రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -26
రాజ్యంగ ముందస్తు కోసం పోరాటం
యరవాడ జైలు లో నిర్బంధం లో ఉన్న మహాత్మా గాంధీ అకస్మాత్తుగా 21-1-1924నజబ్బు పడ్డాడు .అధికార్లు ససాన్ హాస్పిటల్ కు తరలించారు.ఆయనకు అత్యవసరంగా అపెండి సైటిస్ కు ఆపరేషన్ జరగాలని దగ్గర స్నేహితులు ఉంటే కబురు చేయమని డాక్టర్లు గాంధీ తో చెప్పారు .గాంధీ వెంటనే శ్రీనివాస శాస్త్రి డా.పాథక్ ,ఎన్ సి కేల్కర్ ల పేర్లు చెప్పాడు.మొదటి ఇద్దరూ సహాయనిరాకరణ ఉద్యమ వ్యతిరేకులే . అదృష్టవశాత్తు శాస్త్రి ఆ సమయంలో పూనాలో ఉండటం తో వెంటనే రాత్రి 9 గంటలకు ఆ హాస్పిటల్కు వెళ్లాడు .శాస్త్రి తానూ రాసిన ‘’మినిట్స్ ఆఫ్ విజిట్ టు మిస్టర్ గాంధి ‘’లో తాను ఎలాంటి క్రిటికల్ పరిస్థితిలో ఆయన్ను కలిశాడో రాశాడు .ఇది అ ఆ మర్నాడే ప్రచురింపబడింది .అంతటి బాధలోనూ ,అనారోగ్య౦ లోనూ గాంధీ శాస్త్రి ఆరోగ్యం భార్యా పిల్లల క్షేమ సమాచారాలు ,సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులయోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నాడు .తన ఆరోగ్య విషయమై ఎలాంటి ఆందోళన జరిగినా తనకు చెప్పాలనీ ,తన ఆరోగ్యం ,చికిత్స అధికారుల చేతులలో ఉన్దికనుక వారిపై ఎలాంటి ఫిర్యా దు ఉండరాదని చెప్పాడు . ఒక దీర్ఘ స్టేట్ మెంట్ ను తనకు ఆపరేషన్ చేయబోయే కల్నల్ మాడ్లాక్ ను ఉద్దేశించి డిక్టేట్ చేశాడు .శాస్త్రి పెన్సిల్ తో దీన్ని రాశాడు .వెంటనే ఆపరేషన్ చేసేయ్యమని ఆలస్యం అయితే డాక్టర్ పై లేనిపోని అనుమానాలు వస్తాయని తెలియజేశాడు .దీనిపై సంతకం చేస్తుంటే గాంధీజీ చేతులు వణికాయి –‘’shastri noticed he did not dot’’ I’’ at the end ‘’.
శాస్త్రి మినిట్స్ లో రాసిన విషయాలు –‘’ఆపరేషన్ రూం సిద్ధం అయ్యాక ,,డాక్టర్లు బయటకు వెళ్లగా నేనొక్కడినే అక్కడ మహాత్మా తో ఉన్నాను .ఒకటి రెండు మామూలు విషయాలు మాట్లాడాక నేను మహాత్మునితో ఇంకేదైనా ప్రత్యెక విషయం చెప్పాలని మీరు అనుకొంటున్నారా /?’అన్నాను .ఆయన ధోరణి చూస్తె ఏదో చెప్పాలనే ఉన్నట్లు అనిపించింది .నెమ్మదిగా ఆయన ‘,నా ఆపరేషన్ తర్వాత నా విడుదల విషయమై ఏదైనా ఆందోళన జరిగితే ,అది నాకు ఇష్టంకాదు అది ఎంతటి సవ్యమార్గాన నడిచినా నేను సహించలేను .సమస్యలపై ప్రభుత్వంతో నాపోరాటం పోరాటమే ‘’ తగ్గేదేలా’. .కానీ నిబంధనలు నియమాలు ఉండరాదు .ప్రభుత్వం నన్ను జైలు లో ఇంకా ఉంచాలి అనుకొంటే ,నన్ను బయటికి పంపటమే గౌరవదాయకం .నా పద్ధతులు ,ప్రవర్తన మంచివే అని భావిస్తే నేను ప్రభుత్వంతో పోరాటం చేస్తే ,నాకు ఇంగ్లీష్ వారంటే ప్రేమ వారిలో చాలామంది నాకు స్నేహితులున్నారు .వాళ్ళే నన్ను విడిపిస్తారు .కాని అదిమాత్రం తప్పుడు పద్ధతిలో జరగరాదు .ఏ ఆందోళన అయినా అహింసా విధానంలో క్రమ పద్ధతిలోనే జరగాలి .నేను నా భావాలను సరిగ్గా నీకు వ్యక్తం చేసి ఉండక పోవచ్చు .నువ్వే నీ ధోరణిలో శక్తివంతంగా రాయి .నేను అసెంబ్లీలలో మాట్లాడిన తీరు, తెచ్చిన తీర్మానాలు ఒక సారి ఆయన దృష్టికి తెచ్చి ,ఆయన అనుచరులకు భారత ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా అని అడిగాను .ఆశ్చర్యంగా ఆయన మొండిగా తనమాట మీదనే ఉన్నారు .తాను జైలు నిర్బందితుడనని,కనుక తాను తప్పక ‘’prisoners’ code of honour scrupulously ‘’పాటించాల్సిందే అన్నారుమహాత్మా .తాను నాగరికంగా చనిపోయినట్లే –‘అన్నారు -’supposed to be civilly dead’’. బయటి విషయాలు తనకు తెలియవనీ ,పబ్లిక్ తో తనకేమీ సంబంధం లేదన్నారు .కనుక పబ్లిక్ కు మెసేజ్ అంటే సందేశం ఇవ్వక్కర్లేదన్నారు .’’నిన్న మహామ్మదాలి మీరు చెప్పినట్లుగా ఒక సందేశం విడుదల ఎలా చేశాడు??అని అడిగాను .నా నోటినుంచి ఆమాటలు రావటం నాకే సిగ్గు అనిపించింది .అనవసరంగా నోరు జారాను అనిపించింది .కానీ మాటలను వెనక్కి తీసుకోలేముకదా.మహాత్ముడుఒక్కమారుగా నిర్ఘాంతపోయి ‘’మహమ్మదాలీ నా ?నానుంచి మేసేజా ?’’అనే సమయంలో నన్ను కాపాడటానికా అన్నట్లు నర్సు కొంత సామగ్రితో రావటం నన్ను బయటకు వెళ్ళమని కళ్ళతో సౌజ్ఞ చేయటం జరిగి ,నా నెత్తిన పాలుపోసినట్లయింది .కొన్ని నిమిషాలలో గాంధీని ఆపరేషన్ రూం కు మార్చారు .రూం బయట కూర్చుని మహాత్ముని ఉన్నతభావాలు ,క్షమాగుణం ,ధైర్య సాహసాలు .దయాసానుభూతి ఒక్కసారి మనసంతా ఆక్రమించి నిజంగానే కారణ జన్ముడు ,మహాత్ముడు అనుకొన్నాను .సామాన్య ప్రజలపై ఆయనకు ఎంతటి అనుకంప ఉందొ గౌరవం పై ఎంతటి సున్నితభావం ఉన్నదో తెలిసి అబ్బురపడ్డాను .సహాయ నిరాకరణ ఉద్యమానికి ఇలాంటి సకల గుణాభి రాముడే నాయకత్వానికి అర్హుడు అనుకొన్నాను ‘’అని రాశాడు శాస్త్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-23-ఉయ్యూరు
