| గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945) 1945లో పశ్చిమ బెంగాల్ కలకత్తా లో జన్మించిన జయశ్రీ చట్టోపాధ్యాయ వాల్మీకి రామాయణం లో సంగీత మూలాలు అంశం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందింది .విశ్వకవి రవీంద్రుని నిపై ‘’బౌద్ధ అవదాన సాహిత్య ప్రభావం ‘’అనే అంశం పై పరిశోధన చేసి డిలిట్ సాధించింది .తాను రాసిన సంస్కృత గీతాలను ‘’నిస్సంగః ప్రణయః ‘’పేరుతొ వెలువరించింది .దీని సిడి ని 2015 జూన్ లో బాంగ్ కాక్ లో జరిగిన 16 ప్రపంచ సంస్కృత సభ లో ఆవిష్కరి౦పజేసింది .దీనికి ఆంగ్ల అనువాదం ‘’లవ్ వితౌట్ అటాచ్ మెంట్ ‘’గా వచ్చింది .కలకత్తాలోని క్రిస్టియన్ మహిళాకళాశాలలో రీడర్ గా ఉద్యోగించింది .బిషప్ కాలేజీ లో థియాలజి బోధించింది .కలకత్తా సంస్కృత కాలేజీలో సంస్కృత గెస్ట్ లెక్చరర్ గా ఉన్నది .’’రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ‘’వారి స్కాలర్షిప్ పొంది ,సీతారాం బాల్దిక్ ఆదర్శ సంస్కృత మహా విద్యాలయ లో సంస్కృతం , .జాదవ్ పూర్ యూనివర్సిటిలో సంస్కృత అలంకార శాస్త్రం బోధించిన విదుషీమణి డా చట్టో పాద్యాయ జయశ్రీ ముఖ్య సంస్కృత రచనలు –ఆసఫ్ విలాస సమీక్ష ‘’,సంస్కృత సాహిత్య స్వప్న ‘’,మహా వస్తూని రామాయణానుభవ ‘’ అధ్యర్ధ శతక సమీక్షా ‘’మృచ్చకటికే వర్ష ‘’,’’బుద్ధ చరితే రామాయణ సామ్యం’’,జగన్నాథస్య’’,’’జగదాభరణం ‘’,’’సాహిత్య స్మృత్య లోక ‘’,’’ఉషా వరవర్ణిని’’,దేవీ సూక్తం ‘’.ధ్వన్యాలోకః ‘’.ఇవన్నీ అనేక సంస్కృత జర్నల్స్ లో వచ్చాయి . బెంగాలీ భాషలోకి ‘’కాకోలూకీయం ‘’’’,’’లబ్ధ ప్రనాశనం’’ పంచ తంత్రం లోని రెండు తంత్రాలు అనువాదం చేసి తన సంపాదకత్వం లో విడుదల చేసింది .’’నిస్సంగ ప్రణయం ‘’కాకుండా ‘’రాత్రి ‘’,’’శిలా భట్టారిక ‘’,అవసర ‘’,కల్కితా నగరస్య దుర్గా ప్రతిమాంగ్ ప్రతి ‘’ కవితలనూ రాసింది .దీని ఆంగ్ల అనువాదాన్ని 2015 సెప్టెంబర్ 5న దిబ్రుఘర్ లో జరిగిన సాహిత్య అకాడెమి సమావేశం లో ‘’అభి వ్యక్తి’’ప్రదర్శనలో చదివి వినిపించి మన్ననలు పొందింది .
|

