గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 )
ఒరిస్సా కవి గంగదాస తండ్రి సంతస దాస . ఈ కవి ఛందో మంజరి రాశాడు తనకు ముందున్న చింతామణి మిశ్రా రచన ‘’వాజ్మయ వివేక’’ను పలుచోట్ల ఉదహరించారు .అచ్యుత శతకం కంసారి శతకం ,దినేశ శతకాలు కూడా రాశాడు .
275-రామానంద సంగీత నాటక కర్త -రాయ రామ చంద్ర పట్నాయక్ (1509)
రామానంద సంగీత నాటకం అనే శ్రీ జగన్నాధ వల్లభ వాటకం రాసిన ఒరిస్సా కవి రాయ రామ చంద్ర పట్నాయక్ 1509 కాలం కవి .వైష్ణవ తత్వ నిధి అయిన భావానంద రాయి కుమారుడు .చైతన్య మహా ప్రభువు ఒరిస్సాకు రాక మునుపే ఇక్కడ రాధా కృష్ణ మధుర భక్తిని వ్యాపింప జేసినవాడు . 5అంకాలున్న ఇతని నాటకం 21 గీతాలు ,68 శ్లోకాలతో వివిధ రాగాలతో వైవిధ్య మైన ఛందస్సులతో రాయబడింది .ఇందులో జయదేవుని గీత గోవింద శైలి కనిపిస్తుంది .ఈ కవి ‘’టీకా పంచకం ‘’రాశాడని అంటారుకాని వ్రాతప్రతి అలభ్యం .
276-దుర్గోత్సవ చంద్రిక కర్త -భారతీ భూషణ వర్ధన మహాపాత్ర (1568-1600 )
కవి డిండిమ జీవ దేవ ఆచార్య కుమారుడు ,జయదేవ ఆచార్య చిన్నతమ్ముడు భారతీ భూషణ మహా పాత్ర మహా సంస్కృత విద్వా0శుడు .దుర్గోత్సవ చంద్రిక అనే శరత్కాలం లో 16 రోజులుఒరిస్సాలో జరిగే శ్రీ దుర్గా మాత ఉత్సవ వైభవాన్ని గురించిరాశాడు .ఇది గోదావరి మిశ్రా ప్రవచించి ఒరిస్సా అంతా ప్రచారం చేసి అనుసరిస్తున్న ‘’శరత్ శారదార్చన పధ్ధతి’’ . కానీ దీని కర్త్రుత్వం పోషక రాజైన మొదటి రామ చంద్రుని దని ప్రచారం లో ఉంది .
277-చైతన్య చంద్రోదయ నాటక కర్త -పరమానంద దాస కవికర్ణ పూర
బెంగాల్ కు చెందిన శివానంద సేన కుమారుడు పరమానంద దాస ఒరిస్సా లో స్థిరపడ్డాడు .గజపతి ప్రతాప రుద్ర దేవ ఆస్థాన కవి .చైతన్య చంద్రోదయ నాటకం అనే 8 అంకాల నాటకం రాశాడు .దీనిని పూరీ జగన్నాధ స్వామి రధోత్సవాలలో ప్రదర్శించేవారు .
278-గౌర కృష్ణోదయ మహాకావ్య కర్త-మహా మహోపాధ్యాయ గోవింద
మహా మహోపాధ్యాయ గోవింద ను కవి శేఖర గోవిందఅంటారు .చైతన్య మహా ప్రభువు జీవిత చరిత్రను ఒరిస్సాలో ఆయన కార్యక్రమాలను తెలియజేసే 18 కాండాల ‘’గౌర కృష్ణోదయ మహాకావ్యం ‘’గా రాశాడు .ఇది చారిత్రిక కావ్యం .ఒరిస్సాలో ప్రచారం లో ఉన్న చారిత్రిక కావ్యాలైన భక్తి భాగవతం కోసలానందం ,గంగ వంశాను చరిత చంపు సరసన నిలిచిన కావ్యం ఇదికాక ప్రద్యుమ్న సంభవం అనే 19 కాండల కావ్య0 రాశాడు .ఇది బాగా ప్రసిద్ధిచెందింది .
278- వాజ్మయ వివేక కర్త -చింతామణి మిశ్ర (1574)
గోవింద విద్యాధర రాజు ఆస్థాన కవి గోవింద మిశ్ర వాజ్ పాయి మనవడు చింతామణి మిశ్ర .తలిదండ్రులు మృత్యుంజయ మిశ్ర ,శ్రీదేవి .నీలాచలం అని పిలువబడే పూరీ క్షేత్ర వాసి .తండ్రి కూడా గొప్పకవిగా సుప్రసిద్ధుడు . చింతామణి ‘’వాజ్మయ వివేక చంద్రిక ‘’అనే అలంకార ఛందో గ్రంధాన్ని 6 అధ్యాయాలలో 3200 శ్లోకాలలో 1574 లో రాశాడు .ఇతడు శంబరారి చరిత్ర ,త్రిశిరో వధ వ్యాయోగం ,కాదంబరి సారం ,సభా ప్రమోద ,పక్షావలి ,కంసవధ ,కృత్య పుష్పావళి ,సమితి వర్ణన కావ్యాలు రాశాడు .కానీ వివేకం వ్యాయోగం తప్ప మిగిలినవి అలభ్యాలు .
279- సింహ వాజపేయి వంశావళి కర్త -నరసింగ మిశ్ర వాజపేయి -(1520-1580 AD)
మురారి మిశ్రా కొడుకు ధరాధర మిశ్ర మనవడు నరసింగ మిశ్ర ఒరిస్సాలో గొప్ప స్మ్రుతి శాస్త్ర కర్త .యితడు రాసిన ‘’సింహ వాజపేయి వంశావళి ‘’ని చూస్తే అతని మేధో వికాసం తెలుస్తుంది .సిద్ధేశ్వరీమాత అనుగ్రహం తో షట్ శాస్త్ర పండితుడయ్యాడు .బెంగాల్ తర్క పులి’’ గండ ‘’ను వాదం లో ఓడించిన ‘’గ0డర గండడు ‘’. 1565-1568 అక్బర్ ఆస్థానాన్ని సంగీతకర్త కృష్ణదాసు మహాపాత్ర ,ముకున్దదేవుని రాప్రతినిధి లతోకలిసి సందర్శించాడు. నరసింగ 18 ప్రదీపాలు రాశాడు .ఇందులో మొదటిది ‘’నిత్యాచారప్రదీప ‘’ను బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ 1907 లో ,రెండవదానిని 1908 లో ప్రచురించింది .ఈకవి ఇతర రచనలు -సమయ వర్ష ,భక్తి ,ప్రాయశ్చిత్త ,శ్రద్ధ ప్రతిష్ట , శంకర భాష్య ,ఛయాన ,వ్యవస్థ ప్రదీప .నిత్యాచారప్రదీపలో 16 వ శతాబ్దపు చారిత్రిక రాజకీయ మత విషయాల గురించి రాశాడు .
280-ఆయుర్వేద సార సంగ్రహ కర్త -విశ్వనాధ సేన (1530
గజపతి ముకుంద దేవ రాజు ఆస్థాన ప్రముఖ ఆయుర్వేద వైద్య శిఖామణి విశ్వనాధ సేనుడు ‘’ఆయుర్వేద సార సంగ్రహం ‘’గ్రంధాన్ని రాశాడు .దీనితోపాటు విశ్వనాధ చికిత్స ,పత్స్య పత్స్య వినిశ్చియ ‘’గ్రంధాలు ఒరిస్సా అంతా బహుళ ప్రచారం లో ఉన్నాయి .
1550 లో విష్ణుశర్మ 8 అధ్యాయాల ‘’స్మ్రుతి సరోజ కలిక ‘’రాశాడు . 1525 లో బౌద్ రాజు నారాయణ భంజ దేవ్ ఆరుకాండల ‘’గీత కావ్య రుక్మిణీ పరిణయం ‘’ను జయదేవుని గీత గోవింద శైలిలో రచించాడు .ఇందులో 12 గీతాలు 40 శ్లోకాలున్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—

