భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8
ఎస్టేటు –పెన్షన్
దండి ఉప్పు సత్యాగ్రహం దేశం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .ప్రభుత్వం లాటీలకు ,జైళ్లకుకు పని పెట్టింది .రవీంద్రుడు ‘’నైట్ ‘’బిరుదును వదిలేస్తూ వైస్రాయ్ చేమ్స్ ఫర్డ్ కు ‘’మీ బిరుదులు ఇప్పుడు మాకు అవమానంగా ఉన్నాయి .అనాగరకులైన మీ చేతులలో నా దేశ ప్రజలను అమానుష, హింసలకు గురి చేస్తున్నారు .ఈ బిరుదు త్యజించి ,అనామకులైన ప్రజలలో నేనూ ఒకడిగా ఉండటమే నాకు గౌరవం ‘’అని జాబు రాశాడు
.రాజీనామా చేసిన కొద్ది రోజులకే కలకత్తా వెళ్లగా జనం తండోప తండాలుగా స్టేషన్ కు వచ్చి స్వాగతం పలికారు విఠల్ భాయ్ కి .ప్రభుత్వానికి ఇది తప్పు అనిపించి ,పోలీసులు లాఠీ చార్జి చేశారు .పండిట్ గోవింద మాలవీయ మొదలైన నాయకులు తీవ్ర గాయాలయ్యాయి .కలకత్తా వీధులలో జరిగిన ఈ కిరాత చర్య స్వయం గా చూశాడు పటేల్ భాయ్ .ఇక క్షణం కూడా వృధా చేయకుండా స్వాతంత్ర్య సమరం లోకి దూకాడు ‘
పెషావర్ సంఘటనలు
1920 సహాయ నిరాకర ఉద్యమానికే మనకు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది .కానీ కొన్ని హింసాత్మక సంఘటనలు చూసి ,గాంధీ మధ్యలోనే విరమింప జేశాడు .గాంధీకి శాంతి ,అహింసలే ఆయుధాలు .స్వామి వివేకానంద మహాత్ముడిని ‘’చాలా దేశాలు తిరిగాను .మనిషిలోని చెడ్డతనాన్ని మాత్రమె ద్వేషించి ,మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తిత్వం ఆయనది ‘’అన్నాడు ..రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులందర్నీ ప్రభుత్వం బంధించటం తో ప్రజలు ఉద్రేకం పొంది ,గందర గోళం లో ఒక బ్రిటిష్ ఆశ్వికుడు చనిపోయాడు .మిలిటరిని దింపి ప్రజలపై కాల్పులు జరిపించింది ప్రభుత్వం .పరిస్థితి విషమించి పాలన స్తంభించి పోయింది .రాయల్ ఘర్వాల్ సైనికులు దేశీయులపై కాల్పులు జరపటానికి నిరాకరింఛి , ,ప్రజల చేతులలో ఆయుధాలు ఉంటేనే తాము కాలుస్తామని పిల్లల్ని బిచ్చగాళ్ళను కాల్చమని ,ఇండియా సైన్యం ఇండియా రక్షణ కోసమే ,నిరాయుధుల్ని ,చంపటానికి కాదు అని తేల్చి చెప్పారు .అసలు ఈ ఘటనకు కారణం –బ్రిటిష్ సైనికుడు ముందు తుపాకి పేల్చాడు .రిక్షాలో వెడుతున్న ఒక యువతికి ఇద్దరు కొడుకులకు ఆ తూటా తగిలి చనిపోయారు .దీనితో ప్రజలు కోపం పెచ్చుపెరిగి హద్దు మీరటం జరిగింది .ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వం ఒక సంఘాన్నిఅలహాబాద్ హైకోర్ట్ జడ్జి షా మహమ్మద్ సులేమాన్ ,కలకత్తా హైకోర్ట్ జడ్జి ఫ్రా౦ క్రిడ్జి సభ్యులుగా నియమించి .వారి నివేదికలో సులేమాన్ ‘’ప్రభుత్వ మిలిటరీ కారు కింద పడి ప్రజలు చావటం వలననే బ్రిటిష్ ఆశ్వికుని ప్రజలు నిరోధించారు’’అన్నాడు పెషావర్ సంఘటన భయంకరంగా విషాదంగా ముగిసింది .
పటేల్ కమిటీ
పెషావర్ సంఘటనపై నిజ నిర్ధారణ చేయటానికి కాంగ్రెస్ విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడుగా ఒక విచారణ సంఘం నియమించింది .ఈ సంఘ సభ్యులు వాయవ్య రాష్ట్రం లో అడుగు పెట్టకూడదని ప్రభుత్వం నిషేధించింది .ఈ కమిటీ నివేదికనూ జప్తు చేసింది .పటేల్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నివేదిక తయారు చేసి కాంగ్రెస్ కార్యవర్గానికి అందించాడు .దీనిపై చర్చించటానికి కార్యవర్గం 7-8-1930 న ఢిల్లీలో సమావేశమవగా ,ప్రభుత్వం ఆసమావేశాన్ని నిషేధించింది .విఠల్ భాయ్ ,కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు దాన్ని లెక్క చేయకుండా ఉల్లంఘి౦చ గా వీరిని బంధించి జైలులో పెట్టి,6నెలలు కఠిన శిక్ష విధించింది ప్రభుత్వం . అప్పుడు పటేల్ నవ్వుతూ ‘’ఇంగ్లాండ్ లో తమ పదవులకు రాజీనామా ఇచ్చిన స్పీకర్లకు ఎస్టేట్ పెన్షన్ ఇచ్చి గౌరవిస్తుంది .ఎస్టేట్ పెన్షన్ ఇవ్వటానికి బదులు ఇండియా మొదటి అనధికార అధ్యక్షుడిని బంధించి కారాగార శిక్ష విధించారు .ఇదే పెన్షన్ అన్నమాట ‘’అన్నాడు .
పటేల్ అనారోగ్యం
విఠల్ భాయ్ ని మొదట్లో ముల్తాన్ జైలులో ఉంచారు .అక్కడ జబ్బు పడగా కోయంబత్తూరు జైలుకు మార్చారు .డాక్టర్ పరీక్షలో కడుపులో పుండు పెరిగినట్లు గుర్తించారు .ఆపరేషన్ చేయటానికి బల్లపై పడుకోబెట్టారు .అకస్మాత్తుగా ఆయన కింద పడి పోయాడు .దెబ్బలు తగల్లేదు .జైలు రిపోర్ట్ ఇండియా ప్రభుత్వ పరిశీలను పంపారు .1931జనవరి 5న మద్రాస్ శాసన సభలో ఒక సభ్యుడు పటేల్ అనారోగ్యకారణం గా వెంటనే విడుదల చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టాడు .ఆతర్వాత రెండు రోజులకే పటేల్ ను విడుదల చేసింది ప్రభుత్వం .అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది .అందువల్ల చారిత్రాత్మక గాంధీ –ఇర్విన్ ఒడంబడిక రాయబారం లో పాల్గొన లేకపోయాడు .ఫిబ్రవరిలో వియన్నాకు వెళ్ళాడు .అక్కడ మేజర్ ఆపరేషన్ జరిగింది .ఆరోగ్యం కొంత నయమని పించింది .
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
భారత దేశ సమస్యా పరిష్కారానికి ఇంగ్లాండ్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది .మొదటి దాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.దీనికి సిద్ధపడ్డారు .మోకాళ్ళు దిగని కొల్లాయి కట్టి ,ఒకచేతకర్ర మరో చేత భగవద్గీత తో 40కోట్ల భారతీయుల ఏకైక ఆత్మ అయిన మహాత్మా గాంధి హాజరయ్యాడు .విఠల్ భాయ్ కూడా వియన్నానుంచి సరాసరి లండన్ వెళ్ళాడు .ఆరోగ్యం సహకరించకపోవటం, గాంధీ అభిప్రాయాలు తన ఆశయాలకు భిన్నంగా ఉండటం వలన ఏమీ చేయలేక పోయాడు .సమావేశ ఫలితాలు ఆయనకు నచ్చలేదు .బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ పై తీవ్రంగా విమర్శిస్తూ –‘’మొదటి సమావేశం లోఏం చెప్పారో ఇప్పుడూ అదే పాటపాడారు .గాంధీ –ఇర్విన్ ఒడంబడిక వలన కాంగ్రెస్ సహకారం ప్రభుత్వానికి లభించినా ఆమాట పేర్కొనలేదు .దానిపై ఆశలు పెట్టుకొన్న వారి ఆశలు నిరాశాలయ్యాయి ‘’అన్నాడు
.స్వేత పత్ర నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం ,కేంద్ర శాసన సభ అఖిలభారత ఫెడరల్ విధానాన్ని అనుసరిస్తేనే ఇది సాధ్యం .ఇందులో పెట్టిన నియమాలు-దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ వైస్రాయి చేతిలోనే ఉంటాయి .ఫైనాన్స్ విషయం లో ఇండియా కార్యదర్శి నిబంధనను బట్టిమాత్రమే ప్రజామంత్రిస్వీకరించాలి .సంస్థానాధీశులకు ,బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధాలు చక్రవర్తి పర్య వేక్షణలోనే ఉండాలి .బ్రిటిష్ వ్యాపారిపై ఆర్ధిక వ్యాపార అన్యాయ ప్రవర్తన ఉండరాదు .మైనారిటీ హక్కులకోసం వైస్రాయ్ కి అవసరమైన అధికారాలుంటాయి .కరాచీ కాంగ్రెస్ ఈ వైట్ పేపర్ ను తిరస్కరించింది .తమకోరికలను ఇలా –సంపూర్ణ స్వాతంత్ర్యం ముఖ్యంగా దేశ రక్షణ విదేశా౦గ విధానం ఫైనాన్స్ ప్రజల ఆధీనంలోనే ఉండాలి .కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కు భారత దేశానికే ఉండాలి .ఇండియా అప్పు ఎంత సమంజసమో ,అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఎంత భరిస్తుందో నిష్పాక్షిక విచారణ జరగాలి ‘’అని రాతపూర్వకం గా తెలియజేస్తే ,దాన్ని బుట్ట దాఖలు చేసి దేశ గౌరవాన్ని మంట గలిపి,కాంగ్రెస్ ను తీవ్రంగా అవమాన పరచింది బ్రిటిష్ ప్రభుత్వం .బ్రిటిష్ ప్రధాని ఇండియాకుస్వాతంత్ర్యం ఇవ్వటం జరగదని కుండ బద్దలు కొట్టి మరీచెప్పాడు .
సశేషం
నరక చతుర్దశి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,920 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

