గౌతమీ మాహాత్మ్యం -17
27-ఇంద్రాది సహస్ర తీర్దాలు
బ్రహ్మహత్యాపాతకంపోగొట్టే ఇంద్ర తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ వివరించాడు –పూర్వం దేవేంద్రుడు వృత్రాసురసంహారం చేసి బ్రహ్మహత్యాపాతఃకం పొంది ,దాన్ని వదిలించుకోవటానికి అన్ని ప్రదేశాలు తిరిగాడు .ఆపాపం అతని వెంటే వెళ్ళేది .ఒకసరస్సులో దూకి పద్మ౦ యొక్క నాళం లో దూరి అందులో ఒకదారంగా మారి వెయ్యేళ్ళు దాక్కున్నాడు . అతనికోసం బ్రహ్మ హత్యాపాతకం కూడా అన్నేళ్ళూ అక్కడే వేచి ఉన్నది .ఇంద్రలోకం ప్రభువు లేనిదైపోగా దేవతలు బ్రహ్మను ఉపాయం చెప్పమనగా ఇంద్రుడిని వెతికి గౌతమీ జలం తో పవిత్రం చేయమన్నాడు .వెతికి పట్టుకొని స్నాన౦ చేయించబోతుంటే ,గౌతముడికి కోపమొచ్చి’’ పాపిష్టి ఇంద్రునికి గంగాజలం తో అభిషేకం చేసే ప్రయత్నం చేస్తే రూ భస్మమైపోతారు ‘’అనగానే దేవతలు భయపడిఇంద్రుని తీసుకొని వెళ్ళిపోయారు .
ఇంద్రునితోనర్మదానదీ తీరం చేరి అభిషేకం చేయాలనుకొంటే మాండవ్య మహర్షి అభ్య౦తరమ్ చెప్పగా ,తరుణోపాయం చెప్పమంటే శాంతించి అక్కడే చేయటానికి ఒప్పుకోగా ,అక్కడే ఇంద్రునికి యమునాజలంతో అభిషేకించి పాపాలు పోయేట్లు చేయగా,ఆ ప్రదేశం ‘’మాళవ దేశ’’మైంది .తర్వాత గౌతమిలోనూ ముంచి, బ్రహ్మహత్యాపాతకం పూర్తిగా వదిలించి ,దేవతలు మునులుకూడా స్నానం చేసి పవిత్రులైనారు .ఇక్కడే ‘’సిక్తా’’నది యమునతో కలుస్తుంది .ఈరెండూ గంగలో సంగమిస్తాయి .ఇదే పుణ్య సంగమ తీర్ధం ,ఇంద్ర తీర్ధం .ఇక్కడే ఏడువేల పుణ్య తీర్దాలేర్పడ్డాయి .ఇవి అక్షయ ఫలదాయకాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు

