బెంగాల్ న్యాయవాది స్వాతంత్రోద్యమనేత ,స్వదేశీ ఉద్యమనేత కలకత్తా మొదటి మేయర్ దేశబంధు –చిత్త రంజన్ దాస్
చిత్తరంజన్ దాస్ ,జమ్నాలాల్ బజాజ్
దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (బెంగాళీ:চিত্তরঞ্জন দাস) (నవంబరు 5, 1870 – జూన్ 16, 1925) బెంగాల్ కు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత.
ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.
బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన “ఫార్వర్డ్” అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును “లిబర్టీ”గా మార్చారు. కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్గా పనిచేసారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.
ఆయన ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లోని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు, సంఘ సంస్కర్త అయిన దుర్గ మోహన్ దాస్‌కు మేనల్లుడు. ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు ఎస్.ఆర్.దాస్, సరళా రాయ్, లేడీ ఆబాల బోస్. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు బసంతీ దేవి ఆయన భార్య.
కాంగ్రెస్ కోశాధికారి ,స్వాతంత్ర్య సమరయోధుడు -జమ్నాలాల్ బజాజ్
జమ్నాలాల్ బజాజ్ (నవంబర్ 4, 1889 – ఫిబ్రవరి 11, 1942) ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు.
జననం
నేటి రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నవంబర్ 4, 1889 వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.
మరణం
ఫిబ్రవరి 11, 1942లో మరణించాడు
—
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు