సాహిత్యాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు -నిన్న రాత్రి ”యు ట్యూబ్” లో చంద్ర గిరి సుబ్బు ఈటివి ప్లస్ కోసం తీసిన ”అత్తారింట్లో సంక్రాంతి అల్లుడు” రెండు ఎపిసోడ్ లు (”60,61) చూశాను చాలాకాలం తర్వాత సంక్రాంతికి చక్కని తెలుగు హాస్యం తెలుగు పల్లెటూరు ,అల్లుడికి మర్యాద ,పిండివంటలు బామ్మర్ది సహకారం మరదలు పిల్లను బావ హాస్యం పెట్టటం భేషజాలు, కోతల రాయుళ్ల బండారం పెట్టమారి మగడు ”హెన్ పెకేడ్ ”హజబండ్ ”అయిన తనపేరు మర్చిపోయిన” కృష్ణవేణి మొగుడు” ,కూతురంటే ప్రేమకున్న తండ్రి , అల్లుడంటే గౌరవమున్న అత్తగారు ,మంచీ మర్యాద కలగలిపిన సున్నితమైన హాస్య 0తో ఉన్న రెండు ఎపిసోడ్ లు ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తాయి .వెకిలి డోకు హాస్యానికి స్వస్తి చెప్పి ,కమ్మని హాస్యానికి ప్రాణం పోసిన చంద్ర గిరి సుబ్బు బహుధా అభినందనీయుడు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం దూర దర్శన్ లో సంక్రాంతికి ఇలాంటి కమ్మని హాస్యం వండి వడ్డించిన ఎపిసోడ్ లు వచ్చేవి ధర్మవరపు సుబ్రహ్మణ్యం సృష్టించిన ఆహాస్యం గిలిగింతలు పెట్టేది మళ్ళీ ఇన్నేళ్లకు ,ఇన్నాళ్లకు చక్కని హాస్య రసాస్వాదన చేశాను . మీరూ చూడండి .మంచి హాస్యాన్ని ఆస్వాదించండి ,ప్రోత్సహించ0డి -దుర్గాప్రసాద్

