రజనీ ప్రియ -2(చివరిభాగం )

రజనీ ప్రియ -2(చివరిభాగం )

కించిత్ శీలభంగం ,తండ్రి మరణం తో దీనజన సేవ రాజభోగాలలో మర్చిపోయింది రజని .హూణ భటులు పెట్టె బాధలు ఓర్చుకోలేక విలపిస్తున్న పాణిజ ఏడ్పులు వినిపించి .ఆమె తన చిన్నతనం లో తన స్తన్యాన్ని ఇచ్చి ఓదార్చిన మాతృమూర్తిగా గుర్తించి,తాను  పొందిన పతనం అంతా గుర్తుకొచ్చి ,పశ్చాత్తాపం పొంది ,ఆమెను విడిచిపెట్టమని సేవకులను ఆజ్ఞాపించింది .ఆ ఆజ్ఞ వాళ్లకు చేరకముందే వారిరధం ఆమె పైగా వెళ్లి ముసలి తండ్రిలాగానే పాణిజ కూడా చనిపోయింది .’’మా తల్లి దండ్రులలాగ పాలించాల్సిన నువ్వు ,మా ప్రాణాలు తీస్తూ హాయిగా ఎలా సుఖం గా ఉన్నావే ?’’అని పాణిజ ప్రశ్నించినట్లనిపించింది రజనిక్ .దీనితో మళ్ళీ ముసలి సన్యాసి దగ్గర పెరిగిన ముగ్ధ అయింది .

  తోరమానుడి ఘాతుకాలకు బందీలై భరింపరాని కస్టాలు పొందుతున్న కారాగారం చూడటానికి వెళ్ళింది .అందులో సునంద అనే పిచ్చిది ‘’సంపదల్ వలచియమ్ముడు బోతివే రాణి వైన రండా’’అని తన్ను గేలి చేస్తూ ప్రశ్నించిన మాట కలచివేసింది.పాణిజ వలన కొంత మారి ఇప్పుడు ఈ సునంద ప్రశ్నతోపూర్తిగా మారిపోయింది  రజనీ ప్రియ .సునంద వృత్తాంతం అంతా విని ఆమెకేమీ హాని తలపెట్టవద్దని హెచ్చరించి ఆమెను అంతఃపురానికి చేర్చమని ఆదేశించింది ఆ దయామయురాలు .సునంద తన శీల రక్షణకోసం తనప్రాణ ప్రదమైన భర్తను ,పిల్లల్ని బలిఇచ్చిన ధీరురాలు .రజని చరిత్రకు ఈమె చరిత్ర పూర్తిగా ప్రతియోగం అంటే కాంట్రాస్ట్ .తన అపరాధ జ్వాలను చల్లార్చుకోవటానికి బుద్ధుని దగ్గరకు  వెళ్ళాలను కొన్నది .

  ఆ నాటి రాత్రి రజనికి కంటి కునుకు లేదు .మనసంతా భగవాన్ బుద్ధుడే ఆక్రమించాడు .తెల్లవారుజామున వచ్చిన కలలో తధాగత బుద్ధుడు ‘’ఆర్తావన దీక్ష బ్రాణముల నర్పణ జేసిన గాని మానవుల్ లేవగలేరు. ఒక అత్యంత కష్టమైనా పరీక్షకు నిలిస్తే సంకల్పం సాధ్యం  ‘’అనే ప్రబోధం  చేశాడు .అప్పటికే త్యాగాన్ని చేయాలనుకొన్న రజని బుద్ధుని ప్రబోధం తో ,పశ్చాత్తాపం తో ప్రక్షాళన పొంది ,క్రూర కఠినాత్ముడైన  తన భర్త హూణుడిని కూడా వాదం లో లొంగ దీసే ధైర్యం కలిగింది .

  ఒక పిచ్చిదాన్ని అంతఃపురానికి రజని తెచ్చిందన్న వార్త తోరమానుడు విని’’పేదల ప్రాణములు బీల్చి అహమ్మున వీగుచూ –  రధమ్ము నెక్కి పురమందు  చెలంగుట యే రాచ మర్యాద ‘’గా భావించే ఆ దురంహకారి  పరువు తీసింది పిచ్చిది అనిపించగా ,భార్య రజనీప్రియ దగ్గరకు వెళ్లి అతి శాంతం గా ‘’శాంతమొప్ప నసి నేనియు దాల్పని అశోకుని ‘’ఆదర్శంగా చేసుకోమని హితవు చెప్పింది .శాంతికరున వినయాలే రాజులకు అలంకారం అనీ ,సంపద గర్వకారణమనీ  చెప్పింది  .వాడు ‘’ఖడ్గమ్ము లేక రిపుల్ చత్తురే ?వేడుకొంటే జనం మాట వింటారా .వేదా౦తు లపాలి భూమి పరహస్తగత మయిన పుస్తకం లా అవుతుంది ?అని నిలదీశాడు –రాజతంత్రం నీతి ఒకే ఒరలో ఇమడవుఅన్నాడు .ఆమె  ‘’కత్తియేరాజ్యపాలనకు కాగల సాధనం అని క్రొన్నెత్తురు త్రావు క్రూరుడు రాక్షసుడే కానీ రాజు కాడు’అలాంటి వాడికి యమధర్మరాజు కూడా ఏం శిక్ష విధించాలోసందేహ పడతాడు ’అని వాదించింది.’’శాంత విధి వేలోసంగెడి జనం  ఖడ్గాన్ని చూసి ఒక్క కానీ కూడా ఇవ్వరు అన్నది .ఈబొధలు వాడిలో అహంకార ఆవేశ కోపాలను మరింత రెచ్చగొట్టాయి  .

  రజనీప్రియ తనను ప్రణయ  వాహినిలో తేలుస్తుంది అను  కోన్నాడుకానీ ఇలా ఎదురు తిరుగుతుందని ఊహించలేదు .ప్రణయ వేదనలో తుక తుక ఉడికిపోతూ తనను సుఖపెట్టమని కోరాడు .ఆమె ‘’ఒక్క వ్యక్తిపై నెసగెడు ప్రేమ ,సంకుచిత దృక్పధమందు నశించు కామమై ,వసుధ సమస్త జీవతతిపై బ్రసరి౦ చెడి జ్యోతికానిచో ‘’అని చీకటిలో కూరుకు పోయినవాడికి వెలుగు రేఖలు చూడమన్నది .వాడు వినక ధిక్కరిస్తే ,పాదాలు పట్టుకొనిశిరస్సు వంచి  ‘’దేవుడి మనసు మెప్పించేట్లు ప్రజారంజకం గా పాలన చేయి ‘’అని ప్రాధేయపడింది .ఆ దుష్టుడు ‘’బుద్ధ దేవుని పద యుగ్మ రజః పరిపూతమైన ‘’ఆమె శిరస్సును  అవివేకియై తన్నాడు .బిచ్చమెత్తు కొనే దాన్ని తీసుకొచ్చి రాణి ని చేస్తే ,ఆమె మనస్సులో ఔన్నత్యం ఎలా వస్తుంది అనుకొన్నాడు ఆపతితుడు .

  రజనీప్రియ చెప్పే త్యాగం ఆమెలో ఎంత ఉందొ పరీక్షించాలనుకొని తోరమానుడు ‘’వస్త్ర హీనవై పురమున ‘’తిరిగితే తప్పులన్నీ కాస్తాను అన్నాడు .అనాధ దీన జనం కోసం రజనీప్రియ ఆ పరీక్షకు సిద్ధపడి తనమానాన్ని బలి చేయటానికి ముందుకొచ్చింది .ఆమె త్యాగ గుణానికి ఇదే పరాకాష్ట .వాడి క్రూర హృదయం కరిగింది .బుద్ధభగావానుడు తన్ను రక్షిస్తాడని విశ్వాసంతో ఆపరీక్షను పురం లో చాటింపు వేయమన్నది .ఆమె అపూర్వ త్యాగాన్ని విన్న ప్రజలు ఆమె మానాన్ని కాపాడాలని సర్వమంగళను ఆర్తిగా ప్రార్ధించారు .ఆ రాత్రి రాణి రజనీప్రియ భారమంతా బుద్ధభగవానునిపై వేసి నిశ్చింతగా నిద్రపోయింది .భర్త హృదయం లో భయంకర వేదనా జ్వాలలు ప్రజ్వరిల్లాయి .

  మర్నాడు ఉదయం లేచి శుచియై ,రధం ఎక్కి భగవాన్ బుద్ధుని సందర్శించి తనను తనభర్తను ప్రజలను కాపాడమని అర్ధించింది .బయట వేచి ఉన్నరధ సారధి మనసులో తాను  చేస్తున్నది మహా పాపమని రధం తోలేటప్పుడు తాను  వెనుకకు తిరిగి చూడననీ తన్ను క్షమించమని రాణీ పాదాలపై పడిప్రార్ధించాడు .’’నీ ధర్మం నువ్వు చెయ్యి ‘’అని హితవు చెప్పి ఊరడించినది .

   నగ్నంగా రధం దగ్గరకు  రాణి రజనీ ప్రియ వచ్చిన సమయం లో బుద్ధభగవానుని కళ్ళనుంచి కన్నీరు ప్రవహించింది  .నగ్నరాణిరధం లో పురవీధుల్లో తిరుగుతుంటే ,ఇళ్ళల్లో నుంచి ఒక్కరుకూడా బయటికి రాలేదు .ఒక ముసలి వజీరు మాత్రం ‘’విసపు తల౦పులున్పయికి వెన్నెల లొల్కెడు లేత నవ్వులు ‘’తో తలుపు చాటునుంచి ఆమె నగ్న సౌందర్యం చూడాలనుకోగా రధము నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి వాడి కళ్ళను మాడ్చేసింది .రజనీ ప్రియ దివ్యురాలైంది .ఆమె చరిత్ర అతిలోకమైంది .విహారి వెళ్లి రాజుకు ఈవిషయమంతాచేప్పాడు .తోరమానుడు నివ్వెరపోయి ఆమెను శరణు కోరాలని బయల్దేరి ,ఆమె పాదాలపై పడిన సమయంలో బుద్ధ దేవుని ముఖంలో మందహాస మరీచికలు ముత్యాలదండల్లా  మెరిసిపోయాయి .భక్తజన విజయమే లోక కుటుంబు డైన ఆ శాక్య మహనీయుని వేడుక .లోకం శాంతమై ,సౌఖ్యం పొందటమే ఆ దయామయునికి ఆనందం .

  హూణ రాజు తోరమానుడు  తన తప్పు ఒప్పుకొన్నాడు .రాణి రజనీప్రియ అతడిని మన్నించింది .అప్పటినుంచి క్రూర తోరమానుడు పరమ కారుణికోత్తముడయ్యాడు  ..’ఇదీ రజనీప్రియ కధ.

 ‘’ఈ కావ్యంలో యువకవి సత్యనారాయణ ధారాళమైన శైలితో ,మనోజ్ఞమైన కవిత్వం ప్రవహి౦పజేశాడు .ఔచిత్యమైన ఉపమానాలు కావ్య శోభను పెంచాయి .’’సాంధ్య ప్రాభారుణ  ప్రభా జాల దీప్త –మై తనర్చేడితెలిమబ్బు రీతి ,-పర్ణశాల ముంగిట గావి వస్త్రాలు కట్టి ,తపసు నొనరించు హిమశైల తనయ వోలె ‘’అని చక్కని ఉపమానాలు ఉపయోగించాడుకవి .’’వృద్దు శిరమ్ముపై క్షణిక నాట్యో   ల్లాసమున్ జూపి ,దాటె రదాంగమ్ములు ,దాటెనశ్వములు ,దాటెన్ హూణ వర్గంబులున్ ‘’పద్యం లో క్రూరరధ వేగం ,అది చేసిన భీభత్సం కన్నులకు కట్టించాడు .చాలా చోట్ల కరుణ రసప్రవాహం ప్రవహింప జేశాడు .బుద్ధభగావానుని స్తోత్రాలన్నీ భక్తి రస గుళికలే.

  ప్రకృతి వర్ణనలు కూడా మనల్ని ఆకట్టుకొంటాయి  .’’పశ్చిమా౦బుధి భానుండు వ్రాలె –నంత బాపకల్మష చిత్తసంభరిత జగతి –ద్యాగమూర్తుల నా తమోరాగనిబిడ -మైన దివి వెల్గు దారక లచ్చతచట ‘’అని చక్కని ఉత్ప్రేక్షతో మురిపించాడు .’’ధర్మ సంస్థాపనార్ధమా త్యాగమూర్తి –య౦బరంబులు లేక  నెడరుగు నంచు –కన్ను విప్పగ లేదంట కలువ కన్నె-రాజపద పార్శ్వ సంస్థితరమ్య సరసి ‘’లో ఔచిత్య రామణీయకాలు అనన్య సదృశాలు  .ఈ కవి ఇంతకూ పూర్వమే ‘’తిమ్మరుసు ‘’కావ్యం రాసి అనుభవం పొందాడు .

  ఈ కావ్యం మొదటి ఆశ్వాసం  ‘’శపథం ‘’లొ40పద్యాలు ,రెండవ ఆశ్వాసం ‘’ఆత్మ వంచన’’ లో42పద్యాలు ,మూడవది ‘’పరీక్ష ‘’లో 45పద్యాలు ,చతుర్దాశ్వాసం’’సిద్ధి ‘’ లో  50పద్యాలు ఉన్నాయి .కావ్యం మొత్తం 177పద్యాలు .అన్నీ రస గుళికలే .ఈ కావ్యానికి బ్రాహ్మశ్రీదివాకర్ల వారు రాసిన ముందుమాటలు బంగారానికి తావిఅబ్బినట్లున్నాయి .కావ్య విశేషాలు కవితావిశేషాలు అన్నీ వారేచేప్పారు .కనుక నా శ్రమ తగ్గింది ఈకావ్య పరిచయానికి .చివరిగా గుంటూరు సత్యనారాయణకవిగారి బుద్ధభగవానునిపై రజనీ ప్రియ తో పలికి౦చిన   పద్యాల  తో ముగిస్తాను –

‘’నీ కరుణావలోక కమ నీయ సుధారసవాహ చంద్రికా –నీకము నందు నా  హృదయనీరజమార్ద్ర మొనర్తు వంచు నీ

 రాకకు వేచి నిత్యమనురక్తి భజించి రచించుకొన్న నా నాకము గూల్చి నాడు పతనమ్మును గాంచి హసి౦తువా ప్రభూ ‘’

‘’లోకము నీదు బోధనలలో తన దుఖములన్ జయించి య-స్తోక సుఖమ్ములన్ వరలితూగుచునున్న దటంచు నెంచగా

బోకుము నాటి కష్టములమోఘముగా  పెనుపొందే నేడు నీ -రాకకు వేచి లోక మెటు క్రాగెడినో కనువిచ్చి చూడుమా ‘’

‘’శిల్పులు నీదు మూర్తి మున్ జెక్కెడివేళ –జీవకళ జిల్కిన నీ దరహాస మొక్కటే

నిక్కముగాద నేటికిని నిల్చెనయా అమృతంబు లొల్కుచున్ ‘’.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రజనీ ప్రియ

రజనీ ప్రియ

రజనీ ప్రియ అనే చిన్నకావ్యాన్ని కీ.శే. గుంటూరు సత్యనారాయణ ఎం.ఏ.రాసి ,’’చిత్ర కళా కవిత్వాలలో అసమాన ప్రతిభ చూపి పద్దెనిమిదేళ్ళు ఉజ్వలతారగా ప్రకాశించి తమల్ని వీడి ‘’దివ్య కళా’’ వైదుష్యాన్నిఅలవర్చుకోవటానికి దివికేగిన   తన చిన్ని  తమ్ముడు ‘’ వేణు’’కు అంకితమిచ్చి ,మద్రాస్  అడయార్ లోని వసంత ప్రెస్ లో1944లో  ముద్రించారు వెల.రూపాయిపావలా .ఈ పుస్తకం గురించి విశాఖలో ఉన్న సరసభారతి ఆత్మీయులు 95ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు  డా రాచకొండ నరసింహశర్మ-ఎం.డి. గారు ఈమంగళవారం  రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పి ,ఈకావ్యం టెన్నిసన్ అనే  ఆంగ్లకవి కవితను ఆధారంగా కవి రాశాడని అతని తండ్రిపేరు గుంటూరు సుబ్బారావు గారనీ  ఈ కవిపేరు జ్ఞాపకం లేదనీ ,అందులోని కధను సూక్ష్మంగా చెప్పి , అందులో తమకు జ్ఞాపకం వచ్చిన ఒక పద్యాన్ని పాడి వినిపించి గొప్పకావ్యం అని చెప్పారు .’’మీకు తెలుసా ‘’?అని నన్ను అడిగితె ‘’తెలియదు.మా అబ్బాయి శర్మతో నెట్ లో వెతికి౦చి దొరికితే మీకు పంపిస్తాను ‘’అని చెప్పగా చాలా సంతోషించారు .మా శర్మకు ఈ విషయం  మెయిల్ చేయగా వాడు వెతికి పంపగా నిన్న ఉదయం శర్మగారికి ఫార్వార్డ్ చేసి ఫోన్ చేసి చెప్పి ‘’మీరు అనుకొన్న టెన్నిసన్ కవిత కాదు దానినిWS.LANDORకవి  రాసింది ,కావ్యకర్తపేరు సత్యనారాయణ ,ముందుమాటలు డా దివాకర్ల వెంకటావధాని గారు రాశారు’’ అని చెబితే మహదానంద పడ్డారు .ఆ రజనీ ప్రియ విశేషాలే ఇప్పుడు మీకు తెలియ జేస్తున్నాను .

  కవి సత్యనారాయణ తన ముందుమాటలలో ‘’ఈకావ్యం లో చివరిఘట్టం రాణి నగరం లో వస్త్రహీనగా తిరగటం ‘’అనేది WS.LANDOR కవి రాసిన ‘’Leofric and Godiva ‘’ లోనిది .మిగతాదంతా తాను  కల్పించిందే అనీ ,అందులో విహారికధలో సూపర్ నేచురల్ ను కల్పించటం కొందరికి నచ్చలేదన్నారు .అలా జరిగే అవకాశం ఉందని తాను  భావి౦చాననీ ,కథా శిల్పానికి అది చాలా అవసరమనీ చెప్పాడు .రజనీ ప్రియ,తోరమాన్ ల నైసర్గిక స్వభావాలను పరిశీలిస్తే ,అది ఎంతఅవసరమో తెలుస్తుంది అన్నాడు .రజనీ ప్రియ ముగ్ధ ,సహజ కారుణ్య శీల.రాజ్ఞీత్వం రాగానే  ,మానవ సహజమైన ఆత్రానికి లొంగి అంతఃపుర భోగాల కొత్త అనుభవాలకు ఎరఅయింది .తోరమానుడు సహజ క్రూరుడు .అపార శక్తి ధన అధికారాలున్నాయి .ఐహిక సుఖాలన్నీ అనుభవించాడు. పరపీడన దౌర్జన్యం వాడి లీలలు.బాధ ,పేదరికం వాడురోజూ చూసేవే .అలాంటి వాడిని మార్చటానికి లౌకిక శక్తులు చాలవు లోకాతీత శక్తి మాత్రమె మారుస్తుంది .మన చర్యలన్నీ ఒక అదృశ్యమూర్తి లేక శక్తి  నిరంతరం గమనిస్తూనే ఉంటుందని అన్నిమతాలు చెప్పాయి .దీన్ని అందరూ అంగీకరించారు .దుష్టుని దౌర్జన్యం పెరిగినకొద్దీ వాడు ఇలాంటి శక్తికి భయపడి పోతూ ఉంటాడు .రజనీ ప్రియ త్యాగంతో భర్తను మార్చలేకపోయింది .కానీ ఆత్యాగం లో ఆమెలో అణగిఉన్న అతీంద్రియ శక్తి ఆపని చేయగలిగింది.త్యాగమహాత్మ్యం అంత గొప్పది .అని తన కావ్యాన్ని సమాదరించమని విశాఖదగ్గర ఉండే యలమంచిలికి చెందిన ఈ కవి సత్యనారాయణ కోరాడు .

   ఈ కావ్యం పై ‘’ప్రవేశకము ‘’రాసిన డా దివాకర్ల వేంకటావదానిగారు –ఈకవి సత్యనారాయణ ఇంటర్ తమకాలేజి లో చదివి ,అప్పటికే కవిత్వం,రాస్తూ ,నాటకాలు ఆడుతూ   ,,ఎం ఎ ఇంగ్లీష్ పాసైన సూక్ష్మగ్రాహి.ఈ కావ్యాన్ని అతడు రాసినందుకు తనతోపాటు తోటి అధ్యాపకులుకూడా సంతోషిస్తున్నారన్నారు .స్వర్ణయుగమైన గుప్తయుగం అంతరించాక హూణులు పాలించారు .వారిలో తోరమానుడు హిందూ శిల్ప విజ్ఞాన ,మణి,కనక సంపదలు అభిమాన సంపదలను దోచుకొని క్రూర దమన కాండ సాగిస్తూ ,ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తూ ఆటవిక పాలన సాగించాడు .వాడి దౌర్జన్యాలను రూపుమాపి ప్రజలతరఫున నిలబడి వారికి ఆశా జ్యోతిగా కనిపించింది రజనీ ప్రియ .

  రజనీప్రియ చిన్నతనం లోనే తలిదండ్రులను కోల్పోగా వృద్ధ బౌద్ధ సన్యాసి ఆమెను పెంచి పెద్ద చేసి యవ్వనవతికాగానే భిక్షాటనతో ఆయన్ను అనుసరించేది .ఆమెను చూసి తోరమానుడు ఆమెను కామించగా ,తన స్వంతం కావాలని కోరుకోగా సన్యాసి ఎంత చెప్పినా వినక ,సేనాపతిని పంపితే వాడు రధాన్ని ఆయనమీదుగా తోలి చంపి ,ఆమెను చక్రవర్తి కి  అప్పగించాడు .ఆమె చాలా అనునయంగా చెప్పింది వారించింది .వాడు బలవంతంగా తనకోరిక తీర్చుకొన్నాడు .ఆమె తన శీలం భగ్నం అవటం కంటే హుణ చక్రవర్తి తోరమానుడి ‘’హృదయరత్నాన్ని జార్చాలనుకొన్నది .తనువు చిక్కిన పేదలకు సేవ చేయాలనుకొన్న కరుణామూర్తి ఆమె  .’’మనసు మాలిన్యమైన ధనయుతు డికే సేవ చేస్తూ ,వాడిలో పరివర్తనం తేవాలని నిశ్చయించింది .తన శీలాన్ని కోల్పోయి ,పరసేవా  పరతంత్రగా చరిత్రలో నిలిచిపోయిన మావీయమూర్తి రజనీ ప్రియ .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 159వ కార్యక్రమం లో ‘’అంతర్జాతీయ తెలుగు బడి ‘’పురస్కార ప్రదానం .

సరసభారతి 159వ కార్యక్రమం లో ‘’అంతర్జాతీయ తెలుగు బడి ‘’పురస్కార ప్రదానం .œ

అమెరికాలో ఉన్న ‘’అంతర్జాతీయ తెలుగు బడి ‘’సంస్థ ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తోంది .అందులో టెక్సస్ రాష్ట్రం లోని ఆస్టిన్ నగర శాఖా నిర్వాహకులు శ్రీ డొక్కా రామభద్ర (నిరతాన్న ప్రదాత ,అపర అన్నపూర్ణ కీ శే .శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ‘’ఇని మనవడు ‘’గారు (మునిమనవడి గారి కుమారుడు ) ఆంధ్ర రాష్ట్రం లో రెండేళ్ళ నుంచి కరోనా వలన ఉపాధికోల్పోయి ,ఆర్ధికం గా ఇబ్బందులు పడుతున్నా , తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులకు గురుపూర్ణమినాడు ఉడతాభక్తిగా సరసభారతి ద్వారా ఆర్ధిక సాయం అందింఛి సత్కరించాలని భావించి నిన్ననే ఫోన్ లో మాట్లాడి నాకు తెలియ జేయగా ,అలాంటి అయిదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి 24-7-21 శనివారం ఉదయం 10గం.లకు సరసభారతి 159 వ కార్యక్రమం శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి(గురు పౌర్ణమి )నాడు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు అంద జేస్తున్నాము . ఈ కార్యక్రమం లో’’ కోవిడ్ నిబంధనలను’’ పాటిస్తూ పురస్కారగ్రహీతలు ,అతిధులు ,భాషాభిమానులు, వదాన్యులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

ఆత్మీయ అతిధులు

శ్రీ కోసూరు ఆది నారాయణ రావు –రిటైర్డ్ హెడ్ మాస్టర్,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘ మాజీ కార్య దర్శి –కోసూరు

శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ – హెడ్ మాస్టర్ ,తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి –విజయవాడ

డా.శ్రీమతి కొమాండూరి కృష్ణా –తెలుగు ఉపాధ్యాయిని,వక్త –విజయవాడ

శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –ఉపాధ్యాయిని ,బాల సాహిత్యకర్త –మచిలీపట్నం

అంతర్జాతీయ తెలుగు బడి పురస్కార గ్రహీతలు

1-శ్రీమతి జి.మాధవీ లత-హైదరాబాద్

2-శ్రీ పెరక రవికుమార్ –పెడన –కృష్ణాజిల్లా

3-శ్రీమతి ఆదిలక్ష్మీ పద్మావతి –విజయవాడ

4-శ్రీ కపిలవాయి రైవత శర్మ –విజయవాడ

5-శ్రీ దేవర ఈశ్వరరావు –విశాఖ పట్నం

జోశ్యుల శ్యామల దేవి మాదిరాజుశివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి

గబ్బిట దుర్గా ప్రసాద్-సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు

15-7-21-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రేపటి నుంచి శ్రీపాద వారి జీవితం సాహిత్యం ప్రత్యక్ష ప్రసారం

రేపటి నుంచి శ్రీపాద వారి జీవితం సాహిత్యం ప్రత్యక్ష ప్రసారం   సాహితీ బంధువులకు శుభకామనలు -జూన్ 16 నుండి ,ఈ రోజు 15-7-21 వరకు సరస భారతి     ఫేస్ బుక్ ద్వారా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి కథా సంపుటులు 1,2 భాగాలు 17 రోజులు,ఆతర్వాత వారిఅన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ గంధం వేంకాస్వామిశార్మగారి -అమృత హస్తాలు ,కలు ,నాయనమ్మ కథలు 12రోజులు మొత్తం 29 రోజులుగా ప్రత్యక్ష ప్రసారం జరగటం మీరు వీక్షించి అభినందించటం జరిగింది ..ధన్యవాదాలు   రేపు 16-7-21శుక్రవారంanఉదయం 10 గం.నుండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి  జీవితం ,సాహిత్యం ప్రత్యక్ష ప్రసారమౌతుంది 24-7-21శనివారం గురుపూర్ణమి,వేద వ్యాస జయంతి  సందర్భంగా సరసభారతి  ఫేస్ బుక్ లో సాయంత్రం 4 గం లకు ”బ్రహ్మ సూత్ర దర్శనం”ప్రారంభమై ,మర్నాడు 25 వ తేదీ ఆదివారం నుండి ఉదయం 10 గం నుంచే ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది  -గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-21

Posted in సమీక్ష | Tagged | Leave a comment

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం జిల్లా ఒంగోలుకు 13కిలో మీటర్ల దూరం లో అమ్మనబ్రోలు ఉంది .అక్కడ ఉన్న చేన్నకేశవస్వామిని ప్రసన్న చెన్నకేశవస్వామి అంటారు

 శతకాన్నిశార్దూల వృత్తం లో  చెన్నకేశవ స్తుతితో కవి ప్రారంభించాడు-

‘’శ్రీ రమణీశ యోగిజన  చిత్త సరోరుహ మత్త భ్రు౦గ సా-కార సురేంద్ర వంద్య పద ,కౌస్తుభవక్ష సుదీరకోటి మం

దార సువర్ణ చేల మురదానవ సంహర గోపికా మనో –హార సునీల వర్ణధర నమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’

  తర్వాత ద్విప్రాసానుప్రాస ,అంత్యప్రాస ద్విపాది ,ఏక యతిత్రిపాది పద్యాలు రాసి ముక్తపదగ్రస్తం లో  -‘’అబ్జాధరాధరాధిపమురాంతక శాత్రవభీమ ,భీమమో

హాబ్జ విలాస లాస కమలాసన సేవిత దేవ దేవ ర-క్షాబ్జసుధామ ఢామకనకా౦బర వారణరాజతాజ పా-లాబ్జ హితాజితాజిధర’’—- తనకవితా విన్యాసాన్ని చూపాడు .తర్వాత తన చదువు సందె విషయాలు చెప్పుకొన్నాడు .11వ ఏట బడిలోచేరి గురు సన్నిధిలో విద్య నేర్చి ధర్మమే లేని ఊరిలో తనను ఉంచినందుకు దేవుడితో మొరపెట్టుకొన్నాడు .చదువులేకపోతే రెండుకాళ్ళ పశువే అని గ్రహించి ,పాపాలు చేయకుండా సర్వమత సామరస్యం నీతి విద్యా శుచి సత్యవచనం దైవభక్తి ఉన్నవాడే బ్రాహ్మణుడు అని తెలుసుకొన్నాడు .కులమత భేదాలు తంత్రాలు నచ్చలేదు .’’వర్షబిందువులు కారుచు నన్నియు నొక్కరూపమై ఘన నదులై జనంబులకు కల్పమహీజాల్లాగా’’ ఉన్నట్లుగా మనుషులలో ఐకమత్యం ముఖ్యం అన్నాడు .పెళ్లి చేశారు .దరిద్రం .ఎటూ పాలుపోలేదు .ధనమే అన్నిటికి మూలం అని గ్రహించాడు .మాంసం తోలుతో ఉన్న ‘’అంగజు మందిరం ‘’పై వ్యామోహంతోం అన్నీ  మర్చిపోతారుజనం .వేశ్యావృత్తిని నిరసించాడు. వేశ్యకు ఒళ్ళు అమ్ముకొని అమ్మనూ సోదరులను  మేపటమే సరిపోతుంది .

 ‘’చదువులురాని నోరు ,శృతి చక్కగ లేని సితారు ,సద్గుణీ సుదతులు లేని గీము ,వర శూరులు మెచ్చని సాము ,నాటలో పదములురాని పాట,వర్తకులు లేనిపేట ‘’నిష్ప్రయోజనం అన్నాడు .స్త్రీలకూ విద్య అవసరం అన్నాడు .పాటలేనినాటకం ,పాకం దప్పిన భోజనం ,సయ్యాటలు లేనిపొందు,ప్రియమాజ్యము జూపని విందు ,కొలువులో మాటలురాని తేట,మతిమంతులు మెచ్చనిమాట వలన సుఖం ‘’ఇల్లె’’ అ౦టాడుకవి .  ధర్మం మాటలలోకాక ఆచరణలో ఉండాలి .ఆశకు మితిఉండాలి .మేఘాలు ,సూర్య చంద్రులులాగా పరోపకారం చేయాలి మానవుడు .బలాత్కార వివాహం కూడదు అంటాడు .పరస్పర అంగీకారంతో వధూవరులు పెళ్లి చేసుకోవాలి .పరుషవాక్యాలుపలక పోవటం ,పర స్త్రీ వ్యామోహం లేకపోవటం ,పరధనం ఆశించకపోవటం,పండితుల్ని గౌర వించటం బుద్ధిశాలికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు .

  కపట సన్యాసి లక్షణాలు ,మురికిలక్షణం ,కూడా వివరించి ,ప్రపంచోత్పత్తి క్రమం వర్ణించాడు .ఆతర్వాత దశావతారాలు  వర్ణించాడు  -‘’వటువు నటంచు వేషమున వామన రూపముదాల్చి నేల మూడడుగులు చాలు నిమ్మని ‘యాచన చేసి ,ఒసంగ అడుగులుపెంచి ,జగమంతయు జాలక విశ్వరూపమైన వామనావతారం  వర్ణించాడు సహజంగా .దేవుడు ఎక్కడో లేడు ‘’దేవమయంబు నీ జగము .దేవునిలోపల నుండు లీనమై ,భావము లేచువేళప్రపంచము నేర్పడు ‘’అని జగత్తుకు జగన్నాధునికి ఉన్న అనుబంధం వివరించాడు.కాలప్రభావం, మాయచెప్పాడు .ప్రళయం అంటే –‘’శ్రీకరమైన నీ పుడమి జెప్పక నీరము నందు పోవు ,నా ప్రాటమైననీరుగన పావక కీలలయందు ని౦కు ,బల్ తేకువ తోడ పావకుని తీక్షణ మంతనడంచు వాయువాకాశామునందు లీనమవటం ‘’అని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కవి అనుభవసారంగా .వేదాంత పర౦గా .

కందగీతి గర్భ చంపకమాల లో –‘’ఘనఘన సుందరా ,నిపుణక౦తునిదు-గన్న ప్రవీణ సార దు-ర్జనహర ణాధిపాపరమ ,శాంత శిఖామణి భక్త రక్షపా

వనముని సన్నుతా వరద ,వారణపాలన వారిజాక్ష –రాయని యననే సదాసిరుల నమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’

చివరగా గద్యం లో ‘’ఇది శ్రీహరి చరణారవిందమకరంద బిందాస్వాదనేందిందిరా యమాన మానసుండు,కమ్మ వంశజుండును ,క్రిష్ణయ్యతనూ భవుండు ను ,నవనాట కాలంకార విరచిత యశో దురంధరుండు నగు నాగినేని వెంకట కవీ౦ద్ర ప్రణీతంబైన అమ్మనబ్రోలు చెన్న కేశవ శతకము సంపూర్ణము .  

  చక్కని ధారాశుద్ధి ,బహు చందోరీతి ,చెన్నకేశవునిపై భక్తీ శతకమంతా ప్రవ హించింది . ఏ విమర్శకుని దృష్టి కీ,చరిత్రకారుని దృష్టికీ   నాగినేనికవి పడకపోవటం విడ్డూరమే .ఈకవి గురించి రాసే అదృష్టం నాకు కలిగింది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-21-ఉయ్యూరు      ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .
.


ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిచెందింది.ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్దనుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగున్నాడు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకొన్న బ్రహ్మదేవునికి విష్ణువు హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి, గరుడాచలం వద్ద “బంధుర” అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుని చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమౌతుందని, అక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యాదిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదాలవుతాయని విష్ణువు ఆనతిచ్చాడు. కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణువు అనుగ్రహం పొందాడు. కలియుగంలో వేంకటాద్రినుండి వేట నెపంతో తాను ఈ క్షేత్రానికి వస్తానని, శ్రీలక్ష్మీ సమేతుడై తాను ఉపమాకలో గూఢంగా నివసించువాడనని విష్ణువు చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఇక్కడ తపస్సు చేసి తాను పర్వతరూపంలో స్వామివారి ఆవాసంగా ఉండేలా వరం పొందాడు. ఇలా ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి అనేక గాథలున్నాయి. సా.శ. 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణభూపాలుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని కూడా స్థల గాథలలో చెబుతారు.

రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని అంటారు.17వ, 18వ శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువులు ఇక్కడి దేవునికి విలువైన కిరీటాన్ని సమర్పించారని తెలుస్తుంది. బ్రౌన్ దొర కూర్చిన హిందూ దేవాలయాల వివరాలలో ఉపమాక క్షేత్రం ప్రసక్తి ఉంది.ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. పాంచరాత్రాగమం ప్రకారం ఇక్కడ పూజాదికాలు జరుగుతాయి. సంతానార్ధులైనవారు ఇక్కడ స్వామిని దర్శించుకొంటే సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

· ధనుర్మాస ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలరోజులు జరుగుతాయి.

· శ్రీరామ అధ్యయన ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి.

· కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలు: ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

ఈ ఉత్సవాలలో పుణ్యకోటి వాహనం, పొన్న వాహనం, గరుడ వాహనం, రాజాధిరాజ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గజ వాహనం, పెద్ద పల్లకి, చిన్న పల్లకి వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉభయ నాంచారులతో గ్రామ వీధులలో తిరువీధి వైభగంగా నిర్వహిస్తారు. అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒకమారు లభించే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్యవైకుంఠద్వార దర్శనంగా ఉంటున్నది. ఈ క్షేత్ర మహిమలను “శ్రీ ఉపమాక క్షేత్ర మహాత్మ్యం” పేరుతో తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి చక్కని శైలితో రచించారు.

ఉప్మాక క్షేత్ర మహత్వము అని శ్రీగండికోట బాబూరావు అనేకవి గారు రాసి ,తిరుపతి వెంకట కవులకు చూపించి సందేహాలు తీర్చుకొని ,శ్రీ గొట్టుముక్కల నరసింహా చార్యులు ,శ్రీ పుట్టా గంగరాజు గార్ల సాయంతో కాకినాడలో 1-4-1917న ముద్రించారు వెల తెలుపలేదు .కవిగారు తమపద్యాలకు తాత్పర్యం కూడా రాసి మరింత సులభతరం చేశారు .

మొదటగా శార్దూలం లో ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామిని స్తుతి౦చారు కవి –

‘’శ్రీ యుప్మాక పురంబనన్ బరగు సుక్షేత్రంబునన్ –శ్రేయంబౌ భజనాలి సల్పదివిజుల్ సేవింప చెన్నారనల్

చాయల్ దు౦దుభులెల్ల వేడ్క మొరయన్ జానోప్ప సద్భక్త పో-షాయుత్తుండగు వే౦క టేశ్వరుని నే ప్రార్ధింతు నెల్లప్పుడున్ .’’

తరువాత కధలోకి వచ్చి బ్రహ్మవద్ద ఉన్న నాలుగువేదాలను ఎత్తుకుపోయిన సోమకాసురుని చంపటానికి విష్ణుమూర్తిని బ్రహ్మకోరాడు .’’సెబాసుపుత్ర నీ మనమున గల్గు వా౦ఛలిక మానకొసంగెద’’అని దగ్గర్లో ఉన్న బంధుర సరస్సు దగ్గర పవిత్రస్నానం చేసి తపస్సు చేయమన్నాడు .హయగ్రీవ నారసింహ అష్టాక్షరీ మంత్రాలు బోధించాడు .వీటితో తీవ్రతపస్సు చాలాకాలం చేశాడు బ్రహ్మ .విష్ణువు సాక్షాత్కరించి సోమకవధ చేస్తానని అభయమిచ్ఛి వాడిని చంపి వేదాలు తెచ్చి బ్రహ్మలోకం లో ఉన్న కొడుకు బ్రహ్మకి అందించాడు .

కశ్యపప్రజాపతికూడా విష్ణువు కోసం ప్రార్ధిస్తే బంధుర సరస్సువద్ద తపస్సు చేయమంటే చేసి ,విష్ణు సాక్షాత్కారం పొంది వరం కోరుకో మంటే ‘’నీ లాంటి కుమారుని ప్రసాదించు ‘’అని కోరగా సరే అనగా కొంతకాలానికి కొడుకుపుట్టాడు –‘’అతడే వామనాఖ్యుడాయి లోకైక ప్రపూజ్యు౦ డు నయి –యతి సూక్ష్ము౦డు ద్రివిక్ర ముండు నయి యొ-ప్పారెం భళీ’’అలాంటి క్షేత్రాన్ని వర్ణించటానికి బ్రహ్మాదులకూ సాధ్యం కాదన్నాడుకవి.

లోకం లో ఈ క్షేత్ర మహాత్వం విపరీతంగా వ్యాపించింది .’’ఖగ కులే౦ ద్రుండు’’కూడా వచ్చి ఇక్కడి సాగర ఘోషకు పరమానందం చెంది ,పవిత్రస్నానం చేసి మాధవునికోసం తపస్సు చేయగా లక్ష్మీ వరుడు దర్శనమిచ్చి కోరిక ఏమిటి అని అడిగితె ‘’శౌరీ !నా వర పక్ష ద్వయమందు నెల్లపుడు సంవాసంబుగా ను౦ డుమా ‘’అని ప్రార్ధించగా సరే అని వెంటనే వైకు౦ఠానికి వెళ్లి లక్ష్మీ దేవితో గుర్రాన్నెక్కి వస్తానని అది దివ్య క్షేత్రమౌతుందని అభయమిచ్చాడు .

గరుత్మంతుడు విష్ణువు రాకకోసం కృతయుగం లో బంగారు కొండ గా ,త్రేతాయుగం లో వెండికొండగా , ద్వాపరం లో రాగికొండగా ,కలియుగం లో రాతికొండగా వేచి ఉన్నాడు .చాలా కాలానికి తెల్లగుర్రం ఎక్కి లక్ష్మీ సమేతంగా విష్ణువు ఆప్రాంతానికి వచ్చి కొండ రూపంగా ఉన్న గరుడునిపై మునుల౦దరికి మోక్షం ప్రసాదించాడు .

సకలలోకాలు తిరుగుతూ నారదుడు బంధుర సరస్సు విష్యం విని ,ఇక్కడికి వచ్చి మనస్సులో ఎంతోమంది మహాత్ములు దర్శించి తరించిన ఈ క్షేత్రం మహత్తు వర్ణించటం ఎవరి తరమూకాదు అనుకొన్నాడు .దీనికి ఒక చారిత్రాత్మక ప్రసిద్ధి కలగాలని ,గరుత్మంతుని కొండపై ‘’లక్షీ హయ సమేతవిష్ణు మూర్తి ‘’ని ప్రతిష్టించాడు .మరికొంతకాలానికి నారాయణుడు ఒక గొల్లవాని కలలో కనిపించి తాను లక్ష్మీ హయ సమేతంగా కొండమీద ఉన్నాను ‘’అని చెప్పగా మర్నాడు అతడు వెళ్లి ,’’కుంఠీత తేజు యశో విహారు ‘’నో యబ్బ ‘’యటంచు వెంటనే జోహారొనరించి ఆముచ్చటైన విగ్రహాన్ని చూసి మైమరచి స్తుతించి రాజుగారికి తెలియజేశాడు .రాజు ఆలస్యం చేయకుండా వచ్చి శ్రీ వేంకటేశ్వరునికి ఆలయాది నిర్మాణం చేసి ,నిత్యపూజలకు,ఉత్సవాలకు అన్నిఏర్పాట్లు చేశాడు .ఇదే ‘’ఉప్మాక వేంకటేశ్వర మహత్వం సింపుల్ గా .

చివరలో కవిగారు –‘’ఈ కృతి బఠీయింపు వారల కింపు తోడ –నాలకించిన వారల కనుపమాన

భాగ్యభోగాదు లలరు పాపములు గూలు –చెలగు నిష్టమనోరధసిద్ధికరము ‘’ అని ఫలసిద్ధికూడా చెప్పారు .ప్రారంభం లోనే కవి గండికోట బాబూరావు ‘’ఈ చిన్ని పొత్తంబున శ్రీ యుప్మాక క్షేత్ర మహత్వమంతయు సంక్షిప్తముగా వ్రాసినాడను .ఇందలిగాథజగద్విదితమగునదియే కానీ ,ప్రమాణ౦బగు నే గ్రంథమును గాంచి వ్రాయబడినది కాదు ‘’ అని చెప్పారు .సరిగ్గా 18పేజీల గ్రందం.కవి గారి పూర్తివివరాలూ లేవు ఇందులో .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ దేవాలయం లో 24న శాకంభరిపూజ 

సువర్చలాన్జనేయ దేవాలయం లో 24న శాకంభరిపూజ

–ఆషాఢ మాసం సందర్భం గా  ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయస్వామి దేవాలయం లో 24-7-21 శనివారం  గురుపూర్ణిమ, వ్యాస పూర్ణిమ నాడు  ఉదయం 11 గంటలకు స్వామివారలకు వివిధ కాయగూరలతో శాకంభరి ప్రత్యేక పూజ  నిర్వహింపబడును . భక్తులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన  -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త

Tagged | Leave a comment

పొడుపు కథల శ్రీ గానలోల శతకం

పొడుపు కథల శ్రీ గానలోల శతకం

శ్రీ పుట్రేవువెంకట సుబ్బారాయ మంత్రి గారి ద్వితీయ పుత్రుడు శ్రీ నాగ భూషణ కవి రాసిన శ్రీ గానలోల శతకం ఏలూరు రామా అండ్ కో వారు 1914లో ప్రచురించారు .వెల ఒక అణా.

  శతకాన్ని వినాయకుని స్తుతి తో ‘’తండ్రికంటే గొప్పతనమున మున్ముందు –పూజనముల నందు పుణ్యుడు ‘’అన్నారుకవి. తర్వాత సరస్వతిని ‘’బాపనమ్మ యయ్యు  బతి గల్గి యుండియు –రచ్చమీద కెక్కురమణి ‘’అన్నారుకొత్తగా.పోడుపులతో అర్ధం తెలుసుకోమని .తర్వాత అన్నీ పోడుపుపద్యాలే .దీని యర్ధమేమి గానలోల అనేది మకుటం.98 ఆటవెలది పద్యాల సౌందర్యం రాశీభూతమైన శతకం .

‘’నాల్గుమొగములుండు నలినోద్భవుడుగాడు –కనులు పదియునారు కలిగియుండు నాలుమగలకెప్పుడానందమిచ్చును –దీని యర్ధమేమి గానలోల ?’’ అంటే మంచం .’’పండ్లు నూరుగలవు ప్రాణ౦బులేదు .-జీవకోటి నెల్ల జిక్కబట్టు –నరుల తలలపైన నాట్య౦బు లాడును’’అంటే దువ్వెన .తలాతోకా ఉండి,కళ్ళులేకుండా  పొడిచి తోకతో భూమిని పైకి లేపేది –గునపం .పైకేక్కుతాడుమనిషి కానీ గుర్రం కాదు ,పాలిస్తు౦దికానీ బర్రేకాదు.కదలదు ‘’అంటే తాటిచెట్టు .’’మూడుకన్నులుండు ముక్కంటి యనరాదు –కడుపు వీపునడుము కాళ్ళులేవు-తిరిగి ధాన్యములును దినుచు గ్రక్కుచుండు ‘’అంటే తిరగలి .

   రెండు చెవులు ఉంటాయి చేతుల్లేవు కడుపు ఉంది నోరుకన్ను లేవు అగ్నిమీదకేక్కి భక్ష్యము లిచ్చేది –బూర్లేమూకుడు .వర్షాకాలం లో వేయకుండానే వచ్చే గొడుగు –పుట్టగొడుగు .నీరు మేతా అడక్కుండా అన్నికాలాల్లో  బంటులా వెంటవచ్చేది  -నీడ .’’కడుపున కనిపెంచి కన్నేనిచ్చినయట్టి –మామయు౦ డగాను మరచిపోయి –మామయందు రొకని’’అ౦టే చందమామ.రాజు అంటారు రాజ్యం లేదు లెక్క ఖచ్చితంగా చెప్పి చిక్కులు తీరుస్తున్దికానీ మంచీ చెడూ లేనిది –త్రాసు అదే తరాజు .రాణి అ౦టారుకాని రాచపిల్లకాదు,భరణిలో ఎప్పుడూ పడుకొనే ఉంటుందిదానిపేరు చెబితే దేవుళ్ళే దిగొస్తారు –సాంబ్రాణి .కారం అ౦టారుకానిఉప్పులాగాఉన్నా చప్పగా ఉంటూ ,నీళ్ళల్లో కరుగుతుదికాని నిప్పుతగిల్తే మండుతుంది –సురేకారం ‘’నేనే రేడు అంటుంది .ఏదో ఒకకాలం లోనే కాస్తుంది అందరికీ ఊరికే ఇస్తుంది –నేరేడు .

‘’నరుడు గట్టనట్టి  మెరుగైన ఇండ్లలో –పాలు నిండి యుండు మేలుగాను –వానిద్రాగి నరులు వర్ధిల్లు చుందురు’’అంటే పాలిండ్లు.రాత గీతాలేని భారతం పామరజనం నోట్లో పలుకబడేది –చాటభారతం .రామాయణమే,రమ్యమే చదువు రాని వారు చదువుతారు –అదే లోకాభిరామాయణం . శుకం వనం శాఖ ఒకమాటలో ఉన్న ఔషధకూర –చిలకతోటకూర  .గాడిద గుమ్మం ఆకు ఉన్న పదం –గాడిదగడపాకు .’’ వేయి కనులుండు వేల్పురేడా కాడు-కడుపు చెవులు నోరుకాళ్ళు లేవు –దాన్యరాశులేల్ల దనివార భుజియించు ‘’-జల్లెడ .

  ఇలాగే తమాషాగా ఉండే మాటలు కనుక్కోవాలి –‘’అన్నదమ్ములేల యరఛి  పోట్లాడుట –పిల్లలేల యరచు తల్లిజూచి –రెండు నొక్కమాట నుండును బరికింప ‘’అంటే పాలుకు అని అర్ధం పాలు అంటే భాగాలు పంచుకోవటం ,తల్లిపాలు అనీ కూడా .జనాల ఇళ్ళల్లో పుడుతు౦ది కాని సంతానం కాదు అంటుకుంటే  నెత్తురే తాగుతుంది –నల్లి .వాణి అంటారు వాగ్దేవికాదు.జనం తనివారా తాగుతారు .కొత్త కుండలో కూర్చుంటుంది తప్పకుండా –తరువాణి.

  ‘’విట పురుషు నెల్ల వేశ్య నుంచగ నేల –పోయ్యిమీదకూడు పొంగనేల –రెండు నొక్కమాట నుండును పరికింప ‘’అంటే ‘’మరిగి ‘’వేశ్యను మరిగి అని మొదట్లో తర్వాత పోయ్యిమీదమరిగి అని అర్ధాలు .విటుడు వేశ్య ,చేప చిక్కేది- ఎర చేత.’’రాజుమీద నెక్కు రౌతుమీదను నెక్కు –నందినేక్కు పిదప పందినెక్కు-అమృతముపైనెక్కు అన్నిటిపైనా ఎక్కేది ఈగ . జుట్టు నేలవంచి గట్టి తపస్సు చేసి ప్రాప్తాలైన ఫలాలను పక్షులకు పంచిపెట్టేది-మర్రి చెట్టు .’’అన్నదమ్ము లేవురవని నుండిరి  వారి –య౦దు పేరులేని  యతని జూచి –నగలు బెట్టు చుండ్రు నరులు సంతసమున –‘’అనామిక అంటే ఉంగరపు వ్రేలు .

  గర్భభారాన్ని  మోసి కడుపార కంటే ,బిడ్డలని తెలిసినా ప్రేమలేకుండా తండ్రి చంపాలనుకొంటే, తల్లి రక్షిస్తుంది అందకుండా –పిల్లి .పడుపుకత్తే కాదు ఇతరులను ఎరగదు .స్త్రీలకు  ఉపచారం చేస్తుంది కానీ సాని అంటారు చెవలాయలు –మంత్రసాని.జందెం ఉంటుంది బ్రాహ్మణుడుకాదు .  వంగి ఉంటాడు  కాని ముసలాడుకాడు .సిద్ధమైతే యుద్ధానికి రెడీ –విల్లు .చెట్టుకు పుట్టడు మనుషుల్లో తిరుగుతాడుకానీ  వాడిని కాయఅంటారు –డిప్పకాయ . కాళ్ళు౦టాయి తుమ్మెదకాదు నల్లగా ఉంటుంది నమ్మరాదు నరుల తలలపై నాట్యమాడుతుంది –పేను .

‘’గర్భవాసమందు కన్నబిడ్డలనెల్ల –కనుల జూడలేక కరుణమాని –తనదు బిడ్డలనక తప్పక భక్షించేది-పాము.దుఃఖ ఫలాన్ని తెచ్చి మనుషులు రసం పిండి మరగగాచి పొట్టనిండా తినేది –చింతపండు .’’చలువ తియ్యదనము కలిగించునొకకల్లు –కూరలందు వేసి కకొనెడుకల్లు –మంచి వస్తువులను మర్దించు నొకకల్లు –వడగల్లు ,ఉప్పుగల్లు సన్నెకల్లు .చదువూ సంధ్యలు లేకపోయినా గోడమీద కూర్చుని శకునాలు చెప్పేది –బల్లి .మొదలు చివర మూడక్షరాలు కుతుకము ,కూర్మి కలది తలకిందు చేద్దాంటే కానిది –ముదము .కొ౦పతవ్వే కుత్సితుడైనా రాజుంటారు .పళ్ళు కప్పాలుగా ఇస్తారు –ఎలుకరాజు .

 ‘’జుట్టు విరబోసి బట్టలు పదిగట్టి –చెట్టుమీద నుండు చిట్టచివర –పొట్ట చి౦చెనేని పొడచూపు ముత్యముల్ ‘-దీని యర్ధమేమి గానలోల ?-మొక్కజొన్నపొత్తు

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్-12-7-21-ఉయ్యూరు ..      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )

  మహా సమాధి

శేషాద్రిస్వామి 40ఏళ్ళు తిరువన్నామలై లో గడిపారు .మనసు కైవల్యం మీదకు మళ్ళింది ఈ విషయం చూచాయగా సుబ్బలక్ష్మమ్మకు చెప్పాలనుకొన్నారు .’’నిన్ను ఒకటి అడుగుతా ఖచ్చితంగా చెప్పు .నువ్వు చెప్పినట్లే చేస్తా .జనం తొందరపడుతున్నారు .ఇప్పుడున్నట్లే ఉండనా లేక కొత్త కుటీరం నిర్మించుకొని వెళ్లి పోనా ?’’.ఆమెకు స్వామిప్ర ప్రశ్నలోని మర్మ౦ తెలియక ‘’మీకు పైన ఉన్న అన్గోస్త్రం జారిపోతేనే తెలీదు .దీనికి తోడూ ఇంకో కుటీరమా ?ఉన్నచోటే యోగాభ్యాసం చేయండి ‘’’’అంది .ఆయన వదలలేదు కనపడినప్పుడల్లా ఇదే ప్రశ్న వేసేవారు .ఒకసారి విసిగిపోయి ‘’’కొత్తకుటీరం పై అంతమోజు ఉంటె అలాగే కట్టుకొని యోగం చెయ్యండి ‘’అన్నది. ‘’నా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు కూడా చెప్పావుకనుక అలానే చేస్తా ‘’అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు .ఆమె ఆజ్ఞ ఆయనకు పరమేశ్వరి ఆజ్ఞ..

 కొన్నాళ్ళకు పోరుగూరివారు వచ్చి స్వామికి అభిషేకం చేయాలనుకొని కేశసంస్కారం చేయించి అభి షేకానికి సిద్ధపడగా ‘’నాకు స్నానం వద్దు జ్వరం రావచ్చు ‘’అన్నారు .వాళ్ళు మూఢ౦ గా వందలాది పన్నీరు బుడ్లు ఆయన శిరస్సుపై కుమ్మరించి  అనేక బిందెలతో బావి నీరు తెచ్చి శివలింగానికి చేసినట్లు అభిషేకం చేశారు. ఊళ్ళో వాళ్ళూ రెచ్చిపోయారు .అభిషేకం పూర్తియ్యేసరికి బావిలో చుక్క నీరు లేదు  .స్వామి వొళ్ళు తుడిచి విభూతిరాసి ఫోటో కూడా తీశారు .

   ఆరోజు సాయంత్రమే స్వామికి జ్వరం తగిలింది .నలభై రోజులు జ్వరం తోబాధపడ్డారు .ఎంత జ్వరమైనా దిన చర్యలో మార్పు లేదు. చిక్కి శల్యమయ్యారు .జ్వరం తట్టుకోలేక ,చిన్న గురుక్కులు అరుగుమీద పడిపోయారు .అతడు సేవ చేయటం ప్రారంభించాడు .ఊరిజనాలకు  తెలిసి త౦డోపతండాలు గా చేరారు .తిరువన్నామలైలో జరిగే ‘’కృత్తి కొత్సవానికి’’ మించిన జనం వచ్చారు స్వామిని చూడటానికి .వైద్యం చేయిస్తామంటే వద్దన్నారు .ఆహారమూ తీసుకోలేదు .నరసింహస్వామి నారాయణ శాస్త్రి ఉత్తరం రాసి స్వామి విషయం తెలియబర్చాడు .శాస్త్రి వెంటనే వచ్చివాలాడు. ఆయన్ను చూడగానే స్వామి కళ్ళు తెరవగా ఒక నారింజపండు స్వామికి సమర్పించగా ,దాన్ని వలిచి ,అందులో ఒక్కతొన  మాత్రం చిదిపి వాసన చూశారు .వానచినుకులు, తడిగాలి. గురుకులు శాలువా తెచ్చి స్వామికి కప్పాడు .లేచి ఆశాలువతోనే స్వామి ఆలయానికి తూలుతూ వెళ్ళగా వెంట శాస్త్రి ,మాణిక్యం వెంటనడిచారు పడిపోకుండా పట్టుకొంటూ .దారిలో ఒకగుంటలో వాననీరు నిలిచిఉంటే ఆమోకాలిలోతు నీటిలో కూర్చున్నారు  .జనం పెరిగారు .భరించలేక గుంటలోనే పడుకొన్నారు .రాత్రి ఎనిమిదికి అందరూ స్వామి వారికి దూరం గా జరిగి నిలిచారు. మాణిక్యం వెళ్ళిపోయాడు .స్వామివద్ద శాస్త్రి ఒక్కడే ఉన్నాడు .తెల్లవారుజామున మూడుకు గుంటనుంచి బయటకు వచ్చి ఆ తడి గుడ్డలతో గురుకులు ఇంటికి నడిచి వెళ్లి ,అలాగే పడుకొన్నారు .నరసింహస్వామిని సుందరకాండ పారాయణ చేయసాగాడు .స్వామి స్థితిలో మార్పు లేదు .సుబ్బలక్ష్మి రాగా ‘’చూశావా ?’’అనగా అప్పటికి ఆమె కు లైట్ వెలిగి ‘’నేను చెప్పిన కుటీరం, యోగాభ్యాసం ఇది కాదు స్వామీ ‘’అని వలవల ఏడ్చింది .

 అది విభవ సంవత్సర మార్గశీర్ష మాసం .స్వామి జనన కాలం లో గురు శని శుక్రులు మేష వృశ్చిక కు౦భరాసుల్లో ఉన్న సమయాన్ని తనకైవల్య ముహూర్తంగా స్వామి నిర్ణయించుకొని ,శుక్రవారం అదే రాశులలో పద్మాసనం లో కూర్చున్నారు .అరుణాచల ఆది దంపతులను మనస్సులో నింపుకొని ,ఆన౦ద స్ఫురణతో ,రోమా౦చితులై ,భ్రువ మధ్యమం లో ప్రాణాన్నిఆవేశి౦పజేసి , సనాతన ,విశ్వ నియంత ,జ్యోతిర్మయుడు ,సర్వ పోషకుడైన పరమేశ్వరుని విభూతిలో తన ప్రాణవాయువులను కలిపేశారు  .స్వామిలేని అరుణాచలం  రాముడులేని అయోధ్య అయింది .

          శేషాద్రి ద్రిస్వామి  ఉపదేశామృతం

స్వామి ఉత్తమాధికారులకు ఉపదేశ దీక్ష నిచ్చేవారు .విఘ్నోప శాంతికి ‘’శుక్లాంబరధరం ‘’శ్లోకం మూడు సార్లు చదవాలి .ఈశ్వరుడు ఎవరో తెలుసుకొంటే శరీరం తానుగా మారుతుంది .ప్రమాదమే మృత్యువని సనత్సుజాతీయం చెప్పింది .దేహాత్మ బుద్ధిని వదలటమే మృత్యుంజయం.మన నవద్వారపురి లంక జ్ఞానాగ్ని తోనే దగ్ధమౌతుంది .రామాయణం చదవటం అంటే రాముని గుణాలు ఆచరి౦చ టమే .గురువే శివస్వరూపం  ,శివుడే గురువు .జాతిభేదం మాతృభోగం వదిలితే సమాధి సిద్ధి .అగస్త్యమహర్షి సంబోధించిన ‘’రామరామ మహా భాగో ‘’అంటే చాలు మోక్షమే .సుందరకాండ జ్ఞానప్రదాత .రాముడు సర్వవ్యాపి కనుక ఆయన నామ స్మరణ చేయాలి .పాపాలు తొలగటానికి భారతం చదవాలి .

   శ్రీరంగని సేవించినా ,హరికధ చెప్పినా మోక్షమే .శివ ,శక్తులు ఒకరికొకరు విడిచి ఉండనట్లు ,విభూతికి ,కు౦కుమకు భేదం లేదు ..శ్రీకృష్ణ కర్ణామృతం ,లలితా సహస్రనామం ,శివ సహస్రనామ౦ తప్పితే వేరే లోకం లేదు .చిత్తవృత్తి నిరోధమే రాక్షస సంహారం .కామ నాశనానికి ,ఇంద్రియ విజయానికీ అద్వైత దృష్టి అవసరం .సత్యం శాంతం సహనం మన పరిజనం ,మన పరివారం ఆత్మ బంధువులు .ఈగలాగా శుద్ధం ,చీమలాగా బలం,కుక్కలాగా విశ్వాసం ,రతీ దేవిలాగా ప్రేమా ఉన్నవాడికి గురుభక్తి సులభం .వేగిన గింజ మొలకెత్తనట్లు ఈశ్వర ప్రీతిగా చేసే కర్మలు బంధకాలుకావు .

 పనసపండు తొనలాగా ఏశ్వరుడినిఆరాధి౦చాలి . దానితొన బీజాన్ని ఆవరి౦చి ఉంటుంది .ఈశ్వరుడు జగత్తుకు బీజం .ఆ బీజం లోంచి వచ్చిన జగత్తు ఈశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది .పనస తొనలోని గింజను తీసేసి దాన్ని తిన్నట్లుగానే ,పంచకోశ నిరాకరణం చేసి ఆత్మాను సంధానం చేయాలి .ఆత్మ బోధ ఉపనిషత్ ఓంకార ప్రశస్తిని ,అష్టాక్షరిమహిమను చెప్పింది .దీన్నిఅనుష్టిస్తే హృదయేశు డైనవాసుదేవ దర్శనం లభిస్తుంది .మహాభక్తుడైన గుహుడు గంగలోపడి  మునిగిపోవటం అంటే దేహధ్యాసను వదిలేయటమే .

‘’అపసర్ప సర్ప భద్రం తే దూరం గచ్ఛమహాయశాః-జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తీక వచనం స్మర’’ఇదే పాముమంత్రం .భోజనం చేసే టప్పుడు ఎవడు నాలుకద్వారా రసాన్ని ఆస్వాదిస్తాడో వాడిని తెలుసుకొంటే చాలు .సాధ్యమైనతవరకు ప్రవృత్తి నుంచి తప్పుకొని నివృత్తి ని అనుసరించాలి .త్రిభువనజనని జ్ఞానగంగే ప్రవాహం. శరీరమే కాశి. భక్తీ శ్రద్ధలే గయ.గురు చరణ ధ్యానయోగమే ప్రయాగ .తురీయుడైన విశ్వేశ్వరుడే ఆత్మా ,సాక్షి .అన్నీ శరీరం లోనే ఉంటె వేరే తీర్దాలు ఎందుకు ?

‘’కాశీ క్షేత్రం శరీరం ,త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన  గంగా- భక్తి శ్రద్ధా గయేయం-నిజగురు చరణధ్యానయోగః ప్రయాగః-విశ్వేశోయం తురీయః సకలజన మనః –సాక్షీ భూతో౦తరాత్మా దేహం స్వయం మదీయే యదివసతి –పునస్తీర్ధ మన్యత్కిమస్తి?’’(శంకర భగవత్పాదులు ).

  సమాప్తం

ఆధారం -మొదటి ఎపిసోడ్ లో రాసినట్లే –బ్రహ్మశ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు తమిళం లో రాసిన’’ శ్రీ శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ‘’కు శ్రీ విశాఖ గారు తెలుగు అనువాదం చేసి ,తెనాలి సాధన గ్రంధ మండలి వారు ప్రచురించిన ‘’శ్రీ శేషాద్రి స్వామి జీవితము.’’

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 10-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13

  వెంకటాచలమొదలి ,సుబ్బలక్ష్మి దంపతులైన వారింటికి  శేషాద్రి స్వామి ఒక రోజు వెళ్లి ,ఇంటివెనక ఉన్న నాలుగైదు చెట్లను చూపించి సుబ్బలక్ష్మి తో ‘’ఒక వేడుక చూపిస్తా చూడు ‘’అన్నారు .క్షణం లో వందలాదిచిలకలుగోరువంకలు కాకులు నానా జాతిపక్షులు చెట్లపై వాలాయి ‘’ఇవి తమపిల్లల్ని చూసుకోవటానికి పోవా ??’’అని అమాయకంగా ప్రశ్నిస్తే ‘’అలానా సరే ‘’అని పై ఉత్తరీయం నుంచి ఒక నూలుపోగుతీసి  విసిరి ఫోఫో అన్నారు .క్షణం లో వెళ్ళిపోయాయి .సుందరేశం భార్య కనబడినప్పుడల్లాస్వామి ‘’యమపురి చూశావా ??’’అని అడిగేవారు .ఆమెకు చనిపోతాననిదిగులుపెరిగింది .మరోసారి వెళ్ళినా, స్వామి అదే ప్రశ్నవేస్తే ,’’చూడలేదు స్వామీ ‘’అంటే ‘’చూపిస్తా చూస్తావా ?’’అని ఆమె ఎడమ చేయిపయ్యికొని ,తన నోరు తెరచి చూడమన్నారు .స్వామి నోట్లో ఆమెకు ఘోరనరకం ,వికృతాకారులు రోదనలు వొడలు జలదరించే దృశ్యాలు కనిపించాయి .మూర్చపోయింది అయిదునిమిషాలకు కానీ స్మృతిరాలేదు. స్వామి తన ఉత్తరీయం తో ఆమె ముఖం పై విసురుతున్నారు.నెమ్మదిగాతెరుకొని ఇంటికి వెళ్లి అందరికీ చెబితే ఆశ్చర్యపోయారు .కొన్నాళ్ళకు మద్రాస్ లో జరిగే పెళ్లి శుభలేఖ వస్తే స్వామి పర్మిషన్ కోసం రాగా ‘’వెళ్ళవద్దు ‘’అన్నారు కానీ ,ఆమె బంధువులతోమాటవస్తుందని మద్రాస్ వెళ్ళింది .వెళ్ళిన మర్నాడే అక్కడ కలరా తగిలి చనిపోయింది ,రాబోయేమరణాన్ని స్వామి ఆనాడు సూచి౦చారన్నమాట .

  వేంకటాచల మొదలిఒక సారి మద్రాస్ వెళ్లాల్సివచ్చి అసలే దొంగలభయంగా ఉందని స్వామినికలిసి చెప్పి ఒంటరిగా ఇంట్లో ఉన్న తనభార్య క్షేమసమాచారాలు చూడమని కోరగా సరేనన్నారు .ఒకరోజు రాత్రి సుబ్బలక్ష్మితో ‘’రేపురాత్రి మీ పక్కింట్లో దొంగతనం జరుగుతుంది నీకు భయం లేదు నేను మీ అరుగుమీద పడుకొని ఉంటాను ‘’అన్నారు .పక్కింటాయన ఇంట్లో ఉన్న  బంగారం కరిగించి కడ్డీలామార్చి తలకింద పెట్టుకొన్నాడు .ఇది తెలిసిన మరోఆయన దాన్ని తస్కరించాడు .ఆయన లబోదిబో మంటుంటే స్వామి సుబ్బలక్ష్మిని పిల్చి దొంగ వచ్చిపోయాడు నీకు భయం లేదన్నారు .మర్నాడు రాత్రి పదకొండు గంటలకు స్వామి సుబ్బ లక్ష్మి ఇంటికి వచ్చి ఇంట్లో వారంతా భక్తితో స్వామిని ప్రశ్నిస్తుంటే సమాధానాలు చెబుతూ ఆమెను ‘’నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అమ్మవార్ని ఇంద్రాది దేవతల్నీ చూపిస్తా పడుకో ‘’అనగా ఆమె పడుకుంటే ఆమె గుండెపై కుడి చేయి వేసి ‘’ఇప్పుడు చూడు ‘’అనగా ,ఆమెకుమగత వచ్చి శంఖధ్వానాలు మంగళారవాలు అమృతతప్రవాహం విద్యుత్ కాంతులు రసమయ గోళాలు ,వాటిమధ్య తెల్ల ఏనుగు దానిపై సుందరాకారుడు ,రుద్రుడు పార్వతి ,విష్ణువు ‘’చూడు అనగా ఇక చూడలేక మూర్చ పోయింది ‘’నీకు చూసే భాగ్యం లేదు కర్మ క్షయం కాలేదు గురకపెట్టి నిద్రపో ‘’అన్నారు .ఆమెకు నిద్రపట్టలేదు ఆదివ్య దర్శనం తో ఆమె చూపు పోయింది ,తడుముకొని నడవాల్సి వచ్చింది.మర్నాడు ఉదయం 11గంటలకు స్వామివచ్చి ‘’భయం లేదు నీ చూపు మళ్ళీ వస్తుంది ‘’అని తన ఉత్తరీయం తో ఆమె కళ్ళు తుడవగా ఆమెకు చూపువచ్చింది.

  శ్రీ విద్యోపాసకులలో ప్రసిద్ధులైన ఎన్ .సుబ్రహ్మణ్యయ్యర్ ఉపాసనా రహస్యాలపై శ్రీనగర విమర్శ ,గురుతత్వ విమర్శ వంటి  చాలా పుస్తకాలు రాశారు.మంత్ర శాస్త్ర విశారదుడుకూడా . గొప్పకర్మిష్టి. స్వామిపై అమితభక్తి .ఒకసారి స్వామిని దర్శించగా ‘’రేపు ఇలయనార్ కోవెలకు రా ‘’అన్నారు .బ్రాహ్మీ ముహూర్తం లోస్వామి ఆ ఆలయానికి  వెళ్లగా అయ్యరూ రాగా స్వామి ఆయనకు పరాశక్తి రూపం లో దర్శనమిచ్చారు. అయ్యరు పరమానంద భరితుడవగా స్వామి ఆయనకు ఏదో ఉపదేశం కూడా చేశారు .

   స్వామి బంధువు నటేశ అయ్యర్ కొడుక్కి విషజ్వరం మసూచీ తో బాధ పడుతు.కళ్ళు కూడా పోతే,ఎన్నివైద్యాలు చేసినా నయంకాకపోతే స్వామికి చెబితే ‘’వాడిని తెచ్చి ఇక్కడే వదిలి వెళ్ళు‘’అనగా అలాగే చేస్తానంటే ‘’నా దగ్గరకు అంటే అమ్మవారి సన్నిధిలో  ‘’అనగా ,అలాగే చేయగా స్వామి పూజార్లకు చెప్పగా వారు రాత్రిపూజాదికాలుకాగానే వాడిని అమ్మవారి గర్భగుడిలో ఉంచి గుడికి తాళం వేసి వెళ్ళారు .మర్నాడువచ్చి తలుపులు తీస్తే,కుర్రాడి కళ్ళు జ్యోతుల్లా  కాంతులీనుతూ  చక్కగా ఉన్నాయి .ఈ అద్భుతాన్ని అందరూ చాలారోజులు చెప్పుకొన్నారు .

  పదహారేళ్ళ వెంకటరామన్ కు రోజూ సంధ్యవార్చగానే అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసే అలవాటు .ఒఅరోజు గర్భాలయం వద్ద స్వామి కనిపించి ‘’ఎక్కడికి “’అంటే ‘’అమ్మవారి దర్శనం కోసం ‘’అంటే ‘’ఇక్కడే దర్శనం చేస్తావా ??’’అని అడిగితె ‘’మీరు చూపగలిగితే’’అనగా ,స్వామి వాడికి అడ్డంగా నుల్చోని ‘’ఇప్పుడు చూడు ‘’అనగా వాడి మనో నేత్రాల ముందు అమ్మవారు ‘’ఆపీత కుచాంబ ‘’దివ్య దర్శనమిచ్చింది .’’అమ్మవారి చీర రంగేమిటి అనిఅడిగితే ‘’పసుపు ‘’అనగా .కఠమాల?’’అంటే ‘’మల్లెమాల ‘’అనగా ‘’ఆభరణాలో ‘’అని అడిగితె ‘’  శిరసుపై కిరీటం ,ఒడిలో వడ్డాణ౦ ,కాళ్ళకు గొలుసులు ‘’అన్నాడు .’’ఇక లోపలి వెళ్లి చూడు ‘’అనగా లోపలి వెళ్లి అమ్మవారిని చూస్తె తాను  బయట ఎలా ఉన్నఅమ్మవారిని చూశాడో సరిగ్గా లోపల అమ్మవారు అలాగే ఉంది .ఈ అనుభవాని గర్వంగా అందరికీ చెప్పుకొన్నాడు .

  మధురలో ఒక సౌరాష్ట్ర కుటుంబానికి  పిల్లల్లేరు .అమ్మవారు మీనాక్షీ దేవిపై వారికి అమితభక్తి .ఆమెతో మొరపెట్టుకొంటే తిరువన్నామలై వెళ్లి శేషాద్రి స్వామిని దర్శించమని చెప్పింది  .మర్నాడు అక్కడికి చేరి స్వామికి నమస్కరిస్తే ‘’మిమ్మల్ని మీనాక్షీ దేవి పంపిందా?’’అంటే వాళ్ళు ఆశ్చర్యపోగా, దగ్గరకు పిల్చి ఇద్దరి కొంగులనుకలిపి ముడి వేసి ‘’  వెళ్లి రండి ‘’అనగా నాలుగు అడుగులు వేయగానే స్వామి కొంగుముళ్ళు విప్పి ‘’మీ కోరిక నెరవేరి పుత్రప్రాప్తి కలుగుతుంది ‘’అని దీవి౦చి పంపగా ,సంవత్సరం తిరిగేనాటికి వారికి పండ౦ టిమగపిల్లాడుపుట్టగా ‘’శేషాద్రి ‘’పేరు పెట్టుకొన్నారు .స్వామికీ ,పరదేవతకు అభేదమే అని మనం అర్ధం చేసుకోవాలి  .కవికులగురువు కాళిదాస మహాకవి అందుకే ‘’దయమాన దీర్ఘ నయనాం -దేశిక రూపేణ  దర్శితాభ్యుదయాం ‘’అన్నాడు. అమ్మ గుణ నిధిమాత్రమే కాదు, గురుమూర్తికూడా .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12

  ఒకసారి నారాయణ శాస్త్రి భార్యతో శేషాద్రి స్వామిని దర్శించగా ‘’మీ ఇద్దర్నీ కలిసి చూడాలని నేను అనుకొంటే ,నన్ను తోసేస్తున్నారే ‘’?అనగా అర్ధం కాకపోతే ‘’నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బోతున్నావా ?””అని శాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడు నెలలకే  శాస్త్రి భార్య చనిపోయింది  .కుమారపిల్లై కి పెళ్లి అయి పదేళ్ళయినా సంతులేదు .భార్యగతిస్తే రెండోపెళ్ళి చేసుకొన్నాడు .ఈమె కూడా ఏడాదికే చనిపోయింది .మూడోపెళ్ళి ప్రయత్నం లో ఉండి,పోలూరు తిరుక్కోవిలై లలో ఉన్న పిల్లల్ని చూసొచ్చాడు .పోలూరు అమ్మాయి అందం  డబ్బున్నమ్మాయి .రెండో అమ్మాయి బీద అంతఅందం లేదు .ఎవర్ని చేసుకోవాలో తెలీకస్వామినే అడిగాడు ‘’తిరుక్కోవిల్  కాకినే చేసుకో అదే నిన్ను కాపాడుతుంది పోలూరు  పిల్లను చేసుకొంటే ఎవరో దాన్ని ఎత్తుకుపోతారు ‘’అన్నారు .అలానే చేసి సుఖంగా కాపురం చేశాడు .వెంకట సుబ్బయ్య ఇంటిలో స్వామి ఉన్నప్పుడు పుదుచ్చేరి నుంచి ఒక కుష్టు రోగిని తెచ్చి స్వామిని మందు చెప్పమని కోరితే ‘’శ్వాన గ౦ధి’’సేవిస్తే తగ్గుతుందన్నారు .సుబ్బయ్యర్ వనమూలికల పుస్తకం తిర గేస్తే కాశీ దగ్గర దొరుకు తు౦దిఅని తెలియగా స్వామి ‘’అది తెప్పించి వేసుకొన్నా సగమే నయమౌతుంది .మిగిలినసగం అనుభవించాల్సిందే అతడు కర్మి ‘’అన్నారు  .’’కంచి వదిలి తిరువన్నామలై లో స్థిరపడిన మీకు ఆ వనమూలిక కాశీలో దొరుకుతుందని ఎలా తెలుసు “?”అని అడిగితె జవాబివ్వలేదు స్వామి .

  సేలం పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగి శేషాద్రి అయ్యర్ స్వామిని మొదటిసారిగా దర్శించగా ‘’నువ్వూ శేషాద్రివే నేనూ శేషాద్రినే.నువ్వు రామ నామ జపం ఎందుకు చేయరాదు ?’’అనగా ఆరోజు నుంచి చేశాడు .శంకరానందస్వామి శేషాద్రి స్వామి దగ్గరకు వచ్చి ‘’ఈవూర్లో చెట్టియారు కాశీ యాత్రికులకు అన్న సదుపాయం చేస్తారట .నాకు పదిరోజులకు చీటీలు ఇప్పించండి ‘’అని అడిగితె ‘’ఇప్పుడే చెట్టి రైలు దిగి ఇంటికి వెడుతున్నాడు వెళ్లి అడిగితె ఇస్తాడు ‘’అనగా ,దోవలోనే చెట్టి బండీలో కనపడగా ఏకంగా ఒక సంవత్సర కాలానికి ఆస్వామికి అన్నివసతులతో భోజన సౌకర్యం కలిగించాడు .తిరు వెంకట మొదలియార్ బంధువులింట్లో పెళ్లి కెళ్ళి అక్కడి వారు ఇవ్వగా మూడు లడ్డూలు తెచ్చి అలమర లో పెట్టాడు .ఇంతలో స్వామివచ్చి  లడ్డు ఇమ్మనగా ,ఏదిచ్చినా తుంచి పారేసేయ్యటమేగా   అని ఒక్క లడ్డూ ఇవ్వగా ‘’మిగిలిన రెండూ ??””అనగా తెచ్చివ్వగా వాటిని యధాప్రకారం  ముక్కలు చేసి వెదజల్లారు స్వామి.

 కొండమీద ఉన్న సాధువుకు భక్తులు మైసూరుపాక్ చేయించి ఇస్తే దాన్ని ఒకమూల దాచిఉంచితే ,ఒకరోజు పెద్దవానలోస్వామి ఆగుహకు వెళ్లి సాధువుతో ‘’మీకూ మైసూర్ పాక్ ఇష్టమా నాకు చాలా ఇష్టం ‘’అనగా ఆశ్చర్యంతో కొన్నిపాకులు తెచ్చి స్వామికిచ్చాడు సాధువు .జయరామ మొదలికి స్వామి అంటే మహా భక్తీ .ఆతిధ్యమివ్వాలని అనుకొనేవాడు .ఒక చంద్ర గ్రహణం నాడు గ్రహణం వదిచిన తర్వాత భక్తులు స్వామికి అనేకరకాల పదార్ధాలు తెచ్చి తిమని బలవంతం చేశారు .మొదలి అక్కడకురాగానే ‘’కొంచెం అన్నం ,చారు ,కందిపచ్చడి ‘’తీసుకొని రమ్మని చెప్పగా ఇంటికి వెళ్లి భార్యతో చేయిద్దామనుకోగా ఆమె అవే చేసి సిద్ధంగా ఉంచితే పరమాశ్చర్యపడి ,తీసుకు వెళ్లి స్వామికి నైవేద్యం పెట్టాడు అతని భార్య ఒకరోజు ఒకలోటాపాలు తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టగా ‘’ఇంటికి వెళ్ళద్దు ఇంట్లో పాము ఉంది కరుస్తుంది ‘’అన్నారు . భయం తో అక్కడే చతికిలబడింది .కాసేపయ్యాక’’పామును చంపేశారు హాయిగా వెళ్ళు ‘’అని పంపించారుస్వామి .ఇంటికి  వెడితే ,చచ్చి పడి ఉన్నపాముకనిపించింది .

  ఒకరోజు స్వామి జయరామమొదలితో ‘’ఒక మామిడి పండు ఉంటె బాగుండునే ‘’అనగా ‘’ఇది సీజన్ కాదు దొరకదు.పాలు తెస్తాను తాగండి ‘’అనగా ‘’పండు తిన్నాక పాలుతాగితే బహు పస౦దు గా ఉంటుంది  .వెళ్లి వెతుకు దొరక్కపోదు ‘’అనగా .పండ్ల దుకాణాలన్నీ తిరిగాడు. ఒకే ఒకచోట ఒక్కటే మామిడిపండు దొరికింది .దాన్నికొని ,పాలతో సహా తెచ్చి స్వామికిచ్చాడు .ఒకసారి స్వామి నడివీధిలొ పదేపదే సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే ,అర్ధం కాక అడిగితె ‘’కంచిలో ఏకామ్రనాధుడు రధం ఎక్కుతున్నాడు .మీరూ దారాళ౦గాస్వామిని సేవించవచ్చు ‘’అన్నారు .మాణిక్యస్వామిని చూసినప్పడల్లాస్వామి ‘’నిద్రపోకు యముడు పట్టుకు పోతాడు ‘’అనేవారు .ఒఅరోజు రాత్రి తోమ్మిదికే  తిన్నేమీదకూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు  మాణిక్యం.కాసేపట్లో కలలో యమదూతలు దున్న పోతుపై ఎక్కిన యముడిని అనుసరిస్తూ రావటం ,వాడినిపట్టుకో వీడినిపట్టుకో అని ఆజ్ఞలివ్వటం ,తనదగ్గరకువచ్చి ‘’ఈసోమరినీ బంధించ౦డి’’ అనటం జరిగింది .అదేసమయంలో స్వామికనిపించగా ‘’రక్షించ౦డి ‘’అని వేడుకోగా భయపడవద్దని వెన్ను తట్టారట. వెంటనే మెలకువ వచ్చింది .మాణిక్యం ఇంటికి వచ్చి అరుగుమీద కూర్చుని ఉంటె  స్వామి అటుగా వెడుతూ ‘’యమదూతలు భయంకరంగా ఉన్నారా పట్టుకు పోతామన్నారా ?నిద్రపోవద్దుంటే విన్నావుకాదు  ‘’అనగా ‘’బుద్ధి వచ్చింది స్వామీ ‘’అని లెంపలేసుకొన్నాడు  .ఆరోజు రాత్రి 12వరకు భయంతో నిద్రపోలేదు ..అర్ధరాత్రయింది నిద్రపో ‘’అనిస్వామి అంటే ‘’నిద్రపోను ‘’అంటే ‘’స్వామి నవ్వుతూ’’ రోజూ నిద్రపోయేముందు నన్ను  తలచుకొని విభూతిపెట్టుకో.యముడు నీ జోలికి రాడు ‘’అనిచేప్పారు స్వామి .

చెంగల్వరాయుడికి గణపతిపై మహా భక్తీ .స్వామివద్ద రోజూ చాలాసేపు గడిపేవాడు .ఒకరోజు ఇలయనార్ గుడికి వెళ్ళిపడుకోగా కలలో పెద్ద ఏనుగు ,దానికి తాటిచెట్టంత తొండం ,ప్రక్కన ఒక స్త్రీ .’’కనిపిస్తే గణపతి స్వయ౦గా దర్శనమిచ్చాడని సంతోషించి ,కలలో ను౦చి మేల్కొన్నాక ఆనందం పట్టలేక ,నిద్రపోవటానికి మనస్కరించక కాలం గడిపి పొద్దున్నేలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్వామి వద్దకు వెళ్ళగా ‘’నువ్వు చూసిన ఏనుగు బ్రహ్మాడంగా ఉందికదూ .తొండం తాటి చెట్టంత .దాని ప్రభావం తెలుసా?’’అణో రణీయాన్ మహతో మహాన్తాన్ ‘’అనగా స్వామికి తనకల విషయం ఎలా తెలిసిందో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు .

  సబ్ రిజిస్త్రార్ సుందరేశం చెట్టియార్ కున్న ఇద్దరమ్మాయిలు జానకి ,పార్వతి లకు పెళ్ళికాలేదు  స్వామిని దర్శిస్తూ ఉండేవారు .ఒకరోజు జానకికి కలలో తానూ పార్వతీ శివగంగలో స్నానం చేస్తుంటే  స్వామి వచ్చి పార్వతిని గట్టుపైకి లాగారట .ఇద్దరూ కలిసి ఇంటికి వస్తుంటే దారిలో ఒకపెద్ద తొండ జానకిని తరిమింది .స్వామివచ్చి దాన్ని తోలేసి జానకి భయం పోగొట్టారట .తెల్లారాక జానకి తనకల ను పార్వతికి చెబితే ,ఇద్దరూ కలిసి స్వామిని చూడటానికి వెడితే ‘’శివగంగ తీర్ధం చాలాలోతుఅని జాగ్రత్త అని పార్వతిని మందలి౦చలేదా?దాన్ని పట్టుకొన్న యముడు తొండరూపం లో నిన్నుపట్టుకు పోవాలనుకొన్నాడు .ఫరవాలేదు ఇకమీదట భయం ఉండదు ‘’అన్నారు స్వామి .

  చిన్న గురుకులు  తల్లీ ,కళ్ళులేని అత్తగారు వృద్ధులే .తల్లికి జబ్బు రేపోమాపో అన్నట్లుగా ఉంది .తల్లిమీనమ్మ అత్తగారు సవర్ణా౦బ  బుజం పై వాలి ఉంటె మీనమ్మ హాయిగా చనిపోయింది .కళ్ళులేని సవర్ణ రెండుమూడుగంటలు ఆశవాన్ని అట్లాగే మోసింది .మీనమ్మ చనిపోయే సమయం లో స్వామి ‘’అదిగో మీనమ్మ స్వర్గానికి పోతోంది ‘’అన్నారు .ఈవార్త చిన్నగురుకులు విని ఇంటికి వెళ్ళగా అత్తగారిబుజం పై వాలి చనిపోయిన తల్లిని చూశాడు .

  తిరువన్నామలై దగ్గర ఊరిలో  విఠోబాస్వామి సిద్ధిపొందారు .స్వామి బజార్లోపోతూ ‘’అదో విఠోబాస్వామి పోతున్నాడే జోరుగా పోతున్నాడే ‘’అన్నారు .అప్పుడుకానీ ఆస్వామి చనిపోయినట్లు ఎవరికీ తెలీదు .తిరువన్నామలై లో ఎండలు ఎక్కువ వానలు తక్కువ నీటికి కరువు .ఒకసారి వర్షాభావం ఎక్కువైతే జనం స్వామికి బాధలు వివరించగా ‘’ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం వస్తుందిలే ‘’అన్నారు .పదినిముషాలలో  కుంభవృష్టి మూడు గంటలు దంచేసి బాధలన్నీ పోగొట్టింది .

  నారాయణస్వామి 1921లో తిరుచ్చి  ను౦ఛి తిరువన్నామలై వచ్చి శేషాద్రిస్వామిని దర్శింఛి కొంతకాలం అక్కడే ఉన్నాడు .ఒకరోజు భాగవతం చదువుతుంటే తటాలున స్వామి వచ్చి భాగవతం తెరిచి చూడకుండా ఫలానా శ్లోకం చదువు అన్నారు .అది దశమ స్కంధం పంచమాధ్యాయం లో ‘’నందస్యాత్మజ ఉత్పన్నే ‘’అనే సంప్రదాయంగా ఉపదేశించే మొదటి శ్లోకం .స్వామి తనకు ఉపదేశమిచ్చారని నారాయణస్వామి సంతోషించాడు .తెచ్చుకొన్న డబ్బు అయిపోగా ట్రిచి కి టికెట్ కు కూడాడబ్బులేదు  .ఏం చెయ్యాలో తోచక స్టేషన్ కు వెళ్ళాడు .అక్కడ పరిచయం లేని ఒకపెద్దమనిషి  విల్లిపురానికి టికెట్ కొనిచ్చాడు .అక్కడినుంచి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు .అంతాదిగిపోయారు స్వామీ ఇచ్చిన  కొబ్బరికాయ ,తనభాగవతం ఉంచిన స౦చీనిఎవరొ దొంగిలించారు .బాధపడుతూ ఊర్చున్నాడు .ఇంతలో రుద్రాక్షలు విభూతి ధరించిన గొప్ప వర్చస్సుతో ఉన్న సాధువు ,పెట్టెలో చాలా సీట్లు ఉన్నా శాస్త్రిపక్కనే వచ్చి కూర్చుని ‘’ఎందుకు దుఖిస్తావ్ .చిదంబర నటరాజును దర్శిస్తే ఎంతటి విచారమైనా పోతుంది ‘’అన్నాడు .తన సంగతిసాదువుతో చెప్పుకొన్నాడు ‘’అనుగ్రహం భాగవతం లో ఉందా కొబ్బరికాయలో ఉందా .అది కంటికి తెలీదు స్వామి అనుగ్రహం మీకు ఉంటె అది ఉండనే ఉంటుంది .ఎక్కడికీ పోదు ‘’అని తరవాత స్టేషన్ లో దిగిపోయాడు సాధువు .స్వామే వచ్చి ఓదార్చారు అనుకొన్నాడు .చిదంబరం లో దిగి నటరాజస్వామిని దర్శించి ఆతాండవ శివుని చూస్తూ మధురానుభూతిపొందాడు శాస్త్రి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

మరుగునపడిన మధురపదం’’ఎమ్మెలాడి’’కి మళ్ళీ ప్రాణం పోసి ,ఆమెనే తన  ఊహా ప్రేయసిగా భావించి అమలిన శృంగారాన్ని అద్భుతంగా చిలికించి ,భావకవిత్వ ప్రాభవాన్ని మరలా  చిగురి౦పజేసే కావ్య౦’’ ఎమ్మెలాడి’’రాసి కృష్ణశాస్త్రిగారు మళ్ళీ పుట్టారా అన్నంత అద్భుత రచన చేశారు వస్తుతం లెక్కల మేస్టారైన  శ్రీ  కాశీరాజు లక్ష్మీ నారాయణ కవి .ఇప్పటికే కాఫీ శతకం ,భవానీ శతకం ,   వెంకటేశ్వర శతకం ,,ముకుందమాల పద్యానునువాదం రాసి కలానికి పదును పెట్టిన ఈకవి తన బృందం’’ భద్రగిరి-ధ్రువ కోకిల ‘’బృందం వారి వలలో పడి భావసు౦దరి  ఎమ్మెలాడిని సృష్టించుకొని ,శక్తి ధారపోసి  రాశారు .ఎక్కడా సభ్యతా మర్యాదలు దాటకుండా .కృష్ణశాస్త్రి గారు తన ఊహా ప్రేయసికి ‘’ఊర్వశి’’నండూరి వారు ‘’ఎంకి’’ పేర్లు పెట్టుకొని ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలేశారు .ఈకవి పేరు పెట్టకుండా తన ఊహా  సుందరి ’ఎమ్మెలాడి బాహ్య అంతస్సౌ౦దర్యారాధన చేసి పులకించిపోయారు .ఆరసవాహినిలో మనల్నీ ముంచేశారు .కృష్ణశాస్త్రి గారు మరణిస్తే శ్రీశ్రీ ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అన్నాడు .నేను ఈ కవి ఈకావ్యం చూసి కృష్ణ శాస్త్రిగారు మళ్ళీ పుట్టారన్నాను.చక్కని తెలుగు ఛందస్సులో చివరమాత్రం వృత్తాలతో 336పద్యాలతో 6 శీర్షికలతో ఈకావ్యం అల్లారు భావకవిరాజు కాశిరాజు . ఈ కవితో నాకు అస్సలు పరిచయం లేదుకానీ ,ఆయన ముద్రించిన ప్రతిపుస్తకం నాకుపంపటం దానిపై నెట్ లో నాకు తోచినమాటలు రాయటం జరుగుతోంది .ఈపుస్తకం మార్చిలో విడుదలైంది బహుశా నాకు ఏప్రిల్ మే లలో పంపి ఉంటారు ఆవన్నెలాడి ఎందుదాగిందో కాని, నిన్ననే నా కంట బడింది .వదుల్తానా ?ఆబగా ఆమె సౌందర్యాన్ని  లావణ్యాన్నీ తళుకు బెళుకులను ,కటారు మిటారులను నిన్న సాయంత్రం పావుగంటలో జుర్రేశాను .ఆమెపై ఎలా ఏం రాయాలో ఆలోచించాను . శీర్షిక దొరక్కపోతే నా ‘’ఎలుక ‘’పరిగెత్తలేదు .ఇప్పుడే చిక్కింది .ఇక విజ్రు౦భిస్తున్నాను .మీరూ ఆస్వాదించండి .అన్నట్లు వ.పా.గారి బొమ్మేమో అనిపించే’’ కూచి’’ వారి కుంచె బొమ్మ ముఖ చిత్రం ’ఎమ్మెలాడి’’ సౌందర్యాన్ని మరింత ఇనుమడి౦పజేస్తే ,స్కాలిత్యం లేని ముద్రణ ఇంకొంచెం వన్నె తెచ్చింది .అరుదైన పదాలు కూడా అలవోకగా ప్రయోగించటమే,మనం బుర్ర గోక్కుండా అర్ధాలు కూడా అందజేశారు . కాక  మరో విషయం ’ఎమ్మెలాడి’’ వెలకూడా బహుతక్కువే అరవై రూపాయలే .కనుక అందరూ’’ స్వంతం ‘’ చేసుకోవచ్చు .

  ప్రభావం తో ప్రారంభించి ,ప్రన్ననం తో రెండోమెట్టు ఎక్కారు .’’భద్రగిరి ధ్రువకోకిల –భద్రక్ష్మా జాశ్రయ కవి పరభ్రుతములకున్  -రౌద్రారి శరః ప్రేరిత- క్షౌద్రము నందించ పనిచె కవితలు వ్రాయన్ ‘’తేనే అనటానికి క్షౌద్రం అనే మాట ఉందని   మనకు తెలీదు .’’రేత్రమ్మగు భావ సుందరి తలిర్చింది ‘’మదిలో .ఇక్కడ కూడారేత్రం అంటే అమృతం .కనిపించిన భావసుందరి –‘’పంచదార చిలుక ,పాలమీదితరగ-పుట్ట తేనే ఎడదపట్టు దేనె –నేరి జారిపడ్డ నింగి త్రోవరి బువ్వ-ఇంతి పూల బంతియే మ్మెలాడి’’ఆమె భ్రుకుటి బాపు బొమ్మలా ,ఇసుకవాలులో హీరా (పాము )నాట్యంలా శ్రోణిపై నటించు వేణితో ,నల్లత్రాచు పైపైకి పాకే శిరము నెక్కినట్లు  ,పడగమీద పూల బన్న సరంతో ,పుడమిలో ఎక్కడా లేని ముగ్ధ మోహన రూపం తో ,మల్లె కాయమానము అంటే మల్లెపందిరికి అల్లుకొన్న పూతీగగా ఉంది .కన్జరం లేదుకాని కన్జం(పొట్ట ) మాత్రం ఉంది  విరులసొగసు చూసి వి౦త కోరికపుట్టి –పలువిధ కుసుమాల కలిపి నూరి ముద్దగా నలువ చేసిన అ౦గన .తియ్యమాను అంటే చెరుకు దెబ్బ తీర్చింది నుడివిల్లునప్పెఅలరు తూపు నాసికము గా .విల్లునెక్కు బెట్టగావిరితెనేతో –ఇక్షురసం కారి ఆమె పెదవి రహి వహించింది  ఆమె లేత చెక్కిళ్ళు బంతులు –తాకితెఅవి తుమ్మపూలె అంటే ముడుచుకుపోతాయి .సిగ్గు మొగ్గలైన నుగ్గుల బుగ్గలామెవి .ఆమెను చూసి కవి మనసు సుడులు తిరిగింది .ఇలా ఆమె మనసులో కనిపించి కోర్కెలు రేపింది .

 ఆమె’’ ప్రాభవం’’ పై ఒక శీర్షికే పెట్టి రాశాడు కవి .  అడుగుల సవ్వడికి నేల నాట్య వేదిక  అవుతుంది .’’గ్రుడ్డుకాన్పులు’’ అంటే పక్షి సముదాయాలు గొంతులు సవరిస్తే ,భుజగభోగి అయిన నెమలి హృదయం పరవశించి నాట్యం చేస్తుంది .ఆమె క్రీగంట చూస్తె బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు –కాపురాలలో కలతలు రేగుతాయి .తెల్లటిముగ్గుమీద నల్లటి గొబ్బెమ్మలా కళ్ళల్లో నీలి గుళ్ళు ఆమె చూపు మంచుపలకమీద అర్కుని కిరణాలుపడి ప్రతిఫలించినట్లు గా ఉంటుంది .

  ‘’ఊర్పు పాటపాడి ఉర్రూత లూగింప –కంటి రెప్ప దరువు కలిసిరాగ –గాలి కెదుటికురులు గరువు (చెంప )పై నర్తించ – కమిలి కెంపు లమరె గండములకు (చెక్కిళ్ళకు )  .ఇదీ ఆమె సోయగ ప్రాభవం .మొగలిపొదను చుట్టి పరవశించిన ‘’పుట్టపురుగు ‘’అంటే నాగుపాము వదిలిపెట్టలేక –బ్రహ్మవరం పొంది దళపుష్ప వేణియై-బుసలుకొట్టి ఎలమినెసగ ద్రోచిందట .బంధుకమ్ము (తెల్లజిల్లెడు)పై వజ్రపు పొడి లాగా ,కైరవం (తెల్లకలువ )పై రక్త కందచాయ ,పైడిబొమ్మమీద భాస్కర ప్రియ(కెంపు )చాయ లను మించే ఆమె దేహ ఛాయ.’’రజని’’గారి సూర్య స్తుతిలోని భావ విన్యాసమంతా ఇక్కడ ప్రత్యక్షం చేశాడుకవి.ఇన్ని ఆకర్షణలు పుష్కలంగా ఉన్నా ఆమె కు ‘’చెడు తలంపు లేశమైన లేదు ‘’కానీ భీత చిత్తమాత్రం కాదు .ఆమె ‘’సీతమ్మకోరిన పైడి లేడిని మించే పైడి లేడి ‘’అనిఅర్ధం చేసుకొన్నాడు మనభావకవి కాశీరాజు .ఆమె సోయగం ఎలాంటిది అంటే –‘’నేలక్రున్గిపోవు ,నిప్పు నివురుగప్పు –గాలి ఆకసములు కలుషితాలు –నీరు ఆవిరౌతుంది –‘’నిజముగా చెడనిది ‘’ఎమ్మెలాడిసోయగమ్మొకండే’’అని ఢ౦కాబజాయించి సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు .

  తరువాత శీర్షిక ‘’ప్రణయం ‘’వంద పద్యాలతో సుదీర్ఘం గా సాగింది .కవికి ఒంటరిజీవితం సొంటికొమ్ము అనిపించి ,కారమెక్కువై ,మమకారం లేకపోవటం తో ‘’నిజము తెలిసి నంత నీరజాక్షి యెడల-మనసు కలిగె,కలగ మనసుకలిగె’’.తలుపు దాల్పుడు అంటే బ్రహ్మచారి అయిన తనకుఆమెను చూడగానే  బ్రహ్మ చర్యం వదలాలనిపించగా –మంచుకాలం  మండు వేసవి అయింది.తపసుడు అంటే చంద్రుడు తపనుడయ్యాడు(సూర్యుడు ) .ఆమెసొగసును ఎంతతాగినా –గుండె నిండకుండే గుండె కుండ ‘’.పైకి కనుపించని ఆమె రూపాన్ని మనసులోకన్నుల్లో  నింపుకొని చూస్తూ ‘’జుర్రుకొందు సొగబు-జుంటి తేనియలమోవి –చిమ్ము మధురసమ్ము స్వీకరింతు  ‘’  అని ప్రతిజ్ఞ చేశాడు.ఇక ఆమెతో సరససల్లాపాలు చెట్టపట్టాలు ,ఊసులు అన్నీ ఊహించుకొన్నాడు .చేయి చేయి పట్టుకొని చెట్టపట్టాలేసుకొని గోదారి కోటిపల్లి రేవులు లోతానాలు, కోనసీమ కొబ్బరితోటల్లో విహారాలు,పాపికొండల్లో జలవిహారాలు ,చేయాలనుకొన్నాడు .’’పూలయ౦దుదాగి మురిపించకే సఖీ –ఇంద్రధనువు తేరు నెక్కిరావే –ప్రోలు సంతలో ‘’పూసమిఠాయి ‘’నైవేద్యం (అముదు )పెడతానన్నాడు .మల్లెపూల పొదరిళ్ళ దాగి ఉండకుండా వస్తే ‘’ఆధరం ఆనివైద్యం చేస్తా ‘’అని పిలిచాడు .పికరవాలు చి౦త తోపులో చీకటి తప్పుకు పిలుస్తున్నాయి.జంటలన్నీ జాతర చేస్తున్నాయి రమ్మన్నాడు .అందరాని ద్రాక్ష ‘’ఆమ్లికం ‘’అంటే పులుపు .అందని నువ్వు ఆమ్రరసం మామిడిపండురసం అనిఊరించాడు .రాజమండ్రిలో రంగులరాట్నం ఎక్కిస్తాననీ ,కాకినాడలో కాజాలకంటే మధురమైన పూతరేకుల పోడుములతో పొంగారే ఆమె పొందు లో తరిస్తానన్నాడు .’’మిధున హంసలమయిమిన్నేటి ఝరిలో –మిసిమి నాళా లను మెసవుదాము .తీర్ధ స్నానం చేయటానికి వచ్చే దేవతా స్త్రీలకూ వలపు తలపులన్నీ పంచుదాం రమ్మన్నాడు .సూర్యలంక రేవు సొగసులు చూస్తూ పిడత  తకింద పప్పుతిని అరకులోయలో అలసిసొలసి మోవిమోవికలిపి ము౦త మసాలాల రుచి చూద్దాం .’’మనం తప్ప వేరే మానవులే లేని కొత్తలోకం లో విహరిద్దాం .తమప్రేమ జీడిపాకం లా వదలకుండా సాగాలి ‘’అనికోరాడు

  ‘’చి౦త పూల రెవిక ,చెంగావి చీరను కాసే పోసికట్టి కదిలే వాల్చూపులు రువ్వి గుండె ఝల్లుమనిపించాలన్నాడు .పెరిమి సంతలో పీచుమిఠాయి కాకి ఎంగిలి చేసి తింటుంటే పక్కవారు ఫక్కుననవ్వాలట. వంగతోటలో సరసాలాడాలి రారమ్మన  న్నాడు .ఇక్కడ ఈ జంట ఎంకీ -నాయుడు బావ అనిపిస్తారు .అందమంతా తెచ్చి అపరంజిలో ముంచి మెరుగులుపెట్టి తావి కలిపి సుగుణాలు  పొదివి సుందరమూర్తిని చేసి ‘’కరుణ  నింప మరచే  కమలభవుండు ‘’అని నిట్టూర్చాడు

  నిశ్చలమైన తన మనోనిగ్రహం ఆమె పొంకాన్ని  చూసి కట్టు తప్పింది  నిశ్చల కాసార నీరం లో ఆమె కన్నుల ప్రతిరూపులు ఈదినట్లనిపించింది .తమప్రేమ యుగాయుగాల ‘’ప్రణయ౦పు యోష’’ జగజగాల గాఢ చనువు తరతరాల విడిపోని తపన ‘’మనమనంముల సంబర౦బు మనది ‘’అని ఊర్వశీపురూరువుల ప్రమద్వారా రురుల సావిత్రీ సత్యవంతుల ,శకుంతలా దుష్యంతుల ,నలదమయంతుల అచ్చమైన స్వచ్చమైన ప్రేమ అనుకోవచ్చు మనం.’’మధుపముం జూడ విరికేలమదువుపొంగు –మొయిలు వర్షింప     ,ధరఎల పులకరిం’’చు –కలువరాయని గని ఏలకడలిపొంగుపొలతి ని౦ జూడ నాకేల వలపుకలుగు ?””అని కృష్ణ శాస్త్రిగారిలా ప్రేమపుట్టటానికి కారణం అక్కర్లేదని తేల్చారు కవి .ఆమె కళ్ళలో  మెరుపు మెరిస్తే తానూ ఆ మెరుపు అవుతాడు .ఆమె నోటి పలుకుల చిలక ఔతాడు. ఆమె కేశాల తమం అవుతాడు చివరికి ‘’కులుకు నయ్యెదనీ మధ్య నలిగి పోవ ‘’అంటాడు ఇదంతా భావకవుల ఉన్మత్త లక్షణాలే .ఆమె జడలో పువ్వులు ,ఆమెనడకలలో హంస అవుతూ ‘’పసిడి నయ్యెద నీమేని పస వెలంగ ‘’’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .ఆమెవేసిన మంత్రానికి  తనమనసు మరులపంటపండింది .గుప్త వాంచలు అనే   ‘’తావులు తనువెల్లా వ్యాప్తమయ్యాయి .’’అప్పు రెక్కల దాల్చి విహాయసమున –వచ్చి వాలి ‘’సుఖంగా నివాసం చేసి ‘’చూత కిసలయ మద్భావ శోభ మెసవి –కూత వెట్టుము వాసంత కోకిలవలె ‘’అని అర్ధించాడు .వలపు పల్లకీ ఎక్కి ఇలకు దిగే వేల్పు చానలా వచ్చి జీవితం పండి౦చ మన్నాడు .ఇదంతా దేవులపల్లి వారి ధోరణే .

  తరువాత ‘’విరహం ‘’ఆమెకోసం కారుమబ్బులలో ,మేఘం జార్చిన కన్నీటి బొట్టులో ,వెతికాడు .ఆకాశం గగనం శూన్యం అంతా వెతికి శూన్యం అయ్యాడు .కాలువల్లో ,కాసార గమకాల్లో ,నదుల్లో సెలయేటి రొదల్లో వాగుల్లో ,పన్నీటి పరుగుల్లో ఎక్కడుందో తెలియలేదు .ఆమె జాడ విరులలో విరితావి ఝరులలో ,తరువుల్లో ఔషధీ గిరులలో తరగల్లో సముద్రపు నురుగులో ‘’తెర వెరు౦గక వరలుతున్నాడు .చేలల్లో, భూమాత చేలం లో ,పులుల్లో రాచిలక పలుకుల్లో ,తేనెల్లో బంబరగానం లో ,’’పుష్పరాగంపు కెంజాయ బుగ్గల్లో –బుగ్గల్లో పూసే నునులేత సిగ్గుల్లో –పులకించిన నిగ్గుల మొగ్గల్లో వెలుగులో కూడా కనిపించలేదు .మంచు దుప్పటికప్పిన మడులలో ,చలి వెలుగుల సందె పందిర్లో ‘’ప్రియ పరిష్వంగ నిశ్వాస రేచకం లో కన్నుపొడుచుకొని  వెతికినా కానరాలేదు .శృంగార సంయోగ హేలల్లో మొహాబ్ది వీచికలలో ఎక్కడ దాగిందో తెలియలేదు .సూన సౌగంధికాలలో సోక్కిందో ,నీటు నిష్కపు సౌరుల్లో నిక్కిందో తెలియలేదు .ఆమె రూపు హృదయం లో చుక్కగా చెక్కిందేమో ?కూర్మి భావాలు మదినిండా కుక్కిందేమో –రాగ నఖాలతో గుండె రక్కిందేమో ‘’అర్ధం కాలేదు విరహం లో ఉన్న కవిగారికి .

  ఆమె కనిపిస్తే ‘’జోడు గువ్వలై పూల గూడుకట్టి అతను చూపుల మకరందం తాగుతూ ,తిండీ తిప్పలు లేకుండా ‘’ప్రేమ లోకాన చరియించుదాము ‘’అని ఆహ్వానించాడు .తాను జీవితం అనే చిన్న చెట్టు. దానిపై చిలక లాగా వాలే చెలువం ఆమె .’’మొలకనవ్వుల రైళ్ళు మోము తోడ –కొత్త కోర్కెల పూదండ కొప్పు నునిచి –నవ వసంత సుశోభిత నవకమంది –ఆగమి౦చుము నా జీవ నాగమముగా ‘’అని పిల్చాడు .విప్ర లంభం  లో పుట్టిన వేదనాగ్ని ని అశ్రుధారలు కొంచెమైనా అర్పలేకపోయాయి .ఆమె ఒక పూదేన నిర్ఝరం. తాను  ప్రేమ వేసంగీ దాహార్తి పీడితుడు .ఊహల్లో విహరించీ విహరించి వేసారిపోయి దెబ్బతిని ‘’పెదవి చిట్లిశోణితము  స్రవించింది .బుగ్గలు మ౦కెనపూలయ్యాయి .ఆమె దర్శనభాగ్యం తో ఆతడి దాహం తీర్తుంది అన్నాడు .అంతకుముందు ఏ స్త్రీనీ పరకాయించి ఇలా చూడలేదని సంజాయిషీ చెప్పుకొన్నాడు .ఆమె సొబగుల వలలో చేపలాగా చిక్కుకొన్నాడు  .తానూ అస్ఖలిత దృఢ చిత్తుడు. అస్ఖలిత బ్రహ్మ చారి కూడా .కనుక ప్రస్ఖలుతుడిని చేయవద్దన్నాడు .ఆ చిల్కలకొల్కి పలికితే మత్యాలు రాలిపోతాయా అనుకొన్నాడు .ఒబ్బిడిగా కనిఇంచి బెబ్బులి అయిన తనను పిల్లిలా చేసిందట –‘’నీవే ప్రేయసి ,ప్రేమము –నీవే నా చెలియ,చెలిమి నీవే మనమౌ –నీవే ప్రాణము మానము –నీవే నా సుఖము  బాధ నిజముగ సఖియా ‘’అని మొత్తుకున్నాడు.తలిరాకు  వంటి బతుకును వలల సుడిలో తిప్పి ,పోయింది ఎడబాటుకు విలపించాడు .చివరకు ‘’నెలతల నమ్మ౦గ. గలుగు నిట్టూరుపులే ‘’అనే ఎరుకకలిగింది భావకవికి .

  చివరి భాగం ‘’పర్యాప్తం ‘’లో ప్రేమకు అర్ధం ,పరమార్ధం ఏమిటి ప్రేమ ఎలాకలుగుతుంది .ఎక్కడకలిగి ఎలా విక సిస్తుంది?అని ప్రశ్నలు వేసుకొని ప్రేమ అనే తలపు రెక్కలతో ప్రేమాటవిలో చరించే విహగాలకు ప్రేమ అనే గాలి మేపరి అంటే పాము ప్రేముడితో కాటు వేసి విరహాన్ని నింపుతాడు అని హితవు చెప్పారు .మదిలో రేగిన ఊహలు గరుత్మ౦తమ్ము చందంగా గిరి ఏవో ఎదమీటగా ముదాన్ని గూర్చే ప్రేమభావాలు గుర్తుకొచ్చి ఈకావ్యం రాసినట్లు కవి చెప్పారు .

  మంచి భావనా ,ధారాళమైన పద గు౦ఫనా ,గంగాఝరి లాంటి ప్రవాహవేగం పవిత్రత తో పెనవేసిన గొప్పకవిత్వం ఈ కావ్యం లో కవి కాశీరాజు గుప్పించారు .త్వరలో వీరినుంచి గొప్ప ప్రబంధం వెలువడుతుందని ఆశిస్తూ ,ఈ కావ్యాన్నీ ఆయనకవిత్వాన్నీ అభినందిస్తున్నాను .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11

శ్యామా రావు తల్లి వృద్దు .అనారోగ్యం కూడా .ఒకసారి శేషాద్రి స్వామిని ‘అమ్మ  వెళ్లి పోతుందా  ?అని ఆదుర్దాగా అడిగితె ‘’తిరువన్నామలై కి టికెట్ తీశావు ఇదే తిరువన్నామలై ‘’అంటే అర్ధం కాలేదనగా స్వామి మౌనం వహించారు ఆసాయంత్రమే ఆమె చనిపోయింది .ఇప్పుడు అర్ధమైందా అన్నారట స్వామి .సుందరేశయ్యారు వెలగల రుద్రాక్షమాల ధరించి స్వామిని దర్శించి నమస్కరిస్తే ,’’ఈమాలను అమ్మితే నలుగురికి అన్నం పెట్టచ్చే’’అన్నారు ‘’ఇది అంత విలువై౦ది కాదు రెండుమూడు రూపాయలకంటే ఉండదు ‘అన్నాడు .ఆతర్వాతాయన తిరుచునాపల్లి వెళ్లి నదిలో స్నానం చేస్తుంటే మాల జారిపోయింది నీటిలో .దాసీ కన్నమ్మాల్ ను ఒకసారి స్వామి ‘’దొంగరాబోతున్నాడు దొంగతనం జరుగుతుంది జాగ్రత్త ‘’అని హెచ్చరించ గా ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా రెండువందల రూపాయల నగలు  పోయాయి .మంగుళూరు రఘునాధరావు రామభక్తుడు .ఒకసారి స్వామిని దర్శించటానికి వస్తే ,ఒకపెద్ద రాయి తీసుకొని వెంటపడగా ‘’ఇదేమిటి సేతు బంధనమా ,సముద్ర లంఘనమా ??’’అన్నాడు .రాయి దూరంగా పారేసి ఫోరాఫో కోతీ’’అన్నారు స్వామి .ఆ రోజునుంచి ఆయన్ను హనుమంతరావు మారుతి అనే పేర్లతో పిలిచేవారు .ఆయనకు హనుమపై భక్తిపెరిగింది .

  పోస్టాఫీసు గుమాస్తా రామారావు తమ్ముడు తిరుపతిలో సంస్కృతం చదువుతున్నాడు .ఒకసారి అతడిని స్వామి దగ్గరకు తీసుకు వెడితే ,’’వీడు ఆరు నెలలలో పోతాడు ‘’అన్నారు .అలాగే చనిపోయాడుపాపం .నటేశయ్యరు ను చూసి స్వామి ‘’నీకు నామాలున్నవాడు  పుడతాడు ‘’అన్నారు .కొన్ని నెలలకు నల్లటి రక్తం ప్రవహించే నాళ౦తో కొడుకుపుట్టాడు .వైదిక నిష్టాపరుడు రామశాస్త్రి రామభక్తుడు.స్వామి అతనికి ఒక కొడుకు పుడతాడని ,లలితను వదలక పారాయణ చేయి ‘’అని చెప్పారు  .అలాగే స్వామి జన్మ నక్షత్రం హస్తానక్షత్రం లో కొడుకుపుట్టగా శాస్త్రి శేషాద్రి పేరుపెట్టాడు .అప్పాచేట్టి అరుణాచలేశ్వరుని రధం చేయించి ,స్వామిని ఊరేగింపులో కలుసుకోమని కోరగా ‘’స్వామి దీని ఆయుర్దాయం తక్కువే లక్ష్మీ శాపం ఉంది స్వాహా అవుతుంది  ‘’అన్నారు .మూడేళ్ళ తర్వాత  పిడుగుపడి ఆ రధం కాలి పోయింది .కాలే రధాన్ని చూపించి ‘’చూడు రధం ఎలాకాలిపోతోందో లక్ష్మీ శాపం ‘’అన్నారట ,మెయ్యప్ప చెట్టి అరుణాచలేశ్వర ఆలయం లో ఎలెక్ట్రిక్ దీపాలు ఏర్పాటు చేయింఛి ప్రారంభించటానికి స్వామిని కోరితే ‘’ఫోఫో చక్రం తిరగదు ‘’అన్నారు .దిగులుతో గుడికి వెడితే చక్రం తిప్పలేక పనివాళ్ళు కష్టపడుతున్నారు స్వామి దయ లేకపోతె కుదరదని గ్రహించి వెళ్లి బతిమాలి రమ్మనగా వెళ్లి చక్రాన్ని తడిమి సాష్టాంగ పడగా వెంటనే పని చేయటం ప్రారంభించింది .నారాయణ శాస్త్రిగారితో స్వామి ఒకసారి ‘’ఏకేచాస్మిన్ కులే జాతా ‘’అనే శ్లోకం చదివి ‘’నువ్వు సంతకు వెళ్ళావా ?నూరు తమ్ముళ్ళు అక్కడా నూరు ఇక్కడా నూరు.ఈ దేశం లో వంద మ౦దిజనం అ౦తా కలిపితే ఎంత ? ‘’అన్నారు ఆయనకు అర్ధం కాలేదు .నాలుగు నెలలతర్వాత శాస్త్రిసోదరుడు  చని పోయాడు .నూరు తమ్ముళ్ళు అంటే ఆచనిపోయివాడు నీకు ఇష్టమైన తమ్ముడు అని భావం .సంతకు పోతావా అంటే చావుకు జనం బాగా వస్తారని .నూరు మాట చాలా సార్లు వాడటానికి అర్ధం ‘’లోకం లోని వారంతా సహోదరులే ‘’అని .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బెయిల్ ఇచ్చి బతికించండి

బెయిల్ ఇచ్చి బతికించండి’’

నాకు మీ హాస్పిటల్స్ వద్దు ,

మీ కోవిడ్ ట్రీట్ మెంటూ వద్దు

నా తోటిఆది వాసీలున్న చోటికి

నన్ను వెళ్ళనీయండి

బెయిల్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి చాలు

వారిమధ్య ప్రశాంతంగా కన్నుమూస్తాను ‘’

అని ప్రాధేయపడ్డ స్టాన్ స్వామి

పట్ల అందరూ నిర్దాక్షిణ్యంగా

ప్రవర్తించి’’ఉపా’’తో ఉరేశారు .

గిరిజన హక్కుల కార్యకర్త ,

బీమా కారేగావ్ కేసులో ఉపని౦దితుణ్ణి.

ఆమహా మనిషి రక్తం తో చేతులు

 కడుక్కున్నారు అగ్రనాయకుల౦తా

83ఏళ్ళ ఆది వాసీహక్కుల పరిరక్షుకుణ్ణి

ఒక అంతర్జాతీయ నేరస్తునిగా

కరడుగట్టిన ఉగ్రవాదిగా చూసిన

మనచట్టాలు పాముల చుట్టలై

భయభ్రాంతుల్ని చేసిన ఘోర

ఆమానుష సంఘటన కు

యావత్ సభ్యప్రపంచం

విస్తుపోయి ఏహ్యం గా చూస్తోంది .

స్టాన్ స్వామి పట్ల స్టాలిన్ లా

వ్యవహరించిన వారంతా దోషులే  

అయినా పట్టనట్టున్న

వారినేమనాలో తెలీటం లేదు

స్టాన్ స్వామి అమర్ రహే.

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-21-ఉయ్యూరు  

Posted in రాజకీయం | Tagged | Leave a comment

శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి మరణం

నా ప్రియ శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి  మరణం

ఇవాళ జులై 5 సోమవారం ఉదయం అన్నవరం లో స్వామి దర్శనం చేసుకొనిమా అబ్బాయి రమణ  నాకు ఫోన్ చేసి వేణుగోపాలరెడ్డి చనిపోయినట్లు తనకు సదాశివ ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పగా కొంత విచలితుడనయ్యాను.వెంటనే శివలక్ష్మికి మెసేజ్ పెట్టగా ఆమె ఫోన్లద్వారా తెలుసుకొని ఇవాళ ఉదయ౦ 5-30కు వేణు గోపాల్ పెదవోగిరాల స్వగృహం లో దాదాపు ఇరవై రోజులు కరోనాతో పోరాడి అలసి సొలసి జయించలేక చనిపోయినట్లు మెసేజ్ పెట్టి మళ్ళీ కన్ఫర్మ్ చేసి౦దికూడా  .అప్పటికే రెండు సార్లు వేణు నంబర్ కు ఫోన్ చేసినా ,ఎవరూ లిఫ్ట్ చేయలేదు .అజాత శత్రువు, చెరగని చిరునవ్వే ఆభరణంగా ఉండే వేణు కరోనా కర్కశ కోరలకు  బలి అవటం దారుణం ..  

  రెడ్డీ అనీ వేణు అనీ వేణుగోపాల్ అనీ నేను అతడిని ఆప్యాయంగా పిలిచేవాడిని అతడు ‘’మాస్టారూ ‘’అని అత్యంత వినయంగా పలికేవాడు ఈబంధం  ఏనాటి నుంచి ?అని ఒకసారి ఫ్లాష్ బాక్ లోకి వెడితే –నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నరోజులవి . సంవత్సరం గుర్తులేదు కానీ నైంత్ క్లాస్ ఎ సెక్షన్  క్లాస్ టీచర్ గా ఉన్నాను ఇంగ్లీష్ లెక్కలు చెప్పేవాడిని .మిగిలిన హయ్యర్ క్లాసులకు సైన్స్ అదీ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడినని జ్ఞాపకం .ఒకరోజు పోట్టిలాగు ఇన్ షర్ట్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని ఒక పోట్టి నల్లని కుర్రాడిని వెంటబెట్టుకొని ,తెల్ల మల్లుపంచే తెల్ల అర చేతుల చొక్కాపైన ఉత్తరీయం తో , మంచి మీసకట్టుతో సైకిల్ మీద ఒకాయన తీసుకొచ్చి ఆ కుర్రాడి తండ్రినని నాకు పరిచయం చేసుకొన్నాడు .బగా ఒత్తుగా నున్నగా దువ్విన జుట్టు ,చిరునవ్వు ,చిరునవ్వు  స్వంతం అయియన్ ఆకుర్రాడు  మొదటి చూపుతోనే నామనసు గెలిచేశాడు.బాగా చదివి మంచిమార్కులు తెచ్చుకొని చాలా హుందాగా ఉండేవాడు .బెస్ట్ స్టూడెంట్ అనిపించాడు. .వాళ్ళనాన్న నెలకో సారి స్కూలుకు  వచ్చి కుర్రాడి చదువు విశేషాలు నన్ను అడిగి తెలుసుకోనేవాడు .ఇదే జ్ఞాపకం ఆతర్వాత నేను అనేక స్కూళ్ళు మారటం ,అతడి గురించి మర్చేపోయాను .

  2009లో సరసభారతి స్థాపించినప్పుడు ,ప్రతినెలా కార్యక్రమాలు చేస్తూ ,కరపత్రాలు ఎక్కడ వేయించాలా అనుకొంటుంటే ,మా బజారులోనే వాటర్ టాంక్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఒక జిరాక్స్ మెషిన్ డిటిపి చేసే ఒకరిద్దరు అమ్మాయిలూ ,దాన్ని మేనేజ్ చేసే ఒక పాంటు ఇన్ షర్ట్ వేసుకొన్న ఒక కుర్రాడి ఆఫీస్ కనిపించి లోపలి వెడితే ఆకుర్రాడు ‘’మాస్టారు నేను వేణు గోపాలరెడ్డిని హైస్కూల్ లో మీశిష్యుడిని ‘’అని పరిచయం చేసుకొన్నాడు .అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. తెలుగు ఎం ఎ చేసి కొంతకాలం ఫ్లోరా స్కూల్ లో కొంతకాలం కాలేజిలో లెక్చరర్ గా పని చేసి అవేమీ అనుకూలించక ఈ దుకాణం పెట్టినట్లు చెప్పాడు .పామ్ఫ్లేట్స్ పావుఠావులో సగం ముక్కల్లో డిటిపి చేయించి అతనివద్దె జిరాక్స్  తీయించి 200కాపీలు యాభై రూపాయలకు  వేయిన్చేవాడిని .మొదటి సారి కార్యవర్గం వేసినప్పుడు అతడిని ఉపాధ్యక్షుడిగా ఉండమని కోరితే ‘’మీకంటే చిన్నవాడిని .నాకు ఎందుకు మాస్టారూ ‘’అన్న వినయం అతడిది .సరసభారతి పుస్తకాలు రెండో మూడో అతనిదగ్గరే డిటిపి చేయించి బెజవాడలో ప్రింట్ చేయి౦చాను  .నాకు ఎక్కడైనా  తప్పులు కనిపించకపోతే అతడే భూతద్దం లోచూసినట్లు చూసి తప్పులు పట్టేసి తప్పులు లేకుండా ముద్రణకు గొప్ప సాయం చేసేవాడు. అతడు చూస్తె నేను మళ్ళీ చూసేవాడిని కాను .అతనికి తెలిసిన సాహితీ మిత్రుల్ని గుంటూరునుంచి ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాము. సినీ గేయ రచయిత శ్రీ వనమాలీ ఇతనికి క్లాస్ మేట్ అని అయన్ను తీసుకు వద్దామని  అనేవాడు కానీ కుదరలేదు .సరసభారతిసమావేశాలన్నిటికీ హాజరయ్యేవాడు వేదికపై అతిధులను పరిచయం చేసే బాధ్యత అతని అప్పగిస్తే, చాలా సంతృప్తిగా నిర్వహించేవాడు .ఒక సారి సరసభారతి పురస్కారమూ అందించి సత్కరించాము .మరో సారి మేము అమెరికాలో ఉండగా రోటరీ క్లబ్ వారితో కలిసి చేసే తెలుగు భాషా దినోత్సవ౦ లో ఎవరికీ పురస్కారాలివ్వాలని మా అబ్బాయి రమణ మెయిల్ పెడితే వేణుకు,సారదిగారికి అని చెబితే అలానే చేశారు .సుమారు మూడు నాలుగేళ్లనాడు అమరవాణి స్కూల్  లో బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం నాడు  కవిసామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ అనే 92 ఏళ్ళ గుంటూరు జిల్లా కవిపండితుడు బహు గ్రంధకర్త కు సన్మానం చేస్తే ,ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి  వేణు గోపాల రెడ్డిని కూడా సత్కరి౦ చాము అమరవాణివారు శర్మగారికి పూలకిరీటం చేయించి పెడితే ,రెడ్డి మా దంపతులకు పుష్ప కిరీటం చేయించి శాలువాకప్పి సన్మానం  చేసి గురు భక్తీ చూపాడు .

కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన జాతీయ ,అంతర్జాతీయ తెలుగు రచయితల సభకు తప్పక రుసుము సరసభారతి ద్వారాతనకూ వనమాలిగారికీ ,మిత్రులకు  చెల్లించి అందరితోపాటు వచ్చేవాడు .సరసభారతి ఎజి అండ్ ఎస్ జి కాలేజిలో నిర్వహించే కార్యక్రమాలకు అతిని చెవిన వేస్తె చాలు ప్రిన్సిపాల్ స్టాఫ్ మొదలైన వారితో మాట్లాడి అన్నీ దగ్గరుండి చూసి విజయవంతం చేసేవాడు

  అయిదా రేళ్ళక్రితం అపర అన్నపూర్ణ  శ్రీ మతి డొక్కా సీతమ్మగారిపై మా శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి  దేవాలయం లో రెండు సభలు జరిపి ,అమెరికాలో ఉన్న ఆమె గారి మునిమనవడు గారబ్బాయి శ్రీ డొక్కా రాం గారు నెట్ ద్వారా తెలుసుకొని పది వేలరూపాయలు పంపిస్తే నాలుగు హైస్కూళ్లలో ఆమెపై వ్యాసరచన పోతీలునిర్వహించి ఆడబ్బును విజేతలకు పంచిపెట్టాం ఈ సభకు హైదరాబాద్ నుంచి రాం గారి తలి దండ్రులు కూడా వచ్చారు .ఆరోజు ముందురోజు జోరున వర్షాలు అయినా సభ జరిపాం .ఆరోజు వేణు తో ‘’పానుగంటి ‘’వారిపై మాట్లాడమంటే అద్భుత ప్రసంగం చేసి నాకే ఆశ్చర్యం కలిగించాడు .అతడు పానుగంటి వారిపై పిహెచ్ డి చేశాడుకూడా .

  వాళ్ళ స్వగ్రామం పేద వోగిరాల అభి వృద్ధిలో అతని పాత్ర గొప్పది. ఆగ్రామానికి చెందిన వివిధ రంగాలలో ఎక్కడెక్కడో స్థిరపడినవారిని గ్రామానికి తీసుకువచ్చి సత్కరించిన చిరస్మరణీయమైన కార్యక్రమ లో రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి మొదలైనవారి పాత్ర మరువలేనిది .అప్పుడు వచ్చిన ఒక జిల్లాజడ్జి రెడ్డిగారితో నాకు పరిచయమై చాలా సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోన్నాం .రెడ్డి తనకూతురు ఉన్నతవిద్యకోసం బెజవాడలో కాపురం పెట్టి మూడేళ్ళు ఉండి ,మళ్ళీ స్వగ్రామానికి వచ్చేసి ఇల్లు రిపేర్ చెయి౦చు కొనిఅక్కడే ఉండి ఉయ్యూరు జూనియర్ కాలేజీ లో తెలుగు లెక్చరర్  గా పనిచేస్తున్నాడు .కారుకొన్నాడు దానిమీదే బెఅవాడ వెళ్ళిరావటం .ఇప్పటిదాకా కాలేజికి దానిమేదే వచ్చేవాడు .శ్రీ కాకుళంలో కృష్ణ దేవరాయల మహోత్సవాలకు  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఉత్సవాలు జరిపితే నన్నూ  మిగిలినవారినీ కారులో తీసుకు వెళ్లి తీసుకోచ్చేవాడు .

  గురుపూజోత్సవం నాడు టెన్త్ పాసైన పేద ప్రజ్ఞావంతులైన బాలబాలికలఎంపిక లో  ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్ధుల ఎంపిక విషయం లో సరసభారతికి బాగా సహకరించేవాడు .అతడు లిస్టు పంపాడు అంటే బహు నిర్దుష్టంగా ఉండేది  అనుమానం లేకుండా ఆమోది౯ చేవాడిని .వేణు భార్య చాలా అణకువకలది భక్తురాలు .మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయానికి తరచూ పిల్ల, పిల్లాడితో వచ్చేది. నన్ను వాళ్లకు చూపించి ‘’నాన్నగారి గురువు గారు ‘’అని పరిచయం చేసేది .తానూ చేసి వారితో పాదాభి వందనం చేయి౦చేదోడ్డ ఇల్లాలు.రెడ్డీ అని ఫోన్ చేస్తే చాలు వెంటనే పలికి మాట్లాడేవాడు. లేకపోతె భార్య తాను  చేయిస్తానని చెప్పేది .ఇంతటి మర్యాద మన్ననా ఉన్న వివేకశీలి చి. వేణు గోపాలరెడ్డి మరణించటం బాదాకరం .అతని ఆత్మకు శాంతి , ఉన్నత గతులు కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ .అతని కుటుంబానికి సాను భూతి తెలియజేస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-21 –ఉయ్యూరు   

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10

ఒక పశువులకాపరి కొండ చరియలలో పశువులు మేపుతుంటే చిరుతపులిని చూసి పారిపోతుంటే రాతిపైనుంచి దూకగా  మోకాలికి దెబ్బతగిలితే దారిలో శేషాద్రి స్వామి కనిపించి ‘’పశువులను మేపేటప్పుడు జాగ్రత్త ఉండాలి .పులులు వస్తాయి .అయినా నిన్నేమీ చేయ్యవులే ‘’అన్నారు .తనకుమార్తెకు వివాహం చేసిజి. నరసి౦హయ్యరు  దంపతులకు శేషాద్రి స్వామి ఆశీస్సులకోసం బండీ లో తీసుకు వెడుతూ స్వామి తనకెదైనాఉపదెశ౦ చేస్తే బాగుంటుంది అనుకొన్నాడు .స్వామి వెంటనే అరుణాచలస్వామి సేవ చేస్తూ ఉండు ,ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణ చేయి ‘’అనగా ఆశ్చర్యపోయాడు .అర్ధనారి అనే ఆయన తన అరుగుపై స్వామి కూర్చుని ఉంటె ఫోటో తీసి పూజలో పెట్టుకొంటే బాగుంటుంది అనుకోగా ‘’నా ఫోటో వెంకటసుబ్బయ్య ఇంట్లో ఉంది .అడిగితె ఒక కాపీ ఇస్తాడు తెచ్చి పెట్టుకో’అన్నారు

  రామభద్ర శర్మ సోదరికి పొరుగూరులో ప్రసవసమయం అయింది వెళ్ళాలా వద్దా అని మధన పడుతుంటే స్వామి ‘’దిగులుపడకు ఈపాటికి ప్రసవం అయ్యే ఉంటుంది ‘’అన్నారు .ఆశ్చర్య సంతోషాలుకలిగాయి శర్మకి .తిరు వేంకటేశ మొదలియార్ మానసికంగా పంచాక్షరి చేస్తుంటే స్వామి ‘’ఇవాల్టి నుంచి పంచాక్షరి మానేసి రామనామ జపం చెయ్యి ‘’అని ఆదేశించారు .పోస్ట్ మాస్టర్ జనరల్ ఎఫ్.టి.పీటర్స్ బావ రైల్వే స్టేషన్ మాస్టర్ .ఒక పెద్ద స్టేషన్ లో ఒక గుజరాతీ వర్తకుడు రవాణా చేసిన సామాను పోయింది .స్టేషన్ మాస్టర్ అజాగ్రతే కారణమని కోర్టులో కేసువేశాడు .దానికి పది వేలరూపాయలు కట్టాలి .తన కాండక్ట్ సర్టిఫికెట్లు ఆయన దాఖలు చేశాడు .అవి మధ్యలో తప్పిపోయి కోర్టుకు చేరలేదు .దీనితో స్టేషన్ మాస్టర్ పై అనుమానం బలమైపోయింది .విషయం పీటర్స్ కు తెలిసి దిక్కు తోచక తననౌకర్నిపంపి కేసు ఏమైందో కనుక్కోమని పంపించి ,స్వామి దగ్గరకు వెళ్లి ‘’కేసు ఏమౌతు౦దిస్వామీ ‘’అని అడిగితె నవ్వుతూ స్వామి ‘’బస్ బస్ బస్ గప్ గప్ గప్ కూకూ ‘’అని ‘’ఎలాపోయిందో అలాగే దొరికింది ‘’అని వెళ్ళిపోయారు .ఈవిషయం పీటర్స్ కు టెలిగ్రాం ఇస్తే ,తప్పి పోయిన రికార్డులు అన్నీ దొరికి నట్లు పీటర్స్ కు టెలిగ్రాం వచ్చింది .కేసు కొట్టేశారు .

  జిల్లాజడ్జి సుందరేశ అయ్యర్ యుక్తవయసు వచ్చిన కూతురికి వరాన్వేషణ చేస్తున్నాడు .తిరుపత్తూరులో సీతారామయ్య అనే ధనవంతుడికి ఒక కొడుకున్నాడు .అతనికివ్వాలని అయ్యరు భావించి పెళ్ళిచూపులకు ఆహ్వానించగా వచ్చి చూసి పిల్ల పెద్దగా ఉందేమో అని అనుమానించి కొంత వాదులాడుకొన్నారు .ఇంతలో స్వామి అక్కడకు రాగా అందరూ నమస్కరించగా అయ్యరుతో ‘’మీ అమ్మాయిని వీరింటికి నిరభ్యంతరంగా పంపచ్చు ‘’అన్నారు .ఆమాటలుశిరో ధార్యంగా భావించాడు సీతారామయ్య ..

  ముత్తుసామి మొదలియార్ భార్య తాయమ్మ షష్టి వ్రతాలు చేసేది .ఒకరోజు ఇలిమనాక గుడికి పాలు పళ్ళు తీసుకు వెడుతుంటే స్వామి కనబడి ‘’నేనే సుబ్రహ్మ ణ్య స్వామిని నాకే ఇవ్వు’’ అని తీసుకొని పూలను నెత్తికి చుట్టుకొని పళ్ళను పిల్లలకు పంచారు .పాలుసగం తాగి మిగిలినవి ప్రసాదంగా ఇచ్చారు .కలియుగం లో సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్ష దైవంగా ప్రతీతి .ఆమె అదృష్టమే అదృష్టం .కాని అవి ఎంగిలిపాలు అని ఆమె తీసుకోటానికి ఇష్టపడలేదు .ఆపాత్రను వాడకుండా ఒక మూల ఉంచి౦దికూడా .మర్నాడు గుడికి వెడితే స్వామి ‘’పో గాడిదా నీకు మడి ఎక్కువకదా.పాలుపారబోసి పాత్రకూడా అవతల పెట్టేశావు చీచీ ఫో ఫో ‘’అన్నారు .ఆరునెలలదాకా ఆమెతో మాట్లాడలేదు .ఆతర్వాత ప్రసన్నులయ్యారు .

    స్వామి అతీంద్రియ శక్తులు

సుబ్రహ్మణ్య అయ్యరు బంధువు కొడుకు ఇల్లు వదిలి వెళ్ళగా వాడు తిరువన్నామలై వెళ్ళాడని కనిపిస్తే తనదగ్గరకు పంపమని అయ్యరుకు ఉత్తరం రాశాడు .వెతికి వాడినిపట్టుకుని అయ్యరు స్వామి దగ్గరకు తీసుకు వెళ్ళగా ‘’వీడి తండ్రి వీడిని వెంటనే పంపమని నీకు రాస్తే ,ఇంకా నీదగ్గరే వాణ్ని ఎందుకు ఉంచావు””అని అడిగితే అయ్యరు అవాక్కయ్యాడు .శ్రీమంతుడు శ్రీరంగం సుందరం పిళ్ళై ,పెళ్లికాగానే భార్యతో తిరువన్నామలై వచ్చి కొన్ని రోజులున్నాడు  ఆమె నగలపై ఆశపడ్డ నౌకరు దొంగిలించి ఇంటి వెనుక మురికి కాలువ కింద రహస్యంగా దాచాడు .ఏం చేయాలో తోచక  నౌకరుతో సహా పిళ్ళై స్వామిని దర్శించగా ‘’ ‘’దొంగవెధవా .సిగ్గులేదా మురుగుకాల్వ కిందపెట్టిన నగలన్నీ ఒక్కటికూడా వదిలి పెట్టకుండా తెచ్చివ్వు ‘’అన్నారు ఆదొంగ నౌకరుతో .పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకొని ఇచ్చేశారు .ఈ సంఘటన జరగటానికి ముందు వాడు ఎప్పుడుకనిపించినా ‘’చేతికి బంగారుమురుగులు వేళ్ళకు ఉంగరాలు పెట్టుకొంటావా “”అని అడిగేవారు వాడికి అర్ధంయ్యేదికాదు.

  తిరువన్నామలైదగ్గర గ్రామం శీలై పందిల్ లో ఉన్న జగదీశయ్యర్ ఇంటిపూజారి దీక్షితులు అంటే గురుభావం .కానీ దీక్షితులు  అయ్యరు ఇంట్లోని ఎనిమిది సవరుల నగ దొంగిలించి ,గ్రామ దేవత ఆవరణలో దాచాడు .ఇంట్లో అంతా నగకోసం వెదికికి నిరాశపడ్డారు .అయ్యరుఒకసారి గుర్రబ్బండీ లో తిరువన్నామలై  వచ్చి,తిరిగి వెడుతుంటే స్వామికనిపించి ‘’నేనుకూడా రావచ్చా “”అని అడిగితె మహద్భాగ్యం అని ఎక్కించు కాగా దారిలో అయ్యరు తనింట జరిగిన నగ దొంగతనం చెప్పగా’’అందుకే నేను వస్తున్నా ‘’అన్నారు .శీలై పందిల్  చేరగానే ‘’మీ ఇంట్లోనే దొంగ ఉన్నాడు  .నీకు కుక్క ఉందిగా .నేను వెడతా ‘’అనగా ఆరుమైళ్ళదూరం నడవలేరు అని ఎంత చెప్పినా వినక విసవిసా నడిచిస్వామి వెళ్ళిపోయారు .ఊరివారువచ్చి దీక్షితులవాలకం అనుమానంగా ఉంది అని అయ్యరుకు చెప్పగా ,దీక్షితుల్ని పిలిపించి తీవ్రంగా మందలించగా తప్పు ఒప్పుకొని నగ తెచ్చిచ్చి కాళ్ళమీద పడ్డాడు .

 అలమేలు ప్రసవించి ఖాయిలాగా ఉంటె స్వామి వచ్చి ఆమె మంచం ప్రక్క కూర్చుని ఆమె చెయ్యి తాకారు భయపడి కేకేసి౦దామె .ఆమె అన్న  నరసింహారావు వచ్చి స్వామిని దూషించాడు .స్వామి మారుమాట్లాడకుండా వెళ్ళిపోయారు .మర్నాడు ఎచ్చమ్మవచ్చి స్వామిని అలమేలుకు నయమౌతుందా అని అడిగితె ‘’ఆమె చనిపోయి౦దని అందరూ చెప్పుకొంటున్నారే ‘’అన్నారట ఆరోజు రాత్రే ఆమె చనిపోయింది .

 స్వామి శిష్యుడు ముత్తుస్వామి మొదలియారు దాయాది ఆయనపైదావా వేశాడు .స్వామికి నివేదిస్తే ‘’భయం లేదు వాడికి అనుకూలం కాదు ‘’అన్నారు .అన్నట్లే కేసు గెలిచాడు ముత్తుస్వామి .దాయాది హైకోర్ట్ కు వెళ్లగా స్వామికి చెబితే ‘’ఆ కేసు ఎప్పుడో తోసేశారయ్యా నీకేమీ భయం లేదు ‘’అన్నారు అక్కడా ఈయనదే జయం .శివ ప్రకాశమొదలియార్ ను చూసి ఇకరోజు స్వామి ‘’పెద్ద మంట అంటుకొన్నది ‘’అనగా ఆయనకు అర్ధం కాలేదు .మర్నాడు ఆయన కూతురు చనిపోయినట్లు వార్త వచ్చింది .పదిరోజులతర్వాత  వచ్చిన ఆయన్ను స్వామి ‘’ఏ వస్తువూ మన సొంతంఅనుకోటానికి వీల్లేదు ‘’అన్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9

చంగల్వ రాయుడు  వాత౦నొప్పుల తో బాధ పడుతు,నడవ లేకపోతుంటే ,స్వామి కాళ్ళను తడిమి తగ్గి పోతుంది అని అభయమివ్వగా తగ్గి పోయాయి .గ్రామ మునసబు కృష్ణ మూర్తి పదేళ్లుగా గజ్జితో బాధపడుతూ,స్వామిని దర్శించాలని వచ్చి హోటల్ లో కాఫీ   ఆర్డర్ ఇస్తే తెచ్చిటేబుల్ మీద పెడితే శేషాద్రిస్వామి అమాంతం వచ్చి నోట్లో పోసుకోగా  కృష్ణమూర్తికి కోపం వచ్చినా తమాయించుకొన్నాడు.’’వీడికి గజ్జి కదా కుంకుమపువ్వు పూస్తే పోతుంది’’అని వెళ్ళిపోయారు .ఆయనే స్వామి అని సర్వర్ చెప్పాడు .ఆయన గజ్జి దెబ్బతో తగ్గింది .

  సుబ్రహ్మణ్య అయ్యర్ మరదలుకు పిశాచం పట్టి పదేళ్ళుగా  బాధ పడుతుంటే ,అన్ని రకాలమందులు వాడి,తీర్ధ యాత్రలు చేసినా తగ్గలేదు పిల్లలూ పుట్టలేదు .స్వామి దగ్గరకు తీసుకు వెడితే , అయిదారు పసుపు కొమ్ములు తెమ్మని ,వాటిని తన ఛాతీకి రాసుకొని ,వాటిగంధం తీసి ఆమె ఒంటికి పూయమన్నారు .ఆపిల్ల ఆకలి ఆకలి అని పెద్ద గావు కేకపెట్టింది  .అన్నం పెట్టాక ఆమెస్మృతి లోకి వచ్చి ,ఆతర్వాత ఆరోగ్యవంతురాలై సంతాన వతి కూడా అయింది ..రమణ భక్తురాలు ఎచ్చమ్మ రోజూ ఆయనకు ఆహారం పంపేది .ఒకసారి నెలరోజులు జ్వరం వచ్చి పంపలేకపోయింది .స్వామి తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవారు ఒక నెలరోజులు స్వామి రాకపోతే ఆమె పెంపుడుకూతురు  చెల్లమ్మ స్వామి దగ్గరకువెళ్ళివిషయం చెప్పి అమ్మ మిమ్మల్ని ఒకసారి రమ్మనమని చెప్పింది  అంటే’’రేపు వస్తాను’’ అని, మర్నాడు ఉదయమే  ఆరింటికే ఆమె ఇంటికి వెళ్లి పడకగదిలో ఉన్న ఎచ్చమ్మతో ‘’పెరుగన్నం తింటావా ‘’అని చెల్లమ్మను పెరుగన్నం కలిపి తెమ్మని చెప్పి ఆమె తీసుకురాగా ,ఒక ముద్ద తాను  తిని మిగిలింది ప్రసాదంగా ఎచ్చమ్మకిచ్చారు .ఆక్షణం నుంచే ఆమె జబ్బు నయమవటం మొదలైంది .ఒకసారి ఆమె మనవడికి కాలు బెణికి ,ఆస్పత్రికి ఎత్తుకొని తీసుకు వెడుతుంటే ,స్వామి దార్లో కనిపించి రెండు చేతుల్తోమన్ను తీసి వాడి కాలిపై పోసి ,దానితో నుదుట బొట్టుపెట్టి ‘’ఆస్పత్రికి పోతున్నావా ఫోఫో ‘’అనగా ఆస్పత్రికి వెళ్ళగా డాక్టర్ వాడిని నడవమంటే ఏనోప్పీ లేకుండా హాయిగా నడిచి డాక్టర్ తో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించాడు .

  తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య బామ్మర్దికి  దేనిమీదా నమ్మకం లేదు .స్వామిపై భక్తీ గౌరవాలు అసలే లేవు .ఒక రోజు మధ్యాహ్నం అతనికి చేతిలో తెలుకుట్టింది .కుయ్యోమొర్రో అంటుంటే అటుగా వెడుతున్నస్వామి రాగా ‘’అందరూ మిమ్మల్ని స్వామి అంటారు నాబాధ పోగొట్టండి చూదాం ‘’అని చేతులు పట్టుకోగా ,ఎడమ చేత్తో మట్టి తీసి కుట్టిన చోట పోయ్యమనగా పోస్తూ మంత్రం చెప్పండి అనగా ‘’శేషాద్రి ‘’అని నాపేరు చెప్పు చాలు అనగా ,బాధ తగ్గి ఆతర్వాత స్వామిపై నమ్మకం కుదిరింది .

        స్వామి జ్ఞాన దృష్టి

నారాయణ శాస్త్రి గీతాపారాయణ చేస్తుంటే స్వామి వచ్చి ‘’గీతా పారాయణకు ఏకాగ్రత అవసరం ‘’అని చెప్పి వెళ్ళిపోయారు. తాను గీత చదువుతున్నట్లు ఆయనకేలా తెలిసిందో అని ఆశ్చర్యపడ్డాడు శాస్త్రి .ఒకసారి శాస్త్రి నాలుగుకానుల మల్లె పూలుకొని అరుణాచలేశ్వరునికి అమ్మవారికి రమణభగవాన్ కు అర్పించి మిగిలింది స్వామి కి ఇవ్వాలనుకొని వెతికితే స్వామికనిపించలేదు .ఆ ముగ్గురికే ఇచ్చేశాడు .సాయంత్రం స్వామి కనబడి ‘’కాలణా పూలు అయితే ఏం భక్తీ ముఖ్యం ‘’అన్నారు .

  విద్యాగంధంలేనితిరుప్పుగల్ స్వామి సుబ్రహ్మణ్య భక్తుడు .తిరుప్పుగల్ పాడేవారు .ఆయన తిరువన్నామలై రాగా స్వామి ‘’తిరుప్పుగలే మీకు మంత్రం ‘’అన్నారు .’’మీ పూర్వులలో కొందరు సన్యాసం తీసుకోన్నారటకదా ‘’అని అడిగితె ‘’శ్రాద్ధం పెట్టేటప్పుడు బ్రాహ్మీ మూర్తులైన అనే పదం వాడుతాము ‘’అని ఆయన చెప్పగా ‘’నువ్వూ వారిలాగా సన్యాసివి అయిపో ‘’అన్నారు .ఆయన వల్లిమలైలో స్థిరపడి బాగా ప్రసిద్ధి చెందారు .

  చిదంబరం లో సన్యాసం తీసుకొని చెంగల్వరాయుడు గురువుకోసం అన్వేషిస్తూ తిరువన్నామలై వచ్చి ,ఉపవాసం తో సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వచ్చి ప్రార్దిస్తుంటే ‘’నాయనా !మూడురోజులుగా నువ్వు భోజనం చేయలేదాఅని స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడి వద్దే ఉండిపో’’అన్నారు .స్వమిలోనే మురుగన్ ను చూసుకొంటూ ఉండిపోయాడు .

సన్యాసం తీసుకొన్న న్యాయవాది  చెంగల్వ రాయుడు .సుబ్బరామయ్య అనే పురోహితుని భార్య ఆత్మ హత్యా ప్రయత్నం లో ఉరిపోసుకొని చూరుకు వేలాడుతుంటే ,చుట్టుప్రక్కల వారికి తెలిసి కాపాడారు పోలీసులు ఆమెపై అభియోగం తేగా ఆమె పక్షాన  వాదించాడు .ఈ విషయాలన్నీ జ్ఞాపకం రాగా స్వామిదగ్గరకు వెళ్ళాడు ‘’ఒకమ్మాయి ఉరేసుకొందికాని ఫలించలేదు ఉరిలో తగుల్కొన్నాక ఉరి అంటే ఏమిటో తెలిసి కేకలువేస్తే జనమూ పోలీసులూ రారా ?ఈవిషయం రాయుడిని అడగండి చెబుతాడు ‘’అన్నారు స్వామి తాను  మనసులో అనుకొన్నది స్వామి గ్రహించారు అని తెలుసుకోగలిగాడు రాయుడు .చెంగల్వ చిన్నతనం లో పేరు అబ్బాయి రాయుడిని చూడగానే ‘’నీది వాలాజిపేట .నీ పేరు అబ్బాయి కదూ ‘’అనగానే మరింత ఆశ్చర్యపోయాడు .

  రాజు శాస్త్రి శిష్యులకు  మాఘుని శిశుపాలవధ కావ్యం బోధిస్తుంటే ‘’కాయమానము ‘’అనే పదం వచ్చి దాని అర్ధం చటుక్కున స్పురించలేదు దాని అర్ధం గుడారం డేరా ,శిబిరం .స్వామి అటుగా వెడుతుంటే శాస్త్రిగారు ‘’గుడారానికి పర్యాయపదం ఉంటె చెప్పండి ‘’అని అడిగితె ఠక్కున ‘’కాయమానము ‘’అని  చెప్పి వెళ్ళిపోయారు తాను అనుకోన్నపదమే స్వామి చెప్పటం ఆశ్చర్యమేసింది .

  పెరుమాళ్ళు స్వామి ఒక రోజుములైపాల్ తీర్ధ గట్టు లో  స్నానం చేసి విభూతి సంచీ డబ్బు అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చాడు.దారిలో స్వామికనిపిస్తే ‘’అంగడిలో భక్ష్యాలు కొనిస్తా రండి స్వామీ ‘’అనగా ‘’నీ దగ్గర డబ్బు ఎక్కడిది. మలై తీర్ధం పో ‘’అనగా తాను అక్కడ సంచీ మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చింది .

   సేలం వాస్తవ్యుడు,వకీలు  సుబ్రహ్మణ్య మొదలియార్ బంధువులతో స్వామి దర్శనానికి రాగా ఆయన కనపడకపోతే ,నిరాశతో కంచికి వెళ్లి ,మళ్ళీ వచ్చేటప్పుడు స్వామిని చూద్దాములే అనుకోని కారెక్కి కంచి వెళ్ళే సంబరం లో ఉంటె ,స్వామి వచ్చి ‘’ఈకారు కంచికి పోతుందా ‘’అని అడుగగా ,మొదలియారు బృందం  కారుదిగి అమాంతం స్వామిపాదాలపై పడి నమస్కరించారు

  టికె సుందరేశమయ్యరు చిన్నతనం లో ఏడోక్లాసుచదువుతూ అరుగుమీద కూర్చుని లెక్కలు చేసుకొంటుంటే స్వామి ఏమి చేస్తున్నావని అడిగితెఅవి లెక్కలు మీకు తెలీదులెండి అన్నాడు .స్వామి ‘’అలాగా జవాబులు చెబుతా రాసుకో ‘’అని అన్ని లెక్కలకు సరైన జవాబులు చెబితే ,వాడు పుస్తకం చివర ఉన్న జవాబులతో సరి చూసుకొని కరెక్టే అని చెప్పాడు ఇలాస్వామికి లెక్కల పరీక్ష పెట్టాడాబాలుడు.ఈ సుందరశమే పెరిగిపెద్దవాడై  ‘’వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టమౌతోంది ఎవరైనా అవతార పురుషుడు వచ్చి ఉద్ధరించాలి ‘’అని తపన పడ్డాడు .స్వామి గుడికి వెడుతుంటే దారిలో కనిపించగా ‘’నీ సందేహాలు నన్నడిగితే నేను చెబుతా .నువ్వు అనుకొనే సమిష్టికర్మ అంటే యజ్ఞం .అవతార పురుషుడు పుట్టటానికి ఇంకా చాలాకాలం ఉంది ‘’అన్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తేటగీతి వీరభద్రేశ్వర శతకం

తేటగీతి వీరభద్రేశ్వర శతకం
పగోజి కొప్పర్రు పద్య శతకకవి ,కడిమెళ్ళ వారి పుష్కల ఆశీస్సులున్న మధురకవి ,పండితుడు ,సరసభారతికి ఆప్తుడు ,మిత్రుడు శ్రీ మంకు శ్రీను తాజాగా ‘’రాసిన వీర భద్ర శతకాన్నే నేను ‘’తేట గీతి వీరభద్ర శతకం’’ అన్నాను అంతే .శివ కుటుంబం లోని వారిపై ఇప్పటికే రామలింగేశ్వర శతకం , రాజరాజేశ్వరిత్రిశతి వినాయక ,మయూరశతకాలు రాసేసి ఇప్పుడీ శతకం రాశారు .వీరభద్రోత్పత్తి ,దక్షయయజ్ఞ ధ్వంసం ,.పార్వతీ కల్యాణం ,కిరాతార్జునీయం శివభక్తుల చరిత్రల తో అల్లిన శతకం కనుక నేను పెట్టిన పేరు అతుకుతుంది .
వీరభద్రుని రౌద్ర భీభత్స భయానక హింసరచన ధ్వంస రచన ఇందులో బాగానే వర్ణించాడు కవి .‘’వీర భద్ర భీభత్స సంహార శీలి –వగు భవన్మహత్వము కొనియాడ దలచి –సంతరించితి నీ పైని శతకమొకటి ‘’అని వినయంగా చెప్పుకొన్నాడు .శతక మకుటం ‘’విశ్వ కళ్యాణ నిర్నిద్ర వీరభద్ర ‘’.ఉమా దేవి ‘’హిమగిరి వాసు ,సుందరాంగు –అహి విభూషణాది మధ్యంత రహితు –అభవు చిన్మయు నవ్యక్తుడైన శివుని ‘’చూసింది .అతనికి ‘’గాలి మేతరులెహారాలు’’. మంచి మాట .’’సిరిని కాదని శివుని మైసిరిని ,ఆయన విభూతినే ‘’కోరింది.ఆమె ‘’కాల కంధర సతి ,సుగుణాలవల్లి .
‘’మరుని విరితూపులకు విరామమ్ము లేదు-హరుని చిలిపి చైదములకు నడ్డు లేదు –ఉమ సరాగ సంపత్తికి నుపమ లేదు ‘’అలా సాగింది వ్యవహారం .ని౦ డుజాబిల్లి నేస్తం పండు వెన్నెల బంధువు ,ప్రణయ సంస్పర్శ వారికి బంధమయింది .ఉమా కల్యాణం అయింది .అల్లుడు అంటే మామ దక్షుడికి చులకన .అందుకే ‘’అజ్ఞుడౌ దక్షునకు శివుడు అల్లుడయ్యాడు’’ అన్నాడు కవి .యజ్ఞ స్వామిశివుని పిలవకుండా మామ యజ్ఞం ప్రారంభించాడు .’’తావిలేని పూవు ,శశిలేని రాత్రి లా ఆ యాగం ఉందట .కూతురికీ ఆహ్వానం లేదు .కానీ ఆగలేక పిలవని పేరంటానికి విభుడు వద్దన్నా వెళ్లి అవమానం పాలై ‘’దక్ష పుత్రి సతీ దేవి తనువు వీడింది ‘’.వార్త తెలిసిన’’ ఉగ్రుడుగ్రుడై తాండవం’’చేశాడు .ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు –
‘’అది ప్రళయ కాల భీభత్సమది ,మహోగ్ర –నృత్య కేళీవిలాస వేణీకలాప –మదిప్రియ సతీ వియోగ ధర్మాగ్రహంబు ‘’గా భయం పుట్టిస్తోంది .కరుణ శ్రీ తన విజయశ్రీ కావ్యం లో ‘’అది యొక వీర భారత కులాంగన కంటి కవోష్ణ బాష్పబిం –దువులు ధరిత్రిపై గురియు దుర్భర దుస్సహ దుర్దినమ్ముల-య్యవి పది మందిలో ఒక మహా సతి పైట చెరంగు పట్టి ధ –ర్మువు దిగద్రావి రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తముల్ ‘’ అనే పద్యం ఎందుకో నాకకు ఈ సందర్భంగా స్పురించింది .అది పాంచాలీ సతి పరాభవం .చివరికి కౌరవ హననానికి దారి తీస్తే ,ఇక్కడ శివుని సతి పొందిన అవమానం దక్ష వినాశనానికి దారి తీసింది .
లయకాలుడుశివ జటాజూటం నుంచి దక్షాధ్వర హంస రచనకు వీరభద్రుడు ఉద్భవించాడు .నీలదేహం వెయ్యి చేతులు,కపాలమాల దుర్నిరీక్షణ౦గా భీకరాకృతి తో భార్య భద్రకాళి తో కాలభైరవాదులతో శివాజ్ఞతో బయల్దేరిరాగా దిక్పతులు దిక్కులేక తలవంచారు .దక్షుని తలతె౦చేశాడు .విధ్వంస రచన పూర్తి చేయగా –
‘’గళములో సర్పమాడంగ ‘’కదిలి శివుడు వచ్చి’’సతిని ఎత్తుకొని జగాలు సంచలింప ‘’తాండవం చేసే ముక్కంటిని చూడటానికి ముక్కోటి దేవతలకు తరం కాలేదు .చక్రి వచ్చి చక్రం తోఆమే దేహాన్ని ఖండించగా అవి పడిన చోట్ల శక్తి క్షేత్రాలేర్పడ్డాయి .తనకు అప్పగించిన పని’’’’పట్టిస’’ ఆయుధం తో పూర్తీ చేసి వైరి కంఠ విలు౦ఠ న౦ చేశాడు .
తరువాత సతీదేవి పార్వతీ దేవిగా పుట్టటం శివుడి తపస్సు కు సాయం చేయటానికి తండ్రి హిమవంతుడు ఆమెను నియోగించటం .భావజును పూవు టమ్ములు భవునిపై ప్రయోగించగా మూడోకంటికి భస్మమవటం .పార్వతి శివుని భర్తగా పొందటానికి తీవ్ర శివ తపస్సు చేయటం ‘’ఆకులైనా తినకుండా అపర్ణ గా ఉండటం ,శివ పరీక్షకు ఆమె నిలబడటం శివ పార్వతీ కల్యాణం జరగటం ,వారిద్దరి శృంగారం కుమారస్వామి జననం ,అతడి తారకాసుర సంహారం మొదలైన విషయాలన్నీ రాసి,శాంభరీ భిల్ల, అర్జున పోరాటం పాశుపతాస్త్రం పశుపతి పార్దునికివ్వటం ,శివ భక్తులైన చిరుతొండనంబి, భక్త శిరియాళ తిరువెంగానాంచి మొదలైన కధలు వర్ణించి శివుని హాలాహాల భక్షణం ,శ్రీకాళహస్తి మహాత్మ్యం ,మార్కండేయుని కావటం మొదలైనవన్నీ పద్య తోరణంగా చెప్పారు కవి .తర్వాత నేటి సామాజిక సమస్యలు ఏకరువుపెట్టారు .
దొంగ రాముడు సినిమాలో ‘’వీరభద్రయ్య ‘’ను అంటూ మీసాలు మెలేసే రేలంగి దొంగలు పడ్డాక మీసాలు దించి ‘’వట్టి బద్రయ్య ‘’ నే అనటం గుర్తుండే ఉంటుంది .ఆంద్ర దేశం లో పోలవరం దగ్గర పట్టిస గ్రామం లో దక్ష సంహారం చేసిన వీరభద్రస్వామి అక్కడి గోదావరి నీటిలో తన ఆయుధం పట్టిసను కడిగి రక్తపు మరకలు కడిగేశాడనే ఐతిహ్యం ,.అందుకే ఆగ్రామం పట్టిస ఆ సీమ పట్టి సీమ అయి ఇవాళ కృష్ణా డెల్టాకు ఎత్తిపోతల ద్వారాతాగు సాగు నీరు లభిస్తున్నాయి .లేకపోతె కృష్ణా జిల్లా ఎడారి అయ్యేది .ఇదికూడా రాస్తే భేషుగ్గా ఉండేది అక్కడే గోదావరి మధ్యలో చిన్న కొండపై శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ౦ ఉందనీ కవి గారు మర్చిపోయినట్లున్నారు .ఆస్వామి తిరునాళ్ళు కూడా మహోత్స వంగా జరుపుతారు .ఇవి రాయకపోవటం లోపం అనను, అనలేనుకానీ పరిపూర్ణం కాదని చెప్పగలను .అందుకే దీన్ని వీరభద్రేశ్వర శతకం అన్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8

తిరువన్నామలై తాలూకా బోర్డ్ ఆఫీస్ గుమాస్తా టివి సుబ్రహ్మణ్య అయ్యర్ దైవభక్తి పరాయణుడు నిత్యం గాయత్రి జపం చేస్తాడు .శేషాద్రి స్వామిపై పరమ భక్తీ స్వామికీ ఆయనపై అమిత వాత్సల్యం . తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ ఇంటి వాకిలి అరుగుపై కూర్చుని అయ్యరు లెక్కలు చూస్తుంతాడు. ఆయనకు కాశీ వెళ్లాలని ఉండేది .ప్రెసిడెంట్ సెలవు ఇచ్చేవాడు కాదు .బోర్డు డబ్బు నొక్కేసి సెలవు అడుగుతున్నాడనే అనుమానం కూడా .ఒకరోజు స్వామి అటుగా వస్తూ ప్రెసిడెంట్ కు వినబదేట్లు ‘’ఒరేయ్ అరుగు మీద కూర్చున్నవాడు సాధు బ్రాహ్మణుడు

వాడికి అపకారం తలబెడితే నీ ఇంట్లో పీనుగు లేస్తుంది ‘’అని వెళ్ళిపోయారు .ఆమాటలు విన్న ప్రెసిడెంట్ వణికి పోయి ఏడు రోజులు జ్వరం తో మంచం పట్టాడు .ఒకరోజు స్వామి అయ్యరు తో ‘’వీడు నీకు ఏ ఉపకారం చెయ్యడు .కొత్త ఉద్యోగం వెతుక్కో .నీకు అపకారం చేస్తే వాడింట్లో శవం లేస్తుంది ‘’అని వెళ్ళిపోయారు .కొన్ని రోజులకు అయ్యరు తిరుచినాపల్లి లో ఉద్యోగం లో స్థిరపడ్డాడు .

  తిరువన్నామలై విద్వాంసుడు భానుకవి ‘’యోగం- యోగి ‘’అనే విషయం పై మాట్లాడాలనుకొన్నారు ఆయనకు ముందు ఇద్దరు మాట్లాడాలి .ఆ సభకు అధ్యక్షుడు చిదంబరం లోని మహామహోపాధ్యాయ దండ పాణి దీక్షితులు .ఆయన భానుకవి గురించి ప్రక్కవారితో ‘ఈయనెవరో యోగం యోగి పై మాట్లాడతాట్ట ఒక్కటి చాలదా ‘’అని గుసగుస లాడాడు .ఈ మాటలు విన్న భానుకవి ధైర్యం కోల్పోయి లేచి నిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడే కానీ మాట రావటం లేదు .ఆయన పస అలాంటిది అనుకొన్నారు శ్రోతలు ఇంతలో స్వామి అక్కడికి వచ్చారు .హమ్మయ్య అనుకోని మనసులోనే స్వామి పాదాలకు నమస్కరించి ప్రసంగం ప్రారంభించి అమోఘం గా న భూతో గా మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరచాడు. ఆ విజయాన్ని స్వామికి అర్పిస్తున్నట్లు పాదాభి వందనం చేశాడు కవి .

  పరశురామయ్యర్ కూతురు ప్రసవ వేదన పడుతోందని ,దక్కెట్లు లేదనీ చివరి చూపులు చూడటానికి రమ్మని  టెలిగ్రాం వస్తే  ఆందోళన తో  దాన్ని పట్టుకొని ఇలయనార్ కోవెలలో ఉన్న స్వామి సన్నిధికి చేరగా ‘’ఫోఫో భయం లేదు మీ ఆవిడను ఏడవవద్దని చెప్పు’’అనగా మనసు కుదుటబడింది అయ్యరుకు .రెండు రోజులత ర్వాత అమ్మాయి కులాసా కబురు తెలిసింది ..

  కాంట్రాక్టర్ కృష్ణస్వామికి తిరుక్కోవిలూరులో కాంట్రాక్ట్ పని .మధురాంతకం వెళ్లి ఏదైనా పనిలో చేరాలని ఉండి,స్వామిని అడిగితె ,’’అంత దూరం అక్కర్లేదు ఇక్కడే పని చూసుకో ‘’అన్నారు .కానీ ఆ మాటలు వినక రెండుమూడు చోట్లకు తిరిగి కుదరక మళ్ళీ వచ్చేశాడు ‘’స్వానుభవం అయితే కాని తృప్తి ఉండదు ‘’అన్నారట స్వామి .ఒకసారి కాంట్రాక్ట్ విషయం లో యేవో తప్పులు చూపి అతడిని దెబ్బతీయాలని ఉద్యోగులు భావిస్తే ,అతడు వీధిలోను౦చి పోతుంటే ‘’ఫోరా ఫో .ఆగకుండా పో ‘’అన్నారు .సరైన సమయం లో వెళ్లి అధికారుల ప్రశ్నలకు సంతృప్తిగా సమాధానాలు చెప్పి కాంట్రాక్ట్ కాపాడుకొన్నాడు .

  స్వామికి దగ్గర బంధువు కృష్ణస్వామి శాస్త్రులు మురుగన్ భక్తుడు ఒకసారి స్వామి దర్శనానికి వెడితే ఒళ్ళంతా విభూతిపూసి ముఖాన కుంకం పెట్టి ‘’కాశీ రామేశ్వర యాత్రలు చేసిరా ‘’అన్నారు .చేతిలో డబ్బు లేదని అంటే ‘’అన్నీ సమకూర్తాయిలే వెళ్ళు ‘’అన్నారు .ఇంటికి వెడుతూ దారిలో తెలిసినవాడికి చెబితే యాత్ర ఖర్చు అంతా తానే భరిస్తానని వందరూపాయలు చేతిలో పెట్టాడు .భార్యతో కలిసి యాత్ర పూర్తీ చేసి వచ్చిస్వామిని దర్శించగా ‘’నీకు ఇక అంతా మంచే జరుగుతుంది సంతానం , ధన ప్రాప్తి కలుగుతుంది ‘’అన్నారు .పిల్లలూ పుట్టారు ,కొన్న లాటరీ టికెట్ కు డబ్బూ బాగా వచ్చింది .

  ఒకరోజు స్వామి వీధిలో నడుస్తూ దారిలో ఉన్న రెండు రాళ్ళను తీసి రోడ్డు ప్రక్కపడేస్తే ,ఒక కుర్రాడు ఒక రాయి తీయగా స్వామి  వాడి చెంప  చెళ్ళు మనిపిస్తేవాడు ‘’స్వామీ ఈ ఏడు నేను పాసవుతానా ?’’అని అడిగితె నవ్వి తప్పకుండా అన్నారట .వాడు చదువులో మొండి అన్నిట్లో సున్నామార్కులే .కానీ వాడి ఆర్ధిక స్థితి చూసి పరీక్షాదికారులు ప్రమోట్ చేశారు .

  ఒక సారి స్వామి వేప చెట్టు కింద ఉండగా సూర్యనారాయణ అయ్యరు ‘’మిమ్మల్ని మహనీయులు అంటారు .మీ మహిమ నాకు చూపించండిస్వామీ ‘’అని అడిగితె  కిందరాలిన వేపాకు రేమ్మను తీసి తినమన్నారు .దాన్ని నమిల్తే మహా తియ్యగా ఉందట .ఇలా స్వామి మహిమలు కోకొల్లలు .

  స్వామి వైద్యమహిమలు

 తాండ్ర గ్రామం లో కృష్ణస్వామి భార్యకు పాండురోగం .ఒళ్ళంతా వాచీ , వాంతులలో  పురుగులు పడేవి .ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేక గుర్రబ్బండీ లో స్వామి దగ్గరకు తీసుకు వెళ్ళగా ‘’చూద్దాం ‘’అని బండీ ఎక్కి  ఆమె కాళ్ళు పొట్ట గొంతు నొక్కుతూ .ముందుకు జరిగి ,సత్రం వరకు తానె బండీ తోలి ,గబుక్కున దూకి రెండు దోసిళ్ళ మన్ను బండిలోకి విసిరి ,పిడికెడు మన్ను ఆమె నోట్లో పోశారు .మరో రెండు పిడికిళ్ల మన్ను ఇచ్చి మూడురోజులు వరుసగా ఒంటికి పూసుకొమ్మన్నారు .నాల్గవరోజు ఆమె మామూలు మనిషి అయింది .

  తిరువన్నామలై క్రిమినల్ ప్లీడర్  చ౦గల్వరాయుడు కొంతకాలానికి సన్యాసం తీసుకొన్నాడు ఆయన స్నేహితుడు శివ చిదంబరం పిళ్ళై కూతురికి టైఫాయిడ్ .వైద్యులు పెదవి విరిస్తే రాయుడికి చెప్పుకోగా ,ఇద్దరూకలిసి గుడిలో ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళగా ‘’నాకు చెబితే లాభం లేదు ఆ విగ్రహానికి విన్నవించుకో ‘’అనగా రాయుడు ద్రావిడ భాషలోని వెంబా వృత్తం లో పద్యాలు మూడుసార్లు పఠించి,హారతి ఇచ్చి స్వామి దగ్గరకు రాగా ‘’పోపో సాయంత్రం లోపు నయమౌతుంది ‘’అనగా ,ఆసాయంత్రమే ఆమెకు సన్నిపాతం తగ్గిపోయింది .

  పిళ్ళై రెండవ కూతురికి వాంతులు విపరీతంగా అవుతుంటే స్వామి దగ్గరకు వస్తే ఉసిరికాయ మిరపకాయ కలిపి వాడితే తగ్గుతు౦దనగా  మూడేళ్ళ పసిపాపకు ఇదెలా సాధ్యం అని అడిగితె భస్మం చేసి ఇమ్మంటే ,ఇస్తే వెంటనే తగ్గిపోయింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 వింత వీజీవా ?

 వింత వీజీవా ?

అంటే అర్ధం కాలేదా ఇంత ఈజీయా? అని. చరణదాసి సినిమాలో రామారావు ఫోటో చూసి ‘’ఇది డాక్టర్ గారి ఫోటోవా ‘’?అని అడుగుతుంది సావిత్రి .ఒక సారి గేపకం చేసుకోండి .అక్కడినుంచి సరఫరా అయిన ‘’వా ‘’ ఇది . ఇది శీర్షికమాత్రమే .

‘’తాతయ్యా !నీ అకౌంట్ నుంచి అయిదువందలకోట్లు డికె కి ట్రాన్స్ఫర్ చేశా .’’

‘’డికే.ఎవరు దరిద్రపు నాకోడుకా ?’’

‘’అలాంటివాడే .దగుల్బాజీ నాకొడుకు ‘’

‘’నా అకౌంట్ నుంచి నువ్వు ట్రాన్స్ ఫర్ చేయటమేంటి.నాకు చెప్పద్దా.నా సంతకం వద్దా ?’’

‘’అన్నీ నేనే పెట్టాను డికే గైడెన్స్ తో ‘’

‘’దేనికే ఇ౦త డబ్బు ఏం చేద్దామని ?”’

‘’ఎలెక్షన్ లో నిలబడి గెలవటానికి ‘’

‘’నీ కింకా పదేళ్లెగా .అన్నయ్య మేజర్ ‘’

‘’నాకు పద్దెనిమిదేళ్ళు నిండినట్లు ,మేజర్ అయినట్లు డీకే డాక్యుమెంట్ తయారు చేయించాడు కనుక నో అబ్జెక్షన్ ‘’

‘’నీ కెవరు ఓటేస్తారే ‘’?

‘’వేయటం ఉండదు వేయి౦చు కోవటమే .ఇదే డీకే పధ్ధతి ‘’

  ‘’ఎన్నికలముందు ఎన్నెన్నో వాగ్దానాలు .రాజధాని దగ్గర్నుంచి ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ,యువతకు ఉపాధి హామీ అడుగుకోస్వంత ఇల్లు .ప్రభుత్వమే కట్టించి గృహప్రవేశం చేయించే ఏర్పాటు .తల్లికీ తండ్రికీ కాన్వెంట్ లో ఇంగ్లీష్ గర్భంతో ఉన్న తల్లికి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ,పుట్టినబిడ్డకు ఇంగ్లీష్  టీచర్ తొఆల్ఫబెట్ అభ్యాసం , ఉచితవిద్య .క్రీడాకారులకు మైదానాలపంపిణీ,స్వచ్చంద సేవకులనే పేరుతొ ప్రభుత్వోద్యాగాలు .వాళ్ళంతా పార్టీకే పని చేయాలన్న ఆర్డర్లు ,ఇలా చాలా ఉంటాయి అవన్నీ డీకే చూసుకొంటాడు .

  ‘’వీటికి డబ్బు ?’’

ఇసక ,గ్రావెల్ సున్నపురాయి ,పోర్ట్ లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లు ,ప్రభుత్వ బంగళాలు కార్పోరేషన్ స్థలాలు శ్మశానాలు కార్పోరేట్ విద్యా సంస్థలు, హోములు ట్రస్ట్ లు ఇవన్నీ స్వాధీనం, కబ్జా లతో అమ్మకాలతో .

‘’కొత్త ఫాక్టరీల నిర్మాణం ఉపాధి  ఆకాశాలు ?’’

‘’పాత ప్రభుత్వ విదానాలకే కొత్త పేర్లు నాపపేరూ మానాన్నపేరు పెట్టి బ్రహ్మాండంగా లాంచ్ చేస్తాం .ఇంటింటికీ రేషన్ వాన్లతో సప్ప్లై అన్నీ దశతిరిగే ‘’దశ దిశలు ‘’ప్రణాళిక భూలోక స్వర్గమే నేను సిఎం అయితే ‘’

‘’భేతాళ,ప్రేతాలభూమి అవుతుందేమో ‘’

‘’అన్ని అనుమానాలు పడకు .డీకే హూమ్గా ‘’

‘’వీటి మీద కేసులు కోర్టులూ ‘’?

‘’పైన మనం చెబితే వినే పాలకులే ఉంటె మనకు భయమేమిటి ?జడ్జీలను మార్పిస్తాం .లేకుంట వారిపై కేసులు పెట్టించి బెదరగొడతాం .నెల నేలా ఢిల్లీ వెళ్లి పై ఇద్దరికీ సూట్ కేసులు సమర్పిస్తాం కేసుమాఫీకి ‘’

‘’మరి నీ సంపాదన ?’’

‘’నా  టార్గెట్ రోజుకు అయిదువందలకోట్లు అని డీకే ఫిక్స్ చేశాడు  .దానిప్రకారం మా మంత్రులుఎమ్మేలఎలు అధికారులూ వసూలుచేసి ఏరోజు కారోజు సమర్పిస్తారు .ఇదంతా స్విస్ బాంక్ అకౌంట్ లో భద్రం .లేకుంటే శంకరగిరిమాన్యాలే 

‘’దేవాలయాల విషయం ‘’?

‘’ఆయనెవరో మాజీ సిఎం ఏడుకొందలాయన నాలుగు కొండలు నొక్కెసే ?’’ప్రయత్నం చేశాట్ట నీ కెరికేనా?

‘’అందుకే అధ్వాన్నపు చావు చచ్చాదనీ ఎముకలు కూడా మిగల్లెదనీ అంటారు .కొడుకే చంపించాడనీ కొందరు ,కాదు ఆనాటి పై ప్రభుత్వమే అనికొందరూ ఒక పెద్ద బిలియనీర్ అని ఇంకొందరు అని వార్తాకధనం   .అయినా ఆడపిల్లవు నీకెందుకే ఈ దురద ?’’

‘’ఝాన్సీ లక్ష్మీ బాయ్, రుద్రమ దేవి నాకెందుకు అనుకొంటేచారిత్రక నారీమణులు అయ్యేవారా ?’’

‘’సడే సంబడం .ఇంతకీ తిరుపతి కొండ సంగతి ?’’

అక్కడ మనవాళ్ళే ఉంటారు లోపలాబయతా పూజారుల్లోనూ .బోలెడు హుండీ డబ్బు భక్తుల డొనేషన్లు చేతినిండా డబ్బే .’’నామాలాయనకు ‘’ఒక్క కొండమాత్రం ఉంచి మిగిలినవన్నీ అంగుళం వెయ్యిరూపాయలకు అమ్మేస్తా .బెజవాడు దుర్గామ్మకొండను ఇప్పటికే ఒకాయన దాదాపు ఖాళీ చేశాడని విన్నాను .అహోబిలం పానకాలస్వామి సింహాచలం వేదాద్రి పెనుగంచిప్రోలు అంతర్వేది మొదలైన దేవాలయాల ఆస్తులన్నీ బినామీగా మనకే వచ్చే ప్లాన్ తయారు చేశాడు డీకే .ఇంకెవరూ ఏమీ పీకలేరు .మన తరఫున ఒక పనికి రాణి స్వాములోర్ని పెడతాం .ఆయన మనకు వంత పాడుతాడు యజ్ఞాలు య్గాలూ చేయిస్తాడు గెలిస్తే తిలాపాపం తలో పిడికేడుగా ఆయన వాటా ఆయనకు చెల్లిస్తాం

‘’రాజధాని ?””

‘’ఆరు చోట్ల పెడతాం .బంగాళాఖాతం లో ప్రధాన రాజధాని ఉంటుంది .గోదాట్లో ఒకటి.నల్లమల అడవుల్లో ఒకటి ,అరకులోయలో ఒకటి ,పుట్టపర్తి లో ఒకటి .

‘’ఒక్కదానికే రూపాయి కూడా చేపని కేంద్రం ఇన్నిటికి ఎక్కడిస్తుంది ?’’

‘’మెడలు వంచుతాం .పైరవీలు చేస్తాం .ప్రాదేయపదతాం ప్రతినెలా శాలువా సూట్ కేసు సమర్పిస్తాం మోకాలు తండా వేస్తాం .ఏం మాట్లాడేమో చెప్పం .అంతా బ్లాక్ సీక్రెట్ ‘’

‘’నువ్వసలే అర్భకురాలివి ఆయనెవరో లాగా పాద యాత్ర చేస్తూ అందర్నీ కావలించుకొంటే బాగోదు .ఎలా ?

‘’ఎందరు ఎమ్మెల్యేలు గెలిస్తే అంతమంది సలహాదార్లను పెడతాను .వాళ్ళ జీతాలను చూస్తె వాళ్ళే దిమ్మ తిరిగిపోతారు .ఎం చేయాలో మేమే చెబుతాం కానీ ‘’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్’’ మాదగ్గరుంది అని బిల్డప్ ఇస్తాం ‘’

‘’అంటే జీతాలిచ్చి మేపుతూ ఏమీ చేయించరన్నమాట’’

‘’ఎక్సాట్లీ .కోర్టు కేసులకు మళ్ళీ లాయర్లు ఢిల్లీలో పెరుమోసినవాల్లనందర్నీ బుక్ చేస్తాం . మా తరఫున వాదింప జేస్తాం .వాళ్ళ ఫీజులు వింటే జనం ఫ్యూజులు మాడిపోవాల్సిందే .

‘’అలాగే చేస్తూ 150కి పైగా ప్రభుత్వం తెచ్చిన చట్టాల్ని కోర్టు లు కొట్టేశాయ్ తెలుసా ?

‘’అవన్నీ డీకే పరిధిలోవి నేను మాత్రం కుర్చీలో పైల్స్ కంప్లైంట్ వాళ్ళు కూర్చున్నట్లు కూర్చోటమే ‘’

‘’వరదలు గాస్ లీకేజీలు అగ్నిప్రమాదాలు ,కరోనా  వగైరాలోస్తే  ?”’

‘’కాలు తీసి బయట పెట్టను .పేపర్ స్టేట్ మెంట్లు గుప్పిస్తాను .మీడియా  న౦తా కోనేస్తాను. నేను చెప్పిందే రాయాలి కాదంటే వాళ్లభరతమూ పట్టిస్తా ‘’

‘’ఇదంతా హిరణ్యకశిప, రావణ రాజ్యం గా మారుస్తున్నావేమో ఆలోచించావా ‘’.

‘’చించాను. చించే వచించాను .మనపిల్లలకు బూతులు మాట్లాడ్డం రావటం లేదు అది మన సంస్కృతికి గొడ్డలిపెట్టు .ప్రైమరీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా బూతు పంచాన్గాలే పుస్తకాలు .అవి చదివే మిగతా సబ్జెక్ట్ లు ఆప్షనల్ గా చదూకోవాలి .దీని వ్యాప్తికి ఒక ఆడ ఒక మగ  బూతులమంత్రులను పెడతా .పుస్తకాలు రాయిస్తా .ఫ్రీగా సప్లై చేస్తా .బూతులు అసెంబ్లీ కౌన్సిల్ లలో తప్పని సరి చేస్తా .బూతు  మాట్లాడని మంత్రికానీ శాసన సభ్యుడు కానీ మాపార్టీ లో ఊ౦డటానికి వీల్లేదు ‘’

‘’నువ్వు ఆడ పిల్లవే మరీ ఇంత బరి తెగిస్తే ఎట్లా ?’’

‘’నాతోనే బూతులు మొదలవ్వలేదు ఇప్పటికే బూతులు ధారాళంగా అసెంబ్లీలో కౌన్సిల్ లో  బయటా విజ్రుమ్భించి మాట్లాడుతున్న అక్కలు ,అన్నలు చాలామందున్నారు మంత్రులున్నారు శాసన సభ్యులున్నారు,స్పీకర్లున్నారు . ఉచ్చ నీచాలు ఎంతవదిలేస్తే అంత మంచిది .అయినా వీటికో యూనివర్సిటి పెట్టిస్తాం .బూతురత్న బూతు పండిత,బూతు శరణ్య బూతు నేత,బూతు పిత బూతు పితామహ వంటి బిరుదులిచ్చి సన్మానిస్తాం   వీరిని విదేశాలకూ ప౦పి౦ చి బూతు వ్యాప్తి సర్వ దేశాలలోనూ చేయిస్తాం ,కేవలం డజను మంది మంత్రులో శాసన సభ్యులో స్పీకరో మాట్లాడితే చాలదు .అదొక ఉద్యమ రూపం దాల్చాలి దానికి   ఫండ్స్ వేరే ఏర్పాటు చేస్తాం ‘’

‘’పెళ్లి చేసుకొంటావా ??’’

‘’పెళ్ళా ?ఇన్ని పనులమధ్యలో దానికోసం టైం వేస్ట్ చేసుకోలేను .’’

‘’ఇంతకీ నీకు ఇన్స్పిరేషన్ ఎవరే ?’’

‘’మా నాన్న చనిపోయినా రోజూ అర్ధరాత్రి కలలో కన్పించి మాట్లాడతాడు .రోజు వారీ ఏమేం చేయాలో చెప్తాడు .ఆయన మాటే నాకు వేదం ‘’

‘’దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదేనేమో “”?

‘’వోటింగ్ మెషీన్లు ఉంటాయిగా అంతా నీ ఇష్టం కాదుగా వోట్ల పండక్కి ??

‘’ఆ మెషీన్లు మేమే చేయిస్తాం మా డీకే ఇందులో మహాఘటికుడు తిమ్మిని బ్రహ్మిని చేయగలడు .వాటిలో ఎవరికీ ఓటేసినా మాపార్టీ వారికే ఓటు పడే ఏర్పాటు చేస్తాం .దీనికి పై’’ ద్విమూర్తుల’’ ,పక్కరాష్ట్ర  సహకారమూ డబ్బు అందించటమూ అన్నీ జరుగుతాయి .మంచి నాయకులను సేవా దృష్టి ఉన్నవాళ్ళను ఓడింటమే మా ధ్యేయం . పాపం ప్రజలు వోటు వేశామనుకొంటారు తమకు నచ్చిన నాయకుడి పార్టీకి .కానీ ఫలితాలు చూసి నోరు  వెళ్ళబెడ్తారు.ఇదంతా లోపాయకారీ వ్యవహారం నీబోటి ముసిలోళ్ళ  కు అర్ధం కాని ట్రెండ్ ఇది .ఇప్పుడు బీహార్ లో యుపి లో మొన్న ఎపి లో జరిగి౦ది అంతాఇదె ‘’

‘’ఎలెక్షన్ కమీషన్ ఉంటు౦ది కదే’’

‘’ఎక్కడో దూరపు రాష్ట్ర 80 దాటిన ముసలాయన్నిరాష్ట్రం లో ఎన్నికల కమీషనర్ గా వేయిస్తాం పై ‘’వాళ్ళను’’ కాకాపట్టి  .వాళ్ళక్కూడా అవసరమేగా మాట్లాడరు.కరోనాకు కోవాక్సిన్ మందు అయితే ఎలేక్షన్ కు సూట్ కేసులే మందు .ఇప్పటి ట్రెండ్ ఇదే ఈ’’హవా’’నే నడుస్తోంది .

‘’ప్రజాస్వామ్యం వోటింగ్ హక్కు అని మేము జీవితాంతం పోరాడామే ఇదా నేటి రాజ స్వామ్యం అరాజక స్వామ్యం ?”’ప్రజలు వోట్లేయక్కర్లేదు ,మానిఫెస్తోలు అక్కర్లేదు పార్టీ సిద్ధాంతాలు మసిబూసి మారేడుకాయ చేయటం ,మిషన్లనే మెయింటైన్ చేయటం ,ఓటుకు పదివేలు గుప్పించటం ,గెలుపే ముఖ్యం ,డీకే లాంటి ఒకడు ఉంటె సరి .ఇదేనా నీ నీతి ?”’

‘’నేనేకాదు మహా మహా కాషాయం వాళ్ళే ‘’ఖాకీ నిక్కర్ సైన్యాన్ని’’ వదిలేసి గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రజాస్వామ్య అభి చారం ఇదే .వాళ్ళే చేస్తే ఇక మనకు తప్పేంటి ? ఆదర్శాలు వల్లి౦చ టానికే  మాత్రమె. ఆచరించటానికి కాదు .’’

‘’ఈపాపం చూస్తూ అలా ఉండిపోవాల్సి౦దేనా?””

‘’ఎం చేస్తారు ప్రజలు ?.రాజదానికోసం వందలాది రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే అటు వెళ్లి పలకరించిన సినీ హీరోలు పార్టీ నాయకులే లేరు .వాళ్ళ మానాన వాళ్ళు చేస్తూనే ఉన్నారు .మీడియాకూ పట్టదు.రాజధానిలో రైతు ఉద్యమం ఉధృతంగా ఉంటె గడ్డాలూ మీసాలు పెంచటానికి తీరుబాటు గంటకోసూటు మార్చేసే నాయకులకు వారి గోడు పట్టనే లేదు .కరోనా ఒకటి రెండు వేవ్ లలో లక్షలాది మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకొన్న ప్రభుత్వాలు లేవు .వలసకార్మికులను స్వంత ఊర్లకు పంపటానికి ఏ సోనూ సూద్ లాంటి ఉదారులే స్పందిస్తున్నారు కానీ మన రాచకీయ నాయకులు ముందుకు రావటమే లేదు .కనుక ప్రజలు స్తబ్డులై పోయారు .దబ్బనం తో గుచ్చినా వాళ్లకు ప్రజాస్వామ్య స్పృహ రాదు .ఇదే అదను నాబోటి వాళ్లకు .అయినకాడికి బొక్కి ,పైవాడి నోట్లో కొంతకుక్కి మిగిలిన వారిని కుక్కిన పేనుల్లాగా మార్చేయటం ఇప్పడు తక్షణ కర్తవ్యమ్ .అయినా ముందే చెప్పాగా మన చేతికి మట్టి అంటదు .అంతా డీకే చూస్తాడు సూపర్ మాన్ గా .ఏదైనా తేడా వస్తే వాడే జైలుకు వెడతాడు మా అధికార్లు పోతారు .మనం రాజ సింహాసనం పై చిద్విలాసం ఒలక బోస్తాం ‘’

‘’ఛీ ఛీ దేశ ద్రోహీ! ప్రజాస్వామ్య ఘాతకురాలా! .ప్రజాస్వామ్యమంటే ఇంత తేలికా ?వింత వీజీ వా ?నువ్వు బతకటానికి వీల్లేదు నేను చూస్తూ ఊరుకోను. ‘’

‘’ఏమిటండీ చూస్తూ ఊరుకోను అంటూ పలవరిస్తున్నారు .ఏదైనా పాడు కల కన్నారా ??’అనిమాఆవిడ  లేపాక కాని ఇదంతా కల అనిపించలేదు .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు

 .’’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫ్రెంచ్ విప్లవం లో అసూయతో నేరం మోపబడి ఉరిశిక్ష పాలైన దేశభక్తురాలు ,నాటకరచయిత్రి ఒలింపీ డీ గౌజెస్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

ఫ్రెంచ్ నాటక రచయిత్రి ,మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలు మేరీ గౌజ్ 7-5-1748 ఫ్రాన్స్ లోని ఆగ్నేయభాగ౦ లోని మౌంటాబాన్ కర్సిలో జన్మించింది ,తల్లి అన్నే బూర్జువా కుటుంబానికి చెందింది .తండ్రి పియర్రీ గౌజ్ లేక జీన్ జాక్వెస్ లేఫ్రాంక్ మార్కస్ డీపాంపేన్ అయి ఉండవచ్చు .పామ్పెన్ కుటుంబాలకు గౌజ్ కుటుంబాలకు అనాదిగా మంచి సంబంధాలున్నాయి .1712లో పుట్టిన అన్నే కు జీన్ జాక్వెస్ లెఫ్రాంక్ గార్డియన్. అన్నే గౌజ్ ఒక బుచర్ అయిన పియర్రే గౌజ్ ను పెళ్ళాడింది .ఈ దంపతులకు ఒక కొడుకుతో పాటు మేరీ ,మరో కూతురు పుట్టారు .

తనకున్న ఆస్తి తో కూతురును చదివించింది తల్లి ..ఆమె మొదటి భాష ప్రాంతీయమైన ‘’ఒక్కేసిటన్’’.మేరీ వివాహం 24-10-1765న లూయిస్ ఏవ్స్ ఆబ్రి అనే కార్టేరర్ తో ఆమెకు ఇష్టం లేకుండానే జరిగింది .పాక్షిక జీవిత చరిత్రగా ఆమె రాసుకొన్న దానిలో ఆ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించింది ‘’అతడికి చదువు లేదు ఆస్తిలేదు ‘’అన్నది. కాని తనకు సంక్రమించిన అమితమైన సంపద వలన భర్త పాత ఉద్యోగం వదిలేసి కొత్త వ్యాపారం సాగించాడు .1976 ఆగస్ట్ 29న వీరికి ఒక కొడుకుపుట్టాడు .అకస్మాత్తుగా నవంబర్ లో టార్న్ నదికి విపరీతమైన వరదలు వచ్చి భర్త లూయిస్ చనిపోయాడు .మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోలేదు .వివాహ వ్యవస్థను ‘’విశ్వాస ,ప్రేమలకు సమాధి ‘’అన్నదామె .

1770లో మేరీ అబ్రి తానే పెట్టుకొన్న ఒలింపి డీ గౌజ్ పేరుతొ తనకొడుకుతో సహా పారిస్ లో ఉన్న సోదరి దగ్గరకు వెళ్ళింది .అక్కడ సంపన్నుడైన జాక్వెస్ బీట్రిక్స్ తో పరిచయమై ,అతడు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినా తిరస్కరించింది .ఫ్రెంచ్ విప్లవకాలం లో అతని వెంటే నడిచింది .అతని సహకారం తో ఒక దియేటర్ కంపెని స్థాపించింది .పారిస్ లోని కళాత్మక ,ఫిలసాఫికల్ సంస్థలను తరచూ గా సందర్శిస్తూ ,అక్కడ లా హార్పర్ ,,మెర్సి ,చాంఫర్ట్ లతోనే కాకుండా రాజకీయం గా ఎదుగుతున్న బ్రిస్సార్ట్ ,కండార్సేట్ లతో మంచి పరిచయంసాధించింది .మేడం డీ మొన్టేస్సాన్,కంటేస్సీ డీ బ్యూహార్నెస్ సెలూన్లు ఆమెను గౌరవంగా ఆహ్వానించేవి .అక్కడ మాసోనిక్ లాడ్జేస్ తో కలిసి పని చేసింది .

పారిస్ లో ఆమె రచయిత్రి గా జీవితం ప్రారంభించి,1784లో ఒకనవల రాసి ప్రచురించింది .తర్వాత దృష్టి నాటక రచన పైకి మళ్ళింది . తక్కువ స్థాయిలో లోపుట్టినా తనను తాను పారిస్ సమాజం లో నిలబడటానికి తీర్చి దిద్దుకొని, అందరికి ఆత్మీయురాలైంది .అక్కడి సిటిజన్ పత్రికలో మహిళా విభాగానికి ఉత్తరాలు రాస్తూ అందరినీ ఆకర్షించింది .రివల్యూషన్ కు ముందు ఫ్రాన్స్ లో పౌరులు లేరు .రాజులకు రచయితలు తోడుగా ఉండేవారు .కానీ రివల్యూషన్ కాలం లో అక్కడ సిటిజన్లు మాత్రమె ఉన్నారు.1792అక్టోబర్ లో మేడం ,మేడమోసేరీ లకు బదులుగా సిటిజన్స్ అనేపదాన్ని వాడాలని కన్వెన్షన్ డిక్లర్ చేసింది .

1788లో డీ గౌజేస్ రిఫ్లెక్షన్స్ ‘’అనే రచనలో ఫ్రెంచ్ కాలనీలలో ఉన్న బానిసలకు ఊరట కలిగించాలని డిమాండ్ చేసింది .ఫ్రాన్స్ లోని ఆటోక్రాటికి సార్వభౌమత్వానికి ,బానిసల వ్యవస్థకు మధ్య సంధానకర్తగా ఆమె పని చేసింది .’’మనుషులు ఎక్కడున్నా సమానులే .నిజాయితీ ఉన్న రాజులు బానిసలను కోరరు .వారికి తెలుసు బానిసలు అణగి మణగి ఉండే ప్రజలని ‘’అనే భావాలతో ఆమె ‘’ఎస్కవేజ్ డెస్ నారిస్ ‘’అనే నాటకం రాసి 1785లో కామెడీ ఫ్రా౦కైస్’’అనే దియేటర్ లో ప్రదర్శి౦చి౦ది. ఫ్రెంచ్ కాలనీలలోని బానిసత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆమెకు బెదిరింపులు ఒత్తిళ్ళు చాలావచ్చాయి .అలాగే నాటకాలలో స్త్రీలకు సరైన స్థానం ఇవ్వటానికి వ్యతిరేకి౦చేవారిపైనా ఆమె విరుచుకు పడింది .ఆమె ధైర్య సాహసాలకు స్త్రీ పక్షపాతానికి అబ్రహాం జోసెఫ్ అనే ప్రముఖుడు ‘’మేరీ లాంటి స్త్రీలు రేజర్ బ్లేడులను కానుకగా ఇస్తూ తమ సెక్స్ ను చార్మింగ్ గా ఉంచుకొంటారు .ప్రతి స్త్రీ రచయిత్రీ తమ ప్రతిభ ఏమిటో “” తెలుసుకోకుండా మిడిసిపడుతున్నారు ‘’అని నిప్పులు కక్కాడు .దీనికి ప్రతి చార్యగా గౌజేస్ ‘’ “I’m determined to be a success, and I’ll do it in spite of my enemies’’అని ఘాటుగా సమాధానం చెప్పింది .బానిస వ్యాపారం చేసే కంపెనీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె నాటకాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది ఆమె కోర్టులో వేసి నాటకం ఆడే హక్కు సాధించింది .కానీ మూడే మూడు ప్రదర్శనల తర్వాత ప్రేక్షకులుగా బానిసవ్యాపరులు వచ్చి ఇకిలి౦పులు సకిలి౦పులుఅల్లర్లు ఆగడాలు చేయటం తోప్రదర్శన ఆగిపోయింది .

మానవ హక్కుల పరిరక్షుకురాలైన ఆమె ఫ్రెంచ్ విప్లవాన్నిసంతోషంగా ఆశావహంగా మనస్పూర్తిగాసమర్ది౦చి౦ది .కానీ సమాన హక్కులు ఇవ్వనందుకు తీవ్ర నిరాశ చెందింది .1791లో ఆమె ‘’సొసైటీ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ట్రూత్ ‘’లో పని చేసింది .దీనినే సోషల్ క్లబ్ అనేవారు .దీని ముఖ్య ఉద్దేశ్యం స్త్రీలకూ సమాన రాజకీయ న్యాయ హక్కులకు కృషి చేయటమే .ఇందులోని సభ్యులు ఒక్కోసారి స్త్రీ హక్కు ఉద్యమనాయకురాలు సోఫీ డీ కాండోర్సెట్ ఇంట్లో సమావేశామయేవారు 1791లో ‘’డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ది సిటిజెన్స్ ‘’డిక్లరేషన్ వెలువడిన తర్వాత ఆమె ‘’డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ వుమన్ అండ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సిటిజన్స్ ‘’అనే కరపత్రం రాసి వెలువరించింది .దీనిలో ఆమె మొట్టమొదటిసారిగా తన ప్రసిద్ధ స్టేట్ మెంట్ “A woman has the right to mount the scaffold. She must possess equally the right to mount the speaker’s platform.” అనే వాక్యాన్ని పొందుపరచింది .దీనితర్వాత ‘’సోషల్ కాంట్రాక్ట్ ‘’ను ప్రముఖ ప్రజాస్వామ్యవాది జీన్ జాక్వెస్ రూసో రాసిన జెండర్ ఈక్వాలిటి కిఅనుబంధంగా రాసింది .

1790 ,91లలో ఫ్రెంచ్ డెమింగ్ లోని ఫ్రెంచ్ కాలనీల బానిసలు ప్రభుత్వం తెచ్చిన డిక్లరేషన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు .మేరీకి హింసాయుత తిరుగుబాటు ఇష్టం లేదు .ఆవిషయం తెలియజేస్తూ బానిసలు స్వేచ్చాపౌరులు. బానిసల కష్టాలు గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది .పారిస్ మేయర్ ఆమె అక్కడ జాతి వ్యతిరేకత ప్రోత్సహిస్తోందని ఆరోపించాడు . ఆమె నాటకం 1792 డిసెంబర్ లోప్రదర్శించినపుడు దౌర్జన్యం చెలరేగింది .

21-1-1793న జరిగిన ఫ్రాన్స్ 16వ లూయీ శిరచ్చేదాన్ని మేరీ వ్యతిరేకించింది . కారణం ఆమె రాజ్యాంగ మొనార్కిని కోరింది . ఉరితీతవగైరాలను తప్పుబట్టింది .ఇది చాలామంది హార్డ్ లైన్ రిపబ్లికన్ లకు నచ్చలేదు .19వ శతాబ్ది చరిత్రకారుడు జూల్స్ మైఖేలేట్ కూడా రివల్యూషన్ కు క్షమాపణ చెప్పాడు .అతడు స్త్రీలు రాజకీయం లోకి రాకూడదు అనే అభిప్రాయం ఉన్నవాడు .16లూయీ కేసు విచారణ సమయం లో ఆమె నేషనల్ అసెంబ్లీ కి లేఖరాసి అందులో తాను ఆయనను సమర్ధిస్తున్నట్లు తెలిపింది .రాజును తప్పుమార్గం లో నడిపించారానీ అతడు మంచిమనిషి అనీ అతడిని బహిష్కరించాలికాని ఎక్సిక్యూట్ చేయరాదని చెప్పింది.

ఫ్రెంచ్ రివల్యూషన్ తీవ్రమైన కొద్దీ గౌజేస్ విమర్శలుకూడా మరీ తీవ్రమయ్యాయి .1793జూన్ 2న మౌంటెన్ యార్డ్ ఫాక్షన్ గ్రూప్ కు చెందిన జాకోబిన్లు ప్రముఖ జిరోన్డిన్స్ ను అరెస్ట్ చేయసాగారు .అక్టోబర్ లో వారికి గుల్లెషిన్ మెషీన్ కు బలి చేశారు .చివరికి మేరీ రాసిన ‘’ది త్రీ అర్న్స్ఆఫ్ ది సాల్వేషన్ ఆఫ్ ది ఫాదర్ లాండ్ బై యాన్ ఏరీయల్ ట్రావెలర్ ‘’అనే 1973లో ఆమె రాసిన కరపత్రం రివల్యూషనర్లు తీవ్ర అధిక్షేపంగా అనిపించి అరెస్ట్ చేశారు .ఆమె వెలువరచిన కరపత్రం లో 1-స్థిరమైన ప్రభుత్వం ,2-యునిటరి రిపబ్లిక్ 3-ఫెడరలిస్ట్ ప్రభుత్వం లేకా రాజ్యాంగ రాచరిక లలో ఏదో ఒక దాన్ని ప్రజలు ఎంచుకోవటానికి ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరింది .విప్లవవాదుల సిద్ధాంతం ప్రకారం మొనార్కీ ని కోరే పుస్తకం కాని పాంఫ్లెట్ కాని తీవ్ర నేరంగా .

అరెస్ట్ చేశాక సాక్షాదారాలకోసం ఆమె ఇల్లంతా గాలించారు .ఇంట్లో ఏమీ దొరకలేదు అప్పుడు ఆమె స్వయంగా కమీషనర్లను తన స్టోర్ హౌస్ కి తీసుకు వెళ్ళింది .అక్కడ ఆమె అముద్రిత నాటకం ‘’ఫ్రాన్స్ ప్రిజర్వేడ్ ఆర్ ది టిరంట్ డీ త్రోన్డ్’’దొరికింది వారికి .అందులో మొదటి అంకం మాత్రమె ఉంది .మేరీ యాంటోనేట్ డిఫెన్స్ వ్యూహాలు పన్నుతూ ,కూలిపోతున్న రాచరికాన్నినిలబెట్టటానికి సమర్ధిస్తూ విప్లవ సైన్యం తో గౌజేస్ తో ఘర్షణ కొనసాగిస్తోంది .అనే విషయం ఉంది .దీన్నే సాక్ష్యంగా తీసుకొన్నారు .కాని ఆమె ఎప్పుడూ రివల్యూషన్ నే సమర్ధించింది .మూడు నెలలు జైలులో గడిపింది. జడ్జి ఆమె తరఫున వాదించే లాయర్ ను పెట్టుకోవటానికి తిరస్కరించాడు .తన కేసు తానె వాదించుకొన్నది ధైర్యంగా .ఆమెస్నేహితులు ఆమె రాసిన రెండు రచనలు ‘ఒలిమ్పీడీ గౌజేస్ యట్ ది రివల్యూషనరి ట్రిబ్యునల్ ;;,ఎ ఫిమేల్ పేట్రి యట్ పెర్సిక్యూటేడ్’’ముద్రించారు .వీటిలో టెర్రరిజాన్ని ఆమె వ్యతిరేకించింది

అంతకు ముందే తనకొడుకు పియర్రీఆబ్రి కి వైస్ జనరల్ పోస్ట్ ను 1500 లివ్రేస్ దనం తో కొనిపెట్టింది .ఈమె అరెస్ట్ అయ్యాక ఆఉద్యోగం ఊడ గొట్టారు 2-11-1793న ఆమె కొడుక్కి ఉత్తరం రాస్తూ ‘’నాన్నా !నేను చనిపోతాను .నా దేశం కోసం నా ప్రజలకోసం .రిపబ్లికనిజం అనే ప్రత్యెక ముసుగు దరించి నా శత్రువులు .నాకు అడ్డు గోడ కట్టారు ‘’అని తెలిపింది .3-11-17న రివల్యూషనరి ట్రిబ్యునల్ ఆమెకు దేశద్రోహ౦ రాచరిక వ్యవస్థ ను మళ్ళీ ఆహ్వానించటం అనే నేరాలు మోపి మరణ శిక్ష విధించింది .గులషిన్ మెషీన్ పై ఆమె ఉరిశిక్ష అమలు చేశారు .ఆమె మొత్తం మీద 15నాటకాలు రాసింది .అందులో –జామోర్ అండ్ మీర్జా ,ది అనె క్స్పేక్టేడ్ మారేజ్ ఆఫ్ చేర్నుబిన్ ,ది జేనరాస్ మాన్ ,ది కరేక్టెడ్ ఫిలాసఫర్ ,ది బ్లాక్ మార్కెట్ ,దిడేమొక్రట్స్ అండ్ ది అరిస్టోక్రాట్స్,దికాన్వెంట్,ఫ్రాన్స్ సేవ్డ్ ఆర్ ది డీత్రోండ్ టిరంట్,ది ఎంట్రన్స్ ఆఫ్ డుమోర్టేజ్ ఇన్ బ్రస్సెల్స్ ఉన్నాయి . ఆమె జీవించి ఉండగా సెలెబ్రిటి అయినా గొప్ప నాటకరచయిత్రిగా పేరు పొందినా ,దేశం కోసం ప్రాణత్యాగం చేసినా ,ఆమె మరణించాక జనం ఆమెను మర్చిపోయారు .ఆమె దైవోప హతురాలైన దేశ భక్తురాలు .

1980లో ఆమె జీవితం పై ఆలివర్ బ్లాంక్ పుస్తకం రాసిన తరవాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 4-3-2004న పారిస్ లోని ఋ బెర్జేర్ చారియాట్ ,మరియు ఫ్ర్నాచి కాంప్టేలకు ‘’ప్లేస్ ఆఫ్ పా౦పె డి గౌజేస్ ‘’అని గౌరవంగా నామకరణం చేశారు .ఆమె పేరున చాలా వీధులు ఆ తర్వాత వెలిశాయి .

– గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7

ఇలయనార్ దేవాలయం ను  శేషాద్రి స్వామి రాత్రి వేళ దర్శించేవారని చెప్పుకొన్నాం ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకొందాం .ఇలియనార్ అంటే చిన్నవాడు అని అర్ధం .కంబత్తిల్ ఇలయనార్  అంటే స్తంభం లో  కనిపించిన చిన్నవాడు .ప్రౌఢ దేవరాయలకాలం లో అరుణ గిరి నాధుడు అని ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు అరుణగిరి వాసి సుబ్రహ్మణ్యం .తమిళం లో వేలాది కీర్తనలు రాశాడు వాటిని ‘’తిరుష్టు గల్’’అంటారు .వీటికే అరుణగిరికీర్తనలు అంటారు .మనత్యాగయ్యగారికీర్తనల్లాగా అవి ద్రావిడ భాష లో  ప్రఖ్యాతి పొందాయి .రాయలకు అరుణగిరి నాథునిపై అమిత భక్తీ .సంబంధ అండా అనే జైనుడికి ఇది ఇష్టం గా లేదు .ప్రౌఢ దేవరాయలు ఒకసారికోలువులో అరుణగిరీశ్వరుని పొగడగా సంబంధ అండా’’మీ దేవుడికి అంతమహిమ ఉంటె చూపించండి ‘’అనగా రాయలు స్వామిని ప్రార్ధించి దర్శనమిమ్మన్నాడు .’’స్వామి దర్శనాన్ని నువ్వు భరించలేవు ‘’అన్నాడు స్వామి .’’నాకళ్ళకు ఏమైనా  ఫర్వాలేదు .చూడాల్సిందే ‘’అన్నాడు రాయలు .స్వామి ఆయన కోరికమన్నించి ఒక స్తంభం లో చిన్నపిల్లాడుగా దర్శనమిచ్చాడు .అందుకే ఆక్షేత్ర స్వామిని కంబత్తిలయనార్ అంటారు .

  దివాన్ బహదూర్ సుందర శెట్టి 1909-10లో తిరువన్నామలై న్యాదికారికి శేషాద్రి స్వామిని దర్శించాల్నే కోరిక ఉండేది .ఒకరోజు స్వామి ఆయన  ఇంటికి వెళ్ళారు  .మర్యాద చేసి ఆతిధ్యం తీసుకోమనికోరగా సరే అని విస్తరిముందు కూర్చుని భోఅనం చేస్తూ మెతుకులు అటూఇటూ చల్లారు .తర్వాత కొత్త పంచను స్వామికి చెట్టి సమర్పించాడు .దాన్నికట్టుకోని శెట్టికి అ౦గ వస్త్రంగా వేసి ,తీసేసి మళ్ళీ వేశారు .ఆతర్వాత శెట్టి ఇంటినుంచి బయల్దేరాడు .1927లో శెట్టి దక్షిణ ఆర్కాటు జిల్లా జడ్జీ అయ్యాడు  .కొన్ని రోజులు విశ్రాంతికోసం సెలవుపెట్టి తిరువన్నామలై వచ్చి స్వామికి నమస్కరిస్తే స్వామి అటూ ఇటూ పరిగెత్తారు .ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పోయారు .శెట్టి చేతులు జాచమని చెప్పి తన చేతులతోపట్టుకొని పైకీ కిందికీ దింపారు .ఏదేదో మాట్లాడి స్వామి వెళ్ళిపోయారు .నౌకరుకు డబ్బు ఇచ్చి కొత్త వస్త్రాన్ని తెమ్మనిపంపగా అతడు రావటం ఆలస్యమవగా స్వామి వెళ్ళిపోగా ,దారిలో స్వామి అతడి దగ్గరున్న వస్త్రాన్ని తీసుకొని మెడపై వేసుకోగా చూసి శెట్టి మహదానందపడ్డాడు .సెలవుపూర్తి అయి, జాయిన్ ఆయె లోపు ఆయన కు హైకోర్ట్ జడ్జి పదవి వచ్చినట్లు వార్త వచ్చింది .ఇదంతా స్వామి అనుగ్రహమే అనుకొన్నాడు .

  సబ్ ఇన్స్పెక్టర్ శివ ప్రకాశం జీతం నెలకు 75రూపాయలు .ఒక రోజుపనిమీద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెడుతుంటే దారిలో స్వామికనిపించి ‘’నీకు పదిరూపాయలిస్తాను తీసుకొంటావా ?’’అని అడిగితె ‘’మా సి .ఐ ,ఉన్న ఉద్యోగం పీకకుండా ఉంటె చాలు .జీతం పెంచటం కూడానా స్వామీ ‘’అన్నాడు .’’అయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తా ‘’అంటూ ఆయన టోపీ తలమీద పెట్టుకొని తన ఉత్తరీయం అతనిమెడలో వేసి ,ఇద్దరూకలిసి సి ఐ ఇంటికి వెళ్ళారు .అతనిభార్య ‘’మీకు మంచికాలం వచ్చింది ప్రమోషన్ వస్తుంది ‘’అన్నది స్వామి నవ్వుతూ తలూపారు .కాసేపు మాటలతర్వాత ఆయన తోపీ నెత్తిమీద పెట్టుకొని తన ఉత్తరీయం తీసి ‘’అందుకే పోలీసువారితో సావాసం చేయకూడదు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతారు ‘’అని వెళ్ళిపోయారు .ఆరోజే అతని జీతం పదిరూపాయలు పెరిగింది .డి ఎస్పిపి కి ఇష్టం లేకపోయినా ఎ ఎస్పి రికమెండ్ చేసి జీతం పెంచేట్లు ఆర్డర్ ఇప్పించాడు .

  డేనిష్ మిషన్ స్కూల్ టీచర్ వెంకటరామయ్య ను అధికారులు ఏదో సాకుతో తాత్కాలికంగాపీకేసి మూడు నెలలు జీతాలుఇవ్వలేదు  కొంపగడవటం కష్టంగా ఉంది .ఒక రోజు ఆయనకు స్వామి భూతనారాయన గుడి దగ్గర కనిపించగా చెప్పులు వదిలేసి నమస్కరించగా  ఒక చెప్పు తీసి ఆయన నెత్తి మీద బలంగా కొట్టారు .మాస్టారి ప్రాణాలు విలవిలలాడినాయ్ .అంతా మనమంచికోసమే అనుకోని బడికి వెళ్ళగా టేబుల్ పై ఒక కవరు ఉంటె తీసుకొని చదవటానికి గడగడ లాడి ధైర్యం తెచ్చుకొని ఎలాగో అలా తెరిచి చదివితే తనను అదే స్కూల్  హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేసి ఇచ్చిన ఆర్డర్ అది .స్వామి తనకు చేసిన పాద రక్షా పూజ ఫలితమే ఈప్రమోషన్ అనుకొన్నాడు  .

   ఐరావతంయ్యర్ వేలూరి స్కూల్ మాస్టర్ .శ్రీ విద్యా దీక్ష పొందాలనే కోరిక ఉండేది .ఒకసారి రమణ మహర్షిని ,గణపతి మునినీ దర్శించి కోరిక చెప్పుకొందామని తిరువన్నామలై వచ్చి అయ్యర్ హోటల్ లో కాఫీ తాగుతుంటే అకస్మాత్తుగా శేషాద్రి స్వామి వచ్చి ,అక్కడి అలమరులోని రెండుమూడు మిఠాయిలు ముక్కలు చేసి ,ఒకముక్క నోట్లో వేసుకొని మిగిలినవి ఐరావతంయ్యర్ చేతిలో పెట్టారు .అక్కడే సాగిలపడి నమస్కరించాడు అయ్యర్ .తర్వాత  గణపతి ముని ఇంటికి వెళ్లి ,ఆయనకు పాదాభి వందనం చేసి లేవగా ‘’నీకు దశ పంచాక్షరి ఉపదేశిస్తా. చాలా మేలు కలుగుతుంది ‘’అని ఉపదేశి౦చగా, అదంతా స్వామి మహిమ అని గ్రహించి ఇంటికి చేరేసరికి జీతం పెరిగిన వార్త కూడా తెలిసింది .

 ఒక వైష్ణవ పోలీస్  ఇన్స్పెక్టర్ కు స్వామిపై అమితభక్తి .అతడు ఒకరోజు ఎవర్నో బెత్తం తో కొడుతుంటే స్వామి వెళ్లి బెత్త౦  లాగి ఆయన్నే నాలుగు పీకారు .తప్పు చేశానేమో అని భయపడి దూరంగా వెళ్లి నిలబడ్డాడు .కొద్దిరోజులో ఆ ఇన్స్పెక్టర్ కు మైసూర్ సంస్థానం లో ఉన్నత పదవి లభించింది .

  ఉద్యోగం పోయిన సబ్ మేజిస్ట్రేట్ ,పై అదికారుఅలకు అప్పీల్ చేసి స్వామి దర్సనానికి రాగా ,ఏడు రోజులదాకా స్వామి కనిపిచలేదు .ఎనిమిదవ రోజున స్వామి శివగంగ తీర్ధం లో ఉండగా దర్శించగా తన ఉత్తరీయం నీటిలో ముంచి  ఆయన తలపై పిండారు .ఆయనే స్వామి అని పక్కనున్నవారు చెప్పేదాకా ఆయను తెలియలేదు .రెడురోజుల్లో ఆయన అప్పీల్ ను విచారించిన అధికారులు ఆయనకు మళ్ళీ ఉద్యోగం లో చేరే ఆర్డర్లు పంపారు .

  సేలం లో పెద్ద న్యాయవాది బివి నరసింహస్వామి మద్రాస్ శాసన సభ మాజీ సభ్యుడు దేశ సేవ చేసినవాడు .ఆయనకొడుకులిద్దరూ ఆడుకొంటూ ఇంటివెనుక నూతిలోపడి చనిపోయారు .అప్పటినుంచి ఆయనకుజీవితం ఐ విరక్తికలిగి ,రమణ మహర్షిని చూడాలని వెళ్లి అనుకోకుండా శేషాద్రి స్వామిని చూసి ,మహర్షి జీవిత విశేషాలు సేకరించి జీవిత చరిత్ర  రాశాడు .ఉత్తరదేశ తీర్ధ యాత్ర చేశాడు .సాయిబాబా భక్తినీ బోధనలనూ ప్రచారం చేశాడు .ఒక సారి స్వామిని దర్శించి చాలాసేపు ఇష్టాగోష్టి జరపాలనే కోరికను నారాయణ శాస్త్రి గారితో చెప్పగా ‘’మీరు రామభక్తులు కదా రామనామ జపంచేస్తే మీ సంకల్పం నెర వేరుతుంది ‘’అని సలహా ఇవ్వగా ,ఒకసారి స్వామి దర్శనం కలిగగా స్వామి మాట్లాడకుండా ‘’పూర్ణ భక్తి ఉంటె ,అన్నీ సమకూర్తాయి ‘’అని సౌజ్ఞలతో చెప్పారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6

భగవాన్ రమణ మహర్షి ,శేషాద్రిస్వామి సమకాలికులు .స్వామియే వీరిద్దరిలో పెద్ద .అపరోక్షానుభూతిలో ఇద్దరూ సమానులే .పరస్పర గౌరవభావాలున్నవారు .రమణులకు భక్తులు కొత్త సోఫా  తెచ్చి సమర్పి౦చి కూర్చోమనికోరితే ‘’ఎదురుగా ఉన్నది సోఫా అనీ, అందులో కూచోవాలని నాకు తెలియదా దేహాన్ని మర్చిపోవటానికి నేను శేషాద్రి స్వామిని కాను’’ అన్నారట .రమణ భక్తురాలు లక్ష్మీ అమ్మాళ్ ,ఏపని చేసినా భగవాన్ పైనే ధ్యానం గా ఉండేది .శేషాద్రిస్వామిని చూడనే లేదు .ఒకరోజు స్వామి దర్శనానికి బయల్దేరితే ఆయన కనిపించలేదు  .ఏడు రోజులకు కనిపించారు .ఆయనముందు నిలబడి రమణులనే ధ్యానించేది .అప్పుడుస్వామి ‘’అక్కడైనా ,ఇక్కడైనా రెండూ ఒక్కటేగా “”అన్నారట .ఆస్తికులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ధ్యానం చేయాలనిపించి రమణులతో’’పూర్ణాది లేహ్యం సేవిస్తే ధ్యానసిద్ధి కలుగుతు౦దంటారు నిజమేనా ?’’అని అడిగితె ‘’అలాంటి ఆలోచన వద్దు ‘’అన్నారు .కానీ శాస్త్రి ఆ లేహ్యం తిన్నారు .విపరీత ఆలోచనలు బయల్దేరి తలతిరిగి తట్టుకోలేక రాత్రి తొమ్మిదింటికి గుడిలో ఉన్న శేషాద్రి స్వామి  దగ్గరకు వెళ్లగా ‘’ఆ లేహ్యం తినవద్దని చెప్పానుగా .ఎందుకు తిన్నావ్ ‘’అనగా బొల్దుఆశ్చర్య పోయి స్వామి రమణులు అభేద్యులు అని గ్రహించారు .

 ‘’నాయనగారు’’ అంటూ రమణ మహర్షి గౌరవించేసుబ్రహ్మణ్య స్వామి అంశ అయిన  కావ్య కంఠ  గణపతి మహా కవి  భగవాన్ శిష్యులు .బాల్యం లోనే పంచాక్షరి తారా మంత్రం ఉపదేశం పొందినవారు. నవ ద్వీప పండిత సభలో ‘’కావ్య క౦ఠ ‘’బిరుదు పొందిన విద్వత్  వరేణ్యు లాయన .ఆయన ఆసభలో ‘’గణపతిరితి కవికులపతి రతి దక్షో దాక్షిణాత్యోహం ‘’ అని సగర్వంగా తన్ను ప్రకటించుకొన్నారు .లక్షలకొద్దీ జపం చేసినవారు .1903లో తిరువన్నామలై వచ్చి రమణుల శిష్యులై,ఆయన ఉపదేశాలను ఛందో బద్ధం చేసి ‘’రమణ గీత ‘’అనే 18అధ్యాయాల పుస్తకంగా వ్రాశారు .గణపతిమునికి భగవాన్ కులదైవం,శేషాద్రి స్వామి ఇష్టదైవం .తరచుగాస్వామిని గూర్చి మాట్లాడేవారు .పోరుగూరివారొచ్చి స్వామిని చూడాలంటే ‘’ఆపిచ్చి వాడిని చూడాలా ‘’అనేవారు .వాళ్ళు స్వామిని సమర్ధిస్తూ మాట్లాడితే వారి భక్తికి మెచ్చి సమాధానమిచ్చేవారు .’’కుండలినీప్రసాద లబ్ధ దివ్య శక్తి ‘’స్వామికి ఉంది అని చెప్పేవారాయన .

 ఒకసారి శాస్త్రిగారు శక్తి తత్త్వం పై పది రోజులు ప్రసంగిస్తే ,విన్నవారు చివరి రోజున ఆయన కుమారుడు మహాదేవుని పెళ్ళికి యాభై రూపాయలు వసూలుచేశారు .  .అకస్మాత్తుగా స్వామి అక్కడికి రాగా దాన్ని స్వామి చేతిలో పెట్టిమీకు నచ్చినవారికిమ్మన్నారు .వెంటనే గణపతి ముని చేతిలోఆపైకం పెట్టి కాళిదాస శ్లోకం ‘’వాగర్ధా వివ సంపృక్తౌ ‘’చదివి  స్వామి  మహాదేవుని కల్యాణం సూచ్యార్ధ సూచకంగా తెలియజేశారు .

 గణపతి ముని ,రామ శాస్త్రులు కలిసి ‘’రమణ సమితి ‘’స్థాపించి భగవాన్ కు చెప్పాలని వెళ్ళారు. దారిలో స్వామి కనిపించి ‘’సంఘం స్థాపిస్తున్నారా ?మంచిపనే ‘’అన్నారట  ,అవాక్కయ్యారు ఈ ఇద్దరూ ..కొట్లన్నీ స్వామి రాకకోసం తెరిచే ఉంచుతారు .కాలు పెడితే ఆ రోజు వారికి కనక వర్షమే .ప్రతి దుకాణం లోనూ స్వామి ఫోటో ఉంటుంది .దానికి హారతి ఇవ్వనిది వ్యాపారం మొదలు పెట్టేవారుకాదు దుకాణ దారులు .పిలవక పోయినా ముత్యాల చెట్టి అంగడికి స్వామి వెళ్ళేవారు .కాలణా(అణాలో నాలుగో వంతు ) కర్పూరం అడిగితె కాలురూపాయి(పావు రూపాయ ) కర్పూరం పెట్టేవాడు చెట్టి .అదతా  అరుణాచల సన్నిధికే చేరేది .అంత ఉదారుడు .చెట్టికోట్టుకొచ్చి స్వామి గల్లాపెట్టె తీసి నాణాలు కింద కుమ్మరించినా అతడు కిమిన్నాస్తిగా ఉండేవాడు .స్వామి అనుగ్రహం తో కొన్ని లక్షలకు అధిపతి అయ్యాడు .ఒకసారిస్వామి ఈ కొట్లోకి వచ్చినిండు నేతిడబ్బాను బయటికి తీసుకొని వెళ్లి కుమ్మరించేశారు .అనుకోకుండా ఆశలు వదులుకొన్న బండబాకీ డబ్బు 7 వందలు వచ్చాయి ఆనాడు .మరోసారి చెట్టి బట్టల దుకాణం నుంచి ఖరీదైన పట్టుబట్ట తీసుకొని వెళ్లి ,ముక్కలుముక్కలుగా చించి ఎచ్చమ్మగారి గేదె కొమ్ములకూ, కాళ్ళకూ కట్టారు .ఆరోజు చేట్టిగారికి రెండువేలరూపాయలు లాభం వచ్చింది .

  ఒక మామిడి పళ్ళవ్యాపారి అమ్మకానికి మామిడిపళ్ళు నాలుగు పెడితే స్వామి అటుగా వచ్చి ఒకదాన్ని తీసుకోగా యజమానిలేడు.నౌకరు స్వామిచేతిలోపండులాగేసి బుట్టలో పడేశాడు .చుట్టుపక్కలవారు వద్దని చెప్పినా వాడు వినలేదు. మర్నాటి నుంచి  ఆ పళ్ళకోట్లో లో ఒక్కపండు కూడా అమ్మకం జరిగేదికాదు .బండి తోలే మురుగన్ తల్లి ఉన్నామలై.అతడు వీధి అరుగుపై నిద్రిస్తుండగాస్వామి వారిట్లోకి వెళ్లగా అతని తల్లి ఆహ్వానించింది .గంజి ఉందా అని అడిగితె  వెంటనే ఒక లోటా గంజి తెచ్చి స్వామి ముందుంచి కొడుకును నిద్రలేపింది .వాడు నిద్రపోయాను క్షమించు స్వామీ అన్నాడు .వాడిని ‘’బందడీతోలుతున్నావా ‘’అని అడిగితె ‘’గిరాకీ లేదుస్వామీ ‘’అంటే ‘’బండీ ఎద్దూ అమ్మేసేయ్యి ‘’అని వెళ్ళిపోయారు .మర్నాడు అతని ధనవంతుడైన చెన్నై బంధువు తనకూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అనే కబురుపంపాడు .పెళ్లి చేసుకొని బండీ ఎద్దూ అమ్మేసి చింతాద్రి పేటలో మామగారింట తల్లితొబాటుఇల్లరికపు టల్లుడుగా స్థిరపడ్డాడు .

  మంగలి చొక్క లింగానికి స్వామిని చూసిన రోజు కాసుల పంట. అతడే స్వామికి క్షవరం చేస్తాడు  .ఒకపక్క మీసం తీసేయ్యగానే చటాలన స్వామి లేచి వెళ్ళిపోయి అలాగే తిరిగేవారు .స్వామి క్షవరానికి డబ్బులు కుప్పుస్వామిలేక చిన్న గురుకులు ఇచ్చేవారు .ఒకరోజు స్వామి క్షవరం చేయమని చొక్క లింగాన్ని పిలిస్తే కుదురుగా కూచుని క్షవరం అయ్యేదాకా కూర్చు౦టేనే చేస్తాననగా అలాగే వపనం చేయిన్చుకొన్నారు .కానీ చొక్క లింగానికి ఆ రోజు ఎవరూ డబ్బు ఇవ్వలేదు .సాయంత్రం ఉసూరుమని ఇంటికి వెడుతుంటే అతడికి అయిదు రూపాయల నోటు దొరికింది .దేవ దాసీ అలిమేలు స్వామి ఇప్పచేట్టుకింద కూర్చునిఉండగా నమస్కరిస్తే,తనము౦దు పడిఉన్న ఎండిన చేమంతి పువ్వు ను ఆమెతలపై వాసన చూసి వేశారు .ఆవారం లో ఆమెకు ఒక షావుకారు వలన అధిక ధనం వచ్చిపడింది .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విద్యార్ధులకు ,ఉపాధ్యాయ ప్రదానోపాధ్యాయులకు మార్గ దర్శి శ్రీ ఉమా మహేశ్వరరావు

విద్యార్ధులకు ,ఉపాధ్యాయ ప్రదానోపాధ్యాయులకు మార్గ దర్శి శ్రీ ఉమా మహేశ్వరరావు

 ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ,పెద్దలంటే అత్యంత భక్తి ప్రపత్తులు చాటుతూ విద్యార్ధులకు విద్య ,అందునా గణితం గరపటమంటే  అమితాసక్తి ఉన్నవారు ,,అంకితభావం తో ఉద్యోగ నిర్వహణ ,చేస్తూ ,మా అందరికీ తలలో నాలుకగా వర్తించే ,లేక్కలమేస్టారు, ఆతర్వాత హెడ్మాస్టారు అయిన శ్రీ గోపిశెట్టి ఉమామహేశ్వరరావు గారు కిందటి శనివారం జూన్ 26 న అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు ఇంతకు  ముందే శ్రీ కోసూరు ఆదినారాయణ రావు గారు ఫోన్ చేసి చెపితే నిశ్చేష్టుడ నయ్యాను .సుమారు నెలరోజులక్రితం  ఆదినారాయణ ,ఆయన ఉయ్యూరు వచ్చి మమ్మల్ని’’ పరామర్శించి’’ వెళ్ళిన దృశ్యం ఇంకా కనుమరుగు కాలేదు .ఇంతలోనే ఈ విషాదం .ఈమధ్యనే మా మార్గదర్శి శ్రీ సోమంచి రామం గారు ,కృష్ణాజిల్లా టీచర్స్ గిల్డ్ కార్యదర్శి గా అధ్యక్షులుగా విద్యారంగానికి సేవ చేసిన వారు శ్రీ తోటకూర అప్పారాయ వర్మ గారి మరణం విద్యారంగానికి పూడ్చరాని తీరనిలోటు .

 కృష్ణాజిల్లా కోసూరు లో ఉంటూ కృష్ణాజిల్లాపరిషత్ లెక్కల మేష్టారుగా ,ఆపై హెడ్ మాస్టర్ గా విశిష్ట సేవల౦ది౦చినవారు శ్రీ ఉమా .మాతోపాటు కృష్ణాజిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్  కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఎన్నో విలువైన సూచనలు మార్గదర్శకాలు అందించిన సునిసిత మేధావి శ్రీ ఉమామహేశ్వరరావు .ఆ చిరు దరహాసమే ఆయనకు లాండ్ మార్క్ .అదే అందరితో ఆత్మీయతకు దారి తీసింది గలగలమట్లాడే తత్త్వం .ఎంత కష్టమైనా గణిత సమస్యనైనా సులభంగా సుబోదాం గా చెప్పే నేర్పు ఆయనది .దీనికి మా మిత్రుడు శ్రీ ఆదినారాయణ ఆయనకు ప్రేరణ, ఉత్తేజం .మేమంతా రిటైరైనా  ఎదో కొంతవరకు విద్యారంగానికి మా శక్తికొలదీ సాయం చేయాలనీ శ్రీ రామంగారు ,నేనూ ఆదినారాయణ ,శర్మ ,ఉమా మహేశ్వరరావు ,, వైవి రాజు, విశ్వం రాజేంద్రప్రసాద్ ,   ప్రమీలారాణి  సుగుణకుమారి కస్తూరి ,భారతీ దేవి మొదలైన’’ ముసలి ఉత్సాహవంతులం ’ ‘’విద్యారంగం పై అమితాసక్తి ,తీర్చిదిద్దాలనే తపన ఉన్న తెన్నేరు వాస్తవ్యులుశ్రీ దేవి నేని మధు సూదనరావు గారి ఇంట్లో కనీసం ఆరు నేలలకోకసారైనా సమావేశమై చర్చిస్తాం .మా అందరి బదులు మధుసూదనరావు గారు తమకున్న పలుకుబడితో మా ఆశయాలకు రూప కల్పన చేసి,అమలు పరచేట్లు చేస్తూ విజయం సాధించి  ఆ విజయం మాకందరికీ అంట గడుతున్నారు  .ఆదినారాయణ ,రామం విశ్వం ,ఉమా మహేశ్వరరావు గార్లు  జిల్లాపరిషత్ అధికారులతో జిల్లా విద్యా శాఖాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకొని ,విద్యారంగ సమస్యలు పరిష్కరించేవారు .జిల్లా పరిషత్ లోని ఏస్కూల్ లో  నైనా లెక్కల ,ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు లేకపోతె వెళ్లి క్లాసులు బోధించి  పబ్లిక్ పరీక్షకు తయారు చేయించేవారు .ఆదినారాయణ తాను పని చేసి రిటైరై చాలా యేళ్ళయినా  పెదముత్తేవి ఓరిఎంటల్ హై స్కూల్  లో రోజూ ఒకటి రెండు గంటలు ఇంగ్లీష్ బోధిస్తూనే ఉన్నారు .అదీ వారిద్దరి విద్యాసేవ .

  శ్రీ ఉమా రిటైర్ అయి మేనేజిమెంట్ ఒత్తిడితో చల్లపల్లి దగ్గర చాలాపెద్ద ప్రైవేట్ హై స్కూల్ లో ప్రాదానోపాధ్యాయులుగా సర్వ సమర్ధంగా పని చేసి సత్తా నిరూపించుకొన్నారు .మొవ్వ ,చల్లపల్లి మండలాల రిటైర్ ఉపాధ్యాయ సంఘానికి ఇంకా సేవ చేస్తూ ,ప్రతిఏడాది సమావేశాలు నిర్వహిస్తూ వృద్ధులను సత్కరిస్తూ జిల్లాకే ఆదర  ర్శంతీర్చిదిద్దుతున్నారు  ఈ బృందం లోనివారు .ఉచిత ఆరోగ్య కాంపులు,ఉచిత కంటి పరీక్షలు రాజమండ్రి గౌతమీ హాస్పిటల్ వారి ఆధ్వర్యం లో నిర్వహింప జేస్తూ ,ఉచిత ఆపరేషనలు చేయిస్తున్నారు .రిటైరీలకు అండగా ఉంటున్నారు .శ్రమే దైవం అనుకోన్నవారికి విశ్రాంతి ఎందుకు ?ఈ విధంగా విద్యారంగ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ ఉమామహేశ్వరరావు గారి మరణం  ఆత్మీయులైన మాకందరికీ తీరని బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతికలగాలనీ ,వారికి ఉత్తమగతులు  కల్పించాలని భగవంతునికోరుతూ ,వారి కుటుంబానికి సాను భూతి తెలియ జేస్తున్నాను .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5

ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా అంటే అమితవేగా గామిగా ఉండేది.తేలిపోయినట్లు నడిచేవారు .నడుస్తుంటే శబ్దం రాదు .’’అనికేత శుచి ర్దక్ష’’ఆయన జీవితం .పది నిముషాలలో పది చోట్లు మారేవారు కనుక వెదికి పట్టుకోవటం చాలాకష్టం .పిర్రలు నేలపై ఆనకుండా ,మోకాళ్ళు ముడిచి ,మడమలపై  ఆన్చి కూర్చునేవారు .దీన్నిస్వస్తికాసనం అంటారు .

 మంద్ర మధుర భాషి స్వామి .పూర్వాపర సంబంధం ఉండదు.ఒక్కోసారి ఎన్ని అడిగినా జవాబు ఇవ్వరు ఒక్కోసారి రెండుమూడుమాటలే జవాబు.ఎవరినా పాడమంటే ‘’అంబ శివే ‘’అని మాత్రమె శ్రావ్యంగా పాడి ఆపేసేవారు  ఇది తాత కామకోటి శాస్త్రి గారి పాట అని చెప్పేవారు .కూర్చున్న చోటనే మంచం మీద స్తంభం మీద తాళం వేసేవారు .ఎవరైనా వస్తే ఆపేసేవారు . అరక్షణం ఖాళీగా ఉ౦ డేవారుకాదు.తనకెదురుగా ఉన్న వస్తువు చేత్తో తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టేవారు .మళ్ళీ తీసుకోవటం ,మళ్ళీ పెట్టటం .తూర్పుకు కూర్చుని ఒక్కసారిగా పడమటకు తిరిగేవారు  .వెంటనే ఉత్తరానికి తిరిగి చేతులపై ముందుకు జరిగి ,అకస్మాతుగా లేచి ఆకాశం వైపు చూసేవారు .లేకపోతె స్తంభాన్నిపట్టుకొని లేచేవారు .చేతులు వెనక్కు కట్టుకొని ,ఇంకో స్తంభం దగ్గరకు వెళ్లి కిందా పైనాచూసేవారు .ఆకాశం చూస్తూ యాభై సార్లు తిరిగేవారు .అరచేతుల్ని కళ్ళకు అద్దుకోనేవారు .లేకపోతె హఠాత్తుగా పెద్ద గా అర గంట సేపు నవ్వేవారు .కారణం అడిగితె చెప్పేవారుకాదు .ఉడత వెంటా,పిల్లి వెంటా పరిగెత్తేవారు .బండీ కనిపిస్తే ఎక్కి కూర్చునేవారు .మున్సిపాలిటి చెత్తబండి వస్తే ,జట్కాబండి లోంచి దాన్లోకి మారి ‘’చూశారా కోచిబండీ ‘’అనేవారు .

  హోటల్లు ,అంగళ్లు,పచారీ కొట్లలోకిదూరి సామాన్లు కిందపడేసేవారు.గల్లాపెట్టె తెరచి డబ్బు వెద జల్లెవారు  .నాణాలు పేర్చి పిల్లల్లాగా ఆడేవారు .ఏమి చేసినా ఎవరూ స్వామిని ఒక్కమాట కూడా అనేవారుకాదు..స్వామికనపడితే చాలు అందరూ పాదాభి వందనం చేసేవారు .వచ్చినవారి బుద్ధులు మంచివికాకపోతే అక్కడినుంచి పారిపోయేవారు .వాళ్ళు బలవంతంగా వస్తే దుర్మార్గా పోపో అని చీదరించుకొనే వారు .మంచి వారితో మాట్లాడి ఆప్యాయంగా కౌగి లించుకోనేవారు .స్త్రీ పురుష భేదం లేదు స్వామికి .స్త్రీలమీద చేతులు వేసి తోసుకొంటూ నడిచేవారు .వారి ఒడిలో తలపెట్టుకొని పడుకొనేవారు .గబుక్కున లేచి నమస్కారం చేసి ‘’అమ్మా !నువ్వు మా అమ్మ కల్యాణిలా ఉన్నావు ‘’అనేవారు .ఆడవారందరికి స్వామి శిశువే .

  మధ్యాహ్న సూర్యుని తదేకంగా రాత్రి చంద్రుని చూస్తూ మంత్రాలు చదివేవారు .వర్షం ఆయనకు బహు హర్షం .ఆగితే కానీ అరుగుమీదకు చేరేవారుకాదు.రోడ్లమీద నీళ్ళల్లో ఎగురుతూ గంతులేసేవారు .గుడ్డల్ని పిండుకోనేవారుకాడు .అలానే తడిబట్టలతో ఉండేవారు .అన్నిటికీ పరమ నిర్లిప్తులు .జరిగే ప్రతి పెళ్ళికీ  హాజరై వధూవరులను తాకుతూ కూర్చుని నవ్వుతూ తెచ్చిన గంధమంతా పూసుకోనేవారు .దంపతులు పాదాలకు మొక్కితే  ‘’నూరేళ్ళు నూరేళ్ళు ‘’అంటూ వెళ్ళిపోయేవారు .ఎవరింట్లో పీనుగ లేచినా అక్కడా స్వామి  హాజరు .శవానికి ముందు వెళ్లి నమస్కరించేవారు.అశౌచం  ఎంగిలి మైల  ఏ కోశానా ఆయనకు లేనేలేవు. అదే అవధూత లక్షణం దత్తాత్రేయునిలా .

  ఒక్కోసారి స్వామికి తలంటి పోసేవారు టన్నులకొద్దీ నూనె తెచ్చి రాసేవారు .మధ్యలో లేచిపోయేవారు  .తైలమర్దనే తప్ప అభ్యంగనం ఉండేదికాదు  .అ వేషం తో పది రోజులు తిరిగేవారు .ఊరిలోని దుమ్ము అంతా ఆయన శరీరానికి పూసిన నూనెకు అ౦టుకోనేదిదట్టంగా .రామయ్య అనే ఆయనకు స్వామిపై అమితభక్తి .పదేళ్లుగా పరిచయం .కానీ స్వామికి ఆయన నిత్యనూతనుడే .కనిపించిన ప్రతిసారీ ‘’మీరెవరు ఏవూరు ‘’అని అడిగేవారు స్వతంత్రించి పరిచయం చేసుకొంటే ‘’చీచీ ఫో ఫో’’ అని చీదరించుకోనేవారు .స్వామిని చూడకుండా క్షణం ఉండగలిగే వాడు కాదు .ఎవరిముఖమైనా ఒక సారి చూస్తె వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ స్వామికి తెలిసిపోయేవి .ఒక్కో సారి పట్టించుకొనే వారు కాదు .కనుక ఆయన ముందుకు రావటానికి జనం భయపడేవారు .ఒక రోజు స్వామి వీధి అరుగుమీద కూర్చుంటే ,పోరుగూరిభక్తులు తిరువన్నా మలై వచ్చి స్వామిని చూడటానికి వస్తే ,అందులో ఒకడిని ‘’మహాపాపీ సొంతకోడలే నీకు భార్యా చీఫో ‘’అని ఉమ్మేశారు .వాడు గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు .వాళ్లకు తర్వాత స్వామి చెప్పింది నిజమే అని తెలిసింది .

  ‘’యర్వత్రానభి  స్నేహః ‘’అనే  గీతా వాక్యం ప్రకారం అందర్నీ సమానం గా స్నేహంగా చూసేవారు .ఆకలిదప్పులకు అతీతులు స్వామి ఒక్కోసారి నెలరోజులు ఉపవాసం .మరొక్కప్పుడు నలుగురు తినే భోజనం తినేసేవారు .సదా ముఖం పై ఎ భావం లేకుండా తిరిగేవారు .ఎవరరైనా  విస్తరేసి వడ్డిస్తే అంతాకలిపి ఒక ముద్దచేసి,కొన్ని పిడికిళ్ళు విస్తరికి అటూ ఇటూ చల్లి ,రెండుమూడు ముద్దలు నోట్లో వేసుకొనేవారు .లేకపోతె వడ్డన పూర్తీ అవగానే లేచిపోఎవారు .’’అన్నం అలా ఎందుకు చల్లుతారు అని అడిగితె ‘’యో భూతాఃప్రచర్తనిదివానక్తం  బలిమిచ్చంతొ’’అంటే బలి వేయకపోతే రుద్రుడికి కోపం వస్తుంది అనే వారు .ఇది దేవతలకు బలి అనేవారు .ఒకసారి అరుణాచలయ్యరు ‘’దేవతలా నాకు కనిపించటం లేదే ‘’అనగా ‘’సరిగ్గా చూడు స్తంభం ప్రక్కనే నిలబడి ఉన్నారు ‘’అన్నారు .అన్నాన్ని రోగగ్రస్తుడు పధ్యం తిన్నట్లు అయిష్టంగా తినేవారు .కంబత్తి లయనారు గుడికి రోజూ రాత్రిళ్ళు  వెళ్ళేవారు  .అక్కడ పాలగ్లాసులతో చెంబులతో జనం సిద్ధంగా ఉండేవారు .బ్రతిమాలో  బామాలో గ్లాసులు అందిస్తే కింద పోసేవారు ,లేదా పుక్కిలించి ఉమ్మేవారు పాలతోనే పళ్ళు తోముకోవటం,ముఖం కడుక్కొనే వారు .ఆయన చుట్టూ కుక్కలు మూగేవి .ఆపాలు ‘’శ్వాన’’ సంతర్పణ చేసేవారు స్వామి .పాలైనా పంచ భక్ష పరవాన్నాలైనా స్వామికి చాపల్యం లేదు .

   రామనాధ పురం మాణిక్యస్వామి కి శేషాద్రి స్వామి అంటే అమితప్రేమ.రోజూ ఊర్లో భిక్షం యెత్తి స్వామికి భోజనం పెట్టేవాడు .స్వామి తిన్నాకే తినేవాడు స్వామికనపదకపోతే భిక్షాన్నాన్ని జాగ్రత్త చేసేవాడు .ఒకరోజు రాత్రి  స్వామి గుడిలో కనిపిస్తే నాలుగునాల్లకిందటి భిక్షాన్నం పాత్రతో తెచ్చి ముందు పెట్టి మూత తీయగా భరించరానికంపు కొట్టింది .క్రిములు పో ర్లాడుతున్నాయి .ఎవ్వరూ దాన్ని తినరు తినలేరుకూడా .కనీస్వామి విస్తరిలో వడ్డించుకొని ,అక్కడివారు తినవద్దని ఎంత బ్రతిమాలినా వినక  మాణిక్యాన్ని కూడా తినమన్నారు  .మృష్టాన్నం తిన్నంత అనుభూతి చెందారు స్వాములిద్దరూ .

  స్వామి నిద్ర జయించారు .అర్ధరాత్రి ఆసనం వేసి సమాధి స్థితి పొందుతారు .ఎవరైనా కునికిపాట్లు పడుతుంటే ‘’నిద్రపోకు యముడు పట్టుకు పోతాడు ‘’అనేవారు .స్వామి అనుగ్రహం తో లాభపడిన ఒకాయన కృతజ్ఞతగా పది వేలరూపాయలు సమర్పించాలని కంబట్టి లయనారు గుడిలో స్వామి ఉంటె వెళ్లి దూదిపరుపుకొని  తెచ్చి ఇవ్వగా దాన్ని పడకకు కూర్చోటానికి భోజనానికీ వాడే వారు .అదీమురికి పట్టింది భక్తులు దానికీ నమస్కరించేవారు .ఈ శయ్యాగాధ1921నుంచి నాలుగేళ్ళు కొనసాగింది .

     మధ్యాహ్నం సాదు సత్రం పెరటిలో స్వామి విశ్రాంతి .తట్టాబుట్టా చీపురు వగైరాలమధ్యే సేద తీరేవారు .చీమలుకుట్టినా శేషశయనస్వామిలాగా పడుకొనేవారు  .ఎప్పుడూ కిటకిటలాడుతూ జనమే ఆయన చుట్టూ .విచిత్ర సంభాషణ చేస్తూ  అడ్డ దిడ్డంగా పొంతన లేకుండా మాట్లాడి తప్పించుకొని  వెళ్లి   వెళ్లిపోయేవారు స్వామి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా  నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా ఇంటికి వస్తే  శేషాద్రి  పెళ్లి విషయం లో నచ్చచెప్పమని కోరగా ,దానికోసమే వచ్చానన్నాడాయన .జపతపాలు ముగించిన శేషాద్రిని శాస్త్రి ‘’స్మశానం లో శాస్త్ర విరుద్ధంగా జపం చేస్తున్నావట’’అని గద్దిస్తే చేస్తేతప్పులేదన్నాడు శేషాద్రి .’’నేను నైష్టిక బ్రహ్మ చారిణి ఉపాసకులకు దేశకాలాలతోనిమిత్తం లేదు ‘’అనగా మాట్లాడ లేకపోయాడు ఆఘనాపాఠీ .శ్మశానం  నుంచి సరాసరి గృహస్తుల ఇంటికి రాకూడదు ‘’అనిఆయన అంటే ‘’మంచిది ‘’అని వెళ్ళిపోయాడు మళ్లీతిరిగి రాలేదు .ఏ గుడిలోనో ఉంటాడులే అని బాబాయ్ గుండె దిటవు చేసుకొన్నాడు .

ఒక రోజు శేషాద్రి గుడికి వెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే నలుగురు శిష్యులతో అపర దక్షిణా మూర్తిగా అనిపించే గౌడ  సన్యాసిని  శేషాద్రి  చూసి ,భావోద్రేకం కలుగగా ఆయన ‘’మా శుచః ఉపవిష ‘’అనగా అరుగుపై కూర్చోగా  ఆయన చూపులేఈయనకు దీక్ష అయ్యాయి .ఆయన విశేషాలను పట్టన్న అనే అతని ద్వారా తెలుసుకొని ,ఆయన బాలాజీస్వామి అని ,హరిద్వారం నుంచి రామేశ్వరం వెడుతూ కంచికి  వచ్చారని చెప్పగా స్వామికూడా శేషాద్రి వివరాలను అతని ద్వారాతెలుసుకొన్నారు .ఇద్దరూ శాస్త్ర చర్చ చేశారు .ఆయనకు సపర్యలు వీరిద్దరూ చేశారు .స్వామి వెళ్ళిపోతూ పట్టన్నకు దేవీ మంత్రం ,శేషాద్రికి సన్యాస దీక్ష ఇచ్చి వెళ్ళిపోయాడు .దీక్షగా సాధన చేశాడు శేషాద్రి .

  తండ్రి తద్దినం వచ్చింది .శేషాద్రిని ఎలాగైనా ఇంటికి తీసుకొని వచ్చి ఆయన తండ్రి తద్దినం పెట్టించాలనిరామస్వామి వెదకటం మొదలు పెట్టి పట్టుకోనివిషయం చెప్పి ఇంటికి రమ్మంటే ‘’నేను సన్యాసిని .కర్మలు ఎప్పుడో పోయాయి .నేనురాను ‘’అని చెప్పినా వినకుండా బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి గదిలో పెట్టి తాళం వేశాడు .తద్దినం పూర్తీ చేసి పితృ శేషం తిని వెళ్ళచ్చు అని తాళం చెవి రొ౦టిలో దోపుకున్నాడు .శేషాద్రి తమ్ముడు నరసింహ శ్రార్ధకర్మ నిర్వహించాడు .పిండాలకు నమస్కారం చేసే సమయం వచ్చింది  .రామస్వామి గది తాళం తీశాడు .శేషాద్రి గదిలో లేడు .అవాక్కయ్యాడు .ఊరంతా గాలించినా కనపడ లేదు .యోగశక్తితో గదినుంచి మాయంయ్యాడని గ్రహించారు అందరూ.అతడిని సామాన్యుడిగా భావించటం తమ తెలివి తక్కువ తనం అని గ్రహించారు .

  కొంతకాలానికి శేషాద్రి కంచికి ఇరవైమైళ్ళ దూరం లో ఉన్న కావేరీ పాకం లో ఉన్నట్లు వార్త వచ్చింది. అకక్కడ అతడి పెద్దమ్మ సుందరంబాళ్ ఉంటుంది ఆమె పదేళ్ళకొడుకు శేషు ఇతడిని చూసి తల్లితో చెప్పగా  వెళ్లి ఇంటికి రమ్మనగా ,రాను అంటే ఆమె రోజూ నుంచీ ఆహారం తెచ్చిచ్చేది.ఒక రోజు శేషాద్రీ, శేషు గుడి ప్రదక్షిణం చేస్తుంటే ,ఉత్తర ప్రాకారం గోడ దగ్గర పొన్న చెట్టుకింద ఒక పెద్ద పాము కనిపిస్తే ,పిల్లాడు భయపడి అరిస్తే పాము దగ్గరకుశేషాద్రి  వెళ్లగా ఆపాము అతనిపై ప్రాకి మెడ చుట్టూ మూడు సార్లు చుట్టుకొని ,శిరస్సును పడగతో కప్పేసింది .శేషాద్రికి పాముకరిచిందని ఏడుస్తూ వీధిలోకి శేషు పరిగెత్తాడు .జనం పోగయ్యారు నిశ్చలంగా భుజంగ భూషణుడుగా శేషాద్రి కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .శేషాద్రి ఇక్కడ ఉన్నాడని తెలిసి బాబాయి పిన్నీ చూడటానికి వచ్చారు .సమాధిలో ఏడు భూమికలు ఉంటాయి అవి శుభేచ్చ ,విచారణ ,తను మానసీ ,సత్వాపత్తి,సమసక్తి ,పదార్ధ భావన ,తుర్యగ.నాల్గవ భూమికలో ఉన్నవారిని బ్రహ్మ విదులనీ , అయిదు ఆరు ఏడు భూమికలలో ఉన్నవారిని బ్రహ్మ విద్వర ,బ్రహ్మ విద్వరీయ ,బ్రహ్మ విద్వరిష్టు లు అంటారు .సంకల్పం తో సమాధిలోకి వెళ్లి మళ్ళీ బయటికి రావటం అయిదవ భూమిక .ఇతరుల సాయం తో వస్తేఆరవ భూమిక .స్వేచ్చగాకానీ ఇతరులసాయం తోకానీ జాగృతి లోకి రాకపోవటం ఏడవ భూమిక .ఇప్పుడు శేషాద్రి ఆరవ భూమిక లో సమాధిలో ఉన్నాడు .

 చుట్టూ చేరినవారు ‘’నమః పార్వతీ పతయే హరహర మహా దేవ’’అని ఉచ్చైస్వరం తో పలుకగా శేషాద్రి కళ్ళు తెరిచాడు .పిన్నీ బాబాయి ‘’నాయనా !నీమహిమ తెలుసుకోలేక అపచారం చేశాం .నువ్వు ఇంటిపట్టున ఉంటేచాలు ‘’అని దుఖి౦చగా  వాళ్ళనే ఓదార్చి ఇంటికి పంపించేశాడు శేషాద్రి స్వామి .అప్పటి నుంచి ఆయనది అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితి .అదే జీవన్ముక్త స్థితి .ఆయన అందరి వాడే పశుపక్షాదులకు కూడా .ఆయన పాద ధూళి భవ బంధక విమోచనం అయింది .కావేరీ పాకం లో నెలరోజులు ఉండి,జనం పెరిగిపోగా ,ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి మూడు నెలలు ఎవరికీ ఆయన ఆచూకీ తెలియలేదు  .వందల వానిలో, చెంగల్పట్టు లో ఉన్నాడని వద౦తులొచ్చాయి .తర్వాత దిండీ వనం లో కనిపించాడు.మౌన దీక్షలో ఉన్నాడు .శివాలయం లోని యాగ శాలలో ఒక గది ఆయనకిచ్చారు .తాను నెలరోజులు ఆగదిలో ఉంటానని తలపు తాళం వేసుకోవచ్చనీ రాతపూర్వకంగా  చెప్పారుస్వామి .అలాగే చేశారు అర్చకులు అయిదు రోజులు గడిచాక ,ఆయన ఆగదిలో చనిపోతే సంప్రోక్షణ చేయాల్సి వస్తుందని భయపడి తాళం తీస్తే స్వామి నిశ్చల సమాధిలో కనిపించారు .ఇక ఇక్కడ లాభం లేదని శేషాద్రి స్వామి తిరువన్నామలైకు బయల్దేరి వాలాజీపేట ,వేలూరు అంబూరు ,తిరువత్తూరు ,జవ్వాజిమలె ,కన్నియం బాడి,పోరూరు మొదలైన ఊర్ల మీదుగా 1888లో పంచలింగ క్షేత్రం తిరు వన్నామలై చేరారు శేషాద్రిస్వామి తిరిగి తిరిగి అరుణా చలం లో స్థిరపడ్డారు .

వ్యాస మహర్షి అరుణా చలం గురించి –‘’లలాటే త్రై పున్డ్రీ నిటల ధృత కస్తూరి తిలకః –స్ఫురన్మాలాధారఃస్ఫురిత కటి కౌపీన వసనః –

దధానో దుస్తారాం శిరసి ఫణి రాజం శశి కలాం-ప్రదీపు స్సర్వేషాం అరుణ గిరి యోగీ విజయతే ‘’అనే ప్రసిద్ధ శ్లోకం రాశాడు .ఈ శ్లోఆన్ని రోజూ పారాయణ చేస్తే ముక్తిఖాయం అన్నారు శేషాద్రి స్వామి .

  అన్ని చోట్లూ వదిలేసి అరుణా చలం లో ఎందుకు స్థిరపడ్డారని శేషాద్రి స్వామిని అడిగితె ‘’ఇక్కడే కదా శివ ,శక్తులు మోక్షం మేము ఇస్తామంటే మేమిస్తాం అని పందాలు వేసుకొంటారు ‘’అన్నారు .అరుణా చలేశ్వరుని ఆలయం వెనక వేణుగోపాలస్వామి ఆలయం ఉంది .ఆయన వేణుగాన లహరిలో పరవశించి అరుణాచలుడు అచలుడు అయ్యాడని ఊహిస్తారు .ఈ క్షేత్రం లో ఒక చోటునే ఉండకుండా అంతటా తిరిగారు శేషాద్రి .ఆయనది నడక కాదు పరుగే .పగలూ రాత్రీ సంచారమే .సన్నిధి వీధిలో మొదటి ఇల్లు సూర్య నారాయణ శాస్త్రి గారిది .ఆయనకు స్వామి వివరాలు తెలుసు .స్వామి ఇక్కడికి వచ్చారని తెలిసి వెదకటం మొదలుపెట్టారాయన .ఒక రోజు మండపం వద్ద కలుసుకొన్నారు .దగ్గరలో ఏడు గాడిదలు మేస్తున్నాయి .వాటిని తాకి కళ్ళకు అద్దుకున్నారు స్వామి .ఎందుకు అలా చేశావ్ శేషాద్రీ అని శాస్త్రిగారు ప్రశ్నిస్తే ‘’ఇవి గాడిదలు కావు సప్తర్షులు ఇది వసిష్టుడు ఇది ఆస్త్యుడు ‘’అని చూపిస్తూ నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు శేషాద్రి .స్వామిని ఇంటికి రమ్మంటే ‘’ఫోఫో ‘’అని అదిలించారు .అది బాలోన్మత్తపిశాచవత్ స్థితి .ఆయన్ను పిచ్చివాడుఅని ఎవరూ అనుకోలేదిక్కడ .

   సశేషం –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-21

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 158వ కార్యక్రమం

“సరసభారతి 158వ కార్యక్రమంలో భాగంగా ఉగాది పురస్కారాలు ఆదివారం నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ సంవత్సరం ఏప్రియల్ 4వ తేదీ జరగవలసిన కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగ వాయిదావేసిన ది 27-6-2021 నాడు స్థానికులను ఆహ్వానించి వారికి ఉగాది పురస్కారాలను సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రంలో ముఖ్య అతిధిగా సరసభారతి గౌరవ అధ్యక్షులు శ్రీమతి శ్యామలాదేవి, జాగృతి కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి పామర్తి రాజీవి విచ్చేశారు. పురస్కార గ్రహీతలు శ్రీమతి జె శ్యామలాదేవి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. దివి చిన్మయ, విసిశ్ట్ట సామాజికవేత్త- మాజీ గురజాడ సర్పంచ్ శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ ప్రముఖ సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక సేవాకర్త శ్రీ వెంట్రప్రగడ వీరాంజనేయులు,ఇంటర్నేషనల్ బ్రాహ్మణ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర కార్యదర్శి శ్రీ దినవాహి నాగ ప్రసాద్ మా ఉయ్యూరు హ్యూమన్ కంప్యూటర్ బిల్ కలెక్టర్ (విద్యుత్ బిల్ ) శ్రీ ధేనువుకొండ సుధాకర్ రాజు, ఆయుర్వేద వైద్య సహాయకుడు శ్రీ వణుకూరు యజ్న గురుప్రసాద్ఎలెక్ట్రికల్ నిపునుడుశ్రీశిరిగుడి సురేష్ గార్లకు  సరసభారతి అధ్వర్యంలో ఘనంగా శాలువాతో,సరసభారతి పుస్తకాలతో  సత్కరించారు . ఈ కార్యక్రమంలో సరసభారతి కార్యదర్శి శ్రీమతి శివలక్ష్మి ,కోశాధికారి శ్రీ జివి రమణ పర్యవేక్షణలో కార్యక్రమ నిర్వహణ స్వామి వారల సమక్షం లో  జరిగింది”అనతరం అందరికి విందు ను ఏర్పాటు చేశారు . 

     గబ్బిట దుర్గా ప్రసాద్ 28-6-21-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు

 ఇవాళ జూన్ 27వ తెదిఆదివారం నా పుట్టిన రోజు .81  నిండి 82 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు,హితులకు  అందరికీ శుభ కామనలు  – మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-21-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3  

తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది  కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు  .సర్ పిటి త్యాగరాజ చెట్టి గారి తండ్రి పొట్టి మహాదేవ చెట్టి శాస్త్రిగారి వద్ద మంత్రోప దేశం పొంది ,విశేష ధనం ఆర్జించారు.గురు దక్షిణగా నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతే ,చిరునవ్వుతో వద్దని తీసుకోలేదు .అప్పటికి శాస్త్రిగారి వయసు 80.సర్ సిపి రామస్వామి అయ్యర్ మాతామహుడు శాస్త్రి గారిని భాగవత ప్రవచనం చేయమని కోరగా ,తన ఆరోగ్యం సరిగా లేదని మనవడు శేషాద్రిని పంపారు  .తల్లితోపాటు వెళ్లి ఒక్క ఏడాది కాలం శేషాద్రి అక్కడ భాగవత ప్రవచనం చేసి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు .

  శాస్త్రిగారి ఆరోగ్యం బాగా క్షీణించింది .మూడు నెలలు మంచం లోనే ఉన్నారు .తాతగారి ఆరోగ్యం కుడుబడగానే ,కంచికి వెళ్లి అక్కడ ఉపనిషద్ బ్రహ్మం అని పేరుపొందిన శ్రీ కృష్ణానంద స్వామిని ఆశ్రయించి శేషాద్రి తనకు సన్యాస దీక్ష ఇవ్వమని కోరాడు  .దీక్ష ఇవ్వగా ఆయన వద్ద వేదాంత శ్రవణ౦  చేశారు శేషాద్రి స్వామి మాధుకర వృత్తి చేబట్ట లేదు తల్లే కొడుకులిద్దరికీ వండి పెట్టేది .మూడు నెలల తర్వాత దామల్ అనే గ్రామం లో అక్కడ బ్రహ్మానంద మహర్షి పేరు తో కామకోటిశాస్త్రి గారు విదేహ ముక్తి చెందారు .

   మరకతం గారు చాలా ఉదాసీనంగా ఉండేవారు .ఎప్పుడూ మౌనమే ..మూడుపూటలాస్నానం ఎక్కువ కాలం ధ్యానం .ఏక భుక్తం .కొడుకు గుణాతిశయంపై అమిత ప్రేమ ఆమెకు..శేషాద్రికి 15వ ఈటా పెళ్లి చేయాలని అనుకొన్నది .రామల్ గ్రామం లో అతని మేనత్తకూతురు గుణవతి కాకిని ఉంది .ఆమెను కొడుక్కు చేసుకోవాలని తల్లి ఆరాటం వాళ్ళకూ ఇష్టమే .ఎవరినీ సంప్రదించకుండా ముహూర్తం పెట్టించమని అన్న రామ స్వామి జోష్యులతో సోదరి వెంకట లక్ష్మి  చెప్పింది  .ఆయన ‘’శేషాద్రి జీవితం లో పరివ్రాజక యోగం ఉంది సన్యాసి అవటం ఖాయం  .ఆపై నీఇష్టం ‘’అన్నాడు .అన్నమాటలకు తెల్లబోయింది .విఫలమై ఇంటికి వచ్చింది .జపం చేస్తున్న మరకతం చెవిలో ఈమాటలు పడ్డాయి .రామస్వామి చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని ఆమె విశ్వాసం ..పది రోజుల్లో కాకిని పెళ్లి జరిగిన వార్త తెలిసింది .విచారం పెరిగి ఏకభుక్తాన్ని వదిలి ఉపవాసం ఉండేది .చిక్కి శల్యమైంది .తమ్ముడు నరసింహ శాస్త్రి చనిపోయినట్లు కబురొచ్చింది .ఇవన్నీ కలిసి మరింతకు౦గి పోయి మంచమెక్కింది.నెలరోజులు సన్నిపాత జ్వరం తో బాధపడి౦ది. మందులూ మాకులు లేవు .కార్తీక శుక్ల దశమి నాడు కొడుకు శేషాద్రిని దగ్గరకు పిల్చి ‘’నాయనా ! నా పని అయిపొయింది .నన్ను వదిలి వెళ్ళకు ‘’అని హెచ్చరించి ,మర్నాడు  ఏకా దశి నాడు కొడుకును పిలిచి ‘’సత్సంగత్వే నిస్సంగత్వం ‘’శ్లోకం మూడు సార్లు చదివి ‘’కాశ్యా౦తు మరణాన్ముక్తిహ్ స్మరణాదరుణాచలే’’అని మూడు సార్లు అని శేషాద్రి చాతీని మూడు సార్లు చరఛి  చెప్పి ,అత డిని ‘’అంబ శివే ‘’కీర్తనపాడమని, పాడగా వింటూ తానూ పాడుతూ  ‘’అరుణా చల అరుణా చలా  అనుకొంటూ కొడుకుపై ఒరిగి ప్రాణాలు వదిలేసింది ..

  తల్లిమరణాన్ని తట్టుకొని ధీరోదాత్తత తో తమ్ముడు నరసింహం తోకలిసి మాతృ యజ్ఞం పూర్తీ చేశాడు .రామస్వామి జోశ్యులు భార్య కల్యాణి  ఈ సోదరులను జాగ్రత్తగా కనీ పెట్టుకొని ఉన్నారు .తనకున్న పిత్రార్జితం తో రామస్వామి ,స్వీయ ఆర్జనతో కుటుంబాన్ని ఏ లోటు రాకుండా పోషిస్తున్నాడు .శేషాద్రికి ఇంట్లో ఉండాలని పించలేదు. తన పూజా గృహం లో తానూ చిత్రించుకొన్న అరుణా చలేశ్వరుని చిత్రం ,కామాక్షీ దేవి శ్రీరామ పరివారం చిత్రాలు ఉంచి నిత్య పూజ చేసేవాడు .స్నానం చేసి పొద్దున్న 5గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం పన్నెండుకు కానీ లేచేవాడు కాదు .వేళకు భోజనం చేసేవాడుకాడు .కొన్నిరోజులు పూర్తి ఉపవాసమే .తాతగారు ఉపదేశించిన షోడశాక్షరిని తీవ్రంగా జపించేవాడు .గట్టిగా అరుణాచలేశ్వరా ,శోణాద్రి నాధా అని పిలిచేవాడు .రాత్రిళ్ళు దుర్గాసూక్తం చదివే వాడు  బ్రహ్మముహూర్తం లో నాలుగింటికే లేచి స్నానం చేసేవాడు .పినతండ్రి పినతల్లి ఆరోగ్యం కోసం సాధన తగ్గించుకోమని చెప్పినా వినే వాడు కాదు .ఇంట్లో కాక దేవాలయాలలో ఉంటూ ఉపవాసం చేసేవాడు .

  పూర్వం బాగా ఇష్టంగా శాస్త్ర చర్చలు చేసే శేషాద్రి ఇప్పుడు వాటికి దూరం గా ఉన్నాడు .ఎప్పుడూ స్నానం .జపం ధ్యానం .చక్రత్తాల్వార్ సన్నిధిలోఎదురుగానో ఉత్తరముఖంగానో కూర్చుని జపం చేసేవాడు .మధ్యాహ్నం పన్నెండు దాటాక కామాక్షీ దేవి దర్శనం చేసేవాడు .అనేక సార్లు మూకపంచశతి పారాయణ చేసేవాడు.వూరి వారు అందరూ నిద్రపోయాక ఇంటికి బయల్దేరేవాడు .రాత్రి ఉపవాసమే ..కుంకుమ విభూతి నుదుట పులుముకోనేవాడు .సూర్యుని చూసి సాగిలపడే వాడు. తనలో తానూ మాట్లాడుకోనేవాడు .వీధిలో కన్యలు కనిపిస్తే సాగిలపడి నమస్కరించేవాడు .పెద్దల పాదాలకు వంగి నమస్కారం చేసేవాడు .’’ఇదేమిటి శేషాద్రీ’’?అని అడిగితె ‘’బ్రాహ్మణ పాదాలూ భగవంతుని పాదాలు ఒకటే ‘’అనేవాడు .

   స్వామి ఊరేగింపుకు బయల్దేరి వస్తేదారిలో రాళ్ళు కాగితాలు ఏరి పారేసేవాడు గమ్యం లేకుండా పగలూ రాత్రీ ఒకటే తిరుగుడు .క్షురకర్మ లేదు. రాత్రి నిద్ర తక్కువ .ఎవరైనా  ఏంచేస్తున్నావు శేషాద్రీ?’’అని అడిగితె ‘’కర్మనాశనం కోసం జపం చేస్తున్నాను .ఏం జపం అని అడిగితె ‘’అ౦భస్య పారే ‘’  అనే నారాయణ ఉపనిషత్ లోని దాన్ని జపం చేస్తున్నాను ‘’కామో కార్షీత్ మన్యు రకార షీత్-కామః కరోతి నాహం కరోమి ‘’ని లక్ష ఆవృతులు చేశాను ఇంకా యాభై వేలున్నాయి .కర్మ క్షయం కాకపొతే మోక్షం రాదు ‘’అనేవాడు .పిచ్చిముదిరిందని అందరూ తీర్మానించారు .

  ఇంటిపోరు బయటిపోరు తీవ్రంకాగా ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని ,లేకపోతె శ్మశానాని కి వెళ్లి ఉపవాసం చేసేవాడు .ఉదయం సాయంత్రం ఇంట్లో జపం పూర్తిచేసి వేగవలె నదీ తీరం లోని స్మశానం చేరి ,మర్నాడు ఉదయం వరకు జపించి ఇంటికి వచ్చేవాడు .ఇలా చేస్తున్నట్లు పది రోజులదాకా ఎవరికీ తెలీదు .తెలిశాక ‘’అశుద్ధ ప్రదేశం లో జపం ఏమిటి ‘’అని అక్షేపిస్తే ‘’స్మశానం రుద్రభూమి .అక్కడ చేసే సాధనకు రుద్రుడు అనుకూలిస్తాడు .ఇతర చోట్ల వెయ్యి సార్లు చేస్తే ఎంతఫలితమో అక్కడ ఒక్క సారి చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది ‘’అనేవాడు .

  ఒకసారి శేషాద్రి బంధువులు అతడు ఇంట్లో ఒక  గదిలో ఉండగా బయట తాళం పెట్టారు .ఇది బాగుందని తానూ లోపల గడియపెట్టి నాలుగు రోజులు ఏకాంతంగా హాయిగా ధ్యానం లో మునిగిపోయాడు .అయిదవ రోజు తలుపు తెరిచి చూస్తె అతనిలో అలౌకిక శక్తి ఏదో అందరికీ గోచరించింది .ఒక శనివారం ఇంటి వారంతా తలంటి పోసుకోగా ,శేషాద్రి ఉదయం 10గంటలకు శ్మశానం నుంచి తిరిగి వచ్చి బాబాయి తలంటి పోసుకోమంటే వద్దనగా .బాబాయి తలంటి బట్టలు ఉదకటం శేషాద్రి పని .ఆయనతో బాగా చనువుగా ఉండేవాడు .’’ఇవాళ మీ బాబాయి తలంటు కొరట’’అంది పిన్ని .కారణం ఏమిటి అని అడిగితె ‘’నువ్వు ఇలాతిరగటం ఇష్టం లేక ‘’అనగా ‘’నా మీద అలగటం ఎందుకు ?ఎవరి దారి వారిదిగా ఉ౦ టేకలహాలు ఉండవుకదా ‘’అన్నాడు .పినతంద్రిని పిలిచి తలంటి పోస్తూ తలపై నూనె పెట్టి బయటికి వెళ్లి ఆకాశం వైపు చూసి లోపలి రాగా ఆకాశం లో ఏముంది చూడటానికి అని అడిగితె దేవతలను అనగా .దేవతలేనా గంధర్వులు కూడా ఉన్నారా అనగా, ఉన్నారు .వాళ్ళు ఏరాగం ఆలపిస్తున్నారని అంటే బిలహరి అన్నాడు ‘’నీకు పిచ్చి బాగా ముదిరింది రా .వాళ్ళు నాకు కనబడరేం ‘’అంటే ‘’కర్మిష్టులకు కనిపించరు .స్వస్థలంగా ఉన్నవారికే దర్శనమిస్తారు ‘’అనగా ‘’నీ వెర్రి వేయి విధాలుగా ఉంద’’ని బాబాయి స్నానానికి లేచాడు .అతడిపిచ్చికి పెళ్లి తగినమందు అనుకొన్నారు ఇంటివారంతా .

    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2

కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే తమ సంతానంగా గారాబంగా చూసుకోనేవారు .అన్నగారు చిదంబర శాస్త్రిగారికి వెంకట రమణ శాస్త్రి ,నరసింహ శాస్త్రి కుమారులు,సుందరాంబ, మరకతం పుత్రికలు ..పెద్దాయన వేదం వేదాంగాలలో నిష్ణాతుడు .పెళ్లి అయి పెద్ద వారి బలవంతం మీద దాంపత్యం చేసి ,కాశీకి వెళ్లి సన్యసించి ,1904లో సిద్ధిపొందారు .మిగతాముగ్గురు కన్నవారి ఆధీనంలోనే ఉన్నారు .

   అందం కుశాగ్రబుద్ధి ఉన్న మరకత౦ అంటే తండ్రికి మహా ప్రేమ ..కావ్యనాటకాలు ఆమెకు చెప్పించారు .యుక్తవయసురాగానే పురుకుత్స గోత్రీకుడు శ్రీ విద్యోపాసకుడు వరదరాజుకిచ్చి పెళ్లి చేశారు .వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేశారు .సౌందర్యలహరి మూక పంచశతి ఆమెకువాచో విదేయం .వివిధగ్రామాలనుండి వేదం శాస్త్రాలు నేర్వనికి విద్యార్ధులు  వీరింటికి వచ్చి గురుకులవాసంగా ఉండేవారు .కామకోటి వంశీకులు సత్యభాషణులు వారేమి చెప్పినా తప్పక జరిగేది .ఆ వంశం వారిని జోశ్యులు అనేవారు .వరదరాజు తమ్ముడు రామస్వామి అన్నకు సరి సాటైన వాడు .సోదరులకు అన్యోన్యత ఎక్కువ .

  వరద రాజు దంపతులకు సంతానం కలగలేదు .దానాలు హోమాలు తీర్ధయాత్రలు అన్నీ చేశారు .కామకోటి శాస్త్రి తమ ఆరాధ్య దేవత కామాక్షీ దేవిని కుమారునికి సంతాన భాగ్యం కలుగ జేయమని ఆర్తిగా ప్రార్ధించేవారు .ఒక రాత్రికలలో ‘’నాకు  వెన్న నైవేద్యం పెట్టు .నా జ్ఞానకళతో పుత్రుని అనుగ్రహిస్తా ‘’  ‘’అని చెప్పగా అలాగే చేయగా కొద్దికాలానికి మరకతం గర్భవతి అయింది .22-1-1870 శనివారం హస్తా నక్షత్రం కన్యా  రాశిలో  శిశువు జన్మించగా ‘’శేషాద్రి ‘’అని పేరుపెట్టారు ..

   రెండేళ్ళ వయసులోనే శేషాద్రి మిట్ట,పల్లాలు చూసుకోకుండా పరిగేత్తేవాడు  .తండ్రి వరదరాజుప్రక్క ధ్యానముద్రలో కూర్చునేవాడు .మూడవ ఏడు గురుస్తుతి మూక పంచశతిలో కొన్ని శ్లోకాలు నేర్పారు .తదేక ధ్యానం తో చదివేవాడు. అల్లరీ లేదు ఆగమూ ఎరుగడు .నాలుగవ ఏట తల్లి వైశాఖ ఉత్సవాలకు వరద రాస్వామి గుడికి  తీసుకు వెడితే ,అక్కడ ఒక అంగడిలో రెండు అంగుళాల బాలకృష్ణుని కంచు విగ్రహాలు చూసి ముచ్చటపడి అడిగితె అమ్మ దాన్ని 12పైసలకు కొన్నది  .అదే ఆవర్తకుడికి బోణీఆరోజు .ఆలయం లోదర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళారు .మర్నాడు ఉదయం తల్లీ కొడుకు ఆ వీధిలో వెడుతుంటే  నిన్నటి వర్తకుడు బాల శేషాద్రిని అమాంతం ఎత్తుకొని ముద్దాడి ‘’నీది బంగారు చేయ్యిరాబాబూ .బొమ్మల్ని ఇలా ముట్టుకోన్నావో లేదో ,నిన్న బొమ్మలన్నీ అమ్ముడు పోయాయి నీ బోణీ మంచిది ‘’అని మెచ్చాడు. అ రోజునుంచి శేషాద్రిని ‘’హిరణ్య బాహువు ‘’అని పిలిచేవారు అందరూ .ఆ బాలకృష్ణ విగ్రహం ఆయన దేవతార్చనలో చాలా ఏళ్ళు ఉండి పోయింది .ఇప్పటికీ ఆ వంశీయుల చేత పూజలు  అందు కొంటో౦ది.

  అయిదవ ఏట మంచి ముహూర్తం లో అక్షరాభ్యాసం చేశాక ,ఆయుష్యహోమం జిరిపి శ్రీ విద్యా గురువులైన తాతగారు కామకోటి శాస్త్రిగారిచేత కుశాగ్రం తో శేషాద్రి నాలుకపై సారస్వత మహాబీజం ,సారస్వత దశ శ్లోక మంత్రం ఉల్లేఖింప జేశారు .ఆ మంత్రం తో అభిమంత్రించిన ఆవుపాలను అన్నప్రాసనగా చేయించారు .కాగితం పై పంచాక్షరి అష్టాక్షరి వ్రాసి బాలునితో మూడు సార్లు అనుశ్రావిక పద్ధతిలో ఉపదేశించారు .విద్వాంసులకు బహుమానాలిచ్చి పిల్లవానిని ఆశీర్వ ది౦చ మని కోరారు .తర్వాత బడికి పంపారు .అమరకోశం మూడుకా౦డలను ఒక్క నెలలోనే నేర్చేశాడు .మూడేళ్ళు అయ్యేసరికి కావ్యాలు చంపువు ,నాటక అల౦కా రాదులలో  రాటు దేరి అసామాన్య పాండిత్యం సాధించాడు .తమిళ గ్రంథాలు,కంబ రామాయణం ,తిరుకురళ్,నాలడియార్ లలో విశేష పాండిత్యం పొంది కరతలామలకం చెసుఒన్న అసమాన ప్రజ్ఞా దురీండు బాలమేధావి శేషాద్రి .

  విద్వత్ సభలలో శేషాద్రి పేరు మారు మోగింది .ఏ విషయం మీదైనా ధారాళంగా శ్రావ్యంగా ప్రసంగించేవాడు .కండగల కవిత్వమూ చెప్పేవాడు .ఉపనయనం తర్వాత తర్క వ్యాకరణాల అంతు చూశాడు.తాతగారి వద్ద .కొన్ని మంత్రం రహస్యాలు నేర్చాడు .ప్రస్థానత్రయం అభ్యసించాడు .వేద పాఠశాలలో క్రమాంత వేదాధ్యయనం పూర్తీ చేశాడు .న్యాయ శాస్త్రం నేర్చాడు .

 రోజూ విద్యాలయానికి వెళ్ళే ముందు తండ్రికి నమస్కరించి వెళ్ళేవాడు .ఒకరోజు అలా చేస్తుంటే తండ్రి వరద రాజుకు భావోద్రేకం తీవ్రమై ‘’నాయనా !రోజు ఎందుకురా నమస్కారం నాకు .మీ అమ్మకు నమస్కరించు అది చాలు ‘’అన్నాడు ‘’నాకు మీరిద్దరూ సమానమే నాన్నగారూ .భక్తీ ,ప్రీతి లలో తేడా చూపలేను ‘’‘’అని వెళ్ళాడు .కొడుకు వెళ్ళగానే భార్య మరకతః౦ తో ‘’పండంటి బిడ్డను కన్నావు దా౦పత్యం లో నాకు సహధర్మ చారిణివి గా పేరుపొందావు తమ్ముడికి సంతానం లేదు  మన నరసింహ ను దత్తత చేసుకోవాలని అనుకొంటున్నాడు .వాడి కోర్కె తీర్చటం మన విధి .కొద్దికాలం లో శేషాద్రి ప్రఖ్యతుడౌతాడు .నాకు ఇహలోక యాత్ర చాలించటానికి సమయమైంది అని అమ్మవారు చెప్పారు .ఇవాళో రేపో నేను వెళ్ళిపోతాను .శేషాద్రి బాగా లబ్ధ పరతిష్టుడు అయ్యాక ఆ ఆనందం చూసి నువ్వు కైవల్యం పొందుతావు ‘’అన్నాడు వరదరాజు భార్య మరకతం తో . ఆమాటలు విని ఆమె మూర్చపోయింది .తేరుకున్నాక ‘’ధైర్యం కోల్పోకు. అన్నిటికీ ఈశ్వరుడినే నమ్ము .ఆయన ఇచ్చప్రకారమే అంతా జరుగుతుంది ‘’అని చెప్పి ఊరడించాడు .

  మర్నాడు యధా ప్రకారం నియమప్రకారం కార్యక్రమాలు పూర్తీ చేసి  భోజనం చేసి ఉపనిషత్తులు చదువుకొని ,ప్రదోష కాలం లో ఏకామ్రనాధుని దర్శించి ,ఇంటికి వచ్చి ఏమీ తీసుకోలేదు .కాసేపటికి అతిసార విరేచనం అయి అందరూ ఆయన అనుకోన్నట్లే అవుతుందేమో నని భయపడుతూ గుడ్ల నీరు కుక్కుకొని బొమ్మల్లా నిలబడ్డారు .దుఃఖిస్తున్న శేషాద్రిని దగ్గరకు పిల్చి’’నాయనా ! అతి సారం లో కొన ఊపిరి ఉన్నంతవరకు జ్ఞాపక శక్తి పోదు ..’’అతి సారేతు మరణం యోగినా మపి దుర్లభం ‘’ అన్నారు పెద్దలు .నా అదృష్టం కొద్దీ ఆ వ్యాధి నాకు వచ్చింది .ఇక మనసు తత్త్వం పై లగ్నం చేస్తాను .ఎన్ని శాస్త్రాలు చదివినా అనుభవ జ్ఞానానికి మించింది లేదు అని గుర్తుంచుకో .అన్నిజ్ఞానాలలో అదే గొప్ప ‘’అని బోధించి ధ్యానమగ్నుడై వరదరాజు దేహ త్యాగం చేశాడు .తండ్రి మరణం తో శేషాద్రికి దుఖం తోపాటు ,వైరాగ్యమూ కలిగింది ‘.

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1

శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి శ్రీ వెంకట రమణ ప్రెస్ లో శ్రీ నల సంవత్సరం జ్యేష్టమాసం లో 1976 జూన్ లో ముద్రించారు .వెల అయిదు రూపాయలు .

  ఎవరీ వెంకటాద్రి స్వామి ? తిరువన్నామలై లోని అరుణా చల క్షేత్రం లో ని జనులకు భగవాన్ రమణ మహర్షి సూర్యుడు అయితే, శ్రీ  వెంకటాద్రి స్వామి చంద్రుడు .స్వామి ఉపదేశాలను కావ్యకంఠ గణపతి ముని చందోబద్ధం చేశారు .అనేక సిద్ధులు పొందిన మహనీయులు స్వామి .తెలుగులో రమణ లీలలు ,గణపతి ముని చరిత్ర ఉన్నాయి కాని స్వామి చరిత్ర తెలుగులో లేకపోవటం లోటుగా భావించి తాను  నారాయణ శాస్త్రి గారు తమిళం లో రాసిన స్వామి చరిత్రను అనువాదం చేయాలనుకొని కంచి శ్రీ పరమాచార్యు ల వారికి విన్నవించగా ‘’రామకృష్ణ పరమ హంస ,వివేకానందులు రాగ భక్తిలో భగవారాధన చేశారు .శ్రీ రమణులు చిన్నతనం లోనే అద్వైతానుభూతి పొండి ఒక విశిష్టమార్గం త్రోక్కారు .అరవిందుల విధానం వేరు .సదా శివ బ్రహ్మేన్ద్రులు వేంకటాద్రి స్వామి మొదట వైదికం గా ఉంటూ ,తర్వాత దాన్ని అధిగమించి అవదూతలైనారు .వైదిక నిష్టలో ఉండేవారికి ఆదారి వదలటం మహా కష్టమే .ఒక్కొక్కరిది ఒక్కో త్రోవ .అనువాద రూపంగా శేషాద్రి స్వామి వారి కైంకర్యం చేయతగినదే ‘’అని ప్రోత్సహించి దీవించారు .తమిళం లో ఉన్న స్వామి చరిత్రను ‘’శ్రీ శేషాద్రి స్వామి అధిష్టాన సభ –ఊన్జలూరు ప్రచురించారు .శ్రీ కులు౦దై ఆనందస్వామి ఆ చరితలోని కొన్ని విశేషాలను వ్యాసాలుగా తమిళ పత్రికలలో రాశారు .స్వామి చరిత్రను ఆమూలాగ్రం తెలుగులో అనువాదం చేసి ప్రచురించటానికి  ఆ  ఆదిష్టాన సభ వారు   అంగీకరించారు .అలా తెలుగులోకి వెలుగు చూసింది స్వామి చరిత్ర .

  పరమ భాగవతోత్తములు ,అద్వైతామృత ప్రసారకులు మచిలీపట్నం కాలేజి ప్రిన్సిపాల్ ఎందరికో మార్గదర్శి బహు గ్రంధకర్త  లలితా పరాభాట్టారిక అమ్మావరి ఉపాసకులు శ్రీ భాగవుల కుటుంబ రావు గారు  ఆంగ్లం లో సవివరమైన ఉపోద్ఘాతం రాశారు .దాని సారాంశం క్లుప్తంగా తెలుగులో తెలుసు కొందాం .’’స్వామి కల్పిత వ్యక్తికాదు 1870లో పుట్టి 20వ శతాబ్దం లో  సిద్ధిపొందారు .వారి అనుగ్రహ పాత్రులు కూడా ఆకాలన వారే .ఆధ్యాత్మిక చింతన కల ముముక్షువులకు ఈ గ్రంథ౦ అమూల్యమైనది .స్వామివారు బాల్యం లోనే వేదం శాస్త్రాలు సాధించారు .జ్ఞాన సిద్ధి కలిగే దాకా జపం అనుష్టానం కొన సాగించారు .చనిపోయిన తన తల్లికి కర్మకాడ చేశారు .శంకర భగవత్పాదులు లాగానే .తర్వాత జ్ఞానియై ‘’రమతే బాలోన్మత్తవ దేవ’’అన్నసూక్తి స్వామివారికి సరిగ్గా సరిపోయింది .వ్యాసకుమారుడు శ్రీ శుకమహర్షిని చూసి స్త్రీలు సిగ్గుపడకపోవటం భాగవతం లోని కథా విశేషం..శ్రీ శేషాద్రి స్వామి స్పృశించినా స్త్రీలు మనో వికారం పొందక  పోవటం 19-20 శతాబ్దులలో అపూర్వ విషయం యదార్ధం .ఈ రోజుల్లో సామాన్య సిద్దులున్నవారే దూర దర్శన దూర శ్రవణాలు కలిగిఉంటే అపూర్వ సిద్ధులు పొందిన మన స్వామి వారికి అవి పుష్కలంగా ఉన్నాయి అనటానికి సందేహమే లేదు .

  స్వామి అనేక శక్తులు కలిగి ఉండచ్చు అనేకులకు మార్గ దర్శనం చేసి ఉండచ్చు మహా తపస్సంపన్నులు అయి ఉండవచ్చు .అంతమాత్రాన ఆయన చరిత్ర చదవాలా అని పిస్తుంది .ఒక భక్తుడు ప్రార్ధిస్తే ,స్వామి అనుగ్రహిస్తే వర్షం కురిసింది ..క్షణ కాలం లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా నేటి సైన్స్ కు అలా కురిపించే సత్తా ఉందా ?.అది దేశ క్షేమానికేగా జరిగింది .ఇంతకుముందున్న శ్రీ శృంగేరి శంకరాచార్యుల చరిత్రలో ఇలాంటి మహిమలున్నాయి .వారు శృంగేరిలో వరదలు నివారించారు .ప్రధమ రాష్ట్ర పతి శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరిని సందర్శించినపుడు విపరీతం గా కురిసే వర్షాలను ఆపివేశారు .అందుకే దేశ క్షేమానికి భౌతికశక్తి చాలదు ఆధ్యాత్మిక శక్తికూడా కావాలని మన శాస్త్రాలు ద్ఘోషించాయి  .పరాతి సంధానం,అభ్యాసం చేసే  రాజకీయ నాయకులు ఒకరే చాలరు .శ్రీ శేషాద్రి స్వామి శ్రీ రమణులు ,శ్రీ శృంగేరి విద్యా శంకర భారతి ,శ్రీ కంచి చంద్ర శేఖరేంద్ర సరస్వతి వంటి మహనీయులు కూదాదేశానికి అవసరం .రాజేంద్ర ప్రసాద్ గారిలాంటి రాజర్షులు కావాలి .ఈ విషయాలను స్వామి చరిత్ర మనకు బోధిస్తుంది .

  జీవన్ముక్తి ఉందా లేదా స్థిత ప్రజ్ఞులు ఎలా ఉంటారు అన్న ప్రశ్నలకు స్వామి చరిత్ర సజీవ సమాధానం చెబుతుంది .అటు రమణ మహర్షి ఇటు వెంకటాద్రి స్వామి ఇద్దరూ జీవన్ముక్తులే .కాని విభిన్న రీతులలో కనిపించారు అంతే..స్వామివారి బోధలు ఉపవాసం నిరాహారం అంటే ఏమిటి వివరాలున్నాయి .మనకు జీవితం లో వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మార్గ దర్శక సూత్రాలు అన్నీ  ఉన్నాయి .స్వామి భగవదంశగా జన్మించారు .అంటే వారి చరిత్ర భగవంతుని చరిత్రే .భక్తులకు సర్వ దేవతా రూపంగా కనిపించారు .ఆయన కీర్తనం భగవద్గుణ కీర్తనమే .దయా సింధువు అయిన స్వామి  ఇప్పటికీ భక్తులను ఆవేశించి హితబోధ చేస్తున్నారు .శ్రీ విశాఖ గారి అనువాదం వలన ఆంధ్రులకు శ్రీ వెంకటాద్రి స్వామి మరింత సన్నిహితులౌతారు –‘’శాంతా మహంతోనివసంతి సంతః –వసంత వల్లోక హితం చర౦తి’’ ‘’అన్నారు శ్రీ త్రిపురారహస్యం  వంటి ఉత్తమోత్తమ గ్రంథాలు రాసిన  డా భాగవతుల కుటుంబ రావు గారు .

   తిరు వన్నామలై లో శ్రీ శేషాద్రి స్వామి –జీవుడు –ఉపాధి అను సందానకర్తలు 25పేజీల భాగవతుల వారి ఇంగ్లీష్ రచనకు శ్రీ విశాఖ గారు చేసిన తెలుగు అనువాదం లో మరి కొన్ని విశేషాలు .’’ప్రముఖ ఆంగ్లకవి లాంగ్ ఫెలో  తన కవితలో ‘’మనం మనజీవితాలను మహోన్నతంగా చేసుకో గలం.మరణకాలం లో కాలం అనే ఇసుకమీద మన పాదముద్రలను మనవెనక వదలగలం .’’అని మహాపురుషుల ఈవితాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అన్నాడు .సిద్ధపురుషులు శ్రీ శేషాద్రి స్వామి స్థిత ప్రజ్ఞులు .  జీవితమంతా తిరువన్నామలై లోనే గడిపి అక్కడే తుది శ్వాస వదిలిన మహాత్ములు .చిన్నతనం లో ఆయనను తల్లి ఒక దేవాలయానికి తీసుకు వెడితే .అక్కడ కంచు కృష్ణుని విగ్రహాలు 12పైసలకు అమ్ముతుంటే ఒక విగ్రహం కొన్నారు .ఆరోజు ఆవర్తకుని దగ్గరున్న విగ్రహాలన్నీ అమ్ముడు పోయాయి .అతడు ఆశ్చర్యంతో బాల వెంకటాద్రి దగ్గరకొచ్చి అతనిని అభినదించాడు 14వ ఏట తండ్రి చనిపోతే తల్లి మరకతాంబ ఆయన్ను తమ్ముడు నరసింహ ను  పెంచింది .శేషాద్రికి గొప్ప భవిష్యత్తు ఉందని తాతగారు చెప్పారు .పుట్టుజ్ఞాని అయిన శేషాద్రి అన్నీ అతి త్వరలోనే నేర్చుకొని సర్వ శాస్త్ర పారంగతుడైనాడు .దేవాలయానికి లేక స్మశానానికి వెళ్లి జపం చేసేవాడు .తల్లి వివాహ విషయం తెస్తే వద్దనే వాడు .ప్రపంచ విషయాలన్నీ అవగతం చేసుకొన్నాడు .గదిలో ఉంచి తాళం వేస్తె గదిలో లేడు.అన్నంమీద శ్రద్ధ లేదు.నేలమీదా రాళ్ళపైనా పడుకొనే వాడు .పిలిచిన వారింటికి కాకుండా పిలవని వారింటికి వెళ్ళేవాడు ఇదే అదును అనుకొని తల్లి ఒకరోజు ‘’సత్సంగత్వే నిస్సంగత్వం ‘’అనే శంకరాచార్య భజగోవింద శ్లోకం చదివి,అరుణా చల అని మూడు సార్లు పలికి,కళ్ళు మూసింది .అదే ఆమె చివరి ఉపదేశం అనిపిస్తుంది .

  తర్వాత అరుణాచలం వెళ్లి 40 ఏళ్ళ శేష జీవితాన్ని అక్కడే గడిపారు వెంకటాద్రిస్వామి  1929లో అక్కడే సిద్ధిపొందారు .అక్కడ ఏ దేవాలయానికీ వెళ్ళేవారు కాదు వీధుల్లో తిరిగేవారు .సిద్ధిపొందాకకూడా ప్రజలతో సంబంధం కలిగి ఉన్నారు .ఈరోడ్ రైలు స్టేషన్ కు రెండుమైళ్ళ దూరం లో ఉన్న వీరప్పన్ సత్రం లో ఉంటున్న శ్రీ శివరామ కృష్ణయ్యర్ లో ఆవేశించారు .ఈయన తల్లికావేరి అమ్మాళ్ .పవిత్ర చరిత్రురాలు .భర్త  రెవెన్యు ఉద్యోగి .వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరుకుమారులు .చివరివాడే శివరామ కృష్ణ .కావేరి అమ్మాళ్ 40 ఏళ్ళు అన్నం తిననే  లేదు .సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు .పళ్ళు పాలు మంచిగంధం కలిపిన నీళ్ళు ఆమె ఆహారం .తిరువాస నల్లూరు లోని శ్రీ అయ్యవల్ లాగా దివ్య శక్తుల్ని సాధించింది .ఆమె ఇంటికి కావేరినది ఒక మైలు దూరం .వెళ్ళలేక పొతే కావేరి ఆమె పూజాగృహం పైనుంచి ప్రవహింప జేసి స్నానం చేసేది .ఆమె బ్రతికి ఉండగా ఆశక్తులు ఎవరికీ తెలియదు .

  ఒకసారి తిరువన్నామలై వెళ్లి ఒక సత్రం లో ఉదయం పూజలో ఉండగా శ్రీ శేషాద్రి స్వామి అకస్మాత్తుగా వచ్చి ఆకలిగా ఉంది ఆహారం కావాలి అంటే నైవేద్యపు అరటిపండు ఇస్తే సగం తినగా ఏడేళ్ళ శివరామ కృష్ణయ్యర్ అక్కడికి రాగా స్వామి మిగిలిన సగం ప౦డు ఆతని నోట్లో కుక్కారు  .అది ఆబాలుడికి ఇచ్చిన దీక్ష ఏమో అప్పటినుంచి అయ్యర్ గారే వెంకటాద్రిస్వామి స్పిరిట్ గా ఆవేశించారు .ఇదే స్పిరిట్ మీడియం ..20ఏళ్ళు గడిచాయి. కావేరి అమ్మాళ్ కోరగానే స్వామి కలలో  కనిపి౦చి ,తాను  భూతమై అంటే స్పిరిట్ గా అయ్యర్ దేహం లో ఉన్నానని చెప్పారు .ఆస్పిరిట్ స్వామి మాట్లాడినట్లే మాట్లాడేది .అవే హావభావాలు కూడా .ఒక గేము లాఆడేవారు .ఒకపల్చని కొయ్యపలక ,దాని వెనక అడుగున ఉన్న రెండు లంకేలపై ఉంటుంది దానిముందు ఒకభాగం పై ఒక రంధ్రం అందులో పెట్టటానికి ఒక పెన్సిల్ ఉంటాయి .పలక కింద తెల్ల కాగితం పెడతారు .మొదట అయ్యర్ ఆ పలక తాకే వాడు .ఆయనలో ఆవేశించిన స్వామి పలకను నడిపేది అప్పుడు కాగితం పై పెన్సిల్ రాసిన అక్షరాలూ కనిపించేవి .అ౦దులోస్వామి సందేశం ఉండేది .కొంతకాలం తర్వాత  కాగితం తీసేశారు .అయ్యార కే ఏమి రాయాలలో  స్పురిం చేది.దాన్ని చెప్పేవాడు.అయ్యర్ ముఖతా  శ్రోతలు స్వామి వారి రెండుమూడు గంటల ఉపన్యాసం వినగలిగేవారు. అవి ప్రామాణిక ఉపదేశాలు .సామాన్యంగా అయ్యర్ మామూలుగా నే ఉండేవారు సమాదిలోనే స్వామి ఆవేశించేవారు .ఆ కొయ్య పలక సహాయంతోనే స్వామి వారి ఉప దేశాను ఒక పెద్ద పుస్తకం లో ఒక చిన్న పుస్తకం లో అయ్యర్ రాశారు .వీటిని’’ జీవ్య ప్రదర్శిని’’,అనేపేరుతో మొదట ఆతర్వాత ‘’మోక్ష ప్రదర్శిని ‘’అనే పేరుతొ తమిళ మాసపత్రియాలో ప్రచురించారు .ఆతర్వాత స్వామి వారి శిష్యులు శ్రీ శేషాద్రి స్వామిగళ్ అధిష్టానం అసోసియేషన్-ఉంజులూరు ‘’ గా ఏర్పడి వీటిని ప్రచురించి ,స్వామివారి సమాధి కూడా నిర్మించారు .ఇక్కడ శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుగుతాయి .మధురలో ఉంటున్న సిద్ధపురుషులు శ్రీ కులం కుడై ఆనంద స్వామి 1932లో శరేరం చాలించి ,ఆయనకూడా అయ్యర్ర్ శరీర౦ లో  లో ఆవేశిచేవారు .మధురలోని అరసవాది లో వీరి సమాధి నిర్మించారు .

  శివరామ క్రిష్ణయర్ గారు 61వ ఏట 3-3-1974 న మరణించారు .తనకుమారునిలో ఆయన శేషాద్రి స్వామి  స్పిరిట్ గా ఉన్నారు.ఇప్పుడుకూడా ఆస్పిరిట్ రూపం లో వారి బోధలు వినగలం .శ్రీ కుజుమణి నారాయణ శాస్త్రిగారు శేషాద్రి స్వామివారితో సన్నిహితంగా మెలగినవారు .వీరు తమిళం లో స్వామి వారి జీవిత చరిత్ర రాయకపోతే ఎవరికీ తెలిసేదికాదు ..దీన్ని తెలుగులోకి సరళభాషలో అనువదించిన శ్రీ విశాఖ మహోపకారం చేశారు ‘’అని భాగవతుల కుటుంబరావు గారు గొప్ప సందేశాన్ని ముందు మాటలుగా  రాసి మహోపకారం చేశారు .

  సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకు

స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకుΟ

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

గర్త పురి అనే  గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక కన్నుంగా జెలగంగ లో –క గురుత్వంబును గన్న నీవన  ,నరోగత్వోరుధీ సత్ప్రభా-వాది గుణ౦బుల్ దయ సేసినట్టి వాడు ‘’.ఆయన లులాయాసుర హారిణీపుడు..మొక్కగానే దనం యశం ,సౌఖ్యం ఇచ్చే వేలుపు .కామారి అయినా ‘’మేనసగంబు భార్యకు ఇచ్చినవాడు .

‘’జ్వాలాజ్వాల జటాలమై  యటు జగజ్జాలంబు గాల్పంగ-నా –క్ష్వేళ౦ బెంతో విజ్రు౦ భిలన్ ‘’సురపతులు వచ్చి కావుమని ప్రార్ధిస్తే ‘’కడు వేవే నుంచి నావయ్య సల్లీలం గొంతున నీల కంఠ’’అని స్తుతించారు గుప్తా గారు  .నత్కీరుని కాచిన పరమ దయాశాలి శూలి ..’’నీవే హరి నీవే బ్రహ్మ ,మాద్యత్సకలాబ్జ జా౦డములు  నీవే ‘అంటారు కవి .’’వందేర్ధే౦దు కళాపరి ష్క్కృత  జతాభారాయ భావాయ , వా-తాన్ధఃపాలక కంకణాయ  భవతే ధర్మాస్థిరాయేతి’’అనే శోకం లో సగ భాగాన్ని శార్దూలపద్యం లో ప్రారంభించి మంచి ముగింపు ఇచ్చారు .

  తర్వాత గుడి కట్టించిన ఉప్పుటూరి పున్నయ్య గారి  గురించి వారి వంశాన్ని గురించి వారు చేసిన దాత్మిక కార్యక్రమాల గురించి కమ్మని పద్యాలలో వివరించారు  కవి  .ఫలశ్రుతి కూడా చెప్పారు .చివరగా ‘’ఇది శ్రీతు౦గ భద్రాతీరవిరాజమాన కందనవోల్మందిర శ్రీ రామ చంద్ర పరమాత్మ పాదార వింద మరందపా నెంది౦దిరాయమానస దోమ గోవి౦దాఖ్యార్య  వైశ్య శ్రేష్ఠ జ్యేష్టాత్మజాంధ్ర విద్యా వాచస్పతి సాహిత్య సరస్వతి ,శాతావదానీ దోమా వెంకట స్వామి గుప్త ప్రణీత గురు నాథశతకం’’అని మా మాస్టారు గుప్తా గారు శతకాన్ని ముగించారు .శతకం లో 125పద్యాలను  వివిధ ఛందస్సులలో రాశారు ..పద్యం పరిగెత్తటమే కానీ ఎక్కడా కుంటి నడక లేదు .శాతావదానికదా .ఆశువు లో దిట్టతనం బాగానే ఉండి ఉంటుంది .లోకరీతిని కాచి వడబోసిన అనుభవం పద్యాలలో ప్రవహించింది .వారి శివభక్తికి తార్కాణగా నిలిచింది ఈ శతకం . .’కందంలో అందంగా రాసిన 124 వపద్యం –‘’శ్రీ గర్తపురి నిలయా –భోగి వలయ ,కువలయహిత పుష్పా ,విజయా

భోగ శ్రీకర సదయా –త్మా,గిరిజా౦బా సనాధ,హర గురు నాధా’’

మా మాస్టారు గుప్తా గారి గురించి నిన్న రాసిన దానికి అనుబంధంగా మరికోన్నిమాటలు .ఆయన హాఫ్ స్లీవ్ కోటు వేసేవారు .తెల్లగోడుగు ఎప్పుడూ చేతిలో ఉండేది .నడక మహా నిమ్మది.ఆయన గొప్ప పంచాంగ కర్తగా లోకం లో సుప్రసిద్ధులు .గుప్తా గారి పంచాంగం అంటే హాట్ కేకుల్లా ఆకాలం లో అమ్ముడు పోయేవి అంటే వారి పంచాంగ గణనం యెంత నిర్దుష్టం గా ఉండేదో తెలుస్తుంది .65 సంవత్సరాలక్రితం మాకు విద్యాబోధన చేసిన మాస్టారు గుప్తా గారి శతకాన్ని పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను .

  మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -23-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి  వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు  .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము గారి చే గుంటూరు తిలక్ పేటలో  స్థాపింపబడిన ‘’శ్రీ గురునాదేశ్వర స్వామిపై రాసిన శతకం అని కవి పేర్కొన్నారు .తన విజ్ఞాపన లో కవి గుప్తాగారు ‘’గుంటూరులోని ఉప్పుటూరి  వెంకట పున్నయ్యగారు విఖ్యాత వైశ్యులు .బ్రాహ్మణ, వైశ్యులకు అన్నసత్రాలు కట్టించిన వారు .కన్యకాంబ నిత్య నైవేద్యానికి కొరత లేకుండా చేసినవారు. ఎన్నో చోట్ల చలువ పందిళ్ళు నిర్మించారు .మంగళగిరి పానకాల నరసింహ స్వామి ,నెల్లూరు శ్రీ రంగనాధ దేవాలయాలకు గోపుర ,కలశాదులు ఏర్పాటు చేశారు .తాడికొండ క్రాస్ రోడ్ లో తటాకం నిర్మించారు ..ఎన్నో బ్రాహ్మణ వైశ్య బాలురకు  ఉపనయనాలు చేయించారు .శివాలయ నిర్మాణం లింగ ప్రతిష్ట సంకల్పించారు  .వారు కాలధర్మం  చెందారు .ఆలయ నిర్మాణ బాధ్యత అన్నకుమారుడు శ్రీ ఉప్పుటూరి పున్నయ్యగారికి అప్పగించారు ..తానుకూడా కొంత ద్రవ్యం ఖర్చు చేసి శ్రీ గురు  నాదేశ్వరాలయ నిర్మాణం పూర్తీ చేశారు .ఈ శతకం రాయటానికి ప్రోత్సాహం పున్నయ్యగారే ‘’అని శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు తెలియ జేశారు .

  శ్రీ దోమా వెంకటస్వామి గుప్తాగారు  నేను విజయవాడ  లో ఎస్ ఆర్ ఆర్ సివిఆర్ కాలేజిలో ఇంటర్ చదువుతున్నప్పుడు తెలుగు ట్యూటర్ గా పని చేశారు .పొట్టిగా ,లావుగా పంచ కట్టు హాఫ్ హాండ్ చొక్కా ఉత్తరీయం తో ,ముఖాన కాణీకాసంత కుంకుమతో ,ఒక చేతి సంచీ, దాని నిండా పంచాంగాల తో క్లాసుకు వచ్చే వారు .చాలా నెమ్మదిగా మాట్లాడే వారు ఎవరూ వినేవారు కాదు . పట్టించుకొనే వారుకాదు .తనూ తన పంచాంగాలు లేదా ఏదో రాసుకోవటమే కాని పాఠం చెప్పిన దాఖలా నాకు కనిపించలేదు. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటమేకాని  ,ఆయనను విద్యార్దులేవ్వరూ పట్టించుకొన్న పాపాన పోలేదు .మా క్లాసులకూ వచ్చేవారు .అక్కడా అదే తీరు .దీనికి తోడు కాళ్ళకు కాఖీ  రంగురబ్బరు బూట్లు వేసేవారు. నడక చూస్తె చవితినాడు ఉండ్రాళ్ళు బోజ్జనిండా తిన్న గణపతి నడిచినంత నెమ్మది నడక. ఆయన్ను చూస్తె హాస్యమే వచ్చేదికాని గౌరవం కలిగేదికాడు. అది విద్యార్ధులుగా మేము వారిని అర్ధం చేసుకోలేక పోయిన తుంటరితనమే అని ఇప్పుడని పిస్తోంది అప్పుడు అందరితోనూ నేనూ నవ్వినవాడినే  .అప్పుడు కాలేజీ లో తెలుగు శాఖలో పని చేసిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ మాధవ రామ శర్మ,అందరూ ‘’మురిగ్గుంట ‘’అని పిలిచే శ్రీ తంగిరాల సుబ్బారావు (మురిగ్గుంట అనే పేరు ఎందుకొచ్చిందో మాకు తెలీదు ),శ్రీ పొట్లపల్లి సీతారామారావు  ,శ్రీ శూలిపాలశ్రీరామ మూర్తి, శ్రీ పేరాల భరత శర్మ, శ్రీ అందవోలు సత్యనారాయణ ,శ్రీ అక్కిపెద్ది సత్యనారాయణ గార్లు  అందరూ గుప్తాగారినిఎంతో  మర్యాదగా పలకిరించేవారు .అలాంటి మా మాస్టారు రాసిన శతకం ఇది .విశేషాలు తెలుసుకొందాం .

    ప్రార్ధన శ్లోకం గా ‘’శ్రీమద్గర్తపురస్థపూర్ణ జనతానందాతిసంపత్ప్రడదు- జ్ఞానాబోనిది పారగాశ్రిత హృడబ్జాతార్క బి౦బోదయం

సూర్యేంద్రాగ్ని విలోచనం  ,పశుపతిం ,కామ్యార్ధ సంసిద్ధయే –వందేహం శుభదం శివంచ గురునాధేశం జగద్వల్లభం ‘’అని గొప్ప శ్లోకం చెప్పారు .ఆతర్వాత అదే సంస్కృత ధోరణిలో మొత్తం ఇరవై శ్లోకాలు బహు సునాయాసంగా చెప్పి ,ఉప్పుటూరి వారినీ కీర్తించారు .ఆతర్వాత తెలుగు శతకం ప్రారంభించారు .

  సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

  రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి బడిలో ప్రాధమిక విద్య పూర్తి చేసి ,తిరుత్తణి లో మూడవ ఫారం వరకు ఇంగ్లీష్ చదివారు .హైస్కూలు చదువుకోసం తండ్రి మద్రాసులో కాపురం పెట్టి చదివించారు .మొదటినుంచి చదువు పై ఆసక్తి ఉండటం వలన ,దేహారోగ్యం కాపాడుకొంటూ వ్యసనాలకు బానిస కాకుండా బుద్ధిగా చదివి మెట్రిక్ పాసై ,క్రిస్టియన్ కాలేజి లో బి . ఎల్ .చదివి లాయర్ పట్టాపొంది హై కోర్ట్ జడ్జిశ్రీ పిఆర్ సుందరయ్యగారి ఆఫీస్ లో  అప్రెంటిస్ గా చేరి న్యాయవాదిగా మారారు .

  1909 నుంచి తమ స్వంత జిల్లా చిత్తూరు లో ప్రాక్టీస్ ప్రారంభింఛి ,క్రమాభి వృద్ధి చెంది రైతుల కష్టాలు స్వయంగా గ్రహించారు .ఉభయ పార్టీల వాదనలు సాకల్యం గా వినిరాజీ కుదర్చటానికే ఎక్కువగా ప్రయత్నించేవారు .రాజీ పత్రం లో ఉభయుల ఎదుటా ఎవరికీ అనుమానం రాకుండా తాను కూడా సంతకం పెట్టేవారు.అప్పటి జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ రావు బహదూర్ టి.వి .రంగాచార్యులు  మన నాయుడుగారిని డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ గా నామినేట్ చేసి ,వైస్ ప్రెసిడెంట్ ను చేశారు .లోకల్ బోర్డ్ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకొన్నారు .

    1920లో శ్రీ మునుస్వామి నాయుడు మద్రాస్ శాసన సభకు ఎన్నికయ్యారు .తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యారు .స్వలాభానికి కాక ,రైతుల కష్ట నష్టాలు తీర్చటానికి పూనుకొన్నారు .పండించిన ధాన్యం మార్కెట్ కు తోలటానికి ,గిట్టుబాటు ధర పొందటానికి నానా అగచాట్లు పడేవారు రైతులు .పిల్లల చదువులకు దగ్గరలో బడులు లేవు  .అందుకోసం రాకపోకల సౌకర్యానికి ముందుగా నాయుడుగారు రోడ్లు వేయించారు .గ్రామాలలో చక్కని రోడ్డు సౌకర్యం కలగటం వలన గ్రామీణులకు ఎంతో వెసులు బాటుగా ఉండేది .

   గవర్నమెంట్ నియమించిన అగ్రి కల్చర్ కమీషన్ లో బాంకింగ్ ఎంక్వైరీ కమిటీలో మెంబర్ అయ్యారు .సరళ స్వభావి శాంతమూర్తి అవటం రో అన్ని జాతుల మతాల వయసు వారు ఆబాల వృద్ధులు ,అధికార అనధికార ప్రజలంతా ఆయనకు సమానులే .కోపం ఉండేది కాదు  .సర్వజన మాన్యుడు అయ్యారు నాయుడుగారు .

   1930లో జస్టిస్ పార్టీ కి  నాయకత్వం వహించారు.అప్పట్లో ఆ కక్షి వారికి బ్రాహ్మణులంటే ద్వేషం ఉండేది .ద్వేషం ప్రగతికి నిరోధం అని చెప్పి ఒప్పించి బ్రాహ్మణులను కూడా సభ్యులుగా చేర్చు కోవటానికి తీర్మానం చేసి పాస్ చేయటానికి నెల్లూరులో జరిగిన బ్రాహ్మణేతర సదస్సులో పాల్గొన్నారు .అప్పట్లో ఆంధ్రనుంచి వచ్చినవారు ఆక్షేపించారు .నాయుడుగారి మాట వేదవాక్కుగా అందరూ భావించి తీర్మానం నెగ్గించారు .అందరికి అందుబాటులో ఉంటూ గాంధీగారి ఆదర్శాలను సాధ్యమైనత వరకు పాటించే వారు .

  27-10-1930న శ్రీ మునుస్వామి నాయుడుగారు మద్రాస్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా నియమింప బడ్డారు .పదవి చేబట్ట గానే   రైతులు డిస్ట్రిక్ట్ బోర్డ్ టోల్ గేట్లకు చెల్లించే పన్నులు తీసివేసే చట్టాన్ని పాస్ చేయించి రైతులకు మహోపకారం చేశారు .యూరోపియనలను మాత్రమె నియమించే ఎలెక్ట్రిక్ కార్పోరేషన్ వగైరా సంస్థలలో ,అలాంటి పనులు భారతీయలు కూడా సమర్ధవంతంగా చేయగలరు అని రాజధానిలో ,కోయంబత్తూరు నీలగిరి ,చిత్తూరు మొదలగు చోట్ల ఎలెక్ట్రిక్ కార్పో రేషన్ లు స్థాపించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయం సాధించారు .నాయుడుగారు ఈ పదవి అలంకరించటం చిత్తూరు జిల్లాకే గౌరవం కాకుండా కమ్మవారికి గర్వ కారణమైంది .జస్టిస్ పార్టీ లో అభి ప్రాయ భేదాలు రావటం వలన ,తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించటం ఇష్టం లేక  మంత్రి పదవికి రాజీనామా చేసి ,జస్టిస్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపించి అధ్యక్షులయ్యారు . జస్టిస్ పార్టీ వీరి నాయకత్వం లేకపోవటం వలన బాగా బలహీనమై నామ రూపాలు కోల్పోయే స్థితిలో ఉంటే ,,ఆపార్టీ వారొచ్చి నాయుడుగారిని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి మళ్ళీ నాయకులై నడిపించమని ప్రాధేయపడ్డారు .కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని ఒప్పుకొంటే తనకు అభ్యంతరం లేదన్నారు .

  పార్టీ ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరమైన తరుణం లో నాయుడుగారికి జబ్బు చేసి ఆరు రోజుల తర్వాత 13-1-1935న  51ఏళ్ళ వయసులో  రాత్రి రామనామ స్మరణ చేస్తూ ,ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే విష్ణు సాయుజ్యం పొందారు .  ,జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.

  మద్రాస్ రాష్ట్ర తోలి తెలుగు ప్రధాని శ్రీ బలినేని మునుస్వామి నాయుడు గారు పదవిలో ఉండగా సాధించిన ఘన విజయాలు ఒక్క సారి చూద్దాం-

1-పట్టాభూమికి ఒక మైలు దూరం వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉండకూడదని తీర్మానం చేసి పాస్ చేయించారు

2-అడవి పంచాయితీలు ఏర్పాటు చేసి ,పశువులు మేపుకోవటానికి పంచాయితీలకు స్వాధీనం చేశారు .

3-చిత్తూరు జిల్లాలో పశువుల ఆస్పత్రి ఏర్పాటు చేశారు

4-డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనాదరణకు గురైన గ్రామాలకు రోడ్లు వేయించారు

5-చంద్ర గిరి రెంట్ కోర్ట్ కాంప్ పోవటం వలన జమీందారీ రైతులు అనేక కష్టనష్టాలు పడాల్సి వచ్చిన తరుణం లోచంద్రగిరిలోనే స్థిరంగా ఉండే ఏర్పాటు చేశారు

6-టోల్ గెట్ పన్నులు తీసేసిరైతులకు , ఎలెక్ట్రిక్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి స్వదేశీయులకు ఉద్యోగాలు కల్పించారు

   సర్వ మానవ  సౌభ్రాతృత్వం , అందరిపై ఆదరణ,ప్రేమ వల్లనే కార్యాలు సాధించవచ్చుననీ నాయుడు గారు రుజువు చేశారు .

‘’శాంతమే జనులకు జయము నంది౦చును –శాంతమున  నెరుగని జాడ తెలియు

శాంతభావ మహిమ –జర్చింప లేమయా –విశ్వదాభి రామ వినుర వేమ’’.

  ఈ రచనకు ఆధారం – చిత్తూరుకు చెందిన జర్నలిస్ట్, సోషల్ వర్కర్,పెర్సనల్ క్లార్క్ టు ది లేట్ దివాన్ బి.మునుస్వామి నాయుడు అయిన  శ్రీ టి .ఎన్ .ఉమాపతి అయ్య గారు రాసిన ‘’శ్రీయుత దివాన్ బహద్దూర్ శ్రీ మునుస్వామి నాయుడుగారి జీవిత చరిత్రము.

   ఈ పుస్తకం   1935లో చిత్తూరులో రచయిత చేత ప్రచురింపబడింది .వెల కేవలం ఒక్క అణా మాత్రమే .‘’

  ఇంతటి మహనీయుని గురించి మనకు దాదాపుగా తెలియదు .వారిజీవితాన్ని వెలుగులోకితెచ్చిన శ్రీ ఉమాపతి అయ్యా గారు ధన్యులు . దానినాదారంగా నాయుడు గారిని గురించే రాసే అదృష్టం  నాకు కలిగింది .

‘’నాయుడు గారి జీవిత చరిత్ర బాలురు అందరూ తప్పక చదివి ,ఆయనలాగా దేశానికి కీర్తి తేవలయు నని కోరు చున్నాను ‘’అని మనస్పూర్తిగా కోరుకొన్న ఉమాపతి అయ్యగారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకొందాం మనస్పూర్తిగా .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష | Leave a comment

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం

27-6-21 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి  దేవాలయం లో  స్థానికులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను  సరసభారతి 157వ కార్యక్రమం లో  అంద జేస్తోందని తెలియ జేస్తున్నాము.  .

             పురస్కార గ్రహీతలు

1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

2-డా.దీవి చిన్మయ – సరసభారతి ఉపాధ్యక్షులు ,ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

3-శ్రీ జ౦పాన శ్రీనివాస గౌడ్ –  మాజీసర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవా  కర్త

4-శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు

5-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు-ప్రముఖ సాంఘిక, ధార్మిక, సా౦స్కృతిక సేవా కర్త  

6-శ్రీ పామర్తి సత్యపవన్ –కంప్యూటర్ నిపుణుడు

7-శ్రీ శిరిగుడి సురేష్ –ఎలెక్ట్రికల్ నిపుణుడు

8- శ్రీ సుధాకర్ —హ్యూమన్ కంప్యూటర్  బిల్ కలెక్టర్

  జోశ్యులశ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ

   గౌరవాధ్యక్షులు           కార్య దర్శి                కోశాధికారి

                                        గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                                         21-6-21-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం )

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -11(చివరిభాగం )

 రామ నామ మయ రూపం

వాసుదాసు గారు రామమంత్ర మహిమ బోధించిన నాటి నుంచి నరస దాసుగారి మనసంతా రామనామం తో నిండిపోయింది .రోజుకు 21వేలకు పైగా జపం చేస్తూ ,10 వేలకు పైగా రామకోటి రాస్తూ ,రాత్రిళ్ళు రామభజన చేస్తూ ,అర్ధరాత్రి ధ్యాననిమగ్నమౌతూ  మంత్ర సిద్ధిపొందారు .మనో నిశ్చయానికి జపం ముఖ్య సాధన .పద్మాసనం లో నిటారుగాకూర్చుని ,మనసులో రామ చంద్రుని మూర్తి ని నిలిపి ,పాదాలలో ఒక వంద ,మోకాళ్ళపై ఒక వంద ప్రక్కల ఒక వంద ,ముఖం లో ఒక వంద ముఖం నుంచి పాదాలవరకూ అక్షరమాలతో జపం చేస్తూ ఉండటం తో దాసుగారి మనసులో రాముడు పూర్తిగా కొలువై ఉన్నాడు  .ఆయనలో దాసుగారు లీనమయ్యారు .వారి వాక్కులు రోజుకు ఎన్ని నామ స్మరణాలు చేశాయో లెక్క లేదు .భజనలో నామ సంకీర్తనం లో ఉపన్యాసాలలో హార్మోనియం పైనా ,వార్షికోత్సవాలలో ,ఎన్ని గంటలు రామనామం స్మరించారో చెప్పలేము .

 తులసీ రామాయణం శ్రీ రామ శరణ్ గారి వాలకు మరింత మాధుర్యం కలిగించింది .రామ చరితమానస ను ఎన్నిచోట్ల ఎన్ని సార్లు ప్రవచనం చేశారో లెక్క లేదు .అన్ని వేళలో రామనామమే. ఉపవాసం నాడు మరీను .2కోట్ల రామనామం రాసి అరుదైన రికార్డ్ నెలకొల్పారు ,రాసేటప్పుడుకూడా శ్రీరామ శ్రీరామ అనాల్సిందే .రామాయణాన్ని అంతటినీ బొమ్మలుగా చిత్రించారు వాటిని గుంటూరు రామకోటి మందిరం లో చూడవచ్చు .రామనామం తో బియ్యపు గింజలు ఏరి వాటితో అన్న౦ వండుకొని రాముడికి నైవేద్యం పెట్టి భోజనం చేసేవారు .ఆనంద రామాయణం లో రామ భక్తులు రామనామ వస్త్రాలు ధరించాలి అని ఉన్నదాన్ని ఆచరణలో పెట్టి నిత్యం ధరించేవారు .

      స్వభావం

మనిషి స్వభావమే సుందరమైన ఆభరణం ..స్వార్ధ రహితమై  నిష్కల్మష మై ,ప్రజాహితమైనది శ్రీ రాం శరణ్ గారి స్వభావం .కోమల హృదయులు .ఉన్నత విశాల భావాలు వారిలో ఉన్నాయి .ఆదరాభిమానాలు చూపటం లో ఎవరూ ఆయనకు సాటిరారు .చిరునవ్వుతో ఆహ్వానించి ఆప్యాయంగా  ఆత్మీయంగా ఆతిధ్యమిస్తారు .బాధా సర్ప దష్టులకు వారి ఉపదేశాలు అమృతపు ఊటలుగా ఉంటాయి  ,అందరూ వారికి సమానులే .అందరూ శ్రీరామ సంతానమే వారికి. వారి ఆదరణ ఆనంద మయం చేస్తుంది .

  నిరాడంబర సద్గురు శిరోమణి మన దాసుగారు .కామినీ కా౦చనాలకు దూరం కీర్తి కాంక్ష లేదు .వినయ విధేయతలు,సదా చారం  వారి సహజ ఆభరణాలు .ప్రేమ పూర్వకంగా ఎవరైనా వస్త్రాలు ఇస్తే ధరిస్తారు కానీ విలాసవంతమైన దుస్తులు ధరించరు .శుద్ధ సాత్విక భోజనమే ఆహారం .ప్రతి దానినీ సద్వినియోగం చేస్తారు .ఆయనలో భక్తిజ్ఞాన కర్మలు త్రివేణీ సంగమం లాఉంతాయి .అంతులేని శిష్యవాత్సలయం ఉన్నవారాయన. పుట్టపర్తి సాయి బాబాగారితో తమ శిష్యులకు మోక్షాన్ని ప్రదానం చేయమని కోరారంటే వారు మెచ్చారంటే వారికి ఎంతటి శిష్యవాత్సల్యమున్నదో అర్ధమౌతుంది .ఎందరెందరో సాదు పురుషులతో దివ్యపురుషులతో మహాత్ములతో వారికి అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .

     షష్టిపూర్తి ఉత్సవం

 నరసదాసు గారికి అరవై ఏళ్ళు  నిండగానే శిష్యులు అభిమానులు మిత్రులు పెద్దలు 27-4-65 నుండి మూడు రోజులు త్రయాహ్నికంగా ప్రయాగ లోషష్టి పూర్తీ మహోత్సవం నిర్వహించారు .శ్రీ మహా మండలేశ్వర ,శ్రీ భాగవత చరిత వ్యాస,శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య దాసు పాకయాజి గారి షష్టి పూర్తీ మహోత్సవం లో వారి అభిమానులు శిష్యులు అ౦దరితోపాటు శ్రీగాయత్రీ పీతులు శ్రీవిద్యా శంకర భారతీ స్వామి పాల్గొని ఆధ్వర్యాన్ని వహించారు .సంకీర్తన హరికధ ,ఉపన్యాసాదులు నిర్విరామంగా మూడురోజులు మహా వైభవంగా జరిగాయి .

  26-4-65 న బుద్దాం దగ్గర తుంగభద్ర వద్ద దాసుగారికి క్షుర కర్మాదులు,ప్రాయశ్చిత్త మృత్తికా స్నానాలు జరిగి  ,అర్నాడు హరేర్నామ ఏకాహం నిర్వహించారు చైత్ర బహుళ ద్వాదశి 28-4-65 శ్రేఆమ శరణ్ దంపతులు శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారికి పాద పూజ,చేశారు తర్వాత దాసుగారి దంపతులకు  శిష్యబృంద౦  గురుపూజ  చేశారు .శ్రీ నేటి వెంకట నారాయణ మూర్తి దంపతులు ,విస్సం శెట్టి నాగభూషణం దంపతులు  గంగాజలం తో దాసుగారికి అభిషేకం ,పాద పూజ జరిపారు .సాయంత్రం వంగీత సుబ్బరాయ శాస్త్రులవారి ఉపన్యాసం ,శ్రీ పద్యాల వేంకటేశ్వర భాగవతార్ ,అమ్ముల రంగనాధ దాసు భాగవతార్ లు హరికదాగానం చేశారు .శ్రీ రాగం ఆంజనేయులు ,శ్రీ కంభం మెట్టు మధుసూదన రావు లు కదా సంకీర్తనం చేశారు .

  29-4-65చైత్రబహుల త్రయోదశినాడు ఉదయం విఘ్నేశ్వరపూజ ,పున్యాహవాచనం ,మంటపారాధన చేసి ,శ్రీ అర్వపల్లి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ పీసపాటి  మృత్యుంజయావదానులుగారు హోమాలు ,పూర్ణాహుతి నిర్వహించారు సాయంత్రం షష్టి పూర్తీ అభినందన సభ జరిగింది .శ్రీ గాయత్రీ పీథాదిపతులు అధ్యక్షత వహింఛి దాసుగారి ప్రతిభావిశేశాలు సేవా విశేషాలు సవివరంగా తెలిపారు పెద్దాలందరూ దాసుగారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు .ఈ సందర్బహంగా శిష్యులు గురువుగారికి ఒక యకరం పోలంకొని అండ జేస్తే వారికిక ఏ లోటు రాదనీ భావించారు శ్రీ పోలిశెట్టి ఆంజనేయ గుప్త పట్టువస్త్రాలతో పాటు అయిదు వందలరూపాయలు  శ్రీ బోలిశెట్టి సీతారామయ్యగారు కూడా అలానే సమర్పించారు .అభిమానులు భక్తులు శక్తికొలది విరాళాలు ప్రకటించారు .అవేమీ తమకు అవసరం లేదనీ అదంతా శ్రీ నామప్రయాగ స్వామికే సమర్పిస్తున్నాననీ ప్రకటించారు .దేశం నలుమూలలనుండీ ఎందరో పెద్దలు కవులు భక్త శిఖామణులు అభిమానులు సందేశాలు ఆశీర్వచనాలు పంపగా అన్నీ వేదికపై చదివి అందరికి తెలియ జేశారు .

  శ్రీ కాశీ కృష్ణా చార్య వారు సంస్కృతం లో అభినందన సందేశం పంపారు .శ్రీ విద్యారణ్య స్వామి ,శ్రీ సన్నిధానం లక్ష్మీ నారాయణ మూర్తి అవధానిగారు సంస్కృతం లో అభినందన ఆశీస్సులు అందించారు శ్రీ చిరంతనానందస్వామి ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ రామ కృష్ణా నంద స్వామి సందేశాలు వచనం లో శ్రీ చావాలి వామన మూర్తి పద్యాలలోరాసిపంపారు .శ్రీ భాగవతుల కుటుంబరావు  , శ్రీ కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి ,శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ,ప్రశంస పేరుతొ పద్యాలను శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారు ,శ్రీ మాధవపెద్ది నాగేశ్వరరావు వచనం లో ,పంచరత్నాలలో శ్రీజాస్తి వెంకట నరసయ్య ,శ్రీ రామ శరణ ప్రశంసగా పద్యాలలో  శ్రీ శి స రాజశేఖరం ,పండిత శ్రీ పెమ్మరాజు రాజారావు గారు పుష్పాంజలి పేరిట పద్యాలు ,శ్రీ చిర్రావూరి అనంత పద్మ నాభ శాస్త్రిగారు సంస్కృత ఆశీర్వచనం ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు ‘’వీరు భుజించు ఓదనము రామనామ సందీపితమై ,వీరి జీవన లహరి గంగా శైవలినికి సహపాఠి’’అని మెచ్చుకొన్నారు .వీరుగాక శ్రీ చిలుకూరి వీరభద్ర శాస్త్రి ,శ్రీ బాపట్ల హనుమంతరావు ,శ్రీ వెంపటి సూర్యనారాయణ శ్రీ ధనకుధరం వరదాచార్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి ,శ్రీ ధూళిపాళ వెంకట సుబ్రహ్మణ్యంగారు పద్య నీరాజనం ,శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు పద్య నమోవాక భక్తీ కుసుమాలు సమర్పించారు .శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు ,శ్రీ పద్యాల సోదరులు పద్యాలలో దాసుగారి నిరాడంబరత ఆదరణ శిష్యవాత్సల్యం సర్వ సమానత్వం ,సభా పాండిత్యం ,సుబోధకత్వం కదా సంకీర్తన,సద్గురు ప్రాప్తి అదృష్టం ,రామనామ ప్రచారం మొదలైన విషయాలపై తమ గురువుగారు శ్రీ శ్రీరామ శరణ్ గారిపై భక్తిభావబందుర సుమధుర పద్య హారతి సమర్పించారు .వారి పద్యం తోనే సమాప్తి పలుకుతున్నాను –

‘’హరినామ బోధకు ,నాశ్రిత వత్సలు –మందస్మితానను ,మధుర భాషు

కమనీయ కళ్యాణ ఘన గుణ శోభితు –వైరాగ్యయుటు వేణు పత్రపాలు

నామ సంభాషు,శ్రీరామ లేఖన లోలు –నిన్డునిభాస్యు నానంద దాయు

సంచిత రామనారాయణహృదయస్ధు-శ్రీరామనామ సుచేల ధారు

నఖిల తీర్ధ సంచరణు,శేషంబ రమణు –షమ దమాభరణు,పవిత్ర చారు శరణు

లోక మంగళ కరణు భక్తైక శరణు-గురు శిరోమణి శ్రీరమ శరణుదలతు ‘’.

 ఈ 11 ఎపిసోడ్ ల వ్యాసానికి శ్రీ పద్యాల సోదరులు రాసిన’’శ్రీ కుందుర్తి వెంకట నరసయ్యగారి జీవితము ‘’ పుస్తకమే ఆధారం .

  సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -10

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -10

            శ్రీ రామ శరణ్ గారి రచనలు

 శ్రీ రామ శరణ్ గారు ‘’రామ మంత్రానుష్టాన క్రమం’’రాశారు అందులో సర్వమత సమ్మతం కనిపిస్తుంది .రామ తత్వాన్ని బహు సుందరంగా దానిలో నిక్షిప్తం చేశారు .శ్రీరాముడు సకల శక్తి స్వరూపుడు .ఆయనే శివుడు ,సూర్యుడు విష్ణువు ,వినాయకుడు అని చెప్పారు .శివ ,నారాయణ ,గాయత్రి మంత్రాలలోని బీజాక్షరాలు రామ  మంత్రం లోనివే అనీ , మంత్రానునుష్టానికి మడిగా కట్టుకోవాల్సిన దవళీ వగైరా విశేషాలనూ వివరించారు . వేద సంహిత ,ఉపనిషత్ ,పురాణాలనుంచి ఎన్నో ఉదాహరించారు .

  వీరి ‘’నవవిధ భక్తులు ‘’లో వాటిని పూర్తిగా అనుభవించి రాసినదే .భగవంతుని అవ్యాజ కరుణా విశేషాలు ,భగవంతుడు భక్తుల యెడ ప్రవర్తించే విధానం సంపూర్ణంగా వివరించారు .’’కలిసంతనోప నిషత్ ‘’ లో కలియుగం లో అందరూ సులభ సాధ్యంగా ఆచరించాల్సిన విధానాలు ,శ్రీరామనామ ప్రభావం ,సంకీర్తన పధ్ధతి మొదలైనవి రాశారు .

శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి గారి అయిదు భాగాల ‘’చరితా వళి’’ ని చక్కని తెలుగులో అనువదించారు .శ్రీ బల దేవ ఉపాధ్యాయ్ గారి ‘’భారతీయం ‘’అనే ఉత్తమ వేదాంత గ్రంథాన్ని సరళ తెలుగులో అనువదించారు .శ్రీ హనుమాన్ పొద్దార్ గారు హిందీ లో రాసిన ‘’బ్రహ్మ ‘’అనే గ్రంథాన్ని తెలుగు చేశారు .

   మందిర స్థాపనలు

శ్రీరాం శరణ్ గారు బుద్దాం లో శ్రీ రమాచ్యుత మందిరాన్ని నిర్మించటమేకాక వారి శిష్య బృందం ఉన్న చోట్లకూడా మందిరాలు స్థాపించారు .నెల్లూరుజిల్లా రామ గోవిందాపురం అనేచిన్నగ్రామం లో సూర్పరాజు సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు దాసుగారిశిష్యుడు .తనడబ్బును ఊరిజనులు సంతోషంగా ఇచ్చిన విరాళాలతో సీతారామ లక్ష్మణుల చలువరాతి విగ్రహాలను గురువుగారి ద్వారా తెప్పించి ,తన ఇంటి ప్రక్కనే అందమైన మందిరం లో ప్రతిష్టింప జేశారు .కొన్నేళ్ళు గురువుగారి ఆధ్వర్యం లో వార్షికోత్సవాలు జరిపారు .ఆర్దికభారం పెరిగిపోవటం తో ఆ తర్వాత  మానేశారు .

  కృష్ణా జిల్లా దివి తాలూకాలోరాం శరణ్ గారి ఆధ్వర్యం లో చాలామందిరాలు వెలిశాయి .కమ్మనా మోలులో స్త్రీ పురుషులు అందరూ కమ్మగా సంకీర్తన చేస్తారు .శిష్యుడు మద్ది ఆంజనేయులు గురువు  ఆశీర్వాద  బలం తో చందాలు వసూలు చేసి చాలా గ్రామాలలో చలువరాతి సీతారామంజేయ విగ్రహాలు స్థాపించారు .చిన్న గ్రామాలైనా ప్రతిష్టలు మహా గొప్పగా జరిగేవి .గుంటూరు క్షేత్ర సభ్యులు ప్రతి ఏడాదీ వచ్చి స౦కీర్తన చేసేవారు .శ్రీ రఘువర దాసుగారు ఒక నెలరోజులు అక్కడే ఉండి వైభవోపేతంగా సంకీర్తన నిర్వహించారు .వీటన్నిటికి ముఖ్యకారకులు మన దాసు గారే .

  తమ తర్వాత అర్చకులుగా ఒక సద్బ్రాహ్మణుడు శ్రీ శాస్త్రిగారిని దాసుగారు నియమించారు .మందిర నిర్మాణం దగ్గర్నుంచి పదేళ్ళు ఉత్సవాలు ఘనంగా జరిగేవి .నిత్యం ఉదయం సాయంత్రం సహస్రనామ పూజ ,రాత్రి భజన ,పవళింపు సేవ ఉదయం సుప్రభాతం జరిపేవారు .దీనికి దగ్గరే ఉన్న తుంగలవారి పాలెం లో గురువుగారి శిష్యులు సంకీర్తన చేశారు .ఇక్కడ గురువుగారు ‘’అష్టోత్తర శత ఏకాహ అఖండ హరేర్నామ సంఘం ‘’స్థాపించారు .ఈ సంఘం పరిసరగ్రామాలలో ప్రతి ఏకాదశికి ఏకాహం చేసేవారు .ఆహ్వానం రాకున్నా వెళ్లి పాల్గొనేవారు .ఎనిమిది ఏకాహ దశు లలో 108 ఏకాహాలు చేశారు .వీరి నామ ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది .గురువుగారుపాల్గొని మందిర నిర్మాణం నామ ప్రాశస్త్యం లపై ఉపన్యాసాలిచ్చేవారు పాలరాతి విగ్రహ స్థాపన చేయించేవారు .తుంగల నాగభూషణం  సంకీర్తన ప్రియులు .వీరి ఆధ్వర్యం లో ఆనందంగా ఆకర్షణ గా భజనలు జరిగేవి .దీనికొక మైలు దూరం లో కృష్ణానది ఒడ్డునే(నాగాయలంక ) శ్రీ రామపాద క్షేత్ర దేవాలయం ఉంది  .ముందు రామపటం పెట్టి మందిరం కట్టి తర్వాత విగ్రహాలు పెట్టారు. ఇక్కడి రేవు నుంచి పెనుమూడికి లాంచీలు నడుస్తాయి .శ్రీరామ శరణ్ గారు ఈమందిరం దర్శించి ప్రసంగం చేశారు .దీనికి దగ్గరున్న మర్రిపాలెం లోనూ మందిర నిర్మాణం చేశారు .ఇక్కడ గొప్ప సంకీర్తన సంఘం ఉన్నది .ఇక్కడి వారంతా దాసుగారి శిష్యులే .అత్య౦త ఉత్సాహం తో ఏకాదశినాడు అఖండనామం చేస్తారు .కార్యదర్శి సనకా వెంకటేశ్వరరావు చాలా శ్రద్ధగా అన్నీ జరిపిస్తారు .దీనికి 5మైళ్ళ దూరం లో అవనిగడ్డ పోలీసు స్టేషన్ లో ఒక మందిరం కట్టి శ్రీమా శరణ్ గారి ద్వారా శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ప్రతిష్టించారు .దీని ముఖ్యకార్య కర్త జి వె౦క టప్పయ్య నాయుడు గారు .

  అవని గద్దకు దగ్గరలో  ఉన్న బందలాయ చెరువు గ్రామ వాసులు భౌతిక వాదులే అయినా నైతికానికి ప్రాధాన్యమిస్తారు .ఈగ్రామం లో దాసుగారి శిష్యులు 20 మంది ఉన్నారు అందులో పర్చూరు పోతురాజుగారు అద్వితీయ భక్తులు .ఆయన ప్రోద్బలం లో అక్కడ రామమందిర నిర్మాణం జరిగింది .దాసుగారి ద్వారా శ్రీ సీతా రామ ఆంజనేయ  పాలరాతి విగ్రహాలు తెప్పించి శ్రీరామజయరామ జయజయరామ అనే అఖండ నామం మారుమోగుతుండగా ప్రతిష్టించారు  .అఖండ నామ సంకీర్తనలు వార్షికోత్సవాలు గొప్పగా జరిపేవారు .

   బాపట్లలోని శంకర విద్యాలయం లో వేదం సంస్కృతం స్మార్తం బోధిస్తున్నారు .శ్రీరమ శరణ్ గారు దీనికి నాలుగు వందల రూపాయలు అందించి ఒక శ్రీరామ శరణ మ౦ డపాన్ని కట్టించారు  .దీన్నిశ్రీ శృంగేరీ పీఠాదిపతులు ఉద్ఘాటనం చేశారు .దాసుగారు అనేక చోట్ల దేవాలయాల అవసరం ,అవి భక్తీ శ్రద్ధలకు ఎలా తోడ్పడుతాయో ,దేవాలయ ఉత్సవాల ప్రాశస్త్యం మొదలైన ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగాలు చేసేవారు .సంకీర్తన ఉపన్యాసం భజన ,పురాణ ప్రవచనాల అవసరాలను వివరించేవారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-21-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -9

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -9

   మహాత్ముల సాంగత్యం ,పరిచయాలు

అపర వ్యాసులుగా ప్రసిద్ధులైన శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ప్రయాగ వాసి .బ్రహ్మ చర్యం లో శుక మహర్షి .పరమ తపో నిష్టా గరిష్టులు ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ,హి నాథ నారాయణ వాసుదేవ ‘’మాత్రమె ఉచ్చరిస్తారే కానీ  ఇతర మాటలేవీ మాట్లాడారు  .ఉదయం త్రివేణీ స్నానం ఆతర్వాత ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4 వరకు జపధ్యాన పూజ,పురాణ ప్రవచానాదులు ,రాత్రి భజన వారి దిన చర్య .గంగ ఒడ్డున ప్రతిష్టానపురం అనే ఝూసీ లో ఆశ్రమం లో ఉంటారు .అనుష్టానం భజన ఒక చోట ,ప్రవచనం వేరొక చోట జరుగుతుంది .ఆశ్రమవాసులు యాభై మంది దాక ఉంటారు. భోజన శాల వేరు .ఇవికాక సంకీర్తన మందిరం వేరుగా ఉంది .ఇందులో పగలు అఖండ నామం జరుగుతుంది .సంస్కృతం నేర్చుకొనే విద్యార్ధులు  పాళీలు  గా నామం చేస్తారు .గొప్ప పండితులు ఉంటారు .వీరు బ్రహ్మ చారిగారు రాసిన ..భగవత్ చరిత ‘’ను నిత్యం పురాణంగా ప్రవచనం చేస్తారు .

  బ్రహ్మ చారి గారు గొప్ప హిందీ కవి .భాగవతాన్ని హిందీలోవ్రజభాషలో  రాశారు .అవి’’ చప్పలు ‘’(చౌపాయి)అంటే హిందీ పద్యాలుగా ఉండి,గానానికి అనుకూలంగా మహా రసోపేతంగా ఉంటాయి .ఇదికాక బడరీనాద్ దర్శన్ ,మహాకర్ణ ,భక్త మీరాబాయి వంటి గద్య రచనలు కూడా రాశారు .వీరు రాసిన చైతన్య చారితావళి5సంపుటాల బృహద్గ్రంధం .1941లో నిరాట౦క సంకీర్తన మహాయజ్ఞం  జరిగినపుడు మన శ్రీ రామ శరణ గారికి బ్రహ్మ చారి గారితో పరిచయమేర్పడింది .వారి సమక్షం లో హిందీలో చక్కని ప్రసంగం చేశారు మన దాసుగారు .అది తెలిసి మహదానందం తో దగ్గరకు పిలిచి ,దాసు గారి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్నారు .తమ చైతన్య చరితావళి ని తెలుగులోకి అనువది౦చమని  దాసుగారిని కోరారు .సుందర మధుర తెలుగులో దాసుగారు అనువాదం చేశారు .అది స్వయంగా ఆయనే తెలుగులో రాసిన గ్రంథం గా ఉంది .చైతన్యప్రభు బాల్య యవ్వన కౌమారాది దశలు అందులో వారు చిందించిన హాస్యలహరి రమణీయంగా రాశారు .

   మొదటి సారిగా శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారిగారిని గుంటూరుకు ఆహ్వానించి ఆంధ్రులకు పరిచయం చేశారు దాసుగారు .బుద్దాం లో దాసు గారింటికి ఆయన వెళ్ళారు .అక్కడి రమచ్యుత మందిరానికి పాలరాతి విగ్రహాలు ఆయనే అందించారు .ఆతర్వాత చాలా సార్లు వచ్చారు .బ్రహ్మ చారిగారు భాగవత చరితలోని చౌపాయీలను ‘’ భాగవతీ కథా’’ అంటే భాగవత దర్శనం అనే పేరుతొ108 గ్రంథాలు రాయటం ప్రారంభించి ,60పూర్తి చేశారు .ఇదేకాక భారత భాగవత పురాణ ఉననిషత్తు లు సంహితలలోని విశేషాలను క్రోడీకరించి సందర్భాన్ని బట్టి భాగవత దర్శనం లో నిక్షిప్తం చేశారు .18పురాణాలను స్వయంగా చదివి ,పండితులద్వారాకూడా విని దానిలోని సారాన్ని అందించారు .ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా అంతటి గొప్ప రచనను  వెలు వ రించి ఉండలేదు  .ఒంటిచేతితో బ్రహ్మ చారి గారొక్కరే అంతటి బృహత్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు .ఈ ఉత్తమ గ్రంథ ప్రచారానికి సమర్ధులు నరస దాసుగారే అని విశ్వసించి  దాన్ని తెలుగులో అనువదించమని ఆదేశించగా 48భాగాలు అత్యంత సు౦దరమైన ఆంధ్రం లో అనువాదం చేశారు .అన్నిటినీ ఒకే సారి ముద్రించే శక్తి లేక ఒక్కొక్కటిగా ముద్రించారు .’’భాగవత గ్రంధమాల ‘’అనే సంస్థ స్థాపించి మహారాజపోషకులు ,రాజపోషకులు ,సభ్యులు అని వేర్వేరుగా విభజించి 14భాగాలు ముద్రించారు .ఒక వందరూపాయలు చందా కట్టిన సభ్యులకు ప్రతి పుస్తకం ఉచితంగా అందించారు .నెలకు రెండు రూపాయలు పంపిస్తే చాలు పుస్తకం పంపేవారు . ఇంటింటికీ ఆపుస్తక మహాప్రసాదం అందేట్లు చేశారు దాసుగారు .

  మర్రిపూడిలో  హరేర్నామ సప్త సప్తాహం మహా వైభవంగా జరిగింది .దాని కి వీరయ్యగారు ప్రధాన కార్యకర్త .ఎన్నో భక్త బృందాలు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి పాల్గొని వీనుల విందు చేశాయి .శ్రీ అవదూతేంద్ర సరస్వతి శ్రీ రామ శరణ గారు యాజమాన్యం వహించి తమ తమ అనుయాయులతో మహావైభవంగా దిగ్విజయం చేశారు .ప్రభుదత్త బ్రహ్మ చారిగారిని ఆహ్వాని౦చ గా విచ్చేసి పాల్గొని ఆతర్వాత చాలా గ్రామాలలో పర్యటించారు .ప్రతి చోటా నరసదాసుగారి కథాసంకీర్తన ఉండాల్సిందే .ఆమహోత్సవ  సందర్భంగా మన దాసుగారికి ‘’మహా మండలేశ్వర ‘’బిరుదునిచ్చి సత్కరించారు .

 బ్రహ్మ చారిగారు బృందావనం లో ఉన్నారు .యమున ఒడ్డున సుందరభవనాన్ని ఆశ్రమ౦గా నిర్మించుకొని నిత్యకార్యక్రమాలు చేస్తున్నారు . యమున అవతలి ఒడ్డున యాభై ఎకరాలలో గోవులను మేపుతూ గోసేవ చేస్తూ ఆరునెలలు ఉన్నారు .దీనికి ‘’గోలోకం ‘’అనిపేరు .అది పూర్తికాగానే 50రోజులు అఖిలభారత ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు .దేశం నలుమూలలనుండి మహా పండితులు ,కవులు గాయకులూ పాల్గొని విజయవంతం చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు .అఖండ నామ సంకీర్తనలు కూడా జరిగాయి .శ్రీ రామ శరణ దాసుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘’భాగవత చరిత వ్యాస్ ‘’బిరుదు ప్రదానం చేసి ఆత్మీయంగా సన్మానించి గౌరవించారు .దాసుగారి నామ ప్రచారాన్ని సభలో గొప్పగా కీర్తించారు .

    నిరంతర బ్రహ్మ నిష్ఠ లో ఉండే శ్రీ  ఉడీరాం బాబాజీ దాసుగారిని ప్రేమ ఆప్యాయతలలతో వీక్షించారు .శ్రీ శివానంద బ్రహ్మ చారిద్వారా శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందిన హరిబాబా గారు పరిచయమయ్యారు .జగన్మాతగా ప్రసిద్ధి చెందిన మాతా ఆన౦ద  మయీ గారు కూడా పరిచయాయ్యారు .బృందావన్ లో సరోజినీ మాతా ,బిదుబ్రహ్మచారి ,ఆచార్య రాఘవా చారి ,చక్రపాణి జీ మహారాజ్ ,మాతా మీరాబాయి జీ ,బంకే బిహార్ లాల్ జీ మొదలైన మహానుభావులతో దాసుగారికి పరిచయభాగ్యం లభించింది .నైమిశారణ్య నరనారాయణ సోదరులు ప్రయాగలో దాసుగారికి దర్శనమిచ్చారు .ఆజానుబాహులు అద్వితీయ బలసంపన్నులు అయిన ఆసోదరులలో తేడా ఏమీ కనిపించకపోవటం ఆశ్చర్యమేసింది .ఇద్దరూ పద్మాసనం లో కూర్చుంటే ఆ సోదరులకు రోజులు కొన్ని క్షణాలుగా గడిచిపోతాయి.బీహార్ లో బరైలీ రాజు శ్యామానంద జీ ప్రయాగలో విరాట్ సంకీర్తన సభలో మన దాసుగారి ఉపన్యాసం విని పరవశించారు . .ఆయన బరైలీ ప్రాంతమంతతా వాయిద్యాలు సప్ప్లై చేసి సంకీర్తన  సంఘాలు  స్థాపించాడు .శ్రీ పండిత సుదర్శన్ శ్రీ శరణానంద జీ , శ్రీ హరేరాం బాబా ,మున్షీ కన్హయలాల్ జీ మొదలైన సాదుపు౦గవులతో పరిచయమేర్పడింది .కాశీలో 150 ఏళ్ల శ్రీ హరిహరబాబా దర్శనం లభించింది .అక్కడే రామరాజ్య పరిషత్ అధ్యక్షులు శ్రీ కరపత్ర స్వామి తో మాట్లాడే అవకాశం కలిలిగింది .రుషీ కేశ్ లో  స్వర్గాశ్రమం లో గీతాభవన్ ప్రతిష్టాపకులు ,మహాదాత శ్రీ జయదయాల్ గోయంకా గారితో ఘనిష్ట పరిచయం కలిగింది .స్వామి శివానంద అనుగ్రహమూ లభించింది .

  పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాతో దాసుగారి పరిచయం కలిగి ఆయన నిర్వహించిన సనాతన భాగవత సప్తాహం లోతామూ సభ్యులుకనుక 104 డిగ్రీలజ్వరం తో తుగలపాలెం నుంచి వెళ్లి  పాల్గొనగా ,అక్కడికి చేరగానే జ్వరం మాయమైంది .బాబాగారికి నమస్కరించగానే బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడారు .మంత్ర శాస్త్ర ప్రవీణులు హనుమదుపాసకులు శ్రీ శిష్ట్లా చంద్ర మౌళిగారు అధ్యక్షత వహించిన సభలో బాబా గారు మన దాస్సుగారి దగ్గరకు వచ్చి చెవిలో సంకీర్తన ప్రాధాన్యతపై  ఉపన్యాసం చేయమని చెప్పారు  .నరసయ్య గారి ఉపన్యాసం మహా రసవత్తరంగా శ్రోతలమనసులను రంజిల్ల జేసింది ..బాబా బాగా సంతోషించి సంఘ సభ్యులందరికీ తలొక వంద రూపాయలు అందజేసి సన్మానించారు .వారి అనుచరులకు కూడా చార్జీలు ఇచ్చారు .నరస దాసుగారిని ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి ఆప్యాయంగా భుజాలపై చేయి వేసి ,ఆప్యాయంగా మాట్లాడి ఒక బంగారు రూపాయను మెడలో ధరించటానికి ఇచ్చారు .పట్టు వస్తారాలతో పాటు రెండువందల రోపాయలు కూడా అందించి సత్కరించారు .శివరాత్రి నాడు 500మంది బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేసి వారికి అయిదువందల పళ్ళాలులు ఉద్ధరిణలు అయిదు వందల రూపాయలు అందించారు .అప్పుడు శ్రీ రామ శరణ గారు గాయత్రీ మంత్రాన్ని గురించి రామనామాన్ని గురించి రెండిటిని సమన్వయము చేస్తూ అద్భితమైన ప్రసంగం చేశారు .’’బాగు బాగు ‘’అని బాబా బహు మెచ్చారు .

   తర్వాత మహా వైభవంగా జరిగిన బాబా గారి జన్మ దినోత్సవానికి  కూడా దాసుగారు వెళ్లి పాల్గొన్నారు .వేలకొలది యాత్రికులకు బాబా ప్రసాదం లభించింది ,హడావిడి తగ్గాక బాబా దాసుగారి వద్దకు వచ్చి మహా ఆప్యాయంగా సంభాషించారు .ఇంటి విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పారు .’’మీ ముఖ్యమైన  కోరిక చెప్పండి ‘’అని అడిగితె దాసుగారు ‘’స్వామీ !మీ  స్మరణ చాలునాకు .నన్ను నమ్ముకొన్న నాశిష్యులకు మోక్షం ఇవ్వటానికి అనుగ్రహించండి .ఇదే నాకోరిక ఇంకే కోరికా నాకు లేదు ‘’అనగా బాబా సంతోషించి ‘’ఇలాంటి కోరిక ఉన్నవారినినేనేక్కడా చూడలేదు .మీది చాలా దయార్ద్ర హృదయం .శిష్యవాత్సల్యం నిజంగా మీదగ్గరే ఉంది ‘’అని మృదుహస్తం తో దాసుగారి శరీరాన్ని నిమిరారు .దాసుగారికి బాబా గారి పరిచయం వల్లనే గుంటూరు భక్త సమాజం వారికి బాబా గారి దర్శన భాగ్యం  కలిగింది.అప్పుడు ఆధ్యాత్మిక సాధన గురించి బాబా  అమృతోపమానమైన ప్రసంగం చేసి సభ్యులను ఆన౦ద డోలికలలో ఉర్రూత లూగించారు .

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8
నామ ప్రచారం
అ కాలంలో శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు నామ ప్రచారం లో దూసుకు పోతున్నారు .పగోజి అత్తిలి లో పుట్టి న వీరికి తలిదండ్రులు పెట్టినపేరు విశ్వేశ్వరావు .వీరి 12వ ఏట మహాభక్తులైన తండ్రి మరణించారు .రావు గారు నాటకాలాడి పేరు ప్రఖ్యాతులు పొందారు .తల్లి కూడా చనిపోయాక వైరాగ్యం పెరిగి ,బ్రహ్మ చర్యం పాటిస్తూ ప్రయాగ వెళ్లి ,బ్రహ్మ చారి ఆశ్రమం లో సాధన చేసి అయోధ్య చేరి ,మంత్రం దీక్ష పొంది ‘’షియా రఘువర దాస్’’అనే దీక్షానామ ధారియై హిందుస్తానీ సంగీతం నేర్చి ,ఆగాన౦లో నామాన్ని లీనం చేశారు .ఆ నామ గానా మృతం తో జనాలను పరవశ పరచారు .ఆంద్ర దేశం చేరి చాందస భావాలను పారద్రోలటానికి నామాన్ని ప్రయోగించి మనసులను గెలుచుకొన్నారు .
శ్రీ రఘువర దాసుగారు మన నరసదాసు అంటే శ్రీరామ శరణ గారికి బాగా సన్నిహితులయ్యారు .శరీరాలు వేరే కాని ఆత్మ ఒక్కటే .ఇద్దరివీ రామాయత్త చిత్తాలే.ఆయన గానం యెంత మాధుర్యమో ఈయన ప్రవచనం అంతటి మాధుర్యాన్ని కలిగి ఉండేది .ఆధునికకాలం లో రామనామ ప్రచారం లో వీరిద్దరూ అద్వితేయులై నిలిచారు
తులసే రామాయణ ప్రవచనం
శ్రీ రామ శరణ గారు ఉత్తర దేశం లో ఉండి అక్కడ అందర్నీ ప్రభావితం చేసే తులసీ దాసు రాసిన రామ చరిత మానసం ను పూర్తిగా తెలుసుకొన్నారు ..అందులోని విశేషాలు అనేకార్ధాలను చక్కగా విశదీకరించి చెప్పేవారు .ఉన్నత భావ వ్యాప్తియే వారి ముఖ్యోద్దేశం ..బాపట్ల ఆంజనేయ దేవాలయం లో భానువార సంకీర్తనలో పాల్గొనటానికి రాగా సభ్యులు రామనామ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పమని కోరారు . వెంటనే తులసీ రామాయణం లోని ‘’వందవు నామ రామ రఘువరకో , హేతు కృశాను భాను హిమకరకో –విధి హరే హరమయ వేద ప్రాణసో,అగుణ అమాపమ గుణ నిదానసా ‘’అనే చౌపాయి ని ఒక గంట సేపు ఉపన్యాసంగా చెప్పారు . ఆ సంఘ సభ్యురాలు శ్రీమతి వల్లూరి రాజమ్మగారు ‘’స్వామీ !మీద్వారా మాకు తులసీ రామాయణం ఆసాంతం తెలుసుకోవాలని కోరిక గా ఉంది ‘’అనగా సరే అన్నారు దాసుగారు .
ఆమె ఒక వారం లోపే ముహూర్తం పెట్టి ఆహ్వానించారు .అప్పటికి దాసు గారు తులసీ రామాయణం లో రెండు మూడు ఘట్టాలు తప్ప చదివి ఉండలేదు .ఎలా చెప్పాలో అంతుపట్టక రెండు రోజులు సంస్కృత శ్లోకాలతో కాలక్షేపం చేశారు .మూడవ రోజు మందిరం లో కూర్చుని శ్రీరామునితో ‘’రామా !ఏదో మొహమాటానికి తులసీ రామాయణ ప్రవచనానికి ఒప్పుకొన్నాను .నాకు ఆభాష కొత్త.నువ్వు తులసీ దాసు హృదయాన్నుంచి పలికించావు .ఇప్పుడు మీరిద్దరూ నా హృదయం లో ఉండి పలికించాలి ‘’అనగా రాముడు నవ్వి నట్లు కనిపించగా ,ఆ ధైర్యం తో అవధి భాషలోని తులసీ రామాయణ ప్రవచనం మొదలు పెట్టారు .కొన్ని ఘట్టాలు తాను ఎలా పలికారో ఆయనకే తెలీదు .ఆ ఉపాధి ద్వారా ఎన్నెన్నో విషయాలు జనరంజకం గా ప్రవచనం చేశారు .శ్రీరమ చంద్ర మూర్తి స్వయంగా తనద్వారా పలికి౦చాడని దాసుగారి పూర్తీ విశ్వాసం .
కథా సంకీర్తనం
పట్టు వస్త్రాలుకట్టి చేతిలో చిడతలు ధరించి ఆర్తిగా రామా రామా అంటూ చిందులేస్తూ ,నామనామ గానం మధురాతిమధురం చేస్తూ చూపరులకు పరవశం కలిగించేవారు శ్రీ రామ శరణ .తానూ తన్మయులై భక్తులను తన్మయత్వం లో ముంచి తేల్చేవారు .ఎవ్వరికీ ఇహ లోక స్పృహ ఉండేదికాదు .భక్తి మహా సముద్రంలో మునిగి తేలేవారు అందరూ .
ఉపన్యాసం
శ్రీ రామ శరణ గారు ఉపన్యసిస్తుంటే మాటలు తేనెల ఊటలు గా జాలు వారేవి వేదం శాస్త్ర పురాణ ఉపనిషత్తులనుండి ఎన్నో ఉదాహాహరణలు దొర్లి ,ప్రేక్షకహృదయాలు ఆన౦దరస ప్లావితమయ్యేవి .భగవన్నామముతో ప్రారంభించి అందరి చేతా చేయిస్తూ ఆపైన ఉపన్యాసం ప్రారంభించి గొప్ప నేపధ్యాన్ని కలిగించేవారు .కంతేరు గ్రామం లో వారు చెప్పిన ఉపన్యాసం చిర స్మరణీయం .సంకీర్తన విగ్రహారాధన ఇష్టం లేని ఆగ్రామ ప్రజలు అత్యంత ఆశ్చర్యం తో విని ,ముగ్ధులై అనుమానాలన్నీ పటాపంచలు చేసుకొని భక్తివాహినిలో కలిసిపోయారు .దురా చారులు వీరి ఉపన్యాసంతో సదా చారులయ్యారు .చాలామంది నాస్తికులు ఆస్తికులయ్యారు ఇదంతా దాసుగారి ప్రభావమే .
కృష్ణా జిల్లా దివి తాలూకా వేక నూరు గ్రామం లో నామ సప్తాహం జరుపుతుంటే కొందరు పాషండులు రామనామం తో ముక్తి రాదనీ వాదిస్తే ‘’రామేతి వర్ణద్వాయ మాదరే ణ సదా స్మరన్ ముక్తి సముపైతి ,జంతుః’’,’’రామయను రెండక్షరములు నాదరముతో సదాస్మరించిన ముక్తి పొందును ‘’అనీ , ‘’రామనామ సముత్పన్నఃప్రణవో మోక్షదాయకః ‘’7కోట్ల మహా మంత్రాలలో రామనామమే గొప్పదని ,అనేక ఉదాహరణలతో ప్రసంగం చేసి సంకీర్తన ప్రారంభించగా భక్తులు పరవశంతో ఉర్రూత లూగి పోయారు .గ్రామప్రజలు పశ్చాత్తాపం ప్రకటించి మన్నించమని కోరారు .రామ శరణ గారి ఉపన్యాస మహిమ గానగరిమ అంత గొప్పవి .ఆంద్ర దేశం లోని వార్షికోత్సవాలలో తప్పక వారి ప్రసంగం ఉండి తీరాల్సిందే .లాక్షణిక ,తార్కిక ,వైయాకరణ సభలలో కూడా వారి ప్రసంగం హై లైట్ గా ఉండేది .
పగోజి ఆకుల ఇల్లిందపల్లి లో సప్త సప్తాహాలు దాసుగారి ఆధ్వర్యం లో జరిగాయి .తులసీ రామాయణ ఉపన్యాసం నామ సంకీర్తన ధార్మిక ప్రసంగాలతో ఆ సప్తాహాలు గొప్ప విజయం సాధించాయి అక్కడ నారాయణ స్వామి అనే భక్తునికి దాసుగారు ‘’హరేరాం ‘’దీక్షనిచ్చారు .ఆయన హరేరాం బాబా గా ప్రసిద్ధి చెందారు .ఈబాబా గారి ఆధ్వర్యం లో కవిటిం అనే ఊర్లో 100 రోజులు అఖండ హరేరామ సంకీర్తన జరిగింది .కాకుల ఇల్లిందపల్లి లో ద్వాదశ వార్షిక హరి రామ నామ సంకీర్తన జరిగింది .
రామకోటి మన శ్రీ రామ శరణ గారికి చాలా ఇష్టం ..2కోట్ల రామ నామం రాసిన పుణ్యాత్ములాయన .రామకోటి ప్రభావాన్ని చెప్పి ఎందరితోనో రాయించారు .1946నుంచి రామనామంతో ఏరిన బియ్యాన్నే వండుకొని తింటున్నారు .గ్రామస్తులతో కూడా అలాగే చేయిస్తూ మరోరకమైన రామనామ ప్రచారం సాగించారు .రామనామ బియ్యపు అన్నమే తాను తినటానికి కారణాన్ని వివరిస్తూ ‘’నేను కంటితో రాముని ,రామభక్తులి రామనామాన్నీ,ప్రపంచాన్నీ సీతారామ మయంగా చూస్తున్నాను .చెవులతో రామ చరిత వింటాను .నోటితో రామనామమే పలుకుతాను ,దాన్ని గురించే మాట్లాడతాను .ముక్కు శ్వాస మీద రామనామ జపం చేస్తాను .చేతులతో రామనామం రామకధలు రాస్తూ ఉంటాను.కాళ్ళతో రామభక్తుల దగ్గరకు, రామాలయాలకు వెడతాను .మనసులో రామ రూప ధ్యానమే చేస్తాను .ఇక మిగిలిన ఈ పంచ భౌతిక శరీరాన్ని అంటే అన్నమయ కోశాన్ని రామ నామం తో ఏరిన బియ్యాన్నే అన్నంగా వండి రాముడికి నైవేద్యం పెట్టి తింటాను .అప్పుడు నేను ఈ పాంచ భౌతిక శరీరం తో సహా శ్రీరముడినే అవుతాను .నేను రామ సాగరం లో ,రామనామం తో పుడతాను .రామనామం తో పెరుగుతాను రామనామం తో చనిపోతాను ‘’అదీ నరసదాస శ్రీరామ శరణ గారి అనన్య భక్తీ .ఇలాంటి వారిని మనం చూసి ఉండం.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -7

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -7

   ఆచార్య పీఠం

దాసుగారిని అందరూ అయ్యవారు అని పిలిచేవారు .శిష్యులుగా చేర్చుకొని మార్గదర్శనం చేయమని చాలా గ్రామాల వారు కోరారు .ఒక రోజు ఒక మహా తెజస్వంతుడు వచ్చి సమాజం లోని అందర్నీ పలకరిస్తూ ,ఆలింగనం చేసుకొంటూ దాసు గారిని ‘’నువ్వు ఎవరు ‘’అని అడిగితె శ్రీరామ చంద్ర మూర్తి పటంవైపు   చెయ్యి చూపారు .ఆయన సంతోషించి మళ్ళీ కనపడ లేదు .కమ్మనమోలు భజన సమాజం వారు దాసుగారిని ఆహ్వానించ గా దాని నాయకుడు సభ్యులకు దాసుగారిని సాక్షాత్తు శ్రీ రామ చంద్ర మూర్తి అని పరిచయం చేశారు .వారంతా దాసుగారి నవవిధ భక్తులు పుస్తకం చదివి ప్రేరణ పొందినవారే .వారూ తమల్ని శిష్యులుగా స్వీకరించమని బలంగా కోరారు .శిష్యులు పెరిగితే సాధనకు ఇబ్బంది కలిగి వాళ్ళు గుది బండలు అవుతారని ఒప్పుకోలేదు .

   బుద్దాం లో ఉండగా దాసుకి ఒక రోజు రాత్రి కలలో  వాసుదాసు  గారు కనిపించి ‘’నాయనా !ఎందరో నీ మార్గదర్శనం కోసం పలవరిస్తున్నారు శిష్యులుగా చేర్చుకొని వారికి ఊరడింపు కల్గించు .ఆచార్త్య పీఠం ఎక్కి వారి కోర్కె తీర్చి మార్గ దర్శనం చేయి .నీ సాధనకు భజనలకు పుస్తక రచనలకు వీరు తోడ్పడతారు .ఇది నా ఆజ్ఞ‘’అని దిశా నిర్దేశం చేశారు దాసుగారి మనసు కుదుట బడింది .

  పునశ్చరణ ,మంత్రం సిద్ధి

  వాసుదాసు గారి ఆజ్ఞను శిరసా వహించి నరసదాసు గారు నెలరోజులు స్కూలుకు సెలవు పెట్టి ప్రయాగ వెళ్ళారు .అదిమాఘ మాసం .చలి విపరీతం .అందరిలాగానే ఒక పందిరికింద పునశ్చరణ ప్రారంభించారు .పల్లి ఆంజనేయులుగారు కూడా ఆయన వెంట ఉన్నారు .దాసుగారు అప్పుడు కనిపించి అంతర్ధానమైన మహర్షితో మాట్లాడాలని కోరికగా ఉన్నారు .పగటిపూట పూజా జపం చేస్తూ ,రాత్రి పదిగంటలకు ఇంతచప్పిడి కూడు తింటూ ,తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానాదులు చేసి గడగడ వనకుతూ జపం  చేసేవారు .ఆంజనేయులుగారు రాత్రి వినోదాలు చూస్తూ ఉదయం 7కు లేచి 10 గంటలకు స్నానం  చేసేవారు .

   దాసుగారు దీక్షగా రోజుకు కనీసం 90 వేల సార్లు మంత్ర జపం క్రమం తప్పకుండా చేసేవారు .సాయంకాలం ఆ మహర్షికోసం ఎదురు చూసేవారు .ఒక వారం తర్వాత ఒకసాయంత్ర అంతర్ధానమైన మహర్షి రావటం ఆంజనేయులు గారు చూసి చెప్పగానే పద్మాసనం వేసి పద్మనాభుని మనసునిండా నింపుకొని ధ్యానిస్తున్న దాసు గారి దగ్గరకు వచ్చి ‘’స్నేహితుడా !నువ్వు చెప్పిన చిహ్నాలున్నాయన వస్తున్నాడు ‘’అని చెప్పగా ,కళ్ళు తెరిచి చూడగా మందగమనం గా వస్తున్న ఆయన్ను చూడగా ఆయన చేయిపట్టుకొని దాసుగారిని లెవ నెత్తి ‘’నాయనా !నీ సాధన అమోఘం .నీకు అలవాటుకాని వాతావరణం లో ఇంతచలిలో నువ్వు దీక్షగా అనుకొన్నది చేస్తున్నావు .నీ హృదయం ధర్మ మార్గాన్ని కోరుతోంది .నువ్వు ధన్యుడవు ‘’అని పలికి తన చేతులతో దాసుగారి శరీరాన్ని నిమిరారు .నరసయ్య గారు ఆనంద పరవశమయ్యారు .సాక్షాత్తు భగవంతుడే  ఆ రూపం లో వచ్చి తనకు మార్గ దర్శనం చేశాడని దాసుగారు భావించారు

  ఆ మహాత్ముని తమ కుటీరానికి తీసుకువెళ్ళి త్రివేణీ జలం తో కాళ్ళు కడిగి పవిత్రజలం శిరసున చల్లుకొన్నారు . తాను  తయారు చేసిన మధురపదార్ధాలు పెట్టగా కమ్మగా భుజించాడాయన .ఆయన నోటికి అందించినవే తిన్నాడు. చేతితో తీసుకొని తినలేదు .ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన దాసుగారి వినయ విదేయతలకు మెచ్చి ,సరస సల్లాపాలు చేసి దాసుగారి సందేహాలన్నీ తీర్చి ,తమ పవిత్ర హస్తాన్ని నరసదాసుగారి మస్తకం పై ప్రేమగా ఉంచగా దాసుగారు వెంటనే నిర్వికల్పసమాధిలోకి వెళ్ళిపోయారు .ఆ అనుభూతి వర్ణనా తీతం .కొంత సేపటికి సమాధినుంచి బయటకు వచ్చి దాసుగారు పరమానందం పొందారు .దాసుగారికి ఆమహర్షి’’ శ్రీరామ త్రయోదశాక్షర మంత్రం ‘’ఉపదేశించి ‘’నీ ఉగ్ర సాధన ఫలించింది .సంపూర్ణ సిద్ధిపొందావు .సందేహాలు తీర్చే సామర్ధ్యం అలిగింది .ఆచార్య పీఠం అది రోహించి ఆశ్రితులకు ఆశ్రయం ఇవ్వు .నిన్ను ఆశ్రయించిన వారు కష్టాల పాలుకాకుండా ,ఆముష్మిక సుఖాలు పొందుతారు .హరిని కీర్తించే సులభోపాయం బోధి౦చటమే నీ ఆధునిక సాధన .నామ ప్రచారం లో నువ్వు ధన్యుడవు అవుతావు ‘’అని చెబుతూ ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు .

  దాసుగారు ప్రయాగలో పునశ్చరణ దీక్ష ఫలప్రదంగా పూర్తీ చేసుకొని మనసంతా రామమయం చేసుకొని ,జపం చేస్తుంటే సరయూనది నుంచి శ్రీరాముడు బయటికి వచ్చి చేతిని దాసుగారి శిరసుపై ఉంచిన భావన కలిగి కళ్ళు తెరిచి చూస్తె ఎవరూ కనిపించలేదు .రామ సాక్షాత్కారం కలగ లేదని బాధ పడగా ఒక మహాత్ముడు దర్శనమిచ్చారు లేచి పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు .ఆయనే రామతత్వాన్ని ఔపోసనపట్టిన శియారఘునాధ శరణ మహారాజ్ .వారినోటి నుండి నిరంతరం సీతారాం సీతారం నామం వెలువడుతుంది .వారు ‘’భక్త శిరోమణీ !నీ జపం ఫలించింది .నీ నిష్టా నియమాలు నన్ను ముగ్దుడిని చేశాయి నీతోమాట్లాదాలని చాలాకాలంగా నాకు కోరిక .’’అని చెప్పి తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి ,రామ పంచాయత మంత్రోప దేశం చేసి ,అనుష్టానక్రమం బోధించి ‘’శ్రీరామ శరణ్’’ అనే దీక్షానామం ఇచ్చారు .ఆమంత్ర జపమూ చేసి నరసదాసుగారు కాశీ వెళ్ళారు .

  కాశీలో మంత్రం సిద్ధిపొందాలనుకొని గంగ ఒడ్డున శృంగేరిమఠం మెడ ఏడవ అంతస్తులో గది తీసుకొని ,శివ పంచాక్షరి మహామంత్ర జపం చేశారు .తెల్లవారుజామున గంగాస్నానం ,విశ్వేశ్వరాభిషేకం చేసి ,జపానికి కూర్చునేవారు .మూడు రోజులతర్వాత ఒకరాత్రి విశ్వేశ్వరుడు కలలో కనిపించి ‘’రామ భక్త రత్నమా !నీ సాధన సంతోషం కలిగించింది .రామనామం నిండిన నా హృదయమే నీకు దగ్గరైంది .నువ్వు రామునికి ప్రేమపాత్రుడవు నాకు మిక్కిలి సన్నిహితుడవు .నీ రామ నామ ప్రచారం లో నా శక్తి కూడా నిన్ను ఆవహించి ఫలితమిస్తుంది .రామనామ ప్రచార రత్నంగా కీర్తి పొందుతావు ‘’అని ఆశీర్వ దించాడు .అక్కడ పని పూర్తీ చేసుకొని శ్రీరామ శరణ గారు బృందావనం చేరారు .

  బృందావనం లో అడుగడుగునా రాధేశ్యాం భజన అపూర్వమని పించింది దాసుగారికి .అక్కడ శ్రీ ఉడియా బాబా ఆశ్రమం గుహ లో ఉంటూ పునశ్చరణ ప్రారంభింఛి పూర్తీ చేసేలోపు వారికి శ్రీరాధా కృష్ణుల దివ్య దర్శనమైంది .ఎందరో మహాత్ములతో పరిచయభాగ్యం కలిగింది .అక్కడినుంచి గోవర్ధన క్షేత్రం వెళ్లి ,రాధాకృష్ణుల విహార స్థలాలను చూసి పులకి౦చారు  .కుసుమ సరోవరం వద్ద ఉంటూ పునశ్చరణ పూర్తీ చేశారు .ఇక్కడా రాధాకృష్ణ సాక్షాత్కారం పొంది,హరిద్వారం చేరారు .భగీరధుని తపస్సు ఫలించి ఆకాశ గంగ భూమిపై కాలుపెట్టిన పవిత్ర క్షేత్రం అది .ఇది నిజంగా వైకుంఠ ద్వారమే .చలి ఎక్కువ .అక్కడ గంగాస్నానం చేస్తూ పునశ్చరణ పూర్తీ చేశారు .అక్కడ శ్రీ కరపత్ర స్వామి దర్శనం లభించి అయన భాషణలు భూషణాలు అనిపించాయి .కొద్దిగా అనారోగ్యమేర్పడగా బుద్దాం వచ్చేశారు .

  శ్రీ రామ శరణ్ గారి దర్శనం తో ప్రజల  ఆనందానికి అవధిలేదు .అందరూ ఆయన పదపద్మాలను ఆశ్రయించాలని భావించారు .శ్రద్ధ ఉన్నవారికి మంత్ర దీక్ష ఇచ్చారు .గుంటూరు ,కృష్ణా జిల్లాలో ఆయన శిష్యబృందం విశేషంగా ఉన్నారు .ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాలో బెంగుళూరులో కూడా శిష్య బృందం ఏర్పడింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వరిష్ట కర్మిష్టి వర్మగారు

వరిష్ట కర్మిష్టి వర్మగారు

వర్మగారు అని అందరికీ పరిచయమైన శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారు జూన్ 6వ తేదీ ఆదివారం గన్నవరం లో స్వగృహం లో 94వ ఏట మరణించారు .వారితో సుదీర్ఘకాలం పరిచయమున్న ఉపాధ్యాయులు ,కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ తో అనుబంధం ఉన్నవారెవరైనా  వర్మగారి గురించి స్పూర్తి నిచ్చే వ్యాసం రాస్తారేమో నని ఎదురు చూసి ఆశాభంగమై ,నాకు

వారితో ఉన్న అనుబంధాన్ని విద్యారంగానికి వారు చేసిన సేవలను  నాకు జ్ఞాపకం ఉన్న మేరకు అందరికి తెలియజేయాలని ఈ రచన మొ దలుపెట్టాను. వారి  విశేషాలపై నాకు పూర్తి అవగాహనా, లేదు అధారిటీ కూడా నాకు లేదు . ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి విషయాలను   ఏకరువు పెడతాను .ఇందులో క్రానలాజికల్ ఆర్డర్ ఏమీ లేదు .

 నేను సైన్స్ టీచర్ గా కృష్ణాజిల్లా మోపిదేవి హైస్కూల్ లో 1963 ఆగస్ట్ లో చేరాను .హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు .అప్పుడు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా   సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ పటమట హై స్కూల్ లో పని చేస్తున్న శ్రీ ఆరిగపూడి పూర్ణ చంద్రరావు గారు .నాకు అప్పటికి గిల్డ్ అంటేఏమిటో తెలీదు .కాని ఆయనపై అభియోగాలు చాలావినిపించేవి .ఆయన్ను తీసేసి వేరే వారిని నియమించాలని గిల్డ్ సభ్యులకు నాయకులకు కలిగింది .కానీ ఆయన అన్ని విధాలా  పలుకు బడి ఉన్నవారట .దీనిపై వ్యూహానికి పామర్రు హై స్కూల్ లో ఒక ఆదివారం టీచర్స్ సమావేశం  నిర్వహించారు తూమాటి వారి  ఆధ్వర్యం లో .అప్పటి వారిలో  వర్మగారు శ్రీ పాలేటి లక్ష్మణ స్వామి శ్రీ కాకరాల రాధాకృష్ణ మూర్తి ,శ్రీ వల్లభనేని  ప్రభాకరరావు శ్రీ ఏం వి కృష్ణారావు(మొవ్వ కృష్ణారావు ) గార్లు అధ్క్షా మార్పు అవసరం గురించి వివరించారు .

 తర్వాత ఒక సారి పడమట హై స్కూల్ లోనో ఎక్కడో మళ్ళీ సమావేశం జరిగింది .ఈలోగా రావు గారిని మర్యాదగా దిగిపొమ్మని చాలా రాయబారాలు జరిగాయి .ఆయన ససేమిరా అన్నారు .వీళ్ళకీ పట్టు దల పెరిగి ఎలా అయినా దించాలని నిర్ణయించారు .మీటింగ్ జరుగుతుండగా మినిట్స్  బుక్ ను ఎవరో ఎత్తుకు పోయారనే గొడతొ  వాయిదా పడుతూ చివరికి కొత్త పుస్తకం తో ఉన్న వారి హాజరీతో పూర్ణ చంద్ర రావు గారిని  తొలగించి ,మా హెడ్మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారిని గిల్డ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోన్నట్లు జ్ఞాపకం అప్పటి నుంచి నేను గిల్డ్ లో మెంబర్ గా ఉన్నాను .

   ఆతర్వాత గిల్డ్ బాగా పని చేస్తూ అందరి కి దగ్గరైంది .కార్యవర్గ సమావేశాలు సర్వ సభ్య సామావేశాలు రెగ్యులర్ గా జరిగేవి .ఉయ్యూరునుంచి నేనూ లేక్కలమేస్తారు ఆంజనేయ శాస్త్రి సైన్స్ మాస్టారు కాంతారావు, హిందీ మాస్టారు రామారావు నతెలుగుపందిట్ శ్రీ అన్నే పిచ్చిబాబు  వగైరాలం వెళ్లి  వస్తూ ఉండేవాళ్ళం  ఆసమావేశ లలో నన్ను మాట్లాడమంటే మాట్లాడే వాడిని. అంతా నన్ను అభి నంది౦చేవారు .తర్వాత ప్రభాకరరావు గారు ప్రెసిడెంట్ అయినట్లు గుర్తు .ఆయన చాలాకాలం కార్యదర్శిగా ఉన్నారు సీనియర్ మోస్ట్  సేకండరి టీచర్ . రూల్స్ అన్నీ బాగా తెలిసినవారు ఆయనకొక గ్రూప్ ప్రత్యేకంగా ఉండేది

  తర్వాత నేను మోపిదేవిలో పని చేసినప్పుడు సోషల్ మాస్టర్ గా ఉంటూ నాకూ లెక్కల మేష్టారు శ్రీ రమణా రావు గారికి ఆప్యాయం గా ఉన్న శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు అప్పుడే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చి వెళ్లి పొయీరు ,ఆతర్వాత పటమట హై స్కూల్ హెడ్ అయి ఆయన వివాదరహితుడు పెద్దమనిషి అని అందరూ గుర్తించి శర్మగారిని  గిల్డ్ ప్రెసిడెంట్ ను చేశారు .అప్పుడు వర్మగారు సెక్రెటరి అయారు తనకున్న అనుభవం .తో . ఆసమావేశం లో నన్ను మాట్లాడ మంటే ‘’శర్మ ,వర్మా కలిసి గిల్డ్ కు బర్మా వేయకండి ‘’అన్నాను వాళ్ళిద్దరితో పాటు అందరూ పగలబడి నవ్వారు నేను ఎప్పుడు కనబడినా ఈమాటే చెప్పేవారు .ఆతర్వాత తాడంకి హెడ్ మాస్టర్ శ్రీ కే మంగళగిరి శాస్త్రి గారు ప్రెసిడెంట్ చేశారు తాడంకి హిందీమాస్టారు శ్రీ  లక్ష్మణ స్వామి  సెక్రెటరి .ఆతర్వాత వర్మగారిని మేమంతా బలపరచి ప్రెసిడెంట్ ను చేశాం .ఆతర్వాత  చాలామంది మారారు .

  కృష్ణా జిల్లా గిల్డ్ అభ్యర్ధిగా శాసనమండలికి శ్రీ కొల్లూరి కోటేశ్వరావు గారిని ప్రతిపాది౦చటం ఆయనకోసం అహరహం ప్రచారం నిర్వహించి అందర్నీ ఒప్పించి మూడు సార్లు ఆయనను గెలిపించటం లో వర్మ గారి పాత్ర చిరస్మరణీయం .గిల్డ్ నిర్వహించే  టీచర్స్ ఓరిఎంటేష న్ క్లాసులు విజయవంతం అయెట్లు చేయటం లో వర్మగారి కృషి  అభినందనీయం .సిలబస్ మార్పులు ,ప్రశ్నపత్రాలలో మార్పులు వగైరాలకు ప్రత్యెక సమావేశాలు నిర్వహించటం లో ఆరి తేరిన చెయ్యి .మంగినపూడి సెమినార్ గొల్వే పల్లి సెమినార్ ఉయ్యూరు సెమినార్ వంటివి లెక్కలేనన్ని .

  కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులైన శ్రీ మాగంటి అంకినీడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు ,శ్రీ సుంకర సత్యనారాయణ శ్రీ రాఘవ రావు గార్లతో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగే చాతుర్యమున్నవారు వర్మగారు .టీచర్స్ బదిలీలలో సమర్ధమైన టీచర్లను సమర్ధమైన స్కూళ్ళలో నియమించటం లో ఆయన చైర్మన్ లకు మంచి సలహా ఇచ్చేవారు .ఉపాధ్యాయ సంక్షేమం పట్ల మక్కువ ఎక్కువ .విజయవాడ శ్రీ కాకాని వెంకటరత్నం టీచర్స్ గిల్డ్, బందరులో శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు టీచర్స్ గిల్డ్ నిర్మాణం లో వర్మగారు నిర్వహించిన పాత్ర ప్రశస్తమైనది .గిల్డ్ హో౦ లలో అన్ని రకాల సదుపాయాలూ కలిపించటానికి  టీచర్లను   ప్రోత్సహించిన వైనం ,గిల్డ్ నిర్వహణలో  ఎలోపం జరుగకుండా చేయటం  లో ఆయన చూపిన విజ్ఞత మరువలేనివి .పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ టీచర్లకు అందుబాటులోనే ఉండేవారు వారి సమస్యల పరిష్కారినికి చొరవ చూపి ఫలితం సాధించేవారు .జిల్లాపరిషత్ చైర్మన్ నిర్వహించే హెడ్ మాస్టర్లసమావేశం జిల్లా విద్యాధికారి నిర్వహించే సమావేశాలలో ఆయనతో వారు సంప్రదించి విజయం కావటానికి కృషి చేయమని కోరేవారు .

   నేనంటే వర్మగారికి అమితమైన  అభిమానం .నాకూ ఆయన౦టే యెనలేని గౌరవం .మా పెద్దబ్బాయి శాస్త్రి రెండోవాడు శర్మవివాహాలు విజయవాడలో జరిగితే హాజరై ఆశీర్వదించారు ఉయ్యూరులో జరిగిన మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మీ అవధాని వివాహానికి విచ్చేసి ఆశీర్వదించిన డొడ్డమనసు వర్మగారిది .

  నా సర్వీసులో ఎప్పుడూ నాకు బదిలీల గండమే .జరిగినప్పుడల్లా ఆయన కు తెలియ ఎసేవాడిని. వీలున్నమేరకు సాయపడేవారు .ఒక్కోసారి ఉయ్యూరు వచ్చి విషయం  ఏదైనా ఉంటె నాకు నేను ఇంట్లో లేకపోతే,మాశ్రీమటికీ చెప్పి వెళ్ళే సంస్కారం ఆయనది .నన్ను ఒకసారి ఉయ్యూరు హై స్కూల్ నుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవులలో ట్రాన్స్ ఫర్ చేశారు .విపరీతమైన వర్షాలు వరదలు . సెలవాల్లోనే జాయిన్ అయాను  అప్పుడు హెడ్మాస్టర్ ఎల్వి .రామ గోపాలం గారు .ఆయన మేనమామ ,మామగారు శ్రీ ఉమా రామలిన్గామూర్తిగారు జిల్లాలో పేరెన్నికగన్న హెడ్ మాస్టర్ .సెలవల తర్వాత స్కూల్ లో నేను సుమారు పది రోజులు పని చేశాను .అక్కడే వర్మగారితో పని చేసే అదృష్టం కలిగింది నాకు .రోజూ ఉయ్యూరునుంచే వెళ్ళేవాడిని .ఆతర్వాత అక్కడ పని చేసి పామర్రు ట్రాన్స ఫర్ అయిన సైన్స్ మాస్టారు వచ్చి మేమిద్దరం మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పెట్టుకుందామని కోరాడు సరే అని వర్మగారికి చెప్పాను ఆయనా ఒప్పుకున్నారు .వెంటనే మళ్ళీ పామర్రు కు మారాను .వీడ్కోలు మీటింగ్ లో వర్మగారు నాగురించి చాలామంచి మాటలుచేప్పారు .

  ఆయనా నేనూ కూడా రిటైరైనా ఆయనకు ఉత్తరాలు రాయటం ఫోన్ తో మాట్లాడటం జరిగేది .ఒకసారి ఆయన భార్యగారి మరణ వార్త పేపర్లో చదివి పలకరించటానికి వెళ్లి వచ్చాను .మరో సారి నేనూ ఆంజనేయ శాస్త్రి గారు కలిసి వెళ్లి పరామర్శించి వచ్చాం .సరసభారతి పుస్తకాలుకూడా వర్మగారికి పంపేవాడిని .అందినట్లు ఫోన్ చేసి చెప్పేవారు .వర్మగారిపెద్దబ్బాయి శ్రీ ప్రసాద్ ఉత్సావంతుడైన డ్రిల్ మాస్టర్ .గ్రిగ్ స్పోర్ట్స్ లో ప్రాతిఏడూ కలిసేవాళ్ళం .వర్మ గారి విషయాలు అడిగి తెలుసుకొనే వాడిని .రెండో అబ్బాయి శ్రీ రాజేంద్ర ప్రసాద్ తానా అధ్యక్షుడయ్యారు .తానా వారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒక ఏడాది జనవరిలో విజయవాడ సిద్ధార్ధ కాలేజిలో కృష్ణా ఉత్సవాలు జరిపితే ఆయన తో పరిచయమైంది .ఆతర్వాత కూడా రెండు మూడు సార్లు కలుసుకొన్నా౦.

   ఖద్దరు పంచె ఖద్దరు చొక్కా ఖద్దరువుత్తరీయం తో  చిరునవ్వుతో కొంచెం భారీ పర్సనాలిటీ తో వర్మగారు ఎప్పుడూ ఉండేవారు .మంచి హాస్యప్రియత్వం ఉండేది .నవ్వుతూ పలకరించేవారు  .కొంచెం కీచు గొంతు.విషయాన్ని విస్పష్టంగా  మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారు .అందుకే మా ఇద్దరి మధ్య కెమిష్ట్రి బాగా కుదిరిందేమో .నిరంతర ఆలోచనాపరులు వరిష్ట కర్మిష్టి శ్రీ అప్పారాయ వర్మ గారి మరణం బాధాకరం .వారికి ఉత్తమగతులు కలగాలని కోరుతున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6 

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6

బుద్దాం లో శ్రీరమా చ్యుత మందిర నిర్మాణం

ఒకప్పటి బౌద్ధుల ఆవాస భూమికనుక బుద్దాం అనే పేరు వచ్చి ఉంటుంది ఇప్పటికి అక్కడ బౌద్ధ నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి .గుంటూరు సీతారామ నామ సంకీర్తన సంఘానికి ఒక ఏడాది మేనేజర్ గా పని చేసి నరసయ్యగారు బుద్దాం వచ్చి అక్కడ మేనేజి మెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ కాపురం పెట్టారు .అక్కడకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ కలరా తీవ్రంగా వ్యాపించి ,ఒకే వారం లో సుమారు 80మంది చనిపోయారు .జనం భయభ్రాంతులయ్యారు అక్కడ కనీసం ఒక్క దేవాలయం కూడా లేదు .కలరా వ్యాధి బారి పడకుండా జనాలకుధైర్యం చెప్పటానికి నరసయ్యగారు మాధవ కీర్తన సప్తాహం నిర్వహించారు .మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే వ్యాధి తగ్గటం మొదలైంది .ఇది సంకీర్తన ప్రభావం అని జనం విశ్వ సించారు .శ్రద్ధగా అందరూ పాల్గొనేవారు .నరసయ్య గారిని ‘’నరసదాసు ‘’గారని గౌరవంగా  సంబోధిం చేవారు  .అరిష్టాలను అరికట్టటానికి ఆ౦జనేయ విగ్రహం స్థాపించి పూజ కూడా జరిపించారు .మంగళ శనివారాలలో  తమలపాకు పూజలు అప్పాల నైవేద్యం చేయించేవారు .దేవాలయం ,అర్చన  లేని గ్రామం లో ఒక్కపూట కూడా ఉండరాదనే ఆర్యోక్తి ని అక్కడిజనాలకు నిత్యం చెప్పేవారు .

 మందిర నిర్మాణానికి ఆయనకు తగిన ఆర్ధిక స్థోమత లేదు. తల్లి చనిపోయింది .కొడుకు ,కూతురు  భార్యాభర్తల పోషణ జరగాలి .శేషమ్మగారు ఎక్కడెక్కడో అప్పు చెసి కొంపగాడుపుతూ , జీతం రాగానే తీర్చేవారు .ఒక సారి ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్ళారు .దాసు గారొక్కరే ఇంట్లో ఉన్నారు .రోజూ నియమమ తప్పకుండా గాయత్రీజపం , ఏమీ తినకుండా బడికి వెళ్లి ,సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాక అన్నం వండి తినేవారు .ఒకరోజు భోజన సామగ్రి లేక అసంపూర్తిగా భోజనం కానిచ్చేవారు .తన బాధ ఎవరికీ చెప్పేవారు కాదు .అలాగే ఒక సారి రాత్రి సంకీర్తన చేసి నిద్రకు ఉపక్రమించారు  .ఆకలి గా ఉండటం తో నిద్ర పట్ట లేదు .చిన్న కునుకు తీశారు .అందులోనే ఒక కల వచ్చింది .శ్రీరాముడు కనిపించాడు ఆయన అలసిపోయినట్లు ఒళ్ళంతా చెమట కారుతున్నట్లు దాసుగారు చూశారు .పైన ఒక ఉత్తరీయం మాత్రమె ఉంది .బరువైన ధావళి కొంత ఊడింది .పాదాలు దుమ్మూ ధూళితో ఉన్నాయి .శ్వాస మహా వేగం గా ఉండటం తో పరిగెత్తుకొని వచ్చినట్లు అనిపించారు .మొహం తెల్లబడి కళ్ళ వెంట నీరు కారుతోంది .ఏదో చెప్పాలన్న తపన తో ‘’వత్సా !ఆకలితో ఎంత బాధ పడుతున్నావోకదా.వెంటనే రాలేకపోయాను ..నా భక్తుల ఆర్తి పోగొట్టటం నా ధర్మం .నీకోసం ఆహారం తెచ్చాను త్వరగా లేచి తిని కడుపు నింపుకో ‘’అని కుడి చేయిని దాసు గారి ఛాతీపై ఉంచాడు రామయ్య .ఆస్పర్షకు దాసుగారికి మెలకువ వచ్చి లేచారు .ఇంటిగుమ్మం తెరిచి ఉంది .దీపం వెలుగుతూనే ఉంది .ఆశ్చర్యం తో లోపలి వెళ్ళారు .అక్కడ ఒక పళ్ళెం లో నాలుగు గోధుమ రొట్టెలు ,వాటిపై పెద్ద వెన్నముద్ద కనిపించాయి .దాసుగారి హృదయం ఉప్పొంగి పోయింది .మనసులో దైవ ధ్యానం చేసి వాటిని తినటానికి కూర్చున్నారు .అవి అప్పటికప్పుడే తయారు చేసినట్లు వేడిగా  వెన్నతో ఉండటం తో రాముడే తాను తినే ఆహారాన్ని తెచ్చి పెట్టాడని నిశ్చయించారు .రామమంత్ర పునశ్చరణ చేయాలనే తలంపు వచ్చి ,మంత్రానికి ఎన్ని అక్షరాలు  ఉంటె అన్ని లక్షల సార్లు నియమం తో జపి౦చాలని  నిర్ణయించుకొన్నారు .దీక్షగా  ఒక్క నెలరోజుల్లో అనుకున్నది పూర్తీ చేశారు .అహర్నిశలు రామనామ జపమే ,మనసంతా రామమందిరమే చేసుకొన్నారు .దీనితో అంతా రామమయం గా కనిపించింది .వారి భక్తి పరాకాష్టకు చేరింది .రాముడిని చూడటానికి తహతహ లాడారు .

  మళ్ళీ ఒకరోజు రాముడు స్వప్న సాక్షాత్కార భాగ్యం కలిగించి ‘’భక్తావతంసా !నీ సాధన తీవ్ర సిద్ధి పొందింది .నీ ప్రేమ హృదయం పరమ మధురం .నీ భావాలు నన్ను ఆకర్షించాయి .నీతో చాలా సన్నిహితంగా ఉండాలనే తీవ్ర మైన కోరిక నాకు కలిగింది .నువ్వు సిద్ధి సాధించిన ఈ స్థలం లోనే నీతో ఉండి పోవాలని పిస్తోంది .నీ నామ ప్రచారానికి నువ్వు నిర్మించాలనుకొన్న మందిరం గొప్ప ప్రచార సాధనమౌతుంది ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .

  ఐడియా బాగానే ఉంది.చేతిలో దమ్మిడీ కూడా లేదు .శేషమ్మగారి నగలు అమ్మితే వచ్చిన రెండు వేల రూపాయలోతో మందిర స్థాపనమొదలు పెట్టాలనుకొని ప్రారంభించి చిన్న మందిరం కట్టారు .దానిలో సీతారామ ఆంజనేయ మట్టి విగ్రహాలు పెట్టి పూజించేవారు .శ్రీ 108ప్రభుదత్త బ్రహ్మ చారి గారు ,శ్రీ శియా రఘువర దాసు గార్లు మనదాసు గారి మందిరం చూడాలనే ఉత్సాహం తో వచ్చారు .పవిత్రమైన ఆమందిరం లో పాలరాతి విగ్రహాలు పెడితే దివ్య తెజోమయంగా ఉంటుంది అని అన్నారు దాసు గారితో .వారిద్దరితో తమ స్థితి గతులు పూస గుచ్చినట్లు దాసు గారు విన్నవించారు .వెంటనే వారు చంద్రకాంత శిలా నిర్మిత శ్రీ రమాచ్యుత’’ విగ్రహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు  .అది రాజస్థాన్ లో మాత్రమె దొరికే జైపూర్ శిల్పం .నరసదాసుగారు అక్కడికి వెళ్లి శ్రీ సీతారామ ,శ్రీ రాధా కృష్ణుల  విగ్రహాలను ఎంపిక చేసి తీసుకొని  వచ్చి మందిరం లో ప్రతిష్టించారు .సగుణ నిర్గుణ నామాలు అయిన ఓంకారం, హరేరాం ఫలకాలను కూడా ప్రతిష్టించారు .ఈ మందిరానికి ‘’నామ ప్రయాగ ‘’అని పవిత్ర నామం  పెట్టారు .భగవదవతార జ్యోతకమైన సంపూర్ణ ప్రభావమే ఆ మందిరం యొక్క ప్రత్యేకత .దీనితో బుద్ధాం లో దేవాలయం లేని కొరత తీరింది .రోజూ రాత్రి భజన చేసేవారు .ప్రతి ఏకాదశినాడు అక్షండ నామ సంకీర్తన నిర్వహించారు .స్త్రీ భక్తులు కమ్మగా గానం భజన లతో అలరించేవారు .త్యాగరాజకీర్తనామృతం జాలు వారి౦ చేవారు .శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి  శ్రీ సీతారామ దాసుగారు ,శ్రీ ఓంకార దాసుగారు ,శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు గొప్ప ప్రేరణ కలిగించేవారు .

  నాలుగేళ్ళు వరుసగా గ్రామస్తుల సహకారం తో ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు జరిపారు .దాతలు ముందుకు వచ్చి మందిర విస్తరణకు ఆర్ధికసాయం చేశారు .మందిరం విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోయేది నరసయ్యగారి ఆర్ధిక బాధలు తగ్గాయి .కుమారునికి , కూతురికి మంచి సంబంధాలు తెచ్చి వివాహాలు చేశారు.భార్య శేషమ్మగారు భర్త నరస దాసుగారికి అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ అతిధి , అభ్యాగ్తులను ఆదరిస్తూ  తలలో నాలుకగా వ్యవహరించి అందరి మన్ననలు ఆదంపతులు పొందారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -5

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -5

నరసయ్యగారికి రోజూ దేవుడికి మృదు మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలని ఉండేది .కాని ఆర్ధిక పరిస్థితికి అది  గొంతెమ్మ కోరికే .ఒకరోజు ఇదే ధ్యాసతో ఆలోచిస్తూ నిద్రపోయారు .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి పెట్టెలో నాలుగు పంచదార లడ్డూలు ఒక కాగితం పోట్లంలో కనిపించాయి.కాగితం మీద ‘’శ్రీరామ నిలయం –అయోధ్య ‘’అని హిందీలో రాయబడి ఉండటం చూసి అమితాశ్చర్యపడ్డారు .వాటిని అందరికి ప్రసాదంగా పంచిపెట్టారు .ఇలా రోజూ ఏదో ఒక మహిమ కనిపించేది .శేషమ్మగారి డబ్బు పోతూ, మళ్ళీ కనిపిస్తూ ఆమెకు నమ్మకం కలిగేది .ఒకసారి నరసయ్యగారు గురువు వాసుదాసు  గారి కి  అలాంటి మహిమలు ఇక తనకు వద్దు అని కోరారు .తన శిష్యుని యోగ సిద్ధి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోటానికి ఆయన జమ్ముల పాలెం వచ్చారు .గురువుగారికి అత్యంత భక్తితో శిష్యుడు స్వాగతం పలికారు ఆయన అమిత శిష్య వాత్సలయం తో దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ‘’’’నాయనా ! నీ యోగసిద్ధి వినయ విధేయతలు ఆధ్యాత్మిక వివేకం మృదుమధుర భాషణం ,నిర్మల మనసు ,నీ మనసులోని ధర్మమూ నాకు తెలిశాయి .మహిమలు అధోగతికి సోపానాలు .జాగ్రత్తగా మసలు కో ‘’అని హితవు చెప్పి వెళ్ళారు .ఇక తనకు ఏరకమైన మహిమలు చూపవద్దని ఆర్తిగా దేవుని నరసయ్యగారు ప్రార్ధించారు .

  యోగం చేశాక తన శరీరం శవాకారంగా కనపడేది .ఒకరోజు రాత్రి అన్ని శరీర భాగాలనుంచి ప్రాణం పైకి వెడుతూ శిరసు దగ్గరకు వచ్చాయి .వెంటనే ఎవరో నెత్తిన చెయ్యి వేయటం అవి మళ్ళీ యధాస్థానలకు వెళ్ళిపోవటం కనిపించి ఆశ్చర్యపోయారు లేచి చూస్తె ఎవ్వరూ కనపడలేదు .

   గుంటూరుశ్రీ రామ నామ క్షేత్ర సందర్శనం

వంగిపురం లో వాసుదాసుగారు శ్రీ కోదండరామ సేవక సమాజం వార్షికోత్సవాలలో నరసయ్యగారు కూడా పాల్గొన్నారు .జనం తండోప తండాలుగా వచ్చారు .రాగం ఆంజనేయులు,పెండ్యాల రామ సుబ్బయ్య ,పన్నాల లక్ష్మీ నరసింహం ,పన్నాల రామ కృష్ణయ్య గార్లుకూడాగుంటూరు నుంచి వచ్చి  పాల్గొన్నారు .సాయంత్రం 4నుంచి నరసయ్య గారు భక్తీ ఉపన్యాసాలు చేశారు .ముందు సంకీర్తన చేసి తర్వాత ప్రసంగం చేసేవారు .పరమాద్భుతమైన తేజస్సుతో విరాజిల్లుతూ ప్రతిపలుకు కలకండ మాధుర్య౦గా ఉండేది ..శ్రీరాముని లీల విలాసాలను శ్రోతల మనస్సులోచొచ్చుకుపోయేట్లు మాట్లాడేవారు  .ఉపన్యాసం పూర్తీ అవగానే శ్రోతలు అందరూ వచ్చి ఆయనకు పాదాభి వందనం చేసేవారు అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆలింగం చేసేవారు .గుంటూరు వారు ‘’స్వామీ !మీ దర్శనం మాకు శ్రేయోదాయకం .గుంటూరులో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఉన్నది మేము దాని సభ్యులం .అది చిన్న సంఘమే కాని మీరు విచ్చేసి అక్కడ నామ సంకీర్తన ఉపన్యాసాలు చేయవలయునని మాకోరిక .మీరు సందర్శిస్తే దాని అభివృద్ధి దిగ్విజయంగా జరుగుతుందని మా విశ్వాసం ‘’అని  రాగం ఆంజనేయులు బృందం వారు  విన్నవించారు .

  నరసయ్యగారు చాలా సంతోషంగా వారి వెంట గుంటూరు వెళ్ళారు .అప్పటినుంచి నరసయ్యగారిని ఆ సంఘ సభ్యులుగా చేర్చుకొని ,ప్రచారం చేసే ప్రతి చోటుకూ తమ వెంట తీసుకు వెళ్ళేవారు .దీనితో ఆ సంఘం విలువ నాలుగు మూలాలకు ప్రాకింది .నరసయ్యగారు జమ్ముపాలెం నుంచి బుద్ధాం వచ్చి ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా పని చేశారు .బుద్ధాం నుంచి 8మైళ్ళ దూరం లో ఉన్న బాపట్లకు వారం లో నాలుగైదు రోజులు భజనకు వెళ్ళేవారు సాయంత్రం 5గంటలకు బయల్దేరి నడిచి వెళ్ళటం ,రాత్రి 11,12వరకు భజన చేసి తిరిగి నడిచి ఇంటికి రావటం చేసేవారు .తెల్లవారుజామున నాలుగుకే లేచి పనులన్నీ  చూసుకొని బుద్దాం స్కూల్ లో బోధనా చేసేవారు .

 గురువు  లేకుండాయోగాభ్యాసం చేయటం అధిక శ్రమ యోగం లో పనికి రాని భోజనాలు తినటం నిద్ర చాలక పోవటం వలన అనారోగ్యం పాలయ్యారు .ఉప్పు కారం ఉన్న తిండి తినటం తో కలిగిన బాధ ఇది .కీళ్ళ వాతం వచ్చి  కదలలేక మెదల లేక ఒక’’ మూట గా’ ఉండిపోయారు .పల్లెటూరుకనుక వైద్య సదుపాయం లేదు .యాచన గిట్టని మనస్తత్వం వారిది .క్రమంగా మనసును స్వాధీనం చేసుకొని చివరికి దాన్నికూడా  త్యాజ్యం చేసి శ్వాసకార్యాన్ని బంధించటం చేత ఆయన చనిపోయారని అందరూ గుసగుసలాడు తుంటు౦టే కొంతసేపటికి బాహ్య స్మృతి కలిగి .ఆపదలో ఆదుకొనే వారే కనిపించలేదు  .వాత౦ హరి౦చ టానికి పూసిన పూతలవల్ల కొంత గుణం కనిపించింది .ఈ అనుభవంతో గురువు లేకుండా యోగాభ్యాసం చెయవద్దుఅని అందరికీ బోధించేవారు .వాసు దాసు గారు రాసిన ‘’మందరం ‘’ను  నరసయ్య గారి చేతితోఅందంగా  రాయించాలని ఆయనకు అప్పగించారు గురువుగారు .ఆరోగ్యం కొంచెం కుదుట బడింది కనుక ఇక వృధా కాలక్షేపం పనికి రాదనుకొని వాలుకుర్చీలో కూర్చుని నెమ్మదిగా మందరం ను ముత్యాల వంటి అక్షరాలో రాసి గురువుగారికి అందించారు నరసయ్యగారు .

  నరసయ్యగారు చాలా కాలం గా బాపట్లకు రాకపోవటం తో స్నేహితుడు పుల్లె శేషగిరిరావు బుద్దాం వచ్చారు . ఈ బాల్య స్నేహితుడు ,సహాధ్యాయి దుర్వ్యసనాలకు బానిసై పతనం చెందుతు ఉంటే సరైన మార్గం లో పెట్టారు నరసయ్యగారు .నరసయ్యగారి దీన స్థితి చూసి ఆయన హృదయం ద్రవించి,వెంటనే సరైన వైద్యం కోసం బాపట్లకు తీసుకు వెళ్ళారు .స్వంతడబ్బు చాలా ఖర్చు చేసి నరసయ్యగారిని మళ్ళీ ఆరొగ్యవంతుల్ని చేసి స్నేహఋణం తీర్చుకున్నారు శేషగిరి రావు .

   ఆతర్వాత గుంటూరు రామనామ క్షేత్రం వారు వచ్చి నరసయ్యగారిని గుంటూరు తీసుకువెళ్ళి తమ సంఘానికి మేనేజర్ ను చేశారు .గుంటూరులో కాపురం పెట్టి ఆసమాజనికి సేవ చేశారు .కంతేరులో జరిగిన వార్షికోత్సవానికి గుంటూరు సంఘాన్ని ఆహ్వానించగా ,నరసయ్యగారు వెళ్లి భక్తీ ఉపన్యాసంతో వారి మనసులను జ్ఞానం నుంచి భక్తికి  మరల్చారు .మూడురోజులు నవవిధ భక్తిగురించి ప్రసంగించారు .ఆ ఉపన్యాసాల సారాంశం ‘’నవవిధ భక్తులు ‘’పుస్తకంగా ముద్రణ పొందింది .

  రాగం ఆంజనేయులుగారి తండ్రి పిచ్చయ్యగారు గొప్ప భక్తులు .రామకోటి రాసేవారు అప్పటికి ఆ సంఘ సభ్యులలో నరసయ్యగారు ఒక్కరే రామ కోటి రాసిన వారు .అందుకని ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది .పిచ్చయ్యగారు రామకోటి పేరుతొ ఉత్సవాలు నిర్వహి౦చాలనుకొన్నారు. పిచ్చయ్యగారు తమ రామకోటికి భద్రాచలం తీసుకువెళ్ళి సీతారామ స్వామికి సమర్పించి అక్కడే పరమపదించారు .

  నరసదసుగారు నిర్ణయించిన ముహూర్తానికి రామకోటి పూజలు చేసి ,రామకోటి ఉత్సవాలను ప్రారంభించారుగుంటూరులో  .ఆతర్వాత ‘’భానువార సంకీర్తనం ‘’పేరుతొ ప్రతి ఆదివారం భజన,ఉపన్యాసాలు జరిపించారు.నరసదాసుగారు ‘’భక్త రామ దాసు ‘’కథా సంకీర్తనం చేశారు ఇదే కథా సంకీర్తనకు పునాది అయింది .కథా సంకీర్తనలో భక్తి ప్రవహించి  ఉర్రూత లూగిస్తుంది .

 ఒకసారి ఈసభవారు సేకూరు సభలకు వెళ్ళారు .అక్కడ క్రమ శిక్షణ లేకపోవటం చూసి ఏవగించుకొని భక్తీ సమాజ౦ అందరికీ  ఆదర్శంగా ఉండాలిఅని  నిశ్చయించారు .పెండ్యాల రామ సుబ్బయ్య గారితో చర్చించి నియమాలు ఏర్పాటు చేశారు .అప్పటికే నరసదాసుగారు వాసు దాసుగారి వద్ద దిన చర్య రాసి మూడు సోపానాలలో అగ్రస్థానం పొందారు .ఒక రోజు గురువుగారు దిన చార్య రాయాల్సిన అవసరం లేదని చెప్పారు .నరసయ్య గారు సభ్యులను సమావేశ పరచి దిన చర్యరాయటం లో ఉన్న నియమాలు అందరూ పాటించాలని ‘’నియమమే ఊర్ధ్వ అయనం.దాన్ని పాటించే వాడే సాటిలేనిమేటి .దానిలోనే మనుష్యత్వం ఇమిడి ఉంది .మనం చేసేపనులన్నీ దిన చర్యరాసేటప్పుడుగుర్తుకు వస్తాయి .మన తప్పు ఇతరులకు చెప్పాలి .నిర్బంధం లోనే బంధ విముక్తి ఉంది ‘’అనిసాకల్యంగా వివరించారు .అందరూ నియమాలను పాటిస్తామని వాగ్దానం చేసి అమలు పరచారు .నెలకోసారి సమావేశం జరిగి సమీక్ష చేసుకొనేవారు .సాధన శాఖకు నరసయ్యగారిని అధ్యక్షులను చేశారు .మొదటి సమావేశం సంగం జాగర్ల మూడి దేవాలయం లో 25 మంది సభ్యులతోజరిగింది .క్రమ౦గా సంఖ్య 200 దాటింది .తర్వాత గుంటూరి క్షేత్రం లోనే సమావేశాలు నిర్వహించారు .1938 నుండి శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి గారి ప్రోత్సాహంతో  ‘’అవిరామంగా హరేరామ నామ సంకీర్తన’’ జరుగుతోంది .నరసయ్య, ఆంజనేయులు గారి నేతృత్వం తో సమాజం ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతోంది .నామారాధన ,,అధః పతనాను రోదధిని ,విషయ వాంఛా నిరోధిని ,సన్మార్గ సులభోపాయ బోధినీ ,సంశయ విచ్చేదినీ ,వైరాగ్యబోధినీ అయిన ‘’మోక్ష సాధన ‘’అనే మాసపత్రికనరసదాసు గారి సంపాదకత్వం లో వెలువడి ఆస్తికాభ్యుదయానికి విశేషంగా తోడ్పడింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -4

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -4õ

      ఉపాధ్యాయ వృత్తి

ఇంటివద్ద ప్రైవేట్ చెపుతున్నా సరైన ట్రెయినింగ్ లేకపోవటం వలన విద్యార్ధులు పల్చబడగా ,ఒంగోలులో ట్రెయినింగ్ స్కూల్ లో విద్యార్ధిగా చేరారు నరసదాసు గారు .దాసుగారున్నది బ్రాహ్మణ హాస్టల్ .మడీ ఆచారం పాటించటానికి తప్పక పాటించేవారు  .మిగిలిన వారు అవన్నీ పాటిస్తూ   నీతి బాహ్యంగా వ్యవహరించేవారు .ఇది దాసు గారికి నచ్చక ,తన ప్రవర్తన చేత వారిని అంతర్బహిశుద్ధులుగా తీర్చి దిద్దారు .అన్నిటా ఫస్ట్ గా ఉండటం వలన విద్యార్ధి లీడర్ గా ఉపాధ్యాయ విద్యార్ధుల అధికారుల మన్నన పొందారు .రాత్రి 9నుండి 12వరకు భజనలో పాల్గొన్నారు .శ్రీరామనవమి శ్రీ కృష్ణాష్టమి శ్రీ శంకర జయ౦తు లను ఘనంగా నిర్వహించారు .ఉపన్యాసాలు హరికధలు చెప్పించారు .ఇలా బ్రాహ్మణ హాస్టలు ను సదాచార కోష్టంగా మార్చారు .

  విద్యాధికారి ,క్రైస్తవుడు అయిన వర్గీస్ ఒక సారి తనిఖీకి వచ్చాడు .స్క్ల్లు హాస్టలు తనిఖీచేశాడు చాలామంది విద్యార్ధులు గైర్ హాజరయ్యారు .హెడ్ మాస్టర్ లీడర్ దాసుగారిని పిలిపించి కారణం అడిగారు.తాము భోజనం చేయలేదనీ ,భోజనహాస్టలు అపవిత్రం అయిందని ,పుణ్యాహవాచనం   చేయించాలని, అప్పటిదాకా తాము భోజనం చేయమని చెప్పారు .చేసేదిలేకరెండురోజులు సెలవిచ్చాడు హెడ్ మాస్టర్ .అందరి తరఫున పుణ్యాహవాచనం కార్యక్రమం దాసు గారే నిర్వహించి ,మళ్ళీ విద్యాలయాన్ని సక్రమంగా నడి చెట్లు చేశారు .దాసుగారి నిష్టాగారిష్టాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి .ట్రెయినింగ్ లో ఉండగా దాసు గారు ఎందరో మహాత్ముల ఆశీస్సులు పొందారు .మహాభక్తులు బొమ్మరాజు సీతారామయ్యగారిని దర్శించి నమస్కరించగా పరమ వాత్సల్యంతో ఆయన దాసుగారిని ఆప్యాయంగా కౌగలించుకొని ,శరీరమంతా నిమురుతూ ‘’నువ్వు శుద్ధ సాత్విక మూర్తివి .ఆధునికులకు సంసార బాధలు నివారించే మాధవుడిని చేరే సాధనం బోధించే మేదావి అవుతావు ‘’అని దీవించారు .బొమ్మరాజు జానకి రామయ్య ,మల్లవరపు సుబ్బారావు ,నీలంరాజు ఆది మూర్తి ,విక్రాల రామ చంద్రా చార్యులు వంటి పెద్దలు హాస్టలుకు వచ్చి ఆశీర్వదించేవారు .వారి సేవాభాగ్యం దాసుగారికి దక్కింది .

  మెట్టప్రాంతమైన ఒంగోలులో వేసవిలో వదగాడ్పులేక్కువ .వీరి స్కూలుకు ఒక మైలు దూరం లో  ఒక పంచమ జాతివాడు వడదెబ్బ తగిలి రోడ్డుమీదనే పడిపోయాడని తెలిసి ,ఒక స్నేహితుడితో అక్కడికి వెళ్ళగా అతడు స్పృహతప్పి ఉండటం గ్రహించి .అతడికి గోచీ తప్ప ఏమీలేదు. అదికూడా మలం తో నిండి ఉంది .దాసుగారు దాన్ని తీసేసి శుభ్రంగా కడిగి ,తన  అంగోస్త్రాన్ని కప్పి ,అతడిని స్నేహితులిద్దరూ భుజాలపై మోసుకొని సత్రానికి తీసుకు వెళ్ళారు .అక్కడే ఉంచి ,మంచి భోజనం పెట్టించి రెండు రోజులతర్వాత అతన్ని వాళ్ళ ఇంటికి పంపించిన దయామూర్తి నరసదాసుగారు .ఎంతటి నిష్టాగరిష్టులో అంతరి ఉదారహృదయులు దాసుగారు .ఇలా గాంధీ గారి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మానవతా మూర్తి దాసుగారు .

   ట్రెయినింగ్ పూర్తి అవజోచ్చింది .టీచర్స్ అసోసియేషన్ జరిపారు .దానికి విద్యాశాఖాధికారి వర్గీస్ అధ్యషత వహించాడు .ఆయన ప్రతి ట్రెయినీని క్షుణ్ణంగా పరిశీలించి నరసదాసుగారిని ఉత్తమ ఉపాధ్యాయునిగా నిర్ణయించాడు .దాసుగారు ఇంగ్లీష్ లో  లో వర్గీస్ గారికి స్వాగత సన్మాన పత్రం రాసి చదివి అందరికీ ఆశ్చర్యం కలిగించారు .అప్పటి ఒంగోలు కలెక్టర్  ఆల్ రౌండర్ అయిన ఏం సి పాయ్ ‘’సర్వతో సమర్ధత పతకం ‘’దాసుగారికి ప్రదానం చేశారు .ఆ ఏడాది 1931లో  మద్రాస్ ప్రెసిడెన్సిలో నరసయ్యగారు ప్రధమ శ్రేణిలో ప్రధమ స్థానం లో ఉత్తీర్ణులయ్యారు .అప్పటివరకు ఏ ఆంధ్రుడూ సాధించని ఘనవిజయం నరసయ్యగారు సాధింఛి ,జమ్ములపాలెం లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపబడి  పని చేశారు .

        యోగా భ్యాస మహిమలు

యోగ సాధనంతో శారీరక మానసిక ఆరోగ్యం సాధించాలని నరసయ్యగారు భావించి హఠయోగ ప్రక్రియ చదివి ,స్వయంగా యోగాభ్యాసం చేశారు .పాడి ఆవును కొని ఆవుపాలు ,  ,ఉప్పు కారం లేని చప్పిడి కూరలతో ,ఆవుపెరుగన్నం మాత్రమె భుజిస్తూ జిహ్వ చాపల్యానికి కళ్ళెం వేశారు .రెండేళ్ళు ఇలా గడపటం తో ఓజస్సు తేజస్సు ఏర్పడి పరమ ఆకర్షణీయులుగా కనిపించారు.జపధ్యానాలతో మరింత శక్తి సాధించారు .పద్మాసనం లో ఉదయం సాయంత్రం 21వేల 600 జపం చేస్తూ ,రాత్రి 11గంటలకు భజన చేస్తూ ,తెల్లవారుజామున 4గంటలకే లేస్తూ యోగ జీవితాన్ని అత్యంత నిష్టా గరిష్టంగా గడిపారు .

  ఒకరోజు రాత్రి స్వప్నం లో సీతామాతః సర్వాలంకార భూషిత గా మెరుపు తీగలాగా దర్శనమివ్వగా తదేక దృష్టితో ఆమెను చూస్తూ ఉండగా ఆమె పసిపాపలాగా మారి ఆయన ఒడిలో కూర్చున్నది .ముద్దులొలికే ఆ చిన్నారిపాపను ఎత్తుకొని ముద్దాడ బోగా కల మాయమయింది  మెలకువ వచ్చి భార్యకు అంతా చెప్పారు .ఆ పిల్లముచ్చట్లు ఆదంపతులు ముచ్చటగా చెప్పుకొన్నారు .ఇంతలో భార్య శేషమ్మగారికి ప్రసవ వేదన కలిగింది .అప్పటిదాకా ఆమెకు ప్రసవ చిహ్నాలేవీ లేనేలేవు .ఆశ్చర్యంగా ఆడపిల్ల పుట్టింది .సీతా దేవి అనుగ్రహం తో పుట్టిన ఆపాప కు సీతా కల్యాణి అని పేరు పెట్టుకొన్నారు .

  నవవిధ భక్తి రసాలను నరసయ్యగారు ఆస్వాదించారు .సఖ్యభక్తిలోశ్రీరాముడు ఆయనతో ఆటలాడే వాడు .ఒకరోజు రాత్రి రాముడు స్నేహితుడుగా వచ్చి ఆయన ప్రక్క పడుకొన్నారు .భార్య అనుకోని కాలు వేస్తె ,రాముడు లేచి ‘’నీమీదున్న స్నేహంతో వచ్చి నీ పక్కన పడుకొంటే ,నామీదనే కాలు వేస్తావా ‘’ఇది నీకు న్యాయమా ‘’అని అలుకతో పలుకగా నరసయ్యగారు తెల్లపోగా, రాముడు  ‘’మిత్రమా ! నీపాదం నాకు మోదం చేకూర్చింది .నన్నే నమ్మి భజి౦ చేవారంటే నాకు పరమ ప్రీతి .సుజనుల చరణ ధూళి నాకు పరమ పవిత్రం .దాన్ని ధరించటానికే నీ దగ్గరకు వచ్చాను ‘’అని  రామ చంద్రమూర్తి అదృశ్యమయ్యాడు .అమితాశ్చర్యపడ్డారు నరసయగారు .

   రామ భజనకు హనుమ ఉపాసన ముఖ్యం .ఆయన రామునికి నామానికి వారధి .అందుకే నరసయ్యగారు హనుమను అత్యంత భక్తితో అర్చించేవారు .ఒకరోజు రాత్రి 11గంటలకు చేసే భజన పూర్తికాగానే భార్య శేషమ్మగారు ‘’మనం బాగా బీద వాళ్ళం. ఇల్లు గడవటం కష్టంగా ఉంది .సంపాదన యావ లేకుండా మీరు రామభజన చేస్తుంటే సంసారం గతేమిటి వయసులో కాక ముసలితనం లో డబ్బు సంపాదించలేరు కదా ‘’అని భజన గురించి కొంచెం అవహేళనగా మాట్లాడితే ఆయన ‘’అన్నిటికీ రాముడే దిక్కు అని నమ్మి ఉన్నాము మనం .ఆయనే  చూసుకొంటాడు . ఆందోళన పడకు ‘’అని ఊరడించారు .ఆమెకు తలకెక్కలేదు ‘’రొక్కం లేక పొతే డొక్క నిండుతుండా శుష్కవేదాంతం తో కడుపు ని౦ డుతుండా అని వాకిలి తలుపు గడియ పెట్టటానికి గుమ్మం దగ్గరకు వెడితే ,ఒక కోటి అమాంతం వచ్చి బలంగా ఆమె వెంట్రుకలు పీకింది .భయంతో అరిచి కిందపడిపోయింది .నరసయ్యగారు దీపం తో వచ్చి లేపి ,ఆమె తలమధ్యభాగంలో  వెంట్రుకలుకత్తి రించి ఉండటం చూసి ‘’భాగవతాపచారం చేశావు .క్షమాపణ వేడుకో ‘’అనగా ఆమె ‘’నా తలపోటు తగ్గితే నా బంగారు గొలుసు ఇస్తాను .అప్పాలు పానకం చేసి నైవేద్యం పెడతాను అని మొక్కుకోన్నది .వెంటనే ఆమె బాధ అంతా తగ్గింది .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి ఉన్న చిన్న పెట్టెలో 72రూయాలు కనిపించాయి .ఇదంతా ఆంజనేయ మహిమ అని గ్రహించారు ఇద్దరూ .ఆడబ్బును భగవంతుని పటాలు కొనటానికి ఖర్చు చేశారు .ఆరోజు నుంచి వారి బియ్యపు డబ్బాలో ఎప్పుడూ ఒక శేరు బియ్యం నిలవ ఉండేవి .రోజూ చేసే భోజనానికి భగవంతుడు లోటు రానీయడు అని గ్రహించారు దంపతులు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-21-ఉయ్యూరు   ‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment