సోదర పెన్షనర్లు కు సంక్రాంతి శుభాకాంక్షలు .ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి లోపు లైఫ్ సర్ది ఫికేట్ ఇచ్చే దాన్ని ఈ ఏడాదినుంచి జనవరి నుంచి మార్చి లోపు ఇచ్చే ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలిసిందే .లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఫారం కొని లేక ట్రెజరీ వారిచ్చేఫారం తీసుకొని ఫోటో అంటించి ట్రెజరీ ఆఫీసర్ లేక గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకాలు చేయించి పెన్షన్ బుక్ తీసుకువెళ్లి వారిచ్చే రసీదు తీసుకొనేవాళ్ళం .ఇప్పుడు ఆ పస్టాటికి స్వస్తి చెప్పారు
1- ట్రెజరీ ఆఫీసుకు ఇపుడు తప్పకుండా సెల్ ఫోన్ తీసుకు వెళ్ళాలి
2-పెన్షనర్ ఐడెంటిటీ నంబర్ ,పెన్షన్ నంబర్ ,పెన్షన్ తీసుకొంటున్న బాంక్ అకౌంట్ నంబర్ ,ఆధార్ నంబర్ ,బాంక్ పాస్ బుక్ (వీలుంటే ),పాన్ కార్డు నంబర్ లు కాగితం మీద రాసుకొని తీసుకు వెళ్ళాలి
3 -దీని ఇంచార్జ్ వీటిని తన కంప్యూటర్ లో ఫీడ్ చేస్టారు .అవన్నీ కరెక్ట్ గా ఉంటె
4-మన వేలిముద్రను అడిగి మిషన్ మీద వేలితో నొక్కిస్తారు .అది తీసుకోగానే మనఫోటో కంప్యూటర్ లో కనిపిస్తుంది
5-వాళ్ళు మన సెల్ లో వచ్చిన ఓటీపీ నంబర్ అడుగుతారు అది చెప్పగానే వాళ్ళు చూసి ఓకే చెప్పి ,మనం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా మన ఫోటో ఉన్న ధ్రువీకరణ పత్రం ఇస్తారు ‘
6-ఏ చేతి వ్రేలిముద్రా పడకపోతే ఐరిస్ (కంటిపాప ) ఫోటో తీస్తారు అదీ రాకపోతే మనం
– స్వయం గా హాజరై లైఫ్ సర్ది ఫికేట్ ఇచ్చినట్లు ధృవీకరిస్తారు .
సో సింపుల్ -దుర్గాప్రసాద్

