గౌతమీ మాహాత్మ్యం -42
56-యమ తీర్ధం
పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు . .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన కపోతజంట ఉంటె ,దక్షిణ తీరం లో ఉలూకుడు పుత్ర పౌత్రులతో ఉన్నాడు .వీరిద్దరికి చాలాకాలం యుద్ధాలు జరిగాయి .ఎవరికీ జయం కలగలేదు .అనుహ్లాడుడు తన తాత మృత్యు స్వరూపుడైన యమ ధర్మరాజు నాశ్రయించి ‘’యామాస్త్రం ‘’పొంది విశేష బలసంపన్ను డైనాడు .ఉలూకుడు అగ్ని దేవుని అనుగ్రహం తో ఆగ్నేయాస్త్రం పొంది మంచి బలం పొందాడు .మళ్ళీ ఇద్దరి మధ్యా యుద్ధం భయంకరంగా జరిగింది .
ఉలూకుడు పావురం పై ఆగ్నేయాస్త్రం వేస్తె ,కపోతం యామాస్త్రం వేశాడు .హేతి భయ విహ్వాలయై అగ్నిని-‘’తమ్ దేవం శరణం యామి ఆది దేవం విభావసుం –అంతస్ధిత ప్రాణ రూపో బహిశ్చాన్న ప్రదో హాయ్ యః –యో యజ్ఞ సాధనం యామి శరణం త౦ ధనున్జయం ‘’ అని స్తుతించి మెప్పించింది .అగ్ని ప్రత్యక్షమై తన అస్త్రాన్ని ఉపసంహరిస్తానని ,కాని దాన్ని ఎక్కడ వేయాలో చెప్పమని ఆమెను కోరాడు .ఆమె ఏమాత్రం ఆలోచించకుండా భర్త సంతానం క్షేమమే ఆలోచించి ఆ అస్త్రాన్ని తన మీదే వేయమని కోరింది .ఆమె పతిభక్తికి మెచ్చి వీతి హోత్రుడు ఆమె భర్త సంతానానికి కూడా క్షేమం ప్రసాదించాడు .
యమపాశాలకు చిక్కుకున్న ఉలూకుని భార్య ఉలూకి సరాసరి యముడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేసి మెప్పించి తనబాధ చెప్పుకొన్నది .సంతృప్తి చెందిన యముడు ఆమె భర్తకు ప్రాణహాని తప్పిస్తాను కాని అస్త్రాన్ని ఎక్కడ విసర్జి౦చాలో చెప్పమన్నాడు .ఆమె క్షణం కూడా ఆలో చి౦చ కుండా భర్త క్షేమం కోసం ఆ యమ దండాన్ని తనపైనే వదలమని కోరింది .యముడు ఆమెకూ భర్తకు సంతానానికీ క్షేమం కలిగించాడు .యముడు యమపాశాన్నీ అగ్ని ఆగ్నేయాస్త్రాన్నీ ఉపసంహరించగా ఉలూక కపోతాదులు దేవతలా కరుణకు కృతజ్ఞతలు చెప్పారు .
వరాలు కోరుకోమనగా పక్షులు ‘’పాపాత్ములమైన మాకు మా ఇద్దరి మధ్యా ఉన్న వైరం వలన మీదర్శనం లభించింది .గంగానది రెండు వైపులా ఉన్న ఆశ్రమాలలోలోక క్షేమం కోసం మీ రిద్దరూ ఉండి పోవాలి ‘’అనికోరాయి అలాగే అన్నారు అగ్ని యమ దేవతలు .యముడు గౌతమీ ఉత్తర తీరం లో యమ స్తోత్రం పఠించినవారికి అకాల మృత్యువు కలుగదని,ఈతీర్ధం లో స్నానం చేసిన స్త్రీ మూడు నెలలో గర్భవతి అవుతుందని ,వీరుడైన పుత్రునికి జన్మ నిస్తుందని ,వాడు శతాయుష్కుడౌతాడనీ పుత్రపౌత్రాభి వృద్ధితో వర్దిల్లుతాడనీ వరమిచ్చాడు .అగ్ని దేవుడు గౌతమి దక్షిణ తీరం లో తన స్తోత్రాన్ని పఠించే వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ,పవిత్రులై స్వర్గ ప్రాప్తి పొందుతారని వరం అనుగ్రహించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-19-ఉయ్యూరు
.
—

