గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600)
అష్టాధ్యాయి రచించిన పాణిని ఆచార్యుని మేనమామ కుమారుడే ‘’వికృతవల్లి ‘’రాసిన యాడ్యా చార్యులు .కనుక పాణిని కాలం తర్వాత వాడు .లేకఅదేకాలానికి చెందినవాడు అయి ఉండచ్చు .పాణిని ని క్రీపూ 3 శతాబ్ది వాడనికొందరు,క్రీ.పూ 5-6శతాబ్ది కాలం వాడని కొందరు భావిస్తారు .అంతకు మించి యాడ్యాచార్య వర్యుని విశేషాలు మనకు తెలియవు .ఆయన రాసిన వికృతివల్లి మాత్రం దొరికింది .అందులో ఆయన తనగురించి చెప్పుకొన్నది యేమీ లేదు దీనిని ‘’పరిభాషా వృత్తి’’ అనీ అ౦టారు .నాగర లిపిలో ఉన్న ఈ గ్రంథం సంస్కృత వ్యాకరణ స్వరూపాన్ని వివరించే పుస్తకం .ఇందులో సంస్కృత వ్యాకరణ సూత్రాలు భాషా చరిత్రలో వాటి స్థానం గురించి వివరణ ఉంటుంది
వికృతవల్లి ప్రారంభ శ్లోకాలు –
‘’ఓం గణేశాయనమః –ఓం త్రయ పరిభాష సూచనం వ్యాఖ్య రయమః -అయేత్పయమాదికర కార్యః –పరిభాషా సూచనం శాస్త్ర మధి కృతం వేది తవ్యఉ సర్వ మనుక్రమి ష్యామః .
చివరి శ్లోకం –‘’ఇతి పరిభాష సూచ ణి సమాప్తైన శుభా యోగ్యే భవం తస్తాం-శుభమస్తర్వ జగతాం –శ్రీ రామాయనమః ‘’
358-డేలారామ కథా సార కర్త –భట్ట ఆహ్లాదక (
కాశ్మీరానికి చెందినవాడుగా భావింపబడిన భట్ట ఆహ్లాదక ‘’డేలా రామ కథా సారం ‘’రచించాడు.కాలాదులు తెలియవు .
359-బృహత్సంహిత వివృతి కర్త –భట్తోత్పల (10వ శతాబ్దం )
వరాహమిహిరుని రచనలపై వ్యాఖ్యానాలు రాసిన భట్తోత్పల 10వ శాతాబ్ద చివరి కాలం వాడు .బృహత్ సంహితకు వివృతి ‘’ అనే వ్యాఖ్యానం రాశాడు .జ్యోతిష్యంలో దిట్ట అయిన భట్తోత్పల స్వయంగా ‘’హోరా శాస్త్రం ‘’రాశాడు .ఇతని రచనకు చారిత్రక ప్రాధాన్యం రావటానికి కారణం ,తనకు ముందున్న రచయితల గురించి తెలియ జేయటమే .సదానందుని ‘’భాస్వతి ‘’పై భాస్వతి టీకా అనే వ్యాఖ్యానం రాశాడు.
360-రాయ ముకుట పధ్ధతి కర్త –బృహస్పతి రాయముకుట (15వ శతాబ్ది )
బెంగాల్ కు చెందిన 15వ శాతాబ్ది కవి బృహస్పతి రాయముకుట తండ్రి గణేష్ . జలాలుద్దీన్ కాలం వాడు .రఘు నందన రాసిన అనేక స్మృతులలో ఈకవి పేర్కొనబడినాడు .యితడు ‘’స్మృతి రత్నహార ‘’,’’రాయముకుట పధ్ధతి’’ రచించాడు .’’నామ లింగాను శాసన ‘’అనే నిఘంటువుకు ‘’పద చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశాడు .రఘువంశ కావ్యం,శిశుపాల వధ కావ్యం లపై వ్యాఖ్యానాలు రచించాడు .
361-నరేశ్వర పరీక్ష కర్త –సద్యో జ్యోతి (8 వ శతాబ్ది )
8 వ శతాబ్ది కాశ్మీర కవి సద్యోజ్యోతి నరేశ్వర పరీక్ష ,పరమోక్షకారిక లు రాశాడు .రుద్రా తంత్ర ,స్వయంభువ తంత్ర లకు వ్యాఖ్యానాలు రాశాడు .వీటినే తత్వ సంగ్రహ ,తత్వ త్రయ అంటారు .362-నాటక లక్షణ రత్న కోశ కర్త –సాగర నంది (10-13 శతాబ్ది )
పది నుంచి 13 వ శతాబ్ది లోపు జీవించి ఉండవచ్చు అని భావింపబడిన సాగర నంది కవి వివరాలు తెలియవు .కాని అతడు రచించిన నాటకలక్షణ సార గ్రంథానికి విపరీతమైన వ్యాప్తి అభించింది .
363-నిరుక్త కర్త –శాక పూని (క్రీ.పూ.7వ శతాబ్దం )
యాస్కాచార్యుడు పేర్కొన్న శాకపూని కవి నిరుక్త కర్త .క్రీ .పూ .7వ శతాబ్దానికి చెంది ఉండవచ్చు .
364-గౌడ మీమా౦సద-కర్త –శాలికా నాథ(క్రీ.శ .7 వ శతాబ్ది )
క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినా బెంగాల్ కవి శాలికా నాథుడు.గౌడ మీమా౦సద తోపాటు రుజువిమాల ,దీపశిఖ అనే వ్యాఖ్యానాలను ప్రభాకరుని బృహతి ,లఘివి లపై రచించాడు .
365-శంఖ స్మృతి కర్త –శంఖ (క్రీ.పూ -300-100)
శంఖ స్మృతి సంప్రదాయ మూల రచయితలు 20 మందిలో శంఖుడు ఒకడు.కాలం క్రీ పూ 3శాతాబ్దినుంచి 1శతాబ్ది లోపు .శంఖ స్మృతి,శంఖ ధర్మ శాస్త్రం రచించాడు .వీటినుండి తర్వాత కవులు చాలా వాటిని ఉదహరించారు .శంఖుడు లిఖితుడు తోకలిసి ‘’శంఖ లిఖిత స్మృతి’’రాశాడు.దీనికి లఘు స్మృతి కూడా ఉంది .’’శంఖ లిఖిత ధర్మ సూత్రం ‘’కూడా ఈ సోదరులు రచించారు .మహాభారతం లో శంఖ ,లిఖితులు సోదరులు అని ఉన్నది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-19-ఉయ్యూరు
.
,
—

