గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవితా సమీక్ష -1
సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు ఈ లోకాన్నీ అమితంగా ప్రేమించారు .ఈ ప్రపంచం లోని అందాలు సుఖాలు విశిష్టతలను ప్రేమించారే తప్ప అలౌకిక విషయాలపై ధ్యాస లేదు ..కానీ బౌద్ధ సన్యాసినుల దృష్టి వీరికి భిన్నంగా ఉంటుంది . జీవితం పునరపి జననం పునరపి మరణం కస్టాలు దుఖాలు బాధలమయం కనుక వీటికి అతీతమైన శాశ్వతమైన లోకాన్ని అన్వేషించి అందులో ఉండిపోవాలని నిర్వాణమే మార్గమని నమ్మి అలా జీవించారు .ఎప్పుడైతే భౌతికలోకాపేక్ష లేదో, ఇకవారికి ఈలోకం లోని సుఖం సంతోషం నూతనత్వం తాజాతనం ల తలుపులు మూసేసుకొని ఉండిపోయారు .
వీరికి భిన్నంగా సంస్కృత కవయిత్రులు ప్రకృతి మానవుడు ,ప్రేమమొదలైన అనేక అంశాలపై ఉత్తమమైన శ్రేష్టమైన కవిత్వం రాశారు .కాని బొద్ద సన్యాసినుల కవిత్వం దీనికి భిన్నంగా ఒకే విధమైన, మార్పులేని మూస కవిత్వం (మొనాటనస్ )రాశారు .బుద్ధుడు బౌద్ధ సిద్ధాంతాలు మరుజన్మలేని నిర్వాణం పైనే దృష్టిపెట్టారు .ఆపరిధిని దాటలేదు .తమ చుట్టూ ఉన్న ప్రకృతినే వీరు పట్టించుకోలేదు కాని సంస్కృత కవయిత్రులు ప్రకృతిని ఆరాధించారు మమేకమైనారు .బొద్ద సన్యాసినులు సన్యాసినులే అనిపించారుకాని కాని ,కవయిత్రులు గా గుర్తింపు పొందలేక పోయారు .అంతేకాదు మనిషిని కూడా నిర్లక్ష౦ చేశారు. ఎక్కడో చాలా అరుదుగా బిడ్డ చనిపోతే తల్లి రోదన ,భర్త దౌష్ట్యానికి బాధపడిన భార్య లపై రాసినా మనిషిని కర్త, కర్మగా సరైన దృక్పధంతో ఆలోచి౦చ లేదనే చెప్పాలి .
సంస్కృత కవయిత్రులు మాత్రం స్త్రీత్వ సహజ విషయాలకు ప్రాదాన్యమిచ్ఛి .ప్రేమకు పట్టాభి షేకం చేశారు .కాని బౌద్ధ సన్యాసినులైన కవయిత్రులకు ప్రేమా దోమా జాన్తానై.’’ లైట్ .‘’తీసుకొన్నారు .అది అసలు వారికి విషయమే కాకుండా పోయింది .సంస్కృత కవయిత్రులు సహజ ప్రకృతి ధర్మాలను విస్మరించకుండా వాటిని పండించి ఫలవంతం చేశారు .మానవ ప్రేమకు మహోత్సవం జరిపారు .ప్రేమలోని సౌందర్యాన్ని ,ఆన౦దాన్ని ఆకాశానికి ఎత్తేశారు .దీనికి పూర్తి విరుద్ధంగా బౌద్ధ సన్యాసినులు ప్రవర్తించారు .అభిరుచి ఆసక్తి అన్ని అనర్ధాలకు మూల కారణం అనీ, కనుక దాన్ని త్యజించాలని భావించారు . కోరిక అభిరుచి భౌతికప్రేమ ,దాని వికార రూపం ,మలినత్వం పై పదే పదే విరుచుకు పడ్డారు .కనుక సంస్కృత కవయిత్రులకవిత్వం అత్య౦త తీవ్రమైన స్త్రీత్వపు హృదయం అందులోని సంతోషం ఆనందం బాధలు కన్నీళ్లు ,అల్ప సంతోషం,కడగండ్లు మొదలైన మానవత్వ విషయాలతో ఘనంగా పరిమళి౦చి౦ది .కాని బౌద్ధ సన్యాసినుల ‘’గాథాకవిత్వం’’ లో లక్ష్యాన్ని చేరుకొని ,ప్రశాంతత తో సంతృప్తి సాధించి,భౌతికానంద ,సుఖాలను పరిత్యజించి ,సుఖ దుఖాలకు అతీతంగా ఆడ మగఅనే భేదభావం లేని రుషిత్వం తో, కేవలం ఋషిగానే ,వ్యక్తులకు ప్రాధాన్యతలేని సర్వమానవ ప్రేమ దయ కరుణ లే ముఖ్యంగా భావించారు, జీవితాలు సాగించారు .
సన్యాసినుల గాథలలో సహజ సరళ భావ వ్యక్తీకరణ ,కొన్ని చోట్ల పరమాశ్చర్యం కలిగించే ‘’ఉపమ’’ లతో ఉంటాయి .అయినా వాటిలో సహజ సదృశమైన అందం సంగీతం ,లావణ్యం లోపించి మనసులను ఆకర్షించలేదు .ఈ విషయంలో సంస్కృతకవయిత్రులకవిత్వం సర్వాంగ సుందరం అనిపిస్తుంది .ఒక్కసారి పునశ్చరణ చేస్తే- సంస్కృతకవయిత్రులకవిత్వం అనేకానేకంశాలతో బహు కుతూహలంగా రమ్యంగా ఆకర్షణీయంగా ఉంటె ,బౌద్ధ సన్యాసినుల గాథలలో కవిత్వం ఒకే ఒక్క విషయంపైనే దృష్టిపెట్టి రాసింది .మొదటి వానిలో లక్ష్యం ,స్పష్టత ఉండి,బాహ్యవిషయాలపై ఆసక్తి కనిపిస్తుంది .రెండవదానిలో ఎక్కువగా విషయపరమై ,నైరూప్యంగా అంటే ఆబ్స్ట్రాక్ట్ గా అనగా లోపలి అనుభవాలను చిత్రీకరించాయి మొదటి వాటిలో ఇంద్రియపరమైనవిగా భావగీతాలుగా మనసుకు హత్తుకొంటాయి .రెండవ రకమైనవాటిలో గంభీరత తీవ్రత ,సందేశాత్మక బోధనగా ఉంటాయి .మొదటివి ఆసక్తి రేపి ,సజీవంగా ఉంటె రెండవ రకానివి గంభీరంగా ప్రశాంతంగా ఉంటాయి .మొదటివాటిలో’’ ఫెమినైన్ టచ్’’అంటే స్త్రీత్వ స్పర్శ తో వైయక్తికమైతే రెండవవీ సహన దయాశీలం సార్వకాలికంగా దేనికీసంబంధంలేనట్లు౦ టాయి .మొదటివి సాధారణంగా మధురంగా ఉంటె రెండోవి కూడా సరళ౦గాఉన్నా నిరాడంబరంగా కఠినంగా కనిపిస్తాయి .మొత్తం మీద మొదటి వాటిలో మక్కువ ఉద్వేగ ఉద్రేకాలు ఉంటె, రెండవవాటిలోలోతైన,గాఢమైన అభినివేశాలుంటాయి .మొదటివి చురుకుతో సజీవమైతే రెండవవి గంభీరంగా ఉన్నతమైంది.మొదటిది ఈ లోకం గురించే ఆలోచిస్తూ తెలీని మరోలోకం వైపు చూడలేదు .రెండవది ఈ లోకాన్ని తృణీకరించి పరలోక మార్గాన్వేషణ చేసింది .రెండురకాల కవిత్వాలను మహిళలే రాసినా పూర్తి వైరుధ్యం దర్శనమిస్తుంది .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

