తెలుగులో మొదటి ప్రింటింగ్ -2 ఇండియాలో ప్రింటింగ్

తెలుగులో మొదటి ప్రింటింగ్ -2

ఇండియాలో ప్రింటింగ్

దైవవాక్య వ్యాప్తికి ఇండియాలో క్రిస్టియన్ మిషనరీ ప్రవేశించింది .దీనికి బైబిల్ మొదలైన వారి మతగ్రంధాలు బాగా అవసరమయ్యాయి .వారు స్థానిక భాషలు నేరుస్తూ నిఘంటువులు ,వ్యాకరణాలు రాశారు .తర్వాత కాలనీ ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణకోసం ప్రవేశించింది .సివిల్ ఉద్యోగులు సమర్ధ పరిపాలనకు స్థానిక భాషలు నేర్వాల్సి వచ్చింది .వీరికీ భారతీయ భాషలలో డిక్షనరీలు ,వ్యాకరణాలు అవసరమయ్యాయి .ఈ అవసరాలు తీర్చటం కోసం మిషనరీలు, కాలనీ ప్రభుత్వాలు భారతీయ భాషలలో పుస్తకాల కోసం అచ్చు యంత్రాలను నెలకొల్పారు  .1576లో గోవాలో  జేస్సూట్  మిషనరీ మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు  చేసింది . 1578లో మొదటిపుస్తకంగా ‘’డాక్ట్రినా క్రిస్టా’’ ముద్రించారు .దక్షిణభారత లో తిరునల్వేలి జిల్లా పులికైల్ లో కూడా ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .1579లో వెంట్రిలో మిషనరీలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టి    దాన్ని కేంద్రంగా మార్చుకొన్నారు.  1581లో వెంట్రి కి దగ్గరలో ఉన్న వైపికోట కు హెడ్ క్వార్టర్ మార్చారు. 1602లో పోప్ వైపికోట జెసూట్ మిషనరీకి  ఒక ప్రింటింగ్ ప్రెస్ ను గిఫ్ట్ గా  ఇచ్చాడు .ఈ ప్రెస్ లో రోమన్ స్క్రిప్ట్ లో తమిళ, మళయాళ, కొంకణి భాషలలో ప్రార్ధన పుస్తకాలు ప్రచురించారు .పోర్చుగీస్ భాషలో ఉన్న క్రిస్టియన్ మత గ్రంథాలను మలయాళం లోకి అనువదించి 1616ప్రాంతం లో అచ్చువేశారు .1649,1654లలో వీటిని పునర్ముద్రించారు .ఇక్కడ గమనించాల్సిన అతిముఖ్య విషయం ఈ పుస్తకాలు రోమన్ స్క్రిప్ట్ లో ముద్రి౦చ బడటం .

   1674 గుజరాతి వ్యాపారి భీమ్జి పరేఖ్ బొంబాయి లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు .తనకు సాయంగా ఒక ప్రింటర్ ను పంపమని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాస్తే ,ప్రింటింగ్ లో నిష్ణాతుడైన హెన్రి హిల్స్ నుపంపారు .ఇక్కడ కూడా పుస్తకాలు రోమన్ అక్షరాలలోనే ముద్రి౦ప బడినాయి .గుజరాతి ,ఇతర భాషలలో ముద్రించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు .1679 లో హంబెల్ ఖండ్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పడి, మొదటిసారిగా తమిళ్ –పోర్చుగీస్ డిక్షనరీ ప్రింట్ చేశారు .1712లో డేనిష్ మిషనరీ తమిళనాడు తంజావూరు లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి పోర్చుగీస్ భాషలోనే పుస్తకాలు ముద్రించారు .జర్మనిలో తమిళ అక్షరాలను మోల్డ్ చేయించి దిగుమతి చేసుకోన్నారు కాని,అవి బాగా పెద్దవి అవటంతో ఉపయోగపడలేదు .ఈ ప్రెస్ లోనే చిన్న అక్షరాల మోల్డ్ లు తయారు చేసే ప్రయత్నం చేశారు .ఫలించి 1744లో ఈప్రెస్  లోనే తమిళంలో ‘’న్యు టెస్ట్ మెంట్ ‘’ముద్రించారు .అంతకుముందు 1733లోనే ఇక్కడే తమిళం లో వ్యాకరణ పుస్తకం అచ్చయింది .ఇదే ఇండియాలో తమిళభాషలో ముద్రింపబడిన మొదటి వ్యాకరణ పుస్తకంగా గుర్తింపు పొందింది .

                   మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్

1761లో మద్రాస్ లో కొన్ని ఆసక్తికర పరిస్థితుతులలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటైంది .ఆ ఏడాదే బ్రిటిష్ వాళ్ళు పా౦డిచేరిని ఫ్రెంచ్ వారినుంచి స్వాధీనం చేసుకొన్నారు .గవర్నర్ భవన౦ లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ను మద్రాస్ కు తెచ్చి, తమిళం లో నిష్ణాతుడైన బ్రిటిష్ స్కాలర్ కు అందజేశారు .దీన్ని వెప్పేరి మిషన్ కాంపౌండ్ లో నెలకొల్పారు .1779లో ఇక్కడే తమిళ –ఇంగ్లిష్ డిక్షనరీ ,1786లో ఇంగ్లిష్ –తమిళ్ నిఘంటువు లు ముద్రింపబడ్డాయి.ఇంతమాత్రం చేత మద్రాస్ లో ఇదే మొదటి ప్రిన్టింగ్ ప్రెస్ మాత్రం కాదు .1746నుంచి మద్రాస్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లు ఆధారాలున్నాయి .దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు పాండి చేరికి తీసుకు వెడితే ,వాళ్ళ అధికారం పోయాక బ్రిటిషర్లు మళ్ళీ మద్రాస్ కు దీన్ని1761లో  చేర్చారు  .కనుక దక్షిణభారత దేశం లో ప్రింటింగ్ 16వ శతాబ్దం లోనే ఉన్నట్లు గమనించాలి .ఉత్తరభారతం లో 200 ఏళ్ళ తర్వాతనే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .కానీ బెంగాల్ లోని ‘’సేరా౦ పూర్ ప్రెస్’’ అనేక  భాషలలో ప్రింటింగ్ చేయటం లో ప్రముఖంగా తోడ్పడింది .సేరా౦పూర్  మిషనరీలే మొదటి పవర్ ప్రెస్ నుకూడా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకం .

  ఇండియాలో 16వ శతాబ్దిలోనే ప్రింటింగ్ టెక్నాలజీ మొదలై ,19వ శతాబ్ది ప్రారంభానికి పూర్తిగా వికసించింది .ప్రింటింగ్ ప్రెస్ వలన భాషాభి వృద్ధి ,అక్షరాస్యత ,విజ్ఞానం మిక్కిలిగా పెరిగి ,వార్తాపత్రికల ఆవిర్భావానికి నాంది పలికింది .

image.png

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్

గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు  లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది .

   క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు అశోక చక్రవర్తి కాలం లో పాలనా పరమైన విషయాలను ప్రజలకు తెలియ జేయటానికి శిలాఫలకాలు,  ,స్తంభాలపై వివరాలను చెక్కించాడు .సామ్రాజ్యం లో చాలా మారుమూల ప్రాంతాలలోకూడా వీటిని ఏర్పాటు చేశాడు .రవాణా వ్యవస్థ అంతగా రూపు దాల్చని ఆ కాలం లో రాజ నిర్ణయాలు తెలియ జేయటానికి ఇవే ప్రజలకు ఉపయోగంగా ఉండేవి .ఈయన తర్వాత వచ్చిన పాలకులు గోడలపై వ్రాయస గాండ్ల చేత ముఖ్య విషయాలు రాయించారు .పాతవి చెరిపేసి తర్వాత కొత్తవార్తలు రాసేవారు .మొఘల్ సామ్రాజ్యావతరణలో వార్తా ప్రసారం కొత్త దారి తొక్కింది .వార్తాహరుల చేత వార్తలను వేర్వేరు ప్రదేశాలకు పంపే వ్యవస్థ ఏర్పడింది .ఇలా రవాణా వ్యవస్థలో పెక్కు మార్పులు తెచ్చింది మొగలులే .వ్రాతప్రతులు ఆనాడు ఉద్యోగస్తులకే ఉపయోగకరం గా ఉండేవి .తర్వాత వాటిని నకులు అంటే కాపీలు తీసి బాగా ఉపయోగించారు .వార్తలను సేకరించి రాయటానికి వ్రాయస గాళ్ళకు  ఔరంగజేబ్ ఎక్కువ స్వాతంత్ర్యాన్ని కలిపించాడు .కొన్ని సందార్భాలలో వీళ్ళ రాతలు కల్పితంగా ,నిజాలకు దూరంగా ఉండేవి .ముఖ్యంగా దక్కన్ లో ఈ బాధ ఎక్కువగా ఉండేది .

  1656-58కాలం లో ఇండియాలో పని చేసిన ఫ్రెంచ్ డాక్టర్ ఫ్రాన్కోస్ బెర్నియర్ తనపుస్తకం లో  మొగలులకాలం లో వార్తలురాసి వివిధ ప్రాంతాలకు పంపే  వకి –అస్నవిస్  గురించి విపులంగా రాశాడు  .ఔరంగజేబ్ పాలనలో వచ్చిన వెనీస్ యాత్రికుడు నికోలా మానుషి ‘’వార్తలురాసే వకియా –నావిస్ ,కన్ఫియనేవిస్ లు వార్తలను వారానికి ఒకరోజు మొఘల్ రాజుల  సమక్షం లో  చదివి వినిపించాలి అనే షరతు ఉండేది ‘’అని రాశాడు .1828లో కల్నల్ జేమ్స్ టాడ్ వందలాది ఇలాంటి వార్తా పత్రాలను లండన్ లోని రాయల్ ఏషియాటిక్ సొసైటీకి భద్రంగా పంపించాడు .ఇవి ఒక్కొక్కటి 8అంగుళాల పొడవు ,నాలుగున్నర అంగుళాల వెడల్పు ఉండేవి .ఇవన్నీ వేర్వేరు వారిచేత రాయబడిన నోటీసులు ,పదోన్నతపత్రాలు ,చక్రవర్తి పర్యటన విశేషాలు ,వేట వినోదాలు ,దాడులు  ,అందిన నజరానాల వివరాలు పెర్షియన్ ఉర్దూలో రాయబడిన  పత్రాలు . భారత దేశ చరిత్రలో ఈ  వార్తా పత్రాలకు అధిక ప్రాధాన్యం ఉంది .పరిపాలకులకు దేశం లో జరిగిన అనేక విషయాలను తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడేవి .

  అచ్చు వార్తా పత్రికలు  వచ్చాక కూడా వ్రాతప్రతులు, వార్తా పత్రాలు, వార్తాపత్రికలు ఉంటూనే ఉన్నాయి.ప్రభుత్వ పాలనకు వ్యతిరేక౦గా ఉన్న వ్రాతప్రతులు వార్తల రవాణాకు బాగా సహకారంగా ఉండేవి .12-4-1828న ఫోర్ట్ సెయింట్ జార్జ్ ,సర్ జోహాన్ మాల్కోంల అతిరహస్య దస్త్రం ప్రభుత్వ వ్యతిరేక వ్రాతప్రతిగా పేర్కొనబడింది .క్రీశ 1800లో ఆ  దక్షిణ భారత దేశం లోని ప్రతిగ్రామానికీ చేరింది .1800-1806 కాలం లో జరిగిన ‘’వెల్లూరు తిరుగుబాటుకు’’ఆ ప్రతులు బాగా దోహదపడ్డాయి .1857ప్రథమభారత సంగ్రామం లో ఇలాంటి ప్రతులు కీలకపాత్ర పోషించాయని ఆయన రాశాడు .

                  అచ్చుకళ

ఆర్ట్ ఆఫ్ ప్రింటింగ్ అంటే అచ్చుకళ గురించి తెలుసుకొందాం .జర్నలిజం చరిత్ర  అచ్చు యంత్రం అభి వృద్ధితో ముడిపడి ఉన్నది .ప్రింటింగ్ ప్రెస్ మొదట కనిపెట్టిన ఘనత చైనాకే దక్కుతుంది .చైనావారు కదిలే టైపు లను మొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ లో ఉపయోగించారు .మొదటి పేపరు కూడా చైనాలోనే తయారయింది .క్రీ.శ 866లోనే మొదటిపుస్తకం చైనాలోనే అచ్చు అయింది .పెకింగ్ లో ప్రచురింపబడిన ప్రభుత్వ గెజిట్ అత్యంత పురాతన వార్తాపత్రికగా గుర్తింపు పొందింది .

   15వ శతాబ్దం లో జర్మనిలోని మైంజ్ సిటి కి చెందిన జాన్ గూటేన్ బెర్గ్  అనే గోల్డ్ స్మిత్ కదిలే యంత్రాన్ని,  కొయ్య బ్లాకులకు బదులు వాడే మెటల్ టైప్ కు పనికొచ్చే సిరాను అభి వృద్ధి చేసి ఇన్వెంటర్ అయ్యాడు .1456లో సుమారు 300 బైబిల్ పుస్తకాలను ముద్రించి చరిత్ర సృష్టించాడు .దీనితర్వాతే చాలా దేశాలలో ప్రింటింగ్ ప్రెస్ లు వెలిశాయి .ఇటలిలోని వెనిస్  నగరం ప్రింటింగ్ కు పెద్ద కేంద్రంగా విరాజిల్లింది .ఆ కాలం లో ప్రభుత్వాలు, చర్చి లు ప్రింటింగ్ ప్రెస్ లను పోషించాయి .1476లో కాక్స్టన్ అనే మొదటి ప్రింటర్ వెస్ట్ మినిస్టర్ లో ప్రింటింగ్ ప్రెస్ మొదటిసారిగా నెలకొల్పాడు .ఈయన అచ్చు కళను కొలోన్ లో నేర్చుకొన్నాడు .అప్పటిదాకా లాటిన్ భాషలోమాత్రమే ప్రింట్ చేసే వారు. ఈయన ఇంగ్లిష్ లో ప్రింట్ చేసి మరో చరిత్రకు నాందిపలికాడు  .క్రమంగా ప్రింటింగ్ ప్రెస్ లు ప్రపంచమంతా పాకిపోయాయి .

 14వ శతాబ్ది శ్రీనాథకవి రచనలవలన భారతదేశం లో పేపరు వాడకం ఆంధ్రప్రాంతం లో రెడ్ది రాజులకాలం లోనే ఉన్నట్లు తెలుస్తోంది .ప్రింటింగ్ ప్రెస్  అవతరించిన ప్రతి చోటా విద్యావ్యాప్తి జరిగింది .మనిషి దృక్పధంలో అత్యంత తీవ్రమైన మార్పు వచ్చింది .ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలాన్ని ప్రాచీనకాలాన్ని విభజన  చేసింది ప్రింటింగ్ ప్రెస్ . ఇండియాలోకూడా విద్యావ్యాప్తికి ,అభి వృద్ధికి బహువిధాల ప్రింటింగ్ ప్రెస్ తోడ్పడింది .భారతీయ భాషలు దీనివలన ఎన్నోప్రయోజనాలు పొందాయి .వార్తాపత్రికల ప్రింటింగ్ లో ప్రింటింగ్ ప్రెస్ అత్యద్భుత ప్రగతి సాధించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం లేదుకదా ?’’అని ఒక్కమాట అడిగితె ఈయన కళ్ళనుంచి దుఖం ధవలేశ్వర డాం నుంచి గోదావరి ఉబికినట్లు  కారింది .’’తెలివితేటలు  బానే ఉన్నాయి ఊరుకో ‘’అని ,తానుకోడుకును పలకరించినట్లు లోపలివారికి తెలిసిపోతుందేమో అని గబగబా లోపలి వెళ్ళిపోయారు .తనకు ఆక్షణం లో అంత దుఖ౦ ఎందుకు వచ్చిందో  తెలీదన్నారు శాస్త్రిగారు .ఏడవకుండా ఉంటె ఇంకో రెండుమాటలు మాట్లాడి ఉండేవారేమో అనుకోని తనను తాను  సముదాయి౦చు కొన్నారు  .ఆనాటి కొందరిపెద్దల తీరు అలానే ఉండేది .మానాన్నగారూ అలానే ఉండేవారు .తండ్రిగారి టోపీ కనపడకుండా చేసి ,ఆయన తిరుగుప్రయాణం హడావిడిలో దాన్నిమర్చిపోతే పడవల రేవుకు తీసుకు వెళ్లి ఇస్తే ,’’నేను మర్చిపోలేదు నీకోసమే ఉంచాను ‘’అని రెండు పొడిమాటలుమాట్లాడి స్నేహితులతో కబుర్లలో పడ్డారు తండ్రి .

మాఖమాసం లో శాస్త్రిగారి ఉపనయన ముహూర్తం పెట్టి తండ్రికి ఈయనద్వారానే ఉత్తరం రాయించి సంతకం ‘’లింగయ్య శాస్త్ర్ృల్లు వ్రాలు’’అని దస్కత్తు చేశారు. శాస్త్రులు అని రాయటానికి వచ్చినతిప్పలు ఇవి రెండుతప్పులు అందులో గమనించారు మనవడు గారు .పూర్వపు సంస్కృత పండితులకు తెలుగుపై  దృష్టి ఉండేది కాదని ,తాతగారు తాటాతాకుల మీద రాయగలరుకాని కాగితాలమీద రాయలేరని శాస్త్రిగారు ఉవాచ .ముహూర్తానికి ముందే బలగం అంతా చేరింది .ఆ ఇంట్లో మామిడాకు తోరణం కట్టి 40ఏళ్ళు అయిందని ,కనుక మనవడికి ఉపనయనం తాము చేసే అవకాశం ఇవ్వమని మామ్మ,తాత శాస్త్రిగారి తండ్రినికోరటం వారు అంగీకరించటం జరిగి తాత బామ్మల చేతులమీదుగా శాస్త్రిగారి మెడలో జందెపు పోగుపడింది .తమ తలిదండ్రులది త్యాగంగా అందరూ భావించారు .దీనికి శాస్త్రిగారు ‘’వాత్సల్యం వంక చూడగలిగితే అది మహాత్యాగమే ‘’అని చెప్పారు .సంధ్యావందనం నేర్పే బ్రహ్మగారు ‘’అచ్యుత ,జనార్దన ,ఉపేంద్ర ,హరేః శ్రీ కృష్ణః’’అని చెబుతుంటే ‘’ఇవి సంబోధనలు సున్నాలు ఉండకూడదేమో?’’అని దువ్వూరి  వారు ఆయనతో అంటే ‘’మీ సాహిత్యాలిక్కడ పనికిరావు .ఇదేమన్నా కుమారసంభవం, మేఘ సందేశం అనుకొన్నావా ? సున్నాలు అలా ఉండాల్సిందే కదల్చటానికి వీల్లేదు ‘’’’అని గదమాయిస్తే,  ఆయన అమాయక విశ్వాసానికి శాస్త్రిగారు జాలిపడి ‘’స్మార్తం లో భాషా కృషి చేసినవారు లేరు ‘’అని బాధపడ్డారు .వేదపాఠశాలలు సంస్కృత పాఠశాలలు పెడుతున్నారుకాని స్మార్తం చెప్పిస్తూ సాహిత్యగ్రంథాలు కూడా కొద్దిగా చదివించే పాఠశాలలు వస్తే బాగుండును అనుకొన్నారు .’’ఆత్మనామ గురోన్నామ —-నృహ్లియ్యాత్’’అని పెద్దలశాసనం కూడా ఉన్నట్లు గుర్తు చేశారు .రెండేళ్లలో తాతగారి వద్ద  సాహిత్య గ్రంథాలన్నీ పూర్తయ్యాయి .14వ ఏట ఇల్లువదిలి బయట ఎక్కడైనా వ్యాకరణం నేర్వాలని మనసుపడ్డారు .

మూడుమైళ్ళ దూరం దంగేరులో వేదార్ధవిశారదులైన ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి తండ్రిగారు  వేదవేత్త గంగాధరశాస్త్రిగారికి మనవడిని అప్పగించారు తాతగారు .కౌముది ప్రారంభించి సంజ్ఞా పరిభాషలు అచ్ సంధి చదివారు .వేదామూ శాస్త్రమూ చదివిన పండితులు అప్పుడు అరుదు .ఇక్కడ చదివినప్పుడు దగ్గర బంధువు ఉప్పులూరి సూర్యనారాయణ గారింట్లో ఉండేవారు .గంగాధరం గారు కొద్దికాలానికే కాకినాడకు మకాం మార్చారు .అప్పటికే దాక్షారామ లో సంస్కృత పాఠశాల వచ్చింది .చిలుకూరి చతుస్టయ౦ అని వ్యాకరణం లో పేరుపొందిన వారిలో పాపయ్య శాస్త్రిగారి గారి రెండవకుమారుడు చిలుకూరి కొండయ్య శాస్త్రులుగారు అక్కడ వ్యాకరణ బోధకులని దువ్వూరి వారికి తెలిసింది .అక్కడ చేరి హల్ సంది ప్రారంభించారు .40కి పైనే విద్యార్ధులు ఉండేవారు .ఈ బాచ్ లో అనిపెద్ది వెంకటశాస్త్రి దీ   గురువుగారు కొండయ్యగారిదీ సమానవయస్సే .అందుకని గురువుగారు ఈయన్ను ‘’వెంకట శాస్త్రిగారు ‘’అనే గౌరవంగా పిలిచేవారు. ఇది మిగిలినవారిలో అసూయకు కారణం అయి౦ది కూడా .ఒక సాయిబు చేత వేంకటశాస్త్రిని ‘’వెంకన్న గారు ‘’అనిపిలిపించి ,గురువుగారికోపానికి గురై కూకలేయి౦చుకొన్నారు దువ్వూరి అండ్ కో .పొయ్యిమీద ఉడుకుతున్న అన్నం గిన్నె దించలేక కిందపదేసినందుకు గుర్విణి తోనూ చీవాట్లు తిని ఇకా అక్కడ ఉండలేక వెళ్లిపోతుంటే ‘’ఏదోకోపం లో నాలుగు అంటే వెళ్ళిపోవాలా “?అని వాత్సల్యంగా అడిగినా ముగ్గురు ముఠా వెళ్ళిపోయారు .

దాక్షారామకు సుమారు 8మైళ్ళ దూరం లో ఉన్న కొంకుదురు లో కొత్తగా పాఠశాలపెడుతున్నారని వేదుల సూర్యనారాయణ శాస్త్రిగారు వ్యాకరణం బోధిస్తారని తెలిసి అక్కడికి చేరి పాఠాలు ప్రారంభించారు ఈముగ్గురు. వేదులవారు మహామహోపాధ్యాయ తాతారాయుడు శాస్త్రులుగారి మొదటి శిష్యులు .వ్యాకరణం లో అపారపా౦డిత్యమున్నవారు .ఒకగంట చెప్పాల్సిన పాఠాన్ని 2లేక 3న్నరగంటలు బోధించేవారు .సూత్రాలు విమర్శలు అన్నీ వివరంగా బోధించటం వలన మళ్ళీ ఇంటిదగ్గర చదవాల్సిన అవసరం  ఉండేది దికాదన్నారు దువ్వూరివారు .కౌముది దాదాపు పూర్తయింది .వారి బోధనలో ‘’ఉత్సాహకరమైన అనుభవం కలిగింది ‘’అని మురిసిపోయారు .వేదులవారికి పిఠాపుర సంస్థానాధీసులనుంచి పండితులుగా చేరటానికి ఆహ్వానం వచ్చింది .వెళ్ళే ప్రయత్నం లో ఉండి దువ్వూరి వారినిపిల్చి తరువాత ఏమి చదువుతావని అడిగితె ఆయనతో పిఠాపురం వెళ్లి అక్కడే చదువుతాను అనగా ‘’ఇప్పటినుంచే నిర్ణయం లో ఉండకు అప్పుడు ఆలోచిద్దాం ‘’అన్నారు .

తాతగారు రాసిన కార్డు ప్రకారం వెళ్ళారు .15రోజుల్లో పెళ్లి ముహూర్తం అని ఆయన చెప్పటం ,గురువుగారికి పెళ్లి విషయం కార్డ్ రాయటం జరిగిపోయాయి .వధూవరుల  ఇష్టాయిష్టాలతో  జరిగే పెళ్ళిళ్ళు ఆనాడులేవు .బాధ్యతంతా పెద్దలదే నిర్ణయాలూ వారివే .పెళ్లి చూపులూ లేవు ‘’చిన్నవయసులో పెళ్లి విషయం వధూ వరులు  నిర్ణయి౦చు కోలేరుకనుక అప్పటి సంఘం  ఆ అపద్ధతే పాటించింది  ‘’అంటారు శాస్త్రిగారు .వివాహం నాటికఈయనకు 15, ఆమెకు 10ఏళ్ళు .అమలాపురం తాలూకా ఇందుపల్లిలో వంక జగన్నాధం గారమ్మాయి పెళ్ళికూతురు .స్నాతకానికీ వివాహానికీ మధ్యకాలం లో నదులు దాటరాదు అనే నియమం ఉండటంవలన గోదావరి దాటినఅవతలి ఒడ్డున అంటే ‘’ అద్దరిని ‘’ముక్తేశ్వరం లో మాతామహుల ఇంట   స్నాతకం చేసి అమ్మ,అమ్మమ్మ కోరికా తీర్చారు .దువ్వూరివారితల్లి బాగా చదువువుకొన్న అంటే సాహిత్యం చదివిన ఇల్లాలు ‘’వర్ధనమ్మది తెలుగులో మంచి జ్ఞానమండీ ‘’అని అతా చెప్పుకొనేవారు తనతల్లి గురించి .భాషాజ్ఞానం ఎక్కువ.పురాణాలన్నీ తేలికభాషలో అందరికీ చెప్పేది .

పెళ్లి నాటి ఒకముచ్చట గుర్తు చేసుకొన్నారు శాస్త్రిగారు .తాతగారికి సంస్కృతం నేర్పిన గురువుగారిదీ అదే వూరు .తాతగారు నూతనవదూవరులను బంధువులను వారింటికి తీసుకువెళ్ళి ఆశీర్వచనం ఇప్పించారు .తనగురువుగారితో ‘’తమరు నాకు చెప్పినది అంతా తుచ తప్పకుండా నా మనవడికి తృప్తిగా చెప్పేశా’’అన్నారు గురువుకు నమస్కరిస్తూ తాతగారు ‘’ఐతే ఏవైనా శ్లోకాలు అడగనా ?’’అన్నారు ఆముసలి వగ్గు .ఆయన అడిగినవాటికి వాటికి సరైన శ్లోకాలే చెప్పారు దువ్వూరివారు .వారి దర్శనం ‘’పరమగురు దర్శనం ‘’గా భావించి ఆశీస్సుల౦దు కొన్నారు దంపద్యుక్తంగా. ‘’సమానానా ఉత్తమ శ్ల్లోకో అస్తు ‘’అని  ఆ శతాధిక  జ్ఞాన వృద్దు ఆశీర్వదించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభకామనలు – సుమారు వారం క్రితం తమిళనాడు తిరువన్నామలై నుంచిశ్రీ మైలవరపు రామ మోహనరావు గారు ఫోన్ చేసి ,తానూ ఆంధ్రా ప్రాంతం వాడినేనని ఉద్యోగ విరమణ అయ్యాక తిరువన్నామలై లో స్థిరపడ్డానని తెలుగు భాషా సాహిత్యాలపై ఎక్కువ మక్కువ ఉన్న తాను  ఎన్నో బ్లాగులు చూశానని ,కానీ అన్నిటికంటే సరసభారతి బ్లాగు బాగా నచ్చి క్రమంగా తప్పకుండా చదువుతున్నానని అందులోని విషయాలు చాలా ఆకట్టుకొంటు న్నాయని సంకుచితత్వం లేకుండా  తెలుగు భాషా భారతీయ సంస్కృతుల వేదికగా ఉన్దని రాజకీయ సాంఘిక వైజ్ఞానిక విషయాలతో వైవిధ్యభరితంగా అలరిస్తోందని అన్నారు   ,    మిగిలిన బ్లాగులలో తెలుగు చదవటానికి రుచించటం లేదని సరసభారతి బ్లాగు లోని తెలుగు ఆకర్షణీయంగాఅభిలషణీయంగా ఉందని తాను  ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారికి దూరపు బంధువునని చెప్పి తన ఆనందాన్ని నాతో పంచుకొని మురిసిపోయి నాకూ గొప్ప ఉత్సాహాన్ని కలిగించారు . అలాగే అమెరికా,,కెన్యా  సింగపూర్  ఆస్ట్రేలియా ,న్యూజి లాండ్,శ్రీలంక లనుంచి కూడా ఇదివరకు అభిమానులు ఫోన్ చేసి సరసభారతి బ్లాగ్ ను తాము క్రమం తప్పకుండా దువుతున్నామని మనసు విప్పి చెప్పారు ఫోన్ లో .ఇదంతా వారి సౌజన్యం .సరసభారతి అభివృద్ధి సాహితీ బంధువుల హృదయపూర్వక  సహాయ సహకారాలు ఆత్మీయత వల్లనే సాధ్యమౌతోందని  వినయపూర్వకంగా తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఉగాదికి రెండు పుస్తకాలు

ఉగాదికి రెండు పుస్తకాలు

సాహితీ బంధువులకు శుభకామనలు -వచ్చే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో  నేను అంతర్జాలం లో రాసిన  1-ఊసుల్లో ఉయ్యూరు 2-మేము చేసిన కేరళ ,ఉజ్జయిని ఖజురాహో ,సోమనాథ్,ద్వారక యాత్రా విశేషాల తో ఒక పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించి ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాను . కాలక్రమం లో . వివరాలు తెలియ  జేయ గలను -దుర్గాప్రసాద్ -9-919-ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabhara
Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

దువ్వూరి వారిఊరంతా  గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ  తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో  వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి మిగిలింది 3ఎకరాలే .మరోనాలుగేళ్ళ  లో ఇదీ గోదావరికి అర్పణం అయింది .ఒక్కోసారి మూడు లేక నాలుగేళ్ళకు భూమి పైకి తేలచ్చు .ఒక్కోసారి వందేళ్ళు అయినా జాడ లేకపోవచ్చు .ఈ ‘’గంగ వెర్రులు ‘’ఎవరికీ తెలీవు అంటారు దువ్వూరి .తీర గ్రామాలకు ఏటా ఈ తిప్పలు తప్పవు .ధవళేశ్వరం ఆనకట్ట గోదావరికాలువలు ఏర్పరచిన కాటన్ దొర బ్రతికి ఉంటేదీనికి ఉపాయం ఆలోచించి కాపాడేవాడు. ఇప్పటి’’ పబ్లిక్ వేస్ట్ డిపార్ట్ మెంట్ ‘’అదేనండీ పి.డబ్ల్యు డిపార్ట్మెంట్ కు ఈ గోలపట్ట  లేదని శాస్త్రిగారు బాధపడ్డారు .కాలువలద్వారా నీరు ప్రవహించి గోదావరి పొలాలు సస్య శ్యామల౦గా భూదేవికట్టిన పచ్చటి చీర లాగా భాసిస్తూ ఉంటె, కాటన్ దొర ఒకసారి ఆ భూములన్నీ కంటితో చూసి ఆనందించాలని ఒక బోటు లో  నెమ్మదిగా ప్రయాణం చేసి, తనివార చూసి పులకించి ఆనంది౦ఛి తన జీవితం సార్ధకమై౦దని  సంతృప్తి  చెందేవాడు .  ఒకసారి అలా వస్తూ ధవళేశ్వరం నుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే కాలువ ఆనుకొని ఉన్నఅరవై ఇళ్ళు,80మంది వేదవేత్తలు ఉన్న  కపిలేశ్వరపుర ఆగ్రహారానికి రాగా,ముఖ్యమైన  రేవులో  స్నానం చేస్తున్న శిస్ట బ్రాహ్మణులు కాటన్ ను అపర భగీరధునిగా భావించి ‘’కాటన్ దొరస్నానమహం కరిష్యే’’అంటూ మూడు సార్లు చెప్పుకొని స్నానం చేస్తుండగా రేవు దగ్గరున్న దొర చెవులకు ఆపేరు వినిపించి గుమాస్తానుపంపి వాకబు చేయిస్తే ‘’అయ్యా !కాటన్ అనే గొప్ప దొరగారు ఇంజనీరుగా ఉండేవారు .అ మహానుభావుడే ఈకాలువలన్నీ త్రవ్వించాడు. మహామంచివాడు .స్నాన పానాలకు సౌకర్యం లేకుండా తరతరాలనుంచి ఇబ్బందిపడుతున్నమాకు ,ఇలాంటి సౌఖ్యం కలిగిగించిన ఆయనను మర్చిపోకుండా రోజూ స్నాని౦చేటప్పుడు సంకల్పం లో ఆయన పేరు కృతజ్ఞతగా చెప్పుకొ౦టాం ‘’అని చెప్పారట .వచ్చిన వాడు కాటన్ పంపిన  మనిషి అని తెలీక .ఈ మాట గుమాస్తా ద్వారా విన్న దొర అక్కడున్న బ్రాహ్మణులకు తలొక పది రూపాయలు బహుమతులుగాగుమాస్తాద్వారా ఇప్పించాడట  ..ఈ వార్తనెమ్మదిగా అవతలి రేవు వారికి పాకి  దొర దగ్గరా డబ్బులు పిండుకొందామని ఆయన బోటు అక్కడకు రాగానే బిగ్గరగా అక్కడి బ్రాహ్మలు ఆయన పేరు పైకి బాగా వినబడేట్లు సంకల్పం  చెప్పటం విని ,బహుమతికోసం చెబుతున్న మోసపు సంకల్పం అని తెలుసుకొని ,,సరంగులతో ‘’ప్రభుత్వ రేవులో కాక వేరే రేవులో స్నానం చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పించి  వాళ్ళందర్నీ ఒడ్డుకు తరిమి కొట్టి౦చాడట .పడుతూ లేస్తూ ఆశపోతులు పారిపోయారని దువ్వూరివారు రాశారు .

స్వంతూరిలో శివాలయ విష్ణ్వాలయాలు లేవు .ఊళ్ళో బ్రాహ్మలు కోరితే దంగేరులో ఉన్న  రావిపాటి కమ్మవారు కేశవస్వామి గుడికట్టించారు .అంతాకలిసి చ౦దాలు వేసి మల్లేశ్వరస్వామి గుడి కట్టించాలని సంకల్పించి దంగేరువాసి పోలిశెట్టి వెంకటరట్నంగారినే కాపు కులస్తుని అడగటానికి వెళ్ళారు .ఆయన మొదట్లో చేతిలోకానీ లేక పోగాకు కాడలు ఊర్రూరూ తిరిగి అమ్ముతూ ,వచ్చినదానితో కుటుంబం పోషించుకొంటూ’’ ఎక్కడో తేనే తుట్టె పట్టి ‘’ క్రమంగా ఎకరాలకు ఎకరాలుకొని, కాకినాడ వంతెనదగ్గర ఉప్పుటేరు ఒడ్డున ఉన్న కలప అడితీలలో సగం దాకా కొని మహాదైశ్వర్యవంతుడై ,దాన శీలియై ,దైవ బ్రాహ్మణభక్తితో ఎవరేది అడిగినా సంకోచం లేకుండా సాయం చేస్తూ ,లెక్కలేనన్ని దాన ధర్మాలు చేస్తూ ,బీద బ్రాహ్మణులకు యకరమో అరఎకరమో రాసి ఇస్తూ ,ఊళ్ళో ఎవరేది అమ్మినా కొంటూ ,ఎవరైనా అమ్ముతామని వస్తే ‘’నలుగురికి చెప్పి యెంత ఎక్కువ ధర పడుతు౦దోతెలుసుకొని నాదగ్గరకు వస్తే, దానిపై కొంచెం ఎక్కువే వేసి నేను కొంటాను ‘’అనే ఉదార హృదయంతో అందరికి తలలో నాలుక అయ్యాడు. ‘’సాధారణంగా చెడి అమ్ముకొంటారు ఎవరైనా .వాళ్ళు కష్టపడుతూ ఇచ్చింది మనకు జయం కాదు .వాళ్ళను సంతోషపెట్టి పుచ్చుకోవాలి ‘’అన్న ఫిలాసఫీ అమలు చేసిన  సహృదయుడు  .కాకినాడకు స్వంతకారులో వెడుతూ దారిలో ఎవరైనా ముసలి వారుకనబడితే ఆపి కారు ఎక్కించుకొని తీసుకు వెళ్ళే పరోపకారి .శివాలయం లో ‘’కోటి పత్రి ‘’పూజ ,రోజుకు లక్ష పత్రి చొప్పున 100రోజులు జరుపుతూ ,పగలల్లా ఉపవాసం ఉంటూ  ఆ వందరోజుల్లో ఊరందరికీ రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తూ , వాళ్ళ భోజనాలయ్యాకే తానూ భోజనం చేస్తూ,ప్రతిరోజూ పొరుగు ఊళ్లకు జనాలనుపంపి ఒక్కొక్క మారేడు దళం చొప్పున కోయించి తెప్పిస్తూ ,,సంతర్పణలు సమారాధనలు చేస్తూ కేశవ   స్వామికి కోటి తులసిదలాలపూజ చేయిస్తూ, లక్ష్మీ పార్వతులకు కోటి కు౦కు మార్చనలు చేయిస్తూ ,108శ్రీమద్రామాయణ పారాయణాలు 108బ్రాహ్మణుల చేత వందరోజులు చేయించి ,ప్రతిదానికీ పూర్ణాహుతి అతి వైభవంగా చేస్తూ ‘’బరంపురం లో ప్రత్యేకంగా నేయిం ఛి తెప్పించిన తెల్లని అక్షీరాబ్ది పట్టు చాపు ఉత్తరించి విడదీసి ,రెండు చేతులతో లుంగ చుట్టి ఆవునేతి మండగ లో ముంచి తడిపి అగ్నిహోత్రం లో వ్రేలుస్తుంటే అతని వదాన్యతకు ముక్కున వేలు వేసుకోనేవారట .

ఇలాంటి షావుకారు దగ్గరకు శివాలయం చందాకోసం శాస్త్రి గారు  గ్రామ౦లొని బ్రాహ్మణ్యం దువ్వూరిపుల్లయ్యగారి నేతృత్వం లో వెళ్లి అడిగితె ‘’మీరు గుడికతట్ట వచ్చు కట్టలేక  పోనూ వచ్చు .నేను ఇచ్చి౦దానికి వెంటనే ఫలితం రాదు .నేనేదైనా ఇచ్చినా ఆలయం పూర్తియితే అప్పుడు మీ అందరితోపాటు నాకూ ఆవగిజలో అరవై వంతుఫలితం రావచ్చు .మీ అందరికీ నాకు తోచింది ఇస్తాను .దాన్ని మీరు దేవాలయానికే ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి.నాకు వెంటనే ఫలితం దక్కుతుంది  ‘’అని చెప్పి వెళ్ళిన 12మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక ‘’దొంతి ‘’అంటే 20వెండి రూపాయల వంతున పళ్ళెం లో పెట్టి ఇస్తే ,తీసుకొని వెంటనే అంతా పుల్లయ్యగారి చేతుల్లో పెట్టారు .వీరు ఊహించింది వందరూపాయలు .ఆయన ఇచ్చింది 240రూపాయలు .ఎలాగోఅలా మల్లేశ్వరాలయం కట్టేశారు వీరంతాకలిసి .కాని నైవేద్యానికి పొలం లేదు .కొంతకాలానికి మళ్ళీ వెంకటరత్నం గారినే వెళ్లి అడిగారు ‘’నాకున్న దేవ బ్రాహ్మణ భూములు ‘’పల్లం కుర్రు ‘’లో ఉన్నాయి ,మీకు దూరమైనా మంచిఫలసాయం వచ్చే ఒక ఎకరం రాసి రిజిస్టర్ చేయించి మీకు పంపిస్తాను .మక్తా ధాన్యం ఈఏడాదినుంచే వచ్చే ఏర్పాటు చేయిస్తాను ‘’అన్నాడు .పుల్లయ్యగారు ‘’అదనంగా ఇంకొంచెం భూమి ఇస్తే బాగుంటుంది ‘’అనగా ఆమాట వీరెవరికీ నచ్చలేదు .షావుకారు ‘’పుల్లయ్యగారు !దేవుడికి ఎంతిస్తే మనకూ అంత ఇస్తాడు .భగవంతుడు నానోట ఎకరం పలికించాడు .మీరు అడిగారని మరో ఎకరం ఇస్తే మీ ప్రేరణతో ఇచ్చినట్లవుతు౦ది కాని నేను స్వయంగా ఇచ్చింది అనిపించదు దాని ఫలితం లో సగం వాటా మీకూ పంచాల్సి వస్తుంది .నాకు తెలీదుకాని ‘’కర్తా కారయితా ‘’అంటారు తమలా౦టిపెద్దలు .నాకు రావలసిన ఫలితంలో సగానికి సగం ఇతరులకు పంచటం నాకు మనసొప్పదు క్షమించండి ‘’అని చెప్పగా అవాక్కయ్యారు ఆయన వాదనాపటిమకు అక్షరజ్ఞాననం లేని ఆయనముందు ఈపండితులు తలవంచుకోవాల్సివచ్చింది అన్నారు దువ్వూరి శాస్త్రి గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2

బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గం పేటలలో ,12,13వయసులో స్వగ్రామం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు ని౦పటానికేమో ?)14దాక్షారామ ,15,16కొంకుదురు ,పిఠాపురం ,17-23దాకా ‘’ విజీ’’ నగరం ,24-కొవ్వూరు ,25-43వరకు కృష్ణాజిల్లా చిట్టి గూడూరు ,44లో విశాఖ ,45-48 గుంటూరు ,49-70దాకా వాల్తేరు లలో గడిపారు .ఇన్ని చోట్ల తిరిగినా ఆయనకు చిన్నప్పటి తాళ్ళూరు,జగ్గం పేటలంటే విపరీతమైన అభిమానం .రెండో క్లాసు మాష్టారు చింతా జగన్నాధం గారు పిల్లల దస్తూరి రమ్యంగా ఉండేట్లు చేయటానికి  ప్రతి రోజూ ఒకగంట సేపు కాపీ రాయించేవారు .వీరికి దస్తూరి దూరం ,కుదిరేదికాదు .కాపీలు రాయించటం లో అప్పుడొక పధ్ధతి ఉండేది ,పుస్తకం లో పైన గురువుగారు’’ ఒరవడి’’ చక్కగా పెట్టి ఇచ్చేవారు .దాన్ని చూసి పిల్లాడు అడుగు పంక్తి నుంచి ,ప్రారంభించి క్రమంగా పై పంక్తి వరకు కాపీరాయాలి .ప్రతి పంక్తి మాస్టర్  గారికి చూపించి దిద్ది౦చుకొని తర్వాత పైపంక్తిలో పంక్తిలో తప్పులు లేకుండా రాయాలి .ఇలా కిందినుంచి పైకి రాస్తే ఎప్పుడూ మాస్టారుగారి ఒరవడే కనిపిస్తుంది. అదీ కిటుకు .

  తన తండ్రిగారు జీవితకాలం లో నాలుగు నిమిషాలు వరుసగాతనతో  మాట్లాడ లేదని అంతటి డిసిప్లిన్ ఆయనదని ,ఆయన్ను చూస్తె తాతగారు మామ్మ ,అమ్మమ్మ ,తల్లీ అందరూ గజగజలాడి పోయేవారని  తండ్రి తనతో సన్నిహితంగా ఉండకపోవటం పెద్ద బాధగా లోపల ఉండేదని , .కానీ ఏమీ చేయలేని నిస్సహాయత అని చెప్పారు ..తనతోపాటు జగ్గం పేట ,తాళ్ళూరు లలో చదువుకున్న విద్యార్ధులు ,చదువు చెప్పిన మాస్టర్లు అందరూ  దువ్వూరి వారికి బాగా జ్ఞాపకమే .బాల్య స్నేహితులను కలుసుకోవాలని ఎప్పుడూ ఆరాటంగా ఉండేది పెద్దయ్యాక ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్లి చూసి అ ఆనవాళ్ళు పోయినా ఆన౦దాన్ని అనుభవించారు .దస్తూరిలో వెనకబడ్డ శాస్త్రిగారు ఒకరోజు ఆదరాబాదరా కాపీ పేజీ అంతా రాసి పారేశారు .చూసిన చి౦తావారు రూళ్ళకర్ర పెట్టి నెత్తిన ఒకటిస్తే బొప్పికట్టింది ఏడుపు లంకి౦కొంటే ,ప్యూన్ వోదారుస్తుంటే , ఆ మేస్టార్   పై అసూయ ఉన్న తక్కినమేస్టార్లు   తండ్రికి చెబితే ‘’ప్రాణం విసిగితే మనమంతా పిల్లల్ని కొడుతూనే ఉన్నాం. నేను కొట్టే దెబ్బలు మరీ ఎక్కువ .నేను వెళ్లి ఎలా అడుగుతాను బాగుండదు ‘’అని వాళ్ళ నోళ్ళు  మూయించారు .ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు యాగీ చేయమని శాస్త్రిగార్ని మాస్టర్లు రెచ్చగొడితే సమయం చూసి చెప్పారు .ఆయన కనుక్కు౦టాలే అని ,అంతా అయ్యాక ఆ మేస్టర్ని పిలిపించి ఒంటరిగా ‘’అయ్యా రూళ్ళ కర్ర దేనికి వాడుతారు ?’’అని అడిగితె రూళ్ళు వేసుకోవటానికి అని చెబితే ‘’నెత్తిమీద కొట్టటానికీ

ఉపయోగిస్తారా ?’’అనగానే తప్పు తెలుసుకొన్న చింతా వారు చి౦తా క్రా౦తులయ్యారు.

  తమ చిన్ననాటి వైశ్య స్నేహితుడు వెంట్రప్రగడ సత్యనారాయణ మూర్తి ,కమ్మవారి పిల్లాడు ముత్యాలసత్యం అంటే ఎక్కువ అభిమానం .వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తారు ‘’హృదయం త్వేనన జానాతి ప్రీతి యోగం పరస్పరం ‘’అన్నారు .దస్తూరిబాగా ఉంటె జీవితగమనమూ బాగా ఉంటుందని ,మనసు సరళంగా ఉంటుందని ,ఎగుడు దిగుడుగా రాస్తే జీవితం లోనూ అవి తప్పవని తన అనుభవం చెప్పినట్లు తెలియజేసి ‘’చక్కబాటు –సద్దుబాటు –దిద్దుబాటు ‘’ఒక ప్రత్యేకక కళ అన్నారు .గోవిందమ్మ అనే ఇల్లాలు రోజూ సత్తుగిన్నెలో ప్రత్యేకంగా పెరుగు తోడుపెట్టి స్వయం గా వీరింటికి తెచ్చి వీరి తల్లిగారికి ‘’అబ్బాయికి ఈ పెరుగే వేయ౦ డమ్మా ‘’,అని చెప్పేది .సమయానికి పెరుగు అందించని రోజు ఎంతో నోచ్చుకోనేదని ,కని ఇంట్లో అలమారలో ఉన్న సత్తుగిన్నె లో ప్రత్యేకంగా తోడుపెట్టిన పెరుగును తాను రానప్పుడు ఈయన్నే తెచ్చుకోమని చెప్పే మహా ఇల్లాలు .శాస్త్రిగారు బాబాయి పిన్నిలదగ్గర ఉన్నప్పుడు గోవిందమ్మ ‘’అబ్బాయికి పెరుగంటే ఎంతో ఆప్యాయనం.ప్రత్యేకంగా తోడు పెట్టి పంపుతాను అదే అబ్బాయికి వేయండి మీ ఇంట్లో పెరుగు లేదనికాదు .ఏమీ అనుకోకు ‘’అని వ్రేపల్లె గోల్లామే అన్నంత ఆప్యాయంగా చెప్పేది .కాని పిన్నిమాత్రం పిల్లలందరికీ పెరుగు వేసి ,ఈయనకు మీగడ వేసేది ఆప్యాయంగా .’’నాకూ పెరుగే వేతూ,మీగడ జిడ్డు వదలదు ‘’అంటే పిన్ని ‘’పాలసారం పెరుగులో లేదు,రుచా పచా . మీగడలో ఉంది సున్నిపిండితో జిడ్డు పోతుంది .నీకోసం పాల కుండలో మీగడ వేరే తీసి ఉంచాను .వద్దనకు నాయనా !’’అని బ్రతిమాలి వడ్డించేది .ఆప్రేమ ఆప్యాయతకు శాస్త్రిగారు మురిసిపోయారు .ఇలా జగ్గం పేటలో కల్లూరి, వెంట్రప్రగడ కుటుంబాలతో అనుబంధం గాఢమైంది .’’ఒకే కుటుంబం అన్న భావనే తప్ప వేరే కుటుంబాలు అన్న ఆలోచనే ఉండేది కాదు .అలాంటి ఆప్తులమధ్య తాళ్ళూరు, జగ్గం పేటలలో పన్నెండో ఏడుదాకా పెరిగాను ‘’అంటారు దువ్వూరి వారు .బాబాయిపిన్నిలకు సంతానం లేదు .ఈయన్ను దత్తత తీసుకోవాలని లోపల ఉ౦డేదికాని బయట పడేవారుకాదు .అమ్మమ్మకు ఈయన ఒక్కరే దౌహిత్రుడు ఆమె ప్రాణాలన్నీ ఈయనమీదే .ఆమె ఐహిక అముష్మికాలన్నీ ఈయన చేతులమీదే జరగాలి కనుక ఎవరికీ ఈయన్ను పిన్ని బాబాయిల వద్ద ఉంచటానికి ఇష్టపడలేదు .

  స్వగ్రామం మసకపల్లిలో తాతగారివద్ద సంస్కృతం నేర్వటం ప్రారంభించారు .అప్పుడేవరైనా రఘువంశం నాలుగో సర్గ లోని ‘’సర్గాసరాజ్యం గురుణాదత్తం’’శ్లోకం తో ప్రారంభించేవారు అలాగే వీరూనూ .అమరం తాతగారికి వాచోవిధేయం .పుస్తకం అక్కర్లేదు .ఆయనది ‘’చీకటి సంత ‘’మూడుకా౦డలూ అలాగే నేర్పారు .వనౌషధి వర్గులో కొసభాగం ,లింగాది సంగ్రహవర్గు వదిలేశారు .వల్లించి ఊరుకోవటం కాదు తాతగారితో నిత్యం కొంతభాగం ఏకరువు పెడుతూ ఉండాలి .వ్యుత్పత్తులు కూడా చెప్పేవారు .లింగాభాట్టీయం అనే గురుబాలప్రబోధిక ఆయనకు కంఠస్తమే.’’అమరం నెమరుకు వస్తే ,కావ్యాలెందుకు కాల్చను ?’’అనేవారు తాతగారు .పంచకావ్యాలలో మల్లినాద సూరి ఏ శ్లోకం దగ్గర ఏ పంక్తి రాశాడో ఆయనకు గుర్తే .వాల్మీకం అయిదు వందల సర్గలలో తీర్దీయ వ్యాఖానం లో ఎక్కడ ఏ పంక్తి ఉందో టక్కున చెప్పేవారు రామాయణం గురుముఖతా పాఠం గా చదివారట తాతగారు .రామాయణ ఆరుకాండలు తీర్దీయ  వ్యాఖ్యానం తో  సహా తాటాకులమీద స్వయంగా రాసుకొని భద్ర పరచుకొన్న సాహితీ మూర్తి .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలు చదువుకోకపోయినా వ్యాఖ్యానాలో వాటి వివరణలు వాటిని చదువుకొన్న పండితులకంటే మేలుగా చెప్పేవారు .ఆప్రాంతం లోని గొప్ప సాహితీ పండితులు తాతగారి సాహిత్య పరిజ్ఞానానికి జోహార్లు చెప్పేవారట .గోదావరిజిల్ల్లాలో ఇందుపల్లి సాహిత్యానికి ,విశాఖ మండలం లో సాలూరు సాహిత్యానికి 1860-1920 కాలం లో ప్రత్యేక ప్రసిద్ధి ఉండేదని దువ్వూరి ఉవాచ .ఏలేశ్వరపు తమ్మన్న  శాస్త్రులు గారివల్ల ఇందుపల్లికి , సామవేదం అన్నప్ప శాస్త్రులు గారివలన సాలూరు ప్రాంతాలు బహు ప్రసిద్ధి చెందాయి .వీరి తాతగారు ఇందుపల్లి సంప్రదాయానికి చెందినవారు.  .

  తాతగారికి పొలం  వ్యవసాయ కామటమూ ఉండేది .తాతగారితో పొలం వెడుతూ తిరిగివస్తూ వెనకటిశ్లోకాలు వల్లెవేస్తూ వ్యాఖ్యానాలు చర్చిస్తూ గడిపేవారు .చదువుకు క్షణం విరామం ఉండేదికాదు .బామ్మగారు తాతగారిని ‘’పిల్లాడికి వినోదం లేదు ఆటాపాటా లేదు ఎప్పుడూ సంతతా సంధేనా ?అని సన్నాయి నొక్కులు నొక్కేవారు .ఆకాలం లో తోలుబొమ్మలాటలు బాగా ఉండేవి .ఒక రోజు రాత్రి ఆటకు ఆముదం ఖర్చు పెట్టుకొని ఆరు రూపాయలిస్తే రాత్రి తొమ్మిదినుంచి తెల్లవార్లూ ఆడేవారట .వారి బృందం లో కనీసం పది మంది ఉండేవారట .ఈ కాస్త డబ్బు ఎలా సరిపోయేదో అని శాస్త్రిగారు బాధపడ్డారు .రామాయణంలో సుందరకాండకు భారతంలో విరాట పర్వానికి మోజు ఎక్కువగా ఉండేదట .తోలుబొమ్మలాటలు వీదినాటకాలుగా ,స్టేజి నాటకాలుగా ,మూగ సినిమాలుగా టాకీలుగా క్రమ పరివర్తనం  చెందాయంటారు .మామ్మగారు ఎన్నో సార్లు  బ్రతిమిలాడితే ల తప్ప బొమ్మలాట చూడటానికి ఒప్పుకొనేవారు కాదట .చూసిన రోజు మాత్రం బ్రహ్మానందంగా ఉండేదట .

 ఇంటి దగ్గరా ,పొలం లోనూ చదువే చదువు .క్షణం విరామం లేదు .శ్లోకాలు శబ్దాలు,సమాసాలు వ్యాఖ్యానాలు ,కొత్త శ్లోకాలకు అన్వయించే ఎక్సర్ సైజులు ,వ్యుత్పత్తుల పరీక్ష ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉండాలి.ఇవికాక ఆట విడుపుగా ‘’కట్టు శ్లోకాలు ‘’అంటే మన అంత్యాక్షరి అన్నమాట .అంటే ఒకరు ఒక శ్లోకం చదివితే దాని చివరి అక్షరం తో ప్రారంభమయే శ్లోకం రెండో వారు చదవాలి అన్నమాట .ఎప్పుడూ తాతగారిదే గెలుపు .ఒక్కో సారి మనవడికి గెలుపు ఇవ్వాలని మనసులో భావించి చెప్పాల్సిన శ్లోకం స్పురణకు రావటం లేదనే వారట .

  ఆవులు గేదెలు పాడీ పంటా తో ఇల్లు శోభాయమానం గా ఉండేది .రాత్రి వేళ కిరసనాయిల్ దీప౦  దగ్గర చదువు .నిద్ర వచ్చే సమయానికి కట్టు శ్లోకాల జాతర .మామ్మ మధ్యవర్తి .మనవడిని అప్పుడప్పుడు గెలిపించేది .ఉదయం చల్ది భోజనమేకాని కాఫీ అన్నది లేనేలేదు .రోజూ పొలం లేక పెరటి  లోనుంచి  కోసిన తాజా కూరలతోనే వంట .బామ్మ పెరుగు చిలికిచల్ల చేసి పోసేవారు పల్లెటూరి మజ్జిగ అంటే ‘’చింత గింజ వేస్తే మునగని మజ్జిగ ‘’.ఈభోగం పట్నవాసులకు లేనేలేదన్నారు శాస్త్రిగారు ‘’తక్రం శక్రస్య దుర్లభం ‘’అని ఆర్యోక్తి .అంటే దేవేంద్రుడికి మజ్జిగ దొరకదు అనికాదు అర్ధం .మజ్జిగ వైభోగం అంతటి గొప్పదని కవిభావన అని చెప్పారు .మజ్జిక్కి సంస్కృతం లో 1-తక్రం 2-ఉదశ్విత్తు3-మధితంఅని మూడు పెర్లున్నాయని ,నాలుగోవంతు మాత్రమె నీరు కలిపింది తక్రం అని ,సగానికి సగం కలిపింది ఉదశ్విత్తు అనీ ,,అసలే నీళ్ళు కలపనిది మధితం అని అర్ధాలు చెప్పారు దువ్వూరివారు .వీటిలో తక్రం ఉత్తమోత్తమమం –శక్రస్య దుర్లభం అని దీనినే అంటారని చెప్పారు మజ్జిగలో నీళ్ళు ఎప్పుడైనా కాస్త ఎక్కువైతే తాతగారు మామ్మగారితో ‘’అబ్బా ! ఈ వేళతక్రం ఉదశ్విత్తుఅయిందే?’’అనేవారని అప్పడు ఆపదం సంస్కృతం లో ఎక్కడుంది అని తనను అడిగితె తడుముకోకుండా ‘’తక్రం హ్యుదశ్వి న్మదితం ,పాదా౦ బ్వర్దాంబు నిర్జలం ‘’అనే అమర శ్లోకం అందుకొనే వాడిని ,ఇలా భోజన సమయం లోనూ చదువు ప్రసంగాలు జరిగేవని దువ్వూరివారు ఆనందంగా గుర్తు చేసుకొన్నారు .’’తక్రాన్న సమయే చక్రధారి స్మరణ గోవిందో హారి ‘’అని బ్రాహ్మణ భోజన సమాప్తిలో అనటం నాకు బాగా జ్ఞాపకం .

  సశేషం

ఆధారం –కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5వ తేదీ గురు పూజోత్సవ0 వార్త 7 వతేదీ” జ్యోతి లో హైపర్ బోలిక్ గా కధనం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరిత్రను అప్పటిదాకా బోధించిన ,రచించిన గ్రాంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి పవిత్ర శ్రోతస్వినిగా ,పరమ పవిత్రంగా  భాషా భేషజం లేని కమ్మని తెలుగు నుడికారంగా,కారమే లేని కమ్మదనంగా ఉంది .చదువుతుంటే మనల్ని మనమే మర్చిపోయి ,వంశీ కృష్ణుని వేణు గానానికి సకల జగత్తు  సమ్మోహంతో ఊగిపోయిన రసమయ భావన కలుగుతుంది .శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘’అనుభవాలు –జ్ఞాపకాలు ‘’లో ఎలా గోదావరిప్రాంత శిస్ట జన జీవితం ప్రతిబి౦బించిందో , శ్రీ మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి ‘’కృష్ణా తీరం ‘’లో కృష్ణానదీతీర వాసుల గ్రామ జీవన సౌభాగ్యం కనులకు కట్టిందో ,అలా ఉంటుంది దువ్వూరివారి స్వీయ చరిత్ర .కామ ధేనువు కమ్మని పాల పెరుగు మీగడ ,ఇక్షురసం ,ద్రాక్షా సవం త్రాగిన అనుభూతి కలుగుతుంది .ఇంతకీ దువ్వూరి వారెవరో ,వారి విశేషాలేమిటో టూకీ గా తెలుసుకొని అందులోకి ప్రవేశిద్దాం .

  దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[1]

వీరిది తూర్పు గోదావరి జిల్లా లో మసకపల్లి గ్రామం. వీరి ఇంటి పేరు దువ్వూరి . దువ్వూరు అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక ‘ఇ’ కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.

వీరు విలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది.  ” ఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో కోనసీమ లో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జరిగింది.  మామగారు వంక జగనాధశాస్త్రి.

ఈయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరారు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, కిళాంబి రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బోధకులు, వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు తెలుగు బోధకులు. ఈయన 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి “విద్వాన్” పరీక్షలో ఉత్తీర్ణులయ్యా రు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు  1976వ సంవత్సరం మార్చి 6వ తేదీన కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ యేట మరణించారు[2

    దువ్వూరి వారి రేడియోటాక్ ‘’జానకితో జనాంతికం ‘’బహు ప్రాచుర్యం పొందింది సీతమ్మతల్లితో ముచ్చటిస్తున్నట్లుగా వ్రాసిన ఈ వ్యాసం ఆయన మనోభావాలను ,అమ్మకు నివేదించిన వైనమూ కడు రమణీయం . బాల వ్యాకరణ కర్త చిన్నయ సూరి ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ,ఆయన వ్యాకరణ సూత్రాలలో ఉన్న సొగసు ,మంత్రం వంటి ఫలితం ,కూర్పు నేర్పు లను మహా సొగసుగా తెలుగువారికి అందించి సూరి వ్యాకరణం అంటే భయపడేవారికి,విపరీతమైన మైన  క్రేజు కలిగేట్లు దువ్వూరి వారు రాసిన ‘’రమణీయం ‘’కడు రమణీయమే .అలాంటి దువ్వూరి వారు తమ జీవిత చివరి కాలం లో 70వ ఏట రాసిన స్వీయ చరిత్ర అనుభవాల పుట్ట. జుంటి తేనే తెట్ట ,వడబోసిన ఇక్షురసం ,కలకండ పానకం .

    ఈ నరచనకు నేపధ్యం – -2011లో అనుకొంటా కృష్ణా జిల్లా తెన్నేరు వాసి ,ఆత్మీయులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్తకం ఆప్యాయంగా నాకు పంపారు .చదవటం ప్రారంభించి వదలలేక రెండుమూడు రోజుల్లో జుర్రేశాను .మళ్ళీ చదివా, మరోమారు కూడా చదివా.తనివి తీరలేదు .ఆనందం  వర్ణించటానికి  నోట మాటలు రాలేదు . మంచికథకులు, కథారచనలో అద్వితీయులైన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి అన్నగారు , నాకు పరమ ఆప్తులు  బ్రహ్మశ్రీ గంధం వేంకాస్వామి శర్మగారితో ఈపుస్తకం గురించి తరచుగా మా ఇద్దరిమధ్యా జరిగే ఫోన్ సంభాషణలో చెప్పాను .ఆయన మరింత సంబర పడి  ఆపుస్తకాన్ని తనకు పంపిస్తే ,చదివి తిరిగినాకు పంపిస్తామనగా ,కొరియర్ లోప౦పాను .ఆతర్వాత 2012లో మేము అమెరికా వెళ్ళటం ,ఆ మేనెలలోనే  శర్మగారు మరణించటం అక్కడినుంచే వారి సౌజన్యంపై నెట్ లో వ్యాసం రాయటం జరిగింది .అక్టోబర్ లో ఇండియా వచ్చి ,కాస్త కుదురుకున్నాక , బెజవాడ లో  శర్మగారి౦టికి వెళ్లి ,ఆయనతో తరచుగా సభలకు వచ్చే ఆయన కుమార్తెను పలకరించి పుస్తకం సంగతి అడిగితె ,శర్మగారు చనిపోగానే ఆయన పుస్తకాలన్నీ పెట్టేల్లోపెట్టి అటకపై దాచేశామని దించి వెతికే ఓపిక లేదని చెప్పగా హతాశుడనై తిరిగి వచ్చాను .మళ్ళీ ఆపుస్తకం నాకు పంపమని మధుసూదనరావు గారు కనిపించినపుడు అడిగితె తనవద్ద ఉన్న కాపీలు అందరికీ ఇచ్చేశాననని లేవని చెప్పారు .బెజవాడ పాత పుస్తకాల షాపులుఅన్నీ గాలించా. ప్రయోజనం లేదు .ఇక ఆపుస్తకం మనకు కనిపి౦చదు అని నిర్వేదనలో ఉండిపోయా .

  అనుకోకుండా ఈ ఆగస్ట్ నెల మొదటివారం ఆంద్ర జ్యోతి దినపత్రికలో శ్రీ సాకం నాగరాజుగారు తనవద్ద దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్తకాలున్నాయని కావలసినవారు ఫోన్ చేస్తే తానె పంపిస్తానని,సెల్ నంబర్ తో సహా  తెలియ జేశారు .నా ఆనందానికి అవధిలేకుండా పోయింది .ఫోన్ చేద్దాం అనుకుంటూనే ఒక వారం గడిపి ఆగస్ట్ రెండవవారం లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాగరాజుగారికి ఫోన్ చేశా .ఆయన తీయలేదు .కాసేపటికి వారే నాకు ఫోన్ చేశారు .వారి సౌజన్యానికి దాన్యవాదాలు చెప్పి దువ్వూరివారి పుస్తకం పంపగలరా అని అడిగా .తప్పక పంపుతానని ,కానీ తానుప్రస్తుతం బెంగుళూరులో ఉన్నానని ,17,18తీదీలకు తిరుపతి వెడతానని నా నంబర్ సేవ్ చేసుకోన్నానని ,అడ్రస్ మెయిల్ చేయమని చెప్పారు .అప్పటికప్పుడు అడ్రస్ మెయిల్ చేశా .20 కి ఉయ్యూరు వచ్చాం .పుస్తకం రాలేదు .మళ్ళీ ఫోన్ చేశా ఆత్ర౦ ఆగలేక.ఆయన తాను 20కి మాత్రమె తిరుపతివచ్చానని,ఆ రోజే ప్రొఫెషనల్ కొరియర్ లో పుస్తకం పంపాననని చెప్పారు .మర్నాడే పుస్తకం అందింది. వారికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పి  వారిచ్చిన అడ్రస్ కు సరసభారతి పుస్తకాలు పంపవచ్చా అని అడిగితె పంపమంటే ఆసాయంత్రం అదే కొరియర్ లో15పుస్తకాలు పంపాను .అవి అందగానే నాగరాజుగారు ఫోన్ చేసి మాట్లాడి ‘’ఇన్ని ఉద్గ్రంధాలు రాశారు మీరు . మీ వయస్సు యెంత సార్?అనగా 79 నడుస్తోందని చెప్పగా మరింత ఆశ్చర్యపోయి మనస్పూర్తిగా అభినదించారు .నాగరాజు గారిపేరు బాగా విన్నవాడినేకాని,వివరాలు తెలేదునాకు .వారినే ఫోన్ లో అడిగా. తాము తిరుపతికాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేసి 2010లో రిటైర్ అయ్యానని ,అభ్యుదయ రచయితల సంఘం లో తనకు బాధ్యత ఉందని, పుస్తకాలు ప్రసురి౦చామని  చెప్పగా ,’’మా మధుసూదనరావు గారు మీకు తెలుసా ?’’అని అడిగా ..’’బాగా తెలుసు .వారి తెన్నేరుకు రెండుమూడు సార్లు వెళ్ళాము ‘’అన్నారు .అప్పుడు నేను దువ్వూరివారి పుస్తకం ఆయన నాకుఇవ్వటం గంధం వారి నుంచి తిరిగిరాకపోవటం కథ అంతా పూసగుచ్చినట్లు  చెప్పి ‘’అందుకే మళ్ళీ చదవాలనే కోరికతో మిమ్మల్ని  ఆపుస్తకం పంపమన్నాను ‘’  అనగానే ఆయనకూడా ‘’ఈపుస్తకం అడిగారు అంటే సాహిత్యం లో ఎంతో అభి రుచివున్నవారై ఉంటారు ‘’అని తానూ అనుకొన్నట్లు ఆనందం గా చెప్పారు .ఫోన్ లోనే ఈ పుస్తకావిర్భావం వివరించారు .’’నారాయణ రెడ్డిగారు ,భరద్వాజ మొదలైనవారు కలిసి దువ్వూరి వారి స్వీయ చరిత్రను మొదట కొద్దికాపీలే ముద్రించారు . అవి ఎవరిదగ్గరున్నాయో ఎవరికీ తెలీదు .నేను మళ్ళీ ప్రింట్ చేయి౦చాకొని ప్రయత్నిస్తే కృష్ణా జిల్లా పామర్రులో ఉన్న డా రొంపిచర్ల భార్గవి గారి వద్ద జిరాక్స్ కాపీ ఉందని తెలిసి ,ఆమెనుంచి దాన్ని సేకరించి రెండవ ముద్రణగా ప్రచురించాము .అవీ అయిపోయాయి .తర్వాత తిరుపతిలోని ఒక వదాన్యుడు చాలాఖర్చుపెట్టి ఇంకా అందంగా మూడవ సారి ప్రచురించి అన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు పంపాడుకాని ఫీడ్ బాక్ రాలేదు పుస్తకాలుకూడా అయిపోయాయి .మళ్ళీ మేమే నాలుగోసారి ప్రచురించాము .ఆసక్తి ఉన్నవారికి మేమే పంపిస్తున్నాము .మీరు అడిగినందుకు మీకున్న సాహిత్యాసక్తి గమనించి మీ పేరు సెల్ నంబర్ సేవ్ చేసుకొన్నాను ‘’అని ఈ పుస్తక చరిత్ర వివరించారు ఆసాంతం సైకం నాగరాజుగారు .డాక్టర్ భార్గవిగారు నాకు తెలుసు .ఆమెమద్రాస్ లోని  వి.ఎ.కే.   రంగారావు గారి ‘’ఆలాపన ‘’పుస్తకానికి స్పాన్సర్.

   ఈపుస్తకం వచ్చినప్పటినుంచి మా శ్రీమతి ఒక్క క్షణం వదలకుండా చదివి ఎంతో ఆనందం,అనుభూతిపొంది   నిన్నటితో పూర్తి చేసింది .నిన్నరాత్రి నా చేతికి వచ్చిన ఆపుస్తకం లోని నలభైపేజీలు  ఏకధాటిగా చదివి ,దువ్వూరివారి జీవిత విశేషాలు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు నని  సాహితీ బంధువులకు  ఆ విశేషాలు అందించి ధన్యుడనవ్వాలని భావించి చేస్తున్న ప్రయత్నం ఇది .

  ముందుగా సాకం నాగరాజు ఏమన్నారో తెలుసుకొందాం ‘’ఇది తెలుగు వారి మృష్టాన్న భోజనం .దువ్వూరివారి కలం లో గోదావరిప్రవహి౦చి౦ది   .పాఠకుడికి తీర్ధయాత్ర ప్రారంభమౌతుంది  .’’గోవిందమ్మ’’ తోడుపెట్టి శాస్త్రిగారికి రోజూ ఇచ్చే పెరుగులాగా బహుకమ్మగా ఉంటుంది .వీరి భూములు గౌతమీ నది గర్భం లో కలిసిపోయిన ఉదంతాలు వింటే గుండె చెరువే అవుతుంది .మతభేదం వదిలి బ్రాహ్మణులు రేవులలో ‘’కాటన్ దొర స్నానం అహం కరిష్యే ‘’అని సంకల్పం చెప్పుకొని స్నానాలు చేస్తుంటే,తమపోలాలను సస్యశ్యామలం చేసిన దొరపట్ల ఉన్న ఆరాధన  కుమనసు ఉప్పొంగిపోతుంది .కృష్ణాజిల్లా చిట్టి గూడూరు కళాశాలనుంచి వీడ్కోలుసమావేశం లో శాస్త్రిగారిపై వక్తలు కురిపించిన  ప్రశంసల వర్షం  లో మనమూ తడిసి ముద్ద అవుతాం .’’తృప్తి లేనివాడు దరిద్రుడుకాని ,ధనం లేనివాడు దరిద్రుడు కాదు ‘’అన్న ఆయన సిద్ధాంతం అందరికీ ఆదర్శనీయం .వర్తమాన సమాజం పై ‘’సంఘం లో ఏ వర్గమూ ,ఏ వ్యక్తీ నాకేం భయం అని గుండెలమీద చెయ్యి వేసు కొని హాయిగా నిద్ర పోయే వారు నాకు కనబడలేదు ‘’అని ఆవేదన  చెందారు .దువ్వూరి వారి మనుమరాలు డా ధూళిపాళ అన్నపూర్ణ ‘’తాతగారు సాహితీ రమణీయమూర్తి  .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి  సాహితీ  సౌరభం అద్దిన సౌ౦దర్య భావుకులు .రమణీయం అనే పేరుపెట్టటం లోనే సుందరమైనదని వారి హృదయ ధర్మం తెలియజెప్పారు .కటువైన వ్యాకరణ శాస్త్రాన్ని పుష్పం లాగా మలచారు .జీవితాన్ని సరళతరం చేసుకొన్న సాధనాపరులు.స్నేహధర్మం సౌ౦దర్యభావన వీరికి రెండుకళ్ళు .ఈ పుస్తకం చదివితే జీవితాన్ని యెంత సౌందర్య మయంగా మలచుకోవచ్చో తెలుస్తుంది .డా.ధూళిపాళ మహాదేవ మణి’’స్మరణ కీర్తి ‘’లో పద్యాలలో దువ్వూరి వారి వైదుష్యాన్ని కీర్తించారు –

1-‘’మాట మాటాడెనా !మల్లెలై మొల్లలై –ఘుమఘుమ లాడింఛి గుండె నింపు

మైత్రి చూపించెనా !  మరువమై ,గుణ సుధీ -హారమై  చిరతర స్మారకమగు

శబ్ద శాస్త్రము చెప్ప,చక్కని భారత- కథ  చెప్పునట్లుగా కలుగు ప్రీతి మురిపించు వ్రాతలో !’’ముత్యాలు ‘’తారలై –నింగి లేఖను వెల్గు నిశ్చయంబు

రమ్య దువ్వూరి వేంకట రమణవిఖ్యు –తెలుపుటన్నచో నక్షత్ర కలితమైన

అంబరము ,’’కళాపూర్ణో దయ’’ ప్రశస్తి-చిత్రముల్ వేసి చూపుటే శిస్టులార!

  ‘’ఎందరొ జీవితంబు  వెలయించిరి గ్రంథము గాగ ,నందు ,మా –కంద ఫల ప్రసాద మిది,కావ్య మరందము ,సంప్రదాయముల్

చిందు జవాది సౌరభము ,చిక్కని వెన్నెల ,పూలపాన్పు ,నౌ –సుందర లోక వృత్త నయశోభితమయ్యె పఠింప హర్షమై ‘’

  రెండోభాగం నుంచి అసలు కథ లోకి ప్రవేశిద్దాం .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

సరసభారతి 147వ కార్యక్రమం ఘనంగా గురుపూజోత్సవం

          ఘనంగా గురుపూజోత్సవం

సరసభారతి 147వ కార్యక్రమం బ్రహ్మశ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవం 5-9-19గురువారం సాయంత్రం 4 గం.లకు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం నాడు అమరవాణి హైస్కూల్ లో ఆ స్కూల్ తో కలిసి సంయుక్తం   గా నిర్వహించాము .సభాధ్యక్షుడిగా నేను సభను నిర్వహించగా ,ఆపాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు అతిధులను ఆహ్వానించగా, సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి సుమధురంగా గురువందన గీతం ఆలాపించి సభను ప్రారంభించారు .పెదముత్తేవి ఓరియెంటల్ హైస్కూల్ రిటైర్డ్  హెడ్మాస్టర్,కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘ మాజీ కార్య దర్శి శ్రీ కోసూరు ఆదినారాయణ ,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,ఆధ్యాత్మికవేత్త రచయిత, శ్రీ పెర్నేటి గంగాధరరావు ,ఉయ్యూరు ఏజీ ఎస్ జి సిద్ధార్ధ  డిగ్రీ కాలేజి  రిటైర్డ్   కేమిస్ట్రి లెక్చరర్ శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు ,93సంవత్సరాల వయసులోనూ యవ్వనోత్సాహంగాఉన్న పౌరాణిక నాటక రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారు వేదికపై ఆత్మీయ అతిధులుగా  ఆసీనులు కాగా ,సరసభారతి  కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కార్యక్రమం నిర్వహించారు .శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనగా, ముందుగా అందరం శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీ రాధాకృష్ణన్ గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ,పుష్పాలు సమర్పించాము .శ్రీ విశ్వేశ్వరరావు గారు శ్రావ్యంగా ఖంగుమనే కంఠ ధ్వనితో పద్యాలు పాడి, జోకులు చెప్పి సభా రంజనం చేశారు .

https://wp.me/p1jQnd-bN9

   తర్వాత శ్రీ బొడ్డపాటి వారికి ,వారి కుమారునికి  సంయుక్తంగా శాలువాకప్పి సరసభారతి గ్రంథాలు అందించి, 500రూపాయల నగదుతో ,పుష్పమాలతో ఎంఎల్సీ చేత సత్కరి౦ప జేశాము .తరువాత వరుసగా శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు ,ఉయ్యూరు ఏజీ ఎస్జీ సిద్ధార్ధ డిగ్రీ కాలేజి రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ యు.రాం ప్రసాద్ ,శ్రీ ఆదినారాయణ,శ్రీ పెర్నేటి గంగాధరరావు ,56సంవత్సరాలక్రితం నేను మోపి దేవి హైస్కూల్ లో మొదటి సారిగా సైన్స్ మాస్టర్ ఉద్యోగంలో  చేరినప్పుడు నా మొదటిబాచ్ ఎస్ ఎస్ ఎల్సి విద్యార్ధిని ,ఆతర్వాత మచిలీపట్నం లో సైన్స్ టీచర్ గా  , హెడ్ మిస్ట్రేస్ గా చేసి ,జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షురాలైన నాకు అత్య౦త ఆత్మీయురాలైన విద్యార్ధి శ్రీమతి కొల్లి భారతీ దేవి ,పామర్రులో నాతోపాటు హైస్కూల్ లో సైన్స్ టీచర్ , తర్వాత హెచ్ ఏం గా చేసి రిటైర్ అయి, టేన్నికాయిట్ ఆటలో మేటి అయిన శ్రీమతి వి కస్తూరి బాయి ,ఉయ్యూరు విఆర్ కే ఏం హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా చేసి రిటైర్ అయిన మా అన్నగారబ్బాయి ఛి గబ్బిట రామనాథబాబు  ,అమరవాణి టీచర్ శ్రీమతి సుశీల గార్లకు అంటే తొమ్మిదిమంది నవరత్నాలైన వారికి చందనతాంబూలాలు ,పుష్పమాలలు శాలువలు సరసభారతి పుస్తకాలు ,తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి లామినేటేడ్ ఫోటో లు అందజేసి నేనూ మాశ్రీమతి ,శ్రీ రాజేంద్రప్రసాద్  ఘన సత్కారం చేశాం .

  మా గురు వరేణ్యులు  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల కుమారులైన శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట రామకృష్ణ ,శ్రీ కోట గాయత్రిప్రసాద్ ,శ్రీ కోట సీతారామాంజనేయులు గార్లు తమ తలిదండ్రుల స్మారకార్ధం బ్రాహ్మణ  విద్యార్ధి విద్యార్ధినికి ఏర్పాటు చేసిన నగదు పురస్కారం  2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.9/10మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక . నారాయణ  జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గబ్బిట  రమ్య కు 10,,116రూపాయలు

8-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక చైతన్య  జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చి. యనమండ్ర రోహిత్ కుమార్ కు 10,,116 రూపాయలను,

               ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థిని  -కుమారి   ఎస్.సాహితి   10/10 –కు  2,000 రూపాయలు

3-..అమరవాణి పాఠశాల  విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు  2,000 రూపాయలు

.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

4-కుమారి .కె.తిరుపతమ్మ –   బి.ఎ.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు కు 2,000 రూపాయలు

 5-చి.మీరావలి  –    బి.కాం.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు కు- 2,000 రూపాయలు

6-కుమారి ఎన్.ఫాతిమా –బి ఎస్.సి.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు. కు -2,000 రూపాయలు – సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కారం

  స్థానిక శ్రీనివాస విద్యాలయం లో 2019 మార్చి పదవ తరగతి పరీక్షలో 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ మొదటి సంవత్సరం  చదువుతున్న కుమారి ఐలూరు హర్షిత  కు 5,116 రూపాయల ను ,సరసభారతి అమూల్య గ్రందాలతోపాటు శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా అందజేశాము . మొత్తం 37,వేల 420రూపాయల నగదు పురస్కారం సరసభారతి ద్వారా అందజేయించిన కోట సోదరులు ,శ్రీ మైనేని దంపతుల సౌజన్యం అనిర్వచనీయం .ఈ నగదు విద్యార్ధులకు ప్రోత్సాహకం మాత్రమే .వారంతా చదువులలో రాణించాలని కోరుతున్నాము .

  అతిధులందరూ ఉపాధ్యాయ దినోత్సవ విశేషాలు రాధాకృష్ణన్ గొప్పతనం విద్యార్ధులు నేర్చుకోవలసిన విషయాలు చాలా చక్కగా తేట తెల్లంగా మాట్లాడి విద్యార్ధులకు ప్రేరణ కలిగించి సభ ఉద్దేశ్యాన్ని సఫలీ కృతం చేశారు .అనివార్య కారణాలవలన మా కోట గురుపుత్రులు సభకు హాజరు కాలేకపోవటం గొప్ప లోటుగా గోచరించింది .శ్రీనాగరాజు అతిధులకు ఉపాహారం  ,చల్లని పానీయం అందించి ఆతిధ్యధర్మాన్ని నిర్వర్తించారు .పెర్నేటి వారు అందరికి తమ అమూల్య గ్రంధాలను కానుకగా ఇవ్వగా సరసభారతి ఉగాది వేడుకలలో ఆవిష్కరించిన మూడు పుస్తకాలు ఆస్కూలు లైబ్రరీకి నేను నాగరాజుద్వారా అందజేశాను .విద్యార్ధులంతా అత్యంత క్రమ శిక్షణతో మెలగి కార్యక్రమం జయప్రదం చేశారు .

  నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు మెసేజ్ లు చూస్తుంటే ,శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి  సరసభారతి కార్యక్రమాలకు నా అకౌంట్ కు 10వేలరూపాయలు పంపటం చూసి అమితంగా ఆశ్చర్యపోయాను .వారెప్పుడూ అంతే. చడీ చప్పుడూ లేకుండా ఇలా డబ్బు పంపుతూనే ఉన్నారు .వారి సౌజన్యం వెలకట్ట లేనిది .మేమిద్దరం ఇంతవరకు ఈ పదేళ్ళలో కలుసుకోలేదు .ఒకరిముఖం ఒకరు చూడనే లేదు .ఎప్పుడో ఒకసారి మాత్రం ఫోన్ లో మాట్లాడుకొన్నాం .ఆయన మైనేనిగారికి దగ్గరివారు .మా ఉయ్యూరు దగ్గర గండిగుంట గ్రామ వారిది .గుంటూరు నాగార్జున యూని వర్సిటి లైబ్రేరియన్ గా పని చేసి రిటైర్ అయి హైదరాబాద్ లో ఉంటున్నారు .తాను  2004 లో ఉయ్యూరు ఎసి లైబ్రరి ప్రారంభోత్సవానికి వచ్చానని ,కాని నేను వేదికపై కార్యక్రమ నిర్వహణలో ఉన్నందున తాము నన్ను పలకరించటం కుదరలేదని ఆ తర్వాత ఎప్పుడో ఫోన్ లో చెప్పి తాను  సరసభారతి బ్లాగ్ ను నిత్యం చదువుతూ ఉంటానని ఈ ప్రాంతం లో జరిగే విషయాలన్నీ మనబ్లాగ్ ద్వారా తెలుసుకొంటున్నానని  సరసభారతికార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని ,సరసభారతి ఆత్మీయుడనని చెప్పారు .అదే మా ఇద్దరి మధ్య సాహితీ బంధం .చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళినా, వారిని స్వయంగా కలవలేక పోయాను .ఈ సారైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారిని కలిసి రావాలి .ఈ పదేళ్ళలో సరసభారతికి చాలా డబ్బు పంపిన వదాన్యులు కోటేశ్వరరావు గారు. వెంటనే మెయిల్ రాసి కృతజ్ఞతలు తెలియ జేశాను .దీనికి గాను సరసభారతి తరఫున వారికి ఏదో ఒకటి చేసి ఋణం తీర్చుకోవాలి …అలాగే నిన్న సభలో శ్రీమతి భారతి శ్రీమతి కస్తూరి గార్లు చెరి ఒక సీల్డ్ కవర్ నాకు ఇచ్చారు .రాత్రి ఇంటికి వచ్చి ఆ కవర్ లను తీసి చూస్తె, చెరి రెండు  వేలరూపాయలు నగదు వాటిలో ఉండి,మళ్ళీ ఆశ్చర్యానికి గురైనాను .వీరిద్దరి సుమనస్కతకు ధన్యవాదాలు .మనపని మనం చేసుకు పోతుంటే మనకు తెలియకుండానే సహాయం లభిస్తుందని అర్ధమైంది .

  ఇప్పుడు  నిన్న నేనుమాట్లాడిన ,మాట్లాడాలనుకున్న విషయాలు మీకు  అందజేస్తున్నాను. .

‘’గురు రాది రనాదిశ్చగురుః పరమ దైవతం –గురోః పరతరం నాస్తి –తస్మైశ్రీ గురవేనమః ‘’

గురువుకు జ్ఞానం ,అనుభవం ,త్యాగం అనే మూడు కొమ్ములుంటాయి .గురువు ను వసిస్టమహర్షిని  శ్రీ రాముడు  ,సాందీపని మహర్షినిశ్రీ కృష్ణుడు ,అరిస్టాటిల్ ను అలేగ్జాండర్,శ్రీ రామ కృష్ణను శ్రీ వివేకానందుడు ,రామేశ్వర స్కూల్ గురువును అబ్దుల్ కలా౦ ఎలా అనునిత్యం స్మరించే వారో అలా స్మరించి స్పూర్తిపొందాలి .మా గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట మాస్టారిని అందుకే నేనూ, మా గోపాలకృష్ణగారు స్మరిస్తూ ,ఉపాధ్యాయ దినోత్సవాన్ని శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ,విద్యార్ధులలో స్పూర్తి కలిగిస్తూ వారి ప్రతిభాపాటవాలను గుర్తించి ప్రోత్సాహకంగా ఘనమైన నగదు పురస్కారాలు అందిస్తున్నాం .

   ఆధునికకాలం లో భారత మాజీ రాష్ట్రపతి మహా తత్వ వేత్త ఆచార్యులకు ఆచార్యుడు శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యా య దినోత్సవంగా అంటే గురు పూజోత్సవంగా 1962నుంచి జరుపుకొంటున్నాము .ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యా శాఖ మంత్రి శ్రీ మండలి కృష్ణారావు గారు తనకు మచిలీ పట్నం లో గురువులైన కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరిరావుగారి కి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి ఆధ్వర్యం లో మొదటి సారి నిర్వహించి అందరికి మార్గ దర్శనం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రొఫెసర్ రాధాకృష్ణ ‘’ది ఫిలాసఫిఆఫ్ రవీంద్ర నాథ్’’పుస్తకం రాసి రవీంద్ర కవీంద్రుని తత్వ దర్శనం లోకానికి చాటి చెప్పారు .గురువు ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకం వివరిస్తోంది –

‘’శాంతో దాన్తః కులీనశ్చ ,వినీతః ,శుద్ధ వేషవాన్  -శుద్ధాచారః  ,సుప్రతిస్టః,శుచి ర్దక్షః ,సుబుద్ధిమాన్

ఆధ్యాత్మ జ్ఞాన నిష్టశ్చ ,మంత్రం తంత్ర విశారదః –నిగ్రహానుగ్రహ శక్తో ,గురురిత్యభిదీయతే ‘’

  దాదాపు ఇన్ని లక్షణాలు మూర్తీభవించిన వాడు రాదా కృష్ణ పండితుడు .అందుకే మనకు ఆరాధ్యుడు .ఐతే ఇన్ని మంచి గుణాలున్న ఉపాధ్యాయుడు లభించటం కష్టం .అంతేకాక విద్యా బోధనలోఅనేక మైన రీతులు  విషయాలు ఉన్నాయి .ఇప్పటి గురువు ఆటపాటలతో హాయిగా చదువు చెప్పి ఇష్టంగా విద్యార్ధులు నేర్చుకోనేట్లు ప్రోత్సహింఛి ,స్నేహంగా ఉంటూ మార్గ దర్శనం చేయాలి . .విహార యాత్రలకు తీసుకు వెళ్లి అన్యోన్యత పెంచాలి –‘’దేశమైనా చూడు –కోశమైనా చూడు’’అన్న మాటను నిజం చేయాలి .కోశం అంటే నిఘంటువు .కాని ఈ రోజుల్లో కంప్యూటర్ .అది బోధించని, చూపించని విషయం లేనేలేదు .అన్య భాషలు నేర్వటం అవసరమే కాని ,మాతృభాషను మరువ రాదు .తల్లిభాష మూలధనం అని మర్చిపోరాదు .పుస్తకాల బరువు తగ్గించాలి .’’గణము  కాదు లెక్క –గుణము లో నుండును ‘’అనే ‘’తెలుగుబాల ‘’మాట ను ఆచరణలో పెట్టాలి .

 ‘’ Platonic Kingdom ‘’  రాజైన రాష్ట్ర పతి రాధాకృష్ణన్ .ఒకసారి లండన్ లో డా వికె ఆర్ వి రావు ,డా బిఎస్ దేశికన్ లు ఐరోపా తత్వ వేత్తల సమక్షం లో మాట్లాడటానికి వచ్చిన రాదా కృష్ణ ఉపన్యాసం వినటానికి ఉవ్విళ్ళూరి ,ప్రవేశం దొరకక ,ఆయన్నే అడిగితె ‘’నాకు ముందు మంచి కాఫీ ఇప్పించండి ‘’అని చెప్పి వాళ్ళు తెప్పించి ఇవ్వగా త్రాగి ,ఇద్దరి బుజాలపైనా  చేతులు వేసుకొని ఉపన్యాస హాలులోకి ప్రవేశింఛి తన శిష్య వాత్సల్యాన్ని చాటిన గురువు .రష్యా నియంత స్టాలిన్ ఐరన్ కర్టెన్ అని పిలువబడే రష్యాలో ఎవరికీ ప్రవేశం కలిపించేవాడుకాదు.కానీ రాదా కృష్ణన్ అంటే విపరీతమైన గౌరవం ఉండేది .ఆయన తనను చూడటానికి వస్తే ,ఎదురువెళ్ళి స్వాగతం పలికి తన చేంబర్ ఓ కూర్చోపెట్టి’’ప్రొఫెసర్ ప్రొఫెసర్ ‘’అంటూ  మర్యాద చేసి  తనలోని మానవత్వాన్ని చాటి ,తాను  చేసిన నరమేధానికి ఆయన సమక్షం లో  పశ్చాత్తాపం ప్రకటించి  ప్రాయశ్చిత్తం చేసుకొని తనను దుష్టునిగా భావించకుండా స్నేహ హస్తం చాటిన మేధావి మహాపండితుని దగ్గర కన్నీరు కార్చాడు .అదీ తత్వ వేత్త రాధాకృష్ణ అసమాన వ్యక్తిత్వం .’’త్వరలోనే భారత్ లో తత్వ వేత్తలు రాజ్యాదికారు లౌతారన్నమాట ‘’అని భవిష్యత్తును ఊహించి చెప్పాడు కర్కశ హృదయుడు స్టాలిన్ .

  1959 బ్రిటిష్ ప్రధాని ఆ౦థోని  ఈడెన్ భారత దేశానికి వచ్చి పార్లమెంట్ లో రాధాకృష్ణన చేసిన ఆంగ్లప్రసంగానికి ముగ్ధుడై ‘’ఇంగ్లీష్ లో ఇంత  గొప్పగా ధారాప్రవాహం గా, ఇంత ఉ శుద్ధంగా,ఇంత పరమమాదుర్యంగా  మాట్లాడే వారు ఇంగ్లీష్ దేశమైన మా బ్రిటన్ లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు .ఆయన తర్వాత నేను మాట్లాడలేను .’’దున్నిన భూమిలో ,నాగలి చాళ్ళమధ్య చెంగు చెంగున ఎగిరే కుందేలు పిల్లలాగాఆయనఉంటె  , ,కాళ్ళు తడబడే పసిపిల్లవాడిలానేను  ఉండిపోయాను ‘’అని తన జీవిత చరిత్రలో ఈడెన్ రాసుకొన్నాడు .

  భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ రాధాకృష్ణన్ మహత్వాన్ని గురించి చెబుతూ ‘’He is a lift to our nation ,a gift for our nature .He is a teacher to patriots and preacher to philosophers .In the world Radha Krishnan  is the Everesst of philosophers ‘’అని ప్రశంసించాడు .

  విద్యా కుటుంబం అంటే విద్య నేర్పేవారు నేర్చుకొనేవారు ,యాజమాన్యం ఎలా ప్రవర్తించాలో విద్యా రహస్యం ఏమిటో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక పద్యం లో చెప్పినది మనకు ఆదర్శం కావాలి –

‘’వర్తి౦తున్ మత ,దేశ ,జాతి కృతముల్ వైవిధ్యముల్ వీడి,ని  -ర్వర్తి౦తున్ ,బరి చర్య నార్తులకు యావత్ప్రజ్ఞ నర్పించి

త్రికరణ శుద్ధిగా ,భవదీయుడనై ,ఇతర ప్రవృత్తి వీడి,వీ-డికొనిపదార్ధ లాభమొకటే గమనించెద నింక’’

  గురుభ్యోం నమః

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-19-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 147వ కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం ను బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవంగా 5-9-19గురువారం సాయంత్రం అమరవాణి హైస్కూల్ లో

సరసభారతి 147వ కార్యక్రమంగా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలోపాల్గొన్న శాసన మండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్ తన గురుదేవులను సత్కరించి పేద విద్యార్థులకు సరసభారతి అందించిన పారితోషకాలు అందజేశారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా ఇంట్లో గురుపూజోత్సవ సత్కారం

5-9-19గురువారం ఉపాధ్యాయ దినోత్సవ గురుపూజోత్సవం నాడు ఉదయం మా ఇంట్లో మా ఇద్దరికీ శాలువాకప్పి సత్కరించిన సరసభారతి కార్యదర్శి శ్రీమతి శివలక్ష్మి శ్రీ శర్మ దంపతులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)

25-8-1947న యుపి లో మీర్జాపూర్ జిల్లా భైంసా లో జన్మించిన ప్రభునాథ ద్వివేది ఎంఏ,పిహెచ్ డి.కాశీ విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్ .27గ్రంథాలు రాశాడు .అందులో అంతర్ధ్వని కావ్య౦,శ్రీరామానంద చరిత్రం ,స్వేతదూర్వా ,కథా కౌముది ,మహాకవి హర్షవర్ధన ఉన్నాయి .సంస్కృత మహామహోపాధ్యాయ ,బాణభట్టపురస్కారం ,విక్రమ కాళిదాస అవార్డ్ ,కాదంబరి అవార్డ్ అందుకొన్న ప్రజ్ఞాశాలి .

504-సౌందర్య సప్తశతి కర్త –పండిట్ ప్రేమనారాయణ ద్వివేది (1922-2006)

పండిట్ ప్రేమనారాయణ ద్వివేది 5-6-1922న మధ్యప్రదేశ్ సాగర్ లో పుట్టాడు .ఆచార్య ,కావ్యతీర్ధ ఐన ద్వివేది గురుపరంపర లో ప్రొఫెసర్ రాంజీ ఉపాధ్యాయ ,ప్రొఫెసర్ బిఎం ఆప్టే ,ఆచార్య భయ్యాలాల్ శాస్త్రి ,న్యాయాచార్య భద్రం శాస్త్రి ఉన్నారు .సౌందర్య సప్తశతి,కవితావళి,శ్రీమద్రామ చరిత మానసం ,స్తుతికుసుమమాల ,కావ్య నిర్ఝర అనే అయిదు రచనలు చేశాడు .28-4-2006న 84వ యేట నారాయణ సన్నిధానం చేరాడు .తులసీదాసు తో సహా ప్రముఖ హిందీకవుల రచనలను సంస్కృతం లోకి అనువదించాడు .

505-మానవ నీతి వివేచనం కర్త –రాధేశ్యాం ధార్ ద్వివేది(1944)

ఏం ఏ పిహెచ్ డిఅయిన రాధేశ్యాం ధార్ ద్వివేది యుపి లో సాజాన్ డియోరియా లో 22-7-1944జన్మించాడు .వారణాసి డా సంపూర్ణానంద్ సంస్కృత కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ .గురువులు జగన్నాధ ఉపాధ్యాయ ,సి ఆర్ వి మూర్తి గార్లు .7పుస్తకాలు రాశాడు అందులో మానవ నీతి వివేచనం ఉన్నది

506-స్వరిత సందేశకావ్య కర్త –రహస బిహారీ ద్వివేది (1947)

అలహాబాద్ లో 2-1-1947జన్మించిన రహస బిహారీ ద్వివేది సాహిత్య రత్న ,విద్యా వాచస్పతి ,ఎంఏలిట్ .  రాణి దుర్గావతి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ .సంస్కృతం లో 4పుస్తకాలు రాశాడు .అందులో రెండు సందేశకావ్యాలు .-స్వరిత సందేశం ,స్వాతి సందేశం ఉన్నాయి .మిగిలిన రెండు –అర్వాచీన సంస్కృతమహా కావ్యాను శీలనం ,సాహిత్య విమర్శ ,.సంస్కృత మహాకావ్యోం కా ఆలోచనాత్మక అధ్యయనం ,సంస్కృత వాజ్మయం మే విజ్ఞానం కూడా రాశాడు  .సాహిత్య శాస్త్ర స్పెషలిస్ట్ .ప్రెసిడెంట్ అవార్డీ.

507-త్రిక దర్శన కర్త –రామచంద్ర ద్వివేది (1951-1993)

1951లో యుపి మణిపురిలో జన్మించి 42ఏళ్ళు మాత్రమె జీవించి 1993లో మరణించిన రామచంద్రద్వివేది యూనివర్సిటి ప్రొఫెసర్ .ముకున్దశాస్త్రి కిస్టే,గౌరీనాధ శాస్త్రి ,ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య అయ్యర్ లవద్ద చదువుకున్నాడు .తా౦త్రిక లోక ,త్రిక దర్శనం, జాతకమాల , ఈశ్వర ప్రత్యాభిజ్ఞ విమర్శిని ,అమర భారతి  సంవాద గ్రంథాలు రాశాడు .1987-88లో రాష్ట్రపతి పురస్కారం ,మహారాణా మేవార్ ఫౌండేషన్ నుంచి ‘’హరిత ఋషి’’అవార్డ్ అందుకొన్నాడు

508-అలంకార సర్వస్వ సంజ్ఞాని కర్త –రాం చంద్ర ద్వివేది (1935)

15-6-1935న యుపి ఫరూకాబాద్ లో పుట్టిన రాం చంద్ర ద్వివేది ఎం.ఏ. పిహెచ్ డి ,డిప్లొమా ఇన్ ఫ్రెంచ్ .ఉన్నవాడు .సంస్కృత డిపార్ట్మెంట్ హెడ్ .ప్రోఫెసర్ సుబ్రహ్మణ్య అయ్యర్ ,ప్రొఫెసర్ బటుకా౦త శాస్త్రి లు గురువులు . అలంకార సర్వస్వ సంజ్ఞాని అనే ఒక ఒక పుస్తకం రాశాడు .సాహిత్య ,దర్శనాలలో నిష్ణాతుడు .

509-బౌద్ధ దర్శన తత్వ విమర్శ కర్త –రమేష్ కుమార్ ద్వివేది (1960)

బౌద్ధ విమర్శన తత్వ విమర్శ రాసిన రమేష్ కుమార్ ద్వివేది 23-7-1960న యుపి లోని దేవారియాలో జన్మించాడు .వారణాసి డా సంపూర్ణానంద్ సాస్కృత విశ్వవిద్యాలయప్రొఫెసర్, డీన్ .11పుస్తకాలు రాశాడు –అవి-.బౌద్ధ ధర్మ దర్శన ఏవం ధర్మనిరపేక్షత ,బౌద్ధ దర్శన ఔర మార్క్సవాద  ,భారతీయ సంస్కృత ప్రవ్రాజిత నారినామ వదానం ,బౌద్ధ దర్శన తత్వ విమర్శ ,జ్యోతి స్మారికా.

510-శివ సమ్మోహన కావ్యకర్త –రాం కృపాల్ ద్వివేది (1934)

రాం కృపాల్ ద్వివేది 1934ఆగస్ట్ 15యుపి లోని బందా జిల్లా శివ లో పుట్టాడు .సాహిత్య కావ్యతీర్ధ ఐన రాం కృపాల్ ఇంటర్ కాలేజి టీచర్ .సాహిత్య స్పెషలిస్ట్ .నలదమయంతి నాటకం ,మయూర దూతం ,శివ సమ్మోహన కావ్య౦ రచించాడు .

సశేషం

రేపు 5-9-19 గురు సర్వేపల్లి రాధాకృష్ణన్జన్మదినం గురుపూజోత్సవ శుభాకాంక్షలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-9-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా  (1940)

ఉత్తర ప్రదేశ్ ఖున్జా సిటిలో 24-12-1940 అంటే క్రిస్మస్ ఈవ్ నాడు జన్మించిన రమాకాంత శుక్లా ,తల్లి తండ్రిసాహిత్యాచార్య బ్రహ్మానంద శుక్లా  ,,ప్రియం వదశుక్లాల వద్ద సంస్కృతం అభ్యసించి ,సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగాచార్య డిగ్రీలు పొందాడు .ఆగ్రా యూనివర్సిటిలో చేరి ,హిందీ ఎం. ఏ. గోల్డ్ మెడల్ తో ,సంపూర్ణానంద్ యూని వర్సిటి నుంచి సంస్కృతం లోను పాసయ్యాడు .1967లో ‘’జ్ఞానాచార్య రవిసేన కృత పద్మపురాణ యేవం తులసీదాస్ కా రామ చరిత మానస్ తులనాత్మక అధ్యయన౦ ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.సాధించాడు .

  మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి కాలేజిలో 1962లో లెక్చరర్ గా చేరి ,తర్వాత ధిల్లీ లోని ధిల్లీ యూనివర్సిటి రాజదానికాలేజిలో 1967లో హిందీ ఫాకల్టి మెంబర్ అయి ,1986లో హిందీ డిపార్ట్మెంట్ రీడర్ అయి ,2005లో రిటైరయ్యాడు .

  ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా అనేక సెమినార్లు కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .ఇండియన్ ఈస్తెటిక్స్ ,పోయెట్రి సాంస్క్రిట్ పై జరిగిన ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహించాడు .ఢిల్లీ దేవవాణిపరిషత్ ప్రచురించిన ’’అర్వాచీన సంస్కృతం ‘’త్రైమాసిక పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు .అఖిలభారత రేడియో కవి సమ్మేళనం లో సంస్కృత భాషా కవిగా పాల్గొన్నాడు .

   రమాకాంత శుక్లా సంస్కృత హిందీభాషలలోచాలా పుస్తకాలు రాశాడు .’’భాతి మే భారతం’’ ,అనే సంస్కృత టెలివిజన్   సీరియల్ ను దూరదర్శన్ లో  నిర్వహించాడు  .ఆయనపై ‘’దేవవాణి ప్రకాశం ‘’అనే ప్రత్యేకక అభినందన సంచిక సంస్కృతం లో దేవవాణి పరిషత్ వెలువరించింది .స్వయంగా సారస్వత సంగమం ,భారత జ్ఞానతాహం సంస్కృత రచనలు చేశాడు .సంస్కృత రాష్ట్రకవి ,కవిరత్న ,కవి శిరోమణి ,హిందీ-సంస్కృత సేతు మొదలైన బిరుదులుపొండాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ ,రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్ ,ఢిల్లీ సంస్కృత అకాడెమి నుంచి  ‘’మౌలిక సంస్కృత రచనా పురస్కా ర్’’   అందుకొన్నాడు .2009లో  ప్రెసిడెంట్ నుంచి సంస్కృత స్కాలర్ అవార్డ్ ,2013లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం పొందాడు .భారతీయ సంస్కృత ప్రచార సంఘ్ కు వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో ఆయన రచించిన ‘’మమజనని ‘’సంస్కృత రచనకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .

  భాతిమే భారతం నుంచి మొదటి శ్లోకం –

‘’భారతం వర్తతే మే పరం సంబలం –భారతం నిత్యమేవ స్మరామి ప్రియం

భారతే నాస్తి  మే జీవనం జీవనం –భారతాయాపితం మేఖిలం చేస్టితం

భారతాద్ భాతి మే భూతలం భూతలం –భారతస్య ప్రతిస్టితస్యమే మానసే’

భారతేహుం  ప్రపశ్యామి విశ్వేశ్వరం –భారత !శ్రేస్టతాన్గార తుభ్యం నమః ‘’

చివర శ్లోకం –

‘’యత్ర మందాకినీ  పాపసంహారిణీ-యత్ర గోదావరీ చారు సంచారిణీ

దేవ వాణీ చ యత్ర స్థిత మేవాకులా –భూతలే భాతి తన్మామకం భారతం ‘’

భావం -మందాకినీ నది ఎక్కడ పాప ప్రక్షాళనం చేస్తుందో ,ఎక్కడ గోదావరీనది ప్రవహిస్తుందో , ఎక్కడ దేవభాష సంస్కృతం ఉంటుందో అక్కడ భూమిపై నా భారత దేశం ప్రకాశిస్తుంది.

image.png

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501-  వేమన శతకాన్ని  సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

501-  వేమన శతకాన్ని  సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)

ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్21-6-1921తమిళనాడులో జన్మించాడు సంస్కృత తమిళ ఆంగ్లభాషలలో  నిష్ణాతుడైన పండితకవి .లెక్చరర్ గా చేరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ,దేశికన్ ప్రతిభా పాండిత్యాలు గుర్తించి ,రాష్ట్రప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి శాఖకు ప్రత్యేక ఆఫీసర్ గా నియమించాడు .ఇందులో పని చేసిన 13 సంవత్సరాలలో దేశికన్ ప్రాచీన సంస్కృత ఆయుర్వేద గ్రంథాలను అనువదించటం లో గొప్పపరిశోధనా కృషి చేశాడు .ఇందులో 25 వేల శ్లోకాలున్న అష్టాంగ సంగ్రహం ,6,400 శ్లోకాల లో 6 భాగాలుగా ఉన్న చరక సుశ్రుత సంహిత లున్నాయి .వీటిని ఆయుర్వేద కాలేజిలో దేశ వ్యాప్తంగా పాఠ్య గ్రంథాలను చేశారు .అంతటి అమోఘ కృషి చేశాడు దేశికన్ .

  నాటి భారత రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ను దేశికన్ సంస్కృత పరిపుస్టి,అనువాదాలకు ఒక సంస్కృత కమిషన్ ఏర్పాటు చేయమని కోరగా ,వెంటనే అంగీకరించి ఏర్పాటు చేయించి ఆకమిషన్ ఇచ్చిన సూచనలను అమలుపరచి తగినంత నిధులను విడుదల చేయించి సంస్కృత విద్యా పీఠాలను ఏర్పరచి సంస్కృత విద్యకు అందులో రిసెర్చ్ కి ప్రోత్సాహం కల్పించారు .

  దేశికన్ శ్రీ వెంకటేశ్వర ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్1943నుండి 45వరకు  1972నుంచి 75వరకు మూడేళ్ళు ,రిసెర్చ్ ఆఫీసర్ గా సేవలందించాడు .1980లో తంజావూర్ సరస్వతిమహల్ గ్రంథాలయ౦ కు గౌరవ  సంపాదకునిగా ,1988లో చెన్నైలోని ప్రభుత్వ మాన్యుస్క్రిప్త్స్ లైబ్రరీకి గౌరవ సలహాదారుగా  ఉన్నాడు  .ఆయుర్వేద విద్యకు చేసిన మహత్తర సేవకు కంచికామకోటి పీఠం ఆయనకు ‘’ఆయుర్వేద భారతి ‘’,శ్రీరంగం లోని శ్రీమద్ అండావన్ ఆశ్రమం ‘’అభినవ సుశ్రుత విస్తృత ‘’బిరుదులను ప్రదానం చేసి గౌరవించాయి .1971లో రాష్ట్రపతి శ్రీ  వి. వి .గిరి  దేశికన్ సంస్కృత  విద్వత్తుకు రాష్ట్రపతి పురస్కారం అందించారు .1993లో తమిళనాడు ప్రభుత్వం అత్యుత్తమ’’ కలైమణి ‘’పురస్కారమిచ్చి సత్కరించింది .

   ఆయుర్వేదం లో అపారమైన కృషి చేసిన దేశికన్ సంస్కృతం లో ‘’దేశిక మణి శతకం ‘’రాశాడు .తిరుక్కురళ్ ,నాలాదియార్ ,పాతుప్పట్టు ,ఎట్టుతోగై ,శిలప్పాదికారం ,అవ్వయ్యార్ నీడి ,తిరుప్పావై ,సుబ్రహ్మణ్య భారతి రచనలన్నీ  దేశికన్ సంస్కృతం లోకి అనువదించి సుసంపన్నం చేశాడు .6వేల శ్లోకాల భరతుని నాట్య శాస్త్రాన్ని తమిళం లోకి అనువదించిన ఘనత దేశికన్ ది .

  అవ్వయార్ తమిళ రచన  నీడిని అవ్వయ్యార్ నీతి గా శిలప్పాదికారంను నూపుర కావ్యంగా ,నాలాదియార్ ను సంస్కృతం లోకిఅనువదించి ఇంగ్లీష్ ,తమిళాలలో వ్యాఖ్య ,తిరుక్కురళ్ ను రెండుభాగాలుగా సంస్కృతం లోకి అనువాదం చేసి ఇంగ్లీష్ తమిళాలలో వ్యాఖ్య ,గోదాదేవి తిరుప్పావైకి ,కంబరామాయణం బాలకాండ కు  సంస్కృతానువాదం,సుబ్రహ్మణ్య భారతి  రచనలను –భారతీయార్ కావ్య సంస్క్రుతానువాద గా  అనువాదం చేశాడు .

  జనవేమన రాసిన శతక పద్యాలను  1-మూర్ఖ పధ్ధతి 2-దా౦భిక పధ్ధతి 3-విద్వత్పద్ధతి 4- ఆర్థ పధ్ధతి శీర్షికలతో సంస్కృతం లోకి అనువదింఛి రాష్ట్రపతి గిరిగారికి అంకితమిచ్చాడు దీనికి ముందుమాట  బీహార్ గవర్నర్ అనంత  శయనం అయ్యంగార్,ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ బూర్గుల రామ కృష్ణారావు గార్లు  రాశారు .ఇద్దరూ కూడా దేశికన్ సంస్కృత అనువాదం అత్యంత సుందరంగా ,సరళంగా,  మూలానికి విధేయంగా సాగిందని మెచ్చుకున్నారు .

ఒక్కో భాగం లో కొన్ని శ్లోకాలు రుచి చూద్దాం –

1-మూర్ఖ పధ్ధతి –

1-బ్రహ్మజ్ఞానాత్ భవేద్విప్రః   -తద్విహీనో ద్విజేతరః –శ్రుతి సిద్ధమిదం-జ్ఞాన జ్ఞానాద్వాల్మీకి ర్బ్రహ్మతాం యయౌ ‘’

97-శాస్త్రాభ్యాసన మాత్రేణ మూర్ఖో –న గుణ వాన్ భవేత్ –సుగంధ వస్తు భరణాత్ శ్రేస్టే నస్యద్ధాయా ఖరః ‘’

2-దాంబిక పధ్ధతి

2-జ్ఞాతుం హరిం బహూన్ –దేశానటిత్వా నిష్ప్రయోజనః –కపటే తపసి స్తిత్వా –నశ్యంతి బకవద్ వృధా ‘’

98-నీచం చ వైష్ణవం కృత్వా- విప్రవర్య౦ వదంతి తమ్-గంగాజలస్య సంబంధాత్ శుద్దే న స్యాత్ సురా ఘటః’’

3-విద్వత్పద్ధతి

3-మూలే బ్రహ్మో పరేవ్యోమ్ని వేదాంతేప్యేక రూపతః –జ్ఞానం యదాస్తి తత్ప్రాప్య బుధః శివ పదం వ్రజేత్

95-శాస్త్రేణ స్వానుభూత్యా  వా విద్వాన్ విగత సంశయః –నిశ్చలం దీపకలికా తుల్యం తత్వం ప్రపద్యతే ‘’

4-ఆర్యపద్ధతి

4-అసత్యం సర్వదా యస్తు కథ యేత్ –తస్య మందిరే –న తిస్టతిధృవం లక్ష్మీః జలం భిన్నఘటే యథా’

95-అహో దుఃఖం దరిద్రస్య న కంచి ద్గణ యేన్నరః – దుఖితే ధనికే  ఖేద మపహ్య ఇతి భాషతే ‘’

image.png

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

అమెరికా అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన -డిక్సీ లీ రే(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్-విహా0గ -సెప్టెంబర్

అమెరికా శాస్త్రవేత్త ,రాజకీయ నాయకురాలు ,వాషింగ్టన్ గవర్నర్ ,అణుశక్తి ని సమర్ధించి,అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన ధీర వనిత డిక్సీ లీ రే . వాషింగ్టన్ లోని టకోమాలో ‘’మార్గరెట్ రే ‘’గా ఫ్రాన్సిస్ ఆడమ్స్ రే,ఆల్విస్ మారియన్ రే దంపతులకు 1914 సెప్టెంబర్ 3 న జన్మించింది .12వ ఏట నే గర్ల్స్ స్కౌట్ లో చేరిన అతి తక్కువ వయసులో చేరిన బాలికగా రికార్డ్ సృష్టించింది .16వ ఏట స్వయంగా తనపేరును రాబర్ట్ ఈ లీ స్మృత్యర్ధం డిక్సి లీ గా మార్చుకొన్నది .కాలిఫోర్నియా ఒక్ లాండ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్1937లో పూర్తి చేసి ,వైట్రెస్ గా, జానిటర్ గా స్కూళ్ళలో పని చేసి౦ది .1938లో మాస్టర్ డిగ్రీ కోసం జీవశాస్త్ర పరిశోధన చేసి ‘’కంపారటివ్ స్టడి ఆఫ్ ది లైఫ్ హాబిట్స్ ఆఫ్ సమ్ స్పెసీస్ ఆఫ్ బర్రోయింగ్ యూమలే కాస్ట్రికా’’అనే థిసీస్ రాసింది .తరువాత నాలుగేళ్ళు ఓక్ ల్యాండ్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో సైన్స్ బోధించింది .జాన్ ఫిట్జర్ ఫెలోషిప్ తో స్టాన్ఫోర్డ్ యూని వర్సిటి లో బయాలజీలో డాక్టోరల్ కోర్స్ చేసింది . లాంటేర్న్ చేప కు సంబంధించిన ’’పెరిఫెరల్ నెర్వస్ సిస్టం ఆఫ్ లా౦ఫనిక్టస్ లూకోప్సారస్ ‘’అనే పరిశోధన పత్రాన్ని రాసి సమర్పించి 1945లో కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ గ్రూవ్ లో ఉన్న హాప్కిన్స్ మెరైన్ స్టేషన్ నుంచి పిహెచ్ డి పొందింది .

1945లో వాషింగ్టన్ యూనివర్సిటిలో జువాలజీ ఇన్ స్ట్రక్టర్ గా చేరి,1947లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ,అయి దేళ్ళ తర్వాత విశిష్టమైన ‘’జాన్ సైమన్ గుగెన్ హీం మెమోరియల్ ఫౌండేషన్’’గ్రాంట్ పొంది కాల్టెక్ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేసింది .1957లో వాషింగ్టన్ యూనివర్సిటి అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా పనిచేసి౦ది .ఆ కాలం లోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్పెడిషన్ కు చీఫ్ సైంటిస్ట్ గా ఉన్నది .క్లాసులలో సైన్స్ ను అమితాసక్తి కలిగేట్లు బోధించటం ,బయట అనేక రకాల పరిశోధనలతో అలరించటం తో ఆమె పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాపించాయి .దీనితో ఆమెకు మెరైన్ బయాలజీలో వీక్లీ టెలివిజన్ షో చేయటానికి ఆహ్వానం వచ్చింది .దీన్ని ‘’యానిమల్స్ ఆఫ్ ది సీషోర్’’పేరుతొ రూపొందించి ప్రదర్శనలు చేస్తేసూపర్ డూపర్ హిట్ చేసి , మరింతగా కీర్తిపొందింది .ఫసిఫిక్ సైన్స్ సెంటర్ లీ రేను ఆహ్వానించి అప్పటికే దివాళా స్థితిలో ఉన్న సైన్స్ మ్యూజియం ను నిలబెట్టే బాధ్యతను ఏడాదికి 20 వేల డాలర్ల జీతం తో అప్పగించింది .తన ఆలోచనా, ఆచరణ విధానాలతో లీ రే దాన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెంటర్ గా మార్చి అభి వృద్ధి సాధించి చూపించింది .తానూ అనుక్షణం శ్రమించి తనతోటివారినీ శ్రమి౦పజేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ విజయం ఆమె సాధించింది .ఆమె కృషి పట్టుదల సమాజంలోని వారందర్నీ ఆకర్షించి ఆమె ఒక సేలిబ్రేటి అయింది .

అటామిక్ పవర్ అవసరాన్ని గుర్తించి,ప్రచారం చేస్తున్న డిక్సీ లీ రే ను 1973లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ గుర్తించి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా ఉండమని ఆహ్వానించాడు .మొదట్లో ఉండటానికి ఇష్టం లేకపోయినా, చిరకాల మిత్రుడు లూ గుజ్జో నచ్చచెప్పటం తో చేరింది .ఇందులో రిసెర్చ్ ప్రోగ్రాం లతోపాటు ,అమెరికన్ మిలిటరికి న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసి ఇవ్వటం కూడా ఉండేది .ఒక్క ఏడాదిమాత్రమే పనిచేశాక ఆ కమిషన్1975లో రద్దు అయింది .

1975 ప్రెసిడెంట్ జరాల్డ్ ఫోర్డ్ ఆమెను ‘’అసిస్టెంట్ సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఓషన్స్ అండ్ ఇంటర్ నేషనల్ ఎన్విరాన్ మెంట్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్ ‘’గా పదవి అందజేశాడు .అప్పుడే ఆమె ‘’ప్రైవేట్ సెక్టార్ బాగా చేయగలిగిన దాన్ని పబ్లిక్ సెక్టార్ పూర్తిగా నాశనం చేస్తుంది ‘’అన్నది .1975లో వాషింగ్టన్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరచింది .ఎందుకు పోటీ చేస్తున్నావు అని అడిగితె ‘’ఈ వయసులో అట్టడుగు నుంచి ప్రయత్నించ లేక ,పైనుంచే నరుక్కోద్డామనిపించి’’అని తెలివిగా సమాధానమిచ్చింది .అనుభవం ,రాజకీయపార్టీల మద్దతు ,పత్రికల సపోర్ట్ , చేతిలో చిల్లిగవ్వా లేకపోయినా పెళ్ళికాని ఆవిడ కు గవర్నర్ పదవి ఏమిటి అని ఈస డి౦చినా డిక్సీ లీ రే మేయర్ గా గెలిచి పొలిటికల్ పండిట్ లకు మైండ్ బ్లాంక్ చేసింది .వాషింగ్టన్ గవర్నగ్ గా పని చేస్తూ జీతాలు ,ప్రోగ్రాములపై ఆడిట్ విధించి ,ప్రాధమిక విద్యకోసం బాగా ఖర్చు చేసింది .గవర్నర్ భవనం లో ఫస్ట్ లేడీ లేకపోయినా ,తనపెద్ద అక్క మెరియన్ రీడ్ ను తన అఫీషియల్ హోస్టెస్ గా ఏర్పాటు చేసుకొన్నది.తనకు ముందున్న గవర్నర్124మందికి ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొట్టి ముసలి ముఠా తో నింపింది .’’ఎస్ మెన్ ‘’తో నింపింది అని చెవులు కోరుక్కునారు గిట్టనివాళ్ళు .అటామిక్ పవర్ ప్రాముఖ్యతను బాగా ప్రచారం చేసింది .దాదాపు ప్రజలందర్నీ ఉపయోగకరమైన పనులతో ఆకర్షించి ‘’వండర్ ఫుల్ లేడి .ప్రెసిడెంట్ పదవికి ఈమె పోటీ చేస్తే బాగుంటుంది ‘’అనే అభిప్రాయం కలిగించింది .

1980ఏప్రిల్ 3 న మౌంట్ సెయింట్ హేలెన్స్ అగ్నిపర్వతం బ్రద్దలై భీభత్సం సృష్టించినపుడు అన్నిజాగ్రత్తలు తీసుకొని రాష్ట్రం లో ఎమర్జెన్సి విధించింది .అమెరికా ఫారెస్ట్ సర్వీసెస్ సహాయంతో చావు అంచున ఉన్న 30వేలమందిజనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలింప జేసింది .గవర్నర్ పదవిలో ఉండగా ఆ అగ్నిపర్వతాన్ని విమానం మీద చుట్టి త్వరలోనే మళ్ళీ బ్రద్దలౌతుందని సైంటిఫిక్ ఆలోచనతో చెప్పింది . అలాగే మళ్ళీ మేనెల 18న బ్రద్దలై 57మందిని కబళించింది .1980లో మళ్ళీ గవర్నర్ పదవికి పోటీ చేసింది కాని ఓడిపోయింది .

పదవీ విరమణ తర్వాత ఫాక్స్ లాండ్ ఫారం హౌస్ కు చేరి అక్కడే ఉన్నది .మిత్రుడు గుజ్జో తో కల్సి రెండుపుస్తకాలు 1-ట్రాషింగ్ ది ప్లానెట్ పుస్తకం లో పర్యావరణ శాస్త్రవేత్తలు మాటలమనుషులేకాని చేతల వాళ్ళు కారు అని చెప్పింది .పర్యావరణ పరిరక్షణకోసం జీవితాంతం కృషి చేసింది .వరుసగా రెండు సార్లు ఎన్నికలలో వోటు వేయనివారి వోటు హక్కు తొలగించాలని ప్రచారంచేసింది .వాతావరణ (క్లైమేట్ ) మార్పుల శాస్త్రవేత్తలగురించి చెబుతూ ‘’వాళ్ళు సగటు గాళ్ళు .వాళ్ళకు దూరంగా ఉండండి .వాళ్లకు ఒకే బ్రెస్ట్ ఒకే కిడ్నీ ఉంటాయి ‘’అని చమత్కరించింది .

ప్రతిభకు తగిన పురస్కారాలు గుర్తింపులు డిక్సీ పొందింది .1958లో మెరైన్ బయాలజీలో ‘’క్లాప్ అవార్డ్ ‘’,1973లో కన్జర్వేషన్ సర్వీస్ కు ‘’ఫ్రాన్సెస్ కె.అచిన్సన్ మెడల్ ,అమెరికా పీస్ మెడల్ ,1974లో ఫ్రాన్సిస్ బోయర్ సైన్స్ అవార్డ్ లు లభించాయి .ఇంతటి విద్యా వేత్తను గవర్నర్ గా ఎప్పుడూ చూడలేదు అని సెనేటర్ గార్డన్ వాల్ గ్రెన్ కీర్తించాడు .అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ సంస్థ ఆమె పేరిట అవార్డ్ ఏర్పరచి ప్రాతి ఏడాదీ పర్యావరణ పరి రక్షణకు విశేష సేవచేసినవారికి అందిస్తున్నారు . ఆమె రాసిన పేపర్లు ,పుస్తకాలు ఆమె జ్ఞాపికలు అన్నిటిని 190 బాక్సులలో భద్రపరచి ,స్ట్రాన్ఫోర్డ్ యూని వర్సిటి లోని హోవర్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లైబ్రరి అండ్ ఆర్కైవ్స్ ‘’లో జాగ్రత్త చేశారు .

సమర్ధ గవర్నర్ గా ,పాలనా దక్షురాలిగా ,పర్యావరణపరిరక్షురాలిగా ,ప్రజాస్వామ్య వాదిగా ,జీవశాస్త్ర వేత్తగా ,అణుశక్తి సంఘాధ్యక్షురాలిగా బహుముఖీన ప్రతిభ కనబరచిన డిక్సీ లీ రే 2-1-1994 న 80వ ఏట మరణించినది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4   496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)

 16-12-1919లేక 6-12-1918 జన్మించిన కపిల్ దేవ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వాసి .భాదోహి విశ్వభారతి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ ,గురుకుల మహావిద్యాలయ వైస్ చాన్సలర్ .చేదిప్రసాద్ డా హరిదత్త శాస్త్రి గురువులు.శాంతిస్తోత్రం ఏవం మహాప్రయాణం అనే సంస్కృత కావ్యం తో పాటు హిందీలో వేదొమ్ మే విజ్ఞాన వంటి మూడుపుస్తకాలు రాశాడు .వేదం ,వ్యాకరణ కావ్యాలలోనూ మరాఠీ ,బెంగాలి ,పాళీ ,ప్రాకృత ,ఉర్దూ జర్మన్,ఫ్రెంచ్ ,రష్యన్ ,చైనీస్ భాషలలో నిష్ణాతుడు .1991లో పద్మశ్రీ పురస్కారం పొందాడు .వేదరత్న ,రాష్ట్రపతి సమ్మాన్ అందుకొన్నాడు .1976లో ఇటలి జెర్మని ఫ్రాన్స్ ,1989లో ఇంగ్లాండ్ ,నెదర్లాండ్ ,1990లో అమెరికా ,కెనడా ,గయాన ,1991లో మారిషస్ ,కెన్యా ,టాంజనీయ దేశాల పర్యటన చేశాడు .గయానా ,మారిషస్ ప్రెసిడెంట్ ల చేత సన్మానం పొందాడు .లండన్ ,టోరేంటో యూనివర్సిటీలు ఆహ్వానించి గౌరవించాయి .

497-రసపేసల కావ్యకర్త –కాశీ  నాథ్ ద్వివేది (1898-1973)

21-1-1898 ఉత్తరప్రదేశ్ పిప్రా రాం నగర్ లో పుట్టిన కేదార్ నాథ ద్వివేది ఏం ఏ బిఎడ్.అసిస్టెంట్ ప్రొఫెసర్ .కమలనాథ శుక్లా వద్ద చదివాడు  .మధ్యప్రదేశ్ ప్రభుత్వ భిత్రి సంస్కృత విద్యాలయ లో పనిచేశాడు .రసపేసల కావ్యం ,రుక్మిణీహరణం కావ్యం రాశాడు .1973లో చనిపోయాడు సాహిత్య సుధానిధి బిరుదుపొందాడు .

498-కన్యాకుబ్జ లీలామృతకర్త –మహావీర్ ప్రసాద్ ద్వివేది (1864-1938)

   మహావీర్ ప్రసాద్ ద్వివేది హిందీ సంస్కృత విద్వాంసుడు .ఉత్తరప్రదేశ్ లోని రే లో 15-5-1864 జన్మించి 74వ ఏట 1938లో మరణించాడు .రైల్వే లో 25 ఏళ్ళుపని చేసి ,రాజీనామా చేసి ఇతరభాషలను నేర్చాడు .కథామహం నాస్త్రికః ,కన్యాకుబ్జ లీలామృతం,సమాచారపత్ర సంపాదకస్త్వః ,ప్రభాత వర్ణనం ,సూర్య గ్రహణం ఇందులో కొన్ని .హర్ష నైషధం పై మొదటిసారిగా హిందీలో వ్యాఖ్యానించిన వాడు .హిందీభాషకు యెనలేని సేవ చేసినందున 1900-1920కాలాన్ని ద్వివేది శకం అంటారు .కన్యా కుబ్జ బ్రాహ్మణుడు .తండ్రి రాం సాహి దూబే .సరస్వతి హిందీ మేగజైన 17ఏళ్ళు నడిపాడు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రచయిత.మరాఠీ గుజరాతీ ,సంస్క్రుతాలను ఆమూలాగ్రం నేర్చాడు .అన్ని రచనాప్రక్రియలలలో అమూల్య రచనలు చేశాడు .వేదం సంస్కృత సాహిత్యాన్ని ,పండిత జగన్నాధకవి సాహిత్యాన్ని శాస్త్రీయ దృక్పధంతో విశ్లేషించాడు   సంస్కృతకవిత్వం, వ్రజభాష ఖడి బోలి లలో కవిత్వం చెప్పాడు 71పుస్తకాలు రాసిన మహారచయిత .మానుష ,కావ్యకలాప్ ,దేవి స్తుతి వగైరా ..

499-సంస్కార కవితా సంగ్రహ కర్త –మణి శంకర్ ద్వివేది (20వ శతాబ్దం )

  సాహిత్య ,వ్యాకరణ ఆచార్యుడు మణిశంకర్ ద్వివేది రాజస్థాన్ లోని పటాన్ వాడా లో జన్మించాడు .జోద్ పూర్ సంస్కృత కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ .సంస్కార కవితా సంగ్రహం అనే ఒకే ఒక్క రచన చేశాడు .వేద౦ లోనే కాదు ,  సంగీతం  లోనూ నిధి .సి౦ధి కవి అబ్దుల్లా లతీఫ్ రచనలను  సంస్కృతీకరి౦చాడు 15-12-1952న జోద్ పూర్ లో సంస్కృత సమ్మేళనం నిర్వహించాడు .

500-సిద్ధాంత లేశ సంగ్రహ కర్త –పరాస్ నాథ ద్వివేదీ (1943-2010)

వేదాంత వ్యాకరణ సాహిత్య ఆచార్య ,పిహెచ్ డి, వాచస్పతి పరాస్ నాథ ద్వివేది 15-9-1943 బీహార్ లోని  ఆరా లో జన్మించాడు .వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం లో వేదాంత ప్రొఫెసర్ .రఘువీర్ పాండే ,ఆచార్య శ్రీరాం ప్రసాద్ త్రిపాఠీ,దేవ స్వరూప్ మిశ్రా ఈయన గురుపరంపర .సంస్కృతం లో 5గ్రంథాలు-పార్వతీ మంగళం ,వివరణ ప్రమేయ సంగ్రహం ,సనత్సుజాతం ,సిద్ధాంత లేశ సంగ్రహం రచించాడు .23-8-2010న 67వ ఏట మరణించాడు .రాష్ట్రపతి పురస్కారం తో పాటు చాలా అవార్డ్ లను అందుకొన్నాడు .లక్నో సంస్కృత సంస్థాన్ వారు విశిష్ట సమ్మాన్ పురస్కారమిచ్చారు .

   సశేషం

వినాయక చవితి శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-19-ఉయ్యూరు

 మహావీర్ ప్రసాద్ ద్వివేది

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో 2-9-19 సోమవారం వినాయక చవితిపూజ-మేమిద్దరం మనవడు చరణ్ ,మనవరాలు రమ్య

మా ఇంట్లో 2-9-19 సోమవారం వినాయక చవితిపూజ-మేమిద్దరం మనవడు చరణ్ ,మనవరాలు రమ్య

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)

2-7-1966 న ఉత్తరప్రదేశ్ జాన్పూర్ లో జన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ లక్నోలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ సంస్కృత రీడర్ ఆచార్య ,శిక్షా చార్య కూడా .డా.మండన మిశ్ర ప్రొఫెసర్ ఎస్ .డి .వాసిష్ట లు గురువులు . ప్రాచ్య శిక్షా దర్శన౦,ప్రాచీన భారతీయ శిక్షా ,హిందీ శిక్షా గ్రంథాలు రాశాడు

489-దశకంఠ వధ కర్త –దుర్గాప్రసాద్ ద్వివేదీ (1863-1937)

  జ్యోతిష,సాహిత్య ,దర్శన ,వ్యాకరణ  విద్వాన్ దుర్గాప్రసాద్ ద్వివేది 1863లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించాడు .జైపూర్ కాలేజిలో సంస్కృత లెక్చరర్ గా చేరి ,ప్రిన్సిపాల్ అయ్యాడు బాపుదేవ శాస్త్రి ,గ౦గాధరశాస్త్రి ,రా౦ భాజ్ సరస్వత్ ,సర్యుప్రసాద్ ద్వివేదీ ఇతని గురుపరంపర .19పుస్తకాలు రాశాడు .అందులో దశ కంఠ వధం ,దుర్గాపుష్పాంజలి ,దేవరాజ చరిత ,చాతుర్వర్ణ శిక్షా ,ప్రసన్న చండీపతి ఉన్నాయి .మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు .1937లో 74వ ఏట  మరణించాడు.

490-ఆగమ రహస్య కర్త –గంగాధర ద్వివేది (1921)

1921లో అయోధ్యలో జన్మించిన గంగాధర ద్వివేది వ్యాకరణ ,సాహిత్య ఆచార్య .ఆల్వార్ ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .వీరేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,శ్రీ ఘూర్తార్ ఝా ,శ్రీ గిరీష్ చంద్ర అవస్ధి లవద్ద విద్య నేర్చాడు .దుర్గాపుష్పాంజలి , ,ఆగమరహస్యం ,భారతాలోకః వంటి 8 గ్రంథాలు రాశాడు .రాష్ట్రపతి పురస్కారం పొందిన సంస్కృత విద్వాంసుడు .మహాభాష్య౦ ,శబ్దేందు శేఖరం,మంజూష ,ప్రౌఢవ్యాకరణ౦ లలో మహా విద్వాంసుడు .సంస్కృత రత్నాకర పత్రిక సంపాదకుడు .జైపూర్ దూరదర్శన్ నుండి చాల సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు .491-కల్పకాలికా  కర్త-హరిహర కృపాలు ద్వివేది (23-3-1949 మరణం )

వ్యాకరణ ,న్యాయ మీమాంస ,వేదాంతాలలో ప్రత్యేక కృషి చేసిన హరిహర కృపాలు ద్వివేది వారణాసిలోని సీతామూరార్క సంస్కృత స్కూల్ లో ఉపాధ్యాయుడు .రాం యజ్న ,పండిట్ ఉమాపతి ,పండితకమలాకాంత మిశ్ర ,పండిత రామానుజ ఓజ్హా,పండిట్ రఘునందన త్రిపాఠి ,పండిట్ బ్రహ్మదత్త ద్వివేది స్వామి కృష్ణ బోదాశ్రమం ,శంకరానంద్ ఈయన గురుపరంపర .కల్పకాలికా,న్యాయ కుసుమాంజలి టీక ,రామేశ్వర కృతికౌముదిరచనలు చేశాడు .జన్మించినది ఎప్పుడో తెలీదు కాని మరణించింది 23-3-1949 .1922లో ప్రభుత్వం నుంచి మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .  వ్యాకరణ రత్నాకర  ,విద్యానిధి బిరుదులను కాశీ లోని భారత ధర్మమండలి 1914లో బిరుదులిచ్చి సత్కరిస్తే ,అదే ఏడాది బీఆర్ విద్వత్ పరిషత్ ‘’తర్కాలంకార పదవి నిచ్చింది .

492-లింగదారణ చంద్రికా వ్యాఖ్య  కర్త – హరినాథ్ ద్వివేది (1914)

బాలకృష్ణ రానడే శిష్యుడైన హరనాథ్ ద్వివేది లింగ ధారణ చంద్రికా వ్యాఖ్య ,అశౌచనిర్ణయత్రి౦ షత్ శ్లోక అనే రెండు గ్రంథాలు రాశాడు .1914కాలం కవి .

493-గీతా మందాకిని కర్త –ఇచ్ఛారాం ద్వివేది (1961)

15-11-1961జన్మించిన ఇచ్ఛారాం ద్వివేది.యుపి లోని ఈతావా వాడు .తండ్రి లాల్ బహదూర్ ద్వివేది .పురాణ ఇతిహాసాచార్య ,పి.హెచ్.డి. న్యు ధిల్లీ లోని ఎస్. ఎల్ .బి .ఎస్ .ఆర్ సంస్కృత విద్యాపీఠ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ .తండ్రివద్ద ,గోపాల్ దూబే ,ఆచార్య కేశవ్ దేవ్ తివారి ,రామ్ధ్యాల్ ద్వివేది ,ప్రభుదత్త శర్మ వంటి హేమాహేమీల వద్ద విద్య నేర్చాడు .30పుస్తకాలురాశాడు అందులో గీతామందాకిని ,దూత ప్రతివచనం ,మిత్ర దూతం ఉన్నాయి .హిందీ ఉర్దూ లలోనూ పండితుడు .

494-సూక్తిమందాకిని కర్త –ఇంద్ర దేవ ఆచార్య (1940)

1940 మార్చి 1న ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ఇంద్ర దేవ ఆచార్య సాహిత్యం లో పిహెచ్ డి,,విద్యావాచాస్పతి .అసోసియేట్ ప్రొఫెసర్ .సూక్తిమందాకిని ,సుదామ చరిత రాశాడు .

495-బృహద్దేవత కర్త –జయప్రకాష్ నారాయణ ద్వివేది (1954)

1-4-1954ఉత్తర ప్రదేశ్ పిప్రేయహట్,పాదారుణ- లో జన్మించిన జయప్రకాష్ నారాయణ ద్వివేది ఎం. ఏ .పిహెచ్ డి  .గురుపరంపర –విద్యా నివాస్ మిశ్ర ,,డా.విశ్వంబరనాథ్ త్రిపాఠీ,ఎ.సి. బెనర్జీలు . దియోరియా ప్రొఫెసర్ ,.బృహద్దేవత అనే ఏకైక గ్రంథం రాశాడు .గుజరాత్ లోని  ద్వారకలో ఉన్న శ్రీ ద్వారకాధీశ  సంస్కృత అకాడెమిఅండ్ ఇండోలాజికల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ .

ఆధారం –Inventory Of Sanskrit Scholors

  రేపు 2-9-19 సోమవారం వినాయక చవితి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్అన్నదానికి కవి ”బమ్మెర ”స్పందన

తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, శ్రావణి వంటి ఎన్నో చారిత్రక నవలలు సాంఘిక నవలలకు సరిసమానంగా పాఠకుల్ని అలరించి.. ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. రావూరి భరద్వాజకు అంకితంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘వంశధార’ అనే ఆయన నవలను పాకుడురాళ్లు-2 అనుకోవచ్చు. ‘చారిత్రక నవలా చ క్రవర్తి’గా ప్రసిద్దులైన ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ సాహితీ జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

“సముద్రానికీ సాహిత్యానికీ ఏమైనా సంబంధం ఉందా? అంటే ఉందనే చెబుతాను. నేను జన్మించింది ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆకులల్లూరు గ్రామంలో. మానవ సంబంధ, బాంధవ్యాల గురించి ఏమీ తెలియని ఆ వయసులో నాకు తెలిసిందల్లా మనసుతో సముద్రానికి ఉన్న అనుబంధమే. ఆ తరువాత నేను పెరిగింది మా తండ్రి గారి ఊరు తాడికొండలో. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరు భరద్వాజ గారి ఊరు కూడా అదే. నాకంటే ఆయన 15 ఏళ్లు పెద్దవాడే అయినా ఆయనతో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఆ తరువాత్తరువాత నేనూ, ఆయనా హైదరాబాద్‌కే రావడం వల్ల మా బంధం ఆయన జీవితకాలమంతా కొనసాగుతూనే వచ్చింది. అది నన్ను ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలకు మరో భాగం అనిపించే ‘వంశధార’ నవల రాసే దాకా నడిపించింది.

పాకుడు రాళ్లు-2
అది 1960ల ప్రాంతం. కృష్ణాపత్రికలో రావూరి భరద్వాజ నవల ‘పాకుడు రాళ్లు’ సీరియల్‌గా వస్తున్నప్పుడు నేను ఆ పత్రికలోనే పనిచేస్తున్నాను. సుబ్రహ్మణ్య శర్మగారు దానికి ఎడిటర్‌గా ఉంటే డెస్క్ వర్క్ అంతా నేనే చూసేవాణ్ని. ఆ నవలకు గాను ఆయనకు మేము ఇచ్చిన పారితోషికం వారానికి 10 రూపాయలే. న్యాయానికి ‘వంశధార’ అన్న నవలను భరద్వాజ గారే రాయాలి. ఆ విషయమే ఆయనతో అంటే “ఇప్పుడది నాతో కాని పని, నువ్వే రాయి” అన్నారు. ‘వంశధార’ కూడా పాకుడు రాళ్లు నవలలాగే సినిమా రంగానికి సంబం«ధించిన జీవితాల్నే చిత్రిస్తుంది. ఇదీ పాకుడు రాళ్లు నవల చెప్పే జీవిత సత్యానికి సారూప్యమైనదే కానీ మరో రకంగా చూస్తే పూర్తిగా భిన్నమైనది. భరద్వాజ ‘పాకుడు రాళ్లు’ ఒక సినీ కథానాయిక ఉత్థాన పతనాల గురించి చెబితే, ‘వంశధార’ ఒక సినీరచయిత ఉత్థాన పతనాల గురించి చెబుతుంది.

భరద్వాజ ఈ పుస్తకానికి ముందుమాట కూడా రాశారు. పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగానే విడుదల చేయాలనుకున్నాను. ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాను. కానీ, ఈ లోగానే ఆయన వెళ్లిపోయారు. ప్రత్యక్షంగా ఆయన బాధలు నా బాధలు కాకపోయినా, పరోక్షంగా ఆయన బాధ లు నన్నూ కలచివేసేవి. ఆకలితో అలమటించిన రోజులు ఆయన జీవితంలో లెక్కలేనన్ని. భరద్వాజ గారి అర్థాంగి కాంతమ్మ గారు ఎంతో కాలం దాకా ఏ పేరంటానికీ రాలేదు. దానికి కారణం ఆమెకు మరో జత బట్టలు లేకపోవడమే. అంతటి గర్భదరిద్రం అనుభవించాడాయన. అయినా పేదరికం గురించి, దారిద్య్రం గురించి భరద్వాజ వ్యాఖ్యలు భిన్నంగా ఉండేవి. “దరిద్రం అంటే తిండి, బట్ట, గూడూ లేకపోవడ ం కాదు. దరిద్రం అంటే సమాజంలో తాను ప్రేమించే వారెవరూ లేకపోవడం, తనను ప్రేమించే వారు లేకపోవడం’ అనేవారు. ఇవే మాటల్ని పాకుడు రాళ్లు నవలలోని చివరి సన్నివేశంలో మంజరి చేత అనిపిస్తాడు. జీవితాన్ని కాచి వడబోసిన మహానుభావుడాయన. అలాంటి అనుభవజ్ఞుల సాన్నిహిత్యం లభించడానికి మించిన సంపద జీవితంలో మరొకటి లేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ సాంగత్యమే పాకుడు రాళ్లు-2 అనిపించే వంశధార నవల రాయడానికి తోడ్పడింది. అందుకే మన పిల్లా పాపలకు ఏం దక్కినా దక్కకపోయినా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక దశలో పెద్దవాళ్ల సాంగత్యమైతే దక్కాలని నాకనిపిస్తుంది.

మలిచే వాడు మందలించడా?
1959లో కొంతకాలం సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూలో ్లటీచర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఒక ధనవంతుల అబ్బాయి మా స్కూల్లో 8 వ తరగతి చదివేవాడు. ఆ అబ్బాయి బొత్తిగా చదవడం లేదని ఒకసారి వాళ్ల క్లాస్ టీచర్ గట్టిగా మందలించాడు. ఆ విషయం తెలియగానే ఆ అబ్బాయి తండ్రి ఆగమేఘాల మీద మా స్కూలుకు వచ్చి ఆ టీచర్ మీద ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అందరి ముందు ఆ టీచర్ తమ పిల్లాడికి క్షమాపణ చెప్పాలన్నాడు. మా ప్రిన్సిపాల్ మరేమీ మాట్లాడకుండా, అతడు చెప్పిన ట్టే స్కూల్లోని మొత్తం విద్యార్థులను, మొత్తం టీచర్లందరినీ ఒక చోట చేర్చి వాళ్లందరి ముందు ఆ టీచర్‌తో ఆ కుర్రాడికి క్షమాపణ చెప్పించాడు. ఆ వెంటనే ఆ టీచర్ తన రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వడం నేను చూశాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. జీవితాల్ని మలిచే వాడికి మందలించే హక్కు ఉండదా? ఆ పిల్లాడు ధనవంతుల బిడ్డ అయినంత మాత్రాన వాళ్ల కొమ్ము కాయాలా? మా టీచర్ చేసిన తప్పేమిటని మేనేజ్‌మెంట్ మాట వరసకైనా ఒక మాట అడగలేదు. విద్యా వ్యవస్థలు పూర్తిగా వ్యాపారాత్మకం అయిపోతే ఏమవుతుందో నాకా సంఘటన బలంగా చెప్పింది. ఆ స్కూలును వదిలేశాక లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా 35 ఏళ్లు అధ్యాపక వృత్తిలోనే కొనసాగినా ఆ చేదు అనుభవం నన్ను వెంటాడుతూనే వ చ్చింది. ఇప్పటికి 50 ఏళ్లు గడి చినా ఆ సంఘటన నా కళ్లల్లో మెదులుతూనే ఉంది.

ఫలితానికి పలుముఖాలు
రాఘవేంద్రరావుగారు అన్నమయ్య తీయడానికి పదేళ్ల ముందే జంధ్యాల గారు సినిమా తీస్తానంటే అన్నమాచార్య మీద స్క్రిప్ట్ తయారు చేశాను. దానికి సంబంధించిన పాటలన్నీ రికార్డు అయ్యాయి. కానీ, ఆర్థిక పరిస్థితులేవీ అనుకూలించకపోవడంతో నిర్మాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. నా మనసులో ఒక మహా స్వప్నంగా ఆవరించిన ఆ సినిమా ఊహ ఒక్కసారిగా గాజుమేడలా కూలిపోయింది. చాలాకాలం దాకా నేను ఆ దిగులు నుంచి బయటపడలేదు. పదేళ్ల పాటు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఆ స్క్రిప్టు నిరుపయోగంగా ఉండిపోవడం ఎందుకని భావించి చివరికి ఆ సినిమా స్క్రిప్టును ‘శ్రీ పదార్చన’ నవలగా మలిచాను. దాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు ఆ ఏటి ఉత్తమ నవలగా ఎంపిక చే శారు. సినిమా తీయలేనప్పుడు ఆ స్క్రిప్టు ఎందుకులే అనుకుని ఉంటే అది చెత్త బుట్ట పాలయ్యేది. దాన్ని నవలగా మలిచిన ఫలితంగా అది ఒక పురస్కారానికి పాత్రమయ్యింది. ఏ వస్తువుకైనా, ఏ కళా సృజనకైనా ఒకే ఒక్క ప్రయోజనం అంటూ ఉండదు. దాని మిగతా ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే మరో రూపంలో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. దానికోసం పడ్డ శ్రమను సార్ధకం చేసుకోవచ్చు అనిపించింది.

పునాదులు పదిలంగా
‘భువన విజయం’ పద్యనాటక ప్రదర్శనకోసం మా గురువు ఆచార్య దివాక ర్ల వెంకటావధానితో కలిసి ఎన్నో దేశాలు తిరిగాను. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ ఇలా దాదాపు 20 చోట్ల భువన విజయం పద్యనాటక ప్రదర్శనలిచ్చాం. అందులో నాది తిమ్మరుసు పాత్ర. మన దేశంలో మాత్రం ‘వీళ్లకు ఇదో పిచ్చి- ఈ చాదస్తం జీవితాంతం వీళ్లను వదలదేమో’ అంటూ వెటకారంగా మాట్లాడిన వాళ్లే ఎక్కువ. అయినా మేమెప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒకరోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇచ్చిన నాటక ప్రదర్శనకు తెలుగు వారే కాదు, అమెరికన్లు కూడా పెద్దసంఖ్యలో వచ్చారు. పద్యం ఎత్తుకున్న ప్రతిసారీ వారు ఊగిపోవడం మమ్మల్ని తన్మయానికి గురిచేసింది. ప్రదర్శన అయిపోగానే తమ హర్షాతిరేకాన్ని 45 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… అంటే సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ద్వారా వ్యక్తం చేశారు. ఇది ఆ దేశంలో వాళ్లు తెలిపే అతి పెద్ద అభినందనకు చిహ్నం. పుట్టిన చోట పునాదులు కదిలిపోతున్న ప్రక్రియకు మరో చోట ఎక్కడో నీరాజనాలు లభించడం చూస్తే ఆశ్చర్యం వేసింది.. మనసు ఆ్రర్దమైపోయింది. స్వదేశంలో పద్యం అనగానే పెదవి విరిచే పరిస్థితుల్లో ఉంటే దేశం కాని దేశంలో పద్యానికి అంత స్పందన రావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కడో ఏ దేశంలోనో మన పద్యానికి ఆదరణ ఉందని తెలిస్తే గానీ, మనమేమిటో మనకు తెలిసిరాదా? ఆలోచిస్తే ఒక్కోసారి మనల్ని మనం ఎక్కడో జారవిడుచుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. మన పునాదుల్ని మనమే పాతాళంలోకి వదిలేసి ఆ తర్వాతెప్పుడో నెత్తీ నోరు కొట్టుకుంటే ఒరిగేదేమీ ఉండదని నేననుకుంటాను.

కల్పన-సత్యం కలగలిస్తే….
ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ సి. కనకాంబరరాజు గారు ఒకసారి నాతో “గురువు గారూ. ఒక నవల రాసిస్తారా?” అన్నారు. “తప్పకుండా ఇస్తాను” అన్నాను. “యండమూరి వీరేంధ్రనాథ్ రాసిన ‘తులసీ దళం’ న వల త్వరలో ముగియబోతోంది. మళ్లీ ఆ స్థాయిలో సంచలనం సృష్టించే నవల ఏదైనా ఇవ్వండి” అన్నారు. వెంటనే నేను “చారిత్రక నవల రాసిస్తా” అన్నాను. దానికి ఆయన “చారిత్రక నవల ఎవ రు చదువుతారండీ, మంచి మంత్ర తంత్రాలతో ఉండే ఒక థ్రిల్లర్ నవల ఏదైనా ఇవ్వండి” అన్నారు. నేను మొండికేశాను. “నేను చారిత్రక నవలే రాస్తా. ఆ నవల ‘తులసీ దళం’ కన్నా పది కాపీలు ఎక్కువ అమ్ముడుపోయేదిగా ఉంటుంది” అన్నాను. చివరికి ఆయన “సరే” అన్నారు. చేసిన వాగ్దానం మేరకు ఒక సవాలుగా తీసుకుని ‘శ్రావణి’ అనే నవల రాశాను. ఆ నవలకు ఆశించిన దానికి మించి పాఠకుల ఆదరణ లభించింది. అదే స్పూర్తితో రాసిన ‘తంజావూరు విజయం’ నవల మూడు లక్షల కాపీలు అమ్ముడు పోయి అది నన్ను అన్ని రకాలుగా నిలబెట్టింది. ‘ట్రూత్ యీజ్ మోర్ స్ట్రాంగర్ ద్యాన్ ఫిక్షన్’ అనే మాట మనం ఎప్పుడూ వింటున్నదే. ఏ రకంగా చూసినా కల్పన కన్నా వాస్తవికతే ఎక్కువ బలమైనది. అయితే ఈ చారిత్రక నవల అన్నది ట్రూత్‌నే ఫిక్షన్‌గా రాసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో రెండూ ఉన్నాయి. అందుకే దానికి జనాలను అలరించే శక్తి మిగతా ప్రక్రియలకన్నా ఎక్కువ.. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. నేను రాసిన పలు నవలలతో ఇది రుజువయ్యింది కూడా.
చారిత్రక నవలలు చదివితే ఏమొస్తుంది? అంటూ కొందరు అడుగుతూ ఉంటారు. చారిత్రక నవలలు చదవడం అంటే వేల సంవత్సరాల నాటి కాలమాన పరిస్థితుల్లోకి మనం పయనించడమే. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. ”
– బమ్మెర
ఫోటోలు: హరిప్రేమ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)

  ఆర్య వైశ్య కులం లో పడగ శీల గోత్రం లో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ లో 1964లో  జన్మించిన శ్రీ రమణా౦ద మహర్షి  విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో  బి టెక్ చదివి ఉత్తీర్ణులయ్యారు .

27వ యేట 2002లో ఆత్మజ్ఞానం పొంది .ఉపనయన సంస్కారం యజ్ఞోప వీత ధారణా లేకుండానే షిరిడి సాయిబాబా అనుగ్రహంతో అపరోక్షానుభూతి తో బ్రహ్మజ్ఞాని అయ్యారు. అప్పటి నుంచి   షిరిడి సాయిబాబా ,అమ్మవారు ,శివుడు లపై ధర్మప్రచారంసాగిస్తున్నారు  .తెలంగాణాలోని భువనగిరి యాదాద్రి జిల్లా’’ రమణేశ్వరం’’ అనబడే నాగిరెడ్డి పల్లి గ్రామంలో 1008 శివలింగాలు ,స్వర్ణ శివ లింగం ,స్పటిక శివలింగం స్థాపించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు .త్వరలో షిరిడి సాయి బాబా ‘’స్వర్ణ విగ్రహం ‘’స్థాపించే ప్రయత్నం లో ఉన్నారు .

  స్వామీజీ గత 15 సంవత్సరాలుగా 56వచన గ్రంథాలు రచించి ప్రచురించారు .అందులో శివుడే దేవాది దేవుడు ,ఆదిదేవుడు ,పరమపురుషుడు వంటి బృహత్ గ్రంథాలున్నాయి .ప్రస్తుతం షిర్డీ సాయి అనుగ్రహం తో ‘’షిరిడి సాయి బాబా సహస్ర నామ స్తోత్రం ‘’అష్టోత్తర ద్వశత శ్లోకాత్మకంగా  రచించారు .ఈ శ్లోక రచన క్రమాన్ని శ్రీ విద్యా చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ  దెందుకూరి దుర్గాప్రసాద శర్మ గారికి వినిపిస్తూ ,అభిప్రాయ సేకరణ చేశారు .అద్భుత ధారాశుద్ధి ఆ అనుష్టుప్ శ్లోకాలలో ఉందని ,ఉత్తమభావాలకు అనుగుణమైన శబ్దజాలం ,నిష్పాక్షిక సాయి చరిత్ర ,సాయి సిద్ధత్వం ,సాయిలీలలు ,సాయి మార్గ దర్శకత్వం,అనుగ్రహ విధానం అంతా అంతస్సూత్రంగా వేదాంత విజ్ఞానం ఇమిడి ఉండేట్లు ,ఉపక్రమ ,ఉపసంహారాలు ,ఫలశృతికూడా జోడించటం తో అనుభవం ఉన్న గొప్ప కావ్య లక్షణం కలిగిందని వారితో ప్రత్యక్ష  సంబంధం ఉన్న దెందు కూరి వారు సమీక్షగా తెలిపారు .

  స్వామి వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ శర్మగారు వేదాన్ని సామాన్యులు కూడా స్వరసహితంగాగా ఎలా చదవాలో,ఆ జ్ఞానాన్ని సంగీత జ్ఞాన పూర్వకంగా బహిర్గతం చేసిన మహానీయులన్నారు .కనుకనే ఈ గ్రంథాన్నివేద శబ్దమయంగా వైదిక శబ్ద బంధురంగా రచించి ,దీన్ని పఠిస్తే వేద పఠన ఫలితం కలుగుతుందన్నారు .శక్తిపాత గురువు ,తత్వ దర్శి శ్రీ రమణానందులు తొలిసారిగా దీన్ని సంస్కృతం లో రచించినా ఎంతోఅనుభవమున్న కవీశ్వరుల,ఉత్తమ శబ్ద మాధుర్యం ,గొప్ప సమాస భూయిష్టంగా ,అలంకార సహితంగా రాసినట్లు భావన కలుగుతుందని  మరిన్ని సంస్కృత రచనలతో సంస్కృత మహాకవిగా సుస్థిర స్థానం పొందుతారని శర్మగారు వాక్రుచ్చారు .ఈ గ్రంథంశ్రీ వికృతి ఉగాది నాడు 2019ఏప్రిల్ 6 న ఆవిష్కరి౦ప బడింది .ఇప్పుడు స్తోత్ర మాధుర్యాన్ని రుచిచూద్దాం .-

  సంకల్పం –అథ సంకల్పః –ఓం అస్య శ్రీ పరమగురు షిరిడి సాయి –సహస్రనామ స్తోత్ర మహా మంత్రస్య-మహర్షి శ్రీ రమణానందోఋషిః అనుష్టుప్ చందః –శ్రీ షిరిడి సాయినాథో దేవతా ప్రీత్యర్ధం –తత్వ  దర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వర-శివ శక్తి షిరిడి సాయి అనుగ్రహ మహా పీఠాధిపతి–సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కృత –అష్టోత్తర ద్విషత శ్లోకాత్మక –షిరిడి సాయి సహస్ర నామ స్తోత్ర జపే –పారాయణే,హోమేవినియోగః ‘’

ధ్యానం –శివ సాకార మో౦కారమ్ –పూర్ణానంద సదా శివం –పరిపూర్ణ మహా గురుం –సాయీశ్వర ముపాస్మహే ‘’

మోక్షదం శక్తిదం పుణ్యం –సాయి నామ సుకీర్తనం –సర్వ దోషహరం దివ్యం –శ్రవణం పాపనాశనం ‘’

  సహస్ర నామ స్తోత్రం

1-భగవాన్ సాయి శంకరః –పరమాత్మా సదా శివః –సర్వవ్యాపీ పరాశక్తిః ఓంకారో శిరిడీశ్వరః

10 అత్యద్భుత మహామూర్తిః –ఆజానుబాహు రుత్తమః –గుణదామో పరంధామః –యుగావతార పూరుషః ‘’

50-దాదాభట్ శుద్ధ భక్తిదః-ఉద్ధవ్ రావ్ భక్తి ముక్తిదః –నూల్కర్ మాయా విముక్తిదః –ధర్మార్ధ కామ మోక్షదః ‘’

100-ఉపవాస నిరోధకః -శుష్కజ్ఞాన విని౦దకః –క్షుద్రోపాసన ఖండనః –జ్యోతి శ్శాస్త్ర విఖండనః ‘

151-తపోలోక ని’’వాసీ చ-సర్వలోక సుదర్శితః –ఘోర తపో మహా వైద్యో –  ఈషణత్రయ నాశకః ‘’

200-జగదాధార నాయకః –జగదానంద కారకః –జగత్కారణ కారణః –సూర్య చంద్రాగ్ని నేత్రవాన్

208-రమణ సాయి లింగేశః –త్ర్యంబక సాయి మంగళః-శిరిడీశ సుమ౦గళః –రమణానంద సంస్తుతః ‘’

  ఫలశృతి-

1-సాయినామ సహస్రంతు –ఆత్మానంద ప్రదాయకః –ఐశ్వర్య వరదం పుణ్యం –ప్రేమాన్వితో సదాజపః ‘

9-ధ్యాననామ సహస్రేణ-పరాభక్తి సమన్వితః బ్రహ్మజ్ఞానం లభేత్ శీఘ్రం –సిద్ధత్వం మోక్ష మాప్నుయాత్ ‘’

  దీనితోపాటు సాయి సహస్రనామావళి కూడా ఉన్నది .పూర్తి కలర్ పేపర్ పై అత్యంత సుందరంగా ముద్రింపబడిన  ఈ గ్రంథం షిర్డీ సాయిభక్తులకు కరతలామలకమే .

 ఆధారం -సుమారు పది రోజులక్రితం బ్రహ్మశ్రీ దెందు కూరి దుర్గాపసాద శర్మగారు మా ఇంటికి వచ్చినాకు ఇచ్చిన  ‘’షిరిడి సాయి సహస్రనామ స్తోత్రం ‘’గ్రంధం.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవం -సరసభారతి ఉయ్యూరు

This gallery contains 10 photos.

More Galleries | Tagged | Leave a comment

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం

సుమారు పదిహేను రోజులక్రితం  వివేక శీలి ,నాకు మంచి శిష్యుడు వూర మహేష్ అమెరికాలో మరణించాడని ,అతని పార్ధివ దేహాన్ని స్వగ్రామం ఉయ్యూరు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపినట్లు తెలిసి చాలా విచారించాను .మంచి తెలివిగల విద్యార్ధి మహేష్ .అతని అక్కయ్యలు సుజాత ,శ్రీ లక్ష్మి ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతూ ,నాదగ్గర ట్యూషన్ చదివి పాసయ్యారు .సుమారు 30ఏళ్ళక్రితం మహేష్ టెన్త్ క్లాస్ అదే హైస్కూల్ లో చదువుతూ కావాలని నాదగ్గరకు వచ్చి ట్యూషన్ చదువుతానని కోరాడు .అప్పుడు నేను పామర్రులో పని చేస్తూ రోజూ ఉయ్యూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను .నాదగ్గర పదవతరగతి చెదివే వారు లేరప్పుడు .ఆమాట వాడికి చెప్పి ,ఊళ్ళో చాలామంది ట్యూషన్ చెప్పే  మేస్టార్లున్నారు .వాళ్ళదగ్గర ఎవరిదగ్గరైనా చేరితే బాగుంటుంది అని చెప్పాను  .కాదు ‘’మీదగ్గరే చదవమని మా అక్కలూ చెప్పారు .నేనూ అలాగే చదవాలను కొంటున్నాను .మానాన్న కూడా మీదగ్గరే చేరమన్నారు .మీరు ఏ టైం కు రమ్మంటే ఆ టైం కు వస్తా .’’అన్నాడు  .

  వాళ్ళనాన్న వూర మోహనరావు ఉయ్యూరులో వూరా బ్రదర్స్ ఐన ఊర వెంకటేశ్వర్లు, ఊర తాతయ్య ,ఊర సుబ్బారావు లలో సుబ్బారావు గారబ్బాయి .వాళ్లకు ఉయ్యూరు సెంటర్ లో పచారీ కొట్టు ఉండేది .అక్కడే సరుకులు తీసుకు వచ్చేవాళ్ళం కనుక బాగా తెలిసిన కుటుంబం అయింది .మోహనరావు చాలామర్యాదస్తుడు .నిదానం మనిషి .హళ్ళూ పెళ్లూ లేనివాడు .ఇతని అన్నయ్య ను అందరూ ‘’బీకాం ‘’అనేవారు అంటే అతనే ఉయ్యూరులో మొదటిసారిగా బికాం చదివి డిగ్రీ పొందిన వాడన్నమాట .అసలు పేరు ఏదున్నా  అందరికీ ఈపేరే అతని  ఐడెంటిటి .వూరా బ్రదర్స్ కు మాచిన్నతనం లో మా ముందు బజారులో ఉమ్మడి కిరాణా కొట్టు ఉండేది .సోదరులు అంతా అందులోనే ఉండేవారు .తర్వాత వాళ్ళు భాగాలు పంచుకొని ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకొన్నారు .. సుబ్బారావు ను తెలిసినవారందరూ ‘’సాగరయ్య ‘’అని పిలిచేవారు .వీళ్ళకు మెట్ట, మాగాణీ పొలాలు బండీ ఎడ్లు, గోడ్లుగోదా, పాడీ పంటా  పాలేళ్ళు ఉండేవారు వీటిని సాగరయ్యే చూసుకొనేవాడు .ఇతని ఇద్దరుకోడుకులు బికాం ,మోహనరావు లు జాయింట్ వ్యాపారం చేశారు .తర్వాత ఎవరి భాగం వాళ్ళు తీసుకొని వాళ్ళవాళ్ళ వ్యాపారం లో స్థిరపడ్డారు .సుబ్బారావు కు మా బజారులోనే పూర్వం ఠాణా గా ఉండే ఇల్లు ఉంది అందులోనే తండ్రి , కొడుకులుకాపురం .సుబ్బారావు చనిపోయాక మోహనరావు కూడా అందులోనే కుటుంబం తో ఉంటున్నాడు . తెల్లవారి లేస్తే మేము సెంటర్ కు వెళ్ళాలంటే  వాళ్ళ ఇంటి మీదనుంచే వెళ్ళాలి .కనుక బాగా పరిచయాలు౦డేవి.మాశ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మూలవిరాట్టుకు వెండి కవచం వాళ్ళ అమ్మాయి అల్లుడు పేరుమీద మోహనరావు చేయించి అమర్చాడు .ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో చేరాం .

    వూర మహేష్ నాదగ్గర ట్యూషన్ కు చేరాడు .వాడి తమ్ముడు కూడా ఏక్లాసో గుర్తులేదుకానీ వాడూ చదివాడు  .మహేష్ తెలివి తేటలు అపూర్వం అని చేరిన రెండు రోజుల్లోనే గ్రహించాను .వాడొక్కడే నాకు అప్పుడు టెంత్ క్లాస్ విద్యార్ధి .అ  ఏడాదే  లెక్కలు సైన్స్ టెక్స్ట్ బుక్స్ మారాయి .లెక్కల్లో కొత్త చాప్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు .సర్డ్స్ ,ప్రోగ్రేషన్స్ ,ట్రిగనోమెట్రి,,లాగరిధమ్స్ వంటి చాప్టర్లున్నాయి  కాల్క్యులస్ కూడా ఉన్నట్లు జ్ఞాపకం .ఇవి ఇంటర్, డిగ్రీలలో నేను కొంత నేర్చినవే .కాని ఎన్నో ఏళ్ళు అయిపోవటం వలన అసలు ఏమాత్రం టచ్ లోలేవు .మరి మహేష్ కావాలని నాదగ్గర చేరాడు .వాడికి అర్ధమయ్యేట్లు బోధించి వాడిని స్కూల్ ఫస్ట్ వచ్చేట్లు చేయాలి అనే సంకల్పం కలిగింది .వాడికీ ఈమాట చెప్పి ‘’నేను నీకు బోధించటం కాదు ఇద్దరం కలిసి చదువుకోవటం ఇప్పుడు మనం చేయాలి .నామీద యెంత బాధ్యతఉందొ నీమీదా అంతే ఉందని గ్రహి౦చు’’అన్నాను. సరే అన్నాడు మహేష్ .అదొక సవాలుగా తీసుకొన్నాం  ఇద్దరం .ఈ కొత్త చాప్టర్లు ముందు నేను మాస్టరీ చేయాలి అని ఇంటర్, డిగ్రీపుస్తకాలు తీసుకొని బాగా అవగాహనలోకి తెచ్చుకొని వాడికి బోధించాను .చెప్పటం ఆలస్యం యిట్టె అల్లుకు పోయేవాడు .కనుక టెన్త్ లెవెల్ చాలదు మహేష్ కు అనిపించి ,ఇంటర్ ,డిగ్రీ లలో ఆ చాప్టర్స్ లో ఉన్న ముఖ్యమైన లెక్కలు వర్కేడ్ అవుట్ ఎక్సామ్పిల్స్  చెప్పి చేయి౦చేవాడిని .నా శ్రమ చూసి వాడూ అంతేపట్టుదలతో అవన్నీ నేర్చుకొనేవాడు .అంటే చాలా అడ్వాన్సేడ్ గా వాడిని వాటిల్లో తయారుచేయించాను .కనుక క్వార్టర్లీ, హాఫ్ యియర్లీమొదలైన పరీక్షలలో ఎప్పుడూ వాడికే ఫస్ట్  మార్క్ వచ్చేది. ఎలావచ్చేవి అని ఇతర ట్యూషన్ మేస్టార్లు వాకబ్ చేసేవారట  వాడిని అడిగితె ‘’మా మాస్టారి కోచింగ్ వలన’’అని చెప్పేవాడట . అలాగే సైన్స్ కూడా ఇంటర్ స్థాయి లో బోధించాను .ఇంగ్లీష్ లో మాట్లాడటం కూడా నేర్పించాను. సులభగ్రాహి కనుక తేలికగా వంట పట్టించుకోనేవాడు  .ఒక మంచి  సత్తాఉన్న విద్యార్ధికి బోధిస్తున్నాను అనే మహదానందం నాకు కలిగేది .శిష్యుడు గోప్పవాడైతే గురువుకు అంతకంటే కావాల్సింది ఏదీ ఉండదు .నాఎక్స్ పెక్టేషన్స్ కు తగినట్లుగా మహేష్ స్పందన ఉండేది .ఆ తృప్తి చాలు అనిపించింది .ఆ ఏడాది పబ్లిక్ పరీక్షలో మహేష్ అత్యంత విలువైన మార్కులు సంపాదించి స్కూల్ ఫస్ట్ గా వచ్చి నా ఆశయం నెరవేర్చాడు తన అమోఘమైన కృషితో .

   టెన్త్ పాసయ్యాక  ఎక్కడ ఏమి చదివాడో తెలీదుకాని ,ఆతర్వాత పదేళ్లకు మహేష్ బిటెక్ చేసి అమెరికాలో స్థిర పడ్డాడని తెలిసి సంతోషించాను .ఇప్పుడు అతని మరణ వార్త బాగా బాధించింది .అయిదారు రోజులక్రితం మహేష్ తండ్రి మోహనరావు కనిపిస్తే పలకరించాను .మహేష్ కు 46ఏళ్ళు మాత్రమె నని ,సంతానం ఒక ఆడపిల్ల అని ఇంకా చిన్నపిల్లే నని ,సడెన్ గా   హార్ట్ ఎటాక్ వచ్చి మహేష్ చనిపోయాడని ,అంతకు ముందు తానూ, భార్యా అమెరికా వెళ్లి ఒక నెలగడిపి వచ్చామని చెప్పాడు మోహనరావు . అంతకు సుమారు ఇరవై  ఏళ్ళక్రితం మోహనరావు పెద్ద కుమార్తె నా దగ్గర ట్యూషన్ చదివి, స్కూల్ ఫస్ట్ వచ్చి ,నాతోపాటు రేడియో సైన్స్ పాఠాలలో పాల్గొన్న నాకు అత్యంత అభిమానమైన విద్యార్ధిని  సుజాత అకస్మాత్తుగా మరణించింది .ఇప్పుడు పెద్దకొడుకు మహేష్ .ఆకుటుంబానికి మనశ్శాంతి కలగాలని ,మహేష్ ఆత్మకు శాంతికలగాలనీ కోరుతున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-19  గురువారం  సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి 147 వ కార్యక్రమంగా,  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

 ముఖ్య అతిధి –

 –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్   ,శాసనమండలి సభ్యులు

 ఆత్మీయ అతిధులు –   శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట రామ కృష్ణ గారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

శ్రీ మధుసూదన పిళ్లే-ప్రిన్సిపాల్ శాంతినికేతన్ హైస్కూల్ –ఉయ్యూరు

శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి –తెలుగు అధ్యాపకులు ,ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ జూనియర్ కాలేజి –ఉయ్యూరు

                             కార్యక్రమ వివరం

      స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

    1-శ్రీ బొడ్డపాటి  విశ్వేశ్వరరావు –93 సంవత్సరాల పౌరాణిక నాటక రంగ స్థల నటులు –గుడివాడ

    2-శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు –రిటైర్డ్   కెమిస్ట్రి లెక్చరర్ –ఉయ్యూరు

    3-శ్రీ యు.రా౦ ప్రసాద్  –   రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ –ఉయ్యూరు

   4-శ్రీ పేర్నేటి గంగాధరరావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,ఆధ్యాత్మిక గ్రంథ కర్త-మచిలీపట్నం

   5-శ్రీ కోసూరు ఆదిరాయణ రావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –   కోసూరు

   6-శ్రీ మతి కొల్లి భారతీ దేవి –విశ్రాంత ప్రధానోపాధ్యాయిని  -మచిలీపట్నం

   7శ్రీమతి వి.కస్తూరి బాయి –విశ్రాంత ప్రధానోపాద్యాయిని –విజయవాడ

   8-శ్రీ గబ్బిట రామనాథ బాబు –విశ్రాంత ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు –ఉయ్యూరు

  9-  అమరవాణి   ఉపాధ్యాయులలో ఒకరు

               ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థిని  -కుమారి   ఎస్.సాహితి   10/10 –కు  2,000 రూపాయలు

3-..అమరవాణి పాఠశాల  విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు  2,000 రూపాయలు

.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

4-కుమారి .కె.తిరుపతమ్మ –   బి.ఎ.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు కు 2,000 రూపాయలు

 5-చి.మీరావలి  –    బి.కాం.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు కు- 2,000 రూపాయలు

6-కుమారి ఎన్.ఫాతిమా –బి ఎస్.సి.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరు. కు -2,000 రూపాయలు

 .-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి   10,,116 గా ఏర్పాటు చేసిన  స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

7–2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.9

/10మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక . నారాయణ  జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గబ్బిట  రమ్య కు 10,,116రూపాయలు

8-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక చైతన్య  జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చి. యనమండ్ర రోహిత్ కుమార్ కు 10,,116 రూపాయలను

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

9-సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కారం

  స్థానిక శ్రీనివాస విద్యాలయం లో 2019 మార్చి పదవ తరగతి పరీక్షలో 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ మొదటి సంవత్సరం  చదువుతున్న కుమారి ఐలూరు హర్షిత  కు 5,116 రూపాయలు

 సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

వినాయక చవితి శుభాకాంక్షలతో –

 ఆహ్వాని౦చు వారు

గబ్బిట దుర్గా ప్రసాద్- సరసభారతి అధ్యక్షులు

 పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

ఉయ్యూరు -30-8-19

గమనిక –మచిలీ పట్నం ,గుడి వాడ నుండి వచ్చేవారికి ఉయ్యూరు సెంటర్ ,వీరమ్మతల్లి గుడి దాటాక ఎడమ వైపు న ,,విజయవాడ నుంచి వచ్చేవారికి వీరమ్మ తల్లి గుడి దాకా వెళ్ళకుండానే కుడివైపున ’’ కాకాని నగర్ కాలని ‘’పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది .అందులోనుంచి వస్తే సరాసరి అమరవాణి హైస్కూల్ కు చేరుకోవచ్చు .

 సంప్రదించాల్సిన సెల్ నంబర్లు –గబ్బిట దుర్గాప్రసాద్ – .998906637

  పివి నాగరాజు       -9440636357

మాదిరాజు శివలక్ష్మి -9395379582

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎంతని పొగడుదు గిడుగు

ఎంతని పొగడుదు గిడుగు

 

ఎంతని పొగడుదు గిడుగు !

  ‘’ మహా భారత భాగవతాది గ్రంథాలు ఎన్ని సార్లు ప్రచురణ పొంది ,ఎన్ని పరిణామాలు పొందాయో ,ఎన్ని వ్రాతప్రతులు ఎన్ని రూపాలలో ఉన్నాయో ,తెలిసిన వారు గిడుగు వారు తప్ప వేరెవరు లేరు’’అనీ ,’’ఇతర దేశీయులు ,ఇతర రాష్ట్రాలవారు ‘’మీ తెలుగు తల్లి కన్నసుపుత్రుడు ఎవరు ?’’అని నన్ను అడిగితే’’గిడుగు వారు తప్ప వేరెరెవరూ లేరుఅని ఖచ్చితంగా చెబుతాను ‘’అని తెలుగు తొలి చారిత్రక  నవలా రచయిత, ప్రముఖ  పరిశోధక, ,విమర్శకాగ్రేసరులు బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు చెప్పారు .

   గొప్ప గురువు గిడుగు వారికి కు గొప్ప శిష్యుడు  చారిత్రిక పరిశోధకుడు ,భాషావేత్త  వ్యావహారిక భాషా సమర్ధకుడు శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు ‘’మా గురువుగారికి అభిమానం అంటే ఇంటరెస్ట్ లేని విజ్ఞాన శాఖ లేదు .కొత్తది ఏదికనిపించినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టేవారు కాదు .శాసన ప రిశోధనలోనూ అందే వేసి’’న చెయ్యి .’’అని కీర్తించారు .

  ‘’తెలుగు వారికీ నిజమైన సంప్రదాయాన్ని చూపి , సరైనదారిలో పెట్టిన విద్వాంసులు గిడుగు .ఆయన కృషికి గొప్ప నిదర్శనం వారి ‘’ఆంద్ర గద్య చింతామణి’’.కవిత్రయ భారతాన్ని 36సార్లు చదివారు .రామమూర్తి గారు మహా కోపిస్టి .తనదగ్గరున్న అరుదైన ఫ్రెంచ్ నిఘంటువు నిండా మనవడు పెన్సిల్ తో పిచ్చి గీతలు గీస్తే ,వాడిని కోపపడకుండా వాడిలో మార్పు తెప్పించాలని ‘’ఒరేయ్ !నువ్వు పెద్ద వాడవయ్యాక ఈ పుస్తకాన్ని  చదువుతాననినాకు ఇప్పుడు మాట ఇస్తే నిన్నేమీ అనను ‘’అని వాడు ‘’అలాగే చేస్తా తాతయ్యా ‘’అని హామీ ఇస్తే ,క్షమించి వదిలేసిన ప్రేమమూర్తి .ఆయన నోటిలో భగవద్గీత శ్లోకాలు ఎప్పుడూ నానుతూ ఉండేవి . .మరణ సమయం లో కూడా గీత శ్లోకాలు చదువుతూనే తనువు చాలించైనా ధన్యజీవి  ‘’అని శ్రీ చింతా దీక్షితులు గారన్నారు .

   ‘’గురజాడ ,గిడుగు ,యేట్స్ దొర ,శ్రీనివాస అయ్యంగార్ ల వలనననే ‘’వ్యవహారిక భాషోద్యమ౦ ‘’మొదలైంది .కళా ప్రపూర్ణ ,రావు సాహెబ్ ,కైజర్ ఏ హిందూ వంటి బిరుదులుపొంది మహా భాషా వేత్త  గిడుగు .తనధనం ,తన గృహం ,తన జీవితం ,తనజీవం ,తన సర్వస్వం వ్యవహారిక భాషోద్యమానికి ధారపోసిన త్యాగమయుడు గిడుగు రామమూర్తి పంతులుగారు ‘’అన్నారు హాస్యబ్రహ్మ ,వాడుకభాషలో మాండలీకం లో  అద్భుత నాటికలు రాసిన సాహితీ విమర్శకులు శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు .

  ‘’Telugu has acquired as the substance of this Andhra Literary stream mainly on account  of the bold ,persistent ,undaaunted ,un parallelled fight for it,toput up in press ,on the platform ,in social discourse and controversial pamphlets ,from psychological ,educational ,literary ,philological and traditional points of views by our renaissance types of revered scholor ,teacher ,the Upadhyaya of Upaadhyas,Rao SahebGidugu Venkata Rama Murthy pantulugaaru ,our ever beckoning light ,our never failing inspiration ‘’అని గొప్ప కితాబిచ్చారు శ్రీ బి .శేషగిరి రావు .

   వీటికి ఆధారం –ఆచార్య చేకూరి రామారావు గారి ఆధ్వర్యం లో 1986డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ‘’మరో సారి గిడుగు ‘’పుస్తకం .

  చనిపోవటానికి కొన్ని రోజులముందు మద్రాస్ ‘’ప్రజామిత్ర ‘’పత్రిక కార్యాలయం లో పత్రికా రచయితల సమావేశం లో గిడుగు పంతులుగారు చేసిన ‘’తుది విన్నపం ‘’లోని మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకొందాం –‘’నిరాక్షరాస్యత ఉంటె అభి వృద్ధి ఉండదు .విద్యా వ్యాప్తి చెందితేనే సంఘం అభి వృద్ధి చెందుతుంది .ఇంగ్లాండ్ లో కూలిజనం ,కమ్మర్లు, వెల్డర్లు కార్పెంటర్లు మహాకవులు షేక్స్పియర్, మిల్టన్ లను చదవరు .వృత్తి విద్యనేర్పమని అడుగుతారు .అందుకే విద్యాధికులు వాళ్ళ దగ్గరకే వెళ్లి, వాళ్ళ భాషలో  జ్ఞానం ,వివేకం అందిస్తారు . ఆ దేశాలలో ప్రజలకోసం సారస్వతం పుట్టి పెరుగుతుంది .మన దేశం లో కూడా ప్రజలు  తమభాషలో రాయటం, చదవటానికి సమర్ధులు కావాలి .వీటికి పత్రికలూ ,ఇతర మాధ్యమాలు  బాగా తోడ్పడాలి .ఏ భాషద్వారా జ్ఞాన౦ అభివృద్ది అయితే ,ఆభాషలోనే రాయాలి చదవాలి ‘’ఇదీ గిడుగు పిడుగు మనకిచ్చిన సందేశం .

 నేడు గిడుగు వారి జయంతి –తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-19-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” **కొంపెల్ల శర్మ

“శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” **కొంపెల్ల శర్మ
ఏల్చూరి సుబ్రహ్మణ్యం – శతజయంతి – ప్రారంభం ఆగష్టు 26, 1920 – ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్య అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒక్కరు

ఏల్చూరి సుబ్రహ్మణ్యం ( జ:ఆగష్టు 26, 1920 – మ:ఫిబ్రవరి 25, 1995)
ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు. నయాగరాకవులలో ఒకరుగా ప్రసిద్ధులయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం ఆగష్టు 25, 1920. తండ్రి రామయ్య. తల్లి సుబ్బాయమ్మ. ప్రముఖ వేణుగాన కళావిద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు వీరి సోదరులు. ఏల్చూరి మురళీధరరావు వీరి కుమారుడు. సహజకవిగా, మహావక్తగా, ఉద్యమప్రవక్తగా, అజాతశత్రువుగా, అఖిలాంధ్ర కవిలోకానికి ఆత్మీయ మిత్రునిగా మెలగారు. .మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకట సుబ్బారావు, అక్కిరాజు రామయ్య, నాయని సుబ్బారావులు చిన్ననాటి గురువులు. బి.ఎ. చదువుతున్న రోజులలో కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులతో పరిచయమై, తరువాతికాలంలో “నయాగరా” కవితాసంకలనం సమకూర్చడానికి దోహదమయింది. బి.ఎ. డిగ్రీ (యస్.ఆర్.ఆర్ కళాశాల), విజయవాడ.

సాహిత్యప్రస్థానం
సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు .‘త్రివేణి’ ఆంగ్లపత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు, గుడిపాటి వెంకటచలం, గుఱ్ఱం జాషువాల ప్రభావపరిధిలో స్ఫూర్తిని పొంది, పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్యల మూలాన కమ్యూనిస్టు ఉద్యమప్రవేశం చేశారు. 1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అన్న పత్రికను స్థాపించి అనిసెట్టి సుబ్బారావు, దండమూడి కేశవరావు (ఆ తర్వాత సన్న్యసించి శ్రీ కేశవతీర్థస్వామి అయ్యారు, బహుగ్రంథకర్త), బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలైన కవుల తొలిరచనలను అచ్చువేశారు. అదే సంవత్సరం ‘చిత్ర’ అన్న పత్రికను ప్రారంభించారు. 1941 లో ‘నవ్యకళాపరిషత్తు’ను స్థాపించి అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, సముద్రాల రామానుజాచార్య, దేవరకొండ బాలగంగాధర తిలక్, రెంటాల గోపాలకృష్ణ మొదలైన అభ్యుదయకవులను సభ్యులుగా చేర్చుకొన్నారు. వారి రచనలతో 1943 లో ‘మాఘ్యమాల’ కవితాసంపుటాన్ని ప్రకటించారు. శ్రీశ్రీ కవిత్వప్రభావస్ఫూర్తితో 1944 ఆగస్టులో బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం సంయుక్త కృషిఫలితంగా సుప్రసిద్ధకవితాసంకలనం ‘నయాగరా’ వెలువడి అభ్యుదయ సాహిత్యోద్యమంలో అచ్చయిన తొలి కవితాసంపుటంగా పేరుపొందింది. అనిసెట్టి సుబ్బారావు, లక్ష్మీదేవి (“అని-ల”) లకు పెళ్ళికానుకగా గుంటూరులో వీరి గురుదేవులు విశ్వనాథ సత్యనారాయణగారి చేతుల మీదుగా విడుదలయింది. ఇందులోనే వీరి సుప్రసిద్ధకవిత ‘ప్రజాశక్తి’, ‘ఠాకూర్ చంద్రసింగ్’, ‘విజయముద్ర’ మొదలైనవి ఉన్నాయి. ‘సకలప్రజా సముద్ధర్త, సుప్తోద్ధృత జీవశక్తి’, ‘తమసగర్భ దళనహేతి’, ‘బంధీకృత ధనికశక్తి’, ‘రక్తారుణకుసుమం’, ‘బానిస సంద్రం’, ‘జనవిపంచి పాడిన జాబిల్లి పాట’ వంటి పదబంధాలు దీనిలోనివే.

1956 లో వీరిది తెలుగు సాహిత్యంలో తొలి దీర్ఘకవిత ‘నవంబరు 7’ విశాలాంధ్ర పత్రికలో వెలువడింది. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి గారితోడి సన్నిహితత్వం వల్ల నవ్యసాహిత్యపరిషత్తు సభ్యునిగా ఆ సమావేశాలకు హాజరయ్యారు. అనేక ప్రగతిశీల ఉద్యమాలలో పాల్గొన్నారు. వందలాది రష్యన్ కవితలను ఆంగ్లమాధ్యమం ద్వారా అనువదించారు. శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వరరావు సంయుక్తంగా రాసిన “మేమే” కావ్యాన్ని సుబ్రహ్మణ్యంగారికి అంకితం చేసేరు.

“ఏల్చూరి సుబ్రమణ్యం, తొల్చూలు నయాగరాసుతుడు తానెపుడూ, పల్చనకొప్పడు అరసం, కేల్చూపిన కవుల దిట్ట కేరాలక్ష్మీ” అని ఆరుద్ర వీరిపై చెప్పిన సుప్రసిద్ధ చాటువు.

ఉద్యోగాలు
పాత్రికేయుడుగా
1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అన్న పత్రికను స్థాపించి, అనేక ప్రముఖ కవులరచనలు ప్రచురించేరు.
ఆంధ్రసర్వస్వము (సం. మాగంటి బాపినీడు¬¬) సుబ్రహ్మణ్యం సహాయసంపాదకుడు, 1941-42.
‘క్రాంతి’ పత్రిక (సం. బొందలపాటి శివరామకృష్ణ)లో 1947
‘పొగాకులోకం’ (గుంటూరు) పత్రిక సంపాదకులు
సోషలిస్టు పత్రిక, 1952
‘తెలుగుదేశం’ (సూర్యదేవర రాజ్యలక్ష్మి)
ఆకాశవాణిలో స్క్రిప్టు రైటరు, 1954-56, రాయప్రోలు రాజశేఖర్, జలసూత్రం రుక్మీణనాథశాస్త్రిగారలతో కలిసి పని చేసేరు.
‘నేత’ పత్రిక సంపాదకులు, 1956.
‘సోవియట్ భూమి’ పత్రిక సంపాదకవర్గంలో, 1961-1988.
‘అభ్యుదయ’ పత్రిక మద్రాసులో నిర్వాహకసభ్యునిగా.
సినిమా రంగంలో
సంగీతలక్ష్మి, పంచ కళ్యాణి దొంగల రాణి గీతాలు
కవితలు, కావ్యాలు
“శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” కావ్యం
“మాఘ్యమాల” కవితా సంపుటం, 1943. నవ్యకళాపరిషత్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ కవుల కవితాసంకలనం.
నయాగరా కవితాసంపుటి. కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు రాసిన ఖండికల సంపుటి. 1944, 1975.
“నవంబరు 7” తొలి దీర్ఘకవిత. 1956లో విశాలాంధ్ర’లో వెలువడింది.
కథలు
నా ప్రేయసి (మూలం: ఎల్ సోబలేవ్) (కథ) [అభ్యుదయ – 01.10.46] అజంతా/ఏల్చూరి సుబ్రహ్మణ్యం/బెల్లంకొండ రామదాసు/నెల్లూరి కేశవస్వామి –
చతురస్రం (సీరియల్) తెలుగు స్వతంత్ర, 18.01.57, 25.01.57, 01.02.57. అజంతా, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, నెల్లూరి కేశవస్వామి.

 

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  14

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  14

విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం )

    రామకృష్ణయ్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది .కన్నడ ఉత్పలమాల –‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి –భ్యాసనె నెంబ గర్భ మెనగిల్ల ‘’పంపని చంపకమాల ‘’కతెసిరిదాదొడం కథయె మెయ్ గిడలీయ దెముం సమస్తభారతమున పూర్వమాగె వలె పెర్రద కవీశ్వర రెల్ల వర్ణకంకతెయొళొడం బడం’’(పంప ).ఇక కన్నడ కందం అందం చూద్దాం –‘’మిగె కన్నడ కబ్బ౦ గళొ,ళగణిత గుణగద్య పద్య సమ్మిశ్రితమం-నిగదిసువర్గద్య కథా ప్రగీతి యంత  చ్చిరంతనా  చార్యర్కళ్’’.9వ శతాబ్ది నృపతుంగ’’ కవిరాజమార్గ ‘’గ్రంథంలో నుంచి మన కవులు చాలా కన్నడ శబ్దాలు తీసుకొని వాడటం చూపించబడింది .’’చోళ నాళికకాక క్షోణీ తలేశ ‘’అని పండితారాధ్య చరిత్రలో ప్రయోగం ఉందని చూపి౦చాడు శేషేంద్ర శర్మ ..చోళ నాలిక అంటే జొన్నలు, నాలుకతో అని వేటూరి వారు అర్ధం చెప్పారు .జోళ అంటే కన్నడం లో జొన్నలు .’’జొన్నలు గొన్న ఋణంబు నీగెదన్’’అని నన్ని చోడుడు కుమార సంభవం లో రాసినదానికి పంప భారతం లో ‘’జోళమ నెంతునీగు ‘’లేక రన్న భారతం లో ‘’జోళదిపారియం ‘’అనేది మూలం అయి ఉంటుందని శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి  గారు చెప్పారని  శేషేన్ ఉవాచ .వీరే నన్నయ ,తిక్కనలు కూడా పంపభారతాన్ని పద్య నిర్మాణం లోనూ ,అలంకార ప్రయోగాల్లోనూ ఎలా అనుసరించారని  తమ కుమార సంభవ పరిశోధన గ్రంథంలో చూపించారు .నన్ని చోడుడు ‘’నేలయు నింగియు తాళము గా వాయింప , నెండమావులబట్టి బండవలయు ‘అని సీసపద్యం రాశాడు .పాల్కురికి సోమన ‘’వెట్టన నేలకు నింగి కి సూత్రపట్టమే కాళ్ళను బట్ట తలలను ‘’అని రాశాడు .తిక్కన ‘’నేలయు నింగియు తాళముల్ గా  జేసి,యేపున రేగి వాయించి యాడ ‘’అన్నాడు విరాటపర్వం లో . ’నేలయు నింగియు తాళముల్’’అనే పధ్ధతి కర్ణాట కవి నయసేనుడు రాసిన ‘’ధర్మామృతం ‘’అనే కావ్యం లో ఉందట .1112కాలం వాడైన నయ సేనుడు ‘’ధరణి చక్రము వియత్తళము మగంటిక్కువర్ ముంచ నచ్చరి యప్పంతు’’—అని రాశాడట .

   కనుక ఏతావాతా  తేలింది యేమిటి అంటే ,ఆంద్ర సాహిత్యం లో ఇతరకావ్యాలు పరిశోధనకు లొంగినట్లు ఆంద్ర మహాభారతం లొంగదు అంటాడు శేషేంద్ర .దీనితర్వాత వచ్చిన కావ్యాలన్నీ భారత భాష ,అలంకార ,ఛందస్సులను అనుసరించాయి .కానీ ఆంద్ర భారతం మాత్రం కన్నడ భాషలో కలిసిపోయి ఉన్న తెలుగు ,క్రమంగా విడిపోతూ ,ప్రత్యేక రూపాన్ని పొందుతున్న అస్పష్ట సంధియుగ గర్భం లోంచి పుట్టింది .కనుక ఇందులో నూతన ఆంద్ర శబ్దాల కన్నడ మాతృకలు ,కన్నడ జాతీయాల ఆంధ్రీకృతరూపాలు ,కన్నడ ఛందస్సులు ,కన్నడ కావ్యాలలోని అందమైన అలంకారాలు ఉన్నాయి ‘’కావ్యం గ్రాహ్యం అలంకారాత్ ‘’అన్నారు అందుకే పెద్దలు  .

  సమగ్ర ఆంధ్రభారత పరిశోధనకు సంస్కృత వ్యాస పాఠాన్నీ,కవిత్రయ తెలుగు పాఠాన్నీపోలుస్తూ’’ ఇది తీసేశారు అది కొత్తగా  కలిపారు ‘’అంటూ చేసే పరిశోధన చాలదు అని విస్పష్టంగా చెప్పాడు శేషేంద్ర .కవిత్రయం కొత్తగా సృష్టించిన భావం పరమ రమణీయం అనీ ,వ్యాసుడు వీరిముండు బలాదూర్ అనీ కొందరు మూర్ఖంగా వ్యాఖ్యానించారు .ఇదే తప్పే అన్నాడు .కానీ కోరాడ వారు ,శ్రీపాదవారు రచించిన పరిశోధన గ్రంథాలు చూస్తె ,కవిత్రయం వారి నూతన సృష్టి ,సంస్కృత మూలం అనుసరించటం ,వదిలేసిన వాటిల్లో కర్ణాటక కావ్యాలనుంచి తీసుకొన్న భాగాలే అని అర్ధమౌతుంది అన్నాడు గుంటూరు శర్మ .కవిత్రయం ఎక్కడ నూతన సృష్టి చేశారో ,అక్కడ పరిశోధకుడు అప్రమత్తంగా కన్నడ కావ్యాలను శోధించాలి .కనుక కవిత్రయ భారత శోధనకు సంస్కృత పా౦డిత్యమేకాక ,కన్నడ పాండిత్యం అంతకంటే అధికంగా కావాలి అని ఖచ్చితంగా చెప్పాడు  శేషేన్ .దీన్ని అతిక్రమించి చేసిన పరిశోధన అసమగ్రం, నిష్ప్రయోజనం అన్నాడుకూడా .

  తాను 20-5-1962 ఆంధ్రప్రభ దినపత్రికలో కర్ణాటక, ఆంద్ర సాహిత్య సంబంధాలను గురించి ‘’కర్ణాటాంధ్ర సేతువు ‘’అని  రాసిన వ్యాసం లో ‘’మన కావ్యాలను వాటి సంస్కృత మాతృకలతో పోల్చి పరిశీలించటం ఇంతవరకు పరిపాటి అయితే ,ఇక మీదట కన్నడ మాతృకలతో పోల్చి పరిశీలించటం ఆధునిక ఆంద్ర వాజ్మయ విమర్శన పద్దతిగా నెలకొనాలి ‘’అన్నది అందరూ అర్ధం చేసుకోవాలని శేషేంద్ర కోరాడు .ఈ విధంగా శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు అమూల్యమైన కర్ణాటకాంధ్ర సంధానపద్ధతిని ఆంధ్రమహాభారత పరిశోధనలో ప్రవేశపెట్టి ,ఆంద్ర సాహిత్య మహా పురుషులలో’’ అగ్రణి ‘’అయ్యారని ,వారికి ఆంధ్రులు ఎంతో రుణపడి ఉన్నారని ,వారి కోవిదత్వానికి రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్నానని గుంటూరు శేషేంద్ర శర్మ సవినయంగా ప్రకటించాడు .గొప్పవారి హృదయాలు గొప్పవారికే తెలుస్తాయి .కోరాడ, శేషేంద్ర అలాంటి వారే .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  13

కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2

  కవుల చరిత్రలతో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం  ఈ దశ వరకు తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టుకోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి కీలక స్థానం  ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పోగు చేసిన కవుల చరిత్రల సామగ్రి ,తెలుగు భాషాపరిణామ సామగ్రి కోరాడవారు పూర్తిగా అవగాహన చేసుకొని .తెలుగు సాహిత్య స్వరూపాన్ని మళ్ళీ నిర్మించాలంటే తెలుగు సాహిత్యాన్ని మాత్రమె పరిశీలించాలి అనే అభిప్రాయానికి వచ్చారు .అందుకే తన గ్రంథానికి కవితా శబ్దం చేర్చి ,అందులో మన సాహిత్యం మొదటి గ్రంథంగా ఉన్న నన్నయభట్టు భారతం లోనే మన సాహిత్య చరిత్ర బీజ రహస్యాలు౦ టాయని గ్రహించి ,అన్ని శాసనాలు తీసుకోకుండా నన్నయకు పూర్వం ,నన్నయకు సమీపం లో ఉన్న శాసనాలనే పరిశీలించారు .7వ శతాబ్దికి చెందిన జయ సింహ వల్లభ శాసనం ,లక్ష్మీ పురశాసనం ,8వ శతాబ్ది ప్రారంభం లోని  అహదహన శాసనం ,9వ శతాబ్ది పండరంగ అనే అద్దంకి శాసనం గుణగ విజయాదిత్యుని ధర్మవరపు శాసనం ,తర్వాత చాళుక్య భీముని శాసనం ,దీర్ఘాసి శాసనం ,యుద్ధమల్లుడి శాసనాలు మాత్రమె పరిశీలనకు తీసుకొన్నారు .వీటిలోనే తెలుగు భాష యొక్క నన్నయ సమీపకాల రూపం కనిపించటం ,తరువోజ ,అక్కర ల వంటి దేశీ ఛందస్సులో చేసిన రచనలు ,శాసనాలు ఉండటం ముఖ్య కారణం .ఆయనకు భాషతో కాక సాహిత్యం తోనే సంబంధం అని గ్రంథ నామమే స్పష్టంగా తెలియ జేస్తోంది. వీరికి ముందు చాలామంది సాహిత్యం కోసం వెతుకుతూ ,ఇతర మార్గాలలో ప్రయాణించి దారినే కోల్పోతే ,రామకృష్ణయ్యగారు సాహిత్యాన్ని పట్టుకోవలసిన తాళపు చెవులనే పట్టుకొన్నారు అని శేషేన్ శర్మ చెప్పాడు .

   ఈ తాళపు చెవులలో కన్నడ భాషా శబ్ద పరిశీలనం చాలాముఖ్యమైనది .ఉడివోవు అనే పదానికి ఉడి +పోవు గా విడదీసి ఉడుగు అనే ధాతు స్వరూపం అనీ ,కన్నడం లో ఉడగు అని ఉందని ,కనుక దీని ప్రాచీన రూపం ఉడి ఐ ఉంటుంది అని తేల్చారు .’’తగులు సంక్రందన నూతికి౦దగిలి కన్గొన జాలదే సక్తమై ఆసక్తితో ‘’పద్యం లో తగులు అంటే తాకటం అని అర్ధం. కన్నడం లో  తగులు శబ్దం ఉంది .ప్రాచీన కన్నడం  లో తాగు మాటకు ముట్టుకోవటం అనే అర్ధం ఉండి,తా౦గు గామారి తగులు అయిందని భాషా పరిణామం చెబుతోంది అన్నాడు శేషేంద్ర .

  సంస్కృతపదాలు ఎక్కువ, దేశీ పదాలు తక్కువతో అల్లిన నన్నయ రచన అంతకు ముందే కన్నడం లో పంప మొదలైనవారి రచనలో ఉన్నాయి .దీన్ని చూపటం కోరాడవారి రెండవ తాళపు చెవి .చాలాకాలం నిష్ఫలంగా సాగిన తెలుగు సాహిత్య స్వరూప  అన్వేషణ ఉద్యమాన్ని రామకృష్ణయ్యగారు ‘’ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’గ్రంథం ద్వారా సఫలత్వ ద్వారం దగ్గరకు తెచ్చారని ,అంటే శబ్దాలు, ఛందస్సులు, రచనాశైలి అంతా కర్నాటక నుంచి తెచ్చుకొని తన ప్రథమ కృతిని నన్నయభట్టు ఆనాడు ప్రవర్తమానం అనుకోవలసిన పండరంగ ,యుద్ధమల్లాది శాసనాలలో ఉన్న శిష్ట ఆంద్ర భాషలో రాశాడు అని మొట్టమొదటి సారిగా చెప్పిన కోరాడ రామకృష్ణయ్య పంతులుగారి ‘’ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’అనే గ్రంథం తెలుగులో భారత పరిశోధనకు ‘’ఆద్య గ్రంథము,మార్గదర్శక గ్రంథము’’అని గుంటూరు శేషేంద్ర శర్మ స్పష్టంగా చెప్పాడు .ఇంకా పరిశోధన ముందుకు సాగటానికి దీనిలో ఎన్నో విశేషాలు బీజప్రాయంగా ఉన్నాయి .అంటే ఆంద్ర భారత పరిశోధనకు కన్నడ భాషా సాహిత్య పరిచయం ,పరిశీలనం అనివార్యం అని కోరాడ వారే మొదటగా   చెప్పారన్నమాట .

   ‘’ఆంద్ర శబ్ద చింతామణి విషయ పరిశోధనము ‘’  లో శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు చింతామణి ని చర్చిస్తూ ‘’అప్పటికే కర్ణాటక పండితులు త్రొక్కిన పద్ధతులు పరిశీలించి ,ఆంధ్రభాషా సహజాలైన నియమాలను కొంత విశాలంగా సూత్రీకరించి ఉండును .ఆంద్ర భాషాకవితనుధారగా నడపట౦ దుష్కరం కాదని ,ఉభయ భాషా కవితానుభవం ఉన్నవారికితోచకపోదు కదా .నన్నయకు పూర్వమే సంస్కృత భాష సాయం తో కర్నాటక భాషలో ధారావాహిక కవిత  వెలిసింది కదా  ‘’అని స్పుటంగా చెప్పారు . వఝలవారు కర్నాటక ఆంద్ర లిపులలోని సమానత్వాన్ని  కూడా చర్చించారు .ఇలా సమానంగా ఉన్న ఈ రెండుభాషల లిపులను చూసి , నన్నయ తెలుగు లిపికి ప్రత్యేకత ఉండాలని భావించి కొన్ని మార్పులు చేశాడని చెప్పి, అప్పకవీయం లోని ‘’అప్పకవి పుస్తకే స్థితంఆంద్ర లిప్యుద్దారకం శ్లోక త్రయం ‘’అని ‘’బాలేందు పరిధి శృంగవర్త కుశ  గ్రంథి దాత్ర పరశు సమాః’’వంటి శ్లోకాలను ఉద్ధరించి చూపించారు .ఈరెండుభాషలలో అలఘు లకారం వేరు అనీ ,ళకారం వేరని చింతామణిలో నన్నయ చెప్పాడని ,ఈ విషయంలో ఆయన కర్నాటక సంప్రదాయం పాటించాడని ,కర్నాటక శబ్దాను శాసనం140 సూత్రవ్యాఖ్యఉదాహరించారు .అంటే వఝలవారు అప్పటికే కోరాడ వారి గ్రంథాన్ని చూసే ఉంటారు కనుక రామకృష్ణయ్య గారి’ఆంద్ర –కన్నడ సందాన పధ్ధతి ‘’ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు పెద్దమనసుతో  సాదుమార్గం గా స్వీకరించి బలపరిచారు అని శేషేంద్ర శర్మ గట్టిగా చెప్పాడు .

   సశేషం

ఆధారం –కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవం

            image.png

 తెలుగు భాషా దినోత్సవం

 వ్యావహారిక భాషోద్యమ పితామహులు  శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 157 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-19గురువారం  సాయంత్రం 4 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలందిస్తున్న 1- శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ( శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ట్రస్ట్ నిర్వాహకురాలు ,గ్రంథకర్త –గుడివాడ )- 2-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు (ప్రముఖకవి –విజయవాడ ) 3-డా. శ్రీమతి కొమాండూరి కృష్ణా ( విశాలాంధ్ర సంపాదకులు శ్రీ సి. రాఘవా చారి గారిపై పరిశోధకులు ,కవయిత్రి  –విజయవాడ )

మొదలగు  వారికి ‘’తెలుగు భాషోత్సవ పురస్కారం ‘’అందజేస్తున్నాము .

    సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన

                                                                 గబ్బిట దుర్గా ప్రాసాద్ -సరసభారతి అధ్యక్షులు

                                                                     మరియు రోటరీక్లబ్ అధ్యక్షులు

ఉయ్యూరు -27-8-19

— 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1

ఆంద్ర సాహిత్య మహాపురుషులలో అగ్రస్థానం అలంకరించినవారు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు .వారి ఆంధ్రభారత కవితా విమర్శన గ్రంథం కవిత్రయ దర్శనానికి కరదీపిక అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ .ఆయన ప్రాముఖ్యం స్పష్టం కావటానికి ఆంద్ర సాహిత్య ఆధునిక యుగ ప్రారంభ చరిత్ర సంక్షిప్తంగా ముందుగా తెలుసుకొందాం .

   సోమకాసురుడు వేదాలను దొంగిలించి సముద్రం లో దాక్కొంటే ,విష్ణువు మత్శ్యావతారం ధరించి ,వాడిని వధించి వేదాలను లోకాలకు అందించాడు . మానవుడి జ్ఞానార్జన లో ఉన్న కస్ట నష్టాలను పురాణాలు ప్రతీకాత్మకంగా చెప్పిన కథ అది .వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం కాలక్రమంలో కొట్టుకుపోగా సుమారు 150ఏళ్ళ క్రితం వరకు ఆంధ్రులకు తమసాహిత్య స్వరూపం ఏమిటో తెలీదు .మనుచరిత్రాది కావ్యాలే ఎరుగరు .ఒకవేళ తెలిసినవారికి కూడా భారతం మీద ఉన్న గౌరవం  వీటి పై ఉండేదికాదు .అంటే 11వ శతాబ్దపు నన్నయ్య నుంచి నేటి తిరుపతికవులవరకు వచ్చిన కావ్యాలు వ్యాకరణ అలంకార శాస్త్ర గ్రంథాలు ఏవీ చదువబడేవికావు .ఇప్పుడున్న విద్యావిధానం విద్యా శాఖలు అప్పుడు లేవు అంటే అది మరొక సొమకాసురుడి కథ అన్నమాట  అంటాడుషేశేంద్ర .

 ఇంగ్లీష్  వాళ్ళ కాలం లో వాళ్ళు తెచ్చిన’’ లాంతరు ‘’వెలుగులో ఈ దేశపు చీకటిలో ఉన్న వస్తువుల్ని  వెదికి పోగు చేయటం మొదలైంది .ఆంద్ర సాహిత్య పునర్నిర్మాణం అనే మహత్తర ఉదయం కూడా అప్పుడే మొదలైంది .దీనికి పూనుకున్నవాళ్ళు తమకు తెలిసినంతవరకూ పూర్వ కవుల ను వారి కావ్యాలను ,జీవన విశేషాల్ని కథలు గాథలుగా రాయటం తో ఆంద్ర సాహిత్య స్వరూప అన్వేషణలో మొదటి దశ  ప్రారంభమైంది .ఇందులో మొదటివాడు కావలి వెంకటరామ స్వామి అనే పండితుడు ఇంగ్లీష్ లో  ‘’Biogrphical Sketches of Deccan Poets ‘’లో తెలుగు కన్నడ సంస్కృత ,మరాఠీ,గుజరాతీ కవుల జీవితాల్ని సంక్షిప్తంగా రాశాడు .తర్వాత తెలుగులో చాలామంది రాశారు .కందుకూరి వేరేశలింగం పంతులుగారు 1886లో ‘’ ఆంధ్ర కవుల చరిత్ర ‘’రాశారు .ఎన్నో భ్రమ ప్రమాదాలతో ఉన్న దాన్ని ఉద్దండులైన మానవల్లి ,వేటూరి, కొమర్రాజు ,వంగూరి లాంటివారు చేసిన గొప్ప పరిశోధన కృషి వలన గ్రంథాలు వస్తూ ఉంటె పంతులుగారు తనపుస్తకం లోని ‘’హౌలర్స్  ‘’ను దిద్దుకొంటూ 6సార్లు,పునర్ముద్రణం చేశారు .దీనిలోకూడా కవుల బయోడేటా ఉందికాని కావ్య విమర్శ కనిపించలేదు .

  ఇలా కొంత ముదురుపాకాన పడ్డాక కవి ,కావ్యనిర్ణయం మొదలైనవి అవసరమై శాసనాలు, వాటికాలం, వాటిలోని భాష పరిశీలించాల్సి వచ్చి,శాసనాల వేట మొదలైంది .జయంతి రామయ్య ,కొమర్రాజు ,మల్లంపల్లి ,హెచ్ కృష్ణమూర్తి హుర్జ్ ,ఎ.బట్టర్ వర్త్,వేణుగోపాల చెట్టి ,చిలుకూరి నారాయణరావు ,వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లవంటి ప్రకాండ పండితులు 200శాసనాలు సేకరించారు .అప్పటికే దాక్షిణాత్య భాషల పరస్పర సంబంధాల అధ్యయన౦ ప్రారంభమై ఒక దశకు చేరింది .లిపి శాస్త్రం ,శాసన భాషాధ్యయన సూత్రాలు స్పష్ట రూపం లో ఏర్పడ్డాయి .ఈ హడావిడిలో కవుల చరిత్ర రచన వెనకబడి పోయి ,తెలుగు భాష ఉద్గమం.పరిణామం, వికాసం ,తెలుగు వ్యాకరణ చరిత్ర మొదలైన పరిశోధనలు ప్రాధాన్యం వహించాయి ..ఆంద్ర శబ్ద చింతామణి రాసింది నన్నయకాదు అనే సిద్ధాంతాన్ని వీరేశలింగం గారే లేవదీశారు .దీన్ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు సోపపత్తికంగా ఖండించారు .అనేకపండితులు నన్నయే కర్త అని తేల్చారు .బాలవ్యాకరణ ,ప్రౌఢ వ్యాకరణ కర్తలు ,ఎలకూచి బాలసరస్వతి ,ఆహోబిలపండితుడు, అప్పకవి వాసుదేవ వృత్తి,కవి జనంజనం ,ఆంద్ర కౌముది ఇత్యాదులు నన్నయ భట్టే ఆంద్ర శబ్ద చింతామణి కర్త  అని చెప్పబడింది .దీనితర్వాత నన్నయ మొదటి వ్యాకరణ కర్త కాదు అనే మరో వాదం లేచింది .మండ లక్ష్మీ నరసింహాచార్యులు చూపించిన ‘’బార్హస్పత్యం ,రావణీయం , కాణ్వ మాధర్వణ౦,విదన్ కరోమి సారస్వత త్రిలింగ శబ్దానుశాసనం ‘’అనే శ్లోకం ప్రకారం బృహస్పతి మొదటి వ్యాకరణ కర్త అని ,కాదు,కణ్వుడని ఇలా కవి రాక్షస ,పుష్పదంత ,కవి భల్లాట ,హేమచంద్రాదులు మొదలైనవారి పేర్లు చర్చించబడినాయి .’’హేమ చంద్రాది మునిభిః కథితం  చాంధ్ర లక్షణం ‘’వగైరాలు అతడు జైనుడని చెప్పటం తో ఇదంతా ఒక గొప్ప’’ ఆంద్ర వ్యాకరణ చరిత్ర జ్ఞాన కోశం ‘’గా రూపొందింది కాని వఝలవారురౌద్రి జ్యేస్టాషాఢ సాహిత్య పరిషత్ పత్రికలో రాసిన ‘’ఆంద్ర ఛందస్సు ‘’వ్యాసం లో పైవాదాలనన్నిటినీ ఖండించారు .ఇంతలో మరోవాదం చింతామణి కర్త నన్నయ వేరు భారత ఆంధ్రీకరణకర్త నన్నయ వేరు అనీ ,వీరికాలం 15 శతాబ్ది ,11వ శతాబ్దం అనీ మరో పిడివాదం బయల్దేరింది .అంటే ఆంద్ర సాహిత్య స్వరూప పునర్నిర్మాణ ఉద్యమం చివరికి భాషా వ్యాకరణాల అరణ్యం లో చిక్కుకు పోయింది అంటాడు శేషేంద్ర శర్మ .కాని తెలుగు ,కన్నడ లిపులకు క్రీ.పూ. 3శతాబ్దం లో ఉన్న బ్రాహ్మీ లిపి మూలం అని తేల్చారు .దీనినే ద్రావిడి లేక డామిలి అనే వారట .మూల ద్రావిడం అనే ఒక భాషను ఊహించి దానినుంచే దక్షిణాదిభాషలేర్పడ్డాయ్యని ఒక మతం ప్రచారం చేశారు . మూల ద్రావిడం అంటే ఏమిటి ?

  సుమేరియన్ నాగరకత గూర్చి చర్చించిన ఆధునిక పరిశోధన గ్రంథాలలోసుమేరియన్ భాషలోనూ ,సుమేరియన్ ఇతిహాసం గిల్గమిష్ లోనూ అనేక కన్నడ ,తెలుగుపదాలున్నాయి .గిల్గమిష్ లో  నింగిరసు(సూర్యుడు),ఎంకిడు(గిల్గమిష్ కథానాయకుడి మిత్రుడు )ఉరు(ఊరు )మొదలైన ఉదాహరణలు ఇచ్చారు .ఐతే సుమేరియాలజిస్ట్ లప్రకారం ఈ పద జాలం భారత దేశమంతటా ఉంది .ఉదాహరణలు -సంగ్రూర్ (పంజాబు )బేలూరు (బెంగాలు )బిజ్ఞౌర్ (హిమాచలప్రదేశ్ )చిత్తోడ్ చిత్తూర్ (రాజస్థాన్ ).అన్యభాషావాదుల ప్రకారం మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతం నుంచి భారత దేశానికి వలసవచ్చిన ,ప్రోటో ఆస్ట్రోలా ప్రాంతం నుండి ఇండియా వచ్చిన ప్రోటూఆస్ట్రోలాయిడ్ జాతుల భాష యేఇది .నిశితంగా పరిశీలిస్తే ఈ రెండువాదాలలో వైరుధ్యం కనిపించదు అంటాడు శేషేన్.కారణం యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ప్రాంతాలే ఇరాక్ ,మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతం కావటం వలన .కనుక మూల ద్రావిడం సుమేరియన్ భాష కావచ్చు .ఇది ఇండియా అంతా వ్యాపించి ,ఉత్తరభారతం పై అనేక శతాబ్దాలుగా జరుగుతున్న దాడులవలన అక్కడి భారతీయ భాషల పైపొరలు ఎగిరిపోయి ,బయటిభాషలు ఆ స్థానం లో ప్రవేశించి ,కిందిపొరల్లో పాత భాషల తాలూకు పొరలు అలాగే ఉండి పోయినట్లు భాషా పరిశోధకులు భావిస్తున్నారు .బీహార్ లో అనేక ఆదిమవాసుల భాషలలో తెలుగు ,కన్నడ పదాలను పోలిన పదాలు కనిపిస్తాయి .సింహళభాష లో తమిళ కన్నడ తెలుగు ఒరియా  బర్మీస్ ,ధాయ్ లాండ్ కంబోడియన్,లావోస్ ,మలయా ,జావా మొదలైన ఆసియా తూర్పు సముద్ర తీర (చైనా, జపాన్, కొరియాలు తప్ప ) దేశపు లిపులన్నీ ఒకే లాగా ఉంటాయి .ఇది యాదృచ్చికం కాదు పరిశీలనార్హం అంటాడు శేషేంద్ర .కామరాజ యూనివర్సిటి ప్రొఫెసర్ ఒకాయన మన దేశపు కన్యాకుమారి నుంచి జపాన్ ,కోరియాలవరకు’’ ఒకే సాంస్కృతిక పరగణా’’ అని ఒక సిద్ధాంతం చేసినట్లు తనకు జ్ఞాపకం ఉందని గుంటూరు  శేషేంద్ర శర్మ అన్నాడు .

  సశేషం

ఆధారం –కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం )

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం )

కలిపూర్వం 35క్రోధి సంవత్సర జ్యేష్ట శుద్ధ విదియకు విజయ సారధికి 91నిండాయి పరీక్షిత్తు జన్మించాడు .ఆశ్వత్ధామ అస్త్రాలనుంచి గర్భం లో ఉన్న పరీక్షిత్ ను కృష్ణ పరమాత్మ సంరక్షించాడు .34విశ్వావసు చైత్ర పౌర్ణమికి శరత్ చంద్ర చంద్రునికి 92నిండి ,ధర్మరాజు వ్యాసాజ్ఞాతో అశ్వమేధం పూర్తి చేశాడు .33పరాభవచైత్ర పౌర్ణమికి93పూర్తయ్యాయి పూర్ణ చంద్ర నిభునికి . ధర్మరాజు యాగం పూర్తయి  అర్జునుడు అశ్వం వెంట దిగ్విజయ యాత్ర కు బయల్దేరి తనకూ చిత్రా౦గదకు జన్మించిన బభ్రువాహనుని చేతిలో ఓడిపోయి ,సంధి చేసుకొని బంధింపబడిన యాగాశ్వాన్ని తీసుకొచ్చాడు .32  ప్లవంగ శ్రావణ బహుళాస్టమికి శ్యామసు౦దరునికి 94పూర్తయి ,ఉదంకుని ఆశ్రమానికి వెళ్లి దర్శనం తోపాటు 6వ సారి తన విశ్వ రూప సందర్శన భాగ్యం కల్పించి తరి౦పజేశాడు .31కీలకకు 95,30సౌమ్యకు 96,29సాధారణకు 97,28విరోదికృత్ కు 98,27పరీధావికి 99,26ప్రమాదీచకు 100ఏళ్ళు నిండాయి వనమాలికి .25ఆన౦ద  కు 101,24రాక్షసకు 102,23నలకు 103,22పింగళకు 104,21కాళయుక్తి కి 105,20సిద్దార్ధికు 106,19 రౌద్రి చైత్ర శుద్ధ విదియకు 107,18దుర్మతికి 108,17దుందుభి కి 109,16రుధిరోద్గారికి 110,15రక్తాక్షికి 111,14క్రోధనకు 112,13అక్షయకు 113,12ప్రభవకు 114,11విభవకు  యదు భూషణుడికి  115ఏళ్ళు నిండాయి .ఈ కాలం లో కృష్ణమూర్తి ద్వారకలో 12ఏళ్ళు బహు యాగాలు చేశాడు .ధర్మరాజు ధర్మమూర్తిగా హస్తినలో పాలన సాగిస్తున్నాడు .గాంధారిధృత రాస్ట్రులు హస్తినలో పుత్రశోకం తో ఉండలేక శతకూపాశ్రమంలో ఉన్నారు .వ్యాసభగవానుడు ప్రత్యక్షమై గాంధారిని ఊరడించి ఆమె కోరికపై చనిపోయిన కౌరవుల౦దర్నీ యోగశక్తి తో చూపించి ఉపశమనం కలిగించాడు .ధర్మరాజాదులు కూడా ఈ ఆశ్రమం లో కొంతకాలం ఉండి, మళ్ళీ హస్తినకు వెళ్ళారు .గాంధారి ధృత రాస్ట్రులు మరణించారు  .శ్రీకృష్ణ సంకల్పం తో నారదాది మహర్షులు పిండార క్షేత్రం లో సమావేశమయ్యారు .సురాపానం తో మదించిన యాదవులు వారిని అవమాని౦చ గా ,మునుల శాపం తో కృష్ణ కుమారుడు సాంబుడు  స్త్రీ వేషం లో ఋషులను ఆటపట్టి౦చగా ,వాడికడుపులో ముసలం పుట్టగా భయపడి యాదవులు దాన్ని అరగదీసి సముద్రం లోకలిపారు .

   కలిపూర్వం 10  శుక్ల సంవత్సరం లో శిఖి పింఛ మౌళికి116,9ప్రమోదూతకు 117,8ప్రజోత్పత్తికి 118,7ఆంగీరస కు 119,6శ్రీముఖకు 120,5భావకు 121,4యువకు 122,3ధాతకు  123,2 ఈశ్వర కు 124,1బహుదాన్యకు 125 బృందావన విహారికి ఏళ్ళు నిండాయి .ఈ కాలం లో నారదమహర్షి ద్వారకకు వచ్చి వసుదేవునికి భాగవత ధర్మాలు బోధించి ,జనక ఋషభ సంవాదం వినిపించాడు .శ్రీ కృష్ణ భగవానుడు బృందావనం వచ్చి బాలకృష్ణ రూపం ధరించి యశోదా నందులతోపాటు సమస్త గోప గోపీ జనాలకు దివ్య దర్శనం ప్రసాదించి తరి౦పజేసి భాగవతధర్మాలు బోధించాడు ఆ అవతార మూర్తి .కృష్ణస్వామి కృపాకటాక్షం చేత గోప గోపీ జనం అంతా తమతమ దివ్య ధామాలకు చేరి గోలోక ,వైకుంఠ లోకాల దర్శనం చేసి ధన్యులయ్యారు .గోపాలకృష్ణమూర్తి మళ్ళీ ద్వారక చేరగా ,బ్రహ్మ ఇంద్రాదులుఅక్కడికి చేరి నారాయణ భగవానుని సందర్శన భాగ్యం పొంది ,తన  నిజనివాసమైన  గోలోకానికి  విచ్చేయమని ప్రార్ధించి, ఇక అవతార సమాప్తి దగ్గరలో ఉందని గుర్తు చేశారు

   ద్వారకలో అనేక ఉత్పాతాలు పుట్టాయి ,యాదవ ప్రభువు యాదవులను ప్రాభాస తీర్దానికి పంపగా అక్కడ యాదవులు పరస్పర కలహాలతో ఒకరినొకరు సర్వ నాశనం  చేసుకొన్నారు .బలరాముడు స్వకీయ సంకర్షణ భాగవానునిలో లీనమయ్యాడు  .యాదవ స్త్రీలు  దేహత్యాగం చేశారు ..

 ప్రమాది చైత్ర శుద్ధ పాడ్యమి కి ద్వాపరయుగం 8లక్షల 64వేల సంవత్సరాలు పూర్తయ్యాయి .ద్వారకలోని సంఘటనలు తెలిసిన అర్జునుడు ద్వారకకు వచ్చి భగవాన్ శ్రీ కృష్ణ సందర్శనం చేశాడు .తర్వాత బావా మరది కలిసి సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్ళగా ,ముసలం ముక్కతో చేయబడిన బాణాన్ని ఒక బోయవాడు కృష్ణ పరమాత్మ పడుకొనివుండగా ,ఆయన పాదాలు లేడి కన్నులు అని భ్రమించి బాణం తోకొట్టగా ,స్వామి పాద అ౦గుస్టానికి తగిలి దేవకీ వసుదేవ నందనుడు ,యశోదా తనయుడు,  నంద నందనుడు శ్రీ కృష్ణ స్వామి 125సంవత్సరాల 7 నెలల ,8 వ రోజులు పూర్తయ్యాక  నిర్యాణం చెందారు .అంతకుముందే రాధాదేవి గోలోకానికి చేరుకోగా గోపగోపీ బృందం దివ్య స్వాగతం పలికారు .కృష్ణస్వామి గోలోకంచేరగా బ్రహ్మాదులు దర్శించి పులకించారు .

  1ప్రమాది సంవత్సర చైత్ర శుద్ధ సప్తమికి పరమాత్మ గోలోకానికి చేరుకోగానే ,కలియుగం ప్రారంభమై ,అర్జునుడు దారకుని తో ,మళ్ళీ ద్వారకకు చేరి,సప్తమి దాకా అక్కడే ఉన్నాడు .భూకంపాలు రాగా ,మిగిలిన యాదవులతో ద్వారకను వదిలి మధురకు వెళ్ళి,అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు కి  యాదవ రాజ్య పట్టాభి షేకం చేశాడు   .ద్వారక సముద్రం లో మునిగింది .హస్తినకు వచ్చి ధర్మరాజాదులకు  శ్రీ కృష్ణ నిర్యాణ విషయం తెలియజేశాడు .వైశాఖ శుక్లం లో పరీక్షిత్తుకు పట్టాభి షేకం చేసి ,పౌర్ణమినాడు పాండవులు మహాప్రస్థానానికి దీక్ష తీసుకొని, ఒక ఏడాది భూ ప్రదక్షిణం చేసి ,విక్రమ సంవత్సరం లో బదరికాశ్రమం దాటి ,మేరుపర్వత సమీపంలో ఊర్ధ్వ లోకాలకు చేరుకొన్నారు .

   ఆధారం –నారాయణ తీర్దులవారి స౦స్కృత శ్రీ కృష్ణ లీలాతరంగిణి కి  ఉయ్యూరు సంస్థానాదీశ్వరులు  శ్రీ రాజా మేకా వెంకటాద్రి అప్పారావు గారు ఆంధ్రీకరణం చేయగా ,శ్రీమాన్ బొమ్మకంటి  వీరరాఘవా చార్యులు పర్యవేక్షించగా,కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్1948లో  ప్రచురించిన  ‘’శ్రీ కృష్ణ లీలాతర౦గిణి ‘’గ్రంథంలో, కొవ్వూరు సంస్కృత పాఠశాల కార్యదర్శి శ్రీ చదలవాడ గోపీ నాథము,శ్రీమాన్ బొమ్మకంటి వీర రాఘవాచార్యులు ,శ్రీ ఎస్ .యెన్ .కే ..బీజార్కన్ ,శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల అప్పలాచార్యులవారి మహాభారత సంగ్రహం యొక్క  భిప్రాయాలు సేకరించి ,నూజివీడు హైస్కూల్ చరిత్రోపాధ్యాయులు శ్రీ ధన్యంరాజు అప్పారావు గారు సమకూర్చిన ‘’శ్రీ కృష్ణావతార కాలక్రమము ‘’ అనే వ్యాసం .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాడ్మింటన్ మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధు

చరిత్ర సృష్టించిన పీవి సింధు…వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయంపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది.  ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతోఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం.

ఈ మ్యాచ్ ఆరంభంనుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 217 తేడాతో ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది.

ప్రస్తుతం వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచిన సింధు వరల్డ్ ఛాపింయన్ గా నిలిచింది. ఇలా మొదటిసారి ఈ టోర్నమైంట్ లో  గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.

ఈ విజయం అనంతరం సింధు మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. ”ఈ మెడల్ ను మా అమ్మకు అంకితమిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆమె పుట్టినరోజు.  తన విజయం ఆమెనెంతో ఆనందించేలా చేసింది. కాబట్టి పుట్టినరోజు గిప్ట్ గా ఈ మెడల్ ను అంకితమిస్తున్నా.” అని సింధు వెల్లడించింది.

image.png

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5

కలిపూర్వం 49 వికృతి సంవత్సర చైత్ర శుక్లానికి చైతన్య వరడుడికి 77ఏళ్ళు నిండాయి .ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, శిశుపాలుడి నూరు తప్పులు సైచి,101వ తప్పుకు శిక్షగా కృష్ణస్వామి చక్రం తో సంహరించటం ,భీష్మ పితామహుని సలహా పై ధర్మరాజు శిఖిపింఛమౌళికి అగ్రానాధిపత్యం ఇచ్చిపూజించటం ,ఆశ్వయుజ శుక్లం లో పాండవులతో పరమాత్మ ఇంద్రప్రస్థం లో ఉండగా,సాళ్వుడు ద్వారక ముట్టడించటం , ద్వారకా నిర్మాత స్వామి అక్కడికి వెళ్లి వాడినీ ,వాడి తమ్ముడు విధూరధుని ,దంతవక్త్రుని సంహరించాడు .ఆశ్వయుజ శుక్ల దశమి నాడు ద్వారకలో మురారి యుద్ధ సంరంభం లో ఉండగా ,కృష్ణుడు లేని సమయం కనిపెట్టి దుర్యోధనుడు ధర్మరాజు తో ద్యూతానికి పురిగొల్పి ఓడించటం ,ద్రౌపదీ వస్త్రాపహరణానికి నిండు సభలో ప్రయత్నించగా యాజ్ఞసేనికి అక్షయ వస్త్ర దానం చేసి ద్రౌపదీ మాన సంరక్షకుడు అనిపించాడు  యజ్ఞపురుషుడైన  మురభంజనుడు .ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో వనవాసానికి వెళ్ళాడు .48ఖరకు  చాణూర మర్దనుడికి 78నిండాయి .వనవాసం లో పాండవులను పరామర్శించిన పాండవ శ్రేయోభిలాషి తో పాంచాలి తనపరాభావాన్ని చెప్పుకొని దుఖించగా కృష్ణా ను ఓదార్చాడు కృష్ణుడు  .

  47నందనకు 79,46విజయకు 80,45జయకు 81,44మన్మధకు 82,43దుర్ముఖికి 83,42 హేవళంబికి 84,41విళంబికి 85,40వికారికి 86,39శార్వరికి 87,38ప్లవకు 88,37శుభకృత్ కు 89,ఏళ్ళు నిండాయి యదుకుల విభూషనుడికి .సత్య తోసత్యాపతి రెండవసారి పాండవుల వద్దకు రాగా ద్రౌపదీదేవి సత్యభామకు పతివ్రతా ధర్మాలు బోధించటం ,వనవాసం ముగిసేముందు మూడవ సారి ముకుందుడు  మళ్ళీ వచ్చిపరామర్శించి పాండవులకు ధైర్యం చెప్పాడు .శ్రీ కృష్ణానుగ్రహం తో  ద్రౌపది దుర్వాసుని ఆగ్రహాన్ని శాంతి౦ప జేసి ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గి  పాండవులకు ఉపశమనం కలిగించింది .ఈ సమయం లోనే ద్వారకకు కుచేలుడు రావటం అటుకులు చెలికాడికిచ్చి శౌరి చే అస్టభార్యలచే సపర్యలుపొంది అష్టైశ్వర్యాలు అనుగ్రహి౦ప బడటం ,మాధవుడు మిధిలరాజు బహుళాశ్వుని,శ్రుత దేవుని,మిదిలవాసులను తరి౦ప జేయటం జరిగాయి .పాండవుల 12ఏళ్ళ వనవాసం పరి సమాప్తి అయింది .

    36 శోభకృత్ ఆశ్వయుజ కృష్ణ అష్టమికి  కౌస్తుభధారికి 90ఏళ్ళు నిండాయి .పాండవుల అజ్ఞాత వాసం విరాట రాజు నగరం లో ప్రారంభమై ,10 నెలలు నిండాక భీమునిచే నర్తన శాలలో కీచక ఉప కీచక వధ ,  ,విరాట రాకుమారి ఉత్తరకు  బృహన్నల వేషం లోని అర్జునుడు నాట్యం నేర్పటం , ఉత్తర, దక్షిణ  గోగ్రహణం జరిగి ఉత్తరకుమారుని కి  సారధ్యం వహించి పేడి ఐన క్రీడి శమీ వృక్షం పై దాచిన గాండీవం  అక్షయ  తూణీరాలు ఉత్తర కుమారునితో ది౦పి౦చి , ధరించి అర్జునరూపం తో ఉత్తరుడు సారధిగా  ,కౌరవులకు తన నిజరూప దర్శనం చేసి తన అవక్ర పరాక్రమం తో  ఓడించి సిగ్గుపడి వెనక్కి మల్లేట్లు చేసి  భీష్మ ద్రోణాదులమెప్పుపొంది ,విరాట నగరానికి రావటం,  ఉత్తరుడు సర్వం తండ్రికి వివరించటం ,ఉత్తరాభి మన్యుల వివాహం  నీలమేఘశ్యాముడు స్వయంగా  జరిపించాడు .ఆశ్వయుజ శుక్లపక్షం లో పాండవులు ఉపప్లావ్యం ప్రవేశించారు .యదుకులస్వామి ద్వారకకు చేరాడు  .కౌరవ ,పాండవులు యుద్ధం కోసం సేనలను సమకూర్చే ప్రయత్నం లో దుర్యోధన అర్జునులు ఒకేసారి ద్వారకలో శ్రీ కృష్ణ సాయం కోసం రావటం ,తన సర్వసైన్యాన్ని కౌరవ రాజుకిచ్చి ,అర్జునుని కోరికపై తాను  విజయసారదిగా ఉండటానికి అనుగ్రహి౦చి బావమరదితో ఉపప్లావ్యానికి వచ్చాడు వృష్ణివంశ యదుభూషణుడు .  కార్తిక శుద్ధ ద్వాదశి (ద్వాదశి దగ్ధ యోగం )నాడు కేశి సంహారి హస్తినకు రాయబారం వెళ్లి 8రోజులు నయానా భయానా నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ,తనను కట్టేయాలని ప్రయత్నించిన గాంధారి జ్యేష్టపుత్రసమూహానికి విశ్వరూపం తో(నాలుగవ విశ్వరూప సందర్శనం ) భ్రమపెట్టి ముసలిరాజుకు ఆ భాగ్యం కలిగించి , విదురుని ఇంట ఆతిధ్యం స్వీకరించి ,తిరిగి వెళ్ళాడు .

  మార్గశిర శుద్ధ త్రయోదశి మధుసూదనుడికి 90ఏళ్ళు పూర్తి అయి ,కౌరవ పాండవ సైన్యాలు కురుక్షేత్రం లో  మోహరించాయి.అర్జునుడు విషాద యోగం లో ఉంటె భగవద్గీత బోధించి గీతాచార్యుడై నరుడికి నారాయణుడు 5 వసారి విశ్వరూపం చూపించాడు .యుద్ధం ప్రారంభమైన శుద్ధ ఏకాదశినాడే గీతోపదేశం జరిగింది .మార్గశిర బహుళ అమావాస్య నాడు 15 రోజుల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది .పుష్య శుద్ధ పాడ్యమి నాడు దుర్యోధనుని రెండు తొడలు విరగ్గొట్టి హతుడిని చేసి  భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు .అశ్వత్ధామ ఉపపాండవులను మట్టు బెట్టాడు  .వాడిని కృష్ణార్జునులు బంధించి తెచ్చి ద్రౌపదిముందు నిలబెట్టగా మాతృహృదయం తో క్షమించగా ,బావ సూచనతో బావమరది వాడి తలలోని చూడామణిని పెకలించి గబ్బుకంపుతో ఉన్న వాడిని బయటికి తోసేశాడు .పుష్యశుద్ధ పౌర్ణమి నాడు యుదిస్టిరుని పట్టాభి షేకం  శ్రీ కృష్ణ పరమాత్మ చేతులమీదుగా జరిగింది .మాఘ శుద్ధ ఏకాదశి నాడు భీష్మ పితామహుని స్వచ్చందమరణం .భీష్మ తేజస్సు కృష్ణపరమాత్మలో విలీనమైంది  .

    సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-19 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

25-8-19 శ్రావణ బహుళ దశమి శ్రీ అవధాని గారి పుట్టిన రోజు నాడు శ్రీ సువర్చలాన్జనేయస్వామికి ప్రత్యేకపూజ

25-8-19 శ్రావణ బహుళ దశమి శ్రీ అవధాని గారి పుట్టిన రోజు నాడు శ్రీ సువర్చలాన్జనేయస్వామికి ప్రత్యేకపూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -4

కలిపూర్వం 64యువ సంవత్సరం లో సత్యాపతికి 62ఏళ్ళు ,63ధాతలో63,62ఈశ్వరలో 64 నిండాయి .కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి ,అగ్ని దేవుడు ప్రత్యక్షమై ,గాండీవం ,అక్షయ తూణీరాలు ,స్వేతాశ్వ రధం ప్రసాదించి ‘’గాండీవి’’ ని చేసి ,అగ్ని  కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి కానుకగా పాండవులకు  మయుడు అద్భుత సుందర హర్మ్యాన్ని మయ సభను  నిర్మించి ఇచ్చాడు .ఇంద్రుడు అనేక అస్త్రాలు అర్జునునికి ప్రసాదించాడు .61బహుదాన్యకు బహురూపధారికి ,65,60ప్రమాదికి 66,59 విక్రమకు 67,58వృష కు 68,57చిత్రభానులో 69,56స్వభానులో 70,55తారణ సంవత్సరానికి 71ఏళ్ళు నిండాయి .నరకాసురుని వలన బాధకలుగుతోందని ఇంద్రుని నుంచి ఇందీవర  శ్యామునికి  వార్త రాగా,సత్యాపతి అర్ధాంగి తోకలిసి ప్రాగ్జ్యోతిష పురం వెళ్లి, నరకుని సత్యసాయంతో వధించగా అదితి కుండలాలు మళ్ళీ ఇవ్వగా,ఇంద్ర స్తోత్రం తో ప్రీతి చెంది ,అమరావతికి వెళ్లి ,జయించి ,పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి ,నరకుని బందీలై, వాడి సంహారంతో విముక్తులైన న స్త్రీల లో తనవరించినవారిని ద్వారకకు పంపి ,మిగిలినవారిని వారివారి స్వగ్రామాలకు పంపించేసి ,తనలాగా వేషం వేసుకొని తానె వాసుదేవుడిని అని బుకాయిస్తున్న పౌ౦డ్రక వాసుదేవుడిని ,కాశీ రాజు నూ జయించాడు వసుదేవ సుతుడు .

54పార్ధివ కు పార్ధ సారధికి 72,53వ్యయకు 73నిండాయి .కృష్ణకుమారుడు అనిరుద్ధుని   బాణాసురునికూతురు ఉష ప్రేమించి,తనమందిరానికి తీసుకురాగా తండ్రి అతడిని బంధించగా ,యదుభూషణుడు  వచ్చి ,బాణునిఓడిచి  ,ఉషానిరుద్ధులను ద్వారకకు తీసుకు వెళ్లి పెళ్లి జరిపించాడు .52  సర్వ జిత్తుకు 74,నిండి  అభిమన్యు జననం  జరిగి ,51 సర్వధారికి 75,నిండగా ఉపపాండవ జననం జరిగి ,50విరోది  76 ఏళ్ళు నిండాయి నారద గాన వినోడుడికి . నారద ప్రోద్బలంతో ధర్మరాజు కార్తీక శుద్ధ పాడ్యమినుంచి చతుర్దశి వరకు రాజసూయ యాగం సంకల్పించగా ,కృష్ణార్జున భీములు లు ముందుగా గిరివ్రజం చేరి  భీముడు  జరాసంధుని  సంహరించగా ,జరాసంధుడు బంధించిన రాజులందరూ కార్తీక పౌర్ణమినాడు విడుదల చేయించాడు వెన్నుడు .కార్తీక శుద్ధ పంచమినాడు జరాసంధునికొడుకు సహదేవుడు పట్టాభి షిక్తుడయ్యాడు.50 విరోధి లోనే వృష మర్దనుడికి 76ఏళ్ళు నిండగా కురుక్షేత్ర సంగ్రామ సూచకమైన సూర్య గ్రహణం ఏర్పడింది .అప్పుడే యాదవ ,పాండవ ముఖ్యుల సమావేశం కురుక్షేత్రం లో జరిగింది ..సమస్త మహర్షులు దేవతలు విచ్చేసి ,యమునాతీర విహారి శ్రీ కృష్ణ పరబ్రహ్మను సేవించి తరించారు .కురుక్షేత్రం నుంచి ద్వారకకు తిరిగివచ్చి కృష్ణమూర్తి తల్లి దేవకీ దేవి కోరికపై తనకంటే ముందు జన్మి౦చి మేనమామ కంసుని చే చంపబడిన  6గురు సోదరులను బ్రతికించమని కోరగా ,సుతలలోకం వెళ్లి ,బలి చక్రవర్తిని మెప్పించి వారిని తెచ్చి తల్లికి చూపించాడు దేవకీ నందన శౌరి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:

 ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆగస్టు 24 శనివారం మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు

ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం. తనకు సంబంధించిన వస్తువులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగకి  ఇవ్వాల్సిందిగా ఆమె ఓ లేఖలో రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్యజీవితంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు.

తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని మరో లేఖలో ఆమె రాసినట్లు చెబుతున్నారు. ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. అనువాదాలు కూడా చేశారు. కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు.

మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె మృతికి తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో తెలుగు సాహిత్యకారులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

గతంలో ఆమె లెక్చెరర్ గా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె రచనలు చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆమె వెంకోజీపాలెం నుంచి ఎంపివీ కాలనీకి తన నివాసాన్ని మార్చారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె తన సూసైడ్ నోట్ లో పోలీసు కమిషనర్ ను ఉద్దేశించి రాశారు.(తెలుగు టీమ్ )

ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ లో గోల్డ్ మెడల్ సాధించి ,,ఫిలాసఫీ సో షియాలజీ లలోనూ ఏం ఏ డిగ్రీలుపొంది,సైకాలజీలో ఏం ఎస్ సి ,,ఏం ఎడ్ ,అయి ఇంగ్లిష్ లో ఏం ఫిల్  చేసిన విదుషీమణి ,సాహితీ చైతన్య మూర్తి రామతీర్ధకు తో సాహితీ సహజీవనం జరిపిన సాహితీ జగత్  ధాత్రి  జగద్ధాత్రి  .ఆంధ్రప్రభ ఆంధ్రభూమి సూర్య ప్రజాశక్తి దినపత్రికలలో నవ్య వీక్లి చినుకు ,విశాఖ సంస్కృతీ మాసపత్రికలకు  విరివిగా ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన బహు ముఖీన సాహితీ దీప్తి ఆమె ఆంద్ర ,ఆంగ్ల హిందీ ఉర్దూ మొదలైనభాషలలో లోతైన పాండిత్యమున్న సాహితీ గేస్తురాలు  ,మ్యూజ్ ఇండియా ,,కౌముది ,విహంగ ఇ  -వాకిలి మాగజైన్లను తన రచనలతో సంపన్నం చేసిన భావుకురాలు .తెలుగు నుండి ఇంగ్లిష్ కు కవితలు వచనం అనువాదం చేసి ,జాతీయ ,అంతర్జాతీయ కవుల  కవితలను తెలుగులోకి అనువదించిన బహు భాషా వేత్త  కవయిత్రి ఆంధ్రభూమి సోమవారం  సాహిత్య పేజీలో ”కావ్య జగతి ”శిర్షికలో అనువాద కవితలు వెలువరించి అన్యభాషాకవులను తెలుగు వారికి పరిచయం చేసిన సౌజన్యమూర్తి
  విశాఖ ఆకాశవాణి ద్వారా వివిధ విషయాలపై విస్తృత ప్రసంగాలు చేస్తూ ,,తెలుగు విశ్వ విద్యాలయానికి ,,సాహిత్య అకాడెమి సెమినార్లకు పరిశోధక వ్యాసాలను రాసిన శేముషి ఆమెది .సహ సాహిత్యజీవి రామ తీర్ధ తోకలిసి మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా శ్రీ శ్రీ శత  జయంతి ,కన్యాశుల్కం రెండవ ప్రచురణ,గురజాడ 150 జయంతి ,జనగణమన శతజయంతి  ,విజయనగరం కోట త్రిశత జయంతి కార్యక్రమాలు నిర్వహించి అనుక్షణ సాహితీ సేవకురాలు  .మొజాయిక్ తరఫున ప్రతివారం క్రమం తప్పక కార్యక్రమాలు నిర్వహించిన అవిరళ కృషి ఆమెది .ఆమె ప్రతిభకు తగినట్లు ”వృక్ష స్థలే ”అనే కథానికకు  ఆర్ ఎస్ కృష్ణ మూర్తి అవార్డు అందుకున్నది .ధాత్రి పేరుతో తన ప్రత్యేక బ్లాగ్ ను నిర్వహించి0ది ,పుడమితల్లికి ఉన్న ఓర్పు ,నేర్పు, సహనం ఆమెలో ఉండటం వలన ఆమెకు జగద్ధాత్రి పేరు సార్ధకమైంది .
  ఛామన ఛాయ శరీరం చెదరని ,చిఱునవ్వు ముఖాన వెడల్పు కుంకుమబొట్టు ,నిండైన చేనేత వస్త్రధారణతో శ్రీమతి జగద్ధాత్రి సాక్షాత్తు అమ్మవారు గా కనిపించేవారు .చాలా సభలలో కలుసుకొని ఆమెతో ,రామతీర్ధతో మాట్లాడిన విషయాలు మనసు పొరల్లో ఉండిపోయాయి  రామ తీర్ధ మరణించిన 3 నెలలకే జగద్ధాత్రి చనిపోవటం సాహితీ లోకానికి తీరని వెలితి ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుతున్నాను . దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణాష్టమి వేడుకలు

https://photos.google.com/share/AF1QipMRbs05px9R3ANApwb4aXGwinBFqQpQatWDL83KfgmJf8DjfQrt4nu_qlSTjdJ4pA?key=SGZMbEdRc0NtRmNmVUtOMDdRSVZkd2JCNG1DVl93

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3

కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3

కలిపూర్వం 89సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికు౦దవరదునికి 37సంవత్సరాల వయసు పూర్తయి  జాంబవతి  కృష్ణులకు వివాహం ,శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి .ఏకచక్రపురం లో పాండవులఅజ్ఞాత౦  7ఏళ్ళు పూర్తయ్యాయి .88విరోదిక్ కృత్ లో మాధవుడికి 38నిండి ,రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు .పాండవుల క్షేమం తెలుసుకోవటానికి పార్ధసారధి హస్తినకు పోగా ,ద్వారకలో శతధ్వనుడు సత్రాజిత్తును అర్ధరాత్రి నిద్రలో చంపి  ,శ్యమంతకమణి  దొంగిలి౦చు కుపోయాడు  .పాండవులకు 8ఏళ్ళు అజ్ఞాతం పూర్తి .87 పరీదావిలో గోవి౦దు డికి 39నిండి ,సత్యభామ పంపిన కబురు తో ద్వారక చేరగా శతధ్వనుడు శ్యమంతకమణి అక్రూరుని దగ్గర దాచి మిధిలకు పారిపోగా తరిమి వాడిని చంపి వాడివద్ద మణి లేకపోవటం తో ద్వారకకు తిరిగి రాగా ,స్వామి వలన భయంతో అక్రూరుడు కాశీకి పారిపోయాడు .అతడిని రప్పించి మణిని అందరికి చూపించి అతనికే ఇచ్చేశాడు .మణిప్రభావంతో అక్రూరుడు అనేక పుణ్యకార్యాలు యజ్ఞయాగాదులు చేశాడు .పాండవులు ప్రమాదీచ సంవత్సర ఆశ్వయుజ బహుళ అష్టమి వరకు 9ఏళ్ళు ఏకచక్రపుర అజ్ఞాత వాసం లో ఉన్నారు .

   86ప్రమాదీచలో నల్లని స్వామికి 40ని౦డాయి .పా౦చాలపురం లో  ద్రౌపది  స్వయం వరం ప్రకటింప బడగా,ప్రచ్చన్న బ్రాహ్మణ వేషం లో తల్లితోసహాపాండవులు వెళ్లి ,బలరామ  కృష్ణులు  అనేక రాజ యువరాజులు హాజరవగా కృష్ణుడు పాండవులను గుర్తించి మత్ష్య యంత్రం కొట్టే పనిలో ఉన్న సాత్యకిని వారించగా అర్జునుడు దాన్నికొట్టి ద్రౌపదిని దక్కించుకొన్నాడు  .ద్రౌపది వివాహం నాటికి ధర్మరాజుకు 42,భీముడికి 41,అర్జునుడికి 40,నకుల సహదేవులకు 30 ఏళ్ళవయసు .85 ఆనందలో 41నిండాయి ఆనందమోహనుడికి .ద్రౌపది వివాహం జరిగిన ఒక సంవత్సరం 2 రోజులకు విదురుని పంపి గుడ్డిరాజు పాండవులను హస్తినకు రప్పించుకొని ,ధర్మరాజును యువరాజుగా గౌరవించి అతనిచే రాజ్యపాలన చేయించాడు .కన్నయ్య హస్తినకు వచ్చి బావమరదుల క్షేమం తెలుసుకొని ,అర్జునుడితో యమునాతీరానికి వేటకు వెళ్లి ,అక్కడ సూర్యపుత్రి కాళింది ని ప్రేమించి ,  హస్తినకు తెచ్చి ద్రౌపది సంరక్షణలో ఉంచి ,తర్వాత ద్వారకకు తీసుకువెళ్ళి పెళ్ళాడి,అవ౦తి రాజు సోదరి మిత్రవి౦దను వరించి వివాహమాడి భార్యల సంఖ్య 5కు చేర్చాడు మోహన వంశీ లోలుడు .

   84రాక్షస లో ముకు౦దుడికి 42పూర్తయి కోసల రాజకుమారి నాగ్నజితీదేవిని పెళ్ళాడి 83నల లో కేకయ రాకుమారి  భద్రా దేవిని 7వ భార్యగా చేసుకొన్నాడు .82పింగళకు 43నిండి నామాలసామి మద్ర రాకుమారి .లక్ష్మణ ను మత్ష్య యంత్రం కొట్టి ,చేపట్టి అష్టమ భార్యను చేశాడు .రాధనుకూడా కలిపితే 9మందిభార్యలు రాదామనోహరుడికి .81కాళయుక్తి కి 44పూర్తి.అక్కడ కౌరవ పాండవ యాదవులలో అంతః కలహాలు లేకుండా ప్రశాంతంగా స్నేహంగా ఉన్నారు .80సిద్ధార్ధి మాఘబహళపాడ్యమికి46 నిండాయి గోపాల చక్రవర్తికి .ముసలిరాజు పాండవులకు అర్ధరాజ్యమిచ్చిఇంద్ర ప్రస్థానికి పంపాడు  , 79రౌద్రికి 47,78 దుర్మతికి 48 దామోదరుడికి నిండాయి .77దుందుభి ఫాల్గుణం లో 49నిండాయి నళినాక్షునికి .ధర్మరాజు అనుజ్ఞతో అర్జునుడు తీర్ధయాత్ర ప్రారంభం చేసి ఒక ఏడాది యాత్రలలో గడిపాడు  .76 రుధిరోద్గారికి 50,75రక్తాక్షికి 51,74క్రోధనకు 52పూర్తయ్యాయి పూతన సంహారికి .కౌరవ ,పాండవ యాదవుల వంశాలు వృద్ధి చెందాయి .అందరు సౌజన్యంతో జీవించారు ఈకాలం లో .73అక్షయకు 53,72ప్రభవకు 54,71విభవకు 55,70శుక్లకు 56,69ప్రమోదూతకు 57,68ప్రజోత్పత్తికి 58,67ఆంగీరసకు 59,66,శ్రీముఖకు 60అంటే షష్టిపూర్తి శ్రీవల్లభుడికి అయ్యాయి .65భావనామ సంవత్సరం లో 61నిండాయి భావజ గురుడికి . అర్జునుడు తీర్ధయాత్రలో ,చిత్రాంగద ను పెళ్ళాడి,యాత్ర ప్రారంభమైన 12ఏళ్ళకు  ద్వారక చేరాడు  సుభాద్రానుజుని ప్రోత్సాహంతో యతివేషంలో సుభద్రను వరించి ,ఇంద్ర ప్రస్థానికి తీసుకువచ్చి వివాహమాడాడు .

  తీర్ధయాత్రలో మనమూ అలసిపోయాం కనుక కాసేపు విశ్రాంతి –

సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు

— 


గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasab

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం

విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )

గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన  శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి పరాయణులు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని కారాగార క్లేశమనుభవించినవారు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయి కుటుంబ  భారం నెత్తిన వేసుకున్నారు ప్రసాద్ గారు .స్మార్తం నేర్చి కొంతకాలం వైదిక వ్రుత్తి చేసి ,తర్వాత భాషా ప్రవీణ ,పండిత శిక్షణ పూర్తీ చేసి ,కృష్ణా జిల్లాపరిషత్ లో తెలుగు పండితులుగా ఉద్యోగించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు .విద్యార్ధులకు శ్లోకాలు పద్యాలు నేర్పి వారిలో సంస్కృతీ బీజాలు నాటారు .శ్రీమతి శ్యామల గారిని వివాహమాడి గృస్థ జీవితం ఆహ్లాదంగా గడిపారు .నాణ్యమైన నలుగురు పుత్రికా సంతానం పొంది మనవలతో మనవరాళ్ళతో ఆన౦దానుభూతి పొందుతున్నారు .

పండితకవి కనుక ‘గేయాలు రాస్తూ ‘’పారిజాతాలు ‘’కదా సంపుటి తెచ్చిజాతీయ స్థాయి ప్రశంసా పత్రం అందుకున్నారు .సహజ సిద్ధ నటులు .తెలుగు లోనేకాక సంస్కృత  శాకుంతలం కర్ణభారం నాటకాలలో నటించారు . ఆంద్ర గీర్వాణాలలో చక్కని రచనలు చేశారు .సమగ్రంగా సంస్కృతం లో శ్రీమత్పుట్టలాంబాపూజా విధానం రాశారు .శనీశ్వర సుప్రభాతం ,శ్రీ సత్య సాయి నాధాస్టకం ,షిర్డీ సాయి సుప్రభాతం రాశారు తెలుగులో ‘’తెలంగాణా రాష్ట్ర గీతం ‘’,మణికిరణాలు వ్యాకరణ సుధ మొదలైనవి రాశారు ‘’సంపూర్ణ భక్తి స్తోత్ర మాల ‘’,శ్రీ మద్గురువాణి లను సంకలించారు .ప్రస్తుతం బెజవాడ దగ్గర గుంటుపల్లిలో ఉంటున్నారు .  ఉద్యోగానంతర విశ్రాంతి జీవితాన్ని గుంటు పల్లి లో ‘’శ్రీ సత్య సాయి లోక సేవక సంఘ౦ ‘’స్థాపించి సేవ చేస్తూ సత్కాలక్షేపం చేస్తున్నారు .

1-శ్రీమత్పుట్ట లాంబా పూజా విధానం –గుంటూరు దగ్గర చల్లావారిపాలెం  లో జన్మించి దేవతగా ఆరాధింపబడు తున్న పుట్టలాంబ తల్లి సద్బ్రాహ్మణ కుటుంబం కమలనాభుల వారింటి ఆడపడుచు గా లో జన్మించి ,రజస్వలానంతర వివాహం ఆరోజుల్లో నిషిద్ధం కనుక సమాజ బహిష్కరణకు గురై,ఎక్కడినుంచో చల్లావారిపాలెం చేరి౦ది ఆకుటుంబం .ఒక రోజు తలి దండ్రులు అంచి నీటికోసం వెళ్ళగా ఈమె ఒక పుట్టలో దూరినట్లు కధనం .తలిదండ్రులకు తెలిసి వచ్చి బ్రతిమిలాడినా  ల ఇంటికి వెళ్ళక అక్కడే ఉంటూ కనిపిస్తూ మాట్లాడుతూ ఆడుతూ ఉండేదని ప్రతీతి .నల్లపాడు ,చల్లావారి పాలెం ,వెంగళాయ పాలెం ,లింగాయపాలెం ,అంకిరెడ్డి పాలెం ,తురకపాలెం ,స్తంభాల గరువు అనే ఏడు గ్రామాల పుట్టలమ్మకు అత్య్నత భక్తి ప్రపత్తులతో పూజలాచారించారు .ఆ ప్రాంతం లో ఒక ప్రాధమిక  పా శాల కట్టారు . ఆమె శిలా విగ్రహం చెక్కింఛి పెట్టించారు ..అయినా నిత్యం అందరికి దర్శనమిస్తుంది .కవిగారి మేనత్త బండ్లమూడి హనుమాయమ్మ గారికి కనిపించేదని కనిపించినప్పుడల్లా గజ్జెల మోత వినబడేదని ఆమె చెప్పారట . .గ్రామ రక్షణగా ఊరంతా తిరిగేదట .  దెందులూరి వారి కుటు౦బ౦ ప్రతి శుక్రవారం ఆమెకు అభిషేకం చేసి దుర్గా ,లక్ష్మీ అస్తోత్తరం చదివి పొంగలి నైవేద్యం పెట్టేవారు .భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందటం వలన భక్తులు భారీగా విరాళాలు సేకరించి 29-5-1994 అమ్మవారిని పునః ప్రతిష్టించి మంచి ఆలయం కట్టించారు .పుట్టలమ్మ తల్లి యూత్ వారు 60వేల రూపాయల నిధి సేకరించి 15-1-2000 మకర సంక్రాంతినాడు ఎత్తైన ప్రభ కట్టించి ఘనంగా ఊరేగించారు .

ఇంతటి ఘన చరిత్రగల పుట్టలాంబా దేవీ వైభవాన్ని స్తోత్ర అష్టక ,సుప్రభాతాలతో సమగ్ర పూజా విధానాన్ని శ్రీ దెందుకూరి దుర్గా ప్రసాద్ రచించి చరితార్ధు లయ్యారు .అందులోని విశేషాలు –

అష్టకం లో –‘’పుట్టలాంబా మహాదేవీం –పుణ్య శీలా తపస్వినీం –విప్ర పుత్రీం విశాలాక్షీం –నమో దేవీ నమామ్యహం ‘’తో ప్రారంభించి ‘’యాస్కసాన్వయ సంజాతో –దుర్గా ప్రసాద నామకః –పుట్టలాంబా ప్రసాదేనే-దంస్తబకం సమర్పితః ‘’అని ముగించారు .

సుప్రభాతం –పుట్ట లాంబా పుణ్య శీలే –పూర్వా సంధ్యా ప్రవర్తతే –ఉత్తిష్ట సర్వ లోకేశి-కర్తవ్యో లోక సంగ్రహః ‘’అని రొటీన్ గా ప్రారంభించి 9 వ శ్లోకం లో ‘’-త్వామేవ మాతార మివాశ్రంయామః –త్వామేవ పిత్రేవ సదాశ్రయామః –త్వామేవ గుర్వీ మివ భావ యామః –హేపుట్టలాంబే తవ సుప్రభాతం ‘’అని 12లో  ‘’మంగళం జన పాలిన్యై –మంగళం జ్ఞానభానవే –మంగళం భవనాసిన్యై –మంగళం లోక గురవే ‘’అని అమ్మ వారి ప్రతిభను చాటారు .

పూజా విధి లో దేవీ పూజా విధానం గా చెప్పి అష్టోత్తర శతనామాలు రాశారు –అందులో గ్రామ’’ దేవతాయైనమః,విప్ర ప్రపూజితాయైనమః ,గ్రామ రక్షా దక్షాయైనమః ,భ్రుగువార మహా పూజా సంతుస్టా యనమః అంటూ చివరినామం శ్రీ కమలనాభ వంశోద్భవాయైనమః అన్నారు .చివరగా భజనపాటలతో పూర్తయింది .

2-షిరిడి సాయి సుప్రభాతం లో-రెండవ శ్లోకం –శిర్దీశ్వరానంత మహేశ్వరామ్శిన్ –త్రైలోక్య వైశిష్ట్య సుపూజితాన్ఘ్రే –మానావమానాది గుణాద్వివేకిన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘అని మేల్కొల్పారు .10లో –‘’శ్రద్ధా సబూరీతిద్వయం ప్రజానాం –ప్రాచుర్యమానో సగుణాత్మ రూపః –ఏకాదశానాం ప్రవచన్ సదాత్మన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘’12లో ‘’బ్రహ్నాను భూత్యా సతతం స్థితోయః-రాదామయీ కృష్ణ మనోభిరామః –రాజర్షిణాశ్రీ రమణేన సేవిన్-శ్రీకంఠ రూపేణ తపోగ్రభావిన్ –ప్రాభాతకాలే తవ సుప్రభాతం ‘’అంటూ వైవిధ్యంగా రాశారు.

౩- సత్యసాయీ నాదాస్టకం-లో ‘’ప్రశాంతి నిలయ స్తాయ సత్య ధర్మ స్వరూపిణే –సకల లోక వంద్యాయ సోమనాధాయ వందనం –త్రిలోక పూజ నీయాయ సర్వ ధర్మ స్వరూపిణే –పరోపకార దీక్షాయ సాయినాధాయ వందనం ‘’అంటూ మొదలు పెట్టి ‘’సత్య సాయినముద్దిస్య సప్తత్సుత్సవ ప్రాంగణే-శ్రీ దుర్గాయాః ప్రసాదేన చేద౦ స్తోత్రం సమర్పితం .’’అని ముగించారు .

ప్రార్ధనాస్టకం కూడా పుట్టపర్తి సాయిపై రాశారు –‘’సత్య ధర్మ దయామూర్తిం –శాంతి ప్రేమ సమన్వితం –సర్వ భూతాన్తరాత్మాన౦-నమామి సత్య సాయినం ‘తో ప్రారంభించి ‘’యదుక్తం తత్కృతం యేన –యత్కృతం సుకృతం చ తత్-సూక్తం సుమతిం సుకృతం –నమామి సత్య సాయినం ‘’అని భక్తిగా ఆయన మహిమా గానం చేశారు రమ్యంగా .ప్రసాద్ గారి కవిత్వం లో చక్కని ధారాశుద్ధి ,అనాయాసంగా రాసే నేర్పు ,తన్మయ స్థితి ప్రస్పుటంగా కనిపిస్తాయి .ఈ కాలం లోనూ గీర్వాణ౦ లో రాసి మెప్పిస్తున్నందుకు సమాదరిస్తున్న చదువరులకు అభినందనలు .

దెందుకూరి వారి ‘’సంపూర్ణ భక్తి స్తోత్రమాల ‘’గొప్ప స్తోత్ర కదంబం .ఒకరకంగా కరతలం లో ఆమలకమే .అందరు దేవీ దేవతల స్తోత్రగానాలు రెడీ మేడ్ గా మనకు అందించారు .వీరు మరిన్న రచనలు చేసి గీర్వాణ  ఆంధ్ర భాషా వైభవానికి దోహదం చేయాలని మనవి .

ఆధారం –దెందు కూరి వారు పంపిన ‘’శ్రీమత్పుట్టలాంబా పూజావిధానం ,సంపూర్ణ భక్తి స్తోత్రమాల పుస్తకాలు ,శ్రీ షిరిడి సాయి సుప్రభాతం మొదలైనవి .అందులోను ముఖ్యంగా శ్రీ తూములూరువారు ‘’స్తోత్రమాల ‘’లో రాసిన ముందుమాటలు ‘’క్రుతజ్ఞతాంజలి ‘’మాత్రమె దెందు కూరి వారి జీవిత విశేషాలు రాయటానికి సహకరించింది .కవిగారి  గురించి నేను రాసిన దానికంటే అదనపు సమాచారంఅంటే పుట్టిన తేదీ వగైరా లు దొరకలేదు .

దెందుకూరి వారితో పరిచయం –సుమారు నెలక్రితం ఒకాయన ఫోన్ చేసి ‘’నాపేరు దుర్గాప్రసాద్ ,తెలుగు పండితుడిగా చేసి రిటైరయి గుంటుపల్లి లో ఉంటున్నాను ,సంస్కృతం తెలుగులలో పుస్తకాలు రాశాను ,పదేళ్ళక్రితం సాహితీ మండలి మీటింగ్ లో ప్రసంగించి ‘’ఏమీ బాగా లేదని మీతో చివాట్లు తిన్నాను ‘’ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తిగారు నాకు సహాధ్యాయులు. వారు మీ గురించి, రేపల్లెలో ఆవిష్కరించిన గ్రంధద్వయం గురించి చెప్పారు .నాకు వాటిని పంపండి నా రచనలు మీకు పంపుతాను ‘’అన్నారు .ఆ రోజే కొరియర్ లో పంపాను . వారినుంచి వారందాకా అందినట్లు సమాచారం లేదు .తమపుస్తకాలు పంపుతామన్న ఆయన నాలుగు రోజుల క్రితం వరకు పత్తాలేరు .శనివారంకొరియర్ లో  పంపితే అవి సోమవారం నాకు చేరటం ,ఇవాళే వాటిని చదవటం వారిపై రాయటం చకచకా జరిగిపోయాయి .నాకు తెలియని మరో గీర్వాణకవిని పరిచయం చేసి రాయించిన ఘనత శ్రీ తూము లూరు వారిది .వారి సౌజన్యానికి  ధన్యవాదాలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -22-2-18-ఉయ్యూరు

 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.comGabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797


You

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం

విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )

గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన  శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి పరాయణులు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని కారాగార క్లేశమనుభవించినవారు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయి కుటుంబ  భారం నెత్తిన వేసుకున్నారు ప్రసాద్ గారు .స్మార్తం నేర్చి కొంతకాలం వైదిక వ్రుత్తి చేసి ,తర్వాత భాషా ప్రవీణ ,పండిత శిక్షణ పూర్తీ చేసి ,కృష్ణా జిల్లాపరిషత్ లో తెలుగు పండితులుగా ఉద్యోగించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు .విద్యార్ధులకు శ్లోకాలు పద్యాలు నేర్పి వారిలో సంస్కృతీ బీజాలు నాటారు .శ్రీమతి శ్యామల గారిని వివాహమాడి గృస్థ జీవితం ఆహ్లాదంగా గడిపారు .నాణ్యమైన నలుగురు పుత్రికా సంతానం పొంది మనవలతో మనవరాళ్ళతో ఆన౦దానుభూతి పొందుతున్నారు .

పండితకవి కనుక ‘గేయాలు రాస్తూ ‘’పారిజాతాలు ‘’కదా సంపుటి తెచ్చిజాతీయ స్థాయి ప్రశంసా పత్రం అందుకున్నారు .సహజ సిద్ధ నటులు .తెలుగు లోనేకాక సంస్కృత  శాకుంతలం కర్ణభారం నాటకాలలో నటించారు . ఆంద్ర గీర్వాణాలలో చక్కని రచనలు చేశారు .సమగ్రంగా సంస్కృతం లో శ్రీమత్పుట్టలాంబాపూజా విధానం రాశారు .శనీశ్వర సుప్రభాతం ,శ్రీ సత్య సాయి నాధాస్టకం ,షిర్డీ సాయి సుప్రభాతం రాశారు తెలుగులో ‘’తెలంగాణా రాష్ట్ర గీతం ‘’,మణికిరణాలు వ్యాకరణ సుధ మొదలైనవి రాశారు ‘’సంపూర్ణ భక్తి స్తోత్ర మాల ‘’,శ్రీ మద్గురువాణి లను సంకలించారు .ప్రస్తుతం బెజవాడ దగ్గర గుంటుపల్లిలో ఉంటున్నారు .  ఉద్యోగానంతర విశ్రాంతి జీవితాన్ని గుంటు పల్లి లో ‘’శ్రీ సత్య సాయి లోక సేవక సంఘ౦ ‘’స్థాపించి సేవ చేస్తూ సత్కాలక్షేపం చేస్తున్నారు .

1-శ్రీమత్పుట్ట లాంబా పూజా విధానం –గుంటూరు దగ్గర చల్లావారిపాలెం  లో జన్మించి దేవతగా ఆరాధింపబడు తున్న పుట్టలాంబ తల్లి సద్బ్రాహ్మణ కుటుంబం కమలనాభుల వారింటి ఆడపడుచు గా లో జన్మించి ,రజస్వలానంతర వివాహం ఆరోజుల్లో నిషిద్ధం కనుక సమాజ బహిష్కరణకు గురై,ఎక్కడినుంచో చల్లావారిపాలెం చేరి౦ది ఆకుటుంబం .ఒక రోజు తలి దండ్రులు అంచి నీటికోసం వెళ్ళగా ఈమె ఒక పుట్టలో దూరినట్లు కధనం .తలిదండ్రులకు తెలిసి వచ్చి బ్రతిమిలాడినా  ల ఇంటికి వెళ్ళక అక్కడే ఉంటూ కనిపిస్తూ మాట్లాడుతూ ఆడుతూ ఉండేదని ప్రతీతి .నల్లపాడు ,చల్లావారి పాలెం ,వెంగళాయ పాలెం ,లింగాయపాలెం ,అంకిరెడ్డి పాలెం ,తురకపాలెం ,స్తంభాల గరువు అనే ఏడు గ్రామాల పుట్టలమ్మకు అత్య్నత భక్తి ప్రపత్తులతో పూజలాచారించారు .ఆ ప్రాంతం లో ఒక ప్రాధమిక  పా శాల కట్టారు . ఆమె శిలా విగ్రహం చెక్కింఛి పెట్టించారు ..అయినా నిత్యం అందరికి దర్శనమిస్తుంది .కవిగారి మేనత్త బండ్లమూడి హనుమాయమ్మ గారికి కనిపించేదని కనిపించినప్పుడల్లా గజ్జెల మోత వినబడేదని ఆమె చెప్పారట . .గ్రామ రక్షణగా ఊరంతా తిరిగేదట .  దెందులూరి వారి కుటు౦బ౦ ప్రతి శుక్రవారం ఆమెకు అభిషేకం చేసి దుర్గా ,లక్ష్మీ అస్తోత్తరం చదివి పొంగలి నైవేద్యం పెట్టేవారు .భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందటం వలన భక్తులు భారీగా విరాళాలు సేకరించి 29-5-1994 అమ్మవారిని పునః ప్రతిష్టించి మంచి ఆలయం కట్టించారు .పుట్టలమ్మ తల్లి యూత్ వారు 60వేల రూపాయల నిధి సేకరించి 15-1-2000 మకర సంక్రాంతినాడు ఎత్తైన ప్రభ కట్టించి ఘనంగా ఊరేగించారు .

ఇంతటి ఘన చరిత్రగల పుట్టలాంబా దేవీ వైభవాన్ని స్తోత్ర అష్టక ,సుప్రభాతాలతో సమగ్ర పూజా విధానాన్ని శ్రీ దెందుకూరి దుర్గా ప్రసాద్ రచించి చరితార్ధు లయ్యారు .అందులోని విశేషాలు –

అష్టకం లో –‘’పుట్టలాంబా మహాదేవీం –పుణ్య శీలా తపస్వినీం –విప్ర పుత్రీం విశాలాక్షీం –నమో దేవీ నమామ్యహం ‘’తో ప్రారంభించి ‘’యాస్కసాన్వయ సంజాతో –దుర్గా ప్రసాద నామకః –పుట్టలాంబా ప్రసాదేనే-దంస్తబకం సమర్పితః ‘’అని ముగించారు .

సుప్రభాతం –పుట్ట లాంబా పుణ్య శీలే –పూర్వా సంధ్యా ప్రవర్తతే –ఉత్తిష్ట సర్వ లోకేశి-కర్తవ్యో లోక సంగ్రహః ‘’అని రొటీన్ గా ప్రారంభించి 9 వ శ్లోకం లో ‘’-త్వామేవ మాతార మివాశ్రంయామః –త్వామేవ పిత్రేవ సదాశ్రయామః –త్వామేవ గుర్వీ మివ భావ యామః –హేపుట్టలాంబే తవ సుప్రభాతం ‘’అని 12లో  ‘’మంగళం జన పాలిన్యై –మంగళం జ్ఞానభానవే –మంగళం భవనాసిన్యై –మంగళం లోక గురవే ‘’అని అమ్మ వారి ప్రతిభను చాటారు .

పూజా విధి లో దేవీ పూజా విధానం గా చెప్పి అష్టోత్తర శతనామాలు రాశారు –అందులో గ్రామ’’ దేవతాయైనమః,విప్ర ప్రపూజితాయైనమః ,గ్రామ రక్షా దక్షాయైనమః ,భ్రుగువార మహా పూజా సంతుస్టా యనమః అంటూ చివరినామం శ్రీ కమలనాభ వంశోద్భవాయైనమః అన్నారు .చివరగా భజనపాటలతో పూర్తయింది .

2-షిరిడి సాయి సుప్రభాతం లో-రెండవ శ్లోకం –శిర్దీశ్వరానంత మహేశ్వరామ్శిన్ –త్రైలోక్య వైశిష్ట్య సుపూజితాన్ఘ్రే –మానావమానాది గుణాద్వివేకిన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘అని మేల్కొల్పారు .10లో –‘’శ్రద్ధా సబూరీతిద్వయం ప్రజానాం –ప్రాచుర్యమానో సగుణాత్మ రూపః –ఏకాదశానాం ప్రవచన్ సదాత్మన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘’12లో ‘’బ్రహ్నాను భూత్యా సతతం స్థితోయః-రాదామయీ కృష్ణ మనోభిరామః –రాజర్షిణాశ్రీ రమణేన సేవిన్-శ్రీకంఠ రూపేణ తపోగ్రభావిన్ –ప్రాభాతకాలే తవ సుప్రభాతం ‘’అంటూ వైవిధ్యంగా రాశారు.

౩- సత్యసాయీ నాదాస్టకం-లో ‘’ప్రశాంతి నిలయ స్తాయ సత్య ధర్మ స్వరూపిణే –సకల లోక వంద్యాయ సోమనాధాయ వందనం –త్రిలోక పూజ నీయాయ సర్వ ధర్మ స్వరూపిణే –పరోపకార దీక్షాయ సాయినాధాయ వందనం ‘’అంటూ మొదలు పెట్టి ‘’సత్య సాయినముద్దిస్య సప్తత్సుత్సవ ప్రాంగణే-శ్రీ దుర్గాయాః ప్రసాదేన చేద౦ స్తోత్రం సమర్పితం .’’అని ముగించారు .

ప్రార్ధనాస్టకం కూడా పుట్టపర్తి సాయిపై రాశారు –‘’సత్య ధర్మ దయామూర్తిం –శాంతి ప్రేమ సమన్వితం –సర్వ భూతాన్తరాత్మాన౦-నమామి సత్య సాయినం ‘తో ప్రారంభించి ‘’యదుక్తం తత్కృతం యేన –యత్కృతం సుకృతం చ తత్-సూక్తం సుమతిం సుకృతం –నమామి సత్య సాయినం ‘’అని భక్తిగా ఆయన మహిమా గానం చేశారు రమ్యంగా .ప్రసాద్ గారి కవిత్వం లో చక్కని ధారాశుద్ధి ,అనాయాసంగా రాసే నేర్పు ,తన్మయ స్థితి ప్రస్పుటంగా కనిపిస్తాయి .ఈ కాలం లోనూ గీర్వాణ౦ లో రాసి మెప్పిస్తున్నందుకు సమాదరిస్తున్న చదువరులకు అభినందనలు .

దెందుకూరి వారి ‘’సంపూర్ణ భక్తి స్తోత్రమాల ‘’గొప్ప స్తోత్ర కదంబం .ఒకరకంగా కరతలం లో ఆమలకమే .అందరు దేవీ దేవతల స్తోత్రగానాలు రెడీ మేడ్ గా మనకు అందించారు .వీరు మరిన్న రచనలు చేసి గీర్వాణ  ఆంధ్ర భాషా వైభవానికి దోహదం చేయాలని మనవి .

ఆధారం –దెందు కూరి వారు పంపిన ‘’శ్రీమత్పుట్టలాంబా పూజావిధానం ,సంపూర్ణ భక్తి స్తోత్రమాల పుస్తకాలు ,శ్రీ షిరిడి సాయి సుప్రభాతం మొదలైనవి .అందులోను ముఖ్యంగా శ్రీ తూములూరువారు ‘’స్తోత్రమాల ‘’లో రాసిన ముందుమాటలు ‘’క్రుతజ్ఞతాంజలి ‘’మాత్రమె దెందు కూరి వారి జీవిత విశేషాలు రాయటానికి సహకరించింది .కవిగారి  గురించి నేను రాసిన దానికంటే అదనపు సమాచారంఅంటే పుట్టిన తేదీ వగైరా లు దొరకలేదు .

దెందుకూరి వారితో పరిచయం –సుమారు నెలక్రితం ఒకాయన ఫోన్ చేసి ‘’నాపేరు దుర్గాప్రసాద్ ,తెలుగు పండితుడిగా చేసి రిటైరయి గుంటుపల్లి లో ఉంటున్నాను ,సంస్కృతం తెలుగులలో పుస్తకాలు రాశాను ,పదేళ్ళక్రితం సాహితీ మండలి మీటింగ్ లో ప్రసంగించి ‘’ఏమీ బాగా లేదని మీతో చివాట్లు తిన్నాను ‘’ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తిగారు నాకు సహాధ్యాయులు. వారు మీ గురించి, రేపల్లెలో ఆవిష్కరించిన గ్రంధద్వయం గురించి చెప్పారు .నాకు వాటిని పంపండి నా రచనలు మీకు పంపుతాను ‘’అన్నారు .ఆ రోజే కొరియర్ లో పంపాను . వారినుంచి వారందాకా అందినట్లు సమాచారం లేదు .తమపుస్తకాలు పంపుతామన్న ఆయన నాలుగు రోజుల క్రితం వరకు పత్తాలేరు .శనివారంకొరియర్ లో  పంపితే అవి సోమవారం నాకు చేరటం ,ఇవాళే వాటిని చదవటం వారిపై రాయటం చకచకా జరిగిపోయాయి .నాకు తెలియని మరో గీర్వాణకవిని పరిచయం చేసి రాయించిన ఘనత శ్రీ తూము లూరు వారిది .వారి సౌజన్యానికి  ధన్యవాదాలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -22-2-18-ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797


You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web

received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2

  కలిపూర్వం 109  వికృతి  సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి .గర్గాచార్యుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి ,బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి ,కాశీ లో ఉన్న సా౦దీపమహర్షి వద్ద గురుకులవాసం లో ధనుర్వేద ,ఉపనిషత్  విద్య నేర్చి ,గురు దక్షిణగా మృతుడైన గురుపుత్రుని కృష్ణుడు సజీవునిగా తీసుకొచ్చి అప్పగించటానికి ప్రభాస తీర్ధం వెళ్ళటం ,సముద్రుడు పూజించటం సముద్రం ప్రవేశించి   ,పంచ జనాసురుడిని చంపి ,పాంచజన్య శంఖం గ్రహించి ,యమలోకం వెళ్లి ,గురుపుత్రుని తీసుకొని కాశీ చేరి గురువుకు అప్పగించటం జరిగాయి .108 ఖర లో కృష్ణుడు గోపికల వద్దకు ఉద్ధవుడిని పంపటం,గోపికల భ్రమర గీతాలు ,తిరిగొచ్చిన ఉద్ధవుడు స్వామికి గోపికల అత్యంత ఆరాధనా భక్తీ వివరించటం ,కుబ్జ కురూపాన్ని పోగొట్టి సౌందర్య రాశిగా మార్చటం ,సోదరులు అక్రూరుని ఆతిధ్యం,పూజలు  పొంది బహూకరి౦చటం,పాండవుల క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మని హస్తినకు అక్రూరుని పంపటం జరిగింది .కృష్ణ బాల్యం ప్రచ్చన్నంగా బృందావనం లో నందగోపుని ఇంట జరగటం వలన కంస వధ తర్వాతే పాండవ శ్రీకృష్ణ సోదరులకు మొదటిపరిచయకాలం అయింది .107నందనలో 19స్వామికి పూర్తి అవటం  ,జరాసంధుడు మధురపై మొదటిసారి దండెత్తిరావటం ,ఓడిపోయి బలరాముని చేతిలో పట్టుబడటం ,కృష్ణుడు కరుణించి వాడిని విడిచిపెట్టటం జరిగాయి .

   106విజయ సంవత్సరం 20ఏళ్ళు నిండిన మూడు నెలలకే ,జరాసంధుడు మధురపై రెండో సారి కృతఘ్నతతో దాడి చేసి , ఓడి,16సార్లు దండెత్తి 6ఏళ్ళు మదుర , కృష్ణబలరాములను బాధించాడు.105 జయ లో 21ఏడు వచ్చాక  జరాసంధుడు మూడో సారి  దండయాత్ర చేశాడు  హస్తినాపురం లో పాండవులు ఏం చేస్తున్నారో చూద్దాం. ద్రోణాచార్యులవద్ద ధనుర్విద్య నేర్చిన పాండవ కౌరవులకు ధనుర్విద్యా పరీక్షజరగటం   ,నాలుగో దండయాత్ర జరాసంధుడు చేయటం జరిగాయి .104మన్మధ సంవత్సరం లో 22ఏళ్ళు  కృష్ణుడికి నిండాయి .హస్తినలో ధర్మరాజుకు 24వ ఏట యువరాజ్య పట్టాభిషేకం చేశాడు పెద్ద రాజు ధృత రాస్ట్రుడు .103 దుర్ముఖి లో 23ఏళ్ళు నిండటం ,జరుడు 5వ సారి మధురదండయాత్ర ,102 హేవలంబి లో 24పూర్తయి ,6వ సారి దండయాత్ర ,101విళంబిలో 25 కంసారి కి నిండగా 7వ దండయాత్ర ,100వికారిలో మురారికి 26 నిండటం ,సంధుని 8వ దండయాత్ర ,హస్తినలో కౌరవపా౦ డవులమధ్య కలహాలు తీవ్రమవగా ,పాండవులను శార్వరి ఫాల్గుణ శుద్ధ అష్టమికి వారణావత౦ పంపటం జరిగాయి .

   99శార్వరికి నల్లనయ్యకు 27నిండటం, జరా 9వసారి దండయాత్ర ,98ప్లవ లో 28నిండటం ,జరుడి 10 వ దండయాత్ర ,ఫాల్గుణ శుద్ధ చతుర్దశి లాక్షా గృహ దహనం ,కుంతీ దేవితో సహా బిలంగుండా పాండవులు తప్పించుకుపోవటం ,అరణ్యం లో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున భీముడు హిడి౦బాసుర వధ చేసి ,హిడి౦బిని పెళ్ళాడి ఘటోత్కచునికి జన్మనివ్వటం,97శుభకృత్ కు బలరామానుజుడికి 29నిండటం, సందుడి 11 వ దండయాత్ర , 96 శోభకృత్ కు 30నిండటం ,మధురపై 12వ దండయాత్ర ,కుంతీ పాండవులు శాలిహోత్ర ముని ఆశ్రమంలో ధర్మాలు వినటం ,95 క్రోధి కి 31నిండి ,13వ దండయాత్ర ,వైశాఖ శుక్లపక్షం లో పాండవులు  ,ఏక చక్రపురం వెళ్లి ఒక ఏడాది ఉండటం ,94 విశ్వావసులో 32దేవకీనందనుడికి నిండటం ,మధురపై 14వ దండయాత్ర , ఏకచక్రపురం లో రెండో ఏడాది పాండవులు గడపటం ,93పరాభవ కన్నయ్యకు 33నిండటం ,మధురపై 15వ దండయాత్ర ,పాండవులు మూడో ఏడాది ఏకచక్రపుర వాసం ,92ప్లవంగకు శౌరికి 34నిడటం జరుని 16వసారి ,17వ సారి ఎత్తిరావటం  , పాండవుల నాలుగో ఏడు ఏకచక్రపురవాసం.91కీలక సంవత్సరం లో ముకు౦దు నికి 35నిండటం జరాసంధుడు మధురపై చివరిసారి 18వ దండయాత్ర చేయటం ,కాలయవన పారశీకరాజు వాడికి పశ్చిమం నుంచి సాయం రావటం ,3కోట్ల జరాసంధ శత్రు సైన్యాన్నిఎదిరించాల్సిరావటం తో కృష్ణుడు ముందుగా కాలయవనుడితోపోరాడి ,ఓడిపోయినట్లు నటించి భయంతో పారిపోతున్నట్లు భ్రమకలిపించి ముచుకు౦దమహర్షి తపస్సు చేస్తున్న గుహలో దూరి ,కాలయవనుడు ముని తపోభంగం చేయగా  ఆయన కంటిమంటకు వాడు భస్మమవటం,యవన సైన్యం భయపడి పారిపోవటం వరుసయుద్దాలతో ఇక యాదవులను కస్టట్టటం ఇష్టం లేక బలరామ కృష్ణులు ప్రవర్షణ గిరి అనే దుర్గానికి చేరగా ,జరాసంధుడు మధురవదలి దీనిపైకి వచ్చి కాల్చేయగా ,అక్కడినుంచి తప్పుకొని సోదరులు అజ్ఞాత వాసం కొంతకాలం గడిపి ,పశ్చిమ సముద్రం చేరి దాని దగ్గరున్న గోమతి నదీ తీరం లో ద్వారకానగరం నిర్మించటం ప్రారంభించి 90సౌమ్య సంవత్సరానికి పూర్తి చేసి ,యాదవులను ద్వారకకు రప్పించి ,రుక్మిణీదేవిని పెళ్ళాడటం ,ఏక చక్రపురం లో పాండవుల 6వ ఏడు అజ్ఞాతవాసం గడపటం పూర్తి అయింది .

  సశేషం

శ్రీకృష్ణాస్టమి శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణుడు సూర్యుడి అవతారమా . 

కృష్ణుడు సూర్యుడి అవతారమా .  — Andukuri Sastry
భారత భాగవతాలు చూస్తే బహుశ వ్యాసుడు ఉద్దేశ్యం అదేనేమో ననిపిస్తుంది .
సూక్ష్మంగా చెప్పాలంటే భారతం లో మొట్టమొదట కృష్ణుడు కనపడటం ద్రౌపది స్వయం వరంలో .అంతరార్థాళోకి వెళితే
అర్జునుడు పంచభూతాలలో అగ్ని. పాండవులు వరుసగా ఆకాశం వాయువు అగ్ని జలం భూములు .ఈదేవతలకు ఎప్పుడూ సూర్యుడే బలమిస్తాడు.‌దీనికి ఉపనిషత్ప్రమాణం ‘ ‘ఆదిత్యోవై దేవమధుః’ (అందుకే యుద్ధానికి ముందర వానరులు మధివనం లో మధువు తాగుతారు. మధువనం సూర్యుడి నుండి సుగ్రీవుని కి వచ్చింది .వానరులు చెట్లనుంచి వచ్చేప్రాణవాయువులు )
పాండవుల బలం కృష్ణుడే )
ఇక కృష్ణ జననం తోనే వ్యాసుడు కృష్ణుడు సూర్యుడని చేప్పాడు . మనకు సూర్యోదయం అయిన తరవాత సూర్యుడు కనబడుతాడు.కాని ఆయన మొదటి కిరణం భూమి మీద అర్థ రాత్రే పడుతుంది. సూర్యుడు XAxis దగ్గర ఉంటే మొదటి కిరణం y axis మీద పడుతుంది .అందుకే శివరాత్రి లింగోధ్బవ కాలం అర్థరాత్రి. రుద్రుడే సూర్యుడు గా కన పడతాడని నమకం చెబుతుంది ( అసౌయోzవసర్పతి నీలగ్రీవో
..అనేమంత్రంలో ) అందుకే
కృష్ణుడు అర్థరాత్రి పుట్టాడు  . సూర్యుడు విష్ణువుగా
ఋగ్వేదం చెప్పింది’చతుర్భిః సాకం నవతిం ‘అనే౧౬౦౮ మంత్రంలో.కృష్ణుడికి విష్ణువు కి అభేదం అందరూ ఒప్పుకున్నదె
అయితే సూర్యుడు పుట్టగనే స్నానం చేయించాలి . లేకపోతే భూమి భస్మమయిపోతుంది.సూర్యుడు అవతారం ఎత్తినపుడల్లా ఋషులు ఈ జాగ్రత్త తీసుకున్నారు. వాల్మీకి అయోధ్యను ఎన్నుకోవటానికి కారణం సరయూనది( పునర్వసూ జన్మ  నక్షత్రం పెట్టి రాముడు సూర్యుడు అని చెప్పాడు వాల్మీకి .కర్ణుడు పుట్ట గానే గంగలో వేయించాడు  వ్యాసుడు . కృష్ణుడు కూడా యమున లో ప్రయాణం చేశాడు. సూర్యుడి temperature 6000 c ఉంటుందిట.. ‘ భయస్యామతిః ‘ అంటుంది వేదం .
గోవులు అనేశబ్దానికి సూర్యకిరణాలు అనే అర్థం ఉందని యాస్క్యుడు చెప్పాడు .
సూర్యుడు పుట్టగానే ఏం చేయాలి .సూర్య కిరణాలు ఉన్న చోటికి వెళ్లాలు. అవి ఎక్కడ ఉన్నయి .గోవ్రజం అంటే నందుని గొల్లపల్లె వలో..కనుక ఉదయం అయ్యే టప్పటికి అక్కడ ఉండాలి అందుకే వసుదేవుడు కృష్ణుని మోసుకొని గొల్లపల్లె కు వెళ్లాడు‌.సూర్యుడి లక్షణాలు చాలాచెప్పాడు వ్యాసుడు. మనకు జ్ణాపకం ఉంషడదు కాని సూర్యుడు నీట్కిస్థానం . ఆయన ఎక్కడుంటే అక్కడ నీరు ఉంటుంది అందుకే వాన తెప్పించాడు.అప్సరసలు వాసలు సూర్యలోకం లోఉంటారని . వారు నీటిస్వరుపాలు.అందుకే ఎవరైనాఋషి తపసు(వేడి) చేస్తుంటే అక్కడికి వెళ్లి చల్లబరుస్తారు..
పాము లు,రాక్షసులు ,పిశాచాలు పితృదేవతలు దక్షిణ ధ్రువ శక్తులు.సూర్యుడు భూమి మీదకు రాగానె శేషుడు(దక్షిణ ధ్రువం ) వచ్చి సేవించుకున్నాడు .ఇక ‘ రసోవైసః రసగ్గ్ హ్యేనం లబ్ధ్వా నందీ భవతి’ రస స్వరూపుడు అన్నది సూర్యుడు కృష్ణుడు ఇద్దరి విషయంలోనూ సత్యమే ‌.కృష్ణుడిని పొందేవాడెవరు…నందుడు .
ఇక గోవులు సూర్యకిరణాలు …వాటిని పిండి అమృతం తీసేదెవరు …గోపికలు .అంటే చంద్రకిరణాలు . కనుక గోపికలు చంద్ర కిరణాలు.
చంద్రకిరణాలు అంటూ ప్రత్యేకము ఏమీ ఉండవు‌సూర్యకిరణాలే చంద్రుడిమీద పడి చంద్రకిరణాలు అవుతయ్
 రాత్రపూట సూర్యుడిని వరుణుడు అంటారు
అంటేగోపికలు కృష్ణుని రూపాలే .అందుకనే గోపిలల భర్తలు కాని కొడుకులు కాని అత్తమామలు కాని గోపికలు రాత్రిపూట ఇల్లు వదలి వెళ్లినా మాయామోహితులై ..ఏమీ అనరు.
కృష్ణుడు రోహిణీ నక్షత్రం లోపుట్టినట్టు భాగవతంలోఉందికానీ శ్రావణ మాసమని లేదు.అది విష్ణు పురాణం లో ఉంది .
తెలుగులో ఒక్క‌ప్రతిలో మాత్రము ఉంది
ఇకభారత కథ తీసుకుంటే ..పాండవులు దేవతలు ..ఉత్తర ధ్రువ శక్తులు
దుర్యోధనాదులు దక్షిణ ధ్రువ శక్తులు కలి అంశ ..రాక్షసాంశ రూపాలు. కానీ కృష్ణుడికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒకటే .పక్షపాతం లేదు.అందుకని భారతయుధ్దం లో యుధ్ద్దం చేయనంటాడు. మరేం చేస్తావంటే రథం తోల్తానంటాడు.
సూర్యుడు గమన శీలుడు .ఈప్రపంచం లో ఒక్కక్షణం కూడా నిలుకడలేనివి మూడు సూర్యుడు, అగ్ని,గంగా . అందుకే రథసారథ్యం చేస్తానంటాడు.వ్యాసుడు కర్ణుణ్ణి గూడా రథసారథి కే దొరికేటట్టు చేస్తాడు.. చివరికి రథం కదలలేక పోతాడు.
భారత యుధ్దం లో కృష్ణుడు సూర్యుడు అర్జునుడు అగ్ని .ధ్వజం ఆంజనేయుడు (ఆక్సిజన్ ) అగ్ని మండటానికి కావాల్సిన వాయువు .  ( వాయుదేవుడు కాడు చెట్టుమీదనుండివచ్చే ప్రాణవాయువు .‌ చెట్టు కాబట్టే వానర రూపం )
కృష్ణుడి రాయభారం దూరాన ఉండే సూర్యుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను పరస్పర వైరనివారణ ప్రయత్నం .అయుతే ఉత్తర ధ్రువం గోళం పైన ఉంటుంది కాబట్టి సూర్యుడి కి దగ్గర గా ఉంటుంది _(8000 miles)
అదేపాండవులు కృష్ణుని శరణు వేడటం .తనను పూజించిన వాని రక్షిస్తానని కదా కృష్ణుని ప్రతిజ్ఞ
రేపు రాస క్రీడ ను గురించి మాట్లాడుకుందాం

 

Andukuri Sastry

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ

గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ ,విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ నక్షత్రయుక్త వృషభ లగ్నం లో జన్మిచాడని,హోరాను దర్పణం లోనూ ఉన్నది  .ఇప్పటికి 5,115 ఏళ్ళక్రితం కలిద్వాపర సంధిలో అని అర్ధం .కృష్ణుడి జీవితకాలం 125 సంవత్సరాల 7నెలల 8రోజులు .కృష్ణావతారం సమాప్తం కాగానే కలియుగారంభమైంది .అంటే క్రీ పూ .3225.

   కృష్ణుడు పుట్టిన మూడు నెలలలోపు  పూతన సంహారం,శకటాసుర భంజనం జరిగి ,యశోదకు మొదటిసారి తన విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించాడు కృష్ణుడు .గర్గాచార్యుల చేత బలరామ  కృష్ణులకు నామకరణం జరిగింది .ఆరవనెలలో బాల కృష్ణుడికి అన్నప్రాసన అయ్యాక ,తృణావర్త సంహారం చేశాడు .అప్పటికి శత శృంగ పర్వతం మీద కుంతీ పా౦ డురాజులకు యమధర్మరాజు వరంతో ధర్మరాజుప్రజోత్పత్తినామ  సంవత్సరం లోనూ , ,ఆంగీరసనామ సంవత్సరం లో వాయు దేవుని వరంతో భీముడు ,హస్తినాపురం లో గాంధారి  ధృత  రాష్ట్రులకు దుర్యోధనుడు ,శ్రీముఖ నామ సంవత్సరం లో ఇంద్రుని వరం తో అర్జునుడు జన్మించారు .శ్రీకృష్ణ జననం శ్రావణ బహుళ అష్టమి .కలిపూర్వం 126వ సంవత్సరం .

 కలిపూర్వం 125కు భావ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి కృష్ణుడికి ఏడాది వెళ్ళింది .రెండవ ఏడు రాగానే మట్టి తినటం ,యశోదకు ద్వితీయ విశ్వరూప సందర్శనం కలిగించటం ,శతశృంగం లో మాద్రి పా౦డురాజులకు అశ్వినీ దేవతల వరంగా నకుల ,సహదేవులు జన్మించటం జరిగింది .124 యువ లో శ్రావణ బహుళాస్టమికి రెండో ఏడాది వెళ్లి ,ఉలూఖల బంధనం ,యమళార్జున భంజనం ,నలకూబర ,మణిగ్రీవ శాప విమోచనం ,నందాదులు గోకులం నుంచి బృందావనానికి నివాసం మార్చటం జరిగి 3సంవత్సరాల 11వ నెలవరకు కన్నయ్య బృందావన లీలలు సాగాయి .123ధాత లో మూడో ఏడు పూర్తి కాగానే బాలకృష్ణ వత్సాసుర ,బకాసుర,  అఘాసుర వధ చేయగా ,  దేవతలు పుష్ప వృష్టి కురిపించారు .122 ఈశ్వర లో నాలుగో యేట బ్రహ్మదేవుడు గోవులను దూడలను గోపాలురను అంతర్ధానం చేసి ఒక ఏడాది ఉంచాడు ,ఇప్పుడే కృష్ణస్వామి సమస్త గో, గోపాల ,వత్స రూపాలు ధరించి తన సర్వా౦త ర్యామిత్వాన్ని ప్రకటించాడు .

    కలిపూర్వం 121బహుధాన్య శ్రావణ బహుళ అష్టమి కి 5యేళ్ళు నిండి బ్రహ్మకు దిమ్మతిరిగి ఆవు దూడ గోపాలురను వదిలేసి చెంపలేసుకొని కృష్ణ స్తోత్రం చేశాడు .చైత్ర కృష్ణ చతుర్దశి నాడు శత  శృంగపర్వతం పై పాండురాజు మృతి చెందాడు .అప్పటికి ధర్మరాజుకు 7,భీముడికి 6,అర్జునుడికి 5,నకులసహదేవులకు 4ఏళ్ళ వయసు .వీరు హస్తిన కు తీసుకుపోబడి భీష్ముని ప్రాపకం లో పెరిగారు .120 ప్రమాదిలో  కృష్ణుడికి 6ఏళ్ళు  నిండి బృందావనం లో ధేనుకాసుర వధ ,కాళీయ మర్దనం ,ప్రలంబాసురవధ చేశాడు .గ్రీష్మ, వర్ష, శరత్తులలో గోపాలురతోకలిసి గోవులను మేపుతూ ఆటపాటలతో ,మురళీ గానం తో అందర్నీ రంజి౦ప జేశాడు .మార్గశిరమాసం లో కన్నె గోపికల కాత్యాయని వ్రతం ,వారి వస్త్రాపహరణం ,వరప్రదానం ,బ్రాహ్మణులు అంగీరస యాగం చేయటం ,స్వామికి గోపాలురకు బ్రాహ్మణ స్త్రీలు యజ్ఞప్రసాదం సమర్పించటం జరిగాయి .

  119 విక్రమ శ్రావణ బహుళాస్టమికి స్వామికి 7ఏళ్ళు నిండి ,ఇంద్రయాగాన్ని నందాదులతోమాన్పించటం ,ఆగ్రహించి దేవేంద్రుడు అతి వృష్టికురిపించటం ,స్వామి గోవర్ధనగిరి నెత్తటం ,ఇంద్ర గర్వ భంగమవటం ,కామధేనువు స్వామికి క్షీరాభిషేకం చేయటం ,వరుణ దేవుడు పట్టుకు వెళ్ళిన పెంపుడుతండ్రి నందుని విడిపించటానికి వరుణ లోకం వెళ్లి ,విడిపించి తీసుకు రావటం , బాల్య రాసక్రీడ ,జరిగాయి .118 వృష సంవత్సరం లో సర్పరూపం ధరించిన సుదర్శనుడి శాపాన్ని బాలకృష్ణుడు తొలగించాడు .జ్యేష్ట శుద్దంలో ధర్మరాజుకు 11 వ ఏట ఉపనయనం జరిగింది .

  కలిపూర్వం 117నుంచి 112వరకు అనగా చిత్రభాను నుంచి సర్వ జిత్ వరకు శంఖ చూడ సంహారం , వృష భాసుర ,కేశి రాక్షస ,వ్యోమాసుర  వధ జరిపాడు కృష్ణుడు .బృందావనం లో గోపాల లీలలు చూపాడు .ఇవన్నీ అయ్యేసరికి కన్నయ్యకు 14 ఏళ్ళు పూర్తయ్యాయి .111 సర్వధారికి 15 ఏళ్ళు పూర్తి అయి , నారద మహర్షి  వచ్చి కంససంహారం మొదలైన భవిష్యత్ కార్యక్రమాలు చెప్పటం జరిగింది .అంటే కృష్ణుడికి బాల్యం పూర్తి అయి ,అవతార కార్యం నిర్వహించే వయసువచ్చింది కనుకనే నారదుడు  వచ్చి  కర్తవ్య౦ బోధించాడు .

    110 విరోధి శ్రావణ బహుళ అష్టమికి కృష్ణస్వామికి నూనూగు మీసాల నూతనయవ్వనం వచ్చి 16సంవత్సరాలు నిండాయి .అక్రూరుడిని కంసుడు బృందావనానికి పంపటం బలరామ కృష్ణులు ఆయనతో  ధనుర్యాగానికి మధుర చేరటం ,గోపికలు స్వామిని విడువలేక దుఖించటం ,వారించటం ,దారిలో యమునాతీరాన అక్రూరునికి కృష్ణుడు విశ్వరూప సందర్శనభాగ్యం ప్రసాదించటం, (ఇప్పటికి స్వామి 3 సార్లు విశ్వరూప సందర్శనం చూపించాడు ) అందరూ మధుర చేరటం జరిగింది .మధురలో రధం పై విహరిస్తూ సోదరులు రజకుని నిగ్రహించటం ,తంతు వాయక సన్మానం,మాలాకార సన్మానం  పొందటం ,కుబ్జ తో సంభాషణం .మర్నాడు ధనుర్యాగశాల ప్రవేశం చేసి ,కువలయాపీడ౦ అనే ఏనుగు పీచమడిగించి,మల్ల యుద్ధం లో బలరామ కృష్ణ సోదరులు ముస్టికా, చాణూరులను  మల్లయుద్ధం లో గెలిచి, కృష్ణుడు మేనమామ కంసునితోపోరాడి సంహరించటం ,బలరాముడు కంస సోదరులతో పోరి ,నిర్జించటం  ,సోదరులు తలిదండ్రులు దేవకీ వసుదేవులను కారాగృహం నుంచి విముక్తికల్పించి ,వారిచే లాలి౦ప బడటం జరిగాయి .కొన్ని రోజులతర్వాత ,పెంచిన తలిదండ్రులైన నంద, యశోదాదులను ఆహ్వానించి పిలిపించి, వారి సమక్షం లో  మాతామహుడు ఉగ్రసేనునికి పట్టాభి షేకం చేసి ,నందునికి కృష్ణస్వామి ఆధ్యాత్మికజ్ఞాన బోధ చేసి ,దుర్గా స్తోత్రం ఉపదేశింఛి ,వారిని తిరిగి బృందావనానికి పంపించటం జరిగింది .

   సశేషం

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ,మరియు సరసభారతి ఆధ్వర్యం లో కృష్ణాష్ష్టమి వేడుకలు

‘స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ ” 

  శకటాసురిడిని చంపి ,ఏమీ తెలియనట్లు ,హాయిగా యశోద స్తన దుగ్దామృతం తాగుతు,చిరునవ్వులు చిందిస్తున్న  బాలకృష్ణుని భవ్య దివ్య  మూర్తిని హరివంశం లో ఎర్రన  వర్ణించిన  పద్యం ఇది .

 రేపు 23-8-19 శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

— సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టెకారం  ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు  ఏర్పాటు చేయబడినాయి .

    సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్  ఇంగ్లీష్  మాస్టారు శ్రీ ఆయాచితుల త్రినాథ శర్మ గారి చే  ‘’కృష్ణ చరితం ‘’పై ధార్మిక ప్రసంగం ,అనంతరం బాల బాలికల చేత రాధా ,గోపికా ,కృష్ణ వేషధారణ ప్రదర్శనగా  ‘’శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ‘’నిర్వహించబడుతాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

                              గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త

  ఉయ్యూరు -22-8-19

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12   తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12

తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో

తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే దాసుడు .ఇలంగో అంటే చిన్నరాజు .ఇది మనతెలుగు పదం లాంటిదే .ఎల అంటే తెలుగులో లేత అని అర్ధం . ఇళంత-ఎళ౦త-లేంత –లేత అయింది .అంటే చిన్న అని భావం .కో అంటే రాజు .ప్రపంచానికి రాజు దేవుడుకనుక కో అంటే దేవుడు అని అర్ధం .దేవుడిగుడి కోయిల ,కోవెల అయింది .దానిము౦దున్న చెరువు కోనేరు అయింది .

  చిన్నరాజు  అనబడే ఇలంగో తండ్రి నెడుం చెరలారన్ చేర రాజు .ఆయన ఇద్దరుకొడుకులలో చిన్నవాడు ఇలంగో .చిన్నప్పుడే బాగా విద్య నేర్చాడు .ఐతే అతడు సన్యాసం తీసుకోవటానికి ఒక కథ ఉంది .తండ్రికి ఒక సారి తీవ్రంగా జబ్బు చేస్తే ,జ్యోతిష్యులువచ్చి రాజు త్వరలోనే చనిపోతాడని ,చిన్నకొడుకు ఇలంగో రాజవుతాడని చెప్పగా ,అన్న విని పెద్దకొడుకు బాధపడటంచూసి  ,ఆంతర్యం తెలిసి, వెంటనే జైనమత సన్యాసం తీసుకొని తనకు రాజ్యార్హత లేకుండా చేసుకొన్నాడు .దూరంగా వెళ్లి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ,విద్యా వ్యాసంగం చేస్తూ ,అక్కడే శిలప్పాదికారం  మహా కావ్యం రాశాడు .ఇది తమిళపంచ కావ్యాలలో  ఒకటి .కావ్యం పేరులో ఒక విషయం ఉంది .శిలంబు అంటే కాలి కడియం .దాన్ని అధికరించి అంటే దాన్ని గురించి రాసినకావ్యం కనుక శిలప్పాదికారం  అయింది .ఈ కావ్య నాయిక కణ్ణకి లేక కణ్ణగి .

   చోళరాజధాని కావేరిలో మాశాత్తువార్ అనే ధనిక  వైశ్యుడికొడుకు కోవలన్ భార్య కణ్ణకి.విలాసపురుషుడైన కోవలన్ ఒక నర్తకిని మోహించి  భార్యను పట్టించుకోకుండా వ్యసనాలకు మరిగి ,ఉన్నడబ్బంతా హారతి కర్పూరం చేసుకొని ,భార్య నగలు అమ్మి వ్యాపారం చేద్దామని అడిగితె ఆమె తనకాలి కడియం తీసి ఇచ్చి అమ్మి ఆసోమ్ముతో వ్యాపారం చేయమని పంపగా ,వాడు మధుర వెళ్లి  ఒక కంసాలికి అమ్మాడు .వాడు రాణీ గారి  కాలికడియం ఇదివరకే కాజేసినవాడుకనుక  రాజభటులకు చెప్పి వీడిని పట్టించగా రాజు విచారణ లేకుండా నే ఉరిశిక్ష విధించాడు .

  విషయం తెలిసిన కణ్ణగి,మధురవెళ్లి రాజుకు తనభర్త నిరపరాధి అని మొరబెట్టుకొంది.తనకాలికడియమే తనభర్తకు ఇచ్చానని అలాంటి కడియమే తన రెండవకాలికి ఉన్నదని చూపింఛి దానిలోపల రత్నాలు పొదిగి ఉండటం చూపించగా రాజు నిర్ఘాంత పోయి ఆమె భర్త నిరపరాది అని గ్రహించి ,అతనికి  మరణశిక్ష విధించినందుకు కుంగిపోయి సింహాసం నుంచి క్రిందపడి చనిపోయాడు  .తనభర్తకు జరిగిన అన్యాయాన్ని సహించలేక సాద్ధ్వి కణ్ణగి ,తన ఎడమ స్తనాన్ని పీకేసి ,మధురా పట్టణం మీద విసిరేసి పట్టణం తగలబడి పోవాలని శపించింది .అగ్ని దేవుడు అలానే దగ్ధం చేశాడు .మధురనుంచి పశ్చిమానికి బయల్దేరి ఆమె మలై నాడు వెళ్లి నెడవల్ కుండ్రం అనే  కొండమీద  వెంగై చెట్టుకింద కూర్చుని తపస్సు చేస్తుంటే ,మధురాపుర పట్టణ దేవత వచ్చి ప్రత్యక్షమై ,ఆమె గత జన్మ గురించి చెప్పి ,ఆమె భర్త కోవలన్ గతజన్మలో భరతన్ అనేపేరుతో సి౦గపురరాజు కొలువులో ఉండి  నిరపరాధి యైన ఒకవర్తకుడిని గూఢచారిగా భావించి చంపించి వేశాడని ,అందుకే ఈజన్మలో ఇలా అతడు  మరణిం చాల్సి  వచ్చిందని ,ఆరోజు నుంచి 14వ రోజున ఆమె భర్త విమానం లో వచ్చి ఆమెను  తీసుకొని స్వర్గానికి వెళ్తాడని చెప్పి అదృశ్యమైంది .అన్నట్లుగానే అదేరోజున కొండపై ఉన్న కురవలు అందరూ చూస్తుండగా భర్త తెచ్చిన విమానమెక్కి స్వర్గారోహణ చేసింది కణ్ణగి.

   ఈ విషయాన్ని  రాజైన  శెంగుట్టువాన్ కు ప్రజలు చెప్పగా ,రాణిగారు కణ్ణగికి గుడికట్టించి విగ్రహాన్ని ప్రతిస్టించాలనుకొన్నది.రాజు ఉత్తర దేశ యాత్రకు వెళ్లి అక్కడినుంచి విలువైన పాలరాతి పలక  తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని చెక్కించి ‘’పత్తినిక్కడవుళాల్’’పేరిట దేవతగా ఆగుడిలో స్థాపించి నిత్యపూజానైవేద్యాలు ఏర్పాటు చేశాడు .ఇలా కణ్ణగి దేవతయై  పూజల౦దు కొంటోంది.ఇదే శిలప్పాదికారం కావ్య కథా విశేషం .

  మణి మేఖలై అనే ఆమె కథ ను నత్తనార్ ‘’మణి మేఖలై’’కావ్యంగా మలిచాడు .ఇదికూడా తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటి .శిలప్పాదికారం గీతాలు(ఇశై ) నాటకలక్షణాలతో రాణించింది .సముద్రగానం ,ఏటి పాటలు ,ఊయలపాటలు  కూడా ఉన్నాయి .తమిళరాజ్యాలైన పాండ్య, చోళ , చేర, రాజ్యాల పరస్పర సంబంధాలు ,మత సాంఘిక విషయాలు ,ప్రజల జీవనపరిస్థితులు మొదలైన సమస్త విషయాలు ,క్రీస్తు శకారంభం లో తమిళుల జీవిత చరిత్ర తెలుసుకోవటానికి శిలప్పాదికారం కావ్యం బాగాతోడ్పడుతుంది కనుకనే ఇలంగో అడిగళ్ తమిళ సాహిత్య నిర్మాతలలో ఒకడుగా గుర్తి౦ప బడినాడు .

ఆధారం –కోరాడ వారి ‘’తమిళ సాహిత్య నిర్మాత –ఇలంగో ‘’వ్యాసం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-19-ఉయ్యూరు

image.png

image.png

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11

భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )

  ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో  గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు .బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ ప్రకాశం ‘’అనే వ్యాఖ్య,సిద్ధాంత కౌముదిపై ‘’శరద్రాత్రి ‘’వ్యాఖ్యానం  రాసి, తన అసామాన్య శాస్త్ర పరిజ్ఞానాన్ని చాటుకొన్నారు .చంపూ గద్యకావ్యాలూ రాశారు .37వ ఏటనే మరణించిన మేధావి .గుంటూరు లోఉన్న ఒక శంకర మఠ పీఠానికి అధ్యక్షులైన శ్రీ కల్యాణానంద భారతీ మా౦తాచార్యులవారు సుమారు నలభై ఏళ్ళు అద్వైతమత ప్రచారం చేశారు .అసమాన పాండిత్యం ఇంగ్లీష్ లో అభినివేశం ఉన్న వీరు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు సంస్కృతం లో వ్యాఖ్యలు రాసి ప్రచురించారు .వీరి శిష్యులు లింగన సోమయాజులుగారు పంచదశి వ్యాఖ్యానం ,ఉపనిషత్ లకు వ్యాఖ్యానం రాశారు .

  విజయనగరానికి చెందిన ముడు౦బి వెంకట రామ నరసింహా చార్యులు 1842లో జన్మించి ,96ఏళ్ళు జీవించి 1938లో స్వర్గస్తులయ్యారు ఈయన తత్వ శాస్త్ర రచనలు కావ్య నాటక ఆలంకారిక గ్రంథాలు ,చంపూ కావ్యాలు రాసిన మేధావి .వీరి వంశ మూలపురుషుడు ముడు౦బి ఆచాన్ రామానుజులు ఏర్పాటు చేసిన 72గురు వైష్ణవ ఆచార్యులలో ఒకరు .విజయనగరం లో విజయరామ గజపతి ఆస్థానపండితుడైబ్రహ్మ సూత్రాలకు ‘’బ్రహ్మ సూత్రరోమంధనము ‘’భాష్యాన్ని ,తత్వ దర్పణం అనే స్వతంత్ర వేదాంత గ్రంథం ,పాతంజలి యోగసూత్రవ్యాఖ్యానం మొదలైనవి రచించాడు .శతాధిక ఇతర సంస్కృత  రచనలూ చేశాడు.

  తర్క సంగ్రహం కు దీపిక వ్యాఖ్య రాసిన అన్నం భట్టు ,గౌతమసూత్రాలను అనుసరించి కేశవ మిశ్రుడు రాసిన తర్కభాషకు తర్కభాషా ప్రకాశం రాసిన చెన్నుభట్టు ఆంధ్రులే .జగదీశుని సిద్ధాంత లక్షణం పై క్రోడపత్రం  ‘’సంగమేశ్వర క్రోడ’’రాసిన తార్కికులు మహాపండితులు  గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రిగారు  విజయనగరం వాస్తవ్యులు .బ్రహ్మ సూత్రాలకు శ్రీకర భాష్యం అనే శైవ భాష్య కర్త శ్రీపతి పండితుడు పశ్చిమగోదావరిజిల్లా తణుకు తాలూకా కాలధారి గ్రామనివాసి అయిన ఆంధ్రుడు .ఇంతమంది ఆంధ్రులు సంస్కృత తత్వశాస్త్రాన్ని తేజోమయం చేశారు .

ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త్రమునకు ఆంధ్రుల సేవ ‘’వ్యాసం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment