గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ
వ్యాకరణం లో ఉద్దండ పండిత ప్రకా౦డుడుడా. ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ ‘’గజ సూత్ర’’అనే పాణిని అష్టాధ్యాయి ని దశాబ్దం పైగా అధ్యయనం చేశారు .సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి సంస్కృతం లో ప్రాధమిక విద్య తండ్రి శ్రీ శ్రిస్టి శ్రీరామ శర్మవద్ద నేర్చి,తర్వాత ఆయన బాబాయి శ్రిస్టి సాంబమూర్తి శాస్త్రి గారి వద్ద వ్యాకరణం,అలంకార శాస్త్రం అభ్యసించారు .1970లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఎం .ఏ .డిగ్రీ 1970లో పొంది ,1987లో పిహెచ్ డి సాధించారు .స౦ప్రదాయ విధానం లోనే అద్వైత వేదాంతం బ్రహ్మశ్రీ ఆర్.కృష్ణ మూర్తి శాస్త్రి ,బ్రహ్మశ్రీ మణీ౦ద్రవిద శాస్త్రి గార్ల పర్యవేక్షణ లో అభ్యసించారు .భట్ట మీమాంస శాస్త్రం బ్రహ్మశ్రీ రామ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు .వీరి వ్యాకరణ ప్రతిభకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు1982లో ’’వ్యాకరణ విద్వత్ ‘’బిరుదునిచ్చింది .2001లో శృంగేరి శంకరాచార్య ‘’వేదాంత శాస్త్ర విశారద ‘’అందించి సత్కరించారు .
శర్మగారు జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరిఎంటల్ కాలేజి లో సంస్కృత అధ్యాపకులుగా1971లో చేరి , వ్యాకరణ అలంకార శాస్త్రాలను ,సాహిత్యాన్ని 16 సంవత్సరాలు బోధించాడరు ,వీరి శ్రేష్ట బోధనా విధానానికి శృంగేరి స్వామి శ్రీ శ్రీ భారతీ తీర్ధ ‘’వ్యాకరణ విద్వత్ ప్రవర ‘’బిరుదాన్ని బహూకరించి ఘనం గా సత్కరించారు .’’పాండిచేరి ఈకోల్ ఫ్రాంచైజ్ డీ ఎక్స్ట్రీమ్ ఓరియంట్ లో 1987లో రిసెర్చ్ ఫెలోగా చేరి అక్కడ తానూ స్వయంగానూ ఇతరులతోకలిసి రిసెర్చ్ కొనసాగించారు .రెండేళ్ళ పరిశోధనలో ‘’పాణినీయ వ్యాకరణోదహరణకోశః ‘’’తెచ్చారు .తర్వాత మిగిలినవారితోకలిసి ‘’ఇండియన్ అనాలిసిస్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ‘’ప్రోగ్రాం లో అప్పటి సెంటర్ హెడ్ ప్రొఫెసర్ ఎఫ్ గ్రిమాల్ నాయకత్వం లో పని చేశారు .ఈ బృందం భవభూతి నాటకాలను, మహా వీర చరిత్రపై వీర రాఘవ వ్యాఖ్యానాన్ని.మాలతీ మాధవం పై హరిహరుని వ్యాఖ్యానాన్ని ప్రచురించారు .ప్రొఫెసర్ గ్రిమాల్ తో కలిసి రాజచూడ మణి దీక్షిత రచిత ‘’కావ్య దర్పణం ‘’శుద్ధ ప్రతి తెచ్చారు .ఇవే కాక ‘’వ్యాకరణ మాల ‘’పేరిట అనేక పుస్తకాలు ప్రచురించారు .నాగేశుని ‘’పరి భాషేందుశేఖర’’పై వ్యాఖ్యానం ‘’ త్రిపథగా’’శుద్ధప్రతి వెలువరించారు .
శర్మ గారికి వ్యాకరణ శాస్త్రం పై ఉన్న ప్రత్యేక అభిరుచికి నిదర్శనంగా భారతీయ సాంప్రదాయ వ్యాకరణ విధానం పై తీవ్రం గా అధ్యయనం చేశారు .ప్రపంచంలో అనేక దేశాలనుండి వ్యాకరణం లో ఉత్తమ విజ్ఞానాన్ని పొందటానికి పండి చేరివచ్చి శర్మగారి వద్ద శిక్షణ పొందుతున్నారు .శర్మగారిని ఇతర దేశాల యూని వర్సిటీలు ఆహ్వానించి వారి మేధో నవనీతాన్ని ఆస్వాదిస్తున్నాయి .ఆయనకు సంప్రదాయ విద్యా బోధనా విధానం అత్యంత ఇష్టమైనది .ఎన్నో చర్చావేదికలలో పాల్గొని వాటికి ఉజ్జీవనం కలిగించారాయన . కంచి లో జరిగే’’శ్రీ కాంచీ వేద వేదా౦త శాస్త్ర సభ ‘’లో 2010నుంచి శర్మగారు ‘’వ్యాకరణ శాస్త్ర ‘’పరీక్షకులుగా ఉన్నారు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం’’,ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లలో పిహెచ్ డి విద్యార్ధులకు ఎక్స్టర్నల్ ఎక్సామినర్ గా వ్యవహరిస్తున్నారు .’’లోక ప్రియం టీం ‘’లో డా.ఈవా విల్డేన్ తో కలిసి తెలుగు తమిళ సంస్కృత వ్యాకరణ తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-19-ఉయ్యూరు
