గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
451-విద్యావతి
సుమీనాక్షి దేవతపై విద్యావతి అనుష్టుప్ లో రాసిన 12శ్లోకాల స్తోత్రం ఆమె భక్తీ తాత్పర్యాలకు ఉదాహరణగా నిలిచిపోయింది .ఇంతకంటే ఆమెవివరాలు తెలియవు
స్తుతి-‘’యా దేవీ జగత౦త్రీ శంకర శంకరస్యాపి శంకరో –నమస్తస్యై సుమీనాక్షై దేవ్యేమంగళ మూర్తయే ‘’
‘’సకృరారాధ్యయాం సర్వమభీస్టంలభతే జనః-నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే ‘’
‘’లక్ష్మీ సరస్వతీ ముఖ్య యస్తాస్తేజఃకరోద్భవాః – నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే’’
‘’ఇతి స్తుత్వా మహా దేవీ౦ ప్రణమ్యచ పునః పునః –అనుజ్ఞయా సుమీనాక్షయః ప్రార్ధయేహం సుకన్యయా
మాతస్త్వ వ పద ధ్యానే మనో నిశ్చల మస్తుతే’’
452-విజ్జా (7-9శతాబ్దాలమధ్య )
విజ్జా విజ్జిక విజయ బిజ్జక అని పిలువబడే ఈమె శ్లోకాలు ముకులభట్టరాసిన ‘’అభిదా వృత్తి మాత్రిక ‘’లోఉన్నాయి ,కాశ్మీర్ రాజు అవంతివర్మ సమకాలికుడు భట్ట కల్లటునికొడుకే ముకులభట్టు.అవంతివర్మ రాజ్యపాలన క్రీ.శ.855-883.కనుక విజ్జిక ఇంతకంటే ముందుకాలం లో సుమారు 7-9వ శతాబ్దాల మధ్య లో ఉండి ఉంటుంది.చంద్రాదిత్యుని రాణి విజయభాట్టారికా విజ్జికా ఒకరో కాదో చెప్పలేము .వివిధ గ్రంథాలలో విజ్జిక వి 29శ్లోకాలున్నాయి .మనుష్యులు వారిస్వభావాలు ,ముఖ సౌందర్యం ,మగవాని అందం వియోగిని మనసు ,ప్రేమకళ ,విధిరాత ,ప్రకృతి మొదలైన వైవిధ్య విషయాలపై కవిత్వం చెప్పింది .జీవించిన కాలంలో విజ్జిక గొప్ప సంస్కృత కవయిత్రిగా గుర్తింపు పొందింది .భాషపై ఆమెకున్న పట్టు అనితరసాధ్యమనిపిస్తుంది .పద్మావతికంటే శ్లేషను బాగా రాసింది .పర్యాయోక్త, అతిశయోక్తి ,తుల్యయోగిత విశేషోక్తి ,ఆక్షేప సంకర అలంకారాలను బాగా వాటంగా వాడి కవిత్వానికి జవజీవాలు కలిగించింది .
చాటు శ్లోకం –‘’భూపాలః శశి భాస్కరాన్వయ భువః కే నాంనాసాదితా
భర్తరం పునరేకమేవ హి భువస్త్వాం దేవా మన్యామహే
ఏనాన్గః పరిముష్య కున్తలమథాకృష్యవ్యుదస్యా యతం –చోళం పాణ్యచ మధ్య దేశమధునా కామ్చయం కరః పాతితః ‘’
విశిష్ట కవి ప్రశంస ‘’నీలోత్పల దలశ్యామం విజ్జికాం మామ జానతా –వృధైవదరిండినా ప్రోక్తం సర్వ శుక్లా సరస్వతీ ‘’
సామాన్య కవి ప్రశంస –‘’కవేరభిప్రాయమశబ్ద గోచరం –స్పురంత మాద్రుషు పదేషు కేవలం ‘’
వాదద్భి రంగైః కృత రోమ విక్రియే –ర్జనస్య తూష్ణీంభవతోయమజ్జలః ‘’
గ్రామ్యా –‘’మంచే రోమాన్చితాంగీ రతి ముదితతనోః కర్కటీ వాటికాయాం
కాన్తస్యన్గే ప్రమోదముభయ భుజ పరిష్వక్త కంఠే నిలీనా
పాదేన ప్రేఖ్యాంతీ ముఖరయతి ముహుః పామరీ పైరవాణాం
రాత్ర వృత్రాస హేతోర్వ్రుతిశిఖర లతా లంబినీం కంబు మాలాం ‘’
దృష్టి-‘’జనయతి జననాథ దృష్టి రేషా-తవనవ నీల సరోరుహాభిరామా
ప్రణయిషుసుసమాశ్రితేషు లక్ష్మీ –మారిషు చ మంగమన౦గ మంగ నాసు ‘’
సంభోగ –‘’ధన్యాసి యా కధయసిప్రియ మంగమేపి –నర్మోక్తి చాటుక శతాని రతాన్తరేషు
నీవీం ప్రతి ప్రణిహితేతు కరే ప్రియేణ సఖ్యః శపామియది కించిదపి స్మరామి ‘’
చంపక –‘’కేనాపి చంపక తరోవత్ శపి తోసి –కుగ్రామపామర జనాంతిక వాటికాయాం
యత్ర ప్రరూఢనవశాఖ వివృ ద్వలోభాద్ –భో భగ్న వాటఘటనోచితపల్లవోసి ‘’
వసంతం –‘’కిమ్శుకం కలికాన్తర్గత మి౦దు కలాస్పర్ధి కేసారం భాతి-రక్త నిచోలక పిహితం ధనురివ జతుముద్రితం వితనోః’’
453-వికటనితంబ (9వ శతాబ్ది పూర్వార్ధం )
ధ్వన్యాలోకం లో ఆనందవర్ధనుడు వికటనితంబ శ్లోకం ఉదాహరించాడు .కనుక ఆమె కాలం 9వ శతాబ్ది పూర్వార్ధం .భోజుడు చెప్పినదాని బట్టి వికట నితంబ విధవరాలు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నది .ఆమె మొదటి లేక రెండవభర్త ‘’మాష’’అని పలకటానికి బదులు ‘’మాస ‘’అని పలికినట్లు ,సకాషను సకాసగా పల్కినట్లు తెలుసుకొని తాను యెంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకొన్నది .అనేక కవుల చరిత్రలలో అలంకార శాస్త్రాలలో ఆమె కవితలున్నాయి .అందులో 11లభ్యం .గౌరీ పద్మావతి లలాగానే వివిధ విషయాలపై కవిత్వం చెప్పింది .
ద్రుత విలబితం లో రాసిన మొదటి శ్లోకం రాజుయొక్క శత్రు సైన్యవర్ణన.అందులో ఆ సైన్యాన్ని సిగ్గుపడే యువ కన్యగా శ్లేషించింది .రథోద్దతిలో రాసిన రెండవ శ్లోకం లో రాజు కీర్తి వ్యాప్తిని వర్ణించింది .మూడవ శ్లోకం లో ప్రేయసి తన చెలికత్తెతో అర్ధరాత్రి అయినా ఒంటరిగాబయటకు పోవటానికి తనకు భయం లేదని కారణం పూవింటి విలుకాడు తనకు తోడుగా ఉంటాడని చెప్పింది .నాలుగో శ్లోకం లో సిగ్గుపడే భర్త సిగ్గు వదుల్చుకొని భర్తగా రుజువు చేసుకోమని హితవు చెప్పింది .ఆరవ శ్లోకం లో ధైర్యం లేని ప్రియుడు తనను చేర సాహసించలేక పోతున్నందుకు వ్యధ చెందుతూ ,తన ఆవేదన అరణ్య రోదనమే అంటుంది .7లో కన్యను సముద్రంతో చక్కగా పోల్చి చెప్పింది .8లో చేరువైన ప్రియునితో ప్రేయసిపొందే ఆనందం చెప్పింది .9లో అన్యోక్తి గా తుమ్మెదమీద రాసింది .10లోమకరందం లేని కేతకీ పుష్పాన్ని చేరలేని తుమ్మెద ను వర్ణించింది .11వ శ్లోకం లో వసంత ఋతు వర్ణన చేస్తూ ,అన్ని ఋతువులలో ఆహ్లాదపరచే మామిడి చెట్టు ,ఇప్పుడు ఎడబాటులో ఉన్న ప్రియురాలికి మరణ శాపమే అయిందని ,కొద్దిగా చిగిర్చినా అది ఆమె చావుకే కారణమౌతోందని కవితాత్మకంగా చెప్పింది .
ఆ కాలం లో బాగా పేరెన్నిక గన్న కవయిత్రిగా వికట నితంబ పేరు తెచ్చుకొన్నది .ఎందరో ఆమె కవిత్వాన్ని ఉల్లేఖించారు .విజ్జి కంటే సాధారణ కవిత్వం చెప్పింది .ఆమె శబ్దాలు అందం ఆనందం కలిగిస్తాయి .’’వికట నితంబ కవిత్వ౦ అనుభవించేవారు అందులోని తేనె పలుకులను మరచిపోలేరు ,తన హృదయ మకరందం కంటే అవి మిక్కిలి మధురంగా ఉంటాయని తెలుసుకొంటారు ‘’అన్నాడు రాజ శేఖరుడు .ఆధునిక కవితా సౌందర్యానికి ప్రతీక వికట నితంబ కవిత్వం .ఛందస్సును అద్భుతంగా సద్వినియోగం చేసుకొనే నేర్పు ఆమెది .మందాక్రాంతానని మన్మోహనంగా వాడింది. ‘’దోహాదికా ‘’అనే అరుదైన ఛందస్సును ఉపయోగించింది .
చాటువు –‘’అభిహితాప్యభియోగ పరాడంముఖీ –ప్రకటమంగం విలాస మకుర్వతీ
ఉపరితే పురుషాయితుమక్షమా నవ వధూరివ శత్రు పతాకినీ’’
మానిని –‘’అనాలోచ్య ప్రేమ్ణా పరిణతిమనాద్రుత్య సుహృద-సత్వయాకాండే మానః కిమితి సరలే ప్రేయసి కృతః
సమాకృ స్టాహ్యేతేవిరహ దహనోద్భాసుర శిఖాః-స్వహస్తే నగారాస్త దమలదునారణ్య రుదితైః’’
సంభోగం –‘’కాంతే తల్పముపాగతేవిగాలితా నీవీ స్వయం బంధనాద్
వాసశ్చ శ్లథ మేఖలా గుణ ధృతం కిన్చిన్నితంబే స్థితం
ఎతావత్ సఖి వేద్మి కేవలమహో తస్యాంగం సంగే పునః –కోసౌ కస్మిరత౦ చకిమ్సఖి శపే స్వల్పాపి మేన స్మృతిః’’
మధుకరాన్యోక్తి –‘’అన్యాసు తావదృపమర్దసహాసు భ్రుంగం –లోలం వినోదయ మనః సుమనో లతాసు
ముగ్ధమజాత రజసం కాలికామకాలే –వ్యర్ధకదర్ధ యసి కిం నవమాలికాయాః’’
వసంత –‘’కిం దూరీ దైవ హతకే సహకార కేణా-సంవర్దితేనవిష వృక్షక ఏపమాపః
యస్మిన్ మనాగాపి వికాస వికార భాజి-ధోరా భవంతి మదనజ్వర సంనిపాతః ‘’
ఇంతటితో సంస్కృత కవయిత్రులు సమాప్తం –తర్వాత ప్రాకృత కవయిత్రులతో కలుద్దాం
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

