శ్రీనాథ్ ఎస్ హసూర్కర్ తండ్రి పండిత శ్రీపాద శాస్త్రి హసూర్కర్ మధ్యప్రదేశ్ కు చెందినమహా సంస్కృత విద్వాంసుడు .సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా ,ఇండోర్ యువరాజు యశ్వంతరావు హోల్కార్ కు మత గురువుగా ఉన్నాడు .వేదాంతం లోని 42 శాఖల పై అధ్యయనం చేసి అద్భుతమైన ‘’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన సోపానావళి’’రచించి సంస్కృత పండితుల ,వేదాంత వేత్తల ప్రశంసలు పొందాడు .ఇదేకాక ఈయన ఇతర సంస్కృత వచన రచనలూ ఆయన ప్రాభవాన్ని చాటి చెప్పేవే –అవే –శ్రీమద్ వల్లభా చార్య చరితం ,శ్రీ రామదాస స్వామి చరితం ,శ్రీ శిఖా గురు చరితామృతం ,శ్రీ శివాజీ మహారాజ్ చరితం ,శ్రీ పృధ్వీ చవాన్ చరితం ,శ్రీ మహారాణా ప్రతాప చరిత్రము ..
ఈయన సంస్కృత పాండిత్యానికి ,అనేక శాస్త్రాలలో నిష్ణాతృత్వానికి తగిన బిరుదులు పొందాడు .అవే –న్యాయ –వేదాంత ,-మీమాంస తీర్ధ ,సాంఖ్య సాగర ,పండిత రత్న .
శ్రీ శిఖా గురు చరితామృతం లోని ఉపోద్ఘాతం లో పంజాబు దేశ వర్ణన ,నివాసి జన వృత్తాంతం ,మహమ్మదీయ దురాక్రమణ ,కలహాలు ఆర్య ధర్మానికి దుర్దశ అనే భాగాలున్నాయి
ప్రారంభ వాక్యాలు –ఆస్తి సమస్త భారతే వర్షే విఖ్యాతః –అసంఖ్య పర్వతా వలీ నిగడితః –సకల పవిత్ర మహానదీ ప్రవేశ పవిత్రతః –శూర ధార్మిక జన సంకులః –నదీ మాతృకయా ‘’అని ప్రారంభించాడు .తర్వాత పూర్వభాగం లో వంశ చరితం ,బాల్యం గృహస్థాశ్రమమ ,వైరాగ్యలాభం ,పృధ్వీ పర్యటన వర్ణించాడు .ఉత్తరభాగం లో భక్తిమార్గ ప్రసారం ,శిష్య సంఘ స్థాపన ,సనాతన ధర్మ శిక్కు ధర్మ తులనాత్మక పరిశీలన ,అవతార సమాప్తి ఉన్నాయి .
శ్రీనాథ్ కు తండ్రి కనుక కాలం 1896గా భావించవచ్చు .ఇంతకంటే వివరాలు తెలియలేదు ఇంతటి మహా విద్వాంసుని గురించి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-19-ఉయ్యూరు

