గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )

తెలంగాణా రాష్ట్రం సిద్దిపేటలో శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ జన్మించారు .వీరిది పండిత వంశ౦ .పితృ ,పితామహులందరూ సంగీత సాహిత్యాలలో దిగ్దంతులే .తండ్రి నారాయణ శాస్త్రి పండితులేకాక ప్రతిభా వ్యుత్పన్నులు ,సంగీత కళా మర్మజ్ఞులు .   మేనమామ ,విద్యా గురువు శ్రీకొరిడే సీతారామ శర్మగారి ఆదేశం తో   దేవీ మానస పూజ ను ఒక సంవత్సర కాలం దీక్షగా పారాయణ చేసి ఆత్మ గతం చేసుకొన్నారు .దీనితో వారిలో మధుర కవితా ధార పెల్లుబికింది .’’బ్రహ్మోమాపతి పద్మనాభ నుత !శు౦భత్పద్మసింహాసనా ‘’మకుటం తో అమ్మవారిని  స్తుతించిన నపద్యాలలో త్రిమూర్త్యాత్మక రూపినణియైన అమ్మవారే కాకుండా కవి గారూ దర్శన మిస్తారు . తొలితరం తెలంగాణా కధకులలో శర్మగారు అగ్రేసరులు .1960 కాలం లో వారి కధలు ,వ్యాసాలూ ,విమర్శలు ,గేయాలు భారతి ,సాధన ,కృష్ణాపత్రిక లలో ప్రచురితాలు .’’చతురంగం ‘’,’’నవ కథా విపంచి ‘’వీరి కథా సంపుటాలు .’’చివరి ఘడియలు ‘’అముద్రితం .

శర్మగారు వేణువు ,వయోలిన్ ,హార్మోనియం వాయిద్యాలవాదనలో అసమాన ప్రజ్ఞావంతులు .వీరి గాత్రం సుస్వర బద్ధమై వీనుల విందు చేసేది .భువనవిజయ౦ లో రామరాజ భూషణుడుగా జీవించేవారు .వీరి పద్య కవితా గానం మై మరపించేది .కాళిదాస కవిత్వాన్ని ఎంతగా ఆరాదధించేవారో ఓ హెన్రీ కథలనూ అంతగా ఆస్వాదించేవారు .తెలంగాణా ప్రాంతీయ దేశ్య పదాలు ,ప్రాచీనకవుల ప్రయోగాలపై శర్మగారి వ్యాసాలు ఆణిముత్యాలు ..ప్రముఖ పరిశోధకులు నిడదవోలు వెంకటరావు మల్లంపల్లి సోమ శేఖర శర్మగార్ల ప్రశంసలు పొందాయి .దివాకర్ల వెంకటావధాని ,పుల్లెల రామ చంద్రుడు ,దోర్బల విశ్వనాధ శర్మ వంటి సాహితీ ప్రముఖులు శర్మగారి పాండితీ గరిమకు నీరాజనాలు పలికారు .’’అజో-విభో ‘’పురస్కారం సద్గురు శివానంద మూర్తి గారి అమృత హస్తాలనుండి అందుకొన్న పుణ్య మూర్తి .భావకవిత్వోద్యమ ప్రభావం తో ‘’మధురకవి ‘’గా గుర్తింపు పొందారు .ఆయన అధ్యయన శీలత అచ్చెరువు గొల్పుతుంది .ఉద్యోగం చేస్తూ సాహిత్య కృషి కొనసాగిస్తూ ,వేదాంత వాజ్మయ మధనమూ చేశారు .దీనిఫలితంగా  పదకొండు వ్యాసాల ‘’హంసనాదం ‘వెలువడింది .అద్వైత,శివాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను సహేతుకంగా తర్కించి ‘’శివా ద్వైత దర్శనం ‘’రచించి  దిగ్భ్రాంతి కలిగించారు  .శ్రీ శంకర భగవత్పాదుల ‘’శ్రీ దేవీ మానసిక పూజ ‘’ను శంకరుల అంతర్ దృష్టికి తగినట్లు ఆంధ్రానువాదం చేశారు .

అవసరమైతేనే మాట్లాడే నియమమున్న శర్మగారి మౌన అంతరంగం నుండి 108  శ్లోకాల ‘’అద్వైత గీత ‘’జాలువారి యోగ సాధకులకు దిశా నిర్దేశం గా భాసించింది .తామే దీనికి సులభ వ్యాఖ్య రాయగా ‘’దర్శనం ‘’మాసపత్రిక లో ప్రచురింపబడింది .సహాధ్యాయులైన శ్రీ అప్పాల వాసు దేవ శర్మ గారితో కలిసి ‘’దేవీ సప్త శతి ‘’శ్లోకాలను తెలుగులో లోతైన తాత్విక భావన తో రాశారు .’’తొగుట –రాంపురం ‘లోని శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాధిపుల ఆజ్ఞమేరకు సంస్కృత భాగవత శ్రీధరీయ వ్యాఖ్యను ద్వితీయ ,దశమ స్కంధాలకు తెలుగు సేత చేశారు .జ్యోతిశ్శాస్త్రం లోనూ శర్మగారు అఖండులే.శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వాములు తెలంగాణా గజవల్లి లో పర్యటించినపుడు సన్మానపత్రం రచించి శర్మగారు శ్రీవారి అభినందన పొందారు .మనసులాగానే స్వచ్చ శ్వేత వస్త్ర ధారణతో ,ఆలోచనా ముద్రతో శర్మగారు కనిపించేవారు .

శర్మగారి మరణానికి సరిగ్గా నెల రోజులక్రితం తెలంగాణా ప్రభుత్వ తృతీయ ఆవిష్కరణ మహోత్సవం నాడు ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు గారి చేతుల మీదుగా పండిత పురస్కారం అందుకొన్నారు .ప్రచారార్భాటం ఇష్టపడని శర్మగారు ఈ కాలపు కవి యోగి పుంగవులు .

పుంభావ సరస్వతులైన శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మగారు 2017 జులై 4 న ఉమాపతి సాన్నిధ్యం చేరారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-17 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడని వ్రేలి ముద్రలు

1-సెల్ ఫోన్ లకు ఆధార్ కార్డు తో లింక్ చేయమని మెసేజి లపై మెసేజ్ లు వస్తున్నాయి . సీనియర్లు లింక్ చేయటానికి సెల్ డీలర్స్ దగ్గరకు వెడితే వాళ్ళ దగ్గరున్న వ్రేలి ముద్రల మెషీన్  10 వ్రేళ్ళతో ఏ వ్రేలి ముద్రనూ యాక్సెప్ట్ చేయటం లేదు .అందుకని సుమారు 70 ఏళ్ళు దాటిన వారికి లింక్ చేయించుకొననే  అవకాశం లేకుండా పోతోంది .దీనిపై ప్రభుత్వాలు స్పందించి మరేదైనా మార్గం త్వరలో ఆలోచించి అమలు చేయాలని కోరిక .

2-పెన్షనర్ అసోసియేషన్ లో ఇటీవల బయట పడిన అవకతవకలకు ఝడిసి ప్రభుత్వం పెన్షనర్లు నవంబర్ లో ఇవ్వాల్సిన లైఫ్ సర్టిఫికెట్ఇచ్చేటప్పుడుతప్పని సరిగా  వ్రేలి ముద్ర నమోదు చేయటం ఈ సంవత్సరం ఖచ్చితంగా అమలు చేస్తోంది   లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేయటానికి ట్రెజరీ ఆఫీస్ కు వెడితే ఇక్కడకూడా వ్రేలి ముద్ర మెషీన్లుసుమారు  70 ఏళ్ళు దాటిన పెన్షనర్ల వ్రేలి ముద్రలు తీసుకోవటానికి మొరాయిస్తున్నాయి అంటే అంగీకరించటం లేదన్నమాట .కనుక ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ మార్గం అమలు చేయాలి  ట్రెజరీ ఆఫీస్ వారు ఏమీ చేయలేక మళ్ళీ డిసెంబర్ లోనో జనవరి లోనో కొత్తవిధానం అంటే కంటి గుడ్డు ఫోటో ఐరిస్ ఫోటో వస్తుంది అప్పుడు మరల రమ్మని బ్రతిమాలి చెబుతున్నారు
  కనుక పై రెండు విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను . అతి త్వరలో ప్రత్యామ్నాయ మార్గం ప్రవేశ పెట్టి పెన్షనర్ లకు ,సెల్ వినియోగ దారులకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాను
                                              గబ్బిట దుర్గాప్రసాద్
                                        సెల్ వినియోగ దారుడు మరియు రాష్ట్ర పెన్షన్ దారుడు
                                         ఉయ్యూరు -కృష్ణా జిల్లా -సెల్ 9989066375

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

13-11-17 సోమవారం రాత్రి మా ఇంట్లో మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు, కోడలు జయ, కొడుకు కళ్యాణ్, కోడలు , వియ్యంకుడు, వియ్యపురాలు, కళ్యాణ్ బావమరది ,భార్య

13-11-17 సోమవారం రాత్రి మా ఇంట్లో మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు, కోడలు జయ, కొడుకు కళ్యాణ్, కోడలు , వియ్యంకుడు, వియ్యపురాలు, కళ్యాణ్ బావమరది ,భార్య

 

https://photos.google.com/share/AF1QipPQdDmWkLA1WSZrPdRH_U-pRoP4rkAvumNw0YWsPENsQ-fKRnAis7mFEgGx4txR2w?key=ZjE2bjhoQy10T2NTaF8tTXU4MzdpTnlIaUdYWTJ3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5-11-17 ఆదివారం ఉదయం కర్నాటక ప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురంలో మేమిద్దరం మాకోదాలు వియ్యపురాలు ఫోటోలు-పార్ట్-2

5-11-17 ఆదివారం ఉదయం కర్నాటక ప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురంలో మేమిద్దరం మాకోదాలు వియ్యపురాలు ఫోటోలు-పార్ట్-2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రుద్రాభిషేకం -శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటోలు

4-11-17 శనివారంకార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ -మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో తెల్లవారుఝామున3-30 నుండిఉదయం 6 వరకు రుద్రాభిషేకం తరువాత ఉదయం 6 నుండి 8 వరకు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –

463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)

భరత చంద్ర రే గుణకార్ 18 వ శతాబ్ది ప్రముఖ సంస్కృత బెంగాలీకవి .రాజాస్థానకవి కూడా .అన్నపూర్ణ మంగళ కావ్యం తో సుప్రసిద్ధుడయ్యాడు .భరత చంద్ర గా సుపరిచితుడు .నాడియా మహా రాజు కృష్ణ చంద్ర ‘’గుణకార్’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .అప్పటి నుంచి ‘’రే గుణకార్ భరత చంద్ర’’ అని అందరూ పిలువ సాగారు .

నరేంద్ర నారాయణ రే,భవానీ దంపతులకు 1712 లోబెంగాల్ లోని ‘’పెన్రో భూర్షట్ ‘’గ్రామం లో జన్మించాడు . ఈ గ్రామం ఇప్పుడు హౌరా జిల్లాలో  ఆమ్టా కు దగ్గరలో ఉంది. నలుగురు సంతానం లో చివరివాడు .తండ్రి –వర్ధమాన రాజు కీర్తి చంద్ర రే తో ఆస్తి తగాదా పడి రాజమాత బిష్ణు కుమారి ని అవమానించాడు .దీనితో రాజు కినిసి వీళ్ళ భూములన్నీ స్వాధీనం చేసుకొన్నాడు .చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తండ్రి నారాయణ రే ఊరు వదిలి పారిపోయాడు .కొడుకు భరత చంద్ర ను మాతా మహుల ఇంట్లో నయాపారాలో ఉంచారు .అక్కడే ఉంటూ దగ్గర గ్రామం తాజ్ పూర్ లో సంస్కృతం అభ్యసించాడు .14 ఏళ్ళకే సంస్కృతం లో అద్వితీయ పాండిత్యాన్ని సాధించి తలమానికమై భాసించాడు .ప్రక్కనే ఉన్న  శారద గ్రామానికి చెందిన నరోత్తమ ఆచార్య కుమార్తెను వివాహం చేసుకొన్నాడు .

తిరిగి స్వగ్రామానికి చేరిన తమ్ముడు భరత చంద్ర సంస్కృత పండితుడైనందున ఆ భాష కూడు గుడ్డ పెట్టదని  ఈసడించి అన్నలు అవహేళన చేశారు .అవమానం పొందిన భరతచంద్ర స్వగ్రామం వదిలేసి హుగ్లీ జిల్లాలోని బాష్ బెరియా లోని దేబానంద పుర కు వెళ్ళాడు .అక్కడ రామ చంద్ర మున్షి ఇంట్లో ఉంటూ పర్షియన్ భాష నేర్చి పట్టు సాధించి మాస్టర్ అనిపించుకొన్నాడు .పిత్రార్జిత సంపదను కాపాడుకోవటానికి మోఖ్తార్  అయ్యాడు .అన్నలతో ఆస్తితగాదాలు, వారిని సంప్రదించకుండా వివాహమాడటం తో మళ్ళీ ఇల్లు వదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది .ఎక్కడా నిలువ నీడ లేక దేశాటనం చేస్తూ కొంతకాలం మహారాష్ట్ర పాలనలో ఉన్న ఒరిస్సాలోని కటక్ లో ఉన్నాడు .మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోయాడు .

చందర్ మగూర్ లోని  ఇంద్ర నారాయణ చౌదరి అనే ఫ్రెంచ్ ప్రభుత్వ దివాన్ ఇంట్లో అద్దె కున్నాడు భరతచంద్ర .  చంద్ర లోని విద్యా పటిమను గుర్తించి,న దివాన్  కృష్ణ నగర్ మహారాజు కృష్ణ చంద్ర ఆస్థాన కవిగా నియమించే ఏర్పాటు చేశాడు . మహారాజు కవిగారి విద్వత్తు కు తగిన ‘’రే గుణకార్ ‘’బిరుదునిచ్చి గౌరవించి సన్మానించటమే కాక మూలజోర్ లో అనేక వందల ఎకరాల భూమిని ప్రదానం చేశాడు .బెంగాలీ భాష లో ‘’ప్రధమ ప్రజాకవి’’ గా భరత చంద్ర గుర్తింపు పొందాడు .బెంగాలీ భాషను తన కవిత్వం, రచనలతో భరత చంద్ర సుసంపన్నం చేసి శాశ్వత కీర్తి తనకూ భాషకూ సాధించి చిర కీర్తి పొందాడు .

భరతచంద్ర రచనలలో ముఖ్యమైనది 1752 లోరచించిన ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణ మంగళ్ .ఇది మూడుభాగాలు .మొదటి భాగం లో ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణా దేవి స్తోత్రం ఉంది.రెండవ భాగం ‘’కాళికా మంగళ్’’ .ఇందులో విద్యా , సుందరుల కథ ఉంది. మూడవది అయిన చివరి భాగం లో మొదటి మాన్సింగ్ ,అన్నపూర్ణ మంగళ్ అనే భవానంద మజుందార్ ల చరిత్ర ఉన్నది . భానుదత్తుడు మైధిలీ భాషలో రచించిన ‘’రసమంజరి ‘’ని బెంగాలీ భాషలోకి భరతచంద్ర అనువదించాడు . భరతచంద్ర సంస్కృత బెంగాలీ  భాషా పటిమకు నిదర్శనంగా నిలిచిన రచన ‘’నాగాస్టకం ‘’. సంస్కృత ఛందస్సు పై తన సాధికారతను రుజువు చేసిన రచన ఇది .ఇదికాక సంస్కృతం లో గంగాస్టకం రాశాడు . చండీ నాటకం ,తో పాటు మరొక అసంపూర్ణరచన ‘’సత్యనారాయణ పాంచాలీ కూడా రాశాడు .

మధ్యయుగ బెంగాలీ గీతాల నుంచి ఆధునిక బెంగాలీ గీతాలవరకు అనేక వందల పాటలు రాసి భాషా సౌందర్యం తో తీర్చి దిద్దిన ప్రజాకవి భరత చంద్ర . కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితమైన ‘’మంగళ గానం ‘’ను ప్రజా పరం కూడా చేసి భాషకు, సంగీతానికి సొగసులు దిద్దాడు . స్వేచ్ఛగా మంగళగానం చేసే వీలుకల్పించాడు .రాధాకృష్ణుల శృంగారాన్ని,ప్రణయాన్నీ ‘’పదావళి కీర్తనలు ‘’గా రచించాడు . దీనిద్వారా రాం ప్రసాద్ సేన్ ,నిధుబాబు అనబడే రాం నిధి గుప్తాలకు మార్గ  దర్శి అయ్యాడు .

భరతచంద్ర రచన ‘’అన్నదా మంగళ్’’ను’’ గేరాసీ లెబ్ దేవ్’’ రష్యన్ భాషలోకి అనువాదం చేశాడు .భరతచంద్ర సంగీతం సమకూర్చిన వాటినీ కలకత్తా లో నాటకాలకు వాడుకొన్నాడు .48 ఏళ్ళు మాత్రమే జీవించినా, శాశ్వత యశస్సు సాధించిన గుణకార్ భరతచంద్ర ఈ నాటి 24 పరగణాలలో ఉన్న ములజోర్ లో 1760లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

Bharatchandra Ray Gunakor

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )

నేపాల్ లో ఫుల్గమ ప్రాంతం లో రాంజీ ఠాకూర్ జన్మించాడు .వైష్ణవ కవి గోవింద ఠాకూర్ ,ప్రసిద్ధాకవి ,సవతి సోదరుడు రుచికర్ ఈ కవి పూర్వీకులు .లక్ష్మీ కాంత్ ఝా ,వి ఆర్ శర్మ ,పండిత్ శోభాకాంత్ జయదేవ్ ఝా వంటి సుప్రసిద్ధ సంస్కృత విద్వాంస గురువులవద్ద విద్య నేర్చాడు . రాం ప్రతాప్ సంస్కృత కాలేజి ,మహారాజ్ లక్ష్మీ సింగ్ కాలేజీ లలో సంస్కృత లెక్చరర్ గా  చేశాడు .పాట్నాలోని బీహార్ సంస్కృత సమితి  నుండి1956 లో ఆచార్య డిగ్రీ,  1960 లో ఎం ఏ లో గోల్డ్ మెడల్ ,1981 లో దర్భంగా లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి నుండి ‘’బాణ భట్టస్య రచనస్య ప్రేక్షా విలాసః ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి. అందుకొన్నాడు . దర్భంగా లోని లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి సంస్కృత ఆచార్యుడుగా రిటైర్ అయ్యాడు.

రాంజీ ఠాకూర్ సంస్కృతం లో కావ్యం, ఖండకావ్యాలు,ముక్తకావ్యాలు రచించాడు .అతని ప్రసిద్ధ కావ్యం-గీతామాధురి.ఖండకావ్యాలు –వైదేహీ పాదాంకం ,రాధా విరహం ,ప్రేం రహస్యం ,బాణేశ్వరి చరితం ,గోవింద చరితామృతం ,మాతృ స్తన్యం .ముక్తకావ్యాలు-ఆర్య విలాసః ,లఘుపద్య ప్రబంధ త్రయికావ్య కోశః . ఇటీవల ప్రచురించినవి -పర్యాయ చరితం కావ్యం ,అమృత మ౦ధనమ్

1912 లోరాంజీ ఠాకూర్  లఘు పద్య మంజరి కి కేంద్ర సాహిత్యఅకాడేమీ పురస్కారం అందుకొన్నాడు .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ – 3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )

13-10-18 99 న ఢాకా లో  దుర్గామోహన భట్టాచార్య జన్మించాడు .1900 లో కుటుంబం ముర్షీదాబాద్ జిల్లా సహనగర్ లాల్ బాఘ్ కు తరలి వెళ్ళింది .నిరుపేద  కుటుంబం అయిన౦దున పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలకుపంపించలేక పోయారు .వీధిబడిలో బెంగాలీ సంస్కృతాలు బెంగాలీ భాషా మాధ్యమం లో  మాత్రమే నేర్చాడు .దుర్గామోహన్ బుద్ధి తీక్ష్ణత చాలా ఎక్కువకనుక 1915 నాటికే అంటే 16 వ ఏటనే అనేక సంస్కృత ఉపాధి పరీక్షలురాసి అగ్రభాగాన నిలిచాడు .కావ్య ,సాంఖ్య ,పురాణాలలో అత్యుత్తమ డిగ్రీ పొంది ‘’భాగవత రత్న ‘’బిరుదు అందుకొన్నాడు .

విధవరాలైన తల్లి ,తమ్ముడితో కలకత్తా లో ఉన్న మాతామహుల  ఇంటికి చేరాడు.  మేనల్లుడి ఆంగ్ల భాషాధ్యయనం కోరిక తీర్చటానికి పెద్ద మేనమామ అతనిని ప్రసిద్ధ కలకత్తా టౌన్ హైస్కూల్ హెడ్మాస్టర్ సురేష్ చంద్ర కుందు వద్దకు తీసుకు వెళ్ళాడు  .అప్పటికే 16 ఏళ్ళు రావటం వలన 10 ఏళ్ళ కోర్సును కేవలం ఒక్క ఏడాది లో చదవాల్సి వచ్చింది .శ్రమకోర్చి ఇష్టంగా కస్టపడి చదివి 1917 లో యూని వర్సిటి ఎంట్రన్స్ పరీక్ష రాసి ప్రధమతరగతిలో ఉత్తీర్ణుడై అందరికీ ఆశ్చర్యం కలిగింఛి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు .  .పట్టుదల ఓర్పు ఉంటె సాధించలేనిది లేదని నిరూపించాడు .1919 లో విద్యాసాగర్ కాలేజి నుంచి ఇంటర్ పాసై ,1921 లో స్కాటిష్ చర్చ్ కాలేజి నుండి సంస్కృతం లో బి ఏ ఆనర్స్ డిగ్రీని పొందాడు .1923 లో కలకత్తా యూని వర్సిటీ నుంచి సంస్కృత ఎం.  ఏ . డిగ్రీ తీసుకొన్నాడు .

దుర్గా మోహన్ తన దృష్టిని విద్యారంగం పై నిలిపాడు .హౌరా లో నరసింహ దత్ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ గా చేరి ,తర్వాత స్కాటిష్ చర్చ్ సంస్కృత ప్రొఫెసర్ అయి 30 వ ఏటనే హెడ్ అయ్యాడు .1952లో వెస్ట్ బెంగాల్ సీనియర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లో సంస్కృత కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ ఆఫ్ వేదిక్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ గా నియమింపబడ్డాడు .అర్హతను బట్టి ఉద్యోగాలు వెతుక్కొంటూ వచ్చి నిలిచాయి .చనిపోయేదాకా ఈ పదవిలోనే ఉన్నాడు .భట్టాచార్య  సమర్ధత ను  గుర్తించి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ,ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ వంటి అగ్ర శ్రేణి సంస్థలు ఆహ్వానించి వేదం మొదలైన విషయాలపై ప్రసంగాలను ఏర్పాటు చేసి గౌరవించాయి .సంస్కృతం ,వేద వాగ్మయం లో ఆయన కృషికి ఈ సంస్థలు స్వర్ణ పతకాలను అందజేసి సత్కరించాయి.

అందరూ అనుకొంటున్నట్లుభారత దేశం లో  అధర్వ వేదం కనుమరుగు కాలేదని అనేక పరిశోధనలవలన  విషయ సేకరణ వలన నిర్ధారించాడు .దీనికి తగిన సాక్షాధారాల సేకరణ కోసం దేశం లోని అనేక ప్రాంతాలను సందర్శించాడు . చనిపోవటానికి కొన్నేళ్ళ కిందటనే ఒరిస్సాలోని’’ గుహిపాల్’’ గ్రామం లో అధర్వ వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగుతోందని ప్రత్యక్షంగా చూసి సంతృప్తి చెందాడు . గుహిపాల్ లోనే అధర్వ వేదం లోని తొమ్మిది సంహితలలోముఖ్యమైన ‘’పిప్పలాద సంహిత ‘’ఒరియా భాష లోఅనేక  వ్రాత ప్రతులలో  కనిపించింది .దుర్గామోహన  భట్టాచార్య  ఆనందానికి అవధులు లేకపోయింది  . అన్వేషణ ఫలించి అధర్వ వేదం అంతరించి పోలేదని లోకానికి సాక్షాధారాలతో నిరూపించి ఒక రకంగా అధర్వ వేద పునః ప్రతిష్ట చేసి దాని ప్రతిష్టను కాపాడి ఉనికిని చాటాడు .ఈ పరిశోధన విశ్వ వ్యాప్తం గా అందరి దృష్టినీ ఆకర్షించి భట్టా చార్యను ‘’అధర్వ వేదోద్ధారకుడు ‘’గా సన్మానించారు .

పిప్పలాద సంహితపై అనేక సంవత్సరాలు పరిశోధించి ,దాని ప్రచురణకు పూనుకొని ప్రపంచ వ్యాప్త గీర్వాణ విద్యా వేత్తల ప్రశంసలు పొందాడు .దురదృష్ట వశాత్తు కేన్సర్ వ్యాధి సోకి దుర్గా మోహన భట్టాచార్య 12-11-1965 న 66 వ ఏట పరమపదించాడు .మధ్యలో ఆగిపోయిన ఈ పనిని కుమారుడు దీపక్ భట్టాచార్య పూర్తిచేసి మొదటి 18 కాండల గ్రంధాన్నితయారు చేయగా కలకత్తా ఏషియాటిక్ సొసైటీ  మూడు భాగాలుగా1997 ,2008 ,2011 లో   ప్రచురించి లోకానికి అందజేసింది . భట్టాచార్య భార్య భవానీదేవి 1992 లో మరణించింది  .ఆ దంపతులకు అయిదుగురు కుమారులు నలుగురు కుమార్తెలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-17- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 19-3-1872 లో జన్మించింది .తండ్రి జనరల్ మైఖేల్ అలెక్సీ డోమంటో విచ్ 13 వ శతాబ్ది యుక్రెయిన్ కొస్సాక్ సంతతి వాడు .రష్యాటర్కీయుద్ధం లో రష్యాకు బల్గేరియా లో రష్యన్ అడ్మిని స్ట్రేషన్ కు సలహాదారుడు .ఉదార భావాలున్న వ్యక్తిగా ప్రసిద్ధుడు .కాని కడు పేద . మసాలినా మ్రావిన్స్కయా అనే ధనికురాలిని పెళ్లి చేసుకొన్నాడు . వీరిద్దరి కుమార్తెయే మైఖలోవానా .ఈమెను చిన్నప్పుడు అందరూ ‘’షుర ‘’అని పిలిచేవారు . తండ్రిదగ్గర చనువు ఎక్కువ .తండ్రి అభిప్రాయాలకు విలువ నిచ్చి హిస్టరీ తోపాటు అనేక భాషలు నేర్చింది. తల్లితో ఫ్రెంచ్ ,స్నేహితులతో ఇంగ్లిష్ ,రైతులతో ఫిన్నిష్ భాషలో మాట్లాడేది .యూని వర్సిటి లో చేరి చదువు కోవాలను కొన్నదికాని తల్లికి ఆడపిల్లలు ఉన్నత విద్య చదవటం ఇష్టం లేదు . యూని వర్సిటీ లో రాడికల్ భావాలు తీవ్రంగా విద్యార్ధులను ప్రభావితం చేస్తాయనే భయమూ ఉండేది .కనుక తల్లి ఇష్ట ప్రకారమే స్కూల్ టీచర్ గా ఉద్యోగానికి కావలసిన సర్టిఫికేట్ సాధించింది .

1889 -90 కాలం లో 19 వ ఏట ఇంజినీరింగ్ చదువుతూ మిలిటరీ ఇన్ స్టి ట్యూట్ లో పేరు నమోదు చేసుకొన్నపేద వ్లాడిమిర్ లుద్విగోవిచ్ కొల్లాంటి తో పరిచయమై పెళ్లి చేసుకోవాలను కొన్నది . ఆ నిరుపేద తో పెళ్ళికి తల్లి ఒప్పుకోకపోతే ,టీచర్ ఉద్యోగం తో సంసారం గడుపుతామని సమాధానం చెప్పి౦ది .కాని ఆమెను పశ్చిమ యూరప్ లో టూర్ చేయమని మిషతో పంపారు.ఆమె ప్రేమ బలమై ,ప్రేమించిన వాడినే1893 లో పెళ్లి చేసుకొని పంతం నెగ్గించుకొన్నది .కొద్దికాలానికే గర్భవతి అయి కొడుకు మైఖేల్ ను కన్నది.తీవ్ర వామ భావాల రాజకీయ సాహిత్యం అధ్యయనం చేస్తూ ఫిక్షన్ రాసింది .

భర్త వ్లాడిమిర్ రైతు ఆధార సంఘాన్ని పునర్నిర్మించాలనే పూనికతో ఉన్నాడు .యాంత్రికత తో విప్లవభావాలతో నవీన రష్యా ను నిర్మించాలన్న ఆలోచన కార్మిక కర్షకులలోవ్యాపించి పోయింది .పిరికిగా భయం భయంగా లైబ్రరీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడుపుతున్నాడు .ఇంతలో ఎలీనా స్టాసోవాఅనే మార్క్సిస్ట్ ఉద్యమకారునితో పరిచయమై ,అతను ఇస్తున్న చట్ట వ్యతిరేక రచనల పార్సిళ్ళను కొరియర్ గా అజ్ఞాత వ్యక్తులకు చేర వేస్తున్నాడు .తాను కుట్రకు గురయ్యానని గ్రహించి ప్రేమ వివాహం విచ్చిన్నమై కొడుకు మైఖేల్ ను తలిదండ్రులకు అప్పగించి ఆమె ఎకనామిక్స్ చదవటానికి స్విట్జర్ లాండ్ లోని జూరిచ్ కు 1898 లో వెళ్ళిపోయింది .అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్లి లేబర్ పార్టీ నాయకులతో పరిచయం పొందింది . మళ్ళీ1899లో రష్యా వచ్చివ్లాడిమిర్ లెనిన్ తో గాఢ పరిచయం పెంపొందిం చుకొన్నది .ఇదే ఆమె జీవితాన్ని కొత్త మలుపు త్రిప్పింది . 27 వ ఏట ‘’రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ‘’సభ్యత్వం పొంది 1905 లో సెయింట్ పీటర్స్ బర్గ్ లో వింటర్ పాలెస్ ముందు జరిగిన ‘’బ్లడీ సండే ‘’కు ప్రత్యక్ష సాక్షి అయింది .

1905 లో జర్మనీ కి ప్రవాసం వెళ్ళింది .’’ఫిన్లాండ్ అండ్ సోషలిజం ‘’పుస్తకం రాసి ఫిన్లాండ్ ప్రజలను రష్యా జార్ నియంతల సామ్రాజ్య వాదానికి ఎదురు తిరిగి పోరాటం చేయమని ప్రోత్సహించింది .ఇంగ్లాండ్ జర్మని ఫ్రాన్స్ లలో పర్యటించి రోసా రుక్సే౦ బర్గ్ ,కార్ల్ లీబ్నేట్ లను పరిచయం చేసుకొన్నది .1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధ వ్యతిరేకి కనుక జర్మనీ వదిలి డెన్మార్క్ చేరి ,అక్కడ ఆ దేశం కూడా యుద్ధాన్ని సమర్దిస్తోందని గ్రహించి నిరాశ చెంది , స్వీడెన్ వెళ్లి అక్కడ తన ఉపన్యాసాలతో, రచనలతో వారిని యుద్ధ వ్యతిరేకులుగా మార్చాలను కొన్నది .కాని ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది .విడుదలకాగానే నార్వే వెళ్లి అక్కడి సోషలిస్ట్ కమ్యూనిటి తన భావాలకు గౌరవమివ్వటం వలన 1917 వరకు అక్కడే ఉండి పోయింది .1917 లో రష్యాలో కాలు పెట్టగానే జార్ నియంతల సామ్రాజ్యం పతనమై రష్యా రివల్యూషన్ ఊపులో ఉందని గ్రహించింది .

తాను సభ్యత్వం తీసుకొన్న పార్టీ జూలియస్ మార్టోవ్ నాయకత్వం లో మెన్షెవిక్ పార్టీ గా ,లెనిన్ నాయకత్వం లో బోల్షెవిక్ పార్టీ గా చీలి పోయింది .మొదట్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా 1904 లో లెనిన్ పార్టీ బోల్షెవిక్ లకు మద్దతు నిచ్చింది .1917 అక్టోబర్ విప్లవం తర్వాత కొల్లాంటి రాజకీయ జీవితం ప్రారంభమైంది .సోషల్ వెల్ఫేర్ కు పీపుల్స్ కమ్మిస్సార్ అయింది. 1919 లో’’ మహిళా డిపార్ట్ మెంట్ ‘’ ఏర్పరచి దేశం లో పరిపాలన యంత్రాంగం లో బాగా ప్రాముఖ్యాన్ని పొందింది . ఈ సంస్థ స్త్రీ సంక్షేమానికి, విద్య కు ,ఉపాధికి ,వివాహాలకు కృషి చేసింది .విప్లవ సమయం లో మహిళలకు చేసిన వాగ్దానాలన్నీ నెర వేరేట్లు చేసింది . మిగిలిన మహిళా నాయకుల భావాలకు వ్యతిరేకంగా ‘’లిబరల్ ఫెమినిజం ‘’ను వ్యతిరేకించింది .ఆ భావాన్ని బూర్జువా భావం అన్నది .1930 లో డిపార్ట్ మెంట్ మూసేశారు .1917 లో పావెల్ డేబెంకో ను పెళ్లి చేసుకొన్నది .

ప్రభుత్వం లో ఉంటూనే కమ్యూనిస్ట్ పార్టీ చేసే తప్పులను తెలియ బరుస్తూ ,అలేక్సాండర్ షిప్లికోవ్ తో కలిసి ‘’వర్కర్స్ అపోజిషన్ ‘’ఏర్పాటు చేసింది .లెనిన్ దీన్ని రద్దు చేసి ,ఆమె కు ప్రాముఖ్యం తగ్గించేశాడు .1920 నుంచి అనేక డిప్లమాటిక్ స్థాయిలలో పని చేసి ,రష్యాలో మహిళా సాధికారత కోసం తీవ్ర కృషి చేసింది .1923 లో నార్వే రాయబారిగా పని చేసింది .ప్రపంచం లో రెండవ మహిళా రాయబారి గా రికార్డ్ నెలకొల్పింది .మొదటి ఆమె డయానా అబ్గర్ జపాన్ లో అమెరికా రాయబారి గా చరిత్ర సృష్టించింది . తర్వాత మెక్సికో, స్వీడెన్ దేశ రాయబారిగా1926 నుంచి 1945 వరకు సుదీర్ఘకాలం పని చేసి సమర్ధతను నిరూపించుకొన్నది ..ఆమె స్టాక్ హోం లో ఉండగానే

‘’వింటర్ వార్ ‘’ రష్యా ,ఫిన్లాండ్ మధ్య జరిగింది . ఆమె ప్రభావంతో స్వీడెన్ తటస్థంగా ఉండి పోయింది .యుద్ధానంతరం ఆమె ‘’వ్యాచస్లావ్ మోలోటోవ్ ‘’పురస్కారం పొందింది .అనేక శాంతి సంభాషణలలో చురుకైన పాత్ర పోషించింది .లీగ్ ఆఫ్ నేషన్స్ కు రష్యా డెలిగేషన్ లో మెంబర్ గా ఉన్నది .కార్మిక మాతకు తన ,పర భేదం ఉండరాదని హితవు చెప్పేది .మాతృత్వానికి విలువనివ్వాలని కోరేది.

అలేక్సాండ్రా కొల్లాంటి 80 వ ఏట మాస్కో లో 9-3-1952 న మరణించింది .ఆమె పై ‘’వేవ్ ఆఫ్ పాషన్ ‘’సినిమా తీశారు . బ్రిటన్ ,అమెరికాలలో 1960 లో రాడికలిజం ,1970 లో ఫెమినిస్ట్ ఉద్యమం రావటానికి ముఖ్య కారణం ఆమె రచనలే .అంతటి ప్రభావ శీలి ఆమె .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

వసంత విలాసి కృష్ణ శాస్త్రి మహా దేశ భక్తుడు -టిప్పు సుల్తాన్ -జ్యోతి -1-11-17

Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -12(చివరి భాగం )

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -12(చివరి భాగం )

శివానందలహరి లో అద్వైత స్థితి

‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో –‘’శ్లోకం లో శివుని అద్వైత స్థితి ని వర్ణించారు శంకరాచార్య .మహా ప్రళయం లో కూడా పరమేశ్వరుడు ఆనంద లహరిలో తేలియాడుతూ,నిశ్చలంగా  ఉంటాడు .ఇదే అద్వైత స్థితి .ఇ౦దులో ఆన౦ద లహరి ఒక గొప్ప అనుభవ స్థితి .

‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో ,భవ –ద్ధైర్యం చేద్రుశ మాత్మన స్థితిరియం చాన్యైః కథం లభ్యతే

భ్రశ్య ద్దేవ గణం త్రసన్ముని గణం నశ్య త్ప్రపంచం లయం –పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భావాన్ ‘’

శంభో పశుపతీ !నీ ధైర్యానికి జోహార్లు .నీ సాహసానికి జోహార్లు .నీ అచంచల ఆత్మ స్థితి బహు ప్రశంశ  నీయం. ప్రళయ కాలం లో దేవతలు కూడా స్థాన భ్రంశం చెందుతున్నారు .భయం తో వణికి పోతుంటారు .నీ కళ్ళ యెదుటనే ప్రపంచం నశించి పోతోంది .ఇదంతా చూస్తూ నువ్వు మాత్రం నిశ్చలంగా  ఆనంద సముద్ర లహరి లో హాయిగా తేలియాడుతూ ఉంటావు .అని అద్వైతానందాను భూతిని ఆచార్య శంకరులు అద్భుతంగా ఆవిష్కరించారు .

అలాగే ‘’అంకోలం నిజ బీజ సంతతి –‘’శ్లోకం లోనూ అద్వైత సిద్ధాంత ప్రదర్శన చేసిన సంగతి తెలుసుకొన్నాం .నదులు  సముద్రం లో కలిసి తమ నామ రూపాలు అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రమే నన్న భావం గా కలిసిపోతాయి  .ఇదే అద్వైత స్థితి లో ఆంతర్యం .

ఈశ్వరుడు మనలోనే ఉంటె  ఈశ్వర ప్రార్ధన నిరంతరం చేస్తుంటే జ్ఞాన ప్రాప్తి జరిగి ,అరిషడ్వర్గాలు నశించి అద్వైత సిద్ధి లభిస్తుంది అని ఇదివరకటి శ్లోకాలలో తెలుసుకొన్నాం .  ఇలాంటి శ్లోకాలు ఎన్ని చెప్పుకొన్నా సంతృప్తి ఉండదు . నిత్య సాధనతో పరమేశ్వర చిత్త లగ్నమానసులమైతే ఆచార్య శంకరులు ప్రవచించిన శివానంద లహరి అనే అద్వైత సిద్ధి లభిస్తుందని గ్రహించాలని మనవి చేస్తూ ‘’శంకరుల శివానందలహరి ఆంతర్యం ‘’ధారావాహిక కు  ఇంతటితో సమాప్తి పలుకు తున్నాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్  .

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీసత్య నారాయణ స్వామి వ్రతం

శ్రీసత్య నారాయణ స్వామి వ్రతం

— 4- 11- 17 శనివారం ఉదయం 7 గంటలకు మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రుద్రాభిషేకం ,అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొంటున్నాము . మీరందరూ తప్పక వచ్చి రెండు కార్యక్రమాలలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాము

5-11-17 ఆదివారం ఉదయం 6 గంటలకు మల్లాపూర్ లో కారులో బయల్దేరి  5 గంటల ప్రయాణ దూరం లో కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ప్రముఖ దత్తాత్రేయ క్షేత్రం   గానుగా పురం లో వేంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం లో స్వామి వారిని  దర్శించి s , సాయం కాలానికి మల్లాపూర్ చేరుతాము . ఈ దైవ దర్శనకార్యక్రమం లో కూడా పాల్గొనమని కోరిక -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వినయం తో విన్నపం

వినయం తో విన్నపం

— రిసెర్చ్ కృషి లాంటి ఈ బృహద్గ్రంథం  ‘’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”ప్రచురణలోనాకు,సరసభారతికి,,ప్రాయోజకులకు ,అంకితంపొందుతున్నవారికీ ఎవరికీ ప్రతిఫలాపేక్ష ,వ్యాపార దృష్టి లేదని ప్రపంచ పురోగతికి మార్గ దర్శకులైన మహనీయుల జీవిత విశేషాలు సాధించిన ఘనవిజయాలను  ,తెలియని వారికీ ,ముఖ్యంగా నేటి యువతకు ,అభిరుచి ఉన్న ఆసక్తిగల పాఠకుల దృష్టికి తెచ్చి,ఇంతటి సమాచారాన్ని  అందుబాటులో ఉంచటమే మా  ప్రధాన లక్ష్యమని   మనస్పూర్తిగా తెలియ బరుస్తున్నాను .

 

గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17

 

ఎందరో మహానుభావులు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు అనే ఈ గ్రంధానికి  ఆధరాభిమానాలతో ముందుమాటలు రచించిన డా సవరం వెంకటేశ్వరరావు గారికి  -హిస్టరీ హెడ్ -హిందూ కాలేజీ -మచిలీపట్నం ,అభిలషణీయమైన ఆకర్షణీయ అర్ధవంతమైన ముఖ చిత్రాలను డిజైన్ చేసిన శ్రీ కళాసాగర్ గారికి ,డిటిపి చేసి సరసభారతి తరఫున అందంగా  ముద్రి0పజేసి ,అందజేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం  కార్యదర్శి ,రమ్య భారతి సంపాదకులు ,సరసభారతి ఆత్మీయులు శ్రీ చలపాక ప్రకాష్ గారికీ ,  కీ శే డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితమిప్పించి  సార్ధకత కల్పించి ,ప్రాయోజకులుగా సరసభారతి తరఫున గ్రంథ ముద్రణకు తోడ్పడిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులకు , నాతోపాటు అడుగులేస్తూ సహకరిస్తున్న సరసభారతి కార్యవర్గానికి కృతజ్ఞతలు . నా రచనలకు ప్రోత్సాహమిస్తున్న నా అర్ధాంగి శ్రీమతి ప్రభావతికి ,నా కుటుంబ సభ్యులకు అభినందనలు.                                                                                   గబ్బిట దుర్గాప్రసాద్ –

 

వదాన్యులకు వందనాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలకు భక్తితోను , ,సరసభారతి కార్యక్రమాలకు ,గ్రంథ ముద్రణలకు ఆదరాభిమానాలతోనూ  విరాళాలు అంద  జేసిన వదాన్యులైన దాతలకు కృతజ్ఞతలు -గబ్బిట దుర్గాప్రసాద్

1-శ్రీ వేలూరి పవన్ ,శ్రీమతి రాధ దంపతులు -అమెరికా     రూ 15,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ ,శ్రీమతి దుర్గ దంపతులు -హైదరాబాద్ -13,116

3-శ్రీ కోమలి సాంబావదాని శ్రీమతి విజయలక్ష్మి దంపతులు -అమెరికా –10,000

4-శ్రీ అడుసుమిల్లి రాంకీ ,శ్రీమతి ఉష దంపతులు -అమెరికా                  9,000

5-చి గబ్బిట సంకల్ప్ –అమెరికా                                                     7,500

6-శ్రీ గౌడ రఘు శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా                            7,000

7 -శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు -అమెరికా              7,000

8-శ్రీ వీటూరి రామ కృష్ణ ,శ్రీమతి పద్మజ దంపతులు -అమెరికా                   6,600

9-శ్రీ జగ్గా లోకానాధ్ ,శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా                         6,000

10-డా శ్రీ బండారు రాధాకృష్ణమూర్తి డాశ్రీమతి  సులోచన దంపతులు -అమెరికా 6,000

11-శ్రీ వాసుకి ,శ్రీమతి మాలిని దంపతులు -అమెరికా                                  5,000

12-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు -హైదరాబాద్          5,000

13-శ్రీ రావి శరత్ శ్రీమతి ఉష దంపతులు -అమెరికా                                    5,000

14-శ్రీ గోసుకోండ నరేంద్ర శ్రీమతి అరుణ దంపతులు  -అమెరికా                       4,000

15-శ్రీ గ్రంధి హరి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు -అమెరికా                           3,500

16-శ్రీ వేలూరి హరికిషన్ శ్రీమతి శారిక దంపతులు -అమెరికా                            3,000

17-శ్రీమతి వేణి దంపతులు అమెరికా                                                          2,500

18-శ్రీ అడుసుమిల్లి పవన్ సాయి శ్రీమతి పద్మశ్రీ దంపతులు -అమెరికా                2,500

19-శ్రీమతి పసుమర్తి లక్ష్మి -అమెరికా                                                           2,000

-20-శ్రీ గార్లపాటి ప్రసాదావధాని శ్రీమతి అనసూయ దంపతులు -అమెరికా              1,500

– 21-శ్రీ నాగరాజు శ్రీమతి రంజని దంపతులు -అమెరికా                                      1,250

22-శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తి  శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులు-ఖమ్మం     5,00

23-శ్రీమతి చతుర్వేదుల జానకి -విజయవాడ                                                   5,00

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-

స్థూల సూక్ష్మ కారణ శరీరాల లయం

1-      స్థూల శరీరం -పంచ భూతాలూ ,అయిదు కర్మేంద్రియాలు ,అయిదు జ్ఞానేంద్రియాలు ,పంచ ప్రాణాలు ,,నాలుగు అంతః కారణాలు –కలిసిన మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం –ఈ 24 తత్వాలు లయం అయితేనే మోక్షం .అందుకే శంకారాచార్య 24 సార్లు మహేశ్వర పాద పద్మాల స్మరణ చేశారు .ఇలా స్మరణ చేస్తే స్థూల శరీరం పర బ్రహ్మలో లయం అవుతుందని ఆచార్యుల వారి ఆంతర్యం అని గ్రహించాలి .

2-      సూక్ష్మ శరీరం –పంచ ప్రాణాలు ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనసు  ,బుద్ధి కలిస్తే సూక్ష్మ శరీరం .ఇవి 17 తత్వాలు .ఇవీ లయం కావాలని 17 సార్లు పశుపతిని స్మరించారు .మనసును 18 వస్తువులతో పోల్చటం ఆ 17 తత్వాల సూక్ష్మదేహం  లయం అవటానికే నని ఆంతర్యం .

3-      కారణ శరీరం –ఇది ఆకారం లేనిదేకాక పుట్టుక ,చావులకు కారణమైనదికూడా.

దీనికోసం ‘’ఆశాపాశ క్లేశ దుర్వాసనాది —‘’శ్లోకం చెప్పి మనస్సు అనే పెట్టెలో ఈశ్వర పాద పద్మాలుంటే వాసనా క్షయమై కారణ శరీరం లయమౌతుందని  అప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుందని ఇది వరకే గ్రహించాం . పాదాలు మనం నిలకడ గా ఉండటానికిఆధారం గా  తోడ్పడతాయి .అంఘ్రి అన్నా పాదాలే ఉత్తమ గతి పొందించేవి అని అర్ధం .సన్మార్గం లో సంచరి౦చటానికి సహకరించేవి చరణాలు .దేవతల శక్తులన్నీ భగవంతుని పాదాలలోనే ఉంటాయట .

పాద పద్మాలు అనే మాటకు ఆంతర్యం ఆత్మ,పరమాత్మల జ్ఞానాలే భగవంతుని పాదపద్మాలు .భగవంతుని లీలలు ఒక పాదం అయితే ఆ౦తరిక అర్ధం మరో పాదం అన్నారు విజ్ఞులు .శివుడు ఒక పాదం అయితే శక్తి మరోపాదం  అన్నారు.

శంకరాచార్య పాదాలను భక్తి పూర్వకంగా పాదపద్మాలన్నారు .జీవులను సంసార లంపటం నుంచి తరి౦పజేసేవి భగత్పాదపద్మాలు .

ఈ విధంగా శివానంద లహరి లో శంకర భాగవత్పాదులవారు సదాశివ పాద పద్మార్చనం ,స్మరణం ,కీర్తనం,పాద సంసేవనం అందరూ చేసి తరి౦చాలని భావించారు . ఇది శిరోధార్యం మార్గ దర్శకం కైవల్య సాధనం ,సంసార తరుణోపాయం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-17 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -10

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం –10

అన్తఃకరణాలలో రెండవదైన బుద్ధి గురించి శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకాలను తెలుసుకొందాం .

విషయాన్ని నిశ్చయించే మానసిక స్థితి ని బుద్ధి అంటారు .జడ బుద్ధి ఉన్నవాడు పరమేశ్వర చి౦తనానికి దూరం గా ఉంటాడు అనే భావంగా చెప్పిన శ్లోకం –

‘’అసారే సంసారే నిజభజన దూరే ‘’శ్లోకం లో దీని వివరణ ఇదివరకే తెలుసుకొన్నాం .మరో శ్లోకం –

‘’యథా బుద్ధి శ్శుక్తౌ రజత మితి కాచాశ్మని మణి-ర్జలే పైస్టేక్షీరం భవతి మృగ త్రుష్ణాసు సలిలం

తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యో జడజనో –మహా దేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ‘’

దేవతలే ఆరాధించే పరమ శివా పశుపతీ !మూఢుడు సత్యం కాని దాన్ని సత్యం అని భ్రమ పడుతున్నాడు .తాను వేరు బ్రహ్మం వేరు అనుకొంటున్నాడు .అది నిజం కాదని ఆ వెర్రి మాలోకానికి తెలీదు పాపం .నువ్వు నిత్య సత్య సచ్చిదానంద స్వరూపుడివి .కాని వాడు నిన్ను వదిలేసి చిన్న దేవతలనే నమ్ముతున్నాడు .ఇది ఎలా ఉందీ అంటే ముత్యపు చిప్పను చూసి వెండి అని,  గాజు ముక్కను చూసి మణి అని, ఎండమావి ని చూసి నీరు అని భ్రమించటం లాగా ఉంది .కనుక నిన్నే సేవిస్తే ఈ భ్రమ ప్రమాదం వాడికి ఉండదు .ఇతర దేవతలను సేవిస్తే లౌకిక తాత్కాలిక ప్రయోజనాలే నేర వేరుతాయి . నిన్ను సేవిస్తే శాశ్వత ముక్తి లభిస్తుంది .నువ్వుఅవిద్యా నిర్మూలనం చేసి మోక్షం ప్రసాదిస్తావు .జీవుడు మాయావృతుడు .నీవు మాయాతీతుడవు .

అలాగే ‘’గభీరే కాసారే విశతి విజనే –‘’శ్లోకం లోనూ ఇదే భావాన్ని వివరించారని తెలుసుకొన్నాం

జడ బుద్ధిని జ్ఞానం లో నిలపాలి అప్పుడే తరుణోపాయం అని చెప్పెశ్లోక౦

‘’మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ –కరశ్చాభ్యర్చాయాం శ్రుతి రపి కథాకర్ణన విధౌ

తవ ధ్యానే బుద్ధిః నయన యుగళం మూర్తి విభవే -పరగ్రంథాన్ కైర్వాపరమశివ జానే పరమతః ‘’

నా మనసు నీ పాద పద్మాల మీద లగ్నమవ్వాలి .తామర పువ్వుకు ఏమీ అంటనట్లు  నామనసుకు ఏ మాలిన్యమూ అంటరాదు.శివ జ్ఞానం అనే మకరందాన్ని మాత్రమే ఆస్వాదించాలి .నిన్ను స్తుతించే వేద,ఇతిహాస ,పురాణ స్తుతినే వింటూ ఉండాలి .కావ్యాలు, గేయాలు, పద్యాలలో నీ స్తుతే వినిపించాలి చేతులు నిన్నే అర్చించాలి .చెవులు నీ గాథలే వింటూ ఉండాలి . నాబుద్ధి నీధ్యాన లగ్నమవ్వాలి .నాకళ్ళు నీ రూప సౌందర్య దర్శనం తో ధన్యమవాలి .నువ్వే ప్రపంచం,ప్రపంచమే నువ్వు అనే భావన మనసు ,బుద్ధి లో నిండిపోవాలి .నా సర్వేంద్రియాలు నీ చుట్టూనే పరి భ్రమించాలి .ఇలా బుద్ధిని నీకై సర్వ సమర్పణ చేస్తే ,సాయుజ్యమే కదా కలిగేది .

1-      చిత్తం –‘’చింతన కతృత్వం చిత్తం –‘’జ్ఞాపకాల పొరలు ఉన్నది చిత్తం.చిత్తం లో పరమేశ్వర పరిమళాలు నింపుకోవాలి అని –

‘’పాపోత్పాత విమోచనాయ రుచి రైశ్వర్యాయ మృత్యుంజయ –స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే

జిహ్వా చిత్త శిరో౦ఘ్రి హస్త నయన శ్త్రోత్రై రహం ప్రార్ధితో –మా మా జ్ఞాపయ  ముహుర్మామేవ మా  మే వచః ‘’

మృత్యుంజయ మూర్తీ శివా !నాఇంద్రియాలన్నీ నిన్నే ప్రార్దిస్తున్నాయి .ఎందుకంటె తమవలన నేరాలు ఏవైనా జరిగితే అవి పాపాలకు కారణం అవుతాయని .పాపాలు మనోహరమైన ఈశ్వర సంబంధమైన జ్ఞాన సంపదను అనుభవించ కుండా అడ్డుపడతాయి .కనుక పాపాలవల్ల జరిగే ఉత్పాతాలు కలగకుండా ఇంద్రియాలన్నీ నిన్నే సేవిస్తున్నాయి .నాలుక నిన్ను స్తోత్రం చేయటానికి , చిత్తం నీ సంబంధమైన ధ్యానం చేయటానికి  చేతులు నిన్ను పూజించటానికి ,కళ్ళు నిన్నే దర్శించటానికి ,శిరస్సు నీకే నమస్కరించటానికి ,పాదాలు నీ చుట్టూ ప్రదక్షిణం చేయటానికి  ,చెవులు నీకథలే వినటానికి అనుకూలంగా ఉంచమని వేడుకొంటున్నాయి.అందుకని ఓ ప్రభూ నన్ను ఆ ఇంద్రియాలు కోరినట్లు ఆజ్ఞాపించు .నాకు మూగతనం చెవుడు ,గుడ్డితనం కుంటితనం రాకుండా చూడు .ఈ ఆవ లక్షణాలు లేకపోతె  హాయిగా నాఇంద్రియాలు నీ సేవలో ధన్యమౌతాయి

4-ఆహ౦కార౦  -.’’అహం కర్తా అహంకారః ‘’అని శకరాచార్య నిర్వచనం .నేను చేస్తున్నాను అనే భావమే అహంకారం .ఇది అనర్ధ హేతువు దాన్ని వదిలించుకోవాలి .దీనికోసం

‘’త్వత్పాదాంబుజ మర్చయామి –‘’శ్లోకం లో ఈ విషయాన్నే  చెప్పారు.  దీన్ని మనం తెలుసుకొన్నాం .అలాగే 

‘’మనస్తే పాదాబ్జే –‘’శ్లోకం లోని భావాలూ గ్రహించాం –

‘’సా రసనే తే నయనే –తావేవ కరౌ స ఏవ కృతకృత్యః

యా యే యౌయో భర్గం-వద తీక్షతే సదార్చత స్స్మరతి’’

శివ నామం ఉచ్చ రించే నాలుకే నాలుక .శివుని దర్శించే నేత్రాలే నేత్రాలు .మహా దేవుని పూజించే చేతులే చేతులు .నిరంతరం సదాశివుని స్మరించేవాడే కృతకృత్యుడు .పోతనగారుకూడా ‘’కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ —‘’అన్నారు .చివరగా –

‘’క్రీడార్ధం సృజసి ప్రపంచ మఖిలం క్రీడా మృగా స్తే జనాః –యత్కర్మా చరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్

శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేస్టితం నిశ్చితం –తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్య మేవ త్వయా ‘’

ప్రపంచాన్ని ఆటగా సృస్టిస్తావు.ఆ ఆటలో మేమందరం క్రీడా మృగాలమే .నువ్వు సృష్టించిన అడవి జంతువును నేను . నీ పెంపుడు జంతువును కూడా .కనుక నేను చేసే పనులన్నీ నీకు ఇష్టంగానే ఉంటాయి .పెంపుడు జంతువంటే  యజమానికి వల్లమాలిన అభిమానం కదా .కనుక నన్ను రక్షించటం నీ బాధ్యత ,కర్తవ్యమ్ కూడా .కారణం నువ్వు పశుపతివి .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-17 –ఉయ్యూరు

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9

మనసు ను చాతకం ,చక్రవాకం,చకోరం హంస లతో కూడా పోల్చి శంకరాచార్య శ్లోకాలు చెప్పారు –

‘’హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః –కోకః కోకనది ప్రియం ,ప్రతిదినం చంద్రం చకోర స్తదా

చేతో వా౦ఛతి మామకం ,పశుపతే ,చిన్మార్గ మృగ్యం విభో-గౌరీనాథ,భవత్పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్య ప్రదం ‘’

హంస నిండుగా పద్మాలున్న కొలను లో విహరించాలని కోరుకొంటుంది .చక్రవాకం సూర్యుడిరాక కోసం ఎదురు చూస్తుంది .చక్రవాకం చంద్రుని  వెన్నెల కోసం నిరీక్షిస్తుంది .చాతక పక్షి నీల మేఘం ఎప్పుడు వర్షిస్తుందా అని అర్రులు చాస్తూ ఎదురు చూస్తుంది .అలాగే నేను జ్ఞానమార్గం చూపించే  గౌరీ నాధుని పాద పద్మాలద్వారా మోక్షం కోసం ఎదురు చూస్తున్నాను .

  పై నాలుగు పక్షులు కంటికి కనిపించవు .మనసు కూడా అంతే .ఆ పక్షులకున్న విశిష్ట గుణాలవంటివి మన మనసుకు కూడా ఉన్నాయి .ఈ సుగుణాలతో సాధన సాగించమని ఆంతర్యం .

1-హంస పాలు నీళ్ళను వేరు చేస్తుంది .అంటే పాలను వేరు చేస్తుంది .అంటే గుణాన్ని గ్రహించటం హంస లక్షణం .అలాగే హంస తన జీవితకాలం లో ఒక హంస తోనే జత కడుతుంది .మరో హంస వైపు చూడదు .అలాగే భక్తుడు తన చూపును ఈశ్వరుని వైపే చూడాలని ఆంతర్యం .2- చాతక పక్షి శరత్కాల నీల మేఘాన్ని తప్ప మరొక దాన్ని యాచించదు .అన్నికాలాలలోవర్షం పడినా చాతకానికి ఆ నీరు అక్కర్లేదు .అలాగే మనం కూడా మోక్షాన్ని ఇచ్చే ఈశ్వరునే యాచించాలని భావం .3-చకోర పక్షి వెన్నెలలోని అమృతాన్ని ఆస్వాదిస్తుంది .అమృతం చంద్రునిలో మాత్రమే ఉంటుందని దానికి తెలుసు .దీనికోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది .మనం కూడా నిరంతర ప్రయత్నం తో అద్వైతామృతాన్నిపొందాలని సందేశం .-  4- చక్రవాకం పత్నీ వియోగాన్ని పోగొట్టుకోవటానికి సూర్యుని కోసం ఎదురు చూస్తుంది .జీవుడు కూడా పరమాత్మ వైపే దృష్టి సారించాలని సూచన .ఈ నాలుగు పక్షులు తమ గుణాలవలన మానవుని కి గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్నిస్తున్నాయని ఆంతర్యం  .

  మరొక శ్లోకం లో మనసును చాతకం తో పోల్చారు –

‘’కారుణ్యామృత వర్షిణం ,ఘన విపద్గ్రీష్మ చ్ఛిదాకర్మఠం-విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సం సేవ్య మిచ్ఛాకృతిం

నృత్యద్భక్త మయూర మద్రినిలయం  సంసజ్జటామండలం –శంభో ,వాంఛతి నీలకంధర,సదా త్వాం మే మనశ్చాతకః ‘’

ఈ శ్లోకం లో నీలకంఠుడైన శివుడికి, మేఘానికి భేదం లేనట్లుగా చమత్కరించారు శంకరాచార్య

ఆ నీల మేఘం కారుణ్యం అనే అమృతాన్ని వర్షిస్తుంది .గ్రీష్మ తాపాన్ని పోగొడుతుంది .పంటలు బాగా పండుతాయి కనుక రైతులు పూజిస్తారు .వాళ్ళు కోరిన కోరికలను మేఘం తీరుస్తుంది .మేఘాలను చూసి నెమళ్ళు  ఆనంద పరవశంతో నాట్యం చేస్తాయి. మేఘం ఎత్తైన కొండల మీద ఉంటుంది . కం అంటే నీరు ధర అంటే ధరించినది అంటే నీటిని కలిగిఉన్న మేఘం అని అర్ధం .ఆ నీటితో తన దాహార్తిని తీర్చమని చాతక పక్షి నీల మేఘాన్ని కోరుతోంది

  గరళాన్ని మింగటం చేత శివుడి కంఠం నల్లబడింది కనుక నీల కంఠుడు.కంధరం అంటే మెడ కనుక నీల క౦ధరుడు  .ఈయన కరుణ అనే అమృతాన్ని వర్షిస్తాడు .ఆపదలను తొలగించి ,జ్ఞానం అనే పంటలు పండిస్తాడు .దేవతలు ఆయనను సేవిస్తారు ,ఆనంద పరవశంతో నాట్యం చేస్తారు .కైలాస పర్వత వాసి ,జటా జూట ధారి శివుడు .అలాంటి కరుణానిధి అయిన శివుడిని నా మనస్సు అనే చాతకపక్షికోసం  కారుణ్యం అనే అమృతాన్ని వర్షించమని ప్రార్ధిస్తోంది అని ఆంతర్యం .

 మనసును ఒక పెట్టె గా అభి వర్ణించి మరోశ్లోకం రచించారు –

‘’ఆశా పాశ క్లేశ దుర్వాసనాది-భేదో ద్యుక్తైర్దివ్య గంధై రమందై

ఆశా శాటీకస్య పాదారవిందం –చేతః పేటీం వాసితాంమే తనోతు ‘’

నా మనసు ఒక పెట్టె.దాని నిండా అవిద్య ,అస్మితం ,రాగం ,ద్వేషం  అభినివేశం అనే అయిదు క్లేశాలు అనే దుర్వాసనతో ఉంది . ఇవి దుఃఖ హేతువులు .దిక్కులే వస్త్రాలుకల దిగంబరుడైన శివుడిపాద పద్మాలు నా మనస్సు అనే పెట్టెలో ఉంటే ఆ క్లేశ దుర్వాసనలు అన్నీ తొలగి పోతాయి .

అవిద్య అంటే అజ్ఞానం .అస్మితం అంటే సుఖ దుఖాలు నేను అనుభవిస్తున్నాను అనే భావం వలన కలిగే దుఖం .రాగం అంటే ఇష్టమైన దానిపై కోరిక అవి దూరమైతే దుఖం .ద్వేషం అంటే ఇష్టం లేని వస్తువులు దగ్గరైతే కలిగేది .అభినివేశం అంటే తనను తాను ప్రేమించటం  మరణాదుల వలన కలిగే దుఖం .ఈ క్లేశాలు నశించాలంటే శివజ్ఞానం ఒక్కటే మార్గం అని ఆంతర్యం .

 మనసు ఒక గుర్రం అని ఇంకో శ్లోకం –

‘’కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం –సర్వేంగితజ్నమనఘం ధ్రువ లక్షణాఢ్య౦

 చేత స్తురంగ మధిరుహ్య చరస్మరారే –నేత స్సమస్త జగతాం వ్రుషభాధి రూఢః’’

ఈశ్వరా !నామనసు ఒక గుర్రం .దాని నడక చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది . దాని పరుగు వేగం చాలా ఎక్కువ .మనో భావాలను ఇట్టే పసిగట్టే నేర్పు దానికి ఉంది.దోషాలు లేని మాంచి జాతికి చెందిన సాముద్రికలక్షణాలన్నీ కలిగి ఉన్న కల్యాణి జాతి గుర్రం .నువ్వు సర్వ లోకాధినేతవు .వృషభారూఢుడవు.నువ్వే నా మనసనే పంచకల్యాణి గుర్రాన్ని అధిరోహించి తిరగమని  వేడు కొంటున్నాను .

  గుర్రానికి ఉండే సరస చిత్ర గతి 5 రకాలు -1-అతి వేగం అతి నెమ్మది కాకుండా మధ్యరకం గా పరిగెత్తటం 2- .వేగంగా చాతుర్యంగా పరిగెత్తటం 3-వంకర టికర కాకుండా తిన్ననైన మార్గం లో గమనం 4-పైకి కాళ్ళు కదిలిస్తూ పరిగెత్తటం 5-ఒకే రకమైన వేగం తో ఎంతదూరమైనా పరిగెత్తటం.

  ఈ అయిదు రకాల గమనం మన మనసును నడిపే పంచేంద్రియాలకు సంకేతం .రౌతు అంటే గుర్రాన్ని నడిపే వాడు సమర్దుడైతే పొగరుబోతు గుర్రమైనా చెప్పినట్లు దారికొచ్చి మాట వింటుంది .కనుక సర్వ సమర్ధుడైన ఈశ్వరుడే మన మనసనే గుర్రాన్ని ఎక్కితే అది దారికి తప్పకుండా వస్తుందని ఆంతర్యం .

 ఇదికాక మనసును చెరువుతో ,ఇంటితో కూడా పోల్చారు . ఆశ్లోక వైభవాలను ముందే తెలుసుకొన్నాం .

  మనసు అనే మొదటి అంతః కరణ పూర్తయింది .  రెండవదైన బుద్ధి గురించి  తర్వాత తెలుసుకొందాం .

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -8

శ్రీ శంకరుల శివానంద లహరి  ఆంతర్యం -8

మనసు కోతి వంటిది .నిలకడ ఉండదు అన్నీ కావాలను కొంటుంది ఎంగిలి చేసి వదిలేస్తుంది .మోహంఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –

‘’సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ –నటత్యాశా శాఖా స్పటతిఝడితి స్వైర మభితః

కపాలిన్ భిక్షో  మే హృదయ కపి మత్యంత చపలం –దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో ‘’

మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది .చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది .దాన్ని అదుపు చేసి బంధించటం కష్టం .దానికి మోహం ఎక్కువ .పరుగులు పెడుతూ ఉంటుంది .నా వశం లో లేని నా మనసును నువ్వే భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో .నువ్వు భక్తి  అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆది భిక్షుడవు .

  మనసు ఒక ఇల్లు అంటూ –‘’శివ ,తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా –భవ మమ గుణ ధుర్యాం  బుద్ధికన్యాం ప్రదాస్యే

సకల భువన బంధో సచ్చిదానంద సింధో-సదయ హృదయ గేహే సర్వదా సంవస త్వం ‘’

సకల భువన బంధువైన శివా !నా మనసు ఒక ఇల్లు .నాబుద్ధి ఒక కన్య .ఆకన్య గుణ గరిస్టురాలు.దాన్ని నీకు అర్పించాలని సంకల్పిస్తున్నా .నా కోరిక మన్నించి నామనసు అనే ఇంట్లో పార్వతీ దేవి తో వచ్చి ఉండిపో .నాబుద్ధికన్యను గ్రహించి ఇల్లరికపు అల్లుడిలాగా ఇక్కడే ఉంటే నిన్ను సదా సేవిస్తూ ధన్యుడనవుతాను .

 మనసు ఒక మదపు టేనుగు అని –‘’ధైర్యా౦కుశేన నిభ్రుతిం –‘’అనే శ్లోకంలో వర్ణించారు .దీన్ని ఇదివరకే తెలుసుకొన్నాం . మనసు ఒక గుడారం అంటూ మరోశ్లోకం –

‘’ధృతి స్తంభాధారం దృఢగుణ నిబద్ధాంసగమనాం –విచిత్రాంపద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం

స్మరారే మచ్చేత స్పుట పట కుటీం ప్రాప్య విశదాం – జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః సేవిత విభో ‘’

నా మనసు ఒక గుడారం .దానికి స్తంభాలు ధైర్యం మొదలైనవి.  త్రాళ్ళు సత్వ రజస్ తమోగుణాలు .మనస్సనే ఈ గుడారాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని వెళ్ళచ్చు .ఈ గుడారం లో మూలాధారం మొదలైన ఆరు చక్రాలు పద్మాలుగా ఉన్నాయి.  కుండలినీ శక్తి ఉంది.దీన్ని సాధించి ,భేదించి ముందుకు వెళ్ళచ్చు .ఆత్మజ్ఞానం తో ఇందులో హాయిగా జీవించ వచ్చు .నువ్వు కామారివి అంటే మన్మధుడికి శత్రువుకదా .

 మనసు ఒక దొంగ అని చెప్పే శ్లోకం –

‘’ప్రలోభాద్యై రర్ధాహరణ పరతంత్రో దని గృహే –ప్రవేశోద్యుక్త స్సంభ్రమతి బహుధా తస్కర పతే

ఇమాం చేతశ్చోరంకథ మిహ సహేశంకర విభో –తవాధీన౦ కృత్వా మయి నిరపరాధే కురు కృపాం ‘’

నా మనసు ఒక దొంగ .డబ్బు సంపాదించాలనే ఆశ దానికి ఎక్కువ .డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రవేశిస్తుంది .నేను వేరు చిత్తం వేరు ..ఇలా నామనసు శరీర సుఖాలకోసం లోభ గుణానికి బానిస అయింది .ఈ దుర్గుణాన్నిఇక నేను భరించ లేను . నువ్వే స్వాధీనం చేసుకోవాలి.  నన్ను నిరపరాధిని చేసి దయ చూపించు మహ ప్రభో.  

  మనసు ఒక తెల్లకలువ అని చెప్పిన శ్లోకం –

‘’ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం –కామ క్రోధ మదాదయో విగళితాః కాలాస్సుఖా విష్క్రుతః

జ్ఞానానంత్య మహౌషధి స్సుఫలితా కైవల్య నాథే సదా –మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే

ఉత్తమ రాజు పాలనలో ధర్మం నాలుగు పాదాలా వర్ధిల్లు తుంది .కామ క్రోధాది అరిషడ్వర్గాలు నశిస్తాయి రోజులు పక్షాలు నెలలు సంవత్సరాలతో కూడిన కాలం అంతా చక్కగా చల్లగా ప్రకాశిస్తుంది .అనంతమైన జ్ఞానం అనే ఔషధం రాజ్యం లో ఫలిస్తుంది. దాని వలన ప్రజలు విజ్ఞులై సుఖాలనుభవిస్తారు .

  అలాగేమనసు ఒక పుండరీకం అంటే తెల్లకలువ .దానిలో తలపై చల్లని చంద్రుని ధరించిన పరమశివుడున్నాడు .అ౦దువల్ల కామక్రోధాదులు నశించి పోయాయి .రాజు అంటే ప్రభువు చంద్రుడు అనే రెండు అర్ధాలున్నాయి .చంద్రుడు మృదుల స్వభావి రాజు కఠినుడు .ఇలాంటి తెల్లకలువ అనే నామనసులో హాయిగా రాజులాగా విహరించు పరమశివా అని అర్ధం .

  మనసు ఒక దుర్గం గా భావించి చెప్పిన శ్లోకం –

‘’గాంభీర్యం పరిఖా పదం ఘన ధ్రుతిః ప్రాకార ఉద్యద్గుణ-స్తోమ శ్చాప్త బలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్తితః

విద్యా వస్తుసమృద్ధి రిత్యఖిల సామగ్రీ సామేతే సదా –దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు ‘’

నామనసు ఒక దుర్గం .అంటే కోట .అందులో ప్రవేశించటం కష్టం .దుర్గమమైనది దుర్గం –ప్రవేశించటానికి కష్టమైనది అని అర్ధం .దుర్గానికి రక్షణగా చాలా ఉంటాయి .దాని కందకం గాంభీర్యం .ప్రాకారం ధైర్యం .సద్గుణాలే నమ్మదగిన ఆప్తులు .శరీరం లోని నవరంద్రాలే ఇంద్రియాలు . అందులోని సంపద అంతా విద్య  జ్ఞానం మొదలైనవి .కనుక శివుడు ప్రవేశించటానికి కావలసిన సామగ్రి అంతా ఉంది .శివుడు దుర్గా ప్రియుడు .మనసు పరమ  శివునికి ఇష్టమైన దుర్గం అని ఆంతర్యం . శివజ్ఞానం ఉంటేనే ప్రవేశానికి అర్హత ఉంటుంది అని అర్ధం .

  మనసు ఒక అడవి అని వర్ణించే శ్లోకం –

‘’మా గచ్ఛమితస్తతోగిరిశ భో మయ్యేవ వాసం కురు –స్వామిన్ ఆది కిరాత మామక మనః కాంతార సీమాంతరే

వర్తంతే బహుశో మృగా మద జుషో మాత్సర్య మోహాదయః –తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం ఛ సంప్రాప్యసి’’

శివా .నువ్వు ఎక్కడికీ పోవద్దు .నాలోనే ఉండిపో.నామనసు ఒక అరణ్యం అని ముందే చెప్పాను .నువ్వేమో ఆది కిరాతకుడవు .నీకు వేటాడటం చాలా ఇష్టం సరదా కదా .నీకు కావలసినన్ని మృగాలు నాలోనే ఉన్నాయి . హాయిగా వేటాడి అనుభవించు .రా .ఆలస్యం చేయకు .ఇవిగో కామ క్రోధ మద మాత్సర్యాలు అనే మృగాలు .వీటిని వేటాడి నీ వేట తీట తీర్చుకో అనుభవించు ,ఆస్వాదించు ,వినోదించు ,ప్రయోజనం పొందు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-17- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

అంతఃకరణ చతుస్టయ సమర్పణ విషయమైన శ్లోకాలు –మనస్సు, బుద్ధి,చిత్తం , అహంకారం అనే నాల్గింటిని అంతఃకరణ చతుస్టయ౦  అంటారు.ఇవి మనలోపల ఉన్నా వాటి చూపు మాత్రం బయటే ఉంటుంది .తాను పరమాత్మకంటే వేరు అనే భావం వలన ఇవి ప్రకోపిస్తాయి . వాటిని అణచి సమర్పణ చేయాలని అంతర్యం .

సంకల్ప ,వికల్పాలు చేసేది మనసు .దీని అధిదేవత చంద్రుడు .నిష్కర్షగా తేల్చేది బుద్ధి .దీనిదేవత బ్రహ్మ .నేను అనే భావమే అహంకారం .దేవత రుద్రుడు .జరిగి పోయినవాటిని చి౦తి౦చేది చిత్తం . వాసుదేవుడు దేవత .భ్రూ మద్యం లో మనసు,కంఠం లో బుద్ధి ,హృదయం లో చిత్తం ,నాభిలోఅహంకార౦ ఉంటాయి  .వీటిని ఈశ్వరార్పణం చేస్తే జీవి పరమయోగి ,సుఖి అవుతాడని శంకర భగవత్పాదులవారి ఆంతర్యం .వీటికి శ్లోకాలు రాశారు శివానంద లహరి లో .

1-మనసు

‘’గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే –విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః

సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే –సుఖేనావస్థానం జన ఇహ న జానాతి కిమహో ‘’

ఉమానాథా!అదొక అగాధమైన సరస్సు .ఒకవైపు నిర్జర కీకారణ్యం .మరో వైపు ఎత్తైన పర్వతం ..ఇటు నుయ్యి అటు గొయ్యి గా ఉంది పరిస్థితి . వాటిలోకి వెళ్లి పూలు కోసి నీకు అర్చన చేయాలని ఉంది .అటూ ఇటూ తెగతిరుగుతున్నాడు ఆరాట పడుతున్నాడు వెర్రివాడు మూర్ఖుడు .జడుడు.తనలోపలే ఒక పుష్పం ఉందని  కదలక్కర లేకుండా వెతకక్కర లేకుండా లోపలే హృదయ పుష్పం ఉందని గ్రహించలేక పోతున్నాడు . అది బురదలో పుట్టినా దానికి బురద అంటదు .మనసు కూడా అంతే.సూర్యుని చూసి పద్మం వికశించినట్లు  నిన్ను చూస్తె హృదయ పద్మం వికశిస్తుంది . ఆన౦దానుభవం పొందుతుంది .ఈ హృదయ పద్మాన్ని ఉమానాధునికి కైంకర్యం చేసి ఆనందాన్ని హాయిగా అతి సులభంగా పొందవచ్చు .ఇదంతా చూస్తూఉంటె  కస్తూరి మృగం తన నాభి దగ్గరున్న కస్తూరి వాసన గ్రహించకుండా పర్వతాలపై గాలించి అలసి పోయినట్లు గా కనిపిస్తోంది .

  అలాగే ‘’పటుర్వా గేహీవా ,యతి రపి జటీవా తదితరో –నరోవా యః కశ్చిన్ భవతు భవ కిం తేన భవతి

యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే –తదీయస్త్వం శంభో భవసి భావ భారం  చ వహసి ‘’

బ్రహ్మ చారి గృహస్తు ,వానప్రస్తుడు ,సన్యాసి  ఇంకెవరైనా కావచ్చు .వారు శాస్త్రాలు ఆశ్రమ ధర్మాలు నియమాలు పాటించవచ్చు .పాటించి ఉత్తమ బ్రహ్మ చారి ,ఉత్తమ గృహస్తు ,ఉత్తమ వానప్రస్తు,ఉత్తమ సన్యాసి అవవచ్చు .దీని వలన వారికి కొంచెం కూడా ప్రయోజనం ఉండదు.  వాళ్ళ మనస్సు నీ అధీనమై ఉండాలి .అప్పుడే వాళ్ళు ధన్యులవుతారు .కనుక ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మనసు భగవదర్పితమైతేనే జీవికి సాఫల్యత అని ఆంతర్యం  .

మరో శ్లోకం లో –‘’భ్రుంగీ చ్ఛానతనోత్కటః కరి మదగ్రాహీ స్పురన్మాధవా-హ్లాదోనాద యుతో మహాసిత వపుః పంచేషుణా చాదృతః

సత్పక్షః సుమనో వనేషు స పున సాక్షాన్మదీయేమనో –రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః

పరమ భక్తుడైన భ్రుంగి కోరగా శ్రీశైలమల్లేశ్వరా నువ్వు ఇష్టంగా తాండవం చేస్తావు .విష్ణువు మోహినీ రూపం ధరించినపుడు ,ఆయనపై మోహంపొందావు .ఓంకార నాదాలు  ధ్వనించేవాడవు.తెల్లని శరీరం కలిగి మన్మధుని చే ఆరాధింపబడేవాడవు .గజాసుర సంహారివి .దేవతలనేకాక వాసనాత్రయం లేని,సజ్జనులను  కూడా  రక్షించేవాడవు .అలాంటి శ్రీశైల వాసుడవైన నువ్వు నామనస్సు అనే కమలం లో భ్రమరాంబా దేవితో కలసి ఎప్పుడూ విహరించాలి .

  జ్ఞానకమలాన్ని వికసింప జేయాలని ఆంతర్యం .

  ఈశ్లోకాన్ని తుమ్మెద పరంగా కూడా అన్వయించవచ్చు .మగతుమ్మెద ఆడ తుమ్మెద నాట్యానికి ఆకర్షితురాలవుతుంది . అది ఏనుగు మదజలాన్ని ఆస్వాదిస్తుంది .మనోహర వైశాఖమాసం లో పుష్పాలు వికసించి ఉంటాయి .ఆతుమ్మెద జంట  మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనంద ఝంకారం  చేస్తూ ఎగురుతాయి . తుమ్మెద నల్లగా ఉంటుంది . మన్మధుడు పంచబాణుడు . ఆయన బాణాలు అరవిందం అశోకం ,మామిడి పువ్వు ,నవమల్లికాపుష్పం ,కలువ పూవు  .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-17- ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని,  లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? అసలే తొడ తొక్కిడి  ముందూ వెనకా ఒకటే తోపుడు, జనరద్దీ అక్కడి బెత్తంగాళ్ళు (వేత్ర హస్తులు )శీఘ్రం శీఘ్రం అంటూ అరవం లో ,పోండా,పోండా అంటూ తెలుగులో  మువ్, మువ్ క్విక్లీ, అంటూ ఆంగ్లం లో మమ్మల్ని తోసేస్తుంటే  క్షణకాలమైనా దర్శనం చేసుకోనివ్వకుండా ఉంటే, ఘంట ఉందొ ,మోగించారో లేదో ఎవడు చూశాడు?  ఎప్పుడు బయట పడదామా అనే ఆరాటమే తప్ప అని కొందరు ,ఆహా! ఆహా !ఏమి దివ్య దర్శనం !ఆ దివ్య సుందర మంగళ స్వరూపుని కనులారా గాంచి ఆ పంగనామాలయ్యను చూస్తూ పరవశిస్తుంటే ఘంటో ,పంటో మీద దృష్టి ఉంటుందా అని కొందరూ అనవచ్చు .కాని దుర్భిణీ పెట్టి వెతికినా ,చెవులకు స్పీకర్లు పెట్టుకొని విన్నా గర్భాలయం లో ఘంట కనిపించదు ఘంటా నాదం విని పించదు. ఇదేం   విడ్డూరం అయ్యా బాబూ   అసలు ఘంట లేకుండా గుడి ఉంటుందా ,ఘంటానాదం లేకుండా అర్చన ఉంటుందా ?అంటారా ? .అసలు ఘంట ఉంటే కదా కనపడటానికి , మోగిస్తే కదా వినిపించటానికి ?నువ్వేదో మోకాలి చిప్పకూ బట్టతలకు ముడి పెట్టే వాడివిగా కనిపిస్తున్నావు అని నన్ను అంటారు కదూ – నిజమండి  బాబూ –ఆ బాలాజీ మీద ఒట్టు . ఈ ఒట్లూ, పట్లూమాకెందుకుగాని అసలు విషయమేమిటో నాన్చకుండా చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెబుతాను జాగ్రత్తగా వినండి . శ్రీ వారి ఘంట ను ఒకావిడ  మింగేసిందయ్యా బాబూ.  ’ఎన్నాపైత్యకారీ!ఘంటమింగటం ఏమిటయ్యా  అదీ ఆడకూతురు అంటున్నావ్ . నమ్మ మంటావా ?లేక నిమ్మకాయ నెత్తిన మర్దన చేయమంటావా ? అదేమీ అక్కర్లేదు కానీ ‘’నిఝ౦ గా నిజమయ్యా ‘’బాపు రమణల భాషలో . టెన్షన్ తట్టుకోలేకున్నాం అసలు విషయం చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెప్పేస్తున్నా చెప్పేస్తున్నాఆ కథ  చెప్పేస్తున్నా –

   శ్రీ వైష్ణవ లేక విశిష్టాద్వైత సంప్రదాయం లో శ్రీ వేదాంత దేశికులు అని గొప్ప కవి వందకు పైగా గ్రంధాలు సంస్కృత  తమిళభాషలో రచించిన మహా వేదాంతి ఉన్నారు .ఆయన క్రీ. శ. 1268 -1369 కాలం లో ఉన్నారు .  101 సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి  విశిష్టాద్వైత మత వ్యాప్తికి కృషి చేసినవారు ,నిజమైన దేశికోత్తములు .అసలు పేరు వెంకట నాధుడు .కంచి దగ్గర అన్మించి  కంచి ,శ్రీరంగ౦ లలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి ,భగవద్రామానుజులు నియమించిన   74 శ్రీ భాష్య సి౦హాసనాధిపతులలో ఒకరైన వ్రాత్యవరదుల వారి శిష్యులు .

  దేశికులవారి తండ్రి అనంతసూరి .తల్లి తోతాద్ర్యమ్మ లేక తోతాద్ర్య౦బ . శ్రీ వారి ఘంటను మింగిన మహా తల్లి ఈవిడే-అంటే దేశికులవారి తల్లిగారే . మళ్ళీ మధ్యలో సస్పెంసేమిటి ?అనకండి .ఈ దంపతులకు పెళ్లి అయిన 12 ఏళ్ళ దాకా సంతానం కలగలేదు .ఒక రోజు స్వప్నం లో దంపతులకు ఇద్దరికీ విడివిడిగా శ్రీనివాస ,పద్మావతీ దంపతులు ప్రత్యక్షమై ,తిరుమలకు  వచ్చి  తమ దర్శనం చేసుకొంటే పుత్రుడు జన్మిస్తాడు అని ఆనతిచ్చారు . అంతకంటే కావాల్సిందేముంది? దానికోసమే కదా ఇన్నేళ్ళ ఎదురు చూపు .తిరుమల యాత్ర చేసి పద్మావతీ శ్రీనివాస దర్శం చేసి  ,మానసిక ఆనందాన్ని పొందుతారు అనంత సూరి తోతాత్ర్యంబ దంపతులు . ఆరాత్రి తిరుమల శ్రీనివాసుడు చిన్నరి వైష్ణవ బాలుడి రూపం లో తోతాత్ర్యంబ కు కలలో కనిపించి ,శ్రీ వారి ఆరాధనలో వినియోగించే’’ ఘంట’’ను ఆమె చేతిలో పెట్టి మింగమని ఆదేశించాడు .తన ఆజ్నను  పాటించ గానే పుత్ర సంతానం కలుగుతుందని అభయమి చ్చి ,ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు .ఆమె భక్తి  తో దాన్ని మహా ప్రసాదంగా పటిక బెల్లం ముక్క లా  భావించి గుటుక్కున మింగేసింది .

  శ్రీ వారి ఆలయ అర్చకులు ప్రభాత వేళ ఆలయం తెరచి చూస్తే ఘంట కనిపించలేదు .ధర్మకర్తలు అర్చకులను అనుమానిస్తారు .అప్పుడు శ్రీనివాసుడు ప్రధాన అర్చకుని లో ‘’ఆవేశించి’’ ఎవ్వరినీ అనుమాని౦చవద్దనీ,తానే ఒక ఒక పుణ్య స్త్రీకి ఆశీర్వాదం గా ఆ ఘంట ను ప్రసాది౦చానని చెప్పాడు .అందరూ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు .

   శ్రీ వారి ఘంట ను కలలో మింగినామె అంటే తోతాత్ర్యంబ క్రీ .శ .1268 లో ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది .శ్రీనివాస వర ప్రసాది కనుక అ బాలుడికి  ‘’వేంకట నాథుడు’’ అని నామకరణం చేశారు .ఆయనే వేదాంత దేశికులై విరాజిల్లారు .కనుక వేదాంత దేశికులను శ్రీ వేంకటేశ్వరుని ‘’ఘంటావతారం’’గా భావిస్తారు .ఘంటానాదం అసుర శక్తులను తరిమేస్తుంది .’’సంకల్ప సూర్యోదయం’’ అనే తమ గ్రంథం లో దేశికులు ఈ విషయాన్ని నిక్షిప్తం చేశారు –‘’ఉత్ప్రేక్ష్యతే బుధ జనై రుపపత్తి భూమ్నా –ఘంటా హరేః సమజ నిష్ట యదాత్మనేతి ‘’

  అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం లో గంట లేదు, అర్చనలో ఘంటా నాదం ఉండదు .గర్భాలయం బయట  వ్రేలాడే పెద్ద ఘంట ను మాత్రమే వినియోగిస్తారు .ఇదండీ బాబూ అసలు విషయం . 

అలాగే ”ముకుందమాల ”రచించిన కులశేఖర ఆళ్వార్ తాను భక్తుల పాద ధూళితో పవిత్రమై  శ్రీవారి గర్భ గుడి వాకిట ”గడప”గా ఉండాలని కోరుకుని అలాగే అయ్యారు .దాన్ని కులశేఖర గడప అంటారు . 

ఆధారం –  ‘’సరసభారతి బ్లాగ్ ‘’చదువుతూ  నా చిరునామా తెలుసుకొని నేను అమెరికా లో ఉన్నప్పుడు  శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ తాను అత్యంత భక్తి  శ్రద్ధలతో  ఎంతో వివరణాత్మకంగా,సమగ్రంగా  రిసెర్చ్ గ్రంథంలాగా రచించి ఆదరంగా పంపిన   ‘’వేదాంత దేశికులు ‘’ గ్రంథం .    

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-17 – ఉయ్యూరు    

Inline image 1              Inline image 2


Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

నాలుగు రకాల భక్తులకు ఉమా మహేశ్వరుడే శరణు అంటూ వారి  విషయమై శంకరాచార్య వివరిస్తున్నారు .’’ఆర్తో ,జిజ్ఞాసు ,రర్ధార్ధీ,జ్ఞానీ చ భరతర్షభ ‘’అని గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ నలుగురు భక్తులను పేర్కొన్నాడు .

1-ఆర్తుడు – ఆర్తుడు అంటే దుఖం తో బాధ పడేవాడు .

‘’అసారే సంసారే నిజ భజన దూరే జడధియా-భ్రమంతం మాం మంథం పరమ కృపయా పాతుముచితం

మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః-త్వదన్యః కో వా మే త్రిజగతిశరణ్యః పశుపతే ‘’

‘’స్వామీ శివా !స్వస్వరూప జ్ఞానం లేని మూఢుడను నేను .అంథుడను .దయతో ఈ దీనుడిని రక్షించు .ఈ ప్రపంచం చావు ,పుట్టుకలతో కూడి బాధామయంగా ఉంది.ఇందులో సారం అంటే రుచి లేనే లేదు .నేనెవరినో ,ఎక్కడి నుంచి వచ్చానో ,మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలో తెలుసుకో లేక పోతున్నాను .దేహమే నేను అనే భ్రాంతి లో పడి కొట్టుకొంటున్నాను .కించిత్తు కూడా ఆత్మ జ్ఞానం లేని వాడిని .ఆత్మ చింతన లేకపోవటం తో ఈ ప్రపంచం నిత్యం, సత్యం అనే మాయలో ఉన్నాను .వయసు మీద పడి ముసలి వాడినై ,కంటి చూపు కూడా లేని వాడినయ్యాను .ఏది సత్యమో ఏది నిత్యమో తెలియ లేకున్నాను .సంసార లంపటం లో కూరుకు పోయి తపిస్తున్న దీనుడిని .నాలాంటి దీనులను రక్షించటం లో నువ్వు మహా నేర్పరివి .నువ్వు రక్షించటానికి నా కంటే దీనుడు ఎవరున్నారయ్యా .త్రిలోకాలలో నువ్వే నాకు దిక్కు .’’అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’’

  ఇక కాపాడే వారెవ్వరూ లేరని ,భగవంతునిపై భారం వేస్తే ,ఆయన రక్షగా నిలుస్తాడు అని ఆంతర్యం .

తర్వాత శ్లోకమూ ఆర్తుని రోదనమే –

‘’ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే –ప్రముఖ్యోహం తేషా మపి కిముత బంధుత్వ మనయోః

త్వయైవ క్ష౦తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః – ప్రయత్నాత్కర్తవ్యం మద వనమియం బంధు శరణిః’’

పశుపతీ !నువ్వు సర్వ సమర్ధుడవు .దీనులకు అత్యంత ఆప్తుడవైన బంధువుడవు .బంధు ,దీన జన రక్షకుడవు  నువ్వు .దీనులలో ముఖ్యుడను నీకు బంధువుడను సన్నిహితుడను అని నీకు వేరే చెప్పాలా!నాతప్పులన్నీ క్షమించు .దీనికి ప్రయత్నించటం నీ తక్షణ కర్తవ్యమ్ .బంధు రక్షణ సంప్రదాయంగా వస్తోందికదా  .

పరమేశ్వరుడే ఆర్త త్రాణ పరాయణుడు అని ఆంతర్యం  సంసార తాప పరితప్తుని గూర్చిన శ్లోకాలివి .

2-జిజ్ఞాసువు –జ్ఞానం కావాలని ప్రార్ధించే వాడు జిజ్ఞాసువు

‘’ఛందశ్శాఖి శిఖాన్వితైః ద్విజ వరై స్సంసేవితే శాశ్వతే –సౌఖ్యాపాదిని ఖేద భేదినిసుధా సారైః ఫలైర్దీపితే

చేతః పక్షి శిఖా మణే,త్యజ వృధాసంచార మన్యైరలం-నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు ‘’

ఓ మనసా !పక్షీ౦ద్రా!ఎందుకు అటూ ఇటూ వృధాగా తిరుగుతావు ?అదుగో శంకరుని పాదపద్మాలు అనే గూడు అక్కడ ఉంది చూడు .దాంట్లో హాయిగా విహరించు .వేదాలు అనే కొమ్మల చివర ఆ గూడు ఉన్నది .దాన్ని బ్రహ్మ విద్యలో శ్రేష్టు లైన యోగీశ్వరులు సేవిస్తూ ఉంటారు .ఈ గూడు ఆషామాషీ ది కాదు శాశ్వత నివాసం .పరమ సుఖమైన మొక్షాన్నిచ్చేది .సంసార దుఖాన్ని పోగొట్టేది .అది అమృతం నిండిన పండ్లతో శోభిస్తుంది .ఇంకెందుకు ఆలస్యం ? శాశ్వతంగా ఆ శంకరుని పాద పద్మాలలో స్వేచ్ఛగా  విహరించి పరమానంద విభూతి పొందు .

  మనసు పక్షిలాగా ఒక చోట కుదురుగా ఉండదు .దానికి శాశ్వతమైన గూడు అవసరం.  జిజ్ఞాసువుకూడా అలాగే శాశ్వతమైన నివాసం కావాలి . అదే శంకర పాద సన్నిధి అని ఆంతర్యం .

తర్వాత రెండు శ్లోకాలు కూడా జిజ్ఞాసువు నుద్దేశించి చెప్పినవే –

‘’ఆకీర్ణే  నఖ రాజి కాంతి విభవైరుద్యత్సుధావైభవైః-రాధౌతేపి చ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే

నిత్యం భక్తివధూగణై శ్చరహసి స్వేచ్ఛావిహారం కురు –స్థిత్వా మానస రాజ హంస ,గిరిజా నాధాంఘ్రి సౌధాంతరే ‘’

ఈ శ్లోకం గూర్చి ఇదివరకేచేప్పుకున్నాం .తర్వాత శ్లోకం –

‘’శంభు ధ్యాన వసంత సంగిని హృదారా మేఘ జీర్ణ చ్ఛదాః-స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితా పుణ్య ప్రవాళశ్రితాః

దీప్యంతే గుణ కోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః-జ్ఞానానంద సుధా మరంద లహరీ సంవిత్ఫలాభ్యునతిః’’

శివుని ధ్యానించటం అనేది వసంత ఋతువు .నా హృదయం ఒక పూల తోట. దానిలో శివధ్యానం అనే వసంత ఋతువు ప్రవేశించింది .వెంటనే నాలో ఉన్న పాపాలు అనే ఎండుటాకులన్నీ రాలిపోయాయి .వెనువెంటనే పుణ్యాలు అనే పగడాల లాంటి యెర్రని చిగురుటాకులనే సద్గుణాలు  మొలకెత్తాయి .దానితో భక్తి  అనే లతలు ఏర్పడి  శివుని పైకి ఎగబ్రాకాయి  .అవి నవ నవో న్మేమేషంగా గా ఉన్నాయి .అలా అల్లుకు పోయిన లతలకు శివ ధ్యానమే జపం అయింది .ఆ లతలకు జప వాక్కులు అంటే  సోహం ,పంచాక్షరి మంత్రం పుష్పాలుగా పూశాయి. ఒక్క సారి శివా అంటే చాలు స్వస్వరూప జ్ఞానం ఏర్పడి  వాటి పరిమళాలు అంతటా వ్యాపిస్తాయి .అవే బ్రహ్మానంద పరమైన సంస్కార పరిమళాలు .ఆ పుష్పాలనుండిజ్ఞానానందం అనే అమృతం మకరందంగా  ధారా పాతంగా ప్రవహి౦చి౦ది  .భక్తిలతకు బ్రహ్మ జ్ఞానం అనే పంట పండింది. ఇదే జ్ఞానానందం అనే సుధా తరంగం  .ఇదే కైవల్యం .

3-అర్ధార్ధి-ధనంమొదలైన కోరికలు కోరేవాడు అర్ధార్ధి.సాధకుడికి ఇవి అక్కరలేదు కావలసింది శాశ్వతమైన ముక్తి  బ్రహ్మానందం .దీనికోసం మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తారు .పొందే దాకా  వదిలి పెట్టరు వీరు అర్ధార్ధులు.

‘’కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో-విధిత్వం ,విష్ణుత్వం  దిశసి ఖలుతస్యాఃఫలమితి

పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతా – మదృస్ట్వా తద్ఖేదం కథ మిహ సహేశంకర విభో ‘’

శంకర ప్రభూ !నీ పూజ చేస్తున్నా .దానికి ప్రతిఫలంగా బ్రహ్మ పదవో విష్ణు పదవోఇస్తానంటావేమో .అవి నాకు వద్దే వద్దు .నిన్ను పూజించే విష్ణువు సృష్టి కార్యం చేస్తున్నాడు .బ్రహ్మకు నువ్వే వేదాలు ఇచ్చావు.   విష్ణువు  నీ మూల స్వరూపం తెలుసుకోవటానికి భూమిని త్రవ్వి త్రవ్వి అలసి సోలసి వెనక్కి వచ్చేశాడు పాపం  .బ్రహ్మ సృష్టి కార్యం లో మునిగి పోయి ,నీ అంతం ఎక్కడుందో తెలుసుకోవటానికి హంసగా మారి యెగిరి యెగిరి తిరిగి తిరిగి ఆయాసం తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాకై అబద్ధం చెప్పి శాపానికి గురై పూజకు అనర్హుడయ్యాడు .కనుక నాస్వామీ !బ్రహ్మత్వం విష్ణుత్వం నాకు వద్దు మహాప్రభో .నీ ఆది ,అంతాలు చూడలేని ,తెలుసుకోలేని ఆపనికి మాలిన  పదవులు నా కెందుకయ్యా-ఏం చేసుకోను నేను ? ఆ దుఖం ఎందుకు ఆ వ్యధ ఎందుకు వృధా  ఆయాసం ఎందుకు నాకు ? నీ పూజా ఫలంగా మోక్షం ప్రసాదించు తండ్రీ .చాలు .  

  శివుని  అశాశ్వతమైన కోరికలు కోరరాదు .శాశ్వతమూ నిత్యమూ అయిన మోక్షాన్నే కోరుకోవాలని ఆంతర్యం .

1-      జ్ఞాని –బ్రహ్మజ్ఞాని నిశ్చలంగా నిశ్చింతగా ,పరమార్ధం లో మునిగి తేలుతూ ఉంటాడు .శివుడు నాలో కొలువై ఉన్నాడు నాకు భయమెందుకు అనుకొంటాడు –ఈ విషయాన్నే –‘’దీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోప కుల్యాక్రమై –‘’శ్లోకం లో విపులంగా చెప్పుకొన్నాం .మరో శ్లోకం –

‘’కరలగ్న మృగః కరీంద్ర భంగో –ఘన శార్దూల విఖండనోస్త జంతుః

గిరిశో విశదాకృతిశ్చ చేతః –కుహరే పంచ ముఖోస్తి మే కుతో భీః’’

 చేతిలో జింక  గజాసుర వ్యాఘ్రాసుర సంహారి  ప్రాణులను తనలో విలీనం చేసుకొనేవాడు  భస్మలేపనం తో తెల్లగా ఉన్నవాడు ,పర్వత శయనం కలవాడు ,అయిదు ముఖాలున్న శివుడు నా మనస్సు అనే గుహలో ఉండగా నాకు భయం ఎందుకు ?

 సింహాన్ని కూడా పంచముఖఃలేక పంచాస్య  అంటారు .అదీ గుహలోనే ఉంటుంది.దాని చేతిలో వేటాడిన జింక ఉంటుంది .ఏనుగు, పెద్దపులినిఅది చంపుతుంది  .సింహం ఉన్న గుహలో ఇక ఏ జంతువూ ధైర్యంగా ప్రవేశించలేదు .పంచముఖుడైన శివుడిని ,పంచాస్య అయిన సింహాన్ని కలిపి పోల్చి చెప్పారిక్కడ .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-17 –ఉయ్యూరు        

‘   

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5

 శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5

శివానంద లహరిలో నవ విధ భక్తి కి శంకరులు చెప్పిన శ్లోకాలు

1-      వందనం –‘’కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజతఫః –ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున-ర్భవాభ్యామానంద స్పురదనుభవాభ్యాం  నతి రియం ‘’

శివునికి, శివా కు నమస్కారం .ఆ ఆది దంపతులు సకల వేద విద్యా స్వరూపులు .సిగపై చంద్ర కళ కలవారు .ఒకరి తపస్సుకు మరొకరు ఫలంగా లభించినవారు .భక్తులు కోరే ధర్మార్ధ కామ మోక్షాలను ప్రసాది౦చేవారు  .మంగళప్రదులై  ముల్లోకాలకు అనంత శుభాలనిచ్చేవారు .ధ్యానిస్తే హృదయం లో గోచరించేవారు .ఆనంద స్వరూపులే కాకుండా మనకూ ఆనందాన్ని కలిగించేవారు అయినశివా శివులకు నమస్కారం .

  దీనితో పాటు 50 ,51 ,56 శ్లోకాలు కూడా వందనానికి ఉదాహరణలే .’’శివాభ్యాం ‘’అనే మాటలో ఒకే రూపం లో ఉన్న శివ పార్వతులు పరబ్రహ్మ తత్వంగా భావించాలని శ్రీ శ౦కరుల ఆంతర్యం.ఈ శ్లోకం నుంచి 27 వ శ్లోకం వరకు శిఖరిణీ వృత్తం లో రచించారు .27 సంఖ్య నక్షత్రాలకు సంకేతం .అంటే కాల చక్ర స్వరూప దర్శనం చేయించారని భావించాలి .

2-      శ్రవణం –‘’దూరీ కృతాని దురితాని దురక్షరాణి-దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వ చాంసి

సారం త్వదీయ చరితం నితరాం పిబంతం –గౌరీశ  మామిహ సముద్ధర సత్కటాక్షైః’’

గౌరీశా !నా పాపాలు ,దుఖం దౌర్భాగ్యం  దురహంకారం తో వచ్చే చెడ్డమాటలు ,అన్నీ నీ దయ వలన దూరమై పోయాయి . నిత్యం నీ చరిత్రను పానం చేస్తున్న నన్ను ఉద్ధరించు .సంసార లంపటం నుంచి తరింప చేయి .

ఇక్కడ శివ చరిత్ర స్మరణ యిచ్చే ఫలితం చెప్పారు .శివ చరిత్ర గ్రోలితే లభించేది శివానంద లహరి అని ఆంతర్యం .

3-      కీర్తనం –‘’కదావా కైలాసే కనక మణి సౌధే సహ గణైః-వసన్ శంభో రగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః

విభో ,సాంబ స్వామిన్ పరమ శివ పాహీతి నిగదన్ –విధాత్రూణా౦ కల్పన్ క్షణ మివ వినేష్యామి సుఖతః ‘’అది కైలాసం లో బంగారు భవనం అందులో మణులు కూర్చబడి అందంగా ప్రకాశమానంగా ఉంది .పరమశివుడు ఆ భవనం లో ఉన్నాడు .ఆయన ముందు శిరస్సుతో అంజలి  ఘటిస్తూ ‘’ఓ విభో సాంబ సదాశివా పరమ శివా పాహి పాహి ‘’అంటూ బ్రహ్మ కల్ప కాలాలను క్షణ మాత్రం గా ఎపుడు గడుపుతానో కదా అని శంకర భాగవత్పాదులు ఆర్తిగా కీర్తిస్తున్నారు .

నిజానికి ఇదే శివానంద లహరి అంటే కైలాస వాస వాంఛ.శివ సన్నిధిలో ఒడలు మరచి పోవటం కీర్తనలో పరవశించటం .అంతకంటే జీవి కోరుకొనే ఉత్కృష్ట పదవి ఏదీ లేదని ఆంతర్యం .

4-స్మరణం –‘’నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా-పశుత్వం ,కీటత్వం భవతు విహగత్వాది జననం

సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ –విహారాసక్తం చేద్ధృదయ మిహ కిం తేన వపుషా ‘’

పరమేశా !నేను మనిషిగా  దేవునిగా ,పశువుగా ,పురుగు గా ,పక్షిగా జన్మించినా సరే ,ఏ జన్మ లోనైనా నీ పాద పద్మాలను  స్మరించి పరమాన౦దాన్నిపొందుతూనే ఉండాలి .దానిలో నా హృదయం హాయిగా విహరించాలి .ఉపాధి అంటే దేహం ఏ రూపం లో ఉన్నా పరమేశ్వర పాదారవింద స్మరణ చేయాలని ఆంతర్యం .

5-పాద సేవనం –‘’నిత్యం యోగి మనస్సరోజ దళ సంచార క్షమస్త్వత్క్రమ-శ్స్శంభో ,తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతి –

రత్యంతం మృదులం త్వదంఘ్రి యుగళం హా మే మనశ్చింతయ-త్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే ‘’

పశుపతీ ! అత్యంత కోమలమైన నీ పాదాలు అతి సున్నితాలు .యోగీశ్వరుల హృదయ పద్మాలపై సంచరించే కుసుమ కోమలాలు. అలాంటి నీపాదాలు అతి కఠినమైన తలుపు చక్కలాంటి యముని వక్షస్థలాన్నిఎలా తన్నగలిగాయి ? తన్ని అసలు కందిపోకుండా ఎలా తట్టు కో గలిగాయి? అని నా మనసు శంకిస్తోంది .నీ లలిత కోమల పాదాలు నాకు కనిపించేట్లు చేస్తే నీ బాధ ఉపశమింప జేయటానికి వాటిని నా చేతులతో  చక్కగా ఒత్తి సేవిస్తాను .ఆ అనుగ్రహం నాకు ప్రసాదించు .

  భక్తుడైన మార్కండేయుని ప్రాణాలు హరి౦చటానికి  యమ ధర్మ రాజు వస్తే శివుడు యముని వక్షస్థలాన్ని  పాదం తో తన్ని తగిలేశాడు .భక్త రక్షణకు పరమ శివుడు ఎంతటి బాధనైనా భరిస్తాడని ఆంతర్యం .

6-అర్చనం –‘’36 వ శ్లోకం –‘’భక్తో భక్తి గుణా వృతే –‘’దీన్ని గురించి ఇదివరకే చెప్పుకొన్నాం

7         దాస్యం –‘’కదావా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యా౦ఘ్రి యుగళం –గృహీత్వా హస్తాభ్యాం శిరశి నయనే వక్షసి వహన్

సమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజ గంధాన్ పరిమళా- నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముద మనుభవిష్యామి హృదయే

గిరీశా శివా !నీ పవిత్ర పాదార వి౦దాలను నేను చేతులతో పట్టుకోవాలి . వాటిని నాశిరస్సు మీద పెట్టుకోవాలి .కళ్ళకు అద్దుకోవాలి. నా గుండెలమీద ఉంచుకోవాలి .వాటిని గట్టి గా నేను ఆలింగనం చేసుకోవాలి .నీపాద పద్మాల పరిమళాలను నేను  ఆఘ్రాణి౦చాలి  . ఇంతటి మహద్భాగ్యం  బ్రహ్మమొదలైన దేవతలకు కూడా లభించదు .అలాంటి నీ పాద సేవలో నేను బ్రహ్మానందం అనుభవించాలి .అంతటి పరమ సౌభాగ్యం నాకు ఎప్పుడు నువ్వు అనుగ్రహిస్తావో ?

  ఇందులో పరబ్రహ్మ చుట్టూ పరిభ్రమించాలానే ఆరాటం ఆవేదన  పరబ్రహ్మనై పోవాలన్న తపన  ఉండటం తో భక్తి పరాకాష్టకు చేరి ‘’అహం బ్రహ్మాస్మి ‘’ భావం కలుగుతుందని ఆంతర్యం .

8- సఖ్యం –‘’సారూప్యం తవ పూజనే శివ ,మహాదేవేతి సంకీర్తనే –సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే

సాలోక్యం చరాచరాత్మక తను ధ్యానే భవానీ పతే –సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్   ,కృతార్దోహం ‘’   

పరమశివా ! నిన్ను పూజిస్తూ సారూప్య ముక్తిని ,నిన్ను కీర్తించేటప్పుడుసామీప్యముక్తిని ,నీ భక్తుల స్నేహం తో  సంభాషణం తో సాలోక్య ముక్తిని ,కదలలేని పర్వతాదులలో నిన్ను దర్శించి ధ్యానం చేసి సాయుజ్య ముక్తిని ,పొందుతున్నాను .

  పూజ సేవ లలో ‘’సోహం భావేన పూజయేత్ ‘’అనే భావం ఉండాలని ఆంతర్యం అప్పుడే అభీస్ట సిద్ధి .

9-ఆత్మ నివేదనం –   ‘’కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధన పతౌ –గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణై

శిరస్థే శీతాంశౌ  చరణ యుగళ స్థేఖిల శుభే –కమర్ధం దాస్యే హం భవతు భవదర్ధం మమ మనః’’

నువ్వు ఉండేది వెండి కొండ మీద నీకు అందుబాటులో  బంగారు కొండమీద . నీ కనుసన్నలలో కుబేరుడు ,కామధేనువు  కల్ప వృక్షం ,చింతామణి అన్నీ జ్వాజ్వల్యంగా ప్రకాశిస్తున్నాయి .నీ శిరసుపై వెన్నెల వెదజల్లే చంద్ర వంక  . సమస్త సన్మంగళాలునీ పాద సమీపం లో ఉన్నాయి .ఇక నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏముంది స్వామీ . అయితే నా మనసు ఒక్కటే ఉంది.దాన్ని మాత్రం నీకు ఇవ్వగలను .తీసుకొని అనుగ్రహించు అంటూ ఆత్మ నివేదన తెలియ జేశారు శ్రీ శంకర భగవత్పాదులు.

చివరగా –‘’త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయా మ్యన్వహం –

త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో

దీక్షాం మే దిశ చాక్షుషీం స కరుణాం దివ్యైశ్చిరంప్రార్దితాం

శంభో  లోక గురో మదీయ మనస స్సౌఖ్యోప దేశం కురు ‘’

లోకానికే గురువైన సాంబశివా .నీ పాదాలనే అర్చిస్తున్నా.నిన్నే మనసులో ఎప్పుడూ చింతిస్తున్నా.నిన్నే శరణు వేడుతున్నా .వాక్కులతో నిన్నే స్తుతిస్తున్నా .దేవతలే నీ కరుణ కోసం నిరీక్షిస్తూ ఉంటారు .వారిపై చూపే కారుణ్యం నాపై కూడా చూపించు .నేను చిన్నవాడిని అనుకో వద్దు  మనసుకు సౌఖ్యం కలిగే ఉపదేశాన్నివ్వు .నువ్వు లోక గురుడవు .కనుక నాకూ గురువు నీవే .నేను తరించే శాశ్వత  సందేశాన్నిఇచ్చి ,శాశ్వత సుఖాన్ని  ప్రసాదించు .

పరబ్రహ్మ జ్ఞానోపదేశం చేసి శాశ్వత ముక్తిని ప్రసాదించమని ఆంతర్యం .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-17-ఉయ్యూరు    

  

Inline image 1 

Posted in రచనలు | Tagged | Leave a comment

  శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4

భక్తి ధేనువు ,రక్షా అని చెప్పిన శంకరులే భక్తిఒక తీగ ,ఒక సంకెల ,ఒక త్రాడు ,ఒక పంట అని కూడా చెప్పారు .

‘’ఆనందామృత పూరితా ,హర పదాంభోజా లవాలోద్యతా –స్థైర్యోపఘ్నముపేత్య ,భక్తిలతికా ,శాఖోపశాఖాన్వితా

ఉచ్ఛైః  మానస కాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా-నిత్యాభీష్ట ఫలప్రదా  భవతు మే సత్కర్మ సంవర్ధితా ‘’

భక్తి ఒక తీగ .అది ఆనందం అనే అమృతం తో ని౦పబడింది . అది పర మేశ్వరుని పాద పద్మాలు అనే పాదులో పుట్టి పెరిగింది .స్థిర చిత్తం అనే గట్టి కంప ను పట్టుకొని ,చిక్కగా అల్లుకు పోయి ,శాఖోప శాఖలుగా పెరిగి పోయింది .స్వచ్ఛ ఉన్నత మైన మనస్సు అనే పందిరిని ఆక్రమించింది .చీడ పీడలు లేకుండా పరమేశ్వర చింతనం తో ఏపుగా పెరిగి,కోరిన కోరికలను ప్రతి రోజూ ఇస్తోంది .పుణ్య కర్మలతో ఈ తీగ వృద్ధి చెందుతోంది .అంటే భక్తిఒక తీగగా ఉండి పుణ్యాలను సముపార్జించి పెడుతోంది అని ఆంతర్యం .భక్తితీగ పాకుతూ పోయి శిఖరాగ్రం చేరి కైలాస వాసి ,వాసిని అయిన ఉమా మహేశ్వరుల సన్నిధానానికి చేర్చి ,ఇక వదిలి పెట్టకుండా అక్కడే పరమేశ్వర పాద పద్మ లగ్నమై ఉండి పోతుంది అని ఆంతర్యం .

భక్తిఒక శ్రు౦ఖల అన్నారు కదా –అదెట్లాగో చూద్దాం –

‘’ధైర్యా౦కుశేన  నిభ్రుతం –రభసాదాకృష్య భక్తి శ్రుంఖలయా

పురహర ,చరణాలానే-హృదయ మదేభం బధాన చిద్యంత్రైః’’

భవానీశంకరా !నా మనసు ఒక మదపు టేనుగు .అయినా నీ చేతిలో అంకుశం ఉందికదా అనేధైర్యం తో ఉన్నాను .నన్ను నీకు బంధించుకోవాలను కొంటే  భక్తిఅనే గొలుసు ఉండనే ఉంది .మరి కట్టెయ్య టానికి ఒక గుంజకాని స్థంభం కాని కావాల౦టావా –ఉందిగా నీ పాదం.  అదే కట్టు గొయ్య .బంధించటానికి యంత్రం ఏదీ అంటావా ? అదే జ్ఞానం అనే యంత్రం .అంటే మనం భగవంతునికి జ్ఞాన యంత్రం తో బంధింపబడాలి . మదం ఉన్న ఇభం అంటే మదేభం అంటే మదించిన ఏనుగు .దీన్ని అంటే మదహంకారాన్ని తొలగించుకోవాలి అంటే భక్తిమాత్రమే సాధనం అని ఆంతర్యం .

దీని తర్వాత శ్లోకం లో కూడా మనసు మదపు టేనుగు అని దాన్ని కట్టెయ్యటానికి భక్తిత్రాడుగా ఉపయోగ పడుతుందనీ చెప్పారు –

‘’ప్రచరత్న భితః ప్రగల్భ వృత్త్యా –మదవా నేష మనః కరీ గరీయాన్

పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా –పరమ స్థాణుపదం దృఢం నయాముమ్’’

దేవాదిదేవా సర్వేశ్వరా !మదపు టేనుగు లాంటి నామనసు కు హద్దూ పొద్దూ లేదు .విశ్రు౦ఖలంగా స్వేచ్చా విహారం చేస్తోంది .నాలో భక్తికలిగించి ఆ భక్తిఅనే త్రాడుతో స్థిరమైన నీ పాదానికి కట్టేసెయ్యి .

అస్థిరమైన తమోగుణానికి ఏనుగు ప్రతి రూపం .కామ క్రోధాలకు చిహ్నం .ఇంతటి దురహ౦కారమైన నా మనసుకు నీతి బోధించి నీ పాదానికి కట్టేయ్యి. శివ పాదం అంటే స్థాణు పదం .దాన్ని పొందించు .అది మోక్షదాయకం అని, అందరూ దానినే ఆశ్రయించాలని శంకరుల ఆంతర్యం .

భక్తి త్రాడు మనసు కలశం అని మరో శ్లోకంలో అన్నారు –

‘’భక్తో భక్తిగుణావృతే ముద మృతాపూర్ణే ప్రసన్నే మనః –కుంభే సాంబ తవాంఘ్రిపల్లవ యుగం సంస్థాప్య సంవిత్రులం

సత్వం మంత్ర ముదీరియన్ నిజ శరీరా గార శుద్ధిం వహన్ –పుణ్యాహం ప్రకటీ  కరోమి రుచిరం కళ్యాణ మాపాదయన్ ‘’

సాంబ శివా !నేను మోక్షం అనే కల్యాణం చేసుకో దలచాను .దీనికి ముందు స్వస్తి పుణ్యాహవాచనం చేసుకోవాలి కదా .దాన్ని ప్రారంభిస్తూ  నా మనసును కలశం గా చేసి ,దాన్ని సంతోషం అనే అమృత జలం తో ని౦పు తున్నాను .ఇక నాకు వేరే ఆలోచనలే లేవు .భక్తిని త్రాడుగా అంటే సూత్రంగా ఆ కలశానికి చుడుతున్నా .పరమేశ్వరుని పాదాలను   మామిడి చిగుళ్ళు గా ఆ కలశం లో ఉంచుతున్నా .ఆహ౦కారం బ్రద్దలవ్వాలంటే జ్ఞానం కావాలి కదా –కనుక జ్ఞానాన్నికొబ్బరి కాయగా ఉంచుతున్నా .మరి మంత్రంఅంటావా ‘’ఓం నమశ్శివాయ ‘’అనే ప్రణవ శివ పంచాక్షరి మంత్రం  ఉండనే ఉందిగా –ఆ మంత్రాన్ని జపిస్తున్నా. వీటన్నిటితో  నా దేహం  అనే ఇంటిని ,అన్తఃకరణాలను శుభ్రం చేసి పవిత్ర వంతం చెయ్యి .ఈ ప్రక్రియ ఫలం అంతా నీకే సమర్పిస్తున్నా .దయతో గ్రహించు .ఇదే నాజీవితం లో జరిగే ఏకైక శాశ్వత మోక్ష కళ్యాణ ఘటన .

ఈ విధంగా భక్తిఅనే త్రాడుతో ప్రతి ఒక్కరూ మోక్ష కల్యాణాన్ని జరుపుకోవాలని ఆంతర్యం .

చివరగా భక్తి ఒక పంట గా ఎలా చెప్పారో చూద్దాం –

‘’ధీ యంత్రేణ,వచో ఘటేనకవితా కుల్యోప కుల్యాక్రమై –రానీతైశ్చ,సదా శివస్య ,చరితాంభో రాశి దివ్యామృతైః

హృత్కేదార యుతాశ్చ  భక్తి  కలమా స్సాఫల్య మాతన్వతే –దుర్భిక్షా న్మమ సేవకస్య భగవన్విశ్వేశ భీతిః కుతః’’

శివా ! నా హృదయం ఒక పొలం . నీ చరిత్ర ఒక సముద్రం .కాని అందులోని నీరు ఉప్పునీరుకాదు –దివ్యామృతజలం.ఈ అమృత జలాలను కవితలు అనే పంట కాలువలద్వారా ప్రవహింప జేయాలి .వాక్కులు అనే కడవలతో ఆజలాన్ని నింపాలి .బుద్ధి అనే యంత్రం తో మోటబావిలో  లాగా పైకి తోడాలి  .అలా తోడిన అమృత ధారలను నా హృదయం లో నింపితే భక్తిఅనే పంటలు పండుతాయి .

జన జీవనానికి ఆధారం పంట .అలాగే అద్వైత జీవితానికి ఆధారం భక్తి.మనసు శివ జ్ఞానం తో నిండితే భయం అనేది ఉండదు .అద్వైత సిద్ధి కలుగుతుంది , తరి౦ప జేయటానికి భక్తిమార్గం ఉత్క్రుస్టమైనది అని శ్రీ శంకరుల ఆంతర్యం .అందుకే’’ భక్తిరేవగరీయసి ‘’అన్నారు శంకరాచార్య .

సశేషం

నాగుల చవితి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-17- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3

‘’అంకోలం నిజ బీజ సంతతి రాయస్కా౦తో పలం సూచికా ,-సాధ్వీ నైజవిభుం క్షితి రుహం సింధుః సరిద్వల్లభం

ప్రాప్నో తీహ యధా తధా పశుపతేః పాదార వింద ద్వయం –చేతో వ్రుత్తి రుపేత్య తిస్టతిసదా సా భక్తిరిత్యుచ్యతే ‘’

ఇందులో జీవాత్మ ,పరమాత్మలస్థితి వర్ణన ఉంది.జీవుడు పరమాత్మను చేరాలి అంటే వ్యాజ భక్తి వలన ,నిర్వ్యాజ భక్తి వలన చేరాలి . ఇందులో నిర్వ్యాజ భక్తి శ్రేస్టం . శివ సాయుజ్యానికి ఇదే మంచి మార్గం .

‘’అంకోలం’’ అంటే ఊడుగు(బూరుగు చెట్టు ) చెట్టు గింజలు . దాని కాయ పక్వమై పగలగానే  గింజలుచాలా తేలిక కనుక  గాలిలో యెగిరిపోతూ ఉంటాయి . మేఘం  ఉరమగానే భయం తో వచ్చి చెట్టు చుట్టూ పడిపోతాయి  . గుండు సూది బలమైన  అయస్కాంతానికి ఇట్టే ఆకర్షింప బడిఅతుక్కు పోతుంది .  .పతివ్రత ఎక్కడున్నా భర్తనే ప్రేమతో ఆరాధిస్తుంది .తీగ భూమిపైకి పాకి చెట్టు లాంటి ఆధారం దొరకగానే దానికేగట్టిగా  అల్లుకు పోతుంది .నదులు ప్రవహించి ప్రవహించి అలసి సొలసి చివరికి సముద్రం లో కలుస్తాయి .ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన ధర్మాలు .అలాగే మానవుని చిత్త వృత్తులన్నీ  భగవంతుని పాదర వి౦దాలపై లగ్నం అవటాన్ని భక్తి అంటారు .ఈ భక్తి కలగటానికి కారణం భయం .కనుక ఇది వ్యాజ భక్తి . వ్యాజం అంటే నెపం .కాని నది సముద్రం లో కలవటం లో భక్తి పరా కాష్టకు చేరుతుంది .ఎందుకంటె ఇక్కడ నది సముద్రం లో కలవగానే దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది .తానె సముద్రం అవుతుంది .దీనికి కారణం, నెపం ఉండవు.  కనుక ఇది నిర్వ్యాజ భక్తి  .మనం కూడా పరమేశ్వరుని చేరితే మన అస్తిత్వం ఇక శూన్యమే అయి మనం పరమాత్మ స్వరూపులమే అవుతాం .ఇంతటి అంతరార్ధం పై శ్లోకం లో ఇమిడ్చారు శ్రీ శంకరులు .

మరి భక్తి మనకేమైనా చేస్తుందా ?చేస్తుంది .ఇది చెప్పటానికే మరొక శ్లోకం రాశారు .

‘’ఆనదాశ్రుభిరాత నోతిపులకం ,నైర్మల్య తశ్చాదనం –వాచా శంఖ ముఖ స్థితైః చ జఠరాం

రుద్రాక్షైః భసితేవ దేవ ! వపుషోరక్షాం భవద్భావనా –పర్యం కే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ‘’

భక్టి  కూడా మనకు శివ మంత్రాన్ని ఉపదేశించి ,భస్మంతో రక్ష కలిగించి, అభయ ప్రదాత్రి అవుతుంది.  అర్భకు లైన భక్తులను రక్షించే దయామయి భక్తి . అని భక్తి యొక్క పరమ పూజ్యత్వాన్ని స్పష్టంగా తెలియ జేశారు .భక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు .

‘’ఆకీర్ణేనఖరాజి కాంతి విభవై రుద్యత్సుధా వైభవైః-రాధౌతే పి చ పద్మ రాగ లలితే హంస వ్రజై రాశ్రితే

నిత్యం భక్తివధూ గణైశ్చ రహసి స్వేచ్చావిహారం కురు –స్థిత్వా మానస రాజహంస  గిరిజా నాధా౦ఘ్రి సౌధాంతరే’’

శివుని పాద పద్మాలు ఒక భవనం లాంటిది .అది పరమ శివుని కాలి  గోళ్ళ కాంతితో ప్రకాశిస్తుంది .చంద్రుని అమృత కిరణాల వైభవం తో కడగ బడుతుంది. కనుక అత్యంత స్వచ్చంగా తెల్లగా ప్రకాశిస్తుంది . పద్మ రాగ మణుల తో కలిసి ఎర్రగా  లలితంగా శోభిస్తుంది . దేహ జ్ఞానం లేని పరమ హంసలకు అది ఆశ్రయ భూమి .ఆ సుందర రమ్య హర్మ్యం లోకి    భక్తిఅనే కొత్త పెళ్లి కూతురుతో ప్రవేశించి అన్నీ మరచి హాయిగా విహరి౦చ వే ఓ మనసా అని భావం .అంటే భక్తిని భార్యగా భావించమని ఆంతర్యం .

భక్తి ధేనువు అంటూ మరో శ్లోకమూ చెప్పారు –

‘’అమిత ముద మమృతం ముహు ర్దుహంతీ-విమల భవత్పద గోష్ట మా వసంతీం

సదయ పశుపతే సుపుణ్య పాకాం-మమ పరిపాలయ ,భక్తీ ధేను మేకాం’’

నీ పాదాలపై ఉన్న భక్తి గోవు లాంటిది .నీ పరమ పవిత్రమైన నిర్మలమైన పాదాలు అనే గోశాలలో సురక్షితంగా ఉంటోంది   . ఎన్నో జన్మల పుణ్యం వలన అది నాకు లభించింది .ఈ భక్తి గోమాత నాకు మాటి మాటికీ ఆనందామృత౦  అనే శుద్ధమైన క్షీరాన్ని హాయిగా పిండుకోనిస్తోంది. నన్నూ  ఈ భక్తి ధేనువు ను సదా రక్షించు.

గడ్డి తిని ఆవు అమృతం లాంటి పాలు ఇస్తుంది .గోవు నుండి వచ్చే ప్రతి ద్రవ్యమూ పవిత్రమైనదే .అలాగే భక్తి కూడా నిరంతరం స్రవించే తైలధార  .ఇది పరమాత్మ పాదాలు అనే  గోశాలలో సురక్షితంగా ఉంది .నన్నూ  ఆ భక్తి ధేనువును నిరంతరం రక్షించి కాపాడి,కైవల్యం ప్రసాదించు అని ఆంతర్యం .భక్తిమామూలు గోవు కాదు .కోరికలు తీర్చే కామ ధేనువు  అన్నీ అనుగ్రహించే చింతామణి ,కైవల్య  సంధాయిని అని శంకరుల ఆంతర్యం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-17- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ 

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంధాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు ప్రసిద్ధులైన 10 మంది కవులచే కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది . విశిష్టమైన అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య సంగీత ప్రియులందరికీ ఆహ్వానం . పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .

ఆవిష్కరింపబడే గ్రంధాలు

1-ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు

తమ సృజనాత్మక ప్రతిభతో ప్రపంచ ప్రగతిని మార్చి  మలుపు త్రిప్పి ,ఆధునిక ప్రపంచానికి దారులు వేసిన  వేదాంతం  తత్వశాస్త్రం ,కవిత్వం ,నాటకం నవల  సంగీతం నాట్యం సినిమా ,శిల్పం చిత్రకళ మొదలైన వాటిలో లబ్ధ ప్రతిష్టు లైన 91 మంది మహానుభావుల జీవిత చిత్రణ .

అంకితం – స్టాటిస్టిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతులైన గణిత శాస్త్ర వేత్త కీ శే . డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య (అమెరికా )గారికి

ప్రాయోజకులు -సరసభారతి ఆప్తులు  శ్రీ మైనేని గోపాలకృష్ణ  శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )

—                        (పరుచూరి వారికి బావగారు ,సోదరి )

2- గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 -మూడవ భాగం

460 మంది సంస్కృత కవుల జీవితాలు ,కవిత్వం పై వెలువడుతున్నఅపూర్వ  గ్రంధం

అంకితం – దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి  ,శ్రీమతి డా  సులోచన(అమెరికా ) దంపతులకు

ప్రాయోజకులు – విద్యాసంపన్నులు  వితరణ శీలి దేశభక్తి పరాయణులు

ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహన రావు గారు(అమెరికా )

(మూర్తిగారి  వారి బావమరిది ,సులోచనగారి అన్నగారు )

ముందుమాటలు -అవధాన సరస్వతి డా శ్రీ పాపపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు

మనవి -మూడవ గీర్వాణం లో స్థానం పొందిన గీర్వాణకవులు 1-డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 2- డా శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి 3- డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి  4- డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి 5- శ్రీపరాశరం భావనారాయణా చార్యులు  6-డా శ్రీ వెంపటి కుటుంబ శాస్స్త్రి 7-డా శ్రీమతి అయ్యగారి ప్రభావతీదేవి 8-డా శ్రీ ఇనగంటి ఉమారావు 9-డా శ్రీ కె హయగ్రీవ శర్మ మొదలైన వారిని తప్పక ఈ కార్యక్రమం లో పాల్గొని వేదికను సుసంపన్నం చేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను

” వేదిక ”తో సహా అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం నవంబర్ రెండవ వారం లో అందజేస్తాం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-17 -ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

21-10-17 శనివారం మా ఇంట్లో మా మద్రాస్ మేనల్లుడు శ్రీనివాస్ ,అతని కూతురు శాలిని

21-10-17 శనివారం మా ఇంట్లో మా మద్రాస్ మేనల్లుడు శ్రీనివాస్ ,అతని కూతురు శాలిని

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2

‘’ఆద్యా యామిత తేజసే శ్రుతిపదైః వేద్యాయ సాధ్యాయతే –విద్యాయానంద మయాత్మనే ,త్రిజతస్సరంక్షణోద్యోగినే –

ధ్యేయాయాఖిల యోగిభిః సుర గణైః గేయాయ మాయావినే –సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిఃశంభవే ‘’

సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ ప్రళయ కాలం లోనూ నిశ్చలంగా ఉండే మహా జ్యోతిర్లింగ స్వరూపుడు కనుక ఆది ,అంతం లేనివాడు .ఆయన తేజస్సు సాటిలేనిది .వేద వాక్యాలవలననే ఆయన తెలియ బడతాడు . భక్తులను అనుగ్రహించటానికి మాత్రమే లింగ రూపం లో దర్శన మిస్తాడు .జ్ఞానానంద స్వరూపుడు ,అన్ని లోకాల సంరక్షణ బాధ్యత ఉన్నవాడు .యోగి పుంగవుల ధ్యానానికి ఆయనే ధ్యేయం .దేవతల చేత కీర్తింపబడే  మాయా మయుడు .సాయం వేళ తాండవ నృత్యానికి ఇష్టపడేవాడు .అటు వంటి శంకరునికి నమస్కారం .ఈ వర్ణన అంతా నిర్గుణ పర బ్రహ్మ వర్ణనే .మరో శ్లోకం లో   సగుణ నిర్గుణ పరబ్రహ్మను  వర్ణించారు శ్రీ శంకరులు –అ వైభవం చూద్దాం –

‘’త్రయీ వేద్యం ,హృద్యం ,త్రిపుర హర మాద్యం త్రినయనం –జటా భారోదారం ,చలదురగ హారం ,మృగధరం

మహా దేవం ,దేవం ,మయి సదయ భావం ,పశుపతిం –చిదానందం ,సాంబం,శివ ,మతి విడంబం ,హృది భజే ‘’

మూడు వేదాలచే తెలియ బడే వాడు ,మనోహర రూపుడు ,త్రిపురాలను అంటే స్థూల, సూక్ష్మ ,కారణ శరీరాలను సంహారం చేసేవాడు ,లేక త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినవాడు ,ఆది పురుషుడు ,మూడుకన్నులున్న జటాధారి,గంభీరుడు ,కదులుతున్న సర్పాల ఆభారణాలు కలవాడు ,మృగం అంటే జింక ను చేతిలో ధరించినవాడు ,దేవ దేవుడు ,కరుణాళువు,అజ్ఞానాన్ని నిర్మూలించే జ్ఞాన స్వరూపుడు ,అసలు జ్ఞానానికే ఆధారమైన వాడు ,లోక క్షేమం కోసం కాలానికి తగిన రూపాలు ధరించేవాడు ,సాంబుడు అంటే –సా –అంబ -ఉమాదేవితో కూడిన వాడుఅయిన పరబ్రహ్మను నా మనసులో ధ్యానిస్తాను అని భావం .ఇందులోని పదాలు నిర్గుణ పరబ్రహ్మను తెలియ జేసే సార్ధకమైన పదాలు .నిర్గుణ పరబ్రహ్మను చేరాలి అంటే ముందుగా సగుణ పరబ్రహ్మపై సాధన చేయాలి . త్రయీ నయనం మొదలైనవి  సగుణ పరబ్రహ్మను తెలియ జేస్తాయి .కనుక ఈ శ్లోకం లో  సగుణ ,నిర్గుణ పరబ్రహ్మ తత్త్వం అంతా కళ్ళ ముందు ఉంచారు భగవత్పాదులు .సగుణం అంటే మనలాగా శరీర ధారణ కలవాడు అలంకారాలు,అహంకారాలు ఉండి   భార్యాపిల్లలతో ఉండేవాడు .నిర్గుణ అంటే వీటికి అతీతమైనవాడు అని భావం .

సగుణ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేమరో శ్లోకం –

‘’కరలగ్న మృగః కరీంద్ర భంగో ,ఘన శార్దూల విఖండనోస్త జంతుః-గిరిశో ,విశదాక్రుతి శ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీః’’

చేతిలో జింక కలిగి గజాసుర సంహారం చేసిన వాడు ,వ్యాఘ్రాసురుని చంపినవాడు ,పర్వతాలలో నివాసం ఉండేవాడు ,స్వచ్చమైన అతి తెల్లని రూపం ఉన్నవాడు ,పంచ ముఖ అంటే తత్పురుష  సద్యోజాత వామదేవ ,అఘోర ,ఈశాన అనే ముఖ స్వరూపుడు ,ఊర్ధ్వంగా మరొక ముఖం ఉన్నవాడు అంటే విశ్వ వ్యాప్తుడైన పరమాత్మ నా మనస్సులో  .ఉన్నాడు.కనుక నాకింక భయం ఎందుకు ?’’చేతః ‘’పదం ఆయన మోక్ష ప్రదాత అని తెలియ జేసేది .ఆశలు నశిస్తే చేతస్సు నశిస్తుంది .చేతస్సు నశిస్తే వచ్చేది మోక్షమే .చిత్తం నాశనమవటమే ముక్తి అని అంతర్యం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-17 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1

శివానంద లహరి అనటం లోనే గొప్ప ఆంతర్యం ఉంది .శివఅంటే శివుని యొక్క ,  శివా అంటే అమ్మవారి యొక్క ఆనంద ప్రవాహం అని భావం . అంటే అయ్యగారి ,అమ్మగారి ఆనంద రస ప్రవాహం అన్నమాట . దాన్ని చదువుతుంటే మనం ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తామని అర్ధం .’’గుహాయాం గేహేవా బహిరపి ‘’అనే శ్లోకం లో ఎవడు తన అంతః కరణాన్నిసమర్పిస్తాడో వాడు పరమ యోగి అన్నారు శంకరులు .కీటకం అంటే పురుగు తాను మట్టి గూడులో ఉండి ,తను  తుమ్మెదగా  మారాలని మనసా వాచా కర్మణా కోరుకొంటుంది ,ఉవ్విళ్ళూరు తుంది . ఇలా తలచి తలచి చివరికి భ్రమరం గా అంటే తుమ్మెద గా మారుతుంది .దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు .అసలు ఇందులో ఒక  తమాషా ఉంది .కీటకాన్ని తెచ్చి మట్టి గూడులో పెట్టేది భ్రమరమే .పెట్టి ,దాని చుట్టూ ధ్వని చేస్తూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది .లోపలి కీటకం ఆశబ్దం వింటూ తానూ భ్రమరం కావాలని తహతహ లాడుతుంది .అది తాను కీటకం అనే స్ప్రుహనే కోల్పోతుంది .అప్పుడు చివరికి కీటకం ఆ భ్రమర నాదం లో లీనమై పోయి భ్రమరం గా మారుతుంది .కనుక మన సర్వ దేహ ఇంద్రియాలను కీటకంలాగా సర్వ సర్పణ చేస్తే ,అదే ధ్యాసలో ఉంటే పరమాత్మగా మారుతాం ,ఆయనలో లీనమైపోతాం .ఈ విషయాన్నే ఆది  శంకరులు మరో శ్లోకం లో

‘’ఆత్మాత్వం గిరిజా మతిః,పరిజనాః,ప్రాణాః,శరీరం ,గృహం –పూజాతే విషయోప భోగ రచనా ,నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరః –యద్యత్కర్మకరోమి తత్తదధికం శంభో తవారాధనం ‘’  అన్నారు

‘’నువ్వే నా ఆత్మ. ,పార్వతీ దేవి నాబుద్ధి .నా పంచ ప్రాణాలు నీ సేవకులు అంటే పరిజనాలు .నాశరీరమే నీ ఆలయం .విషయ సుఖాల కోసం నేను చేసే పనులన్నీ నీ పూజలే .నేను పోయే నిద్ర నీలో తదేకంగా పొందే సమాధి స్థితి .నాపాదాలు చేసే నడక అంతా నీకు చేసే ప్రదక్షిణాలు .నేను మాట్లాడే మాటలన్నీ నీ స్తోత్రాలే .మహేశ్వరా ! నేను చేసే ప్రతి చర్యా నీ ఆరాధనే అనుకొని  స్వీకరించు ‘’అంటూ మనలోని 24 తత్వాలూ ఈశ్వరార్పణం గా చేస్తే ,మనలోని ఇంద్రియ లోలత్వం అంటే వ్యామోహం తొలగి మన జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అని చెప్పారు .అప్పుడు మనకు ,పరమాత్మకు భేదం ఉండదు అంటే అద్వైత స్థితి పొందుతాం .జీవన్ముముక్తులం అవుతాం అని శంకరుల ఆంతర్యం .

మరొక శ్లోకం లో –‘’నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే –సత్యాయాది కుటుంబినే ,ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే

మాయా సృస్ట జగత్రయాయ ,సకలామ్నాయాంత సంచారిణే-సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే’’అని స్తుతించారు .ఈ జగత్తుకు ఆధారం కారణ భూతుడు అయిన పరబ్రహ్మ నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు .అనగా సృష్టి లయ కాలం లోనూ ఆయన ఉంటాడు .ఆయన త్రిగుణాత్ముడు అంటే స్థూల ,సూక్ష్మ  ,కారణ శరీరాలను జయించి  అంటే వాటికి లొంగకుండా ,నాలుగవది అయిన స్వస్వరూప ఆనందం లో వెలిగి పోతూ ఉంటాడు . పార్వతీ దేవి తపస్సుకు ఆయన ఫల స్వరూపుడు .అన్నికాలాలలో ఉండే సత్య స్వరూపుడు . భక్తులను అనుగ్రహించటం కోసం ఆది కుటుంబి గా అవతరించి పార్వతీ పరమేశ్వరులు గా ఆది దంపతులై అభీష్ట సిద్ధి కలిగిస్తున్నారు . మహర్షుల అంతఃకరణాలలో  అనగా మనస్సులలో మాత్రమే కనిపించే జ్ఞాన స్వరూపుడు .మాయ అనే తన శక్తితో మూడు లోకాలను సృష్టించాడు .అన్ని వేదాలలో ,వేదాంతాలలో సంచరించే బ్రాహ్మీ మయ మూర్తి ఆయన  . ప్రదోష కాలం అంటే సాయంకాల సంధ్య వేళ తాండవ నృత్యం చేసే జటాజూట దారి  .అలాంటి శుభాలనిచ్చే శివునికి నమస్కారం అని భావం .ఇందులో ప్రయోగించిన పదాలన్నీ అర్ధ వంతమైనవే .పరబ్రహ్మ తత్వాన్ని తెలియ జెప్పే పదాలే .

నిర్గుణ ,సగుణ పరబ్రహ్మ స్వరూపాలను శంకరాచార్య ఎలా వర్ణించారో తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-17- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

“మా ఇంట్లో నరక చతుర్దశి ,దీపావళి

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

20-10-17 శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు

20-10-17 శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు –

ప్రతి సంవత్సరం లాగే ఈ  కార్తీకమాసం లో ధారావాహికగా ఏమి రాయాలో అని ఆలోచిస్తుంటే  మేము అమెరికా లో ఉన్నప్పుడు  ప్రముఖ సంస్కృతాంధ్ర విద్యావేత్త బహు గ్రంధకర్త   ఆత్మీయ మిత్రుడు శ్రీ రంగా వఝల మురళీ ధరరావు గారు ఆధరంగా  పంపిన ”శివానంద లహరి ఆంతర్యం ”ఇవాళే దృష్టిన పడింది  ఆయన చాలా లోతుగా దాన్ని చర్చించారు .నేను మాత్రం మాయాబజార్ సినిమాలో వంగర చెప్పినట్లు ”శాస్త్రం నిష్కర్ష గా కర్కశంగా చెబుతుంది మనం సౌమ్యంగా దాని సారాంశమే గ్రహించాలి  ”అన్నట్లు అందులోని ముఖ్య విశేషాలను ”శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం ”గా ధారావాహికం గా రేపటి నుండి  అంద  జేస్తున్నాను -దుర్గాప్రసాద్ 

Inline image 1Inline image 2Inline image 3
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనవి మాటలు మూడు 

మనవి మాటలు మూడు

మనవి-1-నేను రచించి సరసభారతి ప్రచురించిన  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం’’ఆవిష్కరణ సందర్భంగా ‘’గీర్వాణ భాషా వైభవం ‘’శీర్షికతో 4-12-2016 న  నిర్వహించిన” పద్య కవి సమ్మేళనం” లోని కవితలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం’’ లో చివర” అనుబంధం”గా  చేర్చి ముద్రిస్తున్నామని ., .కవులు తమ అమూల్య భావాలను పద్య సుమ మాలగా రూపొందించి గీర్వాణ భాషా సరస్వతి కి అమూల్యా భరణం గా సమర్పించారు . వారందరికీ సరసభారతి కృతజ్ఞతలు తెలియ జేస్తోంది .

ఈ సురభిళ సుమమాలను  సరస్వతీ  పుత్రులు ,నడయాడే దైవం  కంచి జగద్గురువులు ,పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ మహా స్వాములకు  సవినయంగా అంకితమిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .

2-సరసభారతి 26-3-17 ఆదివారం నిర్వహించిన శ్రీ హేవిళంబి ఉగాది వేడుకల సందర్భం గా””వసుధైక కుటుంబం ”శీర్షికగా  ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లోని కవితలను పుస్తకరూపం లో తెస్తున్న సంగతి మీకు తెలుసు .ఇందులో ప్రసిద్ధ అనుభూతికవి కీ శే దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ”వసుధైక గీతం ”కవితను కూడా చేర్చికవితా సంకలనాన్ని   శ్రీ తిలక్ కు అంకితమిస్తున్నామని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది .

3– సరసభారతి అమెరికాలోని షార్లెట్ లో 1-10-17 ఆదివారం 108 వ కార్య క్రమంగానిర్వహించిన  ”దసరా సరదా సాహితీ కదంబం ”లో ఎల్లలు లేని జగతి పై శ్రీ తిలక్అద్భుతంగా రాసిన   ‘వసుధైక గీతం ”చదివి ఆయన ఫోటో ను వేదికపై అలంకరింపజేసి శ్రీ తిలక్ కు ఆ కార్యక్రమం అంకితం చేసిన  సంగతి మీకు జ్ఞాపకం ఉండేఉంటుంది . శ్రీ తిలక్ కు ఈ  రకమైన ఘన నివాళి అర్పించటం సరసభారతి అదృష్టం గా భావిస్తున్నాం  –

దీపావళి శుభాకాంక్షలతో –

 

Inline image 1

దుర్గా ప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ధన త్రయోదశి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు -షార్లెట్ సరస భారతి సాహితీ మితృలు 1-10-17 ఆదివారం జరిగిన సరసభారతి 108 వ సమావేశం ”దసరా సరదాసాహితీ కదంబం ” కార్య క్రమం లో  ఆత్మీయంగా అందజేసిన 1,000 డాలర్లు నగదు కానుక కు ఎక్స్చేంజ్ లో 60 000 రూపాయలు వచ్చిన సంగతి దానిని ఫిక్సెడ్ డిపాజిట్ లో వేస్తానని చెప్పిన సంగతి  ఇదివరకే తెలియ జేశాను .ఈ మొత్తాన్ని ఈ” ధన త్రయోదశి ”నాడు ఫిక్సెడ్ డిపాజిట్ చేశానని తెలియ జేస్తున్నాను. ఆర్ధికం గా ఇబ్బంది పడుతున్న విద్యార్థు లెవరైనా  మీదృష్టికి వచ్చినా ,లేక కడు  బీదరికం తో బాధ పడుతున్న వారెవరైనా మీకు తటస్థ పడితే  మాకు తెలియజేస్తే  విచారించి తగిన ఆర్ధిక సాయాన్ని ”షార్లెట్ సరసభారతి ”పేరిట  దీనిపై వచ్చే వడ్డీ తో మనం ఆర్ధిక సాయం చేద్దాము . ఒక మంచి కార్యక్రమానికి మీరు అంద  జేసిన. ఈ చేయూత చిరస్మరణీయం గా నిలిచి ఆదర్శ ప్రాయమైంది  .అందరికి ధన్యవాదాలు  .

Inline image 1

   దీపావళి శుభాకాంక్షలతో -దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హైదరాబాద్ లో బుధవారం గబ్బిట గిరిజ ఇంట్లో

రెండేళ్ల క్రితం ఫోన్ ద్వారా పరిచయం అయిన శ్రీమతి గబ్బిట గిరిజ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూవుండటం ,నన్ను బాబాయి గారు అనీ మా ఆవిడను పిన్ని గారూలని సంబోధించి పలకరించడం అమెరికా లో ఉన్నా రెండుమూడు సార్లు వాట్స్ అప్ లో మాట్లాడటం ఇండియా వచ్చాక మూడు సార్లు ఫోన్ చేయట0 ,తాను  ఆర్ధోపెడిక్ పేషేంట్ అవటం ,82 ఏళ్ళ అత్తగారి సేవ లో ప్రతిక్షణం ఉండటం ,మన బ్లాగులను చదువుతూ ఉండటం వలన ఆమె మా గబ్బిట వారి ఆడబడుచు అవటం కూడా కారణమై ఈ రోజు 11-10-17 బుధవారం సాయంత్రం 4-30 కు మా దంపతులం మా పెద్దకోడలు శ్రీమతి సమత కాబ్ లో నాగోలు లోని వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసాం . ఆమె అత్తవారింటిపేరు రాయలసీమ ”గుత్తి అగ్రహారం ”. భర్త శ్రీ రిషీకేశ్ ఐబి ఏం ఉద్యోగి .  గిరిజ కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరున్న యలమర్రు లేక కూరాడ కు చెందిన గబ్బిట వారి ఆడబడుచు .గుత్తి అగ్రహారం వారి కోడలు .గుడివాడ దగ్గర బేత వోలు లోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పచ్చళ్ళ శర్మ గారి మేనకోడలు . శర్మగారి ద్వారా నా సంగతి తెలుసుకొని  ఆయన ఎప్పుడూ నా గురించి చెపుతూ ఉండటం తో బ్లాగ్ లో గుర్తుపట్టి అభిమాని అయి తరచూ పలకరించేది . అందుకే ఇవాళ వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లాం ఆమె పై ఉన్న అభిమానం తో .

  గిరిజ దంపతులకు సరసభారతి పుస్తకాలు అందజేశా0 .  మా శ్రీమతి ఆమెకు చీర జాకెట్ పెట్టింది . గిరిజ దంపతులు మాఇద్దరికి బట్టలు పెట్టారు ఆమె అన్నగారి కుటుంబమూ వీళ్ళ ఇంటికి అతి దగ్గరలోనే ఉంటారు . వాళ్ళు కూడా వచ్చి గబ్బిట వారిని చూసిన ఆనందం మాలాగానే పొందారు . మళ్ళీ కాబ్ లో ఇంటికి వచ్చేసరికిసాయంత్రం  6-30 అయింది .రాత్రి 8-45 బస్ కు ఉయ్యూరు ప్రయాణం .
   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-17 -కాంప్ -మల్లాపూర్ -హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు 

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు

8 వ తేదీ ఆదివారం క్షణం తీరిక లేకుండా హైదరాబాద్ లో గడిపిన విశేషాలన్నీ మీకు ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు అంటే తెల్లవారితే సోమవారం  చివరి వీక్లీ లో రాసిన సంగతి జ్ఞాపకం ఉండే ఉంటుంది . ఆహడావిడిలో రెండు పొరబాట్లు దొర్లాయి
-1 నేను ఇంతకు  ముందు అమెరికావచ్చిన నాలుగు సార్లలో చదివిన పుస్తకాలు ట్రిప్ కు సుమారు 300 అని రాసి మొత్తం 1200 అన్నాను .కాదు మొత్తం 16 00 పుస్తకాలు .అలాగే నా నోట్స్ కూడా  ట్రిప్ కు 300 పేజీలు చొప్పున మొత్తంకనీసం  1200 పేజీలు .ఈ నోట్స్ ఆధారంగా ఎన్నో వందల ఆర్టికల్స్ మెయిల్ లో రాయగలిగాను .
2-2012 లో నాలుగవ సారి అమెరికా వచ్చినప్పుడు వారం వారం రాసింది ”అమెరికా వీక్లీ ”అని రాశాను . కాదు దానిపేరు ”అమెరికా డైరీ ”.
   ఆదివారం యిట్టె తెల్లవారి సోమవారం వచ్చింది కంటిమీద కునుకు లేకుండానే .
                       9-10-17 సోమవారం
ఉదయం 6 గంటలకే లేచి స్నానాదులు చేసి  సంధ్యావందనం పూజా మానసికంగా మా అబ్బాయి శర్మా వాళ్ళ ఇంట్లో బాచుపల్లిలో చేశాను .టిఫిన్ చేసి డా శ్రీ రేమెళ్ళ అవధానులు గారు నాకు కానుకగా అందించినవారి రచన  ”జ్యోతిశ్శ్శాస్త్ర   చరిత్ర”బృహద్గ్రంథం మొదటి భాగం చదవటం మొదలు పెట్టాను .  దీన్ని ఒకమరాటీ ఉపాధ్యాయుడు శ్రీ శంకర బాలకృష్ణ దీక్షిత్ మరాఠీ భాషలో రాశాడు . ఎంతో విలువైన సమాచారం సేకరించి ఆయన దాన్ని రెండుభాగాలుగా రాశాడు .మనకెవ్వరికీ తెలియని100 మంది  జ్యోతిష శాస్త్ర వేత్తల రచనలను వారి సిద్ధాంతాలను గణితాన్ని సేకరించి ఎంతో శ్రమ దమాలకు ఓర్చి1890 లో  రాసిన అపూర్వ గ్రంధం . ఆనాడు ఈ రెండు సంపుటాలకు దీక్షిత్ గారికి ప్రభుత్వం మంజూరు చేసిన పారితోషికం 450 రూపాయలు ,1000 రూపాయలు .ఈనాటి లెక్కలలో చూస్తే దానివిలువ 80 ,90 లక్షల రూపాయలకంటే ఎక్కువ అంతటి ఘనమైన నగదు ను బహూకరించారన్నమాట .తర్వాత దీన్ని డా ఆర్ వి వైద్య 1968 ,1981 లలో ఆంగ్లం లోకి అనువదించాడు ఈ మహా గ్రంధాన్ని డా శ్రీ రేమెళ్ళ అవధానులు గారు 6 సంవత్సరాలు ఎంతో కృషి చేసి తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆర్ధిక సాయం తో రెండుభాగాలూ తెలుగులోకి అనువదించి 2014 ,2015 లో ప్రచురించారు .అటు దీక్షిత్ ఇటు వైద్య ,మరియు శ్రీ అవధానులు గారికి భారత జాతి ఎంతో రుణపడి ఉంది అది తీర్చుకోలేని రుణమే . ఈ గ్రంధాలు నాకు బహూకరించినప్పుడు అవధానులుగారితో ”నాకు మీరు మళ్ళీ పని కల్పించారన్నమాట ”అన్నాను ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ”నిజమే ”అన్నారు .
  ఇవాళ ఈ గ్న్నగ్రంథా న్ని   చదివినప్పుడు వీరిలో వరాహమిహిరుడు వంటి ఒక పది మందిని తప్ప మిగిలిన వారిని  చరిత్ర గుర్తించి రికార్డ్ చేయలేదని అని పించింది .అయితే అవధానులగారి గ్రంధం గణిత , జ్యోతిషాలలెక్కలెన్నో ఉన్నగ్రంధం .నేను రాయాలంటే ఆ జోలికి పోకుండా ఒడ్డునవుండి వారి  సంక్షిప్త  చరిత్రలు రాయాలి .కనుక ”గీర్వాణ కవుల కవితాగీర్వాణం -4 ”భాగానికి చేతినిండా ”ఉప్పు అందింది ”అన్నమాట .
      మా అబ్బాయి శర్మ కోడలు ఇందిరా దంపతులు మా ఇద్దరికీ కొత్త బట్టలు  పెట్టి ఆశీస్సులందుకొన్నారు
  మధ్యాహ్నం 12-45 కు మా బావమరిది సెక్రెటేరియట్ కాలనీ నుంచి కారులో వచ్చి మా ఇద్దరినీ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాడు .వీళ్ళింట్లోనే భోజనం .బామ్మర్ది ఆనంద్ ,రుక్మిణి దంపతులు మా ఇద్దరికీ బట్టలు పెట్టి ఆశీస్సులు పొందారు . కరెంట్ వస్తూ పోతూ ఇబ్బందిగా ఉంది ఆదివారం రాత్రి, ఈ రోజు సోమవారం రాత్రి రెండుమూడు గంటలు కుంభ వృష్టిగా వర్షం కురిసింది .మా మేనల్లుడు అంటే బామ్మర్దీకొడుకు వంశీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 10 దాటింది . రాత్రి 10 గంటలకు నిద్రపోయా .మామంచి నిద్రపట్టింది .కిందటి బుధవారం అమెరికాలో బయల్దేరినప్పటినుండి ఇప్పటిదాకా నిద్రే లేదు.  ఈ  నిద్రతో కొంత ఉపశమనం కలిగింది ..
       10-10-17 మంగళవారం
ఇవాళ ఆశ్వయుజ బహుళ పంచమి .మా మామగారు శ్రీ సూర్యప్రకాశ శాస్త్రిగారి ఆబ్దీ క0 .ఆయన చనిపోయి 30 ఏళ్ళు అవుతోంది .మా బావమరిది చాలా శ్రద్ధగా తండ్రికి తద్దినం పెడుతూనే ఉన్నాడు . మాకు మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ అపాయింట్ మెంట్ ఉందని ముందే చెప్పి వంట వాళ్ళను భోక్తలు  మంత్రం వారినీ పెందరాళే  రమ్మనమని చెప్పని ముందే చెప్పాంవాడికి .అలాగే చేశాడు .
  నాస్నాన సంధ్యాదులు మానసికంగా చేసేశాను . ఉదయం 7 గంటలకే వంటాయన వచ్చాడు .ఆయన ఇంటిపేరు జంధ్యాల  బెజవాడవాడే ఇక్కడికొచ్చి 20 ఏళ్ళు అయిందట . బ్రాహ్మణులు ఉదయం 9 గంటలకే వచ్చారు .మా ఇద్దరికీ హోటల్ నుంచి టిఫిన్ ఛేచ్చాడు వంశీ .
అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆబ్దీకం   ఉదయం  9-45 కు ప్రారంభించారు మంత్రం చెప్పే ఆయన సర్వ సమర్ధుడు . వీళ్ళింట్లో అన్ని కార్యాలకు ఆయనే బ్రహ్మగారు .ఇవాళ ఆయన తమ్ముడు ఒక భోక్త ,మరొక భీష్మాచార్యుల   లవంటి గడ్డం మీసాల పెద్దాయన మరొక భోక్త .యధా విధిగా కార్యక్రమ0 పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12 -45 అయింది . మా భోజనాలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1-30 అయింది .
               శిష్యుడు డా యాజి ఇంట్లో మేము
  వంశీతో కాబ్ బుక్ చేయించి మేమిద్దరం శాంతినగర్ లో ఉన్న డా యాజి స్వ0త అపార్ట్ మెంట్ కు వెళ్లాం .వాళ్ళ చిన్నమ్మాయి కిటికీ తలుపు ఓరగా తీసి చూసి తలుపు తీసి మమ్మల్ని ముచ్చటైన మాటలతో లోపలి ఆహ్వానించి కుర్చీలలో కూర్చుబెట్టి  మంచినీళ్లు ఇచ్చి లోపలి  వెళ్లి వాళ్ళనాన్నకు  మే మొచ్చామని చెప్పింది .అతనికి అమెరికాలో ఉండగానే ఇలా వస్తామని ఒకసారి, ఇండియా చేరగానే మరొక సారి మెయిల్ రాశాను అతను సిద్ధంగానే ఉన్నాడు .భార్య శ్రీమతి అన్నపూర్ణ బజారు వెళ్లి అప్పుడే వచ్చి మమ్మల్ని చూసి పరవశించిపోయింది .యాజి చెల్లెలుడా  శ్రీమతి వల్లి కుమార్తె డాక్టరీ మూడవ ఏడాది చదివే అమ్మాయి కూడా యాజి భార్యతో పాటు వచ్చింది .ఆపిల్లఅచ్చంగా వాళ్ళమ్మ పోలికగానే ఉంది .ఇలా అనుకోకుండా ఈ అమ్మాయిని చూసాం .
        ఇంటికి వచ్చినదగ్గర్నుంచి అన్నపూర్ణ తెగ హడావిడి చేసింది .లడ్డూ ,మరొక స్వీట్ ,కారప్పూస పెట్టి ,పళ్ళ ముక్కలు  దానిమ్మగింజలు తినిపించి మాంచి కాఫీ ఇచ్చింది . మా అబ్బాయి రమణ పెళ్లి 2010 లో గుంటూరులో జరిగితే యాజి కుటుంబంతో సహా వచ్చాడు .అప్పుడే అతని భార్యా ఇద్దరు ఆడపిల్లలను మొదటి సారి చూడటం .ఏడేళ్లు గడిచిపోయాయి .నేను గుర్తుపట్టలేదు .మా శ్రీమతిబాగానే గుర్తుపట్టింది . మేమిద్దరం శనివారం నాడే మల్లాపూర్ లో షుగర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ లు తీసుకొని యాజి కి చూపించాం .ఆవిడకు షుగర్ నార్మల్ గానే ఉంది నాకు ”షుగర్ బస్తాల బరువు ”కొంచెం ఎక్కువగానే ఉందని నేను అనుకోగా యాజి ”మీకిది మామూ లేగా మాస్టారూ !అక్కడ స్వీట్ లు జ్యుస్  లు తాగుతారుకదా .కొంచెం ఎక్కువగానే ఉంది .కంగారేమీ లేదు ఉయ్యూరు వెళ్ళాక 15 రోజులతర్వాత మరోసారి టెస్ట్ చేయించి రిపోర్ట్ మెయిల్ చేయండి అప్పటికీ జాస్తీగా ఉంటె మందులు మారుద్దాం ”అన్నాడు .నేను ”అమెరికాలో పంచదార తప్ప అన్నీ చాలా తియ్యగానే ఉంటాయయ్యా  కూరలతోసహా .అదీగాక ఈ మధ్య దసరా పండగలు భోజనాలు మా అమ్మాయి చేసిన మైసూర్ పాక్ లో తెగతిన్నా .ఫ్లయిట్ లో లీటర్ల కొద్దీ జ్యుస్ లు తాగా.ఇంటికి వెళ్లి కాకరకాయ రసం, మెంతిపిండితీసుకొంటాలే ”అన్నాను సంతృప్తి ప్రకటించి బిపి ఇద్దరికీ చూసి నార్మల్ గా ఉందని చెప్పాడు .ఇద్దరికీ మొత్తం మీద ఆరోగ్యం నార్మల్ గానే ఉందని భరోసా ఇచ్చాడు .
             డాక్టర్  శిష్యుడు ,బిటెక్ అర్ధాంగి మాస్టారు  దంపతులకు  చేసినఅపూర్వ సత్కారం ,
  యాజిభార్య మా ఎదురుగా కూర్చుని అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టింది .మనబ్లాక్ లను  క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకొన్నఅమ్మాయి .ఆతను బ్లాగ్ లో విశేషాలు ఎప్పటికప్పుడు ఆమెకు చెబుతూ సంభ్రమానికి గురి చేస్తాడట .యాజి తండ్రి డా కుమారస్వామిగారు మాకు ఉయ్యూరులో ఫామిలీ డాక్టర్ .మా అమ్మకు సుమారు 10 ఏళ్ళు ఆయనే వైద్యం చేశారు .వేరే డాక్టర్ దగ్గరకు తీసుకువెడతానంటే ”నేను అతని చేతుల్లోనే చనిపోతాను నాకు వేరే డాక్టర్ వద్దు .అతడు నాకు కొడుకు లాంటివాడు ”అనేది.  నిజంగా అలానే ఆయన హాస్పిటల్ లోనే నా చేతులమీదుగా మా అమ్మగారు చనిపోయారు .ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాం .యాజి గవర్నమెంట్ మెడికల్ కాలేజి లో మెడికల్ ప్రొఫెసర్  గా చేసి తర్వాత బందరులో పనిచేసి తర్వాత ఉత్తరప్రదేశ్ సహజాన్ పూర్ కు చెందిన శ్రీ రామచంద్ర అనే సహజ యోగ మార్గ దర్శి గారి పేరిట హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఉన్న శ్రీ రామచంద్ర సెంటినరీ హాస్పిటల్ లో గత 15 ఏళ్లుగా డాక్టర్గా సేవలు  చేస్తున్నాడు . 6 నెలల క్రితం మా నేసి గుడ్ విల్ హాస్పిటల్ లోడాక్టర్ గా   ఒపి చూస్తున్నాడు సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు . అతని తండ్రిగారు సుమారు 20 ఏళ్ళక్రితమే చనిపోయారు ఉయ్యూరుదగ్గర కనకవల్లి స్వగ్రామం .ఉయ్యూరు లో మొట్టమొదటగా పిల్లర్లతో బిల్డింగ్ కట్టిన మొదటి వ్యక్తి ఆయనే . యాజి తల్లిగారు మహా భక్తురాలు ఎప్పుడూ తీర్ధయాత్రలు చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు ప్రస్తుతం 8 నెలలనుండి ,ఉయ్యూరు వాసి శ్రీమతి పద్మావతిగారితో కాశీలో ఉంటున్నారు ఇంకొక నెల  అంటే 9 నెలల దీక్ష పూర్తి చేసి హైదరాబాద్ కు తిరిగివస్తారట
  యాజి దంపతులు నాకు పట్టుబట్టలు ,మా శ్రీమతికి మంచిచీరె జాకెట్ పెట్టి  బుట్ట నిండా  పళ్ళు పెట్టి  అపూర్వంగా  సత్కరించి నమస్కరించి ఆశీర్వాదం పొందారు అన్నపూర్ణ లో గొప్ప సంస్కారం కనిపిస్తుంది .మా యాజికి తగిన ”బిటెక్ భార్య”.
             ఎన్నేళ్ల అనుబంధమో  అన్నట్లు
 యాజి దంపతుల ఇంటి నుంచి గుమ్మం దాటి బయటకు రాగానే వాళ్ళ పెద్దమ్మాయి అప్పుడే బీగం పేట స్కూల్ నుంచి వచ్చి అమాంతం నా బుజం మీద వాలి పోయింది .ఏనాటి బంధమో ? ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నవాడిని అనుకున్నంత చనువుతో నాదగ్గరకు రావటం ఆఅమ్మాయి ముఖం లో వెయ్యి కాండిళ్ల  బల్బులు వెలిగినంత ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది .మా అందరికీ మహదానందంగా అనిపించింది యాజి దంపతులు అపూర్వ ఆనందాన్ని పొందారు . వాళ్ళిద్దరి ముఖం లో అంతటి సంతోషం చూసి మా శ్రీమతి నిండుమనసుతో ఆశీర్వదించింది .అందరం కలిసి ఫోటోలు దిగాం . అన్నపూర్ణ తమకారులో మమ్మల్ని మెహిదీ పట్నం లో ఉన్న మా మేనకోడలు పద్మ ఇంటికి తీసుకు వెళ్లి దింపి ఇంటికి తిరిగి వెళ్ళింది . సౌజన్య సంస్కారాలంటే ఇవే .
                     మేనకోడలు ఇంట్లో
  మేము అమెరికాలో ఉన్నప్పుడు మా అన్నయ్యగారి అబ్బాయి రాంబాబు  కొడుకు కళ్యాణ్  పెళ్ళికి మామేనల్లుడు అశోక్ దంపతులు పద్మా ఉయ్యూరు వచ్చారు . మా ఆవిడ మా మద్రాస్ పెద్ద మేనకోడలు కళకు  పద్మ కూ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది ”అమ్మావాళ్లు పెద్దవాళ్లయ్యారు .వాళ్ళు పుట్టింటికి ఉయ్యూరు రాలేక పోతున్నారు .మీకు ఉయ్యూరులో మా ఇంట్లో పుట్టింటి హక్కు ఉంది .వీలైనప్పుడల్లావచ్చి మేం  పెట్టె పుట్టింటి సారె తీసుకొని వెడుతూ ఉండండి ”అని చెబుతుంది .అలాగే ఈపెళ్లికి వచ్చిన కళ ,పద్మా మేము అక్కడ లేకపోయినా ఇంటికి వచ్చి మా కోడళ్ళు శ్రీమతి రాణి ,శ్రీమతి మహేశ్వరి ఇచ్చిన ఆతిధ్యాన్ని పెట్టిన చీరా సారెను తీసుకొని వెళ్లారు .అది ఎంతో గొప్పగా మాకు అమెరికాకు ఫోన్ చేసి చెప్పారు . అదే మేము కోరుకొనేది .అప్పుడే పద్మ మమ్మల్ని హైదరాబాద్ వస్తే వాళ్ళఇంటికి రమ్మని కోరింది .అందుకే వచ్చాము .
   మంచి కాఫీ కావాలని మా ఆవిడ అడిగి పెట్టించుకుని తాగాం .రాత్రి భోజనం కూడా చేసి వెళ్లమన్నారు రామకృష్ణా పద్మా దంపతులు .పెద్దగా తినాలని పించక రెండు చపాతీ లు తిని మజ్జిగ త్రాగా0 . పద్మ దంపతులు మా ఇద్దరికీ బట్టలు పెట్టి ఆశీస్సులు పొందారు పద్మాపిల్లలు ఉద్యోగాలలో ఉన్నారు ప్రస్తుతం 85 ఏళ్ళ పద్మమామగారే పద్మ దంపతులకు పసి పిల్లాడు ఆయన్ను కంటికి రెప్ప లాగా కాపాడుతున్నారు .  ”మా తండ్రిగారు ,తర్వాత మా  అత్తా మామలు అంటే మీ  చిన్నక్కయ్యశ్రీమతి దుర్గ  మీ బావగారుశ్రీ వివేకానంద్ గారు తర్వాత  మీ దంపతులు మాకు పెద్ద వారు .కనుక వీలైనప్పుడల్లా మెహిదీపట్నం మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం తీసుకోండి ”అని” మాటల మాంత్రికుడు” రామకృష్ణమాకు చెప్పాడు .  పద్మ వాళ్ళమ్మాయి రవళి తో మాకు మల్లాపూర్ కు కాబ్ బుక్ చేయించగా ఎక్కి, మేము రాత్రి 8-30 కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి భూప్రదక్షిణంలాగా చేరాం .ఈ కాబ్ కు మేము డబ్బులు కట్టవద్దని పద్మ ముందే చెప్పింది .కానీ ఖర్చు లేకుండా ఇంటికి వచ్చాము . రాత్రి నిద్ర బాగానే పట్టింది .
       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-17 -కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్
    

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

సఫల షార్లెట్ యాత్ర -రెండవభాగం (చివరిభాగం )

4 వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు బోస్టన్ కు ఫ్లయిట్ లో చేరాం .అక్కడినుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ వెళ్ళటానికి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తియై తెచ్చుకున్న పులిహోర ,పెరుగన్నం తిని గేట్  వద్ద సిద్ధంగా ఉన్నాం .అక్కడ కేరళ వెళ్లే ఆయన దగ్గర సెల్ తీసుకొని మా అమ్మాయికి సమాచారం తెలియజేశాను . రాత్రి 11 గంటలకు దుబాయ్ కి విమానం బయల్దేరింది . నాపక్కన ఇస్కాన్ ఆయన కూర్చున్నాడు . వీలైనప్పుడల్లా జపమాలతో జపం చేసుకొంటున్నారు . దుబాయ్ లో దిగే దాకా అంటే 11 గంటలపాటు ఆయన సీట్ లో నుంచి లేవలేదు .ఆశ్చర్యమేసింది . విమానం -50 సెంటీగ్రేడ్ డిగ్రీల ల లో సుమారు భూమినుండి  30 వేలకు నుంచి 50 వేల అడుగుల ఎత్తులో యావరేజ్ గా గంటకు 950 కిలోమీటర్ల వేగం తో ప్రయాణం చేసింది .నాముందున్న బుల్లితెరపై విమానం పోకడ హాస్య చిత్రాలు చూస్తూ గడిపాము .నిద్ర పట్టలేదు .”గాలి కన్యలు ” ఏవేవో తినటానికి తాగటానికి ఇస్తూనే ఉన్నారు .ఏవీ సయించలేదు .కాఫీ మాత్రం తాగాము ఆపిల్  ,మాంగో జ్యుసి అడిగి తాగాం . దుబాయ్ చేరేసరికి రాత్రి 7 అయింది . వీల్ చెయిర్ లాగటానికి ఒక ఆఫ్రో అమెరికన్ అమ్మాయి ఒక అమెరికన్ అమ్మాయి వచ్చారు .ఒక చోట లిఫ్ట్ లో వెళ్ళాలి సొస్తే అక్కడ అమెరికామ్మాయి నన్నుఆవిడ మీకేమవుతుంది అనిఅడిగితే భార్య అన్నాను .పెళ్లి అయి ఎన్నేళ్లయింది అని అడిగితే  53 ఏళ్ళయిందన్నాను బోల్డు ఆశ్చర్యపోయి” ఓ మైగాడ్” అంది . తర్వాత ”ఈవిడ మీకు ఎన్నవ భార్య ?”అని అడిగితె నాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి ”నా ఏకైకభార్య ”అన్నాను . మళ్ళీ మరింత ఆశ్చర్యపోయి ”ఓ వాట్ ఏ గ్లోరియస్ థింగ్ .వి ఆర్ వెరీ వెరీ హాపీ టు హియర్ దిస్ న్యూస్ ” అంటూ ”విష్ యు వెరీ లాంగ్ హాపీ మ్యారీడ్ లైఫ్ ”అని మనసారా శుభాకాంక్షలు తెలిపింది .అంటే పాశ్చాత్య దేశాలలో దాంపత్యాలు క్షణ భంగురాలు అని ఇంతకాలం మేమిద్దరం భార్యా భర్తలు గా జీవించటం వాళ్లకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది .అందుకే నిండుమనసుతో శుభాకాంక్షలు తెలిపారు ఆ ఇద్దరూ .ఇక్కడ నాకొక చిన్న జోక్ జ్ఞాపకం వచ్చింది.  దీన్ని దసరా సరదాల్లో చెబుదామనుకొని మర్చే పోయాను –

ఒక అమెరికన్ ఆయన ఒక హాలీ వుడ్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆమెకు ఎన్నో పెళ్ళో ఆయనకు ఎన్నోపెళ్ళో వాళ్ళిద్దరికే తెలీదు మనకెందుకు .పెళ్లైన నాలుగు రోజులకే భార్య కొత్త భర్తతో ”హానీ !మనం హనీమూన్ కు ఆఫ్రికా వెడదాం అక్కడ సఫారీ బాగుంటుంది ”అంది బుగ్గమీద ముద్దు ముద్ర వేస్తూ .వీడి గుండె జారి  గల్లంతైంది .డియర్ !ఇప్పుడిప్పుడే డబ్బు కూడా బెడుతున్నా .హానీ మూన్ అంటే చాలాఖర్చు కదా ”అన్నాడు .ఆమె ”చిలిపి డియర్ .మా లాంటివాళ్లకు హానీ మూన్ లు రెండేళ్లకో మూడేళ్లకో కదావచ్చేది .కాదనకు హానీ ”అంది గోముగా .వీడు ఆమాటలకు ఐసై పోయి హనీమూన్ చేసి దాచిన డబ్బంతా ఐస్ లాగా కరగించుకొన్నాడట . దుబాయ్ కి రాత్రి 7 గంటలకు చేరింది .హైదరాబాద్ ఫ్లయిట్ రాత్రి 10 గంటలకు .లాగుడు బళ్ల వాళ్ళు రెడీగా ఉన్నారు .కస్టమ్స్ చెకింగ్ నిమిషాలమీద చేయించారు . ట్రెయిన్ లో లిఫ్ట్ లమీద తీసుకొని వెళ్లి చివరికి హైదారాబాద్ విమానం గెట్ దగ్గర కూర్చోబెట్టటారు .ఆవిడకి వీల్ చైర్ దొరికింది నాకు లేదు ”గోవువెంట దగులు కోడె బంగి ”ఆవిడ వెంటే నడిచాను . ఈ వీల్ చైర్ కుర్రాడు చాలామంచివాడు . విమానం ఎక్కబోయేముందు మా ఆవిడ రెస్ట్ రూమ్ కు వెడుతుంటే నడవనివ్వకుండా తీసుకొని వెళ్లి బయట ఉండి  మళ్ళీ చైర్ లో తీసుకొచ్చిన సౌజన్యశీలి .సేవాధరామానికి ప్రతీక . .ఫ్లయిట్ ఎక్కించిన తర్వాత డబ్బు ఇద్దామని జేబులో చేయిపెడుతుంటే ఇంగ్లిష్ లో వద్దు అని మర్యాదగా చెప్పి ”,విష్ యు హాపీ జర్నీ ‘ అన్న సంస్కారి . షార్లెట్ నుంచి దుబాయ్ లో హైదరాబాద్ విమానం ఎక్కేదాకా ఎవరూ మమ్మల్ని డబ్బులు అడగలేదు.  డాలరుకూడా ఖర్చుచేయకుండా అమెరికా నుంచి హైదరాబాద్ చేరాం . ఉదయం 3 గంటలకు హైదరాబాద్ లో దిగాం . ఇండియన్ పాస్ పోర్ట్ వాళ్లకు ఇమ్మిగ్రేషన్ హడావిడి లేదు కస్టమ్స్ చెకింగ్ కూడా నిమిషాలమీద జరిపించాడు వీల్ కుర్రాడు .నేను తెచ్చిన డాలర్లను రూపాయలలోకి ఎక్స్చేంజి లో మార్చేశా డాలర్ కు 60 రూపాయల వంతున ఇచ్చారు బాగేజ్ క్లెయిమ్ కు వెడుతుంటే శాల్తీకి వందరూపాయలు కట్టాలన్నారు కట్టి రసీదు తీసుకొన్నాం .మా లగేజ్ తేలిగ్గా గుర్తుపట్తీసుకొని  మా పెద్దబ్బాయి శాస్త్రికి ఫోన్ చేయగానే వాడు ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నామని చెప్పాడు .సామాను తీసుకొని బయటకు రాగానే వాడు వాడిబాస్ బామ్మర్ది ప్రతాప్ గారి కారుతో వచ్చాడు . ప్రతాపిగారే ఏప్రిల్ లో మమ్మల్ని అమెరికా విమానం ఎక్కించటానికి కారు లో తీసుకొచ్చారు .మళ్ళీ ఆయనే .అప్పుడూ ఇప్పుడూ రూపాయిఖర్చులేదు .సామానుకారులో ఎక్కించి 4-40 కి బయల్దేరి మల్లాపూర్ లో మా అబ్బాయి ఇంటికి 6 వతేదీ శుక్రవారం 5-45 కు చేరాం .ఏప్రిల్ 6 బయల్దేరి 6 నెలల తరవాత అక్టోబర్ 6 కు చేరాం . విమానం లో  తిండి పేరుతో ఏదో చెత్త పెడతారు .దాదాపు 80 శాతం మంది ఏదీ తినరు.  అంతా వేస్టే .దీనిపై అధ్యయనం చేస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి . చక్కగా బెజవాడ బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ  కారాప్పొడి రాజమండ్రి వరదరాజు హోటల్ నుంచి పేపర్ అట్టు కాకినాడనుంచికాజాలు ,శరవణ భవన్  నుంచి సాంబారు ,ఉడిపి హోటల్ నుండి ఊతప్పం ,పొంగల్ మరాటా కేఫ్ నుంచి పూరీ ,చపాతీ, కూరా తెప్పించిపెట్టచ్చుగా అనిపిస్తుంది .

6-10-17- శుక్రవారం -దంతధావనాదులు పూర్తి చేసి కాఫీ స్నానం  చేసి మాకోడలు సమత చేసిన పెసరట్లు తిని హాయిగా కడుపు నిండిందని సంతోషించా.  విమానాలలో తిన్నది 10 శాతం పారేసింది 90  శాతం .ఉసూరుమనిపించింది . మాకోడలు స్కూల్ కు మనవడు భువన్ కాలేజీ కి ఉదయం 8 కె వెళ్లారు .నెట్ లో పోస్ట్ చూసి కాసేపు నడుం వాల్చా . నిద్రపట్టలేదు . 12 గంటలకు భోజనం చేసి కాస్త పడుకున్నా .గబ్బిట గిరిజ ఫోన్ చేసింది . మధ్యాహ్నం 3 గంటలకే లేచి షార్లెట్ లో నాకు డబ్బులు డాలర్ లలో ముట్టజెప్పినవారి లిస్ట్  ,వారెంత ఇచ్చిందో రూపాయలలో తయారు చేశా . మా అక్కయ్య భావలకు ఆదివారం ఉదయం వాళ్ళ ఇంటికి వస్తామని అక్కడిఉంది మా రెండవబ్బాయి  శర్మ ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తామని మా కుటుంబ డాక్టర్ చి యాజికి మంగళవారం మధ్యాహ్నం హెల్త్ చెకప్ కు వస్తామని తెలియజేశాను .శ్రీ పసుమర్తి శర్మగారికి శ్రీ రేమెళ్ళ అవధానిగారికి ఆదివారం సాయంత్రం వారిని కలుస్తానని ఫోన్ లో తెలియజేశాను .

షార్లెట్ లో నాకు డబ్బు అందజేసినవారు -చెన్నై వెళ్ళిపోతూ శ్రీ మతి వీటూరి పద్మజ మా సువర్చలాన్జనేయస్వామికి ఇచ్చింది (ఇదే బోణీ ),గ్రంధి హరి గారింట్లో  రఘు గారింట్లో మాలిని గారింట్లో నాగరాజు గారింట్లో లో రుద్రాభిషేకానికి ఇచ్చిన తాంబూలాలూ ,వేలూరి పవన్ ఇంట్లో పుణ్యాహవాచనం ,సత్యనారాయణవ్రతం లలో ఇచ్చిన తాంబూలం ,రాంకీ ఇంట్లో వ్యాసజయన్తి నాడు ,పవన్ ఇంట్లో వ్రతం నాడు ,అతనిభార్య ఉష అట్లతద్దినాడు ఇచ్చిన తాంబూలాలూ  ,నా పుట్టిన రోజుకు మైనేని గారు పంపినది ,కారీ లో డా భండారు దంపతులు ఇచ్చిన తాంబూలం ,మా అన్నయ్యగారి మనవడు హరి ఇచ్చినది,మా మనవడు సంకల్ప్ ఇచ్చింది ,సాయి ఇంట్లో రుద్రానికి ,పవన్ ఇంట్లో వ్రత సమయం లో ఇచ్చన  తాంబూలాలూ  ,మౌంట్ సోమా అర్చక దంపతులు ఇచ్చిన తాంబూలం ,గోసుకోండ అరుణ దంపతులు ,రావి ఉషా ,సురేఖ వేణి మా అమ్మాయి ఇచ్చింది అంతా రూపాయలలో లిస్ట్ తయారు చేశా . ముద్రించబోయే ”ఆధునిక ప్రపంచనిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంధం లో దాతల లిస్ట్ లో  ప్రచురిస్తాం  ఈ ధనాన్ని అవసరం మేరకు స్వామి సేవకు ,గ్రంథ ముద్రణకు వాడుతాం .దీనినీ  ఫిక్సెడ్ డియాజిట్ లో వేస్తాం .

2-షార్లెట్ లో సరసభారతి నిర్వహించిన దసరా సరదా సాహితీ కదంబం ”లో కవర్ లో పెట్టి సరసభారతి కి కానుకగా ,పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం అందించిన, మీకు 2 వ తేదీ తెలియజేసిన 726 డాలర్లతో పాటు మా అమ్మాయి, రావి ఉష ,అరుణ ,సురేఖ ఇంటివద్ద అందజేసిన దానితో కలిసి 1,000 డాలర్లు .అంటే 60 000 రూపాయలు .దీన్ని నేను ఉయ్యూరు వెళ్ళగానే నెలనెలా వడ్డీ వచ్చేట్లు ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ,దానిపై వచ్చే వడ్డీ ని అవసరమైన అర్హులైన చదువుకొనే విద్యార్థులకు స్కాలర్షిప్ లను ”షార్లెట్ సరసభారతి ”తరఫున ఇచ్చే ఏర్పాటు చేస్తాను .ఒక వేళ అత్యవసరంగా నెలవడ్డీకి మించి ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వవలసివస్తే నేనే ఇచ్చి తర్వాత అసలులో తగ్గించే ఏర్పాటు చేస్తా .ఒకవేళ ఇంకెవరైనా ఉపకారవేతనాలు సరసభారతి ద్వారా ఇవ్వాలని పి0చి  పంపితే, ఫిక్సెడ్ డిపాజిట్ లో చేరుస్తాం . అంతవరకూ అసలు తీయకుండా వడ్డీ నే వాడుతాం . ప్రస్తుతానికి ఇదీ నా ఆలోచన .ఇంత డబ్బు నా దగ్గర ఉంచటం మంచిదికాదు అనే ఈ ఏర్పాటు .

రాత్రి నిద్ర పట్టక పొతే 1-30 కే లేచి 5 గంటలదాకా వీక్లీ మొదటిభాగం రాసిన సంగతిమీకు  తెలుసు .

7-10-17 శనివారం -మేమిద్దరం షుగర్ టెస్ట్ చేయించుకొన్నాం.సాయంత్రం కాఫీ పొడి ,స్వీట్లు   కొని 11 వతేది రాత్రి బస్ కు ఉయ్యూరుకు టికెట్లు బుక్ చేశా . సాయంత్రం కృష్ణాజిల్లా నందమూరు అంటే ఏంటి రామారావు గారి స్వగ్రామం లో జూనియర్ రెసి డెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ సీతా పతి గారు ఫోన్ చేసి తానూ రిటైర్ అయ్యానని ,తూర్పుగోదావరిజిల్లాలో తమ స్వగ్రామం వెడుతున్నామని ,నేను పంపిన సరసభారతి పుస్తకా లన్నీ చదివానని  అవి చాలా విలువయినవని రిఫరెన్స్ పుస్తకాలనీ చెప్పారు మంచి  హృదయం ఉన్నవారు . నాకు మంచి మిత్రులు .ఇద్దరం కృష్ణా జిల్లా రచయితల సంఘం లో క్రియా శీలకంగా పని  చేసినవాళ్ళం సంఘం ప్రచురించిన తెలుగుపసిడి వజ్రభారతి ,మొదలైన రిఫరెన్స్ గ్రంధాలలో  విలువైన  వ్యాసాలను రాసాం .రెసిడెన్షియల్ కాలేజీ సర్వతోముఆభివృద్ధికి తీవ్రంగా కృషిచేసిన సమర్ధుడైన ప్రిన్సిపాల్ ఆయన .తమ చిరునామా మెయిల్ చేస్తే సరసభారతి త్వరలో ప్రచురించబోయే 3 పుస్తకాలను పంపిస్తాను అని చెప్పాను . .

             మా అక్కయ్య బావగార్ల ఇంటికి

8-10-17-ఆదివారం -ఉదయం 9-30 కు కాబ్ లో మేమిద్దరం మామనవాడు భువన్ ఓల్డ్ బోయినపల్లి లో ఉన్న మా చిన్నక్కయ్య  శ్రీమతి దుర్గ, మాబావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గారింటికి వెళ్లి ,కాఫీ తాగి  అమెరికానుంచి మా చిన్నమేనల్లుడు శాస్త్రి ఫోన్ చేస్తే మాట్లాడి మా పెద్దమేనల్లుడు అశోక్ కూడా ఇక్కడికే వస్తే చూసి ,ఫోటొలుది గి ,11-30 కు మళ్ళీ కాబ్ లో మేం  ముగ్గురం బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మ ఇంటికి చేరాం భోజనం చేసి కాసేపు పడకపై దొర్లా

  శ్రీ పసుమర్తి శర్మగారిని 40 ఏళ్లతర్వాత చూడటం
మధ్యాహ్నం  3-30 కు మా అబ్బాయి కారులో నేనూ మా మనవాళ్ళు హర్ష ,భువన్ అమీర్ పేట లో ఉన్న 1963 లో నాతోపాటు మోపిదేవి హై స్కూల్ సోషల్ మేష్టారు పెదప్రోలు వాసి మంచికి సహృదయత కు ,సౌజన్య సౌశీల్యాలకు నిలయం నా శ్రేయోభిలాషి నాకు మార్గ దర్శి అయిన 90 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధులు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారి అబ్బాయి శ్త్రి గారింట్లో దాదాపు 40 ఏళ్లతర్వాత మళ్ళీ శర్మ గారిని చూశాను . వినికిడి కొద్దిగా తగ్గిందికాని ఆయనకు షుగర్ బిపి లు లేవు చక్కని ఆరోగ్యంతో ఉన్నారు కంటి చూపు ఏమీ తగ్గలేదు వారబ్బాయి శ్రీ ఉమామహేశ్వర శాస్త్రిగారు కోడలుగారు ఎంతో ఆత్మీయంగా మర్యాదగా ,సకల సౌకర్యాలు కలిగించి ఇరవైనాలుగు గంటల నర్సు సహకారం తో ఓర్పుగా చూసుకొంటున్నారు.  ప్రక్కనే ఇండో యు ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది .ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ చేర్పించి చక్కని వైద్యం అందిస్తున్నారు .శర్మగారు దేవునితో సమానం .శర్మ గారికి కొడుకు కోడలు చేస్తున్న పితృసేవ అందరికీ ఆదర్శంగా ఉంది . నిష్కల్మష మనస్కులు .విశుద్ధ వర్తనూలు  గొప్ప సహాయ కారి నన్నూ లెక్కలమేస్టారు రమణారావు గారినీ పెదప్రోలు లో వారింట్లో నెల రోజులు మాకు సకల రాజ లాంఛనాలతో వసతి ,భోజనం,కాఫీ టిఫిన్లు పెట్టి పెళ్లి కొ డుకులను చూసినట్లు మేపి  మర్యాదగా చూశారు .ఆయనమాట అంటే మాకు శిరోధార్యం .పడమట హై స్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు .కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కు మేమందరం కలిసివారిని ఏకగ్రీవంగా అధ్యక్షులను చేసాం . నిష్కర్షత నిర్భీకత వారి సహజ లక్షణాలు జిల్లాలో పేరెన్నికగన్న హెడ్ మాస్టర్ గా పేరు పొందినవారు .నేను రాస్తున్న ”నా దారితీరు ”లో”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”లో శర్మగారి గురించీ రాసిన సంగతి మీకు తెలుసు . శర్మగారిని నేను నూతన వస్త్రాలు ,ఫలాలు సమర్పించి సరసభారతి పుస్తకాలను అందజేశాను .నేను వారింటికి రావటం తనకు మహదానందంగా ఉందని నలభై ఏళ్లతర్వాత మళ్ళీ కలుసుకోవటం అపూర్వమైన విషయమని అన్నారు .దీనికంతటికి కారణం షార్లెట్ లో నాకు పరిచయమైననాశిష్యురాలు శ్రీమతి పసుమర్తి లక్ష్మి .

మా భువన్ ను బస్ ఎక్కించి మల్లాపూర్ పంపించి మేము మధురానగర్ లో ఉన్న డా రేమెళ్ళ అవధానులు గారింటికి వెళ్లాం వారు మాకోసం ఎదురు చోస్తున్నారు .వారికీ  నూతనవస్త్రాలు ఫలాలు సమర్పించి ”గీర్వాణకవుల  కవితా గీర్వాణం -2 రెండవభాగం ,మాఅన్నయ్య ,దైవ చిత్తం సువర్చ లేశ్వర శతకం అందజేశాను ఆయన కూడా ఎంతో సంబరపడిపోయారు .ఫోటోలు తీయించుకొన్నారు. మాతో.  నాకు వారే పాదాభివందనం చేయటం వారి సంస్కారానికి నిదర్శనం . వయసురీత్యా నేను పెద్దకావచ్చు కానీ సంస్కృత ,సాహిత్య ,వేద గణిత వేదం విజ్ఞాలలో వారికి సాటి లేనివారు లేరు . నవంబర్ 11 ,12 తేదీలలో అఖిలభారతీయ సంస్కృత సెమినార్ నిర్వహిస్తున్నామని నన్ను తప్పక హాజరవమని చెప్పి ఆహ్వానపత్రం ఇచ్చారు ”నేను సంస్కృత పండితుడిని ,కవిని కాదుకదా ”అన్నా .వారు ”నేను సంస్కృతం లో ఏం కృషి చేశాను దానిపై ఉన్న అభిమానమే చాలు రండి ”అన్నారు సరేనన్నాను .వారు  ఇటీవల ముద్రించిన రెండు విలువైన గ్రంధాలు ”భారతీయ గణితశాస్త్ర చరిత్ర  మొదటి ,రెండవభాగాలు ఒక్కొక్కదానిలో వెయ్యి పేజీలున్న ఒక్కొక్కటి 750 రూపాయలున్న గ్రంధాలను నాకు ఆప్యాయంగా బహూకరించారు ,.ఇంతటి  విలువైన రిఫరెన్స్ గ్రంధాలు నాకు లభించటం నా అదృష్టం పూర్వ జనం సుకృతం వారి సౌజన్యం . .అవధాని గారిమిత్రులు శ్రీ మూర్తిగారినీ ఇక్కడ కలవటం యాదృచ్చికం . అవధానిగారు ఉయ్యూరులో కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ జోస్యుల నాగేశ్వరరావుగారికి దగ్గర బంధువట . ఫ్లోరా స్కూల్ కు 2014 లో వచ్చి మాట్లాడారట . మరొక గొప్ప వ్యక్తితో పరిచయం కలగటం నా అదృష్టం వీరి గురించి గీర్వాణం -3 రాశాను . అక్కడినుంచి బాచుపల్లి ఇంటికి చేరే సరికి రాత్రి 8-30 అయింది .ఇలా ఈ ఆదివారం సార్ధకమైంది .

ఈ విధంగా మా షార్లెట్ యాత్ర -అయిదవ అమెరికా ప్రయాణం సఫలమైంది .సాహిత్య సంగీత ,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎందరో మిత్రుల పరిచయం తో ,పూర్వపు వారి పరిచయాలతో యాత్ర సంపూర్ణమైంది .అయితే ఒక్కటే లోపం .మొదటి నాలుగు యాత్రలో ప్రతిసారీ కనీసం 300 ఆంగ్ల పుస్తకాలు చదివి వాటిపై నోట్స్ ప్రతిసారీ కనీసం 200 పేజీలు రాశా . అంటే కనీసం 1200 పుస్తకాలు చదివి 800పేజీల నోట్స్ రాశా .ఈ సారి ఎందుకో లైబ్రరీ మీద ఆసక్తి తగ్గింది కేవలం 40 పుస్తకాలే చదివా .కానీ ”వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష ”నెట్ లో రాసి  పూర్తి  చేశా .గీర్వాణం -3 లో ఇక్కడికి వచ్చి సుమారు 350 మంది సంస్కృత కవులపై రాశా . ఆధునిక ప్రపంచనిర్మాతలు డిటిపి ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు సవరించా .స్వామి రామ్ రాసిన ‘హిమాలయన్ మాస్టర్స్ ”ఆధారం గా ఒక 8 విలువైన ఆర్టికల్స్ రాశా .ఆస్ట్రో ఫిజిక్స్ పై నాలుగు వ్యాసాలురాశా . ఇవిమాత్రమే కాస్త ఊరడింపు .అన్నిటికి మించి ”వీక్లీ అమెరికా ”శీర్షికతో వారం వారం విషయాలను 28 భాగాలుగా రాశా .నాల్గవసారి 2012 లో షార్లెట్ వచ్చినప్పటి అనుభవాలను ”అమెరికా వీక్లీ ”గా ప్రతివారం రాసి 28 భాగాలరాశా .ఈ రెండు కలిపి పుస్తకం గా తెస్తే మంచిఉపయుక్త సమాచార యాత్రా సాహిత్య గ్రంధమే అవుతుంది .సుమారు 130 పేజీలు రావచ్చు .ఆసక్తి ఉన్న స్పాన్సర్ దొరికినపుడు ఆలోచించవచ్చు .

షార్లెట్ లో మా దంపతులను అభిమానించి ఆదరించి ఆప్యాయతా ఆదరణ ఆత్మీయత చూపినవారందరికీ ధన్యవాదాలు . ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్నిసార్లు తీసుకొని వచ్చిన మా అల్లుడు కోమలి సాంబావదాని మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి లకు  మా మనవాళ్ళు చి శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్ లకు శుభాశీస్సులు .నిజం చెప్పాలంటే మేముఇక్కడికి వచ్చి మా అమ్మాయికి చేసిన సాయం యేమాత్రమూలేదు .కొద్దిగా మా శ్రీమతి వంటపనిలో సాయం చేసి ఉండవచ్చు .నేను మాత్రం నా ”కంపు ”గొడవతప్ప అంగుళం బయటికి  వచ్చి చేసిందిలేదు కనీసం మొక్కలకు నీళ్లు కూడా పట్టేవాడినికాదు మా అమ్మాయి చేయమని చెప్పదు .కానీ కుర్చీలోంచి లేస్తే కొంపమునిగిపోతుందేమోనని దానికే అంటుకు పోయేవాడిని .రెండే రెండు సినిమాలు 1-”బాహుబలి ”బాహుబలి 2-దువ్వాడ జగన్నాధం చూసాం . ఉదయం సాయంత్రం కాసేపు నడక నడిచేవాడిని ఎంత సేపు అనుకొన్నారు ?బాత్ రూమ్ కు వెళ్లోచ్చినంత సేపే .

టెయిల్ పీస్ -నల్లులతో కాపురం
  షార్లెట్ సాయి సెంటర్ వారు రాలీవారు అందరూకలిసి రాలీ లో నిర్వహించిన రిట్రీట్ కార్యక్రమానికి వెళ్లిన మేము రెండు రాత్రులు హోటల్ గదిలోఉండాల్సివచ్చింది .అప్పటికి మేము ఇక్కడికి వచ్చి నెలన్నర అయి ఉంటుంది .ఒళ్ళుమరచి నిద్రపోయాం .రిట్రీట్ నుంచి వచ్చాక ఏదో కుడుతోందే అనిపించటం  ఏం లేదులే అనుకోని కొన్నినాళ్లు గడిపాం . నాకంటే మా ఆవిడ చాలా సెన్సిటివ్ ఆవిడకు నిద్రపట్టక నల్లులు కుడుతున్నాయని తెలుసుకొని హాల్ లో సోఫాలో పడుకునేది .కోడిఒక కోనలో -పుంజు ఒక కోనలో ”’లాగా . ‘నేను నల్లులతో కాపురం  చేసి బాధ భరించలేక అర్ధరాత్రిలేచి దుప్పటిలోదిండులో చూస్తే నల్లులు హాయిగా కాపురం చేస్తూ నారక్తం మరిగి తెగ బలిసికనిపించాయి .మాఅమ్మాయికి చెపితే ఫిట్ లాంటిది తెచ్చి కొట్టింది ,పరుపులు  దుప్పట్లు  ఎండలో వేసి ,ణవాషింగ్ మెషీన్ లో ఉతికాము .కొంత నయం అనిపించింది ఒక వారం తర్వాత మళ్ళీ  సీను మామూలే .మళ్ళీ ఉతుకుడు చంపుడు కొట్టుడు కార్యక్రమం చేసి నల్లుల రూపుమాపా . చివరి మూడువారాలు నల్లులబాధ లేదు . ‘ఈ నల్లులన్నీ రాలీ రిట్రీట్ హోటల్ నల్లులు అని తేల్చాము . అందుకే వాటికి ”రిట్రీట్ నల్లులు ”అని ముద్దుపేరుపెట్టా . ‘ఊసుల్లో ఉయ్యూరు ”లో మా ఇంట్లో పెరిగిన నల్లి ,పిల్లి బల్లి గురించి అదే శీర్షికతో ఆర్టికల్ రాశా .చదివే ఉంటారు .
                    ఐదునెలల మామిడి సీజన్
  ఈ సారి షార్లెట్ అనుభవం లో చిరస్మరణీయమైన మరో విషయం ఉంది .మార్చి 30 న ఉయ్యూరు లో రసం మామిడి పండు తినటం మొదలుపెట్టి ,ఏప్రిల్ 1 హైదరాబాద్ వచ్చేటప్పుడు 100 మామిడిపళ్ళు కొని తీసుకు వెళ్లి 6 వ తేదీ వరకు పూటుగా తింటూ తర్వాత అమెరికా చేరాం .అక్కడ మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో రోజూ మామిడిపళ్ళు బట్టలకు బుట్టలు కొని తెచ్చిపడేస్తూ మాతో తెగ తినిపించింది .గున్నమామిడి ఏమిటో తెలీదుకానీ షార్లెట్ లో ”దున్నమామిడి ”పళ్ళు బాగా వచ్చేవి మహా రుచిగానూ ఉండేవి .ఈ మామిడి మేత మార్చి నుంచి సెప్టెంబర్ 15 వరకు సాగింది మా జీవితం లో ఇదే ”లాంగెస్ట్ మామిడి సీజన్ ”దీనికి కారకురాలు మా అమ్మాయే దొరికిన మామిడిపళ్లే .ఇదొక రికార్డ్

మా మనవడు సంకల్ప్ షార్లెట్ యూనివర్సిటీ లో ఎంఎస్ చేయటం వాడి గ్రాడ్యుయేషను మేము ఉండటం  వాడికి  వెంటనే  చికాగో లో ఉద్యోగం రావటం వాడి అదృష్టం మా అల్లుడు అమ్మాయి ప్రోత్సాహం .మాత్రమే .సరసభారతి సభలు నాలుగు షార్లెట్ లో జరపటం  అందులో చివరిదైన 108 వది అక్టోబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 2-30 నుంచి రాత్రి 7-30 వరకు 5 గంటలు సరసభారతి నిర్వహించిన ”దసరా సరదా సాహితీ కదంబం ”ఆద్యంతం ఆనందాన్ని సంతృప్తినిచ్చి చిరస్మరణీయంగా నిలిచింది . షార్లెట్ లో సరసభారతి అనుబంధ శాఖ ఏర్పడింది .ఇంతకు  మించి ఆనందం ఇంకా ఏమి ఉంటుంది ? ఇక్కడి సాహితీ మిత్రులకు  మా సువర్చలాన్జనేయస్వామి యెడల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు ,సరసభారతిపై గల ఆసక్తి ఆదరణకు అభినందనలతో ధన్యవాదాలు తెలియ జేస్తూ వీక్లీ అమెరికా కు ముగింపు పలుకుతున్నాను .”వీక్లీ ” లో నేనేదో ఉబుసుపోకకు  రాస్తుంటే ఆసక్తిగా చదువుతూ ”అంకుల్ ఏం రాశారంకుల్ ! సూపర్బ్ .మెం తెగ చదువుతున్నాం ”అని నన్ను” ఉబ్బేసి” నిజమేననుకొని నేను నమ్మేసి మరింత రెచ్చిపోయి రాసినా చదివిన అమాయకులందరికి అభినందనలు.  మేము 11 బుధవారం రాత్రికి బస్ లోహైదరాబాద్ మల్లాపూర్ నుంచి బయల్దేరి 12 గురువారం ఉయ్యూరు చేరుకొంటాము .అందరికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ —

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-17 -కాంప్-బాచుపల్లి -హైదరాబాద్

దీనిని 8 రాత్రి 9-30 కు రాయటం ప్రారంభించి అర్ధరాత్రి 1 -45 కుదాదాపు 4 గంటలు రాసి పూర్తి చేశా .

 

Posted in అమెరికా లో | Tagged | 2 Comments

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం 

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం
           ”  సఫల షార్లెట్ యాత్ర ”వారం -మొదటి భాగం
2-10-17 -సోమవారం -మహాత్మా గాంధీజీ జయంతి .మా అల్లుడు కంపెనీ పనిపై లీడ్ పాత్ర పోషిస్తూ ఫిలడెల్ఫీయా వెళ్ళాడు ..మా ఇద్దరు బుడ్డి  మనళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ ఆదివారం కార్యక్రమానికి అలసి సొలసి జలుబు తో బాధపడి స్కూల్ కు డుమ్మా కొట్టారు . పెద్ద వాడు చి శ్రీకేత్ వెళ్ళాడు
 వీక్లీ అమెరికా 27  రెండు భాగాలు రాశాను . శ్రీ డొక్కా రామ్ గారు చదివి చాలా సంతోషించి మెయిల్” మొయిలు ”(మేఘం )సందేశం పంపారు .అందులో వారు సరసభారతి కి ఎప్పుడు ఏరకమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా  చేయటానికి సిద్ధంగా ఉన్నానమని తెలియ జేశారు  సమాధానంగా ధన్యవాదాలు చెప్పి సరసభారతి కార్యక్రమాలకోసం  ఎవరినీ  డబ్బు అడగదని చందాలు వసూలు చెయ్యం  అని రసీదు పుస్తకాలు లేవని ,ఎవరైనా సరసభారతి చేసే కార్యక్రమాలు బాగున్నాయని భావించి విరాళం ఇస్తే దానిని లేక శ్రీ సువర్చలాంజ నేయ స్వామికి ”భక్తిగా సమర్పించినదానిని మేము ముద్రించే పుస్తకాలలో ”సరసభారతి  ముద్రిస్తున్న గ్రంధాలకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు ”అని రాసి వారి పేరు, ఊరు ,సమర్పించిన ధనం రాస్తామని తెలియ జేశాను .అలాగే వారు అర అన్నపూర్ణ నిరతాన్నదాత  గోదావరి డెల్టా ఆపద్బాంధవి వారి కులదైవంకీ శే శ్రీమతి డొక్కా సీతమ్మ గారిపై కార్యక్రమం పెడితే ,పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలపగా  ఇంతవరకు ఆ ఆలోచనలో లేము అని వారు పూనుకొని నిర్వహించమంటే తప్పక చేస్తామని అప్పుడు పారితోషికాలు అందజేయవచ్చునని తెలియ జేశాను వారు మా ప్రయాణం ఫలప్రదం కావాలని ఆకాంక్షించగా  కృతజ్ఞతలు తెలియ జేశాను .వారికి ”గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 ”ఈ శనివారం పోస్ట్ లో పంపిస్తున్నామని తెలియ జేశాను . వారి సౌజన్య వదాన్యతలకు, సంస్కారానికి జేజేలు .
  చలపాక ప్రకాష్ గారు ”ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంథం లో డిటిపి చేసిన 201-పేజీ నుండి 250 పేజీ ల వరకు పంపినవాటిలో   తప్పులు సరిచేసి మెయిల్ లో పంపాను .
   రాత్రి మా అమ్మాయి విజ్జి మా లగేజ్ అంతా జాగ్రత్తగా ఉండాల్సిన బరువు కు కొద్దిగా అటూ ఇటూ గా సర్దేసింది .సాయి పవన్ మన షార్లెట్ కార్యక్రమాలను ”గొట్టం  ”లో పెట్టి లింక్ పంపాడు మా అబ్బాయి రమణ అందరికి దీన్ని మెయిల్ ద్వారా తెలియ జేశాడు .
 3-10-17 మంగళవారం -నిత్య సంధ్యావందనం ,పూజాదికాలు అయ్యేసరికి ఉదయం 9 అయింది .
   ఉదయం నా  ఆత్మీయులు సరసభారతి శ్రేయోభిలాషి శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి ,గీర్వాణం -3 అంకితం అందుకో బోతున్న డా శ్రీ బండారు రాధాకృష్ణమూర్తి ,శ్రీమతి డా సులోచన దంపతులకు ,దీనికి స్పాన్సర్ అయిన  సులోచన గారి అన్నగారు డా శ్రీ ఎల్లాప్రగడ రామమోహనరావు గారికీ ఫోన్ చేసి రేపే మా ఇండియా ప్రయాణం అని చెప్పాను వారు సుఖ ప్రయాణం అంటూ దీవించారు .వీరు నా కంటే ”ముదుళ్ళు ” అంటే ముదుసలులు అంటే పెద్దవారు.అందుకే దీవించారు అన్నాను .  తర్వాత నా అడ్డాడ  శిష్యురాలు 12 ఏళ్లుగా అమెరికాలో భర్త  సంతానం తో ఉంటూ ప్రస్తుతం ఒహాయో లో ఉంటున్న శ్రీమతి కోడూరి పావనికి ఫోన్ చేసి ప్రయాణం  విషయం చెప్పగా అప్పుడే తానూ నాకు ఫోన్  చేద్దామని అనుకొంటున్నట్లు చెప్పింది .మన బ్లాగ్ ను బాగా ఫాలో అవుతుందీపావని . నేను గర్వంగా చెప్పుకొనే శిష్యురాలు పావని  .
మధ్యాహ్నం” నాటికి నేడు శిష్యురాలు”శ్రీమతి పసుమర్తి (కూచిభొట్ల )లక్ష్మి ఫోన్ చేసి మా ప్రయాణం సుఖప్రదంగా జరగాలని కోరుతూ పసుమర్తి భగవంతం మా అమ్మాయి ఫోన్ నంబర్ అడిగితె ఇచ్చానని కాసేపట్లో ఫోన్ చేస్తాడని చెప్పటం ,అలాగే అతను  మాట్లాడటం ఆతర్వాత అతని చెల్లెలు శ్రీమతి దుర్గ ఫోన్ చేయటం వగైరా  అంతా ”ఏ నాటి అనుబంధమో  “” లో పూర్తిగా ”వాయించిన ”సంగతి గుర్తుందిగా . .
 మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో మా ఇంటికి వచ్చింది మా అమ్మాయి ఆత్మీయ స్నేహితురాలు శ్రీమతి సురేఖ .”షార్లెట్ సరసభారతి -సాహితీ మిత్రులు ”అందించిన దానికి తోడుగా తానూ కొంత ధనం  మా శ్రీ సువర్చలాన్జనేయస్వామికి కొంతధనం భక్తిగా సమర్పించింది .సాయంత్రం కన్నడం అమ్మాయి శ్రీమతి వేణి వచ్చి చాలా ఆత్మీయంగా సరస భారతికి కానుక ఇచ్చింది  మా అమ్మాయి విజ్జి షార్లెట్ సరసభారతి బృంద సభ్యురాలిగా కొంత .మా దేవాలయానికి కొంత ముట్ట చెప్పింది .
   రాత్రి వేలూరి పవన్ శ్రీమతి రాధా దంపతులు వచ్చి ఒక అరగంట సేపు కూర్చుని మాట్లాడారు . పవన్ ”అంకుల్ ”అని పిలవడు బంధువులం కనుక .  ఇది నాకు బాగా నచ్చిన విషయం .  రాధమాత్రం ”అంకుల్ ”అంటుంది .మిగతా వాళ్ళూ అలానే అంటారు .దీన్ని కాదనలేను .”అంకుల్ ఆంటీ హవా”ప్రవాహ వేగం లోకొట్టుకు పోతున్నాం
.సరే .నేనెవరినీ గురువుగారూ  ”అని పిలవను నన్ను అలా ఎవరు పిలిచినా రాసినా ఇష్టపడను మొదట్లో సాయిపవన్ ”గురువుగారు ”అని మెయిల్ రాశాడు .వెంటనే నేను జవాబు రాస్తూ ”ఆ పిలుపు నేను పిలవను ఎవరుపిల్చినా ఇష్టపడను .బాబాయ్ గారనో అన్నయ్యగారనో ప్రసాద్ గారు అనో  ఎలాగూ నేను మాస్టర్   హెడ్ మాస్టార్ నూ  కనుక ”మాస్టారూ ”అనో సంబోధించు ఇంకా చనువుగా పిలవాలని ఉంటె ”ఒరేయ్ ”అని పిలువు, రాయిఇంకా సంతోషిస్తా .  అని రాశా అతనికే కాదు ఎవరు అలా రాసినా పిలిచినా నా సమాధానాలం అదే .అంతే అప్పటి నుంచి మళ్ళీ ”గురూ ”దూరం అయింది .ఈమధ్యే రాంకీ కూడా ”గురువుగారు ”అని మెయిల్ లో సంభాషణల్లో అంటున్నాడు .బాహుశా ఇది చూసి దాన్ని విరమిస్తాడని భావిస్తా . నేనే కాదు మా నాన్న గారికీ ఇలా అనటం  ఇష్టం ఉండేదికాదు .గురుత్వానికి తగిన అర్హత మాట ఏమోకానీ నాకు అది ”కంపరం ”గా ఉంటుందని గ్రహించ”మనవి”  .కొంచెం హార్స్ గా రాశానని అనుకొంటే మన్నించండి .
   రాత్రి 9-30 కు శ్రీమతి గోసు(ఊసు )కొండ  అరుణ” రైట్ అంకుల్ ”అని తరచుగా అనే  నేను పేరుపెట్టిన  ”రైట్ అరుణ” దంపతులు వచ్చి ఉడతాభక్తిగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సేవాకార్యక్రమాలకు భక్తిగా కొంత అమౌంట్ ఇచ్చి వెళ్లారు .
  4-10-17 బుధవారం -షార్లెట్ లో చివరి రోజు
ఉదయమే లేచి స్నానాదులతర్వాత సంధ్యావందనం ,పూజా పూర్తి చేసేసరికి 8 అయింది .రాత్రి 12-3- కు మా అల్లుడు ఫిలడెల్ఫీయా నుంచి వచ్చాడు .షార్లెట్ లో చివరి రోజు కనుక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెటా ఫలాలతో బాటు . దేవుడి పూజా విగ్రహాలను పుస్తకాలనూ సర్దేశా .అల్లుడు అవధాని ఎప్పుడు ఆఫీస్ కు వెళ్ళాడో తెలియదు .
  మేము 11-30 కే భోజనాలు చేసి సిద్ధంగా ఉన్నాం.  దారిలోఆరాగా ఆరాగా ”మేయటానికి”  మా శ్రీమతి పులిహోర పెరుగన్నంతయారు చేసి  చిన్న చిన్న డబ్బాలలో సిద్ధం చేసింది .  , చిన్న చిన్న చపాతీలుకారట్  ఆకుకూర వగైరాలతో కలిపి  ఒత్తి  జిప్  లాగ్ లలో బంధించింది .
మా అమ్మాయి మధ్యాహ్నం 1-30 కే  వచ్చేసింది మధ్యాహ్నం సెలవు పెట్టింది .అంతకు ముందే మా అమ్మాయి కి మంచి స్నేహితురాలు సర్వ సమర్ధురాలు మా అమ్మాయిగారింట్లో ప్రతి ఆదివారం ,తెలుగు తరగతులుబోధించే ఉపాధ్యాయిని ,మాంచి సేవాభావం ఉన్న మా ఆంజనేయ స్వామి భక్తురాలు  శ్రీమతి రావి ఉష ఎయిర్ పోర్ట్ లో మాకు సహాయం చేయటానికి వచ్చింది . ఆమె కూడా ”షార్లెట్ సరసభారతి ”తరఫున కార్యక్రమాలకు పేద విద్యార్థుల సహాయానికి కొంత నిధిని ,మా” స్వామి ”సేవకు,  8 వ తేదీ ఆదివారం వాళ్ళమ్మాయి అబ్బాయిల పుట్టిన రోజు నాడు వారి పేరిట మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి ప్రత్యేక పూజ చేయించటానికి కొంత నిధిని అందించింది .ఇలా షార్లెట్ విరాళాల వెల్లువ ”మా ప్రయాణం లో చివరి నిమిషం దాకా సాగటం ఆనందాన్ని వారికి సరసభారతి పట్ల ఉన్న అనురాగం మా స్వామి పట్ల ఉన్న అకుంఠిత భక్తి కి విశ్వాసానికి  మాపై ఉన్న అపార మైన నమ్మకానికి  నిదర్శనంగా నిలిచి పోయింది .
   ఈ ఉష తో పాటు ఆఉషా, రాధా పద్మశ్రీ  రాంకీ ,జంట పవన్ లు ఎల్లా విజయ మొదలైనవారందరూ ”అంకుల్ మళ్ళీ ఎప్పుడొస్తారు వేసవికి వచ్చేయండి .మళ్ళీ మనపూజలు అభిషేకాలు,సరసభారతి కార్యక్రమాలు  సరదాగా మీ ఆధ్వర్యం లో చేసుకొందాం ”అని చాలా సార్లు అంటూ తమ ఆప్యాయతను ప్రకటించారు .నేను మాత్రం అందరికీ ”ఇది సభా ప్రసూతి ,వైరాగ్యాల వంటిది . ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా కార్యక్రమాలు చేయండి మంచిని పెంచండి రుద్రం చదివిన వారు నేర్పేవారు నేర్చుకొనే ”క్షుద్ర ఆలోచనలు ”దూరం చేసుకోండి భార్యా పిల్లలతో స్నేహితులతో మంచిగా మర్యాదగా ప్రవర్తించండి మనసు విశాలమవటానికిప్రయత్నించండి ఇరుకు మురికి ఆలోచనలకు సంకుచిత భావాలకు స్వస్తి పలకండి .  మనమెవరమో తెలుసుకోవటానికి ”ఉపనిషత్తులు ”చదవండి ”అనే చెప్పాను . రావి ఉష ఇవాళ ఉపనిషత్తుల విషయం ప్రస్తావించి అవి ఎక్కడ దొరుకుతాయో అడిగి తెలుసుకున్నది నాకు ఇది మంచి సంతృప్తి నిచ్చిన విషయం .
   ఇంకొక పావు గంటకు బయల్దేరుతామను కొంటుంటే మా అమ్మాయి  వాళ్ళ ప్రక్కింట్లో ఉన్న రవి తలిదండ్రులు (హైదరాబాద్ వాస్తవ్యులు -5 ఏళ్ళ క్రితం ఇక్కడే పరిచయం అయిన  వారు )శ్రీ రాఘవేంద్రరావు గారు శ్రీమతి సుగుణ కామాక్షి దంపతులు  ,వారింట్లో ఉన్న నృత్య దర్శకులు 8 వ తేదీ ఆదివారం ”కీచక వద్ద ”కూచిపూడి నృత్యనాటకం దర్శకులు కీచకపాత్ర దారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మగారు ,ఎల్లా విజయకూడా వచ్చి మాకు వీడ్కోలు పలికారు అందరం కాఫీ తాగి ఫోటోలు దిగాం మా అమ్మాయి సెల్ లో ఫోటోలు తీశారు అందరికి పంపే ఉంటుంది .ఇంత సందడి  ,సరదా వాతావరణం లో సరిగ్గా మధ్యాహ్నం 3 -15 గంటలకు మా అమ్మాయి కారులో నేనూ మాశ్రీమతి ప్రభావతి శ్రీమతి రావి ఉషా షార్లెట్ విమానాశ్రయానికి బయల్దేరి  3-35 కు ఎయిర్ పోర్ట్ చేరాం .మా అమ్మాయి కారు పార్క్ చేసి వచ్చేసరికి మేము చెకిన్ లో నుంచుని బాగేజ్ ఇచ్చాం కొద్దిగా బరువు ఎక్కువైతే ఎయిర్ పోర్ట్ఆవిడే వాటిని మా   హాండ్ లగేజి లో సర్దేసి ఫ్లయిట్ లో సిబ్బందికి ఇస్తే టాగ్ వే సి తీసుకొని   దిగేటప్పుడు ఇస్తారని చెప్పింది ఉష  సర్దుతుండగా మా అమ్మాయి కూడా వచ్చి సాయం చేసి అంతా సరిపోయేట్లు సర్దింది .ఏది తీయాలో ఏది పెట్టాలో దానికే తెలుసు మేమిద్దరం” ఉత్త ”ఉత్స విగ్రహాలమే” ” ,అంతా అయేసరికిటైం  ఇంకా 3-50 .నా శాంసంగ్ మొబైల్ లో ఉష ఎయిర్ పోర్ట్ వై ఫై కనెక్ట్ చేసి రెడీ చేసి ఇచ్చింది దీనితో మెసేజెస్ హాయిగా పంపుకోవటానికి వీలు చేసింది . సరే వాళ్లిద్దరూ మాకు బై చెప్పి వెళ్లిపోయారు ..”తోపుడు బళ్ల వాళ్ళు ”(వీల్ చైర్ వాళ్ళు రెడ్డెగా వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి తోసుకొంటూ  కస్టమ్స్ చెకింగ్ చేయించి ఏ ఇబ్బందీ లేకుండా విమానం ఎక్కించారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఫ్లయిట్ బయల్దేరింది  .ఇక్కడినుంచి బోస్టన్ ,అక్కడి నుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ ,అక్కడి నుంచి హైదరాబాద్ . మిగిలిన విషయాలు తర్వాత రాస్తా -ఏప్రిల్ 6 న షార్లెట్ చేరి 6 నెలల తర్వాత అక్టోబర్ 6 న మళ్ళీ ఐడియా చేరుతున్నాం .
నిద్ర పట్టక రాత్రి 1-30 కి లేచి కూర్చుని ఈ వీక్లీ మొదటి భాగం రాసి మెయిల్ చేసేసరికి టైం తెల్లవారుఝాము 5 గంటలయింది . నిద్ర బదులు ”ఈ రుద్దుడు ”.  .
  సశేషం
   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-17 -కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఏనాటి అనుబంధమో ?

సుమారు 15 రోజులక్రితం 52 ఏళ్ళ క్రితం నా శిష్యురాలైన శ్రీమతి పసుమర్తి (కూచిభొట్ల )లక్ష్మి షార్లెట్ లో పరిచయం అవటం ఆతర్వాత రెండు సార్లు ఏదోకార్యక్రమం లో మళ్ళీ కలుసుకోవటం  అక్టోబర్ 1 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబం ”అయిదు గంటలపాటు నాన్ స్టాప్ గా జరగటం లక్ష్మీ,  కూతురు, అల్లుడూ కూడా అందులో పాల్గొనటం  ,ఆ రాత్రి ల్లక్ష్మీ వాళ్ళమ్మాయి  లావణ్య సనత్ దంపతుల ఇంట్లో విందు చేయటం జరిగింది .చదువు చెప్పిన గురువు అంటే ఎంతటి గౌరవం ఉంటుందో తెలియ జేసే సంఘటన ఇది .

  లక్ష్మి దగ్గర ఇక్కడి మా అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని ,నాకు అత్యంత ప్రియ శిష్యుడు ,నేను రోల్ మోడల్ ఉపాధ్యాయుడుగా ప్రధానోపాధ్యాయుడుగా భావించే కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామ వాస్తవ్యులు నాకు అత్యంత ఆప్తులు నవ్వులు చిరునామా బంధుప్రియులు స్నేహ శీలురు నన్నూ లెక్కలమేస్టారు  శ్రీ రమణారావు గారినీ వారింట్లో నెలరోజులు ఆతిధ్యమిచ్చి కన్నబిడ్డల్లాగా ఆదరించిన  శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారితమ్ముడు చి భగవంతం ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంతో సంబరపడి ఎన్నో విషయాలు ఆనందంగా చెప్పటం తర్వాత నాకు మెయిల్ రాసి ఇలా మాట్లాడుకోవటం ”వెరీ ఫార్ట్యనేట్ ”అని చెప్పటం మరింత సంతోషానికి కారణమై అతని గురుభక్తి కి ముచ్చటేసింది .ఆతను హైదరాబాద్లో యిసిఎల్ లో పని చేసి రిటైర్ అయి అక్కడే ఉంటున్నాడట ,ప్రస్తుతం అమ్మాయి దగ్గరకు వచ్చారట దంపతులు .నవంబర్ లో ఇండియా వస్తారట .అప్పుడు తప్పకూండా కలుద్దామని పొంగిపోయాడు .అతనికి వీక్లీ అమెరికా 27 పంపాను .
  అతని తర్వాత అతని సోదరి శ్రీమతి దుర్గ కూడా లక్ష్మి నుంచి ఫోన్ నంబర్ సేకరించి నాతో ఆప్యాయంగా మాట్లాడింది .ఈమె భగవంతం కూడా 52 ఏళ్ళ నాటి మోపిదేవి శిష్యులవటం తమాషాగా ఉంది .దైవం ఎలా ఎప్పుడు ఎవరెవరిని కలుపుతాడో తెలియదు కదా ఆమె తనకొడుకు దగ్గర ప్రస్తుతం నార్త్ కరోలినా లోని మేము సెప్టెంబర్ 2,3 తేదీలలో వెళ్లిన కేరీ లో ఉంటోందట .ఫిబ్రవరిలో ఇండియా వస్తుందట . ఆమె కూడా గ్రీన్ కార్డు హోల్డర్ . దుర్గాకూడా తన మెయిల్ ఐడి చెప్పిందికాని దానికి పంపితే రిజెక్ట్ అయింది .ఈ విషయం భగవంతానికి రాసి కరెక్ట్ ఐ డి పంపమన్నాను
  దురదృష్టవశాత్తు లక్ష్మి భర్త , శర్మగారి భార్య ,ఆయన పెద్దతమ్ముడిభార్య ,దుర్గ భర్త చనిపోయారన్న విషయం విని బాధ కలిగింది . హైదరాబాద్ లో ఉన్న నాలుగు రోజుల్లో శర్మగారిని తప్పక కలవాలనుకొంటున్నాను .ఆయనకు సుమారు 90 ఏళ్ళు వచ్చి ఉంటాయి .ఆయన 1963 లో నాకు మోపిదేవి హై స్కూల్ లో సహ ఉపాధ్యాయులవ్వటమే దీనంతటికి కారణం .ఆయననాకు ,లెక్కలమేస్టారు  రమణారావు గారికి ఆరాధ్యం ఆదర్శం . రమణారావుగారు కూడా మరణించి సుమారు 15 సంవత్సరాలవుతోంది .ఆయన,నేను పెదప్రోలు లో ఒకే ఇంట్లో ప్రక్క ప్రక్క పోర్షన్ లలో ఉండేవాళ్ళం . కలిసి సైకిల్ మీద మోపిదేవి వెళ్ళేవాళ్ళం కలిసి ట్యూషన్ కూడా చెప్పాం . లక్ష్మి నా సైకిల్ వెనక ,దుర్గ లెక్కల మేస్టారి సైకిల్ వెనక కూర్చుని మోపిదేవి స్కూల్ కు వచ్చేవాళ్లమని లక్ష్మి జ్జ్ఞాపకం చేసుకొన్నది .  అప్పటి శిష్యులే లక్ష్మి, భగవంతం, దుర్గ ,వీరేకాక నాకు మరీ దగ్గర శిష్యులు అడవి శ్రీరామ మూర్తి ,కృత్తివెంటి మాధవరావు .మా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేవారు .మాధవ తమ్ముడే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్ -మన తెలుగు తేజం . ఆ బాధ్యత నిర్వహిస్తున్న ఏకైక తెలుగు బిడ్డ శ్రీనివాస్ . ఈ శిష్యుల సంభాషణతో ఒకసారి ఫ్లాష్ బాక్ కు వెళ్ళాల్సొచ్చింది .ఇవాళ చాలా సంతోషకరమైన రోజు .-
మీ-గబ్బిట -దుర్గాప్రసాద్ -3-10-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in అమెరికా లో | 1 Comment

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2 లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -2

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2

 ,  30-9-17శనివారం సాయంత్రం -మా మనవళ్ళు చదివే కమ్యూనిటీ స్కూల్ లో  ఇక్కడి తెలంగాణా ప్రజలంతాకలిసి ‘’బతకమ్మ ‘’ఉత్సవం బ్రహ్మానందం గా చేశారు .చూడటానికి మేమూ వెళ్లాం .కానీ టికెట్ 5 డాలర్లు పెట్టారు  .అప్పటికే ప్రసిద్ధ తెలంగాణా కవి శ్రీ గోరటి వెంకన్న మాట్లాడుతున్నారు .వినాలని సరదాగా ఉన్నా ,వెళ్లలేక పోయాం తెలంగాణా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పళ్ళాలలో  బతుకమ్మను ఏర్పాటు చేసుకొని సందడి గా కనిపించా రు.వారి ఆరాధనా భావానికి ఆశ్చర్యమేసింది . దేశం మారినా సంప్రదాయం మర్చి పోనందుకు వారిని అభినందించాం  గోరెటి వెంకన్నగారు ఇక్కడ ఉన్నారని తెలిసి ఆయన సాహితీ కదంబ కార్యక్రమానికి రాగలుగుతారేమో కనుక్కోమని శ్రీగ్రంధి హరిగారికి నేనూ మా అమ్మాయి 29  సాయంత్రం  మా ఇంట్లో భజన సమయం లో చెప్పాం .ఆయన వాకబు చేసి వెంకన్నగారు 1 తేదీ తెల్లవారు ఝామున 2 గంటల ఫ్లయిట్ లో వెళ్లి పోతున్నారని 30 మధ్యాహ్నం మాకు తెలియజేశారు . అద్భుతమైన అవకాశం చే చే రిందనుకొన్నాం .

  అక్కడ నుండి మా అమ్మాయి మమ్మల్ని శ్రీ మల్లవరపు శివ కుమార్ గారింట్లో జరిగే దసరా బొమ్మల కొలువుకు ఆహ్వానం వస్తే తీసుకు వెళ్ళింది .శివగారు ప్రసిద్ధ కవి స్వాతంత్ర సమరయోధులు ,రవీంద్రుని శిష్యులేకాక శాంతి నికేతన్ విద్యార్థి ,’’రవీంద్ర వ్యాసావళి ‘’,’’మధుకీల ‘’కావ్యం మొదలైనగ్రంధకర్త ,కృష్ణ శాస్త్రికి చాలా దగ్గర బంధువు ,ఆచంట జానకి రామ్ రచనల్లో ‘’మా విశ్వం బావ ‘’అని పొగడబడిన వాడు స్వతంత్ర ఉద్యమకాలం లో తర్వాత ఎన్నో దేశభక్తి గీతాలు రాసి నిత్యం రేడియో లో గేయాలు రాసి  వినిపించిన స్వర్గీయ శ్రీ మల్లవరపు  విశ్వే శ్వరరావు గారి కుమారులు .వారింట్లో బొమ్మలకొలువు కనుల పండువుగా ఉంది .మాకు ప్రసాదంగా పులిహోర ,తాలింపు సెనగలు ,పెరుగన్నం పెట్టారు .చాలా ఆత్మీయంగా గలగలా మాట్లాడే తత్త్వం శివ గారిది . రేపు జరిగే సాహితీ కదంబం కు రమ్మని ఆహ్వానించాం తనకు మెయిల్ వచ్చిందని తప్పక వస్తానని చెప్పారు .శివ గారింట్లోనే ప్రసిద్ధ నాట్య శిక్షకురాలు దర్శకురాలు శ్రీమతి మంగళం పల్లి మహా కిఞ్చిర్త్యన్ కుటుంబం పరిచయమయ్యారు .ఆమెది హైదరాబాద్ . విదేశీయుని వివాహమాడి ఇక్కడ గొప్ప నర్తకిగా ప్రసిద్ధి చెందింది .అందరితో ఫోటోలు తీసుకొన్నాం . అవి రాత్రే అందరికి పంపాను చూసే ఉంటారు .

             శ్రీరామ్ డొక్కా గారి కవితలు

శనివారం మధ్యాహ్నం టెక్సాస్ రాష్ట్రం లో ఆస్టిన్ లో ఉంటున్న శ్రీరామ్ డొక్కా గారు తాము ఇటీవల రాసి ప్రచురించి విడుదల చేసిన రెండు కవితా సంపుటాలు ‘’ఆత్మానందం ‘’ ఆనందారామం ‘’పంపగా అందాయి .పంపుటౌన్నట్లు బుధవారమే ఫోన్ చేసి చెప్పారు .అందాయి .రాత్రి 10 గంటలకు మొదటి పుస్తకం లోని 116 కవితలు చదివి ‘’ఆత్మానందారామం ‘’అని నా అభిప్రాయంగా వ్యాసం రాసి అర్ధరాత్రి 12 గంటలకు ఆయనకూ మీకూ పంపిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది .రామ్ గారు  ఎంతో ఆనందించివెంటనే  ధన్యవాదాలు రాశారు .

నిద్ర పోయేసరికి రాత్రి ఒంటిగంట అయి ఉంటుంది .వీరిదే ఇంకో పుస్తకం మిగిలింది .తెల్లవారుఝామున 4-30 కి మెలకువ వస్తే లేచి 5 గంటలకు రెండో పుస్తకమైన పద్య కవితల ‘’ఆనందారామం ‘’చదివి వెంటనే ‘’జగదానందారామం ‘’గా నా అభిప్రాయం రాసి పంపేసరికి తెల్లవారి 7 అయింది దీనిపై ఎందుకో రామ్ గారి నుంచి జవాబు రాలేదు . ఇంత  తొందర గా ఎందుకు రాశానంటే ఈ రెండిటిని సాహితీ కదంబం  లో సాహితీ అభిమానం ఉన్నవారికి వారి కానుకగా అంద  జేయటానికే .

1-10-17 ఆదివారం -దసరా సరదా సాహితీ కదంబం

మేము ఏప్రిల్ మొదటి వారం లో షార్లెట్ వచ్చాము .అప్పుడు మొదటిసారిగా శ్రీ రాంకీ ఇంట్లో కార్యక్రమానికి వెళ్లాం .అక్కడ అతనితో వేలూరి ,పవన్,రాంకీ తమ్ముడు సాయి పవన్ తో షార్లెట్లో  తెలుగు సాహిత్యం మీద అభి రుచి ఉన్నవారు కనీసం పది మందితో ఇస్టా  గోష్ఠి జరుపుదాం అంటే తప్పక చేద్దామనటం ,ఆతర్వాత రాంకీ ఇంట్లోనే రెండు సరసభారతి సభలు మరొకటి శ్రీ బులుసు సాంబమూర్తిగారింట్లో స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బులుసు సాంబమూర్తిగారి కార్యక్రం చేయటం తో అందరిలో సరసభారతిపై అభిరుచి పెరిగి చివరికి’’ దసరా సరదా సాహితీ కదంబ0  ‘’    రూపు దాల్చి అద్భుతంగా జరిగింది ‘

   మధ్యాహ్నం 1-45 కే  మేము అందరం వేలూరి పవన్  ఇంటికి  దగ్గరున్న కమ్యూనిటీ సెంటర్ కు చేరుకున్నాం అప్పటికే అక్కడ ఏర్పాట్లు జరిగి పోయాయి  నేను సాంప్రదాయంగా పంచె ,చొక్కా ఉత్తరీయం తో వెళ్లాను .రాంకీ తమ్ముడూకూడా  అదే పద్ధతిలో వచ్చారు .మా అమ్మాయి మైసూర్ పాక్ ,బ్రేడ్ బజ్జీలు తయారు చేసి తీసుకొని వచ్చింది అక్కడే టీ  కాచి  రెడీ చేశారు .ఈ కార్యక్రమ0 బాగా జరగాలని మా అబ్బాయి రమణ ఇక్కడి ‘’పవన్ ద్వయం ‘’ మా అమ్మాయి విజ్జితో తో రోజూఫోన్ కాంటాక్ట్ లో ఉంటున్నాడు దిశా నిర్దేశమూ చేశాడు .జ్ఞాపికల డిజైన్ కూడా ఉయ్యూరు లో చేయించాడట వాటిని ఇక్కడ తయారు చేయించారట ఇదాంతాః నాకు తెలియ కుండానే జరిగి పోయింది . సంతోషం

 మధ్యాహ్నం 2-30 కు అలవాటులో పొరబాటుగా కార్యక్రమం అరగంట ఆలస్యంగా మొదలైంది .ఎలా జరపాలి నేను ముందే సూచించాను దాన్ని తూచా తప్పకూండా చిన్నపవన్ బ్లు ప్రింట్ తయారు చేసి రెడీ చేశాడు .ఆదివారం ఉదయం శ్రీ మైనేని గారి మేనకోడలు ఇక్కడి కాంకర్డ్ నుంచి మా అమ్మాయికి ఫోన్ చేసి ‘’మీ నాన్నగారిని మా ఇంటికి తీసుకు వెళ్లాలని ఉంది  ‘’అని చెబితే ఈ కార్యక్రమం సంగతి చెప్పి ఆవిడనూ ఆహ్వానించింది విజ్జి .ఆమె రాలేదని కొంటా  .ఆవిడకు మైనేనిగారు ఈ విషయం చెప్పలేదా ?ఆయన ఎందుకో నెల నుంచి చాలా ఉదాసీనంగా ఉంటున్నారు .లేకపోతె ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే దానీపై   ఒక్కమాటకూడా ఆయన రాయలేదు నాకు ..ఆశ్చర్యంగా ఉంది

  మా మనవళ్లు  మిగిలిన ముగ్గురు  ఆడపిల్లలు ‘’మా తెలుగు తల్లికి ‘’పాట  చాలాశ్రావ్యంగా పాడారు .వీళ్లల్లో డా శ్రావ్య గారమాయి కూడా ఉంది .తర్వాత జ్యోతి ప్రదీపనం .తర్వాత మా అల్లుడు సాంబావదాని వేద మంత్రప్రార్ధన . ఈ కార్యక్రమానికి మా అమ్మాయినే అందరూ ‘’లంగరు ‘’ వేయమంటేఅంటే యాంకరింగ్ చేయమని   యాంకర్ ను చేశారు .ఇలాంటివి మా అమ్మాయికి కొట్టినపిండి .నల్లేరుపై నడకే . తర్వాత అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించటం జరిగింది .అప్పుడు నేను సరసభారతి గురించి చెప్బుతూ ‘’అక్షరం లోక రక్షకమ్ ‘’అనేది సరసభారతి నినాదం అని మొదలు పెట్టి దాని ప్రస్తానం మజిలీలు తెలిపి   ప్రచురించిన ప్రచురించబోతున్న పుస్తకాల వివరాలు అనుభూతి కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ రాసిన ‘’వసుధైక గీతం ‘’చదివి ఇంతటి విశాల దృక్పధం తో రాసిన కవి ఆనాడు లేడనీ అందుకే ఈ సభను తిలక్ కు అంకితమిస్తున్నామని చెప్పగానే హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి .అంతకు రెండు రోజుల ముందే తిలక్ ఫోటో పెద్ద పవన్ కు మా ఇంట్లో చూపించి దాన్ని ప్రింట్ ఔట్ తీయించి ఫ్రెము  కట్టించమని చెప్పా . చాలా మంచి ఫోటో వచ్చింది దాన్ని వేదికపై సరస్వతీ దేవి ఫోటో ప్రక్కన పెట్టి సార్ధకత చేకూర్చాము . పవన్ అభిసన్దనీయుడు . ఇలాంటి కార్యక్రమాలలో అను  భవం వీళ్లకు లేనందున వేదికపై బానర్ తయారు చేసి ఉంచాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు . నేనూ చెప్పలేదు .తెలుసుకదా ఆపని చేయకుండా ఉంటారా ,ఎన్నో సాయి సభలు చేసినవాళ్లకు నేను చెప్పాలా అనుకొన్నా ,  తీరా వచ్చి చూస్తే అప్రయత్నం జరగలేదు . అప్పటికప్పుడు మా అమ్మాయి ఇంటికి వెళ్లి బానర్ పేపర్ తెస్తే కలర్ మా ర్కింగ్ పెన్స్ తో నేనే చెప్పి శ్రీమతి పద్మశ్రీ ,లావణ్యలతో తయారు చేయించి వేదికపై పెట్టించి సార్ధకత కలిగించా . మరో సంగతి అధ్యక్షుడిని వేదిక ఎక్కించకుండా నే కొంత తంతు కూడా జరిపారు .అనుభవ రాహిత్యం ఏది జరిగినా అధ్యక్షుడి సమక్షం లో జరగాలి అదీ సంప్రదాయం .

తెలుగు కవిత్వం ఎలా ఉండాలో పెద్దన గారి ‘’పూత మెఱుంగులుం ‘’అనే 24 పాదాల ఉత్పలమాలిక చదివి  కృష్ణదేవరాయల ‘’తెలుగుగదేల యన్న దేశంబు తెలుగు యే ను తెనుగు వల్లభుండ తెలుగొ  కండ  -యెల్ల  నృపులు కొలువ యెరుగవే బాసాడి దేశ భాష లందు తెలుగు లెస్స ‘’పద్యం చదివి తెలుగు అతి ప్రాచీనమైన భాష అని 2 వేల  ఏళ్ళ క్రితమే తెలుగు ఉందని చెప్పి రాయల పద్యం ఇక్కడి తెలుగు పిల్లలకు నేర్పమని అలాగే తెలుగు తరగతులలో పిల్లలు ఒకరినొకరు ‘’అక్కా అన్నా ‘’అని సంబోధించుకొనేట్లు అలవాటు చేసి మన బాంధవ్యపదాలైన బాబాయి పిన్ని తాతగారు మామ్మగారు అమ్మమ గారు కూడా అభ్యాసం చేయించమని కోరా.  ఇవి తమ దృష్టిలోకి ఇంతవరకు రాలేదని ఇకనుండి అలానే పిలిపిస్తామని తెలుగు బోధకులుశ్రీమతి జ్యోతి  హామీ ఇచ్చారు ఆధునిక కవిత్వానికి ‘’మాగ్నాకార్టా ‘’అని ప్రశంసింపబడుతున్న శ్రీ శ్రీ ‘’కవితా ఓ కవితా ‘’కవితను తిలక్ ‘’నా అక్షరాలూ వెన్నెలలో తడిసె అందమైన ఆడ పిల్లలు ;కవిత ను చదివి తెలుగు కవిత్వమార్గ నిర్దేశం చేశాను అప్పయ్య దీక్షితులు ‘’తెలుగులో మాట్లాడటం తెలుగు వాడిగా పుట్టటం పూర్వజన్మ తపో  ఫలం అన్నాడని సుబ్రహ్మణ్య భారతి ‘’సుందర తెలుంగు ‘’అని కీర్తించాడని ,తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులే ప్రష్మసించారని గుర్తు చేశాను .

   తర్వాత శ్రీ మల్లవరపు శివ కుమార్ మాటాడి తండ్రిగారి కవిత్వాన్ని గుర్తు చేశారు . తర్వాత శ్రీమతి పద్మశ్రీ   అపరఘంటసాల అని మా అమ్మాయి చెప్పే శ్రీ శ్రీనివాస్ కూచిపూడి నాటక నాట్యానుభవం ఉన్న శ్రీ పసుమర్తి సనత్   గరివిడి కి చెందిన సంగీతము మేష్టారు శ్రీ మోకరాల మూర్తిగారి కరుణశ్రీ గారి ‘’పుష్ప విలాపం ‘’పద్యాలు  సనత్ భార్య శ్రీమతి లావణ్య ,ముసలితనం లోనూ సాహిత్యం పై అభిరుచి తగ్గని కవిత్వం రాసి పాడే శ్రీమతి సీతమ్మగారి పాటలతో తో నా సాహితీ స్రవంతి తర్వాత సంగీత స్రవంతి ప్రవహించింది .

 తర్వాత నేనే సరదా కబుర్లు తో హాస్య వల్లరికి తెరతీశా.దీన్ని శ్రీ నాగరాజు గారు అందుకొని తన నేటివ్ హాస్యం జోడించి కడుపుబ్బా నవ్వించి అనుకొన్నది నెరవేరేట్లు చేసి సరదా పూలు పూయించారు మధ్య మధ్యలో నేను పేరడీలు అందునా మల్లవరపు వారి మధుకీలపై కృష్ణశాస్త్రి గారు రాసిన ముందుమాటలపై జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి అనే జరుక్ శాస్త్రి రాసిన పేరడీ చెప్పి కడుపుబ్బనవ్వించాను మల్లవరపు వారబ్బాయి శివ గారుండగానే  .

  అక్టోబర్ 8 ఆదివారం నాడు షార్లెట్ హిందూ సెంటర్ లో తమ శిష్యురాళ్ళు శ్రీమతి డా సాయి లక్ష్మి ప్రముఖ మృదంగ విద్వా0సులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి అమ్మాయి శ్రీమతి విజయ ల కోరికపై ‘’కీచక వధ’’కూచిపూడి నృత్యాన్ని చేయబోతున్న ప్రఖ్యాత కూచిపూడి నాట్యకళాకారులు దర్శకులు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ ‘’గారు ఈ సభకు కాకతాళీయంగా రావటం తో వారిని వేదిక నలంకరింపజేసి కార్యక్రమ వారి సమక్షం లో జరిపాం .శర్మగారికి సరస భారతి తరఫున నూతన వస్త్రాలు శాలువా కప్పి 2 116 రూపాయలు అందజేశాము . దసరాలలో కళాకారులను సన్మానించటం మనకు అనుస్యూతంగా   వస్తున్న సదాచారం .దాన్ని ఇక్కడ చేయగలగడం అందులో అత్యంత సర్వ సమర్ధకునికి చేయటం మహదానందం గా ఉంది .వీరిని సత్కరించే టప్పుడు  రాంకీ అవధానులతో  వేదాశీర్వచనం  చేయించాచి .  మరింత సార్ధకత  తెచ్చాము . దీనితో సభ సాహిత్య సంగీత నృత్య త్రివేణీ సంగమమై  విరాజిల్లింది .  అందరిలో ప్రేరణ ప్రోత్సాహం స్ఫూర్తి కలిగింది .కార్యక్రమం ముగిసేముందు ప్రత్యేకంగా తయారు చేయించిన  జ్ఞాపికలు పాల్గొన్నవారికీ , సేవ చేసిన వారందరికీ ఇప్పించాం .బాగున్నాయి జ్ఞాపికలు నిజంగా కలకాలం దాచుకోదగినవిగా అసలైన జ్ఞాపికలుగా ఉన్నాయి దీని డిజైనర్ కు స్పాన్సర్ కు అభి నందనాలు .ఉయ్యూరుదగ్గర పైడి కొండలపాలెం నివాసి ఇక్కడ ఉంటున్న శ్రీ సుంకర రావు గారు చాలా చలాకీగా పాల్గొని తర్వాత కార్యక్రమానికి తానూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పగానే మా అమ్మాయి సుంకర వారి వితరణ గురించి  అందరికి తెలియ జేసింది ఇక్కడి తెలుగు తరగతులు నిర్వహించే శ్రీమతి జ్యోతిర్మయి పిల్లలకు చిన్న కథలు చెప్పి ఆకట్టుకున్నారు .

  నేను చివర్లో మాట్లాడుతూ ఈ కార్యక్రమం దీనితో ఆగి పోరాదని కనీసం 6 నెలలకొకసారి అయినా షార్లెట్ తెలుగువారు సరసభారతి వేదిక గా కార్యకర్మాలు నిర్వహించాలని కోరగా అందారూ ఉబ్బి తబ్బిబ్బయి తప్పకూండా చేస్తామని హామీ ఇచ్చారు .తర్వాత కార్యక్రమం ఉగాది రోజున చేయమని ఆనాడు ఉగాది పచ్చడి ,పంచాంగ శ్రవణం తో కూడిన ‘’ఉగాది విభావరి ‘’నిర్వహించమని కోరాను.  శ్రీమతి సాయి లక్ష్మిగారు ‘’బాబాయిగారూ మీరిచ్చిన ప్రోత్సాహం మమ్మల్ని పరవశుల్ని చేసింది ఉగాదినాడు నేను డాన్స్ కూడా చేస్తాను ;;అనటం , పద్మ,శ్రీ , ఉషా, రాధ, రాంకీ ,పవన్ జంట ,ఎల్లా  విజయ మొదలైనవారంతా  ఆనందం  పట్టలేక కళ్ళ వెంట ఆనంద బాష్పవాలు కారుస్తుంటే నా జీవితం ధన్యమైందని పించింది .జీవితానికి సార్ధకత చేకూరింది అనుకొన్నా .ఇంతటి హృదయ స్పందన ఉంటుందని ఊహించలేదు .మా ఈ అయిదవ అమెరికా పర్యటన సాహిత్య ఆధ్యాత్మిక ధార్మిక స్రవంతి గా జరగటం చాలా  సంతృప్తిగా  ఉంది .

 సభలో నాకూ మా శ్రీమతికి శాలువా కప్పి సన్మానం చేశారు . ఒక గడియారంబహూక రించారు . షార్లెట్  ,తెలుగు మిత్రులు అందరూ కలిసి కొంత డబ్బు పోగు చేసి ఇండియా లో సరసభారతి చేస్తున్న కార్య క్రమాల  లో భాగం గా పేద ప్రతిభగల విద్యార్థులకుప్రోత్సాహక నగదు బహుమతిగా  అందజేయమని ఒక కవర్ లో పెట్టి అందించారు .అందులో యెంత ఉందొ నేను ఇంకా చూడలేదు .ఈ సందర్భం గా నేను ‘’ఇక్కడ మా దంపతులను ఆహ్వానించి సత్కరించి రుద్రం సత్యనారాయణ వ్రతం  మొదలైన వాటిలో మాకు నగదుగా తాంబూలం లో పెట్టి,గౌరవించిన  ప్రతి డాలర్ నూ నేను లెక్క రాసుకొన్నానని దానిని ఆయా వ్యక్తుల పేరిట సరసభారతి  పుస్తక  ముద్రణ లో సహకరించిన వదాన్యుల పేర్లలో చేర్చిరాబోయే సరసభారతి గ్రంధాలలో ముద్రి0చి  కృతజ్ఞతలు తెలియజేస్తామని సరస భారతి ఎవరి వద్దా చందాలు వసూలు చేయదని ఇలా డబ్బు ఇచ్చిన వారి పేర్లూ శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి కైంకర్యంగా ఇచ్చేదా న్నీ ఇలాగే మా పుస్తకాలలో ముద్రిస్తామని తెలియ జేశాను .కార్య క్రమ లో శ్రీ గ్రంధి హరి గారు ఆయన శ్రీమతి రంజని ఎంతో సేవ చేశారు .వారికి ప్రత్యేక అభినందనలు .కార్యక్రమం వేద స్వస్తి తో ముగించాం . పూర్తి అయ్యేసరికి రాత్రి 7-30 అయింది అంటే 5 గంటల నాన్ స్టాప్ కార్యక్రమం జరిపామన్నమాట . ఎవరికీ సమయమే తెలీకుండా పోయి నిమగ్నమై మరో లోకం లో తేలిపోయారు .ఇది షార్లెట్ లో సరసభారతి సాధించిన అపూర్వ అద్వితీయ  చారిత్రాత్మక ఘన ,చిరస్మరణీయ  విజయం.  ఇందులో పాల్గొన్నవారికి సహకరించిన వారికి అందరికి సరసభారతి సదా రుణ పడి కృతజ్ఞతగా ఉంటుంది .అందరూమమ్మల్ని   వదిలి వెళ్లలేక వెళ్లలేక గుడ్ల నీరు కుక్కుకొంటూ.  ‘’ సంతోషపు కన్నీళ్లు ‘’ కారుస్తూ  రాలుస్తూ’’ బాన్ వాయేజ్’’ చెబుతూ వీడ్కోలు తీసుకొన్నారు ఇదంతా ఇక్కడి వాళ్ళ సౌజన్యం సౌహార్దత మేము చేసింది ఏమీ లేదు .దోహదం చేసి మా బాధ్యత నెరవేర్చాం అంతే . కార్యక్రమమే అంటా ఫిష్ బుక్ లో లైవ్ గా వచ్చేట్లు చేశారు వీడియో తీసి యు ట్యూబ్ లో పెట్టారు చూడండి

   నేను ఈ కార్యక్రమం 3 గంటలు పెట్టారు ఎవరు వస్తారో ఎవరు ఏ ఐటెం లో ఉంటారో తెలియదు కనుక మొత్తం బాధ్యత నామీదే ఉంటుందేమో నని  అవసరమైతే ఆ మూడుగంటలూ  జోక్స్ తో సాహిత్య ప్రసంగాలతో హాస్యం తో కాలక్షేపం చేయాల్సి వస్తుందని మస్తుగా తయారై వచ్చాను .ఇంతమంది పాల్గొని భాగస్వామ్యులై  నా బరువు తగ్గించారు .అందుకని నే ను తయారు చేసుకొన్నదంతా ఇండియావెళ్ళాక వరుసగా ధారావాహికంగా రాస్తానని దీనివలన ఎంతో సాహిత్య సమాచారం అందుకొంటారని ఎవరికైనా చెప్పటానికి ఉపయోగ పడుతుందని చెప్పాను ఆపని తప్పని సరిగా చేయమని కోరారు .సరే అన్నాను

   సభానంతరం శ్రీ పసుమరి సంత్ లావణ్య దంపతుల ఇంటికి డిన్నర్ కు వెళ్లాం ఎప్పుడో ముందే  బుక్ అయినా  కార్యక్రమం ఇది .మాతో పాటు పసుమర్తి నాట్యాచార్యులు వారబ్బాయి కూడా అతిధులు . మోకారాల వారి కుటుంబమూ ఇక్కడ ఉన్నారు అందరం ఫోటోలు తీసుకొన్నాం . మోకారాలవారు గరివిడిలో మా అన్నగారమ్మాయి శ్రీ మతి వేదవల్లి రామకృష్ణ దాంపతులకు బాగా పరిచయం ఉన్నవారేనట .

  లావణ్య తల్లి శ్రీమతి పసుమర్తి లక్ష్మి 52 ఏళ్ళ క్రితం మోపిదేవిలో నా శిష్యురాలు ఈ మధ్యనే డా శ్రావ్యగారింట్లో పరిచయమైంది .ఆమెను చూస్తుంటే ఇదివరకు రేడియో లో వచ్చే కడుపుబ్బనవ్వించేనండూరి సుబ్బారావు నాగరత్నమ్మ ల  ‘’నాటికి నేడు’’నాటిక గుర్తుకొస్తుంది .   లక్ష్మికి ‘’శ్రీ సువర్చలా మారుతి శతకం ‘’అందజేశాను సభలో ఎల్లా విజయకు ‘’శ్రీ సువర్చ లేశ్వర  శతకం ‘’ఇచ్చాను . అలాగే ఉయ్యూరు ఊసులు ,కాళరాత్రి ,డొక్కా రామ్ గారి రెండు కవితా సంపుటాలు ఆసక్తి ఉన్నవారికి ఇచ్చేసి సార్ధకం చేశాను . లావణ్య ఇంట్లో భోజనం లో వంకాయ కూర కాబేజీ కూర టమేటా చట్నీ  సాంబారు  పెరుగు తో కమ్మని భోజనం . అన్నీ బాగానే ఉన్నాయి .సాధారణంగా నేను కాబేజీ కూరను తినను .దానికి ‘’నీచు కూర ‘’అని పేరు బెట్టాను. అలాగే బీట్ రూట్ కూర ను ‘’రక్తం కూర ‘’అంటాను . దాన్నీపెద్దగా తినను . అయితే లావణ్య ఇంట్లో మా శిష్యురాలు లక్ష్మి కాబేజీ కూర బాగా చేసింది . ఇష్టంగా తిన్నాను . సాంబారూ మహా రుచికరంగా ఉంది .మా అమ్మాయి బీట్ రూట్ కూర బాగా చేస్తుంది అప్పుడు కాస్త రుచి చూస్తా . లావణ్య మా శ్రీమతికి ,మా అమ్మాయికి చీర జాకెట్ పెట్టి ఆశీస్సులు పొందితే మా శిష్యురాలు లక్ష్మి కవర్ లో డబ్బు పెట్టి నన్ను బట్టలు కొనుక్కో మని చెప్పింది . వాళ్ళ అబ్బాయికి సంతానం కలగటానికి మా శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో వారి పేరుమీద అర్చన  చేయించమని  మరి కొంత డబ్బు పెట్టింది . తప్పక చేయిస్తాను అన్నాను ‘శర్మగారు ,లక్ష్మి, సనత్ లు వాళ్ళ ఫోన్ నంబర్లు నాకు ఇచ్చి నా నంబర్ నోట్ చేసుకొన్నారు .ఇంటికి చేరేసరికి రాత్రి 10-30అయింది . ఇలా మధ్యాహ్నమంతా సత్కాలక్షేపం తీపి గుర్తులు మిగిల్చింది

 ఇక్కడి వీక్లీ అమెరికా 27 దీనితో పూర్తి చేస్తున్నాను . మిగిలిన రోజు ల విశేషాలు ఇండియా వెళ్ళాక రాస్తాను .

 గాంధీ జయంతి శుభాకంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-17 -కాంప్ షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం
  సాహితీ బంధువులకు శుభవార్త . 1-10-17 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబ 0 ”దిగ్విజయంగా మధ్యాహ్నం 2- 30 నుండి రాత్రి 7-30 వరకు నాన్ స్టాప్ గా 5 గంటలసేపు జరిగి చరిత్ర సృష్టించింది .ఇందులో ప్రసంగాలు కవితలు పాటలు సంగీతం హాస్యం లు చిందులు తొక్కాయి .ప్రముఖ కూచి నృత్య దర్శకులు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు అనుకోని అతిధిగా విచ్చేసి నిండుతనం చేకూర్చారు వీరికి సరసభారతి నూతన వస్త్రాలు శాలువాకప్పి 2 ,116 రూపాయలు నగదును బహూకరించి పండిత సత్కారం చేసింది  ,ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కవి మధుకీలకావ్యకర్త రవీంద్రుని శిష్యులు దేశభక్తి గీతకర్త స్వర్గీయ శ్రీ మల్లవరపు విశ్వే శ్వరరావు  గారి కుమారుడు శ్రీ శివ కుమార్ , గరివిడి సంగీతం మాస్టారు శ్రీ మోకురాల మూర్తిగారు ఆత్మీయ అతిధులు గా సభకు సార్ధకత కూర్చారు .ఒకరకంగా సరస సంగీత సాహిత్య నృత్య వేదిక గా కార్యక్రమం ఆద్యంత రసప్రవాహమై నడిచి నభూతో న భవిష్యతి   అని పించి రికార్డ్ సృష్టించింది.  అందరిలో చైతన్యం కట్టలు తెంచుకొని ప్రవహించింది . గొప్ప సంతృప్తినిస్ఫూర్తి ప్రేరణలను  కలిగించింది . ఉగాదికి కూడా ”ఉగాది విభావరి ” నిర్వహించాలనే ఊపు వచ్చింది .మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు చూడండి .మిగిలిన విషయాలతో సమగ్రంగా తర్వాత రాస్తాను –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-17 -కాంప్-షార్లెట్- అమెరికా
Image may contain: 1 person, indoor
Image may contain: 1 person, indoor
No automatic alt text available.
Image may contain: 1 person
Image may contain: 1 person, standing and indoor
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 జగదానందా రామం

 జగదానందా రామం

శ్రీ రామ్ డొక్కా గారు నాకు పంపిన రెండవ పుస్తకం ‘’ఆత్మా రామం ‘’..శ్రీ సీతారామాంజనేయుల ముచ్చటైన ముఖ చిత్రం తో ,లోపల వారి కులదైవం ,ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి చిత్రం తో ,ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘’యోగ్యతాపత్రం ‘’తో ,శ్రీ స్వామి పరమాత్మానంద సరస్వతులవారి ఆశీరభినందనలు ,శ్రీ సామవేదం వారి శుభాభినందనలు ,శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి గారి అభినందన చందనం ,శ్రీ సవితాల సూర్యమణి శాస్త్రి గారి ముద  వచనాలు,అక్షర విందు ఆరగించమని ఆహ్వానించిన అమెరికా తెలుగు సాహితీ వేత్త బహు గ్రంధకర్త శ్రీసత్యం మందపాటి పిలుపుతో పుస్తకానికి విలువ అనేకరెట్లు పెరిగింది . తన మనోభావాలను అందమైన కందాలలో రామ్ గారు పొదిగి ,అంత ఎదిగినా ,ఒదిగి ఉండి ,రామభక్త హనుమాన్ అనిపించారు .

‘’’’ఆత్మారామం ‘’లో ప్రార్ధన ,పరిచయ ,ఉపనిషథ్ ,ఇతిహాస ,ఆనంద ,అద్భుత రామాలున్నాయి .అనుబంధంగా శ్రీ వరసిద్ధి వినాయక పద్యమాల ,మాతృ వందనం ,శంకరాచార్య భజగోవిందంకు  ,శివమానస పూజ ,నిర్వాణ షట్కము నాకు ‘’కందా’’నువాదం ,పడగెత్తిన పద్యం ఉన్నాయి .శ్రీ రామ్ గారి విద్వత్తు ,ఆయన సాగించిన కవితా సేద్యం పొందిన లోతైన శాస్తాను భవం సాధించిన వేదోపనిషత్ ,విజ్ఞానం ఈ పుస్తకం లో సాధారణ జనులకు అరచేతి ఉసిరిపండుగా అందజేసిన ధన్య జీవి . లోతులు తరచే  విద్వత్తు నాకు లేదు కానీ అందులో ఉన్న ఆనందాన్ని నాతో పటు మీరూ పాలు పంచుకోవాలన్న తపనతో రాస్తున్నాను .

 . ‘’సీతామాత గ చేసిన -ఆ తపమే అన్నదాన మా ఫలితంబే -మా తరముల గాచునెపుడు ‘’అంటూ సీతమ్మగారికి నమశ్శతం సమర్పించారు . వాడుక భాషలో వేదాంతాన్ని ‘’తోడి ,పాడి ‘’అదంతా రామ లీల అన్నారు .ఊర్ధ్వ మూల మధ శ్శాఖం ‘’కు చక్కని కందం లో ‘’విశ్వాధారము గగనము -విశ్వపు శాఖలు ధరణిని విస్తారంబై -విశ్వంబొక తలక్రిందులు -అశ్వత్ధ0బని తెలియుము ఆత్మారామా ‘’అని అందంగా సరళంగా చెప్పారంటే వేదాంతాన్ని ఎంత బాగా వంట పట్టించుకొన్నారో అర్ధమవుతుంది .’’లోపల చూపే దీపాలను వెలిగించును’’అన్నది ఉపనిషత్సారం ..మనిషిలోని ద్వంద్వాలగురించి చెబుతూ ‘’నాలో వర్ణములెన్నో -నాలోనే మతములెన్నో ,నాకగుపించే -నాలో నాకము నరకము ‘’ఉన్నాయని సూక్ష్మీకరించారు .మనం పొందిన పాపపుణ్యాలు ,కర్మఫలాలు పేర్చినట్లుగా ఉండి ‘’రాటకుకట్టిన ఎద్దుకు -ఆట ‘’గా ఉందని మన గానుగెద్దు జీవితాన్ని  ఆవిష్కరించారు . తైత్తిరీయ ఉపనిషత్ లలో చెప్పిన అన్న స్వరూపాన్ని ‘’అన్నమే ప్రాణము నిల్పును  -యన్నంబె సకల సృష్టి కాధారంబౌ -అన్నము నన్నము మ్రింగును -అన్నమే ఈ భూతకోటి ఆత్మా రామా ‘’అంటూ ‘’అన్నోపనిషత్’’ సెలవిచ్చారు ..జీవులలో దేనినీ తక్కువ చేయరాదని అడవిలో మాకుల ఆకులే తినవలసి వస్తుందన్న చేదు నిజం నిర్మొహమాటంగా చెప్పారు ..చానళ్ల పత్రికల లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ‘’రంగు రాళ్ళఉంగరాల ’’ ప్రకటనల పై నర్మ గర్భంగా ‘’ఉంగరం మొక్కటి తొడిగిన -స0గర మైనట్టి బ్రతుకు స్వా 0తన పడునే-  రంగుల భవితకు రాళ్లను -అంగాంగము బెట్టవలెన’’అని నిలదీశారు వెర్రి వ్యామోహాన్ని దూరం చేసుకోమని హితవు పలికారు

 అర్ధ కామాల మధ్య సార్ధకమైన ధర్మాన్ని మోక్షాన్ని సాధన చేయమని చెబుతూ ‘’వ్యర్ధము కానట్టి బ్రతుకు కర్ధంబిది తెలియవలయు ‘’అంటారు . పరమాత్మకై అన్వేషణ బయటకాదు అంతరంగం లో చేయాలి అప్పుడు ‘వింతలలో వింతగా కనిపిస్తుంది ఆత్మ దర్శనం చింతనలోనే కామ్యం సిద్ధిస్తుంది అదే అద్భుతమై పరమానందాన్నిస్తుంది

 శ్రీ వినాయక ఆవిర్భావ చరిత్రను పద్యమాలలో  చెప్పారు -’’ఎలుకను ఏనుగు ఎక్కెను -పలుక విడ్డూరము గద పార్వతి తనయుల్ -చిలుకుచు ముద్దుల మూటలు -కులుకుల నెమలి యమరెను కొమరుడనుజుడున్ ‘’అంటూ అన్నాదమ్ముల అనుబంధాన్ని వాహనాల సొబగును వింతగా చెప్పారు వరసిద్ధి వినాయకుని స్థిర చిత్తం లో నిలిపి పూజిస్తే విఘ్నాలు రావని ‘’సిరి సంపదలెన్నొ గలుగు శీఘ్రంబుగనే’’అంటూ ఫలసిద్ధి కూడా చెప్పేశారు .

‘’ మాతృ వందనం ‘’ గా తమ కులదేవత సీతమ్మ తల్లికి  అక్షరార్చన  చేస్తూ ‘’అమ్మ చేతి ముద్దందుకొన్నజనులు -’’గన్నవరపు ‘’ప్రజలు ఘనులు ఘనులు -అవతరించె వారి యాకలి  దీర్చగా -అన్నపూర్ణ మాత యామె సీత ‘’అంటూ వందనం చేశారు .ఆమె చేతిలో అక్షయ పాత్ర ఉందేమో నంటూ ‘’అక్షరంపు  పాత్ర నందుకొంటి వేమొ -అన్ని వంట వార్పు లట్టు సేయ -గరిక పోచ కూడఘన శాఖ పాకమే -విందు చేసి పెట్ట ‘’అని ఆమెను ‘’విశ్వమాత ‘’గా అభి వర్ణించారు భేషైన పద్యం డొక్కా సీతమ్మతల్లి అన్నదానం రాత్రి పగలు తెలియనిది .అక్కడ కాలం తోపని లేదు అన్నార్థునికి ఇంత అమృతం వడ్డించి ఆకలి తీర్చటమే ఆమెకు తెలిసిన బ్రహ్మ విద్య బ్రాహ్మణ విద్యకూడా .’’వానల నొక్క కేక విని వానికి నన్నము బెట్టగా వడిన్ -ప్రాణము లెక్క సేయకనె ,పర్వున బొయితి నేరు దాటగన్ -దీనుల సేవలో గడుప దీక్షను గైకొని ,జీవితమ్మునే -దానము ధర్మమున్ సలిపి ధన్యగ నైతివి  ధారా పోయుచున్ ‘’అనిఒకనాటి సంఘటనేకాదు  ఆమె నిరతాన్నదాన పరాయణత్వాన్ని దీనజనోద్ధరణను కళ్ళకు కట్టించారు వారసులైన డొక్కా రామ భద్ర శర్మగారు

 తర్వాత భజగోవిందం లో ‘’భజనలతో గోవిందుని -నిజముగా సేవించు మదిని ,నీ పాండిత్యం -రుజువుగా మరణము నాపదు -భజనలతోనే విముక్తి భజ గోవిందం ‘’అని తేట తేట మాటలతో శంకరుల ఆంతర్యాన్ని తేట తెల్లం చేశారు రామ్ ..మరొక చోట ‘’అచ్చముగా ప్రాణమొకటి -చొచ్చిన దేహమె మనిషిగా చోద్యము చేయున్ -చచ్చిన శవమందురిలను -పచ్చి నిజము తెలిసికొను భజగోవిందా ‘’ఊపిరి ఉన్నంతవరకే జీవుడు శివుడు .ఆగాక శవమే అనే యదార్ధం .చివరగా ‘తన భార్యా ధనములపై -లవలేశము ఆశ విడుము ,రావవి నీతో -భవుడవె దైవము నెరుగక -భవ సాగరమునకు నావ భజ గోవిందం ‘’పరిణతి చెందిన వేదాంతం కురిపించారుసూక్షపదాలతో

‘’మానస పూజ ‘’లో ‘’నీకు లేనిదేది  నీది కాని దేది -ఆత్మ తృప్తి కొరకె అన్ని విధులు -సాగిలబడే తనువు  సాష్టాంగ వందనం -మంత్రపుష్ప మాయె మనసు నేడు ‘’అని భావగర్భితంగా సాగింది కవిత్వం

‘’నిర్వాణ షట్క0’’లో ‘’’మనో బుధ్యహంకార చిత్తాలు నేనుకాను -పంచేంద్రియాలతో బంధించబడను -పంచ భూతాలతో పంచుకో బడను -చిదానంద రూపాన్ని -శివుడనే నేను’’బహు సొంపైన అనువాదం ఆచార్యభావానికి అనువైన అనువాదం మరొక ఆణిముత్యం -’’నిర్వికల్పుడ నేను,నిరాకారుడు నేను -ముక్త సంగుడ ,మూలతత్వాన్ని నేను -అంత కొలువున్నాను ,అన్ని చూస్తున్నాను -చిదానంద రూపాన్ని శివుడనే నేను ‘’

శంకరుల శ్లోకాలను నాగరి లిపిలో ముద్రించటం వారిపైగల ఆరాధనకు పరాకాష్టగా నేను భావించాను .

‘’చివరిదైన పడగెత్తిన పద్యం ‘’ లో తెలుగు వాడి ఆస్తి ,ప్రకాస్టి అయినపద్యం, దాని వైభవాన్ని వర్ణిస్తూ -’’పద్య విద్య లేదు భాషలన్నిటి యందు -పద్య వారసత్వ పటిమ నెరిగి -పద్య మొక్కటి రాసి పది మంది మెచ్చగా -పలుకు ,పరమ శుభము ,పగను విడుము ‘’అంటూ పద్య కేతనాన్ని భుజాన దాల్చి ఆదర్శ ప్రాయులయ్యారు డొక్కా రామభద్రగారు .

 పుస్తకం లోని పద్యాలన్నీ ధారాశుద్ధితో మానసిక శ్రవణానందాన్నిస్తున్నాయి .మాటకు వెతుకులాట కనిపించదు అవి అక్కడ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది .వశ్యవాక్కున్నవారికే సాధ్యం అది రామ్ గారు సాధించుకొన్న వరం . వాణి  వారి కరవాణి అయింది .మరిన్ని రచనలతో ఇటు పద్యం లోను అటు వచన కవిత్వం లోనూ రామ్ గారు సవ్య సాచి అవ్వాలని  మనసారా కోరుకొంటున్నాను . తమ ఆత్మానంద ,ఆత్మారామం లతో నన్నూ మమేకం చేసిన డొక్కా రామ్ గారి ఆత్మీయతకు అభినందనలతో ధన్య వాదాలు –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్  -1-10-17 కాంప్ -షార్లెట్-అమెరికా

రామ్ డొక్కా గారి చిరునామా -rdokka@yahoo.com

                            cell-001-91-40-27174577

— Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మానందారామం

ఆత్మానందారామం

నిరతాన్నదాత అపార అన్నపూర్ణ  కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని  మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ  సరసభారతి నిర్వహించిన కార్యక్రమం  తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత 10 వేల  రూపాయలు అందింపజేస్తూ వారి తలిదండ్రులను పాల్గొనేట్లు చేశారు .

మళ్ళీ 2017 ఏప్రిల్ లో మేము అమెరికా లో షార్లెట్ కు మా అమ్మాయి గారింటికి రాగానే ఫోన్ చేసి కుశలప్రశ్నలడిగి ఆస్టిన్ రమ్మని కోరారు నాలుగు రోజులక్రితం  మేము ఇండియా వచ్చేవారం లో వెడుతున్నామని తెలిసి ఫోన్ చేసి తమ పుస్తకాలు పంపిస్తామని చెప్పి  అభిప్రాయం రాయమని కోరి పంపగా ఇవాళేమధ్యాహ్నం చేరాయి అందులో ‘’ఆత్మానందం ‘’ను ఇప్పుడే ఆబగా చదివేశా   బహుశా నేను రాయటానికి ఏమీ లేదు  జగమెరిగిన వారిని నేనేం పరిచయం చేస్తానుచేయగలను ? ఆయన విద్వత్తు సామర్ధ్యం  సేవ ల ముందు నేనెక్కడ నిలుస్తాను ?అయినా అడిగారుకనుక నా ధర్మం నేను నెరవేర్చాలిగా .ఆపని చేస్తున్నా .

ఇందులో 116 కవితాలున్నాయి అన్నీ అర్ధవంతమైనవి హృదయం లోపటి నుంచి వచ్చినవి ఆన0దాన్నిచ్చేవి.  ఆనందం రామ్ గారు పొంది మననూ పాలు పంచుకోమంటున్నారు ..మధురపదార్ధాన్ని ఒంటరిగా తినరాదని పది మందితో పంచుకొంటే మాధుర్యం మరింత పెరుగుతుందని పెద్దల ఉవాచ ..రాంగారు సకల శాస్త్రాలు వేదాంతం ఔపోసనపట్టిన వ్యక్తి .కనుక వారేది చెప్పినా ‘’నిష్కర్షగా కర్కశం గా ‘’ నే ఉంటుంది .ఎందుకంటె అంత నిబద్ధత వారిది . కవితలకు శీర్షికలో ఆనంద దాయకాలుగానే ఉన్నాయి .నాకు నచ్చిన నేను గమనించిన వాటిని తెలియజేస్తాను . ‘’మనిషిని ప్రేమించి ,పయనాన్ని ఆస్వాదించి ,అక్షరాన్ని ఆరాధించి ,మాటను నియంత్రించి ,మార్పును ఆహ్వానించి ,సత్కార్యం సంకల్పించి ,శక్తిని గుర్తించి ,మానవత్వం ఆచరించి జ్ఞాన జ్యోతిని దర్శించి కాలం తో జతకట్టి ,ప్రకృతిని పరిశీలించి అంతరంగాన్ని జయిస్తే ఆనందో బ్రహ్మ’’ అని ‘’రామోపనిషత్ ‘’గా మొదటికవిత ‘’ఆత్మానందం ‘’లో చెప్పారు ‘

తనను సేవించవద్దని ,ఆరాధించవద్దని హితవు చెప్పారు .లేకుంటే అంతా’’ డేరాబాబా’’లై ,చివరికి ‘’’’మోసం గురో’’అని అఘోరించాలి ..కలలు కనటం కంటే వాటిని నిజం చేసుకోవటానికి ధైర్యం కావాలి ‘’ప్రణయం -ప్రళయం ,ప్రశ్న -సమాధానం ,ఖేదం -మోదం ‘’లాంటి ద్వంద్వాలనుఁ అర్ధనారీశ్వరంగా భావించి చెప్పి అవి విడదీయలేనివని అనుభవించాలని తత్వ బోధ చేశారు ‘’పదాలతో పరవశింప జేయటం -అక్షర బ్రహ్మ యోగం ‘’అని బాగా చెప్పారు .అందరి తో ఉంటున్నా కవి మానసికం గా ‘’ఒంటరి వాడే ‘’నన్న సత్యం బోధించారు .పక్షిలో ఉక్కు సంకల్పం చేప లో ఆత్మ విశ్వాసం కలుపుగోలుతనం మొక్కలో నిలువెత్తు చైతన్యం గమనించిన కవి శ్రీ డొక్కా .సృష్టిలో నీవెంత ప్రత్యేకమో -నీ ప్రతి సృష్టి అంత ప్రత్యేకం ‘’అంటూ రచనలోనైనా  సేవలోనైనా ,పనిలో నైనా దాని ప్రత్యేకత ఉండాలి . కృషి యోగ సంబంధి అవాలి అప్పుడే అది పరిపూర్ణం మార్కెట్ సరుకైపోతున్న మనిషి కథను వ్యధతో దర్శించారు ..అన్నిరూపాల్లోనూ తానె దిగివచ్చిన వాడిని గుర్తించమని  కోరారు .నీకు మిగిలిన సమయం లోనే బ్రతకడం లో ‘’ఆస్కార్ అవార్డు ‘’వచ్చేలా నలుగురితో నామినేట్ చేయించుకో ‘’అని సరికొత్త సినీ భాషలో చెప్పటం ఆయన పరిశీలనకు నిదర్శనం .త్వమేవాహం కవితలో ‘’నాలో నిన్నే గుర్తిస్తా -నీలో నేనే నర్తిస్తా ‘’అనటం  ఆభావనకు పరాకాష్ట . ఉపనిషత్ రహస్యానికి సరైన అర్ధం .’’నిశ్శబ్దం  నిఖిలత్వం -నిశ్శబ్దమే శాశ్వతం ‘’అనటం   వేదాంతాన్ని ఎంతో లోతుగా తెరచిన వారికే సాధ్యమయే విషయ0 .  అందుకే ‘’Un heard melodies are sweeter ‘’’’అన్నాడు ఇంగ్లిష్ కవి ‘’రామ్ దృష్టిలో ‘’ప్రతిపదం సృష్టికి ప్రతి రూపం ‘’అంటూ దాన్ని ‘’ప్రకృతి కూర్చిన వ్యాకరణం ‘’అన్నారు గడుసుగా ..కవికి ఒక సూచనగా ‘’అక్షరాలనుస్వేచ్ఛగా  అందరిలో కలిసిపోనీ -తమ గుర్తింపు ను అవే సాధించుకొంటాయి ‘’ మంచి మాట .మనిషి ఎపుడో మరణించాడు ‘’అని బాధపడ్డారు .’’మార్పు నెగడు ‘’లో ‘’జన మానస సరోవరం లో భావ కుసుమమై వికసించటానికి ‘’లేచి రమ్మని కేకేశారు ‘’మిణుగురు లాంటి చిన్న ప్రశ్న లైనా ఆలోచన దివిటీలు వెలిగించాలి ‘’అనడం  పరమ  భావుకమకం గా ఉంది ‘’నిండు జీవితం లో నిజాయితీ వాకిట్లో నిజ జీవిత పుస్తకమై పరచు’’కొమ్మన్నారు స్వప్నం సత్యం చేసుకొంటే శాశ్వత శాంతి ఒప్పందం పై ఒక చిరు సంతకమై మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది .’’సెల్ఫీ ‘’‘’ని కవితాత్మకం చేసి రాయటం కవి కున్న పట్టు తెలియ జేసింది .మానవత్వపు మనసు ముగ్గు ‘’ను ముచ్చటగా తీర్చుకోవాలట ..చివరగా ‘’ప్రకృతి తత్త్వం ఆనందం -జీవన సత్యం ఆనందం -జగతి రహస్యం ఆనందం -జనహితమే పరమానందం ‘’అంటూ బహుజన హితాయ బహుజన సుఖాయచ ‘’అన్న ఆప్త వాక్యాన్ని అందంగా చెప్పారు .

  నేను చెప్పినవి కొద్దిగానే .మీరు చదివి ఇందులోని మాధుర్యాన్ని ఆనందాన్ని అనుభవించండి .ప్రతికవితా రస బిందువే .ప్రతి ఉక్తి  సూక్తి గానే దర్శన మిస్తుంది .ముద్రణ ,ముఖ చిత్రం కూడా అందంగా ఉన్నాయి . ఈ ‘’ఆత్మా నందారామం ‘’లో అందరూ భాగస్వాములవాలని కోరుతున్నా మరో పుస్తకం పై తర్వాత రాస్తాను .

  గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-17 -కాంప్-షార్లెట్- అమెరికా

రామ్ గారి చిరునామా -rdokka@yahoo.com

                              cell-001-91-40-271-74577

 .

 Inline image 1

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1

 ,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1

 25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను  శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం లో మంత్రాలు చదవటం తో ‘గాత్రానికి ‘’కించిత్ అసౌకర్యం ‘’కలిగి బొంగురు మాట వచ్చింది హాల్స్ ఆరాగా ఆరాగా చప్పరించి ఉపశమనం పొందాను .. వీక్లీ అమెరికా 25 లో రెండుభాగాలు రాశాను

మంగళవారం – నిత్యపూజతో పాటు అమ్మవారి అష్టోత్తరాలూ రోజూ చేస్తున్నట్లే చేసి అయ్యవారి అష్టోత్తర సహస్ర నామ పూజ ,సుందరకాండ అయిదవ రోజు పారాయణ పూర్తి చేశాను .సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కుమార్తె చి బిందు దత్తశ్రీ బి టెక్ ఫైనల్ ఇయర్ లో టి సి ఎస్ వాళ్ళ కాంప్ సెలెక్షన్ సాధించిందని మెయిల్ పెడితే శుభాశీస్సులు పంపాను .కస్టపడి చదివి సాధించినందుకు అభినందించాను ..

బుధవారం -సరస్వతీ పూజ -పై విధంగానే పూజ అంతరం ఆరవ రోజు సుందర కాండ పారాయణ పూర్తి చేశాను .సోమవారం నుండి ఈ రోజు వరకు గొంతుకు ఇబ్బందికాకుండా చాలా సైలెంట్ గా పూజ ,,పారాయణ చేశాను . .

28-9-17 గురువారం -ఇవాళ మౌంట్ సోమాలో చండీ హోమం కు మా అల్లుడితో పాటూ మేమూ వెళ్లాలని మా అమ్మాయి చెప్పటం ,ఈ రోజుదుర్గాష్టమి నాడు  మా నాయనమ్మగారి’’  తిధి’’ అవటం వలన రాత్రి 2-30 కే  లేచికార్యక్రమాలు పూర్తి చేసి  తెల్లవారుఝామున 3 గంటలకుసంధ్యావందనం నిత్యపూజ ,7 వ రోజు సుందరకాండ పారాయణ ఉదయం 6 గంటలకు పూర్తి చేశాను .

           మా నాయనమ్మ గారి ఆబ్దికం

 6 గంటలకు నేను ఇండియానుంచి తెచ్చుకొన్న ఆబ్దిక మంత్రాల పుస్తకం తీసుకొని మంత్రాలు చదువుకొంటూ ,మానసికంగా మా మామ్మ నాగమ్మగారికి ఆబ్దిక విధి నిర్వహించాను . అన్నసూక్తం అధిశ్రవణం కూడా చదివి అంతా అయ్యేసరికి ఉదయం 7-30 అయింది .తర్వాత రామకోటి రాసి భగవద్గీత చదివి ,డైరీ రాసేసరికి 8 అయింది .మా శ్రీమతి నాతోపాటు లేచి లలితా పారాయణం చేసి రెడీ గా ఉంది .మా అమ్మాయి యధాప్రకారం వంట చేసి 8 గంటలకు ఆఫీస్ కు వెళ్ళింది.దేవుడి నైవేద్యం పెరుగులోనానేసిన అటుకులు ఫలహారంకొద్దిగా  చేసి మందులు వేసుకొని మౌంట్ సోమాకు సిద్ధంగా ఉన్నాం

          మౌంట్ సోమా లో చండీ యాగం

మేమిద్దరం మా అల్లుడూ కారులో ఉదయం 9-15 కు బయల్దేరి 12-30 కు మౌంట్ సోమా చేరాం .మేమిద్దరం మాతో తెచ్చుకొన్న కూర ,పచ్చడి అన్నం దారిలోనే కారులోనే తినేసాం . అక్కడ హోమం అక్కడిశ్రీ సోమేశ్వర  శివాలయం అర్చకులు శ్రీ గారపాటి ప్రసాదావధాని గారు ,శ్రీమతి అనసూయ దంపతులు యాగ శాలలో నిర్వహిస్తున్నారు .కార్యక్రమం వారనుకొన్న సమయానికే ఆదాయం 11-30 కు ప్రారంభించారు .మా అల్లుడిని హోమద్రవ్యాలను అగ్నిలో వ్రేల్చటానికి ,అర్చకస్వామినియోగించారు .నేను పట్టుబట్టలు కట్టుకొని ఊరికే ప్రక్కన కూర్చున్నాను . 13 ఆవృత్తాలతో హోమం జరిగింది .ప్రతిసారి గారెలు చెరుకు ముక్క చిన్న గుమ్మడికాయ దానిమ్మపండు ,పుష్పాలను తమలపాకులతో పెట్టి ఆవృత్తం అవగానే హోమ లో వేశారు .ఇలా 13 సార్లు చేశారన్నమాట చివరికి ప్రకృతిలోని మనలోనూ ఉన్న వ్యతిరేక శక్తులను కూడా శాంత పరచటానికి ‘’కూష్మా0డ బలి ‘’ఇచ్చారు. తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు అంతా అయ్యేసరికి సాయంత్రం 5 అయింది ‘.ప్రసాదం గా గారెలు ,పులిహోర . దేవాలయం ప్రక్కనే శ్రీ ఆంజనేయస్వామి పెద్ద సైజు నల్లరాతి శిలా విగ్రహం ఉన్నది .దూరంగానే చూసి నమస్కరించాను

   ఈ శివాలయం నిర్మించిన అమెరికన్ దంపతులు ,మరి కొందరు స్థానిక అమెరికన్ లు ,హిందూ భక్తులు అయిదున్నర గంటలు జరిగిన హోమం లో చాలా భక్తి శ్రద్ధలతో కదలకుండా కూర్చోవటం అత్యాశ్చర్యమేసింది

 హోమం పూర్తికాగానే  మా నాయనమ్మగారిని తలచుకొని  అర్చకులు ప్రసాదావధానిగారి చేతిలో తాంబూలం దక్షిణ పండ్లు పెట్టి నమస్కరించి సంతృప్తి చెందాను .ఈ రకంగా మా నాయనమ్మ గారి ఆబ్దికం ఇక్కడ నెరవేరింది .

       తర్వాత అందరం శివాలయానికి వెళ్లాం .అర్చకస్వామి యధా విధిగా పూజ పూర్తి చేసి ఆ దంపతులు ,మా దంపతులకు దంపతి పూజగా నూతన వస్త్రాలుసమర్పించి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించి ఆశీస్సులు అందుకొన్నారు .ఇది మేము ఊ హ్హించని విషయం .విజయదశమినాడు మా అమ్మాయి పుట్టిన రోజు కనుక మా అమ్మాయికి కొత్త చీర జాకెట్ ఇచ్చారు

 తర్వాత వారింటికి ఆహ్వానించి మా ముగ్గురకు భోజనం పెట్టారు పప్పు ,బీన్స్ కూర అల్లం చట్నీ ,పరవాన్నం పులిహోర గారే లతో భోజనం . ఏదో తిన్నానని పించాను .సాయంత్రం 6-15 కు బయల్దేరి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరాం  .ఫోటోలు నెట్ లో పెట్టి నిద్రకు ఉపక్రమించాను

అలసట తో మాంచి నిద్ర పట్టింది

 29-9-17 శుక్రవారం -లలితా పారాయణ ,భజన

ఉదయం 8 వ రోజుసుందరకాండ  పారాయణ పూర్తి చేశాను .సాయంత్రం 6 గంటలకు మా అమ్మాయి సామూహిక కుంకుమ పూజ ఏర్పాటు చేసింది .నేనే అందరి చేతా చేయించాను 25 మంది మహిళలు భక్తి తో పాల్గొన్నారు . అందరికి ఒక ప్రత్యేక ప్లాస్టిక్  పెద్దపళ్లెంఅందులో ప్లాస్టిక్ భరిణె   లో కుంకుమ   మరొక దానిలో అక్షింతలు ,పూలు ఒక డాలర్ కాయిన్ ఏర్పాటు చేసింది కాయిన్ కు కుంకుమ  బొట్టు పెట్టి  ,అమ్మవారిగా భావించి పూజ జరిపించాం ,తర్వాత అందరూ కలిసి శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేశారు .7గంటలకు పూజ పూర్తయింది .

  సరిగ్గా రాత్రి 7 గంటలకు భజన మొదలు పెట్టారు .గంటసేపు అమ్మవారి కీర్తనలు సాయి నామం తో కలిపి చేశారు . 8గంటలకుభజన పూర్తయింది .అక్టోబర్ 1 ఆదివారం సరసభారతి కార్యక్రమం లో నూ 8 వతేదీ ఆదివారం హిందూ సెంటర్ లో కూచిపూడి నాట్యాచార్యులు ప్రదర్శిస్తున్న ‘’కీచకవధ ‘’కార్యక్రమంలో అందరూ తప్పక పాల్గొనాలని చెప్పాం

  రేపు విజయదశమినాడు మా అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా మామమ్మాయి విజ్జికి గ్రంధి హరి గారి భార్య విజయ లక్ష్మిగారికీ జాయింట్ గా జన్మదిన శుభా కాంక్షలు అందరూ తెలియ జేశారు

 తర్వాత విందు . చపాతీ ,బంగాళాదుంప కాస్టికం కూర ,చానామసాలా కూరా రవ్వకేసరి మరొక  స్వీట్ ,చక్రపొంగలి ,పులిహార కర్వేపాకు పులిహోర ,టమాటా ఊరగాయ ,సాంబారు ,పెరుగన్నం.అన్నీ బాగానే ఉన్నాయి సుమారు 45 మందిదాకా విందు ఆరగించారు . తర్వాత నేను కట్టిన రామరాజు పంచె ఉత్తరీయం చూసి శ్రీమతి గోసుకోండ అరుణ ‘’అంకుల్ మీరు పెదరాయుడు పో జు పెట్టండి .నేను ఫోటో తీస్తా ‘’అంటే పురజనులకోరికపై  ఆ పోజు  పెట్టగా అరుణ దంపతులు ,పవన్ దంపతులు ,మాఅమ్మాయి మాతో ఫోటోలు దిగారు .’’నాకు దిష్టి తగులుతుందేమో నని అనుమానం గా ఉంది బాబూ ‘’  .

    కదంబం కు స్పందన బాగానే ఉందనిపవన్ చెప్పాడు చాలా సంతోషమేసింది .సాయి పవన్ భార్య కు ‘’మా అన్నయ్య ‘’ డాశ్రీమతి  భావన గారికివారి అమ్మగారి ద్వారా  ‘’శతకం ‘’అందజేశాను . రాత్రి 10-30 కి ప్రముఖ గాయని శ్రీమతి ఉష గారి అక్కగారు వచ్చి భక్తిగా అమ్మవారి పై పాటలు పాడారు .అదే సమయం లో ఇండియానుంచి ఉషగారు ఆమె కు ఫోన్ చేశారు ఆమెతో మా శ్రీమతి మా అమ్మాయి ఆవిడ ఫాన్ లమని గర్వం గా చెప్పారు .

30-9-17 శనివారం -యధావిధిగా పూజ అయ్యాక 9 వ రోజు చివరి రోజు సుందరకాండ పారాయణ పూర్తి చేసి సరికిఉదయం  10-45 అయింది .  ఇది నా 57 వ్యాపారాయణ .షార్లెట్ లో 3 వ పారాయణ .

 శ్రీ డొక్కా రామ్ గారు ఆస్టిన్ నుంచి పంపిన ఆత్మానందం ఆత్మారామం పుస్తకాలు అందాయి .అందినట్లు మెయిల్ ద్వారా తెలియజేసి గీర్వాణం -2 ఆయనకు పంపిస్తున్నానని  రాశాను .

  ఇవాళ విజయ దశమి నాడు మా అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా  మా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ప్రత్యేక పూజ ,చక్రపొంగలి రవ్వకేసరి పులిహోర ప్రసాదాలు చేయించాడు మా అబ్బాయి రమణ . మా మూడవ అబ్బాయి మూర్తి రాణి దంపతులు కూర్చుని సాయంత్రం శమీ  పూజ నిర్వహించారు .

            సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-17 -కాంప్-షార్లెట్- అమెరికా

 .

 Inline image 1

Inline image 2Inline image 3
Inline image 4Inline image 5
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

దశాశల  దసరా పై నీళ్ళు చల్లిన వేళ

దశాశల  దసరా పై నీళ్ళు చల్లిన వేళ

మా బామ్మర్ది బ్రాహ్మి దిగాలుగా మొగం వేలాడేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు .’’ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్ –పొద్దున్న చంద్రబాబిచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే మొహం తో వచ్చినవాడివి ,ఇప్పుడు నిరాహార దీక్షలతో సెల్ఫ్ గోల్ చేసు కొంటున్న ‘’ఫానాయన ‘’లాగా మొహం చాటేసుకొని వచ్చినట్లు వచ్చావ్ “’అన్నాన్నేను .’’అవును బావా !దసరా రోజున ఉద్దందపాలెం లో అమరావతి శంకు స్థాపనకు  మోడీ గారు వచ్చి ,యేవో కోటాను కోట్లు రాలుస్తాడనుకొన్నా.తీరా స్థాపన మాత్రం అయిందికాని వరాల జల్లు కురవ లేదు  దశాశల  దసరా రోజున చొప్ప దంటు ఉపన్యాసం తో నీళ్ళు గార్చి వెళ్ళిపోయాడు .అందుకే జీర్ణించుకోలేక జగన్ ఫెసేసుకొనొచ్చా.’’అన్నాడు .నాకు విపరీతంగా నవ్వు వచ్చి నవ్వేశాను .వాడికి ‘’ఎక్కడో ‘’కాలింది .’’ఇక్కడ కొంపలంటుకు పోతుంటే నీ నవ్వ్వేమిటి’’ బా ‘’.అన్నాడు ఏడవ లేక నవ్వుతూ  .’’ఒరే బామ్మర్దీ ! అసలు అంతటి ఆశలెందుకు ?అవి తీరలేదను కోవటమెందుకు ?’’అన్నాను .’’గొప్ప రాజ దాని అమరావతి నిర్మిస్తున్నాం .ప్రపంచ దేశాల వారంతా వస్తున్నారు .ఆరు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నశుభ ముహూర్తం సమయం లో సాక్షాత్తు ప్రధాని స్వయం గా పాల్గొని ఒక్క మాట అంటే ఒక్కమాట స్వయం ప్రతిపత్తి విషయం కాని హోదా విషయం కాని ,ప్రత్యెక పాకేజీ కాని ఏదీ ప్రకటించ కుండా’’ మూటల సంచీ’’ కాకుండా  ‘’మాటల సంచీ దులిపేసి ’’వెళ్ళిపోయాడు .కడుపు మండి పోతోంది  .  ‘’అన్నాడు ఆవేశం గా .’’అరే బాబా ! ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి .సభలో కే సి ఆర్ ఉన్నాడు .మొదటి ది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ,రెండోది ప్రక్క రాష్ట్ర  సి ఏం కూడా ‘’నాకేంటి ?’’అని మొహం పెడితే మోడీ పరిస్తితి ఇబ్బందికరం .ఈ మాత్రం తెలియక పొతే ఎలా ?’’అన్నా .’’బీహార్ కు రెండు లక్షల కోట్ల సంచీ దులిపినోడు మనకు సగమైనా రాల్చక పోతాడా ?నాతొ సహా అను కొన్నారందరూ . ‘’అన్నాడు కన్నీళ్లు ఒక్కటే తక్కువ వాడికి .ఎందుకైనా మంచిదని కర్చీఫ్ మొహానికి అడ్డం పెట్టు కొన్నాడు పాపం .

‘’ఏదో ఉద్ధరిద్దామని  ఉద్దండ పాలెం వెళ్లావు కదా .! దాని గోప్పతనమేమిట్రా?శంకుస్థాపన అక్కడే ఎందుకు ?’’అడిగా .’’నాకేం తెలుసు’’ బా ‘’.’’ గుంపులో గోవింద’’ లా వెళ్ళా. అందరి తో పాటూ నేనూ ఆనందిద్దామని .ఇంతకీ దాని విశేషమేమిటి ‘’బా ‘’.అని అడిగాడు .’’ఏదైనా తెలుసుకొని వెడితే మంచిది .తెలియ కుండా వెడితే ఇలానే ఉంటుంది .అయినా అడిగావు కనక చెప్పాలను కొంటున్నాను .నీకు ఎన్ని దుర్గుణాలున్నా ,తెలుసుకోవాలన్న నీ తపన నాకు నచ్చింది ‘’అన్నాను .’’సరే బావా !చెప్పు .విని సంతోషిస్తా .’’అన్నాడు అరవిరిసిన మోము తో బ్రాహ్మి బామ్మర్ది .

‘’ఆంద్ర కర్నాటక రాజ్య సార్వ భౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ జైత్ర యాత్రలో ఉద్దండ పాలెం లో బస చేయాల్సి వచ్చింది .ఆయన సేనాని’’ ఉద్దండ రాయడు ‘’ఆ గ్రామం లో ఉండటం వలన దానికి’’ఉద్దండ రాయ పాలెం ‘’అని పేరొచ్చింది .ఇక్కడే కృష్ణానది రెండుపాయలైంది .ఈ రెండిటి మధ్య రాజధాని అమరావతి వెలుస్తోంది .వాస్తు రీత్యా చాలా అనువైన స్థలం . ఉద్దండ మహోద్దండం గా అమరావతి  ‘’అమృత నగరి’’  గా వెలిగి పోతుంది .’’అన్నాను ‘.

‘’మరి తుళ్ళూరు సంగతేమిటి ?’’ప్రశ్న సంధించాడు బ్రహ్మి .’’తుళ్ళూరు పూర్వం పేరు ‘’శివ తాండవ పురి ‘’అంటే శివుడు సంధ్యా నృత్యమైన ఆనంద  తాండవ నృత్యం చేసిన చోటు .తుళ్ళూరు పేరు రావటానికీ,రాయల వారి కధకూ సంబంధం ఉంది .రాయలు కొండవీడు ,విను కొండ దుర్గాలను స్వాధీనం చేసుకొని ,కొండపల్లి ని పట్టుకోవటానికి వెడుతూ కొంతకాలం ఈ ‘’శివ తాండవ పురి’’లో మకాం పెట్టాడు .రాయలు ‘’తుళువ ‘’వంశం వాడు కదా .జనం నోళ్ళలో తుళువ పేరు నాని నాని ‘’తుళ్ళూరు’’గా  మారిపోయింది ‘’అని చెప్పాను .మా వాడి ముఖం సహస్ర దళ పద్మం లా పూర్తి వికాసం పొందింది..దిగులు స్థానం లో జ్ఞాన జ్యోతి కనిపించింది .’’తుళ్ళూరు లో పరశురాముడు ప్రతిష్టించిన ‘’శ్రీ రామ లింగేశ్వర దేవాలయం ‘’కూడా ఉండటం తో’’ యాడెడ్ అట్రాక్షన్  ‘’అయింది అన్నా .

‘’పేపర్లలో ,మీడియా లో ‘’రాయ పూడి ‘’పేరు వినిపిస్తోంది .అ కధా ‘’కమా మీషూ ‘’ఏమిటి బా!’’అడిగాడు బామ్మర్ది .’’దీనికీ రాయలవారికీ సంబంధం ఉంది .తుళ్ళూరు నుండి కృష్ణానది దాటి కొండపల్లి కోటను ఆక్రమించుకోవాలి అన్న ఆలోచనలో రాయలవారున్న సమయం లో కృష్ణానదికి’’ పూటు ‘’గా వరదలొచ్చాయి  .వరద ఉధృతిలో   నదిని దాటటం క్షేమం కాదని నిపుణులు సలహా ఇవ్వటం తో ,ఇప్పుడు రాయపూడి అనే పేరుతొ పిలుస్తున్న గ్రామం లో మకాం వేసి వరద తగ్గే దాకా నిరీక్షించాడు .రాయలున్న ఈ గ్రామం ఆయన పేరుతొ ‘’రాయ పూడి ‘’అయింది .అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి  నాయుడు రాయ పూడిలో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ నిర్మాణం చేశాడు .ఈయనే అమరావతిలో అమరలింగేశ్వర దేవాలయం కట్టించాడని మనకు తెలుసు కదా ‘’అన్నాను .

‘’  అమరలి౦గేశ్వరాలయం’’విశేషాలింకా ఏమైనా  ఉన్నాయా ?’’అని అడిగాడు బ్రాహ్మి .’’అవున్రా ఉన్నాయి .ఇక్కడ పౌరాణిక ,చారిత్రిక విషయాలు రెండూ కలగలిసి ఉన్నాయి .మొదట్లో అమర లింగేశ్వర స్వామి విగ్రహం ‘’మల్కపురం ‘’అనే గ్రామం లో ‘’శివాలయం ‘’లో పడి ఉండేది .ఒక రోజు రాత్రి దొంగలు ఈ విగ్రహాన్ని దొంగిలించి పారి పోతుంటే నందీశ్వరుడు వెంబడించాడు .దొంగలు భయ పడి పారి పోతూ అమరేశ్వర లింగాన్ని కృష్ణా నదీ తీరం లో వదిలేసి పారిపోయారు. ఈ లింగాన్నేఅమరావతి లో  వాసి రెడ్డినాయుడు ప్రతిస్టించాడు..అసలీ విగ్రహాన్ని ప్రతిష్టించిన వాడు సాక్షాత్తు ఇంద్రుడే అని మనకు తెలుసు .ఇంద్ర ప్రతిష్ట కనుక అమరలి౦గేశ్వరుడైనాడు  .’’చెప్పా .

‘’బాగుంది బావా !మరిన్ని విశేషాలు చెప్పి నా షేక్స్ పియర్ మొహం లో నవ్వులు పూయించు ‘’అన్నాడు .’’సరే విను .ఈ ప్రాంతం లో శాతవాహన ,కాకతీయ ,చాళుక్య రాజుల పరిపాలనా ప్రభావమూ ఉంది .రాణి రుద్రమ దేవి తండ్రి కాకతి గణపతి దేవ చక్ర వర్తి ఎన్నో దాన ధర్మాలు చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి .పైన చెప్పిన మల్క పురం గ్రామం లో అలాంటి ఒక శాసనం కనిపిస్తుంది .దీనిలో కాకతీయ వైభవాన్ని ,రుద్రమ దేవి శౌర్య పరాక్రమాలను తెలుసు కోవచ్చు .రుద్రమ దేవి మంత్రి శివ దేవయ్య ‘’మండడం ‘’గ్రామం లో శివ లింగం ప్రతిస్టించాడు .’’అన్నాను .

‘’  అమరావతి అంటే  బౌద్ధం వికసించిన చోటు ‘’అంటారు కదా బావా ?’’అన్నాడు .’’అవున్రా !క్రీ .పూ. 563-483 ప్రాంతం లో గౌతమ బుద్ధుడు బౌద్ధ మత ప్రచారం చేస్తూ ఈప్రాంతానికి వచ్చాడు .బీజాక్షరాలను ఇక్కడ నిక్షిప్తం చేయటం వలన ఇది ‘’ధరణి కటకం ‘’అయింది .అదే వాడుకలో ధాన్య కటకం అయింది .చివరికి ‘’ధరణి కోట ‘’అయింది .రాజులకు కోట ముఖ్యం .కోట ఉన్న చోట రాజధాని ఉండటం సాధారణం .కనుక నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో నిర్మించటం అన్ని రకాలా సర్వోత్త్తమంగా అందరూ భావిస్తున్నారు .ఇంద్ర ,పరశురామాది పురాణ పురుషులు ,రాయలు , గణపతిదేవుడు  మొదలైన చక్ర వర్తులు ,అహింసా మూర్తి గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్ర స్థలం .కనుక సర్వ విధాలా శ్రేష్టమైన నగరం అమరావతి .’’అన్నాను ఆయాసపడుతూ .

‘’మొదట్లో తిట్టినా ,చివరికి ఏదో తాయిలం నోట్లో పెట్టి నోరు మూయిస్తావు .ఎన్నో సంగతులు తెలియ జెప్పావు బావా .ఇక బాబు ఇచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే ఫేస్ తో వెళ్లి పోతా.ఇన్ని విషయాలు ఎలా తెలిశాయి బావా ?’’అని బోల్డు ఆశ్చర్య పడ్డాడు .’’బ్రాహ్మీ! వీటిని పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబరావు గారు సేకరించి రాస్తే బుధవారం ఆంద్ర జ్యోతి లో ప్రచురిస్తే చదివి తెలుసుకొన్నాను .నీకు చెప్పాను .నీకు చెప్పటమేకాదు ,ఆ రోజే దాన్ని సాహితీ బంధు లకు నెట్ లో పంపాను కూడా . ‘’అన్నాను .ఒక్క క్షణం ఆగకుండా మా వాడు దౌడు తీశాడు ఇంటికి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 మా బామ్మర్ది డౌట్లు  

మా బామ్మర్ది డౌట్లు

ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా !మోడీ నవాబ్ షరీఫ్ మీద సేక్సికల్ ఆపరేషన్ చేశాడని అందరూ కోడై కూస్తుంటే ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు ‘’?అన్నాడు  .తెల్లబోయా .సేక్సికల్  ఆపరేషన్  ఏమిటో అని గాబరా పడ్డాను .కాసేపు వితర్కిన్చుకొని ‘’ఒరే ఫూలా !అది సర్జికల్ ఆపరేషన్ .దానికీ సెక్స్ కూ ఏమీ సంబంధం లేదు .సగం సగం విని వచ్చి నోటికొచ్చింది కూసి చివాట్లు తింటావు ‘’అన్నాను .’’ఏదో అదే అయి ఉంటుంది .ఎందుకు చేశాడు బావా ?అడిగాడు .’’మన సరిహద్దు దాటి పాక్ ఉగ్ర వాదులు అర్ధ రాత్రి మనమీద బాంబు లేసి మన జవాన్లను చంపి పారిపోయారు .ఊరు కొంటె ఇంతే అవుతుందని సైన్యం మనమేమిటో ,మనసత్తా ఏమిటో చూపించ టానికి అకస్మాత్తుగా వాళ్ళున్న ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రముఠాను చంపి పబ్లిగ్గా  మన వాళ్ళు  చేసిన సాంపిల్ ఆపరేషన్ నే సర్జికల్ ఆపరేషన్ అన్నారు .అంటే శస్త్ర చికిత్స . దుస్టాంగాన్ని ఖండించి ,శేషాంగాన్ని కాపాడటం అన్నమాట .’’అబ్బే వాళ్ళు మా మీదికి రానూ లేదు ,సరిహద్దు దాటనూ లేదు  మా వాళ్ళు అసలు ఎవరూ చావనూ లేదు ‘’అని బుకాయి౦ఛా డటగా నవాబ్ షరీఫ్ ‘’బామ్మర్ది ప్రశ్న .’’అరె నీకూ విషయాలు తెలుసు  నన్ను ఎందుకు మళ్ళీ వాయించటం ‘’అన్నాన్నేను .’’తెలుసనుకో బా .నీ నోటి నుంచి వింటే క్లియర్ కట్ గా ఉంటుందని నా ఏడుపు ‘’అన్నాడు .’’నిజమే .కాని వాళ్ళ సైనికాధికారి  నాలుగు రోజులక్రితం మన సర్జికల్ ఆపరేషన్ నూటికి రెండువందల శాతం నిజంగా జరిగిందని చెప్పేశాడు .పాక్ మీడియా  అంతకు ముందే చానళ్ళలో అన్నీ స్పష్టంగా చూపింది .మన దేశం లోనూ లెఫ్ట్ పార్టీలు ,వాళ్ళ తోక రాహుల్ కూడా పాక్ కే వంత పాడినా సోనియా నిక్కచ్చిగా మోడీని అభి నంది౦చి౦ది .’’అన్నాను .

‘’మన రాజకీయ నాయకులూ ఇలాంటి ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు కదా బావా ‘’?బ్రహ్మం మళ్ళీ ప్రశ్న .’’అవున్రా .కె సి ఆర్ జిల్లాలు పెంచటానికి సర్జికల్ ఆపరేషన్ చేస్తున్నాడు .అది అతి రహస్యం .ఏ జిల్లా పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలీని పరిస్థితి .అక్కడ మామా అల్లుడు కొడుకు కూతుళ్ళకు తప్ప బ్రహ్మ దేవుడికి కూడా ఆఆపరేషన్  రహస్యం తెలియదు ‘’అన్నా .’’మరి బాబు ఏమీ ఆపరేషన్ చేయటం లేదా “మరో లకోటా ప్రశ్న .’నెలకు మూడు సార్లు ధిల్లీ చుట్టూ తిరిగి శాలువాలు బొకేలతో ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసినా బిగుసుకు కూర్చున్న కేంద్రాన్ని ‘’మీతో కటీఫ్ ‘’అని సర్జికల్ ఆపరేషన్ చేశాడుకనుకనే ప్రతి పత్తి పక్కకు పెట్టి ‘’పాకేజీ అంటూ ఏదో ప్రకటించారు కదా .దీనికీ రఘువీర జగన్ లు వీరంగం వేశారు కాని ప్రస్తుత పరిస్తితులలో అంత కంటే ఊరట ఉండదుఅని బాబూ సర్దుకోవాల్సి వచ్చింది .’’చెప్పాను .’’సరే బావా ! చంద్ర బాబు ఎప్పుడూ టెలి కాన్ఫరెన్స్ లంటూ హడా విడి చేస్తాడు .వాళ్లకు విసుగు అని పించదా’’మళ్ళీ ప్రశ్న దాడి .’’కనకనే  ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు ,ఆఫీసర్లు హాయిగా సైలెంట్ గా నిద్ర అనే సర్జికల్  ఆపరేషన్ లో ఉంటున్నారని వీడియో క్లిప్పింగ్ లు ,పేపర్లు చూపిస్తున్నాయి .రుద్దుడు ఎక్కువైతే బోర్ కొట్టదా .కొంతకాలమైనా వాళ్ళు ఆలోచించుకొని పని చేయాలి కదా .ఎప్పుడూ కొరడా ఝపిస్తే తిరుగుబాటు సర్జికల్ ఆపరేషనో,సైలెంట్ నిద్ర ఆపరేష నే  ఫలితం అవుతుంది  .’’అన్నాను .’’ఎన్ని విషయాలు నీకడుపులో ఉన్నాయి బావా ‘’అన్నాడు అరగుండు బ్రహ్మానందం లాంటి మా బామ్మర్ది బ్రహ్మం .

‘’జగన్ సంగతేమిటి “”?మరో ప్రశ్న సంధించాడు .’’ఇమడలేక పోతున్నాడు .అయిన దానికీ కాని దానికి నిరశన ,వాకౌట్ ,బూతుల సర్జికల్ ఆపరేషన్ నిరంతరం చేస్తూనే ఉన్నాడు కదా .కావలి౦తల ముద్దుల ఆపరేషన్ లో దిట్ట ,పలకరింపుల ,ఓదార్పులసర్జికల్ ఆపరేషన్  సెంచరి పూర్తీ చేశాడు .కాని ఆపరేషన్  సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి అతనిది ‘’అన్నాను .’’బావా క్రికెట్ —‘’అన్నాడు నెమ్మదిగా .’’దానిదేమున్దిరా .కోహ్లీ వచ్చాక సెంచరీల సర్జికలపరేషణ్ తో క్లీన్ స్వీప్ విజయాలిస్తున్నాడు కదరా ‘’అన్నా.’’అడగచ్చో లేదో తెలీదుకాని తమిళ నాడు సంగతేంది బావా ?’’’’ఏముంది రా .ఆవిడకు ఆరోగ్యం బాగా లేకపోతే ,హాస్పిటల్ లో చేరి చికిత్స చేయి౦చు కొంటుంటే కళ్ళ జోడు ముసలాయన విమర్శల సర్జికల్ ఆపరేషన్ మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్థితి కుదుట బడింది .’’చెప్పా . ‘’బావా !అమరావతి నిర్మాణం ఆపరేషన్ సంగతేమిటి ?’’మరో బాణం .’’ప్లాన్ల మీద ప్లాన్లు మారుస్తున్నారు .అయినా పట్టు వదలని విక్రమాదిత్యుడు బాబు ‘’అల్టిమేటం అనే సర్జికల్ ఆపరేషన్ చేయగానే అందరూ బిలబిల మంటూ వచ్చి చేరి పని చేసుకొంటున్నారు .పిల్లి మెత్తనిదైతే ఎలుక ఏదో చేసిందని సామెత తెలుసుగా నీకు “.అన్నాను .’’చివరగా దసరా విషయం చెప్పు బావా ?’’అడిగాడు ఫైనల్ గా .’’ఒక రకం గా దసరా మామూలు అనే సర్జికల్ ఆప రేషన్ చేసే జేబుకు చిల్లి పడేసే జనం తగ్గి పోయారు ఈ సేవా మీ సేవా లవలన.అడిగే వాడూ లేడూ ఇచ్చే వాడూ లేక దసరా దేవాలయాలలో భక్తుల దర్శన సర్జికల్ ,అమ్మవారి అలంకార ఆపరేషన్ లతో మూడు పూలు ఆరు కాయలలాగా వర్ధిల్లు తోంది .’’అన్నాను .వెళ్ళొస్తా బావా ‘’అంటూ తుర్రుమన్నాడు బామ్మర్ది బ్రహ్మ౦.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం

అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం————————-
పక్కనే పారుతున్న గోదావరి గలగలతో పోటీ పడి అమెరికాలో ప్రవహిస్తున్న అవధాన చమక్కులు.
దత్తపదిలోపృచ్ఛకు లెవరో బాలు, కాలు, చాలు, పాలు పదాలతో భారత్,పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ని వర్ణించమని అడిగితే మరుక్షణంలో సమాధానం వచ్చేసింది తేటగీతిలో
బాలు వేసిన వెంటనే బ్యాటునూప
కాలుతగులునో యనుచు ప్రేక్షకులు చూడ
జయము పొందిన జనులు వాచాలులైరి
భరతమాతకు మురిపాలు సరణి మెఱసి

గణపతిని స్తుతించ మన్నారు మరో పృచ్ఛకుడు నిషిద్ధాక్షరిలో. వెంటనే కందము లో వందనమన్నాడు పదహారేళ్ళ ఆ అవధాని.

దేహీ యంచున్ శ్రీలన్
భీహారీ ధీర కాచు వేనన్ గ్లౌభా
నీహార రదన భాసా
పాహీయని వేడుచుంటి భద్రే౦దుముఖా!

సభాప్రాంగణమంతా ఒకటే చప్పట్లు. ఆ బాల అవధాని ప్రతిభకు ప్రశంసలు అంతకుమించి సభాసదులు మోముల్లో ఆశ్చర్యానందాలు.

తెలుగునాడుకు వేల మైళ్ళ దూరంలో వున్న అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి కనెక్టికట్ లో పన్నెండో తరగతి చదువుతున్న గన్నవరపు లలిత్.
16 ఏళ్ళ వయసులోనే అవధానాలు చేస్తున్నాడు . ఇంత చక్కగా పద్యాలెలా చెప్తున్నావని అడిగితే యిలా చెప్పుకొచ్చాడు.

మా అమ్మ శైలజ, మానాన్న మారుతి శ్రీధర్. హైదరాబాద్ నుంచి 1996 లో ఉద్యోగ రీత్యా న్యూ యార్క్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నేను అక్కడే సెప్టెంబర్ 23 , 2000 లో పుట్టాను.
మా తాతల కాలం నుంచీ సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం కలిగిన కుటుంబం మాది.
ఇంట్లో అమ్మా, నాన్న ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడే వారు.అలా నా చిన్నతనం నుంచీ
మనభాష అలవాటైంది. బడిలో ఆంగ్లం. యింటికి వచ్చాక తేట తెలుగు.అప్పుడప్పుడూ మనదేశానికి వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వచ్చి పోతుండడం తో భాష మీద పట్టు యింకా పెరిగింది. మా నాన్నకు తెలుగు పద్యాలంటే చాలా యిష్టం. నాకు మూడేళ్ళ వయసునుంచే సుమతి శతకం, వేమన పద్యాలు నేర్పించేవారు.అమ్మ ఇతిహాసాలు చెబుతుండేది.
చిన్నప్పటినుంచీ యింట్లో వుండే భారత రామాయణాలు చదివేవాడిని. సుందరకాండ
చదువుతున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనకు అందదు. భారతం లో ఆది, విరాటపర్వాలు చదివాను. పోతన పద్యాలు నేర్చుకుంటూ భాగవత మాధుర్యాన్ని ఆస్వాదించాను.
మనుచరిత్ర, మొల్లరామాయణం, కరుణశ్రీ కవితా సంపుటాలు చదివాను. శ్రీనాథుడు నాకు చాలా ఇష్టమైన కవి.ఆయన శైలి విశ్వనాథగారి పద్యాల్లోనూ కనిపిస్తుంది.

జాషువా, శ్రీ శ్రీ సాహిత్యాలతోనూ, పరిచయం వుంది.పాఠశాల చదువు, సాహితీ సాధన, మధ్య ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ప్రణాళిక వేసుకొని చదువుకునే వాడిని.పైగా ఏకాగ్రతతో చదవడం అలవాటైంది.
సాహిత్యము కాకుండా వీణ నేర్చుకుంటున్నాను.
టెన్నిస్, బ్యాడ్మింటన్ కూడా ఆడతాను.

ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సంస్కృత వ్యాకరణం, కావ్య పాఠాలూ నేర్చుకోవాలనిపించింది. గురువు కోసం ఆన్ లైన్లో వెదికాను.రాజమహేంద్ర వరానికి చెందిన కామేశ్వరరావు గారు పరిచయమయ్యారు.
నా ఆసక్తిని చూసి ఆయన ఆన్ లైన్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 2013 లో
అలా ఆయనతో ఏర్పడిన పరిచయం కుటుంబ స్నేహంగా మారింది.గురువుగారి దగ్గర
రఘువంశం లో మొదటి సర్గ, లఘు సిద్ధాంత కౌముదిలో సంజ్ఞాప్రకరణాలు, పంచ సంధులు నేర్చుకున్నాను. అలాగే అమెరికాలోనే మల్లాప్రగడ శ్రీనివాస్ గారి దగర వేదంలో శిక్షణ తీసుకున్నాను. పంచసూక్తాలు,నమక,చమకాలు, తైత్తిరీయోపనిషత్తు,
మహానారాయణోపనిషత్తు, మహన్యాసం, అరుణం అభ్యసించాను. అలా సంస్కృతంలో పట్టు వచ్చింది. మా యింటికి సమీపంలో వున్న సరస్వతీదేవి ఆలయంలో రోజూ ఆసక్తి వున్నవారికి ఆ భాషను నేర్పుతున్నాను.నా దగ్గరికి వచ్చే వాళ్లంతా నలభై ఏళ్లకు పైబడినవారే. వారంతా నన్ను తమ బిడ్డ లాగే చూసుకుంటారు.

అంతకుముందే నేను గరికిపాటినరసింహారావు, గారి అవధానాలు చూశాను. ఆయన చమత్కారం చాలా నచ్చింది.అలాగే మేడసాని మోహన్ గారి పద్యధార కూడా.వాళ్ళ ప్రేరణతో నేనూ అవధానం చేయాలనుకున్నా. నా విద్యార్థులలో ఒకరితో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు, ఆయన రాజమహేంద్రవరం లోని తన మామగారితో మాట్లాడించారు.అలా అవధానగురువు ధూళిపాళ మహాదేవమణి గారితో పరిచయం కలిగింది. ఈ ఏడాది మార్చి నుంచీ ఆయన ద్వారా వాట్స్ ఆప్ లో అవధానం నేర్చుకోవడం మొదులు పెట్టాను, వాట్స్ ఆప్ లోనే సమస్యలు, యిచ్చి పద్య౦ పూరించమనేవారు. నేను వ్రాసిన వాటిని సరిదిద్దుతూ,సమాధానం పంపేవారు. అలా అవధానం లో పట్టు సాధించాను.
సంస్కృత గురువు కామేశ్వరశర్మ గారింటికి గతం లో వచ్చాను.అయితే మహాదేవమణి
గారిని నేరుగా ఎప్పుడూ కలవలేదు. ఎలాంటి విద్యయైనా గురుముఖంగా నేర్చుకోవడం ఉత్తమ లక్షణం. ఇటీవల అమ్మా,నాన్నలతో హైదరాబాద్ వచ్చినప్పుడు యిద్దరు గురువులతో మాట్లాడి రాజమహేంద్రవరానికి వచ్చాను. వాళ్ళిద్దరినీ కలిసి మాట్లాడి, నా సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ఇప్పుడు వారి సమక్షంలో అవధానం చేయటం చాలా సంతోషాన్ని కలిగించింది. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, వారి ప్రశంసలు పొందిన ప్రతిసారీ ఉత్సాహం ఉప్పొంగేది.
ఇప్పటికి రెండు అవధానాలు చేశాను. అంతగా యిబ్బంది అనిపించలేదు. ఒకదాంట్లో
‘వారిణీతం తానమాడ పాపంబోవున్’ అన్న సమస్య యిచ్చారు. ‘వరి’ని ‘త్రోవరి’ చేశాను.
దాంతో తేలికై పోయింది. ‘డీ మహనీయమూర్తి’ అన్న సమస్య యిస్తే ‘మోడీ మహనీయ మూర్తి’ అని పూర్తి చేశాను. సాధనా సమయం లో మాత్రం ఒకసారి కష్టంగా అనిపించింది.

‘పిల్లిని పెండ్లియాడి శరభీశ్వరుడంతట బ్రహ్మసాక్షిగా’ సమస్య దీన్నెలా పూరించాలో తోచలేదు. కాసేపటికి ఆలోచన తట్టింది. ఈశ్వరుడు అమ్మవారిని పెళ్లాడినప్పుడు ఆమె ఎలా ఉందంటే, రూపంలో మెరుపుతీగె,గమనంలో గజగమని లా, పరిమళంతో పునుగుపిల్లిలా అని పూరించాను. అవధానం లో దత్తపది ఇంకేవైనా పృచ్ఛకులు ప్రశ్నించి ఊరుకుంటారు. అదే ‘నిషిద్ధాక్షరి’ అయితే ముఖాముఖి స్పర్థలా ఉంటుంది.
అందుకే ‘నిషిద్ధాక్షరి’ అంటే నా కిష్టం.

నా పద్య ధారణ చూసి స్నేహితులు ముచ్చట పడుతుండేవారు. ఇంట్లోవాళ్ల మాటైతే చెప్పనక్కరలేదు. తెలుగు,సంస్కృత సాహిత్యాలను యింకా అధ్యయనం చెయ్యాలి.

ఎప్పటికైనా ఒక మంచి పుస్తకం వ్రాయాలనేది నా కోరిక

తెలుగు కీర్తి దేశదేశాల చాటి౦చి
రాణకెక్కినట్టి రస విలాసి
తెలుగు మహిమ లెల్ల తేజరిల్లగ జేయు
తెలుగుతల్లి వెలుగు తెలుగు వెలుగు.

చిరంజీవి గన్నవరపు లలిత్ !
చిరంజీవ! సుఖీభవ! సుఖీభవ!
(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

 వీక్లీ  అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-2

  వీక్లీ  అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-2

57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -2

24-9-17 ఆదివారం -సాయి పవన్ పద్మశ్రీ దంపతుల ఇంట్లో రుద్రాభిషేకం

 శ్రీ కృష్ణాష్టమి నాడు మా ఇంట్లోభజన రోజునే సాయి తో  వీలున్నరోజు ఉదయమే మహాన్యాసం తో దశశాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం తో రుద్రాభిషేకం జరిపి అష్టోత్తర సహస్ర శివ పూజ ,బిల్వాష్టోత్తరం తో మనం నలుగు రైదుగురం ఒకరి ఇంట్లో ‘’మోడల్ రుద్రాభిషేకం ‘’చేసుకొందాం ‘’అన్నాను క్షణం ఆలోచించకుండా ‘’మా ఇంట్లోనే చేద్దాం .అన్నయ్య రాంకీని వేలూరి పవన్ ను కూడా సంప్రదించి డేట్ ఫిక్స్ చేస్తాను అసలు నా మనసులో ఉన్న మాట మీరే ముందు చెప్పేశారు ‘’అన్నాడు సంతోషమేసింది .సుమారు 15 రోజులక్రితం వాళ్ళఇంటికి మా మనవళ్లను సంగీతం క్లాస్ కు తీసుకు వెళ్ళినప్పుడు అతనే ఈ విషయం మళ్ళీ ప్రస్తావించి తన ఇంట్లోనే 24-9-17 ఆదివారం ఉదయం 7-30 కే   ఏర్పాటు చేశానని  చెప్పాడు సరే అన్నాను . ఆ తర్వాత మెయిల్ లో మళ్ళీ తెలియ జేస్తాడేమోనని అనుకొన్నా  .నేను నవరాత్రి సందర్భం ఉదయం మా ఇంట్లో   21-9-17 గురువారం 25-9-17 సోమవారం మహాన్యాసం తో అభిషేకం  22-9-17 శుక్రవారం నుండి 30-9-17  శనివారం ఉదయం నా 57  వ (షార్లెట్ లో 3 వ)శ్రీ సుందరకాండ పారాయణ చేస్తున్నట్లు అందరికి తెలియ జేశాను . సాయి ఇంట్లో ఉదయం 7-30కి అభిషేకం కనుక ఆ రోజు ఆదివారం నా కార్యక్రమం తెల్లవారుఝామున 4 గంటలకే అనీ ముందే అందులో రాశాను . సాయి నుంచి కన్ఫర్మేషన్ వస్తుందనుకున్నాను .మా అమ్మాయికి మెసేజ్ వచ్చినట్లు చెప్పింది సరే .

       అందుకని ఈ ఆదివారం ఉదయం 4 గంటలకే ప్రారంభించాలనుకొని ,శనివారం రాత్రి ఇంటికొచ్చేసరికి 11 దాటటం ఫోటోలు పంపటం తో 12 -30 దాకా నిద్ర లేదు . కలత నిద్ర కొంత సేపు పోయా .మూడింటికి అలారం పెట్టుకున్నా .సుందరానికి తొందరెక్కువ ‘’అన్నట్లు ‘’మాసుందరికి’’నిద్రరాక అర్ధరాత్రి 2 గంటలకే లేచి కాఫీ ఏర్పాటు చేసింది . నేనూ 3 గంటలకే లేచి స్నానాదికాలు పూర్తి చేసి 3-30 కు కూర్చుని నిత్యపూజ శ్రీ ఆంజనేయ అష్టోత్తర సహస్రనామ పూజ శ్రీ లలితా అష్టోత్తర ,దుర్గా సరస్వతీ ,గౌరీ గాయత్రీ అన్నపూర్ణా అష్టోత్తరాలతో శ్రీసూక్తం గా నిత్యం చేస్తున్నట్లే చేసి ,సుందరకాండ మూడవ రోజు పారాయణ చేసి శతకం చదివి పూర్తి చేసేసరికి ఉదయం 6 అయింది . టాప్ గా హాయిగా సంతృప్తిగా చేసుకొన్నాను రోజూ ఏదో ఒక ప్రసాదం మా శ్రీమతి చేస్తే నైవేద్యం పెడుతున్నా. .ఇవాళ పాలలో అటుకులు నానేసి ఇచ్చింది .  రామకోటి రాసి భగవద్గీత చదివి డైరీ రాసి  పాలటు కుల నైవేద్యం తిని మందులు వేసుకొని సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నేను 6 -30 కె రెడీ అయ్యానన్నమాట  .మా రైడర్ అంటే మా అమ్మాయి విజ్జి లేచి కాఫీ తాగేసరికి ఏడున్నర దాటింది .రెండోసారికాఫీ తాగి ఆ మేము ముగ్గురం కారెక్కేసరికి 7-53 .సాయి వాళ్ళ ఇంటికి 8-15 కు చేరాం .అప్పటికే రాంకీ  సాయిలు అభిషేకం డ్రెస్ లో తయారు గా ఉన్నారు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి .వంటలు కూడా  చేస్తున్నారు  మాకు కాఫీ ఇచ్చారు ,ప్రభల ప్రభాకర్ గారూ వచ్చే ఉన్నారు .అంతా సరి చేసుకొని పూజ అభిషేకం ప్రారంభించేసరికి ఉదయం 9 అయింది . నేను కూడా కూర్చుని అభిషేకం చేసుకొందామన్న ఉద్దేశ్యం తో వచ్చాను వాళ్ళు అన్నీ గురుముఖతా నేర్చినవారు ,ఇలాంటి అభిషేకాలు వాళ్లకు కొట్టిన పిండి వారి తండ్రిగారు తాతగారు వీరి సోదరులను ఇందులో తీర్చి దిద్దారు కనుక వాళ్ళ ఆధ్వర్యం లో నేను మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకొనే భాగ్యం కలిగిందికదా అని సంబరపడ్డాను .కానీ సాయి బాంబు పేల్చాడు ‘’మీరే మాతో చేయించాలి మీ ఆధ్వర్యం లోనే జరగాలని మా కోరిక అన్నాడు ‘’రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరవనట్లు అయిష్టంగానే సరే అన్నాను .అలామొదలైంది ఇక్కడి రుద్రం .అందరం కలిసి మంత్రాలు చదువుతూ గణపతి పూజ ప్రారంభించాం.  సాయి పద్మశ్రీ దంపతులు కూర్చుని పూజ చేశారు .పద్మశ్రీ పట్టుబట్ట కాషాయ బోస్ గా కట్టి సంప్రదాయంగా పెద్ద ముత్తైదువగా వ్యవహరించింది . ప్రభాకర్ ,వేలూరి పవన్  సాయి వాళ్ళ ఇంటి పక్కనున్న తమిళ దంపతులతో భర్త కూడా అభిషేకం లో కూర్చున్నారు బులుసు సాంబమూర్తి గారు పద్మజ  దంపతులు వచ్చారు .సాయికి బంధువుతో స్నేహితుడా శ్రీమతి విద్యుల్లత  భర్త  కూడామాతో పట్టుబట్టలతో కూర్చున్నారు .బులుసువారు ‘’సివిల్ డ్రెస్  ‘’లో ఉండటం ,పిల్లల డ్రాపింగ్ పికప్ డ్యూటీ ఉండటం తో మాతో కూర్చోలేదు వాతావరణం  చాలా బాగాపవిత్రంగా  సెట్ అయింది

 .సాయి ఇంట్లో అభిషేకానికి కావాల్సిన సామగ్రి అంతా ఉంది .అందరికి రాగి పంచ పాత్ర ఉద్దరిణె  రాగి పాత్రలున్నాయి అభిషేకం చేయటానికి  అనువైనఇత్తడి వేదిక ఉంది  .దానిపై శివలింగాలను వాళ్ళు తమ విధానం లో చక్కగా అమర్చాడు సాయి .నా సాలగ్రామాలు ఆంజనేయ విగ్రహం ,స్పటిక లింగాన్ని కూడా అమర్చాడు . పంచామృతాలతో అభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి . ఆవాహన అయ్యాక మహాన్యాసం ప్రారంభించాం రాంకీ సోదరులు నేనూ ,ప్రభాకర్ చదివాము . కనుక మూడు సార్లు చేస్తే 11 ఆవర్తనాలు పూర్తి అవుతాయని మొదటి నమకం తర్వాత నాలుగు చమక అనువాకాలు ,రెండో నమ్మకం తర్వాత మరో నాలుగు చమక అనువాలాలు మూడో నమకమ్ తర్వాత 3 చమకానువాకాలతో ఏకాదశ రుద్రాభిషేకం  తర్వాత వాళ్ళపద్ధతిలో పంచసూక్తాలు  నా పద్ధతిలో దశ శాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం ,శివాష్టోత్తర సహస్రనామ బిల్వాష్టోత్తర పూజ చేసాం పుష్పాలంకారం సాయి చాలా ముచ్చటగా చేశాడు బాగా ఆకర్షణీయంగా ఉంది . అంతా అయ్యేసరికి నాలుగున్నర గంటల సమయం పట్టి మధ్యాహ్నం 1-30 అయింది .ఆరగా ఆరగా ‘’అరకొడుతూ’’అంటే కాఫీ తాగుతూ ఉచ్చై శ్వరం తో జరిపాం  ఆతర్వాత ఉద్వాసన .సాయి దంపతులకు ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం కానుకగా ఇచ్చాము .తర్వాత భోజనాలు . ఆరవ దంపతుల తండ్రి మద్రాస్ లో కేటరింగ్ ఎక్స్పర్ట్ పేరు పద్మనాభన్ .చెన్నై అన్నా నగర్ లో ఉంటారట అడ్రస్ ఇచ్చి వచ్చినప్పుడు తప్పక రమ్మన్నారు .ఆయన ,కూతురు ఇక్కడ సాయి వాళ్ళ ఇంట్లో వంట చేశారు . నాకోసం వంకాయ కూర అందరికోసం దొండకాయ కూర ,పప్పు వడ పులిహోర  కరివేపాకు పులిహోర  అల్లం చట్నీ సాంబారు పెరుగన్నం తో భోజనం  .నేను ఒకటిన్నర వడ  కొద్దిగా పప్పన్నం  పులిహోర ,కొంచెం సాంబారన్నం ,పులిహోరలో పెరుగు తో లాగించాను .అల్లం చట్నీ బాగా ఉంది .  సుమారు 30 మంది దాకా వచ్చారు .

  అందరి భోజనాలఏ సరికి 3 అయింది .సాయి దంపతులు మా ఇద్దరికీ నూతనవస్త్రాలు కట్టబెట్టి  దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందారు . అయిదేళ్లక్రితం అంటే 2017 లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడినుంచి ఇండియా వెళ్లేముందు రాంకీ ఇంట్లో నాతో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు అప్పుడు అతని అత్తగారూ మామగారు కూడా ఉన్నారు  .దానికి వాళ్ళందరూ చాలా సంతోషించారు   సాయివాళ్ళు ఇక్కడ అప్పుడు లేరు  5 ఏళ్లతర్వాత మళ్ళీ రాంకీ తమ్ముడు సాయి ఇంట్లో నే చివరి కార్యక్రమంగా ఈ రుద్రం . తమాషా అని పిస్తుంది ఏమైనా నాలుగున్నర గంటలు వేద మంత్రాలు ఇక్కడ ప్రతిధ్వనించటం మహదానందం  కార్యక్రమాన్ని వీడియో తీసి ‘’గొట్టం ‘’లో పెట్టారు .అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటికి చేరే సరికి సాయంకాలం 4 అయింది .మంచం మీద కాసేపు అటూ ఇటూ దొర్లా,కానీ నిద్ర పట్టలేదు ఫోటోలు అందరికి పంపాను .

   ప్రక్కివారింట్లో డిన్నర్

శ్రీ ప్రక్కి రమణ శ్రీమతి అరుణ దంపతుల ఇంట్లో ఈ రోజు రాత్రి భోజనం మా కుటుంబం పవన్ కుటుంబం పంచాగం ఆయనా ,పిల్లలు అతిధులం .షువర్చలేశ్వర శతకం ఆ దంపతులకు ఇచ్చాము .తర్వాత భోజనం.పప్పు ,వంకాయ కూర ,అల్లం చట్నీ బజ్జీలు ,పులిహోర మినపసున్ని ఉండ  ఉప్మా,  ముక్కల పులుసు ,తియ్యని గడ్డ  పెరుగు .అన్నీ చాలా రుచికరం గా ఉన్నాయి  ఇష్టంగా ఆనందంగా అన్నీ తిన్నాను . కొసరి కొసరి వడ్డించింది అరుణ . అయిదేళ్లక్రితం రెండు సార్లు శ్రావణ మాసం లో మమ్మల్ని అరుణ భోజనానికి పిలిస్తే వెళ్లాం మంఛీ  మర్యాదా పధ్ధతి ఉన్న అమ్మాయి  భక్తి కూడా ఎక్కువే .మా అమ్మాయికి మంచి స్నేహితురాలు  .ఇంటికి చేరే సరికి రాత్రి 11 అయింది .రెండు రోజులు వరుస రుద్రాలు ఇంట్లో పారాయణ తో గొంతు బొంగురు పోయింది .హాల్స్ చప్పరిస్తూ ఉపశమనం పొందాను .ఇబ్బందేమీ లేదు

ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .

      మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment