శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నమస్తే గోపాల కృష్ణగారు -10-1-19 గురువారం మీ 84 వ జన్మదినోత్సవం సందర్భంగా  మాకుటుంబ సభ్యులు సరసభారతి  తరఫున మీకు హార్దిక శుభా కాంక్షలు అందజేస్తున్నాము .శతాధిక ఆయుస్సు తో  ఆరోగ్యంగా జీవించి  మా అందరికి స్ఫూర్తి ,ప్రేరణ కలిగించాలని కోరుకొంటున్నాము .మీకూ మీ కుటుంబానికి 2019 నూతన సంవత్సర  మరియు సంక్రాంతి శుభా కాంక్షలు . మనమధ్య ఈ సాహితీ బంధం ,స్నేహ సౌభాగ్యం కలకాలం వర్ధిల్లాలని భావిస్తాను -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

1856-1915

జననము: 1856. నిధనము: 1915. జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వెలనాటి వైదికులు. గౌతమగోత్రీయులు. తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యాన ప్రబంధకర్త వారణాసి వేంకటేశ్వరకవి యీయనకు మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు. కవికర్తృక గ్రంథములు: కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు). చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము). శంబరాసుర విజయము (సంస్కృత చంపువు). శివరామశతకము (ద్వ్యర్థి. ఆముద్రితము) ముక్తావళి (మదాలస కథగల సంస్కృతాంధ్ర నాటకములు-) మల్లిక (నవల-అముద్రితము) అహోబల పండితీయ వ్యాఖ్య- లఘుకౌముది (ఆంధ్ర టీక) జగన్నాథక్షేత్ర మహాత్మ్యము, శ్రావణ మహోత్సవ తారావళి – ఇత్యాదులు.

తిరుపతివేంకటకవులు ‘భద్రాద్రిరామకరుణ యున్నచో మాకు లోపముండ’దని యొక నమస్కారబాణము విసిరికాని పిఠాపురములో నవధానమునారంభింపలేదు. సిద్ధాంతకౌముదికి బాఠము వ్యాఖ్యానవిశేషముల గ్రోడీకరించి చెప్పువారిలో నాడు భద్రాద్రిరామశాస్త్రిగారు ప్రోడలు. “కౌముది యది కంఠస్థా వృథా భాష్యే పరిశ్రమ:” అనుసూక్తి వీరిపట్ల సముచితముగ సమన్వయించును. ఈయన వినయసంపద పాండిత్యమును మించినది. కర్మాచరణము కవితాపాటనమును డాటినది. బ్రాహ్మముహూర్తమున లేచి సచ్చాత్రుడై పిఠాపురములో బాద గయాక్షేత్రమునకు బోయి స్నానసంధ్యాదులు కావించి, కుక్కుటేశ్వర దర్శనము చేసి వచ్చి యింట గూర్చుండి విద్యార్థులకు బాఠములు చెప్పుకొనుచు సూర్యాలోకము లేకుండ జీవయాత్ర సాగించినధన్యుడీయన. ఆలంకారగ్రంథము లాయన పెక్కుమందికి బాఠము చెప్పెను. కాని యాయనశిష్యులుమాత్ర మలంకారవిద్యార్థులు కారు. పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు భద్రాద్రిరామశాస్త్రిగారి శిష్యులు.

శాస్త్రిగారు తమయిర్వదవయేట ‘కాళిందీపరిణయ’ ప్రబంధము రచించిరి. మచ్చున కీపద్యములు తిలకింపుడు.

కాయచ్చాయల వెల్వరించు వలిపెన్ గాటంపు నీరెండ గెం

జాయల్ పూనగదమ్మలంబు బటవాసద్రవ్యముల్ గంధ చ

ర్చాయుక్తిం బలుతావు లీన సఖిహస్తం బూని వాహ్యాళికై

సాయంవేళల వత్తురందు దరుణుల్ జానొప్ప బూదోటలన్.

వలరాజు తనదుపనులన్

మెలగింపం జెందకుండ నేర్పున దారిన్

వలవైచి పట్టె ననగా

దిలకింపం దగిరి దోమ తెరమంచములన్.

శంతనూపాఖ్యానము 32 వ సంవత్సరమున సంతరించిరి. అది చక్కని ప్రబంధము. ఈకవివరుడు కేవల ప్రాచీనకవితా ధోరణికలవాడేగాక నవీనపథమున గబ్బము లల్లుమేధావి కూడను. వీరి ‘చిత్రసీమ’ కావ్యము పరికించిన నిది స్పష్టపడును. చిత్రసీమ కళాపూర్ణోదయమును బోలు కల్పితకావ్యము. ఇందు గృత్యాద్యవస్థ లేదు. ఇదిక్రొత్తపద్ధతి. “కల దొక రాచకూతురు..” అని కావ్యము నుపక్రమించినారు. ఇందలి యాశ్వాసములకు దళము లనిపేరు. అవియు ద్వితీయదళము మొదలుకొని యారంభింప బడినవి. తత్కారణము గ్రంథములో విశదమగును. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’ యనుచొప్పున నాది మధ్యాంతములందు గృతినాయకుని స్తుతించుపద్యములు రచించె. ఆపద్యములు కేవలషష్ట్యంతములు గాక ద్వితీయాద్యంతములుగా వ్రాయుట మఱియు నూతనత. ఆపద్యములలో భూతభావికథలు సూచితములు. ఈకావ్యములో గార్యముముందును, గార ణము వెనుకను కన్పించుటచే జదువుట కింపు పుట్టించుచుండును. ఇందు నాయకుడు చిత్రసీమ ఈపేరులో నొకవిచిత్రము. సీమ నకారాంతము, ఆకారాంతము కూడ నుండుటచే స్త్రీత్వపుంస్త్వవ్యవహారముల కీపేరే యుపయోగించెను. ఇది యవశ్యపఠనీయకావ్యము. తెలుగుపలుకుబడి కొకమచ్చు.

క్రొవ్వుమెఱుంగుగ బ్బొలయు గుజ్జగుమేనులతోడ నోరగా

దువ్వి శిఖల్ లతల్ ముడిచి దొడ్డగు నిత్తడిపోగులం జెవుల్

గవ్వల పేరుల న్నుదురుగప్పగ వంకరబొట్లు దిద్ది పై

గువ్వలవన్నె చేలమిడి కొందఱు చెంచులు వచ్చి కొంకుచున్.

చిత్రసీమ. —–

తెలుగుననేకాక సంస్కృతమునను వీరి కవితాధార ధారావాహిని. వీరి ‘శంబరాసురవిజయచంపువు’ చదివితీరవలయును. అందలి కవిత్వ మిటులు ప్రహించును.

నిర్మంజీరస్వన మవచనం నన్న కాంచీనినాదం

పశ్చా దేత్య ప్రియతమదృశా వంబుజాక్షి సిధాయ

కాహం బ్రూహీ త్యభిహితవతీ కంకణానాం విరావై

ర్జాతా నద్య: పులకితలసద్గాత్రయష్టి ర్బభూవ.

వైదార్భ్యాదినురీతి శ్చైకావళ్యాద్యలంకృతిప్రఖ్యా

నుకుమారత్వాదిగుణా రసికమనో హరతు కాన్యకన్యా మే.

పరమనైష్ఠికుడై, పండితశ్రేష్ఠుడై, కవిగరిష్ఠుడై చనిన భద్రాద్రిరామశాస్త్రిగారి కృతులు చిరకాలము తెలుగుపుడమి నిలువగలవనుటకు సందేహములేదు. పోతనవలె, కూచిమంచి కవివలె దనకృతులు భగవచ్చిహ్నితము లొనర్చిన మహావుణ్యు డీయన. ఈకవి తనవిషయమును శ్రీరామస్తవమున లగింపజేసి వ్రాసిన యీపద్యము చూడుడు; బాల్యంబున గవిత్వపటిమ చూవ నొనర్చె

మృదులకాళిందీ పరిణయకృతిని

సంస్కృతకవితోరుసామర్థ్య మెఱిగింప

విరచించె శంబరానురవిజయము

శబ్దార్థముఖచిత్ర సరణికై శంతనూ

పాఖ్యాన నామకావ్యం బొనర్చె

రూపకకవితను జూప ముక్తావళి

రచియించె సంస్కృతాంధ్రములయందు

కల్పితకథాపటిష్టత దెల్ప జిత్ర

సీమ గల్పించె మఱియును జేసె బెక్కు

లెట్టి కవితను నిర్మింపనేని దగడె

రామపదనేవి భద్రాద్రిరామశాస్త్రి.

శాస్త్రిగారు ముక్తావళి యనునాటకము తెనుగుభాషలోను, సంస్కృతభాషలోను రచించుట మెచ్చదగినది. తెనుగు ముక్తావళిలోని పద్యములు ముత్యములు.

చ. పడకొదవంగ గొంచెముగ వంగిన గాత్రమునందు వన్నక

ప్పడమును గ్రమ్మి పెన్విరహభారముచేత గృశత్వమంది యి

ప్పడతున్ గ్రీష్మమేగుతఱి వారిదగర్భమునందుగోన వ

చ్చెడు తొలిమించుపోల్కి గడుచిక్కియు గన్నులపండు

వయ్యెడున్.

— ఆధారం -శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ”ఆంద్ర రచయితలు )

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931)

జీవిత విశేషాలు
బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం నందలి రమాధీర సంస్కృత కళాశాలలో గురుకులపద్ధతిలో ముడెగుర్తి వి.ఎస్.ఎన్.శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేసారు. ఆయన భాషాప్రవీణ, సాహిత్యాచార్య, పురాణశాస్త్రి అర్హతలను సాధించారు. ఆంధ్ర సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేసారు[1]. వీరు చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితిని స్థాపించి ఎన్నో సాహితీ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య సంస్కృత పాఠశాల స్థాపించి ఎందరికో సంస్కృత బోధన గావించి, విద్యాదానం చేశారు. దాదాపు అర్ధ శతాబ్ది కాలం పురాణ ప్రవచనములు చేసిన పండిత ప్రకాండులు వీరు. కవిగా ప్రబంధ కర్తగా బహు ప్రసిద్ధి వహించారు. ధవళేశ్వర స్తోత్ర సుధ, శ్రీదేవి లీలాసుధ, ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర, ధృవోపాఖ్యానము, కామేశ్వర స్తోత్రసుధ, శ్రీగణేశాభ్యుదయం, శ్రీమదభీష్టద రామాయణము జగన్నాథ స్తోత్రసుధ, వేంకటేశ్వర నక్షకోమాల, భగవన్నుతి దండకమాల, నేనెవడు?, శ్రీసుబ్రహ్మణ్య సీసపద్య శతకము, నిరాలంబోపనిషత్,సుబ్రహ్మణ్య ‘సకార ‘ సహస్రం, వంటి గ్రంథాలను రచించారు.

ఈ మహనీయుని పాండిత్య కవిత్వాలు సుబ్రహ్మణ్యాంకితాలై వారి యోగసాధనకు రూపాలై ఉన్నాయి. అరుదైన పురాణాంశాలను శోధించి వాటిని పరతత్త్వంతో సమన్వయించడం వారి సరణి. స్కందోపాసకులైన వీరు నిష్కపట భక్తితో కూడిన జ్ఞాని. వీరి రచనలు ఆర్షతేజోవిరాజితాలు. సాధారణంగా హరికథల్లో వాడే “తొహరా” అనే రగడ వంటి దేశీయ వృత్తాలతో బ్రహ్మవైవర్త పురాణాంతర్గత బ్రహ్మఖండ ప్రకృతి ఖండాలను రచించారు. “దేవీభాగవతం” అనే ఒక అరుదైన ప్రాచీన గ్రంథాన్ని (సాధారణంగా లభిస్తున్నదేవీభాగవతానికి విభిన్నమైన) అదే వృత్తంతో “దేవీలీలాసుధ” పేరుతో రచించారు. ఇవి బృహత్ గ్రంథాలు. థర్మ వేదాంతశాస్త్ర చర్చ చేసిన గ్రంథాలు నేనెవడను?”, “తత్త్వదర్శిని కామేశ్వర స్తోత్ర సుధ, నిరాలంబోపనిషత్ ప్రశ్నోత్తర గర్భితంగా రచించిన సుబ్రహ్మణ్యసీస పద్య శతకం, ధవళేశ్వర స్తుతి, జగన్నాథ నక్షత్రమాల వంటి గ్రంథాలు ఆర్ష విజ్ఞానాన్ని ఛందోబద్ధంగా అందించిన రచనలు. ఋషిధర్మ సముపాసనతోనే ప్రతిక్షణం ఒక జ్ఞాన దీప్తిగా వెలిగిన వారి భావన నుండి వెలువడిన మరొక పద్యగద్యాత్మిక కావ్యం శ్రీమదభీష్టద రామాయణము” వాల్మీకి, అధ్యాత్మ రామాయణాలనే కాకుండా బహుపురాణాల, మంత్రశాస్త్రాల సమన్వితంగా సంపూర్ల రామాయణాన్ని రచించారు. వీరి ప్రతి రచనా తన అభీష్టదైవమైన కుమారస్వామి వచరణాలకు అర్పించుకున్నారు. జీవితంలో ఆటుపోట్ల ఎన్ని ఎదురైనా తన ప్రతిభావ్యత్పత్తులకు తగిన రాణింపరాకున్నా అధ్యాత్మ విద్యా సంస్కారంతో హిమశైల సమాన ధీరగుణంతో నిలచిన పరిపూర్ఖులు వీరు. ఆబాల్యం వీరి వైఖరిని గమనించడమే సాధనగా విరిసిన ఆధ్యాత్మిక తేజో విలాసమే “ఆర్షధర్మోపన్యాసకేసరి”.

ఆయనకు ఫిబ్రవరి 10,2008 న విశాఖపట్నం లో స్వర్ణకంకణం యిచ్చి సత్కరించారు.[2]

వ్యక్తిగత జీవితం
సామవేదం నరసింహాచార్యులు(తండ్రి), సత్యవతి (తల్లి) దంపతులకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమారుడు సామవేదం రామమూర్తిశర్మ. రామమూర్తిశర్మ మూడవ కుమారుడు “సామవేదం సత్యనరసింహశర్మ”[3]. మరొక కుమారుడు సామవేదం షణ్ముఖశర్మ ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.

రచనలు
· “శ్రీ ధవళేశ్వర స్తోత్ర సుధ”

· గణేశాభ్యుదయం [4]

· సశేషం

ఆధారం –వీకీపీడియ

మీ-గబ్బిత దుర్గాప్రసాద్ -10-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

 38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర  రచయిత్రుల సభ  జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ  కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియం లో నవనవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి సభా ప్రాంగణం లో ,’’మోహనవంశీ’’ నాదం తో , ఊహాగానం తో ,రామాయణ విష వృక్ష ఖండన ,లత రామాయణం వంటి ప్రసిద్ధ రచనలతో ఆంద్ర ప్రేక్షక జనాల హృదయ సీమల నేలిన ‘’లత ‘’గా కీర్తిపొందిన శ్రీమతి తెన్నేటి హేమలత వేదికపై ‘’అంగనా’’ రంగరంగ వైభవం తో జరగటం ,సముచితం  చారిత్రాత్మకం ,చిరస్మరణీయం .

             7-1-19 సోమవారం –రెండవ రోజు కార్యక్రమాలు

ఉదయం 10 గంటలకు కవి సమ్మేళనం తో రెండవ రోజు కార్యక్రమం ప్రారంభమైంది .అందుబాటులో ఉన్న కవయిత్రులు తమ కవితలను చదివి రక్తి కట్టించారు .తర్వాత నాల్గవ సదస్సు డా .చిల్లర భవానీదేవి ఆధ్వర్యం లో జరిగింది .శ్రీమతి మందరపు హైమవతి –స్త్రీ వాద రచయిత్రులు ,శ్రీమతి సి ఎస్ ఏం లక్ష్మి –మహిళలు –ఆధ్యాత్మికత ,శ్రీమతి కన్నెగంటి అనసూయ –మహిళ.బాల సాహిత్య వేత్తలు ,డా దేవులపల్లి పద్మజ –బాలికలపై అత్యాచారాలు – నివారణోపాయాలు,డా లీలా సుష్మ గుమ్మా –మహిళా –పోషకాహారం ,కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళలు –వ్యక్తిత్వవికాసం  లపై తమకున్న అనుభవాన్ని రంగరించి తలొక 7 నిమిషాలలో మాట్లాడారు .మహిళా బాల  సాహిత్య వేత్తలపై ప్రసంగించిన అనసూయగారు అందరి హృదయాలను దోచుకొన్నారు .దాదాపు మనకు తెలియని ఎన్నో విషయాలు ఆమె తెలిజెప్పి అందరి ప్రశంసలు అందుకొన్నారు .అందుకే అధ్యక్షతవహించిన భవానీ గారు  అనసూయగారి వ్యాసం తప్పకుండా పత్రికలో ప్రచురించి అందరికి అందుబాటు లోకి తేవాలని మంచి సూచన చేశారు .దివ్యా౦గు రాలు కుమారి నిఖిల మహిళా వ్యక్తిత్వం పై  పుస్తకాలు రాసింది .తన అంగవైకల్యాన్ని సవాలుగా తీసుకొని ఎదిగిన’’ స్వయం సిద్ధ ‘’అని పించింది .వేదిక నుంచి దిగగానే నేను ఆమెతో , ఆమె తల్లిగారితో మాట్లాడి  మార్చి 31 ఆదివారం సరసభారతి నిర్వహి౦చే ఉగాది వేడుకలో పాల్గొనమని ఆమెకు ఆరోజు ‘’స్వయం సిద్ధ’’ అవార్డ్ అందజేస్తామని  ఆహ్వానించాను . ఇద్దరూ తప్పక వస్తామని తెలిపారు వారి అడ్రస్ ఫోన్ నంబర్ కూడా తీసుకోన్నాను .ఆమె తండ్రిగారు విజయవాడలో గొప్ప మానసిక వైద్యులట. నిన్ననే ఆమెకు సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను .

   ఈ వేదికపైననే శ్రీమతి సూరెడ్డి శాంతాదేవి ,శ్రీమతి  ముంజులూరి కృష్ణకుమారి ,శ్రీమతి ఏ ఎల్ ఏం ప్రకాష్ కుమారి ,డా బళ్ళూరు ఉమాదేవి ,శ్రీమతి సింహాద్రి పద్మ ,శ్రీ మతి పి.అమరజ్యోతి (అనకాపల్లి )లకు వారి సాహిత్య సేవకుగాను సత్కారం చేశారు .

  అయిదవ సదస్సు ఉదయం 11-30కు డా తుర్లపాటి రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది .మహారాష్ట్రలో తెలుగు మహిళా ప్రగతి పై శ్రీమతి తురగా జయ శ్యామల ,బహిరంగ ప్రదేశాలలో మహిళలకు ప్రత్యెక సౌకర్యాలు పై శ్రీమతి నండూరి సుందరీ నాగమణి ,మహిళాలోక వ్యవహార జ్ఞానవశ్యకత పై శ్రీమతి మణి వడ్లమాని , మహిళా సాధికారత సవాళ్ళు  పై శ్రీమతి  అల్లూరి  గౌరీ లక్ష్మి ,హింస –మహిళ పై శ్రీమతి తాటికోల పద్మావతి ,తెలుగు భాషా సంస్కృతుల పరి రక్షణ –మహిళల పాత్ర -పై డా కొమాండూరి మారుతీకుమారి లు సామాజిక దృక్పధం ఉన్న ఈ  అంశాలపై బాగా  స్పందించి అనుభవాలను జోడించి మాట్లాడి ,అంశాలకు తగిన న్యాయం చేకూర్చారు .

  ఈ వేదికపై ప్రముఖ రచయిత్రులుశ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి ,శ్రీమతి తమ్మిన పరమాత్మ ,శ్రీమతి చివుకుల లక్ష్మి లను సన్మానించారు .

  మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన ఆరవ సదస్సు నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీమతి తేళ్ళ అరుణ అధ్యక్షతన జరిగింది .శ్రీమతి శిస్ట్లామాధవి ,శ్రీమతి ఎ.దుర్గా సుందరి ,శ్రేమతి గురజాడ  రాజరాజేశ్వరి ,శ్రీమతి పాతూరి అన్నపూర్ణ ,డా ఫై ఉష ,శ్రీమతి జి మేరీ కృపాబాయి వక్తలు- వరుసగా ఉద్యోగినుల సాధకబాధకాలు ,స్త్రీవాద సాహిత్యం –సామాజిక చైతన్యం ,గృహ నిర్వహణలో స్త్రీపాత్ర ,పిల్లలపోషణ –తల్లులపాత్ర ,పల్నాటి వీరగాథ లో మహిళామూర్తులు ,మహిళా ఆర్ధిక సాధికారికత అనే అంశాలపై ఆసక్తికరం గా మాట్లాడి న్యాయం చేశారు .

  మొత్తం మీద రెండు రోజులలో ఆరు సదస్సులు వివిధ అంశాలపై జరిగి ,మహిళలు తమ మనో భావాలను వ్యక్తపరచటానికి చక్కని వేదిక లభించి సార్ధకత చేకూరింది .ఈ వక్తల మాటలు వేదికకు మాత్రమె పరిమితం కాకుండా వారు వెలిబుచ్చిన భావాలను  క్రోడీకరించి ఒక సంకలనం గా ప్రభుత్వం తీసుకొని వస్తే తగిన ప్రయోజనం కలుగుతుంది .శ్రీ విజయభాస్కర్ దీనిపై చొరవ తీసుకోగలరని భావిస్తాను .

  మధ్యాహ్నం 2-30కు ‘’వనితా వైభవం ‘’సాహిత్య రూపకం ను డా వెలువోలు నాగరాజ్య లక్ష్మి నిర్వహణలో  జరిగింది  –కొన్ని పౌరాణిక ,కావ్యాలలోని ప్రముఖ పాత్రలను ,ప్రసిద్ధ రచయిత్రులు ఆ పాత్రల పోషణ చేసి ,పాత్రల ద్వారా వారి వ్యక్తిత్వాలను ఆవిష్కరింప జేశారు .దమయంతి పాత్రను డా తాడేపల్లి వీరలక్ష్మి ,ద్రౌపదిగా డా కావూరు సత్యవతి ,వరూధినిగా డా .మైలవరపు లలిత కుమారి ,సత్యభామగా –శ్రీమతి ఎన్.సిహెచ్ మైథిలి నటించి మెప్పించారు .ముప్పావుగంట సేపు జరిగిన రూపకం ఆసక్తికరంగా సాగింది .

మధ్యాహ్నం 3-15కు చివరి కవి సమ్మేళనం శ్రీ మతికోడూరు సుమన ,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ,శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి ,శ్రీమతి ములుగు మైథిలి ,శ్రీమతి జి పద్మకళ ల నిర్వహణలో జరిగి అర్ధవంతమైన కవితలతో సార్ధకత చేకూరింది .

  సాయంత్రం 4-30కు రొటీన్ గా జరిగిన  సమాపనోత్సవం తో రెండు రోజుల రచయిత్రుల సదస్సు సమాప్తమైంది .

  రెండు రోజుల ఈ సదస్సుకు  జిల్లా రచయితల సంఘం ,శారదా స్రవంతి ,సరసభారతి సభ్యులు సభా నిర్వహణకు విశేషంగా తోడ్పడ్డారు .

  ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ రచయిత్రులు తమ రచనా విశేషాలను పాత్రికేయులకు తెలియజేశారు .శ్రీమతి చిల్లర భవానీదేవి 1980తర్వాత స్త్రీ సాహిత్యం ఎక్కువగా వచ్చిందని ,ఇప్పుడు ఆంక్షలు లేవని బాలసాహిత్యం పిల్లల మానసిక వ్యక్తిత్వ వికాసాలకు తగిన పుస్తకాలు రావాలని ,తానూ యాభై ఏళ్ళుగా రచన చేస్తున్నానని 40పుస్తకాలు రాసి ప్రచురించానని చెప్పారు . శ్రీమతి యలవర్తి అనూరాధ –పద్యం తప్ప అన్ని ప్రక్రియలో రచన చేశానని దాదాపు వెయ్యి ప్రచురణలు తనవి ఉన్నాయని, 50కి పైగా అవార్డ్ లు పొందానని ,ఇలాంటి సభలలో ఎంతోమంది మేధావులతో గడిపే అదృష్టం కలుగుతు౦దని, దీనితో జ్ఞాన సంపద పెరుగుతుందని అన్నారు శ్రీ మతి కన్నెగంటి అనసూయ –బాల సాహిత్యం లో మహిళల కృషి తక్కువే అని ,శ్రీమతి రావి శారద దీనిలో బాగా కృషి చేస్తున్నారని తెలుగు  బాలకధలు  ఇతరభాషల లోకి అనువాదం పొందాలని, తాను  300 బాలకథలను రాశానని ,ఈ ఏడాది 150బాలకథలు రాయాలన్నది తన లక్ష్యమని తెలియ జేశారు .శ్రీమతి కోడూరి సుమన-తాను సంగీత సాహిత్య నాట్య రంగాలలో కృషి చేస్తున్నానని ,స్త్రీలు ఎంచుకున్న రంగాలలో ముందుకు వెళ్ళాలంటే కుటుంబ ప్రోత్సాహం చాలా అవసరమని ,మహిళలు ఐకమత్యంగా ఒకే అవగాహనతో కలిసి పనిచేస్తే సాధించలేనిది ఉండదని భరోసాగా చెప్పారు . దివ్యా౦గు రాలు, ఉపాధ్యాయిని శ్రీమతి పెండ్యాల గాయత్రి – బ్రెయిలీ లిపి తో తనవిద్య సాగిందని ,తెలుగులో ఎం .ఏ చేసి ,బిఎడ్అయ్యానని ,సామాజికాంశాలు స్త్రీ వైకల్యం పై రచనలు చేశానని, స్త్రీ అభి వృద్ధికి మానసిక ప్రోత్సాహం చాలా అవసరమని ,రచయితలు   సామాజక  నిర్మాతలని ,వర్తమానం తో పాటు భవిష్యత్తును చూపించగల దిక్సూచులని గొప్ప అభిప్రాయాలను వెల్లడించారు .

  సభలలో సరిగమలు –

1-రెండు రోజులు జరిగిన సదస్సులో ‘’ఆంద్ర ప్రదేశ్ స్త్రీ రచయితల సంఘం’’ రూపు దాల్చకపోవటం దానికి కార్యవర్గం ఏర్పాటు చేసుకోకపోవటం పెద్ద వెలితి అనిపించింది .

2-సన్మానిత రచయిత్రులను క్లుప్తంగా తగిన విధంగా పరిచయం చేయటం అద్భుతః అని పించింది .

3- సన్మానితుల ప్రతిస్పందనా దీనికి తగినట్లే ఉండటం హాయి అనిపించింది ‘

4-రెండు రోజులూ ఒకే రకమైన టిఫిన్ పెట్టినా రుచిగా ఉండటం వలన ఇబ్బ౦ది కలగలేదు .అయితే’’ కాఫీగత ప్రాణులకు’’ఉదయం కాఫీ లేకపోవటం బాధాకరమే . ఉన్నా కాసేపు ఇచ్చినట్లు, అయిపోయి౦దని చెప్పినట్లు,తర్వాత వచ్చిన టీ కూడా మూడు నిమిషాలముచ్చటే అయిందని చాలా మంది  అన్నారు  .

5-రెండు రోజులలో భోజనాలలో వెరైటీ మెయింటేన్ చేసి  తృప్తి కలిగించటం మెచ్చదగిన విషయం .

6-ఎంతసేపూ మాట్లాడటం, వినటం తప్ప వేరే రకపు ఆకర్షణ లేక పోవటం బాధాకరం .ఎలెక్ట్రానిక్ మీడియా ను చక్కగా ఉపయోగించు కొని కొందరు ప్రసిద్ధ రచయిత్రుల  ఫోటోలను వేదికపై ఉన్న తెరపై ప్రదర్శిస్తే   ఎంతో ఆకర్షణీయంగా ఉండేది .వారి స్వరాలు ఆడియో ద్వారా వినిపించి ఉంటె సార్ధకత కలిగేది .వారి ఇంటర్వ్యులలో అవసరభాగాలు  చూపిస్తే ఆసక్తిగా ఉండేది .అసలా వైపు  ఆలొచన చేసినట్లే లేదు .

7-పురస్కారాలు పొందినవారు చాలాసార్లు పొందినవారే .కొత్తవారికీ ఇచ్చి ఉంటె బాగుండేదని సామాన్యుడి సణుగుడు వినిపించింది .

8-ఎంతో దూరభారలనుండి సభలకు వచ్చిన వారిని శాలువా  జ్ఞాపికలతో మాత్రమే  సత్కరించటం  నిరుత్సాహ పరచింది .కనీసం వెయ్యి నూట పదాహార్లు అయినా వారికి నగదు బహుమతి ఇచ్చి ఉంటె ఘనంగా జరిపినట్లు ఉండేది.

9-సభమీద సభ ఓవర్ లాప్ అవటం తో  సభ దారి సభది,  భోజనాల దారి భోజనాలది కబుర్లదారి కబుర్లది  అయి, ప్రేక్షకుల కొరత స్పస్టంగా కనిపించింది .

10-కవి సమ్మేళనాలు ఆసక్తిగా లేవు అని శ్రీ కొంపెల్ల శర్మగారి లాంటి పెద్దలు  అభిప్రాయ పడ్డారు .ఉత్సాహం మంచిదే కాని పదార్ధమూ ఉండాలి కదా .

11-కనీసం 1500మంది ప్రతిధులు హాజరవటం సంతోషదాయకం ,ప్రోత్సాహకరం కూడా .రచయిత్రుల  తోపాటు వారి కుటుంబ సభ్యులూ హాజరవటం మెచ్చదగిన విషయం .

12-తమ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా  ,ఈ రెండు రోజుల సభల ఏర్పాట్లు ,వివిదాంశాల వాటికి తగిన వక్తల ఎంపిక చేసి అన్ని కోణాలలో అంశాలను రాబట్టటానికి ఎన్నో నెలలుగా తీవ్ర కృషి చేసిన శ్రీ  గుత్తికొండ  సుబ్బారావు ,డా పూర్ణ చ౦ద్ ల ను ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది .ఇలాంటి సభలకోసమే వారు కారణ జన్ము లయ్యారా అని పిస్తుంది .

12- ఈ సభల అనుభవం మళ్ళీ జరిగే సభలకు ప్రేరణ స్పూర్తి నివ్వాలని కోరుతూ ,నిర్వహించిన ,పాల్గొన్న వారందరినీ మనసారా అభి నందిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం, సమీక్ష | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ  శంకర నారాయణగారి గ్రంథాల బహూకరణ 

ప్రసిద్ధ చిత్రకారులు ,చిత్ర దర్శకులు శ్రీ బాపు గారి తమ్ముడు,ప్రముఖ చిత్రకారులు ,రచయిత శ్రీ శంకర నారాయణ గారు తాము  రచించిన ,అపూర్వ రస లేఖలు లాంటి 3 చిత్ర గ్రంధాలు  ఉయ్యూరు ఎసి లైబ్రరీకి సరసభారతి చేతుల మీదుగా  ప్రదానం చేయమని  నాకు నిన్న పంపగా ,ఈరోజు 8-1-19 బుధవారం లైబ్రేరియన్ శ్రీ కృష్ణారావు గారికి అందజేసిన ఫోటోలు-దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల

 

విజయవాడలో రెండవ రోజు రచయిత్రుల సభలో వ్యక్తిత్వ వికాశం పై రచనలు చేసి,సన్మానింపబడిన  దివ్యా0గురాలు కుమారి చలామల శెట్టి నిఖిల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక

https://plus.google.com/photos/115752370674452071762/album/6643344136982043649/6643344147643546258?authkey=CLHR2q3R3I-olQE

 

డా శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారితో నేను -6-1-19 ఆదివారంవిజయవాడ రచయిత్రుల సభలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949)

1880లో  గోదావరి జిల్లా కాకరపర్రు లో చర్ల భాస్కర శాస్త్రి జన్మించారు తండ్రి చర్ల  వెంకట శాస్త్రి .ఆరామ ద్రావిడ శాఖకు చెందినవారు .వీరిది లోహితస గోత్రం .చర్ల గణపతి శాస్త్రిగారికి బంధువులు .

 భాష్యకార శాస్త్రి గొప్ప సంస్కృత పండితులు .కనీసం 10 వేలమంది శిష్యులకు ఎలాంటి ప్రతి ఫలాపేక్షా లేకుండా విద్యాదానం చేసిన మహనీయులు .సంస్కృత౦ లో  గొప్ప గ్రంథ రచన చేశారు . –మేకాదీశ శబ్దార్ధ కల్ప తరుః,అనే అలంకార శాస్త్రం ,వర్ణమాల శివ స్తోత్రం చ ,శ్రీరామ విజయ వ్యాయోగః ,మేకధీశా రామాయణ మితిచ నామా౦తరే ,విజయ విలాసః (చరిత్ర గ్రంథ౦)సనాతన ధర్మ విజయ వ్యాయోగం వర్ణమాల రామాయణం ,మేకా ధీశా శబ్ద శత కోటి  ,కంకణ బంధ రామాయణం ,దండక రామాయణం రచించారు . కంకణ బంధం అనేది ఒక విచిత్ర కవితా ప్రక్రియ .69ఏళ్ళ వయసులో భాష్యకార శాస్త్రి 1949లో మరణించారు .

   వీరి గురించి తెలియ జేసినవారు వారి మనవలు శ్రీ చర్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ,అన్నగారు శ్రీ చర్ల భాస్కర రామ శాస్త్రి .ఇంతకంటే భాష్య కార శాస్త్రి గారి గురించి వివరాలు ఎవరి వద్ద ఉన్నా, పంపి వారి గురించి సమగ్రంగా రాయటానికి సహకరించమని మనవి .పూర్వం అన౦త సూరి ‘’రామ కృష్ణ విలోమ కావ్యం ‘’రాశాడు .ఇది 38 శ్లోకాల కావ్యం .ఇందులో మొదటి సగం ,రెండవ సగం లో వెనకనుంచి వస్తే మొదటి దానిలో రామకథరెండవ దానిలో కృష్ణకథ వస్తాయి . సర్కారు జిల్లాలకు చెందిన కృష్ణ మురారి రాసిన ‘’కనక బంధం రామాయణం’’ లో 32 అక్షరాలను వలయాకారం లో అంటే కంకణం ఆకారం లో ఏర్పరచి ,ఏ అక్షరం నుంచైనా ఎడమనుంచి కుడికి ,కుడి నుంచి ఎడమకు చదివితే 62 శ్లోకాలేర్పడుతాయి .రామ కథ తెలియాలంటే దీనికి వ్యాఖ్యానం అవసరం .ఈకవి గౌరీ ,సర్వజ్ఞుల కుమారుడు .వసిష్ట గోత్రీకుడు .19వ శతాబ్ది కవి .

   ఈ కనక బంధాన్నే చర్ల భాష్యకార శాస్త్రి ఆధారంగా రామాయణం రాశారు .ఇందులో సంయుక్తాక్షరాలను విభజించి చదివితే 128 శ్లోకాల కావ్యం ఏర్పడుతుంది అని చక్కగా విశ్లేషించి చెప్పారు ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ ‘’లో శ్రీ ఎం.శ్రీనివాసాచార్ .

   సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -9 

ధ్వని కోణం లో మను చరిత్ర –9

 మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని  వర్ణిస్తూ  పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో  చీకటులు ముసిరిన వెంటనే  ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని  చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు విజ్రు౦భి౦చాడని ధ్వని. ఇది వాక్య జ్యోతకమైన వస్తు ధ్వని .’’వలపుల పల్లవుం డొకడు వట్టి చలంబున నేప దీనయై-యలుకలు దీర్చి దీర్చి ‘’అనే స్వరోచిని ఏనుగు పై ఊరేగించే టప్పుడు,పౌరా౦గనలు  కుతూహలం ఆపుకోలేక చేసే విలాస చేష్టలను వర్ణించే పద్యం .ఇక్కడ అతని లోకోత్తర సౌందర్యం  ధ్వని స్తోంది .దీన్ని ప్రబంధ జ్యోత్య ధ్వని అంటారు శాస్త్రిగారు .సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ చెప్పిన ‘’వికసిల్లం బ్రజ చక్రపాలనము గావి౦ చెం,గార వ్యావృతి౦ ‘’పద్యం లో సూర్యుడికి రాజుకు ఉపమాన ఉపమేయ భావం కల్పించటం చేత ఉపమాలంకార ధ్వని ఏర్పడిందని ,ఇందులో చక్రవాకం అనే పదాన్ని తీసేస్తే అర్ధ స్పూర్తి రాదనీ కనుక ఇది శబ్ద శక్తి మూల ధ్వని అని తేల్చారు డా  శాస్త్రి గారు .

