———- Forwarded message ———-
From: Andukuri Sastry
Date: 2018-04-03 16:03 GMT+05:30
Subject: Re: అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
To: gabbita prasadవటువుకి ఆశీర్వచనములు.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రయ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి
దుర్గాప్రసాద్ గారికి.
నమస్కారములు. ఎంతో తప్పకుండా వద్దామని అనుకున్నాను..జ్ణాపకం లేకపోవటం ఒక కారణమైతే stomach disorder ఇంకొక కారణము. మొన్న సంధ్యావందనం పుస్తకం ఆవిష్కర ణకు కూడా వెళ్లలేకపోయినాను.
మీరు వడుగు దృశ్యం కార్యక్రమాలు వర్ణించిన తరువాత . నా బాధ ఇంకా ఎక్కువ అయిందివటువుకి
అగ్నిరాయుష్మాన్త్సవనస్పతిభి రాయుష్మాన్తేన త్వాzzయుషాzzయుష్మన్తం కరోమి
అగ్నిహోత్రుడు సమిత్తులచేత ఆయుర్దాయముకలవాడు. అటువంటి ఆయుర్దాయముచేత నిన్ను ఆయుర్దాయము గలవానినిగా చేసెదను.
యజ్ఞ ఆయుష్మాన్థ్సదక్షిణాభిరాయుష్మాన్తేన త్వా ఆయుషా ఆయష్మన్తం కరోమి
యజ్ఞము దక్షిణలచేత ఆయస్సు కలది. గాన అట్టి ఆయుస్సు చే నిన్ను ఆయుష్మంతునిగా జేసెదను
బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణై రాయుష్మత్
తేన త్వా ఆయుషా ఆయుషన్తమ్ కరోమిబ్రహ్మము బ్రాహ్మణులచేత ప్రకటింప జేయబడుచున్నది .కాన ఆయుస్సుగలది అని చెప్పబడియె .అటువంటి ఆయుర్దాయముచే నిన్ను ఆయుర్దాయము గలవానిగా చేసెదను.
ACPSastry
అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ లోని అహోబిల మఠం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం లో శాస్త్రోక్తంగా తెల్లవారు ఝామున ౩- ౩౦ నుండి ఉదయం 11-30 వరకు 8 గంటల సేపు జరిగింది .చివరలో ఆరుగురు వేదపండితులు వేద స్వస్తి పలికి వేదగానం తో వాతావరణాన్ని పునీతం చేస్తూ దంపతులకు, వటువుకు వేదాశీర్వచనం చేశారు ,వారికి కోమలి దంపతులు తలొక 5 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు .
ఆ తర్వాత మా మనవళ్ళు చి .ఆశుతోష్ ,పీయూష్ కవల సోదరులు షార్లెట్ లో తమ గురువు శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ గారు నేర్పిన త్యాగరాజ మంగళహారతి కీర్తన ‘’జానకీ నాయక నీకు జయ మంగళం –నీకు శుభ మంగళం ‘’ను సుశ్రావ్యంగా గానం చేసి ఉపనయనానికి హాజరైన సుమారు 150 మంది రసజ్నులను అలరించారు .అందరు కరతాళ ధ్వనులతో తమ ఆనందాను భూతులను తెలియ జేసి చిర౦జీవులను ఆశీర్వదించారు .సరసభారతి తరఫున ఈ చిరంజీవులకు 2,11 6రూపాయలు నగదు కానుక అందజేసి ,శాలువా…
View original post 578 more words

