విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం
విహంగ మహిళా వెబ్ మాసపత్రికను అత్యంత సమర్ధ వంతంగా ,విభిన్నశైలిలో నిర్వహిస్తూ ,నన్ను కూడా విహంగాకు రాయమని 2012 ఏప్రిల్ లో మెయిల్ ద్వారా శ్రీ మతి పుట్లహేమలత గారు కోరగా అప్పటినుంచి అవిచ్చిన్నంగా ఇంతవరకు ప్రతినెలా దేశ విదేశాలలోని మహిళా మూర్తులను గురించి రాస్తూనే ఉన్నాను విహంగాలో ఎంతోఆధరంగా ప్రచురిస్తూనేఉన్నారు .దాదాపు ఆరు సంవత్సరాల సాహితీ బాంధవ్యం . సరసభారతి ప్రచురించిన పుస్తకాలు ఆమెకు కనీసం మూడు ప్రతులు ఒకటి ఆమెకు మరొకటి రాజమండ్రి తెలుగు విశ్వ విద్యాలయానికి ఇంకొకమరచి ఎవరైనా సాహితీ మూర్తికి మూడు ప్రతులు పంపటం ఆమె అలాగే స్వీ కరించి అందజేయటం జరుగుతోంది . మూడేళ్ళక్రితం జనవరిలో జరిపిన విహంగ పత్రిక వేడుకలలో నన్ను ఆహ్వానించి విహంగ ఆత్మీయ పురస్కారం అందించిన సౌజన్యమూర్తి హేమలత గారు . ఇప్పుడే వారి అకాల మరణ వార్త విని దిగ్భ్రా0తి చెందాను . శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు స్వాస్థ్య చిత్తం తో విషాదాన్ని క్రమంగా మరచిపోవాలి కోరుతూ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిస్తూ ఆమె ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-19 -సాయంత్రం 6-40 -ఉయ్యూరు
—

