· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114

· 114- సరదాసినిమాల దర్శకుడు బోయిన సుబ్బారావు

· బోయిన సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశాడు.

సినిమా రంగం
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[1]

· సావాసగాళ్ళు (1977)

· ఎంకి నాయుడు బావ (1978)

· చిలిపి కృష్ణుడు (1978)

· బంగారు చెల్లెలు (1979)

· సీతే రాముడైతే (1979)

· బడాయి బసవయ్య (1980)

· సంసార బంధం (1980)

· జతగాడు (1981)

· ప్రతిజ్ఞ (1982)

· సవాల్ (1982 సినిమా)

· అగ్నిజ్వాల (1983)

· ధర్మ పోరాటం (1983)

· పల్లెటూరి పిడుగు (1983)

· మూగ వాని పగ (1983)

· నాగాభరణం (1984 సినిమా)

· మాంగల్య బలం (1985)

· ముసుగు దొంగ (1985)

· డ్రైవర్ బాబు (1986)

· గురు బ్రహ్మ (1986)

· పుట్టింటి పట్టుచీర (1990)

· అమ్మకడుపు చల్లగా (1991)

· శౌర్య చక్ర (1992 సినిమా)

· తోడికోడళ్ళు (1994 సినిమా)

· దొరబాబు (1995)

· నాయుడుగారి కుటుంబం (1996)

· ప్రియమైన శ్రీవారు (1997)

· పెద్దమనుషులు (1999)

· ప్రేమించు (2001)

·

· నటుడు గిరిబాబు చెప్పిన అనుభవ విశేషాలు

· సుమన్, భానుచందర్’లతో తీసిన సినిమా ‘మెరుపుదాడి’ పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా చూసిన చిరంజీవి, మోహన్ బాబు.. ఈ సినిమా చేయనందుకు చాలా బాధపడ్డారు. కానీ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గిరిబాబును ప్రశంసించారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ప్రముఖ నటుడు గిరిబాబు మాటల్లోనే..

మోహన్‌బాబు నిర్మించే చిత్రం కథాచర్చల్లో మోహన్‌బాబు, ఎం.డి.సుందర్‌, బోయిన సుబ్బారావుతో పాటు నేను కూడా కూర్చునేవాడిని. నేను చెప్పిన ఒకటి రెండు సలహాల్ని పాజిటివ్‌గానే స్వీకరించేవాడు. ఆయన దర్శకత్వంలో నేను నటించిన మరో మంచి సినిమా ‘సీతే రాముడైతే’. ఆ చిత్రం షూటింగ్‌లో జరిగిన ప్రమాదాన్ని నా జీవితంలో మరిచిపోలేను. అది ఎలా జరిగిందంటే… ఆ సినిమాలో నలుగురు విలన్లు ఉన్నారు. వాళ్లల్లో నేను ఒకడిని. కన్నడ నటుడు శంకర్‌నాగ్‌ అందులో హీరో. జయసుధ హీరోయిన్‌. చాలా తమాషా సబ్జెక్ట్‌ అది. ఈ సినిమాలో హీరోలాంటి పాత్రని జయసుధ చేసింది. గోదావరి నదిలో ఉన్న బోట్‌లో ఫైట్‌ సీన్‌ తీస్తున్నారు. శంకర్‌నాగ్‌ కొట్టగానే నేను గోదావరిలో పడిపోవాలి. ఆ సమయంలో గోదావరి నది చాలా ఉధృతంగా ఉంది. నది మధ్యలో బోట్‌లో మేమున్నాం. లోతు ఎంత ఉందో తెలీదు. అందుకే ఆ నీళ్లలోకి దూకడానికి నేను సందేహించాను. అదే మాట బోయిన సుబ్బారావుతో అన్నాను. ‘అబ్బే.. ఏం పరవాలేదండీ.. మీరు నీళ్లలో పడిపోగానే వెంటనే పైకి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మీరేం వర్రీ అవకండి’ అని ధైర్యం చెప్పారు బోయిన సుబ్బారావు. హీరో కొట్టగానే నీళ్లలో పడితే ఎఫెక్ట్‌ బాగుంటుందని సుబ్బారావు ఆలోచన. అయితే నీళ్లలో దూకాల్సింది నేను కాబట్టి అలా దూకడానికి చాలా భయపడ్డా. అందుకే ఫైట్‌ మాస్టర్‌ రాజుని పిలిచి ‘ఈ పడవకి కొంచెం దూరంగా మీరంతా సిద్ధంగా ఉండండి. నేను పడగానే జరగరానిది జరిగితే మీరు వెంటనే పట్టుకోవచ్చు’ అని చెప్పాను. రాజు సరేనన్నాడు. వాళ్ల అసిస్టెంట్స్‌ని సిద్ధం చేశాడు. శంకర్‌నాగ్‌ నన్ను కొట్టగానే ఒక్క సారిగా నీళ్లలోకి జంప్‌ చేశా. దిగితే కానీ లోతు తెలీదంటారు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల ఒరవడి చాలా భీభత్సంగా ఉంది. దూకిన వెంటనే నీళ్లలోంచి పైకి రావాలని ప్రయత్నించాను కానీ ప్రవాహం నన్ను వదిలిపెట్టలేదు. లోలోపలికి లాక్కెళ్లిపోతోంది. ‘కాపాడండి’ అని అరవాలని ప్రయత్నించినా నోట్లోకి నీళ్లు వెళ్లడంతో అరుపు బయటకు వినిపించడం లేదు. ఇక నా పని అయిపోయింది అనుకుంటూ చేతులు పైకెత్తాను. దూరం నుంచి ఇది గమనించిన స్టంట్‌ మాస్టర్‌ రాజు వెంటనే ఓ బలమైన తాడు నా వైపుకి విసిరాడు. అతికష్టం మీద ఆ తాడు పట్టుకున్నాను. అయినా ప్రవాహం నన్ను లోపలికి లాగేస్తోంది. ఈతగాళ్లు అందుబాటులో ఉండటంతో వాళ్లు రంగంలోకి దిగి, ఇంకో తాడు పట్టుకుని నా దగ్గరకి వచ్చి, నా నడుము పట్టుకుని బలవంతంగా పైకి లాగేశారు. వాళ్లు కాస్త ఆలస్యం చేసి ఉంటే కాసేపటికి నా శవం పైకి తేలేదేమో. ఇది జరిగిన గంట సేపటివరకూ నేను మామూలు మనిషిని కాలేదు. ఇలా జరుగుతుందని ఊహించని బోయిన సుబ్బారావు కూడా షాక్‌ అయ్యాడు. అలా ‘సీతే రాముడైతే’ చిత్రం షూటింగ్‌లో అంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. బోయిన సుబ్బారావు జీవితంలో తను సాధించాలనుకున్నది సాధించాడు. తెలుగులోనే కాదు కన్నడంలో కూడా సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. వివాదరహితుడు, మంచి మనిషి కూడా.

· సశేషం
·

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.