ఆ”పాత ”మధురాలు -5

ఆ”పాత ”మధురాలు -5
1-మా పాత శ్రీ ఆంజనేయస్వామి గుడి లో నేనూ మా  శ్రీమతి ప్రభావతి   మా ఇంట్లో రిటైరీలు -ఎడమనుంచి -శ్రీ కోటేశ్వర శర్మ ,శ్రీ చలమయ్య ,,శ్రీ కృష్ణమూర్తి ,శ్రీ రామశేషయ్య,శ్రీ సాయి బాబు  ,శ్రీ గరుడాచలం మేష్టారు 2-అమరవాణి స్కూల్ లో శ్రీ సూరి రామశేషయ్య బాబాయి దంపతులకు సాహితీమండలి సత్కారం  ,-   ఎసి లైబ్రరీలో కెసీపి కెమిస్ట్ ,హాస్య రచయిత,శ్రీ టివి సత్యనారాయణగారికి(ఇన్ షర్ట్ ) సరసభారతి పురస్కార సన్మానం శ్రీ గూడపాటికోటేశ్వరరావు,శ్రీ రంగరామానుజాచార్య  ,లైబ్రేరియన్ శ్రీమతి సుజాత (పింక్  శారి),మాదిరాజు శివలక్ష్మి దంపతులు, బిందు 3-2002లో మొదటి సారి మా అమెరికా ప్రయాణం హైదరాబాద్ లో మా అక్కయ్యగారింటి నుంచి ,బీగం పేట ఎయిర్ పోర్ట్ లో బంధు మిత్రుల వీడ్కోలు  ఉయ్యూరు మా ఇంట్లో ఆ అమెరికా మేనల్లుడు శాస్త్రి శ్రీమతివిజయలక్ష్మి దంపతులు 4-మా అక్కాశ్రీమతి దుర్గ  బావశ్రీ వేలూరి వివేకానంద్  ,మా వదినగారుశ్రీమతికమల   మేమిద్దరం   మేనకోడలు స్పందన ను ముద్దాడుతున్న మేనత్త ,పంచకట్టులో పంతులుగారు 5-మా ఇంట్లో మా అబ్బాయి రమణ ఉపనయనం  మా అమ్మాయి అల్లుడు మాఇంట్లో -అల్లుడి అమెరికా మేనత్త శ్రీమతి లక్ష్మిగారు ,మా అమ్మాయి అత్తగారు శ్రీమతి సూర్య కుమారిగారు  మీ–గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-20-ఉయ్యూరు  

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -4

పాత పెంకుటిల్లు నుంచి కొత్త డాబాకు  మార్పు ,పెంకుటింట్లో సావిడిలో గోడలకు ఫోటోలు వగైరా 

1-పెంకుటింటి వాకిలి వసారా లో మేమిద్దరం ,మాకోడలు సమత మేనకోడలు జయ
   వెనకున్న పెంకుటిల్లు  ముందు కొత్తగా కట్టిన రెండస్తులభవనం లోకి గృహప్రవేశం ,కుటుంబ సభ్యులు
2-నా షష్టి పూర్తి వేడుకలో హోమం ,కుటుంబ సభ్యులు
    ముందు పెంకుటిల్లు వెనక కొత్తభవనం  ,కొత్త బిల్డింగ్ ముందు మేమిద్దరం మాకుటు౦బ స్నేహితురాలు శ్రీమతి భవానిగారు
3-దొడ్లో కొబ్బరి చెట్టు తో నేను ,కొత్త  డాబా ముందు మా దంపతులం
4-దీపావళి దీపాల వెలుగులో రెండస్తులభవనం ,భవనం ముందు మా ఇద్దరితో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి ,ఫస్ట్ ఫ్లోర్లో సంక్రాంతి బొమ్మలకొలువు
5-పాత పెంకుటింట్లోని సావడి లో  దేవుళ్ళ ఫోటోలు , వీడియోకాన్ టివి .
  మీ -దురాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు

—

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ” పాత ”మధురాలు -3

ఆ” పాత ”మధురాలు -3
కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర పులిగడ్డ గ్రామంలో శతాధిక వృద్ధులు ,కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ,నిరాడంబర జీవి నాకు ఆత్మీయులు,గాంధీమహాత్ముని అనుచరులు  శ్రీ మండలి రాజగోపాలరావు గారిని వారింట్లో 2014ఫిబ్రవరి లో సందర్శించనప్పడు  వారి దంపతుల ఫోటో ,వారు  2001 లో నాకు ఆత్మీయంగా రాసిన ఉత్తరం .ఇవాళ ఇప్పుడే వారిని ఫో-19న్ లో పలకరిద్దామని చేస్తే పని చేయటం లేదని వచ్చింది -మీ -దుర్గాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు —

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -2

ఆ”పాత”మధురాలు -2

ఆ”పాత”మధురాలు -2

1987లో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్తాపనోత్సవ చిత్రాలు
1-దేవాలయం ఏరియల్ వ్యూ ,ఆధ్వర్యులు శ్రీమాన్ వేదాంతం రామాచార్య ,మూల విరాట్ప్రతిస్తలో మా దంపతులతోపాటు కెసీపి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు
2-మూల విరాట్ ప్రతిష్ట
3-కలశ స్థాపనలో ఉయ్యూరు శాసనసభ్యులు శ్రీ అన్నే బాబూరాగారు మా అబ్బాయి రమణ ,,కళ్యాణ
4-శ్రీరామపంచాయతనంతో ఆలయ ప్రదక్షిణ లో  విగ్రహాలు కానుకగా ఇచ్చిన  ఎస్ టివోఆఫీస్ అటెండర్ …నా చిన్ననాటి మిత్రులు శ్రీ పెద్దిభొట్ల ఆదినారాయణ శ్రీ సూరి నరసింహం ,స్వామిఅలంకారం
5మొదటిసారి లడ్డుపూజ ,,స్వామివార్ల గ్రామోత్సవం  అనే ఊరుఎరిగింపు
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-20 -ఉయ్యూరు 

—

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం )

గోరియో పాటలు –హంజా పాత్రల నేపధ్యం లోని సాహిత్యంక్రమగా మారిపోయి గోరియా పాటలు వ్యాప్తిలోకి వచ్చాయి .ముందుగా మౌఖికంగా వ్యాప్తి అయి ,జోసేన్ పీరియడ్ లో వ్రాతరూపం పొందాయి .కొన్ని హన్గూయ్ లోకి మారాయి .వీటికవిత్వభాష  ను పయల్గొక్ లేక చాంగ్గా అంటారు .కోర్యో రాజవంశ చివరికాలం లో వచ్చిన సాహిత్యం .మాధుర్యం ఎక్కువ .ప్రేమ ఆనందం బాధలనుచక్కగా శక్తివంతంగా వ్యక్తీకరిస్తాయి .ఆడవారు అలవోకగా పాడే వీలుండటం వలన పండుగలలో బాగా పాడేవారు .ఈవిధానాన్ని  ‘’కిసేంగ్ ‘’అంటారు .ఇందులో దాలియోంకే,యియోయాంచే అని రెండురకాలు .మొదటిదానిలో అంతాఒకే స్టాంజా ఉంటె ,రెండో దానిలో చాల స్టాన్జాలలో ఉంటాయి జీవితాన్ని ప్రతిబింబించే పాటలుగా వీటికి ప్రత్యేకత ఉంది .

  సిజో ,మరియు  గాసా –జోసేయాన్ కాలం మొదట్లో వచ్చినవి .హన్గూల్ నుంచి అక్జాంగ్ లోకి మారాయి .కొరియన్ స్క్రిప్ట్ ప్రకారం రాసినవే .ముఖ్యంగా బౌద్ధ గీతాలు .సిజో అంటే అప్పటికప్పుడు వచ్చేవి .గోర్యోకాలంనుంచే ఉన్నా తర్వాతే అభి వృద్ధి జరిగింది కంఫ్యూజియస్ భావాలవ్యాప్తికి బాగా ఉపయోగపడ్డాయి .గోసా అంటే భావోద్విగ్నంలో వచ్చిన కవిత్వం .ఇవి వ్యాసంగా కూడా ఉంటాయి .ప్రకృతి ,మానవ మంచితనం ,ప్రేమ లపై అల్లబడినకవిత్వం .

వచన రచన –కొరియన్ వచనరచన నాలుగు రకాలు –వర్ణన ,కాల్పనికత ,కలగాపులగం .వర్ణ న లలో పురాణాలు ,లెజెండ్స్ ,జానపదకధాలు వ్రాతపూర్వకంగా లభిస్తాయి .మూడు రాజ్యాంగ వ్యవస్థలచారిత్రకకధనం అంతా వీటిలో ఉంది .సూర్యుడు ,చంద్రులగురించి మిథ్స్ఎక్కువ .వీరిద్దరూ కొరియా ,తాన్గూన్ నిర్మాతలని భావిస్తారు .పూర్వపురాజుల వీరోచితకార్యాల విశేషాలు ఉంటాయి .జానపదాల్లో జంతువులూ ,గోబిన్స్ మొదలైన సూపర్ నేచుర ల్ పాత్రలేఎక్కువ .దుస్ట శిక్షణ శిస్ట రక్షణఇందులో  నీతి.వీటిని జెన్ మాస్టర్ రాశాడు .బౌద్ధమునుల అనుయాయులగాధలు వారు చేసిన అద్భుతాలు,బోధిసత్వకధలు అన్నీ ఉంటాయి .

  ఫిక్షన్ –ఇది చాలారకాలు –ముందుగా కొరియన్ ఫిక్షన్ చైనీస్ భాషలో,తర్వాత కొరియన్ భాష లో  వచ్చింది  .రెండు-ఒకే ఒక గ్రంధం ఉన్న చిన్న వి 10భాగాలున్నమధ్యతరగతివి ,యాంగ్ భాన్ లు రాసినవి .అసలు కధకు చిలవలు పలవలు చేర్చి రాసినవి .అన్నీ సుఖా౦తాలే .కలగాపులగం లో వచ్చినవాటిలో చరిత్ర ,జీవితచరిత్ర స్వీయ చరిత్ర ,సాహిత్య విమర్శనం .కొరియాలో వచ్చిన మొదటి ఫిక్షన్ –గుయుమో సింహా –గుయోం పర్వతం గురించిన కధలు ..  కిం సియుప్ చైనీస్ భాషలో రాశాడు.17వ శతాబ్దం చివర్లో పాన్సోరి ఫిక్షన్ జనసామాన్యం పై మౌఖికంగా వచ్చి వ్యాప్తి చెంది 1870లో పాసోరి రైటర్ లిఖితం చేశాడు .మిడ్ –జోసియన్ కాలం లో పారబుల్ లాంటి కధలలొచ్చాయి .తర్వాతమార్పు పొంది గిసేంగ్ గా మారాయి .

  1980వరకు కొరియన్ సాహిత్యం బయటి ప్రపంచానికి తెలియదు .తర్వాతకొద్దిగా  అనువాదాలు వచ్చి కొంతవ్యాప్తి జరిగింది.జపాన్ చైనాలలో కొరియన్ సాహిత్యానికి గిరాకీ ఉంది .కొరియన్ సాహిత్యానికి ఇంతవరకు నోబెల్ బహుమతి వచ్చినట్లు లేదు .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం

 

ప్రపంచ దేశాల సారస్వతం

8-  కొరియన్ సాహిత్యం

కొరియన్ భాష జపనీస్ –కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని చాలామంది అభిప్రాయం కానీ అది సరికాదు ఒక స్వతంత్ర భాష అని కొందరి భావన .మొదట్లో చైనీస్ లిపినే వాడుకొన్నా ,తర్వాత ద్వన్యాత్మక లిపిని అనుసరించారు .

  కొరియాలో అంతా సారస్వతమే అని ఒక పాశ్చాత్య  వ్యాఖ్యాత చెప్పాడు .కాని క్రీ శ 4వ శతాబ్దిలో చైనా లిపి ప్రవేశ పెట్టబడినప్పటి  నుంచి వ్రాయబడినదంతా సారస్వతమే ఐతే అంత తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో ఆశ్చర్యం గా ఉంటుంది .ప్రతిభ తక్కువ అనటానికి వీలులేదు చైనా ప్రభావంతో కొరియాలో నీతి వాజ్మయమే ఎక్కువగా వచ్చింది .కొరియా సంస్కృతిపై చైనాప్రభావం ఎక్కువే .చైనా సిద్దాం తాలను  చైనాలో కంటే కొరియాలో చాలా ఎక్కువగా నిష్టగా అనుసరిస్తారు .సనాతనత్వం పై అభి రుచి ఎక్కువ అవటం వలన భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం పై దృష్టి పెట్టలేదక్కడ .

   క్రీ.శ 692లో పోల్ చాంగ్ చైనా ప్రాచీన గ్రంధాలను వివరించటానికి కొరియా భాషను ,కొరియన్ ధ్వనులకు అనుగుణంగా ఉపయోగించాడు .అయినా చైనా భాష నేర్వటం వీరికి కష్టంగానే ఉండేది .ఆ భాషను వశం చేసుకొన్న మొదటివాడు చోయ్ చివెన్ (858-910).ఇక్కడి నుంచి మనోజ్ఞమైన శైలి ,సుకుమార శబ్దజాలం తో గద్య పద్యాలు రాశారు కవులు .వాటిలో 1145లో వచ్చిన సంగూక్ సాగి ,సంగూక్ యూసా ముఖ్యమైనవి  .మొదటి దాన్ని కిం పూసిక్ (1075-1151),రెండవ దాన్ని సెయింట్ ఇలియాన్ (1288)కూర్చారు .ఇవి చారిత్రక గ్రంథాలుగా ,కొరియన్ సాహిత్యముఖ్య గ్రంథాలుగా గుర్తింపు పొందాయి .అప్పుడప్పుడుచైనాభాషలో కూడా పద్యాలు రాసేవారు .కన్ఫూషియస్  సిద్ధాంత అనుయాయులు,మేధావులు  కొన్ని నవలలు కూడా రాశారు .1637-92వాడిన కిం మున్జుంగ్’ ’ది క్లౌడ్ డ్రీం ఆఫ్ ది నైన్’’అనేది ప్రసిద్ధమైనది .ఇందులో ఐహిక వస్తువుల అశాశ్వతత్వం గురించి బోధన ఉంటుంది .నిర్మాణ లోపాలున్నా కొరియన్ ముఖ్య  నవలగా గుర్తింపు పొందింది .

  కొరియన్ పద్యాలు సమ్ గూక్ యూపా లో ఉద్ధరి౦ప బడ్డాయి వాటి అర్ధాలు ,వాటి ధ్వనులు సూచించటానికి చైనా అక్షరాలూ వాడారు .క్రీ.శ. 1438లో సెనాంగు రాజు (1419-51)’’ఓన్మం’’అనే అక్షరమాల కనిపెట్టి చైనా అక్షరావాడకాన్ని పూర్తిగా తొలగించేశాడు .ఈ కొత్తలిపి చైనా లిపి తెలియని కార్మికులకు స్త్రీలకూ అమ్మేవారు .దీనితో జానపద గాథలు రాయటం ప్రారంభమైంది .

   కొరియా కవిత్వం ఉత్తమ శ్రేణి కి చెందింది .చాలాభాగం చైనా భాషనుంచి సంగ్రహింప బడినా బాల ,జానపద సాహిత్యం బహు సుందరం గ  ఉంటాయి.కొరియన్ భాషలో ఛందో నియమాలు అతి తక్కువ .7లేక 8అక్షరాల  ద్విపద లలో  రాసేవారు . వ్యక్తీ కరణలో పద్యానికి గద్యానికి తేడా ఉంటుంది .

  కాలక్రమంలో దేశీయ భాషా నురక్తి పెరిగి ,కొత్త ప్రక్రియలలో కవులు రచయితలూ రాస్తున్నారు .కొరియన్ గ్రంథాలు చాలా తక్కువగా అనువాదం పొందాయి .యాంగ్ హిల్ కాంగ్ రచన ‘’ది గ్రాస్ రూఫ్ ‘’,మిరాల్ లి రాసిన ‘’డేర్ యు ‘’పుస్తకాలు చూస్తె కొరియన్ రచయితలకు ఇతరభాషలలో రాసే  ఆసక్తి తగ్గలేదని నిరూపిస్తాయి.

  కొరియన్ పెనిన్సులా లోని జానపద కథలు సంప్రదాయ మత విశ్వాసాలు క్లాసికల్ కొరియన్ సాహిత్యం లో ప్రతిఫలించాయి .సంప్రదాయ కవిత్వం లో నాలుగు  రకాలున్నాయి 1-హినగ్గా –స్థానిక గేయాలు 2-పైలోక్ – ప్రత్యేకపాటలు3-చా౦గ్గా-దీర్ఘ కవితలు ,4-సిజో-సద్యోమదురిమలు.వీటిలో కినోగ్గీ శైలి ఉంటుంది .14,15శతాబ్దాలలో ‘’ఆక్చాంగ్ ‘’-పద గేయాలు వచ్చాయి వీటిలోయంగ్ బి ఒచాన్ కా (1445-47)  యి రాజవంశాన్నికీర్తిస్తూ రాసిన  ఫ్లైయింగ్ డ్రాగన్ సాంగ్స్ లో మాధుర్యం నేటివిటి స్పష్టంగా ఉన్నాయి .వీటిలో ఒకప్రాచీన లిరిక్ సాంగ్- యియో ఒక్ గోజేసియాన్ కాలలో రాసిన ‘’గోమ్ఘూన్ ‘’.

   హియా౦గ్గా –హియాంగ్గాలేక హంజా మార్పు చెందిన కొరియన్’’ఇడు’’ భాషలో రాసింది దీన్ని గుమాస్తా రాత అంటారు .దీనివలన కొరియన్ భాష వ్యాప్తి చెందింది .ఇదేమొదటి కొరియన్ కవిత్వం .వీటిలో 25మాత్రమె నిలిచాయి .సంగూక్ యూసాలో 14,సన్యాసుల మతకర్తలగురించి ఉన్న గున్యేజియాన్ లో 11,మాత్రమే దక్కాయి. యూనిఫైడ్ సిల్లా భాషవచ్చాక రాసిన ప్రాచీనకవిత్వం ఇదంతా .హియాంగ్గాకవిత్వం లో ని పద్యాలలో 4,8,10 లైన్లు ఉంటాయి .10లైన్ పద్యం లో 4,4,2పాదాలుంటాయి .వీటిని బౌద్ధ సన్యాసులు రాశారు .బౌద్ధమే వీటిలో ఎక్కువగా ఉంటుంది .తర్వాత ప్రాధాన్యం మరణం .బౌద్ధ ఋషులకు ,యుద్ధవీరులకు ,కుటుంబ సభ్యుఅలకు స్మ్రుస్మృత్యంజలిగా రాయబడినవే .

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ ”పాత ”మాధుర్యాలు -1

ఆ ”పాత ”మాధుర్యాలు -1

1-మొదటి ఫోటో -ఉయ్యూరు ఎసి గ్రంధాలయం 2004 లోప్రారంభమైనప్పుడు బిల్డింగ్ కమిటీ కన్వీనర్ గా ఉన్న నన్ను సత్కరిస్తున్న శ్రీ మైనేని గోపాలకృష్ణగారు ,జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీమతి
2- రెండవ ఫోటో -హైదరాబాద్ లో చిట్టెం రాజు గారు జరిపిన బాపు -రమణ ల స్నేహ షష్ఠి పూర్తి సభలో బాపూగారితో నేను
3-ఆ సభలో శ్రీ ఇంద్రగంటి ,శ్రీమతి కెబి లక్ష్మి శ్రీ అంపశయ్య నవీన్ లతో నేను
4-అదే సభలో కృష్ణశాస్త్రిగారు మేనకోడలు జానపదగీతాల కలస్వనం శ్రీమతి వింజమూరి అనసూయగారితో నేను
5–కాకినాడలో మహాకధకులు శ్రీ జానకీ జానీ గారింట్లో నేను
6-కధానిపుణులు ఆత్మీయులు శ్రీ గంధం వెంకా స్వామి శర్మగారితో నేను
7-ఉయ్యూరు -వాసి హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్ -శ్రీ గోవిందరాజు చక్రధర్ గారికి ఉయ్యూరు సాహితీ మండలి సత్కారం
8-చల్లపల్లిలో భారతీయ సాహిత్య పరిషత్ నిర్వహించిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అవధానం లో వారితో నేనూ శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు
9-కదా త్రివిక్రములు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్  గారికి ఉయ్యూరులో సాహితీ మండలి సత్కారం
10-ఉయ్యూరుకాలేజి గ్రౌండ్లో నడకపోటీలో పాల్గొన్న ”ముసలిముఠా ”లో నేనూ పంచకట్టులో శ్రీ గరుడాచలం మాస్టారు
11-మోపిదేవి శిష్యుడు అడవి శ్రీరామమూర్తికి ఉయ్యూరు లో సరసభారతి జ్ఞాపిక ప్రదానం
12-30-6-1987అడ్డాడ హైస్కూల్ హెడ్ మా స్టార్ గా రిటైరయిన రోజు నాపంచకట్టు పోజులో ,లైబ్రేరియన్ శ్రీ రాజారావు తో
13-శిష్యుడు కాళీప్రసాద్ మా ఇంట్లో మా దంపతులకు చేసిన సత్కారం
 మీ -దుర్గాప్రసాద్ -18-1-20-ఉయ్యూరు
Posted in ఆ''పాత''మధురాలు, రచనలు | Tagged | Leave a comment

‘డిసెంబర్ ”సొగసులు –మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్

‘డిసెంబర్ ”సొగసులు

–మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా  శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  స్కాండి నేవియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

8-  స్కాండి నేవియన్ సాహిత్యం

.స్కాండినేవియన్ సాహిత్యాన్ని నార్డిక్ సాహిత్యం అంటారు .అంటే నార్డిక్ దేశాలైన ఉత్తరయూరప్ లోని డెన్మార్క్ ,ఫిన్లాండ్ ,ఐస్ లాండ్ ,నార్వే, స్వీడన్ ,స్కాండినేవియాకు చెందిన అసోసియేటెడ్ అటానమస్ టెర్రిటరీలు అయిన ఆలాండ్ ,ఫారో ఐలాండ్స్, గ్రీన్ లాండ్   దేశాలు .ఇందులో మెజారిటి దేశాలు ఉత్తర జర్మని భాష ను వాడుతాయి .ఫిన్లాండ్ ప్రజలలో ఎక్కువమంది యురాలిక్ భాషలు మాట్లాడుతున్నా ,ఫిన్లాండ్ చారిత్రకంగా స్వీడెన్ ,నార్వే లతో బాగా కలిసిపోయింది .దీనిపై ‘’సమీ పాప్యులేషన్ ‘’ప్రభావం ఎక్కువ .ఈ దేశాలు ప్రబలమైన సాహిత్యాన్ని వెలువరించాయి .నార్వీజియన్ నాటకకర్త హెన్రిక్ ఇబ్సెన్ ఆధునిక వాస్తవిక నాటకం యూరప్ లో వ్యాపించటానికి ముఖ్యకారకుడు .అతని ‘’ది వైల్డ్ డక్’’,ఎ డాల్స్ హౌస్ ‘’నాటకాలు యూరప్ తోపాటు ప్రపంచ దేశాలనూ ప్రభావితం చేశాయి  వీరిలో  Nobel prizes for literature have been awarded to Selma Lagerlöf, Verner von Heidenstam, Karl Adolph Gjellerup, Henrik Pontoppidan, Knut Hamsun, Sigrid Undset, Erik Axel Karlfeldt, Frans Eemil Sillanpää, Johannes Vilhelm Jensen, Pär Lagerkvist, Halldór Laxness, Nelly Sachs, Eyvind Johnson Harry Martinson, and Tomas Tranströmer..

మధ్యయుగ స్కాండినేవియన్ సాహిత్యం

మధ్యయుగ స్కాండినేవియన్ సాహిత్యం మొదట ప్రోటో నార్స్,తర్వాత ఓల్డ్ నార్స్ సామాన్యభాషగా ఉండేవి .స్కా౦డినేవియాలో మొదటి వ్రాతప్రతులు రూనిక్ ఇన్స్క్రిప్షన్స్.ఇవి రాయిలేక ఇతరవస్తువులపై ఉంటాయి .వీటిలోకొన్ని నార్సే మైధాలజి,కొన్ని చిన్నచిన్న కవితలు ,యమక శబ్దాలతో కూడినవి ఉన్నాయి .వీటిలో 8వ శతాబ్ది రోక్ రున్నేస్టోన్ లో వలసలకాలానికి చెందిన గాథలుంటాయి .9వ శతాబ్దం లో ‘’ఎద్డిక్ కవితలు ‘’వచ్చాయి ఇవి 13వ శాతబ్దం లో మాత్రమే వ్రాతప్రతులుగా లభ్యమయ్యాయి .స్కాండినేవియా రాజుల, వీరుల గాథలు  వర్ణించబడ్డాయి  .9వ శతాబ్ది కి ముందే నుంచే మౌఖికంగా స్కాల్దిక్ కవిత్వం ఉన్నా,ఆశతాబ్దిలోనే వ్రాతప్రతులలో చేరాయి .ముఖ్యంగా ‘’కార్లేవి రూన్ స్టోన్’’లో ఇవి లభ్యమయ్యాయి . 10వ శతాబ్దం లో క్రైస్తవమతం వ్యాపించి ,యూరప్ తో స్కా౦ డినేవియాకు సంబందాలేర్పడి లాటిన్ వర్ణక్రమ౦ ,లాటిన్ భాష దేశం లో ప్రవేశించాయి .దీనిఫలితంగా డేనిష్ భాషలో ‘’గెస్టా డానోరం’’అనే చారిత్రాత్మక రచన సాక్సో గ్రమారిటస్ రాశాడు .13వశతాబ్దం ఐస్లాండ్ సాహిత్యానికి స్వర్ణయుగం .స్నోర్రి స్టూర్లుసన్’’ ప్రోజ్ ఎడ్డా’’,హీమ్స్క్రిమింగ్లా రాసి మంచి రచయితగా  పేరుపొందాడు .

డేనిష్  సాహిత్యం

16వ శతాబ్దంలో డెన్మార్క్ దేశం లోలూధరన్ రిఫార్మేషన్ వచ్చి ,సాహిత్యంలో కొత్త యుగావిర్భావం జరిగింది .ఈయుగ రచయితలలో హ్యూమనిస్ట్ క్రిస్టీ౦  పెడర్సన్ న్యు టెస్టమెంట్ ను డేనిష్ భాషలోకి అనువదించాడు .పౌల్ హీర్గర్సన్ రిఫార్మేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించాడు .19వశతాబ్ది మొదట్లో నాటకరచనప్రారంభమైంది .హీరోనిమాస్ జస్త్సేన్రాంచ్ మంచిరూపకాలు రాశాడు .17వ శతాబ్దం స్కాండినేవియన్ ప్రాచీన తకు అద్దంపట్టి వో వార్మ్ అగ్రస్థానం పొందాడు .ధామస్ కిన్గో పవిత్ర కవిత్వం రాశాడు .అ౦తర్యుద్ధాలు ఆక్రమణలతో రాజు సంపూర్ణాధికారం పొందాడు  .బ్లూ టవర్ కు చెందిన లియోనార క్రిస్టియానా రిడెం ప్టివ్ ప్రోజ్ రాసి ఆకర్షించాడు .తర్వాతడేనిష్ రచయితలు  ఆన్స్ క్రిస్టియన్ యాన్దర్సన్ ,సోరెన్ కర్క్ గార్డ్,జోహాన్నెస్ వి జేన్సెన్,కరెన్ బిక్సన్ లు వచనరచనలు ఎక్కువగా చేసి ప్రఖ్యాతిపొందారు

ఫారోస్ సాహిత్యం

ఫారోస్ లిటరేచర్ అంటే సుమారు 100-200 ఏళ్ళక్రితం వచ్చిన సాహిత్యం .దీనికి కారణం ఐస్ లాండ్ ఏకాంతం గా ఉండటం ,ఫారోస్ భాష 1890వరకు రాసే భాషగా మారకపోవటమే ..మధ్యయుగకాలం లో కవితలు కథలు మౌఖికంగా మాత్రమేప్రచారమై తరతరాలుగా వ్యాపించాయి  .వీటిని రెండుభాగాలుగా 1-సాగ్నిర్ అంటే చారిత్రాతమైనవి 2-ఏవిన్ టైర్ అంటే కధలుగా,క్వేయో అంటే గేయాలుగా  విభజించారు .వీటన్నిటికి లిఖితరూపం 19శతాబ్దం లో  మాత్రమె వచ్చింది .కాని ఇదంతా అత్యంత ప్రభావ శీల సాహిత్యంగా పరిగణింప బడింది .

ఫిన్నిష్ సాహిత్యం

ఫిన్లాండ్ చరిత్ర గందరగోళం .చరిత్ర ప్రకారం చాలాకాలం ప్రభుత్వ భాష , మెజారిటీ ప్రజలభాష వేరు వేరుగా ఉన్నాయి  .ఇది ఫిన్నిష్ సాహిత్యంపై తీవ్ర ప్రభావం కలిగించింది . గాఢమైన ఫిన్నిష్ అస్తిత్వంపైననే ఎన్నో రచనలు వచ్చాయి . జానపద గేయాల సంకలంగా ‘’కలవేల ‘’వచ్చి ఫిన్నిష్ జాతీయవాదానికి బలమైనది .సంకలనకర్త ఎలియాస్ లోన్రాట్ ఫిన్నిష్ ఎపిక్ రాసిన వాడుగా  అభినందనీయుడయ్యాడు .ఇతను సంపాదకుడు సంకలనకర్తకూడా .1835లో ముద్రింపబడి ఫిన్నిష్ జాతీయతకు కారణమైంది .1870’’సెవెన్ బ్రదర్స్ ‘’అనే మొదటి ఫిన్నిష్ నవల అలెక్సిస్ కివి రాశాడు .ఇదే ఇప్పటికీ ఫిన్నిష్ సాహిత్యం లో అత్య౦త గొప్పరచనగా గుర్తింపు పొందింది .

ఐస్లాండిక్ సాహిత్యం

ఐస్ లాండిక్ సాగాస్ లేక కుటుంబ సాగాలు పదవ ,పదకొండవశతాబ్దాలలోనివాస్తవ చరిత్ర సంఘటనలు .ఇవే ఐస్ లాండ్ లో మొదటి సాహిత్యంగా గణనకెక్కింది .మధ్య యుగాలలో’’రిమూర్ ‘’అనే  బాగాప్రజాదరణపొందిన కవిత్వం  రాయబడింది.రిఫార్మేషన్ తర్వాత  వచ్చిన రచయితలలో హాలిగ్రిమూర్ పెటుర్సన్,జోనాస్ హాలి గ్రిమ్సన్,గున్నార్ గున్నర్సన్ ,హాల్డోర్ లాక్స్ నెస్ లు ముఖ్యులు .

నార్వీజియన్ సాహిత్యం

14నుంచి 19శతాబ్ది వరకు ఉన్న 400 ఏళ్ళను  నార్వే లో ‘’చీకటి యుగం ‘’అన్నారు పెడర్ క్లాసాన్ ఫ్రిస్,లుడ్విగ్ హోల్ బెర్గ్ లు ఏదోకొంత డెన్మార్క్-నార్వే భాషలో రాసినప్పటికీ . 19శతాబ్ది మొదట్లో జాతీయవాదం ,స్వాతంత్రేచ్చ ప్రబలమైన తర్వాత నూతన నార్వీజియన్ జాతీయ సాహిత్యం ఆవిర్భవించింది .ఈ తరహా రచయితలలో హెన్రిక్ ఇబ్సెన్ మకుటాయమానంగా భాసించాడు తన నాటకాలద్వారా .పడమటి యూరప్ సాహిత్యంపై ఇబ్సెన్ ప్రభావం చాలా ఎక్కువ.ముగ్గురు రచయితలు నాట్ హామ్సన్  , ,బిజార్న్ స్టీన్  బ్జోమ్సన్,సిగ్రిడ్ అండ్ సెట్లు    సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ లు పొందారు –

స్వీడిష్ సాహిత్యం

స్వీడిష్ సాహిత్యం లో ముగ్గురు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు .ప్రసిద్ధ రచయితలు- ఆస్త్రిడ్ లిండ్ గ్రెన్,గుస్టాఫ్ ఫ్రాడింగ్,కార్ల్ జోనాస్ లవ్ ఆల్మో విస్ట్ విహేలం నో బెర్గ్ ,ఆగస్ట్ స్త్రిండ్ బెర్గ్ టోమాస్ స్ట్రాన్ స్ట్రోమార్,.

నోబెల్ ప్రైజులేకాక ‘’ది నార్డిక్ కౌన్సిల్ లిటరేచర్ ప్రైజులు డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, ఐస్ లాండ్ స్వీడెన్ రచయితలు ఒక్కో దేశంలో ఇద్దరేసి పొందారు ,నేషనల్ ప్రైజ్ లను ఫిన్లాండ్ లో ముగ్గురు ,నార్వేలో అయిదుగురు ,స్వీడెన్ లో ఆరుగురు పొంది దేశాల సాహిత్య దీప్తికి కారకులయ్యారు .

 

టాప్10 నార్డిక్ పుస్తకాలు

Tómas Jónsson, Bestseller by Guðbergur Bergsson (translated by Lytton Smith)

  1. Novel 11, Book 18 by Dag Solstad(translated by Sverre Lyngstad)
  2. The Endless Summer by Madame Nielsen (translated by Gaye Kynoch)
  3. Not Before Sundown by Johanna Sinisalo (translated by Herbert Lomas)
  4. New Collected Poems by Tomas Tranströmer(translated by Robin Fulton)
  5. Crimson by Niviaq Korneliussen(translated by Anna Halager)
  6. Mirror, Shoulder, Signal by Dorthe Nors(translated by Misha Hoekstra)
  7. The Tower at the Edge of the World by William Heinesen(translated by W Glyn Jones
  8. The Gravity of Love by Sara Stridsberg(translated by Deborah Bragan-Turner
  9. Inside Voices, Outside Light by Sigurður Pálsson(translated by Martin Regal)

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-20-ఉయ్యూరు

 

 

 

—

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం )

నాలుగువందల ఏళ్ళ చీకటి

స్కాండినేవియన్ యూనియన్ కాలం లో నార్వీజియన్ సాహిత్యం ఏమీ రాలేదు .తర్వాత డానో-నార్వీజియన్ అంటే 1387-1814కాలాన్ని ఇబ్సెన్ ‘’నాలుగువందల ఏళ్ళ చీకటి ‘’అన్నాడు .అప్పుడు కోపెన్ హాన్ యూనివర్సిటి ఒక్కటే యువతకు దిక్కు .ఇక్కడే అందరికి శిక్షణ ఇచ్చేవారు .గేబెల్ పేడర్సన్ మానవత్వ విలువలున్న లూధరన్ బిషప్ .అతని పెంపుడు కొడుకు అబ్సలాన్ పడర్సన్ బెఎర్ ఆయన మార్గదర్శకత్వం లో నడిచాడు .ఇద్దరూ జాతీయ దృష్టితోకవిత్వం రచనలు చేశారు ,అందులో ‘’కన్సర్నింగ్ ది కింగ్డం ఆఫ్ నార్వే ‘’పుస్తకం 1567లో వెలువడి కొత్త ఆలోచనలను తెచ్చింది .ప్రేడల్ క్రాసాన్ ఫ్రిస్’’హేల్మిన్స్కిన్గ్లా ‘’ను అనువాదం చేసి పునరుద్ధరించాడు .ఇదే మొట్టమొదటి వాస్తవ చరిత్ర .దీనివలననే నార్వే ను అధ్యయనం చేయటానికి వీలైంది .

    17వ శతాబ్దిలో ‘’మెర్జర్ లిటరేచర్ ‘’లో ను పెట్టర్ డాస్’’నార్వీజియన్ ట్రంపెట్ ‘’ రాశాడు .ఇందులో ఉత్తర నార్వే దేశ భౌగోళిక స్థితి ,ప్రజలు , ఆచారవ్యవహారాలు పండగలు పబ్బాలు జీవన విధానం అన్నీ  రాశాడు .1634-1713కు చెందిన డోరోతి ఎంగెల్బ్రేస్త్స్ డాటర్ అనే మహిళా మొదటి రచయిత్రిగా గుర్తింపు పొందింది .ఆమె రాసిన ‘’సైలెంట్ సాంగ్ ఆఫర్ ‘’1678లో పబ్లిష్ అయింది .ఆమెరచనల రెండవ సంపుటిగా ‘’సారే ఆఫర్’’1685లో ప్రచురించింది .ఆండర్సన్ ఆరేబ్బో క్రిస్టియన్ సాల్మ్స్ ను నార్వీజియన్ భాషలోకి అనువదించింది .

  1811లో నార్వీజియన్ యూనివర్సిటి క్రిస్టియానా అంటే ఇప్పటి ఒసియో లో ఏర్పడి.అమెరికా ఫ్రెంచ్ విప్లవాల  ప్రభావం పడి,డెన్మార్క్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం ఏర్పరచాలన్న ఉద్యమం తీవ్రమై విడిపోయి 1814లో మొదటి రాజ్యాంగాన్ని రాసుకొన్నది .స్కాండినేవియన్ రచయితలూ బాగా రాస్తూ ప్రపంచ వ్యాప్తిపొందారు .హెన్రిక్ వేర్గేర్ లాండ్  నవ నార్వీజియన్  సాహిత్యపిత అయ్యాడు .ఈకాలం లో నార్వీజియన్ జానపద కధలను సేకరించి పీటర్ అస్బ్జోర్న్సన్,బిషప్ జార్గెన్ మోల్ లు  ప్రచురించారు.ఇవి జర్మనీలో ‘’బ్రదర్స్ గ్రిం’’ల సేకరణలా ఉంటుంది .వీటివలన పర్వతప్రాంత జానపద సాహిత్యం జీవితం తెలుస్తాయి .రాజధానికి చాలాదూరం లో  ,ఏకాంత౦ గా ఉన్న ప్రజల జనజీవితంస్థానిక మా౦డలీకాలలో  ప్రతిబింబిస్తుంది .ఈ సంకలకర్త మేధావి ఐన ఇవార్ ఏసన్(1813-1898).స్వయంగా భాషా శాస్త్రం అధ్యయనం చేసినవాడు .నార్వీజియన్ జానపద భాష కు నిఘంటువు ,వ్యాకరణం రాసి మహోపకారం చేశాడు.ఈ భాషనే ‘’నినార్సిక్ ‘’అంటే నవీన నార్వీజియన్ అంటారు .నార్వీజియన్ భాషలో ఇది రెండవ అధికార వ్రాత భాష గా గుర్తి౦పు పొందింది  .

    ఆధునికకాలం లో రాల్ఫ్ జాకబ్ సెన్ రాసిన కవిత్వం ‘’నట్టా పెంట్’’20వేలకాపీలు అమ్ముడయ్యాయి .హరాల్డ్ స్వెర్ ద్రుప్ రాసిన ‘’లైసేట్స్ఏర్బ్లిక్ ‘’కూడా బాగా అమ్ముడయింది .జాన్ ఎరిక్ ఓల్డ్ రాజకీయ కవిత్వం రాశాడు .ఇతని తర్వాత రాసినవారంతా విభిన్న మార్గాలలో వైవిధ్యంగా రాశారు .నవలలకన్నా కవిత్వం అభిరుచి క్రమంగా తగ్గింది .నార్వే ప్రజలు నాటకాలను పెద్దగా ఆదరించరు.జాన్ ఫ్రాస్ ఫ్రాస్సే ఒక్కరే దేశీయంగా అంతర్జాతీయంగా నాటకరచయితగా పేరు పొందాడు   Bjørnstjerne Bjørnsonకు సాహిత్యం లో నవలా రచనకు నోబెల్ పురస్కారం వచ్చింది .మరో ఇద్దరు నవలా రచయితలూ ‘’నాట్ ఆమ్సన్,’’మార్కేంస్ గ్రోడ్’’లకు 20వ శతాబ్ది నోబెల్  అందుకొన్నారు .

  సశేషం

  కనుమపండుగా శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం సరసభారతి ఉయ్యూరు

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -2(చివరిభాగం )

మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం

15వ శతాబ్దం నుంచి 19వ శాతాబ్దివరకు ఐస్ లాండిక్ సాహిత్యం పవిత్ర కవిత్వం అందులో ముఖ్యంగా ‘పాషన్  వెర్సెస్ ఆఫ్ హల్లిగ్రిముర్ పీటర్సన్ ,’’రిమూర్ లు రైమ్స్ తో పాదానికి నాలుగు లేక రెండువాక్యాలలో ఉండేది .వచన రచనజోన్ మాగ్నూసన్ రాసిన  ‘’పీసియర్ సాగా ‘’తో ప్రారంభమైంది 19శతాబ్ది చివరలో .బైబిల్ అనువాదం 16వ శతాబ్దిలోనే వచ్చింది ,జర్మన్ ,డేనిష్ భాషలలోని మత సంబంధరచనలు అనువాదమైనాయి .18వ శతాబ్ది ప్రసిద్ధకవి ఎగ్గార్ట్ ఒలాఫ్ సన్(1726-1768).జోన్ పోర్తాక్సన్ అ బెగేసా జాన్ మిల్టన్ రాసిన పారడైస్ లాస్ట్ తో సహా ఎన్నో అనువాదాలు చేశాడు .సాగాలుమాత్రం పాత మధ్యయుగ మూసలోనే వెలువడ్డాయి. ప్రీస్ట్ జాన్ హాడ్సన్  , హజాలితాన్ వీరిలో ముఖ్యుడు .

   ఆధునిక సాహిత్యం

19వ శతాబ్దిలో ముఖ్యంగా 1830కాలం లో  రొమాంటిక్ కవిత్వం పునరుద్ధరణ జరిగింది .జామి తోరాన్సేన్ (1786-1841),జోనాస్ హాలింగ్సన్ 1807-45)లు సిద్ధహస్తులు .హాలింగ్ సన్ చిన్నకధలు రాసిన మొదటి రచయితకూడా .ఇతని ప్రభావంతో జాన్ తరోడ్ సన్(1818-68)మొదటి ఐస్ లాండిక్ నవల 1850లో రాసిప్రచురించి నవలా పిత అనిపించుకొన్నాడు .1820-96కు చెందిన గ్రిమూర్ తాం సెన్ఎన్నో వీరగాదాకావ్యాలు ,మట్టియాస్ జోసుమ్సన్ ఎన్నో నాటకాలు రాసి నాటక పిత అనిపేరుపొండాడు .ఈకాలం ఐస్ లాండ్ లో పున రుత్దానకాలం .

  రొమాంటిక్ కవిత్వం నుంచి నేచురలిజం ,వాస్తవికవాదం బయల్దేరాయి .వాస్తవవాద కధారచయితలు గేస్తర్ పాల్సన్ వ్యంగ్యవైభావానికి ,ఐస్ లాండిక్ –కెనెడియన్ కవి స్తేఫాన్ జి స్తేఫాన్సన్ 1853-1927ఐరనీ కి ప్రసిద్ధులు . ఎల్నార్ బెనె డిక్సన్  నియో రొమాంటిసిజం లో ప్రముఖకవి .ఐస్ లాండిక్ కవిత్వ  స్వర్ణయుగానికి ఇతడే మకుటం లేని మహారాజు .20వ శతాబ్దిలో చాలామందికవులు డేనిష్ భాషలోరాయటం మొదలుపెట్టారు .జోహాన్ సింగూర్ జాన్సన్ ,గున్నార్ గున్నార్ సన్లు వీరిలో ముఖ్యులు .హాల్డోర్ లాక్స్నేస్ 1902-98 కు 1950లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .ఇతను చాలావ్యాసాలు కవిత్వం ,చిన్నకధలు నవలలు రాశాడు .అభి వ్యక్త వాదనవలలు ఇండిపెండెంట్ పీపుల్ ,ఐస్ లాండ్స్ బెల్ వంటి వి  చాలా అనువాదం చేశాడు.మొదటి ప్రపంచయుద్ధం తర్వాత క్లాసిక్ శైలి పునరుద్ధరణ జరిగింది .డేవియో  స్టెఫాన్సన్, టోమాస్గుయో ముండ్సన్ లు 20వ శతాబ్ది సంప్రదాయ కవిత్వానికి మూలస్థంభాలు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత క్లాసికల్ మోడరన్ శైలి కలిసిపోయాయి .ఇటీవలికాలం లో 1961లో పుట్టిన ఆర్మదూర్ ఇండ్రియాన్సన్   రాసిన క్రైం నవలలు ఐస్లాండ్ దేశం వెలుపల బాగా ప్రాచుర్యం పొందాయి.

   సశేషం

  భోగి శుభాకాంక్షలతో

image.png

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

6-ఐస్ లాండిక్ సాహిత్యం -1

ఐస్ లాండిక్ సాహిత్యం అంటే ఐస్లాండ్ దేశం లో వర్ధిల్లిన ,ఐస్ లాండ్ ప్రజలు రాసిన సాహిత్యం .ఇక్కడ మధ్యయుగాలలో 13వ శతాబ్దిలో సాహిత్యం’’ సాగాలు ‘’అంటే కుటుంబ కథలదారావాహిక  పేరిట వచ్చింది .ఐస్ లాండిక్ ,పురాతన నార్సే అంటే ఒకటే .కనుక ఓల్డ్ నార్సే సాహిత్యమే ఐస్ లాండ్ సాహిత్యం .సి౦గు రూర్ నార్డాల్ ఈ సాహిత్యాన్ని సేకరించి రెండూ ఒకటే అని రుజువు చేశాడు .

  మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం మూడు భాగాలు -1-ఎడ్డిక్ పోయెట్రి 2-సాగాస్ 3-స్కాల్డి క్ పోయెట్రి  .

1-ఎడ్డాస్-ఇదిపాత నార్సే పదంగా చాలామంది భావించారు .దీని అర్ధం ముత్తాతమ్మ.అంటే బాగా ప్రాచీనమైనది అని భావం .కొందరు ‘’ఒడిడి’’అనేఒక ప్రదేశం గురించిన  పదం ను౦చి వచ్చినమాట గా చెప్పారు.ఇక్కడే వచన ఎడ్డా రాసిన ‘’స్నారి స్టూర్లుసన్’’ పుట్టినట్లు భావిస్తారు .ఎల్డ ర్  ఎడ్డాలేక కవిత్వ ఎడ్డా సాముండర్  ఫ్రూయి రాసినట్లు కథనం .కాని ఆధునికులు దీన్ని తిరస్కరించి ఇదంతా 10వ శతాబ్దం లో వచ్చిన కవితలు, కథలుగా పేర్కొన్నారు . ఒకరకంగా ఇవన్నీ స్కాండినేవియన్ ప్రధాన ప్రదేశం నుంచి వచ్చినవే . మొదటిసారిగా ఐస్ లాండ్ దేశం లో 13వ శతాబ్దంలో వీటిని రాసుకొన్నారు .మొట్టమొదటి కవితా ఎడ్డా ‘’ కోడేస్ రీజియా ‘ వ్రాతప్రతిని ’1643లో దక్షిణ ఐస్ లాండ్ లో స్కాల్ హాట్ బిషప్ బ్రిన్జాయ్ ఫర్ స్వేల్న్ సన్ కనుగొన్నాడు .యంగర్ లేక ప్రోజ్ ఎడ్డా ను స్నారి స్త్రూల్ సన్ రాశాడు .ఇది నార్సే పురాణగాథ లను ఆధునికులు అర్ధం చేసుకోవటానికి బాగా ఉపయోగ పడుతుంది .ఇందులో ఐస్ లాండ్ కు చెందిన మైథలాజికల్ కథలు, వాటితోపాటు ‘’కెన్ని౦ గ్స్’’కూడా ఉన్నాయి .వీటివలన ఐస్ లాండిక్ ‘’స్కాల్డ్స్’’కవులగురించి తెలుసుకోవచ్చు .

2-స్కాల్డిక్ కవిత్వం –ఎడ్డిక్ కవిత్వానికి స్కాల్డిక్ కవిత్వానికి తేడా ఉంది .దీన్ని నార్వేజియన్ ,ఐస్ లాండిక్ కవులు రాశారు .వీరినే ‘’స్కాల్డ్స్ ‘’అంటారు .వీటిలో ఐస్ లాండ్ దేశ రాజుల ,యుద్ధ వీరుల, సాహసికుల వీర గాథలను పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వం ఉండిఉత్తేజాన్ని ప్రబోధాన్ని ప్రేరణను కలిగిస్తాయి .వీటిని స్థానిక ఉత్సవాలలో సామూహికంగా గానం చేసి వారికి నివాళి ఘటిస్తారు .కవిత్వం నాటకీయంగా ఉంటూ మనసును ప్రభావితం చేస్తుంది .ఆ మహానుభావులగురించి కవులు అసత్య కధనాలు అల్లి ఉండరు అనే ప్రగాఢ విశ్వాసం ఐస్ లాండ్ ప్రజలది .ఉదాహరణకు ‘’ఈజిల్స్ సాగా ‘’లో ఈజిల్ కుమారులు మరణించటం చాలా భావోద్వేగం తో ఉంటుంది .

   స్కాల్డిక్ కవులను ప్రజలు ఆరాధ్యకవులుగా భావిస్తారు .వీరిని నాలుగు విభాగాలు చేశారు -1-ప్రొఫెషనల్ పోఎట్స్ అంటే రాజాస్థానకవులు .వీరిని రాజును మెప్పించటానికి కీర్తించటానికి కవిత్వం రాస్తారు .ఇవన్నీ చారిత్రాత్మక వాస్తవ సంఘటనలే .పరిపాలనాధికారులు కూడా ఈకవిత్వాన్ని బాగా మెచ్చి ప్రోత్సహించారు .వీరిపైనా వీరిజీవిత సంఘటనలపైనాస్పందించి ఈకవులు కవిత్వం రాశారు

2-ప్రైవేట్ కవులు –వీరు కాసుకోసం కవిత్వం రాయలేదు .పండుగ పర్వదినాలలో ఇతరకవులతో పోటీ వచ్చినప్పుడు రాశారు .

3-క్లెరిక్స్ –మతసంబంధ కవిత్వం రాసిన వారు .

4-అజ్ఞాతకవులు –వీరికవిత్వం తరతరాలుగా ప్రజలనాలుకలపై నర్తించి సాగాలలో చేరింది .తమమనోభావాలను బయటపెట్ట టానికి ఈ అజ్ఞాత పదం బాగా ఉపయోగపడింది .

స్కాల్డి క్ కవిత్వం ఛందస్సు ను బాగా పాటించి రాసినదే .అందులో ఎన్నో అలంకారాలు ,వాటిలో క్లిష్టమైన ‘’కెన్ని౦ గ్స్’’కూడా ఉంటాయి .వీటిలో కళాత్మకత ఉండటం ప్రత్యేకం .పదక్రమం ,పాద నిర్మాణం నిర్దుష్టంగా ఉంటాయి

సాగాలు –పాత నార్సే భాషలో వచనం లో రాసినవే సాగాలు .జర్మని ,స్కా౦డినేవియన్ ప్రజలు ఐస్ లాండ్ కు వలసవచ్చిన చారిత్రాత్మక కథనాలు .వైకింగ్ ల సముద్రయాత్రలు వారు జయించి నివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రదేశాలు,నిర్జన గోట్లాండ్ లో జనావాసం ఏర్పాటు వగైరాలుంటాయి  .ఎడ్డాలు పైలోక కథలు ఐతే , సాగాలు ఇహలోక వాస్తవ  జీవిత కథలు .ఇందులో బిషప్పులు ,సన్యాసుల జీవితాలు  ,శృంగార కథనాలు ఉన్నాయి .కొన్నిటిలో పురాణ గాధలు కూడా అందులో తమాషాగా చోటు చేసుకొంటాయి .9-13శతాబ్దాల మధ్య స్కా౦డినేవియాచరిత్ర తెలుసుకోవటానికి సాగాలు గొప్ప ఉపకరణాలు .

  మహిళా సాహిత్యం

  మధ్యయుగంలో స్త్రీల సాహిత్యంఎక్కడా కనిపించదు .అజ్ఞాతకథలు కవితలు మహిళలే రాసినట్లు నమ్ముతున్నారు .స్కాల్డిక్ కవితలలో ఎక్కువభాగం నార్వీజియన్, ఐస్ లాండిక్ మహిళలు రాసినవే  అంటారు .తర్వాతకాలం లో మాత్రమే పురుషకవులు స్కాల్డిక్ కవిత్వం ,సాగావచనం  రాశారు .మహిళలు గొప్పకవిత్వమే రాశారని భావిస్తున్నారు .కాని 15వ శతాబ్ది కి చెందిన రిమూర్ సైకిల్ ,లాండ్రేస్ రిమూర్ లలో స్త్రీ సంబంధ విశేషణాలు వ్యాకరణపదాలు ఉన్నట్లు గుర్తించారు .కనుక మొదటి ఐస్ లాండిక్ కవిత్వం రాసింది మహిళ మాత్రమే అని నిశ్చయంగా చెబుతారు .

  సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -13-1-20-ఉయ్యూరు

  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం )

  స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం )

బాలడ్(గేయకథా)సాహిత్యం

18వశతాబ్దిలో బాల్లడ్ సాహిత్యాన్ని బెలిమన్ కవి మొదలుపెట్టాడు .యూనివర్సిటి చదువుల విజ్రు౦భణలో వెనకబడి మళ్ళీ 1890పుజు కున్నది .గేయానికి సంగీతం తోడై ఎక్కువ మంది శ్రోతలను ఆకర్షి౦చేట్లు కవులు రాసి ప్రచారం తెచ్చారు .1900లో 90కి పైగా కవులు ఈప్రక్రియ బాగా పండించారు .గుస్తాఫ్ ఫ్రోడింగ్ ,ఎరిక్ ఆక్సెల్ కారల్ఫీల్డ్  కవులు ఇందులో ముఖ్యులు .ఎవర్ట్ త్రాబే (1890-1976)పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ గా రుజువు చేసుకొన్నాడు .మూడు దశాబ్దాలు స్వీడెన్ దేశమంతా తిరిగి ప్రదర్శనలిచ్చి జయభేరి మోగించాడు .నావికులపైనా ,అర్జెంటీనా ,స్వీడిష్ పల్లెప్రాంతాలపైనా ఈబాలడ్స్ రాసి వన్నె తెచ్చాడు .1962నుంచి చనిపోయేదాకా బాలడ్ రచన, గానం లో ప్రఖ్యాతుడైనవాడు కార్నేలిస్ వీస్ వ్రిజ్ .ఇందులోకొన్ని లెఫ్ట్ ప్రొటెస్ట్ సాంగ్స్ అంటే  సొసైటీ ఆఫ్ అండర్ డాగ్స్ పైనా రాసినవి .ఈయనవలన స్వీడిష్ సాహిత్యం అత్యంత ప్రభావితమైంది .మరణానంతరం  ఆయన కవిత్వ మాధురి మరింత ఆకర్షణీయమైంది జనానికి .

  కవిత్వం

1930-40కాలం లో స్వీడిష్ కవిత్వం ఆధునికత మోజు లో ఉంది .ప్రయోగం శైలీ ,వచనకవిత్వం బాగా వచ్చింది .హజాల్మార్ గుల్బెర్గ్ (1898-1961)అనేక మిస్టికల్ క్రిస్టియన్ ప్రభావ కవిత్వం రాశాడు .వీటిలో ‘’ స్పిరి ట్యుయల్ ఎక్సర్ సైజెస్  ‘’వంటివి ఉన్నాయి .కొంత విరామం తర్వాత 1950లో కొత్త శైలిలోయువతకు ప్రేరణగా  రాశాడు .గున్నార్  ఎక్లాట్ (1907-1968)స్వీడిష్ మొదటి సర్రియలిస్టిక్ కవిగా’’సెంట్ పా జోర్డన్ ‘’కవితా సంపుటితో  గుర్తి౦పు పొందాడు .అతని సమకాలికులు దీన్నిఅర్ధం చేసుకోలేకపోయారు .బాణీమార్చి రొమాంటిక్ కవిత్వం తో ‘’డెడికేషన్ ‘’సంపుటి 1934లో తెచ్చాడు .ఇది అందరికీ నచ్చింది .ముసలితనం మీదపడే దాకా రాసి కవిత్వం లో డామినెంట్ పర్సనాలిటీ గా స్థిరపడ్డాడు .అతని శైలి భారంగా సింబాలిక్ గా ,సమస్యాత్మకంగా హింసాత్మక వ్యంగ్యంగా  ఉంటుంది .

  మరోముఖ్య మోడర్నిస్ట్ కవి హర్రి మార్టిన్సన్ (1904-1978)ప్రకృతి ఆరాధనతో సాటిలేనికవిత్వం రాశాడు .ఫ్రీ వెర్స్ నూ బాగా రాసి మెప్పించాడు .నవలలుకూడా రాసి పాక్షిక జీవిత చరిత్రగా ‘’ఫ్లవరింగ్ నేట్టీస్ ‘’1935లో రాశాడు..బాగా పేరు తెచ్చిందిస్పేస్ షిప్ అంతరిక్షం నుంచి దారితప్పిన అంజారా ‘’ ‘’అనే నవల – 20వ శతాబ్ది ప్రముఖకవి టోమాస్ స్ట్రాన్ స్ట్రోమార్.ఇతనికవిత్వం లో క్రిస్టియన్ మిస్టిసిజం కలకు నిజానికిఉన్న అంచుమీద ఉంటుంది .అంటే భౌతిక ఆదిభౌతికంగా ఉంటుంది .60లలో చరిత్ర మార్గదర్శకులపై కవిత్వం వెల్లి విరిసింది .ఇదంతా ప్రయోగాత్మకంగా సాగింది .దీన్ని వ్యతిరేకి౦చివారూ ఉన్నారు .70లలో బీట్ హవా నడిచింది .చిన్నపత్రికలు కవిత్వాన్ని ప్రచురించాయి.డాన్ ఆండర్సన్ కవి రచయిత .తనకవితలకు తానే సంగీతం కూర్చుకొన్నాడు .ఈయనను స్వీడిష్ ప్రోలిటేరేనియన్ రచయితగా గుర్తించారు .

   నాటక సాహిత్యం

రెండవ ప్రపంచయుద్ధం తర్వాత నాటకరచయితలు బాగా రాశారు .పావెల్ రామేల్,కార్ల్ డీ ముమ్మా మంచి హాస్యనాటకాలు రాశారు .పత్రికలూ రేడియో,టివి లు నాటకాలను బాగా ప్రోత్సహించాయి .1960తర్వాత మార్పువచ్చి ,నాటకరంగం అందరి అభిరుచులకు నిలయం అయింది .లార్స్ నార్రెన్ ,పేర ఎలోవ్ ఎన్క్విస్ట్ లు ఈకాలం లో ప్రఖ్యాతులయ్యారు .

   పాప్ మ్యూజిక్

1960లో స్వీడిష్ సాహిత్యాన్ని అమెరికా ఇంగ్లాండ్ లు ప్రభావితం చేశాయి .మొదట్లో అనుకరణగా ఉన్నా తర్వాత స్వంత బాణీ నేర్చింది .యువత విజ్రు౦భి౦చి రాశారు .ప్రోగ్రెసివ్ సాహిత్యం వచ్చినా ఆదరం పొందలేకపోయింది .జాతీయతావాదం మంచి ఊపు తెచ్చింది .మైకేల్ వీహీ ప్రముఖుడు .తిరుగుబాటు కవులలో ఉల్ఫ్ లండేల్ పాత ధోరణికి స్వస్తి చెప్పి  మొత్తం తరానికి ప్రాతినిధ్యం వహించే ‘’జాక్’’అనే  బీట్నిక్ నవల రాశాడు .విమర్శకులు అభిమాని౦చక పోయినా ఇప్పటికీ అదే బాగా పాప్యులర్ నవలగా ఉన్నది .

  ఫిన్లాండ్

ఫిన్లాండ్ లో స్వీడిష్ భాష అదికారభాష .సుమారు 6శాతం జనానికి మాతృభాష కూడా .కనుక స్వీడిష్ సాహిత్యం ఫిన్లాండ్ లో బాగా ప్రభావంత౦గా కనిపిస్తుంది  “a versatile and future-oriented cultural institution of Finland-Swedish literature, culture and research.” అన్నారు అందుకనే .గ్లోబల్ ఈక్వాలిటి కి ,ఫిన్నిష్ జాతీయ భావానికి స్వీడిష్ సాహిత్యం బాగా దోహదపడుతోంది .

   నోబెల్ పురస్కారాలు

స్వీడిష్ సాహిత్యం లో వివిధ ప్రక్రియలలో నోబెల్ పురస్కారాలుందుకున్నావారిలో 1-సేల్మా లాంగాలోఫ్ (1909),2వెర్నెర్ వాన్ హీల్దేన్ స్టాన్(1916),3-ఎరిక్ ఆక్సెల్ కార్ల్ ఫీల్డ్(1931),4-పార్ లాజేర్విస్ట్ (1951) 5-ఈవిండ్ జాన్సన్ ,6-హారీ మార్టిన్సన్ (1974)7-టోమస్ స్ట్రాన్   స్ట్రోమార్ (2011)ఉన్నారు.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 7(చివరిభాగం )

34-పిరాట్ల శంకర శాస్త్రి (1884-1950)-తారణ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీశైల శాస్త్రి ,పిచ్చమా౦బ లకు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా జయంతిపురం లో జన్మించాడు తండ్రి ఆంధ్రగీర్వాణ భాషాపండితుడు, దేవీ ఉపాసకుడు .సోదరులు  మృత్యుంజయశాస్త్రి ,శివరామ శాస్త్రి, సదాశివ శాస్త్రి .పెద్దాయన సాహిత్య నాటకాలంకార విమర్శకుడు .చివరాయన చిన్నప్పుడే చనిపోయాడు .

శంకర శాస్త్రి నిస్టాగరిస్టుడు,శివపూజా దురంధరుడు ,సంగీత సాహిత్యవేత్త .శ్రీ వామ దేవ తీర్ధ స్వామి శిష్యరికం చేసి వేదాంత శాస్త్ర పాండిత్యం సాధించాడు .పద్యరచనా అలవాటు చేసుకొని శంకర శతకం రాశాడు .మొదట్లో పాపట్ల లక్ష్మీ కాంతం వద్ద తర్వాత వీణ కుప్పయ్యకొడుకు ముత్యాల్పేట త్యాగయ్యవద్దాగాన పాండిత్యం సాధించాడు .విజయనగరం గద్వాల అనపర్తి ఆత్మకూరు ముత్యాల సంస్థానాలలో విద్యా ప్రదర్శన చేసి గొప్ప బహుమతులు పొందాడు .కొంతకాలం గుంటూరులో ఉండి తర్వాత ముత్యాల రాజాస్థాన సంగీత విద్వా౦సుడయ్యాడు మద్రాస్ సంగీత పరిషత్ సభ్యుడు .కామవర్ధని, షణ్ముఖ ప్రియ ,భైరవి ,సింహేంద్రమధ్యమ రాగాలలో కీర్తనలు రాసి ,పాడి సంగీత రత్నాకరం లోని విషయాలు విశదీకరించాడు .ఆంద్ర విశ్వకళాపరిషత్ సభ్యుడుగా ఎన్నుకోబడిన మొట్టమొదటి వాడైనాడు .గాత్రం లోనేకాక వీణ, ఫిడేలు ,మృదంగాలలో కూడా నిపుణుడు .రెండవ సంగీత పరిషత్ అధ్యక్షుడయ్యాడు .కొడుకులు మహాదేవ శాస్త్రి ,శ్రీగిరి శాస్త్రి .

35-పిరాట్ల శివరామ శాస్త్రి –బాల్యం లో వేదాధ్యయనం చేసి తర్వాత పాపట్ల వారివద్ద సంగీతం నేర్చి అసదృశ ప్రజ్ఞాపాటవాలతో ,ఫిడేలు మృదంగాలపై జాతిపల్లవులను అడిగిన రీతిలో వాయించే నేర్పరుడయ్యాడు .హైదరాబాద్ మద్రాస్ లలో కూడా కీర్తి గడించాడు .

36-బలిజేపల్లి  సీతారామ శాస్త్రి 2-9-1885న జన్మించాడు వీరివంశం సహజగానకళకు పెట్టిందిపేరు .తలిదండ్రులు ఆదిలక్ష్మమ్మ ,నరసింహ శాస్త్రి .తండ్రి సంగీత సాహిత్య విద్యా సంపన్నుడు .తల్లి అధ్యాత్మరామాయణ కీర్తనలు, తరంగాలు ,అష్టపదులు పాడటం లో నేర్పరి .నాట్య వేదికపై హృద్యమైన సంగీతం తో గుంటూరు బాణీనిర్మించి రక్తికట్టించిన బహుళనాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ఈయన సోదరుడు . అన్నవద్ద సంగీతం నేర్చి,గానవిద్యా దురంధరుడనిపించాడు.గానప్రతిభా దురంధరుడు కోయంబత్తూరు రాఘవయ్య శిష్యుడు ప్రయాగ తిరుమలయ్య గాన మెళకువలు  గ్రహించాడు .పూచయ్య౦గార్, కోనేరి రాజాపురం గానాన్ని విని స్వంత ధోరణిలో గానం చేసి మెప్పించాడు .ఇతనిది శుద్ధ తంజావూరు సంప్రదాయం .రాగభావం ,మనోహర సంగతులు సహజ స్వర పోకడలు ,సంచారాలు సద్య స్పురణ ఇతని ప్రత్యేకతలు .ఎప్పటికప్పుడు నూతన ప్రస్తారాలతోపాడి ఇంపు గూర్చేవాడు .గాన సంస్కార ప్రాబల్యం ,ప్రతిభ అసామాన్యమైనవి .అందుచేత అరవదేశం లోనూ సంగీతం తో దున్నేశాడు .

1917లో కాశీనాధునినాగేశ్వరరావు పంతులుగారు మద్రాస్ కు ఆహ్వానించి కచేరి చేయించి ‘’స్వర్ణకంకణం ‘’ప్రదానం చేసి సత్కరించారు .శ్రీనివాస అయ్యంగార్ ‘’గానవిద్యాదురంధర’’ఆంద్ర గోష్టి సంస్థ ‘’గానకళాప్రపూర్ణ ‘’బిరుదప్రదానం చేసి సన్మానించారు .ఆదిభట్ల నారాయణ దాసుగారు ‘’స్వరసింహ ‘’బిరుదునిచ్చి పూజించారు .కవిత్వం, జ్యోతిషం లలోకూడా పాండిత్యం ఉన్నది .1944లో ‘’భక్తకల్పద్రుమ ‘’శతకం రాశాడు  ఆ యేడాదే షష్ఠి  పూర్తి మహావైభవంగా జరిపారు ,.శిష్యులు –మహావాది వెంకటప్పయ్య శాస్త్రి  దెందుకూరిశివరామ శాస్త్రి ,పన్నాల వెంకటప్పయ్య లు .

37 –తాడిగడప శేషయ్య -1888-1950)-‘’సంగీత విద్వత్ జనరంజక స్వరనిది ‘’బిరుదాంకితుడు. ఒంగోలుతాలూకా రావూరులో జన్మించాడు .పొన్నూరులో పతూరిరామయ్యవద్ద కాళిదాసత్రయం పూర్తి చేసి ,సహజగానం తో పద్యాలు  జనరంజకంగా పాడేవాడు  .మాతామహుడు, తల్లి సంగీతపాటకులు  .ఇతడు గర్భంలో ఉండగా తల్లి ఒక రోజున తెల్లవారుజామున మేలుకోలుపులపాటలు పూర్వరాగ సంచారం లో పాడుతుంటే ఈర్ష్య తో ఒక గాయకుడు ‘’చిత్త చాంచల్య ప్రయోగం ‘’చేశాడు.దానిఫలిత౦ గా  తల్లికి ,పిల్లాడికి కూడా మతి స్థిమితం తప్పింది .

పొన్నూరులో తూములూరి హనుమచ్చాస్త్రి వద్ద కొన్ని గీతాలునేర్చి ఏక సంధగ్రాహి అవటం వలన వారణాసి రామసుబ్బయ్యవద్ద కృతులు ,గానమర్మాలు నేర్చాడు .ఒకరోజు గురువుగారింటి పెరటిలో స్నానం చేస్తూ శేషయ్య తోడి రాగాలాపన చేస్తుంటే అతడే తన భవిష్యత్కర్త అని స్నేహితులకు చెప్పాడు .అప్పటిను౦చి శేషయ్య  అనేక కచేరీలు చేసి ,చల్లపల్లి, మీర్జాపురం రాజాలచే సన్మానాలు పొందాడు .భావపూరితంగా త్యాగారాజకృతులను గానం చేయగలగాయకుడు శేషయ్య ఒక్కడే అనే గొప్ప పేరు సంపాదించుకొన్నాడు .స్వరరాగ తాళజ్ఞానం తో ,బహుచతుర రాగాలాపన చేసేవాడు .ఎప్పుడూ పిచ్చివాడిలాగా తిరిగే మహాగాయకుడు గాన అవధూత తాడిగడప  శేషయ్య 1950లో 62వ ఏట చనిపోయాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు ‘’ఇంతటితో సమాప్తం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-20-ఉయ్యూరు   ‘’.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

 

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

30-కాశీ భట్ల లక్ష్మణ శాస్త్రి –గరికపర్తి కోటయ్య దేవర శిష్యుడు .కస్తూరివారి సావరం నివాసి .చిన్నప్పుడే ఫిడేలు, గాత్రం నేర్చి తోడి ,శుద్ధ సావేరి రాగాలలో వర్ణాలు రచించి చాలామందికి నేర్పాడు .1944లో చనిపోయాడు .కొడుకులు కామేశ్వరావు గణపతి కాశీపతి తబలా హర్మని నిపుణులు .

31-చంద్రాభట్ల కనకయ్య –మార్టేరుదగ్గర తామరాడ అగ్రహార  వాసి .కల్యాణి ఖమాచి ,బిలహరి వసంత శంకరాభరణం ,భైరవి రాగాలలో స్వరజతులు రాశాడు .

32-పారు పల్లి రామకృష్ణయ్య పంతులు (1883-1951)-1883 స్వభాను సంవత్సర౦లో కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో జన్మించారు .శేషాచలం ,మంగమాంబ తలిదండ్రులు .శ్రీ వత్స గోత్రం .1902లో తెలుగురాయలపాలెం కు కరణీక౦  చేసి ,నాలుగేళ్ళకే రిజైన్ చేశారు .గానకళ హృదయం లో మెరుపులాగా మెరిసింది .ఆ తళుకులో సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రిగారి పాదపద్మాలు మనోహరాలై కనిపించి స్పూర్తి నిచ్చి ,ఆ చరణకమల దాసులు ,సన్నిహితులై జ్ఞానదీప్తి పొందారు .శాస్త్రిగారి వద్ద పెదకళ్ళేపల్లి లో 12ఏళ్ళు గురుకులవాసం చేసి నమ్రత సూక్ష్మబుద్ధి తో గురుమనసు రంజింపజేసి ,గురువే దైవంగా భావించి ,గురూపదేశం పొంది చరితార్ధులయ్యారు .

కాకినాడ గాన సభలో తన సత్తా చాటి ,అనేక సార్లు దక్షిణ యాత్రలు చేసి గాన కళారహస్యాలు ఆమూలాగ్రం నేర్చారు .తిరువయ్యారు శ్రీ త్యాగారజారాధనోత్సవాలు చూసి ,బూదలూరి కృష్ణమూర్తి శాస్త్రి గారి గోటు వాద్యకచేరీలో ఫిడేలు నైపుణ్యం చూపి మామ్గుడి చిదంబర భాగవతార్ ,పంచాపకేశన్ మున్నగు విద్వత్ ప్రముఖులమన్ననలు పొందారు .పంతులుగారి గాన కళా వైభవాన్ని వార౦తా ఎంతగానో మెచ్చుకొన్నారు .వాయులీన నిపుణత సున్నిత గాత్రం తో అందరినీ ఆకర్షించేవారు .శాంత దమాది సద్గుణ గరిస్టులు.శుద్ధవాణి ,శుద్ధముద్ర పారుపల్లివారి ప్రత్యేకత .శాస్త్రిగారి శిష్యులలోమేటి .40ఏళ్ళు ఆంద్ర దేశాన్ని గానంతో ఉర్రూతలూగించి దాక్షిణాత్య గానాన్ని బంగారుపల్లకీలో ఊరేగించారు .1916లో గురువుగారితో బరోడా పరిషత్తుకు వెళ్లి ,ఆంద్ర సమాజం చేత సన్మానం .

1931లో నరసరావు పేటలో పిరాట్ల శంకర శాస్త్రి అధ్యక్షత న జరిగిన సారస్వత పరిషత్తులో ‘’గాయక సార్వ భౌమ ‘’బిరుదప్రదానం చేసి ఘన సత్కారం చేశారు .1933లో మద్రాస్ సంగీత పరిషత్ విద్యాప్రవీణ సలహా సభ్యులయ్యారు .1943లో పంతులుగారి షష్టిపూర్తి మహోత్సవం నభూతో గా జరిగింది .1917లో విజయవాడలో త్యాగరాజ శత వార్షికోత్సవం  ఘనంగా చేశారు .విజయవాడలో ‘’త్యాగరాజ సంగీత పరిషత్ ‘’ను స్థాపించి ,ప్రతియేటా పండిత సభలు వాగ్గేయకారులవార్షికోత్సవాలు  జరుపుతూ సత్కరిస్తూ ప్రోత్సహించారు .’’రాగ తాళ భావ ప్రవృత్తులు ప్రజ్ఞాన సమన్వితాలు ‘’అని చెప్పేవారు .చాలా గాయక సభలకు అధ్యక్షులు తిరువయ్యార్ ,పూనా ,మద్రాస్ మొదలైన పట్టణాలలో కచేరీలు చేసి మహాసత్కారాలు పొందారు .పంతులుగారి శిష్యులు ప్రస్తుతం ‘’రామకృష్ణ గాంధర్వ విద్యా పీఠం’’స్థాపించి బెజవాడలో నిర్వహిస్తున్నారు .సహపాఠులు-వెంపటి వెంకట కృష్ణయ్య,చల్లపల్లి పంచానదేశ్వరం ,ద్వివేదుల లక్ష్మన్న ,దుడ్డు సీతారామయ్య ,చల్లపల్లి సుబ్బయ్య  ,దాలిపర్తి రామస్వామి .

శిష్యులు –చిలకలపూడి  వెంకటేశ్వర శర్మ ,మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,వంకదారి వెంకట సుబ్బయ్య ,దాలిపర్తి పిచ్చిహరి , ధూళిపాల  సోదరీమణులు ,వంగల వాణీ బాయమ్మ ,యశోదమ్మ ,లక్ష్మీ నరసింహ శాస్త్రి ,శిష్ట్లా రాజశేఖర శాస్త్రి మొదలైనవారు .

33-దుడ్డు సీతారామయ్య –(1853-1951)-తండ్రి దుడ్డు కామశాస్త్రి అధ్యాత్మరామాయణ ,అష్టపదులు ,తరంగ ప్రవీణుడు .తల్లి సుబ్బమ్మ .తండ్రివద్ద సంగీతం నేర్చి ,స్వయంగా తనూ కొంత నేర్చి తృప్తిపడక దేశాటనం చేసి ,అనేక గురువులవద్ద విద్య అభ్యసించి గానరహస్యాలు నేర్చిన ఏక సంద గ్రాహి .చివరకు సుసర్లవారి ని చేరి 4నెలలలో సకల గాన రహస్యాలు అవగతం చేసుకొన్నాడు .మద్రాస్ లో తిరువత్తూర్ త్యాగయ్యవద్ద కొత్తగాన విషయాలు నేర్చి జంత్ర గాత్రాలలో అసమాన ప్రజ్ఞా ధురీణుడయ్యాడు .’’మూడు సంగీత అవధానాలు’’ చేసిన మహాగాయక మణి.వేదమూల అష్టావధానం ,గణితావధానం ,సంగీత అవధానం చేసిన ఘనుడు .సంగీత అవధానం అంటే –రాగ తాళ,కాల  జాగా గతి జాతి భేదాలు చేసి గాత్రం తోపాడుతూ ఫిడేలుపై వాయి౦చటం. గణితావధానం అంటే –కోరిన జాగాలలో షట్కాలాలలో రెండు చేతులతో తాళాలు వేస్తూ ,కాలాలు మార్చి వ్యస్తాక్షరీ ఘంటనాదాలతో కలిసి అవధానం చేయటం .పద్యకవిత్వం లో పూర ణాలు అసాధారణంగా చేసేవాడు .

పిఠాపురం సంస్థానం లో గణిత అష్టావధానం చేస్తుంటే ,మద్రాస్ గవర్నర్ 24అక్షరాల న్యస్తాక్షరి నివ్వగా సునాయాసంగా చేసి మెప్పు పొంది రాజాగారు తమ ఆస్థాన విద్వాంసులుగా ఉండమని కోరారు .అప్పటికే 10ఆస్థానాలనుండి  గౌరవ వార్షి కాలు పొండుతు౦డటంతో సున్నితంగా తిరస్కరించాడు ,కాకినాడలో చల్లా సుబ్బారావు సింహతలాట మురుగులు ,పత్రి రామచంద్ర రావు స్వర్ణ మాల  చేయించి  గౌరవించారు  .అక్కడి పామర్రులో సంగీత పోటీలో వెయ్యినూటపదహారు రూపాయలు పందెం గెలిచాడు .జంగారెడ్డి గూడెం లో మాడుగుల సుబ్బారావు అరఎకరం పొలం రాసిచ్చాడు .గోడే వారి ఎస్టేట్ లో ఆహిరి, రీతి గౌళ రాగాలు అద్భుతంగా పాడగా  ఓలేటి కామరాజు పంతులు గారు 200ఎకరాల భూమిని శాశ్వత దానపత్రంగా రాసిచ్చాడు .నూజివీడులో మీర్జాపురం రాజా కల్యాణం సందర్భంగా అష్టావధానం లో హుసేని రాగాలాపన చేసి మెప్పించి ‘’మహామహోపాధ్యాయ ‘’బిరుదు పొందాడు .ప్రాచీన గీతాల లక్షణ ప్రబంధాలు ఇతనివద్ద చాలాఉన్నాయి .నిశిత ప్రజ్ఞా దురంధరుడు,ప్రజ్ఞా శీలి  దుడ్డు మహాదొడ్డ గాయకుడు  కూతుళ్ళుకూడా మాహా గాయనీమణులే .ముఖ్యశిష్యుడు  వింజరం గ్రామానికి చెందిన మహేంద్రవాడ బాపన్న శాస్త్రి .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-    

  • దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18

    ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5

    29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-

    గుంటూరు జిల్లా పొన్నూరు వాసి .తండ్రి కోటయ్య .తల్లి లక్ష్మీ దేవి .భార్య రోశమ్మ ..30ఏళ్ళు మాత్రమె జీవించినా చిర యశస్సు నార్జిం చాడు .స్పురద్రూపి ఆజానుబాహు ,విశాలనేత్రుడు .సహజ సుస్వర గాత్రుడు .ఆకార సదృశ ప్రజ్ఞ ఉన్నవాడు  .రాజులను సైతం ధిక్కరించాడు .కౌశిక గోత్రుడు .తండ్రి భరత శాస్త్ర ,నాటక కళా ప్రవీణుడు .తండ్రి వద్దనే అన్నీ నేర్చాడు .15వ ఏటనే కచేరీ చేసిన బాల మేధావి .చనిపోయేదాకా కచేరీలు చేశాడు .ప్రకృతి ధ్వనులను  అనుకరిస్తూ బాల్యం లోనే కంఠం  మేళవించి కమ్మగా పాడుతూ పరవశం కలిగించేవాడు .సరళీలు ,గీతాలు అలంకారాలు తండ్రివద్ద నేర్చి ,రాజనాల వెంకటప్పయ్య వద్ద 30కృతులు ,30తానవర్ణాలు ,,పల్లవి అభ్యసించాడు .ఇతని స్వరజ్ఞానం ,లయ పటిమ చూసి గంధర్వా౦శ  సంభూతుడు అనే వారు   1906లో కాకినాడలో పూచయ్య౦గార్  సమక్షం లో కదన కుతూహలరాగం లో విషమపల్లవి పాడి అందర్నీ ఆశ్చర్యపరచాడు .పూచయ్య తనతో తీసుకొనిపోయి గానపాఠాలు చెప్పి తీర్చి దిద్దాడు .అక్కడపాడే మహా విద్వాంసుల గానం లోనిగుణ దోషాలను విమర్శిస్తూ ,వాటిని తన హృదయం లో భద్రం చేసుకొని శ్రోతలకు వినిపిస్తూ వారే పాడారేమో ననే భ్రమకలిగించేవాడు .1906లో ఎట్టియార్ పురం వెళ్లి సుబ్రహ్మణ్య దీక్షితుల తరఫున నవగ్రహస్వరం పాడి,మెప్పించి  ‘’సంగీత సంప్రదాయ గ్రంథం’’ బహుమానంగా పొందాడు.1909లో రామనాథపురం జమీలో సన్మానం పొంది దేనుకొండ చిన్నయ్య ,నారుమంచి జానకిరామయ్య ,ప్రయాగ తిర్మలయ్య ల సమక్షం లో పూర్వ ,ఆధునిక లక్షణ గతి గమక భేదాలగురించి విమర్శించి చెప్పాడు .కాట్రావులపల్లి రాణీ గారిగారి కుమార్తె వివాహ సమయంలో పండిత సభలో నందిగామ వెంకన్న ,సంగమేశ్వర శాస్త్రి ,నారాయణ దాసు మొదలైన పండిత దిగ్గజాల సమక్షం లో నిరుపమానమైన పల్లవి పాడి ‘’పల్లవి కోకిల ‘’బిరుదు పొందాడు .శేకూరు లో విషమ పల్లవి పూర్తి చేసి మాదయి వెంకటరాయుడిని పరాభావి౦ చాడు .బుచ్చి రెడి పాలెం లో భైరవి రాగాపల్లవి లో అపూర్వ గ్రహస్వరాలు వినిపించి గావిన్ద గోవిందస్వామి  అనే నాగస్వర విద్వాంసుని మెప్పించాడు.

        1907లో కలకత్తా వెళ్లి హిందూస్థానీ గాత్రం నేర్చి గోహర్జాన్ ,శరథ్  చంద్ర మోహన్ , రవీంద్రనాధ టాగూర్ లను మెప్పింఛి సర్టిఫికేట్ ,సువర్ణ పతకం పొందాడు .చేబ్రోలు బంగాళాలో జరిగిన కచేరీలో ‘’ఋషభ గ్రామం ‘’లో పాడుతుంటే దారిన పోతున్న జోడెడ్ల బండీ ఆగిపోయింది  .ఆదిభట్ల నారాయణదాసు ,సుసర్ల దక్షిణా మూర్తి గార్లు రామసుబ్బయ్యగానం విని గంధర్వగానం అన్నారు .గాత్ర వరిస్టులలో ప్రధమ శ్రేణికి చెందిన గాయకుడుగా గుర్తింపు పొందాడు .’’ హృద్య శబ్దః సుశారీరః ‘’అన్నట్లు మృదు మధుర గంభీర ,త్రిస్థాన గమక ప్రౌఢిమగల ఇతని గాత్రం నుంచి వెలువడే ప్రసారాలు గవ్వలగుత్తుల ధ్వని యుతాలు అని మెచ్చుకొనేవారు.రాగ రూప కాలాప్తులకు మేటి .ఎవ్వరికీ ఇంతటి గాన శైలి అబ్బలేదని విమర్శకాభిప్రాయం .శరీరం స్నిగ్ధం గానం అనుద్వాన యుక్తమై అనాయాస లద్గతికమై అన౦త రామ భాగవతార్ ,బిడారం కిట్టప్ప లను మరిపించేది .అందుకే ‘’స్వరజ్ఞాన ‘’.’’స్వరకల్ప వల్లరీ ‘’,’’అర్వాచీన ఆంద్ర గాయన వాచస్పతి ‘’వంటి సార్ధక బిరుదులూ పొందాడు .జంత్ర గాత్రాలలో  అశేష శేముషి ఉన్నవాడు .స్వరకల్పవల్లి ,సంగీత సర్వార్ధ సార సంగ్రహం ,సంగీత ప్రదర్శిని మొదలైన అపూర్వ గ్రంథాలలోతులు తరచిన వైదుష్యం ఉన్నవాడు .అందుకే ఎవరు ఏ రాగం లో ఎలాంటి పల్లవిని విషమజాగాలలో ఇచ్చినా అవలీలగా పాడే నేర్పున్నవాడు .ఏ రాగం లోనైనా వర్ణాన్ని ఆశువుగా రచించి పాడే ధీశాలి .స్వరప్రస్తార ప్రతిభావంతుడు .తానవితానం తాలుగతమై శోభించేది .విలంబ ,మధ్యకాలాలపై ఆసక్తి ఎక్కువ . భరత శాస్త్ర   ప్రకా౦డుడు .గాత్ర పాటలో’’ పాథే ఫోన్ ‘’కిచ్చిన నౌరోజ్ రాగపల్లవి ,కల్యాణి కాంభోజి, ఖరహరప్రియ, రాగాలాపనలు ,మోహన ,రామప్రియ రాగ కృతుల రికార్డులు రామసుబ్బయ్య అసదృశ ప్రతిభా చాతురికి నిదర్శనాలు .తన ఆంద్ర గీర్వాణ పాండిత్యం చాటటానికి పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామిపై చెప్పిన శ్రీరాగ  రుద్రప్రియ ,ఆభోగి ,చారు కేశి ,వీణాధరి జగన్మోహిని కల్యాణి ఆదితాళ,ఆటతాల వర్ణాలు ,గీతాలు ,ఖడ్గబంధాలు ,నాగబందాలు, సంగీత విమర్శక వ్యాసాలూ ఇతనిని అత్యున్నతస్థాయి వాగ్గేయకారుడని ఎలుగెత్తి చాటుతున్నాయి   .ఈయనతో ఆనాటి సమానులు- కోనేరి రాజ పురం  ,గొర్తి లక్ష్మీ నారాయణ ,చల్లపల్లి సుబ్బయ్య ,పాపట్ల లక్ష్మీకాంతం ,నందిగామ వెంకన్నలు .ఇతనికి పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి కోవెలలో స్వస్తి వాచకం  నౌఖరి ఉండేది .

       ఒకసారి వాసిరెడ్డి ప్రసాదరావు జమీందారు చివుకుల వెంకటప్పావధానిఘానాపాఠితో కలిసిరాగా సుబ్బయ్య ఫిడేలుపై పనస చెబుతూ వాయిస్తుంటే గురువు ,రాజు మురిసిపోయారు .గ్రహణ శక్తివల్లనే అంతటి విద్వా౦సుడవటానికి కారణం .దీనికి అతని విజయనగర ,తంజావూర్ మద్రాస్ యాత్రలు తరచుగా చేయటమే కారణం .అఖండ కీర్తి సాధించిన గాయక మణులలో అగ్రగణ్యుడు .పొన్నూరులో గాన విద్యాలయం పెట్టాలని చందాలు వసూలు చేశాడు కాని కార్యరూపం దాల్చలేదు .జార్జిరాజు పట్టాభి షేకానికి  ఢిల్లీలో పాటకచేరి చేయాలని ముఖమల్ అంగరఖా కుట్టి౦చు కొన్నాడు. పుచ్చా సీతారామయ్య జమీన్ దారు ద్వారా  ప్రయాణపత్రం తెప్పించుకొన్నాడు .కాని జయపుర సంస్థానం నుంచి తిరిగి వస్తూ ,చలిజ్వర పీడితుడై మద్రాస్ ఆస్పత్రిలో చనిపోయాడు .ఇతని ఆశయం ‘’ఆంధ్రులు చేతకాని వారు ‘’అన్న అపప్రదను తొలగించటమే .దక్షిణ దేశయాత్ర చేసి అరవగాయకులను ఓడించాలనే కోరిక గాఢంగా ఉండేది .దీన్ని శ్రీ హరినాగాభూషణం కు ఉపదేశించాడు .సుబ్బయ్య సంగీతం ఆజన్మ సిద్ధం .కారణమాత్ర గురు ప్రవర్ధితం  . ఇంతటి గాయక శిరోమణి గురించి తెలుగు వారంతా మరచి పోవటం  దురదృష్టం .పొన్నూరులో నైనాఆయన స్మారకం ఉందొ లేదో ? పొన్నూరు వాస్తవ్యులు,సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,అక్కడే సంస్కృత లెక్చరర్ చేసి రిటైర్ అయిన డా నిష్ఠలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారణాసి రామసుబ్బయ్య మహాగాయకుని కి స్మృతి చిహ్నం  అందరి తోడ్పాటుతో ఏర్పాటు చేసి నవతరానికి స్పూర్తి కలిగించమని వేడుతున్నాను .

     శిష్యులు –తూములూరి హనుమచ్చాస్త్రి ,నిరాఘాటం రామకోటయ్య ,వెంపటి సూర్యనారాయణ ,తాడిగడప శేషయ్య ,రావు సూరయ్య ,మాధవరావు ,లంకా లింగయ్య ,కోడూరి హుళక్కి ,అమ్బతిపూడి సుబ్బయ్య ,పొన్నూరి ముసలయ్య ,,రావు వెంకటరావు ,చల్లాపిచ్చయ్య శాస్త్రి .శేషయ్య గానరచన.స్వరప్రస్తరణ  అమోఘం సంగీత రహ్స్యబోధిని గ్రంధం రాశాడు .

     ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

      సశేషం

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3

15-లయబ్రహ్మ పాపట్ల లక్ష్మీకాంత కవి (1877-1921)

జగ్గయ్య పేట వాసి .సంగీత విద్వన్మణులలో ఒకడు .దిగంత యశోవిశాలుడు సహజ ప్రతిభ స్వతంత్ర రాగాతాళప్రస్తారాలతో ,అనేక గీతికా పాఠ్యఅనుభవం గాన్ధర్వగానం లతో ఆంధ్రనాటకానికి కొత్త జవ, జీవాలు తెచ్చాడు .గాన స్వతంత్రుడు .వివిధ గీతికా నిర్మాత అధ్యాపకుడు వాద్యకారుడు .భావజ్ఞశ్రోతలకు ఆనందం చేకూర్చే నైపుణ్యమున్నవాడు .మైలవరం థియేటర్ కు గొప్ప ‘’ఎస్సెట్’’ గా ఉన్నవాడు .సహచర వాద్యకారులు –తబలా వాద్య ప్రకా౦ డుడున బగ్గన్న ,పేటికా వాద్యకారుడు రామానుజులు. అమృత సోనలూరేట్లు వాయిస్తుంటే నాటక రంగం దేవేంద్ర సభలా భాసి౦చేది.ఆయనవద్ద తర్ఫీదు పొందని నటుడు అనుకరించని పాటపద్దతి ,నాటక సమాజం లేదు అంటే అతిశయోక్తికాదు ముమ్మారు యదార్ధమే .

   అన్నరామయ్యవద్ద సంగీత శిక్షణ పొంది ,సికందరాబాద్ వెళ్లి ,చిన్నన్న సోదరులతోపోటీ చేసిగెల్చి కీర్తి పొందాడు .ఫిడేలు ,హార్మనిలలో అనితర ప్రజ్ఞ చూపి ‘’లయబ్రహ్మ ‘’బిరుదు పొందాడు .రాజమండ్రి గున్నేశ్వరాయ కంపెనీ ,మైలవరం నాటకకంపెనీలో  సంగీత దర్శకునిగా రాణించాడు  .విద్వత్ పరీక్షలో పల్లవి స్పెషలిస్ట్ .సంకీర్ణ ఖండజాతి తాళాల లో విషమ జాగాలు కల్పించి పల్లవి ప్రస్తారం తో ఆశ్చర్య చకితులను చేసేవాడు .గోపీ చంద్,కనకతార ,ప్రహ్లాద సావిత్రి ద్రౌపది ,కృష్ణలీల తులాభారం పాదుకా పట్టాభి షేకం నాటకాలకు భావగర్భిత కీర్తనలు రచించి నాట్య పట్టాభి షేకమేచేశాడు .రసస్పూర్తి ,పదలాలిత్యం అతీతం .నాట్యరంగం లో మొదటగా హిందూస్థానీ రాగాలు వినిపించిన ప్రయోగ శీలి .ఈయన తర్వాత అంతటి ప్రతిభాశాలి రాలేదు  .శిష్యులు పురాణం కనకయ్య ,పిరాట్ల శంకర శాస్త్రి మొదలైనవారు .యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ సంగీత పరీక్షాదికారిగా చాలాకాలం పని చేశాడు .గద్వాల ,అనపర్తి సంస్థానాలనుండి వార్షిక పారితోషికాలు బిరుదులూ సత్కారాలు అనేకం పొందాడు .ఇంతటి ప్రతిభామూర్తి 44ఏళ్ళకే మరణించటం బాధాకరం .

16-ప్రయాగ తిర్మలయ్య (1861-1918)-గుంటూరు జిల్లావాసి .త్యాగారాజశిష్యపరంపరకు చెందిన కోయంబత్తూరు రాఘవయ్య శిష్యుడు .మహావైద్యనాథయ్యర్ సమకాలికుడు .కాకినాడ లో కచేరి చేసిఖ్యాతి పొందాడు  శిష్యుడు బలిజేపల్లి సీతారామ శాస్త్రి .

17-చేబ్రోలు సోదరులు –చేబ్రోలువెంకటరత్నం ,పాపయ్య సోదరులు బందరు వారు .చాలాగీతాలు రాశారు .శిష్యులు –కొచ్చెర్లకోట రామరాజు కంభంపాటి సత్యనారాయణ ,కంచర్ల సుబ్బారావు ,పాపట్ల లక్ష్మీకాంతకవి .వెంకటరత్నం అమరవాది శేషయ్య శిష్యుడు .1926లో చనిపోయాడు .

18-మునుగంటి శ్రీరాములు –పానకాలు సోదరులు –కాకినాడ వారు.జంత్ర గాత్ర నిపుణులు .సంగీత కృతి దర్పణం   స్వరవర్ణ సుధానిధి గ్రంథాలు రాశారు  .శ్రీరామమందిరం నిర్మించి చాలా సభలు చేయించి దానధర్మాలు చేశారు శ్రీరాములుగారి దత్తపుత్రుడు మునుగంటి వెంకటరావు .

19-రావినేని వీరయ్య చౌదరి –రాజనాల వెంకటప్పయ్య శిష్యుడు .కంజీవరం నైన పిళ్ళేవద్ద సంగీతం నేర్చాడు .పల్లవి ప్రవీణుడు .

20-వెంపటి సూర్యనారాయణ-ఒంగోలు తాలూకా తమ్మవరం వాసి .రాగం పల్లవి లోనైపుణ్యం  పొన్నూరి రామ  సుబ్బయ్య వద్ద నేర్చాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2

8-రాజనాల వెంకటప్పయ్య (1860-1930)గురువుకు తగిన శిష్యుడు .పల్లవి పాడటం లో నేర్పరి .అనేకులకు భోజన వసతులు కల్పించి గానవిద్య నేర్పిన కులపతి .శిష్యుడు పొన్నూరు రామ సుబ్బయ్య .

9-ద్వివేదుల లక్ష్మన్న సోదరులు-బొబ్బిలి వారు. గాత్రం త్రిస్థాయిలో పలికించే నేర్పున్నవారు  .మృదువుగా మనోహరంగా తంబురా శ్రుతిలాగా స్నిగ్ధంగా గానం చేసి, మహావైద్యనాధన్ వంటి వారినే మెప్పించిన వాడు .లయపట్టు తెలిసి పల్లవి ప్రస్తారం లో అమోఘ శక్తి సంపాదించి కల్యాణి ,కారుబారు బిల్హరి లో ‘’నా జీవనాధార ‘’కృతులు పాడటం లో సమర్ధులు .భావుక శ్రేణికి చెందిన గాయకోత్తముడు  .

10-చల్లపల్లి పురుషోత్తం,పంచానాదం  -అన్న గాత్రజ్ఞుడు.తమ్ముడు జంత్ర  గాత్రజ్ఞుడు.

11-చల్లపల్లి సీతారామయ్య -సుబ్బయ్య – అన్న గంభీర గాత్రజ్ఞుడు,ఫిడలర్.తమ్ముడు  వీణానాదం వంటి జీవం కల శ్రుతి రంజక గాయకుడు .తిరువత్తూరు కుప్పయ్య ,ముత్యాల్పేటత్యాగయ్యలవద్ద సంగీతం నేర్చాడు .గాత్రం లాగానే హృదయమూ మెత్తనిదే .నిర్మల ,నిరాడంబర  జీవనం గడిపాడు .తానపద్ధతిసత్స౦ప్రదాయ బద్ధం ,శ్లిస్ట గుణోపేతం .బాణీలో చోళదేశపు ఛాయలుంటాయి .గౌరీ మనోహరిలో ‘’బ్రోవ సమయం ‘’,ముఖారి లో ‘’క్షీణమై తిరిగి జన్మించెనో ‘’కృతులు అతని ప్రత్యేక సొమ్ములు .’’నిర్దోషో మధ్యమో మతః ‘’అన్నట్లు రంజక,అనుకార సంజ్ఞార్హాలు .

12-కందా రాఘవయ్య –హరికథా పితామహుడు కందా రాజన్న దత్తపుత్రుడు .స్వయంగా గాన విద్య నేర్చిన వాడు .గుంటూరు సీమలో ప్రసిద్ధుడు .

13-పెనుమత్స లక్ష్మీ పతిరాజు –క్షత్రియ కుల గాయకుడు .

14-గబ్బిట యగ్గన్న శాస్త్రి (1875-1921)

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని గబ్బిట వారి ‘’రామారావు గూడెం అగ్రహారం ‘’వాస్తవ్యుడు .గౌతమస గోత్రీకుడు .తెలగాణ్యబ్రాహ్మణుడు .ఆజన్మ బ్రహ్మ చారి  . గానగురువు కట్టు సూరన్న.శాస్త్రి  గొప్ప పదకర్త ,భక్త రచయిత,గాయకుడు .తండ్రి సూర్యనారాయణ.  శాస్త్రి రాసిన జావళీలు ఆంద్ర దేశం లోనేకాక కర్ణాటక,మహారాష్ట్ర నాటకాలలో వీటి నకళ్ళు   ప్రవేశించి మెప్పు పొందాయి .అనితర సాధ్యమైన గాన ప్రతిభ యగ్గన్న సొత్తు .ఒకరకంగా గానయజ్ఞం చేశాడు యగ్గ(జ్ఞ)న్న శాస్త్రి .పండితాదరం పొందినమహాగాయకుడు .సుప్రసిద్ధ ఫిడలర్ గొర్తి లక్ష్మీ నారాయణ తో కలిసి ఎన్నో చోట్ల కచేరీలు చేసి సత్కారాల౦దు కొన్న శేముషీ దురంధరుడు ..శిష్యులు –ఇరుగంటి బుచ్చిరామ శాస్త్రి ,దంపూరి సుబ్బారావు ,తిరువయ్యార్  కు చెందిన పల్లవి సుబ్బారావు,కాకినాడకు చెందిన సత్యరాజు బ్రహ్మేశ్వరరావు .నాట్యాభినయ శిష్యురాండ్రు –చేటపర్రు సుందరి , పువ్వులపాపాచలం మొదలైనవారు .యగ్గన్న శాస్త్రి చాలా కృతులు ,జావళీలు ,వేంకటేశ ,భద్రాద్రి రామ శతకాలు రచించాడు. అతి తక్కువవయసు 46ఏళ్ళకే చనిపోవటం దురదృష్టం .

 స్వవిషయం –యగ్గన్న శాస్త్రి మా రామారావు గూడెం అగ్రహారం వాడు మా ఇంటి పేరు వాడు కావటం  మా అదృష్టం,మాకు గర్వ కారణం  .1980 ఫిబ్రవరిలోమొదటివారం లో  నేను మద్రాస్ వెళ్ళినప్పుడు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారింటికి వెళ్లి కలిసి ఆయన స్క్రిబ్లింగ్ పాడ్ పై ముచ్చటిస్తుంటే  ‘’గబ్బిట వారిలో గొప్ప గాయక ,పదకర్త ఉన్నారు మీకు తెలుసా ‘’?అని ఆయన ప్రశ్నించి ,రాస్తే ‘’నాకు తెలియదు ‘’అని నా అజ్ఞానం ప్రదర్శించి రాస్తే, ఆయన ‘’గబ్బిట యగ్గయ్యశాస్త్రి  గారుఅనుకొంటా  గొప్ప గాయకుడు పదకర్త ‘’అని నాకు రాసి  చెప్పిన జ్ఞాపకం .అప్పటికి నా తెలివి తేటల దృశ్యం ‘’అంతే’’.ఐతే ఆపేరు మర్చే పోయాను .’’గబ్బిటవారిలో గొప్ప గాయకుడున్నాడు అనికృష్ణశాస్త్రి గారునాతో  చెప్పారు’’  అని మాత్రం అందరికీ చాటి౦ పేస్తూ చెప్పేవాడిని .

  మా రామారావు గూడెం లో మానాన్నగారిచ్చిన స్థలం లో శ్రీ భక్తాంజనేయ దేవాలయం నిర్మించిన చందోలు సుబ్బారావు గారి అల్లుడు శ్రీ కొలచిన ప్రసాదరావు గారికి ‘’యగ్గన్న శాస్త్రి గారి ఆర్టికల్ సుమారు నెలక్రిందటపంపించి శాస్త్రిగారి గురించి మరిన్ని విషయాలు తెలిస్తే నాకు తెలియజేయమని కోరాను. నేటి వరకు జవాబు రాలేదు .నాటక ,సినీ రచయిత ‘’శ్రీరామాంజనేయ యద్ధం ‘’ఫేం మాకు దగ్గరిజ్ఞాతి  స్వర్గీయ గబ్బిట వెంకటరావు(మద్రాస్ ) గారబ్బాయి ,సినీ నిర్మాత గబ్బిట మధు కు అదే ఆర్టికల్ పంపి అతనికేమైనా తెలుసునేమో అని ఫోన్ చేసి అడిగితే తెలియదన్నాడు .వెంకటరావు గారిదీ రామారావు గూడెమే.

జావళీలు

వాల్‌గంటి… రాగం: ముఖారి తాళం: రూపక వాల్‌గంటి సోయగంబునెన్న వశముగాదురా

ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా

తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా

వరకుందనంపు జాయ ముద్దుగుల్కు మేనురా

ప్రోయాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లురా

ప్రాయంపుటింతి మధ్యము గన్పట్టదు గదరా

అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా

మరువంపు మొల్ల మొగ్గల పల్వరుస పొలతిరా

జలజాతనేత్ర గబ్బిట యజ్ఞన్న కవినుతా

వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా

వాల్‌గంటి సోయగంబుల

ఇంత వేగపడిన రాగం కమాచి తాళం రూపక

ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా

రవంతవేళజూచి ముద్దులాడ దగునురా

మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి

యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా

మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక

పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా

దాపున మా పూలదోట లోపల నీవుండుము

గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా

చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి

చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా

చాలు చాలు రాగం బ్యాగ్ తాళం రూపక

చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ

వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీ

గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా

బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే

అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే

యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే

ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే

అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే

చంచలాక్షి రాగం: బ్యాగ్ తాళం: ఆది

చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర

యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను

అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు

కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర

పంచశర రూపశర పంచకముల బల్మరు

పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర

చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి

మంచమున శయనించి తపించెను రకింతచేత

అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి

గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక

అయ్యయో రాగంహిందూస్తానీ కాఫీ తాళం చాపు

అయ్యయో సైపగలేనే

చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే

మదిరాక్షి వినవే మకరాంకుడురువడి

పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే

అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనే

వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల

హరినిటు దేవే మణీహారమిచ్చెదనే

చిన్న ముద్దీరా రాగం హిందూస్తాని కాఫీ తాళం ఆది

చిన్నముద్దీరా నాసామి

కన్నుల పండువుగా నిను గనగనె

వెన్నవలెను మది వేగ గరగురా

సరసత నీవొకసారి మాటాడిన

బొరి బొరి మేన బులక లెచ్చురా

అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె

కమ్మని కోర్కెలు గలుగుచుండురా

కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞననమిత చరణ విడనాడజాలరా

కోమలాంగి రాగం కేదారగౌళ తాళం ఆది

కోమలాంగి తాళకున్నదిరా

తామరస విలోచన

సామిరాగదర కామినిక గనగ నా

మనోజుని శరానలంబునకు

చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర

సుందర శరీర యెందరైన నిన్ను బోలరంచు నీ

యందంబు చందంబు డెందంబునందలచి

కూరిమి మీరగ వారిజముఖిని జేరి

సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు

సేయ మేరగాదు వేవేగమే రార

సారెకు నీ రాక నారయుచు

వావిగ గబ్బిట వంశజ యజ్ఞన సేవిత

నీకై యాసించి యున్నదిర యే

విధాననైన దాని గ్రీడింపు

భావింప మీవేళ శ్రీవేణుగోపాలక

హాయికల్గెనురా రాగం బిలహరి తాళం రూపక

హాయికల్గెనురా చాలగ ||హా||

నామది ||హా||

నీయొయ్యారంపు పాటల

నీయెడ బాళిని నేను రాగానెరా

వేయని ముద్దిడి యెదను జేర్చి

వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో

మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి

సుగంధము కూర్మిబూయ గారామున

నీ తీరౌ మోవిసుధారసమీయ

మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ

చక్కలిగింతలు చాలగొల్పి

చొక్కింపు గోట నొక్కుచు

బాలిండ్లెక్కుడు బెనగ

ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక

బ్రోచెడి శౌరి నేడు చారు నానా

బంధోచాతురీ మారునికేళి

ఏమి పల్కెనే రాగం తోడి తాళం రూపక

ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్లవా||డేమి ||

మోమాటమేమిలేక తెల్పగదె చెలి

నేవ్రాయుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా

యేవైన నుల్లసమ్ములాడెనా చెలిఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా

నీకేమియైన భూషలిచ్చెనా చెలి

ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా

మనసిచ్చి మారుజాబు వ్రాసెనా చెలి

ఇటు నేవత్తుననియెనా అటు నన్ను రమ్మనియెనాపటు గబ్బిట శ్రీ యజ్ఞనార్చితుడు హరి

వినవే సామి చేసిన  రాగంతోడి  తాళం  రూపక

వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలి

కనుల నిండ నే నిదురగొని
నటులుండిన వేళను
చనవున గడపినవన్నియ

నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి
పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు
సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున

మేలైన గదంబు రోజ పాళి నలది
పెదవి తేనె గ్రోలి ముద్దు బెట్టి గోపాలుడు
సుఖలీలల ననుదేలించెనె నీలవేణి

ఇల గబ్బిట యజ్ఞనాఖ్యు గృపమీర నేలినట్టి
నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల
హారము నెలమి నొసగె

వానిజూడు మెందున్నాడో    రాగం నాటకురంజి  తాళం ఆది

వానిజూడు మెందున్నాడో సఖియ

నాణెంపు బల్కుల దేనెలొల్కువాడే

నిద్దమైన చెక్కుతద్దముల సౌరు
ముద్దుగారు మోము మోవికెంపు వాడే

బంగారు దువ్వలువ వల్లెవాటు వైచి
సంగీతమ్ము జేయు చహలు గల్గువాడే

చల్లని చూపుల సత్కవిత్కముల
పెల్లైన యీవుల పేరు బొందువాడే

అనయము గబ్బిట యజ్ఞన్న కవీంద్ర
వినుతుడైన రంగ విభుడింక రాడాయె

వనజాక్షుని బాయలే నే  రాగం హిందుస్తానీ కాఫీ   తాళం ఆది

వనజాక్షుని బాయలేనే సఖీ

వెనుకనె వచ్చి నా కనుదోయిని మూసి
తను నన్నెఱుంగమన్నాడే

కడు ముద్దు పాటల గరగించి నన్ను
తన తొడపైని నుంచుకొన్నాడే

మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు
తమలంబు నొసంగినాడే

ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞన్న
హృద్వనజ ప్రపూజితాంగుడే

ఈ మోహమెట్టోర్తురా  రాగం తోడి   తాళం ఆది

ఈ మోహమెట్టోర్తురా
వేగ ప్రేమ జూచి యేలుకోర

నీ మీదను నా మానసమేమారక చిక్కెగదరా మేనున గరుపాటులు వేమారును గల్గెనుర

పిక్కటాలు వక్షోజము లెక్కుడుగ పొంగారెర
మక్కువగ నీ కౌగిలి యొక్కపరి నీగదర

దట్టమగు చెమ్మటలు బుట్టి మదిగట్టి చెడి
గుట్టు విడి వెచ్చనగు నిట్టూర్పులు వచ్చెనుర

ఇంతంతనని కోర్కెలు స్వాంతమున గంతులిడె
వింతలుగ శ్రీ గబ్బిట యజ్ఞేశనుత

చాలు పోపోరా  రాగం బ్యాగ్   తాళం ఆది

చాలు పోపోరా యేరా నీ
చందమెల్ల దెలిసెరా
జాడలెల్ల దెలిసెరా

నీ నయ వినయమెల్ల నేడు దెలిసె
మ్రొక్కకు నీకే నిష్టమటరా

ఎందుకు నన్నంటెదు నా డెందము
పరిశోధింప నిందు వచ్చితే యేరా

ఆ లతాంగి మైత్రి సౌఖ్య లీలలిందు
జూపింప గోపాల వచ్చితే యేరా

బిసరుహలోచన గబ్బిట యజ్ఞనాప్త
దాని బసకె వేంచేయరా

మారుబారి కోర్వజాలరా  రాగం బ్యాగ్   తాళం ఆది

మారుబారి కోర్వజాలరా
శ్రీమానినీ మనోహరా

నీరేజు సూన కఠోర బాణమ్ములురోరుహముం దాకెరా

ఇందీవరాప్తుని యెండ వేడిమికి
కందుచు మేనెల్ల గ్రాగుటె కాకయా
మందానిలుడు పల్మారు గగుర్పాటు
లొందింప సాగించెరా

శారికా కీర మయూర మధు వ్రత
పారావతనిక రారావములకు
తోరంబుగా మది తృళ్ళిపడుచు మహారాటమున్ జెందెరా

చయ్యన గబ్బిట సత్కుల జని యజ్ఞయ్యను బ్రోచెడి జలజనయన యా గయ్యాళి జేరి నన్నెయ్యడ నేచుట లయ్యయ్యొ యిది మేరా

నేను అనుకోనేదేమిటంటే- మా తాతగారు కీ.శే .గబ్బిట దుర్గాపతి శాస్త్రి గారికి సోదరులు 9మంది అని మా అమ్మ చెప్పేది .కనుక వారిలో ఎవరో ఒకరి కుమారులై ఉంటారు గబ్బిటయగ్గన్న శాస్త్రి గారు అని అనుకొంటున్నాను .వారి వివరాలేవీ మాకు తెలీదు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం 

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం

-15-1-2020 బుధవారం  పుష్య బహుళ పంచమి మకర సంక్రాంతి సాయంత్రం 6-30 గం .లకు సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవంగా ,,పద్మవిభూషణ్  వాగ్గేయకార  శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ,  అమర గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరావు గార్ల  సంస్మరణ గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 148వ కార్యక్రమం నిర్వహిస్తోంది .సంగీత సాహిత్యాభిమాను లందరు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

                                  కార్యక్రమం
15-1-20 బుధవారం -సాయంత్రం 6-15 కు -త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ
                                    ”        6-30కు త్యాగరాజ ఆరాధనోత్సవం -పంచరత్న కీర్తనల గానం
                                             నిర్వహణ -శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి -సరసభారతి                                                                                 గౌరవాధ్యక్షులు
పాల్గొను   గాయనీ మణులు -1-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి(రేడియో ,టివి గాయకురాలు )
                                               2-శ్రీమతి విజయ -సంగీత ఉపాధ్యాయిని -ఉయ్యూరు
                                               3-శ్రీమతి గూడ మాధవి -ఉయ్యూరు
                                                4-కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ -ఉయ్యూరు
                                                             మొదలైనవారు
image.png
image.png
image.png

image.png
 
 
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠఏకాదశి )మహా పర్వదినాన ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయదేవాలయంలో ఉదయం 5గం.లకు ఉత్తరద్వార దర్శనం చిత్రాలు

6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠఏకాదశి )మహా పర్వదినాన ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయదేవాలయంలో ఉదయం 5గం.లకు ఉత్తరద్వార దర్శనం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు

        రాయలసీమ వారు

1-పక్కా హనుమంతాచారి –(1849-1939)

పంచ కావ్యాలు ముగించి ,కరూర్ లో కరూర్ రామస్వామి వద్ద సంగీతం నేర్చాడు సహాధ్యాయులు శ్రీమతి కోయంబత్తూరు తాయి ,పల్లడం సంజీవరావు గార్లు .వీరి వివాహం ఖర్చు తాయి భరించిందట .శిష్యులు చింతపల్లి వెంకటరావు ,రామచంద్రరావు వగైరా .

2-చింతపల్లి వెంకటరావు –కంచుమోతగాత్రం మంచి బాణీ లయలో దిట్ట .భావగాంభీర్యం రాగరసం సమ్మోహితులను చేస్తుంది .నేక్కార్పట్టు శేషన్నవద్ద గాన మెళకువలు నేర్చాడు .అసాధారణ కల్పనా చిత్ర ధురీణుడు.శరపరంపరగా అపూర్వ రాగాలలో పాడగల  ప్రజ్ఞఉన్నవాడు .పాండిత్యం సాధనతో  అందరినీ ఆకర్షించాడు .మరో గురువు తిరువయ్యార్ సుబ్రహ్మణ్యం .రాయల సీమవారికి ఇతని సంగీతం ఆదర్శం .1944లో చనిపోయాడు .

3-కురుగోడు వెంకటాచలం –కర్నూలు వాడు .నామకల్లు నరసింహయ్య శిష్యుడు .కల్పనా వైచిత్ర్యం స్వరాల అల్లిక జిగి బిగి ఇతని సొత్తు .తమ్ముడు వెంకట నరసయ్య ఫిడలర్ .

4-చలమత్తూరు రామయ్య –పక్కా హనుమంతాచారి శిష్యుడు .శ్రీవిద్యోపాసకుడు .హఠయోగి.ఫిడలర్.అలంకారాలు షట్కాలాల లోను,వర్ణాలను త్రికాలాల్లోనూ గమకబద్ధం గా పాడేవాడు .పావు ,అర్ధ జాగా ఇచ్చి వర్ణ సాధన చేసేవాడు .గతిభేద రహస్యవేది.నాటకురంజి ,కురట,వసంత ,శహన రాగాలను విస్తరించి విసుగు పుట్టకుండా పాడే నేర్పరి .హిందూపురం వాసి .

5-ఆమదాల వెంకటస్వామి –అనంతపురవాసి ఫిడలర్.శిష్యురాలు గుండాసాని .బోధన నిరుపమానం .ప్రక్కవాద్యం నైపుణ్యమున్నవాడు .శిష్యులు నరసింహాచారి ,,భీమసేనాచారి .

   ఒంగోలు సీమ వారు

6-దేనుకొండ చిన్నయ్య –అద్దంకి వాసి 1869-1920కాలం .ఒంగోలుతాలూకా గార్లపాడు గ్రామం లో ఆరువేల నియోగి కుటుంబం లో పుట్టాడు తండ్రి పిచ్చయ్య నృసి౦ హో పాసకుడు,పారిజాతాపహరణం వామన చరిత్ర యక్షగాన కర్త .నిరతాన్న ప్రదాత.శ్రీరామ   ,నృసింహ ఉత్సవాలు ఘనంగా చేసేవాడు .

 ,.14వ ఏట నెల్లూరు తర్వాత మద్రాస్ చేరాడు .పెదకూర సి౦గరాచార్యవద్ద గానం నేర్ఛి తిరువయ్యార్ లో పట్నం సుబ్రహ్మణ్యం వద్ద రెండేళ్ళు సాధన చేశాడు .తర్వాత ఉమయాల్పురం వెళ్లి మహా వైద్యనాధన్ శిష్యుడైన స్వామి నాధయ్య వద్ద 6ఏళ్ళు గానవిద్య అభ్యసింఛి కచేరీ చేసే సామర్ధ్యం సాధించాడు .అయ్యరు గారి 72మేళకర్తలు వల్లించి ,గానరహస్య వేత్తయై ఇంటికి వస్తూ మద్రాస్ లో కచేరి చేసి గానవిదుల మన్నాన పొంది స్వగృహం చేరాడు .ఈయనతోపాటు పై ప్రదేశాలలో విద్యాభ్యాసం చేసిన పరమాత్మునినారాయణ విద్యావినయసంపన్నుడు,రంజక గాత్రజ్ఞుడు కొద్దికాలానికే చనిపోయాడు .కొత్తపల్లి లో పెళ్లి చేసుకొని గానకచేరీలు చేస్తూ మెప్పు పొందాడు .లక్ష్య లక్షణాలతో విద్యార్ధులకు బోధించాడు .ఒంగోలు సీమ పరిసర ప్రాంతాలలో బుద్దాం ,పరుచూరు కావలి దేనుకొండ గ్రామాలలో పాఠశాలలు పెట్టి విద్యాదానం చేశాడు  .

   శిష్యులు –కుందుర్తి రామమూర్తి రామాయణం సీతాపతి ,ఫణిహారం వెంకట సుబ్బయ్య ,ములుకుదురు వెంకట కృష్ణయ్య ,పోతుమర్రి కృష్ణయ్య ,పరమాత్ముని సుబ్బయ్య ,పమిడి ఘంటం సుబ్బయ్య ,ఓగిరాల రామమూర్తి ,ఓరుగంటి వరదయ్య ,పరిమి భద్రయ్య ,దాసరి రత్నం ,గంధం మురహరి షేక్ నబీ ముగాలాయి ,భూసురపల్లి రత్నం,చదలవాడ అచ్చయ్య ,రావినూతుల వరదయ్య ,అమనబ్రోలు దాసు ,విస్సా రామారావు ,కొడుకు సుబ్బారావు మొదలైనవారు.పెదపూడిలో ఇతని గానవిద్యా నైపుణ్యానికి సింహతలాపు మురుగులు చేయిన్చిసత్కారి౦ చారు  గద్వాల్ తిరువాన్ కూర మైసూర్ సంస్థానాలలో గానవిద్య ప్రదర్శించి ‘’లయ బ్రహ్మ ‘’బిరుదు పొందాడు .స్వరకల్పనా చాతుర్య మేటి .స్వరాలను అనర్గళం గా అల్లగల సమర్ధుడు పల్లవి ప్రస్తరణ ప్రవీణుడు .సంగీత శాస్త్ర నిధి .సోదరుడు వెంకయామాత్యుడు యక్షగాన రచయిత శ్రీ రంగనాధ భట్టార్ ఉపదేశం తో విశిష్టాద్వైతం స్వీకరించి తాడిపత్రిలో ఆశ్రమ స్వీకారం చేసి నియమబద్ద జీవితం గడిపి సిద్దుడై1929లో  మరణించాడు .

  కృష్ణా తీర గాయకులు

7-సుసర్ల దక్షిణామూర్తి –(1860-1917 )-గానవిద్యా కులపతి బిరుదు పొందిన శాస్త్రిగారు కృష్ణాజిల్లా పెద కళ్ళేపల్లిలో రౌద్రి సంవత్సర  ఆషాఢ శద్ధ త్రయోదశి జన్మించాడు తండ్రి గంగాధర శాస్త్రి .గానవిద్యకు సంస్కృతం అవసరం అని గ్రహించి వ్యాకరణ మీమాంస ఛందో ఉపనిషత్ కావ్య అధ్యయనం చేశారు .సంగీత సాధనమేమోక్షం అని భావించి తంజావూర్ దగ్గర పంచనద క్షేత్రానికి వెళ్లి ,గాన వరిస్టుడు ఆకుమళ్ళ   వెంకట సుబ్బయ్య వద్ద ,ఆయన శిష్యుడు వీణా ధర్మ దీక్షితార్ వద్దా గురుకులవాసం చేసిగానవిద్య అభ్యసించారు .కొంత లక్షణ గ్రంధాలు కొన్ని గీత వర్ణ కీర్తనలు గ్రహించి తిరిగి వచ్చారు .వాటిలో పైడాల గురుమూర్తి శాస్త్రి 72మేళకర్తలలోని లక్షణ గీతాలు ,ప్రబంధాలు ఘనరాగ గీతాలు తానవర్ణాలు కీర్తనలు మాత్రకాల పద్ధతినింసరించి స్వరపరచి రాశాడు .

 ‘’ లక్ష్య లక్షణ సమన్వితుడైన నాదోపాసకుడైనవాడు రసికుడు .ఉదాహరణ కోనేరు నాగభూషణం .రాగ రూప కాలాలను అనన్య సాదారణంగా చేయగలవాడు భావుకుడు ఉదాహరణ పాల్ఘాటు అనంతరామ భాగవతార్ ,టైగర్ వరదాచారి ..సభికులను ఏదో విధంగా రంజింప జేసేవాడు రంజకుడుఉదాహరణ రామానుజయ్య౦ గారు  . . గాయకుల పోకడలను అనుసరించేవాడు ఉదాహరణ సీతారామా చారి .రసిక గాయకులను తయారు చేసేవాడు శిక్షాకారుడుఉదాహరణ –సుసర్ల దక్షిణామూర్తి ‘’అని హరి నాగభూషణం గారు చెప్పారు వీరిలో పితృస్థానం శిక్షాకారునిది . అంతటి  స్థాయి ఉన్న మహానుభావులు సుసర్ల వారు .అనేకమంది విద్యార్ధులకు భోజనం వసతి తనింట కల్పించి గాన విద్య నేర్పారు. కనుకనే ‘’కులపతి ‘’అయ్యారు .వీరి సవయస్కులు సతీర్ధులు ఫ్లూటు శరభ శాస్త్రి సద్గురు కటాక్షం పొందాడు .గురు శ్రేణికి చెందినవారు పట్నం సుబ్రహ్మణ్యం మహా వైద్యనాధన్ ,పంచాపకేశన్,వీణ ధర్మ దీక్షితులు .

  శాస్త్రిగారు ఆజనుబాహువులు .బ్రహ్మ తేజో విరాజితులు ,అగ్రహారీకులు అవటం చేత కచేరీలు చేసే విద్యార్ధులను తయారు చేశారు .కుమారులు కృష్ణబ్రహ్మం ,నాగేశ్వర శాస్త్రి ,విశ్వపతి శాస్త్రి జంత్ర గాతజ్ఞులు .రాజనాల వెంకటప్పయ్య ,ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి నరసింహం సోదరులు ,దుడ్డు సీతారామయ్య ,సింహాద్రి అప్పలాచారి ,చల్లపల్లి పురుషోత్తం ,పంచనాదం సోదరులు, చల్లపల్లి సీతారామయ్య సుబ్బయ్య సోదరులు ,పారుపల్లి రామకృష్ణయ్య ,పెనుమత్స లక్ష్మీ పతిరాజు, కందా రాఘవయ్య ,సుసర్ల గంగాధర శాస్త్రి మొదలైన వారు మెరికల్లాంటి గాన శిష్యులు .శాస్రిగారు 57వ ఏట సాయుజ్యం పొందారు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

  ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-20-ఉయ్యూరు

image.png

 .
—


press.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
             8520805566

Land Line : 08676-232797

—
You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9Px%2B9ggp_HzZPAj1cPMbtdiYqDtjuuP%3DUbA4%2B2MaWCBQ%40mail.gmail.com.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి ?

ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి ?

పరమాత్ముడు ఉన్న లోకానికి వెళ్ళటం దక్షిణ ద్వారదర్శనం భగవంతుని  భగవంతుని చూడటం తూర్పు ద్వారా దర్శనామ్ ద్వార దర్శనం కీర్తించడం పశ్చిమ ద్వార దర్శనం భగవంతుణ్ణి సేవించటం ఉత్తరద్వార దర్శనం అని బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం లో చెప్పబడింది
image.png

అన్ని కైంకర్యాలు పరమాత్మ  చేయాలి అనేవారు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో గోదాదేవి ఒకరు ఆమె  ఆమె ఒక ఒక పాశురంలో”ఉనక్కెనాం లట్ చెయ్యో0 ”అంటే మేము నీ అంతరంగ సేవచేయాలని వచ్చాము   .మత్తానం కా మంగళ్ మాతుం ”అంటే ఇంతకంటే వేరే కోరిక ఏదీ మాకు లేదు
వైకుంఠంలో అన్ని వేళల స్వామికి కైంకర్యం చేయాలన్న కోరికే   ఉత్తరద్వార దర్శనం

—  స్వామికి పాదాలు కొట్టటం చాలిస్తే దుప్పటికప్పటం అంటివి సేవలు కావు  .అసలైన సేవకు ఉదాహరణ ఆదిశేషుడు అని యామణాచార్యులవారు ఒక శ్లోకం లో చెప్పారు –

”నివాస శయ్యా ,ఆసన పాదుక,అంశుక ,ఉపాదాన ,శీతాతపవార్షిణా  విధి -శరీర భేదైఃః తవ శేషతాం గతః ”అంటే ఆది శేషుడు నువ్వు ఉంటాను అంటే ఇల్లు అయ్యాడు ,పాడుకొంటాను అంటే పానుపు అయ్యాడు ,కూర్చుంటాను అంటే సి౦హా సనమయ్యాడు నడుస్తాను అంటే పాదుకయ్యాడు   తలవాలుస్తానంటే దిండు .,కట్టుకొంటాను అంటే వస్త్రం,చలికి దుప్పటి ,ఎండకు గొడుగు  అయ్యాడు  అందుకే ఆది అంటే మొదటి సేవకుదయ్యాడు నీకు ఓ మహా విష్ణూ . 
 పరమాత్మకు అన్నీ తానె అయినవాడే నిజమైన సేవకుడు అలా సేవించటమే ఉత్తర ద్వారా దర్శనం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం 11 అదే ఏకాదశి ఈ పదకొండు పరమాత్మకు పరిపూర్ణంగా సమర్పించటమే వైకుంఠ ఏకాదశి ఉద్దేశ్యం ప్రేమతో నిన్దినద్వారమే ఉత్తరద్వారం దాని నుంచి దర్శించటమే  పరమాత్మకు ఆంతరంగిక కైంకర్యం అందుకే ముక్కోటికి అంతటిఊ ప్రసిద్ధి’శరీరం లోని ఆణువణువూ మనసు అంతఃకరణం అన్నీ పరమాత్మకు అర్పించటమే ఉత్తర ద్వార దర్శనం 
-దుర్గాప్రసాద్ 
ఆధారం -డా కందాడైరామానుజాచార్య ప్రవచనం 
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13     త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -5

మలబారు రాజ గాయకులు-2

స్వాతి తిరుణాల్  ఆస్థాన విద్వాంసులు

1-పరమేశ్వర భాగవతార్ –తిరువాన్కూర్ గాయకులలో అగ్రగణ్యుడు .అక్కడి సంగీత ప్రారంభ అంత్య దశను చూసినవాడు .క్లిష్టంగా ఉండే ఇతని కీర్తనలు పాడటం కష్టం .

2-గోవింద మరార్ –మొవ్వత్తుపురం తాలూకా రామమంగళం నివాసి .షట్కాలపల్లవి ప్రవీణుడు కనుక ‘’షట్కాల మరార్ ‘’అంటారు .1831లో తిరువాన్ కూర్ వచ్చి స్థిరంగా ఉన్నవారిలో మొదటివాడు .ఒక చేతిలో సప్త త౦త్రి తంబురా వేరొక చేతిలో మంజీరా తో దేశాటనం చేస్తూ పండరీపురంలో మరణించాడు .ఆ  తంబుర ఆ దేవాలయం లో ఇప్పటికి ఉన్నట్లు చెబుతారు .1843లో తిరువయ్యార్ లో త్యాగరాజ స్వామిని దర్శించి ,గానం తో మెప్పించి ‘’గోవిందదాస్ ‘’బిరుదు పొందాడు .ధనాశ లేదు.

3-కృష్ణ మరార్ –అసమాన ప్రతిభతో వర్ణాలు కృతులు పల్లవులు పాడగల మేధావి .సప్తస్వరాలు పలికే ‘’ఎడక్కు ‘’అనే చర్మ వాద్యం తయారు చేసి ఎప్పుడూ పాడుకొంటూ ఉండేవాడు .తన సామర్ధ్యాన్ని ప్రకటిస్తూ తంబురకు ఒక ధ్వజాన్ని పైన కట్టేవాడు .రాజు స్వర్ణకంకణం ఇచ్చి గౌరవించాడు .

4-మేరు స్వామి (1833-70)-తంజావూర్ నుంచి వచ్చిన మహారాష్ట్ర బ్రాహ్మణ గాయకుడు .కోకిల కంఠ స్వరం ఉండటం వలన ‘’రాజా కోకిలకంఠ’’బిరుదు రాజు ప్రదానం చేశాడు .ఇతని చిత్రం స్వాతి తిరుణాల భోజన శాలలో ఉండటం విశేషం .నెలకు వందరూపాయల పారితోషికం .మంచి కథకుడు కూడా .

5-లక్ష్మణ గోసాయి -1860లో అయిల్లం తిరుణాల్ రాజు దర్బార్ గాయకుని చేశాడు .మేరుస్వామికి వ్యతిరేకి.’’మహామేరుస్వామి ‘’బిరుదుపొందాడు.నాల్గు స్థాయిల్లో అవలీలగా పాడగల సమర్ధుడు .

6-వడివేలు –గోవి౦ద మరార్ తో త్యాగరాజ స్వామి దర్శనం చేయించి ,ఆయనతో తిరువాన్ కూర దర్బార్ కు రాజాహ్వానం తెలియ జేయగా త్యాగబ్రహ్మ తిరస్కరించి ‘’మేమిద్దరం ఒక చోట కలుసు కొంటాం ‘’అని నర్మ గర్భంగా తెలియ జేశారు .తానవర్ణాలు అనన్య సామాన్యంగా ఉంటాయి .తిరువాన్ కూర్ సంస్థానం లో మొదటి సారిగా ఫిడేల్ ను ప్రవేశ పెట్టిన ఘనత వడి వేలుదే.మెల్లకన్ను, బక్క శరీరం, ఒంటికన్నుతో వికృతంగా ఉండేవాడు .శ్రావ్య కంఠ స్వరం తో అందర్నీ ఆకర్షించేవాడు .హరిపద క్షేత్రం లో పాడటానికి కీర్తనలు రాశాడు .ఇతని వర్ణాలు ప్రసిద్ధాలు .రాజు  దంతపు ఫిడేలు అందజేసి సత్కరించాడు .

7-శివరాం ఉరుదాస్ ఉరఫ్ క్షీరాబ్ధి శాస్త్రి –  వేదాంత గీత రచయిత ,మంత్ర వేత్త .

8-ఇర్వన్ వర్మ తంపి(1783-1856)-స్వాతి తిరునాళ్ బంధువు .500గీతాలురాసిన కవి .రాసి రాజు కు పంపి ఆమోదం పొందేవాడు .స్వాతి తిరుణాల్ తో సమాన ప్రతిభ ఉన్నగాయకుడు.కూతురు కుట్టి కుంజ తంగాచి కవయిత్రి .ఈమె మనుమడు పద్మనాభ తంపి గొప్ప చిత్రకారుడు .

9-నారుమంచి జానకి రామయ్య (1823-1902)-ఆంధ్రుడు .ఈ కుటుంబం గాన ప్రశస్తికి చాలా ఈనాములు పొందింది .1823లో పుట్టి ,18వ ఏట తంజావూరు లో త్యాగరాజస్వామిని దర్శించి ,గానబోధ చేయమంటే వీణకుప్పన్న వద్ద నేర్వమని చెప్పారు .14ఏళ్ళు గురు శుశ్రూష చేసి 300 గీతాలు ,100వర్ణాలు 100కీర్తనలు  పాఠం చెప్పుకొని ,పల్లవి పాడటం లో మహా ప్రావీణ్యం సాధించాడు .1855లో స్వగ్రామం వెళ్లి ,తర్వాత మద్రాస్ చేరి కుప్పన్నవద్ద మరో రెండేళ్ళు సంగీతం నేర్చి ,దక్షిణాదిలో చాలాకచేరీలు చేసి ,ఆంద్ర దేశం లో ‘’చోళ దేశపు కర్ణాటక బాణీ’’మొట్టమొదట ప్రవేశపెట్టిన కీర్తి పొందాడు .ఈయనపాట నాద భూయిష్టంగా ,భావప్రదానంగా సకల లక్షణ సమన్వయంగా ఉంటుంది .శ్రీ త్యాగారాజ స్వామి దైవం ఊరేగింపులో కీర్తనలు తరంగాలు మైమరచి పాడేవాడు .ఫిడేలును ప్రక్కవాద్యంగా ఎప్పుడూ పెట్టుకొనే వాడు కాదు .తొట్లవల్లూరు చల్లపల్లి ఉల్లిపాలెం ,నరసరావు పేట జమీందార్ లచేత ఆహ్వాని౦పబడి కచేరీలు చేసి సత్కారాలు పొందాడు .

శిష్యులు –నారుమంచి సీతారామయ్య ,ఉప్పుటూ(లూ)రి శ్రీరాములు ,జవంగుల శ్రీహరి ,రాఘవులు శ్రీమతి రాం భాయి రంగనాయకి ,చిన్నమ్మి అందరూ పల్లవిలో దిట్ట లే .

10-నారుమంచి చినసీతారామయ్య –(1877-1943)-గుంటూరు జిల్లా పెదరావూరు వాసి జానకిరామయ్య శిష్యుడు .గురు సేవలో సంగీతం నేర్చాడు .100వర్ణాలు 100కీర్తనలు 200లక్షణ గీతాలు ,అనేక స్వర జతులు అభ్యసించాడు సీతారామయ్య శ్రీరాములను గురువుగారు కుప్పయ్య పుత్రుడు ముత్యాలప్పేట త్యాగయ్యకు అప్పగించాడు .రెండేళ్లలో అన్నీ సాధన చేశారు .వృద్ధులబాణీ మార్చి కొత్త బాణీలో పాడిన వారిలో సీతారామయ్య ఒకడు .  .ఇదే  ఈయన  ప్రత్యేకత వర్ణం పాడటం లో పెట్టిందిపేరు .నాదాన్ని పూరించి విలంబనకాలం లో ,ఆర్తిలో ,భావప్రకటన తో గమకయుక్తంగా పాడటం లో ఘనుడు .వర్ణం ,స్వరకల్పన ప్రత్యేకత .స్వరప్రస్తారం రాగభావ పూరితమై గజగమనాన్ని పోలి ఉంటుంది.ఎవరినీ ఆశ్రయించని స్వతంత్రుడు, ఉదారుడు .పరోపకారులు. ఎ౦దరో దాక్షిణాత్య గాయకుల కచేరీలు ఏర్పాటు చేశాడు .గాన శిక్షణలో సర్వ సమర్ధుడు .ఈయనవద్ద సంగీతం నేర్వటానికి 10ఏళ్ళు పట్టేది .సెమ్మ౦ గుడి,చౌడయ్య రోజుకు 10గంటలు సాధన చేసేవారు .ఈయన వర్ణం స్వర ప్రస్థానాలు మెచ్చి తిరుమలస్వామి అయ్యంగార్ ఖరీదైన తంబురా బహూకరించారు .కొడుకు సాంబశివరావు బియె.బిఎడ్ మంచి గాత్రజ్ఞుడు .

రాజులలో స్వాతి తిరుణాల్ రాజా(1756-88) –అంటే స్వాతి తిరుణాల్ తండ్రి సంస్కృత భాషా కోవిదుడు .ఇతనికీర్తనాలు ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో గానం చేస్తారు . మలబారు సంగీత ప్రారంభ దశ ఇది  .గోవి౦ద మరార్ ఎక్కువగా అష్టపదులు పాడేవాడు .

రాణీ రుక్మిణి బాయి (1800-37)-స్వాతి తిరుణాల్ సోదరి .రాసిన గీతాలను శాంతి భావగర్భితంగా శ్రావ్యంగా గానం చేసేది .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

రేపు 6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12
త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4
మలబారు రాజ గాయకులు
ప్రాచీన ద్రావిడ గానపద్ధతిని తిరువాన్కూర్ లో ‘’సోపానం ‘’అంటారు .ఇది ఆర్య సంగీతం తోపాటు ప్రచారం లో ఉంది .పాటలు ,పదాలు కధకళి నృత్యం,’’ పట్టు’’అనే జాతీయ గీతాలలో ఉన్జాల్ ,తుల్లాల్ ,వంజి ,తిరువత్తుర,భద్రకాళి అనే గీతాలలో బాగా వాడబడింది .చాలా ద్రవిడ రాగాలు పది ,ఇందాశ,ఇందాళ౦,పురాణి,కన్న కురంజి పేర్లతో ఉన్నాయి .’’తేవార భక్తి గీతాల’’లో 20రాగాలు వాడారు .అవే –నాటపదై-నాటరాగం ,పజం పంజరం –శంకరాభరణం ,సాదారి-పంతువరాళి ,కౌశిక్-భైరవి పేర్లతో 11వ శతాబ్దం లో వాడబడ్డాయి .మన వీణ కు సమానమైన ‘’యాళి’’అనే తంత్రీ వాద్యం అక్కడ ఉంది .
తమిళం లో సప్తస్వరాలకు పేర్లు –స-కురల్,రి-తుట్టం ,,గ –కై క లై ,మా-ఉజాయ్ ,ప-ఈశం ,ధ-విలారి ,ని-తారం .ఆర్యులగమక చిహ్నాలు తమిళులకు ఉత్తేజమిచ్చాయి ,మలబారు లేక కేరళలో ఆర్య, ద్రావిడ సంపర్కం ఉండివిచార గీతాలు, దీర్ఘపు చుట్లు కనిపిస్తాయి .18శతాబ్ది కార్తిక తిరునాళ్,స్వాతి తిరునాళ్ రాజులు ఈ శైలిలోగీతాలు రాశారు.క్రమంగా త్యాగరాజ ,దీక్షితార్ లప్రభావం వలన కొత్త గాన రీతులేర్పడ్డాయి
1-స్వాతి తురునాళ్((1820-47)
తిరువాన్ కూరు మహారాజా స్వాతి తిరుణాల్ త్యాగరాజస్వామి సమ కాలికుడు .గానవిద్యా కౌశలం తో కళాపోషణ చేశాడు .కులశేఖరాల్వార్ అనుయాయి .రాజులలో గాన సామ్రాట్ ,సమ్రాట్టులలో గాన చక్రవర్తి .ఈఘనత మొత్తం ఆ రాజవంశానికి కూడా చెందుతుంది .స్వరాక్షరాలైన సరిగమ లను సముచితంగా ఇమిడ్చి అర్ధగౌరవం చెడకుండా రాయటం ఈయన ప్రత్యేకత .నేర్చుకోనేవారికి సులభశైలిలో కొన్ని రాశాడు .కొన్ని గాయకుల గాత్ర పటిమకు పరీక్షలాగా చాలా కఠినం గా ఉంటాయి .భక్తిగీతాలు సోపానవిధానం లో మృదు మధుర శైలిలో రాశాడు .ఈ రెండుతరగతుల పద్ధతులలోని లోపాలను సవరించి ఆర్య ,ద్రావిడ గానాన్ని మిళితం చేశాడు .ప్రఖ్యాత ఆంగ్లకవి చాసర్ సులభ శైలి, శ్రావ్యత స్వాతి తిరుణాల్ లో భణుతులలో కనిపిస్తుంది .ఒకరకంగా పల్లెటూరి పదాలను గుర్తు చేస్తాయి .కీర్తనలలో ఉత్కృష్ట రసస్పూర్తి ఉంటుంది .నిరుపమానమైన భాషా పా౦డిత్యమున్న గాయక రాజు .ఆస్థానగాయకుడు పరమేశ్వర భాగవతార్ కఠినస్వర కల్పనా చేయగా ,వాటికనువైన గీతాలు రాసిన విద్వత్తున్నవాడు .
27సంవత్సరాల అల్పాయుష్కు డైనా అనేక రకాల కీర్తనలు రాశాడు .ఈయనరాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఇప్పటికీ దసరా పండుగలో పాడుతూనే ఉన్నారు .రాజవంశం లో వైష్ణవమతస్తుడు స్వాతి తిరుణాల్ ఒక్కడే .నృత్యం ,కథాకళి లోకూడా గొప్ప ప్రవేశమున్నవాడు.హిందూస్థానీ గానాభి వృద్ధికోసం ఉత్తర ప్రదేశ్ నుంచి హలావతి, సులేమాన్ లను రప్పించాడు .ఆగర్భ శ్రీమంతుడైన౦దువల్ల ‘’శాక్తన్ రాజా ‘’అంటారు .తానురాసినవి త్యాగయ్యగారికి పంపి ,అభిప్రాయం కోరిన సహృదయుడు .శ్రీ అనంత పద్మనాభ స్వామియే తన కులదైవం అని పూజించి శాసించి ప్రజలనమ్మకం కోసం ‘’పద్మనాభ దాస వంచిపాల ‘’బిరుదుపొందాడు .స్వామి తరఫుననే తనరాజవంశం పాలించాలనేది అభిప్రాయం .
సంగీత ప్రత్యేకతలు -శ్రావ్యత ,మాధుర్యం భావగర్భిత ఈయన ప్రత్యేకతలు .కృతులు మనోహరత్వం తో మనసును దోచుకొంటాయి .పద్మనాభ స్వామికి అంకితమిచ్చిన కృతులన్నీ ఉత్తమ భక్తిభావ౦ ఉత్కృష్ట శైలిలో ఉంటాయి .ఈయనరాసిన హిందూస్థానీ కృతులు తాన్ సేన్ సదారంగ్ వంటి గాయక కృతులనే మరపిస్తాయిని బుధజనాభి ప్రాయం .’’స్వాతి తిరుణాల్ సంగీతోత్సవం ప్రతిఏడాది జనవరి 4నుంచి 13వరకు మహావైభవంగా తిరువాన్కూర్ లో నిర్వహిస్తారు .ఆయన రాసినవి, హిందూస్థానీ గీతాలే పడాలి .ఆయనపేర పురస్కారం అందిస్తారు .
ఈయన ఆస్థాన గాయకులంతా గొప్ప పేరున్నవారే .వారిని గురించి వివరగా తర్వాత తెలుసుకొందాం .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11     త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -3

2- విద్యా వాచస్పతి ముత్తుస్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835)

‘’నాద సముద్ధరణార్ధం  సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞాన త్రిమూర్తుల రూపం లో అవతరించాడు అని చెప్పటానికి త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి లయబ్రహ్మ ,సర్వాంతర్యామి ,అద్వితీయుడు వేలాది  రాగాల సృష్టికర్త రాగ స్థితికర్త అయిన త్యాగరాజుగారు విష్ణుమూర్తి . ,లయకర్తా ప్రళయ భయంకరుడు ,నియమాలను పాటించే ఈశ్వర రూపుడు దీక్షితులు .కర్నాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులు వీరు .త్యాగయ్య దీక్షితులు విష్ణు మహేశ్వరులులాగా సదా పూజ్యులు .నాదమూర్తి రెండు నేత్రాలవంటివారు  .ప్రాచీన సంప్రదాయ బద్ధులై నాద విద్యను  మోక్షసాధనంగా చేసుకొన్న మహా నాదోపాసకులు .

ముత్తుస్వామి దీక్షితులు 1775లో రామస్వామి ,సుబ్బమా౦బలకు జన్మించాడు .సోదరులు బాలాస్వామి ,బాలస్వామికూడా గానకళా ప్రవీణులే అని ముందే చెప్పుకొన్నాం .ముత్తు(ద్దు)స్వామి బాలంబికా వరప్రసాద లబ్ధుడు .తండ్రివద్దె సంగీత సాహిత్యాలు నేర్చాడు .జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడుకూడా .ఏక సంధ గ్రాహి .తండ్రి సృష్టించిన హంసధ్వని రాగంలో ‘’వాతాపిగణపతిం భజే ‘’కీర్తన రాసి తండ్రికి అంకితం చేసి రచనప్రారంభించాడు . ఈకీర్తన వినని వారు లేరు .

మణలి జమీందారు ఆశ్రయం లో ఉన్నప్పుడు శ్రీ విద్యోపాసకుడు చిడంబరనాథ యోగి వచ్చిశ్రీవిద్యా మంత్రోపదేశం చేసి ,తనతో కాశీకి తీసుకువెళ్ళి గానవిద్యలో ప్రవీణుడిని చేశాడు  .అక్కడే అంతర్యాగ,  బహిర్యాగాలు  చేసి ‘’శ్రీ గురుగుహమూర్తి ‘’ఐన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని తిరుత్తనిలో దర్శించి ,ఒక రోజుండగా రాత్రి స్వామి ప్రత్యక్షమై నోట్లో పటికబెల్లం పెట్టి ఆశీర్వదింఛి అదృశ్యమవగా,పులకిత శరీరం తో ధ్యానిస్తే జ్ఞానోదయమై,వెంటనే ‘’శ్రీ గుహో జయతి ‘’అంటూ 20 కీర్తనలు రాశాడు .ఇవి జగత్ప్రసిద్దాలైనాయి .మాలలుగా కీర్తనలు రాయటం లో ప్రసిద్ధుడైనాడు ‘’గురుగుహ ‘’ముద్ర కీర్తనలలో ఉంటుంది .తర్వాత కంచి చేరాడు  .అక్కడే శ్రీ విద్యోపాసనలో మంత్రం ద్రస్టలైన త్యాగయ్య ,శ్యామ శాస్త్రి గార్లు ఉపనిషద్ బ్రహ్మాన్ని సేవిస్తున్నారు .త్యాగయ్యగారి రామ అష్టపదులకు రాగ తాల వర్ణన మెట్టులు కూర్చాడు .

కొన్నేళ్ళ తర్వాత తిరువయ్యార్ వచ్చి ,శ్రీ త్యాగేశుని సేవిస్తూ ,నదీ తీరంలో నిత్య సచ్చాస్త్ర పఠనం తో ‘’ప్రాణారామం మన ఆనందం ,శాంతి సంరుద్ధమమృతం’’అన్నట్లు శాంత చిత్తంతోకాలం గడిపాడు .ఇక్కడే త్యాగేశ ,ఆనందేశ ,అచలేశ ,హాటకేశ ,వల్మీకేశ లపై కీర్తనలు రాశాడు .అన్ని శివ ,విష్ణు క్షేత్ర సందర్శనం చేసి ,శ్రీ వేంకటేశ,కాశీ  విశ్వేశ,పంచలింగ క్షేత్రాలపై ‘’ప్రబంధాలు ‘’అనబడే పెద్ద కీర్తనలు రచించాడు .నవగ్రహాలపై నవరత్న కీర్తనలు రాశాడు .క్షేత్రయ్య విజయ రాఘవ పంచకం, త్యాగయ్య ఘనరాగ పంచకం ,స్వాతి తిరునాళ్ళ మణి ప్రవాళ కీర్తనలను పోలిన నవగ్రహ ,నవావరణ కీర్తనలు రాశాడు .నవగ్రహ కీర్తనలలో దీక్షితుల జ్యోతిశ్శాస్త్ర పాండిత్యం వ్యక్తమౌతుంది .నీలోత్పలా౦బిక ,మీనాక్షి దేవి లపై కృతులల్లాడు .ఇవి గీర్వాణ భాషలో ఉదాత్త స్తోత్ర వాజ్మయంగా  ప్రసిద్ధి చెందాయి .ఈయన మంత్రశాస్త్ర ,యోగ శాస్త్ర వైదుష్యానికివి అద్దం పడుతాయి .

దీక్షితుల సోదరులు చిన్నస్వామి బాలస్వాములు రాజాస్థానాలలో అన్నగారి కీర్తనలు గానం చేసి బహుళప్రచారం చేశారు .మధురకు ఆహ్వాని౦ప బడి అక్కడే ఉండగా తమ్ముడు చిన్నస్వామి చనిపోగా  సోదరుని మరణం భరించలేక బాలస్వామి శిష్యుడు హరితోకలిసి రామేశ్వరం తీర్ధయాత్ర చేసి ,ఎట్టియార్పురం రాగా రాజు దీక్షితార్ కృతులు అతని నుంచి విని అతన్ని ఆస్థాన విద్వాంసుని చేసి అక్కడే ఉ౦చేశాడు  .ఈ విషయాలన్నీ తెలిసిన దీక్షితులు ‘’సుఖ దుఖే సమౌ కృత్వా ‘’అన్నట్లు మనసుదిట్టపరచుకొన్నా,బాలాస్వామిని చూడాలనే కోరిక మాత్రం పోలేదు .

ఇద్దరు భార్యలతో ,శిష్యుడు తేపూరు సుబ్రహ్మణ్యం తో కలిసి ఆవూరి దేవాలయ అర్చన చేశాడు .అప్పుడు బాలాస్వామి వివాహ విషయం తెలిసి ,ఎట్టియా పురం వెడుతూ దారిలో నీరు లేక పొలాలు ఎండిపోవటం చూసి ‘’ అమృతవర్షిణి ‘’రాగం లో ‘’ఆన౦దామృత  కర్షిణి వర్షిణి’’కీర్తనరాసి పాడగా ,ముసురుపట్టి ధారాపాతంగా వర్షాలు కురిసి రైతులు ఎంతో సంతోషించారు .ఎట్టియాపురం దర్బారులో కీర్తనలు పాడగా రాజు ఆనందించి ఆస్థానం లో ఉండిపొమ్మని కోరగా నిర్లిప్తంగా ,తిరువయ్యార్ చేరి మళ్ళీ తన సంగీత పాఠాలు చెప్పటం మొదలుపెట్టాడు .

ఒక సారి కివలూరు లో దైవ దర్శనానికి వెళ్ళగా పూజారులు ఆలయం తలుపులు మూసేశారు .అక్కడే నిలబడి శంకరాభరణ రాగం లో ‘’అక్షయ లింగ విభో ‘’కీర్తన ఆశువుగా పాడగా ఆలయ తలుపులు తెరుచుకొన్నాయి .త్యాగయ్య శామశాస్త్రులపై అమితభక్తి .వారి కీర్తనలు తరచుగా  వింటూ ఆన౦ది౦చేవాడు దీక్షితార్ .త్యాగయ్యగారింట జరిగిన శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా మణిరంగు రాగం లో ‘’ మామవ పట్టాభిరామ ‘’కీర్తన రాశాడు .పుత్రులు లేకపోవటం తో సుబ్బరామ దీక్షితులను దత్తత చేసుకొన్నాడు .

1885లో ఎట్టియాపురం రాజు యువరాజు వివాహానికి రమ్మని ఆహ్వానించగా ,తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ,శిష్యులతో వెళ్ళాడు .ఆరోజు దీపావళి ఊరంతా మహా

సందడిగా ఉంది .పట్టపు తెనుగు మదమెక్కి  ,తొండం ఆకాశం వైపు పైకెత్తి భీభత్సం చేస్తుంటే,ఏదో కీడు రానున్నదని గ్రహించి  ,దీక్షుతులవారికి విన్నవిస్తే ,కన్నులు తెరచి ‘’మీనాక్షి కుముదం ‘’అనే తన కిష్టమైనకీర్తన అన్నారు .శిష్యులు అందుకొని’’మీనలోచనీ పాప మోచనీ ‘’ పల్లవిని పాడుతుండగా ముత్తుస్వామి దీక్షితులవారి కపాల విచ్చేదనం జరిగి 60వ ఏట ప్రాణాలు కోల్పోయారు .రాజు ,ప్రజల దుఖం వర్ణనాతీతం .

దీక్షితార్ శిష్యవర్గం

శిష్యులలో నాట్యం చేసేవారు మార్దంగికులు ,నాదస్వరం వారు గాయకులు,వాజ్మయ నిర్మాతలున్నారు .శుద్ధమద్దెల త౦బి యప్ప ,తిరుక్కడయార్ భారతి , అవడయార్వీణ వెంకట్రామయ్య ,తేవూరు సుబ్రహ్మణ్యం ,కోర్నాడ రామస్వామి ,అయ్యస్వామి బిల్వ వనం ,వడివేలు చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం ,నర్తకి అమ్మాణి,కమలం .

త౦బియప్ప –శ్రుతిపర్వమైన మద్దెల వాయించి ‘’శుద్ధ మద్దెల ‘’బిరుదు పొందాడు .మహా వైద్యనాధయ్యర్ ‘’చింతయామి కందమూలకందం’’ కీర్తన పాడుతుంటే సరిగ్గా లేదని ఆక్షేపించిన రసజ్ఞుడు.

భారతి, వెంకట్రామయ్య, సుబ్రహ్మణ్యం –గురువుతో తీర్ధ యాత్ర చేశారు

రామస్వామి –భరతనాట్యం లో దిట్ట .సంగీత మార్గదర్శి .

బిల్వవనం –నాదస్వర వాద్య నిపుణుడు

అయ్యస్వామి –తాన ,పద వర్ణ రచయిత.

పొన్నస్వామి –భరతనాట్య ,ఫిడేలు ప్రవీణుడు .గురుభక్తి తెలియజేస్తూ ‘’భిన్న షడ్జ ‘’రాగం లో గురుగుహమూర్తికి శిష్యుడనని చెప్పాడు .స్వరజతులు ,పద వర్ణలరచనలో సిద్ధహస్తుడు

కమల –గాన ,నాట్య కోవిదురాలు .గురువు ఆర్దికకస్టాలలో ఉన్నప్పుడు తన ఆభరణాలు అమ్మి సహాయం చేసి ఆదుకొన్న ఉత్తమ శిష్యురాలు ,త్యాగి .

ముత్తుస్వామి దీక్షితులు అమరజీవి , సన్మార్గుడు విరాగి ,ముముక్షువు  అద్వైతి ,సోహత్వం పొందిన మహాజ్ఞాని మధురవాక్కులు ,గేయకల్పనలు ,రాగ విన్యాసం ,ఆత్మతత్వం దీక్షితార్ కీర్తనల ప్రత్యేకత .నాదోపాసనతో త్యాగబ్రహ్మ భక్తిని అనన్య సామాన్య ప్రతిభతో తీర్చిదిద్దితే ,దీక్షితులు రాగ గమకాది లక్ష్యలక్షణ సమన్వయం చేశాడు .తాళగతులతోరాగవిన్యాస క్రమాన్ని పోషించి ,లక్షణ యుక్తగానాన్ని శ్యామ శాస్త్రి  నిర్మించాడు .ఈ త్రయం సందేశం ఒక్కటే ‘గానం ఆముష్మిక సాధనం అనిచెప్పి , యుగ కర్తలని పించారు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు

1-శ్యామ శాస్త్రి (1763-1827)

‘’నాదోపాసన చే శంకర ,నారాయణ విధులు  వెలసిరి ‘’అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు ముగ్గురు వాగ్గేయకారులు త్రిమూర్తులుగా గానమే ముక్తిమార్గంగా తెలియ జేసినవారు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామ శాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులుగార్లు  ఒకే చోట తిరువయ్యార్ లో జన్మించటం విశేషం  .ఈ కాలం లోనే జర్మనీలో సంగీతజ్ఞులు బీథోవెన్,మొజార్ట్ లు కూడా జన్మించారు .అందుకే 1750-1850 కాలం ప్రపంచానికి ‘’సంగీతానికి స్వర్ణయుగం ‘’

శ్రీనగరం అనబడే తిరువయ్యార్ లో గౌతమస గోత్రం లో బోధాయనసూత్రానికిచెందిన వడమ  బ్రాహ్మణ కుటుంబం లో 1763లో శ్యామ శాస్త్రి జన్మించాడు .తండ్రి విశ్వనాథయ్యర్ .వీరిది పూర్వ ఆంద్ర దేశం లోని కంభం జిల్లా .అసలు పేరు సుబ్రహ్మణ్యం .’’శ్యామకృష్ణ ‘’ముద్దు పేరు .బ్రహ్మ ఒకప్పుడు కంచిలో తపస్సు చేస్తుంటే  శ్రీ దేవి  దివ్య జ్యోతి చే కళ్ళకు అవరోధమయింది .దీన్ని ధృవ పరచటానికి బంగారుకామాక్షి విగ్రహం చేయించి దేవాలయం లో ప్రతిస్టించాడు .ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయంలో పూజా పునస్కారాలు లేకపాడు పడి ఉండటం  చూసి,సంప్రోక్షణ చేయించి  ,నిత్యపూజాదికాలు చేయటానికి స్మార్తబ్రాహ్మణులను నియమిప జేశారు .అలా శ్యామశాస్త్రి వంశీకులు పూజారులయ్యారు .1565లో తురకలదాడికి తాళలేక ‘’జింజి ‘’కి పోయి ,1594లో  అనేక బాధలు పడుతూ ఉదయార్పాలెం ,నాగూరు మొదలైన గ్రామాలు దాటి తిరువాడి చేరారు ..శ్యామశాస్త్రి తండ్రి తులజాజి రాజు  రక్షణకోరగా తంజావూర్ లో ఆశ్రయమిచ్చాడు .అప్పటినుంచి అక్కడే శ్యామశాస్త్రి మరణం వరకు   స్థిరపడ్డారు .శాస్త్రి మరణం తర్వాత వంశీకులు అక్కడే ఉంటూ స్వర్ణ కామాక్షి విగ్రహాన్ని కాపాడుతూ ఉన్నారు .

చిన్నతనం లోనే శ్యామశాస్త్రి సంస్కృత తెలుగు ద్రావిడ భాషలు నేర్చాడు .శ్రీవిద్య ను సంగీతస్వామి అనే యతీశ్వరుని చే ఉపదేశం పొంది ,పచ్చిమిరియం ఆదెప్ప ,వీరభద్రయ్యలవద్ద ప్రౌఢ గాన రీతులు నేర్చి ,శ్రీ కామాక్షీ ప్రసాదంగా అనేక కీర్తనలు ,స్వరజతులు ‘’శ్యామ కృష్ణ ‘’ముద్రతో రచించి కీర్తి పొందాడు ఆదెప్పయ్య ‘’కామాక్షీ ‘’అని గౌరవంగా శ్యామ శాస్త్రి ని పిలిచేవాడు .తండ్రి అర్చకత్వం లభించి దేవమాన్యాలతో కుటుంబ పోషణ జరిగేది .

శ్యామశాస్త్రి కృతుల విశిష్టత –కాలం రీతులు ,కదళీపాకం లాంటి రాగ శయ్య ,క్లిష్ట తాళగతులతో ‘’అతీత అనాగత గ్రహాలతో ‘’కలిసి పాడటానికి కొంచెం కష్టమని పించేవి .స్వర సాహిత్య ప్రకర్ష ఉండటం చేతే అందులో నిష్ణాతులు మాత్రమెజనరంజకంగా  పాడగలిగేట్లు ఉండేవి .అందుకే ‘’తాళప్రస్తార శ్యామయ్య ‘’అన్నారాయనను .దేవీ భక్తి పొంగిపోరలుతాయి కీర్తనలలో .రాసిన 300కీర్తనలు ఇప్పుడు ప్రచారం లో లేవు .మీనాక్షీ నవరత్నాలు ,ధర్మ సంవర్ధిని ,కామాక్షి, బృహన్నాయకి పై రాసిన కీర్తనలు బాగా ప్రచారమయ్యాయి.ఇవి ఆంద్ర గీర్వాణ తమిళభాషలలో  మనోహరంగా మధురంగా ఉంటాయి .అఖండ మనశ్శాంతి ఆత్మ సంతృప్తినిస్తాయి .

త్యాగారాజకీర్తనలలో మానసిక వ్యధ సంసారబాధలు ఉంటె, శ్యామశాస్త్రి రచనలలో బిడ్డ ఆర్తి తల్లికి చెబుతున్నట్లు ఉంటాయి .ఈయన ఆనంద భైరవి కీర్తనలు  ప్రత్యేకం .మాంజి ,కలగడ ,చింతామణి అనే అపూర్వరాగాలలో కూడా రాశాడు .’’చాపు తాళం ‘’పై అభిమానం జాస్తి .తాళవర్ణాలు ,స్వరజతులు విద్యార్ధులకు బాగా ఉపయోగకరంగా రాశాడు .త్యాగరాజ ,దీక్షితార్ లతో తరచూ కలసి మాట్లాడేవాడు .దీక్షితులకు ‘’పాదుకాంత దీక్ష ‘’ఇచ్చాడు .ఊరు దాటి యాత్ర అనేది చేయనే లేదు .కొడుకు సుబ్రాయ శాస్త్రి  త్యాగయ్యగారి శిష్యుడు .నిగ్రహానుగ్రహ శక్తులున్నమహా దేవీ భక్తుడు .ఒకకోమటి ‘’అర్చకుడు ‘’అని హేళన చేస్తే శాపగ్రస్తుడై చచ్చాడు .తనమరణం ఇంకా అయిదు రోజులున్నదని ముందే చెప్పి1827వ్యయసంవత్సర మకర మాస శుక్ల దశమి నాడు గానజ్యోతి వెలిగించి దేహం చాలించిన  దేవీ భక్తుడు శ్యామశాస్త్రి64వ ఏట  శ్రీ దేవిలో ఐక్యమయ్యాడు .

శ్యామ శాస్త్రి చింతామణి రాగం లో ‘’దేవీ బ్రోవ సమయమిదే ‘’కృతి రచించి దేవి ఆశీస్సు పొంది బొబ్బిలి కేశవయ్య అనే విద్వాంసుని ,నాగపట్నం లో అప్పుకుట్టి ని ఓడించాడు .

1926లో మైసూర్ రాజా ఆహ్వానించి సత్కరిస్తానంటే వద్దన్నాడు .జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడు కూడా .

వారసులు –పంజు శాస్త్రి ,సుబ్రాయ శాస్త్రి కొడుకులు .పంజు దేవాలయం అర్చకుడు .ఇతడి మొదటిభార్యకొడుకులు రామకృష్ణ ,సా౦బశివం ,అన్నాస్వామి .రామకృష్ణ పెద్ద కొడుకు నటేశం పూజారి .ఇతనివద్ద శ్యామశాస్త్రి రాసిన లక్ష్యలక్షణ ప్రతులున్నాయి .వీటిలో తాళప్రస్తారాలు చిత్రాలు ఉన్నాయి .సా౦బశివం బ్రహ్మజ్ఞాని, వేదాంతి .అన్నాస్వామిని సుబ్రాయ శాస్త్రి దత్తత చేసుకొన్నాడు .

అన్నాస్వామి (1827-1900)-అసలుపేరు శ్యామకృష్ణ .తండ్రి వద్ద కావ్య నాటకాలంకారగాన శాస్త్రాలు  నేర్చాడు .రచయిత, ఫిడలర్ .’’పాలించుకామాక్షీ ‘’’’పాహి శ్రీ గిరిరాజసుతే ‘’అనే ఆనందభైరవి కీర్తనలకు స్వరసాహిత్యం రాశాడు .72మేళ కర్తల రాగ లక్షణాలు రాశాడు వీణకుప్పయ్యతో కలిసి అపూర్వ పల్లవులకు స్వరకల్పన చేసి ,పాడాడు .

శిష్యులు –మేలకార్ గోవిందన్ ,కామాక్షి .కొడుకు శ్యామశాస్త్రి .చిత్రలేఖకుడు ఫిడలర్ .73ఏళ్ళు జీవించి 1900లో చనిపోయాడు .

శ్యామశాస్త్రి శిష్యులు –

అలసూరి కృష్ణయ్య  మైసూర్ ఆస్థాన విద్వాన్ ,పల్లవి ప్రవీణుడు .

దాసరి –నాగస్వర కోవిద ,.ఒకసారి తిరువయ్యార్ స్వామి ఊరేగింపులో  శుద్ధ సావేరి రాగాలాపన పల్లవి పాడి ‘’దారి తెలుసుకొంటి ‘’కృతితో ముగించగా త్యాగరాజస్వామి అతని ప్రతిభను మెచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.

పుదుకోట శేషాచలం –  1741జననం .పుదుకోట సంస్థాన విద్వాన్ .కొడుకు మాతృ భూషయ్య .సోదరుడు రాం దాస్ రామముద్రతో కృతులు రాశాడు .శిష్యులు -స్వరకాడు సుబ్బయ్య .మనవడు గోపాలస్వామి కృతికర్త .

.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -adu81-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847)

త్యాగరాజ శిష్య పరంపర -6

61-ఎం.వెంకటరామ జోషి (1858-1924)

బొమ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధుడు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు .పీతాంబర్, గారడీ ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రాహి .శిష్యుడు నల్లూరి నారాయణ .

62-మువ్వలూరి సభాపతి

త్యాగయ్యగారి సమకాలికుడు .మానంబు చావడి శిష్యుడు భరత శాస్త్ర ప్రవీణుడు .ఇతనిభక్తి శృంగార పదాలను నేటి నట్టువరులు పాడుతున్నారు .వీటిని మన్నారు గుడి రాజగోపాల స్వామికి అ౦కిత మివ్వటం చేత ‘’రాజగోపాల ముద్ర ‘’ఉంటుంది .కొన్ని చరిత్ర నిరుపానాలు రాశాడు .సీతాకల్యాణం లో వానప్రస్థఘట్టం జాలి గొలుపుతుంది .

హరికథా ప్రవీణులు

63-సూత్రం నారాయణ శాస్త్రి (1849-1909)

గాన, తర్క శాస్త్ర ,హరికథ కోవిదుడు .సంస్కృతంలో ‘’ఘటికాచల మాహాత్మ్యం ‘’రాశాడు .హా థీ రాం బాబా ,మార్కండేయ, చంద్ర హాస హరికధలు రాసిన అష్టావధాని .

64-రాధా కృష్ణ శాస్త్రి (1858-1907

సంస్కృతపండితుడు ,కవి హరికధలు చాలారాసి వాటిలో గీర్వాణ ద్రావిడ ,మణిప్రవాళ భాషాకీర్తనలు జోడించాడు .దివాన్ శేష శాస్త్రి చే సన్మానితుడు.

65-గోవింద స్వామి భాగవతార్ (1861-1921)

తంజాపురి కృష్ణభాగవతార్ శిష్యుడై 18ఏళ్ళు కథలు నేర్చాడు .తెలుగు, అరవ,కన్నడ, మరాటీ భాషలలోని గీతాలు చేర్చి మిశ్రకథాగానం చేసేవాడు .పురాణహరికథలలో మేటి .వేంకటేశ మీనాక్షి కళ్యాణాలు, లవకుశ, గౌరీ చరిత్ర హరికథలు రాశాడు .గాయక ,ఫిడలర్ . ఉదయార్పురం ఆస్థానగాయకుడు .త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభించినవారిలో ప్రథముడు .శిష్యులు –మనుమడు ఆత్మనాద భాగవతార్, నారాయణ భాగవతార్ ,రామసామి కన్నయ్య నాయుడు .

వీరి తర్వాత త్యాగరాజస్వామి సమకాలిక దాక్షిణాత్య సంగీత తపస్సంపన్నుల గురించి తెలుసుకొందాం .

.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ- గబ్బిట-దుర్గాప్రసాద్ -3-1-20-ఉయ్యూరు

—

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో 2020..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020

నన్ కావాలనుకొని నాస్తికురాలైంది:

సైమన్ డీ బోవర్ 9-1-1909న బోర్జువాస్ పారిసన్ కుటుంబంలో ఫ్రాన్స్లోనిపారిస్ లో జన్మించింది.తండ్రి జార్జెస్ బెర్ట్రాండ్ డీబోవార్ లీగల్ సెక్రెటరి .తల్లి ఫ్రాంకాయిస్ డీ బోవర్ కేధలిక్ మతస్తురాలు .మొదటి ప్రపంచ యుద్ధం అయిపోగానే కుటు బానికికున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి పూట గడవటమే కష్టమైంది .సైమన్ నూ చెల్లెలు హెలీన్ ను కాన్వెంట్ స్కూల్ లో చేర్పించారు .మత విశ్వాసం అధికంగా ఉన్న సైమన్ ,చిన్నప్పుడు సన్యాసిని అవాలనుకొని తర్వాత ఆలోచనమార్చుకొని జీవితాంతం నాస్తికురాలిగానే గడిపింది .తన తెలివి తేటలతో తండ్రిని మెప్పించేది .ఆయన తనకూతురు మగాడిలా ఆలోచిస్తుందనే వాడు .కట్నం ఇచ్చి పెళ్లి చేసే సత్తా తలిదండ్రులకు లేదని గ్రహించి తనమార్గాన్ని తానే ఎన్నుకొన్నది .

మేధావి:

1925లో గణితం ,ఫిలాసఫీ పరీక్షలురాసి ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ కేధలిక్ డీ పారిస్ లో గణితం ,,సాహిత్యాన్ని ఇన్ ష్టిట్యూట్ సెయింట్ మేరీలో చదివి ,సార్బోర్న్ లో ఫిలాసఫీ చదివి 1928లో డిగ్రీ పొందాక ఎం.ఏ .కు సమానమైన థీసిస్ ను ‘’లీబ్నేజ్ భావన ‘’అనే అంశం పై రాసింది .ఆకాలం లో సార్బోర్న్ నుంచి డిగ్రీ తీసుకొన్న 9వ మహిళగా డీబోవర్ గుర్తింపు పొందింది .కారణం అంతకు కొద్దికాలం నుంచే మహిళలకు ఉన్నత విద్యకు అవకాశం కలిపించటమే .మొదట్లో ఆమె మారిస్ మేరియా పొంటీ ,క్లాడ్ లెవి స్ట్రాస్ లవద్ద పని చేసింది .తర్వాత ఈకోల్ నార్మల్ సుపీరియర్ లో ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసింది .ఇక్కడే జీన్ పాల్ సాత్రే ,పాల్ నిజాన్ ,రీనీ మాధ్యు లు విద్యార్ధులుగా ఉండేవారు .బోవార్ కు ఇవ్వాల్సిన ఫస్ట్ రాంక్ ను కొద్ది మార్కుల తేడాతో సాత్రేకు ఇచ్చి,21ఏళ్ళ ఆమెకు సెకండ్ రాంక్ ఇచ్చింది పరీక్షల జూరీ .ఆ పరిక్ష అంత చిన్న వయసులో ఆడిగ్రీ పాసయినది అప్పటికి బోవార్ ఒక్కరు మాత్రమే . కనుక మేధావిగా గుర్తి౦పుపొందింది .

ఆత్మ భాగస్వామ్యం:

తన ఆత్మకథ’’డ్యూటిఫుల్ డాటర్ ‘’లో డీబోవర్ తనతండ్రి భావాలకు, తల్లి మనోభావాలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ రెండూ సమతుల్యం చేసి తాను మేదావినయ్యాయనని రాసింది .1929నుంచి 43వరకు 14ఏళ్ళు లైసీ లెవెల్ యూనిట్ లో ఫిలాసఫీ బోధిస్తూ ,తన రచనలద్వారా డబ్బు సంపాదిస్తూ గడిపింది .1929అక్టోబర్ లో సాత్రే ఆమెను పెళ్లి చేసుకొంటానని చెప్పి రెండేళ్ళు ఇద్దరూ కలిసి ఉండటానిక్ బాండ్ పై సంతకాలు చేద్దామని చెప్పాడు .వివాహం అంటే ఆమె ఇష్టపడలేదు కాని ఆజంట జీవితాంతం ‘’ఆత్మ భాగ స్వాములు ‘’(సోల్ పార్టనర్ షిప్ )గా ఉండిపోయారు . డీబోవర్ ఓపెన్ రిలేషన్ షిప్ వలన ఒక్కోసారి ఆమె విద్యా సంబంధాలపై నీడగా మారేది .హార్వర్డ్ ప్రేక్షకుల సమక్షంలో వచ్చినప్రశ్నలన్నీ సాత్రే రచనలపై వస్తే ,బోవర్ ను ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు అడిగేవారు .వీరిద్దరి సోల్ రిలేషన్ షిప్ 1929లో మొదలై ,1980లో సాత్రే మరణందాకా 51ఏళ్ళు ఉంది.

ఇద్దరూ ప్రభావ శీలురే:

సాత్రే, బోవర్ లు ఇద్దరూ ఒకరి పుస్తకాలోకరు చదివి విషయాలపై చర్చించుకొనేవారు .సాత్రే రాసిన ‘’బీయింగ్ అండ్ నతింగ్ నెస్’’,బోలవర్ రాసిన ‘’షి కేమ్ టు స్టే’’,ఫెనోమనాలజి ‘’,ఇన్టెంట్ ‘’పుస్తకాలలో ఎవరిపై ఎవరిప్రభావం ఎంతో ఈనాటికీ చర్చగానే ఉన్నది .బోవార్ రచనలపై సాత్రే కాక ఇతర ఫిలాసఫర్లు హెగెల్ ,లీబ్నిజ్ ల ప్రభావం ఎక్కువ .1930లో ‘’నియో హేగేలియన్ రివైవల్ ‘’ను అలేక్జాండర్ కోజీవ్ ,జెన్ హేప్పోలైట్ లు తీవ్రతరం చేసి ఒక తర౦ ఫ్రెంచ్ ఆలోచనాపరులను విపరీతంగా ప్రభావితం చేశారు .ఆప్రభావం బోవర్ మీదా కూడా ఎక్కువే .

నవ ప్రేమికుడు ఆల్గ్రెన్:

ఆమెకు పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కనాలని ఆలోచన ఉండేదికాదు .అ౦దుకని రాజకీయాలలో ,విద్యావ్యాసంగం లో రచనలలో బోధనలో ,ప్రేమికులతో గడిపింది .1947లో చికాగో లో అమెరికన్ రచయిత నెల్సన్ ఆల్గ్రెన్ ను కలిశాక ముఖ్య ప్రేమికుడయ్యాడు .ఈ ప్రేమపై ఆమె ‘’మై బిలవ్డ్ హస్బండ్ ‘’అనే రచన చేసి అట్లాంటిక్ తీర పాఠకులను ఉత్తేజపరచింది.ఆల్గ్రెన్ కు’’దిమాన్ విత్ ది గోల్డెన్ ఆరం ‘’పుస్తకానికి 1950లో నేషనల్ బుక్ అవార్డ్ వస్తే ,బోవర్ కు 1954లోఆల్గ్రెన్ హీరో గా ఉన్న ‘’ది మ౦డరిన్స్ ‘’పుస్తకానికి ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం ‘’ఫ్రాన్సిస్ ‘’పొందింది .వీరిద్దరిమధ్య ఉన్న అన్యోన్యాన్ని బహిర్గతం చేసినందుకు అతడు తిరస్కరించాడు .కొన్నేళ్ళకు ఇద్దరూ విడిపోయినా ఆమె చనిపోయాక అతడు పెట్టిన సిల్వర్ రింగ్ తోనే ఖననం చేశారు .

ప్రిస్టేజియస్ అవార్డ్ వెనక్కి:

ఆమె సెక్స్ విషయాలు శిష్యులు ,కొందరు ప్రముఖులు తర్వాత బయట పెట్టారు. తన స్టూడెంట్ 17ఏళ్ళ విద్యార్ధి సోరోకిన్ ను 1939లో మోహించి ఆకర్షించి చెడగొట్టిందన్న అభియోగం రుజువై బోవర్ ను బోధన ఉద్యోగంనుంచి సస్పెండ్ చేశారు .1977లో ఆమెకిచ్చిన ప్రిస్టేజియస్ అవార్డ్ ‘’ఫ్రాన్సిస్ ‘’ను వెనక్కి లాగేసుకొన్నారు .

