అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

  ఈ డాక్టర్ గారెవరో నాకు తెలీదు కాని కిందటి మంగళవారం నేను శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉండగా ఫోన్ చేసి ,తాను  కాకినాడ లో డాక్టర్ ననీ, పై పుస్తకం రాశాననీ ,దాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వకుండా 2వేల కాపీలు అమ్మానని ఇది అరుదైన విషయమనీ ,సరసభారతి బ్లాగ్ ద్వారా నేను పరిచయమయ్యాననీ ,నా అడ్రస్ తెలిపితే పుస్తకాలు పంపుతాననీ చెప్పారు .కాసేపయ్యాక నా అడ్రస్ ఎలాగో సంపాది౦చాననీ ,పుస్తకాలు పంపుతున్నాననీ చదివి అభిప్రాయం రాయమనీ కోరారు .ఆయన పంపిన 3పుస్తకాలు మొన్న శనివారం 7వ తేదీ అందాయి .ఇవాళఉదయం అందులో ఒక పుస్తకం ఉయ్యూరు శాఖా గ్రంధాలయానికి అందజేసి ,ఇప్పుడే ఆ పుస్తకం చదివి అభిప్రాయం రాస్తున్నాను .

 ‘’ డా.మురళీకృష్ణ అరుదైన మేధావి .లోతైన అధ్యయనం ,నిశిత పరిశీలన ,మేర తెలియని ఊహా శక్తి ,అంతకు మించి తోటివారికి సాయపడాలనే మానవత్వం ,నిబద్ధత గల వ్యక్తీ ‘’.అందుకే ఇంత ఘనవిజయం సాధించారు వైద్య రంగం లో ‘’

 వైద్య – ఆరోగ్య –శాస్త్రీయ-ఆత్మ కథ

 పుస్తకాలతో పాటు ఆయన పంపిన కవరింగ్ లెటర్ లో తనను పరిచయం చేసుకొంటూ ,కాకినాడలో ‘’సా౦క్రమిక వ్యాధి నిపుణుడి ‘’గా పని చేస్తున్నాననీ,1997నుంచి ఎయిడ్స్ ,కోవిడ్ పీడనాకాలం లో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు భరోసా కల్పించటం లో ఎన్నదగిన కృషి చేశాననీ ,చెప్పారు  .2022జనవరి లో ‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’పేరిట సెమి ఆటో బయాగ్రాఫిక్ గా ఈ పుస్తకం ప్రచురించాననీ ,గతంలో ఇలాంటి పుస్తకం ఎప్పుడూ వెలువడి ఉండదనీ , కనుక ఇది , ‘’వైద్య – ఆరోగ్య –శాస్త్రీయ-ఆత్మ కథ ‘’అనీ ,ఎఏపత్రికా ప్రకటన లేకుండానే 200రూపాయల ఈ  పుస్తకాన్ని రెండు వేలకాపీలను తెలుగు ప్రజలు కొన్నారనీ సంబరంగా తెలిపారు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి HIV/ఎయిడ్స్ వైద్య నిపుణుడననీ తెలియ జేశారు .వివిధమైన అనేక సా౦క్రమిక వ్యాధుల సమాహారమే ఎయిడ్స్ అన్నారు.కరోనా వైరస్ –కోవిడ్ ఇటీవల ప్రపంచ పీడగా మారి చాలా కష్ట నష్టాలకు గురి చేసింది .ప్రభుత్వ సంస్థలద్వారా తాను ఎయిడ్స్ పై ప్రజలకు గొప్ప అవగాహన కల్పించాననీ వైద్యాన్ని ప్రజలకు అందు బాటులో తెచ్చాననీ సంతోషం తో ఆత్మవిశ్వాసం తో చెప్పారు .

  2021లోఅత్యంత ప్రమాదకర ‘’డెల్టా వైరస్ ‘’జబ్బుకు ‘’ఏస్పిరిన్ ,ప్రేడ్ని సొలాన్ ,ఎజిత్రోమైసిన్ ‘’లతో రూపొందించిన ‘’హోం కేర్ కిట్ ‘’లక్షలాది తెలుగు వారి జీవితాలపై భరోసా బతుక్కి భద్రతా కల్పించిందనీ ,తన ‘’వాల్ ‘’పైననే తొమ్మిది నెలల కాలం లో దఫదఫాలుగా ‘’యనమదల ప్రోటోకాల్ ‘’లో 18వేలకు పైగా పేర్లు నమోదవటం దీనికి తిరుగులేని నిదర్శనమన్నారు. ప్రస్తుతం భారత దేశాన్ని కుదిపేసి పీడిస్తున్న’’ఓమిక్రాన్ రకం కోవిడ్ ‘’జబ్బుకు నవీకరించిన ప్రోటోకాల్ 13వేలకు పైగా తన ‘వాల్ ‘’పై షేర్ అయిందని ,వాట్సాప్ ,ఇతరరకాలుగా లక్షలాది మందికి చేరాయని కనుక కంగారు పడకుండా ‘’జీవితాన్ని చూద్దాం –బాగు చేసుకొందాం ‘’అనే నినాదమిచ్చారు డాక్టర్ గారు .జబ్బులు మనుషుల్ని సమాజాన్ని  అర్ధం చేసుకోనేట్లు చేస్తాయి .తన వీడియోలతో సహా అన్నిటినీ చూపేలా ‘’ఫిజికల్-డిజిటల్  ‘’ఇంటర్ స్పేస్’’తో పఠనాన్ని ఈ పుస్తకం  పై మెట్టులో నిలుపుతుందని నమ్ముతున్నారు .సమాజం తనకు చదువు చెప్పి తనను ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టి నందుకు తన శక్తి మేరకు సమాజానికి ఉపయోగ పడ్డానని ఆత్మ సంతృప్తి చెందారు ఈ డాక్టర్ .

