శ్రీ పన్నగాచల నాయక శతకం
శ్రీ సచ్చిదానదస్వరూప పులహరి పీలోజి దేశికేంద్రులు రచించిన శ్రీ పన్నగాచల నాయక శతకం శ్రీకోల్లిపర సూరేశ్వర లింగం దేవర ద్రవ్య సహాయంతో శ్రీ పులహరి పీరోజి బాబు చే 1924లొ ప్రచురితం .వెల –పావలా .విజ్ఞప్తిలో బాబు –‘’తనతాతగారు పీరోజి దేశికేంద్రులు అనేక గ్రంథాలు రాశారని అవి ముద్రితం కాకుండానే శివైక్యం చెందారని ,తన తండ్రి లక్ష్మోజి ఆ శిధిలా తాళపత్ర గ్రంథాలలోని ‘’పరమానంద సుధాలహరి ‘’మాత్రం కాగితంపై కాపీరాసి ముద్రించారని ,తాతగారి శిష్యులు శ్రీ పాటిబండ్ల వీరయ్యాచార్యుల ప్రోత్సహించగా తానూ ప్రయత్నించే లోపే ఆయనా మృతి చెందారని , అప్పికట్ల నివాసి అని,చినపరిమి అగ్రహార వాస్రవ్యులు ,వీరమహేశ్వర స్వరూపులు శ్రీకొల్లిపర చన్నమల్లయ్య గారి ధనసాయంతోశతకం ముద్రించానని సత్తెనపల్లి నుంచి తెలియజేశారు .ఉపోద్ఘాతంలో –కవిగారు ఫిరోజి బాబు గారు 1929-30మధ్యలో జన్మించి ,చిన్నతనంలోనే అనేక మహిమలు చూపుతూ ఆశ్చర్యపరచేవారని ,బడిలో చేరి అందరికన్నా బాగా చదివి పేరు తెచ్చుకోన్నారని ,ఒకసారి బడి నుండి ఇంటికి వస్తుంటే ఒక సిద్ధుడు కనపడగా భవబందాలనుంచి విముక్తి ప్రసాది౦చమనికోరగా తారకం ఉపదేశించి అదృశ్యమయ్యారని ,తర్వాత పదిహేనవ ఏట శ్రీ జమిలి శేషయాచార్యులవద్ద పరతత్వ రహస్యాలు గ్రహించారని ,శివ పంచాక్షరి ద్వాదశాక్షరి జపం నిర్విఘ్నంగా చేస్తూ ,జనులకు జ్ఞానబోధ చేస్తూ 9-7-1889న శివైక్యం చెందారని ,ఈ శతకంతో పాటు పరమానంద సుధాలహరి ,తత్వ సంగ్రహం ,స్వప్రకాశమానం .రామ శతకం మొదలైనవి రచించారని జిల్లెపల్లి వాస్తవ్యులు శ్రీ బోడేపూడి వెంకటరావు గారు తెలియజేశారు .తర్వాత గురు పీఠిక సంతరించి తన గురుపరంపరను ధ్యానిచారుపీరోజికవి . శతకం అంతా మత్తకోకిల పద్యాలలో రాశారు .’’పన్నగాచల నాయకా ‘’అనేది శతక మకుటం .
మత్తకోకిలస్వరంతో మొదటిపద్యం పలికించారు –‘’ శ్రీ రమామణి మనోహరా చిన్మయాత్మక పాండుర- స్మేరశోభిత రాజమండల స్నిగ్ధ సద్వదనంబుజా-వారిజాసన సోమశేఖర వందితాంఘ్రి సరోరుహా –పారమోక్ష శుభ ప్రదాయక ‘’పన్నగాచల నాయకా ‘’.తర్వాత వెంకటేశ్వర అలివేలు మ౦గలను స్తుతించి ,గోపభూపయ,శోదబాలక గోపికాతి మనోహరా ,మయూర పించ వికాసా కామరూప అంటూ పరవశించారు .ద్వేష భీషణ వేష సాత్యవతేయ హృత్పరిపోషకా ,రామ కోమలమూర్తి నిత్యవ,నిరామయాత్మక ,సామజరాజ కస్ట విదార అని కొన్ని విషయాలు గుర్తు చేశారు .రేఖ మేఘ రుచిప్రకాశరీరతిర్మణిరేఖ ,చిద్రేఖ శేఖర అంటూ వినూత్న పదబంధాలు సృష్టించి స్వామి కీర్తన చేశారు .రాజమండల సన్నిభాసన,రాజరాజ వతంస ,భూరాజమండల ముఖ్యపూజిత రాగయోగి మనోజ్వలా ‘’అన్నారు .సర్వతోముఖ సర్వ రూపక సర్వదీపకలాప సర్వపాలన సర్వ ఖేలన అని స్వామి సర్వాంతర్యత్వాన్ని ఆవిష్కరించారు .నీవే సర్వ చరాచరం సర్వజగాలు .నిన్నే భావన చేసి బతుకుతున్నాను .చలమేల కరుణి౦చరా .ఏకమై పరిపూర్ణమై సకలేంద్రియ ప్రకరాన్తమస్తోకమై నిరవద్యమైన నువ్వు సూక్ష్మమే కాదు స్థూలం కూడా .
ఆరింటిని వధించి పదహారును పరిమార్చి ,ఆరు చేర్చి ఆరు కూర్చి ,ఆరిటిని పోకార్చి ,ఆరుపువ్వులమీదుగా ,పదహారు కాంతుల పూర్ణమైనది ఇమ్పారుగా ఉంటుంది అని వేదాంత బోధ చేశారు .99 వ మత్తకోకిల లొ –‘’మత్తకోకిల పద్య సుమాలతో మాలచేసి నీకు సమర్పించాను వెంకటేశ్వరా .స్వీకరించి అందరికి సకలార్ధాలు సమకూర్చు .వందవ పద్యంలో –‘’పులారి కులం లొ శేషయార్య సేవాపరుడను .సత్యభామాపుర నివాసిని .ఫీరు దాసు పేరు .నాకృతిని వ్యాప్తి చేసి అందరికి శుభం కల్గించ మనికోరారు .
దాసకవి లోక హితైషి .వెంకటరమణ పాదార్చకులు .మదినిండా స్వామిని నింపుకొని ఇంపు మీరగా మత్తకోకిలస్వనం తో భక్తీ మత్తు ఎక్కిన్చేట్లు శతకం రాసి తరించారు .చదివి మనమూ తరిద్దాము .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-23-ఉయ్యూరు —
