కంచి పరమాచార్యులవారిని స్మరించి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డా పిన్నమనేని వెంకటేశ్వరావు

విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి  నార్జించింది  .రోగులపాలిటి స్వర్గ ధామం  అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు గా సేవలందించారు .

  1967కాలం లో కంచి పరమాచార్యులపై వ్యాసాలూ వారి అనుగ్రహ భాషణలు  ఆంధ్ర ప్రభలో వచ్చేవి .డాక్టర్ గారి కుటుంబం వాటిని అతి శ్రద్ధగా చదివి  మననం చేసుకొనేవారు .ఆ కాలం లో  వారి కుమార్తె మరణించటం ,వారి  రెండవ కుమారునికి తీవ్ర అనారోగ్యం చేయటం వలన కుటుంబం లో మనశాంతి లేకుండా పోయింది .కొడుకు జబ్బు ఏమిటో తెలుసుకోవటానికి వారు దేశం లో తిరగని హాస్పిటల్ లేదు .కానీ ఎవరూ రోగ నిర్ణయం చేయలేకపోయారు .చివరికి ఢిల్లీ వెళ్లి ఆలిండియా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో చూపించి డయాగ్నైజ్  చేయించాలనుకొన్నారు   .

  ఢిల్లీ వెళ్ళే ముందు పరమాచార్యులను దర్శించాలనుకొని నరసరావు పేట లో దర్శించారు .సుమారు 45 నిమిషాలు  శ్రీవారితో గడిపారు .ఢిల్లీ వెడుతున్నామని చెప్పగానే ,కురుక్షేత్రం లో దేవుని దర్శించి ఢిల్లీ వెళ్ళమని ఆదేశించారు .అలాగే కురుక్షేత్ర వెళ్లి స్వామి దర్శనం చేసుకొని ఢిల్లీ వెళ్లి మెడికల్ సైన్సెస్ ఇన్ స్టి ట్యూట్ లో కుమారుని చేర్పించి ,పరీక్ష చేయించారు  .అన్ని పరీక్షలు చేశాక వారి అబ్బాయికి ఏ రకమైన జబ్బు లేదని డాక్టర్లు ధృవీకరించారు  .అప్పటిదాకా మనసు లో ఉన్న అశాంతి ఒక్క సారిగా మటుమాయమై కుటుంబానికి శాంతి లభించింది . ఆరోజు నుంచి  ఆ కుమారుడికి ఏ రకమైన జబ్బూ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు .

 పిన్నమనేని వారికి జీవితం లో ఏ సమస్యలు వచ్చినా శ్రీ వారి దర్శనం చేస్తారు. అవి వెంటనే పరిష్కారమవుతాయి .శ్రీ వారి దర్శనం తో తమకు కలిగే ఆనందాను భూతులు మాటలలో  వర్ణించలేమని అంటారు డా వెంకటేశ్వరరావు .ఉదయం, రాత్రి శ్రీవారిని స్మరించకుండా వారు రోజు గడపరు .అంతే కాదు అప్పటినుంచి తాను ఏ రోగికి శస్త్ర చికిత్స చేసినా ,స్వామిని స్మరించిమాత్రమే చేస్తాను అని చెప్పారు డా .పిన్నమ నేని .ఈ విషయాన్ని ‘’స్వామిని  స్మరించి శస్త్ర చికిత్స ‘’వ్యాసం రాశారు .

image.png

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-19 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు

  కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి అనుగ్రహించటం వారి ప్రత్యేకత .వారి ఔదార్యాన్ని అనుభవించిన వారెందరెందరో ఉన్నారు .ఒక్కొక్కరిది ఒక్కో దివ్యానుభవం .అలాంట వారిలో విజయవాడ లో ఇప్పడు బెంజ్ సర్కిల్ అని పిలువబడే చోట దాదాపు యాభై ఏళ్ళక్రితం ‘’బెజవాడ మోటార్స్’’అధినేత ,వితరణ శీలి బెజవాడలో వైదిక మహా సభలు పెద్ద ఎత్తున నిర్వహించి అందరి చేతా ‘’పంతులు గారు ‘’అని గౌరవంగా పిలువబడే బ్రహ్మశ్రీ మాగంటి సూర్యనారాయణ గారొకరు .  వీరికి రామవరప్పాడులో గొప్ప ఎస్టేట్ ఉండేది .  మాగంటి వారు శ్రీవారిని 1962లో ఇలత్తాన్ గుడిలో మొదటి సారిగా దర్శించుకొన్నారు .అప్పుడు మాగంటివారి అల్లుడు పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మూర్ఛ వ్యాదివలన బాగా బాధపడ్డారు .డాక్టర్ల నందర్నీ సంప్రదించి మందులు వాడారు .గుణం కనపడ లేదు .పూజ్యులు ,పండితులు ,శ్రీవారికి పరమ భక్తులు బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారి సలహాపై శ్రీవారిని దర్శించారు .వ్యాధి విషయం గ్రహించి తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా ‘’పంచగవ్యాలు ‘’ఇప్పించమని ఆదేశించారు .అలాగే చేశారు మాగంటివారు   .తొమ్మిది ఆదివారాలు అవగానే మాగంటి వారి అల్లుడికి  మూర్ఛ రోగం మటుమాయమైంది .

  అప్పటికే సూర్యనారాయణగారు మోటారు కార్ల విక్రయం చేస్తున్నారు .పోటీ ఎక్కువగా ఉండటం తో అమ్మకాలు తగ్గాయి  వర్కర్లు మానేసి వెళ్ళిపోయారు .దిక్కు తోచని పరిస్థితి లో పడ్డారు .అన్నిటికీ పరమాచార్య పైనే భారం వేసి ,కుటుంబం తో కాంచీపురం వెళ్లి మఠం లో  భిక్ష చేశారు .భిక్ష అవగానే పరమాచార్యస్వామి ఆశీర్వదిస్తూ ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’ అని ఆశీర్వదించారు .

  అప్పటిదాకా మాగంటివారు మోటారుకారు వ్యాపారం మీద నెలకు మూడు వేలరూపాయలు అమ్మకం పన్ను చెల్లించేవారు .స్వామి వారి  ఆశీర్వాదం తర్వాత  స్వామి అనుగ్రహం తో నెలకు లక్షరూపాయ;ల పన్ను చెల్లించారు .అప్పుడు ఆయనవద్ద ఒకే ఒక పని వాడు అంటి పెట్టుకొని నమ్మకం తో ఉండేవాడు . బయటకు వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారు లేకపోయారు .కాని స్వామి వారి అనుగ్రహం తో ,  ఆశీర్వాద బలం తో నాలుగైదుజిల్లాల నుండి తెలిగ్రాములద్వారా ఆర్డర్లు వచ్చేవి .కంపెనీ వారికి ఈ విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయారు .ఇదంతా పరమా చార్యుల ప్రభావం కాక వేరొకటి కానే కాదు అని పంతులుగారు మనస్పూర్తిగా నమ్మారు .స్వామి సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాత్రుడు కాదు అని విశ్వసి౦చారు .ఈ విషయాలన్నీ మాగంటి  సూర్యనారాయణ పంతులుగారు  ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’అనే  వ్యాసం లో రాశారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-19-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

1937 ప్రారంభం లో కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు కాశీ యాత్ర పూర్తి చేసి ,ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ,గోదావరి జిల్లాలో సంచారం ప్రారంభించారు .గ్రామాలలో తమ దివ్య సందేశాలతో ఆస్తిక జనులను ఉత్తేజితులను చేశారు .తర్వాత అక్కడి కోన సీమ లో ముక్కామల గ్రామం చేరారు .అక్కడున్న ఉద్దండ పండితులైన శ్రీ దువ్వూరి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ భమిడిపాటి సోమనాధ శాస్త్రిగారు మొదలైనవారు మంగళవాద్య, పూర్ణ కుంభం లతో స్వాగతం పలికి పుష్పమాలాలంకృతులను చేసి ,స్వస్తి  వాచకాలతో ముక్కామల గ్రామం లోకి ప్రవేశపెట్టారు .

  అది స్వామి వారి జయంతి మహోత్సవ సమయం కనుక శ్రీ దువ్వూరి బాలకృష్ణ మూర్తి గారు శ్రీ వారి అధ్యక్షతన తొమ్మిది రోజులు ‘’బ్రహ్మ సత్రం ‘’జరపాలని ఉన్నదని ఎరిగించి వారి అనుగ్రహం పొందారు .బ్రహ్మానంద భరితులైన మూర్తిగారు ఈవిషయాన్ని దేశం లో ఉన్న అనేక మంది పండితులకు గృహస్తులకు ఆ క్రతు మహోత్సవం లో పాల్గొనవలసినదని ఆహ్వానాలు పంపారు .వారిఆహ్వానానికి విశేష  స్పందన కలిగి ముక్కామల గ్రామం యతులతో ,పండితులతో  గృహస్తులతో నిండి పోయి కను విందు చేసింది .

   అప్పుడు నెల్లూరులో ఉన్న బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు తనకు అందిన ఆహ్వానాన్ని మహా భాగ్యంగా భావించి విచ్చేశారు .ఆ రోజే శ్రీవారి ప్రధమ దర్శన భాగ్యం వారికి దక్కింది .క్రతు సమాప్తి వరకు అక్కడే ఉండి, శ్రీవారి అధ్యక్షతన’’బ్రహ్మ సభ ‘’గా జరురుగుతున్న   సభలో పాల్గొని వారి అనుజ్ఞ తో ప్రవచనాలు చేస్తూ , స్వామి దివ్య దర్శనం తో పులకించిపోయారు .క్రతువు పరిసమాప్తి అయ్యాక శ్రీవారి అనుమతితో నెల్లూరు చేరారు .

  1938లో శ్రీవారు చాతుర్మాస్య వ్రతానుస్టానం పూర్తి చేసి ,మార్కాపురం లో శరన్నవరాత్రుల ఉత్సవాలను జరిపి ,మార్గ శిరమాసం లో నెల్లూరు చేరారు .గ్రామజనుల కోరికపై అక్కడే మూడు నెలలు ఉండి పోయారు .ఒక రోజు వారి సమక్షం లో ప్రవచనం చేస్తున్న మండలీక వేంకట శాస్త్రిగారు ప్రసంగవశాన ‘’చరమ వృత్తి ‘’అని ఏదో చెప్పబోయారు .వెంటనే శ్రీవారు ‘’శాస్త్రీ !చరమ వృత్తి అంటే ఏమిటి ‘’?అని ప్రశ్నించారు .అప్పటికప్పుడు శాస్త్రిగారు ‘’మరణ కాలీనమైన వృత్తి’’అని చెప్పారు . వెంటనే పరమాచార్యులవారు ‘’ధ్యాన పరిపాక అవస్థ లో కలిగే అఖండ బ్రహ్మాకార వృత్తి నే’’ చరమ వృత్తి’’అంటారు అని సెలవిచ్చారు .శ్రీవారు చెప్పారు అంటే అది పరమ సిద్ధాంతమే అని శాస్త్రిగారు నమ్మి ,తాను  చెప్పింది కూడా ఎక్కడో ఉన్నది తానూ చదివిందే అని గుర్తుకు వచ్చి ‘’స్వామీ ! రేపు ఈ విషయం గూర్చి మనవి చేస్తాను ‘’అని చెప్పి ,ఆరాత్రి తమవద్ద ఉన్న ‘’అద్వైత సిద్ధి ‘’గ్రంథాన్నితిరగేశారు .అందులో మూడు చోట్ల ‘’చరమ  వృత్తిః మరణ కాలినా , అఖండ బ్రహ్మాకార వృత్తిః’’అని అని ఉండటం తో తాము  చెప్పింది సరైనదే అని నిశ్చయం చేసుకొని  వాటిని గుర్తుపెట్టుకొని ,మర్నాడు శ్రీవారి సన్నిధి చేరి వాటిని వివరించారు .

  స్వామీజీ ‘’ఇంకా రెండు చోట్ల ఉండాలి .చదివి వినిపిస్తావా “”? అని అడిగారు .ఆశ్చర్యపోయిన శాస్త్రిగారు ఇంకా తను వేరే చదవాల్సింది ఏమీ లేదని వినమ్రంగా చెప్పారు .అప్పుడు శ్రీవారు ‘’నువ్వు చెప్పిన దానికి ప్రమాణం చూపావు బాగానే ఉంది .మరి నేను చెప్పిందానికీ ప్రమాణం చూపించు ‘’అన్నారు చలోక్తిగా .మండలీక శాస్త్రిగారు ‘’నేను మానవ మాత్రుడిని కనుక నా వాక్యానికి ప్రమాణం కావాలి. తమరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు .భగవంతుని ముఖం నుంచి నిర్గతమైన వేదం లాగా శ్రీవారి ముఖ నిర్గత వాక్యానికి ప్రమాణం అవసరం లేనే లేదు ‘’అన్నారు. .శ్రీవారు ఉదారం గా నవ్వుతూ ‘’నీకు వకాల్తా ఇస్తున్నాను .నేను చెప్పిన వాక్యానికి కూడా ప్రమాణం చూపించి చెప్పు ‘’అని ఆదేశంలాంటి అనుగ్రహం చేశారు .

  స్వామివారు చెప్పిన వాక్యానికి ప్రమాణం ఎక్కడ వెతకాలో అర్ధంకాక శాస్త్రిగారు  ఇంటికి చేరి అదే ఆలోచనలో ఉండి పోయారు .కాకతాళీయంగా శాస్త్రిగారు తమ పుస్తకాల బీరువా వెతుకుతుండగా భగవద్గీత కు శ్రీ మధు సూదన సరస్వతి స్వాములవారు రాసిన ‘’గూడార్ధ దీపిక ‘’అనే వ్యాఖ్యానం కనిపించి. అందులో 18 వ అధ్యాయం పై దృష్టిపడింది  .చూశారు .అందులో అద్వైతులకు దేహాదుల స్థితి ఎలా కలుగుతుంది అనే  ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి .1-  బ్రహ్మజ్ఞానం కలుగగానే అజ్ఞానం పూర్తిగా నశించదు .ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది .ఈ కొద్దిదానివలన మళ్ళీ శరీర ధారికావచ్చు .ఈ లేశమైన అజ్ఞానం మరణ సమయం లో అఖండ బ్రహ్మాకార వృత్తి మళ్ళీ కలిగి నశిస్తుంది .అప్పుడే విదేహ ముక్తి సిద్ధిస్తుంది .ఈ విషయం లో ‘’చరమ  వృత్తి అంటే మరణకాలీన అఖండ బ్రహ్మాకార వృత్తి అని అర్ధం .కాని అజ్ఞానం కొద్దిగా అంటే లేశమాత్రంగా మిగలటం అసంభవం అని భావించి ,అజ్ఞాన సంస్కారాను  వృత్తి ని చెప్పారు .

2-కరెంట్ స్విచ్ ఆన్ చేయగానే ఫాన్ తిరిగి ,కరెంట్ ఆపేసినా కొంతకాలం తిరిగి ఆగిపోతుంది .అలాగే బ్రహ్మవేత్తకు ధ్యాన పరిపాకం చివర కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూప జ్ఞానం వలన  దేహ ఇంద్రియాలకు చెందిన అజ్ఞానం నశిస్తుంది .ఫాన్ ఉదాహరణలో చెప్పినట్లే ,సంస్కార వశంతో కొంతకాలం దేహే౦ద్రియాదులు తిరిగి ,తర్వాత సంస్కారం నశించటం వలన ,మరణకాలం లో బ్రహ్మ జ్ఞానం అవసరం లేకుండానే స్వయంగా దేహెం దేహే౦ద్రియాదులు పోతాయి .ఈ పద్ధతిలో చరమ వృత్తి అంటే ధ్యాన పరిపాకం చివర కలిగే వృత్తి ‘’అని చెప్పబడింది. దీనినే శ్రీవారు ఉటంకించింది .

  మర్నాడు స్వామి వారి సన్నిధికి వెళ్లి శాస్త్రిగారు తాను చూసిన విషయాలు చెప్పారు .వెంటనే ‘’ఆ పుస్తకం చూడాలని  నీకుఎలా  తోచింది  ?’’అని ప్రశ్నించారు .శాస్త్రిగారు ‘’నాకు తెలియకుండా ,నాకు కనిపించకుండా ఎవరో ఈ సాయం చేశారు .అంతకంటే నేనేమీ చెప్పలేను ‘’అన్నారు నతమస్తకులై శాస్త్రిగారు .శ్రీవారి  సన్నిధిలోఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ,వారితో సంభాషిస్తే ఎన్నో సిద్దా౦త రహస్యాలు బయటపడతాయని, వారి దివ్య దర్శనం తో ఎందరికో వ్యాధులు నయమయ్యాయని శ్రీవారి దివ్య ఉపదేశ అమృత సేవనం తో ప్రజలకు అత్యంత శాంతి లభిస్తుందని బ్రహ్మశ్రీ మండలీక  వేంకట శాస్త్రి గారు పరమాచార్యుల సప్తతి జయంతి మహోత్సవ సందర్భంగా ఆంద్ర ప్రభలో రాశారు .అందులోని ముఖ్య విషయాలు నా భాషలో మీకు తెలియజేశాను .శ్రీ వారిపై శాస్త్రిగారు రచించిన శ్లోకం –

‘’అజ్ఞానా౦తర్గహన  పతితా ,నాత్మ విద్యోప దేశైః-త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాపపాప చ్యమానాన్ ‘’

ముక్ష్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ- శంభో ర్మూర్తిః,చరతి భువనే శంకరాచార్య రూపా ‘’

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-19-ఉయ్యూరు

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

 

శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు


ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక సభ్యులు ,ఆర్గనైజర్ జాగృతి వారపత్రికల కాలమిస్టు  వీటికి మించి మహా గొప్ప కథా రచయితా   జాగృతి లో  ప్రతివారం సినిమాలపై హాస్య స్పోరకంగా సమీక్ష రాసేవారు, సరస సంభాషణా చతురులు మర్యాదా పురుషోత్తములు ,నాకు మార్గదర్శి ,రోల్ మోడల్ ,మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మా మేనల్లుళ్ళు అశోక్ ,శాస్త్రి లకు ,మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ కు బందరులో లెక్కల గురువు ,  R.S.K.గా అందరూ  పిలిచే స్వర్గీయ శ్రీ రాజనాల శివ రామ కృష్ణ మూర్తి  గారు 10-4-1996 న అంటే 23 ఏళ్ళ క్రితం నాకు బందరునుంచి రాసిన కార్డ్ శిధిలమై చీకి  చినిగి అంచులు కనిపించని స్థితిలో  ఇవాళ దేనికోసమో వెతుకుతుంటే దొరికింది . ఇది నాకు గొప్ప” ట్రెజర్ ”అని పించింది . కార్డు లోనే సర్వ విషయాలు సరిపుచ్చారు వారికి నా యెడల ఉన్న ఔదార్యానికి ఇది నిదర్శనం.  వారి రాజకీయ పరిజ్ఞానానికి  దర్పణం . -మీ దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు
Posted in సమీక్ష | Tagged | Leave a comment

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లా రచయిప్రచురణార్థంతల సంఘం సహకారంతో, 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి.

కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలి మహాసభలు మాతృభాషోద్యమ నిర్మాణం లక్ష్యంగా జరుగగా, 2011లో సాంకేతిక తెలుగు అంశం పైన రెండవ మహాసభలు జరిగాయి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భాషపరంగా తెలుగు వారంతా ఒక్కటేననే అంశాన్ని చాటుతూ 2015లో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగిన వైనం తెలిసినదే!

2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించవలసిందిగా అటు తెలుగు ప్రభుత్వాలు ఇటు తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టే లక్ష్యంతో 2019 డిసెంబరు 27, 28, 29 తేదీలలో విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ 4వ మహాసభలు జరుగుతున్నాయి. మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ ఈ మహాసభల ప్రధాన ధ్యేయం.

తెలుగుతోపాటు తెలుగు నేలపైన కోలమి, కోయ, గోండి, కువి, కుయి, యెరుకల, సవర, పర్జి, కుపియా, బంజారా లాంటి భాషల్ని మాతృభాషలుగా కలిగిన ప్రజలు, అలాగే ఉర్దూ మాట్లాడే ప్రజలు తెలుగువారిగానే జీవిస్తున్నారు. తెలుగుతో పాటుగా ఈ మాతృభాషలన్నీ ప్రపంచీకరణం కోరల్లో చిక్కుకున్నవే! మాతృభాషల్ని మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోయి చివరికి అవి తమ ఉనికినే కోల్పోతాయి. ఇప్పటికే మాతృభాష లెన్నో అంతరించి పోయాయి. దీన్ని నివారించ గలగాలి.

ఈ మహాసభలలో ముఖ్య చర్చనీయాంశాలు:

·         తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్రం మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి…

·         తెలుగు నేలపైన అన్ని విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న వివిధ జాతుల మాతృభాషల పరిరక్షణ కోసం

ప్రత్యేకంగా మాతృభాషల పీఠాలుఏర్పరచి నిధులు, నిధులు సమకూర్చటం గురించి…

·         తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల గురించి..

·         అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష

విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి…

·         రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పనగురించి…

·         ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి గురించీ…

·         తెలుగు విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలుగురించి…

·         తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకునేందుకు కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి…

·         తెలుగేతర ప్రాంతాల్లో జీవిస్తున్న తెలుగు వారికి హిందీ మాదిరే ప్రాధమిక, మాధ్యమిక పద్దతిలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ గురించి…

·         యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచటం గురించి,

·         గత ఐదేళ్లుగా ఆగిపోయిన సాహితీ గ్రంథాల కొనుగోళ్ల గురించి…

·         ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా లోతైన అధ్యయనం జరిగేందుకు వీలుగా మరిన్ని చర్చనీయాంశాలు సూచించ వలసిందిగా ఆయారంగ ప్రముఖులను కోరుతున్నారు.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

2007 ప్రధమ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రపంచ తెలుగు రచయితల సంఘంఏర్పడింది. 2011 రెండవ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘంఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యత కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.

2019 జనవరిలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిష్ట్రేషన్ చేయించారు. గౌరవాధ్యక్షులుగా డా. మండలి బుద్ధప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

అధ్యక్షులుగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ గోళ్ల నారాయణ రావు, కార్యదర్శిగా డా. జి వి పూర్ణచందు, సహాయకార్యదర్శిగా డా. గుమ్మా సాంబశివరావు, కోశాధికారిగా శ్రీ టి శోభనాద్రి, కార్యవర్గ సభ్యులుగా డా. ఈమని శివనాగిరెడ్డి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ పంతుల వెంకటేశ్వర రావు, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గార్లతో ఏర్పడిన కార్యవర్గం ఈ మహాసభలను నిర్వహిస్తోంది.  

రేపటి మహాసభల నాటికి ప్రపంచ వ్యాప్తంగా సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గం కలిగిన ఒక అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా తెలుగు భాషాసంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేస్టూ, ప్రపంచ తెలుగు” కలను నిజం చేయటం ఈ సంస్థ లక్ష్యం.  తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది.    ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో రూ. 2000/-(విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, జీవిత సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన. రచయితలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యాభిమానులైన ప్రతీ ఒక్కరూ ఈ సంస్థలో జీవిత సభ్యులుగా చేరవచ్చు.

మహాసభల ప్రతినిథులకు సూచనలు

ప్రతినిధులుగా పాల్గొనేవారు ఈ మహాసభల కోసం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితసభ్యులుగా చేరిన వారు అదనంగా ఈ ప్రతినిథి రుసుము చెల్లించనవసరం లేకుండా మినహాయింపు నిస్తున్నారు. ప్రతినిధి రుసుమునుగానీ, జీవిత సభ్యత్వాన్ని గానీ డి.డి. లేదా చెక్కు రూపేణా   PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగా వ్రాసి, కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం, 1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్హాం పేట పోష్టాఫీసు ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ-520002 చిరునామాకు పంపవలసి ఉంటుంది.

ప్రతినిధులు, జీవిత సభ్యులకు, ప్రతినిధులకు  మాత్రమే ఈ మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహారాలుంటాయి. వసతి ఏర్పాట్లు మాత్రం ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది.

ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 అక్టోబరు 31.

జీవిత సభ్యులుగానూ, ప్రతినిధులుగా నమోదయిన వారికి కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలోనూ ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ప్రపంచతెలుగువ్యాస సంపుటిలోనూ  ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది.

సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఎప్పటిలానే  కల్పిస్తున్నారు.  

మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి. ఎవరో వచ్చి ఆహ్వానించా లనుకోకుండా, మాతృభాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని నిర్వాహకులు ప్రార్థిస్తున్నారు.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం http://www.prapanchatelugu.com వెబ్సైట్ చూడగలరు. మీ సమాచారాన్ని ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com కు పంపవచ్చు.  శ్రీ గుత్తికొండ సుబ్బారావు,అధ్యక్షుడు 9440167697, డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి  9440172642లతో సంప్రదించవచ్చు.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ 

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్

మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ
” ఏంట్రా విశేషాలు ?”అడిగా .
”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ  వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా ?”అన్నాడు
”విన్నాను ”అన్నాను .
”మళ్ళీ ఇన్ని శతాబ్దాల తర్వాత మన రాష్ట్రం లో గోల్డ్ రష్ లాగా జాబ్ రష్ వచ్చి జాబులే జాబులు బావా . యెంత అదృష్టమో మన రాష్ట్రానికి పట్టింది తేనే తుట్టెలాగా అన్నాడు
”తలా తోకా లేని ఈ కమామీషు ఏంట్రా ?” అన్నా
”పేపర్ చదవవు.  చానల్స్ చూడవు.  ఇంటర్వ్యుల జోలికి పోవు.  నువ్వు బావ అని చెప్పుకోటానికి కూడా సిగ్గుగా ఉంది  లోకజ్ఞానం ఎలావస్తుంది బావా .?”అన్నాడు నిస్సిగ్గుగా
”అసలు విషయం ఏడవక ఈ నాన్చుడేమిట్రా?”అన్నాను గద్దించి
”పాకీ పని చేసేవారు  రోజుకు  గంటమాత్రమే పని చేస్తారని ,ఆపని తానుకాని చీఫ్ సేక్రేటరికాని లక్షరూపాయలిచ్చినా   చేయరని కనుక వారిజీతం భారిగా 18వెలరూపాయలుఇవ్వాలని సిఎం ఆదేశంట ఇది లీక్ అయి అందరికీ ”డిగ్నిటి ఆఫ్ లేబర్ ”గుర్తుకొచ్చి జనం కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలకోసం అప్లికేషన్లు పెట్టటం పైరవీలు చేయటం సాగించారట .
”పోన్లేరా  మంచి  ప్రోగ్రెసివ్ ఐడియా బాగుంది పాపం కిందతరగతి వాళ్లకు ఇప్పటిదాకా ఆపనే చేస్తూ ఎదుగూ బోదుగూలేనివారికి గోల్డెన్ ఆపర్ట్యూనిటి”అన్నాను
”నిజమే నేనూ అలానే అనుకొన్నా -కానీ ”అన్నాడు
”ఈ కానీ, అర్ధణాలేమిట్రా ”?అడిగా
”అక్కడే ఉంది తిరాకాసు దీనికి క్వాలిఫికేషన్ యెస్. సి పెట్టారు
”మంచిదేగా ఎస్సీలైనా బాగుపడతారు ”అన్నా
”అక్కడే తప్పులో కాలేశావు . యెస్. సి లంటే వేరే అర్ధం ఉందిలే . నీకు తెలీదు ”అన్నాడు
”మరి రష్ ఎందుకురా ?”
ఆప్రత్యేక  యెస్. సి  ప్రజాప్రతినిధులు ,అన్ని వర్గాలవారు గంట పనికి 18వేలు అనగానే డిగ్నిటి ఆఫ్ లేబర్ గుర్తుకొచ్చి ,పార్ట్ టైం జాబ్ కదా అని  పరి గెత్తుకోస్తున్నారని,సెలెక్షన్స్ కూడా వాళ్లవాళ్లేకనుక జాబ్ గ్యారంటి అనీ అంతగా అవసరమైతే ”ఉత్తరాయణం దక్షిణాయనం ”  ఉన్నాయి అనే ధీమా గా ఉన్నారని చెవులు కోరుక్కొంటున్నారు బావా ”అన్నాడు
”విలేజ్ వర్కర్లుగా  వాళ్ళ వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకొన్నారని అంటున్నారు కదా మళ్ళీ ఈ కక్కూర్తి ఏమిట్రా ?”అన్నాను
”డబ్బెవరి చేదుబావా  అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటేనే కదా ఎన్నికలలో తాము పెట్టింది అంతా పూడ్చుకోగలుగుతారు ”
”మంచి విషయాలు చెప్పి నాకు జ్ఞానబోధ చేశావు . మంచి జరుగుంతోందేమో అని ఆశించిన నా ఆశలపై నీళ్ళు కుమ్మరించావు ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అన్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు
 
Posted in రచనలు, రాజకీయం | Tagged | Leave a comment

కొత్త కొలువుకూటం 

కొత్త కొలువుకూటం 

ఈ మధ్యదాకా ”గౌరవ సభ ”

నలభై రోజుల్నించి ”కౌరవ సభ ”
ఇప్పటిదాకా ”పూతు ”సభ 
ఇప్పుడేమో ”బూతు సభ ”
మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం 
నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం  
ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం 
ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం 
 మాటకు  చేత కు నాడు ఆదర్శం 
  చేతకు  మాటకు నేడు  మైళ్ళ దూరం 
వివేకం విజ్ఞానం దూరదృష్టి నాడు 

అజ్ఞానం ,అహంకారం ,అసహనం నేడు 

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-19-ఉయ్యూరు 
Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రముఖులకు సరసభారతి నివాళి 

ప్రముఖులకు సరసభారతి నివాళి

 ఇటీవల నెల రోజులలో మరణించిన ప్రముఖ రచయితలు1- శ్రీ రామతీర్థ , 2-మహాస్వప్న ,3-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ,4-దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ 5-,శ్రీమతి విజయనిర్మల ,6-నటుడు శ్రీ రాళ్ళపల్లి ,7-సాంఘిక విద్యా సేవకురాలు శ్రీమతి వి కోటేశ్వరమ్మ గార్లకు నివాళి కార్యక్రమాన్ని సరసభారతి 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గం లకు స్థానిక ఏ సి గ్రంధాలయం లో నిర్వ హిస్తోంది .సాహిత్య సంగీతాభిమానులు  పాల్గొని నివాళి సమర్పించవలసినదిగా కోరుతున్నాము
  గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
 మాదిరాజు శివ లక్ష్మి -కార్యదర్శి
 20-7-19 -ఉయ్యూరు  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

                        నేపధ్యం  

సరసభారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు మా తలిదండ్రులు కీ శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ  గారల స్మారక ఉగాది పురస్కారం అందజేయటానికి హైదరాబాద్ లో ఉన్న నోరి నరసింహ శాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఎం.ఇ. గారిని ఆహ్వానించి పురస్కారం అందించి సత్కరించాము .అప్పుడు వారు  జులై 14 ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో వ్యాస పౌర్ణమి సందర్భంగా నాకు గురు పురస్కారం అందిస్తామని రహస్యం గా చెప్పారు .సరే అన్నాను .కానీ యెవరికీ నేను చెప్పలేదు .జూన్ 20కు అందెట్లుగా నాకు ఆహ్వాన పత్రాలు పంపారు .అందులో త్యాగరాజ గాన సభ నిర్మాత , లలితకళా ప్రపూర్ణ  శ్రీ కళా సుబ్బారావు పురస్కారం అందిస్తున్నట్లు ఉన్నది .ఈ ఆహ్వానాన్ని అందరికీ పంపాను .అందరూ అభినందించారు .డా .రామడుగు వేంకటేశ్వర శర్మగారు గుంటూరు నుండి తనకు నేనుపంపిన ఆహ్వానం అందగానే ఫోన్ చేసి యెంతో సంతోషించి  కళా సుబ్బారావు గారి సాహిత్య ,కళా సేవలను వివరించి ‘’మీకు వారి అవార్డ్ రావటం ‘’చాలా అభినందనీయ విషయం అని నన్ను అభినందించారు .ఒక గొప్పవారి పేరిట  ఒకప్పుడు మన  రాస్ట్రమే అయినా నేడు వేరొక రాస్త్రం అయిన తెలంగాణాలో అందునా రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో అందులోనూ ఘనత వహించిన త్యాగ రాజ గాన సభ లో పురస్కారం అందుకోవటం నేను ఊహించని విషయం .అది జరుగబోతున్నందుకు మా కుటుంబం అంతా యెంత గానో సంతోషింఛారు .

      ప్రయాణ సన్నాహం

https://photos.app.goo.gl/BPE4LARCx1K3Ks4q8

 జులై 12 శుక్రవారం తొలి ఏకాదశి పర్వదినం కనుక ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం నుంచి  బయల్దేరాలను కొన్నాం  . 14 వ తేదీ సభకు నాతోపాటు ఉన్న పురస్కారగ్రహీతలు అతిధులు కలిపి 12 మండి ఉన్నారు  వీరికి నేను రాసి ,సరసభారతి  ప్రచురించిన ‘’ గీర్వాణకవుల  కవితా గీర్వాణం 3 భాగాలు  దైవచిత్తం మొత్తం 4పుస్తకాలు అందజేయాలని 16 సెట్లు దేనికది ఒక ఒక కవర్ లో పెట్టి రెడీ చేసి రెండు అట్ట పెట్టెలలో పాక్ చేసి సిద్ధం చేశాను . వీటి బరువు చూసి మా శ్రీమతి గుండె బాదుకొని బస్ లో వద్దు కారులో వెళ్దాం అన్నది .నేను ‘’కొండవలస ‘’లాగా ‘’ఐతే వాకే’’అన్నాను  .మా సంగతి ముందే తెలిసిన మా అబ్బాయి   రమణ కారు బుక్ చేస్తానని చెప్పాడు .సరే అన్నాను .  మా ఆన్నయ్య గారబ్బాయి రామనాధ్ శిష్యుడు మా అందరికీ బాగా పరిచయమున్న ఉయ్యూరులోని యమహాకంపెనీ మేనేజర్ దావూద్ గురువారం ఉదయం తాను కొత్త కారు కొన్నానని , రమణకు చ్చెప్పాడట  .వాడు మా హైదారాబాద్ ప్రయాణం సంగతి చెబితే ‘’మొదటి రైడింగ్  తాతయ్య్గ  గారు అమ్మమ్మగారి తో చేయిద్దా0’’అని చెప్పి డ్రైవర్ ను మాట్లాడి కారు తెచ్చి మా వాటర్ ప్లాంట్ లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టాడు.   మేమిద్దరం మా మనవడు చరణ్ మధ్యాహ్నం 12 కే భోజనం చేసి  పావుతక్కువ 2 కు కాఫీ లు తాగి రెడీ అయ్యా0.దావూద్ ,మా రమణ వచ్చారు .మొదటి సారి కారు ప్రయాణం కనుక దావూద్ చేతిలో యెంతైనా కొంత డబ్బు పెట్టమన్నాడు ,దావూద్ పది రూపాయలు పెట్టండి తాతయ్యగారు అన్నాడు .అది పద్ధతి కదనుకొని అయిదువందల ఒక్క రూపాయి చేతిలోపెట్టి‘’ఇలాంటికార్లు రెండుమూడు కొనాలి ‘’అని భుజం తట్టాను అతడు మా ఇద్దరికాళ్ళకు నమస్కారం చేసి ‘’తాతయ్యగారూ ఇదంతా మీ  ఆశీర్వాదమేనండీ’’అని ఆనందంగా చెప్పాడు . మధ్యాహ్నం 2-15కు అందరికీ బై చెప్పి బయల్దేరా0 .సూర్యాపేటలో టిఫిన్ చేసి మళ్ళీ బయల్దేరి రాత్రి 7-45కు హైదారాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంటికి మల్లాపూర్ చేరా0.

                           సభ -పురస్కార సత్కారం

 14 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 30 కి కాబ్ లో  మేమిద్దరం ,చరణ్ ,పెద్ద కోడలు శ్రీమతి సమత  బయల్దేరి 5 గంటలకు త్యాగరాజ గాన సభకు చేరా0 .మణికొండనుంచి స్టేట్ బాంక్ లో పని చేస్తున్న మా బావమరది ఆనంద్ ,బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మా కోడలు శ్రీమతి ఇందిర మనవడు హర్ష మనవరాలు హర్షిత  చేరుకున్నారు. సత్కారం సంగతి మా  రమణద్వారా తెలుసుకున్న హైదారాబాద్ లో ఉంటున్న మా ఉయ్యూరు శిష్యుడు వేగరాజు రాజా ,ఉయ్యూరులో యెలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్  స్వర్గీయ వెంపటి శర్మగారబ్బాయి ప్రభాకర  కూడా వచ్చారు .54యేళ్లక్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యుడు అత్యంత వినయ సంపన్నుడు  ఉద్యోగం చేసి రిటైరై హైదరాబాద్ లో ఉంటున్న నజీరుద్దీన్ మధ్యాహ్నం ఫోన్ చేసి సన్మానం సంగతి తెలిసి తను  జలుబు ,తుమ్ముల వలన ఇబ్బంది పడుతున్నానని యే మాత్రం వీలున్నా వస్తానని చెప్పాడు సరే అన్నాను .రాలేక పోయానని తర్వాత మెసేజ్ పెట్టాడు .ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదివిన లంకావారబ్బాయి  ప్రభాకర్  స్నేహితుడు పరిచయం  చేసుకొని  చెప్పాడు . నా అభిమానిడా శ్రీమతి కే బి లక్ష్మి గారు వచ్చి వేదికమీద నాతో మాట్లాడి అభినందనలు తెలిపి అక్కడి వారితో ‘’మా గురువుగారు దుర్గా ప్రసాద్ గారు ‘’అని చెప్పటం నాకు పరమానందం కలిగించి అవాక్కయ్యాను  .దాదాపు పాతిక యేళ్ళ క్రితం పామర్రు హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ,అనేక అవార్డులు పొందిన నేను యెప్పుడు కనిపించినా ‘’సార్ !ఇంతమంది సైన్స్ మేస్టర్లు పామర్రు హైస్కూల్ లో పని చేసినా ,ఇప్పటికీ మిమ్మల్నే బాగా గుర్తుపెట్టుకొని అందరూ అభిమానిస్తారు కారణం  యేమిటి?’’అని అమాయకంగానో గడుసుగానో ప్రశ్నించే  ,రిటైర్ అయి హైదారాబాద్ లో ఉంటున్న ,తమ తండ్రి గారు శ్రీ పూసపాటి నాగేశ్వర రావు గారి జీవితం రచనలపై పిహెచ్ డి చేసిన శ్రీ పూసపాటి శంకరరావు గారూ వచ్చారు .ప్రముఖ కథారచయిత అత్యుత్తమ శ్రేణి విమర్శక విశ్లేషకులు ,పద చిత్ర రామాయణ కర్త శ్రీ విహారిగారు వాట్సాప్ లో అభినందించారు .వారం ముందే ‘’నేనువస్తాను కలుస్తాను ‘’అని మెయిల్ పెట్టి ఊరించిన హైదారాబాద్ వాసి  శ్రీ ఎ. సి.పి . శాస్త్రిగారు ‘’యథాప్రకారం’’ చెయ్యిచ్చారు .

  సాయంత్రం 5 -30 కి సభ ప్రారంభమైంది .ముందుగా  శ్రీ వారణాసి వెంకట నారాయణ శాస్త్రి గారు రచించిన ‘’భగవద్గీత ‘’బుర్రకధను  శ్రీ పిసుపాటి వేంకటేశ్వర శర్మగారు శ్రావ్యం గా గానం చేసి సమ్మోహపరచారు .తరువాత అతిధులకు పురస్కార గ్రహీతలకు నాదస్వర వాద్యం తో పూర్ణ కుంభం తో వేదాశీస్సులతో స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు .నేను తెచ్చిన పుస్తకాల సెట్లు సభ ప్రారంభం ముందే అందరికీ పంచేశాను .’’దర్శనం ‘’పత్రిక లో పని చేస్తున్న శర్మగారు ‘’ఒక సెట్ ఉంటే ఇవ్వండి ‘’అని అడిగితే ప్రభాకర్ కిచ్చిన సెట్ తీసుకొని అతనికి  పోస్ట్ లో పంపిస్తానని చెప్పి తీసుకొని దర్శనం గారికిచ్చాను

 సభా సంచాలకులు శ్రీ పి.ఎం. గాంధీ సుశబ్ద సుమధుర వచనాలతో  ఒక్కొక్కరిపై రాసిన ప్రత్యేక పద్యం తో అపూర్వంగా రాగ భావాలతో ఆలపిస్తూ అందరినీ వేదికపైకి ఆహ్వానించారు .బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రీ గారు అధ్యక్షత వహించి సభ నిర్వహించారు .నోరి ఛారిటబుల్ ట్రస్ట్ గురించి తాము చేబడుతున్న కార్యక్రమాలగురించి పురస్కార గ్రహీతలగూర్చి క్లుప్తంగా అర్థవంతంగా వివరించారు .తరువాత శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి సంస్కృతం లో రచించి ,డా వారణాసి వెంకటేశ్వర్లు గారు తెలుగు అనువాదం చేసి నోరి ట్రస్ట్ వారు ప్రచురించిన ‘’బ్రహ్మ కలా’’గ్రంధాన్ని శ్రే శ్రీ విజ్ణానంద భారతీ స్వామి ఆవిష్కరించారు .ముఖ్య అతిధిగా శ్రీ పిల్లుట్ల విశ్వనాధ్ గారు ,విశిస్ట అతిధిగా డా వారణాసి వెంకటేశ్వర్లు ,ఆత్మీయ అతిథి శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు పురస్కార గ్రహీతలు వేదికను సుసంపన్నం చేశారు .

మొదటగా అనుగ్రహణ భాషణం చేసిన స్వామీజీ చెప్పిన ‘’గుర్రబ్బండీ వాడి ‘’ అన్యాపదేశ కధ అందరినీ ఆకట్టుకొన్నది .

  ఆ పిమ్మట పురస్కార ప్రదానోత్సవం సన్మానం ఘనంగా నోరివారు అందరి సహకారం తో నిర్వహించారు .శ్రే వేద వ్యాసపురస్కారం ను బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మగారికి ,శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి పురస్కారం బ్రహ్మశ్రీ మున్నంగి వేంకటరాయ శర్మగారికి ,కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కారం శ్రీ రాధశ్రీ అనబడే పద్యకవి దిడుగు అనంత రాధ కృష్ణ ప్రసాద్ గారికి ,శ్రీ మునిమాణిక్యం నరసింహారావు పురస్కారం ప్రముఖ రచయిత్రి డా.శ్రీమతి వాసా ప్రభావతిగారికి ,డా సర్వేపల్లి రాధ కృష్ణ లౌకిక గురు పురస్కారం డా శ్రీమతి శరత్ జ్యోత్స్నారాణి గారెకి ,డా.బెర్జాగీ పురస్కారం ప్రొఫెసర్ యెస్. వెంకటరావు గారికి ,తెలుగు తల్లి పురస్కారం శ్రీ సాధన నరసింహ శర్మగారికి ,శ్రీ కళాసుబ్బారాఓ పురస్కారం శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్  అనే నాకు  అందజేశారు .  దంపతులను ఆశీనులను చేసి సత్కరించిన తీరు  ఆకర్షణీయం, అభిలషణీయంగా ఉన్నది .మా దంపతులకు నోరివారి సన్మానమే కాకుండా మా బావమర్ది ఆనంద్  గులాబీ దండ శాలువాలతో మిమ్మల్ని సత్కరిస్తే ,శ్రీమతి కంలాకర్ భారతి గారు శాలువా కప్పి అభిమానం చాటితే  మా ఇద్దరబ్బాయిలు  కోడళ్ళు మనవళ్లు మనవరాలు శాలువాలుకప్పి  హైదారాబాద్ లోనూ ‘’గబ్బిటవారి హవా’’ చూపెట్టారు .శాస్త్రిగారు  అందరికీ శాలువా పుష్పమాల ,జ్ణాపిక ,మెడల్ ,దీన్ని భద్రపరచుకోవటానికి చిన్న భరిణ ,నోరి నరసింహ శాస్త్రిగారి పుస్తకాలు ,రెండు బత్తాయిపళ్లు  అన్నీ నోరి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ప్రత్యేకమైన పెద్ద నాణ్యమైన ‘’Duffelబాగ్ ‘’లో పెట్టి అందించారు  . డా శివప్రసాద్ గారు శాస్త్రిగారితో  వారి తండ్రిగారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు .డా వెంకటేశ్వర్లు ఆవిష్కరింపబడిన గ్రంధం లోని ముఖ్యాంశాలను స్పృశించారు .వృద్ధురాలైన ప్రభావతిగారు అనారోగ్య రీత్యా సన్మానం అందుకొనగానే వెళ్ళిపోయారు .పురస్కార గ్రహీతలు   ఇవ్వబడిన రెండుమూడు నిమిషాలలో తమ మనో భావాలను స్పందనగా తెలియబరచారు .చివరి వాడిని నేనే కావటం 9గంటలకు వేదిక ఖాళీ చేసి  వెళ్లాల్సిన  అవసరం ఉండటం తో నాకు ఒక్క నిమిషమే కేటాయిస్తే అందులోనే చెప్పాల్సింది చెప్పేశాను .తర్వాత సన్మానితులందరి తరఫున నేను తెచ్చిన శాలువాను మేమందరం కలిసి శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికప్పి కృతజ్నాత తెలియ జేయటం హైలైట్ అయింది .నేను మాట్లాడుదామనుకొని తయారు చేసిన దాన్ని ఇప్పుడు మీకు తెలియ జేస్తాను .  సభ అవగానే  మేమందరం దగ్గరలోనే ఉన్న హోటల్ కు వెళ్ళి టిఫిన్లు చేశా0  మా మనవడు హర్ష ఇంటర్ పాసై ,ఇంజనీరింగ్ లో చేరిన సందర్భంగా మా అబ్బాయి శర్మ హోటల్ ఖర్చు  3,500రూపాయల బిల్లుకట్టిమిమ్మల్ని ఆశ్చర్యం లో పడేశాడు .శర్మావాళ్లు బాచుపల్లి ,మా బామ్మర్ది మనికొండ,వెళ్లారు మేము మల్లాపూర్ చేరేసరికి రాత్రి 11-30 అయింది .

  నా ప్రసంగ పాఠం

‘’గురుః ఆది రనంత శ్చ-గురుః పరమ దైవతం -గురోఃపరతరం నాస్తి -తస్మై శ్రీ గురవేనమః’’

ఈ శ్లోకం ‘’విశ్వ సార తంత్ర ‘’లోనిది .యెందుకో దీనికి లోకం లో యెక్కడా ప్రచారం లేక పోవటం  ఆశ్చర్యంగా ఉంది .ఆషాఢ పౌర్ణమి వ్యాసమహర్షి జన్మించిన రోజు .ఆయన వసిస్టమహర్షి మునిమనవడు ,శక్తిమహర్షి మనవడు ,పరాశర సత్యవతీ దంపతులపుత్రుడు శుకమహర్షికి తండ్రి .వ్యాసపౌర్ణమినాడు బ్రహ్మసూత్ర పఠనంచేస్తారు .స్త్రీలు ‘’గో పద్మ వ్రతం ‘’విష్ణుమూర్తి అనుగ్రహం కోసం  చేస్తారు .నాలుగు ముఖాలులేని బ్రహ్మ అంటే జ్నాన చైతన్య ప్రదాత ,నాలుగు భుజాలు లేని విష్ణువు అంటే రక్షకుడు ,అపమార్గం నుంచి తప్పించేవాద్దు ,మూడు నేత్రాలులేని శివుడు అంటే అజ్నానాన్ని నశింప చేసే వాడు గురువు అంటారు అంటే త్రిమూర్తి అవతారం. జ్నానజ్యోతి ప్రసాద్దించే ప్రత్యక్ష దైవం కనుక గురువు ‘’గురు దేవుడు ‘’అయ్యాడు .అంతేకాక ‘’ఆచార్య దేవో భవ ‘’కూడా .

  నేపాల్ లో తానాహు జిల్లాలో ‘’దమాలీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు వేద విభజన చేసిన గుహ ఉంది .గొప్ప యాత్రాస్థలమైంది .వ్యాసుడు ‘’కాలావతారం ‘’అన్నారు .వ్యాస అనేది ఒక అధికారం అంటే ఒక పదవి .ప్రతియుగం లో ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు .ఇప్పటికీ 27 గురు వ్యాసులయ్యారు మొదటి ద్వాపరమ్ లో స్వాయంభువ్డుమొదటి  వ్యాసుడు ,రెండవ ద్వాపరమ్ లో ప్రజాపతి వ్యాసుడు మూడవ ద్వాపరమ్ లో శుక్రుడు వ్యాసుడు ,ఆతర్వాత వరుసగా వసిస్ట ,త్రివర్ష ,మొదలైనవారు వ్యాసులై 27 వ వ్యాసుడుగా సనద్వాజుడు అయ్యాడు .ఇప్పుడున్న బాదరాయణుడు లేక కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాసుడు 28 వ వ్యాసుడు .దీని తర్వాత ఈయన సూర్య సావర్ణికాలం లో సప్తరుషులలో ఒకడు ఔతాడు .

  కాశ్మీర్ లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అనే అర్ధం .వ్యాసర్షి భారత హరివంశ0 తోకలిపి 1 లక్ష ఇరవై అయిదు వేల శ్లోకాలు ,పురాణాలలో 5 లక్షలశ్లోకాలు రాసీనా  మహానుభావుడు .మానవ మనస్తత్వం మారడం లేదని భారతం లో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యెషు ,నహి కశ్చిత్ శ్రుణో తిమే-పరోపకార పుణ్యాయ,పాపాయ పరపీడనం ‘’అని  నెత్తీనోరూ బాదుకున్నాడు . జనాలకు చేతులెక్కి మొక్కాడు పాపం .దీని అర్ధం యేమిటంటే ‘’ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం అపకారం చేస్తే పాపం ‘అని నేను మొత్తుకున్నా యెవ్వరూ నా మాట వినటం లేదే ‘’అని పరితపించిన మానవీయ మూర్తి విశాల హృదయుడు భగవాన్ వేద వ్యాసుడు .ఇప్పటికీ యెవరూ ఆమాట వినటం లేదుకదా .

  అటుకులు తీసుకొని తన చెలికాడు  శ్రీ కృష్ణుని దర్శించిన కుచేలుడు తనమిత్రుడు చేసిన సపర్యలకు ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు అంతేకాక గురువు సాందీపమహర్షి ని తలచుకోవటం అక్కడ గడిపిన రోజులు గుర్తుకు చేసుకున్నాడు .దీనికి ఆశ్చర్యపోయాడు కుచేలుడు –‘’

‘’గురు మతి దలపగ-త్రిజగద్గురుడ వనం దగిన నీకు -గురువనగా నొరు డెవ్వ దింతయును నీ -కరాయంగా – విడంబన0 బగు గాదె హరీ ‘’అన్నాడు –

 భావం -త్రిజత్తులకు గురువైన నువ్వు గురువు సాందీపమునిని   తలచుకోవటం ఆశ్చర్యంగా ఉంది ‘’అని అంటే లోకం లో గురువు కున్న ఉత్కృస్ట స్థితిని ఆచరణలో చూపి లోకానికి గొప్ప మార్గ దర్శి అయ్యాడు భగవాన్ శ్రీ కృష్ణుడు  వ్యాసర్షి కృష్ణుని అవతార మే కనుక కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు .కృష్ణావతార ఘట్టం లో దేవతలంతా చేసిన ప్రార్థన ఇద్దరికీ వర్తిస్తుంది

‘’గురు పాఠీనమవై ,జలగ్రహమవై ,కోలంబవై ,శ్రీ నృ కే-సరివై ,భిక్షు0డవై ,హయాననుడవై  ,క్ష్మా దేవతా భర్తవై

ధరణీ నాధుడవై ,దయా గుణోదారు0 డవై ,లోకముల్ -పరి రక్షించిన నీకు  మ్రోక్కెద ,మిలాభారంబు వారింపవే ‘’

 గురుపౌర్ణమి శుభాకాంక్షలతో

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-19-కాంప్ -మల్లాపూర్ -హైదారాబాద్

— 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

తొలి లేక శయన ఏకాదశి

ఒకప్పుడు భగవాన్ శ్రీ కృష్ణుడు ,యుదిస్టిరుడైన ధర్మరాజుకు ప్రధమ లేక తొలి లేక శయన ఏకాదశి విశేషాలను తెలియ జేశాడు .దీన్ని బ్రహ్మదేవుడు తన పుత్రుడు నారదమహర్షికి తెలిపాడు అని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది .ఈ సందర్భం గా మాంధాత మహారాజు వృత్తాంతం తెలియ జేయబడింది .మాంధాత పాలనలో ఒకసారి తీవ్ర అనావృస్టి ఏర్పడి భయంకర మైన కరువు సంభవించింది .ప్రజలను ఈ కరువు బాధ నుంచి ఎలా  తప్పించాలో ఆయనకు బోధ పడలేదు .అప్పుడు ఆంగీరస మహర్షి రాజుకు వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ,ముందుగా ‘’దేవ శయన ఏకాదశి వ్రతం ‘’ఆచరించమని సలహా ఇచ్చాడు .మహారాజు  ఆవ్రతాన్ని నిష్టగా చేయగా విష్ణు మూర్తి ప్రీతి చెంది దేశం లో వర్షాలు తగినట్లు కురిసేట్లు చేశాడు.కరువు కాటకాలనుంచి దేశానికి ముప్పు తప్పింది .ఉపవాసం ముఖ్యంగా ఏకాదశి వ్రతం చేయాలి .

విష్ణుమూర్తి  ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు  క్షీర సాగరం లో  శేష శయనం  పై నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక శయన ఏకాదశి లేక దేవ శయన ఏకాదశి అంటారు .దీనికే తొలి లేక ప్రథమ ఏకాదశి అనిపేరు .ఇప్పటినుంచే పండుగలు ప్రారంభమౌతాయి  శయన ఏకాదశి నుంచి నాలుగు నెలలు  నిద్రపోయి  కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి  మేలుకొంటాడు.ఈ ఏకాదశిని ఉత్ధాన ఏకాదశి లేక  ప్రబోధిని ఏకాదశి అంటారు .ఈ నాలుగు నెలలు వర్షాకాలం కనుక యతీశ్వరులు, సన్యాసులు పీఠాదిపతులు ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలరు .దీనినే చాతుర్మాస దీక్ష అంటారు .

మహారాష్ట్రలో శయన ఏకాదశి నాడు చంద్ర భాగా నదీ తీరం లో ఉన్న పాండురంగడు కొలువై ఉన్న పండరి పురానికి   రాష్ట్రం నలుమూలలనుంచి కాలినడకన పండరి శోభ యాత్ర చేసి వచ్చి చంద్ర భాగ లో స్నానించి  పాండురంగ స్వామిని  దర్శించి పునీతులౌతారు  .ఈ యాత్రలో మహారాష్ట్రలోని అలంది నుంచి సంత్ జ్ఞానేశ్వర్  విగ్రహం ,నార్సి నాం దేవ్ నుంచి సంత్ నామదేవ్ విగ్రహం ,దేహు నుంచి సంత్ తుకారాం విగ్రహం ,పైఠాన్ నుంచి సంత్ ఏకనాథ్ విగ్రహం ,త్రయంబకేశ్వర్ నుంచి సంత్ నివృత్తినాథ్ విగ్రహం ,ముక్తానగర్ నుంచి సంత్ ముక్తాబాయి విగ్రహం ,సస్వాద్ నుంచి సంత్ సోపాన్ విగ్రహం ,షేగావ్ నుంచి గజానన్ మహారాజ్ విగ్రహం లను మోసుకొంటూ పండరి పురం చేరుతారు .ఈయాత్రికులను ‘’వర్కారీలు ‘’అంటారు ,వీరంతా జ్ఞాన దేవ, తుకారాం ల అభంగాలను భక్తి పారవశ్యంతో గానం చేస్తూ పండరి  యాత్ర చేయటం విశేషం .

రేపు 12-7-19 శుక్రవారం పవిత్ర  తొలి ఏకాదశి శుబాకా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి

అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని” అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి ”వ్యాసం జులై గురు సాయిస్థాన్  లో ప్రచురితమైంది -దుర్గాప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు 49 –‘’ఇ మెయిల్ ఇన్ఫార్మర్’’ సృష్టికర్త –టి.సోనీ రాయ్(చివరిభాగం )

ఇ మెయిల్స్ చెక్ చెక్ చేసుకోవటానికి డెస్క్ టాప్ మీద  ఆధారపడి వచ్చేది .ఈ ఇబ్బందిని అధిగమించటానికి హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త సోనీ రాయ్ పరి శోధకుడిగా మారి తానె ఒక యంత్రాన్ని సృష్టించాడు .2001లో రూపొందించిన ఈ గాడ్జెట్ అంటే’’ ఇ మెయిల్ ఇన్ఫార్మర్ ‘’ ఎప్పుడు ఇ మెయిల్ వచ్చినా అందించి కాలాన్ని ఆదా చేస్తుంది .దీన్ని టెలిఫోన్ కు రిసీవర్ తో సిరీస్ లో  కలపాలి. సోని రాయ్ ఇన వెంటర్స్ అసోసియేషన్ సంస్థాపక అధ్యక్షుడు ..E.S.P.అంటే ఇ మెయిల్ సర్వీస్ ప్రోవైడర్ లో వినియోగదారులు తమ ఫోన్ నంబర్లతో ఇ మెయిల్ అడ్రస్ లను రిజిస్టర్ చేసుకోవాలి .ఇన్ బాక్స్ లో కొత్త మెయిల్ రాగానే యి .ఎస్. పి ‘’లైట్ ఎమిటింగ్ డయోడ్ ‘’C.E.D.ఒక బజ్ శబ్దం చేస్తుంది .ఇది P.C.మరియు I.S.P.ల చార్జి లవలన కలిగే విద్యుత్తును ,టెలిఫోన్ చార్జీలను ఆదా చేస్తుంది .

image.png

సోనీ రాయ్ ‘’చెక్ అథెంటిక్ సిస్టం ‘’C.A.S.పరికరాన్ని కూడా సృష్టించారు .ఇది బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం పై పని చేసి బ్యాంక్ చెక్ ల నిజస్వరూపాన్ని తెలిపి ,నకిలీ చెక్కుల వాడకాన్ని నిరోధిస్తుంది .ఈ ఎక్విప్ మెంట్ లోనే సిరా రహత వేలి ముద్రల సాంకేతిక పరిజ్ఞానం ,ఫింగర్ ప్రింట్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ కూడా  ఉంది.చెక్ నిస్కాన్ చేసి చదివే  అవకాశమూ ఉన్నది  .ఇంతేకాదు ఒక హై స్పీడ్ కంప్యూటర్ కూడా ఇందులో ఉండటం విశేషం .C.A.S.ద్వారా ప్రతి చెక్కును నిర్దుష్టంగా పరిశీలించే అవకాశం కలిగింది .

సోనీ రాయ్ మేధస్సు కు తగిన అవార్డులు రివార్డ్ లు దక్కాయి .1905లో య౦గ్ సైంటిస్ట్ అవార్డ్ ,2001లో  చెస్ట్ ఇన్వెన్షన్ అవార్డ్ ,  నేషనల్  ఇన్నోవోషన్ ఫౌండేషన్ అవార్డ్ లను అందుకున్న ఆధునిక యువ సాంకేతిక శాస్త్ర వేత్త సోనీ రాయ్ .

50-హై స్పీడ్ చిప్ డిజైనర్ –శ్రీ రాం సుదీర్ రెడ్డి

ఖమ్మం జిల్లా భద్రాచలం లో 1968లో జన్మించిన శ్రీ రాం సుదీర్ రెడ్డి ,కోరుకొండ హై స్కూల్ చదువు తర్వాత కృష్ణాజిల్లా మచిలీపట్నం లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్ ఇంజనీరింగ్ చదివి పాసై ,అమెరికా వెళ్లి క౦ ప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎం.యెస్.చేసి ,కొద్దికాలం లోనే విజయవంతమైన పారిశ్రామిక వేత్త అయ్యారు .బోస్టన్ నగరం లో ఐ .టి .లో.అకు౦ఠితదీక్ష తో  విశేష పరిశోధనలు చేశారు .

హైస్పీడ్ కమ్యూని కేషన్ కు అవసరమైన ‘’చిప్ డిజైనింగ్ ‘’లో అత్యంత ప్రతిభ కనబరచారు .అనేక మల్టీ నేషనల్ హార్డ్ వేర్ కంపెనీలు ఈయన అపార మేధాశక్తిని గుర్తించాయి .బోస్టన్ లో స్వంతంగా ‘’సిమ్రాన్ కమ్యూని  కేషన్స్’’కంపెనీ ప్రారంభించి ,ఒక్క ఏడాదిలో రెండు రకాల చిప్ లను అందించిన ఘనుడిగా గుర్తింపు పొందారు .నాన్ డాక్ లిస్టెడ్ కంపెనీ అయిన అప్లైడ్ మైక్రో సర్క్యూట్స్ కార్పో రేషన్, రెడ్డి గారి  సిమ్రాన్ కంపెనీని 120 మిలియన్ల డాలర్ల తో (575కోట్లరూపాయలు )కొను గోలు చేసింది .ఈ డీల్ వలన కొన్నకంపెనీ షేరు విలువ 4 డాలర్లనుంచి పదిరెట్లు పెరిగి 40 డాలర్లుగా దూసుకుపోయింది .ఈ కంపెని కాపిటలైజేషన్ 2,500కోట్ల డాలర్లకు  చేరింది .

image.png

2002కు రెడ్డిగారు అప్లైడ్ మైక్రో సర్క్యూట్ కార్పోరేషన్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్  అండ్ జనరల్ మేనేజర్ హోదాలో ‘’ఫ్రేమర్ లేయర్ ప్రాడక్ట్స్’’ కు ఇన్ చార్జి అయినారు .ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ విశేష ప్రతిభా పాటవాలు చూపిన ఈయన తన స్వంతప్రాంతం తెలంగాణలో ఒక ఆర్ అండ్ డి నెలకొల్పటానికి 2002 ఏప్రిల్ లో విశ్వ ప్రయత్నం చేశారు  , 25కోట్ల పెట్టుబడితో ఏర్పడే దీనికోసం జూబ్లి హిల్స్ లో భవన నిర్మాణం చేబట్టారు కూడా .ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఐ టి వర్గాలతో సంప్రదింపులు జరిపినా స్పందన కరువైనందున నిరాశతో విరమించుకు-న్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

మనవి-‘’ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు’’ ధారావాహిక ఈ 50మంది శాస్త్ర వేత్తలతో ప్రస్తుతం ముగిస్తున్నాను .ప్రజల  దృష్టిలో ఎక్కువగా పడనీ వారినే ఎక్కువమందిని తీసుకొని రాశాను .ఇంకాఎందరో మహాను భావులున్నారు .వీలున్నప్పుడు వారి గురించి తెలియ జేస్తాను .ఇప్పటికి ఇది విరామం .

రేపు 12-7-19 శుక్రవారం ‘’తొలి ఏకాదశి ‘’శుభా కాంక్షలు’’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు

47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ

గుంటూరు జిల్లా ఇంటూరులో శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ 26-9-1906 న జన్మించారు .మద్రాస్ వేస్లికాలేజిలో ఎం.ఏ.చదివి ,1921లో బ్రిటన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఏకాగ్రత కుదరక అమెరికా వెళ్లి  హార్వర్డ్ యూని వర్సిటిలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేశారు .ఇక్కడే రెండు సార్లు వరుసగా ఫెలోషిప్ పొందిన  తొలి భారతీయ మేధావిగా గుర్తింపు పొందారు .సామాజిక ,అర్ధ తత్వ, శాస్త్రాలను కూలంకషంగా మధించారు .సిద్ధాంతవ్యాసం రాసి యూని వర్సిటీ వారి చే పిహెచ్ డి పొందారు .1939లో గ్రంథ ప్రచురణ జరిగింది  .అనేకమంది మేధావులతో ,సామాజిక సంస్థలతో అనుబంధం పెంచుకొన్నారు .

  ఇండియాకు తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య పోరాటం లోపాల్గొని అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలు లో ఉన్నారు .విడుదల అయ్యాక  బెల్గాం యూని వర్సిటిలో ,బొంబాయి టాటా సంస్థలో ఉద్యోగించారుకాని ఇమడ లేకపోయారు .వైవిధ్యభరిత సామాజిక అంశాలు ముఖ్యంగా మైనారిటీల సమస్యలపై అత్యద్భుత గ్రంథ రచన చేసి ,తామే మైనారిటీ గా రూపొంది శారీరకంగా ,మానసికం గా కుంగిపోయిన బడుగు జనోద్దరణ శీలి బాలకృష్ణగారు .ఆయన అముద్రిత రచనలు చాలా ఉన్నాయి .వాటిని ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది .మానసికంగా కుంగిపోయిన కాట్రగడ్డ బాలకృష్ణగారు అతి తక్కువవయసు 42 ఏళ్ళకే భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాలుగు నెలలకే 18-12-1948 న పరమపదించారు .

48-ఆర్కిడాలజి శాస్త్రవేత్త –శ్రీ ఎ.నాగేశ్వరరావు

గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించిన శ్రీ ఎ.నాగేశ్వరరావు ఆంధ్రా యూని వర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ‘’ఆర్కిడ్స్ ఆఫ్ అరుణాచల ప్రదేశ్ ‘’అనే సిద్ధాంతవ్యాసం రాసి ,టి.పి.ఆర్కిడ్ పరిశోధన  కేంద్రం లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ గా చేరి ,అరుణాచల ప్రదేశ్ అరణ్యాలలో విస్తృతంగా తిరిగి ఆ సబ్జెక్ట్ పై అపార విజ్ఞానం సంపాదించారు .

  1980లో టి.పి.ఆర్కిడ్ స్టేషన్ లో చేరి ఆర్కిడ్స్ పై విస్తృత పరిశోధనలు చేశారు .అస్సాం లో తేజపూర్ కు 65కిలోమీటర్లలో టి.పి.ఉంది ఇక్కడ పది హెక్టార్ల అంటే పాతిక ఎకరాలలో ఈ పరిశోధన కేంద్రం ఉన్నది .ఇక్కడే పరిశోధనలు చేసి నాగేశ్వరరావు గారు 250  ఆర్కిడ్ లను సృష్టించి   రికార్డ్ చేశారు .ఒకటి రెండు రోజుల్లో వాడిపోయి స్వరూపస్వభావాలు కోల్పోయే పూల స్థానం లో ఆర్కిడ్ లు ప్రవేశం చేయటానికి రావు గారి కృషి అద్వితీయం .వీటికోసం విదేశాలలో లక్షలాది డాలర్లు కుమ్మరిస్తున్నారు .ఆర్కిడ్స్ తాజాతనం కోల్పోకుండా ఆకర్షణీయంగా ఉంచటానికి రావు గారి కృషి ఫలించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .

   ఇంతకీ ఆర్కిడ్స్ అంటే ?పుష్పించే సాధారణ మొక్కల లాగానే ఉండే ఒకజాతి గడ్డి మొక్కలను ఆర్కిడ్స్ అంటారు .ఇవి ’’ఆర్కిడిసి ‘’కుటుంబానికి చెందినవి .పుష్పాలంకరణ లో వీటికి విశేష ప్రాధాన్యత ఉన్నది .దేశం మొత్తం మీద 1200రకాల ఆర్కిడ్స్ ఉంటె నాగేశ్వరరావు గారి పరిశోధనఫలిత౦ గా  అరుణాచల ప్రదేశ్ లో 250రకాలు ఉండి దేశం లో అగ్రస్థానం గా అరుణాచలప్రదేశ్ ను  నిలిపిన ఘనత నాగేశ్వరరావు గారిదే .ఇందులోని 30రకాల ఆర్కిడ్స్ ప్రపంచం లో మరెక్కడా లేవు .అందుకే అరుణాచలప్రదేశ్’’ఆర్కిడ్స్ రాజధాని –కేపిటల్ ఆఫ్ ఆర్కిడ్స్ ‘’అయింది .

  ప్రపంచం లో సహజ సిద్ధంగా ఉన్న ఆర్కిడ్స్ 30 వేల రకాలు ఉంటాయి .వాటిద్వారా శాస్త్రవేత్తలు క లక్షా ముప్ఫై వేల రకాల ఆర్కిడ్స్ సృష్టించారని తాజా నివేదికలు తెలియ జేస్తున్నాయి .డాక్టర్ నాగేశ్వరరావు  సృష్టించిన 250  ఆర్కిడ్స్  లో అయిదారు కొత్తరకాల హైబ్రిడ్ లను రిజిస్టర్ చేశారు .ఆర్కిడ్స్ విజ్ఞాన రంగం లో అంతర్జాతీయ ప్రతిభ ఉన్న కొద్ది మంది శాస్త్రవేత్తలలో నాగేశ్వరరావు గారు ఉండటం అందునా ఆంధ్రులు కావటం అందరికి గర్వకారణం . ‘అరుణాచలేన్సిస్ ,బీర్ మానియా ,జైనియానా ,ఒజోరోనియా ,కంలాంగినేస్ మొదలైన ప్రజాతి ఆర్కిడ్ లను అభి వృద్ధి చేసిన గొప్పఆర్కిడ్  శాస్త్రవేత్త శ్రీ ఎ.నాగేశ్వరరావు గారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19 ఉయ్యూరు

image.pngimage.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్  –శ్రీ పంచేటి కోటేశ్వరం

25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి ఎస్ సి పాసై ,1943లో డి ఎస్ సి పట్టా పొందారు ఇండియన్ మెటియోరోలాజికల్  సర్వీస్ లో అసిస్టెంట్ గా  1940లో చేరారు .తర్వాత డైరెక్టర్ జనరల్ అయ్యారు .ఇరాన్ ప్రభుత్వం లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుడుగా ,వాతావరణ సలహా దారుగా 1975నుంచి మూడేళ్ళు ఉన్నారు .ఇండియాకు తిరిగి వచ్చి, విశాఖ ఆంధ్రా యూని వర్సిటి లో మెటిరియోరోలాజికల్ అండ్ వోషనోగ్రఫీ కి గౌరవ ఆచార్యులై 1972నుండి 82 వరకు  పదేళ్ళు పని చేశారు .

  కోటేశ్వరం గారు 1974లో ఇ౦ డియన్ నేషనల్ సైన్స్ అకాడెమి  లో ఫెలో అయ్యారు .ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్స్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ల ఫెలోషిప్ పొందారు .ఇండియన్  మెటియోరోలాజికల్ సంస్థకు అధ్యక్షులై విశేష సేవ లందించారు .వాతావరణ శాస్త్రం లో ఆర్ధిక శాస్త్రం లో వాతావరణ శాస్త్ర వినియోగానికి ముఖ్యమైన పరిశోధనలు చేశారు .1963లోపూనాలోని  ఇండియన్ ట్రాపికల్ మెటియోరోలజికి ,1960-65 మధ్య న్యుఢిల్లీ లోని నార్దర్న్  హేమి స్ఫియర్  ఎక్స్ చేంజ్ అండ్ అనాలిసిస్ సెంటర్ స్థాపనకు అద్భుత కృషి చేశారు .ఆయన మార్గ దర్శకత్వం లోనే 1970-73 కాలం లో దేశం లోని తూర్పు కోస్తా వెంబడి తుఫాన్ హెచ్చరిక రాడార్ సిస్టం ఏర్పాటైంది .ఇదే కాదు ఉత్తర భారతం ,మధ్యభారతం లలో వరదలు సృష్టించే నదుల ఆయకట్టు ల వద్ద ఫ్లడ్  మెటిరియోరోలాజికల్ సెంటర్ లను ఏర్పాటు చేసిన ఘనతా ఆయనదే .తన శాఖవారితో ‘’శాటిలైట్ మానిటరింగ్  సెంటర్’’ లు ఏర్పాటు చేయి౦ఛి  వాతావరణ సేవలలో ఆధునికత తెచ్చినదీ కోటేశ్వరం  గారే .శీతోష్ణస్థితి  సంబంధ ప్రయోజనాలు ,ముందస్తు సమాచార సేకరణకు ,గణాంకాల అంచనాలకు మొదటిసారిగా కంప్యూటర్ వ్యవస్థ నేర్పరచి ,దేశీయ వాతావరణ శాస్త్రం లో  విప్లవాత్మక మార్పులు తెచ్చి కొత్త అధ్యాయం సృష్టించి ,విదేశాలకు దీటుగా నిలబడేట్లు చేశారు .ఋతుపవనాలు అల్పపీడనాలు తుఫానులు ,వరదలు వాతావరణ మార్పులు పై అవిశ్రాంత పరిశోధన సాగింఛి తమ ఫలితాలను అందరికీ పంచేవారు ’’పంచేటి వారు’’.

  వరల్డ్  మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ ,అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్  ఆఫ్ ఇండియా సంస్థలకు ఉపాధ్యక్షులుగా 1971నుంచి 75వరకు నాలుగేళ్ళు విలువైన సేవలు అందించారు .ఆంధ్రా యూని వర్సిటి నుండి  గౌరవ పురస్కారం  అయిన D.S.C.(HON-Cau)పొందారు .1975లో భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’ పురస్కారం అందించి ,  గౌరవించి,సత్కరించింది . ఢిల్లీ తెలుగు అసోసియేషన్ కు అధ్యక్షులుగా1959నుండి 10ఏళ్ళు 1969 వరకు సేవలందించి ,అక్కడి తెలుగు వారికి విశేషమైన సేవలందించారు  .చికాగో లో ఇండియన్ అసోసియేషన్ కు కూడా1955-56లో  అధ్యక్షులై  ప్రవాస తెలుగు ప్రజలకు   అండదండగా ఉన్నారు.

  వాతావరణ శాస్త్ర పరిశోధనలకు అమెరికాలోని చికాగో,మియామీ  లకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళారు .వీరి సేవలను గుర్తించి ప్రపంచ వాతావరణ సంస్థ  గౌరవ  అధ్యక్షునిగా ఎంపిక చేసింది .70కి పైగా పరిశోధన వ్యాసాలను దేశీయ విదేశీయ మేగజైన్స్ లో రాశారు .వాతావరణ శాస్త్రం పై ఇంతటి అభి రుచి ఏర్పడటానికి కారణం 1927లో  ఆయన 12ఏళ్ళవయసులో వచ్చిన తీవ్రతుఫాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం  చేసి భీభత్సం సృష్టించి విశేష జనప్రాణ నష్టం  కలిగించటమే .తనప్రజలను ఈ తుఫానులనుండి కాపాడాలి అనే సంకల్పం అప్పుడే ఆయన మనసులో బీజ రూపం లో ఏర్పడి  వట వృక్షమై ,ఈ  విశేష కృషికి దారితీసింది .

  వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని డా .పంచేటి కోటేశ్వరం గారు 1997 నవంబర్ 1 న  82ఏళ్ళ వయసులో పంచత్వం చెందారు .ఆయన భార్య శ్రీమతి సరోజినీ .వీరికి నలుగురు కుమార్తెలు  ఒక కుమారుడు .

  పంచేటి వారి రచనలు – Low and high Raman frequencies for water”. , “Additional Raman frequencies for water” ,The Surface Structure of the Tropical Cyclones in the Indian Area, The Easterly Jet Stream over the tropics” ,Study of Pre-monsoon Thunderstorms over Gangetic West Bengal by Radar ,Vertical Development of Precipitation Echoes from Cumulus Clouds near Calcutta during the Pre-monsoon season”., The Upper-tropospheric and Lower-stratospheric Structure of Several Hurricanes, “On the Structure of Hurricanes in the upper Troposphere and lower Stratosphere”.

  ఈ శాఖలో పని చేసిన శ్రీ యడవల్లి పరమ శివరావు నెల్లూరు జిల్లాలోనే1920లో జన్మించి   కేంద్ర వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ అయిన రెండవ తెలుగు వారుగా (మొదటివారు శ్రీ పంచేటి కోటేశ్వరం )రికార్డ్ సృష్టించారు ,వాతావరణ అబ్జర్వేటివ్ డైరెక్టర్ కూడా అయ్యారు.’’సౌత్ వెస్ట్ మాన్సూన్ ‘’పరిశోధన గ్రంథం రాశారు .

  మరో శాస్త్రవేత్త శ్రీటి. ఎస్ మూర్తి (తాడేపల్లి సత్యనారాయణ మూర్తి )1937ఆగస్ట్ 5న జన్మించి చికాగోలో వాతావరణ శాస్త్రం లో పిహెచ్ డి పొంది ,అక్కడే లెక్చర గా చేరి కెనడా వెళ్లి  ఓషన్ సైన్సెస్ వారి ఫిషరీస్ లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ అయి ,చికాగో కెనడాలలో లో డిస్టింగ్ విష్డ్ మెడల్, అప్లైడ్ ఓషనోగ్రఫీ ప్రైజ్  పొందారు .ఐతే ఆంధ్రాలో పుట్టినా వీరి సేవలు ఇండియాలో జరగలేదు.  మన దేశం కొత్తగా అడుగు లేస్తున్న వాతావరణ శాస్త్రానికి తొలితరం శాస్త్రవేత్త మూర్తిగారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంధ్రశాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు

ఆధునిక ఆంధ్ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-

45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు

శ్రీ కోనేరు రామకృ శాస్త్ర రత్నాలుష్ణారావు గారు కోస్తాతీరం లో 4-10-1932న జన్మించి ,ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీలో బి .ఏ ఆనర్స్1953లో  చేసి సైకాలజీ లో ,ఎం.ఏ. ఆనర్స్1955లో   పాసై ,1962 పిహెచ్ డి అయ్యారు .అక్కడే ఫిలాసఫీ సైకాలజీ లెక్చరర్ గా చేరి 1953నుండి 1958వరకు అయిదేళ్ళు ప్రొఫెసర్ శైలేంద్ర సేన్  ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి గార్ల ఆధ్వర్యం లో పని చేశారు  .1958లో ఫుల్ బ్రైట్ స్కాలర్ గా అమెరికా వెళ్ళారు .చికాగో  యూని వర్సిటిలో చేరి రాక ఫెల్లర్  ఫెలో  షిప్ తో మరో ఏడాది గడిపి పిహెచ్ డి చేసి ,డి.లిట్ అయ్యారు .1960లో విశాఖ వచ్చి  ఆంధ్రా యూనివర్సిటి లో  లైబ్రేరియన్ గా చేరి ,ఒక ఏడాది తర్వాత అమెరికాలోని నార్త్ కరోలిన రాష్ట్రం లోని డ్యూక్ యూని వర్సిటిలో పారా సైకాలజీ లాబరేటరిలో జే బి రైన్ తో కలిసి పని చేశారు .తర్వాత మానవ ప్రవృత్తి (నేచర్ ఆఫ్ మాన్ )పై  పరిశోధనకు నాంది పలికి ,ఎక్సి క్యూటివ్ డైరెక్టర్  అయ్యారు .

  1960మధ్యలో ,1967లో మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయానికి వచ్చి పారా సైకాలజీ డిపార్ట్ మెంట్ శాఖను నెలకొల్పారు .ప్రపంచం మొత్తం మీద పారాసైకాలజి పై ఏర్పడిన మొట్ట మొదటి డిపార్ట్ మెంట్ ఇదే .పారాసైకాలజి అసోసియేషన్ కి చార్టర్  మెంబర్ అయి ,1963 లో సెక్రెటరి ,1965లో ప్రెసిడెంట్ అయ్యారు 1978లో రెండవసారి ప్రెసిడెంట్ అయిన ఘనత ఆయనది 1977లో ఇన్ స్టిట్యూట్  ఆఫ్ పారా  సైకాలజికి డైరెక్టర్ అయినారు .

  శ్రీ యెన్ టి రామారావు ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యాక ఆయన అభ్యర్ధనపై ,మళ్ళీ విశాఖ  వచ్చి ఆంధ్రాయూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి అధిష్టించారు .రాష్ట్రం లో ఉన్నత విద్యామండలి స్థాపింఛి మార్గ  దర్శి అయ్యారు .  ఇదే మన దేశం లో ఏర్పడిన తొలి విద్యామండలి  .దీన్ని ఆదర్శంగా  తీసుకొని ఆ తర్వాత, చాలా రాష్ట్రాలు వాటిని స్థాపించాయి మానవీయ విజ్ఞాన శాస్త్రం ,సేవలపరిశోధన పై స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశారు  . యోగా, చైతన్యం (కాన్షస్నెస్)సంస్తనేర్పరచి డైరెక్టర్ అయ్యారు .1987లో మళ్ళీ పారాసైకాలజి  హెడ్ అయి చాలాకాలం పని చేశారు .భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రిసెర్చ్ కు చైర్మన్ గా వ్యవహరించారు .అమెరికా, కెనడా, బ్రిటన్ ,జర్మని ,ఫ్రాన్స్ ,గ్రీస్,స్వీడెన్, నెదర్ లాండ్స్ ,డెన్మార్క్, ఐస్ లాండ్, ఇటలి  ,జపాన్, పాకిస్తాన్, ధాయిలాండ్ ,సింగపూర్ ,శ్రీలంక లలో పర్యటించి యూని వర్సిటీలలో ప్రసంగాలు చేశారు .

  2002లో ఆయన గౌరవార్ధం ఒక ప్రత్యేకసంచికను వెలువరింఛి అందులో ‘’  a man of many interests… cross-cultural and cosmopolitan…. His writings are a blend of Eastern and Western traditions. They are an attempt to bring about, to use his own expression, the sangaman (confluence) of East-West streams of thought. Dr. K. Ramakrishna Rao is to Indian psychology what Dr. S. Radhakrishnan is to Indian philosophy“.[3]:3

అని అభి వర్ణించారు

   2006లో రావుగారు ‘’భారతతత్వ శాస్త్ర పరిశోధన  మండలి ‘’కి అధ్యక్షులుగా ఎన్నికయయారు

  2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది .ఆంద్ర ,కాకతీయ విశ్వ విద్యాలయాలు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ,ఆచార్య నాగార్జున యూని వర్సిటి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డ్ లను అందించాయి .

  రామకృష్ణారావు గారు ‘’గాంధీస్ ధర్మ ‘’,,కాన్షస్నెస్ స్టడీస్ –క్రాస్ కల్చరల్ పెర్ స్పెక్టివ్స్,యోగా అండ్ పారాసైకాలజి ,మిస్టిక్ అవేర్ నెస్,గాంధి అండ్ ప్రాగ్మాటిజం ,ఎక్స్పేరిమెంటల్ పారాసైకాలజి ,psi కాగ్నిషన్ మొదలైన విలువైన గ్రంధాలు రాశారు .గాంధీజీ విద్యా విధానం పై ఏర్పడిన ‘’ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ హ్యూమన్ సైన్సెస్ అండ్ సర్వీసెస్ అనే ప్రయోగాత్మకసంస్థకు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు .ఈ మధ్య వరకు విశాఖలోని గీతం యూని వర్సిటి చాన్సలర్ గా వ్యవహరించారు .

 రావుగారు పరంజ్ పే,  సి ఆనంద్ ,రైన్ మొదలైనవారి తో కలిసి సైకాలజీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్,  బుక్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఆన్ ది ఫ్రాన్టియర్స్ ఆఫ్ సైన్స్ ,,కే.ఎస్.మూర్తి అండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ థాట్,ఎక్స్ పెరిమెంటల్ స్టడీస్ డిఫరెంషియల్ ఎఫెక్ట్ ఇన్ లైఫ్ సెట్టింగ్ గ్రంథా రాశారు .అనేక జాతీయ అంతర్జాతీయ పత్రికలలో200కుపైగా  విశేషమైన ఆర్టికల్స్ రాశారు

సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు ఆంధ్రా యూని వర్సిటిలో రామ కృష్ణారావు గారి శిష్యులు .గురువుగారి ఘనత గురించి ఎంతసేపైనా మాట్లాడుతారు .రావు గారు అమెరికా వెడితే వారిని కలవకుండా తమ ఇంటికి తీసుకుకు వెళ్లి ఆతిధ్యమివ్వకుండా గోపాలకృష్ణగారు ఉండరు .వారి విశాఖ ఫోన్ నంబర్ నాకు ఇచ్చి నాతో మాట్లాడించేవారు  .వారిని సరసభారతి కార్యక్రమాలకు ఒకటి రెండు సార్లు స్వయంగా నేనే ఫోన్ చేసి మాట్లాడి ఆహ్వానించాను. అప్పుడు వారి ఆరోగ్యం సరిగ్గా లేదని కదలటం కష్టమని వారూ ,వారి శ్రీమతిగారూ చెప్పారు .సరసభారతి ప్రచురణలు అన్నీ వారికి పంపించేవాడిని. అందినట్లు వెంటనే లెటర్ రాసేసౌజన్యం వారిది .వారి విలువైన పుస్తకాలను నాకు గోపాల కృష్ణగారు కొని పంపించగా చదివాను.

ఆధారం –వీకీ పీడియా ,శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు

26-5-1935న పశ్చిమ గోదావరిజిల్లా పెరవలి మండలంలో లోని పిట్టలవేమవరం గ్రామం లో  తురగ దేశి రాజు జన్మించారు .1954లో ఆంధ్రా యూని వర్సిటిలో బిఎస్ సి పాసై  బెనారస్ హిందూ యూని వర్సిటి లో చదివి ఏం ఎస్.సి పొందారు .1964లో ఆంధ్రా యూని వర్సిటి నుంచి పిహెచ్ డి అందుకొన్నారు .అమెరికాలోని న్యూయార్క్ దగ్గరున్న అయిన్ స్టీన్ కాలేజి ఆఫ్ మెడిసిన్ 1967-69కాలం లో డాక్టోరల్ రిసెర్చ్ చేశారు .

  విజయనగరం మహారాజా కాలేజిలో లెక్చరర్ గా 1956 లో చేరి రెండేళ్ళు పని చే,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఆఫీసర్ గా పరిశోధనలు చేశారు  .విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజి లోనూ 1958-64 వరకు పరిశోధనలు కొనసాగించారు.తర్వాత ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టి ట్యూట్ఆఫ్  మెడికల్ సైన్సెస్ లో సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్ గా 1961నుంచి 75వరకు 14 ఏళ్ళు ఉన్నారు .బెంగుళూరు నేషనల్ హెల్త్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ N.I.M.H.A.N.Sలో అసిస్టెంట్ డైరెక్టర్గా ,అసోసియేట్ ప్రొఫెసర్ గా 1975-76లో రాణించారు .న్యూరో ఫిజియాలజీ కి ప్రొఫెసర్ గా  హెడ్ గా కీర్తిపొందారు

  మానసిక శాస్త్రానికి సంబంధించిన 185కు పైగా విలువైన పరిశోధనా వ్యాసాలను జాతీయ అంతర్జాతీయ పత్రికలకు రాశారు దేశి రాజుగారు .మెదడుపై పరిశోధనలో వీరికృషి అద్వితీయం అపూర్వం .చేతనావస్తలోని వివిధ దశలలో ‘’Trasmission of neuronnal messages by chemical transmitters  electricala potential ‘’అనే విషయం పైనా ,’’ట్రాన్స్మిషన్ అఫ్ సిగ్నల్స్  ఆఫ్ సేరేబ్రిల్  కార్టెక్స్ న్యూరాన్స్ ‘’పైనా విస్తృత పరి శోధనలు చేసి గణనీయమైన ఫలితాలు సాధించారు .మెదడు పనితీరు ,నిర్మాణం అందులోని న్యూరాన్ల మెత్తదనం అభి వృద్ధి పరచటం లో దేశిరాజు గారు అపూర్వ కృషి చేసి ‘’మానసిక వైద్యవిధాన మహారాజు ‘’అనిపించారు .యోగా ద్వారా మెదడుకు కలిగే ప్రతిస్పందన  ,మెదడు పని తీరు పెంపుడు  మీద అనితరసాధ్యమైన కృషి చేశారు .తురగ వారి మెదడు’’ తురగ  వేగం ‘’తో పని చేసేదేమో అనిపిస్తుంది

    ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ పత్రికా సంపాదకులుగా,న్యూరాలజి పత్రిక కు సహాయ సంపాదకులుగా  తురగ వారున్నారు .  .వీరి పరిశోధన కృషికి నేషనల్ అకాడెమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,జువలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లు ఫెలోషిప్ లు అందించాయి .అంతేకాక ఇంటర్నేషనల్   బ్రెయిన్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ,న్యురోలాజికల్  సొసైటీ ఆఫ్ ఇండియా ,సొసైటీ ఆఫ్ న్యూరో సైన్స్ ఇన్ ఇండియా ,ఇండియన్ అకాడెమి ఆఫ్ యోగా ,అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్ట్స్అండ్ ఫార్మోకాలజిస్త్స్ ఆఫ్ ఇండియా ,ప్రిమటలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ,ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బయో మెడికల్ సైన్సెస్ ,ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ న్యూరో పాథాలజి (అమెరికా ),సొసైటీ ఆఫ్ బయోమెడికల్ కమ్యూని కేషన్స్ మొదలైన ప్రసిద్ధ సంస్థలకు వివిధ పదవులలో ఉంటూ మార్గ దర్శనం చేశారు .

  దేశిరాజు వారి అమూల్య వైద్యవిధాన సేవలకు ఎన్నో అవార్డ్ లు ,రివార్డ్ లు పొందారు 1966లో శకుంతలాదేవి అమీర్ చ౦ద్ రిసెర్చ్ ప్రైజ్ ,1971లో గ్లాక్సో వోరేష న్  గోల్డ్ మెడల్ ,1980లో శాంతిస్వరూప్ భట్ నగర్ పురస్కారం ,ఎస్ ఎల్ భాటియా  వోరేషన్ అవార్డ్ ,1982లో , డాక్టర్ బిసి రాయ్  నేషనల్ అవార్డ్ ,1985లో బసంతి దేవి అమీర్ చంద్ ప్రైజ్ ,1986లో డాక్టర్ మేనినో డిసౌజా న్యూరాలజీ ఒరేషన్ అవార్డ్ ,1986-87లో హెచ్ జే మెహతా మెమోరియల్ ఒరేషన్ అవార్డ్  మొదలైనవి ఎన్నో  అందుకొన్నారు .

  మానసిక రోగుల చికిత్సా విదానం లో అత్యాధునిక ప్రక్రియలు ఎన్నో ప్రవేశ పెట్టిన దేశిరాజుగారు ‘’కరెంట్ షాక్ ట్రీట్ మెంట్ ‘’ను పూర్తిగా వ్యతిరేకించారు .’’మనస్తత్వ శాస్త్రాన్ని సరైన పద్ధతిలో అధ్యయనం చేయని వైద్యులు మానసిక వ్యాధుల చికిత్స చేయరా దు ‘’అనే సిద్ధాంతాన్ని ఆయన  జీవిత కాలమంతా  ప్రచారం చేసిన  మానవీయమూర్తి .ఈ విషయం లో మనదేశం ఎన్నో శతాబ్దాలు వెనకపడి ఉందని భావించారు .దేశిరాజుగారు 1992లో 57 వ ఏట మరణించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి

వేలూరి వెంకట కృష్ణ శాస్త్రిగారు కృష్ణాజిల్లా చిరివాడ అగ్రహారం లో 23-10-1934 న శ్రీ వేలూరి పార్ధసారధి శ్రీమతి అనసూయ దంపతులకు జన్మించారు .గుడివాడ కాలేజి లో డిగ్రీ పూర్తీ చేసి ,హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి నుడి ఏం ఏ ను ,కర్నాటక దార్వార్ యూని వర్సిటి నుంచి ఫై హెచ్ డిఅందుకొన్నారు .వి.వి.గా లోక ప్రసిద్ధులయ్యారు .

   ఆంద్ర ప్రదేశ పురాతత్వ శాస్త్రం అంతా  కృష్ణ మూర్తి గారి చుట్టూనే తిరిగి అంతటి అవినాభావ సంభంధమేర్పడింది .ఈ స్వర్నకాలం 1970-నుండి 190౦ వరకు రెండు దశాబ్దాలు కొనసాగింది .ఆంద్ర దేశం లో చరిత్రకు పూర్వం లోను , చరిత్ర కాలం కు   సంబంధించిన  అనేక విషయాలను ఆ సంస్థ అధిపతిగా త్రవ్వి తీసి లోకానికి అందించారు .అలాగే అనేక బౌద్ధ ఆరామాలు ,ప్రదేశాలను వెలికి తీసి వెలుగు లోకి తెచ్చారు .వీత్తికి సంబంధిన చరిత్ర కూడా రచించారు .అందుకే ‘’నిజాం తెలంగాణా చరిత్ర పితామహుడు ‘’అనే అన్వర్ధ బిరుదు అందుకొన్నారు .ఆంద్ర దేశం కు  తెలంగాణాకు సంబంధించిన అనేక పుస్తకాలు రాసిన స్కాలర్ అని పించుకొని ‘’లెజెండ్ ‘’అయ్యారు .వందలాది పురాతత్వ పరిశోధకులకు గొప్ప మార్గ దర్శి అయ్యారు .చాలా జర్నల్స్ లో వందలాది పరిశోధన వ్యాసాలూ రాసిన ఘన చరిత్ర వి.వి .గారిది .తన పరోధన అంశాలపై  విలువైన 10గ్రంథాలు రచించారు .ఆయన పురాతత్వ పరిశోధనకు గౌరవంగా ఒక సావనీర్ డా పి చెన్నారెడ్డి సంపాదకత్వం లో రూపు దాల్చింది .

  నాగార్జున కొండలో ఆర్కిలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా 1959నుంచి 1961నుండి 68 వరకు ’’ స్కాలర్ ట్రెయినీ ‘’గా ఉద్యోగం ప్రారంభించారు .1961-68కాలం లో.ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాస్త్రం ,మ్యూజియం శాఖకు టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్నారు 1968-79కాలం లో 11 సంవత్సరాలు ఆర్కిలాజికల్ త్రవ్వకాల శాఖకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను , 1979-81లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా  1981నుంచి 1992వరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా సేవలందించారు .1989నుంచి 91వరకు స్టేట్ ఆర్కైవ్స్ ,అండ్ ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్స్ లైబ్రరీ కి డైరెక్టర్  గా కూడా వ్యవహరించారు  ,

  ప్రకాశం జిల్లా చందవరం ,గుంటూరు జిల్లా కేసనపల్లి ,కరీం నగర్ జిల్లా ధూళికట్ట,కోటిలింగాల లోని బౌద్ధ ప్రదేశాలను త్రవ్వి వెలికి తీశారు .రంగా రెడ్డి జిల్లా మేడ్చెల్ తాలూకాలోని కేసన గుట్ట ప్రాంతాన్ని శాతవాహనుల తర్వాత క్రీ.శ.4-5 శతాబ్దాలలో చాళుక్యరాజులు పాలించినట్లు త్రవ్వకాల  సాక్షాధారాలతో నిరూపించారు .కృష్ణశాస్త్రిగారు త్రవ్వి వెలికితీసిన తోట్లకొండ ,  బావి కొండలను భారత ప్రభుత్వం అభి వృద్ధి చేసి గొప్ప యాత్రా స్థలాలుగా మార్చింది .

శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం వలన ముంపుకు గురైన చాలా దేవాలయాలను కొత్తగా కట్టిన గ్రామాలైన సోమశిల ,ఎర్లదిన్నె,సిద్దేశ్వరం ,భుజ౦గేశ్వరం ,క్యాటూరు లలో శాస్త్రిగారి ఆధ్వర్యం లో పుంర్మించారు .ఇవి కేఇష్ణ శాస్త్రిగారి  ప్రణాళికాబద్ధమైన ఆలోచన పటిమకు, నైపుణ్యానికి,అంకితభావానికి గొప్ప నిదర్శనాలుగా నిలిచిపోయాయని విశ్లేషకులు భావించి శాస్త్రిగారిని బహుదా అభినందించారు .ప్రతిజిల్లాకు ఒక మ్యూజియం నిర్మించాల్సిన అవసరం ఉందని శాస్త్రి గారు భావించి  అననతపురం  నెల్లూరు ,నల్గొండ  వరంగల్ ,చందవరం లో నిర్మించి చూపించిన కార్యశీలి .నల్గొండజిల్లాలో  పానుగల్ లో పచ్చల సోమేశ్వరాలయం ప్రక్కనే మ్యూజియం నిర్మించటం శాస్త్రిగారి ఆలోచనాదృక్పదానికి అద్దం పడుతుంది .ఇప్పుడిది ప్రముఖ టూరిస్ట్ సెంటర్ అయింది .

  కృష్ణ శాస్త్రిగారికి అవుట్ స్టాండింగ్ అర్కియాలజిస్ట్ గా ‘’ఎమినెంట్ సిటిజెన్ అవార్డ్ ను హైదరాబాద్ లోనిసద్గురు శివానంద మూర్తి గారి ’’ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్’’ 2002లో అందజేసింది . ఏలూరుగా పిలువబడుతున్న హేలాపురి లో ‘’హేలాపురి ఫోర్ట్ గ్రూప్ ‘’సంస్థ ‘’యశస్వి ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించింది .

  శాస్త్రిగారి ఆంగ్లరచన ‘’ప్రోటో హిస్టారికల్ కల్చర్ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్ ‘’గ్రంథం1982లో ప్రచురణ పొందింది .తెలుగులో రాసిన ‘’భారతీయ సంస్కృతీ –పురాతత్వ పరిశోధనలు ‘’పెద్దలకు ,పిన్నలకు కరదీపికగా భాసించే గ్రంథం

  •   వారి ఇంగ్లిష్ పరిశోధనపత్రాలు Terracotta’s from Peddabankur and Dhulikatta, (1978) Andhra Pradesh Journal of Archaeology, Vol 1, and no.1.
  • Keesara, part of Vishnukundina empire, (1979) Andhra Pradesh Journal of Archaeology, Vol. 1 no. 1
  • The Ash mound excavation at Hulikallu (1979) Andhra Pradesh Journal of Archaeology, Vol. 1 no. 2
  • Recent archaeological discoveries of the Satavahana period in AP,) Satavahana Souvenir, Satavahana Seminar Special Issue. 1981
  • Ancient Andhra History @Archaeology (Sectional Presidential Address) Proceedings of the AP History Congress, 8th Session, Kakinada, 1984
  • Vandalism of Archaeological monuments in India – role of public in their preservation, (1985) preservation, (1985) Proceedings of All India Museums Conference, Bhuvaneswar.
  • Historical Mosques of Hyderabad (1987) Journal of Salar Jung Museum Annual Research Journal, 1983–84 Hyderabad.
  • Architectural affiliation of Andhra with rock-cut caves of Ellora, (1988) Proceedings of Indian Art History Seminar.
  • Kuchipudi dance – a historical sketch, (1988) Souvenir of the Kuchipudi Kalaniketan, Hyderabad.
  • Salient features of the Early Islamic architecture in A.P (1989) Souvenir of the Centenary celebrations of the Victoria Jubilee MuseumVijayawada.
  • Seals and ceilings from Peddabankur, Epigraphia Andhrica, Vo.51989
  • Recent Trends in Archaeology of Andhra Pradesh, Sectional Presidential Address, 51 Session of Indian History Congress, Calcutta, 1990
  • Salvage archeological Operations under the Srisailam Project, (1990) Ithihas, and vol. 15 no.2. 1989
  • Artistic Innovations During the Vijayanagara Times, with Reference to AP, Itihas, Vol XV, 1989
  • Historical Geography of Andhra Pradesh, General Presidential Address, 28th Session of Andhra Pradesh History Congress, Vijayavada, 2004.
  • Tummanayeru Grant of Pulakesi 11. Brahmasri, P.V.Parabrahma Sastry Felicitation Vol., 2004
  • Sects of Buddhism in Andhra, Kevala_Bodhi, Buddhist and Jaina History of Deccan, 2004
  • Freedom Movement in (Coastal) Andhra, Krishna Pushkaram Celebrations, Special Issue, 2004

 మొదలైనవి ఎన్నో ఉన్నాయి

తెలుగులో రాసిన రిసెర్చ్ పేపర్లు

  • Andhra Pradesh Raastram lo Puraatatva Parisodhanalu, Andhra Jyoti Special Issue, 1985
  • Nagarjunkonda – Oka Bouddha Kshetram, (1987), Telugu Samacharam.
  • Amaravathi, (1987), Telugu Samacharam.
  • Bavikonda – Bouddharamam, (1988) Telugu Samacharam.
  • Nelakondapalli (1988) Telugu Samacharam.
  • Srisailam Project loni puratana kattadala parikshana charyalu, (1989) Telugu Vignanam.
  • Charitrika Chihnalu, MaaTelugu Talliki Mallepooladanda, A special issue brought out by Andhra Jyothi.1989.
  • Praachinaandhra Samskuti, Special Issue, Andhra Saaraswata Parishad Diamond Jubilee, 2003
  • Praachina Naanemulu-Moosi Charitra Parisodhana Telugu, B.Nsastry Commemoration Volume,
  • Tarataraala Telugu Samskruti, Moosi, November–December 2000.
  • Brihatsilayuga Samskrutulu-Inupayugam, Andhra Pradesh Samagra Charitra Samskruti, Vol 1. Andhra Pradesh History Congress, 2003

మొదలైనవి .

Discoveries[edit]

  • Discovered Stone Age Sites Early Stone Age site at Nagarjunakonda in Guntur District, Amarabad, Chandravagu, in Mehboobnagar District Several prehistoric sites near Ramagundam, Godavary Khani, Early, Middle and Late Stone age sites in Adilabad District near Wankhidi, Pochchara, Kerimeri etc., several Prehistoric sites in and around Yelleswaram in Nalgonda District
  • Neolithic sites near Togarrai, Kadambapur, Budigapalli, Kolakonda, Devaruppula, and Polakonda in Karimnagar District
  • Megalithic burial sites near Kadambapur, Valigonda in Nalgonda District, Kolakonda in Warangal District, Chinna Torruru, Bommera, Ramunipatla, Timmannapalli, Chilpur, Sirisapalli, Mandapalli, Palamakula, Pullur, and Vargas in Medak District
  • Buddhist Stupas at Kesanapalli in Guntur District, Chandavaram in Prakasam District, Dhulikatta, Kotilingala, Poshigoan in Karimnagar District
  • Prehistoric rocks art sites at Regonda in Karimnagar District, Edithanur in Medak District, Durgam and Bollaram in Mahbubnagar District, Gargeyapuram in Kurnool District???.

Salvage archaeology

Under Salvage archaeological operations in the submergible area of the Srisailam Project a large number of ancient temples have been dismantled and reconstructed at higher altitudes. The Somasila Group of Temples, the temples of SiddheswaramBhujangeswaram were transplanted and reconstructed. The fourteen temple group of Somasila was dismantled bit by bit and reconstructed at the newly built Somasila village that it now stands aloft in the new Somasila village due to the unceasing efforts of Sastry.

 చరిత్రను ,పురాతత్వ విషయాలను త్రవ్వి త్రవ్వి అలసిపోయిన శ్రీవేలూరి వెంకట కృష్ణ శాస్త్రి  గారు  77 వ ఏట 21-8-2012న శాశ్వత నిద్ర పోయి విశ్రాంతి తీసుకొన్నారు.

  శాస్త్రిగారు మా రెండవ బావగారు చిరివాడకు చెందిన శ్రీ వేలూరి వివేకానంద గారికి అతి దగ్గర బంధువులు .ఆ బంధుత్వం తోనే ఒక సారి వారు మాఇంటికి ఉయ్యూరు వచ్చారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .నేను మా బావగారి చుట్టరికాన్ని జ్ఞాపకం చేసేవాడిని .అలాగే మా బావగారి మేనల్లుడు – చెల్లెలు శ్రీమతి గాడేపల్లి శాంత ,శ్రీ శ్రీమన్నారాయణ దంపతుల కుమారుడు మేమందరం ‘’రాంబాబు ‘’అని పిలిచే రామకృష్ణారావు ఆర్కిలాజికల్  డిపార్ట్ మెంట్  లో శాస్త్రిగారి ప్రోత్సాహంతో చేరి ,అంచెలంచెలుగా ఎదిగి, సుమారు అయి దేళ్ళక్రితం రిటైరయ్యాడు . భోపాల్ లో ఉండే శాస్త్రిగారి సోదరులు శ్రీ వేలూరి రాధాకృష్ణ  ప్రసిద్ధి పొందిన గొప్ప చిత్రకారులు అని జ్ఞాపకం .

  ‘’డిపార్ట్ మెంట్ లో ఎవరైనా రిటైర్ అయితే కొత్తవారిని వేయటం లేదు .తగిన ఫండ్ ను ప్రభుత్వం రిలీజ్ చేయటం లేదు .పని చేయటం చాలాకష్టం గా ఉంది ‘’అని సభలలో తరచుగా చెప్పేవారు శాస్త్రిగారు .రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలుకూడా వారి సేవలపై ఉదాసీనమే చూపిం చాయి కాని ఏ రకమైన బిరుదు, పురస్కారాలు అందించలేదు .ఆయనదీ వీటికై వెంపర్లాడే వ్యక్తిత్వం కాదు .తనపనేదో తాను నిర్దుష్టంగా చేసుకుపోయారు .ఇలాంటిమహానుభావులు అరుదుగా ఉంటారు  వారే చరిత్ర పురుషులు .

 సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-19-ఉయ్యూరు

  image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు 42- కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు

42-  కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి  తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త    –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి

 భూగర్భ శాస్త్ర లోతులు తరచిన శాస్త్రవేత్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు 24-8-1926న కృష్ణాజిల్లా మచిలీపట్నం లో శ్రీ వావిలాల సీతారామ శాస్త్రి దంపతులకు జన్మించారు . బి ఎస్ సి ఆనర్స్ తర్వాత 1946లో ఏం ఎస్ సి చేసి ,కెనడా వెళ్లి ఆల్బెర్టా యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ఫెలోగా ఉంటూ పరిశోధనలు చేశారు .

  అస్సాం లోని దిగ్బోయిలో అస్సాం ఆయిల్ కంపెనీ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా చేరి ,జియాలజిస్ట్ గా 1949లో పదోన్నతి పొందారు .అప్పర్ అస్సాం కు సుర్మా వాలీకి మధ్య మైక్రో ఫోర్మానిఫెరల్ అధ్యయనానికి  నా౦దిపలికారు .అలాగే సిందు –బెలూచిస్తాన్ ప్రాంతాలలో మేసో జాయిక్  ప్లా౦టానిక్ ఫోరామిని ఫెర అధ్యయనం కూడా చేశారు . రాజస్థాన్ లోని జై సల్మేర్ లోనూ అధ్యయనం చేసి ‘’పాలో జిగ్రాఫికల్ మాప్ ‘’తయారు చేశారు .

జియలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో జియాలజిస్ట్ గా పదవి పొంది ,పదేళ్ళు పని చేశారు .డెహ్రాడూన్ లో ఆయిల్ అండ్ నేచురల్ గాస్ కమిషన్ కు జనరల్ మేనేజర్ గా ఉన్నారు .తర్వాత శాస్త్రిగారు ‘’రిసోర్స్ అండ్ ట్రెయినింగ్ ఇన్ స్టి ట్యూట్ ఫర్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ సంస్థ ‘’ను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు  .ఈ సంస్థ తొలి అధిపతిగా ఉండి నాలుగు సంవత్సరాలు సేవలందిస్తూ పరిశోధనలను వేగవంతం చేశారు .O.N.G.C.లో ఉంటూనే సీనియర్ శాసన లిపి  శాస్త్రజ్ఞులుగా   (పాలయింటా లజిస్ట్ ) 1959-63మధ్యకాలం లో నాలుగేళ్ళు పరిశోధనలు చేశారు .ఇండియాలో ప్రకృతి వనరులు గుర్తించటం లో అద్భుత పరిశోధనా పాటవం ప్రదర్శించారు .బాంబే హై లో సున్నపు రాళ్ళు ఉన్నట్లు అంచనా వేసి ,నిజమని నిరూపించారు .మన రాష్ట్రం లో కృష్ణా -గోదావరీ పరివాహక   ప్రాంతాలలో చమురు ,సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటగా గుర్తింఛి  అంచనావేసింది వావిలాల వాసుదేవ శాస్త్రి గారే .పాలార్ బేసిన్ లో కూడా సహజవాయువు చమురు నిక్షేపాలకోసం అన్వేషణ జరిపారు .’’ ఆర్బిటో లైన్స్ ఆఫ్ బర్మా టిబెట్ అండ్ ఇండియా’’అనే ఆయన  చేసిన అత్యుత్తమ పరిశోధనా ఫలితాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిఫరెన్స్ బుక్ గా 1957లో ముద్రించింది .భౌగోళిక ఆకృతీకరణ లేక అమరిక (జగ్రాఫికల్ కాన్ఫిగరేషన్ ),జియో టెక్నానిక్స్ లపై శాస్త్రిగారు  చేసిన అధ్యయన ఫలితమే కృష్ణా –గోదావరి బేసిన్ లో చమురు ,ఖనిజవాయువు ఉనికి బయట పడింది .గోదావరి తీరం లో ఆన్ లైన్ ,ఆఫ్ షోర్లలో చమురు నిక్షాపాలున్నాయని ఆయన చెప్పింది రుజువైంది .ఉష్ణ కుండాల వలన ఆగ్నేయ భారతం లో అత్యధికంగా హైడ్రో దేర్మల్ గ్రేడిఎంట్  ఉందని ఆయన  ఊహించి చెప్పినమాట యదార్ధమై౦దికూడా .

   ఆసియా లోని ‘’ఆయిల్ అండ్ గాస్  మాప్ ‘’ను 1-5 మిలియన్ నిష్పత్తిలో తయారు చేసే బృందానికి నాయకత్వం వహించి ,తెలియ జేసిన దానిని 1978లో యు. యెన్ .ప్రచురించింది .దీన్ని 1985 ,1989లలో మళ్ళీ సవరించి ప్రచురించారు .ఈ బృందమే ‘’ సెడిమెంటరి బేసిన్ మాప్ ఆఫ్ ఇండియా ‘’కూడా తయారు చేసింది .లక్ష ద్వీపం లో ని పూగా వాలీ జియోధర్మల్ స్టీం రిజర్వాయర్ పై శాస్త్రిగారు డా వి ఎస్ కృష్ణస్వామి తో కలిసి  తీవ్ర కృషి చేశారు . ఇండియాలోని ఈస్ట్ కోస్ట్ బేసిన్ లు ఐన మహానది, కృష్ణా, గోదావరి ,పాలార్, కావేరి బేసిన్ ల జియో టెక్నానిక్స్ ,మరియు పరిణామం లపై ధారావాహికం గా విలువైన పరిశోధన పత్రాలు రాసి ప్రచురించారు

    తాను పని చేస్తున్న సంస్థలో నే సూపరింటే౦ డింట్  జియాలజిస్ట్ గా (1963-64)రిసెర్చ్ అండ్  ట్రెయినింగ్ విభాగానికి జాయంట్ డైరెక్టర్ గా (1964-68)బాధ్యతలు నిర్వహించారు .వీరి తర్వాతనే వో యెన్ జి సి తమిళ గుత్తాధిపత్యం లోకి వెళ్ళింది .తెలుగువారు తెల్లమొహాలు వేసుకొని కూర్చు౦డి పోయారు .

  వాసుదేవ శాస్త్రిగారు నేషనల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్  నుంచి ఫెలోషిప్ పొందారు .1968-75కాలం లో తొమ్మిదేళ్ళు ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ సంస్థకు ముఖ్య అధిపతిగా ఉండి,విద్యార్ధులను పరిశోధనా రంగం లో నిష్ణాతులుగా తీర్చి దిద్దారు .బ్యాంకాక్ లో ఉన్న స్టాండర్డ్ వాక్యూం ఆయిల్ కంపెని కి ఐక్యరాజ్య సమితివిభాగం లో E.S.C.A.P.ఆధ్వర్యం లో 1975లో ప్రధాన సలహాదారు గా ఉంటూ భారత కీర్తి పతాకను ఘనంగా ఎగురవేశారు E.S.C.A.P.పధకం నిర్వహణకు ప్రత్యెక విధి నిర్వాహకులుగా ,ఆర్ధిక విషయాల అధిపతిగా ఉన్నారు . O.N.G.C.,ఇన్ సతి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థల రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగాలకు డైరెక్టర్ అయి ,ఆంధ్రుల మేధా సంపత్తిని పరిశోధనా సామర్ధ్యాన్ని  నిర్వహణ చాతుర్యాన్ని లోకానికి చాటి చూఫై  అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు .కేశవదేవ మాలవీయ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ అయి, పదవీ విరమణ వరకు పని చేశారు .రిటైర్ మెంట్ కుముందు O.N.G.Cకి జనరల్ మేనేజర్

  శాస్త్రిగారి శాస్త్ర సామర్ధ్యానికి తగిన పురస్కారాలు ఎన్నో లభించాయి .జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ,సోసైటీఆఫ్ ఎర్త్ సైన్సెస్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్  అసోసియేషన్ ,పాలయింటోలాజికల్ సోసైటీ ఆఫ్ ఇండియా మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు గౌరవ సభ్యత్వం అందించి తమను తాము గౌరవి౦చు కొన్నాయి .1976 జియోలాజికల్  సొసైటీ ఆఫ్ ఇండియా స్వర్ణ పతకం ప్రదానం చేసి సన్మానించింది .

   1976లో ఐక్యరాజ్య సమితివారి E.S.C.A.P ప్రచురించిన ‘’ఆయిల్ అండ్ నేచురల్ గాస్ ఆఫ్ ఇండియా ‘’పుస్తకం రెండవ , మూడవ ముద్రణలకు   కీలక బాధ్యత వహించి మంచి గుర్తింపు పొందారు .ప్రముఖ ‘’Tectonic Map of India’’పత్రికకు 1970నుంచి కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించి , పరిశోధకులకు ఉత్సాహ ప్రోత్సాహాలు కలిగించారు .

  ఆయన భార్య శ్రీమతి కమల .వీరికి ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు  సంతానం .1997లోశాస్త్రిగారు 71వ ఏట వాసుదేవ లోకానికి చేరారు . సైన్స్ తప్ప వేరే విషయం ఏదీ శాస్త్రిగారు  మాట్లాడే వారు కాదని ఆయన సన్నిహితులు చెప్పారు . O.N.G.C.,లో తనదైన సైంటిస్ట్ బృందాన్ని ప్రొఫెషనల్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు .యు యెన్ కు పెట్రోలియం అండ్ జియో టెక్నో నిక్స్ ఆఫ్ ఏసియా కు కన్సల్టెంట్ గా ,యు .యెన్ . ఎకనామిక్స్ ఆఫీసర్ గా బాంకాక్ లో ఉన్నారు .మలేషియా లోని పెట్రోనాస్ కు అడ్వైజర్ . పెట్రోలియం దానికి సంబంధించిన  మరియు పలు విద్యాలయాల  సంస్థల బోర్డ్ లలోగౌరవస్థానం లో  ఉన్నారు

  ఇంతటి  దిగ్దంత భూగర్భ శాస్త్ర వేత్త ‘’మన బందరు ‘’వారవటం మనకు గర్వకారణం .కానీ వారి గురించి ఈ నాటి తరానికి ఏమీ తెలియక పోవటం ఆశ్చర్యకరం .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారుకూడా ఎప్పుడూ శాస్త్రిగారి గురించి చెప్పిన జ్ఞాపకం నాకులేదు .బందరు వారికైనా తెలుసో లేదో ?బందరులో వారికి  గుర్తింపుగా ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు . తెలుగు వీకీపీడియాలోనూ వారి గురించి సమాచారం లేదు .బందరులో మరొక వావిలాల వాసుదేవ శాస్త్రిగారు ,అద్వైత పరబ్రహ్మ శాస్త్రిగారు గొప్ప ప్లీడర్లు  అని విన్నాను .అక్కడి వావిలాల వారు విద్యావంతులు ,ఘన చరిత్ర ఉన్నవారే ..

. ఆధారం శ్రీ బి ఎస్ వేంకటాచల రచన ‘’OBITUARY’’ JOUR.GEOL.SOC.INDIA,YOL.5I. APRIL 1998

మరియు శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు

ఆధునిక శాస్త్ర రత్నాలు –

41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు

17-10-1872న పశ్చిమ గోదావరిజిల్లా రేలంగిలో ఒక పేద  బ్రాహ్మణ కుటుంబం లో చిలుకూరి వీరరాజు దంపతులకు  శ్రీ చిలుకూరి వీరభద్రరావు జన్మించారు .సంస్కృత ఆంధ్రాలలో సాధికారత సాధించారు .దేశోపకారి ,విబుధ రంజని ,సత్యవాదిని ,ఆంద్ర కేసరి మొదలైన పత్రికలకు సారధ్యం వహించారు .

  1909లో మద్రాస్ వెళ్లి ,’’విజ్ఞాన చంద్రికా మండలి ‘’వారి గ్రంథ మాలలో ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రెండుభాగాలుగా రచించి 1912లో వెలువరించారు .అప్పుడే రూపుదాలుస్తున్న ఆంధ్రోద్యమానికి ఊపిరులూదారు.’’ఇతిహాస తరంగిణి గ్రంథ మాల ‘’ను రాజమండ్రి లో స్థాపించి మొదటి ప్రచురణగా ‘’ఆంధ్రుల చరిత్ర -3 మూడవ భాగాన్ని’’1916లో  వెలువరించారు.కాకతీయ ఆంద్ర రాజుల చరిత్ర ,ఆంద్ర రాజుల చరిత్ర రాసి 1936లో ప్రచురించారు .నిశిత పరిశోధన నిక్కచ్చితనం ,అపరిమిత పరిజ్ఞానం నిష్కర్ష విశ్లేషణ  రావు గారి సొత్తు .అవే భావి తరాలకు మార్గ దర్శకాలయ్యాయి .

‘’పెరిస్తా ‘’అనే విదేశీ యాత్రికుడు ,చరిత్రకారుడు ‘’అళియ రామరాయలు ఒకప్పుడు  గోల్కొండ నవాబు కుతుబ్ షా వద్ద పని చేశాడని ,మరొక సుల్తాన్ ఆయన కోటపై దాడి చేస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోగా ,కుతుబ్ షా తరిమేశాడని ,అప్పుడు శ్రీ కృష్ణ దేవరాయలవద్ద ఉద్యోగం సంపాదించాడని,  ఈ విషయం తనకు ఒక అనామ కుడైన చరిత్రకారుడు చెబితే నమ్మి రాశాను ‘’అని రాశాడు .ఇది యదార్ధం కాదని వీరభద్రరావు గారు భావించారు .అళియరామరాయల వ్యక్తిత్వం ,ప్రవర్తన ,తల్లి కోట యుద్ధం లో ఆయన చూపిన ధైర్య సాహసాలు చూస్తె ఇదంతా కట్టుకధ గా భావించి ,లోతైన పరిశోధన చేసి అసలు సిసలైన చరిత్ర రాసి మహోపకారం చేశారు .

  •   చిలుకూరిరచనలు – రాజమహేంద్రపుర చరిత్రముఆంధ్రుల చరిత్రము ,జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము,తిక్కన సోమయాజి,తిమ్మరుసు మంత్రి, శ్రీనాథ కవి, శివాజీ చరిత్ర, కర్ణ సామ్రాజ్యము, నవరసిక మనోల్లాసిని ,స్వయం సహాయము ,వరలక్ష్మీ విలాసము, హిందూ సంసారము, హిందూ గృహము, హస్య తరంగిణి ,సుమిత్ర,ఆళియరామరాయలు[5] ,నాయకురాలి దర్పము ,అశ్వత్థామ అచ్చి[6] ,అశోక చక్రవర్తి ధర్మశాసనములు.

రాజమండ్రిలో ‘’ఆంద్ర పరిశోధన సభ ‘’స్థాపనలో కీలకపాత్ర  పాత్ర చిలుకూరివారిదే .1928లో నంద్యాలపట్టణం లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యం లో జరిగిన ‘’ఆంద్ర మహాసభ ‘’లో శ్రీ చిలుకూరి వీరభద్ర రావు గారికి ‘’ఆంద్ర చరిత్ర చతురానన’’బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .చిలుకూరివారు కొవ్వూరులో 17-5-1939న67 వ ఏట మరణించారు .

   సత్య ప్రకటనమే సత్పరిశోధనకు లక్షణం అని నమ్మిన నిర్బీకులు రావుగారు .తెలుగు వారిలోని కొన్ని జాతులు, వర్ణాలు గురించి ఆయన వెల్లడించిన నిర్ణయాలు కొందరు సంస్థానాదీశులకు కోపం తెప్పించాయి .దీన్ని గమనించిన వేదం వెంకట రాయ శాస్త్రి గారు ‘’  వీరభద్రరావుగారు ! ప్రమాదము సుమండీ ‘ యని మందలించారట కాని తను నమ్మిన మార్గం లోనే నడిచారు .మొగమాటం అనేది పూజ్యం .సత్య శోధనానికి ఆస్తి ,ఆరోగ్యం ఖర్చు చేసిన మహానుభావులు .ఆయన మిడికింది ‘’ఇస్కూలు ఫైనల్ ‘’మాత్రమె కాని’’చరిత్ర చతురాననులయ్యారు’’ ఒక సభలో కట్టమంచి రామలింగారెడ్డి ‘ వీరభద్రరావుగారి విమర్శనశక్తి చాల గొప్పది. దానిని వర్ణింప నా కర్హతలే ‘ దని చెప్పారు .

ఆంధ్రచరిత్రకారులలో వీరభద్రరావుగారు, లక్ష్మణరావుగారు, రామయ్యపంతులుగారు, వీరేశలింగముపంతులుగారు ఒకే శ్రేణికి చెందినవారని విజ్ఞుల భావన .చిలుకూరి వారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ఆంధ్రులలో జాతీయోద్యమానికి దారి చూపింది .చిలుకూరి వారి చరిత్ర పరిశోధనా రంగం వలన ప్రాచీన ఆంద్ర సౌభాగ్యం ,ప్రాచీన సామ్రాజ్య వైభవం తెరలు తెంచుకొని వచ్చి మధుర నాట్యం చేసింది ‘’అని అన్నాడొక విశ్లేషణ శిఖామణి .ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ కుందూరి ఈశ్వర దత్ చిలుకూరివారి మేనల్లుడు .వీరేశలింగం గారి తర్వాత చరిత్రకారులకు చిలుకూరివారే మార్గ దర్శకులు అంటారు .

ఆధారం –తెలుగు వీకీపీడియా మరియు శ్రీ వాసవ్య రచన’’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు  న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు

దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రి వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండి నుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం పాఠశాలలో చదివారు. 1916 లో మద్రాసు ప్రసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) మద్రాసు లోనే పూర్తిచేసి 1922 నుండి విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య యోధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.

వ్యక్తిగత జీవితం

ఆయన తల్లిగారు ద్రాక్షారామం వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి విశాఖపట్టణంకు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922నుండి విజయవాడలో ప్రఖ్యాత న్యాయవాది. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.[1][2],[3], గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.[4]. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా బ్రిటిష్ ప్రభుత్వ౦ చేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన న్యాయవాదిగా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర,స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి, వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.[5] వారు నీతి నిజాయితీకి మరోపేరు.[6] అవినీతి ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు సాహిత్య, రాజకీయ, న్యాయవాద పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. ఉపన్యాసాలు ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. స్వాతంత్ర్య సమరయోధులుగా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని,జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా విజయవాడలోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు సాహిత్య కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95పైబడినతరువాత 03-10-1992 న భోపాల్ నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా కథలు గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో జైలుకి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా

ఆంధ్ర మద్రాసు ప్రావిన్సల పై విపులమైన సమాచారము గాంధీగారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
స్వాతంత్ర్యోద్యమములో కాంగ్రెసు కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
కాంగ్రెస్ జాతీయనాయకులవద్దనుండి ఇంగ్లీషులో వచ్చిన కీలక సమాచార కార్యాచరణ విషయాలను తెలుగులోకి, ఆంధ్రప్రాంతపు కాంగ్రెస్సు నాయకులు తెలుగులో వ్రాసినది ఇంగ్లీషులోకి తర్జమాలు
కృష్ణా జిల్లా కాంగ్రస్ కర్యాచరణకు in charge for publicity గా పనిచేశారు
సహకార సంస్ధోద్యమంలో వారు కృష్ణా జిల్లా సహకార సంసధకు డైరక్టరు గాను బెజవాడ సహకార భాండారు కార్యదర్శిగాను పనిచేశారు
న్యాయవాదిగా వారి సేవలను కాంగ్రెస్ నాయకులగు డా.ఘంటసాల సీతారామ శర్మ, ఎన్.జి.రంగా (ఆచార్యరంగా) గార్లకి వచ్చిన కేసులలో న్యాయవాదిగా వారి తరఫున పనిచేశారు
ఇండియలీగ్ కమిషన్ కు, ఖోసలా కమిషన్ (కృష్ణా రివర్ ) కూ తను వ్రాసిన మేమోరాండ సమర్పించారు.
ప్రజాసేవ సంస్ధల్లో, న్యాయాలయాలలో ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భములలో అధికారులతో స్పందించి నివారణకు చర్యలు చేప్పట్టారు
కేవలం తన పుస్తకాలే కాకుండా గొప్ప పండితులైన వేలూరి శివరామ శాస్త్రి గారు, భావకవి బసవరాజు అప్పారావు గార్ల పుస్తకాలు ముద్రంపచేశారు
తనమిత్రులైన వారికోరికపై వారి పుస్తకాల సవరణలకు సహాయ పడ్డారు.
ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.

“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండి వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్టేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- కాకినాడ- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, పిఠాపురం జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండి1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రాశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916 – 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టల్లో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, వెలిదండ్ల హనుమంతరావు L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, యల్లాప్రగడ సుబ్బారావు L.M&S.,Ph.D (U.S.A), గోవిందరాజుల వెంకటసుబ్బారావు, డా అమంచర్ల శేషాచలపతి రావు కె.ఎల్.రావు (కానూరి లక్ష్మణ రావు)M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) టి. యస్ అవినాశ లింగం (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), యమ్. భక్త వత్సలం ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) కోకా సుబ్బారావు ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) పోతాప్రగడ శ్రీరామారావు, (తణుకులో న్యాయవాదిగా చేశారు )

వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు

దిగవల్లి అనే గ్రామం కృష్ణాజల్లాలో నూజివీడు తాలూకా లోనున్నది. శివరావు గారి పితామహుడు దిగవల్లి తిమ్మరాజు గారి పూర్వులు దిగవల్లి దగ్గిర కొయ్యూరు గ్రామంలో వుండి, బొమ్మలూరు రమణక్కపేటలో భూములు కలిగనవారు. వారి వంశీయులు సంప్రతీ కరణాలు. అంటే చుట్టుప్రక్కల గ్రామ కరణ సమూహమునకు పెద్ద కరణంగా మిరాస్మీ అనే హక్కు కలిగి గ్రామంలో జరిగే కార్యకలాపై లావజ్మల్ అనబడే ఫీజు వసూలు చేసుకునే హక్కు గల కరణాలు. తిమ్మరాజు గారి జీవిత కాలం 1794 – 1856. వారు చిన్ననాటనే 1807 సంవత్సర ప్రాంతంల్లో కొయ్యూరు గ్రామం వదలి ఏలూరు లోకొంతకాలం వుండి ఇంగ్లీషు, పార్సీ భాషలు చదువుకుని అక్కడనుండి ఉద్యోగాన్వేషణలో రాజమండ్రీకి చేరి ఇంగ్లీషు వారి ఈస్టుఇండియా కంపెనీ ప్రభుత్వంలో మొట్టమొదలుగా 1811 లో రాజమండ్రి డిస్ట్రి క్టు కోర్టులో ‘ఇంగ్లీషు రికార్డు కీపర్’కు అసిస్టెంటుగా ప్రవేశించి తరువాత 1820 లో కాకినాడలో కలెక్టరు కార్యాలయంలో ఇంగ్లీషు రికార్డు కీపర్ గా చేశారు. ఆ తరువాత పిఠాపురంలో శిరస్తదారుగా నియమింపబడ్డారు. వారికి కలేక్టరు రాబర్టసన్ గారు 1922 లో నివాసగృహ నిమిత్తము 8640 చదరవు గజములస్తళమును కాకినాడలో రాబర్టసన్ పేటలో ఇచ్చినట్లు గోదావరి జిల్లా రికార్డులలో ఉంది. ఆస్దలములో తిమ్మరాజుగారు రెండుమండువాల పెద్ద ఇంటిని నిర్మిచుకన్నారు. తిమ్మరాజుగారు 1828 లో కాకినాడలో శ్రీ భీమేశ్వరాలయ గోపురం, 1931 లో ఆ గుడి పూర్తిగా కట్టించి నట్టుగా ఆ గుడిలోని శిలాశాసనం వల్ల తెలుస్తున్నది. 1850 లో తిమ్మరాజు గారు కంపెనీ ప్రభుత్వంలో హూజూర్ సిరస్తాదారుగా నెలకి రూ 250 జీతంపై పనిచేస్తున్నారు. వారు చేసిన పెద్ద ఉద్యోగాల కారణంగా రాజమండ్రీ జిల్లా (తదుపరి గోదావరి జిల్లా) లో ప్రభుత్వపు రికార్డులలో తిమ్మరాజుగారిని గూర్చిన రికార్టు వుంది .పిఠాపురం జమీందారైన రావుసూర్యారావు గారు 1850 లో చనిపోగా తిమ్మరాజుగారిని కంపెనీ ప్రభుత్వం వారు పిఠాపురం సంస్థానంకి కోర్ట్ ఆఫ్ వార్డ్సు (Court of Wards) మేనేజరుగా నియమించారు. ఆవిధంగా వారు1850 లో రెండు ఉద్యోగాలు నిర్వహించారు . 1834 లోవారు జొన్నలగడ్డ కొండయ్య కొత్తపల్లి అమల్దార్ల అన్యాక్రాంత లావాదేవిల వ్యవహారంలో తిమ్మరాజు గారు విచారణ జిరిపి కలెక్టరుకు పంపిన రిపోర్టు (అప్పటి రాజమండ్రీ జిల్లా )గోదావరి జల్లా రికార్డులో చేర్చబడి యున్నది.[7]. ధవళేశ్వరం ఆనకట్ట కట్టే రోజుల్లో తిమ్మరాజు గారి పనిలో లోపం కలిగనదని ఆనకట్ట నిర్మాణ కమీషనర్ వారికి ఒక అణా జుల్మానా విధించగా తిమ్మారాజు గారి అపీలుపై జిల్లా కలెక్టరు విచారణ జరిపించి వారు నిజాయతి పరులని, తెలుసుకుని జుల్మానా రద్దు చేసినట్లుగా జిల్లా రికార్డులో వున్న సంగతి శివరావు గారు బయటకు తీసి వారి కథలు గాథలు పుస్తకంలో వ్రాశారు.[8]. తిమ్మరాజుగారి పనిచేసిన పదవులు కీలకమగుట వల్ల గోదావరి జల్లా రికార్డులలో వారి ద్వారా జరిగిన ప్రభుత్వ వ్యవహారాలలో వారి గురించి ప్రత్యక్షాధారాలు కనబడ తాయని శివరావు గారు చరిత్ర

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపవిత్రఃః పవిత్రోవా” 

అపవిత్రఃః పవిత్రోవా”

ఇవాళ నాదెండ్ల  ఆ మొన్న రమేష్ వెంకటేష్ అండ్ కో బిజెపి తీర్ధం పుచ్చుకొన్నారు  రేపు ఇంకెందరో? అందరికీ అమిత్ షా ”అపవిత్రఃః పవిత్రోవా”మంత్రం చెప్పి ప్రక్షాళన చేసి కమలం రంగు అంటించి ,తిరు క్షవరమూ చేయించి ఊర్ధ్వ పుండ్రాలు పెట్టి  కాషాయం కప్పికలుపుకొంటాడు పాపం బాబు ఇలా ఫాన్ గాలి వాళ్ళను చేరదీసి నిండా  మునిగాడు శాంతం పాపం . -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )

‘’డిగ్రీలు లేని పాడుకాలాన ‘’పుట్టావు అని విశ్వనాథ వారి సానుభూతి పొంది ఆయన కృతిని అంకితం పుచ్చుకొన్న శాసన పరిశోధకులు పురాలిపి శాస్త్రవేత్త విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ మల్లం పల్లి సోమశేఖర శర్మగారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం ‘’మినిమించిలి పాలెం ‘’లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రయ్య గార్లకు 1891 లో జన్మించారు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని “పాలకూరు”కి “బమ్మెర”కు సమీపమున నున్న గ్రామం .కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టారు.అక్కడే ‘’దేశ మాత ‘’పత్రికలో చేరి చారిత్రక అంశాలపైఅభిరుచి పెంచుకొన్నారు .

.జీవిత విశేషాలు
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించారు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించారు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. ఆయనకు సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశారు. చిలుకూరి వారి ‘’ఆంద్ర దేశ చరిత్ర ‘’చిత్తుప్రతికి శుద్ధప్రతి రాసిన ఘనత శర్మగారిది .తన అభిరుచికి తగ్గట్లు తనను తాను మలచుకొన్న కర్మిస్టి శర్మగారు. ‘’ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల’’స్థాపించి ఆంధ్రవీరులు ,ప్రాచీన విద్యా పీఠాలు,ప్రాచీన ఆంద్ర నౌకాజీవనం మొదలైన పరిశోధన గ్రంథాలు రాసి ప్రచురించారు .ఆనాటి భారతి మాసపత్రిక శర్మగారి రచన లేకుండా వెలువడేది కాదు అంటే అతిశయోక్తికాదు .పత్రికకు, వారికి ఉన్న అనుబంధం అలాంటిది .వారి రచన అంటే పరమ ప్రమాణం అని యాజమాన్యం నమ్మి ప్రచురించేది .మద్రాస్ లోని ‘’ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్ జర్నల్ ‘’లోనూ విలువైన తెలుగు ,ఇంగ్లిష్ వ్యాసాలు రాశారు .
అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మరియు రాయప్రోలు సుబ్బారావు వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనారు. అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నారు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకట రమణయ్యతో కలిసీ నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించారు. వీరిని ‘’ శాసనాల శర్మ ‘’అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.

తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ఎపిగ్రాఫియా ఇండియా, భారతి, శారద, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశారు. ఘంటసాల ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం ఆయన మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ గారు మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవారు. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ “ఱ”గా గుర్తించగా వేటూరి ప్రభాకర శాస్త్రి దానిని “ష+జ” (‘ష’ క్రింద ‘జ’ వత్తు) అని అన్నారు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవారు

శాసన పరిశోధనలు
లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతులు. అమరావతీ స్తూపము అన్న ఆయన రచన ఇందుకు తార్కాణము. మొగల్‌రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించారు.

సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించారు. సమస్యా భూయిష్టమైన వేంగి చాళుక్యుల కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశారు. కాకతీయులు అన్నా, తెలంగాణమన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబంధించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించారు. తన మిత్రుడు నేలటూరు వెంకటరమణయ్యతో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలో వెలువడిన ‘Early History of Deccan’లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశారు. కాకతీయుల తరువాత సాగిన అంధకార యుగం అనుకొనే సమయం గురించి పరిశోధించారు. క్రీ.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాపయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన Forgotten Chapter of Andhra Historyలో వివరించారు. ఈ “ముసునూరు యుగం” రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ గారు నిరూపించారు.[1]

అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.

శాసనములను ప్రకటించుటలో , ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసి ఉంది. తొందరపాటు అనున ఎరుగరు . పాఠ నిర్ణయమున అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము ”’భారతి”’ లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశమునకు సంబందించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావని కంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనాలు .

ఆంధ్ర దేశములోని మౌర్య అశోకుని బ్రాహ్మీశిలా శాసనము మొదలుకొని ఇకక్ష్వాక, శాలంకాయన, విష్ణుకుండిన, పల్లవ, తూర్పు చాళుక్య, గాంగవంశ, కాకతీయ, మునుసూరి, రెడ్ది, విజయనగర రాజుల శాసనలిపులన్నింటినీ వారు చక్కగా చదివి పరిష్కరించారు . భారతిలో ప్రకటించిన అశోకుని రాయలసీమ, శాలంకాయన నందివర్మ పెదవేగి, వినయాదిత్యుని కర్నూలు, అరికేసరి కొల్లిపర్రు, దేవేంద్రవర్మకంబికాయ, హస్తివర్మ నర్సింగపల్లి, ముసునూరి ప్రోలనాయకుని విలస శాసనములు ఆయా రాజవంశముల చరిత్రకు చాలా ముఖ్యమైనవి.ఈ శాసనముల ఆధారంగా వారనేక చక్కని చారిత్రక లఘువ్యాసములు భారతిలో రచించారు . అందు కడపటి పల్లనుల కాల నిర్ణయము, వేంగి చాళుక్యులు, వాతాపిచాళుక్యులు, కళింగకదంబులు, త్రిలోచన పల్లవుడు, వడ్డవారము, బౌద్దమత పరిణామము, పాల్కురికి రికి సోమన, జక్కన కవుల కాల నిర్ణయము, కులములుకుల సంఖ్య, చారిత్రక శతకములు, తంజావూరి మహారాష్ట్ర భూపతులు-ఆంధ్ర సాహిత్యము, యూరోపియనులు-ఆంధ్రభాషా చరిత్రసేవ మున్నగువానిలో ఆంధ్రదేశ సంస్కృతికి సంబందించిన వివిధ రంగములలోని విజ్ఞాన విశేషములు కరతలామలకము గావించారు .యూనివర్సిటీ డిగ్రీలకు మించిన యోగ్యతా పత్రాలను అందుకొన్న విజ్ఞానఖని సోమశేఖర శర్మగారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో దశాబ్ద కాలం హిస్టరీ లెక్చరర్ గా చరిత్ర ,శాసన పరిశోధనలపై విద్యార్ధులకు బోధించి అవగాహన కల్పించారు .రెండవసారి కూడా ఆంధ్రా యూని వర్సిటీ లో 1957-63కాలం లో పనిచేసి విద్యార్ధులను చరిత్ర పరిశోధకులుగా తీర్చిదిద్దారు .
‘’ తెలుగు విజ్ఞాన సర్వస్వం ‘’ లో మల్లమపల్లివారు ‘’తెలుగు సంస్కృతి’’ సంపుటానికి సంపాదకత్వం వహించి ,తానూ అమూల్యమైన వ్యాసాలూ రాశారు.

“భారతీయ లిపి శాస్త్రము”, “ఆంధ్రదేశమున మాండలికుల పరిపాలన” అను రెండు గ్రంధములు శర్మగారి రచించాలని అనుకొన్నారు , కాని మల్లంపల్లి సోమశేఖర శర్మ 1963 జనవరి 7వ తేది 72వ ఏట విశాఖ పట్నం లో మరణించారు. అందువల్ల ఆంధ్రులకు అవిలభించె అదృష్టము పోయి౦ది.

సోమశేఖర శర్మ రచనలు
· అమరావతి స్థూపము, ఇతర వ్యాసములు – 1932

· కొన్ని చారిత్రిక వ్యాసాలు ‘ఆంధ్రభారతి’ వెబ్‌సైటులో చూడవచ్చును

· నా నెల్లూరు జిల్లా పర్యటన – శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.

· Corpus of inscriptions in the Telangana District part IV (Archaeological series) – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ (1973)

· సోమశేఖర శర్మ విరచితము – ఆంధ్రవీరులు – 1920

· రాగతరంగిణి – విచారకరమైన చిన్న కథ – 1916 – మనోరమ ప్రెస్

· విజయ తోరణము – రేడియో నాటికలు

· ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) – 1976 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ

· ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము – ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు – వెల రూ.1-8 [1]

· రెడ్డి రాజ్యాల చరిత్ర (‘హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్‌డమ్స్’ ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం) [2]

· బౌద్ధ యుగము అంశంపై ఆయన రాసిన వ్యాసాలను చారిత్రకవ్యాసములు[2] పుస్తకం రూపంలో 1944లో ప్రచురించారు.

] శర్మగారి పరిశోధనా వ్యాసాలు అత్య౦త విలువను సంతరించుకొన్నాయి .ఇంతటి మహోన్నత మూర్తికి డిగ్రీలు లేకపోవటంవిశేషం . ,ఏ పురస్కారాలు లేకపోవటం శోచనీయం నేను 1963-64లో రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజిలో బిఎడ్.చేస్తుండగా శర్మగారి మేనకోడళ్ళు శ్రీమతి ఇవటూరి వరలక్ష్మి ,శ్రీమతి ఇవటూరి శివ లక్ష్మి నాకు క్లాస్ మేట్లు.. శర్మగారు చనిపోయి కొన్ని నెలలే అయినందున ఆ సోదరీమణులు మేనమామగారిని పదే పదే గుర్తు చేసుకొని దుఖి౦చేవారు .వారిద్దరి సౌజన్యం మరువరానిది గా ఉండేది .

ఆధారం –తెలుగు వీకీ పీడియా మరియు శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’. .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం

  చరిత్ర అంటే బ్రిటిష్ వారు చెప్పింది, రాసిందే చరిత్ర అని చాలా కాలం మనం నమ్మాం.చదివాం గుడ్డిగా .కాని అసలైన చరిత్ర అదికాదు అనిఖండి౦చి  ,సహేతుకంగా రుజూవు  చేసి ,పాశ్చాత్య చరిత్ర పరిశోధకులనూ మెప్పించి అనేక చరిత్ర గ్రంథాలు రాసి ప్రచురించి ఒకరకంగా చరిత్ర రచన లో విప్లవం  సృష్టించిన వారు శ్రీ కోట వెంకటాచలం గారు .కృష్ణా జిల్లా మేడూరు దగ్గర  మధునాపురం అగ్రహారం లో 21-4-1885న శ్రీ కోట వెంకటాచలం గారు జన్మించారు .బందరు నోబుల్ కాలేజిలో చదివి స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నారు . బందరు లో జాతీయ కళాశాల స్థాపనకు ,అభి వృద్ధికి విశేష కృషి చేశారు .

  1924లో బెజవాడలో   స్థిర నివాసం ఏర్పరచుకొని జీవితమంతా యదార్ధ భారతదేశ, ఆంద్ర దేశ చరిత్ర రచనకు అంకితభావం తో కృషి చేశారు .ప్రాచీన హిందూ వైజ్ఞానిక సామాజిక శాస్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .నలభై ఏళ్ళు ఇలా చరిత్ర  పరిశోధనలో నిమగ్నమై అసలు సిసలు దేశీయ చరిత్ర,  ఆంధ్రుల చరిత్ర రాసి కళ్ళు తిరిగే యదార్దాలను బయట పెట్టి చారిత్రిక పరిశోధకులకు మైండ్ బ్లాంక్ చేశారు .1947లో ‘’ఆర్ష విజ్ఞాన గ్రంథమాల ‘’స్థాపించి ,పదేళ్ళ కాలం లో 12అద్భుత గ్రంథాలు రాసి ప్రచురించారు .అందులో ముఖ్యమైనవి –మానవ సృష్టి విజ్ఞానం ,బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం ,ఆంధ్రులెవరు?జంబూద్వీపం ,కలి శక విజ్ఞానం మొదలైనవితెలుగు లో రచించారు .దేశమంతా తిరిగి ఉపన్యాసాలిచ్చి చారిత్రిక సత్యాలకు పట్టాభి షేకం జరిపించారు .1951లో రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభలో కోటవారు ‘’ Xandrames, Sandrocottus and Sandrocyptus’’లపై సాధికార పరిశోధన పత్రం రాసిసంర్పింఛి బ్రహ్మాండమైన ప్రసంగం చేసి ప్రశంసలు పొందారు .1956లో ఏర్పడిన మొదటి సంస్కృత కమిషన్ కు రెస్పాండర్ గా ఉన్నారు.

   ఆంగ్లం లో1- ‘’The history of Vikramaditya and Shalivahana 2-The plot of Indian Chronology ,3-Chronology of Kasmir History 4-Chronology of Nepal history 5-Abe of Buddha 5-Milinda yuga Purana 6-Indian Eras మొదలైన ఆధేన్టిక్  గ్రంధాలురాశారు .  ఆంద్ర ,ఆంగ్లాలలో  23గ్రంథాలు రాశారు .సృష్టి క్రమాన్ని ఆదినుంచి రాసిన చరిత్ర ఘనాపాఠీ కోటవారు .ప్రతి రచనా  తులనాత్మకంగా   .పరి శీలించి పరిశొధి౦చి  పాశ్చాత్యుల అభూతకల్పనలను చీల్చి చెండాడిన చరిత్ర భార్గవ రాముడాయన .చరిత్ర గర్భం లో మరుగు పడిపోయిన అనేక అంశాలను తనకలం ‘’కోల’’తో పైకెత్తి తీసి ఉద్ధరించిన  అపర  అతారమూర్తి శ్రీ వెంకటాచలం గారు .ఆయన చరిత్ర అధ్యయన పరిశోధన ,పరిశీలనాలకు తలలుపండిన చారిత్రకపరిశోధకులు కాదనలేక తలలు వంచి ఉండి పోయారు . పాశ్చాత్య చరిత్రకారులతో ఆంగ్లం లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తనభావాలను వివరించేవారు .హేతుబద్ధమైన ప్రణాళికా బద్ధమైన రచనలే చేశారుకాని తానుపట్టిన కుందేలుకు మూడుకాళ్ళేఅన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు .అందుకే ఆయన చెప్పింది వేదవాక్కుగా శిరో దార్యమై ‘’భారత చరిత్ర భాస్కర ‘’విమర్శకాగ్రేసర ‘’పాకయాజి ‘’బిరుదులు  సార్ధకమైనాయి .  ‘’Indian History in general and ‘’Andhra History in particular  even very recently hve been subject to many manipulations .The entire Chronlogy in fact may be off .But  Pandit Venkatachalam was the only voice decrying the propaganda that was being sowed during colonial rule .Kavi samrat Vishvanadha also raised his hands to support him .’’ అని అందుకే అన్నారు .విశ్వనాధ కోటవారి పుస్తకాలకు ముందుమాటలు రాసి విలువ పెంచారు .

  1957లో వెంకటాచలం గారు ‘’అభినవ విరూపాక్ష పీఠం’’కు పీఠాధిపతు లై ‘’అద్వయానంద  శంకర భారతీ స్వామి ‘’గా ఆశ్రమ నామ దారి అయ్యారు

చల్లా సుబ్బారాయుడు గారు అసలుతండ్రి .కోట నిత్యానందం గారు పెంపుడు తండ్రి .పట్టువదలని రచనా విక్రమార్కులై జీవిత చరమాంకం లో కూడా ‘’మహాభారత యుద్ధకాలం ‘’,’’శంకర పీఠముల చరిత్ర ‘’ప్రామాణికంగా1958-60 కాలం లో  రాశారు .15-11-1959న 74 ఏళ్ళవయసులో చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటాచలం గారు మరణించి చరిత్ర పురుషులయ్యారు.

కోటవారి చరిత్ర ప్రకారం బుద్ధునికాలం క్రీ పూ 1887కాగా పాశ్చాత్యులు క్రీపూ 6వ శతాబ్దం అన్నారు .క్రీపూ 1534కు చెందిన చంద్ర గుప్తమౌర్యునికాలాన్ని క్రీపూ 327కు మార్చారు .ఆదిశంకరాచార్యులకాలం క్రీపూ509ఐతే పాశ్చాత్యులు దాన్ని క్రీ పూ .788కి మార్చారు .క్రీపూ 327అయిన గుప్తుల యుగాన్ని క్రీస్తు తర్వాత యుగంగా తప్పుడు ఆలోచనలతో గామార్చారు .ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ,శాలివాహనుడు ,అగ్ని వంశ రాజులను పాశ్చాత్యులు చరిత్రలో చేర్చలేదు .ఇన్ని తప్పులతడకలతో మనకు హిస్టరీ చెప్పారు ప్రశ్నించకుండా ఇంతదాకా మనం డూడూ బసవన్నలలాగా నేర్చుకొన్నాం .ఈచీకటికి వెలుగునిచ్చారు చరిత్ర భాస్కరులు వెంకటాచలంగారు .

  ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతాన్ని ఖండించి ‘’అవుట్ ఆఫ్ ఇండియా సిద్ధాంతం ‘’ప్రతిపాదింఛి మ్లేచ్చరాజులు అందులో ముఖ్యంగా యవన రాజులు వైదిక కర్మలను అడ్డుకొని  అక్కడినుంచి భారత వర్షం లోని  వాయవ్యభాగానికి తరిమేశారని  అన్నారు .అదే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ .అక్కడినుంచి పడమరకు వెళ్లి గ్రీసులోని తూర్పు ,దక్షిణప్రాంతాలను ఆక్రమించి ఉండిపోయారు .దీనినే ఇప్పుడు ‘’అయోనా ‘’అని అంటున్నారు .ఇది యవన శబ్దానికి అపభ్రంశమైన పదం .అలా భారత విజ్ఞానం తూర్పు దేశాలనుంచి పడమటి దేశాలకు వ్యాపించిందని నొక్కి వక్కాణించారు .దీనికి ఉదాహరణలుగా గ్రీకు ,భారతీయ విధానాలు నమ్మకాలు ఒకే లాగా ఉండటమే అన్నారు .

  ప్రామాణిక భారతీయ చరిత్ర రచనకు కోట వారు ఋగ్వేదం, సూర్య సిద్ధాంతం ,బ్రహ్మాండ విష్ణు భవిష్యత్ ,భాగవత పురాణాలు ,కల్హణుని రాజతరంగిణి ,నేపాల్ రాజవంశావలి ,అనేకానేక బౌద్ధగ్రంథాలు అవలోడనం చేశారు .బాలగంగాధర తిలక్ రాసిన ‘’ఆర్కిటిక్ హోమ్’’ గ్రంథాన్ని కూడా సహేతుకంగా ఖండించారు కోటవారు.

  ఇంత గొప్ప చరిత్ర పైశోధకుడైన ఆంధ్రతేజం చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటాచలం గారికి విజయవాడలో కనీసం ఒక శిలా విగ్రహమైనా స్థాపించాలని  అనేకసార్లు నేను అందరికి విజ్ఞప్తి చేసినా  ఎవ్వరికీ పట్టకపోవటం విచారకరం .వీరి కుమారులు డా కోట నిత్యానంద శాస్త్రి గారు 90ఏళ్ళకు పైబడినవారు నాకు చాలా ఆత్మీయులు ,విజయవాడలో ప్రముఖ  వైద్యులు బహు ఆధ్యాత్మిక చారిత్రిక గ్రంథకర్త  .వీరికి సరసభారతి రెండవ సమావేశం లోనే మా తలిదంద్రుల పేరిట సాహితీ పురస్కారం అందజేసి వారి జనకులు వెంకటాచలంగారిని సత్కరించినట్లుగా సంతృప్తి చెందాము . వీరితోపాటు అవధాన సరస్వతి డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికికూడా పురస్కారం అందజేశాము .

  చాలాకాలం తర్వాత ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కోటవారి విలువైన సేవలు గుర్తించి సుమారు ఏడు లేక ఎనిమిది ఏళ్ళక్రితం హైదరాబాద్ లో సభ జరిపి కోటవారు చరిత్ర పరిశోధనకు చేసిన సేవలను ప్రస్తుతించి సావనీర్ ప్రచురించి  వారి కుమారులు నిత్యానంద శాస్స్త్రిగారికి పురస్కారం అందించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-19-ఉయ్యూరు

image.png

 image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

 

ఆధునిక

37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ  –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి’ తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను రచించారు. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం ఈయన వ్రాసిన గ్రంథమే.పివి పరబ్రహ్మ శాస్త్రిగా సుపరిచితులు .

జీవిత విశేషాలు

పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు. 1938లో ఓల్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పాఠశాల విద్యను, 1948లో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. పిఠాపురంలో వ్యాకరణ, తర్క, వేదాల్లో నిష్ణాతులైన వారణాసి సుబ్రమణ్యశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత వరంగల్ జిల్లా జనగాంకు వచ్చి అక్కడ తెలుగు మీడియం హైస్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా చేరారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1955లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందారు. 1959లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. పురావస్తు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన 1981 పదవీ విరమణ పొందారు.[1]

ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. శాసనగ్రంథాల రచనతోపాటు చరిత్ర రచన చేసిన ఆయన భారత చరిత్రకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఖమ్మంజిల్లా బయ్యారం చెరువు వద్ద లభించిన కాకతీయ శాసనాన్ని పరిష్కరించి, కాకతీయ చక్రవర్తుల వంశక్రమణికను పునర్నిర్మించారు. వరంగల్‌లో లభించిన శాసనం ఆధారంగా రాయగజకేసరి బిరుదు కాకతీయ చక్రవర్తులలో రాణీ రుద్రమదేవికే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. గణపతి దేవుడు వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం. కాకతీయులు ఎలా అవిర్భవించారు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఎలా హనుమకొండలో స్థిరపడ్డారనే విషయాన్ని ఈ శాసనం చెప్తుంది. వెయ్యిస్తంభాల గుడి శాసనంలో రెండో ప్రోలరాజు అతడి కుమారుడు రుద్రదేవునికి సంబంధించిన సమాచారాన్ని అంతకుముందు శాసన పరిశోధకులు సరిగా వ్యాఖ్యానించలేదని ఆయన భావించారు. పీవీ శాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించి కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులను వివరించగలిగారు. పరబ్రహ్మశాస్త్రి తెలంగాణ చరిత్రకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన కానుక రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాన్ని పరిష్కరించడం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీ.శ.1290 నవంబరులో మరణించారని ప్రకటించారు. కాయస్త అంబదేవుని తిరుగుబాటును అణచడానికి స్వయంగా రుద్రమదేవి కదనరంగానికి వెళ్లింది. ఆ యుద్ధంలోనే 80 ఏళ్ల వయసులో ఆమె మరణించిందని చెప్పారు. కాకతీయులపై పరిశోధనకు కర్నాటకలోని ధార్వాడ్ వర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

పరిశోధన

కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి లోతైన, నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్త్రి. వెలుగుచూడని కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికితీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితులలో ఈయన అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవనవిధానంలోనే ఉందని గుర్తించి అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. శాసనాలు అన్నీ చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరేనని అనేకమందితో గుర్తింపబడ్డారు. చరిత్రనే గాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించిన మేధావి పరబ్రహ్మ శాస్త్రి.

శాతవాహన వంశ పాలన గురించి కాలక్రమణిక ను నిర్ధారించిన ఘనత పరబ్రహ్మ శాస్త్రి గారిదే . ఈసందర్భం గా ఆయన ‘’I fully claim credit for it .A smal token –trade lisence with ana inskription of the picture and the period of Roman King Tibarious onone side and ofSatavahana ruler Hku Sri on the other clinched the issue ..Icould establish the period of Siri Satavahana ,Satakarni 1,Simukha and the others there on ‘’అని విజయగర్వంగా చెప్పారు .

బ్రాహ్మి ,సంస్కృతం ,తెలుగు కన్నడ శాసనలిపులను పరిష్కరించిన సంస్కృత పిహెచ్ డి ,చరిత్ర డాక్టరేట్ శాస్త్రి గారు .12వ శతాబ్దం వరకు తెలుగు ,కన్నడాలకు ఒకే లిపి ని పరిశోధించారు .గుంటూరు జిల్లా భట్టిప్రోలు లో భద్రపరచిన బుద్ధుని అవశేషాలున్న ‘’క్రిస్టల్ కేస్కేట్స్’’పై ఉన్న లిపిని కూడా పరిశోధించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు .బాహ్మి లిపి నుంచి తెలుగు లిపి పరిణామం చెందిన విధానాన్ని విపులంగా వివరించారు .హైదరాబాద్ లోని చైతన్యపురి ప్రాంతం లో విష్ణు కుండినుల పాలన నాటి శాసనాలను వెలుగులోకి తెచ్చిన ఘనాపాఠీ పరబ్రహ్మ శాస్త్రి గారు

సన్మానము

2007లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారమందించి గౌరవించి సత్కరించింది .

తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో 2014 అక్టోబరు 21 మంగళవారం ఈయనకు కిన్నెర ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని రవీంద్రభారతిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన్ రావు చేతులమీదుగా ఘన సన్మానం జరిగింది.నిరంతర అన్వేషి, నిత్య శ్రామికుడు, విజ్ఞానఖని డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రామమోహనరావు మాట్లాడుతూ పరబ్రహ్మశాస్త్రి విజ్ఞానానికి ప్రతీక అన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రధాన స్రవంతిలో ఉంటూ శాస్ర్తియ పరిశోధన చేయడం అంత తేలిక కాదని, ప్రామాణికంగా నలుగురూ ఒప్పుకునే స్థితిలో పరిశోధనలు చేయడం, ఇంకా నిత్యాభ్యాసాన్ని కొనసాగించడం గొప్ప లక్షణమని అన్నారు. చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా వెల్లడించి రాబోయే తరాలకు జ్ఞానాన్ని క్రోడీకరించి అందించడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయమని అన్నారు. చరిత్రపై పరిశోధనలు అంత తేలికైన విషయం కాదని, ఎంతో నిబద్ధత, జ్ఞానం ఉండాలని చెప్పారు. ఎంతో ఉన్నతమైన విలువలున్న వారు చాలా మంది సమాజంలో ఉన్నారని, అలాంటి వారిలో ప్రముఖుడైన పరబ్రహ్మశాస్త్రిని సత్కరించడం తెలంగాణ ప్రభుత్వం చేసిన మహత్తర కార్యమని న్యాయమూర్తి ప్రశంసించారు. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే సమాజానికి సేవ చేసిన వారికి ఈ చిరుసత్కారం ఏర్పాటు చేయడం ఎంతో ఔచిత్యంగా ఉందని అన్నారు[2]. వీరు తన జీవిత కాలమంతా శాసన పరిశోధనలో గడిపి ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటించారు. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, నాణాల పరిశీలనతో శాతవాహన శక కాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. సంస్కృతం మీద గల పట్టుతో ఎన్నో బ్రాహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించారు. పన్నెండు గ్రంథాలు రచించారు. ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము ఈయనకు లక్ష రూపాయల చెక్కును బహూకరించింది. శాసన లిపి పరబ్రహ్మ  పరబ్రహ్మ శాస్త్రి గారిపై  కేంద్ర ప్రభుత్వం  చిన్న చూపే చూసింది .తగిన గౌరవ పురస్కారాల౦ దించక పోవటం పెద్ద తప్పిదమే  .అనంతరం తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెబుతూ పరబ్రహ్మ శాస్త్రి మాట్లాడారు. హైదరాబాద్ చరిత్రకు కుతుబ్‌షాహీలను ఆధారంగా తీసుకుంటామని, వాస్తవానికి అంతకంటే ముందే విష్ణుకుండినుల మూలపురుషుడు మాధవ వర్మకు సంబంధించిన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. మాధవవర్మకు సంబంధించిన శాసనాలను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ చరిత్ర చెప్పే ప్రయత్నం నేటి పరిశోధకులు చేయాలని సూచించారు. శాసనాలు రాజకీయ చరిత్రకు సంబంధించి మాత్రమే కాకుండా అనేక ఆచారాలు, వ్యవహారాలకు కూడా ఆధారాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కొండపర్తి గ్రామంలో లభించిన శాసనంలో తమలపాకులు పుచ్చుకోవడం అనే ప్రస్తావన ఉందని, ఎలాంటి న్యాయవ్యవస్థలు లేని సమాజంలో తమలపాకులు పుచ్చుకోవడమే కట్టుబాటుగా ఉండేదని ఈ శాసనం రుజువు చేసిందని అన్నారు.

వీరు పన్నెండు గ్రంథాలు రచించారు. ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు. సంస్కృతం, తెలుగు భాషల్లో సమాన ప్రతిభా సంపత్తులను సొంతం చేసుకున్న ఆయన ఎన్నో శాసనాలను, నాణాలను పరిశీలించి తెలంగాణ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. ఆయన రాసిన కాకతీయాస్ ఆఫ్ వరంగల్ గ్రంథం ఓరుగల్లు పాలకుల చరిత్రకు ప్రామాణికంగా నిలిచింది.

వ్యక్తిగత జీవితం

శాస్త్రి గారి  భార్య పుచ్చా మహాలక్ష్మి, కుమారుడు పీవీ రామ్, ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, సరస్వతి, మీనా ఉన్నారు. బ్రెయిన్ హెమరేజ్‌కు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ-95 ఏళ్ళ వయసులోశాసనలిపి పరిశోధన పరబ్రహ్మశ్రీ పుచ్చా వాసుదేవ  పర బ్రహ్మశాస్త్రి గారు  2016, జూలై 27 సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచి పరబ్రహ్మం లో ఐక్యమయ్యారు .

ఆధారం –తెలుగు వీకీ పీడియా మరియు శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ

 నలభై ఏభై ఏళ్ళక్రితం శంకరనారాయణ డిక్షనరీ లేని ఇల్లు ఆంద్ర దేశం లో  ఉండేదికాదు .విద్యార్ధులకు కల్పవృక్షంగా ఉండేది .దీని నిర్మాత శంకరనారాయణ అని అందరికీ తెలుసుకాని ,ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంధ రచయిత పావులూరి మల్లన్న వంశీయుడని చాలా మందికి తెలియదు  .1860లో  పావులూరి శంకరనారాయణ గోదావరి జిల్లాలో జన్మించారు .గణిత శాస్త్రం లో ఎం. ఏ .పాసై ,కొంతకాలం శ్రీకాకుళం లో లెక్కల మేస్టారుగా ఉన్నారు .తర్వాతమద్రాస్ చేరి ,సాహిత్యం పై అభి రుచితో M.R.A.S. డిగ్రీ పొందిన తొలి తెలుగు వాడుగా   రికార్డ్ సృష్టించారు .మద్రాస్ ప  ప్రెసిడెన్సికాలేజిలో లెక్కల లెక్చరర్ గా ,మద్రాస్ యూనివర్సిటీలో పరీక్షాదికారిగా ఉద్యోగించారు .ఈకాలం లోనే తెలుగు –ఇంగ్లిష్ నిఘంటువును తయారు చేసి వెలువరించారు .తమిళభాషలోనూ అపార పాండిత్యం ఉండటం చేత తమిళ –ఇంగ్లిష్ ,ఇంగ్లిష్ –తమిళ డిక్షనరీ కూర్చారు .

 పాథశాల బాలబాలికలకోసం ప్రణాలికా బద్ధం గా తయారు చేసుకొన్న తెలుగు –ఇంగ్లిష్ పదాల సంపుటి ఒక బృహత్ నిఘంటు అవతారం దాల్చి 1897లో ప్రచురణ పొందింది. వెంటనే ఇంగ్లిష్ –తెలుగు  నిఘంటువు కూడా రూపొందించి అచ్చు వేశారు .ఈ రెండు నిఘంటువులు చాలాసార్లు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకొన్నాయి ,కాలక్రమం లో శరీర శాస్స్త్ర ,సామాన్య శాస్త్రాలకు చెందిన పదాలను కూడా చేర్చి అనుబంధంగా ప్రచురించారు .బ్రౌన్ నిఘంటువులతర్వాత శంకరనారాయణ  డిక్షనరీలకే అత్యధిక ప్రాచుర్యం లభించింది .

  ఇంగ్లీష్ భాషలో చెప్పే భావాలన్నిటినీ తెలుగులో కూడా తప్పకుండా చెప్పవచ్చు అని నిరూపించిన తొలి నైఘంటికుడు’’ పాలూరి శంకరనారాయణ’.’తాను పావులూరి మల్లన వంశస్తుడనని చెప్పుకోవటం వలన పాలూరి కాస్తా పావులూరిగా మారి ఆయనకు ఒక విశేషణం అయింది .భారత స్వాతంత్ర్య పోరాటం లో తెలుగు ప్రజ కూడా ఇంగ్లిష్ లో ఆలోచించి  ఇంగ్లిష్ లోనే తమభావాలను ప్రకటించాల్సి వచ్చేది .భావావేశం కార్యదీక్ష స్పూర్తి ,ప్రేరణ మొదలైన అంశాలతో నిమిత్తం లేని ఆంగ్లపదాలకు తెలుగు భావార్ధాల అవసరం ఎక్కువైంది .అదే సమయంలో సిపి బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకో వాలనుకొన్న ఆంగ్లేయులకు తెలుగు నిఘంటువు కూర్చాడు .తర్వాత కొంత రూపా౦తరాలు చెంది శంకరనారాయణగారి నిఘంటువులు వచ్చి అందరికోరికా తీర్ఛి కరతలామలకాలని పించుకొన్నాయి .

 ఒకరకంగా చెప్పాలంటే సంస్కృతానికి పాణిని ,గ్రీకు భాషకు డయోనిసియస్,,లాటిన్ కు డోనాటనస్  ఆరబిక్ కు ఆల్ ఖలీల్ చేసిన సేవలు యెంత గొప్పవో శంకరనారాయణ గారు ఇంగ్లిష్, తెలుగు లకు అంతటి ఉత్కృష్ట సేవలు చేశారని విజ్ఞుల అభిప్రాయం .ఈయనకు ఖగోళ శాస్త్రం లోనూ లోతైన అవగాహన ఉన్నది  .ఏది ఏమైనా శంకరనారాయణ గారు తెలుగు వారికి చిర స్మరణీయులు.

ఆధారం శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

36-మహోన్నత భాషా శాస్త్రవేత్త –డా కోరాడ మహాదేవ శాస్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 29-12-1921న జన్మించిన కోరాడ మహాదేవ శాస్త్రి ,మద్రాస్ పచ్చయప్పకాలేజి లో బి.ఎ .ఆనర్స్ చదివి ,సిమ్లా యూనివర్సిటి రిసెర్చ్ సెంటర్ లో 1944నుండి రెండేళ్ళు పనిచేశారు .ఢిల్లీ లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేమ్బర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి లో ఎకనామిక్స్ రిసెర్చ్ అసిస్టెంట్ గా చేరి ‘’ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఇండియా ‘’గ్రంథం రాశారు.

  భాషా శాస్త్రం పై మక్కువ ఉన్న శాస్త్రిగారు ‘’హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు ‘’అనే అంశం పై పరిశోధించి పి.హెచ్. డి.పొంది,డిలిట్ కూడా అయ్యారు .1965-68కాలం లో అనంతపురం  పిజి  సెంటర్  హెడ్ గా ,స్పెషలాఫీసర్ గా ఉన్నారు .తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ విదేశీయులకోసం ‘’డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు ‘’రాసి మహోపకారం చేశారు .బాలప్రౌఢ వ్యాకరణ దీపిక ,ఆంద్ర వాజ్మయ పరిచయం మున్నగు ప్రసిద్ధ గ్రంధాలు రచించారు .’’తెలుగుకు సరైన భాషా చరిత్ర లేదు’’ అని వాపోయేవారు .2005లో ‘’దేశీయ పద వ్యుత్పత్తి నిఘంటువు ‘’రూపొందించగా ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించింది .జర్మనీలో తెలుగు నేర్చుకోనేవారికి శిక్షణ ఇచ్చిన భాషా శాస్త్రవేత్త కోరాడవారు .

  అనంతపురం లోని శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు .సునీతి కుమార్ చటర్జీ ,మీనాక్షి సుందరం పిళ్లే,క్షితీష్ చంద్ర చటర్జీ వంటి ఉద్దండులవద్ద శిక్షణ పొందిన మహాదేవ శాస్త్రిగారు అంతటి వారుగా ఎదిగారు .1971లో ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ ఏర్పడటానికి తీవ్ర కృషి చేసిన ముగ్గురిలో శాస్త్రిగారు ప్రధములు .ఎకనామిక్స్, కంపారటివ్ ఫైలాలజి ,తెలుగు లలో 3పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందారు శాస్త్రిగారు .1976-78కాలంలో శాస్త్రిగారు జర్మనీలోని కోల్న్ లో    ఇన్ స్టి ట్యూ ట్ ఆఫ్ ఇండాలజీ లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు  .శాస్త్రిగారు అనేక జాతీయ అంతర్జాతీయ మేగజైన్లలో చాలా విషయాలపై విపులమైన పరిశోధన వ్యాసాలూ రాశారు . బ్రౌన్  పురస్కారం అందుకొన్నారు  

   శాస్త్రిగారి భార్య శ్రీమతి సరస్వతి  సుగుణ వివేక వినయాలు మూర్తీభవించిన ఆదర్శ  భారత గృహిణి   –ఈ దంపతులకు ముగ్గురుకుమారులు ఒకకుమార్తె .11-10-2016న 96 ఏళ్ళ వయసులో నడిచే సరస్వతి స్వరూపం శ్రీ కోరాడ మహాదేవ శాస్త్రిగారు  శివమహాదేవ సన్నిధి చేరారు  .

ఆధారం శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’మరియు ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ వారి 2016నవంబర్ సంచిక 

   సశేషం

  మీ గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-19-ఉయ్యూరు

 image.png

 image.png

 

 image.png

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

  

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య

ప్రముఖ ఆర్ధిక వేత్త ,మేధావి శ్రీ కాళీపట్నం కొండయ్య 1900లో గోదావరి జిల్లాలో జన్మించారు .విజ్ఞాన ఆర్ధిక చరిత్ర శాస్తాలలో సాటిలేని వాడు అనిపి౦చు కొన్నారు  స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనటం వలన  వీటికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు .ఆర్ధికరంగం పై విపులమైన అధ్యయనం చేశారు .రూపాయి మారకం రేటు ఒక షిల్లింగ్ నాలుగు పెన్నీలు ఉండాలా ,లేక ఒకషిల్లింగ్ ఆరు పెన్నీలు ఉండాలా అనే  సమస్యను ఆంద్ర ప్రాంతం లో ఆయన ఒక్కరే పూర్తిగా అవగాహన చేసుకొని జాతీయ దృష్టితో  వివరించిన  మేధావి .

ప్రముఖ పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్త జేమ్స్ జీన్స్ రచించిన ‘’యూని వర్స్ అరౌండ్ అజ్ ‘’గ్రంథంలోని ముఖ్యాంశాలను ‘’విశ్వ రూపం ‘’పేరిట అనువదించి తెలుగు విద్యార్ధులకు మహోపకారం చేశారు .అప్పుడు ఆంద్ర యూని వర్సిటి వైస్ చాన్సలర్ గాఉన్న రాధాకృష్ణన్ వీరి కృషిని మిక్కిలి  ప్రశంసించి ప్రోత్సహించారు .’’విజ్ఞానం ‘’పేర ఒక మాసపత్రిక కొంతకాలం నడిపారు .

పశ్చిమ గోదావరి జిల్లా నిడద వోలు  లో ‘’కెమికల్స్ లిమిటెడ్ ‘’రసాయన పరిశ్రమ నెలకొల్పి ,అరటి చెట్ల మట్టలనుంచి ‘’పొటాషియం పెర్మంగనేట్’’తయారు చేయించారు .దీనిపై విస్తృత పరిశోధనలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు . కవికోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన శాస్త్ర వేత్తల కోసం ఏర్పాటు చేసిన నగదు పురస్కారం మొట్టమొదటిసారిగా కొండయ్యగారికే ప్రదానం చేశారు .కొండయ్యగారు బెనారస్ హిందూ యూనివర్సిటిలో పరిశోధన చేస్తూ లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు .నిడద వోలులో పరిశ్రమ స్థాపనకోసం 1941లో రాజీనామా చేస్తే వైస్ చాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇష్టపడక కొంతకాలం ఆపేసి నిర్ణయం మార్చుకోమని అర్ధించారు కూడా .కానీ పదవిని త్యజించి తాను  అనుకొన్న పరిశ్రమ స్థాపించి కోస్తా జిల్లాలకు మార్గ దర్శి అయ్యారు  .కొంతకాలానికి ఆర్ధికంగా నష్టపోయి మూసేశారు .పరిశ్రమ దెబ్బతినటానికి కారణాలు వివిధ కోణాలలో విశ్లేషించారు .

భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నా  పేరుకోసం  వెంపర్లాడ లేదు  .’’ముస్లిం దేశాలలో విజ్ఞాన వికాసం ‘’అనే వీరి రచన పరమ ప్రామాణికంగా ఉండి ,ఇప్పటికీ కాలదోషం పట్టలేదు .కొండయ్యగారి మరో రచన ‘’ఆఫ్రికా పంపకం ‘’కు డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఉపోద్ఘాతం రాశారు  .1946లో మద్రాస్ యూని వర్సిటి స్నాతకోత్సవం లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారు కొండయ్యగారిని ఆదర్శం గా తీసుకోవాలని విద్యార్ధులకు ఉద్బోధించారు .స్పూర్తి మంతుడు ,కీర్తి మంతుడు శ్రీ కాళీ పట్నం కొండయ్య 1966లో 66వ ఏట మృతి చెందారు .

34-అమెరికాలో బాంక్ ఏర్పరచిన తొలి ఆంధ్రుడు – జాస్తి సతీష్

శ్రీ జాస్తి సతీష్ గుంటూరు లో 1959లో జాస్తి వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించి ,ఉన్నత విద్యలో రాణించి 1975లో అమెరికా వెళ్లి ‘’వేన్ స్టేట్ యూని వర్సిటి ‘’లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 1984లో  బి.ఎస్ .డిగ్రీ పొందారు.ఫెడరల్ రిజర్వ్ బాంక్ లో ఫైనా౦షియల్ సిస్టమ్స్ అనలిస్ట్ గా  ఉద్యోగం చేసి ‘’బాంక్ ప్రెసిడెంట్ ‘’అవార్డ్ పొందారు .

1988లో ప్రైవేట్ రంగం లో ప్రవేశించి ‘’నేషనల్ బాంక్ ఆఫ్ డెట్రాయిట్ ‘’లో ఇన్వెస్ట్మెంట్  బాంకర్ అయ్యారు .బాంక్ యాజమాన్య సౌజన్యం తో ఎం .బి .ఏ. చేసి ,తనబాంక్ ను మరో బాంక్ ను మరో బాంక్ స్వాధీనం చేసుకోగా కొంతకాలం పని చేసి ,తర్వాత  స్టాండర్డ్ ఫెడరల్ బాంక్ లో చేరి బ్యాంకుల స్థాపనలో పరిశోధనలు చేశారు .అమెరికాలో భారతీయుల యాజమాన్యంలో ఉన్న అన్ని బాంకుల విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ‘’’కీ  బాంక్ ‘’లోకూడా పని చేసి నైపుణ్యం సాధించారు .2005లో కొత్త బాంక్ స్థాపనకు ముమ్మర ప్రయత్నాలు చేశారు .మిచిగాన్ రాష్ట్రం లోని ఓక్ లాండ్ కౌంటి పరిధిలో ఉన్న ‘’నోనీ’’నగరం లోఅమెరికా ప్రభుత్వ అనుమతితో  ‘’లోటస్ బాంక్ ‘’ను 2007జూన్ లో  స్థాపించారు .ఒక ప్రవాస ఆంధ్రుడు విదేశాలలో ఒక బ్యాంక్ ను స్థాపించటం ఇదే మొదలు . 16వ ఏటనే అమెరికా వెళ్లి స్థిరపడి, ఆంధ్రుడిగా మొట్టమొదటి బ్యాంక్ స్థాపించిన ఘనత శ్రీ జాస్తి సతీష్ కు దక్కింది .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.

  1. You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
    To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
    To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9Sf9%3DCzv6eK4KmDZ-1Ap67tTWq%2BETa6%3D0SVzXasGghVw%40mail.gmail.com.
    For more options, visit https://groups.google.com/d/optout.
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు Inbox x

కృష్ణాజిల్లా కౌఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు

కృష్ణాజిల్లా కౌతవరం లో 1942మార్చి 21న నారాయణ స్వామి దంపతులకు జన్మించిన డా.పచ్చా రామ చంద్రరావు ఉస్మానియా యూనివర్సిటి నుంచి  1959లో బిఎస్ సి ,1961లో ఏం ఎస్ సి డిగ్రీలు పొందారు .బెంగుళూర్ లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో1963లో  బి .ఇ.పాసై ,బెనరస్ హిందూ యూనివర్సిటి లో మెటలర్జి ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ తీసుకొని ,1968 పి.హెచ్. డి.అయ్యారు.ఇక్కడే 1964లో లెక్చరర్ గా చేరి ,రీడర్ గా ప్రొఫెసర్ గా పదోన్నతులు అందుకొన్నారు ..శ్రీమతి సుదారావు ను వివాహమాడారు ఆమె వారణాసిలో ఆంధ్రాబాంక్ ఉద్యోగిని .

   అఖండ మేధావిగా అప్పటికే గుర్తింపు పొందిన రావు గారు లోహాల త్వరిత ఘనీభవ స్థితి దశలను సిద్ధాంత పరంగా ,ప్రయోగాత్మకంగా నిరూపించి విలువైన సమాచారాన్ని సంపాదించారు .స్థిరమైన లోహపు ఉత్పత్తుల నమూనా తయారీ ,స్వాభావిక లక్షణాలకూర్పు సంసిద్ధపరచటం మొదలైన వినూత్న టెక్నిక్ లను అభి వృద్ధి  చేశారు .మొదటగా ‘’క్వాసే క్రిస్ట  లైన్ ‘’మిశ్ర దాతు  రూపకల్పన చేసి పేరుపొందారు .తన పరిశోధనాఫలితాలను దేశ విదేశీయ పత్రికలలో ప్రచురించారు .అనేక అంతర్జాతీయ ,దేశీయ ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకుగౌరవ సభ్యత్వాలు ,గౌరవ పదవులను ఇచ్చి గౌరవించాయి .’’మెటీరియల్స్ రిసెర్చ్ సొసైటీ ఆఫ్  ఇండియా  ‘’లో గౌరవ సభ్యత్వం పొందారు .కలకత్తాలోని ‘’ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెటల్స్ ,ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ సొసైటీ ఆఫ్ ఇండియా ,ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ (బెంగుళూరు )మొదలైన ప్రఖ్యాత సంస్థలలో ఆయనకు జీవిత సభ్యత్వం ఉన్నది .

డిఫెన్స్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ  (D.I.A.T.)వైస్ చాన్సలర్ అయ్యారు ..హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ అడ్వాన్షడ్ రిసెర్చ్ సెంటర్  ఫర్పౌడర్ మెటలర్జీ అండ్ న్యు మెటీరియల్స్ లో  రాజా రామన్న  ఫెలోషిప్ పొందారు

 1979లో నేషనల్  మెటల్లర్జిస్ట్స్ అవార్డ్ ,1985లో శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం ,మాలవీయ మెమోరియల్ ట్రస్ట్ వారి సీనియర్ అకాడెమి అవార్డ్ రావు గారిని వరించాయి .ఇప్పటికీ బెనారస్ హిందూ యూని వర్సిటి లోని స్కూల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో నిరంతర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .తన పరిశోధన ఫలితాలకు 16 పేటెంట్లు పొందిన మహా శాస్త్రవేత్త రావు గారు .

 1993లో గోవాలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ప్లాటినం జూబిలీ లెక్చరర్ గా ఉన్నారు

32-క్లోజ్ పాక్డ్ స్ట్రక్చర్స్ రూప కర్త – పద్మ భూషణ్ డా .పల్లె రామారావు

30-6-1937న కర్నూలులో కేశవరావు దంపతులకు పుట్టిన డా .పల్లె రామారావు1956లో మద్రాస్ యూని వర్సిటి నుంచి బిఎస్ సి ,ఆనర్స్ ,ఆంధ్రాయూనివర్సిటినుంచి 1957లో ఎం. ఏ .డిగ్రీలు అందుకొన్నారు .1964లో బెనారస్ యూని వర్సిటి నుంచి పిహెచ్ డిపొందారు .అమెరికా వెళ్లి ,పెన్సిల్వేనియా యూని వర్సిటిలో 1991లో డాక్టోరల్ రిసెర్చ్ చేశారు .

  బెంగుళూరు లోని ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో    మెటలర్జీ రిసెర్చ్  అసిస్టెంట్ గా 1960లో చేరి ,రెండేళ్ళు పనిచేసి ,బెనారస్ హిందూ యూని వర్సిటి మెటలర్జికల్ ఇంజనీరింగ్ శాఖలో లెక్చరర్ గా పని చేసి 1967లో రీడర్ ,1975లో ప్రొఫెసర్ అయి  అయిదేళ్ళు  పని చేశారు .1982లో హైదరాబాద్ లోని డిఫెన్స్  మెటలర్జికల్ రిసెర్చ్ లాబ్ కు డైరెక్టర్ ఐ, 9ఏళ్ళు పనిచేశారు .ఖనిజాలనుంచి లోహాలను తయారు చేసే విధానాలను ఆధునిక పరచే ప్రయోగాలు పరిశోధనలు చేశారు .కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగానూ సేవలందించారు .

  లోహ సంగ్రహణ శాస్త్రం –మెటలర్జీ లో విస్తృత పరిశోధనలు చేసిన రామారావు గారు లోహాలు ఏర్పడేప్పుడు వచ్చే బీటలు ,సాగుడు ,పాకటంవంటి లోపాలను గుర్తించి నివారించటానికి ఎక్స్ రే ప్రక్రియను సమర్ధంగా ఉపయోగించారు .లోహాలు ,లోహ మిశ్రమాలలో ఉన్న అతి సూక్ష్మ నిర్మాణాలపైనా ,అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అభి వృద్ధి విషయం లోనూ అవిరామ పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు .’’క్లోజ్ పాక్డ్ స్ట్రక్చర్స్ ‘’(D.H.C.P.,F.E.C.-Double hexagonal Close Pcked FaceCentral Cubic )రూపకల్పనలో విశేష కృషి చేసి ,పరిశోధనపత్రాలు వెలువరించారు .’’ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ఆఫ్ మెటల్స్ ‘’పత్రికకు 1987నుంచి ప్రధాన సంపాదకులుగా పల్లె వారున్నారు .’’బులెటిన్ ఆఫ్ మెటీరియాల్ సైన్సెస్ ‘’పత్రికు అసోసియేట్ ఎడిటర్,చైర్మన్  రావుగారు. ‘’మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ‘’పత్రిక అసోసియేట్ ఎడిటర్ కూడా .జర్నల్ ఆఫ్ ప్రెషర్ వెసల్స్ అండ్ పైపింగ్ ,హై టెంపరేచర్ టెక్నాలజీ ,ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫాటిగ్యు,సాధన మొదలైన పత్రికల పరిశోధక సంపాదకమండలి సభ్యులు .

   రావు గారి కృషికి తగినట్లు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడెమి ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థలనుంచి ఫెలోషిప్ అందుకొని , పరిశోధనలో తనకు తానె సాటి  అనిపించుకొన్న మేధావి మెటల్లర్జికల్ ఇంజనీరింగ్ లో చేసిన  విశేష కృషికి  ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు .1964లో పాండ్యా మెమోరియల్ మెడల్ ,1971లో కామని గోల్డ్ మెడల్ ,1973లో నేషనల్ మెటల్లరిస్ట్స్ డే అవార్డ్ ,1979శాంతిస్వరూప్ భాట్నగర్ అవార్డ్  హోమి జహంగీర్ భాభా అవార్డ్ ,1986లో నేషనల్ లెక్చరర్ అవార్డ్ ,వాస్విక్ అవార్డ్ ,1989లో మెటీరియల్సైన్స్ తరఫున I.N.S.A.ప్రైజ్ పొందిన అరుదైన లోహ సంగ్రహణ శాస్త్రవేత్త రామారావు .

  భారత ప్రభుత్వం రామారావు గారి అవిశ్రాంత పరిశోధనా దీక్షను  గుర్తించి 1989పద్మశ్రీ ,2001లో పద్మభూషణ్ పురస్కారాలు అందించి సత్కరించింది  .కేంద్ర ప్రభుత్వం లో ఏషియన్ డెవలప్ మెంట్ శాఖ కార్య దర్శిగా, శాస్త్ర సాంకేతిక శాఖ కార్య దర్శిగా ,ఉన్నారు .పదవీ విరమణ తర్వాత ,అటామిక్ ఎనర్జీరెగ్యులేటరి బోర్డ్ అధ్యక్షులుగా 1995నుంచి 1998వరకు మూడేళ్ళు సేవలందించారు .1999 ఆగస్ట్ లో హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులయ్యారు .జీవిత చరమాంకం స్వస్థలం  కర్నూలు లో గడిపారు .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-19-ఉయ్యూరు

image.pngimage.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రామ కృష్ణ పరమహంస సన్యాస శిష్యులు -జులై -శ్రీ రామ కృష్ణ ప్రభ 

కింద కూర్చున్నవారిలో ఎడమనుంచి -స్వామి శివానంద ,స్వామి శారదానంద ,,స్వామి సుబోదానంద ,స్వామి అఖండానంద , ,స్వామి ప్రేమానంద ,స్వామి అద్వైతా నంద ,
కుర్చీలలో కూర్చున్నవారు -ఎడమనుంచి -స్వామిబ్రహ్మానంద ,స్వామి వివేకానంద
నిలుచున్నవారిలో ఎడమనుంచి -స్వామి అద్భుతానంద ,స్వామి యోగానంద ,స్వామి అభేదానంద ,స్వామి త్రిగుణాతీతానంద ,స్వామి తురీయానంద ,స్వామి విజ్ఞానానంద ,,స్వామి రామ కృష్ణానంద,,స్వామి నిరంజనానంద  .
  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-19-ఉయ్యూరు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత

  కెమికల్ టెక్నాలజీ పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మూల్పూరి జనార్ధనరావు దంపతులకు కృష్ణాజిల్లా ఉయ్యూరుదగ్గర వల్లూరుపాలెం లో 19-10-1961 జన్మించిన శ్రీమతి మూల్పూరి సుజాత హైదరాబాద్  యూని వర్సిటి లో ప్లాంట్ సైన్సెస్ లో ఎం. ఎస్. సి. చేసి అత్యున్నత గ్రేడ్ సాధించి బంగారు పతకం అందుకొన్నారు .1996లో పి.హెచ్ .డి.పొందారు .ఐ ఏ ఎస్ తో సమానమైన అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ పరీక్షరాసి ఐసి ఎ ఆర్ అనుబంధ సంస్థ అయిన నూనెగింజల పరిశోధనా సంస్థలో శాస్త్ర వేత్తగా చేరి చమురు  గింజల పై ప్రత్యేక పరిశోధనలు చేశారు .

  బయో టెక్నాలజీ ,టిస్స్యు కల్చర్ , .జెనెటిక్స్ శాస్త్రాలద్వారా వీటి అధ్యయనం చేసి ,నూనె గి౦జల లోని వంధ్యత్వ సమస్య పరిష్కారానికి విపరీతమైన కృషి చేశారు .పొద్దు తిరుగుడు, గడ్డిపూలు ,కుసుమ నూనె   గి౦జలపై పత్యేక పరిశోధనలు చేసి ‘’స్టేబుల్ మేల్ స్టెరిలిటి సిస్టం ‘’ను అభి వృద్ధి చేశారున  .ఈ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించి విశేష కీర్తి లభించింది ,జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా నూనె గింజలలో ‘’ఇన్ సె క్ట్ రెసిస్టన్స్ ‘’అంటే చీడ పీడలను తట్టుకొనే శక్తి ని అభి వృద్ధి చేసి ,రైతులకు గొప్ప మేలు చేకూర్చారు .

  సుజాత గారి పరిశోధనా కృషికి’యునెస్కో బయో టెక్నాలజీ యాక్షన్  ఫెలోషిప్’’,నెదర్లాండ్ ప్రభుత్వ ఫెలోషిప్ లు లభించాయి .  .పరిశోధనలకోసం ఇంగ్లాండ్ ,అమెరికా నెదర్ లాన్స్ ,ఇజ్రాయిల్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయాలను చూశారు .భారత్ –నెదర్లాండ్ దేశాలు నూనె గింజల పై బయో టెక్నాలజీ రంగం లో చేస్తున్న కృషిలో ముఖ్య భూమిక పోషించారు .భారత్ –సెర్బియా దేశాలమధ్య వైజ్ఞానిక సహకార ఒప్పందం లో భాగం గా నొవిసాద్ నగరం లో జరిగిన ప్రత్యేక వైజ్ఞానిక సదస్సుకు ఆహ్వానం అందుకొని హాజరయ్యారు .పొద్దు తిరుగుడు విత్తనాలపై పరిశోధనకు ఆప్రభుత్వానికి చేయూత నిచ్చారు .విలువైన రిసెర్చ్ పేపర్స్ స్వయంగా, ఇతర శాస్త్రవేత్తలతో కలిసీ రాసి ప్రచురించారు

     శాస్త్ర  వేత్తలు ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు కష్ట నష్టాలు తెలుసుకొంటూ,  వారికి లాభ సాటి వ్యవసాయానికి తోడ్పడాలని ఆమె సూచించేవారు .భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐన I.C.A.Rలో చేసిన పరిశోధన విజయాలకు ప్రతిష్టాత్మకమైన ‘’పంజాబ్ రావు దేశముఖ్ మహిళా శాస్త్ర వేత్త అవార్డ్ ‘’శ్రీమతి మూల్పూరి సుజాతగారికి 2004లో లభించి,16-7-2005 న అందుకొన్నారు .ఈ అవార్డ్ పొందిన మొదటి ఆంద్ర మహిళాశాస్త్ర వేత్త కావటం ఆంధ్రులకు గర్వకారణం .

image.png

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాదికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన -వందనా శివ-(వ్యాసం ) గబ్బిట దుర్గా ప్రసాద్

విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాదికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన -వందనా శివ-(వ్యాసం ) గబ్బిట దుర్గా ప్రసాద్


1952నవంబర్ 5న డెహ్రాడూన్ లో అరణ్య సంరక్షకుడైన తండ్రికి ,ప్రకృతిపైప్రేమతో రైతుఅయిన తల్లికి వందనా శివ జన్మించింది .నైనిటాల్ లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్ ,డెహ్రాడూన్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ లలో విద్యనేర్చింది .చండీఘర్ లోని పంజాబ్ యూని వర్సిటిలో చదివి ఫిజిక్స్ లో 1972లో బిఎస్ సి.డిగ్రీ పొందింది .కొద్దికాలం భాభా అటామిక్ సెంటర్ లో పనిచేసి కెనడా వెళ్లి గ్లూఫ్ యూని వర్సిటి లో చదివి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ 1977లో అందుకొన్నది .’’చేంజెస్ ఇన్ ది పీరియాడిసిటి ఆఫ్ లైట్ ‘’పై పరిశోధన వ్యాసం రాసి 1978లో పశ్చిమ ఒంటారియో యూని వర్సిటి నుండి ఫిలాసఫీ ఆఫ్ ఫిజిక్స్ ను కేంద్రంగా చేసుకొని ఫిలాసఫీలో పిహెచ్ డి పొందింది .’హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థీరీ’’అని ఆమె రాసి పరిశోధన గ్రంథం మంచి పేరు తెచ్చింది .బెల్ సిద్ధాంతానికి బాహ్య విషయంగా గణితం ఫిలాసఫీ లలోని నిగూడార్ధాలపై కేంద్రీకరించి రాసిన డెజేర్టే షన్ ఇది.తర్వాత బెంగళూరు వచ్చి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో సైన్స్ , టెక్నాలజీ , పర్యావరణ విధానాల అంతర్ సంబంధాలపై తీవ్రమైన పరిశోధన చేసింది .

వ్యవసాయం- ఆహారం –మేధోహక్కు లపై ప్రత్యేక దృక్పధం:

వందనా శివ వ్యవసాయం ఆహారం లలో వచ్చిన ఆధునీకరణ అభి వృద్ధి లపై విస్తృతంగా రాసిందీ ప్రసంగించింది .’’మేధోహక్కు ,జీవ వైవిధ్యం ,జీవనీతి ,జెనెటిక్ ఇంజినీరింగ్ మొదలైన ముఖ్యవిషయాలపై వందనా శివ క్రియాశీలకంగా పోరాటం జరిపింది .ఆఫ్రికా ఆసియా ,లాటిన్ అమెరికా ,ఐస్లాండ్ స్విట్జెర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలలోని లోని ‘’గ్రీన్ మువ్ మెంట్ ‘’ఉద్యమానికి సహకరించింది .జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా వ్యవసాభి వృద్ధి జరగరాదని ఈ సంస్థ ముఖ్యపోరాటం .

పరిశోధన సంస్థ స్థాపన – నవ ధాన్య సృష్టి –బీజ విద్యాపీఠ్:

1982లో సైన్స్ ,టెక్నాలజీ ,జీవావరణం లకోసం ఒక రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ను నెలకొల్పింది దీనితో 1991’’నవ ధాన్య ‘’సృష్టి చేసింది .దీన్ని ఒక ఉద్యమంగా చేబట్టి జీవ వైవిధ్యం ,సమగ్ర సంపూర్ణత ,స్థానిక విత్తనాభి వృద్ధి ,సేంద్రియ వ్యవసాభి వృద్ధి ,న్యాయమైన వాణిజ్యం ల కోసం అహరహం శ్రమించింది .’’నవధాన్య ‘’ అంటే కొత్త ధాన్యం అనికాదు ‘’తొమ్మిది రకాల విత్తనాలు’’లేక నూతన బహుమతి అని అర్ధం చెప్పింది వందనా శివ .తన రిసెర్చ్ సంస్థకు రైతులను ఆహ్వానించి వీటిపై అవగాహన తరగతులు నిర్వహించి వారు అమలు చేయటానికి ప్రోత్సహించింది .మొదటి సారిగా దేశం మొత్త౦ మీద 40విత్తన బ్యాంకులను నెలకొల్పి ప్రాంతీయ విభాగాలలో అందుబాటుకు తెచ్చి వైవిధ్య వ్యవసాయానికి దారి చూపించింది .డెహ్రాడూన్ వాలీ లో 2004లో ఇంగ్లాండ్ లోని షుమేకర్ కాలేజి తో కలిసి ‘’బీజ విద్యా పీఠ్’’అనే అ౦తర్జాతీయ కాలేజీని ఏర్పాటు చేసింది .

మేధో హక్కులపోరాటం –వేపను కాపాడిన శివకు వందనం:

మేధోహక్కులను కాపాడటానికి ,జీవవైవిధ్యానికి ఆమె రిసెర్చ్ సంస్థ తీవ్రంగా కృషి చేసింది.వేప, బాస్మతి బియ్యం, గోధుమలపై జరుగుతున్న ‘’బయో పైరసీ’’ని చాలెంజ్ చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటిపై మనకున్న హక్కులను కాపాడింది .బయో డైవర్సిటి,ఐపిఆర్ లేజిస్లేషన్ ప్రభుత్వ సంస్థలలో పని చేసి సహకరించి సాధించింది .

రచనాశివం:

.1984లోనే పంజాబ్ లో హింసాత్మక సంఘటనలు ,భోపాల్ లో గాస్ లీక్ తో జన నష్టం లను చూసి ఆమె వ్యవసాయం పై కృషి ప్రారంభించింది . యుఎన్ యూని వర్సిటీలో చదువుతూనే ‘’ది వయోలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ‘’పుస్తకం రాసింది .రసాయనిక ఎరువులు అతిగావాడి సస్యాభి వృద్ధి సాధిస్తే జీవావరణ పర్యావరణాలు దెబ్బతిని మనుషుల ఆరోగ్యమూ పాడైపొతుందని ,సుమారు 1400రకాల క్రిమిసంహారక పురుగు మందులుప్రపంచం మొత్త౦ మీద మనఆహారాలలో చేరి హాని కలిగిస్తున్నాయనీ కారణం స్ప్రే ద్వారా చల్లే మందులో 1శాతం మాత్రమే క్రిములను సంహరిస్తుందనీ మిగిలినదంతా ఆహార పదార్ధాలలో చేరుతుందనీ ,వీటివల్ల కిడ్నీ సమస్య, కేన్సర్, గుండెపోటు సహజమైపోతాయని హెచ్చరించింది .ఇన్ని వైవిధ్య విషయాలపై తీవ్రంగా పోరాడుతూ కృషి చేస్తున్నాకూడా వందనా శివ తన అభిప్రాయాలు ప్రజలకు చేరువ అవటానికి పుస్తకాలు రాసింది .1969లో మొదటిపుస్తకం ‘’ స్టేయింగ్ అలైవ్’’లో మూడవ ప్రపంచ ౦ పై మహిళలకు గొప్ప అవగాహనకలిగించింది .1990లో ‘’వుమెన్ అండ్ అగ్రికల్చర్ ‘’అనే రిపోర్ట్ ను ఎఫ్ .ఏ.ఓ .కోసం రాసి అందులో ‘’ఇండియాలో ఎక్కువమంది వ్యవసాయదారులు స్త్రీలే ‘’అని చెప్పింది .

ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న వందనా శివ వేదిక్ ఈకాలజి ,అనదర్ స్టోరి ఆఫ్ ప్రోగ్రెస్ ,క్రియేటింగ్ ఫ్రీడం ,పావర్టి ది ట్రు కాస్ట్,చిప్కో ,ఈకో ఫెమినిజం సీడ్స్ ఆఫ్ డెత్ ,మొదలైన 20కి పైగా విలువైన పుస్తకాలు రాసింది .

పదవీ వందనం:

ఖాట్మండులో లో ఏర్పాటైన ‘’మౌంటేన్ డెవలప్ మెంట్ ఇంటర్నేషనల్ సెంటర్’’ లో స్త్రీలకూ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయించింది .’’వుమెన్స్ ఎన్విరాన్ మెంటల్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ‘’బోర్డ్ లో ఆమె సభ్యురాలు .2010లో వందనాశివకు ‘’సిడ్నీ పీస్ ప్రైజ్ ‘’అందజేసినప్పుడు ఆమె చేసిన’’మేకింగ్ పీస్ విత్ ఎర్త్ ‘’ ఉపన్యాసం పుస్తకంగా వెలువడింది .ఇందులో జీవవైవిధ్యాన్ని ,జాతులకు, ప్రకృతికిఉన్న సంబంధాన్నీ చర్చించింది .ఇది భారత దేశాన్ని గూర్చి రాయబడినా,ప్రపంచం లోని అన్ని ప్రాంతాలవారికీ వర్తించే విషయం .

వందనా శివ సమర్ధతకు తగిన పదవులెన్నో అలంకరించింది .ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్ ,వుమెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ,థర్డ్ వరల్డ్ నెట్ వర్క్ మొదలలైన ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో సభ్యురాలు సలహాదారు మెంబర్ ..ఇటలి లోని టస్కని రీజియన్ ఏర్పాటు చేసిన ‘’ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్’’కమిషన్ కు చైర్మన్ .స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’సైంటిఫిక్ కమిటీ ‘’సభ్యురాలు ..W.T.Oకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియన్ పీపుల్ కాంపైన్ స్టీరింగ్ కమిటీ మెంబర్ .’’వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ ‘’లో కౌన్సిలర్ .భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’ఆర్గానిక్ ఫార్మింగ్ ‘’కమిటీ సభ్యురాలు .2007లో ‘’స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ విజన్స్ ‘’ప్రాజెక్ట్ పాల్గొని సలహాలిచ్చింది .

మరిరెండు ముఖ్య ఉద్యమాలు:

వందనా శివ అంటే అందరికి ముందు గుర్తుకు వచ్చేవి విత్తనాస్వేచ్చ మేధో హక్కుపరిరక్షణ .

విత్తన స్వేచ్చ -.విత్తనాలవిషయం లో కార్పోరేట్ పేటెంట్ లను ఒప్పుకోరాదని విత్తన స్వేచ్చ రైతులకే ఉండాలనీ ,ఇంటలెక్త్యువల్ ప్రాపర్టీ రైట్స్ తప్పక ఉండాలని ,బయోపైరసి ని అరికట్టాలని ఉద్యమించింది .అమెరికా లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తో 10సంవత్సరాలు ‘’వేప చెట్టు ‘’పైరసీ పై పోరాటం చేసి ఆహక్కు భారత దేశానిదే అని మెడలు వంచి ఒప్పించింది . గోల్డెన్ రైస్ –బయో సింతసైజ్ బీటా కేరొటీన్ అనే విటమిన్ ఎ ను నస్టపరచే జెనటిక్ ఇంజనీరింగ్ తో తయారైన గోల్డెన్ రైస్ ఆరోగ్యానికి హాని అని ప్రపంచవ్యాప్తంగా వేలాది బాలబాలికలకు కంటి జబ్బులువచ్చి బాధపడుతున్నారని ఆ బియ్యాన్ని బహిష్కరించాలని తీవ్రపోరాటం చేసింది .

రైతులు మొన్సాటో, కార్గిల్ అనే గుత్త సంస్థల విత్తనాలను అత్యదిక ధర పెట్టికొని ,అవి పండక అప్పులపాలౌతున్నారని వందనాశివ నెత్తీ నోరూ మొత్తుకొని చెప్పి ‘’ది.కార్పోరేట్ హైజాక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ‘’పుస్తకం రాసింది .జీవావరణ పర్యావరణ రక్షణకు స్త్రీలు బాగా ముందు ఉండాలని, ‘’ఈకో ఫెమినిజం ‘’అందుకే నేడు అవసరమని నొక్కి చెప్పి దాన్ని వ్యాప్తిచేసింది .

డాక్యుమెంటరీ వందనం:

వందనా శివ పై ఫ్రీడంఎహిడ్ ,రోష్ని ,ఈజ్ యువర్ ఫుడ్ సేఫ్ మొదలైన అనేక డాక్యుమెంటరి సినిమాలొచ్చాయి .నీటి స్వచ్ఛతపై ఆమెకున్న మమకారానికి ప్రతీకగా –గంగా ఫ్రం ది గ్రౌండ్ అప్ ,బ్లూ గోల్డ్ ,వరల్డ్ వాటర్ వార్స్,ఫ్లో ఫర్ లవ్ ఆఫ్ వాటర్ డాక్యుమెంటరీలు తీశారు .విత్తన స్వేచ్ఛ పై ‘’దివరల్డ్ అకార్డింగ్ టు మోన్సాంటో,ఫెడప్ వంటివి తీశారు .దలైలామా రినైసెన్స్ డాక్యుమెంటరి లో ఆమె ఒకపాత్ర ధరించింది .డిమైన్ వంటి ఫ్రెంచ్ సినిమాలలోనూ ఉన్నది .

పురస్కారవందనం:

వందనా శివ 1993లోపొందిన ‘’ రైట్ లైవ్లి హుడ్ అవార్డ్’’నోబెల్ ప్రైజ్ కు ప్రత్యామ్నాయం అని భావిస్తారు ,2003లో టైమ్స్ మేగజైన్ ఆమెను ‘’ఎన్విరాన్ మెంటల్ హీరో ‘’అని అభి వర్ణించింది . 2010సిడ్నీ పీస్ ప్రైజ్ ,2012లో మిరోడి అవార్డ్ ,2016లో ఫుకూకా ఏషియన్ కల్చర్ ప్రైజ్ లభించాయి .

-గబ్బిట దుర్గాప్రసాద్

image.png

image.png
Posted in రచనలు | Tagged | 2 Comments

 ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం

” ఆషాఢస్య ప్రథమ దివస్ -మే

   ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం

వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.”(మేఘ సందేశం )

ఇవాళ ఆషాఢమాసం మొదటి రోజు .దీన్ని కాళిదాస మహాకవి తన మేఘ సందేశం కావ్య శ్లోకం లో పొందుపరిచాడు
భావం ఆషాఢమాసం లో మొదటి రోజున కొండమీద మేఘాలు మత్తేభం లాగా ఢీకోట్టినట్లున్నాయి 
  ఈ రెండుపాదాలు శ్లోకం లో చివరి రెండు పాదాలు వీటికి పైన ఉండే మొదటి రెండుపాదాలు –
తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః  ”
ప్రియురాలిని వదిలి వెళ్ళాక విరహ బాధ అనుభవిస్తున్న యక్షుడు చిక్కి శల్యమయాడు .కుబేరుని కొలువులో ఉండే అతని చేతి బంగారు కడియాలు చేతులనుంచి జారిపోతున్నాయి  కుబేరుని ఆగ్రహానికి గురై ఒక ఏడాది మానవుడిగా  రామగిరిలో ఉంటూ భార్యకు మేఘం ద్వారా సందేశం పంపాడు ఇదే మేఘ సందేశం .
  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు .

image.png
Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు

కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించిన చలసాని సుబ్బారావు ,అదేజిల్లా పెనమలూరు మండలం కానూరు లో స్థిరపడ్డారు .విద్యా గంధం లేకపోయినా తనదైనమార్గం లో అధ్యయనం చేసి అఖండవిజయాలు సాధించి రైతులకు స్పూర్తిప్రదాత అయ్యారు .అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులలో అధిక దిగుబడి సాధించి రికార్డ్ సృష్టించారు .

   1945-46లో తమలపాకుల తోటలను పెంచటం ప్రారంభించి ,తుఫాన్ వలన తీవ్ర నష్టాలు పొందారు .పోగొట్టుకున్నదాన్ని పోగొట్టుకొన్న చోటే సాధించాలన్న సంకల్ప బలం తో ,పెంపకం, యాజమాన్యం లలో ఉన్న లోపాలను అధ్యయనం చేసి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తమలపాకు తోటలుపెంచి గణనీయమైన దిగుబడులు సాధించి ,ఎగుమతులు కూడా చేబట్టి ‘’తమలపాకు రారాజు’’అనిపించుకొన్నారు .

 అంతేకాదు సీజన్ తో నిమిత్తం లేకుండా అన్ని రోజుల్లో అన్ని రకాల కూరగాయలు అత్యధిక దిగుబడులతో పండించి ఆశ్చర్యపరచారు  .తక్కువ ఖర్చు అధిక దిగుబడి ఆయన స్లోగన్ ధ్యేయం కూడా .తన పరిశోధనలన్నిటినీ వ్యవసాయక్షేత్రం లోనే చేసి ,భూమినీ ,వాతావరణాన్ని పరిశోధక గ్రంథాలుగా భావించి పరిశోధనలు చేసిన  లాబ్ లో కాలుపెట్టని భూమి పుత్రుడైన శాస్త్రవేత్త .సృజనాత్మక  కృషి తో  ఆదర్శ రైతుగా గుర్తి౦పబడి జాతీయ స్థాయికి ఎదిగారు .

   చెరుకు ఉత్పత్తి లో నూ విప్లవ మార్గాలను అనుసరించి అధికదిగుబడులు సాధించిన యదార్ధ కృషీవలుడు సుబ్బారావు గారు .1992లో హెక్టార్ కు 133.37టన్నుల చెరుకు పండించి అవార్డ్ పొందారు .వరి లోనూఅద్వితీయ కృషి చేసి అదే ఏడాది ఎకరానికి 39 బస్తాల రికార్డ్ దిగుబడి సాధించారు .బాస్మతి రకం వరిని కూడా ఎకరానికి 35బస్తాలు పండించిన రైతు వీరుడాయన .

  ఏ పంట సాగు చేసినా దాని అంతు చూసి అత్యధిక దిగుబడి సాధించట౦ ఆయనకు నల్లేరు పై బండి నడక అయింది. ఆయన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించటానికి ,సలహాలు పొందటానికి రాష్ట్రం నలుమూలలనుండి వ్యవసాయ దారులు వచ్చేవారు .1980లో జిల్లా ఆదర్శ రైతు అవార్డ్ , 1990లో ఆంధ్రప్రదేశ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి బంగారుపతకం ,కేంద్ర ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి ఆదర్శ రైతు పురస్కారం ,1994లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అగ్రికల్చరల్ ఫౌండేషన్ అవార్డ్ అందుకొన్నారు .విజయవాడ వ్యవసాయ మార్కెట్ ,’’ఉత్తమ కర్షక ‘’అవార్డ్ ,కృష్ణాజిల్లా కిసాన్ మేళా,కృష్ణా పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన అవార్డ్ మొదలైనవెన్నో ఆయన్ను వరించాయి .భూసారం కాపాడటం  నీటిపోదుపు ,కంపోస్ట్ ఎరువువాడకం మొదలైన మెలకువలతో ఇన్ని అద్భుత విజయాలు సాధించారుఆదర్శ  రైతుపెద్ద చలసాని సుబ్బారావు గారు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అందుకొన్నారు .

   రాజమండ్రి లోని సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ,టెక్నికల్ శాఖలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా 1955లో చేరారు .పనిచేసిన 41 సంవత్సరాలలో 7 సార్లు పదోన్నతి పొంది ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ,శాఖాధిపతి గా  ఎదిగారు .పొగాకు రంగం లో అవిశ్రాంత కృషి చేసి 1996 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు .తర్వాత గుజరాత్ అగ్రికల్చరల్ యూని వర్సిటి లో ఇన్విజి లేటర్ గా ,జాతీయ అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికా సంపాదకులుగా ఉన్నారు .

  రమణారావు గారు 1968లో రాజమండ్రి నుంచి ,మేలురకం వర్జీనియా పొగాకు విత్తనాలను కర్ణాటకలోని ‘’బైలె కుప్పె’’గ్రామానికి తీసుకు వెళ్లి సాగు చేసి నాణ్యత పెంచారు.దీనితో కర్నాటక రైతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మేలురకపు సిగరెట్ పొగాకు ఉత్పత్తిలో అగ్రగాములై మనదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా సాధించి పెట్టారు .పొగాకుకు వచ్చే బూడిద రంగు తెగులు నివారణకు జపాన్ నుంచి తెప్పించిన రెండు జన్యువులను మన పొగాకులో ప్రవేశ పెట్టి  విజయం సాధించారు .అలాగే’’ సీతాఫలం’’ తెగులు నివారణకు ‘’వేమర్ -50’’అనే విత్తనం లోని జన్యువును ప్రయోగించి ,అనేక మేలుజాతి  వంగడాలను రూపొందించారు  .

  1969లో మనరాష్ట్రం తరఫున ఒరిస్సా వెళ్లి అక్కడ వర్జీనియా పొగాకు సాగు కు శ్రీకారం చుట్టారు .అక్కడి రైతులు ఈ పొగాకు ను అత్యధికంగా పండించి ఇబ్బడిముబ్బడి లాభాలు పొందారు .మన  రాష్ట్రానికీ ,కర్ణాటక రాష్ట్రానికీ కలిపి 10 రకాల మేలు జాతి వంగడాలు రూపొందించిన ఘనత  వెలువలి వారిదే .వీరు జాతీయ అంతర్జాతీయ సైన్స్ మేగజైన్ లలో 32పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .2005మార్చిలో రష్యాలోని అజార్ బైజాన్ సందర్శించి , వర్జీనియా పొగాకు ఉత్పత్తి పెంపుదలకు ,మార్కెటింగ్ కు అవకాశాలను విశ్లేషించారు .

  రమణారావు గారి ప్రతిభకు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .రాజమండ్రి లోని ‘’ది ఇండియన్ సొసైటీ ఆఫ్ టుబాకో సైన్స్ ‘’1955లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది . ఈ సంస్థ కార్య దర్శిగా ఉన్న1990- 1993కాలం లో రాజమండ్రిలో పొగాకు సదస్సు నిర్వహించారు .వేప చెట్టు గుణాలు ,విశేష ప్రయోజనాలు తెలియ జేయటానికి బెంగుళూరు లో ‘’వరల్డ్ నీమ్ కాన్ఫరెన్స్ ‘’నిర్వహించారు .1976నుంచి ‘’ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ‘’సంస్థలో సభ్యులుగా ఉన్నారు .

  వ్యవసాయ సైన్స్ తో పాటు రావు గారికి చిత్రలేఖనం పైనా విశేష అభిరుచి ఉంది .ఇందులో చేసిన కృషికి దామెర్ల రామారావు ఆర్ట్ స్కూల్ వారు వెండిపతకం బహూకరించారు .లలిత సంగీతం లోనూ ప్రావీణ్యం ఉన్న వీరికి ఆంధ్రా యూని వర్సిటి  వెండికప్పు ,వెండిపతకం అందజేశారు .ఢిల్లీ లోని కృషి అను సంధాన పరిషత్ వారు స్కాలర్ షిప్ ఇచ్చారు .1971లో గుజరాత్ లోని ఆనంద్ అగ్రికల్చరల్ కాలేజి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధుల వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి పొందారు .’’హెమ’’అనే మేలురకం వర్జీనియా పొగాకు వంగడం రూప కల్పన చేసినందుకు ‘’డా.జి.ఎస్.మూర్తి అవార్డ్ ను రావుగారు 1992లో అందుకొన్నారు .పొగాకు వ్యవసాయం లో ఇంతటి అద్భుత కృషి చేసిన వెంకటరమణారావు గారి గురించి మనకెవ్వరికీ పెద్దగా తెలియకపోవటం ఆశ్చర్యమే .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు  27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు

  1. 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

  భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 మార్కులొచ్చాయి .పరిశోధనపై ఆసక్తితో జపాన్ వెళ్లి ఒక ఏడాది పరిశోధన  విషయాలపై అవగాహన పెంచుకొన్నారు .

  ఇండియాకు తిరిగొచ్చి ,కలకత్తా లో ప్రముఖ రసాయనిక  శాస్త్రవేత్త డా ప్రఫుల్ల చంద్ర రే(పి.సి.రే.) గారిని చేరి ఉత్తమ శిక్షణ పొందారు .జపాన్ అనుభవం తో మాంగనీస్ మొదలైన ఖనిజ విశ్లేషణ లో ఘనాపాఠీ అయ్యారు .ఖనిజాల ఎగుమతులను అధ్యయనం చేసి ,దానికి సంబంధించిన వ్యాపార సంస్థను నెలకొల్పి  సాగక దెబ్బ తిన్నారు .తర్వాత మద్రాస్ ప్రభుత్వ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో కెమికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ,తగిన విద్యార్హతలు లేకపోయినా ,రసాయనిక శాస్త్రం లో చేసిన కృషిని తెలుసుకొని నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చారు .ఇక్కడితో ఆయన పరిశోధన దిశ కొత్త మలుపు తిరిగింది .నిరంతర పరిశోధన చేస్తూ ,మొదటి  ప్రపంచయుద్ధం లో డెప్యుటేషన్ పై ఇరాక్ సందర్శించారు .  తిరిగొచ్చి మళ్ళీ ఉద్యోగం లో చేరగానే ప్రభుత్వ వ్యవసాయ శాఖలో రసాయనిక శాస్త్ర వేత్తగా నియమి౦ప బడ్డారు .ఇక్కడ పని  చేస్తూ భూసార పరిరక్షణపై గణనీయ పరిశోధనలు చేశారు .ఢిల్లీలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో    ఎర్త్ సైన్సెస్ విభాగ హెడ్ అయ్యారు .ఇక్కడ 1934నుండి 11ఏళ్ళు 1944 వరకు ఉండి,అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు .తొలి తెలుగు వాడూ అయినందున మనకూ గర్వకారణమే .రిటైర్ అయ్యాక దేశం లోని అనేక ప్రాంతాలలోని వ్యవసాయ రంగాలలో అత్యున్నత పదవులలో రాణించారు .

   తర్వాత 1944-47 కాలం లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్  డైరెక్టర్  గా ,బెనారస్ హిందూ యూని వర్సిటి అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ గా ,అగ్రికల్చరల్ కాలేజి ప్రిన్సిపాల్ గా,రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సలహాదారుగా  సేవలందించారు  విశ్వనాద్ . దేశం లోనే ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త గా గుర్తింపు పొందారు .కేంద్రం లో  కె.ఎం. మున్షీ మంత్రిగా ఉన్నకాలం లో ప్రారంభమైన ‘’వనమహోత్సవాలు ‘’కార్యక్రమం లో భాగస్వాములయ్యారు .కేంద్ర ప్రభుత్వ అధీనం లో ఉన్న అనేక ప్రణాళిక కమీషన్ లలో ,సలహా సంఘాలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు .భూ వినియోగం మొదలైన అంశాలపై పలు మార్గ దర్శక సూచనలు చేశారు .24 వ ఇండియన్ కాంగ్రెస్ వ్యవసాయ విభాగానికి అధ్యక్షత వహించి ,వ్యవసాయ శాస్త్రవేత్తలకు మార్గ దర్శనం చేశారు .జర్మనీ ప్రభుత్వం కూడా వీరి నుండి వ్యవసాయ అభి వృద్ధికి సూచనలు తీసుకొన్నది .

    తన సమర్ధతకు తగిన ఉన్నతపదవులెన్నో భాగవతులవారికి దక్కాయి .ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ శాఖ లోని బోర్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ కి గౌరవ రీజినల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కమీషనర్ గా ,కార్యదర్శిగా 1950-51కాలం లో పని చేశారు .ప్లానింగ్ కమిషన్ లో అగ్రికల్చరల్ ప్రోగ్రాం కు గోరవ సలహాదారుగా ,1951-52లో ,ఇండియన్ కౌన్సిలాఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ వారి సాయిల్ సైన్స్ కమిటీకి అధ్యక్షులుగా 1952నుంచి 56 వరకు నాలుగేళ్ళు ఉన్నారు .భూసారపరిరక్షణలో ,వ్యవసాయ పైశోధన  రంగం లో అవిశ్రాంత కృషికి చాలా  సంస్థలు వీరిని ప్రోత్సహించాయి .ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,,ఇండియన్ అకాడేమిఆఫ్ సైన్స్ మొదలైన సంస్థలలో ఫౌండేషన్ ఫెలోగా ఉంటూ పరిశోధనలు చేశారు .

 సాయిల్ సైన్స్ ,ఫెర్టిలైజర్ ప్లాంట్ ,యానిమల్ న్యుట్రిషన్ ,షుగర్ కేన్ రిసెర్చ్ రంగాలలోనూ విశేష పరిశోధనలూ చేశారు .వ్యవసాయ ఉత్పత్తులను  ,వ్యర్ధ పదార్ధాలను ఆర్ధికం గా ఎలా సద్వినియోగ పరచాలో అద్వితీయంగా వివరించారు .తగిన శాస్త్రవేత్తలతో కలిసి దేశం లోనే మొదటి సారిగా ‘’సాయిల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ‘’తయారు చేసి కీర్తి శిఖరాలను అధిరోహించారు .చెరకు అధిక దిగుబడి ఉత్పత్తికి విశేష పరిశోధనలు చేశారు .చెరుకు గానుగ ఆడటానికి పక్వ స్థితిలో ఉన్నదో లేదో పరీక్షించే ‘’షుగర్ కేన్ రిఫ్రాక్టో మీటర్ ‘’తయారు చేసి విప్లవాత్మకమార్పుకు నాంది పలికారు .

 జొన్న పంట దిగుబడి పెరగటానికి ,సింధటిక్ రబ్బర్ ఉత్పాదన లో భాగవతులవారి  కృషి అద్వితేయమైనది .రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,భూసారం పెంచి ఇతోధికంగా పంట దిగుబడి సాధించటానికి రైతులకు అనేక నూతన విషయాలను సూచించి ఆచరి౦ప జేసి అధిక దిగుబడిలో ఇండియా ‘ అగ్ర భాగాన నిలిచింది .భాగవతులవారికి బ్రిటిష్ ప్రభుత్వ౦ 1935లో ‘’కింగ్స్ సిల్వర్ జూబిలీ మెడల్ ‘’1936లో ‘’కింగ్స్ మెడల్ ‘’ అందజేసింది .ఆంధ్రా యూని వర్సిటి ‘’డాక్టర్ ఆఫ్ సైన్స్ అవరిస్ కాజ్ ‘’గౌరవ డిగ్రీ అందించింది .కేంద్ర ప్రభుత్వం రావు బహదూర్ ,C.I.E.గౌరవ పురస్కారాలిచ్చింది .

  భాగవతులవారు ‘’The Effect of Manufacturing crop of negative and Re productivecapacity of the seed ‘’పరిశోధన వ్యాసం మంచి పేరు తెచ్చింది .ఇది జర్మని భాషలోకి అనువాదం పొందింది జొన్న ,వరి లపై కూడా రచనలు చేశారు .విజయనగరం లో ఒక రసాయనిక పరిశ్రమ స్థాపించారు.ఇలాంటి పరిశోధకవ్యాసాలు 100కు పైగా రాశారు .దేశానికి పూర్తిగా అంకితమైన వీరుఆంధ్ర రాష్ట్ర౦ లో నూ సేవలందిస్తూ ,బాపట్ల అగ్రికల్చరల్ కాలేజి స్థాపనలో ఎంతో సహాయం చేశారు .ఇన్ని విధాలుగా భారత వ్యవసాయ రంగం లో తనదైన ముద్ర వేసిన వీరికి చరిత్రలో తగిన స్థానం లభించకపోవటం ఆశ్చర్యంగా ఉంది .శ్రీ భాగవతుల విశ్వనాథ్  ఢిల్లీ లో 75 ఏట 1-2-1964న మరణించారు .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురు –శిష్య -2

గురు –శిష్య -2

గురు –ఎపి లో పాలన ఎలా ఉందిరా ?

శిష్య –అదుర్స్ గురు –ముప్పై యుటర్న్ లు ,పది మానభంగాలు ,పదహారు దోపిళ్ళు ,అన్తెవేగంగా కూల్చివేతలూ  గా దినదిన ప్రవర్ధమానంగా ఉంది .

గురు –అరేయ్ ఆయనోచ్చి పాపం నెల కూడా కాలేదు .అప్పుడే బేరీజు వేసి ఇన్ని అభా౦ డాలా ?నాకేం నచ్చలేదు .

శిష్య –రచ్చ రచ్చ గా ఉన్నా నీకు చీమకుట్టినట్లైనా లేదా ?

గురు –నాకు అంతా బాగా ,ప్రశాంతంగా నే కనిపిస్తోందే .

శిష్య –కళ్ళు మూసుకొన్నావా ?అరకంటి తో చూస్తున్నావా ?నాకేమీ నీ ధోరణి అర్ధం కాటం లేదు గురవా .

గురు-సరేకాని నవరత్నాల పంపిణీ బాగా జరుగుతోందా ?

శిష్య –ఇంకా సాగినట్లు లేదు .ఆఫీసర్లు బుర్రలు పగలకొట్టుకు౦టున్నారు ,జుట్లు పీక్కుంటున్నారు .వీటికి మనీ ఎక్కడ అని !మోడీ ఏమీ ‘’చేపేట్లు’’లేడు .పైగా ఇప్పటికే ‘’కుర్రాయన ‘’మీదసానుభూతిపోయి కారాలు మిరియాలు నూరుతున్నాడని అనుకొంటున్నారు .ప్రస్తుతం నవ రత్నాల బదులు రూపాయికి ఒకటిచ్చే ‘’నవరత్న ఆయిల్ పాకెట్స్’’ ప్రజలకు ఇస్తే చిరంజీవి యాడ్ లో చెప్పినట్లు ‘’చల్లచల్లగా కూల్ కూల్ గా’’ ఉంటారేమో?

గురు –అరే!అప్పుడే యు టర్నా? కొత్త జంట ఎలా నడుస్తున్నార్రా ?

శిష్య –అంటే జగన్ కెసిఆర్ లనేగా నీ ఉద్దేశ్యం .ఆరు కౌగిలింతలు ,పదహారు ఇకిలింతల్లా ఉంది వాళ్ళ అన్యోన్యం .

గురు-కాళేశ్వరం పై తాజా వార్తలే౦ట్రా?

శిష్య –ఆ  ఏముంది గురవా !మసి పూసి మారేడుకాయ .బుడ్డాడిని బుట్టలో వేసుకొని ఆటలాడే చాణక్యం .మనకు బొక్క ,వాళ్లకు నక్క తొక్కుడు .మనకు నష్టం వాళ్లకు బోల్డు లాభం .

గురు –ఎక్కడున్న ఆస్తులు అక్కడి వాళ్ళవే అన్నాడట గులాబీ సామి ?

శిష్య –అవును గురూ .అందుకే భవిషత్తులో గోదారి -శ్రీశైలం అనుసంధానం తమదే అంటే ‘’అన్నీ మూసుకు కూర్చోవాల్సిందే ‘’అని గోలగా ఉంది ఆంధ్రాలో .

గురు –మరి ఆంధ్రాజనం గాజులు తొడుక్కుని కూర్చుంటారా ?

శిష్య –కూర్చోరు .ఇప్పుడిప్పుడే’’ సన్నాయి నొక్కుడు ‘’ప్రారంభమైంది .దీనికి సరైన నాయకత్వం కావాలి.

గురు –‘’అమిత’’ బలుడు’’ షా’’ కొత్తపాచికలే౦టిరా?

శిష్య –గులాబీ దండుపై చాణక్య ప్రయోగం లో ఉన్నాడని ,గులాబీ లో ఒకబాచ్ అధినేతకు తెలియకుండా ,ఆయన చెంత చేరి చెవిలో జోరీగల్లా రొద పెడుతున్నారని  గులాబీ నేత లూప్ హోల్స్ అన్నీ వాళ్ళే అందిస్తున్నారని ,అందులో మొన్నటి ఇంటర్ పరీక్షాఫలితాలు విద్యార్దులమరణాలు కూడా ఉన్నాయని మీడియాలో జోరుగా ఊహాగానాలు హల్ చల్ చే     స్తున్నాయి .పైగా మోడీని పిలవకుండా కాళేశ్వరం ఓపెన్ చేయించి శనీశ్వరం చుట్టి౦చు కున్నాడని బలంగా అనుకొంటున్నారు .

గురు –మేనల్లు డే౦  చేస్తున్నాడు ?

శిష్య –సమయం కోసం కాచుక్కూచున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు .

గురు –ఇక్కడ అలాంటి ప్రమాదం లేదుకదా ?

శిష్య –ఓరి నాపిచ్చ గురూ ! కింగ్ మేకర్ ఢిల్లీలో చక్రం తిప్పుతూ  ఇక్కడొక కన్ను వేసి ఉంచుతూ  టైంకోసం ఎదురు చూస్తున్నాడని అంటున్నారు .

గురు –అరే!ఇంకా నెలలు నిండని పసిగుడ్డు పాలన .అప్పుడే అంత ప్లాన్ వేస్తారా ?

శిష్య –మనకు కొత్తేమీకాదుకద గురూ ,నమ్మిన  నాదెండ్ల  అన్న ఎన్టి వోడిని ముంచేసింది మర్చావా ?అధికారం దక్కించుకోవటం లో  ఉచ్చనీచాలు ఉండవు గుర్వా.

గురు –సరేరా .  మోడీ సెంట్రల్ లో ,జగన్ రాష్ట్రం లో అన్ని సీట్లు ఎలా సంపాదించారని నాకు ఇంకా అనుమానంగానే ఉందిరా !

శిష్య –నీకేనేమిటి ?ప్రజలు కూడా అసలు మేము వాళ్లకు వోట్లు వేయనేలేదు  ఎలాగెలిచారబ్బా ఇన్ని సీట్లు ?అని ఇప్పుడు లబోదిబో మంటున్నారట .

 గురు –అదేరా నాకూ మిలియన్ డాలర్ల సందేహం .

శిష్య –ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఇలాగే భారీ మెజారిటీ సీట్లు, వోట్లతో గెలిచాడట .ఎలెక్షన్ అయిన కొన్నినెలలకు’’  వాటర్ గేట్ కుంభ కోణం ‘’బయటపడి ,తలవాచి, పరువు గంగలో కలిసి  రాజీనామా చేసిన ఉదంతం ఇప్పుడు బాగా వైరల్ అయింది గురూ .ఏ బొక్కలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక ?

 గురు –ఒకేదేశం ఒకే ఎన్నిక బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు గదరా మోడీ ?

శిష్య –అవును గురూ .2022-23లో ఒకేసారి దేశం లో ఎన్నికలు అన్నాడు పిఎం .జ్యోతిష్కులు  పంచా౦గ కర్తలు  టివిలలో ‘’శని ప్రభావం అధికంగా ఉన్న సమయం లో దేశం లో  ప్రదాని,ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు .ఇది మూన్నాళ్ళ ముచ్చటే .అయిదేళ్ళూ అధికారం లో ఉండరు .శని మార్పుకు కూడా కారకుడు .కనుక ఏదో ఒక కారణం తో మధ్యంతర ఎన్నికలు దేశం లోనూ , మనరాష్ట్రంలోనూ వస్తాయని ఢంకా బజాయించి చెబుతున్నారు .అయినా మోడీకి కేదార్ నాథ్ గుహ ,జగన్ కు స్వరూపానంద స్వామి ఉన్నారు .భయమేల గురు ?అయినా మళ్ళీ నాతోనే రహస్యాలన్నీ చెప్పించి చల్లగా జారుకొంటున్నావు గురూ .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు .

  కొద్దికాలానికే రిజర్వ్ బాంక్ లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ,పరిశోధనలలో పండిపోయారు .13 ఏళ్ళు రిజర్వ్ బాంక్ లో సేవలందించి తనపరిశోధన లలో నిష్ణాతులై ,రిసెర్చ్ ఆఫీసర్ గా ,డిప్యూటీ డైరెక్టర్ గా ఎదిగారు .తర్వాత ఇండ స్ట్రియల్ డేవలప్ మెంట్ బాంక్ (I..D. B.L.)లో1977లో  చేరి రిసెర్చ్ డివిజన్ ,,ప్లానింగ్ కార్పోరేట్ ,ఫైనా౦షియల్  భాగాలలో ఉత్కృష్ట సేవలందించారు .

  మర్చెంట్ బాంకింగ్ డివిజన్ చీఫ్ జనరల్ మేనేజర్ అయి ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ అయ్యారు .ఈ పదవులలో ఉంటూ మానవ వనరుల అభి వృద్ధికి ,పెట్టుబడి దారుల సంబంధాలను మెరుగు పరచటానికి ,ట్రెజరీ అండ్ ఫండింగ్ ప్రక్రియల నైపుణ్యానికి అద్వితీయమైన కృషి చేశారు నరసింహం గారు .తర్వాతకాలం లో ఇండస్ట్రియల్ కార్పోరేషన్  ఆఫ్ ఇండియా లిమిటెడ్ (I.F.C.I)ప్రెసిడెంట్ గా 16-7-1998 న పదవీ బాధ్యతలు చేబట్టి తన విశేష ప్రతిభా విశేషాలు ప్రదర్శించారు .దీని అనుబంధ సంస్థలకు గౌరవ సభ్యులుగా ఉంటూ సలహా సంప్రదింపులతో వాటి అభి వృద్ధికీ తోడ్పడ్డారు .ఆర్ధిక శాస్త్రవేత్తగా ,బాంకింగ్ రంగ నిష్ణాతులుగా పి.వి. నరసింహం ప్రపంచ ప్రఖ్యాతి పొందారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

← Back

Thank you for your response. ✨

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి నూతన ఆవిష్కరణలు చేశాడు .

అందులో ముఖ్యమైనది గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసే ప్రక్రియ ముఖ్యమైనది దీనితో ప్రపంచ ప్రసిద్ధ  శాస్త్ర వేత్తల సరసన చేరాడు .అమెరికాలో గ్లిజరిన్ ఉత్పత్తి అత్యధికంగా ఉన్నా వాడకం బాగా తక్కువై నిల్వలు ఎక్కువైపోయాయి .ఆయన దృష్టి దీనిపై పడి,పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసి  తర్వాత భారీ గా ఉత్పత్తికి తోడ్పడ్డాడు .దీని కెమికల్ ఫార్ముల – C3H8O2 అమెరికా ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు దాసరి పసాద్ గారికి పలురకాల అవార్డ్ లు రివార్డ్ లు అందించి గౌరవింఛి పేటెంట్ ను మంజూరు చేసింది .

  దాసరి సాధించిన ప్రోపిలిన్ గ్లైకాల్ కు అమెరికాలోనే కాక అనేక దేశాలలో గొప్ప డిమాండ్ ఉంది .విమాన పైభాగాలపై మంచు పేరుకు పోకుండా అప్పటిదాకా ఇథలిన్ గ్లైకాల్ వాడేవారు  .కాని ఇందులో పర్యావరణానికి హానికలిగించే విషపదార్దాలున్నట్లు గుర్తించారు .దాసరిప్రసాద్ తయారు చేసిన ప్రోపిలిన్ గ్లైకాల్  లో విషపదార్ధాలు లేకపోవటంతో ఇప్పడు దీనినే వాడుతూ పర్యావరణ రక్షణ కల్పిస్తున్నారు .అంతే కాక ఇది జీవ సంబంధ ఉత్పత్తి .సోయాబీన్ ఆయిల్ ను దీనికి ఉపయోగిస్తున్నారు అంటే ఆర్గానిక్ ప్రొడక్షన్ కనుక ఏ ఇబ్బందులు ఉండవు .దాసరి మేధా శక్తిని గుర్తించి ‘’ది ప్రేసి డేన్షియల్ గ్రీన్  కెమిస్ట్రి  అవార్డ్ ‘’అందజేశారు.

    ప్రోపిలిన్ గ్లైకాల్ ను  వాహనాల బ్రేక్ ఫ్లూయిడ్ లలో ,సౌందర్య సాధనాలలో ,ఆహార ఉత్పత్తులలో ,లిక్విడ్ సోప్ తయారీలోకూడా  వాడుతున్నారు .శీతలీకరణాన్ని (ఫ్రీజింగ్ )నివారించటానికి’’ యాంటి ఫ్రీజర్ ‘’గా భారీ ఎత్తున  ఉపయోగిస్తున్నారు  .అనేక రకాల పోలిమేర్స్ తయారీలో ,బిల్డింగ్ మెటీరియల్స్ లో ,లేజర్ ప్రింటింగ్ లో టోనర్ గా ,ఫార్మకాలజిలో ,చర్మవ్యాదులకుపయోగించే ఆయింట్ మెంట్ లలో ఎక్కువగా ప్రోపిలిన్ గ్లైకాల్ వాడకం ఉన్నది .. ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం లో 18-10-1931న జన్మించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి హైదరాబాద్ లో స్థిరపడినా తన స్వగ్రామాన్ని మరచిపోలేదు .కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. టెలికం పరిశోధకులు.

పూణెలో (1974-75), ఆంధ్ర ప్రదేశ్ లో (1978-83) టెలీఫోన్స్ శాఖ ప్రధానాధికారిగా ఉంటూ దేశవ్యాపితంగా ఎస్.టీ.డీ , ఐ.ఎస్.డీ ల వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ఈయన కృషి ఫలితంగా ఈ రోజున దేశంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా ఎస్.టి.డి, ఐఎస్‌డి, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్సు, ఐఎస్‌డీ ఎన్ లైన్లు విస్తృతమయ్యాయి. “నాట్” గురించి పార్లమెంటు సభ్యులకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర మంత్రులకు అవగాహన కల్పించారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొట్టతొలి చైర్మన్ గా, మేనేజింగ్ డైరక్టరుగా దేశ వ్యాప్తంగా టెలీ కమ్యూనికేషన్ ల శకానికి నాంది పలికారు.

1989 లో టెలీ కమ్యూనికేషన్స్ మేనేజిమెంటు అండ్ స్టడీస్ సెంటరు నెలకొల్పారు. నేషనల్ టెలీకాం పాలసీ ఎన్.టీ.పీ కి సంబందించిన డ్రాప్టు పాలసీని 1989 లో రూపొందించారు. సెంటరు తరపున ఒక హౌస్ జర్నల్ ను నెలకొల్పి దానికి ఎడిటర్ గా కొంతకాలం వ్యవహరించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ను సవరించి దానికి ప్రత్యామ్నాయంగా టెలికం లా కు రూపకల్పన చేసి 1992 లో ప్రవేశపెట్టేందుకు కృషి జరిపారు.

టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బిల్ ను డ్రాఫ్టింగ్ చేసిన ఈయన ప్రైవేటు రంగంలో టెలికం పరిశ్రమ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించి, దేశీయ టెలికం వ్యవస్థకు నూతన శకం ఆవిర్భవింపజేశారు. జాతీయ, అంతర్జాతీయ టెలికం సదస్సులు అనేకంలో పాల్గొని టెలికం పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా నూతన పోకడలను అంకితం చేశారు. ఇంటర్నేషనల్ టెలికం యూనియన్ (జెనీవా) కు గౌరవ సభ్యులు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఏషియన్ టెలికం మహాసభలో (సింగపూర్,హాంకాంగ్,జెనీవాలలో 2001,02,03లలో) పాల్గొని మనదేశపు టెలికం రంగపు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దాదాపు 20 దేశాలలో జరిగిన టెలికం సదస్సులలో ప్రధాన వక్తగా పాల్గొని, ఎప్పటికప్పుడు టెలికం అభివృద్ధి పథకాలను సూచించారు.

ఇంటెల్ సాట్ (వాషింగ్టన్) ,ఇన్మార్ సాట్ (లండన్) లకు గవర్నర్ గా వ్యవహరించారు. గయానా, యెమెన్ మొదలైన వర్ధమాన దేశాలకు ప్రణాళికలను రచించి తెలికం ఇంటర్నేషనల్ టీం కు నేతృత్వం వహించారు. 1995 లో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి, 2000లో నేపాల్ ప్రభుత్వానికి టెలికం సలహాదారుగా దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాం (1997-04) లో రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా యున్నారు. భారతీయ విద్యా భవన్ కు (హైదరాబాదు శాఖ) ఛైర్మన్ గా, “ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీర్స్” కు జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా, న్యూయార్క్ సంస్థకు గౌరవ సభ్యులుగా పనిచేసారు. సిటిఎమ్‌ఎస్ కు డైరక్టరుగా పనిచేశారు.

రచించిన గ్రంథములు
· India, understrain, India, U.P

· India Explorations, In True Conscience.

అవార్డులు
· ఎల్.వి.రామయ్య అవార్డు గ్రహీత.2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది .

హోమియో పతి వైద్యం లోతులుతరచి ఈనాడు పత్రికలోచాలాకాలం ధారావాహికంగా ఆ వైద్య విధానం గురించి రాసి పుస్తకరూపం లో ప్రచురించారు హోమియో కిట్ రూపొందించారు .తెలుగు విద్యార్ధి మాసపత్రికలో జాబులు జవాబులు శీర్షిక నిర్వహిస్తున్నారు .జాతీయ మేధావుల సంస్థ గా ‘’ప్రజ్ఞా భారతి’’స్థాపించి ,చైర్మన్ గా ఉంటూ జాతి భవిష్యత్తుకు దిశా నిర్దేశనం చేస్తున్నారు 89 ఏళ్ళ వయసులో కూడా చాలా చలాకీగా టివి కార్యక్రమాలలో గోస్టులలో,చర్చావేదికలలో పాల్గొంటున్న అనుక్షణ క్రియాశీలి హనుమాన్ చౌదరి .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురు శిష్యులు ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?

గురు శిష్యులు

గురు -శిష్యా! ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?

శిష్య -అయిదుగురుకదా గురూ
గురు -మరి సీఎం లు ఎందర్రా ?
శిష్య – ఐదారుగురు  గురూ
గురు -అదేంట్రా ఒక్కరే ఉండాలి కదా
శిష్య -ఉండాలి నిజమే .అసలు సీఎం జగన్ .కీ సీఎం  విజయసాయి ,సూపర్ సీఎం కేసీఆర్ సుప్రీం సీఎం మోదీషా . వీరికి పైన రాజగురు  స్వరూపానంద సామి .
గురు-బాగుందిరా .ఏపీ కి హోదా వస్తుందా ?
శిష్య -రానట్లే ఉంది గురూ . ఇప్పటికి మూడు సాలు పీఎం ను ”కలిసి సార్ సార్ -ప్లీజ్ ప్లీజ్ ”మంత్రం పఠించినా ఫలితం తేలక నీరసపడడ్డాడు సీఎం .
గురు -మరి వేరే ఉపాయం లేదా ?
శిష్య -ఉంది గురూ .జగన్ ఎంపీలందరూ ఢిల్లీలో ఒక నెలరోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్పక వస్తుంది .లేక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికైనా వసద్ది  .
గురు -అంత  సాహసం చేస్తార్రా ?
శిష్య -చెప్పటం తేలికేకాని చేయటం కష్టంకదా గురూ
గురు -వేరే ఉపాయ0  లేదా  ?
శిష్య -భేషుగ్గా ఉంది . విశాఖ సాములోరు  స్వరూపానంద జీ -జగన్ ను కేసీఆర్ ను యాగాలు యజ్ఞాలు చేసి రికార్డ్ మెజారిటీలతో గెలిపించానని చెప్పారు కదా ఆయనకు ఒక యాభై కోట్లు ఇచ్చి పూజాపునస్కారాలు యజ్ఞ యాగాలు మోదీషా  మనసు మార్చే యంత్రాలు కట్టించి విభూతి పంచిపెడితే  గ్యారంటీగా రావచ్చు
గురు -కేసీఆర్ ,,జగన్ లు గోదారి  అంతు  చూస్తాం అంటున్నారు ?
శిష్య -కాళేశ్వరం కడితే శనేశ్వరమే తప్ప చుక్క నీరు లేదట .ఇక్కడ బాబు పట్టిసీమ నీళ్లు రాయలసీమదాకా పారించి ఆంద్ర అంతా సస్యశ్యామలం చేశాడు .ఆ కడుపుమంటతో ”పసి వాణ్ని ”దువ్వి జలసిరి పొంది తనమగసిరి చూపించాలన్నతాపత్రయం గురూ .చివరికి ”కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అనే సామెత రుజువవుతుందేమోనని భయంగా ఉంది గురూ
గురు -ప్రజాదర్బార్ అర్ధరాత్రి కూల్చేశారు .దానికి కోట్లు ఎందుకు ఓట్లు వేసినవారంతా కలిస్తే ఉఫ్ఫ్మని ఊదేసి వాళ్ళుకదా   ?
శిష్య – -అంత ”ఔడియా వచ్చి ఉండదు ”లేక ”స్వామి” ఆదేశించి ఉండరేమో
గురు – కరకట్ట వెంబడి సచ్చిదానంద ఆశ్రమం మంతెనరాజు గారి విల్లాస్ ,ఇస్కాన్ వారి భారీ భవంతులున్నాయి వాటినీ కూల్చేస్తారా ?
శిష్య -”కూల్చేసుకోండి లేదా కూల్చేస్తాం ”స్లోగన్ ఫ్లోట్  చేశారుకదా .చూద్దాం .అత్యంత కీలక విషయాలన్నీ నాతోనే చెప్పించి తప్పించుకొన్నావ్ గురూ .
  మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి ,ఎం ఏ .లు చదివారు .ఇండియాకు తిరిగివచ్చాక దక్షిణ భారత దేశం లోనే పేరుపొందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా కీర్తిపొందారు .

కృష్ణా జిల్లా  గుడివాడ దగ్గర సిద్ధాంతం లో వేలాది ఎకరాల భూస్వామి ,ఉయ్యూరులోనూ భూములున్న  శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య అనే సంపన్న వ్యవసాయ దారుడు 1932లో ఉయ్యూరులో సుగర్ ఫాక్టరీ నిర్మించారు . ఆయన నిర్వహణలో ఫాక్టరీ నడిచినా   టెక్నికల్ అనుభవం  లేనందున కుంటినడకే నడిచింది .రైతులకు, ఆయనకూ కూడా నిరాశే మిగిల్చింది .  రామకృష్ణ గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు  రాష్ట్రం  పారిశ్రామిక రంగం లో పురోగమించాలన్న తలంపుతో ఉయ్యూరులో తనభార్య శ్రీమతి దుర్గాంబ తండ్రి అంటే తన మామగారు స్థాపించిన షుగర్ ఫాక్టరీ అనుకొన్న లక్ష్యాలను సాధించటం లో విఫలమై వెనకడుగు లో ఉండగా  వెలగపూడి రామకృష్ణగారు  ఉయ్యూరు షుగర్ ఫాక్టరీని మామ గారి కోరికపై  నిర్వహణ బాధ్యతలు1941లో చేబట్టి కెసీపి లిమిటెడ్ గా నామకరణం చేశారు   లాభాలలో నడిపించి ఆసియా ఖండం లోనే అతిపెద్ద షుగర్ ఫాక్టరీ గా తీర్చి దిద్దారు .ఈవిధంగా రామకృష్ణగారు మద్రాస్ రాష్ట్రం లో తోలి పారిశ్రామిక వేత్తగా గుర్తింపుపొందారు .ఫాక్టరీ సామర్ధ్యాన్ని600 T.C.D.కి పెంచారు .ప్రస్తుతం కెపాసిటి న 7,500 T.C.D.కే పెరిగింది .ఇలా దినదిన౦గా  గణనీయమైన అభి వృద్ధి సాధించింది కేసిపి ., చెరుకు రైతులలో విశ్వాసం పెంచి చెరుకు నాటటానికి తగిన ప్రోత్సాహకాలు రైతులకు అందించారు

వెలగపూడి వారి ప్రోత్సాహం తోనే తణుకులో సర్వారాయ షుగర్ ఫాక్టరీ ,ఆంధ్రా సుగర్స్ , డెక్కన్ సుగర్స్ చక్కర పరిశ్రమలు ఏర్పడి వాణిజ్యరంగం లో కొత్త పుంతలు తొక్కాయి  మద్రాస్ లో సెంట్రల్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు .కెసీపి సిమెంట్ ఫాక్టరీ మాచర్లలో నెలకొల్పారు షుగర్ లో ఎంత పేరుందో కెసీపి సిమెంట్ కూ అంత నాణ్యతా గిరాకీ ఉంది .ఇతర దేశాలలో షుగర్ ఫాక్టరీలను కూడా ఉయ్యూరు కెసీపి నిర్మించి గొప్ప పేరు సంపాదించింది

..కృష్ణా కమ్మర్షియల్ ప్రాడక్ట్స్ అంటే కె .సి.పి.పంచదార ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పొందింది .ఇక్కడి షుగర్ క్రిస్టల్స్ నాణ్యత మరే పంచదారకూ లేదు .దీనికి అనుబంధంగా సోడా గాస్ ,రెక్టిఫైడ్ స్పిరిట్ ,ఉత్పత్తిలోనూ పేరు పొందింది .ఉయ్యూరు సోడా వాటర్ తాగినవారికి ఇంకెక్కడి సోడా నచ్చనే నచ్చదు.కన్ఫెక్షనరి అంటే’’పంచదార  బిళ్ళలు’’కూడా ప్రసిద్ధి చెందాయి . కొంతకాలం తర్వాత బిళ్ళలవీటి ఉత్పత్తి ఆగిపోయింది ‘.ప్రస్తుతం అసిటిక్ యాసిడ్ ప్లాంట్ గణనీయమైన లాభాలు గడిస్తోంది .

రామకృష్ణగారి మరణం తర్వాత రామ కృష్ణగారి ఇద్దరు కుమారులు శ్రీ మారుతీ రావు  శ్రీ లక్ష్మణదత్ .కుమార్తె శ్రీమతి రాజేశ్వరి .కొన్నీల్లు ఫాక్టరీలను సమర్ధవంతంగా నడిపారు .తర్వాత  అన్నదమ్ముల వాటాలలో ఉయ్యూరు చల్లపల్లి, షుగర్ ఫాక్టరీలు శ్రీ మారుతీ రాగారికి  మాచార్ల సిమెంట్ ఫాక్టరీ మద్రాస్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ దత్తుగారికి లభించాయి .మారుతీ రావుగారు గొప్ప టెక్నీషియన్ .మాన్ పవర్ తగ్గించి ఫాక్తరీని ఆధునికత జోడించి సమర్ధంగా నడిపారు . రైతులు డబ్బుకోసం ఫాక్టరీ చుట్టూ తిరుగకుండా  బాంకులలో రైతులపెర అకొంట్ లు తెరిపించి  సరాసరి నగదు ఆ అకౌంట్ లలో జమ అయ్యేట్లు చేశారు .ఇది రైతులకు వరప్రదాయిని అయింది.  ఉయ్యూరులో ఒక పారిశ్రామిక విప్లవమే వచ్చినట్లైంది .మారుతీ రావు  గారి మరణం తర్వాత  ఉయ్యూరు కెసీపి బాధ్యతలు ఆయనభార్య శ్రీమతి ఇర్మ్ గార్డ్ చేబట్టారు .శ్రీ దత్తు ఫిక్కీ అధ్యక్షులయ్యారు  దత్తుగారి భార్య ముక్త్యాలరాజా కుమార్తె శ్రీమతి ఇ౦దిరాదత్తు.ప్రపంచ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షురాలు .వెలగపూడి రామకృష్ణగారమ్మాయి  శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ జయపూర్ చక్కర కర్మాగారానికి మేనేజింగ్ డైరెక్టర్ .వీరికుమారుడు శ్రీ ఆర్ ప్రభు తమిళనాడు ఊటీ (నీలగిరి )పార్లమెంటరీ స్థానానికి 5 సార్లు ఎన్నికై ,ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు .

వెలగపూడి రామకృష్ణ గారు జయపురం సంస్థానానికి దివాన్ గా పని చేశారు . మద్రాస్ ప్రభుత్వం లో అభి వృద్ధికమిషనర్ .గా సేవలందించారు .జిల్లాకలేక్టర్ గా ,లేబర్ కమీషనర్ గా ,పరిశ్రమల కమీషనర్ గా ,పార్లమెంట్ సభ్యునిగా ప్రజా సేవలో పునీతులయ్యారు .

వదాన్యులైన రామకృష్ణగాఋ   జన్మించిన చోట ఆయన బహుముఖీన సేవలకు గుర్తింపుగా ’’నగరం ‘’లో  ‘’వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజి’’ఏర్పాటైంది.తెనాలిలో విఎస్ ఆర్ ,అండ్ యెన్ వి ఆర్ కాలేజి స్థాపించారు .విజయవాడలో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి స్థాపన జరిగింది .మద్రాస్ లో ఆంధ్రా చేంబర్ ఆఫ్ కామర్స్ ఆయన పేరిట నిర్మించారు .ఇంతటి పారిశ్రామిక దిగ్గజం శ్రీవెలగపూడి రామ కృష్ణ గారు 72వ 1968 ఏప్రిల్ 18న మరణించారు .

తణుకు కు చెందిన పండిత శ్రీ పెనుమెచ్చ సత్యనారాయణ రాజుగారు ‘’ తెలుగు రాజు కృతులు ‘కావ్యాన్ని మంజరీ ద్విపదలో మనోహరంగా రాసి  తన మిత్రుడు వెలగపూడి  రామకృష్ణగారి  58 వ జన్మ దినోత్సవం సందర్భంగా ‘’  రామ కృష్ణము ‘’పేరుతొ పద్యాలు రాసి  అంకితమిచ్చారు . దీనికి ప్రముఖ శాస్త్రవేత్త రక్షణశాఖ కు సలహాదారు ,ఉస్మానియా యూని వర్సిటి వైస్ చాన్సలర్  రాజుగారికి తన చిన్నతనం లో శిష్యుడు ,రాజా విక్రమ దేవవర్మగారి సౌజన్యంతో ఆంద్ర విశ్వ విద్యాలయ౦  లో ప్రొఫెసర్ గా పని చేసిన  డా శ్రీ సూరి భగవంతం గారు ,ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు ముందుమాటలు రాశారు .

రామకృష్ణగారిపై  రాజు గారు రాసిన కొన్ని పద్యాలు రుచి చూద్దాం .

‘’గోదావరీ తీర కేదారములుపోవ –ఇంద్రావతీ భూములిచ్చినావు

‘’కాకరపర్రు’’లోనున్న గృహంబు ను వీడ –కోటపాడు న ఇల్లు కూర్చినావు ‘’

యుద్ధకాలమున౦దు ఉద్యోగ మొనగూర్చి –దోసిళ్ళతో సొమ్ము పోసినావు

నరసిన నా తల నరసి సోడా గ్యాసు –నేజెన్సి యిచ్చి పోషించు చుంటి

విన్ని  యుపకారములు చేయుచున్న కతన –నస్మదీయాంధ్ర కృతి కన్య నాత్మసఖుడ

వైన నీ కిచ్చినాడ  నేన౦కితముగ-ప్రేమతో శ్రీ వెల్గ పూడి రామకృష్ణ

‘’ఆరాధనంబుతో నీరాజనంబిచ్చి –యావేదనంబును నందజేసి

విజయంపు శ్రీతోడ రుజుభావమందించి –చంపకమాలినీ చరితమొసగి

పండిత రాట్చాటుభావాల గైసేసి –సరస రసాలంపు జవుల జూపి

భీమేశు శతకంబు నామెత గావించి-విక్రమ శతకంబు విశద  పరచి

ప్రేమతోడ జ్ఞానాంజలి పెట్టి దీని –‘’రామ కృష్ణము ‘’గావించి రామకృష్ణ

దేశదేశాల నీ కీర్తి తేజరిల్ల –నంకితము జేయుచుంటి నీకందుకొనుము ‘’

‘’పుత్రుని ‘’రామకృష్ణ ‘’యని ముద్దిడు కొంచును  నీదు పేరుతొ

బుత్రిక తెల్గురాట్కృతి ని మోదముతో నిడి నీకు  ,జన్మ తా

పత్రయ మీగ గంటి,భవ బంధములన్నియు ద్రెంచుకొంటి,స’

న్మిత్రమ ! రామ కృష్ణ కనుమీ !ధనధాన్య చిరాయుతున్నతుల్ ‘’

‘’ఏబది యెన్మిదైన భవదీయ జయంతికి నంకితంబుగా –నేబడది యైదు వత్సరము  లించ జనించిన నా’’ కుమారికన్’’

కూబర వృత్త రీత గుణ గుంఫిత రత్న మయూఖ దీపికన్ –నీ బహుమాన హస్తమున నేనిడితిన్ గొను రామ కృష్ణుడా ‘’

‘’ఢిల్లీ కోటలుదాటి నీదు గుణ మల్లీ వల్లికల్ హిందూ భూ –వాల్లభ్యధ్వజ దండమండన కళాపాండిత్య మార్జి౦చు టల్

సల్లాపామృత,రామ కృష్ణ !సతిగా సౌహిత్య సాహిత్య సం-పల్లావణ్య  వతిన్  కృతీంది నిడితిన్ బాణిం గ్రహింపం గదే’’

‘’దుర్గా౦బా ‘’దరహాస చంద్రికలలో దూగాడుచున్ గూడ శ్రీ –స్వర్గంగా లహరీ ప్రభావ కవితా భామా రమా కేళిమై

దుర్గా గంగలతోడి ఈశుడటు సంతోషంబు రేకెత్తగన్  -దిర్గన్ వచ్చును ‘’రామకృష్ణ ‘’గైకొ నీ తెల్గు రాట్పు త్రికన్ ‘’

ఇతి శివం

పండిత పెను మెచ్చ సత్యనారాయణ .

ఇలా రామకృష్ణగారు ఇన్ని మంచిపనులు చేశారని ,ఆయనకు ఒక కృతి అ౦కిత మివ్వబడిందనీ ఈ నాటి వరకు నాకే కాదు ఇక్కడి వారెవరికీ తెలియదు .రాజుగారి కావ్యాన్ని మా అబ్బాయి శర్మ లింక్ ద్వారా నిన్న పంపాకే నాకు తెలిసింది .

ఆధారం తెలుగు వీకీపీడియా  కొంత నాకు తెలిసిందీ ,మిగిలినది రాజు గారి కావ్యం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు

ఆంద్ర రాష్ట్రం లో 1960లో పుట్టి న మండవ సురేంద్ర బాబు తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ పట్టభద్రులై ,చండీ గడ్ లోని సెమి కండక్టర్ కాంప్లెక్స్ లో ఉద్యోగం లో 1983లో చేరి మూడేళ్ళు పని చేస్తూ పరిశోధన రంగం లో అడుగుపెట్టారు .సెమి కండక్టర్ పరిశోధనలో 17 ఏళ్ళ విశేష అనుభవం పొంది సిర్రజ్ లాజిక్ సంస్థలో ఇంటిగ్రేటెడ్ చీఫ్ డిజైనింగ్ పని చేస్తూ ,డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ తయారీ  విభాగ మేనేజర్ అయ్యారు .జిలాగ్ సంస్థలో ఆయన చేసిన పరిదోధనలకు మూడు పేటెంట్ లు పొందారు .

 కెనడాలో పిహెచ్ డి పొంది ,అట్టావాలో బెల్ నార్తాన్ రిసెర్చ్ సంస్థలో   చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ పదవి పొంది  కెనడాలోని మాట్రాక్స్ సంస్థ నుండి ‘’చిప్ మేకర్ ‘’మొదలైన గౌరవ పురస్కారాలెన్నో అందుకొని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్నునిగా గుర్తింపు ను అందుకొన్నారు .

   1997లో  సిర్రజ్ లాజిక్స్ సంస్థను వదిలి ,మరో ఇద్దరు శాస్త్ర వేత్తలతో కలిసి ‘’ సెంన్టిల్లం ‘’సంస్థను స్థాపించారు .ఈ కొత్త సంస్థ 2000 మే నాటికి పబ్లిక్ ఇస్స్యు లో మంచి పేరు పొందింది .బ్రాడ్ బాండ్ లో సురేంద్రబాబు గారికి, ఆయన సంస్థ సెంటిల్లం కు గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

image.png

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు- ప్రభాకర్,,అప్పారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు-  ప్రభాకర్,,అప్పారావు  –

బండారు ప్రభాకర్ ,ఎం.అప్పారావు లు ప్రవాస ఆంధ్రులు .ఎలెక్ట్రానిక్స్ దిగ్గజాలు .ఇద్దరూకలిసి ట్రాన్సిస్టర్ రూపకల్పన చేసి చరిత్ర సృష్టించారు .ప్రభాకర్ విజయవాడకు చెందినవాడు .హైదరాబాద్ వెళ్లి ఒక పబ్లిక్ స్కూల్ లో చదివి  ఖర్గపూర్ ఐ ఐ టి లో చదువు అయ్యాక అమెరికా లోని కాలిఫోర్నియాకుయూని వర్సిటి లో పదార్ధ విజ్ఞాన శాస్త్రం లో పిహెచ్ డి సాధించాడు  అదే యూని వర్సిటీ లో పని చేస్తూ y ఆకారం లో ఉండే నానో ట్యూబుల విద్యుత్ ధర్మాలను గుర్తించే అనేక పరిశోధనలుచేశాడు .ఆ పరిశోధనా ఫలితం గా కొత్త సాధనాలు రూపొందించాడు .

  ఎం.అప్పారావు కూడా ఆంధ్రుడే .ఇక్కడ చదువు పూర్తి చేసి ముంబై యూని వర్సిటి లో ఉన్నత విద్య తర్వాత అమెరికా  వెళ్లి కెంటకి యూని వర్సిటి నుంచి పిహెచ డి పొందాడు . .మాసా చూసేట్స్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా చేరి పని చేస్తున్నాడు .సౌత్ కారోలీనా లోని   ఈక్లెమెన్స్ యూని వర్సిటి లో ఎన్నో పరిశోధనలు చేశాడు .

  కాలిఫోర్నియాలోని ప్రభాకర్ ,సౌత్ కరోలీనా లోని అప్పారావు కలిసి ఒక గ్రాడ్యుయేట్ విద్యార్ధిని సాయంగా పెట్ట్టుకొని  ‘’నానో టెక్నాలజీ ‘’లో గొప్ప కృషి,పరిశోధన  చేశారు.ప్రపంచం లోనే అతి చిన్నదైన ట్రాన్సిస్టర్ ని నానో ట్యూబ్ లతో తయారు చేసి ప్రపంచాన్ని నివ్వెర పోయేట్లు చేశారు .నానో ట్యూబులు వెంట్రుక  కన్నా సన్నంగా ఉంటాయి .దీని నిర్మాణంతో ‘’అల్ట్రా మినియేచర్  ఎలక్ట్రానిక్ ‘’పరికరాల తయారీకి మార్గం సుగమమైంది .వై ఆకార నానో ట్యూబులతో తయారైన ఈ బుల్లి  ట్రాన్సిస్టర్ కు సంబంధించిన వివరాలు విశేషాలను ఈ జంట శాస్త్ర వేత్తలు 2005 సెప్టెంబర్ ‘’నేచర్ మెటీరియల్స్ ‘’మాసపత్రికలో ప్రచురించారు .

  సాధారణంగా ట్రాన్సిస్టర్ సైజు తగ్గినకొద్దీ  వాటిలో వాడే చిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది .కానీ నానో టెక్నాలజీ తో తయారైన ఈ ట్రాన్సిస్టర్ అనూహ్య రూపం లో అతి సూక్ష్మ౦గా  ఉండటమే కాక అత్యంత సమర్ధవంతంగా పని చేసింది .ఈ జంట ప్రవాసాంధ్ర శాస్త్రవేత్తలు ‘’ఐరన్ –టైటానియం ‘’రేణువుల కోసం ప్రత్యెక తరహా రసాయనాలు వాడి ,వినూత్న నానో ట్రాన్సిస్టర్లు   తయారు చేసి ,ప్రపంచం లో ఎలెక్ట్రానిక్స్ దశను, దిశనూ మార్చి అభి వృద్ధిలో మార్గ దర్శుకు లయ్యారు .వీరిద్దరూ ఆంధ్రులవటం మనకు గర్వకారణం .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

   సశేషం

image.pngimage.png

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -28-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ సోపానాలు నిర్మల -ఇక ప్రశాంత లోకానికి

 
 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment