కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత -2(చివరిభాగం ) శివ -వేంకట కవులు

                శివ -వేంకట కవులు

వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు .

   బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు

కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు గ్రామానికి చెందినవారు బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు .నియోగి బ్రాహ్మణులు .సా౦ఖ్యాయనస గోత్రీకులు .ఆంద్ర మత్చ్య పురాణం ,బిల్వనాథీయం ,సాత్రాజితీయం మొదలైన ఉద్గ్రంథాలు 25రచించిన పండితకవి .

    మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగలూరు వాస్తవ్యులు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు. మధ్వబ్రాహ్మణులు .విశ్వామిత్ర సగోత్రీకులు .శ్రీ రామాయణోద్భూత ఉత్తరకాండ ,శుద్ధాంధ్ర భీమసేన విజయం మొదలైన పంచ వింశతి గ్రంథ కర్తలు .16ఏళ్ళ వయసులోనే ‘’అష్టావధానం ‘’చేసిన సాహస మేధావి కవి .అంగలూరులో స్వంత ఖర్చులతో,అనేక కస్ట నష్టాలను భరించి ‘’ బాలికా పాఠశాల’’ స్థాపించి  ,నిర్వహించి, సర్వతోముఖాభి వృద్ధి చేసిన మహోదారులు ,స్వార్ధ త్యాగి .

  సాంబశివరావు గారు , అప్పారాగారు చిరకాల మిత్రులు .సమవయస్కులుకూడా .యాభై ఏళ్ళ వయసు వారు .సహజ పా౦డిత్యులు .ఉభయభాషా కోవిదులు . తమమిత్రత్వాన్ని కాపాడుకోన్నట్లే  తమ పేర్లకూ మిత్రత్వం చేకూరుస్తూ ‘’శివ వెంకట కవులు ‘’అనే మిశ్రమ నామం తో 1912నుండి కనక దుర్గా స్తోత్ర రత్నమాల ,బ్రహ్మపత్రాభ్యుదయం ,జగన్నాథీయంమొదలైన ఆరు గ్రంథాలు రచించారు .వడాలిలో ఉన్న జగన్నాథదేవాలయం పాలకులు ఈ జంటకవులకు ‘’ప్రబంథ కవి పంచానన ‘’బిరుదునిచ్చి గౌరవించి సత్కరించారు .

ఈ విషయాలన్నీ ‘’పామర్రు కారోనేషన్’’ కమిటీ మెంబర్ శ్రీ బొమ్మారెడ్డి నాగి రెడ్డి 15-5-1914న ‘’పామఱ్ఱు( స్తూప )జయధ్వజ చరిత్ర ‘’పుస్తకం  పీఠికలో తెలియ జేశారు .

  ఈ జంటకవుల కవిత్వాన్నికొద్దిగా  ఆస్వాదిద్దాం

1-‘’శ్రీ విద్యోత సమస్త లోకపటలీ సృష్టి స్థితి క్షేపణ-ప్రావీణ్యోల్ల సదాత్మక శక్తి మహిమోపన్యస్తసర్వేశ్వర

త్వావిర్భూత దయామయా కృతితియుతుం డై,సర్వగుండౌమహా –దేవుండీయుత జార్జి భూమి పతికిన్ దీర్ఘాయు రారోగ్యముల్ ‘’

2-భూషణమై పామర్తికి –శేషుడు ధర మోచి ,యుల్లసిలునంతకు సం

 తోషమున జార్జికారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’

3-పరమోత్సాహంము తోడ హైందవ జన ప్రాంచన్మనోభీస్టముల్-చరితార్ధంబు లొనర్ప,బంచమ మహా జార్జి ప్రభుం డంచితా

దరుడై,ఢిల్లి  మహాభి షేక పదవిన్ దాల్పంగ,దన్మంగళా-కరమౌ పుణ్య దినంబు శాశ్వతముగా గన్ దెల్పబామర్తిలో

స్థిరమౌ స్తంభము నాటి ,మాకు గరమర్ధిన్ మేలుగాంచి తీ-వురు తేజో నిధివై మహామ్మదుహుమాయూన్ సాయెబు గ్రామణీ’’

4-‘’అసమాన రాజభక్తి సమేతులై ప్రజా సామాన్యమునకు రాజన్యభక్తి –స్థిరముగ నెలకొల్పి పరమోపకారంబు గావించు శ్లాఘ్య సంకల్పమొప్ప

బ్రతి సమంబును ,రాజ పట్టాభి షేకమహోత్సవ స్మరణ ప్రయోగ సరణి –నతి బీదలగువారి కన్న వస్త్రములిచ్చి తత్సుకృతంబు భూధవునకంచి

తాయురారోగ్య ములొసంగు నట్లు వేడి –కొనెడు సత్కార్య శూరులై మనెడు నట్టి

సాదు’’పామర్తి కారోనేషన్’’సమాజ –సభికులను బ్రోవు గావుత జక్రధరుడు ‘’

ఈ కమిటీ రెండవ సంవత్సరోత్సవం 12-12-1912న అప్పటి తాసిల్దారు శ్రీ తాయి సుబ్బారావు నాయుడు గారి యాజమాన్యం కింద జరుపబడింది .నిధి వసూలు చేసి హుమాయూన్ గారిలాగానే పేదలకుమృష్టాన్నభోజనం పెట్టించి నూతనవస్త్రాలిచ్చారు .12-12-1913న మూడవ వార్షికోత్సవం డిప్యూటీ  తాసిల్దార్ శ్రీ వక్కలంక లక్ష్మీ నరసింహారావు పంతులుగారు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా మన జంటకవులు మంచి పద్యాలవి౦దు కూర్చారు –‘’కరుణన్ బీదల కన్నవస్త్ర ములొసంగన్ ,నీ మహోత్సాహ ని-ర్భరతన్ గన్గొని లేమి లేమి యగుచున్ వైధాత్ర  సంకల్పమున్

జరితార్ధం బొనరించు నీదగు క్రియా చాతుర్యమార్యాళిప-ల్మరు వర్ణి౦చు ను వక్కలంక కులాజాలక్ష్మి నృసి౦హాన్వయా ‘’

రూపకం –బ్యాండు మెట్టు

‘’జార్జి చక్రవర్తికిన్ –జనని మేరి రాణికిన్ –ఊర్జిత జయమంగళంబు –లొసగు నీశు డెప్పుడున్

తనదు ప్రజల సాటిగా –దలచి మనల సూటిగా –ఘనుడు జార్జి చక్రవర్తి –కాచుచుండు గావుతన్ ‘’

చివరి కందపద్యం –‘’శివ వే౦కటీయ కృతియై –చవులిడు పామఱ్ఱు స్తంభ చారిత్రంబీ

భువి నార వితారకమై –కవి హృదయాహ్లాద కరముగా విలసిల్లున్ ‘’

  శివ, వేంకట కవులు రాసి ప్రచురించిన గ్రంథాలు

1-శ్రీ రామాయణోద్భు దోత్తరకాండం 2-జగన్నాదీయం అనే వడాలి మాహాత్మ్యం 3-శుద్ధాంధ్ర మేఘ సందేశం 4-ఆంధ్రీకృత మేఘ సందేశం 5-చంద్రిక –నవలాప్రబంధం 6-బాలాశతకం 7-సీతారామ శతకం 8-రామ శతకం 9-ఆది కేశవ శతకం 10-శ్రుత శైల హనుమత్సతకం 11-బ్రహ్మ పత్రాభ్యుదయం అనే పొగాకు మహిమ 12-గంగిరెద్దు –హాస్యరచన 13-స్త్రీ విద్యా సార సంగ్రహం-వచనం  14-దొంగసామి చరిత్ర –యదార్ధకథ 15-శ్రీకృష్ణ మానస పూజ-సంస్కృతం  16-హరిహర స్తోత్ర తారావళి –సంస్కృతం 17-కనకదుర్గా స్తోత్ర రత్నమాల-సంస్కృతం 18-అంగలూరు విలేజి భూగోళం 19-పామర్రు జయధ్వజ చరిత్ర 20-బాలతొడవు (అమూల్యం )21-నేత్రావధాన చంద్రిక

ఇవన్నీ- శివ వే౦క టీయ  గ్రంథాలయం-అంగలూరు –కృష్ణా జిల్లా లో దొరుకుతాయని ప్రకటించారు జంటకవులు .

 రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-19-ఉయ్యూరు

–image.png

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -36

50-సోమ తీర్ధం

పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ  ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు  బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం తాము ఎక్కడికి వెళ్ళాలి అని అడగగా ,గౌతమీతీరం చేరితే ఆమె చంద్రుని పతిగా ప్రసాదిస్తు౦దన్నాడు  .బ్రహ్మ చెప్పినట్లే అక్కడికి చేరి –‘’కో వేత్తి భాగ్యం నరదేహ భాజాం ,మహీగతానం,సరితామధీశే –యేషాం మహాపాతకం సంఘ హన్త్రీ త్వమ౦బ  గంగే సులభా సదైవ ‘’

‘’నమోస్తు తే మాతరభీస్ట దాయిని ,నమోస్తుతే బ్రహ్మమయే అఘనాశిని –నమోస్తుతే విష్ణు పదాబ్జ నిః సృతే,నమోస్తు తేశంభు జతావినిః సృతే’’అని ప్రార్ధించాయి .గంగాదేవి సంతృప్తి చెంది ఏం కావాలని అడిగితె తేజో వంతుడైన రాజును భర్తగా ప్రసాదించమని కోరగా’’ గంగామాయి’’ –

‘’అహం చామృత రూపాస్మి ఓషధ్యోమాతరోమృతాః-తాదృశం చామృతాత్మానం పతిం సోమం దదామివః ‘’అన్నది అంటే –నేనూ ,మీరూ అమృత రూపులం .అలాగే అమృతాత్మకుడై న చంద్రుని మీకు పతిగా ఇస్తాను ‘’అనగా ఓషధులు పరమానంద పడి,కృతజ్ఞతలు తెలిపి తమ స్థానాలకు వెళ్ళిపోయాయి .అమృతాత్మకుడు,సమస్త సంతాప నివారకుడు  రాజు అయిన సోముని ఓషధులు పతిగా పొందిన చోటు సోమతీర్ధంగా విరాజిల్లింది .భుక్తి ముక్తి తోపాటు సోమపాన ఫలాన్ని ఇస్తుంది అని నలువ నారదునికి తెలియ జేశాడు .

   సశేషం

   రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656990979741736897/6656990980106632306?authkey=CJKv6M2yo7TvggE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ లింగం ఉండేవి .కొలనులో నీరు ఎప్పుడూ ‘’ఏనుగు లోతు’’ ఉండేది .శివలింగం కొలను నీటికి పైన దర్శనమిస్తూ ఉండేది .లింగం పాదం ఎంతలోతులో ఉందొ ఎవరికీ అంతు పట్టేదికాదు .ఈ శివ లింగాన్నిఎప్పుడో నాగులు ప్రతిస్టించాయనీ ,నిత్యాభి షేకానికి ఒకనదిని కూడా అక్కడ కల్పించాయని ,నాగులు తెచ్చిన నదికనుక ‘’నాగులేరు ‘’అనే పేరొచ్చిందని పూర్వులు చెప్పుకొనేవారు .ఆవరణం లేని ఆ శివలింగం మహా ప్రభావ సంపన్నంగా ఉండేది .దివ్యులు వచ్చి అర్చించి వెళ్ళేవారు .ఆశివ లింగం శిరసుపై ఒకపద్మం వికసించి దివ్య పరిమళాలను వెదజల్లేది.ఆ కొలను గట్టున అనేక శాఖలతో విస్తరించిన వట (మర్రి )వృక్షం ఉండేది .ఆ వటవృక్షం తొర్రలో మహా నాగం ఒకటి నివసించేది .అది రోజూ చెట్టుదిగి ఆమహా శివ లింగాన్ని చుట్టుకొని నాగాభరణంగా  భాసించేది .

   చాలా ఏళ్ళు గడిచాక ఆ చెరువు కొంత పూడిపోయి ,చిన్న గ్రామం ఏర్పడింది .తర్వాత ఎశం లో మహమ్మదీయ ప్రభుత్వమేర్పడి ,హిందూ దేవాలయ ధ్వంసం చేసి ,విగ్రహాల పీఠభాగం నిక్షిప్తమై ఉన్న  ఉన్న అమూల్య సంపదను  దోచుకోవటం ప్రారంభమైంది .అలాంటి సంక్షోభ కాలం లో ఒకమహమ్మదీయ సైన్యం  ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి శివలింగ వైభవానికి ఆశ్చర్యపోయి ,ఆ శివలింగ మూలాన్ని ధ్వంసం చేస్తే అన్నతమైన ధన కనక వస్తురాసి లభిస్తుందని ఆశపడి ,తటాకం లోకి చేరి చాలాలోతుగా ఉన్న నీటిలో ఉన్న లింగాన్ని  పీకటానికి విశ్వ ప్రయత్నం చేశారు .మానవ సాధ్యం కాదని అర్ధమై ఒక ఏనుగును  దింపి ప్రయత్నించారు.అది తామర తూడు ఆశతో లింగం పైఉన్న తామర పువ్వును పెకలించింది .దాని  మూరెడు పొడవున్న తూడు బయటికి వచ్చింది .అప్పుడు శివలింగం శిరసుపై రంధ్రం ఏర్పడి రక్తం కారటం మొదలు పెట్టింది .కొలను నీరంతా రక్త ప్రవాహమైంది .ఈ హఠాత్సంఘటనకు  తురక సైన్యం భయపడి ,ప్రయత్నాన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించింది .ఇప్పటికీ ఆ శివలింగం శిరోభాగం లో మూరెడు లోతు గుంట కనిపిస్తుంది .ప్రతి రోజూ శివలింగ౦పై ఉన్న గుంటను   శుభ్రంగా  కడిగి, వస్త్రం జొనిపి ,తుడిచి శుభ్రం చేస్తారు .లేకపోతె రక్తపు వాసన వస్తుంది .

  గ్రామస్తులకు ఈ విశేష శివలింగం పై అశేషభక్తి ఏర్పడి  నిత్యపూజలుచేయటం ప్రారంభించారు .క్రమ౦గా కొలను పూడిపోయి గ్రామం వృద్ధి చెందింది .గ్రామస్తులు ఆ మహా మహిమాన్విత శివ లింగానికి ప్రాకారం ,ఆలయం కట్టించి ‘’సోమేశ్వర స్వామి ‘’గా అర్చిస్తూ నిత్యోత్సవాలు నిర్వహించారు .కొలను గట్టున ఉన్న వటవృక్షం అంటే మర్రి చెట్టు ఇప్పుడు లేదు .చాలాకాలం మర్రి చెట్టు, అందులో పాము ఉండటం  యదార్ధం కనుక ఆగ్రామానికి ‘’పాము మర్రి ‘’అనే పేరొచ్చింది .కొంతకాలానికి ‘’పామ్మర్రి ‘’గా మారి ,చివరికి’’ పామర్రు ‘’అయింది .

‘’పాము వసియించు మఱ్ఱికి  –గ్రామము కుఱగటనుగలుగ గా గాంచి, జన

స్తోమమ్ము ‘’పాము మఱ్ఱన’’-‘’బామఱ్ఱ’’ని యదియ పిదప వాడుక పడియెన్’’

  పామర్రు క్రమాభి వృద్ధి పొంది ,చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా మారి ,1910లో గుడివాడ , తాలూకాలో పామర్రు డివిజన్ అయింది .ఈ డివిజన్ లో 65 గ్రామాలు ఉండేవి .ఈ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ కార్యాలయం పామర్రులో ఉంది .1-1-1910న డిప్యూటీ తాసిల్దార్ గా శ్రీ నండూరి రామ చంద్రరావు పంతులుగారు ఉద్యోగం లో చేరి ,సుపరిపాలనతో ప్రజామన్నన పొందారు .తర్వాత శ్రీ మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారు  డిప్యూటీ  తాసిల్దారయ్యారు .అదే సమయం లో భారత దేశాన్ని పాలించే అయిదవ జార్జి చక్రవర్తి కి ఢిల్లీ లో పట్టాభి షేక మహోత్సవం జరిగింది .దేశమంతా ఆ పట్టాభి షేకాన్ని ఘనంగా నిర్వహించారు .

  పామర్రు లోనూ అత్యుత్సాహంగా రాజుగారి పట్టాభి షేక మహోత్సవం జరపాలని భావించి ప్రజలు స్వచ్చందంగా చందాలు వేసుకొని 5 వేల రూపాయల నిధి ప్రోగు చేసి ,బీదలకు అన్నదానం ఏర్పాటు చేసి ,ఆ మహోత్సవానికి జ్ఞాపక చిహ్నంగా పామర్రులో ‘’జయ స్తంభం ‘’నిర్మించారు .ఈ జయ స్తంభం  బందరు-హైదరాబాద్ రోడ్డులో ,పుల్లేరు కాలువ వంతెన ప్రక్కన నిర్మించారు .పద్నాలుగున్నర అడుగుల ఎత్తులో ,ఆరడుగుల లోతున ఏర్పాటు చేశారు .స్తంభం మధ్యలో నాలుగు పలకలు ,దానికి పైన కిందా ఎనిమిది పలకలుగా ఉండేట్లు నిర్మించారు .మధ్యలో ఉన్న తూర్పు వైపు పలకపై ‘’శ్రీ శ్రీ పంచమ జార్జి చక్రవర్తి .మేరీ చక్రవర్తినీ గార్లకు ఢిల్లీలో 12-12-1911న పట్టాభి షేక మహోత్సవము జరిగినదని జ్ఞాపకార్ధ మీ స్తంభం ప్రతిస్తించబడి,14-12-1911తేదీన కృష్ణా కలెక్టర్ హెచ్ ఎల్ బ్రైడ్ వుడ్ దొరవలన ప్రసిద్ధ పర్చబడినది ‘’అనే అర్ధం వచ్చేట్లు ఇంగ్లీష్ లో చెక్కించారు .

In commomoration  of The Imperial  Coronation on 12-12-19 11At Delhi

Of The Most Gracious Majesties KING=EMPEROR GEORGE V And QUEEN=EMPRESS MARY.

Un weiled on 14-12-1911By H.L. BRAID WOOD Esq.-Collector Krishna

‘’భూషణమైన మైన పామర్తికి –శేషుడు ధర మోచి యుల్లసిలు నంతకు ,సం

తోషమునజార్జి కారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’

  ఇలాంటి శాశ్వత నిర్మాణ జయస్తంభం ఈ తాలూకాలోనే మొట్టమొదటిది .దీని నిర్మాణ బాధ్యత అంతా మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది  ఖర్చులు పోను మిగిలిన ధనాన్ని బాంక్ లో వేసి నిర్మాణకమిటీకి అప్పగించారు .

నాకు ఇన్నేళ్ళుగా పామర్రు లోని ఈ జయస్తంభం గురించికాని శివాలయ విశేషం గురించికాని పామర్రు అనే పేరు ఎలావచ్చిందనికాని తెలియని లేదు . అగ్రిగోల్డ్ వారు భక్తి సుధ మేగజైన్ తీస్తున్నప్పుడు దాని ఇంఛార్జిగా ఉన్న శర్మగారు నన్ను పామర్రు శివాలయానికో ప్రత్యేకత ఉందని దాన్ని గురించి తెలుసుకొని ఆర్టికల్ రాయమని పదే  పదే చెప్పేవారు . నాకు తీరికా ఓపికా లేక అప్రయత్నం చేయలేదు .పామర్రు లో మూడు సార్లు సైన్స్ మాస్టర్ గా ,అద్దాడలో ఏడేళ్లు  హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు పామర్రు వాస్తవ్యులు,తెలుగుపండిట్  స్వర్గీయ శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు కాని  లెక్కలమేస్తారు హెడ్ ఆస్టార్ అయినా స్వర్గీయ శ్రీ  గుండ్రం వెంకటేశ్వరరావు గారు కానీ పై విషయాలగురించి నాతో ఎప్పుడూ ముచ్చటించనే లేదు . ఇలా పామర్రు చరిత్ర నాకు అజ్ఞాతం  గానే ఉండి పోయింది ఇంతకాలం గా . 

  మనవి-నాలుగు రోజులక్రితం మా అబ్బాయి శర్మ పై జంటకవుల పుస్తకం మెయిల్ లో పంపాడు అది చదివి ఆశ్చర్యపోయి రాసిన వ్యాసం ఇది .దీని తర్వాత ఆ జంటకవుల చరిత్ర  సూక్ష్మ0గా  రాస్తాను . నెట్ లో వెదికితే ఆ స్తంభం చరిత్ర ,ఫోటో కూడా కనపడలేదు .నాకూ ఎప్పుడూ అక్కడ కనిపించలేదు లేక నా దృష్టి  దానిపై పడక పోయి ఉండచ్చు కూడా -. దుర్గాప్రసాద్ 

  సశేషం

ఆధారం –శివ- వేంకట కవులు అనే జంటకవులైన ‘’ప్రబంధ పంచానన ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అడవి సాంబశివ రావు పంతులు ,మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులు గార్లు రచించిన ‘’పామఱ్ఱు (స్తూప )జయధ్వజ చరిత్ర ‘’

 రేపు రధ సప్తమి శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-19-ఉయ్యూరు 

—

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -35

48- ఆత్మతీర్ధం

భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై తాను  సంసారతాపత్రయం లో కూరుకుపోయానని ,కామ కోపాలతో లోపలి శత్రువులను జయి౦చ లేకపోతున్నాననీ దీనినుండి విముక్తిపొంది తనమనసులో ‘’సోమ ‘’అనే పదం శాశ్వతంగా ప్రతిష్ట చేయమని,తనకే పదవులు  అక్కరలేదని ‘’శివ ‘’పదం ఉన్న చోట తన ఉనికి  ఉండేట్లు చేయమని –‘’గౌరీపతే శంకరసోమనాథ,విశ్వేశ ,కారుణ్య నిధేఖిలాత్మకం –సంస్తూయతే యత్ర నదేతి తత్ర కేషామపి  స్యాత్క్రుతి నాం నివాసః ‘’అంటూ ఆర్తిగా వేడుకొన్నాడు .

  దత్తుని స్తుతి కి పరవశించిన పరమేశ్వరుడు అలాగే అని చెప్పి వరమిచ్చాడు .అత్రి మహర్షి కోరిక అయిన ఆత్మజ్ఞానం కలిగిన చోటుకనుక ఆత్మ తీర్ధం గా ప్రసిద్ధి చెందింది.

    49-ఆశ్వత్దాది  తీర్ధం

బ్రహ్మ నారదునికి అశ్వత్ధ ,పిప్పల ,మంద అనే మూడు తీర్దాల విశేషాలు చెప్పాడు .ఒకప్పుడు వింధ్యపర్వతానికి   గురువైవైన అగస్త్య ముని  దేవకార్య నిమిత్తమ ,భార్య లోపాముద్రతో ,వెయ్యి మంది మునిగణ౦ తో విన్ధ్యను సమీపించాడు .అది అత్యంత ఉన్నతమై ఆకాశాన్ని  అంటుతోందా  అన్నట్లు పెరిగి పోయి ఉన్నది .శిష్యుడైన విన్ధ్యరాజు గురువు అగస్త్యమౌనిని అర్ధాంగి లోపాముద్రను వెంటవచ్చిన ముని బృందాన్ని సకల సపరి చర్యలతో స్వాగత సత్కారాలతో మెప్పించాడు .అగస్త్యముని శిష్యుడితో ‘’నేను వీరందరితోకలిసి దక్షిణ దేశ యాత్ర చేయటానికి వెడుతున్నాను .కనుక మాకు దారి ఇచ్చి ,మేము తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని,మాటతప్పవద్దని  కోరుతున్నాను ‘’అన్నాడు మహాభాగ్యం అంటూ వింధ్యుడు తలవొగ్గి మార్గం కలిపించగా దక్షిణానికి అగస్త్యముని బృందం వెళ్ళింది .అగస్త్యముని గౌతమీ తీరం చేరి ,సత్ర యాగం చేయటానికి దీక్ష పూని ముని బృందం సాయం తో ఏడాదికాలం చేసి నిర్విఘ్నంగా పూర్తి చేశాడు .

  కైటభాసురునికి ఆశ్వత్ధుడు ,పిప్పలుడు అనే ఇద్దరు కొడుకులున్నారు .వీరిద్దరూ యజ్ఞ ధ్వంస కార్యక్రమాన్ని చేయాలనుకొని మొదటివాడురావి చెట్టు రూపం లో ,రెండవవాడు బ్రాహ్మణ రూపం లో ముని యాగ శాలకు చేరి ,కామ రూప విద్య లో నిష్ణాతులుకనుక రోజూ సత్ర యాగం వద్ద బ్రాహ్మణులను బాధించేవారు ఆశ్వత్ధుడు రావి చెట్టు వద్దకు వచ్చిన బ్రాహ్మణులను ,చంపేసి తినేసేవాడు .పిప్పలుడు బ్రాహ్మణవేషం లో సామగానం చేస్తూ నేర్చుకోవటానికి వచ్చే వారిని నాకిపారేసేవాడు .అప్పటినుంచి లోకం లో సామగానం చేసే బ్రాహ్మణులు  కరుణ లేని వారయ్యారు –‘’తస్మదద్యాపి విప్రేషు సామగో తీవ నిష్క్రుపః ‘’’

రోజు రోజుకీ  బ్రాహ్మణులు క్షయం అవటం గమనించి ,మునులు దక్షిణ తీరం లో తీవ్ర తపస్సు చేస్తున్న శనైశ్చరుని చేరి జరిగింది చెప్పగా తన తపస్సు పూర్తికాగానే వాళ్ళను చంపుతానన్నాడు .మునులు అప్పటిదాకా ఆగితే కొంప కొల్లేరు అయిపోతున్దని అతనికి కావాల్సిన తపస్సు అంతా తామే ఇస్తామని చెప్పగా ‘’ఐతేమీ పనైపోతుంది ‘’ అన్నాడు శని .

  సూర్యపుత్రుడైన శని  బ్రాహ్మణ రూపం లో ఆశ్వత్ధుని చేరి ,రావి చెట్టు రూపం లో ఉన్నవాడి చుట్టూ ప్రదక్షిణ చేయగా  మామూలు బాపడే అనుకోని తినేశాడు .వాడి శరీరం లోకి ప్రవేశించిన శని మనవాళ్ళ సినీమా డైలాగ్ లాగా  ‘’కంటి చూపుతో ‘’ భస్మం చేశాడు   ఆశ్వత్దుడిని .తర్వాత పిప్పలుని చేరగా వాడు వెర్రి బాపడనుకొని మింగేశాడు .పొట్టలో చేరిన శని తన తీవ్ర దృష్టి తో వాడినీ భస్మం చేశాడు .మహర్షులు ప్రీతమానసులై మందుడు అంటే శనికి కోరిన కోర్కెలన్నీ తీర్చారు .పూర్తిగా సంతృప్తి పొంది శని ‘’శనివారం అశ్వత్ధ వృక్షాన్ని  కి ప్రదక్షిణ చేసేవారు స్పృశించే  వారి పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి .అశ్వత్ధ తీర్ధం లో స్నానం చేస్తే సర్వ కార్య సిద్ధి కలుగుతుంది .గ్రహపీడలు తొలగిపోతాయి ‘’అని ప్రకటించాడు .అప్పటినుండి ఇది అశ్వత్ధ ,పిప్పల ,మంద ,అగస్త్య ,సాత్రిక ,యాజ్ఞిక ,సామగ తీర్ధమని పేరు పొందింది .

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

10-2-19ఆదివారం మాఘ శుద్ధపంచమి-శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయా దేవాలయం లో ఆవు పిదకలపై సామూహికంగా ఆవుపాలు పొంగించి ,పొంగలి వండటం చిత్రాలు

10-2-19ఆదివారం మాఘ శుద్ధపంచమి-శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయా దేవాలయం లో ఆవు పిదకలపై సామూహికంగా ఆవుపాలు పొంగించి ,పొంగలి వండటం చిత్రాలు

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656343671508355121/6656343675649995666?authkey=COj0787t4dWZ7wE

 

10-2-19ఆదివారం మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక సత్యనారాయణ వ్రతం -మరియు 18సార్లు సైకిల్ పై అయ్యప్పదీక్షతో శబరిమలై యాత్ర ,5 సార్లు శివ దీక్షతో నడకతో శ్రీశైల యాత్ర చేసిన శ్రీ బిరుదుగడ్డ వెంకటేశ్వరరావు కు ,25 సార్లు దీక్షతో శబరిమలై యాత్ర చేసిన మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం కాపలాదారు శ్రీ చౌడాడ అప్పలనాయుడు కు చిరుసత్కారం చిత్రమాలిక

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656348639693451921/6656348644545239762?authkey=COOWxtj69vX9cA

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘విహంగ ”హేమలత -జ్యోతి-11-2-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 137 వ కార్యక్రమంగా 10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం

రసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ   10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం
10-2-19 మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి(సరస్వతీ దేవి జన్మదినోత్సవం ) నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోసరసభారతి 137 వ కార్యక్రమంగా  ఉదయం 9 గం లకు ఆవుపాలు పొంగించి పొంగలి వండటం ,ఆతర్వాత ఉదయం 10గం లకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహింపబడుతుంది .
 వ్రతం అనంతరం   శ్రీ అయ్యప్పదీక్షతో 18సార్లు సైకిల్ పై శబరిమల యాత్ర ,5సార్లు  శ్రీ శివ దీక్షతో కాలినడకన శ్రీశైల యాత్ర చేసిన స్థానిక సుధీర్ టింబర్ డిపో ఉద్యోగి శ్రీ  బిరుదుగడ్డ వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం ,వారి అనుభవ ప్రసంగం ఉంటాయి . భక్తులు ,,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన –
                                       గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త
                                         9-2-19 -ఉయ్యూరు

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం
 విహంగ మహిళా వెబ్ మాసపత్రికను  అత్యంత సమర్ధ వంతంగా ,విభిన్నశైలిలో నిర్వహిస్తూ ,నన్ను కూడా విహంగాకు రాయమని 2012 ఏప్రిల్ లో మెయిల్ ద్వారా శ్రీ మతి పుట్లహేమలత గారు కోరగా అప్పటినుంచి అవిచ్చిన్నంగా ఇంతవరకు ప్రతినెలా దేశ విదేశాలలోని మహిళా మూర్తులను గురించి రాస్తూనే ఉన్నాను విహంగాలో ఎంతోఆధరంగా ప్రచురిస్తూనేఉన్నారు .దాదాపు ఆరు సంవత్సరాల సాహితీ బాంధవ్యం . సరసభారతి ప్రచురించిన పుస్తకాలు ఆమెకు కనీసం మూడు  ప్రతులు  ఒకటి ఆమెకు మరొకటి రాజమండ్రి తెలుగు విశ్వ విద్యాలయానికి  ఇంకొకమరచి   ఎవరైనా సాహితీ మూర్తికి మూడు ప్రతులు పంపటం ఆమె అలాగే స్వీ  కరించి అందజేయటం జరుగుతోంది .  మూడేళ్ళక్రితం జనవరిలో జరిపిన విహంగ పత్రిక వేడుకలలో నన్ను ఆహ్వానించి విహంగ ఆత్మీయ పురస్కారం అందించిన సౌజన్యమూర్తి హేమలత గారు . ఇప్పుడే వారి అకాల మరణ వార్త విని   దిగ్భ్రా0తి   చెందాను . శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు స్వాస్థ్య చిత్తం తో  విషాదాన్ని క్రమంగా మరచిపోవాలి కోరుతూ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిస్తూ ఆమె ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-19 -సాయంత్రం 6-40 -ఉయ్యూరు 

—

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -34

46-శేష తీర్ధం

శేషుడు రసాతలానికి అధిపతి .సమస్త ఫణి రాజులు అతని అధీనం లో ఉండేవారు .అంతకు పూర్వమే దేవతలు రాక్షలకు అది ఆవాసభూమి .నాగరాజును అడ్డుకొనగా అతడు బ్రహ్మకు ‘’స్వామీ !నువ్వే నన్ను పాతాళాకి పంపావు .కాని దేవదానవులు నన్ను రానివ్వటం లేదు .నువ్వే దిక్కు ‘’అని శరణువేడాడు . బ్రహ్మ గౌతమీనదికి వెళ్లి ,మహాదేవుని అర్చించి శరణు పొందమని హితవు చెప్పాడు .అలాగే గంగానది చేరి పవిత్ర స్నానం చేసి , త్రిదశాధిపతి పరమేశ్వరుని  ధ్యానం చేశాడు –

‘’నమః సహస్ర శిరసే నమః సంహారకారిణే-సోమ సూర్యాగ్ని రూపాయ జలరూపాయతే నమః ‘’

‘’సర్వదా సర్వ రూపాయ కాలరూపాయ తేనమః –పాహి శంకర సర్వేశ పాహి సోమేశ సర్వగ –జగన్నాథ నమస్తుభ్యం దేహి మే మనసేప్సితం ‘’అని బహువిధాల స్తుతించాడు .ప్రీతిమానసుడై శివుడు నాగుని కోరికలన్నీ తీర్చాడు .దేవ రాక్షస వినాశానికి శూలం ఆయుధంగా ఇచ్చి శత్రు సంహారం చేయమన్నాడు .

  శేషుడు పాములనందర్నీ వెంటబెట్టుకొని రసాతలం చేరి శూలంతో దేవ రాక్షాస సంహారం చేసేసి ,బిలం ద్వారా పైకి వచ్చిశివుని   దర్శించాడు .ఆ బిల తలం నుండి పవిత్ర జలం ఉత్పన్నమై గంగానదిలో కలిసింది .శివుడి దగ్గర ఉన్న విశాలమైన కుండం వద్ద శేషుడు నిత్యహోమం చేశాడు .కనుక ఆనీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది .ఈ జలం గంగా సంగమ౦ అయి ,పవిత్ర తీర్ధ స్థలమైంది .చాలాకాలం అక్కడే శివ ధ్యానం తో గడిపి శివ వరప్రసాదం తో సకల అభీష్టాలు నెరవేర్చుకొని మళ్ళీ పాతాళం చేరాడు .అప్పటి నుంచి ఇది నాగతీర్ధంగా పిలువబడింది.ఇది సకల కోరికలను తీరుస్తూ ,ఆయుస్సు సంపద కలిగిస్తుంది ఇక్కడి స్నానదానాలు ముక్తినిస్తాయి అని బ్రహ్మ దేవుడు నారదునికి చెప్పాడు .

              47-వడవాది సహస్ర తీర్ధం

మహానలం  ,వడ వానలం అని పిలువబడే ప్రసిద్ధ క్షేత్రం గూర్చి నారదునికి బ్రహ్మ వివరించాడు .వడవా అనే నది అక్కడ ఉన్నది జరా మృత్యునివారకం .నైమిషం లో ఋషులు ఒకప్పుడు యజ్ఞం చేసి మృత్యువును ‘’శాంత చిత్తు’’ని చేశారు .మృత్యు నాశనం జరగటం లేదుకనుక ప్రాణులు మరణించటం లేదు .స్వర్గం శూన్యమైంది .మానవ లోకం జనం తో నిండిపోయింది .అప్పుడు దేవతలు రాక్షసులని  మునుల సత్రయాగాన్ని భగ్నం చేయమన్నారు .అలా చేస్తే తమకేమిటి లాభం అని వాళ్ళు ప్రశ్నించారు .యజ్ఞార్ధ ఫలం దక్కుతుంది అని  చెప్పారు  దేవతలు . .

   రాక్షసులు దేవతలమాట విని ఋషుల సత్రయాగానికి రాగా ,వారు మృత్యువును  ప్రార్ధించారు .అందరూ ఆలోచించి నైమిశం వదిలి ,శమితతో అగ్నిని మాత్రం తీసుకొని అత్యంత వేగంగా గౌతమీ తీరం చేరి స్నానించి మహేశ్వరుని రక్ష చేయమని-‘’మహానలం ,మహాకాయం ,మహానగ విభూషణ౦ -మహా మూర్తి ధరం దేవం శరణం యామి శంకరం ‘’అని

 మృత్యువుకూడా ‘’రాక్షసేభ్యో భయం ఘోరమాపన్నం త్రిదశేశ్వర – యజ్ఞ  మాస్మా౦ శ్చ రక్షస్వ యావత్సత్రం సమాప్యతే ‘’అనీ ప్రార్ధించారు .సంతుష్టి చెందిన సదాశివుడు మృత్యువుకు ఇష్టమైంది కోరుకోమన్నాడు .ఆయన రాక్షసులవలన మహర్షుల సత్రయాగం విచ్చిన్నమైంది ,కనుక యజ్ఞం పరిసమాప్తి వరకు తమందర్నీ రక్షించమని వేడుకొన్నాడు .శివుడు అలాగే అని చెప్పి వారి కోరిక తీర్చాడు .శమితమైన మృత్యువుతో  ఋషుల యజ్ఞం పూర్తయింది .దేవతలు హవిర్భాగం కోసం వచ్చారు .

   మహర్షులకు తీవ్రమైన కోపం వచ్చి యజ్ఞ వినాశానికి రాక్షసులను పురికొల్పి  పంపినందుకు ,ఇకనుండి రాక్షసులతో నిత్యం శత్రుత్వమే కలుగుతుంది అని శపించారు .అప్పటినుండి దేవతలకు రాక్షసులు శత్రువులైపోయారు .అక్కడ ఉన్న వడవ ను మృత్యువు భార్యగా చేసి అభిషేకించారు ఋషులు .ఆ అభిషేక జలమే నదీ రూపం పొంది వడవా నది అయింది .మృత్యువు స్థాపించి పూజించిన శివలింగం ‘’మహానల లింగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆస్థానం వడవా సంగమం గా ప్రసిద్ధమైంది .స్పర్శ మాత్రం చేత ముక్తి నిస్తుంది .సర్వాభీష్ట సిద్ధి నిచ్చే వెయ్యి తీర్దాలు ఆ నదికి రెండువైపులా వర్ధిల్లాయి .

   సశేషం

 రేపు 10-2-19 ఆదివారం సరస్వతీదేవి జన్మదినమైన శ్రీ పంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాసు అచ్యుత రావు పంపిన శ్రీ దాసు శ్రీరాములు విశేషాలు

 

 

శ్రీ దుర్గా ప్రసాద్ గారికి నమస్కారములు
మీతో పరిచయమవటం చాలా సంతోషం.
I am attaching some articles o the Mahakavi.
I hope they would interest you.
భవదీయుడు
దాసు అచ్యుత రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్
స్వర్గీయ శ్రీ దాసు శ్రీరాములు గారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు ఇవాళ ఉదయం 9గంటలకు ఫోన్ చేసి  మన సరసభారతి బ్లాగ్ లో దాసు శ్రీరాముల గారి గురించి రాసిన విషయం చదివి ఫోన్ చేస్తున్నాననీ ,తానూ 60 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నానని ,తాతగారిది కృష్ణా జిల్లా ముదినేపల్లిదగ్గర ఉన్న ఊరని దాన్ని దాసువారి అగ్రహారం అంటారనీ ,దాసువారి గ్రంధాలు నాకు రెండు సెట్లు పంపుతానని ఒకటి నన్ను తీసుకోమని రెండవది ఉయ్యూరు లైబ్రరీకి ఇవ్వమని ,దాసుగారి కుమార్తె కూడా గొప్ప రచయిత్రి అనీ  ఆమె పుస్తకాలు కూడా పంపుతానని,ఇకనుండి నాతో తరచుగా టచ్ లో ఉంటానని అన్నారు చాలా సంతోషమేసింది -దుర్గాప్రసాద్  

—

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -33

45-అవిఘ్న త్తీర్ధం

అవిఘ్న తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి బ్రహ్మ తెలిపాడు .పూర్వం .గౌతమీనది ఉత్తరతీరాన దేవ యజ్ఞం ప్రారంభమై ,విఘ్న దోషం వలన పూర్తి కాలేదు..దేవతలు విచారం తో బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకొన్నారు .బ్రహ్మ ధ్యానంచేసి విఘ్నానికి కారణం విఘ్నేశ్వరుడు అని,కనుక ముందు ఆయనను ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చాడు . వారంతా గౌతమీ నదిలోస్నానం చేసి ,తీరం లో ఆదిదేవుడైన వినాయకుని భక్తితో-

‘’న విఘ్న రాజెన నమోస్తికశ్చిద్దేవో మనో వాంఛిత సంప్రదాతా –నిశ్చిత్య చైత త్రిపురా౦తకో పి తమ్ పూజయామాస వదే పురాణం ‘’

‘’కరోతు సో స్మాకమవిఘ్న మస్మిన్మహా క్రతౌ  సత్వర మా౦బికేయః –ధ్యాతేన యేనాఖిల దేహభాజాం పూర్ణా భవిష్యంతి మనోభి లాషాః’’-అంటే విఘ్నరాజుకు సాటి కోరికలు తీర్చే దేవుడు లేడుఅని భావించి త్రిపురాంత సంహారానికి శివుడు  కూడా పూజించాడు .ఎవరిని ధ్యానిస్తే జీవుల మనోవా౦ఛితాలు , నెరవేరుతాయో ,అలాంటి అంబికా తనయుడు విఘ్నరాజు మా క్రతువు నిర్విఘ్నంగా పూర్తయేట్లు చేయాలి .పార్వతీదేవికి పుత్రుడు పుట్టాడని లోకాలన్నీ మహోత్సవాలు చేసి విఘ్నరాజు అనే పేరు పెట్టాయి .తల్లి ఒడిలో ఆడుకొంటూ ,తల్లి వద్దంటున్నా ,సరదాగా చంద్రుని తండ్రి శివుడి జటలో దాచాడు  .తల్లి పాలన్నీ తానే తాగేస్తూ  తమ్ముడు కార్తికేయుడికి పాలు లేకుండాచేసి పొట్ట పెంచుకొన్నందున తండ్రి లంబోదరుడు అనే పేరు పెట్టాడు .దేవగణాలతో ఉన్నప్పుడు ఒకసారి తండ్రి కొడుకును నృత్యం చేయమనగా ,నూపుర రావం తో నే సంతోష పరచగా తండ్రి గణేశ్వరుడు గా అభిషేకం చేశాడు .చేతిలో విఘ్నపాశం ,భుజం పై కుఠారం ధరించి దేవతలచే పూజింపబడుతూ కూడా తల్లికి కూడా విఘ్నం కలిస్తాడో ,దేవాసురులచేత పూర్వ పూజ్యుడు అంటే మొదట పూజింపబడే వాడు ఐన విఘ్నపతికి సరి లేరు ఎవరూ .’’అని అనేక స్తోత్రాలతో స్తుతించారు .

  గణేశుడు సుప్రసన్నుడై ఇకపై దేవ క్రతువుకు విఘ్నాలు ఉండవన్నాడు .అలాగే నిర్విఘ్నంగా క్రతువు పూర్తయి దేవతలు తృప్తి చెందారు .దేవతలతో గణపతి తన స్తోత్రాన్ని భక్తీ శ్రద్ధలతో పఠించినవారికి .దరిద్రం ,దుఖం కలగదని ,ఆస్థానం లో అలసత్వం లేకుండా స్నాన దానాలు చేసినవారి సకలకార్యాలు సిద్ధిస్తాయని చెప్పగా సురలు సరే అని కృతజ్ఞతలు చెప్పి ,స్వర్గానికి వెళ్ళిపోయారు .ఈ తీర్ధమే అవిఘ్న తీర్ధం .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలలో ప్రత్యేక అతిధి -శ్రీ ”ప్రాస”మణి గారు

పద్యాలలో ప్రాస గురించి మనకు తెలుసు .ప్రసంగం లోనూ ప్రాస తో  మైమరపించే  కావలికి చెందిన  రిటైర్డ్  తెలుగు పండిట్ శ్రీ” ప్రాస” మణి  గారిని సరసభారతి శ్రీ వికారి  ఉగాది  వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇప్పుడే ఆహ్వానించాము . వారు తప్పకవచ్చి పాల్గొని మనలను ప్రాస డోలికలో ఉర్రూత లూగించటానికి వస్తున్నామని అంగీకారం తెలిపారని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్

—

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -32

44-బ్రహ్మ తీర్ధం

భక్తిని ముక్తినీ ఇచ్చే బ్రహ్మ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .రాక్షసులు రసాతలం లో దాక్కున్నప్పుడు మాతృకలు కూడా వెళ్ళగా దేవతలు మాత్రం అక్కడే ఉండిపోయారు .గాడిద ఆకారం కల బ్రహ్మగారి అయిదవ ముఖం అసురులను పారిపోవద్దనీ,  తాను క్షణం లో దేవతలనందర్నీ చంపుతానని అన్నది .సురలు ఒణుకుతూ విష్ణువుకు విన్నవించగా ,ఆయన ‘’నా చక్రం తో  బ్రహ్మ గార్ధభ ముఖాన్ని తెంచి వేయగలను  కాని ఖండి౦పబడిన ఆ శిరస్సు సకల ప్రపంచాన్నీ నాశనం చేస్తుంది .మీకు ఒక విరుగుడు చెబుతా .జాగ్రత్తగా విన౦డి.  శంకరుని శరణు వేడండి’’అని ఉపాయం   చెప్పాడు .

 .బ్రహ్మాది దేవతలు శివునిస్తుతి౦చగా  స౦తసి౦చి ఏమికావాలని అడిగితె,దేవతలు  విషయం వివరించగా ఆయన బ్రహ్మ యొక్క భయంకర గాడిద తలను చేతి గోళ్ళతో తు౦చి వేయగలనని ,  ,కాని దాన్ని ఎక్కడ పడెయ్యాలో ఆలోచించమని అన్నాడు   .భూదేవి తాను  ఆ శిరస్సు భ౦చ లేనని ,అది తనపై పడితే తాను  పాతాళానికి కు౦గి పోతానని చెప్పింది .సముద్రాన్ని అడిగితె   ఆ తల  పడిన తక్షణమేతాను ఎండి పోతానన్నది .గత్యంతరం లేక దేవతలు ‘’ముక్కు కారుతోంది అంటే నువ్వే తుడువు ‘’అన్న చందంగా ఆశిరస్సును శివుడే ధరించాలని కోరారు . ‘’కానుపు చేయటానికి వచ్చినమ్మ ఏది బయటపడినా తానె తీయాల్సి వస్తుంది ‘’అన్నట్లుగా తనకు తప్పదని శివుడు బ్రహ్మ గాడిత తలను గోటితో త్రుంచి ,తానె దాన్ని ధరించి లోకోపకారం చేశాడు .గరళం మింగినాయనకు ఇదో లెక్కా ?.ఇక బ్రహ్మ  గాడిద తల భయం లేదని శివునికి ప్రార్ధనలతో కృతజ్ఞతలు చెప్పి దేవతలు గౌతమీ తీరం చేరి నదినీ శివుని భక్తితో అర్చించారు .అప్పటినుంచి అది బ్రహ్మ తీర్ధంగా ప్రసిద్ధమైంది .దీనికే సూర్య తీర్ధం అనే పేరుకూడా ఉంది .మహా దేవుని చే ఖండి౦ప బడిన బ్రహ్మ  గార్ధభ శిరస్సును అవిముక్త క్షేత్రం లో స్థాపించటంవలన దేవతలకు  హితం  చేకూరింది అనినారడునికి బ్రహ్మ చెప్పాడు .బ్రహ్మ తీర్ధం లో గౌతమీ తీరం లో ఆ  శిరస్సును దర్శించి ,అవిముక్త క్షేత్రం లో ఉంచబడిన బ్రహ్మ కపాలం ను సందర్శిస్తే బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోతుంది .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-19-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -31

43-మాతృ  తీర్ధం

నారదునికి బ్రహ్మ మాతృ తీర్ధ విశేషాలు తెలియజేస్తూ మనోవ్యధలను తీర్చే గొప్ప తీర్ధం అన్నాడు .అనేక దేవదానవ యుద్ధాలలో దేవతలు దాయాదులైన అసురులను జయి౦చ లేకపోయారు .  దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మ కైలాసం వెళ్లి శివ దర్శనం చేసి ‘’విమధ్యవారీ శమన౦గ శత్రో  యదుత్తమం తత్తు దివౌక సేభ్యః –తతశ్చ తుస్టోదాత్వా విషం సంహార నీలకంఠః!కోవా ధర్తుం త్వామృతే వై సమర్దః –తతశ్చ తుస్టోభగవానాది కర్తా  త్రిలోచనః  ‘’మొదలైన స్తోత్రాలతో స్తుతించగా ,సంతోషించి వచ్చినపనేమిటి అని అడిగితె దేవతలు ముక్త క౦ఠం తో’’దానవులవల్ల మా భయం పెరుగుతో౦దేకాని తగ్గటం లేదు దుఖార్తులను కాపాడే బాధ్యత తీసుకొని దైత్య సంహారం చేయి ‘’అని విన్నవించారు .అదే తన తక్షణ కర్తవ్యమని భావించి వెంటనే రాక్షసులున్న చోటికి వెళ్లి యుద్ధం చేశాడు .కానీ జయించటం అసాధ్యమయి అలసిపోయాడు .నొసటి నుండి స్వేదబిందువులు కారుతుండగా ,తామసమూర్తి అవతారమెత్తి దైత్య సంహారం చేయటం ప్రారంభించాడు .ఈ రుద్రావతారానికి భయపడ్డ దేవతలు పారి పోయి మేరు పర్వతం వెనక నుండి వెళ్లి భూదేవి ని ఆశ్రయించారు .

భూమికి దిగి దానవ సంహారం ఆపకుండా చేశాడు రుద్రుడు .రుద్రుని నుంచి చెమట కారి బిందువులుగా భూమి పై పడ్డాయి .ఆ బిందువులు పడిన చోట్లలో శివాకారపు మాతలు’’ ఉద్భవించారు .వాళ్ళంతా రాక్షసులని మింగేస్తామని బయల్దేరారు .రాక్షసులు రసాతాలం లో దాక్కోన్నారని అక్కడికి వెళ్లి చంపమని శివుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.మాతలు భూమిని చీల్చుకొని ,పాతాళం చేరి  దానవులను సంపూర్ణంగా సంహరించారు .మాతల  రాక కోసం దేవతలు గౌతమీ తీరం లో నిరీక్షిస్తున్నారు  .దేవతలు ఎక్కడి నుండి బయల్దేరి మళ్ళీ ఎక్కడికి చేరారో ఈ ప్రదేశం దేవతల స్పర్శతో పునీతమై ప్రతిస్థాపన క్షేత్రమైంది .మాతలుఎక్కడెక్కడ పుట్టారో ,అక్కడ వారి పేరు మీద మాతృ  తీర్ధం గా ప్రసిద్ధమైంది .శివుని పూజించినట్లే మాతృ కలనూ పూజించాలని చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు . మాతృ కలు అక్కడే ఉండి పోయారు .ఈ ఆఖ్యానం విన్నవారికీ ,చదివిన వారికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని బ్రహ్మ నారదమునికి చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-19-ఉయ్యూరు

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -30

42- నాగ తీర్ధం

బ్రహ్మ నాగ తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి వివరిస్తున్నాడు .ప్రతిష్టాపన పురం లో శూర సేనరాజు గుణవంతుడు సోమవంశం వాడు .చాలాకాలం వరకు సంతానం లేదు .పుత్రుడు కావాలని ఆశించాడు కాని ఒక సర్పం పుత్రుడుగా పుట్టింది .ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచాడు .రోజూ ఆపామును చూసి దంపతులు బాధపడేవారు .ఆ పాము మాట్లాడేది .తనకు ఉపనయనం చేయమని కోరింది .సరే అని చెవులు కుట్టించి ఉపనయనం చేసి వేద విద్య నేర్పించాడు .ఒకరోజు తనకు పెళ్లి చేయమని కోరాడు .పాముకు పిల్లనెవరిస్తారనే సందేహం బాధించింది .రాజులు ఏ రకంగానైన పెళ్లి చేసుకోవచ్చు కనుక కన్యను దొంగిలించి అయినా పెళ్లి చేయమని లేకపోతే గంగలో దూకి చస్తానని చెప్పింది ఆ సర్పపుత్రరత్నం . మంత్రులతో ఆలోచించి తనకొడుకు గొప్ప వీరుడని విద్యా వేత్త అని మాత్రమె చెప్పాడు కాని అసలు రహస్యం చెప్పలేదు .మంచి కన్యను చూడమని మాత్రం బలవంత పెట్టాడు .

ఒక ముసలి మంత్రి మాత్రం పూర్వ దేశం లో విజయుడు అనే రాజు ఉన్నాడని ,అతడికి ఎనిమిది మంది పుత్రులున్నారని ,భోగవతి అనేగుణశ్రే స్టురాలైన   కూతురు ఉందని  ,ఆమె తగినదని చెప్పాడు .ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయమని ఆ మంత్రికి ధనకనక వస్తు వాహనాలిచ్చి ఆపిల్ల తండ్రి వద్దకు పంపాడు .ఉబ్బిపోయిన విజయ రాజు కూతుర్నిస్తానని ఒప్పుకొన్నాడు .మళ్ళీ రాజు దగ్గరకు వెళ్లి చెప్పి ఈ సారి మిగిలిన మంత్రులతో వచ్చి విజయుని కట్నకానుకలతో మెప్పించి రాకుమారుడు అక్కడికి రావటానికి ఇష్టపడటం లేదని శస్త్రానికిచ్చి  పెళ్లి చేయవచ్చునని శాస్త్రాలలో ఉందని నచ్చచెప్పి భోగవతీ కన్య వివాహాన్నిఅత్యంత వైభవంగా  జరిపించారు .మామగారు అల్లుడికి తగిన రీతిలో కట్నకానుకలు భారీగా పంపుతూ కుమార్తెను అత్తవారింటికి పంపాడు .

సర్పం తనభార్య తన దగ్గరకు ఎందుకు రావటంలేదని తల్లి దండ్రులను నిత్యం అడిగేవాడు .భోగవతికి తనభర్త సర్పం అని తెలియ జేశారు .ఆమె అధైర్యపడకుండా ,దైవ నిర్ణయమని భావించి భర్త దర్శనం చేయించమని కోరింది .పట్టె మంచం పై పవళించినభర్త  సర్పాన్నిచూసి చేతులు జోడించి తాను  ధన్యురాలుకనుకనే దైవం అయిన పతి లభించాడని చెప్పి ,పక్కపై పాము పక్కన కూర్చుని అనునయిస్తూ సపర్యలు చేసింది .ఆ పాముకు అప్పుడు పూర్వ స్మృతి కలిగి తనను చూసి భయపడనందుకు భార్య ను మెచ్చుకొనగా పతియే దైవం అని పెద్దలమాట తనకు శిరోధార్యం అన్నది .

భార్య మంచితనాన్ని ,పతిభక్తికి మెచ్చి ఆతడు ఆమెస్పర్శ చేత తనకు పూర్వ జన్మజ్ఞానం కలిగిందని ,తాను పూర్వం శివుని చేత శాపి౦ప బడి శివుని చేతికి ఆభరణంగా ఉన్న శేషుని పుత్రుడైన పాముకు తాను  భర్త అని ,పూర్వం భోగవతి తనభార్య అనీ , ఏకాంతం  లో  శివపార్వతులు  ఉండగా శివుడు ఒకరోజు పార్వతి మాటలకు పగలబడి నవ్వాడనీ, అప్పుడు తాను కూడా నవ్వానని ,శివుడు కోపించి ‘’మానవ గర్భం లో జ్ఞానం కల పాముగా పుడతావని  శపించాడని’’ చెప్పాడు  తానూ పశ్చాత్తాపంతో శంకరుని ప్రార్ధించగా గౌతమీనదిలో స్నాని౦చి తన్ను పూజిస్తే జ్ఞానం కలిగి భోగవతి అనుగ్రహం తో శాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడని ఆమెకు తెలియ జేశాడు .

భర్తను వెంటబెట్టుకొని భోగవతి గౌతమీ నదిలో స్నానం చేయించి శివ పూజచేయించింది .ప్రసన్న శివుడు వారికి దివ్యరూపం ప్రసాదించాడు .భార్యతో కైలాసానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అతని తలిదండ్రులు అతన్ని వారించగా భార్యతో నాగరాజు ఆరాజ్యాన్ని పాలించి  సంతానం పొంది ,గౌతమీ తీరం లో శివలింగ ప్రతిష్టచేసి నిత్యం అర్చించి చివరికి భార్యతో శివ పురి చేరాడు  .అదే నాగతీర్ధం గా ప్రసిద్ధి చెందింది .

సశేషం

అఘం అంటే పాపం .దాన్ని పోగొట్టే మాసం మాఘమాసం కనుక మళ్ళీ గౌతమీ మాహాత్మ్యం ఈ రోజు నుంచి కొనసాగిస్తున్నాను

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు

 

—



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మార్గశిరం లో హరి-హర కైంకర్యం

మార్గశిరం లో హరి-హర  కైంకర్యం

మధురకవి శ్రీమతిముదిగొండ  సీతారామమ్మగారు మదినిండా భక్తి నింపుకున్న విదుషీమణి .వినయం ఆమె ఆభరణం .ఆమె తలిస్తే ,పిలిస్తే పద్యం వరదలై ప్రవహిస్తుంది .అతి సహజ సుందర పదాలతో క్లిస్ట విషయాన్ని సైతం సుందర పద్యంగా చెక్కగల నైపుణ్యమున్నవారు .ఇప్పటికే చాలా పద్య కావ్యాలు రాసి ప్రచురించిన అనుభవమున్నవారు .ఈ మార్గ శిరమాసం లో ఆమె దృష్టి గోదాదేవి ‘’తిరుప్పావై ‘’పాశురాలపై ,మాణిక్కవచకర్’’ తిరు వె౦బావై’’పడి, ఆ మాసంలోనే రెండిటినీ తన స్వంత బాణీలో సీసపద్యాలలోకి అనువదించి అటు ‘’ఆ౦డాళ్ళు’’ లాగా, ఇటు’’ శివబాల’’ లాగా తన భక్తిప్రపత్తులను చాటి, తానూ ఆ వ్రతాలలో అక్షర అర్చనతో భాగస్వామి అయి ధన్యమయ్యారు .అంటే హరిహరాద్వైతం సాధించారన్నమాట .తెలుగు సాహితీ లోకానికి వాటిలోని ఉదాత్తభావనలను సరళ సుందరంగా అందించి మన్ననలు అందుకొన్నారు .

              తిరుప్పావై

  తిరుప్పావై గురించి తెలుగునాట ఈ నాడు తెలియని వారు లేరు .ప్రతి వైష్ణవాలయం లో ధనుర్మాసం లో తిరుప్పావై గానం ,వాటిపై ప్రవచనం సర్వ సాధారణమే .అందులో శరణాగతి అందరినీ తన్మయులను చేస్తుంది .పేరుకు ‘’మేలి నోము ‘’కాని ,అంతరార్ధం చాలా వేదా౦త విషయ సమగ్రం .ముక్తికి మార్గం .సామీప్య సారూప్య సాయుజ్యానికి దగ్గరి దారి .శ్రీ కృష్ణావతారం లో శ్రీకృష్ణ పరమాత్మ అతిమానుష చేష్టలు ,సౌందర్యానికి వశులైన గోపకన్యలు ధూర్త గోపాలునిపై మనసు పారేసుకొని సర్వ సమర్పణ బుద్ధితో ఉంటె ,గోప వృద్ధులు ,తమ ఇంటి కన్యకలను వేణుమాధవునికి కనిపించకుండా నేల భోషాణం లో దాచారు .దీనివలన ప్రకృతి కన్నెర్ర జేయగా ,వర్షాభావం ఏర్పడింది .దీనికి పరిష్కారంగా వృద్ధులు రాజీపడి గోపకన్యలు వర్షం కోసం శ్రీ కృష్ణుని గురించి వ్రతం చేయమని ,వారికి , కృష్ణుడిచెప్పి  ఉభయుల అంగీకారం తో ఆయనకు వీరిని అప్పగించి వెళ్ళారు..ఇక ఆలస్యంచేయరాదని ఆ రాత్రిని కొనియాడి ,అర్ధ రాత్రి నోముకై స్నానం చేయటానికి తనను లేపమని ఆనతిచ్చి ,తాను’’నప్పిన్న పిరాట్టి ‘’అయిన నీళా దేవి గృహ ప్రవేశం చేశాడుకొంటె కిట్టయ్య .  .ఆయన చెప్పినట్లే శ్రీ కృష్ణ గుణ చేస్టితులైన గోపకన్యలు స్మరణానందం తో  నిద్రరాక ,లేచీ లేవక ,లేవనివారిని మేల్కొలపటానికి నందగోపుని ఇంటికి వెళ్లి ,శ్రీ కృష్ణుని మేల్కొల్పి ,తమ ప్రార్ధనలు విన్నవించి నోము అనే పేర భగవత్ సంశ్లేషానందం పొందినట్లు గోదాదేవి పారవశ్యం తో రాసిన పాశురాలు ఇవి .అన్నిటికీ భావ గంభీరంగా పద్యాలలోకి మధుమదురంగా మలచి తమ ‘’మధురకవి ‘’బిరుదు సార్ధకం చేసుకొన్నారు ‘’సరసభారతి ఆస్థాన కవయిత్రి’’ శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు .

                      తిరు వె౦బావై

   9వశతాబ్ది శైవకవి మాణిక్క వచకర్ పాండ్య రాజు రెండవ వరగుణ వర్మ మంత్రి .అనునిత్యం శివభక్తి తన్మయత్వం లో తేలియాడే వాడు .గొప్ప కావ్యాలు రాశాడు .కాని ఆయనపేరు 63నాయనార్ల పేర్లలో చేరకపోవటం ఆశ్చర్యం .తమిళనాడులోని మదురై జిల్లా వైగై నదీ(విశ్వనాథ వారి ‘’ఏక వీర’’నవల  కథ జరిగిన చోటు)  తీరం వాధవూర్ లో  జన్మించి,శివాలయం పూజారిగా జీవిస్తూ ,రాజు విశ్వాసం పొందాడు .అతనిలోని సైనిక పటుత్వం గమనించి రాజు ,తన సైన్యం కోసం మేలు జాతి గుర్రాలను కొనమని చాలాడబ్బు ఇచ్చాడు.సరే నని బయలేరి వస్తూంటే దారిలో శివుడే ఒక శివముని  రూపం లో కనిపించి,ఆత్మజ్ఞానం కలిగించగా  రాజు ఇచ్చిన ధనం తో ‘’తిరు పెరునత్తురై  ‘’లో గొప్ప శివాలయం నిర్మించి ,మన భక్త రామ దాసు అనిపించాడు .రాజునూ శివ భక్త శిఖామణిగా మార్చి ముక్తి పొందేట్లు చేసిన పరమ శివభక్తుడు మాణిక్య వచకర్ .ఈయన దేహం చాలించినప్పుడు ఆయన ఆత్మ దివ్యజ్యోతిగా మారి, పరమజ్యోతిలో కలిసి ,ఆయన శవం కనిపించకుండా పోయిందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు .  చిదంబరం లో శ్రీ లంక బౌద్దులతో వాదం చేసి ఓడించిన ప్రతిభ ఆయనది .ఆయన ఆరాధనోత్సవం తమిళనాడు అంతటా జూన్ –జులై లో వచ్చే ‘’ఆణి’’నాడు ఘనంగా నిర్వహిస్తారు .

  ఆయన రాసిన 20 పాశురాల ‘’తిరువె౦బావై ‘’తానేఒక మహిళగా భావించి ‘’పావై నొ౦బు’’ను అనుసరిస్తూ పరమ శివుని కీర్తిస్తాడు .ఆయన విగ్రహం ఆంద్ర ప్రదేశ్ ఆర్కేలాజికల్ మ్యూజియం లో త్రిభంగ భంగిమలో ఒక చేతిలోఓం నమః శివాయ అని రాయబడిన  తాళపత్రం తో ఉన్నది .కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి మాణిక్య వచకర్ గురించి ,తిరువె౦బావై ఘనత గురించి తరచుగా చెప్పేవారు .ఇందులోని 9వ పాశురం కావ్యానికి ఆత్మ,ఫలశృతిగా ఉందని సీతారామమ్మగారు చెప్పిన మాటలు యదార్ధం –ఒక సారి ఆపద్య వైభోగం చూద్దాం –

‘’చిన్మయ రూపుడాచిత్త చిదంబర –నటరాజ గిరివాస నందివాహ –కామేశ్వరీ పతి ,కామ సంహారుడా –కనికరించుము స్వామి కరుణ చూపు —-

‘’భస్మధారుల కిల భవబంధ వితతి –త్రెంపి బాస టగుడదువయ్య దీనబంధు –మార్గ శిర మాస తానముల్ మార్గ మిచ్చు –శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’

  ఈపద్యం శ్రీనాధుని భీమఖండం లోని ‘’చంద్ర బింబానన -,చంద్ర రేఖా మౌళి, నీలకుంతల ఫాల, నీల గళుడు ‘’పద్యాన్ని స్ఫురణకు తెచ్చింది .

  ఈ పాశురాలలో  ‘’ శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’మకుటం ‘’మకుటాయమానం’’గా ఉన్నది .పద్యాలు జలపాత సౌరుతో మానసిక విందు కూర్చింది .పూర్వం మన మగువలు చదివే ‘’ఆధ్యాత్మ రామాయణ  కీర్తన ‘’ల తన్మయత్వం కలిగిస్తుంది.అలా పాడుకోవటానికి అనువుగా కూడా  ఉన్నది . .అవును .తనువూ మనసు భగవంకితమైనప్పుడు వచ్చే శబ్దం ,అర్ధం అత్యంత ఉన్నతంగా నే ఉంటాయి .

   ఇలా శివ- కేశవుల అభేదాన్ని భక్తిభావ బంధురంగా రెండు రకాల పాశుర పద్యాలలో నిబద్ద౦  చేసి  తమ కలం కత్తికి రెండు వైపులా సునిశిత ’’ ధార’’ ఉందని నిరూపించారు శ్రీమతి సీతారామమ్మగారు .అభిన౦దనలు .

          గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో  సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న  రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .

  ఈ వేడుకలలో1- ‘’స్త్రీ శక్తి ‘’అనే అంశం పై జిల్లాలోని  ప్రముఖ కవి మిత్రుల చేత ‘’కవి సమ్మేళనం నిర్వహింపబడుతుంది

 2-,కొందరు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ,

3-స్వయం శక్తితో ఎదిగిన వారికి ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాలు అంద జేయబడుతాయి

4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,సరసభారతి ప్రచురించిన మూడు పుస్తకాలు 1-117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )‘’ 2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి  ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )ఆవిష్కరణ జరుగుతుంది .

  కార్యక్రమ౦లో పాల్గొను అతిధులు-1-శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు 2-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్  -విజయవాడ , శ్రీ 3-జి.వెంకటేశ్వరావు – సి .ఇ.ఒ-కెసీపి  4-శ్రీ పులి శ్రీనివాసరావు-రోటరీక్లబ్ అధ్యక్షులు –5 శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు 6-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి, రమ్యభారతి సంపాదకులు,7-శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ ) 8–డా ఉప్పలధడియం వెంకటేశ్వర –తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై 9-శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్ 10-శ్రీ కొల్లూరి రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు 11-శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు 12-శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక  సేవా కర్త  –హైదరాబాద్ -13కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ 14- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు-రిటైర్డ్ తెలుగు జూనియర్ లెక్చరర్ – కాకినాడ 15-డా.కోనేరు లక్ష్మీ ప్రమీల మొదలగువారు

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే ఆయుర్వేదం పై ఒరిజినల్ గ్రంథం.శబ్ద చంద్రిక,ద్రవ్యగుణ సంగ్రహ ,చికిత్సాసార లేక గూఢ వాక్య బోధక ,సర్వ సార సంగ్రహ ఇతర రచనలు .చరక సుశ్రుతుల గ్రంథాలపై వరుసగా ఆయుర్వేద దీపిక ,భానుమతి అనే వ్యాఖ్యానాలు రాశాడు .

400-చంద్ర వ్యాకరణ కర్త -చంద్ర గోమిన్ (7వ శతాబ్ది )

7వ శతాబ్ది బెంగాల్ కవి చంద్ర గోమిన్ చంద్ర వ్యాకరణం రాశాడు .లోకానంద అనే నాటకం ,న్యాయ సిద్ధ్యాలోకం ,ఆర్య తారాదేవి స్తోత్ర మౌక్తికమాల ,కూడా ఇతని రచనలే .

401 –నిబంధ సంగ్రహ కర్త –దల్లాన (13వ శతాబ్ది )

దళ్బన ,దళ్హన అని కూడా పేర్లున్న దల్లాన 13వ శతాబ్ది ప్రముఖ వ్యాఖ్యాత .సూత్ర సంహితకు అమోఘమైన ‘’నిబంధ సంగ్రహ ‘’వ్యాఖ్యానం రాశాడు .అంకోల కు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి భరుపాల .

402-కుట్టానిమత కర్త –దామోదరగుప్త (8-9శతాబ్దం )

కామ కళాకేళీ గ్రంథమైన ‘’కుట్టాని మత ‘’ రాసినవాడు దామోదరగుప్త .క్రీ.శ.779-813కాలం కాశ్మీర రాజు జయాపీడుని మంత్రి అని కల్హణుడు రాజతరంగణిలో చెప్పాడు .

403-అవలోక వ్యాఖ్యాన కర్త –ధనిక (10వ శతాబ్దం )

ధను౦జయుని దశరూపకం పై ‘’అవలోక ‘’వ్యాఖ్యానం రాసిన ధనిక కవి  విష్ణు కుమారుడు. .10వ శతాబ్ది ఉత్పల దేవ రాజు  మంత్రి .కావ్య నిర్ణయం కూడా ఇతని రచనే అంటారు .ధనుంజయుని సోదరుడు అని కొందరంటారు .మరికొందరు ధనిక యే ధనుంజయుడు అన్నారు .

405-వాదగ్ధ ముఖ మండన కర్త –ధర్మ దాససూరి (13వ శతాబ్ది )

13వ శతాబ్దికి  చెందిన బౌద్ధకవి ధర్మ దాస సూరి .వాదగ్ధ ముఖ మండన అనే  ఛందో గ్రంథం  రాశాడు

406-పవన దూత కర్త –ధోయి (12-13శతాబ్ది )

12లేక 13వ శతాబ్ది బెంగాల్ రాజు లక్ష్మణ సేన ఆస్థానకవి ధోయి.ఇతనికే ధోయికా అనే పేరుకూడా ఉంది .బ్రాహ్మణుడని ,వైద్యుడని కొందరు అంటే చేనేత వాడని కొందరన్నారు .పవన దూత కావ్యం రాశాడని సదుక్తి కర్ణామృతం ,సుభాషిత ముక్తావళి ,సారంగధర పద్ధతిలో చెప్పబడినా అందులోని శ్లోకాలు అలభ్యం .

407-రసేంద్ర  చింతామణి కర్త –ధుందూక దత్త (15వ శతాబ్ది )

15వ శతాబ్దికి చెందిన ధుందూక దత్త ఆయుర్వేద వ్యాఖ్యానం ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు

408-చందోమంజరి కర్త –గంగాదాస (12వ శతాబ్ది )

12వ శతాబ్దికి చెందిన ఒరిస్సా కవి గంగాదాస చందోమంజరి అనే అలంకార గ్రంథంరచించాడు వైద్యగోపాలదాస ,సంతోష కుమారుడను అని కవే చెప్పుకొన్నాడు .తాను అచ్యుత చరిత ,కంసారి శతకం ,దినేశ శతకం కూడా రాశానని చెప్పాడు .

409-ఘట కర్పర కావ్య కర్త –ఘట కర్పర (105 బి.సి.)

క్రీపూ 105కు చెందిన విక్రమాదిత్య మహారాజు ఆస్థాన కవులైన నవరత్న కవులలో ఘట కర్పర ఒకరు.ఘటకర్పర అనే కావ్యం రాశాడు .ఇది 22శ్లోకాల సందేశ కావ్యం కొత్తగా  పెళ్ళైనవాడు భార్యకు పంపిన సందేశమే ఇతి వృత్తం .యమకాలతో కావ్యమంతా నింపేశాడు .

410-హరిభక్తి విలాస కావ్యకర్త –గోపాల భట్ట (1503-1578)

బెంగాల్ లోప్రముఖ  వైష్ణవ మత ప్రచారకులైన ఆరుగురు బృందావన గోస్వాములలో ఒకరైన గోపాలభట్ట బెంగాల్ కుచెందినవాడు .1503లో జన్మించి 75ఏళ్ళు జీవించి 1578లో మరణించాడు ,చైతన్య స్వామి శిష్యుడు .హరిభక్తివిలాసం  అనే ప్రముఖ రచన చేశాడు దీనిలో వైష్ణవులు  సామాజిక మత ధర్మాలను ఎలా నిర్వహించాలోసాధికారంగా రచించాడు వారికి ఇది కరదీపిక .సత్క్రియా సార దీపిక కూడా ఈయన రచనే అని అంటారు  .

మనవి – ఇప్పటివరకు నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ౦   మూడు భాగాలలో 146+482+462=1090మంది సంస్కృత కవుల గురించి రాశాను .అంతర్జాలం లో రాస్తున్న ఈ నాలుగవ భాగం లో ఇప్పటికి 410మంది గీర్వాణ కవుల పై రాశాను .అంటే మొత్తం 1500మంది గీర్వాణ కవులపై రాసే అదృష్టం దక్కింది .కానీ ఇంకా చాలామంది ఉన్నారు .కనుక ప్రస్తుతం గీర్వాణం-4 కు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,మళ్ళీ వీలువెంట రాసేఅవకాశం తీసుకొంటానని సాహితీ బంధువులకు సవినయంగా తెలియ జేస్తున్నాను .

సశేషం

రేపు ప్రారంభమయ్యే  పవిత్ర మాఘమాసం  శుభాకాంక్షలు

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

—



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం  5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః 7-డిస్క్రిప్టివ్ కేటలాగ్ ఆఫ్ తమిల్ మాన్యు స్క్రిప్ట్స్ 8-ది మెసేజ్ ఆఫ్ సెయింట్ తయామన్వార్  .

398-అర్వాచీన సంస్కృతం కర్త –రమాకాంత శుక్లా (1940)

1940లో ఉత్తరప్రదేశ్ ఖుర్జా లో జన్మించిన రమాకాంత శుక్లా తలిదంద్రులు సాహిత్యాచార్య పండిత బ్రహ్మానంద  శుక్లా శ్రీమతి ప్రియంవద శుక్లా లనుంచి  సంస్కృతం నేర్చాడు .సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగ  ఆచార్య డిగ్రీలు పొంది ,ఆగ్రా యూని వర్సిటిలో చేరి హిందీ ఎం.ఏ.గోల్డ్ మెడల్ తో  పాసై ,సంపూర్ణానంద యూనివర్సిటి నుంచి సంస్కృత ఎం.ఏ.పొందాడు .జైనా చార్య రవి సేన రచించిన పద్మపురాణం -తులసీ దాసు రాసిన రామచరిత మానసం ల తులనాత్మక పరిశోధన చేసి 1967లో పిహెచ్ డి సాధించాడు .

  మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి  కాలేజి లో 1962లో హిందీ లెక్చరర్ గా చేరి ,తర్వాత  ఢిల్లీ యూనివర్సిటిలోని రాజధాని కాలేజి లో హిందీ ఫాకల్టి  మెంబరయ్యాడు  .1986లో రీడర్ అయి ,2006లో రిటైరయ్యాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా చాలా సెమినార్ లకు  కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .’’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ ఈస్తెటిక్స్ అండ్ పోయెట్రి ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కు అధ్యక్షత వహించాడు .’’అర్వాచీన సంస్కృతం ‘’అనే త్రైమాస పత్రిఅకు ముఖ్య స౦పాదకుడు గా ఉన్నాడు.ఈ పత్రిక ఆయనే ఢిల్లీ లో స్థాపించిన ‘’దేవవాణి’’పరిషత్ ఆధ్వర్యం లో వెలువడేది .రేడియోలో సర్వభాషా కవిసమ్మేళన లో సంస్కృత కవిగా పాల్గొన్నాడు .

  దూర దర్శన్ ప్రసారం చేసిన ‘’భాటీ మే భారతం ‘’అనే సంస్కృత సీరియల్ రాశాడు శుక్లా ఆయన జీవితం సంస్కృత సేవ పై  ‘’దేవవాణి సుయశః ‘’అనే ప్రత్యేకక సంచిక వెలువడింది . అర్వాచీన సంస్కృతం ,సారస్వత సంగమ౦,భారత జ్ఞానతాహం అనే రచనలు చేశాడు .ప్రస్తుతం ఢిల్లీ లోని రాష్ట్రీయ  సంస్కృత సంస్థాన్ ‘’లో ‘’శాస్త్ర చూడామణి విద్వాన్ ‘’గా సేవలందిస్తున్నాడు .

   శుక్లా సంస్కృత ,హిందీ భాషా పాండిత్యం కు తగిన సంస్కృత రాష్ట్ర (జాతీయ )కవి ,కవి రత్న ,కవి శిరోమణి ,హిందీ –సంస్కృత సేతు బిరుదులు  పొందాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ అందుకొన్నాడు .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారం అందజేసింది .ఢిల్లీ సంస్కృత అకాడెమి  ‘’అఖిల భారతీయ మౌలిక సంస్కృత రచనా పురస్కారం ‘’అందించి గౌరవించి సత్కరించింది .2009లో భారత రాష్ట్ర పతి’’సంస్కృత విద్వాంస ‘’పురస్కారం ఇచ్చారు .2013 భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .’’ భారతీయ ప్రకార సంఘం ‘’కు శుక్లా వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో శుక్లా రచించిన ‘’మమ జనని ‘’పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది .

image.png

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

 కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన  డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ డిఅందుకొన్నారు .శ్రీ ఆంజనేయ శతకం ,శ్రీ గాయత్రి మాతృ ద్విశతి ,దేశభాష లందు తెలుగు లెస్స సంకలనం తో సాహితీలోకం లో  సుప్రసిద్ధులు .ఇప్పుడు తాజాగా2018 డిసెంబర్ లో  ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’వచన రచన చేసి ఆ మాతపై తమకున్న భక్తిప్రపత్తులను చాటుకొని ,.చాలాకాలంగా సాహితీ మిత్రులైన శాస్త్రి గారు నాకు సుమారు 20 రోజులక్రితం దానిని పంపారు .చదవటానికి ఇప్పటికి కుదిరి చదివి ఆనందించాను .వీరి జ్ఞాన సంపత్తికి డా .రామడుకు వేంకటేశ్వర శర్మగారు ‘’జ్ఞానాభి షేకం ‘’చేస్తే ,మహాకవి శేఖరులు శ్రీ భారత శ్రీమన్నారాయణ ‘’చిదంబర ప్రశస్తి ‘’చేసి చిదంబర విజ్ఞాన రహస్యం బయట పెట్టారు .శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు అభినందన కంఠహారం-గ్రైవేయకం సమర్పించారు .స్మార్త క్రమాంత విశిష్ట స్వాధ్యాయి శ్రీ జగర్ల పూడి వీరభద్ర శర్మ ‘’జ్ఞాన యజ్ఞం ‘’గా శాస్త్రి గారి కృషిని అభివర్ణించారు .శాస్త్రి గారు’’ ఒక్క మాట ‘’లో సూర్యుడున్న చోట చీకటి ఉండనట్లే సనాతన ధర్మమున్న చోట దుఖ౦ ఉండదని  ,బ్రహ్మ సమానమైన దేవుడు ,బ్రహ్మ సమానమైన గురువు , బ్రహ్మ సమానమైన తపం లేదని భావిష్యపురాణ౦ చెప్పిందనీ కనుక గాయత్రీ మంత్రం బ్రహ్మ సమానమైనదని చెప్పారు .ఇప్పుడు గ్రంథంలోని కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుంచుతున్నాను .

  ‘’సూర్యుడు ,నక్షత్రాలు లేని ఆహోరాత్రాలమధ్య సందికాలాన్ని సంధ్య అంటారు ఇదికాలవాచకమే అయినా ,ఉపాస్య దేవత గా ఆరాధించాలి .అని చెప్పి గాయత్రి ఆవిర్భావ కథ తెలిపి ,’’యా వసేత్ ప్రాణి జిహ్వాసు సదా వాగుపవర్తనాత్-సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాతా మహర్షి భిః’’అంటే జీవరాసులలో వాక్కు ఉన్నవారి నాలుక కొనపై నర్తించేది సరస్వతి అని ఋషులు చెప్పారని తెలియజేశారు .తర్వాత గాయత్రి విశిష్టతను చెబుతూ ముక్తినిచ్చే 6 గయలలో గాయత్రి కూడా ఒకటన్నారు .పరమేశ్వరుని ముఖం నుండి వెలువడిన మొదటి ఛందస్సు గాయత్రి .గానం చేస్తే రక్షించేదీ,గయ అనబడే ప్రాణాల్ని కాపాడేదీ,ఆరాధిస్తే మనస్సుకు ప్రశా౦తినిచ్చేదీ గాయత్రి అన్నారు .ఋగ్వేద ,అధర్వ వేద ,శతపథ బ్రాహ్మణ ,సూత సంహిత ,బృహదారణ్య  ఛాందోగ్య  నారాయణ ,నృసింహ పూర్వతాపి ,మైత్రాయణి, ఉపనిషత్ లలో నిర్వచి౦ప బడిన గాయత్రిని బహు శ్రమ కోర్చి వెలికి తీసి ముందుంచారు .బృహద్యోగి యాజ్ఞవల్క్యం ,విశ్వామిత్ర స్మృతి ,మను స్మృతి,స౦వర్త  ,యాజ్ఞవల్క్య ,హరీత, పరాశర,శంఖ ,స్మృతులలో ఉన్నగాయత్రినీ ,పద్మ ,కూర్మ అగ్ని ,మత్స్య,భవిష్య ,నారద పురాణాలలో  చెప్పబడిన గాయత్రిని ,సంధ్యా భాష్యం,మహాభారతం భగవద్గీత ,భాగవత గాయత్రినీ వివారించారు .శ్రీ వాసా సూర్యనారాయణ ,శ్రీ శేషావతారం గార్లు  చేసిన గాయత్రీ స్తుతి ,శ్రీనాథుని కాశీఖండ గాయత్రి ని వివరించి ,బ్రాహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారు శ్రీనాథుని  సీసానికి చెప్పిన వివరణ ఇచ్చారు –‘’గాయత్రీ దేవికి మూడు వేదాలు మూడుపాదాలు,భూమి ఆకాశం నాలుగు దిక్కులు కలిసి ఆరు కుక్షులు ,సమస్త భవనం శరీరం ,స్వర్గమే పొట్ట ,ధర్మశాస్త్రం హృదయకోశం .ఛందస్సమితి స్తనద్వయం .ఈశ్వర నిరీశ్వర సాంఖ్యాలు రెండూ రెండు చెవులు .అగ్ని ముఖం .శిక్షా, వ్యాకరణ, నిరుక్త,జ్యోతిష ,కల్పాలు అయిదూ అయిదు తలలు  ,అధర్వణ వేదం చేస్ట,శిఖ శివుడు.  బ్రహ్మ శిరస్సు .విష్ణువు ఆత్మ ,.భావ లక్షణం తటస్థ లక్షణం .  పూర్వ మీమాంస స్థూల శరీరం ,వేదాంత శాస్త్రం సూక్ష్మ శరీరం .

   ఇలామనకు తెలిసినా, తెలీని అనేక విషయాలు తరచి రాసిన పుస్తకం .తర్వాత గాయత్రీ మంత్రాని శబ్దగత అర్ధం మంత్రాధి దేవతలు ,మంత్రాక్షర వర్ణాలు ,ఛందస్సులు బీజాక్షరాలు  ,తత్వాలు ,ఋషులు , కళలు ,,దేవీశక్తులు ,మంత్రాక్షర అవతారాలు ,సత్ ప్రవృత్తులు ,సిద్ధులు ,విద్యలు ,మాతృకలు ,కూడా సవివరంగా తెలిపారు .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలకు 24 స్త్రీ ,పురుష దైవీ శక్తులున్నాయని వాటినీ వివరించారు .గాయత్రీ మంత్ర జపాన్ని  పది సార్లు ,28సార్లు ,108సార్లు ,వెయ్యిన్నూట ఎనిమిది సార్లు శక్తి ననుసరించి చేయాలి .

   పిమ్మట గాయత్రి మంత్ర హోమ విధానం ,గాయత్రీ మంత్ర మహిమ తెలిపే వృత్తాంత గాధలు చెప్పి గాయత్రీ మాహాత్మ్యాన్ని గురించి వేదవ్యాసుని దగ్గరనుంచి ,మహర్షులు ,జగద్గురు శంకరాచార్య ,రమణమహర్షి ,స్వామి శివానంద ,రామకృష్ణ పరమహంస ,స్వామి వివేకానంద ,అరవి౦దయోగి, గాంధీజీ ,  రవీంద్ర, తిలక్ ,మాలవ్యా దయానంద సరస్వతి,సర్ మోనియర్ విలియం దాకా ప్రస్తుతి౦చిన విషయాలు చెప్పి  చివరికి ఫలశ్రుతి చెబుతూ గాయత్రీ మంత్ర జపం చేసిన చోట అగ్ని జల,వాయు  పిశాచ సర్ప  భయం ఉండదని భరోసా తో ముగించారు .

  ఒక రకంగా డా సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారి ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’ఆల్ ఇన్ వన్ లేక ‘’గాయత్రీ విజ్ఞాన సర్వస్వం ‘’అని  ఢంకాపథంగా చెప్పవచ్చు .దీన్ని వారి గురు పాదులు స్వర్గీయ బ్రహ్మశ్రీ భాగవతుల సంజీవ శాస్త్రి గారికి అ౦కితమివ్వటం శాస్త్రిగారి గురుభక్తికి తార్కాణ.ఇంత విలువైన గ్రంథాన్నికీ.శే.శ్రీమతివేముల రాజ్యలక్ష్మి ,శ్రీ రాఘవరావు దంపతుల స్మృత్యర్ధం వారికుమారులు  ,కోడళ్ళు కీ.శే .వేముల సాంబశివరావు శ్రీమతి పద్మావతి దంపతులు ,శ్రీ వేముల నగేష్ ,శ్రీమతి స్వాతి దంపతులు ఆర్దికసాయమందించి ప్రచురించినందుకు అభినందనలు  .కీర్తి శేషులను అక్షరాలతో నిజంగా కీర్తి శేషుల్ని చేశారు .శ్రీ గాయత్రి మాత ఆ కుటుంబాలకు సర్వదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను  

     ‘’చిదంబర రహస్యం’’గా ఉన్న గాయత్రీ మాహాత్మ్యాన్ని శ్రీ చిదంబర శాస్త్రి గారు కరతలామలకం చేసినందుకు అభినదిస్తూ మరిన్ని ఆర్ష విద్యా గ్రంథాలు వారి నుండి వెలువడాలని ఆశిస్తున్నాను .

   ‘’త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీచ సరస్వతీ –బ్రాహ్మీచ వైష్ణవీ రౌద్రీ రక్తాశ్వేతా సితే తరా’’

‘’కమలా విష్ణు లోకే చ , గాయత్రీ బ్రహ్మలోక దా-రుద్ర లోక స్థితా గౌరీ హరార్ధాంగ నివాసినీ ‘’

గాయత్రీం చి౦తయేద్యస్తు హృత్పద్మేసముపస్థితం –ధర్మా ధర్మ వినిర్ముక్తః తయాతి పరమా౦  గతిం ‘’

‘’కర కమలంబుల యందున –వర వేద కమండలములు భాసిలు చుండన్ –శిరమున ఖండేందునితో –వరలెడి గాయత్రి !నీకు వందన శతముల్ ‘’

సుందరమైన ముఖ చిత్రాలతో ,పాల నురగవంటి తెల్లకాగితాలపై  207పేజీల అత్యంత విలువైన సమాచారం తో ఉన్న   ఈ గ్రంథాన్ని పొందటానికి మూల్యం –కేవలం శ్రీ గాయత్రీ ధ్యానమే .అంటే ఉచితంగా పొందవచ్చు .కావలసినవారు శాస్త్రి గారి ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి –

 డా.సర్వా సీతారామ చిదంబర శాస్త్రి –అక్షర భారతి కాన్సెప్ట్ స్కూల్ –పాత కోర్టు భవనం –వినాయకుడి గుడి దగ్గర –జగ్గయ్య పేట 521175 –కృష్ణా జిల్లా

సెల్ –9885383741

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు .

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు  .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా చేరి 1983-2014వరకు పని చేసి ,2008-2013లో ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా పని చేసి ,సిమ్లాలోని ఇండియన్  ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్   అడ్వాన్స్ డ్ స్టడి ఫెలో అయ్యాడు .త్రిపాఠీ అభిమాన విషయాలు నాట్య శాస్త్రం ,సాహిత్య శాస్త్రం .

38 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యు ఏట్ క్లాసులు బోధించిన ,25ఏళ్ళు పిజి యూనివర్సిటి   సంస్కృత డిపార్ట్ మెంట్  హెడ్ గా ,6ఏళ్ళు డీన్ గా ,5ఏళ్ళకు పైగా వైస్ చాన్సలర్ ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా మరొక అయిదేళ్లకు పైన పని చేసిన అనుభవం త్రిపాఠీ ది.38ఏళ్ళు రిసెర్చ్ గైడ్ గా 50మందికి పిహెచ్ డిలు రావటానికి తోడ్పడిన మార్గదర్శి .

నాట్య శాస్త్ర   విజ్ఞాన సర్వస్వం 4భాగాలు ప్రచురించిన శేముషీ సంపన్నుడు త్రిపాఠీ.కోల్పోయిన నాట్య శాస్త్ర విషయాలను క్రోడీకరించి మోనోగ్రాఫ్ లు గా ప్రచురించిన ప్రతిభా సంపన్నుడు .సంస్కృత నాటకం ,జానపద నాటకరంగం లపై అనేక ప్రాజెక్ట్ లు నిర్వహించి ప్రచురించిన కళాభిమాని .

త్రిపాఠీ కి ఉన్న అపార అనుభవం వలన ఆయనను ఎన్నో ప్రధాన ప్రసిద్ధ పదవులు వరించాయి .1-డీన్ ఆఫ్ ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ ,2-మద్యప్రదేశ యూని వర్సిటి రిసెర్చ్ జర్నల్ ఎడిటర్ 3-సాగర్ యూనివర్సిటి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ మెంబర్ 4-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ కు చైర్మన్ 5-ఇంటర్నల్ క్వాలిటి అస్స్యూరెన్స్ చైర్మన్ ,6-సంస్కృత పాఠ్య     పుస్తకాల కమిటీ ముఖ్య సలహాదారు 7-కేంద్ర సాహిత్య అకాడెమీ ఎక్సి క్యూటివ్ మెంబర్ 8-N.C.E.R.T. సంస్కృత కర్రిక్యులం చైర్మన్ ,9-అనేక యూని వర్సిటీల ‘’నాక్ ‘’పీర్ టీం చైర్మన్ .

త్రిపాఠీ  విజ్ఞాన  సంపన్నతకు తగిన బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్నాడు

1-సంస్కృత సాహిత్య అవార్డ్ 2-బెస్ట్ రిసెర్చ్ పేపర్ అవార్డ్ 3-రాజ శేఖర అవార్డ్ 4-నాటక రచనకు సాహిత్య కళా పరిషత్ అవార్డ్ 5-బెస్ట్ రిసెర్చ్ పబ్లికేషన్ అవార్డ్ 6-వ్యాస పురస్కారం 7-వి వి .కాణే స్మారక పురస్కారం 8-భోజ పురస్కారం 9-కంబన్ సమ్మాన్ హిందీ అకాడెమి అవార్డ్ 10-వాగీశ్వరి అవార్డ్ 11-కాళిదాస సమ్మాన్  రెండు సార్లు 12-కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ 13-రామ కృష్ణ సంస్కృత పురస్కారం 14-కేకే బిర్లా శంకర్ అవార్డ్ 15-సంస్కృత మహామహోపాధ్యాయ బిరుదు 16-నాట్యాయన సంస్థ చే భవభూతి అవార్డ్ 17-సంస్కృత గౌరవ సమ్మాన్ 18-జాతీయ వేదం వ్యాస పురస్కారం 19-5వమహా కవి  కాళి దాస సంస్కృత జీవన్ వ్రతి అవార్డ్ 20-5వ జయదేవ సరస్వతి అవార్డ్ 21-సంస్కృత శిరోమణి సమ్మాన్ 22-మహా రాష్ట్ర ప్రభుత్వం చేత జీవన్ వ్రతి సంస్కృత సమ్మాన్ 23-పూనా యూని వర్సిటి నుంచి గౌరవ డాక్టరేట్ 24-రాజప్రభ పురస్కార 25-పండితరాజ జగన్నాథ పురస్కార 26-ఆచార్య సుమతీ సాగర్ స్మృతి అవార్డ్ 27-మీరా సమ్మాన్ 28-సమంతర్ సమ్మాన్ 29-అఖిలభారత అంబికా దత్త వ్యాస పురస్కార 30-శ్రీమతి చంద్రావతి జోషి సంస్కృత భాషా పురస్కార్31-నాట్య శాస్త్ర కళానిధి పురస్కారం .

ఈ మహా మహోపాధ్యాయ రచనలపై ఏడుగురు పరిశోధన చేసి గ్రంధాలు వెలువరించి ఆయన కీర్తిని మరింత పెంచారు .

రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా ఉంటూ ఖాళీ పోస్ట్ లను రిక్రూట్ మెంట్ ద్వారాభర్తీ చేశి ,అనేకమందికి ప్రమోషన్లు ఇచ్చి ,సంస్థను ఏ గ్రేడ్ స్థాయి సాధించాడు .ముక్త అధ్యాయ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశ పెట్టి ,23కాంపస్ లు ,23సంస్కృత మహా విద్యాలయాలు స్థాపించాడు .మూడు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు, పది జాతీయ సమావేశాలు  నిర్వహించాడు . అనేక జాతీయ ,అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు సెమినార్ లకు స్పాన్సర్ గా ఉన్నాడు .15 వ అంతర్జాతీయ సమావేశం న్యు ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో2012లో 6రోజులు  జనవరి 6నుంచి 10వరకు  జరిపి ,పారిస్ లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఏర్పాటు చేయించాడు .

లక్నోలో పాళీ భాషకు రిసెర్చ్ సెంటర్ ,జైపూర్ లో ప్రాకృతభాషకు రిసెర్చ్ సెంటర్ ,సంస్కృత పాళీ ,ప్రాకృత భాషల తులనాత్మక అధ్యయనానికి’’ వాజ్మయి ‘’ సెంటర్ ,హిమాచల్ ప్రదేశ్ బలహార్ లో వుమెన్స్ స్టడీ సెంటర్ ,ముంబై లో సెంటర్ ఫర్ వొకేషనల్ స్టడీస్ ,భోపాల్ లో నాట్య శాస్త్రానికి స్టడీస్ సెంటర్ , శృంగేరిలో ఇండీజినస్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు అయ్యాయాయంటే అదంతా డా రాధా వల్లభ త్రిపాఠీ అకుంఠిత దీక్షా ,శ్రమ ఫలితమే .

ఇంతటి విద్యా వినయ సంపన్నుడు ,నిత్య కృషీవలుడు ,నాట్య, సాహిత్య  శేముషీ దురంధరుడు , అయిన డా .రాధా వల్లభ త్రిపాఠీ సాధించిన విజయ పరంపర భారత సంస్కృత క్షేత్రం లో శాశ్వత కీర్తి నార్జించి పెట్టాయి .లాంగ్ లివ్ త్రిపాఠీ.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

—



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు.

అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా మనియర్ విలియంస్ అను మహాశయుడు స్ఫోటసందర్భమున నిట్లు వ్రాసినాడు

” The eternal and imperceptible element of sound or words and the real vehicle of idea which bursts or flashes on the mind when a sound is uttered”.

కక్షీరపర్వతముపై ఓశిజ నామము గల ఒక యోగి నిజగ్రంథమున శబ్దమున కుండెడి అర్ధప్రకాశకశక్తి విశేషమును ప్రపంచించి, దానికి స్ఫోటమని పేరిడినాడు. ఈనుతన నామము వలన అతనికి స్ఫోటాయనుడను పేరు ప్రసిద్ధమయినది. అతడు పాణిని కెంత ముదరివాడో తెలియదు. వ్యాసభగవానునకు తరువాతి వాడు మాత్రము అగును. మహాభారతము న స్ఫోట శబ్దము కనబడదు. కాని వ్యాసభాష్యమున స్ఫోటతాత్పర్యము విహితమగుటచే స్ఫోటాయనుడు వ్యాసుడు తరువాతివాడని చెప్పవచ్చును.

వ్యాసభాష్యము వేదవ్యాస ప్రణీతము (వ్రాయబడిన) కాదనియు, మహాభాష్యప్రవర్తి అనియు చాలమంది అంటారు.

“Yoga system of Patanjali” అను గ్రంథ భూమికలో Haughton Woods, “There is little room to doubt that Varshaganya was an older contemporary of Vasubandhu”. అని వ్రాసినాడు. Professor Takakusu అను జపనీసు విద్వాంసుడు వసుబంధు క్రీ.శ. 5,6శతాబ్దములలోని వాడని నిర్ద్ధారణచేసాడు. కావున వ్యాసభాష్యము 5 వ శతాబ్దానికి ముందులేదని చెప్పవచ్చును.

స్ఫోట వాదము

స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్దేవిని గూర్చిన స్తోత్రాలు ఋగ్వేదంలోనే కనిపిస్తాయి. అయినా వ్యాకరణ సాంప్రదాయం ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్ఫోటాయనమహర్షి. భర్తృహరి, నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు.

నిత్యమైన స్ఫోట, లేక శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. పరా పశ్యంతీదశలలోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప మన సాధరణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం; శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే ‘నాదం’ అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అవాహత చక్రం మధ్యమా వాక్కు నెలవు. ఇది అంతర స్ఫోట. కంఠప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యస్ఫోట.

సర్వదర్శన సంగ్రహంలో పాణినీయదర్శనాన్ని వివరిస్తూ మాధవాచార్యస్వామి అంటాడు: “స్ఫోట అనబడే ఈ శబ్దం విభాగాలులేనిది; నిరవయవం; నిత్యమైంది; జగత్తు పుట్టుకకు కారణమైంది. నిజానికి ఇది బ్రహ్మపదార్ధమే!”. భర్తృహరీ బ్రహ్మకాండలో ఇదేమాట అన్నాడు.

”’ఆకాశం”’ అనగానే ఎత్తుగా నీలంగా, భూమిమీద బోర్లించిన కోళ్ళగంపలాగా కనిపించేదీ, మబ్బులకూ సూర్యచంద్రులకూ ఆధారంగా ఉన్నట్టు అనిపించేదీ మనకు స్ఫురిస్తేనే ఆమాట అర్ధమయినట్టు అనుకుంటున్నాము. ఇలా ఏశబ్దం తీసుకున్నా ఆశబ్దార్ధం వాక్యరూపంగానే మనకు స్ఫురిస్తున్నట్లు తేలుతుంది.

ఒకభాషలోని ఒకమాట ఆభాషతెలిసిన వ్యక్తి మనస్సులో ఒక అర్ధాన్ని, తెలియనివ్యక్తి మనస్సులో మరోఅర్ధాన్ని స్ఫురింపజేయగలదు.ఉదాహరణకి ”’కాఫీ”’ అనేమాట దక్షిణాదివారి మనస్సులో కఫీపానీయాన్ని స్ఫురింపజేస్తే హిందీ మాతృభాషగా గల ఉత్తరాదివారికి చాలు అనే అర్ధాన్ని బోధించవచ్చును.

ఇలాఒకేమాట వేరువేరుభాషల్లో వేరువేరు అర్ధాలని బోధించగల్గినట్లు, మానవులందరిలోనూ స్వతసిద్ధంగా ఒండే స్ఫోట ఏకరూపమే! ఒకేవ్యక్తికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చుననుకోండీ అప్పుడు ”’మనిషి”’ అన్నా man, అన్నా ఆద్మీ అన్నా అతనిమనస్సులో అభివ్యక్తమయ్యే స్ఫోటఏకరూపమే.

దీనినిబట్టి, మానవైంద్రియాదిశక్తులచేత పరిమితమై మానవుడి జననంతోపాటే అతడు గ్రహించదగిన జ్ఞానరాశిఅంతా సూక్ష్మరూపంలో అతడిలో సన్నద్దమై ఉంటుందనీ, అదే స్ఫోట అనీ తేలుతుంది. అందుకే స్ఫోట నిత్యం అన్నారు. అలా సన్నద్ధమై ఉన్న జ్ఞానాన్ని అభివ్యక్తం చేసే పరికరాలే భాషలోని శబ్దాలన్నీ. ఒక చీకటికొట్లో ఎన్నోవస్తువులండవచ్చును టార్చిలైటు దేనిమీద వేస్తే ఆవస్తువునే కనిపిస్తుంది. ఆసంగతి బాగా తెలుస్తుంది. స్ఫోటని మనం సంపూర్ణంగా నిర్వచించలేకపోయినా అది మనందరి నిత్యానుభవంలోనూ ఉన్నదే! ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మరొకడు అర్ధం చేసుకొన్న ప్రతిసందర్భం లోను స్ఫోట పనిచేస్తూనే ఉంది. ఈస్ఫోట లోపించడం మూలానే మరమనిషికి ఏదిపడితే అదిమాట్లాడగలదు ఏదిమాట్లాడినా బోధపరచుకోగలగడం సాధ్యంకాలేదు.

వైయా కరణాంగీ కృతమగు వాదమునకే స్ఫోట వాదము ని పేరు. ఈ స్ఫోట వాదము పాణినికి ముందున్నదో లేదో చెప్పటము కష్టము.స్ఫోటాయనుడను పేరు పాణినీయమున ఉంది.ఈతడే స్ఫోట వాదమునకు కర్త. స్ఫుటత్యర్ధో స్మాదితి స్ఫోటః దీని వలన అర్ధము స్ఫుటమగును కావున స్ఫోటమనియు తెలియును.వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కును విభజించిరి.పరావాక్కు మూల చక్రస్థము, పశ్యంతి నాభి సంస్థితము.ఈరెండును యోగులకే అనుభవనీయము.హృదయ దేశమందలి వాక్కు మధ్యమ అనబడును.కంఠదేశమందలి వాక్కు వైఖరీ వాక్కు.ఈ మధ్యమ వాక్కునకే స్ఫోట శబ్దమని వ్యవహారము.ఇది నిత్యము, అఖండము, అవికారము, అచలము ఇదే బ్రహ్మ స్వరూపము.ఈ సిద్ధాంతులకే స్ఫోట బ్రహ్మవాదులని లేదా శబ్ద బ్రహ్మ వాదులని పేరు. వీరు శబ్దమునే బ్రహ్మముగా భావింతురు.మనము శ్రవణేంద్రియముచే గ్రహించు శబ్దముకాక, దానిచే అభివ్యక్తమై బుద్ధినిష్టమగు శబ్దమే స్ఫోటము.అదియే అర్ధమును ప్రకాశింపజేయును.అది నిత్యము.అది పదరూపమున కాని, వాక్య రూపమునకాని యుండును.వాక్యస్ఫోటమె ముఖ్య సిద్ధాంతము.

భర్తృహరి ముఖ్యముగా ప్రతిపాదించిన వాక్యజాతి స్ఫోట. అయినను తరువాతి వైయాకరణుల అష్ట విధములగు స్ఫోటల నీరీతిగా నిరూపించిరి. వర్ణములను మాత్రలుగను, పదములను ప్రకృతి ప్రత్యయములనుగాను, వాక్యమును పదములుగాను విభజించి అర్ధములేర్పరుచుట వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించిన విషయము.వ్యవహారము ఉపయుక్తములగు పదములకు అఖండ పదస్ఫోటను కొందరు పేర్కొనిరి.ఏమైనను నవ్యులు అఖండ స్ఫోటమే ముఖ్యమందురు.ప్రాచీనులు వాక్యజాతి స్ఫోట ముఖ్యమని భావింతురు.వ్యక్తిస్ఫోట, జాతిస్ఫోటయను విభేదమును గూర్చి చాల వివాదము ఉంది. ప్రాచీన వైయాకరణులు జాతి స్ఫోట వాదులని, నవీన వైయాకరణులు వ్యక్తి స్ఫోట వాదులని ప్రసిద్ధి. భర్తృహరి జాతి స్ఫోటనే ప్రతిపాదించి బలపరిచెను.జాతి స్ఫోట తాత్వికముగా ఉన్నా ఆచరణయోగ్యము కాదని నవీనుల అభిప్రాయము.వ్యక్తి మూలముననే జాతి గ్రహింపబడును.వ్యక్తులన్నింటి యందుండు సమాన ధర్మమే జాతి.అందువలన చివరకు ఆధునిక విమర్సకులు వ్యక్తి జాతి స్ఫోటలు రెండును అవినాభావములని నిర్ణయించిరి.

పాశ్చాత్యదర్శన మనశాస్త్రాలలో స్ఫోటవాదంతో పోలికలు ఉన్నటు అనిపించే కొన్ని భావాలను మనం గుర్తించవచ్చును. గ్రీకుల ”’లాగాస్”’ (logos) కాంట్ ప్రతిపాదించిన కారణాత్పూర్వజ్ఞాన సిద్ధాంతం (apriori) మనశాస్త్రంలోని-స్ఫురణ (intuition) వంటివి. ప్లేటొ లాగాస్ ప్రంచానికి మూలరూపం అన్నాడు.అంటే లాగాస్ నుంచే ప్రపంచం అంతా వచ్చిందని. ఫైలో (philo) దేవుడికీ, ప్రపంచానికీ మధ్య అనుసంధానం కలిగించేది లాగాస్ అన్నాడు.హొరక్లైటస్ (Heraclitus) భౌతిక జగత్తునంతటనీ లాగాస్ ద్వారానే మనం గ్రహిస్తున్నామన్నాడు.

                         ఆధారం -1948భారతి మాసపత్రికలో శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు ,1963భారతి లో శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తం గారు రాసిన   ‘’స్ఫోట వాదం ‘’ ఆధారంగా వీకీ పీడియాలో వచ్చిన వ్యాసం .

393-కాశ కృత్స్న వ్యాకరణ కర్త –కాశ క్రుత్స్నుడు –(4వ శతాబ్దికి పూర్వం )

కాశకృత్స్న వ్యాకరణము అనునది సంస్కృత వ్యాకరణం.[1].

దానిని రచించినది కాశకృత్స్నుడో, కాశకృత్స్నియో. కవి కల్పద్రువ కాలము నందు బోపదేవగోస్వామి కాశకృత్స్నుడు ఆదిశాబ్దికుడని వ్రాసినాడు. కాశకృత్స్నుడు మీమాంసకుడని ప్రసిద్ధి. కాతీయసూత్రమునందు యాజ్నవల్క్య పుత్రుడు కాత్యాయనుడును, మహాభాష్యమున (4-1-14) పతంజలి డు ఇతనిని మీమాంసకుడని అన్నారు. కాశకృత్స్నుడే వ్యాకరణకర్త అని చెప్పవచును[2]. అష్టాధ్యాయి యందు ఇతని నామము కనబడకున్నను ఈతడు పాణిని కి తరువాతి వాడు కాడు. పారాశర్యశిలాలిభ్యాం భిక్షునటసూత్రయోః అను సూత్రమున పాణిని వ్యాసుడు నామము,వేదాంతసూత్రమును స్మరించినాడు. అవస్థితేరితి కాశకృత్స్న అను వేదాంతసూత్రమున వ్యాసభగవానుడు ఇతనిని స్మరించినాడు[3]. శ్రీభాష్యము న రామానుజాచార్యుడు పరశర్యుడే వ్యాసుడని సంబోధించినాడు. పాణిని వ్యాసుని పేర్కొన్నాడు, వ్యాసుడు కాశకృత్స్నుడుని పేర్కొన్నాడు. కావున ఇతడు వ్యాపాణినులకు పూర్వుడు అని అనుకొందురు. శతాచ్చ ఠన్యతావశతే అను సూత్రమును గూర్చి ప్రదీపమున కైయటాచార్యుడు ఆపిశల కాశకృత్స్నయో స్త్వగ్రంథ ఇతివచనా ద్ ప్యత్ర ప్రతిషేధాభావో నియతకాలాశ్చ స్మృతయో వ్యవస్థాహేతవ ఇతిమునిత్రయమతే నాద్యత్వే సాధ్వసాధుప్రవిభాగః అన్నాడు. ఇలా పలుచోట్ల ఈతని గూర్చి పలువురు పూర్వకవులు తెలిపినారు. అయినను పాణినీయ వ్యాకరణము పూర్వులగ్రంథములకంటే బలవత్తరమయిన దని పలువురు గ్రంథ కారుల అభిప్రాయము. పతంజలి కాశకృత్స్నవ్యాకరణమును జూచియుండవచ్చును; కాని భర్తృహరి చూచినాడో, లేదో తెలుపుట కష్టము. ఒకచోట తదర్హం ఇతి నారబ్ధం సూత్రం వ్యాకరణాంతరే అన్నాడు భర్తృహరి. దీనిపై వ్యాఖ్యవ్రాసిన హేలరాజు వ్యాకరణాంతరే కాశకృత్స్నే చాపిశలె అని వివరించినాడు.

ఈవ్యాకరణము మూడు అధ్యాయములగ్రంథము.ఈ వ్యాకరణమున మూడు,నాలుగు సూత్రములు మాత్రమే నేడు లభించుచున్నవి.

ఆధారం –భారతి మాసపత్రిక మరియు ఈ క్రింది వాటి ఆధారంగా వీకీపీదియాలోని వ్యాసం

  1.  काशकृत्स्न व्याकरणम्: Kashkritsna Vyakaran
  2. ↑ हिंदी व्याकरण का संक्षिप्त इतिहास
  3. ↑ अवस्थितेरिति काशकृत्स्नः।।1.4.22।।

 

394-కర్మంది వ్యాకరణ కర్త –కర్మందుడు (4వ శతాబ్ది పూర్వం )

కర్మంది వివరణము

 

కర్మంది ఒక  వ్యాకరణగ్రంథము. దీనిని కర్మందుడు వ్రాసినట్లు తెలియుచున్నది. అవైయాకరణులయిన శిష్యుల కొరకు వ్యక్తావధూత, క్రాంతదర్సియగు భగవాన్ కర్మందుడు తన భిక్షుసూత్రమునకు పూర్వవృత్తమయిన వ్యాకరణ సూత్రములు కొన్ని రచించినట్లు సన్యాసి సంప్రదాయమున ఉంది. ఇందు భిక్షుసూత్రాంసములు పెక్కు ఉన్నాయి. ఇది కేవలము జనశ్రుతికాదు. కవీంద్రాచార్య సూచీపత్రమున వ్యాకరణ ప్రస్తావనలో కర్మంది వివరణనామకగ్రంధోల్లేఖనము ఉంది. కవీంద్రాచార్యుడు సన్యాసి అని, గ్రంథముఈ గ్రంథముమూలముగా తెలిసింది. కర్మందప్రోక్తవ్యాకరణ సంబంధిసూత్రములు భిక్షుసూత్రముకంటె భిన్నముగా భావించువారు ఈగ్రంథమును కార్మందవివరణ అని అంటారు.

సరస్వతీదేవి ప్రథమమున కర్మందునికి ఈ సూత్రములు ఇచ్చెనని, అనుభూతిస్వరూపాచార్యునికి పూర్వుడగు పరివ్రాజకనరేంద్రాచార్యుడు ఈ సూత్రము లన్నింటికిని కూర్చి, స్వకీయవృత్తివార్తికాదులతో కలిపి సారస్వతవ్యాకరణమను పేరిట వేరగుది రచించినని కొందరౌ అంటారు. దీనికి పూర్వము ఈగ్రంథముసన్యాసుల దగ్గెర ఉండేది.

“కర్మందకృశాశ్వాదినిః” (అష్టా-4-3-111) సూత్రమువలన కర్మందమస్కరి పాణినికి పూర్వుడని తెలియుచున్నది. కర్మందుని భిక్షుసూత్రము వ్యాసుని భిక్షుసూత్రముకంటె పూర్వమని కొందరందురు. వ్యాసుని భిక్షుసూత్రమునకు తరువాత మరియొక భిక్షుసూత్రము ప్రకటిత కాలేదు.

ఆధారం –వీకీ పీడియా

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అప్పు చేసి పప్పు కూడు కు యాభై -భూమి

Posted in సినిమా | Tagged | Leave a comment

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం 

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

 మాఘ శుద్ధ పంచమి శ్రీపంచమి 10-2-19 ఆదివారం ఉదయం 9 గం లకు సరసభారతి 137 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి దేవాలయం లో సామూహికంగా పాలుపొంగించి పొంగలి తయారు చేయటం ,అనంతరం సామూహిక సత్య నారాయణ వ్రతం నిర్వ హింపబడుతోంది . దీనికి రుసుము చెల్లించ వలసినఅవసరం లేదు . పూజా ద్రవ్యాలు ,దేవతా విగ్రహాలు వగైరా ఎవరి పూజాసామగ్రి వారే తెచ్చుకొని  సాధ్యమైనంతవరకు దంపద్యుక్తంగా కూర్చుని చేసుకోవచ్చు .
   వ్రతం పూర్తయ్యాక 11-30గం లకు శ్రీ అయ్యప్ప దీక్షతో ఉయ్యూరు నుండి శబరిమలై కు సైకిల్ పై 18 సార్లు వెళ్లి వచ్చిన వారు ,శ్రీ  శివ దీక్షతో ఉయ్యూరు నుంచి శ్రీశైలం కు  నడకతో 5 సార్లు వెళ్ళివచ్చినవారు ,స్థానిక సుధీర్ టింబర్ డిపోలో గుమాస్తాగా ఉన్న శ్రీ బిరుదుగడ్డ వేంకటేశ్వరరావు (స్వామి )గారికి సన్మానం ,అనంతరం ”స్వామి”గారి  అనుభవ విశేషాల ప్రసంగం ఉంటుంది .
   అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన  .  వ్రతం లో పాల్గొని వారు అర్చక స్వామిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవలసినది ,
               గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -ఆలయ ధర్మకర్త  -2-2-19 -ఉయ్యూరు 

—

image.png

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము

             గ్రంథ కర్త పరిచయం

పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్

జననం -27-06-1940-ఉయ్యూరు

తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి

విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి.

వివాహం –ప్రభావతి తో(21-02-1964)

ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు

           కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998)

సంతానం -1-గబ్బిట  మృత్యుంజయ శాస్త్రి ,సమత (హైదరాబాద్ )

                  (సంకల్ప్,భువన సాయి తేజ )

             2-లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర(హైదరాబాద్ )

                    (శ్రీహర్ష సాయి ,హర్షితాంజని)

            3-నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి (ఉయ్యూరు )

                   ( గౌతమ్ శ్రీ చరణ్ ,రమ్య )

            4-వెంకట రమణ ,మహేశ్వరి (ఉయ్యూరు )

            5-కోమలి  విజయ లక్ష్మి , సాంబావధాని(షార్లెట్-అమెరికా )

                    ( శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ )

సాహితీ వ్యాసంగం –రచనలు ,సరసభారతి అధ్యక్షులు

స్వీయరచనలు -1-ఆంధ్ర  వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథానిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం 6-సిద్ధ యోగి పుంగవులు 7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 9-దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 – 11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 12-కెమోటాలజి పిత  కొలచల సీతారామయ్య 13-దైవ చిత్తం 14-గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 ,15-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి కరదీపిక 16-ఆధునిక ప్రపంచ నిర్మాతలు ,జీవితాలలో చీకటి వెలుగులు 17-గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-3 ,18-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 19-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 20-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 21-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2.

స్వీయ సంపాదకత్వం లో సరసభారతి ప్రచురణలు -1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-ఆదిత్య హృదయం 6-త్యాగి పే’’రెడీలు 7-శ్రీరామ వాణి 8-మా అన్నయ్య 9-శ్రీసువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

  సరసభారతి ,శ్రీ సువర్చలలాంజనేయ స్వామి  బ్లాగుల నిర్వహణ ,

   శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో ధన్యత ,అనునిత్య సాహితీ వ్యాసంగం .

———————————————————————————

                 శ్రీ హనుమతే నమః

              రెండవ భాగం రచనకు నేపధ్యం

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1మొదటిభాగం  దేశ ,విదేశాలలోని 201 శ్రీ ఆంజనేయ దేవాలయాల  గురించి నేను  రాసి, సరసభారతి ప్రచురించి 18-5-2015  శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో శ్రీ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆవిష్కరణ జరిపాం .దీనిని  మా చిన్నక్కయ్య,  బావగార్లు శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద్ లకు వారి వివాహ వజ్రోత్సవ కానుకగా అ౦కిత మిచ్చాం  .దీని కి స్పాన్సర్ –మా మేనల్లుడు చి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ) శ్రీమతి విజయలక్ష్మి దంపతులు. (అమెరికా ).

   అప్పటి కి కొద్దికాలం ముందు నుంచే రెండవభాగం దేవాలయాలను అంతర్జాలం లో రాయటం మొదలు పెట్టాను .మధ్యమధ్య రాస్తూ ఆపేస్తూ  మరి కొన్ని పుస్తకాలు రాస్తూ ప్రచురిస్తూ 2018 అక్టోబర్ కు  మూడేళ్ళలో 100 దేవాలయాల గురించి మాత్రమే రాసి ,ఇక ఉండవులే అనుకొన్నాను .

  కాని మా రెండవ అబ్బాయి శర్మ ఇంకా చాలాఉన్నాయని ,వాటి వివరాలు వీకీపీడియా ,యు ట్యూబ్ ,ఇతర చోట్ల నుండి లింక్ లు పుంఖాను పు౦ఖంగా పంపటం ప్రారంభించాడు .వెంట వెంటనే వాటిని అదే వేగంతో ఇంటర్ నెట్ లో రాసేసేవాడిని .నవంబర్ కు రెండవభాగం లో దేవాలయాల సంఖ్య 254 అయింది .ఇందులో ఒక్కటి మాత్రమే అమెరికా దేవాలయం .మిగిలినవన్నీ మన దేశం లో వివిధ రాష్ట్రాలకు చెందినవే .ఇందులో కొన్ని దేవాలయ చరిత్రలు హిందీ , కన్నడం ,మలయాళం ,తమిళం మొదలైన వివిధ భాషలలో ఉన్నాయి .ఏదో రకంగా తంటాలు పడి విషయ సేకరణ చేసి రాశాను .కొన్నిటిని యు ట్యూబ్ లో చూస్తూ ,వింటూ రాయల్సివచ్చేది . హనుమ దయ వలన అన్నీ సక్రమంగా సాధ్యమైన౦త వరకు పూర్తి వివరాలతోనే రాశాను .కొన్ని దేవాలయాల చరిత్ర  అసమగ్రంగా నే దొరికింది .దొరికింది దొరికినట్లు రాసి సంతృప్తి చెందాను .

  మరీ అసలేమీ వివరాలు లేని దేవాలయాలను ఆయా రాష్ట్రాలలో చివర ‘’దర్శించదగిన ఇతర ఆంజనేయ దేవాలయాలు ‘’అనే శీర్షిక లో పొందు పరచాను .ఇవి సుమారు 50 దాకా ఉంటాయి.అంటే రెండు భాగాల లో కలిపి 201+254+50=555ఆంజనేయ దేవాలయాలను స్పృశించిన  అదృష్టవంతుడనయ్యాను .ఇంకా మా  దృష్టి లోకి రాని ఆంజనేయ దేవాలయాలు ఎన్నో ఉండే ఉంటాయి . కనుక ఇదే పరిపూర్ణం అని మేము భావించటం లేదని సవినయంగా మనవి చేస్తున్నాము .వివరంగా రాసిన అన్ని దేవాలయాల ఆంజనేయ స్వామి వారల విగ్రహాల  ఫోటోలు  పెట్టాము .ఒక వేళ విగ్రహం ఫోటో దొరకక పోతే, దేవాలయం ఫోటో అయినా పెట్టాం  .ఈ ఫోటోల సేకరణ ,ఫైల్ గా పెట్టటం ,రాష్ట్రాలవారీగా వరుసక్రమంలో  లిస్టు తయారు చేయటం ,కవర్ పేజీలలో ఏయే ఫోటోలు ఉండాలో నేను చెబితే వాటిని అలా ఎంపిక చేసి ,తయారు చేసే పని  అంతా మా అబ్బాయి శర్మ   తన డ్యూటీ తానూ చేసుకొంటూ,ఈపనులు  చేసినందుకు  అభినందనలు .దీనివలన నా శ్రమ, కళాసాగర్,  ,ప్రకాష్ గార్ల శ్రమ చాలా తగ్గింది .

          ఎందరో మహానుభావులు

  సరసభారతికి ఆప్తుడు ,రమ్యభారతి సంపాదకుడు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఇదివరకు లాగానే ఈ పుస్తకం ,డి.టి.పి .నిర్దుష్టంగా చేసి ,ముద్రణ చేయించి , సకాలం లో అందజేసినందుకు , మేము ‘’సరసభారతి స్టాఫ్ కళాకారుడు’’గా భావించే  శ్రీ కళాసాగర్ కోరిన డిజైన్ లోఅందమైన  ముఖ చిత్ర రచన చేసి గ్రంథానికి అదనపు ఆకర్షణ కలిగించినందుకు ధన్యవాదాలు .

             సరసభారతి ప్రగతి

   ఇది సరసభారతి ప్రచురించిన 33వ గ్రంథం,నేను రాసిన 21వ పుస్తకం అని విన్న  విస్తున్నాను .సరసభారతి స్థాపించి(2009-నవంబర్ 24 )9సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం లో ప్రవేశించిందని తెలియజేయటానికి ఆనందంగా, సంతృప్తిగా ఉన్నది . .2019 జనవరి 31 నాటికి సరసభారతి  136  వైవిధ్యభరిత  కార్యక్రమాలు నిర్వహింఛి’’అక్షరం లోక రక్షకం ‘’అన్న మా లక్ష్యానికి అనువుగా నడుస్తోంది   . సరసభారతి సాధించిన ,సాధిస్తున్నప్రగతి , విజయాలన్నిటికీ సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి , కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,  కోశాధికారి  గబ్బిట వెంకట రమణ కార్యవర్గ సభ్యులు,  మా కుటుంబ సభ్యులు ,ముఖ్యంగా మా శ్రీమతి ప్రభావతి అందిస్తున్న సహాయ , సహకారాలకు  ధన్యవాదాలు .సాహితీ బంధువుల ,వదాన్యులైన వితరణ శీలురైన దాతల ప్రోత్సాహక సహాయాలకు  కృతజ్ఞతలు .

                  హనుమలకు అంకితం  

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం ను కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని మా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారికీ ,పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకప్పటి గబ్బిటవారి అగ్రహారమైన  రామారావు గూడెం లో వెలసిన  గబ్బిట, చందోలు వారి శ్రీ భక్తాంజనేయ స్వామివారికీ ,ఉయ్యూరు లో మా మేనమామ  శ్రీ గుండు గంగయ్యగారి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారితో సహా అన్ని దేవాలయాల శ్రీ ఆంజనేయ స్వామి వారలకు అంకితమిస్తూ ధన్యులమవుతున్నాము .ఏదో మన భ్రమ కాని హనుమ లేని చోటున్నదా?శ్రీ హనుమ కృపా కటాక్షా  వీక్షణాలే  ఇంతటి బృహత్  రచన,ప్రచురణ మాతో  చేయించాయి .

                   శ్రీ ఆంజనేయ వైభవం

ఇంతటి వైభవం గా దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం  వస్తున్న సందర్భం గా, నామదిలో ఇందులో’’ శ్రీ ఆంజనేయ వైభవం’’ పై పద్యాలు రాయింఛి, చేర్చాలనే  కోరిక లీలగా మెదిలి ,సరసభారతి అభిమానకవులను కొందరికి చెప్పి, తలొక 11 వృత్త పద్యాలు రాసి పంపమని   తెలియ జేయగా ,వెంటనే స్పందించి , అది తమ అదృష్టంగా ,శ్రీ హనుమ ప్రసాదంగా, కర్తవ్యంగా భావిస్తున్నామని, సరసభారతి పై తమకున్నఆదరాభిమానాలను చాటి చెప్పి ,అతి తక్కువ వ్యవధిలోనే  రచించి పంపిన కవి మిత్రులు 1-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ (గుంటూరు )2-శ్రీ మంకు శ్రీను (కొప్పర్రు )3-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ )  4-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య(విజయవాడ )5-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (విజయవాడ )6-మధుర కవి శ్రీమతి ముదిగొండ  సీతారామమ్మ(విజయవాడ )7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని (విజయవాడ )8-శ్రీమతి వారణాసి సూర్యకుమారి (మచిలీ పట్నం )గార్లకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. ఈ ‘’వైభవ పద్య రాశి ‘’ గ్రంథానికి అదనపు ఆకర్షణ కాగలదు .శ్రీ హనుమ బహుముఖీన ప్రతిభావైభావానికి దర్పణంగా భాసించ గలదని భావిస్తున్నాను ..

              సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలు

 సరసభారతి  శ్రీ వికారి నామ  సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న 31-3-19 ఆదివారం నాడు ప్రముఖులకు ఉగాది పురస్కారం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,కవి సమ్మేళనం తో పాటు  నేను రచించిన మూడు సరసభారతి ప్రచురణలు 1-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య(స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ  శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర  పరిశోధన పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు (అంకితం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి(అమెరికా ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం  ఆవిష్కరణ జరగటం  సరసభారతి ప్రగతికి నిదర్శనమని సవినయంగా మనవి చేస్తున్నాను . ఈ కార్యక్రమ౦లో పాల్గొంటున్నఅతిధులకు,పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖులకు, కవి  సమ్మేళనంలో పాల్గొంటున్న కవి మిత్రులకు ,ఉగాది ,స్వయం సిద్ధ పురస్కారాలు అందుకొంటున్న  ఆత్మీయులకు శ్రీ వికారి ఉగాది శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .

‘’పూజ్యాయ వాయు పుత్రాయ వాగ్దోష వినాశన –సకల విద్యాం కురు మే దేవ రామ దూత నమోస్తుతే .

‘’ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీ శ్రద్ధా పుత్రాస్శుశీలతా –ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ‘’

‘’సర్వ కళ్యాణ దాతరం  సర్వాపత్ నివారకం –అపార కరుణా మూర్తిం  ఆంజనేయం నమామ్యహం ‘’

‘’ఆంజనేయం మహా వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం –తరుణార్క ప్రభం శాంతం రామదూతం భజే ‘’

                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

———————————————————————————————

శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి సేవకు ,సరసభారతి పుస్తక ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ  .వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ),శ్రీమతి విజయలక్ష్మి దంపతులు –ఫ్రీమాంట్ (అమెరికా ) –రూ-25,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ –హైదరాబాద్ –రూ-15,000

3-శ్రీ మద్దాల జగదీశ్ ,శ్రీమతి లక్ష్మిదంపతులు –షార్లెట్ (అమెరికా )రూ-10,240

4-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు –హైదరాబాద్- రూ-10,000

5-శ్రీ గబ్బిట రామనాథ బాబు శ్రీమతి జయలక్ష్మి దంపతులు –ఉయ్యూరు –రూ-10,000

6-శ్రీ పువ్వుల సారధి ,శ్రీమతి రేణుక దంపతులు –హైదరాబాద్ రూ–5,120

7-శ్రీమతి చతుర్వేదుల జానకి –విజయవాడ –రూ-2,000

8-శ్రీ .టి.వి.ఎస్. బి .శాస్త్రి (ఆనంద్ ) శ్రీమతి రుక్మిణి దంపతులు-హైదరాబాద్  –రూ 1,116

9--శ్రీ చతుర్వేదుల మధుసూదనమూర్తి శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు –విజయవాడ –రూ-1,100

10--శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీమతి ఇందిర దంపతులు –హైదరాబాద్-రూ-1,100

11-శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు –ఖమ్మం –రూ-1,000

12-శ్రీమతి కొల్లి భారతి –మచిలీపట్నం –రూ-1,000

13-శ్రీ కడవకొల్లు కృష్ణ దంపతులు –కడవకొల్లు -రూ-500

14– శ్రీ కూచిభొట్ల రాజ గోపాల కృష్ణ మూర్తి ,శ్రీమతి సీతారామమ్మ దంపతులు –ఉయ్యూరు –రూ-500  

                                  గబ్బిట దుర్గా ప్రసాద్  

  ———————————————————————————

—



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఛత్రపతి శివాజీ -ధ్వజమెత్తిన ప్రజాపతి -శ్రీ రామ కృష్ణప్రభ-జనవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)

సంస్కృత ,గణిత మహా విద్వాంసుడు సుధాకర్ ద్వివేది ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఖజోరి గ్రామం లో 1855లో జన్మించాడు .బాల్యం లో గణితాన్ని పండిట్ దేవ కృష్ణవద్ద నేర్చాడు .1883 లోవారణాసిలోని  ప్రభుత్వ సంస్కృత కళాశాలలో గణిత అధ్యాపకుడుగా చేరి  బాపుదేవ శాస్త్రి అనే ఆయన రిటైర్ అయ్యాక ఆస్ట్రాలజీ కూడా బోధించాడు .తర్వాత వారణాసి క్వీన్స్ కాలేజి లో గణిత శాఖ హెడ్ గా చేరి 1905లో రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .

   సుధాకర్ ద్వివేదీ అనేక గ్రంథాలను అనువదించాడు .చాలావాటికి వ్యాఖ్యానాలు రాశాడు .ఎన్నో గ్రంథాలు  రాసి వెలువరించాడు ..అందులో గణిత విభాగం ఆల్జీబ్రా లోని పెల్లియన్ ఈక్వేషన్స్ ,స్క్వేర్స్ ,డయో ఫాన్టైన్ ఈక్వేషన్స్ లపై విస్తృతంగా రచనలు చేశాడు .

  సంస్కృతం లో ద్వివేదీ రచనలు -1-చలన్ కలన్ 2-దీర్ఘ వృత్త లక్షణ్(కేరక్టర్ స్టిక్స్ ఆఫ్ ఎల్లిప్స్)3-గోళీయ రేఖా గణిత్ (స్పియర్ లైన్ మాథమాటిక్స్ ) 4-సమీకరణ్ మీమాంసా (అనాలిసిస్ ఆఫ్ ఈక్వేషన్స్ )5-యాజుష జ్యోతిషం,అర్చా జ్యోతిషం 6-గణక తరంగిణి 7-యూక్లిడ్స్ ఎలిమెంట్స్ 6,11,12 భాగాలు 8-లీలావతి 9-బీజగణిత 10-పంచసిద్దా౦తికా ఆఫ్ వరాహమిహిర  11-సూర్య సిద్ధాంత 12-బ్రహ్మ గుప్తాస్ బ్రహ్మ స్ఫుట సిద్ధాంత 13-ఆర్యభట హిజ్ మాయా సిద్ధాంత .

  హిందీలో –డిఫరెన్షియల్ కాల్క్యులస్ ,ఇంటెగ్రల్ కాల్క్యులస్ ,థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ ,ఎ హిస్టరీ ఆఫ్ హిందూ మాథమాటిక్స్

  అరుదైన ఇంతటి గణిత మేధావి ,రచయిత సుధాకర్ ద్వివేది 55సంవత్సరాలు మాత్రమే జీవించి 1910 లో మరణించాడు .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మందు బిళ్ళ ల్లాంటి డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు

మందు  బిళ్ళ ల్లాంటి  డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు ‘’

క్లుప్తత నిర్వచనాలకే కాదు కవిత్వానికీ బాగా వర్తింప జేస్తున్నారు కవులు .ఆకాశాన్ని అద్దంలో చూపిస్తున్నట్లు కొండ౦త భావాన్ని కుదించి అందంగా చెబుతున్నారు .ఇప్పటికే 6 రచనలతో లబ్ధ ప్రతిష్టులైన డా .మక్కెన శ్రీను తాజాగా 2019కానుకగా 500 ల  ‘’గోరంత కవిత ‘’నానోలను ఆంద్ర పాఠకులకు అందజేశారు . ఆయన పంపిన ఈ పుస్తకం ఈ ఉదయమే నాకు అందగా వెంటనే చదివాను . అప్రతిభుడనయ్యాను .చేయి తిరిగిన మహాకవి స్పర్శ కనిపించింది .దేనికదే సాటి గా ఉన్నాయి .ఎంత పెద్ద జబ్బైనా  చిన్న మందు బిళ్ళతో నయం చేసి గుణం కలిగించవచ్చు .ఆ లక్షణం  ఈ నానోలలో అంతటా గోచరించింది .ఆయనే నిర్వచించినట్లు ‘’నాలుగు –పాదాలు –నాలుగే –పదాలు ‘’నానో భావాలు ను చక్కగా పాటించి మెరుపులు ,వెలుగులు ,చమత్కారాలు ,ఆలోచనలు సృష్టించారు .గోరంత దీపం కొండంత వెలుగు కదా .అలా వెలుగులీనిన నానోల సమాహారం ఈ పుస్తకం . వివరణ అక్కర లేని నానోలివి . నోట్లో వేసుకొన్న  ‘’మెడిసిన్ పిల్ ‘’లా తక్షణ రిలీఫ్ ఇస్తాయి .అందుకే అందులోని కొన్ని నానోలు మీకోసం –

1 –నానో- గోరంత –భావం –కొండంత

2-తొలి –బడి –అమ్మ- ఒడి

3-చరవాణి –సంభాషణ –నరవాణి-సంహారం

4-తల్లి –పుట్టుక –తండ్రి –నడత

5-కంటి –దానం –లోక౦ –వెలుగు

6-నోట్లో –గుట్కా –మరణపు –చిట్కా

7-అమ్మ –ఆత్మ-నాన్న –జీవాత్మ

8-అమ్మ –లాలన –నాన్న –పాలన

9-ప్రేయసి –మధురం –ఒడి –సాంత్వనం

10-అచ్చు –సొంపు –హల్లు –ఒంపు

11-పఠనం-నిత్యం –వికాసం –సత్యం

12-రక్తం –ప్రసరణ –జీవం –ప్రజ్వలన

13-ఆర్ధికం –తాత్కాలికం –హార్దికం –శాశ్వతం

14-మండే –చెట్టు –ఎండే –ప్రకృతి

15-ఓర్పు –కష్టం –విజయం -ఓదార్పు

16-కష్టం –చేదు గుళిక –ఫలితం –తీపిమాత్ర

17-నీకు –నీవు –అన్వేషణ –జ్ఞానం

18-పాదాలు –నానీలు –పదాలు –నానోలు

19-విత్తనం –అంకురం –విత్తం –అంకుశం

20-మొగుడు -ధనాత్మకం –పెళ్ళాం –రుణాత్మకం

21-వాకిట –నాగలి –ఆకలి –మాయం

22-ఆకాశం –కవిత్వం –నక్షత్రాలు –నానోలు

23-ప్రకృతి -వీక్షణం –ఆకృతి –దర్శనం

24-జీవి –అండపిండం –విశ్వం –బ్రహ్మాండం

25-ఆదర్శం –వల్లించేది –కర్తవ్య౦  –ఆచరించేది

26-ప్లాస్టిక్ –ఆవరణం –పర్యావరణ –భూతం

27-దేవుడు –సముద్రం –జీవుడు –కెరటం

28-గోమాత –దీవెన –భూమాత –క్షేమ౦

29-కళ్ళ-తడి –మనసు –అలజడి

30-ఆలుమగలు –అనురాగం –ప్రేమ –లతలు

31-సమాజ –శిలలు –వీధి –బాలలు

32-కసువు –దివాళా-పశువు –కబేళా

33-శృంగారం –శ్రీనాథుడు-సంసారం –స్త్రీ నాథుడు

34-నుదుటి –విభూతి-దైవత్వ –అనుభూతి

35-నేడు –వ్యవసాయం –రైతు –ఎద గాయం  

36-పలుకు –సిద్ధాంతం –అరుపు –రాద్ధాంత౦

 37-ప్రశ్నల –నిఘంటువు –శ్రీ శ్రీ –మహా ప్రస్దానం

 38-విశ్వ వీధి –పూదండ –సినారె-విశ్వంభర

39-కవి –త్రాసు –భావన –తూనిక  

40-భావం –జీవం –భాష –సజీవం

అందమైన’’ అక్షర బంతి’’ముఖ చిత్రం తో  పాలనురుగు పేపర్ పై ముద్దులొలికే ముద్రణతో విడుదలైన  డాక్టర్ గారి నానోలు చప్పరించి ఉపశమనం పొందండి .తాత్విక, బౌద్ధిక ,మానసిక లౌకిక , శాస్స్త్రీయ ,ప్రబోధాత్మక ,చిత్తశాంతి జనక ,కవితాత్మక నానోలను ఆస్వాదించి ‘’గోరంత కవిత ‘’లలో కొండంత వెలుగులు దర్శించండి .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-19-ఉయ్యూరు

 

Posted in సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)

   బహుముఖీన ప్రతిభ

వాగీశ్ శాస్త్రిగా గౌరవింప బడుతున్న డా .భగవతీ ప్రసాద్ త్రిపాఠీ అంతర్జాతీయ సంస్కృత వ్యాకరణ కోవిదుడు ,భాషా శాస్త్రవేత్త ,తాంత్రికుడు ,యోగి.1935లో మధ్యప్రదేశ్ లోని ఖురాలీ సిటీ లో జన్మించాడు .విద్యాభ్యాసం బృందావనం బెనారస్ లలో సాగింది .వారణాసి తిక్ మణి సంస్కృత కాలేజిలో 1959లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి,అక్కడే ఉన్న సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి లోని రిసెర్చ్ సంస్థకు1970 లో  డైరెక్టర్ అయ్యాడు .మూడు దశాబ్దాలు దీనిలోనే సేవలందించాడు . 1959లోనే సంపూర్ణానంద యూని వర్సిటి నుండి సంస్కృత వ్యాకరణ ఆచార్య(ఎం. ఏ .) పి.హెచ్. డి,(విద్యా వారిధి )ను వ్యాకరణం ,హిస్టారిక్ లింగ్విస్టిక్స్ లో 1964లో పొందాడు .1966 జర్మన్ డిప్లొమా ,1969లో వాచస్పతి (డి .లిట్.)అందుకొన్నాడు .

            రచనా వాగీశం

   19వ ఏట నుండే డా వాగీశ్ శాస్త్రి సంస్కృత వ్యాసాలూ రాయటం ప్రారంభించి రెండువందలకు రిసెర్చ్ పేపర్లతో సహా వివిధ జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ లో రాశాడు .అయిదవ సంస్కృత సమ్మేళనానికి సెక్రెటరి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .సరస్వతి భవన గ్రంథాలయం మొదలైన సంస్థలకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించాడు .300 వ్రాత ప్రతులను పరిష్కరించి తన సంపాదకత్వం లో గ్రంథాలుగా ప్రచురించిన వైదుష్యం ఆయనది .ప్రముఖ సంస్కృత జర్నల్ ‘’సరస్వతి సుషమ’’ ముఖ్య సంపాదకుడుగా చాలాకాలం ఉన్నాడు .వ్యాకరణం ,ప్రాచీన భాషాశాస్త్ర౦ (ఫైలాలజి) సంబంధ రిసెర్చ్ విషయాలు ,నాటకం చరిత్ర ,కవిత్వం ,వ్యంగ్యం ,చారిత్రిక పరిశోధన ,ఆధి భౌతిక (మెటా ఫిజిక్స్ )మొదలైన వాటిపై అనేక గ్రంథాలు రచించాడు .

                            మాగ్నం ఓపస్

   వాగీశ్ శాస్త్రి  మేధో సర్వస్వమైన  రచన’’ మాగ్నం ఓపస్’’ ఒకటి ఉన్నది .విట్నీ అనే పాశ్చాత్య పండితుడు పాణిని –పాణిని ధాతుపథం పై తీవ్ర విమర్శ చేస్తూ రాసిన దానిపై ప్రతి విమర్శ పై చేస్తూ ‘’పాణినీయ ధాతుపథ సమీక్ష ‘’రచించి 1965లో ప్రచురించాడు .విపరీతమైన శ్రమ చేసి వర్ణక్రమం లో వివిధ ధాతుపథాలలోఉన్నసంస్కృత ,పాళీ ,అపభ్రంశ ,మిగిలిన ప్రాకృత భాషలలోని  ధాతువుల కేటలాగ్ తయారు చేసి వాటి ధృవీకరణ ,వాటి క్రియా రూపాలు మామూలు రూపాలతో సహా కళ్ళముందు నిలబెట్టాడు .ఇది విట్నీ విమర్శను పూర్తిగా త్రిప్పికోట్టిన అరుదైన గ్రంథం గా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది .

          శరపరంపర రచన

  శాస్త్రి మరో ముఖ్య రచన ‘’కృష్ణం నాగ పాశః ‘’అనే రేడియో నాటకం .సింబాలిక్ గా రాయబడిన ఈ నాటకం దేశభక్తిని ,మతసామరస్యాన్ని ,జాతిపై గౌరవాభిమానాలను ,మాతృ దేశ సంరక్షణలో చూపాల్సిన త్యాగ నిరతిని బహు చక్కగా చెప్పింది .శాస్త్రి సృజనాత్మతకు నిలువెత్తు అద్దంగా ఈ నాటకం భాసించింది .ఇవికాక సంస్కృతం లో తద్ధితాన్తః కేచన శబ్దః ,అనుసాధన పధ్ధతి ,దాత్వర్ధ విజ్ఞానం రాశాడు .మిగిలిన రచనలలో శబ్ద నిర్వచన ఔర్ సబ్దార్ధ ,జిప్సీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ ,ఉప్సహితం  వంటివి ఉన్నాయి .సృజనాత్మక రచనలలో –కథా సంవారిక టాల్ స్టాయ్ కథాసప్తకం , భారత్ మే సాంస్క్రిట్ కి అనివార్యకోమ్ ,శ్రీ గంగా స్తవన చయనిక , శ్రీ శివ స్తవన చయనిక ,నర్మ సప్త శతి ,సాంస్క్రిట్ వాజ్మయ మ౦ధనం ,ఆతంకవాద శతకం ,నాద శాబ్దికం ,సంజయ క్రియా పాద,సంక్షిప్త సార్ వ్యాకరణ్,శివ సంకల్ప సూక్తం మొదలైన 24 ఉన్నాయి .

  చారిత్రిక రచనలు –జిప్సీ భాష ,మహాకు౦భ ఏవం సంగమ స్నానం ,ఆతోబయాగ్రఫీ ఆఫ్ వాగ్ యోగి ,మైగ్రేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఫ్రం ఇండియా ,బుందేల్ ఖండ్ కీ ప్రాచీనత .పద్మ పురాణ అండ్ రఘు వంశ .

మెటా ఫిజిక్స్ –పర చేతన కి యాత్ర ,శక్తి ,శివ అండ్ యోగ ,యోగ చూడామణి ఉపనిషత్ ,సంవిత్ ప్రకాశ (వైష్ణవ తంత్రం ),త్రయంబకం యజామహే .

 నవ్య  సంస్కృత వ్యాకరణం –సాంస్క్రిట్ శిక్షన్ కి సరళ్ఔర్ వైజ్ఞానిక్ విధి ,వాగ్ యోగ –న్యుమానిక్ సాంస్క్రిట్ టెక్నిక్ ,వాగ్యోగ –కాన్వేర్సేషనల్ టెక్నిక్స్ ,సాంస్క్రిట్ మేడ్ ఈజీ -2 భాగాలు

నిఘంటు నిర్మాణం –వామన పురాణ విషయానుక్రమ శబ్ద కోశం ,ఎటిమలాజికల్ బుందేల్ డిక్షనరీ ,శబ్ద పరణ్యం నాం ధాతు నిర్భర్ శబ్ద కోష్.ఇలా బహువిధ ప్రక్రియలలో తన అసమాన శేముషీ ప్రతిభను చాటి ,చేబట్టిన ప్రతి విషయాన్నీ సువర్ణమయం చేసిన రచనా ఘనాపాఠీ శాస్త్రీజీ .

           మార్గ దర్శి

 వాగీశ్ శాస్త్రి మార్గదర్శకత్వం లో సంస్కృత వ్యాకరణం లో 20మంది , అలంకార  శాస్త్రం ,కవిత్వం లో 20మంది ,ఫిలాసఫీ ,తంత్ర లో 6గురు ,వేద,పురాణ ఆయుర్వేద  లలో ఇద్దరేసి , జ్యోతిషం లో ఒకరు విద్యార్ధులు పి.హెచ్ .డి  .పొందారు .సంస్కృత వ్యాకరణం లో ఒకరు ,అలంకారం కవిత్వం లో ముగ్గురు ,ఫిలాసఫీ, తంత్ర ,పురాణ లలో ఒక్కొక్కరు విద్యార్ధులు డి.లిట్ .అందుకొన్నారు .

               శాస్త్రీజీ సృజన విధానం –వాగ్యోగం

  వాగ్యోగ అనే తన సృజనాత్మక విధానం లో సంస్కృతాన్ని మాటల , సంభాషణల రూపం లో గణిత విధానం లో సంస్కృత వ్యాకరణం నేర్పుతున్నారు .ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులు వచ్చిఅతి తక్కువ సమయం లో సంస్కృతం నేర్చుకొని వెడుతున్నారు .పాప్ సింగర్ మడోన్నా ‘’యోగ తారావళి ‘’గానం చేసింది .ఆమెగానం లో ఉచ్చారణ దోషాలు కనిపెట్టి తెలియజేశాడు శాస్త్రీజీ .ఆమె బిబిసి రేడియో ద్వారా శాస్త్రి గారితో పరిచయం పొంది తన ఉచ్చారణ ను చక్కగా తీర్చి దిద్దుకోన్నది .

    వైదుష్యానికి తగిన  బిరుదులూ సత్కారాలు పొందిన పద్మశ్రీ వాగీశ శాస్త్రి

1966లో కాళిదాస అవార్డ్ ,1982మహా మహోపాధ్యాయ ,1990బాణభట్ట అవార్డ్ ,1994లో వేద వేదా౦గ  అవార్డ్ ,1995లో అను సంధాన్ పురస్కార ,స్వామి విష్ణు తీర్ధ సమ్మాన్ ,యశ్ భారతి పురస్కార్, విశ్వభారతి పురస్కార్, సాంస్క్రిట్ సాధన సమ్మాన్ ,ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమీ నుంచి 6 సార్లు గౌరవపురస్కారం వంటి అనేక విశిష్ట పురస్కారాలు బిరుదులూ సన్మానాలు శాస్త్రిగారిని వరించి ఆయన శేముషికి వన్నె తెచ్చాయి.2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి విశేష గౌరవం కలిగించింది .

83 ఏళ్ళ మహా సంస్కృత కవి శిరోమణి, భారత దేశ ఆధ్యాతిక జాతి రత్నమైన డా.భగవతీ ప్రసాద్ త్రిపాఠీ-వాగీశ  శాస్త్రీజీ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లి,గీర్వాణి పద సమార్చనలో తరించాలని కోరుకొందాం .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోషలిస్టు డైనమైట్ ,రెబెల్ ,ఏక వ్యక్తి సైన్యం ,నిర్భయ నిరాడంబరుడు -”జార్జి ది జైన్ట్ కిల్లర్ ”ఫెర్నాడజ్

image.png

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి

మహా సంస్కృత విద్వాంసుడు  లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి  

భారతీయ సంస్కృత మహా విద్వాంసుడు మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జన్మించాడు .ఆ పరిసరాలలో ఆయనొక్కడే అయిదవ తరగతి పాసైనవాడు అంటే యెంత వెనకబడిన ప్రాంతం వాడో అర్ధమౌతుంది .హైస్కూల్ చదువులో తప్పటం వలన అతని టీచర్ ‘’రతన్ లాల్ శాస్త్రి’’ రోజు కొక భగవద్గీత అధ్యాయం చదవమని ,దానివలన కస్టాలు గట్టే  క్కటమేకాకుండా  పరమాత్మ కృప కలుగుతుందని  సలహా ఇచ్చాడు .భగవద్గీతా పఠనానికి అలవాటు పడిన ఖాన్ ,క్రమగా అందులోని లోతైన విషయాలకు ఆకర్షితుడై , సంపూర్ణంగా అధ్యయనం చేసి అందులోని రహస్యాలను ఆకళింపు చేసుకొని స్నేహితులకు బోధించేవాడు తన జీవిత పరమార్ధం నెరవేరాలంటే సంస్కృతం నేర్చి అందులో  ప్రావీణ్యం  సంపాదిస్తేనే భగవద్గీత అధ్యయన ఫలప్రాప్తి కలుగుతుందని విశ్వసించాడు .

  పట్టుదలతో చదివి సంస్కృతం లో ఎం. ఏ .పాసయ్యాడు ఖాన్ శాస్త్రి .వారణాసి లో సంపూర్ణానంద్ వద్ద పురాణాలు కూలంకషంగా చదివి నిష్ణాతుడై ఆచార్య ,శాస్త్రి పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు .కంపారటివ్ రెలిజియన్ లో డాక్టరేట్ పొందాడు .ఆయన పరిశోధన అంశం ‘’మహా మంత్ర గాయత్రి ఔర్ సురాఫతా కా అర్ధ ప్రయోగ్ ఏవం మహాత్మ్యా కి దృష్టిసే తులనాత్మక్ అధ్యయన్ ‘’దీన్నే ఇంగ్లీష్ లో ‘’Comparative Analyisis of Gayatri Mantra and Surah Fatiyah with reference to meaning and importanace ‘’అంటారు .భారతీయ సంస్కృత సంస్థాన్ లో ఖాన్ శాస్త్రి సంస్కృత ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు ..

ఖాన్ శాస్త్రి రచనలు –మోహన్ గీత ,గీత ఔర్ ఖురాన్ మే సామంజస్య ,  వేద ఔర్ ఖురాన్ సే మహామంత్ర గాయత్రి ఔర్ సురా ఫతాః,వేదోం మే మానవ అధికార్,మీజోయ్ ,మహామంత్ర గాయత్రి కా బౌద్ధిక్ ఉపయోగ్,శ్రీమద్భగవద్గీతా ఔర్ ఖురాన్ ,విశ్వ బందుత్వకా ప్రత్యచ్చ్ ప్రమాద్ ‘’.

మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రికి 2009లో  ‘’నేషనల్ కమ్యూనల్ హార్మని అవార్డ్ ‘’(జాతీయ మతసామరస్య పురస్కారం )అందజేశారు .2019లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-19-ఉయ్యూరు

 image.png

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

      భాషా ప్రవీణులు ,పొన్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామ వాస్తవ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి ,సంస్కృతాంధ్ర రచనా దురంధరులు శ్రీ కడెము  వేంకటసుబ్బారావు గారు  సహస్రాధిక పద్యాలతో రచించిన  వీర రస ప్రదానకావ్యం ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’.ఖడ్గ తిక్కనకు ముందు శ్రీ చేర్చటం లోనే కవిగారికి ఆ సాహస వీరునిపై ఉన్న అనన్య భక్తీ తాత్పర్యాలు వ్యక్తమౌతున్నాయి .ఖడ్గ తిక్కన కథ అరవై ,డెబ్భై ఏళ్ళ క్రితం అయిదు ఆరు తరగతుల తెలుగు వాచకాలలో పాఠ్యాంశం గా మనం  చదువుకొన్న వాళ్ళమే.కాలక్రమం లో అది కనుమరుగైంది .కాని తెలుగు దేశం లో కవి తిక్కన ఖడ్గ తిక్కన పేర్లు తెలియని వారు ఉండేవారు కాదు . ఇద్దరూ నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి మహా రాజు ఆస్థానం లో మంత్రిగా ,సేనాపతిగా గౌరవస్థానాలు అందుకొన్నవారే .భారతాంధ్రీకరణలో కవిత్రయం లో రెండవ వాడుగా తిక్క యజ్వ సుపరిచితుడే .ఆయన తేట తెలుగు, నాటకీయత చవి చూసి మురిసిపోని వారు లేరు .ఖడ్గ తిక్కన పేరు చెబితే  పల్నాటి బాలచంద్రునిలా ,ఝాన్సీ లక్ష్మీ బాయిగా వొడలు పులకరిస్తుంది .అంతటి అవినాభావ సంబంధం ఉన్న కీర్తిమంతులు వీరిద్దరూ .

   శ్రీ కడెము   వేంకట సుబ్బారావు మాస్టారు గారు చాలా సాహసంగా ,కవితాత్మకంగా నాటకీయంగా ,సహజ సరళ ధారా పద్య విన్యాసం తో ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం తీర్చి దిద్దారు .’’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేత సంస్కృతాంధ్రాలు ,గ్రాంథికవ్యావహారికాలు ,సంప్రదాయ ఆధునికతలు రచనలో పడుగు –పేకయినవి ‘’అని మెచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.వి . రాఘ వేంద్ర రావు గారి  మాటలు అక్షర సత్యాలు .ఈ కావ్యానికి ముందుమాటగా ‘’గ్రంథ పరిచయం ‘’చేసిన విశ్రాంత ఆంధ్ర శాఖాధిపతి శ్రీ మేడూరి ఉమామహేశ్వరం కవినీ కావ్యాన్నీ క్షుణ్ణంగా ఆవిష్కరించి మహోపకారం చేశారు .కనుక నాకు దీన్ని పరిచయం చేయటం చాలా తేలికయినది .ఎక్కువభాగం వారి మాటలలోనే కావ్య సౌరభాన్ని మీకు అందిస్తున్నాను .

  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం  ఏడాశ్వాసాల గ్రంథం.సహస్రాధిక పద్య సమన్వితం .పూర్వాపర విరుద్ధం కాకుండా చరిత్రా౦శాలను కవి కథా కథనమున చక్కగా నిరూపించారు .ఇతివృత్తం ,పాత్ర పోషణ, రసము పరస్పరాశ్రయంగా పూర్వ పూర్వా శ్వాశాలు ,ఉత్తరావుత్త్రా రాశ్వాశాలు పోషకంగా కథ మలచబడింది .సంగ్రహంగా ఇందులోని కథ తెలుసుకొందాం .

 మొదటి ఆశ్వాసం –పాకనాటి సీమ రాజధాని నెల్లూరు .దీనికి విక్రమ సింహ పురం అనే పేరుకూడా ఉంది .పాలకుడు మనుమసిద్ధి మహారాజు .కొమ్మన కుమారుడు కవి తిక్కన మంత్రి .అరొక మంత్రి భీమన .సిద్దన మంత్రి కొడుకు ఖడ్గ తిక్కన సర్వ సేనాపతి .ప్రక్కరాజ్యం కనిగిరి సీమ పాలకుడు  కాటమ రాజు . మంత్రి పద్మరాఘవుడు .బ్రహ్మ రుద్రయ్య సేనాపతి .కనిగిరి విస్తారమైన గో సంపదతతో అలరారు తోంది .మూడేళ్ళుగా వర్షాలు లేక ,కరువు కాటకాలతో అలమటిస్తోంది కనిగిరి .కాటమరాజు మనుమసిద్ధి దగ్గరకు వచ్చి పశువుల మేతకు పుల్లరి( పశువుల మేతకోసం ఇచ్చే డబ్బు )ఒడంబడిక చేసుకొన్నాడు .

   రెండవ ఆశ్వాసం – ఒప్పందం ప్రకారం యాదవులు నల్లమల అడవులలో లక్షకు పైగా ఆవులు మేపుకొంటున్నారు  .అక్కడ నెల్లూరు గిరిజనులు రక్షకులుగా ఉన్నారు .పశు కాపరులైన యాదవులు అడవిలో పిట్టల్ని జంతువుల్ని కొట్టటం తో గిరిజనులకు యాదవులకు భేదాలు ,తగాదాలు ఏర్పడ్డాయి .రాణీగారు తన పెంపుడు చిలుకను యాదవులు కొట్టారని పగబట్టి గిరిజనుల్ని ఉసి గొల్పింది .వాళ్ళు ఆవులను చంపటం మొదలెట్టారు .పశు వధ మనుమసిద్ధి మహా రాజే చేయించాడని యాదవులు భావించి ,ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ,ఇవ్వాల్సిన పుల్లరి చెల్లించకుండా ఆవులతో సహా పారిపోయారు .

   మూడవ ఆశ్వాసం –గొల్లలు పుల్లరి ఎగ గొట్టి పారిపోవటం మనుమసిద్ధి రాజుకు కోపం తెప్పించింది .పుల్లరి వసూలు చేసుకొని రమ్మని భట్టును రాయబారిగా కనిగిరి పంపాడు .కాటమ రాజు తమ గో నష్టాన్ని లెక్క తేల్చమని పేచీ పెట్టాడు .తాము ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల పుల్లరికన్నా ,గోనస్టం చాలా ఎక్కువకనుక దాన్ని బిగపట్టుకొని మిగిలిన డబ్బు ఇమ్మన్నాడు కాటమరాజు .అన్యాయపు మాటలు అన్నాడు భట్టు .సంధి చెడింది .యుద్ధం లో మనుమ సిద్ధిని బందిస్తామని యాదవులు ప్రగల్భాలాడారు .భట్టు చెప్పిన మాటలు విన్న మనుమసిద్ధి మారాజు సేనాపతి తిక్కనకు ‘’వీర ఖడ్గ తాంబూలం ‘’ఇచ్చి యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు .

  నాలుగవ ఆశ్వాసం –ఖడ్గతిక్కన ఇంటికి వచ్చి భార్య చానమ్మ తో కనిగిరి వెళ్లి పుల్లరి వసూలు చేసుకొని వస్తాను లేదా యుద్ధమైనా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు .ఇంతలో రాయశృంగార భట్టు వచ్చి యుద్ధానికి ప్రోత్సహించాడు .వీరపత్ని చానమ్మ భర్తకు రక్త తిలకం దిద్ది  విజయం తో తిరిగి రమ్మని వీరగీతం ఆలాపించింది .

  ఐదవ ఆశ్వాసం –యుద్ధరంగం లో సైన్యం సమాయత్తమైంది .యాదవుల స్కంధావారం లో వీరాలాపాలు మిన్నంటాయి .పంబ జోళ్ళ కథ  వీరరస స్పోరకంగా సాగుతోంది .భట్టుతో ఖడ్గతిక్కన తన శౌర్య పరాక్రమాలే చాలు అనుకొని  ,కొద్దిమంది సైనికులతో  ప్రవేశించి కాటమను పుల్లరి ఇమ్మని అడుగగా ,యాదవులు మిగిలినడబ్బు ఇమ్మన్న్నారు .వాద ప్రతివాదాలు తీవ్రమయ్యాయి కాని పరిష్కారం కనిపించలేదు .యుద్ధం ప్రారంభమైంది .తెలివిగా యాదవులు యుద్ధరంగం లోకి అశేషమైన ఆవులమంద ను తోలారు .’’ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ‘’లా తయారైంది పరిస్థితి .ఖడ్గ తిక్కన ఖంగు తిన్నాడు ఈ ఆకస్మిక పరిణామానికి .యాదవ సేన నెల్లూరి సేనను చంపింది .ఖడ్గ తిక్కన ఒంటరి పోరాటం చేసి సూర్యాస్తమయం అవుతుండటం తో  కాటమ కోరికపై యుద్ధం ఆపేసి ఇంటికి వచ్చాడు .

ఆరవ ఆశ్వాసం –విషయం తెలియని నెల్లూరు పౌరులు ఖడ్గ తిక్కన యుద్ధం లో వోడిపోయి వస్తున్నాడని గేలి చేశారు .బొగ్గులు పేడ,పిడకలతో కొట్టి అవమానించారు .ఎలాగో భరించి ఇంటికి వస్తే తండ్రి ‘’మీసం ఉన్న పేడి’’అని  నిందించాడు .భార్య చానమ్మ భర్త స్నానం కోసం మంచం చాటు పెట్టి ,పసుపు ముద్దా, నీళ్ళు పెట్టి మరీ అవమానించింది .ఇవన్నీ భరిస్తూ తల్లి అనురాగం తో వడ్డించే అన్నమైనా తిందామని కూర్చుంటే ‘’విరిగిన పాలు ‘’పోసి కొడుకు మనసు విరిచింది .భరించలేని అవమానం ఊరిలో ఇంట్లోనూ జరిగాక ఖడ్గతిక్కన రక్తం ఉడికి పోయి ‘’విజయమో వీర స్వర్గమో ‘’తేల్చుకొంటానని ,ఆ రాత్రికి రాత్రే మలి యుద్ధం లో పాల్గొనటానికి యుద్ధభూమికి వెళ్ళాడు .

   ఏడవ ఆశ్వాసం –యాదవులు తమ సేనాని బ్రాహ్మ రుద్రయ్యను యుద్ధ ముఖద్వారం దగ్గర నిలిపారు .ఖడ్గ తిక్కన వీరావేశం తో ఆతడిని నిరుత్తరుని చేసి  ,రణభూమిలో వీర విహారమే చేశాడు.కాటమ రాజు   మొదలైన వారందరికీ తన ఖడ్గమహిమ చాటి చెబుతూ, యుద్ధ రంగాన్ని యాదవ సేనల పీనుగుల  పెంటగా మార్చేశాడు .తెగిపడిన యాదవ శిరస్సు ల గుట్టపై’’ ఈటెను పాతి,తన ఉత్తరీయం తగిలించి విజయస్త౦భ౦ గా వీర పతాకం ‘’గా నిలబెట్టాడు ఖడ్గతిక్కన .సొమ్మసిల్లిన బ్రహ్మరుద్రయ్య తేరుకొని తిక్కన తో కలియబడ్డాడు .చాలాసేపు ద్వంద్వ యుద్ధం చేశారు .ఖడ్గ తిక్కన రుద్రయ్య తలనరికాడు కత్తితో  .కిందపడిపోతూ రుద్రయ్య తిక్కనను కత్తితో పొడిచి చనిపోయాడు .జవసత్వాలను కూడ గట్టుకొని ఖడ్గ తిక్కన పాక్కుంటూ పోయి తాను పాతిన విజయ ధ్వజాన్ని పట్టుకొని మరణించి వీర స్వర్గం అలంకరించాడు .భట్టు వచ్చి గుర్తించి వీర తిక్కనను ప్రశంసించాడు .తండ్రి ముసలి సిద్దనామాత్యుడు వచ్చి నెత్తురు వర్రులో ఎగసి పడే కొడుకు ఖడ్గ తిక్కన కండలను శాలువలో సేకరించి ఇంటికితెచ్చాడు .వీరపత్ని చానమ్మ తిక్కనతో సహగమనం చేసింది

  మనుమసిద్ధి ,కాటమ రాజులమధ్య యుద్ధం సాగింది .కవిబ్రహ్మ తిక్కనామాత్యుడు పల్లకిలో వచ్చి యుద్ధాన్ని ఆపి ,’’ధర్మాద్వైతాన్ని’’ ఇద్దరికీ బోధింఛి ,స్నేహహస్తాలు కలిపి , సంధి కుదిర్చి , శాంతి గీతం ఆలాపించాడు .తెలుగు నాట శాంతి కేతనం రెపరెపలాడింది .తిక్కనగారి హరిహరాద్వైతం  పరమ శాంతిని చేకూర్చింది ‘’ .

  కవిగారు శ్రీ కడెము  వేంకట సుబ్బారావు గారు తన ‘’విన్నపం ‘’లో ‘’ఖడ్గ తిక్కన కథ-‘’కాటమ రాజు కథలు’’పేరిట ద్విపద ఛందస్సులో ఉన్నది .’’పిచ్చుగుంటలవారు’’  దీన్ని బాగా ప్రచారం చేశారు .పల్నాటి వీర చరిత్రకు ఉన్న ప్రాశస్త్యం ఖడ్గ తిక్కనకూ ఉంది .అందులో లాగా లోలాగా ఇందులో వంచనలు,మాయలు  లేవు .మనుమసిద్ధి కాటమరాజు ఇద్దరూ దీరోదాత్తులే .ఇద్దరూ నిజాయితీగానే వ్యవహరించారు .అక్కడ మగువ మాంచాల, ఇక్కడ చానమ్మ ఇద్దరూ వీరవనితలే .ఇద్దరూ భర్తలను యుద్ధానికి సమాయత్త పరచి వీర తిలకం దిద్ది పంపిన  తెలుగు ఆడపడుచులని పించారు .ఖడ్గ తిక్కన తన శౌర్య పరాక్రమాలతో శత్రువులను సైతం మెప్పించాడు .బాలచంద్రుడు నరసి౦గుని తల నరికి వీరస్వర్గం అలంకరిస్తే ,ఇందులోఖడ్గ  తిక్కన బ్రహ్మ రుద్రుని తలనరికి వీర స్వర్గం చేరాడు .ఈ ఇద్దరూ వీరాభిమన్యుని పౌరుష పరాక్రమాలకు వారసులే .

‘’’ఖడ్గ తిక్కన కథను పరిగ్రహించేముందు నేను యోగ సమాధి కి రావలసి వచ్చింది .ఆయోగ చక్షువులతో లోపాలన్నీ తొలగిపోయాయి .చక్కని ప్రేరణాలు ,సముచిత పూరణాలు బొమ్మకట్టి నా మనో వేదికపై ఆటాడాయి ,మాటాడాయి.మూల కథకు భంగం రాకుండా  ,ఇరు వర్గాలవారి గౌరవోన్నతులకు పోషకంగా రచన చేశాను .కావ్యం చివరలో కవి బ్రహ్మ తిక్కనను ప్రవేశ పెట్టి ‘’పోరునస్టం –పొందు లాభం ‘’అనే ధర్మోక్తి తో సఖ్యం కావించి ,మంగళప్రదంగా ఆంద్ర పౌరుష జ్యోతి వెలిగింప జేశాను .ఈ కావ్య రచన చేశాకనే డా శ్రీతంగిరాల వేంకట సుబ్బారావు గారి ‘’కాటమ రాజు కథలు ‘’గ్రంథం చూశాను .అందులో కొన్ని సముచిత విషయాలున్నాయి .

  ‘’ఖడ్గ తిక్కన ,కవితిక్కన అన్నదమ్ముల బిడ్డలు .ఇద్దరూ మనుమసిద్ధి మహారాజు సేనాపతిగా కవిగా ఉన్నారు . కవితిక్కన తన ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’కావ్యకన్యను మనుమసిద్ధికి అంకితమిచ్చి ‘’మామా ‘’అనిపించుకొన్నాడు .ఖడ్గ తిక్కన అనేక యుద్ధాలు జయించి మనుమసిద్ధికి జయశ్రీ కలిగించి ‘’గంధ వారణ’’బిరుదుపొండాడు .కవి తిక్కన లాగానే నేనూ నా కావ్యాన్ని హరిహర నాథునికి  అ౦కితమిచ్చాను ’’అని ఎంతో సమ దృష్టి తో కవిగారు సుబ్బారావుగారు చెప్పుకొన్నారు .

  నేను చెప్పాలంటే ఈ కావ్యం లో  ప్రతి పద్యం హృద్యంగా ఉంది . మంచి మాటల పోహళింపు ,చమత్కారం ,అలంకార సౌందర్యం ,పాత్రోచిత భాష ,నాటకీయ సన్నివేశ చాతుర్యం, ఒకే పద్యం లో వివిధపాత్రల సంభాషణ దేనికదే సాటిగా ఉన్నాయి .ఉదాహరించాల్సి వస్తే కావ్యమంతా ఉదాహరించాల్సి వస్తుంది .నాకు అంతబాగా నచ్చిన కావ్యం .ఇంతటి ఉత్తమ వీర కావ్యం మన సాహిత్య పరిషత్ ల దృష్టిలో పడకపోవటం ఆశ్చర్యంగా ఉంది .దగ్గరే ఉన్న నాగార్జున  విశ్వ విద్యాలయం వారికీ ఆనక పోవటం విడ్డూరం .నవ్యాంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సచివోత్తములు శ్రీ డి.విజయభాస్కర్ గారికీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికీ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘానికీ ఈ కవిగారి గురించి కావ్యం గురించీ తెలియదని పిస్తోంది .నన్నడిగితే ‘’అక్షర లక్షలు ‘’చేసే కవిత్వం ఇందులో ఉంది .హాయిగా చదివిస్తుంది .ఇంత తేలికగా పద్య రచన చేయవచ్చా అని పిస్తుంది ,మార్గ దర్శనం చేస్తుంది .మనల్ని ఎలివేట్ చేస్తు౦ది కావ్యం .

  ఆధారం –వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం శత వార్షిక  వేడుకలో నేను శ్రీ చలపాక ప్రకాష్ గారి  బృందం తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒక మహానుభావుడు శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం నాకు ఆత్మీయంగా అందజేశారు .  మూడు రోజుల క్రితమే  దాన్ని చదివి వారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం ‘’రాయటం చేత నిన్ననే   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 లో 389 వ గీర్వాణకవిగా వారి గురించి రాసి సంతృప్తి చెందాను .ఇప్పుడు ఈ వ్యాసం రాశాను .

    ఇప్పుడే వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి గారికి ఫోన్ చేసి శ్రీ సుబ్బారావు గారి గురించి కావ్యం గురించీ నేను రాసిన విషయం గురించీ తెలియజేసి కవిగారి ఫోన్ నంబర్  ఉంటేతెలియజేయమని కోరాను .ప్రస్తుతం తనవద్ద నంబర్ లేదని తెలుసుకొని తెలియ జేస్తానని చెప్పి ,కవిగారు ఇప్పుడు 94ఏళ్ళ వయో వృద్ధులని  ,మాట్లాడలేకుండా ,కదలలేకుండా ఉన్నారని చెప్పారు .మొన్ననే తానూ వారి ఇంటికి వెళ్లి పలకరించి వచ్చానని చెప్పారు .అంతటి మర్యాద ఆమె పాటించినందుకు అభినందించాను .

శ్రీ ఖడ్గతిక్కన కావ్యం లో కవిగారి కవితా ప్రౌఢి కి మచ్చుకు కొన్నిపద్యాలు –

‘’శ్రీ గౌరీ హృదయేశ్వర –ఆగమ నిగమాది వినుత ,హరిహర నాథా-భోగీశ్వర ,యోగీశ్వర –బాగుగ రణ తిక్కన కథ పలుకుదు వినుమా ‘’

‘’శ్రీ కరుడవు ,జగతీ సృజ –నాకరుడవు ,కర్మ యంత్ర నాథుడవగుచున్ –లోకుల నేలెడి హరిహర –తేకువతో వినుము ఖడ్గ తిక్కన కథలన్’’(ఖడ్గ తిక్కన పౌరుష౦ )

‘’హృదయ పాత్రలో రక్తాజ్య మింత నించి –ప్రాణ వర్తి రగిల్చి ,శౌర్యాగ్ని పెంచి –తెలుగు పౌరుష జ్యోతియై తేజరిల్లి –వీడె’’ఖడ్గ తిక్కన ‘’వచ్చెచూడ రండు ‘’

‘’తెలుగు గడ్డ మగంటిమి వెలుగు బిడ్డ-మేఘ గర్జానుకారి ,క్రొమ్మెరు పనంగ-అశ్వ మెక్కి ఖడ్గో జ్వాల  హస్తుడగుచు  -‘’ఖడ్గ తిక్కన ‘’అరుదెంచె,కనుడు బుధులు ‘’(వీర తిక్కన )

‘’హరిహర నాథు డంట,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –హర గిరి జాద్వయంబు ,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –

పరము నిహమ్ముకున్ దిగిచి భక్తి రసామృత మందజేసి అం –దరకు దైవ దృష్టియును ,దర్శనమున్ కలిగింతురా ప్రజల్ ‘’(నెల్లూరు వర్ణన )

‘’జ్యోతి ప్రణవమైన చూడాంబ సుతులు దే-వాంగ జనులు మగ్గమందు నేసి –సన్న నూలు పట్టు అరి బుటా చీరెలు –అఖిల దేశములకు అ౦పు  చుంద్రు’’( నేత మగసిరి )

‘’పుల్లరడుగ బోయి పోరాట నిలబడి –ముచ్చముడిగి వోడి వచ్చినావు –నమ్ముకొన్న నృపతి నట్టేట ముంచితి –పరువు బరువు లేని పిరికి పంద‘’ (  తండ్రి ఈసడింపు ) )

‘’పెరటికి నన్ను తెచ్చితివి –పేర్మిని స్నానము చేయుమంటి ,వీ-పరిసరమంత స్త్రీలయిన వారికి మాత్రమె స్నాన యోగ్యమై-పరగుచు నుండెగాని –మగవారికి న్యూనత గల్గు నట్లుగా –స్వరచన మిచ్చటన్ జరుప జాలితి  వీ యెగతాళిసైతునా ?’’( భార్యతో తిక్కన )

‘’నాన్నగారు బైటకు వెళ్ళినారు పురుషు –లెవ్వరిటలేరు ,మరి పోతుటీగ రాదు –సిగ్గు పడకుండ స్నానంబు చేయవచ్చు –పసుపుతో స్నానమును చేసి త్వరగరండు ‘’-(భర్తతో చానమ్మ )

‘’పత్ని భుజోపరి మూట పట్టునంట-తల్లి కొమరు నాకలి పొట్ట తడుము నంట-కన్నతల్లి ఎవ్వరికైన కల్పవల్లి –అమ్మ పిలిచెను ,లోపలి కరుగువాడ ‘’( భోజనానికి సిద్ధమైన తిక్కన )

‘’వీర వనితనైతి ,వీర పత్నియు నైతి –వీరమాత నగుచు వీగిపోతి-వారపోసి నీకు హరతిచ్చిన నాడె-వీరమాత నగుదు వేడ్క పడుదు ‘’(కొడుకుతో తల్లి ప్రోలమ్మ  )

‘’అసదృశముగ నరి వీరుల – మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్ –కసవును మేయగ బోయిన –పసులును విరిగినవి తిక్క !పాలును విరిగెన్ ‘’(తల్లి అవమానం )

‘’ఇంక నాకు శాంతి ప్రశాంతి ఏమి లేదు –అంతకంత కావేదన అధికమయ్యె-అజ్ఞతాబ్ది నిర్మథన జీవాత్మ నేను –ప్రజ్వలత్ భిన్న భౌమాగ్ని పర్వతమను ‘’(క్రోధాగ్ని పరాభావాగ్ని తో తిక్కన )

‘’జడ వస్తువున శక్తి ,శక్తిలో చేతన –చైతన్య మానంద సాగరమగు –జీవాత్మ పరమాత్మ చేరిక ఒక్కటై –సచ్చిదానందాత్మ సాగరమగు –ప్రకృతిపురుష లాస్య భావ ,తా౦డవభావ –సహితాభినయ కళాసాగరమగు –ఊర్ధ్వ దృష్టికి ముక్తి –ఒగిఅధో దృష్టికి-సంసృస్టి యుగ సౌఖ్య సాగరమగు –అదియె బ్రహ్మ ముహూర్త నిత్యాభినవత –పొంగి పొరలు వేగురు జుక్క పొడుపు వేళ-గండు మగడైన ఖడ్గ తిక్కన్న తేజి –చూపు దాటె’’( వేకువ జాము వర్ణన )

‘’కుంతముల వంటి దంతాల క్రుమ్మి పొడిచి –కంబముల వంటి నాలుగు కాళ్ళ ద్రొక్కి –అరటి గెలల తోటల వంటి అరి బలముల –కూల ద్రోయుచు౦డెను మత్త కుంజరములు ‘’(భీకరయుద్ధం )

‘’ఘల్లు ఘల్లున మ్రోగు గజ్జల చెడ్డిపై –కుదురుగా పెనుకాసెకోక జుట్టి –ఘణఘణమని  మ్రోగు గంట లోడ్డాణ౦బు –నడుముపై బిగువుగా నాచికట్టి –ఉక్కు చొక్కావంటి చక్కని మరువును –బలుపైన ఎదరొమ్ము పైన బెట్టి –పాగా శిరస్త్రాణ వస్త్వాదికమ్ములు –శిరసున సొగసుగా జేర్చి చుట్టి –టముకు తప్పెట్లు మేళ తాళముల తోడ –చిందులను త్రొక్కుచు పదాతి సేనలపుడు –వారి వారి ఆయుధముల తీరు లెసగ –పొలికలని యందు వేర్వేర తలపడిరటె’’(సైన్య వర్ణన )

‘’ధర్మమును ,క్షాత్రమును నాకు ద్వ్యక్షు లంటి-జ్ఞాననేత్ర మొక్కటె ఆత్మ శక్తి యంటి-సోహమే బ్రహ్మమే నేను –జయము నేను –ఇటుల నా రాజ ఋణము నే నీగు చుంటి ‘’ (యుద్ధం లో  ఖడ్గ తిక్కన )

‘’రెండు పెద్దపులులు గా౦డురు గాండ్రంచు-బొబ్బరించి గ్రుడ్లు నుబ్బరించి –పళ్ళు కొరుకు చుండి పంజా విసరు చుండి –పోరునట్లు వారు పోరిరపుడు ‘’(ఖడ్గ తిక్కన ,బ్రహ్మ రుద్రయ్యల ద్వంద్వ యుద్ధం )

‘’ప్రళయ కాల రౌద్రోద్రేక భయద కాళి-నాల్క వంటి తిక్కన కత్తి నాట్యమాడె-మిత్తి మిడి గ్రుడ్ల జిగి వంటి మెరపులుమిసె-నిప్పు రవ్వలు పువ్వులు నింగి విరిసె’’(ప్రళయ భయంకర ఖడ్గ తిక్కన )

‘’కొంచె మూపిరితో ప్రాకి కొనుచు పోయి –ఖడ్గతిక్కన్న ధ్వజభూమి కన్ను మూసె-జ్ఞాన కర్మ యోగముల సంస్కారులైన – ఎట్టి వారికి నైన మోక్షైక  ఫలమె’’(ఖడ్గ తిక్కన వీర మరణం )

‘చిజ్జగాత్మక మీ విశ్వ సృష్టి యెల్ల-ఈశ్వరోత్పన్న ,మాత్మజులెల్ల జనులు –సోదరులుగ జీవింపక ,ఒకరి నొకరు –చంప జూతురే?వారికి చావు రాద?’’(కవి తిక్కన శాంతి సందేశం )

‘’తిక్క యజ్వ మహా మంత్రి ధీ నిదాన –నా నమస్కృతుల్ మీ ఉపన్యాసమునకు ‘’(మనుమా సిద్ధి )

‘’తిక్కన మహా కవీ !మీ సుదీ గరిమకు –మాకు కనువిప్పు కలిగె నమస్కృతు లివె’’(కాటమ రాజు )

‘’ఖడ్గ తిక్కనతో పోరాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి –అట్టి జగదేక వీరులే అంతమైరి –అయ్య బ్రహ్మ రుద్రయ్య ! జోహారులయ్య ‘’(వీరులకు తిక్కయజ్వ నివాళి )

‘’యుద్ధమె ఆన్ని తీర్చునను యోజన మంచిది కా,దదేఅసం –బద్ధము –గెల్చి ,గద్దె గొని పాండవులే ,యువరాజు నెన్నుచో –ఇద్ధ కళా నిరాత్ముని పరీక్షితునిన్ గొనినారు ,శాంతి సం-సిద్దత బూని యెల్లరును క్షేమమునన్ బ్రతుకంగ  జెల్లదే’’(కవి  తిక్కనార్యుని ప్రజాహిత శాంతి సందేశం )

    ఈ కవిగారి గురించి వారి కావ్య రచన గురించి నేనూ ఇప్పటిదాకా తెలుసుకోకపోయినదుకు సిగ్గు పడుతున్నాను .ఇంతటి కావ్యాన్ని చదివి ఆస్వాదించలేక పోయినదుకు బాధగా ఉంది .ఇప్పటికైనా చదివి అందులోని సారాన్ని మీతో పంచుకొన్నదుకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నాను .. మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-19-ఉయ్యూరు

  ఇప్పుడు మీకు శ్రీ  కడెము వేంకట సుబ్బారావు కవి వరేణ్యుల గురించి నేను నిన్న గీర్వాణం-4లో రాసిన వ్యాసం పొందుపరుస్తున్నాను

    గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా  వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర  రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .

  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర  సుప్రభాత  శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం  -ఉత్తిష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు  అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరసభారతి 136 వ కార్యక్రమంగా 25-1-19 శుక్రవారం సాయంత్రం శ్రీ సువర్చాలాంజ నేయ దేవాలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172 ఆరాధనోత్సవం

సరసభారతి 136 వ కార్యక్రమంగా 25-1-19 శుక్రవారం సాయంత్రం శ్రీ సువర్చాలాంజ నేయ దేవాలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172 ఆరాధనోత్సవం

 

No photo description available.
Image may contain: 2 people
No photo description available.
Image may contain: 2 people, people sitting and indoor

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి ౧౨౦వ జయంతి మహోత్సవ ఆహ్వానం -6-2-19 సా 6-త్యాగరాజ గాన సభ -హైదరాబాద్

కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి ౧౨౦వ జయంతి మహోత్సవ ఆహ్వానం -6-2-19 సా 6-త్యాగరాజ గాన సభ -హైదరాబాద్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా  వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర  రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .

  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర  సుప్రభాత  శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం  -ఉత్తిష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు  అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)

అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం

  అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కు౦జరుడు  .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి .కొత్తవారినెవ్వరినీ ప్రోత్సహించనివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వెల్లాల కవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ .తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగ రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,’’శృంగార శేఖర భాణం’’కూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డిత్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అనీ  అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు  అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .

  భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం  చారు చంపూ ప్రబంధం ”.

అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చివర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .

  ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –

”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేత శృ౦ఖలితమ్

రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”

  ఇప్పుడు వెల్లాలవారి’’ శృంగార శేఖర భాణ౦ ‘’గురించి తెలుసుకొందాం –

ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వెలువరించిన ఈ గ్రంథం మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండాగారం లోని ఒకే ఒక  వ్రాతప్రతి ఆధారంగా పరిష్కరించి ముద్రించింది .పీఠికలో ఆంధ్రులు రాసిన భాణాలను ఎన్నిటినో పేర్కొని ,అభినవ కాళిదాస బిరుదా౦కితులను గురించి ప్రస్తావించి  వెల్లాలవారు భాగవత చంపూ ప్రబంథాదులు రచించిన కవి అని తెలియజేశారు .ఇవికాక శ్రీ రంగాచార్య కృత పంచభాణ విజయం (1887),శ్రీ వరదాచార్య కృత వసంత తిలక భాణ౦  (1872)ఈచంబాడి శ్రీనివాసాచార్య కృత శృంగార తరంగిణీ భాణ౦  (1883)తమ  ఇంట ఉన్నాయని ఈ ముగ్గురూ తెలుగువారే అనీ  సమీక్షకులు శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు చెప్పారు .పీఠికలో పేర్కొన్న రేచర్ల సింగన కృతమైన ‘’కందర్ప సంభవ భాణం’’ లభించలేదని ,దీన్ని తన రచనయే అని చమత్కార మంజరిలో విశ్వేశ్వర కవి ,రసార్ణవ  సుధాకరం లో సర్వజ్ఞ సింగ భూపాలుడు పేర్కొన్నారని చెప్పారు .

    దశ విధ రూపకాలలో భాణం ఏకాంకిక . .శృంగార లేక వీర రస ప్రధానం .కాని శృంగార ప్రదానాలే ఎక్కువై  జుగుప్స కలిగిస్తాయన్నారు శాస్త్రీజీ .భాణకర్తలు దాదాపు అందరూ వ్యాకరణ తర్క మీమాంస వేదాంతాలలో నిష్ణాతులే .

  భాణం ఏక పాత్ర ప్రయోగం తో ,రంగ ప్రవేశం చేయని పాత్రల ప్రస్తావనతో ,ఆ పాత్రల స్వరాలను చక్కగా అభినయిస్తూ రక్తి కట్టిస్తుంది .ఖడ్గయుద్ధాలు ,పొట్టేళ్ల పోరాటాలు ,కోళ్ళపందాలు ,జార ధర్మాసనాలు  వర్ణింపబడతాయి .ఆయాపాత్రల ,శబ్దాల అనుకరణ వలన ప్రయోజన సిద్ధి లభిస్తుంది .అందుకే భాణం శ్రవ్య కావ్యానికి దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది అంటే  ధ్వన్యనుకరణ విద్యా ప్రదర్శనానికి భాణం గొప్ప వేదిక అవుతుందన్నమాట .ఒకే పాత్ర అద్భుతమైన నాటకీకరణ ,అసాదారణమైన ధ్వన్యనుకరణ వలన భాణం బహు  రక్తికడుతుంది .  శృంగార శేఖర భాణంలో ప్రధమ శ్రేణికి చెందిన ప్రాతిభా విలాసం తక్కువగాఉన్నా ,కవితాధార ,శృంగార రసవర్ణన ,చమత్కారం పుష్కలం  గా ఉన్నాయి .కవి కవిసమయాలను అనువుగా ఉపయోగించుకొన్నాడు అని సంపాదకులు చెప్పింది యధార్ధమన్నారు నోరివారు .ప్రస్తావనలో సూత్రధారుడు ప్రేక్షక సమాజం గురించి చెబుతూ –

‘’అధీతరతి తంత్రాణా మనంగ –బ్రహ్మ వాదినం –సోయం విదగ్ధ మిశ్రాణా౦ –సమాజ సముపస్థితిః’’అంటాడు .నాయకుడు దారిలో చందనలత తల్లి రమ్మని లోపలి పిలువగా అనుకొన్నమాటలు –

‘’కిమాత్ధ?అంతర్న ప్రవిశ్యతే  భావే వేతి-శిఖి సాంప్రతముత్పలమాలాయా దర్పణ పరిణయ నోత్సవార్ధం గమ్యతే –శ్వః సమాగామాన్తాస్మి –ఇయ మాశీః

‘’స్తవ శాలి సుతా యాస్తే తరంగిత రతిక్రియం  -అస్తు మన్మథ సర్వస్వ మఖండిత మిదం వయం ‘’

 చివరలో భరత వాక్యం కూడా కాముకుల ఆశయాలకు అనుగుణంగానే సాగింది –

‘’అనితర రసా ధీనం భూయా దనంగ పదం పదం(పరం ) –హృదయ మసకృచ్చ్సంగా రాద్వైత శృంగలితం నృణాం-శశిధర కలా పీడం శ్యామామయం కరుణామయం   –శమయతు పునర్జన్మ క్లేశం మమాపి వరం మహః ‘’

  ఆధారం –శృంగార శేఖర భాణ౦ పై శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు 1973 జనవరి భారతి మాసపత్రికలో చేసిన సమీక్ష .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[

జీవిత విశేషాలు
ఆయన జూన్ 16 1949 న సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ ఘనపాఠీ గారివద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణవిద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ మరియు వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్యశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, లంక నరసింహశాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి మరియు రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి లవద్ద అభ్యసించారు.[2]

సత్కారాలు, బిరుదులు
శాస్త్రనిధి
శాస్త్ర రత్నాకర
శాస్త్ర మహాదధి
శాస్త్ర భూషణ
పండిత రత్న
శాస్త్ర విద్వాన్ మణి
విద్యా వాచస్పతి
శ్రీ రాఘవేంద్రస్వామి అనుగ్రహ పురస్కారం[1]
దర్శన అలంకార బిరుదు – శ్ర్ంగేరి పీఠాదిపతిచే.[1]
ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. తిరుపతి లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ శృంగేరి మహాస్వామి ఆయనకు “సంచాలకత్వం” బిరుదును యిచ్చారు.[2]

ఆయన అనేక వేదసదస్సులలో పాల్గొని సంస్కృత సాహితీ జ్ఞానాన్ని అందిస్తుంటారు.[3]

ఆధారం -వీకీ పీడియా
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-19
—

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

387-పోతన భాగవతం  సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

  వ్యాసమహర్షి సంస్కృత భాగవతం మహా ప్రశస్తి రచన .దానికి పోతనామాత్యుని అనువాదం మందార మకరందం .అలాంటి పోతనగారి తెలుగు భాగవతాన్ని సంస్కృతం లోకి తర్జుమా చేయటం అంటే ఆషామాషీ కాదు .అసాధ్యం అని కూడా అని పిస్తుంది .కాని దాన్ని సుసాధ్యం చేసిన పండితకవి శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు .పోతనగారి రచనలో ప్రహ్లాద చరిత్ర ,గజేంద్ర మోక్షం ,,వామనావతారం ,గోపీ కృష్ణ విలాసం ,కంస వధ ,ఉద్దవ సందేశం భ్రమర గీతాలు  రాత్నాలవంటి భాగాలను ఎన్నుకొని సంస్కృతీకరించారు .పోతనగారి మాధుర్యానికి ఏమాత్రం భంగం రాకుందే  సంస్కృ తానువాదం సాగటం చాలా గొప్ప విషయం .పోతనగారి తెలుగు పద్యాలకు దీటుగా సంస్కృత శ్లోకాలు రాసి సెభాష్ అనిపించుకొన్నారు .పోతన చెప్పని విషయాలను కూడా చెప్పి మెరుగులు కూడా దిద్దారు .

  ధర్మరాజు నారదుని ప్రశ్నించటం లో మూలం లో లేని ‘’ప్రహ్లాదస్తుల పీలతా సురకలం జారణ్య జాతాః భవత్ ‘’అనే రూపకాన్ని చేర్చి పవిత్రతను కాపాడారని శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు తన సమీక్షలో తెలిపారు .పోతన అనుప్రాసాలను ఉన్నది ఉన్నట్లుగా ,కొన్ని చోట్ల వేరే శబ్దాలతో సన్నిధానం వారు సొగసు చేకూర్చారు .’’బాలం హరిపద చిన్తాలోలం దూరీ కృతాఘ జాలం త౦ శ్రీలం పితాజిఘాం సత్కథ  ,మిత్యాహస్మ –సూనుం శాంత గుణ ప్రదాను’’మొదలైన పద్యాలను ‘’పుత్రం పాప లతా లవిత్ర మమలజ్ఞానైకపాత్రం మహా భ్రాత్రం’’మొదలైన స్వతంత్ర అనుప్రాసలతో సంస్కృతీకరించి వన్నె తెచ్చారు .-

‘’హాలాపాన విజ్రుంభమాణమద గర్వోద్రిక్త దేహోల్లసత్ –బాలాలోకన శ్రుమ్ఖలా నిచయ స౦బద్ధొన తర్తు౦ క్రమః –సంసారంబు నిధిం కదాపి చమహా విద్యా౦శ్చధిక్కామినీ –హేలా కృష్ణ కురంగ శాబక ఇవ స్యాద్ భ్రాతరఃపశ్యత ‘’.

  నృసింహావతార౦ లో వచనం విభక్తి ప్రత్యయాల మార్పుతో  ఎక్కువభాగం మూలమే ఉండటం చేత పోతన ప్రదర్శించనట్లే అయింది అంటారు నోరివారు .గజేంద్ర మోక్షం లోని ‘’లావొక్కింతయు లేదు ‘’పద్యానికి  సంస్కృతాను వాదం చూద్దాం –

‘’క్షీణం మే అంగబలం ధృతి ర్విచలితా ,స్థానాచ్చ్యవంతే నవః –నమ్ముగ్దోస్మి,భ్రుశం ,కృశోస్మి భిన్నోస్మి చ –

నత్వద్వేద్యపరం శరణ్య మనమాం క్షాంతాపరాదాన్ ,రయా –దాయా హేశ్వర,పాహిమాం ,వరద  భో రక్ష సర్వేశ్వర’’

  వామనావతారం లో ‘’ఆదిన్ శ్రీసతికొప్పుపై ‘’అనే పోతన ప్రశస్త పద్యానికి  సన్నిధానం వారి    సంస్కృతానువాదం –

‘’ఆదౌ శ్రీ యువతేః కచేష్యద తనూ వల్క్యాంతదంశోత్తరా-సంగే గంగ తలేతతః కుఛ తటే పాదాంబుజా తద్వయే

యోస్తే వ్యాపృత యేష పాణి రధరో మేపాణి రస్త్యుత్తరః-శ్రేయో స్మాత్కిము శాశ్వతం భవతి కిం శరీరం శ్రియః ‘’

అలాగే ‘’ఇట్లు విష్ణుండు గుణ త్రయాత్మక౦ బగు విశ్వ రూపంబు ధరియించిన భువియు ,నభంబును ,దివంబును దిశలు ‘’అనే విశ్వ రూప వర్ణన వచనం అంతా,   సంస్కృతానువాదం లో ప్రత్యయాలమార్పుతో –‘’ఏవం వటునా ధృతే  గుణ త్రయాత్మకే విశ్వ రూపే ద్యావా పృధివ్యౌదిశః ‘’అనే పోతనగారి శబ్దాలతోనే చేయటం సంమోదావహంగా ఉంది అన్నారు నోరి నరసింహ శాస్త్రి గారు .

  మను చరిత్రను శ్రీ కుంటి మద్దిశేష శర్మగారు సంస్కృతం లోకి  అనువాదం చేసినప్పుడు నోరి వారు ‘’ఆంద్ర కావ్యాలను సంస్కృతం లోకి అనువదించేవారు సంస్కృత భూయిష్ట భాగాలను ఆ ఛందస్సులతోనే అనువదించినందుకు అభినందించాను .ఇతర అనువాదకులు కూడా ఈమార్గాన్నే అనుసరించాలి అని సూచించాను .సన్నిధానం వారు అదే మార్గాన్ని అనుసరించటం అభినందనీయం ‘’అన్నారు .’’ఈ  సంస్కృతానువాదం లో పోతన కవితా మాధుర్యం సంస్కృత భాషా విదులకు చవి చూపి నందుకు సన్నిధానం శాస్త్రి గారు స్తవనీయులు ‘’అని శ్లాఘించారు .

2-సన్నిధానం వారు కొన్ని ప్రసిద్ధ  కావ్యకథలను’’ ‘’కావ్య కథా’’పేరిట సంస్కృతీకరించారు . .ఈకథలను ఇంగ్లీష్ లో చార్లెస్ లాంబ్ షేక్స్పియర్ నాటక కధలను రాసినట్లు రాశానని శాస్త్రిగారు చెప్పుకొన్నారు  .శాస్త్రిగారి ప్రయత్నం మంచిదేకాని కాని అందులో మాధుర్యం లేదన్నారు నోరి వారు .కొన్ని ఆంధ్రకావ్య కథలను అనుసరించక స్వతంత్రత చూపారనే అన్నారు .కాని జాగ్రత వహించనందున అనౌచిత్యాలేర్పడ్డాయంటారు .శ్రీరాముడు సముద్ర తరణం ‘’సాగరోయం దశ యోజన విస్తీర్ణఃశతకాల దఘ్నశ్చ’’అని మాత్రమె అన్నాడుకాని శాస్త్రిగారు దాన్ని’’’శతయోజనమాయతమ్’’అని చెప్పటం భ్రమ జనితం .ఉడత సాయాన్ని ;;చిక్రోడకధ’’గా రాశారు .ఉడతకన్నా ముందే కాకులు గ్రద్దలు ,చీమలు సేతుబంధనానికి సాయం చేసినట్లు  శాస్త్రిగారు కల్పనా చేశారని ,కాని రాముని దయ ఉడతపై మాత్రమె చూపి మిగిలిన జంతువులపై చూపక పోవటం సందర్భ శుద్ధిగా లేదంటారు నోరివారు .రంగనాధ రామాయణం లో ఉడుత సాయమే ఉందికాని మిగిలినవాటి సాయం లేనేలేదన్నారు .ఏమైనా ఇదంతా అవాల్మీకం .

  ‘’ఏకలవ్య కధ’’లో ద్రోణుడే కుడి బొటన వ్రేలును గురు దక్షిణగా కోరినట్లు చేసిన శాస్త్రిగారికల్పన ఆంద్ర భారత కధకు కూడా విరుద్ధమే అని తేల్చారు శ్రీనోరి ..ప్రస్తావనలో శాస్త్రిగారు ‘’సంస్కృతం లోని వాసవదత్త మొదలైన వాటిని ప్రస్తావించి వాటిలో కదా సరస్వతీ నది లాగా కనబడీ కనబడనట్లున్నది ,అందుచే వాటిని చదవటానికి బుద్ధిపుట్టదు’’అని ఆక్షేపణ సమంజసం కాదు .లోకోత్తర చమత్కారం అయినప్పుడే రసవంతం అవుతాయి ‘’అని తీర్పు ఇస్తూ ఈ సంస్కృత  కథలు  సంస్కృత భాషాధ్యయనం చేసే విద్యార్ధులకు ఉపయోగపడుతాయి అనటం లో ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పారు .

3- భర్తృ దానం –అనేది సన్నిధానం వారు పారిజాతాపహరణ కధకు చేసిన    సంస్కృతానువాదం శృంగారం .దీనికి ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు ఇంగ్లీష్ లో అద్భుతమైన ఉపోద్ఘాతం రాశారని నోరి వారు కితాబిచ్చారు .పారిజాత కధవరకు శృంగార రస ప్రాదాన్యమనీ ,తులాభార కథ శాంతరస ప్రదానమైనదనీ, శృంగారం  అంగరసమై ,ఇంద్రునితో యుద్ధాన్ని రెండుపద్యాలతో సంక్షిప్తఎపింఛి ,అంగ కధకు అతి విస్తృతి దోషం రాకుండా చేశారని పుల్లెలవారు మెచ్చారనీ ,కాని సన్నిధానం వారి కథలో 23పేజీలు  పారిజాత కథ ఉంటె శీర్షికగా పెట్టిన భర్తృ దానకద 12పేజీలే ఉందని కనుక పుల్లెలవారు చెప్పిన దోషం ఇక్కడా వర్తి౦చిదనీ   నోరి వారు ఉవాచ .సంస్కృత దృశ్యకావ్యాలలో ఉన్న కథా బిగువు శ్రవ్యకావ్యాలలో ఉండదనటం ప్రసిద్ధం .వ్యాకరణ శాస్త్రం చేత సాధించలేని ప్రయోగాలు   సంస్కృతానువాదం లో సన్నిధానం వారు చేయటం ఉచితంకాదని నోరి శాస్త్రిగారి అభిప్రాయం .పునీత శబ్దాన్ని తానూ సమర్దిస్తాననీ నోరి ఉవాచ .పారిజాత కథను సులభ  సంస్కృతం లో రచించి అఖండ భారత వ్యాప్తికల్గించిన శాస్త్రిగారి ప్రయత్నాన్ని తాను ‘’అగ్గించు చున్నాను ‘’అన్నారు నోరిశ్రీ .

4-నందచరితం అనేది సన్నిధానం వారు ‘’భక్తనందనారు ‘’చరిత్రగా సంస్కృతం లో రాసిన రచన .దీనికి ఆంగ్లం లో ఉపోద్ఘాతం శ్రీ కేవిఎన్ అప్పారావు రాశారు .’’నక్క ఎక్కడ నాగలోకమెక్కడ ‘’వంటి  తెలుగు సామెతలను చాలా సులభంగా  సంస్కృతీకరించినందుకు అప్పారాగారూ నోరివారూ సన్నిధానం శాస్త్రిగారిని మనస్పూర్తిగా శ్లాఘించారు .

5-కళాపూర్ణోదయః – పింగళి సూరన కళాపూర్ణోదయ కథకు సన్నిధానం వారి   సంస్కృతీకరణం ఇది .ఆంద్ర కావ్యాలలోనే కాదు భారతీయ భాశాకావ్యాలన్ని టి లోనూ విశిష్టమైంది పింగళి సూరన కళాపూర్ణోదయం అనీ,రామరాజ భూషణుడి ‘’ వసు చరిత్ర’’వచ్చిన వందేళ్ళకు’’ కాళహస్తి ‘’కవి దాన్ని  సంస్కృతీకరింఛి గొప్ప గౌరవం కలిగించాడనీ , పూర్వం సంస్కృత భాషమీద దండయాత్ర చేసిన ప్రాకృత భాషాకవుల కావ్యాలు వాటిలోని సంస్కృత చాయవలననే  ఇప్పటికీ నిలిచిఉన్నాయని ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ దూరదృస్టి తో చేబట్టిన సంస్కృతీకరణ చాలా విశేషమైనదని నోరి నరసింహ శాస్త్రిగారు అభిప్రాయ పడ్డారు .

  ‘’కళాపూర్ణోదయం సరస్వతీ చతు ర్ముఖుల లీలా కేళి ని ఆధారం గా చేసుకొని ,దాని ఆధారంగా ‘’గృహరాజు మేడ ‘’గా నిర్మించిన సుందర కథా మందిరం ..దీన్ని  సంస్కృతీకరించే పని చేబట్టిన సన్నిధానం వారు మిక్కిలి అభినదనీయులు .’’అని మెచ్చారు నోరివారు .పుల్లెలవారి ప్రస్తుతిపొందిన ఈ అనువాదం అదే స్థాయిలో నడచింది అనవసర విషయాలు తీసేసి చిక్కని చక్కని కథను సంస్కృతం లో నడిపించారు .సంస్కృత కావ్యాలలో సర్గలో శ్లోకాలన్నీ ఒకే వృత్తం లో ఉండి,సర్గాంతం వేరే వృత్తం లో ఉంటుంది .సన్నిధానం వారు ఆంద్ర సంప్రదాయాన్నే అనుసరించారు .మూలం లోని 105పద్యాల మంగళాచరణం ,కృతిపతి వంశ వర్ణన వదిలేశారు అనువాదం లో .ద్వారకాపుర వర్ణనతో ప్రారంభించారు .దీనివలన తెలుగు కావ్యమర్యాద సంస్కృత భాష వారికి తెలియదు .కొన్నిపద్యాలను సంక్షేపించి కొన్ని యధామూలంగా అనువదించారు .

  మొదటి ఆశ్వాసం లో కలభాషిణి నోట సూరన వినిపించింది సీసపద్యం  -’’పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన’’  దీనికి శాస్త్రిగారి   సంస్కృతానువాదం –

‘’పదాని పంధాయ మిథో హితాని –కావ్యే రాసానా మనుకూల రీతీః-గుణానలంకార గణా౦ స్తదర్హాన్ –బద్నన్ కవీ౦ద్రో న మహీయతే కైః’’

 పద్యం తాత్పర్యమైతే వచ్చిందికాని ,కాని తెలుగుపద్యం అందం అసలు రానేలేదు .వాచ్య ,లక్ష్య ,వ్యంగ్యార్దాల ,నిర్దోషిత సంగతి మచ్చుకైనా అనువాదం లో రాలేదు .

సూరన లయభాతి పద్యం –‘’చలువల వెన్నెలలు చెలువునకు సౌరభము ‘’దీన్ని శాస్త్రిగారు స్రగ్ధరా వృత్తం లో అనువాదం చేశారు –

జ్యోత్స్నాయా శ్శీతలాయా యది సురభిలతా –శైత్య సౌరభ్య భాజాం –కర్పూరాయాం మృదుత్వం యదిచ ,మధురిమా –విద్యతే చే న్నిగాఢం-వాతానాం చంద్ర వాద్రేర్మసృణ మ్రుడులతా –శైత్య సౌరభ్య భాజా –మర్హం త్యాఖ్యాతు మేతే సదృశ ఇతి కవే –రస్య కవ్యస్య వాగ్భిః’’

  ఈ సంస్కృతానువాదం యధా మూలంగా హృద్యంగా ప్రౌఢం గా సాగిందని దీని తో శాస్త్రిగారి సంస్కృత కవన సమర్ధత జగత్తుకు  చాటిందని మనస్పూర్తిగా నోరి శాస్త్రిగారు మెచ్చుకున్నారు .శాస్త్రి గారి సంస్కృత అవతారికలో ఆంధ్రకవుల ఆచారాన్ని  సహృదయులకు నమస్సు లర్పించారు  –

‘’గోస్ఠశ్వా  విమృశ౦తియే కవి కృతీః కర్తుం –న శక్తాః స్వయం –తాన్ సంప్రీ జయితుం వహి ప్రభవతి బ్రహ్మాసి –తేభ్యో నమః ‘’

  ఇదీ బ్రహ్మశ్రీ సన్నిధానం సూర్యనారాయణ  శాస్త్రిగారు తెలుగు కావ్యాలకు సంస్కృతం లో చేసిన మహోపకారం .ఆంధ్ర గీర్వాణాలలో జగజ్జెట్టీలు కనుక వారి అశేష పాండితీ వైదుష్యానికి వారి అన్ని రచనలు మచ్చుగా నిలిచాయి .

  సన్నిధానం వారి మహుముఖీన ప్రతిభను గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం లోనే రాశాను .ఇప్పుడు ఈ అదనపు సమాచారం లభించటం చేత దాన్ని విస్తృత పరచాను .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార  వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో  సంస్కృతోతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .

   శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు  చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే  అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి  రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .

అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి  పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .

వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి  గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై  అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 ప్రస్తుత కథనానికి ఆధారం –శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1972 జులై భారతి మాసపత్రిక ,1964డిసెంబర్ భారతి ,మాసపత్రికలో చేసిన సమీక్షలు అని సవినయంగా మనవి చేస్తున్నాను .వీటిని నాకు అందించిన వారి కుమారులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )

మైసూర్ ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరీ లో అసిస్టెంట్ పండితుడుగా ఉన్న లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య ‘’భగవద్గీతా మీమాంస ప్రబందం’’రాశాడు .తనకుటుంబం  గురించి చెప్పుకోలేదు కాని ,తన గురించి రెండు శ్లోకాలలో ఈ గ్రంధం లో చెప్పుకొన్నాడు .

‘’నానా భాషాసు భాషాపతిరివ మధురోదార గంభీర వాదీ-విద్వద్గోస్టి సుభాషా  సుఖ రసిక మనాః

మైసూర్సమ్రాట్ట దేశే సదధి కృతి పదే ప్రోన్నతే భాసమానః –శ్రీమాన్ దీమాన్ యశోమాన్ భువి జయతి శ్రీ వి.యెన్.నృసింహార్య శర్మా ‘

తస్మై శ్రీ నృసింహ య్యంగార్య వార్యాయ ధీమతే –సమర్పితం సవినయమే తత్పుస్తకమస్తు శమ్’’

అసలు విషయం లోకి ప్రవేశిస్తూ ఇలా రాశాడు –

‘’  అధ ఖాలు భగవద్గీతా నామకం మహాభారత భీష్మ పర్వాన్తర్గత మధ్యాత్మ శాస్త్ర ముపనిషచ్చబ్ద  వ్యపదేస్య౦  క౦చన ప్రబంధ ముపబామహె –అధీమహోమాచాన్వహం సర్వేపి వయం పరమ నిశ్రేయస కరమితి.

386-ధవళేశ్వర స్తోత్ర సుధకర్త –సామవేదం రామ మూర్తి శర్మ (1931)

జీవిత విశేషాలు

బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం నందలి రమాధీర సంస్కృత కళాశాలలో గురుకులపద్ధతిలో ముడెగుర్తి వి.ఎస్.ఎన్.శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేసారు. ఆయన భాషాప్రవీణ, సాహిత్యాచార్య, పురాణశాస్త్రి అర్హతలను సాధించారు. ఆంధ్ర సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేసారు[1]. వీరు చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితిని స్థాపించి ఎన్నో సాహితీ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య సంస్కృత పాఠశాల స్థాపించి ఎందరికో సంస్కృత బోధన గావించి, విద్యాదానం చేశారు. దాదాపు అర్ధ శతాబ్ది కాలం పురాణ ప్రవచనములు చేసిన పండిత ప్రకాండులు వీరు. కవిగా ప్రబంధ కర్తగా బహు ప్రసిద్ధి వహించారు. ధవళేశ్వర స్తోత్ర సుధ, శ్రీదేవి లీలాసుధ, ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర, ధృవోపాఖ్యానము, కామేశ్వర స్తోత్రసుధ, శ్రీగణేశాభ్యుదయం, శ్రీమదభీష్టద రామాయణము జగన్నాథ స్తోత్రసుధ, వేంకటేశ్వర నక్షకోమాల, భగవన్నుతి దండకమాల, నేనెవడు?, శ్రీసుబ్రహ్మణ్య సీసపద్య శతకము, నిరాలంబోపనిషత్,సుబ్రహ్మణ్య ‘సకార ‘సహస్రం, వంటి గ్రంథాలను రచించారు.

ఈ మహనీయుని పాండిత్య కవిత్వాలు సుబ్రహ్మణ్యాంకితాలై వారి యోగసాధనకు రూపాలై ఉన్నాయి. అరుదైన పురాణాంశాలను శోధించి వాటిని పరతత్త్వంతో సమన్వయించడం వారి సరణి. స్కందోపాసకులైన వీరు నిష్కపట భక్తితో కూడిన జ్ఞాని. వీరి రచనలు ఆర్షతేజోవిరాజితాలు. సాధారణంగా హరికథల్లో వాడే “తొహరా” అనే రగడ వంటి దేశీయ వృత్తాలతో బ్రహ్మవైవర్త పురాణాంతర్గత బ్రహ్మఖండ ప్రకృతి ఖండాలను రచించారు. “దేవీభాగవతం” అనే ఒక అరుదైన ప్రాచీన గ్రంథాన్ని (సాధారణంగా లభిస్తున్నదేవీభాగవతానికి విభిన్నమైన) అదే వృత్తంతో “దేవీలీలాసుధ” పేరుతో రచించారు. ఇవి బృహత్ గ్రంథాలు. థర్మ వేదాంతశాస్త్ర చర్చ చేసిన గ్రంథాలు నేనెవడను?”, “తత్త్వదర్శిని కామేశ్వర స్తోత్ర సుధ, నిరాలంబోపనిషత్ ప్రశ్నోత్తర గర్భితంగా రచించిన సుబ్రహ్మణ్యసీస పద్య శతకం, ధవళేశ్వర స్తుతి, జగన్నాథ నక్షత్రమాల వంటి గ్రంథాలు ఆర్ష విజ్ఞానాన్ని ఛందోబద్ధంగా అందించిన రచనలు. ఋషిధర్మ సముపాసనతోనే ప్రతిక్షణం ఒక జ్ఞాన దీప్తిగా వెలిగిన వారి భావన నుండి వెలువడిన మరొక పద్యగద్యాత్మిక కావ్యం శ్రీమదభీష్టద రామాయణము” వాల్మీకి, అధ్యాత్మ రామాయణాలనే కాకుండా బహుపురాణాల, మంత్రశాస్త్రాల సమన్వితంగా సంపూర్ల రామాయణాన్ని రచించారు. వీరి ప్రతి రచనా తన అభీష్టదైవమైన కుమారస్వామి వచరణాలకు అర్పించుకున్నారు. జీవితంలో ఆటుపోట్ల ఎన్ని ఎదురైనా తన ప్రతిభావ్యత్పత్తులకు తగిన రాణింపరాకున్నా అధ్యాత్మ విద్యా సంస్కారంతో హిమశైల సమాన ధీరగుణంతో నిలచిన పరిపూర్ఖులు వీరు. ఆబాల్యం వీరి వైఖరిని గమనించడమే సాధనగా విరిసిన ఆధ్యాత్మిక తేజో విలాసమే “ఆర్షధర్మోపన్యాసకేసరి”.

ఆయనకు ఫిబ్రవరి 10,2008 న విశాఖపట్నం లో స్వర్ణకంకణం యిచ్చి సత్కరించారు.[2]

వ్యక్తిగత జీవితం

సామవేదం నరసింహాచార్యులు(తండ్రి), సత్యవతి (తల్లి) దంపతులకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమారుడు సామవేదం రామమూర్తిశర్మ. రామమూర్తిశర్మ మూడవ కుమారుడు “సామవేదం సత్యనరసింహశర్మ”[3]. మరొక కుమారుడు సామవేదం షణ్ముఖశర్మ ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.

రచనలు

“శ్రీ ధవళేశ్వర స్తోత్ర సుధ”
గణేశాభ్యుదయం [4]

ఆధారం –వీకీ పీడియా

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-19-ఉయ్యూరు

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)

సంస్కృత మహా విద్వాంసుడు మహాకవి అనేక గ్రంథ రచయిత కాళీ ప్రసన్న విద్యారత్న 1849లో బెంగాల్ లో జన్మించి 75వ ఏట 1924లో మరణించాడు .1908నుంచి 10వరకు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భట్టా చార్య కుటుంబానికి చెందిన ఈ కవి బరిశాల్ లోని ఉజిర్ పూర్ గ్రామం లో జన్మించాడు .ఫరీద్ పూర్ జిల్లా ధనూకా గ్రామం లో చతుష్పతి అంటే వీధి బడిలో సంస్కృతం అభ్యసించాడు.బారిశాల్ లో ఎంట్రన్స్ పాసై కలకత్తా స్కాటిష్ చర్చ్ కాలేజి  చేరి బి .ఏ ,ఎం.యే లు పాసై ,1881 లో ఢక్కాజగనాథ కాలేజిలోసంస్కృత  టీచర్ గా చేరి ,తర్వాత 1901వరకు ప్రెసిడెన్సి కాలేజిలో పనిచేసి ,తర్వాత ఆకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .

భారతీయ పురాణాల ను తనసంపాదకత్వం లో వెలువరించి ,సంస్కృత రచనలు ఎన్నో చేశాడు .ఆయన రచనలలో బృహత్ శివ పురాణం ,శ్రీ శ్రీకృష్ణ చరితం ,వేదాంత దర్శనం ,బృహద్యాగమిత,బృహద్దహ పురాణం ,శివ సంహిత ,సంజీవ్ చందర్ గ్రంధావళి ,కాళీ కైవల్యదాయిని ,కల్కిపురాణ౦ ,స్తబ్ కోవచమాల ,కైతంత్ర మొదలైనవి ఉన్నాయి .సంస్కృత విద్యా వ్యాప్తికి టోల్ లను సందర్శించి ,టోల్ వ్యవస్థను పటిస్టపరచాడు .1911లో సంస్కృత సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యాడు .మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నాడు.

384-విష తంత్ర కర్త – కవిరాజ్ జైమిని భూషణ్ రే(1879- 1926)

కవిరాజపంచానన రే కుమారుడు కవిరాజ్  జైమిని భూషణ్ రే 1879లో ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లా పోయోగ్రాం లో జన్మించాడు .స్థానికంగా విద్యాభ్యాసం ప్రారంభించి ,తర్వాత దగ్గరే ఉన్న కలకత్తా లో14వ ఏట సౌత్ సబర్బన్ స్కూల్ లో  సెకండరీ విద్య పూర్తి చేసి ,కలకత్తా  సంస్కృత కళాశాలలో బి ఏ చదివి ,ప్రభుత్వ సంస్కృత కాలేజి లో మాస్టర్ డిగ్రీ పొంది ,కలకత్తా మెడికల్ కాలేజీ లో డాక్టర్ డిగ్రీ అందుకొన్నాడు .ఇంటిదగ్గర తనతండ్రి వద్ద ఆయుర్వేద విద్య క్షుణ్ణంగా అభ్యసించాడు .విద్యా తృష్ణ తీరక సంస్కృతం లో ఎం .ఏ .చేశాడు .మెడిసిన్ లో గోల్డ్ మెడల్ పొందాడు .ఆయన అభిమాన విషయం గైనకాలజీ అండ్ మిడ్ వైఫ్రి ‘’ఇంగ్లిష్ వైద్యం పై వ్యామోహం పెంచుకోకుండా తండ్రిలాగా కవి రాజ్ అవ్వాలని నిశ్చయించుకొన్నాడు .బంగ్లా –మార్వారీ హాస్పితలో లో నెలకు నలభై రూపాయలజీత తో కవిరాజ్ గా ఉద్యోగం పొందాడు .

ఆయుర్వేదం పై ఉన్న విపరీతమైన అభిమానం తో దానిలోనే  రాణించా లనుకొని ,’’ఆయుర్వేదవైద్యం  కడుపుకు కూడు పెట్టకపోతే  ఆయుర్వేద ‘’పంచన్ ‘’అంటే  విరేచనాలమందు అమ్ముకొని అయినా బతుకు తాను ‘’అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు .ఆనాటి ప్రభుత్వం కూడా ఆయుర్వేదానికి ఏరకమైన ప్రోత్సాహం ఇవ్వలేదు .చివరికి ‘’వైద్యరాజ్ ఫార్మసి ‘’ఏర్పాటు చేసి ఆయుర్వేద మందుల అమ్మకం సాగించాడు .ఆయుర్వేదాన్ని ఆధునిక  వైద్యానికి సరిపోయేట్లు ఆయుర్వేద మందులను ఆయనా, ఆయన సిబ్బంది శ్రమించి తయారు చేశారు .దీని ఖర్చులకు తనఫీజును 4 నుంచి 32 రూపాయలకు పెంచాడు .బీదలకు ఉచిత వైద్యం అందించేవాడు .గ్వాలియర్ ఇండోర్ మొదలైన పట్టణాలకు వెళ్లి  మహారాజులకు  వైద్యం చేయటానికి ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొనేవాడు.క్రమంగా కవిరాజ్ పేరు ప్రఖ్యాతులు వ్యాపించి1915కు  కలకత్తాలో సేలిబ్రేటి అయ్యాడు .మద్రాస్ లో జరిగిన  ఏడవ అఖిలభారత ఆయుర్వేద సభకు అధ్యక్షుడయ్యాడు .

కలకత్తా 29 ఫరియా పుకూర్ వీధిలో అద్దె భవనం లో ‘’కవిరాజ్ అష్టాంగ ఆయుర్వేద కాలేజి హాస్పిటల్’’ స్థాపించాడు .ప్రాచీన ,అధునాతన ఆయుర్వేద వైద్యవిధానం బాగా ప్రచారమై మహాత్మాగాంధీ ని ఆకర్షించింది .9ఏళ్ళ తర్వాత  రాజా దినేంద్ర స్ట్రీట్ లో నెలకొల్పిన స్వంతభవనానికి మహాత్ముడు తన అమృత హస్తాలతో శంకుస్థాపన చేశాడు .ఇప్పుడు అక్కడ ‘’జే .బి .రాయ్ స్టేట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ ‘’ హుందాగా అందరికీ దర్శనమిస్తోంది .దాని శతవార్శికోత్సవం 2016లో ఘనంగా నిర్వహించారు .కవి రాజ్ ఈ హాస్పిటల్ నిర్మాణానికి తన స్వంత డబ్బు 70 వేల రూపాయలు ఖర్చు చేయటమే కాక ,తన చిరాస్తులను కూడా అమ్మి అభి వృద్ధి చేశాడు .ఆయుర్వేదం లో అనేక విషయాలమీద అంటే శాలక్య తంత్ర ,ప్రసూతి తంత్ర ,విషతంత్ర ,కుమార తంత్ర లను ఆధారంగా గ్రంథాలు రాశాడు  ర .ఆయన రాసిన ‘’వ్యాధులు –మూలకారణాలు –గుర్తించటం ‘’అనే పుస్తకం చాలా ప్రసిద్ధమై గొప్ప పేరు తెచ్చింది .’’ఆయుర్వేద ‘’అనే మాసపత్రిక కూడా నడిపాడు .

కవిరాజ్ జైమిని భూషణ్ రాయ్ సరోజ బాలాదేవిని వివాహమాడి ఆరుగురు సంతానం పొందాడు .కలకత్తాలో 11-8-1926న 47ఏళ్ళ వయసులోనే చనిపోవటం దురదృష్టకరం .చనిపోవటానికి ఒక్క రోజు ముందు తన అష్టాంగ ఆయుర్వేదవిద్యాలయానికి 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన మహా వితరణ శీలి .ఆయన మరణానంతరం  పాతిపుకూర్ లో ఆయన నివాసమున్న ఇంటిని గార్డెన్ ను క్షయ ఆస్పత్రిగా మార్చారు . స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రముఖ వైద్యుడు, బెంగాల్ ముఖ్యమంత్రి బి. సి .రాయ్ అని పిలువబడే డా బిధాన్ చంద్ర రాయ్ ఈ హాస్పిటల్ కు శంకు స్థాపన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-19-ఉయ్యూరు

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment