గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )
సంస్కృత కవయిత్రులగురించి తెలుసుకొన్నాం .ప్రాకృత కవయిత్రుల గురించి తెలుసుకోకపోతే అసమగ్రమే అవుతుంది .వీరిలో తొమ్మిదిమంది ఉన్నారు .ఒక్క’’ అవంతీ సుందరి’’ని తప్ప మిగిలినవారిగురించి శాతవాహనరాజు అంటే హాలుడు రాశాడు .7వ శతాబ్ది బాణుడుకూడా వీరిని ఉదాహరించాడు .ప్రాకృత కవయిత్రులు 7వ శతాబ్దికి ము౦దువారుగా భావించారు .
454-అను లక్ష్మి
ప్రేమకు చెందిన అనులక్ష్మి శ్లోకాలు నాలుగున్నాయి .మొదటిదానిలో పొగడ్తలకు ఉప్పొంగి అగడ్త లో పడ్డ యువకుడి విషయం ,రెండవదానిలో అనుభవం లేని కుర్రాడు సాని బారినపడటం ,పురుషులను ఆడంబరం తో ఆకర్షించిన స్త్రీ ,నాలుగులో శిదిలవట వృక్షం పై ఆశ్రయం పొందిన పక్షుల వెతలు వర్ణించింది .మానవస్వభావాలను బలహీనతలను చక్కగా కవిత్వం లో ప్రతి బి౦బి౦ప జేసింది .దారితప్పినవారు పొందే అధోగతి నీ బాగా చెప్పింది .
‘’యత్తవ సతీ జాయా అసత్యేయచ్య సుభగ వయమపి-తత్ కిం స్ప్రుటతు బీజం తవ సమానో యువా నాస్తి ‘’
వట –‘’హసితం స హస్త తాళం శుష్కవట ముపగంతేః పథికైః-పసత్ర ఫలానాం సద్రుశే ఉడ్డీనో శుక వృ౦దే’’
455-అసులద్ధి
ప్రియులనుంచి ,భర్తలనుంచి వేరైనా స్త్రీల వ్యధలను రెండు శ్లోకాలో వర్ణించింది అసులద్ధి.మొదటిది పోషిత భర్త్రుక గురించి .రెండవది చతుర అయిన చేటి తన సఖి ప్రేమను ఆమె ప్రియుడికి తెలిపి సమాగమం కల్గించటం .
‘’సఖి వ్యధయంతి కదంవానియధా మాం తధా నశేష కుసుమాని –నూనమేషు దివసేషు వహతి గుటికాయా ధనుః కామః ‘’
‘’నాహం దూతీ త్వం ప్రియ ఇతి కోస్మాక మత్ర వ్యాపారః –సా మ్రియతే తవాయశాస్తేన చ ధర్మాక్షరం భణామః’’
456-అవంతీ సుందరి
రాజశేఖరుని భార్య అవంతీ సుందరి ధనదపాల సోదరి .చాహువాన్ వంశస్త్రీ .తన కర్పూరమంజరి నాటకాన్ని ఆమె కోరికపై ప్రదర్శించినట్లు రాజశేఖరుడు చెప్పాడు .కావ్యమీమాంస అలంకార శాస్త్రం లో ఆమె అభిప్రాయాలను పొందుపరచాడు .ఆమె రాసినవి మూడు శ్లోకాలు .మొదటిది విరహిని గురించి .రెండవది ప్రేయసి ప్రియుడిని అపార్ధం చేసుకోవటం .మూడవది దాంపత్య జీవితం లో ఆనందాను భూతి పొందిన జంట గురించి .ఈ మూడిటిలో అవంతి సుందరి కవితా ప్రతిభ గోచరమౌతుంది .ఆమె మాటలు సంగీతాన్ని వినిపిస్తాయి .
విరహిణి-‘’కిం తదపి హా విస్మ్రుతం నిష్క్రుప యద్గురు జనస్య మధ్యేపి –అభిదావ్య గృహీతస్త్వం స్రస్తోత్తరీయయా
పత్యుపహాస –‘’ఉపహసీతీన్ద్రాణీమింద్ర ఇందీవరాక్షీదనీయం –కౌమార ప్రేక్షితే తవముఖస్య శోభాం పశ్యన్ ‘’’’
457-మాధవి
మాధవి రాసిన ఒకే ఒక శ్లోకం హాస్యస్పోరకంగా ఉంటుంది .ఆడవారు తీవ్ర ప్రేమికులుకారని ,మనసు అర్పించి బానిసలలాగా ఉంటారని చెప్పింది
దుర్వీ దగ్ధ –గోపాయంతి యే ప్రభుత్వం కుపితా దాసా ఇవ యేప్రసాదయంతి-తయేవ మహిలానాంప్రియాః శేషాఃస్వామిని ఏవ వరాకాః’’
458-ప్రహత
స్వాదీనపతికపై ప్రహత చెప్పిన ఒకే ఒక్క శ్లోకం ఉన్నది
‘’ఏకం ప్రహరోద్విగ్నం హస్తం ముఖ మారుతేన వీజయన్-సోపి హసంత్యా మయా గృహీతో ద్వితీయేన కష్టే’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