‘అక్షరం లోక రక్షకం ‘’అనే నినాదానికి పూర్తి అర్ధం నా భాషాసేవ .నా పుస్తకాన్నీ ,నా కృషినీ మీకు తెలియ జేస్తున్నాను ‘’అని డా యనమదల మురళీ కృష్ణ కవరింగ్ లెటర్ ముగించారు  .

  ఈ సెమి ఆత్మకథా చిత్రం లో 1-కోవిడ్ 2-ఎయిడ్స్ -3-నేను అనే మూడుభాగాలున్నాయి .

మొదటి దానిలో ప్రాణభీతి కోవిడ్ ,అప్రమత్తత తోనే ఓమిక్రాన్ వేరిఎంట్ నుండి రక్షణ ,ఏసీ వలననే కోవిడ్ వ్యాప్తి,పరిశుభ్రతతో చెక్ ,మానసిక ధైర్యమే మొదటిమందు ,వాక్సిన్ సురక్షితమే ,ఇంట్లోనే ఆక్సిజన్ సాచురేషన్ ఎలాసాధ్యం ,దీని బారిన పడ్డ ఎయిడ్స్ రోగుల పరిస్థితి ,ఆందోళన భయాలే ప్రాణం తీస్తాయి ,ఎరుకతోనే భరోసా ,వ్యాదినిరోధకశక్తిని దెబ్బతీస్తున్న కోవిడ్ బ్లాక్ ఫంగస్సమస్యలు  కరోన కిట్ , సమస్య లను చక్కగా వివరించి కరోనాలో వైద్యునిగా తనప్రయాణ౦  ఎలా సాగిందో వివరించారు .

 రెండవది అయిన ఎయిడ్స్ లో –ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమా ,ప్రవర్తనే ప్రపంచం ,అజ్ఞానమే మరణం ,ప్రవర్తనే జీవితం ,కొత్త దార్లలో వెలుగు రేఖలు ,నిరంతర వైద్యం ,నైపుణ్యం లేని స్పెషలిస్ట్ లు ,కోరికల గుర్రాలపై ప్రమాదకర ప్రయాణం  వనరులు స్తోమత బట్టే బతుకైనా ,వైద్యమయినా అనే అంశాలను బహు పరిశీలనాత్మకంగా చర్చించి జీవితానికి భరోసా కల్పించారు స్వానుభవాలను కూడా జోడించారు .

3-నేను –లో సైంటిఫిక్ మెధడ్,మార్కెట్ ఎకానమీ ,మెడికల్ కాలేజి మేగజైన్ ఎడిటర్ గా తన కృషి ,మూసను దాటితేనే అద్భుతాలు వస్తాయి ,పెద్దలదగ్గర తగ్గి లోకం లో పెరగాలి, జీవిత గమనాన్ని నిర్దేశించిన తన అర్ధాంగి గీత ,కొత్తగా ప్రయత్నిస్తేనే సంతోషం ,వినిమయ లాలస ,తన ప్రైమరీ స్కూల్ మాష్టారు తనికెళ్ళ వెంకట రమణ శాస్త్రి స్పూర్తి ,ప్రేరణ ,హ్యూమనిస్ట్ సుబ్బరాజు ,అదృష్టదీపక్ పాండితీ ప్రకర్ష ,జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చుకోవటమే జీవితం , మొదలైనవి ఉన్నాయి .జగన్  వీరారాధకుడుగా డాక్టర్ కనిపిస్తారు .

  ఇది అనుభవాలతో ఆత్మకథగా సాగిన రెండు ప్రాణాంతక జబ్బుల వికటాట్టహాసం వీర విహారం .వాటిని అదుపు చేయటానికి కావలసిన మానసిక స్థైర్యం నింపిన రచన .డా యనమదల రామ కృష్ణ ను అభినదిస్తున్నాను .

చిరునామా -4-50పెట్రోల్ బ్యాంకు దాటాక ఇంద్రపాలెం –కాకినాడ -533006

సెల్ -94406-77734

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-22-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.