అస్తిత్వవాద రచన:

1944లో బోవర్ తనమొదటి ఫిలాసఫీ వ్యాసం ‘’అస్తిత్వవాదనీతి ‘’పై రాసింది 1947లో కొనసాగిస్తూ ‘’ది ఎథిక్స్ ఆఫ్ ఆమ్బిగ్యుటి’’రాసింది .ఇదే ఫ్రెంచ్ అస్తిత్వవాదానికి దారి చూపింది .ఆమె ‘’సంపూర్ణ స్వేచ్చ ‘’(ఆబ్సల్యూట్ ఫ్రీడం )సమర్ధించింది .రెండవ ప్రపంచయుద్ధం చివరలో సాత్రే ,బోవర్ కలిసి ‘’లెస్ టెమ్ప్ మోడర్ నెస్’’అనే రాజకీయ పత్రిక నడిపారు .అందులో బోవర్ రచనలు చాలా చోటు చేసుకొన్నాయి .చనిపోయేదాకా ఆమె దాని ఎడిటర్ గా ఉంది

స్త్రీవాది:

.’’వన్ ఈజ్ నాట్ బార్న్ బట్ బికమ్స్ ఎ వుమన్ ‘’అనేది ఆమె సిద్ధాంతం .సెక్స్ జెండర్ వ్యత్యాసాన్ని ఖండించింది .. మహిళ మగాడికి సంబంధించింది కనుక ఆమెను సెకండ్ సెక్స్ ‘’అని నిర్వచిస్తున్నారన్నది .ఈ అభిప్రాయాలతో ‘’సెకండ్ సెక్స్ ‘’రచన చేసింది .మగాళ్ళు ఆడవారిని వాళ్ళ చుట్టూ ఉన్న ఆకర్షణగా చూశారన్నది .ఈ భావాలతో మహిళా ఉద్యమాన్ని ,ముఖ్యంగా ఫ్రెంచ్ మహిళా విమోచన ఉద్యమాన్ని నడిపింది .మహిళా సాధికారత, సమాన విద్య ,ఆర్ధిక స్వేచ్చ లకోసం తీవ్ర పోరాటం చేసినా ,తాను ’’ ఫెమినిస్ట్’’ ను కాను అనేది .అనేక ఉద్యమాలు నడిపి 1972లో తాను ఫెమినిస్ట్(స్త్రీవాది ) నే అని బహిరంగంగా ప్రకటించింది. 1970లో ఫ్రాన్స్ స్త్రీ విముక్తిఉద్యమ౦ లో తీవ్రంగా పాల్గొన్నది .’’అబార్షన్ హక్కు’’పై నినదించే మహిళలల తరఫున సంతకాలు సేకరించి ప్రభుత్వానికందించింది .అనేక ఉద్యమాల ఫలితంగా 1974ఈ హక్కు చట్టం అమల్లోకి వచ్చింది .

. రచనా సర్వస్వం:

ఆమె రాసిన పుస్తకాలన్నీ స్వదస్తూరితో రాసినవే .తర్వాతే టైప్ చేయటం జరిగేది .1954లో ఆమె రచించిన ‘’ది మాన్డరిన్స్’’కు ప్రసిద్ధ ‘’ప్రిక్స్ గొన్ కోర్ట్ ‘’అవార్డ్ వచ్చింది .అందులో సాత్రేకు, తనకు ఉన్న మిత్రుల శ్రేయోభిలాషుల ,ఫిలాసఫార్ల జీవిత విశేషాలున్నాయి .దీన్ని తన అమెరికన్ లవర్ ‘’ఆల్గ్రెన్ ‘’కు అంకిత మివ్వగా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు .అమెరికా,చైనాలలో గడిపిన రోజులు యాత్రా విశేషాలన్నీ ‘’ట్రావెల్ డైరీ ‘’లుగా 1950నుంచి 60దాకా రాసింది ..’’ది వుమన్ డెస్ట్రా యడ్’’వంటి చిన్నకథలు కూడా రాసింది.1980లో ‘’వెన్ థింగ్స్ ఆఫ్ స్పిరిట్ కం ఫస్ట్’’ పేరిట తనబాల్యం లోని ముఖ్య మహిళలపై కథలు రాసింది .తన జీవిత చరిత్రను నాలుగు భాగాలుగా ‘’మెమాయిర్స్ ఆఫ్ ఎ డ్యూటిఫుల్ డాటర్ ‘’గా రచించింది .1964లో ‘’ఎ వెరి ఈజీ డెత్ ‘’పేరుతొ ఒక నవెల్లాను ,ముసలితనంలో కేన్సర్ తో చనిపోతున్న తల్లిని చూడటానికి వెళ్లి రాసి ప్రచురించింది .ఇందులో డాక్టర్ –పేషెంట్ లమధ్య ఉండాల్సిన నైతిక ,సత్య విషయాలను చర్చించింది

.1981లో ‘’ఎ ఫేర్ వెల్ టు సాత్రే ‘’పుస్తకం రాసింది .ఇందులో సాత్రే గడిపిన చివరి రోజుల విషాదమంతా కళ్ళకు కట్టించింది .1984లో వచ్చిన యా౦థాలజి ‘’ఫెమినిజం అలైవ్ అండ్ ఇన్ కాన్స్టంట్ డేంజర్ ‘’కు బోవర్ ‘’సిస్టర్ హుడ్ గ్లోబల్ ‘’,ది ఇంటర్నేషనల్ మువ్ మెంట్ యాంథాలజి ‘’రాసింది .దీనికి రాబిన్ మోర్గాన్ ఎడిటర్ . దాదాపు 30 రచనలు చేసింది’
ఉత్తరాలపర్వం

సాత్రే మరణం తర్వాత బోవర్ సాత్రే తనకు రాసిన ఉత్తరాలన్నీ కొంత ఎడిట్ చేసి ప్రచురించింది .సాత్రే ,బోవర్ లు తమ సాహిత్య వారసురాలిగా ఆర్లేట్ ఎల్కై మ్ ను దత్తత చేసుకొన్నారు .బోవర్ సాహితీ దత్త పుత్రిక సిల్వీ లీ బాన్ బోవర్ చనిపోయాక ఆమెవీ ,సాత్రే వి ,ఆల్గ్రెన్ వి ఎడిట్ చేయని ఉత్తరాల నన్నిటినీ ప్రచురించింది .

పురస్కార బోవర్:

బోవర్ ప్రిక్స్ కాన్కోర్ట్ ప్రైజ్ ,జెరూసలెం ప్రైజ్ ,యూరోపియన్ సాహిత్యానికి ఆస్ట్రియన్ స్టేట్ ప్రైజ్ లను అందుకొన్నది.

మరణం

అస్తిత్వవాద మార్గదర్శి సైమన్ డీ బోవర్ 78 వ ఏట 14-4-1986 న్యుమోనియా తో పారిస్ లో మరణించింది .పారిస్ లోని మాంట్ పర్నాస్ సేమిటరి లో సాత్రే ప్రక్కనే ఆమెను ఖననం చేశారు .ఆధునిక యూరోపియన్ సాహిత్య రచయితలపై బోవర్ ప్రభావం చాలా ఎక్కువే ..ఆమెపై వచ్చిన పుస్తకాలూ చాలా ఉన్నాయి .

-గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -7(1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -5

41-గీతాల శేషయ్య

కంచినివాసి .పైడాల గురుమూర్తి శాస్త్రి శిష్యుడు .కృతికర్త .గాత్రజ్ఞుడు .శిష్యులు నాగోజీరావు ,గీతాల సుబ్బయ్య .

42-అడ్డగంటి వీరాస్వామి

మద్రాస్ వాసి. తిల్లానాలు రాగమాలికలు స్వరజతులు రాశాడు

43—అక్కన్న

వైణికుడు.వెంకట గిరి ఆస్థాన విద్వాంసుడు .

44-షట్కాలం నరసయ్య

ఆరు కాలాలో కీర్తనలు పాడే సమర్ధుడు, వైణికుడు. వేంకటగిరి ఆస్థాన విద్వాంసుడు .వర్ణాల ,కృతుల రచయిత.

45-స్వరం కొండయ్య

కృష్ణాజిల్లా బందరు వాసి. గానప్రతిభ, శైలి ,స్వరకూర్పు, శబ్ద సొగసు ,మనోధర్మ స్వరం ,పక్కా తాళపొందిక ఉన్న గాయకుడు.త్యాగరాజస్వామి వారి విగ్రహాలను పూజించిన అదృష్టవంతుడు

46-మధుర సుబ్రహ్మణ్యం

త్యాగయ్య వంశీకుడు .నైషధం శేషయ్య ,కరూరు చిన్నస్వామి శిష్యుడు .లక్ష్య లక్షణ పరిజ్ఞానంతో గాయకప్రపంచ లోసుస్థిరస్థానం పొందాడు .ప్రముఖ గాయకులకు ఫిడేలు సహకారం అందించాడు .అన్నామలై సంగీతకళాశాల అధ్యాపకుడు .అడయారు కళాక్షేత్రం లోనూ ఫిడేలు ఆచార్యుడు .శిష్యులు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ,తంజావూరు లక్ష్మీనారాయణ

47-భుజంగ రామస్వామి

వీణ ,మృదంగ, కంజిర, ప్రవీణుడైన గాయకుడు .హరి కథకుడు.గోవిందస్వామి సంజీవరావు లకు మృదంగ సహకారమందించాడు.

48-చల్లగాలి వీర రాఘవయ్య ,అప్పయ్య సోదరులు

తంజావూరు చిక్క ఒత్తప్పయ్య వంశీకుడు .అప్పయ్యమనవడు. వరాహప్పయ్య ఆంగ్ల హిందూ గాన సంపన్నుడు .’’అభినవ నారద ‘’బిరుదు.వీరరాఘవయ్యకు తంజావూరు రాజులు ‘’చల్లగాలి ‘’బిరుదిచ్చారు .శిష్యులు-లక్ష్మణ గోసాయి పరమేశ్వర భాగవతార్ ,వడివేలు ,వీరరాఘవయ్య ,నీలక౦ఠ శాస్త్రి అఖిలా౦డపురం వీణ ధర్మ దీక్షితులు ,కొడుకు గోపాలయ్య ,మనవడు కృష్ణయ్య.

49-తిరుకుండ్రం రామయ్య

షట్కాల పల్లవి ప్రవీణుడు

50-నాగపట్నం వెంకటస్వామి

గాత్రం ,ఈల ప్రవీణుడు. ఫ్లూటు వాద్య౦ లో ఘటికుడు .

51-చిదంబరం గురుస్వామి

గురువు ముదిగొండ సభాపతి .శిష్యుడు కృష్ణమూర్తి

52-కృష్ణమూర్తి అయ్యంగార్

రంగస్వామి బంధువు గురుస్వామి శిష్యుడు గంభీర శాస్త్ర సమ్మత శుద్ధకర్ణాటక గాన ప్రవీణుడు .

53-పట్టమంగళం ఈశ్వరన్ –సా౦బశివన్

పుదుక్కొట వాసి .వైణికుడు. హరిదాస్ రామచంద్రరావు శిష్యుడు .మద్రాస్ కళాక్షేత్రం లో, రేడియోలో పని చేశాడు

54-ఎల్.సుబ్రహ్మణ్య శాస్త్రి (శర్మాదేవి )

వీణ శేషన్న శిష్యుడు .గానాన్ని ‘’కళకళకోసమే ‘’అనే దృష్టిలో చూశాడు ,మద్రాస్ గాన పరిషత్తులో చాలాకచేరీలు చేశాడు.

55-తాడిచర్ల లక్ష్మీనారాయణ శాస్త్రి (1916)

కడప జిల్లా సిద్ధవటం వాసి .తండ్రి వెంకట శాస్త్రి .అన్నామలై పట్టభద్రుడైన వైణికుడు.గోమతి శంకరన్ ,మధుర సుబ్రహ్మణ్య౦ ల శిష్యుడు .

56-కొల్లాపురం ముద్దు కృష్ణయ్య

దండపాణయ్యర్  శిష్యుడు .వైణికుడు. సోదరుడు రాముడు మంచి మార్దంగికుడు .

57-పంచాపకేశన్ ,రాముడు సోదరులు

పంచాపకేశన్1936లో అన్నామలై నుంచి ‘’సంగీతభూషణ ‘’పొందాడు .ఢిల్లీ,కర్నాటక సంగీత  పాఠ శాలల్లో 1928నుంచి 43వరకు ఆచార్యుడు .ఢిల్లీ ఆకాశవాణి నిలయ విద్వాంసుడు .మాయవరం లక్ష్మణస్వామివద్ద రాముడు మృదంగం నేర్చాడు

58-అలత్తూరు సోదరులు

వీరిలో వెంకటేశయ్య మహాగాయకుడు ,హార్మనిస్ట్ .శివ సుబ్రహ్మణ్యం తిరువాన్కూర్ ఆస్థాన విద్వాంసుడు .’’వీరిద్దరి యుగళగానం’’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది .ఈ జంట రాగాలాపన ,స్వరకల్పన చిత్రతాళగతులు తిరువాన్కూర్ రాజా ను బాగా ఆకర్షించాయి .మద్రాస్ సంగీతపరి షత్తులో వీరిద్దరి స్థానం ప్రముఖం .

                      భరత నాట్య ప్రవీణులు

59-మెరటూరి  వెంకటరామ శాస్త్రి

మెరటూరి వంశం వారు భారత శాస్త్ర నిష్ణాతులు .మూలపురుషుడు మెరటూరి వెంకట రామ శాస్త్రి సంగీత భరతనాట్యాలలో సుప్రసిద్ధుడు .త్యాగరాజ సమకాలికుడు .

60-మెరటూరిఅరుణాచలం (1831-95)

త్యాగరాజ శిష్యపర౦పరలోని వాడు .’’స్వరకళానిధి ‘’పట్టాభి అరుణాచలం అసలుపేరు .తాత శివరామన్.అచ్యుతసముద్రం లేక మెరటూరు గ్రామ ఈనాం దారులు .తండ్రిపట్టాభిరామయ్య ఉషాకల్యాణ,కంసవధ యక్షగాన కర్త .గొప్ప భరతనాట్య ప్రవీణుడు .తంజావూరు వరదరాజస్వామి సన్నిధిలో చాలా నృత్యనాటికలు ప్రదర్శించాడు .ప్రహ్లాద చరిత్ర ఫేమస్ .సంగీతజ్ఞానంతో వేలాది ప్రదర్శకులను ఆకర్షించి అలరి౦చే వాడు  .ధనార్జనకోసం విద్యను  ప్రదర్శించని నిజభక్తుడు .చాలావర్ణాలకర్త .రసవాదం, ఆయుర్వేదం లో నిష్ణాతుడు .ఇతని ఇల్లు ప్రఖ్యాతులైన ఉమయాల్పురం కృష్ణయ్య ,సుందరరామయ్య ,వీణ సా౦బ య్యలతోకళకళ లాడేది .నిర్మోగామాటి .నాగస్వర విద్వాన్ శివకొలందు నిర్భయంగా విమర్శించాడు .శిష్యులు శివగంగ వైద్యనాధన్ ,తంజావూరు సుబ్రహ్మణ్యం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు -61-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -4

31-శ్రీ కంఠయ్య(1870-1914)

కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రాస్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రామయ ఫిడేల్ లో దిట్ట

32-చిన్నాస్వామి –

దేవుడయ్య శిష్యుడు  .ఫిడలర్ .త్యాగరాజ భక్తి సంగీతః పోషకుడు .ఘన గాత్ర విద్వాంసులు పుష్పవనం ,కోనేరు రాజాపురం ,వైద్యనాధం ,పూచయ్య౦ గార్,ప ల్లడం ,సి౦గ పట్టిఆచార్యులకు ఫిడేల్ సహకారం అందించాడు.

             33-పాప వేంకటరామన్

తిరువాన్కూర్ రాజాస్థానగాయకుడు .తండ్రివద్ద గానం నేర్చి గోవిందస్వామి పిళ్ళై దగ్గర ఫిడేల్ అభ్యసించాడు .స్వంత బాణీ కూర్చాడు .కచేరీ అయిపోయాకకూడా ఇతని వాద్యం ప్రతిధ్వనిస్తుంది .మద్రాస్  రేడియో ఆర్టిస్ట్

34-వెంకటరామ శాస్త్రి (1870)

వైణికుడు.చాలాకృతులు , ‘’సంగీత స్వయం బోధిని ‘’గ్రంథం రచింఛి ముద్రించాడు

35-పట్టుకోట శ్యామ భాగవతార్ (1872-1924)

గురువు శయ్యం వెంకటస్వామి .గొప్ప హరికథకుడు.భక్తరామదాస్ హరికధ స్పెషలిస్ట్ .త్యాగరాజ కృతులను సభాపతయ్య ప్రవచనాలను బాగా చెప్పేవాడు .వేంకటేశ్వరుని భక్తుడుకనుక శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా చేసేవాడు

36-పుదుచ్చేరి రంగస్వామి (1888-1920)

ప్రవేశ పరీక్ష దాకా ఫ్రెంచి భాషలో చదివి ,ఎట్టియాపురం రామ చంద్ర భాగవతార్ వద్ద గాన విద్య నేర్చి ,ప్రవీణుడై పిఠాపురం ,విజయనగరం, కాకినాడ ఆస్థానాలలో పాడి,వెంకటగిరిమహారాజు చేత స్వర్ణకంకణం అందుకొన్నాడు .తిరుక్కోడి కావాల్ కృష్ణయ్య ,గోపాలకృష్ణయ్యలు ఫిడేల్ పై ,అలగానంబి మాముండియపిళ్లే ,దక్షిణామూర్తి మృదంగ సహకారం అందించేవారు .కంచిలోని నైన పిళ్లే ఇతనితో తరచూ సంప్రదింపులు జరిపేవాడు .కుంభ కోణం వాసి అయ్యాక పంచాపకేశి తో పరిచయమైంది .పంచాప కీర్తనలకు చిట్ట స్వరాలు రాశాడు .ఎన్నో త్యాగారాజ కృతులు గానం చేసేవాడు .శుద్ధబాణీలో సాహిత్యభావం తో పాడేవాడు .విశిష్ట స్వర నిర్మాత .త్యాగరాజ వర్ధంతి సంబరాల్లో పాల్గొనేవాడు .శిష్యుడు సాకోట రంగయ్య .

37-ప్రతాపం గోపాలకృష్ణయ్య (1886-1944)

కారూరు వాసి టైగర్ వరదా చారి శిష్యుడు .అభినయం ,గాత్రం, వీణ, ఫిడేల్ కన్జీరాలలో నిపుణుడు .పూనా బొంబాయి మొదలైన పట్టణాలలో కచేరీలు చేశాడు .12గ్రహరాసులకు 12 స్వరాలు కూర్చివీటి ఆధారంగా  జాతకం చెప్పటం ఇతని ప్రత్యేకత .త్యాగరాజ కీర్తనలలో బీజాక్షరాలున్నాయని కనుక సాహిత్య దోషం తోపాడితే కీడు వాటిల్లుతుందనిసాహిత్య ప్రయోజనాన్ని  చెప్పాడు .

38-ప్రతాపం నటేశయ్య

గోపాలకృష్ణయ్య శిష్యుడు .వానమామల్ తోటాద్రి,అరియకుడి శిష్యరికం చేసి గానం నేర్చాడు .రసికరంజని సభ గాన పాఠశాలలో అధ్యాపకుడుగా ఉన్నాడు

39-చల్లగాలి ఆదిమూర్తయ్య

కృష్ణయ్య సోదరుడు తంజావూర్ ఆస్థానగాయకుడు .

40-స్వరగత్తు నారాయణ స్వామి

పుదుక్కొట నివాసి .చిట్టినారాయణస్వామి శిష్యుడు .స్వరకాడు సుబ్బయ్య వంశీకుడు ‘’స్వరగత్తు ‘’వాద్య నిపుణుడు . అగాధ సంగీతజ్ఞానమున్నవాడు .మహావైద్యనాథన్ ,శరభశాస్త్రిలకు ప్రక్కవాద్యం వాయించేవాడు.తంజావూర్ ఆస్థాన విద్వాంసుడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

   సశేషం

మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -2-1-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

నోరి నరసింహ శాస్త్రిగారి 43వ వర్ధంతి సభల ఆహ్వానం

నోరి నరసింహ శాస్త్రిగారి 43వ వర్ధంతి సభల ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నూతన ఆంగ్ల సంవత్సరం విశేష లడ్డు పూజ

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం )

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం )

సురవరం వారి వేదికపై 28వ తేదీ శనివారం రాత్రి జరిగిన’’ సాహితీ ప్రతినిధుల సదస్సు’’ కు డా.దీర్ఘాసి విజయ భాస్కర్ ఆధ్యక్షత వహించి మనిషిలో ఆశను రేకెత్తించేది సాహిత్యమని ,ఇవాళ తెలుగు రాస్ట్రాలపరిస్థితి ‘’కుములుతున్న గడ్డి వాము ‘’లాగా ఉందని ,మంటలు కనిపించకపోయినా లోన రగిలిపోతోందని ,ప్రపంచం లో 5లేక 6అజ౦త భాషలున్నాయని అందులో తెలుగు, ఇటాలియన్ బాషలు ముఖ్యమని,మొత్తం 6700భాషలు ప్రపంచం లో ఉన్నాయని ,సాహిత్యం ఉన్నంత మాత్రాన భాష సజీవంగా ఉన్నట్లుగా అనుకోరాదని ,అంత్యకాలం లో భాష పై అయిష్టత కలగటం ,సహజమని అందు వలన జానపద కళలు సాహిత్యం అంతరిస్తాయని  కనుక సాహిత్యరంగ పునరుజ్జీవన విషయం గా   కలిసికట్టుగా పని చేసి భాషను రక్షించు కోవాలని కోరారు .

 శ్రీ కందిమళ్ళ సాంబశివరావు ప్రస్తుతం భాష ప్రమాదం పడగ వణికిపోతూ  ఉందని కనుక గొప్ప చైతన్యం వస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేమని ,అణగారిన వారి గుండె చప్పుళ్ళను అన్ని ప్రక్రియలలో వినిపించాలని ,300మాండలీక నాటకాలున్నాయని ,వీటి నిఘంటువు,చరిత్ర పద్యనాటక చరిత్ర  తయారు చేయాలని ,సెకండరి స్థాయిలో నాటకాలను ప్రోత్సహించాలని చెప్పారు .శ్రీ  పివి ఎన్ కృష్ణ –యువతకు దూరమైన పద్యనాటకాన్ని చేరువ చేసే ప్రయత్నం తీవ్రంగా జరగాలని ,నటనలో భావ వ్యక్తీకరణ జరిగి ఉత్సుకత పెరుగుతుందని ,చదివి౦చక పోవటం, నేర్పించకపోవటం మన తప్పేనని ,పద్యనాటకం సంస్కృతిని నేర్పుతుందని ,’’మణి ప్రావాళభాష’’లో రాయటం తప్పేమీకాదని అన్నారు .శ్రీ స్వతంత్ర భారతి రమేష్ –భాష సంస్కృతీ పెద్ద ఉప్పెనలో చిక్కుకున్నాయని రక్షించుకొనే బాధ్యత మనదే నని ,ఆర్తిగా అందిస్తే యువత తేలికగా అ౦దుకొంటు౦దని ఇది తన అనుభవమని ,మనదైనదాన్ని యువతకు అందించే బాధ్యత మనందరిదీ అని తన అనుభవసారాన్ని తెలియ జేశారు .

  శ్రీ జివి పూర్ణచంద్ –‘’అమూర్తి మంతాలకు ‘’తెలుగు ఉండదు అనీ ,భాష జీవితం లోంచే వస్తుంది ,ఋగ్వేదం లోని 350పదాలు ద్రావిడ లేక ముండా భాషలనుంచి చేరి ఉంటాయని ,ముఖ్యంగా తెలుగుపదాలెన్నో సంస్కృతం లో చేరాయని ,తెలుగు ఇతరభాషలనుంచి పదాలు తీసుకోవటమే కాదు ఇతరభాషలకు పదాలు అందించి ‘’ఆదాన ప్రదానాలతో’’ వర్ధిల్లిందని ,భాషను పెంచుకొని సుసంపన్నం చేసుకోవాలని తెలిపారు .శ్రీ స్వర వీణాపాణి ‘’ప్రాధమిక అవసరం అనేది భాష ,తెలుగు వాడు ఏ భాషనైనా యిట్టె నేరుస్తాడని పరిశోధనలు రుజువు చేశాయన్నారు .

  కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకొందాం –కమ్యూనిస్ట్ నేత నారాయణ ‘’మాతృభాషలో విద్యాబోధన అమలయ్యేదాకా పోరాటం చేయాలి .భాషను ఆధునీకరణ సులభతరం చేయాలి ‘’అన్నారు ఎం ఎల్సి రామకృష్ణ ‘’ఆంగ్లమాధ్యమానికి వంతపాడుతున్న నేతలు ఏనాడైనా తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు విన్నారా ఢిల్లీ లో జరిగిన మేదావులసదస్సు ప్రాధమిక విద్యాబోధన మాతృబాషలోనే జరగాలని తీర్మానించిన విషయం వీరికి తెలుసా .ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం .నియామకాల్లో ప్రతిభకు చోటు లేకపోవటం పెద్ద లోపం .ఉపకులపతుల నియామకానికీ ఇదే కొలతబద్ద ఐతే భాష ఎలా కాపాడబడుతుందని ఆవేదన చెందారు .ఎం.ఎల్.సి మాధవ్ ‘’శాసనమండలిలో  సాక్షాత్తు ముఖ్యమంత్రి  తెలుగు తెలుగువాళ్ళకు గా  ఉపయోగం ఉందా అని ప్రశ్నించటం దారుణ .సి ఏం పై ‘’భరత్ అనే నేను ‘’సినిమా ప్రభావం పడిందేమో అనిపిస్తోండి శ్రీలంకలో అక్కడున్న తమిళులపై సింహళీ భాష రుద్దే ప్రయత్నం చేస్తే తీవ్ర పోరాటం చేసి  ఆపించేసారు అక్కడి ప్రధాని తమిళుల భాషాభిమానానికి చేయెత్తి నమస్కరించాడు .భాషకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే ఓటు వేస్తాం అని ప్రజలు గట్టిగా నిలబడితే  ఈప్రమాదం తప్పిపోతుంది .శ్రీ అశోక్ బాబు ‘’తెలంగాణ ఉద్యమాన్ని సాహిత్యమే ముందుండి నడిపించింది. ఇక్కడా ఆ పరిస్థితి రావాలి ‘’అన్నారు .

‘’ఆయాఉ౦ది కదా అని అమ్మను చంపేద్దామా  ప్రభుత్వ ఉత్తర్వు 25నంబర్ జి వో రద్దు అయ్యేవరకు మడమ త్రిప్పద్దు ‘’అన్నారు ఆవేశంగా శ్రీ తులసి రెడ్డి .కేంద్ర సాహిత్యఅకాడెమీ  కార్యదర్శిశ్రీ కే శ్రీనివాసరావు ‘’ఎన్నిభాషలు నేర్చినా ,హృదయస్పందనకలిగించేది మాతృభాషమాత్రమే .మనకొచ్చే కలలు మన మాతృభాషలోనే వస్తాయి .ఇదంతా సహజ సిద్ధం ‘’అన్నారు .’’ప్రవాసాంధ్రులకే తెలుగు మీద మక్కువ ఎక్కువగా ఉంటె ,ఇక్కడ తెలుగుపై ఈ సమ్మెట పోటేమిటి ‘’అని బాధపడ్డారు తానా మాజీ అధ్యక్షులు  శ్రీ తోటకూర ప్రసాద్ .’’ప్రాధమిక విద్య తెలుగులో ఉంటె సున్నిత భావాలు అర్ధం చేసుకోవచ్చు .అమెరికాలో ఉన్నా మేము ఒకరినొకరం ‘’ఒరే,అరే’’అని కమ్మని తెలుగులో పలకరించుకొంటాం ‘’అన్నారు అమెరికా  ప్రతినిధి డా ఆళ్ళ శ్రీనివాస రెడ్డి .’’కన్నడ లిపి తెలుగు లిపికి దగ్గర .11వ శతాబ్దం వరకు రెండూ కలిసే ఉన్నాయి ‘’అన్నారు తెలుగు కన్నడ ‘’అద్వితీయ ‘’భాషా వేత్త ‘’శ్రీ నాగ శేషు .మారిషస్ తెలుగు వెలుగు శ్రీ సంజీవ నరసింహ అప్పుడు ‘’కోటి జన్మల పుణ్యం చేస్తేనే తెలుగు దేశం లో పుట్టగలం .మారిషస్ లో ఉన్నా, మా మనసంతా తెలుగు నేలమీదే .అక్కడ మన తెలుగు పండగలన్నీ ఘనం గా చేసుకొంటాం. మారిషస్ లో ప్రాధమిక స్థాయినుంచి విశ్వ విద్యాలయ స్థాయివరకు అన్ని కోర్సుల్లో తెలుగు భాష ఉండేట్లు చేశాం. అక్కడ అధికారభాష ‘’ఫ్రెంచ్ .మాతృభాష’’ క్రియెల్’’.మరో 8భాషలుకూడా అక్కడున్నాయి. అన్ని భాషలలో బోధనా జరగటం అక్కడి ప్రత్యేకత .’’తెలుగు భాషకు బోధనాధికారి ‘’గా నేను పని చేస్తూ ఉండటం నా అదృష్టం ‘’అన్నారు అత్యంత వినయం తో .ఈయన ఇప్పటికి 50సార్లు ఆంద్ర దేశం వచ్చారు . విమానం దిగగానే తెలుగు నేలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వచ్చిన ప్రతిసారీ అన్ని పుణ్యక్షేత్ర సందర్శన చేసి అక్కడి పవిత్ర మృత్తికను మట్టిని సేకరించి మారిషస్ తీసుకు వెడతారు.

  ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం అధ్యక్షులు శ్రీ ముని రత్నం నాయుడు ‘’ఇతర రాష్ట్రాలలో తెలుగు పాఠశాలలో తెలుగు పుస్తకాల కొరత ఎక్కువగా ఉంది .రాష్ట్రప్రభుత్వాలు శీతకన్ను వేస్తూసహకరి౦చట౦  లేదు అందుకని ‘’ప్రపంచ తెలుగు నిధి ‘’ని మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలుగు పుస్తకాల కోరతనూ తీర్చాలి ‘’అని కోరారు .’’ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ బోధించే సత్తా ఉపాధ్యాయులకు  ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచించాలి ‘’అన్నారు రేడియో స్టేషన్ మాజీ సంచాలకులు శ్రీమతి ముజు లూరి కృష్ణకుమారి .తమిళనాడు వాసి ,ఆచార్య తిరుమల రామ చంద్ర కుమార్తె అచ్చమైన తెలుగు పేరున్న చెన్నైలో స్థిరపడి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన  శ్రీమతిఆముక్తమాల్యద ‘’తెలుగు వారిలో రాత పటిమ పెంచుతున్నాను తెలుగు అక్షరాలూ నేర్పి ,తెలుగుపైఆసక్తి ఉన్నవారికి వారాంతపు తరగతులు ,వేసవిలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాను .ఈ పని నాకు మహదానందం కలిగిస్తోంది .వివిధశిబిరాలలో  300మందిదాకా నా దగ్గర తెలుగుపదాలు నేర్చుకొన్నారు ‘’అని గర్వంగా తన మాతృభాషా సేవను తెలియ జేశారు .

  ఇలా అందరూ తెలుగు ప్రాధిక స్థాయి నుండి అమలవ్వాలని ముక్తకంఠంగా నినదిస్తే ,మనం మనకర్తవ్యాన్ని మరచి పోకూడదని విన్నవిస్తున్నాను .చివరగా మహాసభల తీర్మానాల్లో ముఖ్యమైనవి తెలియ జేస్తున్నాను .1-జాతీయత ,మానవ సంబంధాలు  కుటుంబ బందాలు బలపర్చుకోవటానికి దోహద పడే విద్యలోప్రాధమిక స్థాయినుంచి తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం తప్పక  అమలు చేయాలి 2-తెలుగు భాష మనుగడకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ప్రపంచతెలుగు వారు ,రచయితలూ ,మేధావులు వెంటనే స్పందించాలి 3-ఇతరరాస్ట్రాల, దేశాల లోని తెలుగు వారికి ‘’సర్టిఫికేట్ కోర్సులు ‘’నిర్వహించాలి 4-తెలుగు ‘’ప్రపంచ తెలుగు ‘’గా తీర్చిదిద్దటానికి సాంకేతక ,భాషా వేత్తలు ప్రభుత్వాలు ,ప్రజలు కృషి చేయాలి 5-న్యాయస్థానాలలో తెలుగు అమలుకున్న అవరోధాలను తొలగించే ప్రయత్నం జరగాలి .

ముక్తాయింపు –ఆహ్వానపత్రికలో చాలామంది పెద్దల పేర్లున్నా, వారిలో ఎక్కువమంది రానందుకు బాధగా ఉంది .

  రేపు 2020 ఆంగ్లనూతన సంవత్సర ప్రవేశ వేళ శుభాకాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-19-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

2020 శుభాకాంక్షలు మరియు డా .పంగులూరి డా ఎల్లాప్రగడ పద్య శుభాకాంక్షలు

2020 శుభాకాంక్షలు మరియు డా .పంగులూరి డా ఎల్లాప్రగడ పద్య శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2

సాంకేతిక ప్రతినిధుల సదస్సు

 28-12-19 శనివారం ఉదయం 9 సురవరం వారి వేదికపై సాంకేతిక ప్రతినిధుల సదస్సు నేను సమన్వయకర్తగాఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షులు గా ,డా పాలెపు సుబ్బారావు అతిధిగా జరిగింది .శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి బావగారు డా రాచకొండ నరసింహశార్మగారు .సెప్టెంబర్ లో95 వ ఏట  రాసి, ప్రచురించిన ‘’మైదానం లో సూర్యోదయం ‘’కవితా సంపుటి నా ఆధ్వర్యం లో బెజవాడలో ఆవిష్కరణ జరగాలని కాంక్షించి విశాఖ నుండి శ్రీ గౌరినాయుడు ద్వారా పుస్తకాలు పంపారు .ఇవి ఆంగ్లకవుల కవితలకు శర్మగారి కమ్మని అనువాదం .ఇలాంటి అనువాదాలు వారు చాలా చేసి ప్రచురించారు . ప్రముఖ ఆంగ్లకవి  రాబర్ట్ బ్రౌనింగ్ సతీమణి ,సానెట్ కవిత్వం లో మేటి, ఎలిజబెత్ బ్రౌనింగ్ సానేట్స్ కు అర్ధవంతమైన అనువాదం చేసి ముద్రించిన అనుభవం వారిది .తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలలో లోతైన అవగాహన ఉన్నవారే కాక ప్రముఖ నవలా, కథారచయిత శ్రీ రావి శాస్త్రి గారి తమ్ముడు కూడా .  ఈ’’మైదానం లోసూర్యోదయం ‘’కవితా సంపుటిని గారపాటి వారి చేఆవిష్కరణ చేయించి శర్మగారికి మహదానందం చేకూర్చాము  .

  తర్వాత గారపాటి వారు మాట్లాడుతూ ఆధునికంగా ‘’అలెక్స్ ‘’వంటి పరికరాలు  సమాచారం ఇవ్వటమేకాక ,మనతో సంభాషిస్తాయి ఇదొక విప్లవం .మనం మాట్లాడుతుంటే స్క్రిప్ట్ రాసే సౌకర్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది .వీటిని యువత బాగా అందుకొంటున్నారు వాటిపై పరిశోధనలూ బాగా జరుగుతున్నాయి .ఫేస్ బుక్, వాట్సాప్ లలో రాసేది శాశ్వతం కాదు .వాటిలో రాసినవాటిని బ్లాగ్ లోనో వీకీ పీడియాలోనో పోస్ట్ చేస్తే శాశ్వత గా  ఉండిపోతాయి .వీటిపై విశ్లేషణకు వీలౌతుంది. ఎప్పుడుకావాలంటే అప్పుడు వాటిని మనం పొందచ్చు .ఏది రాసినా గూగుల్ లో వెతికేట్లు రాయాలి .స్వంత గొంతుతో ఆడియోలు తయారు చేసుకొని భద్రపరచండి బ్లాగుల్లో .వీడియోలు తీసి స్వంత చానల్ ఏర్పాటు చేసుకోండి .ఏది రాసినా నవతరం మాధ్యమం లో రాయాలి ,I.S.C.I.’’తో అద్భుతాలు జరుగుతున్నాయి ,ప్రామాణికత ఏర్పడింది ,యునికోడ్ లో భారతీయ భాషలు చేరాయి .ఇందులో తేలికగాతెలుగు ఇమిడి ముందున్నది .’’నేడు భాష లిపిని దాటి పోయింది ‘’యంత్రానువాదం ఆటోమాటిక్ గా భాషను మార్చే సౌలభ్యం ఏర్పడింది అని ‘’భాష మనిషిని మానవునిగా మార్చింది ‘’అన్నిభాషల మాతృక ఒక్కటే .లిపి కనబడితేనే భాష అవుతుంది అని మర్చిపోరాదు .కృత్రిమ బుద్ధి లేకుండా అనువాదం సాధ్యం కాదు .అన్నిటికీ మాతృభాష ముఖ్యం దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి ‘’అని   హితవు చెప్పారు .

   డా పాలెపు ‘’తాళపత్ర గ్రంధాలలో విలువైన ,సమాజానికి మేలు చేసే ఆరోగ్యానికి సంబంధింన సమాచారం  చాలా ఉందని వాటిని శోధించి,  సేకరించి  నిలువ చేసుకోవాలని కోరారు ..శ్రీ పవన్ సంతోష్ ‘’వీకీ పీడియా ,’’తెలుగు కోరా ‘’లలో నిరంతరం రాయాలి .అప్పుడే అవి శాశ్వతాలౌతాయి .రిఫరెన్స్ కు వీలుకలుగుతు౦దన్నారు .చెన్నైకి చెందిన’’దా సుభాషితం ‘’సంస్థ కు చెందిన శ్రీ కిరణ్ కుమార్ ‘’తెలుగు మనుగడకు మా సంస్థ విపరీతంగా కృషి చేస్తోంది .నేర్చేవారు నేర్పేవారూ ఉంటేనే భాష జీవిస్తుంది .ప్రతి ఏడాది బ్రౌన్ పోటీలు నిర్వహించి బహుమతులిస్తాం .దాసుభాషితం ‘’మొబైల్ ఆప్’’ తో సాంకేతిక విప్లవం తెచ్చింది .’’think digital first ‘’అనేది నేటి నినాదం .మనపాఠకులు మనకంటే ముందున్నారు అని గుర్తుంచుకోండి .కనుక వారికోసం రాయాలి .మాట్లాడే గ్రంథాలు కూడా తెచ్చింది దాసుభాషితం ‘’అని వివరించారు .

  శ్రీ జే సీతాపతిరావు ‘’ఇంజనీరింగ్ విద్య ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం .దీనికి ట్రిపుల్ ఐ టి ఐ లు బాగా కృషిచేస్తున్నాయి .’’భావాన్ని తరంగం మార్చే ప్రయత్నం’’ విస్తృతంగా జరుగుతోంది .మాకు కావలసిన సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తే దూసుకుపోతాం ‘’అన్నారు .మైసూర్ ను౦చి వచ్చిన డా బి నాగశేషుమాట్లాడుతూ బహుజన స్త్రీకవులు తెలుగులో రావటం లేదని ,కన్నడం లో బాగా రాస్తున్నారని,మొల్లమాంబ తర్వాత తెలుగులో ఎందుకు బహుజన స్త్రీలు కవులుగా రాలేదో అన్నదానిపై పరిశోధన జరగాలని ,కన్నడ తెలుగు కవయిత్రులపై తులనాత్మక పరిశోధన జరగాలని తెలుగులో 16వ శతాబ్దినుఛి మాత్రమే బహుజన రచయిత్రులు విస్తృతంగా రాస్తున్నారని ఆమధ్యకాలం లో ఎందుకు రాయలేదన్నదానిపై పరిశోధన చేసి వెలుగు లోకి తేవాలని ,ఇవాళ తమిళనాడు లో తెలుగు ప్రాంతాలలో తెలుగులోనే ఎన్నికల ప్రచారం చేయటం హర్షించదగిన పరిణామమని చెప్పారు .శ్రీరహ్మనుద్దీన్ ‘’అత్యాధునికంగా వచ్చిన ‘’స్పీచ్ టు టెక్స్ట్  ‘’అందరూ వాడుతూ ప్రయోజనం పొందుతున్నారని ,వాయిస్ టైపింగ్ లో భాషను సెలెక్ట్ చేసుకొంటే దాని పని అది చేసుకు పోవటం ఎంతో సాంకేతికాభి వృద్ధి అనీ , యుని కోడ్ అందరికీ అందుబాటులో ఉంటె ప్రింటర్స్ మాత్రం వాళ్ళవాళ్ళ ఫాంట్ లు వాడుతున్నారని ,వాళ్ళు తప్పకుండా యునికోడ్ లోనే ప్రింట్ చేయటానికి ప్రభుత్వం రచయితలూ ఒత్తిడి తేవాలని కోరారు ఈఅధునాతనకాల౦  లో అందరూ విస్తృతంగా రాయటమే చాలావసరమని క్లిష్టమైన పదాలుసులభంగా రాయటానికి రాస్తూ ఉండటమే ముఖ్యమని ‘’ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్’’ ను అందుబాటులోకి తేవాలని బొమ్మలు, ఆడియోలు బాగారావాలని ,అంతర్జాలం లో తెలుగు మాధ్యమంగా అందరూ రాసి భాషను ముందుకు తీసుకు వెళ్లాలని  హితవు  చెప్పారు .

  మాకిచ్చిన 2గంటల సమయం లో సదస్సుఉదయం 11కు  పూర్తి చేసి ,ఒకరకంగా సదస్సులన్నిటికీ మార్గదర్శకంగా ఆదర్శప్రాయంగా నిర్వహించామని సంతోషంగా చెబుతున్నాను .ఇప్పటికి జరిగిన 4ప్రపంచ సభలలో ‘’సాంకేతిక సదస్సు ‘’లు మాత్రమె అర్ధ వంతంగా జరగటం దిశా నిర్దేశం చేయటం జరిగిందని గర్వంగా తెలియజేస్తున్నాను.నాకు సాహిత్యం తోపాటు సాంకేతికత పైనా అభి రుచి ఉ౦ది కనుక ఈ రెండూ కలిసిన ఈ సదస్సు నిర్వహించే బాధ్యతనాకు అప్పగించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .

    సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు  ఇదే వేదికపై ‘’కవి సంధ్య ‘’ నిర్వాహకులుఆచార్య శిఖామణి అధ్యక్షతన జరిగింది .సాహిత్య సంస్థ సాహిత్యానికి ఆస్వాదించేవారికి ఉన్న ఒకవాహిక .’’తెలుగు భాషకు మరణశాసనం రాసిన’’ ఈ నాటి ప్రత్యెక పరిస్థితి లో సృజన ప్రోత్సహించి బంగారు పళ్ళానికి గోడ చేర్పుగా సంస్థలు ఉంటూ ,ఈ సభలయ్యాక తమప్రాంతాలలో సమావేశాలు జరిపి ఇక్కడి భావప్రసారం చేయాలని శిఖామణి కోరారు .యువభారతి నిర్వాహకులు .ఆచార్య వంగపల్లి విశ్వనాథం  మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న సాహిత్య సంస్థల లిస్టు ప్రతి సంస్థదగ్గరా ఉండాలి ,సంస్థలను ఎవరికి వారే రక్షించుకోవాలి ,ఆంగ్లమాధ్యమం వలన పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో మేధావులు విశ్లేషించి చెప్పాలి ,సమస్యను పరిష్కరించే మేధస్సు కావాలని ‘’పుడితే ఉయ్యాల –పోతే మొయ్యాల ‘’–ఉంటేఇయ్యాల ‘’అన్నసామెత గుర్తుంచుకోవాలని ,’’తెలుగు సేన ‘’ఏర్పడి పని చేయాలని సంస్థలన్నీ ఐక్యంగా పని చేయాలని చెప్పారు .శ్రీ విద్యా నాగభూషణం ‘’మన అభిప్రాయాలు సూటిగా జగన్ విన్నపంగా ఇవ్వాలి. రెండవరాంక్ లో ఉన్నతెలుగు నాలుగవ రాంక్ కు పడిపోయింది .తెలుగు మాట్లాడే వారి స౦ఖ్య పెంచి మళ్ళీ 2వ రాంక్ సాధించాలని కోరారు .శ్రీ సుందరేశ్వరరావు ‘’రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ‘’ను బలపర్చమని సాహిత్య విలువలు పెంచమని చెప్పారు

  ఇదే వేదికపై మధ్యాహ్నం జరిగిన ‘’చరిత్ర పరిశోధన ప్రతినిధుల సదస్సు ‘’కు ఆచార్య ఈమని శివనాగిరెడ్డిగారు అధ్యక్షత వహించి ‘’శాసనాలే శ్వాస నాళాలుగా శాసన పరిశోధన జరగాలని ‘’గొప్ప అభిప్రాయాన్ని అలవోకగా మాట్లేడే తమ గంగాప్రవాహ సదృశ వాగ్దోరణితో చెప్పారు .రెడ్డిగారి రచన ‘’పంచ శిల్పుల చరిత్ర ‘’ను గోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు శ్రీ రాము సూర్యారావు ఆవిష్కరించారు ‘’తలిదండ్రులు లేని అనాధ పిల్లలుంటే నాదగ్గరకు పంపండి .ఉద్యోగం వచ్చేదాకా వారిని  మాదగ్గర ఉంచుకొని ఉచితంగా చదివిస్తాను  .నిరుద్యోగులు వచ్చినా ఉద్యోగం వచ్చేదాకా పోషిస్తాను అని తన సెల్ నంబర్’’9848620051’’ తో సంప్రదించమని చెప్పిన గొప్పవితరణ శీలి మటల్లోకాక చేతల్లో సేవ చూపిస్తున్న ఆదర్శ ఎం ఎల్ సి శ్రీ సూర్యారావు అభినందనీయులు.ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా ..

  ముఖ్య అతిధి డా.రాపాక ఏకా౦బరేశ్వరాచార్యులు మెకంజీ నుంచి నేటిదాకా జరిగిన పరిశోధనలు వివరించారు –‘’మెకంజీ సేవ చాలా విశేషమైనది .గ్రామచరిత్రాలు ,కవిలెలు సేకరించి కైఫీయత్తులు రాసి రికార్డ్ చేసిన మహానుభావుడు .ఆ సేకరణలు మూడు భాగాలుగా  భార్య తీసుకువచ్చి మద్రాస్ ఇంగ్లాండ్, మ్యూజియం లలో భద్రపరచినది. కావలి బొర్రయ్య కన్నడంలోని రెండు రకాల భాషలపై పరిశోధించాడు .చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర రాస్తే ,కొమర్రాజు భారత దేశ ,శివాజిచరిత్ర రాశాడు .యుద్ధమల్లుని బెజవాడ శాసనం కిందినుంచి పైకి చదివి ప్రచురించాడు .బెంగాల్ లో ఉన్న ‘’విశ్వ కోష్ ‘’లాగా తెలుగు విజ్ఞాన సర్వస్వం తెచ్చే కృషిలో కొన్ని భాగాలు తెచ్చాడు .మల్లంపల్లి సోమశేఖరశర్మ జీవితమంతా శాసనాలతోగడిపి ‘’శాసన శర్మ ‘’అయ్యాడు .నేలటూరి వెంకటరమణయ్య ‘’పరిశోధన రాక్షసుడు ‘’మారేమండ రామారావు కాకతీయ చరిత్ర ,రాశాడు .భావరాజు వెంకటకృష్ణారావు రాజమండ్రిలో’’తెలుగు హిస్టారికల్ సొసైటీ ‘’స్థాపించి మహోపకారం చేశాడు .’’ఎర్లి  డైనాస్టీస్  ఆఫ్ ఆంద్ర ‘’,తూర్పు చాళుక్య చరిత్ర రాశాడు.రాజరాజ నరేంద్ర సంచిక తెచ్చాడు .ఈకృషికి బిఎ చదువుతుండగానే ఏం ఏ డిగ్రీ ప్రదానం చేశారు .కోరాడ  పరబ్రహ్మ శాస్త్రి పరిశోదనా గొప్పదే .గుర్తి వెంకటరావు శాతవాహన చరిత్ర ,ఓరుగంటి రామచంద్రయ్య ‘’ స్టడీస్ ఆన్ విజయనగర ,స్టడీస్ ఆన్ కృష్ణరాయ రాశాడు .ఆర్ సుబ్రహ్మణ్యం త్రవ్వకాలపై  గ్రంథం తెచ్చాడు  ,శ్రీమతి ప్రతిభ చెన్నయ్యరుద్రమదేవిపై ,సి సోమసున్దరరావు ‘’గౌతమీపుత్ర శాతకర్ణి ‘’పై రాశారు .    చరిత్ర మర్చి పోరాదు .’’గతాన్ని వర్తమానం తో అను సంధించేదే చరిత్ర’’అని నిర్వచనం చెబుతూ టకటకా మాట్లాడి ముగించారు .

  శ్రీ డి. సూర్యకుమార్  ‘’రుద్రమ దేవి స్త్రీలకూ ప్రసూతి ఆస్పత్రి కట్టించిన మొట్టమొదటి పాలకురాలని ఈవిషయం నకిరేకల్ శాశనం చెబుతోందని ,రాజులు అక్షయ తృతీయనాడు విరివిగా దానాలు చేసి శాసనాలు వేశారని, ఆనాడు బంగారు కొని దాచుకోలేదని  భూమికొని దానాలు చేసేవారని ,’’పెళ్ళికొడుకు మలిదేవరాజు ‘’అనే కాకతీయ యాదవరాజు న్నాడని’’ పెళ్లి కొడుకు’’ అనేది ఇంటి పేరు అని ,కోటగిరి శాసనం లో కాకతీయులకు చెందిన విరియాలవారి వంశ చరిత్ర బయటపడిందని ,శాసన విషయాలను తేలికభాషలో ఉపవాచాకాలుగా తీసుకు రావాలని ‘’కొత్తవిషయాలు బహిర్గతం చేసి చరిత మలుపు తిప్పారు సూర్యకుమార్ .

  పూర్ణచంద్ గారు,నాతో రాజేష్ తో  ‘’వేదికపైకి కరపత్రం లో లేనివారిని  ఎవరినీ  అనుమతించవద్దు ,ఎవరికీ ప్రత్యేకంగా శాలువాలు పూలహారాలు వేయించవద్దు .ఇది చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలి ‘’ అని వార్నింగ్ ఇచ్చినా ‘’రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధ్యక్షులు ‘’రెడ్డి గారు ‘’తలచుకొంటే రూల్స్ గీల్స్ జాన్తానై అయి పోయి అరడజను మంది ఆయనకు శాలువాలుకప్పి దండలు వేసి ఫోటోలు తీసుకొని వేదికను’’ కబ్జా’’ చేస్తే ఏమీ అనలేక గొణుక్కుంటూ ప్రేక్షక పాత్ర వహిచి ఊరుకోన్నాం .ఒక్కగంటమాత్రమే చారిత్రిక సదస్సుకు సమయమిస్తే రెండున్నర గంటలు ‘’వాయించిన ఘనత’’ కూడా ఈసభకు దక్కింది తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పూర్ణచంద్, ఎంవి ఆర్ శాస్త్రి  గార్లు కూడా చివర్లో వచ్చి  సభను ‘’లా —గించారు ‘’.అంటే ‘’చెప్పటం వేరు ఆచరణ వేరు ‘’అనటానికి ఈ సదస్సు చక్కని ఉదాహరణ అని చెప్పటానికి సిగ్గు పడుతున్నాను .

   మరికొన్ని సదస్సుల  సమాచారాలు  తర్వాత తెలియ జేస్తాను

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-19-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు

‘’2019 అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం ‘’గా నిర్వహిస్తున్న నాలుగవ  ప్రపంచ తెలుగు  రచయితల మహాసభలుగా విజయవాడ పిబి సిద్ధార్ధ కళాశాలలో డిసెంబర్ 27శుక్రవారం నుంచి 29ఆదివారం వరకు మూడు రోజులు ,1600మంది ప్రతినిధులు, జీవిత సభ్యత్వం లేక ప్రతి నిధిరుసుం చెల్లించి,ప్రయాణ, విడిది ఖర్చులు ఎవరికి వారే భరించి  అత్య౦త ఉత్సాహం పాల్గొన్నారు .వీరందరికీ ఉదయ సాయ౦త్ర  అల్పాహారం ,షడ్ర సోపేత మధ్యాహ్న,రాత్రి భోజనం నిర్వాహకులు అందించి అందరి మెప్పు పొందారు .ఈ సభల గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ .అధ్యక్ష కార్య దర్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా,జి.వి పూర్ణచంద్ ల ఆలోచనా ఫలితంగా కార్యక్రమ రూపకల్పన జరిగి ప్రాంగణానికి డా.కొమరరాజు లక్ష్మణ రావు గారి పేరు ,సదస్సులు జరిగే రెండువేదికలకు గిడుగు శ్రీరామమూర్తి ,సురవరం ప్రతాప రెడ్డిగార్ల పేర్లు పెట్టటం సముచితంగా ఉన్నది  .ప్రారంభ ముగింపు సభలు గిడుగు వారి వేదికపై నే జరిగి ,చర్చా సదస్సులు రెడ్డిగారి వేదికపై మొత్తం 15 సదస్సులు మూడు రోజులలో జరిగాయి .ప్రత్యేకకవి సమ్మేళనం ,జీవితసభ్యుల  ,ప్రతినిధుల  కవి సమ్మేళనం ,శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి చే ‘’చమత్కార చతుర్ముఖ పారాయణం ‘’,డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ చే ‘’ఎనుకుదురాట’’అనే అచ్చతెలుగు అష్టావధానం , డా మీగడ రామలింగస్వామి ‘’సంగీత నవావధానం ‘’,డా సప్పా అప్పారావు ‘’తెలుగు వారి ఆలయ నృత్య రీతులు ‘’ప్రదర్శన ,శ్రీ రాజేష్ బృందం చే ‘’తెలుగు భాషోద్యమ గీతాలు ‘’,శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ చే ‘’కావ్యాలలో తెలుగు సొగసు,’’శ్రీ సిల్వెస్టర్ చే ‘’ప్రపంచ తెలుగు ‘’ధ్వన్యనుకరణ ,డా రాధశ్రీ చే ‘’పలకరిస్తే పద్యం ‘’,తెలుగు తల్లి వైభవం ‘’కదంబ కార్యక్రమం ,శ్రీఅనంత శ్రీరాం చే’’యువత –తెలుగు భవిత ‘’పై ప్రత్యేక ప్రేరణ ప్రసంగం ,డా కెవి సత్యనారాయణ బృందం చే ‘’పారిజాతాపహరణం లో సత్యాకృష్ణులప్రణయ  ఘట్టం’’నృత్య ప్రదర్శన ,కూడా నవరస పోషకం గా ఉత్సాహ, వినోదాలను పంచాయి

.ప్రత్యేక సదస్సులుగా విదేశీ ప్రతినిధుల ,తెలుగు భాషా పరిశోధక ,సాహితీ  ,బోధనా, ,రాజకీయ, పాలనా ,సాంకేతిక తెలుగు ,భాషోద్యమ ,చరిత్ర పరిశోధన ,సాహితీ సంస్థల సాంస్కృతిక ,ప్రచురణ ,రాష్ట్రేతర ,పత్రికా ప్రసార మాధ్యమాల మహిళా రంగాలకు చెందిన ప్రతినిధుల సదస్సులు ఆయారంగాలలో నిష్ణాతులైన వారు పాల్గొని చర్చా వేదికలుగా ఉండాల్సినవాటిని ఉపన్యాస వేదికలుగా మార్చి ,సభలు ఇచ్చిన సమయంకంటే రెండు గంటలు కూడామించి మాట్లాడేవారికి నిమిషం ,అరనిమిషం మాత్రమె దక్కి ఉసూరు మనిపించాయి ,.చెవులకు పరీక్ష అనిపించాయి .

ప్రారంభ సభ దగ్గరనుంచి అన్ని సభల్లోనూ అందుబాటులో ఉన్న శాస్త్ర ,సాంకేతికతను ఉపయోగించకుండా రొడ్డకొట్టుడు  ఉపన్యాసాలతో విసుగు తెప్పించారు .కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు శ్రీ చంద్ర శేఖర  కంబార్ ఆంగ్లం లో, కన్నడం లో చేసిన ప్రసంగం ఒక్కరికంటే ఒక్కరికీ అర్ధం కాకపోవటం శోచనీయం .వీరి ప్రసంగానికి అప్పటికప్పుడు వెనుక స్క్రీన్ పై తెలుగు అనువాదం వాక్యాలు వచ్చే అత్యాధునిక  సాంకేతికత అవకాశం ఉన్నప్పుడు     ఆఆలోచన ఎందుకు రాలేదో ఎవరికీ అంతు బట్టని విషయమై చర్చకు దారి తీసింది .పేపర్లలో కూడా ఈవిషయం వచ్చింది ..ఉపన్యాసాలలో సాంకేతికత యేకాని ఆచరణలో సాంకేతికత లేక పొతే సభల సఫలత ఎలాసాధ్యం అని గొణుక్కున్నారు   .ఈ రంగం లో విశేషానుభవం ఉన్న శ్రీ షేక్ రహ్మనుద్దీన్ ను మర్నాడు అడిగితే ‘’ఆదిచాలా తేలిక .మా దృష్టికి నిర్వాహకులు తెచ్చి ఉంటె హాయిగా ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం .ఈ గందర గోళం ఉండేది కాదు ‘’అన్నారు .తెలుగు భాషా సంస్కృతులపై పరిశోధనలు చేస్తున్న ఫ్రెంచ్ ఆచార్యులు ఆచార్య డేనియల్ నేజెర్స్ చక్కని తెలుగులో  మాట్లాడి అందరి దృష్టి ఆకర్షించారు. మారిషస్ తెలుగు పెద్దాయన శ్రీ సంజీవ నరసింహ అప్పుడు హాయిగా   తెలుగులోనే వేదికపైనా, బయట అందరితోనూ మాట్లాడుతూ మనమాటల్లో ఆంగ్ల శబ్దం దొర్లితే బాధపడి సవరిస్తూ’’ తెలుగులోనే మాట్లాడండప్పా .మేమంతా తెలుగుకు అంకితమై మారిషస్  లో జీవిస్తుంటే ,మీకెందుకు ఈ ఆ౦గ్లవ్యామోహం ’’అని మెత్తగా ‘’– పెడుతూ ‘’కర్తవ్య బోధ చేసి అందర్నీ ఆకర్షించారు .ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారు  తక్కువ సమయం  తీసుకొని మాట్లాడినా అర్ధవంతమైన, కర్తవ్య బోధకమైన ,ఆచరణీయాత్మక ప్రసంగాలు రెండు వేదికలపైనా చేశారు .’’ వెయ్యేళ్ళయినా   తెలుగు మరణించదు’’అని కమ్మని ఆశ కలిగించారు తన విస్తృత అవగాహన ,అనుభవాల దృష్ట్యా .సాహిత్య అకాడెమి కార్యదర్శి డా శ్రీనివాసరావు తెలుగు పుట్టు పూర్వోత్తరాలలోకి వెళ్లి బోర్ కొట్టిస్తే ,ఆచార్య ఇనాక్ ఆకర్షిస్తే ,సిరివెన్నెల మాటలతో చి౦దులేస్తే  ,జొన్నవిత్తుల కరుణశ్రీ పద్యాలతో హితవు చెప్పారు .ప్రారంభ వేదిక పై ‘’తెలుగు ప్రపంచం ‘’ప్రత్యేక సంచిక ,తెలుగు వెలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది .అమెరికానుంచి వచ్చి,ప్రార్ధన గీతం ఆలాపి౦చిన శ్రీమతి  ఆకునూరి శారద  శ్రావ్య కంఠం పరవశింపజేసింది .94ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు,రచయిత్రి ,స్వర్గీయ బుచ్చిబాబు గారి అర్ధాంగి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు వీల్ చైర్ లో కూర్చుని అందరికి ప్రేరణ ,స్పూర్తి కలిగించటం విశేషం .రచయిత్రులలో ఆమే అందరికన్నా పెద్ద వారవటం ,ఆమెను చూసే అదృష్టం రచయితలకు కల్గి౦చిన౦దుకు  నిర్వాహకులు బహుధా అభినందనీయులు .  శ్రీ బుద్ధ ప్రసాద్ గారు అధ్యక్షోపన్యాస కర్తవ్య బోధ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్వాగత ,శ్రీ పూర్ణచంద్ లక్ష్య ప్రస్తావన జరిగాయి .ఉదయం 10గంటలకు ప్రారంభమై రెండు గంటలలో ముగియాల్సిన ప్రారంభ సదస్సు మూడున్నరగంటలు ‘’సా—-గి ‘’  శ్రోతల సహనానికి  పరీక్ష పెట్టింది  .

నన్ను సురవరం వేదికకు అనుసంధానం చేసి ,ఎప్పటికప్పుడు సదస్సు రిపోర్ట్ తయారు చేసి ప్రెస్ కు ఇచ్చే బాధ్యత అప్పగించారు శ్రీ గుత్తికొండ ,శ్రీ పూర్ణ చ౦ద్ లు .కనుక గిడుగు వేదికపై జరిగిన మిగతా కార్యక్రమాల వివరాలు ప్రత్యక్షంగా నాకు తెలీక పోయినా ,కొన్ని వివరాలు సేకరించి అందిస్తాను .ఇక్కడివాటికి నేను సాక్షీభూతుడిని కనుక వివరంగా చెప్పగలను  .నాకు సహాయకంగా గోదావరి జిల్లారచయితల సంఘం(గోరసం ) అధ్యక్షుడు ,యువకుడు  అత్యుత్సాహవంతుడు, ‘’ఎవర్ ఎనర్జేటిక్’’,సెల్ లో తెలుగు మెసేజ్ లను ‘’సెల్ పగిలి పోతుందేమో’’ అన్నంత అత్యంత వేగంగాతన  సెల్లో టైప్ చేసి  విలేకరులకు యెప్పటికప్పుడు తాజాగా’’ వండి వడ్డిస్తూ’’ అందించటానికి సహకరించిన ‘’యువర్స్ మోస్ట్ ఒబీడిఎంట్లీ’’గా నన్ను ;’’;గురువుగారు గురువుగారు’’ అంటూ సంబోధించే శిష్యుడులాంటి  చి .శిష్టు సత్యరాజేష్  ఉండటం నా అదృష్టం. అందుకే పూర్ణ చ౦ద్ పెట్టిన బాధ్యతను  సంతృప్తిగా నెరవేర్చగలిగాను రాజేష్ తోడ్పాటుతో .నా దగ్గరే కాదు గిడుగు వేదిక ‘’రిపోర్ట్ కొట్ట టానికీ’’ అతడే .ఇలా ‘’సవ్య సాచిత్వం’’ చేసిన రాజేష్ మిక్కిలి  అభిన౦దనీయుడు .

ఇది ధనుర్మాసం తెల్లవారుజామున 3-15కు లేచి స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి చేసి ,టిఫిన్ తిని కాఫీ తాగి నేను రెడీగా ఉంటె మా మనవడు చి.చరణ్ లేక మనవరాలు చి.రమ్య నన్ను’’ బండీ’’ ఎక్కించుకొని సెంటర్ లో దింపి తే నేను ఉదయం 7-30కు సిద్దార్ధకాలేజీ కి చేరి ,సాయ్న్త్రకార్యక్రమాలయ్యాకభోజనం చేసి బయల్దేరి వస్తే ,,రాత్రి కూడా సెంటర్ నుంచి నన్ను ఇంటికి తీసుకువస్తూ ‘’తాతా! ఈ వయసులో ఇలా చీకటితో వెళ్లి ,రాత్రి పొద్దుపోయే దాకా ఉండి,బస్సుల్లో తిరగటం అవసరమా ‘’?అని అమాయకంగా, ఆప్యాయంగా నన్ను అంటుంటే ముసిముసినవ్వులే నా సమాధానం .వాళ్ళ అభిమానానికి హాట్సాఫ్ .కనుక వీరిద్దరూ కూడా  అభినందనీయులే కదా ..

వేదికలపై మాట్లాడినవారిలో శ్రీ రెంటాల జయదేవ్ వంటి ఒకరిద్దరు మినహా ‘’పాలకుల అస్తవ్యస్త విధానం పై అగ్నికి ఆహుతౌతున్నతెలుగు ‘’గురించి తీవ్ర స్వరం లో హెచ్చరించినవారు లేక పోవటం విచారకరం .అసలు ముఖ్యవిషయం పై ము౦దు గానే సభలో తీర్మానం చేసి ప్రతినిధుల ,అతిధుల అందరి సమక్షం లో చదివి ఆమోదం పొందించి ఉంటె దాని ప్రభావం ఇంకా బాగా ఉండేది . భాషాభిమానమున్న రెండు వేలమంది ప్రతినిధులతో సిద్ధార్ధ కాలేజి నుంచికనీసం ఒక పావు కిలోమీటర్ ప్రదర్శన చేసి ఉంటె ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేదేమో .2019లో మరణి౦చిన మన తెలుగు సాహితీ ప్రముఖులకు మొదటిరోజు సభలో శ్రద్ధాంజలి ఘటించక పోవటం మనం ఏ సందేశం ఇస్తున్నామో అర్ధం కావటం లేదు .యువత ను ఆకర్షించే విధంగా వారి ఇన్వాల్వ్ మెంట్ తో ఒక్క కార్యక్రమం కూడా లేక పోవటం క్షమార్హం కాదేమో ! కాలేజీ విద్యార్ధులు ఈ కాలేజీలో నే ఉన్నారు .వారి కి ప్రబోధాత్మక కార్యక్రమం నిర్వహింఛి ఉంటె సార్ధకమయ్యేవి సదస్సులు .రాష్ట్రం నిప్పులమీద ఉంటె కాలక్షేపం కవి సమ్మేళనాలు అర్ధరాత్రి దాకా సాగించటం చాలామంది వ్యతిరేకించారు .అచ్చతెలుగు అవధానం చేసేవారికి పృచ్చకులకు మరో అరడజను మందికి మాత్రమె అర్ధమయ్యే ప్రక్రియ .దానికి అంతప్రాదాన్యమా అన్నవారూ ఉన్నారు .’’కవి సమ్మేళనం లో పాల్గొనటానికి ఎంతో దూరం నుంచి వస్తే ఖండువాలను ఎవరికీ తెలీని వారితో కప్పించటమేమిటని ‘’బాధపడ్డారుకొందరు కవులు . ‘’బడిలో తెలుగు మాధ్యమం అవసరాన్ని’’తెలియజేసే మెమొరాండం రాష్ట్ర ముఖ్యమంత్రి లేక విద్యామంత్రి లేక ప్రధానకార్యదర్శి వంటి వారికి ఒకబృందాన్ని పంపి ఇప్పింఛి ఉండాల్సింది .ఇదే మన తక్షణ కర్తవ్యమ్ కనుకఅని అభిప్రాయపడ్డాడు ప్రతినిధులు . .  సభలకు హాజరైన వారంతా దాదాపు 50పడి దాటిన వారే .వీరిలో వృద్ధులు అతి వృద్ధులు ,కన్ను లేక కాలు వంటి అవయవ వైకల్యం ఉన్నవారు ,వీల్ చైర్ లో చేతికర్ర ఊతం తో ,లేక భార్య పిల్లల తోడుగా వచ్చారంటే వారికి తెలుగు భాషపై ఉన్న ఆరాధన ఎంతటిదో ,దాన్ని కాపాడుకొనే తపన ఎలాంటిదో అర్ధమౌతోంది .అలాంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు .16వందలమందేకాక ఇంకా అంతమంది ప్రతినిధులుగా నమోదవటానికి ఉత్సాహం చూపారని వారికి ఇక్కడి ప్రాంగణం చాలదనే భావంతో మర్యాదగా ఒద్దని చెప్పామని నిర్వాహకులు చెప్పటం సముచితమే . .ప్రతి సదస్సు,లేక కార్యక్రమం  జరగటానికి కార్యకర్తలంతా’’ నిలువు జీతం ‘’తో పని చేసి తమ అంకితభావాన్ని  చాటుకున్నారు .ఉపాహార, భోజనాల సమయంలో కేటరింగ్ వారు చాలా మర్యాదగా ప్రవర్తించి ఏలోటు రాకుండా చేసినందుకు, అక్కడి పారిశుధ్యం పై శ్రద్ధ వహించిన వారూ అభినదనీయులే .అయితే గోడలప్రక్కన కనీసం ఒక 20కుర్చీలైన వేయించి ఉంటె ‘’నావంటి ముసలి ముతకా’’కూర్చుని తినటానికి వీలుగా ఉండేది .ఎప్పటికప్పుడు మంచినీళ్ళ గ్లాసులు సిద్ధం చేసిన సిబ్బందిని నేను  అభినందనలు తెలిపాను స్వయంగా .  ఈ కార్యక్రమాలన్నే సమాజ శ్రేయస్సు, పిల్లల భవత కోసం చేసినవే ,ఇందులో ఆర్ధికంగా ఆర్ధికేతరంగా సహాయ సహకారాలందించిన వారందరూ వందనీయులే .ప్రతినిధులకు ఒక బ్యాగ్ ,రాసుకొనే పుస్తకం, పెన్ను, సావనీర్, జ్ఞాపిక ,సర్టిఫికేట్ ,’మెడలో బిళ్ళ ‘’ఇచ్చి సత్కరించటం ముదావహం .ప్రతినిధులను నమోదు చేసుకోవటం లో కార్యకర్తల బాధ్యతా బాగా మన్ననలు పొందింది . మొదటి రెండు రోజులలోనూ , మూడవరోజూ ఎప్పుడూ సమావేశ మందిరాలు దాదాపు పూర్తిగా ప్రతినిధులతో నిండి ఉండటం అభి రుచికి నిదర్శనంగా నిలిచింది .స్టేజి ముందు వీడియో వారి వలన వెనక వారికి చాలా ఇబ్బందిగా ఉండటం చూస్తూనే ఉన్నాం .’’హా౦గి౦గ్ కేమేరాలు’’ పెట్టి దూరం నుంచి ఆపరేషన్ చేసే వ్యవస్థవస్తే తప్ప ఈ లోపం సరి చేయలేమేమో .వేదిక బానర్ వద్ద, తెలుగుతల్లి విగ్రహం వద్దా ప్రతినిధులు గుంపులు గుంపులుగా ఫోటోలు తీసుకోవటం వారి ఆన౦దానికి ,దీన్ని చిరస్మరణీయ౦ చేసుకోవటానికి పడిన ఆరాట౦  అభినందనీయం . మిగిలిన సదస్సుల పై  విషయాలు ఈ సారి తెలియ జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-19-ఉయ్యూరు       ,

 

 

 

 

—

 

  1. D 
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక

విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక

27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వీడిష్ భాషా సాహిత్యం -2

స్వీడిష్ భాషా సాహిత్యం -2

శ్రామిక వర్గ సాహిత్యం –స్వీడన్ రైతు వ్యవస్థలో శ్రామికులను ‘’స్టాటేర్ ‘’అంటారు .వీరికి ఇచ్చేకూలి  డబ్బుగా కాకుండా పంట ,ఇల్లు రూపంగా ఇస్తారు,.వీరిలోనూ రచయితలూ వచ్చారు .వీరిలో ఇవాన్ హో జోహన్సన్ ,మావో మాడ్రిన్సన్,జాన్ ఫ్రిడ్జి గార్డ్  ప్రముఖులు .ఉన్న శ్రామిక వ్యవస్థ రద్దుకోసం వారు గొప్ప చైతన్యాత్మక, ప్రబోధాత్మక రచనలు చేశారు .వీరినే ప్రోలెటేరియన్ రచయితలన్నారు .వీరిలో ప్రసిద్ధుడు విహేల్మ్ మోబెర్గ్ (1898-1973).సాధారణ ప్రజానీకం అందులోనూ ముఖ్యంగా రైతుల విషయాలపై రచనలు చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇతని రచనలు ‘’ది ఎమిగ్రంట్  సిరీస్ ‘’గా నాలుగు భాగాలలో1949నుండి పదేళ్ళ కాలం లో  ప్రచురించాడు  .ఇందులోఉత్తర అమెరికాకు స్వీడిష్ ఇమిగ్రేషన్ గురించి విపులంగా చర్చించాడు .19వ శతాబ్దిలో అలా వెళ్ళిన  వారు అనుభవించిన కస్టాలు బాధలూ వివరంగా రాశాడు .

బాలసాహిత్యం

1930లో కొత్త అవగాహన వచ్చి బాలల అవసరాలు ముఖ్యవిషయాలయ్యాయి .ఆస్ట్రిన్ లిండ్ గ్రెన్ ‘’పిప్పీ లాంగ్ స్టాకింగ్ ‘’1945లోప్రచురి౦ చాక కొంతమంది అవి సాంస్కృతిక వ్యతిరేకమని  నిరసన తెలిపారు .కొద్దికాలం తర్వాత ఆమెనే నెత్తిమీద పెట్టుకోవటం తో బాలసాహిత్యం మూడు పూలు ఆరుకాయలుగా వికసించింది .వీటిలో చక్కని నీతినీ జోడించి రాసింది ఆమె.పు౦ఖాను పుంఖ౦ గా బాలసాహిత్యం వెలువరించి లిండ్ స్వీడన్ లో అత్యంత ఆదర రచయితగా ప్రసిద్ధి చెందటమేకాదు, ఆమె రచనలు ప్రపంచ వ్యాప్తం గా 80 భాషలలోకి అనువాదం పొందాయి .పిల్లల మనస్తత్వం ,ఆలోచనలు,విలువలు  ఆమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియ లేదు అంటే ఆశ్చర్యం కాదు .చావు ,ధైర్యం గురించి ‘’ది బ్రదర్స్ లియోన్ హాట్’’ లో బాగా రాసింది .’’మియో మై సన్’’లో స్నేహంగురించి చక్కగా చెప్పింది .పిల్లల చిలిపి తనం పైనా ‘’కారిస్సాన్ ఆన్ ది రూఫ్ ‘’,రాసింది .’’ఏమిలాఫ్ మాపిల్ హిల్స్ ‘’పై 12 పుస్తకాలు రాసింది .ఇది స్మాల్ లాండ్ అనే పల్లె లో 1900లో ఉన్న పిల్లాడి కథ.వాడి చిలిపితనం వలన పడిన ఇబ్బందులు నవ్వునూ ధైర్యాన్ని కలిగిస్తాయి.చివరికి వాడు బాధ్యతగల పౌరుడుగా ఎదగటం మునిసిపల్ చైర్మన్ అవటం ఉన్నది .

డిటెక్టివ్ సాహిత్యం

రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం స్వీడిష్ డిటెక్టివ్ నవలలు బ్రిటిష్ అమెరికన్ తరహాలో ఉండేవి .యుద్ధం తర్వాత 1960లో స్వతంత్ర రచనలు బాగా వచ్చాయి .మాజ్ సియోజ్ వాలి ,పెర్ వాహ్లూ జంటగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ నవలలు రాశారు . మార్టిన్ బెక్ మొదలైనవారు ఇదే దారి లో నడిచారు .ఈ సాహిత్యం లో గొప్ప పేరున్నవాడు హెన్నింగ్ మాన్కెల్(1945-2015)కర్ట్ వాలేండర్  సిరీస్ రాశాడు .ఇవి 37భాషల్లోకి అనువాదమయ్యాయి .వీటిలోని సామాజిక దృక్పధానికి ప్రపంచం హారతి పట్టింది .వీటిలో ఉదార వలస సంస్కృతీ ,జాత్యంహంకారం ,నియో నాజీజం చర్చించారు.ఇవి మూడు సార్లు సినిమాలుగా తీశారంటే ఎంతటి విఖ్యాతమయ్యాయో అర్ధమౌతోంది .ఇంగ్లీష్ లో కూడా వీటిని చిత్రీకరించారు .మాన్కేల్ ‘’కామెడియా ఇన్ఫాంట్ ‘’వంటి ప్రసిద్ధ రచనలూ చేశాడు .మాపుటోసిటీలో వీధి బాలుడి గురించిన విషయం ఇందులో ఉంది .చాలామంది డిటెక్టివ్ రచయితలు  జర్మనీ మొదలైన దేశాలలో బాగా పాప్యులరయ్యారు .వీరిలో లీజా మార్క్లుండ్ ఒకరు .నక్సాన్ లర్సార్ ,ఆర్నె డాల్ , పెర్సాన్ ,జాన్ ధియోరిన్,కామిల్లా లాక్ బర్గ్ ,మారి జుంగ్ స్టేడ్,ఆకే ఎ డ్వర్సన్ మొదలైనవారు .మిలీనియ౦  ట్రయాలజి తో స్టేగ్ లార్సెన్ ఇంటర్నేషనల్ సెన్సేషన్ సృస్టించాడు .గూఢ చారి సాహిత్యం కూడా జాన్ గుల్లియో రాశాడు .కార్ల్ హామింగ్టన్ అనే స్పై పై రాసిన నవల బెస్ట్ సెల్లర్ మాత్రమేకాక  ఫిలిం కూడా తీశారు.’’నైట్ టెంప్లార్’’పై రాసిన సిరీస్ సెమి ఆటోబయాగ్రఫీ .దీనికి మెటఫోరికల్ (రూపకాలంకార )పేరు’’ ఓండ్ స్కన్’’(ది ఈవిల్ ).ఇలా అపరాధ పరిశోధన, గూఢచారి సాహిత్యాలలో స్వీడిష్ సాహిత్యం ప్రపంచ ప్రసిద్ధి కూడా పొందటం హర్షి౦చ దగిన విషయం.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-19-ఉయ్యూరు

—

 

gmail.com.

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847)

త్యాగరాజ శిష్య పరంపర -3

21-వైద్య కవీశ్వరన్ (1825-86)

తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి .

22-చల్లగాలి కృష్ణయ్య (1825-65)

పచ్చిమిరియం ఆదెప్ప శిష్యుడు పల్లవి గోపాలయ్య  కొడుకు .తంజావూర్ ఆస్థాన విద్వాంసుడు .వీణా ,గాత్ర సంగీత నిపుణుడు ‘’శ్రుతి తంత్రిని వాయించకుండా వీణను మీటటం ఇతని ప్రత్యేకత .వీణ మానవ గాత్రం లాగా పలికేది.దక్షిణానిలం లాగా చల్లగా ఉండేది కనుక ‘’చల్లగాలి’’ బిరుదు వచ్చింది .తిరు నెలంగాడు,త్యాగయ్య ,మాయవరం వైద్య నాథన్ శిష్యులు .

23-స్వరకాడు వెంకట సుబ్బయ్య (1825-64)

ఆరం తంగి దగ్గరున్న వల్లవాడి నివాసి .శేషాచలయ్యవద్ద గానం నేర్చి ,పల్లవి స్వరకల్పనలో సిద్ధహస్తుడయ్యాడు .నిడమంగళ గ్రామంలో ఉంటూ బయట  ఏకాంత ప్రదేశం లో నాదోపాసన చేసేవాడు .చనిపోయే దాకా గాత్ర గాంభీర్యం తగ్గనే లేదు .శిష్యుడు పల్లవి సోమభాగవతార్ .శ్రీ రాజగోపాల స్వామికి తనగాత్రం నివేదించే వాడు .స్వరకల్పనా చాతుర్యాన్ని మెచ్చిన శివాజీ మహారాజ్ ఇతనికి ‘’స్వరకాడు ‘’బిరుదప్రదానం చేసి గౌరవించాడు .

24-కాళిదాసు నారాయణ స్వామి (1858-1926)

రామయ్య కొడుకైన యితడు త్యాగరాజు  వంశీకుడు. మానంబు చావడి శిష్యుడు .ఫిడేలు ప్రవీణుడు .నిడమంగళం వెళ్లి స్వరకాడు సుబ్బయ్యవద్ద స్వర రహస్యం,పల్లవి ప్రస్తావన స్వరకూర్పు  నేర్చాడు .తెల్ల దొరలనుంచి గిటార్ ,పియానో ,బాన్జో వాద్య లక్షణాలు తెలుసుకొని  భారతీయ రాగాలు నేర్పాడు .అబ్రహం పండితర్ జరిపిన గానపరిషత్తులో పాల్గొని అనేక విషయాలు చర్చించాడు .కొడుకు నీలకంఠన్ గొప్ప సంగీత విద్వాంసుడు .

25-నీలకంఠన్

తండ్రివద్ద సంగీతం నేర్చాడు. ఇతని ఇల్లు సఖా రామారావు ,పూచయ్య౦గార్ ,కోనేరి రాజాపురం సంగీత ధ్వనులతో మారు మోగేది .7వ ఏట స్వరజ్ఞానమబ్బిన బాలమేధావి .అపార సంగీతజ్ఞానం ,దర్పంగల గాత్రం ఇతని సహజ ఆభరణాలు .రామ స్వామి శివన్ 100రచనలకు అనేక రాగ తాళగతులతో వర్ణ మెట్లు కట్టాడు .1936-నుంచి 43వరకు మద్రాస్ అడయారు కళాక్షేత్ర పండితుడిగా ,సంగీతకాలేజి ఆచార్యుడుగా ఉన్నాడు .

26-రామస్వామయ్య అనే రామానంద యోగి

వాలాజి పేట కృష్ణ స్వామి శిష్యుడు .శ్రీత్యాగరాజ  స్వామి కృతులను మొదటిసారిగా ముద్రించి లోకానికి అందించిన మహానుభావుడు

27-తిల్ల స్థానం పంజు ,నృసింహ భాగవతార్ సోదరులు

త్యాగరాజస్వామి జీవిత చరిత్ర ,కీర్తనలను అచ్చు వేసిన అదృష్టవంతులు .నృసింహ హరికథ భాగవతార్ .

28-పల్లవి శేషయ్య (1832-1909)

నెయ్యకార్పట్టి సుబ్బయ్య కొడుకు .ఆంద్ర ములికినాటి బ్రాహ్మణుడు .సోదరుడు కోదండరామయ్య ‘’కొనగోలు పాటగాడు’’..మనోధర్మ సంగీతం లో దిట్ట. కల్పనా స్వరాలను క్లిష్టమైన చిత్ర విచిత్ర తాళగతులలోబంధింపబడిన ఎలాంటి జాతులలోని పల్లవులనైనా చాలాఅవలీలగా పాడే నైపుణ్యం ఉండేది.వెయ్యి త్యాగరాజస్వామి కృతులు కంఠస్థం చేసి ,శ్రీరామునికి  సహస్రార్చన చేసిన  మహా భక్తుడు .మల్లికా వసంత ,శుభపంతు వరాళి లలో ఇతని కృతులు రచనాపాటవానికి ఉదాహరణలు .ముత్యాలప్పేట సుబ్బయ్య ఇంట్లో సావేరి రాగం 18 గంటలు పాడి రికార్డ్ సృస్టించాడు. మేళ క్రమపద్ధతిలో వెయ్యి రాగాలను అమర్చి వాటికి ఆరోహణ ,అవరోహణ స్వరాలు కూర్చిన ప్రజ్ఞావంతుడు .గొప్ప లక్ష్య ,లక్షణ విద్వాంసుడు .అనేక కృతులు వర్ణాలు తిల్లానాలు రాసిన ప్రతిభుడు .మైసూరు రాజా సన్మానం పొంది, బందరు మొదలైన పట్నాలలో కచేరీలు చేసి కీర్తి పొందాడు .ఇతని కీర్తనలకు ‘’శేషముద్ర ‘’ఉండటం విశేషం .

29-కరూరి చిన దేవుడు (1860-1900)

దక్షిణామూర్తి, ఈయన పినతండ్రి ,పెత్తండ్రి బిడ్డలు .దేవుడయ్య కరూరి నరసయ్య కొడుకు .ఆబాల్య సంగీతజ్ఞానసంపన్నుడు.గాత్రజ్ఞుడు.ఫిడలర్ కూడా .పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి వంటి దిగ్దంతులకు ఫిడేల్ సహకారమందించిన ప్రతిభ ఆయనది .ఉరయార్పురం రాజా పోషణలో మద్రాస్ లో సంగీత శాల స్థాపించి విద్యార్ధులకు నేర్పాడు .గర్భపురి ముద్రలో ఉన్న దక్షిణామూర్తి కృతులకు వర్ణ మెట్లు తయారు చేశాడు .సోదరుడు చిన్నస్వామి .శిష్యుడు నీలకంఠయ్య.’’చిన దేవుడు’’ 40ఏళ్ళకే ఉచ్ఛ స్థితి లో ఉండగా’’ ఆదేవుని’’ సన్నిధానం చేరాడు .30-సి.యస్. కృష్ణస్వామి (1865-1925)

తిరుచునాపల్లి నివాసి అయినా తూగోజి కాకినాడలో చాలాకాలమున్నాడు .అందుకే ‘’కాకినాడ కృష్ణయ్య’’ అంటారు.పట్నం సుబ్రహ్మణ్యమ వద్ద గాత్ర ధర్మాలు నేర్చాడు .త్యాగరాజ శతకీర్తన స్వరావళి ,వేంకటేశ తానవర్ణాలు,,ప్రథమగాన శిక్ష  రచించాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-19

.

‘’

—

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847)

శిష్య పరంపర -2

11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు  స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు

12-ముత్యాల్పేట  త్యాగయ్య

వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు  రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య ,పిరాట్ల శంకరయ్య ,సుబ్రాయ శాస్త్రి,దుడ్డు సీతారామయ్య ఇతని ముఖ్య శిష్యులు .1917లో చనిపోయాడు .

13-  ఝంఝా మారుతం సుబ్బయ్య ,

తంజావూర్ కన్నయ్య శిష్యుడైన వడ్డి సుబ్బయ్యకు స్వాధ్యాయి .త్రిస్థాయి గాత్రం లో ఘనుడు .మైసూర్ మహారాజు ‘’ఝంఝా మారుతం’’బిరుదు ఇచ్చాడు .

14-మైసూరు సదాశివరావు

వాలాజాబాద్ వెంకటరామయ్య శిష్యుడు .సర్వతో ముఖ ప్రజ్ఞతో కృతులు, తిల్లానాలు స్వరజతులు ,తానవ ర్ణాలు ,పదవర్ణాలు రాసిన ఘనుడు .మధురగాత్రం తో మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాయల ఆస్థానగాయకుడయ్యాడు.మహా నారసి౦హోపాసకుడు .ఒకరోజు సాయంత్రం మిత్రులు ‘’కమలామనోహరి రాగం’’ లో ‘’నరసింహు డుదయించె’’కృతి పాడమని పట్టు బట్టారు .చాలా పవిత్రంగా పాడే కృతి ఆది.బలవంతం మీద పాడాడు. ‘సరసి జానందము పగుల ‘’అనే వాక్యాన్ని ముగించగానే నరసింహస్వామిఫోటోకి ఉన్న గ్లాసుపగిలి పోయింది .అందరికీ భయం ఆశ్చర్యం కలిగింది. దీపాలు ఆరిపోయాయి .వెంటనే పాట ఆపేసి  హారతిచ్చాడు.తీర్ధయాత్రలు చేస్తూ అక్కడి దేవుళ్ళపై  కీర్తనలు భారవి, మోహన, కాంభోజి, ,తోడి, హరి కాంభోజి, బలహంస ,అఠాణా రాగాలలో కూర్చాడు.గజానన, ఆంజనేయ త్యాగారాజుల పైనా కీర్తనలు రాశాడు .తనప్రభువుపై పదవర్ణనలు,తిల్లానాలు అల్లాడు. ఇతని స్వర ,తాళజ్ఞానం అపూర్వం .రాగ భావ అర్ధపుస్టి,గణ యతి ప్రాసలతో ఈతని కీర్తనలు బహుజనాభిమానం పొందాయి

15-వాలజి పేట కృష్ణయ్య

అనేక కృతులు స్వరజతులు రాశాడు .

16-అన్నాస్వామి

1827లో పుట్టి సుబ్బరాయ శాస్త్రికి దత్తుడయ్యాడు .కావ్యాలంకార నాటక వ్యాకరణ సంగీత శాస్త్రం ఫిడేలు వాద్యంలో ప్రవీణుడు .’’పాలించుకామాక్షి ‘’,’’పాహి శ్రీ గిరిరాజ ‘’  కృతులకు స్వరాలు కూర్చాడు ఇతని శిష్యులు తచ్చూరి సి౦గరాచారి సోదరులు గ్రంథ కర్తలు .

17-తిరువాయూరి పంచాపకేశన్

త్యాగయ్య గారి సోదరుని మనవడు.మానంబు చావడి శిష్యుడు .అపార సంగీతజ్ఞానమున్నవాడు .22ఏట చనిపోయాడు .కొడుకు రాముడు భాగవతార్ మహా గాయకుడు .

18-సాదు గణపతి శాస్త్రి (1893-1945)

జలతరంగ వాద్యం లో మాహా విద్వాంసుడు. తండ్రి నాగరత్నం మానంబు చావడి మేనల్లుడు .రామనాడు ,పిఠాపురం ,త్రిపు నా౦డాల్,స్వాధీనం జమీందార్లు ఇతన్ని ఆహ్వానించి కచేరీలు జరిపించి సత్కరించారు .సోదరుడు సుబ్రహ్మణ్యం మంచి గాత్ర జ్ఞుడు  ..లార్డ్ సైమన్ ,లివింగ్టన్ల నుంచి ప్రశంసా పత్రాలు పొందాడు’

19-ఆలగుంట సీతారామయ్య (1806-86)

తిన్నవెల్లి జిల్లా ఎలవర్స నొండల్ గ్రామస్తుడు .ఎట్టియా పురం ఆస్థానగాయకుడైన కృతికర్త.ఇతని గానవైదు ష్యానికి శివాజీ భోంసలే మెచ్చి అనేక బిరుదాలు, అశ్వాలు ,గజాలు ఇచ్చి  సన్మాని౦చాడు .వాటిని మధుర మీనాక్షి అమ్మవారికి సమర్పించాడు.ఎల్వరస నొండల్ రాజా ఆదిపట్టి గ్రామం ఈనాం గా ఇచ్చాడు .భజనపద్ధతిపై ‘’రామ మహోత్సవ ప్రాక్తిక’’రచించాడు .

20-పుదుక్కొట సుబ్రహ్మణ్య భాగవతార్ (1823-96 )

పుదుక్కోటరాజు  తొండమాన్ రఘునాథ రామ చందర్ ఆస్థానగాయకుడు .తండ్రి వెంకటరామయ్య .తిరువయ్యార్ లో త్యాగరాజస్వామిని సేవించిన అదృష్టవంతుడు.శివానంద నౌక  ,ప్రహ్లాద చరిత్ర ,గద్య పద్య కీర్తనావళి రాశాడు .కొడుకు నాగరత్నం ఆస్థాన విద్వా౦ సుడే.తిరువాన్కూర్ రాజు చే గౌరవి౦పబడ్డాడు .’’ఇతని మరణంతో కర్ణాటక గానం అంతరించింది ‘’అన్నాడు రాజా రామ చందర్ .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు

 

 

స్వాతి తిరునాళ్

 

 

 

 

 

 

‘’

—

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఫిన్నిష్ సాహిత్యం -2(చివరిభాగం

              ఫిన్నిష్ సాహిత్యం -2(చివరిభాగం )

21వ శతాబ్దం లో 2014లో’’ ఫ్రాంక్ ఫర్ట్  బుక్ ఫెయిర్ ‘’లో ఫిన్లాండ్ అంతర్జాతీయ స్థాయి సాధించింది .పారిస్ రివ్యు పత్రిక ‘’కొత్త తరహా ఫిక్షన్ తో ఫిన్ లాండ్ తన ముద్ర వేసింది ‘’అని పొగిడింది .2018కి ఫిన్నిష్ సాహిత్యం మూడు రెట్లు ఎగుమతి అయింది .అప్పటిదాకా ఉన్న జర్మనీ రికార్డ్ ను ఫిన్ లాండ్ ,ఆంగ్లో అమెరికన్ మార్కెట్లు అధిగమించాయి .ఈ శతాబ్దపు ప్రముఖ రచయితలు  –సోఫీ ఓక్సనేన్ ,పాజ్టింస్టాటోవికి ,లారా లిండ్ స్టెడ్ ,మిక్కో రిమ్మినెన్ లు .మిక్కీ 2011లో ఫిన్ లాండియా ప్రైజ్ తననిరనతర సాహితీ కృషికి అందుకొన్నాడు .ఫిన్నిష్ ఫాంటసి ,సైన్స్ ఫిక్షన్ వేగవంతమై అంతర్జాతీయ గుర్తింపు పొందాయి .వీరిలో 1992లో ఫిన్లాన్డిక్ ప్రైజ్ పొందిన లీనాక్రోన్ ,2000లో అదే ప్రైజ్ అందుకొన్న జోహన్నా సిన్సాలో ఉన్నారు .

ఫిన్లాండ్ లో ఫిన్నిష్ భాషను విద్యలో పరిపాలనలో ప్రవేశ పెట్టాక ,స్వీడిష్ భాష ఫిన్లాండ్ లో ప్రాచుర్యమైనది .జోహాన్ లుడ్విగ్ రునేబెర్గ్ (1804-1877)స్వీడిష్ భాష మాట్లాడే రచయితగా బాగా పేరు తెచ్చుకొన్నాడు .అవర్ లాండ్ అనే కవితా  అతని మొదటి  కవిత’’మై లాండ్ ‘’ ఫిన్నిష్ స్వాతంత్ర్యం పొందటానికి 70 ఏళ్ళు ముందుగానే ఫిన్లాండ్ జాతీయ గీతంగా గౌరవి౦పబడి విశేష కీర్తి పొందింది .20వ శతాబ్ది పూర్వార్ధం లో ఆధునిక స్వీడిష్ భాష ఫిన్లాండ్ లో పురుడు పోసుకొని ఉద్యమంగా బలపడి ,అద్భుతమైన ప్రగతి సాధించింది .ఈ ఉద్యమనాయకుడు ఎడిత్ సోడేర్ గ్రాన్ ..ఫిన్లాండ్ లోవిశేష  ప్రాచుర్యం స్వీడిష్ భాషా రచనలు టోవ్ జాన్సన్ రాసిన ‘’మూమిన్ బుక్స్ ‘’గా గుర్తింపు పొందాయి .వీటినే కామిక్స్ లేక కార్టూన్ బుక్స్ అంటారు .జాన్సన్ ఒక్కామే ఉవ్వెత్తుగా లేచిన బాలసాహిత్య సృజనాత్మక తరంగాలకు జీవం పోసింది   .1960-70కాలం నార్డిక్ బాలసాహిత్యానికి బంగారుకాలం .జాన్సన్ కు సైదోడుగా నిలిచాడు ఇమ్మెలిన్ సాండ్ మన్ లిలస్ .ఫిన్లాండ్ లోని స్వీడిష్ రచయితలలో తరువాత చెప్పుకో దగినవారు హెన్రిక్ టిక్క నెన్,జెల్ వెస్టో .వీరిద్దరూ సెమి ఆటోబయాగ్రఫిక్ వాస్తవిక నవలా రచయితలుగా ప్రాముఖ్యం పొందారు .ఫిన్నిష్ ఫాంటసి సాహిత్యానికి సమాంతరంగా స్వీడిష్ ఫాంటసి కూడా వృద్ధి చెందించాడు జోహన్నా హాల్మ్ స్ట్రాం.

టాప్ టెన్ ఫిన్నిష్ బుక్స్

ఫిన్లాండ్ దేశాన్ని ‘’ది లాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ అని కూడా పిలుస్తారు .దౌజండ్ లేక్స్ సాహిత్యమన్నా ఫిన్నిష్ సాహిత్యమన్నా ఒక్కటే .

1-టోవ్ జాన్సన్(మహిళ ) రచన –టేల్స్ ఫ్రం మూమిన్ వాలీ 2-ఎలియాస్ లోన్ రాట్ రచన –కలవేలా 3-మికా వాల్టారి రాసిన –ది ఈజిప్షియన్ 4-సోఫీ ఒక్సనెన్ (మహిళ ) రచన –పర్జ్ 5-ఆర్టో పాసలిన్నా రచన –ది యియర్ ఆఫ్ ది హేర్ 6-వైనో లిన్నా రాసిన –అండర్ ది నార్త్ స్టార్ 7-రిక్కా పుల్కిన్నేన్ (మహిళ )రచన –ట్రూ 8-అలెక్సిస్ కివి రచన –ది సెవెన్ బ్రదర్స్ 9-హన్ను మైకేలా రాసిన –మిస్టర్  బూ 10-లీనా లెహ్టోలైనెన్(మహిళ )రచన –మై ఫస్ట్ మర్డర్ .

తప్పక గుర్తుంచుకోవాల్సిన అయిదుగురు ఫిన్నిష్ రచయితలు  -లీనా క్రోన్ –కలె క్టేడ్ వర్క్స్,ఎమ్మి ఎలిన్నా ఐట రాంటా-మెమరిఆఫ్ వాటర్  ,పాసి ఇల్మారి జాకేలేనెన్ –ట్విన్ పీక్స్ ,ఆంటి టుమోన్నెన్-ది హీలర్ ,జిర్కీ వైనో నేన్-దిఎక్స్ ప్లోరర్ అండ్ ఆదర్ స్టోరీస్

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు

.

—

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847)

అ౦దరి  వాడైన త్యాగయ్య

త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపోవటం తో సంసారులు విరాగులు భక్తులు అన్ని వర్ణాలవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రుత్వాలు లేకపోవటం తో ఆయన కీర్తనలు సర్వజన అంగీకారం పొందాయి .విమర్శించాలని వచ్చే వారి ఆయన శాంత హృదయం చూసి నోరు మెదపక వెళ్ళిపోయేవారు .పరిశుద్ధత ,ఆత్మ స్వాతంత్ర్యం ,మనో నిశ్చయం ఆయనకు సహజాలంకారాలు .దేశమంతా త్యాగబ్రహ్మ కీర్తనలకు బ్రహ్మ రధం పట్టింది .కాశీ నుంచి గోపీనాథ భట్టాచార్యవచ్చి దర్శించి తరించాడు . షట్కాలగోవి౦ద మరార్ స్వామిని దర్శించి పునీతుడై మెప్పు గౌరవం పొందాడు .అరవలు అపరానారదునిగా భావించి త్యాగయ్యగారి కృతులను నేర్చుకొని పాడారు .వాటిలోని అర్ధ గా౦భీర్యం ,భాషా పా౦డిదత్యం, కవితా మాధుర్యం అర్ధం కాకపోయినా తమిళులకు త్యాగారాజస్వామి  ఆరాధనీయుడయ్యారు.తెలుగుభాషా  మాధుర్యం కవితా పాటవం రుచి చూసిన మహా వైద్యనాధయ్యర్  ,పట్నం సుబ్రహ్మణ్యం ,పూచయ్య౦ గార్, శ్యామ శాస్త్రి తెలుగు కీర్తనలు రాసి పేరుపొందారు .ఎందరో త్యాగయ్య  కీర్తనలుపాడి ,ఆయనపై ప్రశంసాపద్యాలు రాశారు .కొందరైతే పిల్లలకు త్యాగయ్యగారి పేరు పెట్టుకొన్నారు .శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మచలువ ,పూనిక తో ప్రారంభమైన త్యాగరాజ ఆరాధన నేడు దేశం లోని ప్రముఖగాయకులు త్యాగయ్య వర్ధంతి పుష్యబహుళ పంచమినాడు తిరువయ్యార్   లో పాల్గొని భక్తీ తాత్పర్యాలతో త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలాపనచేసిస్మరించి , కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.

శిష్య పరంపర

1-వీణ కుప్పయ్య –సామవేద బ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు .’’నారాయణ గౌళ’’ రాగ ప్రవీణుడవటం వలన ‘’నారాయణ గౌళ కుప్పయ్య ‘’గా ప్రసిద్ధుడు .కోవూరి సుందరేశ మొదలి ఆస్థానగాయకుడు .వినాయకచవితి ,చిత్ర పౌర్ణమిలను ఘనంగా నిర్వహించి ఘనవిద్వామ్సులచేత కచేరీలు చేయించి సన్మాని౦చేవాడు  .రాదారుక్మిణీ సమేత  శ్రీ వేణు గోపాలస్వామి పూజాదికాలు మహా భక్తితో చేసేవాడు .త్యాగయ్యగారిని కోవూరు  పిలిపించి త్రిపురసుందరీ సుందరేశ్వరులపై కృతులు రచి౦పజేశాడు .మద్రాస్ లో మరణించాడు .ఇతనికోడుకులు కృష్ణస్వామి ,రామస్వజ్మి ,త్యాగయ్య ,శిష్యులు కొత్తవాసాల్ వెంకటరామయ్య ,ఫిడేలు పొన్ను స్వామి గానప్రవీణులే .చివరికొడుకు త్యాగయ్య ‘’పల్లవి స్వరకల్పవల్లి ‘’,సంకీర్తన రత్నావళి ‘’లను ముద్రించాడు .కుప్పయ్య తండ్రి సాంబయ్య గొప్ప వైణికుడు’’’ఎ సాంబడు వాయించాలి .ఆ సాంబడు (శివుడు )విని ఆనదించాలి అనే సామెత ప్రచారం లో ఉంది .వీణ కుప్పయ్య వల్లనే మద్రాస్ కు ‘’సంగీత నిలయం ‘’అనే పేరొచ్చింది .

2-వాలాజి పేట వెంకట రమణయ్య

మధురవాసి ,సౌరాష్ట్ర బ్రాహ్మణుడు వాలాజిపేట వెంకటరమణయ్య .త్యాగారాజస్వామిపై ధ్యానశ్లోక ,మంగళాస్టకాలు రాశాడు .గురుపుత్రి సీతమ్మ వివాహ సందర్భంలో శ్రీ కోదండరామ స్వామి తైల చిత్రపటాన్ని రచించి కానుకగా ఇచ్చాడు .అప్పుడు భావోద్రేకానికి లోనైనా త్యాగరాజు ‘’నను పాలి౦ప ‘’అను కీర్తన ఆశువుగా చెప్పారు .ఇప్పటికీ ఈచిత్రం త్యాగయ్య గారి వంశీకుల వద్ద భద్రం గా ఉండటం విశేషం

ఈయనకొడుకు మైసూర్ సదాశివరావు .శిష్యుడు కృష్ణ భాగవతార్ .రమణయ్య భావ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమినాడు మరణించాడు .

3-తిరువాడి సుబ్రామయ్య

ఇతడుత్యాగరాజ కృతులకు మొదటి స్వర రచయిత.త్యాగరాజ కృతి గాన పద్ధతిని కొడుకుకు నేర్పాడు

4-నేమం సుబ్రహ్మణ్యం

పల్లవి ప్రవీణుడు నేమం సుబ్రహ్మణ్యం క్రుతులగానం లో మహా నేర్పరి .కొడుకు నటేశయ్య కూడా గాయకుడే .

5-ఉమయాల్పురం సోదరులు

కృష్ణ భాగవతార్ ,సుందరభాగావతార్ లను ఉమయాల్పురం సోదరులుఅంటారు .త్యాగయ్యగారి ఆదేశం తో   ఆదుత్తురై నివాసి జగద్రక్ష భాగవతార్ వద్ద గాన విద్య ప్రారంభించి రాటు దేలాక త్యాగయ్యగారి వద్ద చేరి ‘’జానకీ మనోహరం ‘’కృతి ప్రారంభించారు

6-టి.శివరామయ్య

సుబ్రామభాగవతార్ కొడుకు .మానంబు చావడి వెంకటసుబ్బయ్యవద్ద త్యాగరాజ కృతులు నేర్చి ఫిడేలుపై వాయించాడు  .పంచాప కేశవ భాగవతార్ తో కలిసి మైసూర్ బరోడా కాశీలకు వెళ్లి కచేరీలు చేశాడు. దేశీయ రాగ తాళాలతో ‘’చతు ష్షష్టి మాలిక ,నవరత్నరాగామాలిక రచించాడు

7-మువ్వనల్లూరు గోవిందన్ సభాపతి సోదరులు

శాలీయ మంగళం నివాసులు .తండ్రి మధ్యార్జనం దొరస్వామి .పదకర్తలు సంస్కృత కృతులు రాశారు .

8-మానంబు చావడి వెంకటసుబ్బయ్య

త్యాగయ్యగారి బందువు .ములికినాటి బ్రాహ్మణుడు .ఫిడేలు వాద్యగాడు.వేంకటేశ ముద్రతో చాలా కృతులు రాశాడు .దేవా గాంధారి రాగం లో ‘’స్వామికి సరియెవరు’’కృతి రాసి గురుభక్తి చాటుకొన్నాడు .

ఈయన శిష్యులు –మహా వైద్యనాధయ్యర్ ,పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి ఫిడేలు వెంకోబారావు పంచాపకేషన్ ,శివరామయ్య ,సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (బందరు )

9-తంజావూరు రామారావు

1757లో పుట్టిన రామారావు త్యాగయ్యగారి శిష్యుడు , కార్యదర్శి .గురువుగారితో దక్షిణ యాత్ర చేశాడు .’’చిన్న త్యాగయ్య ‘’అనిఅందరూ అనేవారు  .పెద్దపెద్ద పనులకు త్యాగయ్యగారు ఈయనను నియమించేవారు .’’అయ్యర్ వాళ్’’అని త్యాగయ్యగారు రామారావు ను పిలిచేవారు

10-సుబ్రాయ శాస్త్రి (1803-62)

శ్యామాశాస్త్రి రెండవకొడుకు .గానవిద్య తండ్రివద్ద ప్రారంభించి త్యాగయ్యగారి వద్ద పూర్తీ చేశాడు .తెలుగు సంస్కృతం ద్రావిడ భాషాలలో కోవిదుడు ‘’కుమారా ముద్ర ‘’తో కృతులు స్వరజతులు రాశాడు .మధ్యమకాల స్వర సాహిత్య చిట్ట స్వరాలతో ఉండే ఇతని కృతులను త్యాగయ్యగారు విని మెచ్చేవారు .ఫిడేలు వాదనలో మహా ఘటికుడు .ఉదయార్పాలెం రాజు ఇతని కోరిక ఏమిటి అని అడిగితె ‘’నాపై అంబ కటాక్షం ఉంది అంతే చాలు ‘’అన్నాడు.1862చైత్ర కృష్ణ దశమి ఉదయం సంధ్యవార్చి ‘’దత్తం ‘’అంటూ నీళ్ళు వదలి తనకు ఇంకా రెండు గంటలు మాత్రమె ఆయుః పరిమాణం  అని చెప్పి అలాగే చనిపోయాడు .ఇతని శిష్యులు అన్నాస్వామి ,తాళపారంగత కంచి కాశీ శాస్త్రి ,ఫిడేలు చంద్రగిరి రంగా చార్యులు,గీతాల శోభనాద్రి ,పొన్నుస్వామి బాలు ,తిరుజ్ఞానముదలి , చిన్మఠం రాఘవులు చెట్టి .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

సశేషం

మీ–గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

‘’

—

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment