ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వ గంధ బలాతిబల మొదలైన మహా మూలికలను నిష్ప్రయోజనం అని నిరూపి౦ప జేసి ఆయుర్వేదాన్ని భూ స్థాపితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి భారత వైద్య ప్రతినిధిగా ‘’ఏకాంగ వీరుడిగా’’ ఎదిరించి నిలిచి ‘’ఆయుర్వేద కాంగ్రెస్ ‘’స్థాపించి ఆసేతు హిమనగం బర్మా ,కాబూల్ లలో పర్యటించి ,మహా పండితులను ఏకం చేసి ఉద్యమానికి బాసటగా మద్రాస్ లో ఆయుర్వేద కళాశాల స్థాపించి ,అనేక ఆయుర్వేద గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాసి ప్రచురించి ఆయుర్వేదం మహోన్నత వైద్య విధానం అని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తీ పండిత దీవి గోపాలాచార్యులు
మద్రాస్ లోని కన్యకాపరమేశ్వరి ఆయుర్వేద కాలేజి లో వైద్యులుగా పని చేస్తూ గుర్రబ్బండీ మీద మాత్రమె ప్రయాణం చేసేవారు .అప్పుడు ఆంగ్లేయ సివిల్ సర్జన్ల ఫీజు అయిదు రూపాయలు . వీరుకూడా అదే ఫీజు తీసుకొనే వారు సమానంగా .ఆ ఆయుర్వేద కాలేజిలో దేశం లోని అన్ని ప్రాంతాల విద్యార్ధులు ఉండేవారు .ఆయన చనిపోవటానికి ముందు రామ చంద్ర వారిని సందర్శించి ధన్యులయారు .తలపాగా ఊర్ధ్వ పు౦డ్రాలతో మహా వర్చస్సుతో వెలిగి పోయే వారట .గాంభీర్యం కరుణ ముఖంలో కనిపించేవి .ఆధునిక ధన్వంతరి దీవి గోపాలాచార్యులవారు .
కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర భావ దేవరపల్లి లో 10-10-1872న జన్మించారు.ఆయుర్వేద మార్తాండ ,భిషజ్మణి’’ వైద్య రత్న బిరుదాంకితులు ,ఆయుర్వేదం లో విస్తృత పరిశోధనలు చేసి ప్లేగు ,కలరాలకు ‘’శత ధౌత ఘ్రుతం ‘’హైమాది పంక్రం –అంటే పానకం మందులు తయారు చేసి వాడి ఆ జబ్బులు నయం చేసిన ప్రయోగ శీలి .29-9-19-20న 48వ ఏటనే చనిపోయారు .
హాధీ రాం జీ నమిలిన అల్యాకు
రామచంద్ర గారి ఆయుర్వేదా చార్యులు చింతపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీవి వారికి మొదటితరం శిష్యులు .ఒకరోజు సుమారు పదిహేను మంది విద్యార్ధులను వెంట తీసుకొని ఓషధీ విజ్ఞాన యాత్రకోసం కపిల తీర్ధం కొండ ఎక్కించారు .అక్కడ ఒక చోట తన చేతిలో ఉన్న బాణాకర్ర తో పొదలాగా ఉన్న చిన్న పొన్నగంటి ఆకుల్లాగా ఉన్న పొదను చూపించారు .ఆఆకులు తినమన్నారు అలాగే తిన్నారు అవి పిచ్చ తియ్యగా ఉన్నాయి .అతిమధురం కన్నా తీపి .రసం మి౦గ గానే కొత్త బలం శక్తి వచ్చి నట్లు అందరికీ అనిపించింది .అందర్నీ కూర్చోబెట్టి దానికథచెప్పారు శాస్త్రిగారు .
‘’దీనిపేరు అల్లి ఆకు .అల్యాకు అంటారు.తిరుపతిలోని హాథీరాం మఠం లో’’ హథీ రాంజీ’’ మహంతు గారు సుందర బాలాఢ్యుడు.తిరుపతికి పడమరగా రెండుమైళ్ళ దూరం లో ఒక రింగు తోట ఉండేది .అక్కడ రాతి గుండ్లు ఉంటాయి మీరు చూసేఉంటారు వాటిని బంతి లాగా ఎగరేస్తూ వ్యాయామం చేసేవాడు .ఈ అల్యాకు గుప్పెడు నోట్లో వేసుకొని ,నమిలి రసం మింగి నెలరోజులు ఆహారం లేకుండా తపస్సు చేసేవాడు .తర్వాత మరో గుప్పెడు నమిలి రసం మింగి యోగ సమాధిలో నెలల తరబడి ఉండేవాడు .రెండుమూడాకులు తింటే ఆకలే వెయ్యదు.ఇక్కడే తిరుపతి (యాత్రీకులు ఆచిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కడితే త్వరలోనే స్వంత ఇల్లు నిర్మిస్తారు అనే నమ్మకం ఉంది .నేనూ మాఅమ్మాయి అలాగే రాళ్ళు పపేర్చాం తర్వాత ఇల్లు కట్టుకోన్నాం –ఇది స్వవిషయం ).
అంతటి యోగీ ఒక యోగిని చేతిలో మోసపోయాడు .ఆమె తిరుపతికి వచ్చి ఈయనతో వాదానికి దిగి ,ఓడిపోయింది .తనను పురుష శక్తితో గెలవమని అప్పుడే ఓటమి అంగీకరిస్తానని సవాలు విసిరింది .నమ్మి ఓడిపోయాడు ఆయన్ను భ్రస్టుడిని చేసి పారి పోయింది .యోగ భ్రస్టుడై స్త్రీ వ్యామోహం లో పడి కొంతకాలానికి తెలుసుకొని మళ్ళీ దార్లో పడ్డాడు ‘’అని శాస్త్రీజీచేప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-20-ఉయ్యూరు

