సంకర హాస్యం
కొన్ని పదాలలో ఉన్న ఒక అక్షరాన్ని మరొకటి కౌగిలించుకొని ఒక వింత రూపాన్ని పొంది ,పరిహాసంగా మారటమే సంకరం .నేపధ్యప్పాట ,ఏమ్హ్లేదు ,షుమ్మయ్య (ఉష్,అమ్మయ్య ),పుస్తకం కొండ మెందుకు ?వాణ్ణ నాల్సిన పన్లేదు.ఇలాంటివి ముళ్ళపూడి మార్క్ ఆస్యానికి బంగారు తునకలు .
భ్రష్టం –తచ్చనం ,అన్ స్ప్రూయత,వ్రెందుకు ,బ్ర౦ధి ఖానా
లోహనం –ను ఇంగ్లీష్ లో లిస్పింగ్ అంటారు .దైల్లో త్రంకు పెట్టె మరిచా .ఎవరైనా తెత్తిత్తేబౌమానం ఇత్తా.
ముద్దమాటల హాస్యం
‘’అమ్మా మన దొద్దిలో పూలు పూత్తున్నయ్యే,.దీనికో పద్యం అనిరుద్ధ చరిత్ర లో కథా ప్రారంభ పద్యం కూడా ఉంది .
‘’అని దుద్దుని చాలిత్తము –ఇనుతకు మాకు ఉదయములు ఏదుక పొడమేన్ –ఇనిపింపు తయిత్తరముగ-ఇనుత బుదవాత,తూతఇనయోపేతా ‘’దీనికి అసలు పద్యం –అని రుద్ధుని చారిత్రము –వినుటకు మాకు హృదయములు వేడుక పొడమెన్-వినిపింపు సవిస్తరముగ-వినుత బుధ వ్రాత ,సూత, వినయో పేతా ‘’.
ప్రలాపం –అంటే అప్రయోజనమైన మాట –ఇన్ కోహేరెంట్ స్పీచ్ .దీనికి ఉదాహరణ కుదరలేదనిచేతు లెత్తెశారు మునిమాణిక్యం .
నిరస్తం –గబగబా మాట్లాడే పదాన్ని నిరస్తం అంటారు .సత్యనారాయణ అనటానికి ‘’సత్తేనాన్’’,విశ్వనాధ అనటానికి విశ్వనా అనటం .రామాన్జనరావు ,సుబ్భమన్యం గారూ .హాస్యం లో అనురక్తి ఉన్నవారికే ఇందులో హాస్యం కనిపిస్తుంది .
దీపావళి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-21-ఉయ్యూరు

