దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2

1-సంగీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847)

ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టాభిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొతే ఆర్తిగా త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని  ‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు యెంత సొగసు ‘’,నాద సుధా రసంబిలను నరాకృతిఆయెరా’’అంటూ కీర్తనలతో స్తుతించారు .ఈవిషయం గురువుగారికి తెలిసి పాడమని కోరగా ‘’దొరకునా ఇటు వంటి సేవ ‘’కృతిలో ‘’కామిత ఫలనాయకి యగుసీత ‘’అనే చోట సాహిత్య స్వరాలు వేయగా ,పరమానందం తో వేంకటరమణయ్య గారు రాజు తమకు బహూకరించిన ‘’మకర కంఠి’’మొదలైన ఆభరణాలను తీసి శిష్యుని మెడలో వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసికొని’’దీర్ఘాయురస్తు ‘’అని దీవించగా త్యాగరాజస్వామి ‘’జయ జానకీ రామ ‘’కృతి పాడి ఆశీర్వాదం పొందారు ..గురువుగారి కుమార్తె వివాహానికి ఈ ఆభరణాలను  నూతన వస్త్రాలతో సహా ఆయనకే కానుకగా అందజేసిన త్యాగమూర్తి త్యాగయ్యగారు .

స్వార్ధపరుడైన అన్న జపేశం ఆస్తి విభాగం లో మొత్తం ఆయనే దక్కించుకోగా త్యాగరాజస్వామికి నిత్యం తాను  పూజించే ‘’శ్రీరామ పంచాయతనం ‘’దక్కింది .వీటికి అలంకరణ చేసి ‘’కొలువై యున్నాడే’’,కొలువమరెగదా’’మొదలైన కీర్తనలు రచించి పాడుతూ కాలం గడిపారు .ప్రతిఏడాది ఈ విగ్రహాలకు సమారాధన చేసి సంగీత రసికులను ఆహ్వానించి తన కీర్తనలతో బ్రహ్మానందం కలిగించటం జపేశుని ఈర్ష్యకు కారణమై ,వాటిని దొంగిలించి కావేరిలో పారేశాడు .ఈ సంఘటనకు మనసు వ్యాకులమై ‘’ఎందు దాగినాడో ‘’మొదలైన కృతులు రాసి పాడుకొంటూ నిద్రాహారాలు లేకుండా గడుపుతుంటే స్వామి కలలో సాక్షాత్కరించి తానున్న చోటు తెలియజేశారు .అక్కడికి వెళ్లి వెతుకగా అవి దొరకగా పట్టరాని ఆనందం తో ‘’రారా మా ఇంటి దాక ‘’కీర్తనపాడి సంప్రోక్షణ చేసి ,అన్నకు సద్బుద్ధి ప్రసాది౦ప మని వేడుకొన్నారు.భార్య పార్వతి ఒకరోజు ధర్మ సంవర్ధినీ దేవితో మాట్లాడటం విని త్రిపురసు౦దరిపై  ‘’దారిని తెలుసుకొంటి ‘’కీర్తన రచించి పాడారు .భార్య మరణాన్ని తట్టుకోలేక ‘’తొలి జన్మమున జేయు’’, ‘’ఏ పాపము జేసితినో ‘’కృతులు రాశారు .ఆమె చెల్లెలు కమలను ద్వితీయం చేసుకొని ‘’సీతమ్మ ‘’అనే కూతురిని పొందారు .

దక్షిణాదిన ఉన్న సకల శైవ వైష్ణవ క్షేత్రాలన్నీ దర్శించి అ స్వాములపై కీర్తనలు రచించారు త్యాగ బ్రహ్మ .తిరుమలేశుని దర్శనం లో ‘’తెరతీయగ రావే ‘’కోవూరు సుందరేశ్వరునిపై ‘’శంభో మహాదేవ ‘’కృతులు రాశారు .ఇక్కడి సుందరేశ మొదలియార్ త్యాగయ్యగారి నిర్లిప్తత గమనించి రహస్యంగా పల్లకీలో వరహాల మూట పెట్టించాడు .అడవి దొంగలు అపహరిస్తే ,ఇస్ట దేవతా స్మరణ చేస్తే రామ సోదరులు విల్లంబులతో దొంగలను భయపెడితే‘’ఎవరిచ్చిరిరా ఈ శరచాపం ‘’అని కీర్తిస్తే వరహాలమూట అర్పించి క్షమాపణ కోరి, వారే పల్లకీ బోయీలై  ఒక అగ్రహారానికి గౌరవంగా చేర్చారు .

ఆవూరిలో కాశీ యాత్రకు వెడుతున్న  దంపతులను పెద్దపులి భయపెడితే పాడుపడిన దేవాలయంలో ప్రాణ రక్షణ చేసుకోగా, భర్త అక్కడి పాడు నూతిలో పడి చనిపోతే ‘’అయ్యవారికి ‘’తెలిసి ,’’నా జీవనాధారా ‘’కృతి రచించి శ్రీరామ కృపతో బ్రతికించారు .ఉపనిషద్ బ్రహ్మంగారి ఆహ్వానం పై కంచి వెళ్లి కామాక్షి అమ్మవారిపై ,కీర్తన రాశారు .మద్రాస్ పార్ధ సారధి కోవెలలో దేవ గాంధారి రాగాన్ని వరుసగా వారం రోజులు దీక్షగా గానం చేశారు .పుదుక్కొట మహా రాజు దర్బారులో ‘’జ్యోతిస్వరూపిణి’’రాగాలాపన చేసి దీపాన్ని వెలిగించారు .తీర్ధ యాత్రలు ముగించి స్వగ్రామం పంచనదం చేరగా ,అక్కడ గోవింద మరార్ అనే తిరువాన్కూర్ సంగీత విద్వాంసుడు ఎదురు చూస్తున్నాడు .మరార్ గానప్రతిభకు మెచ్చి సత్కరించి ‘’గోవింద దాసు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’ఎందరో మహాను భావులు ‘’అనే విశిష్ట కృతి రాశారు .కృతులతోపాటు నౌకాచరితం ,ప్రహ్లాద విజయం మొదలైన యక్షగానాలూ రాశారు .

ఇలా 88ఏళ్ళు రామనామ కీర్తనలు రాస్తూ ,గానం చేస్తూసార్ధక జేవితం గడిపిన సంగీత సద్గురు త్యాగరాజస్వామి ‘’జ్ఞానమొసగ రాదా ‘’,’’ఇదే సమయమురా ‘’,’’దయ జూచుటకిది వేళరా ‘’మొదలైన కీర్తనలతో మోక్షాన్ని ప్రసాది౦పమని తన ఇస్ట దైవాన్ని వేడుకొంటూ కాలం గడిపారు .ఒక ఏకాదశి నాటిరాత్రి త్వరలో భగవత్ సందేశం రాబోతోందని కలగన్నారు .కలలో రామచ౦ద్ర ప్రభువు దర్శనమిచ్చి ‘’నువ్వు త్వరలో సన్యాసం స్వీకరించు .ఇవాల్టికి అయిదవ రోజు నా పదవి నీకిస్తాను ‘’అని అని  చెప్పి అంతర్ధానమయ్యాడు .చివరి కీర్తనగా ‘’గిరిపై నెలకొన్న రాముడు ‘’పాడి ఆనాడే వేద విదుల సమక్షం లో బ్రహ్మానంద తీర్దులవారి వద్ద సన్యాసాశ్రమం పొందారు .1847ప్లవంగ నామ సంవత్సర పుష్యబహుళ పంచమి నాడు త్యాగబ్రహ్మ కపాలం విచ్చేదమై త్యాగ జ్యోతి అంతరిక్షం చేరింది .రామభజనలతో త్యాగరాజ కీర్తనలతో శిష్యులు వారి పార్ధివ దేహాన్ని కావేరీ తీరం చేర్చి ,అభిషేకం చేసి బృందవానం నిర్మించారు .

తంజావూర్ దగ్గర త్యాగరాజ శివుడు కొలువై యున్న తిరువారూర్  లో ఆంద్ర ములికి నాటి బ్రాహ్మణులు కాకర్ల వంశీకులు .వేద శాస్త్ర పురాణ వేత్తలైన పంచనద బ్రహ్మ౦  గారికి సదాశివ,సదానంద ,,సచ్చిదానంద, బాలానంద, గిరిరాజ అనే అయిదుగురు కుమారులు .గిరిరాజును సుబ్రహ్మణ్య భారతి అని పిలిచేవారు .తెలుగు సంస్కృతాలలో ప్రజ్ఞావంతుడు ,గానవిద్యా సంపన్నుడు ,వేదాంత గేయ రచయిత.తంజావూర్ రాజులైన షాహాజీ శంభాజీ లపై 100 సంగీత పదాలు,యక్షగానాలు  రాసినకవి .ఇవి అలభ్యం .గిరిరాజ కుమారుడు త్యాగయ్యగారి తండ్రి రామ బ్రహ్మం భారత రామాయణాదులను ప్రసంగాలుగా చెప్పే నేర్పున్నవాడు .తులజాజి రాజు ఆస్థానం లో రామాయణ ప్రవచనం చేసి ,శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపి గొప్ప సన్మానాలు పొందాడు .ఈయన సోదరులు పంచనదం ,పంచాపకేశిలకు విద్య అబ్బలేదు దుష్ట  స్వభావులవటంతో తలిదండ్రులు కాశే యాత్రకు బయల్దేరారు .

ఒక రోజు స్వప్నం లో రామబ్రహ్మ౦ గారికి ‘’నారద వాల్మీకి సరస్వతి భారద్వాజ అంశ సంభూతుడు కుమారుడుగా జన్మిస్తాడని ,త్యాగరాజు పేరుతో ప్రసిద్దుడౌతాడ’’ని  కల వచ్చింది.భార్యతో శ్రీ త్యాగారాజాలయానికి వెళ్లి దర్శించి పూజించి స్వప్న ఫలం కోసం ఎదురుచూస్తుండగా అయిదవ రోజున 1759 బహుధాన్య సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం శ్రీ త్యాగరాజ స్వామి జన్మించారు .కొంతకాలానికి పుత్రసమేత౦ గా దంపతులు కాశీ యాత్రకు పోతూ పంచనదం లో విడిది చేస్తే శ్రీ పంచనదీశ్వర స్వామి కలలో కన్పి౦చి ,కాశీ కంటే తిరువయ్యూరు గొప్ప క్షేత్రమని ,అక్కడ సిద్ధి పొందినవారు లింగరూపం పొందుతారని చెప్పాడు ..ఈ వార్త తెలిసిన తులజాజి రాజు వీరికి తిరుమంజన వీధిలో ఒక ఇల్లు ,కొంత పొలం ఏర్పాటు చేశాడు .అప్పటినుంచి అక్కడే ఉంటూ అయిదవ ఏట త్యాగయ్యకు ఉపనయనం చేసి ,సంస్కృతం నేర్పించి సూత్రసహితరామమంత్రోపదేశం చేశారు .

బాల్యం లో తోటిపిల్లలతో గోలీలాడుతూ గడుపుతుంటే శ్రీ రామ కృష్ణానంద యతి ‘’గమనించి శ్రీరామ షడక్షరీ మంత్రోపదేశం చేసి ,శ్రీరాముని భక్తితో కొలుస్తూ ,కీర్తనలు రాయమని హితవు చెప్పాడు .అలానే చేస్తూతోడి రాగం లో ‘’ నమో రాఘవాయ ‘’ అనే మొదటి కృతి రాసి పాడుతుంటే తండ్రి విని ,సంగీత విద్వాంసులకు వినిపిస్తే, అందులోని మధురభావ భక్తితత్పరత కు ముగ్ధులయ్యారు .వేదాధ్యయనం సాంగోపాంగంగా నేర్చి , శ్రీ శొంఠి వేంకట రమణయ్య గారి వద్ద గానవిద్య అభ్యసించారు .ఆతర్వాత కథ అంతా ముందే చెప్పుకొన్నాం .

మరో  సంగీత కళా తపస్సంపంన్నుడి గురించి ఈసారి తెలుసుకొందాం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-19-ఉయ్యూరు

 

 

 

 

‘’

—

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ ,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్  సామ్రాజ్యం సాధించారు .తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి ఆత్మ సామ్రాజ్యం సాధించే శక్తి ఉందని నిరూపించారు .సాంఖ్యులు ,యోగులు పొందే నిర్వాణ స్థాయిని  నాదోపాసన తో పొందవచ్చునని తెలియ జేసిన గాయక  బ్రహ్మ  త్యాగయ్య.’’సంగీతజ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే మనసా ‘’?అని లోకోత్తర సందేశమిచ్ఛి తరి౦ప జేశారు .తెలుగు భాషామదుర్యం ,కావ్య రసామృతం,గానానందం  త్రివేణీ సంగమం గా ఏకస్థాయిలో తనకృ తులలో మేళవించి బ్రహ్మానంద రసాను భూతి సిద్ధింప జేశారు త్యాగయ్య .

   రాగాలకు జీవకళ ఉట్టిపడేట్లు గంభీర భావపూరితంగా కృతులను కూర్చ టానికి తెలుగు భాష మాత్రమే సరైనదని  నిరూపించారు వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి.వేద, వేదాంగాల  సారాన్ని మంచి నుడికారంతో తెలుగు వారికి అందించిన మహానీయుడాయన .నిగమాల నిస్ట లో వ్యాసుడు కవితా గోష్టి లో వాల్మీకి .వైరాగ్యం లోశుకమహర్షి .భక్తిలో ప్రహ్లాదుడు.సాహిత్యం లోచతుర్ముఖ బ్రహ్మ. గానం లో నారదమహర్షి అనిపించిన సర్వజ్ఞ మూర్తి త్యాగబ్రహ్మసకల వేదోపనిషత్ సారాన్ని 24 వేల దివ్య సంకీర్తనలలో వ్యక్తం చేసిన పు౦భావ సరస్వతి ,సంగీత సద్గురువు త్యాగరాజస్వామి ..’’దేశభాషలందు తెలుగు లెస్స’’అని రుజువుచేసిన క్రాంత దర్శి ..96కోట్ల రామనామం జపించి తరించి తరి౦పమజేసినశ్రీరామభక్తుడు,త్యాగమూర్తి త్యాగబ్రహ్మ .    త్యాగబ్రహ్మగారి కృతులన్నీ నాద బ్రహ్మ సాక్షాత్కారం లో నుండి ఆవిర్భవి౦చినవే ..ప్రతికీర్తనా  రాగ సుధారస పాన మత్తత కలిగించే అమృత గుళిక.  ‘’Tyagaraja ;s songs breathe the wisdom of S0crates,the tenderness and nathos Buddha ,the love of Christ for suffering humanity ,the quintessence of Upanishads and with all an in effable sweetness of music for which there is no parallel in the ancient and modern world ‘’ ఇలాంటి దివ్యామృతాన్ని తనివి దీరా గ్రోలేట్లు వేలాది కీర్తనలు రచించి దాక్షిణాత్యగాయకులకు భక్తిమార్గం చూపిన నాదబ్రహ్మ సద్గురుమూర్తి త్యాగరాజస్వామి .

    శ్రీ శొంఠి  రమణయ్య  సద్గురువుల వద్ద గానవిద్య నభ్యసించి అసమాన పాండిత్య ధనుడై ,రామభక్తితో ఆయన కల్యాగుణా లను  24 వేల కృతులతో గానం చేసి ‘’శ్రీ గిరిరాజ సుతా ‘’అనే విఘ్నేశ్వర ప్రార్ధనతో ఆరంభించారు త్యాగయ్య .నిరంతర రామనామ పద రాజీవ ధ్యానం తో తన్మయత్వం లో వెలువడిన దివ్యనామ సంకీర్తనలు కర్ణ రసాయనంగా గానం చేస్తూ శ్రీరామ సేవలో గడిపిన ధన్యమూర్తి .తల్లి సీతమ్మ .తండ్రి రామ బ్రహ్మ .వీరిద్దరి పేర్లు వచ్చేట్లు ద్వంద్వార్ధంగా ‘’సీతమ్మమాయమ్మ ,శ్రీరాముడు మాకు తండ్రి ‘’కృతి రాశారు .పెన్నూ ,పేపరు లేని ఆకాలం లో కృతులను బొగ్గుతో గోడలపై  రాసేవారు త్యాగయ్య .ఇవన్నీ తంజావూరు ,తిరువయ్యారు లలో విశేష వ్యాప్తి చెందాయి .

    ఆకాలం లో తంజావూరు రాజదర్బారు లో 360మంది మహా గాయకులుడేవారు .వీరికి సంవత్సరం లో ఒక్క రోజు మాత్రమె పాడే అవకాశం కలిగేది .అందుకని ప్రతివారు ఒక్కొక్కరాగం లో విశేష కృషి చేసేవారు .వారు సాధన చేసిన రాగాన్ని బట్టి వారికి పేర్లు వచ్చాయి .శంకరాభరణం నర్సయ్య ,అఠాణా అప్పయ్య ,తోడి సీతారామయ్య వగైరా .ఇంతమంది సంగీత విద్వాంసులలో క్రొత్త విద్వాంసుడిగా త్యాగరాజుగారికి పేరు రావటానికి కారణం ఆయన అలౌకిక ప్రతిభ .అప్పటికే దేశ దేశాంతర కీర్తి పొందిన త్యాగయ్య గారిని  గురువు గారు పిలిపించి తిరువాయార్ గాయక సమావేశం లో త్యాగయ్యగారితో పాడించారు.అద్బుతంగా గానం చేసి సుభాష్ అనిపించుకొన్నారు ‘’దొరకునా ఇటు వంటి సేవ ‘’కీర్తన మహా రంజుగా పాడిఅందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు .వెంకట రమణయ్యగారు శిష్యుని గాన పాండిత్యాన్ని మనసారా అభినందించి ,ఆస్థాన గాయకుడైన తన తండ్రి వెంకట సుబ్బయ్య మొదలైన ఆస్థాన విద్వాంసుల సమక్షం లో పాడమనగా కాంభోజి రాగం లో ‘’మరిమరి మొరలిడి నానే ‘’  కీర్తన రసరమ్యంగా పాడి పరవశులను చేశారు .ఈ వార్త శరభోజీ మహారాజుకు చేరి సగౌరవంగా ఆహ్వానించగా ‘’నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి చాల సుఖమా నిజముగదెలుపు  మనసా ‘’  అనే కృతి రాసి ,దర్బారుకు వెళ్ళటానికి విముఖత చూపారు .ఆజ్ఞా ధిక్కారంగా భావంచి బంధించి భటులను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించగా ,’’కడుపు శూల ‘’వ్యాధి తో గిలగిలలాడాడు .సిరిరా మోకాలు  అడ్డినందుకు అన్న జపేశం కోపగించి ‘’నీ భజన బట్టకాయెనా,పొట్ట కాయెనా’’అని ని౦దించాడు .

  గురు ముఖంగా నేర్వని విద్య వ్యర్ధం అని భావించి ‘’గురువు లేక ఎటు వంటి గుణి కి తెలియగబోదు’’కీర్తన రాశారు .మాతామహుడు వీణ కాళహస్తయ్య చనిపోయాక’’నారదీయ ‘’గ్రంథం లభించగా అర్ధంకాక పొతే రామాన౦ద యతి ‘’నారదోపాస్తి ‘’మంత్రోపదేశం చేయగా ,నారదమహర్షి దర్శనమిచ్చి పంచనదీశ్వరాలయానికి తీసుకు వెళ్లి ,’’స్వరార్ణవం’’గ్రంథం ఇచ్చి ,సకలశాస్త్రార్ధం  అవగతం అవుతుందని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు

  ‘’ ఆత్మమధ్యగతః ప్రాణః ప్రాణ మధ్యగతో ధ్వనిః-ధ్వని మధ్యగతో నాదః నాదమధ్యే సదాశివః ‘’ అనే శ్లోకభావంగా ‘’రాగ సుధారస పానము ‘’అనే కీర్తనరాశారు త్యాగయ్య .స్వరార్ణవం లోని మూర్చనలపేర్లకు ఇప్పుడు ,ప్రచారం లో ఉన్న వాటి పేర్లకు చాలా తేడాలున్నాయి .తననారద భక్తి ప్రకటనకు ‘’శ్రీనారద సరసీ రుహ భ్రు౦గ’’,’’నారద గురుగుహ ‘’,నారద గురు స్వామి ‘’మొదలైన కీర్తనలు రాసి నారదాంకితం చేశారు   త్యాగబ్రహ్మ .తనమాయరూపాన్ని త్యాగయ్య పసికట్టాడని గ్రహించి త్యాగయ్యకు ‘’రామ తారక మంత్రం ‘’నారదుడు ఉపదేశి౦చగా ‘’ఎంత భాగ్యమో ‘’,’’సందేహమును దీర్పుమయ్య ‘’కృతులురాసి కృతజ్ఞత తెలుపుకొన్నారు నారద గురువుకు శిష్య త్యాగబ్రహ్మ .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

image.png

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-19-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా వంశీకుడైన సంగీత్జుడు గబ్బిట యగ్గ న్న శాస్త్రి

మా వంశీకుడైన సంగీత్జుడు గబ్బిట యగ్గ న్న శాస్త్రి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఫిన్నిష్ సాహిత్యం -1

ఫిన్నిష్ సాహిత్యం -1

ఫిన్లాండ్ దేశ సాహిత్యమే ఫిన్నిష్ సాహిత్యం .యూరోపదేశం లోమధ్య యుగం లో 13వశతాబ్దం లో  నవ్ గోర్డ్ నుంచి వచ్చిన ‘’ బిర్చ్ బార్క్ లెటర్ 292 ‘’మాత్రమే ఫిన్నిష్ సాహిత్యానికి చెందినది .రష్యాలోని ఒలోనేట్స్ ప్రాంతం లో మాట్లాడే ఫిన్నిక్ భాషా మాండలికమైన’’ క్రిల్లిక్’’ లో ఇది రాయబడింది .ఫిన్నిష్ మధ్యయుగకాలం లో ఫిన్లాండ్ లో రచనలు స్వీడిష్ కాని లాటిన్ భాషలోకాని రాసేవారు .16వ శతాబ్దం నుంచి నెమ్మదిగా ఫిన్నిష్ సాహిత్యం ప్రారంభమైంది .రాసే విధానం మాత్రం బిషప్ ,ఫిన్నిష్ లూధరన్ సంస్కర్త 1510-1567కుచెందిన మైకేల్ అగ్రికోలా తో ప్రారంభమైంది .1548లో ఈయన న్యు టెస్టమెంట్ ను ఫిన్నిష్ భాషలోకి అనువదించాడు .

  19వ శతాబ్ది ప్రారంభం లో ఫిన్లాండ్ రష్యా లో భాగమైనప్పుడు విద్య,జాతీయతలపై ఆసక్తి పెరిగి ఫిన్నిష్ జానపద సాహిత్యం విస్తృతంగా వచ్చింది .క్రమగా స్వీడిష్ భాషావ్యామోహం తగ్గి తమదైన ఫిన్నిష్ భాషకు పట్టం కట్టాలన్న ఆలోచన అన్ని వైపులనుంచి ఉధృతంగా వచ్చింది .వేలాది జానపదగీతాలను సేకరించి ‘’సుయోమేన్ కంసాన్ వాన్ హట్ రనాట్’’అంటే ప్రాచీన ఫిన్నిష్ ప్రజల కవితలు పేరిట సేకరించి భద్రపరచారు .కలేవాలా అనే ప్రముఖ కవితా సంకలనం మొదటి సారిగా 1835లో వెలువడింది .1870లో ఫిన్నిష్ భాషలో మొదటినవల ‘’సెవెన్ బ్రదర్స్ ‘’అలెక్సిస్ కివి (1834-1872)రాశాడు .1919లో ఫ్రాన్స్ ఈమిల్ సిన్నాపా(1888-1964 ‘’మీకా హెరిటేజ్ ‘’నవలరాసి ఫిన్నిష్ భాషా సాహిత్యం లో మొదటి నోబెల్ బహుమతి పొందాడు .ఇతనితర్వాత ప్రసిద్ధుడు వైనోలిన్నా .

   1909-1979కి చెందిన మిక్కా వాల్టారి ‘’మైకేల్ ది ఫిన్ ‘’,’’ది సుల్తాన్స్ రెనిగేడ్’’ రచనలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి .పావో హవిక్కో,ఈవా లిసా మనర్ ల  తో ప్రారంభమై 1960లో ఫిన్నిష్ కవిత్వం టి. ఎస్. ఇలియట్ , ఎజ్రా పౌండ్ కవిత్వ ప్రేరణతో   ఫిన్నిష్ భాషలో గొప్పకవిత్వం రాశారు.ఈ ధోరణలో ప్రసిద్ధమైనకవి ఈనోలీనో టిమోకె.ముక్కా(1944-1973).ఈతనిని ‘’వైల్డ్ సన్ ఆఫ్ ఫిన్నిష్ లిటరేచర్ ‘’అంటారు .21వ శతాబ్ది ప్రముఖ రచయితలలో మిక్కో రిమినేన్ ,లీనాక్రోన్ లు .క్రోన్ ఫిన్లాండ్ ప్రైజ్ ను 1992లో అందుకొన్నాడు .2000 లో ఇదే ప్రైజ్  జోహన్నా సిన్సాలో కు  దక్కింది .

    సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డేనిష్ భాషా సాహిత్యం

డేనిష్ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది .ఈ భాష డెన్మార్కు దేశ భాష .13 వ శతాబ్దికి పూర్వం ఈ భాష ‘’రూనిక్ ‘’లిపిలో వ్రాయబడేది. క్రీ శ. 1300లో లాటిన్ లిపి ప్రవేశపెట్టబడింది .లాటిన్ లిపిలో మొదటగా మూడు న్యాయ శాస్త్ర గ్రంథాలు మూడు వేర్వేరు మాండలికాలలో  రచి౦ప బడినాయి .అంటే అప్పటికి డేనిష్ భాషకు దేశీయ సాహిత్యభాష ఇంకా  యేర్పడలేదన్నమాట .క్రీ,శ.1200లో దేశం లో క్రైస్తవం ప్రవేశించగా ఆ దేశానికి పడమటి యూరోపియన్ సాహిత్యం తో పరిచయమేర్పడింది .యూరప్ దేశ పౌరాణిక గాథలు లాటిన్ నుంచి 14వ శతాబ్దం లో డేనిష్ భాషలోకి అనువాదం పొందాయి .ఆ యుగం లో వెలువడిన సాహిత్యం లో జానపద సాహిత్యమే అగ్రస్థానం పొందింది .1591లో ఈసాహిత్య లోని  100జానపద గేయాలను  ‘’యా౦డర్స్ సోరస్సన్ వేడెర్ ‘’మొదటిసారిగా సంకలనం చేశాడు .

 

image.png

16వ శతాబ్దానికి జానపదం తో పాటు మానవతావాదం కూడా సాహిత్యం లో స్థానం పొందింది .ఈమార్గ౦ లో నడిచినవాడు క్రిస్టియరల్ పీడర్సేన్ .ఇతడు 1554లో మరణించాడు.ఇతడేబైబిల్ ను మొదటగా డేనిష్ భాషలోకి అనువాదం చేశాడు .లౌకిక సారస్వతం లోమొదట కనబడేది . 1555కు చెందిన  హెమ్మెన్  హీగర్ జర్మన్ కావ్యాన్ని డేనిష్ లోకి  చేసిన అనువాదం  మెచ్చదగినది ..రినై సెన్స్  కాలం లో డేనిష్ సాహిత్యం లోనూ యూరోపియన్ సాహిత్యం తో పాటు కొత్త చైతన్యం వచ్చింది . ఆనాటి కవులలో 1634-1703కు చెందిన థామస్ కి౦గోఅనే ప్రార్ధనా గీతాలరచయిత ప్రముఖుడుగా చెప్పవచ్చు .వచన రచనలు కూడా అప్పుడు చాలా వచ్చాయి .భాషా శాస్త్రం ,భాషాచరిత్ర లలో కృషి చేసిన ఓల్ వరన్,ఎరిక్ పొంటో స్పిడన్,పీడర్ సైవ్ లు ప్రసిద్ధులు .మహిళా రచయితలలో లియోనారా క్రిస్టి నావుల్ ఫెల్ట్,బ్రిజిటీ తోట్ ప్రఖ్యాతులు ఫెల్ట్ 20 ఏళ్ళ తన జైలు జీవితాన్ని గుండెలు కరిగేట్లు చిత్రించింది .లాటిన్ భాషలో ఉన్న తత్వవేత్త ‘’సెనెకా ‘’రచనలకు బ్రిజిటీ డేనిష్ భాషాను వాదం చేసింది .

18వ శతాబ్ది పూర్వార్ధం లో ఉన్నకవులలో లడ్విక్ హాల్  బెర్గ్(1684-1754) ను’’ డేనిష్ సాహిత్య పిత ‘’ అంటారు .అనేక ప్రహసనాలు ,34 సుఖాంత నాటకాలు ,చాలా నవలలు రాశాడు .డేనిష్ సాహిత్యం ఇతని వలన సుసంపన్నమైంది .ఆయుగం లో ఇతనితర్వాత ప్రముఖ రచయిత క్లోప్ స్టాక్ .  జర్మన్ సాహిత్యఉత్తమ  లక్షణాలన్నీ  డేనిష్ సాహిత్యం లోకి ప్రవేశపెట్టి ఆ సాహిత్య విలువను అన్ని విధాలా పెంచి చిరస్మరణీయత కలిగించాడు .

1801నుంచి 1864 వరకు డేనిష్ సాహిత్యానికి స్వర్ణయుగం .క్రైస్తవ సాహిత్యం ,జాతీయతాభావం ,మానవ ప్రేమ త్రివేణీ సంగమ౦గా కాల్పనిక సాహిత్యంతో పెనవేసుకొని డేనిష్ సాహిత్యాన్ని అత్యున్నత  స్థాయికి తెచ్చాయి .యాడెం ఓక్లెం ,ఫ్లేగర్ నికోలాయ్ , ఫ్రెడరిక్ నెవెరిన్,గ్రాండ్ విగ్  మహా కవులు ఆ యుగానికి వన్నె  తెచ్చారు ,మార్గ్ గ్రండ్యరు .ఓక్లెం కవి వివిధ ప్రక్రియలతో డేనిష్ సాహిత్యాన్ని కొత్తమార్గాలలో నడిపించాడు .గ్రాండ్ విక్ కవి జాతీయ భావాలను తనకవిత్వం లో నింపి నిరంతర సాహితీ కృషి తో జనాలకు  ప్రేరణ ,ప్రోత్సాహం స్పూర్తి కలిగించాడు .ఈ యుగం లో డేనిష్ సాహిత్యం నవ్యవాస్తవిక వాదానికి అత్యంత ప్రాముఖ్యత కలిగించింది .ఈ మార్గం లో నడచిన రచయితలలో పాల్ మార్టిన్ మొల్లర్,జూట్ స్టీవ్ ,స్టీవ్ వెన్ బ్లిచ్చర్ .గొప్ప నవలాకారులు ,ధాన్ సీన్ జిల్లెం బెర్గ్, ఎహరన్ స్వర్డ్  కథా రచయితలు .ఆనాటి నాటక రచయితలలో సుప్రసిద్ధుడు జోహన్ లడ్విక్ హై బెర్గ్ .ఈయన రాసిన   ‘’ఎల్వర్ హోజ్ (దేవ శిఖరి ) ,సివ్ హోవర్డక్ రూపకాలు అత్యుత్తమ స్థాయి కి చెందినవిగా గుర్తింపు పొందాయి .వీరి కంటే అత్యుత్తమ ,విలక్షణ రచనలతో డేనిష్ సాహిత్యాన్ని వైభవ స్థితికి తెచ్చినవాడు హాన్స్ హా౦డర్సన్ (1805-1875).ఫిక్షన్ రచనలో ఈయన్ను మించినవారు డేనిష్ సాహిత్యరచయితలలో  లేనేలేరు .

నవ్య సంప్రదాయ మార్గాన్ని అనుసరించినవారిలో 1842-1927 కు చెందిన జార్జి బ్రా౦డిల్ ప్రధముడు ,ప్రముఖుడు ..ప్రఖ్యాత విమర్శకుడుగా కూడా ఈయనకు పేరుంది .తర్వాత రచయితలకు ఈయనే మార్గ దర్శి .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత డేనిష్ సాహిత్యం లో నవలా రచన బాగా ప్రాచుర్యం పొందింది .ఈ మార్గ గామి ‘’టాం క్రిస్టెన్ సన్’’ విశేష కీర్తి పొందాడు .గేయ కవులలో హాఫ్ మన్స్,హాసెన్ లు ప్రసిద్ధి చెందారు .రూపక రచయితలలో నాథన్ సెన్ ,కేరల్ గండ్రప్ లు గణనీయులు .

1917కార్ల్ అడాల్ఫ్ జేల్లరప్ ,హెన్రి క్ పొంటోప్పిడాన్ లకు సంయుక్తంగా సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .1944లో నోబెల్ ప్రైజ్ విన్నర్ కార్ల్ పీటర్ హెన్రిక్ డాం.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-19-ఉయ్యూరు

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

ఆస్ట్రేలియన్ సారస్వతం -2(చివరిభాగం )

ఆస్ట్రేలియన్ రచయితలలో అంతర్జాతీయ ఖ్యాతి పొంది నోబెల్ ప్రైజ్ పొందినవాడు పాట్రిక్ వైట్ . క్రిస్టినా స్టేడ్ ,డేవిడ్ మలూఫ్ ,పీటర్ కార్వే, బ్రాడ్లీ క్లేవేర్ గ్రీవ్, ధామస్ కేనల్లీ ,కొలీన్ మెక్ కలోఫ్ ,నెవిల్ షూట్ ,మారిస్ వెస్ట్ లు కూడా లబ్ధ ప్రతిష్ట రచయితలే .సమకాలీన రచయితలలో ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ,ఆర్ట్ హిస్టోరియన్ రాబర్ట్ హగ్స్ ,హాస్య రచయితలు బారీ హంఫ్రీస్ ,క్లైవ్ జేమ్స్ లున్నారు .

  క్లాసిక్ ఆస్ట్రేలియన్ రచయితలలో కవులు  హెన్రి లాసేన్,బాన్జో పేటర్సన్,  సిజె డెన్నిస్,డోరోతియామాకేల్లర్ ప్రసిద్ధులు .డెన్నిస్ ఆస్ట్రేలియన్ వ్యావహారిక భాషలో రాస్తే ,మాకేల్లర్ ‘’మై కంట్రి’’కావ్యం రాసిన దిగ్గజం .ప్రసిద్ధ బులెటిన్ డిబేట్ లో లాసన్ ,పేటర్సన్ లు ఆస్ట్రేలియా జీవిత విధానం పై పోటీపడి  రొమాంటిక్ కవులను మించిపోయారు .లాసన్   చిన్న కథల గొప్ప ఆస్ట్రేలియా రచయితగా ప్రాభవం పొందాడు .పేటర్సన్ కవితలు పాప్యులర్ ఆస్త్రేలియన్  ‘’బుష్ పోయెమ్స్’’ గా కీర్తి పొందాయి. 20వ శతాబ్దపు కవులలో డెం మారీ గిల్ మోర్,కెన్నెత్ సీసర్,ఎ.డి. హాప్,జూడిత్ రైట్ అగ్రస్థానంలో ఉన్నారు .సమకాలీనకవులలో ప్రసిద్ధులు లెస్ ముర్రే ,బ్రూస్ డావ్.వీరి కవితలను ఆస్త్రేలియన్ హై స్కూల్స్ లో   పాఠ్యా౦   శాలుగా విద్యార్ధులు చదువుతున్నారు .

  క్లాసిక్ నవలా రచయితలలో మార్కస్ క్లేర్క్ మంచి మార్కులు పొందాడు. ఇతని ‘’ఫర్ ది టర్మ్ ఆఫ్ హిజ్ నేచురల్ లైఫ్ ’’ నవల కు మంచి క్రేజ్ ఉంది . ‘’మై బ్రిలియంట్ కెరీర్ ‘’నవలారచయిత మైల్స్ ఫ్రాన్క్లిన్ ,’’ది ఫార్త్యూన్స్ ఆఫ్ రిచార్డ్ మహోని ‘’రచయితహెన్రి హాన్డేల్ రిచర్డ్సన్,’’సచ్ ఈజ్ లైఫ్ ‘’నవలాకారుడు జోసెఫ్ ఫర్ఫి,’’రాబరీ అండర్ ఆర్మ్స్ ‘’నవలా రచయిత రోల్ఫ్ బోల్దర్ వుడ్ ,’’ది హార్ప్ ఇన్ ది సౌత్ ‘’రచయిత రూత్ పార్క్ లు మంచి గిరాకీలో ఉన్నారు .

   బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో ‘’ది మాజిక్ పుడ్డింగ్ ‘’రచయిత నార్మన్ లిండ్ల్సే,’’పోస్సం మాజిక్ ‘’రాసిన మెం ఫాక్స్ ,’’స్నగ్గీపాట్ అండ్ కుడ్డీ పై’’రచయిత మే గిబ్స్ లు  క్లాసిక్ బాలసాహిత్య రచయితలుగా గుర్తింపు పొందారు .’’లుకింగ్ ఫర్ అల్బ్రాంది ‘’ మోడరన్ క్లాసిక్ .దీని రచయిత  మేలీనా మార్కేట్టా.ప్రఖ్యాత నాటక రచయితలుగా స్టీలీ రడ్,డేవిడ్ విలియంసన్ ,అలాన్ సే మోర్ ,నిక్ ఎన్రైట్ నాటకాలకు మంచి పేరు ఉన్నది .

   మేజర్ సిటీలకు దూరంగా చాలా మంది జనాభా ఉంటారు .ఆస్త్రేలియన్ కథలు ,పురాణాలనే లెజెండ్స్ అన్నీ ఆస్ట్రేలియా అవుట్ బాక్ లో ,డ్రోవర్స్( పశువుల కాపరుల).స్క్వాటర్స్అంటే కబ్జా దారుల ,బంజరు భూముల్లో ,మురికి మైదాన ప్రజల జీవితాలలో నుంఛి పురుడు పోసుకొన్నవే .ఆస్త్రేలియన్ ఆదిమ సంతతి రచయిత డేవిడ్ ఉనాపియన్ .మొట్టమొదటి సారిగా కవిత్వాన్ని ప్రచురించిన ఆదిమ సంతతి కవి ఊడ్జేరూ నునౌకల్ .స్టాలీ మోర్గాన్స్ రచన ‘’మై ప్లేస్ ‘’లో తరతరాల తన  సంతతివారి కధలు గాధలు అనుభవాలు  నిజాయితీగా నిర్భయంగా చిత్రించాడు .  ఆస్త్రేలియన్ చారిత్రిక రచయితలలో చార్లెస్ బీన్ ,జాఫ్రి బ్లైనీ ,రాబర్ట్ హగ్స్ ,మాన్నింగ్ క్లార్క్ ,క్లైరీ రైట్ ,మార్సియా లాంగ్టన్ ముఖ్యులు .

    ఆస్ట్రేలియా ను వదిలి 1960లో బ్రిటన్ ,అమెరికాలలో సెటిలైన ఆస్త్రేలియన్ రచయితలు నిరంతరంగా తమ దేశ సాహిత్యాన్ని పండిస్తూనే ఉన్నారు .వీరిలో క్లైవ్ ,జేమ్స్ ,రాబర్ట్ హగ్స్ ,బారీ హంఫ్రీస్ జెఫ్రీ రాబర్త్సన్ ,జెర్మేన్ గ్రీర్ లున్నారు .వీరిలోచాలామంది సిడ్నీలోని సిడ్నీ పుష్  మేధావివర్గసభ్యులు  .’’ఓజ్ ‘’అనే సెటైరికల్ మాగజైన్ లో రాస్తుంటారు.బ్రిటన్ లో స్థిరపడిన క్లైవ్ జేమ్స్ లీడింగ్ హ్యూమరిస్ట్ .ఆస్ట్రేలియా నేపధ్యంగా గొప్ప సెటైర్ రచనలు చేసి పాప్యులర్ అయ్యాడు .ఇటీవలే రాసిన ‘’కల్చరల్ ఆమ్నేషియా ‘’  కు మంచి పేరొచ్చింది  .రాబర్ట్ హగ్స్ ‘’ది ఫాటల్ స్టోర్ ‘’వంటి చారిత్రాత్మక రచనలెన్నో  చేశాడు .

  బారిస్ హంఫ్రీ  తన డడాయిస్ట్ నాటకానుభవంతో 1960నుంచి లండన్ లో బ్రిటిష్ టెలివిజన్ లో కలంతో దున్నేశాడు .తర్వాత అమెరికాలోనూ ప్రసిద్ధుడయ్యాడు .ఈయన  డెం  ఎడ్నా ఎవిరేజ్ ,బారీ మెకంజీ ,లెస్ పాటర్సన్ లపై రాసిన ఆస్త్రేలియన్ కారి కేచర్స్ బాగా ప్రసిద్ధమై పుస్తకరూపం పొందాయి .5దశాబ్దాల నాటక ,సినీ అనుభవమున్న ఈతని జీవిత చరిత్రరాసిన అన్నే పెండర్ 2010లో చార్లీ చాప్లిన్ తర్వాత అంతటి హాస్యనటుడు అని కితాబిచ్చాడు .ఆయన స్వీయ రచనలలో డెం ఎడ్నా బయాగ్రఫీస్ ,మై గార్జియస్ లైఫ్ ,హాన్డ్లింగ్ఎడ్నా,తన బయోగ్రఫీ ‘’మై లైఫ్ ఆజ్ మీ ఎ మెమాయిర్ ‘’ఉన్నాయి .జాఫ్రి రాబర్ట్సన్   ప్రముఖ అంతర్జాతీయ మానవహక్కుల లాయర్ ,రచయిత,బ్రాడ్ కాస్టర్.ఈయన రాసినపుస్తకాలలో ‘’ది జస్టిస్ గేమ్’’,క్రైమ్స్ ఎగనస్ట్ హ్యుమానిటి మంచి ప్రచారం పొందాయి .ప్రముఖ ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ‘’ది ఫిమేల్ యూనక్ ‘’( the female eunuch )అనే పుస్తకం రాసింది . ఇంగ్లాండ్ లో ఉంటున్నా అధ్యయనం విమర్శ విశ్లేషణ మాతృదేశం పై వీరాభిమానం ఏ మాత్రం తగ్గలేదు .ఈమె ఇటీవలి రచనలు ‘’వైట్ ఫెల్లా  జంప్ అప్’’,’’ది స్టోరీస్ వే టు నేషన్ హుడ్’’

   ఇంగ్లీష్ కాకుండా ఇతర ఆస్ట్రేలియన్ సాహిత్యం

ఆస్ట్రేలియా అనేక దేశాల వలస జాతుల సముదాయం .ఇటాలియన్ గ్రీక్ ,అరెబిక్ చైనీస్ ,వియత్నమీస్ లావోస్ ,ఫిల్పినో , లాట్వియన్ ,యూక్రేనియన్,పోలిష్ రష్యన్ సెర్బియన్ ,ఇద్దిష్, ఐరిష్ జాతులవారున్నారు .మైనారిటీలైన వీరుతమతమ భాషల్లో కవిత్వం కథలు రాసుకొంటారు .తమ పండుగలను చేసుకొంటారు .జాతీయ స్రవంతిలో కలవరు,వారి పత్రికలు మేగజైన్లున్నాయి .అందులో విమర్శ విశ్లేషణ ప్రచురణ చేసుకొంటారు .ఇంగ్లీష్ కాక ఇతర పురాతన సాహిత్యం ఇటీవల అనువాదం పొంది విమర్శనాత్మక చారిత్రాత్మక గుర్తింపు పొందాయి .చైనీస్ భాషలో మొదటినవల వాంగ్ షీ పింగ్ 1909 లో రాసిన ‘’డి పాయిజన్ ఆఫ్ పోలిగమి’’ ఆస్ట్రేలియా లో 2019లో  పబ్లిష్ అవటం విశేషం .పశ్చిమ దేశాలలో ఎక్కడా ఇలా పబ్లిష్ అయిన దాఖలాలు లేవు .

   ఐరోపాదేశాలలో లాగా ఆస్ట్రేలియా లో సైన్స్ ఫిక్షన్ విస్తృతంగా రాలేదు .నెవిల్ షూట్ రాసిన ‘’ఆన్ ది బీచ్ ‘’1957లో పబ్లిష్ అయి 59లో సినిమాగా వచ్చింది .ఇది అంతర్జాతీయ విజయంగా భావిస్తారు .క్రైమ్ ఫిక్షన్ కెర్రి గ్రీన్ వుడ్ ,షేన్ మెలోని , పీటర్ టంప్లె ,ఆర్ధర్ అప్ ఫీల్డ్ ,పీటర్ కారిస్ మొదలైనవారు రాశారు  .మూడుకోర్టు కేసులపై రచనలు వచ్చాయి .ఆదిమజాతి మనిషి కామెరాన్ డూ మద్గ్రీ పోలీస్ కస్టడి లో  చనిపోవటం పై  ‘’ది టాల్ మాన్ డెత్ అండ్ లైఫ్ ఆన్ పాం ఐలాండ్ ‘’క్లో హూపర్ రాసి 2008లో ప్రచురించాడు .

    మేగజైన్లు

ది ఆస్త్రేలియన్ మేగజైన్ ,1821లో ప్రార౦భ మైఒక్క ఏడాది నడిచింది .దీనిలో కవిత్వం కథలు వ్యాసాలూ ,సాధారణ విషయాలు వచ్చేవి .ఇవాళ ఎక్కువ మేగజైన్లను యూనివర్సిటీలు ప్రచురిస్తున్నాయి .అందులో మీజిన్ ,ఓవర్ లాండ్ ,హీట్ ,సదర్లి ,వెస్టర్లి వంటివి ఉన్నాయి .మిగతా జర్నల్స్ లో ముఖ్యమైనవి –క్వాడ్ర౦ట్ , ఆస్ట్రేలియన్ బుక్ రివ్యు ,ఐలాండ్ ,వాయిస్ వర్క్స్,కిల్ యువర్  డార్లింగ్స్ వగైరా .

  సాహిత్య అవార్డ్ లలో ప్రముఖమైనవి –అన్నే ఎల్డర్ అవార్డ్ ,చిల్డ్రన్స్ బుక్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ,డిట్మార్ అవార్డ్ ఫర్ సైన్స్ ఫిక్షన్ ,కెన్నెత్ స్లీజర్ అవార్డ్ ఆఫ్ పోయెట్రి ,పీటర్ బ్లాజీ ఫెలోషిప్ ,స్టెల్లా ప్రైజ్ ,విక్టోరియన్ ప్రీమియర్ లిటరరిఅవార్డ్ వగైరా .,బుకర్ ప్రైజ్,మాన్ బుకర్ అవార్డ్ ,ఆరంజ్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డ్ లకు ఆస్త్రేలియన్ రచయితలూ అర్హులే

.  నోబెల్ ప్రైజ్ పొందిన రచయితలు-బియాన్ ఫై స్క్మిద్ట్ ,ఎలిజబెత్ బ్లాక్ బరన్ ,బారీ జే మార్షల్ ,జే రాబిన్ వార్రెన్ ,జేఎం కొడ్జీ ,పీటర్ దోహేర్తి,జాన్ హార్సాని ,జాన్ కంఫోర్త్ ,పాట్రిక్ వైట్ ,సర్ బెర్నార్డ్ కార్త్జ్ ,అలేక్జానర్ ప్రోఖ్రోవ్ ,సర్ జాన్ కారీ ఎక్క్లెస్ఫ్రాంక్ మార్కెన్ బార్నెట్ ,హవార్డ్ ఫ్లోరీ .అంతర్జాతీయ అణ్వాయుధ నిషేధ ప్రచారానికి ఆస్ట్రేలియా దేశానికి 2017లో నోబెల్ శాంతి అవార్డ్ వచ్చింది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు

 

image.png

— మొదటి నోబెల్ ఫ్రీజ్ విన్నర్ -పాట్రిక్ వైట్

image.png

మొదటి ఆదివాసీ రచయిత-యునేపియన్


image.png
ఆదివాసీ లాయర్ పియర్సన్ 
 
image.png
బేరి హంఫ్రీస్ 
image.png
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం –నందలూరు

దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది
నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన రాజంపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.

గ్రామచరిత్ర[
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ’’ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు’’.[3].

ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట కింద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.

పేరు వెనుక చరిత్ర
ఈ గ్రామానికి పూర్వం తొండమండలం, నిరంతపురం, చొక్కనాథపురం అనే పేర్లు ఉండేవి. నిరంధర అనే మహారాజు నిరంతపురం అనే గ్రామాన్ని నిర్మించగా అది బాహుదా నది వెల్లువలో కొట్టుకుపోగా తరువాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ ప్రదేశాన్ని సందర్శించి నెలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్టు మెకంజీ కైఫీయత్‌లో పేర్కొనబడింది[4]. పూర్వం ఒక తెలుగు చోడ ప్రభువు గోహత్య పాప నివారణార్థం బాహుదానదీ తీరం వెంబడి 108 శివాలయాలను నిర్మించాడు. ఆ దేవాలయాలలో నంది విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ నది గట్టున ఉన్న గ్రామానికి నం(ది)దుల ఊరు అనే పేరు వచ్చిందనీ అదే వ్యవహారికంలో నందలూరుగా మారిందని మరొక ఐతిహ్యం[5].

చూడదగ్గ ప్రదేశాలు
సౌమ్యనాథ స్వామివారి ఆలయం
11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వార్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీ సౌమ్యనాథుని చొక్కనాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగు శాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.

ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ]

దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్‌ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్‌ విన్నగర్‌ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్‌ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది.

ప్రత్యేకత
బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఎటువంటిదీపంలేకున్నా..
ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు.

దేవాలయంలోమరోఆలయం
ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్నది శివాలయంగా చెప్పుకుంటున్నారు.

మత్స్య,సింహంచిహ్నాలు
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు.. లోపల సీలింగ్ పై ఒక పెద్ద మ త్ష్యం చెక్కబడింది . భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ,ప్రళయం సంభవించినా ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.లేక ప్రళయం సంభవించినప్పుడు
పైభాగంలోఈచేపకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. .

ఆలయ నిర్మాణం
ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది.

. శాసనాలు

ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు.

కోర్కెలుతీర్చేదేవుడు
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది.

శ్రీ మహా విష్ణువు నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ,మహోగ్రరూపం గా కొంతకాలం తిరిగి ఉగ్రం తగ్గి సౌమ్యుడిగా మారి ఇక్కడ వెలిశాడని అతిహ్యం .

ఈ గ్రామం లోనే శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయంకూడా ఉన్నది .దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది
నందలూరు కు సమీపం లో ఒంటిమిట్టకు దగ్గరలో చేయ్యుర్ లో ఉన్న శివాలయం లో కార్తీకమాసం మూడవ సోమవారం శివలింగం లోకి నీరు చేరుతుందట .మిగతా ఎప్పుడూ అక్కడ నీటి జాలు ఉండదట .ఇదొక విశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప

‘’ కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ చ : కప్పుర మియ్యఁగరాదా కడపరాయా – నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయ కప్పుమివే కుచములు కడపరాయా – వో కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ చ : కందువకు రారాదా కడపరాయా – ముందే గందమిచ్చినవాఁడవు కడపరాయ కందము నీమాటలిఁకఁ గడపరాయా – వో కందర్పగురుఁడ మొక్కేఁ గడపరాయ చ : కలసితివిటు నన్నుఁ గడపరాయా – నా కల నేఁడు నిజమాయఁ గడపరాయ కలదాననే నీకుఁ గడపరాయా – వో కలికి శ్రీవేంకటాద్రి కడపరాయ అని అన్నమయ్య కొలిచిన దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం.

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.

ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు.ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.

గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.

క్షేత్ర ప్రాశస్త్యం
దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది.

తిరుమలవరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.

ఉత్సవాలు
దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు.

40, 50 సంవత్సరాలక్రితం వరకు కడప జిల్లాలోని కోడూరు ప్రాంతం నుంచి తిరుమల లోని గోగర్భం వరకు కాలిబాట వుండేది. తిరుపతి ప్రాధాన్యత తగ్గకూడదన్న విషయంపై పలు చర్చల అనంతరం కోడూరు నుంచి వున్న అడ్డదారి గురించి వెలుగలోకి రాకుండా చేశారు. త్రేతాయుగంలో శ్రీ రాముడు సీతాదేవిని వెతుకుతూ వింధ్య పర్వతాల నుండి బయలుదేరి ఆంధ్రతీర ప్రాంతాల నుంచి బయనిస్తూ దట్టమైన అరణ్యంలో రాక్షస సంచారం ఎక్కువగా వుండడం వలన దారిపొడవునా హనుమంతుని చిత్రాలు గీస్తూ వెళ్లాడని చరిత్రకారులుచెబుతున్నారు. ఆ విధంగా పెద్ద బండరాయిపై గీసిన చిత్రం నేటికీ దేవునికడపలో వుంది. నేటికీ చరిత్ర చెప్పిన సాక్ష్యాల ప్రకారం ముందుగా దేవునికడపకు హనుమత్‌ క్షేత్రం పేరు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం కలిప్రవేశం జరిగిందని కృపాచార్యులు కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకుందామని వింధ్య పర్వతాల నుంచే కాలి నడకన బయలుదేరారు. అలా నడుచుకుంటూ వచ్చిన కృపాచార్యులు హునుమత్‌ క్షేత్రం వచ్చిన తరువాత ఆయన ప్రయాణం ముందుకు సాగలేదు. అలాంటి దశలో కృపాచార్యులు ఏ హనుమత్‌ క్షేత్రం వద్దకు వచ్చిన తరువాత ఆయన ప్రయాణం ముందుకు సాగలేదు. అలాంటి దశలో కృపాచార్యులు నా బోటి వారికే దర్శనం కష్టంగా వుందని తలచి శ్రీవెంకటేశ్వరును ప్రార్థించారు. కృపాచార్యునికి హనుమత్‌ క్షేత్రంలో వెంకటేశ్వరుడు దర్శనమిచ్చి తమ దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా హనుమత్‌ క్షేత్రంలో తమను దర్శించుకొని తిరుమలకు వస్తారని కృపాచార్యులకు చెప్పారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పుడు కృపాచార్యులు స్వామి అనుమతితో లక్ష్మీ వెంకటేశ్వర్లు ప్రతిమలు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమలకు తొలి గడపగా హనుమత్‌ క్షేత్రం చివరి గడపగా వరాహ క్షేత్రాన్ని కొలుస్తున్నారు. నేటికీ కూడా తిరుమల కొండల క్రింద హనుమంతును పెద్ద విగ్రహం దర్శనమిస్తుంది. దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్‌ విగ్రహ వెనుకభాగంలో పెద్దరాతిపై హనుమంతుని విగ్రహం వుంది. దండకారుణ్యమైన ఈ ప్రాంతంలో రాక్షస సంచారం ఎక్కువగా వుండేదని అందువలన భక్తజన సంరక్షకుడిగా ప్రసన్న వెంకటేశ్వరునిగా ప్రసిద్ధుడైన స్వామిగా వెలసిన ప్రాంతమే దేవునికడప. దండకారణ్యంలో హనుమత్‌ క్షేత్రాలు ఎక్కువగా వున్నాయి. కృపాచార్యులచే ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుని ప్రతిష్ట జరిగిందని ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజలు కృపావతి మండలంగా పిలుస్తుండేవారు. పామరజనంనోట కృపావతిగా పిలువను రాక కురుపాయి , కడుపాయి, కడపగా మార్పు చెందింది. గత 70, 80 సంవత్సరాల క్రితం బ్రిటిషు పరిపాలనలో కలెక్టర్ల వద్ద పనిచేసే బిళ్ళ బంట్రోతుల వద్ద గల బిళ్ళలపై కడుపాయి తాలూకాగా వున్న నిదర్శనం వుంది. కడపకు వచ్చిన నెహ్రూ కూడా కడపను కడప అని సంబోధించక కుడుప్పాయి అని సంబోధించారు. ఈ ఆలయ పునరుద్ధరణకు కృషి చేసినవారు ఎందరో వున్నప్పటికీ 14వ శతాబ్ధం నుంచి కొంతమంది మహారాజుల పేరు చరిత్రకారులు పొందుపరచిన సమాచారంలో వున్నాయి. విజయనగర సామ్రాజ్య హరిహరరాయులు, బుక్కరాయులు, పాల్యం వంశీయుడైన నరసింహరాయులు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ రాయులు, స్వామి ఆరాధన కోసం అమూల్యమైన ఆభరణాలు, మడిమాన్యాలు, సమర్పించారు. నంద్యాల అహోబిలేశ్వర దేవమహారాజు స్వామి కైంకర్యాని కి భూదానం చేశారు. మగమండలేశ్వరుని తిమ్మయ్య దేవ మహారాజు ఉదయగిరి సీమలోని గ్రామానికి చెందిన రాబడిని ఈ ఆలయానికి ఇచ్చారు. ఆరణం సర్వప్ప స్వామికికిరీటం సమర్పించారు. చిన్న ఆవు బలరాజు స్వామికి పూలతోట కోసం భూమిని దానం చేశారు. ఈ వివరాలన్నీ ఆలయంలో వున్న శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. వెంకటేశ్వరుని వరప్రసాదాన జన్మించిన మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యుడు కడపలోనే కొంతకాలం వుండి కడపరాయుడైన వెంకటేశ్వరుని ప్రత్యక్షంగా సేవించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని స్వామి సన్నిధిలోని మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. తాండవ గణపతి శిల్పం మనోహరమైంది. ఆలయ రాజగోపురం మట్లిరాజుల కాలంలో నిర్మింపబడి నదిగా చెప్పబడుతోంది. గోపుర ద్వారాన ఇరువైపులా రాయలవంశీకుల శిల్పాలు వున్నాయి. ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మద్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.

ఇక్కడి శ్రీ సోమేశ్వరాలయం లోవర్షాలలకోసం సహస్ర ఘటాభి షేకం చేస్తారు .మంత్రపూతంగా 108 బిందెల నీరు స్వామికి అభిషేకం చేస్తే ,ఆలయం లో అభిషేకజలం యెంత ఎత్తున ఉంటుందో ,ఆతర్వాత ఎంతమంది ఎన్ని వందల బిందేలనీరు భక్తులు తెచ్చిపోసినా ఒక్క మిల్లీమీటరు కూడా అభిషేక జల మట్టం పెరగదు.అదీ ఇక్కడి సోమేశ్వరస్వామి మహాత్మ్యం అని ప్రత్యక్షం గా చూసిన ఒంటిమిట్ట డా శివకుమార్ మాకు చెప్పారు . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు

image.png

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4 (చివరిభాగం )

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4          (చివరిభాగం )

ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -3(చివరి భాగం )

6-మహాయోగి ,త్యాగి ,భక్త శిఖామణి ఆంద్ర వాల్మీకి శ్రీ వాసుదాసు

ఆంద్ర వాల్మీకి వాసుదాసు అనే శ్రీ వావికొలను సుబ్బారావు గారు ఈ క్షేత్రాభివృద్ధికి ఆధునిక కాలం లో యెనలేని కృషి చేశారు .,  ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి “ఆంధ్ర వాల్మీకి” బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.

గిడుగు వారి వ్యావహారిక భాష వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరి మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీసారు.

జీవితవిశేషాలు

వావిలికొలను సుబ్బారావు జనవరి 23, 1863 న రాయలసీమలోని కడప మండలం జమ్మలమడుగు లో  జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. ఏడేళ్ళ వయసు వచ్చ్చేదాకా మాటలు రాలేదు .తర్వాత వచ్చి చదువులో అందరికంటే ముందుండేవారు .ఆంగ్లపాఠశాలలో  ఎఫ్.ఏ.చదువుతూ ,తెలుగు ,సంస్కృతాలలో గట్టిపట్టు సాధించారు 1883లో ప్రొద్దుటూరు తాలూకా ఆఫీసులో నెలకు 7 రూపాయల జీతం తో డిస్పాచ్  గుమాస్తాగా చేరి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు.  ఇన్స్పెక్షన్ కు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనం చేయకుండా ,ఏదిచ్చినా తీసుకోక ఆదర్శంగా ఉద్యోగించారు .వీలులేకపోతే స్వయంగా వండుకు తినేవారు .

వివాహం

నెల్లూరు శ్రీ కాంచనపల్లి శేషగిరి రావు గారిపుత్రిక శ్రీమతి రంగనాయకమ్మనుపెద్దలు కుదర్చగా  వివాహమాడారు .వీరికి ఒక కొడుకు పుట్టినా చిన్నతనం లోనే చనిపోయాడు ‘.భార్య 1910లో పరమపదించారు .

గ్రంథ రచన

మొదటగా ‘’శ్రీ కుమారాభ్యుదయం ‘’అనే ప్రౌఢ ప్రబంధం25వ ఏట  రాశారు .నెల్లూరు ఆవిష్కరణ సభలో ఇంత పిన్నవయసులో మహా ప్రబంధ రచనా అని చిన్నా ,పెద్దా అనుకోవటం విని, ఆసభలోనే ఆశువుగా’’ శ్రీ తల్పగిరి  రంగ నాథ శతకం ‘’చిత్ర పదకల్పనా చాతుర్యంతో చెప్పగా ప్రక్కనున్న వారు రాశారు .అలాగే ఆతర్వాత ‘’కౌసల్యా పరిణయం ‘’బంధకవిత్వం తో సహా అనేక ప్రక్రియలతో రాశారు .శీర్షికలోనే అనేక తమాషాలుఅంటే శ్లేషలు  చూపారు

1-శ్రీ కుమారాభ్యుదయం =మన్మథచరిత్ర 2 -కుమారాభ్యుదయం =మన్మథచరిత్ర 3-మారాభ్యుదయము = మన్మథచరిత్ర 4- రామాభ్యుదయము = మన్మథచరిత్ర ఇలా ఒకొక్క అక్షరం తీసేసినా అదే అర్ధం  వస్తుంది .

లెక్చరర్ సుబ్బారావు

వావికొలను వారి పాండితీ ప్రకర్ష గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఆంద్ర ఉపన్యాసకునిగా1904 నియమించి గౌరవించింది .ఇక్కడే 16ఏళ్ళు 1920 వరకు పని చేశారు . ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు భారతదేశాన్ని చూడటానికి వచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూ కవితలు చెప్పమని బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని ఖరాకండిగా తిరస్కరించి తాను’’ రామదాసునే గాని కామదాసును’’ గానని తేల్చి చెప్పారు.

.’’ఆంద్ర భాషాభి వర్దినీ సమాజం ‘’స్థాపించి ఎందరినో భాషా సంస్కృతులలో నిష్ణాతులను చేశారు .ఇక్కడ పని చేస్తున్నప్పుడే ‘’ఆర్యనీతి,ఆర్య చరిత్ర రత్నావళి ,హిత చర్యమాలిక రాశారు. ఆనాడు ప్రతి పాఠశాలలో, గ్రంధాలయం లో వీరి రచనలు కనిపించేవి .ప్రతిదీ 20కంటే ఎక్కువ సార్లు పునర్ముద్రణం పొందటం విశేషం .విద్యార్దులకోసం ‘’సులభ వ్యాకరణం ‘’మూడు భాగాలుగా రాశారు .’’సుభద్రా విజయం ‘’నాటకమూ రచించారు. భగవద్గీతను ‘’ద్విపద భగవద్గీత ‘’గా  తెనిగించారు ‘

ఆంధ్ర వాల్మీకి

సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని’’ ఇరవై నాలుగు వేల ఛందో భరిత పద్యాలుగా’’ తెలుగులో సప్త కాండలుగా 1900లో వ్రాశారు. . ఇది అనితర సాధ్యమైన విషయం. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ )’’ 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం ‘’చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢ అర్ధాలు స్ఫురించాయి. ఆయన వ్రాసిన రామాయణాన్ని ఒంటి మిట్ట శ్రీ కోదండరామ స్వామి కి అంకితమిస్తూ 1908 అక్టోబర్ 9,10,11 తేదీలలోమహాజన  సమక్షం లో ఆవిష్కరింప జేశారు .మహాసభ  ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చారు.   సభలో మహాపండితులు ఆయనకు’’ ‘ఆంధ్ర వాల్మీకి’ ‘అని బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .

దివ్యానుభూతులు

ఒకరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వస్తుంటే ఆకలితో ఉన్న ఒకతను  అన్నం పెట్టమని అడిగితె ,ఇంట్లో వంట చేసేవారు లేకపోతె ఆ విషయం ఆలోచిస్తూ వెనక్కి తిరిగితే ఆ వ్యక్తి కనిపించలేదు .ఇంటికి వస్తే సిద్ధవటం తహసీల్దార్ జయరామ నాయుడు ‘’ఒంటిమిట్ట రామాలయం లో స్వామికి నిత్య నైవేద్య దీపారాధనలు జరగటం కష్టం గా ఉంది .మీరు పూనుకొని ఆలోటు పూరిస్తే బాగుంటుంది ‘’అని రాసిన ఉత్తరం కనిపించింది .తనను అన్నం అడిగింది సాక్షాత్తు రామ చంద్ర ప్రభువే అని అర్ధం చేసుకొని, అప్పటినుంచి  నెలకు 10 రూపాయలు స్వామి కై౦కర్యానికి ఒంటిమిట్ట పంపారు .

ఒక సారి యోగ సాధనలో ఘటికా చలం లో ఉండగా ఒకనాటి స్వప్నం లో తాను ముండ్ల బాటలో నడుస్తున్నాడని ఇద్దరు బాటసారులు చేయిపట్టుకొని మంచి దారి చూపించారు .ఇదీ రామ మహిమగానే భావించి హఠ యోగం కన్నా భక్తి యోగం మిన్న అని స్వామి ఆజ్ఞగా భావించి ,తానూ సాధించి ఇతరులకు బోధిస్తూ ‘’ఘటికాచల నృసింహ కేశవా ‘’మకుటం తో శతకం రాస్తుంటే ,ఒక రోజు రాత్రికలలో ఇద్దరు బైరాగులు కనిపించి ‘’ఇక్కడేం చేస్తావ్ ఒంటి మిట్టకు రారాదా ‘’ అని పిలిచారు .ఉదయం లేవగానే ఇకాలస్యం చేయకుండా ఒంటి మిట్ట కు బయల్దేరి వెళ్ళారు .బాల్యం నుంచి తన ఇస్ట దైవం కోదండరాముని ఆజ్ఞగా భావించి స్వామి సేవలో తరించటానికి వెళ్ళారు .

టెంకాయ చిప్పతో స్వామి కి కానుకల నిధి

రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికీ వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చిం ఉద్ధరించటానికి కంకణం ,తనకున్న సర్వస్వం రామార్పితం చేసి ,కౌపీనం మాత్రమె ధరించి టెంకాయ చిప్పను చేతిలోపట్టుకొని  ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించారుత ధనం దానిలో పడినా ఏదీ ఉంచుకోనక.  రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి

ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు

వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో

దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి

కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప! ”

అంటూ  ‘టెంకాయ చిప్ప శతకం’ చెప్పిన మహాకవి.

ఆయన ఎంతటి మహా కవి యంటే ‘’నెల్లూరు’’లో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా ‘’రంగనాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా ‘’చెప్పి శతకాన్ని పూర్తిచేశారు .

ఆలయ జీర్ణోద్ధారణ

విమాన గోపుర జీర్ణోద్ధారణ గర్భాలయ ,అంతరాలయ నేలను బాగు చేయించటం ,మహాద్వారానికి తలుపులు సంజీవరాయ దేవాలయ జీర్ణోద్ధరణ ,శ్రీరామ సేవాకుటీరం అనే సత్రనిర్మాణ౦  నూతన రథం ఏర్పాటు ,శృంగి శైలంపై వాల్మీకి ఆశ్రమ౦ ,ఇమాం బేగ్ బావి మరమ్మత్తులు ,ప్రక్కన భవన నిర్మాణం వాసుదాసు గారు సేకరించిన నిధితో సమ కూర్చారు ఈపనులన్నీ 1923నుంచి 4ఏళ్ళు 27 వరకు జరిగాయి .

వస్తు పరికరాలు ఆభరణాలు

వెయ్యి మందికి వంట చేయటానికి పాత్ర సామగ్రి ,108కాసులమాల ,108మంగళసూత్రాలహారం ,ఉత్సవ మూర్తులకు బంగారు కిరీటాలు ,మరికొన్నిఆభరణాలు వెండి సామాను చేయించి స్వామికి అర్పించారు ఆంధ్రవాల్మీకి .

గృహాలు

1-ఒంటిమిట్టలో ఒక భవనం 2-కడపలోని తన నివాసాన్ని ‘’శ్రీరామ చంద్ర భవనం ‘’గా మార్చి అర్పించటం 3-మద్రాస్ తిరువళి క్కేణిలోని శ్రీ రామజయమ౦దిర౦ అన్నీ కొదందరామార్పితం చేశారు వాసుదాసకవి .టెంకాయ చిప్ప  బిక్షా పాత్ర వలన వచ్చిన ద్రవ్యం ,శిష్యులు గురుదక్షిణగా సమర్పించిన డబ్బు ,స్వీయ గ్రంథాల అమ్మకం వల్ల వచ్చిన ధనం ఆరోజుల్లోనే రెండు లక్షలరూపాయలకు పైగా ధనాన్నివెచ్చించారు రామార్పణ౦ గా వావికొలను సుబ్బరాయ వాసు కవిగారైన ఆంధ్రవాల్మీకి .ఎంతటి నిస్వార్ధమో ఊహకు అందని విషయం .అక్కడ భద్రాచల రామదాసు ,ఇక్కడ ఈ వాసు దాసు శ్రీరామ సేవలో పునీతులై తరించారు .

1920లో ఒంటిమిట్టకు చేరిన వాల్మీకి గారు ,ఇంటికి వచ్చిన అతిధి అభ్యాగతి బందువర్గాలను పోషిస్తూ ,పుస్తకప్రచురణ చేశారు .దేవాలయ ఉత్సవాలు కైంకర్యాలు మహా వైభవంగా దగ్గరుండి జరిపించారు  .సాధారణ భక్తులకు తెలియని ఒంటి మిట్ట క్షేత్రాన్ని బహుళ వ్యాప్తి చెందించి అశేష భక్త జనానికి ఆకర్షణ కలిగించారు .

మహా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవ౦

వాల్మీకి రామాయణాన్ని 108 సార్లు పారాయణ చేసి హృదయగతం చేసుకొని ఆంధ్రవాల్మీకం రాసి  ,పూర్వాంగం గా ‘’మందరం ‘’రచించి ఆసేతు హిమనగ పర్యంతం హరిద్వార ,సింధు ,బ్రహ్మపుత్ర ,మొదలైన 500 దివ్య క్షేత్రాలలో సహస్ర ఘటాభి షేకాలు,కొత్తగా తయారు చేయించిన కనకరత్న కిరీటాలతో మిత్రుల తోడ్పాటుతో శ్రీరామ సామ్రాజ్యపట్టాభి షేక మహా యజ్ఞాన్ని 50 వేల ప్రజల సమక్షం లో నిర్వహించిన మహా భక్త శిఖామణి శ్రీ వావికొలను సుబ్బారావు గారు .

మందర రచన

వాల్మీకి రామాయణానికి సంస్కృతం లో మహేశ్వర తీర్ధ ,గోవింద రాజు మొదలైన వారు వ్యాఖ్యానాలు రాశారు .అప్పటికి తెలుగులో ఎవరూ వ్యాఖ్యానం రాయలేదు .ఆకొరత తీర్చారు ఆంధ్రవాల్మీకి .వాల్మీకి హృదయాన్ని ఆవిష్క రిస్తూ ,ఆ అమృతాన్ని అందరూ పొందాలని భావించి తానూ తెలుగులో రాసిన రామాయణం ఆధారంగా కవి వాల్మీకి హృదయానికి అద్దం పడుతూ ,తన ప్రయోగ వైశిస్ట్యాలను ,ప్రయోగించిన పదాల సౌరును ,వాటికి పూర్వకవుల ప్రయోగాలు చూపిస్తూ ,చమత్కార గర్భిత పదాలకు వివరణ ఇస్తూ ,వ్యాకరణాది విశేషాలు తెలియజేస్తూ సంప్రదాయ అర్ధాలను సమన్వయ పరుస్తూ వ్రాసిన మహా ఉద్గ్రంథమే వాసుదాసు గారి ‘’మంధరం’’.

రామాయణ బాలకాండ ఒంటిమిట్ట వాల్మీక్యాశ్రమం లోనే రాశారు .నగరి సమీపం మేల్పట్టుగ్రామంలో శ్రీ గుడుపూడి దొరస్వామి నాయుడు గారి ఆహ్వానం మేరకు వెళ్లి ‘’అయోధ్యకాండ ‘’రాశారు .రావు గారి  శిష్యుడు  నాయుడుగారు గురు దక్షిణగా రామార్పణం చేసినా స్వామికి చేరలేదు .గుంటూరు మండలం నడిగడ్డ పాలెం లో ప్రణవాశ్రమం నిర్మించి మౌనవ్రతం చేస్తూ ‘’అరణ్య కాండ ‘’రాశారు .పంచవటి ,పంపాసరోవరం ,కిష్కింద ,మాల్యవంతం ,భద్రాచలం నుంచి హంపి వరకు స్వయంగా దర్శించి తుది నిర్ణయం చేసి రాశారు .తూర్పు గోదావరిజిల్లా కోలంక జమీ౦దారిణి శ్రీరాజారావు రామాయమ్మ గారు వాసుదాసుగారిని ఆహ్వానించి ఒక వనం లో విడిది ఏర్పాటు చేయగా ,మౌనవ్రతం తోనే ,అవధూత నియమాలు పాటిస్తూ ఒక సంవత్సరం లో కిష్కింద ,సుందర ,యుద్ధ ,ఉత్తర కాండలు రచించారు .70ఏళ్ళ వయసులో ,రోజుకు 20గంటలు రామకావ్యానికే వినియోగించారు .

మందరం చివరలో చెప్పిన పద్యం –

‘’ ఆ తల్లి గారిట్లు లాదరంబున బ్రోవ –యామార్తి సుబ్బా దాసార్య వరుడు –శిష్యుడై హితుడయి ,చేదోడు నగుచు –నిఖిల కార్యంబుల నిర్వహింప

సీతమ్మ ప్రావుగ చిల్లర లక్ష్మమ్మ-ఏక పున్నమ్మయు నెల్ల విధుల –మేనిని బ్రోవ౦గ  మేకొన నీ విట్లు –వీరి నొసంగిన కారణమున

సాంతముగ గ్రంథమంతయు సలుపగంటి –నేక చిత్తంబు తోడ ,నే లోకమందు

నైన వీరల తోడి పోత్తమరియుండ-జేయవే జానకీ నాథ !శ్రీ సనాథ’’

మంధరం ను కోదండ రాముని కిఅర్పి౦చటానికి  వాసుదాసుగారు ఒంటిమిట్ట వచ్చారు .1934 జ్యేష్ట  శుద్ధ ద్వాదశి నాడు భక్తులతో ఆలయం క్రిక్కిరిసి ఉన్నది స్వామికి పూజ అయ్యాక’’ మంధరం’’ ను తన బంగారు కలం తోపాటు స్వామికి సమర్పించారు .’’కోదండరాముడు నాకిచ్చిన బలం కలం .కనుక దానిని స్వామి పాదాల చెంత ఉంచాను .రాముడు నాతో పలికిస్తేనే రాయగలిగాను .నేను రాసినవన్నీ ముద్రించటానికి డబ్బుకావాలి .వయసు మీదపడి బలహీనుడ నయ్యాను .రాముని సొమ్ము రామునికే అర్పించాను .కార్యభారానికి రాముడే సమర్ధుడు ‘’అన్నారు వినయంగా ఆంద్ర వాల్మీకి . ‘

‘’శ్రీరామ భిక్షాం దేహి’’అంటూ వాసుదాసు గారు ఊరూ వాడా కాలినడకన నిరాహారులై ఎండనక ,వాననక దేశమంతా తిరిగి తాను  పాదం పెట్టిన చోటల్లా కనకవర్షం కురిసింది.దాన్ని చేతితో నైనా తాకే వారు కాదు  ప్రక్క వారు లెక్క పెట్టాల్సిందే,వాళ్ళే ఖర్చు చేయాల్సిందే .విలువ నిలవ చూసే పధ్ధతి వారికి లేదు .ఉదాసీనులు .శిష్యాగ్రణి  శ్రీ దాస శేషస్వామి  దాసుగారి పాదసేవ చేస్తూ ,పట్టాభిషేకానికి రెండు సంవత్సరాలముండు వచ్చారు .దాసుగారి రచనాభారమంతా ఆయనే సమర్ధంగా చేసేవారు .ఎప్పటికప్పుడులోటుపాట్లు లేకుండా కట్టు దిట్టం చేశారు .దీనితో తేరగా తినటానికి వచ్చిన బంధు గణానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లై నెమ్మదిగా జారుకొన్నారు .ఊళ్ళో కలహాలవలన దేవాలయానికి అర్పించిన వస్తువులు ఆభరణాలు ,పెద్ద గంట తోసహా దాసుగారింట్లోనే ఉన్నాయి.దేవాలయానికి ఎదురుగా శ్రీరామ సేవా కుటీరం నిర్మించి  ,శ్రీ వరదాభయ కోదండ రాములు అనే పేరుతొ ‘’నకిలీ సన్నిధి ‘’ఏర్పరచారు .

దాసుగారి  వీలునామా

తాను  సంపాదించిన సర్వస్వం  ట్రస్టీ లను ఎన్నుకొని వారి ద్వారా శ్రీరామునికి అర్పిస్తానని ఒక సభలో ప్రకటించారు .తాను  నడుపుతున్న ‘’భక్త సంజీవని ‘’పత్రిక లోనూ అలానే రాశారు .కాని అలా చేయలేదు .చనిపోవటానికి13రోజుల ముందు ఒంటిమిట్టవచ్చారు..చాలా నీరస౦గా ఉండటం చేత స్వామిని దర్శించి మద్రాస్ వెళ్ళారు .అక్కడ అవసాన దశలో తమ తమ్ముడికొడుకు  శ్రీ లక్ష్మాజీ రావు ను ట్రస్టీ గా చేసి ,శ్రీ వరదాభయ కోదండ రామ స్వామి పేర తమకున్న యావదాస్తీ సమర్పిస్తూ వీలునామా రాశారు .అప్పటికి వారి ముద్రితాముద్రిత గ్రంథాలు ,ఆభరణాలు తప్ప ద్రవ్యం ఏమీ లేదు .రెండు వందలు మిగిలితే ఉత్తరక్రియలకు వాడమని రాశారు .నమ్మిన శిష్యుడు శ్రీ దాస శేష స్వామికి చక్రా౦క౦  వేసే శ౦ఖ చక్రాలు భక్తి సంజీవని పత్రికా నిర్వహణ అధికారమిచ్చారు .ఆంధ్రవాల్మీకి వాసుదాసకవి శ్రీ వావికొలను సుబ్బారావు గారు మద్రాస్ లోనే 73వ ఏట 1-8-1936పరమపదించారు .

దాసుగారి తదనంతరం

దాసు గారి నిర్యాణం తర్వాత లక్ష్మాజీ రావుకు నిర్వహణ బాధ్యత చేతకాలేదు .ప్రజలలో అసమ్మతి పెరిగితే ,కడప బారిస్టర్ శ్రీ కృష్ణస్వామి ఒక భక్త సంఘం ఏర్పాటు చేసి రావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ స్వామి వారి ఆస్తినంతటిని సంఘానికి దఖలు చేయమని కోరారు .ఇంతలో రావు గారింట దొంగలుపడి మొత్తం దోచుకుపోయారు  బ్యాంకు లో  ఉన్న స్వామి నగలు మాత్రం దక్కాయి .చేసేదిలేక రావుగారు కడప వెళ్లి  బారిస్టర్ గారి సమక్షం లో దాసుగారు రాసిన వీలునామాప్రకారం అంతా భక్త సంఘానికి బదిలీ చేసి ఊపిరి పీల్చుకొన్నారు .

దాసుగారు లేని లోటు

దాసుగారు జీవించి ఉండగానే స్వామి నిత్యభోగానికి ప్రయత్నించారు .వారున్నప్పుడు నిత్యపూజా కైంకర్యాలు ఉత్సవాలు మహా వైభవంగా జరిగేవి .గుంటూరు జిల్లా వెళ్ళగానే మళ్ళీ పరిస్థితి మామూలయింది .బారిస్టర్ గారి పూనికతో మళ్ళీ వైభవం వచ్చింది .1949 ట్రస్టీ పదవి నుంచి విరమించుకోగా,వితరణ శీలి  శ్రీ పుట్టం రెడ్డి రమణారెడ్డిట్రస్టీగా వచ్చి ,దేవాలయ ఆస్తులను ఇతరులనుంచి స్వాధీనం చేసుకొని ఆలయానికి దఖలు పరచి ‘’నిత్య నైవేద్య పూజా నిధి ‘’ఏర్పరచి  లోటులేకుండా చేశారు .దాసుగారికోరిక ‘’నిత్యభోగ కల్పనం’’రెడ్డిగారి వలన తీరింది .శ్రీ దాస శేషస్వామి దాసుగారి రచనలన్నీ పునర్ముద్రణ చేసి జిజ్ఞాసువులకుందుబాటులోకి తెచ్చారు .

దాసుగారి రచనలు

  • 1-ఆంధ్ర వాల్మీకి రామాయణం 2-శ్రీకృష్ణలీలామృతము3- ద్విపద భగవద్గీత4- ఆర్య కథానిధులు 5-ఆర్య చరిత్రరత్నావళి 6-సులభ వ్యాకరణములు7-శ్రీకుమారాభ్యుదయము( రమాకుమార చరితం )8- గాయత్రీ రామాయణం 9-శ్రీరామనుతి10- కౌసల్యా పరిణయం 11-సుభద్రా విజయం నాటకం 12-హితచర్యమాలిక 13-ఆధునిక వచనరచనా విమర్శనం 14-పోతన నికేతన చర్చ 15-పోతరాజు విజయం16- రామాశ్వమేథము17- ఆంధ్ర విజయము18-టెంకాయచిప్ప శతకము 19- ఉపదేశ త్రయము 20-మంధరము 21-శ్రీరామావతార తత్వములు22- శ్రీకృష్ణావతార తత్వములు 23-దేవాలయతత్త్వము24-దండక త్రయము.

శ్రీసీతారామకల్యాణ౦

ఒంటిమిట్టలో శ్రీ సీతారామ స్వామి కల్యాణం శ్రీరామనవమినాడు కాక చైత్రపౌర్ణమి నాడు రాత్రి వేళ జరగటం విశేషం .మర్నాదు ఉదయం రధోత్సవం ‘’మెరవణి’’చేస్తారు .సిద్ధవటం పాలించిన మట్లి రాజులకాలం లో కల్యాణం 5రోజులు రాత్రిపూట నిర్వహించేవారు .బుక్కరాయల కాలం లో చైత్ర శుద్ధ నవమి నుంచి  కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమై ,రథత్సవంతో ముగిసేవి .శ్రీరామనవమినాడు పోతన జయంతి నిర్వహిస్తున్నారు .

బ్రహ్మోత్సవాలు

1356లో బుక్కరాయలకాలం లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి .ఆయన చంద్ర వంశం రాజుకనుక చంద్రుడు శ్రీరామ చంద్రుని కల్యాణం తిలకించి పులకించాలని పౌర్ణమినాటి రాత్రి సీతారామకల్యాణం ఏర్పాటు చేశాడు .ఇది చంద్రుడికి శ్రీరాముడు ఇచ్చినవరం కూడా అంటారు .చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి  . చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఒంటిమిట్ట

నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక భద్రాచలం తెలంగాణాలోకి వెళ్ళాక ఒంటిమిట్టకు విశేష ప్రాధాన్యం తెచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు .కళ్యాణ మండపం కట్టటానికి 100కోట్లు సాంక్షన్ చేశాడు ఆలయ పూజాదికాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాడు .మళ్ళీ ప్రాభవం తీసుకొచ్చాడు .

ఒంటడు +మిట్టడు =ఒంటిమిట్ట

ఒంటిమిట్ట రామాలయం అంటే ఒంటడు మిట్టడు అనే బోయసోదరులే ముందు గుర్తుకు రావాలి .విజయనగరాన్ని కంపరాయలు పాలిస్తున్నప్పుడు చెరువులు నిర్మించి గ్రామాలు నెలకొల్పి ,వ్యవసాయాన్ని పెంచి సామ్రాజ్య వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు .అయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒంటడు,మిట్టడుఅనే బోయ సోదరులు ఆయనకు సకల సౌకర్యాలు కలిపించేవారు .వారి భక్తీ ఆసక్తి వినయాలకు రాజు సంతోషించి ఏదైనా కోరుకోమంటే ఇక్కడి రామాలయం అభి వృద్ధి చేయమని అడిగారు .వెంటనే డబ్బు శాంక్షన్ చేసి ఖర్చుపెట్టే బాధ్యత ఈ సోడురులపై పెట్టాడు .అ డబ్బులో ఒక్క కానీకూడా వ్యర్ధం చేయకుండా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు .కంపరాయలు మళ్ళీ వచ్చి చూసి పరమానంద భరితుడై ఇంకా ఏదైనా కావాలంటే చేస్తాను అన్నాడు దానికి ఆసోదరులు ఈ గ్రామం తమపేర వర్దిల్లేట్లు చేయమని కోరారు .అలాగే అని ఆగ్రామానికి వారిద్దరిపేరు వచ్చేట్లు ఒంటిమిట్ట పేరు పెట్టినట్లు స్థానిక కథనం .ఆ బోయసోదరుల పూర్వజన్మ సుకృతం అలాంటిది .స్వామి సేవలో తరించారు.తమపేర్లను సార్ధకమూచేసుకో గలిగారు  .వీరిద్దరినీ మర్చిపోతే చరిత్రమనల్ని క్షమించదు.

విదేశీ ,దేశీ యాత్రికులు

క్రీ.శ.1652లో ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ ట్రావర్నర్ ఒంటిమిట్ట ఆలయం చూసి ,ఇక్కడి ఆలయ శిల్ప విన్యాసాన్ని వేనోళ్ళ మెచ్చాడు .ఇక్కడి గోపురం అరుదైన వాటిల్లో ఒకటిగా పేర్కొన్నాడు .సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య ఈక్షేత్రం సందర్శించి రామునిపై కీర్తనలు రాసి,రామునికి  పాడివినిపించాడు .మట్లి రాజుల ఆస్థానకవి ఉప్పుగుండూరు వేంకటకవి స్వామిపై ‘’దశరధ రామా !’’మకుటం తో శతకం రాశాడు .స్వామి సేవలో తరించిన వరకవి నల్లకాల్వ అయ్యప్ప కాలం లో నెల్లూరు తిరుపతి బద్వేలు ,నందలూరు రాజం పేట వరకు తురుష్కులు  జరిపిన దాడులను ‘’శత్రు సంహార వేంకటాచల విహార ‘’అనే మకుటం తో శతకం రాశాడు. భవనాశి  ఓబులదాసు గురించి చెప్పుకొన్నాం .ఆయన రాసిన పదమాలికలుకొన్ని తెలుసుకొందాం –‘’రామనామము రామనామము రమ్యమైనది రామనామము ‘’అనేది ఇప్పటికీ జనం పాడుకొంటున్నారు .అలాగే ‘’రాముని దాసులమయ్యా –బ్రేమను గనుగొనరయ్యా-పరులమాటకు  మేము రాము –పరుల బాటకు నడ్డపడము –పరసతులను మేము పాలించి చూడము –తరుణులందరు మాకు తల్లి తోడులయ్యా ‘’మరొకటి ‘’చెప్పవే తల్లి చెప్పవే సీతమ్మ –నీవైన చెప్పవే రాముతోడ అంటూ భక్తీ ఆర్తీ లతో పాడి తరించాడు .

పోతన సాహిత్య పీఠం

1995లో ఒంటిమిట్ట ప్రాంత కవులు తెలుగుపండితులు అధ్యాపకులు కలిసి ‘’పోతన సాహిత్య పీఠం’’ఏర్పాటు చేసి .కోదండరామాలయం లో సాహితీ సమావేశాలు, ధార్మిక ప్రసంగాలు నిర్వహిస్తున్నారు .భాగవత సప్తాహాలు , ధనుర్మాసం లో నిత్యందార్మిక ప్రసంగాలు  ఏర్పాటు చేస్తున్నారు.వాసు దాసు గారు మొదలు పెట్టిన  పోతన జయంతిని  ఆలయ అధికారులతోకలిసి  ఘనంగా నిర్వహిస్తున్నారు  .ప్రముఖ భాషా పరిశోధకులు ,కడపబ్రౌన్ లైబ్రరీ ట్రస్ట్ సెక్రెటరి  శ్రీ కట్టా నరసింహులు ఇక్కడ అనేక సాహిత్యకార్యక్రమాలు బహు ఉత్సాహంగా జరుపుతున్నారు .

ఒంటిమిట్ట క్షేత్రం అభి వృద్ధికి ఆలోచనలు

1-ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో వెంటనే  రైల్వే హాల్ట్ ఏర్పాటు చేయాలి .

2-కళ్యాణమండప నిర్మాణం త్వరలో పూర్తి చేసి సకల వసతులు కల్పించాలి .ఇక్కడ ఆంధ్రవాల్మీకి గారి అద్భుతశిలావిగ్రహం నెలకొల్పాలి .శ్రీరామునిపై ఆయన రాసిన ముఖ్యపద్యాలను గోడలపై రాయించాలి .అలాగే అయ్యలరాజు రామభద్రుని పద్యాలు రాయించాలి .

3-వాసుదాసు గారి ముఖ్యపద్యాలు మంచి గాయకులతో పాడించి రికార్డ్ చేసి సిడిలు గా తేవాలి .తిరుమలలో అన్నమయ్య కీర్తనలు వినిపిస్తున్నట్లు ,నిరంతరం దాసుగారి పద్యాలు  ఆలయం బయటా ,ఊరిలో వినబడేట్లు ఏర్పాటు చేయాలి

3-సామాన్యులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేయాలి

4-ఆలయం లో పూజాదికాలలో మంత్రాలు తంత్రాలతోపాటు సమానంగా ఉండాలి .

5-ఏకాంత సేవ మొక్కుబడిగా కాక అర్ధవంతంగా ,స్వామిపై కీర్తనల గానంతో పరవశించేట్లు నిర్వహించాలి .

6-ఆలయ చరిత్ర ను చిన్న పుస్తకాలుగా ముద్రించి అందుబాటులోకి తేవాలి .

7-ఆధ్యాత్మిక గ్రంథ విక్రయ శాల నెలకొల్పాలి

8-శనివారం మాత్రమేకాక స్వామి లడ్డూ ప్రసాదం నిత్యం అమ్మే ఏర్పాటు చేయాలి

9-మరింత విస్తృతంగా ఒంటిమిట్ట కోదండరామ వైభవాన్ని ప్రచారం చేయాలి .దీనికోసం ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిర్వహించాలి .

సమాప్తం

<p style=”margin:6pt 0in;background-image:initial;background-position:initial;background-size:initial;background-repeat:initial;background-origin:initial;background-clip:i

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్లు

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్లు*
అమరావతి: ఏపీలో ప్రాధమిక విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ.. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. *బీజేపీనేత సుదీష్‌ రాంబొట్ల, డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ ఈ పిటిషన్లు వేశారు.*
జీవో అమలును నిలిపివేయాలని, మీడియంని ఎంపిక చేసుకునే హక్కు..తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్లను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. *ఇంగ్లీషు మాద్యమం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.* ఒకవేళ ప్రింట్‌ చేస్తే.. ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక జారీచేస్తూ..
*తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది.*
*- APUS AP* ఇది వాట్సాప్ లో నాకు వచ్చిన సమాచారం-చలపాక

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3

ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -2

3-అయ్యలరాజు రామభద్రుడు

శ్రీ రామాభ్యుదయం రాసిన అయ్యలరాజు రామభద్రుడు 1550కాలం వాడు అలియరామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజు కు శ్రీరామాభ్యుదయ కావ్యం అంకితమిచ్చాడు .ఒంటిమిట్ట వాసి ఐన కవి ‘’ఇది శ్రీ మదొంటిమిట్ట రఘు వీర శతక నిర్మాణ కర్మఠ జగదేక ఖ్యాతి ధుర్య అయ్యలరాజు తిప్పయ మనీషి పర్వతాభిదాన పోత్రాక్కయార్య పుత్ర పరిశీలిత సమిద్ధ రామానుజ మతసిద్ధాంత ముమ్మడి వరదా చర్య కటాక్ష వీక్షా పాత్ర ,హృదయ పద్మాసనస్థ శ్రీరామభద్ర –శ్రీరామభద్రకవి ప్రణీతంబైన ‘’శ్రీరామాభ్యుదయ ము ‘’అన్నాడు

‘’శిలజిగురు బోడియై యుల్లసిల నొనర్చి –ఎత్తి పోయిన గౌతము నిల్లు నిలిపె

నడుగు కెందమ్మి కమ్మపుప్పొ డిని ఇంక-నేమని నుతియించవచ్చు శ్రీరాము మహిమ ‘’

 ఇతని గురించి ఒక ఐతిహ్యం ఉంది .కవి చిన్నపాపడుగా ఉండగా తల్లి కోదండరామాలయం లో జరిగే ఉత్సవానికి ఈ శిశువు నెత్తుకొని వెళ్ళగా, ముద్దుగా ఉన్న అతడిని చూసి అక్కడి స్త్రీలు ఎత్తుకొని ముద్దాడుతుండగా ,వాళ్ళదగ్గరే పిల్లాడు ఉంటాడని ఇంటికి వచ్చి ,యెంత సేపటికీ బిడ్డ రాకపోవటం తో ఊరంతా వెదకి౦ది .ఆ రాత్రి శిశువు దేవాలయం లోనే ఉండిపోయి తల్లికోసం అలమటిస్తుంటే సీతమ్మతల్లి  బిడ్డను ఎత్తుకొని , లాలించి, ఆకలి తీర్చటానికి స్తన్యం ఇచ్చింది .అమృ తోపమానమైన  అస్తన్యం తో శిశ ఉల్లాస౦గా ఉన్నాడు .తెల్లవారుజామున పూజారులు స్వామి సుప్రభాతానికి వస్తే, సీతమ్మ పాదాల చెంత బిడ్డ ఆడుకొంటూ కనిపించి ఆశ్చర్యపరచాడు .అతని తల్లికి వర్తమానం పంపి రప్పించి శిశువును అప్పగించారు .ఆ రాత్రి ఆబిడ్డడు మూడు సార్లు సీతమ్మతల్లి పాలు త్రాగినట్లు గుర్తులున్నాయి .పెదవులపై సీతమ్మవారి గుర్తులున్నాయి. చూసి పరమానదభరితులయ్యారు .ఈ కవిని గురించి ఆంధ్రవాల్మీకి రాసిన సీసపద్యం చూద్దాం –

‘’అమ్మక !కోవెలందు దన –యమ్మయు  నొంటిమివీడిపోవ,రే

పమ్మిన యాకతటన్  శిశువు –పాలకు నేడ్వగ నాలకించి ,తా

నమ్మగ స్తన్యమిచ్చిన దయామయి –నన్గనగ వమ్మ అమ్మ !సీ –తమ్మభయ క్షుధార్దితుని

నయ్యలరాజు కులోద్వాహుం  బలెన్ ‘’(ఆంధ్రవాల్మీకం –బాలకాండ -86వ పద్యం )

                        4-ఇమాం బేగ్

1640లో కడప నవాబు  రాజులలో  అబ్దుల్ నబీఖాన్ మొదటివాడు నవాబులకాలం లో సిద్ధవటం కోట ఉంది .మట్లి అనంతరాజు ఈ కోట,అందులో శివాలయం 1604లో కట్టించాడు .నావాబు కోటనుస్వాదీనం చేసుకొని శివాలయం ధ్వంసం చేసి మసీదు కట్టించాడు .దేవాలయ అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి .నవాబు ప్రతినిధి ఇమాం బేగ్ .ఒంటిమిట్ట కోదండరామ మహాత్యాన్ని స్వయంగా చూడాలని వచ్చి ,’’మీదేవుడిని పిలిస్తే పలుకుతాడా ‘’?అని అడిగితేపలుకుతాడు అని చెప్పగా దేవాలయం లో నూ ,బయటా మనుషులెవ్వరూ లేకు౦డా,పోకుండా చేయించి ‘’ఓ రామా !ఒంటిమిట్ట రామా !అని ఆర్తిగా మూడుసార్లు పిలిచాడు ఇమాం బేగ్ .మూడవ పిలుపుకు ‘’ఓ-ఓ-ఓ’’అని వినిపించగా నవాబు సంతోషంతో సాస్టా౦గపడి ఆనంద బాష్పాలు రాలుస్తూ,పులకిత శరీరుడై వినయంగా శ్రీరాముని ప్రార్ధించాడు .స్వామి మహాత్మ్తాన్ని గ్రహించి తనవంతు కై౦కర్యంగా ,దేవాలయం మెట్లకు దక్షిణాన ఒక బావి త్రవ్వించాడు .చుట్టుప్రక్కల బావుల్లో ఉప్పునీరు ఉంటే నవాబుగారిబావిలో స్వచ్చమైన మధుర జలం ఊరింది .ఈ నీటినే స్వామి పూజా కై౦కర్యాలకు వినియోగిస్తారు దీనినే’’ ఇమా౦ బేగ్ బావి ‘’అంటారు  .అంతేకాదు దగ్గరున్న మసీదులో పిల్చినా రాముడు పలికాడట .

            5-మాల ఓబన్న

200 ఏళ్ళక్రితం ఆలయానికి తూర్పున అరమైలు దూరం లో ‘’మలకాటపల్లె ‘’అనే ఊరు లో ఓబన్న అనే మాలకులస్తుడు పుట్టి మహా భక్తుడయ్యాడు .విద్య శుచి ఆచారం లేనివాడు .మాలల లో చెన్న దాసరులు వైష్ణవ మతావలంబులు .భగవద్రామానుజులు కంచి గోపురమెక్కి తిరుమంత్ర రహస్యాన్ని వివరించినప్పుడు రహస్యంగా  విన్నవారే చెన్నదాసరులు .ఓబని సంసారం పెద్దది .బాల్యం లోనే రామాయణ భాగవతాది పురాణాలు విని ,భక్తితో స్వామిని భజించేవాడు .నాలుగవ జామునే లేచి స్నానించి ఊర్ధ్వ పుండ్రాలు ధరించి తంబూర ,చిటి తాళం తో ,కాలిగజ్జెలతో కోదండరాముని కోవెలముందు భజన చేస్తూ పారవశ్యంలో ఇహలోక స్పృహ లేకుండా చాలాకాలం చేసి ఇంటికి వచ్చేవాడురోజూ .ఇది చూసి కన్ను కుట్టిన కొందరు సో౦బేరులు ,స్వామి అర్చనకోసం పూజారులు తీర్ధ జలాన్ని తీసుకొని వెడుతూ వేదమంత్రాలు ఉచ్చరిస్తుంటే ,శూద్రుడు అక్కడ ఉంటే అపవిత్రం అవుతో౦దని  గగ్గోలు పెట్టి ,నానాయాగీ చేశారు .

  ఒక రోజు తహసీల్దారు వస్తే ఆలయ ధర్మకర్తలు ఉద్యోగులు ఎదురువెళ్ళి స్వాగతం పలికి మేళతాళాలతో గుడిలోకి తీసుకు వెడుతున్నా అదేమీ పట్టనట్లు ఓబయ్య తన భజన తాను  చేసుకొంటున్నాడు .ఆయనకు పూజార్లు అతనిపై చాడీలు చెప్పి పురెక్కించగా, ఆయనా వివేకం కోల్పోయి ‘’వాటీజ్ దిస్ నాన్సెన్స్ ‘’అని బిళ్ళబంత్రోతులచేత ఓబని మెడబట్టి దూరంగా  నెట్టేయించాడు .ఆలయం పడమటి భాగానికి వెళ్లి యధాప్రకారం భజన కొనసాగించాడు .

   మర్నాడు ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూడగా స్వామి పడమటి వైపుముఖం తో కనిపిస్తే అవాక్కై ,కిందపడి పొర్లు దణ్ణాలు పెడుతూ పొలికేకలు పెట్టారు .జనమంతా పోగయి   ఆశ్చర్య పోయారు .ఆ రోజు రాత్రి తహసిల్దార్ కలలో కనిపించి ,మర్నాడు ఓబని తన సముఖానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు .ఏమి జరుగుతుందో అని ఊరిజనమంతా ఆలయంలోకి చేరారు .రామభజనలతో,మంగళవాద్యాలతో అర్చకులు ,తహసీల్దారు గ్రామపెద్దలు  ఓబని సమీపించి తమ అపరాధాన్ని క్షమించమని కోరారు ,భూనభోంతరాలు దద్దరిల్లేట్లు అందరూ మహా గౌరవంగా ఓబన్న ను  కోదండ రామ సన్నిధికి తీసుకు వెళ్ళారు .మళ్ళీ ఆశ్చర్యం కలిగిస్తూ స్వామి తూర్పు ముఖంగా దర్శనమిచ్చాడు .

  ఓబన్న 120 సంవత్సరాలు జీవించాడు .తనివి తీర దేవాలం లోకి వెళ్లి స్వామిని దర్శించి పూజించి ఆడిపాడి ధన్యుడయ్యాడు .బాగా ముసలి వాడు అయ్యాక కోవెలకు రాలేక తన ఊరిలోనే ఉంటూ ,మనుమల సాయం తో పడమటి గోడవరకు వచ్చి, గోపుర దర్శనం చేసి ,తాను తినే రాగి సంకటి స్వామికి  నైవేద్యం పెట్టి ,అ ప్రసాదాన్ని తినేవాడు .అనాయాస మరణం తో ఓబన్న సాయుజ్యం పొందాడు .’’భవ నాశి  ‘’వంశీయుడైన ఓబన్న తరువాత తరాలవార౦తా     వైష్ణవులే  .స్వామి బ్రహ్మోత్సవాలలో ఓబని స్తంభం వద్ద పందిట్లో వీరంతా భజనలు చేస్తారు .ఓబన్న  స్మృతిచిహ్నం ఇప్పటికీ ఉన్నది.ఇక్కడే ఆయన భజన చేసేవాడు .గరుడోత్సవం నాడు  వీరంతా ఉపవాస  ఉండి,స్వామి గరుడ వాహనం పై ఊరేగుతూ మహాద్వారం దగ్గరకు రాగానే స్తంభం పై పెద్ద జ్యోతి వెలిగించి ,గోవి౦ద నామాలతో చుట్టూ తిరుగుతూ భజనలు చేస్తారు. ఈ మర్యాద ఇప్పటికీ అమలు ఉన్నది .ధన్యుడు మహాభక్తుడు ఓబన్న .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-19-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2 చారిత్రిక ప్రాధాన్యం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2
చారిత్రిక ప్రాధాన్యం
పూర్వం నుంచి ఒంటిమిట్ట ప్రాంతాన్ని పాలించిన రాజులెవరో తెలీదుకాని విజయనగర సామ్రాజ్యకాలం లో ,పొత్తపి నాటి చోళులపాలన లో కొంత వైభవం పొందింది క్రీ.శ.1556తళ్ళికోట యుద్ధం ముగిశాక పొత్తపినాటి చోళులైన’’’మట్లి వంశపు’’ రాజులు పాలిచారు .వీరికాల౦ లో ఈక్షేత్రాభి వృద్ధి బాగా జరిగింది .ఆలయం మూడు పర్యాయాలు నిర్మింపబడి నట్లు తెలుస్తోంది. గర్భ గృహం ,అంతరాలయం ,ముఖమండప గోపుర ప్రాకారాదులు వేర్వేరు కాలాలలో నిర్మించారు .
శ్రీ కృష్ణ దేవరాయల తర్వాత సవతి తమ్ముడు అచ్యుతరాయలు 12ఏళ్ళు పాలించాడు .ఆతను చనిపోయాక చిన్న పిల్లాడైన కొడుకు వేంకటపతి రాయలు కు పట్టాభి షేకం చేసి ,అచ్యుతుని బావమరది సకలం తిమ్మయ్య మంత్రిగా ఉన్నాడు .తర్వాత మేనల్లుడిని చంపించి తానే రాజుగా ప్రకటించుకొన్నాడు .ఇదిగిట్టక రాయల అల్లుడు అళియరామరాయలు లేక అరవీటి రామరాయలు సకలం తిమ్మయ్యను చంపి ,అచ్యుతుని అన్నకొడుకు సదాశివరాయలును నామమాత్రపు రాజును చేసి ,బాక్ సీట్ డ్రైవింగ్ గా రాజ్యమేలాడు .అప్పటి నుంచి అరవీటి వంశ ప్రాభవం పెరిగింది .రాజ్యం అత్యున్నత స్థితిలోకి తెచ్చినా, చివరికి నానా అల్లరి పాలై తళ్ళికోట యుద్ధం లో దక్కన్ సుల్తాను చేతిలో చనిపోయాడు .దేవాలయం లోని రెండు శాసనాలలో ఈ చరిత్ర అంతా దర్శనమిస్తుంది .ఇవి 1555 మరియు 1558కాలం శాసనాలు .
కోదండ రామాలయ శిల్ప వైభవం
గర్భాలయం ,అంతరాలయం ,ముఖ మండపాలపై విద్యానగర శిల్ప విన్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ద్వారపాలకులైన జయవిజయులు ,గరుడుని ముందున్న ప్రభు ,దేవేరుల విగ్రహాలు అంజలి ముద్రతో ఉంటాయి .గోపుర నిర్మాణం లో చోళ శైలి కనిపిస్తుంది.కిందున్న సంజీవరాయ గుడి మొదలైనవి హంపీ విఠలాలయ౦ ను పోలిఉంటాయి .అక్కడి ఇసుకతో ఉన్న యెర్ర రాయినే ,ఇక్కడా వాడారు .అక్కడి శిల్ప విన్యాసమే ఇక్కడా ఉన్నది .అంతటి బండరాళ్ళు ఎలా తెచ్చారో ఎలా కస్టపడి మలిచారో ,ఎంతటి అంకితభావం తో జీవకళ సృష్టించారో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది .పై శాసనాల కాలానికి కోదండ రామ స్వామికి ‘’శ్రీ రఘు నాయకులు ‘’అనే పేరున్నట్లు తెలుస్తోంది .
గ్రామనామం
ఒంటి మిట్ట అంటే ఒక్కటే ఐన మిట్ట.మిట్ట అంటే కొండ ,బెట్ట ,శైలం అని సమానార్దాలున్నాయి .కనుక ఏక శిలానగరం అన్నారు .ఒకప్పుడు ఇది నగర స్థాయి పొంది౦దన్నమాట..కోటలు ,బురుజులూ ఉండి,కాలక్రమంలో అంతరించి ఉండవచ్చు . పడమటి భాగం లో గొప్ప చెరువు శాసనకాలానికే ఉంది .ప్రాచీన వీరాంజనేయ గుడి చెరువు గట్టున ఉంది .ఈ కట్టపై నుంచి కాశీ ,రామేశ్వరం లకు పోవచ్చు .విశ్రాంతి సత్రాలు అన్నసత్రాలు తో పచ్చగా కళకళ లాడే ఏక శిలానగరం ప్రాభవం కోల్పోయి ఇప్పుడు గ్రామంగా నే ఉండి పోయింది .
క్షేత్రానికి వాయవ్యం లో మృకండాశ్రమ౦,ప్రక్కన సెలయేరు ఉన్నాయి .దీని ప్రక్కనే రైల్వే ట్రాక్ ఇప్పుడు వచ్చింది .సర్వేయర్ లార్డ్ మెకంజీ 160 ఏళ్ళక్రితం ఈ సంగతు లన్నీ’’ కై ఫీయత్’’ లో నమోదు చేశాడు .
ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు
1-త్రిపురాంతకుడు అనే అయ్యలరాజు తిప్పరాజు –
విద్యానగర ప్రౌఢ దేవరాయల ఆస్థానకవి అయ్యలరాజు తిప్పరాజు ఒంటిమిట్ట వాసి .రఘు వీర శతకం రాశాడు –
‘’తారుణ్యోదయ యొంటిమిట్ట రఘునాథా!నీకు నే పద్యముల్ –నూరున్ జెప్పెద ,నూరు బేరు వెలయన్ నూత్నంబుగా ,నంత నా
నోరుం బావన మౌను ,నీ కరుణ గా౦తున్ భక్తి,నన్నందరున్-రారమ్మందురు గారవించి ,రఘు వీరా ,జానకీ నాయకా ‘’
ఈతని మనుమడు అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం కావ్యం రాశాడు .
2-బమ్మెర పోతనామాత్యుడు –
మందారమకరంద భాగవతాన్ని రచించిన పుణ్యమూర్తి బమ్మెర పోతరాజు అనే పోతనామాత్యుడు ఇక్కడే ఉన్నాడు .కాలం 1405-70.తల్లి అక్కమాంబ .తండ్రి కేసనమంత్రి .శైవులు .అన్న తిప్పన .పలికించెడివాడు రామభద్రుడు అని చెప్పాడు భక్తపోతన .’’శ్రీ కైవల్య పదంబు జేరుటకు చింతించి ‘’ముముక్షు జన సేవ్యం బైన భాగవతం రాశాడు .ఫలితం భవహరం .
పోతన తెలంగాణా వాడని అక్కడి వారి అభిప్రాయం .1770లో పురాణం హయగ్రీవ శర్మగారు పోతన చరిత్రను భాగవత పీఠికలో చెప్పారు .ఆతర్వాత వందేళ్ళకు నివాసంపై వివాదమేర్పడింది.ఆంద్ర వాల్మీకి శ్రీ వావికోలనుసుబ్బారావు గారనే వాసు దాసు గారు ‘’బమ్మెర పోతన నికేతన చర్చ ‘’అనే గ్రంథం రాశారు .’’మగిడి ఏక శిలా నగరమునకు చను దెంచితిని ‘’అనటం తో భాగవత రచన చేయటానికి ఇక్కడికి వచ్చాడని తెలుస్తోంది. అప్పటికి తెలంగాణలోని బమ్మెరగ్రామం రచనకు అనుకూలంగా లేకపోవచ్చు .ఆధునిక పోతన బిరుదున్న శ్రీ వానమామలై వరదా చార్యులవారు’’ పోతన చరిత్ర ‘’కావ్యం రాశారు దశమాశ్వాసం 26వ పద్యం లో ‘’నొంటి మిట్టన్ కవి వరే ణ్యుడుంటతెలిసే ‘’
27 వ పద్యం లో –‘’నొంటిమిట్ట రాముని వర మందిరా౦గణము ముందొక పందిరి క్రి౦ద
నందరున్ ఘన దీక్ష రామగుణగాన మొనర్పెడిపుణ్య రూపునిన్ ‘’
46వ పద్యం లో –‘’ఒంటి మిట్ట లోననె వసియింప నాజ్ఞ నిడె నాకు రఘూత్తము డింక-నేను సింగన నృపతి సమ్ముఖమ్ము నకు గ్రమ్మర బమ్మెర కేగ నొల్ల ‘’
49వ పద్యం లో –‘’శ్రీరామనవమీ మహోత్సవములు నపుడె-భాగవతమ్ము రామా౦కితముగ-కృతి సమర్పణ సేయుటుచితమగును ‘’
59వ పద్యం లో –‘’అంత విప్ర జనాను జ్ఞాతు౦డై,రామ భ్ర్ర్రుత్యుం డగు సహజ పా౦ డిత్యుండు ‘’
పోతనార్యు డానందాశ్రుపూర మొల్క-వరదు పాద సన్నిధి నుంచె భాగవతము
రామగళ సూనహార మా గ్రంథము పయి-నూడి పడె గృతికాంత పెండ్లాడె ననగ’’
ఈ విషయాలనన్నిటిని విమర్శక శిఖామణులు ఆచార్యదివాకర్ల వెంకటావధాని ,రీడర్ శ్రీ పల్లా దుర్గయ్య ,పరిశోధకులు శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గట్టిగా సమర్ధించారు .
పోతనగారు వర్ణించిన ‘’మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి –నువిద చెంగట నుండ నొప్పువాడు ‘’పద్యం ఒంటిమిట్ట కోదండరాముని గురించి చెప్పినదే .దేవాలయం లో పోతన విగ్రహం ఉంది .దేవాలయం లో ‘’భాగవత తాంబూలం ‘’అనే మర్యాద ఉంది .శ్రీరామ తీర్దానికి తూర్పున ‘’పోతన మడి.’’ఉంది.శ్రీనాథమహాకవి పల్లకీ ఎక్కి పోతూ పోతనకొడుకు మడిదున్నుతుంటే ‘’హాలికులా !’’అని హాస్యమాడినచోటు , ,పోతన ఇల్లు శిదిలంకాగా అక్కడే దైవ యోగంతో మరో ఇల్లు నిర్మాణమవటం ,పోతన రామ దర్శనం పొంది కృష్ణకథ భాగవతం రాయటం ,జా౦బవాన్ శ్రీరామ శ్రీకృష్ణావతార కాలాలో ఉండటం .పోతన ఈ ఒంటిమిట్టలోనే ఉన్నాడని రుజువు చేసే సాక్ష్యాలు అంటారు ఈ చరిత్రరాసినఒంటిమిట్ట వాసి శ్రీ రామావఝల వేంకటేశ్వర్లుగారు .
ఆంద్ర వాల్మీకి కూడా తన ‘’ఆంద్ర వాల్మీకి రామయణకావ్యం ‘’లో –‘
‘’బమ్మెర పోతరాజు నిరపాయ సుఖస్థితుజేయు పొంటె,వా –క్యమ్ములనిల్పి ,భాగవత మార్ద్ర సుధారస ధార లొల్క,బూ
ర్వమ్మును-నేడు నింక సరివారలు మిన్నలు లేక యుండ ,సా –రమ్ముగ బల్కు నేక శిల రాముడు నాకు బ్రసన్నుడయ్యెడున్’’
అని పోతనామాత్యుని ఏకశిలారామభక్తి ప్రశస్తి చేశారు .

← Back

Thank you for your response. ✨

సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-19-ఉయ్యూరుς

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1

కడప జిల్లా ఒంటిమిట్ట లో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం రామాయణ కాలం నుంచే ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతమంతా దండకారణ్యం.ఒంటి మిట్టకు సంస్కృత నామం ఏక శిలానగరం .ఒకే శిలలో శ్రీ రామ లక్ష్మణ సీతా దేవి ఉండటం ప్రత్యేకత .అందువలన కూడా ఈపేరు వచ్చి ఉండచ్చు .మహాభాగవత౦ రచించిన బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట వాడే .ఇక్కడే పోతన గారి పొలం అంటే ‘’మడి ‘’ఉంది .పోతనగారిది ఇదే ఊరు అని వాసుదాసకవి అంటే శ్రీ వావికొలను సుబ్బారాయ కవి శ్రమించి గ్రంథస్తం చేశారు  ,ఆంద్ర వాల్మీకి బిరుదాంకితులైన వాసు దాసకవి చెప్పిన మాట రుషి ప్రోక్తంగా శిరో దార్యమే .ఆలయం లో ఆయన విగ్రహం దానికింద ‘’కాటుకకంటి నీరు ‘’పద్యం ఉన్నది విజయనగర రాజులకాలం నుంచి ఒంటిమిట్టకు బహుళ ప్రాచుర్యం కలిగింది .నారవీటి రాజులు స్వామికి మాన్యాలిచ్చారు .

                         పౌరాణిక ప్రాధాన్యం

      ఒకప్పుడుఆది శేషునికి ,వాయుదేవుడికి బల ,పౌరుషాలపై వివాదం వచ్చింది .శేషుడు మేరు పర్వత శృంగాన్ని ఒకదాన్ని పట్టుకొని ,దమ్ముంటే తనను కదిలించమని వాయు దేవుడికి సవాల్ విసిరాడు .వాయుదేవుడు ప్రళయ గంభీరంగా వీస్తున్నా శేషుడు కదలలేదు .కసి హెచ్చి ఇంకా బలంగా ఢీకొట్టాడు.ప్రళయా నిలుని ధాటికి,ఊపుకు  తట్టుకోలేక శేషుడు అటూ ఇటూ అవగా మేరు శృంగం ఆయన పట్టులోనింఛి జారి, గిరగిరా తిరుగుతూ భూమి మీద పడింది,దేవతలు దిగివచ్చి ఇద్దర్నీ శాంతింపజేసి ఒకరిని ‘’మహాబలుడని’’ ,మరొకరిని,’’ మేరు నగ ధీరుడని’’బిరుడులిచ్చారు .ఆ విరిగినమేరు శృంగమే శేషాచలం అయింది .ఆపర్వతాలవరుస కొనసాగి కడప మండలం నల్లమల వరకు వ్యాపించింది ,శేషాచలం అగ్రభాగాన తిరుమల  ,మధ్యభాగమైన దండకారణ్యం లోని ఒంటిమిట్ట ,చివర దేవుని గడప .అయ్యాయి .  తిరుమలలో శ్రీనివాసుడు ,ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామ స్వామి ,దేవునికడపలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు .దండకారణ్యం దక్షిణాన కావేరినది ద్రావిడ ,పాండ్య దేశాలు ,మధ్యభాగంలో ‘’సిరగుజ ‘’పడమట గుజరాత్ లోని కుశస్దలి,వింధ్య దక్షిణ ప్రాంతమైన బీరారు ,కన్యాకుమారి అగ్రం,తూర్పున ఒరిస్సా వైతరణీ నది మధ్యప్రదేశ్  ను ఆక్రమించి కృష్ణా ,గోదావరి మధ్యున్న ఆంద్ర దేశం వరకు దండకారణ్యం వ్యాపించి ఉన్నది .

   పితృవాక్య పాలనకోసం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యానికి నడుచుకొంటూ వచ్చి ,ఎండవేడికి తాళలేక ఒక చెట్టుక్రింద కూర్చోగా కరుణా౦తరంగ సీతమ్మ ఆప్రాంతం లో జీవ జంతు సముదాయం దప్పిక ఎలా తీర్చుకొంటాయి? ‘’అని ప్రశ్నిస్తే ,జానకి దాహం వేస్తోందని గ్రహించి విల్లు ఎక్కు పెట్టి బాణం సంధించి భూమిలోకి వేస్తే  అమృతోపమానమైన పాతాళ గంగ  భూమిని చీల్చుకొని పైకి వస్తే ముగ్గురూ దాహం తీర్చుకొన్నారు .అదే ఇప్పుడు ‘’శ్రీ రామ తీర్ధం’’గా ఇక్కడ ప్రసిద్ధమైంది .ఎన్నికరువుకాటకాలు వచ్చినా ఈ తీర్ధజలం తగ్గదు. అంతేకాదు నల్లపూస వేసినా కనిపించేంత స్వచ్చంగా నీళ్ళుంటాయి .ఆధి వ్యాధులను తీర్చే గుణమూ ఉంది  .పూర్వం దీనిచుట్టూ మొగలి పొదలు దట్టంగా వ్యాపించి పాములు కీచురాళ్ళకు నిలయమై ,ఎవ్వరూ ఇక్కడికి రావటానికి సాహసం చేయకపోతే ఆంధ్రవాల్మీకి శ్రీ వావికొలను సుబ్బారావుగారు ,స్వంత ఖర్చులతో వాటిని తొలగించి ,పైనుంచి కిందకు దిగటానికి మెట్లు కట్టించి రామతీర్ధాన్ని స్నాన యోగ్యంగా మార్చి పుణ్యం కట్టుకొన్నారు .ఒంటిమిట్ట అంటే కొదందరాముడి తర్వాత గుర్తుకొచ్చేది వాసు దాసు మహనీయులే .అంతటి అవినాభావ సంబంధం ఉంది ఆయనకు . ఆయన   పద్య రామాయణం ‘’మంధరం ‘’ఇక్కడే రాశారు .రామతీర్దానికి ఉత్తరంలో ఉన్న చిన్నకొలను లక్ష్మణ తీర్ధం.దండకారణ్యం లో తపస్సు చేసుకొంటున్న మునిగణాలను రాక్షసులు బాధిస్తుంటే వారు శ్రీరాముని శరణు వెడితే అభయమిచ్చి రాక్షససంహారం చేసి శాంతికల్గించాడు .ఆంధ్రవాల్మీకి ఈ సందర్భంగా చెప్పిన పద్యం –

‘’ఈ ముని కోటి కంతటికీ నీవె శరణ్యుడ,వీవెధర్మ ర –క్షా మహితుండవో నుత యశా ! గురు వర్యుడు బూజ నీయుడున్

స్వామియు ,మాననీయుడును ,శాసకుడు న్నృపు డీవ సుమ్ము ,మ-త్స్వామివి నీవ ,నీవు వనధారుణి నుండిన ,నూరను౦డి నన్’’అని మహర్షులు గుర్తు చేశారు రామునికి .

  మరి కొంతకాలానికి సీతాన్వేషణం చేస్తూ ,హనుమ ,జాంబవంతులు ఈ ప్రదేశానికి వచ్చి రాత్రి నిద్ర చేయగా స్వప్నం లో సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చాడు .ఉదయమే లేచి చూడగానే ఏక శిలపై ఆముగ్గురు మూర్తులు ‘’ప్రకటిత ‘’మయ్యారు  .మునులు ముక్తికాములు కనుక సీతామాత వామభాగం అంటే హృదయస్థానం లో ,’’రామస్య దక్షిణో బాహు ‘’అన్నట్లు లక్ష్మణుడు కుడిప్రక్కన అ౦గ రక్షకుడై ధనుర్ధారియైఉంటాడు. రాక్షససంహారం కోసం శ్రీరాముడూ కోదండాన్ని బాణాన్ని  ధరించి కొదండరామస్వామిగా  కనిపిస్తాడు .ఈ దివ్యమంగళ మూర్తులను తనివారా దర్శించి ,పులకించారు హనుమ ,జాంబవంతులు .జాంబవంతుని ఆత్మబలం తో ఇది సాధ్యమైనందు వలన ఈ క్షేత్రం ‘’జాంబ వత్ప్రతిస్టం’’అని పేరుపొందింది .

   త్రేతాయుగం లో జాంబవంతుడు రామునితో మల్లయుద్ధం చేయమనికోరితే, ద్వాపర యుగం లో అది సాధ్యం అని చెప్పటం ,శ్రీ కృష్ణుడు శ్యమంతకమని ని వెతుకుతూ జాంబవంతుని గుహలోకి వెళ్ళటం ఇద్దరిమధ్య భీకర యుద్ధం జరిగి అమేయ బలసంపన్నుడు జా౦బవాన్ ఓడిపోవటం  కృష్ణుడే రాముడు అని గ్రహించటం ,తనకూతురు జాంబవతిని శ్యమంతకమణిని ఇచ్చి పంపటం మనకు తెలిసిన విషయాలే .ఇలా త్రేతా ,ద్వాపర యుగాలతో జా౦బవంతునికి సంబంధం ఉండటం వలన జాంబవంత క్షేత్రం అని గట్టిగా చెబుతారు .

    శ్రీరాముడు అవతారం చాలించి వైకుంఠం వెడుతుంటే ‘’ఎల్లవేళలా నీ రూప దర్శనం ,నామం అనుగ్రహించు ‘’అనికోరగా అనుగ్రహించాడు రాముడు .అందుకే ఇక్కడ కొండ దిగువన కొదందరామునికి ఎదురుగా శ్రీ సంజీవరాయలుగా వెలసి,అంజలి బద్ధుడై  అనుక్షణ నిత్య సేవాభాగ్యం పొందుతున్నాడు హనుమ .

  శివుడు వైరాగ్యం తో తపస్సు చేసింది కూడా ఈ క్షేత్రం లోనే . అందుకే ఇక్కడి  శివుడు ‘’శ్రీరామలి౦గేశ్వరునిగా ప్రసిద్ధుడు .క్షేత్రానికి వాయవ్యం లో మృకండమహర్షి ఆశ్రమం ఉంది .ఇక్కడే కుమారుడు మార్కండేయుడు శివపూజతో మృత్యువును జయించాడు .శృంగి ముని తపస్సు చేస్తుండగా మెడడలో చచ్చినపాము  వేశాడని నిష్కారణంగా పరీక్షిత్తు మహారాజును శపించి ,ఆ పాపం పోవటానికి శ్రీరామ తీర్ధం దగ్గర ఉన్న కొండపై తపస్సు చేశాడు .అదే శృంగి శైలం. అదే  ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి ఆశ్రమం అయింది .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-19-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

15-12-19 ఆదివారం

  గత రెండు రోజులుగా రాత్రి నిద్రలేనందున శనివారం రాత్రి మాంచి నిద్రపట్టి ఆదివారం ఉదయం 6-30కు మెలకువ వచ్చి ,కార్యక్రమాలు కానిచ్చి , గీజర్ వేడి నీటి స్నానం చేసి సంధ్య ,పూజా పుస్తక పఠనంతో పూర్తి చేశాను .ఈలోపే కిందినుంచి శ్రీమతిపద్మ మామనవడితో కాఫీ పంపిస్తే సేవించి ,సామానంతా సర్దేసుకొని బాగ్ తో 7-15కి కిందకి దిగాను .మా వాళ్ళు స్నానానికి ఉపక్రమించారు .ఆడవాళ్ళు ఇంకా బద్ధకం గానే ఉన్నారు .స్నానాలు కాలేదు .అందరి స్నానాలు అయే సరికి పద్మగారు అందరికీ పూరీ కూర సిద్ధం చేయగా ,కావలసినన్ని అడిగి అడిగి వేసి తినిపించారు .తృప్తిగా అందరం తిన్నాం .ఇంతమందికి అంటేమా ’’ సెవెన్ సీటర్స్ ‘’కు శివగారికి, తనకూ అనగా ‘’నవగ్రహాలకు ‘’పూరీ బ్రేక్ ఫాస్ట్ మహా ఫాస్ట్ గా చేసి వడ్డించారు .అందరం ఆమె వర్క్ హాలిక్ తనానికి మెచ్చుకోన్నాం. తనకు ఇలా ఇంటికి బంధువులు స్నేహితులు వస్తే వడ్డించి భోజనం పెట్టటం లో ఎంతో సంతృప్తి ఉందన్నారామె.శనివారం సాయంత్రం శివ దంపతులకు మేము ‘’చిరు సత్కారం ‘’చేస్తే,పద్మగారు ‘’ఎన్నాళ్ళయిందో మా పుట్టింటి వారు ఇలా చీర సారే పెట్టి .అచ్చంగా మా అమ్మానాన్న ల్లాగా మీరు నన్ను ఆదరించారు ‘’అని ఆనంద బాష్పాలు రాల్చారు .మా శ్రీమతి ‘’అమ్మా !మీలాంటి వాళ్ళందరూ మా అమ్మాయిల్లాంటి వారే .వారికి ఏదైనా ఇలాచేయటం లో మాకు కొండంత సంతృప్తి ఉంది .’’అని భుజాన చేయి వేసి దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తలనిమిరి ఆలింగనం చేసుకొన్నది .ఆ అనుభూతి మాకు మహదానందంగా ఉన్నది .

               మృకండ మహర్షి ఆశ్రమ సందర్శనం

 అనుకొన్న సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ఆదివారం ఉదయం 8-30కు సామాన్లన్నీ కారులో సర్దేసి శివగారితో సహా కారు ఎక్కు తుండగా ఎదురింట్లో  ఉన్న ఆయన తమ్ముడు  ,లాయర్    శ్రీ ఆదినారాయణ రావు గారు వాళ్ళఅబ్బాయి వారి బంధువు వాకిట్లో నిలబడి మాకు సెండాఫ్ ఇచ్చారు .రావుగారు శుక్రవారం రాత్రి వచ్చి మాట్లాడి 1-శ్రీ మదొంటి మిట్ట కోదండరామాలయ దివ్య చరిత్రము 2-ఒంటిమిట్ట శ్రీరామకథ 3-జయం జయం పుస్తకాలిచ్చారు .కారుకు శుభ శకునంగా  శ్రీమతి పద్మ ఎదురు రాగా బయల్దేరాం అందరికీ వీడ్కోలు చెప్పి .రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటాక మృకండ మహర్షి ఆశ్రమం పది నిమిషాలలో చేరాం .అక్కడి పూజారికీ ముందే శివ గారు చెప్పి ఉండటం తో మాకు విఐపి ట్రీట్ మెంట్ జరిగి ‘’శ్రీ మృకండేశ్వర స్వామిని ‘’పూజ చేసి ,తీర్ధ ప్రసాదాలిచ్చారు .నాకు పుష్పహారం కూడా వేశారు .ఇక్కడే మార్కండేయుడి తండ్రి మృకండ మహర్షి తపస్సు చేశారు .ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది .పెళ్ళిళ్ళు బాగానే జరుగుతాయి .శివ గారి వివాహం పద్మగారితో ఈ కళ్యాణ మండపం లోనే జరిగిందని జ్ఞాపకం చేసుకొని శివ చెప్పారు .

    ఒంటిమిట్ట దగ్గర ‘’మాధవరం’’ గ్రామం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి .రెండు రోజులనుంచి అదేరూట్ లో వేడుతూ౦ డటం తో ఒకసారి దిగి చూడాలని పించి శివగారికి భార్యకు చెబితే , సరసమైన రెట్ల తో ఇచ్చే శ్రీ సాయిఈశ్వర్ హాండ్ లూం స్టోర్స్ ‘’దగ్గర మమ్మల్ని దింపి ,షాప్ వోనర్ తో మాగురించి చెప్పగా  ,ఇంటికి మా కారులోనే ఆయన్ను డ్రాప్ చేసివచ్చారు మావాళ్ళు .షాప్ ఇంకా తెరవలేదు .మమల్ని చూసి హడావిడిగా ఊడ్పులు ,ముగ్గులు వేసి ఓపెన్ చేసి సరుకు చూపించాడు వోనర్ .మేము 12 చీరలు ,మా కోడలు మామనవరాలికోసం టాపులు,వియ్యపురాలు రెండు ,రాంబాబు వాళ్ళమ్మకు రెండు కొన్నాం .మంచి’’ హోమ్ మేడ్’’  కాఫీ ఇచ్చారు అందరికీ .షాపింగ్  అయేసరికి 10-30అయింది .సరాసరి బ్రహ్మంగారి మఠానికి బయల్దేరాం .

      బ్రహ్మంగారి మఠ సందర్శనం

  మాధవరం నుంచి సిద్ధవటం మీదు గా కచ్చాపచ్చా రోడ్ పై ప్రయాణం చేసి ,చివరికి సింగిల్ రోడ్ లోనూ ప్రయాణించి కందిమల్లయ పల్లి అనే బ్రహ్మం గారి మఠం అనే గ్రామానికి  మధ్యాహ్నం 12-15కు  ,శివగారి బంధువు ల ఇంటికి చేరాం.శివగారు వీరికి చెప్పి ఉండటం చేత వారబ్బాయి డాక్యుమెంట్ రైటర్ ‘’ శివ ‘’మా కోసం ఎదురు చూస్తున్నాడు .అతను బైక్ మీదా మేము కారులో బ్రహ్మం గారి మఠం చేరాం అయిదు నిమిషాలలో .శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాశీలో అత్రి మహర్షి ఆశ్రమంలో పెరిగి  ,ఇక్కడికి వచ్చి తత్వ బోధలు చేస్తూ సంఘ సంస్కరణకు పాల్గొనగా ఊరి జనం వెలి వేస్తె  ,నీరు ఆహారం లేకుండా చేస్తే ,ఒక రోజు రాత్రి మహాసంకల్పం తో చేతిలో ఉన్న చిన్న కొమ్ముతో బావి తెల్లారేటప్పటికి తానొక్కడే త్రవ్వి తన సంకల్ప బలం నిరూపించారు .ఆ బావి నీరు మహా రుచిగా ఉన్నాయి ఏబావి ఎండిపోయినా ఈ బావి నీరు ఎప్పుడూ ఎండక పోవటం విశేషం .గ్రామ దేవత పోలేరమ్మకు ఊరిజనం జంతువులను బలి ఇస్తుంటే ఆపేసిన కారుణ్య మూర్తి  బ్రహ్మ౦గారు .తను చుట్ట కాల్చుకోవటానికి నిప్పుకావాలంటే పోలేరమ్మ దేవతతో స్వయంగా తెప్పించుకొన్న మహిమామూర్తి బ్రహ్మం గారు .ఆయన నివశించిన ఇల్లు కూడా చూశాం .అసలు మఠం లో బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యారు .దానిపై శివలింగం ఏర్పాటు చేశారు భార్యవీర పాపమాంబ కూడా ఇక్కడే సిద్ధిపొందారు .వీరిద్దరి సమాధులు ప్రక్కప్రక్కనే ఉన్నాయి .వెనక భాగాన ఒక నూనె దీపం ఇరవై నాలుగు గంటలూ  వెలుగుతుంది. బ్రహ్మంగారు జీవించి ఉన్నప్పడు నీటితో దీపం వెలిగించారు .ఆయన పోయాక నూనె దీపం పెట్టి కాపాడుతున్నారు .బ్రహ్మంగారు కొడుకు ,కోడలు కూడా ఇక్కడే సమాధి అయ్యారు .బ్రహ్మ౦ గారు రాసిన కాలజ్ఞానం ప్రతులు వెండి బాక్సుల్లో ఆయనసమాది వద్ద భద్ర పరచారు .కాలజ్ఞానం ఆయన బనగానపల్లిలో రాశారు .అక్కడి నుండి ఇక్కడికి వచ్చాకనే ఇక్కడసమాది అయ్యారు..మఠం  లో నిత్యాన్నదానం జరుగుతుంది .
ఈవిషయాలన్నీ ‘’చిన్న శివ ‘’మాకు దగ్గరుండి చూపిస్తూ వివరించాడు .ఇవన్నీ చూపించి  చిన్న శివ ఇంటికి మమ్మల్ని తీసుకు వెళ్ళాడు .ఆ శివకు ఈ శివకు చుట్టరికం ఏమిటి ?ఆ శివ అన్నగారి అమ్మాయి ఈశివ అమ్మగారు .అదీ బంధుత్వం .శివనాన్నగారు గ్రామకరణం చేసి తర్వాత డిగ్రీ బి.ఎడ్ పాసై టీచర్ గా చేరి హెడ్ మాస్టర్గా రిటైరయ్యారు .వీరిపేరు సుబ్రహ్మణ్యంగారు .పనిమీద బెజవాడ వెడితే ఈ శివ మా బాధ్యతా అంతా ఆశివ చెప్పగా తీసుకొన్నాడు. ఇంట్లో ఆడవారందరూ మహా కలుపుగోలుగా మమ్మల్ని దగ్గర బంధువులుగా ఆదరించి మర్యాద చేసి కమ్మని భోజనం వండి వడ్డించి కొసరి కొసరి తినిపించారు .శివ బ్రదర్స్ నలుగురు .అందరూ ఉద్యోగస్తులే. దగ్గరలోనే పని చేస్తున్నారు .ఉమ్మడి కుటుంబం .కోడళ్ళు,అత్తగారు మహా నిదానస్తులు .ఆతిధి మర్యాద బాగా తెలిసినవారు .ఆ ఆదరణకు మేము ‘’ఫిదా ‘’అయ్యాం .ఒకమనవరాలు మహాలక్ష్మి చాలాకలుపుగోలు గా చాలాకీగా ఉండి,నన్ను ‘’తాతయ్యా తాతయ్యా’’ అని ఆత్మీయంగా పిలుస్తూ ,నా నవ్వు చాలాబాగుందని మెచ్చుకొని, కావాలని నవ్విస్తూ ఫోటోలు తీసింది .నిజంగా మనవరాలే అనిపించింది ఆ చిన్నారి .తొమ్మిదో తరగతి చదువుతోంది .అక్కడి ఫోటోలన్నీ ఆపిల్లే తీసింది .జామ చెట్టు ,మిగిలిన చెట్లతో వాతావరణం బాగుంది .ఈ ప్రాంతాలలో కోతులెక్కువ .కరెంట్ తీగలమీద కూడా కూర్చునే సాహసం వాటిది .భోజనాలుకాగానే ఆకు ,వక్కా ఇచ్చి తాంబూలం వేసుకోమన్నారు అరటిపళ్ళు తినటానికిచ్చారు జామకాయ కోసి ముక్కలు పెట్టారు .ఆడవారికి జాకెట్ పసుపు,కుంకుమ పూలుఇచ్చి మర్యాద చేశారు .వాళ్ళ అందరి భోజనాలు అయ్యే దాకా మేము ఉండి,వీడ్కోలు చెబుతుంటే ‘’వీలైనప్పుడల్లా వస్తుండండి.మాకేమీ ఇబ్బంది లేదు .మీవాళ్ళు ఎవరొస్తున్నా చెప్పండి అన్నీ దగ్గరుండి మా శివ చూపిస్తాడు ‘’అని ఆప్యాయత వర్షించి మమ్మల్ని తమవాళ్ళ ను చేసుకొన్న సౌజన్యం వారందరిదీ .ఎక్కడో ఒంటి మిట్ట శివ గారికి తెలిసిన మాకు ఇంతటి ఆప్యాయత ఆత్మీయతా చూపటం పరమా శ్చర్యంగా ఉంది .ఆ సంస్కారం అలాంటిది .బాంబుల సీమలో ‘’ప్రేమ అనురాగ ఆత్మీయ బాంబులు ‘’పేల్చిన ఆ కుటుంబం ఎన్నటికీ మరపురాదు .శివను అడిగి వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే సరసభారతి పుస్తకాలు పంపిస్తానని చెప్పి ,ఉయ్యూరురాగానే 16వ తేదీసోమవారం 12పుస్తకాలు రిజిస్టర్డ్ పార్సిల్ లో పంపి కొంతవరకు రుణవిముక్తులంయ్యామనుకొన్నాను .

                    త్రిపురాంతక సందర్శనం

 బి.మఠం లో చిన్న శివ ఇంటివారందరికీ ధన్యవాదాలు చెప్పి ,షార్ట్ కట్ లో ప్రయాణం ఎలాగో

తెలుసుకొని మధ్యాహ్నం 2-30కు బయల్దేరాం ఆనందంగా .ఇక్కడి నుంచి కడపజిల్లా పోరుమామిళ్ల మీదుగా ,ప్రకాశం జిల్లా బేస్తవారి పేట కు సాయంత్రం 4కు చేరి,కాఫీలు తాగాం.ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం  వచ్చింది  .ప్రకాశం జిల్లా కనిగిరి మీదుగా వచ్చేటప్పుడు ప్రయాణం చేశాం కదా .కనిగిరి ని కాటమరాజు అనే యాదవ రాజు ,నెల్లూరును మనుమసిద్ధి మహారాజు పాలిస్తున్నప్పుడు పాలించాడు .పశువుల ‘’పుల్లరి’’(పచ్చిక బీడులలో మేపుకోవటానికి ఇచ్చే డబ్బు ) విషయమై తగాదా వచ్చి యుద్ధం జరిగింది కనిగిరిలో .మనుమసిద్ధి సేనాని ఖడ్గతిక్కన .మంత్రి తిక్కన సోమయాజి .ఖడ్గతిక్కన  యుద్ధం లో వీర విహారం చేసి మరణించిన సంగతి ,అంతకుముందు యుద్ధం నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రీ తల్లీ బార్య ఆయన్ను  ఆడదానికింద జమకట్టి  నిష్టూరాలాడటం విరిగినపాలు అన్నం లోపోయటం మంచం వెనక స్నానానికి నీళ్ళుపెట్టి అవమానించటం  మనకు తెలిసిన విషయాలే .పేట నుంచి  30కిలోమీటర్లదూరం లో ‘’గుంట’’వెళ్లి ,అక్కడి నుంచి సుమారు20కిలో మీటర్లదూరం లో ఉన్నప్రకాశం జిల్లా  త్రిపురాంతకం చేరే సరికి సాయంత్రం 5-30అయింది .ము౦దుగా కొండ దిగువన ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం లో అమ్మవారి దర్శనం చేశాం. అమ్మవారు మహా వైభవంగా వెలిగిపోతోంది .ఇక్కడ అమ్మవారు ఒక చెరువు నూతిలో ఉంటుంది  ,ఇది గొప్ప శక్తి పీఠం.అమ్మవారు మహా మహిమాన్విత .’’బాల’’ ఆకారం లో ఉంటుండటం విశేషం. త్రిపురాంతకం లో కొండపైన మహా శివుడు తారకాసురుని ముగ్గురు కొడుకులను అమ్మవారి సహాయంతో ఇక్కడే సంహరించాడు కనుక త్రిపురాంతకం అని పేరు .పార్వతీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామిగా ఇక్కడి శివుడిని పూజిస్తారు .త్రిపురాంతకం  శ్రీశైలానికి 100కిలో మీటర్లు .శ్రీశైలానికి తూర్పు ముఖద్వారం త్రిపురాంతకం .

   సాయంత్రం 6-30కు త్రిపురాంతకం నుండి బయల్దేరి ,నరసరావు పేట ఔటర్ ద్వారా గుంటూరుకు రాత్రి 8-30కు చేరి ,అక్కడ మదీనా మొబైల్ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తిని 9గంటలకు బయల్దేరి రాత్రి 10-30కి ఉయ్యూరు చేరాం .బయల్దేరిన దగ్గరనుండి మొత్తం 61 గంటలు ఈ మూడు రోజుల్లో .మాడ్రైవర్ ఈసా చాలా నిదానస్తుడు .ఎంతోజాగ్రత్తగా సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసినా మాకు అలపు  లేకుండా చేశాడు  .అతని ఓర్పుకు హాట్సాఫ్ .అందుకే ఘనంగానే అతనికి మామూలు ఇచ్చాం అడగకపోయినా .ఇలా శ్రీఒంటిమిట్ట కోదండరామ దర్శనం తో మొదలుపెట్టి ,,శ్రీత్రిపురా౦తకేశ్వర  బాలాత్రిపురసుందరీ దర్శనం తో యాత్ర ముగించి హరిహరాద్వైతాన్నిచాటామేమో నని పించాం .

 ఒంటిమిట్ట శ్రీ  కోదండ రామాలయ ,పుష్పగిరి ,సిద్ధవట వివరాలు , విశేషాలు తరువాత తెలియజేస్తాను .ఇన్ని రోజులు ఇంతదూరం మాతో ప్రయాణించిన మీకు ధన్యవాదాలు .

  మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-19-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-2

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-2

డా.శివగారింట్లో మేడపై గదిలో మగాళ్ళం డ్రైవర్ తో సహా పడుకొన్నాం .నేను మ౦చంపైనా చరణ్ ,రాం బాబు కిందపరుపులపైనా ,డ్రైవర్ వసారాలో మంచం మీదా పడుకున్నాం .శివగారిల్లు నిత్య కల్యాణం పచ్చతోరణం లా ఎప్పుడూ బంధువులు స్నేహితులతో రద్దీ గానే ఉంటుంది .కనుక పది మంది వచ్చినా హాయిగా పడుకొనే ఏర్పాట్లున్నాయి .ఆడవాళ్ళను  ముగ్గుర్ని కింద మంచాలపై పడుకోబెట్టి ,శివ దంపతులు నేలమీద పడుకొన్నారు .నాకు,మా ఆవిడకు  గురు వారం రాత్రి అంతా పెద్దగా నిద్రలేదు .ఆవిడ వంట హడావిడి, నాకు యేహడావిడి లేకున్నా నిద్రలేదు .శుక్రవారం రాత్రి ఒంటిగంటకే మెలకువ రాగా మూడు న్నర దాకా అటూ ఇటూ దొర్లి ,లేచి పండ్లుతోమి  కాలకృత్యాలు కానిచ్చి , ,రాం బాబు తో గీజర్ ఆన్ చేయించి ,హాయిగా వేడి నీటితో స్నానం చేశాను .సంధ్యావందనం ,పూజ పుస్తక పఠనం తో పూర్తి చేశా .అప్పటికే పద్మగారు కాఫీ కలిపి గ్లాస్ నాకు పైకి పంపిస్తే త్రాగాను .మిగిలినవారూ సిద్దమయ్యారు .

,అందరం 14వ తేదీ శనివారం ఉదయం 5కు సిద్ధమై ,గుడి ఇంటికి దగ్గరే అయినా కారులో శివగారితో సహా బయల్దేరి 5-30కి చేరి మెట్లు ఎక్కి ఆలయ ప్రవేశం చేశాం .5-45కు అంతరాలయం లో మా అభిషేకం టికెట్లు వెరిఫై చేసి ,మమ్మల్ని స్వామికి అతి సమీపం లో కూర్చోబెట్టారు .అందరి గోత్రనామాలు చదివి పూలున్న పళ్ళెం మాతో తాకించి  ,మేమంతా అభిషేకం లో పాల్గొనే అర్హత కలిగించారు .ఆ రోజు 30మంది అభిషేకం టికెట్లు కొన్నారు .సరిగ్గా ఉదయం 6గంటలకు ఆలయం ఆఫీసర్ కు సంప్రదాయ తలపాగా చుట్టి చేతుల్లో పూలు పండ్లు మేమిచ్చిన నూతనవస్త్రాలతో పూల దండలతో పండ్ల తో  స్వాములపాదలవడ్డ ఉంచమని ఇచ్చిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు ,సహా  నూతన వస్త్రాలున్న పళ్ళెం ఇచ్చి  తెల్ల గొడుగు  పట్టించి ,అర్చకస్వాములు మాతో సహా అందర్నీ ఆలయ ప్రదక్షిణ మూడు సార్లు మంత్ర పూత౦గా మంగళ వాద్యాలు మ్రోగుతుండగా చేయించి ,మళ్ళీ అంతరాలయం లోకి తీసుకు వెళ్ళారు .

అభిషేకం

అప్పటికే శ్రీరామ ,లక్ష్మణ ,సీతా మాతల తో ఉన్న కోదండరామ స్వామికి  అభి షేక వస్త్రాలు ,పూలమాలలు ధరింపజేసి మంత్రాలతో అభిషేకం మొదలు పెట్టారు .తర్వాత హారతి ఇచ్చి ,రెండో సారి పసుపు ,ఆవుపాలు ,పంచామృతాలతో అభిషేకం చేసి శిరసులపై రంధ్రాల పళ్ళెం తో జల్లు స్నానం లాగా చేసి మళ్ళీ హారతిచ్చారు .మూడవ సారి పవిత్ర జలాలతో జల్లుస్నానం తో అభి షేకం పూర్తి చేసి హారతిచ్చారు .ఇదంతా అయ్యేసరికి ఉదయం 7-30 అయింది .నాకేమని పించింది అంటే మంత్రాలకన్నా తంత్రాలే ఎక్కువయ్యాయని ..అందరం జ౦ప ఖానాలపై కూర్చున్నాం .మా శ్రీమతికి ,వియ్యపురాలికి అంతరాలయం వెలుపల శివ గారు కుర్చీలు  వేయించి  స్పష్టంగా కనబడేట్లు కూర్చో పెట్టించారు .అందర్నీ బయటకు పంపించి స్వామి వారికి నూతన వస్త్ర ధారణా అలంకరణ ,నిత్యపూజా చేసేసరికి 8-45 అయింది .నేను అభిషేకమవగానే బయట మెట్లపై కూర్చుని తెచ్చుకొన్న శ్రీరామ  అష్టోత్తర , సహస్రనామాలు ,సీతా అస్టోత్తర  సహస్రనామాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసి ,మళ్ళీ అందరం అంతరాలయం లోకి వెళ్లాం .శ్రీ కోదండ రాములకు హారతిచ్చి ,మాకు అభిషేకజలం శిరసుపై జల్లి ,తీర్ధం ఇచ్చారు .మేమిచ్చిన వస్త్రాలు అయ్యవార్లకు అమ్మవారికి అలంకరించి మేమిచ్చిన పూలదండలు స్వామివార్లకు వేసి కనులపండువ చేశారు. మా శ్రీమతి ఆనందం వర్ణనాతీతం పరవశించి౦ది    నాకు అర్చకస్వామి చేత మెడలో స్వాముల శేషవస్త్రం ఖండువా కప్పించి స్వామి కి వేసిన పుష్పమాల వేయి౦చారు శివ .మేమందరం ఈ రెండున్నర గంటలలో దివ్యానుభూతిని పొందాం .దీన్ని ఇలా ఏర్పాటు చేయించిన శివ గారిని యెంత మెచ్చుకున్నా చాలదు .అందరం బయటకు వచ్చి ,అక్కడ ప్రసాదాలు పెట్టె మందిరం దగ్గరకు వెళ్లి దొప్పలలో అందజేసిన  వేడి వేడి పొంగలి ,పరవాన్నం తిన్నాం .మహా రుచికరంగా ఉన్నాయి .ఒక్కొక్కరం రెండేసి దొప్పలప్రసాదం లాగించాం .శుక్రవారం రాత్రి శ్రీ సౌమ్య వేంకటేశ్వరాలయం లో ‘’మలిహోర ‘’అనే ప్రసాదం పెట్టిన సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది .మహా రుచిగా ఉంది .అడిగి మళ్ళీ పెట్టించుకొని తిన్నాం .

ఆలయ లోపల, ముఖ మడపం లోనూ ,బయటి గోపురం బయటా లోపల శిల్పకళ అత్యద్భుతం గా ఉన్నది .వాటిని మాకు దగ్గరుండి చూపిస్తూ ,వివరించారు డాశివ .ఒక శిల్పం లో గుర్రం ఏనుగు తలలు కలసి ఉండటం ఆశ్చర్య౦ .బయటి మెట్లకు కుడిప్రక్కన ఆవరణలో కడప నవాబు ప్రతినిధి ‘’ఇమాం బేగ్’’ త్రవ్వించిన బావి ఉన్నది .దీని జలమేస్వాములకు అభిషేకజలం గా వాడుతారు .ఇలా శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వాముల దర్శనం ,అభిషేకం కనులపండువుగా చూడగలిగిన అదృష్ట వంతులమయ్యాం .ఆలయం లో ఒక ప్రక్క చిన్న మందిరం లో చిన్నశ్రీ  ఆంజనేయస్వామి విగ్రహం ఉంది .బయట చిన్నగూడులో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది జా౦బవంతుడిలాగా అనిపిస్తాడు .జాంబ వంతుడే విగ్రహ ప్రతిష్ట చేశాడని అతిహ్యం . కనుక జాంబ వంత క్షేత్రం గా భావిస్తారు బయట చిన్నగూడులో  పొతనామాత్యుల విగ్రహం ,దానికింద పద్యం ఉన్నాయి .పోతనగారి జన్మస్థలం ఒంటిమిట్ట అనే ఏకశిలా నగరం .ఇక్కడ ఆయన జయంతి ప్రతిఏడాది ఘనంగా నిర్వహిస్తారు .పోతన మడి(పొలం ),శ్రీనాధుడు గాలిలో పల్లకీ నిలిపిన చోటు ఇక్కడే ఉన్నాయి . పోతన తెలంగాణాలో పుట్టినట్లు అక్కడివారు భావిస్తారు.మార్కండేయుని తండ్రి మృకండ మహర్షి ఈక్షేత్రం లో తపస్సు చేశాడనీ కనుక మృకండ క్షేత్రం అనే పేరు కూడా ఉందని అంటారు .ఈ వివరాలు ఆలయ చరిత్రలోతర్వాత  రాస్తాను .

శ్రీ సంజీవ రాయ హనుమ

శుక్రవారం రాత్రే కోదండరామ దర్శనానికి ముందు సంజీవరాయ దర్శనం చేశాం .కోదండ రామునికి ఎదురుగా  ఆలయం మెట్లకు ఎదురుగా ఈ స్వామి ఆలయం ఉంది .సుమారు 5అడుగుల భారీవిగ్రహం .మహా వర్చస్వంత౦ గా దర్శనమిస్తాడు హనుమ ఈ క్షేత్రపాలకుడు సంజీవరాయహనుమ  .మేము ఉయ్యూరు నుంచి తెచ్చిన ,మా దొడ్లోని తమలపాకులు,కట్టి తెచ్చిన చేమంతిపూల దండ నూతన వస్త్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు , కొబ్బరికాయ వగైరా పళ్ళెంలో పెట్టి అర్చకస్వామికి అంద జేశాం .ఆయన మా అందరి గోత్రనామాలు అడిగి చెప్పి అష్టోత్తర పూజ చేస్తుండగా నేను అష్టోత్తర సహస్ర నామాలు తృప్తిగా చదివి స్వామికి వినిపించా .దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండు భాగాల పుస్తకాలు స్వామి చరణాల వద్ద అర్చక స్వామితో పెట్టించాను .మేమిచ్చిన వస్త్రాలు స్వామిపై వేసి ఆనందం కలిగించారు .నైవేద్యం హారతి ఇచ్చారు .నాకు అర్చకస్వామితో ప్రసాదం ఇప్పించి స్వామి శేషవస్త్రం కప్పించి పుష్పహారం వేయించారు శివ.శనివారం నాడు మా ఇలవేల్పు హనుమ సంజీవరాయ రూపం తో దివ్య దర్శనం చేశాం .మధురానుభూతి పొందా౦ అందరం .

శివగారితో ముందే చెప్పి ప్రతి శనివారం ఇక్కడ అమ్మే తిరుమల స్వామి లడ్డూలు 10 కొన్నాం .ఒక్కోటి 50 రూపాయలు.ప్రసాదంతిని ,కారులో శివగారింటికి 9-30కు చేరాం .అందరికి వేడి వేడి మినపట్లు తిన్నవారికి తిన్నంత గా రెండుచట్నీలతో  చేసి పెట్టారు శ్రీమతి పద్మ .మహారుచికరంగా ఉన్నాయి .ఆమెకు ధన్యవాదాలు చెప్పాం .ఆమె సన్నగా పీలగా ఉన్నా మహా చలాకీ మనిషి .నిమిషాలలో అన్నీ సిద్ధం చేస్తారు .మనిషికాదు మానవత్వం ,ఆపేక్ష ,ఆత్మీయత రంగరించిన యత్రం అనిపిస్తు౦ది ఆమె స్పీడ్ చూస్తే.

పుష్పగిరి సందర్శనం

శనివారం ఉదయం 10-30కి శివగారింటి నుంచి అందరం కారులో బయల్దేరి ,దారిలో సీతాదేవికి దప్పిక అయితే శ్రీరాముడు వేసిన బాణం తో భూగర్భాగంగ ఉబికి పైకి వచ్చిన రామతీర్ధం ,లక్ష్మణుడు వేసిన బాణంతో  భూగర్భ జలం గా వచ్చిన లక్ష్మణ తీర్ధం చూశాం .ఈ రెండు నీళ్ళ రుచి భిన్నంగా ఉంటాయట .రామతెర్ధం కొబ్బరినీళ్ళులాగా ,లక్ష్మణతీర్ధజలం ,కొంచెం తక్కువ తీయగా ఉంటాయట .ఒకదానికొకటి 10అడుగుల దూరం లో ఉన్నప్పటికీ’ .సరాసరి పుష్పగిరి చేరాం 11గంటలకు .ఆ వూళ్ళో ఎవరో చనిపోతే ఆలయం మూసి పూజారి వెళ్ళాడట .ఊళ్ళో శవం ఉండగా ఇక్కడ ఆలయాలు తీయరట.ఒకమ్మాయి తాను  చెప్పి పిలుచుకోస్తానని చెప్పి వెళ్లి వెంట ఉండి తీసుకొచ్చింది అర్చకుడు యువకుడే .ఒక్కో ఆలయం తలుపు తీసి దీపం వెలిగించి దర్శనం చేయించాడు .ఇక్కడ శివుడు ‘’వైద్యనాథేశ్వరుడు .అమ్మవారు కామాక్షి దేవి విడిగా చిన్న గుడిలో ఉంటుంది. అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రం ఉంది ఈ ఆలయం శక్తి పీఠం.  అస్టమాతృకల విగ్రహాలున్నాయి .సిద్దేశ్వరాలయమూ ,శ్రీ లక్ష్మీ చేన్నకేశవాలయమూ ఉంది .అన్నీ చక్కగా చూసి ఇక్కడి పుష్పగిరి పీఠం చూద్దామని ఆశపడితే ,పీఠాధిపతి  ఇక్కడ ఉండటం లేదని చెప్పాడు పూజారి .కాని గో సంరక్షణ ఉన్నది  సరే అని అది ఉన్న చోటు చూసి ఫోటోలు దిగాం .పుష్పగిరి పీఠం ఆంధ్రుల ముఖ్య పీఠం.కంచిది తమిళులది ,శృంగేరి కన్నడిగులది .ఒకప్పుడు మహా వైభవంగా ఉండేది పుష్పగిరి పీఠాదిపతి మందీ మార్బలంతో దేశమంతా పాదయాత్ర చేసి శ్రీచాక్రార్చన చేసేవారు .ఇప్పుడు అంతా వెలవెల బోతోంది ఇక్కడి వాతావరణం .పూల తో శోభిల్లేగిరి పుష్పగిరి .ఇప్పుడాశోభ లేకపోయే సరికి ఉసూరు మనిపించింది .పీఠ విశేషాలు తర్వాత రాస్తాను .పుష్పగిరి లో పెన్నానదికి అవతల ఎత్తైన కొండపై శ్రీ చెన్నకేశవ ఆలయం దూరానికే ముచ్చటగా అనిపిస్తుంది .వెళ్లి చూసే టైం లేక వెళ్ళలేదు .కానీ చూడాల్సిన దేవాలయం .

కడప ప్రాంతం అంటే బాంబులతో దద్దరిల్లు తుందనే భయం ఉండేది .15ఏళ్ళనుంచి ఫాక్షనిజం లేదని శివ చెప్పారు .రోడ్డుకు ఇరువైపులా వరి చేలు కంటికింపుగా ఎక్కడ చూసినా కనిపించటం మరో విశేషం .పొట్టి వంగడం ‘’జిలకర మసోరి ‘’ఈ ప్రాంతపు ప్రత్యేక వరిపంట .ఇది ఎక్స్ పోర్ట్ వెరైటీ .నాణ్యమైన సన్నబియ్యం బియ్యం జిలకర మసూరి.

దేవుని గడప

పుష్పగిరి నుంచి సరాసరి దేవుని గడపకు వెళ్లాం .ఇది కడప కు బయట 5కిలో మీటర్లలో ఉంటుంది .పాతకడప అనీ అంటారు .ఇక్కడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం సుప్రసిద్ధం .తిరుమల వెళ్ళే యాత్రికులకు ఇది గడప వంటిది అందుకే దేవుని గడప అని అంటారు .ఈ స్వామి దర్శనం చేస్తే తిరుమల బాలాజీని దర్శించినట్లే అవ్వాలని ఒక భక్తుని కోరికపై ఇక్కడ స్వామి వెలిశాడని అతిహ్యం .ఇక్కడ కూడా డా.శివ గారు తన బంధువుకు ముందే ఫోన్ చేసి చెప్పి మాకు శీఘ్రదర్శనం కలిపించి స్వామివారి కై౦కర్యం మాకు లభించేట్లు చేశారు .అంతటి నెట్ వర్క్ శివ గారిది .

కడప బ్రౌన్ మెమోరియల్ లైబ్రరి

దేవుని గడపనుంచి సరాసరి కడప వెళ్లి సి.పి.బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీకి వెళ్లాం .అప్పటికే ఒంటిగంట అయింది .మూసేశారు .అక్కడి లేడీ అటెండర్ తలుపులు తీసి మాకు లోపల అంతా చూపించింది .సరసభారతి ప్రచురణలు 14 లైబ్రరీలో లైబ్రేరియన్ కు ఇవ్వాలని తెచ్చాను .కనుక  గీర్వాణం- 3,ఆధునిక ప్రపంచ నిర్మాతలు పుస్తకాలు ఆ అటెండర్ కిచ్చి ఫోటోలు తీసుకొన్నాం ,మిగిలిన పుస్తకాలను ప్రస్తుతం తిరుపతి లో ఉన్న లైబ్రరి ట్రస్ట్ సెక్రెటరి శ్రీ తట్టా నరసింహా చారి గారి కి ఫోన్ చేసి ఆయన రాగానే తాను  అందజేస్తాననని శివ గారు అంటే వారికి అప్పగించాను .కడప కలెక్టర్ గా చేసిన బ్రౌన్ ఆంధ్రభాషకు చేసిన సేవ అమూల్యం అనితర సాధ్యం .ఎన్నో అపూర్వ గ్రంథాలు సేకరించి పండితులను తనస్వంత ఖర్చుతో నియమించి పరిష్కరి౦ప జేసి ప్రచురించాడు .తానూ స్వయంగా తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు ‘’బ్రౌణ్యం ‘’కూర్చిన అంద్రులకు ప్రాతస్మరణీయుడు బ్రౌన్ .ఇంగ్లాండ్ లో పుట్టి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చి తెలుగు భాషాభి వృద్ధికి యెనలేని సేవచేశాడు .వేమనగారి శతకపద్యాలు సేకరించి మొదటగా ప్రచురించాడు బ్రౌన్ .ఇక్కడ బ్రౌన్ లైబ్రరి,రిసెర్చ్ కేంద్రం  ఏర్పడటానికి ముఖ్య కారకులు మహా పండితులు ,విమర్శకులు విశ్లేషకులు స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమత్సాస్త్రి గారు .ఎన్నో ఉపయుక్త గ్రంథ రచన చేశారు .సరసభారతి పుస్తకాలు వారికి పంపిస్తే ,చదివి బాగున్నాయని ఫోన్ చేసి,లేక ఉత్తరం రాసి వాటిని బ్రౌన్ లైబ్రరీకి అందజేస్తున్నట్లు తెలిపిన సౌజన్య శీలి శాస్త్రిగారు .ఆయనతో మాట్లాడటం అంటే పుంభావ సరస్వతి తో మాట్లాడినట్లు ఉండేది .ఇక్కడి నుంచి బయల్దేరి సరాసరి ఒంటిమిట్ట శివ గారి ఇంటికి మధ్యాహ్నం 2-30కు చేరాం .శ్రీమతి పద్మ రెడీ చేసిన భోజనం తిని కాసేపు విశ్రమించాం .

సాయంకాలం 5గంటలకు డా శివ దంపతులకు మా దంపతులం మాకోడలు నూతనవస్త్రాలు పసుపుకు౦కుమ  పండ్లు అందజేసి ,ఇద్దరికీ చెరొక శాలువా కప్పి సరసభారతి ఆత్మీయ సత్కారం జరిపాం .అందరం కాఫీ త్రాగి సిద్ధవటం కు రెడీ అయ్యాం .

సిద్ధ వట సందర్శనం

శ్రీశైలానికి దక్షిణద్వారం సిద్ధవటం .ప్రక్కనే గలగలా పారే పెన్నానది .అందులోకి సోమశిలనుంచి లిఫ్టి ఇరిగేషన్ తో కలిసే కృష్ణాజలాలు కను విందు చేస్తుంది .సిద్ధవట౦లొ వటవృక్షం క్రింద పూర్వం సిద్ధులు తపస్సు చేసి సిద్ధిపొందేవారు అందుకే ఆపేరు .నది ప్రక్కనే వట వృక్షం ఉన్నది .ప్రశాంత వాతావరణం  .సిద్ధవటం లో రాజులకోట ఉంది .దూరంనుంచే చూసి తిరుగుప్రయాణం లో ఫోటోలు తీసుకొన్నాం

జ్యోతి గ్రామ ప్రత్యేకత

సిద్ధవటానికి సుమారు 10కిలోమీటర్లలో జ్యోతి గ్రామం ఉంది .ఎన్నో వందల ఏళ్ళక్రితం ఇక్కడి సిద్దేశ్వరాలయం  కామాక్షీ ఆలయం గోపురం వగైరా వరదనీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాయని ,15ఏళ్ళ క్రితం  పురాతత్వ శాఖవారి త్రవ్వకాలలో ఆలయ గోపుర పైభాగం కనిపిస్తే కి౦దిదాకాత్రవ్వితే 50 అడుగులగోపురం దానికెదురుగా శిధిలావస్థలో కొంచెం ఎత్తుమీద ఉన్న శ్రీ సిద్దేశ్వరాలయం ,దానికి కుడిప్రక్క శ్రీ కామాక్షీ ఆలయం బయట పడ్డాయని ,ఆవరణ చుట్టూ గోడ కూడా ఉండేదని ఒకభాగం గోడకనిపి౦చి౦దని ,గోడలమధ్య ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయని కుమారస్వామి విగ్రహం కూడా బయటే మట్టిలో సగం కూరుకు పోయి ఉందని ,ప్రాంగణం సుమారు 5 ఎకరాల విస్తీర్ణం లో ఉందని చెప్పి స్వామి,అమ్మవార్ల  దర్శన౦ , లింగాల దర్శనం చేయిస్తూ వివరించారు శివ .

జ్యోతి గ్రామం నుంచి సిద్ధవటం చేరి అక్కడి గుడిలో ఉన్న శ్రీ సిద్ద వటేశ్వర స్వామిని ,కామాక్షి అమ్మవారినీ దర్శించాం పూజారి ఉన్నాడు శ్రీశైలం నుంచి నెలకొక పూజారి ఇక్కడికి వచ్చి స్వామివారి నైవేద్యం పూజాదికాలు నిర్వహిస్తారట .ఈ ప్రాంతపు ఆలయాలన్నిటిని శ్రీశైల దేవస్థానం  దత్తత తీసుకొని సంరక్షిస్తూ భక్తులకు అందుబాటులో ఉంచటం విశేషం .,అభినందనీయం .శివగారింటికి రాత్రి 7-30కు చేరాం .అప్పటికే పద్మగారు మా అందరికి కావలసినన్ని మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా తయారుచేసి తినటానికి పెట్టారు హాయిగా తిన్నాం .కాసేపు టివి చూసి ఇక రాత్రి భోజనం అక్కరలేదని పించి పైకి వెళ్లి పడుకొన్నాను .రాత్రి 9గంటలకు సేమ్యా ఉప్మా ప్లేట్ లో పెట్టి ,మజ్జిగ గ్లాసుతో చరణ్ కిచ్చి పంపారు పద్మ .నాకు సేమ్యా పెద్దగా ఇష్టం ఉండదు ,కొద్దిగా తిని మజ్జిగతాగి హాయిగా నిద్ర పోయా .మాంచి నిద్ర పట్టింది .ఆదివారం ఉదయం 7-30కు తిరుగు ప్రయాణం అనుకొన్నాం .ఆదివారం విశేషాలు రేపు రాస్తాను.

ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

—

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-1

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-1

   నేపధ్యం

ఈ దసరాలలలో ఒంటి మిట్టనుండి డా.జి.శివకుమార్ ,ఆయన మిత్రులైన ఆర్.ఎం.పి.డాక్టర్ల బృందం మా మూడవ అబ్బాయి డా .నాగగోపాలకృష్ణమూర్తి ఆహ్వానం పై ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన రెండు రోజుల సదస్సుకు వచ్చి మా ఇంటిలో , మా దంపతులకు తిరుమల నుంచి తెప్పిచిన శాలువా లడ్డు ప్రసాదం ,శ్రీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామ స్వామి వ ఫోటో అందజేసి మమ్మల్ని అక్కడికి రమ్మని కోరారు .సరే అని సరసభారతి 14ప్రచురణలు మొత్తం సుమారు 350పుస్తకాలు ఇచ్చి  ఆప్రాంతం లో సాహిత్య సాంస్కృతికాభిమానులకు అందజేయమని కోరాను .మహా ప్రసాదంగా  తీసుకు వెళ్ళారు .అన్నీ సద్వినియోగం చేశారనే భావించాను .అప్పటినుంచి ఒంటిమిట్ట  ప్రయాణం ఆలోచన తీవ్రమైనది .పిల్లలకు సెలవులు కలిసొస్తాయని ఈనెల 13శుక్రవారం బయల్దేరి ,14,15తేదీలలో అక్కడ చూడాల్సినవి చూసి 15 మధ్యాహ్నం తిరుగు ప్రయాణం చేయాలని భావించాం .శివ దంపతుల ఇంట్లోనే బస భోజనాదులు అని మా మూర్తి చెప్పాడు .మనవరాలు రమ్య కు అనుకోకుండా ‘’పారాయణ ‘’వారు పరీక్ష పెట్టటం తో ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ బాబు వస్తానంటే సరే అని ‘’సెవెన్ సీటర్’’గా నేనూ మా శ్రీమతి ప్రభావతి ,మా మూడవకోడలు శ్రీమతి రాణి , వాళ్ళ అమ్మగారు ,మా వియ్యపురాలు శ్రీమతి దేవి గారు,మనవడు చరణ్ ,అన్నగారబ్బాయి రామనాథ  బాబు ,డ్రైవర్ ఈసా తో ఇన్నోవాలో  వెళ్లాలని తయారయ్యా౦.

              ప్రయాణం

   13వ తేదీశుక్రవారం ఉదయం 4కే లేచి ,స్నాన సంధ్యావందన పూజాదికాలు పూర్తి చేసి ,టిఫిన్ కాఫీలు లాగించి మేమిద్దరం  8 కి సిద్ధమయ్యాము  .మిగతావాళ్ళు అందరూ రెడీ అయ్యేసరికి 8-30దాటింది .దారిలోభోజనానికి ఇంట్లోనే అన్నం, కూర కొబ్బరి చట్నీ ,పులిహోరా మెంతిమజ్జిగ తయారు చేశారు అత్తా కోడళ్ళు .అన్నీసర్దుకొన్నాం  ,అక్కడి శ్రీరామ ,సీతా  లక్ష్మణులకు ,సంజీవరాయ హనుకు నూతన వస్త్రాలుకొన్నాము  ,కిలోన్నర చేమంతిపూలతో దండలు కట్టింది మాశ్రీమతి .దొడ్లోని కనకాంబరాలు  డిసెంబర్ పూలు కోసి పూజకు తీసుకు వెళ్లాం .మా వాటర్ ప్లాంట్ వాటర్ రెండు పెద్దకాన్ లలో పెట్టుకొని ప్లేట్లు గ్లాసులు,పెరుగు  కమలాపండ్లు చక్రకేళిలతో  బిస్కెట్ పాకెట్ లతో 9గంటలకు బయల్దేరాం .గుంటూరు  హైవే మీదుగా చిలకలూరి పేట ,అద్దంకి ,దరిశి ,పొదిలి మీదుగా కనిగిరి దగ్గరలో  అక్కడి గిరి సముదాయం ,అ౦దమైన ప్రకృతికి’’ ఫిదా’’ అయి ,కొండపై ఉన్న శ్రీ బాలార్క విశ్వేశ్వరస్వామి కోవెల ఉందని తెలిసి క్రిందనే అరుగులు ఉంటె భోజనానికి అనువుగా ఉంటుందని అక్కడ చేరి తెచ్చుకొన్నవి కడుపారగా ఆరగించాం డ్రైవర్తో సహా.చక్రకేళీలు తిన్నాం  .కొండపైకి వెళ్లి అక్కడ జరుగుతున్న చండీయాగం ,చూశాం .మమ్మల్ని భోజనానికి ఉండమని చేసేవారు చేయించే వారుకోరినా కుదరదని వినయంగా చెప్పి ,కిందకు దిగి బయల్దేరి ,కనిగిరి మీదుగా బద్వేల్ చేరి ,అక్కడి నుంచి ,సిద్ధవటం ,మాధవవరం ,మీదుగా ఒంటిమిట్ట డా. శివ గారింటికి సాయంత్రం 4 కు చేరాం . ఆయన, అర్ధాంగి శ్రీమతి పద్మ(జ)  దంపతులు మాకోసం ఎదురు చూసి ఆహ్వానించారు.కమ్మని  కాఫీ ఇస్తే తాగాం .మగవాళ్ళం పై అంతస్తులో ఉన్నగదిలో’’గాస్   సిలిండర్  ద్వారా గీజర్  ఏర్పాటు ఉన్న వేడి నీటి స్నానాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ,కిందికి దిగి ఈలోపు పద్మ సిద్ధం చేసిన కమ్మటి బజ్జీలు తిని   రెడీ అయ్యాం  .

   సాయంత్రం 5-30కు శివ మమ్మల్ని అందర్నీ తాళ్ళపాక తీసుకు వెళ్ళారు .దారిలోచేయ్యేరు ప్రాజెక్ట్ దానికి  చేరువలో ఒక శివాలయం ఉందని ఆ శివాలయం లోప్రతికార్తీక మాస మూడవ సోమవారం నాడు శివలింగం లోకి నీరు వస్తుందని  ఈమిస్టరి  ఎవరూ ఇంతవరకు చేధించలేదని చెప్పారు .తాళ్ళపాక లో అన్నమాచార్య జన్మించారు .ఊరి బయట 108అడుగులున్న అన్నమయ్య భారీ విగ్రహం ఉంది. అన్నమాచార్య విద్యాకేంద్రం ఉన్నది .అన్నమయ్య తండ్రి ఇక్కడి సిద్దేశ్వర స్వామి దేవాలయం లో పూజారి .శైవులు .అన్నమయ్య తిరుమల వెళ్లి అక్కడ వైష్ణవం స్వీకరించి అడ్డ బొట్టును నిలువు బొట్టుగా మార్చుకోన్నాడట .ఆయన జన్మించిన ఇల్లు, కూర్చుని రాసుకొన్న చోటు ,ద్యానమందిరం చూశాం .ప్రక్కనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చూశాం .ఈఆలయం లో శ్రీఏకా తాతయ్య అనే మహాభక్తుడు నిరంతరం తలకాయ నొప్పి తో బాధపడుతూ ఇక్కడిఈ స్వామిని దర్శించి   నొప్పి మాయమవగా ,దేవుని ఎదురుగా స్వయంగా శిలారూపం పొంది ,తనలాగే ఎవరైనా శరీర బాధలు పడేవారు తమ శిరసును తన శిరసుపై మూడు సార్లు ఉంచితే నివారణ ఆయే వరం పొందాడు .అందుకని భక్తులు మూడు సార్లు ఆయన శిరసుకు తమ శిరసుఆనించి మొక్కు కొంటారు అని శివ చెప్పారు .

 తిరిగి వెడుతూ దాములూరు గ్రామం లో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం చూశాం .ఉగ్ర నారసింహుడు తన ఉగ్రాన్ని తగ్గి౦చు కొని శా౦తమూర్తిగా ఇక్కడ అవతరించి సౌమ్యనాథస్వామిగా మారాడు . భారీ విగ్రహం .స్వామి  వెనుక అంతేఎత్తులో శ్రీ ఆంజనేయస్వామి ఉండటం మరో విశేషం స్వామి తోకకూడా బాగా కనిపిస్తుంది రెండు విగ్రహాలు కలిసిపోయినట్లే ఉండటం మరో వింత  .వివాహాలు కానివారు సంతానం లేనివారు మరేదైనా కోరిక ఉన్నవారు ఆలయం చుట్టూ 8ప్రదక్షిణాలు చేసి కోరిక తెలియబరచాలి .కోరిక తప్పక తీరుతుంది. తీరినతర్వాత 108ప్రదక్షిణాలు చేయాలి .చాలామహిమ గలస్వామి అని శివ చెప్పారు .ఇక్కడి మూడు దేవాలయాలలో అర్చకస్వాఉ లంతా శివ గారికి బాగా పరిచయస్తులు .ఈమూడు గుడులలో పూజారి గార్లచేత నాకు స్వామి పుష్పమాలలను తీసి నా మెడలో వేయించారు .అంతటి పలుకుబడి డా.శివ గారిది .ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఒంటిమిట్ట శివగారింటికి చేరేసరికి రాత్రి 8.అయింది అప్పటికే పద్మగారు వంట చేసి సిద్ధంగా ఉంచి మాకు వడ్డించారు. పప్పు ,కాబేజికూర ,చట్నీ ,సాంబారు ,పెరుగు ,అప్పడం లతో కమకమ్మని వేడి వేడి భోజనం మా ‘’సెవెన్ సీటర్స్ ‘’వడ్డించి కొసరి కొసరి తినిపించారు .అన్నీ మహా రుచికరంగా ఉన్నాయి. ఈ దంపతుల ఆత్మీయత ,ఆదరణ ,అతిధి సేవ అమోఘం అద్భుతం .

   రాత్రి 8-30కు శ్రీ కోదండరామ స్వాములకు ఏకాంత సేవ .అంటే పవళింపు సేవ .దానికోసం మాకు ఏర్పాట్లు చేసి మమ్మల్ని తీసుకు వెళ్ళారు శివ .ఒక అరగంట సేపు జరిగింది చాలా దగ్గరగా చూడగలిగాం శివ గారి వలన .ఇక్కడఒకే రాతిపై శ్రీరామ,సీతా  లక్ష్మణ స్వాముల విగ్రహాలు కొలువై ఉండటం అరుదైన .ప్రపంచం లో ఎక్కడా లేని విశేషం .,నేను కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో  సైన్స్మాస్టర్ గా పని చేసినప్పుడు అక్కడి పురాతన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కోవెలలో ప్రతి శుక్రవారంరాత్రి సుమారు రెండుగంటలు పవళింపు సేవ వృద్ధ పూజారి గారు భార్య భక్తులు అతి శ్రద్ధగా చేయటం పాటలు పడటం భజనలు చేయటం చూశాను.మళ్ళీ ఇన్నేళ్ళకు ఇక్కడ .చూశా .మా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి ఆలయం లో ఒకసారి అర్చకస్వామి శ్రీవేదాంతం దీక్షితులు ఇలా ఏకాంత సేవ చేయించి పాటలు పాడించి గొప్ప వైభవం కలిగించాడు .కాని ఇక్కడ అంత గొప్పగా జరిగినట్లు నాకు అనిపించలేదు .తంత్రం ఎక్కువ మంత్రం తక్కువ  అన్నట్లు జరిగింది .

ప్రతి శనివారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం లో  ఉదయం  6గంటలకు స్వామి వారలకు అభిషేకం నిర్వహిస్తారు .దీనికి టికెట్ 150రూపాయలు .ఇద్దర్ని అనుమతిస్తారు మూడు టికెట్లు కొనిపించి  ఉదయానికి రిజర్వ్ చేయించారు శివ .ఇక్కడి పూజార్లు ఆయన అంటే మహా గౌరవం. అందరినీ చనువుగా ‘’మామా మామా ‘’అని ఆప్యాయంగా పిలుస్తారు శివ . ఆయనకు ఇక్కడ అడ్డు ఏమీ ఉండదు .డైరెక్ట్ ఎంట్రన్సే .నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టి సౌకర్యాలు కలిగించి తిరుమల తిరుపతి దేవస్థానానికి దీని నిర్వహణ బాద్య అప్పగించారు .అప్పటి నుంచే ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి .సౌకర్యాలు సేవలూ పెరిగాయి .కళ్యాణమండప నిర్మాణానికి 100 కోట్లు శాంక్షన్ చేశాడు బాబు .ప్రభుత్వం మారటం తో పనులు మందంగా జరుగుతున్నాయి .మా రెండవ రోజు యాత్ర విశేషాలు రేపు తెలియ జేస్తాను .

                        విజ్ఞప్తి

కడప జిల్లాలో అతి ప్రాచీన ప్రసిద్ధ కోదండరామ క్షేత్రం ఒంటిమిట్ట మీదుగాదేశం లో చాలారాస్ట్రాలనుంచి  తిరుపతికి 65 ట్రెయిన్స్ నడుస్తున్నా ,ఇక్కడ రైల్వే స్టాప్ లేదని ,అందువలన యాత్రికులకు చాలా అసౌకర్యంగా ఉందని ,రైల్వే హాల్ట్ ఉంటె సామాన్యుఅకు ఈ రూటు బాగా అందుబాటులో ఉంటుందని ,ఈ విషయం పై ప్రజలు ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డ్ కేంద్ర ప్రభుత్వం చాలా ఉదా సీనంగా ఉన్నాయని ఎంతో బాధతోనాకు  తెలియ జేశారు డా శివ      .ఒకవిజ్ఞప్తి తయారు చేసి రైవే హాల్ట్ ఉండాల్సిన అవసరం తెలియజేస్తూ  వేయిమంది ప్రముఖులతో సంతకాలు పెట్టించి ,స్థానిక ప్రజాప్రతినిధులకు పార్లమెంట్ మెంబర్లకు రాష్ట్ర కేంద్ర మంత్రులకు ,వెంకయ్యనాయుడు గారికి జివిఎల్ నరసింహారావు గారికీ ,రాష్ట్ర పతికి రైల్వే మినిస్టర్ కు ,రైల్వే బోర్డ్ కు పంపి ,వెంబడిస్తే పని జరగచ్చునని చెప్పాను .కనుక ఈ విజ్ఞప్తిని అందరూ ముఖ్యమైనదిగా భావించి ,ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తే త్వరలో ఫలితం కలిగి ఇక్కడి ప్రజల ,దూర యాత్రీకుల కల నిజమౌతుందని ,ఇక్కడి శ్రీ కోదండ రామ శ్రీ సంజీవరాయ హనుమ ల కృపాకటాక్షం తో  . అతి తత్వరలో  ఒంటిమిట్ట లో ఎక్స్ ప్రెస్ రైళ్ళ రైల్వే హాల్ట్ ఏర్పడుతుందని క్షేత్రం మరింతగా మూడు పూలు ఆరుకాయలుగా విలసిస్తుందని  నమ్ముతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-19ఉయ్యూరు

—

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మినీ మూడు రోజులయాత్ర

13-12-19 శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10గంటలకు 61 గంటలకు మినీ మూడు రోజులయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఒంటిమిట్ట మృకండమహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ,బ్రహ్మగారు సమాధి అయిన కందిమల్లయ్యపల్లి అనే బ్రహ్మంగారి మఠం గ్రామం చూసి ,త్లిసిన వారింట్లో భోజనం చేసి,పోరు మామిలళ్ళ,  ,బేస్తవారి పేట ,,గుంట,మీదుగా త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి ,వినుకొండ ,నరసరావు పేట ,మీదుగా గుంటూరు చేరి టిఫిన్ చేసి రాత్రి 10తలకు ఉయ్యూరు సుఖంగా చేరాం

 

 

మా వొంటిమిట్ట ట్రిప్ -13-12-19 శుక్రవారం ఉయ్యూరునుంచి కనిగిరిమీదుగా వొంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాయం ,డా.శివ,శ్రీమతి పద్మ దంపతుల ఆతిధ్యం ,తాళ్ళపాక అన్నమాచర్య జన్మస్థలం ,ఆయన తండ్రి శివార్చకుదుగాఉన్న శివాలయం ,లక్ష్మీ చెన్నకేశవ ఆలయం ,108 అడుగుల అన్నమయ్య విగ్రహం ,14వ తేదీ వొంటిమిట్ట ఆలయ శిల్ప సౌందర్యం ,రామ ,లక్ష్మణ తీర్దాలు ,పుష్పగిరి పీఠం,శ్రీ వైద్యనాధ ,కామాక్షీ అమ్మవారు శక్తి పీఠం,,దేవుని గడప లక్ష్మీ వేంకటేశ్వరాలయం ,కడప బ్రౌన్ లైబ్రరి,,శివ దంపతులకు మా చిరు సత్కారం ,,సిద్ధవటం లో పెన్నానది సొయగాలు ,సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ నీరు ,పెన్నవరదలలో జ్యోతిగ్రామంలో 60అడుగుల ఇసుకలో కూరుకు పోయి 15ఏళ్ళ క్రితం బయటపడ్డ 50అడుగులగోపురం ,సిద్దేశ్వర కామాక్షీ దేవాలయాలు , సిద్ధవటం లో సిద్ధవటేశ్వరస్వామి,15వ తేదీ ,వొంటిమిట్ట లో మార్కండేయుల తండ్రి మ్రుకండమహర్షి ఆశ్రమ౦ ,బ్రహ్మంగారి మఠం(కందిమల్లయ్యపల్లి ),ఆయనతవ్విన బావి వగైరా ,శివగారి బంధువులింట్లో ఆతిధ్యం ,త్రిపురాంతక౦ లో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శక్తిపీఠం,శ్రీ త్రిపురంతకేశ్వర సందర్శన చిత్రమాలిక ,

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గొల్లపూడి పై వచ్చిన వార్తా పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

   ఆస్ట్రేలియన్ సారస్వతం

   ఆస్ట్రేలియన్ సారస్వతం

క్రీ.శ .1788లో ఆంగ్లేయులు వలస వెళ్లి ఆస్ట్రేలియా ఖండం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు కనుక అక్కడ వచ్చిన సాహిత్యమంతా ఇంగ్లీష్ లోనే ఉండేది .మొదటి రచనలలో స్థానికచరిత్రకు ప్రాధాన్యం ఇచ్చినా ,వాటికి సాహిత్య గౌరవం రాలేదు.మొదటికవులు బేరయన్ ఫీల్డ్ ,విలియం వెంట్ వర్త్ లలో కూడా ఈ లోపమే ఉండేది .

  చార్లెస్ హార్పర్ (1817-68)కవితలలో ఆస్త్రేలియన్ వాతావరణాన్ని ప్రతిఫలించే ప్రయత్నం చేసి కొంతవరకు నెరవేర్చగాలిగాడు .అదే బాటలో హెన్రి క్లారెంస్ ,కేండాల్ (1841-82)అక్కడి ప్రకృతి దృశ్యాలను మనోహరంగా వర్ణించారు .1833-70 వాడైన ఎ..ఎల్ .గార్డన్ అశ్వధాటి లయతో కొన్ని గేయాలను ఆనాటి ఆశ్వికుల వీరోచిత పోరాటాలపై రాశాడు .అప్పటినుంచి పాడుకోవటానికి అనువైన గీత రచనలు బాగా వచ్చాయి .ఈ గేయకర్తలలలో ఎబి పాటర్సన్ హెన్రి లాసేన్ ,సి.జె.డెవిస్ ముఖ్యులు .

  క్రమంగా కవిత్వం లో ఉద్వేగం తగ్గి ,20వ శతాబ్ది నాటికి కవిత లో కొత్త సొగసులు చేరాయి .’’నవ ప్రజాస్వామ్యకవి ‘’అని పేరు పొందిన జేర్నార్డ్ ఓ డౌడ్ దీర్ఘ కవితల్లో ఆస్ట్రేలియన్ లజీవితాలను ,ప్రణయ విషయాలను రసవత్తరంగా చిత్రించాడు .క్రిస్టఫర్ బ్రెన్నాన్’’ది వా౦డరర్ ‘’కావ్యం లో  తాత్విక చింతన బాగా చేసి మంచి ఆకర్షణ కలిగించాడు .మేరీ గిల్మోర్ ,జూడిత్ రైట్ కవయిత్రులు సుకుమార ప్రణయం పండింఛి జనరంజనం చేశారు .హ్యూమక్ క్రే కవిత్వం లో అక్షర రమ్యత ,సా నెయిల్సన్ కవిత్వం లో మధుర భావనలు పఠితలను.విశేషంగా ఆకట్టుకొన్నాయి .

    తర్వాత కాలపు కవులలో ఆర్.డి ఫిట్జెరాల్డ్ ,,కెన్నెత్ స్లెసర్ బాగా ప్రసిద్ధులు .నవ యువకవులు కొందరు సాంప్రదాయ కవిత్వం రాస్తుంటే, మరి కొందరు  విశ్రు౦ఖల మైన కవిత్వం తో చెలరేగుతున్నారు .కవిత్వం లో ఉపమానాలు ,వస్తువు ఆస్ట్రేలియా కే చెందినవి ఉండాలన్న ఉద్యమంకూడా వచ్చింది .నవలా రచనకు మార్గదర్శి హెన్రి కింగ్స్లీ .తర్వాత మార్కస్ క్లార్క్ ,రాల్ఫ్ బోల్డర్ వుడ్ .అక్కడ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ల జీవితాలను మార్కస్  క్లార్క్ ‘’ఫర్ ది టర్మ్ ఆఫ్ హిజ్ నేచురల్ లైఫ్ ‘’అనే నవలలో,అనేక ఎపిసోడ్ లుగా అత్యంత సహజం గా రాశాడు .ఆ దేశపు సాహసికుల కార్యకలాపాలను రాల్ఫ్ బోల్దర్ వుడ్ నవలలలో కళ్ళకు కట్టించాడు .జోసెఫ్ ఫర్ఫీ రాసిన ‘’సచ్ ఈజ్ లైఫ్ ‘’నవల ఆస్ట్రేలియా దేశీయ వాతావరణాన్ని వాస్తవంగా మహోహరంగా చిత్రించాడు. బ్రేంట్ ఆఫ్ లిన్ బిన్,మైల్స్ ఫ్రాన్క్లిన్ ,యీనియన్ గన్అనే నవలారచయిత్రులు కూడా అదే లక్ష్యంతో రాశారు .

 హెన్రి హామ్డేల్ రిచర్డ్స్ సన్ అనే మారుపేరుతో హెన్రి ఎట్ రిచర్డ్సన్ అనే రచయిత్రి రాసిన ‘మారిస్ గెస్ట్ ‘’’’,డి ఫార్త్యూన్స్ ఆఫ్ రిచర్డ్ మెహోని ‘’నవలలు ఆస్ట్రేలియా సాహిత్యం లో ఉత్తమోత్తమమైనవిగా కీర్తి పొందాయి .ఈమె 1939లో ‘’యంగ్ కోసిమా ‘’నవలకూడా రాసింది వాన్స్ పామర్ నవల ‘’ది స్పెయిన్ ఫామిలి ‘’నగర జీవిత వర్ణనకు పెట్టింది పేరుగా నిలిచింది .అతని మనస్తత్వ చిత్రణ అమోఘం .కైలీ కేన్నెంట్ ‘’లాస్ట్ హావెన్ ‘’నవల గ్రామీణ జీవన చిత్రణ కు పట్టం కడితే ,’’రైడాన్ స్ట్రేంజర్’’నవల లో నాగరక జీవిత చిత్రణ ఉంటుంది .క్వీన్స్ లాండ్ ప్రాంతపు పశువులకాపరుల నిరాడంబర జీవితాలను ఫ్రాంక్ డేవిసన్’’మాన్ –షై’’లో కథా వస్తువుగా తీసుకొన్నాడు .అత్యధిక ప్రజాదరనపొందిన నవలాకారులు –ఎలినార్ డార్క్,కేధరిన్ ప్రిచర్డ్ ,జేవియర్ హెర్బర్ట్ మొదలైనవారు .మానవుడికి ప్రకృతికి మధ్య సంఘర్షణ ను లియనర్డ్ మన్  ’’మౌంటేన్ ప్లాట్ ‘’నవలలో మంచి సమర్ధవంతంగా చిత్రించాడు .

      ఆస్ట్రేలియా పత్రిలు కొన్ని  చిన్నకథలకు ఎక్కువ ప్రోత్సాహమివ్వటం వలన సృజన ,కల్పన మూడు పువ్వులు ఆరుకాయల్లా కథా వాజ్మాయాన్ని సుసంపన్నం చేశారు కవులు నవలాకారులు .వీరిలో హెచ్ లాసన్ ,బార్బారా బెయిన్ టన్ ,స్టీల్ రడ్,డీ.స్టువర్ట్ ,ఏ .మార్షల్ .జి.కేసీ లు ముఖ్యులు .ఆస్ట్రేలియాలో సాహిత్య గౌరవం అందుకొన్న గొప్ప నాటకాల సృష్టికి అనుకూల వాతావరణం లేదు .అక్కడ నాటక  ప్రదర్శనలపై ప్రజలకు అభి రుచి కలిగే లోపే సినిమాలు వచ్చేసి ,రంగస్థలానికి ప్రోత్సాహం లభించలేదు .లూయీ ఎస్సన్ ,డగ్లస్ స్టువర్ట్ ఔత్సాహిక ప్రదర్శనలకోసం కొన్ని ఏకాంకికలు మాత్రం రాశారు .వ్యాసరచన ,సాహిత్య విమర్శకు విశేష గౌరవం ,ఉత్తమ ప్రమాణం తమ రచనలద్వారా కల్పించినవారు వాల్టర్ మర్డక్,నార్మన్ లిండ్సే .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్ లో

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ  వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్  లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి

మహా భక్త శిఖామణులు(చివరిభాగం )

20-రుయి దాస స్వామి

రామానంద స్వామి ని సేవించే ఒక యువకుడు కఠిన బ్రహ్మ చర్యం పాటించేవాడు .ఊరిలో బిచ్చమెత్తి వచ్చిన బియ్యం తో అన్నం వండితే ,గురువు ఇస్టదేవతకు నైవేద్యం పెట్టేవాడు .వడ్డీ వ్యాపారం తో ‘’డబ్బు చేసిన ‘’ఒక ధనికుడు ఈ యువకుడికి బిక్షం వెయ్యాలనుకొనగా గురువు అనుమతి లేనిదే స్వీకరించనన్నాడు .ఒక రోజు విపరీతమైన గాలి వాన వచ్చి బయటకు వెళ్ళలేక పోయాడు యువకుడు .ధనికుని ఇంటినుంచి బియ్యం తెప్పించి నైవేద్యానికి అన్నం వండాడు .గురువు మనసు నిశ్చలంగా ఉండలేకపోయి శిష్యుడిని బియ్యంఎక్కడినుంచి తెప్పించావని అడగగా, వడ్డీ వ్యాపారి నుంచి అని చెప్పగా అక్రమ ధనార్జన చేసే అతని నుంచి ఎందుకు తెప్పించావని కేకలేసి తన ఆజ్ఞ ధిక్కరించినందుకు మరుసటి జన్మలో నీచ కులం లో పుడతాడని శపించాడు .

కొద్దికాలానికే  ఆ శిష్యుడు చనిపోయి  మాదిగ కులం లో పుట్టాడు .కాని పూర్వజన్మ జ్ఞానం ఉండేది .హృదయం హరి భక్తితో పొంగిపోయేది .కాని గురునికి దూరమయ్యాననే బాధ ఉండేది.అందువలన తలిదండ్రులు ఎంతలాలన చేసినా ఏడుపు మానే వాడుకాదు.తండ్రి  చేసేదిలేక రామానంద స్వామికి విన్నవించాడు .విషయం గ్రహించిన స్వామి శిష్యుడు తనకు దూరమయ్యాననే బాధతోనే శిశు రూపం లో ఏడుస్తున్నాడని గ్రహింఛి ‘’నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళండి .అన్నీ చక్కబరుస్తాను’’అనగా ‘’మేము నీచకులం వాళ్ళం .మా ఇంటికి మీరెలా వస్తారు స్వామీ ‘’అన్నారు అమాయకంగా .’’సేవా ధర్మం   లో అంటరానితనం అనేది లేదు  .పరోపకారమే నిజమైన హరి సేవ .నేను నీతో వస్తానుపద  ‘’అన్నాడు

  మాదిగవానితో కలసి రామానందస్వామి వాళ్ళ ఇంటికి వెళ్లగా బిడ్డను చంకలో పెట్టుకొనితల్లి   ఎదురు చూస్తోంది .బాలుడు చాతకపక్షిలాగా గురు చంద్రునికోసం అలమటిస్తున్నాడు .తన దుఖాన్ని కన్నీటి దారలతో చెప్పాడు ఆ పూర్వ శిష్యుడు ,ఇప్పటి మాదిగ శిశువు .ఆచార్యుని  హృదయం కారుణ్య రసమైప్రవహించి శిశువు శిరసు తాకుతూ ‘’బిడ్డా !ఏడవకు .భక్తరక్షకుడుశ్రీరామ చంద్రుడు నిన్ను కాపాడుతాడు .ధన్యుడవు అవుతావు ‘’అని ఆశీర్వ దింఛి చెవిలో రామనామ మంత్రం ఉపదేశించి వెళ్లి పోయాడు .ఈ బాలుడు క్రమగా పెరిగి రుయీ(ఏడుపు ) దాసు అనే పేరు పొంది పెద్దవాడై శ్రీరామ భక్తిలో మునిగిపోయాడు.రామనామ స్మరణ చేస్తూ,కులవృత్తి నిర్వహించేవాడు .రెండు జతల చెప్పులుకుట్టి ఒక జత కనిపించిన రామభక్తుడికిచ్చి రెండవ జత అమ్మి, ఆడబ్బుతో జీవనం సాగించాడు .డబ్బు తీసుకోకుండా హరిభక్తుల జోళ్ళు బాగు చేసేవాడు  .

  బంధు మిత్రులను వదిలి గంగాతీరం లో కుటీరం ఏర్పాటు చేసుకొని ,శ్రీరామ విగ్రహం పెట్టి ,పూజిస్తూ కులవృత్తీ చేస్తూ కాలం గడిపాడు .జోళ్ళు అమ్మలేని రోజు ఉపవాసం ఉండేవాడు .ఆకలి దప్పులు లేకుండా నిత్య హరినామ స్మరణ చేసేవాడు .ఒకరోజు  రాముడేస్వయంగా మారు వేషం లో వచ్చి  ఒకస్పర్శమణి చూపి  దాన్ని తాకిస్తే ఇనుము బంగారం అవుతుందని చెప్పి  ఇవ్వబోతే ‘’స్వామీ !ఎవరు నువ్వు నాపై ఇంతటి కరుణ ఎందుకు  ?’’అని ప్రశ్నించాడు ..’’నీ కస్టాలు పోగొట్టటానికే పరుసవేది ఇస్తున్నా తీసుకో ‘’అనగా రుయీ ‘’నిజంగా నువ్వు నా ఇష్టదైవం శ్రీ రాముడివే ఐతే, నీ నిజ రూప దర్శనభాగ్యం కలిగించు ‘’అన్నాడు .మర్నాడుకూడా వచ్చి  ఆపరుసవేదిని తీసుకోమని చెప్పి మూలనున్న కత్తికి దానిని అ౦ టించగానే అది బంగారుకత్తి గామారింది .దాసు ‘’నువ్వు ఎవరివో గారడీ వాడిలాగా ఉన్నావు బంగారం లాంటి నాకత్తిని నిజంగా బంగారం చేసి నా కడుపుకొట్టావు .నీ రాయీఅక్కర్లేదు నువ్వూ అక్కర్లేదు తీసుకొని పో ‘’అన్నాడు ..’’బంగారు కత్తి వలన బోలెడు డబ్బు వస్తుంది ‘’అని ఆశపెట్టాడు .’’నాకు బంగారం పై మోజులేదు.ధనం  కూడా బెట్టాలన్నతాపత్రయమూ లేదు.నీ రాయి నాకు ముక్తినివ్వదు. కస్టాలు తెస్తుంది .దయతో తీసికెళ్ళు ‘’అన్నాడు .పరుసవేదిని  రుయీ దాసు చేతిలొపెట్టి వెళ్ళాడు లీలామానుష రూపుడు.

  బంగారు కత్తినీ ,తానూ మామూలుగా వాడే కత్తినీ మూలపారేసి ,కొత్తకత్తికొని వృత్తికొనసాగించాడు .ఉపవాసాలు చేస్తూ వృత్తికొనసాగిస్తూ , రామనామ స్మరణ చేస్తూనే ఉన్నాడు .కరుణామయుడు భరించలేక మళ్ళీ వచ్చి పరుస వేది ఏమైంది అని అడిగితె మూల పారేశాను  కావాలంటే ఎవరికైనా ఇచ్చుకో అనగా , పరుసవేది తాను  తీసు కొంటాకాని , నేనిచ్చేది ఏ దైనా కానీ నువ్వు తీసుకోవాలి ,ప్రతిరోజూ నీ దేవుడి పీఠం మీద అయిదు బంగారు నాణాలు ఉంటాయి .అవి తప్పక తీసుకో .ఇప్పుడు చూడు అక్కడ నాణాలు ఉంటాయి అని బలవంత పెట్టగా ‘’అసలు నువ్వెవరవయ్యా స్వామీ . ఈ బలవంతం ఏమిటి ?అనగా ‘’నేను నీవాడిని .నీ భక్తికి మెచ్చి ఈ ఏర్పాటు చేశాను ‘’అన్నాడు .’’నీ కరుణకు ధన్యవాదాలు కానీ నేను తీసుకోలేను .మన్నించు .నీ దర్శనం ఇప్పించు చాలు ‘’అన్నాడు .   వెంటనే  నిజరూప దర్శనం కలిగించి సంతృప్తి పరచి శ్రీరామ చంద్ర మూర్తి అదృశ్యమయ్యాడు ,దాసుమనసులో అద్భుత జ్యోతి ఏర్పడిన భావం కలిగింది .ఏం జరిగిందో అర్ధంకాక ఉన్మాదిలాగా ‘’రామా రామా ‘’అంటూ అటూ ,ఇటూ పరుగులు తీశాడు .తర్వాత రామనామం కలవరిస్తూ మూర్చపోయాడు .తేరుకొని లేచి రాముడు అడిగిన దాన్ని తీర్చటం తన విధి అనుకోని రోజూ వచ్చే నాణాలను రామభక్త పూజకు వినియోగించటానికి నిర్ణయించాడు .

   ఆరోజు నుంచి భక్తుల రాక పెరిగి కుటీరం రామనామం తో ప్రతిధ్వనించింది .దిక్కు లేనివారంతా  రూయీ దాసు దాసులయ్యారు .దాసు పెట్టే భోగాన్నం తీసుకోవటానికి ప్రతిరోజూ రాముడు ఏదో ఒక వేషం లో వచ్చేవాడు .కొంతకాలం తర్వాత ఆశ్రమం భక్తులకు అప్పగించి చిత్రకూటం వెళ్లి  దగ్గరలో ఉన్న గాయత్రి ,పయస్విని మందాకినీ నదులలో  మందాకినీ చెంత ఆశ్రమం నిర్మించుకొని ,రామ భజన స్మరణ చేశాడు .ఈ మూడు నదులు కలిసే చోటు ఒక త్రివేణీ క్షేత్రమైంది .దీనికి దగ్గరలో హనుమాన్ ధారా ,భరత కూపం ,భరద్వాజాశ్రమం ఉన్నాయి .సీతా ఝాలీ అనే రాణి రుయీదాసు శిష్యురాలై మంత్రోపదేశం పొందాలనుకొంటే కొందరు పండితులు క్షత్రియరాణి చండాలుని వద్ద మంత్రోప దేశమా అని ఆక్షేపిస్తే రాణి ‘’అతడు నిస్వార్ధ భక్తుడు .’’అని చెప్పి తారక మంత్రోప దేశం పొంది ,ధ్యాన ,మంత్రజప ,దీనజన పోషణలో జీవితం గడిపి,రామ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు .

 ఒక శ్రీరామనవమి నాడు గొప్ప సంతర్పణ చేసింది రాణి .అన్నికులాలవారినీ ఆహ్వానించి ,రుయీ దాస స్వామికి ప్రత్యేక ఆసనం వేసి చేయి పట్టుకొని తీసుకు వచ్చి కూర్చోబెట్టింది .బ్రాహ్మణులకు నచ్చక  ,దూరంగా వెళ్లి కూర్చున్నారు .వడ్డన పూర్తయి నివేదన అయ్యాక ప్రతి బాపడి కుడిపక్కన దాసు కనిపించాడు .కిక్కురుమనకుండా తిన్నారు .భోజనాలతర్వాత దాస స్వామిని బంగారు సింహాసనం పై కూర్చోబెట్టి ,రాణి వి౦జామరతో విసిరింది .బ్రాహ్మలు అతన్ని చూడగా అతనికి బంగారు జందెం ఉన్నట్లు గమనించారు .కాని అహం చావక వెళ్ళిపోయారు .రాణి కొంతకాల౦ తర్వాత దాసు తో  తీర్ధ యాత్రలు చేసి , ఆతడు ముందూ తర్వాత ఆమె  సాయుజ్యం పొందారు

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

మహా భక్త శిఖామణులు ఈ 20వ ఎపిసోడ్ తో ముగిస్తున్నాను

 శ్రీ హనుమద్ వ్రత శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-19-ఉయ్యూరు

జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి… ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేటలో 1906 సంవత్సరంలో మృత్యుంజయుడు, వేంకమాంబ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యాభాసం చేసి తత్త్వశాస్త్రం, చరిత్రలలో ఎం.ఏ. పట్టా పొందారు. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యుడు. ఆయన కొంతకాలం స్వరాజ్య పత్రికలో పనిచేశారు.

1926లో లా పట్టా పొందారు. కొన్నాళ్లు రాజమండ్రి, విశాఖపట్నంలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈయన సంస్కృతాంధ్ర భాషలనే కాక, బెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్ మొదలైన నేర్చుకొని ఆయా భాషల సాహిత్యం గురించి పరిచయం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ భాష ప్రభావం ఈయన రచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈయన భార్య శారదాంబ కూడా విదుషీమణి, రచయిత్రి.

ఈయన 1965 డిసెంబర్ 14న పరమపదించారు. చంద్రగుప్త, మేవాడు పతనము వంటి నాటకాలు, శ్యామల (1920), కాలసర్పి (1922), భిన్నహస్తము (1920), నూర్జహాన్ (1925), దుర్గాదాసు, ఆటీన్ మణెలా (1920), ఒథెల్లో (1960), నాలుగు కథలు (1932) పాంచకడీ దేవ్ రాసిన బెంగాలీ కథలకు తెలుగు అనువాదం,  ఆంధ్ర మహా పురుషులు (1936), సాహిత్య తత్త్వ విమర్శనము (1936), విద్యార్థి ప్రకాశిక, ప్రణయ ప్రతిమ (1920) వంటి నవలలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.

ఈయన 1950ల్లో తాను చేసిన మహారాష్ట్ర యాత్రను ఈ గ్రంథంలో యాత్రా సాహిత్యరూపంలో రచించారు. ఈ యాత్రలో భాగంగా శివాజీ, బాజీరావు వంటి మహావీరులకు సంబంధించిన చారిత్రిక ప్రదేశాలు, కోటలు, మహానగరాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించి వాటి గురించి గ్రంథంలో పొందుపరిచారు. కాగా ఈ పుస్తకంలో అత్యంత విలువైన భాగం మాత్రం పీఠికలో ఉన్న యాత్రా సాహిత్య వివరాలు.

క్రీస్తుకు పూర్వమున్న వివిధ నాగరికతల్లో యాత్రా సాహిత్యం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి వరకూ యాత్రా సాహిత్యం రచించిన భ్రమణ కాంక్షాపరుల గురించి ఇందులో వివరించారు. ఈ సమాచారం విజ్ఞానసర్వస్వ దృక్కోణంలో యాత్రా సాహిత్యం తరహా వ్యాసాలకు చాలా విలువైనది. దీని రెండవకూర్పును వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు చెన్నపురిలోని వావిళ్ల ప్రెస్‌లో 1951 సంవత్సరంలో ముద్రించారు. సంపూర్ణ భక్త విజయం గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి.

మద్రాసులో న్యాయవాది సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ


ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ

https://photos.google.com/share/AF1QipPZ0Q9ghNz9Tk8KnS2Kmwyromd_koykQeHI1ek4rh8beGr9apAZ6hE8JoJoTh3zWA/photo/AF1QipNcwl3W4v5a9sX3SvGpVGK7A28OoSFmRVas-9kk?key=Smx1ZHlhdFNyajNrSnF1SjVPX1dwaW1LX3BXQUZn

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

https://photos.google.com/share/AF1QipNJaokogHnsHqgaVIlqu0z-FTqoYQ6fWZzW2Itpl4UFPStT5-BpSF-OqFoKseh3iA?key=cDlnVGhDVTNxQTZzUXp3V196RkNVU2JOV3B1eXF3

Posted in దేవాలయం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు

మహా భక్త శిఖామణులు

17- రవి దాసు

చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో  పుట్టిన రవి దాసు ,తల్లి  ఝర్  బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని ఆక్షేపిచేవారు  .అనుకోకుండా కరువు వచ్చింది .తినటానికి కూడు లేకపోయినా కడుపులో కళ్ళు పెట్టుకొని  హరినామజపం చేసేవాడు .గుండెకరిగి శ్రీహరి బైరాగి రూపం లో వచ్చి ,సకలైశ్వర్యాలిచ్చే దివ్య శిల చేతిలోపెట్టాడు .’’నీనామమే దివ్య ధనం.ఇంకా నాకీ ఐశ్వర్యం ఎందుకు ?’’అన్నాడు .ఎంతోబతిమాలినా ససేమిరాఅనగా చివరికి అతి బలవంతం మీద ఇంట్లో ఒక మూల విసిరేసి పొమ్మన్నాడు బైరాగితో .మళ్ళీ ఒక సారి వచ్చి శిలను ఉపయోగించావా లేదా అని అడిగాడు .దాని మొహ౦ కూడా  చూడలేదన్నాడు దాసు  .పరాత్పరుడు సంతోషించి అమూల్య ధనరాసులు ఇవ్వగా వాటినీ తాకనైనా తాకలేదు .ఆశరీరవాణి ఆ  ఆలయ నిర్మాణ  చేయి  చెప్పింది .

    రవిదాసు చక్కని దేవాలయం నిర్మించి ,తానె అర్చకుడై నిత్యపూజాదికాలు  చేశాడు కాని బైరాగి ఇచ్చిన డబ్బు ముట్టుకో లేదు.ఒక రోజు పూజాద్రవ్యాల బుట్టలో మిలమిల లాడుతూ అయిదు బంగారు నాణాలు కనిపించాయి .దేవుడు పరీక్షిస్తున్నాడని బాధపడగా ‘’ఈశ్వరాజ్ఞ పాలించక తప్పదు ‘’అన్నాడు కలలో .ఆ నాణాలతో ఒక విశ్రాంతి భవనం కట్టించాడు .భక్త రవి దాసు పేరు నలువైపులా మారు మ్రోగి ,కొందరికి అసూయ తెప్పించింది .వారు రాజుదగ్గరకు వెళ్లి ‘’ఒక చండాలుడు పూజారియై విష్ణు  ప్రసాదం అందరికీ పెట్టి ,ఆలయాన్ని మైలపరుస్తున్నాడు. వెంటనే ఆలయం నుంచి తరిమి వేయండి ‘’అని కోరారు .రాజు దాసును పిలిపించి విగ్రహాన్ని ఆలయాన్ని బ్రాహ్మణులకు వశం చేయమని ఆజ్ఞాపించగాసరే అన్నాడు  .ఆ రోజు రాత్రి రాజుకు కలలో శ్రీ హరి కనిపించి దాసును తొలగించవద్దని గట్టిగా చెప్పాడు .రవి దాసు భక్తీ, మహత్యం గుర్తించి రాజు అతన్ని ఆలయ సేవలోనే ఉండమని చెప్పి ,అనేక విధాల సన్మానం చేశాడు .

   చిత్తూరు రాణి’’ ఝాలీ ‘’రవి దాసు శిష్యురాలైనది .క్షత్రియ కులం లో పుట్టిన ఆమె చండాలునికి దాసురాలవటం అగ్రకులజులు జీర్ణించుకోలేకపోయి గందరగోళం సృస్టించారు .ఒకరోజు రాణి బ్రాహ్మణుల౦దర్నీ పిలిచి, సంతర్పణ చేసింది .అందరూ వచ్చారు .ఆసనాలపై కూర్చున్నారు .ఇద్దరి బ్రాహ్మణుల మధ్య ఒక హరిదాసుకూర్చున్నట్లు కనిపించి విప్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు .కాని ఆప్రాంగణమంతా రవిదాసు తో  నిండిపోవటంతో అమితా శ్చర్య పోయి కిక్కురుమనకుండా కడుపునిండా మెక్కి బొర్రలు తడుముకొన్నారు .రవిదాసు మహత్వం అర్ధమై అందరూ అతనిపాదాలపై పడి క్షమాపణ కోరారు .రవి దాసు తన చర్మం చీల్చి లోపలి యజ్ఞోపవీతం చూపించి పూర్వ జన్మలో తాను బ్రాహ్మణుడను అని చెప్పాడు .

  రవి దాసు మహాజ్ఞాని అని పేరుపొందాడు .అతడు రాసినవి ‘’ఆది గ్రంథం లో చేర్చారు .అవి సర్వ జనామోదం,ఆదరణ పొందాయి .అతడు రాసిన శ్లోకాలు కాశీ లో మహా పండితులుకూడా మహా ఆవేశం తో గానం చేస్తారు .రవిదాసు తనవారికోసం వైష్ణవ మతం లో ఒక శాఖ ఏర్పరిచాడు .అతని మహత్వం తెలిసి అన్ని జాతులవారు ఆరాధించారు .’’.భక్తిమాల ‘’లో రవి దాసుకు మహోన్నత స్థానం ఉన్నది .కుష్టువ్యాధులకు సేవ చేసేవాడు.అగ్రకులస్తులు కూడా దాసును సేవించి వ్యాదులనుండి విముక్తులయ్యేవారు .120ఏళ్ళు జీవించి రవిదాసు పరమపదించి బ్రహ్మపదం చేరాడని అందరి విశ్వాసం .ఆయన స్థాపించిన మతం ఇప్పటికీ సజీవమై అతన్ని నిరంతరం స్మరించేట్లు చేస్తోంది .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

This gallery contains 19 photos.

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు 7-12-19 శనివారం ఉదయం స్వామివార్లకు అష్టకల స్నపన ,మన్యుసూక్తాభిషేకం ,అనంతరం రెండున్నర గంటలు చామంతిపూలతో నాలుగు సార్లు అష్టోత్తర, సహస్రనామ విశేష అర్చన చిత్రాలు-2 ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు … Continue reading →

More Galleries | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం

amaheరోగులపాలటిదైవం

18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద  శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి  చెట్టెక్కి  కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా నిరాశే అయింది .ఆయన కలకత్తాలో ఉండగా భార్యకు రక్తగ్రహణి వ్యాదివచ్చి పుట్టింటే మరణించింది .మరో పెళ్లి చేయాలని తండ్రిభావి౦చినా  ,వైద్యం మీదే దృష్టి ఉన్నకోడుక్కి ఇష్టం లేదు .రోగాలను శీఘ్రంగా గుర్తించి ఉచితంగా మందులిచ్చి హస్తవాసి మంచిదని ,వైద్యో నారాయణోహరిః అనిపించుకొన్నాడు .ఇల్లంతా రోగులతో నిండేది .వారి సేవయే పరమధర్మగా భావించాడు .విసుగు విరామం లేనేలేదు .అభాగ్యులను నిరుపేదలకు అతడుప్రత్యక్ష దైవమె .

          సేవా ధర్మ మహాశయుడు

  ప్రేమ చంద్ర మున్షి అనే ధనికుడు కలకత్తాలో హాట్ ఖోలాలో ఉండేవాడు .ఇంటి పనులకు మనిషులను పెట్టక ,ఒక పేద బంధువుతో అన్ని పనులు చేయించుకొనేవాడు .రోజూ గంగాస్నానానికి వెడుతూ నాగమహాశాయుని ఇంటికి వచ్చి హుక్కాపీల్చి వెళ్ళేవాడు .కొంతకాలానికి ఆయనింట్లో పని చేస్తున్నబంధువు చనిపోయాడు .పిసినారి ఐన అతనికి సాటివారెవ్వరూ సాయం చేయటానికి రాలేదు. నాగమహాశయుడు వెళ్లి తాను  శవాన్ని తీసుకు వెడతానానని చెప్పి ,తండ్రికూడా సాయంరాగా స్మశానానికి తీసుకు వెళ్లి దహన సంస్కారాలు చేశాడు .

           శాస్త్ర జిజ్ఞాస ,మళ్ళీ పెళ్లి

  నాగామహాష్యుని స్నేహితుడు సురేశ చంద్ర దత్తు బ్రహ్మ సమాజీకుడు విగ్రహారాధనకు వ్యతిరేకి ఇద్దరూ తరచూ వాదించుకొన్నా స్నేహం బాగా ఉండేది .కేశవ చంద్ర సేన్ స్థాపించిన బ్రహ్మ సమాజమందిరానికి నాగ ను తీసుకు వెళ్ళేవాడు .కేశవ చంద్రుని ఉపన్యాసాలకు ముగ్ధుడయ్యేవాడు .సచ్చరిత్రుడు పవిత్రుడు ఐన నాగమహాశాయుని చూసి చాలామంది తమ అభిప్రాయాలు మార్చుకొని వైదికాచార విధానాలు అవలంబించేవారు .నాస్తికులుఆస్తికులయ్యారు .ఏకాదశీ వ్రతం శ్రద్ధగా చేసేవాడు. గంగాస్నానం తప్పని సరి .సాధకులను సన్యాసులను దర్శించి శాస్త్రాలలో సందేహాలు తీర్చుకోనేవాడు .ఒక వృద్ధ బ్రాహ్మణుడి వలన షట్ చక్ర రహస్యం తెలుసుకొన్నాడు .తండ్రి ఎన్నిసార్లు వివాహప్రసక్తి తెచ్చినా వద్దనే చెప్పేవాడు .ఒకరోజు తండ్రి గదిలో వెక్కి వెక్కి ఏడవటం చూసి కారణం అడిగాడు .ఆయన మాట విని పెళ్లి చేసుకొంటానన్నాడు .తండ్రి వెతికి తగిన అమ్మాయితో పెళ్లి చేశాడు .

         వైద్యో నాగమహాశయో హరిః

  కలకత్తా వెళ్లి వైద్య వృత్తి సాగించాడు .ఎవరినీ ఏదీ అడిగేవాడుకాడు .ఇస్తే పుచ్చుకోవటమే తప్ప అడగటం రాదు .మేనత్తకు జబ్బు చేసిందని తెలిసి స్వగ్రామం వెళ్లి ,ఆమెను రక్షించాలని విశ్వప్రయత్నం చేసి విఫలంకాగా ఆమె ఆశీర్వదిస్తూ దైవ స్మరణతోచనిపోయింది .తీవ్ర దుఖంతో ఏడ్చేశాడు .పిచ్చిపట్టినవాడిలాగా ఉండేవాడు చెల్లెలు శారద వచ్చి సాయం చేసింది ఊరడించినది .కొంతకాలానికి మామూలు అయ్యాడు .మరణం గురించి మళ్ళీ జన్మ గురించి ఆలోచించేవాడు .రోగుల సేవలోనే సమయమంతా గడిపి అంతకు మించి ఆనందం లేదనుకోనేవాడు .ఒకరోజు నిరుపేద కు నాలుగుగంటలు సేవచేసి మందులిచ్చి ,వేసి ,రాత్రి ఎలాఉందో చూడటానికి వెళ్ళాడు. పూరి గుడిసెలో ఒంటిపై వస్త్రం కూడా లేని స్థితి లో చూసి ,తానుకప్పుకొన్న శాలువాకప్పి చలిను౦చి కాపాడాడు .మరోకరోగి నేలపైనే పడుకోవటం చూసి ,ఇంటికెళ్ళి తనమంచం ,దిండు తెచ్చి ,వేసి ,పడుకోబెట్టి సేవ చేశాడు .ఒకకుటుంబంలో పసిపిల్లకు కలరా సోకితే వెంటనే వెళ్లి  అక్కడే ఉండి ,మందులిస్తూ సేవ చేశాడు. కాని బ్రతకలేదు .నాగ చాలాడబ్బు పిండి ఉంటాడని స్నేహితుడు సురేష్ ఊహించాడు .శిశువు చనిపోయిందనే మహాశయుని బాధ చూసి తల్లడిల్లాడు .అన్నం కాని నీళ్ళుకానీ తాగలేదు

  నాగమహాసహాయుడు  వాడే మందులు గొప్ప గుణాన్ని కలిగి ఉండేవని రోగులు నమ్మారు పాల్ సోదరులు ఆయనను తమ ఇంటి డాక్టర్ గా  నియమించుకొన్నారు .పాల్ చుట్టాలవిడకు కలరా సోకితే ఈయనగురువును పిలిపించారుకాని నాగమహాశయుడు చేస్తున్న వైద్యమే సరైనదని గురువు శిష్యుని మెచ్చుకొన్నాడు .ఆమె బ్రతికింది .సంతోషం తో పాల్ బ్రదర్స్ ఒక వెండి పెట్టెనిండా రూపాయలు నింపి ఆయనకివ్వగా, కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు .తండ్రికి తెలిసి బాధపడ్డాడు .ఒకధనికుడు అందగత్తె ఐన వితంతువును చూపించి ఆమె గర్భాన్ని తీసెయ్యాలని కోరి పళ్ళెం నిండా రూపాయలు పెట్టాడు నాగమహాశయుడు ‘’వితంతువుకు కడుపు చేసి ఒకపాపం చేసి ,భ్రూణహత్యకోసం మరో పాపం చేస్తున్నావు ‘’అని చెప్పి మాన్పించటానికి  బ్రహ్మ  సమాజీకుడు,సేవాతత్పరుడు సంస్కారి   శివనాధ శాస్త్రికి చెప్పగా ఇద్దరూ కలిసి వచ్చేసరికి ధనికుడు ఆ విధావరాలితోకాశీకిపారిపోయాడని తెలిసింది .

   శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సన్నిధిలో

  వైద్యం వలన కొన్త  రాబడి కొంత బాగానే ఉన్నా , తండ్రి స్వయంగానే వంట చేసేవాడు చూడలేక బాధపడేవాడు నాగ .జడభరతుడి కథ బాగానచ్చి అలా ప్రవర్తించేవాడు .ఒకసారి గంగ ఒడ్డున పరవశంతో నృత్యం చేస్తూ నదిలోపడిపోతే ,స్నేహితులు కాపాడారు .ఒక బైరాగి గురు కటాక్షం లేనిది ఏదీ సాధించలేవని చెప్పాడు అనుకో కుండా ఒక గురువువచ్చి మంత్రోపదేశం చేశాడు .దీక్షగా జపం చేశాడు .తండ్రి ఆరోగ్యం క్షీణించింది .భార్య అతనికి బగా సహకరించింది .ఒకసారి  సురేష్ తో  కలిసి దక్షిణేశ్వరం వెళ్లి శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శింఛి మంచంపై పడుకొన్న ఆయన పదాలను తాకాలని ప్రయత్నిస్తే ,చటుక్కున వెనక్కి లాగుకోగా ,బాధపడుతుంటే పరమహంస ‘’ఒక రకం చేప బురదలో ఉన్నా , దానికి బురద అంటుకోనట్లే, సంసారంలో ఉన్నా నీకు  సంసారం మాలిన్యం అంటుకోదు ‘’అని చెప్పాడు .దగ్గరలోని పంచవటి లో కాసేపు ధ్యానం చేసిరమ్మని పంపాడు .అలాచేసి పరమహంస  ఆశీస్సులు పొంది ఇంటికి చేరాడు పరమానందంగా .మరో సారి వెడితే రామకృష్ణ ‘’ఉన్నతస్థితి పొందావు ‘’అన్నారు .ఇక్కడే వివేకానంద స్వామితో పరిచయభాగ్యం కలిగింది .పరమహంస స్వామితో నాగమహాశయుని చూపిస్తూ ‘’యితడు నిజంగా స్వార్ధ రహితుడు ‘’అనగా స్వామి ‘’అచార్యులన్నమాటకాదనగలవారెవరు?“’అన్నాడు .నాగ క్రమంగా వైద్యం మానేశాడు. తండ్రికి తెలిసి పాల్ బ్రదర్స్ కు చెప్పి సంస్థలో పని కుదిర్చాడు .కాని బలవంతం మీద వెళ్ళేవాడు .తండ్రి చనిపోయాడు. దినవారాలు అప్పు చేసి చేశాడు .

     సంసారంలో సన్యాసి

 కలకత్తాలో ప్లేగు విజ్రుమ్భించింది .మందులిస్తారుకాని రోగులకు సేవ చేయటానికి ఎవరూ ముదుకు రాకపోతే నాగమహాశయుడే దీక్షగా సేవలో పాల్గొన్నాడు . వీలైనప్పుడల్లా పరమహంస దర్శనం చేసి, సద్గొస్టి లో పాల్గొనేవాడు .తనవూరిలో   కుటీరం లో ఉందామనుకొంటే భార్య ఆయనదారికి అడ్డురానని చెప్పగా ఇంట్లోనే ఉన్నాడు .ఒకసారి ఒకభక్తుడు వచ్చి బ్రహ్మ చర్యం బాగానే ఉందికాని సంతానం కోసం ప్రయత్నించమని చెబితే ,ఇటుక రాయితో తలబాదుకొని అలాఅనటం భావ్యం కాదనగా ఆయన తన తప్పు తెలుసుకొని క్షమించమన్నాడు .

పరమదయామయుడు మహాశయుడు

  పాల్ సోదరులకోరికపై భోజేశ్వరానికి పడవపై వెళ్ళాడు .తిరిగివచ్చేటప్పుడు పాల్ బ్రదర్స్ 8రూపాయలు చలికి ఆగే శాలువా ఇచ్చారు .ఓడరేవు ఆరు మైళ్ళ దూరంలో ఉంది .రేవు చేరగా బీదరాలు పసిపిల్లలతో చలికి ఆగలేక దీనంగా కనిపిస్తే డబ్బులు, శాలువా ఇచ్చేసి పడవ ఎక్కి ఇంటికి చేరాడు .పాల్ సోదరుల దుకాణంలో నాగ బదులు రణజిత్ పని చేస్తూ సగం డబ్బు మహాశాయుడికిచ్చేవాడు. అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకోనేవాడు .చెరువులలో బియ్యం, పప్పులు  చేపలకుఆహారంగా వేసేవాడు .అన్నిప్రాణులనూ సమాదరించే గొప్ప లక్షణం ఆయనది .హింసకు వ్యతిరేకి .ఎప్పుడూ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లే కనిపించేవాడు .ఎవరికి నమస్కారం అంటే ‘’జగదీశ్వరునికి’’ అనేవాడు .నాగమహశయుని దర్శన౦ తోనే దీర్ఘ  వ్యాధులు  కూడా నయమయ్యేవని విశ్వాసం .

 ఇంటి ముందు ఉప్పొంగిన గంగ

  యాభై ఎల్లఏళ్ళకు ఒక సారి వచ్చే ‘’అర్ధోదయం ‘’గంగాతీరంలో గొప్పగా జరుగుతుంది .మూడు రోజులముందే మహాశయుడు కలకత్తా వదిలి స్వగ్రామం వచ్చాడు .గంగ ఉన్న  చోటు వదిలి ఇంటికొచ్చావేమితని తండ్రి అడిగాడు .నమ్మకమైన భక్తిఉంటె పావనగంగ తనంతట తానే ఇక్కడికి రాదా ?’’అన్నాడు .సరిగ్గా అర్ధోదయం రోజు శుభుహూర్తం లోఆయన పూజామందిరంలో పూజ చేసుకొంటూ ఉండగా , మహాశయునిఇంటికి ఈశాన్యభాగం లో భూమి నుంచి జలధార తటాలున పైకి ఉబికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది .’’అమ్మా పతితపావని పావన గంగా ‘’ అంటూ బయటికి  వచ్చి ఆ గంగకు నమస్కరించి ,పవిత్ర గంగాజలం తీర్ధంగా తీసుకొని అక్కడే తను , తండ్రీ భార్య అందరూ అర్ధోదయ పవిత్రస్నానాలు చేశారు .భక్తిపారవశ్యంతో ‘’జయజయగంగే ‘’అంటూ నాట్యం చేశాడు మహాశయుడు .ఈఅద్భుత ఘట్టం తెలిసిన వివేకానదస్వామి ‘నాగమహాశాయుని వంటి మహాత్మునకు అసాధ్యమైనదేదీలేదు .ఆయన ఇచ్చాశక్తి  అమోఘం .ఆశక్తివలన ముక్తిపొండటం అతి తేలిక ‘’అన్నాడు .ఈ అద్భుతాన్ని గొప్పగా మహాశయుడు ఎన్నడూ ఎవరితోనూ ప్రస్తావించలేదు .

    గురుభక్తి ,శిష్యవాత్సల్యం

  నాగ మహాష్యుడిని చూడటానికి శిశ్యుడొకడుఒకసారి ఢాకా ను౦చి బయల్దేరి దారిలో విపరీతైన వర్షం గాలి కారు చీకటిలో ఎలాగగో  ఇంటికి వచ్చి గడ్డకట్టుకు పొతే భార్యాభర్త సపర్యలు చేసి స్వాస్త్యం కలిగించి ఎందుకు ఇంతసాహసం చేశావని అడిగితె ‘’ఈ మహాత్ముని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోయాను ‘’అన్నాడు ఆనంద బాష్పలతో .అతిధికి వండిపెతట్ట టా నికి ఇంట్లో కట్టెలు లేవు .ఇంటివాసాలు పీకి వాటితో వంట చేయి౦చి భోజనం పెట్టాడు . కలకత్తా విద్యాసాగర కాలేజీలో చిదివే యువకుడొకడు నాగమహాశయుని చూడాలనే కోరిక తీవ్రంగా కలిగి భావోద్రేకం తో ఉండి,సాధ్యంకాక ఆత్మహత్యకు హాస్టలు పై అంతస్తు నుంచి దూకి సిద్ధమవగా ఎవరో వెనకనుంచి ‘’దూకడద్దు  నాగమహాశయుని దర్శనం రేపు పోద్దునకలుగుతుంది ‘’అని వినిపించి ఆగిపోగా మర్నాడు ఉదయం మహాశయుడు అతని తలుపుతట్టి లోపలి రాగా పాదాలపై వాలిపోగా ఆప్యాయంగా కౌగిలించి పైకి లేపి ధైర్యం కలిగించి ఆత్మహత్య పాపం నేరం అని చెప్పి బేలూరు తీసుకు వెళ్లి ఆశ్రమ యోగులకు అప్పగించాడు  నాటవర ముఖోపాధ్యాయ అనే కుర్రాడు శీలరహితుడై పోగా ,మహాశయుడు అతన్ని మంచిమార్గం లోకి మళ్ళించాడు .’’నాగ మహాశయుని సమక్షం లో అయిదు నిమిషాలు ఉంటె చాలు అత్యద్భుత ఆధ్యాత్మిక పరిణతి లభిస్తుంది అన్నారు హరకామి,నీ కైలాస చంద్ర దంపతులు .  స్వామి వివేకానంద కూడా ఇలాగే అన్నాడు ‘.

             మహా నిర్యాణం

 వంగశకం 1306లో దుర్గా ఉత్సవాలకోసం కలకత్తా వెళ్లి సంబారాలకోసం జ్వరం తో  కలకత్తా వెళ్ళలేకపోతే భార్య చక్రవర్తి అనే శిష్యుడికి టెలిగ్రాం ఇస్తే ,అతడు మఠం లో వేదమతం గురించి ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే , ఎటూ పాలుపోక అద్భుతానందస్వామి గ్రహించి  ఉపన్యాస౦ ఎప్పుడైనా ఇవ్వచ్చు . ముందు నాగమహశయుని చూసిరామ్మని చెప్పగా, కాళీఘాట్ నుంచి వెంటనే బయల్దేరి మర్నాడు ఉదయం రాగా ఇంటివసారాలో మంచం పై పడుకొని ఉన్న గురువుగారిని చూసి గగ్గోలు పెట్టి గురుపత్నిని అడిగితతే వ్యాధి పెరగ్గానే  ఆయనే అక్కడికి వెళ్లి పడుకొన్నారు తానేమీ చేయ లేకపోయాను అని వలవలా ఏడ్చింది. మహాశయుడు శూలవ్యాది గ్రహణి లతో బాధపడుతున్నాడు .పగలు నాలుగుమెతుకులే తిండి .తనబాద ఎవరికీ చెప్పనేలేదు .సుశ్రూషకు అనుమతి అడిగితె చక్రవర్తి ,గురువు అంగీకరించకపోతే ,మంచం దగ్గరే కూర్చుని డుర్గాస్తవం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు చదివి వినిపించి గురువు ముఖంలో ఆనందం చూసి సంతృప్తి పొందాడు .మహాశయుడు గంటలకొద్దీ సమాధిలో ఉండేవాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ‘’అమ్మా అమ్మా, అని సచ్చిదానంద్ ,అఖండ చైతన్య ‘’అని  పలవరించేవాడు  .

 ఈయనమంచంలో ఉన్నా ఇంటికి అతిధి అభ్యాగతుల రాక మామూలే .వారికి కావలసినవన్నీ చేకూర్చమని భార్యకు చెప్పేవాడు .తనకై దుఃఖించే వారితో ‘’ఈతుచ్చశరీరం పై మక్కువ ఎందుకు? .ఇది ఎంతోకాలం ఉండదు.ఈశ్వరుడు కారుణ్య నిధి ఆయన ప్రేమ అనంతం  ‘’అనేవాడు  .కళ్ళనుండి నీరు కారేది. ప్రక్కలకు ఒత్తిగిలటమూ చాలాకష్టంగా ఉండేది .దుర్గామాత దుర్గామాత అనే మాటలే తప్ప వేరొక మాట వచ్చేదికాదు .’’మాకుదిక్కెవ్వరు ?’’అని అక్కడివారు అడిగితె ‘’పరమహంస పదద్వయమే దిక్కు. రామకృష్ణుడే అందరికీ దిక్కు ‘’అనేవాడు .

ఢాకాలో ఉండే శారదానందస్వామి మఠం బాధ్యతలు చూసేవాడు .అప్పుడప్పుడు  వచ్చి నాగమహాశయుని సేవ చేసి వెళ్ళేవాడు.ఆయనద్వారా మందులు తీసుకోమని భర్తకు చెప్పించినా ‘’పరమహంస ,జగన్మాతల నామాలే నాకు మందులు ‘’అన్నాడు .తండ్రి దినవారాలకు చేసిన అప్పు తీర్చలేకపోయానని బాధపడేవాడు .అప్పు ఇచ్చినాయన  ఒక రోజు చూడటానికి రాగా ‘’నాయనా !అప్పు తీర్చజాలని అపరాధిని నేను .నేను చనిపోయాక నా ఇల్లు తీసేసుకుని నన్ను రుణ విముక్తుడిని చేయండి .నాభార్య పుట్టింట్లో ఉంటుంది ‘’అన్నాడు .అతడు ఏడుస్తూ ‘’డబ్బుకోసం రాలేదు మహాత్మా మీ దర్శనం కోసమే వచ్చాను ‘’అని కాళ్ళమీద పడి బావురుమన్నాడు .చలించిన మహాశయుడు ‘’ఈశ్వర కటాక్షం .మీ హృదయం మహోన్నతం .జగదీశుని కటాక్షం వలన మీకు సర్వ సుఖాలు కలుగుతాయి ‘’అన్నాడు .మధ్యాహ్నం 3గంటలైంది వ్యాధి తీవ్రమైనది .సంధి లక్షణాలు వచ్చి తాపం భరించలేక ,అకస్మాత్తుగా లేచికూర్చుని విసనకర్రతో విసిర్తే కొంచెం ఉపశమనం కలిగి ,చక్రవర్తితో ‘’పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టు ‘’అన్నాడు .అంతరార్ధం గ్రహించి అతడు ‘’పుష్య శుద్ధ త్రయోదశి పగలు పది గంటలకు దివ్యమైన ముహూర్తం ‘’అన్నాడు .’’నువ్వు అనుమతిస్తే ఆముహూర్తానికే తిరిగిరానిలోకాలకు బయల్దేరుతాను ‘’అన్నాడు .భార్యతో సహా అంతా  గొల్లుమన్నారు .

   రెండు రోజులకు ప్రాణం విడుస్తాడు అనగా మంచం చుట్టూ చేరిన భక్తులందరూ వింటూ ఉండగా చక్రవర్తితో ‘’గురు దేవులు వచ్చారు నాకు అన్ని తీర్దాలు చూపిస్తారు .నువ్వు ఒక్కోదాని పేరు చెప్పు ‘’అన్నాడు .హరిద్వారం అనగానే త్రివేణీ సంగమం చూసి ఉప్పొంగిపోయినట్లు స్నానిన్చినట్లు తన్మయం లో అన్నాడు సమాదినుంచి లేచాక చూస్తే ‘’సురదుని’’లోస్నానం చేసినవాడుగా కనిపించాడు  .తెల్లవారు జామున నాలుగు గంటలకు కొద్దిగా నిద్రపట్టి ఉదయం ఆలస్యంగా లేచాడు .తెల్లారి పుష్య శుద్ధ త్రయోదశిఉదయం 8గంటలకు అకస్మాత్తుగా లేవగా ఆయాసం ఎక్కువకాగా చక్రవర్తి మహాశయుని చెవులలో ‘’శ్రీ రామకృష్ణ శ్రీ రామ కృష్ణ ‘’అని ఉచ్చరించాడు .పరమహంస ఫోటో ఒకటి దగ్గర ఉంచి ‘’ఏనామం స్మరించటానికి సర్వం త్యజించారో  ఆయన స్వరూపం చూడండి ‘’అన్నాడు .కళ్ళు తెరచి ‘’కృపానిదీ జోహార్ జోహార్ ‘’అని చివరిపలుకులు పలికాడు నాగమహాశయుడు .9గంటలకు ఆయాసం బాగా ఎక్కువై ,అరగంట తర్వాత దృష్టి నాసాగ్రం పై ఉన్నట్లు కన్పించింది .శరీరరోమాలు నిక్క బొడుచుకున్నాయి .పులకి౦త కనుదోయినుంచి ప్రేమధార కురిసింది .ప్రాణవాయువు మూలాధారం నుంచి క్రమ౦గా పైకి వెడుతోంది .నాభికి చేరగానే గుండె వేగంగా కొట్టుకొన్నది .పావు గంటకు మహాసమాదిలోకి వెళ్ళాడు .భార్య ‘’వారు గృహస్తాశ్రమంలోనే ఉన్నారుకనుక ఆప్రకారమే కార్యక్రమాలు జరగాలి ‘’అని చెప్పింది .ఆయనను జాగ్రత్తగా పట్టుకొని ఒకబల్లపై మెత్తని శయ్య ఏర్పాటు చేసి పడుకోబెట్టారు .అయిదారు నిమిషాలతర్వాత ప్రాణవాయువు ఆగిపోయింది .వదనం జ్యోతిర్మయంగా కనిపించి కళ్ళనుండి ప్రేమామృతం వర్షిస్తున్నట్లుగా ఉంది .భార్య భర్తమరణానికి తీవ్రంగా రోదించింది .

  గ్రామ పెద్దలు వచ్చి శవాన్ని పరీక్షించగా శరీరం వేడిగానే ఉండటం వలన మరో 12గంటలు అలానే ఉంచి తర్వాత అగ్ని సంస్కారం చేయాలని నిర్ణయించారు .రాత్రిపదిగంటలకు చందన కర్రల పేర్పుతో ,శిష్యులే పుత్రులై దహన సంస్కారం శాస్త్రోక్తంగా చేశారు .నాగమహాశయుడు 53ఏళ్ళ 4నెలల 7రోజులు మాత్రమె జీవింఛి పుట్టిన చోటనే మట్టిలో కలిసిపోయిన పుణ్యాత్ముడు. ఆయన జన్మించిన దేవభోగాగ్రమం ,ఆయనవలన పవిత్ర క్షేత్రం అయింది .జ్ఞాన,భక్తి యోగి గా నాగమహాశయుడు చరిత్ర ప్రసిద్ధి పొందాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

 

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం 

 ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము . 

     కార్యక్రమ వివరాలు
7-12-19 శనివారం  ఉదయం 5గం .లకు సుప్రభాతం అనంతరం  అష్ట కలశ స్నపన ,మ న్యుసూక్తముతో స్వామి వార్లకు అభిషేకం  ,నూతనవస్త్ర ధారణ
    ఉదయం 8 గం  లకు -గంధ సిందూరం ,చేమంతి పూలు ,వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర సహస్రనామ పూజ ,అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
8-12-19 ఆదివారం -ఉదయం 9 గం  లకు అరటిపండ్లు వివిధ ,ఫలాలతో విశేష అర్చన  అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి  -శ్రీ హనుమద్వ్రతం
  ఉదయం 9 గం కు పంపా కలశ పూజ,13ముడుల తోర పూజ  ,మంత్రం తో తోర ధారణ, తమలపాకులతో అష్టోత్తర సహస్రనామ పూజ
  అనంతరం శ్రీ హనుమద్వ్రత0 ,అయిదు కథల వివరణ – అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
                గబ్బిట  దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -30-11-19
                                   మరియు భక్త బృందం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

శ్రీ రమణీయ రామాయణం

శ్రీ రమణీయ రామాయణం

బాపు రమణ లో రమణగారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు ‘’రమణీయ శ్రీ రామాయణం ‘’రాసి ,ఆత్మీయంగా తనసంతకం చేయగా , వియ్యంకుడు ,బాపుగారితమ్ముడు ,పెన్సిల్ ఆర్ట్ నిపుణులు ,మద్రాస్ రెడియోకేంద్ర మాజీ డైరెక్టర్ ,సరసభారతి ఆత్మీయులు శ్రీ శంకరనారాయణ (శ్రీ సత్తిరాజు శంకరనారాయణ )గారు ,ఆపుస్తకాన్ని తన చేతి వ్రాత ఉత్తరంతో సహా నాకు నవంబర్ 27పంపగా,మర్నాడే అంది,అందిందని ఫోన్ లో ధన్యవాదాలు తెలిపాను .శంకర్ గారి ఉత్తరం లోశ్రీ మైనేని  గోపాలకృష్ణగారికి కూడా పుస్తకం పంపినట్లు తెలిపి నన్ను పుస్తకం చదివి అభిప్రాయం తప్పకుండా రాయమని కోరటం వారి సౌజన్యమే .వీరు ఈ నెల 15న బాపు గారి జన్మ దినోత్సవంనాడు ‘’బాపు గారి పురస్కారం ‘’అందుకో కోబోతున్నందుకు హృదయపూర్వక అభినందనలు .నూటికి వెయ్యి శాతం వారు అర్హులు .రమణీయ రామాయణాన్ని మా శ్రీమతి పుస్తకం వచ్చిన దగ్గర్నుంచి ,విడువకుండా పట్టుదలగా ప్రత్యక్షరం చదివి ,మధ్యమధ్యలో’’ ఎంతబాగా రాశారండీ ఆవిడ !’’అంటూ పులకించి నిన్నటితో పూర్తి చేసింది .ఇవాళ  మూడుగంటలలో నేనూ  ఏకబిగిన చదివాను .స్పందన రాయటానికి ఆశక్తుడనేమో అని సందేహించి ,అయినా శ్రీరామ సంకల్పం గా భావించి మొదలు పెడుతున్నాను .

  త్రేతాయుగం లో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో బహుజన రంజకంగా ,మనోల్లాసంగా ,ఉపమాలంకార సుశోభిత౦గా రచించి తాను  ఆదికవి అయి ,కావ్యం ఆదికావ్యం అనే ఘనత సాధించాడు .కాలక్రమంలో ఎన్నో రామాయణాలు వెలువడినా వాల్మీకం కు సాటి లేదని బహుజనాభిప్రాయం .తెలుగులో అనువాద రామాయణాలు చాలావచ్చినా ,విశ్వనాథ వారి కల్ప వృక్ష రామాయణానికి సరి సాటి లేదన్నదీ యదార్ధమే . శ్రీనివాస శిరోమణి గారి వచన రామాయణం బహుజనాభిమానం పొందింది .ప్రవచన రామాయణంగా ఉషశ్రీ రేడియో రామాయణం ‘’నభూతో’’గా సాగింది .విశ్వనాథకు వచ్చినట్లే శ్రీదేవిగారికీ ‘’మరలనిదేమి రామాయణం ‘’అనే వికిత్సకలిగినా ,ఆయనలాగే సమాధానపడి నట్లు ఈమె ‘’పలికెడిది రామకథ,పలికి౦చెడి  వాడు రామభద్రు౦డట’’అని తనూ భక్తపోతనగారిలా నమ్మి, రమణీయ రామాయణ రచనకు’’కవి ‘’అనే వాల్మీకి నీ  ,శిరోమణి గారిని స్మరించి, నమస్కరించి ఉపక్రమించారు .నాకు యేమని పించిందంటే ‘’వాల్మీకి మహర్షి శ్రీదేవి గారి అవతారం దాల్చి,ఆధునికకాలం లో ఉన్న ఆంధ్రులకు ,తానే తెలుగువారికోస౦ అచ్ఛ స్వచ్చమైన తెలుగులో, తెలుగు ఇంతమధురంగా ,జు౦టితేనె ,పనసతొనల రుచితో ఉంటుందా అని ఇతరులు అసూయ పడేంత  మనోహరం గా భక్తి విశ్వాస బంధురంగా  రాశాడేమో?’’అనిపించింది .అంతే కాక,రచయిత్రి  రమణీయ శ్రీ రామాయణం ‘’అనటంలో కూడా రమణీయ అంటే ముళ్ళపూడి వెంకటరమణగారినీ,శ్రీ అన్నా  శ్రీదేవి అన్నాఒకరే కనుక తనపేరుకూడా కలిసి వచ్చినట్లు పెట్టారేమో అనికూడా అనిపించింది .రచనకు మూలకారణం రమణ గారే అని ఆమె అన్నారు .బాపురమణల  సీతాకల్యాణం ,సంపూర్ణ రామాయణ చలన చిత్రాలలో మాట రమణ గారిది, చేత బాపుగారిదీ  .ఈ రెండు చేతులూ కలిసి అద్భుత భక్తి రసాన్ని ప్రవహింపజేసి ,రసికజన మనసులను రసప్లావితం చేశారు .బాపు ‘’బామ్మ శ్రీ ‘’మాత్రమే కాదు ‘’శ్రీరమణ అన్నట్లు ‘’బొమ్మర్షి ‘’కూడా .రమణగారు యవ్వనదశనుంచీ రామాయణ పరిమళాన్ని అంటించుకొన్న ధన్యులు .ఆయన రచనలో వాల్మీకి శైలి ప్రవహిస్తు౦దనటం యదార్ధం .భర్త రాత కోతల్లో శ్రే దేవిగారికీ మొదటినుంచీ ప్రమేయం ఉండటంతో, ఆసౌరభం ఆమె  హృదయాంత రాళాల లో జీర్ణించుకు పోయింది  .ఇంతకంటే రామాయణం రాయటానికి ఇంకే అర్హత కావాలి ?శ్రీరమణ అన్నట్లు యిది ‘’రామ చక్కని కలనేత ‘’.

  శ్రీదేవిగారు ప్రతికాండ ను ‘’శుద్ధ బ్రహ్మ పరాత్పరరామ –కాలాత్మక పరమేశ్వరామ ‘’’’సీతా ముఖా౦భోరుహ చంచరీకః ‘’,’’దండకవన జనపావన రామ –శూర్పణఖార్తివిధాయకరామ –ఖర దూషణ ముఖ సూదక రామ ‘’,’’విరచిత నిజపితృకర్మకరామ –భరతార్చిత నిజపాదుకరామ ‘’,’’హనుమత్సేవితనిజపద రామ –నత సుగ్రీవా భీస్టద రామ ‘’,’’భీత భాను తనూ భవార్తి నివారణ జాతి విశారద౦ ‘’,సుందరే సుందరో రామః –సుందరం కిం న సుందరం “,’’ఉల్లంఘ్య సింధోస్సలిలం స లీలం –యశ్శోక వహ్నిం జనకాత్మజాయా – ఆదాయ తే నైవ దదాహ లంకాం –నమామి త౦ ప్రాంజలి రా౦జ నేయం ‘’,  ‘’అన్జనానందనం వీరం-జానకీ శోక నాశనం –కపీశ మక్ష హ౦తా రం –వందే లంకా భయంకరం ‘’‘,’’ఆమిషీకృత మార్తాండం –గోష్పదీ కృత సాగరం -తృణీకృత’ దశగ్రీవం –ఆంజనేయం నమామ్యహం ‘’,శ్రీరామరామ రణ కర్కశ రామ రామ –శ్రీరామ రామ శరణం భవ రామ ‘’శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ‘’మొదలైన జనం నాలుకలపై నర్తించిన పదాలు, శ్లోకాలు ,వీలైన చోట్ల అధ్యాయాలలో కూడా చేర్చి రావణ సంహారం ముందు ఆదిత్య హృదయ స్తోత్రశ్లోకాలు ఉటంకించి ,అందులో జరిగే కథలను చెప్పీ చెప్పకుండా చెప్పటం ప్రత్యేకత .వీటికి మించి వాల్మీకి మహర్షి ప్రయోగించిన ఆమ్రేడిత ఉపమాల౦కారాల  సౌందర్యాన్ని తెలుగులోకి కమ్మగా అనువాదం చేసి వాటిని’’ బోల్డ్ లెటర్స్ ‘’లో ముద్రించటం మరో ప్రత్యేకత.ఇలాంటి రచనతో ‘’గంగానది ఒక చోట అతివేగంగా ,ఒక చోట నెమ్మదిగా ,ఒక చోట తిన్నగా ,ఒకచోట వంకరలు తిరిగినట్లు ,ఒక చోట కిందికి దూకుతూ ,అతి దర్శనీయంగా ‘’ఉన్నట్లు శైలికూడా అలానే ఉండటం ఇంకో ప్రత్యేకత .అందుకే పుస్తకం చేతిలో పట్టుకొంటే ఆ రచనా ప్రవాహం లో కొట్టుకు పోవటమే తప్ప, ఇహ లోక ధ్యానం ఉండదు .అదృష్టవంతురాలు శ్రీదేవిగారు .వారితోపాటు మనమూ .

   కొన్ని ఉపమాలంకార ఉదాహరణలు .శిశువు రాముడి అరచేతిలో వజ్రరేఖ ఉండి,వజ్రపాణి ని కన్న అదితిలాగా కౌసల్య ఉన్నది .రాముడికి  సీతాదేవిపై అనురాగానికి కారణం ,ఆమె సౌజన్య ,సౌందర్య ,సౌశీల్య సద్గుణాల తో తనను సంతోష పెట్టటం వల్లనేకాదు ,తనతండ్రి దశరధ మహారాజు  చూసి ,ఆలోచించి ,సమ్మతించి చేసిన భార్య యిందువల్ల కూడా అన్న వాక్యాలు పవిత్రాలు .అరేంజ్డ్ మారేజేస్ లో ఉన్న గొప్పతనానికి నిదర్శనం .రాముడికి సీతమీద కన్నా, సీతకు రాముడి మీద అనురాగం ఎక్కువ అనటమూ వాల్మీకమే .మారీచునితో రాయుడు యుద్ధం చేసేటప్పుడు ‘’మదపు టేనుగులా ,ఉన్నాడు .పరిశుద్ధ వంశంలో జన్మించటమే ఆఏనుగు తొండం .మహాబాహువులు పొడుగాటి దంతాలు .ప్రతాపమే మదజలం .అ రాముడు నృసింహ స్వరూపుడు ,కొపొద్రేకాలతో చెలరేగే సింహం వాడి బాణాలు గోళ్ళుఖడ్గాదులు కోరలు .సింహం మృగాలను చంపినట్లు రాక్షసులని చంపాడు .వర్షాకాల నల్లటి మేఘాలు తెల్లటి వానధారలు హోరు గాలి పోసుకొన్న గుహ లతో పర్వతాలు కృష్ణాజినం కప్పుకొని ,తెల్లటి జంధ్యాలు ధరించి వేదాధ్యయనం చేస్తున్న బ్రహ్మ చారుల్లా ఉన్నాయి .శరత్కాలం లో  ‘’చేపలనే ఒడ్డాణాలు పెట్టుకొని ,నదులనే స్త్రీలు రాత్రంతా రతికేళి లో ఓలలాడి ,ప్రాతఃకాలం లో మందమందంగా తమ ఇళ్ళకు నడిచిపోయేట్లు మెల్లమెల్లగా పారుతున్నాయి .లంకాపట్టణం ‘’ప్రాకారానికి అండగా ఉన్న ఇసుక తిన్నెలు జఘనాలవలె ,అగడ్తలలో శుద్దోదకాలు కట్టుకొన్న చీరల్లాగా ,శతఘ్నులు ,శూలాలు తల వెంట్రుకలతో పెట్టుకొన్న కొప్పు లాగా ,కోటబురుజులు కర్ణాభరణాలలాగా సుందరా౦గనలాగా  కనిపిస్తోంది హనుమకు .సీతా దేవికి హనుమ విశ్వ రూపం చూపించినపుడు ‘’వందే వానర నారసింహ ఖగారాట్ క్రోడాశ్వ వక్త్రా౦ చితం ‘’శ్లోకం ఉదాహరించటం  ఎంతో సముచితంగా ఉంది .సీతాదేవి లంకలో ఎలాబ్రదికింది అంటే ‘’  నీళ్లున్నపొలం లో తేమవల్ల ,నీళ్ళు లేని ప్రక్కపొలం లో పైరు బ్రతికి ఉన్నట్లు ‘’.

  మొదటి రోజు అలసిపోయి ,రాముడు విశ్రాంతి తీసుకొని రమ్మని పంపిస్తే రెండవ రోజు రాముడితో యుద్ధానికి వచ్చిన రావణుడు ఒకసారి గతంలో జరిగినవన్నీ చక్రాల్లా కనిపించాయి .అరణ్యుడు అనే ఇక్ష్వాకు రాజును యుద్ధంలో ఓడించి చిత్రవధ చేసి చంపగా ,అతడు చనిపోతూ తనవంశం లో ఒక పుణ్యపురుషుడు జన్మించి ,రావణుని బంధుమిత్ర సపరివారంగా సంహరిస్తాడని శపించాడు .ఆపుణ్య పురుషుడు రాముడే అని రూఢిగా ఇప్పుడు నమ్మాడు .నందిశాపం ,మానవుని వల్ల చావు గురించి బ్రహ్మను అడగకపోవటం ,వేదవతి శాపం గుర్తుకొచ్చాయి .తపస్సు ద్వారా సాధించిన పుణ్యఫలం క్షయమై ,శాపబలం అనుభవం లోకి వచ్చిందని గ్రహించాడు .లక్ష్మణ ,ఇంద్ర జిత్తులు మహా యుద్ధం చేసి ‘’దేహాలనిండా గాయాలతో ఆకులన్నీ  రాలిపోయి పూలు మాత్రమే మిగిలిన బూరుగ, మోదుగ చెట్ల లాగా ఉన్నారు ‘’.తనను దెప్పిన ఇంద్రజిత్ తో పినతండ్రి విభీషణుడు ‘’ధర్మాన్ని వదలి పాపం చేయాలనుకొన్నవాడిని ,చేతికి చుట్టుకున్న పాములాగా వదిలించుకోవాలి .పరద్రవ్యం ,పరకాంత లను అపహరణ చేసినవాడిని తగలబదడిపోయే ఇంటిని వదిలేసినట్లు వదిలెయ్యాలి ‘అందుకే అన్నను వదిలాను ‘’అని చెప్పాడు .రావణుడు యుద్ధభూమిలో పళ్ళు కొరికితే ‘’రాక్షసులు త్రిప్పే  నూనె గానుగ ధ్వనిలా ఉంది ‘’

  భీషణ యుద్ధం చేస్తున్న రాముడు రాక్షసులకు ‘’పెద్దగాలికి వనంలో చెట్లు కూలిపోవటం కనిపించి గాలిమాత్రం కనిపించనట్లు ,మహా రథాలు చెక్కముక్కలై కనిపించాయికాని రాముడు కనిపించలేదు .’’శబ్ద స్పర్శ రూప రస గంధాలను   హే౦ద్రియాలు అనుభవిస్తున్నా ,కారణభూతమైన పరమాత్మ దేహికి కనిపించనట్లు ,ఒళ్ళంతా కొట్టిన దెబ్బలు కనిపించాయికాని రామ దర్శనం కాలేదు .’’చక్రం లాగా మండలాకారంగా తిప్పే రాముడు వింటి కొననే చూశారుకాని రాక్షసులు రాముడిని చూడలేదు. తన శరీరమే నాభిగా ,బలమే జ్వాలలుగా ,బాణాలే ఆకులుగా ,,కార్ముకమే అంచుగా ,జ్యారవం మహా ఘోషగా ,పరాక్రమమమే అక్ష ప్రదేశంగా ,దివ్యాస్త్రాలే ధారలుగా శత్రు సంహారం చేస్తున్న వీర ధీర సుందరరామ చక్రం రాక్షసులకు కాల చక్రం లాగా కనిపించి భయపెట్టింది  .అందుకే మహర్షి ‘’గగనం గగనాకారం –సాగరం సాగారోపమః –రామ రావణయో  ర్యుద్ధం –రామరావణ యోరివ –ఏవం బృవంతో దదృశః తద్యుద్ధం రామరావణ౦ ‘’అని చేతులెత్తేశాడు .

   రావణవదానంతరం  అయోధ్య చేరి పట్టాభి షిక్తుడైన రాముడు –

‘’వామే భూమి సుతా ,పురశ్చ హనుమాన్ ,పాశ్చాత్ సుమిత్రానందనః –శత్రుఘ్నో భరతశ్చపార్శ్వ దళయోః,వాయ్వాది కోణేషుచ-సుగ్రీవశ్చ ,విభీషణశ్చయువరాట్  తారా సుతో జా౦బవాన్ –మధ్యే నీల సరోజ కొమలరుచిం రామం భజే  శ్యామలం ‘’లా దర్శనమిచ్చాడు .

  సీతా రామ కళ్యాణ మహోత్సవం లో ‘’జానక్యాః కమలాంజలి పుటే — ముక్తాస్తా శ్సుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః’’ జన హృదయాలలో స్థిరంగాఉన్న ప్రసిద్ధ శ్లోకం ఉదహరించటం శుభదాయకం కాలానికి తగినట్లుగానూ ఉన్నది .

  కథా ప్రపంచం అనే తిరుపతి లోని ప్రసిద్ధ సంస్థ ముద్రించిన అందమైన దోషరహితమైన ,పాలనురుగు వంటి తెల్లటికాగితాలపై ముద్రించిన అమూల్యగ్రంథం ఇది .అందమైన శ్రీ సీతారాముల ముఖ చిత్రం , వెనుక ముకుళిత హస్తాలతో  రామభక్త హనుమాన్ ఉండటం జయం ,శుభం .సుందరకాండ పారాయణ కు ,రామాయణ పారాయణకు తగినట్లుగా 28అద్యాయాలతో,217పేజీల తో ఉన్న ఈ రమణీయ రామాయణం చదివి అందరూ అందులోని మంచిని గ్రహిస్తే అందరికి క్షేమం ,లాభం విజయం ‘.వాల్మీకి ఉపమానాలకు అద్దం పట్టే రచన శ్రీదేవిగారు చేసి ధన్యులయ్యారు .అభినందనలు .

‘’స్వస్తి ప్రజాభ్యఃపరిపాలయంతాం –న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః-గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం –లోకా స్సమస్తా సుఖినో భవంతు ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1

మహా భక్త శిఖామణులు

16-నాగ మహాశయుడు -1

గృహస్తుడైన నాగమహాశయుడు ఆదర్శ పురుషునిగా కీర్తి గడించాడు..’’నేను భూమి మీద చాలా ప్రదేశాలు తిరిగానుకాని నాగమహాశాయుడి వంటి వారెక్కడా కనిపించలేదు ‘’అని స్వామి వివేకానంద తరచుగా చెప్పేవారు .తూర్పు బెంగాల్ లో నారాయణ గంజ్ రేవుకు దగ్గరలో దేవ భోగ్ అనే పల్లెటూరిలో నాగమహాశయుడు1846ఆగస్ట్ 21 న జన్మించాడు .పూర్తిపేరు ‘’దుర్గా చరణ నాగ్ ‘’.తండ్రి దీనదయాళు. తల్లి త్రిపురసుందరి .తాత ప్రాణ కృష్ణ ,నాయనమ్మ రుక్మిణి ..వీరి పూర్వ నివాసం ‘’తిలారది’’.కాని మూడు తరాలనుంచి దేవ భోగ్ లోనే ఉంటున్నారు .దీనదయాళ్ కు ఇద్దరు చెల్లెళ్ళు .పెద్దావిడ భగవతి తొమ్మిదేళ్ళకే భర్తను కోల్పోయి ,విధవరాలై అన్న ఇంట్లోనే ఉంది .రెండవ చెల్లెలు భారతి సంసారం చేసుకొంటూ ,అప్పుడప్పడు అన్నగారింటికి వచ్చి వెళ్ళేది .దీన దయాళ్ కు దుర్గా చరణ్ ,మరో కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు .నాగమహాశాయుడనే దుర్గా చరణ్ తర్వాత శారదామణిపుట్టింది .ఈమె తప్ప మిగిలిన అనుజన్ములు అందరూ చనిపోయారు .చివరిపిల్ల పుట్టుకలో పురిటిజబ్బు  సోకి తల్లికూడా మరణించగా బాధ్యత అంతా ఆడబడుచే చూసింది.

  తల్లి పోయే నాటికి  నాగ్ వయసు 8.శారదకు 4ఏళ్ళు .తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పిల్లల పెంపకం మేనత్త చూసింది ..’’నా మేనత్త పూర్వజన్మలో నాకు తల్లి యై ఉంటుంది ‘’అని నాగమహాశయుడు ఆమెఎడ అవ్యాజానురాగంతో చెప్పేవాడు .తండ్రి దైవభక్తి తో నిష్టగా ఉండేవాడు .కలకత్తాలో  ‘’కుమారటులి’’ అనే చోట రాజకుమార పాల్, హరిచరణపాల్ అనే సోదరుల  వ్యాపారసంస్థలో పనిచేసేవాడు .జీతం తక్కువైనా ఆకుటు౦బ౦ తో అన్యోన్యంగా ఉండేవాడు  .వేలకొద్దీ డబ్బు అతని చేతులమీదనుంచే నడిచేది .స్వార్ధం లేని నిజాయితీ అతనిది .ఒకసారి కొన్ని వేలరూపాయలు లెక్కతేలకపోయినా దీనదయాళ్ ను అడగనైనా అడగలేదు .అతని ప్రవర్తనపై అంతటి నమ్మకం ఆసోదరులకు .కొన్నేళ్ళకు ఆడబ్బు లెక్క తేలి దీనదయాళ్ పై నమ్మకం విపరీతంగా పెరిగిందివారికి .

  పాల్ సోదరులది ఉప్పువ్యాపారం  .నారాయణ గంజ్ కు పడవలద్వారా ఉప్పు సరఫరా చేసేవారు .ఆ రేవు పట్నానికి వెళ్ళే కాలువ దట్టమైన అరణ్యం గుండా ప్రవహిస్తుంది .కనుక బందిపోటుదొంగలు పడవలపై దాడి చేసి సరుకు దోచేసేవారు .నమ్మకస్తులనే ఉప్పు పడవలలో పంపేవారు .ఒకసారి దీనదయాళ్ ను అలా పంపారు .పడవ ‘’సుందర్ బన్’’అడవి చేరేసరికి చీకటిపడింది .ముందుకు వెళ్ళే సాహసం చేయకుండా అక్కడే లంగరు వేసి ,దగ్గరలో శిధిలమైన ఇల్లు  ,ప్రక్కన రెండు గుడిసెలు కనిపిస్తే అక్కడికి చేరారు .నావికులు రాత్రి భోజనం చేసి నిద్రపోయారు .దీనదాయాల్ దుడ్డుకర్రపట్టుకొని రామనామస్మరణ చేస్తూ హుక్కాపీలుస్తూపడవలోనే ఉండికాపలా కాశాడు .

   తెల్లారగానే పడవ దిగి ,కంచెం దూరం నడవగానే కాలి వ్రేలి తాకిడికి ఏదో తళుక్కున మెరవగా ,బంగారునాణాల తోపాతి పెట్ట బడిన  బిందేకనిపించింది.కొన్ని నాణాలు పరీక్షించి చూడగా అవి పూర్వకాలం నాణాలుఅంటే మొహర్లు  అని అర్ధమై మళ్ళీ అన్నీ బిందెలో పోసి కనపడకుండా మట్టి కప్పేసి ,పడవవ వాళ్లను  తొందర పెట్టి ప్రయాణం సాగించాడు ,.ధనం మీద వ్యామోహం, పరుల సొత్తుపై ఆపేక్ష లేని సోశీల్యం అతనిది. ఆసద్గుణాలే కొడుకు నాగమహాశయుడికి సంక్రమించాయి  .

  నాగ మహాశయునికి ఒక జత వెండి మురుగులుతప్ప ఏ ఆభరణాలు లేని కడుపేద .సహజ సౌందర్య దీప్తి అతనిది .నవ్వుతూ హాయిగా నామకీర్తన గానం చేస్తూ ఉండేవాడు .ముచ్చటపడి ఏదైనా ఇస్తే తీసుకోనేవాడుకాదు.మేనత్త  ఆప్యాయంగా  దగ్గర కూర్చోబెట్టుకొని పురాణకథలు చెప్పేది .ఆటలపై ఆసక్తి తక్కువే .ఒకసారి తోటిపిల్లలు అబద్ధం చెప్పమని బలవంతం చేస్తే ససేమిరా చెప్పను అంటే విపరీంగా కొట్టగా,రక్తం కారుతూ  గాయాలతో ఇంటికి రాగా మేనత్త విషయం తెలుసుకోవటానికి అనేకరకాలప్రశ్నలు వేసినా తన స్నేహితులు  దండింప బడుతారని అసలు విషయం ఏమీ చెప్పనేలేదు .ఆబాధ అణచుకొన్నాడు .నారాయణ గంజ్ లో బడిలో చేరి కొంత చదువుకొన్నాడు .పై చదువు కలకత్తాలోనే చదవాలి తండ్రితో కలకత్తావెళ్లి   చదువు కొంటానని చెప్పగా తనకు పంపి చదివించే స్తోమత లేదన్నాడు తండ్రి .పోనీ  ఢక్కాలో చదువు దామనుకొంటే 10క్రోశులదూరం .అందరూ వద్దన్నా వినక ,ఎవరికీ చెప్పకుండా కొన్ని అటుకులు మూటకట్టుకొని ఢాకా  బయల్దేరి వెళ్లి అక్కడతనకు నచ్చిన స్కూలును ఎన్నుకొని రాత్రికి ఇంటికి చేరాడు .మేనత్త తల్లడిల్లి అడిగితె చెప్పి మర్నాడు ఉదయమే అక్కడ బడిలో చేరాలికనుక అన్నం సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు .చదువుపై అతనికున్న ఆసక్తికిఆమెమారు మాట చెప్పకుండా ‘’శ్రీరామ రక్ష’’అని దీవించింది .

  మర్నాడుమేనత్త వండిన అన్నం తిని ,చేతిలో కొంచెం డబ్బు తీసుకొని ఢక్కావెళ్లి నార్మల్ స్కూల్ లో చేరి ,స్కూలుకాగానే రాత్రికి ఇల్లు చేరాడు .ఇలా 15నెలలు అక్కడ చదివాడు  అతి నడక వలన ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. అయినా దీక్ష వదలలేదు .దారిలో ఒకసారి పిశాచం కనిపించిందని ,భయపడకుండా అలాగే ఉండిపోయాననీ, అదీ ఏమీ చేయలేదనీ, తర్వాత నాలుగడుగులు వేశాక అది పకపకా నవ్విందని,మూడు సార్లుఅది కనిపించినా తనకే అపకారమూ చేయలేదని  తన అనుభవం చెప్పాడు .ఒక ఉపాధ్యాయుడు నాగ్ శ్రమ గుర్తించి పితృవాత్సల్యంతో  తమ ఇంటనే  ఉండి చదువుకోమని చెప్పగా ,కృతజ్ఞత చెప్పి అదే వాత్సల్యం సదా తనపై చూపనికోరి మళ్ళీ యధాప్రకారం ఇంటినుంచే వచ్చి చదివాడు .

  ఒకరోజు బడి నుంచి తిరిగివస్తుంటే ‘’ఫతుల్లా ‘’అనే పల్లెటూరిలో గాలివాన చిమ్మచీకటి కమ్మేసి అడుగు వేయటం కష్టమైంది  .ఏ ఇంటివారు రమ్మని పిలవలేదు .ఎవరినీఅతడు ఆశ్రయమివ్వమని కోరనూలేదు .ఆజడివాన ,హోరుగాలి మెరుపులు, ఉరుములమధ్య అలాగే ఇంటికి నడుస్తూనే ఉన్నాడు .కొంతదూరం పోయాక దారిప్రక్కన ఉన్న  చెరువులో పడిపోయాడు .లేవటానికి విశ్వ ప్రయత్నం  చేశాడు .ఒక  రెల్లు దుబ్బుపట్టుకొని గట్టు చేరదామని ప్రయత్నిస్తే అది తెగిపోయి, మరింత లోతుకు కూరుకు పోయాడు. వర్షం గాలీ ఏమాత్రమూ తగ్గలేదు. మేనత్త  గుర్తు కొచ్చి దుఃఖించాడు .రామనామ స్మరణ చేస్తూ ధైర్యంగా అనేకప్రయత్నాలు చేసి చివరికి ఒడ్డుకు చేరి ఆలస్యం చేయకుండా ఇంటికి బయల్దేరాడు .పొలిమేర చేరేసరికి చేతిలో లాంతరుతో మేనత్త ఎదురు చూస్తూ ‘’నాయనా దుర్గా చరణా ‘’అని గద్గదస్వరంతో పిలిచి ,దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నీకే అపాయం జరిగిందో అని గుండె తల్లడిల్లి పోయాను .దేవుడి దయవలన సుఖంగా చేరావు ‘’అని తలనిమిరి ముద్దుపెట్టింది. నాగమహాశయుడు ‘’అత్తా !నాకేమీకాలేదు ఎందుకు బాధపడతావు .కొంచెం తడిశాను అంతే’’అని ధైర్యం చెప్పాడు ,

  ఢక్కాలో చదివింది కొద్దికాలమే అయినా వంగ వాజ్మయం లో గొప్ప పట్టు సాధించాడు .అతని దస్తూరి ముత్యాలప్రోవు .రచన సర్వాంగ సుందరం .రాసింది ఎవరికీ చూపించేవాడుకాదు .తర్వాత కలకత్తాలో వైద్య విద్య నేర్వటానికి వెళ్లేముందు తనరచనలను ‘’ఉపన్యాసమంజరి ‘’పేరుతొ ప్రచురించాడు .బాలబాలకులకోసం రాసి౦ది కనుక వారికి ఉచితంగా పంచిపెట్టేవాడు .వివాహవయసురాగానే మేనత్త అన్నగారితో ఆలోచి౦చి విక్రమపురికి దగ్గరలో ఉన్న ‘’రాయి జదియా’’గ్రామానికి చెందిన ధనికుని 11ఏళ్ళ  కూతురుతో వివాహం చేశారు .అదే రోజు మరో ముహూర్తంలో చెల్లెలు శారద వివాహం కూడా జరిపించారు .అయిదు నెలల తర్వాత నాగమహాశయుడు కలకత్తాలోని కేమ్బెల్ మెడికల్ కాలేజీ లో చేరాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

 

అర్జునమిశ్రపండితుడు పురుషోత్తమ ధామం లో బిచ్చమెత్తి జీవించే పరమ సాదు , ఉదార ,శాంత ,భక్తిస్వభావుడు .సదా భగవద్గీత పారాయణ చేసేవాడు .గీతార్ధసారం గ్రహించి టీక రాశాడు .ఇప్పటికీ ఉత్తరదేశం లో దీనికి విశేష ఆదరణ ఉంది .గీత 9వ అధ్యాయం 22వ శ్లోకానికి టీకరాస్తూ ‘’యోగ క్షేమ్యం వహామ్యహం ‘’అనేదానిపై సందేహం వచ్చి ‘’ప్రత్యక్ష భావం పూని ఉంటాను ‘’అని చెప్పిన గీతాచార్యుని వాక్యం సత్యం కాదని భావించికొట్టేసి  ‘’పరోక్షభావం లో ఉంటాను అనే అర్ధం వచ్చే శబ్దాన్ని’’ ఇరికి౦చాడు .భగవద్గీత భగవానుని శరీరంకనుక ,ఈ కొట్టివేత పరమాత్మకు దెబ్బగా తగిలి ,మిశ్రాకు జ్ఞానోదయం కలిగించటానికి మొదట్లో గాలివాన కల్పించాడు .భిక్షాటనం చేస్తేనే కుటుంబపోషణ జరిగేదికనుక ,గాలివానకు బయటికి వెళ్ళలేక దంపతులు పస్తు ఉన్నారు .మర్నాడు భిక్షకోసం బయల్దేరితే విపరీతమైన వర్షం లో దూరం పోలేక కూలిపోబోతున్న గుడిసెలో తలదాచుకొన్నాడు .ఇంతలో ఇద్దరు బ్రాహ్మణబాలురు శరీరమంతా రక్తం కారుతూ మిశ్ర ఇంటికి వెళ్లి మిశ్రా ఆహారపదార్ధాలు పంపాడని చెప్పి ఒక రెండు మూటలు  భార్యకిచ్చారు .ఆమె ఆశ్చర్యపోయి వాళ్ళ శరీరం రక్తమయం అవటానికి కారణం అడిగి అలాంటి కోమల శరీరులను తనభర్త ఎలా అంత  పెద్ద బరువుగల మూటలు  ,ఇచ్చి పంపాడు అని  బాధపడి వాళ్ళ వృత్తాంతం అడిగింది. వాళ్ళు తమ తల్లిదండ్రులు బీదవారని తామిద్దరం మూటలు మోసి సంపాదించి కుటుంబ పోషణకు సాయపడుతున్నామని ,ఆ మూటలిచ్చి రమ్మంటే వచ్చామని  ఆయనకు ఆకలి బాధతో మతి స్తిమితం తప్పి  పిచ్చకోపంతో తమను ఒక ఇనుపకడ్డీతో  కొట్టడని ఆయనింటికి రాగానే అడిగితె నిజం తెలుస్తు౦దని  చెప్పి  మూటలు దించి వెళ్ళిపోయారు .భర్తకే ప్రమాదం జరిగిందో అని కంగారుతో తన ఇద్దరు పిల్లల్ని వొళ్ళో నేసుకొని ఏడుస్తుంటే పిల్లలిద్దరూ యెగిరి పోయారు  .ఇంతలో మిశ్రా వచ్చి విషయం తెలుసుకొని ,వాల్లరోపురెఖలెలాఉన్నాయని అడగ్గా ,పెద్దవాడు బంగారం రంగులో చిన్నవాడు నలుపురంగులో ఉన్నారని ,ముఖాలలో దివ్య తేజస్సుకనిపించిందని  చెవులకు బంగారు కుండలాలున్నాయని చెప్పింది .’’అయ్యో భగవానుల నుకొట్టింది నేనే ‘’అని మూర్చపోయాడు దురంత వేదనతో .ఆమె కూడా మూర్చితురాలైంది .కాసేపటికి ఇద్దరూ తేరుకోన్నాక అతడు ‘’వచ్చిన వారు శ్రీకృష్ణబలరాములే .వారి దర్శనభాగ్యం పొందిన అదృష్టవంతురాలవు ‘’అని చెప్పాడు.కలం తో గీతలో తాను  వహామ్యహం ‘’మాటకోట్టేసి వేరేమాట రాసినందుకు జగదీశుడికి తీవ్రమైన దెబ్బ కొట్టిందని  ,పశ్చాత్తాప పడి ,తను చేర్చినమాట తీసేసి  మళ్ళీ యధా ప్రకారమే ఉంచాడు .ఇంకా ఎక్కువ శ్రద్ధాసక్తులతో హరి సేవనం చేశాడు .ఇద్దరి భక్తికీ మెచ్చి కృష్ణుడు సాక్షాత్కరించి ధన్యులనుచేశాడు .

   దారిద్ర్యం కఠోర దీక్షకు కారణం కావాలి. సేవాధర్మం ,పశ్చాత్తాపం విశ్వాసం ,అనుకూల దాంపత్యం  జీవన్ముక్తికి హేతువులు .

15-మహంతజీ

భక్త మహంత జీ ఒరియా దేశాస్తు డైన నిరుపేద కృష్ణ భక్తుడు .భార్య మహా సాధ్వి .ఒకమగపిల్లాడు ఇద్దరాడపిల్లలు.ఒరిస్సాలో కాటకం వచ్చి తిండిదొరకటం కష్టమైంది .దరిద్రబాద భరించలేక కుటుంబం పోషించలేక మహంత్ కృష్ణుడే దిక్కు అని కటిక ఉపవాసాలతో ఉన్నారు .వీరిని చూడలేక ‘’కృష్ణా ,కృష్ణా ‘’అని మూర్చపోయేవాడు .భార్యకూడా అతనిబాధ గ్రహించి అతనికి స్నేహితులెవరైనా ఉంటె వెళ్లి ఆశ్రయిద్దామని సలహా చెప్పింది .’’దీనబంధు’ అనే స్నేహితుడు ఉన్నాడని   ,అతడు ‘’నీలాచలం ‘’లో ఉంటాడని, అంతదూరం ఈ పరిస్థితిలో వెళ్ళలేమని చెప్పాడు .ఎలాగైనా వెళ్లి పిల్లలకైనా ఎంతో కొంత ఆహారం సంపాదించాలి అని చెప్పగా అందరూ కలిసి బయల్దేరారు .

   చాలాప్రయాణ౦  కష్టనస్టాలుపడి చేసి పూరీ జగన్నాథంచేరారు .ఆలయంలో ఘంటా శంఖానాదాలు మిన్ను ముట్టుతున్నాయి .సింహద్వారం దగ్గర వీరంతా నిలబడ్డారు .జనంబాగా ఉన్నారు తోసుకు వెళ్ళటం కష్టం అనిపించింది .ద్వారం బయటనుంచే జగన్నాథ దర్శనం చేసి పులకి౦చి గంజికాలువదగ్గర చతికిలపడ్డారు .’’ఇంకా ఆలస్యం ఎందుకు మీ స్నేహితుడిదగ్గరకు వెళ్లి అడిగి ఏదైనా తీసుకు రండి ‘’అంది భార్య .అతడు ‘’మిత్రుడు ఎంతో మంది జనసమూహం లో ఉన్నాడు .కాసేపు ఓపికపట్టు .అప్పుడు వెళ్లి కలుద్దాం .దూరంగానైనా చూశాం కదా ఆతృప్తి చాలు .చావు గురించి దిగులెందుకు ?.ఇది మిత్రుని ప్రేమపూరిత నివేదన మైన అమృతతుల్యమైన గంజి. దీన్నే అందరం తాగుదాం ‘’అనగా అందరూ దోసిళ్ళతో ఆగంజే పంచభక్ష్య పరమాన్నంగా భావించి కళ్ళకు అడ్డుకొని కడుపు నిండా తాగారు .ఆయాసం తో ఆ గట్టుపైనే విశ్రమింఛి నిద్రలోకి జారారు .

  కడుపాకలి తీరక మెలకువవచ్చి ‘’జగన్నాధా జగన్నాధా ‘’అని దిక్కులు పిక్కటిల్లేట్లు ఆర్తిగా అరిచాడు మహంత్ .రాతి గోడలలోపల బందీ అయిన జగన్నాథుని హృదయం కరిగిపోయింది .క్షణం ఆలస్యం చేయకుండా బ్రాహ్మణబాలుని వేషం లో ఒక బంగారుపళ్లెం నిండా మధురపదార్ధాలతో చరచరా నడిచి మహంత్ దగ్గరనిలించి ‘’నెచ్చెలీ !లేవండి .మీకోసమే మంచి మిఠాయిలు తెచ్చాను .తీసుకొని తృప్తిగా తినండి ‘’ అన్నాడు .మూర్చనుంచి లేచిన మహంత్ కు ఆమాటలు వినిపించాయికాని ,కళ్ళు తెరవలేదు .అలా మూడు సార్లు లేపాడు దేవాది దేవుడు .భార్యకు మెలకువవచ్చి ‘’మీ స్నేహితుడు అనుకొంటా ద్వారం దగ్గర నిలబడి పిలుస్తున్నాడు లేవండి ‘’అన్నది .అతని అనుమానాలు పటాపంచలై లేచి పిచ్చివాడిలాగా ఆసుందర బ్రాహ్మణ బాలుడిని చూశాడు .పళ్ళెం బరువుతో బాలుడి చేతులు వణుకుతున్నాయి .మహంత్ చెయ్యి చాపగా బాలుడు ఈతని నెత్తిపై పళ్ళెం పెట్టాడు .శరీరం గగుర్పొడిచింది .ఏదో మాట్లాడాలనుకొంటున్నాడుకాని మాటలు రావటం లేదు .బాలుడి పాదాలపై పడి ఏదో చెప్పాలనుకోన్నా,ఏదీ స్పృహకు రావటం లేదు. బాలుడు అదృశ్యమయ్యాడు .

  మిఠాయి పళ్ళెం పిల్లల ముందు పెట్టాడు .ఆనందంగా ,సంతృప్తిగా అందరూ భుజించారు .ప్రాసాదమంతా తినేశారు .భార్య పళ్ళెం కడిగి శుభ్రం చేసి మిత్రునికి ఇచ్చిరమ్మని చెప్పగా,ఆలయంలోకి వెళ్లి ఎన్నో సార్లు పిలిచినా జవాబు రాలేదు. తలుపులన్నీ మూసి ఉన్నాయి .నిస్పృహతో బయటికి వచ్చి  గుడ్డలో మూటకట్టి తలక్రిందజాగ్రత్తగా  పెట్టుకొని,అందరూ గాఢ నిద్రపోయారు .తెల్లవారినా మెలకువ రాలేదు .ఆలయం లో ఏదో కలకలం వినిపించింది  .గర్భాలయం లో ఉండే బంగారు పళ్ళెం కనిపించటం లేదని గగ్గోలు పెడుతున్నారు .అన్నిచోట్లా భటులు వెతుకుతుండగా మహంత్ తలకి౦ద ఉన్న  పళ్ళెం పై సూర్యకిరణాలు పడి ,అందరికీకనిపించింది మహంత్ దొంగ తనం చేశాడని  ,అనుమానించి అతనికుటు౦ బాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు తిట్టారు .తాను  నిరపరాదినని మొరపెట్టినాఎవరూ వినిపించుకోలేదు .రాత్రిజరిగినకథ అంతా చెప్పాడు .పిచ్చోడన్నారు  .జగన్నాథస్వామినే ఆర్తిగా అర్ది౦ చాడు ప్రార్ధనలతో .జైలులోపెట్టారు .అతని ఆర్తనాదాలు ప్రజలకు వినిపించకపోయినా జగత్ప్రభువుకు వినిపించాయి .

  మర్నాడు సూర్యోదయానికి  ముందే  ప్రతాపరుద్ర మహారాజు కలలో జగన్నాథుడు కనిపించి జరిగినదంతా వివరించి అదృశ్యమయ్యాడు .రాజు  వెంటనే మహంత్ దగ్గరకురాగా అతడు గీత గోవిందం మధుమదురంగా గానం చేస్తూ పరవశంలో కనిపించాడు .లోపలి వెళ్లి తానే సంకెళ్ళు తెంపేశాడురాజు .మహంత్ స్పృహలోకి వచ్చిచూడగా మహారాజు అతని పాదాలపై వ్రాలి క్షమించమని కోరుతూ కనిపించాడు .ఇదంతా తన’’ నెచ్చెలి ‘’  లీల అని మహంత్ మురిసిపోతూ చెప్పాడు .అతని భార్యాపిల్లలను పిలిపించి రాజు మహంత్ భార్యపాదాలపై వ్రాలి క్షమించమన్నాడు .బంగారు పల్లకీలో మహంత్ కుటుంబాన్ని కూర్చోబెట్టి ,జగన్నాథాలయానికి సాదరంగా మర్యాదగా తీసుకు వెళ్లి తీర్ధస్నానాలు చేయించి నూతనవస్త్రాలు కట్టబెట్టి చందనం అగరు పూలమాలలతో,పుష్పాలతో పూజించి  సత్కరించాడు..అష్టైశ్వర్యాలు మహంత్ కుటుంబానికి ప్రతాపరుద్ర గజపతి మహారాజు ఏర్పాటు చేశాడు  .భూమి రాసిచ్చాడు .దేవాలయం లెక్కలు రాసేఉద్యోగం లో నియమించి వంశపారంపర్యహక్కు కల్పించాడు .దైవ విశ్వాసం ఎంతటి కస్టాలు పెడుతుందో, అంతకు వెయ్యి రెట్లు మేలు కూడాచేస్తుంది .కృష్ణుడు కుచేలునిపట్ల చూపిన మిత్రధర్మం ,తనను నెచ్చెలిగా భావించిన మహంత్ పట్ల జగన్నాథుడు చూపి స్తవనీయుడయ్యాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి

మహా భక్త శిఖామణులు

12-దీపా౦కుర స్వామి

బౌద్ధరాజు గోవి౦దపాలుడు విక్రమపురం రాజధానిగా పాలించేకాలం లో ,దానికి దగ్గరగాఉన్న వజ్ర యోగిని అనే పల్లెలో క్రీ.శ980లో దీపాంకురుడు పుట్టాడు .ఇతడిని ఆదినాథుడు అనిపిలిచేవారు. గొప్ప గురువు వద్ద చేరి మహా విద్వా౦సుడయ్యాడు .పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార సుఖం పొంది ,ఇల్లువదిలి విశేష శ్రమ చేసి హిందూ బౌద్ధ శాస్త్రాలలో గోప్పపా౦డిత్యం సాధించాడు .ధర్మ రక్షితుని వద్ద బౌద్ధ దీక్ష తీసుకొన్నాడు .ఆకాలం లో బర్మాలో బౌద్ధం బాగా వ్యాపించిఉంది .కొంతమంది వర్తకులు ఏనుగులు ఎక్కి బర్మా వెడుతుంటే వాళ్ళతోకలిసి 13నెలలు ప్రయాణం చేసి  ఆదేశం చేరాడు .

   చంద్ర కీర్తి అనే మహనీయుని చేరి యోగ శిక్షపొంది ,12ఏళ్ళు గడిపి సిద్దుడై భారత దేశం తిరిగి వచ్చాడు .మగధ బౌద్దులాతడిని’’ధర్మపాలుడు ‘’గా స్వీకరించగా అతనికీర్తి దశదిశలా వ్యాపించింది .రాజా న్యాయపాల్ అతని ప్రతిభను గుర్తించి ప్రధాన యాజకుని గా (ఋత్విక్కు) నియమిస్తానని అంటే ఒప్పుకోలేదు .ఆకాలం లో టిబెట్ దేశాన్ని హ్లాలామల్ అనే రాజు దోరింగ్ నగరాన్ని రాజధానిగా పాలిస్తున్నాడు .ఆదేశంనుంచి కొందరు బౌద్ధ సాధకులను భారత దేశానికి బౌద్ధ ధర్మం విశేషంగా నేర్చుకోవటానికి పంపాడు .వారు చాలా చోట్ల తిరిగి చివరికి మగధ చేరి దీపాకురిని ప్రజ్ఞా విశేషాలు తెలుసుకొని ,అతని సేవించి విజ్ఞానం గడించి తమతో టిబెట్టుకు రమ్మని ఆహ్వానించారు .దీపా౦కురుని ఎలాగైనా తీసుకురమ్మని వారికీ రాజు లక్షలాది బంగారునాణాలు   పంపాడు .కాని యితడు అంగీకరించలేదు .

   టిబెట్ రాజు  చనిపోయాక అతని కొడుకులు దీపా౦కురుని ప్రార్ధించి ,ఒప్పుకోకపోతే  నిర్బంధించి బలవంతంగా టిబెట్ తీసుకు వెళ్ళారు .అక్కడ 15ఏళ్ళు బౌద్ధధర్మాన్ని బోధింఛి విశేషకీర్తి సాధించాడు . 1035లో 55వ ఏట దీపాంకురుడు లాసా నగరం లో నిర్యాణం చెందాడు .ఇప్పటికీ టిబెట్ ,చైనా బౌద్ధులు దీపా౦కురుని  స్మరిస్తారు .

13-కమలాకాంత స్వామి

వంగ దేశం బర్ద్వాన్ ఇల్లా అ౦బికాకాల్నా గ్రామంలో వంగశకం 1179లో కమలాకా౦త స్వామి పుట్టాడు .తండ్రిది వైదిక వృత్తి.చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ,తల్లి ఊరిబడిలో చదివించింది .మాతృభాషతోపాటు , సంస్కృతంకూడా పట్టుదలగానేర్చి గొప్పవాడయ్యాడు .చిన్నతనలోనే గ్రంథ రచనలు చేయటం ప్రారంభించాడు .కవిత్వంలో దిట్ట అనిపించాడు రసబందురకవిత్వం రాసేవాడు .సంగీతంలోనూ నిష్ణాతుడయ్యాడు .కంఠ స్వరం మహా మాధుర్యంగా ఉండటం తో వినేవారు పరవశి౦చే వారు .గాన్ధర్వగానాన్ని మరిపించేవాడు .శాంతదయా ప్రేమ పరిపూర్ణుడు .ఇతని గుణ గరిస్టతకు మెచ్చి బర్ద్వాన్ రాజు తేజచంద్ర బహదూర్ ఆస్థాన పండితునిగా 1216న నియమించి గౌరవించాడు .

    రాజ ధర్మం నిర్వర్తించి మిగిలినకాలం దుర్గా దేవి ఆరాధనలో గడిపేవాడు .రసరమ్య గీతాలు అమ్మవారిపై రచించిపాడేవాడు  .ఆ గానానికి జడపదార్ధాలు సైతం చైతన్యం అయ్యేవని చెప్పేవారు .రాజు ఇతనిని తన ఆచార్యుని చేశాడు .కోటం హాట్ లో అన్నివసతులతో సుందరభవనం కట్టించి అందులో ఉంచాడు .పూజలకు భజనలకు రాజు మరొక ప్రత్యేక  మందిరం  నిర్మించి ఇచ్చాడు .పూజలకు భజనలు దసరాలలో ప్రాత్యేకంగా చేసే దుర్గాపూజకు ఖర్చు అంతా రాజే  భరించే వాడు .భార్య గుణవతి .సదా పతిసేవలోదుర్గా  మాత సేవలో గడిపేది .భర్త సేవలో పగలూ రాత్రి సేవ చేసేది భార్య అని తలచి అతడు భావోద్రేకానికి గురయ్యేవాడు  అప్పుడామె శాంతంగా ప్రేమతో అనునయించేది .

  ఒక రోజు రాజోద్యోగి వచ్చి ‘’మహాశయా !పవిత్ర జీవితానికి కామినీ కాంచనాలు బంధనాలు కావటం లేదా ??’’అని అడిగాడు కమలాకా౦తు డు ‘’స్త్రీలు భగవతి స్వరూపులు ‘’స్త్రియః సమస్తః సకల జగత్ ‘’.స్త్రీ రత్నం .అలాంటిది సాధనాలకు అడ్డంకీ కాదు ‘’నాస్తి భార్యా సమో బన్ధుఃనాస్తి భార్యా సమాగతిః-నాస్తి భార్యా సమో లోకే సహయో ధర్మ సంగ్రహే ‘’ .ఆమె శక్తి స్వరూపిణి ‘’అన్నాడు .మనసు తృప్తి చెంది శిష్యుడయ్యాడు .

   కొంతకాలానికి భార్య మరణించింది .చితిపై ఆమెను చేర్చి మృదు మధురంగా గీతాలాపన చేస్తూ నృత్యం చేశాడు .తన్మయత్వంలో నృత్యం చేసి ఆమె అంత్యక్రియలు నిర్వర్తింఛి మహదానందంతో ఇంటికి చేరాడు .ఒకసారి వేరే ఊరికి వెడుతుంటే ‘’ఓడగాయ ‘’అనే గ్రామం దగ్గర బందిపోటు దొంగలు కత్తులూ బల్లాలతో మీదకు ఉరికారు .ఏమాత్రం భయం లేకుండా మృత్యువు సమీపిస్తోంది అన్న పరమానందంతో గానం చేస్తూ నాట్యమాడాడు .ఆమధురమంజుల గానానికి బందిపోట్ల హృదయాలుకరిగి  సాష్టాంగ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు .భయరహితుడు  భగవతిని స్థిరంగా మనసులో కొలువు చేసుకొన్నవాడు కమలాకా౦తుడు తనమరణం దగ్గర పడిందని గ్రహించి రాజును తనదగ్గరకు పిలిపించి ధర్మోపదేశం చేసి ,పారమార్ధిక విషయాలు బోధించి రాజు మనసుకు   ప్రశాంతత చేకూర్చాడు .తనను కి౦దపడుకోబెట్టమని చెప్పి, పడుకోబెట్టగానే  ప్రాణాలు విడిచాడు .అదే సమయంలో దగ్గరున్న భోగవతీ నది బాగా ఉబికి అందరికీ  ఆశ్చర్యం కలిగించిందని ఇప్పటికీ బెంగాల్ లో చెప్పుకొంటారు .సార్ధకజన్ముడు కమలాకాంత స్వామి .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

మహా భక్త శిఖామణులు

9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

ఉత్తరప్రదేశ్ జోన్ పూర్ జిల్లా ప్రేమపురం లో అయోధ్యానాథ తివారి అనే వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజమతస్తుడు విశుద్ధ వర్తనుడు .అన్న లక్ష్మీనారాయణ సంసారం వదిలి కుర్ధాలో భాగీరధీ నది ఒడ్డున వటవృక్షం కింద కుటీరం ఏర్పాటు చేసుకొని యోగాభ్యాసం, హరికీర్తనం తో గడిపేవాడు .అయోధ్యనాథుని ముగ్గురుకొడుకులు గంగారాం , హరిభజన దాస్,బలరాం .రెండవవాడికి చిన్నతనంలో మశూచి సోకి  కుడికన్ను పోయింది .అందరూ శుక్రాచార్య అని పిలిచేవారు .హరిభజనుడు 1840 లో ప్రేమపురం లో పుట్టాడు .పెదనాన్న లక్ష్మీనారాయణకు అంతుచిక్కని వ్యాధి రాగా ఇతడిని సేవకోసం తండ్రికుర్ధాకు పంపాడు .

శుక్రాచార్యుడు అందరి చేత పిలువబడే హరిభజన దాస్ పెత్తండ్రి ఆశ్రమంలో సేవ చేస్తూ చదువు నేర్చాడు .చీకటితోలేచి గంగాస్నానం చేసి అధ్యయనం పూర్తి చేసి ,వంట మొదలుపెట్టేవాడు .పెదతండ్రికి అతని శిష్యులకు ముందు భోజనం పెట్టి తర్వాత తాను  తినేవాడు .ఇలా ఒక ఏడాది గడిచాక ,హుసేనుపురం లో ఉన్న శివరత్న శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకోవటానికి రోజూ వెళ్లి వచ్చేవాడు .శంకర గ్రామం లో ఉన్న నంద పండితునివద్ద ‘’బాలబోధం ‘’,శీఘ్రబోధం ‘’అనే జ్యోతిష గ్రంథాలు కూడా అభ్యసించాడు .13ఏళ్ళ ఈకుర్రాడు వ్యాకరణం పై మోజు పడి గాజీపురం లోని వేచన పండితునివద్ద’’సారస్వత ‘’,చంద్రిక’’గ్రంథాలు చదివి ,ఏడాది తర్వాత గోపాలపండితుని దగ్గర’’వేదాంత పంచదశి ‘’నేర్చాడు .అసాధారణ మేధావికనుక కొద్దికాలం లోనే ఇవన్నీ నేర్ఛి,స్వగ్రామం వెళ్లి మాతృమూర్తిని దర్శించాడు .

1856లో పెదనాన్న లక్ష్మీ నారాయణ యోగి మరణించాక ,అంత్యక్రియలు యధావిధిగా నిర్వహించి ఆశ్రమం లోనే ఉన్నాడు శుక్రాచార్య హరిభజనుడు  .ఆశ్రమంలో అనేక దేవతవిగ్రహాలు స్థాపించి నిత్య పూజ చేసేవాడు .ఇన్ని సాధించినా మనశ్శాంతి ఉండేదికాదు .ఆహరం తినకు౦డా కొద్దిగాపాలు తాగేవాడు .పాలుకూడా మానేసి కటిక ఉపవాసాలున్న రోజులెన్నో ఉన్నాయి .

1857లో ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు హరిభజనుడు .ఆసేతు హిమాచల పర్యంతం పాదచారిగా పర్యటించి చివరికి ‘’గిర్నాడ్’’పర్వతం చేరి ,ఒకమహా పురుషునివలన యోగ సాధన నేర్చి ,నిష్ణాతుడై ,మళ్ళీ తీర్ధయాత్రలు చేసి మూడేళ్ళ తర్వాత ఇక్కడికే చేరాడు .పెదతండ్రి అస్తికలు గంగలోకలిపి ,కొత్త సమాధి నిర్మింఛి దానిపై నల్లరాతి పాంకోళ్ళను చెక్కించి స్థాపించాడు .అక్కడ ఇంటివద్ద తండ్రి చనిపోయాడు  .గిర్నాడ్ వదలి ‘’నేను ‘’పదాన్ని కూడా విసర్జించి తనను ‘’తాను ‘’అని ఇతరులను ‘’బాబు ‘’అని ,స్త్రీలను ‘’తల్లి ‘’అని పిలవటం మొదలుపెట్టాడు .ఉదయం పదిగంటలవరకు గంగాస్నానం జపతపాలు ,పూజ చేసేవాడు .గంగానది మధ్యలో నిలబడి శ్రీ కృష్ణ స్తవం చేసేవాడు .పూజతర్వాత నాలుగుగంటలు  యోగాభ్యాసం చేసి ,కాసేపు బయటికి వెళ్లి తిరిగివచ్చి వంట చేసుకొని తిని కాసేపు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం ఆశ్రమానికి వచ్చినవారితో సత్కాలక్షేపం చేసి ,మళ్ళీ యోగసాదనలో మునిగిపోయేవాడు .రొట్టెలుకాల్చటం వలన సమయం వృధా అవుతోందని పాలు, మారేడాకులరసం మాత్రమే తీసుకొనేవాడు .కొన్నేళ్ళతర్వాత స్వగ్రామం వెళ్లి తల్లిని వెంటపెట్టుకొని మాఘ కుంభ మేళా కు ప్రయాగ వెళ్ళాడు .అక్కడినుంచి గంగ ఒడ్డునఉన్న   తనపూర్వ కుటీరం చేరి ,యోగసాదనకుఒక గుహ తయారు చేసుకొని ,వారాలతరబడి యోగం లో గడిపాడు .అతడు ఏ ఆహారం తీసుకోకుండా గాలిమాత్రమే పీల్చి జీవిస్తున్నందున ప్రజలు ‘’పవుహారీ బాబా ‘’ పవనం అంటే గాలి ఆహారంగా కలబాబా అని పిలిచేవారు .

విభూతి పూసుకోవటం కాని జడలు పెంచుకోవటం కాని చేసేవాడుకాడు .జుట్టు ముడి వేసుకొనేవాడు .గోచీ ధరించి పాదాలదాకా లుంగీ తో ఉండేవాడు .కొంతకాలం తర్వాత తనగురువును చూడాలని గిర్నార్ బయల్దేరగా అయోధ్యలో ఉండగానే గురువు హిమాలయాలలో ప్రాణత్యాగం చేశాడని తెలిసి ,అయోధ్యలో ఒక  వైష్ణవయోగి వద్ద నూతన విజ్ఞానం పొంది, తనకుటీరం లో ఉన్నాడు .రథోత్సవం నాడు బయటికివచ్చి రథాన్ని కొంతదూరం లాగి, ఆశ్రమం చేరేవాడు .ప్రతి ఏకాదశికి భక్తులకు అనుగ్రహభాషణం చేసి విజ్ఞాన వంతుల్ని చేసేవాడు .మిగాతకాలమంతా తపస్సులోనే .

తర్వాత వచ్చిన త్రివేణీ పుష్కరాలకు రైల్ లోప్రయాగ  వెళ్లి త్రివేణి ఒడ్డున చిన్న కుటీరం లో ఉం,వేడి చలికి బాగా ఇబ్బందిపడి ,దగ్గు  జ్వరం బాగా వచ్చిబాధపడగా జనం మందులు తీసుకోమంటే వద్దని చెప్పి నా వినక ఖరీదైనమందులు రుచికరమైన పదార్ధాలు తెచ్చిపెట్టి పరీక్షించేవారు కొందరు బ్రాహ్మణులు .వాటిని తీసి నదిలోపారేసి వెళ్ళిపోయేవాడు .వాళ్ళు వచ్చి తమకు ద్రోహం  చేశాడని ఆరోపిస్తే ‘’ఈ దాసుడు ఏ తప్పూ చేయలేదు .మీరిచ్చిన మందులు రోగానికే సమర్పించాను .కావాలంటే పరీక్షించండి ‘’అన్నాడు. పరీక్షిస్తే వ్యాధి నయమైపోయిందని తెలుసుకొన్నారు .ఇదంతా ఆశ్చర్యంగా ఉండేది వారికి .

ప్రయాగలో ఉండటం ఇష్టం లేక త్రివేణీ సంగమ స్నానం చేసి ,తల్లిఉన్న చోటికి వెళ్లి ఇంట్లో ఉండకుండా బయట ఉద్యానవనంలో ఒకరోజు గడిపి మళ్ళీఆశ్రమానికి చేరాడు .పెదతండ్రి ఉన్నరోజుల్లో ధనికులు డబ్బు ధాన్యం   ఆశ్రమానికి ఇచ్చేవారు .వాటిని ఆయన పేదలకు అతిధి అభ్యాగాతులకు , శిష్యుఅలు ఖర్చుపెట్టేవాడు .ఈయనా అలానే చేసేవాడు .ఒకరోజు ఒకపిచ్చివాడు దుడ్డుకర్రతో వచ్చి బాబాను కొట్టే ప్రయత్నం చేస్తే శిష్యులు అడ్డుపడగా అప్పుడు హోమం చేస్తున్న స్వామి  పూర్తయ్యాక కుటీరం బయటికి వచ్చి వాడిపై తీవ్ర౦గా దృష్టి పెడితే  వాడు ఆగిపోయి పిచ్చికుదిరి  అతడిని  వాడు పరమభక్తుడై స్వామి సేవలో ధన్యుడయ్యాడు  . .మరో సారి ఒక మాయావి సన్యాసి వేషంలో వచ్చి ఇన్ని విగ్రహాలెందుకు  వీటి అలంకారానికి డబ్బు తగలేస్తున్నావు  అనగా అక్కర్లేదనికావాలంటే తీసుకోమని ఆశ్రమం తాళం చెవి ఇచ్చి వెళ్ళిపోయాడు .మర్నాడు భక్తులువచ్చి విషయం తెలుసుకొని  దొంగసన్యాసి  స్వామికి ద్రోహం చేశాడని తన్నబోగా పారిపోయాడు .

పహారీబాబా ఆశ్రమం వదిలి దేశాటనం చేస్తుంటే  పూరీజగన్నాథంలో ఒక భక్తుడు చూసి రమ్మని ప్రాధేయపడినా రాకుండా ,తీర్ధయాత్రలుచేస్తూ గోగగ్రస్తుడై .ముర్షిదాబాద్ జిల్లా బ్రహ్మపురం లో  గంగా నదిఒద్దున ధ్యానంలో గడుపుతుంటే ఒక వంగ దేశీయుడు ఆశ్రమ౦  నిర్మించగా , అందులో యోగసాధన చేశాడు .1888ఆషాఢ పౌర్ణమి నాడు బాబా గొప్ప యజ్ఞం నెలరోజులు చేయగా  అందరినుంచి విపరీతంగా అన్నిరకాల సహాయ సహకారాలు లభించి దిగ్విజయమైంది .

ఒకరోజు అర్ధరాత్రి గంగా స్నానం చేసి ఒడ్డున యోగాభ్యాసం లో ఉంటె  విఘ్నాలుకలిగి యోగ దృష్టికి ఆటంకం కలిగి ,ఏదో తెలీనిబాద జీర్ణకోశం లో ఇబ్బంది పెట్టి ,క్షీణించటం మొదలుపెట్టగా ,ఏం జరిగిందని అందరూ ప్రశ్నిస్తుంటే జవాబివ్వలేదు .1898లో స్వామి సోదరుడు, ఆయనకొడుకు బదరీనారాణ, వారణాసికాలేజి ఆచార్య  భగవంతచారి , జనార్దన పండితుడు ,కొందరు పెద్దమనుషులు వచ్చి స్వామి ఆశ్రమందగ్గర పర్ణశాలలో విడిది చేశారు. బాబాకుటీరం లోనే ఉన్నాడు  .కుటీరం నుంచి పొగ బయటికి వచ్చింది .హోమథూమం అనుకొన్నారు అందరూ .స్వచ్చమైన ధూమం గమనించి బదరీనారాయణ తలుపు లోపల వేయబడటం గమనించి ,కుటీరం పైకెక్కి చూడగా అగ్ని జ్వాలలు గమనించాడు.కెవ్వునకేకవేసి ‘’మహాత్మా అగ్నినార్పటానికి అనుమతివ్వండి ‘’అని ప్రార్ధించాడు .స్వామి పైకి చూసి ఏదో సౌజ్ఞచేశాడు అర్ధంకాలేదు బదరికి .స్వామి శిష్యుడు    భ్రుగునాథుడు పెకెక్కి చూడగా, స్వామి అప్పుడే స్నానం చేసినట్లు వెంట్రుకలు తడిసి శరీరం బంగారు రంగులో ఉన్నట్లు,శరీరమంతా  నెయ్యి పూసి ఉన్నట్లు , ‘’దర్భగడ్డి గోచి’’ తడిగా ఉన్నట్లు గమనించాడు .స్వామి పద్మాసనం లో యోగ ముద్రలో ఉన్నాడు .శరీరం నుంచి మంటలు వస్తున్నాయి ,యోగదండం కింద పడి ఉంది . కొద్ది కాలానికే మంటలు శరీరమంతా వ్యాపించాయి.కదలక నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు బాబా .మరి కొంతసేపులో బ్రహ్మ రంధ్రం బ్రద్దలై స్వామి ప్రాణవాయువు అన౦త వాయువులో కలిసిపోయింది .అంటే  సరైన  ముహూర్తం చూసుకొని పవుహరీ బాబా  ఆత్మ త్యాగం చేసుకొన్నాడన్నమాట .

1890స్వామి వివేకానంద బాబాను ఘాజీపూర్ లో సందర్శించాడు .కానీ బాబాతో మాట్లాడటానికి ఇంటర్వ్యు చేయటానికి  కుదరలేదని,21-1-1890లో ఒక ఉత్తరం ,అదేనెల 31న మరో ఉత్తరంలో బాబా ఎవరినీ చూడటానికి ఇష్టపడటం లేదని ,నాలుగురోజులత్రవాట ఫిబ్రవరి 4 న ఇంకో ఉత్తరం లో .through supreme good fortune, I have obtained an interview with Babaji. A great sage indeed! — It is all very wonderful, and in this atheistic age, a towering representation of marvellous power born of Bhakti and Yoga!’’అని ఉత్తరం రాశాడు ఇంటర్వ్యు దొరికిమాట్లాడి నందుకు పరమ సంతోషంతో  .తీవ్రమైన నడుం నేప్పితో బాధపడుతూ కూర్చోలేక ,కదలలేక ,యోగాసనాలు వేయలేక బాధపడుతూ బాబాను చూశాక శిష్యుడిగా స్వీకరించమని కోరితే సరే అన్నాడు బాబా  ఈ విషయం తెలియజేస్తూ వివేకానంద ‘’ I have sought refuge in his grace; and he has given me hope — a thing very few may be fortunate enough to obtain. It is Babaji’s wish that I stay on for some days here, and he would do me some good. So following this saint’s bidding I shall remain here for some time.  ‘’అని ఫిబ్రవరి 4 న మరో ఉత్తరం రాశాడు . మర్నాడు దీక్షా స్వీకారం అనగా ముందు రోజు రాత్రి స్వామి వివేకానందకు  రామకృష్ణ పరమహంస కలలో విషాద వదనం తో కన్పించగా ,తనను గురువు  పరమహంసమాత్రమే అని నిశ్చయంగా భావించి పవహారీ బాబా శిష్యరికం   వద్దనుకొన్నాడు  పరమహంస శిష్యుదయ్యాకకూడా పహారీ బాబా ప్రభావం వివేకానడునిపై పోలేదని పరమహంస తర్వాత పహారీ బాబా మాత్రమె గొప్పవాడని చెప్పేవాడని సిస్టర్ నివేదిత చెప్పేది .బాబాపై ఒక పెద్దవ్యాసం రాసి స్వామి ప్రచురి౦చాడుకూడా .ఒకసారి స్వామి బాబా ను ‘’బోధనలతో సామాజిక సేవ చేయవచ్చుకదా ‘’అని అడిగితె ‘’’’భౌతిక సేవ మాత్రమె సేవ అనుకొన్నావా ?శారీరక క్రియలు లేకుండానే మనసులను బుద్ధిని ప్రభావితం చేయవచ్చు ‘’అని బదులిచ్చాడు బాబా Do you think that physical help is the only help possible? Is it not possible that one mind can help other minds even without the activity of the body?

Pavhari Baba to Vivekananda[1’’

Quotation

‘’Remain lying at the door of your Guru like a dog.’’అని వివేకానందకు బాబా బోధించాడు .అంటే గురువుపై అచంచల భక్తీ విశ్వాసాలు ఉంచాలన్న అర్ధం  అందులో ఉన్నట్లు  వివేకానంద వివరించాడు .

బాబా 1898లో ప్రాణత్యాగం చేసినట్లు సిస్టర్ నివేదిత తెలియజేసింది .స్వామి నిశ్చలానంద ‘’ the saint, having come to realize the approaching end of his earthly life, had offered his body as the last oblation to the Lord, in an act of supreme sacrifice.’’అని అంజలి ఘటించారు . .పహారీబాబా మరణవార్త స్వామి వివేకానందకు ఆల్మోరాలో ఉండగా చేరింది .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’మరియు వికీపీడియా

సశేషం

శ్రీ సుబ్రహ్మణ్యషష్టి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు

10-ఖోజేజీ స్వామి

జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి .ఆ శుభ ధ్వని విని ,నా దేహానికి అంత్యక్రియలు చేయండి ‘’అని చెప్పాడు .కొద్ది నిమిషాలలోనే స్వామీజీ ప్రాణాలు వదిలాడు .కాని శుభానాదం వినిపించలేదు .ఆశ్రమంలోని వాయిద్యాలన్నీ ఎక్కడపెట్టినవి అక్కడే ఉన్నాయికాని వాటిలోంచి నాదం రానేలేదు .శిష్యులదుఖానికి అంతం లేదు విశుద్ధవర్తనుడు నిర్మలమనస్కుడు ఐన స్వామి వైకుంఠం తప్పక చేరతాడని వారి విశ్వాసం కాని ఇప్పుడా సూచన కనిపించలేదు .ఈ స్వామితో సమానుడైన శిష్యుడు యోగానంద సరస్వతి ప్రక్క ఊరిలోనే ఉంటె వెళ్లి తెలియ జేయగా ఆయన హుటాహుటిన వచ్చాడు .స్వామి పార్ధివ దేహానికి నమస్కరించి శిష్యులు చెప్పిందంతావిని ,ఆశ్రమం నాలుగు మూలలా పరికించి చూశాడు .అక్కడ ఉన్న మామిడి చెట్టు,దానికి పండిన పండు  చూసి ‘’’’మన గురూజీ వైకుంఠం చేరలేక పోయారు .అందుకే శంఖధ్వని వినబడలేదు .దీనికి ఒక కారణం కనిపిస్తోంది .దేహ త్యాగ సమయం లో ప్రాణికి దేనిపైన అయిన భోగేచ్చ కలిగితే  వెంటనే దానికి అనుకూలమైన చోట శరీరం ప్రవేశిస్తుంది .మనసు పూర్తిగా స్వాధీనమై కోరికలు పూర్తిగా నశిస్తేనే పునర్జన్మ ఉండదు .లేకపోతె పునరపి జననం పునరపి మరణం తప్పదు.ఈ మామిడి చెట్టుకున్న పండుమీద స్వామి  వాంఛ ఉండటం చేత ,అది ఆపండుమీదే వాలి ఉంది .ఆయన పునర్జన్మ కూడా అందులోనే ఉన్నది .ఆపండుకోసి తెచ్చి ,రెండు ముక్కలు చేసి చూడండి .అందులో మనస్వామి పురుగుగా ఉండటం గమనిస్తారు ‘’అన్నాడు .

  యోగానందుడు చెప్పినట్లే శిష్యుడు మామిడి పండు కోసి తెచ్చాడు .యోగానంద జాగ్రత్తగా పండును రెండుముక్కలు చేయగా ఆయన చెప్పినట్లే ఒక పురుగు అందులో కనిపించింది .వెంటనే ఆపురుగు చచ్చిపోయింది .ఆ వెనువెంటనే వైకు౦ఠపతి శ్రీ మహా విష్ణువు దివ్య రధం లో కూర్చుని క్షణకాలం దివ్య దర్శనమిచ్చి అంతర్ధానమయ్యాడు  .ఆ వెంటనే ఆశ్రమం లోని స్వామి శంఖం,ఘంటం  మొదలైన వాయిద్యాలు దివ్య నాదం చేశాయి .ఆచార్య శేఖరుడు వైకు౦ఠం చేరాడని చాలా సంతోషించారు శిష్యబృందం .తర్వాత స్వామి పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేశారు .

మరణ సమయం లో ఎకోరిక ఉంటె ఆకోరిక తీరేదాకా మరో జన్మ ఎత్తుతారని మన శాస్త్రాలు భగవద్గీత చెప్పాయి .కనుక  అంత్య సమయంలో  చిత్తం ఈశ్వరా౦కితం గా ఉంచుకోవాలని ఒక సూచన ఇందులో ఉన్నది .

11-లాలాచార్య స్వామి

 భగవద్రామానుచార్యుల వారి ముఖ్య శిష్యుడు , అల్లుడే లాలాచార్యస్వామి .గురువే దైవం అని సంపూర్ణంగా నమ్మినవాడు .పరమభాక్తాగ్రేసరుడు .ఒకరోజు నది ఒడ్డున తిరుగుంటే ఒక శవం కొట్టుకు రావటం చూసి ,దానికి అంత్యక్రియలు చేయాలనుకొన్నాడు .నదిలో దిగి శవాన్ని వీపుమీద మోసుకొని వచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళి  పుష్పాలతో శయ్య తయారు చేసి దానిపై పడుకోబెట్టి వైష్ణవ సంప్రదాయం లో అంత్యేష్టి  చేశాడు .స్నానం చేసి ఇంటికి వెళ్లి ఆ అపరిచితునికి  శ్రాద్ధం  కూడా పెట్టి ,బంధు మిత్రులను  భోజనాలకు పిలిచాడు లాలా .ఎవడో కోన్ కిస్కా కు ఈ పనులు చేయటమేమిటి అని ఎవ్వరూ వెళ్ళలేదు .మనసులో మిక్కిలి బాధపడి గురువు రామానుజులకు నివేదించాడు.’’నువ్వు చేసింది మహత్తర కార్యం .మూర్ఖులు నీ గొప్పతనం గుర్తించలేరు విచారించక ,ఇంటికి వెళ్ళు ‘’అని ఊరడించాడు .

  లాలాచార్య ఇంటికి వచ్చి ఒక అద్భుత దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు .ఇంట్లో ఎందరో అతిధులు దివ్యకాంతి శరీరులై  ఊర్ధ్వపుండ్రా లతో పరమ వైష్ణవ శిఖామణులుగా గోచరించారు .వారంతా పరవశంతో విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఆనందంతోనృత్యాలు చేస్తున్నారు .ఇంట్లో వండి న భక్ష్య భోజ్య  లేహ్య  చోష్యాలను కడుపారా వారంతా భుజించారు .ఇదంతా తన గురుమహిమాకటాక్షంగా భావించాడు లాలా చార్య .ఈ కోలాహలం చూసి ,ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి దివ్య సుందర విగ్రహాకారులు భోజనం చేయటం గమనించి అమితాశ్చర్య పడ్డారు .లాలాచార్య తమను ఎంతో మర్యాదగా భోజనాలకు ఆహ్వానిస్తే తూలనాడి తిరస్కరించి వెళ్లకపోవటం తప్పు అని గ్రహించి ఆయన పాదాలపై వ్రాలి క్షమాపణ కోరారు .అప్పుడు లాలా ‘’దుఖి౦చకండి .ఆమహాత్ములు తిని వదిలేసిన ఉచ్చిస్టం భుజించి అన్ని దుఖాలను చింతలను పోగొట్టుకొని పరమానంద విభూతి పొందండి ‘’అన్నాడు .వారంతా మహా ప్రసాదం అని అలాగే తిన్నారు .

  ‘’అనాధ ప్రేత సంస్కారం కోటి యజ్ఞఫలం ‘’అని మనం సూక్తి వల్లిస్తాంకాని ఆచరణ లో అవలంబించం .శవాన్ని చూస్తేనే పాపం అన్నట్లు ,ముట్టుకొంటే ఏదో మునిగిపోయినట్లు భావిస్తాం .శవంతో స్మశానానికి వెళ్ళటం నేరం ఘోరం అనుకొంటాం .ముస్లిం సోదరులు ఇందులో గొప్ప ఆదర్శంగా ఉంటారు .శవ పేటిక మోయటం పవిత్ర కార్యంగా భావిస్తారు .మన దక్షిణ దేశంలోకంటే ఉత్తర హిందూ దేశం లో శవాలను మోయటానికి ఏ పట్టింపూ ఉండదు .పిల్లా జెల్లా పిన్నా పెద్దాఅందరూ  ఆపని చేసి ఎంతో సంతోషిస్తారు.అది తమ విధిగా ఎంచుకొంటారు  . ఆ విశాల  హృదయం అందరికీ ఉండాలని కోరుకొందాం .

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా

మహా భక్త శిఖామణులు

8-మౌనీ బాబా

బెంగాల్ నదియా జిల్లా  అజుదియా గ్రామంలో 1856లో శివనాథ ఘోష్ కు మౌనీ బాబా జన్మించాడు .తండ్రి హరి భక్తుడే కాని పోలంపుట్రా నగలు నట్రా లేని బీదసంసారి .కుటుంబ పోషణకోసం సాబ్నా పట్టణం చేరి కొంతదబ్బు సంపాదించాడు .పెద్దకొడుకు ప్యారేలాల్,చిన్నవాడు కున్జులాల్ ప్రభుత్వబడిలో చదివారు  .అందులో ఒక బ్రహ్మసమాజీయ ఉపాధ్యాయుడు ప్యారేలాల్ తెలివి తేటలు గుర్తించి’’కోపం పనికి రాదనీ సత్వగుణం మంచిదని పరస్త్రీని తల్లిలాగా చూడాలనీ  .ధర్మం మాత్రమె చనిపోయాక వెంటవస్తుందని  .ధర్మమే అన్నిటినీ కాపాడుతుంది ‘’‘’అనీ తత్వ బోధ చేసేవాడు  .ఇలా జ్ఞానామృతం పొందిన ప్యారేలాల్ ,తమ్ముడితోకలిసి మనో వికాసం పొందాడు .బ్రహ్మసమాజ ప్రార్ధనలలో పాల్గొని జ్ఞాన విజ్ఞానాలు పెంచుకొన్నారు .ఈ సోదరులను హిందూ మతం వెలి వేసింది .

  తమ్ముడిని చదివించాలని అన్న ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు .జల్పాయి గురి లో కొంతకాలం పని చేసి ,తర్వాత రంగాపురం లో ఇంగ్లీష్ పాఠ శాల హెడ్ మాస్టర్ అయి చాలాకాలం పని చేశాడు .పెళ్లి చేసుకొని కాపురం రంగాపురం లో పెట్టాడు .సోదరికూడా వీరితో ఉండేది .సంసారం చేస్తున్నా , జ్ఞాన వికాసం కోసం అర్ధరాత్రి లేచి ధ్యాన సమాధి లోకి వెళ్ళిపోయేవాడు .రోజుకు మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోయేవాడు కాదు .సామాన్య ఆహారమే తినేవాడు .ఉపవాసాలెక్కువగా ఉంటూ ,తర్వాత జీవితంపై చింతనతో గడిపేవాడు .12ఏళ్ళతర్వాత భార్య చనిపోయింది .వైరాగ్యభావం ప్రవేశించింది .మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేస్తే ,తనను మళ్ళీ సంసారకూపం లోకి లాగవద్దని చెప్పేవాడు .తమ్ముడు ప్రయోజకుడై ధనం తగినంత సంపాదించాడు .ఇంటిబాధ్యత అతనికి అప్పగించి యోగ సాధనకోసం ప్యారేలాల్ చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు .

  మూడేళ్ళు చిత్రకూట్ లో గడిపి తర్వాత రమ్యమైన ప్రకృతికి ఆలవాలమైన ఓంకార్ నాథ్ పర్వతం  చేరి  ,అనువైన ప్రదేశం లో తపస్సు ప్రారంభించి ఎండ వానల్లో నిద్ర ఉండీ లేక ,తినీ తినక  తీవ్ర తపస్సు చేశాడు .యోగాసనం నుంచి అతడు లేవటం ఎవరూ చూడలేదు .ఇతని కఠోర సాధన, తపస్సు గమనించి లక్ష్మీ నారాయణ్ అనే మార్వాడీ ,ఆపర్వత౦  పైనే ఒక గుహను వసతులతో ఏర్పాటు చేసి అందులో ఉంచాడు .తపస్సు కు ఎట్టి ఆటంకమూ లేకపోవటంతో ,మరింతఘోర తపస్సు చేయగలిగాడు .ఎవ్వరితోనూ మాట్లాడకుండా నిరంతరం మౌనంగానే గడిపాడు .ప్రజలలోకి వెడితే భంగం కలిగిస్తారని  గుహ వదిలి  వెళ్ళేవాడుకాదు.ఆరునెలలు గడిచాక అతని గొప్పతనం గుర్తించి అందరూ ‘’మౌనీ బాబా ‘’  అని పిలవటం మొదలు పెట్టారు .అతని ఆస్తి మూడు ఇత్తడి చెంబులు,ఒక చర్మపు ముక్క ,ఒక రాతిపలక .తోలుముక్కపై పడుకొని రాతిముక్కను దిండుగా వాడుకొనేవాడు .

   అతన్ని చూడాలని జన ప్రవాహం వచ్చి గుహ ద్వారం వద్ద నిలబడేవారు .రోగవిముక్తికి తత్వజ్ఞానానికి ,సిద్ధికి,జ్ఞానోపదేశానికి  జనం వచ్చేవారు .ఆ మార్వాడీ ‘’నేను నిరుపేదను బాబా కృప వలన మహా ధనవంతుడనయ్యాను .నా ఐశ్వర్యం అంతా నౌనీ బాబా యే’’అనేవాడు .ఓంకారనాథ దేవాలయ అర్చకుడు మౌనీబాబా వంటి తపస్సంపన్నుడిని తాను  అంతవరకూ చూడలేదని చెప్పేవాడు .కొద్దిగాపాలు కొంచెం, మారేడు ఆకులపసరే ఆయన ఆహారం .ఇలా చాలాకాలం గడిచాక శరీరం శుష్కించి ఎముకల పోగుగా మారాడు .1896లో 40 ఏళ్ళ చిన్నవయసులోనే సిద్ధిపొందాడుమౌనీబాబా ‘.

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి

మహా భక్త శిఖామణులు

7-అప్పాస్వామి

తమిళనాడుకు చెందిన అప్పాస్వామి అసలుపేరు ‘’మరుల్ నీకియార్ ‘’.తండ్రి పులగానార్ .తల్లి మతినియార్ .అప్పా అక్క తిలాతవధియార్ ను కలిప్ప హయ్యార్ అనే పల్లవరాజు సైన్యాదికారికిచ్చి  పెళ్లి  చేయాలనుకోగా ,అతడు ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక వీరుడిని ఎదుర్కొని పోరాడుతూ చనిపోయాడు .ఈలోపే ఈపిల్ల తలిదండ్రులూ చనిపోయారు .బాలిక సతీ సహగమనం చేద్దామని ప్రయత్నించింది ,కాని ఉన్న ఒక్కగానోక్కతమ్ముడు  దిక్కులేని వాడైపోటాడని ప్రయత్నం విరమించుకోన్నది .అప్పాఆలోచనలు వయసు వచ్చినకొద్దీ తత్వ జిజ్ఞాసపై మరలింది .అప్పటికి మంచి ఊపులో ఉన్న జైనమతం ఆకర్షించి ,జైనతీర్ధం  పుచ్చుకొని గ్రంథాలు బాగా పఠింఛి ,అనంత జ్ఞాన సంపన్నుడయ్యాడు .తర్వాత పాటలీ పుత్రం వెళ్లి ,తనప్రతిభ చూపి జైనసంఘానికి ఆధ్యాత్మిక నాయకుడయ్యాడని ఒక కథ ప్రచారం లో ఉంది .

  తమ్ముడిలా మత  భ్రస్టుడయ్యాడని అక్క చాలా విచారించి ,స్వగ్రామం లో ఉండలేక కేటిలాం నదీ తీరాన ఉన్న ‘’తిరుఅతి కై ‘’అనే శైవ క్షేత్రం చేరి ,పరమ శివారదనలో గడిపింది .కాని తమ్ముడు తిరిగి వస్తాడన్ననమ్మకం ఆమె మనస్సులో గాఢంగా ఉంది .ఆమె ప్రార్ధన పాలించి నట్లుగా ,పాట్నాలో సుఖ జీవితం గడుపుతున్న తమ్ముడికి ఒక రోజు కడుపులో భరింపరాని బాధకలుగగా,జైన సన్యాసులు ఎన్నో మంత్రాలు మందులతో తగ్గించే  ప్రయత్నాలు చేసినా బాధ పెరిగిందేకాని తగ్గక ,మరణబాద అనుభవించి ,దూరాన ఉన్న  దిక్కులేని అక్క గుర్తుకు వచ్చి ,కన్నీరు జలజలా ఏరులా ప్రవహించగా ,చివరికి అక్కకు ఒక పరిచితుడిద్వారా కబురు చేశాడు  .

    ఆ కబురు విన్న అక్క తాను  అన్యమతం వాడి ముఖం చూడనని ,ఆప్రదేశానికి రాన నీ ఖచ్చితంగా ప్రత్యుత్తరం పంపింది .అతనిలో మార్పు వచ్చి మతాన్ని వదిలేసి ,అక్క అనురాగం పొందాలని తపించి ,ఆలస్యం చేయకుండా ,అక్క ఉన్న చోటుకు వెళ్లాలని నిశ్చయించి ఒక అర్ధరాత్రి జైన దుస్తులు తీసిపారేసి ,భిక్షాపాత్ర, నెమలికన్నులు ఆశ్రమంలో వదిలేసి అక్క ఉన్న చోటికి ఎవరికీ తెలియకుండా బయల్దేరి వెళ్ళాడు .దారిలో కడుపులో బాధ మరింత పెరిగి,చివరికి తిరు అతి కై చేరి అక్కపాదాలపై పడి’’నీకు ద్రోహం చేసిన పాపిని క్షమించు అక్కా ‘’అని ఏడ్చేశాడు .అక్క మనసుకరికి అక్కున చేర్చుకొని తమ్ముడిని ఊర డించి ధైర్యం చెప్పి,లేవదీసి ముఖాన భస్మం రాసి దేవాలయ గర్భాలయ౦లోకి తీసుకువెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయించి,శివ ప్రార్ధన చేయించింది .ప్రార్ధన పూర్తికాగానే అతడి ఉదర వ్యాధి తగ్గిపోయింది .ఇది శివమహిమ అని నమ్మకం కలిగి ఆనంద పారవశ్యంపొందాడు  .అకస్మాత్తుగా అతని నోటినుంచి మధుమదురమైన శివ భక్తి గీతాలు వెలువడినాయి .అతని రచనలో ఇవే చాలా ఉత్కృష్టమైనవిగా భావిస్తారు .

    ఆకాలం లో దక్షిణ దేశంలో కొలేరూన్ నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీబలసంపంనులైన  పల్లవరాజుల ఆధీనం లో ఉన్నాయి . అప్పటి రాజు ‘’కదవ ‘’జైనమతావలంబి .కనుక యువ శివస్వామి అప్పాస్వామిని అన్ని రకాలబాధాలకు గురి చేయమని ఆజ్ఞ జారీ చేశాడు .కాని వినకపోతే తనదగ్గరకు తెప్పించుకొవాలని భావించి భటుడికి చెబితే తనవల్లకాదని అంటే మంత్రినే పంపగా రాజు మనసు మార్చాలని స్వామి వెంట వెళ్ళాడు .యువ స్వామిని కొట్టించాడు సున్నపు బట్టీలలో దొర్లించాడు ,సముద్రంలోకి విసిరేయి౦ చాడుకాని అతనికి ఏమీకాలేదు యోగికనుక నీటిపైతేలి ,భక్త ప్రహ్లాదునిలాగానే శివభక్తి మహిమతో ‘’తిరుప్ప తిరి పులియూర్ ‘’తీరం చేరాడు  .పై సంఘటనలో ఆతడు శివమహిమలను కీర్తిస్తూ రాసినవన్నీ బహుళ ప్రచారమయ్యాయి .చివరికి కేతిలాం నది దాటి ఉన్న చోటుకు చేరాడు .పల్లవ కదవ రాజు స్వామి మహిమ గ్రహించి జైనం వదిలి శైవం స్వీకరించి స్వామి శిష్యుడయ్యాడు .జైనమందిరాలు పడగొట్టించి శివాలయాలు కట్టించాడు .తిరు అతి కై లో గొప్ప శివాలయం  నిర్మించాడు పల్లవరాజు .

   అక్క దగ్గర కొంతకాలం గడిపి తీర్ధ యాత్రలు చేస్తూ ,చిదంబరం వెళ్లి ,నటరాజ స్వామి సన్నిధిలో భక్తిభావబందురపద్యాలు , గేయాలన్నో రచించాడు .అవి ఇప్పటికీ ప్రజలనాలుకలమీద నర్తిస్తున్నాయి .తర్వాత కావేరి నదీ తీరశైవాలయాలన్నీ ,తంజావూరులోని ‘’శియాలీ ‘’తో సహా సందర్శించాడు  .తి౦గలూరులో’’అప్పుధి’’అనే బ్రాహ్మణ సాధువు ను దర్శించగా స్వామి వెల్లాల కులం వాడని తెలిసినా ఆదరంగా ఆదరింఛి ఆతిధ్యమిచ్చాడు .ఈ ఇద్దరి కలయిక తమాషాగా జరిగింది .సాదువుకొడుకుకు పాము కరిస్తే అప్పాస్వామి మంత్రం తో నయం చేసి బ్రతికించాడు .అక్కడి నుంచి అప్పాస్వామి కీర్తి దశదిశలా బాగా వ్యాప్తి చెందింది .

   తర్వాత తంజావూర్ జిల్లా తిరుఆరూర్ చేరి ,అక్కడినుంచి పంప కాలూర్ వెళ్లి స్థిరంగా ఉన్నాడు .చాలామంది సాధువులతో పరిచయమేర్పడింది .సంబంధర స్వామి తో కలిసి అప్పాస్వామి తిరు ఆరూరు కు దక్షిణాన వున్న క్షేత్రాలన్నీ దర్శించాడు .పురాతనమైన వేదారణ్యం వెళ్ళగా  అక్కడి దేవాలయం తలుపులు చాలాకాలం నుంచి మూసే ఉంచారని తెలిసి౦ది .వేదాలు స్వయంగా వచ్చి ఇక్కడి శివుడిని దర్శించి పూజించేవి .అలాంటి ఆలయం మూయబడి ఉండటం బాధకలిగింది .వేదాలుకూడా వచ్చి పూజించటం మానేశాయట. సంబందార్ అప్పాస్వాములిద్దరూ ఆలయం బయటద్వారం వద్దే నిలబడి భక్తిగా శివస్తోత్రాలు పరవశంగా గానం చేశారు .అప్పాస్వామి మధుర మంజుల స్వరంతో మహేశ్వరుని కీర్తించాడు .అప్పాస్వామి పదవ గేయం ముగించగానే ఆలయం ద్వారాలు వాటంతటికి అవే తెరుచుకొని ఆశ్చర్యం కలిగించాయి .సంబంధస్వామికూడా ఆర్తిగా ఒక గేయం రచించి గానం చేశాడు  .ఒకొక్క  గేయానికి ఒక్కొక్క తలుపు తెరచుకొని మూసుకున్నాయట .స్వాములగానం జరుగుతున్నంతవరకూ ఇలా తలుపులు తెరుచుకొంటూ మళ్ళీ మూసుకోవటం మహా వింతగా ఉన్నది .ఇదంతా వేదం మహిమ ,భక్తిగరిమ తెలిపే విషయం .ఆలయ ప్రవేశం చేసి స్వామి దర్శనం తో పులకించి బయల్దేరారు ఈస్వాములిద్దరూ .

  అప్పాస్వామి తంజావూర్ జిల్లా ‘’తిరుప్పన్ తిరుతి ‘’ లో ఉంటుండగా ఒకరోజు సంబంధస్వామి పల్లకీలో వచ్చాడు .అప్పాస్వామి ఎదురువెళ్ళి తానూ శిష్యులతోపాటు పల్లకీ మోశాడు . ,ఇది తెలియని సంబంధస్వామి ‘’అప్పాస్వామి ఎక్కడ ?’’అని ప్రశ్నించాడు ..’’స్వామీ ఇక్కడే మీ పల్లకి మోస్తున్నాను ‘’అన్నాడు .కంగారుగా పల్లకి దిగి సంబంధస్వామి ,ఆనంద బాష్పాలు కారుస్తూ అప్పాస్వామిని కౌగలించుకొన్నాడు .మహాత్ములు యెంత వినమ్రంగా ఉంటారో తెలియేసే సంఘటన ఇది.

  అప్పాస్వామి శైవ విజ్ఞానం ఆకళింపు చేసుకోవాలని దేశపర్యటన చేశాడు .కైలాసపర్వతం ఎక్కాడు .కొంత దూరం వెళ్లేసరికి ఆశరీరవాణి’’మహాత్మా !నువ్వు శిఖరం ఎక్కనక్కరలేదు .కావేరి తీరం లోని ‘’తిరు యియూరు ‘’చేరి ,శివుని తపస్సులో ధన్యుడవై చరితార్డుడవు  కావలసినది ‘’అని చెప్పింది .ఆమాటప్రకారం మళ్ళీ ఆప్రదేశానికే చేరి తపస్సు చేశాడు పరమా శివుడు పార్వతీ  సహితంగా పరమ సంతోషంతో ప్రత్యక్షమవగా  పరవశంతో ఇద్దరిపై అనేక కీర్తనలు అలవోకగా చెప్పాడు .అవన్నీ గొప్ప ప్రాచుర్యం పొందాయి .

  అప్పస్వామి భక్తీ పరీక్షకు అనేక సందర్భాలు ఏర్పడ్డాయి .పంపకాలూరులో శివ సేవకు వెడుతుంటే దారిలో బంగారు రాసులు వజ్రాల రాసులు కనిపించాయి .వాటిపై పై దృష్టిపెట్టక శివధ్యానంతో ఆలయం చేరాడు .మరోసారి గ౦ధర్వ స్త్రీలు అతని దగ్గరకొచ్చి ప్రలోభ పెట్టారు .కన్నెత్తి చూడక పశుపతి స్మరణే చేశాడు .ఆలయ ప్రాంతం లోని కలుపు మొక్కలను పీకేసేవాడు ,మట్టిని చదును చేసి పూలమొక్కలు నాటి నీరు పోసి పెంచేవాడు .శివభక్తిలో అతడు తరించాడు .అంతాశివమయంగా భావించాడు .

  అప్పాస్వామి రచించిన పద్యాలు గేయాలు మూడువందలున్నాయి .ఇవి మూడుగ్రంథాలుగా ప్రచురణ పొందాయి .తమిళ శైవ వాజ్మయం లో’’తిరుమురై’’అని ప్రసిద్ధిచెందిన 12గ్రంథాల సంపుటిలో అప్పాస్వామి రచించిన పైమూడు గ్రంథాలు ఉన్నాయి అంటే అతడు ఎంతగొప్ప శివభక్తుడో ఎంతై మహాకవియో అర్ధమౌతుంది .

  ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు గోరసం మూడవ పరస్పర సహకార సంకలనం శ్రీమతి డొక్కా శీతమ్మ గారికి *అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష, రాజమహేంద్రవరంలోని సరికొత్త సమాచరం వారపత్రికలో…

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి

మహా భక్త శిఖామణులు

5-కుపరాబాయి

పురోహితుడి కూతురు కుపరాబాయి .ఈ పిల్ల పుట్టకముందు సంతానం కోసం తల్లి తండ్రులు చాలానోములు వ్రతాలు చేశారు .ద్వారకానగరానికి వెళ్లి శ్రీ కృష్ణ  సేవ చేశారు .కృష్ణ కృపవలన కుపరాబాయి పుట్టింది .తల్లి పురుటినొప్పులతో బాధ పడుతుంటే, కృష్ణుడే మంత్ర సానిగా వచ్చి సేవ చేశాడని జనంలో నమ్మకం ఉంది .పుట్టిన పిల్లకు ఆయనే శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడనీ అంటారు .తలిదండ్రుల భక్తీ ఆమెకూ అబ్బి నిరంతరం భగవధ్యానంలో గడిపేది .ద్వారక నుంచి తలిదండ్రులు స్వగ్రామం చేరారు .

  దినదిన ప్రవర్ధమాన అయిన కూతురు కుపరాబాయికి యుక్తవయసు రాగానే తగిన వరునితో పెళ్లి చేశారు ,కాపురానికి అత్తవారింటికి పంపే ప్రయత్నం చేస్తుంటే ,సంసార జీవనం ఇష్టం లేక ,ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పెట్టి వెళ్లి, అనేక తీర్ధ యాత్రలు చేసి,ద్వారక చేరింది .అక్కడ శ్రీ కృష్ణ నామ సంకీర్తనతో కాలం గడిపింది .కొంతకాలం తర్వాత ఆమెను వెతుక్కుంటూ తండ్రి ద్వారకవచ్చి కూతుర్ని చూసి ఆనందించి తల్లి బెంగతో ఉందని ఇంటికి రమ్మని కోరాడు .కాదనలేక  వెళ్ళింది కాని మనసంతా కృష్ణుడే నిండి ఉన్నాడు .

  కూతురి ప్రభావం తలిదంద్రులమీద పడి వాళ్ళిద్దరూ కూడా హరినామస్మరణతో రోజంతా గడిపేవారు .ప్రజలలో కుపరాబాయి భక్తీ విశేషం బాగా వ్యాపించి ఆమె దర్శనం కోసం రోజూ వందలాది మంది వచ్చి ప్రభావితులయ్యేవారు .పాలనా చేసేవారూ ఆమెకు భక్తులయ్యారు .భక్తి మహాత్మ్యం వాలన వాళ్ళ కష్టాలు బాధలు తొలగి పోయేవి .ఆమె సాన్నిధ్యం లో అందరికీ పవిత్రత చేకూరింది .అంతటి ప్రభావం ప్రజలపై కలిగించింది కుపరాబాయి .

6-గుణవతిబాయి

ఉత్తర హిందూస్థాన్  లో ఒక చిన్నరాజ్యం పాలించే క్షత్రియరాజుభార్య గుణవతి బాయి .ఈమె దాసీలలో పరమభక్తురాలు ఒకామె ఉండేది .సేవచేస్తూనే మనసులో నిరంతరం భగవధ్యానం చేసేది .దాసీ భక్తికి ఆశ్చర్యపోయి రాణి తానుకూడా భక్తిలో గడపాలను కొంటున్నానని దాసికి తెలిపింది .ఆమె సంతోషంతో శ్రీకృష్ణమంత్రం రాణికి ఉపదేశించింది .మంత్రోప దేశ ప్రభావంతో రాణి నిరంతరం హరినామ స్మరణలోనే గడిపేది .సంసారం పై వ్యామోహం కలగలేదు .రాజుకు ఈమె ధోరణి నచ్చలేదు .ఆమె భక్తితో పాటు ,ఈతని కోపం కూడా హెచ్చింది .అయినా తనపూజాదికాలు మానలేదు .

   బైరాగులు వచ్చి ఆమె మనసు  చెడ గొడుతున్నారేమో అనే అనుమానంతో ఎవరినీ కోటలోకి రాకుండా రాజు కట్టడి చేశాడు .జాగ్రత్తగా చూస్తూ ఉండమని మంత్రికి చెప్పి ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు .రాణి గుణవతిబాయి యధాప్రకారం భజన పూజలు చేస్తూనే ఉంది .మంత్రి అడవికి వెళ్లి రాజుకు నివేదించాడు .తోక తొక్కినపామే అయిన రాజు తనమాటను ధిక్కరించినందుకు రాణి పై అసహనంతో ఆమె పీడవదిలి౦చుకొందామని నలుగురు భటులను ఆమెను చంపటానికి పురమాయించాడు .అడవినుంచి కోటకు వచ్చిన ఆ నలుగురు రాణి తీవ్ర ధ్యానమగ్నమై ఉండినందువల్ల దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోయారు .ఇంతలో వాళ్ళ హృదయాలలో ఏదో బాధకలిగి ,నలుగురూ కుప్ప గూలారు .ధ్యానం నుంచి బయటికి వచ్చిన రాణి వాళ్ళ దీనస్థితి చూసి ప్రేమతో వారికి సేవ చేసి  కారణం అడిగింది .ఆమె మాటలు వారికి అమృతం గా అనిపించాయి .ఆమె కన్నులనుండి దివ్య తేజస్సు ప్రసారమౌతున్నట్లు గ్రహించారు .వెంటనే ఆమె పాదాలపై వ్రాలి క్షమించమని కోరి, రాజు పంపిన విషయం చెప్పారు .

  కోటలో జరిగిన  వృత్తాంతం మంత్రి రాజుకు తెలియ జేయగా, రాజు తన చేస్టకుసిగ్గుపడి ,పశ్చాత్తాపం తో కోటకు వచ్చి,రాణి గుణవతి బాయి చేతులు పట్టుకొని తనతప్పు మన్నించమని కోరాడు .ఆమె ‘’మీరు ఇలా అనకూడదు .మీ మనసుమార్చినవాడు ఆ కృష్ణపరమాత్మ .ఆకృష్ణమంత్రం నాకు ఉపదేశించిమనదాసి పుణ్యం కట్టుకొన్నది ‘’అనగా తనకు కూడా మంత్రోపదేశం కావాలని కోరాడు .దాసిని పిలిపించి రాజుకు మంత్రోప దేశం చేయమని చెప్పింది. ఆ దాసీ వినయంగా ‘’మహా రాజా !మీకు మంత్రోపదేశం చేసే అంతటి దాన్నికాను .రాణీగారు కోరినప్పుడు కూడా ఈమాటే చెప్పాను .చివరికి రాణీగాఋ పట్టుబడితే ఉపదేశి౦చాను  మన్నించండి ‘’అన్నది .

 మంత్రోప దేశ ప్రభావం తెలుసుకొన్న రాజు దాసీని తనకు తప్పక శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించమని అర్ధించాడు .కాదనలేక ఉపదేశించింది .ఆమెను  పరిచారిక వృత్తి నుంచి విముక్తి చేసి కోటలోనే ఒక మందిరం ఏర్పాటు చేసి ధ్యానం చేసుకొనే వసతి కల్పించాడు .రాజు కూడా రాజకార్యాలతర్వాత కుటుంబంతో అక్కడే కృష్ణస్వామి పూజ భక్తీ శ్రద్ధలతో రోజూ చేసేవాడు  .దాసీకి  గురు పీఠంఏర్పాటు చేసి ఆమెకు తామంతా సేవకులుగా వర్తిల్లారు .రాణి గుణవతిబాయి అమితానందం పొందింది. ఇదివరకటికంటే ఎక్కువగా అతిధి అభ్యాగతులను ఆదరించేది .యోగులను దీనులను పూజించి సేవ చేసేది .ప్రజలుకూడా రాజు ,రాణీ లను అనుసరిస్తూ సత్కార్యాలు చేస్తూ  కృష్ణ ష్ణభక్తిలో తరించారు .

    పవిత్ర దా౦పత్యాన్ని కొన్నేళ్ళు అనుభవించి గుణవతీబాయి దేహం చాలించింది .గురుపీఠంలో ఉన్న దాసికూడా సిద్ధిపొందింది .రాజు కుమారుడికి రాజ్యమప్పగించి కోటలోని మఠంలోనే భగవధ్యానం లో రేయిం బవళ్ళు ఇహలోక ధ్యానం లేకుండా గడిపి సాయుజ్యం పొందాడు .కులం వృత్తి  ముఖ్యంకాదు గుణమే గరీయసి అని దాసీ నిరూపించి, గురుపీఠ అర్హత పొందింది .దీన్ని గుర్తించిన రాజు రాణీ గార్లుకూడా తదనుగుణంగా ప్రవర్తించారు .

. ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 4-ఆవుల్ చాంద్ స్వామి

మహా భక్త శిఖామణులు

4-ఆవుల్ చాంద్ స్వామి

బెంగాల్ లో ‘’కర్తాభజ ‘’సంప్రదాయ స్థాపకుడు ఆవుల్ చాంద్ స్వామి .పార్శీ భాషలో దేవుడిని ‘’ఆవూలియా అంటారు .అందులోని పుట్టినపేరే స్వామి ది.ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలీవు .బెంగాల్ లో సుమారు 400ఏళ్ళక్రితం నదియా జిల్లా  ఉలా అనే గ్రామం లో మహాదేవ దాసు అనే శూద్రుడు ఉండేవాడు .తనకున్న తమలపాకు తోటలోని ఆకులను కోసి అమ్మి,కొద్దిపాటి వ్యవసాయమూ చేస్తూ  జీవనం చేస్తున్నాడు .ఒక రోజు మధ్యాహ్నం తోటలోలో పొదలదగ్గర  పసి పిల్లాడి ఏడ్పు వినిపించి ,చూడగా ,తోటమధ్య ఒక బాలుడు కూర్చుని ఏడుస్తున్నాడు .అతడిని ఊరు పేరు అడిగితె తనకేమీ తెలీదన్నాడు .పిల్లలు లేరుకనుక వాడిని ఇంటికి తీసుకు వెళ్ళాడు .అందమైన ఆపిల్లాడిని చూసి భార్యకూడా సంతోషించి పూర్ణ చ౦ద్ అనే పేరుబెట్టి పెంచారు .కుర్రాడికి అన్ని పనులు పురమాయించి చేయిస్తున్నాడు దాసు .ఏదైనా నాతేడావస్తే తిట్టటం కొట్టటం కూడా చేసేవాడు .ఓర్చుకొంటూ భగవధ్యానం చేసేవాడు బాలుడు .  ఆ ఇంటి ప్రక్క హరి భక్తుడైన హరిహరుడు అనే ఆయన ఇంట్లో సంకీర్తన జరిగేది .పూర్ణచంద్రుడు రోజూ వెళ్లి వినేవాడు .బుద్ధి చురుకైనదికనుక అక్కడ జరిగే వేదాంత చర్చలన్నీ అవగతం చేసుకొనేవాడు .కొద్దికాలం లోనే సంస్కృతమూ బాగా అబ్బింది .అందరు ఆకుర్రాడి తెలివి తేటలకు ,భక్తికి ఆశ్చర్యపోయేవారు .కాని పెంచిన హరిదాసు గుర్తించలేక పోయాడు .అతడి సతాయింపు వేధింపులతో ప్రక్కింటికి వెళ్ళే సమయం దొరికేదికాదు .కాని హరికీర్తనమాత్రం మానలేదు .ఇంటినుంచి వెళ్ళిపోదామని అనుకొన్నాడు. యజమాని గ్రహించి ఆపేశాడు .హరిహర ,పూర్ణ చంద్రులు నిర్విరామంగా హరి కీర్తన చేశారు .పెళ్లి చేసుకోమని గురువు చెప్పగా ,ఇష్టం లేక ఆఊరు వదిలి ‘’పులియా ‘’గ్రామం చేరాడు .అది బ్రాహ్మణ అగ్రహారం. విద్వాంసులకు నిలయం .వైష్ణవులకు ఆటపట్టు.మహా భక్తుడు  గౌరా౦గుని ప్రియ శిష్యుడు హరిదాసు ఒకప్పుడున్న   చోటు.ఆయనకట్టించిన మఠం ఇప్పటికీ ఉంది .బలరాం దాసు అనే భక్తుడు అక్కడ ఉండేవాడు .ఈయనవద్దకు చేరి తనప్రవర్తనతో మెప్పించి వైష్ణవాన్ని స్వీకరింఛి ‘’ఆవుల్ చాంద్’’పేరుతొ ప్రసిద్ధుడయ్యాడు .

  సంవత్సరన్నర కాలం అక్కడే ఉండి,బలరామ దాసు శిష్యులతో తూర్పు బెంగాలు కు వెడుతుంటే వెంట వెళ్ళాడు .కొంతకాలం అలాగడిపి, మళ్ళీ పులియా గ్రామం రాకుండా తీర్ధయాత్రలు చేశాడు .భారత దేశ పుణ్య క్షేత్రాలన్నీ సందర్శించి చివరికి వజ్రా అనే గ్రామంలో స్థిరంగా ఉండిపోయాడు .రోజూ భిక్షాటన చేసి వచ్చినదానిలో పేదలకు పంచి తానూ తినేవాడు .రోగార్తులను అన్నార్తులను ఆదరి౦చేవాడు ,జ్ఞానబోధలతో అందరినీ ఆకర్షించేవాడు .అతని హరినామ సంకీర్తన వినటానికి భక్తులు బాగావచ్చేవారు .అతని దైవబలం గొప్పది అవటం తో రోగుల బాధలు తీరేవి ,కంటి చూపు నోటిమాటకూడా వచ్చేవి .ఏ జబ్బైనా అతని సమక్షం లో నయమౌతుందనే నమ్మకం బాగా పెరిగింది .శిష్యబృందమూ పెరిగింది .అందులో హుటూ ఘోష్ ,బెబూ ఘోష్ లు ముఖ్యులు .

  రామశరణుడు అనే అతనికి శూలవ్యాదివస్తే ,ఆవుల్ చాంద్ నయం చేయాగా శిష్యుడైపోయాడు .సామాన్య గృహస్తు ఐన యితడు పెద్ద జమీందార్ దగ్గర మంచి ఉద్యోగం లో చేరి అభిమానం పొంది   ‘’ఉఖరా ‘’అనే పరగణాలో పెద్ద ఉద్యోగం పొందాడు  .ఈ ఉద్యోగం లో ఉండగానే శూలవ్యాది వచ్చింది మూర్చలుకూడా వచ్చేవి .ఆవుల్ చాంద్ ను శరణు వెడితే కమండల జలం ముఖం పై చల్లి  నయం చేశాడు .స్వామి శిష్యుడై అతని భావవ్యాప్తికి దోహదపడ్డాడు రామ శరణుడు.

  వంగశకం 1651వైశాఖ శుద్ధ పంచమినాడు సాయంత్రం సిద్ధిపొండాడు ఆవుల్ చ౦ద్ .సిద్ధి పొందేముందు బోయాలియా అనే గ్రామం లో శిష్యుడు కృష్ణదాసు వ్యాధితో బాధపడుతున్నాడని ,తనరాకకోసమే ప్రాణాలతో ఉన్నాడని తెలిసి ,అతన్ని చూడటానికి వెడుతూ అక్కడున్నవారిలో కొందరిని తనతో రమ్మనీ ఇక తాను అక్కడికి రానని పరలోకం వెడుతున్నానని చెప్పి కమండలం కాషాయం మాత్రమె తీసుకొని బయల్దేరాడు .కృష్ణదాసు మరణించాడు. స్వామికి జ్వరం వచ్చి చాలా రోజులుంది .తనకు అంత్యకాలం దగ్గరైందని గ్రహించి తనను ‘’తులసీ తలం ‘’తీసుకు వెళ్లి అక్కడ హరినామ కీర్తన చేయమన్నాడు .నామస్మరణ వింటూ, తానూ ఉచ్చరిస్తూ తన్మయం పొంది తన తుది శ్వాస వదిలాడు

   శిష్యులు స్వామి పార్ధివ దేహాన్ని ‘’పరారీ ‘’అనే పల్లెకు తీసుకు వెళ్లి సమాధి చేశారు .ఆయన దగ్గరున్న కాషాయ వస్త్రాన్ని బోయాలియా గ్రామానికి పంపారు .బ్రతికి ఉండగానే చిరిగిన శాటీని రామశరణుడికిచ్చాడు స్వామి.అది ఇప్పటికీ భద్రంగా అక్కడే ఉంది.స్వామికి ఉత్తరాదికారి గా రామశరణుడు ఆశ్రమ బాధ్యతలు చేబట్టాడు .కొద్దికాలమే బ్రతికి మరణించాడు అందరూకలిసి అతని వంశీయుడు ఈశ్వర చంద్రుని మఠాధిపతినిచేశారు  .తర్వాత ఇతనికొడుకు హరిదాసు ఆతర్వాత అన్నకొడుకు రసిక్ చంద్రుడు అయ్యారు .

  పతివ్రత అయిన రామ శరణుడి భార్యను ఆవుల్ స్వామి ‘’అమ్మా అని సంబోధి౦చేవాడు .ఆమె కీర్తి ఇప్పటికీ ప్రజలకు జ్ఞాపకం ఉంది .

   ఆవుల్ చాంద్ స్వామి బోధన సారాంశం –‘’ఏకమాత్ర పరమ స్వరూపుడైన శ్రీ కృష్ణుని ధ్యానించండి .ఇతర దేవతా దూషణ చేయవద్దు .ఆచార్యుని యెడ భక్తీ మనసులో ఆచరణలో చూపండి .ఉదయం ,సాయంత్రం ఉతికినబట్ట లే కట్టుకోండి .అతిధులను సేవించండి .హరినామ స్మరణ సత్కర్మా చరణ వదలకండి .అందర్నీ సోదరభావంతో చూడండి .అన్ని వేళల అన్ని చోట్లాసత్కాలక్షేపమే చేయండి .వైష్ణవ ధర్మాన్ని పాటిస్తూ,అందులోని మహాత్తునుప్రజలకు తెలియ జేయండి .మనసు నిర్మలంగా ఉంచుకోండి .ఉచితాహారమే తినండి .ఆత్మ సత్యం అని నమ్మండి .ధర్మ విషయాలను చర్చించండి ‘’

  స్వామీజీ నిషేధించిన క్రియలు –ఇతరుల సొత్తు అపహరి౦చ టం హత్య ,పరస్త్రీ పొందు .అబద్దాలాడటం ,కఠినవాక్కు వ్యర్ధ ప్రసంగాలు ,దురాలోచన .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఈ శనివారం ఉదయం గారెల దండ స్వామి కి గారెల దండ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము .

     కార్యక్రమ వివరాలు
7-12-19 శనివారం  ఉదయం 5గం .లకు సుప్రభాతం అనంతరం  అష్ట కలశ స్నపన ,మ న్యుసూక్తముతో స్వామి వార్లకు అభిషేకం  ,నూతనవస్త్ర ధారణ
    ఉదయం 8 గం  లకు -గంధ సిందూరం ,చేమంతి పూలు ,వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర సహస్రనామ పూజ ,అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
8-12-19 ఆదివారం -ఉదయం 9 గం  లకు అరటిపండ్లు వివిధ ,ఫలాలతో విశేష అర్చన  అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి  -శ్రీ హనుమద్వ్రతం
  ఉదయం 9 గం కు పంపా కలశ పూజ,13ముడుల తోర పూజ  ,మంత్రం తో తోర ధారణ, తమలపాకులతో అష్టోత్తర సహస్రనామ పూజ
  అనంతరం శ్రీ హనుమద్వ్రత0 ,అయిదు కథల వివరణ – అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
                గబ్బిట  దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -30-11-19
                                   మరియు భక్త బృందం
Posted in దేవాలయం | Tagged | Leave a comment

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

‘’ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వం తెలుగు రద్దు చేసిందని గగ్గోలు పెట్టగా ,ప్రభుత్వం నా   ఆధ్వర్యం లో  ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించమని వారం గడువిచ్చి ,గంటకు లక్ష జీతం నాతం లలో నన్ను డైరెక్టర్ గా మరో పదిమంది ని రోజుకు లక్షజీతం తో ఏర్పాటు చేసింది .విషయాలన్నీ సాకల్యంగా పరిశీలించి మాతృభాష స్థానం లో తల్లిభాష అంటే బూతు భాష ప్రవేశ పెడితే అందరికీ నచ్చుతుందని  నిర్ణయించి  కొన్ని సూచనలు చేశాం .వీటిని ఈరోజునుంచే అమలు చేస్తే ఇక ఎవ్వరూ గొడవ చేయరు ఈ భాష అందరికీ అందుబాటు లోనే ఉంటుంది .సభ్యత పాటించి కొందరు ఆభాష మాట్లాడరు కానీ వారి నరనరానా ఉంటుంది .కోపం వస్తే కట్టలు తెంచుకొని ఉరుకు లేస్తుంది .ఇంతకంటే ఆల్టర్నేటివ్ మాకు కనిపించలేదు .ప్రజలంతా తప్పక పాటించి విజయం చేకూర్చమని కోరుతున్నాం .మా నివేదికలో ముఖ్యాంశాలు మీముందు పెడుతున్నాను .’’అన్నాడు కమీషనర్ .సభ్యులు చప్పట్లు కొట్టారు .

ఇక ముఖ్య విషయాలు చూద్దాం .1-ఇంట్లో ,బయటా అందరూ బూతులతోనే పలకరించుకోవాలి .బూతు అపవిత్రం కానేకాదు .తల్లీచేల్లీ అమ్మా నాన్న అందర్నీ తెగబూతులు తిట్టాలి .2-బడిలో రెచ్చిపోయి బూతులు మాట్లాడాలి .పంతుళ్ళు అడ్డం వస్తే పంచలు లాగేయ్యాలి .ఆడ మేస్టార్లు అడ్డం చెప్పినా అదే పని 3-కాలేజీలలో ఆడా మగా సెకండరీ స్థాయి దాటి బూతులతో చెలరేగాలి .4-యూని వర్సిటీ స్థాయిలో కాలేజీ స్థాయికంటే పై స్థాయి బూతుల దండకం వాడాలి .ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవ్వరైనా కేరే ఝాట్ గా ఉండాలి .కొత్తబూతులు కనిపెట్టి వాడాలి .సంస్కారం ఏ కోశానా అడ్డం రాకూడదు .’’తల్లి అక్క ,అమ్మా ఆలి ‘’భాషను గౌరవి౦చటమే మన విధి ,విధానం .దీనికి భిన్నంగా నడిస్తే తెలంగాణ శకుంతల అన్నట్లు ‘’పిసికి  చంపేయాలి .5-ఉద్యోగాల్లో మనం చెప్పిందే వేదం .కాదంటే శాల్తీలు లేస్తాయని చెప్పాలి .గౌరవం అనేమాట మన డిక్షనరీలో ఉండరాదు .అందర్నీ ఏరా ,ఒరేయ్ , ఏమే, ఒసే అనే పిలవాలి .దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారినైనా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా ఏకవచనంతో సంబోధించాలి .ఇలామాట్లాడనివాళ్ళ నాలుకలు కోసెయ్యాలి .6-‘’ఏ రకమైన దీక్షల్లో’’ ఉన్న వాళ్ళయినా ,దీనికేమీ ఢోకాలేదు.అన్నీ ‘’ఆయనే ‘’చూసుకొంటాడు .12వ నంబర్  13వ నంబర్  భాషతప్ప ఇక ఏదీ వాడరాదు .

  6- ఈ భాషా ప్రోత్సాహానికి ఓరిఎంటేషన్ క్లా సులు తరచుగా జరపాలి.ట్రెయినింగ్ ఇప్పించాలి .ఇతర రాష్ట్రాల దేశాలవారిని పిలిచి గెస్ట్  లెక్చర్లు ఇప్పించాలి .మన వాళ్ళనూ  ఇతర దేశాలకు పంపి నేర్చుకోనేట్లు చేయాలి. దీనికి వీసా ఫీఉలూ అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది .దీనికొక ప్రత్యెక శాఖ మంత్రి వగైరా ఉండాలి  7-అసెంబ్లీ లో ఈ వాడకం తగ్గితే వెంటనే బర్త్ రఫ్ చేయాలి .8.మంత్రులు వాడకుంటే మహా నేరంగా భావించి సభాపతి సస్పెండ్ చేయాలి మార్షల్స్ తో బయటికి   ఈడ్పించాలి .సభాపతి అసలు ఆభాషలేకుండా సభాలోకాని బయట  ఎక్కడా కాని మాట్లాడితే సిఎం వెంటనే పీకి పారెయ్యాలి .ఇప్పటికే ఈ ఆరు నెలల్లో దీని వాడకం ‘’పీక్ లెవెల్ ‘’లో ఉంది .ఇంకా ఇంకా ఎదిగిపోవాలి .9-చీఫ్ సెక్రెటరి అయినా సేక్రటరీలైనా బూతు భయం తో వణికి పోవాలి. అప్పుడే అమలు బాగా జరుగుతున్నట్లు లెక్క .ప్రతిస్థాయిలోనూ ప్రోత్సాహకాలు అందించాలి .అవార్డ్ లు రివార్డ్ లు ఇవ్వాలి బిరుదులూ అందించాలి .ఎలిమెంటరీ లో ‘ బూతు ’కిశోర ‘’ సేకండరీలో ‘’బూతుబాల ‘’కాలేజీలో ‘’బూతుయువ ‘’డిగ్రీ ఆపైన ‘’బూతు మహా ‘’వంటి బిరుదులివ్వాలి ’10-ఉద్యోగులకు ‘’బూతు నవ రత్న’’ ‘’బూతేశ్వర్’’ బూతు మహాశయా ‘’వంటివి ఇవ్వచ్చు ఇంకా కావాలంటే ఇన్నో వేటివ్   గా ఆలోచించి  లేక మన ‘’పెద్దలను’’ సంప్రదించి జనసమక్షం లో పది వేలకు తక్కువ లేకుండా నగదు బహుమతులతో ఇచ్చి సత్కరించాలి .

  11-పాఠ్య గ్రంధాలలో బూతుకే ప్రాధాన్యత ,అశ్లీలతకే పట్టాభిషేకం గా ఉండాలి .ప్రత్యేక బూతు పుస్తకాలు రాయించి రచయితలను ప్రోత్సహించాలి .పాత పుస్తకాలు తగలెయ్యాలి .ఆ నీడ వాసనా ఇక పనికి రాదు .అంతా ఫ్రెష్ .ఎక్కడా ఇందులో అవినీతి ఉండరాదు 12-బూతు విద్యాకేంద్రాలు విరివిగా స్థాపించాలి .ఎంతఖర్చుకైనా వెనకాడ రాదు .13-సమాజం లో పెద్దలు బూతులతో చెలరేగి పోతుంటే వారికి బూతు పిత ,బూతు పితామహ ,బూతు ప్రపితామ బూతుమాత బూతు బామ్మ ,బూతు అమ్మమ్మ ,బూతక్క ,బూతుపిన్ని ,బూతు అత్తా వంటి పేర్లతో ఘనంగా సత్కరించాలి .ఇదే తిరుగులేని మంత్రం .నాలుగు రోజుల్లో గొప్ప ఫలితాలు కనిపించి ప్రభుత్వం మాపై పెట్టిన  ఖర్చు  దండగ కాదని రుజువు చేయాలి .దీని అమలు బాధ్యతా ప్రతి పిల్లాడిదీ, పెద్దాడిడీ పెద్దాయనదీ ,పెద్దావిడదీ అందరిదీ అని అనుక్షణం గుర్తుంచుకోవాలి .ప్రసూతి వార్డులలో బూతు కేసెట్లు  సిడిలు పెట్టించి వినిపించి పుట్టిన ప్రతివారూ జన్మతః బూతులు మాట్లాడేట్లు చేయాలి  ప్రహ్లాదుడికి నారద భక్తీ సూత్రాలు తల్లికడుపులో ఉండగా వచ్చినట్లు  మనమూ చేయాలి. ఇక దిగులు ఉండదు .చానళ్ళన్నీ బూతుకు తప్ప దేనికీ ప్రాముఖ్యం ఇవ్వరాదు పత్రిఅకూ విరివిగాసహకరించాలి .బూతు సాహిత్య  సంస్థలు అవసరమైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి తెల్లవారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే దాకా ‘’బూతే బూతుగా ‘’అదే చివరికి’’ పూతు ‘’అంటే పవిత్రంగా తినగతినగ వేము తియ్యగా ఉన్నట్లు మారుతుంది .బూతూ జిందాబాద్ .నీయమ్మ విసుగొచ్చింది .సెలవ్ ‘’అన్నాడు

  ‘’ఏమండీ తెల్లారింది లేవండి ‘’అన్నకేక విని ‘’నీ యమ్మ .పొద్దున్నే లేపాలా “’అన్నా . ఆవిడ కంగారుగా ‘’ఎమైనాపైత్యం ప్రకోపించిందా ?నోరు పారేసుకొంటే,పిసికి  కోసి కూర వండుతా ఫు౦డాకోర్ ‘’అంది అవాక్కయ్యా .దాని నోటి నుంచి ఇలాంటిమాట ఎప్పుడూ వినలేదు .టివి ఆన్ అయి ‘’బండబూతులు మాట్లాడుతున్న వారితో దుశ్చర్యలపై  ఇంటర్వ్యు  వస్తోంది .ఓహో ఇదంతా కలా అని సమాధాన పడ్డాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర  స్త్రీ  .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే పనిలో ఉండేది .స్వామి నైవేద్యానికి అల్లం ,ఇంగువ నెయ్యి మసాలావస్తువులుకలిపి’’ కిచిడీ అన్నం ‘’తయారు చేసేది .ఇది హిందూస్తానీయులకు అత్యంత ఇష్టమైనది .దీనినే స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదన చేసేది .

 కర్మాబాయి కీర్తి బాగా వ్యాపించగా ఒక రోజు ఒక బైరాగి ఆమె ఇంటికి భిక్షకు వచ్చాడు. సర్వ సద్గుణ  శీలి యైన ఆమెను చూసి మహాదానందపడ్డాడు .కాని ఆమె ఏ ఆచారాన్ని పాటించకుండా స్వామి ప్రాసాదం తయారు చేయటం చూసి బాధ, కోపం వచ్చి ,సదాచార విధానం బోధించి ఇకనుండి తాను చెప్పినట్లే చేయమని హితవు చెప్పాడు .మర్నాడు బైరాగి చెప్పిన ఆచార విధానం అంతాపాటించి ప్రసాదం తయారు చేసే సరికి రెండుజాములయింది .కర్మాబాయి ఇంటికి జగన్నథ స్వామి వచ్చి ప్రసాదం తింటాడని ప్రజలలో ఒక గొప్ప నమ్మకం ఉండేది .ఆ రోజుకూడా అలానే వచ్చాడు స్వామి .ఆలస్యమైందని కంగారు పడుతూ బాధపడుతూ స్వామికి ప్రసాదం వడ్డించింది .ఆయనా ఆలస్యమైందని ఆఘమేఘాలమీద తిని  ప్రక్షాళనం అంటే నోరు కడుక్కోకుండా   మందిరానికి వెళ్ళాడు.

 జగన్నాథ మందిర అర్చకస్వాములు స్వామి నోటికి కిచిడీ అన్నం మెతుకులు అంటి ఉండటం గమనించి ‘’పరాత్పరా !ఏ పవిత్ర గృహం పావనం చేసి విందు ఆరగించి జీవితం ధన్యం చేశావు స్వామీ ,మూడులోకాల్లోనూ  ఆ పుణ్యమూర్తి ధన్య మూర్తి ‘’అన్నారు.

  భక్త సులభుడు జగన్నాథుడు ‘’భక్తులారా !నన్ను సేవించింది పుణ్య చరిత కర్మాబాయీజీ .ప్రతిరోజూ మధ్యాహ్నం కాకుండానే నాకు కిచిడీ ప్రసాదం చేసి  వడ్డిస్తుంది .ఈ రోజు ఒక సన్యాసి చెప్పిన మాటలు విని ఆచారం తో ప్రాసాదం చేయటానికి మధ్యాహ్న సమయం దాటింది .ఆమె చేతి ప్రసాదం  తింటేకాని నేను వేరే ప్రసాదం స్వీకరించను .ఇవాళకూడా ఆమె ఇంట అన్నప్రసాదం తిని ఆలస్యమైందని, ‘’దేవి’’ నాకోసం ఎదురు చూస్తుందని  పరుగుపరుగున వచ్చేశాను .మీరు ఆమె ఇంటికి వెళ్లి, రేపటి నుంచి ఆమె ఇదివరకు ఎలా ప్రసాదం చేసేదో అలానే తయారు చేయమని చెప్పండి ‘’అన్నాడు జగత్ప్రభువు స్వామి .

   ఈవిషయం వారు కర్మాబాయీజికి ఇంటికి వెళ్లి తెలియజేశారు .ఆమె చాలా సంతోషించి అటుపై పూర్వంలాగానే ఆచారం  పాటించ కుండా స్వామికి కిచిడీ అన్నం ప్రసాదం చేసి వడ్డించింది .ఈ విషయం తెలిసిన బైరాగి స్వామి ఒక రోజు ఆమె ఇంటికి వచ్చి ‘’అమ్మా !నీ మహత్తు తెలియకుండా నీకు సుద్దులు చెప్పాను .ఆచారాలతో స్వామికి కష్టం కలిగించేట్లు చేశాను .నువ్వూ ,స్వామీ నన్ను మన్నించాలి ‘’అని ప్రాధేయపడ్డాడు .నిష్కల్మష భక్తిమహిమ వెళ్ళ డించటానికి జగన్నాథుడు చేసిన లీల ఇది .కర్మాబాయీజీ కర్మ పరిపక్వమై 25-7-1634 న 29ఏళ్ళ వయసులోనే జగన్నాథ సన్నిధి చేరింది . భక్త శిఖామణి అయిన కర్మాబాయిజీ పై ఒక జానపద గీతం ప్రచారం లో ఉంది .’’ Thali bhar’r lyayi khichado upar ghee ki batki !

Jeemo mhara syam dhani jeemavai beti Jat ki !!

  కర్మాబాయి స్మరణార్ధం ఇప్పటికీ జగన్నాథ దేవాలయం లో కిచిడీ (ఖేచరాన్నం )తయారు చేసి బంగారు పళ్ళెం లో పెట్టి స్వామికి భోగం  చేస్తుంటారు .ఎంగిలి ,అంటూ పూరీ జగన్నాథ మందిరం లో ప్రసాదాన్ని అంటుకోవు .అంతా పవిత్రమే అందుకే ‘’సర్వం అగన్నాథం ‘’అంటారు .కర్మాబాయి అంతకరణ విశుద్ధమైనది .అనురాగ భక్తిభావ రంజితమైంది .అక్కడ ఇక దేనికీ స్థానం లేదు .శుభ్రమైన హృదయం లో భక్తి పరిమళిస్తుంది .అందులోంచి పొ౦గి పొరలే అనురాగం పై ,క్షీర సాగర శయనుడు డోలలాడుతాడు.

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

 మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే  తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం పై శ్రద్ధ ఏర్పడింది .అద్వైతుడు అనే మహాయోగి ని దర్శించాలని శాంతిపురానికి వెళ్ళగా స్వామీజీ మొదట అంగీకరించక పోయినా  తర్వాత అతని భక్తీ విశ్వాసాలు చూసి,అనుగ్రహింఛి హరినామం ఉపదేశించాడు . ‘’కునియా ‘’అనే పల్లెకు దగ్గరలో ఉన్న అరణ్యం లో నివాసమేర్పరచుకొని హరినామ స్మరణం తో గడిపాడు .తురక విష్ణు భక్తుడవటం సహించలేక ఆమతస్తులు నేరం మోపి నవాబు దగ్గరకు తీసుకు వెళ్ళగా భటులతో తీవ్రంగా కొట్టించాడు .రక్తం ప్రవాహంలా కారి స్పృహ తప్పి పడిపోయాడు .చనిపోయాడని భావించి గోతిలో పాతిపెట్ట మన్నారు  .అప్పుడు స్పృహ రాగా సేవకులు గురువుకు చెప్పారు .బ్రతికి ఉండగా పాతిపెట్టటం మంచిదికాదని నవాబు నదిలోకి తోసేయించాడు .చాలా దూరం కొట్టుకుపోయి చివరికి  ఒడ్డు చేరాడు .

  తినటానికి ,ఉండటానికి ఏమీ లేక అల్లాడుతుండగా సప్తగ్రామానికి చెందిన బలరామాచార్యులు ఇంటికి తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చాడు .హరి భక్తుడైన ఆచార్యులు పరమత సహనం తో జనం నినదించినా లెక్క చేయకుండా  ఈతురకను కాపాడి,ఇంట్లో ఉంచుకొన్నాడు .హరి దాసు నామ సంకీర్తనం తో ఎక్కడోకాలిన మహమ్మదీయులు  ఆచార్యులను దూషించారు .అతడు తన్మయత్వంలో హరినామ స్మరణ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు .పిచ్చివాడని గోల చేశారు .సప్తగ్రామ జమీందార్ కొడుకు రఘునాధుడు ఆచార్యుల వద్ద విద్య నేరుస్తున్నాడు .కాని హరిదాసు భక్తికి ఆకర్షితుడై చదువు సంధ్యలు మానేసి తానూ అదే ధోరణిలో హరి కీర్తన చేస్తుండగా తురక సన్యాసి దగ్గర ఇలా చేయటం తండ్రికి నచ్చక ,కేకలేసి వినకపోతే గురువునే దూషించాడు .తనవలన గురువు నిందపడాల్సి వస్తోందని గ్రహించి ,గురువుకు కృతజ్ఞత చెప్పి శాంతిపురం చేరి ,గంగానది ఒడ్డున ప్రశాంతంగా గడిపాడు .

  రోజుకు లక్ష సార్లు తక్కువ లేకుండా హరి నామ స్మరణ చేసి మాత్రమె మంచి నీరు త్రాగేవాడు .అతని తారకమంత్రం ”హరే కృష్ణ హరే కృష్ణ -కృష్ణకృష్ణ హరే హరే -హరేరామ హరేరామ రామరామ హరే హరే ” ఈ పవిత్రాత్ముని చూసి జనం శిష్యులుగా చేరారు .ఆ వూరి జమీందార్ కు ఇది ఇష్టం లేక ,అతని ఏకాగ్రత మరల్చాలని ఒక భోగం స్త్రీని ప్రేరేపించి ఒకార్ధ రాత్రి అతని కుటీరం లోకి పంపాడు .దేహ స్పృహ లేని దాసు హరినామస్మరణతో పరవశమై ఇదేదీ గమనిచ లేదు  .ఆమె అనేక ప్రయత్నాలు చేసి౦ది కాని అతనికి బాహ్య స్పృహ ఉంటేగా ?రాత్రి తెల్లవార్లూ బతిమాలుతూ బామాలుతూ తిడుతూ ,కోప్పడుతూ  విశ్వ ప్రయత్నం చేసి విఫలమై తెల్లవారగానే వెళ్లి పోయింది . మళ్ళీరాత్రి వచ్చి రెచ్చ గొట్టే మాటలతో ప్రయత్నించి చివరకు తానుకూడా దొంగ భజన చేస్తున్నట్లు నటించింది కాని దాసు ప్రవర్తనలో మార్పు లేక,ఏకాగ్రతకు భంగం కలగక పోవటంతో నిరాశతో  ఇంటికి వెళ్ళింది .ఎలాగైనా అతన్ని లొంగ దీయాలన్న జమీందార్ ప్రేరణతో ఎక్కువ డబ్బు ఆశకు మూడో రోజూ వచ్చింది  .సకలప్రయత్నాలు చేస్తూ చివరికి ‘’భ్రమర కీటక న్యాయం’’లాగా ఆ వేశ్య కూడా భక్తి పారవశ్యంలో తన్మయురాలైంది.ఇప్పుడు కళ్ళు తెరిచిన హరిదాసు ఆమెపై జాలిపడి మంత్రోప దేశం చేశాడు ఆమె కూడా నిరంతర హరినామ స్మరణతో జన్మ చరితార్ధం చేసుకొన్నది  ..

      కొంతకాలం తర్వాత హరిదాస ఠాకూర్  నవద్వీపం వెళ్లి అక్కడి వైష్ణవులతో కలిసి తిరిగాడు .అతని భక్తి,ప్రేమలను గుర్తించి అనేక సేవలు చేశారు .చైతన్య మహాప్రభువు ‘’నీలాచలం ‘’అంటే పూరీ జగన్నాధం లో ఉన్నారని తెలిసి భక్త బృందం తో వెళ్లి ,చైతన్య సమక్షంలో జీవనం గడిపాడు  .’’యవన హరిదాసు ‘’గా గుర్తింపు పొందిన యితడు చైతన్యుడు తనువు చాలించక పూర్వమే పరమ పదించాడు .అంత్య సమయంలో చైతన్య ప్రభువు శిష్యులతో వచ్చి హరిదాసు దగ్గర కూర్చుని హరినామ స్మరణ చేశాడు .ఆ హరినామ సంకీర్తన చేస్తూ ,వింటూ తనవు పులకంకురాలు పొందగా యవన హరిదాసు దేహం చాలించాడు ఆ  మహా భక్త శిఖామణి  .చైతన్యుడు అతని పార్ధివ దేహాన్ని సింధు నది తీరానికి చేర్చి,దిక్కులన్నీ హరినామ స్మరణతో పిక్కటిల్లుతుండగా  సమాధి చేయించి బృందావనం నిర్మించాడు .

 ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా రాష్ట్ర ధ్యాన దేవుడు తనకులం నుంచి బహిష్కరిప బడినతర్వాత పన్ధర్పురానికి వెళ్లి మతోద్యమ విప్లవం విస్తృతం చేశాడు .బ్రాహ్మణుల అధికారాన్ని ఎదిరించాడు .జనసామాన్యానికి భగవద్గీత అర్ధమయేట్లు  మరాటీ భాషలో రాసి జన వ్యాప్తికలిగించాడు .జంతు హి౦స మాన్పించి ,విశ్వాసం తోనే భగవంతుని చేరవచ్చునని బోధించాడు .జనంలో మంచి పేరు వచ్చి భక్తజనం కవులు బాగా ఆయనకు దగ్గరయ్యారు .దీనితో ప్రజలకు సాంఘిక స్వాతంత్ర్యం ఏర్పడి నూతన రూపు దాల్చింది మహారాష్ట్ర సమాజం .ఆయన భక్తులలో ప్రముఖుడు చండాల వంశానపుట్టిన ‘’చోక మేల’’.

 

image.png

—

image.png

  ఈ మతోద్యమం భీమ నదీ తీరాన ఉన్న ముఖ్య స్థలం అక్కడ ఒక ప్రాచీన దేవాలయం ఉంది.కాని 13వ శతాబ్ది వరకు దానికి ప్రచారమే లేదు .అదే పన్ధర్ పుర దేవాలయం .ఈ దేవాలయం లోని ఇటుక వేదికపై నిలిచి  విఠోబా ను ఆరాధించాలని ,భక్తులు ,సామాన్య జనం ఉవ్విళ్ళూరే వారు .స్వామి దర్శనంతో పులకించిపోయి జన్మ ధన్యమైనదని భావించేవారు .దీని గురించి కధలు,గాధలు తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి .ఒక కుంటి యోగి పైథాన్ నుంచి ,పండరీ పురానికి దేక్కుంటూ పాక్కుంటూ చేరి స్వామి దివ్య దర్శనం చేశాడట .ఆలయం పెద్ద గోప్పదేమీకాడు శిల్ప సౌందర్యమూ పెద్దగా లేదు .కాని అదొక గొప్ప ఆకర్షణ .ఆలయం లోని ప్రతిభాగం లో భక్తీ చిప్పిలుతుందని భక్తులు భావించి దర్శించి మురిసిపోయేవారు .

  విఠల దేవుని ప్రదానసేవకులలో చోక మేల ఒకడు .తండ్రి సుదాముడు .తల్లి ముక్తాబాయి .వీరిది పండరికి దగ్గరలోని అనాగడ్ అనే పల్లె.మంచి స్థితిపరులే కాని సంతానం లేదు .సుదాముడు తరచూ పండరినాధుని దర్శించి పుత్రభిక్ష ప్రసాదించమని వేడుకొనేవాడు .భర్త  ఊరిలో లేనప్పుడు భార్య ముక్తాబాయి తమ తోటలోని 200మామిడి పండ్లను కోసి బీదర్ లోని ముసల్మాన్ గవర్నర్ కు అందజేయటానికి తీసుకు వెళ్ళేది .ఒక రోజు పేద బ్రాహ్మణుడు దారిలో కనిపించి ఆకలిగా ఉంది కొన్ని పళ్ళు ఇస్తే తిని ఆకలి తీర్చుకొంటానని ప్రాధేయపడ్డాడు .సంతోషం తో పండిన పండ్లు అయిదు ఆయన చేతిలో పెట్టింది .వాటిని తీసుకొంటూ ‘’అమ్మా !నీ సౌజన్యం ఎనలేనిది .మీకు పండంటి అయిదుగురు సంతానం కలుగుతారు .నాకు మామిడిపళ్ళు ఇచ్చావు కనుక  నీ పెద్ద కొడుకుకు ‘’చోక’’(చోక్ సేన్ అంటే మరాటీలో మామిడి పండు అని అర్ధం )అని పేరు పెట్టు అని చెప్పి వెళ్లి పోయాడు .

  కొంతకాలానికి ముక్తాబాయి దంపతులకు పుత్రుడు జన్మించగా ‘’చోక ‘’లేక చోక మేల అని పేరు పెట్టుకొన్నారు .తల్లీ తండ్రీ భక్తులే కనుక చిన్నప్పటి నుంచి బాలుడికి కూడా ఆభక్తి సహజంగా అబ్బింది .చండాల వంశజుడు కనుక ఊళ్ళో ఏ పశువు చనిపోయినా ఈడ్చుకు వెళ్లి బయట పారేయటం అతని పని అయింది .ఒక సారి ఊరి పెద్దలతో సహా తండ్రి ఊర్లో లేనప్పుడు ఒక పెద్ద ఆవు చచ్చిపోతే ,దాన్ని కళేబరాన్ని ఈడ్చి పారేయాల్సి వచ్చింది చోక మేల కు .యితడు చిన్నారి బాలుడు .దాన్ని లాగేసే శక్తి లేనివాడు. విఠోబాతన శక్తినిచ్చి  సాయం చేశాడు .ఒక సారి పండరి ఆలయం లో స్వామి దర్శనానికి వచ్చి దర్శించి జన సమూహం లో ఉండిపోయిన ఒక సుందరి,అయిన బాలిక  చోక మేల ను చూసి ,అకస్మాత్తుగా పాదాలపి వ్రాలి తనను భార్యగా చేసుకోమని కోరింది .సరే నని తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడాడు .

  కొన్ని రోజుల తర్వాత తన హృదయేశుడు పందడరినాథుని సమీపాన నివసించాలని కాపురం పండరిపురానికి మార్చాడు .అనుకూలవతి భార్య సకల విధాలా సాయపడుతోంది .పండరి వెళ్ళాడే కాని,నీచ కులజుడవటం వలన, ఆలయ ప్రవేశం నిషిద్ధం కనుక  విఠలుని సేవ చేయటానికి కుదరటం లేదు .బయట గుమ్మం దగ్గర కూర్చునే కనిపించీ కనుపించకుండా స్వామిని దర్శిస్తూ తన్మయుడయేవాడు .ఇలా రోజూ కూర్చుంటూ తర్వాత చీపురుతో గుడి చుట్టూ బాగు చేస్తూ ఉండేవాడు .గుడిలో జరిగే ప్రార్ధనలు భజనలు అన్నీ బయటినుంచే వింటూ కనిపిస్తే చూస్తూ కాలక్షేపం చేసేవాడు .మాదిగవాడు సన్యాసి కావటం ధ్యాన దేవుడి శిష్యులకు కూడా ఇష్టం గా ఉండేదికాదు .అతని భక్తిని అపహాస్యం చేసేవారు .

  ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అసూయతో చోకమేలతో ‘’ఎందుకు వృధాగా రోజంతా ఆలయం బయటే కూర్చుంటావు .బ్రాహ్మణుడి దగ్గర కూర్చుని అతని కుక్క కంచంలోని ఆ పెరుగన్నం తినాలనే  ఆశ ఎలా నెరవేరదో, నీకు విఠల దర్శనం అలా నెరవేరదు .బిచ్చగాడు రాజవాటం యెంత అసంభవమో,  నువ్వు వైకుంఠం చేరటం అంతే అసంభవం ‘’అన్నాడు .ఆమాటలు ములుకులుగా గుచ్చుకొన్నా, చోక మేల వినయంతో నమస్కరించి ‘’అయ్యా !కోట్ల మైళ్ళలో ఆకాశం లో ఉన్న సూర్యభగవానుడు నేలమీదనీటిలో ఉన్న పద్మాలకు కిరణ శోభకలిగించి వికసింప జేయటంలేదా ?దూరంగా ఉన్నా, నా విఠలదేవుడు నామొర ఆలకించి నన్ను కనికరించక పోడు.మనుషుని హృదయం లో ఆ స్వామిని ప్రతి స్టి౦చు కొన్న ప్రతివాడూ ఆయనకు దగ్గరగా ఉన్నట్లే ‘’అన్నాడు .

 అదే రోజు రాత్రి విఠలుడు చోకమేల ను తానే దేవాలంలోకి తీసుకు వెళ్లి,గర్భాలయం లో కూర్చోబెట్టి , అతని భక్తిని ప్రశంసించాడు .ఇ౦తలొ ఆలయ౦ లోని పూజారులు మేలుకొని ,ఘోరం జరిగి పోయిందని గగ్గోలు పెట్టి మిగిలిన పూజారులను పిలిచి రప్పించారు  .తలుపులన్నీ వేసి ఉంటె ఎలా ప్రవేశించాడనే ఆశ్చర్యంతో పాటు మాదిగావాడివలన ఆలయం అపవిత్ర మైనదని ఆక్రోశం కలిగింది వారికి ,కోపోద్రేకాలను ఆపుకోలేక అతడిని కొట్టి బరబరా గొడ్డును లాగినట్లు లాగించి బయటపడేశారు  .అతడు నిశ్చల నిర్మల మనసుతో ‘’పెద్దలారా !గంగానదిలో మాదిగవాడు స్నానం చేస్తే అది మైలపడుతుందా ?వీచేగాలి చండాలుని సోకితే మైలపడుతుండా ,అతని ఊపిరి వాయువును మైలపరుస్తుందా ?చండాలకులం లో పుట్టిననేను ఏ అపరాధమూ చేయలేదు ‘’అనగా  వాళ్లకోపం తారాస్థాయి చేరి ‘’నీచకులం లో పుట్టి ,మాకు నీతులు నేర్పుతున్నావా ?’’అని మండిపడి రాజు దగ్గర నివేదించారు .

  రాజు మహమ్మదీయుడు  చోకమేల ను పిలిపించి విచారించాడు .అతడు ‘’ఆ విఠోబా దేవుడే నేను అంటరాని వాడిని అని మొరపెట్టినా ,వినక తానె తీసుకువెళ్ళి గర్భాలయం లో కూర్చోబెట్టాడు నేనేమి  చేయగలను ?’’అన్నాడు .ఎన్ని విధాలా చెప్పినా వినక ముస్లిం నవాబు అతడి మెడకు బండపలుపు కట్టించి వీధుల్లోకి   ఈడ్పించాడు .గట్టి ప్రాణం కనుక తట్టుకు నిలబడ్డాడు .పండరి నుంచి బహిష్కరింఛి భీమనదికి అవతల పదేయించి మళ్ళీ రావద్దని శాసించాడు ‘.

  హరి లోన కొలువై యున్న భక్తునికి భయమెందుకు ?చోకమేల భీమనది ఒడ్డున ‘’దీపమాల ‘’కట్టించి ,తనగుడిసె లో కూర్చునేవాడు  .ఒకరోజు నిమ్మ చెట్టుకింద భోజనం చేస్తుంటే పండరి విఠలుడు ప్రత్యక్షమవగా ,ఆయనకూ విస్తరి వేసి భార్య వడ్డించింది .వడ్డనలో కుండలోని పెరుగు స్వామి వస్త్రాలపై పొరబాటున పడింది .’’దేవాది దేవుడు మనింటికి వస్తే ఇలా అపచారం చేస్తావా ?’’అని భార్యను కసిరాడు .అదే సమయంలో ఆలయ పూజారి అటు వస్తూ చోక మేల విఠలుని దూషిస్తున్నాడని భ్రమపడి ముందూ వెనుకలు చూడకుండా చెంపలు వాయించి నీచుని ముట్టుకొన్నందున భీమనదిలో స్నానించి దేవాలయం చేరి  పూజ చేస్తుండగా దేవుని వస్త్రం పై పెరుగు కనిపించి,దేవుడి చెంప వాఛి  ఉండటం ,  కళ్ళ నుండి కన్నీరు  కారటం గమనించాడు .జరిగినది అర్ధమై మహాయోగి అయిన చోకమేల కు తాను  చేసిన పరాభవానికి చింతించి దానిప్రభావం స్వామి మీద పడటం గుర్తించి అతడు మహా యోగి అని భక్త శిఖామణి అని తెలుసుకొన్నాడు .క్షణం ఆలస్యం చేయకుండా ఆ చండాల భక్త యోగీశ్వరుని పాదాలపై వ్రాలి క్షమించమని అర్ధించాడు .సగౌరవంగా అతడిని తనతో ఆలయానికి తీసుకు వెళ్ళగా స్వామి బుగ్గ వాపుతగ్గి అశ్రుధార మాయమై,మందస్మిత ముఖారవి౦ద౦ తో  విఠోబా దర్శనమిచ్చాడు .చోకమేల పవిత్ర భక్తి అందరికీ తెలిసి ,అతని చరిత్ర మహా రాష్ట్రం అంతా వ్యాపించింది .

  బీదరునవాబు  మంగళ మేఖల అనే పట్టణం చుట్టూ ఎత్తైన రాతి గోడ కట్టాలని నిర్ణయించి ,మాదిగలందర్నీ ఆపనిలో నియమించాడు .ప్రభువు ఆజ్ఞ కనుక చోకమేలకూడా పనిలో చేరాడు .ఒకప్రక్కకట్టిన గోడ పూర్తికాకుండానే అకస్మాత్తుగా కూలి,చోక మేల తో సహా కూలీలు దానికి౦దపడి చచ్చిపోయారు .అతని అస్థికలు గోడకింద కూరుకుపోయినా కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .విఠలుడు తనభక్తుడు నామదేవుని చోకమేల అస్తికలను తెచ్చి పండరిపురం  చేర్చమని ఆజ్ఞాపించాడు .ఆయన వెళ్ళగా అక్కడ అందరి ఎముకలు కలిసిపోయి గుర్తించటం కష్టమైంది .ఏం చేయలాని తెగ ఆలోచించి చెవి నేల మీద ఆనించాడు  ‘’విఠోబా విఠోబా ‘’అనే శబ్దం వినిపించి ,అవి చోకమేల అస్తికలే అని రూఢిగాభావించి పోగు చేసి తీసుకు వెళ్లి పండరి పురంలో భూగర్భం లో పాతిపెట్టింఛి ఒక శిలా స్థాపించాడు .అక్కడ మహారాష్ట్ర మాదిగలు నిత్యం భజనలు చేస్తారు .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’

  మరో భక్తుని తో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment