బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22
Video link
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22
Video link
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-
-ప్రపంచ సౌందర్య రాశి ,’’ఏ రాస్తా హాయ్ ప్యార్ ‘’సినీ ఫేం ,జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలైన మదనపల్లి నటి-శ్రీమతి లీలా నాయుడు
లీలా నాయుడు (1940 – జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. “యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది.
బాల్యము
లీల 1940 సంవత్సరములో జన్మించింది. మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).
జీవనగమనము
· 1954లో (పదిహేను సంవత్సరముల వయసు) Femina Miss India గా ఎన్నుకొన బడింది.
· వోగ్ పత్రిక (Vogue) లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
· 1956లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ను పెళ్ళాడింది.
· మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్నపిదప తిలక్ రాజ్ తో విడిపోయింది.
· విడాకుల తరువాత జిడ్డు కృష్ణమూర్తి బోధలకు ఆకర్షితురాలయ్యింది.
· 1969లో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ ను వివాహమాడింది.
చిత్ర రంగము
1960లో విడుదలైన “అనూరాధ” లీల మొదటి చిత్రము. హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారము పొందింది. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు. 1962లో “ఉమ్మీద్” (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి “The Householder” (1963), శ్యామ్ బెనెగల్ “త్రికాల్” (1985) లలో నటించింది. కొద్ది చిత్రములలో నటించిననూ లీల వాటిద్వారా చిత్రరంగముపై చెరగని ముద్ర వేసింది. 1992లో నటించిన “Elctric Moon” లీల చివరి చిత్రం.
మరణము
లీల జులై 28, 2009 న ముంబాయిలో మరణించింది[3].
315-లోక్ సభ సభ్యుడు ,డేంజర్’’సినీ విలన్ ,నంది అవార్డీ,కొక్కొరోకో దర్శకుడు,విచిత్ర వేష దారి –డాక్టర్ నాగమల్లి శివ ప్రసాద్
నారమల్లి శివప్రసాద్ (జూలై 11, 1951 – సెప్టెంబరు 20, 2019) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.
తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.[1] కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 2019 సెప్టెంబర్ 21న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3
బాల్యము
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి లో, నాగయ్య, చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951న జన్మించాడు.
విద్య
శివప్రసాద్ తిరుపతిలోని వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.
కుటుంబము
శివప్రసాద్‌కి విజయలక్ష్మి తో 26 పిబ్రవరి 1972 లో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు మాధవీలత, నీలిమ.
సినిమారంగం
సాహిత్యం, కళలు, సినిమా నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి నాటకంపై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరో కో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2006 సంవత్సరంలో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నాడు.
నటించిన చిత్రాలు
రాజకీయరంగం]
చంద్రబాబు నాయుడు , శివప్రసాద్ బాల్యస్నేహితులు, చంద్రబాబునాయుడి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయాడు.
మరణం
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 21న మరణించాడు.[2]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-22-ఉయ్యూరు
హాస్యానందం
40- విపర్యోక్తి
కారణం వలన కార్యం జరుగుతుంది .ఆకాశంలో మేఘాలుంటే నెమళ్ళు నాట్యం చేస్తాయి .కాని నెమళ్ళు నాట్యం చేస్తే ఆకాశ౦ మేఘావృతం అవుతుంది అంటే విపర్యయం .కారణం అయింది కార్యంగా మారటం అన్నమాట .ఇది హాస్య హేతువవుతుంది ..చెరువులు ఎండితే ఎండలు మండిపోతాయి అంటే విపర్యోక్తి ,చెట్లు చిగిరిస్తే వసంతం వస్తుంది అన్నదీ విపర్యోక్తే అన్నారు మునిమాణిక్యం.కుక్కలు అరిస్తే దొంగలొస్తారు ,చంద్రుడు వస్తే చీకటిపోతుంది కూడా అలాటివే .ముందు చెప్పాల్సింది వెనకా వెనక చెప్పాల్సింది ముందు చెబితే విపర్యోక్తే నండి బాబూ అని అని మొత్తుకున్నారు మాస్టారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
విజయదశమి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-22-ఉయ్యూరు
పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.10వ భాగం.5.10.22
Video link
’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర
ఒక కవి, రచయిత తన జీవితాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తాడు .ఎవరి అనుభూతివారిది .అయితే అది ఊహాలోకాల్లోకాక భూమి మీద ఉంటె రాణింపు ఎక్కువ .సరసభారతికి అత్యంత ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇటీవలే వెలువరించిన ‘’నా జీవన యాత్ర ‘’నిజంగానే ఆయన సాహితీజైత్రయాత్ర అంత సుదీర్ఘమైనది .ప్రతిమాట ,ప్రతి పంక్తి మనసును తాకుతుంది .తెచ్చిపెట్టుకొన్న కవిత్వంకాదు .మనోభావాలు గుండె పొరల్లోనుంచి తమకు తాము వెల్లువలాపైకి ఉబికొచ్చిన కవితాదార .
ప్రకాష్ కు యాత్ర అంటే ఒక కొత్త మార్పుకు చేర్పు ,కొత్తపాత్రలతో కరచాలన౦. అక్షరాలు మొలిపించి ,మురిపించి స్పూర్తిని ప్రసాది౦చేదే .చిన్నప్పుడు డబ్బు ఇబ్బందితో స్కూల్ పిల్లల యాత్రకు పంపకపోతే చిట్టిమనసుల కోరికల్ని,సరదాను చంపుకోవటం ప్రత్యక్షంగా చూపించటమే .కొండపల్లి యాత్రానుభూతి అడ్డుకట్ట వేయలేనంత ప్రవాహ ఉధ్రుతితో ఆనంద సంద్రమయింది .నేరేడుపళ్లనుకొని ఇంకుడు కాయలు తిన్నప్పుడు అసలైన పరిశోధన విజ్ఞానం యాత్ర బోధించింది .పరీక్షలవలన కుటుంబ సభ్యులతో యాత్ర కు వెళ్ళక ఒంటరిగా ఇంట్లో ఉండటంతో కలిసి వెళ్ళే యాత్ర పాత్ర కలగానే మిగిలింది .అయితేనేం ఊహల యాత్రలో నానమ్మ కతలతో తనపాత్ర ఎప్పుడూ విహరిస్తూనే ఉందనే ఊరట పొందాడు .
మనసు ఆల్బం లో భద్రాద్రిగోదారి గుత్తి చేపలు దృశ్యకావ్యంగా భద్రమైంది .వృత్తి బండీ లాగటానికి యాత్ర బండిని రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ లో బందీచేశాడు .పెళ్ళే ఒక తీర్ధయాత్రగా మజా యాత్రయై మధురోహల్ని నింపి ,జీవనయాత్రకు తోడు నిచ్చింది .జీవనసాగరంలో యాత్ర భాగమైపోయింది .సాహితీ తపస్సు కామారెడ్డి లో పండినప్పుడు సాహిత్యయాత్ర జీవన మజిలీలో ప్రధాన పాత్రే పోషించింది .యాత్ర అంటే సరదామాత్రమేకాదు,అన్నిరకాలా నలిగిపోవటం కూడా .
భావుకుడైన ప్రకాష్ కు యాత్ర సమస్త ప్రకృతిని పలకరించి తడిమి తురుముకోవటం .అనేక పాత్రల్ని కలుపుకొంటూ ,కొత్తపాఠాలు నేరుస్తూ ముందుకు సాగటం .అనేక వేదికలపై మెరుస్తూ ,అనేకానేక కవి, రచయితలతో మమేకమౌతూ ,అనేక ఆలోచనలపరవళ్ళతో మహా ప్రవాహంగా సాగిపోతూ సాహిత్య గుబాళింపు లెన్నో అఘ్రాణిస్తూ , తానూ అందజేసి, మహానుభూతి పొందాడు .’’ఉయ్యూరులో రాజాగారి కోట సాక్షిగా జరిగిన కథా సదస్సులో కాలేజి విద్యార్ధులకు బ్రతుకు గాతలను కథలుగా చెప్పి ,ఆలోచనా బీజాలు నాటటం ఆయన మర్చిపోలేదు .
ఎన్నెన్నో జ్ఞాపకాలు మరెన్నో జ్ఞాపికలు ఇంకెన్నో సత్కారాలు ఈ సాహితీ యాత్రా ఫలితాలే అని పరమ సంతోషం వ్యక్తం చేశాడు ప్రకాష్ .జనకవనం వేదికపై కంపించేదేహంతో తొలికవిత చదివి అనూహ్యంగా వచ్చిన స్పందన చప్పట్ల రూపం లో వ్యక్తమైనప్పుడు ,ఫెలోషిప్ ఆర్దికప్రోత్సాహం లభించినప్పుడు ప్రత్యక్ష సాక్షి సాహితీ యాత్రాలే అని గుర్తు చేసుకొన్నాడు .అందుకే చలపాకకు యాత్ర అంటే జీవతం లో ఒక పాత్ర .అనేక అనుభూతుల అక్షయ పాత్ర .రమ్యభారతి పత్రిక,నిర్వహణ ,క్షణం తీరికలేని సాహితీ సభా నిర్వహణ దక్షత ,,రాష్ట్ర సభల నిర్వహణ, వ్యాస ,విశ్లేషణా విశ్వరూపం తో అమెరికా సాహిత్యపు అంచులు తాకినప్పుడు ఆయనపొందిన ఆనందం అవధులు దాటింది .మనిషి బంగారం .మనసు బంగారం .వృత్తి బంగారం,ప్రవృత్తి బంగారం అయిన’’ ప్రకాశ’’ జీవనుడు ‘’చలపాక’’ అన్ని తరాలవారికీ ఆదర్శ మూర్తి . ఆయన యాత్రలో మనల్నీ యాత్రీకుల్ని చేసి మధురానుభూతుల్ని పంచాడు .
అందమైన ఫ్రంట్ ముఖ చిత్రంలో చలపాక జీవనయాత్రలో అలసి పోయిన ముఖంతో కనిపిస్తాడు కాని బాక్ చిత్రంలోనవయవ్వన స్పూర్తి తోయాత్రకు సిద్ధం అన్నట్లు దర్శనమిస్తాడు .
విజయదశమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.21వభాగం.5.10.22
Video link
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17
· 51-‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ ‘’గేయకర్త ,ఆత్మాభిమాని ,తేటగీతి కవి ,బలిదానకావ్యకర్త ,గాంధీ బిల్హణీయం,దీనబంధు సినీ గేయకర్త –శ్రీ శంకరంబాడి సుందరాచారి
· శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.
జీవిత విశేషాలు
సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం[1]. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.[2] సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది[3]. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.[4]
సాహితీ వ్యాసంగం
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. “నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు[5].
సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.
సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి “మా తెలుగు తల్లికి” గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.
ఇతర కవుల అభిప్రాయాలు
స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారన్నారు- మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉంది.
కీ.శే.కవిసాంరాట్ విశ్వనధ సత్యనారాయణ అన్నారు- తెలుగు పలుకుబై, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించుచున్నట్లున్నది.ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవుచున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసములనుండియు, మారుమూల పదములనుండియు విడివడి సరళమైనది.
శ్రీగడియారం వేంకటశేషశాస్త్రి అంటారు: ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి.
శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు మాటలలో-సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత.
శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ గారు:తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట….కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత.
రచనల నుండి ఉదాహరణలు
సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మకు ఒక సందేహం కలిగి ఇతడిని “అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?” అని ప్రశ్నించాడు. ఆయన దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు.
తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్య. విగ్రహం పలకం
నల్లకొండల నుగ్గుగా నలగగొట్టి
చిమ్మచీకటిలోగల చేవబిండి
కాళసర్పాల విసమెల్ల గలిపినూరి
కాచిపోసిన రూపుగా గానుపించె
పచ్చి రక్కసి, నడగొండవలెను, వదన
గహ్వరము విచ్చి మంటలుగ్రక్కి,నాల్క
సాచి, కనులెఱ్ఱవార, చేయూచికొనుచు
నురము ముందుకునెట్టి, శిరమునెత్తి
కాలభైరవియై వల్లకాటికెల్ల
దానె గాపరి యనమించి తలల మాల
మెడను వ్రేలాడ, ద్రాచులు పడగలెత్తి
భూషలయి మేన బుసకొట్టి, ఘోషలిడుచు
హరులు,తరులును,గిరులును,దరువులొకట
వెంట బడిమూగ,నడుగులు,పిడుగులగుచు
నిడిన చోట్లెల్ల గోతులు వడుచునుండ
నచటి కరుదెంచె వికటాట్టహాసముగను
తేటతెనుగు తనము పుణికిపుచ్చుకుని ఎదుటపడిన సుందరాచారి తాటకిని చూసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ముక్కున వేలు వేసుకున్నాడు.
బిరుదులు
శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.
మా తెలుగు తల్లి గేయానికి రాష్ట్రం లో, దేశ విదేశాలలో గొప్ప గుర్తింపు తెచ్చినవారు మహాగాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి .ఆమెను మనం మర్చిపోకూడదు . శ్రీ సుందరాచారి శత జయంతి సందర్భంగా బందరుకు చెందిన శ్రీ యుటిఎఫ్ వెంకటేశ్వరరావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మగార్లు ఒక బృందంగా ఏర్పడి ఆయన జీవిత చరిత్రను అనేక చోట్ల రూపకంగా ప్రదర్శించారు .సరసభారతి తరఫున ఉయ్యూరులో కూడా ఫ్లోరా హైస్కూల్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయించాం .వారు చక్కగా నిర్వహించి విద్యార్ధులకు గొప్ప స్పూర్తి కలిగించారు .ఆమహాకవిపై మేమూ ఒక కార్యక్రమం నిర్వహించామన్న సంతృప్తి ,గౌరవం సరసభారతి కి దక్కింది .
సశేషం
విజయ దశమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-22-ఉయ్యూరు
హాస్యానందం
39-వ్యతిరేకార్ధోక్తి
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చెప్పేవాడు ఒక అర్ధాన్ని ఉద్దేశించి ,దానికి వ్యతిరేకార్ధం వచ్చేట్లు మాట్లాడటం వలన కలిగే చమత్కారం అన్నారు మునిమానిక్యంగారు .ఉదాహరణ –ఒక తండ్రి తన కొడుకుతో పరిహాసానికి ‘’ఒరే.ఇప్పుడు రాత్రి ఒంటిగంట అయింది ఇంకా ఏం పడుకొంటావులే .ఇంకాసేపు గడిపేస్తే హాయిగా తెల్లార్తుంది ‘’అన్నాడు .ఇందులో ‘’ఇక చాల్లేరా కుంకా పడుకొని ఏడు ‘’అని అర్ధం అన్నమాట .మరోటి .భార్య భర్తతో ‘’నన్ను ముద్దుపెట్టుకోకండి అలా చేస్తే నాకు తిక్కరేగుతుంది ‘’’’అన్నది అంటే ముద్దుకోసం తహతహ లాడుతో౦దన్నమాట .మూడోది –ఒకాయనకు భార్యమీద పిచ్చకోపం వచ్చింది .’’భోజనానికి లేస్తారా ?అంది భర్త బు౦గ మూతిపెట్టి’’లేవను ‘’అన్నాడు .’’ఏం ఎందుకని’’ ?అని తేనెమనసులు సినీ పాటలాగా అంటే ‘’నాక్కోపం వచ్చింది ‘’అంటే ,’’ఎట్లాపోదో నేను చూస్తాగా ?’’అని ఆమె అంటే ‘’ఇది పోయేకోపం కాదు .నువ్వు లాగి వెనకనించితోసుకొంటూ తీసుకు వెడదామనుకోన్నావేమో ?అదేమీ సాగదు .చక్కిలిగింతలు పెట్టి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మా అమ్మను కేకేస్తాను ‘’అన్నాడు .ఇవన్నీ చేస్తే భోజనానికి లేస్తాను అని అర్ధం .ఇందులో ఉన్న చమత్కారం గ్రహించని ఆడది ఉండదన్నారు సార్.వ్యతిరేకార్ధ స్ఫురణ ఈ రకం గా ఒక చక్కని మనో వ్యాపారం అయింది .దీనివల్ల పుట్టే హాస్యమూ పరమ రమణీయంగా ఉంటుంది అని ఇలాంటి వాటిలో భార్య కా౦త౦గారితో తలపండిన మునిమాణిక్యం నరసింహారావు గారన్నారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6
సాధారణంగా తారాశంకర్ తన రచనతో సంతృప్తి పొందడు .దాన్ని మార్చిమార్చి మెరుగులు దిద్దుతూనే ఉంటాడు.1939లో ప్రచురించిన ధాత్రీ దేవతనవల ఆయన రచయితగా ప్రదర్శించిన లక్షణాలన్నీ బీజ ప్రాయంగా ఉన్నాయి .పాత ధనవంతుల నయా ధనవంతుల సమస్యలు ,రైతాంగ సమస్యలు ,సగటు మనిషి నిరంతర పోరాటం ,వ్యక్తిత్వంతో భాసించే స్త్రీ ,పురుషులు ,విభిన్న సిద్ధాంతాల కార్యకర్తలు ,వర్షాభావ పరిస్థితులు ఇందులో దర్శన మౌతాయి . మనో వికారాలు లేకుండా నిస్సంగం గా ఆయన రాసిన తర్వాతనవలలకు ఇది నాంది .ఇవన్నీ విస్తృత ప్రాతిపదిక పై రాసినవే .సార్వకాలీనత సార్వజనీనత ఉన్నవే .తన అత్త మరణం ధాత్రీదేవత మరణం అంటాడు బంధ్యోపాధ్యాయ .నిష్కల్మష ప్రేమమూర్తి గౌరీ.హి౦సా విధానాలతో స్వాతంత్ర్యం సంపాదిద్దామనుకొన్న కొందరు యువకులు అమెరికా మొదలైన దేశాలకు వెళ్లి అక్కడ కేంద్రాలు ప్రారంభించారు .అదే నిజమైన విప్లవంగా భావించారు .
గణ దేవత ,పంచ గ్రామ నవలలో అయిదు గ్రామాల కథ ఉంది .పంచాయతీరాజ్ అస్తవ్యస్తం క్షీణదశ చూపించాడు .పాత నుంచి కొత్తకుకోత్తకు మారే దశ చూపాడు .ప్రాచీన ,మధ్యకాలాలలో బెంగాల్ లోగ్రామాలు 9,7,5 సంఖ్యలో సమూహాలుగా ఉన్నాయి .గ్రామ నిర్వహణ సంఘాలచే గ్రామస్తుల అంగీకారంతో పాలన జరిగేది .అందుకే వీటి నవగ్రామ, సప్తగ్రామ ,పంచాగ్రామ అనే పేర్లు వచ్చాయి .ఈ సంఘాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవి ,మన్ననలు పొందేవి .ఒకకమ్మరి గ్రామస్తుల పని చేయటానికి నిరాకరించటంతో ‘’గణ దేవత ‘’నవల మొదలౌతుంది .కులాల వృత్తులు చేసేవారికి గ్రామస్తులు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పేవారు .అది వారిఅవసరాలకు చాలేదికాదు .పైకుమ్మరి అందుకే ఆవూరు వెళ్లి పట్నం లో బతుకుదామనుకొన్నాడు .గ్రామ సంఘం అతడిని విమర్శించినా లక్ష్యపెట్టడు .ధనికుల్ని శాసించలేని ఆ సంఘాన్ని అతడూ లెక్క చేయలేదు .పట్నం నవనాగరకతకు ప్రతీక .పల్లె ఇంకా అలానే కునారిల్లుతోంది .గ్రామ సంఘాలకు మూలాలైన ఆయిదు గ్రామాలు క్షీణించిపోయాయి .పట్నం వెళ్ళిన ఆయువకుడు తిరిగివచ్చీ ఇంకా ఎక్కువమందిని తనతో తీసుకు వెళ్ళాలనుకొని వచ్చి గ్రామం ధనికుల హస్తాలలో నలిగిపోతుంటే భరించలేకపోతాడు .ఇందులో ఉన్నవారు వ్యక్తులు కారు సాంఘిక వ్యవస్తలు .ప్రధానపాత్రలు ఒకే ఆర్ధిక వ్యవస్తకుచెందినవి .నిరక్షరాస్యులమధ్య విద్యావంతుడు ఒకడు ఉండిమార్గదర్శనం చేయటం ఉంది .కార్మికులుగా వలస పోకుండా భూమిని ఇంకా తమ జీవనాధారంగా నిలబెట్టుకొనే వ్యక్తులు పెరుగుతారు .ఈ నవలలో ఉన్నత ఉత్తమ సాహిత్య విలువలు నెలకొల్పాడు .ఆకాలం లో అలాంటి రచయితలూ లేరు .ఆయన కృషి చేసిన సాహిత్య ప్రక్రియ విభిన్నమైనది .ఆయన సాహిత్యగౌరవం అసాదారణమైనది .
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు
పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.9వ భాగం.4.10.22
Video link
బ్రహ్మవైవర్తం ప్రకృతిఖండం తర్వాత ,బృందావన్ లాల్ పిమ్మట ?
సాహితీ బంధువులకు శుభ కామనలు –
కొద్దిరోజుల్లో బ్రహ్మ వైవర్త పురాణం -ప్రకృతి ఖండం అయిపోతుంది .వెంటనే బాలవ్యాస ,వేదాంత కేసరి బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ”మహాభారత తత్వ కధనం ”ప్రారంభిస్తాము .
సాయంకాలం చేస్తున్న బృందావన్ లాల్ వర్మ కూడా త్వరలోనే అయిపోతుంది .వెంటనే చేమకూర వేంకట కవి విరచిత ”విజయ విలాస ప్రబంధం ”శ్రీ తాపీధర్మారావు గారి వ్యాఖ్యానం తో ప్రారంభిస్తామని మహర్నవమి ,విజయ దశమి శుభా కాంక్షలతో తెలియజేస్తున్నాము -గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-22-ఉయ్యూరు
శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి
Video link
శమీ పూజ ,శమీ అష్టోత్తర శతనామావళి
శమీపూజ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశాశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ||
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ||
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||
తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా; విజయదశమినాడు చేపట్టిన ఏకార్యము అయినా విజయముతధ్యము అని ‘చతుర్వర్గ చింతామణి‘ అనే ఉద్గ్రంథము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే ‘విజయం‘ అని తెలిపియున్నది. ఆ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని నమ్మకం..
మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి ,పదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు వాడిని సంహరించి విజయం సాధించింది. అందుకే ఆరోజుకు విజయదశమి అనే పేరొచ్చింది.పూర్వం రాజులు ,జమీందార్లు లోక కల్యాణం కోసం ,వాళ్ళ విజయం కోసం ,వారి పాలనలో ఉన్న దేవాలయాలలోశమీ పూజోత్సవాలు చేసేవారు . సాయంకాలం పూజ తర్వాత స్వామిని గుర్రం పై ,వేదమంత్రోచ్చరణతో ,మేళ తాళాల ఛత్ర చామర మర్యాదలతో తో ఊరేగించి ,,శమీ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ వృక్షానికి ,ఆయుధాలకు పూజ చేసి ,విజయం కోసం నాలుగు దిక్కులలో,వృక్షం పై అగ్రంపైనా బాణాలు సంధించి వదిలే వారు. ఇది శత్రునాశనానికి చిహ్నం . ప్రస్తుత సంవత్సరం విజయదశమినుంచి వచ్చే సంవత్సరం విజయ దశమి పర్యంతం అష్ట దిక్కులా తనకు తన కుటుంబానికి దిగ్విజయం కలగాలని. “ విజయ పత్రం. “ రాసి శమీ వృక్షం మొదట్లో ఉంచుతారు. ఇందులో గోత్రం ,పేరు రాయాలి. శమీ వృక్షానికి అందరూ ప్రదక్షిణాలు చేసి ,శమీ పత్రాలను కోసి భక్తితో కళ్ళకు అద్దుకొని శిరస్సున ఉంచుకొని ఆలయానికి వస్తారు.
మనం ఒక తెల్లకాగితం మీద పైన శ్రీ రస్తు— శుభమస్తు —-అవిఘ్నమస్తు అని దూర దూరంగా రాసి దానికింద
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ
అనే శ్లోకం రాసి ,దానికింద స్వస్తిశ్రీ చాంద్రమాన _________( శుభకృత్) నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి –విజయదశమినుంచి ,శోభకృత్ నామ సంవత్సర ఆశ్వ యుజ శుద్ధ దశమి విజయ దశమి పర్యంతం అని రాసి, తర్వాత(_______( గౌతమస) గోత్రం –తర్వాత________ ( గబ్బిట దుర్గాప్రసాద్) కు కుటుంబానికి అష్టదిక్కులా దిగ్విజయం కలుగుగాక అనిరాసి శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీ అని అయిదుసార్లు
రాసి పసుపు ,కుంకుమ అంటించి శమీ వృక్షంలేక కొమ్మ కింద ఉంచాలి. గుడిలో అయితే అర్చకస్వామి శమీ కొమ్మకు బియ్యాన్ని మూటలో కట్టి ,మనం రాసిన కాగితాలన్నీ కొమ్మ క్రింద పెట్టి అష్టోత్తర పూజ చేస్తాడు. కాగితం బాణాలు తయారు చేసి ధర్మకర్త చేత నాలుగు దిక్కులకు బాణాలు వదిలిస్తాడు.
జమ్మి చెట్టుకు ఇంతటి ప్రాధాన్యం రావటానికి కారణం ఆ వృక్షాధి దేవత అగ్ని దేవుడు అవటమే. అగ్నిదేవుని వలననే దేవతలకు హవిస్సులు అందిస్తాము. ఆయన ద్వారానే దేవతలను ఆహ్వానించటం సంప్రదాయం.. ‘హిరణ్య వర్ణాంహరిణీ౦ సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ౦లక్ష్మీం జాత వేదో మమావహః. “ అనే వేదవాక్యం లో. “ అగ్నిదేవా !లక్ష్మీదేవిని నేను పూజించటానికి ఆమెను ఆహ్వానించు. “ అని ఉంది. ఇ౦తటిప్రభావం కల అగ్ని శమీ వృక్షానికి అధి దేవుడు. అందుకే జమ్మికి అంతటి ప్రాధాన్యం. అంతేకాదు. “ శమీ కీర్తనా దేవపాపం నశ్యతి వాచికం-స్మరణాన్మానసం
పాపం ,స్పర్శనాత్కాయజం తదా –నిత్యం తత్పూజ నా ,ధ్యానా ద్వంద్వ నా చ్చైవభక్తితః-నిర్విఘ్న కరమాయుష్య౦,జ్ఞానం ,పాప క్షయోపిచ. “ . అంటే శమి అని నోటితో అంటే నోటితోచేసినపాపాలు ,మనసులో శమీ అనుకొంటే ,మనసుతో చేసిన పాపాలు ,,శమీ అని తాకి నమస్కరిస్తే శారీరక పాపాలు పోవటమేకాక ప్రతిరోజూ పూజిస్తే దీర్ఘాయువు జ్ఞానం కలుగుతాయి. ఆనంద రామాయణం లో శ్రీ రాముడు రోజూ శుద్ధుడై నిత్యకర్మలు చేసి ,వట వృక్షం, బిల్వ ,శమీ, ఆశ్వత్ధం తులసీ మొదలైనవృక్షాలను పూజిస్తాడని ఉంది.
కర్ణాటక లో విజయదశమి పండుగనాడు’’ జంబూ సవారీ’’ అనే ఉత్సవం చేస్తారు. సాయంకాలం అందరూ కొత్తబట్టలు కట్టుకొని గ్రామానికి వెలుపల దగ్గరలో ఉన్న మరో గ్రామానికి నడచిలేక బళ్లమీద బస్సులమీద ఊరేగింపుగా వెళ్లి అక్కడి దేవాలయం లో దైవ దర్శనం చేసి తిరిగి ఇంటికి వస్తారు. మా చిన్నతనం లో హిందూ పురం లో ఇలానే చేసే వాళ్ళం. హిందూ పురంనుంచి బెంగుళూరు రోడ్డులో ఉన్న సూగూరు వెళ్లి అక్కడి ఆంజనేయస్వామిని దర్శించి తిరిగి వచ్చేవాళ్ళం.జట్కాబండి వాళ్ళు బస్సులవాళ్ళు అందర్నీ ఉచితంగా ఎక్కించుకొని జంబూ సవారీ సరదాగా జరిపేవారు. దీన్నే సీమోల్లంఘనం అంటారు.
అలాగే రాజులు ,జమీందార్లు పార్వేట ఉత్సవం చేసేవారు ఇదే విధానం లో. మన తిరుమల,వరదరాజస్వామి మొదలైన ప్రసిద్ధ ఆలయాలలో కూడా స్వామి ఉత్సవ విగ్రహానికి క్షత్రియ వేషం వేసి కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం చేస్తారు ,.
ఇంకా దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్త దినం ఈ విజయదశమి రోజునే అని తెలియజేయబడింది. “శ్రవణా” నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి “విజయా” అనే సంకేతము ఉన్నది. అందుకనే దీనికి “విజయదశమి” అను పేరు వచ్చినది.
ఈ విజయదశమినాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలుచుకుని పేరంటం పెట్టుకొని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.
అలాంటి విజయ దశమి రోజు మరింత ముఖ్యమైనది “శమీపూజ”. శమీవృక్షమంటే “జమ్మిచెట్టు” అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తిఅవగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న “అపరాజితా” దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా‘ దేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు. తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారంకూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో;
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అని ఆ చెట్టుకు ప్రదక్షణలుచేస్తూ పై శ్లోకము స్మరిస్తూ ఆ శ్లోకములు వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగ, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
ఇలా మానవులు అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలన్నా మనకు ఏర్పడిన దారిద్ర్యం తొలగిపోవాలన్నా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై. ఈ “శరన్నవరాత్రి” దసరావైభవంలో పాలుపంచుకుని సర్వులూ పునీతులు అవుదురుగాక…!
ఇందులో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకొందాం. పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధిప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమిని’’ దశహరా’’ అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది. పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమినాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైనది ‘శమీ వృక్షా’న్ని దుష్టఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.
శమీ శమయతే పాపం
శమీ నాశయతే రిపూన్
శమీ విత్తంచ పుత్రంచ
శమీ దిత్సతి సంపదమ్
అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని శమీవృక్షం వద్ద పఠించాలి. శమీవృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సం కేతం. మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.
మొత్తం మీద చెడు పై మంచి సాధించే విజయమే విజయదశమి అని గుర్తించాలి.
శమీ అష్టోత్తరం
ఈశాన్యైనమః
పాపశమన్యైనమః
వశన్యైనమః
శివాఫలాయైనమః
లోహిత కంకటాయైనమః
అర్జున బాణ సంరక్షకాయైనమః
రామస్య ప్రియ దర్శినిన్యైనమః
యాత్రాయాం సుఖ ప్రదాయైనమః
నిర్విఘ్న కర్త్రుకాయైనమ
10-శ్రీరామ పూజితాయైనమః
అగ్నికాంతిప్రతీకాయైనమః
విఘ్నేశ పూజా విధాయకాయైనమః
శని దోష నివారకాయైనమః
యుద్ధ విజయ సాధకాయైనమః
పాండవాయుధ రక్షకాయైనమ
కుష్ఠువ్యాధి నివారకాయైనమః
ఇభ వక్త్రాయనమః
గర్భ స్రావ నివారకాయైనమః
కఫ నివారకాయైనమః
20-శ్లేష్మధ్వ౦స కాయైనమః
ఏక వింశతి పత్రికా ముఖ్యైనమః
రోమనివారణాయైనమః
భూసార వృద్ధిదాయైనమః
పాంధఛాయా కల్పితాయైనమః
పోషకాహారాయైనమః
శాకపాక వినియోగాయైనమః
దంత వ్యాధి నివారిణ్యైనమః
సర్వ రోగనివారిణ్యైనమః
అపరాజితా దేవీ ప్రియాయైనమః
30-గోత్ర వంశాభి వృద్ధి దాయిన్యైనమః
క్షీర పక్షి ప్రియాయైనమః
కల్ప వృక్ష సమాయైనమః
పశు సంరక్షకాయైనమః
శ్రీ భద్రాయై నమః
పుణ్యదాయైనమః
పుణ్యరూపిణ్యైనమః
జానకీదుఃఖ శమన్యైనమః
సర్వ కల్మష సంహార్యై నమః
కామితార్ధ ప్రదాయై నమః
40-సత్య రూపాయయై నమః
శుభ ప్రదాయై నమః
శుద్ధాయై నమః
శక్త్యైనమః
పూతాత్మికాయై నమః
చతుర్వర్గ ఫలదాయైనమః
త్రిలోక జనన్యై నమః
మూల ప్రకృతిసంజ్నికాయైనమః
బ్రహ్మ రూపి ణ్యైనమః
అవాజ్మానస గోచరాయై నమః
50-పంచ భూతాత్మికాయైనమః
పంచ కలాత్మికాయైనమః
నిర్గుణాయై నమః
నిత్యాయైనమః
నిరాటంకాయనమః
దీన జన వత్సలాయై నమః
చతురానన సేవితాయైనమః
సిద్ధి ప్రదాయై నమః
అమలాయై నమః
కమలాయై నమః
60-లోక వందితాయై నమః
లక్ష్మైనమః
రామ ప్రియాయైనమః
విష్ణు ప్రియాయై నమః
తటిల్లతా౦గ్యై నమః
ప్రకృత్యై నమః
సర్వ భూత హిత ప్రదాయై నమః
విభూత్యై నమః
పరమాత్మికాయై నమః
శుచయే నమః
70-ధన్యాయై నమః
నిత్య పుష్టాయై నమః
దీప్తాయై నమః
రమాయై నమః
వసు ధారి ణ్యై నమః
క్రోధ సంభవాయై నమః
అనుగ్రహ ప్రదాయై నమః
అశోకాయై నమః
లోక శోక వినాశిన్యై నమః
అనఘాయై నమః
80-కరుణాయై నమః
ధర్మ నిలయాయై నమః
లోక మాత్రేనమః
దేవ్యై నమః
సుప్రసన్నాయైనమః
ప్రభాయై నమః
ఆహ్లాద జనన్యై నమః
విమలాయై నమః
విశ్వ జనన్యై నమః
వహ్ని ధరాయై నమః
90-యశస్విన్యై నమః
జయాయై నమః
మంగళ ప్రదాయై నమః
సర్వ దిక్ శుభ దాయకా యైనమః
వంశ ప్రవృద్ధయై నమః
గోత్రాభి వృద్యైనమః
ప్రసన్నాక్షాయై నమః
సర్వోపద్రవ వారి ణ్యైనమః
బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
100-పూర్ణాయై నమః
అనంగాయై నమః
స్తవ్యాయై నమః
పరమాయై నమః
తరణాయై నమః
భగవత్యై నమః
తత్వ త్రయ్యై నమః
మత్యై నమః
మాత్రేనమః
హిత కారిణే నమః
110-మాన్యాయై నమః
రాజ్య లక్ష్మై నమః
సర్వ సంపత్తి దాయై నమః
భోగ లక్శ్మైనమః
మహా జయాయై నమః
మహా బోధాయై నమః
మహా బంధన సంహారి ణ్యై నమః
మహా వృక్షాయై నమః
మహా ఛాయాయై నమః
మహానఘాయై నమః
120-మహా శ్వాసాయై నమః
మహా సారాయై నమః
మహా క్షాన్త్యై నమః
యశస్విన్యై నమః
మహారోగ వినాశిన్యై నమః
మహా క్షేమంకర్యై నమః
మహా విష నివారిణ్యై నమః
మహా శుభద్రాయై నమః
మహా సత్యై నమః
మహా నిత్యాయై నమః ‘
130-మహా శివ ప్రియాయైనమః
చిన్మయాకారాయై నమః
కాత్యాయిన్యై నమః
మాతృకాయై నమః
అజ్ఞాన శుధ్యైనమః
సృష్టి రూపాయైనమః
పురుషార్ధ ప్రదాయిన్యైనమః
వరదాయై నమః
భయ నాశిన్యైనమః
140-విశ్వ తోష్యణ్యైనమః
కుల సంపత్ప్రదాయై నమః
ప్రణవాత్మికాయై నమః
ఈశ్వర్యై నమః
చి౦తితార్ధ ఫల ప్రదాయి నమః
సర్వ మంత్ర మన్యైనమః
అమేయాయై నమః
అక్రూరాయై నమః
సర్వాస్త్ర ధారిణ్యై నమః
భూమిజాయై నమః
150-స్వ తేజసాయై నమః
బ్రాహ్మైనమః
జగద్ధితాయైనమః
మాన్యాయై నమః
నిరంజనాయై నమః
నిగమ గోచరాయై నమః
పూజ్యయైనమః
ధర్మ ప్రియాయై నమః
సర్వోపద్రవ వారిణ్యైనమః
లోకానంద దాయికాయైనమః
160-ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకృతి ఖండం .20.వ భాగం.4.10.22
Video link
స్త్రీ విముక్తి పై కధలు రాసిన ఇంగ్లీష్ లెక్చరర్ , రీడర్ ,’’సంపెంగలు సన్నజాజులు’’ నవలా ఫేం.సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –శ్రీ అవసరాల రామకృష్ణారావు
అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 – నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత.
1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.
మరణం
2011, నవంబర్ 28 న హైదరాబాదులో స్వర్గస్థులయారు.
జీవితం
· ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు.
· తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.
· విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు.
· తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.
అందుకున్న కొన్ని పురస్కారాలు
· 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)
· 2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)[3]
· 3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)
· 4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)
· 5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)
· 6. ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)
ప్రచురించిన కొన్ని పుస్తకాలు
· 1. మనం మనుష్యులం
· 2. సహజీవన సౌభాగ్యం
· 3. ఇంకానా అంతరాలు?
· 4. అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ
· 5. సంపెంగలూ, సన్ంజాజులూ
· 6. మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?
· 7. అది ప్రశ్న, ఇది జవాబు
· 8. హెడ్మిస్ట్రెస్ హేమలత
· 9. పేకముక్కలు
· 10. కథావాహిన – 6
· 11. గణిత విశారద[4]
· 12. కేటూ, డూప్లికేటూ
· 13. అర్ధమున్న కథలు
· 14. రామచిలుక
· 15. మోహనరాగం
· 16. మేథమేట్రిక్స్-1
· 17. మేథమేట్రిక్స్-2
· 18. మేథమేట్రిక్స్-3
· 19. అంగ్రేజీ మేడీజీ
· 20-25. కథల సంపుటాలు
సమకాలీన రచయితలు
ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు
· 1. వేమూరి వేంకట సూర్యనారాయణ
· 2. ఈరంకి వేంకటరావు
· 3. వేమూరి వేంకటేశ్వరరావు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు
image.png
జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి .
అది సుమారు 1930వ సంవత్సరం .ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో ఒకమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా తమ డాబా ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి సెల్యూట్ చేసింది .నిజానికి ఇదేమీ పెద్ద విషయం కాదు .,తప్పూకాదు.కానీ అప్పుడు రాజమండ్రిని తమ తీవ్ర దౌష్ట్యంతో కనికరం లేకుండా వణకిస్తున్న ఇద్దరు దుర్మార్గులైన పోలీసు ఆఫీసర్ ముస్తఫా ఆలీఖాన్ ,డప్పు రాయుడు అనే సబ్ ఇన్స్పెక్టర్ లు ఎక్కడ బ్రిటిష్ వారికి అవమానం జరిగినా వచ్చి మీదపడి లాతీ చార్జి చేసి చేతులూ కాళ్ళూ విరగ్గొట్టే వారు .సబ్ ఇన్స్పెక్టర్ ఈవిషయం తెలుసుకొని పై ఆఫీసర్ ముస్తఫా కు తెలియజేశాడు .ఇంకేముంది అసలే కోతి,నిప్పుతోక్కితే ఎలా ఉంటుందో అలా అయ్యాడు ముస్తఫా .లారీలాతో పోలీసులను ఎక్కించుకొని ఆ ఇంటికి వచ్చాడు . మౌంటెడ్ పోలీసులను కూడా బయట పఎర్పాటు చేయించాడు హడలు పుట్టించటానికి .సరాసర ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి జండా తీసేయ్యమని చెప్పాడు తియ్యను అందామె .తియ్యక పోతెతీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తు౦ది.అరెస్ట్ చేస్తాం అని హెచ్చరించాడు .
ఇంతలో ఆమె తండ్రి బయటికి హడావిడి చూశాడు .కూతురుని అడిగి విషయం తెలుసు కొన్నాడు .ముస్తఫా ఖాన్ తో ‘’మా అమ్మాయి జండా తియ్యదు జండా ఎగరేసే హక్కు అందరికి ఉంది .నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ‘’అన్నాడు పెద్దాయన .
ఆ పెద్దాయన పేరే దేవత శ్రీ రామమూర్తి .పేరుమోసిన లాయర్ .ఆ అమ్మాయిపేరు శ్రీమతి కోడూరి లీలావతి .చదువు కొంటో౦ది .ఖాన్ తో ‘మా అమ్మాయిని అరెస్ట్ చేయటానికి పర్మిషన్ ఉందా ?వారంట్ తో వచ్చావా ?’’అని అడిగారు శ్రీరామమూర్తి .ఆ రోజుల్లో ఖాన్ పేరు చెపితేనే ‘కార్చుకొనే వారే ‘’కాని ఎదిరించిమాట్లాడే వారు లేరు అంత హడల్ పుట్టించేవాడు .జనం విపరీతంగా పోగయ్యారు .ఇంతకీ ఖాన్ మన శ్రీరామ మూర్తి గారికి కాలేజిలో క్లాస్ మేట్ .అయినా ఎవరి తీరు వారిదే .అప్పుడు అరెస్ట్ చేయాలంటే కాకినాడలో ఉన్న కలెక్టర్ దగ్గర్నుంచి పర్మిషన్ పొందాలి .ఇక చేసేదిలేక ఖాన్ బృందం తోకముడిచి వెళ్లి పోయింది .అప్పటినుంచి శ్రీరామ మూర్తిగారిని ‘’జండా ప్లీడర్ ‘’అని పిలిచేవారు .
ఖాన్ కలెక్టర్ ను మేనేజ్ చేసి రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి అరెస్ట్ కు పర్మిషన్ తెచ్చాడు .మహా తెలివిగల మన లాయర్ గారు ఈ లోపే స్టే ఆర్డర్ తెచ్చేశారు .చేసేదేమీ లేక పోలీసులు కోర్టులో కేసు పెట్టారు .శ్రీరామ మూర్తిగారు కూతురు తరఫున వాదించారు .అప్పటిదాకా రావు గారు కాంగ్రెస్ భక్తుడుకాడు సాను భూతి పరుడు మాత్రమె . గాంధీ అభిమాని .గాంధీకి ఈవిషయం తెలిసి అభినందనలు తెలియజేశాడు జండా ప్లీడర్ కు .రెండుచేతులా బాగా సంపాదిస్తున్న ప్లీడర్ .ఈ సంఘటన తో ఆయనలో మార్పు వచ్చింది .గాంధీ అనుయాయుడుయ్యారు .ఉచితంగా పేదలకు న్యాయ సేవ అందించేవారు .
బ్రిటిష్ ప్రభుత్వం కూడా జండా ఎగరేయటం తప్పు పని కాదనే అన్నది. అయితే ఆసమయం లో ఎలాంటి గొడవలు అల్లర్లు ,సత్యాగ్రహాలు చేయకూడదని చెప్పింది .అప్పటికే సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జండా ఎగరేయటం అందరి హక్కు అని కోర్ట్ లో కేసు వేసి గెలిచాడు .ఈ తీర్పులేవీ పట్టించుకోలేదు ఇక్కడి కోర్టు .కోర్ట్ తీర్పు ప్రభుత్వ పక్షాన వచ్చింది .న్యాయమైన హక్కును కాలరాస్తున్న స్థానిక కోర్టులు ,పోలీసు వ్యవస్థ పై తీవ్ర ఆగ్రహం చెందిన లాయర్ శ్రీరామ మూర్తిగారు ఆనాటి లండన్ లో ఉన్న అత్యున్నత న్యాయస్థానమైన ‘’ప్రీవీ కౌన్సిల్ ‘’లో కేసు దాఖలు చేసి న్యాయం చేయమని కోరారు .వాదోపవాదాలు సుదీర్ఘంగా సాగి, చివరికి తీర్పు శ్రీరామ మూర్తిగారికి అనుకూలంగా వచ్చి జండా ఎగరేసే హక్కు అందరికి ఉన్నది అని తేల్చి చెప్పింది .నాటినుంచి శ్రీరామమూర్తిగారి పేరు దేశ విదేశాలలో మారు మోగింది .ఎందుకుజండాపై ఇంత అభిమానం ?అంటే ‘’ జండా జాతికి జీవగర్ర ,సమతా చిహ్నమ్ము’’అన్నారు కరుణశ్రీ .మరో అడుగు ముందుకు వేసి ‘’నా జాతి జండా కున్న పొగరు, గర్వం నాకున్నాయి ‘’అని ప్రకటించాడు శేషేంద్ర .
గాంధీ పిలుపుతో రాజకీయ ప్రవేశం చేశారు రావుగారు .వ్యక్తి సత్యాగ్రహం సహాయ నిరాకరణ,ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు .రాజమండ్రిలో లోని ఒక వీధి వీధి అంతా దేవత శ్రీరామమూర్తి గారి భవనాలే .నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని ,సీతానగరం ఆశ్రమానికి విశేష సేవ లందించారు .గాంధీ గారు ఎప్పుడు వచ్చినా శ్రీరామమూర్తి గారింట్లోనే బస, ఆతిధ్యం .ఆయనకాంగ్రెస్ నిధికోసం వస్తే, రావుగారు భారిమొత్తంలో నిధి అందజేయగా ,కుమార్తె తనమెడలో ఉన్న అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ తో సహా, నగలన్నీ నిలువుదోపిడిగా మహాత్మునికి అందజేసిన త్యాగమయి . కూతురు లీలావతి దేవి గారిని శ్రీ కోడూరి గున్నేశ్వరరావు గారు వివాహమాడారు .ఆమె పట్టభద్ర్రురాలు .కాంగ్రెస్ సేవా పరురాలు .సరోజినీ నాయుడికి అత్యంత ఆత్మీయురాలు .ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించినందుకు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తే ఆయన రాజమండ్రి వచ్చి శ్రీరామ మూర్తిగారింటికీ వస్తే మన లాయరు గారు నేతాజీ ఎవరి కంటా పడకుండా అజ్ఞాతంలో దాచి ,అరెస్ట్ నుంచి తప్పింఛి పంపించేశారు అంతటి వీరాభిమాని నేతాజీకి .
ఇవాళ ఉదయం శ్రీ దేవత శ్రీరామ మూర్తి గారి దౌహిత్రుడు అంటే కూతురు లీలావతిగారి కుమారులు శ్రీ కోడూరి శ్రీరామ మూర్తిగారి ఫోన్ నంబర్ మా అబ్బాయి శర్మ సేకరించి నాకు పంపితే వెంటనే రాజమండ్రి లో విశ్రాంతి తీసుకొంటున్న ఆ 93 ఏళ్ళ ఆ సాహితీ మూర్తి గారికి ఫోన్ చేసి తాతగారి వివరాలు అడిగితె చాలా ఓపికగా జవాబులు చెప్పారు .ఆ సారాంశమే పైన రాసిన విషయాలు .వారికి కృతజ్ఞతలు .
అహింసనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు గాంధీజీ. ప్రపంచవ్యాప్తంగా పరిమళించిన ఆయన కీర్తి ఎందరికో స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే తర్వాతి తరం నమ్మకపోవచ్చంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారంటే జాతిపిత కీర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వచ్చే గాంధీజీ జయంతి సందర్భంగా గోదావరి తీరంతో ఆయనకున్న అనుబంధాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
స్వాతంత్రోద్యమకాలంలో అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహాత్మా గాంధీ ఎప్పటికీ మార్గదర్శే! ఉద్యమకాలంలో ఆ జాతిపిత పాదస్పర్శతో గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో గాంధీజీ 5 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారని చరిత్ర చెప్తోంది. కోటిపల్లి బస్టాండ్, రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు, వంకాయలవారి వీధి ప్రాంతాల్లో బాపూజీ నడయాడారు. 1946 జనవరిలో చివరిసారి వచ్చిన గాంధీజీ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రసంగించారు.
గాంధీజీ రాజమహేంద్రవరానికి వచ్చినప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పదిలంగా ఉన్నాయి. స్వరాజ్య నిధి కోసం 1930లో బాపూజీ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు దేవత శ్రీరామమూర్తి తన ఇంటికి ఆహ్వానించి డబ్బు, నగలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాలను దేవత శ్రీరామమూర్తి మనుమడు కోడూరు శ్రీరామమూర్తి ఈటీవీ భారతి తో పంచుకున్నారు. మహాత్ముడి జీవిత చరిత్రపై అనేక రచనలు చేశారీయన.దాదాపు 100పుస్తకాలు రాశారు
రాజమహేంద్రవరంలోనే మరో కుటుంబానికి మధురానుభుతుల్ని మిగిల్చారు మహాత్ముడు. గాంధీజీ ఇచ్చిన విదేశీ వస్తు వినియోగ బహిష్కరణ స్పూర్తితో కేవీ రత్నం 1932లో పెన్నుల తయారీసంస్థ ప్రారంభించారు . 1933లో ఆలిండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యదర్శి జేసీ కుమారప్ప, రత్నం రూపొందించిన రెండు పెన్నులను తీసుకెళ్లి ఒకటి మహాత్ముడికి ఇచ్చారు. దేశంలోనే తొలిసారి పెన్నుల తయారీ సంస్థను స్థాపించిన కెవి.రత్నాన్ని అభినందిస్తూ మహాత్ముడు స్వయంగా ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేటికీ ఈ కుటుంబం వద్ద పదిలంగా ఉంది.
స్వాతంత్ర సమర ఉద్యమ సమయంలో ఈ ప్రాంత నుంచి అనేక మంది మహాత్ముడి ప్రసంగాలకు ఉత్తేజితులై పోరాటంలో పాల్గొన్నారు. ఆ జ్ఞాపకాలు గోదావరి తీరంలో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.
.స్వాతంత్ర్యోద్యమకాలంలో ( Freedom Struggle movement ) హింసే ఆయుధంగా సత్యమే మార్గంగా బ్రిటీషు తెల్లదొరల్నించి దేశానికి స్వాతంత్ర్యాన్ని( Independence ) తెచ్చిపెట్టిన గాంధీ ( Gandhiji ) ఎప్పటికీ మార్గదర్శకుడే. అందుకే జాతిపిత అయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ( October 2 Gandhi jayanti ) సందర్బంగా జాతిపిత మహాత్మాగాంధీకు గోదావరి తీరంతో ముఖ్యంగా రాజమహేంద్రవరం ( Rajamahendravaram ) తో ఉన్న అనుబంధాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఐదుసార్లు మహాత్ముడు రాజమహేంద్రవరానికి వచ్చారు.
1921–46 మధ్య కాలంలో ఐదుసార్లు రాజమహేంద్రవరం ( Gandhiji Visited Rajahmundy ) గడ్డపై అడుగెట్టారు. తొలిసారిగా 1921 మార్చి 30న రాజమహేంద్రవరాన్ని సందర్శించారు. అనంతరం అదే ఏడాది ఏప్రిల్ 4న, తిరిగి 1929 మే 6న, తరువాత 1933 డిసెంబర్ 25న, చివరిగా 1946 జనవరి 20వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలో ఉన్న గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. కస్తూరిబా ఆశ్రమంగా ( Kasthuriba Ashramam ) పిల్చుకునే ఆ ఆశ్రమంలో ఇప్పటికీ నాడు గాంధీజీ ఉపయోగించిన రాట్నాన్ని భద్రపరిచారు.1929 మే 6వ తేదీన కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ పాల్ చౌక్ నే ఇప్పుడు ఇన్నిస్ పేటగా పిలుస్తున్నారు.
మరోసారి 1946 జనవరి 20 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని గూడ్స్ యార్డ్ ప్రాంతంలో జరిగిన మహాత్మా గాంధీ ప్రసంగాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుంచుకుంటారు. నాటి ప్రసంగంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జాతినుద్దేశించి గాంధీజీ చేసిన ప్రసంగం అణువణువునా జాతీయోద్యమ భావాన్ని ఉత్తేజితం చేసింది. మహాత్మా గాంధీ చేసిన హిందీ ప్రసంగాన్ని స్వాతంత్ర్య సమరయోధుడైన కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. గోదావరి ప్రాంతంలో అదే గాంధీజీ చివరి పర్యటన.
ఇవీ మహాత్మునికి రాజమహేంద్ర వరంతో ఉన్న అమూల్య అనుబంధం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-22-ఉయ్యూరు
హాస్యానందం
38- వక్రోక్తి
అంటే స్వభావ విరుద్ధమైన లోకోత్తర విచిత్రం అని నిర్వచించారు మునిమాణిక్యం .వక్రత లేని, హాస్యం లేని కావ్యం రాణించదు. శబ్దగత వక్రతవలన శబ్దాశ్రయ హాస్యం పుడుతుంది .భావంలో ఉంటె భావగత హాస్యమౌతుంది .వక్రత అంటే వంకరతనం అది శ్లేషలో ఉంటె శ్లేష వక్రోక్తి ,కాకువు లో ఉంటె కాకు వక్రోక్తి అంటారు మాస్టారు .హాస్యగత వక్రోక్తి మూడురకాలు .1వైచిత్ర్యం 2హాస్య జనకంగా ఉండటం 3చమత్కారం ధ్వని గర్భంగా ఉండటం అన్నారు సార్.ఉదాహరణ –భార్య భర్త శీలాన్ని శంకించి నిష్టూరాలు ఆడుతూ ‘’అందమైన పిల్లకనిపిస్తే చాలు మీకు నాకు పెళ్లి అయి పెళ్ళాం కూడాఉంది అన్నదే మర్చిపోతారు ‘’అన్నది .భర్త వెంటనే ‘కాదు కాదు .చక్కని స్త్రీ కనిపిస్తే నాకు పెళ్లి అయిందనే సంగతి సూది పెట్టి గుచ్చినట్లు బాధతో జ్ఞాపకం వస్తుంది ‘’అన్నాడు .ఇందులో భార్య అంద గత్తె కాదనే బాధధ్వనిగా ఉంది .ఇదిచక్కని వక్రోక్తి అని కితాబిచ్చారు మునిమాణిక్యం జీ .
మరోఉదాహరణ –ఒక అభిప్రాయంతో మాట్లాడినట్లు పైకి కనిపించినా వేరొక అభిప్రాయంకూడాస్ఫురించేది కూడా ఉంది .భార్య కొత్తగా కాపురానికి వచ్చింది వంట కమ్మగా చేయటం రాదు .ఆమాట ఆమెకు చెప్పలేడు.తనవంట బాగాలేదని ఆమెకు తెలీదు .పాపం ఒకరోజు ‘’నేను రోజూ ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారు ‘’అంది అమాయకంగా .వెంటనేభర్త ‘’నా జీవిత భీమా మొత్తం నీకే వస్తుంది ‘’అన్నాడు .తెలివిగలభార్యకు తేలిగ్గానే అర్ధమవుతుంది .ఇక్కడ రసం వ్యంగ్య రూపం లో ఉందని డిఫైన్ చేశారు గురూజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
దుర్గాష్టమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.8వ భాగం.3.10.22
Video link
అమృతోత్సవ సమయం లో స్మరింప తగిన ఇద్దరు మహిళా మాణిక్యాలు (వ్యాసం)- గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.19.వ భాగం.3.10.22
Video link
ప్రముఖ నాటక,చరిత్ర రచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ-శ్రీ అంగర సూర్యారావు
అంగర సూర్యారావు (జూలై 4, 1927 – జనవరి 13, 2017) ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన “చంద్రసేన” ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. ‘సమగ్ర విశాఖ నగర చరిత్ర’ రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.[1][2] ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.[3]
బాల్యం
అంగర సూర్యారావు 1927 జూలై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
విద్య
విద్యాభ్యాసం మండపేట, రామచంద్రపురంలలో జరిగింది.
వృత్తి
1949లో విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు.
రచనలు
• తొలి రచన 1945లో ‘ కృష్ణా పత్రిక’ లో వచ్చింది. ( వ్యాసం)
• మొదటి కథ ‘ వినోదిని ‘ మాస పత్రికలో ప్రచురితమయింది.
• ‘ చిత్రగుప్త’, ‘ చిత్రాంగి’, ‘ ఆనందవాణి’, ‘ సమీక్ష’, వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
• 1948 నుండి 1958 వరకు ‘ తెలుగు స్వతంత్ర’ లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
• ‘ ఆంధ్ర సచిత్ర వార పత్రిక’, ‘ భారతి సాహిత్య మాస పత్రిక’, ‘ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక’లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
• పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-22-ఉయ్యూరు
‘మనకు తెలియని మహాత్ముని కబుర్లు -4(చివరిభాగం )
శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు మహాత్మునితో తన పరిచయాన్ని వివరిస్తూ ‘’1942ఫిబ్రవరి నెలలో హిందూస్తానీ ప్రచార సభ కార్యక్రమం గాంధీజీ అధ్యక్షతన వార్ధాలో జరిగింది.ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా నేనూ హాజరయ్యాను .ఇంకా అప్పటికి జవహర్ లాల్ ,ఆజాద్ ,రాజేంద్రప్రసాద్ ,డా పట్టాభి జైళ్ళలోనే మగ్గుతున్నారు .గాంధీజీ తన అధ్యక్షోపన్యాసంలో ‘’నాయకుల్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని యాచిస్తానా ?మనం నిర్మాణ కార్యక్రమం తీవ్రం చేస్తే ,మనశక్తి పెరిగి ,అప్పుడు వారంతట వారే విడుదల అవుతారు .అంతేకాని వాళ్ళంతా జైలులో చచ్చినా సరే ప్రభుత్వాన్ని మటుకు యాచించను’’అని గద్గదస్వరంతో గాంధీ అన్నమాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి .ప్రభుత్వ విధానం వల్లా ,కొపాతి రేకం వల్లా జేవురించిన ఆముఖమూ ,,అనుచరులు జైళ్లలో అనుభవిస్తున్న నరకయాతన తలచుకొని పడే ఆవేదనవల్ల ,కంపిస్తున్న ఆధరం ‘’చచ్చినా సరే ప్రభుత్వాన్ని యాచించను ‘’ అనే దృఢప్రతిజ్ఞను సూచించే జ్యోతిర్మయ నేత్ర యుగ్మమూ ఇప్పటికీ నా మనసులో ప్రత్యక్షమౌతూనే ఉంది .ఎంత తపన పడ్డారో ఆ మహాత్ముడు అర్ధమయింది .
గాంధీజీ మాటలే కాక ,చేతలు కూడా ఒక్కొక్కప్పుడు మహా కఠొరంగా,మరొక్కప్పుడు మహా మృదులంగా ఉంటాయి .కొన్ని పెద్ద విషయాలలో చాలా లొంగుబాటు తనం ,కొన్ని చిన్నవిషయాలలో అమితమైన పట్టుదల చూపిస్తారని పిస్తుంది .’స్వరాజ్యం ఇవ్వండి అని బ్రిటిష్ ప్రభుత్వం ముందు సాగిల పడతా ‘’ అన్నారొకసారి .ఆశ్రమం లో పెట్టెకు చిన్న తాళం వేసిందని కస్తూర్బా తో సంవత్సరం మాట్లాడలేదాయన..’’వజ్రాదపి కఠొరాని,మృదూనికుసుమాదపి ‘’అనే సూక్తి ఆయనకు పూర్తిగా సరిపోతుంది .
