గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949)
1880లో గోదావరి జిల్లా కాకరపర్రు లో చర్ల భాస్కర శాస్త్రి జన్మించారు తండ్రి చర్ల వెంకట శాస్త్రి .ఆరామ ద్రావిడ శాఖకు చెందినవారు .వీరిది లోహితస గోత్రం .చర్ల గణపతి శాస్త్రిగారికి బంధువులు .
భాష్యకార శాస్త్రి గొప్ప సంస్కృత పండితులు .కనీసం 10 వేలమంది శిష్యులకు ఎలాంటి ప్రతి ఫలాపేక్షా లేకుండా విద్యాదానం చేసిన మహనీయులు .సంస్కృత౦ లో గొప్ప గ్రంథ రచన చేశారు . –మేకాదీశ శబ్దార్ధ కల్ప తరుః,అనే అలంకార శాస్త్రం ,వర్ణమాల శివ స్తోత్రం చ ,శ్రీరామ విజయ వ్యాయోగః ,మేకధీశా రామాయణ మితిచ నామా౦తరే ,విజయ విలాసః (చరిత్ర గ్రంథ౦)సనాతన ధర్మ విజయ వ్యాయోగం వర్ణమాల రామాయణం ,మేకా ధీశా శబ్ద శత కోటి ,కంకణ బంధ రామాయణం ,దండక రామాయణం రచించారు . కంకణ బంధం అనేది ఒక విచిత్ర కవితా ప్రక్రియ .69ఏళ్ళ వయసులో భాష్యకార శాస్త్రి 1949లో మరణించారు .
వీరి గురించి తెలియ జేసినవారు వారి మనవలు శ్రీ చర్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ,అన్నగారు శ్రీ చర్ల భాస్కర రామ శాస్త్రి .ఇంతకంటే భాష్య కార శాస్త్రి గారి గురించి వివరాలు ఎవరి వద్ద ఉన్నా, పంపి వారి గురించి సమగ్రంగా రాయటానికి సహకరించమని మనవి .పూర్వం అన౦త సూరి ‘’రామ కృష్ణ విలోమ కావ్యం ‘’రాశాడు .ఇది 38 శ్లోకాల కావ్యం .ఇందులో మొదటి సగం ,రెండవ సగం లో వెనకనుంచి వస్తే మొదటి దానిలో రామకథరెండవ దానిలో కృష్ణకథ వస్తాయి . సర్కారు జిల్లాలకు చెందిన కృష్ణ మురారి రాసిన ‘’కనక బంధం రామాయణం’’ లో 32 అక్షరాలను వలయాకారం లో అంటే కంకణం ఆకారం లో ఏర్పరచి ,ఏ అక్షరం నుంచైనా ఎడమనుంచి కుడికి ,కుడి నుంచి ఎడమకు చదివితే 62 శ్లోకాలేర్పడుతాయి .రామ కథ తెలియాలంటే దీనికి వ్యాఖ్యానం అవసరం .ఈకవి గౌరీ ,సర్వజ్ఞుల కుమారుడు .వసిష్ట గోత్రీకుడు .19వ శతాబ్ది కవి .
ఈ కనక బంధాన్నే చర్ల భాష్యకార శాస్త్రి ఆధారంగా రామాయణం రాశారు .ఇందులో సంయుక్తాక్షరాలను విభజించి చదివితే 128 శ్లోకాల కావ్యం ఏర్పడుతుంది అని చక్కగా విశ్లేషించి చెప్పారు ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ ‘’లో శ్రీ ఎం.శ్రీనివాసాచార్ .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-19-ఉయ్యూరు

