గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
356- ఆంజనేయ రామాయణం –కందాళ వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )
శ్రీ ధర్మవరపు సీతా రామాంజనేయులు వ్యావహారిక తెలుగుభాష లో రచించిన ఆంజనేయ రామాయణం ను శ్రీ కందాళ వేంకట రామ నరసింహా చార్య , శ్రీ కదాళ వేంకట కృష్ణ మాచార్య సంయుక్తంగా సంస్కృతం లోకి ‘’ఆంజనేయ రామాయణం ‘’గా వచనం లో అను వదించారు .దీనిని సంస్కృత భారతి వారు 2013 లో ప్రచురించారు . మూల కవిధర్మవరపు వారు కవి పండిత పోషకుడు, వదాన్యుడు ,స్వతహా కవి .సంస్కృత అనువాదం సరళంగా సుబోధకంగా చేశారు కందాళ ద్వయం .ప్రార్ధనా శ్లోకం చూద్దాం –
‘’శ్రీమద్రామ కథా౦ పుణ్య మా౦జనేయ ప్రకీర్తితం –అను వక్త్రుం ప్రవృత్తౌ హి త్తోహి నత్వా గురు పరంపరాం –అసామర్ద్యేపి మిత్రస్య ప్రీతయే రధ వాపనే –ప్రవృత్తౌ నౌ శ్రీనివాసోనుగ్రుహా ౦తు శ్రేయస ‘’
‘’నారాయణా తే నమామహత్వం స్తోతుం శక్తః –సదవన దీక్షిత దుర్జన నాశక శ్రీనివాస జగదేకపతే ‘’
బాలకా౦డ ప్రారంభవచనం చూద్దాం –‘’వివస్వతః మనుః ఇక్ష్వాకు కులస్య మూల పురుషః –అత యేవ తద్వంశ యాః సూర్య వంశ ఇత్యుత్పంతే-సః వైవస్వతః వస్తుతః క్షత్రియ వంశ స్యైవ మూల పురుషః ఆసీత్ ‘
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-19-ఉయ్యూరు

