గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318)
ద్వైతమతస్థాపకుడు మధ్వాచార్య శిష్యుడైన త్రివిక్రమ పండితాచార్య సుబ్రహ్మణ్య పండితా చార్య కుమారుడు . అరుదైన ‘’వాయుస్తుతి ‘’సంస్కృతం లో రాసి చాలా ప్రఖ్యాతుడయ్యాడు .ఈయన గురించి పూర్తివివరాలను కుమారుడు నారాయణ పండితాచార్య ‘’సుమద్వ విజయం ‘’లో రాశాడు .యవ్వనం లోనే త్రివ్క్రముడు సంస్కృత సాహిత్యం లో అవక్రపరాక్రమ౦ చూపించిన ధీశాలి .మధ్వమతం పుచ్చుకొని సంస్కృతం లో ‘’ఉషాహరణ మహా కావ్యం ‘’రచించాడు .
కాసర్ గోడ్ రాజు జయ సింహకు గురువు త్రివిక్రమ .ఒక సారి మధ్వా చార్య కాసర్ గోడ్ సంస్థానానికి రాగా ,ఆయనకు త్రివిక్రమ పండితా చార్య కు ఎనిమిది రోజులు సుదీర్ఘ చర్చ జరిగింది .స్వతహాగా అద్వితీ అయిన త్రివిక్రముడు ఆచార్యులవారి చేతిలో ఓటమి పాలై ,శిష్యుడై ,మధ్వ మతాన్ని స్వీకరించాడు .మధ్వా చార్యులు రాసిన ‘’బ్రహ్మ సూత్ర భాష్యం ‘’కు త్రివ్క్రమ పండితా చార్య ‘’తత్వ ప్రదీపిక ‘’వ్యాఖ్యానం రాశాడు .ఇవికాక విష్ణు స్తుతి ,తిది నిర్ణయం ,మధ్వ స్తోత్రం మొదలైనవి కూడా రచించాడని ప్రతీతి .బృందావనం అని పిలువబడే త్రివిక్రమ పండితాచార్య సమాధి కేరళలో కుద్లూ దగ్గర కావు మఠం లో ఉంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-19-ఉయ్యూరు
—

