అపసంహిత హాస్యం
అపసంహిత హాస్యం
పదాలను దగ్గర దగ్గరగా పలికితే సంహితం .విపరీతార్ధం కోసం వాక్యాలను విశ్లేషం చేయటం అపసంహిత .ఒకాయన బుద్ధి హీనుల గురించి కాలేజిలో ఉపన్యాసం ఇవ్వటానికి రాగా ,ప్రిన్సిపాలాయన్ను విద్యార్ధులకు పరిచయం చేస్తూ ‘’ఇవాళ మీరు బుద్ధి హీనులగురించి మంచి ఉపన్యాసం వింటారు .మంచి అని ఎందుకు అన్నానంటే ఇచ్చే ఆయన బుద్ధిహీనత ……గురించి దాని స్వరూప స్వభావాల గురించి ఎక్కువ పరిశోధన చేశారు ‘’అన్నాడు .ఇందులో బుద్ధిహీనత అన్నమాట దగ్గర కావాలని ఏర్పరచిన విశ్రాంతి వలన అర్ధాంతరం స్ఫురి౦చి చమత్కారమిస్తుంది .ఉపన్యాసకుడు వాయించటం మొదలెట్టి ‘’బుద్ధి హీనతగురించి మీ ప్రిన్సిపాల్ కు తెలిసినంత నాకు తెలియదు ‘’అనటం లో ఉన్న కాకువు వలన వేరొక అర్ధాన్ని సాధించాడు .ఇదీ శబ్దాశ్రయ హాస్యమే.
మరో మచ్చు తునక –ఒక జడ్జి ఒక నేరస్తుని గురించి ‘’ఇంత స్కౌండ్రల్ ను నేనెక్కడా చూడలేదు ‘’.దీనికి నేరస్తుడు ‘’నేను దుర్మార్గుడనే జడ్జి గారు నాకంటే పెద్ద దుర్మార్గుడిని చూడ లేదనటం అన్యాయం ‘’అన్నాడు .నా కంటే దగ్గర ఏర్పడిన విశ్రాంతి వలన విపరీతార్ధం వస్తుందని మునిమాణిక్యం ఉవాచ .
కాకువు –శబ్దాశ్రయ హాస్యం సాధించటానికి హ్రస్వంగా పలకాల్సిన చోట దీర్ఘంగా దీర్గం గా పలకాల్సిన చోట హ్రస్వంగా పలకటం వలన హాస్యం కలుగుతుంది .ఇదే కాకువు అంటారు .కోర్టులో సాక్షి ‘’దేవుని ఎదుట అంతా అంతా నిజం చెబుతానూ ,అబద్ధం చెప్పనూ ‘’అనటం .గుంటూరు దగ్గర ‘’లంజ చెరుకూరు ‘’,’’కుక్కకాకాని ‘’అనే ఊళ్ళున్నాయి .ఒక షోకిలా దారిలో కనిపించిన ఒక సోకు కత్తెతో’’లంజా !చెరుకూరు కు దారేదీ ?అని అడిగితె ఆమె తక్కువేమీ తినలేదు కనుక ‘’కుక్కా ,కాకాని దగ్గర ‘’అని రిపార్టీ ఇచ్చింది
మృషార్ధకం – ఈ కకువుతో ఇంకా రమణీయ హాస్యం పుడుతుంది .వాక్యం లో ఏదో ఒక పదాన్ని నొక్కి పలికితే విపరీతార్ధం వచ్చి నవ్వు పుడుతుంది అంటారు మాస్టారు మునిమాణిక్యం .మీరు ఈ ఊళ్ళో ఇల్లు కొన్నారా అని అడిగితె ‘’ఇల్లు కొనలేదు ‘’అంటే ఇంకేదో కొన్నాను అని అర్ధం వస్తుంది .’’తమకు పిల్లలు పుట్టారా ‘’?అని అడిగితె ‘’పిల్లలు పుట్టలేదు ‘’అంటే ఇంకెవరో పుట్టారనే అర్ధం రావచ్చు .కానీ ఇది అసంభావితం అవుతుంది .బాగా అసంభావిత అర్ధం ఇచ్చే మాట మృషార్ధకం ‘’.అని రుద్ధ చరిత్రలో కృతికర్త వంశ వివరాలిస్తూ ‘’అతని సాధ్వి కొండమాంబ గర్భమందు జనియించే వినయ విద్యా చరణుడు ,హరిహరధ్యాస సేవాపరయణు౦డు.మహిత గుణశాలి అబ్బయా మాత్యుడు ‘’అని రాశాడు కవి నిజంగా ఇందులో హాస్యం లేదు కానీ ముని మాణిక్యంగారికి ‘’గర్భం లో పుట్టకుండా దేనిలో పుడతాడు అని డౌటొచ్చి నవ్వొచ్చిందట.
మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-21-ఉయ్యూరు
