గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )
459-రేవా
రేవా రాసిన రెండు శ్లోకాలు న్నాయి .ఒకటి ఖండిత నాయకి గురించి ,రెండవది కలహాంతరిత గురించి .గాథలుగా చెప్పబడే ఈ శ్లోకాలు కవయిత్రికవితా ప్రతిభకు జోహార్ అనాల్సిందే .
‘’కిం తావత్ కృతా అధవాకరోషికరిష్యసి సుభగేదానీం-అపరాధనా మలజ్జ శీల కధయ కతమే క్షమ్యతాం’’
‘’అవలంబితమాన పరాన్ముఖ్యాఆగచ్ఛతోమానిని ప్రియస్య –పుష్టపులకోద్దామస్తవ కధయతి స౦ముఖ స్థితంహృదయం ‘’
460-రోహా
కలహాన్తరితపై రోహా రాసిన ఒక్కటే శ్లోకం లభించింది .
‘’యేన వినా న జీవ్యతే నునీయతే స కృతాపరాధోపి-ప్రాప్తేపి నగర దాహే భణకస్య న వల్లభోగ్నిః’’
461-శశిప్రభ
శశిప్రభ శ్లోకం రోహా కవితకు భిన్నమైనది .ప్రియుడిని క్షమించే ఓర్పు నేర్పూఉన్నది .మగతోడు లేకుండా స్త్రీ ఉండలేదని ,లత వృక్షాలంబనం తోనే వర్ధిల్లుతుందని చెప్పింది .
‘’యధాయధావాదయతిప్రియస్తథా తథానృత్యామి చంచలేప్రేమ్ణా-వల్లీ వలయత్యన్గః స్వభావ స్తబ్ధోపి వృక్షే ‘’
462-వద్ధావహి
పోషిత భర్త్రుక గురించి వద్ధావహి రాసిన శ్లోకం ప్రసిద్ధి చెందింది . వర్షరుతువులో నల్లని మేఘాలు వింధ్యపర్వతం శృంగాల్లాగా ఉన్నాయట .
‘’గ్రీష్మేదవాగ్ని మషీ మలినాని దృశ్యంతే వింధ్య శిఖరాణి-ఆశ్వాసిహి ప్రోషిత పతికే న భవాంతినవ ప్రవృడభ్రాణి’’’’
ఇంతటితో ప్రాకృత కవయిత్రులు సంపూర్ణం .
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు
—

