వీక్షకులు
- 1,107,399 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.69 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,543)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: December 2020
హేలాపురి (ఏలూరు )శతకం
హేలాపురి (ఏలూరు )శతకం
కిరాతార్జునీయం-.41(చివరి భాగం )
కిరాతార్జునీయం-.41(చివరి భాగం ) 18 వ చివరి సర్గ -2(చివరి భాగం ) అర్జునుని సఫలత చూసిన ప్రమథగణం అతని తపస్సును ఫలితం మహా గొప్పదని కీర్తించారు –‘’తపసికృత ఫలే ఫలజ్యాయసీ –స్తుతిరివ జగదే హరేఃసూనునా ‘’.అర్జునుడు ప్రత్యక్ష మహా దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు –‘’ఓ శంకరా !పరమ దయామతివి ,భక్తసులభుడవు ,,శరణమిచ్చే వాడివి … Continue reading
కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1
కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1 తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జునుడిని శివుడు ముద్గరం అనే ఇనుప ఆయుధం వంటి పిడికిలితో పొడిచాడు –‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జునులు ముష్టి యుద్ధం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టుకొ౦టే కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో … Continue reading
కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం )
కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం ) ప్రతీకార సమర్ధుడైన పార్ధుని చేయి ఆ సమయం లో సాయ పడకపోయినా ,పూర్వపు ఉపకారం తలచుకొని అమ్ములపొది నుంచి అతి కష్టంగా వేరు పడింది .కృతజ్ఞుడైన సత్పురుషుడు మొదట ఉపకారం చేసిన వాడైనా ,తత్కాలం లో ఉపయోగపడని మిత్రుడిని వదలటం సహజమే .-‘’పరాన్ముఖత్వేపి కృతోపకారా—త్తూణీ ముఖాన్మిత్ర కులాది … Continue reading
కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2
కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2 అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జునుడు ప్రమథులకు ,కంటి దోషమున్నవారికి ఒకే చంద్రుడు అనేక బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దోషావృతలోచనానం –విభిద్యమానః ప్రుథ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు – శివుడి … Continue reading
కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1
కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1 ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్ధం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జునుడిపౌరుషం బాగా అతిశయించింది –‘’ధృతం గురు శ్రీర్గురుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను యుద్ధం చేస్తున్నందుకు సంతోషించాడు కాని శత్రువు వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొగ … Continue reading
54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం
54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం
కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం )
కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం ) అర్జున సర్పబాణ సముదాయం వలన సిద్ధులు ,పక్షులు సంచరించే మార్గం ఆగిపోయి ,అగ్ని అన్ని వైపులకు వ్యాపించటం చేత దిక్కులు పొగతో నిండిపోయాయి .శత్రువులు ముట్టడించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా౦-పరోపరుద్ధస్య పురస్య భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రాన్నిసర్పాల బాధ … Continue reading
కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2
కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2 అర్జునుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పోగొట్టే ‘’ప్రస్వాపనాస్త్రం ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త్రం ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్టంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్ సగణస్యశత్రోః-‘’.ప్రస్వాపనాస్త్రం ద్రుతమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ … Continue reading
కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1
కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1 కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జునుడికి కోపం వచ్చి,తాను యుద్ధం లో గెలవక పోవటానికి కారణాలు ఊహించటం మొదలు పెట్టాడు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్టం తెలిసిన ఏనుగులు కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా … Continue reading
కిరాతార్జునీయం-.33 15వ సర్గ – 4(చివరి భాగం )
కిరాతార్జునీయం-.33 15వ సర్గ – 4(చివరి భాగం ) శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ … Continue reading
కిరాతార్జునీయం-.32 15వ సర్గ – 3
కిరాతార్జునీయం-.32 15వ సర్గ – 3 కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 20- రుమేనియా దేశం ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్ బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు … Continue reading
పూలదండకు మరణ శిక్షా ?
పూలదండకు మరణ శిక్షా ? కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం అసూయకు దారితీసిందా శివదాసన్ ! కొచ్చీ మెరైన్ డ్రైవ్ వీధిలోనే పడుకుంటూ నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే నీపైనే అసూయా ? … Continue reading
కిరాతార్జునీయం-.31 15వ సర్గ – 2
కిరాతార్జునీయం-.31 15వ సర్గ – 2 కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 12-ఆస్ట్రేలియా దేశం 1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం … Continue reading
కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం )
కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం ) ‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 9-పోలాండ్ దేశం ప్రొఫెసర్ ఇ.స్టుడ్ కీ విజ్ పోలాండ్ లోని అతిపెద్దదైన వార్సా యూని వర్సిటిలో సంస్కృత బోధన పుస్తకం రాశాడు .ఎ.లోగోవి స్కి ఇప్పటికీ బోధిస్తున్నాడు .ఆర్టూర్ కార్ప్ సంస్క్రుతపాలీ భాషల ను నేర్పుతున్నాడు .ప్రొఫెసర్ ఎం కె.బిరిస్కి,తాను ఇండియాలోని బెనారస్ యూని వర్సిటిలో చదివి నేర్చిన … Continue reading
హితం పలికే శ్రీధర్ ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు
హితం పలికే శ్రీధర్ శ్రీ శ్రీధర్ ఎర్రోజు ఎవరో నాకు తెలియదు కాని ఆయన రాసిన ‘’ఈశ్వరమ్మ శతకం ‘’మాత్రం నాకు ఆయనే ఈ నెల 8న పంపగా బహుశా నాలుగైదు రోజుల క్రిందట నాకు అందింది కాని నేను చూడలేదు .నిన్ననే చూసి ఆయనకు ధన్యవాదాలుచేప్పాను .నాస్పందన తెలియజేయమని చిన్న నోట్ కూడా పుస్తకం … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం
విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం క్రీశ 1 -4శతాబ్దాలమధ్య ఇండోనేషియాలో భారతీయ రాజుల పాలన జరిగింది .కంబూజ అని నేడు పిలువబడుతున్న కా౦భోజలో శ్రీమార ,కౌండిన్య ,సుమత్రలో శ్రీ విజయ ,జావా ,బాలీ లలో శైలేంద్ర వంశాలు పాలించాయి .రామాయణ భారతాలలో బౌద్ధ గ్రంధాలలో దీవులమధ్య సాహస కృత్యాల వర్ణన కనిపిస్తుంది … Continue reading
17.12.2020 గోరసం వారు బాలుపై తెచ్చిన 88మందికవుల కవితల నీరాజనం జూమ్ ద్వారా సాతంత్రం 6గంటలకు ఆవిష్కరణ జరిగింది
“గోదావరి రచయితల సంఘం(గోరసం)”చే ఈరోజు అనగా 17 డిసంబర్ 2020 నాడు జూమ్ వేదికగా ప్రముఖ గాయకుడు కీ.శే. శ్రీ ఎస్.పి.బాలు గారికి కవితార్చన సంకలనాన్ని ఈరోజు గోరసం సంస్థ ఆవిష్కరణ చేసింది. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జానపద అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, ప్రముఖ మాటల పాటల … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 4-జర్మని దేశం జర్మనీ దేశం లో సంస్కృతం పై అభిమానం 19వ శతాబ్ది ప్రారంభం లో క్లాసిక్ రచయిత జే .డబ్ల్యు .వాన్ గోథే తో ప్రారంభమై,జే బి హెర్డర్ తో స్థిరపడింది .వాన్ షెలేగల్ ,అనే హంబోల్ట్ ఇండియన్ స్టడీస్ కు పీఠాలను 1818లో బాన్ ,1821లో … Continue reading
శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం
శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం సాహితీ బంధువులకు శుభకామనలు –2021నూతన ఆంగ్లసంవత్సరం ,సంక్రాంతి శుభాకాంక్షలు – శ్రీ చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు డా చర్ల మృదుల గారు నాలుగు రోజులక్రితం నిడదవోలు నుంచి ఫోన్ చేసి 10-1-2021 ఆదివారం ఉదయం 10గంటలకు నిడద … Continue reading
కిరాతార్జునీయం-.29 చతుర్దశ సర్గ -3
కిరాతార్జునీయం
విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 1-కెనడా దేశం –1996-2001 అశోక్ అక్లుజ్ కర్- వాన్కూవర్ లోని యూని వర్సిటి ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ఏషియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ .భర్తృహరి ,ఆయన వ్యాఖ్యాతలపై పరిశోధన చేశాడు .కకెనడలో సంస్కృతం పై పరిశోధన చేశాడు .ముక్తాక్ అక్లుజ్ కర్ –భర్తృహరి … Continue reading
కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2
కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2 కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య .గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జనులకు ఎప్పుడూ శత్రువులే –‘’సఖా న యుక్తః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా సూయతి యస్తపస్యతే –గుణార్జనోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధయః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః … Continue reading
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం https://photos.google.com/album/AF1QipM-O2q4FAVv21i-tdl0U1eyxSuTu5W5hxDbySXk
కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం )
కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం ) శివుడు పంపిన భిల్లుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్తమ మార్గాలను బోధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి సంగతేమిటి ?ఆత్మజ్ఞానులైన యతులు జనన మరణాలు … Continue reading
ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం
ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు .డిసెంబర్ 14 సోమవారం తో శ్రీ శంకరవిజయం ఏడవ సర్గ ప్రత్యక్ష ప్రసారం పూర్తీ చేసి ,మళ్ళీ మాఘమాసం లో మిగిలిన సర్గలు పూర్తీ చేయాలని సంకల్పం . ఇది వరకే ప్రకటించినట్లు ఈ డిసెంబర్ 15 … Continue reading
కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2
కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2 శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని మూడోకంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణపు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసోప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్తడిల్లతాభైః-కిరణైర్వ్యోమని … Continue reading
కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1
కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1 అర్జునుడు దగ్గరకొస్తున్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క బొడుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తున్న పందిని అర్జునుడు చూసి ,అనమాని౦చగా, మనసులో అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు … Continue reading
కిరాతార్జునీయం-.23పన్నెండవ సర్గ -2(చివరి భాగం )
కిరాతార్జునీయం-.23 పన్నెండవ సర్గ -2(చివరి భాగం ) మహర్షులు దర్శించిన శివుడు హిమాలయం పై ఉండటం తోపర్వతాలు సముద్రాలు ఆకాశం దిక్కులు అన్నిటినీ కల్గిన ఈ విశ్వాన్ని తన ప్రకాశం తో వ్యాపించి నట్లున్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక పర్వతాల దాకా … Continue reading
శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో ధనుర్మాస ప్రత్యేక పూజలు
ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ విదియ 16-12-20 తెల్లవారితే బుధవారం నుండి 13-1-2001మార్గశిర బహుళ అమావాస్య 13-1-2001 భోగి వరకు ధనుర్మాసం సందర్భంగా ప్రతి రోజూ ఉదయం 5-30నుండి స్వామి వారలకు సుప్రభాత సేవ ,తిరుప్పావై ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు అష్టోత్తర ,సహస్రనామార్చన ,శ్రీ గోదా రంగనాయక స్వాములకు … Continue reading
కిరాతార్జునీయం-.22 పన్నెండవ సర్గ -1
కిరాతార్జునీయం-.22 పన్నెండవ సర్గ -1 ఇంద్రుడు అంతర్ధానమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రారంభించాడు .సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు –‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి … Continue reading
కిరాతార్జునీయం-.21 పదకొండవ సర్గ -4(చివరి భాగం )
కిరాతార్జునీయం-.21 పదకొండవ సర్గ -4(చివరి భాగం ) అర్జునుడు ముసలి తాపసి వేషంలో ఉన్న ఇంద్రునితో ఇంకా చెబుతున్నాడు ‘’మనిషి అభిమానం తో ఉన్నంతకాలం సంపద నిలుస్తుంది .కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .—తావదాశ్రీ యతే లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తావదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’ … Continue reading
సార్ధకమైన ఆదివారం
సార్ధకమైన ఆదివారం సాహితీ బంధువులకు శుభకామనలు .నిన్న 6-12- 20 కార్తీక బహుళ షష్ఠి ఆదివారం మా ఇంటి పెరటిలో ఉన్న ఉసిరి వృక్షం క్రింద ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు నేనూ మా అబ్బాయి మూర్తి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకంతో తో సహా చేసి, శివ అస్టోత్తర శతనామపూజ, … Continue reading
కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం
కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం https://photos.google.com/share/AF1QipOZK-YDfb09Tj3Ha24fPGPzx-wteFFXqQVyhHoYQeh03mKScTC0jiKnhwB_CKacPg/photo/AF1QipNNT5-8YyueCmJLyByHk_hWH7iKVz81UjWvno6a?key=MTQyNU5lbjdTcUlJNmtUTWhaalRHOVB3ZlprRU1R
సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !
సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం ! ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
కిరాతార్జునీయం-.20 పదకొండవ సర్గ -3.
కిరాతార్జునీయం-.20 పదకొండవ సర్గ -3. అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం … Continue reading
కిరాతార్జునీయం-.19 పదకొండవ సర్గ -2
కిరాతార్జునీయం-.19 పదకొండవ సర్గ -2 ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల … Continue reading
కిరాతార్జునీయం-.18 పదకొండవ సర్గ -1
కిరాతార్జునీయం-.18 పదకొండవ సర్గ -1 ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త ఏందు కరైరహ్నః పర్యంత ఇవ … Continue reading
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ https://photos.google.com/share/AF1QipMjPo4iV-V7Xjicv9NQ28T6783BQSvk5VAIsjHEbMjpGXVTXUKI_ewdJmwdISsB8w?pli=1&key=N3ZBbUVjZVh5dkhtV1Jrci1NNTd3UDlZV1pYZ3hn
తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్
తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 1815 డిసెంబర్ 15 న ఆంగ్ల కవి లార్డ్ బైరన్ ,లేడీ బైరన్ దంపతులకు జన్మించింది అగస్టా ఆడా.ఎనిమిదవ ఏట తండ్రి బైరన్ గ్రీకు ప్రజాయుద్ధం లో చనిపోయాడు .తల్లి కూతురికి గణిత౦ ,లాజిక్ లపై ఉన్న శ్రద్ధను హర్షించలేకపోయింది … Continue reading

