సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2

సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2

‘’ప్రపంచ చరిత్రలో మొట్టమొదట మనస్సు యొక్కస్వాతంత్ర్యం ,దాని శక్తి సామర్ధ్యాలపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది సాంఖ్యమే’’అన్నాడు రిచార్డ్ గార్బ్.’’ప్రపంచం లో ఇదివరకు ఎన్నడూ లేని ఔక్తిక విధానం అంటే రేషనల్ సిస్టం సాంఖ్యం మాత్రమె ప్రవేశపెట్టింది ‘’అన్నాడు వివేకానందుడు .’’కపిల సిద్ధాంతానికి చారిత్రిక ప్రాధాన్యం ఉంది .మానవ మనో చరిత్ర లో ఇది అత్య౦త అద్భుత విషయం .కారణం –ఆలోచించే ప్రతి మనసులో ప్రపంచ సృష్టి ,మానవ ప్రకృతి సంబంధాలు ,వాటి భవిష్యత్ నిర్ణయాలు మొదలైన వాటిపై వచ్చే అగోచరమైన సమస్యలకు యుక్తి యుక్తం గా సంతృప్తి కలిగే సమాధానం చెప్పింది సాంఖ్యం ఒక్కటే ‘’అన్నాడు సాంఖ్య కారిక లో డా.జాన్ డేవిస్.’’సాంఖ్యం పరిపక్వమైన ,మనోధర్మమైన తత్వ శాస్త్రం .ఎందుకంటె భగవ౦తుని ఆస్తికత ను, యుక్తిమూలం గా నిరూపించటం సాధ్యం కాదని తెలిసి కూడా  దాని విషయం లో మౌనం చూపింది అనే సత్యాన్ని బట్టి దర్శనాలు సాంప్రదాయక మతాల నుండియెంత స్వతంత్రంగా వ్యక్తమయ్యాయో తెలుస్తోంది .శుద్ధ తత్వ శాస్త్రం లో సాంఖ్యం ఒక ప్రఖ్యాతమైన ప్రయత్నం అని ‘’శ్రీనివాస అయ్య౦గార్ ,రాధాకృష్ణన్ అభిప్రాయ పడ్డారు .జాన్ డేవిస్ కూడా ‘’కపిలుని సా౦ఖ్యదర్శనం  శుద్ధ తత్వ విషయం లో భారత దేశం  వెలువరించిన విషయ సమగ్రత పొందింది ‘’అన్నాడు .మహాభారతం కూడా సాంఖ్యం లాంటి జ్ఞానం లేనే లేదు అన్నది .’’ప్రకృతి తత్వ శాస్త్రాలు వ్యత్యస్తాలై ,ఏకత్వ సాధనకు అసాధ్యంగా ఉన్నా ,ప్రకృతి శాస్త్ర ఫలితాలకు అన్వయిస్తూ తాత్విక విధానం ఉండాలి ‘’అన్నాడు రాధా కృష్ణ పండితుడు .’’ మానవ నిత్యానుభూతి ,యుక్తియుక్తంగా విచారణ చేయటం సాంఖ్యం నిరూపించింది .ఈమార్గం లో ప్రతివాడూ తన అనుభవం తో ప్రారంభించి ,తర్వాత తనకు అందని సర్వాన్నీ బహిర్గతం చేస్తాడు .అనుభవం ఎందుకు  అవసరమో ,అనుభూతి సాధించటం ఎలాగో ,సాంఖ్యం విస్పష్టంగా వివరించింది ‘’అంటాడు రాధాకృష్ణన్ .’’అధ్యాత్మం కాని యుక్తి విధానం సాంఖ్యం అవలంబించి౦ది. దీని అంకురార్పణ నిత్యానుభవం .అనుభవం యొక్క సరైన నిర్వచనమే సాంఖ్యం తత్త్వం ‘’అని జేఎన్ ముఖర్జీ స్పష్ట పరచాడు .మానవలోకానికి అసాధారణమైన ,సాటిలేని తాత్విక సిద్ధాంతాన్ని ప్రసాదించిన ఈ సాంఖ్యం ను  తక్కువ చేసి మాట్లాడే వారిపై కోపం తో ‘’భారతీయుల షట్ దర్శనాల శ్రేష్టత్వాన్ని బట్టి వేదాంతాన్ని కొందరు భారతీయ తత్వ వేత్తలు క్రమంగా ఏర్పాటు చేశారు .సాంఖ్యానికి రెండవ స్థానం కల్పించారు .ఈ అప్రదాన్యతకు సాంఖ్యం తన అసమ్మతిని తీవ్రంగా ప్రకటించింది .సాంఖ్యం ఒక అద్భుత తత్వ శాస్త్రాన్ని ప్రబోధించింది .ఇలాంటిదాన్ని వేదాంతానికి రెండవది గా చేయటం దాని సిద్ధాంత జ్ఞాన లోపం ,అవగాహనా రాహిత్యం వల్లనే ‘’అంటాడు ముఖర్జీ .

   ‘’వ్యాకుల చిత్తులైన ,నిరాశాపరుల ఊహలతో ,ఊహాతీత తన్మయత్వాన్ని అనుభవించటానికి ,విపరీత వ్యామోహం తోకానీ ,సాంఖ్యం ఆకర్షింప బడదు .’’ప్రపంచం ద్వారా ,ప్రపంచం లో ,ప్రపంచం కోసం ‘’దృఢమైన ,నిశితమైన ,నిత్యమైన జీవిత సందేశాన్ని సాంఖ్యం అందిస్తోంది .దాని విశాల భవనం మీద వేదం ఒక ప్రత్యెక గ్రంథం గా కాక ,ఒక సాహిత్యమే అయింది అన్నాడు ముఖర్జీ పండితుడు సాంఖ్యం పై ఉన్న అవ్యాజ గౌరవం తో .

  ‘’సర్వ సిద్ధాంతాలతో ఖండన మండనాలు పొందిన సాంఖ్యం ఎంతటి ప్రధాన స్థానం ఆక్రమి౦ చిందో అర్ధమౌతుంది .  వేదాంత సూత్రాలు సాంఖ్యం తో ఢీ కొట్టే ప్రయత్నాలు చేశాయి .కొందరు బౌద్ధులు ఖండించారు .’’కార్యం ,కారణం లో అంతర్గతంగా ఉంటుంది ‘’అన్నసాంఖ్యాన్ని వైశేషికులు ప్రతిఘటించారు .కానీ ఇతర వాదాలచేత సాంఖ్యం ‘’శ్రౌతం ‘’గా పరిగణింప బడి ,క్రమ౦గా పూర్తిగా లయింప బడి ,తర్వాత హైందవ విజ్ఞానం లో సుస్థిరంగా పొదగబడిందని పండితభావం .వేదాంత సూత్రాలు కానివన్నీ తామసికాలు అని పద్మ పురాణం ,.వైశేషిక సాంఖ్యాలు మహర్షులచేత రాయబడినా, అవి మందబుద్దులకోసమే అని సూత సంహిత ,అంటూ కీర్తించినా ని౦దించినా ,బౌద్ధానికి ముందున్న పురాణ విజ్ఞానం లో సాంఖ్యం సర్వాదిపత్యం ఉన్న సిద్దా౦త౦గా  చెలామణి అయింది’’అన్నారు శ్రీనివాస అయ్యంగార్ ,ముఖర్జీ లు .శంకర భగవత్పాదులు కూడా పూర్వోక్త చందం కార్యకార ణాలకు అనన్యత్వ  అంగీకారం ఉండటం వలన ,ధర్మశాస్త్ర వేత్తలైన దేవలుడు మొదలైన వారిచే అనుసరించబడటం వలన సాంఖ్యం ప్రఖ్యాత మై౦దికనుక ,దాని ఖండనం వేదాంత భాష్యం లో దాని ఘనతను అంగీకరించారు .ఈవిధంగా కపిలముని చెప్పిన సంఖ్య సిద్ధాంత సూత్రాలప్రాధాన్యత అగణితం ,అపూర్వం అని అర్ధమౌతోంది .

  ఆధారం – శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ సిద్ధాంత సౌరభం’’.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి  

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి

‘’యావత్ ప్రపంచం లో భారతీయ తత్వ శాస్త్రం తో పోల్చదగినది ఇంకొకటి లేదు’’అన్నాడు యువి సోవాని అనే విమర్శక నిపుణుడు . వైజ్ఞానిక అంతరిక్షం లో మన తత్వ శాస్త్రం తేజో విరాజమానమైన సూర్యుడుగా ప్రసిద్ధమైనది సాంఖ్య సిద్ధాంతం .’’సాంఖ్యం భారతీయ తత్వ శాస్త్రాలలో అతి ప్రాచీనం ‘’అన్నారు డా.ఎస్ఎస్ సూర్యనారాయణ శాస్త్రి . వెబర్ పండితుడుకూడా ‘’సాంఖ్యం అతి పురాతనమైనది’’అని నిర్ధారించాడు .స్వామి వివేకానంద ‘’సాంఖ్యా పేక్ష లేకుండా ,ప్రపంచాన్ని సరైన రీతిలో అర్ధం చేసుకోవటం కుదరదు .దీన్ని లౌకిక అలౌకికంగా తెలుసుకోవచ్చు కనుక అనేక దర్శనాలద్వారా సాంఖ్యానికి ప్రాధాన్యత పెరిగింది .వివిధ దర్శనాలకు సాంఖ్య తత్త్వం ఒక్కటి మాత్రమె సామాన్యంగా ఉన్నది .కనుక యావత్ప్రపంచం  సాంఖ్య౦ను  అంతగా గౌరవిస్తోంది  .ఇదే అన్ని దేశాల దర్శనాలకు ముఖ్య ఆధారం .ప్రపంచం లో ఎప్పుడు ఎక్కడ తత్వ శాస్త్ర విచారణ జరిగినా అందులో కొంతవరకైనా కపిలమహర్షి సంఖ్య సిద్ధాంతం తప్పక ఉంటుంది ‘’అన్నాడు .

 ఇంకాస్త ముందుకు వెళ్లి మాక్స్ ముల్లర్  ‘’పైధాగరస్  భారత దేశానికి వచ్చి సాంఖ్యం నేర్చి ,తన గ్రీసు దేశం లో బోధించాడు .తర్వాత ప్లేటో కూడా దీన్నే సూచించాడు .ఆతర్వాత నాస్టిక్ శాఖీయులు సాంఖ్యాన్నిఅలెగ్జాండ్రియా కు తీసుకు వెళ్ళారు .అక్కడి నుంచి యూరప్ చేరింది .కనుక ప్రపంచం లో ఎక్కడ ఏ తత్వ శాస్త్ర ,ఆధ్యాత్మిక కృషి ఉన్నా ,దానికి పరమపిత ‘’కపిలా చార్యుడే ‘’.కనుక ప్రాచీన హిందూ తత్వ శాస్త్రం లో ప్రధాన సిద్ధాంతాలైన వేదాంత ,సాంఖ్యాల పరిచయం లేని వాడు తత్వవేత్త కాదు అని పించుకొనే కాలం వచ్చేసింది’’అన్నాడు అనుమానం లేకుండా .

   సాంఖ్య కర్త కపిల ముని

‘’సర్వ ప్రపంచ తత్వ శాస్త్రాలకు పునాది అయిన సాంఖ్య శాస్త్ర కర్త ఎవరు ఆయన జీవిత విశేషాలేమిటో తెలుసుకొందాం .అనేక దేశాలలో ఆయా దేశాల తత్వ శాస్త్ర ఆచార్యుల ,వ్యాప్తి చేసిన వారి జీవిత చారిత్రలు స్పష్టంగా ఉన్నాయి .కానీ భారత దేశం లో ఆవివరాలు తెలుసుకోవటం చాలాకష్టం  .ధేల్స్ ఎవరో, ప్లేట్ ఎవరో ఎప్పుడు ఎక్కడ పుట్టారో  ,ఏం చేశారో మనకు భావించటానికి అవకాశమున్నది .కానీ కపిల గౌతమ కణాద,బాదరాయణ జైమినుల గురించి మనకు తెలిసింది శూన్యం ‘’అని వాపోయాడు మాక్స్ ముల్లర్ పండితుడు .’’సాంఖ్య దర్శన తత్వాభి వృద్ధి చారిత్రం ,అభేద్యం అయిన అంధకారం లో మునిగిపోయి,మరుగున పడింది ‘’అని భారతీయ తత్వ శాస్త్ర పరిణామ చరిత్ర రాసిన పిటిశ్రీనివాస అయ్యంగార్ కూడా అభిప్రాయ పడ్డారు .

  అయినా ‘’సా౦ఖ్యస్య వక్తా కపిలః పరమ ఋషిహి,పురాతనః –హిరణ్య గర్భో యోగస్య వక్తా నాన్యః పురాతనః ‘’అనేభారతం లో శాంతిపర్వం లోని మోక్ష ధర్మ ప్రకరణం లో ఉన్నదాన్ని బట్టి ,సాంఖ్యకారుడు పరమ రుషి వరేణ్యుడు,అతిప్రాచీనుడు హిరణ్య గర్భుడు అయిన కపిలాచార్యుడే అని పూర్తిగా రూఢి అవుతోంది .వేదాంత సూత్రకర్త వ్యాసుడు స్మృత్యదికరణ లో కాపిల సా౦ఖ్యాన్నిచర్చించాడు .పద్మపురాణం కూడా కపిలుడే సాంఖ్య కర్త అన్నది .వైశేషిక సాంఖ్య దర్శనా చార్యుల సూత సంహిత లో ‘’కాణాద,కపిలాద్యైస్తు,మునీ౦న్ద్రై రపి కీర్తితం –మంద బుధ్యను సారేణ కేవలం పరి కీర్తితం ‘’అని ఉండటం విష్ణు సహస్రనామం లో మహర్షి కపిలా చార్యః ‘’అని ఉండటం చేత శంకరాచార్యులు కూడా భాష్యం రాస్తూ ‘’మహర్షి కపిలాచార్య అన్నది ఏకనామం అనీ సాంఖ్య శుద్ధాత్మతత్వ విజ్ఞానాచార్యుడు కపిల ముని అని స్పష్టంగా చెప్పారు  .ఆది విద్వాంసుడు మహర్షి చంద్రుడు అయిన కపిలమహర్షి కరుణ తో నిర్మాణ చిత్తాన్ని అధిష్టించి ‘’అసురి ‘’అనే శిష్యుడికి తంత్రాన్ని బోధించాడు అన్నారు శంకరులు .దీనికి వ్యాఖ్యానం రాసిన వాచస్పతి మిశ్రా ‘’పంచమావతారమైన కపిలుడు అసురి కి మొదట సాంఖ్యం బోధించాడనీ ,భారతాది ఇతిహాస పురాణాలలో కూడా సాంఖ్య దర్శనా చార్యుడు కపిల మహర్షి యే అని ధృవీకరించాయి’’అన్నాడు .

  జేమ్స్ జీన్స్ పండితుడు ‘’భౌతిక విజ్ఞానం యదార్ధాన్ని గ్రహింప జాలనిది అవటం వలన  మనం ఇంకా పరమార్ధ స్పర్శకు దూరం గానే ఉన్నాం’’అనగా ,’’.ప్రస్తుత భౌతిక జ్ఞాన విశ్వం అగమ్య గోచరం .ప్రకృతి పరిణామ వాదం ఎక్కువైంది .అన్ని చోట్లా అసందర్భాలు ,పరస్పర వ్యతిరేకతలు ఉండటం చేత ఈ  విజ్ఞానం సంతృప్తికరం కాదు ‘’అన్నాడు సల్లినాన్ పండితుడు.మరింత ముందుకు వెళ్లి లింకన్ బార్నెట్ ‘’ప్రకృతి రహస్యాల తెరలు తొలగించిన కొద్దీ , సంక్షోభం నుంచీ క్రమత్వం ఏర్పడి ,నానాత్వం నుంచి ఏకత్వం కలిగి ,భావాలన్నీ లయించి మూల సూత్రాలు అధిక తరంగా సులభ మౌతాయి ‘’అన్నాడు .

  ఇంతటి ముఖ్య దర్శనాచార్యుడైన కపిలుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియటం లేదని డా.ఎస్ ఎస్ సూర్యనారాయణ శాస్త్రి బాధపడ్డారు .సాంఖ్య ఉపనిషత్ గా ప్రసిద్ధి చెందిన ‘’శ్వేతాశ్వతర ఉపనిషత్ ‘’మొదటగా కపిలుని నామం స్మరించినది .సర్వ సృష్టికి కారణమైన బ్రహ్మ సృష్టిలో మొదట పుట్టిన తనకుమారుడైన కపిలునికి సర్వ విజ్ఞానాలు ప్రసాదించాడు అని ఉన్నది .కనుక కపిలుడు బ్రహ్మ మానస పుత్రుడు ,సర్వజ్ఞుడు.గౌడ పాదుడుకూడా కపిలముని ని బ్రహ్మమానస పుత్రునిగానే చెప్పాడు .సాంఖ్య కారికా భాష్యం లో గౌడపాదుడు ‘’ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు సృష్టి మొదట్లో భగవంతుడైన కపిలాచార్యునికి సహజంగా అలవడినాయి ‘’అని కీర్తించాడు .కపిలుని తర్వాత ఉద్భవించిన సనక, సనందన,సనాతన ,సనత్కుమారులు షోడశ వర్ష శరీర దారులనీ ,వారితో పుట్టిన భావాలు ప్రకృతికాలు అని గౌడపాదుడు చెప్పాడు  .శ్వేతాశ్వరోపనిషత్ లో ‘’నిత్యాలకు నిత్యుడు ,చేతనాలకు చేతనుడు ,అనేకులలో ఏకుడు,సర్వకామ ప్రదాత అయినవాడు  ఆత్మ.’’సాంఖ్య యోగం తో దీన్ని గ్రహించి ,ఆ దేవతను ఎవడు తెలుసుకొంటాడో వాడు అన్ని బంధాలనుంచి విముక్తు డౌతాడు ‘’అని కపిల ప్రోక్త సాంఖ్యం చెబుతోంది .కనుక’’ శ్వేతాశ్వతర ఉపనిషత్ కాలానికే సాంఖ్యం బాగా ప్రాచుర్యం పొందింది’’అన్నాడు డా.ఇ.రోయర్.కపిలముని పై మరి కొన్ని విషయాలు మరోసారి తెలుసుకొందాం .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద సిద్ధాంతం  

కణాద సిద్ధాంతం  

‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి విధానంగా చేసిన వాడు కణాద మహర్షి .మొదట కాశ్యపుడు అనే పేరుతొ ప్రసిద్ధుడై ,ఉలూక మహర్షి కుమారుడు అవటం చేత ఔలుక్యుడు అని పిలువబడ్డాడు .’’సప్త వింశతి మే ప్రాప్తే ,పరివర్తే ,క్రమాగతే –జాతు కర్ణ్యో యదా వ్యాసో ,భవిష్యతి తపొధనః .తదాహం సంభావిష్యామి సోమశర్మా ద్విజోత్తమః-ప్రభాస తీర్ధ మా సాద్య,యోగాత్మా లోక విశ్రుతః-తత్రాపి మమ తే  పుత్రా భవిష్యంతి తపోధనాః-అక్షపాదః కణాదశ్చ ఉలూకో వత్స ఏవచ ‘’జాతుకర్న్య వ్యాసుని కాలం లో ,ప్రభాస తీర్ధం లో అపర శివావతారం అని పేరుపొందిన  తపోధనుడైన సోమశర్మ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు .అతడికి అక్షపాద,ఉలూక ,కణాదులు అనే ముగ్గురు కొడుకులు అని వాయు పురాణం చెప్పింది .దీనిని బట్టి కణాదుడున్యాయ దర్శన కర్త గౌతముని సహాధ్యాయుడుగా గుజరాత్ లోని ప్రభాస తీర్ధం లో సోమ శర్మ అనే గురువు వద్ద అన్ని విద్యలు నేర్చాడు .దీన్ని ఇ.వి.కౌవెల్ పండితుడు కూడా తన ‘’సర్వ దర్శన సంగ్రహాను వాదం ‘’లో సమర్ధించాడు .ఉలూక మహర్షి కొడుకు అవటం వలన కణాదుడు  వైశేషికులను ‘’ఔలూక్యులు ‘’అంటారని హేమచంద్రుని అభిదాన చింతామణి లో చెప్పినట్లు కౌవెల్ రాశాడు .

   విద్యాభ్యాసం తర్వాత అంతర్ముఖుడై మహర్షి యై ,అవదూతయై బాహ్యాభ్యన్తరాలు మరిచి పక్షిలాగా తిరుగుతూ ,భిక్షకూడా తీసుకోకుండా ,వీధులలో తిరుగుతూ రోడ్డుపై పడిన ధాన్యపు గింజలను ఏరుకొని తినేవాడు .అందుకే కణాదుడు అనే పేరొచ్చింది .కణ భుక్ ,కణభక్షక ,కణభుజ  అనీ పిలిచేవారు .ఇదికల్పితనామమని ,మారుపేరు అనీ ,మాక్డోనాల్డ్ అన్నాడు .కశ్యప వంశజుడు కనుక కాశ్యపుడు .ఉలూకుని కొడుకు కనుక ఔలూక్యుడు ,తృణ ధాన్య భోక్తకనుక కణాదుడు. కణాద అనే పేరుతోనే బాగా ప్రసిద్దుదయాడు లోకం లో .కణాదుడు అంటే గణాలను భుజించే వాడు కనుక ఇతర సిద్దాన్తాలకంటే సృష్టికి కారణమైన విశిష్టమైన పరమాణువులను ప్రతిపాదించాడు కనుక గణాలన్నా ,పరమాణువులన్నా పర్యాయ పదాలే కనుక , గణ సిద్ధాంతం చెప్పాడు కనుక గణాదుడు అనటం సముచితం .వ్యాస ,అక్షపాద పదాలు కూడా ఇలా ఏర్పడినవే .

  కణాద మహర్షి తపో వృత్తిలో ఉంటూనే ,తన తీవ్ర సాధనచే లభించిన జ్ఞాన సంపదను ,మరుగు పడనీయకుండా ,శ్రోత్రియత్వం బ్రహ్మ నిష్టత్వం ఉండటం చేత ‘’సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ‘’అనే శంకర మిశ్రుడు చెప్పిన వైశేషిక సూత్రం ప్రకారం ఉత్తమ ప్రశాంత చిత్తులు ,శమాన్వితులు,క్రమ వేదాధ్యయన శీలురు అయిన శిష్యుల తరుణోపాయం కోసం ‘’పరమ కారుణికః మునిహ్’’అని వృత్తి కారులు చెప్పినట్లు సంపూర్ణ దయతో ‘’కాణాదేనతు యత్ప్రోక్తం శాస్త్రం వైశేషికం మహత్ ‘’అనే పద్మ పురాణ వాక్యం ప్రకారం కణాద యోగికుల సార్వ భౌముడు మహా శాస్త్రమై ,దశాధ్యాయీ తంత్రం అనే ఈ ‘’వైశేషిక దర్శన౦’’ను సూత్ర రూపంగా బోధించాడు .

   వైశేషిక సూత్ర రచనాకాలం ఎప్పుడు ?

‘’Dates are the weak points in the Literary History of India ‘’అంటే ,భారతీయ సాహిత్య చరిత్రలో కాలనిర్ణయమే లోపం అని  మాక్స్ ముల్లర్ పండితుని అభిప్రాయం.కనుక కాల నిర్ణయానికి అలవాటు పడిన విద్యార్దులకు ఇక్కడ కాలనిర్ణయం క్లిష్టం అని పిఆచి ఆశాభంగం కలిగిస్తుంది అనీ అన్నాడు ముల్లర్ ..’’అంతకు ముందు చాలాకాలం ,ప్రత్యేకమైన కాలం లో మరుగు పడిన వైశేషిక సిద్ధాంతపరిణామం ,సాహిత్యం యొక్క పర్యవసానం ను మాత్రమె సిద్ధాంతానికి ఆధారమైన మూలసూత్రాలను తెలియజేస్తుంది ‘’అంటాడు మాక్డో నాల్డ్.అంటే దర్శనాల సిద్ధాంత సూత్ర రచన అతి ప్రాచీన కాలం లోనే జరిగింది .కారణం అవి ఒక వ్యక్తికీ ఒక కాలానికి మాత్రమె చెందకుండా ,విస్తృతంగా అనేక తరాలకు సంబంధించి తత్వ వేత్తల పరంపరవరకు సిద్ధాంత పరిణామం ప్రసరించి ఉంటుంది .ఒక వేళ సూత్ర కాలాన్ని మనం  నిర్ణ యించ గలిగినా ,సిద్ధాంతాలు ఎప్పుడు పుట్టాయో తెలుసుకోవటం దుర్లభమే .సిద్దా౦తకాల నిర్ణయం అసంభవం కనుక సూత్రకాల నిర్ణయం చేసి సంతృప్తి పడాలి అని అనుభవజ్ఞు లన్నారు .

  సూత్రకాల నిర్ణయం కూడా అంత తేలిక కాదు .’’మూల గ్రందాల కాలం నిర్ణయించటం కష్టం నామమాత్రంగా శిష్టులైన కర్త లను గుర్తించటం కూడా కష్టమే .అంతమాత్రం చేత పండితులు మౌనంగా ఉండకుండా కొంత శ్రమ కాల నిర్ణయం చేశారు .నిరాధారంగా  కొంత ఉండటం వలన దోషాలుగా అనిపిస్తాయి .వైశేషికం –జైన బౌద్ధులకు  ముందే క్రీ .పూ.2వ శతాబ్దిలో వ్యాపించి ఉండచ్చు అని మాక్డోనాల్డ్ అభిప్రాయపడ్డాడు .కాని వైశేషిక సూత్రాలు మాత్రం అంత ప్రాచీనం కాదు అన్నాడు .అశ్వ ఘోషుడు దీన్ని ఖండించాడు కనుక వైశేషిక ప్రాబల్యం క్రీ.పూ .రెండవ శతాబ్దికి చెందింది అని తీర్మానించాడు .ఈ సూత్రాలు బుద్ధుడికాలానికితర్వాత ఎక్కువ దూరం లో లేవని శ్రీనివాస అయ్యంగార్ ఉవాచ. జాకోబి ప్రకారం  న్యాయ, వేదాంతాలు క్రీశ .200-400 కాలం నాటివి అన్నాడు .జైమినీయ ,కాణాదాలు వీటికంటే కొంచెం ముందువి .తర్క సంగ్రహం ను అనువాదం చేసిన Bodas తన ఉపోద్ఘాతం లో వైశేషిక సూత్రన్యాయ భాష్య కర్త వాత్సాయనుడి కాలం తో చూస్తూ ,క్రీపూ 400కు పూర్వం కానీ క్రీశ 500కానీ అయి ఉండవచ్చు అన్నాడు .క్రీపూ 6వ శతాబ్దికికి చెందిన బుద్ధ ,మహా వీరులకాలం లో వైశేషికం వ్యాపించి ఉంది అని రాదా కృష్ణ పండితుడు గట్టిగా చెప్పాడు .

   వైశేషికం పూర్వ మీమాంస నుంచి పుట్టింది .ఇటీవలి జైన గ్రంథం ‘’ఆవశ్యక ‘లో క్రీ.శ 18లో రాహగుత్త అనే జైన గురువు వైశేషికం రాశాడని ఉందట .’’వైశేషికం జైన శాఖ కాదు ‘’అని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చాడు రాధా కృష్ణ పండితుడు  .

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీయ విజ్ఞానం  

భారతీయ విజ్ఞానం

‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం లోనే ఉంది ‘’అని పండిట్ నెహ్రు చెప్పాడు .19వ శతాబ్ది పారశీక పండితుడు అల్ జహీజ్ ‘’హిందువులు గణిత జ్యోతిష వైద్యాది పలు శాస్త్రాలలో అగ్రగణ్యులు .’’అన్నాడు ‘’అనేక విజ్ఞానాలకు ఆటపట్టు అయిన భారత దేశం ప్రస్తుతం ప్రపంచ లో ఎక్కువగా ఉపయోగించే 1,2,3,- – 0 వరకు ఉన్న అంకెల సంస్కృత సంఖ్యారూపాలను నిర్మించింది .గణితమే కాక ,న్యూటన్ పుట్టటానికి వేలాది సంవత్సరాలకు పూర్వమే భారతీయులకు గురుత్వ శక్తి తెలుసు ‘’అన్నాడు స్వామి వివకానంద .తత్వవేత్త ,రచయిత విల్ డ్యురాంట్ ‘’సర్వమానవాళికి మాతృ దేశం భారత భూమి యే.అన్నిభాషలకు  తల్లి సంస్కృతమే .’తత్వ శాస్త్రం పుట్టింది కూడా ఇక్కడే ‘’అన్నాడు .’’అరబ్బీయుల వలన మన గణితానికి ,బుద్ధునిమూలంగా క్రైస్తవ మత ఆదర్శాలకు ,గ్రామ పంచాయితీల నుండి స్వరాజ్యం ,ప్రజారాజ్యలకు హిందూ మతమే తల్లిఅని చెప్పి  .సర్వ జ్ఞాన ప్రదాత్రి అయిన భారతమాత పాద పద్మాలకు విల్ డ్యురాంట్ ప్రణామం చేశాడు .

   ‘’ భూగర్భం లో ఉండిపోయిన మొహంజ దారో హరప్పా ల త్రవ్వకాలవలన బయల్పడిన నాగరకతకు కనీసం 5 వేల సంవత్సరాలు .ఢిల్లీ దగ్గర ఉన్న ఇనుపస్తంభం శీతోష్ణాలకు మార్పు చెందకుండా ఇంతకాలం ఉండటం ఆధునిక సైంటిస్ట్ లకే ఆశ్చర్యం ‘’ అన్నాడు నెహ్రు .’’తమ కుశాగ్ర బుద్ధిని ఖగోళానికీ అను సంధించి సూర్య చంద్ర గమనాలను .అతి సూక్ష్మంగా  పరైశీలించారనీ ,వారి చంద్ర కళాపరిణామ గ్రహణం నిర్దుష్టం ‘’అన్నాడు కోల్ బ్రూక్ .9వ శతాబ్ది పర్హియా పండితుడు జాకోబి ‘’అన్ని దేశాల వారి కంటే భారతీయులు ఖగోళ జ్యోతిష శాస్త్రాలలో నిర్దుష్టమైన పాండిత్యం ఉన్నవారు .’’అన్నాడు ‘’అందుకే భారతీయులు మాత్రమె ,అతి నిర్దుష్టమైన గమన విధానాన్ని గ్రహించారు’’అన్నాడు బాలగంగాధర తిలక్ .’’పతంజలి యోగ శాస్త్రం అధ్యయనం చేస్తే ‘భువనజ్ఞానం సూర్యే సంయమాత్ ‘’అంటే సూర్యుని యందు బుద్ధిని సంయమనం చేస్తే ,14లోకాల విజ్ఞానం తెలుస్తుంది ‘’అని పతంజలి భాష్యకర్త వ్యాస దేవుడు పేర్కొన్నాడు .’’చంద్రే తారా  వ్యూహ జ్ఞానం’’అంటే చంద్రుని ఏకాగ్ర బుద్ధితో పరిశీలిస్తే నక్షత్ర మండల జ్ఞానం కలుగుతుంది .’’ధ్రువే తద్గతి జ్ఞానం ‘’ధ్రువ నక్షత్ర సంయమనం వలన నక్షత్ర గమన జ్ఞానం కలుగుతుంది అని పతంజలి సూత్రాలలో చెప్పాడు .

   సంస్కృతి వ్యక్తీ నిష్టమై వికసించి నాగరకత రూపం లో సంఘం లో వ్యాపిస్తుంది .ఇదివరకే మనం తెలుసుకున్నట్లు రెండురకాల సంస్కృతీ విభాగాలు పూర్తిగా సా౦ఘికాలై నాగరకత అవుతోంది .నాగరకత కు రెండు విస్పష్ట భావనలున్నాయి అవి కృషి ఫలితంగా ఏర్పడతాయి .కృషి రూపం అంటే వ్యక్తిని సాంఘికం చేయటం .దీనివలన సాంఘిక వాది అవుతాడు మనిషి .కనుక నాగరకత అంటే  సాంఘిక  వ్యవస్థయే..ఇది జీవిత విదానాన్ని తెలియ జేస్తుంది .ఇతరులతో ఏకత్వాన్ని చేస్తుంది .ఇదే నాగరకత ముఖ్య విధానం అంటాడు దీరేంద్రనాథ రాయ్.

  విజ్ఞాన ప్రదాత్రి అయిన భారత దేశం అసమాన సర్వతోముఖ సంస్కృతీ సంపదను పెంపొందించి అనుభవించి , ఆనందించటమేకాక త్యాగం తో విశ్వమానవ కల్యాణాన్నే అపేక్షించే ప్రేమైక స్వరూపిణి ,తనను ఆశ్రయించిన వారికీ ఆశ్రయించని వారికీ కూడా విజ్ఞాన భిక్షపెట్టి ,ప్రాపంచిక సుఖాలకు అతీతులు గా మానవ జాతిని ఉద్ధరిస్తోంది .’’ఈజిప్ట్ దేశం అతి ప్రాచీనకాలం లో తన నిబంధనలు సాంఘిక వ్యవస్థ, కళలను భౌతిక శాస్త్రాన్నీ భారత దేశం నుంచే గ్రహించింది ‘’అని దివ్యజ్ఞాన సమాజ వ్యవస్థాపకురాలు మేడం బ్లావట్స్కి  తన’’ సీక్రెట్ డాక్ట్రిన్’’ లో  చెప్పింది .గ్రీకు విజ్ఞాని ప్లేటో తనగురువు సోక్రటీస్ చనిపోయాక ,హిందూ దేశానికి వచ్చి ,తత్వ శాస్త్రం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.సోక్రటీస్ కాలం లో భారతీయ బ్రాహ్మణ గురు పండితులు ఎధేన్స్ నగరం లో బోధించారు .క్రీ.పూ.550వాడైన  పైథాగరస్ కూడా .

  ‘’యవన దండ యాత్రలలోనే కాక ,వివిధకాలలలోని రాజ్య సామ్రాజ్య విధానాలలో ,చక్రవర్తుల విధానాలలో కూడా భారతీయ ఐక్యత మరో రకంగా కనపడింది అన్నాడు సురేంద్రనాథ దాస్ ..ఆధ్యాత్మిక తృష్ణ ,పారమార్ధిక నియమపాలన ,అన్నిటికంటే ముఖ్యం అని పించటం వలన ,భారత దేశం అనేకానేక అసంఖ్యాక రాజకీయ పరివర్తనాలను  అధిగమించి నిలబడింది ‘’ఆన్నాడు దాస్  .శిశిర్ కుమార్ సేన్ కూడా ‘’భారతీయ చిత్తానికి పారమార్ధిక దృష్టి మాత్రమె మూల సూత్రం ‘’అన్నాడు .ఇదే భారత దేశ అపూర్వ అసమాన విచిత్ర తత్త్వం .

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ వేదాంత సౌరభం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-21-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం  

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం

1-సుమధుర సినీ గాయకుడు ,స్వరమాధురి స్రష్ట శ్రీ జి .ఆనంద్ ,2-విజయవాడ రేడియో నాటక రంగానికి వెన్నెముక ,ప్రయోక్త ,సౌమ్యుడు ,పెరాలిసిస్ వచ్చినా ,ధైర్యంతో అధిగమించి రేడియో నాటక సేవ చేస్తున్న , మాజీ స్టేషన్ డైరెక్టర్ ,అందరిచేతా ‘’పాండు రంగ ‘’గా పిలువబడే శ్రీ  పి.పాండురంగా రావు ,3-కూచి పూడినాట్యాచార్య ,అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి,వైవిధ్యభరిత ,పలుభాషల నాట్య ప్రదర్శనలు కూచిపూడిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ సిద్ధేంద్ర కళాక్షేత్రానికి ,నాట్యాచార్యునిగా సేవలందిస్తూ ,తమ ఇలవేల్పు అయిన  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్త ,కృష్ణా విశ్వ విద్యాలయ కాంపస్ ను కూచిపూడిలో ఏర్పాటు చేయించి విద్యార్ధులకు శిక్షణ నిస్తూ ,ప్రతియేటా కూచిపూడిలో నాట్యోత్సవాలు నిర్వహిస్తూ ,ఇతర సాంప్రదాయ నాట్య కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తున్న ,విస్తృత ప్రజాసంబందాలతో తలలో నాలుకలా ఉంటున్న సౌజన్య శీలి ,అలుపెరుగని కళా మూర్తి   శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ ,4-దాదాపు అర్ధ శతాబ్దిగా నాటక రంగం ముఖ్య౦ గా పౌరాణిక నాటక రంగానికి విశిష్ట సేవలందిస్తూ ,తెలుగు పద్యాన్ని హృదయంగమంగా ,అర్ధ, భావ   గాంభీర్యంతో గానం చేస్తూ ,మైక్ తో పనిలేకుండా వేలాది ప్రేక్షకులను  అలరిస్తూ ,93ఏళ్ళ వయసులోనూ ఎక్కడా స్వరంలో మార్పులేకుండా,పలు పౌరాణిక నాటక పాత్రల పద్యాలను సుమధురంగా గానం చేసే ,సహృదయులు  ,విజ్ఞానఖని ,అవిశ్రాంత నటులు,పరిచయం అయి రెండేళ్ళు మాత్రమె అయినా ,,15రోజులకొకసారి  ఫోన్ చేసి ఆత్మీయంగా పలుకరించే , శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వర రావు గార్లు  రెండు రోజుల వ్యవధిలో మరణించటం తెలుగు కళా రంగానికి తీరని ,పూడ్చరాని లోటు .వారందరికీ ఉత్తమ గతులు కలగాలని ,వారి కుటుంబాలకు సాను భూతి తెలియ జేస్తున్నాను  .

గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-21-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | 1 Comment

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం

అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి ,కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో 7-5-21శుక్రవారం కూచిపూడి లో మరణించారు .1952లో జన్మించి,తిరుపతిలో సంస్కృతం లో బి.ఎ డిగ్రీ పొందిన కేశవప్రసాద్ ,కృష్ణాజిల్లా పరిషత్ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి రిటైరయ్యారు .నాట్య కుటుంబానికి  చెందిన ప్రసాద్ అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి స్థాపించి కార్యదర్శిగాఎంతో కళా సేవ చేసి  ఎన్నో భాషల నాత్యకలాకారులను ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు 1978నుంచి 83వరకు సిద్ధేంద్ర కళాక్షేత్రం లో డాన్స్ అసిస్టెంట్ గా పని చేశారు .1800లకు పైగా ప్రదర్శనలిచ్చి మార్గదర్శి గా ఉన్నారు ,శ్రీ వేదాంతం రత్తయ్యశర్మ ,డా.చింతా రామనాధం ,శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ ,పద్మశ్రీ డా.వెంపటి చినసత్యం వంటి నాత్యాచార్యులతో కలిసి పని చేసిన నాట్య గురువు కేశవ ప్రసాద్ .

.సరసభారతి పురస్కారం తో పాటు అనేక పురస్కారాలు పొందిన కేశవ ప్రసాద్ మరణం కళా రంగానికి తీరని లోటు .ఆత్మీయత ,ఆప్యాయత ,గౌరవం సంస్కారం,సౌజన్యం  మూర్తీభవించిన కళా మూర్తి కేశవప్రసాద్ .-నాకుసరసభారతికి మంచి ఆత్మీయుడు .అయన ఆత్మకు శాంతి కలగాలని  భావిస్తూ ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-21

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

 లిటరరీ బయాగ్రఫి ,న్యు జర్నలిజం –న్యు క్రిటిసిజం అంతర్ధానం అవుతుండగా ,హిస్టారికల్ క్రిటిసిజం కల్చరల్ థీరీ ఆవిర్భవించి లిటరరీ బయాగ్రఫి బాగా వికసించింది .లియాన్ ఈడేల్ హెన్రి జేమ్స్ పై 5భాగాల అధ్యయనం -1953-72,సిన్క్లేర్ లేవిస్  పై ,మార్క్ షోరర్ రాసిన –సింక్లైర్ లేవిస్ –యాన్ అమెకన్ లైఫ్ -1961,జేమ్స్ జాయిస్ -1959ఆస్కార్ వైల్డ్-1988 లపై   రిచార్డ్ ఎలిమాన్ –ఎడిత్ వార్టన్ పై ఆర్ డబ్ల్యు బి లేవిస్ -1975,డాస్టోవిస్కి పై జోసెఫ్ ఫ్రాంక్ రాసిన 5వాల్యూముల చరిత్ర 1976-2002,వాల్ట్ విట్మన్ కవి పై పాల్ జ్వీగ్ రాసిన బ్రిలియంట్ స్టడి -1984,మేరి మెకార్ధి పై కరోల్ బ్రైట్ మాన్ రాసిన విస్తృత జీవిత చరిత్ర -1992 అన్నీ మాన్యుమెంటల్ వర్క్స్ గా గుర్తింపు పొందాయి .

   రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన సంక్లిష్ట స్థితి పై కొత్త జర్నలిజం సోషల్ కామెంటరీలు విస్తృతంగా వచ్చాయి .జాన్ హెర్సి రాసిన –హీరోషీమా  -1946లో భావోద్వేగ రహిత అటామిక్ హోలోకాస్ట్ అంటే సర్వ వినాశం  గూర్చి మంచి వివరణ ఉంది .నవలారచయిత జేమ్స్ బాల్డ్విన్ –నోట్స్ ఆఫ్ ఎ నేటివ్ సన్ -1955,నో బడి నోస్ మై నేం-1961,ది ఫైర్ నెక్ష్ట్ టైం వ్యాసాలలో అనర్గళ ధారావాహిక సాహిత్యం ప్రవహింప జేశాడు .జాతి, సంస్కృతి లపై జాన్ ఎల్లిసన్ –షాడో అండ్ యాక్ట్ -1964,గోయింగ్ టు ది టెర్రిటరి-1986 వ్యాస సంపుటాలు గొప్ప ప్రభావం చూపాయి .నార్మన్ మైలర్ యొక్క’’ న్యు జర్నలిజం’’ పొలిటికల్ సమావేశాల ,పెద్దపెద్ద నిరసన ప్రదర్శనల డ్రామా అంతా చూపాడు .నావలిస్ట్ జోన్ దిడియాన్ రెండు భాగాల సోషల్ ,లిటరరీ కామెంటరి గా –స్లౌచింగ్ టువార్డ్స్ బెతేల్హెం-1968,ది వైట్ ఆల్బం -1979రాసింది  .ఇందులో మదటి వ్యాస సంపుటి లో 1960ల నాటి కలర్ కల్చర్ ఏర్పడటానికి కారణమైన శక్తుల గురించి ,కౌంటర్ కల్చర్ ఏర్పడటం గురించి బ్రిలియంట్ ఇన్వెస్టి గేషన్.టాం ఉల్ఫ్ ,హంటర్ యెస్.ధాంప్సన్ జర్నలిస్ట్ లు స్టైలిస్ట్ లుగా పేరుపొందారు  .వియత్నాం యుద్ధం లోని సర్రియల్ ఎట్మాస్ఫియర్ ,రాక్ మ్యూజిక్ ,డ్రగ్స్ లు ప్రేరణాత్మక సమస్యలుగా సబ్జెక్టివ్ జర్నలిజం గా మారి ,మైకేల్ హెర్ర్ –డిస్పాచెస్ -1977రాశాడు .ఈకాలం మూడ్ కూడా ఆటోబయాగ్రఫీ కి మాంచి ఊతమిచ్చింది .దీనితో ఫ్రాంక్ కాన్రాయ్-స్టాప్ టైం-1967,లిలియన్ హెల్మన్ రాజకీయ ,పర్సనల్ ఎలిమెంట్స్ గా-యాన్ అన్ ఫినిష్డ్ వుమన్ -1969,స్కౌన్డ్రల్ టైం-1976,రాబర్ట్ ఎం.పిర్సిగ్-జెన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటే నెన్స్-1974 రచనలలో అన్నిరకాల క్లాసిఫికేషన్ లను ధిక్కరించి రాశారు .పిర్సిగ్-ముఖ్య పాత్రలోని ఎమోషనల్ కొల్లాప్స్ లను విచ్చిన్నమౌతున్న వర్క్ మాన్ షిప్ ,సంస్కృతిక విలువలతో సమానం చేశాడు .చివరగా ‘’థీరీ’’ గూర్చి తెలుసుకొందాం .

   థీరీ –మేజర్ క్రిటిక్స్ ,న్యూయార్క్ క్రిటిక్స్ లను వివిధ రకాల క్రిటిక్స్ అనుసరించారు .వీరు క్లోజ్ రీడింగ్ కంటే థీరీ ని ఎన్నుకొన్నారు .యూరోపియన్  స్ట్రక్చరిజం మాత్రం అమెరికాలో ప్రతిధ్వనించలేదు .కానీ పోస్ట్ స్ట్రక్చరలిస్ట్ థీరిస్ట్ లైన మైఖేల్ ఫౌకాల్ట్,రోలాండ్ బార్తేస్,జాక్వెస్ డెరిడాలకు అంతగా రాజకీయం లేని చోట్ల అంటే1960తర్వాత ప్రవేశించిన  సంశయవాదం ,ఓటమి ఉన్న చోట స్వాగతం లభించింది .ఏల్ కు చెందిన నలుగురు ప్రొఫెసర్లు డేర్రిడా తో చేతులు కలిపి ,ఒక గ్రూప్ ఆఫ్ ఎస్సేస్ గా ‘’డి కన్స్ట్రక్షన్ అండ్ క్రిటిసిజం ‘’-1979లో ప్రచురించారు .పాల్ డీ మాన్ ,జె.హిల్స్ మిల్లర్ లు ఇద్దరూ అమెరికాలో డీ కన్స్ట్రక్షన్ విశేష ప్రచారం తెచ్చారు .హోరాల్ద్ బ్లూం,జియోఫ్రి హెచ్ హార్ట్స్ మాన్ లిద్దరూ తమ ముందుతరం  కవులలోని సమస్యాత్మక రిలేషన్ షిప్,వాళ్ళ స్వీయ భాష లపై శ్రద్ధ చూపించారు .ఆధునికకవులపై రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ప్రభావం పై బ్లూమ్ ఎక్కువ దృష్టి పెట్టి రాశాడు .యాన్ గ్సైటీ ఇన్ఫ్లు ఎన్స్-1973,మాప్ ఆఫ్ మిస్ రీడింగ్ -1975రచనలు చేసి న బ్లూమ్స్ విస్తృతమైన ఆడియెన్స్ ను  ది వెస్టర్న్ కానన్ ,-1994,షేక్స్పియర్ –ది ఇన్వెన్షన్ ఆఫ్ ది హ్యూమన్ 1998లలో పొంది అగ్రశ్రేణి విశ్లేషకుడైనాడు .ఈ రెండిటి అన్వేషణ పరిశీలన పరిశోధన లతో పాశ్చాత్య లిటరరీ ట్రడిషన్ ను ఓడించి పారేశాడు .

   ఫిలాసఫర్లు అయిన రిచర్డ్ రోర్టిస్టాన్లీ కేవెల్,క్రిటిక్ రికార్డ్ పయోరియర్ లు యూరోపియన్ ధీరీ కి సమా౦తరమైన దాన్ని ఎమర్సన్ ఫిలాసఫీలో లో,ప్రోగ్రామిస్ట్ లైన విలియం జేమ్స్ ,జాన్ డ్యూయీ రచనలలో  దర్శించి లోకానికి చాటారు .డ్యూయీ ,ఇర్వింగ్ హోవ్ అనుకరించి అధిగమించి రోర్టి సోషల్ క్రిటిక్ గా –అచీవింగ్ అవర్ సెంచరి -1998,ది ఫిలాసఫీ అండ్ సోషల్ హోప్ -1999రచనలలో బాగా ఎదిగి సుస్థిర స్థానం పొందాడు .మరికొందరు క్రిటిక్స్ కూడా మరింత పొలిటికల్ మలుపు త్రిప్పారు .స్టీఫెన్ గ్రీన్ బ్లాట్ –షేక్స్ పియర్ ఇతర  ఎలిజబెత్ కాలపు రచయితలపై ,ఎడ్వర్డ్  సైడ్ రాసిన –ది వరల్డ్ ,దిటెక్స్ట్,అండ్ ది క్రిటిక్ -1983 వ్యాస సంపుటి ,ఇప్పటిదాకా ఉపేక్ష వహించిన లేక నిర్లక్ష్యం చేసిన’’ సాహిత్యానికి చారిత్రిక సాన్నిహిత్యాన్ని ‘’చాటింది .సైడ్ రాసిన –ఓరియెంటలిజం –1978,కల్చర్ అండ్ ఇ౦పీరియలిజం -1993 లలో ఆర్ట్స్ అండ్ సొసైటీ లపై కాలనైజేషన్ ప్రభావాన్ని వివిధకోణాలలో చూపించాడు .ఇతడి వ్యాసాలన్నీ ‘’రిఫ్లెక్షన్స్ ఆన్ ఎక్సైల్’’-గా 2000లో ప్రచురితలైనాయి .

  మరికొందరు క్రిటిక్స్ ఈ హిస్టారికల్ అప్రోచ్ నుంచి దూరమై ,కల్చరల్ స్టడీస్ పై దృష్టి కేంద్రీకరించారు .దీనితో ఉన్నత –సాధారణ కల్చర్ మధ్య ఉన్న గీత చెరిగి పోయింది .కళలు,భావజాలం పై చర్చలు పెరిగాయి . ఫెమినిస్ట్ క్రిటిక్స్ అయిన కేట్ మిల్లెట్,ఎలెన్ మోర్స్ ,సాండ్రా గిల్బర్ట్,సుసాన్ గుబార్ ,ఎలైన్ షోవాల్టర్ లు కొత్త జెండర్ బేస్డ్ అప్రోచేస్ టు పాస్ట్ అండ్ ప్రెసెంట్ రైటర్స్ వెలుగులోకి తెచ్చారు .తమాషా అయిన సిద్ధాంతకారులు అంటే క్వీర్ దీరిస్ట్ లు –ఈవ్ కోసోఫ్స్కిసేడ్జివిక్,లు హోమో సెక్సువాలిటిపై ఓవర్ట్ అండ్ ఇమ్ప్లిసిటి అంటే బహిరంగ, అవ్యక్త ధోరణులపై రాశారు .

   ఈ విదానాలన్నీ కొత్త విధాన విమర్శనా ధోరణులకు  పురుళ్ళు పోశాయి .కాని రాజకీయం సిద్ధాంత భావనలకే ప్రాముఖ్యం ఉండటం తో సాధారణ పాఠకుడికి చాలా దూరమై పోయాయి .ఇది అల్లాన్ బ్లూమ్స్ లాంటి కన్జర్వేటివ్ లకన్నెర్రకు కారణమై ఈయన 1987లో  –క్లోజింగ్ ఆఫ్ అమెరికన్ మైండ్స్ –రాశాడు .వామభావీయుడు రస్సెల్ జాకోబి ,’’దిలాస్ట్ ఇంట లెక్ట్యు వల్స్ ‘’-1987 డోగ్మాటిక్ విజ్డం-1994 రాశాడు ,   థీరీ ఆధార క్రిటిసిజం కు వ్యతిరేకత 1990దశకం లో మొదలైంది .రాజకీయ పరిణత పై మాత్రమేకాక ,ఇన్ఫార్మల్ వ్యాస రచనలపైనా విమర్శ పెరిగింది .పబ్లిక్ మేధావుల పాత్ర ,అత్యధిక పాఠకుల కు దగ్గరవటం అనే వాటిపై ఒత్తిడి పెరిగింది .దీనితో లిటరరీ జర్నలిజం కు మళ్ళీ ప్రాణ ప్రతిష్ట జరిగింది .పాతతరం క్రిటిక్స్ ఫ్రాంక్ లింట్రి చ్చియా ‘’ దిఎడ్జ్ ఆఫ్ నైట్ ‘’-1994లోనూ ,సైడ్ ‘’అవుట్ ఆఫ్ ప్లేస్ ‘’-1999లోను ,యువ క్రిటిక్ ఆలిస్ కప్లాన్ –ఫ్రెంచ్ లెసన్స్ -1993లోను ఆటో బయాగ్రఫి కి మారి ,తన స్వంత ఇంట లెక్ట్యువల్  అవుట్ లుక్ ను ,స్వీయ వ్యక్తీకరణను తమ రచనలలో నింపారు .

దీనితో 20వ శతాబ్ది అమెరికా దేశపు సాహిత్యం సమాప్తం .

  సశేషం

మనవి –అమెరికా సాహిత్యం మొత్తం 27 ఎపిసోడ్ లుగా వస్తే అందులో , 20వ శతాబ్ది సాహిత్యం 19 ఎపిసోడ్ లు వచ్చింది .వీలుని బట్టి 21వ శతాబ్ది అమెరికన్ సాహిత్యాన్ని రాసే ప్రయత్నం చేస్తాను .ఇంతటి సుదీర్ఘ సాహితీ ప్రయాణం లో నా వెంట నడిచిన సాహితీ ప్రియులకు ధన్యవాదాలు .

ఆధారం –ఎన్ సైక్లో పీడియా బ్రిటాన్నికా .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-21-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

భారత మాత దివ్య స్వరూపం

భారత మాత దివ్య స్వరూపం

భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము  .చారిత్రిక  విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం ,ప్రజాబాహుళ్య0 లో ఎలా ప్రవేశించి మార్పు తెచ్చిందో గ్రహించాలి .అందుకోసం మనం ముందుగా  సంస్కృతి అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి  .

  ‘’ఒక జాతి సంస్కృతి దాని సర్వ సామాన్య వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది ‘’అన్నాడు ధీరేంద్ర నాథ్.అంటే జాతికి సంస్కృతి జీవగర్ర అని భావం .ప్రజానీకం యొక్క బాహ్య అభ్యంతర పురోగమనాన్ని కలుగ జేసే సంపూర్ణ నాగర వ్యవస్థలో అప్రత్యక్షంగా ,సర్వ వ్యాపకం గా ఉన్న తత్వమే సంస్కృతి అన్నాడాయన ., సంస్కృతి కున్న సంబంధం ఏమిటి ?ప్రత్యేకతలతో వేషభాషలలో  అనేక మార్పులు కలిగించి ,భూసారం పెంచి సస్యశ్యామలం చేసి మానవ జీవితాలలో బాహ్యమైన మార్పులు కలిగించేది సంస్కృతి  .దీని వలన భూ గర్భం లో ఉన్న అనేక లోహజాతులు రూపాంతరం చెంది ,మానవులకు ఉపయోగకారకాలై మానవ జీవితాన్ని సున్నితం చేస్తుంది .ఈ సంస్కృతీ బలం తో కిందికి ప్రవహించే జలాలు పైకి ఎగసి ప్రజోపకారం గా మారతాయి .అనేక ప్రకృతి శక్తులు మానవాధీనాలై దుఖం తగ్గించి సుఖాన్ని పెంచటానికి తోడ్పడతాయి .దీనినే లౌకిక సంస్కృతీ అంటారు .

   సంస్కృతిలో రెండవభాగం ధార్మికం అంటే నైతికం అంటారు .మొదటిదానిలో ప్రకృతి శక్తులు ద్వారా సంపద పెరిగి మనిషి అనుభవించి సుఖిస్తాడు .రెండవ భాగం అతడి స్వేచ్చా విహారానికి కొన్ని అడ్డకట్టలు వేస్తుంది .స్వార్ధాన్ని తగ్గిస్తుంది స్వాతంత్రానికి హద్దులేర్పరుస్తుంది .అనుభవించే అధికారం ఉన్నా వనరులకు ఆటంకం కలిగించరాదని శాసిస్తుంది .ఇతరులను బాధించ రాదని ,నివారిస్తుంది .అందరికీ అనుభవించే హక్కు ఉందని బోధిస్తుంది .ప్రకృతి సంపదానుభవం మనిషికి లాగానే ఇతర ప్రాణులకు అధికారం ఉందనే ఎరుకతో మానవ సమాజం జీవిస్తోందని పండిట్ నెహ్రు అన్నాడు .’’భారత దేశం ప్రాచీన పురుషుల్ని విస్మరిస్తే ,అది భారత భూమిగా ఉండదు .తనకు ఆనందం గర్వకారణం అయినది అంతా అదృశ్యమౌతాయని నెహ్రు పండితుడే విస్పష్టంగా చెప్పాడు .గతాన్ని ద్వేషించకుండా అందులోని మంచిని, వర్తమాన భావిష్యత్తులకు ఉపయోగ పడేట్లు చేయాలి .’’భూతకాలాన్ని వర్తమానానికి అనుసంధించి ,భవిష్యత్తుకు మేళవించి ,ఉపయోగ పడని వాటిని వదిలేసి ,భావన, ఆచరణ కోసం సచేతనం చేయటమే శ్రేయస్కరం ‘’అన్నాడు నెహ్రు .

  ‘’ The philosophy of a country is the cream of its culture and civilization ‘’అంటే దేశ సంస్కృతి,నాగరకతలకు ఆదేశ తత్వ శాస్త్రం వెన్నలాంటిది .అందుకే భారత దేశ ఔన్నత్యం అనాది గురు పరంపరాగత ఆధ్యాత్మిక విద్యా వైభవం మూలంగానే వ్యక్తమౌతాయి .ఆమెకు ఆధ్యాత్మిక విద్యయే జీవ గర్ర ..ఆమహిమ వలన భారత దేశం ఒక్కటే భగవంతుని గ్రహించిందని ,దివ్యాతి దివ్య ఆధ్యాత్మిక సంప్రదాయానికి కారకం అనీ ,ప్రపంచం లోనే అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి అనీ ,ప్రపంచానికి హృదయ స్థానమని ,మానవ పరిణామానికి అధినేత అనీ ,ప్రపంచానికి శిరస్సు అనీ ,జగన్మాత అనీ ప్రఖ్యాతి పొంది ,పవిత్ర చరిత్రయై భారతి స్వార్ధ పరం కాకుండా ఈశ్వర నిమిత్తంగా లోక సంగ్రహణం కోసం ఉందని ,అలౌకిక యశో నిదానంగా ప్రకాశిస్తోందని అవిలినో ,లూయిస్ రెనాన్ ,కెన్నెత్ వాకర్ ,శిరీష్ కుమార్ మిత్ర ,స్వామి రామ తీర్ధ ,అరవిందులు ,చెప్పిన విలువైన మాటలను మనం మననం చేసుకొంటూ  అర్ధం చేసుకోవాలి .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –సర్వ సిద్ధాంత సౌరభం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26

  • ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -26

20వ శతాబ్ది సాహిత్యం -18

 నాటక సాహిత్యం -2(చివరిభాగం

ఎయిడ్స్ వ్యాధి మహమ్మారిగా మారి పెద్ద సంక్షోభం సృష్టించింది .దీనితో అనేకమంది గే నాటకరచయితలకు ప్రేరణ కలిగి౦ది .వీరిలో టోని కిష్నర్ 1991లో ‘’ఏ బ్రైట్ రూమ్ కాల్డ్ డే’’నాటకం తో అందరి చూపు ఆకర్షించాడు 1932-33లో జర్మనీలో స్థిరపడి రెండు భాగాల ‘’ఏంజెల్స్ ఇన్ అమెరికా ‘’-1991-92ను కామెడీ, బాధ లతో రంగరించి ,పర్సనల్ చరిత్రలోసిమ్బాలిజం కలిపి ,చారిత్రాత్మకపాత్రలు సృష్టించి బ్రాడ్వే కీర్తి సాధించాడు .రాజకీయ రచయిత అయిన యితడు పబ్లిక్ ధీమ్స్ పై దృష్టి సారించి రాశాడు  .తర్వాత కాలంలో రాసిన స్లేవ్స్ -1996,సమయానికి తగిన హోం బడి/కాబూల్ -2001లో అద్భుత మోనోలోగ్ తర్వాత డ్రామా ను తాలిబాన్ అధీనం లోని ఆఫ్ఘనిస్తాన్ నేపధ్యంగా రాశాడు .off బ్రాడ్వే నాటకాలు అనేకం రాసిన తరవాత డేవిడ్ హెన్రి హ్వాంగ్ క్రిటికల్ ,కమ్మర్షియల్ విజయాన్ని బ్రాడ్వే లో తన జెండర్ బెండింగ్ డ్రామా ఎం.బటర్ ఫ్లై -1988లో రాశాడు .లండన్ లో సం అమెరికన్స్ అబ్రాడ్-1989,టు షేక్స్పియరిన్ యాక్టర్స్ -1990 వంటి లిటరరీ డ్రామాలతో  మాంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్నాడు  రికార్డ్ నెల్సన్ .రిచర్డ్ గ్రీన్ బెర్గ్  -జ్యూయిష్ – అమెరికన్ జీవితాన్నిగే,సాధారణ రిలేషన్ షిప్ లతో ఈస్టర్న్ స్టాండర్డ్ -1989,దిఅమెరికన్ ప్లాన్ -1990,టేక్ మీ ఔట్-2002 రాశాడు .చివరిది గే బేస్బాల్ ప్లేయర్ జీవితాన్ని  తన హోమో సెక్సువల్ టీంమేట్స్ కు వివరించేకథ.డోనాల్డ్ మార్గురీస్ చాలా సూటిగా జ్యూయిష్ ఫామిలి లైఫ్ ను –ది లోమన్ ఫామిలి పిక్నిక్ -1989లో చిత్రించాడు .నటులలో ఉండే కోరికలు ,సంబంధాలను –సైట్ అన్ సీన్ -1992నాటకంలో కలేక్టేడ్ స్టోరీస్-1998లో కళ్ళకు కట్టించాడు .   1990దశకం లో ప్రతిభావంతులైన స్త్రీ నాటక కర్తలు బయటికి వచ్చారు .వీరిలో పౌలా వోగెల్ –హాఫ్ బటన్ నైతిక సమస్యల ను హాస్య౦,ఓదార్పు లతో వేశ్యల జీవితాలను –ఓల్డేస్ట్ ప్రొఫెషన్ -1981లో ఎయిడ్స్ ను  బాల్టిమోర్ వాల్ట్జ్-1992 లో,పోర్నోగ్రఫీ ని ‘’hot ‘’n ‘’throbbing ‘’ ను  మైనర్ లపై సెక్సువల్ అబ్యూజ్ ను హౌ ఐ  లెరెండ్ టు డ్రైవ్-1997 లో చిత్రించింది .

  యువ ఆఫ్రికన్ –అమెరికన్ ప్లే రైట్ –సుజాన్ లోరీ పార్క్ –సర్రియలిస్టిక్ గా ‘’ది అమెరికా ప్లే-1993 నాటకాన్ని స్కార్లెట్ లెటర్ కాల్డ్ ఇన్ దిబ్లడ్-1999,టాప్ డాగ్/అండర్ డాగ్ -2001ఆధారంగా ఇద్దరు సోదరులమధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ను ఆవిష్కరించి సాం షెఫర్డ్ కుటుంబ సంఘర్ష పై  రాసిన ట్రూ వెస్ట్ నాటకాన్ని గుర్తుకు తెచ్చింది. లోరీపార్క్ తర్వాత జార్జ్ ,ఐరా గెష్విన్ ల పోర్గి,అండ్ బెస్స్ ను 2012లో అడాప్ట్ చేసుకొని నాటకాలు రాసి ,తన స్వంత నాటకం ఫాదర్ కంస హోం ఫ్రం వార్ –ను రెండు భాగాలనాటకం గా రాసి 2014లో ప్రదర్శించింది. ఇందులో అమెరికన్ సివిల్ వార్ లో  హోమర్ రాసిన ఒడిస్సీకి స్థానం కల్పించింది .హీదర్ మెక్ డోనాల్డ్ రాసిన- యాన్ ఆల్మోస్ట్ హోలీ పిక్చర్ -1995లో వన్ మాన్ షోగా ఒక ప్రీచర్  స్పిరిట్యువల్ లైఫ్ ను చూపింది .కవి అయిన నవోమి వాలెస్ –వన్ ఫ్లీ స్పేర్’’-1995నాటకాన్ని 1665నాటి లండన్ ప్లేగు నేపధ్యంగా రాసింది .మార్గరెట్ ఎడ్సన్1995లో విట్ అనే నాటకాన్ని కేన్సర్ వ్యాధితో నెమ్మది నెమ్మదిగా కుంగి చనిపోయిన సాహితీ వేత్త దయనీయ జీవితాన్ని మెటాఫిజికల్ కవిత్వం విట్ లతో అత్యద్భుతంగా చిత్రించింది .

  సాహిత్య ,సాంఘిక విమర్శ -1972లో చనిపోయే దాకా ఎడ్మండ్ విల్సన్ అమెరికా దేశ వెర్సటైల్ ,విశిష్ట  సాహిత్యకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. జాన్ అప్ డైక్ ఇప్పుడు విల్సన్  స్థానాన్ని ‘’దిన్యుయార్కర్ ‘’లో  పొంది ,తన అసమానమైన సాహితీ విమర్శలతో ,సమీక్షలతో మహా ప్రాచుర్యం పొంది ,వీటిని –హగ్గింగ్ ది షోర్-1983,ఆడ్ జాబ్స్ -1991 సంపుటాలుగా వెలువరించాడు .గోరే విడాల్ తన బ్రిస్కి రీడబుల్ ఎస్సేస్ తో నాలుగు దశాబ్దాలు అమెరికన్ క్రిటికల్ పొలిటికల్ విషయాలు చర్చించి 1993లో యునైటెడ్ స్టేట్స్ మహా గ్రంథ0గా ప్రచురించాడు .సుసాన్ సోన్ టాగ్  డిఫికల్ట్ యూరోపియన్ రైటర్స్ లపై రాసిన  వ్యాసాలు –అవాంట్ గార్డెన్ ఫిలిం ,పాలిటిక్స్, ఫోటోగ్రఫీ, భాషకు పట్టిన వ్యాధి 1960 నాటి ఇంట లెక్ట్యువల్ స్పిరిట్ ను చూపిస్తాయి .ఎ సెకండ్ ఫ్లవరింగ్ ,-1973,ది డ్రీం ఆఫ్ది గోల్డెన్ మౌన్టేన్స్-1980పుస్తకాలలో మాల్కం కౌలీ రెండు ప్రపంచ యుద్దాలమధ్య ఉన్న కవుల జీవిత చిత్రణ చేశాడు .ఆల్ఫ్రెడ్ కజిన్ 1984లో యాన్ అమెరికన్ ప్రొసెషన్ అనే  అమెరికా దేశ సాహిత్య చారిత్ర  గాడ్ అండ్ ది అమెరికన్ రైటర్ ,-1997,తన స్వీయ జీవిత చరిత్ర –స్టార్టింగ్ అవుట్ ఇన్ ధర్టీస్-1965,న్యూయార్క్ జ్యూ-1978లో  రాశాడు .

  ఇర్వింగ్ హావ్-స్టడీస్ ఇన్ ది క్రాస్ రోడ్స్ ఆఫ్ లిటరేచర్ అండ్ పాలిటిక్స్ ,పాలిటిక్స్ అండ్ దినావెల్ -1957,జ్యూయిష్ ఇమ్మిగ్రేషన్ ఇన్ న్యూయార్క్ ,వరల్డ్ ఆఫ్  అవర్ ఫాదర్స్1976 – రాశాడు .లెస్లీ ఫీల్డర్ తన ఐకనో క్లాస్టిక్ లిటరరీ క్రిటిసిజం గా రాసిన –లవ్ అండ్ డెత్ఇన్ ది అమెరికన్ నావెల్ -1960 ,లో అమెరికన్ సాహిత్యం లో ప్రవేశించినఫ్రూడియన్ ఐడియాల  గురించి వివరించాడు .ఇతడే తర్వాత రచనలలో పాప్యులర్ కల్చర్ గా  సోషల్ సైకలాజికల్ రచనలు చేశాడు .సటిల్ ఫ్రూడియన్ అయిన లయోనిల్ ట్రిల్లింగ్ –లిబరల్ ఇమాజినేషన్స్-1950, వ్యాసాలలో వెర్నాన్ పారింగ్ టన్ యొక్క పాప్యులిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లిటరేచర్ ,సోషల్ రిపోర్టేజ్ లను వ్యతిరేకించి ,సమస్యాత్మకంగా ఉన్న మానవ సంక్లిష్టత పై రాయమని సూచించాడు .దీనితో విమర్శ రాజకీయం నుంచి అంతర౦గ శోధనకు,నైతిక వాస్తవానికి  మారింది .ఇదంతా కోల్డ్ వార్ నేపధ్యమే .

  1960లలోని సాంస్కృతిక రాజకీయ సంక్లిష్టత వలన అమెరికన్ యంగర్ స్టూడెంట్స్ఆఫ్ లిటరేచర్  లో సోషల్ అప్రోచ్ చేరింది .హెన్రి లూయీ గేట్స్ జూనియర్ 1980లో మేజర్ క్రిటిక్ గా వెలుగులోకి వచ్చాడు .బ్లాక్ రైటర్స్ ఇన్ స్టూడెంట్స్ కు మార్గ దర్శనం చేశాడు .ఇతని ఫిగర్స్ ఇన్ బ్లాక్ -1987,సిగ్ని ఫైయింగ్ మంకీస్ -1988దిశానిర్దేశనం చేశాయి .1990లలో గేట్స్ విస్తృత విషయాలపై రాసిన ఎస్సేయిస్ట్ గా ప్రసిద్ధి చెందాడు .అలాగే కార్నెల్ వెస్ట్ ,స్టాన్లీ క్రౌచ్ ,బెల్ హుక్స్ ,షెల్బి స్టీల్ ,స్టీఫెన్ కార్టర్ ,గెరాల్డ్ ఎర్లి ,మైఖేల్ వాలెస్ లు బ్లాక్ సోషల్ క్రిటిక్స్ గా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-21-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?

 

ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?

వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర లక్షణాలు కనిపిస్తాయి .దేశాన్ని బట్టి వస్తువు స్థాన నిర్దేశం చేస్తూ ముందూ వెనుక పొడుగు పొట్టి పైన కింద అని అనేకరకాలుగా వ్యవహరిస్తాం .దీనివలన దేశం యొక్క ఆస్తికత నిరూపి౦ప బడి ,కాలం లాగా నిమిత్త కారణం అవుతోంది .సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి తూర్పు పడమర దిక్కుల కల్పనా ఏర్పడింది .అలాగే మిగిలిన దిక్కులు కూడా . ఇవి మానవ కల్పితాలు .నిజానికి దేశం ఏకం ,నిత్యం .అస్తూలం వ్యాప్తం .కాని నిష్క్రియం .అమూర్తంగా ఉంది అని  వైశేషికులు అంటారు .మన పూర్వుల భావాలు మనకు తోచినట్లు ,తమ ప్రత్యేకభావాలు కూడా తర్వాత తరాలకు కృత్రిమంగా కనబడ అవచ్చు ,తాము ప్రతిభా వంతుల భుజ స్కంధాలపై ఆధారపడి నిలిచి ఉన్నామని ఆధునిక శాస్త్రవేత్తలు గ్రహించారని లింకన్ బార్నెట్ చెప్పాడు .

  ‘’our notion of time and space although much more subtle and flexible  than they were before the appearance of RelativeTheory ,are not very likely yet subtle enough ‘’అన్నాడు లిమిటేషన్స్ ఆఫ్ సైన్స్ లో జే డబ్ల్యు యెన్ సల్లివాన్ .దీనిభావం అయిన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చెప్పక పూర్వం కంటే దేశ ,కాలాలకు చెందిన మన భావనలు చాలా సూక్ష్మ తరాలుగా ఉన్నా పూర్తిగా సూక్ష్మాతి సూక్ష్మాలు కావు .ఈ దృష్టి తో చూస్తె న్యూటన్ ఎడ్డి౦గ్టన్, అయిన్ స్టీన్ మొదలైన సైంటిస్ట్ ల భావాలతో కణాద, గౌతమ సిద్ధాంతాల్ని పోల్చి చూస్తె ,ఆధునిక సైంటిస్ట్ ల సిద్ధాంతాలలో కొత్తదనం ఏదీ లేదని తెలుస్తోంది .పైగా లోపాలు బాగా కనిపిస్తాయి .దేశ కాలాల ఏకత్వ సర్వ వ్యాపకత్వాలు ,త్రికాలాలు దిక్కులు అన్నీ కల్పితాలే అని కణాదులు చెప్పినట్లే ఈనాటి శాస్త్ర వేత్తలూ చెప్పారు .గ్రహాలూ వాటి సంచారం అంతరించినా ,దేశకాలాలు నిత్యాలు నిర్వికారాలు అపరిమితాలు అని వైశేషికులు చెప్పినట్లే ఈ సై౦టిస్ట్ లూ చెప్పారు కానీ అయిన్ స్టీన్ చెప్పిన space-time continuum అంటే దేశకాల ప్రవాహ ఐక్యం సిద్ధాంతం ఇంకా పరిపూర్ణం కాలేదు .ఇందులో చాలాసిద్ధాంత రాద్దా౦తాలున్నాయి అనటానికి సల్లివాన్ చెప్పిన మాటలే తార్కాణం .

  లింకన్ బార్నెట్ చెప్పిన అనిశ్చయత్వ సిద్ధాంతం అంటే ‘’ప్రిన్సిపుల్ ఆఫ్ అన్ సర్టేనిటి’’ని బట్టి ఈశ్వర సృష్టిలో సర్వ ప్రకృతి రహస్య గ్రహణం అనిశ్చయం, అనిర్దారితం గా ఉంది .అంటే మానవ బుద్ధికి అతీతంగా ఉంది .అందుకే ‘’ఈ విషయం లో గ్రీకు రోమనులకంటే మనం అధిగమించినట్లుకానీ ,అత్యున్నత నాగరకదేశాలైన చైనా భారత దేశాలకంటే మనకు ఎక్కువ తెలుసు అనికాని అనుకోవటం అనుమానాస్పదమే అంటే’’ డౌట్ ఫుల్’’అన్నాడు సల్లివాన్ పండితుడు .కనుక మన ప్రాచీన రుషి ప్రోక్త ప్రకృతి రహస్యాల కు మించిన రహస్యాలేవీ ఆధునిక శాస్త్రవేత్తలు గ్రహించ లేదని అర్ధం .

  ‘’My religion consists of a humble admiration of the illimitable superior Spirit  who reveals Himself in the slight details we are able to perceive with our frail and feeble minds ‘’అని భారతీయ మహర్షుల భావనకు నమస్సులు అందించాడు సల్లివాన్ .’’బుద్ధికి అగోచరమైన   విశ్వంలో వెలువడిన ఉత్కృష్ట ప్రజ్ఞా శక్తి ని గూర్చి హృదయ పూర్వక భావ విశ్వాసమే ఈశ్వర భావాన్ని కలుగ జేస్తోంది ‘’అని అయిన్ స్టీన్ శాస్త్రవేత్త చెప్పినట్లు ,మనప్రాచీన మహర్షులు కార్య రూప ప్రపంచాన్ని వినియోగించుకోవటమే కాకుండా ,దానికి కారణమైన అమానుష ప్రజ్ఞా శక్తి రూప సర్వజ్ఞ తత్వమైన పరమేశ్వరునే విశ్వసి౦చా రు .విశ్వ జీవ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకోవటమే కాక ,సృష్టి ప్రయోజన సమస్యా ధ్యాన తత్పరులై ,ఈశ్వర సంకల్ప రహస్యాలను గ్రహించే ప్రయత్నం చేసి సాధించి ,ఆ అద్వితీయ అలౌకిక మహాతత్వాన్ని పొంది ,ఆన౦దించి ,అభ్యుదయ నిశ్రేయస సిద్ధికోసం ప్రపంచ పరిశోధన చేశారు .అదే భారతీయ విజ్ఞాన తత్వ వైభవం .దీన్ని గ్రహించి మన సంస్కృతీ మహాత్మ్యాన్ని దాని సత్సంపదను సద్వినియోగం చేసుకొందాం .

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –సర్వ సిద్ధాంత సౌరభం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-21-ఉయ్యూరు


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -25

20వ శతాబ్ది సాహిత్యం -17

 నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర  నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ ,అబ్స్త్రాక్ట్ ,అలిగారికల్  గానే  అనేక వ్యాసాలలో వివరి౦చాడు .ఈ భావనలన్నీ తన అసామాన్య నాటకం –డెత్ ఆఫ్ ఎ సేల్స్ మాన్ నాటకం లో  -1949లో బయట పెట్టాడు.మిల్లర్ డ్రామాలన్నీ 1930 నాటి హెన్రిక్ ఇబ్సన్ కుటుంబ సమస్యాత్మక నాటకాలు లాగానే  ఉంటాయి.ముఖ్యంగా క్లిఫ్ఫోర్డ్ ఆర్డేట్  ను పోలి ఉంటాయి .కాని మిల్లర్ తన నాటకాలకు మెటాఫిజికల్ రంగు అద్దాడు 1947లో మిల్లర్ రాసిన ఆల్ మై సన్స్ నుండి 1968లోని దిప్రైస్ వరకు నాటకాలు చాలా బలంగా తండ్రీ కొడుకుల మధ్య బాంధవ్యాన్ని ఆనాటి అతి భయానక డిప్రెషన్ నేపధ్యం లో చూపించాడు. మిల్లర్ అసమ్మతి నిరసన స్వరాన్ని స్పష్టంగా ప్రకటించాడు. 1953లో రాసిన –ది క్రూసిబిల్ లో  సేలెం విచ్ ట్రయల్స్ గా మెకార్ధీ కాలపు దెయ్యపు పాలన పై విరుచుకు పడ్డాడు .

  రెండవ నాటక కర్త –టెన్నెస్సీ విలియమ్స్ ఒకే మాదిరి రచనలు చేయకపోయినా మిల్లర్ కంటే శక్తివంతమైన ,ప్రభావ శీలి అయిన నాటక కర్త అని పించుకొన్నాడు .ఆడ వారి పాత్ర చిత్రణ లో గొప్ప మెళకువలు చూపాడు .మనసుకు హత్తుకొనే కవితాత్మక వాక్యాలు ,దక్షిణ ప్రాంతపు ట్రాజిక్ విజన్ లను –డి గ్లాస్ మేనేజేరి -1944,ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ -1947,కాట్ ఆన్ ఎ హాట్ టిన్ రూఫ్ -1955,ది నైట్ ఆఫ్ ది ఇగువాన -1961 నాటకాలలో ప్రదర్శించాడు .అతని పాత్రల కలలు ,భ్రాంతులు ,ఫ్రస్ట్రేషన్ లు ,జీవన పోరాటం లో ఓడిపోవటాలు మొదలైన వాటిని తన స్వంత కలలు,నిరాశా నిస్పృహలకు  షార్ట్ ఫిక్షన్ లో ప్రాణం పోశాడు .వీటిలోంచే తననాటకాలకు ఇతి వృత్తాన్ని తీసుకొన్నాడు కూడా .

మిల్లర్ ,విలియమ్స్ లిద్దరూ పోస్ట్ వార్ ధియేటర్ ను 1960 దాకా దున్నేశారు .వీరిద్దర్నీ చాలెంజ్ చేసే కొద్దిమంది నాటకకారులు వచ్చారు.1962లో ఎడ్వర్డ్ అల్బీ చిన్న నాటకాలు –ది జు స్టోరీ -1959,ది అమెరికన్ డ్రీం-1960లతో  స్థిర స్థానం సాధించి ,హు ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా ఉల్ఫ్ నాటకాన్ని యూరోపియన్ నాటకకర్తలైన సామ్యుల్ బెకెట్ ,యూజీన్ అయోనేస్కో ల  ప్రభావం తో అమెరికా ధియేటర్ లో అతి ముఖ్య పాత్ర పోషించాడు .కాని క్రమ౦గా క్రేజ్ ,రెప్యుటేషన్ తగ్గుతూ 1964లో రాసిన టైని ఆలీస్ ,1966లోని ఎ డెలికేట్ బాలెన్స్ నాటకాలతో పతనం చెందాడు .కాని గోడకు కొట్టిన బంతి లాగా ఓ నీల్ లాగా 1994 ఆటో బయగ్రాఫికల్ నాటకం త్రీ టాల్ వుమెన్ ‘’నాటకం తో పూర్వ వైభవంపొందాడు .

    off బ్రాడ్వే అసెండేన్స్ –అమెరికన్ డ్రామా కేంద్రం బ్రాడ్వే నుంచి off off బ్రాడ్వే కు  జాన్ గీల్బెర్ రాసిన –ది కనెక్షన్స్ -1959,నాటకం తో మారింది .అమెరికన్ నాటక కర్తలు లివింగ్ ధియేటర్,ఓపెన్ ధియేటర్ మరికొన్ని సాహస కొత్త కంపెనీలతో కలిసి ఉచితంగా రాడికల్ సృజనాత్మక నాటకాలు రాయటానికి ఒప్పందాలు చేసుకొన్నారు .డేవిడ్ బేబ్ 1974లో రాసిన –ది బేసిక్ ట్రెయినింగ్ ఆఫ్ పావ్లో హమ్మెల్,స్టిక్స్ అండ్ బోన్స్-1972నాటకాలు అమెరికాదేశపు మిలిటరీ నేషనలిజాన్నీ,సాంస్కృతిక శూన్యాన్నీ ఎత్తిచూపే వ్యంగ్యాత్మక నాటకాలు .డేవిడ్ మామేట్ నాటకకర్త –న్యూయార్క్ డ్రామా క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ను 1976లో రాసిన ‘’అమెరికన్ బఫ్ఫెలో ‘’నాటకానికి పొందాడు .గ్లెంగర్రీ గ్లెన్ రాస్ 1984 మొదలైన నాటకాలలో మనషులు ఎలా ఆశలు ,నిరాశలు సూటిగా కాకుండా వాలుగా మర్మ గర్భ మాటలతో  వ్యక్తం చేస్తారో చూపాడు .1992లో రాసిన –ఒలియన్నా నాటకం లో సెక్సువల్ హరాస్మెంట్ పై జెండర్ వార్ చిత్రించాడు .

  అమిరి బరాకా (లి రాయ్ జోన్స్),ఎడ్ బుల్లిన్ లు ఇద్దరూ యాంగ్రీ బ్లాక్ నేషనలిస్ట్  దియేటర్ ను ప్రభావితం చేశారు .బరాకా రాసిన –డచ్ మాన్ ,దిస్లేవ్-1964 నాటకాలలో జాతి విద్వేషం ప్రతిబింబిస్తే ,బుల్లిన్ రాసిన –ఇన్ ది వైన్ టైం-1968 నాటకం లో వీధి గీతాలను –స్ట్రీట్ లిరిసిజం ను ప్రయోగించాడు .మేరియా ఇరీన్ ఫార్నెస్1977లో రాసిన ఫెఫు అండ్ హర్ ఫ్రెండ్స్ నాటకం లో మహిళల రిలేషన్ షిప్ ల అన్వేషణ జరిగింది .కనుక off బ్రాడ్వే నాటక ఆధిక్యత 1979లో అమెరికన్ డ్రామా చరిత్రలో పెరిగి ,సాం సేఫార్డ్ అనే ఫలవంతమైన ప్రయోగాత్మక నాటక రచయిత రాసిన –బరీ చైల్డ్ నాటకం పులిట్జర్ బహుమతి పొందింది .షెఫర్డ్ అంతకు ము౦దురాసిన –ది టూత్ ఆఫ్ క్రైం-1972నాటకాలు రాక్ నేపధ్యం ,1960నాటి కౌంటర్ కల్చర్ ను,అమెరికన్ వెస్ట్ లోని మిత్నిక్ వరల్డ్ ను  ప్రత్యక్షం చేశాయి .ఆఫ్ బీట్ డ్రామాలతో యితడు శిఖరాగ్రం చేరాడు . తీవ్రమైన ఫామిలి కాన్ ఫ్లిక్ట్  –కర్స్ ఆఫ్ ది స్టార్వింగ్ క్లాస్ -1976,ట్రూ వెస్ట్ -1980,ఫూల్ ఫర్ లవ్-1983,ఎ లై ఆఫ్ ది మైండ్ -1986,నాటకాలలో ఉన్నాయి .

  అమెరికన్ డ్రామాలో కొత్త స్వరాలు లాన్ఫోర్డ్ విల్సన్ ,రాసిన టాల్లీస్ ఫాలీ-1979నాటకం పులిట్జర్ పొందింది .జాన్ గువారే 1971లో రాసిన హౌస్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ లో సీరియస్ ఫార్స్ చేస్తే ,సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ -1990లో ఫ్రెష్ సోషల్ డ్రామా గా రాశాడు .నిటోజేక్ శాంఘే –కోర్ పొయెం-‘’ఫర్ కలర్డ్ గర్ల్స్ హు హావ్ కన్సిడర్డ్ సూసైడ్ /వెన్ ది రెయిన్ బౌఈజ్ ఎనఫ్ ‘’నాటకాలు బ్రాడ్వే నుకూడా కుదిపేశాయి .స్త్రీ నాటక కర్తలలో మార్షా నార్మన్ ,బెత్ హెన్లి,టినా హవ్,వెండి వాసర్ స్టెయిన్ ఉన్నారు .మా రైనీస్ బ్లాక్ బాటం -1984,ఫెన్సేస్-1987,నాటకాలకు పులిట్జర్ ప్రైజ్ పొందాడు.జో టర్నర్  కం అండ్ గాన్ -1986,రాశాడు .ఆగస్ట్ విల్సన్ బ్లాక్ ప్లే రైట్ గా1980లో  ఆవిష్కారం పొంది ,20వ శతాబ్దం లో ప్రతి దశకానికి సంబంధిన  విషయాలను  నాటకంగా మలచి ,1990లో రాసిన దిపియానో లెసన్ నాటకానికి  రెండవ పులిట్జర్ ప్రైజ్ అందుకొన్నాడు .ఈవిధంగా ఆశతాబ్దికి చెందిన పది దశకాలకు సంబంధించి పది డ్రామా సైకిల్ ను 2005లో తనమరణానికి కొద్ది కాలం ముందు రాసి పూర్తి చేశాడు .ఆగస్ట్ విల్సన్ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -24

20వ శతాబ్ది సాహిత్యం -16

కొత్త దిశలు -1960లో జేమ్స్ రైట్ శైలి నాటకీయంగా మారి౦ది.సాధారణ కవిత్వాన్ని వదిలేసి ,’’ది బ్రాంచ్ విల్ నాట్ బ్రేక్’’-1963,షల్ వుయ్  గాదర్  యట్ ది రివర్ -1968 కవితల లో  ‘’మెడిటేటివ్ లిరిసిజం ‘’గుప్పించాడు .విషయం ఛందస్సు,లయల  కంటే ఎమోషనల్ టెనార్ ఆఫ్ ఇమేజెస్ ‘’పై ఎక్కువ ఆధారపడ్డాడు. డేవిడ్ ఇగ్నటోవ్.-ఫిగర్స్ ఆఫ్ ది హ్యూమన్ -1964,రెస్క్యు ది డెడ్ -1968 కవితలలో చిన్నవే అయినా మహా పదునైన కవితలు చెక్కాడు .వీటిలో వేగం ,సాధారణత్వం ,పారడాక్స్,పర్సనల్  ఇమ్మీడియసిఉన్నాయి .ఎమెర్సన్

ట్రాన్ సేండేన్స్ ప్రభావం తో ఎ.ఆర్. అమ్మాన్స్ స్వర కూర్పుతో వచన కవిత్వం రాశాడు .ఇతడి బ్రీఫింగ్స్-1971,కవిత ఆఅటోబయాగ్రాఫికల్ జోటింగ్స్,చిన్న చిన్న మెరుపులు అబ్జర్వేషన్ లతో నిండి ఉంటుంది .కాని దీర్ఘ కవితలు సాధారణ ప్రపంచాన్ని విజన్ లా మార్చాయి .ఇగ్నటోవ్ లాగా  సాహిత్య గుబాళింపు తగ్గి, దారిపక్క మనుషుల జీవితాలపై ప్రకాశ కిరణాలను ప్రసరించింది .

  రోజు వారీ జీవితం ,ఫ్రెంచ్ సర్రియలిజం వ్యాప్తి ,న్యూయార్క్ కవుల గ్రూప్ అయిన   ఫ్రాంక్ ఒ హర ,కెన్నెత్ కోచ్ ,జేమ్స్ స్యూయ్లర్ ,జాన్ ఆష్ బెర్రీ లను ప్రభావితం చేసింది .హరకవిత్వం  సినిమా స్టార్ల పొగడ్త తో కలిసిఉన్నా ,తక్షణ విషయంగా, విలక్షణం గా ప్రత్యేకంగా ఉన్నది .కోచ్ కామిక్ వాయిస్ చిన్న విషయాలనుంచి ,అద్భుత విషయాల దాకా ఊపి పారేసింది .వాలెస్ స్టేవెన్స్ ప్రభావం బాగా ఉన్న యాష్ బెరీ లోతైన అంతర్ దృష్టి,సమస్యాత్మక చిత్రకం గా ,వివేక విన్యాసంగా కవితలు రాశాడు .పోఎటిక్ కలర్ వదిలేసి ఆ కవితలు సూచనాత్మకంగా ,సన్నిహితంగా ,అనుభవం ,అవగాహనల మధ్య అన్వేషణకు దారి చూపిస్తాయి .

   యుద్ధానంతర కవులలో బాగా ఆకట్టుకొన్న కవులలో ఎలిజబెత్ బిషప్ సింపుల్ గా ఆకర్షణతో ఆమె మెంటార్ అయిన మేరియన్నే మూర్ కవితలకు ప్రతిధ్వనిగా రాసింది .ఆమె స్నేహితుడు లోవెల్ యొక్క కన్ఫెషనల్ మోడ్ ను తప్పించి ,స్థలాని ,మర్యాద తో కూడిన హార్ట్ బ్రేకింగ్ శైలికి ,పరిశీలన శక్తికి అందరికంటే ముందున్నది .జేమ్స్ మెర్రిల్ –‘’ది చేంజింగ్ లైట్ యట్ సా౦డోవర్-1982లో లైట్ హార్టెడ్ పర్సనల్ ఎపిక్ కవిత్వం ను  ఓజా బోర్డ్ అనే చనిపోయిన స్నేహితుల  కవి ఆడెన్ నీడలుగా రాశాడు .1976లో రిఫ్లెక్షన్స్ ఆన్ ఎస్పినేజ్ ,బ్లూ వైన్-1979,పవర్స్ ఆఫ్ తర్టీన్-1983 కవితలలో కెరీర్ హైలైట్ కవిత్వాన్నీ ,రాస్తే ,జాన్ హోలాండర్ మాత్రం మెరిల్ లాగా టెక్నికల్ ఫీట్స్ చేశాడు .రిచార్డ్ హొరార్డ్ కవి విట్టీ మొనోలాగ్స్ ,చరిత్ర ప్రసిద్ధ పురుషుల డయలాగ్స్ లతో అన్ టైటిల్డ్ సబ్జెక్ట్స్ -1969,టు పార్ట్ ఇన్వెన్ష న్స్-1974లో రాసి జనాన్ని ఆకర్షించాడు .

   అటోబయాగ్రఫికల్ కవితా విధానాలు –మార్క్ స్ట్రాండ్ పారడాక్సికల్ కవితా భాష తో గ్రంధులు,పారబుల్స్ ఆఫ్ రీజన్ లతో మూవింగ్ -1968,డార్కర్-1970 కవితలు రాశాడు .డార్క్ హార్బర్ -1993 బ్లిజ్జార్డ్ ఆఫ్  వన్స్- 1998 కవితలతో తన కవి గౌరవాన్ని బాగా పెంచుకొన్నాడు ఇలాగే ఆతోబయాగ్రఫికల్ కవితలు రాసి లబ్ది పొందినవారిలో ఫిలిప్ లెవిన్ ,రాబర్ట్ పిన్స్కి,జెరాల్డ్ స్టెర్న్,లూయీ గ్లిక్ ,షరాన్ ఓల్డ్స్ ఉన్నారు .డెట్రాయిట్ వర్కింగ్ క్లాస్ వారితో పని చేసిన కవి లెవిన్ కవిత్వ పోకడే చాలా తేడాగా ఉండేది .ఓల్డ్స్ కవి అద్భుత ఎమోషనల్ తీవ్రత ,పుష్కలత్వం తో కవిత్వాన్ని గుబాళింప జేశాడు .పిన్స్కి కవితలన్నీ 1996లో ‘’ది ఫిగర్డ్ వీల్ సంపుటిగా  వెలువడ్డాయి .1997నుంచి 2000వరకు’’ పొయెట్ లారియట్’’ గా ఉన్న పిన్స్కి వైవిధ్య రసభరిత ఆలోచనాత్మక దిశా నిర్దేశపు కవిత్వాన్ని అవిచ్చిన్నంగా ప్రవహింప జేశాడు .సికె విలియమ్స్ కవి- టార్-1983,ఫ్లెష్ అండ్ బ్లడ్-1987 కవితలలో నెరేటివ్ టెక్నిక్స్ ను ప్రయోగించి సూక్ష్మ విషయాలను కూడా పరిశీలించి ప్రయోగాత్మక కవిత్వ ధార కురిపించాడు .ఇతడు 2000లో రాసిన ‘’రిపేర్ ‘’కవితా సంపుటి పులిట్జర్ ప్రైజ్ పొందింది .అడ్రేన్నే రిచ్ కవయిత్రి లెస్బియన్  ఫెమినిజం కవిత్వాన్ని –విల్ టు చేంజ్ ,1971,డైవింగ్ ఇంటు ది రెక్-1973 కవితలు ఆశతాబ్దపు 1960నాటి కవిత్వానికి మలుపు త్రిప్పే కవితలు .

   ఆ దశాబ్దం లోపాతకవులు కొందరు ఆటోబయాగ్రాఫికల్ కవిత్వం గిలికారు .వీరిలో స్టాన్లీ కునిట్జ్,రాబర్ట్ పెన్ వార్రెన్ డబ్ల్యు ఎస్ .మెర్విన్ లున్నారు .1960దశాబ్దం నల్ల జాతి కవులకు స్వర్ణయుగమే .వీరిలో రాబర్ట్ హేడెన్,గ్వెండోలిన్ బ్రూక్స్ మైఖేల్ ఎస్ హార్పర్ ఉన్నారు .వీరిరచనలు 1980నాటి యువ కవులకు గొప్ప నేపధ్యం అయింది .వీరిలో ఎడ్వర్డ్ హిరీష్ ,అలాన్ షాపిరో,జోరీ గ్రాహం , కేథీ సాంగ్ ,రీటా డవ్ ఉన్నారు .రీటా తన గ్రాండ్ పేరెంట్స్ ధామస్ ,జ్యూలా ల పై రాసిన సీక్వెన్స్ కవితలకు పులిట్జర్  ప్రైజ్ 1987లో వచ్చింది .ఆబ్స్ట్రాక్ట్ గా ,అంతు చిక్కనట్లు-ది డ్రీం ఆఫ్ దియూనిఫైడ్ ఫీల్డ్ – కవిత్వం రాసిన గ్రాహమ్స్ తన    అయిదు సంపుటులనుంచి దీన్ని ఎంపిక చేసి వేసింది .ఎయిడ్స్ సంక్షోభానికి ప్రేరణ పొందిన మార్క్ డోటీ-మై అలెగ్జాండ్రియ -1993,ధాం గన్ 1992లో రాసిన ది మాన్ విత్ నైట్ స్వీట్స్ ,గొప్ప మెమాయిర్ అయిన బారోడ్ టైం-1988 మరికొన్ని పాల్ మోనెట్టీ 1988లో రాసిన సైక్లిక్ కవితలు లవ్ ఎలోన్ ఉర్రూతలూగించి గొప్ప జాగృతి అవగాహన కలిగించాయి.లూసియాన కవి యూసఫ్ కొమున్యాక  ప్రభావంగల ఆఫ్రికన్ అమెరికన్  వాయిస్ గా 1990లో ఆవిర్భవించాడు .యుద్ధ సైనికుడుగా ,వార్ కరేస్పా౦ డెంట్ గా తన అనుభవాలను ‘’వియత్నాం ఇన్ డీన్ కై దావు-‘’1988లో రాసి ,తన కొత్తకవితా సంపుటి నియాన్ వెర్నాక్యులర్ -1994లో పులిట్జర్ ప్రైజ్ పొందాడు .ఇతని కవితలన్నీ ‘’ప్లెజర్ డోమ్’’ కవితా సంపుటిగా 2001లో ముద్రణ పొందాయి .బిల్లీ కాలిన్స్ కవి తన విట్టీ ,సంభాషణాత్మక కవిత్వపఠనం తో అశేష జనాన్ని ఆకర్షించాడు .ఇవన్నీ ‘సెయిలింగ్ అలోన్ అరౌండ్ ది రూమ్స్ ‘’గా 2001లో అతడు పోయెట్ లారియట్ అయిన సంవత్సరం లో పబ్లిష్ అయ్యాయి. దీని తర్వాత యుద్ధానంతర నాటక సాహిత్యం గురించి తెలుసుకొందాం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-5-21-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

Posted in రచనలు | Tagged | Leave a comment

మనకు తెలిసీ తెలియని సంగతులు

మనకు తెలిసీ తెలియని సంగతులు

‘’బృహత్ శంకర  విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ హర్ష  విక్రమార్కుడు పుట్టాడు .హర్షుడు రాజ్యానికి వచ్చాక తండ్రి చంద్ర వర్మనర్మదా తీరం లోని గౌడ పాదుని ఆశ్రయించి ,గోవింద భగవత్పాదుడు అయ్యాడు .ఈయనే మన శంకరాచార్యుల వారి గురువు .గౌడపాడుడు పతంజలి మహర్షి నుంచి వ్యాకరణ౦,శుక మహర్షి నుంచి బ్రహ్మ విద్య నేర్చాడు .హర్ష విక్రమాదిత్యుడు నేపాల్ ను కూడా పాలించాడు .పార శీకుల్ని ఓడించి పారద్రోలాడు .ఈపారశీకులు’’ శకే ‘’అనే దేశ౦ నుంచి  వచ్చారు,ఓడిపోయారుకనుక విక్రముడికి ‘’శకారి’’ బిరుదు వచ్చింది .ఇతడు క్రీపూ.457లో చనిపోయాడు .అప్పటి నుంచి హర్ష శకం ప్రారంభమైంది .

  పారమార వంశానికి చెందిన మరో విక్రమార్కుడు ఉజ్జయిని ని పాలించాడు .ఇతడు క్రీ .పూ.57న విక్రమ శకం ప్రారంభించాడు .ఇతడి కొడుకే శాలివాహనుడు .శాలివాహనుడు క్రీ శ 54లో రాజ్యానికి వచ్చి ,క్రీ శ.78లో శకులను ఓడించి ,శాలివాహన శక కర్త అయ్యాడు .ఇలా మూడు శకాలు ప్రారంభమయ్యాయి .

  చంద్ర వర్మ పూర్వాశ్రమం లో గౌడ పాదుని శిష్యుడై ,విద్యనేర్చి నాలుగు వర్ణాలలోని నలుగురు కన్యలను పెళ్ళాడి వాళ్ళ వలన వరరుచి ,విక్రమాదిత్య ,భట్టి, భర్తృహరి అనే కొడుకులకు జన్మ నిచ్చాడు .వరరుచి పాణిని కి సహాధ్యాయి .విక్రమార్కుడు ఉజ్జయిని చక్రవర్తి అవగా ,భట్టి మహా కవిగా రాజాస్థానం లో ఉన్నాడు .భర్తృహరి ‘’వాక్య పదీయం’’అనే వ్యాకరణం ,శతకాలు రాశాడు .

  పతంజలి శాపానికి గురైన గౌడ పాదుదు  బ్రహ్మ రాక్షసిగా పుట్టి ,సమర్ధుడైన వాడికి తన వ్యాకరణం బోధించి ,శాప విమోచనం పొందాడు .గురువు ఆదేశం తో ఉత్తరదేశయాత్ర చేస్తూ,చంద్రవర్మకు వ్యాకరణం బోధించి శాపం పోగొట్టుకొన్నాడు .

  చంద్ర వర్మ గోవింద భగవత్పాదుడై,నర్మదా నదీ తీరం లో అమరేశ్వరం (ఓంకార క్షేత్రం )లో శిష్యులకు బోధ చేస్తూ  ,నర్మదా ద్వీపం అయిన మాంధాత ద్వీపం లో క్రీ.పూ.494న సిద్ధి పొందాడు .అప్పుడు కొడుకు విక్రమాదిత్యుడు ఓంకార  నాధ దేవాలయం నిర్మించి ,అమరేశ్వర లింగ ప్రతిష్ట చేశాడు .శ్రీ హర్ష విక్రమాదిత్యుడు ఉజ్జయిని చక్రవర్తి అయి ,శకులను ఓడించి క్రీపూ 457 శ్రీ హర్ష శకం ప్రారంభించాడు .గుప్త వంశ చక్రవర్తి చంద్ర గుప్తుడు కూడా విక్రమాదిత్య బిరుదు పొంది ,పారశీకులను ఓడించి క్రీపూ 270లో మగధ రాజ్యాధిపతి అయ్యాడు .మాళవ దేశ రాజు విక్రమాదిత్యుడు క్రీపూ 57లో పట్టాభి షిక్తుడై ,విక్రమార్క శకం ప్రారంభించాడు .ఇలా ముగ్గురు విక్రమాదిత్యులు ఉండటం తో చరిత్రకారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు .

  పూర్ణ వర్మ అనే రాజు జావా ద్వీపాన్ని పాలించాడు .మరో పూర్ణ వర్మను చైనాయత్రికుడు హుయాన్ సాంగ్ ప్రస్తావించాడు .ఈకాలం క్రీ శ 540 కనుక శంకరాచార్య ఆ కాలానికి చెంది ఉంటాడు అని తెలంగ్ అనే పండితుడు ఉవాచ .శశాంకుడు అనే రాజు బౌద్ధులకు ప్రాణప్రదమైన బోధి వృక్షాన్ని నరికి౦చేశాడు .అశోక వంశానికి చివరి రాజైన పూర్ణవర్మ వెయ్యి ఆవులపాలతో దానికి అభిషేకం చేసి చిగురింప జేశాడు .ఆ బోధి వృక్షం చుట్టూ 24అడుగుల ఎత్తైన గోడ కట్టించాడని,హుయాన్సాంగ్ వచ్చేనాటికి గోడ శిధిలమై 4అడుగుల ఎత్తు మాత్రమె ఉందని హుయాన్ సాంగ్ రాశాడు .

   క్రీ శ 750లో పాటలీపుత్ర నగరం గంగానది వరదలలో మునిగిపోతే ,ప్రస్తుతం ఉన్న పాట్నా క్రీశ 1541లో ఉద్ధరింప బడింది .అలాగే ‘’సుఘ్న నగరం ‘’ధానేశ్వరం’’దగ్గర యమునా నది ఒడ్డున ఉండేది .ఈ రెండు పట్టణాలను శ్రీ శంకరులు పేర్కన్నారు .వీటన్నిటి వలన తేలిన విషయం –శ్రీ శంకర భగవత్పాదులు పాశ్చాత్యుల లెక్క ప్రకారం క్రీ శ లో పుట్టిన వారు కానే కాదు. క్రీ.పూ .500ప్రాంతం వారు .ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే క్రీ పూ 509 కి చెందిన వారు .

ఆధారం –శ్రీఅనుభవానంద స్వామి వారి’’ సర్వ సిద్ధాంత సౌరభం’’ .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | 2 Comments

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -23

20వ శతాబ్ది సాహిత్యం -15

 యుద్ధానంతర కవిత్వం

పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల  ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం సమాప్తి చెందే రోజులవి .1945-60మధ్య వచ్చిన కవిత్వం ఆధునిక కవిత్వంగా ఐరానిక్ కవిత్వంగా పేరు పొందింది .మామూలు ఛందస్సు లయ కు ప్రాధాన్యం ఉన్నదే .1950 తర్వాత ప్రారంభమైన కవుల కవిత్వం లో వెరైటీ తోపాటు వివిధ భావాల ప్రభావం ఉంది .ఉన్నదానితో తృప్తి పడకుండా ,తిరుగుబాటు చేసి ప్రయోగాలు చేస్తూ ,ఇంకా వాడుక భాషలో ,ఇంకా విస్పష్టంగా కవిత్వం రాశారు .

     అధికారిక –ఫార్మల్ కవులు -1940తర్వాత కవులలో రాబర్ట్ లో వెల్ కవి ,ఇలియట్ ప్రభావం తో ,మెటా ఫిజికల్ కవులు  జాన్ డోన్నె,జేరాల్ద్ మాన్లి హాప్ కిన్స్ ప్రభావం తో ఆధ్యాత్మిక ,కుటుంబ సంబంధ కవితలు ‘’లార్డ్ వీరీస్ కాజిల్ ‘’-1946లో రాశాడు .ప్రభావితం చేసిన ఇతర ఫార్మల్ కవులలో దయోడర్ రోత్కే,కవి విలియం బట్లర్ యేట్స్ ప్రభావం తో ఐరానిక్ లిరిక్స్ ను అత్య౦త ప్రతిభావంతంగా ,ప్రకృతిపై మక్కువతో ‘’దిlost son అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’-1948లో రాస్తే ,రిచర్డ్ విల్బర్1956లో ‘’ధింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ‘’కవితా సంపుటి ,రా౦డాల్ జారెల్ 1948లో’’ losses’’ రాశాడు .డబ్లు హెచ్ ఆడెన్ ప్రభావంతో కొందరు యువకవులు జేమ్స్ మెర్రిల్ ,డబ్లు ఎస్ మెర్లిన్ జేమ్స్ రైట్ ,అడ్రిన్నే రిచ్ జాన్ హోలా౦డర్ లు కవిత్వం రాశారు .అద్భుత టెక్నికల్ నైపుణ్యం ప్రదర్శించినా ,వీళ్ళకు ఆడేన్స్ నాడి దొరకలేదు .ప్రయోగాలు ,బీట్ కవిత్వం -1950మధ్యకాలం లో గొప్ప ప్రతిక్రియ ఒకటి ఏర్పడింది .కవులు ఇలియట్ ,మెటాఫిజికల్ కవిత్వాలను వదిలేసి మరింత రొమాంటిక్ గా ,మరింత వచనాత్మకం గా రాయటం మొదలెట్టారు .ఇలాంటి కవులలో వాల్ట్ విట్మన్ ,విలిం కార్లోస్ విలియమ్స్ ,హార్ట్ క్రేన్,డి.హెచ్ లారెన్స్ ఉన్నారు .పడమటి నార్త్ కరోలినా లోని బ్లాక్ మౌంటేన్ కాలేజి కి చెందిన కవుల గ్రూప్ ఒకటి –చార్లెస్ ఓల్సన్ ,రాబర్ట్ క్రీలీ ,రాబర్ట్ డంకన్,ఎడ్వర్డ్ డార్న్,డెనిస్ లీవర్ స్టవ్ లు కవిత్వం లో ఫారం కంటే విప్పి చెప్పటానికే ప్రాధాన్యమిచ్చారు .ఓల్సన్ రాసిన ‘’మాక్సిమస్ పోయెమ్స్ ‘’-1953-68లో బెల్లం పాకం లాంటి ,అసమానంగా ఉండే ధారతో ఎజ్రా పౌండ్ యొక్క ‘’కాంటోస్’’,విలియమ్స్ రాసిన ‘పాటర్సన్ ‘’ధోరణిలో రాశారు .అలేన్స్ గీన్ బర్గ్ –అసంకల్పిత ,మతప్రవక్త ప్రబోధ విధానం లో 1956లో ‘’హౌల్ ‘’ను,మనసును కదిలించే  తనతల్లి స్మృతి కవిత’’కాడ్డిష్’’-1961లో రాసి శక్తి వంతమైన ‘’బీట్ కవిత్వానికి ‘’నాంది పలికాడు .అసాధారణ తీవ్రత తో రాసిన ఈ కవితలు వాల్ట్ విట్మన్ విలియం బ్లేక్ ,క్రిస్టఫర్ స్మార్ట్స్ కవితలు ప్రభావితం చేసినట్లు ప్రభావం చూపాయి .దీనితో పాటు ఫ్రెంచ్ సర్రియలిస్ట్ కవుల డ్రీం లాజిక్ ,జాజ్ సంగీత కళా సౌందర్యారాధన భావనలన్నీ గిన్స్ బెర్గ్ స్నేహితుడు నవలాకారుడు జాక్ కేరోనాక్ లో కనిపిస్తాయి ఇతర బీట్ కవులలో లారెన్స్ ఫెర్లి౦ఘెట్టి. ,గ్రిగరికోర్సో ,గేరీ సిండర్స్ ఉన్నారు ..ఈస్టర్న్ రెలిజియన్ కు చెందిన స్టూడెంట్  -సిండర్స్ కవి 1974లో రాసిన ‘’టర్టిల్ ఐలాండ్ ‘’లో అమెరికన్ సంప్రదాయమైన నేచర్ కవిత్వం రాయటం విశేషం .

  కప్పి పుచ్చటం కన్నా ,విప్పి చెప్పటం లోనే ఆనందం పొందిన బీట్ కవిత్వం విలియమ్స్ కవిలోని సూటి విధానం నచ్చి లో వెల్ కవి ,కొత్త ఆటోబయాగ్రఫికల్  శైలిని లాకోనిక్ కవిత్వం వచనం లలో ‘’లైఫ్ స్టడీస్ ‘’-1959,’’ఫర్ ది యూనియన్ డెడ్’’-1964లో ప్రయోగించాడు .లోవేల్స్ రాసిన ఈ కొత్తరకం కవిత్వం దాదాపు అందరు  అమెరికన్ కవులకు ప్రేరణ కలిగించింది .కాని కన్ఫెషనల్ గ్రూప్ కు చెందిన కొద్దిమంది కవులు –ఆన్నే  సెక్స్టన్,తన ‘’బెడ్లా౦అండ్ పార్ట్ వె బాక్ -1960.,ఆల్ మై పోయెట్రీ-1962,సిల్వియా ప్లాత్ మరణానంతరం 1965లోప్రచురింపబడిన ‘ఏరీల్ ‘’  ప్రేరణ పొందలేదు .ప్లాత్ మాత్రం వైట్ హాట్ ఎమోషనల్ ఇంటేన్సిటి లోని ఐసి సర్కాసిజం కు ఆకర్షితురాలైంది .లోవెల్ ప్రభావం పొందిన మరొక కవి జాన్ బెర్రిమన్ ‘’డ్రీం సాంగ్స్ ‘’-1964,68 లో ఆటో బయాగ్రఫికల్ ఎలిమెంట్ ను సంగీతం ,స్వీయ వ్యక్తీకరణ ,కామిక్ ట్రాజిక్ విషాదం రంగరించి రాశాడు .సెక్స్టన్,ప్లాత్,బెర్రిమేన్ లు విషాద జీవితాలే గడిపారు .ఫ్రెడరిక్ సీడెల్2021లో రాసిన ‘’లైఫ్ ఆన్ ఎర్త్ ‘’అలాగే అవార్డ్ పొందిన సన్ రైజ్ –1980కవితలు లోవెల్ ప్రభావానికి లోనై రాసినవే .

    డీప్ ఇమేజ్ కవులు –తన మేగజైన్,స్వంత  చారిస్మాతో దిఫిఫ్టీన్ ,ది సిక్ష్టీస్,ది సేవెంటీస్.లతో రాబర్ట్ బ్లై-ఎందరెందరో కవులను తమ స్వంత గొంతుకలను వినిపించమని ప్రోత్సహించి రాయించాడు .ఈ ప్రభావం తో రాసినవారిలో గాలవే కిన్నేల్ ,జేమ్స్ రైట్ ,డేవిడ్ ఇగ్నటోవ్,లూయిస్ సింప్సన్ ,జేమ్స్ డిక్కీ ,డోనాల్డ్ హాల్ ఉన్నారు .వీళ్ళనే ‘’డీప్ ఇమేజ్ కవులు ‘’అన్నారు .బ్లై,అతని స్నేహిత కవులు స్పిరిట్యువల్ ఇంటేన్సిటి,ఆత్మను అధిగమించే ఆలోచనలతో తాత్కాలికానికి స్వస్తి చెప్పి రాశారు .వీరిని ప్రభావితం చేసిన వారిలో స్పానిష్ ,లాటిన్ అమెరికన్ రచయితలైన ఫెడ్రికో గార్సియా లోర్కా ,జువాన్ రేమాన్ జిమ్మేన్జ్ ,సేసార్ వేల్లిజో ,పాబ్లో నెరూడా ఉన్నారు .వీళ్ళందరి సర్రియలిజం ఇమేజేరి ,వారి గ్రీన్ హౌస్ పోయెమ్స్ -1946-48కవితలు తర్వాత వచ్చిన రోత్కే రాసిన మెడిటేటివ్ కవితలు ,వాటిలోని ప్రకృతి అనుభవం  ఈకవులకు ఆధ్యాత్మిక పరివర్తనకు మార్గ దర్శనం చేశాయి .కాని వాళ్ళ హిస్పానిక్ మోడల్స్ ల రాజకీయ కవిత్వం అంటే వియత్నా౦ యుద్ధం పై  వ్యతిరేక కవితలు .,లారెన్స్ ప్రేరణ ఉన్న  కవి కిన్నేల్  ‘’ది పోర్క్యుపైన్,ది బేర్ కవితలలో ప్రకృతికిరాతకం ,మిత్ కున్న శక్తి చాటాడు .అతడి వాటిక్ సీక్వెన్స్ –ది బుక్ ఆఫ్ నైట్ మేర్-1971,ది మోర్టల్ యాక్ట్స్ ఆఫ్ ,మోర్ట ల్ యాక్ట్స్ ,మోర్టల్వర్డ్స్ -1980 లు ఆలంకారిక కవితలు. సమకాలీన కవులను బాగా ప్రభావితం చేశాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-21-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్

 ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన వారు సిద్ధాంతీకరించారు .ఈ ఈధర్ లోనే అసంఖ్యాక నక్షత్ర గోళాలలో భూమి తన చుట్టూ తానూ గంటకు వెయ్యి మైళ్ళ వేగం తో తిరుగుతూ ,సూర్యుడిని సెకనుకు 20మైళ్ళ వేగం తో చుట్టి వస్తుంది .భూమి ,చంద్రులు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారు .సూర్యుడు తన గ్రహ కూటమి తో సహా మిల్కీవే లో కనిపిస్తూ ,బ్రహ్మ నక్షత్రం’’ వెగా ‘’చుట్టూ ,సెకనుకు 13మైళ్ళ వేగంతో తిరుగుతాడు .ఈ బ్రహ్మ నక్షత్ర కూటం అంతా నక్షత్ర వీధి –పాలపుంత ను సెకనుకు 200మైళ్ళ వేగం తో చుడుతుంది .ఈ నక్షత్ర వీధి అతి దూరంగా ఉన్న మరో నక్షత్ర కూటాన్ని సెకనుకు 100మైళ్ళ వేగం తో చుట్టి వస్తుంది .వీటన్నిటికి మధ్య భాగం లో మానవ దృష్టికి కనిపించని మూల కేంద్రకం ఒకటి ఉంటుందని న్యూటన్ భావించాడు .కానీ ఈ అసంఖ్యాక గోళాలకు ఆధార మైన స్పేస్ అనేది భౌతిక మైన సద్వస్తువు .అది అతి నిశ్చలంగా అచంచలంగా ఉందని ,అది ప్రకృతిలో ఈశ్వరుని సర్వ వ్యాపకత్వాన్ని నిరూపించే పదార్ధం అని న్యూటన్ విశ్వసించాడు..

   న్యూటన్ తర్వాత కాలం లో ఈధర్ వాదాన్ని శాస్త్ర వేత్తలు త్రోసి పుచ్చారు .కారణం ఏమిటి అంటే ఈధర్ లో భ్రమణం చేసే భూ మండలం నుంచి అనుకూల వ్యతి రేక దిక్కులకు ప్రసరింప చేసిన కాంతి వేగాల్లో తేడాలు కనిపించటమే .కనుక ఈధర్ అనేది పదార్ధ భావం కాదు అని తేల్చారు .ఈధర్ పదార్ధ భావం కాదు అన్న ఈ సిద్ధాంతాన్ని అయిన్ స్టీన్ –భూ భ్రమణం వలన మాత్రమె కాక ,సూర్యాది ఇతర గ్రహ భ్రమణ విశేషం వలన కూడా కాంతికి ఎలాంటి అంతరాయం ఏర్పడదు అని తీర్మానించాడు .ఈ సిద్ధాంత ఫలితంగా స్పేస్ కు దిక్కులు కాని అవధులు కాని లేవని, దేశ ,కాలాలు ఇంద్ర ధనుసు రంగులు లాగా కల్పితం అన్నాడు .అన్ని వస్తువులకు అవకాశం ఇచ్చేదే స్పేస్అని ,ఈ స్పేస్ లో జరిగే కార్య పరంపరను సూచించేదే కాలం .దీని గణనకు సెకను నిమిషం గంట ఏర్పడ్డాయి .అభావం అయిన కాలానికి ఈ సూచనలే ఆధారం వస్తువులునికి తెల్పే స్పేస్ లాగే ,వస్తువు యొక్క కార్య సంఘటన క్రమాన్ని మాత్రమె కాలం సూచిస్తుంది .పరాపరాలు ముందు వెనుక రూపం లో దేశ అంటే స్పేస్ కాలాలు ప్రవర్తిస్తాయి .స్పేస్ కు ఒకరకమైన కొలతలు ,కాలానికి వేరే రకమైనకొలతలు కావాలి .అంటే అనిర్వచనీయం ,సర్వవ్యాపకం అయిన దేశ కాలాలను కృత్రిమమైన కొలతలతో స్థూలం చేస్తున్నామన్నమాట .ఈ కొలిచే విధానం సూర్య గ్రహ కూటాలకు మాత్రమె సంబంధించినవి .ఇతర చోట్ల ఉపయోగ పడవు .ఆకాశం లో  సూర్యుడు 15డిగ్రీలులో ఉంటె గంట  అనీ ,సూర్యుడిని ఒకసారి  భూమి చుట్టివస్తే సంవత్సరం అంటాం .కానీ బుధ గ్రహాన్ని చూస్తె అది సూర్యుడికంటే భూమికి దగ్గరగా ఉండటం వలన 88రోజుల్లో సూర్యుడిని చుట్టి సంవత్సరం పరిమాణాన్ని తగ్గించింది .తన చుట్టూ తానూ తిరగటానికి 88రోజులు పడుతుదికనుక రోజుకు, సంవత్సరానికి మానం లో తేడా ఉండదు .శుక్రుడికి 225రోజుల సంవత్సరం .కొన్ని వారాల రోజు ఉంటుంది .అంగారక గ్రహం భూమి కంటే దూరంగా ఉంటుంది  కనుక అక్కడ సంవత్సరానికి 687రోజులు ,రోజుకు 24గంటల 55నిమిషాలు ఉంటాయి .బృహస్పతి జూపిటర్ కు 9గంటల 55నిమిషాలు ఒక రోజు .శనికి 10గంటల 14నిమిషాలు ఒక రోజుకు .ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కో కాలమానం ఉంటుంది .మన దేశం లో సూర్యోదయమైతే అమెరికాలో రాత్రి అవుతుంది .దేశాకాలపరిస్థితులను బట్టి మాన విధానం మారుతుంది .ఈకాలమానాలు మనం కల్పించుకొన్నవే కదా .వీటిని కాదంటే ,దేశకాలాలు సువిశాలాలు ,నిర్వికారాలు,నిరవదికాలు అవుతాయి .ఇదే వాటి సహజ స్వరూపం .ఇక్కడ ముందు వెనకలు, పైనా కిందా లేనేలేవు .మనిషి తన సౌకర్యం కోసం వీటిని కల్పించి ,అనుభవిస్తున్నకాలం వర్తమానం అనీ ,దానికి ముందుది భూతకాలమని ,దాని తర్వాతది  భవిష్యత్ కాలం అని భావిస్తున్నాడు .అంటే అఖండ కాలానికి ఖండత్వం కల్పిస్తున్నాడు .అభిన్నమైన దేశం అంటే స్పేస్ లో లోపల బయట అనీ ,దూరం,దగ్గర అనీ కల్పించుకొని జీవిస్తున్నాడని అయిన్ స్టీన్ మహాశయుని సిద్ధాంత తాత్పర్యం.

   పై విషయాలను మరింత లోతుగా సూక్ష్మ౦గా ఆలోచిస్తే దేశ ,కాలాల మధ్య తేడా తగ్గించి space-time –continuum   అంటే దేశకాల ప్రవాహం అనీ ,అంతా దేశ కాలనిబద్ధమని ,ఈ ద్వయం అభిన్నమని అంటే కాల మానాలు నిజానికి దేశ మానాలే అనీ ,అవి పరస్పర అపేక్షికాలని ,ఐన్స్టీన్ సిద్ధాంతీ కరించాడు .అంటే ప్రకృతిలో ఈ రెండు ఒక్కటే అని ,కనిపించే భిన్నత్వం కల్పితమని ఆయన భావం .ఆయన సిద్ధాంతం ప్రకారం పాంచ భౌతిక వస్తుజాలం అంతా దేశ ,కాల బద్ధాలై నాలుగు కాలమానాలు కలిగి ఉంది .అందులో మూడు దేశానికి అన్వయిస్తే ,ఒకటి మాత్రం కాలానికి .పొడవు వెడల్పు ఎత్తు అనేవి దేశానికీ ,ఎప్పుడు అనే ప్రశ్న కు సమాధానం కాలానికి చెందుతుంది .వ్యక్తికి సంబంధించిన దేహ పరిమాణం దేశానికి ,వయస్సు కాలానికి అన్వయిస్తుంది .ఇలాగైనా దేశకాలాలు అభిన్నాలు అని అయిన్ స్టీన్ సిద్ధాంతం .ఆధునికకాలం లో యెంత దూరం అనే ప్రశ్నకు రైలులో కొన్నిగంటలు విమానం లో కొన్ని నిమిషాలే కదా .దేశ మానం లో అంగుళం మొదలైనవి మూడు కొలతలకు అంటే పొడవు వెడల్పు ఎత్తు లకు సరిపోతే ,కాలం మాత్రం క్షణాధికానికి అన్వయిస్తోంది .దేశ,కాలాల సంకోచ వ్యాకోచాలు మానవా ధీనాలు కానీ కాలాన్నే వేగ వంతం చేయటం కాని ,నెమ్మదిని చేయటం కాని వెనక్కు తిప్పటం కానీ  మనకు సాధ్యం కాదు .సర్వ చరాచరాలు పరాధీనం అయి ,భూతకాలం నుంచి వర్తమానానికి, దానినుంచి భవిష్యత్తుకు సాగిపోవాల్సిందే కానీ ,మార్గాంతరం లేదు .దేశాకాలాలలో కొంచెం తేడా కనిపించినా అవి కల్పితాలే అని భావించి ,ఏకం చేసి ,కాలాన్ని నాలుగవ మానం గా చేర్చి ,సమన్వయ పరచి ,విజ్ఞాన లోకానికి నూతన భావ ధారను అయిన్ స్టీన్ కల్పించాడు .హాట్సాఫ్ టు హిం .ఇది కణాదుల వైశేషిక న్యాయానికి దారితీసింది .

   ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-21-ఉయ్యూరు 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

20వ శతాబ్ది సాహిత్యం -14 203-అమెరికాదేశ సాహిత్యం -22

బహుళ సాంస్కృతిక సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం

20వ శతాబ్ది సాహిత్యం -14

బహుళ సాంస్కృతిక సాహిత్యం -2

ఎన్.స్కాట్ మామడి రాసిన ‘’హౌస్ మేడ్ ఆఫ్ డాన్’’నవలకు 1969లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .జేమ్స్ వెల్ష్ రాసిన’’వింటర్ ఇన్ ది బ్లడ్—1974,’’ఫూల్స్ క్రో’’-1986,లెస్లీ మార్మన్ సిల్కో రాసిన ‘’సెరిమని ‘’-1977,లూయీ ఎండ్రిచ్ నవల ‘’లవ్ మెడిసిన్ -1984,ది బీట్ క్వీన్ -1986,యాంటి లోప్ వైఫ్ -1998 నవలలు  నేటివ్ అమెరికన్ హిస్టరీ,అస్తిత్వ  పరిశోధన పై   అస్పష్ట శక్తివంతమైన నవలలు .మెక్సికన్ అమెరికన్ లగురించి రుడాల్ఫోఎ.అనయ రాసిన ‘’బ్లెస్ మీ ఉల్టిమా’’-1972,రిచార్డ్ రోడ్రిగెజ్ రాసిన స్వీయచరిత్ర లాంటి ‘’హంగర్ ఆఫ్ మెమరి ‘’-1981,సాండ్రా సిస్నేరోస్ రాసిన ‘’ది హౌస్ ఆన్ మాంగో స్ట్రీట్ ‘’-1983,ఈమెదే అయిన వుమన్ హోలరింగ్ క్రీక్ ,అదర్ స్టోరీస్ సంపుటాలు మెక్సికన్ లైఫ్ ను చూపేవే .

  పాత, కొత్త సంస్కృతుల లో పెరిగిన వాటిని బాగా అర్ధం చేసుకొన్న ఇమ్మిగ్రంట్ రచయితలైన ఆస్కార్ హిజులోస్ –ది మామ్బో కింగ్ ప్లే సాంగ్స్ ఆఫ్ లవ్ ‘’-1989,క్రిస్టినా గార్సియ –డ్రీమింగ్ ఇన్ క్యూబన్ -1992, ది ఎజిలిరో సిస్టర్స్ -1997,ఆంటిగ్వా లో పుట్టిన జమైకా కిన్కైడ్ రాసిన అన్నీ జాన్ -1984,లూసీ -1990,ఎయిడ్స్ జ్ఞాపకాలైన మై బ్రదర్ -1997,సి నౌ అండ్ దెన్-2013,డొమినికా లోపుట్టిన జునాట్ డయాజ్ రాసిన పులిట్జర్ ప్రైజ్ పొందిన నవల –ది బ్రీఫ్ వండ్రస్ లైఫ్ ఆఫ్ ఆస్కార్ వావో -2007,బోస్నియన్ ఇమ్మిగ్రెంట్ అలేక్జాండర్ హెమాన్  రాసిన క్వేస్చిన్ ఆఫ్ బ్రూనో -2000,నో వేర్ మాన్ -2002,చైనీస్-అమెరికన్ రచయియిత్రి మాక్సిన్ హాంగ్ కింగ్స్టన్ రాసిన వుమన్ వారియర్ -1976,చైనా మెన్-1980 నవలలో ప్రాచీన చైనా వారసత్వం ,అద్భుత కుటుంబ చరిత్ర నుచూపింది . శాన్ఫ్రాన్సిస్కో లోని బే ఏరియాలో 1960 నాటి బోహీమియన్ ప్రపంచాన్ని ‘’ట్రిప్ మాస్టర్ మంకీ,-హిజ్ ఫేక్ బుక్ అనే మొట్టమొదటి నవలో చూపింది .ఇతర ఏషియన్ –అమెరికన్ రచయితలలో గీష్ జెన్ -1991లో రాసిన టిపికల్ అమెరికన్ నవలలో వలస మనుషుల జీవన పోరాటం ఫ్రస్ట్రేషన్ కళ్ళకు కడుతుంది .కొరియన్ –అమెరికన్ రైటర్ –చాంగ్ రే లీ –రాజకీయ జాగృతి కుటుంబ వ్యవస్థ ,తరాల భేదాలను –నేటివ్ స్పీకర్ -1995,గెస్చర్ లైఫ్-1999లో చూపిస్తే ,హా జిన్ –వైటింగ్ -1999,నవలకు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .చైనాలో కల్చరల్ రివల్యూషన్ కాలం లో, ఆతర్వాత ఉన్న పిరికితనం ,అణచివేత ,దెబ్బతిన్న ప్రేమ ,పాత కొత్త తరం చైనా లో ఇమడలేని స్థితిని రచయిత అద్భుతం గా ఆవిష్కరించాడు .ఇండియా అమెరికాలో ఉండే భారతి ముఖర్జీ –దిమిడిల్ మాన్ అండ్ ఆదర్ స్టోరీస్  -1988,జాస్మిన్ -1989,డిజైరబుల్ డాటర్స్ -2002,ది ట్రీబ్రైడ్-2004 రాసింది .ఇంకా చాలామంది మాలతి కల్చరల్ రచనలు చేసి ,మారుతున్న అమెరికన్ సాహిత్యాన్ని పరిపుష్టి చేశారు .

   1900కాలం లో చాలా మంది ఫిక్షన్ రైటర్స్ తమ శక్తి యుక్తుల్ని స్వీయ జీవిత చరిత్రలు రాసుకోవటం లో సార్ధకం చేసుకొన్నారు .మేరీ కార్ రాసిన ది లయర్స్ క్లబ్ -1995లో టెక్సాస్ గల్ఫ్ కోస్ట్ లో కుదేలైన కుటుంబ వ్యవస్థ చూపించింది .ఫ్రాంక్ మెక్ కోర్ట్1996లో  రాసిన ఎంజలాస్ యాషెస్ లో డికెన్స్ బాల్యం లాంటి జీవితం ,ఐరిష్ మురికి కూపాలు వర్ణించింది .అన్నే రోఫే-తన ధనిక  తలిదండ్రుల నిర్దయ , ఎయిడ్స్ తో అన్న చనిపోవటం మొదలైనవి –‘’1185 పార్క్ అవెన్యు -1999 లో దయనీయంగా వర్ణించింది .డేవ్ ఎగ్గర్ –‘’ఎ హార్ట్ బీటింగ్ వర్క్ ఆఫ్ స్టాగరింగ్ జీనియస్ ‘’2000లో అనేక కష్ట నష్టాలు అనుభవిస్తూ ఒక యువకుడు తన తలిదండ్రులు చనిపోతే తమ్ముడిని ఆదుకొని తీర్చి దిద్దిన విధానం చూపించాడు .

  నవలల పై చాపల్యం చావలేదు .అనేక పెద్ద ప్రతిష్టాత్మిక నవలలు తెగరాసి పారేశారు రచయితలు .వీరిలో  డేవిడ్ ఫాస్టర్ వాలెస్-ఇన్ఫినిట్ జెస్ట్ -1996,లో ఎన్సైక్లో పీడిక్ మార్మిక నమ్మకాలతో సోషల్ ఫిక్షన్ ,పోస్ట్ మోడరన్ ఐరని కలిపి దంచాడు .జోనాధన్ ఫ్రాన్జేన్-నేషనల్ బుక్ అవార్డ్ పొందిన నవల –ది కరెక్షన్స్ -2001,ఫ్రీడం-2010 నవలలు  ఫామిలి పోర్ట్రైట్ లే.డాన్ లిలోస్ –అండర్ వరల్డ్ -1997,లో ప్రచ్చన్న యుద్ధ అంటే కోల్డ్ వార్ స్థితిగతుల్ని ఫిక్షనల్ ,హిస్టారికల్ పాత్రల కళ్ళతో చూపించి మనము౦దు౦చాడు.ఈ మూడు నవలలో మరీ ఆలస్యమైపోయిన ఏకీకృతం కాని సాంఘిక రియలిజం నుPynchonesque invention   గా కొత్తగా చూపించాడు .పించాన్ బతికి వచ్చి చారిత్రిక నవలలు రాసినట్లు అనిపిస్తుంది ప్రతిదీ కళ్ళకు కట్టిస్తాడు .1997లో రాసిన మేసన్ అండ్ డిక్సన్ లో 18వ శతాబ్దపు ఇద్దరు ప్రసిద్ధ సర్వేయర్లు ,వారి అమెరికన్ కాలనీల గురించి పరిశోధనలు అన్వేషణలు,మాప్ లు తయారు చేయటం గురించి రాస్తే ,2006లో రాసిన ఎగైనెస్ట్ ది డే లో 20వ శతాబ్ది నుంచి 21వ శతాబ్ది కి పయనం కనిపిస్తుంది . రెండవ ప్రపంచ యుద్ధానంతర కవిత్వం గురించి  తర్వాత తెలుసుకొందాం .  

    సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -21 20వ శతాబ్ది సాహిత్యం -13

203-అమెరికాదేశ సాహిత్యం -21

20వ శతాబ్ది సాహిత్యం -13

ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం -2

ఎ గార్డెన్ ఆఫ్  ఎర్త్లి డిలైట్ ,-1967,దెం-1969 రాసిన జాయ్స్ కరోల్ ఓట్స్ – డెట్రాయిట్ హింస లాంటి అర్బన్ ప్రాంత హింస ను సహజ సిద్ధంగా వర్ణించి రాసింది .1971 సర్రియలిజం ను ప్రయోగాత్మకం గా వాడి ‘’వండర్ లాండ్’’ నవల రాసింది .1980లో గోధిక్ ఫాన్సీ తో బెల్లె ఫ్లూయర్,1986లో అప్ స్టేట్ అయిన న్యు యార్క్ లోని బ్లీక్ బ్లూ కాలర్ వరల్డ్ గురించి మార్యా నవల  రాసింది .తర్వాత బ్లాండే-ఎ నావెల్ -2000,లో నటి మార్లిన్ మన్రో జీవిత చరిత్ర రాసింది .వాస్తవతను పట్టుకోవటానికి మాత్రమె కాకుండా మలైర్  ,ఓట్స్ లిద్దరూ ఆ శక్తిని ఫిక్షనల్ మోడ్స్ తో చూపించారు .

   1970లో ఫెమినిజం ప్రవేశించి ,కొత్తతరం స్త్రీ రచయితలూ వచ్చారు .ఎరికా జంగ్ –సెక్సీ అండ్ ఫన్నీ గా ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్ 1974,రీట మే బ్రౌన్ –లెస్బియన్ లైఫ్ ను రూబీ ఫ్రూట్ జంగిల్ 1973లో రాసింది .1970లో వచ్చిన ఇతర ఫిక్షన్ స్త్రీ రచయితలలో ఆన్ బీటీ –చిల్లీ సైన్స్ ఆఫ్ వింటర్ నవలలో ,కధల్లో1960తర్వాతకాలపు జనరేషన్ చిత్రించింది .గైల్ గాడ్విన్1974లో రాసిన ది ఆడ్ వుమన్ లో ఉన్నత నాగరకత ప్రదర్శించింది .మేరీ గార్డెన్-ఐరిష్ కేధలిక్ జీవితాలను ఫైనల్ పే మెంట్స్ -1978 చిత్రిస్తే ,అలిసాన్ లూరీ,అన్నే టైలర్ లు సోషల్ కామెడీలు రాశారు .

  రేమండ్ కార్వర్ ప్రభావం – 1970లో వచ్చిన ప్రేరణాత్మక ఫిక్షన్ రైటర్ మాత్రం రేమండ్ కార్వర్.ఇతడు ఫసిఫిక్ నార్త్ వెస్ట్ లోని  బ్లూ కాలర్ లైఫ్ ను కధల్లో చిత్రించిన మరొక రియలిస్టిక్ రచయిత , 1981లో వచ్చిన ఇతడి ‘’వాట్ ఉయ్ టాక్  వెన్ వుయ్ టాక్ అబౌట్ లవ్ ‘’,1983లో వచ్చిన కేతేడ్రేల్ కధా సంపుటాలు దీనికి నిలువెత్తు సాక్ష్యాలు .జీవితాలను స్వయంగా నాశనం చేసుకొనే అతడి పాత్రలు జీవితాన్ని కోల్పోయిన వారే .అతడి శైలి పై హెమింగ్వే ,సామ్యుల్ బెకెట్ ప్రభావం జాస్తి .గొప్ప సలహాదారుగా దర్శనమిస్తాడు రచయిత .అక్కడక్కడ బార్తేల్మే  మేరీ రాబిన్సన్ ,అమీ హేమ్పెల్ లను చెత్తగా అనుకరించినా, ఆ తరాన్ని బాగా ప్రభావితం  చేశాడు . కార్వార్ ప్రేరణతో అతన్నే  అనుకరించి గొప్పగా నవలలు రాసిన వారిలో రిచర్డ్ ఫోర్డ్ –రాక్ స్ప్రింగ్స్ – 1987,రస్సెల్ బాంక్స్ –కాంటి నెంటల్  డ్రిఫ్ట్-1984,టోబియస్ ఉల్ఫ్ –ది బారక్స్ ధీఫ్-1984,దిస్ బాయ్స్ లైఫ్ -1989 ఉన్నారు .1960కాలపు కౌంటర్ కల్చర్ రియలిస్టిక్ రచయిత రాబర్ట్ స్టోన్ ఉద్బవించాడు .ఇతడి డాగ్ సోల్జర్స్ -1974,లో వియత్నాం జనరేషన్,  డ్రగ్స్ ముఖ్య విషయం. 1981లో వచ్చిన ఎ ఫ్లాగ్ ఫర్ జనరేషన్ మధ్య అమెరికా లోని  అస్పష్ట విషాద కాన్రాడ్ రాజకీయ నవల .అతని పాత్రలలో ఆధ్యాత్మిక అశాంతిని అసలు సాధారణ జీవితం కంటే ఎక్కువగా వర్ణించాడు .1986లో అతడి హాలీ వుడ్ నవల చిల్డ్రన్ ఆఫ్ లైట్ -1986,లో ,డమాస్కస్ గేట్-1989లో హోలీ లాండ్ లోని అలౌకిక వాతావరణం –(అపోకలిప్టిక్ అట్మాస్ ఫియర్ )చూపాడు .రిచార్డ్ రూసో మంచి హాస్యం ,సూక్ష్మ విషయాలతో కూడా వాయవ్య రాష్ట్రాలలో  బ్లూ కాలర్స్ కోల్పోయిన జీవితం  యొక్క శిధిలతను రిస్క్ పూల్ -1988,నో బడీస్ ఫూల్ -1993,ఎంపైర్ ఫాల్స్ -2001లో చిత్రించాడు. ఇతడే అకాడెమియా పై సెటైరికల్ గా స్ట్రైట్ మాన్ -1997 నవల రాశాడు .

  కొంతమంది స్త్రీ రచయితలైన ఇ.అన్నీప్రౌల్క్స్ పురుష పాత్రలను చిత్రిస్తూ ది షిప్పింగ్ న్యూస్ -1993,క్లోజ్ రేంజ్-వైమింగ్ స్టోరీస్-1999,రాస్తే ,ఆండ్రియా బారెట్ –షిప్ ఫీవర్ -1996,రాసింది .స్త్రీలలో రిలేషన్ షిప్ గురించి మేరీ గేయిట్స్ స్కిల్  సెటైరికల్ గా -టు గరల్స్ ఫాట్ అండ్ ధిన్-1991ను నబకోవ్ ,మేరీ మేకార్ధి ప్రభావం తో రాసింది .లారీ మూర్ –వ్యక్తిగత నాణ్యమైన కధలను నవలలుగా రాసింది .డిబోరా ఐసెన్ బెర్గ్ ,అమీ బ్లూమ్ ,ఆంటోన్యా నెల్సన్ ,ధామస్ జోన్స్ లు 20వ శతాబ్ది చివరికాలాన్ని చిరస్మరణీయమైన కధలతో నింపారు .

  బహుళ సాంస్కృతిక సాహిత్యం -20వ శతాబ్దం చివర్లో మల్టి కల్చరల్ సాహిత్యం బాగా ఊపు అందుకొన్నది .కొత్త జ్యూయిష్ వాయిసెస్  ఫిక్షన్ లో వినిపించాయి ఇ.ఎల్.డాక్టర్రో తన సాహిత్యం లో చారిత్రకాన్ని నవలా ఫిక్షన్ లో కలిపి రాగ్ టైం-1975,వాటర్ వర్క్స్ -1994 రాశాడు .సింధియా ఒజిక్ –ఎన్వి లేక యిద్ధిష్ అమెరికా 1969లో యిద్ధిష్ లిటరేచర్ లోని లీడింగ్ మోడల్ కారక్టర్స్ లో వర్ణించింది  .1980లో రాసిన ఈమె కథ’’షాల్’’ లో నాజి కాన్సేన్ట్రేషన్ కాంప్ లో ఒక బేబీ హత్యోదంతం ఉంది .డేవిడ్ లివిట్-హోమో సెక్సువల్ ధీమ్స్ ను పరిచయం చేసి ఫామిలి డాన్సింగ్ -1984లో మిడిల్ క్లాస్ జీవితాన్ని చిత్రించాడు .21వ శతాబ్ది ఆరంభానికి పూర్వపు సోవియెట్ యూనియన్ కు చెందిన గేరీ స్టైయింగార్ట్,లారా వాప్నవర్ రచయితలు అమెరికా చేరిన వలస జనం అనుభవాలను వర్ణించారు .తర్వాత నవలా ప్రస్థానం గురించి తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-21-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం

203-అమెరికాదేశ సాహిత్యం -20

20వ శతాబ్ది సాహిత్యం -12

ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం

20వ శతాబ్ది నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్యోక్క్  కోపం ,సాంఘిక నిరసన సంప్రదాయానికి భిన్నంగా కొత్త విధానం కనిపెట్టారు .జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లు రైట్ మార్గగాములు అయినా అమెరికాలో నల్ల వారి సంక్లిష్ట పరిస్థితులను చిత్రించే అనేక వివాదాస్పద వ్యాసాలతో సాహిత్య రచన చేశారు . బాల్డ్విన్ తన 1935లో రాసిన మొదటి నవల  ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’లో హార్లెం ప్రపంచాన్ని ,నల్ల వారి చర్చి విషయాలను తన యవ్వన అనుభవాలతో రాశాడు .గ్రామీణ జానపదుల గురించి అబ్సర్దిస్ట్ హాస్యం ను వాస్తవాన్ని జోడించి రాశాడు .రాల్ఫ్ ఎల్లిసన్ మాత్రం నల్లవారి అనుభవాలు గ్రామీణ వ్యవసాయం ,వివక్షత తో కూడిన విద్య ,ఉత్తరప్రాంతాలకు వలస పోవటం ,ఘెట్టో భయానక స్థితులు లపై జాతీయత ,కమ్యూనిజం ప్రేరణకలిగిస్తూ నవలలు రాశాడు .1952లో యితడు రాసిన ‘’ఇన్ విజిబుల్ మాన్ ‘’ను యుద్దానతరం వచ్చిన గొప్ప నవలగా భావించారు .

  తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రులు యుద్ధానంతర అమెరికన్ ఫిక్షన్ రాశారు .1970లో వచ్చిన   ది bhiest ఐ’’,1973రచన ‘’సులా ‘’,1977లోని ‘’సాంగ్ ఆఫ్ సాల్మన్ ‘’1987లో ‘’,బిలవ్డ్’’,1992లో జాజ్ ,1998లో ‘’పారడైజ్ ‘’తోపాటు టోనీ మారిసన్ అనేక విధాల లిరికల్ రి కలెక్షన్ ,మాజిక్ రియలిజం దాకా రాశాడు .  .ఎల్లిసన్ లాగా మారిసన్ వైవిధ్య జానపద గీతాలు ,బ్లాక్ హిస్టరీ లను బానిసత్వాన్ని బిలవ్ద్ లో హార్లేన్ రినైసేన్స్ ను జాజ్ లో చిత్రించింది  .ఎంతో  కవిత్వం రాసిన ఎలిస్ వాకర్ 1976లో పౌరహక్కుల సమస్యపైనవల’మెరిడియన్’’ రాసి,’’కలర్ పర్పుల్ ‘’అనే బ్లాక్  ఫెమినిస్ట్ నవలకు 1982లో పులిట్జర్ ప్రైజ్ పొందింది  .నల్లజాతి పురుషులు కూడా విజ్రుమ్భించి సాహిత్య సృజన చేశారు ఈకాలం లో .వారిలో ఇస్మాయిల్ రీడ్,వైల్డ్ కామిక్ రాస్తే ,జేమ్స్ అలాన్ ,మెక్ ఫెర్సన్ చిన్నకథలు రాశాడు .చార్లెస్ జాన్సన్ రాసిన’’ ది ఆక్స్ హీర్దింగ్ టేల్ ‘’,(1982),డి మిడిల్ పాసేజ్ -1990 నవలలో చారిత్రాత్మక ఊహాత్మకత ప్రదర్శించాడు .Gay రచయిత రాండాల్ కెన్మాన్ మాత్రం ఫోక్ ఇమాజినేషన్ తో బాల్డ్విన్ ఎలిసన్ ల శైలిలో రాశాడు .కాల్సన్ వైట్ హెడ్ ఫోక్ ట్రడిషన్ లో ప్రయోగాలు చేసి, ది ఇంట్యూ షనిస్ట్-1999,జాన్ హెన్రి డేస్-2001లో రాశాడు .

 న్యు ఫిక్షనల్ మోడ్స్-రెండవ ప్రపంచ యుద్ధం ,కోల్డ్ వార్ ,అటామిక్ బాంబ్ ,కలవర పరచే కన్స్యూమర్ కల్చర్ ధోరణి ,1960లోని కల్చరల్ క్లాషేస్ కు ప్రేరితులైన రచయితతలు  సంప్రదాయ ఫిక్షన్ ను వదిలి కొత్త అన్వేషణకు దారి చూపారు .దీని ఫలితంగా పోస్ట్ మోడరన్ నవల పుట్టింది .విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తల్మే,ధామస్ పించాన్ ,రాబర్ట్ కూవర్ ,పాల్ ఆస్టర్,డాన్ డెలిలో వాస్తవానికి పెద్దపీట వేసి రియాలిటి కే రియాలిటి తెచ్చారు .వారి నవలలు ‘’ఆర్టి ఫాక్ట్స్’’ అయ్యాయి .రియలిస్టిక్ టెక్నిక్ లను ఐరానికల్ గా ప్రయోగించారు .హింస ను మరింత పెంచారు .డాక్యుమెంటేషన్ కు విలువ పెంఛి ఫాంటసి కి దారి తీశారు .నార్మన్ మైలర్ ,జాయ్స్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్తదారి నిర్మాతలు .

   1948లో మైలర్ -రచయిత డాస్ పాసోస్ సాంఘిక నిరసన ధోరణి సంప్రదాయం లో ‘’ది నేకెడ్ అండ్ ది డెడ్’’రాశాడు .దీని పరిమితులకు లోబడి ఫేబుల్స్ లో సర్రియలిస్టిక్ ఫాంటసి ప్రవేశ పెట్టి ,యాన్ అమెరికన్ డ్రీం – 1965,వై అర్ వియ్ ఇన్ వియత్నాం -1967రాశాడు .ఇతని సబ్జెక్ట్ ఏమిటి అంటే రాజకీయం గా, వ్యక్తిగతంగా ‘’నేచర్ ఆఫ్ పవర్’’.తర్వాత దారిమారి ‘’నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ ‘’ఇన్ ది ఆర్మీస్ ఆఫ్ ది నైట్ ‘’,మియామి అండ్ సీజ్ ఆఫ్ చికాగో -1968సృష్టించాడు .మైలర్ తన స్వంత గొంతును గొప్పగా ఉన్న స్వకీయమై ,కామిక్ అయినా మేధోవిలసిం గా సృస్టించు కొన్నాడు .ఈ నూతన విధాన ట్రూ లైఫ్ నవల ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్ ‘’రచనకు  1979లో పులిట్జర్ పొందాడు .మళ్ళీ ఫిక్షన్ కు వచ్చి  సెంట్రల్ ఇంటలిజెన్స్ పై ‘’హార్లాట్స్ ఘోస్ట్’’ -1991రాశాడు అతడి చివరి నవలలు –(జీసెస్ క్రైస్ట్-ది గాస్పెల్ అకార్దింగ్ టు సన్)1997, ,అడాల్ఫ్ హిట్లర్ (ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ )2007రాశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-21-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929)

– ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929)

ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్ అమెరికన్ లింగ్విస్ట్ 1929లో పుట్టాడు .పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సౌత్ ఏషియన్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .చాలా పుస్తకాలు రాశాడు .సౌత్ ఏషియా –1-ద్రవిడియన్ లింగ్విస్టిక్ హిస్టరీ 2-రైస్ ఇన్ ద్రవిడియన్ 3-ప్రోటో ద్రవిడియన్ అగ్రికల్చర్ 4-లింగ్విస్టిక్ ఆర్కియాలజీ ఇన్ సౌత్ ఏషియా 5-లింగ్విస్టిక్ ఆర్చియాలజి అండ్ ది ఇండస్ వాలీ కల్చర్ 6-ది సోషల్ కంటెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్  స్టాండర్డై జేషన్ 7-లెక్సికల్ ఎవిడేన్సేస్ ఫర్ ఎర్లి కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండో ఆర్యన్ అండ్ ద్రవిడియన్ వంటి 13 విలువైన రచనలు చేశాడు .

  కొలామి అనేది  తెలుగులో గోడ అయిందని ,కిట్ అనేది వ్రాత, తుడిచేయటం గా తెలుగు ,తమిళాలలో మారిందని ,అరి అంటే పన్ను ,పొగడ్త అని దీని అసలు రూపం ధాన్యం అని అదే వరి గా తెలుగులో మారిందని ,.దక్షిణ ద్రవిడియన్ లో ఒక్క్ అనేది గణితం లో ఒకటి అనే తెలుగు పదం అయిందని ,జంతువుల కొవ్వు ‘’నే’’ క్రమంగా నెయ్యి అయిందని ,ఫ్రా౦క్లిన్  చూపించాడు .ఎలి, ఇలి లోంచి తెలుగు ఎలుక వచ్చిందని అంటాడు .

4- భగవద్గీతానువాదం చేసిన అమెరికన్ లింగ్విస్ట్ ,స్కాలర్ -ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టన్(1885-1963)

24-7-1885జన్మించి 7-12-1963న 78వ ఏట మరణించిన వాడు అమెరికన్ లింగ్విస్టిక్ ,విద్యావేత్త ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టేన్.ఏల్ యూని వర్సిటిలో సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ప్రొఫెసర్ .1953-54 కాలం లో బెనారస్ హిందూ యూని వర్సిటికి విజిటింగ్ ప్రొఫెసర్ .1913 నుండి 1936వరకు పెన్సిల్వేనియా యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా 23ఏళ్ళు పని చేశాడు .భగవద్గీతను అనువాదం చేయటం తో ఆయన పేరు జగత్ ప్రసిద్ధమైంది .ఇది 38,39 హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్ గా 1944లో ముద్రితమైంది .సింహాసన ద్వాత్రి౦సిక పునర్ముద్రణ లోను , ,పంచతంత్రం మూల ప్రతి శిదిలమైతే దాన్ని పూరించటం లో విశేష కృషి చేశాడు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)

7-7-1907న నెదర్ లాండ్స్ లోని ది హేగ్ లో జన్మించి 96ఏళ్ళ నిండు జీవితాన్ని గడి,14-12-2003 న జీస్ట్ లో మరణించిన  ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ ఇండాలజీ లో విశిష్ట స్థానం ఉన్నవాడు. గత శతాబ్దపు మేటి ఇండాలజిస్ట్ గా ప్రసిద్ధి చెందినవాడు .సంస్కృతం,లాటిన్ ,గ్రీక్ ,ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ లను లైదేన్ యూని వర్సిటి లో అధ్యయనం చేసి ,1934లో సంస్కృత ,ఇతర యూరోపియన్ భాషలలో నాసికా ఉచ్చారణ (నాసల్ ) పత్ర సమర్పణ చేసి ,డాక్టరేట్ సాధించాడు   . ఇండొనీషియాలోని జకార్తా లోఉన్న లైసియం ఆఫ్ బటేవియా లో గ్రీక్ ,లాటిన్ బోధించే ఉపాధ్యాయుడిగా అయిదేళ్ళు ఉద్యోగించాడు .1939లో లైదేన్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .

ఇండో –ఇరానియన్ ,ఇండో –ఆర్యన్ ఫైలాజి ,లింగ్విస్టిక్స్ ,మైథాలజి ,దియేటర్ ఆర్ట్  ,ఇండో –యూరోపియన్ ,ద్రవిడియన్ ,ముండా,పాన్ ఇండియన్ లింగ్విస్టిక్స్ లలోని అన్ని శాఖలోనూ జ్ఞాన నిధి .

   రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి అండ్ ఆర్ట్స్ మెంబర్ గా 1937నుంచి 39వరకు పని చేసి  రాజీనామా చేశాడు .ఆర్డర్ ఆఫ్ దినెదర్లాండ్స్ లయన్  కు Knight అయ్యాడు .

 కూపర్ రచనలన్నీ ‘’ఇండియన్ లింగ్విస్టిక్స్ అండ్ ఫైలాలజి ‘’గా ముద్రణ పొందాయి .ఇండియన్ మైదాలజి పై రాసినవన్నీ అతని స్నేహితుడు జె.ఇర్విన్ ‘’ఇండియన్ కాస్మాలజి ‘’గా రెండు దశాబ్దాలక్రితం ప్రచురించాడు .1968వరకు కూపర్ బిబ్లియాగ్రఫీ అంతా ఫెస్టాక్రిఫ్ట్ అంటే ‘’ప్రతి దానం’’ గా లభిస్తుంది .తరువాత విషయాలు అనేక చోట్ల నుంచి  సంగ్రహించారు .

  సంస్కృతం లో కూపర్ అధ్యయనం మొదట  వేదం నామవాచకాలతో1942లో  ప్రారంభమైంది .యుద్ధం తర్వాత 1947లో ట్రేసేస్ ఆఫ్ లేరేన్జీల్స్(నాసికా ధ్వనులు  ) ఇన్ వేదిక్ సాంస్క్రిట్ ‘’ పై అధ్యయనం చేశాడు .ఫైనల్ వొవెల్స్ ఇన్ ఋగ్వేద పై 1955లో పరిశోధించాడు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి శ్రీ ప్లవ ఉగాదికి ఆవిష్కరించాల్సిన   -1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి మనీష  2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు అనే రెండు పుస్తకాలను 13-4-21శ్రీ ప్లవ ఉగాది మంగళ వారం ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పవిత్ర పాదాల వద్ద ఉంచి స్వామియే ఆవిష్కరించి నట్లు భావించాము .21-4-21 బుధవారం శ్రీరామనవమి నాడు మన ఆలయం లో జరిగిన శ్రీ సీతా రామ కల్యాణం సమయం లో అమెరికా నుంచి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి తో స్వామి వారి సన్నిధానం లో పై రెండు పుస్తకాలను ఆవిష్కరి౦ప జేసి ,సుమారు 60మంది భక్తులకు 60 సెట్లు  పుస్తక ప్రసాదంగా అందజేయించాము . .
   ఆ తర్వాత  ఈ నెల 22నుంచి 27 వరకు సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు బుక్ పోస్ట్ లో ,రిజిస్టర్డ్ పార్సిల్ ద్వారా 140 సెట్లు పంపాము దాదాపు అందరికి  అందుతున్నట్లు   మెసేజ్ లు,ఫోన్ లు వస్తున్నాయి .ఇలా మొత్తం 200 సెట్లు అంటే 400పుస్తకాలు పుస్తక ప్రసాదంగా అందరికీ అంద జేసి సంతృప్తి చెందాము .మీ -దుర్గా ప్రసాద్ -27-4-21

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)

1-ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)

1-13-1949న  అమెరికా లోని లోవా లోని  వాటర్లూ లోపుట్టిన డేవిడ్ డీన్ షుల్మన్-ఇజ్రాయిల్ ఇండాలజిస్ట్ ,కవి ,శాంతిప్రబోధకుడు .1967లో వాటర్ లూ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందాడు.వెంటనే ఇజ్రాయిల్ కు వలస వెళ్లి హీబ్రూ యూని వర్సిటి చేరి ,1971లో ఇస్లామిక్ హిస్టరీ అందులో అరెబిక్ ముఖ్య విషయంగా గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇంగ్లిష్ ఎకనామిక్ హిస్టోరియన్ డేనియల్ స్పెర్బెర్ సాన్నిహిత్యం స్నేహం,ప్రేరణ వలన  ఇండియన్ స్టడీస్ పై ఆసక్తి పొందాడు .తర్వాత ఫైలాలజిస్ట్ ,సెమెటిక్ భాషలలో నిష్ణాతుడు అయిన చిన్ రాబిన్ వలన స్పూర్తి పొందాడు .ఐడిఎఫ్ లో పని చేసి ,తర్వాత ఇజ్రేలి దేశం 1982లెబనాన్ ఆక్రమణ లో పిలువబడి ,ఆర్మీసర్విస్ లో వైద్య నైపుణ్యం పొంది ,సెటిలర్ల హి౦స వలన గాయపడిన పాలస్తీనియన్ లకు సేవలందించాడు .

   సంస్కృత ,తమిళాలలో  డాక్టరేట్ చేశాడు .తమిళ శైవ తలపురాణ౦ ముఖ్య అంశంగా పరిశోధన పత్రం రాశాడు .1972-76కాలం లో లండన్ యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో ‘’ది మైధాలజి ఆఫ్ తమిళ్ శైవ తల(స్థల )పురాణ0  పై జాన్ ఆర్ .మార్ వద్ద పరిశోధన పత్రం రాసి సమర్పించాడు .దీనికోసం తమిళ నాడులో ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చింది .దీనిఫలితంగా హీబ్రూ యూని వర్సిటిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అండ్ కంపారటివ్ రెలిజియన్ శాఖలో ఇంస్త్రక్తర్ గా చేరి ,లెక్చరర్ అయి తర్వాత 1985లో ప్రొఫెసర్ అయ్యాడు .1987-1992కాలం లో  మెక్ ఆర్ధర్ ఫెలో గా  ప్రొఫెసర్ షుల్మన్ ఉన్నాడు .1988లో ఇజ్రాయిల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ హ్యుమానిటీస్ కు మెంబర్ గా ఎన్నికయ్యాడు .2015లో అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ కి ఎన్నికయ్యాడు .జెరూసలెం యూని వర్సిటి ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కు ఆరేళ్ళు డైరెక్టర్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరి ని బలపరచాడు .విగల్ బ్రోన్నేర్ తో కలిసి అక్కడే ఒక కొత్త పుస్తకం రాశాడు .2019నుంచి’’ ఇన్ఫోసిస్ ప్రైజ్’’ కు హ్యుమానిటీస్ జ్యూరీ గా సేవలందించాడు  .ఐలీన్ ను పెళ్ళాడి ముగ్గురు మగ పిల్లల తండ్రి అయ్యాడు .

   అహింస అంటే ప్రాణ౦ గా భావించే షుల్మన్ ‘’జాయంట్ ఇజ్రాయిల్ –పాలేస్టైన్ –లైఫ్ ఇన్ కామన్ఆర్ ట్రయోష్ గ్రాస్ రూట్స్  మువ్ మెంట్ ఫర్ నాన్ వయోలెన్స్ ఉద్యమ౦ లో ప్రముఖ శాంతి కాముక పాత్ర పోషించాడు .’’ఇరు వైపులా వారు గెలిస్తేనే ఇరుపక్షాల వారూ ఓడిపోయినట్లు ‘’అనే సిద్ధాంతం అతనిది .ఇరు వర్గాలలో నైతిక సూత్ర వైఫల్యాలను తెలియ జెప్పేవాడు This conflict is not a war of the sons of light with the sons of darkness; both sides are dark, both are given to organized violence and terror, and both resort constantly to self-righteous justification and a litany of victimization, the bread-and-butter of ethnic conflict. My concern is with the darkness on my side.[4]

   2007లో ‘’డార్క్ హాప్’—వర్కింగ్ ఫర్ పీస్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ పాల స్టైన్’’’అనే పుస్తకాన్ని రాసి ప్రచురించి అక్కడ శాంతి సాధన ఎంతటి ముండ్ల బాట  పై ప్రయాణమో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు .దాదాపు 40 విలువైన ఆర్టికల్స్ వివిధ పత్రికలలో రాసి ప్రచురించాడు .సహ రచయితలతోకలిసి 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .

  ఈనాటి తమిళ భాష సంస్కృత పదాలతో సంపన్నమైనదని వివరంగా రాశాడు “Modern Tamil is astonishingly rich in Sanskrit loan words. Indeed, there may well be more straight Sanskrit in Tamil than in the Sanskrit-derived north-Indian vernaculars. Sanskrit words tend to be Tamilised in accordance with the Tamil phonematic grid, much in the way they were already at the time of the Tolkappiam grammar.”

  తమిళం కూడా సంస్కృతం లాగానే దేవ భాష అని ‘’ముక్తాయింపు’’ ఇచ్చాడు .అతి స్వచ్చ సంస్కృతం అతి స్వచ్చ తమిళం లేవు అన్నాడు .Muttusvāmi Dīkṣitar and the Invention of Modern Carnatic Music: The Abhayâmbā Vibhakti-kṛtis అనే పుస్తకం రాశాడు .స్ప్రింగ్ ,హీట్ అండ్ రైన్స్ అనే దక్షిణ దేశ యాత్ర దర్శిని రాశాడు ..

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని

https://photos.google.com/u/1/share/AF1QipNh9b6HxgNpZClnhqqLwhNzDpydN1mEg8mnIgom_HdV4xW7-k1HhP6OFmRomWSMWg/photo/AF1QipOpET2Sw4as98UmXJelZ8RpfdmkMsYDiorZi-ou

Posted in దేవాలయం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

671-నీతిమాల కర్త –విశ్వేశ్వర ఝా (1935)

వ్యాకరణ ఆచార్య విశ్వేశ్వర ఝా 1-2-1935న మధుబనిలో పుట్టి ,అక్కడి సంస్కృత మహా విద్యాలయం లో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు .గురుపరంపర –పండిట్ దీనబంధు ఝా ,శ్రీ మధుసూదన మిశ్ర .ప్రత్యేక శిక్షణ   డా ఉమారమణ ఝా ,డా.విశ్వనాథ ఝాల వద్ద పొందాడు .నీతిమాల ,సుకనాశోపదేశం ,సంస్కార వివేచన ,స్వప్న వాసవ దత్తం రాశాడు .

672-సత్యబోధ విజయ కర్త –విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్(1931)

8-4-1931న కర్నాటక బిజాపూర్ లో బాగల్పేట్ లో పుట్టిన విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్ ప్రభుత్వ సంస్కృత విద్యాశాఖలో ఇన్స్పెక్టర్ .కేశవాచార్య శిష్యుడు .సత్యబోధ విజయం మాత్రమె రాశాడు .

673-అష్టాధ్యాయి భాష్య కర్త –బ్రహ్మదత్ జిజ్ఞాసు (1892-1972)

1892లో జలంధర్ లో పుట్టిన బ్రహ్మదత్ జిజ్ఞాసు -స్వామి పూర్ణానంద సరస్వతి ,దేవనారాయణ తివారి ,మ. మ.పండిట్ చిన్నస్వామి ల శిష్యుడు .అష్టాధ్యాయి భాష్యం ఒక్కటే రాశాడు .21-2-1964న 72వ ఏట చనిపోయాడు  .కాశీలో మోతీ జీల్ లో పాణిని కాలేజ్ స్థాపించాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

674-జైనతత్వ వివేక కర్త –న్యాయ తీర్ధ జీవన్ ధార్(1974 న మరణం )

1974లో మరణించిన న్యాయతీర్ధ జీవన్ దార్ జైనతత్వ వివేకం మాత్రమె రాశాడు

675- ఆనంద మీమాంస కర్త -తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి(1901 )

ఆనంద మీమాంస ,జ్యోతి నిబంధ ,శుద్ధి సర్వస్వం ,మొదలైన 11పుస్తకాలు రాసిన తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి 27-1-1901న మహారాష్ట్ర లో పిమ్పల్నేర్ లో పుట్టాడు .గురుపరంపర –కె.రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,వామాచరణ్ భట్టాచార్య ,తర్కతీర్ధ సంస్కృత పండిట్ బిరుదాంకితుడు .1976లో పద్మభూషణ్ పొందాడు .ధర్మకోశ పత్రిక సంపాదకుడు .స్వాతంత్ర్య సమర యోధుడుకూడా .

676-బాలచంద్ర శాస్త్రి జోషి (1916)

నవ్యన్యాయ ,వేదాంత, మీమాంస ,వ్యాకరణ జ్యోతిష ,అలంకార ధర్మ శాస్త్ర ఆచార్యుడైన బాలచంద్ర శాస్త్రి జ్యోషి 15-6-1919న కర్ణాటకలో పుట్టి విలువైన 4 సంస్కృత గ్రంథాలు రాశాడు .ధార్వాడ జగద్గురు శంకరాచార్య సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ .సాంప్రదాయ విద్యావిధానం లో విద్యనేర్చి ,నేర్పాడు .అనేకమంది పీఠాదిపతులు అనేక బిరుదులతో సత్కరించి సన్మానించారు .చాలామంది పీఠాదిపతులు ఈయన శిష్యులే .ప్రెసిడెంట్ అవార్డీ.

677-కర్ణభారం కర్త –హరేశ్ అరుణ్ భాయ్ జోషి (1963)

15-12-1963న గుజరాత్ లోని పోర్ బందర్ లో పుట్టిన హరేశ్ అరుణ్ భాయ్ జోషి వేదాంతం లో ఎం ఏ .నీతిశతకం ,కర్ణ భారం ,స్వప్న వాసవ దత్తం ,సంస్కృత సాహిత్య ఇతిహాసం ,వేదాంత దర్శనం అనే 5పుస్తకాలు రాశాడు .

678-ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి కర్త –హేమ చంద్ర జోషి (1925)

1925జులై 31న యుపి అలహాబాద్ లో పుట్టిన హేమచంద్ర జోషి సాహిత్య, న్యాయ, మీమాంస ఆచార్య .గోరఖ్ పూర్ సంస్కృత విశ్వవిద్యాలయప్రొఫేసర్ .ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి మాత్రమే రాశాడు .లక్నోలోని అఖిలభారత సంస్కృత పరిషత్ స్థాపకుడు .ప్రెసిడెంట్ అవార్డీ.

679-శ్రీ శని మహాత్మ్యం కర్త –జాజిరాం పురుషోత్తం జోషి (1924)

కావ్యతీర్ధ జాజిరాం పురుషోత్తం జోషి 9-4-1924 న మహారాష్ట్ర లో రైన్ మాడ్ లోని రోహాలో పుట్టాడు .సాహిత్య శిక్షా శాస్త్రికూడా .గడగిల శంకర శాస్త్రి ,శ్రీధర్ శాస్త్రి ,హరిహర్ ఝా ల శిష్యుడు .శ్రీ శని మహాత్మ్యం కావ్యం  తోపాటు  .ప్రాకృత కావ్యానువాదం రాశాడు .

680-భారతీయ సంస్కృతి కర్త –కేదార్ నారాయణ్ జోషి (1948)

సాహిత్యాచార్య ,వ్యాకరణ తీర్ధ కేదార్ నారాయణ్ జోషి 3-4-1948న మధ్యప్రదేశ్ లో కాన్నౌడ్ లోని  దేవాస్ లో పుట్టాడు .ఉజ్జైన్ విక్రం యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –డా రేవా ప్రసాద్ ద్వివేది ,డా.రమ్ని హాల్ శర్మ ,డా లక్ష్మణ్ నారాయణ్ శుక్ల .ప్రత్యెక శిక్షణ డా రమేష్ చంద్ర శర్మ ,డా.రామధర్ మాలవ్యాల వద్ద పొందాడు. భారతీయ సంస్కృతీ,సంస్కృత కావ్యేషు వైదిక చిన్తనస్య ప్రభావః ,శ్రీపాద శాస్త్రి హసూరకార వ్యక్తీ ఏవం అభి వ్యక్తీ ,సంస్కృత కావ్యశాస్త్ర ఔర్ నిరాలా రాశాడు .ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్ అవార్డ్ ,బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాఅవార్డ్ ,వాగర్ధ సమ్మాన్, సమాజ్ రత్న సమ్మాన్ పొందిన మహా పండితుడు .

681-మరీచి భాష్యం కర్త –కేదార్ దత్ జోషి (1910)

1910లో అల్మోడా లో పుట్టిన కేదార్ దత్ జోషి ,కాశీ  సంస్కృతకాలేజి లెక్చరర్ .హరిదత్త జోషి ,పండిట్ బలదేవ్ పాఠక్  ల శిష్యుడు .గ్రహ గణితాధ్యాయః ,వాసనాభాష్య౦ ,మరీచి భాష్యం ,గ్రహలాఘవం ,ముహూర్త చింతామణి రాశాడు .

682- రహస్యమయి నాటకం కర్త –కేశవ రాం రావ్ జోషి (1928)

7-4-1928న మధ్యప్రదేశ్ చింద్వాడ జిల్లా రంగరి లో పుట్టిన కేశవ రాం రావ్ జోషి సాహిత్యాచార్య .అమ్బాదాస శాస్త్రి పాండేయ,శంకర శాస్త్రి ,పండిట్ హరి రాం శుక్లాల శిష్యుడు నీల కంఠ విజయ కావ్య౦ ,రహస్యమయి నాటకం రాశాడు .

683-ప్రాధమిక పాణినీయ వ్యాకరణ కర్త –మాధవ్ గణేష్ జోషి (1918)

ప్రాధమిక పాణినీయ వ్యాకరణం ను సంస్కృత ,ఇంగ్లిష్ ,కన్నడ ,మరాటీ భాషలలో రాసిన మాధవ్ గణేష్ జోషి 1918లో పుట్టాడు .కర్నాటక బెల్గాం లోని విద్యామందిర్ లో సంస్కృత టీచర్ .

684-వేదాంత నివేదనం కర్త –మహావీర్ ప్రసాద్ జోషి (1914-2002)

1914లో ఝుంఝును జిల్లా దండ్ లోడ్ లో పుట్టిన మహావీర్ ప్రసాద్ జోషి ఆయుర్వేద సాహిత్య ఆచార్య .రాజ్ ఘర్ సాహిత్య సమితి చైర్మన్ .భవానీదేవి హాస్పిటల్ సెక్రెటరి .రాసిన 22పుస్తకాలలో ప్రతాప చరితం ,ప్రార్ధనా పుష్పాంజలి ,వేదాంత నివేదనం ,పంచతంత్రం, రుద్రాసాధ్యాయి ,ఉన్నాయి 2002లో 88వ ఏట మరణించాడు .సంస్కృత రత్నాకర భారతి మాసపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలూ రాశాడు .

685-మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం కర్త –మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి (1924)

మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి 1924లో మహారాష్ట్ర లో ఎలం బహాట్ లో పుట్టాడు .కావ్యరత్న ,స్మృతి తీర్ధ ,ధర్మ శాస్త్ర .వినాయక్ శాస్త్రి తిల్లు,అచ్యుత్ శాస్త్రి పద్వేల శిష్యుడు . మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .

686-కారక మీమాంస కర్త –మోతీలాల్ జోషి (1935)

దర్శన సాహిత్య వ్యాకరణ కావ్యతీర్ధ ఆచార్య మోతీలాల్ జోషి 1935లో రాజస్థాన్ జైపూర్ లోని సహారాపుర జిల్లా బడీ జోడి లో పుట్టాడు .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాల్.ప్రభుత్వ సంస్కృత డిపార్ట్ మెంట్ డైరెక్టర్ .సిండికేట్ మెంబర్ .కారకమీమాంస ,ప్రబోధ చంద్రోదయ విమర్శ రాశాడు .జైపూర్ శాహిపురా బాగ్ లో టీచర్ ట్రెయినింగ్ కాలేజి స్థాపించాడు .

687-అధ్యాపక శిక్ష కర్త –ఆర్.ప్రహ్లాద జోషి (1971)

సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ .శిక్షా ఆచార్య ,విద్యా వారిది .23-6-1971లో గుల్బర్గా లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .అధ్యాపక శిక్షమాత్రమే రాశాడు .

688-కరుణా కటాక్ష లహరి కర్త –రసిక్ బిహారీ జోషి (1929)

రాజస్థాన్ బైవార్ లో 1929లో పుట్టిన రసిక్ బిహారీ జోషి రాసిన 5పుస్తకాలలో మోహ భంగ ,కరుణా కటాక్ష లహరి ,సారస్వతం ,ప్రజ్ఞాపారిజాతం ,శ్రీ గోవర్ధన గౌరవం ఉన్నాయి .

689-రాధా సహస్ర నామ కర్త –రసిక్ విహారీ జోషి(20వ శతాబ్ది )

పుట్టిన తేదీ తెలీదుకాని హిందీ ఆనర్స్ ,శాస్త్రి ,డిలిట్.ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ,ఇన్వేస్టి గేటర్,el కోలీజియో డి మెక్సికో .35పుస్తకాలు రాశాడు అందులో రాధా సహస్రనామం ,లక్ష్మీ నృసింహ సహస్రనామస్తోత్రం , ,ది యూని వర్సల్ ట్రూత్ ,ఫ్రెంచ్ గ్రామర్ లిటరేచర్ ,యోగ అండ్ మెడిటేషన్ . సంస్కృతకవి .,యుపి సంస్కృత అకాడెమి ,గౌరవ డాక్టరేట్, వెనిజుల అవార్డ్ ,దాల్మియా అవార్డ్ ,సాహిత్య అకాడెమి ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ అవార్డ్ తోపాటు ప్రెసిడెంట్ అవార్డీ.హరిత రుషి అవార్డ్ పొందాడు .వార్సా ,బుడాపెస్ట్ ,జెకోస్లోవేకియా ,కంబోడియా ,కొలంబో,మెక్సికో  యూనివర్సిటీ లకు విజిటింగ్ ప్రొఫెసర్ .

690-చిచంద్రిక వ్యాఖ్యాన  కర్త –గోపాలాచార్య కహద్క ర్  (20వ శతాబ్ది )

మహారాష్ట్ర లో పుట్టి ,నీల కంఠ శాస్త్రి శిష్యుడైన గోపాలాచార్య కహద్కర్ ఒకే ఒక్క పుస్తకం సంస్కృతం లో రాశాడు . దుశక్ర దోద్ధాదిని రాసిన చిచంద్రికపై అనేక వ్యాసాలూ రాశాడు ‘

691-అపరాజిత మహాకావ్య కర్త –పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా(1928)

10-10-1928 న ఒరిస్సాలో పుట్టిన పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా ఆయుర్వేద ఆచార్య సాహిత్య రత్న .డాక్టర్. అపరాజిత మహాకావ్య౦ ఒక్కటే రాశాడు .

692-తంత్ర అధికారి నిర్ణయ కర్త –అశోక్ కుమార్ కాలియా (1944)

20-4-1944న యుపి బహ్రేచి లో పుట్టిన అశోక్ కుమార్ కాలియా లక్నో యూనివర్సిటి సంస్కృత రిటైర్డ్ ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీమద్ అభీన రంగనాథ్ శిష్యుడు .రాసిన 7పుస్తకాలలో తంత్ర అధికార నిర్ణయం ,లక్ష్మీ తంత్ర ,పంచారాత్ర పరిశీలన ,పురుషోత్తమ సంహిత ఉన్నాయి .అజస్ర సంస్కృత క్వార్టర్లి ఎడిటర్ .2009లో ప్రెసిడెంట్ అవార్డీ.

693-కోసూర శివమాత కర్త –బద్రినాథ్ కల్లా (1931)

3-3-1931 కాశ్మీర్ శ్రీనగర్ లో పుట్టిన బద్రినాథ్ కల్లా –శాస్త్రి .కాశ్మీర్ యూని వర్సిటి లో సంస్కృత డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .సెంటర్ ఫర్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ లో ప్రొఫెసర్ .కోసూర శివమాత ,విటస్థ మహాత్మ్యం ,మానసాదర పాన అనే హిందీ పుస్తకం రాశాడు .రాష్ట్రీయ భాషా ప్రచార సమితి అవార్డ్ పొందాడు .

694-శ్లోకత్రయ వివరణ కర్త –వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్ (1911)

సాహిత్య ,వేదాంత శిరోమణి వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్,,తమిళనాడు తంజావూర్ లో పుట్టాడు .గురుపరంపర – మహా మహోపాధ్యాయ  యజ్ఞస్వామి ,కే.కృష్ణ శాస్త్రి ,వి వైద్యనాధ శాస్త్రి ల శిష్యుడు .వృత్తి మీమాంస ,శ్లోకత్రయ వివరణం రాశాడు ,సుందర రామాయణం ,సతీ విలాసం  వేంకటేశ శతకం ,భగ వనుధ్యాన చంపుకావ్యం ,విచార సారంగధర ,పతంజల మహాభాష్య౦,నీతి ప్రకాశిక ,హరిహరాద్వైత భూషణం పాణిని సూత్ర వ్యాఖ్య,కల్పతరు వ్యాఖ్య ,న్యాయ సిద్ధాంతామృతం  లను తన సంపాదకత్వం లో ముద్రించాడు .

695-వ్యాస సూక్త కర్త –కె.కమల్ (1938)

తెలంగాణా మహబూబ్ నగర్ లో 3-6-1938న పుట్టిన కె.కమల్ హైదరాబాద్ నిజాం కాలేజి సంస్కృత ప్రొఫెసర్ .తెలుగులో కాదంబరి కావ్య సుషమ,శాంతిపర్వ సూక్తులు ,సంస్కృతం లో వ్యాస సూక్తం రచనలు .

696-సంస్కార సాహిత్య ఐతిహాసిక కర్త –కమల్ రత్నం (1914)

1914అలహాబాద్ లో పుట్టిన కమల్ రత్నం ఢిల్లీ లోని రంజాస్ స్కూల్ ప్రిన్సిపాల్..గయా ప్రసాద్  దీక్షిత్ , కె.ఎ. సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు .సంస్కృత సాహిత్యేతిహాసిక –సంస్కృత పరిప్రేయే-కాళిదాస ,కాళిదాస జన్మ భూమి ,అన్వేషణ రాశాడు

697-ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్య సహిత కర్త –జియాలాల్ కంబోజ (1932)

హర్యానా కర్నాల్ లో 12-2-1932న పుట్టిన జియలాల్ కంబోజ  న్యు ఢిల్లీ హిందూ కాలేజి ప్రొఫెసర్ . ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్యసహిత అనే ఒకే పుస్తకం రాశాడు .

698-వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం కర్త –వసంత కృష్ణ రావు కన్హే (1939)

1939 డిసెంబర్ 3న రాయపూర్ లో పుట్టిన వసంత కృష్ణ రావు కన్హే సాహిత్యాచార్య .సరస్వతి ప్రసాద్ చతుర్వేది ,డా హస్రూర్కర్ ,డా ఆర్ యెన్ శర్మ ,డా.రేవా ప్రసాద్ ద్వివేది ,పండిట్ రామానందన్ ఓఝా ,పండిట్ రాజేంద్ర చౌదరి ,కరపత్ర స్వామిల శిష్యుడు. వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం మాత్రమె రాశాడు .

699-12పుస్తకాలు రాసిన దిలీప్ కుమార్ కంజీలాల్ (1933)

దిలీప్ కుమార్ కంజీలాల్ 1-8-1933న కలకత్తా లో పుట్టి ,పిహెచ్ డిచేసి ,ప్రభుత్వ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రవీంద్రభారతి విజిటింగ్ ప్రొఫెసర్ .కామన్ వెల్త్ యూని వర్సిటీలచే ఎంపిక చేయబడిన విజిటింగ్ ఫెలో .ఏన్శేంట్ అష్ట్రోనాట్ సోసైటీ లైఫ్ మెంబర్ . అమెరికా బోరి ,పూనా చెన్నై లను సందర్శించాడు. ప్రెసిడెంట్ అవార్డీ

700-అభినవ సంస్కృత కథ కర్త –నారాయణ శాస్త్రి కంకార్ (1930)

1930జులై 30న జైపూర్ లోపుట్టిన నారాయణ శాస్త్రి కంకార్ వ్యాకరణ సాంఖ్య యోగ దర్శన ఆచార్య .సాహిత్య రత్న ,ప్రభాకర్ .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .ప్రభుత్వ ఆయుర్వేద కాలేజి సెక్రెటరి .నవల్ కిషోర్ కంకార్ శిష్యుడు .రాసిన 29పుస్తకాలలో అభినవ సంస్కృత  కథ,రచనాభ్యుదయ మహాకావ్యం ,అభినవ సంస్కృత సుభాషిత సప్తశతి,సంస్కార కథా కౌతుకం  ,వినాయక నామాభినందనం ఉన్నాయి .వ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .మద్రాస్ ,రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత అకాడెమి పురస్కారాలు పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-21-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున శ్రీరాముడి పేరు మార్చి చెబుతున్నారు తెలుసా ?తెలిస్తే స్పందించండి

భద్రాద్రిలో శ్రీరామ నవమి నాడు కల్యాణం లో శ్రీరాముడి పేరు ఈమధ్యకాలం లో  మార్చి చెబుతున్నారని తెలుసా మీకు ?బ్రహ్మశ్రీ  అన్నదానం చిదంబర శాస్త్రి గారు లాంటి వారు దీనిపై మీడియాలో ఎంతోకాలంగా పోరాడుతున్నారు .ఫలితం కనిపించలేదు ఇవాల్టి ఆంధ్రజ్యోతి లో దీనికి సంబంధిన ఆర్టికల్ జత చేస్తున్నాను చదివి న్యాయం అనుకొంటే  స్పందించండి-దుర్గాప్రసాద్  

Posted in దేవాలయం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4     

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4     

651-అవాకదాహ చక్ర కర్త –సీతారాం ఝా (1890-1975)

1890లో బీహార్ దర్భంగా జిల్లా చౌగామాలో సతీష్ చంద్ర ఝా పుట్టాడు .జ్యోతిష ఆచార్య ,జ్యోతిష తీర్ధ .కాశీ సన్యాసి పాఠశాలలో సంస్కృత టీచర్ .67గ్రంథాలు రాశాడు. అందులో అవాకదాహ చక్రం ,ఆహిబాల చక్రం ,నీలకంఠవ్యాఖ్య ,బృహజ్జాతక టీకా ,ముహూర్త మార్తాండ టీకా ,మానసాగరీ టీకా ,బృహత్ పారాశర హోరా టీకా ఉన్నాయి .,15-6-1975న 85వ ఏట చనిపోయాడు .జ్యోతిష విద్వాన్  జ్యోతిష రత్నాకర బిరుదాంకితుడు .’’మిధిలా నగర సూర్యుడు ‘’గా ప్రఖ్యాతి పొందాడు .జ్యోతిష శాస్త్రం లో అపార ప్రజ్ఞావంతుడు .

652-కాత్యాయన శ్రౌత సూత్ర కర్త –శంభు కుమార్ ఝా (1970)

  యజుర్వేద ,ఋగ్వేద,ధర్మశాస్త్ర సాహిత్య ఆచార్య శంభుకుమార్ ఝా 25-5-1970 న మధుబనిలో పుట్టి ,జగద్గురు రామచంద్రాచార్య సంస్కృత యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .గురువు విశ్వేశ్వర ఝా .వైదిక దేవ వాదస్య  సమీక్షాత్మకం –అధ్యయనం ,కాత్యాయన శ్రౌత సూత్రం ,వైదిక సాహిత్యేతి హాసంరాశాడు .

653-రాగ తరంగిణి కర్త –శశి నాథ ఝా (1954)

సంస్కృతం లో 70పుస్తకాలు రాసిన శాశినాధ ఝా బీహార్ మధుబనిలో 15-2-1954లో పుట్టాడు . సంస్కృత డిలిట్.బీహార్ దర్భంగా యూని వర్సిటి ప్రొఫెసర్ .గురుపరంపర –పండిట్ కులానంద మిశ్ర ,పండిట్ తేజనాథ ఝా ,పండిట్ శ్యామసుందర ఝా ,పండిట్ ఖగేన్ద్రఝా,పండిట్ కామేశ్వర ఝా .డా.శంకర్ జి ఝా ,డా.పంచదేవ ఝా ,డా.సదానంద ఝా ,డా కమల్ ఠాకూర్ ల వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు .శుద్ధి కౌముది ,సమాస శక్తి ,రాగతరంగిణి ,దీపికా ,ఉపస్ర-అధాత్వర్ధసంగ్రహం ,బాలశిక్షా సోపానం మొదలైన 70పుస్తకాలు రాశాడు వ్యాకరణం లో అపార పా౦డిత్యమున్నవాడు ,గొప్పరచయిత ,సంపాదకుడు .

654-లక్షణావలి వ్యాఖ్య కర్త –శశినాథ ఝా (1963లో మరణం )

1963లో చనిపోయిన శాశినాథ ఝా బీహార్ లో పుట్టాడు .లక్షణావలి వ్యాఖ్య ,త్రితలా వచ్చేదకత్వ వధ ,ఖండసార రాశాడు .

655- బ్రాహ్మస్పు అసిద్ధాంతస్య సమీక్షాత్మమధ్యయనం కర్త –శివ కాంత ఝా (1956)

1956లో జనవరి 2న బీహార్ మధుబని జిల్లా బర్దహా లో పుట్టిన శివకాంత ఝా ,బీహార్ దర్భంగా లోని ఎస్ కే సింగ్ సంస్కృత విశ్వ విద్యాలయ జ్యోతిష ప్రొఫెసర్, హెడ్ .బ్రహ్మ గుప్తోక్తం వేధాయంత్రం , బ్రాహ్మస్పు అసిద్ధాంతస్య సమీక్షాత్మక మధ్యయనం ,అద్భుత సాగరః ,యోగయాత్ర రాశాడు .జ్యోతిష భాష్య శిరోమణి భాస్కర్ పురస్కారం 2003లో పొందాడు అనేక సంస్కృత విద్యా రిసెర్చ్ కమిటీలలో సభ్యుడు .

656-వ్యాకరణ తత్వాదర్శ కర్త –శివకాంత ఝా (1959)

10-4-1959న బీహార్ మధుబని జిల్లా గోనౌళి అన్దారా తాడి గ్రామం లో పుట్టిన శివకాంత ఝా నవ్యవ్యాకరణ ఆచార్యుడు .జైపూర్ సాస్కృత విద్యాలయ ప్రొఫెసర్ . వ్యాకరణ తత్వాదర్శపాణిని సూత్రార్ధ తత్వ కోశ ,స్ఫోటత్వమీమాంస వగైరా రాశాడు

657-పరమ లఘు కళ కర్త –శోభాకాంత జయదేవ ఝా (1922)

బీహార్ దర్భంగా లో 10-10-1922న పుట్టిన శోభాకాంత జయదేవ ఝా వ్యాకరణ.న్యాయ ఆ  వేదాంత తర్కఆచార్యుడు .మిధిల సంస్కృత శోధన సంస్థాన్ డైరెక్టర్ .పరమలఘు కళ అనే ఏకైక పుస్తకం రాశాడు .ప్రెసిడెంట్ అవార్డీ.

658-సుధాకర భాష్య కర్త –శ్రీమురళీధర ఝా (1869-1929)

  జ్యోతిష న్యాయ వ్యాకరణ సాహిత్య ఆచార్య శ్రీమురళీ ధర ఝా  1869లో మిదిలలోని శ్యాం సుధార్ లో పుట్టాడు .కాశీ  లో సంస్కృత లెక్చరర్ .గురుపరంపర –పండిట్ విద్యాఝా ,పండిట్ సుధాకర ద్వివేది ,పండిట్ మధుసూదన ఝా ..ప్రత్యేక శిక్షణ పండిట్ బాబువా మిశ్రా ,పండిట్ చంద్ర శేఖర ఝా ,పండిట్ గంగాధర మిశ్రా ,పండిట్ మురళీ ధర ఠాకూర్,పండిట్ సీతారాం ఝా లవద్ద పొందాడు .రాసిన 5పుస్తకాలలో సుధాకర భాష్యం ,సిద్ధాంత తత్వ వివేకం ,లీలావతి –బీజగణితం ,శివా స్వారోదయ టీకా,త్రికోణమితి,ఉన్నాయి .1929లో 60ఏళ్ళ వయసులో చనిపోయాడు .1922లో బ్రిటిష్ ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .

659-భారతీ ప్రవేశిక కర్త –సుభద్ర ఝా (1909)

1909జులై 9న మధుబని జిల్లా నగదః లో పుట్టిన సుభద్ర ఝా సాహిత్య ఆచార్య .మైధిలి పాట్నా యూని వర్సిటిలో రిటైర్డ్  ప్రొఫెసర్ .ది ఫార్మేషన్ ఆఫ్ మైధిలి లాంగ్వేజ్ ,దిసాంగ్స్ ఆఫ్ విద్యాపతి,భారతీ ప్రవేశిక రచనలు .సాహిత్య అకాడెమి అవార్డ్ పొందింది .

660-బాల నిబంధ కర్త –సుఖేశ్వర్ ఝా (1938)

4-5-1938బీహార్ మధుబనిలో పుట్టిన సుఖేశ్వర ఝా బీహార్ భాగల్పూర్ యూనివర్సిటిప్రొఫెసర్ .బాలనిబంధాః,నిబంధ సుధా ,పాణినీయంసిస్టం ఆఫ్  యాక్సేంట్ రాశాడు .

661-పురుష మేధ యజ్ఞస్య సమీక్షాత్మక౦ అధ్యయనం కర్త –సు౦దర్ నారాయణ ఝా (1972)

సుందర నారాయణ ఝా 1972ఏప్రిల్ 30న బీహార్ హనుమాన్ నగర్ లో పుట్టాడు  .ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠ ప్రొఫెసర్ . పురుష మేధ యజ్ఞస్య సమీక్షాత్మక౦అధ్యనం ,కటియేశి దీపకః ,అవ్యయ పురుష నిరూపణం రాశాడు .

662-వైయాకరణ సిద్దాన్తానాం తులనాత్మక అధ్యయనం కర్త –సురేంద్ర ఝా (1948)

వైయాకరణ సిద్దాన్తానాం తులనాత్మక అధ్యయనం రచించిన సురేంద్ర ఝా 20-6-1948న బీహార్ లో పుట్టాడు .లక్నోకా౦పస్ లోని RSKS ప్రిన్సిపాల్ .

663-కవీంద్ర గంగానంద కవితా తధా కర్తృత్వ కర్త –సూర్యనారాయణ ఝా (1946)

1946జులై 26న బీహార్ లో రత్నాపూర్ జిల్లా సహరస లో పుట్టాడు .ప్రొఫెసర్ . కవీంద్ర గంగానంద కవితా తధా కర్తృత్వ అనే ఒకేఒక పుస్తకం రాశాడు .

664-సంస్కృత –హిందీ కోశ నిర్మాత –తరణీష్ ఝా (1919)

సంస్కృత –హిందీ నిఘంటు నిర్మాణం చేసిన తరనీష్ ఝా 3-4-1919 బీహార్ లోని పంచి ఘటియా లో పుట్టిన వ్యాకరణ, వేదాంత ఆచార్య .నిరాశనకుమార్ ,సదానంద ఝా ,రవినాథ ఝా ల శిష్యుడు .

665-ముదిత మదాలస నాటకం ప్రచురించిన  –త్రిలోక నాథ ఝా (1934)

3-8-1934న బీహార్ మధుబనిలో సరిసాబ్ పాహి లో పుట్టిన త్రిలోక నాథ ఝా సంస్కృత డిపార్ట్ మెంట్ హెడ్ .గురుపరంపర –ఉమాకాన్తఝా,డా రామకరణ శర్మ ,డా.జయంత్ మిశ్రా ,డా .ఎస్ ఎస్ బెగాచి .గోకులనాథ ప్రణీతం ముదిత మదాలస నాటకం తన సంపాదకత్వం లో ప్రచురించాడు .

666-శృంగార సారిణి సమీక్ష కర్త –ఉదయకాంత ఝా (1939)

4-4-1939న బీహార్ మధుబని లోని చతౌని లో పుట్టిన ఉదయకాంత ఝా సాహిత్య హెడ్ .డా.కృష్ణానంద ఝా డా.ఖగేశ్వర ఝా ల శిష్యుడు .శృంగార సారిణి సమీక్ష ,విజయభూతి సమీక్ష రాశాడు .

667-న్యాయసార విచార కర్త –ఉమారమణ ఝా (1925)

న్యాయ  ఆచార్య ఉమారమణ ఝా18-7-1925న యుపి లో పుట్టి ,లక్నో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో సంస్కృత ప్రొఫెసర్ ,ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాడు .విలువైన 30గ్రంథాలు రాశాడు .అందులో  న్యాయసార విచార,దశ పదార్ధ శాస్త్రం ,తర్కప్రవేశిక ,శ్రీ నెహ్రు చారు చర్చ ,వివేక సహస్రి  మొదలైనవి ఉన్నాయి .యుపి సంస్కృత సంస్థాన్ సభ్యుడు .విశ్వ సంస్కృత సమ్మేళనం లో పాల్గొన్నాడు .రేడియో లో చాలా రాసి ప్రసారం చేశాడు .శ్రీ శృంగేరి, శ్రీకంచి పీఠ పురస్కారాలు,రాష్ట్రపతి అవార్డ్  పొందాడు.

668-త్రిపథగా కావ్య కర్త  -వేదానంద ఝా (1924)

సాహిత్య రత్న ,ఆచార్య వేదానంద ఝా 15-8-1924న బీహార వర్గానియాలోని వసంత పూర్ లో పుట్టాడు .ఢిల్లీ లోని మోతీనాథ్ సంస్కృత మహావిద్యాలయ ప్రిన్సిపాల్ .జన్నీరాం వ్యాస్ ,భూప నారాయణ ఝా లశిష్యుడు . త్రిపథగా కావ్య౦ ఒక్కటే రాశాడు .

669-లోచన విమర్శ కర్త –విదానాథ్ ఝా (1929)

15-12-1929 నబీహార్ లో మిధిలలో పుట్టిన విదానాథ్ ఝా సంస్కృత హెడ్ .డా హజారీ ప్రసాద్ ద్వివేది ,ప్రొఫెసర్ మహావీర్ పాఠక్ ల శిష్యుడు .లోచన విమర్శ ఒక్కటే రాశాడు .

670-కావ్య శాస్త్రీయ సిద్ధాంతదార్శనిక తత్వ విమర్శ  కర్త –విద్యానంద్ ఝా (1951)

సాహిత్యాచార్య ,శిక్షా శాస్త్రి విద్యానంద ఝా 1951జులై 11న బీహార్ లోని బేగూ సరాయ్ లో పుట్టాడు .భోపాల్ కాంపస్ సంస్కృత ప్రొఫెసర్, హెడ్ .మండన మిశ్ర ,కవిరత్న అమీర్ చంద్ర శాస్త్రి ,డా .హర్షనాథ మిశ్రా ల శిష్యుడు .శ్రీమద్ యశోవిజయ ముని కృతయః కావ్యప్రకాశైకయః ద్వితీయ,తృతీయమాత్రోపాలభిదయః సమీక్షా ,కావ్యశాస్త్ర సిద్దాన్తానాం దార్శనిక తత్వ విమర్శ రాశాడు .మహా వక్తగా ,శిష్య మార్గదర్శిగా ప్రసిద్ధుడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

వరుసపుస్తకం పేరువివరాలు
26వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీషసాహిత్య అకాడెమి ప్రచురించిన హైదరాబాద్ సంస్కృత అకాడేమి డైరెక్టర్ శ్రీ పి జి. లాల్యే ఇంగ్లీష్ లో రాసిన ‘’మల్లినాథ ‘ఆధారం  గా రాసినది  ’వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి  మనీష ‘
27ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు42 మంది ఆధునిక విదేశ సంస్కృత  విద్వాంసుల జీవితం, రచనలు – వివిధ దేశాలలో సంస్కృత ప్రచారం
28Nuclear Physicist Dr. Ankunuri  Venkata Ramayyaఅణుశాస్త్రవేత్త డా ఆకునూరి వెంకటరామయ్య బుక్ లెట్ విశేషాలు  కు ఇంగ్లీష్ లో అనువాదం
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ప్రయాగ రంగదాసు,ఎడ్ల రామదాసు కీర్తనలు

The compositions of Prayaga Rangadasa, Mallekonda Ramadasu and Yedla Ramadasu struggle to remain in public memory.

“B ala Tripura Sundari, Gaikonuma Haarathi…, the strains of this captivating Telugu lyric sung sonorously by a group of children drift out of a small school in Perla village, Karnataka. Their teacher Prince Rama Varma, renowned Carnatic classical vocalist and musicologist, nods his head in approval while keeping rhythm.

This composition is by Prayaga Rangadasa, better known as the maternal grandfather of legendary musician and composer Mangalampalli Balamuralikrishna. Rangadasa is also credited with other little gems like Ramududhbhavinchinaadu (Chenchuruti), Rama Rama Yanarada (Sindhubhairavi), and endearing, alliterative, folksy compositions like Yeme O Chitti, etc.

Rama Varma has also taught these children Eeswaraagya Yemo Theliyadu (Sindhubhairavi) by Mallekonda Ramdasu, another Andhra Pradesh composer. He will soon teach them another Mallekonda piece–– Mayalokamu. Varma has also taught Petrai Saami Devuda by yet another lesser-known but talented composer Yedla Ramadasu. Yedla, whose tomb you can see in Rajahmundry, is also credited with Chaalu Chaalu (Saraswathi) and a beautiful mangalam in Anandabhairavi. (Most above available on youtube).

These three Telugu composers lived between late 19th and early 20th centuries. While Prayaga Rangadasa’s compositions have tunes also by him, those of Mallekonda and Yedla have been all superbly tuned by Balamuralikrishna.

All their compositions are noted for being simple, unembellished, engaging, soaked in bhakti-bhaava or devotional fervour; and with undeniable musical merit. “They belong to simple yet authentic classical music,” states Pappu Venugopal Rao, musicologist and dance scholar, author, and secretary of Madras Music Academy.

These compositions were learnt by Rama Varma from his guru and musical giant Balamuralikrishna who has them as part of his famously vast repertoire. Though these lyrics were part of bhajan-singing perhaps a century ago, they were largely forgotten over the years and sadly neglected by the music world. However, Balamurali, re-introduced them to music-lovers by rendering them in Bhakti Ranjani of All India Radio. Occasionally, he also sang them in his concerts.

It was a great contribution from Balamurali and elicited much appreciation at that time. However, the compositions did not receive their due either from music teachers, performers or rasikas/sabhas––the entities which preserve and propagate music traditions. And thus, gradually slipped into oblivion. The saving grace was that Balamurali, much later, taught them to his student Rama Varma who has been propagating them dedicatedly by rendering them occasionally and also teaching them to his own students who are, ironically, all outside Andhra Pradesh.

To Balamuralikrishna and his star-disciple Rama Varma goes the credit of keeping these compositions still alive. Says Varma, “I love the cadences of these lyrics and their lilting tunes. They are such a delight to sing. And they have an instant appeal––once people listen to them, they want to hear them again and again.” It is indeed a sad state of affairs that such appealing lyrics and even their composers’ names are now largely unheard-of in their own state. There is little documentation too. Why have such deserving compositions disappeared from musicians’ repertoires and music-teachers classes? Explaining possible reasons, Pappu Venugopal Rao says, “There are many composers in Telugu who have receded into oblivion and their songs are not being heard or not being sung. The main reason is they did not have a ‘Sishya Parampara’ that could propagate their music in other areas of the state.”

The compositions of Prayaga Rangadasa, Mallekonda Ramadasu and Yedla Ramadasu, have worthy musical qualities; and are meaningful, melodious and aesthetic. They are deserving of public platforms including concerts. They also merit documentation in written works and audio-records. Thus, a great deal of responsibility rests on musicians, teachers and sabhas/academies who should make efforts to propagate these lyrics.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు 

శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు 

https://photos.google.com/u/1/share/AF1QipNXy5Li75cvIfSKKSjCqQCAu3-4jfUQG7Nc85iH2BAPX7uhz66nr4Lyy1jAw3ghuA


1-సాహితీ బంధువులకు13-4-21మంగళవారం  శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలు 2-సరసభారతి శ్రీప్లవ ఉగాది వేడుకలను రద్దు చేసిన సంగతి మీకు తెలుసు .కానీ ఈ ఉగాదిరోజు న   మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాల వద్ద 1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలంమల్లినాథ సూరి మనీష2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలను ఉంచి స్వామి వారే ఆవిష్కరించినట్లు భావించాం .3-21-4-21బుధవారం శ్రీ రామనవమి కల్యాణం సందర్భం గా మన ఆలయం లో ఈ రెండు పుస్తకాలను భక్తులకు అందజేస్తాం .4-శ్రీరామనవమి తర్వాత సాహితీ బంధువులకు బుక్ పోస్ట్  ద్వారా పై రెండు పుస్తకాలు పంపిస్తాము 5-అవిష్కరించాల్సిన 3 వ పుస్తకం Nuclear Scientist Dr. Akunuri   Venkata Ramayya పుస్తకాలు 50 కట్ట ను శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు నాకు సుమారు నాలుగైదు నెలల క్రితమే పంపారు ఆకట్ట నుభద్రంగా దాచాను  .కాని పై రెండు పుస్తకాలు ప్రింట్ అయి వచ్చిన సందర్భంగా పుస్తకాలు సర్దాము .రామయ్యగారి పుస్తకాలకట్ట ఎక్కడ పెట్టామోగుర్తురాక,యెంత వెదికినా కనపడక పోయే సరికి పై రెండు పుస్తకాలే స్వామి పాదాల వద్ద ఉంచి ఆవిష్కరణ జరిపినట్లు భావించాం .అవి కనబడిన తర్వాత ఆవిష్కరించి అందరికి పంపుతాము .ఈ అసౌకర్యానికి మన్నించ మనవి -మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-21-ఉయ్యూరు   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ప్లవ ఉగాది ,శ్రీరామనవమి శుభాకాంక్షలు

1-సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు 13-4-21 మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .21-4-21బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు .

2-ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకు  సరసభారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ ప్లవ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .

3-20-4-21 మంగళవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ఫేస్ బుక్ ద్వారా’’ శ్రీ శంకర విజయం ‘’64 వ చివరి భాగం ప్రత్యక్ష ప్రసారమౌతుంది .

4-21-4-21 బుధవారం శ్రీ రామనవమి నాడు సాయంత్రం 4 గం.లకు ‘’విశిష్ట యోగ వాసిష్టం ‘’ధారావాహిక ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమై ,22-4-21 గురువారం నుండి రోజూ ఉదయం 10 గం.ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది

   మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-21-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్


బాల్యం ,విద్య:

1903 ఏప్రిల్ 3 న కర్ణాటక లోని మంగుళూరు లో కమలాదేవి జన్మించింది .తండ్రి అనంతయ్యధరేశ్వర్ మంగుళూరు జిల్లా కలెక్టర్ .తల్లి గిరిజా బాయ్ కర్ణాటక తీరప్రాంత ఛత్రపూర్ సారస్వత భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందింది .కమలకు తల్లి లక్షణాలు వారసత్వం గా లభించాయి .నాయనమ్మ పురాణ ఇతిహాసాలలో అసాధారణ పాండిత్యం కలది .తల్లి గిరిజా బాయ్ ఇంటి వద్దనే ట్యూటర్ల వద్ద విద్య నేర్చింది .తలిదండ్రుల విశిష్ట లక్షణాలు కమలాదేవిని తీర్చి దిద్దాయి .బాల్యం నుంచే అరుదైన ధైర్య సాహసాలు ,తెలివి తేటలు ప్రదర్శించి కమల మిగిలినవారి కన్నా భిన్నంగా ఉండేది .ఆనాటి దేశభక్తులైన మహా దేవ గోవింద రానడే ,గోపాలకృష్ణ గోఖలే ,రమా బాయ్ రానడే , అనీబిసెంట్ వంటి వారితో వీరి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది .అందుకే కమలా దేవికి యవ్వనం లోనే స్వదేశీ ఉద్యమం పై గొప్ప ఆసక్తి కలిగింది .కేరళలోని ప్రాచీన నాటక సంప్రదాయ౦ కుటియాట్ట౦ ను గురువు పద్మశ్రీ మణిమాధవ చాక్యార్ వద్ద ,గురుకులం తిరుక్కురు స్సిమంగళం లోనే ఉంటూ అభ్యసించింది. అత్యంత స్నేహితురాలుగా ఉండే పెద్దక్క సగుణ వివాహమైన కొద్దికాలానికే ,మరణించటం ,తండ్రి కూడా ఆమె ఏడవ ఏట నే చనిపోవటంతో, కమలాదేవి తట్టుకోలేక పోయింది . దీనికి తోడు అంతులేని తన ఆస్తికి వీలునామా రాయకుండానే తండ్రి చనిపోవటం తో ,యావదాస్తి ,బాబాయికొడుకుకు చట్టప్రకారం దక్కి, వీళ్ళకు నెలనెలా పించను మాత్రమె దక్కితే ,తల్లి గిరిజాదేవి, ఆ దయా ధర్మ భిక్షం తిరస్కరించి, స్వయంగా తన కట్నకానుకలతో కూతుళ్ళను పోషించాలని నిర్ణయించింది . చిన్నారి కమల భూస్వామ్య లక్షణాలను తిరస్కరిస్తూ ఇంట్లోని నౌకర్లు చాకర్లతో కలసి మెలసి మెలిగేది .ఇదే ఆమెను గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలిని చేసింది .

వివాహం వైధవ్యం:

కమలాదేవికి 14వ ఏట 1947లో వివాహం జరిగింది .కాని భర్త రెండేళ్లకే చనిపోవటం తో వైధవ్యం ప్రాప్తించింది .మద్రాస్ లో క్వీన్ మేరీస్ కాలేజిలో చేరి ,అక్కడ భారత కోకిల సరోజినీ నాయుడు చిన్న చెల్లెలు సుహాసిని చటోపాధ్యాయ తో పరిచయం కలిగి ,తన అన్నమహా మేధావి హరీంద్ర నాధ చటోపాధ్యాయకు కమలాదేవిని పరిచయం చేసింది.ఈ ఇద్దరూ కళారాధకులవటం వలన బాగా దగ్గరయ్యారు .కమల తన 20వఏట హరీన్ ను పెళ్ళాడింది .ఆనాటి సంఘం విధవా పునర్వివాహాన్ని అంగీకరించక అభ్యంతరం చెప్పింది. అయినా ధైర్యంగా పెళ్ళాడారు .నవ దంపతులకు ఏడాది తిరగాగానే రామ అనే కొడుకు పుట్టాడు

నటన:

.సంఘాన్ని యెదిర్చి కమలా హరీన్ దంపతులు కొత్త ఆలోచనలతో నాటకాలు,స్కిట్స్ రాసి ప్రదర్శించేవారు .అప్పటికి ఇంకా స్త్రీలు సినిమాలలో నటించటానికి భయపడేవారు .కాని కమల కొన్ని సినిమాలలోనూ నటించింది .1931లో శూద్రకమహాకవి రాసిన మృచ్చ కటిక మూకీ సినిమాలో లో వసంత సేనగా ,ఏనాక్షి రామారావు హీరో తో ప్రముఖ కన్నడ దర్శకుడు మోహన్ దయారాం భవాని దర్శకత్వం లో నటించింది .1943లో హిందీ సినిమా తాన్సేన్ లో ప్రముఖ గాయకుడు కె.ఎల్. సైగల్ ,ఖుర్షీద్ లతోనూ ,శంకర్ –పార్వతి లోనూ 1945 లో ధన్నా భగత్ మూకీ లలో కమలాదేవి చటోపాధ్యాయ నటించింది .చాలా ఏళ్ళ తర్వాత పరస్పర అంగీకారంతో భర్తనుంచి విడాకులు పొంది మళ్ళీ సంఘం లో సంచలనం రేపింది .

లండన్ జీవితం:

హరీన్ తో పెళ్లి అయిన కొద్దికాలానికే ,హరీన్ లండన్ వెడితే ,కొన్ని నెలలతర్వాత కమల కూడా వెళ్లి ,లండన్ యూని వర్సిటి లోని బెడ్ ఫోర్డ్ కాలేజిలో చేరి ,సోషియాలజీలో డిప్లమా పొందింది .

భారత స్వాతంత్ర్య సమరం:

లండన్ లో ఉండగానే 1923 లో మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమం వార్త తెలిసి ,ఇండియాకు తిరిగి వచ్చేసి ,గాంధీజీ సేవాదళం లో చేరి మహిళాభ్యుదయానికి కృషి చేసింది .ఆమె సేవాదళం స్త్రీ విభాగానికి నాయకురాలైంది .దేశమంతటిలోని యువతులకు స్పూర్తి కలిగించి సేవాదళ సభ్యులుగా అంటే సేవికలు గా చేర్పించి గొప్ప శిక్షణనిచ్చి, తర్ఫీదు చేసింది .1926లో అఖిలభారత మహిళా సంఘ సంస్థాపకురాలు మార్గరెట్ కజిన్స్ ను కలిసి ,ఆమె ప్రోద్బలంతో మద్రాస్ ప్రాంతీయ శాసన సభకు శాసన సభ్యురాలిగా పోటీ చేసి, దేశంలోనే శాసనసభకు పోటీ చేసిన మొదటి మహిళ గా రికార్డ్ సృష్టించింది .కానీ 55వోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది .

అఖిలభారతీయ మహిళా సంఘం కార్యదర్శి:

AIWC అంటే అఖిలభారతీయ మహిళా సంఘానికి కమలాదేవి సంస్థాపక సభ్యురాలై,వెంటనే మొదటి కార్యనిర్వాహక కార్యదర్శి అయింది .ఆమె నాయకత్వం లో ఆ సంస్థ దేశ మంతటా శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేక అభ్యుదయ కార్యక్రమాలు చేబట్టి మహిళాచైతన్యం తెచ్చింది .శాసనసభ సంస్కణలకూ మార్గదర్శనం చేసింది .ఆమె పదవీకాలం లో అనేక యూరోపియన్ దేశాలు పర్యటించి అక్కడి మహిళాభ్యుదయ కార్యక్రమాలు అధ్యయనం చేసి ,ఇండియాలోకూడా అమలు చేయించి మహిళల చే నిర్వహింపబడే విద్యా సంస్థల స్థాపనకూ అంకురార్పణ చేసిన ముందుచూపు ఉన్న మార్గదర్శకురాలు కమలాదేవి .అంతే కాదు దేశం లోనే మొట్టమొదటి హోం సైన్స్ కాలేజీ గా న్యు ఢిల్లీ లో’’ లేడీఇర్విన్ కాలేజి’’స్థాపించింది .

ఉద్యమనాయకత్వం:

1930లో గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సంఘం లో ని ఏడుగురిలో కమలాదేవి కూడా ఒకరై ఉండటం మహిళలకు గర్వకారణం .బొంబాయి సముద్ర తీరం లో ఉప్పు తయారు చేసిన మొట్టమొదటి స్త్రీరత్నం కమలాదేవి చట్టోపాధ్యాయ. ఆమెకు సహాయం గా నిలిచిన మరో ధీరవనిత అవంతికా బాయ్ గోఖలే . 1940లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు కమలాదేవి లండన్ లో ఉంది .అక్కడ నుంచి ప్రపంచ దేశాల పర్యటన చేసి భారత దేశానికిస్వాతంత్ర్యం యెంత అవసరమో అందరికీ తెలియజేసి బాసటగా నిలిచింది .యుద్ధం ముగిశాక పోరాటం తీవ్రతరం చేసింది .

స్వాతంత్ర్యానంతర సేవలు:

భారత దేశంస్వాతంత్ర్యం సాధించినా దేశ౦ ఇండియా ,పాకిస్తాన్ గా విడిపోవటం ,శరణార్ధుల ను ఆదుకోవాల్సిన అవసరం కలిగి, కమల వెంటనే కార్య రంగం లో దిగి’’ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ ‘’స్థాపించి శరణార్ధులను పెద్ద ఎత్తున ఆదుకొన్నది .శరణార్ధుల ఆవాసానికి టౌన్షిప్ను కో ఆపరేటివ్ తోడ్పాటుతో ఏర్పాటు చేసింది .ఎట్టకేలకు ప్రధాని నెహ్రూ ఒప్పుకొని,ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరరాదనిమెలికలతో షరతు పెట్టాడు .ఎంతో శ్రమతో ఢిల్లీ బయట ఫరీదాబాద్ లో దేశ వాయవ్య సరిహద్దు నుంచి వచ్చిన 50వేలమంది శరణార్ధులకు ఆవాసం కల్పించిన ధీరోదాత్త మహిళ కమలా దేవి .అక్కడ వారికి ఇళ్ళుకట్టుకోవటానికి ఉద్యోగ , వృత్తులకు,ఆరోగ్యానికి క్షణం తీరికలేకుండా సహాయ పడి వెన్నంటి ఉంది .

కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం:

శరణార్ధుల పునరావాసం తోపాటు వారు పోగొట్టుకొన్న కుటీర ,చేతి వృత్తులకు ప్రోత్సాహం కలిగించి మళ్ళీ వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, భారతీయ కళలకు విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టల వ్యాప్తికి కారణమైంది .స్వాతంత్ర్యానంతర దేశ పురోగతిలో ఇదొక మైలురాయిగా నిలిచింది .

కళా సాంస్కృతిక రంగ సేవ:

భారతదేశ అభి వృద్ధికోసం ఉత్పత్తులను భారిగా పెంచటానికి ప్రధాని నెహ్రు యాంత్రీకరణ ప్రవేశ పెడుతుండటం కమలాదేవిని కలచి వేసి ,దానివలన భారతీయ కళా సాంస్కృతిక రంగాలకు సంప్రదాయ కటీర, చేతి వృత్తుల వారికీ ,అసంఘటిత వ్యవస్థలోని స్త్రీలకూ గొప్ప విఘాతం కలుగుతుందని గ్రహించింది.దీనికి విరుగుడుగా ప్రత్యామ్నాయం గా వరుసగా అనేక క్రాఫ్ట్ మ్యూజియం లు ,భారతీయ సంప్రదాయ కళ ,వృత్తులకుప్రాచీన భాండాగారాలు (ఆర్కైవ్స్ ) శిక్షణకు నిపుణుల ఏర్పాటు పెద్ద ఎత్తున నెలకొల్పింది .వీటితోపాటు ఢిల్లీ లో’’ థియేటర్ క్రాఫ్ట్స్ మ్యూజియం ‘’ఏర్పాటు చేసింది . హస్తకళాకారుల కు ప్రోత్సాహంగా జాతీయ పురస్కారాలు ఏర్పరచింది .దేశ వ్యాప్తంగా’’ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం’’ లను స్థాపించింది .

నాట్య విద్యాలయ స్థాపన:

బెంగుళూరులో కమలాదేవి 1964లో’’ కథక్ నాట్య ,కోరియోగ్రఫీ’’సంస్థను భారతీయ నాట్య సంఘం కు ఆధ్వర్యం లో నెలకొల్పి ప్రసిద్ధ నాట్య శిరోమణి మాయారావు ను డైరెక్టర్ ను చేసింది .

కాలానికంటే ముందుగా ఆలోచించే నేర్పున్న చటోపాధ్యాయ ‘’ఆల్ ఇండియా హాండి క్రాఫ్ట్స్ బోర్డ్ ‘’ఏర్పరచి ,మొదటి చైర్మన్ గా అందరి ప్రోద్బలం తో ఎన్నికై సమర్ధంగా నిర్వహించింది .క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇండియా కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ . వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ,ఆసియా ఫసిఫిక్ రీజియన్ కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ .

సంగీత నాటక అకాడెమీ నిర్వహణ:

నేషనల్ స్కూల్ ఫర్ డ్రామా ను కూడా ఏర్పాటు చేసిన కమలాదేవి ,తర్వాత సంగీతనాటక అకాడెమి నిర్వహణ బాధ్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి,యునెస్కో సభ్యురాలైంది .ఎన్నో బృహత్తర ప్రణాకలు చేబట్టి నిర్వహించిన కమలాదేవి తన స్వీయ జీవిత చరిత్ర ‘’ఇన్నర్ రీసెస్ అండ్ ఔటర్ స్పేసెస్-మెమాయిర్ ‘’ను 1986లో రాసి ప్రచురించింది .

బిరుదు ,పురస్కారాలు:

కమలాదేవి చట్టోపాధ్యాయ సాంఘిక కళా సేవలను గుర్తించి , భారత ప్రభుత్వం 1955లో పద్మ భూషణ్ పురస్కారం అందిస్తే ,1966అంతర్జాతీయ రామన్ మాగ్ సెసే అవార్డ్ ,1974లో అత్యంత అరుదైన సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ ,1977లో హస్తకళలకు ఇచ్చిన ప్రోత్సాహానికి యునెస్కో అవార్డ్ ,1987లో పద్మ విభూషణ్ అనే అత్యుత్తమ పురస్కారాలు పొందింది .శాంతి నికేతన్ సంస్థ కమలాదేవి కి అత్యుత్తమ ‘’దేశికోత్తమ పురస్కారం ‘’అందించి గౌరవించింది .

మహా ప్రస్థానం:

ప్రజాజీవితం లో అత్యుత్తమ సేవలందించి మహిళాభ్యుదయానికి భారతీయ సంప్రదాయ కళలు హస్త కళల అభి వృద్ధికి నిరంతర సేవలందించిన పద్మ విభూషణ్ శ్రీమతి కమలాదేవి చట్టోపాధ్యాయ 85ఏళ్ళ వయసులో 29-10-1988 న పరమ పదించింది .

రచనాప్రస్థానం:

తన స్వీయ జీవిత చరిత్రతో పాటు అవేకెనింగ్ ఆఫ్ ఇండియన్ వుమెన్ ,,జపాన్ ఇట్స్ వీక్నెస్ అండ్ స్త్రెంగ్త్ ,ఇన్ వార్ టార్న్ చైనా ,ఇండియన్ . ఎంబ్రాయిడరి,హాండి క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ,ట్రడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫోక్ లోర్ డాన్స్ ,దిగ్లోరి ఆఫ్ ఇండియన్ హాండిక్రాఫ్ట్స్ ,టువర్డ్స్ ఎ నేషనల్ థియేటర్ ,ఇండియన్ వుమెన్స్ బాటిల్ ఫర్ ఫ్రీడం,,సోషలిజం అండ్ సొసైటీ వంటి 18పుస్తకాలు రాసింది .ఆమెపై ప్రసిద్ధ రచయితలు ఎనిమిదిమంది గొప్ప పుస్తకాలు రాశారు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 
Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Virus-free. www.avast.com


You received this message because you are subscribed to the Google Groups “సరసభారతి సాహితీ బంధు” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-V7u-yz-Wycq9HoMnsqM4VDDeU7aOPgqch0oA0FR6VVg%40mail.gmail.com.

సమగ్ర సమాచారం.నమఃపూర్వకధన్యవాదాలు
3 ఏప్రి, 2021, శని 06:36కి, gabbita prasad <gabbita.prasad@gmail.com> ఇలా వ్రాసారు:
Show quoted text
Show quoted text

To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAP-rMRGXXzSxSCCUn8yzgnhM1sUBKigwT7c81zVDRRS%2BQttXuA%40mail.gmail.com.

← Back

Thank you for your response. ✨

Posted in రచనలు | Tagged | Leave a comment

డా.కట్టా నరసింహులు గారి తత్వ బోధ ,మరియు సాహితీ బంధువుల సానుభూతి కవితలు

– 

కేంద్ర సాహిత్య అకాడెమి కార్య దర్శి శ్రీ కే.శ్రీనివాసరావు పంపిన సానుభూతి సందేశం

1.: తండ్రి కంటె ముందు తనయుడు వెడలుట
తండ్రికెంత బాధ ధరణి మీద
ఈశ్వరుండు చేయు ఈ వింత ఆటను
 తెలిసినట్టి తండ్రి కలతగనడు.
l ఈశ్వరుని తలంపు నెరిగిన ఆ తండ్రి
గుండె దిటవు చేసికొనునుగాదె..   డా.కట్టా నరసింహులు గారు -తిరుపతి2-హస్తవాసి తోడ హరియించు రోగముల్

హస్తమంద జేసీ ఆదు కొనుచు

అలరించి నావు అందరివాడవై

అంద కుండ పోయె అంత లోనె శ్రీ .దండిభట్ల దత్తాత్రేయ శర్మ -విజయవాడ 3-: స్వార్ధభావములేని సాధుశీలియితండు
దుర్మార్గభావనాదూరుడితడు
వంచనచేయుటావంతనెరుంగడు
స్నేహభావముజూపుచెలిమికాడు
సిరిసంపదలు కోరిచిందులువేయడు
చెలిమినికలిమిగాచింతచేయు
మంచివైధ్యుడనుచుమన్నించప్రజలెల్ల
ఎంచినమార్గానమించెనితడు

తేగీ
ఘనుడుగబ్బిటవంశపుఘనతపెంచెపెన్నిదయ్యనుఈతడుపేదవార్కి
తల్లితండ్రియుబంధులుతల్లడిల్ల
వెన్నెల ంటికీర్తినిగొనివెడలెదివికి
కం
దాతగనెంచిరిసురలే
త్రతగతామెంచిపిలిచెతత్పరుడనుచున
నేతగనుంచగదివికే
మాతాపితరులుసతికినిమాననిబాధే
: మధురకవి  ముదిగొండసీతారామమ్మ4-సీ…చిన్నతనమునుండిచింతలకెదురేగు
               ధృత్యున్నతోత్సాహధీరుడతడు
దూరంబుగానున్నతీరులోదగ్గర
          పిల్లలన్ పెంచిన పెద్ద యతడు
చరవాణిలోపరిష్కారముతెల్పుచు
       వ్యాధులన్ తగ్గించువైద్యుడతడు
పిల్లలలందరిన్  భేదమ్ముచూపక
      ప్రేమను పంచెడు ప్రేమమూర్తి
 ఆ.వె.కన్నవారినెపుడుకంటికిరెప్పలా
  చూచిసేవనజేయుసుతుడతడు
అట్టిఘనుడునేడుఆస్వర్గమునుజేరె
వారికిత్తుఘననివాళులిపుడు
 …శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ( తపస్వీ)విజయవాడ  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-21-ఉయ్యూరు 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘మూర్తి’మత్వం

చిన్నప్పటి నుండి సమస్య లకు ఎదురువెళ్ళే తత్వం.

ఒంటరిగా పోరాడే మనస్తత్వం.

తను దూరంగా పిల్లలు అందరికీ దగ్గరగా పెంచిన విశిష్ట లక్షణం.

ఫోన్ లోనే ఆరోగ్య పరిష్కారం.

హస్తవాసి తో గ్రామ గ్రామాన ధన్వంతరి గా వచ్చిన పేరు.

ఏమి ఆశించకుండా వైద్యం.

23 జిల్లాల లో ఆర్ఎంపీ సంఘం కి చేసిన సేవలు.

రాజకీయ నేతల కు  సైతం మనసుకు దగ్గరగా   పని చేసే చతురత.

అందరి పిల్లలని ఒకే విధంగా చూసే నైజం.

తల్లిదండ్రుల ఆరోగ్యం కంటికి రెప్పలాగ కాపాడిన వైనం.

తన గమ్యానికి  పథక రచన  ధైర్యం. ….

ఒక్కటేమిటి  ఎన్నో. ఎన్నో..

చివరకు  ‘ మంచి ‘ అంతా ‘నీళ్ళ ‘  లాగా  మారి పోయి ఎందరికో. దాహం తీర్చి. .

కానీ. ఒక్కటే అప్పుడు ఫోటోలలో లేడు ఇక ఇప్పుడు కనబదడు.

–నీ అన్నలు ..అక్కలు.  తమ్ములు. చెల్లెళ్ళు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి మార్చి   23 మంగళవారం  64వచివరి భాగంతో సరసభారతి ఫేస్ బుక్  ద్వారా  అందిస్తున్న  శ్రీ  శంకర విజయం ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది .పూర్వం ప్రకటించినట్లు వెంటనే నారదుడు వగైరా ప్రసారం చేయటం వాయిదా వేశాం .

    కానీ , మార్చి 24 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారం ఉదయం 10గం. నుంచి వాల్మీకి మహర్షి రచించిన అద్భుత ఆధ్యాత్మిక బృహద్గ్రంథ౦  32వేల శ్లోకాల” యోగ వాసిస్టం” ను సంక్షిప్త పరచి ”విశిష్ట యోగ వాసిస్టం”గా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-3-21-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Leave a comment

కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రం

కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రంస్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రిక (6)

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకల ఆహ్వాన పత్రిక

సరసభారతి వేడుకల ఆహ్వాన పత్రిక

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

631-తత్వ ప్రకాశిక టీకా కర్త –కృష్ణ మాధవ ఝా (1898-1996)

1898లో బీహార్ లో జన్మించి 98 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపి 1996లో చనిపోయిన కృష్ణమాధవ ఝా పరమ లఘు మంజూష కు తత్వ ప్రకాశిక టీకా అనే ఒకే ఒక గ్రంథం రాశాడు

632-సిద్ధాంత లక్షణ బోధిని కర్త –కృష్ణ మాధవ ఝా (1899-1985)

బీహార్ మధుబని జిల్లా సరిసాబ్ పాహి తాలూకా బిట్టో గ్రామ౦  లో కృష్ణమాధవ ఝా 1899లో జన్మించి 1985లో మరణించాడు .సిద్ధాంత లక్షణ బోధిని అనే ఏకైక గ్రంథం రాశాడు .

633-కాత్యాయన శ్రౌత సూత్ర కర్త –లక్ష్మీశ్వర్ ఝా (1948)

శుక్ల యుజుర్వేద ఆచార్యుడు లక్ష్మీశ్వర ఝా బీహార్ సహస్రా జిల్లా బాఘ్వాలో 5-6-1948 న పుట్టి  ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠ లో ప్రొఫెసర్ చేశాడు మూడు గ్రంధథాలు రాశాడు. అందులో కాత్యాయన శ్రౌత సూత్ర, వేదాంత సిద్ధాంత ముక్తావళి ,వైదికవాజ్మయ ఇతిహాస ,గౌడపాద కారికా కా సమీక్షాత్మక్ అధ్యయన ఉన్నాయి .గురువులు శీలకా౦త ఝా ,శివదాస మిశ్రా .

634-జాతి బాధక పరిష్కార కర్త –లోక నాథ ఝా (20వ శతాబ్ది )

బీహార్ లో పుట్టిన లోకనాథ ఝా మహామహోపాధ్యాయ .ఉభయ భావ దివాకర పరిష్కార ,జాతి బాధాక పరిష్కార రాశాడు .

635-రసగంగాధర వ్యాఖ్య కర్త –మదన మోహన ఝా (1922)

జగన్నాథ పండిత రాయలు రాసిన రస గంగాధర అలంకార శాస్త్రానికి సంస్కృతం హిందీలో వ్యాఖ్యానం రాసిన మదనమోహన ఝా 1922లో డిసెంబర్ 2 న మధుబనిలోని నవనిలో  పుట్టాడు .సాంప్రదాయ విద్య నేర్చాడు .పాట్నాప్రభుత్వ  సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్.యదుపతి మిశ్రా, ఈశ్వర నాథ ఝా ల శిష్యుడు .వ్యాకరణ సాహిత్య శాస్త్రాలలో నిష్ణాతుడు .

636-వైదిక దర్శన విమర్శ కర్త –మోహానంద ఝా (1972)

15-8-1972 న బీహార్ సమస్తిపూర్ లో పుట్టిన మోహానంద ఝా సంస్కృత పిహెడి.రాసిన 4 గ్రంథాలలో వైదిక దర్శన విమర్శ,తర్క సంగ్రహ సర్వస్వం ,న్యాయ సిద్ధాంత ముక్తావళి ఉన్నాయి .

637-సపర్యాస్టకం కర్త –మహేష్ ఝా (1946)

నవ్యన్యాయ ఆచార్య మహేష్ ఝా 4-2-1946న మధుబనిలో పుట్టాడు .గురుపరంపర –పండిట్ మురళీధర్ ఝా ,బెచేన్ ఝా ,డా.అయోధ్యాప్రసాద్ సిన్హా .చండికా శతకం ,ఆర్యాశతకం ,సపర్యాష్టకం రాశాడు

638-భూ పరిక్రమణ౦ కర్త –మునీశ్వర్ ఝా (1928)

1928 నవంబర్ నాలుగున  బీహార్ కరామౌలి లో పుట్టిన మునీశ్వర్ ఝా సంస్కృత ,హిందీ డిలిట్.12పుస్తకాలు రాశాడు.అందులో భూ పరిక్రమణ౦, వేదం వాగ్వివృత్తి,ఉన్నాయి ప్రెసిడెంట్ అవార్డీ.

639-  విద్యాపతి వాజ్మయ కర్త -మునీశ్వర్ ఝా (1928)

1928నవంబర్ 4న మధుబని లో పుట్టిన మునీశ్వర్ ఝా సాహిత్య ఆచార్య ,మహామహోపాధ్యాయ, విద్యా వాచస్పతి .వైస్ చాన్సలర్ .రాసిన 10పుస్తకాలలో విద్యాపతి వాజ్మయ ,కావ్య ఔర్ భాషా వున్నాయి .ఫ్రాన్స్ జర్మని ట్రినిడాడ్ వెస్ట్ ఇండీస్ సందర్శనచేశాడు .

640-సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా కర్త-పరమేశ్వర్ ఝా (1853-1924)

పరమేశ్వర్ ఝా 1853లో దర్భంగా జిల్లా తరువని లోపుట్టి ,వ్యాకరణ ధర్మశాస్త్ర మీమాంస సాంఖ్య వేదాంత ఆచార్య .దర్భాన్గాలోని రామేశ్వర లతా సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .ఈయన గురు పరంపర లో చిరంజీవి మిశ్రా ,పండిట్ రాజారాం శాస్త్రి ,పండిట్ బాల శాస్త్రి ,పండిట్ తారా చరణ్ భట్టాచార్య ,పండిట్ విశ్వనాథ ఝా ఉన్నారు .ప్రత్యెక శిక్షణ పండిట్ మార్కండేయ మిశ్రా ,పండిట్ త్రిలోక నాథ ,శివానంద ఠాకూర్ ల వద్ద పొందాడు .రాసిన 13గ్రంథాలలో సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా ,ఛాందోగ్య వృషోత్సర్గ ,సదాచార దర్పణ ,పరమేశ్వర కోశ ,మిధిలేశ ప్రశస్తి ఉన్నాయి .1924లో 71వ ఏట మరణించాడు .భారత ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించింది .వైయాకరణ కేసరి ను భారతార్ధం మహా మండల ప్రదానం చేసింది .

641-ఋతు దర్శన కర్త –పరమేశ్వర ఝా (1856)

1856లో బీహార్ తర్రోనిలో పుట్టిన పరమేశ్వర ఝా 30ఉద్గ్రంథాలు రాసిన సంఖ్య ధర్మ శాస్త్ర వేదాంత వ్యాకరణ ఆచార్య .మిదిలాతత్వ విమర్శ ,రుతుదర్శనం ,యక్ష సమాగమ ,పరమేశ్వర కోశ నిఘంటు ,మొదలైనవి రాశాడు .వైయ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .

642-నేపాల సామ్రాజ్యోదయం కర్త –పశుపతి ఝా (1930)

27-4-1930 న పశుపతి ఝా నేపాల్ లో సాధు లో పుట్టాడు .నవ్య వ్యాకరణ ,సాహిత్య ఆచార్య .ప్రొఫెసర్ .గురుపరంపరలో బాలబోధ మిశ్రా ,జీవననాద్ ఝా ఉన్నారు .నేపాల సామ్రాజ్యోదయం రాశాడు .

643-గ్రహార్ఖ దర్శన కర్త –ప్రేమ కాంత్ ఝా (1957)

1957జులై 1న మధుబనిలో ప్రేమ కాంత్ ఝా పుట్టి ,INM  సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేశాడు గ్రహార్ఖ దర్శన అనే ఏకైక రచన చేశాడు .

644-యోగ రత్నాకర కర్త – రాం కిషోర్  ఝా(1959)

బీహార్ ముఝపర పూర్ లో 5-11-1959న పుట్టిన రాం కిషోర్ ఝా పిహెచ్ డి .రాసిన 4పుస్తకాలలో యోగ రత్నాకర ,విఖ్యాత వ్యాజ్యం ,చండికా చరిత చంద్రిక ఉన్నాయి .

645-లఘు కౌముది వ్యాఖ్య కర్త –రామ చంద్ర ఝా (1951)

సంస్కృత హిందీలలో 21పుస్తకాలురాసిన రామచంద్ర ఝా 1951న జనవరి 19న దర్భా౦గా లో పుట్టి ,  గణిత, ఫలిత జోశ్య ,ధర్మ శాస్త్ర ఆచార్య .KSDసంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్ హెడ్ .సిద్ధాంత కౌముది లఘు కౌముది మధ్య కౌముది లకు సంస్కృత హిందీ వ్యాఖ్యానాలు రాశాడు

646-శివ తత్వ విమర్శ కర్త –రామేశ్వర్ ఝా (1905-1981)

1905లో సమస్తిపూర్ జిల్లా పాటసగ్రాం లో పుట్టిన రామేశ్వర్ ఝా 76 వ ఏట 12-12-1981న మరణించాడు .ఈయన గురువులు రామదత్త మిశ్రా ,రాదా కాంత్ ఝా సదానంద ఝాఉగ్రానంద ఝా , ,పండిట్ బాలకృష్ణ .పురాణతా ప్రత్యభిజ్ఞా,శివ తత్వ విమర్శ రాశాడు .మహామహోపాధ్యాయ బిరుదు ,ప్రెసిడెంట్ సర్టి ఫికేట్ పొందాడు .

647-ముగ్ధా శతకకర్త –రాం కిషోర్ విభాకర్ ఝా (20వ శతాబ్ది )

ముగ్ధాశతకం ,విభాకర వైభవం రాసిన రాం కిషోర్ విభాకర్ ఝా 20వ శతాబ్ది కవి .బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .సంస్కృత హిందీ మైధిలి భాషలలో ఎం ఏ .పిహెచ్ డి.దేవఘర్ మహావిద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .

648-మాలవీయ ప్రశస్తి కర్త –రతి నాథఝా (1922)

1922లో బస్ట్ లో పుట్టిన రతి నాథ ఝా వారణాసి లో  సంస్కృత ప్రొఫెసర్.మహావీరాభ్యుదయం గాంధీ శతకం ,మాలవీయ ప్రశస్తి ,అరవింద శతకం ,మహావీరాభ్యుదయ మహాకావ్యం ,వాణీ విలాసం రాశాడు .

649-ఉషతి గోమతి కర్త –సర్వ నారాయణ ఝా (1962)

గణిత ,ఫలిత జోశ్య ఆచార్య సర్వనారాయణ ఝా డిలిట్ 5-6-1962న బీహార్ సహరసా లో పుట్టాడు .లక్నో ssలో సంస్కృత ప్రొఫెసర్ .మేఘమాల ,వైష్ణవి ,ఉషతి గోమతి రాశాడు .

650-సురత చరిత మహాకావ్యపరిశీలన  కర్త –సతీష్ చంద్ర ఝా (1947)

10-5-1947 మధుబని చమపూర లో పుట్టిన సతీష్ చంద్ర ఝా డిలిట్.BRA బీహార్ యూనివర్సిటి  సంస్కృత ప్రొఫసర్, హెడ్ .సురత చరిత మహాకావ్యపరిశీలనం ,కాత్యాయన వార్తికానాం ,భాషా శాస్త్రీయ అధ్యయనం రాశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4      621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)

ఆచార్య ,విద్యా వారిది ధనీంద్ర కుమార్ ఝా 1963 లో జూన్ 11న ముజఫర్పూర్ లో జన్మించాడు .లక్నో RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర లో ఆచార్య పారస్ నాథ ద్వివేది ,ఆచార్య రమ్యతన శుక్ల ,పండిట్ రాం ప్రసాద్ త్రిపాఠీ ,పండిట్ రఘునాథ శర్మ ఉన్నారు .డా నరేంద్రకుమార్ ,డా ధనుంజయ శుక్లా వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .శివ ధర్మ మహా శాస్త్రం ,పరాశర సంహిత రాశాడు

622-జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత కర్త –దిలీప్ కుమార్ ఝా (1966)

ధర్మ శాస్త్ర ఘంటా ,ఫలిత జోశ్య  సాహితి ఆచార్య దిలీప్ కుమార్ ఝా 26-10-1966న దర్భంగా లో పుట్టి ,దర్భంగా KSDSయూనివర్సిటి ప్రొఫెసర్ చేశాడు .లక్ష్మీ నాథ ఝా ,బ్రజ కిషోర్ ఝా ,ప్రొఫెసర్ శివ కుమార్ ఝా ప్రొఫెసర్ రామ చంద్ర ఝాల శిష్యుడు .కార్తీక్ కుమార్ ,బ్రిజేష్ కుమార్ ఝా ,గోవింద ఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు . జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత రాశాడు .

623-ఖద్యోత టీకా కర్త –గంగా నాద ఝా (1871-1941)

అలహాబాద్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గంగానాథ ఝా 1871లో పుట్టి 1941లో చనిపోయాడు. ఖద్యోత టీకా ,మండన మిశ్రుని  రచనకు మీమంసాను క్రమణిక రాశాడు .సంస్కృత ఆంగ్లా లలో  విశేష ఖ్యాతి పొందాడు .

624-మైధిలీ భాషా వికాస కర్త –గోవింద ఝా (1923)

వ్యాకరణ ,సాహిత్య ఆచార్యుడు 49గ్రంథాల రచయిత గోవింద ఝా 1923లో అక్టోబర్ 10 న మధుబని లో పుట్టాడు. బీహార్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్.గురు దీనబంధు ఝా శిష్యుడు .మిధిలా –ఇంగ్లిష్ నిఘంటువు కల్యాణికోశ ,మైధిలి భాషా కా వికాస్ మొదలైనవి రచించాడు సాహిత్య అకాడెమీ అవార్డ్ ,కామిల్ బుల్కా  అవార్డ్  గ్రహీత. ఈయన పై డాక్యుమెంటరి తీశారు.

625-జ్యోతిస్సౌరభం  కర్త –హన్స ధర ఝా (1963)

గణిత ,ఫలిత జోస్యధర్మ శాస్త్ర ,పురాణ ఆచార్య హన్స ధర ఝా 5-10-1963న బీహార్ మధుబని లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీ యదు వీరఝా ,పండిట్ శ్రీరామావతార్ మిశ్రా ,ప్రొఫెసర్ రామ చంద్ర ఝా ,ప్రొఫెసర్ శివకాంత్ ఝా ,ప్రొఫెసర్ రాధా కాంత ఠాకూర్,లు. ప్రత్యెక శిక్షణ ను విద్యానాథ మిశ్రా ,డా.రాం కుమార్ కౌల్ ,డా.సుమన్ కుమార్ ,డా అద్వేష్ కుమార్ శ్రోత్రియ లవద్ద పొందాడు .జ్యోతిస్సౌరభం ,గోల పరిభాష ,త్రిస్కంద జ్యోతిషం రాశాడు . ధర్మ శాస్త్రం, పురాణాలలో  లో మహా విద్వాంసుడు .

626-జ్ఞాన సంహిత కర్త –హరేంద్ర కిషోర్ ఝా (1956)

1-5-1956 న హర్పూర్కల లో పుట్టిన హరేంద్ర కిషోర్ ఝా ఎం.ఏ.పిహెచ్ డి.BS రాం సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు జ్ఞాన సంహిత ఒకే ఒక పుస్తకం రాశాడు .

627-సంవిత్స్వ తంత్ర కర్త –కమలేశ్ ఝా (1960)

శంకర వేదాంత, శైవ ఆగమ ,నవ్య న్యాయ ,జైన దర్శన ఆచార్య కమలేశ్ ఝా 4-6-1960న బీహార్ సమస్తిపూర్ లో పుట్టాడు .బెనారస్ హిందూ యూనివర్సిటి లో ధర్మాగమ ప్రొఫెసర్ .7గ్రంథాలు రాశాడు .వీటిలో సంవిత్స్వ తంత్ర,శైవ తత్వ విమర్శ ,ఆగమ సంవిద , పూర్ణతా ప్రత్యాభిజ్న ఉన్నాయి .స్కాట్ లాండ్ సందర్శించాడు

628-ధర్మస్య మూలం అర్ధ కర్త –ఖగేష్ ఝా (1942)

1942 జనవరి 2న మధుబనిలో పుట్టిన ఖగేష్ ఝా ,వైశాలి RPSకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రమేష్ ఝా ,రామానంద ఝా ,పండిట్ రాం దేవ్ ఝా ,పండిట్ ఉదయకాంత్ ఝా ,పండిట్ మహేష్ ఝా ల శిష్యుడు .పండిట్ ఆత్మానంద శర్మ ,పండిట్ ప్రమణానంద ఝా,పండిట్ రాజెంద్ర ఝా  ,పండిట్ భగలుఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .రాసిన 4పుస్తకాలలో –ధర్మస్య మూలం అర్ధ ,సురభారతి ,ప్రబంధావళి ఉన్నాయి .

629-గూడార్ధ  తత్వాలోక కర్త –కీర్త్యానంద ఝా (1934)

కీర్త్యానంద ఝా 1934బీహార్ దర్భా౦గా జిల్లా జరిసో లో పుట్టాడు .అసిస్టెంట్ ప్రొఫెసర్ గురుపరంపర –పండిట్ అచ్యుతానంద ఝా ,,పండిట్ హరి రాం శుక్లా ఉన్నారు. గూడార్ధ  తత్వాలోక అనే ఏకైక పుస్తకం రాశాడు .

630-న్యాయ శాస్త్రాను శీలనం కర్త –కిషోర్ నాద ఝా (1940)

52ఉద్గ్రంధాలు రాస్సిన కిషోర్ నాధ ఝా వ్యాకరణ,సాహిత్య ఆచార్య .న్యాయ వైశేషిక౦లొ ఎం ఏ .10-6-1940న యుపిలో పుట్టాడు .అలహాబాద్ గంగానాథ ఝా సంస్కృత కాలేజిలో రీడర్ చేసి రిటైరయ్యాడు .డిలిట్.గురుపరంపరలో మధుసూదన మిశ్రా ,దీనబంధు ఝా ,చంద్రమాధవ ఝా ఉన్నారు .ఉత్తరరామ చరితానికి సంస్కృత హిందీ వ్యాఖ్యానం ,న్యాయ శాస్త్రీ ఈశ్వరవాద ,న్యాయ దృశ్యాత్మాను చింతనం ,న్యాయ సూత్రణం పాహ విమర్శ ,న్యాయ శాస్త్రాను శీలనం మొదలైనవి రాశాడు .ప్రెసిడెంట్ అవార్డీ.

   సశేషం

  మహాశివరాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

ఎక్కువకాలం చీకటిలో ఉంటూ .ఉద్యోగావకాశాలు తక్కువేఅయినా , అస్థిరమైన భూభాగం
ఉన్నా ,మహిళా మణులను గౌరవిస్తూ ,తమ భాషా సంస్కృతులసేవలో తరిస్తూ, నిరంతరం పరి
రక్షించు కొంటూ ,ఆర్ధికాభి వృద్ధి చెంది ,ప్రపంచానికే ఆదర్శ ప్రాయం గా నిలిచిన
దేశం ఐస్ లాండ్ .అక్కడి భాషా సాంస్కృతిక సేవలను తెలుసు కొనే ముందు ఆ దేశ
పరిస్థితి ని గమనిద్దాం .

అస్థిర అస్తవ్యస్త దేశం

ఐస్ లాండ్ దేశం అంటే మనలాగా నిశ్చింతగా ఉన్న దేశం కాదు .ప్రపంచం లో ఉన్న అగ్ని
పర్వతాలలో మూడవ వంతు ఇక్కడే ఉన్నాయి .ఉత్తర అట్లాంటిక్ ఆర్కిటిక్ సముద్రాల మధ్య
ఉన్న ప్రాంతం .ప్రతి అయిదేళ్లకోసారి ఏదో ఒక అగ్ని పర్వతం బద్దలై భీభత్సం
సృష్టిస్తుంది .దీన్నే అక్కడి వారు ‘’యాత్రిక విస్ఫోటనం (టూరిస్ట్ ఎరప్షన్)అని
సరదాగా అంటారు .అందువల్ల భూభాగం అస్థిరం గా ఉంటుంది .అయితే ఈ అస్థిరత వల్లనే
ఎనభై శాతం ఉష్ణాన్ని పొందుతారు .ఇదొక విపరీతం ..గడ్డకట్టిన మహా సముద్రం ఐస్
లాండ్ .దీన్ని మొదట గుర్తించిన బ్రిటిష్ నావికుడు దీనికి ‘’ధూలే’’అని
పేరుపెట్టాడు .. ఇక్కడి అనిశ్చిత వాతావరణా,న్ని చూసి ‘’నరకానికి ఘనీభవించిన
మార్గం’’ అంటారు.ఐస్ లాండ్ రాజధాని ‘’రెక్ జవిక్ ‘’.ఇక్కడిప్రజలను వైకింగులు
అంటారు .జనాభా సుమారు మూడు లక్షలు .దేశ విస్తీర్ణం 103చదరపు కిలో మీటర్లు .
.3,200అడుగుల మ౦ద౦ మంచు ఉన్న ప్రాంతం .పర్వతాలు ,హిమానీ నదులున్న ప్రాంతం
.హిమానీ నదులు లోతట్టు ప్రాంతాలనుండి సముద్రం వైపుకు ప్రవహిస్తాయి . యూరప్
మొత్తం మీద ఐస్ లాండ్ అతి పెద్ద’’ మంచు టోపీ’’(ఐస్ కాప్).మిగతా దేశాలలో ఉన్న
మంచుప్రాంతాలన్నీ కలిపినా దీనికంటే తక్కువే . ఉష్ణోగ్రత ఎప్పుడూ పది సెంటి
గ్రేడ్ డిగ్రీలకంటె తక్కువే .అంటే పద్నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ .విపరీతమైన
గాలి ,వర్షాలే ఈదేశానికి ‘’పెద్ద ప్లేగు వ్యాధి ‘’అని చమత్కరిస్తారు ..వర్షం
అన్ని వైపులా నుంచే కాదు ,సమాంతర వర్షం కూడా పడటం ఇక్కడి ప్రత్యేకత .ఆర్కిటిక్
వలయానికి అవతలి వైపు ,ఉన్నత అక్షా౦శ రేఖ మీద ఉండటం వలన ఎప్పుడూ చీకటి గా ఉండటం
మరో విశేషం .డిసెంబర్ జనవరి నెలల్లో రోజుకు 5గంటలు మాత్రమే సూర్యుడు
కనిపిస్తాడు .దీనివలన ‘’షార్ట్ డే డిప్రెషన్ ‘’వీరికి ఎక్కువ .శీతాకాలం
లో ‘’మిరుమిట్లు
గొలిపే భయంకర ఉత్తర కాంతులు ‘’(ఘో స్ట్లీ ఆరోరా బొరియాలిస్ )దర్శన మిస్తాయి
.ఆకాశం లో మెరుపుల్లా విద్యుత్ తరంగాలు భయ భ్రా౦తుల్ని చేస్తాయి.ఉష్ణోగ్రతలు
12సెంటి గ్రేడ్ నుంచి మైనస్ 15సెంటిగ్రేడ్ డిగ్రీలవరకూ మారుతూ ఉంటాయి
.ఆర్కిటిక్ వలయం పైన ఉండటం వలన ‘’అర్ధ రాత్రి సూర్యుడు ‘’కనిపిస్తాడు .సమాంతర
రేఖలో ఎప్పుడూ ఇక్కడ సూర్యుడు కుంకడు.ఇదొక వింత .పడమటి ఫిజార్డ్స్ లో పర్వతాలు
సూర్య కాంతిని అడ్డ గించటం వలన చాలా గ్రామాలు చీకట్లోనే శీతాకాలమంతా ఉంటాయి
.ఫిబ్రవరి మార్చి నెలలలో వచ్చే సూర్య దర్శనానికి పులకరించి ఈ ప్రజలు ‘’సన్ షైన్
కాఫీ ‘’త్రాగుతారు .జూన్ ,జులై నెలలో నిజమైన చీకటి రాత్రులు రావు .సూర్యుడు
అర్ధ రాత్రి వేళ దిక్చక్రానికి కిందుగా ఉండటం తో మసక గా ఉండి పగలు అయిపోయి
నట్లు భావిస్తారు .ఆగస్ట్ దాకా నక్షత్రాలుకూడా రావు .ఇక్కడ ‘’శాండీ గ్లేసియల్
డెసర్ట్’’’’పైమంచు ప్రదేశం ,లేక రాళ్ళ ఆకృతులు దిక్చక్రం దగ్గర
‘’ఏర్పడి ‘’తమాషా
ఎండమావి ‘’(ఫాటా మార్గానా ) లా ఉండటం మరో విశేషం .

అస్టిరత లోనూ ఆత్మ స్థైర్యం

ఐస్ లాండ్ ప్రజలు కస్ట జీవులు .వారానికి 46 నుండి 50గంటలు కష్టపడి పని
చేస్తేనే వారి కడుపు నిండు తుంది .ఉద్యోగ స్థాయి 4శాతం కంటే తక్కువ .ఇది
ప్రపంచం లోనే అతి తక్కువ శాతం .ఒకప్పుడు మద్య నిషేధం అమలు పరచారుకాని ఇప్పుడు
ఎత్తేశారు .ఇక్కడి చేపలు పట్టే వారి జీవితం చాలా దుర్భరం గా ఉంటుంది .సముద్రం
పై చేపల వేటకు వెళ్ళిన జాలర్లు సురక్షితం గా తిరిగి వస్తారనే నమ్మకం ఉండదు
.అందుకే భర్తలను కోల్పోయిన జాలరి భార్యలు ఎక్కువగా ఉంటారు .ఇరవై వ శతాబ్దం వరకు
చేపలవేట ఒక్కటే ముఖ్య వృత్తి .ప్రపంచం లో ఉండే తిమింగిలాలు అంటే ‘వేల్స్’’ లో
సగం అయిస్ లాండ్ లోనే ఉండటం విశేషం .వీరికి ఎగుమతులు పెద్దగా ఉండవు .అన్నీ ఇతర
దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే .అందుకే ధరలుఎప్పుడూ ఆకాశాన్ని అంటి
ఉంటాయి .’’ఊహకందని అరుపులు ,ఉంటాయి వృక్షాలు కాని రైళ్ళు కాని ఉండవు .భవన
నిర్మాణ కళ(ఆర్కి టెక్చర్ ) ఉండదు.పండ్లు ,పచ్చదనం ఆరోగ్యావసరాలకు చాలవు .సంపద
తక్కువ కనుక సంస్కృతీ తక్కువగానే ఉంటుంది .యాత్రికుల కు ఆకర్షణీయ అంశాలు చాలా
తక్కువే .సాహిత్యం పగ ప్రతీకారం కేంద్ర మై ఉంటుంది.అయినా ఐస్ లాండ్ ను ఎందుకు
ప్రేమిస్తానంటే ఇక్కడ జనాభా తక్కువ అవటం వల్ల’’అని ప్రముఖ ఆంగ్లో అమెరికన్ కవి
డబ్ల్యు .హెచ్ .ఆడెన్ ‘’లెటర్స్ ఫ్రం ఐస్ లాండ్ ‘’కవిత లో అంటాడు .దేశం ఎన్నో
శతాబ్దాలకాలం నార్వేజియన్ ల పాలన కింద ఉంది .తర్వాత డెన్మార్క్ అధీనం లోకి
వచ్చింది . 1944లో డెన్మార్క్ కబంధ హస్తాలనుండి విడివడి ఐస్ లాండ్
స్వాతంత్ర్యాన్ని పొంది, రిపబ్లిక్ దేశమైంది ..ఇవన్నీ ఈదేశ విపరీత పరిస్థితులే
.అయినా ప్రజలు ఏంతో బాధ్యతగా దేశ నిర్మాణం లో ,సంస్కృతీ ,భాషా పరిరక్షణ లో
నిబద్ధులై ప్రపంచానికి ఆదర్శ ప్రాయం గా ఉన్నారు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత
దేశం తీరే మారిపోయింది .అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా అభి వృద్ధి చెందింది
.ఐరోపా ఆర్ధిక వ్యవస్థలో భాగస్వామ్య దేశ మైంది .ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన
ఆర్ధిక సంక్షోభానికిగురై,రాజకీయ ఆస్థిరత్వమేర్పడి, మళ్ళీ క్రమంగా పుంజుకొని
యాత్రికాకర్షణ దేశంగా నిలబడింది .స్వేచ్చా వాణిజ్యం అమలు పరుస్తోంది .సాంఘిక
సంక్షేమం ,ఆరోగ్య సంరక్షణ అందరికీ విద్య అందిస్తూ ప్రగతి పధం లో నడుస్తోంది .
ఇప్పుడు ఆర్ధిక ,రాజకీయ ,సాంఘిక రంగాలలో సుస్థిరమైన దేశమైంది . పునరుజ్జీవన
ఇంధన శక్తి వాడకం లో అగ్రగామి దేశం ఐస్ లాండ్ . ’’రెన్యూడ్ హైడ్రో
ఎలెక్ట్రిక్ పవర్ (హెచ్ యి డి )ను విశేషంగా ఉపయోగిస్తారు .’’భూ ఉష్ణోగ్రత తో
వేడి పొందే బాహ్య ఈత కొలను’’ (జియో దేర్మల్ వార్మేడ్ ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్
పూల్) ఐస్ లాండ్ ప్రత్యేకతలలో ఒకటి .

సంస్కృతీ సేవలో ఐస్ లాండ్

ఐస్ లాండ్ దేశీయుల జాతీయ భాష ను ‘’ఐస్ లాండిక్ ‘’అంటారు .అందరు కలసి మెలసి
ఉండటం అనేది వీరి గొప్ప సంస్కృతి .చిన్న చిన్న కుటుంబాలే ఇక్కడ ఎక్కువ .కొన్ని
కుటుంబాలకు జియోగా ,స్కార్మ్,రిచిటర్ ‘’వంటి ఇంటి పేర్లు ఉంటాయి .తండ్రి పేరు
లోని మొదటి పదాన్ని ‘’టాగ్ ‘’గా ఉపయోగిస్తారు .ఉదాహరణకు ‘’బిజోర్క్ గు౦డు
మండ్స్ డాట్టర్’’అంటే బిజోర్క్ అనే ఆమె, గుండు మ౦డు కూతురు అని అర్ధం .అదే
కొడుకైతే చివర్ ‘’సన్’’ఉంటుంది .వీరి సంస్కృతి ‘’మా ప్రజ మీ ప్రజ ‘’ .అంటే
కలిసి మెలసి ఉండటం .వీరిది అహింసా సమాజ సిద్ధాంతం.97శాతం ప్రజలు దేవుని
నమ్ముతారు .చాలా కొద్ది మందిమాత్రమే అలవాటుగా చర్చి కి వెడతారు .
‘’సుమో ఆట ‘’లాగా
వీళ్ళకి ‘’గ్లిమో ‘’ఆట బాగా ఇష్టం.వీరి జాతీయ చిహ్నం ‘’పర్వత మహిళ’’.దీనిని
బట్టి స్త్రీలంటే వీరికి యెంత గౌరవమో తెలుస్తోంది .ప్రపంచం లోనే మొట్ట మొదటి
సారిగా మహిళా వోటు హక్కు అమలు చేసిన దేశం ఐస్ లాండ్ .1922లో జరిగిన ఎన్నికలలో
మహిళకే ఎక్కువ స్థానాలు లభించాయి .

మాతృభాషా సేవలో ఐస్ లాండ్

ప్రపంచం లోనే మొదటి ‘’బ్రాస్క్యు ‘’నిఘంటువు ను ఐస్ లాండ్ దేశపు వాయవ్య భాగం
లో మారు మూల ఉన్న ఒక రైతు తయారు చేశాడు బాస్క్యు నావికులు చేపల వేటకు దగ్గరలో
ఉన్న తీరానికి వచ్చినప్పడు ,ఈయన వారి నుండి భాష నేర్చుకొన్నాడు .ప్రపంచం లో ఏ
దేశానికంటే తలసరి పుస్తక రచన ,ప్రచురణ ,అమ్మకం ఐస్ లాండ్ లో చాలా ఎక్కువ .ప్రతి
ఏడాది కనీసం 500 కొత్త పుస్తకాలు ప్రచురిస్తారు .ఇది అమెరికాలో రోజుకు
విడుదలయ్యే 1200 పుస్తకాలకు సమానం .ఐస్ ల్యాండ్ దేశపు దేశ భక్త కవి ‘స్నార్రి
హిజార్ట సన్ ‘’.’’భూమి ,జాతి ,భాష (లాండ్ ,నేషన్ ,లాంగ్వేజ్)అనేవి
మాత్రమేనిజమైన మూర్తి త్రయం ‘’(ట్రినిటి )అని ఆయన రాశాడు. అందుకే వారి ‘’జాతీయ
కవిగా’’ గౌరవింప బడుతున్నాడు .ఐస్ లాండ్ ప్రజలు కవిని ‘’స్కాల్డ్ ‘’అంటారు
.కవికి అందరికంటే ఉన్నతమైన ఉత్క్రుస్టమైన స్థానాన్నిస్తారు .వీరాభిమానం
ప్రదర్శిస్తారు .సమాజం లో కవికి చాలా గౌరవం ఇస్తారు .దీనికి కారణం కవి సంఘం లో
నీతిని వ్యాపి౦ప జేస్తాడన్న నమ్మకమే .ఐస్ లాండ్ స్వాతంత్ర్య సమరం లో కవులు గణ
నీయమైన పాత్ర పోషించారు .కవిత్వ ప్రతిభను ఉదాత్త వ్యక్తిత్వం గా పరిగణిస్తారు .

ఐస్ లాండ్ ప్రజలు తమ భాషను చాలా పవిత్రం గా, స్వచ్చం గాఉండేట్లు
కాపాడు కొంటారు .పర భాషా ప్రభావం తమ భాష మీద పడ కుండా ఏంతో జాగ్రత్త
తీసుకొంటారు. భాష పలచ బడకుండా కాపాడుకొంటారు .ప్రపంచ మంతా వాడే . అంతర్జాతీయ
అరువు పదాలైన కంప్యూటర్ , రేడియో ,టెలివిజన్ ,టెలిఫోన్ లను అస్సలు వాడరు .వారి
భాషలో వీటికి తగిన ,అర్ధవంతమైన పద సృష్టి చేసుకొన్నారు . ఈ పద సృష్టి కోసం
విద్యా సభలను (ఎకడమిక్ కమిటీ )లను ఏర్పాటు చేస్తారు .కంప్యూటర్ ను
‘’టోల్వా ‘’అంటారు
.టోలా అంటేవీళ్ళ భాష లో సంఖ్యఅని అర్ధం .’’వోల్వా’’అంటే ఊహించి చెప్పటం
(ప్రాఫెటైజ్ )అంటే సంఖ్యా దర్శిని అని అర్ధం .టెలిఫోన్ ను ‘’సిమి ‘’అని
పిలుస్తారు .సిమి అంటే దారం .తీగ ద్వారా వార్తలు పంపటం అనే అర్దం.హెలికాప్టర్
ను ‘’పిర్లా ‘’అంటారు .అంటే ‘’విర్లర్ ‘’తిరిగేది అని అర్ధం హెలికాప్టర్
ఎగరాలంటే పైన ఉన్న రెక్కలు తిరగాలిగా .దానికి సూచన .జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను’’
పోటా లేక జూమర్ ‘’అంటారు .శాస్త్ర సాంకేతిక పదాలపై లాటిన్ భాషా ప్రభావం పడకుండా
చూసుకొంటారు .సాధారణ ప్రజానీకానికి’’ పద నిర్మాణం’’(వర్డ్ బిల్డింగ్ ) ఒక సరదా
.వీటిపై తరచుగా చర్చలు జరుపుతారు .వీటిలో నూతన శబ్ద ప్రయోగాలు చాలా హాస్య
స్పోరకం గా ఉంటాయి .’’పెజేర్స్ ‘’అనే పదానికి ‘ఫ్రియోప్ జో ఫర్ ‘’అనే సమానమైన
పదం సృష్టించుకున్నారు .దీని అర్ధం ‘’శాంతి దొంగ ‘’అని .ఇవి మన జేబుల్లో ఉండి
రోద చేస్తాయికదా అందుకని . .

’’ఐస్ లాండిక్ భాష ప్రపంచం లో ఏ జాతి భాష కన్నా ఉత్తమమైనది ‘’ అన్నాడు వాళ్ళ
మహాకవి ‘’ఐనార్ బెనడిక్స్సన్’’.ఇదే ఐస్లాండ్ ప్రజలకు వేద మంత్రం అయింది .ఈ
ప్రజలకు మాతృ భాష భావ వినియోగానికి మాత్రమే కాదు, సంస్కృతీ సారం .అది వారి
జాతీయ అస్తిత్వ .సూచకం,జాతి గర్వం ,మనుగడ . వారి హృదయపు లోతుల్లో’’ ఐస్
లాండిక్ భాష ఏ ఇతర జాతీయ భాష కంటే నాణ్యమైన భాష ‘’అని త్రికరణ శుద్ధిగా నమ్మకం
ఉంటుంది .సాధారణం గా వీరి భాష ఉత్తర జర్మన్ కుటుంబ భాష కు దగ్గర గా ఉంటుంది
.నార్వేజియన్ ఫారోస్ భాషలకు సన్నిహితం గా ఉంటుంది . . లాటిన్ భాష లాగా మార్పు
చెందకుండా పూర్వపు రూపం లోనే ఉండటం .సాహిత్యాన్ని పరిరక్షించుకోవటం
,ప్రాచీన ‘’నార్సే
సంస్కృతి ‘’ని భద్రంగా రక్షించుకోవటం వలన ఐస్ లాండిక్ భాష ను ‘’ఉత్తర లాటిన్
భాష ‘’అంటారు .ఐస్ లాండ్ వారి ‘’స్వర్ణ యుగం ‘’క్రీ. శ .1100నుండి ప్రారంభమైంది
.మొదటి నుంచి ఈజాతి కవిజాతియే .9,11శతాబ్దాల కాలం లో 100 మంది ఐస్ లాండ్ కవులు
యూరప్ దేశాలలో ఉన్నారు .10వ శతాబ్దపు చివరలో ఉన్న స్కాండినేవియా రాజాస్థాన
కవి పేరు ’’ ఐస్ లాండర్ ‘’అన్నవిషయం నూటికి నూరు శాతం యదార్ధం .

అంతర్గత అంత్య ప్రాస (యమకం),అనుప్రాస నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు
.వీరికి పౌరాణిక ,వీరోచిత గాధలంటే గౌరవం ఎక్కువ . దీనినే ‘’వైకింగ్
మైండ్ ‘’అంటారు
. ‘’పశువులు చనిపోతాయి ,బంధువులు చనిపోతారు ,చివరికి మనమూ చనిపోతాం ‘’అనే
సామెతనువీళ్ళు తరచుగా వాడతారు .మరొకటి ‘’స్నేహితుడికి స్నేహ హస్తం చాచాలి
.కానుకకు కానుక అందించాలి .నవ్వుకు నవ్వూ ఇవ్వాలి ‘’.ఐస్ లాండ్ దేశం లో1807లో
జన్మించిన ‘’జోనస్ హాల్ గ్రిమ్సన్ ‘’ కవి ప్రజా హృదయాలను దోచుకున్నకవి .జాతికి
ప్రియ పుత్రుడు .అభిమానం తో ప్రజలు ఆయన శిలా విగ్రహం నిర్మించి స్మరిస్తున్నారు
.ఇలా మొట్ట మొదటి గౌరవం దక్కించుకొన్న కవి ఈయనే .ఈయనను ఆంగ్ల కవి విలియం
వర్డ్స్ వర్త్ లాగా ‘కవితా తీవ్ర వాది ‘’ ‘’గా భావిస్తారు .ప్రజల భాషలో కవిత్వం
రాశాడు .వృక్ష శాస్త్ర వేత్త కూడా .నేచురల్ హిస్టరీ గ్రంధం రాశాడు .

1864-1940 లో జీవించిన మరోకవి’’ ఐనార్ బెనేడిట్సన్ ‘’కలకాలం గుర్తుంచుకోదగిన
,ప్రజల నాలుకలపై నర్తించే అద్భుత కవిత్వం రాశాడు .ఈయన నగర,లోక కవి(కాస్మా
పాలిటిక్ ) .ఐస్ లాండ్ కే ప్రత్యేక మైన’’ ఉత్తర కాంతిని ,గల్ ఫాస్ ను
జలపాతాలను’’
సహజ సుందరంగా వర్ణించాడు .

ఈ దేశకవి ‘’హోల్డార్ కిల్జాన్ లాక్స్ నెస్1955లో ‘’సాహిత్యం లో నోబెల్
బహుమతి కూడా పొంది ,దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశాడు . .దేశపు గ్రామీణ
జీవితానికి కవిత్వం లో అద్దం పట్టాడు .’’బెల్ ఆఫ్ ఐస్ లాండ్ ‘’నవల రాసి ,అందులో
18వశతాబ్ది విశేషాలన్నీ వివరించాడు .ఆ దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర అందులో
సవివరంగా వర్ణించాడు .రెండవ ప్రపంచ యుద్ధానంతరం ‘’ఆటం స్టేషన్ ‘’అనే రచన
చేశాడు .ఆయన రాసిన కవితాపంక్తి ‘’దెబ్బ తిన్న బానిస మహా గొప్పవాడు –అతని హృదయం
లో స్వేచ్చ ఉంది ‘’ ఆ దేశస్తులకు స్పూర్తి నిస్తుంది .’’వరల్డ్ లైట్ ‘అనే
త్రిపుటి రచన లో సమాజం లో తన పాత్రను గురించి రాశాడు .ఎన్నో వర్ణ క్రమాలను
(స్పెల్లింగ్)మార్చేసి రాశాడు .వీధి భాష(స్ట్రీట్ లాంగ్వేజ్ ) రాశాడు
.ఆర్ధికాది రంగాలలోనే కాక సాహిత్య౦ లోను ఐస్ లాండ్ అగ్రగామిగా
ఉండి,ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైంది . మాట్లాడే జనం లేక భాషలు అంతరించి
పోతున్నాయనే దాన్ని సవాలుగా తీసుకొని ,మాతృ భాషను కాపాడుకొంటూ,సేవచేస్తూ ,బాష
ఆంగ్లపదాలతో కలుషితం కాకుండా అర్ధ వంతమైన పదాలను ఎప్పటికప్పుడు సృస్టిం చుకొంటూ
,స్త్రీ కి ఉన్నత గౌరవాన్ని కలిగిస్తూ ,సంస్కృతీ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా
నిలిచింది ఐస్ లాండ్ దేశం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-15-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)

1-11-1921న బీహార్ లో మధుబని జిల్లా మంగ్రోనిలో పుట్టిన అద్యాచరణ ఝా సాహిత్య అలంకార వ్యాకరణ ఆచార్య .బీహార్ KSSV కు ప్రతి కులపతి .25పుస్తకాలు రాశాడు .అందులో మనోరమ శబ్దరత్న ప్రకాశిక ,సంస్కృత రచనా సంగ్రహ ,భారతీయ వాణీ మయేషు రామకథా వర్ణనం , హరిశ్చంద్రోపాఖ్యానం ఉన్నాయి .అనేకరచనలు రేడియో ద్వారాప్రసారాలయ్యాయి ,ప్రెసిడెంట్ అవార్డీ,సాంస్క్రిట్ రత్న సమ్మాన్ ,యుపి సంస్కృత అకాడెమి పురస్కారం పొందాడు .

612-ఆనంద మధు మందాకిని  కర్త –ఆనంద్ ఝా (20వ శతాబ్ది )

 వ్యాకరణ ఆచార్య , వేదాంత వాగీశ ఆనంద్ ఝా ఆనంద మధు మందాకినీ మాత్రమె రాశాడు .లక్నో యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .సకల దర్శన కానన్, సంచార పంచానన్ అనే బిరుదు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

613-  సంస్కృతోద్గార కర్త –అనిల్ కుమార్ ఝా (1964)

డిలిట్ అయిన అనిల్ కుమార్ ఝా 1964లో జనవరి 26న బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .రాసిన 4పుస్తకాలలో సంస్కృతోద్గార ఒకటి .

614-గూడార్ధ తత్వాలోకనం కర్త –ధర్మ దత్త బచ్చా ఝా (1860-1918)

బీహార్ మధుబని జిల్లా మిథిలతాలూకా నివాని లో 1860లో ధర్మ దత్త బచ్చాయా పుట్టాడు సులోచనా మాధవ చంపూ ,గూడార్ధ తత్వాలోకనం(జగదీశుని సిద్ధాంత లక్షణం పై వ్యాఖ్యానం ) రాశాడు .1918లో 58ఏళ్ళకే చనిపోయాడు .న్యాయ శాస్త్రం లో ఎదురులేని వాడు .

615-ప్రమోద లహరి కర్త –బదరీ నాద్ ఝా (1893)

1893లో జనవరి 20న బదరీ నాద ఝా బీహార్ లో పుట్టాడు .న్యాయ ,నవ్య వ్యాకరణ ఆచార్య .జమ్మూ లోని RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .7గ్రంథాల రచయిత.కర్ణభారం ,ఊరు భంగం ప్రతిజ్ఞా యౌగంద రాయణ౦ ,మేఘ దూతం వ్యుత్పత్తి వాదం  లపై సంస్కృత వ్యాఖ్యానాలు  రాశాడు .

616-పంచమి సాహిత్య విద్య కర్త –బటోహి ఝా (1951)

సాహిత్య ఆచార్య,శిక్షా శాస్త్రి అయిన బటోహి ఝా10-10-1951న బీహార్ దర్భంగ లోపుట్టాడు .లక్నో సంస్కృత  సంస్థాన్ లో సాహిత్య ప్రొఫెసర్ .పంచమి సాహిత్యవిద్య ,భాగవత సహస్రనామ ,సప్తశతి సహస్రం ,గీతానాంత రసం రాశాడు

617-ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య  సమీక్షాత్మకం అధ్యయనం కర్త –భవేంద్ర ఝా (1949)

బీహార్ మధుబని జిల్లా లఖ్నోర్ లో భవేంద్ర ఝా3-1-1949న పుట్టాడు .వ్యాకరణ ఆచార్య .LBSసంస్కృత విద్యా పీఠ౦ లో ప్రొఫెసర్ .ఒకేఒక్క ఉద్గ్రంధం ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య  సమీక్షాత్మకం అధ్యయనం రచించాడు .

618-దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః కర్త –చంద్ర భూషణ ఝా (1969)

8-7-1969 న బీహార్ దర్భంగా లో పుట్టిన చంద్ర భూషణ ఝా ఎంఫిల్ పిహెచ్ డిచేసి ,ఢిల్లీ యూని వర్సిటి షెఫెర్డ్ కాలేజి  సంస్కృత ఆచార్యుడుగా చేశాడు .మహర్షి బాదరాయణ సమ్మాన్ ,గ్రహీత . దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః రాశాడు .

619-వాజపేయి శతక కర్త –నారాయణ దేవ్ ఝా (1952)

సాహిత్య ,వ్యాకరణ ఆచార్య నారాయణ దేవ్ ఝా 12-01-1952 న బీహార్ సీతామండిలో పుట్టాడు ,దర్భంగా సంస్కృత కళాశాల సంస్కృత ప్రొఫెసర్ .ఈయన గురుపరంపరలో పట్టాభి రామ శాస్త్రి, ప్రొఫెసర్ ద్విజెంద్రనాద్ మిశ్రా ,బటుకనాద శాస్త్రి ఉన్నారు .సంస్కృతం లో వాజపేయి శతకం ఒక్కటే రాశాడు .

620-బృహత్ పరాశర హోర కర్త –దేవానంద ఝా (1921)

దేవానంద ఝా 1921లో అక్టోబర్ 15న బీహార్ నాగవాస లో పుట్టాడు .జ్యోతిష ,సాహిత్య ఆచార్య .దీనాలాల్ చౌదరి,ముకుంద శాస్త్రి ల శిష్యుడు . బృహత్ పరాశర హోర ఒక్కటి మాత్రమె రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

భగ చంద్రజైన్ 1936 సెప్టెంబర్ 11న మధ్యప్రదేశ్  చత్తర్పూర్ లో పుట్టి సంస్కృత ,ప్రాకృత జైనాలలో ఆచార్యు డయ్యాడు .నాగ పూర్ ,మద్రాస్ యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసి ,మైసూర్ యూనివర్సిటి ప్రాకృత ,అండ్ రిసెర్చ్ కు డైరెక్టర్ అయ్యాడు .ఈయన గురుపరంపర –పన్నాలాల్ జైన్ ,పండిత కైలాస చంద్ర సిద్ధాంత శాస్త్రి ,డా నారాయణ సమతిని .డా కస్తూర్ చంద్ర జైన్ ,డా బి మొహరిల్ ,డా లోఖండే,డా ఖండేర్కర్ ,డా.మలాతీ బొదలె ,డా కాలా త్రికూలె ,డా అధవాలే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .75గ్రంథాలు రాసిన మహా రచయిత.అందులో జైన సంస్కృత కోశ ,చత్సుచ్చతకం మొదలైనవి ఉన్నాయి .అహింసా ఇంటర్నేషనల్ అవార్డ్ ,ప్రెసిడెంట్ అవార్డ్ మొదలైన ఎన్నో పురస్కార గ్రహీత చాలా దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ .

592-కర్మ ప్రకృతి కర్త-గోకుల్ చంద్ర జైన్ –(1934)

5-11-1934న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పిదుర లో గోకుల్ చంద్ర జైన్ పుట్టాడు .వారణాసి సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . కర్మ ప్రకృతి సత్యశాసన పరీక్షా పరిసంవాద వంటి ,అయిదు గ్రంథాలు రాశాడు .గోమటేశ్ విద్యా పీత పురస్కారం ,ప్రశస్తి పురస్కారం ,ప్రెసిడెంట్ అవార్డ్ లు పొందాడు .

593-సిరికుమ్మ చరితం కర్త –జినేంద్ర జైన్ (1962)

మధ్యప్రదేశ్ సిందుది జిల్లా కట్ని లో జినే౦ద్ర జైన్ 1962లో జూన్ 14జన్మించాడు సంస్కృత  ఎం .ఏ. పిహెచ్ డి .రాజకోట్ లోని జైన్ విశ్వభారతి యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .అక్ఖానాయ మణి కోశం ,సిరికుమ్మ చరితం ,అనువాద ప్రాకృత సాహిత్యం ఏవం జైన దర్శన సమీక్ష వగైరా 13 పుస్తకాలు రాశాడు .

594-జైన ఉద్ధరణ కోశ కర్త –కమలేశ్ కుమార్ జైన్ (1960)

జైన దర్శన ,ప్రాకృత ఆచార్య కమలేశ్ కుమార్ జైన్ 21-6-1960న రాజస్థాన్ లో పుట్టి ,జైపూర్ సంస్కృత  యూనివర్సిటిలో జైన ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .రెండు భాగాల జైన ఉద్ధరణ కోశం రాశాడు .పండిత గోపాల దాస్ బరేయా స్మారక అవార్డ్ గ్రహీత .

595-జైన పురాణ కోశ కర్త –కస్తూర్ చంద్ర జైన్ (1936)

సుమన్ గా ప్రసిద్ధుడైన కస్తూర్ చంద్ర జైన్ 1936 లో ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్ బన్సా జిల్లా తర్ఖేడ దామో లో పుట్టాడు .సంస్కృత ఎం .ఏ .పిహెచ్ డి .రాజ్ కోట్ జైన్ విద్యా మహా సంస్థాన్ శ్రీ విరాజీలో రిసెర్చ్ అసిస్టెంట్ .జైన పురాణ కోశం ,భారతీయ దిగంబర జైన అబిలేఖ ,ప్రాణాన పరీక్షా భాషా వచనిక మొదలైన 5పుస్తకాలు రాశాడు .జైన పురాణ కోశక అవార్డ్ ,శ్రుత సంవర్ధన అవార్డ్ పొందాడు .

596-పాలీ ప్రవేశిక కర్త –కోమల్ చంద్ర జైన్ (1935)

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినాలో 20-8-1935న జన్మించిన కోమల్ చంద్ర జైన్ సంస్కృత పిహెచ్ డి చేసి బెనారస్ హిందూ యూనివర్సిటిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .పాలీప్రవేశిక ,ప్రాకృత ప్రవేశిక ,రాశాడు .

597-క్షణ భంగుర జీవన కర్త –కృష్ణ జైన్ (1959)

గ్వాలియర్ అటానమస్ ప్రభుత్వ కాలేజిలో ప్రొఫెసర్ కృష్ణ జైన్ 1-7-1959న మధ్యప్రదేశ్ లో పుట్టాడు ,క్షణ భంగుర జీవన ,దశధర్మ గ్రంథాలు రాశాడు .

598-రత్న యోగ సార కర్త –మున్ని పుష్ప జైన్ (1928)

మున్ని పుష్ప జైన్ 22-6-1928న మధ్యప్రదేశ్ దామో లో పుట్టి ,జైన దర్శన ఆచార్య అయింది .రత్న యోగ సార ,పంచేంద్రియ సంవాద వంటి 5పుస్తకాలు రాసింది .

599-మూలాచార కర్త –మున్ని జైన్ (1957)

1957లో జూన్ 22న దామో లో పుట్టిన మున్ని జైన్ –జైన ఫౌండేషన్ డైరెక్టర్ .పండిట్ కైలాస చంద్ర జైన్ ,పండిట్ ఫూల్ చంద్ర సిద్ధాంత శాస్త్రి గురువులు .మూలాచార ,పంచేంద్రియ సంవాద సంయక్త్వ ప్రచ్చిసి ,రత్నయోగ సార రాసింది

600-ముక్తాహార కర్త –పన్నాలాల్ జైన్ (1911)

పన్నాలాల్ జైన్ సాహిత్య ఆచార్య ,శాస్త్రి .5-3-1911న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పర్గువలో పుట్టాడు .సాగర్ లోని శ్రీ గణేష్ దిగంబర జైన సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .గురుపరంపర –గణేష్ ప్రసాద్ వర్ని ,దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి ,కైలాష్ చంద్ర ,హజారీలాల్ న్యాయ తీర్ధ ,కోక్ నాద శాస్త్రి ,కపిలేశ్వర్ ఝా . ప్రొఫెసర్ భగచంద్ర జైన్ ,ప్రొఫెసర్ భగ చంద్ర భాస్కర్ ,డా హరీంద్ర భూషణ్ జైన్ ,.వినయాంజలి అనే కావ్య సంగ్రహం ,ముక్తాహార ,సంయకత్వ చింతామణి ,సుజ్ఞాన చంద్రిక ,ధర్మ కుసుమోధ్యయనం మొదలైన 5గ్రంథాలు రాశాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

601-ప్రారంభిక బౌద్ధ దర్శన్ కర్త –విజయకుమార్ జైన్ (1956)

1-7-1956 ఉత్తరప్రదేశ్ లో పుట్టిన విజయకుమార్ జైన్ లక్నో లోని  RSKS కాలేజి ప్రొఫెసర్ .పండిట్ కైలాష్ చంద్ర శాస్త్రి ,డా కేసి జైన్ ల శిష్యుడు .10పుస్తకాలు రాశాడు .పాలీ సద్దాతృ సంగ్రహ ,ప్రారంభిక బౌద్ధ దర్శన,సంస్కృత సూక్తి సముచ్చయ అందులో ముఖ్యమైనవి .యుపి సంస్కృత సంస్థాన్ అవార్డ్ ,సృత్సంవర్ధన్ అవార్డ్ ,దిగంబర్ జైన్ శాస్త్రి పరిషత్ పురస్కార పొందాడు .సృత్సంవర్ధిని పత్రిక సంపాదకుడు కూడా .

602-జ్ఞాననిది కర్త –యోగేష్ కుమార్ జైన్ (1978)

1978 జులై 4 మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బారాలో జన్మించిన యోగేష్ కుమార్ జైన్ జైన దర్శన ఆచార్యుడు .రాజస్థాన్ విశ్వభారతి యూని వర్సిటి లాడ్నం నాగౌర్ లో ప్రొఫెసర్ .జ్ఞాననిది పుస్తకం ఒక్కటే రాశాడు .

603-నీతిశత కకర్త –సునీతా జైస్వాల్ (1968)

ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ లో 1968 ఫిబ్రవరి 8 న పుట్టిన సునీతా జైస్వాల్ డిఫిల్ చేసి ,యుపి లోని ప్రభుత్వ పిజి డిగ్రీకాలేజి సంస్కృత ప్రొఫెసర్ చేసింది .నీతిశతకం ,కుమార సంభవం ,ఈశా వాస్య ఉపనిషత్ వంటి 5పుస్తకాలు రాసింది .

604-సంస్కృత న్యాయ శాస్త్ర కర్త –జై కుమార్ జలాజ్ (1934)

యుపి లో లలితాపూర్ లో 2-10-1934న పుట్టిన జైకుమార్ జలాజ్ అలహాబాద్ యూని వర్సిటి ప్రొఫెసర్ .28గ్రందాల రచయిత.రాసిన వాటిలో సంస్కృత న్యాయశాస్త్ర ,ఏక పూర్వ విచార ,ఐతిహాసిక భాషా విజ్ఞాన ,మరికొన్ని హిందీ రచనలు ఉన్నాయి అఖిలభారత విశ్వనాధ అవార్డ్ ,భోజ పురస్కారంసాహిత్య సరస్వత్ సమ్మాన్  వంటి అవార్డ్ ల గ్రహీత .

605-లవారస కర్త –హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ (1954)-,

లవారస ,స్వప్నకావ్యం రాసిన హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ 20-10-1954న గుజరాత్ భావనగర్ లో పుట్టి ‘’మాధవ్’’ పేరుతొ పిలువబడ్డాడు .సాహిత్య శాస్త్రం లో నిపుణుడు .

606-నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా కర్త –జయదేవ్ అరుణోదయ్ జాని (1951)

జయదేవ్ అరుణోదయ్ జాని 5-2-1951న గుజరాత్ బరోడా లో పుట్టాడు . అరుణోదయ్ జాని,సురేంద్ర చంద్ర కుంతేవాలా,విద్యాభాస్కర ,మణి శంకర ఉపాధ్యాయ ల శిష్యుడు . నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా అనే ఒకేఒక పుస్తకం రాశాడు .

607-జైన ఆచార సంహిత కర్త –ఉత్తమ సింగ్ జాట్(1975)

ఉత్తమ సింగ్ జాట్15-7-1975న రాజస్తాన్ భరత్ పూర్ లో జన్మించాడు .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.గురుపరంపర –విజయ కుమార్ జైన్ ,ప్రొఫెసర్ ఆజాద్ మిశ్రా ,జేబీ షా .రాసిన 4పుస్తకాలలో జైన ఆచార సంహిత ,జైన ధర్మ దర్శన ,ముఖ్యమైనవి .

608-వాల్మీకి యుగీన భారతం కర్త –మంజులా జయస్వాల్ (1950)

మంజులా జయస్వాల్ 1950మే 6న అలహాబాద్ లో పుట్టి డిఫిల్ చేసింది అలహాబాద్ సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .వాల్మీకి యుగీన భారత రాసింది .

609-ముహూర్త మార్తాండ కర్త –నేమి చంద్ర జయస్వాల్( 1922)

 సంస్కృత డిలిట్ నేమి చంద్ర జయస్వాల్ రాజస్తాన్ లో బాబర్ పూర్ జిల్లా ధౌల్ పూర్ లో16-9-1922 న  పుట్టాడు .ముహూర్త మార్తాండ ,భారతీయ జ్యోతిష ,సంస్కృత కావ్యాను చింతనం మొదలైనవి రాశాడు .

610-వాస్తు నిర్దోష ప్రకరణం కర్త –శ్వేత జెజూర్కర్ (1973)

సంస్కృత పిహెచ్ డి, సంగీతం లో ఎం ఏ .శ్వేత జెజూర్కర్1973 జూన్ 29న గుజరాత్ వడోదరజిల్లా నిజాంపూర లో జన్మించి ,మహారాజ్ శాయోజీ రావు యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ చేసింది .డా ఉమా దేశ పాండే శిష్యురాలు. 20పుస్తకాలు రాసింది .అందులో వాస్తు నిర్దోషక ప్రకరణం ,సిద్ధాంత కౌముది ,ముఖ్యమైనవి .

  సశేషం

మనవి –నేను రాసి సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ 3భాగాలలో 1090మంది సంస్కృత కవులను పరిచయం చేశాను .ఈ గీర్వాణం-4లో ఇప్పటికి 610 గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే మొత్తం మీద ఇప్పటికి 1700 మంది సంస్కృత కవులను పరిచయం చేసే అదృష్టం దక్కింది .ఇంకా చాలామందే ఉన్నారు .వారినీ పరిచయం చెస్తాను .ఈ నాలుగవ భాగం లో చాలామంది 20వ శతాబ్దానికి చెందిన వారు ,మన సమకాలీనులు కూడా ఉండటం విశేషం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)

వేదాంత శిరోమణి, వేదాంత విద్వాన్ గురురాజాచార్య రాజా 17-9-1921న కర్ణాటకలో జన్మించి మద్వ సిద్ధాంత సాహిత్యం లో నిష్ణాతుడయ్యాడు .గురు సార్వ భౌమ సంస్కృత పాఠశాలకు గౌరవ ప్రిన్సిపాల్ గా ,సమీర సమయ సమవర్ధిని సభకు సెక్రటరిగా పని చేశాడు .భేద విద్యా విలాసం ,ఉపాసన సంగ్రహ విజయం ,ఐతరేయ మంత్రార్ధం ,వైగ్వైఖరి వంటి 8సంస్కృత గ్రంథాలు రాశాడు .కమలేశ్ అనే మారుపేరుతో సంస్కృత శ్లోకాలు రాశాడు .విద్యా వైభవ ,సాహిత్యాలంకార ,ధర్మ శాస్త్ర భూషణ్ ,విద్వత్ చూడామణి బిరుదాంకితుడు .సంస్కృత సాహిత్య కృషికి రాష్ట్రపతి పురస్కారం పొందాడు .

572- సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం కర్త -విశ్వనాథ హంపి హోలీ (1955)

1-6-1955లో  బెల్గాం లో జన్మించిన విశ్వనాథ హంపి హోలీసంస్కృత ఎం. ఏ .పిహెచ్ డి.సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం వంటి 8పుస్తకాలు రాశాడు .

573-కిరీ ఆబాస్య కర్త –హర్ష కుమార్ (1936)

 విష్ణు సహస్రనామాలపై కిరీ అభ్యాసం తోపాటు పద్య పుష్పాంజలి రాసిన హర్ష కుమార్ 4-12-1936న ఢిల్లీ లో పుట్టి ,సంస్కృత పి.హెచ్. డి .చేశాడు .ఒకే ఒక సంస్కృత రచన కిరీ అభ్యాసం రాశాడు .

574-చెన్నమ్మ నవలాకర్త –శ్రీనాథ్ హోసూర్కర్ (1924)

26-2-1924లో పుట్టిన శ్రీనా థ్ హోసూర్కర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాలేజిలో సంస్కృత లెక్చరర్ .చెన్నమ్మ సి౦ధుకన్య  నవలతోపాటు అజాత శత్రు ,ప్రతిజ్ఞా పూర్తి ,రాశాడు .

575-సంస్కృత భరత నర్తన మాల కర్త – ,శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ (1886)

కొల్హాపూర్ లోని హసూర్ లో 10-6-1886న జన్మించిన శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ హోల్కార్ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరై,నిండోర్  లోని మహారాజా యశ్వంతరావు కాలేజీలో పనిచేశాడు .సంస్కృతం  లో 15పుస్తకాలు రాశాడు .సంస్కృత భరత  నర్తన మాల ,రాణాప్రతాప ,వల్లభాచార్య ,శివాజీ ,సమర్ధ రామదాస ,పృధ్విరాజ ,గురునానక్ ,మహావీర ,బుద్ధ మొదలైనవి వీటిలో ప్రసిద్ధాలు .ఇంగ్లీష్ లో ది గ్రేట్ వుమెన్ ఆఫ్ మహారాష్ట్ర ,అండ్ రాజస్థాన్ రాశాడు .’’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన సోపానావలి’’అనే ఉద్రంథ౦ ఆయనకు చిరయశస్సు సాధించిపెట్టింది .

576-గణేశ మీమాంస కర్త –గణపతిశాస్త్రి హెబ్బార్ (1901)

1901లో  కర్ణాటకలోని మంగుళూరు లోజన్మించి , 1986లో మరణించిన   గణపతిశాస్త్రి హెబ్బార్ –ఋగ్వేద న్యాయ వేదాంత రాజనీతి శాస్త్ర కోవిదుడు .మహామహోపాధ్యా య లక్ష్మణశాస్త్రి  ,పండిత భీకం భట్ పట్వర్ధన్,పండిట్ రాజేశ్వర శాస్త్రి  గార్ల  శిష్యుడు .గణేశ మీమాంస గ్రంధం రాశాడు .విద్యాభూషణ్ ,సర్వతంత్ర బిరుదాంకితుడు .

577-శివ స్వారోదయ కర్త –హేమలత (1943)

భాగల్పూర్ లో 15-2-1943న పుట్టిన హేమలత  భాగల్పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,హెడ్. శివ స్వారోదయ రాసింది .

578-వ్యాకరణ శాస్త్ర కర్త –హింద్ కేసరి (1947)

ఉత్తరప్రదేశ్ మణిపూరి జిల్లా  లోని కేసరిలో  15-8-1947 న పుట్టిన హింద్ కేసరి జైపూర్ లో సంస్కృత సంస్థాన్ ప్రిన్సిపాల్ .గోవిందం శాస్త్రి,పండిత రాం ప్రసాద్ త్రిపాఠీ ఆమె గురుపర౦పర .సంస్కృత వ్యాకరణం తో పాటు అయిదు పుస్తకాలు రాసింది .62వ ఏట 2009లో మరణించింది .

579-వివేచని కర్త –నవీన్ హోల్లా (1973)

మంగుళూరులో 1973డిసెంబర్ 8న పుట్టిన నవీన్ హోల్లా,శృంగేరి రాజీవ్ గాంధి కాంపస్ లో సంస్కృత అసిస్టెంట్ ప్రొఫెసర్.వివేచని అని ఒకే ఒకపుస్తకం రాసింది .

580-వసంత సేన కర్త –కృష్ణన్ ఇలాయత్ (1897)

31-5-1897న కేరళ కల్లూరు లో పుట్టిన కృష్ణన్ ఇలాయత్ ఆచార్య ,విద్వాన్ .పటమన వాసుదేవ ఇలయత్ ,కే వాసుదేవన్ ముసత్ ,శ్రీనివాస రాఘవాచార్య ,అనుజన్ రాజా ,నీల కంఠ శర్మగురువు గార్ల  శిష్యుడు .వసంత సేన ,సుహృత్ పుస్తకాలకర్త .

581- తార్కికరక్ష  కర్త –ఎఫ్.ఇరిమాల్(1945)

పారిస్ యూని వర్సిటిలో సంస్కృత ఎం.ఏ .పిహెచ్. డి చేసిన ఎఫ్.ఇరిమాల్ –ఫ్రాన్స్ లోని కేన్ లో 1945మార్చి 27 న పుట్టాడు .గురుపర౦పర –ఎల్ రెనోట్,ఏ మినారి ,సి కైలత్ .భవభూతెహ్ మహా విరచితం ,భవభూతెహ్ సమయం ,తార్కికరక్ష .అనే మూడుపుస్తకాలు రాశాడు

582-మండన మిశ్ర స్య స్పోట సిద్ధి  కర్త –కేయే ఎస్ అయ్యర్ –(1896)

7-9-1896న కేరళ పాల్ఘాట్ లోపుట్టిన కె.యస్. అయ్యర్-నారాయణ శాస్త్రి ,ప్రొఫెసర్ సిల్విన్ లేవి ,డా బ్రినేట్ ,మిసెస్ రైస్ డేవిస్ ల శిష్యుడు .ప్రొఫెసర్ సత్యవ్రట్ సింగ్ ,ప్రొఫెసర్ కేసి పాండే లవద్ద మెళకువలు నేర్చాడు .12గ్రంథాలురాశాడు వాటిలో కాళిదాస విరచితం మాలవికాగ్నిమిత్రం ,మలయాల మా మహాభారతం మండన మిశ్రస్య స్పోట విధి ,భర్తృహరి ప్రణీతం వాక్య పదీయం ఉన్నాయి .అనేక విశ్వవిద్యాలలాలో గౌరవ స్థానం పొందాడు .లక్నో,ఫ్రాన్స్ ,హాలండ్ ,బెల్జియం జర్మని స్విట్జర్లాండ్ ఆస్ట్రియా ,ఇటలీ లలోని లోని అఖిలభారతీయ సంస్కృత పరిషత్ వ్రాత ప్రతుల కేటలాగ్  చీఫ్ ఎడిటర్ .యుపి సంస్కృత సంస్థాన్ విద్వాన్ పురస్కారం ను, ప్రెసిడెంట్ అవార్డ్ ను అందుకున్నాడు .

583-శబ్ద శక్తి కర్త –విరూపాక్ష జడ్డిపాల్ –(1970)

21-7-1970న ఎల్లాపూర్ లో పుట్టిన విరూపాక్ష జడ్డిపాల్ –సంస్కృత ఇంగ్లిష్ చరిత్రలలోఎం. ఏ ..విద్యావర్ధిని తిరుపతి సంస్కృత విద్యా పీఠ౦ ప్రొఫెసర్ .శబ్దశక్తి ,టీచింగ్ ఆఫ్ సంస్కృత మొదలైన నాలుగుపుస్తకాలురాశాడు .

584-జినాష్టకావలి స్తోత్ర కర్త –అభయ్ జైన్

 సాహిత్యార్యుడైన అభయ్ జైన్  గవర్నమెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ .జినాష్టకావాలి స్తోత్రం సంపాదక కర్త .

585-సంవేగ చూడామణి కర్త –అనేకాంత కుమార జైన్ –(1978)

అనేకా౦త కుమార జైన్ 1978లో ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా దలపత్ పూర్ లో జన్మించాడు  ఢిల్లీ లోని SLBSR విద్యా పీఠ సంస్కృత ప్రొఫెసర్ .దయానంద భార్గవ శిష్యుడు .6పుస్తకాలురాశాడు .అందులో సంవేగ చూడామణి ,సద్దర్శనేషుప్రమాణ ప్రమేయ సముచ్చయ ,ఆవశ్యక నిరుక్తి ఉన్నాయి .

586-జైన ధర్మ మీమాంస కర్త –అశోక్ కుమార్ జైన్ –(1959)

1-3-1959లలితపూర్ లో పుట్టిన  అశోక్ కుమార్ జైన్- జైన దర్శన ఆచార్య .బెనారస్ హిందూ యూనివర్సిటి ప్రొఫెసర్ .జగన్నాథ ఉపాధ్యాయ ,ప్రొఫెసర్  వీరేంద్రకుమార్  వర్మల శిష్యుడు. అనే కాంతజైన్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .16పుస్తకాలురాశాడు .అందులో జైనధర్మమీమాంస ముఖ్యమైనది ఆచార్య జ్ఞాన సాగర మహారాజా దార్శనిక వివేచన వగైరాలు ఇతర రచనలు .

587-నైతిక శిక్షావతికర్త –అశోక్ జైన్ (1962)

20-6-1962న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బందా లో పుట్టిన అశోక్ జైన్-సాధనే కే  సూత్రా , శిక్షావతి ,జినేంద్ర పూజావలి రాశాడు

588-అమరభారతి కర్త  –దయా చంద్ర జైన్ (1915-2006)

1915ఆగస్ట్ 11న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా సాహ్పూర్ మార్గావ్ లో దయా చంద్ర జైన్ పుట్టి ,గణేష్ దిగంబరజజైన్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .ఈయన గురుపరంపర లో –గణేష్ ప్రసాద్ వర్ని ,పండిట్ దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి, పండిట్ హజారీలాల్ న్యాయ తీర్ధ ,పండిట్ ముకుల్ శాస్త్రి క్షిష్టే లోకనాథ శాస్త్రి కపాలేశ్వర ఝా , పండిట్ బాబూరాం ఝా ఉన్నారు .అమరభారతి ,శ్రీ చతుర్వింశతి సంధాన మహాకావ్య ,భగవాన మహా వీర ముక్తక స్తవం ,విశ్వతత్వ ప్రకాశ సయాద్వాద ,వార్నీజీ కా జీవన పరిచయ .12-2-2006న చనిపోయాడు

589-ప్రాచీనాభి లేఖ  కర్త -భగచంద్ర భగేందు జైన్ (1937)

ఆచార్య ,కావ్యతీర్ధ ,గాంధీ దర్శన ,సాహిత్యరత్న భగచంద్ర భగేందు జైన్1937 ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్ రితి కట్నిలో పుట్టాడు .దామోPG కాలేజి  సంస్కృత హెడ్ .భోపాల్ సంస్కృత అకాడెమి  సెక్రెటరి .సంస్కృత ప్రాకృత జైన విద్యా అనుసందాన్ కేంద్ర డైరెక్టర్ .దయాచంద్ర సిద్ధాంత ,పన్నాలాల్, ప్రొఫెసర్ రాంజీ ఉపాధ్యాయ ల శిష్యుడు .సావిత్రీ జైన్ నరేంద్ర సింగ్ రాజ్ పుట్ ల వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .ప్రాచీనాభిలేఖ మొదలైన నాలుగు గ్రంథాలురాశాడు .లక్ష్మీదేవి జైన్ అవార్డ్ ,అహింసా ఇంటర్నేషనల్ సాహిత్య అవార్డ్ ,జైన్ రాష్ట్ర గౌరవ అలంకరణ అవార్డ్ ,కుండల్పుర పురస్కారం ,రిషభ దేవ్ పురస్కారం అందుకొన్నాడు .

590-తిలోపపన్నతి సాంస్కృతిక మూల్యాంకన కర్త –ధర్మేంద్ర జైన్ (1940)

సంస్కృత ,ప్రాకృత జైన ,క౦పాపరటివ్ మతాల లో ఎం.ఏ .అయిన ధర్మెంద్రజైన జైన దర్శనాచార్య 24-8-1940లో పుట్టాడు సాహిత్య దర్శన జైన బౌద్ధ ఆచార్య .జైపూర్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ డెవలప్ మెంట్ ఆఫీసర్ .తిలోపపన్నత్తి సాంస్కృత మూల్యాంకన అనే ఏకైక పుస్తకం రాశాడు .ముని పుణ్య అవార్డ్ గ్రహీత .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యుగా౦తాలను సూచించే దేవాలయం

 

యుగా౦తాలను సూచించే దేవాలయం

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర  గ్రామం లో యుగా౦తాలకు   సంబంధించిన ఆధారాలున్నాయి .ఇక్కడ  హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది .దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది .గుహలో అత్య౦త పురాతన శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది .ఈ గుడిని కేదారేశ్వర దేవాలయం అంటారు .లింగం నాలుగు స్తంభాల కప్పు లోపల ఉంటుంది. ఈ స్తంభాలు నాలుగు యుగాలకు సంకేతికాలు .ఈ ఆలయ నిర్మాణం ఎవరు, ఎప్పుడు చేశారు అన్న ఆధారాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు .ఏ చరిత్రలోనూ లేదు .ఇక్కడి నాలుగు స్తంభాలలో ఒక్కొక్క స్తంభం ఒక్కో యుగం తర్వాత కూలి పోయిందట .ఇప్పుడు మిగిలింది కలియుగ స్తంభం ఒక్కటే .ఈస్తంభం కూలిన మర్నాడే కలియుగం అంతరించి పోతుందని విశ్వాసం .కలియుగం ఇప్పటికి 5వేల సంవత్సరాలే గడిచింది ఇంకా చాలా లక్షల సంవత్సరాలు గడవాలి కనుక మనం కంగారు ,భయం పడాల్సిన పని లేదు .

  ఈ కేదారేశ్వర దేవాలయం నాలుగు గోడలనుంచీ నిర౦తరం చల్లని నీరు ప్రవహిస్తూనే ఉండటం గొప్ప విశేషం ‘కానీ వర్షాకాలం లో మాత్రం గుడిలో చుక్క నీరు కూడా ఉండకపోవటం మరో వింత .హరిశ్చంద్ర ఘడ్  కోట విషయం అగ్నిపురాణం ,స్కాందపురాణం వగైరా పురాణాలలో చెప్పబడింది అంటే ఎంతో పురాతన కోట అని అర్ధమౌతుంది.కోటలోపల ఒక రహస్యమైన సొరంగమార్గం గుండా వెడితే అక్కడ ఒక నీటి కొలను కనిపిస్తుంది .ఇక్కడే ఉన్న శివలింగం మరకత మణి లింగం  .నీరు కూడా ఈ మరకత మణి రంగులో లింగం చుట్టూ ఉంటుంది  .కాలక్రమం లో ఆ మరకత మణి లింగం దొంగలపాలయింది .ఈ ఆలయం లో కనకాంబరం రంగులో ఉన్న వినాయక విగ్రహం మరో ఆకర్షణ .ఈ గణేశుని నిత్యం వేలాది భక్తులు సందర్శిస్తారు .ఆలయం నల్ల గ్రానైట్ రాతి నిర్మాణం .స్తంభాలపై సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి .గుడిలో ఏకశిలా నందివిగ్రహం దానికెదురుగా అతి పురాతన శివలింగం కనిపిస్తాయి .

  హరిశ్చంద్ర ఘడ్ దగ్గర సప్తతరణి అనే చోట ఏడు గుహల వరుస సముదాయం ఉంటుంది .దీనికి ఒకప్రత్యేకత ఉంది .ఈ గుహల వద్ద నిలబడితే చాలు ఎసి లో ఉన్నదానికంటే అతి చల్లదనం అంటే మైనస్ డిగ్రీల చల్లదనం అనుభవించవచ్చు ఈ గుహల ఎదురుగా నీటి కొలనూ ఉన్నది .కొలను నీటి చల్లదనమో గుహల చల్లదనమో ఎవ్వరూ చెప్పలేరత అనుభవించి ఆనందం పొందుతారు .  బయట చిన్న జలపాతమూ ఆకర్షణీయమే .లోపల విశ్రాంతి తీసుకొనే చిన్న హాల్ కూడా ఉంటుంది .దీనికి అనుబంధంగా పెద్ద గణేశ విగ్రహం కూడా  తప్పక చూడాల్సిందే ..

  మీ -గబ్బిట  దుర్గాప్రసాద్-5-3-21-ఉయ్యూరు  

Posted in సమీక్ష | Leave a comment