  ‘’అచటి విప్రులు మెచ్చ రఖిల విద్యాప్రౌఢి-ముదిమది దప్పిన మొదటి వేల్పు ‘’సీసపద్యం లో అతి శయోక్తి అలంకారాలు దట్టించాడు కవి .అక్కడి క్షత్రియులు ఇతర దేశ క్షత్రియులకంటే గొప్పవారని ఉత్కర్ష పర్యవసాయక మగు వ్యతిరేకము ధ్వనిస్తోంది .కనుక ఇక్కడ అల౦కారం చే వచ్చేఅలంకార ధ్వని .’’ఉరు దరీ కుహర సుప్తోత్ద శార్దూలముల్ –ఝరవారి,శోణిత శంక ద్రావ’’పద్యంలో  సూర్యాస్తమయ వర్ణన ఉంది .శార్దూలాలకు శోణిత భ్రాంతి ,మృగాలకు దావ పావక భీతి ,ముని జనులకు కాషాయ భ్రాంతి ,దేవతలకు హేమాద్రి భ్రాంతి కలిపించటం చేత ఇదంతా భ్రాంతి మదలంకార స౦సృష్టిధ్వని .పర్యాయ అలంకారం  ధ్వనిస్తోంది .ఒకేవస్తువు అనేక చోట్ల ఉంటె పర్యాయాలంకారం .మొత్తం మీద ఇందులో కవి ప్రౌఢోక్తి వలన ఏర్పడిన అర్ధ శక్తి మూలక అల౦కార ధ్వని .’’దట్టంపు నీకట్టినట్టి చెంగావికి –బాగుగా లేదని కేల బయట నిమిరె-గోరంబో గోళ్ళ నిక్కువపు  గె౦పో?యని –  చెయిపట్టి నయమున సెజ్జ సేర్చె’’పద్యంలో  మనోరమ ఆలంబ విభావం .ఆమె అతిలోక సౌ౦దర్యలావణ్యాలు ,ఏకాంత ప్రదేశం ఉద్దీపన విభావాలు ,సెజ్జ చేర్చటం ,చెయ్యి పట్టుకోవటం,అధరాస్వాదనం ,  ఆశ్లేషించటం   అనుభావాలు వలన మనోరమపై స్వరోచికి రతి భావం కలిగింది కనుక ఇక్కడ సంభోగ శృంగార ధ్వని ఉందని శాస్త్రి గారి ఉవాచ .’’అక్కట !వాడు నాతగుల మారడి సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచి పోయె,దరి జేరగ రాని,వియోగ సాగరం ‘’లో ప్రవరుని చేత తిరస్కృత అయిన వరూధిని ఆత్మనింద ఉంది .అతనిపై ఆమెకున్న రతి కోరిక వ్యన్జనమైంది .కనుక ఇది విప్రలంభ శృంగార రస ధ్వని అని తేల్చారు ..రాక్షసుడు మనోరమ వెంటపడగా ఆక్రోశిస్తూ ఆమె ‘’ఆ విపినా౦తరమున హా –హా వనిత ననాథ,నబల ,నార్త’,విపన్నం’’చెప్పిన కంద పద్యం లో శాస్త్రిగారికి ‘’దయానక ధ్వని ‘’కనిపించింది .దేవాసి అనే గంధర్వుడు పారర్షిని ‘’పోపో విప్రాధమ ‘’మొదలైన తిట్ల దండకం చదవటం లో అతని ఉగ్రతభావం ధ్వనిస్తోందికనుక ‘’నీ వైశిష్ట్యము ,తిట్టులన్ ,మేరయునే నీకంటే’’పద్యం లో భావ ధ్వని ఉందంటారు శాస్త్రీజీ .

  మనోరమ యెడల జీర్ణ ముని చూపిన అమానుషత్వాన్ని చెప్పే –‘’జననాథ !ఏమి చెప్పుదు— తన చేతి నాగబెత్తము గొని –పసరము గొట్టినట్లు గొట్టె నదయుడై ‘’లో స్త్రీపట్ల అంతటి క్రోధం చూపటం అనుచితమని  రౌద్రరసాభాసం కనిపిస్తోందికనుక ఇక్కడ రౌద్ర రసాభాస ధ్వని ఉందని చెప్పారు డా .కోరిడే   ‘’అంతట బ్రాచి నిశాపతి ‘’అనే కంద౦ లోనూ ,ఈ చందమే ఉందన్నారు .‘’అనిన బ్రసన్నుడై  ,ముని కరాబ్జములన్ నను నెత్తి వత్స !మ-త్సునిశిత శాప శూల హతి స్రుక్కితిగా’’పద్యం లో  బ్రహ్మ మిత్రుడు  తన్ను శరణు కోరిన ఇందీవరాక్షు ని అనుగ్రహించే సందర్భం లో భావ శాంతి ధ్వని ఉందన్నారు .’’తెచ్చుటయు  కేళిభవనము –చొ చ్చెనొ,చొరదో యనంగ సుదతుల నీడంజొచ్చి ‘’పద్యం మనోరమ లజ్జ ,ప్రేమించిన వాడి అతిలోక సౌందర్యం ఆస్వాదించాలనే ఉత్కంఠ ఉన్నదికనుక ఇక్కడ భావ సంధి ధ్వని ఉందని విశ్లేషించారు .మాయ ప్రవరుని దగ్గరకు వెళ్ళేటప్పుడు-‘’తొలుదొల్త వాని గన్నుల గా౦చి నప్పుడ –పల్లవాధర గుండె జల్లుమనియె-నట రెండు మూడ౦ జల రుగు నప్పుడ కాళ్ళ –బంకజాక్షికి దొట్రు పాటు గదిరె’’’  సీసపద్యం లో ఆమె తడబాటు ,ఆనందం చెమటపట్టటం ,అతడి ముఖం చూసి పొందిన హర్షం  ఆన౦ద బాష్పాలు రాలటం మొదలైనవాటిలో ‘’భావ శబలతా ధ్వని ‘’ ఉందని పసిగట్టారు శ్రీ రాజన్న కవి శేఖర ఆలంకారిక మహోదయులు .

   సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006)

సాలగ్రామ కృష్ణ రామ చంద్రరావు 4-9-1925 న కర్నాటక లోని హసన్ లో జన్మించారు .చిన్నతనం బెంగుళూరు లో తాతగారి వద్ద గడిపారు .అక్కడే చదువు ప్రారంభించి, సంస్కృతం ను మహా సంస్కృత విద్వాంసుడు అగ్నిహోత్రి విఠలాచార్ వద్ద నేర్వటం మొదలు పెట్టారు .వీరి వద్ద నేర్చిన సంస్కృతం గొప్ప పునాదిగా ఏర్పడి ,ఆతర్వాత ఎన్నో సంస్కృత రచనలు చేయటానికి దోహదపడింది .తాతగారి మరణం తర్వాత నంజన్ గూడ్ అనే చిన్న పట్టణం చేరి,తలిదంద్రులవద్ద ఉండి పోయారు .మైసూర్ వెళ్లి చదువు పూర్తి చేసి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు .పాళీ భాషనూ తరచి చూశారు .

  మొదట్లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రిసెర్చ్ అసిస్టెంట్ గా చేరి ,తర్వాత ఆల్ ఇండియా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్(N.I.M.H.A.N.S .) లో ఉద్యోగించారు.క్రమంగా పదోన్నతిపోంది 1965 నాటికి క్లినికల్ సైకాలజీ హెడ్ అయ్యారు . ‘’నిమ్హాన్స్ ‘’లో పని చేస్తున్నప్పుడే ‘’ది డెవలప్ మెంట్ ఆఫ్ సైకలాజికల్ థాట్ ఇన్ ఇండియా ‘’అనే గొప్ప గ్రంథం రచించారు .Thematic Apperception Test’’(T.A.T.)కార్డ్ లకు భారతీయ అనువర్తనం (వెర్షన్ )చేశారు .వీటిని ఆధారంగా ప్రయోగాలు కూడా చేశారు .మానసిక శాస్త్రాన్ని బాగా ప్రభావితం చేసిన భారతీయ సైకాలజీ ని ‘’నిమ్ హాన్స్ ‘’కోర్సులో చేర్ఛి  సిలబస్ లో విప్లవాత్మక మార్పు తీసుకు రావటానికి  విశేష కృషి చేశారు.

 నిమ్ హాన్స్ ను 1965లో వదిలేసి  బెంగుళూరు లో అనేక విద్యా సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా, సైకాలజీ, ఇండాలజీ, ఫిలాసఫీ,విద్య , సోషల్ వర్క్  మొదలైన విషయాలను బోధించారు .తర్వాత కాలమంతా ప్రసంగాలు ,రచనా వ్యాసంగం ,ఇంటివద్ద విద్యార్ధులకు బోధనలతో గడిపారు .

  భారతీయత మూర్తీభవించిన  సాలగ్రామ సంస్కృత ,ఆంగ్లభాషలలో గొప్ప గ్రంథాలు రచించారు .అవన్నీ భారతీయ సంస్కృతీ, వేదాంతం,కళ,సంగీతం ,సాహిత్యం కు సంబంధించినవే .సంస్కృతం లో ఒకనాటకం రాశారు .ఆచార్య బుద్ధ ఘోషుడు రాసిన ’’విశుద్ధమాగ్గ ‘’కు పాలీభాష లో వ్యాఖ్యానం రచించారు .’’సుమంగత గాథ’’పై పాళీ భాషలో పరిశీలనాత్మక గ్రంథం రచించారు .ఎన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ,శ్రీ చక్ర ,ది యంత్రాస్ ,ఎన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ ఐకనోగ్రఫీ ,మంత్ర, తంత్ర, యంత్ర  ,తంత్రా సైకాలజీ ,సాలగ్రామ కోశ ,సోషల్ ఇన్ స్టి ట్యూషన్స్ అమాంగ్ ది హిందూస్,గణేశ మొదలైన పుస్తకాలు కూడా రచించారు .

2-2-2006న 82 ఏళ్ళ వయసులో మరణించి ,సాలగ్రామ సన్నిధి ,శ్రీ రామ ,కృష్ణ సాన్నిధ్యమైన  వైకుంఠం చేరే నాటికి ఆయన’’ 32 భాగాల ఆంగ్ల ఋగ్వేదం’’ రచిస్తున్నారు .ఆయన మరణి౦చిన తర్వాత 2007లో 16 భాగాలు ప్రచురి౦ప బడినాయి .అసలు సిసలు భారతీయత మూర్తీభవించిన అసమాన ప్రతిభాసంపన్నులు శ్రీ సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు.

  చిత్ర లేఖనం శిల్పం లలో కూడా సాలగ్రామ నిష్ణాతులు .ఆయన వేసిన ,చెక్కినవి  బెంగుళూర్ రవీంద్ర కళాక్షేత్రం లో  శాశ్వతంగా చోటు చేసుకొన్నాయి .

  సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -8 

ధ్వని కోణం లో మను చరిత్ర -8

‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ?

 విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో   అననురూప వస్తు ఘటనా నిబంధ రూపమైన విషమాలంకారం ఉన్నది .ప్రవరుని అతి లోక సౌందర్య  కౌగిలింత బహు పుణ్యం అని ,అతని సౌభాగ్యాతిశయం ,పొందు సౌఖ్యం దక్కని తాను  అదృష్ట హీను రాలను అంటుంది .ఇందులో అలంకార కృత వస్తు ధ్వని ఉందన్నారు డా రాజన్న శాస్త్రి .

‘’శ్రేణుల్ గట్టి నభో౦తరాళమున బారెం బక్షులుష్ణా౦శు పా-షాణ వ్రజము కోష్ణమయ్యెమృగ తృష్ణావారధు లింకెన్ జపా –శోణం బయ్యె బతంగ బింబము ,దిశా స్తోమంబు ,శోభా దరి –ద్రాణం బయ్యె,సరోజ షండములు ,నిద్రాణంబు లయ్యెంగడున్ ‘’

పద్యం లో పెద్దన ప్రకృతిని కళ్ళకు కట్టించాడు .సాయంత్రం అయింది అనే విషయం ధ్వనించింది .స్వతస్సిద్దార్ధ శక్తి మూలధ్వని .

‘’వరుణా ద్వీపవతీ తటా౦చలమునన్ ‘’అనే మొదటిపద్యం లో అరుణాస్పద పుర వర్ణన లో కవి ప్రౌఢోక్తివలన ఏర్పడిన వస్తుధ్వని ఉంది ,’’ఇను డస్తాద్రి కి బోవ గొల్లగొని ,నే డేతేర’’పద్యం లో వరూదినికి చెలులు శీతలోప చారాలు చేస్తూ చెప్పిన మాటలలో తూర్పు తెలతెల వారుతోంద నే ధ్వని ఉన్నది .ప్రియుని సాన్నిధ్యం తప్పక లభిస్తుంది అనే ఊరడింపు ఉంది .’’ఇనుడు ‘’’’కొల్లగొని ‘’అనే మాటలలో రాజు అవసాన దశలో ఉంటె, దొంగలు దోచిన సొమ్మును  చోట్లు మారుస్తూ దాస్తున్న విషయం అర్దా౦తరన్యాసంతో ధ్వనించింది .సూర్యుడు అస్తమించేటప్పుడు తనకా౦తులను అగ్ని లో దాస్తాడు అనే శ్రుతి వచనం ‘’అగ్నిం వా వాదిత్యః  సాయం ప్రవిశతి ‘’ని కవి చక్కగా ఇక్కడ వాడుకొన్నాడు .ఇది వక్త్రు ప్రోఢోక్తిచే ఏర్పడిన వస్తు ధ్వని ..’’ఎందే డెందము గందళించు రహిచే ‘’పద్యం లో ప్రవరుడు చెప్పిన బ్రహ్మానందం కోసం వెదకటం వ్యర్ధమని వరూధిని చెప్పింది .ఇది వివక్షితాన్య పర వాచ్య ధ్వని అన్నారు శాస్త్రిగారు .ఇప్పటిదాకా చెప్పిన ధ్వనులన్నీ వాచ్యార్ధం తో ఏర్పడినవే .ఇక ఇప్పుడు అవి వక్షిత వాచ్య ధ్వని ఎక్కడెక్కడ ఉందొ చూద్దాం –

‘’ఆహా ధన్యుడనైతి ‘’పద్యం లో కళా వతిని ఇమ్మని అడగటానికి వచ్చిన దేవాపి అనే గంధర్వుని చూసి ,ఈసడిస్తూ పారర్షి తాను  ధన్యుడనయ్యానని ,తన ఆచార విద్యా తపాలు  ఫలించాయని దెప్పటం లో  తన దౌర్భాగ్యం మాటలతో చెప్పలేనిది అనే వ్యంగ్యార్ధం ధ్వనిస్తోంది .ఇది అవివక్షిత వాచ్య ధ్వని అయిందన్నారు కోరిడే వారు .

‘’హుంకారం బొనరించి వే తలగు డోహో నేను స్వారోచినే ‘’లో తన చుట్టూ మూగిన ఆడలేళ్ళను  చూసి మగలేడి స్వారోచిపై ఏహ్యభావం కలిగి౦ది ‘’నేను స్వారోచినే ‘’అనటం లో కాను అనే అర్ధమూ దాక్కొని ఉంది .బహు స్త్రీ లోలుడు అనే ది లక్ష్యార్ధం. స్వరోచినే అనటానికి బదులు స్వారోచినే అనటం లో స్వరోచి పదం ధర్మ విశిష్టతను వ్యక్తం చేసి అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని అయి౦ద౦టారు డా శాస్త్రీజీ .’’ఈ పాండిత్యము నీకు దక్క మరి యె౦దే ‘’అనే ప్రవరుడన్న పద్యం లో ‘’ఆన౦దో బ్రహ్మ  ‘’అనే ఉపనిషత్ వాక్యం కు పెడర్ధం వరూధిని చెప్పిందని ,దాని అర్ధం అదికాదని ‘’మీ సంప్రదాయార్ధముల్ ‘’లో ధ్వనించి . ఆమె కోరే బ్రహ్మానందం ఆశి౦చే వాడిని కాను అనే వ్యంగ్యార్ధం వస్తుధ్వనిగా కనిపిస్తుంది .’’కొలకోల గూయు బై నొరగు,గుత్తుక గుత్తుక జుట్టు బారు ఛి –ల్వలక్రియ ,గానరాని గతులన్ మయి మై బెనచుచున్ ‘’పద్యం లో చెలికత్తెలు వరూధినిని వినోదింప జేయటానికి పలికిన పలుకులు సంయోగ వియోగాలు దైవా దీనాలు .కనుక వగవటం మంచిదికాదని ప్రవరుడుకూడా దీర్ఘ విరహం భరించ లేక తిరిగి వస్తాడు అని ఊరడింపు ఉన్నది .దీన్ని ‘’విధి చాతురి పద ద్యోత్య మైన వస్తు ధ్వని అంటారు రాజన్నగారు .’’యెంత తపంబు సేసి జనియించిన వారొకొ’’పద్యమూ దీనికి మరో ఉదాహరణ.

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600)

అష్టాధ్యాయి రచించిన పాణిని ఆచార్యుని మేనమామ కుమారుడే ‘’వికృతవల్లి ‘’రాసిన యాడ్యా చార్యులు  .కనుక పాణిని కాలం తర్వాత వాడు .లేకఅదేకాలానికి చెందినవాడు అయి ఉండచ్చు .పాణిని ని క్రీపూ 3 శతాబ్ది వాడనికొందరు,క్రీ.పూ 5-6శతాబ్ది కాలం వాడని కొందరు భావిస్తారు .అంతకు మించి యాడ్యాచార్య వర్యుని విశేషాలు మనకు తెలియవు  .ఆయన రాసిన వికృతివల్లి మాత్రం దొరికింది .అందులో ఆయన తనగురించి చెప్పుకొన్నది యేమీ లేదు దీనిని ‘’పరిభాషా వృత్తి’’ అనీ అ౦టారు .నాగర లిపిలో ఉన్న ఈ గ్రంథం సంస్కృత వ్యాకరణ స్వరూపాన్ని వివరించే పుస్తకం .ఇందులో సంస్కృత వ్యాకరణ సూత్రాలు భాషా చరిత్రలో వాటి స్థానం గురించి వివరణ ఉంటుంది

వికృతవల్లి ప్రారంభ శ్లోకాలు –

‘’ఓం గణేశాయనమః –ఓం త్రయ పరిభాష  సూచనం వ్యాఖ్య రయమః  -అయేత్పయమాదికర కార్యః –పరిభాషా సూచనం శాస్త్ర మధి కృతం వేది తవ్యఉ సర్వ మనుక్రమి ష్యామః  .

చివరి శ్లోకం –‘’ఇతి పరిభాష సూచ ణి సమాప్తైన శుభా యోగ్యే భవం తస్తాం-శుభమస్తర్వ జగతాం –శ్రీ రామాయనమః ‘’

358-డేలారామ కథా సార కర్త –భట్ట ఆహ్లాదక (

కాశ్మీరానికి చెందినవాడుగా భావింపబడిన భట్ట ఆహ్లాదక ‘’డేలా రామ కథా సారం ‘’రచించాడు.కాలాదులు తెలియవు .

359-బృహత్సంహిత వివృతి కర్త –భట్తోత్పల (10వ శతాబ్దం )

వరాహమిహిరుని రచనలపై వ్యాఖ్యానాలు రాసిన భట్తోత్పల 10వ శాతాబ్ద చివరి కాలం వాడు  .బృహత్ సంహితకు వివృతి ‘’ అనే వ్యాఖ్యానం రాశాడు .జ్యోతిష్యంలో దిట్ట అయిన భట్తోత్పల స్వయంగా ‘’హోరా శాస్త్రం ‘’రాశాడు .ఇతని రచనకు చారిత్రక ప్రాధాన్యం రావటానికి కారణం ,తనకు ముందున్న రచయితల గురించి తెలియ జేయటమే .సదానందుని ‘’భాస్వతి ‘’పై భాస్వతి టీకా అనే వ్యాఖ్యానం రాశాడు.

360-రాయ ముకుట పధ్ధతి కర్త –బృహస్పతి రాయముకుట (15వ శతాబ్ది )

బెంగాల్ కు చెందిన 15వ శాతాబ్ది కవి బృహస్పతి రాయముకుట  తండ్రి గణేష్ . జలాలుద్దీన్ కాలం వాడు .రఘు నందన రాసిన అనేక స్మృతులలో ఈకవి పేర్కొనబడినాడు .యితడు ‘’స్మృతి రత్నహార ‘’,’’రాయముకుట పధ్ధతి’’ రచించాడు .’’నామ లింగాను శాసన ‘’అనే నిఘంటువుకు ‘’పద చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశాడు .రఘువంశ కావ్యం,శిశుపాల వధ కావ్యం లపై వ్యాఖ్యానాలు రచించాడు .

361-నరేశ్వర పరీక్ష కర్త –సద్యో జ్యోతి (8 వ శతాబ్ది )

8 వ శతాబ్ది కాశ్మీర కవి సద్యోజ్యోతి నరేశ్వర పరీక్ష ,పరమోక్షకారిక లు రాశాడు .రుద్రా తంత్ర ,స్వయంభువ తంత్ర లకు వ్యాఖ్యానాలు రాశాడు .వీటినే తత్వ సంగ్రహ ,తత్వ త్రయ అంటారు .362-నాటక లక్షణ రత్న కోశ కర్త –సాగర నంది (10-13 శతాబ్ది )

పది నుంచి 13 వ శతాబ్ది లోపు జీవించి ఉండవచ్చు అని భావింపబడిన సాగర నంది కవి వివరాలు తెలియవు .కాని అతడు రచించిన నాటకలక్షణ సార గ్రంథానికి విపరీతమైన వ్యాప్తి అభించింది .

363-నిరుక్త కర్త –శాక పూని (క్రీ.పూ.7వ శతాబ్దం )

యాస్కాచార్యుడు పేర్కొన్న శాకపూని కవి నిరుక్త కర్త .క్రీ .పూ .7వ శతాబ్దానికి చెంది ఉండవచ్చు .

364-గౌడ మీమా౦సద-కర్త –శాలికా నాథ(క్రీ.శ .7 వ శతాబ్ది )

క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినా బెంగాల్ కవి శాలికా నాథుడు.గౌడ మీమా౦సద తోపాటు రుజువిమాల ,దీపశిఖ అనే వ్యాఖ్యానాలను ప్రభాకరుని బృహతి ,లఘివి లపై రచించాడు .

365-శంఖ స్మృతి కర్త –శంఖ (క్రీ.పూ -300-100)

శంఖ స్మృతి  సంప్రదాయ మూల రచయితలు 20 మందిలో  శంఖుడు ఒకడు.కాలం క్రీ పూ 3శాతాబ్దినుంచి 1శతాబ్ది లోపు .శంఖ స్మృతి,శంఖ ధర్మ శాస్త్రం రచించాడు .వీటినుండి తర్వాత కవులు చాలా వాటిని ఉదహరించారు .శంఖుడు  లిఖితుడు తోకలిసి ‘’శంఖ లిఖిత స్మృతి’’రాశాడు.దీనికి లఘు స్మృతి కూడా ఉంది .’’శంఖ లిఖిత ధర్మ సూత్రం ‘’కూడా ఈ సోదరులు రచించారు .మహాభారతం లో శంఖ ,లిఖితులు సోదరులు అని ఉన్నది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-19-ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

 

 

,

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ పండితరాయలు రచించిన భామినీ విలాసం అనే గ్రంథాన్ని సూక్తి సుధ పేరుతో అనువదించారు. పుత్రసంతానం లేని శాస్త్రి తన సుందరకాండనే పుత్రునిగా పేర్కొనేవారు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించాకా కానీ ఆయన శిష్యుల చొరవతో సుందరకాండము ముద్రణ పొందలేదు.

బాల్యం, విద్యాభ్యాస౦
మేడవరం రామబ్రహ్మశాస్త్రి 1885లో నెల్లూరు జిల్లాకు చెందిన కంకణంపాటి అగ్రహారంలో వేంకట సుబ్బమ్మ, సుబ్బశాస్త్రి దంపతులకు జన్మించారు. రామబ్రహ్మశాస్త్రి ప్రముఖ పండితుడు, రచయిత వేలూరి శివరామ శాస్త్రి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు.[1]

వృత్తి, వ్యక్తిగత జీవితం
మేడవరం రామబ్రహ్మశాస్త్రి ఉపాధ్యాయవృత్తి చేపట్టి కర్నూలు పట్టణంలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతపు కర్నూలు స్టేడియం ప్రాంతంలో నివాసం ఉండేవారు. కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో సంస్కృతం, తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయనకు వయసు మీద పడేవరకూ సంతానం లేకపోయి, వార్ధక్యంలో ఓ కుమార్తె జన్మించింది. కుమారులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరకాండనే కొడుకుగా భావించేవారు. అటువంటి కావ్యం ఆయన మరణానంతరమే ముద్రణ పొందడం ఆయన జీవితంలోని ఒక విషాదం. మేడవరపు రామబ్రహ్మశాస్త్రి 1966-67 మధ్య కాలంలో మరణించారు.[1]

రచనా రంగం
తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధుడైన బలిజేపల్లి లక్ష్మీకాంతం వాల్మీకి రామాయణంలోని సుందరకాండాన్ని తెలుగులో కావ్యంగా రాయాలని ప్రయత్నించి కొంతవరకూ రాశారు. తెలియని కారణాల వల్ల అసంపూర్ణంగా వదిలేశారు. ఆ తర్వాత స్వయంగా కర్నూలులో రామబ్రహ్మశాస్త్రిని కలిసి తన సుందరాకాండను పూర్తిచేయమని కోరారు. దాంతో రామబ్రహ్మశాస్త్రి సుందరకాండ పూర్తిచేశారు. కొడుకులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరాకాండనే కుమారునిగా భావించేవారు. ఆయన మరణానంతరం ఆయన విద్యార్థులు చందాలు వేసుకుని సుందరాకాండ ప్రచురించారు. జగన్నాథ పండితరాయలు రాసిన భామినీ విలాసం అనే సుప్రసిద్ధ సంస్కృత కావ్యాన్ని రామబ్రహ్మశాస్త్రి సూక్తిసుధగా తెనిగించారు. అయితే గొప్ప పాండిత్యం, వ్యుత్పత్తి ఉండి కూడా రామబ్రహ్మశాస్త్రి రచన రంగంపై తగినంతగా దృష్టి పెట్టకపోవడంతో తగినన్ని రచనలు చేయలేదని కర్నూలు జిల్లా రచయితల చరిత్ర రాసిన కె.ఎన్.ఎస్.రాజు పేర్కొన్నారు.[1]

ప్రాచుర్యం
మేడవరం రామబ్రహ్మశాస్త్రి సాహిత్యరంగంలో చక్కగా తెనిగించగల కవిగా ప్రఖ్యాతులయ్యారు. ఆ క్రమంలోనే తన కావ్యాన్ని పూరించమని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కోరారు. భామినీ విలాసాన్ని ఆంధ్రీకరిస్తూ రాసిన సూక్తిసుధ ప్రముఖ కవులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఈ కావ్యాన్ని గురించి – “పండితరాయల శ్లోకము లందలి రసభావములను, ధ్వన్యన్యోక్తి విలాసములను, పదప్రయోగాచిత్యమును జక్కగా పరిశీలించి మూలమునకే విధమునను దీసిపోనట్లుగా వారీ యనువాదమును సాగించినారు. ప్రతి పద్యము సరసమైన లలిత సుందర పదప్రయోగ భాసురమై, ప్రౌఢమై హృదయము నానంద తుందిలము గావించినది” అని ప్రశంసించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ “భామినీ విలాసమునకు మరికొన్ని యాంధ్రీకరణములు కలవు. వానిలో నిది విశిష్ట లక్షణము కలది” అని సూక్తిసుధ విశిష్టత వివరించారు.

ఆయన గద్వాల, వనపర్తి, దైవందిన్నె మొదలైన సంస్థానాలకు వెళ్ళి పాండిత్యాన్ని కనబరచి, సంస్థానాధీశుల సత్కారాలు, బహుమానాలు పొందేవారు.[1]

ఆధారం -వీకీపీడియా
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ

వ్యాకరణం లో ఉద్దండ పండిత ప్రకా౦డుడుడా. ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ ‘’గజ సూత్ర’’అనే పాణిని అష్టాధ్యాయి ని దశాబ్దం పైగా  అధ్యయనం చేశారు .సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి సంస్కృతం లో ప్రాధమిక విద్య తండ్రి శ్రీ శ్రిస్టి శ్రీరామ శర్మవద్ద నేర్చి,తర్వాత ఆయన బాబాయి శ్రిస్టి సాంబమూర్తి శాస్త్రి గారి వద్ద వ్యాకరణం,అలంకార శాస్త్రం  అభ్యసించారు .1970లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఎం .ఏ  .డిగ్రీ 1970లో పొంది ,1987లో పిహెచ్ డి సాధించారు .స౦ప్రదాయ విధానం లోనే అద్వైత వేదాంతం బ్రహ్మశ్రీ ఆర్.కృష్ణ మూర్తి శాస్త్రి ,బ్రహ్మశ్రీ మణీ౦ద్రవిద శాస్త్రి గార్ల పర్యవేక్షణ  లో అభ్యసించారు .భట్ట మీమాంస శాస్త్రం  బ్రహ్మశ్రీ రామ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు .వీరి వ్యాకరణ ప్రతిభకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు1982లో ’’వ్యాకరణ విద్వత్ ‘’బిరుదునిచ్చింది .2001లో శృంగేరి శంకరాచార్య ‘’వేదాంత శాస్త్ర విశారద ‘’అందించి సత్కరించారు .

  శర్మగారు జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరిఎంటల్ కాలేజి లో సంస్కృత అధ్యాపకులుగా1971లో  చేరి , వ్యాకరణ అలంకార శాస్త్రాలను ,సాహిత్యాన్ని 16 సంవత్సరాలు బోధించాడరు ,వీరి శ్రేష్ట బోధనా విధానానికి శృంగేరి స్వామి శ్రీ శ్రీ భారతీ తీర్ధ ‘’వ్యాకరణ విద్వత్ ప్రవర ‘’బిరుదాన్ని బహూకరించి ఘనం గా సత్కరించారు .’’పాండిచేరి ఈకోల్ ఫ్రాంచైజ్ డీ ఎక్స్ట్రీమ్ ఓరియంట్ లో 1987లో రిసెర్చ్ ఫెలోగా చేరి అక్కడ తానూ స్వయంగానూ ఇతరులతోకలిసి రిసెర్చ్ కొనసాగించారు .రెండేళ్ళ పరిశోధనలో ‘’పాణినీయ వ్యాకరణోదహరణకోశః ‘’’తెచ్చారు .తర్వాత మిగిలినవారితోకలిసి ‘’ఇండియన్ అనాలిసిస్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ‘’ప్రోగ్రాం లో అప్పటి సెంటర్ హెడ్ ప్రొఫెసర్ ఎఫ్ గ్రిమాల్ నాయకత్వం లో పని చేశారు .ఈ బృందం భవభూతి నాటకాలను, మహా వీర చరిత్రపై వీర రాఘవ వ్యాఖ్యానాన్ని.మాలతీ మాధవం పై హరిహరుని వ్యాఖ్యానాన్ని ప్రచురించారు .ప్రొఫెసర్ గ్రిమాల్ తో కలిసి రాజచూడ మణి దీక్షిత రచిత ‘’కావ్య దర్పణం ‘’శుద్ధ ప్రతి తెచ్చారు .ఇవే కాక ‘’వ్యాకరణ మాల ‘’పేరిట అనేక పుస్తకాలు ప్రచురించారు .నాగేశుని ‘’పరి భాషేందుశేఖర’’పై వ్యాఖ్యానం ‘’ త్రిపథగా’’శుద్ధప్రతి వెలువరించారు .

  శర్మ గారికి వ్యాకరణ శాస్త్రం పై ఉన్న ప్రత్యేక అభిరుచికి నిదర్శనంగా  భారతీయ సాంప్రదాయ వ్యాకరణ  విధానం పై తీవ్రం గా అధ్యయనం చేశారు .ప్రపంచంలో అనేక దేశాలనుండి వ్యాకరణం లో ఉత్తమ విజ్ఞానాన్ని పొందటానికి పండి చేరివచ్చి శర్మగారి వద్ద శిక్షణ పొందుతున్నారు .శర్మగారిని ఇతర దేశాల యూని వర్సిటీలు ఆహ్వానించి వారి మేధో నవనీతాన్ని ఆస్వాదిస్తున్నాయి .ఆయనకు సంప్రదాయ విద్యా బోధనా విధానం అత్యంత ఇష్టమైనది .ఎన్నో చర్చావేదికలలో పాల్గొని వాటికి ఉజ్జీవనం కలిగించారాయన . కంచి లో జరిగే’’శ్రీ కాంచీ వేద వేదా౦త శాస్త్ర సభ ‘’లో 2010నుంచి శర్మగారు ‘’వ్యాకరణ శాస్త్ర ‘’పరీక్షకులుగా ఉన్నారు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం’’,ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లలో పిహెచ్ డి విద్యార్ధులకు ఎక్స్టర్నల్ ఎక్సామినర్ గా వ్యవహరిస్తున్నారు .’’లోక ప్రియం టీం ‘’లో డా.ఈవా విల్డేన్ తో కలిసి తెలుగు తమిళ సంస్కృత వ్యాకరణ తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు .

   సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2-1-19 బుధవారం మా ఇంట్లో మా అల్లుడు శ్రీ asఅవధాని

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )

   శ్రీ ధర్మవరపు  సీతా రామాంజనేయులు  వ్యావహారిక తెలుగుభాష లో  రచించిన ఆంజనేయ రామాయణం ను శ్రీ కందాళ వేంకట రామ నరసింహా చార్య , శ్రీ కదాళ  వేంకట కృష్ణ మాచార్య సంయుక్తంగా సంస్కృతం లోకి ‘’ఆంజనేయ రామాయణం ‘’గా వచనం లో  అను వదించారు .దీనిని సంస్కృత భారతి వారు 2013 లో ప్రచురించారు . మూల కవిధర్మవరపు వారు  కవి పండిత పోషకుడు, వదాన్యుడు ,స్వతహా కవి .సంస్కృత అనువాదం  సరళంగా సుబోధకంగా చేశారు కందాళ ద్వయం .ప్రార్ధనా శ్లోకం చూద్దాం –

‘’శ్రీమద్రామ కథా౦ పుణ్య మా౦జనేయ ప్రకీర్తితం –అను వక్త్రుం  ప్రవృత్తౌ హి  త్తోహి నత్వా గురు పరంపరాం –అసామర్ద్యేపి మిత్రస్య ప్రీతయే రధ వాపనే –ప్రవృత్తౌ నౌ శ్రీనివాసోనుగ్రుహా ౦తు  శ్రేయస ‘’

‘’నారాయణా తే నమామహత్వం స్తోతుం శక్తః –సదవన దీక్షిత దుర్జన నాశక శ్రీనివాస జగదేకపతే ‘’

బాలకా౦డ ప్రారంభవచనం చూద్దాం –‘’వివస్వతః మనుః ఇక్ష్వాకు కులస్య మూల పురుషః –అత యేవ తద్వంశ యాః సూర్య వంశ ఇత్యుత్పంతే-సః వైవస్వతః  వస్తుతః క్షత్రియ  వంశ స్యైవ మూల పురుషః ఆసీత్ ‘

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

విజయవాడ నుంచి వేటపాలెం

30వ తేదీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకే లేచి ,స్నానం సంధ్యావందనం ,పూజా ముగించుకొని 5-45 కు ఉయ్యూరు సెంటర్ కి వెళ్లి 6-10కి బెజవాడ రైల్వే  స్టేషన్ కు వెళ్ళే 222 సిటీ బస్ ఎక్కి ఉదయం 7-20కి స్టేషన్ చేరా .అక్కడే ఉన్న కాంటీన్ లో ప్లేట్ వడ 35 రూపాయలకు కొని, తిందామని ప్రయత్నిస్తే, ఏదో మాదిరిగా ఉంటె, అందులో పది రూపాయల విలువగల సరుకు కూడా తినకుండా ప్లేట్ వదిలేసి ,బిపి టాబ్లెట్ వేసుకొని 19 రూపాయల తో కాఫీ తీసుకొన్నా .నా అదృష్టం బాగుండి .కాఫీ చాలా బాగా రుచిగా ఉంది .తాగి ,చలపాక ప్రకాష్ వాళ్ళు అప్పటికే స్టేషన్ కు చేరారని తెలుసుకొని ,ఉదయం 8 కు బయల్దేరే రాజమండ్రి -ఒంగోలు  ఫాస్ట్ పాసెంజర్ కు నా టికెట్ 25 రూపాయలకు కొనుక్కొని 6వ నంబర్ ప్లాట్ ఫాం చేరగా, ప్రకాష్ నాదగ్గరకు రాగా, అందరం ఒక చోటికి చేరాం .కుమారి రితిక ,ప్రశాంత్ లు కూడా అక్కడే ఉన్నారు .ప్రకాష్ అందరికీ టీ ఇప్పించారు .తాగాలని లేకపోయినా ప్రయత్నించా .’’నీళ్ళ తేనీరు’’కాస్త కాటికి మిగతాది పారపోశా . సుమారు గంట ఆలస్యంగా 8-50 గంటలకు పాసెంజర్ వస్తే ,బాగా రష్ గా ఉంటె ,ప్రకాష్ ముందు దూరి ,మా అందరికీ సీట్ లు ఏర్పాటు చేశారు .అందరం ఎలాగో అలా సర్దుకు కూర్చున్నాం .మాతోపాటు బృందావనరావు గారు కల్పన,వాణి ,చెన్నకేశవ గార్లు మొదలైన వారం అందరం కలిసి బయల్దేరాం .దుగ్గిరాలలో మరో చలం గారు ఎక్కారు .

మంచి టీం ఆర్గనైజర్ అయిన ప్రకాష్ అందరికి తలొక రెండు బొబ్బట్లు ఆర్డర్ ఇచ్చి ,బెజవాడలోనే చేయించి ,ప్లేట్ లలో పెట్టి మా అందరికీ ఇప్పించారు .ఇంకా కావాలా అని కొసిరి అడిగారు .చాలాబాగా రుచికురంగా ఉన్నాయి బొబ్బట్లు .’’కేక ‘’అనిపించాయి .సీసాలతో  వెంట  తెచ్చిన మంచినీరూ సప్ప్లై చేశారు  .మధ్యలో స్టాపుల ఒక్క నిమిషమే ఆగి రన్నింగ్ లోమాత్రం ‘ఫాస్ట్’’ అనిపించి నిడుబ్రోలు చేరే సరికి ,రెండు రైళ్ళ క్రాసింగ్ తో పావుగంట ఆలస్యమై ,ఉదయం 11-30కి వేటపాలెం చేరాం .మధ్యలో కల్పనా గారిచ్చిన ఆమె రాసిన  రెండుపుస్తకాలు చదివేశా.ఆవిడ దానిమ్మకాయలుకొని ఒకటి ఒలిచి అందరికీ పెట్టారు .కాలక్షేపం బటాణీ ల్లా  దానిమ్మ గింజలు బాగున్నాయి  స్టేషన్ లో అందరం ‘’భంగిమ ‘’లో ఉండి ఫోటోలు దిగి ,లైబ్రరీ వారు ఏర్పాటు చేసిన ఆటోలలో  సారస్వత నికేతన్   చేరాం .అప్పటికే   వెంకట సుబ్బయ్యగారు వచ్చేశారు .ప్రకాష్  బెజవాడలోనే బానర్లు తయారు చేయించి, వెంట తెచ్చి, ఇక్కడికి చేరుకోగానే కట్టించారు .,అదీ ఆయన కమిట్ మెంట్ .అతిధులకు శాలువాలు ,కానుకగా బంగారు పెన్నులు కూడా  బెజవాడ నుంచే తెచ్చారు .

సరిగ్గా 12గంటలకు సభ ప్రారంభమైంది .సభాధ్యక్షులు రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు .డా.సత్రం మల్లేశ్వరరావు రాసిన ‘చీకటి దాచిన వెలుతురు’’కవితా సంపుటి ఆవిష్కర్త శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ,లలిత కళాసమితి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ లొల్లా శ్రీరామమూర్తి ,కళాంజలి సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీ కాకరపర్తి వెంకటేశ్వర్లు ,ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ బి హనుమా రెడ్డి ,కవయిత్రి సాహితీ విమర్శకురాలు డా వి నాగ రాజ లక్ష్మి , సాహితీవేత్త శ్రీ బీరం సుందరరావు ,కవి శ్రీ శ్రీనివాస గౌడ్ ,సమీక్షకులు శ్రీ సజ్జా వెంకటేశ్వర్లు , రాష్ట్ర రచయితల సంఘం కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ గార్లు అతిధులుగా వేదికనలంకరించారు .కార్యక్రమాన్ని చక్కని సంభాషణా చాతుర్యం తో నిర్వహించారు వృద్ధాశ్రమం అధ్యక్షులు శ్రీ గుత్తి విశ్వేశ్వరరావు .మరొక పుస్తకమూ ఆవిష్కారం పొందింది అప్పాజోశ్యులవారి అమృత హస్తాల మీదుగా .

వక్తలు గ్రంథాలయ క్రమాభి వృద్ధిని వివరించారు .ప్రభుత్వం కూడా సహకరిస్తే ఇంకా బాగా విస్తరణ జరుగుతుందని వక్తలు అభిప్రాయ పడ్డారు .ప్రైవేట్ యాజమాన్యం లో లాభా పేక్ష లేకుండా ,నిస్వార్ధంగా మొదటి నుంచి ,ఇప్పటి దాకా నికేతన్ నిర్వహింప బడుతోందని తెలియ జేశారు .ఉద్యోగులు కూడా క్రమశిక్షణ, అంకిత భావం తో ,జీతాలు పెద్దగా లాభించకపోయినా సేవా దృక్పధం తో పని చేస్తున్నారని ఒక కంప్యూటర్ అసిస్టెంట్ ఉచిత సేవ అందిస్తోందని చెప్పారు .వేదికపై వ్యవస్థాపకులు శ్రేష్టి గారి నిర్వాహకులు పంతులుగారి, రెండు సార్లు సందర్శించిన పూజ్య బాపూజీ చిత్రపటాలు ఏర్పాటు చేసి పెద్దలచే పుష్పమాలా౦కరణ చేయించటం సముచితంగా,  గౌరవ ప్రదం గా ఉంది , లైబ్రరీ సేవలో ధన్యులైనవారిని పేరు పేరునా స్మరించి అంజలి ఘటించటం సంస్కార వంతమైన చర్య గా ఉన్నది ..లైబ్రరీ స్వీపర్ వాచ్ మాన్ దంపతులను గౌరవంగా కుర్చీలలో ఆసీనులను చేసి   పూల హారం వేసి   శాలువాకప్పి బంగారు పెన్ బహూకరించారు .అలాగే లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి  సేవలను ప్రస్తుతించి ఘనంగా సత్కరించారు . మిగిలినవారిని కూడా సత్కరింఛి గౌరవం చూపారు .ఆవిష్కరింపబడిన పుస్తకాలపై సూక్ష్మమైన పరిచయాలు జరిగాయి .కవులనూ,సమీక్షకుని ,అతిదుల౦దరినీ,  తగిన విధంగా సన్మానించారు .

కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొన్న స్థానిక మహిళ ఒకరు ఆమె భర్త గారి స్మారకం గా ఒక లక్ష రూపాయలు లైబ్రరీకి విరాళం అంద జేశారు  . దీనితో స్పందించి ప్రేరణ పొందిన వదాన్యులు పది వేల రూపాయలు  వంతున విరాళాలు అందించి యదా శక్తి అభివృద్ధికి తోడ్పడి,తమ వదాన్యత చాటుకున్నారు .ఇది అభిలషణీయ మైన విషయం .అందరికీ స్పూర్తి దాయకం కూడా .

నేను ఉయ్యూరు నుంచి నాతో తెచ్చిన 36పుస్తకాలను వేట పాలెం గ్రంధాలయానికి లైబ్రేరియన్ గారి చేతులమీదుగా అందజేశాను .వీటిలో సరసభారతి పుస్తకాలతోపాటు డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల సంస్కృత గ్రంథాలు ,డా.శ్రీమతి వాణీ కుమారి,  కవి సామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ,శ్రీ  ఎం ఆర్ వి ఎస్ మూర్తి ,శ్రీ ఆవాల బుచ్చిరెడ్డి ,ఆచార్య శ్రీ వత్స ,శ్రీ తాడేపల్లిసుబ్రహ్మణ్య శాస్త్రి,మొదలైన వారి పుస్తకాలున్నాయి .ఇవే కాదు సరసభారతి ఇప్పటి దాకా ప్రచురించిన దాదాపు అన్ని పుస్తకాలు ,ఆవిష్కరణ జరిగినవెంటనే ప్రకాష్ గారు ఈలైబ్రరీ కి పంపటం అలవాటే.పుస్తకాలు అందగానే అందినట్లు ధన్యవాదాలు తెలియ జేస్తూ,  లైబ్రేరియన్ శ్రీ వల్లిగారు వెంటనే పంపటం రివాజు .ఇది చక్కని సంప్రదాయం .అందరు లైబ్రేరియన్లు విధిగా  పాటించాల్సిన సూత్రం  . వల్లి గారితో మాట్లాడుతూ సెప్టెంబర్ లో అమెరికానుంచి వచ్చిన ఒకాయన ,మరో హైదరాబాద్ ఆయన ఇక్కడికి వచ్చినట్లు ,ఏదో ఆర్ధిక సాయం లైబ్రరీకి చేయాలను కొన్నట్లు విన్నాను ఎంతవరకు వచ్చిందని అడిగాను .ఆమె వాళ్ళు తమ పుస్తకాలు ఇచ్చారు కాని ఆర్ధిక సాయం గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు .

సభ పూర్తవగానే అందరం లైబ్రరీ లో సామూహికంగా ఫోటోలు తీసుకొన్నాం .ఇక్కడ గాంధీ గారు వాడిన చేతి కర్ర ఉంది .అది వారసత్వపు ఆస్తిగా ,పవిత్రంగా అందరూ భావించి ఆ  కర్ర చేతబట్టి ఫోటోలు తీసుకున్నాము .అక్కడ నాకు కవి రాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారు రాసిన ‘’ఖడ్గ తిక్కన ‘’పద్యకావ్యం నాతోపాటు మిగిలిన వారందరికీ  అర్చక ప్రవర శ్రీ చల్లా రామారావు గారు రచించిన ‘’శ్రీ రామాయణ సారామృతం ‘’వచన గ్రంధం ,డాశ్రీ సత్రం మల్లేశ్వరరావు గారి ‘’చీకటి దాచిన వెలుతురు’’తొలి కవితా సంపుటి అందజేశారు .సాధారణంగా సాహిత్య సభలు అంటే వేదికపైనా ముందు రచయితలూ తప్ప ,ఊళ్ళోని వారెవరూ రారు. ఉండరు .కాని వేటపాలెం లో ఆ ఆనవాయితీ తప్పించి ఊరి పెద్దలు చాలామంది పాల్గొని ఘన విజయం చేకూర్చారు.ఇందుకు  ఊరివారిని తప్పక అభినందించాల్సిందే . కార్యక్రమం ముగియగానే మమ్మల్ని అందర్నీ కార్లు  ఆటోలలో దేశాయ పాలెం లో ఉన్న అనాధ వృద్ధాశ్రమం లో కమ్మని విందు ఏర్పాటు చేశారు .టేబుల్ మీల్స్ .పూర్ణం, వడ ,పులిహార ,పప్పు ,రెండుకూరలు ,చట్నీ ,సాంబారు ,గడ్డ పెరుగు నెయ్యి తో రుచికరమైన భోజనాలు కొసరి కొసరి వడ్డించి తినిపించారు .

అనాధ వృద్ధాశ్రమం

.               విశాలమైన ఆవరణలో పచ్చని  వృక్షాలమధ్య మంచి బిల్డింగ్ లలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు.శ్రీ సత్రం మల్లేశ్వరరావు గారు వ్యవస్థాపకులు నిర్వాహకులు .ఆస్ట్రేలియా లో ఉన్న వారి కుమారులు ఆశ్రమ నిర్వహణకు ఆర్ధిక సాయం అందిస్తున్నారట .వేటపాలెం శ్రీ అరుళానంద స్వామి దివ్య ఆశీస్సులతో ,గ్రామ పెద్దల వదాన్యుల సహకారం తో అన్ని కులాల వారితో ఉన్న గొప్ప ఆదర్శమైన కమిటీ తో ఆదర్శంగా నిర్వ హిప బడుతోంది  .ఆశ్రమవాసులను సర్వే చేసి సెలెక్ట్ చేసి చేర్చుకొంటారు .వృద్ధాప్యం తో పాటు అనాధలు అయి ఉండటం ప్రాధమిక విషయంగా భావిస్తారు .ఆశ్రమం లో చేరినదగ్గరనుంచి మట్టిలో కలిసి పోయే దాకా ఖర్చు అంతా ఆశ్రమానిదే .ఒక్క రూపాయ కూడా ఎవరూ కట్టనక్కర లేదు .ఇప్పటికి 110 మందికి అంత్య క్రియలు ఏ లోటూ లేకుండా నిర్వహించారట .వాషింగ్ మెషీన్ ,ఫాన్ లు మంచి గాలి వెలుతురూ లభిస్తాయి .రోజూ ఒక ఆర్ ఏం పి డాక్టర్ పర్య వేక్షిస్తాడు. నెలకొకసారి డాక్టర్ వచ్చి పరీక్షలు చేస్తాడు .షుగర్ పేషెంట్ లకు  ప్రత్యెక కాంపులు నిర్వహించి నెలకు సరిపడా  మందులు ఉచితం గా  అంద చేస్తారు .కుష్టు రోగులకు నెలకొకసారి ఊళ్ళో పరీక్ష చేయటానికి  క్రిస్టియన్ మిషనరీ డాక్టర్ వస్తాడు .వారికి అంటే సుమారు యాభై అరవై మందికి  అక్కడే  భోజనం అందేట్లు  ఆశ్రమకమిటీ మెంబర్అయిన నవాబు గారు స్వంత ఖర్చు తో ఏర్పాటు చేస్తాడట . ఎందరో మహానుభావులు ,ఉదార హృదయులు . ఈ విషయాలన్నీ మా భోజనాలయ్యాక చెట్లకింద కుర్చీలలో మమ్మల్ని కూర్చోబెట్టి ,మల్లేశ్వరరావు గారు చెప్పారు .అప్పటికప్పుడు అందరం స్పందించి ఎవరికి తోచిన దనం వారు ఇచ్చి మా కర్తవ్యమూ నెరవేర్చాము .ఇదొక  సంతృప్తి మాకు .

వేట పాలెం జీడి పప్పు కు ప్రసిద్ధి

వేట పాలెం అంటే జీడి పప్పుకు ప్రసిద్ధి అని బీరం వారన్నారు .ఇండియాలో నంబర్ వన్ నాణ్యమైనజీడిపప్పు వేటపాలెం లోనే దొరుకుతుంది .ఆ తర్వాత స్థానం’’ పలాస’’ పొందింది వేటపాలెం లో 42 జీడిపప్పు ఫాక్టరీలున్నాయట .కాని మాకు కొందామనుకొంటే దారిలో ఎక్కడా జీడిపప్పు అమ్మే కొట్లు కనిపించలేదు .రైల్ లోనూ ఎవరూ అమ్మకానికి రాలేదు .చాలా సార్లు మద్రాస్ నుండి వచ్చేటప్పుడు కొనే వాళ్ళం .ఇప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళే టప్పడూ జీడిపప్పు దర్శనం కాలేదు .అది బాధగానే ఉంది .

తిరుగు ప్రయాణం

ఆటోలో అందరం చీరాల స్టేషన్ చేరాం .చీరాల పేరాల  ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఉద్యమ కేంద్రాలు .వారు నడచిన పవిత్ర నేల గుండా ప్రయాణించటం ఆమహా పురుషుని స్మరణ ధన్యులను చేశాయి అని పించింది .స్టేషన్ కు చేరే సరికి ఇంకా ఫాస్ట్ పాసెంజర్  వెళ్ళ లేదని తెలిసి ఊపిరి పీల్చుకొన్నాం .ఎవరి టికెట్ వాళ్ళం కొనుక్కొని సరిగ్గా 4 గంటలకు వచ్చిన పాసెంజర్ ఎక్కాం. భవానీ దీక్షలు విరమణ రోజులు కనుక ట్రెయిన్ అంతా వారితోనే నిండి పోయింది .ఎక్కటానికి చాలా కష్టమైంది .వేటపాలెం నుంచి బెజవాడ దాకా అందరం నిలబడే ప్రయాణం చేశాం  .నెత్తిన ఇరుముడి మూటలు ,యెర్ర వస్త్ర ధారణా ,మెడనుండి మోకాలిదాకా  గజనిమ్మకాయ సైజులో గుచ్చిన నిమ్మకాయల దండ ,పుష్పహారం ,శూలం బల్లెం లతో వెంట వచ్చిన భార్య భవానీ లు పిల్ల భావానీల తో  ఇవికాక లగేజీ తో పాపం ఎంతో కస్టపడి ఎక్కి ,నుంచొనే చోటు కూడా లేక ఇబ్బంది తో  దుర్గమ్మవారిపై  మనసునిండా భక్తితో ఒకరినొకరు  ‘’భవానీ భవానీ ‘’అని పిలుచుకొంటూ సందడి సందడిగా ఉంది కంపార్ట్ మెంట్ .  బెజవాడ కు పాసేంజర్ సాయంత్రం 6 కు చేరింది .ఒకరికొకరం గుడ్ బై చెప్పుకొని  ఎవరి దారి వారు పట్టాం.నేను స్టేషన్ బయట 333 సిటీ బస్ కోసం గంట సేపు వెయిట్ చేసి ,లాభం లేదని ,బస్ స్టాండ్ కు సిటీ బస్ లో ఎక్కి వెళ్లి, అక్కడనుంచి రూట్ బస్ ఎక్కి ఉయ్యూరు చేరే సరికి రాత్రి 9 అయింది .ఇంతమజ్జిగా అన్నం తిని వేటపాలెం ఫోటోలు పెట్టి ,నిద్ర పోయేసరికి రాత్రి 10-30.అయింది .మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ధనుర్మాస కార్యక్రమానికి మా సువర్చలా౦జనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి .ఈ టైట్ ప్రోగ్రాం చూసి మా ఆవిడ దెప్పుతూ ‘’ఎఫ్ ఎం మిర్చీ రేడియోలో  ‘’ తరచుగా అనట్లు   ‘’బాబు బాగా బిజీ ‘’అన్నది .

చలపాక దంపతులు

శ్రీ చలపాక ప్రకాష్ పూనిక నేర్పూ వ్యూహం ప్రణాళిక సక్రమంగా .అమలు జరగటం వలన మా గ్రంధాలయ సందర్శన యాత్ర విజయవంతమైంది .ప్రకాష్ లాంటి నిస్వార్ధ సేవా పరాయణుడు నాకు ,సరసభారతికి మిత్రుడు, ఆత్మీయుడు అవటం మా అదృష్టం .ప్రకాష్ భార్యామణి కూడా ఆయనకు తగ్గ దొడ్డ ఇల్లాలు .అణకువ ,గౌరవం, మర్యాద మన్నన, ,సహాయం ఆతిధ్యాలలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది .’’అన్ని విధముల నుద్దియౌ నతని  గృహిణి‘’అని పెద్దనగారు ప్రవరుని భార్య గురించి చెప్పినమాట ప్రకాష్ అర్ధాంగి గారికి సరిగ్గా అన్వయిస్తుంది. ఈ సరస్వతీ తీర్ధ  యాత్రా ఫలం ప్రకాష్ దంపతుల పుణ్యమే .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -1

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -1

సారస్వత నికేతన్ స్థాపన ,ఉద్దేశ్యం ,అభివృద్ధి

   ప్రకాశం జిల్లా వేటపాలెం లోని ‘’సారస్వత నికేతన్ ‘’గ్రంథాలయం కు వందేళ్ళ చరిత్ర ఉంది ,బాల సాహిత్య బ్రహ్మ ,మధుర కవి ,తెలుగు వైతాళికుడు ,సంఘ సంస్కర్త ,రాజమండ్రి ‘’గౌతమీ గ్రంథాలయ’’ స్థాపకులు,’’ మానవ సేవ’’ పత్రిక సంపాదకులు ,స్వాతంత్ర్య సమరయోధులు ,భాషా వేత్త కీ.శే .శ్రీ నాళ౦ కృష్ణా రావు గారి బంధువు శ్రీ  ఊటుకూరి వెంకట.శ్రేష్టి గారు 15-10-1918 న   ప్రజలలో సాహిత్యం ,నైతికత ,శీల సంపద ,దేశభక్తి,మానవత్వం ,దాతృత్వం ,భక్తీ మొదలైన మానవ విలువలు వ్యాప్తి చెంది౦చటానికి  ఈ గ్రంథాలయాన్ని స్వంత ఖర్చులతో  స్థాపించారు . బహుశా నాళం వారి ప్రభావం శ్రేష్టి గారిపై  మిక్కుటం అని పిస్తుంది .కావలసిన సామగ్రి అందించి,రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి ,తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం, ఇంగ్లిష్ ,హిందీ భాషలను ప్రోత్సహించటానికి తగిన గ్రంథాలను సమకూర్చారు .సాధారణ పాఠకులకోసం ,మహిళల కొరకు    వార్తాపత్రికలు, మేగజైన్లు తెప్పించారు  సంచార గ్రంధాలయాలు నడిపారు . తరువాత దీన్ని అభివృద్ధి చేసినవారు శ్రీ అడుసుమిల్లి  శ్రీనివాస రావు పంతులుగారు .

        ప్రముఖుల సందర్శన

.1929లో జాతిపిత మహాత్మా గాంధీ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు .1935లో గాంధీజీ రెండో సారి రావటం చిరస్మరణీయం .

1935లో భారత తొలి రాష్ట్ర పతి శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ సరస్వతీ నిలయాన్ని సందర్శించారు.భవనాల ప్రారంభోత్సవం సేఠ్ జమ్నాలాల్ బజాజ్ ,ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గార్లు చేశారు.దీన్ని సందర్శించిన ప్రముఖులలో శ్రీ చిలకమర్తి లక్ష్మీ  నరసింహం ,కాశీనాథుని నాగేశ్వరరావు .కట్టమంచి రామ లింగారెడ్డి ,పాతూరి నాగభూషణం గారు మొదలైన ప్రముఖులున్నారు  .

          విద్యా విజ్ఞాన వినోద వికాసాభి వృద్ధి

   ఈ గ్రంథాలయ నిర్వాహకులు పేద విద్యార్దులకోసం ఉచిత పాఠశాల నడిపారు .నిరక్షరాస్యులకోసం పుస్తకాలు పేపర్లు చదివి వినిపించి విషయాలు తెలుసుకొనే ఏర్పాటు కూడా చేశారు .ఆరు బయట ఉన్న స్థలం లో పెద్దలను ఆహ్వానించి  ఉపన్యాసాలిప్పించేవారు .ఆనాడు అందుబాటులో ఉన్న’’ మాజిక్ లాంతరు ‘’నుపయోగించి స్లైడ్స్ ప్రదర్శించి పారిశుద్ధ్యం ,ట్రాఫిక్ రూల్స్ ,మొదలైన సమాజ విషయాలను తెలియేసేవారు .పుస్తకాలవరకూ మాత్రమె లైబ్రరీ కాదు , సమాజ  అవసరాలకూ అది తోడ్పదాలన్న శ్రేష్టి గారి ‘’శ్రేష్టమైన’’ ఆలోచనకు గోపురమే ఈ  సారస్వత  నికేతనం .ఏ శుభ ముహూర్తం లోప్రారంభమై౦దో,ఏ శుభ దేవతలు  ఆశీస్సు లంది౦చారో కాని, అవిచ్చిన్నంగా వారి ఆశయాలకు అనుగుణంగా ,నడుస్తూ తనను తానూ తీర్చి దిద్దుకొంటూ  సమాజాన్నీ అన్ని కోణాల్లోనూ ఆదుకొంటోంది .స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు లాభాపేక్ష లేని ప్రైవేట్ యాజమాన్యం లో నడవటం విశేషం . ఇందులో పని చేసిన గ్రంథాలయ అధికారులు ,వర్కర్లు కూడా స్వచ్చందంగా సేవ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు .వారికిది  సరస్వతీ దేవాలయమే .మనకు కావలసిన పుస్తకం  సుమారు  లక్ష దాకా  పుస్తకాలలో ఏ బీరువాలో ఎన్నో నంబర్ లో దొరుకు తుందో చెప్పగలిగిన సుదీర్ఘ కాలం పని చేసిన లైబ్రేరియన్ ఉన్నారంటే ,యెంత అంకిత భావం తో ఇక్కడ సేవ చేస్తున్నారో అర్ధమౌతుంది . ఆనాటి యువజనులు ‘’హిందూ యువజన సంఘం ‘’పేరిట సంస్థ స్థాపించి ,కార్యకలాపాలను ఇక్కడే నిర్వహించేవారు .లైబ్రరీకి అండ దండలు గా ఉండేవారు .ఈ ప్రాంతపు  సారస్వత తృష్ణ తీర్చి కర్తవ్య పరాయణులను చేస్తోంది వేటపాలెం సారస్వత నికేతన్ .ఇన్ని విధాల సేవలు ఈ గ్రంథాలయం అందించి సమాజానికి దగ్గరై,సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించి విద్యా విజ్ఞాన  వికాస కేంద్రంగా భాసించి ఆదర్శ ప్రాయమైనది .

                ప్రత్యేకతలు

   మనకు కావాల్సిన తెలుగు పుస్తకం ఏ లైబ్రరీలోనూ దొరకకపోతే  అది తప్పకుండా వేటపాలెం గ్రంధాలయం లో దొరుకు తుంది అనే నమ్మకం నిలబెట్టు కొని తన ప్రత్యేకత చాటుకుంది .మనకున్న అతి ప్రాచీన గ్రంథాలయాలలో దీని తర్వాత చెప్పుకో తగింది కడపలోని బ్రౌన్ లైబ్రరీ .ఏ నాటి వార్తాపత్రికైనా మేగజైన్ అయినా ఇక్కడ లభ్యమౌతుంది .వాటిని అతి భద్రంగా జాగ్రత్త చేసి సంరక్షిస్తున్నారు .పరిశోధకుల పాలిటి కొంగుబంగారం గా వర్ధిల్లు తోంది. అమెరికా ,జపాన్ ,ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి ,భారత దేశం లో అన్ని ప్రాంతాలనుండి పరిశోధకులు ‘’పుస్తకాల వేట’’లో వేటపాలెం వచ్చి గ్రంథాలయ భవనాలలో బస చేసి ,సౌకర్యాలను విని యోగించుకొని తమ ప్రాజెక్ట్ లను నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని సఫల మనోరధు లౌతున్నారు .కొన్ని వేలమంది ఇక్కడ పరిశోధనలకోసం వచ్చారు .

                వివిధ కార్యక్రమాల వేదిక –సాహితీ మూర్తుల స్పందన

  మొదట పెంకు టి౦ట్లో ప్రారంభమై ,నేడు కాంక్రీటు రెండు అంతస్ధుల భవనాలలో  విరాజిల్లు తోంది ఇక్కడి’’ సారస్వత  సరస్వతి ‘’..ఇక్కడే 1942లో గుంటూరు జిల్లా గ్రంథాలయాధికారుల  సభ  అంతర్జాతీయ సహకార ఉద్యమ సభ ,దక్షిణభారత యువత విద్యాసదస్సు జరిగాయి .1950లో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ‘’జర్నలిజం తరగతులకు ‘’ప్రధాన ఆచార్యులుగా వ్యవహరించారు  .శ్రీ తల్లావఝల శివ శంకర శాస్త్రి శ్రీ తల్లావఝల కృత్తివాస తీర్ధులు ,మహాకవి శ్రీ బండ్ల సుబ్రహ్మణ్యం ,శ్రీ మాచి రాజు దేవీ ప్రసాద్ ,శ్రీ నేలనూతుల కృష్ణమూర్తి ,శ్రీ బూదరాజు రాధా కృష్ణ వంటి రచయితలూ ఈ సరస్వతీ ప్రాంగణం గురించి విపులంగా రాశారు .వేట పాలెం నివాసి ,ఆర్ధిక -గణాంక శాస్త్ర నిపుణులు  దేశ విదేశాలలో అత్యున్నత పదవులనలంకరించి రిటైరయిన సాహితీ వేత్త శ్రీ బందా లక్ష్మీ నరసింహారావు  ‘’సారస్వత నికేతన్ ‘’చరిత్రను రచించి శాశ్వతం చేస్తున్నారు .

  ‘’వేట పాలెము తెలుగుల పేర్మి ధనము –నిత్య పరిశోధనకాంచి తౌన్నత్య గృహము’’అని శ్రీ గుండు మధుసూదన్ ,’’వేట వలదోయి ,గ్రంథాలు వేలకొలది –ఒక్క చోటనే దొరకును నిక్కముగను ‘’అని శ్రీమతి నేదునూరి రాజేశ్వరి ,’’జ్ఞాన దాహపరుల దాహార్తి దీర్చు చెలమ ‘’ అని మరోకకవి ఈ గ్రంధాలయాన్ని కవిత్వం తో ప్రస్తుతించారు .

                  సందర్శనాభి లాష

  ఇంతటి ఘన చరిత్ర ఉన్న సరస్వతీ మహల్ ను  దర్శించాలని సారస్వతాభిమానులకందరికీ ఉ౦డటం సహజం .దాని శత వసంత వేడుకలలో పాల్గొనటం అదృష్టం .కాని అప్పటిదాకా ఆగటం ఎందుకు ?2018 లోనే సందర్శించి ,అక్కడ సభ జరిపి దాని ఉన్నతికి కృషి చేసిన వారిని సంస్మరించి ,సేవ చేస్తున్న వారిని సత్కరించి ‘’ మనం ముందు౦దా౦ ‘’అనే ‘’నావెల్ థాట్ ‘’ఆంద్ర ప్రదేశ్ రచయితల సఘం కార్యదర్శి రమ్యభారతి సంపాదకుడు ,కవి కధకుడు విమర్శకుడు ,అనుక్షణ సాహిత్యోప జీవి శ్రీ చలపాక ప్రకాష్ కు రావటం ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు,కవి రచయిత సోమేపల్లి పురస్కారస్థాపకులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి చెప్పటం వారు ఆమోదించటం ,వీలైనంత మంది కవులు రచయితలూ పాల్గోనేట్లు ప్రణాళిక సిద్ధం చేసి ,అక్కడ వేటపాలెం లోని నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి ,ఏర్పాట్లు చేయించి ,అందరినీ  అందరికీ అనుకూలమైన  ఈ 30-12-18 ఆదివారం  యాత్రలో పాల్గోనేట్లు అవిరళ కృషి చేసి  సందర్శన యాత్ర కు ఘన విజయం చేకూర్చి ,ఈ సరస్వతీ యాత్రాఫలాన్ని సాహిత్యాభి మానులకు అందజేసిన శ్రీ చలపాక కృషికి హాట్స్ ఆఫ్ .

  శ్రీ చలపాక కృషి ఫలించి ,మాధ్యమాలలో,  వాట్సాప్ వార్తలలో చూసి రచయితలకూ స్పందనకలిగి చూడాలని ,పాల్గొనాలని ఉత్సాహం గా  సందర్శన యాత్రలో  ఎవరి ఖర్చు వారు భరించి  స్వచ్చందంగా భాగ స్వాములయ్యారు . .బొంబాయి ఇండియన్ ఎక్స్ ప్రెస్  ‘’య౦గ్ అండ్ ఎనర్జేటిక్’ విలేకరి కుమారి’’ రితిక ‘’మాతో పాల్గొనటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది , ప్రకాష్ కే ఆశ్చర్యమేసింది .విజయవాడ విలేకరి శ్రీ ప్రశాంత్  కెమెరామన్ గా ,విషయ వివరణకు సహాయకునిగా ఆమెకు తోడ్పడ్డారు   .అలాగే చెన్నై, విశాఖ లనుంచి ,ప్రకాశం నెల్లూరు ,గుంటూరు జిల్లాలనుంచి పాల్గొన్నారు .చలపాక అధ్వర్యం లో విజయవాడ నుంచి  ఆయనా ,ఆయన అర్ధాంగి, తమ్ముడి కుమారుడు ,నేనూ,  ప్రముఖ కవి కధకులు విమర్శకులు  శ్రీ  సి హెచ్ , వి .బృందావనరావు ,రిటైర్డ్ లెక్చరర్  కవి శ్రీ చెన్నకేశవ ,శారదా విపంచి అధ్యక్షురాలు శ్రీమతి కోనేరు కల్పన,కవయిత్రి శ్రీమతి సింహాద్రి  వాణి , దుగ్గిరాలనుండి కవి శ్రీ మరో చలం మొదలైన వాళ్ళం 13 మంది ఉన్నాం . మొత్తం మీద వేట పాలెం సందర్శన యాత్రలో సుమారు 50 మంది సాహితీ కారులు ఉండటం విశేషమే ,యాత్రా విశేషాలు వేటపాలెం సభా విషయాలు, అక్కడి అనాధ వృద్ధాశ్రమ౦ సంగతులు వివరంగా మరో వ్యాసం లో తెలియ జేస్తాను .   

.   సశేషం

  2019 నూతన సంవత్సర శుభాకాంక్షలతో –

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2019-ఉయ్యూరు   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం -3(చివరిభాగం )

ఫిన్ లాండ్ లో బడులు  రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా  ఎంచక్కా  రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా బడికి వెళ్తారు ,హోం వర్క్  సంస్కృతికి బండెడు పుస్తకాల బరువుకీ  చరమగీతం ఎప్పుడో పాడేశారు .ఆరో తరగతిదాకా ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనేలేదు .ఆపై క్లాసులలో ఇచ్చేదాన్నిబట్టి హోమ్ వర్క్ అరగంటలో పూర్తి చేస్తారు .అందుకే బడి గేట్లు ఉదయం తొమ్మిది తర్వాతే తెరచుకొని మధ్యాహ్నం రెండున్నరకల్లా  బంద్ అవుతాయి .అంటే రోజూ ఒంటిపూట బడేనన్నమాట .రోజుకు బోధన నాలుగు పీరియడ్లు మాత్రమే . ప్రతి పీరియడ్ కి మధ్యలో పావుగంట విరామం .ఆ సమయం లో చిరుతిళ్ళు అంటే స్నాక్ ఠంచనుగాఅందుతాయి .రోజుకో గంట ఆట ల విరామమ తప్పని సరి .పిల్లల ఆహారం గురంచి తలిదండ్రులకు బెంగ అక్కర్లేదు .చదువు పూర్తయ్యే దాకా ప్రభుత్వానిదే అన్ని బాధ్యతలూ .మంచి పోషకాహారం ఇష్టమైన రుచులలో అందుతుంది .

‘’అందరూ సమానంగా చదివి అందరూ టాపర్లు కావాలి ‘’అన్నది ఫిన్లాండ్ లక్ష్యం .తరగతికి 15నుంచి 20మంది విద్యార్ధులే ఉంటారు కనీసం నాలుగు తరగతులవరకు ఒకే ఉపాధ్యాయ బృందం పిల్లలకు పాఠాలు చెప్పటం ఇక్కడ ప్రత్యేకం ,ఈ నాలుగేళ్ళలో పిల్లల సామర్ధ్యం ,సబ్జేక్ట్ లపై   అవగాహన గురించి  టీచర్లకు మంచి అవగాహన కలుగుతుంది .ఎప్పటికప్పుడు వివిధ అంశాలలో ప్రతిభ ఆధారంగా వాళ్ళ సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు .ఏడాది చివర్లో లెక్కలు సైన్స్ లలో పరీక్షలు పెట్టినా ,వాటిలో మార్కులను బయట పెట్టరు .తమబోధన ఎలాఉంది పిల్లలు ఎలా రిసీవ్ చేసుకొంటున్నారు అని టీచర్లు అంచనా వేసుకొంటారు .వారి జవాబు పత్రాల ఆధారం గా మరుసటి ఏడు శిక్షణలో అవసరమైన మార్పులు చేసుకొంటారు .ఒక్కో తరగతి మారే కొద్దీ పిల్లలలో విజ్ఞానం తో పాటు వ్యక్తిత్వమూ పెరుగుతుంది .

16 ఏళ్ళ వరకు పరీక్షలే రాయని విద్యార్ధులు తోమ్మిదోతరగతి గ్రేడ్ చివర్లో తమజీవితం లో మొదటి ‘’పెద్ద పరీక్ష ‘’రాస్తారు .పైతరగతులకు వెళ్ళాలంటే ఇది తప్పక పాసవాల్సిందే .పరీక్షలు బుర్రకు పదును పెట్టకుండా  ఆయా  అంశాలలో వారి ప్రాధమిక జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేవిగా ఉంటాయి కనుక పరీక్షల్లో తప్పటం అనేది జరగదు .తొమ్మిదో గ్రేడ్ తర్వాత చదువు కొనసాగి౦చాలా వద్దా అన్నది పిల్లల ఇష్టమే .ఉన్నత విద్యకోసం ‘’అప్పర్ సెకండరి ఎడ్యుకేషన్ ‘’కాలేజీల బాట పడతారు .చదువుపై ఆసక్తిలేనివారు వృత్తి విద్యలలో శిక్షణ తీసుకొని   స్థిర పడతారు  .దేన్ని   ఎంచుకున్నా ఫీజుల భారం ఫిన్ లాండ్ ప్రభుత్వానిదే .పిల్లల చదువుఖర్చులు ,పాఠశాల విద్యా ప్రమాణాల గురించి చింత ఎవరికీఅక్కర్లేదు .కనుక ఫిన్ లాండ్ దేశం విద్యార్ధుల, ఉపాధ్యాయుల,  తలిదండ్రుల పాలిటి భూలోక స్వర్గం అని పిస్తుంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-18-ఉయ్యూరు .

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం

ఫిన్ లాండ్ లో ‘’ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ డెవలప్ మెంట్ ‘’అనే సంస్థ ,మూడేళ్ళ కోసారి ప్రపంచ స్థాయి లెక్కలు ,సైన్స్ మొదలైన అంశాలలో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించటానికి పోటీ నిర్వహిస్తుంది .నాలుగేళ్ళ క్రితం భారత్ ఆ పోటీలో పాల్గొని చివరి నుంచి ,రెండో స్థానం పొంది ‘’,సిగ్గుతో చిమిడి ‘’మళ్ళీ పోటీలో పాల్గొన లేదు .ఈ పోటీలలో ఫిన్ లాండ్ ఎన్నో ఏళ్ళుగా మొదటి స్థానం పొందుతోంది .అక్కడ తలసరి ఆదాయం లో 7శాతం చదువుపై ఖర్చుచేస్తుంటే మనదేశం 3.3శాతం తో చెయ్యి దులుపుకొంటో౦ది ..అక్కడ స్కూల్ టీచర్ సగటు నెలసారి ఆదాయం రెండున్నర లక్షలు .ఇక్కడ మన పంతుల్ల  ళ్ళకు  31వేలు మాత్రమె .అక్కడ నెల రోజుల్లో చెప్పేదాన్ని ఇక్కడ వారం లోనే లాగించేస్తున్నారు .అందుకే అక్కడ విద్యా వ్యవస్థ ఉత్కృష్ట స్థానం లో ఉంది .ఇదంతా మాజిక్ లాగా అబ్రకదబ్ర గా ఒకే సారి వచ్చింది కాదు .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ఫిన్ లాండ్ భారీగా నష్టపోయి ,విద్యా వ్యవస్థ పరమ చెత్తగా ఉండేది .ఇతర దేశాలతో పోటీపడి ఎదగటానికి ,ప్రగతి పధం లో దూసుకు వెళ్ళటానికి అక్కడి ప్రభుత్వం పౌరులే కీలకం అని గ్రహించిది .డబ్బున్నవాళ్ళు పిల్లల్ని ఖర్చు పెట్టి మంచి స్కూల్ లో చేర్పిస్తుంటే ,డబ్బు లేని సామాన్యుల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు .దీనితో 80వ దశకం లో సమూల ప్రక్షాళన కు శ్రీకారం చుట్టారు .దేశ విద్యా వ్యవస్థను ప్రభుత్వ అధీనం లోకి తెచ్చుకుని ,ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేసేసారు .విద్యార్ధుల ఆర్ధిక పరి  స్థితులతో సంబంధం లేకుండా ,అందరికి సమాన మైన  ఉచిత  నాణ్యమైన  విద్య అందించటం ప్రారంభించి౦ది.అంతే ఇక వెనక్కి తిరిగి చూడకుండా గత 45ఏళ్ళ నుండి అప్త్రతిహత౦ గా ముందుకు దూసుకు వెడుతూ ఇతర దేశాలకంటే విద్యా ప్రమాణాలలో ఎన్నో మైలు రాళ్ళు దాటి ,అగ్రరాజ్యాలను వెనక్కి నెట్టేసి అగ్రగామి అయి ఆదర్శమైంది .ప్రభుత్వం, తలిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య చక్కని సమన్వయ౦  ,ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం తోనే  మిగతా దేశాలను అభివృద్ధి పోటీలో ఫినిష్ చేసి ఈ లక్ష్యాన్ని చేరుకొంది ఫిన్ లాండ్ .అక్కడ రాంకుల హోరు ,రాంకు సాధన పోరు లేనేలేదు. రాంకుల వేటలో మన విద్యార్ధులు అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు .ఫిన్ లాండ్ లో పిల్లలు ఉత్తమ ప్రమాణాలను ఆడుతూ ,పాడుతూ సాధిస్తున్నారు .పిల్లలపై  ఇక్కడ లాగా అక్కడ వత్తిడి లేనేలేదు టెన్షన్ లేదు .ఏటా బోధనా పద్ధతులను అనుగుణంగా మార్చుకొంటోంది .మూడేళ్ళ కోసారి జరిగే ‘’ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసేస్ మెంట్’’(P.I.S.A )లో అమెరికా చైనా జపాన్ వంటి దిగ్గజ దేశాలను ఈ చిట్టి పొట్టి దేశం పిల్లలు  వరుసగా మొదటి స్థానం సాధిస్తున్నారు .విద్యార్ధుల కలలకు, తరగతి గదులకు,పాఠశాల అనుసరించాల్సిన విధానాలకు ,తలిదండ్రులు కూడా పాటించాల్సిన నిబంధనలకు ఫిన్ లాండ్ డ్రీం లాండ్ కావటమే కాదు వాస్తవ భూమిక అయింది .    ఫిన్ లాండ్ లో చిన్నారులు బడిలో కాలు పెట్టాలంటే 7 ఏళ్ళు నిండాల్సిందే .అప్పటిదాకా పలకా బలపం బొక్కుల గొడవ ఉండదు డే కేర్ సెంటర్ లలో ఉంటూ మెదడుకు పదును పెట్టుకొంటారు .ఆరు లోపు పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకొంటాయి దేనినైనా త్వరగా గ్రహించే శక్తి తేలిగ్గా వస్తుంది .కనుక బుర్రలో సబ్జెక్ట్ లు కుక్కకుండా నేర్చుకొనే సామర్ధ్యం పెంచుకొనే  శక్తి  పెంచుతారు .అందరితో కలిసి ఆడుకోవటం ,పద్దతిగా తినట౦ ,నిద్ర పోవటం ,ఒకరికొకరు సాయం చేసుకోవటం ,,శుభ్రత పాటించటం ,భావ వ్యక్తీకరణ సామర్ధ్యం పెంచుకోవటం ,జాలీ, దయా, సానుభూతి, సామాజిక స్పృహ వంటి మానవీయ విలువలను తెలుసుకొని పాటించటం ,అన్ని జీవన నైపుణ్యాలు సాధించటం చేస్తారు .మనకూ ప్లే స్కూల్స్ ,డే కేర్  సెంటర్లు ఉన్నాయి కాని ఈ పధ్ధతి విధానం ఉందా అని నాకు అనుమానం .

పిల్లలు బడికి ఎప్పుడైనా వెళ్ళచ్చు .అంటే’’ కేర్ ఫ్రీ’’ చదువు అనుకొనేరు .కానే కాదు కాని మంచి పౌరుడిగా ఎదగాలనేది అక్కడి ప్రభుత్వ లక్ష్యం .కనుక బాల్యం లో తొలి ఆరేళ్ళు దీనికే కేటా ఇస్తారు ‘’నేర్చు కోవాల్సిన వయసు వస్తే ,వాళ్ళే నేర్చుకొంటారు ‘’అనేది వారి సిద్ధాంతం .ఉన్నత విద్యావంతులు ఉత్తమ పౌరులుగా మారుతారని ఆదేశం గోప్పనమ్మకం .కనుక ప్రతి చిన్నారి చదువు బాధ్యతా ప్రభుత్వమే తీసుకొంటుంది .8నెలల వయసులో డే కేర్ లో కాలు పెట్టినదగ్గరనుంచి ,25ఏళ్ళ తర్వాత యూని వర్సిటీ లో పిహెచ్ డి పొందేదాకా ఒక్క రూపాయి సారీ’’ ఒక్క యూరో’’ కూడా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందిస్తోంది ఫిన్ లాండ్ ప్రభుత్వం .కార్మికుడి కొడుకు దగ్గరనుంచి దేశాధినేత పిల్లాడి దాకా అందరూ ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకొని బయటికి రావాల్సిందే .సంపన్న కుటుంబం లో పుట్టినా చదువు విషయం లో అందరితో సమానంగా నే నేర్వాలి .పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకు ఉన్న స్కూళ్ళల్లో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందించటం ఇక్కడి ప్రత్యేకత .

మన దేశం ఉగ్గు గిన్నెలు స్వెట్టర్లు ఉయ్యాలా వంటివి పసిపిల్లల తలిదండ్రులకు కానుకగా ఇస్తే అక్కడ బిడ్డ ఆస్పత్రిలో బిడ్డ పుట్టి  బయటికి తీసుకు వెళ్ళేటప్పుడు డాక్టర్లు ఉపయుక్తమైన మూడు పుస్తకాలు  పేరెంట్స్ చేతిలో పెడతారు .పిల్లల్ని చదివిస్తూ ,తలిదండ్రులు పుస్తకాలు చదివే వ్యాసంగం కొన సాగించాలని చెప్పే విధానమే ఇందులో పరమార్ధం .పిల్లల్ని ఆరోగ్యంగా పెంచి సంరక్షి౦చటానికి తల్లికి 8 నెలల ప్రసూతి సెలవ ఇస్తారు .ఆ తర్వాత కూడా ఉద్యోగానికి వెళ్ళలేని పరస్థితి ఉంటె మూడేళ్ళు ‘’డే కేర్ అలవెన్స్’’అందిస్తారు .అయితే ఈ సదుపాయాన్ని అక్కడి తల్లుల్లో 3శాతం మంది మాత్రమేవాడుకొంటున్నారు  .అంటే బెవార్స్ గా డబ్బు వస్తోంది కదా దుర్వినియోగం చేయరు .అర్హులకు అందాలని అందరి ఆరాటం .   .ఆరేళ్ళ వరకు పిల్లలు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలోనే హాయిగా పెరగవచ్చు .ఇక్కడ 12మంది పిల్లలకు ఒక టీచర్ ,ఒక నర్సు ఉంటారు .చిన్నారుల ఆలనాపాలనా ,జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యత వాళ్ళే తీసుకొంటారు.

ఇక్కడి నుంచి బయటికి వచ్చాక పిల్లలు అయిదేళ్ళ పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర 12మంది పిల్లలు పెరుగుతారు .తలిదండ్రుల తర్వాత పిల్లలకు టీచర్ తోనే అత్యంత అనుబంధమేర్పడుతుంది .వాళ్ళ స్వభావం సామర్ధ్యం అర్ధం చేసుకొని టీచర్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాడు .ఈ అయిదేళ్ళలో తరగతి పాఠాలు ఉండనే ఉండవు .పరిసరాలైన జంతువులూ వృక్షాలు పక్షులు మనుషుల గురించే నేర్పిస్తారు .సంరక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తయ్యాక ,పిల్లల్నిఎక్కడ చేర్పించాలి  అనే టెన్షన్ ఉండదు .పల్లెనుంచి ,పట్నం దాకా ప్రతి స్కూల్ కు ప్రభుత్వం నుంచి ఒకే స్థాయి లో నిధులు  అందుతాయి  .ఒకే తరహా విద్యార్హతలు సామర్ధ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు .కనుక ఏది మంచి స్కూలు అని ఆలోచి౦చనక్కర  లేదు .అన్నీ మంచి స్కూళ్ళే.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-18-ఉయ్యూరు

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 2 Comments

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)

     చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ లో ఇందిరా గాంధి ఎమర్జెన్సీ కాలం లో అండర్ గ గ్రౌండ్ కు వెళ్లి ,వీర సావర్కార్ ,స్వామి వివేకానంద లపై సంస్కృత రచనలు చదివి ప్రభావితుడై సంస్కృతమే ఊపిరిగా భావించాడు .

  1981లో కృష్ణ శాస్త్రి ,స్నేహితులుకలిసి బెంగళూర్ లో ‘’సంస్కృత భాషణ ‘’(స్పోకెన్ లాంగ్వేజ్ )ఉద్యమ౦ ప్రారంభించారు .అంటే సంస్కృతాన్ని సంస్కృతం లోనే నేర్వాలి తప్ప వేరే భాష సహాయం తో కాదు అనే ఉద్యమం .అందుకని సంప్రదాయ విధానమైన వ్యాకరణం తో ప్రారంభించటానికి బదులు సంభాషణ రూపం లో సంస్కృతం నేర్చుకొనే నూతన విధానానికి శ్రీకారం చుట్టాడు .సంస్కృతం  అభ్యసించేవారికి ఇది వరప్రసాదమై అందులో అతి తక్కువకాలం లో నిష్ణాతులయ్యారు .దీనితో కొద్దిపాటి చదువున్నవారు  కూడా సంస్కృతం నేర్వటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు .

  సంస్కృత భాషా వ్యాప్తికోసం చాము కృష్ణ శాస్త్రి ‘’సంస్కృత భారతి ‘’సంస్థను లాభాపేక్ష లేకుండా స్థాపించి ,తక్కువకాలం లో సంస్కృతం నేర్పెట్లు ఏర్పాటు చేశాడు .’’పదిరోజుల్లో సంస్కృతం లో మాట్లాడటం  ఎలా ‘’ (టెన్ డేసాంస్క్రిట్ స్పీకింగ్ కోర్స్ )ఉద్యమాన్ని దేశమంతా ప్రచారం చేసి  తగిన వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని  ఉచితంగా నేర్పుతూ ఘన విజయం సాధించాడు .కోటి మంది ప్రజలకుఈ కోర్సు విధానం లో సంస్కృతం లో మాట్లాడే అవకాశం కలిపించాడు .ఒక లక్షమంది ఇళ్ళల్లో సంప్రదాయ విధానం లో సంస్కృతం లో మాట్లాడుతున్నారు .

  సంస్కృత భారతి ప్రభావం విశ్వ విద్యాలయాలు కాలేజీల పై పడి సంస్కృతం లో సంభాషించే కోర్సులను ఏర్పాటు చేశాయి .అమెరికాలో’’ SAFL కోర్స్ ‘’అంటే ‘’సాంస్క్రిట్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ కోర్స్’’ భారతీయ చిన్నారులలో బాగా హిట్ అయింది.భారత దేశం లోనే కాక కెనడా అమెరికా ,యుకె ,యు ఏ యి వంటి 13 దేశాలలో కూడా సంస్కృత భారతి శాఖలు అత్యద్భుతంగా అంకిత భావం తో సేవ చేసున్నాయి .అంతేకాదు ఆ సంస్థ  గుజరాత్ లో సంస్కృత భాష పునరుజ్జీవనాన్నికూడా  సాధించింది.

    ‘’సంస్కృత గృహాలు ‘’, సంస్కృత మాతృభాషా పిల్లలు ‘’వంటి ప్రయోగాలు కూడా చేసి ఈ సంస్థ విజయాలు సాధించింది .’’సరస్వతి సేవ ‘’పేరిట వందలాది ఇతర భాషా పుస్తకాలను సంస్కృతం లోని అనువాదం చేయించింది .యువ రచయితలను ,పాఠకులను ఆకర్షించటానికి ‘’సంస్కృత పుస్తకోత్సవాలు ‘’’’,సాహిత్యోత్సవాలు  ‘’నిర్వహించాడు శాస్త్రి .భారత దేశం లో ఇంగ్లిష్ ,హిందీ స్థానం లో సంస్కృతమే అనుసంధాన భాషగా(లింగ్వా ఫ్రాంకా ) ఉండాలని ,చేయాలని శాస్త్రి మనసారా కోరాడు .సంస్కృత భాష ఒక్కటే భారత ప్రజలందర్నీ ఒక్కటిగాచేయగాలిగేది అని ఖచ్చితం గా నమ్మాడు .సాంఘిక ఉన్నతి, ఐకమత్యాల సాధనకు సంస్కృతమే వేదిక కావాలని అంటాడు .

  తనకున్న ఆశయాల సాధనకు శాస్త్రి ‘’సాంస్క్రిట్ ప్రమోషన్ ఫౌండేషన్ ‘’సంస్థ ను వాలంటరీ సంస్థగా ఏర్పాటు చేశాడు .సమాజం లో అణగారిన ప్రజలకు సమాజ అభ్యున్నతికి ,సంస్కృతికి సంస్కృతమే ఆధారం అని భావించాడు .ఈ సంస్థ ట్రస్టీలు గా భారత సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి  శ్రీ ఆర్ సి లాహోటి ,మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ యెన్ గోపాలస్వామి ,జస్టిస్ రామ జాయిస్ ,శ్రీ గురుమూర్తి వంటి ప్రముఖులున్నారు .దీనికి శాస్త్రి ముఖ్య ట్రష్టి మరియు సెక్రెటరి.

  ఎక్కువకాలం టీచర్ ట్రెయిని౦గ్ వర్క్ షాప్ లలో  లెర్నింగ్ మెటీరియల్స్ తయారీ ,సంస్కృత విద్యా చర్చలలో శాస్త్రి గడుపుతాడు .సంస్కృత భాష నేర్పటమే కాదు గణితం ,కెమిస్ట్రి,హిస్టరి మొదలైన సబ్జెక్ట్ లను కూడా సంస్కృతం లోనే నేర్పాలన్నది శాస్త్రి ఆశయం ,ధ్యేయం.కేంద్ర ప్రభుత్వ’’ రోడ్ మాప్ ఫర్ ది డెవలప్ మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ –టెన్ యియర్ ప్రాస్పెక్టివ్ ప్లాన్  డాక్యుమెంట్ ‘’   కమిటీలో శాస్త్రిని 2016లో గౌరవ సభ్యుని చేశారు .శాస్త్రికి ఉన్న అపార అనుభవం తో ‘’బోర్డ్ ఆఫ్ రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ‘’వంటి అనేక సంస్థలలో గౌరవ సభ్యుడయ్యాడు .సంస్కృతం లో అనర్గళంగా ,ఆలోచనాపూర్వాకం గా మాట్లాడే నేర్పు శాస్త్రి ది.భగవద్గీత ఆదర్శం గా ఆయన జీవిస్తాడు. ప్రశంసలకు పురస్కారాలకు దూరం .

  కార్యకర్త మాత్రమేకాక శాస్త్రి  సంస్కృత  గ్రంథ కర్త కూడా –సావదాన్ శ్యాం ,ఉత్తిష్ట మా స్వప్తః ,పరిష్కారః  (వ్యాస  సంపుటి )  రచించాడు .శాస్త్రి చేసిన సంస్కృత సేవకు కాశీ విద్యా పీఠం’’సారస్వత సుధాకర ‘’ అఖిలభారత విద్యార్ధి పరిషత్ ‘’రాస్ట్రీయ యువ పురస్కార ‘’అందజేశాయి .కేంద్ర ప్రభుత్వం 2017లో ‘’పద్మశ్రీ ‘’పురస్కార మిచ్చి గౌరవించింది .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

 

image.png

 నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు  దాసు శ్రీరాములు గారు – పరిచయము
– నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ 

అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన యశస్సు గాంచిన కొక్కొండ వేంకటరత్నం పంతులు, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, గోపీనాధం వేంకటకవి, వసురాయకవి (వడ్డాది సుబ్బారాయడు) మున్నగు వారి శతాబ్దజయంతులు జరుగనే లేదు. ఆ మహాకవి పండితుల కోవలోని వారే దాసు శ్రీరామ కవీంద్రులు.

ఆధునిక వాఙ్మయ చరిత్రలో శ్రీరాములుగారి కింకొక విశిష్టత గలదు. లౌకిక వృత్తిచే న్యాయవాదులయ్యు సాహిత్య ప్రపంచమున స్థిరకీర్తి నార్జించిన వారాకాలమున గలరు. ఆంధ్రనాటక పితామహ ధర్మవరము రామకృష్ణమాచార్యులు, ప్రథమ చారిత్రక నాటకకర్త కోలాచలము శ్రీనివాసరావుగార్లు న్యాయవాదులే. న్యాయవాది పట్టము బడసి ప్రభుత్వోన్నతోద్యోగులైన – భాషా ప్రపంచమున కసమానమగు సేవ గావించిన శ్రీ జయంతి రామయ్య పంతులుగారును స్మరణీయులు. ఈ దృష్టితోఁజూచిన శ్రీరాములుగారికి నవ్యయుగమున నున్నత స్థానము గలదు.

సంస్కృతాంధ్ర భాషలలో కవిపండితులగుటయేగాక, శాస్త్ర విద్వాంసులగుటయు, శ్రీరాములుగారి యింకొక విశిష్టత – వారి సమకాలికులలో కొక్కొండ వారి తరువాత, కవిపండితులలో శాస్త్ర విద్వత్తుగలవారు శ్రీరాములుగారొక్కరే – వారికి ధర్మశాస్త్రము, భరతశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము మొదలగు శాస్త్రములందు మంచి ప్రావీణ్యము గలదు.

1901వ సంవత్సరమున (ప్లవ) నధికమాస నిర్ణయమును గూర్చి తెలుగుదేశమున జెడ్డ వివాదము చెలరేగినది. ప్రఖ్యాత పంచాంగ కర్తలైన పిడపర్తివారు అధికమాసము వచ్చునని వాదింపగా, రాణి మహాగ్ని చిన్న నరసింహ విద్వాంసులు (వీరే రాణీచయనులు గారని పేరుపొందినవారు) రాదని వాదించిరి. రాజమహేంద్రవరములో జరిగిన యీ నిర్ణయ సభకు, ఆంధ్రదేశమున జ్యోతిష్కులందరునూ వచ్చిరి. ఆ మహాసభకు శ్రీరాములుగారే అధ్యక్షులై అధిక మాసము వచ్చునని తీర్పు చెప్పిరి. సభవారు వారి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యమున కాశ్చర్యచకితులైరి.

సమకాలిక సాహిత్య ప్రక్రియల యందన్నింటనూ శ్రీరాములు గారు సిద్ధహస్తులు.

  1. పురాణ ప్రక్రియ: వీరికి ముందు ములుగు పాపయారాధ్యుల వారును, త్రిపురాన తమ్మయ్య దొరగారును దేవీభాగవతమును రచించిరి. కాని దాసువారి ఆంధ్రీకరణము తోడనే దానికి వ్యాప్తి కలిగినది. శ్రీరాములుగారి కృతి తరువాతనే పురాణ రచన తిరిగి ప్రారంభమైనది. జనమంచి శేషాద్రిశర్మగారి బ్రహ్మాండ పురాణము, ములుగు చంద్రమౌళిశాస్త్రిగారి లింగ కూర్మ పురాణములు వెలసినవి.
  2. శతక ప్రక్రియ: ఈ ప్రక్రియలో వీరితరులకన్నా నాలుగు విధములుగా ప్రత్యేకత చూపిరి.
    1. సంస్కృత భాషలోనే శతకము రచించుట – కామాక్షీ శతకము.
    2. సంస్కృత శతకానువాదము చేయట – సూర్య శతకము; సంస్కృతమున మయూర మహాకవి రచించిన సూర్యశతకము మహా ప్రౌఢకృతి. శ్రీనాధుడు కొన్ని శ్లోకములకు పద్యములు రచించినాడు. కాని శ్రీరాములుగారు పూర్తిగా దీనిననువదించినారు. ఇది విశేషముగా నభినందింపదగినది. దీని ముద్రిత ప్రతి గౌతమీ గ్రంథాలయము (రాజమండ్రి)న గలదు.
    3. తెలుగు శతక రచనము: సోమలింగ శతకము, చిలుకల కొలికి శతకము, ముద్దులగుమ్మ శతకము.
    4. అచ్చతెలుగు శతకరచన: చక్కట్లదండ. వీరి దేవీభాగవతమున రెండు శతకములు సందర్భానుసారముగ గలవు.
  3. నాటక ప్రక్రియ: ఇందునూ త్రివిధములుగా వీరు ప్రత్యేకతను ప్రదర్శించిరి.
      1. అనువాదములు: శ్రీరాములుగారి సమకాలికముగా సంస్కృత నాటకానువాదములు చేయుట పరిపాటియైనది. వీరు, రామభద్ర దీక్షితుని జానకీ పరిణయమునూ, భవభూతి మాలతీ మాధవము, మహావీర చరిత్రలనూ ఆంధ్రీకరించిరి. వీనిలో మాలతీ మాధవము “సరస్వతి” అను పత్రికలోను, మహావీర చరిత్ర “మంజువాణి” అను పత్రికలోనూ ప్రకటితములైనవి. ఇంకనూ ముద్రారాక్షస, మృచ్ఛకటిక, రత్నావళి, మంజరీ మధుకరీయము మున్నగువానిని తెనిగించినట్లు తెలియుచున్నది.
      2. స్వతంత్ర నాటక రచనము: మహాలక్ష్మీ విలాసము, సీతా కళ్యాణము.

    1. అచ్చతెనుగు రచన: శాకుంతల నాటకాంధ్రీకరణము అచ్చ తెనుగున నాటకము రచించినవారు శ్రీరాములు తక్క వేఱెవ్వరు లేరు.1
  4. ఖండ కావ్య ప్రక్రియ: అధునాతన ఖండ కావ్య ప్రక్రియకు నొకవిధముగా ఆద్యులువీరే.

    వీరి ‘తెలుగునాడు’ అను ఆంధ్రవీధి స్వతంత్రమగు సాంఘిక కావ్యము. 14వ శతాబ్దిని క్రీడాభిరామము వెనుక వెలసిన సాంఘిక వ్యవస్థను నిరూపించు కృతియిదే. క్రీడాభిరామములో చరిత్ర, సాంఘిక ప్రవృత్తులు రెండూ కలసియున్నవి. తెలుఁగునాడులో నితివృత్తము కేవలము సాంఘికము – దాసువారి కృతులలో హెచ్చు ప్రచారము బడసినది తెలుఁగునాడే.

    ఈ నవయుగములో సాంఘికేతివృత్త రచనకిదియే మొదలు. దీని తరువాత ప్రసిద్ధమైనది భోగరాజు నారాయణమూర్తిగారి పండుగ కట్నము.

  5. వచనప్రక్రియ: ఆ కాలమున గ్రాంథికవచన రచన చేయుట వ్యాప్తిలో నుండెను. శ్రీరాములు గారి “అభినవ గద్యప్రబంధము” చిన్నయసూరి గ్రాంథికశైలిలో రచితమైనది.
  6. శాస్త్ర గ్రంధములు: తెలుగులో శాస్త్ర గ్రంథరచన శ్రీరాములుగారి కాలమున ప్రారంభదశలో నుండెను. వారు తమ అభినవ కౌముది, తర్క కౌముది, వైశ్యధర్మ ప్రదీపిక, సారసీలగ్రహ గణితము (గణిత శాస్త్రము), అభినయ దర్పణము (నాట్య శాస్త్రము) మున్నగు రచనలచే నీ గ్రంథరచనకు నెంతో దోహదము గావించిరి.
  7. పద కవిత్వము: శ్రీరాములగారు పద్యకవిత్వ మందెంత ప్రవీణులో, పదకవిత్వ రచనము నందంత దిట్టలు. వీరు పదములనేగాక జావళీలను విశేషముగా రచించినారు. వీరు సంగీత నాట్యనాటక శాఖలకు చేసిన సేవ గుర్తించి సంగీత నాటక అకాడమీవారు నాట్యకళలో వీరిని గూర్చి రాసినారు.

ఇట్లు సప్తవిధ సాహిత్య ప్రక్రియలను సాధించుటయేగాక, వారి కవితా రచన యందు స్వతంత్రత వహించిరి. కవుల పోకడలను జీర్ణించుకుని, లక్ష్యలక్షణ వివేచనతో కవితారచన సాగించుట వీరి కావ్యములో ముఖ్య లక్షణము. 1. రేఫఱకారముల ప్రాసలో నుపయోగింపకూడదు. 2. పూర్వకవికృత పదజాలమునే వాడవలెను. 3. పూర్వకవి భావముల ననుసరింపవలెను అన్న లాక్షణిక నియమముల నన్నింటిని వీరి చర్చించి స్వతంత్రము, సజీవము, జాతీయమునైన రచనా రీతిని తమ గ్రంథములలో సుప్రతిష్ఠితము చేసినారు. పై విషయములు వారు దేవీ భాగవత పీఠికలో చర్చించినారు.

వారి కాలమున శబ్దరత్నాకరము కవులకు ప్రధానగ్రంథముగా నుండెడిది. వసురాయకవిగారి ప్రక్కనెప్పుడు శబ్దరత్నాకరముండెడిది. కవి పండితులలో, అందలి పదములనే తప్ప వాడకూడదని అభిప్రాయము బలీయమై యుండెడిది. శ్రీరాములు గారు స్వతంత్రించి ఇస్త్రి, రుమాలు, లింగకాయ మున్నగు వ్యావహారిక పదములను ప్రయోగించి వానికి గ్రాంథికతావస్థ చేకూర్చినారు.

“కవియే భాషానుశాసకుఁడు
కవి ప్రయోగ మూలము వ్యాకరణము”
అని వీరి సిద్ధాంతము.

అద్యతన కాలమున స్వాభావిక వర్ణనలకు వీరిది పెట్టిన పేరు. దేవీ భాగవతమునందు “అల్లూరి పల్లెటూరి వర్ణన” ఆంధ్రకావ్యవర్ణనలో ననుకరణీయమైది. ఆ వర్ణన ననుసరించి నేను పల్లెవర్ణన గావించితిని. (చూ. మించుపల్లి)

వీరు స్వతంత్రులు, మహాకవులు గావున వీరి గ్రంథములను సావధానముగా నధ్యయనము చేసిన మనకు నేడు, నిఘంటువుల కెక్కని పదములు, పలుకుబళ్ళు, కవితా సంప్రదాయములు నవేలముగా లభింపగలవు.

ప్రాచీన భావ సమన్వయము

సాహిత్యమున కొక్కొండ వారివలెనే శ్రీరాములుగారు సంఘమున ప్రాచీన సంప్రదాయములను, నవ్య సంస్కారముతో సమన్వయము చేసిన వారు. పాశ్చాత్య నాగరికతా సంస్కార విశేషములను గ్రహించి వానిని, మన ప్రాచ్యసంప్రదాయ సారముగా సమన్వయించి దేశ పురోభివృద్ధికి తోడ్పడినారు.

ఆధునిక సాహిత్య యుగ ప్రక్రియలన్నింటియందు బహుముఖ ప్రజ్ఞతో తమ ప్రత్యేక గరిష్ఠ స్థానమును ప్రతిష్టించినవారు శ్రీరాములుగారే.

చెళ్ళపిళ్ళ వారన్నట్లు, శ్రీరాములుగారు సరసకవి, విద్వత్కవి, స్వతంత్ర కవి, ఆశుకవి, దాత, నేత.

రచనలు

వారు 33 గ్రంధములు రచించినట్లు భాగవతావతారికలో చెప్పుకొన్నారు. ఆ గ్రంథములు ముద్రితములైనను, నేడు లభ్యమగుట లేదు.

దిగవల్లి వేంకటశివరావుగారు చెప్పినట్లు వారిజీవితము, ఉదార భావములు, వారి సంతతి వారికే గాక ఆంధ్రులందరికి మేలుబంతులు.

సూచనలు

  1. శ్రీరాములుగారి జీవితచరిత్రను వారి కుమారులు విష్ణురావుగారు 700 అరటావు పుటలలో వ్రాసినారు. అది ముద్రితమగుట అత్యావశ్యకము. ఈనాడు మనకు నవ్యయుగ సాహిత్య చరిత్ర లేదు. అట్టి గ్రంథములు బయలు వెడలిన – పై చరిత్రకెంతో ఉపయోగము.
  2. వారి గ్రంథములన్నింటిని సేకరించి, ఒక కేంద్రమున హైదరాబాదు నందుంచుట. అప్పుడు ప్రత్యేకముగా సాహిత్యోపాసకులు కొందఱు వారి గ్రంథములామూలాగ్రముగా చదివి సమీక్షలు ప్రకటించి, వారి ప్రతిభ లోకమునకు వెల్లడించుట కవకాశము కలుగును.
  3. విశ్వవిద్యాలయములలో పరిశోధన: ఈనాడు విశ్వవిద్యాలయములలో నవీన యుగమున మహాకవులను గూర్చి పరిశోధన జరిపి సిద్ధాంత వ్యాసములను( Thesis ) రచించి పట్టములు ( Ph.D. ) పొందుచున్నారు.

దాసు శ్రీరామ మహాకవి ఆయన రచనలు అను విషయముపై విశ్వవిద్యాలయములలో పరిశోధన చేయించెదరని భావించున్నాను. శ్రీరాములుగారి వలెనే కొక్కొండ, మండపాక, గోపీనాధ వారలను గూర్చి విశ్వవిద్యాలయములలో పరిశోధన జరుగవలెను.

ఆరువేల పద్య సంఖ్యను పైఁబడిన దేవీభాగవతము నాఱునెలలలో, తనవృత్తి ధర్మమును నిర్వహించుచు, సంపూర్ణము చేసిన శ్రీరాములు గారి ప్రతిభ అనితర సాధారణము.(నియోగిసర్వస్వము – 75,76)

వారు వ్రాయునపుడు బాతు కలము నుపయోగించెడి వారని, ఆంధ్రపత్రిక 1916 సంవత్సరాది సంచికలో వారి ఛాయాచిత్రమునఁ గలదు. అందు వారు లౌక్యవృత్తి వేషముతోఁగాక – గృహస్తు వేషముతో నున్నారు. వారి కుమార్తె, కవయిత్రి శారదాంబగారు కూడ అందుఁగలరు. ఇట్టి ఛాయాచిత్రములను సేకరించవలెను.

ఆంధ్ర మహాజనులు, శ్రీరాములుగారి గ్రంథములు పునర్ముద్రించుటకే గాక, పై సూచనలను ఆచరణలో పెట్టి అవి పూర్తి యగుటకు తోడ్పడుదురుగాక అని విన్నవించుచున్నాను.

దాసు శ్రీరాములు గారి “తెలుఁగునాడు”
గ్రంథ రెండవ ముద్రణ పీఠిక నుంచి ఉద్ధృతము.

రచన -శ్రీ నిడద వోలు వెంకట రావు


image.png
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శాసనాలై నిలిచిన మహాకవులు

విష్ణుసూరి:

ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది.
tekugu

రేపి:

క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి హత్తుకుంటుందని గణపవర శాసనంలోని 16వ శ్లోకం తెలుపుతుంది.

రవి చక్రవర్తి:

ఈయనకు కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నదని పాలక శాసనంలో గణపతిదేవ మహారాజు శాసనం ద్వారా తెలుస్తున్నది. వర్ణనలకంటే ఉత్ప్రేక్షాదులపై ఈ కవికి అభిరుచి ఉందని తెలుస్తుంది.

మాధవుడు:

ఈయన ఈశ్వరార్యపుత్రుడు. ఒకప్పటి మెదక్‌జిల్లా (నేటి సంగారెడ్డి)లోని ముదిమాణిక్యం గ్రామంలో దొరికిన శాసనం ఇతని కవిత్వానికి మచ్చుతునక.

వెంకట భట్టోపాధ్యాయుడు:

వేద శాస్ర్తార్థ తత్వజుడు. ఈయన రచించిన మన్ననూరి శాసనం సంస్కృతాంధ్ర సమ్మితము. ఈ పూర్తి శాసనాన్ని బీఎన్ శాస్త్రి, పరబ్రహ్మ శాస్త్రి పరిష్కరింపచేశారు.

మాయి భట్టోపాధ్యాయుడు:

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర గ్రామంలో లభించిన శాసనంలో ఈ కవికి పదవాక్యప్రమాణజ్ఞుడనే బిరుదు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతని కవిత్వంలో ప్రజ్ఞాశాలి అనడానికి ఉమామహేశ్వర శాసనం చివరున్న చక్రబంధమే తార్కాణం.

నాగదేవ కవి:

కాకతి రుద్రదేవుని సామంతుడైన గంగాధరుని ఆస్థానకవి దామోదరార్యుని కుమారుడు. ఈయన సకలశాస్త్ర పారంగతుడు. గంగాధరుని రంజన వంశాన్ని సహజ కావ్య సరళిలో ఎంతో మృదుమధురంగా బెకెల్లు శాసనంలో తెలిపాడు. ఇతని కవిత్వం.. శబ్ద రచనా సౌందర్యం, వస్వైక్యం, శబ్ద స్ఫూర్తి.

అనంతసూరి:

ఇమ్మాది మల్లికార్జునదేవుని ఆస్థాన కవి, పండితుడు గోవిందభట్టు దౌహిత్రుడు (కూతురి కొడుకు- మనుమడు). ఈయన విరచితమైన పానగల్లు శాసనం (క్రీ.శ. 1290) శబ్దార్థ ప్రాధాన్యంతో ఉంది. ఉపమానాలంకారాలు ఎక్కువగా ఉన్నాయి. కావూరి సుబ్రహ్మణ్యశాస్త్రి అనే శాసనకర్త పరిష్కరించాడని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ శాసనాన్ని ఇంగువ కార్తికేయశర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు అందించాడు.

అభినవ మయూరసూరి:

క్రీ.శ. 1245లో గణపతి దేవమహారాజు కాలంనాటి వడ్డమాను శాసనం ద్వారా మల్యాల గండ దండ నాయకుని ఆస్థాన కవుల్లో ఒకడని తెలుస్తున్నది. ఈ శాసనంలో 165 పంక్తులున్నప్పటికీ అందులో 41 పంక్తులు తెనుగు వచనంలో ఉన్నాయి. మిగిలినవి ప్రాకృత (బ్రాహ్మీ), సంస్కృత శ్లోకాలు. తెలంగాణలో ఉత్కృష్ట మహాశైలిలో శాసనం లభించింది. అయితే లింగాల శాసనంలో ఇతడు ఆత్రేయ గోత్రుడని, ఈశ్వర హరిపుత్రుడని కవిత్వపద వ్యాఖ్య శాసనం సంస్కృత శ్లోకాలతో ఉన్నది.
srinivass

ఈశ్వరసూరి:

మయూరార్య పుత్రుడు, మహాశాసన, సంస్కృత కవి. ఈయన అంతగా తెలియని శబ్దాలంకార కవి. మహబూబ్ నగర్ జిల్లాలోని బూదపురంలో ఉన్న రెండు శాసనాలు (క్రీ.శ. 1256-1272) ఈశ్వర సూరి రచనా సామర్థ్యానికి మచ్చుతునకలు. మల్యాల గండ దండాదీశు ఆస్థాన కవుల్లో ఈయన ప్రథముడు. తెలంగాణలో పుట్టి కాశీపీఠంలో చదివి ఆస్థాన కవిగా మొదటివాడై అపశబ్దాభాస, అవ్యయాభాస-పునరుక్త్యాభాస, క్రియా పదభ్రమకవు, క్రియా పదత్రయ గోపకం స్త(స్థ)బకావళి-మిధునావళి-శబ్దాలంకారం, పాదాదియకము, అనవ్రతాక్షర ప్రయోగాలు ఈ మహాకవి రచనాశైలి.

నాగనాథుడు:

కౌశిక గోత్రికుడు. పశుపతి కుమారుడు. వరంగల్ జిల్లాలోని ఐనవోలు గ్రామంలో దొరికిన ప్రాచీన శాసనాలు ఇతని రచనలు రేచర్ల, కాకతీయ వంశాల వర్ణన శుద్ధ కావ్య ధోరణిలో చిత్రీకరించి రచించాడు. ఎందరో శాసనకవులు కూడా అంతరించిపోయారు. పిల్లలమర్రి, పాలంపేట, కోటగిరి, కొండిపర్తి, మెదక్, కుండినాపురం (నేటి కొండాపురం) మొదలైన శాసనకర్తలు (కవులు) పేర్లు తెలియనప్పటికీ వారి వాజ్ఞయ ప్రజ్ఞ కల్పనా చమత్కృతి, పరిశీలనా నైశిత్యం, భావములు అనంతం.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

— మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ పండితరాయలు రచించిన భామినీ విలాసం అనే గ్రంథాన్ని సూక్తి సుధ పేరుతో అనువదించారు. పుత్రసంతానం లేని శాస్త్రి తన సుందరకాండనే పుత్రునిగా పేర్కొనేవారు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించాకా కానీ ఆయన శిష్యుల చొరవతో సుందరకాండము ముద్రణ పొందలేదు.

బాల్యం, విద్యాభ్యాసం
మేడవరం రామబ్రహ్మశాస్త్రి 1885లో నెల్లూరు జిల్లాకు చెందిన కంకణంపాటి అగ్రహారంలో వేంకట సుబ్బమ్మ, సుబ్బశాస్త్రి దంపతులకు జన్మించారు. రామబ్రహ్మశాస్త్రి ప్రముఖ పండితుడు, రచయిత వేలూరి శివరామ శాస్త్రి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు.[1]

వృత్తి, వ్యక్తిగత జీవితం
మేడవరం రామబ్రహ్మశాస్త్రి ఉపాధ్యాయవృత్తి చేపట్టి కర్నూలు పట్టణంలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతపు కర్నూలు స్టేడియం ప్రాంతంలో నివాసం ఉండేవారు. కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో సంస్కృతం, తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయనకు వయసు మీద పడేవరకూ సంతానం లేకపోయి, వార్ధక్యంలో ఓ కుమార్తె జన్మించింది. కుమారులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరకాండనే కొడుకుగా భావించేవారు. అటువంటి కావ్యం ఆయన మరణానంతరమే ముద్రణ పొందడం ఆయన జీవితంలోని ఒక విషాదం. మేడవరపు రామబ్రహ్మశాస్త్రి 1966-67 మధ్య కాలంలో మరణించారు.[1]

రచనా రంగ0
తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధుడైన బలిజేపల్లి లక్ష్మీకాంతం వాల్మీకి రామాయణంలోని సుందరకాండాన్ని తెలుగులో కావ్యంగా రాయాలని ప్రయత్నించి కొంతవరకూ రాశారు. తెలియని కారణాల వల్ల అసంపూర్ణంగా వదిలేశారు. ఆ తర్వాత స్వయంగా కర్నూలులో రామబ్రహ్మశాస్త్రిని కలిసి తన సుందరాకాండను పూర్తిచేయమని కోరారు. దాంతో రామబ్రహ్మశాస్త్రి సుందరకాండ పూర్తిచేశారు. కొడుకులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరాకాండనే కుమారునిగా భావించేవారు. ఆయన మరణానంతరం ఆయన విద్యార్థులు చందాలు వేసుకుని సుందరాకాండ ప్రచురించారు. జగన్నాథ పండితరాయలు రాసిన భామినీ విలాసం అనే సుప్రసిద్ధ సంస్కృత కావ్యాన్ని రామబ్రహ్మశాస్త్రి సూక్తిసుధగా తెనిగించారు. అయితే గొప్ప పాండిత్యం, వ్యుత్పత్తి ఉండి కూడా రామబ్రహ్మశాస్త్రి రచన రంగంపై తగినంతగా దృష్టి పెట్టకపోవడంతో తగినన్ని రచనలు చేయలేదని కర్నూలు జిల్లా రచయితల చరిత్ర రాసిన కె.ఎన్.ఎస్.రాజు పేర్కొన్నారు.[1]

ప్రాచుర్య0
మేడవరం రామబ్రహ్మశాస్త్రి సాహిత్యరంగంలో చక్కగా తెనిగించగల కవిగా ప్రఖ్యాతులయ్యారు. ఆ క్రమంలోనే తన కావ్యాన్ని పూరించమని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కోరారు. భామినీ విలాసాన్ని ఆంధ్రీకరిస్తూ రాసిన సూక్తిసుధ ప్రముఖ కవులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఈ కావ్యాన్ని గురించి – “పండితరాయల శ్లోకము లందలి రసభావములను, ధ్వన్యన్యోక్తి విలాసములను, పదప్రయోగాచిత్యమును జక్కగా పరిశీలించి మూలమునకే విధమునను దీసిపోనట్లుగా వారీ యనువాదమును సాగించినారు. ప్రతి పద్యము సరసమైన లలిత సుందర పదప్రయోగ భాసురమై, ప్రౌఢమై హృదయము నానంద తుందిలము గావించినది” అని ప్రశంసించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ “భామినీ విలాసమునకు మరికొన్ని యాంధ్రీకరణములు కలవు. వానిలో నిది విశిష్ట లక్షణము కలది” అని సూక్తిసుధ విశిష్టత వివరించారు.

ఆయన గద్వాల, వనపర్తి, దైవందిన్నె మొదలైన సంస్థానాలకు వెళ్ళి పాండిత్యాన్ని కనబరచి, సంస్థానాధీశుల సత్కారాలు, బహుమానాలు పొందేవారు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం

సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు –

ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ తాళ పాత్ర గ్రంధాలతో పాటు అనేక అరుదైన పుస్తకాలున్నాయి .
  ఈ గ్రంధాలయ శత వార్షిక వేడుకలు 30-12-18ఆదివారం జరుగుతున్నాయి .సాహిత్యాభిమానులు పుస్తక ప్రియులు అందరూ అత్యుత్సాహం గా పాల్గొని జయప్రదం చేయమని మనవి
 ఆ రోజు యాత్రగా సాహితీ ప్రియులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వార్యం లో విజయవాడ నుండి బయలుదేరుతున్నారు .ఉదయం 8 గంటలకు విజయవాడ లోబయల్దేరే  విజయవాడ -ఒంగోలు ఫాస్ట్ పాసెంజర్ లో అందరు కలిసి వెళ్లాలని ఆలోచన .కనుక ఆదివారం ఉదయం 7 -30 కు విజయవాడ రైల్వే స్టేషన్ కు అందరు చేరితే  ఎవరి టికెట్ వారు పెట్టుకొని వేటపాలెం కలిసి వెళ్ళవచ్చు అక్కడ శత వార్షికోత్సవం, పుస్తకావిష్కరణ ,భోజనాలు కూడా ఉంటాయి   .
 మధ్యాహ్నం 3 గంటలకు వేటపాలెం లో ఫాస్ట్ పాసెంజర్ అందుకొని విజయవాడ చెర వచ్చు . ఆసక్తి  ఉన్నవారు శ్రీ చలపాక ప్రకాష్ గారిని 9179346334లేక 9247475975నంబర్ లకు ఫోన్ చేసి సంప్రదించండి -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 354-సంస్కృత చలన చిత్రాలు

Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-)

సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి తగిన వారసుడైన ప్రొఫెసర్ రామ చంద్రన్,చిన్ననాటి నుండి సంస్కృతం ఆసక్తిగా నేర్చాడు .సంస్కృత భాష బోధించటం లో నిష్ణాతుడని పించుకొని విద్యార్దుల అభిమానం గొప్పగా పొందాడు .సంస్కృతం లో లోతైన పాండిత్యం ఉన్నా అతి తేలిక భాషలో సంస్కృతం బోధించటం ఆయన ప్రత్యేకత .సంస్కృత శిబిరాలలో ఆయన ప్రసంగాలు మహా ఆసక్తిగా ఉండేవి .సాధారణ ప్రజలకోసం వాడుక సంస్కృత భాషలో వందలాది  శిబిరాలు నిర్వ హించాడు .సంస్కృతం బోధించేటప్పుడు సంస్కృతం మాత్రమే వాడేవాడు .మరే భాష సాయం తీసుకొనే వాడు కాదు .చిన్న పిల్లాడు తల్లి భాష యెంత సహజంగా నేర్చుకొంటాడో ,అంతే సహజం గా రామచంద్రన్ సంస్కృత బోధన చేసి తన ప్రత్యేకత చాటుకొని ,సంస్కృత భారతి కి  విపులమైన ప్రచారం చేశాడు .ఆయన చేసిన సంస్కృత భాషా సేవకు ‘’సుందరం ఫైనాన్స్ స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ ‘’పురస్కారం అందుకొన్నాడు .

353-సంస్కృత వార్తా పత్రిక –సుధర్మ

సంస్కృతం లో ప్రచురణ పొందుతున్న ఏకైన దిన పత్రిక’’సుధర్మ ‘’కర్ణాటకలోని మైసూర్ నుండి  వెలువడుతుంది .1970స్థాపింపబడిన ఈ సంస్కృత వార్తా పత్రిక సర్క్యు లేషన్ అంతా పోస్ట్ ద్వారానే జరగటం మరో విశేషం .దీనికి కారణం పత్రిక స్తాపించినపుడు దీన్ని అమ్మటానికి ఏ న్యూజ్ ఏజెంట్ కూడా ముందుకు రాకపోవటమే .అప్పటినుంచి కావాల్సిన వారికి పత్రికను పోస్ట్ లో పంపటం మొదలు పెట్టారు .అదే ఇప్పటికీ కొనసాగుతోంది .ప్రస్తుతం ఈపత్రిక నిధులు లేక దిన దిన గండంగా నడుస్తోంది

కలాలె నడదూర్ వరద రాజ అయ్యంగార్ సంస్కృత భాషా వ్యాప్తికోసం ‘’సుధర్మ ‘’సంస్కృత దిన పత్రిక ప్రారంభించాడు .సంస్కృత పుస్తక ప్రచురణలో అనుభవమున్న ఆయన ,తనవద్ద పనిలేకుండా పడిఉన్న  మెషీన్లకు పని కల్పించే ఉద్దేశ౦ తో ఈ పత్రికా ప్రచురణకు పూనుకొన్నాడు .ఈ విషయాన్ని మిత్రులకు, సన్నిహితులకు చెబితే యెగతాళి చేసి,దిన పత్రిక కు కావలసిన సంస్కృత పదజాలం లేదని ,సాహసం చేయవద్దని  నేల విడిచి సాము చేయవద్దని హెచ్చరించారు .కాని అభిన౦దించి,ప్రోత్సహించిన వారిలో కన్నడ దిన పత్రిక సంపాదకుడు అగరం రంగయ్య ,రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ పి.నాగాచార్ ఉన్నారు వీరి ప్రోత్సాహం తో వరద రాజ  అయ్యంగార్ ధైర్యంగా మొదటి దిన పత్రిక 1970 జులై 14న మహా రాజా సంస్కృత కాలేజి లో ఉన్న ‘’గణపతి తొట్టి ‘’నుంచి ప్రచురించాడు .దీనితో పాటు నాటి కేంద్ర సమాచార మంత్రి ఐ కే గుజ్రాల్ ను ఒప్పించి రేడియో లో రోజూ సంస్కృత వార్తలు ప్రసారం చేయించటానికి ఒప్పించాడు . ఇలా రెండు మాధ్యమాల ద్వారా సంస్కృత ప్రచారానికి వరద రాజ అయ్యంగార్ దోహద పడినందుకు గీర్వాణ వాణి హృదయపూర్వకం గా ఆయనను అభినందించి ఉండాలి .

1990లో అంటే పత్రిక స్థాపించిన 20ఏళ్ళకే అయ్యంగార్ చనిపోయాడు  .అప్పటినుంచి పత్రిక మైసూర్ లోని రామ చంద్ర అగ్రహారం నుండి వెలువడుతోంది .సుధర్మ పత్రిక చందా దారులు  సంస్కృతం పండితులు ,సంస్కృత విద్యార్ధులు  .పత్రిక సర్క్యులేషన్ 3,500 కాపీలు .వార్షిక చందా 500 రూపాయలు .దేశమంతటా పత్రిక లైబ్రరీలకు,విద్యా సంస్థలకు ,చందాదారులకు పోస్ట్ లోనే పంపబడుతుంది .అమెరికా ,జపాన్ దేశాల కూడా పత్రిక పంపబడుతోంది .వీరికి సాలు సరి చందా రుసుము 50 డాలర్లు .

పత్రిక అమ్మకాలపై వచ్చే లాభం అత్యంత స్వల్పమే .కాని సంస్కృతం పై ఉన్న అభిమానం ,జర్నలిజం పై ఆసక్తి ఉన్న సంపత్ కుమార్ పత్రికను కొనసాగించాలనే దృఢ సంకల్పం లో ఉన్నాడు .పత్రికను లాక్కు రావటానికి కిందా మీదా పడుతున్నాడు .పత్రిక సంస్కృతభాష నేర్వటానికి  వ్యాప్తికి ,జ్ఞాన సముపార్జనకు చక్కగా తోడ్పడుతోంది .2011జులై 15న సుధర్మ 42వ వార్షికోత్సవం మైసూర్ లో ఘనంగా నిర్వహించారు  .ఈ ఉత్సవం లో వక్తలందరూ సంస్కృతం లోనే సంభాషించి,అరుదైన  ప్రత్యేకత చాటారు.సంస్కృత విద్వాంసులను ఘనంగా సత్కరించి భాషపట్ల తమకున్న అభిరుచిని తెలియజేశారు .ఇప్పడు ఈ పత్రిక ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతోంది .

ఇప్పుడు సుధర్మ ప్రపంచం లోనే మొట్టమొదటి ‘’ఇ పేపర్’’దినపత్రిక అయి రికార్డ్ సాధించింది .హాయిగా ఉచితంగా చదువుకొనే సౌలభ్యం కలిగించి చరిత్ర సృష్టించింది ..చదువరులకోసం సంస్కృతం లో క్రాస్ వర్డ్ పజిల్ తోపాటు అనేక ఆకర్షణీయ అంశాలు అందిస్తోంది .స్థాపకుడు వరద రాజ అయ్యంగార్ ఆత్మ ఎంతగా పులకిస్తోందో ? ఆ మహామనిషి పూనిక ,సాహసం  చిరస్మరణీయ౦ కావాలంటే వదాన్యులైన సంస్కృతాభిమానులు సుధర్మ యాజమాన్యానికి చేదోడుగా నిలవాలని కోరుతున్నాను .

మీ కోసం సుధర్మ వివరాలు

http//sudharma epapertoday .com

Email-sudharma.sanskrit daily @gmail.com

www.sudharma sanskrit daaily .in

సశేషం

క్రిస్మస్ శుభా కా౦క్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-18-ఉయ్యూరు  .

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

23-12-18 ఆదివారం నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం

Image may contain: indoor
Image may contain: 1 person, indoor
Image may contain: plant and outdoor
Image may contain: people standing and indoor

No automatic alt text available.
Image may contain: indoor
Image may contain: 1 person, indoor
23-12-18 ఆదివారం మేమిద్దరం .మాకోడలు శ్రీమతి సమత,మనవడు సంకల్ప్ ఉయ్యూరు నుండి కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం( క్రీ.శ 1011రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం ) భీమవరం శీ భీమేశ్వర స్వామి ,మావూళ్ళమ్మ దేవాలయాలు ,అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం ,బీచ్ ,కోనసీమ అందాలకు నిలయమైన కొబ్బరి తోటలు ,పెనుకొండలోసుమారు 3 వేలనాటి శ్రీ నగరేశ్వర ,శ్రీ మహిషాసురమర్దిని (ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు ) పెనుకొండలో పుట్టి, రాజు కుబ్జ విష్ణు వర్ధనుని అహంకారానికి గుణ పాఠంంచెప్పటానికి అగ్నికిఆహుతై దేవతగా వెలసి న వైశ్య కుల దేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ (ప్రపంచం లోని వైష్య్లందరికీ ఈమె కులదేవత )అమ్మవారిని దర్శించిన చిత్రమాలిక

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

అనుకోకుండా అంతర్వేది

సాహితీ బంధువులకు శుభకామనలు -23-12-18 ఆదివారం ఉదయం 8-30 కి ఉయ్యూరు నుండి మేమిద్దరం,మా పెద్దకోడలుశ్రీమతి సమత,మనవడు చి .సంకల్ప్ కారులో బయల్దేరి గుడివాడ మీదుగాముదినే[పల్లి  దగ్గర సింగరాయ కొండ లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం ,కలిదిండి లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ,భీమవరం సోమారామం ,భీమేశ్వరాలయం ,మావూళ్ళమ్మ దేవాలయాలు చూసి అంతర్వేది వెళ్లి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ,బీచ్ చూసి ,తిరుగుప్రయాణం లో పెనుకొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరాలయం ,శ్రీ నగరే,శ్వర, శ్రీ మహిషా సుర మర్దిని అమ్మవార్లను దర్శించి ,రాత్రి 9-30కు ఉయ్యూరు చేరాం .

పెనుకొండలో సాహితీమూర్తి బహు గ్రంధకర్త సాహిత్య సంస్థ నిర్వాహకులు నాకు ,సరసభారతి అత్యంత ఆత్మీయులు  శ్రీ ఎం  ఆర్ వి ఎస్ మూర్తి గారు మేము వస్తామని ఉదయం, సాయంత్రం మాకోసం ఆలయం లో ఎదురు చూసి ,సాయంత్రం మా రాకకు ఆనందించి స్వయంగా దేవతా మూర్తుల దర్శనం చేయించి, చరిత్ర తెలియ జెసి, మా కెంతో తోడ్పడ్డారు .వారికి ఉయ్యూరు నుంచి మేము తీసుకు వెళ్లిన శ్రీ సువర్చలాన్జనేయ ప్రసాదం అంతర్వేది ప్రసాదమందజేసి కృతజ్ఞతలు తెలియ జేశాము . –దుర్గాప్రసాద్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4  గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి సంగీత గాయకురాలు .బికాం పాసై ,హిందీలో విశారద అందుకొన్నాడు .తల్లి నుంచి క ర్ణాటక సంగీత అభిరుచికలిగి ,గాయకుడు మహమ్మద్ రఫీ అంటే అభిమానమేర్పడింది .మద్రాస్ లో జెమిని స్టుడియోలో సంగీత శాఖ నిర్వాహకులు ప్రఖ్యాత వీణ విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి గారి మన్నన పొందాడు .నిర్మాత ఎస్ ఎస్ వాసన్ ను హిందీపాటతో మెప్పించి ,1952లో జెమినీవారి హిందీ చిత్రం ‘’మిస్టర్ సంపత్’’లో గీతాదత్ తో పాడి తెరంగేట్రం చేశాడు  .వరుసగా కన్నడ తెలుగు మొదలైన సినిమాలలో అవకాశాలు వచ్చి వేలాది పాటలుపాడాడు .పాడటమే కాదు చక్కని పాటలూ రాశాడు .అగ్రనటులందరికీ పాడినా, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు ఆయన స్వరం చక్కగా సరిపోయేది .అందుకే ఆయనకు 300 కు పైగా పాటలు పాడి అభిమానం సంపాదించాడు

సంస్కృతం లో ఎన్నో స్తోత్రాలు ,భజనలు రచించాడు .మొత్తం 3 వేలపాటలు సంస్కృతం ,తెలుగు ,కన్నడం తమిళం ,హిందీ ,మలయాళం ,తుళు ,కొంకణి భాషలో పాడిన అష్ట భాషా జ్ఞాని .ఆయన జీవిత చరిత్ర ‘మాధుర్య సార్వభౌమ డా.పిబి శ్రీనివాస్ –నాద యోగి ‘’పేరుతొ  వచ్చింది .కర్ణాటక ప్రభుత్వం ఈ పుస్తకానికి’’ బెస్ట్ బుక్ అవార్డ్ ‘’అందించింది .శ్రీనివాస్ లలిత గాన మాధుర్యానికి కర్ణాటక ప్రభుత్వం ‘’కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం’’ ఇచ్చింది .తమిళనాడు ప్రభుత్వం ‘’కలైమణి’’బిరుదాన్నిచ్చింది .రాజకుమార్ కుటుంబీకులు ‘’రాజకుమార్ సౌహార్ద్ర అవార్డ్ ‘’అందించి గౌరవించారు .కన్నడ యూని వర్సిటి ‘’కర్నాటక నాదోజ అవార్డ్ ను ,తమిళనాడు  ఫిలిం ఆనరరి అవార్డ్ ‘’కలైవర్ కూడా అందుకొన్నాడు .పుంభావ సరస్వతి పి.బి.శ్రీనివాస్ 2013 ఏప్రిల్ 14న 82 వ ఏట సరస్వతీ సన్నిధానం చేరాడు .ఇంటిపేరే ‘’ప్రతివాది భయంకర’’ కాని ఆయన స్వరం అత్యంత కోమలం, లలితం  ముఖాన నిలువు బొట్టు, మెడలో కండువా ,శిరస్సున తలపాగా శ్రీనివాస్ ప్రత్యేకత .

ఇంతవరకు నేను రాసినదే .దీనితర్వాత శ్రీకాంత్ జయంతి సాక్షి పత్రికలో 2017సెప్టెంబర్ 17రాసిన ‘’అష్టభాషా కవి పి.బి.’’ను చేర్చాను –

‘అష్ట భాషా కవి నాచన సోముడు అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేరు వేరు భాషలు కావు’’.  సి.నారాయణరెడ్డి ఈ మాటలు అన్నారు. ‘‘మనకు తెలిసిన ఏకైక అష్టభాషా కవి తెలుగువారైన పి.బి.శ్రీనివాస్‌.’’ ఈ మాటలూ సినారెవే.
పి.బి.శ్రీనివాస్‌ ఒక బహుభాషా చలన చిత్ర నేపథ్య గాయకులు మాత్రమే కాదు; అష్టభాషా వేత్త, కవి కూడా! తెలుగువారైన ఆయన తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషలలో ఎన్నో కవితలు రాశారు. పద్య ఛందస్సులో కొత్త కొత్త వృత్తాలను సృష్టించారు. 1960ల ఉత్తరార్థంలో ఆంధ్రప్రభ పత్రికలో ఆయన సృష్టించిన కొత్త వృత్తాల పద్యాలు అచ్చయ్యేవి.
అంతర్లాపి కవితా పద్ధతిని ఆయన ప్రచారంలోకి తెచ్చారు. ఒక కవితలో మొదట్లోనో, మరో చోటో నిలువుగా ఉన్న అక్షరాలను కలిపి చదివితే విడిగా వేరే వాక్యం వస్తుంది. దాన్ని అంతర్లాపి అంటారు. ‘సద్వైద్వ జీవనము’ రాసిన వైద్య కవి లోలంబరాజు అంతర్లాపిలో ప్రసిద్ధుడు. పి.బి.శ్రీనివాస్‌ ఆ పద్ధతిలో ‘దశగీత గీత సందేశం– సంఖ్యాక్షర సందేశ పద్ధతి’ అని ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో వరుసగా 10 గీతాలు ఉంటాయి. వాటిల్లోని ఒక్కో గీతంలోని ఒక్కో వాక్యంతో 11వ గీతం పుడుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన దేవులపల్లి వారు పి.బి.శ్రీనివాస్‌ను ఇంగ్లిష్‌ కవి విలియం బ్లేక్‌తో పోల్చారు.
1979లో శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు అనే అపూర్వ చ్ఛందః ప్రకరణ గ్రంథాన్ని ప్రకటించారు పి.బి. శ్రీనివాస్‌. శ్రీనివాస వృత్తం పాద పాదానికీ 11 యతులతో 116 అక్షరాలతో నడిచేది. శ్రీ గాయత్రీ వృత్తం షడక్షర (కళా) గణాలతో పేర్లకు తగ్గట్టు రూపొందేది. ఛందః ప్రస్తారాల్లో గాయత్రీ ఛందస్సులోని 64 గురు లఘు సంయోగ పద్ధతుల ప్రాతిపదికగా ఈ గాయత్రీ వృత్తం సృష్టించబడింది. పంచతాళ వృత్తం అనే మరో అద్భుతమైన 72 అక్షరాల వృత్తాన్ని కూడా ఆయన సృష్టించారు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల రూపాలనూ, స్వరాలనూ తేలికగా గుర్తుంచుకోవడానికీ, గుర్తుపట్టడానికీ  గణితం అధారంగా ‘డైమన్డ్‌ కీ’ అనే సూత్ర రచన చేశారు.
1978లో కడప ఆకాశవాణి కేంద్రంలో తొలి తెలుగు గజల్‌ వాగ్గేయకారులుగా ‘‘కల్పనలు సన్నాయి పాడే వేళ చింతలు దేనికి?’’ అన్న గజల్‌ రాసి పాడారు. గజలియత్‌ను తెలుగుకు తెచ్చిన కవి ఆయనే. ఎనిమిది భాషలలో గజళ్లు రాసిన ఏకైక కవి. ఉర్దూ, కన్నడ, తమిళ గజళ్లు రికార్డులపై విడుదలయ్యాయి.

చార్‌ దిన్‌ కీ జిందగానీ క్యూం కిసీసే దుష్మనీ

దుష్మనీ చాహేతొ కర్లీ దుష్మనీసే దుష్మనీ

(నాలుగు నాళ్ల జీవితంలో మనకెందుకు శత్రుత్వం శత్రుత్వమే కావాలనుకుంటే చేద్దాం శత్రుత్వంతో శత్రుత్వం)
అన్న ఆయన ఓ గజల్‌ షేర్‌ ఖండాంతరాలకు వ్యాపించింది. 1996లో విశ్వసాహితీ వారు ‘గాయకుడి గేయాలు’ అన్న పి.బి.శ్రీనివాస్‌ గేయాల సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో గజళ్లు కూడా ఉన్నాయి. ‘‘శక్తులలో గొప్ప శక్తి కల్పనా శక్తి/ పంక్తులలో గొప్ప పంక్తి కవితా పంక్తి’’ అన్నారు.
ఆకాశవాణి కేంద్రాల కోసం చాలా లలిత గేయాలు రాసి పాడారు. నవరసాలపై ఒకే రాగంలో రాసిన 9 పాటలు ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ప్రసారమైనాయి. ‘‘పాలవెల్లి నీ పిల్లన గ్రోవి నీల గగనమే నీ మ్రోవి’’ అంటూ ఆ పాటలో చివరి పంక్తులుగా ‘‘ప్రశ్నార్థకమే విధాత రాత, ప్రత్యుత్తరమే భగవద్గీత’’ అని తమ రచనా వైదుష్యాన్ని ప్రదర్శించారు. ‘‘అన్నీ పోతాయి ప్రేమ పోతే’’ అన్నారు ఓ పాటలో. ‘‘బ్రతుకు ప్రేమించడానికి, ప్రేమించు బ్రతకడానికి’’ అని అన్నప్పుడు దాశరథి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు.
1969లో చంద్రుడిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ దిగిన సందర్భంలో ‘మేన్‌ టు మూన్‌’, ‘మూన్‌ టు గాడ్‌’ అనే రెండు పాటలు రాసి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కూ, ఆర్మ్‌స్ట్రాంగ్‌కూ పంపి వారి నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 1970ల ఉత్తరార్థంలో ‘లవ్లీ లవ్‌ సాంగ్స్‌’, ‘వైట్‌ షాడోస్‌’ అన్న రెండు ఇంగ్లిష్‌ కవితా సంకలనాల్ని వెలువరించారు.
1997లో ఆకృతి సంస్థ వారు పి.బి.శ్రీనివాస్‌ అష్టభాషా కవితల సంకలనం ‘ప్రణవం’ విడుదల చేశారు. ఇందులో స్వదస్తూరితో ఆయన రాసిన సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ కవితలు ఉన్నాయి. ఈ సంకలనంలో ఇతర 7 భాషల కవితలకు ఇంగ్లిష్‌లో ప్రతిలేఖనం, అనువాదం ఉన్నాయి. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ప్రయత్నం, ప్రయోగం జరిగి ఉండదు.

ఆయన ఎన్నో తెలుగు, సంస్కృత, హిందీ, కన్నడ స్తోత్రాలను రాశారు. సంగీతా సంస్థ వారు ఆయన రాసిన హిందీ, సంçస్కృత భజనలను ‘భజన్‌ సుధ’పేరుతో క్యాసెట్‌ విడుదల చేశారు. 1963–64లో అప్పటి జ్యోతి పత్రికలో ‘స్వర లహరి’ శీర్షికతో దేశంలోని చలనచిత్ర సంగీత దర్శకులపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. మళ్లీ అదే ప్రయత్నాన్ని 1986లో శివరంజని పత్రిక కోసమూ చేశారు. కర్ణాటక సంగీత వాగ్గేయకారుడిగా ‘నవనీత సుమ సుధ’ అన్న రాగ సృజనా, దానికి సాహిత్య రచనా చేశారు. ‘ఏక స్వరి’ అంటే ఒకే స్వరంతో ఉండే రాగాన్ని రూపొందించి దానికి ‘‘ఆనందం, ఆనందం’’ అంటూ కృతి రాసి శ్రుతి నిచ్చారు. కొన్ని అన్నమాచార్య సంకీర్తనల్ని హిందీలోకి అనువదించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం వారు ఆయన గేయాలు కొన్నిటిని ‘గేయ కవితలు’ పేరుతో ప్రచురించారు.
‘‘ఎన్నో భాషలలో అఖండమైన పాండిత్యాన్ని ఆపోసన పట్టిన రచయిత. సాహిత్యంలో సాము గరిడీలకు ఆయన పెట్టింది పేరు’’ అన్నారు గొల్లపూడి మారుతిరావు. ‘‘ఆయన ఒక విద్యా సాగరం’’ అన్నారు తమిళ కవి వాలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘ (P) పుం (B)భావ (S) సరస్వతి’’ అన్నారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-18-ఉయ్యూరు
.

 

 

 

 

 

,

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ

 

2-12-18 శనివారం ఉదయం ఉయ్యూరు ఎసి లైబ్రరీలో సరసభారతి 135వ కార్యక్రమం లో  శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పెద్దకుమారుడు శ్రీ కృష్ణ ,మనవరాలు సెరీనా (అమెరికా )పాల్గొని తమ తండ్రిగారి తరఫున సరసభారతి ఆధ్వర్యం లో లైబ్రరీకి నూతన గ్రంథాలు ప్రదానం ,శ్రీ కృష్ణ గారికి సరసభారతి, వాకర్స్ క్లబ్ సత్కారం చిత్రాలు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి

350–వేదసమీక్షా -2(చివరి   గీర్వాణ కవుల

‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన స్వర్గాదులకే కాక ,దృష్ట ప్రయోజనం కల లౌకిక సిద్ధులకు కూడా సామమంత్ర ప్రయోగం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు .

శ్రీ వే.జగదీశ్వర శాస్త్రి గారు ‘’శుక్ల యజుర్వేదమీమా౦సా ‘’లో యజుర్వేద ప్రథమామాచార్యుడు యాజ్ఞవల్క్య అతిశయాన్ని ,శాఖా భేదాలను ,శత పద బ్రాహ్మణ  విశేషాలను ,ఈ సంహితకు భాష్య కారులను చెప్పి ,యాజ్ఞవల్క్య చరిత్రతో ముగించారు .మంత్రం భాగము మాత్రమె వేద పద వాచ్యం అనే ఆధునికుల వాదాన్ని ఖండించి సహేతుకంగా మం త్రం ,బ్రాహ్మణాలు రెండూ వేద పద వాచ్యాలని సప్రమాణంగా రుజువు చేశారు .

శ్రీసూర్య ప్రకాశ శాస్త్రి గారు ‘’వేదేషు రాజనీతిః’’లో వేదభాగం లోని వాక్యాలను సూత్ర ప్రాయంగా తీసుకొని ,మన్వాది స్మృతులు ,పురాణాలు ,కౌటిల్యుని అర్ధ శాస్త్రం ఎలా విస్తరించాయో వివరించారు వేద విధానం లో ‘’రాజ సూయం ‘’ప్రకరణ బట్టి భారతీయ రాజుల ధర్మ ప్రవర్తన ,ప్రజాను రంజకపాలన నిరూపితమైందని ,క్షత్రియులే రాజులైతే వారిలో విద్యావినయాది సద్గుణాలు కలవారికే రాజ్యాభిషేకం చేయాలని ,వాళ్ళు మంత్రి, పురోహితులను నియమించుకొని వాళ్ళ ఆజ్ఞలు పాటించాలని తెలిపారు .మంత్రుల లో పురోహితుడు అగ్రగణ్యుడు .అతడు ఉత్తమ గుణ శీల సంపన్నుడై,  వేద వేదాంగాలలో ,దైవ కార్యాలలో ,దండనీతిలో నిష్ణాతుడై దైవ ,మానుష ఉపద్రవాలకు ప్రతిక్రియ చేయగల సమర్ధత కలిగి ఉండాలి .రాజు పురోహితుని గురువుగా ,ఆచార్యునిగా సేవించాలి.  యుద్ధ౦ ఆత్మ రక్షణ ,,పన్నులు ఎలా చేయాలో స్పష్టంగా చెప్పారు .

‘’వేద లక్షణం ‘’లో శ్రీ రా. కృష్ణ స్వామి ఘనాపారి గారు ప్రాతి శాఖ్యాల ప్రయోజనం వివరించారు .’’దర్శనానాంలోక న్యాయానా౦ చ మూల భూతా వేద భాగాః’’లో శ్రీ చతుర్వేది రామ చంద్రా చార్యులుగారు కొందరు దర్శనాలు 6అంటే మరికొందరు 10అన్నారని ,’’సర్వ దర్శన సంగ్రహం ‘’16 చెప్పిందని ,ఆయా అభిప్రాయాలకు మూల భూతాలైన వేదవచనాలను పేర్కొన్నారు .ఇవి ఎక్కువభాగం ఉపనిషత్తులలోని వే కాని వేదభాగాలలోనివి కావు అన్నారు నోరివారు . ఈ వ్యాసాలన్నీ సంస్కృతం లో రచించినవే .

ఇంగ్లిష్ లో రాసిన వ్యాసాలలో శ్రీ సి ఎస్.వెంకటేశ్వరన్ ఋగ్వేదం లోని  బృహస్పతి ,బ్రహ్మణస్పతి శబ్ద విచారణ చేసి ,రెండూ ఒకే దేవత పేర్లు అన్నారు .శ్రీ ఇ.అనంతా చార్యులు ‘’ఆపో విషయక వేద భావన ‘’ఎంతగొప్పదో గొప్పగా వివరించారు –It is from the flow of ocean universal consciousness that our human hearts too receive the flood of the universal consciousness .The waters are therefore aid to contain the Powers of immortaality and rectitude and the Devas alone are capable of declaring  the Powers of the waters ‘’.

మీమాంసా శాస్త్ర పండితులు శ్రీడి టి తాతాచార్యులుగారు ‘’శ్రౌత సూత్రాలు ‘’వ్యాసం లో సూత్ర లక్షణం ,యజ్ఞ స్వరూపం ,కర్మ వైవిధ్యం తెలిపి ,వేద కర్మలు ప్రధానం –ఇషఅతి ,పశు ,సోమ అనే మూడు విదాలైనాయని  రుగ్మంత్రఉచ్చారణ –స్తోత్రం , శస్త్రం అనే రెండు భేదాలుంటాయని,ఏయే వేద శాఖకు, ఏయే శ్రౌత సూత్రాలు పుట్టాయో ,వాటిలో ఏవి నేడు లభిస్తున్నాయో వివరించారు. యజ్ఞ కర్మలు కర్తకు మాత్రమేకాక ,దేశానికి ,విశ్వానికీ మహా ప్రయోజనమని చెప్పారు .డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి గారు ‘’వేదాలలో జ్యోతిశ్శాస్త్ర స్మరణం ‘’వ్యాసం లో సంధ్యావందనం నుంచి ,పింజపితృ యజ్ఞం వరకు యజ్ఞ వేదికలు నిర్మించటానికి కాల జ్ఞానం ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు .శ్రీ అగ్ని హోత్రం రామానుజా చార్యులుగారు ‘’వేదాలలో రాజకీయ భావనలు ‘’లో సభా ,సమితి ,గణాలు మొదలైన వాటివలన ప్రజా తంత్ర రాజ్యాలున్నాయని ,రాజ సూయ ప్రకరణం లో రాజు ఎన్నుకోబడి ,అభిషిక్తుడు అయ్యేవాడని సామ్రాట్ ,విరాట్ ,ఏకరాట్,అధిరాట్  శబ్దాలను బట్టి చక్రవర్తి భావన కూడా ఉండేదని అన్నారు .’’వేదాలలో ఖగోళ విషయాలు ‘’లో శ్రీ వి .సుబ్బారావు గారు ఇండో ఆర్యన్లు ఏయే భూముల్ని ,ఏ వరుసలో ఆవాస భూములుగా మార్చుకోన్నారో ,వాటిని తెలిపే ఋక్కులను ,వారికి తెలిసిన వృక్షజాలాన్ని ,పంటలు మొదలైనవి వివరించారు .

‘’వేదం లో ఆర్ధిక సంపద ‘’లో శ్రీ ఏం ఎస్ ప్రసాద రావు గారు వేదకాలం లో ఆర్ధిక స్థితి గోవిన్దావస్థ నుండి ,వ్యావసాయకానికి ,పారిశ్రామికానికి ,వాణిజ్య స్థితికి ఎలా క్రమ పరిణామ౦ చెందిందో చెప్పారు .ఋగ్వేదం లోని సముద్ర శబ్దం ,శాతారిత్ర(నూరు తెడ్లు కల నౌక ) శబ్దం తరచుగా ఉండటం వలన సముద్ర వ్యాపారం కూడా ఉండేదని ,ఇలా రెండు వేల సంవత్సరాల కాలం లో జరిగిన పరిణామాలను తెలియ జేశారు .’’వేదాలలో రసాయన శాస్త్రం ‘’లో శ్రీ వి ఆర్ కృష్ణన్ రసాయన శబ్దం అధర్వ వేదం లో ఉందని బంగారం సీసం ఇనుము వాడుక లో ఉండేవని ,సోమం ,యవ లనుండి మద్యం తీయటం వారికి తెలుసనీ ,ఓషధి పరిజ్ఞానం  సూత్ర ప్రాయం గా ఉండేదని ,తర్వాతకాలం లో చరకుడు ,శుశ్రుతుడు మొదలైన వారు ఆయుర్వేద శాస్త్ర రూపొందించారని అన్నారు ‘

‘’వేద సమీక్షా ‘అనే ఈ వ్యాస సంకలనం విద్వా౦సులకే కాక ,సామాన్యులకూ,వేదాభిరుచి ఉన్నవారికి  అనేక విషయాలు అందుబాటులోకి  తెచ్చిందని ,దీన్ని సమీక్షించిన శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారన్నారు .

ఆధారం –శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు భారతి మాసపత్రికలో 1967నవంబర్ సంచిక లో చేసిన సమీక్ష .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-18-ఉయ్యూరు

 

 

 

 

 

,

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )

గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం  చదివిస్తారు  .గోపికా గీతిక జయ దేవుని గీతగోవింద కావ్యానికి ప్రేరణ .గోపికాగీతిక లో కొన్ని ముఖ్య శ్లోకాలు చూద్దాం –

1-జయతి తేధికం (కృష్ణ )జన్మనా వ్రజః –శ్రయత ఇందిరా కృష్ణ శష్వ దాత్రహి – దయిత ద్రశ్యతమ్ కృష్ణ దిక్షు తత్వ కాః -త్రయి ధ్రతాసవాః-కృష్ణ త్వాం విశిన్వతే ‘’

2-న ఖలు గోపికా కృష్ణ నందనో భవాన్  –అఖిల దేహినాం కృష్ణ అంతరాత్మ దృక్-వృక్ష నాశ ఆర్తితో కృష్ణ విశ్వ గుప్తయే –సఖా యు దేవివాన్ కృష్ణ సాత్వతాం కులే ‘’

3-తవ కథాం రతం కృష్ణ తప్త జీవనం –కవి భిరీదితం కృష్ణ కల్మషాపహం –శ్రవణ మంగళం కృష్ణ శ్రీమదాతత౦-భువి ఘ్రణ౦తి తే కృష్ణ భూరిదా జనాః’’

అని శ్రీ కృష్ణ గుణగానం చేసిన గోపికల గోపికా గీతికి మురిసి ,పరవశించిన కృష్ణుడు మళ్ళీ దర్శనమిచ్చాడు .వాళ్లకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చిన అనుభూతి కలిగింది –‘’తన్వాఃప్రాణా౦ ఆగత౦’’.

  యోగుల హృదయ సీమలలో విహరించే పరమాత్మ ,కాళిందీ పుళింద సీమలపై గోపికా పరివేష్టితుడై ,శరత్ పున్నమి వెలుగులలో వాళ్ళతో ఆ శరత్ చంద్ర ప్రభువు  అతి సన్నిహితంగా చనువుగా మాట్లాడాడు .ప్రతి గోపిక వొడిలోతన దివ్య మంగళ పాదాలను ఉంచాడు .అక్కడున్న శతానేక గోపికలవొడి లలో పాదాలు౦చాడన్నమాట .ఆ పాదాలు వాళ్ళతో మాట్లాడుతున్న అనుభూతి పొందారు –కాదు కలిగించాడు స్వామి .అంటే ఎన్ని రూపాలుగా బాలకృష్ణుడు అవతరించి వారికి అత్యంత మానసిక సంతృప్తి కలిగించాడో అర్ధం చేసుకోవాలి .ఇదే ఆయన మాయాలీల గోపికాలీల.ఈ మాయ అర్ధం కాక అమాయకంగా ఆయననే దీని మర్మమేమి స్వామీ అని ప్రశ్నించారు .దానికి’’ స్వార్ధం కోసం స్నేహం చేసే వాళ్ళు ఉంటారు .స్నేహం వల్ల లబ్ది చేకూరకపోతే స్నేహం వదిలేస్తారు .కొందరు తలిదంద్రులలాగా ఆప్యాయంగా ఉంటారు .అవతలి వారు అలా ప్రవర్తి౦చక పోయినా వారిలో ఈ వాత్సల్యం తగ్గదు.కొందరు ఆధ్యాత్మిక పరిపుష్టి పొంది  బంధాలకు లోనౌతామని ఇతరులను పట్టించుకోరు .కొందరు పగ, ద్వేషం వలన ఇతరుల బాగు ఆలోచించరు  ,కాని మీరంతా ఈ ప్రపంచ బంధాలను వదిలి నా శరణు కోరారు, నాపై ప్రేమ కరిపించారు కనుక ఆ సాన్నిహిత్యం పెంచాను .మీకు కనపడకుండా అదృశ్యమైనా, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను . నాపై కోపం, ద్వేషం, అసూయ వదిలేయండి .నేనెప్పుడూ మీ వాడినే .మీ వెంటే ఉంటా .మీరు నాకు ఇచ్చిన దానికి,  మీ నిస్వార్ధ ప్రేమకు, సేవకు ,నేను ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .మనమధ్య బాంధవ్యం  నిందా రోపణ చేయలేని దివ్యప్రేమ మాత్రమే . గృహబందాలను అత్యంత కష్టం తో వదిలేసి నా చెంత చేరారు  .దివ్యమైన అద్భుతమైన మీ కృత్యాలే  మీకు  నష్ట పరిహారం ‘’అని చెప్పాడు . గోపికలు ఆయనపై యెంత ప్రేమ భక్తీ చూపించారో, ఆయనా అంతకంటే ఎక్కువ ప్రేమ వర్షం వారిపై తనివి తీరా కురిపించి సంతృప్తి పరచాడు .

  దీని తర్వాత ‘’రాసలీల ‘’ప్రారంభమౌతుంది .చేయీ చేయీ కలిపి గోపికలు బృందంగా ఏర్పడి బాలకృష్ణుని చుట్టూ తిరిగారు .ఇద్దరు గోపికలకు ఒక కృష్ణుడు ఉన్నాడు ఒక గోపిక కుడి భుజం పై ఆయన ఎడమ చేయి ,వేరొక గోపిక ఎడమ బుజం పై ఆయన కుడి చేయి వేసి లీలా నృత్యం చేస్తుంటే ,ప్రతిగోపికా- కృష్ణుడు తన ఎదుట ఉండి తన రెండుభుజాలపై చేతులు వేసి నృత్యం చేస్తున్నట్లు భావించింది .కాని నిజానికి ఆమెకు ఎడమవైపు ఒక కృష్ణుడు, కుడివైపు మరొక కృష్ణుడు ఉన్నాడు .యోగేశ్వరు డైన శ్రీ కృష్ణ పరమాత్మ రాసలీలలో గోపికలను మాయలో పడేశాడు .అది వారికి తెలియనే తెలియదు కారణం  వాళ్ళమనసులు వాళ్ళలో లేనేలేవు  .ఆ రాసలీలలో అలౌకిక ఆనందం అనుభవించారు . ఈ రాస లీల నీటిలో జలక్రీడగా ,అడవిలో వనక్రీడ గా ,భూమిపై స్థల క్రీడగా మూడు చోట్ల జరిగింది .అనేకమంది గోపికలతో అనేకమంది కృష్ణులు చేస్తున్న ఈ అద్భుత రాసలీలా విలాసాన్ని అంతరిక్షం నుంచి దేవతలు మహర్షులు దర్శించి పులకించారు .ఇక్కడ మరొక గొప్ప విషయం ఉన్నది .గోపికల ఇళ్ళల్లో  వారి భర్తల దగ్గర  వారి భార్యలైన గోపికలు వారి ప్రక్కనే ఉన్నారు .ఇళ్ళల్లో భర్తలు తమభార్యాలు తమతోనే ఉన్నట్లు అనుభూతి చెందారు .ఇదీ క్లైమాక్స్ .లోకమంతా రాసలీల మత్తులో తేలిపోయింది .

  రాసలీల ను పరీక్షిత్ కు శుకుడు వివరించి చెప్పగా ‘’కృష్ణుడు అన్నీ ఉన్న సంతృప్తి ఉన్నవాడు .కాని ఆయన చేసిన ఈ పని ప్రపంచ దృష్టిలో  నీతిబాహ్యం అని పించదా?ఎందుకు అలా చేశాడు ?లోకానికి ఏ దివ్య సందేశం అందించాడు దీనితో ?’’అని ప్రశ్నించాడు .ఈ ప్రశ్న  ఆయనదేకాదు అందరికీ వచ్చే సందేహమే కదా .దీనికి సరైన సంతృప్తికరమైన  సమాధానం శుక మహర్షి చెప్పాడు .’’పరమేశ్వరుని లీలలు నీతి బాహ్యం కానేకాదు .ఆయన అగ్ని హోత్రం వంటివాడు .అగ్ని లో వేసినది ఏదైనా కలుషితం కాదు .అమానుష స్వరూపుడు చేశాడు కదా అని మనం కూడా అలా ప్రవర్తిస్తే ,ఎవరైనా రుద్రుడననుకొని విషం తాగితే నాశనమైనట్లు సర్వ నాశన మౌతాం .పరమాత్మ వాక్కులను అనుసరించాలేకాని ఆయన చేష్టలను కాదు .పరమాత్మ సర్వాతీతుడు కనుక ఆయన చిద్విలాసాలు  అంతుబట్టవు , ఆయనకు ఏ దోషం ,పాపం అంటదు.స్వార్ధరహితుడు కనుక పరోపకారమే ఆయన కర్తవ్యమ్ .లౌకిక పరిధిలో ఆయన చేష్టలు చట్ట విరుద్ధాలనిపించినా, అవి మానవాతీత కృత్యాలు .’’అని సమాధానం చెప్పాడు శుకర్షి .అనీబిసెంట్ రాసలీలకామ  శృంగార కేళి (రిబాల్డ్రి)కాదు .అదొక దివ్య మానవాతీత అనుభూతి అని చెప్పింది .అందుకే రాసలీల ఉత్కృస్ట మధుర భక్తికి తార్కాణగా నిలిచింది .

  పరమాత్మ సర్వ సాక్షి .ఆయన గోపికలలో,  వారి భర్త లలో కూడా సాక్షీ భూతుడు .లోకాలన్నిటి లో పారమార్ధిక కాలక్షేపం అది .భగవంతుడు మానవావ తారం దాల్చినప్పుడు భక్తులపై ,సర్వ మానవాళి పై దయ, ప్రేమలను చూపి౦చ టానికి ,ఇలాంటి లీలలు ప్రదర్శి౦చి  విశ్వాసం కలిగించి ,వారిని తనవైపుకు ఆకర్షి౦చి దివ్యమార్గాన్ని చూపిస్తాడు .శుక మహర్షి బోధించిన ఈ రాసలీల విన్న వారు ,చదివినవారు ఆ పరమేశ్వరుని అత్య౦త భక్తులై ,భౌతిక కామవాసనలకు దూరమై పరమ పదం చేరుతారు .

‘’లోకాః సమస్తా స్సుఖినో భవతు  ‘’

 రాస లీలలు సమాప్తం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4

కృష్ణుడు యెంత నచ్చ చెప్పినా గోపికలు వినలేదు .మొదట భర్తకు ,తర్వాత కుటుంబ విధి అని ఆయన చెప్పినదానికి ఆయనే తమ పతి,తమకే కాక ఎల్లలోకాలకు ఆయనే భర్త అని ,కనుక తమ మొదటికర్తవ్యం శ్రీ కృష్ణుని సేవయే అని ‘’మా హృదయాలు ,శరీరాలు  కుటుంబం సర్వం నీకే ఆధీనాలు .నువ్వే వీటినన్నిటినీ లోబరచుకోన్నావు .మా చేతులు ,కళ్ళు బుద్ధి మనసు మావికావు .అవన్నీ నీవే .నీకు కానిపనిని దేనినీ అవి చేయటానికి అంగీకరించటం లేదు .కనుక నీ అధీనులమైనమమ్మల్ని వెనక్కి వెళ్ళమని అనవద్దు స్వామీ .మమ్మల్ని నీసేవకులుగా వినియోగించుకో ప్రభూ ‘’అని వేడుకొన్నారు –

‘’ఇతి  వికల వికటం తాసాంశ్రుత్వ యోగేశ్వరేశ్వర-ప్రహస్య సదయం గోపిః ఆత్మా రామో ప్యరిరమత్’’

  గోపికల మాటలకు చిరునవ్వు నవ్వి జగత్ ప్రభువు, సర్వ లోక నాధుడు  వారందరినీ సంతృప్తి పరచాడు .ఆయన స్వయం సంతృప్తి ఉన్న మహానుభావుడుకదా.ఆయన ఆత్మారాముడు .ఆయన దగ్గర లేనిది లేదు –‘’నానవాప్తం అవాప్తవ్యం ‘’అని గీతలో ఆయనే చెప్పాడు .ఎప్పుడైతే వారిని తనకు అత్యంత సన్నిహితులని భావి౦చాడో అప్పుడు గోపికలు తాము  ఉత్కృస్ట  జీవులమని భావించారు .తామే భూ ప్రపంచం లో  లోఅత్యంత గొప్పవాళ్ళం అనుకొన్నారు .దీనితో వారిలో కించిత్ గర్వ రేఖను స్వామి కనుగొన్నాడు .వారి కి సరైన ఆధ్యాత్మిక బోధ చేయాలని భావించి ,అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు .

  బాల కృష్ణుని కోసం గోపికలు అన్ని చోట్లా వెతకటం ప్రారంభించారు .ఆయన ఎడబాటును  సహించలేకపోయారు .తట్టుకోలేక పోయారు .బుద్ధి పని చేయటం లేదు .ఆయనంటే విపరీతమైన పిచ్చ పట్టింది .దీనినే విరహం అంటారు .భక్తి లో ఇది ఉత్కృష్ట స్థాయి .అందరికి భగవంతు డంటే ఇష్టమే .కాని ఆయన ఎడబాటును గోపికలు భావి౦ఛి నంతగా మనం అనుభవించలేము .భగవంతుడు మనం ఇచ్చేది స్వీకరించడు అనుకొంటాం .కాని భక్త శబరి ఇచ్చినట్లుగా మనం ఇవ్వగలమా ?.దేవుడు మనమొర ఆలకించి మనల్ని రక్షించడు అని  భావిస్తాం ,కాని ద్రౌపది  పిలిచిన౦త  ఆర్తిగా పిలుస్తామా ?దేవుడు మనకు వరాలివ్వడనుకొంటాం ,కాని రాధ ప్రేమించినంత గాఢంగా ఆయన్ను ప్రేమించగలమా ? అంటే మనం చేసేదాంట్లో తీవ్రత ఉంటేనే ఆయన నుంచి స్పందన ఉంటుంది .ఏదో పూజా నైవేద్యాలతో సరిపెట్టుకొంటే ఆయనా అలాగే ఉపేక్ష భావంతోనే ఉంటాడు .

  గోపికలు ఆ అడవి అంతా గాలించారు .దారిలో ఆయన పాదముద్రల ఆనవాళ్ళు కనిపిస్తే వాటి నాధారంగా వెతికారు .తర్వాత  ప్రక్కప్రక్కనేపాదముద్రల  ద్వయం కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించాయి  .అందులో ఒకటి స్త్రీపాదంగా. రెండోది స్వామి పాదంగా గుర్తించారు .వాళ్లకు అసూయ హద్దు మీరింది .తమలోనే ఎవరో ఆయనతో గడుపుతున్నారని అనుమానమొచ్చింది .ఆమె తమకన్నా గొప్ప అదృష్టవంతురాలు అనుకొన్నారు .కృష్ణస్వామితో ఉన్న ఆ ఒంటరి గోపికకు తమాషా అనుభవం ఎదురైంది .తానె అదృష్టవంతురాలననుకొని ఆయన్ను తనను మోసుకొని వెళ్ళమని కోరింది .నవ్వుతూ సరే అని భుజాలమీద ఎక్కమన్నాడు .ఎక్కే ప్రయత్నం చేస్తుండగా చటుక్కున మాయమయ్యాడు .దీనితో ఆమె గర్వం ఖర్వమైంది .మిగిలిన బృందమంతా వచ్చి చేరగా అందరూ కలిసి మళ్ళీ వెతుకులాట మొదలెట్టారు .ఈ ఏకైక వనిత రాధ అని తర్వాత సాహిత్యకారులు రాశారు .ఆకాశం లో మబ్బులు కమ్మాయి. చంద్రకా౦తి తగ్గింది.అందరు తిరిగి బయలు దేరిన చోటికే చేరుకొన్నారు .తాము కృష్ణుడితో మాట్లాడిమాటలు ,ఆయనతో తిరిగిన ప్రదేశాలు ఆ అనుభవాలు గుర్తు చేసుకొంటూ ,ఇంటిని మరచి ,ఆయన గుణగానం చేస్తూ పరవశించి పోతున్నారు –

‘’తన్  మనస్కాస్ ,తదాలాపాస్ తద్విచేస్టాస్,తదాత్మికాః-తద్గుణమేవ గాయన్త్యః నాత్మాగారాని సస్మరుః’’

ఇదీ గోపికల ఉత్కృస్ట ప్రేమ భక్తి.ఇదే అన్నిభక్తులలో ఉన్నతమైనది.దీనినే గీతలో కృష్ణపరమాత్మ వివరించాడు –

‘’తద్బుద్ధయాస్  తదాత్మనాస్,తన్నిస్టాస్ తత్ పారాయణాః-గచ్చన్త్య పునరా వృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః’’

అంటే ఎవరు తమబుద్ధి మనసు దాని(బ్రహ్మం )పై ఉంచుతారో ,ఎవరి ఆత్మ అదో,దానిపైనే దృష్టి పెడతారో,అదే తమ గమ్యమని భావిస్తారో వారు పునర్జన్మ లేని పరమపదం పొందుతారు .ఇంతటి ఉత్కృస్ట భక్తీ గోపికలది కనుక ఉత్తమ భక్తీ తత్పరులకు గొప్ప ఉదాహరణగా బృందావన గోపికలు నిలబడ్డారు .నిస్వార్ధ భక్తికి గోపికలే ఉదాహరణ .కర్మ  కన్నా ఈ జ్ఞానభక్తి వారిని ఉన్నతులను చేసి పరమాత్మ సాన్నిధ్యానికి చేర్చింది .మనసులను గోపికలు అర్పించినట్లుగా ఎవరూ అర్పించేనే లేదు .

  నారాయణ ఉపనిషత్ శ్లోకం –

‘’ఐక్యం తే దాన హోమ వ్రతనియమ తపస్సాంఖ్య యోగైర్దురాపం –త్వత్సంఘేనైవ .గోప్యయాః కిల సుకృతి తమః ప్రాపురానంద సంద్రం –భక్తే శ్వన్యే సుభూసస్వపి బహు మనుషే భక్తిం ఏవ త్వమాసాం –తన్మే త్వద్భక్తిం  ఏవ దృఢయా హర గదాన్ కృష్ణ వాతాలయః ‘’

దానం జపం తపం నియమ౦  యోగం సాంఖ్యం మొదలైనవి ఏవీ గోపికల ఉత్కృస్ట భక్తికి సాటిరావు .నీతో సామీప్యం ,సఖ్యం వారిని ఏ భక్తునికన్నా సాటి రాని వారిని చేసింది అని గురవాయూర్ కృష్ణుని స్తుతించింది మేల్ పుతూర్ నారాయణ భట్టాత్రి రచించిన  ‘’నారాయణీయ౦’’ .

 సశేషం

 శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-3

ఇప్పుడు అసలు కథ లోకి వద్దాం .అప్పటికి కృష్ణుడికి 10ఏళ్ళు లేక కొంచెం తక్కువ మాత్రమే అని మర్చి పోరాదు.బృందావన గోపికలు ‘’కాత్యాయని వ్రతం ‘’ చేస్తున్నారు .శ్రీ కృష్ణుని’’ తమ పతి’’గా చేసుకోవటానికి చేస్తున్న వ్రతం అది .ఇది చాలా నియమాల తోరణం .తెల్లవారు  ఝామున  యమునా నదిలో స్నానం ,నది ఒడ్డున ఇసుకతో పార్వతీ దేవి ప్రతిమ తయారు చేసి యధావిధిగా  పూజించటం ,నెల రోజుల కార్యక్రమం .చివరి రోజున జరిగిందే గోపికా వస్త్రాపహరణం .కాత్యాయని వ్రత దీక్షలో ఉన్నప్పుడు వారు నగ్నం గా స్నానం చేయరాదని కృష్ణుడు చెప్పాడు .వాళ్ళు వ్రతభంగం చేసినందుకు శిక్షగా’’ చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు ‘’ .తర్వాత వాళ్ళ’’ వలువలు’’ వాళ్ళ కిచ్చి వేశాడు .వారు కోరిన కాత్యాయన వ్రత ఫలంగా-అంటే కృష్ణుని పతిగా పొందే భాగ్య ఫలంగా  కొద్దికాలం లోనే వారికి కోర్కె తీరుస్తానని బాస చేశాడు .ఈ సందర్భంగానే ఆయన వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు –

‘’ న మయ్యా  వేషిత ధియుం కామః కామయ కల్పతే –భర్జితా,ఖచ్చితా ధన ప్రయో బీజయ నేష్యతే’’-అంటే –మీలో ఎవరు మీ మనసు,బుద్ధి  నావైపు త్రిప్పి ఉంచారో ,వారిలో కోరిక ,లేక మోహం కలిగి నందువలన అది  వేడి చేసిన లేక ఉడకేసిన విత్తనం మొల కెత్తని విధం గా చెడు లేక దోషం కానే కాదు.మన సర్వ వేదాంత  గ్రంథాలు కూడా బ్రహ్మ  జ్ఞానికి కర్మవాసనలు వేడి చేసిన విత్తనం మొలకెత్తని విధంగా అంటవు,వెంటరావు అనే చెప్పాయన్న సంగతి మర్చిపోరాదు .

 గోపికల కాత్యాయని వ్రత ఫలితం అందుకొనే రోజు శరత్ పౌర్ణమి  రానే వచ్చింది .  ఆయన మాయ చే సృష్టింపబడిన’’ దివ్య లీల’’ ఇది  .-‘’యోగమయం ఉపశ్రితః ‘’అన్నాడు అందుకే .పున్నమి నాటి రాత్రి బాలకృష్ణుని సమ్మోహిత మధుర వేణుగానం యమునానదీ తట విపిన సీమలలో ప్రతిధ్వనించి ,ప్రకృతిని సర్వజీవజాలాన్ని పరవశం కలిగిస్తోంది .గోపికల వీనులకు విందుగా ధ్వనించి అద్భుత రసవాహినియై మనసులను, శరీరాన్ని పుల కింప జేస్తోంది .ప్రతివారిని దైనందిన కృత్యాలకుదూరం చేసి ,ఆనంద పారవశ్యం తో యమునా తీరం వైపుకులాక్కు వెడుతోంది .దీనికేవరూ మినహాయింపుగా కనిపించలేదు .చెట్లు లతలు పొదలు పూలు ,ఆకులు పక్షులు జంతువులు మంత్ర ముగ్ధంగా నిలబడి పోయాయి .ఆ దివ్య వేణునాదం అందరి తనువూ మనసులను పులకరి౦ప జేసి, చిత్తరువు బొమ్మలైపోయారు.ఈ మధుర దృశ్యాన్ని కరుణశ్రీ గారు కమ్మని పద్యాలలో పొదిగారు –

‘’ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా  ఊదగ దోయి, ఊదగ దోయి –యుష్మదీయ వేణూదయ రాగ డోలికలలో జగమ్ము సర్వమ్ము పులకరించిన దోయి ‘’

  ఈ సంపూర్ణ మధుర దివ్యనాదం ఆలకించిన గోపికలకు మనసు మనసులో లేదు .పారవశ్యం తో ఎక్కడిపనులక్కడే వదిలేసి భర్త, తండ్రి, అత్తామామ,బంధుత్వాలను కూడా విసర్జించి ,తమను తామే పూర్తిగా మరచిపోయి  ఆ నాదం వైపుకు బారులుకట్టి పరుగులు తీశారు  .కృష్ణ వేణునాదం ఎరవేసి వాళ్ళను లాక్కు పోయింది .కొందరు గోపికలు ఇంటిపనులు సంసారం వదిలి పెట్టలేక ఇళ్లలోనే ఉంటూ ,బాల కృష్ణుని పై అపార ప్రేమతో ,కళ్ళు మూసుకొని ఏకాగ్ర చిత్తం తో ఆ వేణుగానాన్నివింటూ పరవశించారు .శ్రీకృష్ణుని తో ఎడబాటుకు తల్లడిల్లిపోయారు .దీనితో వారి పాప మంతా  దగ్ధమైపోయింది –‘’తీవ్ర పాప ధృత శుభం ‘’ .ద ఆయనపై సంపూర్ణ ధ్యాస,ఆరాధనతో వారు ఆయన పరిష్వంగ సుఖపారవశ్యం పొంది ,వారి భౌతిక భక్తి నశించి ఆధ్య్యాత్మికాన౦ద౦ పొందారు .కృష్ణుడు దేవాది దేవుడై,పరమాత్మయై,తమకు  అత్యంత మానస ప్రియుడై ,స్నేహితుడై ,అత్యంత సన్నిహితుడైపోయాడు .వారి కర్మ బంధాలన్నీ చేది౦ప బడ్డాయి.భౌతిక శరీరాలు నశించి ,ఆధ్యాత్మిక శారీరులైనారు .

  ఇక్కడే పరీక్షిత్ మహారాజుకు ఒక ధర్మ సందేహం వచ్చి శుకమహర్షిని   ‘’మహర్షీ !గోపికలు కృష్ణుని తమ ప్రియుడు అనే భావించారు కాని ,శుద్ధ సత్య స్వరూపం అనే ఎరుకలేదు .వారు తమ స్వస్వరూప భావన వదిలి భౌతిక బంధాలను ఎలా చేది౦చు కోగలిగారు ?’’ఆని అడిగితె శుకుడు ‘’కృష్ణుని ద్వేషించిన శిశుపాలుడే కర్మబంధ విమోచనం పొందితే ,ఆయనను అత్యంత ప్రేమగా ఆరాధించే గోపికలకు విమోచనం కలగటం లో ఆశ్చర్యమేమున్నది ?పరమాత్మ ప్రమాణాలకు అందనివాడు .ఆయన కొరతలేని నిత్య సంపూర్ణుడు .మాయ ఆయన సృష్టి,దాని నియంత్రణ చేసేవాడు కనుక ప్రకృతికి బంధుడు కాదు .ఆయన అవతార పరమార్ధం మానవులకు అత్యంత ప్రయోజనాలు సమకూర్చటమే .కోరిక ,కోపం ,భయం ,రక్షణ ,ఆయనతో తాదాత్మ్యభావం ,ఆయనతో స్నేహం ఉన్నవారందరూ ఆయన స్మరణతో ఆయనలో ఐక్యమైపోతారు .దీనికి ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు .నువ్వు చాలా అదృష్ట వంతుడవు రాజా !నువ్వు గర్భం లో ఉండగానే ఆయన దర్శనం అనుభవించిన పుణ్యా త్ముడవు .’’అని సందేహాలన్నీ నివృత్తి చేశాడు శుకర్షి .

 బాలకృష్ణుడు గోపికలంతా బిరబిరా తన వద్దకు రావటం  మూగటం గమనించి ,వెనక్కి వెళ్లి పొమ్మని చెప్పాడు .వాళ్ళ మొదటికర్తవ్యం ఇంటి వద్ద భర్తను ఇంటిని పిల్లలను చూసుకోవటం అని చెప్పి ‘’మీకు నాపై అత్యంత ప్రేమాభిమానాలున్నాయి నాతో  అనుబంధం ఉందిమీకు .ఇది మీకు సహజమే .ప్రపంచం లో ప్రతిజీవి నాతో ఆనందం అనుభవిస్తారు –‘’ప్రియంతే మయి జనతాః’’.కాని మీ విధి కృత్యం వేరే చోట ఉంది .గౌరవ కుటుంబాలకు చెందిన మీలాంటి  స్త్రీలు ఇలా చేయటం దోషం .వారు పతనమై స్వర్గానికి దూరమై , సంఘం లో గౌరవం కోల్పోయి కస్టాలు ,దుఖం అనుభవిస్తారు ‘’అని చెప్పి ఒక గొప్ప శ్లోకం చెప్పాడు దానిని ఆయన మళ్ళీ చెప్పాడు  తర్వాత .-

‘’శ్రవణాత్ ,దర్శనాత్,ధ్యానాత్ మయి భావో ను కీర్తనాత్-న తథా,సన్ని కర్షేణప్రతియాత తతో ఘ్రాన్’’-

అంటే –నాపై పారమార్ధిక ప్రేమ కలగటానికి నిరంతరం నన్ను గురించివినటం ,నా ప్రతిమను ఆరాధించటం ,నాపై ధ్యానం ,విశ్వాసంతో నా గుణ గాన కీర్తన చేయటం చేయాలి .నాతో భౌతిక సామీప్యత వలన పై ఫలితం రాదు .కనుక దయచేసి మీ ఇళ్ళకు తిరిగి వెళ్లి పొండి’’అని పరిపరివిధాల నచ్చ  చెప్పే ప్రయత్నం చేశాడు కృష్ణుడు .

   సశేషం

 రేపు 20-12-18 గురువారం మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్ వ్రతం శుభాకాంక్షలతో

 – మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2

శ్రీ కృష్ణుని దివ్యత్వమే రాసలీల అంటుంది బెసెంట్ సతీమణి .వ్యాసర్షి భాగవత ప్రారంభం లో శ్రీ కృష్ణ జననం వివరిస్తూ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తబహుళ అష్టమి నాడు కంసుని మధురలోని కారాగారం లో కృష్ణజననం జరిగిందని చెప్పాడు .  భాగవత దశమస్కంధం మూడవ అధ్యాయం లో లో వ్యాసుడు ఆ సన్నివేశాన్ని వొడలు గగుర్పొడిచేట్లు వర్ణించాడు .గాడాంధకారం లో రాత్రివేళ దేవదేవుడుచంద్రుడు తూర్పు దిక్చక్రం లో ఉదయించి పెరుగుతున్నట్లు  సాక్షాత్కరించాడు –కనిపించాడు అన్నాడు కాని, దేవకీ గర్భం నుండి జన్మించాడు అని చెప్పలేదు .ఆసన్నివేశం మహోత్క్రుస్టం –

  ‘’తమ్ అద్భుతం బాలక౦ అ౦బుజేక్షణం-చతుర్భుజం ,శంఖ గదార్యాయుదయుధం  -శ్రీ వక్ష లక్షణం ,గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం –మహార్హ వైడూర్య కిరీట కుండలం –త్విషాపరిష్వక్త సహస్ర కుంతలం –ఉద్దామ కాన్చ్య౦గదకంకణాదిభిః-విరాజమాన౦ వసుదేవ  ఐక్ష్యత ‘’

భావం –దేవకి భర్త వసుదేవుడు ఆ బాలకృష్ణుడిని-చతుర్భుజాలతో శంఖ గద చక్ర కమలాలతో ,ఉరమున శ్రీవత్స చిహ్నం తో,మెడలో కౌస్తుభ మాలతో  ,పీతాంబర ధారియై ,నవనీల మేఘశ్యామల వర్ణం తో ,చిక్కని శిరోజాలు  కర్ణాభరణాలపై అలంకరింపబడిన  కిరీటం తో ,ధగద్ధగాయమానమైన వజ్రాది హారాలతో ,కటి ,హస్త ,ముంజేతులకు అలంకారాలతో దర్శించాడు .

  మనం నమ్మినా నమ్మక పోయినా ఇది యదార్ధం .ఇది నమ్మకపోతే రాసలీల వ్యాసుని ఊహాలీల, కల్పితహేల అనిపించి ఇక చెప్పటానికేమీలేక వ్యాస రచన ను మాత్రమే చదవగలం .ఇదంతా పరమ సత్యం అని నమ్మితే ,శ్రీకృష్ణ రాసలీల కూడా యదార్ధమే నని నమ్మాల్సిందే .ఏదో నమ్మటం మాత్రమె కాదు. అప్పుడే దానిలో  న్యాయ నిబద్ధత  కనిపిస్తుంది .రాసలీలపై మంచి, చెడు అనుమానాలు వస్తే ,శ్రీ కృష్ణ జనన వృత్తాంతాన్ని తప్పక నమ్మాము అని మర్చిపోరాదు .కనుక శ్రీ కృష్ణుడు సర్వ శక్తిమంతుడు ,సంపూర్ణ అతీత మానస దివ్యమూర్తి  అని గ్రహించాలి .

  మనలాగా కృష్ణుడు ఒక సాధారణ మానవుడు అనుకొంటే రాసలీల అంతా హుళక్కి అని పిస్తుంది.ఆస్థాయి దాటి ఆలోచిస్తేనే, అందులోని పరమార్ధం ద్యోతకమౌతుంది .శ్రీ కృష్ణుని ఇంద్రియాతీత పారమార్ధిక దివ్య మూర్తిగా,సర్వాంతర్యామిగా ,సర్వజ్ఙునిగా సర్వ శక్తి వంతునిగా  తెలుసుకోవాలి . ఈ చిత్త సంస్కారమే లేకపోతే,మనల్ని మనమే కోల్పోయి ,రాసలీల తత్వాన్ని చర్చించి అర్ధం చేసుకొని ఆన౦ది౦చటానికి అర్హత కోల్పోతాము .

  సశేషం

  వైకుంఠ (ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలతో

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తి కి తార్కాణం-అనీబి సెంట్

బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల  వృత్తాంతాలు ,చిత్రాలలో  శిల్పాలలో  , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా  కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి   భక్త జయదేవుని గీత గోవి౦దకావ్యం .ఇందులో ముఖ్యపాత్ర రాధ శ్రీ కృష్ణునికి అత్యంత ఆత్మీయ ప్రేయసి .ఆమెకు కృష్ణుడు తప్ప ఎవరూ అక్కరలేదు .ఆమె కృష్ణుడినే చూసింది, ఆయననే విన్నది .ఆయన గురించిమాత్రమే భజనల్లో మాట్లాడింది .రాధ శ్రీ కృష్ణుని కోసమే ,ఆయనగురించే ఆయనతోనే మాట్లాడింది .ఆమె పై వలపు విసిరినివారెవ్వరినీ లెక్కచేయలేదు .ఆమె మనసా వాచా కర్మణా బృందావన నంద కిశోరునినే వలచింది ప్రేమించింది ఆరాధించింది .ఆమ మనసు,  హృదయం నిండా కృష్ణుడే.వేరొకరికి చోటేలేదు .ఆయనమనసులో ,మదిలో కూడా ఆమె యే.గీత గోవిందం పాటలు దేశమంతటా అందరూ గానం చేసి పరవశిస్తారు .భజనలో పాడి తన్మయత్వం పొందుతారు .ఒక్కోసారి ఆ పారవశ్యం లో లోకమే మర్చిపోతారు .జయదేవకవి గీతాలకోలాహలం నిర్బంధం లేని మనోల్లాసం ,ఆత్మ సంతృప్తి కలిగిస్తాయి .  .విక్టోరియన్ భావజాలం లో ‘’కామపూరిత శృంగారం’’(ఈరోటిక్) అనుకొన్నా, మనదేశం లో ఈ కావ్యం భక్తిమార్గం లో కేంద్ర బి౦దువైంది . ఇది దేవుడే రాసుకొన్న స్తుతి కావ్యం .ఈ గీతాలు గానం చేస్తూ నృత్యం చేస్తుంటే ఆ గానానికి,లయకూ , నాట్యానికి మాత్రమే కాదు అందులో వర్ణింపబడిన రాదా కృష్ణుల లీలా  సాహిత్యానికి కూడా ముగ్దులమౌతాం  .

  దీనికి అంతటికి అసలు మూలం ఏది ?ఇదంతా జయదేవుని ఊహ ,సృష్టి యా.కానే కాదు .దీనికి  వ్యాసమహర్షి రచించిన  శ్రీమద్భాగవతం లోనే మూలాలున్నాయి.దశమ స్కంధం లో 29నుంచి 33వరకు ఉన్న అయిదు అధ్యాయాలను ‘’రాస పంచాధ్యాయి ‘’అంటారు .ఇవి  శ్రీకృష్ణునికి , బృందావన గోపికలకు మధ్య జరిగిన రాసలీల ను పూర్తిగా తెలియ జేస్తాయి. దీన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకొని అభినందించాలనుకొంటే, ముందు మన మనసులను సరిగ్గా దానికి తగినట్లు ట్యూన్ చేసుకోవాలి .

  ఒకసారి వెనక జరిగిన ‘’గోపికా వస్త్రాపహరణ౦ ‘’దగ్గరకు  వెడదాం .ఆరేళ్ళు పిన్నడు ఆపనిచేయటం అనైతికం అనిపిస్తుంది .ఆకుర్రాడు ఆరిందాలాగా ఆడవారి వినయం పై   ,పెద్దాడిగామాట్లాడుతాడు.దీనిపై  అనిబిసెంట్ చాలా చక్కని వివరణ ఇచ్చింది .

‘’గోపికలు ఋషులు .బాలకృష్ణ రూప జగ దుద్దారకుడు,  మహాత్ముడు శ్రీ కృష్ణుడు గోపికలకు పాఠం చెబుతున్నాడు  .దీని వెనకాల పరమ నిగూఢమైన రహస్యం ఉన్నది .ఆత్మ పరమాత్మను చేరేముందు , కఠిన పరీక్ష  ఎదుర్కోవాలి  .అప్పటిదాకా బాహ్యంగా తన వెంట ఉన్నవన్నీ ,తనకు ఆధారమైనవన్నీ ఒక్క అంతరంగాన్ని తప్ప అనీ వదిలేయాలి అంటే విసర్జి౦చేయాలి .అంటే తనకు రక్షగా ఉన్న సర్వ విషయాలు ,ఆచ్ఛాదనలు వదిలేసి నిస్సిగ్గుగా ఆత్మనొక్కటే  నమ్ముకొని  అన్నీ విసర్జించి  నగ్నంగా ,వంటరిగా నిలబడాలి .ఈ పరీక్షలో జంకు గొంకులకు తావే లేదు .బయటి సహాయం అపేక్షించకుండా ,దేనిపైనా ఆధారపడకుండా ,చివరికి గురువుపైనా భారం వేయకుండా యేకతా దృష్టిలో ఉండాలి ,వంటరిగా, నగ్నంగా మాత్రమే ఆత్మ పరమాత్మ వైపుకు ప్రయాణ౦చేయాలి  .ఇక్కడెవరూ చేయి అందించేవారుండరు .చేయిచ్చినా, చేదుకొన్నాఆ లీలామానుష రూపుడుఒక్కడే .ఈ ఉత్కృష్ట భావాన్ని వ్యాసహర్షి గోపికా వస్త్రాపహరణం లో గోపికా కృష్ణుల నెపం తో అందరికీ ఎరుక కలిగించాడు .

  సశేషం

వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలతో –

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)

14వ శతాబ్దికి చెందిన ఆనంద పూర్ణముని ‘’న్యాయ చంద్రిక ’’రాశాడు .ఇతనికి విద్యాసాగరుడు  అనే బిరుదున్నది .ద్రవిడాచార్య బాలకృష్ణానంద తెలియజేసినదాని ప్రకారం  పూర్ణానంద  సరస్వతే ఆనంద  పూర్ణముని .13వశతాబ్దిలో మధ్వాచార్య ‘’బ్రహ్మ సూత్రభాష్య౦ రాసి అద్వైతమతాన్ని ఖండించగా ,శ్రీ చిత్సుఖాచార్యులు ‘’భాష్య భావ ప్రకాశిక ‘’రాసి  అద్వైతాన్ని సమర్ధించాడు .దీనిపై ద్వైతమతం పక్షాన శ్రీ జయతీర్ధులు ‘’న్యాయ సుధా ‘’రాయగా  అది ద్వైతానికి బలవాత్తర గ్రంథంగా చెలామణి అయింది .తర్వాత అటూ ,ఇటూ చాల వచ్చాయి .కాని ‘’న్యాయ చంద్రిక ‘’వచ్చాక దానిని ఎదుర్కొనే ద్వైత గ్రంధం ఇంతవరకు రాలేదు అని దీని భూమికలో మహామహోపాధ్యాయ శ్రీ అనంత కృష్ణ శాస్త్రి చెప్పారని శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారన్నారు .

  న్యాయ చంద్రికలో ఆనంద పూర్ణ ముని వైశేషిక దర్శనాన్ని ,భాస్కరుని ద్వైతాద్వైత బ్రహ్మ పరిణామ వాదాన్ని సూక్షంగా ఖండించాడు .భాస్కరవాదానికి శ్రీమద్రామానుజుల విశిస్టాద్వైతానికి పెద్దగా భేదంలేదు  .న్యాయ చంద్రికలో 1-సమన్వయ పరిచ్చేదం 2-అవిరోధ పరిచ్చేదం3-సాధన పరిచ్చేదం 4-ఫల పరిచ్చేదంఉన్నాయి  .ఇందులో మొదటిదిపెడ్డది మూడోది చిన్నది .విషయ వివరణ చేస్తూ కారికా రూప శ్లోకాలు కూడా ఉన్నాయి .వీటిని గ్రంథం మొదట్లోనే పెట్టారు .కారికలకు ముందు ద్వైతాద్వైత వాదభేదాలలో ముఖ్యమైనవి 44శీర్షికలు గా క్రోడీకరించటంవలన ఒకదానికొకటి ఎదురుగా ఉండి,కళ్ళకు కట్టినట్లు కనబడుతాయి  . దీన్నీ మద్రాస్ ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీ వారు ప్రచురించారు .

350-వేదసమీక్షా –సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి )

1964ఫిబ్రవరి లో తిరుపతిలో జరిగిన వేద సెమినార్ లో  సమర్పించబడిన  వ్యాస సంకలనం ఈ’’ వేదసమీక్షా ‘’.వ్యాసకర్తలంతా వేదవిద్వాంసులే .వీరిలో కొందరు ప్రాచీనపద్దతి వారు మరికొందరు పాశ్చాత్య రీతులను అర్ధం చేసుకొన్న ఆధునిక విద్వాంసులు .సంస్కృత దేవనాగర లిపిలో 44పేజీలు  ,మిగిలిన పేజీలు  ఇంగ్లీష్ లో ఉన్నాయి .దీన్నిబట్టి ప్రాచీన ,నవీన పద్ధతుల ఉపయోగాలేమిటో స్పష్టమౌతుంది .వేదాసక్తి ఉన్నవారంతా  చదవాల్సిన పుస్తకం .ఆంద్ర ,కేరళ ,తమిళనాడు ,కర్ణాటక రాష్ట్రాల  కళాశాల , విశ్వ విద్యాలయ ఉద్దండ పండితులు రాసిన వ్యాసాలివి .

  సాధారణంగా దేశమంతా వేదోచ్చారణ ఒకే రీతిగా ఉంటుందని  అందరిభావన .కాని దీనిలో గోదావరి మండల ,కేరళ పద్ధతులలో భేదాలున్నట్లు ,ముఖ్యంగా సామవేదపాఠం లో,కేరళవారికి ,మిగిలిన ప్రాంతాల వారికి తేడా ఉంటుందని .’’కేరళేషు వేదాధ్యన సంప్రదాయః ‘’వ్యాసం లో శ్రీ ఇట్టిరవి నంబూద్రి తెలిపారు .ఆయన సామవేద జైమిని శాఖలో అగ్రేసర పండితులు .కేరళలో ముందు సామవేదం నేర్చి ,తర్వాతే మిగిలిన వేదాలు నేర్చేవారు .ఋగ్వేద,యజుర్వేద పాఠాలలో అక్కడి వారికి మిగిలినవారికి పెద్దగా భేదాలు లేవు .కేరళ సామవేద పాఠంలో’’ కంపము ‘’ఎక్కువ .ఇతర ప్రాంతాలలో గీత స్వరాలైన షడ్జాదులకు ఎక్కువ ప్రాధాన్యముంది . వారుమధ్యమ స్వరం మీదనే ఎక్కువ శ్రమ పెడతారుకాని ,సప్తమమైన నిషాదం అసలు ఉపయోగించరు .ఇలాంటి అపూర్వ విషయాలు ఈ వ్యాసం లో ఉన్నాయి .

  ‘’శౌనకీయ శిక్షా ‘’వ్యాసం లో శ్రీ వే.వెంకటరామ శర్మ ఋగ్వేదానికి అన్వయించే ఆ శిక్షలో వీరకరణము ,రంగము ,సంయుక్త వర్ణోచ్చారణం మొదలైనమెలకువాలు రాస్తూ,  వేదోచ్చారణలో కేరళీయులకున్న౦త శ్రద్ధ, మిగిలినవారికి లేదన్నారు. వీరు ప్రాతిశాఖ్య ,క్రమ శిక్షలో అద్వితీయ పండితులు  .శ్రీ ప్రతివాద భయంకర అణ్ణ౦గరాచార్యులు ‘’పద పాఠ పరిశుద్ధి’’వ్యాసం లో తైత్తిరీయ సంహిత  ‘’లో 1,09,287పదాలున్నాయని ,,వీటిలో ఏకాక్షర ద్వ్యక్షర ,బహ్వక్షరములున్నాయని ,ఒకే పదం వేర్వేరు చోట్ల భిన్నస్వరాలలో ఉచ్చరించటానికి కారణం వేదపురుషుని ఉచ్చారణ విశేషమే అనీ ,అ ఉచ్చారణ దశ విధాలని చెప్పారు .

  శ్రీ వే. వేంకట రామ శర్మ ‘’వైదికః ప్రకృతిపాఠః’’లో వేదపాఠం ప్రకృతి,వికృతిఅనే భేదాలతో ఉంటుందని అందులో ప్రకృతిపాఠంసంహిత ,పదం ,క్రమం అనే మూడు అంతర్భాగాలతో ఉంటుందని ,వికృత పాఠంఘన ,జటమొదలైన 8విధాలని వేడ్యాచార్యులు ‘’వికృతివల్లి ‘’లో చెప్పాడని,వ్యాడి-పాణిని మేనమామకుమారుడని ,,ఆయన లక్ష శ్లోకాలతో పాణినీయం ను గురించి గ్రంథం రాశాడని చెప్పారు .యజ్ఞం లో ,స్వాధ్యాయం లో సంహితార్ధ పరిజ్ఞానం సంబంధం కలిగి ఉండటం వలన సంహితార్ధ పరిజ్ఞానానికి ,పదాధ్యయనానికి ప్రయోజనం ఉందని ,క్రమ పాఠానికి అలాంటి ప్రసిద్ధి లేదని ,స్మృతిప్రయోజనమున్నదని,క్రమం కూడా ఆర్షమే అనీ ,వ్యాకరణ శాస్త్రం లో ‘’తదథీతే తద్వేద ‘’అని మొదలు పెట్టి ,’’క్రమదిభ్యో వున్’’అంటే క్రమాధ్యయనం చేసేవారిని ‘’క్రమకులు ‘’అంటారని ,పఠాధ్యయనం చేసిన వారిని ‘’పదకులు ‘’ అంటారని ,కనుక క్రమపాఠం అందరూ అంగీకరించారని వివరించారు .శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు దీనిపై ‘’వేద స్వరూప ప్రయోజనాలు  తెలీకుండా ‘’ఘనపాఠులు’’ ఘన స్వస్తి ఆంద్ర దేశం లో చెబుతున్నారని ,అది రానివాళ్ళు కూడా ఒకటి రెండు పనసల ఘన వల్లించి ,దానితో ఆశీర్వదించటం ఉందని ,ఇది వేదవిదులు వేద ప్రామాణ్య౦ తెలిసినవారు ఆలోచించాలని’’ అన్నారు .

ఆధారం –349,350 వ్యాసాలకు ఆధారం శ్రీ నోరి నరసిఇంహ శాస్త్రిగారు 1963జనవరి ,1967నవంబర్ ‘’భారతి ‘’మాసపత్రికలో చేసిన సమీక్షలు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-18-ఉయ్యూరు

 ,

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర

వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ  వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని ,ముంబై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆర్కి టెక్ట్స్ లో ఫెలోగా ఉన్నారు .ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ గా ,తెలంగాణా ఘటకేశ్వర్ లోని హెచ్. ఐ .టి .ఎస్ .ప్రిన్సిపాల్ గా ఉన్నారు .ఇప్పటికే 1- వెయ్యేళ్ళ వీణ వంక 2-రేచర్ల రెడ్డి వంశ చరిత్రలో మెరుపులు3-bruhatamma ,బృహతమ్మ బ్రతుకమ్మ బతుకమ్మ   3-Roman foot prints in Charminar 4-Batukamma 5-My Forays  వంటి ఎన్నో చారిత్రిక పరిశోధనా  గ్రంథాలు రాసి దేశం లో సుప్రసిద్దులయ్యారు .వీరికి ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ ఈమని శివనాగి రెడ్డి స్పూర్తిప్రదాత .శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారు నాకు పరిచయస్తులు కారు .కాని వారు ఈ పుస్తకం నాకు నా అడ్రస్ ఎలా తెలుసుకొని పంపారన్నది నేను శోధించాల్సిన విషయమైంది .పుస్తకం నాకు నవంబర్ 20 అందగానే ధన్యవాదాలు చెబుతూ నా వైనం ఎలా తెలిసిందని మెయిల్ రాశానుకాని ఇంతవరకు సమాధానం రాలేదు .

శ్రీ రెడ్డిగారు నల్లగొండ జిల్లా ఆమనగల్లు లో పుట్టిపెరిగారు .వీరి పూర్వీకులకు రేచర్ల వంశానికిచెందిన ‘’దేశముఖ్ ‘’వారసత్వ హక్కున్నది .కాకతి గణపతి దేవ చక్రవర్తి పిల్లలమర్రికి చెందిన రేచర్ల బేతిరెడ్డి ,నామి రెడ్డి  చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆమనగల్లు ప్రాంతానికి సర్వ స్వతంత్ర రాజులుగా నియమించాడు .కనుక వీరు శాసనాలలో ‘’ఆమనగంటి పుర వరాధీశ్వరులు ‘’గా గుర్తింపు గౌరవం పొందారు  .చిన్నతనం నుండి రెడ్డిగారికి రే చెరువులు అనబడే రేచర్ల రెడ్ల చరిత్రతోపాటు  వెలమ వంశ మూల పురుషుడుగా చెప్పబడే చెయ్యూరి చెవ్వి రెడ్డి కథా,అతనికీ  పిల్లలమఱ్ఱి ప్రాంతం లో ప్రచారం లో ఉన్న రేచ బేతాళతో ముడివేయబడిన కధలువింటూనే ఉన్నారు .జటప్రోలు సంస్థానాధీశులు శ్రీ వెలుగోటి రాజ గోపాలకృష్ణ యాచేంద్ర  కోరికపై శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి ,శ్రీ అవధానం శేషశాస్త్రి గార్లు ‘’వెలుగోటి వంశావళి ‘’రాస్తే 1910లో ముద్రితమైంది .కాని దీని పై రెడ్డిగారికి నమ్మకం కుదరలేదు .మెకంజీ మాన్యు స్క్రిప్ట్ లన్నిటిలో కొన్ని బ్రౌన్ రాత ప్రతులను తయారు చేసి ,సంపుటాలుగా బైండ్ చేయించాడు .ఇవే స్థానిక చరిత్రలు లేక కైఫీయత్తులు .వెలుగోటి వంశావళి కూడా మెకంజీ కృషి ఫలితమే .

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ,తురుష్కులను పార ద్రోలి తెలుగు దేశం లో స్వా తంత్రాన్ని  స్థాపించటానికి  ముసునూరి ప్రోలయ ,కాపయ నాయకుల పాత్ర అమోఘం .వీరికి రేచర్ల గోత్రీకులైన వెలమనాకకులు సహాయపడ్డారు .1361 నుంచి 1475వరకు రాచకొండ ,దేవరకొండ రాజధానులుగా తెలంగాణా అంతా పాలించారు .1475లో దేవరకొండ రాజు లింగమనేని తో వీరి పాలన పూర్తయింది .వీరి చరిత్రకు  సాక్ష్యంగా  31శాసనాలున్నాయి .గణపతి దేవుడు, రుద్రమ దేవి ,ప్రతాప రుద్రుల కాలం లో వీరు కాకతి సామ్రాజ్యానికి అమోఘ సేవలందించారు .చేయ్వి రెడ్డి కొడుకు ప్రసాదిత్యుడు రుద్రమ దేవిని కాకతీయ సింహాసనం పై  అధిస్టింప జేసి ,ఆమె కు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచి వేశాడని వెలుగోటి చరిత్ర చెబుతోంది .ఇదే ఇప్పటికీ ప్రామాణిక గ్రంధం గా వెలమవారు భావిస్తారు .చేయ్వి రెడ్డికి పూర్వం ఉన్నవారి గురించి ప్రస్తావన లేదని బుచ్చి రెడ్డిగారంటారు .

కాకతి రుద్రుని  క్రీ.శ. 1181 మొరిపి రాల శాసనం ప్రకారంమరొక కొత్త వంశ వృక్షం కనిపిస్తోందని ,ఇది విర్యాల కుటుంబానికి చెందినకొల్లిపాక సోమనాధుని భక్తుడు  కేతి రెడ్డి, భార్య వెలుసాని  తో మొదలై ,వరుసగా దేవి రెడ్డివరకు వచ్చి ఇతడిని దేవి రెడ్డి బేతియగా చేసి ,ఇతని తండ్రిని విర్యాల బేతియబంటు చేర్చటం జరిగింది కనుక బేతయే బేతాల నాయకుడు అన్నారు రెడ్డిగారు. .   వెలుగోటి వంశావళి లో చేయ్వి రెడ్డి బేతాల రెడ్డి గా చెబితే ,తర్వాత వచ్చిన వెలుగోటి వంశ చరిత్రలో బెతాలనాయుడు అన్నారు .

రేచర్ల పద్మనాయక మూలాలను ఇంతవరకు ఎవరూ పరిశోధించనందుకు రెడ్డి గారు బాధపడ్డారు .వీరత్వం వలన వీరి వంశం ‘’వెలమ వంశం’’ అయిందని శ్రీనాధుడు చెప్పాడు .కొందరు చరిత్రకారులు రెడ్డి సామాజిక వర్గం వారికి రేచర్ల అనే,ఇంటిపేరు ఉంటుందని ,వెలమవారికి రేచర్ల గోత్రంగా ఉంటుందన్నారు .రెడ్డి గారి దృష్టిలో వెలమలు అంతా పద్మనాయకులు కారు .13వ శతాబ్దం నుంచి వెలమ రాజులకు పేరు చివర నాయనంగారు లేక నాయన గారు చేరింది .ఉదాహరణకు ఎర్రమ నాయనిం గారు .ముసునూరు కాపయ నాయకుడు లేక నాయని౦గారు  వెలమ కాదని చరిత్రకారుల నిర్ణయం .ఇతడు వెలమ అనవోతా నాయకుని చేతిలో 1367-68లో భీమవరం వద్ద యుద్ధం లో చనిపోయాడు .

వెంకట గిరి సంస్థానాధీశులు రాజ దానినిని వెలుగోడు నుంచి  వెంకటగిరి కి  మార్చినప్పటినుండి ఇంటిపేరు వెలుగోటిగా ప్రచారమైంది .వీరి వంశ పరంపర నామం ‘’యాచేంద్ర ‘.రేచర్ల రాజధానిగా 6 తరాలు పాలించిన రేచర్ల రాజుల ప్రధాన స్థానం వెంకట గిరి .అసలు వెలుగోడు పెరేలావచ్చింది ?రాయప్ప కపిలేశ్వర గజపతి రాజ లాంచనమైనవెల్ల గొడుగు అంటే  తెలుపు గొడుగు పట్టుకొని కోట గోడపై నిలుచున్న  తర్వాత వెలుగొడుగు పేరొచ్చి ,వెలుగోడు గా  మారింది .15వ శతాబ్ది లో వెలుగోటి వారు విజయనగర సామంత రాజులు .కృష్ణ దేవరాయల పట్టాభి షేకం సందర్భంగా ధూర్జటి కవి ‘’ధాటీ నీరావార ఘోటీ హత విరోధి కోటులై  వెల్గు వెలుగోటి వారు ‘’అనే చాటువు చెప్పాడు .రాయలు రాయప్పకు రాజలా౦ఛనమైన  తెల్ల గొడుగుకు ప్రదానంచేస్తూ ‘’వెలు గొడుగు ప్రభువు ‘’బిరుదు ఇచ్చాడు .

చెలికాని శేషారావు ,డా చెన్నమనేని పద్మ వెలుగోటి వంశావళి చరిత్రలలో లేని ఒక కొత్త విషయం చెప్పారు –‘’వివాహ లేక శోభనం వేళ రేచని కులస్తులు ఇచ్చిన అక్షతలు స్వేకరించాలి .1181వెలనాటి రెండవ కులోత్తుంగ రాజేంద్ర చోళుడు మరణించగా ,పల్నాడులో అన్నదమ్ముల మధ్య కలహాలు రావటం తో నలగామ రాజు సాయం కోరటం తో  కాకతి రుద్రుడు జోక్యం చేసుకొని,సైన్యం తో కోట నాయుడైన దొడ్డ భీముని ఓడించి ,ధరణికోట పట్టుకొని ,వెలనాటి పడమర సరిహద్దులోకాపలా దారులుగా  ఉన్న కొండపడుమతి రాజులనురెండవ కేతరాజు సాయం తో ఓడించి,కృష్ణా పశ్చిమ  తీరం  లోని వెలనాడు ,పలనాడు లను లోబరచుకొని ,,రేవూరు గ్రామాన్ని త్రిపురాంతక మహాదేవుడికి కానుక ఇచ్చినట్లు 1185త్రిపురారం శాసనం తెలియజేస్తోంది .సింగమ దేవ నాయకుని కుటుంబం రుద్ర దేవుని ఆహ్వానం పై ‘’అలుగడప ‘’ప్రాంతానికి వెళ్లి ,రుద్రుని మహా ప్రధాని అయ్యాడు .సి౦గమ మతాత కు  గడికోట మల్లుడు అనే బిరుదుంది వెలనాటి చోళులకు చివర మల్ల ఉంటుంది .కనుక వీరే తెలంగాణాకు వచ్చిన మొదటి తరం వెలమ నాయకులు అని అన్నారు రెడ్డిగారు.వెలనాటి నాయకులు ‘’వెలనాటి మల్లులు ‘’గా పిలువబడి ఉండాలని, వెలనాటిమల్లులే  కాలక్రమ లో ‘’వెలమల్లు ‘’లై ఇప్పటి ‘’వెలమలు’’ అయ్యారని రెడ్డిగారి మాట యదార్ధంగానే కనిపిస్తోంది  .ఆలుగడప శాసనం లో గుండపనాయుని ‘’గడికోట మల్ల ‘’గా పేర్కొనటం వలన మల్ల బిరుదు తో వారు మల్లుల పాత్ర పోషించి ఉండాలన్నారు .గుండప నాయకుని  పూర్వీకులు  ‘’వెలనాటి చోళులే ‘’అని రెడ్డిగారు నిర్ధారించారు .

1201లో తీరాంధ్రపై కాకతీయ దాడి మొదలైంది .అయ్య కుటుంబానికి చెందిన పిన్న చోదడి  వెలనాటి సామంతుడు .కాకతి సైన్యం తో పోరాడి ఓడిపోయి ,తనకూతుళ్ళు నారాంబ , పేరాంబలను గణపతి దేవునికిచ్చి పెళ్లి చేశాడు .ఇలా ఒక శతాబ్దం  వెలనాటిపాలనలో ఉన్న తీరాంధ్రం కాకతీయ పాలనలోకి వచ్చింది .అలాగే గణపతి నేరుగా  పృధ్వీశ్వరునిపైకాకుండా   మొదట దివిసీమపాలకుడు అయ్యనాయకుని పై దాడి చేసిఓడించటం తో పృధ్వీశ్వరుడు గణపతి ని ఎదిరించకతప్పలేదు .ఈలోగా వెలనాటి శత్రువులైన నెల్లూరి తెలుగు చోడరాజు తిక్కభూపాలునితో ,కొణిదన కుచెందిన మహామండలేశ్వర చోడ బల్లయ తో సఖ్యమేర్పరచుకొని ,చివరి దెబ్బగా పృధ్వీ శ్వరుడిని1209లో  ఓడిద్దామనుకొని ,అయ్యరాజ్యం ద్వీపాన్ని (దివిసీమ )జయైంచి ఆరాజు కుమార్తెలను పెళ్ళాడి దక్షిణ సరిహద్దు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఇతనిమిత్రులు పృధ్వీ శ్వరుడిని ఓడించి చంపారు .ఈ దాడిలో పాల్గోన్నవారందరికీ ‘’ప్రుద్వీశ్వర శిరః కందుక క్రీడా వినోదులు’’అనే బిరుదు పొందారు .1209లో చందవోలు లో వెలనాటి చోడరాజ్యం అంతమై ,కాక తీయ సామ్రాజ్య భాగమైంది .వెలనాటి రాజ ప్రతినిదిత్వాన్ని గణపతి దేవుడు తనబావమరది జాయప  నాయకునికి అప్పగించి తర్వాత సైన్యాధిపత్యం అందజేశాడు .యితడు నృత్త రత్నావళి రాశాడు .సురవరం ప్రతాపరెడ్డిగారు వెల్లాల వారే వెలమలు అయిఉంతారని ఊహించగా థర్ స్టన్అనే పరిశోధకుడు ‘’కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఇన్ సౌత్ ఇండియా ‘’అనే పుస్తకం లో అలుగడప శాసనం వలన వెల్లాల వారే వెలమలయ్యారని గట్టిగా చెప్పాడు .నరసరావు పేట పద్మనాయక వెలమ సంస్థానాధీశులు విరియాల గోత్రీకులని ఇంటిపేరు మల్రాజు వారని ,విరియాల మల్రాజు గణపతి దేవ చక్రవర్తి సామంతుడని 1234’’పమ్మి దాన శాసనం ‘’రుజువు చేస్తోంది .

ఇదీలా ఉండగా  మరొక వెలమ రాజు  దేవాద్రి రాజధానిగాఅనవోత రాజు  మెదక్ జిల్లాలో కొంతభాగాన్ని పాలించాడని 1453దర్పవల్లి శాసనం చెబుతోంది.ఇతని రెండవభార్య మల్లమాబ వీరిమనుమడు పల్లయ .అనవోతకు రెండవ సింగభూపాలుడు ,ధర్మానీడు కొడుకులు .అనవోత తండ్రి సి౦గమ నేనికి ఇద్దరు భార్యలు ఉండి ఉండవచ్చు  అంటారు రెడ్డిగారు .ఆ కాలం లో బహమనీ  సుల్తాన్ లతో యుద్ధ తప్పించుకోవటానికి హిందూ రాజులు తమ కూతుళ్ళనిచ్చి పెళ్ళిచేసేవారు .అల్లాఉద్దీన్ తండ్రి మొదటి అహ్మద్ షా సామంతుడైన సంగమేశ్వరుని కూతుర్ని పెళ్ళాడి ఆమెకు ‘’చెబ్రా చెహరా ‘’బిరుదు ఇచ్చాడు.పన్నయ  కూడా సింగభూపాలుడికి భయపడి సుల్తాన్ తో సంబంధం కలుపుకొని ఉంటాడని రెడ్డి గారి ఊహ  .

కరీం నగర్ జిల్లా కోరు కల్లుమండలకేంద్రం వీణవంక గ్రామ ఉత్తరాన గోదావరి ఉపనది మానేరుకు ఆనుకొని ఉత్తరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయమున్నదని మానేరు నది మధ్యలో పూర్వపు కోరుకల్లు గ్రామ ఆనవాళ్ళు కనిపిస్తాయని ,నది ఒడ్డున నాగ దేవత శిల్పం ,కొంతదూరం లో గుట్టవైపు ఆంజనేయ శిల్పం కనిపిస్తాయని ,నది వరదలవలననో కలరావలననో ,  గుట్టకు నైరుతి దిశకు గ్రామం మారి ఉంటుందని ,గుట్టపై16 స్తంభాల శిధిల మండపం ఉందని ,,కోరుకొల్లులో ప్రాచీన   ‘’మహా కూటే శ్వరాలయం’’ఉందని ,దీనిప్రక్కన ఒక రాజకుటుంబం వేయించిన శిలాశాసనముందని  కనుక రాచకొండ వెలమరాజులతో సంబంధమున్న కోరుకొల్లు తెలంగాణా చరిత్ర లో చెప్పుకోదగిన విషయమనీ శ్రీ బుచ్చి రెడ్డి ఉవాచ   .కోరుకొల్లు లోని ‘’ఎర్రపోచమ్మ’’దేవత దగ్గర కోడి ని బలిస్తే విత్తనాలకు పట్టే యెర్ర చీమల బెడద తప్పుతుందని దీనికి తాను ప్రత్యక్ష సాక్షినని రెడ్డిగారన్నారు .ఈవిషయాలపై ఆయన ‘’వెయ్యేళ్ళ వీణవంక ‘’పుస్తకం రాశారు .

అలెక్స్ హెలీ తనజాతి  దక్షిణాఫ్రికా మూలాల కోసం ఎంతో శ్రమించి సాధించి ‘’రూట్స్ ‘’పుస్తకం రాసి చరిత్ర సృష్టించాడు .అలాగే శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి గారు తమ వెలమవంశ మూలాలను త్రవ్వి తీసి సహేతుకంగా శాసనాలనాదారంగా రుజువు చేసి వెలమవంశజులకు మహోపకారం చేశారు .మనకు తెలియని కొత్తవిషయాలు ఆవిష్కరించి చెప్పారు .వీరి పరిశోధన ,తపన ఎన్నదగినది .వారుకోరినట్లు మరింత లోతుగా ప్రభుత్వాలుపూనుకొని నిజమైన వెలమ చరిత్రను వెలువరిస్తుందని ఆశిద్దాం . శాసనాలు, రాజవంశ చరిత్ర అయినా ,రెడ్డి గారి రచన ఆరుద్ర సాహిత్య చరిత్ర లాగా హాయిగా చదివించే గుణం ఉండటం వలన విషయం తేలికగా అర్ధమౌతుంది .దీనికి వీరిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే .

ఈ పుస్తకం లో చివర అనుబంధంగా శ్రీ బుచ్చి రెడ్డిగారు  రాసిన ‘’నాయకురాలు నాగమ్మ’’ జీవిత చరిత్రనూ చేర్చారు .నాకు తెలియని ఎన్నో విషయాలున్నందున మీకూ అందించాలనే తపనతో అందులోని ముఖ్యాంశాలను అందజేస్తున్నాను .

నాయకురాలు  నాగమ్మ

పలనాటి మంత్రిణి నాగమ్మ  కరీం నగర్ జిల్లా పెగడపల్లి లోని ఆరవెల్లి గ్రామం లో భూస్వామి రామి రెడ్డి కూతురు .చిన్నప్పుడే తల్లి చనిపోతే ,కలరా వంటి వ్యాధులు గ్రామాన్ని కలవర పెడితే ,కూతురుతో తండ్రి పల్నాడు వెళ్లి అక్కడ  జిట్టలో గామాలపాడు లో ఉన్న సోదరి ,బావమరది మేకపోతుల జగ్గా రెడ్డి  ఊరికి చేరి ,క్రమంగా వారి సహకారంతో భూములు కొని వ్యవసాయం చేసి పెద్ద భూస్వామి అయ్యాడు .చలాకీ పిల్లనాగమ్మ ఏక సంథాగ్రాహి.కనుక శివభక్తుడు గోపన్నమంత్రి పర్యవేక్షణలో చదువుతో పాటు ధనుర్విద్య సాముగరిడీలు అశ్వ శిక్షణ పొంది ,ఆ గ్రామంలో శివాలయం నిర్మించగా తండ్రి చెరవు నిర్మించాడు , తండ్రి తనమేనల్లుడికిచ్చి నాగమ్మ పెళ్లి చేయగా, పెళ్లి అయిన మూడు రోజులకే అతడు చనిపోగా ,ఆబాధ మర్చిఏందుకు కూతురిని సంస్కృత ,తెలుగు కన్నడ తమిళభషలు ,రాజనీతి, తత్వశాస్త్రం మొదలైనవి నేర్పించాడు . ఈ గ్రామ౦ లో పెద్దగా నిలిచి దానధర్మాలు చేస్తూ ,న్యాయ  సలహాలతో  ప్రజలకు చేరువై ‘’ నాయకురాలు నాగమ్మ ‘’అని పించుకోన్నది  .

గురజాల పాలకుడు అలుగు రాజు మంత్రి బ్రహ్మనాయుడు నాగమ్మ తండ్రి  త్రవ్వించిన  చెరువు రాజ్యోపకారానికి కావాలని ఒత్తిడి చేస్తే ,నిరాకరిస్తే ,ఆగ్రహించి అర్ధరాత్రి రామి రెడ్డిని హత్య చేయించాడు .బ్రహ్మనాయుని అకృత్యాలకు చెక్ పెట్టాలని నాగమ్మ శపథం పూని, ఒక రోజు అలుగురాజు వేటకు వెళ్లి అలసిపోయిసైన్యంతో సహా  జిట్టగ్రామానికి వస్తే నాగమ్మ సాదరంగా ఆహ్వానించి అందరికి అతిదిమర్యాదాలు చేసి ,అతడి అనుగ్రహం పొంది ఏమికావాలో కోరుకోమంటే రాజాస్థానం లో ‘’ఏడుఘడియలు ‘’మంత్రిగా ఉండటానికి అధికారం ఇవ్వమని కోరితే ,ఒప్పుకొని రాజపత్రం రాసిచ్చాడు .ఈ అనుమతితో తరచూ రాజదర్బార్ కు వెళ్లి వచ్చేది .తనపలుకుబడితో అధికారులను  ,దగ్గరకు చేర్చగా మంత్రిదొడ్డనాయుడు మంత్రిపదవి త్యజించి ,తన రెండవ కొడుకు బ్రహ్మనాయుడిని ప్రధానమంత్రి చేశాడు .

తనకిచ్చిన ఏడు  ఘడియల  అధికారం తో నాగమ్మ ,నాయుడు, బంధువులుదోచిన సంపదనంతా ఖజానాకు చేర్పించి ,నలగామ రాజు విశ్వాసం పొంది ,శాశ్వతంగా మంత్రి అయి౦ది .నాగమ్మచింతపల్లికి చెందిన మేడిగం కాటి రెడ్డి ని సైన్యాధ్యక్షునిగా ,మాడగుల వీరా రెడ్డిని  సైన్యాదికారిగా చేసి ,రాజ్యాన్ని బలోపేతం చేసి  రాజ్య రక్షణకు విశేష కృషి చేసింది .నాగమ్మ మంత్రిత్వం గిట్టని బ్రహ్మనాయుడు మలి దేవాదుల సాయంతో హైహయ కుటుంబం లో అంతః కలహాలు సృష్టించి,పలనాడును రెండురాజ్యాలుగా చీల్చాడు .నాగమ్మ ఒకే రాజ్యంగా ఉండాలని పట్టుబట్టింది .నలగాముడు మలిదేవాదులకు 90 గ్రామాలతో  కూడిన మాచర్ల రాజధానిగా రాజ్యమిచ్చాడు .పెద్దమలిదేవుడు బ్రహ్మనాయుని ప్రధానమంత్రిని చేస్తే చిన్నవాడుకనుక నాయుడే మొత్తం పాలన సాగించాడు .

నలగామ రాజు గురజాల రాజధానిగా రాజ్యాన్ని పాలిస్తూ నాగమ్మను ప్రధాని చేశాడు .నాగమ్మ ప్రజాభిమానం పొందుతూ ఉండగా నాయుడు ‘’చాపకూడు ‘’సిద్ధాంతం తో ప్రజలకు చేరువయ్యాడు .కళ్యాణీ రాజ్యంతో బంధుత్వం కలిపి ,పెదమలిరాజుకు రాజు సోమేశ్వరుని కూతురు తో పెళ్లి చేయించి మాచర్ల రాజ్య పట్టం కట్టాడు .ఈ వియ్యం గురజాలను కలవర పరచింది .నాయుడుకాలచూరుతో వియ్యమంది చందోలు విరోదికూటమిలో చేరాడు .కోడిపందాల వ్యసనం తో రెంత చింతలవడ్డ జరిగిన కోడిపందెం తో మాచర్ల పుంజు ‘’చిట్టిమల్లు ‘’ఓడిపోగా మలిదేవాదులు  పందెం ప్రకారం  రాజ్యం కోల్పోగా, నాయుడు రెండో పందెం కాయించి గోలివాగు దగ్గర నాగమ్మ పుంజు సివంగి డేగ కు నాయుడు పుంజు చిట్టిమల్లుకు పోటీజరుగగా   బ్రహ్మన పుంజు ఓడిపోగా ,అన్యాయం అరిగిందని గగ్గోలు పెడితే మధ్యవర్తి అలరాజు  నాయుడి కోడి గెలిచిందని తీర్పు ఇవ్వగా మళ్ళీ మలిదేవాదులు రాజ్యం కోల్పోయి ,క్రష్ణదాటి మండాది అడవికి వలసవెళ్లి వీరా మేడపి పట్టణం కట్టుకొని పాలించగా ఏక రాజ్యం చేయాలన్ననాగమ్మ ఆశలు అడుగంటాయి .

ఏడేళ్ళ ఆరునెలల ప్రవాసం తర్వాత మలిదేవాదులు తమరాజ్యం, ఆదాయం ఇవ్వమని  , కోరగా  ,నాగమ్మ ఒప్పుకోక అలరాజును రాయబారిగాపంపగా ,రాయబారం విఫలమై తిరుగుప్రయాణం లో  విష ప్రయోగం లో  చనిపోయాడు .నాగమ్మే ఈపని చేయించినది అందరూ అంటారు .అతని తండ్రి కొమ్మరాజుకు నాయుడిపై అనుమానం వచ్చి౦ది .మలిదేవాదులు నాయుడుప్రోత్సాహంతో గురజాలపై యుద్ధం  ప్రకటించగా  ,నలగామరాజు సమకాలీన రాజుల సాయం కోరగా నాగమ్మ రాజకీయ చాతుర్యం తో కాలచూరులుతప్ప అందరూ సాయానికి వచ్చారు . ఇరు సైన్యాలకు కారం పూడిలో యుద్ధంకు  సన్నద్ధమైనా ,రక్తపాతం జరుగరాదని నాగమ్మ నలగామ రాజుకు నచ్చ చెప్పి మేడిదగం  కాటి రెడ్డి  ,మాడుగుల వీరా రెడ్డి ,ధరణికోట కేతరాజులను పంపి సంధి ప్రయత్నం చేసి సాధించింది .సందికుదిరిన సంతోషం తో రెండువైపులవారూకలిసి సహపంక్తి భోజనాలకు కూర్చోగా ,వడ్డన ప్రారంభంకాగానే  బ్రహ్మనాయుడి కొడుకుఉడుకురక్తపు  బాలచంద్రుడు దూసుకువచ్చి ‘’సంధీలేదు గిన్ధీ లేదు యుద్ధ జరగాల్సిందే ‘’అని వడ్డించిన  విస్తళ్ళను  కాలితో తన్నేసి చిందరవందర చేయగా నలగామునికి కోపంవచ్చి యుద్ధ ప్రకటన చేశాడు .

బ్రహ్మనాయుడికి దన్నుగావచ్చిన గోసంగులు ఎడురుతిరగ్గా నాగమ్మవైపే ఎకువమంది చేరగా మూడు రోజులు యుద్ధం జరిగి నాయకురాలు నాగమ్మ స్వయంగా కత్తి పట్టి నాయుడితో యుద్ధం చేయగా,రెండవరోజు బాలచంద్రుడు చనిపోగా ,నాగమ్మ హృదయం ద్రవి౦చగా, మూడో రోజు కాలచూరి  కొమ్మన మరణించగా ,మలిదేవుడే స్వయంగా యుద్ధానికి వచ్చి హతమైనా ,నాయుడు యుద్ధం కొనసాగించి ,నాగమ్మ నాయుడు హోరాహోరీ యుద్ధం చేశారని చనిపోయాడని కొందరు అంటే ,నాగమ్మ శరణు వేడగా క్షమించి గుత్తికొండ బిలం చేరి తపస్సుతో తనువు చాలించాడని కొందరు అంటారు  .నాయుడి నిష్క్రమణతో పలనాటి యుద్ధం సమాప్తమైంది .నాగమ్మ నలగామరాజుకు విజయం చేకూర్చి రాజు కు అండగ నిలిచింది .

పల్నాడు  అంతటా కాలువలు  త్రవ్వించి  వ్యవసాయానికి తోడ్పడి ,గురజాలదగ్గర సంగమేశ్వర పురం లో ,అడిగొప్పుల ,జూలకల్లు లలో  పెద్ద చెరువులు త్రవ్వించి ,కారంపూడి వద్ద నాగులేరుకు ఆనకట్ట కట్టించి నీటికొరత తీర్చి సశ్యశ్యామలం చేసి రాజ్యాదాయం పెంచి ‘’రైతు నాయకురాలు’’ అనికూడా అనిపించుకొన్నది .చాలా శివాలయాలు కట్టించింది .గురజల  వీరభద్రాలయం ఆమె కట్టించిందే  .పాలనావ్యవస్ద ను  పటిష్టం చేసింది .పలనాడు ఆరాధ్య దేవత అయింది .ఆడపిల్లలకు’’ గౌరవంగా నాగమ్మ’’ పేరు పెట్టుకోవటం ఆనవాయితీ అయింది

జీవిత చరమాంకం లో నాగమ్మ గుర్రం మీద ఆయుధాలు పెట్టుకొని పనాడునుండి తెలంగాణా కరీంనగర్ జిల్లా  స్వగ్రామం ఆరవెల్లి వెళ్లిందని ,అక్కడిప్రజలు ఆమెను నాయకురాలిని చేయగా ,దొంగలభయం నుండి ప్రజలను కాపాడుతూ ,ప్రజలకు రక్షణ ఇస్తూ  ,దొంగలను ఎదిరిస్తూనే చనిపోయిందని కొందరు ,స్వచ్చందంగా నే నాగమ్మ జీవ సమాధి అయిందని కొందరు అంటారు .

శ్రీనాధ కవిసార్వభౌముడు –‘’పంట రెడ్డి వారి పడతి యన౦గా –ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ –మేకపోతుల రెడ్డి మేనకోడలు ను –ఆరవెల్లి వారింటి ఆడపడుచు అమర కోడలన ‘’- అని చెప్పిన పద్యం లో కూడా నాగమ్మ తెలంగాణా కరీంనగర్ జిల్లా ఆరవెల్లి గ్రామం ఆడపడుచు .అని నాయకురాలు నాగమ్మ చరిత్రను శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారు మరోకోణం లో ఆవిష్కరించారు  .

అయితే మన౦ విన్న దానికి దీనికీ తేడాలున్నాయి  .బ్రహ్మనాయుడు వైష్ణవమతావలంబి నాగమ్మ ది శైవం .సహజ వైరం ఉండేఉంటుంది .ఆయన చెన్నకేశవాలయం కట్టిస్తే ,ఈమె వీరభద్రాలయంనిర్మించింది .  ఈ హరిహర ద్వేషం చూసే తిక్కన సోమయాజి హరిహరాద్వైతం బోధిస్తూ మహాభారతాన్ని ఆంధ్రీకరించాడని మనకు తెలిసిన విషయం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-18-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )

  • గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )

 ఆది శంకరాచార్య శిష్యుడు ఆనందగిరి .శంకర విజయం ,న్యాయ నిర్ణయం ,తర్క సంగ్రహ  గ్రంథాలు రచించాడు .ఇతడినే ఆనంద జ్ఞాన అంటారు .

349-హారలత కర్త –అనిరుద్ధ భట్టు (11వ శతాబ్దం )

బెంగాల్ లో స్మృతి రచనకారులలో ప్రసిద్ధుడు అనిరుద్ధ భట్టు .12వ శతాబ్ది రాజు వల్లాలసేన అనిరుద్ధభట్టు తన గురువు అని చెప్పుకొన్నాడు .హార లత ,పితృ దయిత అనే స్మృతి వ్యాఖ్యానాలు రాశాడు .’’కర్మోప దేశిని పధ్ధతి ‘’కూడా ఇతని రచనే అంటారు .

350-వార్తిక సూత్రకర్త –అనుభూతి స్వరూపాచార్య (12వ శతాబ్దం )

12వ శతాబ్దికి చెందిన ఆచార్యుడు అనుభూతి స్వరూపాచార్య .సారస్వత వ్యాకరణం లోని వార్తిక సూత్రాలు రాశాడని అంటారు .

351-మీమాంస న్యాయ ప్రకాశ కర్త –ఆపదేవ (17వ శతాబ్దం )

ఆపదేవి గా పిలువబడే ఆపదేవ  మీమాంస న్యాయ ప్రకాశ రచించాడు .తత్వ శాస్త్రం లో ఇది పూర్వ మీమాసకు గైడ్ లాంటిది .ఇతని కొడుకు అనంత దేవుడు తన ‘’స్మృతి కౌస్తుభం ‘’లో  తండ్రి గురించి రాశాడు .వీరిది సకల శాస్త్ర పారంగత ,ఆధ్యాత్మిక స౦పన్నత  ఉన్న మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం .ఆపదేవ  ముత్తాత 1609 నాటి ఏకనాధుడు అనే మహా భక్తకవి .ఆపదేవుని తాత పేరు ఆపదేవుడు .తండ్రిపేరు అనంత దేవుడు.బహుశాకవి 17వ శతాబ్దికి చెందినవాడు అయి ఉండాలి .మీమాంస శాస్త్రం లో భట్ట పధ్ధతి అనుయాయి .

352-చతుశ్శతక  కర్త –ఆర్య దేవుడు –(క్రీ.శ.2వ శతాబ్దం )

కానదేవుడుఅంటే ఏకాక్షి ,నీలనేత్రుడు అని పిలువబడిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని శిష్యుడు ఆయన పీఠానికి ఉత్తరాదధికారి అని హుయాన్ సాంగ్ ,ఇత్సింగ్ యాత్రికులు చెప్పారు .ఆర్యభట్టు జీవిత చరిత్రను 405కు చెందిన కుమార జీవ చైనాభాషలోకి అనువదించాడు .కనుక ఆర్యదేవ రెండవ శతాబ్ది చివరి కాలం వాడు అయి వుండచ్చు,చతుశ్శతకం ,అస్టావలప్రకరణం లేక ముష్టి ప్రకరణం రాశాడని భావిస్తారు .ఆర్యదేవుని రెండు చిన్నవ్యాఖ్యానాలను బోధిరుచి చైనాభాషలో త్రిపిటకలలో అనువాదం చేశాడు .చిత్త విశుద్ధి ప్రకరణ  కూడా ఇతని రచనగా చెబుతారు .

353-జాతకమాల కర్త –ఆర్య సూర(3-4శతాబ్దాలు )

మూడు లేక నాలుగో శతాబ్దికి చెందిన ఆర్యసూర జాతకమాల రాశాడని చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నాడు .అజంతా లోని కుడ్య చిత్రాలలో దీని విషయం ఆనాడు చెప్పబడింది

354-బాలం భట్టి కర్త –బాలంభట్ట –(1730-1820)

బాలంభట్టు లేక బాలకృష్ణ పాయ గుండ దక్షిణ భారత దేశానికి చెందినవైద్యనాథ,లక్ష్మి దంపతుల కుమారుడు .విజ్ఞానేశ్వరుడు రాసిన ‘’మితాక్షర ‘’కు బాలంభట్టి అనే వ్యాఖ్యానం రచించాడు .శబ్ద కౌస్తుభం ,శబ్ద రత్న , శబ్దేందు శేఖర వ్యాకరణాలకు కూడా వ్యాఖ్యానం రాశాడు .ఇదే పేరుతొ ఉన్న  తంజావూరుకవి బాలబోధిని బాలరంజని అనే చిన్న వ్యాకరణ పుస్తకాలు రాశాడు .

355-ప్రబోధ ప్రకాశ కర్త-బలరామ పంచానన (?)

కాలం వగైరా విషయాలు తెలియనిబ్రాహ్మణకవి బలరామ పంచానన ‘’ప్రబోధ ప్రకాశం ‘’అనే వ్యాకరణ గ్రంథం రాశాడు .  ఇతనిదే ‘’ధాతు ప్రకాశిక ‘’కూడా అంటారు .

ఆధారం – సురేష్ చంద్ర బెనర్జీ  రచించిన – ‘’ఎ కంపానియన్ టు సాంస్క్రిట్ లిటరేచర్’’

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుకవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )

  • గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )

12వ శతాబ్దం లో కొంకణ దేశాన్ని పాలించిన అపరార్కాదిత్య మహారాజు ‘’న్యాయముక్తావళి రచించాడు .ఇది యాజ్న్య వల్క్య స్మృతికి వ్యాఖ్యానం .జీమూతవాహనుని వంశం లో విద్యాధర కుటుంబానికి చెందినవాడు

యాజ్ఞవల్క్య స్మృతికి అనేక వ్యాఖ్యానాలున్నాయి .అందులో విశ్వరూప విజనేశ్వర ,అపరార్క ,శూలపాణి ల వ్యాఖ్యానాలు ముఖ్యమైనవి .ఆధునిక శిక్షాస్మృతిలో మితాక్షర ప్రాధాన్యం ఉన్నది కనుక యాజ్ఞావల్క్యుని స్మృతి అన్నటికంటే ఉన్నత స్థాయి పొంది,మార్గ దర్శకమైంది .ఈనాటి శిక్షాస్మృతికి అదే ఆదర్శమైంది .దీనికి సిలహార వంశానికి చెందిన అపరార్కాదిత్య రాసిన  ‘’అపరార్క యాజ్ఞవల్క్య ధర్మశాస్త్ర నిబద్ధ ‘’ ను రెండుభాగాలుగా ఆనందాశ్రమం ప్రెస్ ప్రచురించింది .

1-శ్రుతి  స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః –సంయక్సంకల్పజః కామో ధర్మ మూలమిదం స్మృతం ‘’

347-న్యాయ సార పదపంచిక కర్త –వాసుదేవ (10 వ శతాబ్దం )

భా సర్వజ్ఞరాసిన న్యాయ సార కు వాసుదేవ కవి ‘’న్యాయసార పదపంచిక ‘’వ్యాఖ్యానం రాశాడు .ఈయన  కాశ్మీరకవి .తండ్రి సూర్య .వాసుదేవ తన వ్యాఖ్యానం  ఉపోద్ఘాతం లో తన రచన ‘’న్యాయభూషణం ‘’ వంటి బృహత్ వ్యాఖ్యానాలను అర్ధం చేసుకోలేనివారికోసం రాసినట్లు చెప్పాడు .నిగ్రహస్థానం ,ప్రతిజ్ఞాహాని ల విషయాలు చెప్పాడు .నిగ్రహస్థానం లో ప్రతిజ్ఞా విశేషహాని మొదలైన స్వల్ప భేదాలున్నాయని తన న్యాయ భూషణం లో వివరించి నట్లు చెప్పటం వలన న్యాయభూషణ కర్తకూడా వాసుదేవ అయి ఉండాలి .దీనిలోని విషయాలను జయసి౦హసూరి తరచుగా ఉటంకించాడు .  కనుక వాసుదేవ కాలం 10వ శతాబ్దం మధ్య భాగం అని  భా సర్వజ్ఞ కు తర్వాత అతి దగ్గర కాలం వాడని  చెప్పవచ్చు ,

1-దేవ దేవ మభి వంద్ధ్య శాశ్వతం –యోగ  వృంద హృదయైకమందిరం –వాసుదేవ విదుషా విరచ్యతే –న్యాయ సార పదపంచికా  పరం ‘’

‘’ప్రణమ్య శంభుం జగతః పతిం పరం సమస్తతత్వార్య విదం స్వభావతః –శిశు ప్రబోదాయ మయాభిదాస్యతే –ప్రమాణ తత్భేధ తదన్య లక్షణం ‘’.

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమృత యోగిని -పెనుమత్స సీతమ్మ అవధూత – గురు సాయి స్తాన్ -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం )

క్రీశ 9లేక 10వ శతాబ్దికి చెందిన భా సర్వజ్ఞ’’న్యాయ  సారం ‘’రచించాడు .16 విభాగాలుగా ఉన్న న్యాయ శాస్త్రాన్ని ఏకీకృతం చేసిన’’న్యాయ సార శాస్త్రం రాసినవాడు భా సర్వజ్ఞ.ఆయన జనన విషయాలు పెద్దగా తెలియదు .కాశ్మీరానికి చెందినవాడై ఉంటాడని ఊహ .క్రీ.శ .775కు చెందిన సర్వజ్ఞ మిత్ర ,క్రీ.శ. 1025 కు చెందిన సర్వజ్ఞదేవ అనే వారు బాగా ప్రచారం లో ఉన్న కాశ్మీర కవులు .జైనకవులు గుణతంత్ర ,మాలదారి రాజశేఖరులు భా సర్వజ్ఞ ను పేర్కొన్నారు .యితడు సాంఖ్య సిద్ధాంతానికి దగ్గరవాడు . జైనులు మూడు ప్రమాణాలను అంగీకరించారు .కాని యితడు బౌద్దులవలె  అవగాహన ,అనుమానం అనే రెండు ప్రమాణాలనే అంగీకరించాడని చెబుతారు  న్యాయ సూత్రాలను నిరాకరించకుండా మోక్షాన్ని ఆత్మ గమ్యంగా చెప్పాడు .

14వ శతాబ్దం లో గంగోపాధ్యాయుడు  రచించిన తత్వ చింతామణి తో న్యాయ శాస్త్రం నవీనమార్గం పట్టి,’’నవీన న్యాయ శాస్త్రం ‘’ ఏర్పడింది .గౌతమన్యాయ సూత్రాలతోగ్రంథరూపంగా  ప్రారంభమై ,18శతాబ్దం లో ఉదయనాచార్య శివ విద్యా చార్యులవరకు ఈ శాస్త్రం ప్రసిద్ధ ఆచార్యుల హస్తాలలో ఉన్నది .తర్వాత నవీన న్యాయం పేరుతొ పండితుల పరమైంది .’’The race of grants was to be succeeded by a remarkably versatile and disputatious troop of dwas philosophy lost its freshness as well as its charm ,and gradually degenerated into a bundle of endless contro versies ‘’అన్న మహా దేవా రాజా రామ దాస్ మాటలు సత్య దూరం కాదు అన్నారు నోరి నరసింహ శాస్త్రిగారు .న్యాయ సారం అలాంటి ఆచార్య నైయాయకుని గ్రంథం అవటం వలన సంభావ్యమై౦దన్నారు .ఇందులో సూత్ర వ్యాఖ్యాతలను విమర్శించటమే కాక ,అక్కడక్కడ గౌతమ సూత్రాల ప్రత్యక్షార్దానికి మరొక సమన్వయము కూడా చేశాడు .

దీని వ్యాఖ్యానాలలో వాసుదేవ విరచిత ‘’న్యాయ సార పద పంజిక ‘’ను ఇంతకు  పూర్వమే పూనావారు ప్రచురించారని ,ఇప్పుడు దీనితోపాటు ప్రచురితైన’’ న్యాయముక్తావళి’’ శ్రేష్టమైనదని శాస్త్రిగారి భావన .దీన్ని 12వ శతాబ్దం లో కొంకణ రాజ్యమేలిన ‘’అపరార్క దేవుడు ‘’అనే రాజు రాశాడు .ఇది స్వతంత్ర సమర్ధ రచన అంటారు .దీనిలో న్యాయమతాన్ని ఖండించిన బౌద్ధ జైన మీమాంసక మతాచార్యుల నేకాక ,తాను  స్వయంగా  అద్వైతి అయినా,మొహమాటం లేకుండా వాచస్పతిమిశ్రా రాసిన ‘’భామతి ‘’ని కూడా కొన్ని చోట్ల ఖండించాడు .న్యాయ కళానిధి అసంపూర్ణ వ్యాఖ్యానం .అయినా న్యాయ శాస్త్రం నవీన మార్గం పట్టకముందే 13వ శతాబ్దం లో రాయబడింది కనుక  దాని విలువ తెలిసి చివరలో ముద్రించారు .ఇది న్యాయ శాస్త్రాభిమానులకు సంతోషించదగిన విషయం అన్నారు .

గ్రంథ సంపాదకులలో శ్రీ ఎస్ సుబ్రహ్మణ్య శాస్స్త్రి గారు ఇంగ్లిష్ లో ,శ్రీ వి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతం లో ఉపోద్ఘాతాలు రాశారు .ఈ రెండూ భేషుగా ఉన్నాయి .భా సర్వజ్ఞుడు కాశ్మీరీ అనటానికి చెప్పిన కారణాలు సంతృప్తిగా లేవు .’’ప్రణమ్య శంభుం జగతః పతిం పరం ‘’మొదలైన ప్రారంభ శ్లోకాలవలన అప్పటికే కాశ్మీర్ లో శైవం బాగా వ్యాపించి ఉంది .సర్వజ్ఞ శబ్దం – సర్వజ్ఞ మిత్రుడు సర్వజజ్ఞ దేవుడు అనే వారి పేర్లలో ముందు ఉంటె ఈకవి పేరులో తర్వాత ఉండటం గమనార్హం.  ఆంధ్ర దేశం లోనే సర్వజ్ఞ ,సర్వజ్ఞ చక్రవర్తిబిరుదులున్నవారు చాలామంది ఉన్నారు .శివభక్తి భారత దేశమంతా వ్యాపించే ఉంది కనుక కవి శైవుడు అనలేము అంటారు నోరివారు .’’యత్త ద్బ్రహ్మ జగద్బీజ మాను నంత్యా గామోక్తయః –శ్రీమచ్ఛివకర  గ్రామ వాస్తవ్యం వస్తుతః (తత్ )స్తుమః ‘’అనే పాఠా౦తరాన్ని గ్రహిస్తే శైవుడు అనేది నిరాదారమవుతుంది .శివ గ్రామం ఎక్కడిదో తెలిస్తే కవి ఎక్కడి వాడో తెలుస్తుంది అంటారు శాస్త్రీజీ .

ఆధారం –‘’నోరి సమీక్షలు ‘’పుస్తకం లో శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1962 భారతి సెప్టెంబర్ లో చేసిన సమీక్ష

345-శ్రీ వేదాంత పంచ దశ సార సంగ్రహ కర్త –శ్రీ ముదిగొండ వెంకట రామ శాస్త్రి (20 వ శతాబ్దం )

శ్రీముదిగొండ వెంకట రామ శాస్త్రిగారు రచించిన ఈ గ్రంథం  ఓం కార మందిరం చేటపాపాయపాలెం ,బెల్లంకొండ పోస్ట్ ,గుంటూరు జిల్లా లో ముద్రితం .శాస్త్రిగారు ‘’సంగ్రాహకః  బ్రహ్మ విద్యాలంకారులు .294శ్లోకాల వివేక పంచకం ,848శ్లోకాల దీపపంచకం ,429శ్లోకాల ఆనంద పంచకం లనుండి వరుసగా 123,270,166శ్లోకాలను మాత్రమె ఏరి మూల గ్రంథస్వరూపం స్పురించేట్లు కూర్చిన సంగ్రహ గ్రంథం .గ్రంథం చివరలో సంస్కృతం లో భూమిక ,సంస్కృతం లోనూ తెలుగులోనూ వేరువేరుగా తాత్పర్యాలు రాసి చేర్చారు .భూమికలో ఆధునికులను విమర్శించారు .మూల గ్రంథకర్త శ్రీ విద్యారణ్య స్వామి .కాని ఆయనతోపాటు భారతీ తీర్ధ కూడా రాసినట్లున్న శ్లోకాలున్నాయని నోరి నరసింహ శాస్త్రి గారి అభిప్రాయం .ఆంద్ర వ్యాఖ్యానం శ్రీ రాయప్రోలు లింగన సోమయాజులు రాశారు .

సంగ్రహ కర్త శ్రీ ముదిగొండ వారు ‘’నమః శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే ‘’అనే ప్రారంభ శ్లోకాలలో శంకరాచార్యులను స్మరించారో లేక అదే పేరున్న తమ గురువు ను స్మరించారో అంటారు నోరివారు .శ్రుతికి అపౌరుషేయత్వం సాధించిన మీమా౦సకులను అందర్నీ  సంగ్రహకర్త ‘’క్షుద్ర కోటి ‘’లో చేర్చటం  ,ఆంద్ర దేశం లో ఆనాటి పండితులలో అగ్ర కోటికి చెందిన శ్రీ ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి ‘’ అక్షుద్ర ప్రతిభ’’కు నిదర్శనం కాదన్నారు నోరివారు .

మనవి –గీర్వాణకవుల గురించి రాయటం మొదలు పెట్టినదగ్గర్నుంచి శ్రీ ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి గురించి రాయాలనుకొని ఎందరెందరినో అడిగితె ఎవరూ నాకు ‘’ఉప్పు’’ అందించిన వారు లేకపోయారు .ఇప్పుడు వారి గురించి కొద్దో గొప్పో రాసే అవకాశం శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1963 మే లో భారతి లో రాసిన సమీక్ష వలన సిద్ధించింది .

ఆధారం -‘’  శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి వారికుమారులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (హైదరాబాద్ )నాకు అందజేసిన విలువైన పుస్తకం -’నోరి ‘’సమీక్షలు’’.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-18-ఉయ్యూరు

 

 

 

 

,

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి (మరణం -22-9-1952)

శబ్దమంజరి చేతపట్టిన ప్రతిఒక్కరికీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారి నామం సుపరిచితమే.సంస్కృతం అభ్యసించాలన్న ఆసక్తి గలవారికి ఎలా అభ్యసించాలో తెలియక సరియైన ప్రాథమిక పాఠ్య గ్రంథాలు లేక దారీ తెన్నూ తెలియకుండా ఉన్న అయోమయస్థితిలో శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు శబ్దమంజరి నీ, సమాసకుసుమావళి నీ రచించి మహోపకారం చేశారు.ఈ రెండూ ఒకే గ్రంథముగా సంపుటీకరింపబడి సంస్కృత బాలశిక్షగా ఒక్క ఆంధ్రసీమలోనే గాక ఆసేతుహిమాచలం వ్యాప్తిలో ఉంది.సంస్కృతం చదువుకోవాలనే వారికి నాటికి నేటికీ ఇదే శరణ్యం.సమాసకుసుమావళిలోని దిగువశ్లోకంలో వారి నామధేయాలు పొదుపరిచిఉన్నాయి.

శ్రీమధ్యమందిర కులాంబుధి పూర్ణచంద్ర
శ్రీ సర్వమంగళమనీషికృతా సలీలం
ఏషా సమాసకుసుమావళి రాబ్జతారం
జీయాత్కృపానిధి సదాశివ సత్ప్రసాదాత్

అమలాపురం తాలూకా ముంగండ గ్రామానికి చేరువలో ఉన్న గన్నవరమనే గ్రామములో శాస్త్రిగారు జన్మించారు. విజయనగర గజపతిరాజుల ఆస్థానములో విజయరామగజపతి, నారాయణగజపతి ల కాలములో పండితులుగా ఉండేవారు.ఆసేతుహిమాచలం పర్యటించారు. ఆయాదేశాలలో ఉన్న పెక్కురు సంస్కృత పండితులతో వాదోపవాదాలు చేసి జయించారు.వీరికి అభినవ కాళిదాసు అన్న బిరుదు ఉంది.

సమాసకుసుమావళి లో శాస్త్రిగారి చమత్కార రసజ్ఞత
శ్రీ శాస్త్రిగారు చాటూక్తులు మధురములు చమత్కార సంయుతములు.దక్షిణదేశయాత్రలో సర్వమంగళేశ్వర శాస్త్రి గారు, ఓరోజున ఆనందతాండవపురమనె ఒక అగ్రహారములో ఒక తమిళ బ్రాహ్మడు ఇంట్లో భోజనం చేసారు. ఆఇంట యజమానురాలు శాస్త్రిగారుకి నేయి వడ్డించింది. అనంతరం ఆనేతిగిన్నె మీద శాస్త్రిగారు చెప్పిన చాటువు

ఆనందతాండవపురే ద్రవిడస్య గేహే
చిత్రంవశిష్టవనితా సమ మాజ్యపాత్రాం
విద్యుల తేవ పరివృత్యతి తత్ర దర్వీ
ధారాం విలోకయతి కశ్చన యోగసిద్ధః

అర్ధము: ఆనందతాండవపురమున ఒక ద్రావిడుని యింటియందు ఆజ్యపాత్ర అరుంధతి నక్షత్రమువలె (వశిష్త వనిత) ఉంది. అంటే కనిపించి కనిపించకుండా మినుకుమినుకుమని ఉంది.అంటే అంత చిన్నది.అందులో గరిటి మెరుపు తీగవలె నాట్యమాడు చున్నది అంతలోనే కనిపించి అంతలో మాయమవుతున్నది.గరిటలోనుంచి పడే ఆజ్యధారను యోగసిద్ధి పొంది దివ్యదృష్టిని సంపాదించిన మహామహులు మాత్రమే చూడగలరు.

సత్యప్ప పంతులు అనే ఉద్యోగి మీద శ్రీ శాస్త్రిగారు చెప్పిన మరో శ్లోకం

అ మంగళే మంగళ వార సంజ్ఞా
అపుణ్యగే పుణ్యజన ప్రతీతిః
అ సత్యసే సత్యప ఇత్యభిఖ్యా
త్రయః ప్రసిద్ధా విపరీతరీత్యా

అమంగళమగు వారమునకు మంగళవారమని పేరు పెట్టుట, అతి పాపులగు రాక్షసులకు పుణ్యజనులని పేరుపెట్టుట. సంతము అనృతములే పల్కు వీనికి సత్యప్ప అనిపేరు పెట్టుట ఈ మూడును ప్రసిద్ధి విపరీతములు.

చాటువులు కాక శాస్త్రి గారి జీవితానికి సంబంధించిన చిత్రవిచిత్రములైన కథలెన్నింటినో రచయిత ఈ గ్రంథములో పొందుపరిచారు.

ఒకసారి జగన్నాధ క్షేత్రం వెళ్ళినప్పుడు శాస్త్రిగారు దేవదర్సనం చేసుకొని బయటికి వస్తూ ఆలయ ప్రాకారంలో ఉన్న మర్రిచెట్టు ఆకులు నాలుగు కోసి చేత్తో బట్టుకొన్నారట. అది ఒక ఉత్కళ పండితుడు చూచి ఇలా పృఛ్ఛ్హించినాడట.

ఉ. పం: అయ్యా మీరు మర్రియాకుల నెందుకు తెంపిరి. మం.శా: విస్తరింట కుట్టి భోజనము చేయుటకు. ఉ. పం:మర్రిఆకును భుజింతురా? మం.శా:ఏమి? నిషేధమున్నదా? ఉ. పం:లేకేమి మీకు తెలియదా? మం.శా:నాకు తెలిసినంతవరకు ఎట్టి నిషేధము లేదు. ఉ. పం:వటర్కాశ్వత్థ పత్రేషు భుక్త్వా చాంద్రాయణం దరేత్ అనిలేదా? మం.శా:దాని అర్ధము మీరేమనుకొనుచున్నారు? ఉ. పం:మర్రి, జిల్లేడు, రావి ఈఆకులలో భుజించినయెడల తత్తాప పరిహారార్ధము చాంద్రాయణ వ్రతము చేయవలెనని. మం.శా:అట్లా కాదు; చాంద్రాయణ వ్రతము చేయదలచుకొన్నవారు, వట, ఆర్క, అశ్వత్థ ఈమూడు జాతుల ఆకులలో ఏదైనా ఒకదానియందు భుజించి తరువాత నావ్రతము చేయవలనని దాని అర్ధము. అయ్యది విధిని సూచించుచున్నది కాని నిషేధము లేదు. ఉ. పం:అయన భగంతుడు వట పత్రసాయి కాడా? భగవంతుని శయ్యను భిజింపదగునా? మం.శా:మీ ఉత్కళులు భగవంతుని అవతారములలో మత్స్యకూర్మ వరాహములనే భిజించి వేయుచున్నారు గదా. ఆయన శయ్యను భుజించుట మీకు తప్పు అనిపిస్తున్నదా?

శాస్త్రిగారి కుమారుడు భగవత్పతంజలి శాస్త్రి గారికి వివాహం జరుగుతోంది. ఆడపెళ్ళివారు పెళ్ళికొడుకును తలుపుదగ్గర అటకాయించి పెళ్ళికూతురు పేరు చెబితేకాని తలుపుతీయ మని పట్టుపట్టినారు.మేము పేరుచెప్పవలసినవారము కాము, అన్నాడు పెళ్ళి కొడుకు.అలా కుదరదన్నారు ఆడపెళ్ళివారు.ప్రక్కన నిల్చున్న శాస్త్రిగారు అబ్బాయీ నీవన్న మాట ముమ్మారు చెప్పరా అన్నారు. ఆతడు మేము పేరు చెప్పవలసినవారము కాము, కాము, కాము అన్నాడు.

సరే యిక యిరువిరి పంతాలు చెల్లిపోయాయి కనుక తలుపుతీయండి అని చమత్కరించారు శాస్త్రిగారు. నలుగురూ తెల్లబోయినారు. పెళ్ళికూతురు పేరు కామాక్షి కామాక్షమ్మ.తల్లి తండ్రులు కాము కాము అని కూడా పిలుస్తారట.

ఇలాంటి చక్కటి కథలు ఎన్నో ఈగ్రంథంలో ఉన్నాయి.

శాస్త్రి గారి ఇతర రచనలు
· కర్మజ్ఞానవివరణము (మీమాంస శాస్త్రసారం)

· వేదసారము

· పార్ధవిజయము (కావ్యం)

· సమాసకుసుమావళి (శబ్దమంజరి సహితము)

· విభక్తి విలాసము

· సర్వమంగళీయము ( వ్యాకరణ గ్రంథం)

· సన్నుతీయం (ఖండన గ్రంథమ్)

· భగవద్గీతాభాష్యము

· శ్రీ జగనాధాష్టకము

· శ్రీలలితా పంచదశీ మంత్ర వర్ణమాలా స్తోత్రము.

· సూర్యాష్టకము.

· ఆధారం -1956 భారతి మాస పత్రిక.

· ఇంతటి ప్రసిద్ధ సంస్కృత కవి జన్మదినం తెలియక పోవటం ఆశ్చర్యం .

· సశేషం

· మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –13-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా)  కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

 342-   ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా)  కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –

 దక్షిణ దేశ  సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ ఆర్యలతో ఈ పుస్తకాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శాస్స్త్రి శ్రీ మానవల్లి రామకృష్ణయ్య పంతులు గార్లు పరిష్కరించి ప్రచురించారు .దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు తెలుగు లోకి అనువదించారు .

  ‘’పాండ్యు ని సంస్కృత కవిత్వం అలతి అలతి పదాల కూర్పుబిగువుతో శోభాయమానంగా  ఉంటుంది చివరి  –‘’ఇమాం కాంచన పీఠస్ధాం స్నానయంతి వధూమివ ‘’శ్లోకాన్ని బట్టి ఈ గ్రంథం’’తమిళ సంగం ‘’చేత బంగారు పీటమీద కనకాభి షేకం పొందిందని తెలుస్తోంది .

 పాండ్య కవితా వైభవం

1-మూర్ధాః-న ద్రస్టవ్యాః –ద్రష్టవ్యాశ్చేన్నతైస్తు సహతిస్ఠేత్-యది తిస్టేన్నతుకథ యేత్-యఅలసతి కథయేన్మూర్ధ వత్ కథ యేత్’’

దీనికి రాళ్ళపల్లి వారి అనువాదం –మూర్ఖులను జూడ బోరాదుమొదలు ,చూడ –వలసెనా,కూడి వారితో నిలువ దగదు –నిలువ వల నేనియు బల్కవలదు-పల్క-,వలసె బోమూర్ఖునట్లె తా బలుకవలయు ‘’

మరో శ్లోకం –శబ్దార్ధ సూక్ష్మ వసనా – సత్యాభరణా,విచిత్ర హేత్వంగీ-విద్వన్ముఖ నిష్క్రాంతా-సుస్త్రీవ విరాజతే వాణీ’’

అనువాదం –‘’చిత్ర హేతు ఘటన చెలుంపు మేను,స-త్యంబు తొడవు ,పద పదార్థ  రచన –సన్న వలువ గాగ ,సత్కాంత పోలిక –వెలయు   బుధుల నోటవెడలు మాట ‘’

ఆధారం -1971జులై భారతి మాసపత్రికలో శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి సమీక్ష –సుందర పాండ్య విరచితా –ఆర్యా ‘’

మరికొంత సమాచారం ‘’నీతిద్వి షస్టికా’’నుంచి లభించింది .ఆ వివరాలు –

నీతి ద్విషస్టిక రచయిత సుందర పాండ్య.రాజు దీనిని మొదట దేవనాగర లిపి లో శ్రీ పండిత పురాణం సూర్యనారాయణ తీర్ధ,శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు పరిష్కరించగా ,బ్రహ్మశ్రీ కనుపర్తి మార్కండేయ శర్మ 1928లో ప్రచురించారు. సంస్కృతం లో ముందుమాట శ్రీ వేటూరి వారు రాస్తే, శ్రీ మానవల్లి రామకృష్ణకవి ఇంగ్లీష్ లో కవి జీవిత విశేషాలపై సంస్కృత ,తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం మొదలైన వాటిపై  విపుల చర్చ చేశారు .

  ఆర్యా ఛందస్సులో కవి రాయటం వలన దీన్ని ‘’ఆర్యా ‘అన్నారు .దీనికి 116వ శ్లోకమే ఆధారం  .రాళ్ళపల్లి వారి తెలుగు అనువాదం తో 1970 లో ప్రచురితమైంది .ద్వి షస్టికా’’అంటే 120.ఉన్నవి .116శ్లోకాలే కాని దాన్ని రౌండ్ ఫిగర్ చేశారన్నమాట ;కాని అసలు అర్ధం 62 మాత్రమేకాని 120కాదు .62 శ్లోకాలలో నీతి చెప్ప బడింది కనుక ‘’నీతి ద్వి షస్టికా’’పేరు సార్ధకమైంది . 1981లో ‘’సురభారతి’’ వారు సంస్థ తెలుగు అర్ధతాత్పర్యాలతో ప్రచురించారు .నీతి విషయాలలో పరనింద పనికిరాదని ,మాట తూలరాదని ,క్రోధం నిరోధించుకోవాలని ,సజ్జనులతో స్నేహం చేయాలని మొదలైనవి ఉన్నాయి .

  సుందర పాండ్య రాజు మదురానగర పాలకుడు.వేద,ధర్మ శాస్త్రాలలో నిష్ణాతుడు .అక్కడి దేవుడు సుందరేశ్వరుడు అమ్మవారు మీనాక్షి దేవి .  పాండ్యరాజులు కళాసాహిత్యాలను బాగా పోషించారు .ఎవరుకావ్యం రాసినా పండిత సభ ఆమోదం పొందాలి .ఈ ముక్తకాలు ఆర్యా శ్లోకాలు .ఆర్యా అంటే ఇక్కడ మీనాక్షీదేవిఅమ్మవారు అనే అర్ధం కూడా ఉంది .

  ‘’ ప్రొఫెసర్ ఎస్.కుప్పుస్వామి శాస్త్రి ఆచార్య సుందరపాండ్య పై పరిశోధన చేసి ,వార్తికం రాశాడని ,దీన్ని ఆదిశంకరాచార్యులు శారీరక భాష్యం లోనూ ,  ,కుమారిలభట్టు తంత్ర వార్తికం లోనూ పేర్కొన్నారని ,సిన్నమనూరు శాసనం లో ఉన్న క్రీశ 750కాలపు   అరికేసరి ఈ పాండ్య రాజు వారసుడని ,కనుక ఈ రాజు కాలం క్రీ. శ  .650కావచ్చునని చెప్పాడు 1250వాడైన కృష్ణ లీలాశుక –‘’పద్ధతి’’రాసిన ‘’ఈశాన దేవ’’శిష్యుడు ,సుందర పాండ్యుని ‘’నక్షతి,చుంబతి నిస్తే తన్వయా ముఖ పంకజం ప్రేయాన్ ‘’అనే శ్లోకాన్ని ఉదాహరించాడని ,ఈ పాదం వీరపా౦డ్యుని ‘’క్రియా నిఘంటువు లో ఉందని చెప్పాడు .ఈ నిఘంటువు 13వ శతాబ్దం లో కూర్పబడింది .

  వల్లభ దేవ ,జల్హణ,సారంగధర మొదలైనవారు కూడా ఈకవిని పేర్కొన్నారు .సుందర పాండ్య మీమాంశాస్త్రానికి  వేదాంత సూత్రాలకు  వార్తికలు రాశాడు .వాచస్పతి మిశ్ర సాంఖ్య వార్తికలోచివర  చెప్పిన’’ రాజవార్తిక ‘’ఈ రాజకవిదే అయి ఉండవచ్చు.క్రీశ 500కు పూర్వపుదైన’’పంచతంత్రం ‘’లో  కూడా ఉదాహరి౦పబడింది .విష్ణు కుండినరాజు కుబ్జ విష్ణు వర్ధనునిఆస్థాన౦  లోని’’ జనాశ్రయకవి’’రాసిన ‘’జనాశ్రయి’’ లో ఈకవి శ్లోకం ‘’చారిత్ర నిర్మల జలః సత్పురుష నదోశ్రయో భవతు నిత్యం –యస్య విభాత్రార విందే మిత్ర భ్రమరః కృతా విహారః ‘ అనే దాని ’ప్రకారం కుబ్జుడు జనాశ్రయుడిని  బయటికి పంపేశాడు.ఈకావ్యం క్రీశ600లో రాసినది అయి ఉండాలి .ఆశ్వఘోష ,కాళిదాస, శూద్రక ,సుందరక ,వరరుచి మొదలైన వారు’’ఆర్యా ‘’గురించి చెప్పారని జనాశ్రయి లో ఉన్నది .కనుక ఆర్యా నీతి శతక౦ అంటే ‘’నీతి ద్వి షస్టికా ‘’కర్త రాజ సుందర పా౦డ్య కవి కాలం క్రీశ 600లకు పూర్వమే అని ప్రొఫెసర్ కుప్పుసామి శాస్త్రి నిర్ధారించాడు  ‘’అని శ్రీ మానవల్లి రామకృష్ణకవి ఉపోద్ఘాత౦ లో విపులంగా చర్చించి నిగ్గు తేల్చారు.

 అదనపు సమాచారం రాయటానికి ఆధారం -ఈ రోజు ఉదయం మా అబ్బాయి శర్మ మెయిల్ లో పంపిన ప ”నీతి ద్వి షష్టికా ”కావ్యం

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –  13-12-18-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment