ధన్యవాదాలు
బ్రహ్మశ్రీ డా రాచకొండ నరసింహ శర్మ గారు -ఎం.డి గారికి -నమస్కారాలు
సరసభారతి పై మీకున్న అవ్యాజ అనురాగం ,ఆత్మీయత మరువలేనిది .మా కార్యక్రమాలు మీరు మెయిల్ లో చూస్తూ ,సరసభారతి బ్లాగ్ ను నిత్యం ఈ 95ఏళ్ల వయసులో కూడా చదువుతూ మెయిల్ లో స్పందిస్తూ ,నాకు .సరసభారతికి గొప్ప స్పూర్తి కలిగిస్తున్నారు .మీకు వీలైనప్పుడల్లా సరస భారతికి
మేము అడగకుండానే చెక్ ల రూపం లో డబ్బు పంపుతూ మాకు మరింత ఉత్సాహ ,ప్రోత్సాహాలు కలిగిస్తున్నారు . ఇటీవల మీరు నా పేర పంపిన 10వేలరూపాయల చెక్ ఇవాళే అందింది .కృతజ్ఞలతో ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .మీ శ్రీమతి గారు డా .అన్నపూర్ణా దేవి గారికి మా నమోవాకములు .మీ దంపతులు మంచి ఆరోగ్యం తో కలకాలం జీవించాలని కోరుతూ మీఆశీస్సులు మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుతూ -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-21-ఉయ్యూరు

