డన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

లండన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

01/03/2022విహంగ మహిళా పత్రిక

3-12-1838న ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి బీచ్ లోని విస్బెక్ లో ఆక్టేవియా హిల్ జన్మించింది .తండ్రి జేమ్స్ హిల్ కారన్ మర్చంట్. తల్లి కరోలిన్ సౌత్ వుడ్ స్మిత్ తండ్రికి మూడవభార్య .తండ్రి సంతానం పదిమందిలో ఎనిమిదవ కూతురే హిల్ .తల్లి తండ్రిసానిటరి రిఫార్మర్ .కుటుంబాన్ని బాగానే తండ్రి పోషించాడుకానీ ,అప్పుల్లో కూరుకుపోయి ,దివాలాతీసి ,మతిస్థిమితం తప్పాడు.అప్పటినుంచి మాతామహుడు డా ధామస్ సౌత్ వుడ్ స్మిత్ కుటుంబాన్ని ఆదుకొన్నాడు .ఈయన గొప్ప రిఫార్మర్ .గనులలో బాలకార్మికులు ,పట్టణ బీదజనులను ఆదుకొనేవాడు .కూతురు కారోలీనా కు కూడా ఈ లక్షణాలు బాగా అబ్బాయి ..పేదల విద్య,ఆవాసాలకోసం ,పరిశుభ్రతకోసం పాటుపడేది .

తర్వాత వీరి కుటుంబం ఫించిలి అనే చిన్న ఊరిలో ఒక కాటేజీ లో ఉన్నారు .హెన్రి మేహ్యు రాసిన ‘’లండన్ లేబర్ అండ్ లండన్ పూర్ ‘’పుస్తకాన్ని చదివిన అక్టేవియా హిల్ అక్కడి మురికి వాడలలో ప్రజల జీవన పరిస్థితులు ఎంతదారుణ౦గా ఉన్నాయో అర్ధం చేసుకొన్నది . ఎఫ్.డి.మారిస్ అనే ఆంగ్లికన్ ప్రీస్ట్,రిఫార్మర్ అయిన ఫామిలి ఫ్రెండ్ ప్రభావం కూడా ఆమెపై ఉంది . లండన్ పేదప్రజల తరఫున ఆటవస్తువులు తయారు చేసి రాగ్గెడ్ స్కూల్ పిల్లలకు అందజేసేది .సెంట్రల్ లండన్ లోని బ్లూమ్స్ బరి వర్కింగ్ మెన్స్ కాలేజి లో వుమెన్ క్లాసులకు సెక్రేటరిగా పని చేసేది ,

బాధలలో ఉన్న జెంటిల్ వుమెన్ కు ఉద్యోగాలు కల్పించే ఒక కో ఆపరేటివ్ గిల్డ్ హిల్ ను 13వ ఏట గ్లాస్ పెయింటింగ్ క్లాస్ లకు శిక్షణ నివ్వటానికి తీసుకొన్నది .గిల్డ్ బాగా విస్తారమైన తర్వాత ఆమెను 14వ ఏట వర్క్ రూమ్ కు ఇన్చార్జిని చేశారు .మరుసటి సంవత్సరం ఆమె ఖాళీసమయలలో జాన్ రస్కిన్ దగ్గర కాపీయిస్ట్ గా పని చేసింది .గిల్డ్ ఇంచార్జి గా ఉండగా హిల్ కు అక్కడి పిల్లల దారుణ జీవితాలు మనసును కలచి వేసేవి .ఆమెకున్న ఆత్మ విశ్వాసం ఆమెను ‘’చారిటి ఆర్గనైజేషన్ సొసైటీ ‘’కి సన్నిహితురాలిని చేసింది. ఈ సంస్థ బీదవారి కష్టనష్టాలు గుర్తించి సేవలు అందిస్తూ చక్కని పర్యవేక్షణ చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడటం ఆమెకు బాగా నచ్చింది .పేదలకు సత్వరసాయం ,దానిపై మంచి పర్యవేక్షణ ఉంటేనే దాత్రుత్వం రాణిస్తుందని భావించింది . నచ్చిన విషయం పై స్పష్టంగా సూటిగా ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం ఆమెది .

1830నుంచి వర్కింగ్ క్లాస్ వారిఇళ్ళ కోసం పార్లమెంట్ వివిధ సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి .హిల్ కార్య క్షేత్రం లోకి ప్రవేశించగానే ‘’నమూనా ఇళ్ళ నిర్మాణ ఉద్యమం ‘’చేబట్టి వసతులతో గృహం నిర్మాణం చేయాలనే ఊపు తెచ్చింది .దీనికి ప్రభుత్వం చట్టం తెచ్చింది . అతిపేద ఉద్యోగులకు ,అన్ స్కిల్డ్ లేబర్ కు ఉపయోగ పడటంలో విఫలమైందని గ్రహించింది .యజమానులు అద్దెకున్న వారి అవసరాల ను ఉపేక్షిస్తున్నారని ,టేనేంట్ లు ఒత్తిడి తేలేక పోతూ ,అణగ ద్రోక్కబడుతున్నారని గ్రహించింది .తన అధీనం లో ఉన్నవారికి కొత్త ఇళ్ళు ఏర్పాటు చేయాలనుకొంటే వనరులకోరత కనిపించి ,చివరికి దీనికి పరిష్కారంగా తానే లాండ్ లార్డ్ అవ్వాలని నిర్ణయి౦చు కున్నది .

జాన్ రస్కిన్ కు కూడా కో ఆపరేటివ్ గిల్డ్ పై అభిమానం ఉంది . మానవత్వమున్న వ్యక్తిగా మురికి వాడలలోని దుర్భర దారిద్ర్యాన్ని గమనించి ఏదో చేయాలనిపించి౦ది .అప్పటికే తన కాపీయిస్ట్ హిల్ ఆ కార్యక్రమం లో ఉందని తెలుసుకొన్నాడు .1865లో తండ్రి నుంచి ఆయను వచ్చిన 750పౌండ్ల ధనాన్ని మేరిలేన్ బోన్ లోని పారడైజ్ ప్లేస్ లో ఆరు గదులున్న మూడు కాటేజీ లు కొన్నాడు .వీటి మేనేజి మెంట్ హిల్ కు అప్పగించాడు .వీటిపై సంవత్సరానికి అయిదు శాతం వడ్డీ వస్తే పెట్టుబడి పెట్టినవారికిసంతోషంగా ఉంటుంది అని హిల్ చెప్పింది .1866లో రస్కిన్ ఫ్రెష్ వేర్ ప్లేస్ లో మరొక అయిదు కాటేజీలు కొని వీటిపైనా మేనేజ్మెంట్ హిల్ కే అప్పగించాడు .వీటికి కావలసిన రిపేర్లు చేయించి ,పశువుల కొట్టాలను తీసేయించి,అక్కడ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయించాడు .చెట్లు నాటించాడు . వీటిని అల్పాదాయ వర్గాలవారికి అద్దెలకిచ్చాడు .పెట్టుబడిపై అయిదు శాతం లాభం వచ్చింది .ఇంకా అధికంగా వచ్చిన డబ్బు ను ఆ ఇళ్ళ సౌకర్యాలకోసం ఖర్చుపెట్టాడు .అద్దేబకాయిలు లేకుండా మంచి వాళ్ళకే ఇచ్చాడు .ఖచ్చితమైన పధ్ధతి అవలంబించటం వలన ,హిల్ చాతుర్య నిర్వహణ వలన 1974కు 15 హౌసింగ్ స్కీమ్స్ ఏర్పరిచి 3వేలమందికి అద్దె కిచ్చి తను అనుకొన్నది సాధించి రస్కిన్ కిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోన్నది .

బిల్డింగ్ లనే కాదు,అద్దెకున్నవారినీ సమర్ధంగా మేనేజ్ చేసి ,’’మునిసిపల్ సోషలిజం ,సబ్సిడీ గృహాలు ‘’విధానానికి నాంది పలికి విజయవంతం చేసింది .వారానికి ఒకసారి వెళ్లి అద్దె వసూలు చేసేది .ఈపని స్త్రీలు మాత్రమె సాంఘిక సేవా కార్యక్రంగా చేయాలనేది .క్రమంగా జీతాలు ఇచ్చి పని చేయించింది. సోమ మంగళ బుధ వారాలలో ఉదయం పూటమాత్రమే అద్దె వసూలు చేసేవారు .మధ్యాహ్నం పూట జమా ఖర్చులు చూసి ,కాంట్రాక్టర్ లను పిలిపించి రిపేర్లు చేయించేది .గురు ,శుక్రవారాలలో బాకీదారులపై దృష్టి పెట్టేవారు .కొత్తగా అద్దె కొచ్చే వారికి ,ఖాళీ చేసి వెళ్లి పోయేవారికీ సాయపడేవారు .హిల్ ఏర్పాటు చేసిన సహాయకులు పని సమయంలోకానీ పని అయిపోయాకకానీ అద్దె దారుల సంఘాన్ని ఏర్పరచి ,బడి లేని సమయాలలో పిల్లల క్లబ్ ,సొసైటీలు ఏర్పాటు చేయించేవారు .1859లో హిల్ ‘’సౌత్ వార్క్ డిటాచ్ మెంట్ ఆఫ్ ది ఆర్మీ కేడేట్ ఫోర్స్’’ను స్వతంత్ర సంస్థ గా మొట్ట మొదటిసారిగా ఏర్పరచి స్థానిక బాలురకు మిలిటరీ విధానం లో శిక్షణ ఇప్పించింది .డెర్బి షైర్ రెజిమెంట్ ఆఫీసర్ లను ఆహ్వానించి స్పూర్తికలిగించేది .దీనిఫలితం కేడేట్ల సంఖ్య 160కి పెరిగింది .పూర్ రిలీఫ్ ,బయటి సాయం వగైరాలు న్యాయం చేకూర్చవని భావించింది అందుకే ఆమె విధానాలలో స్వీయ బాధ్యత కలిగించింది .

1884లో ఎక్లేసియాస్టికల్ కమీషనర్స్ హిల్ పని తీరును గుర్తించి సౌత్ లండన్ లో తమకున్న స్లం ప్రాపర్టీస్ ను మేనేజ్ చేసి ,సంస్కరించే బాధ్యత అప్పగించారు .ఈ ప్రాంతం విపరీతమైన దరిద్రానికి ,దొంగతనాలకు ప్రసిద్ధి కెక్కింది.తన అకు౦ ఠిత దీక్షా దక్షతలతో హిల్ వాటిని మోడల్ ప్రాపర్టీస్ గా మార్చి ,పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప ఉత్సాహం కలిగించింది .ఆమె పనితనాన్ని శ్లాఘిస్తూ అమెరికన్ అభిమాని ‘’ ruling over a little kingdom of three thousand loving subjects with an iron scepter twined with roses.”[1 అన్నాడు ఆమెకు ‘’ the life-enhancing virtues of pure earth, clean air and blue sky.” మహా ఇష్టం .’’ గ్రీన్ బెల్ట్ ‘’అనే పదాన్ని హిల్ మొదటిసారి ఉపయోగించి ఇవాళ అందరికీ ఆదర్శమైంది .ఈ దృక్పధం తోనే హాం స్టెడ్ హీత్ ,పార్లమెంట్ హిల్ ఫీల్డ్స్ ను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడింది .అభి వృద్ధిపెరుతో ఇక్కడ కొత్త నిర్మాణాలేవీ చేయకుండా చూసింది .

1876 హిల్ పెద్దక్కమిరండా’’సౌందర్య వ్యాప్తికి ‘’ స్థాపించిన కైరీ సొసైటీ ట్రెజరర్ గా ఉన్నది .’’బ్రింగ్ బ్యూటీ ,హోం టు పూర్ ‘’అనే నినాదం తో ఓపెన్ స్పేస్ లలో పట్టణ పేదలకు లైబ్రరి, కళలు ,సంగీతం, ఉత్తమ గ్రంథాలు అందుబాటులోకి తెచ్చింది .ఈపధకం బాగా విస్తరించి ఆతర్వాత ‘’నేషనల్ ట్రస్ట్ ‘’గా మారింది .రస్కిన్ ,హిల్ ,రాబర్ట్ హంటర్ ‘’కామన్స్ ప్రిజర్వేషన్ సొసైటీ ‘’గా ఏర్పడి ఇంగ్లీష్ లేక్ డిస్ట్రిక్ట్ లో రైల్వే లైన్ నిర్మాణాన్ని ఆపుదల చేయించి అక్కడి అందాలను కాపాడారు .హిల్ సూచించిన ‘’నేషనల్ ట్రస్ట్ ‘’పేరు తో సహజ సౌందర్య ప్రదేశాలను చారిత్రిక ప్రదేశాలను రక్షించారు .ఓపెన్ స్పేస్ లను కాపాడి అక్కడ నిర్మాణాలు జరగకుండా చూశారు .డినాస్ఓలూ ప్రాపర్టి,మొదటి చారిత్రాత్మకమైనది .కట్టిన ప్రాపర్టి-ఆలఫ్రిస్టన్ క్లేర్జి హౌస్ ,మొదటినేచర్ రిజర్వ్ విక్కెన్ ఫెన్.

హిల్ ఇళ్ళ మేనేజి మెంట్ బాగా పెరిగింది .రస్కిన్ మెంటల్ గా దెబ్బతిని ఆమెను వ్యతిరేకించాడు .కానీ ఎక్లేస్టికల్ కమీషనర్స్ ఆమె సాయం కోరిమేనేజిమేంట్ అప్పగించి పేదలకు మేలు చేశారు .19వ శాతాబ్దంనాటికి హిల్ సేవకులు ఫ్రీ వర్కర్స్ కాదు బాగా శిక్షణ పొందిన జీతం తీసుకొనే వారుగా మారారు .ఈమెపధకాలు యూరప్ అమెరికాలలోనూ వ్యాపించాయి. Beatrice Webb said that she “first became aware of the meaning of the poverty of the poor,’’విక్టోరియా రాణి కూతురు ప్రిన్స్ ఆలిస్ లండన్ లోని హిల్ ప్రాపర్టీ లను జర్మనీలో ప్రవేశపెట్టింది .హిల్ అసిస్టెంట్ ,సెక్రెటరి అయిన మాడ్ జెఫ్రీ ఆతర్వాత కమీషనర్ ఆఫ్ క్రౌన్స్ లాండ్స్ అయి ,ఆక్టేవియా హిల్ హౌసింగ్ విధానం లో లండన్ లో హౌసింగ్ ఎస్టేట్స్ నిర్మించాడు .

1880నాటికి హిల్ 70వేల పౌండ్ల ప్రాపర్టీని మేనేజి మెంట్ చేసింది .ఈమె ప్రేరణతో లండన్ కౌంటీ కౌన్సిల్ 15లక్షల పౌడ్లతో 1901-02 బడ్జెట్ తో లండన్ పేదల ఇండ్ల పునర్నిర్మాణం చేబట్టింది .కానీ ఆమె స్త్రీలకు వోటింగ్ హక్కు అక్కర్లేదనీ ,ఒల్డేజి పెన్షన్ ఇస్తే మంచికన్నా చెడు ఎక్కువగా జరిగి ఆత్మ విశ్వాసం తగ్గి పోతుందని చెప్పింది .73 ఏళ్ళ వయసులో ఆక్టేవియా హిల్ 13-8-1912న మేరీ లేబోన్ లోని స్వగృహం లో మరణించింది .

1898లో ఆమె చిత్రపటాన్ని ఆమె ఆభిమానులు సమర్పించిన సందర్భం లో హిల్ – “When I am gone, I hope my friends will not try to carry out any special system, or to follow blindly in the track which I have trodden. New circumstances require various efforts, and it is the spirit, not the dead form, that should be perpetuated. … We shall leave them a few houses, purified and improved, a few new and better ones built, a certain amount of thoughtful and loving management, a few open spaces…” But, she said, more important would be “the quick eye to see, the true soul to measure, the large hope to grasp the mighty issues of the new and better days to come – greater ideals, greater hope, and patience to realize both.” అని గొప్ప సందేశమిచ్చింది .

ఇవి అందరూ ఆచరి౦చాల్సినవే .ఆమె స్థాపించి ‘’హోరేస్ స్ట్రీట్ ట్రస్ట్ ‘’ఆతర్వాత బాగా అభి వృద్ధి చెంది’’ఆక్టేవియా హౌసింగ్ ‘’గా మారింది .ఆమె స్థాపించిన ‘’ది సెటిల్ మెంట్ మువ్ మెంట్ ‘’ఆమెసహచరుడు సామ్యుల్ చేతిలో పెరిగి ఫస్ట్ యూనివర్సిటి ఫార్మేడ్ సెటిల్ మెంట్ గా రూపు దాల్చింది .ఇంగ్లాండ్ చర్చిలో ఆగస్ట్ 13న హిల్ సంస్మరణం జరుపుతారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.