గౌతమీ మాహాత్మ్యం -18
28-పౌలస్త్య తీర్ధం
విశ్రవసువు పెద్దకొడుకు కుబేరుడు సకల సంపదలతో తులతూ,గుతూ ఉత్తర దిశాదిపతిగా ,లంకాధిపతిగా ఉన్నాడు .ఇతని సవతిపుత్రులే రావణ కుంభకర్ణ విభీషణులు .వీళ్ళు రాక్షసస్త్రీ యందు రాక్షసులుగా విశ్వవసువుకు పుట్టారు .బ్రహ్మ ఇచ్చిన విమానం తో ధనదుడు రోజూ వచ్చి బ్రహ్మ దర్శనం చేసుకోనివెళ్ళేవాడు .ఒకరోజు రావణాదులతల్లి ‘’మీ నడవడి బాగాలేదు తలవంపులుగా ఉంది. సవతి పుత్రునితో స్నేహం ఏమిటి .ఏదైనా గొప్పపని సాధించండి ‘’అన్నది .వెంటనే ఘోరాటవిలో ఘోరతపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గొప్పవరాలు పొందారు .మేనమామ మరీచి మాతామహుల చెడు ఆలోచనా ప్రభావం తో అన్న కుబేరుని లంకారాజ్యం ఇమ్మన్నారు .ఇవ్వననగా యుద్దం చేసి ,కుబేరుని జయించి లంకనాక్రమించి రాక్షస పాలనలోకి తెచ్చుకున్నారు .
కుబేరుడు తాత పులస్త్యబ్రహ్మకు మొరపెట్టుకోగా గౌతమీస్నానం చేసి శివధ్యానం చేయమనగా ,అలాగే చేసి స్తోత్రాలతో మెప్పించి వరం కోరుకోమనగా ఆశరీరవాణి’’ధనపాలత్వం కోరుకో ‘’అని చెప్పగా .దానినే శివునివేడగా ఇవ్వగా సోమేశ్వర లింగపూజ చేసి దిక్పాల పతియై ,దనాదిపతియై దాతృత్వశక్తిగల పుత్రులను పొందాడు కుబేరుడు .అప్పటినుంచి ఆతీర్ధం పౌలస్త్య తీర్ధంగా,ధనద,వైశ్రవస తీర్దం గా పలువబడింది .ఇక్కడస్నానం చేసి ఏ చిన్నదానంచేసినా విశేషఫలితమిస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు

