గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య )
ద్వారకా పట్టాల రచించిన బీనాబాయ్ 12నుంచి 15శతాబ్దాల మధ్యకాలం లో ఉన్న కవయిత్రి .తనతండ్రి యదువంశరాజు మండలీకుడని వీర సాహస సద్గుణ సమేతుడని చెప్పింది .ఈ రాజు కధియవార్ ను పాలించిన గిర్నార్ చూదాసమ మండలీకరాజులలో ఒకడై ఉండవచ్చు .మొదటి మ౦డలిక 11వ శతాబ్దం మొదట్లోని వాడు ఈమె తండ్రికాదు.తర్వాత వాళ్ళలో ఒకరై ఉండవచ్చు .పాటలీపురరాజు వీరసి౦హుని కొడుకు హరసింహ రాణి బీనాబాయ్ .అతడు చాహువాన వంశ వారసుడు .కనుక ఆమెకాలం 12-15శతాబ్దాలమధ్య అని నిర్ణయించారు .
మహారాణీ ,మహా విద్యావంతురాలైనా బీనాబాయ్ తన గురించి గొప్పగా ఎక్కడా చెప్పుకోలేదు అదీ ఆమె సౌజన్యం .శ్రుతి,స్మృతి,పురాణాలలో నిష్ణాతురాలు .కృష్ణభక్తురాలు.అందుకే తన జీవితమంతా స్కాంద పురాణా౦ర్గత ‘’ప్రభాస ఖండం ‘’లోని ‘’ద్వారకా మాహాత్మ్యం ‘’ రచించటానికే వెచ్చించింది .ఆమె భారత దేశమంతా పర్యటించి వివిధ తీర్దాలు సేవించింది .
ఈ కావ్యం లో నాలుగు అధ్యాయాలున్నాయి .మొదటి అధ్యాయం లో తనగురించి చెప్పి ,స్కాంద పురాణం లో ద్వారక విశిష్టతను చెప్పిన విషయాలను రాసి ,శ్రీ కృష్ణుని సేవ చేస్తే,ద్వారక సందర్శిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని రాసింది .రెండవ అధ్యాయం లో ద్వారకదారిలో వచ్చే క్షేత్రాలగురించి చెప్పి ,ద్వారకలో గోమతీ నది ,చక్రతీర్ధం ద్వారకా-గంగా తీర్ధం, శంకోద్ధార దర్శనం చివరికి గోమతీనది స్నానం తో సర్వపాప ప్రక్షాళనం .స్నానవిధి తర్పణవిధానం పూసగుచ్చినట్లు వివరించింది .గోమతీ తీరం లో పెట్టె శ్రాద్ధవిదానమూ బాగా రాసింది .చివరికి శ్రీకృష్ణునికి అభిషేకం వివిధసేవలు నైవేద్యాలు వివరించింది .ఇదంతా రామనుజాచార్యులవారి విశిష్టాద్వైత విధానం ఆధారంగా రాసిందే .ద్వారకా మాహాత్మ్యాన్ని అనుసరించినా స్వకపోల విధానం చేబట్టింది .సంప్రదాయ ఆచార పధ్ధతి పాటించటం ఆమెకు అత్యంత ఇష్టమైన విషయం .ఇది చదివితే భారతనారి మతాన్నే కాక మతాతీత సంప్రదాయాన్నీ ఏలగలదనిపిస్తుంది .ఒక అజ్ఞాత యాత్రికుడికి తానొక గైడ్ గా ఉండి ద్వారక యాత్ర చేయించినట్లు అనిపిస్తుంది .ఇప్పుడామె కవితా ప్రతిభ దర్శిద్దాం .
‘’శ్యాయం రామానుజం కాంతం కృతంతందేవా విద్విషాం-నమామి బ్రహ్మ గోపాలవేషం ప్రత్యూహ శాంతయే
‘’ఆశీద్ యాదవ వంశజః పరిలసన్ కీర్తిఃప్రతాపోన్నతో-మానీ మాండలికా భిధః క్షితి పతిఃసద్ద్రం విద్వాశ్రయః
ఆసీర్నిర్జిత వీరవైర నిచయ స్త్యాగార్ధకోశోద్యమో-యోర్ధిప్రార్దితదఃకళావిహ ర్యుగే గణ్యైర్గుపౌర న్న్వితః
తస్య కన్యా వదాన్యాసీ ద్బీనాబాయీతివిశ్రుతా –హరిసింహ మహీపస్య వల్లభా పుణ్య వల్లభా’ప్రధమాధ్యాయం ప్రధమ శ్లోకం –‘’ఏవం సంపూజితస్తేన హరినా బ్రాహ్మణోత్తమా -ఉవాచ పరి సంతుస్టే వరం బ్రూహీతి కేశవం ‘’
చివరగా –‘’మజ్జన సంసార పాదోనిధిస్వలజల ప్రోద్ భవత్ పాపవార్తా –వర్తేసద్వ్రుత్తపోతైఃధృఢ గుణయుతైర్ఘ్రుతఃపుణ్య కీర్త్యా
ధర్మః శ్రీ బీనాబాయ్యాకిలకలియుగే జాతయాయాదవే కిం –వంశే తత్రాతిచిత్రం స హరి రుదధరద్ యన్న ధర్మం ప్రసూనయః
‘శివమస్తు సర్వం –వర్షే భాద్రపద సుది సోమే లిఖితం –శుభం భవత్ శ్రీః’’
464-గంగావాక్యావళికర్త –విశ్వాస దేవి(15వ శతాబ్దం )
మిథిలరాజు శివ సి౦హు ని తమ్ముడు పద్మ సి౦హుని భార్య విశ్వాస దేవి ‘’గంగా వాక్యావళి ‘’రాసింది .భర్త మరణం తర్వాత రాజ్యాన్నిపాలించింది .ఈమె .తోడికోడలైన శివసి౦హుని భార్య లక్ష్మీదేవి కూడా రచనలు చేసిన విద్యా వంతులు .15వ శాతాబ్దికవి విద్యాపతి వంటి కవులకుఆశ్రయమిచ్చినవారు .
గంగావాక్యాని సుదీర్ఘ స్మృతి అంటే కర్మకాండకు సంబంధించింది .గంగానదికి సంబంధిన సకల విషయాలు ఇందులో చెప్పింది .అనేక పురాణ స్మృతులనుండి విషయ సేకరణ చేసి కూర్చిన గ్రంథం .ఇందులోని 29ప్రకరనలున్నాయి .అవే – శ్రవణ కీర్తన యాత్ర వీక్షణ నమస్కార ,స్పర్శన అభయ ,సర్వబంధు పరికృతిక్షేత్ర అవగాహన ,స్నాన తర్పణ మృత్తిక ,జప దాన పిండ ,జల తోయపాన ఆశ్రయ ప్రాయశ్సిత్త,కృతకృత్య మృత్యు అస్తిస్థితి విఘ్న ప్రతిసిద్ధ వగైరాలున్నాయి
గంగను నిత్యస్మరణ చేయాలని స్మరణమాత్రం చేత సద్గతికలిగిస్తుందని .ధనంలేకపోయినా గంగాయాత్ర సంకల్పం బలీయంగా ఉంటె అవరోధాలు తొలగి దర్శనం కలిగి పుణ్యలోకాలు సిద్ధిస్తాయని విశ్వాస దేవి అత్యంత విశ్వాసంగా తెలియ జేసింది .ఈమె కూడా తానొక గైడ్ లా యాత్రికులకు మార్గదర్శనం చేసి ఫలితం సిద్ధింప జేసింది .ప్రతి విషయాన్ని కూలంకషంగా మనముందుంచి మేలు చేసింది .యాత్రిక కరదీపికగా ఉంటుంది కావ్యం .
కంబాల ఆశ్వవతార అనే రెండు పాములు ప్రయాగ ,ప్రతిష్టాన పురం మధ్య ఉంటాయని ,ప్రజాపతి ప్రయాగ బాహుమూలక మధ్య ఉంటాడని ఇక్కడఆని గంగా ,యమునలలో కాని స్నానిస్తే పునర్జన్మ ఉండదని చెప్పింది. ప్రజాపతి ప్రాంతం లో మరణిస్తే ముక్తి లభిస్తుంది .ఇదంతా గమనిస్తే స్మృతి పురాణాలపై రాణి విశ్వావతికి ఉన్న అవగాహన అనంతం అని అర్ధమౌతుంది .ఇన్ని ముఖ్యవిషయాలను గుదిగుచ్చి వరుసక్రమం లో అందించటం లో ఆమె అందెవేసిన చెయ్యి అనిపిస్తుంది .ఉపనిషత్కాలం లోని గార్గి, వాచక్నవిల వైదుష్యం విశ్వావసి లో దర్శనమిస్తుంది .ఆమె ధన్యయై మనలనూ ధన్యులను చేసింది .
మొదటిశ్లోకం –‘’స్వస్త్యస్తువస్తుహ్నిన రశ్మి భ్రుతః ప్రసాదా –దేకం వపుః శ్రితవతోర్హరిణా సమేత్య
తస్మాభి పంకజ సద్రోత్య మృణాలలీలా –మావిష్కరోతి హృది యస్య భుజన్గరాజః ‘’
‘’యావద్ గంగా విభాతి త్రిపురహర జటా మండలం మండయంతీ-మల్లీ మాలా సుమేరేః శిరసి సితమహా వైజయంతీ జయన్తో ‘’
చివరగా –‘’యావత్ స్వర్గ తరంగిణీ హర జటాజూటారంతలంబతే –యావాహ్దిక వికాసి విస్తృత కరః సూర్యే యముజ్జ్హృమ్భతే
యావ న్మండలమేన్దివం వితనుతేశంభో శిరోమండనం-తావత్ కల్పలతే యమస్తు సఫలాదేవ్యాఃసతాం శేయసే
కియన్నిబంధమాలోక్య శ్రీ విద్యాపతి సూరిణా-గంగాం వాక్యావలీ దేవ్యాఃప్రమాణోర్విమలీకృతా’’
‘’ఇతి సమస్త ప్రక్రియా విరాజమాన దానదలిత కల్పలతాభి మానభవభక్తి భావిత బహుమాన మర్హమర్హదేవీ శ్రోమాహిస్వాస దేవీ విరచితా గంగా వాక్యావలీసమాప్తః ‘’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు
—