‘’ బాపూజీ ‘’అంటే నాన్న అని అర్ధం .గాంధీజీకి తన బిడ్డలేకాదు యావద్భారత ప్రజలకూ, కాదుకాదు అఖిల ప్రపంచానికీ తండ్రి అయ్యాడు .అందుకే ఆయన్ను బాపూజీ అని పిలుచుకొంటూ ఆయన్ను మనం అతి సన్నిహితుని చేసుకొన్నాం .కనుకనే ఆయన మనల్ని విడిచి వెళ్లేసరికి ఇంతగా పరితపిస్తున్నాం .ఆయన భౌతిక శరీరాన్ని మనం ఇక చూడలేం. ఆయన వాణి ప్రత్యక్షంగా వినలేం .కానీ విశ్వ శరీరాన్ని ధరించి ,ప్రణవ నాదం తో తన వాణిని మేళవించి ,బాపూజీ తరతరాలకు అదివ్య సందేశాన్ని అందిస్తూనే ఉంటారు .ఆసందేశాన్ని మనకు ప్రసాది౦ప బడుగాక ‘’అంటూ ముగించారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్య గారు.
మహాత్మునితో ఇంతటి ప్రత్యక్ష సంబంధం ఉన్న మహితాత్ముడైన ఈ హిందీ ఉద్యమకారుని గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించిన దాఖలా లేదు .మా అబ్బాయి శర్మ ఎక్కడో రెండు పేజీలు సంపాదించి నాకు పంపించి ఆయనమీద ఎవరూ రాయలేదు అయన చెప్పిన విషయాలు ఎవరూ ఎక్కడా చెప్పినట్లు లేదు మనమే రాయాలి అంటే కనిపించీ కనిపించని చిన్నచిన్న అక్షరాలలో ఉన్న ఆ సమాచారాన్ని కళ్ళు పెద్దవి చేసుకొని ,భూతద్దంలో చూసి నట్లు పెంచి చూసి ఆదివ్య సందేశాన్ని మీకు అందించగలిగినందుకు నేను ధన్యుడిని .అలాంటి ఉన్నవ వారి మాటలు అమృతపు ఊటలు అనిపిచాయి .అందుకే ఈ వ్యాస పరంపర బాపూకే కాక, ఉన్నవ వారికీ చిరుకానుకే . .
గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.7వ భాగం.2.10.22
Video link
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -3
శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య గారు ‘’నేనెరిగిన గాంధి ‘’లో విషయాలు తెలుసుకొంటున్నాం మనం .1916నాటి ఉదంతాన్ని ఆయన మాటలలోనే ‘’1916లో దక్షిణ భారత హిందీ ప్రచార సమితి రజతోత్సవాల సందర్భంగా గాంధీజీ ఆంధ్రదేశం లో చివరి సారిగా పర్యటించారు .జనవరి 20వ తేదీ ఉదయం 10-30 గం లకు గాంధీ పరివారపు స్పెషల్ ట్రైన్ వాల్తేరు చేరింది .నేను వాల్తేరునుంచి మద్రాస్ వరకు ఆయనతో ప్రయాణం చేశాను .వాల్తేరు స్టేషన్ దగ్గర బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది .అక్కడే గాంధీ మొదటిసారిగా ప్రసంగించారు .అసంఖ్యాకం గా ఉన్న జన సమూహం నుంచి కొద్దిగా గల్లంతు బయల్దేరేసరికి గాంధీజీ కొంచెం తీవ్రంగా ‘’క్రమశిక్షణ అవసరం. లక్షలాది జనం వచ్చినచోట కూడామనం మహాసభలను ప్రశాంతంగా జరుపు కోలేకపోతే ,స్వరాజ్యానికి అర్హులమే కాజాలం .ఒక వేళ స్వరాజ్యం వచ్చినా ,నిలుపుకోలేము ‘’అని హెచ్చరించారు .అంతటితో మంత్రద్రష్టంగా సభఒక్క సారి నిశ్శబ్దమై పోయింది .అందుకు బాపూజీ ప్రజలను అభినందించారు .ఆయనమాట్లడుతూ ‘’స్వతంత్ర్య భారత దేశం లో ప్రతిభారతీయుడూ హిందూ స్తానీ నేర్చుకోవాలి .ఆంధ్రదేశం లో హిందీ బాగా ప్రచారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది .’’అన్నారు .
వాల్తేరు నుంచి మద్రాస్ చేరేలోపు ప్రతి చోటా వేలకు వేలు జనం గాంధీ దర్శనార్ధం వచ్చారు .రైతులు ,కూలీలు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తుకొని వచ్చి ఆయన్ను దర్శించి తన్మయం చెందిన దృశ్యాలను నేను మరవలేదు .మహాత్ముని ముఖ దర్శనం కాగానే ఆ అమాయక ప్రజలముఖాలలో అనుభూతి ,దివ్య వికాసం ,ఆనందం ,కళ్ళల్లో కలిగిన తృప్తి ,కారుతున్న ఆనంద బాష్పాలు నాకు అమితాశ్చర్యం కలిగించాయి. చేతులెత్తి మొక్కటం, వేడుకోవటం , సాస్టాంగపడటం చూస్తె ,అది ‘’మూఢ భక్తేమో ‘’అనిపించింది .పుణ్య క్షేత్రాలు దర్శింఛి నప్పుడు, భగవత్ ఉత్సవాలలో ,ఊరేగింపులలో కలిగే తన్మయత్వం మహాత్ముని చూస్తె కలగటం నేను చూసి పరవశం చెందాను .ఆయన దర్శనం ఒక్క క్షణకాలమే అయినా వారు పొందిన తన్మయత్వం ,ఆత్మ పురోగతిమార్గం లో వారిని ఒక మెట్టు పైకి ఎక్కి౦చి౦దని నానమ్మకం . గాంధీజీ సంక్షంలో గడిపే వారు ఎపుడైనా ఆఅయకులు పొందిన అనుభూతి పొందారా అని నా అనుమానం .
గాంధీజీ పరివారం భోజన విశ్రా౦తులకు సింహాద్రిపురంలో రైలు సుమారు 3గంటలు ఆగింది .అప్పుడే అక్కడికి ఒక మిలిటరీ స్పెషల్ వచ్చింది .అందులోని సైనికులంతా పరుగుపరుగునవచ్చి మహాత్ముని దర్శనం చేసుకొన్నారు .కనిపించిన ప్రతి మనిషిని హరిజన నిధికి డబ్బు ఇవ్వమని గాంధీ తన అక్షయ హస్తం చాచారు .సైనికులనూ అలాగే అడిగితె వాళ్ళు చేతిలో ఏమీ రాల్చకుండా కోయ్యబోమ్మల్లా నుంచుంటే ‘’మీరేనా దేశాన్ని,ప్రజల్నీ రక్షించేది ?బీదవారికి ఒక్కపైసా కూడా ఇవ్వటానికి సాహసించని మీరు దేశాన్ని ఏం రక్షిస్తారు?హరిజన సేవకు విరాళాలివ్వమని గవర్నర్లనూ వైశ్రాయిల్నీకూడా అర్ధిస్తాను .ఇది రాజ ద్రోహం కాదు ‘’అనేసరికి సైనికులు బారులు తీరి కానుకల వర్షం కురిపించారు .బాపు వాక్కు అమృత వాక్కు కదా !
సహచరులఎడ గాన్దీకున్న గౌరవ ప్రతిపత్తులు తెలియ జేస్తా..ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సభాధ్యక్షులు శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అనారోగ్యం వల్ల గాంధీ దర్శనానికి రాలేక పోయారు .ఆ విషయం బాపూజీతో నేను చెప్పాను .వెంటనే మహాత్ముడు ‘’ఎంత మాట ?వారు నా దగ్గరకు రావాలా ?నేనే వారి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవాలి .కానీ అవకాశం లేకపోతోంది ‘’అని ఎంతో చింతించారు బాపు .కానీ తర్వాత బెజవాడ స్టేషన్ లో దేశభక్తుడు గాంధీని దర్శించగా ,అప్పటికే మౌనవ్రతం మొదలు పెట్టిన ఆయన ఒక కాగితం పై ‘’మనం చాలాకాలం కలిసి పని చేశాం .ఇప్పుడు మీరు బాగా వృద్దులైపోయారు .ఇంతశ్రమ పడి ఎందుకు వచ్చారు?’’అని రాసి వెంకటప్పయ్యగారికిచ్చారు .రైలులోనే వారిద్దరూ నిష్కామ కర్మ ,భగవద్భక్తి పురుష ప్రయత్నం మొదలైనగహన విషయాలపై కాగితాలమీదే రాత పూర్వకంగాచర్చలు జరిపారు .ఆ కాగితం ముక్కలు కొండా వారి దగ్గర ఉన్నాయేమో?
శ్రీ దిగుమర్తి రామస్వామిగారు గొప్ప దేశ భక్తులు ,నిష్కలంకులు వారు గాంధీ దర్శనానికి వస్తే బాపూ వేసిన ప్రశ్నలు –‘’మీ తల్లిగారు క్షేమంగా ఉన్నారా ?ఆమె వృద్ధాప్యంవలన లేవలేని స్థితిలో ఉన్నారని తెలుసుకొన్నాను .అలా జీవించటం దుర్భరం ‘’అంటూ చింతించారు బాపు .’’మీరు 125ఏళ్ళు జీవిస్తారని తెలుసుకొని మా తల్లిగారు చాలాసంతోషించారు ‘’అని రామస్వామిగారు అనగా గాంధీజీ ‘’నేను 125సంవత్సరాలు జీవిస్తానని జోస్యం చెప్పలేదు .ఈ దాసుని సేవ అవసరం అని భగవంతుడు భావిస్తే,మానవ సేవ చేసేందుకు అన్నేళ్ళు బతుకుతాను అన్నాను .అంతే కాని జరాభారంతో క్రుంగి కృశించిపోయి లేవలేని స్థితిలో అన్నేళ్ళు బతకాలనికాదు నా ఉద్దేశ్యం ‘’అన్నారు బాపు .అలాగే వెళ్ళిపోయాడు బాపు ఆఖరిక్షణం వరకు మానవ సేవాకర్యంలోనే నిమగ్నుడై .జగత్పితను ఆరాధించటానికి వేదిక నెక్కబోతుండగా తన భౌతిక శరీరం వదిలేశారు మహాత్ముడు .ఆయన సంకల్ప సిద్ధుడు, స్థిత ప్రజ్ఞుడు ‘’.
గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.18వ భాగం.2.10.22
Video link
హాస్యానందం
36- ద్వంద్వార్ధోక్తి
రెండు అర్ధాలు గల మాటలను ఉపయోగించటం .ఆ పండితుడు ‘’పతిత ద్విజుడు ‘’అంటే ఆయన పళ్ళు ఊడిపోయాయి అని అర్ధం కానీ పతితుడైన బ్రాహ్మణుడు అనీ అర్ధం ఉంది అప్పుడు నవ్వు ఆపుకోలెం అంటారు హాస్య మాణిక్యం గారు .ఒక సారి మొక్కపాటి వారిని మాస్టారు ‘’గురు పాదులు ‘’అన్నారట. ఆయన ఈయనకు గురు తుల్యులే కానీ ఇందులో కొంటె తనం దాగి ఉందని మునిమాణిక్యం మాస్టారు చెప్పారు .అంటే ఆయన పాదాలు చాలా పెద్దవి అనే అర్ధం కూడా ఉంది అని విప్పి చెప్పారు .వాడు కైంకర్యం చేశాడు అంటే దేవుడికి నైవేద్యం పెట్టాడు అని పైకి అనిపించినా దేవుడి సొత్తు కాజేశాడని ఇన్నర్ మీనింగ్ ఉందండోయ్ .
ఆమె మోము తామర అంటే ,కన్ను తామర ,చరణములు తామర ,కరంబులు తామర అనే ఒక పద్యం ఉంది ఒక హాస్యగాడు ‘’మొల తామర అని విన్నాం కానీ ఒళ్ళంతా తామరే అన్నమాట అదేదో దూలగొండి లాగున్నది ‘’అని చమత్కరించాడట .పద్మ౦ అనటానికి బదులు తామర పదం వాడినందువల్ల ఆ దురద గోక్కోలేక నవ్వలేక ఉక్కిరి బిక్కిరౌతాం .ఇంతకీ ఆపద్య రాజం ఏమిటి అంటే అని మాస్టారు చెప్పారు –‘’అటుపయి మోము దామరట,యక్షియు తామర లోన దామరేయట,-చరణంబులు దామర యేయంట,కరంబున దామర౦ట-ఇంతటి విపరీత మున్నెమొల తామర వింటిమి గాని మేని యందంతట నిటు తామరం గలుగు తన్వి నిజంబుగదూల గొండియే’’-ఇది శెట్టి నరసింహం గారి పద్యం అని చెప్పారు మాస్టారు .కాసేపు గోక్కుందాం .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2
ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు –‘’గాంధీజీ తన జీవిత చరిత్రలో తన జీవిత ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పారు .ఆయన లక్ష్యం భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం మాత్రమె కాదు .స్వారాజ్యాన్నీ ,ఈశ్వర సాక్షాత్కారాన్నీ ఆత్మ దర్శనాన్నీ పొందటమే ఆయన లక్ష్యం .తాను చేసిన ప్రతిపని భగవద్దర్శనం కోసమేనని ,ఈ ప్రయత్నం లో తాను ఆహుతి అవటానికి కూడా వెనుదీయననీ ,,తానూ రాజకీయ రంగం లో ప్రవేశించటం కూడా ఆత్మ సాక్షాత్కారం పొందటానికే అని గాంధీ రాశారు .తనకు ఇంకా భగవద్దర్శనం పూర్తిగా కలగలేదని అనేవారు .
ఒక సారి గాంధీని ఇలా ప్రశ్నించా ‘’బాపూ !మీరు ఆత్మ కథలో ముప్పై ఏళ్ళుగా భగవంతుని దర్శనంకోసం నిరంతరం శ్రమిస్తున్నానని ,ఆ ప్రయత్నం లో అగ్ని గుండాన దూకటానికైనా సిద్ధమే అని రాశారు కదా .మీ ఉద్దేశ్యంలో భగవంతుడు ఎలా ఉంటాడు ?ఏ రూపం లో మీరు భగవంతుని చూడాలని అనుకొంటున్నారు ?శ౦ఖుచక్రగాదాయుధాలతో ఉన్న విష్ణు మూర్తిని చూడాలనుకొంటున్నారా ‘’అంటే బాపు చిరునవ్వు నవ్వి ‘’క్రైస్తవులకు ఆరూపం లో సాక్షాత్కరించడు కదా ‘’అన్నారు .’’కానీ భక్త శిరోమణి తులసీ దాస్ కు విష్ణు రూపం లోనే దర్శనమిచ్చినట్లు తెలుస్తోందికదా ‘’అన్నాను .’’అవును .యద్భావం తద్భవతి .అన్నట్లు ఎవరు ఏ భావంలో ఆరాధిస్తే ఆ రూపం లో భగవద్దర్శనం లభిస్తుంది .కాని నాకు ఏదో ఒక ఆకార మూర్తిగా దర్శించాలని లేదు .నిరాకార ,నిరంజన ఆత్మ స్వరూపాన్నే సాక్షాత్కరింప జేయమని కోరుతున్నాను ‘’అన్నారు బాపు .ఆయన అన్నిమతాలను సమభావం తో చూశారు .రామనామ సంకీర్తనం చేసేవారు .సాకారమూర్తిని సేవించలేదు .నిజానికి ఆయన ఆరాధించిన రాం రహీం యేసు లకు భేదమే లేదు .
‘’గాంధీజీ రాసిన గీతా బోధన నాకు తెలుగులో రాయటానికి అదృష్టం కలిగింది .అందులో అయిదవ అధ్యాయం 18వ శ్లోకం ‘’విద్యా వినయ సంపన్నేబ్రాహ్మణే గవి హస్తిని – శుని చైవ స్వపాకం చ పండితా స్సమ దర్శనః ‘’భావం నాకు స్పష్టంగా గోచరించలేదు .వెంటనే గాంధీని ‘’బాపూ !అందర్నీ సమాన దృష్టితో చూడటం అంటే ఏమిటి ?అది ఎలా సాధ్యమౌతుంది ?మిమ్మల్నీ ,మురికి బట్టలు ఉతికే చాకలిని సమానంగా గౌరవించటం ఎలా ?ఆ చాకల్ని ‘’దయ చేయండి ఈ కుర్చీలో కూర్చోండి ‘’అని గౌరవిస్తే లోకులు నన్ను పిచ్చి వాడు అనుకోరా ?కనుక ఈ సమత్వాన్ని మా నిత్య జీవితం లో ఆచరణలో పెట్టటం ఎలాగో వివరించి చెప్పండి ?’’అన్నాను .బోసినవ్వుల బాపు ‘’సమత్వం అంటే అదికాదు ..ఎవరికీ ఏది అవసరమో గుర్తించి ,వారికి ఆ విధంగా సేవ చేయటం ‘హాథీకో మన్,చివుంటేకో కణ్’’అన్నట్లు ఏనుగు కు మణుగు ఆహారాన్ని చీమకు ఒక కణం ఆహారాన్ని పెట్టినా రెండిటికి సమానంగా ఆహారం పెట్టినట్లే లెక్క ..ఆకలేసిన వాడికి ,ఆకలి లేని వాడికీ సమానంగా పెడితే ఇద్దరికీ అపచారం చేసిన వాళ్ళమవుతాం .వారిద్దర్నీ సమాన దృష్టితో మనం చూడలేదన్నమాట .కనుక ఎవరికీ ఏది ఎంత అవసరమో వారికి ఆ సేవను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం వల్లనే సమదృష్టికలుగుతుంది .అభ్యాసం అనుభవాలవలన ఈ ధర్మ సూక్ష్మాలు బోధ పడతాయి ‘’అని ఉపదేశించారు మహాత్మాజీ .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
శమీ అష్టోత్తరం
ఈశాన్యైనమః
పాపశమన్యైనమః
వశన్యైనమః
శివాఫలాయైనమః
లోహిత కంకటాయైనమః
అర్జున బాణ సంరక్షకాయైనమః
రామస్య ప్రియ దర్శినిన్యైనమః
యాత్రాయాం సుఖ ప్రదాయైనమః
నిర్విఘ్న కర్త్రుకాయైనమ
10-శ్రీరామ పూజితాయైనమః
అగ్నికాంతిప్రతీకాయైనమః
విఘ్నేశ పూజా విధాయకాయైనమః
శని దోష నివారకాయైనమః
యుద్ధ విజయ సాధకాయైనమః
పాండవాయుధ రక్షకాయైనమ
కుష్ఠువ్యాధి నివారకాయైనమః
ఇభ వక్త్రాయనమః
గర్భ స్రావ నివారకాయైనమః
కఫ నివారకాయైనమః
20-శ్లేష్మధ్వ౦స కాయైనమః
ఏక వింశతి పత్రికా ముఖ్యైనమః
రోమనివారణాయైనమః
భూసార వృద్ధిదాయైనమః
పాంధఛాయా కల్పితాయైనమః
పోషకాహారాయైనమః
శాకపాక వినియోగాయైనమః
దంత వ్యాధి నివారిణ్యైనమః
సర్వ రోగనివారిణ్యైనమః
అపరాజితా దేవీ ప్రియాయైనమః
30-గోత్ర వంశాభి వృద్ధి దాయిన్యైనమః
క్షీర పక్షి ప్రియాయైనమః
కల్ప వృక్ష సమాయైనమః
పశు సంరక్షకాయైనమః
శ్రీ భద్రాయై నమః
పుణ్యదాయైనమః
పుణ్యరూపిణ్యైనమః
జానకీదుఃఖ శమన్యైనమః
సర్వ కల్మష సంహార్యై నమః
కామితార్ధ ప్రదాయై నమః
40-సత్య రూపాయయై నమః
శుభ ప్రదాయై నమః
శుద్ధాయై నమః
శక్త్యైనమః
పూతాత్మికాయై నమః
చతుర్వర్గ ఫలదాయైనమః
త్రిలోక జనన్యై నమః
మూల ప్రకృతిసంజ్నికాయైనమః
బ్రహ్మ రూపి ణ్యైనమః
అవాజ్మానస గోచరాయై నమః
50-పంచ భూతాత్మికాయైనమః
పంచ కలాత్మికాయైనమః
నిర్గుణాయై నమః
నిత్యాయైనమః
నిరాటంకాయనమః
దీన జన వత్సలాయై నమః
చతురానన సేవితాయైనమః
సిద్ధి ప్రదాయై నమః
అమలాయై నమః
కమలాయై నమః
60-లోక వందితాయై నమః
లక్ష్మైనమః
రామ ప్రియాయైనమః
విష్ణు ప్రియాయై నమః
తటిల్లతా౦గ్యై నమః
ప్రకృత్యై నమః
సర్వ భూత హిత ప్రదాయై నమః
విభూత్యై నమః
పరమాత్మికాయై నమః
శుచయే నమః
70-ధన్యాయై నమః
నిత్య పుష్టాయై నమః
దీప్తాయై నమః
రమాయై నమః
వసు ధారి ణ్యై నమః
క్రోధ సంభవాయై నమః
అనుగ్రహ ప్రదాయై నమః
అశోకాయై నమః
లోక శోక వినాశిన్యై నమః
అనఘాయై నమః
80-కరుణాయై నమః
ధర్మ నిలయాయై నమః
లోక మాత్రేనమః
దేవ్యై నమః
సుప్రసన్నాయైనమః
ప్రభాయై నమః
ఆహ్లాద జనన్యై నమః
విమలాయై నమః
విశ్వ జనన్యై నమః
వహ్ని ధరాయై నమః
90-యశస్విన్యై నమః
జయాయై నమః
మంగళ ప్రదాయై నమః
సర్వ దిక్ శుభ దాయకా యైనమః
వంశ ప్రవృద్ధయై నమః
గోత్రాభి వృద్యైనమః
ప్రసన్నాక్షాయై నమః
సర్వోపద్రవ వారి ణ్యైనమః
బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
100-పూర్ణాయై నమః
అనంగాయై నమః
స్తవ్యాయై నమః
పరమాయై నమః
తరణాయై నమః
భగవత్యై నమః
తత్వ త్రయ్యై నమః
మత్యై నమః
మాత్రేనమః
హిత కారిణే నమః
110-మాన్యాయై నమః
రాజ్య లక్ష్మై నమః
సర్వ సంపత్తి దాయై నమః
భోగ లక్శ్మైనమః
మహా జయాయై నమః
మహా బోధాయై నమః
మహా బంధన సంహారి ణ్యై నమః
మహా వృక్షాయై నమః
మహా ఛాయాయై నమః
మహానఘాయై నమః
120-మహా శ్వాసాయై నమః
మహా సారాయై నమః
మహా క్షాన్త్యై నమః
యశస్విన్యై నమః
మహారోగ వినాశిన్యై నమః
మహా క్షేమంకర్యై నమః
మహా విష నివారిణ్యై నమః
మహా శుభద్రాయై నమః
మహా సత్యై నమః
మహా నిత్యాయై నమః ‘
130-మహా శివ ప్రియాయైనమః
చిన్మయాకారాయై నమః
కాత్యాయిన్యై నమః
మాతృకాయై నమః
అజ్ఞాన శుధ్యైనమః
సృష్టి రూపాయైనమః
పురుషార్ధ ప్రదాయిన్యైనమః
వరదాయై నమః
భయ నాశిన్యైనమః
140-విశ్వ తోష్యణ్యైనమః
కుల సంపత్ప్రదాయై నమః
ప్రణవాత్మికాయై నమః
ఈశ్వర్యై నమః
చి౦తితార్ధ ఫల ప్రదాయి నమః
సర్వ మంత్ర మన్యైనమః
అమేయాయై నమః
అక్రూరాయై నమః
సర్వాస్త్ర ధారిణ్యై నమః
భూమిజాయై నమః
150-స్వ తేజసాయై నమః
బ్రాహ్మైనమః
జగద్ధితాయైనమః
మాన్యాయై నమః
నిరంజనాయై నమః
నిగమ గోచరాయై నమః
పూజ్యయైనమః
ధర్మ ప్రియాయై నమః
సర్వోపద్రవ వారిణ్యైనమః
లోకానంద దాయికాయైనమః
160-ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.6వ భాగం.1.10.22
Video link
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.17వ.భాగం.1.10.22
Video link
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1
హిందీ భాషోద్యమాన్ని 40 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించిన వారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు .ఆయన ‘’నే నెరిగిన గాంధీ ‘’అనే పుస్తకం రాసి గాంధీజీతో తన అనుభవాలు తెలియజేశారు .అందులో గాంధీ మరణ వార్త గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకొందాం .
‘’గుంటూరు జిల్లా ఉన్నవా అనే కుగ్రామం లో ఉన్న మాకు 30వ తేదీ రాత్రికే గాంధీజీ మృత్యు వార్త తెలిసింది .ఆ రోజు నేను పడిన ఆవేదన నాకే ఆశ్చర్యమేసింది .మాతల్లి మరణి౦చి నప్పటి కన్నా ఎక్కువగా దుఖించాను .అంత దుఖపడటం అవసరమా అని పించింది .మస్తిష్కం ఉచితానుచితాలను పట్టించుకోదు.దుఖం కొంతతగ్గాక అందుకు కారణం వెతుక్కొని కొంతతృప్తి చెందాను .గాంధీ మాట విని పాథశాల స్వస్తి చెప్పి ,30ఏళ్ళుఉడతా భక్తిగా దేశ హితైక కార్యక్రమాలలో మునిగి తేలాను .ప్రతినిమిషం ఆయనతో పెనవేసుకుపోయాయి మా లాంటి వారి జీవితాలు .అలా౦టిమాకు ఈ గ్రంధి తెగేసరికి విసిరి ఒడ్డుమీద పడేసినట్లయింది .తీరని వేదన, వ్యధ పడక తప్పదు.
1934లో గాంధీతో ప్రత్యక్ష పరిచయభాగ్యం హరిజనోద్ధరణ సందర్భంగా ,అంతకు ముందు 1916లో దక్షిణ భారత హిందీ ప్రచారసభ రజతోత్సవం నాడు మహాత్ముని ఆంద్ర దేశానికి తోడ్కొని వచ్చే మహా అదృష్టం నాకు దక్కింది .నా జన్మ చరితార్ధమైంది ..1934 గాంధీ ని ఆహ్వానింఛి తీసుకురావటానికి ఆంధ్రరాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శి శ్రీ మాగంటి అంకినీడు గారు పంపగా ,నేను డోర్నకల్లు స్టేషన్ కు వెళ్లి ,గాంధీజీ పరివారంతో బెజవాడకు వచ్చాను .ఆరోజుల్లో గాంధీజీకి మీరాబెన్ సుశ్రూష చేసేవారు .
తెల్లారుతోంది గాంధీ ఇంకా ఏదో రాసుకొంటూనే ఉన్నారు .ఆయన నెత్తిమీదున్న నాలుగు వెంట్రుకలు పిల్ల తెమ్మేరలకు నృత్యం చేస్తున్నాయి .ఆ దృశ్యం చూడగానే బసవరాజు అప్పారావు గారి గేయం ‘’నాలుగు పరకల పిలక .నాట్యమాడే పిలక –నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక –కొల్లాయిగట్టితేనేమి మా గాంధి కోమటైపుట్టితేనేమి ?”’అనే గేయం పాడి ,మీరాబెన్ కు వినిపించి హిందీలో అర్ధం చెప్పాను .ఆమె ఎంతో సంతోషించింది .ఆంధ్రకవి కల్పనా శక్తికి అబ్బురపడి శ్లాఘించింది .అప్పుడు గాంధీజీ బస బందరులో జాతీయ కళాశాలలో ఏర్పాటు చేయబడింది .అప్పుడు నేను ఆకళాశాలలో హిందీఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను .మూడు రోజులు గాంధీ ఇక్కడే ఉన్నారు .కార్యక్రమం బాగా ప్రశాంతంగా జరిగింది .విశాలంగా ఉన్న కాలేజి ఆవరణలోకి గాడిదలను రాకుండా చేయలేకపోయాం .ఒక రోజుఒక గాడిద గట్టిగాఓ౦డ్ర పెడుతోంది .గాంధీ విని ‘’అచ్చా అచ్చా సురీలాహై ‘’అంటే శ్రావ్యంగా ఉంది అన్నారునవ్వుతూ .నేను వెంటనే అందుకొని ‘’గాంధీజీ !గాడిద తత్వ విచారణ చేస్తోంది ‘’ఖుదాహై ‘’?అంటే దేవుడున్నాడు’’అని .కానీ ఎందుకో సందేహ౦ కలిగి ‘’హైకి నహీ హైకి ,నహీ ‘’ఉన్నాడా ,లేడా,ఉన్నాడా లేడాఅని వితర్కిన్చుకొని చివరాఖరికి ‘’హై హై హై’’ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని నిర్ణయానికి వచ్చింది అంటూ ఇంచుమించు అదేస్వరంతో నే చెప్పాను ఆయన సంతోషం తో పకపకా నవ్వారు .ఆయన అంతరం ఏమిటి /నా అంతరం ఏమిటి ?ఈ ఛలోక్తి విసిరేసాహాసం నాకు ఎలా వచ్చింది .నాకే ఆశ్చర్యమేసింది నిజానికి బాపూజీకి సామాన్యుల యెడ వాత్సల్యం ,సహజ వినోదప్రయత్నమే నన్నీ సాహసానికి ప్రోత్సహించింది .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.5వభాగం .30.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6
తారాశంకర్ రాసిన చైతాలిఘూర్ని ,పాషాణపూరి ,నీలకంఠ,మన్వంతర నవలలు ఆయన మానసిక అశాంతికి దర్పణాలు .అశాంతి అలజడి ఆయన రచనలలో తరచుకనిపిస్తాయి .ధనవంతుల సాంఘిక వ్యవస్తఃలో సగటుమనిషి జీవితం వ్యధాభరితం అని చైతాలి తెలియజేసింది .ఇందులో దుర్భరక్షామ౦ వర్ణించాడు .గోష్టఅనే నే పేదరైతు భార్య దామినితో ఉన్నవూరు వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది .కాబూలీవాలవద్ద తీసుకొన్న అప్పు తీర్చలేకపోయాడు .బతక టానికి బస్తీ వెళ్లి ఫాక్టరీ లో రోజుకు యాభైపైసల కూలీ గా చేరి ,రోజుకు 8గంటలు పనిచేసినా బతకటం కష్టమైంది. స్త్రీలమానం పెట్టుబడి దారులకు అతి సులభం .దామి పై వాడి చూపుపదిండి.ఒక రాజకీయపార్తి సమ్మె చేయమంటారు .ఫాక్టరీ మూసేస్తారు .ఆకలి విలయ తాండవం చేస్తుంది .కొందరుకూలీలు తట్టుకోలేక యజమానిని పనిలోకి తీసుకోమని ప్రాధేయపడతారు .సమ్మె చేయాలన్న వారు వీరితో ఘర్షణ పడతారు .ఆదోమ్మీలో మేస్త్రి గోష్టను చంపేస్తాడు .’’చైత్రమాసపు తుఫాను భయంకరమైందేమీ కాదు ముందు రాబోయే భయంకర తుఫానుకు సూచన మాత్రమె ‘’అని నవలముగిస్తాడు తారాశంకర్ .
పాషాణ పురి నవల బిగుతుగా నడుస్తుంది .హత్యా,గృహదాహన నేరాలకు మరణ శిక్ష అనుభావిన్చాల్సిన ఒక కవి జీవిత గాథ ఇది .రసవత్తరమానసిక రుగ్మత ఉంది .జైలు శిక్ష పడి బయటికొచ్చినవాడు ఎవర్నీ లక్ష్యం చేయక నేరస్తుడౌతాడు అనేసత్యం చూపిస్తాడు .నీలకంఠ నవలలో కథ ఉండదు .ఒకపేద భార్యాభర్తల కథ .యజమాని వాడినికొట్టించి జైలులో పెట్టిస్తాడు. ఆమె ఒంటరిదావ్వగా బంధువొకడు ఆమె శీలాన్ని శంకి౦చి ప్రచారం చేస్తే ,ఆమె ఆగ్రామాన్ని తగలబెట్టి పట్నం చేరి మగపిల్లాడని కని నీలకంఠ పేరుపెట్టి చచ్చిపోతుంది .కొడుకు పెద్దవాడై గ్రామానికి వస్తాడు .తండ్రి అని తెలియకపోయినా బంధువుగా ఉంటూ ఇద్దరూ పట్నం చేరతారు .బలహీనకథ
మిడ్నపూర్‌లో క్షామం తుఫాను వరద ఉకిరిబిక్కిరి చేస్తాయి .కని తోకలిసి నీల సాయం చేస్తుంది .యుద్ధప్రభావం మనుషులపై ఎక్కువైంది .కొందరుకోటీశ్వరులైతే ఎక్కువమంది దరిద్రనారాయణులయ్యారు .కన్నెపిల్లల్ని వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్నారుకొందరు తండ్రులు .యుద్ధం వలన కొత్త తరం ఏర్పడింది .తలిదండ్రులకు పిల్లలకు ఆమధ్య అగాధమేర్పడింది .కమ్యూనిస్ట్ పార్టీలో ఇద్దరూ చేరతారు .సమకాలీన సమస్యాచిత్రణం ఇందులో రచయిత బాగా చేశాడు .సరోజకుమార్ చౌదరినవల కాలో ఘోడా-నల్లగుర్రం తప్ప యుద్ధ భీభత్సం ఏ నవలాకారుడు రాయలేదు .మళ్ళీ తారాశంకర్ రాసి సాహితీ గౌరవం పెంచాడు .కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు కాకపోయినా యుద్ధ సమయంలో వారి సేవాస్పూర్తి నచ్చి ఈనవల రాసి న్యాయం చేకూర్చాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు ,
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.16వ భాగం.30.9.22
Video link
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -16
· 49-రాళ్ళపల్లి వారి గాదా సప్తశతికి ఆంగ్లానువాదం,అలియరామరాయభూపాలుడు రాసి,హిందూ విలేకరి ,తాలూకా బోర్డ్ ప్రేసే డెంట్ శ్రీ టి.శివ శంకరం పిళ్ళే ,
టి.శివశంకరం పిళ్లె అనంతపురం జిల్లా పెనుకొండ లో నివసించాడు. న్యాయవాదిగా పేరు సంపాదించాడు. మంచి రచయిత. మంచి వక్త. ఇతడు గుత్తిలో డాక్టర్ సుబ్బయ్య పిళ్లె పెంపుడు కొడుకు. డాక్టర్ సుబ్బయ్య గుత్తి నుండి పెనుకొండకు బదిలీ అయ్యాడు. పెనుకొండలో ఉండగా శివశంకరం పిళ్లెను పెంచి పెద్ద చేశాడు. ఎలిమెంటరీ విద్య పెనుకొండలో చదివాడు. ఆ కాలంలో పెనుకొండలో ఉన్నత పాఠశాల లేదు. దానితో శివశంకరంపిళ్లెను బళ్లారికి పంపించి మెట్రిక్యులేషన్ చదివించాడు. తరువాత పెనుకొండలో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. భారత,భాగవత పురాణాలన్నీ బాగా చదువుకున్నాడు. తెలుగు సాహిత్యంలో పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో బహుళ ప్రచారంలో ఉన్న కందుకూరి వీరేశలింగం సాహిత్యం చదివి ప్రభావితుడై పెనుకొండలో ఉన్న విధవరాలైన ఒక మధ్వ బ్రాహ్మణస్త్రీని పునర్వివాహానికి అంగీకరింపజేసి బెంగళూరులోని తన మిత్రుడితో విధవావివాహం జరిపించాడు. గుమాస్తా ఉద్యోగం వదిలి వకీలు పరీక్షకు కట్టి ప్యాసై వకీలు వృత్తిని చేపట్టాడు. శివశంకరం పిళ్లె ఒక మరాటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే ఆమె మృతి చెందింది. ఇతడు తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా చాలా కాలం పనిచేశాడు. 1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు హాజరయ్యాడు. హిందూ పత్రికకు పెనుకొండ నుండి విలేఖరిగా ఉండి వార్తలు, వ్యాసాలు పంపేవాడు. కృషి పేరుతో ఒక పత్రికను కూడా నడిపాడు.
చనలు
50-సంగీత భావ ప్రధాన రచనలు,గంగావతరణ శివ తాండవం చేసి న ,విద్యాప్రభాస సంస్థ స్థాపకురాలు ,కవయిత్రీతిలక –శ్రీమతి కొలకలూరి స్వరూప రాణి
కొలకలూరి స్వరూపరాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]
ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి, పండితులు. ఈమె గోవాడ గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత పంచకావ్యాలు, కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.
ఆమె తొలి రచన స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది కృష్ణా పత్రికలో ప్రచురించబడింది. ఉపాధ్యాయం అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. విద్యాధర ప్రభాస అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు సన్మానించాడు. కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
రచనలు
· గంగావతరణ శివతాండవం
· చంద్రగ్రహణం
· ప్రబోధం
· కల్యాణవాణి
· నన్నయమహిళ
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు
—
హాస్యానందం
34-ఛలోక్తి
ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే చాలామంది ఉండటం వలన డాక్టర్ ఈయన్ను చూడటానికి రావటానికి ఎక్కువ సేపు అయింది .డాక్టర్ ‘’పాపం చాలాసేపు వెయిట్ చేసినట్లున్నారు ‘’అనగా మనాయన ‘’ఎంతసేపైతేనేం డాక్టర్ .రోగం ముదరకముందే చికిత్స చేస్తారనే ఆశతోవచ్చాను ‘’అనగా ఆడాక్టర్ ముఖాన నెత్తురు చుక్కలేదు .
బందరు-గుంటూరు రైలు చాలా నిదానంగా నడిచేది.మంగళగిరి వద్ద ఒక అవ్వ పొలాల్లో అడ్డంగా నడుస్తుంటే జాలిపడ్డ గార్డ్ ‘’అవ్వా నడవలేవుకాని బండీ ఎక్కు గుంటూరులో దిగబెడతాను ‘’అనగా ఆమె ‘’నూరేళ్ళు బతుకు నాయనా .ఇవాళ కోర్టులో వాయిదా ఉంది .బండీ ఎక్కలేను ఎక్కితే ఆపని కి అందుకోలేను ఏమీ అనుకోకు మనవడా ‘’అంది .మరో ఛలోక్తి .గార్డు ఒకముసలమ్మతో ‘’ఈపిల్లాడికి అరటిక్కెట్టే తీశావేమిటి ? నిండు టికెట్ కొనకుండా ‘’అనగా ‘’నిజమేనయ్యా బెజవాడలో ఎక్కినప్పుడు వీడికి నిండు టికెట్టు తీసుకొనే వయసు రాలేదబ్బయ్యా ‘’అని రైలు నత్తనడకపై చాచి కొట్టింది .
ఒకావిడ బ్రష్ తో నగలు కడుగుతుంటే వెనగ్గా వచ్చినావిడ బ్రస్ష్ లాక్కొని’’ వదినా !పందివా?మనిషివనుకొన్నా ‘’అన్నది .’’అవునమ్మా పందివే ‘’అన్నది. ఆవిడ ఆబ్రష్ వెంట్రుకలు మనిషివా పందివా అని చలోక్తిగా అంటే ఈవిడ దాన్ని తిప్పి నువ్వు పందివే ‘’అనే అర్ధంలాగి చలోక్తితో కొట్టింది .
ఒక పిచ్చాసుపత్రి సూపరింటే౦ డెంట్ బదిలీ అవుతుంటే సభ జరిపి ఒకాయనను మాట్లాడమంటే ‘’ఈయన నిగర్వి .మాలో ఒకడుగా మెలిగాడు ‘’అనేసరికి అందరూ భళ్ళున గొల్లు మన్నారు .పార్వతీ పురంలో నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారు ఉద్దండ పండితులు .బొబ్బిలి రాజుగారికి మహా మిత్రుడు.ఒకసారి రాజు ఆయన్ను ‘’మనం ప్రయాణమై పోతున్నప్పుడు నక్క ఎదురైతే మంచిది అంటారు అయితే నాకో డౌటు ఎడమ వేపునుంచి కుడివైపుకు వెడితేనా ,కుడినుంచి ఎడమకు వెడితేనా ?అన్నారు ‘’కరవకుండా ఎటు పోయినా ఇబ్బంది లేదు మారాజా ‘’అన్నారు శాస్త్రిజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.4వ భాగం.29.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5
తారాశంకర్ కథలతోనే సాహిత్యం లో అడుగుపెట్టి అసంఖ్యాకం గా కథలురాశాడు .వాటిని కేటగరైజ్ చేయటం కష్టం.ముఖ్యమైన వాట్ని గురించి తెలుసుకొందాం .జల్సాఘర్ ,రాయ్ బారి ,సారే సత్ గండర్ జమీందార్ –చిన్న జమీందార్ లుఆనాటి జమీందార్ల జీవన విధానాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేవి .విలాసాలు కామ వా౦చలకు అలవాటైన రోజే ఒక జమీందార్ మందిరంలోనే భార్యకుమారుడు చనిపోగా నిరాశతో వెళ్ళిపోదామనుకొని ఒక్క సారి మందిరం వైపు చూస్తె లోపలి దీపాలుఆహ్వానం పలికినట్లనిపించి మళ్ళీ లోపలి వెడతాడు .రాయ్ వంశీయుల పాత్ర చిత్రణ అద్భుతం .మరోజమీందర్ రైతులకు విపరీతపన్నులు వేసి పీడిస్తే ఎదురుతిరిగి కట్టకపోతే మేనల్లుని బతిమాలి కాశీకి వెళ్ళిపొతాడుఅవమాన౦ భరించలేక .అనురాగ మాధుర్యం తెలిసినవారే జీవించటానికి అర్హులు అని చెప్పే కథ’’బేదిని’’ గొప్పకథ .పడవనడిపే వ్యక్తీ ప్రవృత్తిని గొప్పగాచిత్రించాడు మరోకథలో .వరద భీభత్సంలో అతడు ,భార్యా కొట్టుకుపోతుంటే వాడికి బతకాలనే కోరికకల్గి భార్యను చంపేసి ఈదుకొంటు ఒడ్డుకు చేరాడు .తెచ్చిపెట్టుకున్న గుణాలు కోల్పోయాక మనిషి ఎలాప్రవర్తిస్తాడో వివరించాడు ఇందులో ..చలనామోయి అంటేఅంతు చిక్కనిమనిషి లో మనిషి ఆధునికమానవుడిగా ఆదిమ మానవుడిగా ఎలాప్రవర్తించ వచ్చో చూపాడు .
శంకర్ సంభాషణా చాతుర్యానికి ,రసవత్తరచిత్రీకరణకు అద్దంపట్టేది ‘’అగ్రదాని ‘’-తద్దినం బ్రాహ్మణులు కథ .మనుషులకు పశువులకు మధ్య ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా పాములతో అనుబంధాన్ని గురించి ముచ్చటైన’’పడతి-పాము’’కథ, నాగకన్యనవల రాశాడు .హృదయాన్నికరిగించే ఎద్దు కథా రాశాడు .ఆయనకథలన్నీ భూమికిసంబంధించినవే .ఇలాంటికథలు దేశంలో ఎక్కడైనా జరగవచ్చు .చక్కగా పంట పండించి పౌష్యలక్ష్మిని చూసుకొని గర్వం ఆనందంపొంది ,వయసు పైబడి దుర్బలుడైనా ,అమానుష శక్తి తోపంటకోసి ధాన్యం బస్తాలు బండీకి ఎక్కించి ,ఒక ఎద్దు కాడి ఎత్తలేకపోతె,తానే కాడికాసి ,పట్టుతప్పి బండీకి౦దపడి ప్రాణాలు కోల్పోతూ చేతిలోకి ధాన్యంగింజల్ని చేతిలో తీసుకొని ,తన బంగారుపొలాన్ని ఆఖరి సారి చూస్తూ తుది శ్వాస వదిలే కథ గుండెల్ని పిండేస్తుంది .ఇల్లు కట్టే మేస్త్రీకి కూడా కొన్ని విలువలు ఉంటాయని ఇదూరత్ లో చూపించాడు .పల్లెప్రాంత పాత్రలు ప్రశ్నలు వేయవు ,ప్రతి ఘటి౦చవుకూడా .కానీ అరుదైన మానవతా లక్షణాలు వారిలో ఉంటాయి అని చెప్పేదే పోస్ట్ రన్నర్ దీను గురించిన కథ.
వంగ కథానికా రచయితలు ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు .కానీ తారాశంకర్ కథలలో నాటకీయత తగ్గటం క్లిష్టత కావాలని చెక్కే నగిషీ ఉండవు.అయినా ఉత్తమకథానిక రచయితగా పేరు పొందాడు .ఆయనకు జీవితం ఇంద్రధనుసులాగా బహు వర్ణ శోభిత౦గా కన్పించటం ,ఆయన్ను పరవశి౦ప జేయటం ,తాదాత్మ్యం పొందటం మనల్నికూడా ఆనుభూతులకు లోను చెయ్యటం వలన ఆకథలు ఉత్తమోత్తమంగా గుర్తింపు పొంది సర్వోత్క్రుష్టకథా రచయితగా భాసించాడు తారాశంకర్ బంద్యోపాధ్యాయ్ .నిర్జీవ మానవ మేధస్సు ఆయనకు పనికి రాదు .ఆయనకు నచ్చింది ఎప్పుడూ సగటు మనిషిమాత్రమే .పరిణతశిల్పం లేకపోయినా,బలీయమైన నాటకీయత ,స్వచమైన నిజాయితీ కన్పిస్తాయి .సూటిగా పఠితల హృదయాలలోకి చొచ్చుకుపోతాడు తారాశంకర్ .ఆయనకథలలో సగటు మనిషి తన నిజమైన ప్రతి బింబాన్ని చూసుకో గలడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.15వ భాగం.29.9.22
Video link
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15
• 46-శ్రీశైల ప్రభ సంపాదకుడు ,తెలుగు గైడ్స్ తోపాటు ,నీతినవనీతం ,శ్రీశైల చరిత్రాది కర్త –రాయలసీమకవి బిరుదాంకితుడు –శ్రీ నూతలపాటి పేరరాజు
• నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో 1896లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం నూతలపాడులో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా అనంతపురం జిల్లా ఉరవకొండలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రాంతంలో జీవించడం వల్ల ఇతడు రాయలసీమ కవిగా వాసికెక్కాడు. ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు శ్రీశైలప్రభ, శిశువిద్య, ఆరాధన పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు 1968, నవంబర్ 15న తనువు చాలించాడు[1].
రచనలు
1. భక్త అక్క మహాదేవి
2. భక్తమల్లమ్మ
3. హంపీ[2]
4. శ్రీశైలచరిత్ర
5. విజయనగర చరిత్రము[3]
6. తులసీ రామాయణం
7. ఆనంద రామాయణం
8. రామకథామృతము
9. వైదర్భీ విలాసము
10. శ్రీ సాయిబాబా చరిత్ర
11. శాంతి విజయము
12. తుళసీదళము
13. శ్రీ కృష్ణనిర్యాణము (అముద్రితం)
14. నీతినవనీతము
47-తెలుగు సంస్థానాలు హరికధా సర్వస్వం ,ఆకాశ వాని భాశషితాలు ,భారత శబ్ద రత్నాకరం కర్త తెలుగు విశ్వవిద్యాలయం తొలికులపతి,డిలిట్ –ఆచార్య తూమాటి దోణప్ప
ఆచార్య తూమాటి దోణప్ప (జూలై 1, 1926 – సెప్టెంబర్ 6, 1996) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
బాల్యం, విద్యాభ్యాసం
దోణప్ప అనంతపురం జిల్లా రాకెట్లలో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1926, జూలై 1వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు దోణతిమ్మారాయ చౌదరి. తాతగారైన తూమాటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46 సం. ల మధ్య కాలంలో ఉరవకొండలోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు మొదలైనవారు ఇతని గురువులు.1949-52సం.ల మధ్య ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి అనకాపల్లి కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. గుడివాడ కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని గంటి జోగి సోమయాజివద్ద పరిశోధక విద్యార్థిగా చేరి “తెలుగులో వైకృతపదాలు” అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.
ఉద్యోగం
1957లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు.1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు.1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు.1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
నాటకాలు
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో ‘చిత్ర’ పాత్రధారిగా, ‘సుభద్రా పరిణయం’లో సుభద్ర పాత్రను, ‘మోహినీరుక్మాంగద’లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు.సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
రచనలు
ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు చిత్రగుప్తలో ఇతని చంద్రుడు-కలువ అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు వినోదిని, రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. “బైబిలు-ఖురాను-భగవద్గీత” అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.వాల్తేరులో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని ‘ఆదర్శశిఖరాలు’ మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక జయశ్రీ పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
ప్రకటించిన గ్రంథాలు
1. ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము
2. భాషాచారిత్రక వ్యాసావళి
3. తెలుగులో కొత్తవెలుగులు
4. జానపద కళాసంపద
5. తెలుగు హరికథాసర్వస్వము
6. తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు
7. దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట
8. మన కళాప్రపూర్ణుల కవితారేఖలు
9. ఆకాశవాణి భాషితాలు
10. తెలుగు వ్యాకరణ వ్యాసాలు
11. ఆంధ్రుల అసలు కథ
12. బాలల శబ్ద రత్నాకరం
13. తెలుగు మాండలిక శబ్దకోశం
పురస్కారాలు
• 1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు.
• తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్.
• 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
• ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు
48-ఆదర్శ రచయిత,కంకాళరాత్రి కర్త సాంస్కృతిక శాఖ ప్రత్యేకాధికారి –శ్రీ అంతటి నరసింహం
అంతటి నరసింహం సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత[1].
జీవిత విశేషాలు
ఇతడు 1925లో కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1939-40లలో మిడిల్ స్కూలు ముగించుకుని 1943లో యస్.యస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు పాస్ అయ్యాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి “ప్రబంధాలలో ప్రకృతి వర్ణన” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. 1946 నుండి 1976ల మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వాటిలో తను చదివిన దత్తమండల కళాశాల కూడా ఉంది. 1976 నుండి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేశాడు. 2010లో మరణించారు.
రచనలు
ఇతడు గేయకావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, పిల్లల నవలలు, నాటకాలు ఎన్నో వ్రాశాడు. వాటిలో అముద్రిత రచనలు ఎక్కువగా ఉన్నాయి.
కావ్యాలు
1. కంకాళ రాత్రి (పద్యకావ్యం)
2. ఇప్పుడే[2] (వచన కవితా సంపుటం)
సాంఘిక నవలలు
1. ఆదర్శం[3]
2. భావం
3. లేడీ లెక్చరర్ స్వగతం
4. ప్రేమభిక్ష
5. శోభాదేవి
6. శంపాలత
7. చీకట్లో కాంతిరేఖలు
నాటికలు, నాటకాలు
1. సహజీవనం
2. సామరస్యం[4]
3. మానవత్వం
4. పరిష్కారం
చారిత్రాత్మిక నవలలు
1. రామరాయలు
2. భువనవిజయం
బాలల నవలలు
1. కోటవీరన్న సాహసం
2. ఉదయగిరి పోలన్న ధైర్యం
3. మంత్రాల రామన్న మొండితనం
4. కవిగారి బాల్యం మొదలైనవి.
ఆదర్శ రచయిత
ఇతడు కేవలము తను నమ్మిన ఆదర్శాలను రచనలకే పరిమితం చేయక వాటిని స్వయంగా చిత్తశుద్ధితో ఆచరించాడు. కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ ఇతడు కులాంతర వివాహంగా ఒక చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా వివాహమాడాడు. జీవితాంతం కాఫీ, టీ, సిగరెట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించాడు. ” నా నవలలు చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం ఉండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే నాకానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికి అభ్యుదయం కలుగుతుంది” అని తన మనసులోని మాటను ఒక సందర్భంలో వెల్లడించాడు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
హాస్యానందం
33-సరసోక్తి –
మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం నాకు తెలీదు ‘’అంది మాస్టారి నవ్వుముఖం బల్బు మాడి పోయింది.మరో సరసం .ఒకాయన భార్య వాగుడుకాయ .రాత్రీ పగలు జలపాతం లా హోరు పెడుతుంటే ,ఆయన నిద్రలేక అఘోరిస్తుంటే ఆమె డాక్టర్ ను చూడమంది .వెళ్లి మందు తెచ్ఛి ఆమెకిచ్చి రోజూ రెండు వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది అన్నాడు .రెండెం కర్మ మూడేసుకోండి అంది ‘’అవి నాక్కాదు నీకు ‘’అనగానే అవాక్కైంది .అసలు విషయానికి సరసంగా సుకుమారంగా ప్రియం గా భర్త ఆమెకు విషయం చెప్పాడన్న మాట అన్నారు మునిమాణిక్యం.మూడో ఉదాహరణ .ఒకాయన డాక్టర్ తో తాను ముసలితనం లోకూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణ౦ శాంతి సౌఖ్యాలతో ఆనంద జీవితం గడపటమే ‘’అన్నాడు .’’అంటే మీ ఇంట్లో పోట్లాటలు గట్రా ఉండవా ?అన్నాడు డౌట్ గా డాట్రు .’’లేకేమి మేమిద్దరం ఒక రాజీ కొచ్చాం .ఆవిడకు కోపం వస్తే నేను మాట్లాడకూడదు .నాకు కోపం వస్తే నేను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళాలి ‘’అన్నాడు పగలబడి నవ్వాడా డాక్టర్ .
ఛలోక్తి
నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారి ఛలోక్తి ఒకటి ఉంది .పూరీ జగన్నాధం లో మర్రాకుల విస్తరిలో ఎవరూ భోజనం చచెయ్యరు .నిషిద్ధం .అక్కడి పండితుల్ని ఈయన అడిగితె ‘’వటపత్రశాయి పడుకొనే పత్రాలలో భోజనం నిషిద్ధం .ఇది స్వామి వారి అవతార క్షేత్రం ‘’అన్నాడు .శాస్త్రిగారు నవ్వి ‘’ఇలాంటి మహా క్షేత్రంలో స్వామి వారి అవతార మూర్తుల్నే తినేమీకు ఆయన శయనించే పత్రం నిషిద్ధమా ?అన్నారు .స్వామి మత్స్యావతారం ఎత్తాడు గా .ఆరూపం లో ఉన్న చేపలు తి౦ టారుగా మీరు అని ఎద్దేవా .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4
తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు ఆరు రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు .ఇలా సాహిత్యమే వృత్తిగా జీవించాడు .1933లో ఆయన కలకత్తా కాపురానికి వచ్చేసరికి అది బెంగాల్ నాడీ కేంద్రంగా ఉంది .రచయితలూ తరచుగా కలుసుకోనేవారు .టాగూర్ శరత్ లకు తప్ప మిగిలినవారికి రచనలపై పెద్దగా రాబడి ఉండేదికాదు .అయినా యువకులు సాహిత్య౦ పైనే జీవించేవారు .సాహితీ సేవలో కొందరు ప్రాణాలు కోల్పోయారుకూడా .ఈ విషయాలను అచి౦త్య కుమార్ ‘’మేము మృత్యువును ప్రేమించటం నేర్చుకోన్నాం .రాజకీయ సాహిత్యరంగాలలో మృత్యువు ఆకర్షణీయంగా కనిపించేది .యువకులు రచయితలుగానే విప్లవకారులు గానో తయారయ్యేవారు .రచన అంటే పేదరికం ,ఆకలి ని ఆహ్వానించటమే ‘’అన్నాడు
ఆశతాబ్దం ఉత్తరార్ధంలో టాగూర్ మాలంచ –ఉద్యానవనం ,చార్ అధ్యాయ్ ,దుయిబోన్ –అక్కా చెల్లెళ్ళు ,శరత్ శ్రీకాంత్ ,శేషప్రశ్న వంటి ఉత్తమ రచనలు వచ్చాయి .అంతకుముందే టాగూర్ చతురంగ ,ఘరె బైరే ‘’శరత్ పధేర్ డాబి –కోరిక వెలువడ్డాయి .కల్లోల్ పత్రికను నవయువకులు నడిపారు .కనుక అలజడి ఆందోళనలు అందులో చోటు చేసుకొన్నాయి .అట్టడుగు వర్గాల జీవితాలు ఇందులో ఎక్కువగా వస్తువులయ్యాయి .పేదరికం బిచ్చగాళ్ళు వేశ్యలు పై మాణిక్ ఘటక్ ప్రత్యేకంగా రాశాడు .నృపేంద్ర కృష్ణచటర్జి గోర్కీ మదర్ నవల అనువాదం చేశాడు .ఆనాటి రచనలు ఐరోపా పోకడలను పోలిఉన్నాయి,అసంతృప్తి ,ఆందోళన ఉన్నాయని తారాశంకర్ అన్నాడు .1929లో విభూతి భూషణ్ బెనర్జీ ‘’పధేర్ పాంచాలి ‘’-ఒక రోడ్డు కధ విచిత్రపత్రిక లో ధారావాహికంగా వచ్చి సంచలనం సృష్టించి సత్యజిత్ రేచేత సినిమా తీయించింది .సురేష్ చంద్ర ఉత్తర పత్రిక నిర్వహించాడు .దీనిలో దూర్జటిప్రసాద్ ఎక్కువగా రాసేవాడు .బుద్దదేవ బస్ కవిత త్రైమాసికపత్రిక నడిపాడు .పరిచయ పత్రిక ఉత్తమసాహిత్యాన్ని అందించింది .
తారాశంకర్ తన రాయి కమల్ నవలను ,చల్ నామోయి –అంతుచిక్కనిమనిషి కధా సంపుటిని టాగూర్ కు పంపిస్తే ,నవలబాగా నచ్చి తనఅభిప్రాయాన్ని,కధలు మెచ్చుతూ మరో ఉత్తరాన్ని శంకర్ కు రాశాడు .బెంగాల్ రచయితలకుదేశంగురించి చాలా తక్కువగా పరిచయం ఉండటం టాగూర్ కు నచ్చలేదు .మరో సారి టాగూర్ ను కలిసినప్పుడు తన ‘’జల్సాఘర్ –విలాసమందిరం కధా సంపుటి ఇచ్చాడు.తర్వాత కొద్దిరోజులకే టాగూర్ అనారోగ్యం పాలయ్యాడు . అచేతన స్తితి నుంచి చేతనావస్తకు వచ్చిన యువకుడి జీవితం అందులో టాగూర్ కు బాగా నచ్చింది .శంకర్ శాంతినికేతన్ కు తరచుగా ఎందుకు రావటం లేదని అడిగాడు .శాంతినికేతన్ ఆ జిల్లా ప్రజలకు దూరమై పోయిందని టాగూర్ బాధ పడేవాడు .ప్రజకు దీనికి ఉన్న మధ్యగోడ ఆయన గ్రహించలేకపోయాడు .నాటి బెంగాల్ గురించి క్షుణ్ణమైన పరిశోధన చేసిన బ్రజెంద్రనాదధ బంద్యోపాధ్యాయ కూడా తారాశంకర్ సన్నిహితుడయ్యాడు .రామానంద చటర్జీతారాశంకర్ రచనలను తరచూ ప్రచురించి ప్రోత్సహించాడు .గ్రామసీమలను ఆయన విభిన్న దృక్కోణంలో చూసిరాశాడు .చాలాభాగంసంప్రదాయవాది.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22.
Video link