అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు
సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి తెలియ జేశాం
 ఏప్రిల్ 1 శనివారం మేమిద్దరం మయ మనవడు చర ణ్ కారులో బయల్దేరి హైదరాబాద్ కు మధ్యాహ్నంమయ ఆపెద్డబ్బాయి శాస్త్రి ఇంటికి  చేరామ్. మర్నాడు నేను  మయ అబ్బాయి శాస్త్రి మనవడు కాబ్ లో బయల్దేరి ఓల్డ్ బోయిన్ పల్లి లో మయ అక్కా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని  బాచుపల్లి లో మయ రెండో అబ్బాయి శర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న మల్లంపేట శ్రీ ఆంజనేయ స్వామి  పక్కనే ఉన్న శివాలయం దర్శించి  మియాపూర్ వెళ్ళి మయ అమ్మాయి వాళ్ళ ఫ్లాట్ చూసి  శర్మా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని శాయ్‌ంత్రం నాలుగుకు బయల్దేరి మల్లాపూర్ చేరామ్ .
  5 వ తేదీ బుధవారం శ్రీ రామ నవమి రాత్రి 12 గం లకు శాస్త్రి బాస్ బామ్మర్ది గారి కారులో అందరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరి ,బాగెజ్ అప్పగించి వీల్ ఛైర్ సహాయం తో హాయిగా తెల్లవారుజామున (6) ఎమిరేట్స్ ఫ్లైట్ లో బయల్దేరి దుబాయ్ ఉదయం చేరామ్ .రెండు గంటల తర్వాత న్యూ యార్క్ ఫ్లైట్ లో 14 గంటలు ప్రయాణించి 6 వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు న్యూ యార్క్ చేరామ్ .అప్పటికే విపరీతం గేయా వర్షం పది ఆగింది సాయంత్రం 5 గం ల శార్లెట్  ఫ్ఫ్లైట్ కేన్సిల్ అయింది .ఆదివారం దాకా లేవన్నారు .ఎవరిదో ఫోన్ సహాయంతో మయ అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పాం .అప్పటికప్పుడు ఎమిరేట్స్ వాళ్ళతో మాట్లాడి వాషింగ్టన్ డిసీకి టికెట్లు మార్పిస్తే ఆ విమానం రాత్రి 10 గం లకు బయల్దేరాల్సింది నాలుగు గంటలు లేట్ అయి రాత్రి 3 గంటలకు బయల్దేరి నాలుగున్నరకు చేరింది .మా అమ్మాయి మా మనవడు శంకల్ప్ ను తీసుకొని రాత్రి 9 కి బయల్దేరి 600 మైళ్ళు డ్రైవ్ చేసి దీసి లీ తెల్లవారు జామున 3 కు చేరింది .సామాను కలెక్ట్ చేసుకొని అందరం అయిదున్నర కు బయల్దేరామ్ . మలీ 600 మైళ్ళు డ్రైవ్ చేసి అంటే రాను పోను 1200 మైళ్ళు అంటే 1800 కిలో మీటర్లు డ్రైవ్ చేసింది మయ అమ్మాయి .దారిలో మానవాడిని యూనీ వర్సిటీలో దింపి ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం రెండు .స్నానాదికాలు పూర్తి చేసి భోజనం చేసే సరికి 3 .కాసేపు రెస్ట్ తీసుకొని టెక్చిన సామానౌు అంతా  సర్ది రాత్రి భోజనం  10 అయింది .అంటే న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దాదాపు 12 గంటలు పడి ఉన్నాం .హైదరాబాద్ నుంచి టెక్చుకున్నవి తిన్నాం కనుక సరిపోయింది .లేకపోతే మయ పని ఖాళీ .24 గంటల్లో అమెరికా రావాల్సిన వాళ్ళం 36 గంటలకు చేరామ్ .ఇదొక కొత్త అనుభవం .అయితేనేం రెండు మహానగరాలు న్యూయార్క్ ంవాషింగ్టన్ లను విహంగా వీక్షణం చేసే వీలు కలిగింది రాత్రి వెలుగుల్లొ.అన్దుకె ఇది ´రెండు మహానగరాల కధ ;;అన్నాను -మీ దుర్గాప్రసాద్ -కాంప్ -శార్లెట్ -అమెరికా -10-4-17
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

రోసికా ష్విమ్మర్ అని అందరూ పిలిచే రోసికా బడ్డీ ష్విమ్మర్ 11-9-1877 న హంగేరి లోని బుడా పెస్ట్ లో జ్యూయిష్ కుటంబం లో జన్మించిన ఫసిఫిస్ట్ ఫెమినిస్ట్ ,మహిళా ఓటు హక్కు ఉద్యమకారిణి .ప్రపంచ ప్రధమ మహిళా ఫెడరలిస్ట్ గా గుర్తింపు పొందింది .భాషా శాస్త్రాలను సంగీతాన్ని ఇష్టపడి చదివింది .కాని కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఛిన్నా భిన్నమవటం తో బుక్ కీపర్ గా ఉద్యోగం చేయాల్సి వచ్చింది .మంచి విషయాలపై ఆసక్తి ఉండటం వలన ,స్త్రీలకు జరుగుతన్న అన్యాయాలు ఆమె దృష్టి లో పడి మహిళాభ్యుదయానికి సేవ చేయాలని నిశ్చయించు కొన్నది.
1897 లో ఇరవై ఏళ్ళ వయసులోనే ‘’హంగేరియన్ వుమెన్ క్లెర్క్స్ అసోసియేషన్’’ ను నిర్వహించింది . ఏడేళ్ళ తర్వాత 1904 లో ‘’హంగేరియన్ ఫెమినిస్ట్ అసోసియేషన్ ‘’స్థాపించి ,’’హంగేరియన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ ‘’స్థాపనకు సహకరించింది . హంగేరియన్ పీస్ సొసైటి బోర్డ్ మెంబర్ అయింది .1909 లో హంగేరి ప్రభుత్వం ష్విమ్మర్ కు చైల్డ్ వెల్ఫేర్ గవర్నింగ్ బోర్డ్ లో పదవి నిచ్చి గౌరవించింది .
1913 లో ‘’ఇంటర్ నేషనల్ వుమన్ సఫ్రేజ్ అలయన్స్( ‘’ఐ .డబ్ల్యు. ఎస్ .ఎ.)కు కరెస్పాండింగ్ సెక్రెటరి అయింది .కారీ చాప్ మాన్ కాట్ తో యూరప్ అంతా విస్తృతంగా పర్యటించి మహిళా ఓటు హక్కు ప్రాధాన్యం పై అనేక బహిరంగ సభలలో ప్రసంగించి విషయాన్ని ప్రపంచ దృష్టి కి తెచ్చింది . ’’ఆనో ‘’(మహిళ)అనే మేగజైన్ కు సంపాదకత్వం వహించింది . 1914 లో లండన్ కు వెళ్లి అక్కడ చాలా ఐరోపా వార్తా పత్రికలకు కరెస్పా౦డెంట్ గా పని చేసింది . తర్వాత ఐ .డబ్ల్యు. ఎస్. ఏ. కు ప్రెస్ సెక్రెటరి అయింది .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవటం తో స్వదేశానికి రాలేక పోయింది .ఘర్షణల నివారణకు ఉద్యమించింది .1914 లో అమెరికా పర్యటించి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ను కలిసి యుద్ధ నివారణకు ఒక తటస్థ సమావేశాన్ని నిర్వహించమని డిమాండ్ చేసింది .1915 లో ‘’వుమెన్స్ పీస్ పార్టి ‘’స్థాపనకు కృషి చేసింది .
నెదర్ లాండ్ దేశం లోని ‘’ది హేగ్ ‘’లో 1915 లో ఏప్రిల్ 28 నుండి మే 10 వరకు జరిగిన ‘’ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ వుమెన్ ‘’సదస్సులో యుద్ధం లో పాల్గొంటున్న దేశాలమధ్య ఘర్షణ నివారణకోస౦ ష్విమ్మర్ ప్రవేశ పెట్టిన ‘’న్యూట్రల్ కాన్ఫరెన్స్ ఫర్ కంటిన్యుయస్ మీడియేషన్ ‘’తీర్మానం ఆమోదింపబడి ఆమె స్పందనకు విశేష గౌరవం కల్పించారు .అదే ఏడాది చివర స్టాక్ హోం కు ‘’పీస్ షిప్ ‘’చాప్టర్ విషయమై హెన్రి ఫోర్డ్ సమర్ధన సాధించింది .కాని ఫోర్డ్ మాట నిలబెట్టుకోక పోవటం తో 1916 జూన్ లో అత్యవసర ఘర్షణ నివారణకు మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ ఉద్యమం నిర్వహించింది .ఆమె ఆందోళన ఫలించి యుద్ధ విరమణ జరిగింది.అప్పుడామె ‘’వుమెన్స్ ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడం ‘’సంస్థ ఉపాధ్యక్షురాలైంది .
ఆస్ట్రియా నుండి హంగేరి విడిపోయి 1918 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రధాని మిహలి కరోల్యి స్విట్జర్లాండ్ కు ష్విమ్మర్ ను రాయబారి గా నియమించి ఆమె విశేష కృషికి గౌరవం కలిగించాడు .ఈమెయే ప్రధమ మహిళా రాయబారి అయి రికార్డ్ సృష్టించింది . ఏడాది తర్వాత 1919 లో కమ్యూనిస్ట్ పాలన ఏర్పడి నప్పుడు వారిని ఆమె ద్వేషించటం తో ఆమె పౌరహక్కులు కోల్పోయింది .1920 లో మిక్లాస్ హోర్తీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడ దోసినప్పుడు ఆమె వియన్నాకు పారి పోయింది .1921 లో అమెరికా చేరి చికాగో లో స్థిరపడి మళ్ళీ హంగేరి మొహం చూడలేదు .చికాగోలోనే ఉంటూ’’హంగేరి లో స్త్రీల రాజకీయాల ‘’కోసం శ్రమిస్తూనే ఉంది .
అమెరికాలో ష్విమ్మర్ ఫసిఫిస్ట్ భావాలకు సోషలిస్ట్ భావాలుగా ముద్ర వేశారు . తన వ్యక్తిత్వం పై వేసిన అపవాదు నుండి బయటపడటానికి పోరాడుతూనే ఉంది . ఫ్రెడ్ మార్విన్ ఆమెను జర్మని గూఢ చారి అని బోల్షేవిక్కుల ఏజెంట్ అని అభియోగం మోపినప్పుడు ఆమె పరువు నష్టం దావా వేసి 17, 000 డాలర్ల నష్ట పరిహారం పొందింది .అయినా ఆమె ఫాసిస్ట్ భావాలవలన ఆమెకు అమెరికా పౌర సత్వం లభించలేదు .అమెరికా సుప్రీం కోర్ట్ అమెరికా కు ఆమెకు జరిగిన న్యాయ పోరాటం లో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు నిచ్చింది .1946లో అమెరికాకు జిరౌర్డ్ కు మధ్య నడిచిన కేసు లో ఆమెకు ఊరట లభించింది .జీవితాంతం అమెరికాలో’’ స్టేట్ లెస్ సిటిజన్ ‘’ గా ఉండి పోయింది .
జీవిత చరమాంకం లో ష్విమ్మర్ ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం కృషి చేసింది .1935 లో ‘’వరల్డ్ సెంటర్ ఫర్ వుమెన్స్ ఆర్కైవ్స్ ‘’ను మేరీ రైటర్ బియర్డ్ తో కలిసి స్థాపించింది .1937 లో ష్విమ్మర్ కు ‘’ప్రపంచ శాంతి ‘’బహుమతి నిచ్చి గుర్తించి గౌరవించారు .అదే ఏడాది లోలా మేవరిక్ లాయడ్ తో కలిసి ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం ప్రచారం ప్రారంభించింది .20 వ శతాబ్దం లో ఇదే ప్రపంచం లో’’ మొట్టమొదటి ఫెడరలిస్ట్ ఆర్గ నై జేషన్ ‘’.20 వ శతాబ్దం లో ఫెడరలిస్ట్ ఉద్యమం బాగా ఊపు అందుకొని ‘’అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటు ‘’కు ఊతమిచ్చింది .ఈ ఖ్యాతి అంతా ఆమెకే దక్కాలి .కాని దీనికి కారణ భూతురాలైన ష్విమ్మర్ ను గుర్తుంచుకున్నవారు అరుదైపోవటం విడ్డూరం అనిపిస్తోంది .1947లో ఆమె పేరు ను ‘నోబెల్ శాంతి బహుమతి’’కోసం ఎంపిక చేసి పంపారు .కాని దురదృష్ట వశాత్తు మరుసటి ఏడాది శాంతి బహుమతిని ఎవరికీ ప్రకటించక పోవటం తో ఆమెకు అందుకొనే అదృష్టం చే జారి పోయింది .
71 వ ఏట న్యుమోనియా సోకి న్యూయార్క్ లో 3-8-1948 న ప్రపంచ శాంతి కపోతం రోసికా ష్విమ్మర్ అసువులు బాసింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————

Posted in రచనలు | Tagged | Leave a comment

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం

ఇవాళ తెల్లవారు జామున మూడింటి దాకా మాంచి నిద్రట్టేసింది .మూడింటికి మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారే ప్రయత్నం చేశా. కాని నిద్రరాలేదు. అలాగే అయిదింటి దాకా పక్కమీద దొర్లుతూ ,అప్పుడే ప్రారంభమయే ఎఫ్ ఏం రేడియో ఆన్ చేసి శ్రీరామనవమి కనుక హాయైన రామ నామ కీర్తనలతో కాలక్షేపం చేద్దామనుకొని ,పక్కలోని ఆ బుజ్జి ము౦డను గిల్లుతూ తిప్పుతూ  నెత్తిమీద మోదుతూ స్టేషన్లు మార్చినా ఒకటి రెండు బాలమురళి కీర్తనలు తప్ప మనసుకు హాయని పించే పాటలే రాలేదు .కాని అంతకంటే చేసేది ఏమీ లేదు కనుక ఏదో మా గన్నుగా వింటూ తిట్టుకొంటూ తిడుతూ ఆరున్నర దాకా కాలక్షేపం చేశా .ఏదో వెలితి బాధిస్తూనే ఉంది .పండగ రోజున సుప్రభాత సమయాన ఇలా జరిగిందేమిట్రా అని గుసగుస లాడుతున్నా. ఇక లాభం లేదని లేచి నిత్యకృత్యాలు ,సంధ్య ,శ్రీరామనవమి పూజాదికాలు పూర్తి చేసి ,సామాను ఒక సారి మళ్ళీ సర్ది ,అంతా ప్రయాణానికి ఓకే అనుకోని మా వాళ్ళు చేసిన పులిహోర తిందామని ప్రయత్నం చేస్తే మా ఉయ్యూరు దబ్బ కాయ పులుపు నషాళానికి అంటి ,ఏదోకతికి మందేసుకొన్నా-సారీ మందులు వేసుకొని రెండో సారి కాఫీ తాగి ,ఏమీ తోచక ఎప్పుడూ ఉయ్యూరులో టి వి మీద ధ్యాస ఉండని నేను చానల్ళు మారుస్తూ ఏదైనా ఆనందం కలిగించేది దొరుకుతుందేమో నని ప్రయత్నించా .భద్రాచల శ్రీ రామనవమి కల్యాణం చప్ప చప్పగా ఉందని పించింది .మా వాళ్ళ ఇంటి దగ్గరే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమౌతుందేమో అని ఆతురత పడితే అక్కడ వాళ్ళుమధ్యాహ్నం  ఒంటి గంటకు పైన కాని మొదలు పెట్టరని తెలిసింది  .సరే నని ఉసూరు మంటూ చానళ్ళు కిందికీ పైకీ మారుస్తుంటే అప్పుడు ఒక అద్భుతం ఈ టి. వి. లో  ఆవిష్కార మైంది . .అదే చిత్తూరు వి నాగయ్య గారి ప్రతిభాసర్వస్వం అయిన త్యాగయ్య సినిమా .ఇదివరకు చాలా సార్లు చూశా కాని ఇప్పుడున్న అసంతృప్తికి అదొక గొప్ప విరుగుడు మానసిక ప్రశాంతికి దోహదంగా   కనిపించింది .అంతే ఇక వేరే చానల్ జోలికి పోలేదు .అయ్యేదాకా అలా చూస్తూనే ఉండి పోయాం నేనూ మా శ్రీమతీ .

నాగయ్య గారి ముఖం లో ఎంతటి బ్రహ్మ వర్చస్సు కని పించిందో ఆశ్చర్యమేసింది .త్యాగయ్యగారి పాత్రకు జీవం పోశారు నాగయ్య .ఆయన మహానటుడు సంగీత కర్త  దర్శకుడు నిర్మాత గాయకుడు కథారచనలో   సంభాషణలలో  సముద్రాల రాఘవాచార్యులవారికి  చేదోడు  కూడా .అన్నీ తానే అయి తనప్రతిభా  సర్వస్వం ధార పోసి తీసి నటించి ‘’ఆల్ టైం క్లాసిక్ ‘’వైభవం తెచ్చారు .ఆనటనలో ఎంత తన్మయత యెంత భక్తి పులకరింత ఎంతటి వినయ విధేయతలు ,ఎంతటి ఔదార్యం ఎంతటి రామ నామ పానమహిమ ఉన్నాయో వివరించి చెప్పటం నలువకు, ఆదిశేషునికీ కూడా తరం కాదు అంటే ,కోన్ కిస్కా నేనెంత ? ఆ ఫీల్ ను మీతో పంచుకొంటే పొందే ఆనందం  అర్ణవమే . బ్రహ్మానంద సహోదరత్వమే .

కమ్మగా సాగే కమనీయ త్యాగబ్రహ్మ కథ.ఇల్లాలు కమలాంబ గా  హేమలతా దేవి ,ధర్మాంబ గా జయమ్మ , జపేశం గా ముదిగొండ లింగమూర్తి ,రాజనర్తకి చపల గా సరితాదేవి ,నారదునిగా వేదాంతం లక్ష్మీ పతి ,తంజావూర్ రాజుగా నారాయణ మూర్తి ,మొదలైన వారంతా శక్తి యుక్తులు ధారపోసి నటించారు ..పద్మనాభం ,లక్ష్మీ రాజ్యం లు కూడా ఉన్నారు .సంగీత దర్శకత్వం చేసిన నాగయ్యగారికి  జె.ఎ. రెహమాన్ సహకరించాడు .

భజ గోవిందం పాట పులకరింత తెస్తే ,ఆరగింపవే బ్రతిమాలి స్వామిని పాలు త్రాగి౦చి నట్లు ,దొరకునా పాట మళ్ళీ మనకు వినే భాగ్యం దొరుకునా అన్నట్లు ఉంది .’’ఎందరో మహానుభావులు ‘’వింటే ఎందరో లేరు మహానుభావులు నాగయ్య ఒక్కరే మహానుభావులు త్యాగయ్యలో ఒదిగిన పూర్ణ పురుషులు అనిపించక తప్పదు. జోజో శ్రీరామా జోలపాట వింటే రాముడు తప్పక నిద్రిస్తాడు .మనసా పాట ఆయన అంత రంగ మధనమే .నా మొర ఆలకింప వరద రాజ లు ఆ దేవుళ్ళను పలకరించి విన్నపాలు విన్నవించి కార్యోన్ముఖులను చేసేట్లుగా ఉంటాయి నాగయ్య గారి స్వరం లో సుస్వర మాధుర్యం తో .అందరూ మెచ్చేదే  అయినా ఆచరించ లేనిది ,త్యాగయ్యగారు ,పోతన్న గార్లు  మాత్రమే ఆచరించినది ‘’నిధి చాల సుఖమా ‘’లో రాముని సన్నిధి మాత్రమే సుఖమిస్తుందన్న ఎరుక కలిగిస్తుంది .తన్మయత్వం తో’’ నాగబ్రహ్మ’’త్యాగ బ్రహ్మ ‘’హృదయాన్ని ఆవిష్కరించారు .’’సంగీతజ్ఞానమూ ‘’వింటుంటే ‘’భక్తి వినా ‘’ మరేదీ లేదని పించింది .తెర అవతలనుంచు ని భక్తి భావ బంధురంగా ‘’తెరతీయగ రాదా ‘’అని పాడితే దేవ దేవుడే దిగివచ్చి లోని, బయటి తెరలుతొలగించి అజ్ఞాన తిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతి దర్శనం చేయించింది .సామజ వర గమన ,బాలకనక మయ ,శివ శివ అనరాదే,రామ భక్తి సామ్రాజ్యం ,ఎవరని  నిర్ణయి౦చేరా  కృతులు నాగయ్య గారి కంఠం లో ఊపిరులు ఊది సమ్మోహనం చేసి ,భక్తి సామ్రాజ్య వైభవానికి ఎత్తిన పతాకలుగా స్థిరం గా నిలిచాయి .నాగయ్య గారి లాంటి మహానటుడు తెలుగు వాడై పుట్టటం మన అదృష్టం ఆయన దుర దృష్టం .ఆయన నటనకు సాటి రాతగిన వాడు హాలీవుడ్ నటుడు ‘’పాల్ ముని ‘’.అక్కడ మునికి బ్రహ్మ రధం పట్టారు .ఇక్కడ మన నట మహర్షి ,ముని చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి  ఘంట సాల వంటి వారెందరినో  ప్రోత్సహించి పైకి తెచ్చిన మహా దాత కు గుర్తిపు లేదు . ఇవాళ త్యాగయ్య సినిమా చూస్తే నేను మా ఆవిడ పొందిన ఆనందం వర్ణనాతీతం . ఉయ్యూరులోమా శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో పీతల మీద కూర్చుని సీతారామ కల్యాణం చేసి తలంబ్రాలు పోసే  భాగ్యం అమెరికా ప్రయాణం వలన కుదరని మాకు  ,నిజంగా శ్రీరామనవమి మా ఇంట్లో చేసుకొన్నంత అదృష్టం దక్కిందని పించింది .

నాకు హృదయానికి తాకే సన్నివేశాలు చూస్తుంటే గుండె కరిగి పోతున్నట్లు అనిపించి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల ధారాపాతంగా కారిపోతాయి .నన్ను నేను సంబాళించుకోలేని ఒక అపూర్వ అచేతన  స్థితి అది .అలా అయింది ఇవాళ త్యాగయ్య చూస్తుంటే. అంతటి మధురానుభూతికి లోనయ్యాను .విశ్వనాద్ సినిమాలు చూస్తే ఇలాగే ఉంటుంది నా పరిస్థితి మాయ బజార్ చూసినా మల్లీశ్వరి చూసినా ఇంతే .త్యాగయ్య సినిమా చూసి నేను ఇవాళ గొప్ప రిలీఫ్ పొందాను .తెల్లవారు జామున నుంచి ఉన్న అసంతృప్తి ,అసహాయత ,నీరసం ఒక్క దెబ్బతో దూరమైపోయాయి .ఎద నిండా ఆనందమే తాండవ మాడింది .ఆనంద రస సాగరం లో ముంచి తేల్చారు నాగయ్యగారు త్యాగయ్య లో . ఆ ఇద్దరి జీవితాలు ధన్యాతి ధన్యం .త్యాగయ్య కోసమే నాగయ్య జన్మించారనే అనిపిస్తుంది .పోతన్న కూడా తనకోసమే నాగయ్యగారు పుట్టారని భావించి ఉంటారు .ఇది చారిత్రిక సత్యం .73 ఏళ్ళు దాటాయి నాగయ్యగారి త్యాగయ్య వచ్చి .ఇప్పటికీ అదే స్వచ్చత అదే ,పవిత్రత, అదే రామ భక్తి సామ్రాజ్యం .ఆతర్వాత ఎన్నో వచ్చినా త్యాగ బ్రహ్మం గారి సంగీత సామ్రాజ్య వైభవానికి ఈ చిత్ర రాజం ఒక్కటే నిలువెత్తు దర్పణం గా నిలిచింది .ఈ అనుభూతినే మీతో పంచుకొన్నాను .

మధ్యలో ఒక సారి ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో రామకల్యాణ౦  యెంత వరకు వచ్చిందో చూద్దామని వెళ్ళా .అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట దాటుతోంది .కాని అక్కడ ఇంకా కల్యాణం శురూ కాలేదు . నేను స్వామిని దర్శించి బయటికి వస్తుంటే అప్పుడే కల్యాణం చేసే దంపతులు సీతారాముల విగ్రహాలతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి గుడిలోకి వెడుతున్నారు .కల్యాణం ఇంకాకాని ఆ సీతా రాములను దర్శించి నమస్కరించి ,ఇదే దక్కిందనుకొని ,మా త్యాగయ్య ఏమయ్యాడో అనే కంగారుతో ఇంట్లోకి వచ్చి పూర్తయ్యేదాకా చూసి తృప్తిగా భోజనం చేశాను .

Inline image 1

శ్రీరామమనవమి  శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3 92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3

92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )

కృష్ణన్ భట్టాద్రి పాద  1879 లో కేరళలోని త్రిస్సూర్ జిల్లా పెరువనం దేశ మన లో కున్నట్టూర్ పడి నంజరే దాతుఅనే తంత్ర సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .తండ్రి పేరుకూడా కొడుకు పేరే .తల్లి చిత్తూరు మన నుండి వచ్చింది ,తొమ్మిది మంది సంతానం లో ఆరవ  వాడు .నలుగురు సోదరులు ,నలుగురు సోదరీమణులు .

ఉపనయనానంతరం ఋగ్వేదాన్ని కంఠోపాఠం చేశాడు .జీవితమంతా వేదం అధ్యన అధ్యాపనం లో గడిపాడు .అద్వాన్సేడ్ సంస్కృతాన్ని సాహిత్యాన్ని  చన్నమంగళం అయ్య శాస్త్రి వద్ద నేర్చాడు .కోడంగూర్ గురుకులం లో తర్కాన్ని అభ్యసించాడు . వంశ పారంపర్యంగా వస్తున్న తంత్ర శాస్త్రం లో నిష్ణాతుడై ,తచు శాస్త్రం లో మహా పాండిత్యాన్ని సాధించాడు .భట్టాద్రి పాద ముఖ్య శిష్యుడు 2000 వ సంవత్సరం లో చనిపోయిన తంత్ర మహా నిష్ణాత కలక్కూజ దివాకరాన్ నంబూద్రి .భట్టాద్రి ఆధ్వర్యం లో అరుదైన మహా గొప్ప తిలపర్వత యజ్ఞాన్ని నభూతో గా కొచ్చిన్ మహా రాజు కోరికపై నిర్వహించారు .ఈ మహా క్రతు విధానాన్ని సంపూర్ణం గా నంబూద్రి పుస్తకం గా రచించి ‘’తిలపర్వత దానం ‘’శీర్షికతో ముద్రించాడు .ఆయన రాసిన మరో గ్రంథం ‘’సాహిత్య చింతామణి .’’.ఇందులో ‘’త్రిసంధ ‘’,సంన్యాసక్రియ ‘’మొదలైన కర్మకాండ నంతటిని చక్కగా వివరించి రాశాడు .85 వ ఏట మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -౩-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩ 91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩

91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )

శాస్త్ర శర్మ (కుంచు )నంబూద్రి కేరళలో 1877 లో సుబ్రహ్మణ్య నంబూద్రి కిరనా౦జల్ పార్వతి దంపతులకు జన్మించాడు .అన్న వాసుదేవ నంబూద్రి గొప్ప వ్యాకరణ వేత్త .తమ్ముడు సుబ్రహ్మణ్య నంబూద్రి న్యాయ శాస్త్ర వేత్త .7 వ ఏట ఉపనయనం జరిగి అన్నగారి వద్దనే వేదం నేర్చి తర్వాత త్రిస్సూరు బ్రహ్మస్వామి మఠంలో 15 వ తేడు వరకు చదువుకున్నాడు .ఆ సమయం లోనే వ్యాకరణ న్యాయ శాస్త్రాలను కిరంగాట్ మన లో ఉన్న ప్రసిద్ధ పండితుడు రామ స్వామి శాస్త్రి వద్ద  క్షుణ్ణంగా అభ్యసించాడు .న్యాయ శాస్త్రం లో అడ్వాన్సేడ్ ట్రెయినింగ్ ను కుడు౦గ ల్లూర్ గురుకులం లో విఖ్యాత భట్ట గోదావర్మ రాజ వద్ద నేర్చాడు .ఆయన మేనకోడలిని వివాహమాడాడు .

కొచ్చిన్ రాజు తర్కాలంకార బిరుదు ప్రదానం చేసి త్రిపుని తుర లోని సంస్కృత పాఠ శాలలో న్యాయ శాస్త్రా చార్యునిగా నియమించాడు .1931 వరకు అక్కడే పని చేసి, రిటైర్ అయినా కూడా తన విద్యావ్యాసంగాన్ని బోధనను మానకుండా చేశాడు .జీవిత కాలమంతా న్యాయ సదస్సులకు న్యాయ నిర్ణేతగా కొనసాగాడు .

న్యాయ శాస్త్రం లో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం .నాచన్ రత్నమాలిక ,దీనిపై ‘’నూతనాలోకనం’’ అనే వ్యాఖ్య ,సుబోధినీ టీకా లను రచించాడు గంగాతరంగిణి అనే 24 తరంగిణులకు ఒక్కొక్కదానికి 14 శ్లోకాల కావ్యం  రాశాడు. కాశీ విశ్వేశ్వరునిపై అచంచల భక్తీ ఉన్న కుంచు నంబూద్రి వ్యాఖ్యాన టీకా ‘’ప్రసూనాంజలి’’ రాసి తన శివ భక్తి గరిమను చాటుకున్నాడు .చిన్నదే అయినా అత్యంత ప్రసిద్ధి చెందింది .చాతక సందేశం అనే సందేశ కావ్యాన్నీ రాశాడు .82 ఏళ్ళ వయసులో కుంచు నంబూద్రి 1959 లో శివసాయుజ్యం పొందాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-4-17 బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు

Image result for sri rama navami greetings in telugu

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విషయం : పాత ఙ్ఞాపకాలు

నమస్తే -ఇది” సీతా రామయ్యాయణం ”తీపి గుర్తులు కానీ పిడకల వేట కాదు ఇంత  విలువైన సమాచారం మన పుస్తకం లో మిస్ అయ్యాము కదా అని బాధ పడుతున్నా . అయినా ఇబ్బంది లేదు శ్రీ ప్రేమ్ చంద్ గారి ఫ్రెండ్ గారి ఆంగ్ల అనువాదం లో చేర్చవచ్చునేమో కనుక్కోండి . ఇలోఆంటీ మీ అనుభవాలు నాకు రాస్తూ ఉండండి అందరికీ పంపి భాగస్వాములను చేద్దాం -మీదు
2017-04-01 20:54 GMT+05:30 Gopala Myneni <gmyneni008@gmail.com>:

అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : “కడుపులో కెలుకుతూంటే  కక్కుంటే కక్కుంటే పోతుంది”, అనే సామె తను అడ్డం పెట్టుకుని ఈక్రింది విషయాలు మీకు చెప్పుకుంటున్నాను. వేరే ఆడ్ చేయమని కాదు, కరెక్ట్ చేయమని కాదు. నన్ను నమ్మండి . అవేమంటే:

1) మా బావమరిది రామక్రిష్ణయ్య గారు ఆఖరు దశలో, మంచంమీద ఉండగా నాకు ఫోన్ చేయించి , “గోపాలకృష్ణ గారూ , మెడిటేషన్  ఎలా చేయాలో చెప్తారా అని అడిగితె అవాక్కయ్యి , తేరుకుని , తప్పక రాసి పాముపుతా లెండి  అని చెప్పటం, ఆతరువాత నేను పనిచేసే యూనివర్సిటీ అఫ్  లూయివిల్ లో  , ఇంగీష్ డిపార్ట్మెంట్ హెడ్ (అమెరికన్)  మెడిటేషన్  మీద   వారానికోసారి ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నట్లు తెలిసి, వాకబుచేస్తే తేలిందేమంటే , నా చిన్నపుడు మానాయనమ్మ నేర్పించిన “హరే రామ , హరే రామ , రామ, రామ, హరే, హరే” మంత్రాన్నే వల్లె  వేయిస్తున్నారని తెలిసింది . అదే ప్రింట్ చేసి  నేను రామకృష్ణయ్య గారికి అదే వ్రాసి , “అది మీ పేరు నే మంత్రంగా వాడు కోవచ్చును, చాలా ఈజీ , మర్చిపోవటానికి వీల్లేని  మంత్రం” అని రాశాను.  తదుపరి , ఫోన్ చేసి కూడా చెప్పాను . కొలది రోజులకే అయన స్వర్గస్తు లయ్యారు .
2) కీ.  శే.  సీతారామయ్య గారు ఇండియా వచ్చినపుడు , నేను మొదటి సారి అమెరికా నుండి తిరిగి వచ్చి ఉయ్యూ రు   మా వరండా లో మా నాన్న గారు నేను  ఉదయం కూర్చుని ఉండగా , ఒకాయన రొప్పుకుంటూ  వచ్చి మా నాన్న గారిని ఉద్దేశిస్తూ  , ” అయ్యా  రష్యా నుండి వచ్చిన అనంతరామయ్య గారి తమ్ముడు మిమ్మల్ని గురించి వాకబు చేశారు “, అని చెప్తే , నేను మా నాన్న గారు రిక్షా లో వెళ్లి అయన తోటలో ఇంటి వరండాలో , జనాలు చుట్టి  ముట్టి  ఉండడం చూస్తుంటే , వారి మనుమడి మమ్మల్ని తీసికొని వెళ్లి తాతగారి దగ్గర ఎదురుగా కుర్చీల్లో కూర్చోపెట్టారు . మానాన్న గారిని , “వెంకట నరసయ్య గారు , వారి అబ్బాయి గోపాలకృష్ణ ఆమ్నెరికానుండి తిరిగి వచ్చారు ” అని చెప్పగా , సీతారామయ్య గారు ఆశ్చ ర్యంగా ”  చిన్నపుడు మనిద్దరం కలసి అన్నయ్య దగ్గర చదుకునే వాళ్ళం , గుర్తున్నానా నర్సయ్యగారూ , చాలా మారిపోయారు , ఎక్కడ్నించి , కు మ్మమూరు నుంచేనా  రావడం ” అని అడిగితె , మా నాన్న గారు అయన ముఖంలో చూస్తూ  “ఊఁ ” అన్నారు. అపుడు ఎవరో “లేదండీ , ఇపుడు ఉయ్యూరు లోనే ఉంటున్నారు ” అని చెప్పారు. అప్పటికే , మా నాన్న గారు మౌన ముద్ర దాల్చి మాట్లాడటం లేదు, అత్యవసరం అయితే కానీ. ఉదాహరణకు .ఉయ్యూరు లో ” బండెక్కు మామ ” అనే ఒక చిల్లర కొట్టు  వైస్యులు ఉండేవారు . అయన వచ్చి మా నాన్న గారి తో “మా డా బా  అమ్మకానికి పెట్టదల్చుకున్నామండీ , మీకేమైనా కొనే ఉద్దేశ్యం ఉందా “, అంటే “ఊ ” అనటం మా అమ్మగారు విని , ఆయన్ను తిప్పిపంపించేయటం లాంటివి ఎన్నో. డబ్బంతా హరించుకు పోయి , మా అమ్మ గారి మిగిలిన దాని తో మా చదువులకూ ఇంటి ఖర్చుకూ సతతమవుతుం డేవారు . నాన్న గారికి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా , పిలిస్తేనే స్నానం , భోజంనం చేయటం చేసేవారు . అయన గారు, ఉయ్యూరు బిల్డింగ్ సొ సై టీ కి , గన్నవరం జైలు విసిటింగ్ కమిటీ (జైళ్లలో ఉన్నవారిని హింసకు గురి చేయకుండా ఉండేందుకు)కి ప్రెసిడెంట్ గా ఉండేవారు . ఆ కమ్యూనికేషన్స్ మెయిల్ లో వస్తే చూడకుండానే పారవేయటం చూసి రెసిగ్నే షన్  చేయించాము . ఇదంతా వేరే విషయం , దారి మళ్లింది .
సీత రామయ్య గారు నన్ను “అమెరికాలో నేనుండగా (అంటే అయన ఉండగా ) నల్ల వాళ్ళను బాగా వెలివేసి వారు , ఇపుడు కూడాఅ లానే  ఉందా ” అని అ డి గితే , నేను నీళ్లు నమలడం చూసి . అయన ” తెలుగు లో ఎక్ష్ప్రెస్స్ చెయ్యటానికి ఇబ్బందిగా ఉంటె , ఇంగిలీషులోనే చెప్పండి”  అని అచ్చ తెలుగులో అంటే అవాక్కయ్యాను . ఇంకా నానుండి  ఏమీ మాట పిగల  లేదు. నా అవస్థ చూసి వదిలేశారు .  ఇంతలో యాకమూరు చొప్పరపు సుబ్బారావు (కెసిపి యూనియన్ ప్రెసిడెంటు ), ” అక్కడ , దేవుడ్ని నమ్మరంటగా , మనుషుల్ని 60 సంవత్సరాలు పైబడగానే చంపేస్తారంటగా ” అని ప్రశ్నలవర్షం (కమ్యూనిస్టుల పై వ్యంగ్య  ధోరణిలో) కురిపించగా , సీతారామయ్యగారి సమాధానం :” ఇక్కడ మీరు నమ్మిచెడినవారూ లేరు, నమ్మక చెడిపోతే  పొయ్యారు ” అంటే “రష్యాలో ” నమ్మక చెడిపోయినవారూ లేరూ , నమ్మిచెడిపోతే పొయ్యారు ” అంటారు . అదే తేడా “. మరి మీ రీడు ప్రశ్న ” 60 వయసు పైబడ్డ వాళ్ళ సంగతి , అదే నిజమైతే నేను బ్రతికి బట్టకట్టి మీముందుండటమే సమాధానం . నేను వేరే ఏమీ చెప్పనవుసరం లేదు ” అని ముగించారు.
మాట్లాడినంత సేపూ , చార్మినార్ సిగరెట్ వేళ్ళ మధ్య కాలుతూనే ఉంది . అపుడపుడూ పొడిదగ్గు వస్తుంటే అన్నగారి మనుమడు ఎదో రసం ఇస్తూడేవారు .  కాసేపటికి మేము తిరిగి రిక్షాలో ఇంటికి బయలుదేరి వెళ్ళాం .
ఇవి సార్ నా గుర్తులు . ఇవి మీకు నేను నన్ను ఏమైనా పరిచయవాక్యాలు రాయ మంటే రాయ నందుకు ఇప్పటివరకూ అపుడపుడూ బాధిస్తూ గుర్తుకొస్తుంటాయ్ సార్. ఆఖరుకు మీరే ఎదో నాతరఫున వ్రాసి సరిపెట్టుకున్నాం. కనీసం నాకు తెలిసిన విధంగా వ్రాసి పంపినా మీరు దాన్ని ఎడిట్ చేసి పెట్టి ఉండేవారని ఇపుడు తెలిసివచ్చింది . నా కంటే, మా సిస్టర్ ఒకావిడ , ప్రేమచంద్ గారు వ్రాసింది చూసి , కొద్దిగా జెలసి(అసూయ ) తో .” వాళ్ళ నాన్న కన్నా , మన నాన్న కే   ఎక్కువగా పరిచయంగా, అనంతరామయ్య గా రితో, సీతారామయ్య గారితో కూడా, మరి నువ్వెందుకు రాయ లేదు  ”  అని మందలించినట్లు గుర్తు.
అయ్యా, నన్ను క్షమించాలి. “నేను ఇపుడు ఇoత  హడావుడిగా అమెరికా ప్రయాణంలో  ఉంటె ఈయన  , రామాయణం లో పిడకల వేట లా , పానకం లో పుడ కలా” తగులుకున్నారు”  అనుకుంటే మీ తప్పులేదు . ఇక మళ్లీ  మీరు అమెరికా వచ్చి , విశ్రాంతి తీసికొని , టైం లాగ్ దాటి న  తదుపరి మాట్లాడుకుందాం . అప్పటి వరకూ , మీ.  గో
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)

2-10-19 46న కేరళలోని వజ్హూర్ లో జన్మించిన గంగాధర నాయర్ సంస్కృత పండిత వంశం వాడు. తండ్రి స్వాతంత్ర సమర యోధుడు ,సంస్కృత విద్వాంసుడు దేశీయ వైద్యుడు అయిన వి. కె .గోపాల పిళ్లే.నాయర్ చత్తంపి స్వామికల్ ప్రశిష్యుడైన స్వామి విద్యానంద తీర్ధ పాద వద్ద సంప్రదాయ పద్ధతిలో సంస్కృత వ్యాకరణం నేర్చాడు .సంస్కృత వ్యాకరణాన్ని ఇటు ఓరియెంటల్, అటు పాశ్చాత్య విధానం రెండిటి లోనూ తిరువనంతపురం లోని ప్రభుత్వ సంస్కృత కళా శాలలోను ,కేరళ యూని వర్సిటి లోను అధ్యయనం చేశాడు .కేరళ యూని వర్సిటిలోని రష్యన్ డిపార్ట్ మెంట్ ద్వారా రష్యన్ భాషా సాహిత్యం పై మాస్టర్ డిగ్రీ పొందాడు .ప్రొఫెసర్ ఎం .ఎస్ .శాస్త్రి ఆయన గురువు .గురువుతర్వాత నాయర్ ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రొఫెసర్ అయ్యాడు .ప్రొఫెసర్ వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ,డా ఆర్ కరుణాకరన్ లవద్ద సంస్కృతం లో ప్రాచీన సంస్కృత శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర గ్రంధాలలోని  లో ‘’ఊనాది సూత్రా ల‘’పై పరిశోధన చేసి పి. హెచ్ .డి .అందుకున్నాడు . .

  కాలడి లోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృత వ్యాకరణ విభాగం అధిపతిగా ,ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ డైరెక్టర్ గా పని చేశాడు .కొచ్చిన్ యూని వర్సిటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెనేట్ మెంబర్ గా ,తిరుపతి రాష్ట్రీయ సంస్కృత యూనివర్సిటి  సెనేట్ మెంబర్ గా కూడా ఉన్నాడు .మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఉన్న ఓరియెంటల్ స్టడీస్ ఆఫ్ ఏ .పి .సింగ్ యూని వర్సిటి ఫాకల్టి  ఎక్పర్ట్ మెంబర్ గా పని చేశాడు .కలకత్తాలోని రవీంద్ర భారతి యూని వర్సిటి డి .ఆర్. ఎస్. ప్రోగ్రాముల సలహా సంఘానికి యు జి సి నామినేట్ సభ్యుడు .కాలడి సంస్కృత యూని వర్సిటి డీన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు .కొచ్చిన్ లోని సుక్రుతీంద్ర ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ అకాడెమిక్ కౌన్సిల్ చైర్మన్ .దాని మేగజైన్ కు సంపాదకుడు .పురాతన సంస్కృత పత్రాల విశ్లేషణలో అవిశ్రాంతంగా విశేష  కృషి చేసి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందినవాడు గంగాధర నాయర్ .నారాయణ భట్ట పై  పాణినీయేతర ప్రభావం అన్న ఆయన విశ్లేషనణాత్మక వివరణాత్మక పరిశోధన పెద్ద గుర్తింపు తెచ్చింది .ఇది పాణిని వ్యాకరణ అధ్యయనానికి కొత్త దారులు చూపింది .

 కాలడి యూని వర్సిటి లో రిటైర్ అయ్యాక నాయర్ ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతాన్ని వాడుక భాషగా మలచటానికి తీవ్ర కృషి చేస్తున్నాడు .ఇండియా అమెరికాల యూని వర్సిటీలలో విస్తృతంగా పర్యటించి ప్రసంగాలు చేస్తూ   సంస్కృతాన్ని జీవద్భాషగా, ప్రజలు మాట్లాడుకొనే భాషగా మార్చటానికి సర్వ శక్తులు ధార పోస్తున్న సంస్కృతాభిమాని నాయర్ .తాను పదవిలో ఉండగా ఎంతో ధైర్యం తో ఒక ముస్లిం మహిళ శ్రీమతి  ఫాతిమా బీవి  కు భారతీయ వేదాంతం లో పి. హెచ్. డి .పొందటానికి రిసెర్చ్ గైడ్ గా నాయర్ ఉండి అందరి అభిమానాన్ని పొందాడు .

85-కాశికా వృత్తిపై వ్యాఖ్యానించిన –పదమంజరి (11 వశతాబ్దం )

11 వశతాబ్ది కి చెందిన పదమంజరి పాణిని వ్యాఖ్యానమైన కాశిక వృత్తికి వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఈ కీర్తి హరిదత్తు నిది అనే వాదం కూడా ఉంది .హరిదత్తుడు ఆపస్థంభ ధర్మ సూత్రాలు ,గౌతమ ధర్మ సూత్రాలు మొదలైన వాటిపై వ్యాఖ్యానం రాశాడు .

86-మీమాంసలో తన స్వంత మార్గాన్ని ఏర్పరచిన –ప్రభాకరుడు (7 వ శతాబ్ది )

భారతీయ తత్వవేత్త వ్యాకరణ వేత్త అయిన ప్రభాకరుడు 7వ శతాబ్దపు కవి .కుమారిల భట్టు మీమా౦స పై ఖండనం చేసి తన మార్గం ను వేరుగా ఏర్పాటు చేసుకొన్నాడు .ఇదే ప్రభాకర విధానం (ప్రభాకర స్కూల్ )అని పిలువబడుతోంది .8 వశతాబ్దం లో శైలకాంత ప్రభాకర సిద్ధాంతం పై వ్యాఖ్యానించాడు .పూర్వ మీమాంస సిద్దా౦త కర్తగా ప్రభాకరుని గుర్తిస్తారు .

  ప్రభాకరుని సిద్ధాంతం ప్రకారం -పదాలు సూటిగా అర్ధాన్ని ఇవ్వలేవు .మిగిలిన శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడే దాని అర్ధం తెలుస్తుంది .దీనికే అన్వితాభిధానం అన్నాడు. అన్వితఅంటే అనుసంధానమైనది అని అర్ధం .అభిద అంటే వ్యక్తీకరణ అని అర్ధం . వాక్యం లో పదం ఏ సందర్భంగా ప్రయోగింప బడిందో తెలియాలంటే మిగతా పదాలమధ్య సంబంధం తెలియాలి .అప్పుడు ఆ వాక్యం మొత్తం భావం అవగాహన అవుతుంది .ఇది ఆధునిక లింగ్విస్టిక్స్ లోని ‘’అండర్ స్పెసిఫికేషన్ ‘’అన్నమాట .అనగా నిర్దేశిత ప్రయోజనం .

 ప్రభాకర వాదాన్ని భట్టకులు వ్యతిరేకించారు . అభిహితాన్వయం ను  వాళ్ళు అంగీకరించారు .అంటే ప్రతి పదం యొక్క అర్ధం తెలిస్తేనే వాక్యం యొక్క మొత్తం భావం తెలుస్తుంది అని వీళ్ళ వాదం .వీరి భావనలో శబ్దాలు స్వతంత్రమైనవి ,సంపూర్ణ స్వరూపమైనవి .ఇది ఈ నాటి ‘’ఫోడోరియన్’’వాదానికి దగ్గర లో ఉంది .

87-ప్రకరణ పంచిక కర్త  –శైలకాంత(క్రీ.శ.900)

 7 వ శతాబ్దానికి చెందిన ప్రభాకరుని అనుయాయుడు 9 వ శతాబ్ది శైలకాంత .భట్టవాద వ్యతిరేకి .ప్రభాకరుని పూర్వ మీమాంస పై విపులమైన వ్యాఖ్యానం’’ ప్రకరణ పంచిక ‘’ రాశాడు .ప్రభాకర సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి శైల కాంత వ్రాసిన ప్రకరణ పంచిక ఒక్కటి మాత్రమే మిగిలింది .

88 –గణిత మేధావి –విరహంక (6 వ శతాబ్దం )

6 వ శతాబ్దికి చెందిన విరహంక  గొప్ప ఛందస్ శాస్త్ర వేత్త ,గణిత మేధావి .8 వ శతాబ్దం వాడు అనే అభిప్రాయమూ ఉన్నది .క్రీ పూ. 4 వ శతాబ్దానికి చెందిన పింగళ కుని ఛందస్సూత్రాల నాధారంగా ఛందశ్శాస్త్రం  రాశాడు .దీనికి వ్యాఖ్యానాన్ని 12 వ శతాబ్దానికి చెందినగోపాలకవి రాశాడు .

89-ఛందశ్శాస్త్ర కర్త పింగళ –(క్రీ పూ. 4 వ శతాబ్దం )

చందశ్శాస్త్రం పై వెలువడిన అతి ప్రాచీన గ్రంధాన్ని పింగళ క్రీ పూ 4 వశతాబ్దం లో రాశాడు .పాణిని తమ్ముడుగా లోక ప్రసిద్ధి .లేకక్రీ పూ .2 వ శతాబ్దం లో  మహా భాష్యం రాసిన పతంజలి సోదరుడు .8 అధ్యాయాల ఈ చందో శాస్త్రం లోని సూత్రాలను అర్ధం చేసుకోవాలంటే వ్యాఖ్యానం తప్పనిసరి గా ఉండాల్సిందే . ఈ గ్రంథం క్రీ పూ లో చివరికాలం లో కాని క్రీ.శ .ప్రారంభ కాలం లో కాని రాయబడి ఉంటుందని ఊహిస్తున్నారు .అంటే వేద ఛందస్సుకు ,లౌకిక ఛందస్సుకు మధ్యకాలం లో సంధియుగం లో  రాయబడి ఉండాలి .మౌర్యకాలానికి దగ్గర లో ఉండి ఉంటుంది .10 వ శతాబ్దికి చెందిన హలయూథ దీనిపై వ్యాఖ్యానం రాయటమేకాక విస్తృత పరచాడు కూడా . .

  ఛందశ్శాస్త్రంలో గురు,లఘువుల చర్చ ఉన్నది .ద్విసంఖ్యామానం ఆధారంగా రాశాడు .వివిధ ఛందస్సులు వాటి కలయికలు చూస్తే  బైనామియన్ ధీరం (ద్విపద సిద్ధాంతం )గుర్తుకు వస్తుంది .దీనికి హలయూధుని ‘’మృతసంజీవిని ‘’వ్యాఖ్యానం చూస్తుంటే’’ పాస్కల్  త్రిభుజం ‘’ గుర్తుకు వస్తుంది .ఈ శాస్త్రం లో ‘’మాత్రా మేరు లేక మేరు ప్రస్తార ‘’విధానం ఈ నాటి గణితం లోని ‘’ఫైబో నాసి నంబర్ ‘’లను పోలి ఉంటుంది .  Pingala’s system ranks binary patterns starting at one (four short syllables—binary “0000”—is the first pattern), the nth pattern corresponds to the binary representation of n-1 (with increasing positional values). Positional use of zero dates from c. the 7th century (Brahmagupta) and would have been known to Halāyudha but not to Pingala.

90-మృత సంజీవిని రాసిన –హలయూధుడు (10 వ శతాబ్దం )

గణిత మేధావి అయిన హలయూధుడు 10 వ శతాబ్దానికి చెందినవాడు .పింగళుని చందశ్శాస్త్రానికి ‘’మృత సంజీవిని ‘’వ్యాఖ్య రాశాడు .ఇది ఈనాటి పాస్కల్ త్రిభుజానికి ఆనాడే చెప్పిన సిద్ధాంతం .ఈ కవి రాష్ట్ర కూట రాజుల రాజధాని ‘’మాన్య ఖేట ‘’లో నివసించాడు .రాష్ట్ర కూట రాజు  మూడవ కృష్ణుని ఆస్థానం లో ఉండి ఈ వ్యాఖ్యానం రాశాడు .ఈ కవి రాసిన ‘’కవి రహస్యం ‘’రాజు మూడవ కృష్ణుని స్తుతిస్తూ రాసినదే .తరువాత ఉజ్జయినికి పారమార రాజులకాలం లో చేరాడు .పారమార రాజు ముంజ ను స్తుతిస్తూ  మృతసంజీవని వ్యాఖ్య రాశాడు .పై రెండు గ్రంధాలే కాక ‘’అభిదాన రత్నమాల ‘’ అనే సంస్కృత నిఘంటువు కూడా హలయూధుడు కూర్చాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-17 –ఉయ్యూరు

 

  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం పై కవితలు

అందరికి వందనం -సరసభారతి అనేకమంది కవులను ఆహ్వానించి వసుధైక కుటుంబం పై కవి సమ్మేళనం ను హేవిళంబి ఉగాది వేడుకలనాడు నిర్వహించిన సంగతి అందరికి తెలుసు .ఆ కవితలను పుస్తక రూపం గా తెచ్చే ప్రయత్నాన్ని శ్రీ వసుధ బసవేశ్వర రావు గారికి అప్పగించాం .ఇంకా ఎక్కువ మంది కవుల కవితలను కూడా చేర్చాలనే సంకల్పం కలిగింది . మీరు కూడా ఆ శీర్షికపై కవితలు అల్లండి. మీ మిత్రుల ను ప్రోత్సహించి రాయించండి . ఈ కవితలన్నీ ఈ క్రింది చిరునామాకు కానీ ,ఇమెయిల్ కు కానీ ఏప్రిల్ 15 లోపు పోస్ట్ చేయండి .మీరూ పాల్గొనే అపూర్వ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోండి,అద్భుత అపూర్వ కవితా సంకలనానికి సహకరించండి  -గబ్బిట దుర్గా ప్రసాద్ 

శ్రీ వసుధ బసవేశ్వరరావు -ఆంధ్రా బాంక్ మేనేజర్ -హిందూకాలేజి high school  బ్రాంచ్
  బచ్చు పేట (పో.ఆ ) )   మచిలీ పట్నం -1 
 సెల్ నంబర్ -9490832 787
email -vasudha@gmail .com 
Posted in కవితలు | Tagged | Leave a comment

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

 ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

దుర్ముఖి వెడుతూ వెడుతూ చాలామందిని’’ పచ్చడి పచ్చడి’’ చేసి  చేదు పంచి వెళ్ళింది .కొందరికి హాట్ హాట్ స్వీట్ పెట్టింది .కొందరికి బంపర్ ఆఫర్ తో హేపీ ఇస్తే కొందర్ని పాపర్లను చేసి,అన్ హేపీ టోపీ పెట్టింది  .అందులో ఈ మధ్యనే జరిగిన పంచ రాష్ట్రాల ఎన్నికలలో ప్రజల చేత పంచెలు ఊడ పోగొట్టుకొన్నవారు కొందరైతే, కొత్త పంచలు కానుకగా పొందిన వారు మరికొందరు . .ఇదీ ఎన్నిక బాగోతం .దూషణ భూషణ తిరస్కారాల కాటా దెబ్బ తిన్న వాళ్ళే గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ లేచి ఎగురుతారు .లేకపోతె చతికిలబడి పోతారు గోడకు కొట్టిన పిడకలాగా .పిడకల వేట ఆపి అసలు విషయానికి వస్తాను .అసలు ఈ ఉగాది ఎవరికి  ఎలాటి ఉగాది పచ్చడి రుచులు  చూపించిందో చూద్దాం .

      భూమి పుత్రులం మేముండగా దత్త పుత్రులెందుకు దండగ అని భేషజాలు పలికిన అఖిలేష్, వాళ్ళ బాబుయాదవ్  ,రాహుల్ ,సోదరి  ,కమ్మీ  లాలూ ముఠా అండ్ కో పాపం పండి ,మోడీ చేతిలో పీటీ దెబ్బ తిని ,సర్వం కోల్పోయి  ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదుమాత్రమె మింగి కూలబడ్డారు .సైకిల్ గాలిపోయి పంచరయి రిమ్స్ బెండ్ అయి , ‘’సీటు ‘’,అధికార సీటూ గోవిందా అయి కూలబడ్డారు .

ఇక’’ ఏనుగు’’ బొమ్మావిడ రాష్ట్రమంతా తన శిలా విగ్రహాలు భారీ లెవెల్ లో పెట్టించి పూజలు చేయించుకొని ,జనానికి విసుగు పుట్టించి పార్టీ ఎవరిని ఉద్ధరించటానికి పుట్టిందో మర్చి పోయి అరిస్టో  క్రాట్ గా వ్యవహరిస్తే ,చీదరించు కొని ,ఏవగించుకున్న చీపురు పుల్లలాగా ఏరిపారేస్తే ఉగాది పచ్చడిలో కారం తింటూ నోరుమండి నీళ్ళు  తాగుతోంది వేసవి అప్పుడే వ విజ్రుంభించినట్లు పాపం .అధికారం ఉండటం కాదు దాన్ని పదిలం గా ప్రజానుమతంగా మలచుకోవాలి .

 రెండున్నర ఏళ్ళక్రితం అసలు పాదమే మోపటానికి స్థానం లేని యు .పి లో చక్కని వ్యూహం పన్ని దాదాపు అన్ని లోక్ సభ స్థానాలు సంపాదించిన మోడీ పార్టీ ,ఈ శాసన సభ ఎన్నికలకు అప్పటి నుంచే పకడ్ బందీ వ్యూహం పన్ని ,అంతా తానే అయి అమిత్ షాదూసుకు వెడితే ,పార్టీ పెద్దలందర్ని దూరం పెట్టి తానే సర్వ సైన్యాధ్యక్షుడై ఢిల్లీ నుంచి గల్లీ దాకా సుడిగాలి పర్యటన చేసి వైరి శిబిరంలో ప్రకంపనలు ,భయోత్పాతం పుట్టించి ఒణుకు తెప్పించి ,వోటరు నాడిని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వోట్లన్నీ దండుకొని  మూడువంతుల మెజారిటీ సాధించి పెట్టిన మోడీ అండ్ కో కు ప్రజలు బ్రహ్మ రధం పడితే ,ఈ ఉగాది వేళ ఉగాది పచ్చడిలో బెల్లం చెరుకు ముక్కల కమ్మని స్వీటు తింటున్నారు.గెలుపు మధు రసాస్వాదన చేస్తున్నారు .

   పెద్ద నోట్లరద్దు దండగ  సాధించిందేమీ లేదు ,బ్యాంకుల దగ్గర భారీక్యూలు ,ప్రజల ఇక్కట్లు గట్టెక్కవు అని కాకిగోలతో ఊదర కొట్టి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ,ఢంకా బజాయించిన వార్తా పత్రికలూ ఎలక్ట్రానిక్ మీడియా అంచనాలు తలక్రిందై  కుదేలై ,రెండు నెలల్లో అంతా సర్దు బాటులోకి వస్తే ,మి౦గా లేక కక్కాలేక మోడీ వ్యూహం తెలియలేక తమబాకాలు కాకాలు పని చేయక లబో దిబో మని  చతికిలబడి ఈ ఉగాదినాడు ఉగాదిపచ్చడిలో  చింతపండు పులుపు మాత్రమే దక్కి ,తిని బావురు మంటున్నారు.ఇందులో ఒక తెలుగు దినపత్రిక మీడియా కూడా ఉన్నాయన కు 400 కోట్ల నల్లదనం’’ రద్దు చెదలు’’ తినేయటం తో  మరీ విరుచుకు పడ్డాడు ఆసమయం లో .పాపం ఎవరికి ఎంత దక్కాలో అంతే కదా దక్కేది బాస్ !

  మణిపూర్ ఏమిటి  కాషాయం ఎగరేయటం ఏమిటి,గొడవల గోవా ఏమిటీ మెజార్టీ రాకపోయినా వ్యూహం ఫలించి కమలం అధికారం లోకి రావటం ఏమిటి ,అందరి అంచనాలను తలక్రిందు చేయటం కలలో కూడా ఊహించలేనిది .కాని ‘’కలనిజమాయేగా కోరికా తీరెగా’’అన్న పాతః పాట నిజమైంది .ఇక్కడ ఉగాదినాడు ఉగాది పచ్చడిలో వగరు కాంగీ తింటుంటే ,పారీకర్  బీరేన్ సింగ్ లు షడ్రుచుల సమ్మేళననాన్ని హాయిగా  తింటూ అనుభవిస్తున్నారు  .ఉత్తరాఖండ్  లో మొదటినుంచి దూకుడుగా ఉన్న కమలం జెండా రెట్టింపు ఉత్సాహం తో రెప రెప లాడింది .రావత్ అండ్ కో పంచ భక్ష్య పరమాన్నం తో అన్నిరుచుల ఉగాది పచ్చడి ఉగాది నాడు  భోంచేస్తున్నారు .

 పంజాబ్ మనదే అనుకొన్న అం ఆద్మీ క్రేజీ కేజ్రీ ధమాల్ మన్నాడు . అక్కడి అవినీతి కి బలై కమలం పూర్తిగా వాడి అధికారం కోల్పోయి వల వలా విల విలా .ఈ ఉగాది నాడు అక్కడ కెప్టెన్ వ్యూహం ఫలించి ‘’పంచ ఆబ్ ‘’లను కలిపి గద్దెనెక్కి హేపీ ఉగాది జరుపుకొంటూ ఉగాది ఫలరసాన్ని హాయిగా  తోటివారితో అనుభవిస్తున్నాడు .ఆం లేదు ఆద్మీ లేడు హాం ఫట్ లేదు ,షా పధకం పారనూలేదు .కనుక వీళ్ళంతా ఈ ఉగాదికి చేదు కారం వగరు పులుపు తింటూ గత స్మృతులను నెమరేసుకొంటున్నారు .

  అసలు గెలుగువాడి ఉగాదిని వదిలి ఉత్తరభారత౦ హరికధ ఎందుకు అంటారని తెలుసు .వస్తున్నాఅక్కడికే .చిన్ననాటి నుండి తండ్రి చాటుబిడ్డ గా ఉండి ,తండ్రిని చాటుకు పంపేసి ఆయ౦డగానే అధికారం చెలాయించి ,పోగానే ఆ గద్దె నాదేనన్న ఊహాలోకం లో తేలుతూ ,ఎన్నికలలో బోర్లాపడి ,ఉప ఎన్నికల్లో కళ్ళూ కాళ్ళూ పోగొట్టుకొని నమ్మిన మంది నట్టేట ముంచి నాలుగోవంతు ఖాళీ అయితే ,నోట్ల రద్దు ఎన్ని వేల కోట్ల బొక్క పెట్టిందో తెలియక ,చేదే అలవాటు చేసుకొని వేపకాయలే తిని తిని   వాచాలత్వం ముదిరి తానే సి ఎం అనుకొంటూ పగటి కలలు కంటున్న యువ నాయకుడిని జనం సభలో బయటా చీదరించుకొంటు౦టే మి౦గా లేక కక్కాలేక  సి ఎం నే ఎంతమాట అంటే అంతమాట అంటూ పరువు గంగలో కలిసిన’’ దేనిమీదో ‘’వానపడ్డట్టు  దులుపుకు తిరుగుతూ ఈ ఉగాది నాడు ఉగాది పచ్చడిలో వేపపూవే మధురసం గా తింటూ మరింత వెర్రి పెంచు కొంటున్నాడు .బాబు మాత్రం చిద్విలాసంగా షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరితోకలిసి ఆరగించి పండగ చేసుకొంటున్నాడు .

 మరో యువ సినీ రాచకీయ సేనాని దూకేస్తా దూకేస్తా నంటూ  దేని లోనికి దూకుతాడో తెలీక కంగారు పడుతూ పడేస్తూ అటు సినిమాలూ అచ్చిరాక ఇటు రాచకీయం పడక ఉగాదినాడు  దిగాలు పడుతూ ఉగాది చెట్నీలో పులుపు,వగరు, కారం  చేదు మాత్రమే మింగుతూ ఆకాశానికి నిచ్చెన లేస్తూ పగటి కలలు కంటున్నాడు .

 ఇంతమందికి ఉగాది పచ్చడి ఇన్ని రకాల అనుభవాలను అను భూతులను మిగిల్చింది .సవ్యం గా ఆలోచించి సరైన ప్రణాళికతో ము౦దు కెడితే చేదే తీపి కారమే తీపి వగరే పొగరు పవరు అయి ఊరడిస్తుంది  .

 శ్రీ హేవళంబి ఉగాది శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ హేవిళంబి ఉగాది శుభా కాంక్షలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు –సమీక్ష

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు –సమీక్ష

https://plus.google.com/photos/107563242221333034923/album/6402024555658028593/6402024554504284338?authkey=CJeo7Ofyot2q9AE

సరసభారతి 103  వ సమావేశం గా ఉగాది వేడుకలు ఉగాదికి మూడు రోజులముందు 26-3-17 ఆదివారం సాయంత్రం స్థానిక ఏ .సి .లైబ్రరీలో నా అధ్యక్షత న జరిగాయి .ప్రముఖ గాయని శ్రీమతి శాంతిశ్రీ గారి ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమైంది .అధ్యక్షోపన్యాసం లో నేను సరసభారతి గత ఏడేళ్ళ, నాలుగు నెలల కృషిని తెలియజేశాను .ముఖ్యఅతిధి శాసన మండలి సభ్యులు  శ్రీవై .వి .బి .రాజేంద్ర ప్రసాద్ మా ట్లాడుతూ ‘’ సరసభారతి ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించటం , వందకు పైగా సాహితీ వేత్తలు హాలు క్రిక్కిరిసేలా హాజరవటం, సాహిత్యం లో లబ్ధ ప్రతిస్టు  లైనవారికి ఉగాది పురస్కారాలు అందజేయటం ,దాదాపు 50 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించటం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే  .ఈ వయసులో కూడా మా మాస్టారు ఇంత పకడ్బందీగా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించటం పుస్తకాలు రాసి ,రాయించి ప్రచురించటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది .అందరూ ఆయనకు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారు .అందరికి అభినందనలు .’’అన్నారు . నేను మాట్లాడుతూ ‘’లైబ్రరీ పై అంతస్తు పూర్తికాలేదు .సెక్రెటరి గారిని ఫిబ్రవరిలో కలిసి మాట్లాడినప్పుడు ఈ విషయం వారి దృష్టికి తెచ్చాను .ఆయన ‘’ఫండ్స్ ఉన్నాయి. కాంట్రాక్ట ర్లే ఎవరూ ముందుకు రావటం లేదు ‘’అని చెప్పారు ‘’అన్నాను శ్రీ రాజేంద్రతో .ఆయన ‘’మరొక సారి ప్రయత్నిద్దాం .ఎవరూ రాకపోతే మనమే ఎవరో ఒక పేరుమీద కాంట్రాక్ట్ తీసుకొని చక్కగా అన్ని వసతులతో కట్టిద్దాం .సాహిత్య కార్యక్రమాలు పైనే హాయిగా జరుపు కోవచ్చు ‘’అన్నారు .అందరూ హర్షధ్వానాలు చేశారు .

మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలను

1-విద్యా వార్రిది ,బహు సంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,జ్యోతిష్య శాస్త్ర వేత్త డా. శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి 2-అవధాన భారతి,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్క్రుతోపన్యాసకులు  విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావు గారికి 3-నవ భారత సాహితీరత్న ,సాహితీ విశిష్ట ,వానమామలై స్మారక ,సోమనాథ కళా పీఠ పురస్కార గ్రహీత ,శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు ,సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్య భరిత గ్రంథ ప్రచురణ కర్త ,విద్వత్ కవి ,విమర్శకులు ,40 కి పైగా గ్రంధాలను రచించిన గ్రంథకర్త ,విశ్వనాథ వారి కృష్ణ కావ్యాల పరిశోధకులు డా శ్రీ టి .శ్రీరంగ స్వామికి గారికి అందజేశాము .ముగ్గురకు గంధ తాంబూలాలతో .పన్నీరు ,సెంట్ సుగంధ పరిమళాలతో సత్కరించి నూతన వస్త్రాలు ,శాలువా ,పుష్పహారం ,వసుధైక కుటుంబం జ్ఞాపిక లతో పాటు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల నగదు కానుకగా అంద జేశాము .

‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని –ఐ టి ఐ .ఐ టి సి కోర్సులకు గ్రంథాలను,పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యలకు రిఫరెన్స్ పుస్తకాలను స్వంత ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాలనుండి ఏ రకమైన సహాయ ప్రోత్సాహకాలు లభించని సాంకేతిక విద్యా వేత్త ,రిటైర్డ్ డిప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ళ శ్యామ సుందరరావు గారికి అందజేశాము .వీరికీ పై విధంగానే చందన తాంబూలాలు ,నూతనవస్త్రాలు ,శాలువా, పూల దండ , వసుధైక కుటుంబం జ్ఞాపిక  శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )అందజేసిన 3 వేల రూపాయలు ,సరసభారతి అందజేసిన 2 వేల రూపాయలు మొత్తం 5 వేల రూపాయల నగదు కానుకగా అందించాం .

సన్మాన గ్రహీతలు తమ సంతోషాన్ని ,కృతజ్ఞతను ,తమ సాహిత్య వ్యాసంగాన్ని వివరంగా తెలియ జేశారు .శ్రీ నిష్ఠల వారు తమ బహుముఖ పాండిత్యాన్ని సంస్క్రుతరచనలో తమ అనుభవాన్ని ఉదాహరణ పూర్వకంగా తెలియ జేశారు.తమ రచనలను ఆసక్తికలవారికి పంచిపెట్టారు . .శ్రీ చక్రాలవారు తాము ఈ ప్రాంతానికి రావటం ఇదే మొదటి సారి అని తమను ఎంతో ఆత్మీయం గా ఆదరించారని చెప్పి తాము రచించిన ‘’రుక్మిణీ పరిణయం ‘’కావ్యం లోని సొగసులను వివరిస్తూ ఈ కావ్యం లో 400కు పైగా వివిధ ఛందస్సులను సందర్భాన్ని బట్టి ప్రయోగించానని అందరు చదివి ఆనందించాలని చెప్పి అక్కడ కవిత్వం ప్రయోగం మీద ఆసక్తి ఉన్న వారికి కావ్యాన్ని తమ చేతుల మీదుగా అందజేశారు. శ్రీ రంగస్వామి తాను ఉయ్యూరు రావటం మహదానందంగా ఉందని దుర్గా ప్రసాద్ గారితో 23 ఏళ్ళుగా పరిచయం ఉందని చెప్పి తమ సాహితీ సేవలను తెలియ జేశారు .శ్రీ నాదెళ్ళ తాము పుస్తక రచనలో పడిన ఇబ్బందులను ,ప్రభుత్వాల ఉదాసీనతను అందరి దృష్టికి తెచ్చారు .

గౌరవ అతిధిగా వచ్చేసిన ‘’ప్రముఖ అంతర్జాతీయ గణిత( స్టాటిస్టిక్స్ )శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ డా శ్రీఅరుచూరి రామ కృష్ణయ్యఫౌండేషన్  ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాథ్ గారు తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను వివరించారు .అప్పుడు నేను మాట్లాడుతూ ‘’ఆహ్వాన పత్రం లో నేనూ శ్రీనాథ్ గారు సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తా౦ ‘’అని తెలియ బరచాం  ‘’అని గుర్తు చేసి ‘’లూయీ అంటర్ మేయర్ అనే అమెరికా సాహితీ వేత్త ‘’మేకర్స్ ఆఫ్ దిమోడరన్  వరల్డ్ ‘’అనే గ్రంధాన్ని- కవిత్వం ,నాటకం ,సినిమా, చిత్రలేఖనం, సైన్స్ ,టెక్నాలజీ, శిల్పం ,నాట్యం, రాజకీయం మున్నగు వివిధ రంగాలలో చరిత్రను తమ సృజన లతో మలుపు తిప్పి న  92మంది ప్రముఖులపై రాశాడని ,దాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణగారు నాకు పంపారని దాన్ని చదివి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’పేరిట ఇంటర్ నెట్ లో రాశానని అది పూర్తికాగానే శ్రీ గోపాల కృష్ణగారు ఇంతటి ఉద్గ్రంధాన్ని తమ బావమరది ప్రముఖ గణిత శాస్త్ర మేధావి స్వర్గీయ  డా శ్రీ పరుచూరి రామ కృష్ణయ్య గారికి అంకితం ఇస్తే సముచితంగా ఉంటుందని సూచించారని దాని ముద్రణ ఖర్చు  విషయం  శ్రీ శ్రీనాథ్ గారితో మాట్లాడానని తెలియ జేశారని  ఇప్పుడు శ్రీనాథ్ గారు ఆ విషయమై ప్రకటన చేస్తారని అన్నాను .శ్రీ శ్రీనాథ్ గారు ‘’మా అన్నగారికి ఈ పుస్తకం అంకితం ఇస్తున్నందుకు చాలా సంతోషం .దీనిని సరసభారతి తరఫున ముద్రించటానికి అయ్యే మొత్తం ఖర్చు డా పరుచూరి రామకృష్ణయ్య ట్రస్ట్ అందజేస్తుంది ‘’అని అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు . అంతే కాక సరసభారతి భవిష్యత్తులో  నిర్వహించే ఏ మంచి కార్యక్రమానికైనా ట్రస్ట్ అండగా నిలుస్తుందని ,విద్యార్ధులకు స్కాలర్షిప్ లను అందజేయాలనుకొంటే తాము ట్రస్ట్ ద్వారా అందించగలమని శ్రీ నాథ్ చెప్పి అందరిలో ఉత్సాహాన్ని కలిగించారు .

ఈ సందర్భం లోనే నేను మాట్లాడుతూ ‘’నిన్ననే శ్రీ మైనేని గారు ఒక మెయిల్ రాశారు .నేను  ఇంటర్నెట్ లో రాస్తున్న మూడవ గీర్వాణం ను పూర్తి చేయగానే అమెరికాలోనార్త్ కారోలీనా లోని ’’ కారీ’’ లో ఉంటున్న ప్రపంచ ప్రఖ్యాత బయో కెమిస్ట్  స్వర్గీయ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి కుమారులు శ్రీ రామ మోహన రావు గారి ఈ గ్రంథాన్ని-ఆధ్యాత్మిక వేత్త అయిన  తమ బావగారు శ్రీ భండారు రాధాకృష్ణ మూర్తి గారికి  అంకిత మిస్తే బాగుంటుందని సూచించారని, గ్రంథ ముద్రణకు శ్రీ రామ మోహన రావు  గారు స్పాన్సర్ గా ఉంటామని తెలియ జేసారని ,నాకు ఎంతో ఆనందం కలిగిందని ,ఒక మంచి పుస్తకం రావటానికి ఇంతమంది సహృదయాలు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఏమీచేయ లేక పోతున్నానని  తెలియ జేయగా అందరూ ఆనందం తో చప్పట్లు మోగించారు .

తారువాత ‘’వసుధైక కుటుంబం ‘’పై కవి సమ్మేళనం ను మినీ కవిత్వ సారధి ,విమర్శకులు మచిలీ పట్నం ఆంధ్రా బాంక్ మేనేజర్ శ్రీ వసుధ బసవేశ్వర రావు ,విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలుగుపండిట్ శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ,మచిలీపట్టణం హైస్కూల్ టీచర్ కవి విశ్లేషకురాలు బాల సాహిత్య రచయిత్రి  శ్రీమతి గుడిపూడి రాధికా రాణి 2 గంటల పాటు సమర్ధంగా నిర్వహించారు .కృష్ణా జిల్లాలోని నలుమూలలనుండి  గుంటూరు,పశ్చిమ గోదావరి జిల్లాలనుండి కవులు కవయిత్రులు అన్ని వయసుల వారు  అత్యుత్సాహంగా పాల్గొని కవిత్వాన్ని చదివి వినిపించి మురిపించారు .కవిమిత్రులందరికీ వసుధైక కుటుంబం జ్ఞాపిక అంద జేశాము .

నేనూ నా శ్రీమతి ఏప్రిల్ 6 న అమెరికాకు 5 వసారి వెడుతున్నాం .మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు కోరుతున్నాం అనగానే అందరూ హర్షం తో కరతాళ ధ్వనులు చేసి అభినందించారు .

ఈ  వసుధైక కుటుంబం కవి సమ్మేళన కవితలను ముద్రిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చి శ్రీ వసుధ గారిని సంప్రదించాను .ఆయన మంచి నిర్ణయం అన్నారు .వెంటనే వసుధగారికే  పుస్తకం తెచ్చే బాధ్యతను స్వీకరించమని కోరగాఆన౦ద౦ గా హర్ష ధ్వానాలమధ్య  అంగీకరించారు .కనుక కవి సమ్మేళనానికి రాలేక పోయిన కవులు తమ కవితలను వసుధ గారికి పోస్ట్ లోకాని లేక vasudha@gmail.com కు మెయిల్ ద్వారా పంపమని వసుధ, నేనూ అందరికి  విజ్ఞప్తి  చేస్తున్నాం .

సరసభారతి అధ్యక్షురాలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవిగారు ఫినిషింగ్ టచ్ గా ఒక గీతాన్నికమ్మగా పాడి కార్యక్రమానికి సమాప్తి పలికారు .

సభ ప్రారంబానికి ముందు అందరికి  గారె టిఫిన్ గా అందజేసి మధ్యలో పైనాపిల్ జ్యూస్ ఇచ్చాం , కార్య క్రమం లో పాల్గొన్న వారందరికీ లైబ్రరి పై అంతస్తులో శ్రీమతి శ్యామలాదేవిగారు కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు .సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు 4 గంటలపాటు సరసభరతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు అత్యంత ఆనదోత్సాహాల మధ్య జరగటం చారిత్రాత్మక విషయం .అందరికి అభినందలు .ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని అన్నీ తానే అయి నిర్వహించిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి సమర్ధతకు ధన్యవాదాలు .కార్యక్రమం దిగ్విజయం చేయటానికి సహకరించిన కోశాధికారి చి .జి. వి .రమణ,సాంకేతిక సలహాదారు శ్రీవి. బి .జి .రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు ధన్యవాదాలు .

శ్రీ చక్రాలవారు ఫోన్ లో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రావటం ఇదే ప్రధమం అని చెప్పగా వారిని  వారి కుటుంబం తో సహా మా ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని ఆతిధ్యం స్వీకరించమని కోరగా విచ్చేసి మమ్మల్ని ఆన౦ద  పరచారు .మా ఇంట భోజన ఏర్పాట్లన్నీ మా కోడలు శ్రీమతి రాణి ,మా ఇంటి ఆడపడచులు అను కొనే  శ్రీమతి మల్లికాంబ గారు  శ్రీమతి భవానిగారు ,శ్రీమతి శివలక్ష్మి కుటుంబం చేశారు .వారు విశ్రాంతి తీసుకోవటానికి  తమ గృహం ఇచ్చారు శ్రీమతి  శ్యామలాదేవిగారు  . మా మనవడు ఛి చరణ మనవరాలు ఛి రమ్య చక్కని సహకారం అందించారు ..

సాయంత్రం అందరికంటే ముందే మూడున్నరకే వచ్చిన శ్రీ నిష్టల దంపతులను ,వారి మిత్రులను ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ను మా ఇంటికి సాయంత్రం ఆహ్వానించి బిస్కెట్ ,టీ ఇచ్చి వారి ప్రయాణపు బడలికను కొంత తగ్గించాగలిగాం . శ్రీ చక్రాల వారు శ్రీ నిష్ఠల  వారు మా ఇంటికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-17 –ఉయ్యూరు

 


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

26-3-17 ఆదివారంమధ్యాహ్నం మా ఇంట్లోవిద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారి కుటుంబం

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం

మిత్రులారా మిత్రత్వం తో సేవ చేద్దాం రండి

అందరి హృదయాలను గెలుద్దాం రండి

ఇతరులూ మనలాంటి వారేనని గ్రహిద్దాం

 స్పర్ధ ,ఘర్షణ శాశ్వతంగా విడనాడుదాం

అనవసర పోటీ మనస్తత్వాన్ని త్యజిద్దాం

సాటివాడి సర్వస్వాన్నీ బలం జులుం తో

దోచుకొనే ఆలోచనకు స్వస్తి చెబుదాం

మన భూమాత సకలం ఇచ్చే కల్ప వృక్షం

కోరికలు తీర్చే కామ ధేనువు

మనతండ్రి పరమాత్మ పరమ దయాళువు

హద్దులలో ఉందాం ముద్దుగా బతుకుదాం

దాన ధర్మాలు చేస్తూ ప్రేమ ,దయా వర్షం కురిపించి

వసుధ లోని సకల మానవాళినీ మనవాళ్ళను చేద్దాం

మానవులంతా పరమానందం తో మనుగడ సాగించాలి

అందరం సుఖ శాంతులతో వర్ధిల్లాలి

ఇలలో స్వర్గం వికసించాలి

‘ఇదే వసుధైక కుటుంబం  

 

’శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః పరో వేది గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’.

   గబ్బిట దుర్గా ప్రసాద్ -26-3-17 –ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –

81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

ఆదిశంకరాచార్యులవారి  శిష్యుడు తోటకాచార్య .ఉత్తరాభారతదేశాన బదరీనాధ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలో వాడక్కే మఠ స్థాపకుడు . ఆదిశంకరాచార్య శృంగేరిలో ఉన్నప్పుడు గిరి అనే మూగ  బాలుడు వారిని దర్శించాడు .తమ శిష్యునిగా స్వేకరించారు . చాలా  కస్టపడి చదువుతూ సేవ చేస్తూ గురు అనుగ్రహం  అభిమానం పొందాడు .అంతగా తెలివి తేటలు లేని గిరి కి ప్రాదాన్యమిస్తున్న గురువుగారిపై మిగతా శిష్యులకు కోపం గిరిపై ఈర్ష్య అసూయలు కలిగాయి .శిష్యులకు అద్వైత వేదాంతాన్ని బోధి౦చ టానికి కూర్చునే సమయం లో శిష్యుడు గిరి గురువుగారి వస్త్రాలను ఉతుకుతూ౦డేవాడు .గిరివచ్చేదాకా పాఠం ప్రారంభించేవారు కాదు శంకరులు .ఒక రోజు పద్మపాదుడు గురువుగారికి ఎదురుగా ఉన్న గోడను చూపిస్తూ ,దానికి పాఠం చెప్పటం ఎలాంటిదో గిరి కి బోధించటం అలా౦టినిది అని ఎద్దేవా చేశాడు .

           శిష్యుని గురుభక్తికి ,వినయ విదేయతలకు సంతోషించిన శ్రీ శంకరులు అతనిని అనుగ్రహించాలను కొన్నారు .మానసికంగా నే శిష్యుడుగిరికి సర్వ శాస్త్రాలను బోధించేశారు .గుర్వనుగ్రహం తో సకలశాస్త్ర పారంగతుడైన గిరి  అకస్మాత్తుగా తోటక ఛందస్సులో గురువు శంకరులపై అష్టకం ఆశువుగా చెప్పాడు. అదే తోటకాస్టకం గా లోకం లో ప్రాచుర్యం పొందింది .మూగ గిరి తోటకాచార్యుడై ప్రసిద్ధి చెందాడు .తోటకాస్టకం లో కొన్ని రుచి చూద్దాం –

1-విదితాఖిల శాస్త్ర సుధాజలధే –మహితోపనిషతకధి తార్ధ నిధే –హృదయే కలయే విమలం చరణం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను .ఆయన దయామృత సాగరుడు .ఉపనిషత్ సారాన్ని గ్రహించి గ్రంధ రచన చేసిన శేముషీ విభవ సంపన్నుడు .

చివరి శ్లోకం

8-విదితా న మయా విశదైకకలా  -న చ కించన కాంచన మస్తి గురో .-ద్రుతమేవ విదేహి కృపాం సహజం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను . బుద్ధీ ,జ్ఞానం లేని చేతిలో దమ్మిడీ కూడా లేని ఈ నాపై ఆయన  కృపాకటాక్షం  ప్రసరించాలి .

Inline image 2

82- అజ్ఞాని జ్ఞాని గా  మారిన -హస్తామలకాచార్య (8 వ శతాబ్ది )

అద్వైత బోధకులు ఆది శంకరాచార్యులవారి మరో శిష్యుడే హస్తామలకాచార్యులు .ద్వారకామ్నాయ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలోని త్రిశూల్ లో ఇడయిల్ మఠాన్ని స్థాపించాడు .కర్నాటక లోని కొల్లూర్ లో  ఆదిశంకరులున్నప్పుడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఇప్పుడు శివల్లి అని పిలువబడే శ్రీ బాలి గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఇంటిలోనూ అగ్ని హోత్రపు సుగంధం పరవశి౦ప జేసి ప్రతి ఇల్లు భిక్షకు ఆహ్వానించింది .రెండు వేలకు పైగా ఉన్న ఆ గ్రామ బ్రాహ్మణులు వేద వేదాంగ, శాస్త్రాలలో నిష్ణాతులు ,వేద విధానం లో యజ్న యాగాలు చేసేవారు .అక్కడ శివ పార్వతులు కొలువైఉన్న ఒక శివాలయం ఉన్నది .ఆ గ్రామం లో ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు అన్నీ తెలిసిన మహా జ్ఞాని .కాని ఆయన కొడుకు అందగాడే కాని శుద్ధ  తెలివితక్కువ దద్దమ్మ  .ఉపనయనం జరిగింది కాని వేద విద్య ప్రారంభం కాలేదు .ఊరికే రికామీగా సోమరిగా స్తబ్దుగా ఉండేవాడు .

 శంకర భగవత్పాదులు తమగ్రామ౦  వచ్చారని తెలిసి ప్రభాకరుడు కుమారునితోసహా  వారిని దర్శించి ,అమాంతం వారి పాదాలపై తండ్రీ కొడుకులు  వాలిపోయి సాష్టాంగ నమస్కారం చేశారు .కరుణా శంకరునికి తన కొడుకు  గోడు విన్నవించుకొన్నాడు  .శంకరులకు ఆకుర్రాడిపై వాత్సల్యం కలిగి ‘’నువ్వు ఎవరు ‘’’?అని ప్రశ్నించారు .అప్పటిదాకా లోకం ఏమిటో ,తన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో  కూడా తెలియని అతడు అకస్మాత్తుగా ఆశువుగా 12 శ్లోకాలలో అద్వైత పరమార్ధాన్ని చెప్పేశాడు .ఆన౦దించిన శ్రీశంకరులు అతడిని శిష్యునిగా స్వీకరించి ‘’హస్తామలకాచార్య ‘’అని నామకరణం చేశారు .అరచేతిలో ఉసిరికాయ లాగా అతనికి సర్వ విజ్ఞానం ఒక్కమారు లభించినందున సార్ధకంగా ఆ పేరు పెట్టారు .

  హస్తామలకుని ప్రతిభా పాండిత్యాన్ని గ్రహించిన శంకరులు ఆయను తన సూత్ర భాష్యం పై వార్తికం రాయమని ఆదేశించారు .అలాగే హస్తామలకుడు రాసి పూర్తి చేశాడు .ఇక్కడ ఒక ఫ్లాష్ బాక్ కథ ఉంది.తెలుసుకొందాం

ఒక సారి యమునా నదీ తీరం లో ఒక ముని తపోధ్యానం లో ఉన్నాడు ,బ్రాహ్మణ స్త్రీలు స్నానం చేయటానికి వచ్చారు .అందులో ఒకావిడ తన రెండేళ్ళ పిల్లాడిని ఆముని దగ్గర వదిలి జాగ్రత్తగా చూడమని చెప్పి యమునా నదీ స్నానికి వెళ్ళింది .ఆపిల్లాడు నెమ్మదినెమ్మదిగా జారి యమునా నదిలో పడి  మునిగిపోయాడు .తల్లి  వచ్చి విషయం తెలిసి నిర్ఘాంత పోయింది .సమాధి నిస్టు డైన ముని  కళ్ళు తెరిచి చూశాడు .రోదిస్తున్న ఆ మాతృమూర్తి వేదనకు చలించిపోయాడు .తన  శరీరాన్ని  త్యాగం చేసి ఆ బాలుడిలో చేరిపోయాడు .మునిగి చనిపోయాడు అనుకొన్న బాలుడు బ్రతికి బయటికి వచ్చాడు .ఆ బాలుడే హస్తామలకాచార్య .అందుకే ఆయన లో అంత అగాధమైన జ్ఞానం నిండి ఉన్నది .అది శంకర కరుణతో ఉబికి బయటికి వచ్చి,అద్వైత ధార గా  ప్రవహించింది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

శంకరా చార్యుల గురువు గోవింద భాగవత్పాదులవారి గురువు గౌడపాదాచార్య క్రీ.శ .6 వ శతాబ్దికి చెందినవారుగా పరిగణిస్తారు .మధ్యయుగం లో వేదానత శాస్త్ర వ్యాప్తి చేసినవారు ఆయన .ఆది శంకరులు వారిని ‘’పరమాచార్య ‘’గా పేర్కొని గౌరవించారు .మాండూక్య కారిక ను సంతరించిన మహాను భావులు  గౌడపాదులవారు .దీన్ని గౌడపాద కారిక ,అని ఆగమ శాస్త్రం అని  కూడా పిలుస్తారు .ఇది 4 అధ్యాయాల గ్రంధం .లేక నాలుగు భాగాల పుస్తకం .ఇందులో నాలుగవది బౌద్ధ పదజాలం తో ఉంటుంది కనుక బౌద్ధ ప్రభావం తో రాయబడిందని అంటారు .కాని ఆచార్య స్వామి రాసింది హిందూ వేద ధర్మమే కాని బౌద్ధ ధర్మ౦  కాదు .మొదటి మూడుభాగాలు అద్వైత భావ వ్యాప్తికి దీప్తికి పట్టు గొమ్మలు .ఇందులో మొదటిభాగం లో మాండూక్య ఉపనిషత్ ఉన్నది ఇది ద్వైత ,విశిస్తాద్వైతులకూ ఆరాధనీయమే .

మాండూక్య కారిక కేవలం 12  వాక్యాల చిట్టి  గ్రంధం .శంకరుల ముందుకూడా మాండూక్య ఉపనిషత్ ‘’శ్రుతి ‘’గా పేర్కొన బడేది .దీని వ్యాప్తి అనంతం ప్రభావం చెప్ప తరం కానిది .ఉపనిషత్ సారం  అంతా వడకట్టి ఇచ్చింది .ఇందులోని మొదటిభాగం  –ఆగమ ప్రకరణం(29 శ్లోకాలు )  2-వైతత్య ప్రకరణ (38 శ్లోకాలు )3-అద్వైత ప్రకరణ (48 శ్లోకాలు )4-అలతశాంతి ప్రకరణ (100 శ్లోకాలు )

ఆగమ భాగం లో ఆత్మమనిషి శరీరం లో 1-విశ్వ 2-తైజస 3 –ప్రజ్నఅనే మూడు రూపాలో ఉంటుందని చెబుతుంది రెండవ ప్రకరణం వైతత్య అంటే అసత్యం లో బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది .మూడులో అద్వైత విషయాలన్నీ క్రోడీకరించి ఉన్నాయి నాలుగవ ప్రకరణ అలత శాంతి అంటే అగ్ని,శాంతి లో ప్రముఖుల సూక్తులు ఉన్నాయి .ధర్మం ,సాంఖ్యం ,అజాతివాదం ,సంసారం ముక్తి విషయాలపై వివరణ ఉంది.

80-పంచపాదిక రాసిన పూరీ పీఠాధిపతి-పద్మ పాదాచార్య (8 వ శతాబ్దం )

శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు,సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

శ్రీ శంకరులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో పూరీ గోవర్ధన మఠానికి పద్మపాదాచార్యులు పీఠాది పతిని చేశారు .శంకరాచార్యులవారు . అసలు ఆయన కేరళలో తెక్కే మఠం అనేదాన్ని స్థాపించాడని కొందరు అంటారు కాదు ఆయన దక్షిణ భారతం లో చోళప్రాంతం వాడని కొందరి అభిప్రాయం .సురేశ్వరాచార్యులతో కలిసి పద్మపాదుడు వివరణ భాష్యకారుడిగా గుర్తింపు పొందాడు .ఆయన రాసిన గ్రంధాలలో ఒకే ఒక్కటి ‘’పంచ పాదిక ‘’లభ్యం .శంకరులు తాను రచించిన బృహదారణ్య భాష్యం పై  వివరణ వ్యాఖ్య  రాయమని కోరితే పద్మ పాదుడు దీన్ని రాశాడు .అసూయతో ఉన్నమేనమామ దీన్ని తగలబెడితే శంకరాచార్యులవారి అమోఘ జ్ఞాపక ధారణా శక్తి వలన ఇప్పుడున్న రూపం లో మళ్ళీ పద్మపాదుడు రచించాడు .పద్మపాదుడు గురువే సర్వం గురువును మించినది లేదు అని అభిప్రాయపడ్డాడు .శంకర –పద్మ పాదుల గురు శిష్య బంధం మహా ఆదర్శప్రాయమైంది లోకం లో .

శంకరుల ‘’అధ్యాస ‘’భావాన్ని పద్మపాదుడు పంచ పాదిక లో సంపూర్ణంగా ఆవిష్కరించాడు .జీవ బ్రాహ్మలు ప్రతిబింబ బింబాల వంటి వారు అని ఇందులో సారాంశం .

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 76 –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

76  –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )

అద్వైత మత స్థాపకులు శ్రీ శంకర భగవత్పాదుల గురువు గారే గోవింద  భగవత్పాదుల వారు .ఆయన జీవితం రచనల గురించి పెద్దగా లోకానికి తెలియదు .కాని శంకరాచార్యులవారు తమ రచనలో వారి ప్రస్తావన చేశారు .శంకర విజయం లో కూడా ఆయన గురించి సమాచారం లేదు .గోవింద పాడుల గురువు గౌడపాదులవారు .శంకరాచార్య ప్రకరణ గ్రంథం వివేక చూడామణి మొదటి శ్లోకం లో గోవింద భగవత్పాదుల గురించి లో పేర్కొన్నారు .శృంగేరి శారదా పీఠం గురు పరంపరలో గౌడపాదుల తరువాత గోవింద భగవత్పాదుల ను తర్వాత శంకరాచార్యులను పేర్కొంటారు .

  మాధవీయ శంకర విజయం ప్రకారం కేరళను వదిలి వెళ్ళిన ఆది శంకరులు నర్మదా నది తీరం లో ఉన్న ఓంకార క్షేత్రాన్ని చేరి అక్కడ కొండపై ఉన్న చిన్న గుహలో ఉంటున్న గోవింద భగవత్పాదుల దర్శనం చేశారు .శంకర విజయం ప్రకారం ఒకనాడు రేవా నదికి అకస్మాత్తుగా విపరీతంగా వరదలు వస్తే ,శంకరులు తన కమండలాన్ని అడ్డం పెట్టి వరద ను ఆపేసి సమాధిలో ఉన్న గురువుగారికి తపో భంగం కాకుండా కాపాడారని ఉన్నది  .ఇప్పటికీ ఆగుహను మనం దర్శించవచ్చు .ఓంకార క్షేత్రం లో ఓంకార మహా శివుడు కొలువై ఉంటాడు .గోవింద పాదులు శంకరుని చూడగానే ‘’నువ్వు ఎవరు /?అని ప్రశ్నిస్తే

‘’న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం’’అని శ్లోకం చెప్పారు .ఇదే దశ శ్లోకి గా లోకం లో ప్రసిద్ధి చెందింది .భావం –
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

ఇది విన్న గురువు చాలా సంతోషించి ఆయన అద్వైత వైదుష్యానికి అబ్బురపడి తన శిష్యునిగా స్వీకరింఛి సన్యాస దీక్ష అనుగ్రహించారు .గురువు గోవిందపాదుల ఆదేశం తో శ్రీ శంకరులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయటం ప్రారంభించారు .

Inline image 1

77- హిందూ మత పరిరక్షణకు బౌద్ధం స్వీకరించి ప్రాయశ్చిత్తం చేసుకున్న -కుమారిల భట్టు (భట్టిపాదుడు )(8 వ శతాబ్దం )

తన 15 వ ఏట, ఆది శంకరాచార్యులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేననిమాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు “శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు” అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.

భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తాడు.

 78-మీమాంస ,అద్వైత దర్శనాలపై రచనలు చేసిన సురేశ్వరాచార్యులే మండన మిశ్రులు(8 వ శతాబ్దం )మండన మిశ్రుడు 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త, ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. కర్మ మీమాంస పై అధారిటీ .స్పోట వాదానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు .ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత సురేశ్వరాచార్యుల అను పేరుతో ప్రసిద్ధిపొందాడు. శంకరాచార్యులను తర్క గోష్ఠిలో ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటే అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలో సురేశ్వరచార్యులు ఒకరు. శంకరాచార్యులు అందువలన దక్షిణామ్నాయ మఠమైన శారదా మఠానికి మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గురువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటే ఎక్కువగా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయంలో సాధారణానికి భిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కన్నా ఎక్కువ. వేదాంత సంస్కృతిని అనుసరించి రెండు రకాలా మీమాంసలు ఉన్నాయి. ఒకటి పూర్వ మీమాంస ( మీమాంస అని అంటే దాని అర్థం పూర్వమీమాంస) రెండొ మీమాంస ఉత్తర మీమాంస దీనినే వేదాంత విద్య అని కూడా పిలుస్తారు. వేదాంత విద్య అంటే వేద=జ్ఞనం అంత = అంచులు జ్ఞానం అంచులు తెలిపేది పూర్ణ జ్ఞానం). ఫుర్వమీమాంస అనుసరించి వైదిక కర్మ కండ,యజ్ఞ యాగాదులు నమ్మకాలు ఉంటాయి. ఉత్తర మీమాంస అంతా ఉపనిషత్తుల సారం , జ్ఞాన సముపార్జన గురించి ఉంటుంది.

   మండన మిశ్రులు బీహారీ బ్రాహ్మణుడు .బీహార్ లోని మహేశీ ప్రాంతం లో నివశించాడు .ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మం డలేశ్వర్ అంటారు.గుప్తేశ్వర మహా శివాలయం లో శంకరాచార్యుల వారితో వాదం చేశాడు .అందుకనే ఈ పట్నం ఆయన పేరుమీద నే పిలువ బడుతోంది . కుమారిలభట్టు ప్రచారం చేసిన మీమాంస సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు మండన మిశ్రుడు .అద్వైత భావనలతో ‘’బ్రహ్మ సిద్ధి ‘’ గ్రంథంరాశాడు .బ్రహ్మ సిద్ధి మండన మిశ్ర గా ప్రసిద్ధుడయ్యాడు .కర్మ మీమా౦సపై అత్య౦థ అభిమానం ఉన్నందున గొప్ప కర్మిస్టి గా మారి పోయాడు .వేదం లో చెప్పబడిన కర్మకాండలను తుఛ తప్పక పాటించాడు .మండన మిశ్రుని బ్రహ్మ దేవుని అవతారంగా భావిస్తారు .అయన భార్య ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతీ దేవి యే.

Inline image 2

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-3-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 74 –నాట్య శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

74 –నాట్య  శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36

త్రిపాఠి అంటే నే మహా పండితుడు అనే అర్ధం లోకం లో ఉంది కమలేశ్ త్రిపాఠి నాటక నాట్య రంగ ప్రముఖుడైన సంస్కృత విద్వాంసుడు .బెనారశిండు విశ్వ విద్యాలయ౦ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ రెలిజియన్స్ అండ్ ఆగమిక్ స్టడీస్ లో   ఎమిరిటస్ ప్రొఫెసర్ . ఇందిరా గాంధి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ కు 20 07 లో సలహాదారు .యూరప్ లో అనేక దేశాల యూని వర్సితీలలో విజిటింగ్ ప్రొఫెసర్ .జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో విస్తృతంగా ఫిలాసఫీ  నాటకం సాహిత్యం లపై రచనలు చేశాడు .’’అమరు శతకాన్ని హిందీలోకి అనువదించాడు .చాలా సంస్కృత గ్రందాల ప్రచురణకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత నాటక రంగం ఆయన కృషికి ఎంతో రుణ పది ఉంది.కమలేశ్ అంటే నాట్య నాటక రంగాలే గుర్తుకు వస్తాయి అంతటి విశిష్ట సేవ చేశాడు .ఆయన నాట్య వ్యాప్తి  కుటియాట్టం నుంచి అస్సాం లోని అ౦కీయ నాట్ వరకు విస్తరించింది .సంప్రదాయం అన్నిటా కొత్త వచ్చి నట్లు దర్శనమిస్తుంది అదే ఆయన ప్రత్యేకత ,నిబద్ధత .

  సంస్కృత నాటక రంగాన్ని ఆధునికం చేయటం లో గొప్ప కృషి చేయటానికి పండిట్ మధురా ప్రసాద్ దీక్షిత్ తోడ్పాటు పొందాడు . అభిజ్ఞాన శాకుంతలం ,మాలవికాగ్ని మిత్రం ,ఉత్తర రామ చరితం, ముద్రా రాక్షసం  వేణీ సంహారం మొదలైన సంస్కృత నాటకాలను ప్రదర్శించటం లో ఎన్నో మెళకువలు తీసుకున్నాడు .డి.ఫిల్ పొంది ,వారణాసి లోని సంపూర్ణానంద యూని వర్సిటి నుంచి ఆచార్య బిరుదు అందుకొన్నాడు .అక్కడే తబలా వాయి౦చటమూ నేర్చాడు .

   ఉజ్జైన్  కాళిదాస అకాడెమి చైర్మన్ గా సమకాలీన సంస్కృత గ్రంధ వ్యాప్తికి ప్రచురణకు అద్వితీయ కృషి చేశాడు .భాస  ,కాళిదాస కవుల నాటకాలను పూర్తిగా అర్ధం చేసుకొని అంకిత భావం తో  వందలాది ప్రదర్శనలను చేసిన సంస్కృత నాటక పరివ్యాప్తి దీక్షా తత్పరుడు .భాసుని నాటకాల గొప్ప తనాన్ని   ఆధునికులు అర్ధం చేసుకోవటానికి వీలుగా ‘’బాల చరిత్ర ‘’మొదలైన వాటిని హిందీలో రాశాడు .ప్రొఫెసర్ కమలేశ్ దత్త త్రిపాఠి  నాట్య శాస్త్ర నిదిగా గుర్తింపు పొందాడు . 2006 లో సాహిత్య అకాడెమి పురస్కారం 20 07 లో భారత రాష్ట్ర పతి ప్రశంసా పత్రం అందుకొన్నాడు .2008 లో స్వామి హరిహరానంద  సరస్వతి సమ్మాన్ అందుకొన్నాడు .ప్రయాగ హిందీ సాహిత్య సంమేలన్ ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .నాటక ,నాటక రంగాలలో అపార అనుభవం, వైదుష్యం ఉన్నందున కైలాస్ నాధను  సంగీత నాటక అకాడెమి ఫెలో ను చేసి గౌరవించింది .

Inline image 2

75 –మహమ్మద్ ప్రవక్త చరితను సంస్కృతం లో రాసిన –కె .ఎస్.నీల కంఠన్ ఉన్ని( 1895 -1990)

మళయాళ ,సంస్కృతాలలో ఉద్దండ పండితుడు నీలకంఠన్ ఉన్ని 1895 లో కేరళలో కొట్టాయం జిల్లా కావిల్ మదం గ్రామం లో జన్మించాడు .ఈ వంశంవారు  తెక్కునూర్ రాజ వంశానికి రాజ గురువులు .స్వగ్రామం లో కన్నం పల్లి మధు ఆసాన్ వద్ద ప్రాధమిక విద్య నేర్చి ,తిరువాన్కూర్ రాయల్ సంస్కృత కాలేజి లో చదివి శాస్త్రి, మహోపాధ్యాయ డిగ్రీలు సాధించాడు .మలయాలంమున్షి గా 35 ఏళ్ళు వివిధ విద్యా సంస్థలలో పని చేశాడు .కొట్టాయం లోని ఎం డి సేమినరి హైస్కూల్ లో  రిటైర్  అయ్యాడు .

   ఉన్ని ఎన్నో మళయాళ గ్రంథాలు రాశాడు .దేవాలయాలు ఉత్సవ సంప్రదాయాలు ,ప్రాచీన విధానాలపై విస్తృతంగా వ్యాసాలూ రాశాడు .కాళిదాస కవి శాకుంతలం మేఘ దూతం లను మలయాళం లోకి అనువాదం చేశాడు .ఆయన కూర్చిన ‘’పంచ మహా నిఘంటు ‘’చాలా ప్రఖ్యాతమైంది .కథాకలి లో వాడే మూడు అట్టకాలు రచించాడు .

 మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను సంస్కృత కావ్యం గా రాసిన ఘనత ఉన్ని ది .దీనికి ‘’విశుద్ధ నబి చరితం ‘’అని సార్ధక నామం పెట్టాడు .అయోధ్య సంస్కృత పరిషత్ ఉన్ని సంస్కృత సేవకు ‘’సాహిత్య రత్న ,విద్యా భూషణ్ బిరుదులిచ్చి సత్కరించింది .1890లో ఉన్ని 95 వ ఏట మరణించాడు .ఆయన మరణానంతరం 4-4-2011 న ఆయన సంకలం చేసిన అద్భుత గాధలను ‘’ఐతిహ్య కదాకల్ ‘’పేరిట ప్రచురించారు .ఇది కొట్టారతి సంకున్ని సంకలం చేసిన ‘’ఐతిహ్య మాల ‘’తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది .

Inline image 1

         సశేషం

ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో  

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3

73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )

              ఇంతింతై

29-9-1930 న సంస్కృత మహా పండితుడు చారుదేవ శాస్త్రి కుమారుడు గా జన్మించిన  సత్యవ్రత శాస్త్రి తండ్రిని మించిన పాండిత్యం ఉన్నవాడు .వారణాసి వెళ్లి పండిట్ సుఖదేవ్ ఝా ,డా.సిద్దేశ్వర వర్మ ల వద్ద విద్య నేర్చాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో బి. ఏ. ఆనర్స్ ఎం. ఏ. లను బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి పి .హెచ్ .డి .పొందాడు .ఢిల్లీ యూని వర్సిటి లో సంస్కృత ఉపన్యాసకుడుగా చేరి హెడ్ గా  పండిట్ మన్మోహన  నాద దార్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా  డీన్ గా  45 ఏళ్ళు పనిచేశాడు .తర్వాత పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయ వైస్ చాన్సెలర్ గా సేవలందించాడు .బాంగ్ కాక్ లోని చూల లొంగు కారన్ ,సిల్పకారన్ యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు ,నార్త్ ఈస్ట్ బుద్ధిష్ట్ యూని వర్సిటి ,ధాయ్ లాండ్ , జెర్మని  ,బెల్జియం లోని కేధలిక్ యూని వర్సిటి ,కెనడాలోని అల్బర్టా యూని వర్సిటి ,లకు కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .ధాయ్ లాండ్  ప్రిన్సెస్ మహా చక్రి సింధు కారన్ కు సంస్కృతం నేర్పాడు .

           మహా రచన

   శాస్త్రి   సంస్కృతం లో  3 మహా కావ్యాలు ,3 ఖండ కావ్యాలు ,1 ప్రబంధం ,ఒక పత్ర కావ్యం ,5 విశ్లేషణాత్మక గ్రంధాలు రాశాడు .అందులో రామకృతి మహాకావ్యం ,బృహత్తర భారతం ,శ్రీ బోధి సత్వ చరితం ,వైదిక వ్యాకరణం ,శర్మణ్యా దేశ సూత్ర౦ విభాతి ముఖ్యమైనవి .అనేక భాగాలుగా ‘’డిస్కవరీ ఆఫ్ సాంస్క్రిట్  ట్రెజర్స్ ‘’ఒక గొప్ప ఉద్గ్రంధం .ధాయ్ లాండ్  రామాయణం రాయల్ ధాయ్ ను రాజు అభ్యర్ధనపై సంస్కృతీకరించి శ్రీ రామ కృతి మహాకావ్యంగా రాశాడు .దీనికి ముందుమాట మహారాణి రాసింది .ధాయ్ లాండ్ లోని హిందూ దేవాలయాలు ,వాటిలోని సంస్కృత లిపి పై పరిశోధన చేశాడు .కాళిదాస రచనలపై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .యోగ వాసిస్టం  కు వివరణ రాసి ప్రచురించాడు .ఈశాన్య ఆసియాలో సంస్కృత పదజాలం ,శ్రీరాముడు ల పై విస్తృత పరిశోధన చేశాడు .న్యు ఢిల్లీ లోని’’ జవహర్ లాల్ నెహ్రు స్పెషల్ సెంటర్ ఫర్ సాంస్క్రిట్ ‘’కు గౌరవ ప్రొఫెసర్ గా శాస్త్రి ఉన్నాడు .

 

                  అంతర్జాతీయ పురస్కార వైభవం

సత్య వ్రత శాస్త్రి కి రాయల్ నేపాల్ అకాడెమి గౌరవం ,బెల్జియం యూని వర్సిటి విశిష్టపతకం ,కెనడాలోని అట్టావా అంతర్జాతీయ ఫెలోషిప్ ,బాంగ్ కాక్ యూని వర్సిటి గౌరవ దాక్ట రేట్ ,ఇటలి లోని సివిల్ అకాడెమి అవార్డ్ ,కెనడా వారి కాళిదాస సమ్మాన్,ఇటలి లోని టోరినో వారి స్పెషల్ అవార్డ్, గోల్డెన్ ప్రైజ్ , ,ఇండొనీషియా ప్రభుత్వ అవార్డ్ ,ధాయ్ లాండ్  రాయల్ డెకరేషన్ ,రోమానియా ప్రభుత్వ ఎక్సెలెన్స్, అవుట్ స్టాండింగ్ టీచర్  అవార్డ్ లు ,, ఇటలి లోని అగ్రి గెంటో నుండి ఫెలోషిప్ ,డాక్టర్ ఆఫ్ ఆనర్ వంటివి లెక్కలేనన్ని అంతర్జాతీయ  అవార్డ్ లు లభించాయి .

                       జాతీయ పురస్కార హేల

   సాహిత్య అకాడెమీ పురస్కారం ,ఢిల్లీ లోని సాహిత్య కళా పరిషత్ గౌరవం ,సిఖ్ గురుద్వారా పురాస్కారం ,భారత రాష్ట్ర పతి పురస్కారం ,శిరోమణి సంస్కృత సాహిత్య కార్ ,విశిష్ట సాహిత్య పురస్కార ,గీతా రాణా పురస్కార ,సాంస్క్రిట్ సేవా సమ్మాన్ ,సాంస్క్రిట్ సాహిత్య పురస్కార ,ఇందిరా బెహరే గోల్డ్ మెడల్ ,పండిత జగన్నాధ పద్య రచన పురస్కార్,కాళిదాస పురస్కార ,పండిట్ క్షమా రావు పురస్కార ,వాగ్విభూషణ బిరుదు ,దేవ వాణీ రత్న సమ్మాన్ ,రాజస్థాన్ వారి అఖిలభారత సంస్కృత తొలి పురస్కార ,వాచస్పతి పురస్కార ,మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు, మహా మహోపాధ్యాయ బిరుదు ,జ్ఞాన పీఠ పురస్కారం ,పద్మ భూషణ్ వంటి జాతీయ పురస్కారాలు  76 వరకు అందుకొన్న సాహితీ మూర్తి శ్రీ సత్యవ్రత శాస్త్రి .ఆయన్ను సన్మానించి గౌరవించని సాహిత్య సంస్థ ,ప్రభుత్వం లేదు అంటే అతిశయోక్తి కాదు .

                    సాహిత్య సరస్వతి

పైన చెప్పిన గ్రంధాలే కాక హ్యూమన్ వాల్యూస్ డెఫినిషన్స్,సంస్కృత రైటింగ్స్ అండ్ యూరోపియన్ స్కాలర్స్ ,వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ సాంస్క్రిట్ వంటి 15 ఎకడమిక్ రచనలు చేశాడు .’

  బృహత్ భారతం శ్రీ బోధి సత్వ చరితం ,ఇందిరా గాంధి చరితం ,ధాయ్ దేశ విలాసం , న్యు ఎక్స్ పరి మెంట్స్ ఇన్ కాళిదాస ,చాణక్య నీతి ,భవి తవ్యనం ద్వారానీ భవంతి సర్వత్ర ‘’అనే స్వీయ చరిత్ర మున్నగు సాహిత్య పరమైన 12 రచనలు చేశాడు .

Inline image 1

ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )

డోగ్రీ సాహిత్యాన్నీ హిమాలయ పర్వత ప్రాత సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్కృత పండితుడు కవి దేవీ దత్త శర్మ 23-10-1924 న ఉత్తరాఖండ్ లోని కుమాన్ జిల్లాలో జన్మించాడు .ఆగ్రా యూని వర్సిటి నుండి ఎం ఏ డిగ్రీపొంది ,బనారస్ ,పంజాబ్ యూని వర్సిటీల నుంచి రెండు డాక్టోరల్ డిగ్రీలు సాధించాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి డి.లిట్ అందుకొన్నాడు .28 గ్రంధాలు ,200 పరిశోధనా పత్రాలు ,రచించాడు .56 రిసెర్చ్ గ్రంధాలలు  వారి విద్వత్తును చాటుతాయి .ఆయన 8 భాగాలుగా రాసిన ‘’సోషియో కల్చర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ‘’గొప్ప ప్రాచుర్యం పొందింది .మూడు భాగాల’’ జ్ఞాన కోశం ‘’ సంతరించాడు .

చండీగర్ లోని పంజాబ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా దీర్ఘకాలం పని చేసిన అనుభవం దేవీ దత్త శర్మ ది .

ఆయన విద్వత్తు కు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .గర్వాల్ యూని వర్సిటి ‘’జీవిత సాఫల్య పురస్కారం ‘’,న్యు ఢిల్లీ లోని గ్యాన్ కళ్యాణ్ దత్వ్య న్యాస్ సంస్థ ‘’అఖిలభారత విద్వత్ సమ్మాన్ ‘’ను ,సంపూర్ణానంద  సంస్కృత విశ్వ విద్యాలయం ‘’సంస్కృత విద్వత్ సమ్మాన్ ‘’,కేంబ్రిడ్జి లోని ఇంటర్నేషనల్ బయాగ్రాఫికల్ సెంటర్ ‘’2000 సంవత్సరం లో ‘’మిలీనియం అవార్డ్ ‘’ను ,అదే ఏడాది  భారత ప్రభుత్వం ‘’మిలీనియం సంస్కృత పురస్కారం ‘’,2001 లోభారత రాష్ట్ర పతి  గౌరవ సర్టిఫికేట్ ,2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించాయి .

సశేషం

Inline image 1

అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)

1868 లో కర్నాటక రాష్ట్రం కావేరీ తీరాన రుద్రపట్నం గ్రామం లో  శ్యామ శాస్త్రి జన్మించాడు  ,సాంకేతి బ్రాహ్మణుడు .పుట్టిన చోటే చదివి మైసూర్ వెళ్లి సంస్కృత పాఠశాలలో చదివి సంస్కృత విద్వత్ –డిగ్రీ ఉత్తమ శ్రేణి లో పొందాడు .ఆయన ప్రతిభను గుర్తించిన మద్రాస్ యూని వర్సిటి సంస్కృతం లో బి ఏ డిగ్రీ ఇచ్చింది .మైసూర్ రాజ్య దివాన్ శేషాద్రి అయ్యర్ ప్రోద్బలం తో  శాస్త్రి ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరి లో లైబ్రేరియన్ గా చేరాడు .ఇక్కడపని చేస్తూ వేద ,వేదాంగాలను  క్లాసికల్ సంస్కృతాన్ని,ప్రాకృత ,ఇంగ్లీష్ ,కన్నడ ,జర్మన్ ,ఫ్రెంచ్ భాషలను  స్వయంగా అభ్యసించి గొప్ప వాడయ్యాడు .

1891 లో  ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి  ట్యూట్’’  మైసూర్ ఓరియెంటల్ లైబ్రరి ‘’గామారింది .అందులో వేలాది సంస్కృత  తాళ పత్రా గ్రంధాలున్నాయి .నిత్యం వీటిని పరీక్షిస్తూ వీటిని కేటలాగ్ చేస్తూ వాటిలోని విషయాలను సేకరించాడు .  ఆ కుప్ప లో 1905 లో అర్ధ శాస్త్రం ఆయన కంట బడింది . మూడేళ్ళు కస్టపడి శిధిలమౌతున్న దానిని ఓపికగా కాగితాలపై రాసి తన సంపాదకత్వం లో ముద్రించి లోకానికి మొట్ట మొదటి సారిగా కౌటిల్యుని అర్ధ శాస్త్రాన్ని తెలియ బరచాడు .దానిని తానే ఇంగ్లీష్ లోకి అనువదించి 1915 లో ప్రచురించాడు .ఇక్కడ అర్ధ శాస్త్రం మూల గ్రంధ రూపం లో లభిస్తే ,దేశం లోని ఇతర ప్రాంతాలలో దాని నకళ్ళు దొరికాయి .దీనిని తంజావూర్ లోని ఒక సంస్కృత పండితుడు ఈ లైబ్రరీకి ఎప్పుడో ఇచ్చాడట .ఇప్పటి దాకా అర్ధ శాస్త్రం దండి ,బాణుడు ,విష్ణు శర్మ ,మల్లినాద సూరి మెగస్తనీస్ మొదలైన వారు వారి రచనలలో ఉదాహరించినదే అందరికి  తెలుసు .అసలు అర్ధ శాస్త్రం గ్రంధ రూపం లో శ్యామ శాస్త్రి ప్రచురించి మహోపకారం చేశాడు .ఇది ఒక చారిత్రాత్మక సన్ని  వేశంగా నిలిచింది .తరువాతనే ఫ్రెంచ్ జర్మన్ మొదలైన భాషలలోకి అనువాదం పొందింది అర్ధ శాస్త్రం .

శాస్త్రి మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీలో 1912 వరకు పని చేసి తర్వాత బెంగుళూరు లోని శ్రీ చామ రాజేంద్ర సంస్కృత పాఠ శాల ప్రిన్సిపాల్ అయి 1915 వరకు ఉన్నాడు .1918 లో మళ్ళీ పాత స్థానం చేరి ,క్యురేటర్ అయి ,మైసూర్ లోని ఆర్కిలాజికల్ రిసేర్చేస్ కు డైరెక్టర్ అయి 1929 వరకు రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .అర్ధ శాస్త్రాన్ని కనుక్కోవటం తో  ఆగి పోకుండా శ్యామ శాస్త్రి వేద కాలం ,వేద ఖగోళం మొదలైన విలువైన విషయాలపై పరిశోధన చేశాడు .క్రీ పూ.8 శతాబ్దానికి చెందిన’’వేదాంగ జ్యోతిషం ‘’,గ్రహణాలపై ‘’ద్రప్స’’ ,ఎక్లిప్స్ కల్ట్ ఇన్ వేదాస్ కొరాన్ అండ్ బైబిల్ అనే ద్రప్స కు అనుబంధ గ్రంధం ,వేదకాలం పై ‘’గవ౦ అయన ‘’,ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటి ,ది ఆరిజినల్ ఆఫ్ దేవ నాగరి ఆల్ఫబెట్స్’’అనే గొప్ప రచనలు చేశాడు శ్యామ శాస్త్రి .వీటిని దేశీయ ,విదేశీయ సంస్కృత విద్వాంసులు అందరూమహోన్నత రచనలుగా కీర్తించారు .భారత దేశం లో ఆశుతోష్ ముఖర్జీ ,రవీ౦ద్ర నాథ టాగూర్ బాగా మెచ్చారు .1927 లో శాస్త్రి గాంధీ జీని నంది హిల్స్ లో కలిశాడు .శాస్త్రి పరిశోధనలవలన మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీకి అంతర్జాతీయ గుర్తింపు గౌరవం దక్కాయి .

ఇండాలజిస్ట్ లు ,ఓరిఎంటలిస్ట్ లు అయిన  జూలియస్ జాలీ ,మొరిజ్ విత్నిజ్ ,ఎఫ్ డబ్ల్యు ధామస్ ,పాల్ పెల్లి  యాట్ ,ఆర్ధర్ బెర్రిన్ గ్దేల్ కీత్ ,స్టెయిన్ కొ నోవ్ మొదలైన వారు శాస్త్రి కృషికి నీరాజనాలు అందించారు .జే. ఎం .ఫ్లీట్ ‘’భారత దేశ సామాన్య చరిత్రను అందజేసిన౦దుకు శ్యామ శాస్త్రి కి  మనం ఎల్లప్పుడు రుణ పడి ఉండాలి ‘’అన్నాడు .వాషింగ్టన్ డిసిలోని ఓరియంటల్ యూని వర్సిటి 1919 లోను ,1921 లో కలకత్తా యూని వర్సిటి శ్యామ శాస్త్రికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి .రాయల్ ఏషియాటిక్ ఫెలో ను చేసి గౌరవించారు .కాంప్ బెల్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసి సత్కరించారు .

శ్యామ శాస్త్రి కృషికి ‘’అర్ధ శాస్త్ర విశారద ‘’,బిరుదును మైసూర్ మహా రాజా ఇస్తే ,భారత ప్రభుత్వం ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదును ,వారణాసి సంస్కృత మండల్ ‘’విద్యాలంకార ,పండిత రాజ ‘’బిరుదులూ ప్రదానం చేసి ఆయన కీర్తిని పెంచాయి .ఆయన అంతర్జాతీయ కీర్తి కి ఉదాహరణ గా ఒక ఉదంతాన్ని అందరూ చెప్పుకొంటారు –ఒక సారి మైసూర్ మహా రాజు నాలుగవ జయ చామరాజ ఒడియార్ జర్మనీ సందర్శించినప్పుడు ఒక యూని వర్సిటి వైస్ చాన్సెలర్ ‘’మీరు శ్యామ శాస్త్రి గారి మైసూర్ నుంచి వచ్చారా “’అని ఆశ్చర్యంగా అడిగాడట .రాజు మైసూర్ కు తిరిగి వచ్చి శ్యామ శాస్త్రిని న భూతో గా సత్కరించి ‘’మేము మైసూర్ లో మహా రాజులం మీరు మా పౌరులు .కాని జర్మనీ లో మీరు గురువులు ,మీ వలననే మేము ,మా ప్రజలు గౌరవం, కీర్తి  పొందాము ‘’అని  అత్యంత  వినయంగా గౌరవం గా అన్నారట .

శ్యామ శాస్త్రి తర్వాత కూడా ఇండాలజీ సమస్యలపై పరిశోధనలు కొన సాగించి క్యురేటర్ అయ్యాడు .మైసూర్ రాజ్య ఆర్కి యాలజి డైరెక్టర్ గా ఉంటూ ఎన్నెన్నో శిలా ఫలకాలు, రాగి రేకులుకనిపెట్టాడు . మైసూర్ చాముండి పురం లోనితన స్వగృహానికి  ఆశుతోష్ ముఖర్జీ గౌరవార్ధం ‘’ఆశుతోష్ ‘’అని  నామ కారణం చేశాడు శ్యామ శాస్త్రి .1944 లో 76 వ ఏట అర్ధ శాస్త్రాన్ని  కనుగొని లోకానికి అందించిన  రుద్రపట్నం శ్యామ శాస్త్రి మహా రుద్ర సన్నిధానానికి చేరుకున్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

             కేదార్ నాథ పాండే –రాహుల్ సాంకృత్యాయన్

మహా పండిత  రాహుల్ సాంకృత్యాయన్ అంటే నిరంతర యాత్రాశీలి ,వ్యాసకర్త యాత్రకు సాహిత్య గౌరవం కలిగించిన  బహుభాషా వేత్త .9-4-1893 న తూర్పు ఉత్తర ప్రదేశ్ లోఅజాం ఘర్ జిల్లాలో   కేదార్ నాథ్ పాండే గా జన్మించాడు .స్థానికంగా విద్య ప్రారంభించినా  తర్వాత సంస్కృత హిందీ ఇంగ్లిష్ ,పాళీ భోజ్ పూరి ,ఉర్దూ ,పర్షియన్ అరబిక్ ,తమిళం కన్నడ ,టిబెటన్, సింహళీస్, ఫ్రెంచ్ ,రష్యన్ భాషలు నేర్చి రాయగల సమర్ధత సాధించిన బహు భాషా వేత్త .ప్రారంభం లో ఆర్య సమాజం దయానంద సరస్వతి బోధనలపై ఆకర్షణ ఉండేది .తర్వాత బౌద్ధం అతనిని పూర్తిగా మార్చేసింది .దేవునిపై నమ్మకం లేకపోయినా పునర్జన్మ ను విశ్వసించాడు .తర్వాత మార్క్సిస్ట్ సోషలిజం మోజులో పడి దాన్నీ వదిలేశాడు .ఆయన రాసిన ‘’దర్శన్ – దిగ్దర్శన్ ‘’గ్రంథం ప్రపంచ తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా వివరించింది .ఇందులో రెండవ భాగం –‘’ధర్మ కృతి ప్రమాణ వార్తికం’’ కు అంకితమై రాసినట్లు కనిపిస్తుంది .దీని మూలాన్ని టిబెట్ ఆ భాషలో ఉంటే సేకరించాడు ..

                        విస్తృత యాత్రికుడు

         విస్తృత నిరంతర యాత్రికుడైన సాంకృత్యాయన్ లడక్ ,కిన్ననూర్, కాశ్మీర్ ,నేపాల్ టిబెట్ ,శ్రీలంక ఇరాన్ ,చైనా రష్యా లను సందర్శించాడు .చాలాకాలం బీహార్ లో శరన్ జిల్లా పరసాగడ్ లో ఉన్నాడు .ఈ గ్రామ ప్రవేశ ద్వారానికి’’ రాహుల్ గేట్ ‘’అని పేరు పెట్టారు .టిబెట్ కు బౌద్ధ సన్యాసిగా వెళ్ళాడు. చాలా సార్లు టిబెట్ వెళ్లి విలువైన పాళీ ,సంస్కృత వ్రాత రాతులను, చిత్రాలను సేకరించి తెచ్చుకొన్నాడు .ఇవి విక్రమశిల ,నలందా విశ్వ విద్యాలయాలకు చెందినవి .వీటిని ఇండియాకు   23 కంచర గాడిద లపై తెచ్చి పాట్నా మ్యూజియం లో భద్ర పరచాడు .

                        బహుభాషా గ్రంధ రచన

అనేక భాషలలో నిష్ణాతుడైన రాహుల్ గొప్ప సృజన శీలి .20 లలో రచన ప్రారంభించి దాదాపు 100 పుస్తకాలు అనేక విషయాలపై-సోషియాలజీ ,హిస్టరీ ఫిలాసఫీ ,బౌద్ధం టిబెటాలజీ ,లేక్సికోగ్రఫీ  వ్యాకరణం ,సైన్స్ జానపదం  నాటకం వ్యాసం రాజకీయం మొదలైన వాటిపై  రాశాడు . ప్రాకృతం  లోని ‘’మైఝిమ నికాయ్ ‘’ను హిందీలోకి అనువదించాడు .రాహుల్ ప్రసిద్ధ రచన హిందీలో రాసిన ‘’ఓల్గా సే గంగ ‘’.చార్తిత్రాత్మక ఫిక్షన్ .ఇందులో క్రీ పూ 6000 కాలం నుండి 1942వరకు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం వరకు చరిత్ర ఉంది .అన్నిభాషలలోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధమైంది .ఆయన రాసిన పుస్తకాలు 10 కి పైగా బెంగాలీ లోకి అనువాదం పొందాయి .చరిత్ర కారుడు  కాశీ  ప్రసాద్ జైస్వాల్ సాంకృత్యాయన్ ను గౌతమ బుద్దునితో సమానం అన్నాడు .స్కూలు విద్య లేకపోయినా అన్నీ స్వయంగా సాధించాడు. సోవియెట్ రష్యా వెళ్లి లెనిన్ గ్రాడ్ యూని వర్సిటి లో  ఇండాలజీ ప్రొఫెసర్ గా 1937 -38 వరకు మళ్ళీ 1947-48వరకు పని చేశాడు .

                            వివాహం వగైరా

బాల్యం లోనే రాహుల్ వివాహం ‘’సంతోషి’’ తో జరిగింది . ఆతర్వాత ఆ బాల వధువు ఏమైందో ఆయనకు తెలియదు .వయసు 40 లలో రెండో సారి రష్యా వెళ్ళినప్పుడు సంస్కృత, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ,రష్యన్ భాషలలో ప్రవీణురాలైన మంగోలియన్ స్కాలర్ ‘’లోలా’’ తో సన్నిహితం గా ఉన్నట్లు ఆయన డైరీ వలన తెలుస్తోంది .టిబెటన్ –సంస్కృత నిఘంటు నిర్మాణానికి ఆమె ఆయనకు తోడ్పడింది .ఇద్దరూ పెళ్ళిచేసుకొని ‘’ఇగార్’’ అనే కొడుకుకు జన్మనిచ్చారు .ఆయనతో వాళ్ళిద్దరూ ఇండియా రావటానికి స్టాలిన్ రష్యా  అనుమతి నివ్వ లేదు  .తర్వాత కమల అనే ఇండియన్ నేపాలీ ని పెళ్లి చేసుకొని జయ ,జేత అనే అమ్మాయిని అబ్బాయిని సంతానంగా పొందాడు .జేత నార్త్ బెంగాల్ యూని వర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. జయ డెహ్రాడూన్ లో ఉండేది .

                  సుదీర్ఘ యాత్ర

 రాహుల్ శ్రీలంక యూని వర్సిటి లో పని చేస్తుండగా విఅరీతమైన మాదుమేహ వ్యాధి,  అతి రక్తపు పోటు  వలన  గుండెపోటు వచ్చి డార్జిలింగ్ లో 1963 ఏప్రిల్ 14 న 70  వ ఏట  సుదీర్ఘ యాత్ర లో సుదూర తీరాలకు చేరుకొన్నాడు .ఆయన పేర అవార్డ్ లను అందజేస్తున్నారు .

                 సాంకృత్యాయన్ సాహిత్య సర్వస్వం

హిందీలో దివోదాస్ ,మధుర స్వప్న ,విస్మృతి యాత్ర మొదలైన 8 నవలలు ,వోల్గా సే గంగ ,బహురంగి మధుపురి వంటి 4 కథా సంపుటులు ,3 భాగాలుగా ‘’మేరీ జీవన్ యాత్ర ‘’అనే స్వీయ చరిత్ర ,సర్దార్ ప్రిద్వి సింగ్ ,బచ్ పన్ కి స్మ్రుతి యాన్ ,కప్తాన్ లాల్ ,మహామానవ్ బుద్ధ , స్టాలిన్ ,లెనిన్ ,మొదలైన 16 జీవిత చరిత్రలు ,మాన్సిక్ గులామీ ,రుగ్వేదిక్ ఆర్య ,ఘుమక్కార్ శాస్స్త్ర ,దర్శన్ –దిగ్దర్షన్ ,మధ్య ఆసియా కా ఇతిహాస్ సామ్యవాద్ హి కోన్ వంటి ఇతర రచనలు ,భోజ్పురి భాషలో 2 ,నేపాలీ భాషలో 1 ,టిబెటన్ భాషలో 7 పుస్తకాలు రచించాడు .

  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు మూడు సార్లు అరెస్ట్ అయిన జాతీయ వాది రాహుల్  .ఆయన విజ్ఞానం  మహా పండితుని విజ్ఞానం .1963 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసి సన్మానించింది .తన దిన చర్య ను డైరీలో నిత్యం సంస్కృతం లోనే రాసుకోనేవాడు .దీని ఆధారంగానే అనేక రచనలు చేయగలిగాడు సాంకృత్యాయన్ .

Inline image 1

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

69-హేమచంద్రుని ప్రమాణ మీమాంసకు సంపాదకత్వం వహించిన జైన విద్యావేత్త –సుఖలాల్ సంఘ్వి(( 18 80  -1978 )

పండిట్ సుఖలాల్జీ అని అందరూ గౌరవంగా పిలిచే సుఖలాల్ సంఘ్వి జైన విద్యావేత్త ఫిలాసఫర్ .జైనం లోని స్తనక్ వాసి సంప్రదాయం వాడు .చిన్నప్పుడే విపరీతంగా మసూచికం బారి పడి నెమ్మదిగా కోలుకొని జైన గ్రంధాలలోని తర్క గ్రంధాలు చదివి బెనారస్ హిందూ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అయ్యాడు .జైన మతాన్ని అద్భుతం గా వివరించి చెప్పగల సామర్ధ్యం సంఘ్వికి బాగా ఉన్నదని పాల్ దండాస్ అన్నాడు .ప్రసిద్ధ జైన విద్యా వేత్త పద్మనాభ జైన్ కు మార్గ దర్శి .సాహిత్య అకాడెమి అవార్డ్ ,పద్మ భూషణ్ పురస్కారం అందుకొన్నాడు .

గుజరాత్ లోని సౌరాస్ట్రలో లిమ్డి గ్రామం లో 8-12-1880  న జన్మించాడు .వణిక్ కులానికి చెందినవాడు .తండ్రి తల్సి సంఘ్వి.తల్లిమణిబెన్.నాలుగో ఏట తల్లి చనిపోయింది .దూరపు బంధువుల పెంపకం లో పెరిగాడు .జైన గురువుల బోధలు శ్రద్ధగా వినేవాడు .బెనారస్ లో యశో విజయ జైన్ సంస్కృత పాఠ శాలలో చేరి మూడేళ్ళలో సిద్ధ హేమ వ్యాకరణం ,తర్క సంగ్రహ ,ముక్తావళి ,వ్యాప్తి చంద్రిక లను అనేక వ్యాఖ్యానాలతో సహా చదివాడు .రఘువంశం ,మేఘ సందేశం ,నైషధీయాలను ఆమూలాగ్రం చదివేశాడు .అలంకార శాస్త్రాలు కోశాల ను అధ్యయనం చేసి సాధించాడు .1911 లో మిధిల, కాశీ లకు వెళ్లి సాహిత్యం ,ఫిలాసఫీ నేర్చాడు .ఆగ్రా వెళ్లి ‘’పంచ ప్రతిక్రమణ ‘’అనే దేవేంద్ర సూరి నాలుగు కర్మ గ్రంధాలలో మొదటి దానిని తన సంపాదకత్వం లో వెలుగు లోకి తెచ్చాడు .హరి భద్ర సూరి రాసిన యశో దర్శన ,యోగ వి౦శిక లను కూడా ప్రచురించాడు .న్యాయా చార్య పరీక్ష పాసై జైన పాఠశాలలో బోధించి ముని జిన్ విజయ ,ముని లలితా విజయ ,ముని పుణ్య విజయలకు గురువై బోధించాడు .

1922 లో గుజరాత్ విద్యా పీఠంలోని   పురాతత్వ మందిర్ లో భారతీయ తత్వ శాస్త్రం బోధించాడు .సిద్ధ సేన దివాకరుని 5 భాగాల సన్మతి తర్క కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .1933 నుంచి 10 ఏళ్ళు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో జైన ఫిలాసఫీ ప్రొఫెసర్ గా ఉన్నాడు .సంస్కృత హిందీ గుజరాతీ భాషలలోని విలువైన గ్రంధాలకు అనువాదాలకు ఎన్నిటికొ ఎడిటర్ గా ఉన్నాడు. తత్వార్ధ సూత్రా ,న్యాయావతార లను గుజరాతీ భాషలోకి అనువాదం చేశాడు .హేమ చంద్ర సూరి రచన ప్రమాణ మీమాంస కు సంపాదకుడుగా ఉన్నాడు. జయ రుషి రాసిన తతావప్లవ  ను వెలుగులోకి తెచ్చి గొప్ప కీర్తి పొందాడు .ఇది చార్వాకం పై ప్రసిద్ధ గ్రంధం .బౌద్ధ తత్త్వం పై కొత్త వెలుగులు ప్రసరింప జేశాడు .1944 లో రిటైరై  భారతీయ విద్యా భవన్ లో చేరి జైనముని ఆచార్య జినవిజయాజి వద్ద పని చేశాడు .1957 లో బరోడా లోని ఎం .ఎస్ .యూని వర్సిటి ఆహ్వానం పై భారతీయ తత్వ శాస్త్రం పై 5 గొప్ప ఉపన్యాసాలు చేశాడు .ఇవి గుజరాతీ ,హిందీ ఇంగ్లీష్ లలో  ప్రచురింపబడ్డాయి . ఆత్మ –పరమాత్మ ,సాధన ల పై ఆయన గుజరాత్ విద్యా సభలో చేసిన  ప్రసంగాలను బాంబే యూని వర్సిటి ‘’ఆధ్యాత్మ విచారణ ‘’పేర ముద్రించింది .

నాధూరాం ప్రేమి ప్రభావం ఈయనపై ఎక్కువ దిగంబర జైనులతో కూడా చాలాస్నేహం గా ఉండేవాడు .జైనం బాగా అర్ధం కావాలంటే పాళీ భాష బాగా నేర్వాలి అనేవాడు .ఎందరో యువకులను మార్గ దర్శనం చేశాడు ఆయన అశేష శేముషి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈయన  విద్వత్తుకు తగిన బిరుదులూ పురస్కారాలు లభించాయి .విజయ ధర్మ సూరి జైన్ సాహిత్య స్వర్ణపతకం ,మద్రాస్ యూని వర్సిటి డి.లిట్,1958 లో కేంద్ర సాహిత్య  అకాడెమి  పురస్కారం ,1961 లో కేంద్ర ప్రభుత్వం సంస్కృత సేవకు యోగ్యతా పత్రం ,1974 లో పద్మ భూషణ్ అవార్డ్ ,1975 లో బీహార్ నవ నలంద విహార్ నుండి విద్యా వారిధి బిరుదు పొందారు. డా సర్వేపల్లి రాదా కృష్ణన్ సంఘ్వి ని జ్ఞాన యజ్ఞం చేస్తున్న మహానుభావుడు అని అభివర్ణించారు .97 వ ఏట 2-3-1978 న పండిట్ సుఖలాల్జి సంఘ్వి మరణించాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -2

ట్రిప్ చేజెర్ల -2

—                54 ఏళ్ళ క్రితపు స్నేహితులు   బాబాయ్,అబ్బాయ్ ల సందడే సందడి

1962- 63లో రాజమండ్రి లో నా బి ఎడ్  ట్రెయినింగ్ మిత్రులు శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ. ఇద్దర్నీ కలిపి మళ్ళీ చూడటానికి 54 ఏళ్ళు పట్టింది . వాళ్ళిద్దరూ నన్ను’’ బాబాయ్’’ అనేవాళ్ళు నేను ‘’అబ్బాయ్ ‘’అనే వాడిని .అదీ మా స్నేహ బాంధవ్యం . కిస్టాయ్కి  అప్పటికే పెళ్లి అయింది .1964 లో నా పెళ్ళికి సుబ్బయ్య వచ్చాడు .తర్వాత అతని పెళ్లి మన ఘంటసాల లో జరిగితే నేను వెళ్లాను .తర్వాత ముగ్గురం జిల్లా పరిషత్ సెలెక్షన్ లలో కలిశాం .నాకు గుంటూరు జిల్లాలో రెంట చింతల అనే ఎండలు రికార్డ్ గా ఉండే ఊర్లో పోస్టింగ్ ఇస్తే , సుబ్బయ్యను కృష్ణా పరిషత్ లో ముసునూరు ,కృష్ణ మూర్తికి వత్సవాయి ఇచ్చారు .వాళ్ళూ చేరలేదు నేనూ చేరలేదు. అప్పటికే నేను కృష్ణా లోమోపి దేవి లో ఉద్యోగం చేస్తున్నాను .కృష్ణ లెక్కల వాడు .సుబ్బు బయాలజీ వాడు .కృష్ణ గుంటూరు జిల్లాపరిషత్ లో హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయితే ,సుబ్బాయ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .కృష్ణ మూర్తి నేను 1963 నుండి కనీసం పదేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు కొనే వాళ్ళం .ఇన్లాండ్ కవర్ లో ఒక్క మిల్లీ మీటర్ కూడా ఖాళీ లేకుండా రాసుకునేవాళ్ళం .ఆ తర్వాత ఒక సారి చందోలు వెళ్లి కిస్టాయ్ ఇంట్లో ఒక రోజు ఉండి ,వాళ్ళమ్మ గారి ఆతిధ్యం కూడా పొంది ,ఖాజీపాలెం  సుబ్బాయ్  ని ఇద్దరం కలిసిచూసి అక్కడి నుంచి నేను రేపల్లె వెళ్ళి మా రాయ ప్రోలు శివ రామ దీక్షితులు బాబాయి వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .బాబాయ్ ‘’ఒరే నీ జీతం ఎంత ?’’అని అడిగితె ‘’145 ‘రూపాయలు ‘’అని చెబితే బోల్డు ఆశ్చర్య పోయి ‘’మేస్టర్లకు అంత జీతమిస్తారా “’అని అడిగితే అవాక్కయ్యా .సుమారు 20 ఏళ్ళ క్రితమ 1997 లో నేను అడ్డాడలో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు కిస్టాయ్  ఒక సారి పామర్రు బస్ స్టాండ్ లో కనిపించాడు .ఒకటి రెండు ఉత్తరాలు  రాశా .జవాబు లేకపోతే  వదిలేశా .సుబ్బయ్య జాడ మళ్ళీ లేదు .2016 కార్తీక మాసం లో శివాలయం లో కొత్త బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లో జరిగిన కార్తీక వనభోజనాలలో సుబ్బయ్య అల్లుడి  తమ్ముడు ఉయ్యూరులో రాయప్రోలు ముక్కోటి శాస్త్రి అల్లుడు పలకరించి సుబ్బయ్యగారు మిమ్మల్ని అడగమన్నారు అంటే  ఎలా అని ఆరాతీసి ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా సుబ్బాయ్ కి ఫోన్ చేసి కిస్టాయ్ ఫోన్ నంబర్ తీసుకొని మళ్ళీ’’ టాకటం ‘’ మొదలు పెట్టాం .సరసభారతి పుస్తకాలు కార్యక్రమాల ఆహ్వానాలు పంపుతూనే ఉన్నా .సుబ్బయ్య భార్య తో సహానిరుడు  జనవరి 25 న జరిగిన కొలాచల సీతారామయ్యగారి పుస్తకావిష్కరణ కు  వచ్చాడు  .ఇన్నేళ్ళకు కలుసుకొన్నందుకు అందరం ఎంతో సంతోషించాం .వేదికపైకి ఆహ్వానించి మాస్నేహం అందరికి చెప్పి శాలువా కప్పి జ్ఞాపిక అద జేశా .భోజనాల తర్వాత  ఇంటికి దంపతులు వచ్చారు .ఇద్దరికీ బట్టలు పెట్టాం. వాళ్ళూ మాకు పెట్టారు .మళ్ళీ ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు ముగ్గురం దంపత్యుక్తంగా కలుసుకొనే మహా భాగ్యం కలిగింది .

పొన్నూరు నుంచి సరాసరి చందోలు వచ్చాం . శ్రీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న కృష్ణ మూర్తి ఇంటికి వెళ్లాం .దంపతులు  ఎంతో  సంతోషించారు .పది రోజులక్రితమే  ఇలా వస్తున్నట్లు ఫోన్ లో చెప్పా .టిఫిన్ కాఫీలు అయ్యాక కిస్టాయ్ తమ దేవాలయం లోమా సమక్షం లో  మా పేర పూజ చేసి ప్రసాదం ఇచ్చాడు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు  శాలువా అందజేశాడు .మేమూ ఆ దంపతులకు అలాగే సత్కారం చేసి దబ్బ కాయ ఇచ్చాం . కిస్టాయ్ సరసభారతికి, శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకు 2,1 1 6 రూపాయలు అంద జేశాడు .అక్కడే ఎదురుగా ఉన్న శ్రీ లింగోద్భవ దేవాలయం సందర్శించాం .ఈ స్వామి మీదనే శ్రీతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులుశ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు 8 వ ఏట సంస్కృతం లో లింగోద్భవ వృత్తమాలిక రాసి తమ ప్రతిభను చూపారు .స్వామి ముందు మొదటి సారి అష్టావధానం చేశారాట.

చందోలు అనగానే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గుర్తుకు వస్తారు. వారు నడయాడిన పవిత్ర స్థలం చూశాం .వారిని కంచి పరమాచార్యులవారితో కలిసి ఉయ్యూరు లో 1969 లో చూసిన జ్ఞాపకం .శ్రీ బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు వారు .పరమాచార్యులవారికి అంతరంగికులు .తనకోసం రావద్దని శాస్త్రి గారిని చూస్తే  చాలని వారు భక్తులకు చెప్పే వారట .అంతటి మహనీయులు శాస్త్రి గారు . ఆదంపతుల విగ్రహాలు చూశాం .జీవ కళ తొణికిస లాడుతూ ముచ్చటగా ఉన్నాయి. అక్కడే పరమాచార్యులవారు కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం చూసి పులకించని వారు ఉండరు .శాస్త్రిగారి తమ్ముడుగారి అబ్బాయి , వీరి కుమారుడు అక్కడే ఉండి ఆ భవన బాధ్యతలు చూస్తున్నారు. వారు స్థాపించిన వేద పాఠ శాల విద్యార్ధులు లేక ఖాళీ గా ఉంది.శాస్త్రిగారి కాలం లో పరమ వైభవంగా ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం బోసి పోయినట్లు ఉన్నది .శాస్త్రి గారి పూజా గృహమూ చూశాం .జన్మ ధన్యం అయింది  .

అక్కడి నుంచి కృష్ణ మూర్తి తో సహా ఖాజీ పాలెం చేరాం .సుబ్బయ్య ఇల్లు శివాలయం ప్రక్కనే. ఆతను ఇందులో పూజారికూడా. సంవత్సరం లో 4 నెలల వంతు .ఇల్లు ముచ్చటగా ఉంది .ముగ్గురం కలిసి 54 ఏళ్ళు .మళ్ళీ గలగలా మాట్లాడుకొంటూ పాత విషయాలు గుర్తు చేసుకొంటూ బి ఎడ్ అనుభవాలు చెప్పుకొంటూ ఒక గంట గడిపాం .రాజమండ్రి లో ఎన్నో సినిమాలు కలిసి చూసిన కబుర్లు ,సాయంత్రాలలో  గోదారి ఒడ్డున తిరిగిన విశేషాలు ,వరద రాజు హోటల్ ఇడ్లీ రుచి, పంచవటి హోటల్ పేపర్ అట్టు జ్ఞాపకం చేసుకోన్నాం. కాలేజి గురువులు ప్రిన్సిపాల్ శ్రీ హాబి బుల్లా ,లెక్కల లెక్చరర్లు శ్రీ డి.వీరభద్ర రావు ,శ్రీ డి సూర్యనారాయణ ,తెలుగు హెడ్  ఫిజిక్స్ నటరాజన్ బయాలజీ సుబ్బమ్మ కేమిస్త్రి అప్పారావు (చెంబిస్త్రి) బేసిక్ ఎడ్యుకేషన్ రాజు గార్లను  గుర్తుకు తెచ్చుకున్నాం. క్లాస్ మేట్ లు  లలితా వరలక్ష్మి  విశాలాక్షి ,నాగే౦ద్రనాథ్ (కాకినాడ )రూమ్ మేట్ల ను(వెంకట రెడ్డి-అద్దంకి  ,పాల్ -మైలవరం )లను   మరోసారి హృదయ ఫలకం పై ఆవిష్కరింప జేసుకొన్నాం. ఆ రోజులు తిరిగి  రావు అని  ఆనంద పడ్డాం . కిస్టాయ్ జోకుల కేకర్లకు మల్లికాంబ గారు పగల బడి నవ్వారు . మా దంపతులకు సుబ్బయ్య ద౦పతులు బట్టలు పెట్టారు. సుబ్బయ్య భార్యకు మేము చీరా జాకెట్ పెట్టాం. దబ్బకాయ ఇచ్చాం .సుబ్బాయ్ సరసభారతికి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు 2 వేల రూపాయలు అందజేశాడు .వాళ్ళు పెట్టిన  పండ్ల ముక్కలు తిని, కాఫీ త్రాగాం .విష్ణు పూజారి కృష్ణ మూర్తి ,శివ పూజారి సుబ్బయ్య .విష్ణు శివ అవతారాలు అనుకొంటే ఏదో కొంత సాహిత్యం సృష్టిస్తున్న నేను బ్రహ్మనే కదా .కనుక ముగ్గురం ఆ త్రిమూర్తుల ప్రతి రూపాలమే అని పిస్తుంది. ,శివాలయ దర్శనం చేసి రాత్రి 7 -30 గం లకు బయల్దేరి రేపల్లె చేరి పెనుమూడి వంతెన దాటి ,కృష్ణ కరకట్ట ఎక్కి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఉయ్యూరు చేరాం .మా డ్రైవర్ ఈసా ముస్లిం .అయినా ఒక్కడే దేవుడు అన్న విశ్వాసం ఉన్నవాడు .ఒక ముస్లిం మత గురువు ఉపన్యాసాల రికార్డ్ వినిపిస్తూ తానూ అన్నీ చెబుతూ అందర్నీ ఆకట్టుకొన్నాడు .అతనితో దాదాపు 25 ఏళ్ళ పరిచయం ఉంది  మా ‘’లూనా’’ కు గాలి కొట్టి౦చటానికి  రిజిస్త్రార్ ఆఫీస్ ఎదురుగాఅతనూ సోదరులు నడిపే టైర్ రిపేర్ షాప్ కు  కు వెళ్ళేవాడిని. అదే పరిచయం .అతని భావ తీవ్రతకు ముగ్ధుడ నై 26 వ తేదీ ఉగాది వేడుకలకు తమ్మని ఆహ్వానం ఇచ్చి శాలువా కప్పుతాను అని చెప్పాను .ఉదయం 5 గం నుంచి ప్రయాణం లో ఉన్నా ఎక్కడా అలసట అనిపించ లేదు స్నేహబంధం ఆరోగ్యకరం ఆనంద కారణమూ  అయి  మనసుకు ఉల్లాస ఉత్సాహాలనిచ్చింది . సంతృప్తికలిగింది . .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -1

ట్రిప్ చేజెర్ల -1

18-3-17 శనివారం ఉదయం 5 గం లకే నేనూ  నా శ్రీమతి ప్రభావతి ,మనవడు చరణ్ మా కుటుంబ మిత్రురాలు శ్రీమతి మల్లికాంబ గారు కలిసి కారు లో బయల్దేరి గుంటూరు జిల్లాలోని  చేజెర్ల ,కోటప్పకొండ దేవాలయ సందర్శనం పొన్నూరులో శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల ను దర్శించి ,54 ఏళ్ళ క్రితం నాతో రాజమండ్రి బి ఎడ్ కాలేజి లో   ట్రెయినింగ్  మిత్రులైన  చందోలులో ఉంటున్న శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి  ,ఖాజీపాలెంలో ఉంటున్న శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ స్వగృహాలలో  వాళ్ళను చూసి ,రేపల్లె మీదుగా  పెనుమూడి వద్ద శ్రీ మండలి వెంకట కృష్ణా రావు వారధి దాటి ,కృష్ణ కరకట్ట మీదుగా ప్రయాణం చేసి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఇంటికి చేరాం .ఆవిశేశాలు .

చేజెర్ల కపోతేశ్వరాలయం

శిబి చక్రవర్తి కాశ్మీర్ దేశాన్ని పాలిస్తున్న రోజులలో ఆయన తమ్ముళ్ళు  మేహా డంబరుడు, జీమూత వాహనుడు ఉన్నారు .మేహా డంబరుడు అన్న గారి అనుమతి తీసుకొని  కొందరు మునులతో ఇప్పటి చేజెర్ల అని పిలువ బడే చేరం చోర్ల వచ్చి అక్కడి ప్రకృతి కి పరవశుడై   ‘’దేవర కొండ ‘’పై శివునికై  తపస్సు చేసి లింగాకారం పొందాడు .వార్త తెలుసుకొన్న జీమూత వాహనుడు అన్నగారి జాడ తెలుసుకోవటానికి కొందరు మునులతో ఇక్కడికి వచ్చి తానూ అన్నగారి దారిలో తపస్సు చేసి కైలాసం చేరాడు .ఇద్దరు తమ్ముళ్ళ జాడ తెలియని శిబి చక్రవర్తి ససైన్యంగా ఇక్కడికి వచ్చి తానూ ఇక్కడి ప్రకృతి అందాలకు పులకి౦చి త్రయాగం అంటే 100 యజ్ఞాలు చేయ టానికి నిశ్చయించి 99 పూర్తీ చేసి నూరవ యజ్ఞం చేస్తుండగా ,వంద యజ్ఞాలు పూర్త యితే బ్రహ్మ పదవి కి అర్హుడౌతాడుకనుక అతనిని పరీక్షించటానికి త్రిమూర్తులు నిర్ణయించుకొని శివుడు వేటకాడుగా బ్రహ్మ ఆయన బాణం గా విష్ణు మూర్తి పావురం గా మారి ఇక్కడ ఉన్న రూపన గుంట్ల గ్రామానికి వస్తారు   .శివుడి బాణం దెబ్బకు  గాయ పడిన కపోతం   శిబి పాదాలపై పడి ఆయన ను శరణు కోరుతుంది .ఆయన అభయమిస్తాడు .వేటకాడు వచ్చి తాను కొట్టిన పావురం తనకు ఆహారం గా కావాలంటే ,దాని ప్రాణ రక్షణ చేస్తానని అభయమిచ్చాను కనుక వదలను అంటాడు శిబి .చివరకు కపోత రక్షణ  కోసం శిబి, పావురం బరువుతో సమానంగా తన శరీరం లోని మాంసాన్ని  కోసిస్తాను అంటే వేటకాడు శివుడు ఒప్పుకుంటాడు .త్రాసు తెప్పించి పావురాన్ని ఒక వైపు ఉంచి తన శరీర మాంసాన్ని కోయటం ప్రారంభిస్తాడు .ఎంత కోసినా తూకం సరి పోవటం లేదు. చివరికి తన శిరస్సును ఖండించు కొబోగా త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆయన శరణాగత ధర్మానికి మెచ్చి నూరవ యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించి బ్రహ్మ పదవి నిస్తారు .శిబి ఆప్రదేశాన్ని అపర కైలాసం గా వర్ణిస్తాడు శివుని ఆజ్ఞతో తాను శివలింగా కృతి పొంది పావురం పేరు మీద ‘’కపోతేశ్వర లింగం ‘’అవుతాడు. అతని తో బాటు మిగిలిన వారూ లింగాలుగా మారిపోతారు .లింగం పై భాగాన రెండు రంధ్రాలు ఉంటాయి .అవి శిబి చక్రవరి కళ్ళు .ఆ రంధ్రాలనుంచి అభిషేక తీర్ధం ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు .లింగం వద్ద ఇప్పటికీ మాంసం వాసన రావటం ఆశ్చర్యమే కాక చారిత్రిక సత్యంగా భావిస్తారు .శిబి తండ్రి మాంధాత ఆయన తండ్రి యయాతి అని మనకు తెలిసిందే .

శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఈ స్వామిపై ‘’కపోతేశ్వర శతకం ‘’రాశారు .రెండేళ్ళ క్రితం నాకు పంపగా చదివి ఆనందించి ఈక్షేత్ర దర్శనం చేయాలని ఉవ్విళ్ళూరాను .ఇదిగో ఇప్పటికి కుదిరింది .ఆలయం చాలాపురాతనమైనది  సుమారు 17 వందల ఏళ్ళ నాటిది .రాతి శిలాఫలకాలపై చరిత్ర ఉంది .లింగం తెలుపు పాలరాయి. మేము వచ్చేసరికిపూజారి గారు అభిషేకం చేస్తున్నాడు .అయిదారుగురు భక్తులున్నారు .మా కొబ్బరికాయ కొట్టి హారతి తీర్ధ ప్రసాదాలు ఇచ్చాడు .ఇక్కడే ప్రక్కన ఉన్న అరుగుమీద మాతో తెచ్చుకున్న ఇడ్లీలు తిన్నాం .

‘’ మా అమ్మాయి ‘’

శ్రీమతి బెల్లంకొండ శివకుమారి నరసరావు పేట లో ఉంటుంది .భర్త లెక్చరర్ .ఆమె విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై పై గొప్ప అధారిటి .చాలా చక్కగా ఎన్ని గంటలైనా పుస్తకం సహాయం లేకుండాఅనర్గళంగా  దానిపై మాట్లాడుతుంది .ఉయ్యూరు లో రెండు సార్లు నేను ఆమెతో మాట్లాడించా .బెజవాడ లో గత ఏడాది జరిగిన విశ్వ నాథ సాహితీ వైభవం లో కూడా పూర్ణ చంద్ గారికి చెప్పి ఆమెను పిలిపించి మాట్లాడించా .ఆమె నన్ను ‘’నాన్న గారు ‘’అని మాశ్రీమతిని ‘’అమ్మా ‘’అనిఎంతో ఆప్యాయంగా, గౌరవం గా కలిసినప్పుడు, ఫోన్ లో మాట్లాడినప్పుడూ సంబోధించటం ఆమె సంస్కారం .మేము చేజెర్ల వస్తున్నామని నరసరావు పేట రాగానే ఆమెకూ, శ్రీమతి యడవల్లి మనోరమ కు ఫోన్ చేస్తే మనోరమలిఫ్ట్ చేయలేదు శివకుమారి తాను చేజెర్ల దారిలో ఉన్న రెడ్డి పాలెం హైస్కూల్  కు వస్తున్నానని  అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర ఉండమని అంటే ఆగాం. భర్త తో  కలిసి వచ్చి అమాంతం నా పాదాలపై వాలి’’ నాన్న గారూ ! మళ్ళీ ఎన్నాళ్ళకు  అమ్మను ,మిమ్మల్ని చూడగలిగాను ‘’అని ఆనందం తో పరవశించింది .మాకూ ఎంతో ఆనందం కల్గింది భర్తకూడా అదే  విధంగా  పాదస్పర్శ చేసి నమస్కరించాడు మా ఇద్దరికీ . సంస్కారం మూర్తీభవించిన ఆడంపతుల్ని చూసి పులకించి పోయాం అందరం . శివ కుమారి సామర్ధ్యాన్ని నాకు తెలియ జేసిన వారు  ప్రముఖ కథా రచయిత,  నరసరావు పేటవాస్తవ్యులు శ్రీ గంధ౦  యజ్న వల్క్య శర్మ గారి అన్నగారు .నాకు సరసభారతికి ఆప్తులు ‘’అమృత హస్తాలు ‘’ ‘’కథా సంపుటి రచయిత స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మగారు  .వారే డా.శ్రీ మడక సత్యనారాయణ గారినీ మా పాపాయి పిన్ని మేనకోడలు  నరసరావు పేట లో తెలుగు లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ ను కూడా పరిచయం చేశారు. మనోరమ నన్ను ‘’బాబాయి గారు ‘’అంటుంది మావిడను ‘’అమ్మా ‘’అంటుంది .శివకుమారి మనోరమకు ఫోన్ చేసి  మా చేజెర్ల ప్రయాణం సంగతి చెబితే అప్పుడు ఫోన్ చేసి సారీ చెప్పి  మాట్లాడింది .శివకుమారిని చూసిన ఆనందం తో చేజెర్ల కపోతేశ్వర దర్శనం మరింత మధురమని పించింది .

కోటప్పకొండ

రెండేళ్ళ క్రితం మొదటి సారిగా కోటప్ప కొండకు వెళ్లి వచ్చాం .దారిలోనే కదా అని మళ్ళీ  శ్రీ త్రికోటేశ్వర స్వామి ‘’దర్శనం చేసుకొని  ఇక్కడి స్పెషల్ ప్రసాదం అయిన ‘’నేతి అరిసెలు ‘’కొన్నాం .శ్రీ కోడెల శివ ప్రసాద్ గారి వల్లనే కోటప్ప కొండ అభి వృద్ధి బాగా జరిగింది. పైకి కారు వెళ్ళే రోడ్డు వేశారు .వసతులు బాగా కల్పించారు .కోటప్పకొండ ప్రభలు చాలా ప్రసిద్ధం .కొండకింద ‘’గబ్బిట కోటయ్య గారి బ్రాహ్మణ అన్నదాన సత్రం ‘’చూసి అక్కడి వాచ్ మన్ ద్వారా దాన్ని నిర్వ హించే శ్రీ  గబ్బిట బాలు గారు చిలకలూరి పేటలో లో ఉంటారని తెలుసుకొని ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాం. చిలకలూరి పేట లో’’గబ్బిట వారి వీధి ‘’ఉందని వాచ్ మన్ చెబితే  ఎంతో సంతోష పడ్డాం . ఈ సత్రం బ్రాహ్మణుల కోసమే .శివరాత్రికి వచ్చే  బ్రాహ్మణ   భక్తులకు మూడు రోజులు ఉచితంగా భోజనం పెడతారు .మిగిలిన కులాల వారికీ  సత్రాలున్నాయి .దీనికి గాను చందాలను వసూలు చేయటానికి ఒక బ్రాహ్మణుడు రసీదు పుస్తకాలతో ఉయ్యూరు వచ్చి సేకరించి తీసుకొని వెళ్ళేవాడు .దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎవరూ చందాల కోసం రావటం లేదు .చిన్న సత్రమే అయినా సేవ ఘనం .అందులోనూ మా గబ్బిట వారిది అని గర్వ పాడుతాం వారికి మాకూ పరిచయాలు లేక పోయినా .అప్పుడు మేమిచ్చిన చందా మొదట్లో 2 ,తర్వాత 5 చివర్లో 10 రూపాయలు మాత్రమమే తలచుకొంటే ఇప్పుడు సిగ్గేస్తుంది .కాని అప్పటికి అదే గొప్ప .వసూలు చేసే బ్రాహ్మణుడు మా ఇంట్లోనే భోజనం చేసి ఊర్లోకి వెళ్లి చందాలు వసూలు చేసేవాడు .మా అమ్మా నాన్నా తర్వాత నా తరం వరకూ అలా జరిగింది. తర్వాత వాళ్ళే రావటం మానేశారు .నిధులు సంతృప్తిగా ఉన్నాయేమో .

పొన్నూరు లో సాహితీ మూర్తుల దర్శనం

కోటప్పకొండ నుంచి చిలకలూరి పేట మీదుగా ,పెదనందిపాడు దాటి పొన్నూరు కు బయల్దేరాం. దారిలో  నీడ ఉన్న ప్రదేశం లో మేం తెచ్చుకొన్న మామిడికాయ పప్పు ,కొబ్బరి మామిడి పచ్చడి, కారం పొడి గడ్డ పెరుగు తో భోజనం లాగించాం డ్రైవర్ ఈసా తో సహా.మధ్యాహ్నం 1-30 కు పొన్నూరు చేరి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారింటికి వెళ్లి ,వారి శ్రీమతికి చీరా జాకెట్ పెట్టి ,మా దొడ్లో కాసిన దబ్బకాయ ఇచ్చి ,శాస్త్రిగారు పెట్టిన టీ తాగి ,ప్రక్కనే ఉన్న రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ ,జ్యోతిష శాస్త్ర వేత్త బహు  గ్రంథ కర్త మన హేవళంబి ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారం అందు కొబోతున్న    డా శ్రీ నిష్టల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ  దర్శించి ,వారి శ్రీమతికీ చీరా జాకెట్   దబ్బకాయ ఇచ్చి పొన్నూరు వచ్చిన ఫలితం పొందాం . వారి సతీమణి మా శ్రీమతికి ,మల్లికాంబ గారికి జాకెట్ పీస్ లిచ్చి సత్కరించారు.  దక్షిణా మూర్తి గారివల్లనే నేను రండవ గీర్వాణం లో చాలామంది సంస్కృత కవుల పై రాయగలిగాను .ఎ0దరినో నాకు పరిచయం చేసి ఎన్నో పుస్తకాలు పంపి రాయటానికి సహకరించి ప్రోత్సహించిన మహానుభావులాయన .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 -ఉయ్యూరు


Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

అన్యోన్య దాపత్యం

శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంధ కర్త 1988 లో వారికి కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రదానం చేసింది  .అయినా ఏమాత్రం గర్వం ఆయనలో లేదు .సుశీలగారు వారి గ్రంధాలను అత్యంత శ్రద్ధాసక్తులతో చదివారు వారామెతో ‘’బాల రామాయణం ‘’రచింప జేయించారు .అది అలభ్యం .శాస్త్రి గారి ఆకాశమంత పాండిత్యాన్ని చూసి తాము రచించటం మానేశారు .వారి సాహిత్యం పై ప్రసంగించేవారు సుశీల .తండ్రి గారి గ్రందాలప్రచారం చేయమని కూతుళ్ళను ప్రోత్సహించారు .స్త్రీల కోసం ‘’మాతృశ్రీ స్తోత్ర రత్నాలు ‘’సంకలనం చేసి ప్రచురించారు.గాంధీ పైఒక మంగళహారతి రాశారు .’’మంగళమని మంగళమని మంగళమనరే –మంగళమని పాడరే మహాత్మా గాంధీకి ‘’అనేది ఆపాట .’’బీదలకు నేను సేవ చేస్తే నా పిల్లలకు భగవంతుడు సహకరిస్తాడు ‘అనే నమ్మకం ఆమెది .స్వాతంత్ర సమర యోధులైన శాస్త్రిగారు జైలు కు  వెళ్ళినప్పుడు, వినోబా తో పాద యాత్ర చేసినపుడు ధైర్యంగా పిల్లల ఆలనా పాలనా చూసుకోనేవారు .భర్త గారికి జున్ను ఇష్టం అని బకెట్ నిండా జున్ను వండి జైలుకు తీసుకు వెళ్లి పోలీసులను కూడా తినమనే వారు .మన ‘’మామయ్యలు’’ మాయ గాళ్ళు  కదా ,వారికి పెట్ట కుండా అంతా తామే ‘’జుర్ర్రేసే’’వారు .తెలిసినా ఆమె వారిని ఏమీ అనేది కాదు .పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకుండా తెలుగు హిందీ నేర్పించారు .శాస్త్రి గారి పుస్తకాలను పిల్లలు అమ్మి ,కొన లేని వారికి ఉచితంగా ఇచ్చేవారు .భర్తల ఆశయాలకు అనుగుణంగా మసలు కొనేవారు .నగలు లేక పోయినా ,తెల్ల ఖద్దరు చీర ధరించి మెడలో నల్లపూసల దండతో అసలైన భారత నారిగా కని పించేవారు .

భూదాన ఉద్యమానికి భర్త 5 ఎకరాలు దానం చేసినప్పుడు ,ఆమె సహకరించారు . తర్వాత తర్వాత కొడుకు కూతుళ్ళు ఆంగ్ల విద్య నేర్చి ఎంతో అభి వృద్ధి సాధించారు .కుమారుడు ఆంధ్రా యూని వర్సిటి లో ఎం ఎస్ సి పాసయ్యాడు కమల అక్కడే ప్రొఫెసర్ అయింది .పెద్దమ్మాయి సంస్కృతం హిందీలలో ఎం ఏ .చేసి సంస్కృత లెక్చరర్ గా రిటైర్ అయింది రెండవ కూతురు హిందీ లో ఎం ఏ పి హెచ్ డి.. మిగిలిన ఇద్దరూ ఎం ఏ పి హెచ్ డిచేసి ఉద్యోగాలు చేసి స్వంత కాళ్ళపై నిల బడ్డారు .శాస్త్రి గారు హైదరాబాద్ మకాం మార్చి లలితా ఆర్ట్ ప్రెస్ పెట్టి నడిపారు .కస్తూరి బాయ్ సమాజం  26 ఏళ్ళు నిరాఘాటం గా నడిచింది .సుశీలగారు స్పురద్రూపి .భవిష్యత్ జ్ఞానం బాగా ఉండేది .నలుగురైడుగురను తీసుకుని  తరచుగా తీర్ధ యాత్రలు చేసేవారు .సత్య సాయి పై ఆరాధన ఏర్పడింది. ఆయనకూ ఈమె సేవా విషయాలు తెలిసి నిర్వహణకు ధనం ఇచ్చేవారు .బాబాపై పద్యాలు కూడా రాశారు .1976  డిసెంబర్ లో ఒక్కగానొక్క కొడుకు హార్ట్ ఎటాక్ తో చని పోయాడు ఇది దంపతులను బాగా కుంగ దీసింది .శాస్త్రి గారి మరణం తర్వాత సుశీలగారు 1976 లో 65 ఏళ్ళ వయసులో చనిపోయారు .

శాస్త్రిగారు సుశీల దంపతులు నిడద వోలులో కస్తూరి బాయి ఆశ్రమాన్ని స్థాపించి కుట్లు అల్లికలు హిందీ నేర్పించారు .కార్తీకమాసం లో అన్నదానం తో పాటు వస్త్ర దానమూ చేసిన ఉత్తమ మహిళ.నిరాడంబర జీవి .ఉన్నత సంస్కారం ఆధ్యాత్మిక భావ సంపదా ఉన్న ఉత్తమా ఇల్లాలు .సుశీల గారు అమృత వర్షిణి అంటారు అందరు .ఆమె గారి స్పూర్తితో ఎందరో అనాధ ఆశ్రమాలు  పెట్టి నిర్వహించారు .ఆమె సంతానాన్ని ఆణి ముత్యాలుగా తీర్చి దిద్దిన మహిళా మాణిక్యం .శాంత స్వరూపిణి సుశీలగారు .వారి కుమార్తె విదుల ‘’అమ్మ అంటే అమృతం .త్యాగం అనే కొవ్వొత్తి .తను కరిగిపోతూ ఇతరులకు వెలుగు నిచ్చేదేవత .మూర్తి రాజు సంస్థల అధ్యక్షులు శ్రీ మూర్తి రాజు ఆమెకు బంగారు గొలుసు కానుక గా ఇస్తాను అంటే ‘’మళ్ళీ మీరు గొలుసు ఏదీ అని అడగ వద్దు .ఎవరైనా బాగుంది అంటే ఇచ్చేస్తాను ‘’అన్నారు .విదుల ‘’చర్ల సుశీల వృద్ధాశ్రమం ‘’పెట్టి  150మందితో నడుపుతున్నారు .మనిషిలోని ప్రతిభను గుర్తించి సాయం చేసే దొడ్డ గుణం ఆమెది .ఏ కొత్తపాట విన్నా నేర్చుకొనే వారు నేర్పే వారు .తెల్లవారు ఝామున 4 గంటలకే లేచి ధ్యానం చేసేవారు .తర్వాత అన్నం ,మజ్జిగ  ఊరగాయ తీసుకొని రైలు గేటు దగ్గర రిక్షా వాళ్లకు ,ముష్టి వాళ్ళకూ పంచి ఇచ్చేవారు .ఎందరో పేద పిల్లలకు ఫీజులు కట్టి చదివించి ,ఉద్యోగాలు ఇప్పించిన మహా ఇల్లాలు .సుశీల గారు లాంటి మనిషి ఉంటారా అని ఆశ్చర్య పోతాం .అంతటి ఉత్తమ మహిళా ఆదర్శ మూర్తి శ్రీమతి చర్ల సుశీల గారు .

ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

పుట్టుక విద్యాభ్యాసం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె  సుశీలాంబ  1-1-1911 న జన్మించారు .చలాకీ ఉత్సాహం ఉన్న పిల్ల .మగ పిల్లవాడు లేని తండ్రి ఆమెను కొడుకుగా పెంచారు .ఆమె సైకిల్ తొక్కేది, కాలవలో స్నానం చేసి ఈత కొట్టేది .బంగారు నగలపై మోజు ఎక్కువ .తండ్రి గారు తాను రాసిన కథ ‘’బంగారం ‘’చదివి వినిపించి బంగారం పై వ్యామోహం ఎంతటి అనర్ధమో తెలియ జేశారు. అప్పటి నుంచి ఆమెకు  నగలపై  విరక్తి కలిగింది .తండ్రి గొప్ప సంఘ సంస్కర్త .క్విట్ ఇండియా ఉద్యమలో ఆయనతో పాటు సుశీలకూడా పాల్గొన్నది .పెద్దగా చదువు లేకపోయినా జ్ఞాన వంతురాలు .వక్తగా విదుషీమణి గా పేరు పొందారు .శ్రావ్యమైన కంఠం తో  మధురంగా పాడేవారు .తల్లి గయ్యాళి. ఎప్పుడూ తగాదాలే భర్త తో.అన్నం కూడా వందేదికాదు .శాస్త్రిగారు ఊరి చివర కాలువ గట్టున పాక వేసుకొని పండ్ల తోటలు పెంచుతూ పళ్ళు, మరమరాలు  సెనగపప్పు, తిని బడికి వెళ్ళేవారు కాని భార్యను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు అంతటి ఉత్తములు .

వివాహం

కాకర పర్రు లోనే శ్రీచర్ల నారాయణ శాస్త్రి గారనే బహు భాషా కోవిదులున్నారు .వ్యాకరణ నిఘంటు కర్త .నారాయణా౦ద్రీ వ్యాకరణ౦ రాశారు  .మహిష శతకం ,మహా భారత మీమాంస రచించారు.   భారత మీమాంస గ్రంధాలు సీరియల్ గా ఉండేవి .వీటిని వీరి మనవరాళ్ళు హైదరాబాద్ లో అసెంబ్లీ భవనం దగ్గర ,తెలుగు యూని వర్సిటి దగ్గర అమ్ముతూ ఉంటె సుమారు 25 ఏళ్ళ క్రితం నేను కొని చదివాను. అద్భుతమైన పరిశోధనాత్మకమైన గ్రంథాలు అవి .వాటిని ఆధారం గా చేసుకొని కొన్ని వ్యాసాలు  రాస్తే శ్రీ శుభం పత్రిక  ప్రచురించింది .పిఠాపుర ఆస్థానం లో కొద్దికాలం ఉండి రాజు కోరికపై ‘’ఆంద్ర నిఘంటువు ‘’కూర్చి బయటి కొచ్చారు .సుశీల గుణ గణాలు తెలిసి ఆయన ఆమెను తమ కుమారుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రి  గారి తో వివాహం 1921 లో ఆమె 10 వ ఏట  జరి పించారు .ఉభయుల అంగీకారం తో కట్న కానుకలు లేవు .గణపతి శాస్త్రి గారు ఉపనయన ,వివాహ విధి ,సులభ సంస్కృత చంద్రిక  బ్రహ్మ మీమాంసా దర్శనం రాశారు. బౌద్ధం మీద అనురక్తికలిగి బుద్ధుని కథలు రాశారు .శాస్త్రి గారు చెవులకు బంగారు పోగులు ధరించేవారు .దొంగలభయం తో ఆరు బయట పడుకున్నప్పుడు చెవులకు గుడ్డ కట్టుకొనే .వారు చివరికి దానిపై మోహం పోయి ఆయనా నగలకు వ్యతిరేకు లయ్యారు .భార్య పేరును సుశీలగా మార్చేశారు .ఈ దంపతులకు ఒక కొడుకు నలుగురు విమల ,కమల ,విదుల ,మృదుల అనే కూతుళ్ళు .తల్లి  పేరు లోని ‘’ల’’కారం వీరిలో ప్రతిధ్వని౦చేట్లు పేర్లు పెట్టారు .కొడుకు పేరు బుద్ధ నారాయణ శాస్త్రి .

చారు శీల సుశీల – ఇంట సాత్వికాహారం

మాతృమూర్తి సుశీల కరుణామయి. ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెడితేకాని తినేదికాదు .ఆర్ధికం గా పుష్టి లేని వారి ఇళ్ళకు   వెళ్లి వారికి తెలియకుండా కూరగాయలు, బియ్యం గుమ్మాల వద్ద పెట్టి వచ్చేది .రహదారి పడవలు నడిపే వారి శ్రమ గుర్తించి ,వారి కి పెరుగు అన్నం పెట్టి చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని చెప్పేది .గణపతి శాస్త్రిగారు గాంధీ అనుయాయులు .ధర్మ పత్నిగా ఆమె ఆయన్ను అనుసరించింది .భర్త రాసిన తెలుగు భగవద్గీత గీతాలను ఉదయం 5 గంటలకే లేచి పారాయణ చేసేది .బ్రహ్మ సమాజం పాటలు భక్తీ గీతాలు  రాట్నం మీద నూలు వడుకుతూ ఆలపించేది .ఇంటిలో సత్సంగం జరిపేది .కుటుంబం అంతా ఆవుదగ్గర గుమ్మ పాలు త్రాగే వారు .అల్పాహారం లో పెసలు అరటి పళ్ళు ,మధ్యాహ్న భోజనం లో పుచ్చకాయ ముక్కలు ,సీతాఫలాలు ,జామ పళ్ళు పెరుగు .పచ్చి దొండ బెండ సొరకాయ ,టమేటా, బీరకాయ  ముక్కలు తినేవారు .సాయంత్రం నూకల జావలోకారం లేని ఆవకాయ ,పెరుగు కలిపి తీసుకొనేవారు .వారు పెట్టిన కారం లేని ఆవకాయ సంవత్సరం నిలవ ఉన్నా చెడి పోయేది కాదు. కారం లేని ధనియాల ఆవకాయ వారింట్లో స్పెషల్ .రాత్రి 6 గంటలకే భోజనం గా జావ తాగి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొనే వారు .సుశీల పిల్లలకు చద్దన్నం లో పెరుగు పోసి బ్రేక్ ఫాస్ట్ గా మది బట్టలు కట్టించి మొదట్లో ఇచ్చేది.భర్త మాట విని ఆ పధ్ధతి మార్చుకొని చద్ది కూడు , మదడి బట్టలకు స్వస్తి చెప్పింది .చాదస్తంగా ఎప్పుడూ మడి బట్టలతోనే ఉండేది .మాలవాళ్ళను చూసేదికాదు . ఇతర కులస్తులను ఇంటికి రానిచ్చేదికాదు.భర్త అనునయంగా నచ్చ చెప్పి అన్నీమానిపించాడు  .శాస్త్రి గారు కాపు వాడితో ఇంట్లోకి నీళ్ళు తెప్పించి ,పిల్లలతో మొక్కలకు నీళ్ళు పోయి౦చే వారు .పెరడు ప్రకృతి నిలయంగా అన్ని రకాల కాయ గూరలు ,పండ్ల చెట్లు, పూల చెట్ల తో కళకళ లాడేది .తేనె టీగలను పెంచి తేనే తీసేవారు .ఆవులు గేదెలు ఉండేవి .పాలు పెరుగు అనాధలకు  బీదలకు పోసేవారు .

శాస్త్రి గారిల్లు పూరి గుడిసె మాత్రమే  .తర్వాత పెంకుటిల్లు .నుయ్యి ,కొబ్బరి చెట్లు ధాన్యం నిలువకు’’ గాదె’’తో  చూడ ముచ్చటగా ఉండేది .నూలు వడికి అందరూ ఖద్దరు బట్టలే కట్టేవారు .ఎక్కడికి వెళ్ళినా’’ తకిలీ ‘’తమతో తీసుకు పోయేవారు పిల్లలతో సహా .’’సూత్ర యజ్ఞం ‘’పేరు తో ఇంటి వారు, బయటివారు రోజూ కనీసం మూడు గంటలు నూలు వాడికే వారు .సుశీల గారు రాజమండ్రి నుంచి ఖద్దరు బట్టలు కొనుక్కు వచ్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు .ఆడా మగా అందరి చేత ఖద్దరు కట్టించేవారు .పండగలకు పిల్లలకు కొత్త బట్టలు కొనేవారు కాదు .సామాన్యులు పుట్టిన రోజు చేసుకో కూడదని మహాత్ముల పుట్టిన రోజులే చేయాలని పిల్లలకు నచ్చ చెప్పేవారు .దంపతులు తాము ఆచరించి తర్వాత ఇతరులకు చెప్పేవారు అంతటి ఆదర్శం వారిది .

మధుర భాషిణి సుశీల

మధుర భాషిణి ,మధుర గాయని సుశీల గారు అనర్గళంగా ఉపన్యాసాలిచ్చేవారు .ఒక సారి దుర్గా బాయ్ దేశముఖ్  సభలో 5 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడమంటే సుశీలగారికిమరో  10 నిమిషాల దాకా ఇచ్చి ఆమె వాగ్ధాటికి ఆశ్చర్య పోయింది దేశ్ ముఖ్ .కోమల భావాలు సేవా దృష్టి ఉన్నందున అన్ని రంగాలలో దూసుకు పోయింది .ఒక రైతు కొడుకు తమ ఇంట్లో  దొంగతనం చేసి పట్టుబడితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్రతిమిలాడి వాడు చిన్నపిల్లాడు వదిలేయమని విడిపించుకొని వచ్చి వాళ్ళు కొట్టిన దెబ్బలకు నూనె రాసి కట్టు కట్టిన దయామయి .శాస్త్రి దంపతులు హరిజన వాడకు వెళ్లి శుభ్రత గురించి తెలియ జెప్పేవారు .తమ పిల్లలనూ తీసుకొని వెళ్లి వాళ్ళ చేత ఉత్తరాలు రాయించేవారు ,రాయటం చదవటం నేర్పించారు .రోగాలకు హోమియో మందులు ఇచ్చేవారు .’’కళ్ళు మాన౦డోయ్ –కళ్ళు తెరవం డోయ్ ‘’అని పాడుతూ వారి అలవాట్లను మాన్పించిన  సంస్కారులు  .

కస్తూరి బాయి మహిళా సమాజ స్థాపన

శాస్త్రిగారు ‘’శ్రీ కస్తూరి బాయి మహిళా సమాజం ను 1950 లో స్థాపించారు .అనాధ ,అసహాయ ,పతితలకు , , పెళ్లి కాని యువతులకు , భర్తను కోల్పోయినవారికి ఉపాధి కల్పించటమే వీరి ఆశయం .సుశీల గారు దీని చైర్మన్ .విద్యార్ధి సంఘానికి కూతురు కమల ప్రెసిడెంట్ .తండ్రీ కూతుళ్ళు హిందీ నేర్పేవారు .భవన నిర్మాణం కోసం పిల్లలు ఇంటింటికీ తిరిగి పావలా వంతున ఒక లక్ష రూపాయలు సేకరించి భవనం నిర్మించిన  దీక్ష వారిది .హిందీ తోపాటు కుట్టుపని ,ఎంబ్రాయిడరీ క్లాసులు నిర్వహించేవారు .ఖాళీ స్థలం లో కూరలు పండించి వేలం వేసి డబ్బు కూడ బెట్టేవారు .కొడుకు కూడా వీరితో పాటు కష్టపడేవాడు. అయితే అతన్ని భవనం లోకి వెళ్ళకుండా కట్టడి చేశారు శాస్త్రి గారు అదీ పధ్ధతి అంటే . బయట ఉండే సేవలు చేసేవాడు .మొదటి ఏడాది వార్షికోత్సవం 3 రోజులు ఘనం గా చేసి వక్తల నాహ్వానించి స్పూర్తి కలిగించారు .శాస్త్రిగారు రాసిన ఝాన్సి లక్ష్మి బాయి ,భారత మాత ,మీరాబాయి నాటకాలను వేయించారు .ప్రతి ఏడాది వార్షికోత్సవం జరిపి తాము రాసిన పొట్టి శ్రీరాములు ,బాపూజీ అల్లూరి బుర్రకధలను చెప్పించేవారు .సుశీలమ్మ గారి సమాజం అంటే ఆడ పిల్లలకు భయం లేదని తలిదండ్రులు నమ్మేవారు .హిందీ పరీక్షలకు రాజమండ్రి తీసుకు వెళ్లి ఎక్కడా ఉంచకుండా బంధువు భారతమ్మ గారింట్లో ఉంచిపరీక్ష రాయించేవారు .ఆడపిల్లల రక్షణ విషయం లో అంతటి శ్రద్ధ తీసుకొనే వారు .‘

శ్రీమతి చర్ల సుశీల గారి  ఫోటో జత చేశాను చూడండి

ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 -ఉయ్యూరు

‘’

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -2(చివరి భాగం )

శ్రీనాధుని ‘’చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు ‘’పద్యం లాగానే శాస్త్రిగారు కూడా తన గ్రంధ రచనలను పరామర్శించి ‘’సీసం’’ లో కరగించారు –

‘’నే పది యారేండ్ల లోపల సత్య కధయు,సా –విత్రీ చరితంబు ,చిత్ర శతక –మిరువదేడు ల లోన వర గౌతమీ మహాత్మ్య ము,కాళిదాస వృత్తాంత వచన

మిరువదై దేండ్లలో  నేకావళియు  జగ –న్నాధ చరిత ,గజానన విజయము –ముప్పదేడులలోన మునుమున్న కావేరి కథ,వధూ విజయము ,కనకగిరియు

నవల శ్రీ వేంకటేశ్వ రీయమును వీర –రుద్ర విజయము ,ప్రద్యుమ్న చరిత

బొబ్బిలి యు, వేణిసంహారము  కలభాషి –ణియు ను రాజ భక్తి యును

కమలినియును ,నానందోదయమును ,వీర –సేన విజయము లోనుగా జెప్పనైన

కృతులు శతకాస్ట కంబులు ,కృతి విమర్శన –నంబులు బెక్కు లొనరించి నాడనేను ‘’

తాను భారత భాగవత రామాయణాలను  తెనిగించటం లో ‘’వాళ్ళ కంటే బాగా రాస్తానని కాదు ,కేవల చాపల్యం వల్ల  రాస్తున్నాను ‘’అంటూ పద్యం చెప్పారు –

‘’నన్నయ తిక్కనాది కవి నాథుల కన్నను మిన్నగా తెలుం –గున్నుడు వంగ లాడ  నధికుండను నేనని కాదు ,గ్రంథమం

దున్నెరసుల్ ,కొరంతలును  దోచు నటంచని కాదు ,వెండియున్ –బన్నుట భారతేస్టతను బట్టిన చాపల మంచు  నెంచుడి’’అని వినయంగా చెప్పారు .మూలాన్నివీసం కూడా  దాట కుండా అనువదించారు .

శ్రీనాధుని లా వ్యవసాయం చేసి చేతికి చిప్ప మిగుల్చుకొని ఆయన బాధపడిన గతవైభవస్పురణ ‘’కవి రాజు కంఠంబుకౌగిలించెను గదా !పురవీధి నెదు రెండ బొగడ దండ ‘’సీసం లాగా మన కవి రాజు కూడా –సీసం లోనే –

‘’గౌతమీ మహత్మ్య కర్త కంఠము చుట్టు –కొని యు౦డెగదా !ఋణము చిలువ –కవి మిత్రుల మేనెల్ల చివికించే గదా –అప్పుల వారి వాక్యాయుధములు ‘’అంటూ చివరగా ‘’పేట లంకల పాట నీ పాటు దెచ్చె-మాల పురువుల పాలయ్యె మరి పొగాకు –అప్పు ముప్పది వేల రూప్యంబులింక –నెట్లు దీర్చెడు శ్రీ పాద కృష్ణ మూర్తి ‘’’అని పురుగు పంటలనే కాక తననూ నాకి పారేసిందని వ్యధ చెందారు .

ఒక అవధానం లోశాస్త్రి గారికి ‘’వడ్డాణ మలంకరించె వనిత కుచంబుల్ ‘’అని సమస్యనిస్తే క౦ద౦ లో అందంగా వండారు-

‘’షడ్డకులు పోరుచో భూ -రాడ్డమ్మున నుడువనే గుర భవనంబునన్

నడ్డాక దెగుడు  మెడగొను-వడ్డాణ మల౦కరించె వనితా కుచంబుల్ ‘’

తన కవితా సామర్ధ్యాన్ని గూర్చి చెబుతూ శాస్త్రి గారు –

‘’గడియకు నూరు పద్యములు కల్పన జేయగ జాలి ఎంతయే-గడు నవధానముల్ సలుపు వాడనయై .కవి రాజ నామమున్

బడసి ప్రశంస కెక్కగ బ్రబంధము లెన్నొరచించి ,మించు నే –నుడివెద కృష్ణ మూర్తి నని నూత్న కవీ౦ద్రు లెరింగి కో నిటన్ ‘’

రాజ మండ్రిలో శాస్త్రి గారి స్వగృహం పేరు ‘’సుదర్శన భవనం ‘’.అందులో పై అంతస్తులో పద్మాసనం వేసుకొని కూర్చునే వారు .సందర్శకులు ఎదురుగా చాపల పై ఆసీను లయ్యేవారు .దీన్ని వర్ణిస్తూ శ్రీ ఆర్ .ఎం చల్లా ఆంగ్లం లో ‘’this is the Vatican of the poetic pontiff .The poet and his wife are a hospitable couple .What Words worth said of Milton was true of Krishna Murty  Sastry –

‘’thy soul was like a star  ,and dwelt apart –thou hadst a voice whose sound was like the sea ‘’అన్నారు .ఇన్ని ఉద్గ్రంధాలు రాసి,అందరిలో ప్రధములుగా ఉన్నా’’his work is much praised and less read .He perhaps ranks  first .i can admonish the Andhra reading public  for their indifference to Sripada ;s writings ‘’అని బాధ పడ్డాడు చల్లా .

శాస్త్రి గారి కృష్ణ భారత కవిత్వాన్ని మెచ్చుకుంటూ శ్రీ కాశీ కృష్ణాచార్య ‘’ధారా శుద్ధికి జహ్ను కన్య ,పద సందర్భంపు పూదోట ,భాషా రామామణి దర్పణంబు ,కవితా సామ్రాజ్య సింహాసనం బౌరా –సర్వ రసామృదాంబునిధి ,శయ్యా పాక వ్రుత్యాద్యలం –కారాగారము కృష్ణ భారత మనంగా నెన్న సామాన్యమే ‘’ అన్నారు .శ్రీ మంగు శివరాం ప్రసాద్ శాస్త్రి గారిని ‘’సాహితీ వాచస్పతి ‘’అంటే ,డా దామెర వెంకట సూర్యా రావు ‘’శాస్త్రి గారిని వారిని వరించిన  బిరుదులూ ,పురస్కారాలు ఏ కవికీ దక్కలేదేమో ‘’అన్నారు .

‘’నాకు జాతి మత ద్వేషం లేదు .సర్వమత సమ్మతుడనని చెప్పగలను .పూర్వా చార పరాయణుడనైననూ కాలమును బట్టి సమయోచితముగా ప్రవర్తి౦తు ను ‘’అని చెప్పుకున్నారు శ్రీపాద .శాస్త్రి గారికి శ్రీ జగన్నాధం లో ఇంద్ర ద్యుమ్నం దగ్గర పదేళ్ళ బాలుడు బంగారు బొమ్మవంటి పిల్లగాడు చిన్న గోచీ తో గంజాయి తాగుతూ హిందీ లో తనతో వస్తే అరణ్యం లో లోకాన్ని రక్షించే సింహ రాజాన్ని చూపిస్తాను ‘’అన్నాడట .ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు అని భావించి శాస్త్రి గారు నీటిలో దిగి స్నానిస్తుంటే బాలడు అదృశ్యమయ్యాడట  .అతనికి కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉంటాయని నరసింహ ఉపాసకుడు అని శాస్త్రి గారు గ్రహించారు .మరొక సారి పెద్దపల్లి నుంచి హనుమకొండకు వెడుతుంటే దొంగలు బండీని ఆపి దిగమని హెచ్చరిస్తే ,అకస్మాత్తుగా ఒక పోలీసు సాయుధుడు గా వచ్చి దొంగలను భయపెట్టి  హనుమకొండకు చేర్చి మాయం అయ్యాడట . తనపాలిటి దేవుడే ఆ పోలీసు అనుకొన్నారు.శాస్త్రి గారు రెండు మూడు అచ్చు యంత్రాలు స్థాపించి అనేక పురాతన గ్రంధాలు ప్రచురించి లోకోపకారం చేశారు .’’రోజుకు కనీసం  ఒక ప్రబంధం అయినా రాయగలను ‘’అని చెప్పుకొన్నారు .వారి   అవధానాలలో వ్యస్తాక్షరి ,న్యస్తాక్షరి ,లిఖితాక్షరి ,నిషేధాక్షరి ,దత్తాక్షరి ,ఆకాశ పురాణం,సహ పఠనం ముఖ్యమైన  అంశాలు .వీరు సుందర కాండ రాస్తుంటే ఒక వానరం ఇంట్లో ప్రవేశించి గ్రంధం చుట్టూ తిరిగి ,వీరు చూసేలోపు అంతర్ధానం అయిందట .శాస్త్రిగారికి ప్రధమ కోపం ఎక్కువ .ఆ తర్వాత  ఎంతో మర్యాద చేసేవారట .హృదయం లో కల్మషం ఉండేదికాదు .కాని గ్రాంధిక భాషను మాత్రం వదిలి పెట్టే వారు కాదు .అప్పు చేసి కూడా దాన ధర్మాలు చేసిన పుణ్య మూర్తి .వెంకట శాస్త్రిగారు వీరి శిష్యులే అయినా వ్యవహారం లో షస్టాస్టకం.ఒక సారి గురూ గారితో తగాదా పరిష్కరించుకొందామని వచ్చారు .శాస్త్రి గారు అమాంతం లేచి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆశీర్వదించి భోజనం చేయందే వదలను అన్నారు .’’మన తగాదాల గూర్చి మాట్లాడటానికి నేను వచ్చాను. అది అయితేనే భోజనం ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు ‘’నువ్వు భోజనం చెయ్యక పొతే అసలు నీతో నేను మాట్లాడను ‘’అన్నారు శాస్త్రి గారు .భోజనం చేసి మాట్లాడుకొని తగవు పరిష్కరించుకున్నారు. అంతటి వాత్సల్య పూర్ణులు శాస్త్రి గారు .ఒక రామ చిలకను పెంచేవారు .అది పంజరం నుంచి ఎగిరిపోయినా మళ్ళీ వీరింటికి వచ్చి చేతిపై వాలేదట .

‘’వ్యాసుడే మళ్ళీ  రాజమండ్రిలో కృష్ణ మూర్తి శాస్త్రి గారిగా పుట్టారు ‘’అన్నారు శ్రీ బోయి భీమన్న .తాను హరిజనుడను అని చెబితే నమ్మలేదట శాస్త్రిగారు ‘’కులాన్ని బట్టి భాష ఉండదు.గ్రామం లో  ప్రతికులం వారు ఒకే భాష మాట్లాడుతారు .పాత్రోచిత భాష నాకు నచ్చదు ‘’అన్నారట భీమన్నగారితో .శాస్త్రి గారికి కోపం జాస్తి అని అందరూ అంటారు. ఎన్నో కోర్టు కేసులు ఎందరిమీదో వేసి కోర్టు పక్షి అని పించుకొన్నారు .మద్రాస్ ఉమ్మడి రాష్ట్ర మంత్రి శ్రీ బెజవాడ గోపాల రెడ్డితో శాస్త్రిగారు శ్రీ ప్రోలాప్రగడ వారి ఆఫీసుకు వచ్చి ఫోన్ లో మాట్లాడేవారట .ఒక సారి చలికాలం వచ్చి మాట్లాడుతుంటే దంతాలు టకటక శబ్దం చేశాయట –రెడ్డిగారితో ‘’అబ్బాయీ !మనకు ఆస్థానకవి పదవి వచ్చేసినట్లే .కళ్ళు ,పళ్ళు సరిగ్గా లేని వాళ్లకు ఆ పదవి ఇవ్వద్దు అన్నాడట రాజాజీ .మనకి కళ్ళు శుభ్రంగా కని  పిస్తున్నాయి. పళ్ళు ఊడే ప్రసక్తే లేదు కట్టుడు దంతాలు కనుక .కనుక పదవి గారంటీయే ‘’అని పకపక-సారీ ‘’టకటక’’నవ్వారని శ్రీ ప్రోలాప్రగడ చెప్పారు .

శాస్త్రి గారు తిలక్ ,గాంధీజీ లపై నాటకాలు రాస్తే  బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెడితే కోర్టు కొట్టేసిందని ,పంచమ జార్జి చక్రవర్తి పై శ్రీ పాద గ్రంధం రాయటమేకాక పంచ వర్ష ప్రణాళికలు పైనా నాటకం రాసిన బుద్ధి శాలి అని డా .పి ఎస్ ఆర్ అప్పా రావు గారు తెలిపారు .’’వారి పద్య గద్య నాటకాలు సంగీత ప్రధానమై ,ప్రాచ్య ,పాశ్చాత్య లక్షణాలను స్వతంత్ర మార్గం లో ఏర్చికూర్చినవి ‘’అన్నారు శ్రీ ఐ. శ్రీనివాసరావు .శ్రీ విశ్వనాథ ‘’శాస్త్రి గారు పోతే కర్మను మించిన ప్రశ్నవచ్చి దుఖించాల్సి వస్తుంది .రేపు చనిపోతారనగా ఇవాళ కూడా రాసిన మహానుభావుడు .శ్రీపాద, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇద్దరూ మహా పురుషులు ,దీర్ఘాయుష్మంతులు  .మన శాస్త్రాలు నిజమైతే ఆయన స్వర్గం లోనే చిరకాలం ఉంటారు ‘’.అన్నారు . శ్రీ తాపీ ధర్మారావు ‘’యువకవులను  ,వృద్ధి లోకి వచ్చే వారిని వారెన్నడూ చిన్న చూపు చూసి ఎరుగరు .’’అనగా ,శ్రీ దాశరధి ‘’ప్రాచీన సాహిత్యానికి ఎంత ప్రతినిధియో ,ఆధునిక సాహిత్యం పట్ల అంత మక్కువ ఉన్న వారు .ప్రాచీన ,ఆధునిక సాహిత్య వారధి శ్రీపాద .ఆయన స్థానాన్ని ఎవరూ పూరించలేరు .ప్రబంధ యుగానికి ఆయనే ఆఖరిమహా కవి ‘’‘’అని కీర్తించారు .

ఇంతటి కీర్తి కాయుని జన్మదినాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ,వారి ప్రచురణలు వెలుగులోకి తేవాలని ,వారిజీవిత చరిత్ర ,రచనలను  పాఠ్య అంశాలుగా  చేర్చాలని ,వారి శిలా విగ్రహాన్ని పునరుద్ధరించాలని ,విశాఖ మ్యూజియం లో ఉన్న వారి గండ పెండేరం ,మణి కిరీటం ,మొదలైన వాటిని ప్రజల దర్శనార్ధం ఉంచాలని ,వారి పేర సారకోపన్యాసాలు ఇప్పించాలని ,వారి స్వగృహం ‘’సుదర్శన భవనం ‘’ను ప్రభుత్వం  స్మృతి మందిరంగా మార్చాలని ,వారి అముద్రిత గ్రంధాలను ముద్రించాలని వారి జీవిత చరిత్రను  ఆంధ్ర ,కేంద్ర సాహిత్య అకాడెమీలు ప్రచురించాలని సాహిత్యాభిమాను లందరూ కోరు కొంటున్నారు .

‘’ఒక నన్నయ్యయు ,నొక తిక్కన్న యమాత్యుం డొక్కయెర్రన్న,తా-నొక శ్రీనాధుడు ,నొక్క పోతనయు ,నీ యుర్విం బెడంబాసి ,తా

నకలంకంబుగ కృష్ణ మూర్తి మహనీయాకారము౦ దాల్చి ,యాం –ధ్రికి సేవల్ పొనరించి రంచు దలతున్ శ్రీ పాద  వంశోన్నతున్ ‘’

‘’పునర్జీవిత శ్రీ నాథః-అపరా౦ ద్రీసరస్వతి –రాశీ భూతాత్మ విశ్వాసః –కృష్ణ శాస్త్రీ ర్మహా కవిః’’

ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

 

కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి శత జయంతిఉత్సవం 1966 లో ,150 వ జయంతి వేడుకలు  2016 లో జరిగాయి .వారి అపూర్వ విద్వజ్జీవితం ఈ తరం వారికి తెలియ జేసే ఉద్దేశ్యం తో కొన్ని ముఖ్య విశేషాలు రాస్తున్నాను .

సాక్షాత్తు సరస్వతీ దేవి శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రి గారి అవతారం దాల్చిందేమో నని పిస్తుంది .వారొక్కరే భారత రామాయణ భాగవతాలను మూల గ్రంధాలకు ఏ మాత్రం తేడా లేకుండా అనువాదం చేసి శ్రీ కృష్ణభారతం శ్రీ కృష్ణ రామాయణం శ్రీ కృష్ణ భాగవతం అని నామకరణం చేశారు  .శ్రీ నాధుని కవి సార్వ భౌమ బిరుదం శాస్త్రి గారికీ అన్వర్ధమే కాక ఆయనకు బాగా ఇష్టమైన బిరుదు అది .1866 అక్టోబర్ 29 పశ్చిమ గోదావరి జిల్లా ఎర్న గూడెం దగ్గర దేవర పల్లి గ్రామం లో శ్రీపాద వేంకట సోమయాజులు ,శ్రీమతి వేంకట సుబ్బమ్మదంపతులకు జన్మించారు .గారాబం గా స్వేచ్ఛ గా పెరిగారు .చిన్ననాట చదరంగం,గుర్రపు స్వారి లలో మేటి అనిపించారు  .కవిత్వమూ కావ్య నాటక శాస్త్ర జ్ఞానమూ అబ్బింది షోడశ కర్మాంత స్మార్తాన్ని ,చయనానంతశ్రౌతాన్ని ,సోమ పంచకాన్ని అభ్యసించారు .తండ్రి గారికి యజ్న నిర్వహణ లో తోడ్పడ్డారు .12 ఏళ్ళకే కుమార సంభవం  నైషధం లను నేర్చి ,శ్రీనాధునిపై అభిమాన మేర్పడి 16 వ ఏట ‘’సత్యనారాయణో పాఖ్యానం ‘’రాశారు .

ఇతరుల కింద ఉద్యోగం  ఇష్టం లేక గోదావరి లంక  భూముల్ని కౌలుకు తీసుకొని పంట పండక విపరీతంగా పీకలలోతు అప్పుల్లో మునిగి పోయారు .అప్పుల నుంచి బయట పడటానికే అవధానాలు ,కవిత్వం లోకి దిగారు అస్టావ ధాన శతావధాన ,చిత్రావధానాలు చేసి మెప్పు పొందారు .మొత్తం 225  గ్రంథాలు రాశారు .98 పద్య కృతులు ,32 నాటకాలు ,5 శతకాలు ,8 5 వచన రచనలు ,21 విమర్శన గ్రంథాలు ,5 ప్రహసనాలు 9 సంస్కృత గ్రంథాలు  రాసిన ఘనత వారిది .వీరి చివరి కృతి రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారిపై రచించిన సంస్కృత కృతి ‘’రాజేంద్రాభ్యుదయం ‘’.శ్రీ పాద వారు సంపాదకులుగా ‘’గౌతమి ‘’అనే తొలి తెలుగు దిన పత్రిక నడిపారు .వజ్రాయుధం ,కళావతి  ,మానవ సేవ మాస పత్రికలు ,స్వరాజ్యోదయం ,వందే మాతరం అనే పక్ష పత్రికలూ నడిపారు .వారి బొబ్బిలి యుద్ధం నాటకం బహుళ ప్రసిద్ధి పొందింది యజ్న ఫలం నాటకం ఇంటర్ కు బోధనా గ్రంథంగా ఉండి నేను ఇంటర్ మొదటి సంవత్సరం లో దాన్ని నాటకం గా చదువుకొన్నాను .శ్రీ  చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు శ్రీపాద వారి వద్ద చదరంగం ,కొంత సంస్కృత సాహిత్యమూ నేర్చారు .

1930 లో పాలకొల్లు లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారికి సువర్ణాభిషేకం ,జరిగింది .1933 లో రాజమండ్రి లో సువర్ణ గండ పెండేరం  ప్రజా సమూహం నిర్వ హించింది .1936 లో విజయవాడ ,సాలూరు లలో గజారోహణ జరిగితే ,1945లో విజయవాడలో మణికిరీట ధారి అయ్యారు .మయూర్భంజ్ లో గజా రోహణ సన్మానం ,1954 లో గుడివాడ లో సువర్ణ పుష్ప పూజ అందుకున్నారు .1950 లో మద్రాస్ ప్రభుత్వం ‘’ఆంధ్ర ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవించింది .ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వీరిని ఆజీవిత ఆస్థాన కవి గా నియమించింది ,1958 లో రాష్ట్ర పతి ఆ జన్మాంత సంస్కృత పండితునిగా పేర్కొని ‘’సనద్ ‘’పట్ట ప్రదానం చేసి , సంవత్సరానికి 15 00రూపాయల గౌరవ భ్రుతి  కల్పించారు .రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి పురపాలక సంఘం వారికి ‘’స్వేచ్ఛా పౌరసత్వం ‘’ప్రసాదించాయి .1941 శ్రీపాద వారి శిలా విగ్రహాన్ని రాజమండ్రి పురపాలక సంఘ ఆవరణలో నెలకొల్పి గౌరవించారు .శాస్త్రి గారు 94 వ ఏట 29-12-19 60న శ్రీ పాద పీఠం చేరుకున్నారు .1966 లో శ్రీపాద వారి శత జయంతి వేడుకలను ప్రభుత్వం మూడు రోజులు ఘనంగా నిర్వహించింది .

శాస్త్రి గారి దౌహిత్రులు శ్రీ కల్లూరి సత్యనారాయణ మూర్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖలో అధికారిగా పని చేసి ప్రతి ఏటా తాతగారి జయంతిని నిర్వహించారు .శాస్త్రి గారి కోరికపై వారి లభించిన అమూల్య గౌరవ పురస్కారాలను శత జయంతి నాడు  ఆంధ్రవిశ్వ విద్యాలయానికి బహూకరించారు .విశాఖ లో మ్యూజియం ఏర్పడినప్పుడు వీటిలో కొన్నిటిని ఆంధ్రా యూని వర్సిటి వారు 1992 లో వస్తు ప్రదర్శన శాలకు తరలించి ప్రజలు ఈ అమూల్య ఆభరణాలను దర్శించటానికి వీలు కల్పించారు .

ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.

సశేషం

సంచిక కవర్ పేజీలు  జత చేశాను చూడండి –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా విశాఖ విజిట్

మా విశాఖ విజిట్

చాలా రోజుల నుండి విశాఖ పట్నం వెళ్లి  మా మైనేని గోపాల కృష్ణగారి అక్క బావా ,డాక్టర్ దంపతులైన శ్రీ రాచ కొండ శర్మ శ్రీమతి అన్నపూర్ణా దేవి గార్లను చూడాలని ఉంది .సుమారు  రెండేళ్ళ క్రితం పరిచయమైన ఆచార్య సార్వభౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ దర్శించాలనే కోరిక ఉంది. ఒక సారి మైనేనిగారు కా .రా .మాస్టారి కథానిలయం కు విరాళం ను సరసభారతి ద్వారా చెక్కు రూపం లో అందజేయమని డబ్బు పంపినపుడు నేనే స్వయం గా వెళ్లి శ్రీకాకుళం లోని మాస్టారికిచ్చి ,వచ్చేటప్పుడు శర్మ గారి దంపతులను చూసి వద్దామనుకొన్నా .కాని అప్పుడు అకస్మాత్తుగా శర్మగారికి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్ లో ఉన్నందున ఆ ప్రయత్నం మానుకొని పోస్ట్ లోనే కారా మాస్టారికి చెక్కు పంపా . ఈ మధ్య ఒక ఇరవై రోజుల క్రితం మళ్ళీ విశాఖ వెళ్లాలని పించటం, మైనేని వారిద్వారా శర్మ గారికి తెలియ జేస్తే ,వారు  ఆనందించటం, శ్రీ శాస్త్రిగారికి ఫోన్ లో వస్తున్నాననిచెబితే ఎప్పుడు వచ్చినా స్వాగతం  మా మహద్భాగ్యం  అని తెలియ జేయటం జరిగింది .మా అబ్బాయి శర్మ ద్వారా రైల్ టికెట్స్ 15 -3-17 బుధవారం విజయవాడ నుండి విశాఖ కు రత్నాచల్ లో ఏ. సి. చైర్ కార్ లో మా ఇద్దరికీ మనవడు చరణ్ కు , వచ్చేటప్పుడు అదే రోజు రాత్రి విశాఖ లో రాత్రి 8 -30 గం లకు బయల్దేరే గరీబ్ రధ్ లో బుక్ చేసేయటం చకచకా జరిగి పోయింది .నిన్న ఆప్రోగ్రాం ప్రకారం 24 గంటల వ్యవధిలో ఉయ్యూరు నుంచి ఉదయం 4 గంటలకే కారులో  బయల్దేరి విజయవాడ స్టేషన్ చేరటం 6 గంటల రత్నా చల్ లో బయల్దేరటం ,విశాఖ 12 గం లకు చేరటం ,దారిలో ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్  ఉదయం 7 గం లకు, విశాఖ స్టేషన్ లో మేము తెచ్చుకున్న అన్నం తినేయటం ,వెంటనే ఆటో లో శర్మగారింటికి వెళ్ళటం ,అక్కడ 4 -30 దాకా గడిపి శ్రీ శాస్త్రి గారింటికి అటో లో వెళ్ళటం అక్కడ వారి ఆత్మీయతను అందుకోవటం ,బిగ్ బజార్ లో షాపింగ్ చేసి స్టేషన్ చేరి రాత్రి 8-30’’గరీబోడి రధం ‘’(ఫుల్ ఏ .సి .)ఎక్కి పడుకొని అలసట తీర్చుకొని ,రాత్రి 2 గం లకు బెజవాడ చేరటం కారులో 3 -30 కు ఇంటికి రావటం జరిగింది . శర్మ ,శాస్త్రి గార్ల ఇంటిలో మా అనుభవాలను ఇప్పుడు తీరికగా తెలియ జేస్తా .http://wp.me/p1jQnd-aqT

93 ఏళ్ళ వృద్ధ డాక్టర్ దంపతులు డా .శ్రీ రాచకొండ నరసింహ శర్మగారు ,డా శ్రీమతి అన్నపూర్ణాదేవిగార్లు

ఇద్దరికీ 93 ఏళ్ళు .పైకి ఆరోగ్యంగా నే కనిపిస్తున్నారు .ఆమెకు ఏ రకమైన వ్యాధి అంటే బి .పి ,షుగర్ ల వంటివి ఏవీ లేవు   ఒక్క మందు బిళ్ళ కూడా మి౦గాల్సిన అవసరం లేకపోవటం  ఎంతో అదృష్టం .కొద్దిగా వినికిడి తక్కువ .రోజూ కనీసం రెండు గంటలు ఏదో ఒకటి చదవటం ఆమెకు ఇష్టం .చదవకుండా ఉండలేరామే.కొంత జ్ఞాపక శక్తితగ్గింది .చక్కగా తానే లేచి నుంచొని ,నడవటం చేస్తారు .అయినా శర్మగారు ఆమె ఆరోగ్య విషయం లో అత్యంత శ్రద్ధ చూపించి 24 గంటలూ షిఫ్ట్ పద్ధతిలో ఒక నర్స్ ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉండే ఏర్పాటు చేశారు .ఆమె అంటే ఆయనకు ప్రాణం .ఆమెకూ ఆయనంటే గొప్ప ఆరాధ్యం .అందుకే ఆ దంపతులు హాయిగా మానసికంగా చాలా బలంగా శారీరకం గా దృడం గా లేకపోయినా మానసికం గా మహా బలం గా ఉండి జీవితం కొన సాగిస్తున్నారు .పిల్లందరూ ఎదిగి డాక్టరీ చదివి వివాహాలు అయి అమెరికాలో స్థిర పడ్డారు .వీరిద్దరూ డాక్టర్ వృత్తిలో విశాఖ ,ఇతర ప్రాంతాలలో ఐతర దేశాలలో సేవలు అందించి 2004 నుండి విశాఖ లో స్వంత ఇల్లు ‘’రాచకొండ రెసిడెన్సి ‘’లో ఉంటున్నారు .2008లో ఈ దంపతులు అమెరికా లో పిట్స్ బర్గ్ లో ఉన్నారు అప్పుడు మేము మూడో సారి అమెరికా వెళ్లి మిచిగాన్ లో స్టెర్లింగ్ హిట్స్ లో ఉన్న మా అమ్మాయి చి. సౌ విజయలక్ష్మి,అల్లుడు  శ్రీ అవధాని గార్ల ఇంట్లో ఉన్నాం .శర్మగారు నాకు కవితలు ,పుస్తకాలు పంపటం ,నేను వెంటనే చదివి తిరుగు మెయిల్ టపాలో వాటిపై స్పందించటం జరిగేది .దానికి ఆయన చాలా ఆశ్చర్య పోయేవారు .వారితో పరిచయమూ తమాషాగానే జరిగింది .

శ్రీ మైనేని గారు ఉయ్యూరు శాఖా గ్రంథాలయానికి భూరి విరాళం అందించటం ,దాన్ని ఏ .సి .లైబ్రరీగా కట్టే ప్రయత్నం లో ఎం .ఎల్. సి  శ్రీ రాజేంద్ర ప్రసాద్ నన్ను కన్వీనర్ గా చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయటం మైనేని గారి అన్నగారు శ్రీ తాతయ్య గారూ  నేనూ కలిసి బిల్డింగ్ వర్క్ చూసి అతి తక్కువ కాలం లోనే పూర్తి చేయటం,2004 లో దాని ప్రారంభోత్సవానికి మైనేని గారు రావటం ,అప్పుడే శర్మగారూ రావటం తో ఇద్దరితో ఒకే సారి పరిచయం కలిగింది  .అప్పటినుంచి శర్మగారి ఆ౦తరంగికులలో నేను చేరిపోయాను మైనేని వారితో బాటు .శర్మగారి 90 వ జన్మ దినోత్సవం నాడు నేను రాసిన ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’వారికే అంకితమిచ్చి ఆవిష్కరణ జరిపాం. ఖర్చు అంతా మైనేని వారిదే .ఇలా  వృద్ధి  పొందిన ఆత్మీయత క్రమంగా బలపడి వారు సరసభారతికి అప్పుడప్పుడు విరాళం పంపటం నేను కృతజ్ఞతలు చెప్పి స్వీకరించి వారి పేరును పుస్తకాలో ప్రచురించటం జరుగుతూ మన పుస్తకాలు వారికి పంపటం వారి పుస్తకాలు నాకు పంపటం జరుగుతోంది .ఈబంధమే వారిని మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కలుసుకోవటానికి ఆతురత చూపించింది .మైనేని వారిని అప్పుడూ ,ఆతర్వాత నాలుగో సారి అమెరికాకు 2012 లోమేము  వెళ్ళినప్పుడు నన్నే వారి వేటపాలెం (హాంట్స్ విల్ )కు పిలిపించుకోవటం మూడు రోజులు వారింట్లో ఉండటం తో ,రెండవ మారు చూసే అదృష్టం కలిగింది .నిత్యం’’ మెయిల్ మొయిల్ ‘’ద్వారా కలుస్తూనే ఉంటాం .అది వేరే విషయం .

శర్మ గారింట్లో నిన్న వారి చెల్లెలు , విశాఖ ప్రభుత్వ మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,ఆమె కుమారులు అ౦తర్జాతీయ ప్రముఖ డాక్టర్ శ్రీ శ్రీధర్ గార్ల పరిచయం కలిగింది .అందరూ అందరే మహా ప్రతిభా సంపన్నులు .శర్మ గారి అన్నగారు రా .వి .శాస్త్రి , ప్రోలిటరేటియట్లపై అద్భుత కథా ప్రముఖ కథా, నవలా రచయితా ,  పేదలకు రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా కేసు చేబట్టి న్యాయం చేకూర్చిన ఆడ్వోకేట్, స్వర్గీయ రాచకొండ విశ్వ నాద శాస్త్రి  గారు .శర్మ గారి అన్నగారు ప్రసిద్ధ రైల్వే ఇంజనీర్ ఎన్నో నూతన రైలు మార్గాలను నిర్మించిన ఆదర్శ ఇంజనీర్ .లంచానికి ఆమ్యామ్యా కి అతి దూరం. నిర్దుష్టంగా విధి నిర్వహణ చేసినవారు .శర్మ గారి తండ్రిగారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు ఇతరులకు మేలు చేసి ఆస్తి హారతి కర్పూరం చేసుకొన్న వదాన్యులు మాస్టర్ సి వి గారి ముఖ్య శిష్యులు . .ఇప్పుడు  శర్మ గారి రాచకొండ రెసిడెన్సి వారి తండ్రి గారి నుంచి సంక్రమించిన  స్థలం లో నిర్మించినదే .దీనికి ఎదురుగా దాదాపు సముద్ర తీరం వరకు ఒకప్పుడు వీరి జమానాలోనే ఉండేదట .శర్మ గారి మేనల్లుళ్ళు ,అన్నగారి కుమారులు అందరూ ఇక్కడే ఫ్లాట్ లలో ఉంటూ హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజా సేవలో ఉన్నారు .   ‘’మా అన్నయ్య అందరికీ మంచి ఆరోగ్య సూత్రాలు బోధిస్తాడు .కాని తాను ఆచరించిన పాపాన పోలేదు .అందుకే కంటి చూపు దాదాపు లేదు .తన విషయం లో విపరీతమైన తాత్సారం అశ్రద్ధ . అదే మా  వదిన  విషయం లో కాని, మా విషయం లో కాని ,తాత్సారం చేయడు మమ్మల్ని చేయ నివ్వడు ‘’అని మొత్తుకున్నారు శర్మగారి సోదరి .’’రోజూ ఇంత గోధుమపిండి నీళ్ళలో కలుపుకొని హోటల్ నుంచి చప్పిడి రుచి లేని కూరలు తెప్పించుకొని   ఆ సూప్ లాంటి దానిలో నంచుకొని తింటాడు .ఇంక బలం ఏమి వస్తుంది “’అని బాధ పడ్డారామే .కంప్యూటర్ పనికి ,తాను చెప్పింది టైప్ చేయటానికి ఒక కుర్రాడిని పెట్టుకున్నారు . వీరి కుమార్తెలు  తలిదండ్రులను అమెరికా తీసుకు వెళ్ళే ప్రయత్నం లో ఉన్నారు . అన్నపూర్ణ గారు ‘’ఇక్కడే బాగుంది అక్కడికి ఎందుకు ‘’?అంటున్నారట .ఈ లోగా తాను ఇన్నేళ్ళుగా సమకూర్చుకున్న అతి విలువైన గ్రంధాలయం లోని పుస్తకాలను శర్మ గారు స్థానిక లైబ్రరీలకు ఉదారం గా ఇచ్చేసి కొంత బరువు తగ్గించుకొంటున్నారు .నాకు కావాల్సినవేవైనా తీసుకోమని అంటే ‘’సామల సదాశివరావుగారి ప్రత్యేక సంచిక ఏప్రిల్- సెప్టెంబర్ ‘’ జయంతి ‘’సంచికను ,జాన్ మాకే రాసిన ‘’ది స్టోరీస్ ఆఫ్ దివరల్డ్స్ లిటరేచర్ ‘’గ్రంథాన్ని వారికి చెప్పి ‘’నోక్కేశాను .’’

శాస్త్రి గారికి ఒక ఉత్తరీయం కప్పి దంపతులిద్దరికీ శాలువా కప్పి సరసభారతి తరఫున మా దంపతులం వారి సోదరి మేనల్లుడు ల సమక్షం లో  సత్కారం చేశాం  .శర్మగారు మా మనవడిని ఆశీర్వ దించి 5 వేల రూపాయలు నగదు బహుమతిని అందజేశారు .ఆ వృద్ధ దంపతులకు శిరసు వంచి మేము పాదాభి వందనం చేసి అదృష్ట వంతులమయ్యాం . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యెక సంచిక ,సరసభారతి శ్రీ హేవలంబి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

మా కోసం స్వీటు పళ్ళు తెప్పించారు. విశ్రాంతికి గది ఏర్పాటు చేశారు .మా మనవడు బీచ్ చూస్తానంటే వారి అసిస్టంట్ నిచ్చి పంపించి చూసే ఏర్పాటు చేశారు శర్మగారు .వారు ప్రస్తుతం డా .యెన్ .గోపి గారి ఎన్నో కవితలను ఆంగ్లం లోకి అనువదిస్తున్నారు .కంటి చూపు లేకపోయినా మైక్రోస్కోపిక్ గ్లాస్ సహాయం తో .అదీ వారి సాహితీ దీక్ష .వైద్య రంగం లో ,విద్యా సాహిత్య రంగం లో రెండింటిలోను సవ్య సాచి డాక్టర్ శ్రీ శర్మగారు .ఎన్నో సాహితీ సంస్థలతో సంబంధాలున్నాయి .12 వ తేదీన వారి పుస్తకం ఒకటి ఆవిష్కరణ జరిపించారు .అందుకని నన్ను వారి సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే తహతహ తో ఎందరికో ఫోన్ మీద ఫోన్ చేసి వారింటికి వచ్చెయ్యమని కోరారు .ఎవరి పనిలో వారుంటారు కదా ,ఇంతలో మమ్మల్ని శ్రీ వేదుల వారు వారింటికి సాయంత్రం 5 గంటలకు తప్పక రమ్మని  ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు .కనుక శర్మ గారి మిత్రులిద్దరూ అక్కడే శాస్త్రి గారింట్లో నే కలుస్తామని వీరికి చెప్పారు . శ్రీ శర్మగారి దంపతులు ‘’శతమానాధికం ‘’ ‘’జరుపుకోవాలని వారి ఆరోగ్యాలు సుస్థిరంగా ఉండాలని  వారి మానసిక బలానికి జేజేలు పలుకుతున్నాను .శర్మ గారి దంపతులకు సాదర కృతజ్ఞతలు తెలియ జేసి మేముముగ్గురం వారి అసిస్టెంట్ సాయం తో ఆటో లో బయల్దేరి శ్రీ శాస్త్రి గారి గృహం చేరాం .ఆ ముచ్చట్లు కింద రాస్తున్నాను .

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ శాస్త్రి గారు సుమారు రెండేళ్ళ క్రితం వారి అమూల్య గ్రంధాలను నాకు పంపారు .అందిన వెంటనే  అందులో ఉన్న వారి ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి పుస్తకాలు అందాయని ధన్యవాదాలు తెలియ జేసి ‘’నా గురించి మీకు అసలు ఎలా తెలిసింది అడ్రస్ ఎలా తెలుసుకున్నారు ‘’అని ఆశ్చర్యంగా అడిగాను .’’ఎలాగోలా తెలుసుకున్నాను .మీ గురించి ఇక్కడి మా వాళ్లకు చాలామందికి తెలుసు .వారి ద్వారా తెలుసుకొని మీకు పంపాను ‘’అన్నారు అవాక్కయ్యాను .అదిగో అప్పటి నుంచి వారితో పరిచయం పెరగటం మా సరసభారతి పుస్తకాలు వారికి పంపించటం వారు రాసినవి నాకు పంపటం .అందుకని రెండవ గీర్వాణం మొట్టమొదటగా వారి గురించే రాశాను నెట్ లో. అది పుస్తక రూపం దాల్చినప్పుడు కవుల కాలం బట్టి కూర్చటం తో ఆ వరుసలో వారి గురించి వ్రాసింది వచ్చింది. వారి గురించి రాశానని చెప్పాను చాలా ఆనందించి ఆ పుస్తకం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు .మొదటి రెండు భాగాలు చదివి వారు ‘’మీ రచనలో గొప్ప రీడబిలిటి ఉంది .అది నన్ను చకితుడిని చేస్తోంది. వాటిలో రోజూ ఏదో ఒక వ్యాసం చదవకుండా నేను ఉండలేక పోతున్నాను ‘’అని ఫోన్ లో తలియ జేసి ఆశీర్వదించి అభినందించిన సజ్జన వరేణ్యులు శాస్త్రిగారు . ఈ మధ్యనే వారు తాత్పర్య సహితంగా రాసిన పుష్పదంతకవి ‘’శివ మహిమ్న స్తోతం ‘’నాకు పంపటం దాన్ని అంతర్జాలం లో ఇంకొంచెం సులభతరం చేసి సీరియల్ గా రాయటం జరిగింది .శాస్తిగారు ప్రసన్న భారతి మాసపత్రిక లో ‘’రెండవ గీర్వాణమ్ ‘’పై  సంక్షిప్తంగా చక్కని వ్యాసం రాశారు .అలాగే ఆపత్రికలోను ,కళా గౌతమి లోను నేను వారిపై అందులో వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించారు .వారి శ్రీమతి గారు కూడా గొప్ప విదుషీమణి . భర్త కు  అన్నివిధాలా సాహిత్యం లో చేదోడు వాదోడుగా ఉంటారు .

శాస్త్రి గారి దంపతులకుమేము ముందు సన్మానం చేద్దామని సిద్ధమవుతుంటే వారు వారించి ‘’మీరు మా అతిధులు ముందు మా సత్కారం మీరు స్వీకరించాలి ‘’అని నచ్చ జెప్పారు .కాదనలేక పోయాం .వారు మా ఇద్దరినీ ఆత్మీయంగా సత్కరించాక మేమిద్దరం ఆ దంపతలకు గౌరవ సన్మానం  సరసభారతి తరఫున చేసి పాదాభి వందనం చేసి వారి ఆశీర్వచనాలు అందుకున్నాం. ఎన్నో రోజుల కల ,కోరిక ,ఈ నాడు నెరవేరింది .ఉగాదికి ముందే ఒక విద్వత్ కవి పండిత  శ్రేష్టులను సత్కరించే అదృష్టం మాకు దక్కింది. చాలా ఆనందం కలిగింది . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యేక సంచిక ,సరసభారతి శ్రీ హేవళంబి  ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

శర్మ గారి కోరిక పై నన్ను కలవటానికి శాస్త్రి గారింటికి వచ్చిన విశాఖ సారస్వత వేదిక నిర్వాహకులు శ్రీ మంగు శివరామ ప్రసాద్ ,ప్రసన్న భారతి సంపాదకులు శ్రీ డి. వి .సుబ్బారావు గార్లతో ఆత్మీయ పరిచయం కలిగింది .వారికి సరసభారతి గురించి ,నా గురించి శ్రీ శర్మగారిద్వారా బాగా తెలుసునని అన్నారు .అలాంటి సాహితీ మిత్రులను చూచినందుకు మహదానందం కలిగింది .వారిద్దరూ ‘’ఈ సారి విశాఖ కు మీరు మా ఆహ్వానం పై రావాలి మాతో గడపాలి మీ ప్రసంగం మేము వినాలి ‘’అని కోరారు .తప్పక వస్తానని అది నా కర్తవ్యమని చెప్పాను .వారిద్దరు బహు విలువైన ఒక రకం గా అమూల్యమైన గ్రంధాలు -1-శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి జయంతి విశేష సంచిక 2-శ్రీడి .వి .సూర్యారాగారి ‘’సద్గమయ ‘’3-ఆర్ష విజ్ఞాన పరిషత్ ప్రచురణ ‘’మృదుల ‘’గారి భావ వీచికలు 4-శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర 5-‘’కవిగారు ‘’శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జీవిత చరిత్ర ‘’కవిగారి మనుగడ ‘’6-శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ‘’భగవద్గీత ‘’అనువాదం  ‘’7-శ్రీమతులు చర్ల విమల ,మృదుల రాసిన ‘’గీతామృతం ‘’8-ప్రసన్న భారతి ‘’జనవరి సంచిక అందజేశారు . వారికి ఎంతో కృతజ్ఞుడను .

ఇలా పండిత శ్రేస్టులు మహా కవి విమర్శకులు  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు డా శ్రీ గుమ్మా సాంబశివ రావు గారు మొదలైన వారెందరికో పి. హెచ్ .డి .కోసం మార్గ దర్శనం చేసిన ఆచార్య సార్వ భౌముల దర్శనం చేయటం వారు మాకు ఆత్మీయ సత్కారమందించటం వారిని సన్మానించే గొప్ప అదృష్టం మాకు లభించటం మా భాగ్య గరిమ గా భావిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

‘’రాయికైనా ఆయన పాఠం చెబితే రావాల్సిందే –రాకపోవటం అనేది లేదు ‘’అని ప్రసిద్ధి పొందిన  వారు మహా మహోపాధ్యాయ శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారు .కంచి పరమాచార్యులకు అత్యంత సన్నిహితులు . ద్వైత అద్వైత విశిష్టాద్వైతు లందరికీ ఆదర్శ గురు మూర్తి .వారి౦టి లోనే  ఉండి చదువుకొన్నవారెందరో శిష్యులున్నారు .వారి శిష్యపరంపర అగణితం .అందరూ వివిధ శాస్త్రాలలో అమోఘ   పాండిత్యం ఆ గురు మూర్తి వలన పొంది లబ్ధ ప్రతిష్టులై,అత్యున్నత పదవులలో రాణిస్తున్నారు .ఆయన జీవితకాలం లోనే శిష్యులందరూ కూడి ఫాల్గుణ బహుళ పాడ్యమి శాస్త్రి గారి జన్మ దినం రోజు ,శాస్త్రార్ద చర్చలు ,పండిత పురస్కారాలు చేస్తూ చక్కని పర౦పరను సృష్టించారు .ఇప్పడు శ్రీ మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను దేశం లోని  అనేక రాష్ట్రాలలో ,రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో ఉన్న శిష్య బృందం అందరూ కలిసి ఘనం గా 11-3-17 నుండి 13 -3-17 వారి జన్మ దినం ఫాల్గుణ బహుళ పాడ్యమి వరకు  మూడు రోజుల పాటు ఘనంగా విజయవాడలోని శివ రామ కృష్ణ క్షేత్రం లో అంటే మాణిక్య శాస్త్రి గారు 30 సంవత్సరాలు ఏకధాటిగా  సకల పురాణ ప్రవచనం చేసిన  కార్య క్షేత్రం లో నిర్వహించారు .

11-3-17 –శనివారం     మొదటి రోజు ఉదయం గో పూజ ,గురుపూజ నిర్వహించి, అంతకు ముందు రెండు  రోజులుగా నిర్వహించిన హోమానికి   పూర్ణా హుతి జరిపారు .ఉదయం 9 గం లకు  సభ ప్రారంభమైనది .ఉదయం 10-45 వరకు ‘’తైత్తిరీయ ఉపనిషత్ ‘’భాష్య ప్రవచనం ,అద్వైత సిద్ధిలో ‘’అనుమాన బాదోద్ధార ‘’విచారం శాస్త్ర చర్చ జరిగింది .ఉదయం 11 గం లకు మాణిక్య శాస్త్రిగారి ముఖ్య శిష్యులు ,ప్రస్తుత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ప్రొఫెసర్ డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి  గారు- నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ బాగం ‘’నుండి మాణిక్య శాస్త్రి గారి పై ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పై రాసిన వ్యాసాలను సంగ్రహించి ఒక ప్రతేక సంచిక (బుక్ లెట్)గా సరస భారతి చేత రూపొందించి స్వంత ఖర్చులతో ముద్రించి ఉదయం  శ్రీ మాణిక్య శాస్త్రి గారి పెద్దకుమారులు శ్రీ సూర్యనారాయణ ఘనపాటి గారిచే ఆవిష్కరణ జరిపించి ,అందరికి పంచిపెట్టించారు . మధ్యాహ్నంవిందు భోజనం .చేతి వ్రేళ్ళ సందులలోనుంచి జారిపోయేట్లు ‘’స్నేహం ‘’అంటే నెయ్యి వడ్డించి శుస్టు గా ,అందరూ సంతృప్తిగా భుజించేట్లు కొసరి కొసరి వడ్డించి ,తినిపించి ఆనందించారు .

మధ్యాహ్నం 3 గం నుండి 5 గం వరకు శాస్త్రార్ద చర్చ ఆ తర్వాత 6 -30 నుండి 8 గం వరకు సంగీత విభావరి జరిగాయి .    రెండవ రోజు 12-3-17 ఆదివారం ఉదయం 8-30 గం నుండి 10 గం వరకు బ్రహ్మ సూత్ర శంకర భాష్యం లో’’ఈక్ష్త్యత్యధికరణ ప్రవచనం .10 గం నుండి 12-30 వరకు అద్వైత సిద్ధిలో అనుమాన బాధోద్ధార –విచారణ

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 గం వరకు ‘’శాస్త్రార్ధాలు ‘’.సాయంత్రం 6-30 గం నుండి ‘’పండితోపన్యాసాలు ‘’

జరుగుతాయని ఆహ్వాన  పత్రిక లో ఉంది .నేను ఆ రోజు వెళ్ళ లేదు కనుక  జరిగే ఉంటాయి .

మూడవ రోజు 13-3-17 సోమవారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి జన్మదినం –ఉదయం 8-30 నుంచి 10 గం వరకు భగవద్గీత లో అస్టమాధ్యాయం .10 గం నుండి 12 -30 వరకు ‘’సిద్ధాంత బిందు టీక’’లో విచారము .

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 వరకు శాస్త్రార్ధాలు .జరిగే ఉంటాయి .

సాయంత్రం 6 30 నుండి 7-30 వరకు సమాపన ఉత్సవం –గురువరేణ్యు లు శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శేముషీ వైభవం పై పండితుల ,శిష్యుల ఉపన్యాసాలు .రాత్రి 7-30 గం లకు పండిత సత్కారాలు , వేద స్వస్తి ,వందన సమర్పణ .

నిన్న అంటే 13 వ తేది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,శ్రీ మద్దులపల్లి దక్షిణామూర్తి గారు ఫోన్ చేసి’’ సాయంత్రం పండిత సత్కారం లో మీకు కూడా సత్కారం చేయాలని అనుకొంటున్నా౦ దంపత్యుక్తంగా రావలసినదని ఆహ్వానించారు .పెద్దల ఆహ్వానం శిరోధార్యం కనుక ,నేను ఏ రకంగానూ పండితుడిని కాదు కనుక ,పండితుల సమక్షం లో సన్మానం కనుక ,జిహ్వ చాపల్యమూ ఉంది కనుక, వస్తాను అని చెప్పి మేమిద్దరం మా మనవడు చి చరణ్ తో కలిసి 5-30 గం లకు శివ రామ కృష్ణ క్షేత్రం చేరాము .అప్పటికి ఇంకా ఉపన్యాసాలు జరుగుతున్నాయి .వారెవరో పేరు తెలియదుకాని అనర్గళం గా గంగా ప్రవాహ సదృశంగా గీర్వాణ భాష లో మాట్లాడి సభా రంజనం చేశారు  .వారికి నా నమస్సులు .మద్దుల పల్లి వారి శిష్యులు వారి వారి అనుభవాలను మనసుకు హత్తు కోనేట్లు వివరించి చెప్పారు .అందులో నేను అంతర్జాలం లో  మూడవ గీర్వాణం లో రాసిన డా వెంపటి కుటుంబ శాస్త్రి గారు కూడా ఉండటం మహా దానందం కలిగించింది .తనకేమీ తెలియదని మొదలు పెట్టి ,చివరికి మనకేమీ తెలియ దన్నట్లు గా వారు ప్రసంగించిన తీరు అద్భుతం అని పించింది .శ్రీ గబ్బిట వారూ   అంతేవాసిగా తమ అనుభవాలను  గుదిగుచ్చి చెప్పారు .డా ధూళిపాళ రామ కృష్ణ గారూ గురువుగారి  పరిపూర్ణ కటాక్షాన్నివివరించారు . మాణిక్య శాస్త్రిగారి కుమారుడు శ్రీ  దత్తాత్రేయ  శాస్త్రిగారు తండ్రి గారి బాణీలో ,అదే స్వరం తో వారు ప్రవచనం చెప్పి నట్లు అర్ధవంతమైన ప్రసంగం చేసి ఆకట్టు కొన్నారు .సభా సంచాలనం శ్రీ విశ్వ నాథ గోపాల కృష్ణ గారు చేశారు .అంతా విన్న తర్వాత నా మనసులో ఒక మాట మెదిలి  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి చెవిలో  చెబితే ‘’ఆ మాట ఈ ముఖతా చెబితే గౌరవం గా ఉంటుంది ‘’అని నన్నే చెప్ప మన్నారు .నేను ‘’అందరికీ నమస్కారం .అందరూ మహానుభావులు .దిగ్దంతులైన పండిత శ్రేస్టులు .నేను మాణిక్య శాస్త్రి గారి గురించి రెండవ గీర్వాణం లో రాయటానికి ఎంద రెందరినో ఆశ్రయించాను. ఎవరి వద్దా సరైన సమాచారం లేదు .చివరికి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి వలన మద్దు లపల్లి వారబ్బాయి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి పరిచయం కలిగి ,వారు పంపిన రెండు పుస్తకాల నుండి విషయ సేకరణ చేసి రాశాను .ఇక్కడ ఈ మూడు రోజులుగా మీరందరూ మాణిక్య శాస్త్రి గారి ప్రతిభా విశేషాలను ఎవరి అనుభవాన్ని బట్టి వారు చాలా వివరం గా తెలియ జేశారు .ఇంతమంది విద్వజ్జనం ఈ సభకు రావటం ఆశ్చర్యం .అది శాస్త్రి గారి పై ఉన్న విశేష అభిమానానికి చిహ్నం .మీరందరి ప్రసంగాలను వ్రాత పూర్వకం గా ఇక్కడి నిర్వాహకులకు అందజేసి వాటిని ఒక పుస్తక రూపంగా తెస్తే మాణిక్య శాస్త్రి గారి పై కొంతవరకు సమగ్రమైన పుస్తక౦ వస్తుంది. ఆ ప్రయత్నం అందరూకలిసి చేసి సమగ్ర గ్రంధాన్ని ఆ మహానీయునిపై త్వరలో తీసుకు రావలసినదిగా అభ్యర్ధిస్తున్నాను .నేను రాసింది ఆవగింజలో అరవై వ భాగమే .ప్రస్తుతం అదే అందరికి కర దీపిక గా ఉండటం  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పూనికా నా అదృష్టం’’అన్నాను .అంతా బాగానే ఉందన్నారు .నిజంగా అందరూ కలిసి ఆలోచించి పని చేసి ఉంటె ఈ సభలోనే మాణిక్య శాస్త్రి గారి పై ప్రత్యెక సంచిక సమగ్రంగా సర్వ విషయాలతో ఆకర్షణీయంగా రూపొండేది ఆ ఆలోచన ఎందుకు చేయలేక పోయారో నిర్వాహకులు అంతు చిక్క లేదు .

శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు తమ గురు వరేణ్యు లు శ్రీ మాణిక్య శాస్త్రి గారి కుమారులకు వస్త్ర ,ధన రూపం గాసత్కరిస్తూ ,పనిలో పనిగా నాకూ ఆ సత్కారం చేసి నన్ను రుణ గ్రస్తుడిని చేశారు  . మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారు అన్నట్లు ’’ వేద పండు ‘’ లు ఇందరి ముందు నాకు సన్మానం చేయటం ఆంజనేయ శాస్త్రి గారి విశాల హృదయానికి తార్కాణ,నాపరమ అదృష్టం .ఈవిధంగా సుమారు 100 మందికి పైగావేద, శాస్త్ర విద్వాంసులను ఘనంగా సత్కరించి  శత జయంతికి ఘనత చేకూర్చారు .ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు .

కొసమెరుపు –శత జయంతి ఉత్సవాలు షడ్ర సోపేత భోజనాదులతో  వైభవంగానే జరిగాయని పించాయి .ఆహ్వానాలు అందరికీ అందలేదని కొందరికి మాత్రమే చేరాయని  ఆహ్వానాలు వేరు కరపత్రాలు వేరుగా ఉన్నాయని ,వాట్సప్ లో   పంపి చేతులు దులుపుకున్నారని గుసగుసలు వినిపించాయి .   ఆహ్వానం లో ఎవరెవరు వచ్చి పాల్గొంటున్నారో వారి వివరాలు రాయక పోవటం దారుణం .మూడు యూని వర్సిటీ లకు వైస్ చాన్సలర్ గా పని చేసి ,పారిస్ లో ఉన్న ’’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్’’కు అధ్యక్షులుగా ఉన్న శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి పేరే ఆహ్వాన పత్రికలో లేక పోవటం చాలా వింతగా ఉంది. సంగీత కచేరీ చేసిన ఆమె పేరూ ముద్రించక పోవటం బాధ్యతా రాహిత్యం అని పించుకోదా?వేదికపై పసంగించేవారు వారి ధోరణలో వారు సంస్కృత లోకం లో విహరిస్తూ ఉంటే ప్రేక్షక స్థానం లో ఉన్నవారు ఎవరి వ్యాసంగం లో వారు ఉండి పోయి, వక్తకు నిరాశే మిగిల్చారు .

మూడు రోజుల కార్య క్రమ౦ లో శాస్త్ర చర్చలు అందులో నిష్ణాతులకు మాత్రమే కదా,మిగతావారికి అందులో ఆహ్లాదం ఉండక పోవటం సహజం .కనుక మధ్యమధ్యలో వారి ప్రసంగ సారాంశం తెలుగు లో చెప్పి ఉంటె కొంత ఆకర్షణ ఉండేది .

ఇంత పెద్ద కార్యక్రమం  ఇద్దరు పీఠాది పతుల ఆశీస్సులతో నిర్వహిస్తూ కూడా మీడియా వారికి తెలియ జేయక పోవటం ఇక్కడ జరిగిన విషయాలు పత్రికా ముఖంగా ప్రచురణ భాగ్యానికి నోచుకోక పోవటం ఆశ్చర్యం .దీనికి బాధ్యులెవరు ? వేదిక మీద ఎప్పుడూ ఒకే పెద్దాయన ఉండి మిగిలిన వారికి సరైన గౌరవం దక్కలేదనే  నిట్టూర్పులు వినిపించాయి .లక్షలు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమం అందరి తోడ్పాటుతో ,అందరి ప్రాతినిధ్యం తో ,ఎంతో స్పూర్తి దాయకం గా పరి సమాప్తి కావాల్సింది .అలాజరగ లేదనే అని పించింది .ఇంతటి కార్య క్రమాన్ని వీడియో తీయించలేక పోవటం, రికార్డ్ చేయించలేక పోవటం ప్రసార మాధ్యమాల విలువ విపరీతం గా ఉన్న ఈ కాలం లో నచ్చని పని .అయితే కొందరు ఉత్సాహ వంతులు స్వంత వీడియో కెమెరాలతో వారికి కావలసినవి వీడియో తీసుకున్నారు .ఇప్పటికైనా మించి పోయింది లేదు వారి వద్ద సేకరించి ఒక సమగ్ర సి .డి. గాతీసి చానల్ వారికిస్తే ప్రపంచ వ్యాపితంగా కార్యక్రమ౦ తెలుస్తుంది .

వీటన్నిటికి మించి మరొక పెద్ద లోపం –చివరి రోజు సాయంత్రం సభను బహిరంగ సభగా నిర్వహింఛి  బెజవాడలోవివిధ రంగాలలో ప్రముఖులను కూడా ఆహ్వానించి వారి ఉపన్యసాలనూ ఏర్పాటు చేస్తే, మాణిక్య శాస్త్రి గారి మాణిక్య ప్రభా విశేషం లోక విదితమయ్యేది . ఈ ఆలోచన రాక పోవటం విడ్డూరం .

మొదటి రోజు నేను వెళ్ళినప్పుడు ఒక 70 ఏళ్ళ ముసలావిడ ‘’బాబూ ! ఉదయం 6 అయిందంటే ఇక్కడ మేమందరం కనీసం మూడు వందలమంది మాణిక్య శాస్త్రి గారి ప్రవచనం వినటానికి హాజరయ్యేవారం .ఆ అభిమానమే మళ్ళీ ఇక్కడికి మమ్మల్ని రప్పించింది ‘’అన్నది .ఆమె మాటలకు నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. అంతటి అభిమానం సంపాదించారు శాస్త్రి గారు .

లోపాలను చూపటమే ధ్యేయం కాదునాది .మరింత స్పూర్తిదాయకం గా నిర్వహిస్తే సంతృప్తి ఆనందం దక్కేదికదా అని మాత్రమే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –  14-3-17 -ఉయ్యూరు

 

 

 

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

1-ఆకాంక్ష ఫౌండేషన్ వ్యపస్థాపకురాలు -షహీన్ మిస్త్రి

బొంబాయిలో పార్సీ కుటుంబానికి చెందిన షహీన్ మిస్త్రి స్త్రీ విద్య కోసం పాటుపడిన మహిళ.మహిళకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని ఉద్యమించిన నారి .ఆమె పెంపకం అనేక దేశాలలో జరిగింది .ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూని వర్సిటి నుండి విద్య లో మాస్టర్ డిగ్రీ పొందింది .కాని బొంబాయి లోని మురికివాడల ప్రజలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారని ,నాణ్యమైన విద్య వారిక౦దటం లేదని ,వారు మిగిలిన వర్గాల వారితో చదువులో పోటీ పడలేక పోతున్నారని గ్రహించింది .వారికి ఆసరా ,విద్య పై మక్కువ కలిగించి జనజీవన స్రవంతిలో చేర్చిఈ పోటీ ప్రపంచం లో ధైర్యంగా నిలబడి తమ సత్తా చాటి చూపాలని భావించింది షహీన్ .
తన ఆలోచనలకు అనుగుణంగా 1898 లో ‘’ఆకాంక్ష కేంద్రం ‘’అనే లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థను నెలకొల్పింది .దీని ద్వారా అల్పాదాయ వర్గాల పిల్లలకు స్కూల్ అయిపోయాక ట్యూషన్లను ఏర్పాటు చేసింది .ఆమె కృషి ఫలించి మంచి గుర్తింపు రావటం తో మరింత వ్యాప్తి చేయటానికి 2008 లో ‘’టీచ్ ఫర్ ఇండియా ‘’ఏర్పాటు చేసి మరిన్ని ప్రయోజనాత్మక కార్యక్రమాలను చేబట్టింది .అప్పటి నుంచిదాదాపు 2 వేలమంది పిల్లలను చేర్చుకోవటం ,శిక్షణనివ్వటం ,ఉద్యోగ సదుపాయాలూ కల్గించటం చేసింది .ఆమెనిరంతర విద్యా సేవకు 2001 లో ‘’అశోకా ఫెలో ‘’అవార్డ్ ,2002 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘’గ్లోబల్ లీడర్ ఫర్ టుమారో ‘’అవార్డ్ నిచ్చి గౌరవించారు .2006 లో ‘’ఏషియా సొసైటీ 21 లీడర్ ‘’పురస్కారం అందుకొన్నది .అనేక విద్యా బోర్డ్ లలో ఆమెకు స్థానం కలిపించి సలహాలు తీసుకొంటున్నారు .

2- బాలికల పై యాసిడ్ దాడికి వ్యతిరేక పోరాటం చేస్తున్న –లక్ష్మీ అగర్వాల్

15 వ ఏట 35 ఏళ్ళ ‘’మృగాడు ‘’ బరి తెగించి ప్రవర్తిస్తుంటే ,తనకు ఇష్టం లేదని మొత్తుకొంటున్నా హద్దు మీరి ప్రవర్తిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించినందుకు లక్ష్మీ అగర్వాల్ ముఖం పై యాసిడ్ పోసి తన వికృత చేస్ట కు పరా కాస్ట గా నిలిచాడు.హిందూ స్థాన్ పత్రిక లక్ష్మి పై జరిగిన యాసిడ్ దాడి ఉదంతాన్ని సీరియల్ గా ప్రచురించి ప్రజలలో చైతన్యం కలిగించింది .తనకు జరిగిన ఈ క్షోభ మరే ఆడపిల్లకూ జరుగ కుండా చేయాలని లక్ష్మి నిశ్చయించుకొని ,యాసిడ్ దాడికి వ్యతిరేకంగా 27 వేలమందితో సంతకాలు చేయించి సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి,ప్రజా ఉద్యమానినికి నాంది పలికింది .సుప్రీం కోర్ట్ ధర్మాసనం వెంటనే చర్య ప్రారంభించి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ పెట్టమని ,యాసిడ్ దాడికి పాల్పడిన వారిపై సత్వరం కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ జారీ చేసింది .
యాసిడ్ దాడి లో ప్రాణాలతో బతికి బయట పడిన వారి సంరక్షణ కోసం లక్ష్మీ అగర్వాల్ ‘’చాన్వ్ ఫౌండేషన్ ‘’ఏర్పాటు చేసి సేవలందిస్తోంది .20 14 లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సతీమణి ,అమెరికా ప్రధమ పౌరురాలు లేడీ మికిల్లీ ఒబామా చేతులమీదుగా లక్ష్మీ అగర్వాల్ ‘’ఇంటర్ నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ ‘’ను అందుకున్నది .’’ఎన్ .డి .టి .వి .ఇండియన్ ఆఫ్ ది యియర్’’పురస్కారమూ లభించింది .వీవా దీవా ప్రకటనలలో ఆమె ముఖ చిత్రం ప్రచురించి బాలికలకు బాహ్య సౌందర్యం కంటే అంతస్సౌ౦దర్యం ముఖ్యమని గ్రహించేట్లు చేశాయి .

3- గృహ హింసపై ఉద్యమిస్తున్న లాయర్ –ప్రమీలా నేసర్గి

ప్రమీలా నేసర్గి తల్లి స్వాతంత్ర సమర యోధురాలు తండ్రి .స్వయం కృషితో ఎదిగినవాడు ఆమె పై తలిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువ ..అతితక్కువ వయసు లోనే న్యాయ శాస్త్రం చదివి పాసై లాయర్ వ్రుత్తి చేబట్టింది .ధైర్య సాహసాలు స్వతంత్ర భావాలు ఉన్న మహిళా న్యాయవాది గా పేరు పొంది౦ది.ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగినా వారి తరఫున వాదించి న్యాయం చేకూర్చటం ఆమె లక్ష్యం .బాలకార్మికులు ,గృహయాజమాన్యం ,గృహ హింస ,కార్యాలయాలలో సెక్సువల్ వయోలెన్స్ ,ఖైదీల దయనీయ స్థితులు వంటి అతి సున్నితమైన సమస్యలపై ఆమె గళం విప్పి బాధితుల పక్షాన న్యాయం కోసం నిరంతరం పోరాడే యోధురాలు .అసంఘటిత వర్గాలను ఐక్యపరచి ఒకే వేదికపై నిలిపి పోరాటం చేయిస్తున్న మార్గ దర్శకురాలు .ఇంగ్లీష్ –కన్నడ అనువాద నిఘంటు కమిటీలో సభ్యురాలు .50 ఏళ్ళ కన్నడ బార్ కౌన్సిల్ కు బార్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన ప్రధమమహిళా లాయర్ ప్రమీలా నేసర్గి .అతి పెద్ద కేసు నుంచి అతి చిన్న కేసు దాకా స్వీకరించి సమర్ధంగా వాదించి గెలిపించే నేర్పు ఆమె ప్రత్యేకత ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మాణిక్య శాస్త్రిగారి శాత దినోత్సవం లో13-3-17 రాత్రి నాకు సన్మానం చేసిన డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి సందర్భంగా వెలువరించిన బుక్ లెట్

మహా మహోపాధ్యాయ స్వర్గీయ  బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు విజయవాడ శివ రామ క్షేత్రం లో 11-3-17 నుండి 13-3-17 వరకు వారి శిష్యులలో ప్రముఖులు శాస్త్ర విద్వన్మణి,ఆర్ష విద్యాభూషణ ,న్యాయ రత్న ,భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ, వేదా౦తాచార్య  ప్రస్తుత బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ఆచార్యులైన డా  శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన  శిష్య బృందం ఘనం గా నిర్వ హిస్తున్న సందర్భం గా , శ్రీ మాణిక్య శాస్త్రి గారి జీవితం, సాహిత్యం  పైనా ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి జీవిత సాహిత్యాలపైన నేను ”గీర్వాణకవుల కవితా గీర్వాణం -రెండవ భాగం ”లో రాసిన వ్యాసాలను సంగ్రహించి ,కొత్త విషయ విశేషాలు  చేర్చి రాయగా   ప్రత్యేక  బుక్ లెట్ గా  సరస భారతి తరఫున స్వంత ఖర్చులతో శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు   ప్రచురించి మొదటి రోజు 11-3-17 శనివారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి పెద్దకుమారుల చేత ఆవిష్కరింప జేసి సభ లో పాల్గొన్న వారందరికీ ఉచితం గా అందజేసి తమ గురు భక్తిని చాటుకున్నారు . ఇందులో  నాది ఉడత సాయం మాత్రమే -మీ దుర్గా ప్రసాద్ 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు

డా ఇనగంటి ఉమా రామారావు 10-8-1956 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కు దగ్గర లోని త్యాజం పూడి గ్రామం లో శ్రీ ఇనగంటి సీతారామ మార్కండేయ శర్మ ,శ్రీమతి సూర్య ప్రకాశమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ విద్య ను కొవ్వూరు లోని ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం లోను తిమ్మ సముద్రం లోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యా పీఠం లోను అభ్యసించారు .వీరి న్యాయ ,అలంకార శాస్త్ర గురువులు వీరి తండ్రిగారి తోపాటు ,శ్రీ బొక్కా వీరభద్ర శాస్త్రి ,శ్రీ రామ చంద్ర కోటేశ్వర శర్మ ,,శ్రీ దోర్బల ప్రభాకర శర్మ ,శ్రీ దుర్భా శ్రీ రామ చంద్ర మూర్తి గార్లు .శ్రీ రామారావు న్యాయం లో విద్యా ప్రవీణ ,అలంకార శాస్త్రం లో ఎం. ఏ. డిగ్రీలను ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి పొందారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి విద్వాన్ పట్టా అందుకున్నారు . వీరికి న్యాయ శాస్త్ర బోధనలో 36 సంవత్సాల అనుభవం ఉన్నది .ప్రస్తుతం తిమ్మ సముద్రం సంస్కృత విద్యా  పీఠం  ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు . ‘’విష్ణు ధర్మోత్తర పురాణం ‘’ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ లో భాగం గా ఇప్పుడు అనువాదం చేస్తున్నారు .

శ్రీ ఉమా రామారావు 2015 లో కులపతి ఆచార్య హరే కృష్ణ శత పథి ముఖ్య సంపాదకులుగా ,తాము సంపాదకులుగా శ్రీ అన్నం భట్టు విరచిత ‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦జనం ‘’(మంగల వాదః ) గ్రంధాన్ని ప్రచురించారు .దీనిని  తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రచురించింది .  ఈ గ్రంధం  17 వ శతాబ్దికి చెందిన అన్నం భట్టు రచించిన ‘’సిద్ధాంజనం’’ ఇప్పటి వరకూ ప్రచు రింప బడని వ్రాత ప్రతి నాధారం గా ప్రచురింప బడింది .ఇది 13 వ శతాబ్దానికి చెందిన గంగేశ ఉపాధ్యాయ రచించిన నవ్య న్యాయ పాఠ్య గ్రంధం పై పక్షాధర మిశ్ర అనబడే జయదేవ   ‘’ఆలోక ‘’పేరిట రాసిన ఉప వ్యాఖ్యానం .

తత్వ చింతామణి లోని ‘’మంగల వాదం ‘’ అనేది  తత్వ చింతామణి కి ప్రత్యక్షర ఖండం లో ఒక భాగం  ఇందులో అనేక విషయాలపై చర్చ ఉన్నది .పూర్వపు విద్యా వేత్తలైన పక్షధార ,నరహరి ,రుచిదత్త ,మహేశ ,మధు సూదన  ల సిద్ధాంతాలపై అన్నం భట్టు చేసిన ఆలోచనాత్మక  విశ్లేషణాత్మక వివరణమే ఇది .వీటిని అన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చిన గ్రంధం .ఈ గ్రంధం లో మరో విశేషం –తత్వ చింతామణి  ఆలోక వ్యాఖ్యానాల మూల రూపాలను యధా తధం దీనితోపాటు చేర్చి  ప్రచురించి చదువరులకు సౌలభ్యం కలిగించటం .సంక్షిప్త ఉపోద్ఘాతం  నోట్స్ వగైరా అందజేయటంకూడా లాభించింది .

ఆధారం -11-3-17 న విజయవాడ శివ రామ క్షేత్రం లో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి మూడు రోజుల ఉత్సవాల మొదటిరోజున నన్ను శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ  వెంటబెట్టుకొని సభలో పాల్గోనేట్లు చేయగా , నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’నుండి శ్రీ మాణిక్య శాస్త్రి గారు,శాస్త్ర విద్వాన్మణి,ఆర్ష విద్యా భూషణ ,న్యాయ రత్న  భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ  వేదా౦తాచార్య  డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గార్ల పై నేను  రాసిన వ్యాసాలను సంగ్రహించి ప్రత్యేక బుక్ లెట్ గా ప్రచురించి ,ఈ రోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా డా శ్రీ ఇనగంటి ఉమా రామా రావు గారు  పరిచయమై నాకు అందజేసిన ‘’తత్వ చంతామణ్యాలోక సిద్దా౦జనం ‘’ గ్రంథం .

ఈ సందర్భం గా భోజనాల సమయం లో అక్కడ చేరిన సంస్కృత విద్వా౦సు లందరినీ నేను సంస్కృత కవుల పై తెచ్చిన రెండు గ్రంథాలను వివరించి మూడవదానినీ నెట్ లో రాస్తూ ఇప్పటికి 67 మంది గురించి రాశానని  ,కనుక ఇక్కడ ఉన్నవారు తమ బయోడేటా, గ్రంథ రచన విషయాలను మాణిక్య శాస్త్రి గారిపై అందజేసిన బుక్ లెట్ లో ఉన్న నా చిరు నామాకు పంపించి వారిని గురించి రాసే అదృష్టం కలిగించమని ప్రార్ధించాను .చూడాలి ఎందరు  స్పందిస్తారో .

.

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-17 –ఉయ్యూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

                   కుటుంబ నేపధ్యం

తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .

                                   జనన విద్యాభ్యాసాలు  వివాహం

గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ  శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ  20 15 లో వేదం లో  ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం గా శ్రీ యజ్ఞ సరస్వతి అనే  కూతురును పొందాడు .

. శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు , శ్రీ దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారు ,శ్రీ కాశీ కృష్ణ మూర్తి ఘనాపాఠీగారు , శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీగారు , ,శ్రీ కె. వి .యెన్ .అవధాని గారు ,ఎం .స్వామి నాధన్ గారు (వేద భవన్ .                         గీర్వాణ రచనా సామర్ధ్యం

తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రాతిశాఖ్యానం పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా  రాశాడు .ఇవి గాక ’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమణిక ‘’ రచించాడు .

పురస్కారాలు

2000 సంవత్సరం లో 15 వ ఏటనే  లక్నో లోని ఉత్తర ప్రదేశ్  సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా  శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు. వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు   ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించగా అందులో పని చేస్తూ ఉన్నాడు ..

ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా  వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .

శ్రీ శ్రీనివాస శాస్త్రి ఫోటో జత చేశాను చూడండి 

           సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాఇంట్లో యలమర్రు గబ్బిట వారు

8-3-17 బుధవారం ఉదయం మా ఇంటికి  యలమర్రు కు చెందిన వారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ0 లో 30సంవత్సరాలనుండి   భాషా శాస్త్ర వేత్తగా ,న్యాయ విద్యా ప్రవీణగా  ,వేదాంతాచార్యగా సేవలు అందిస్తున్న డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,వారి కుమారులు డా శ్రీ గబ్బిట శ్రీనివాస   శాస్త్రి గారు .రావటం మా సుకృతం .

  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు   తమకు తర్క న్యాయ మీమాంసాది శాస్త్రాలు బోధించిన విజయవాడ వాస్తవ్యులు మహా మహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను  అత్యంత భక్తి శ్రద్ధలతో 11-3-17 నుండి 13-3-17 వరకు మూడు రోజులు విజయవాడ శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో  మాణిక్య శాస్త్రిగారి శిష్య బృందం తో కలిసి ఘనం గా నిర్వహిస్తూ ,ఆహ్వానాన్ని నాకు అందజేయటానికి ఉయ్యూరు వచ్చిన సందర్భం ఇది .
   స్థానిక ఛానల్ వారు మా ఇంట్లోనే శ్రీ శాస్త్రిగారిని ఇంటర్వ్యూ చేశారు . సంస్కృత భాషా వైభవాన్ని  తమ వైదుష్యాన్ని భాష చిరంజీవిగా వర్ధిల్లటానికి చేయవలసినదానిని వారుచక్కగా వివరించి చెప్పారు .
  శ్రీ మాణిక్య శాస్త్రి గారిపైన ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారిపైనా నేను గీర్వాణ కవుల కవితా గీర్వాణం -రెండవ భాగం లో రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను . వాటినే ఉపయోగించి మాణిక్య శాస్త్రిగారి శత జయంతికి ఫోటోలతో సహా ఒక చిన్న బుక్ లెట్ ను ప్రచురించి ,సభలకు విచ్చసే వారందరికీ అంద  జేయాలన్నది శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి సంకల్పం . ఆ బుక్ లెట్ తయారీ కూడా మా అబ్బాయి రమణ సహాయం తో ఇక్కడే రూపు  దాల్చటం  సరసభారతి అదృష్టం . గురు భక్తి కి నిలువు దర్పణం డా  శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు . అందరికీ ఆదర్శ ప్రాయులు ఆ గురు శిష్యులు . -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో


Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )

డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1956 న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం  యలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బాసావిత్రి  గారు .కొవ్వూరు  ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం .ఏ . పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి ముగ్గురు  కుమారులు –శ్రీ సుబ్రహ్మణ్య సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ శ్రీనివాస యజ్ఞ దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది .తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది .   .

గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి  1983-88 కాలం లో  తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని  న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు ..1997 నుంచి తర్క ,వేదాంత శాస్త్రాలలో  ప్రొఫెసర్గా ఉన్నారు .

శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లోజగదీశ భట్టా చార్య తర్కామృతం పై  ‘’మాణిక్య ప్రభ ‘’రాశారు .1995మాధురీ గాదాధరీ మత భేద విమర్శ రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై  ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళువిజయవాడ ఆకాశ వాణి లో   తర్క శాస్త్ర వైభవం ,అనిత్యః శబ్దః ,పరమాణు స్వరూపం ,వ్యక్తి వివేక విమర్శనం మున్నగు అంశాలపై  ప్రసంగాలు చేశారు .

శ్రీ  ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే .కే. డి.లో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు, వక్తలు గాఉండి భాగవత ,రామాయణ ,స్కాంద పురాణా౦ తర్గత కాశీఖండాలపై  ప్రవచనం చేశారు .సంప్రదాయ న్యాయ మీమాంస  వేదాంత శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .ఈ శాస్త్రాలలో వీరికి గురువులు మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు ,పండిత రాజ ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,పండిత రాజ,పద్మభూషణ్  పి .యెన్ .పట్టాభి రామ శాస్త్రి గారు ,న్యాయ వేద వేదాంత విద్వాన్ శ్రీ ధూళి పాళ రామచంద్ర శాస్త్రి గారు ,కవితార్కిక చక్రవర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు .

1670 కాలపు వాడైన నాగేశ భట్టు భట్టోజీ దీక్షితుల భారతీయ పంచాంగం  ప్రకారం  కాల ,తిధి నిర్ణయం పై ‘’తిధినిర్ణయం ‘’ అనే సంస్కృత శాస్త్ర గ్రంథాన్ని ప్రకాశింప జేశారు  .జగదీశ భట్టాచార్యుడి  తర్కామృత గ్రంథంపై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’ మాణిక్య ప్రభ సంస్కృత వ్యాఖ్యా విభూషితం’’చేశారు . శాస్త్రిగారి ద్వితీయ పుత్రులు ,పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో తర్క శాస్త్రం లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన శ్రీ జయమాణిక్య శాస్త్రి  ‘’మణిప్రభ హిందీ వ్యాఖ్య’’సంవలితం ‘’చేశారు . దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ  రచించిన ‘’ఉజ్వలా వ్యాఖ్యానం ‘’ను శాస్త్రి గారు సంపాదకులుగా వెలువరించారు . .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .క్రీ. శ.1600 కాలం వాడైన మధురానాథ తర్క వాగీశుని ‘’మాధురీ ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గాదాధరీ ‘’,13వ శతాబ్దికి చెందిన  గంగేశుని  ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురీ గాదాధర్యోర్మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ  ప్రచురించింది .రామరుద్ర భట్టాచార్యులు  రాసిన ‘’ వ్యుత్పత్తి వాద వ్యాఖ్యానాన్ని ’ మద్రాస్ లోని అడయారు లైబ్రరీ నుంచి  కంచి కామ కోటి పీఠ ఆస్థాన విద్వాంసులైన  మహా మహోపాధ్యాయ  శ్రీ ఎస్ .ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రిగారి ద్వారా తెప్పించి   ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’ అని ప్రకాశనం చేశారు .. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడ శీతి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని ఉజ్జైన్  లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .

డా.శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు అనేక మంది విద్యార్ధులకు తర్క ,వేదాంత ,మీమాంస శాస్త్రాలను బోధిస్తూ పరిశోధనకు ప్రోత్సహిస్తూ సుమారు 25 మంది చే తర్క వేద వేదాంత శాస్త్రాలలో పి .హెచ్ .డి .సాధించటానికి మార్గ దర్శనం చేశారు .ప్రస్తుతం వీరి మార్గ దర్శనం లో 10 మంది పి .హెచ్. డి.,పి .డి.ఎఫ్ .చేస్తున్నారు .  కంచి కామకోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో శాస్త్రిగారు శాస్త్రార్ధం చేసి స్వర్ణపతకం పొందారు .శ్రీ వారి అనుగ్రహం తో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి తర్క శాస్త్రాన్ని వినిపించారు . ఆంధ్ర పీఠమైన పుష్పగిరి శంకరాచార్యులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి ఆదేశం తో వారి ఉత్తరాధికారి ,ప్రస్తుత పీఠాదిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారికి తర్క వేదాంత శాస్త్రాలను కాశీ లో  శ్రీ శాస్త్రి గారి ఇంటి వద్దనే శ్రవణం చేయించారు .అనేక మంది పీఠాదిపతుల వద్ద గోలోక౦ ,కాళీ శాంకరి ,బచ్యాఝా ‘’ అద్వైత సిద్ధి ,బ్రహ్మాన౦దీయ క్రోడ పత్ర’’విషయాలపై  శాస్త్రార్ధాలు చేసి జగద్గురువుల అనుగ్రహం పొందారు .కంచి ,శృంగేరి, ద్వారక ,పుష్పగిరి ,ఉడిపి పీఠాలలో శాస్త్రార్ధ చర్చ చేసి ‘’శాస్త్ర విద్వన్మణి’’, ‘’న్యాయరత్న ,’’ఆర్షవిద్యా భూషణ’’ బిరుదులను అందుకున్నారు . శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆజ్ఞానుసారం మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ఇంటిలో  అంతేవాసిగా ఉండి తర్క వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టారు .

‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి  ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .

శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో జత చేశాను చూదాండి

గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-2017 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ హేవిళంబి ఉగాది వేడుకలకు సాదర ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)

  జెర్ ట్రూడ్ స్టెయిన్ పై రెండు వర్గాలమధ్య  రేగిన విపరీత మైన దుమారం అంతా ఇంతా కాదు .మధ్యే మార్గమే లేదు .ఆమె వ్యతిరేకులు ఆమెనుఒక ఫ్రాడ్ గా ,ఆమె చెప్పిన ఆటోమాటిక్ రైటింగ్ ఒక అవహేళనగా భావించారు .ఆమెది ‘’క్లినికల్ కేస్ ఆఫ్ మేగలోమానియా ‘’అన్నారు .కొద్దిమంది ఆమెను  రచయిత్రిగా కంటే ఆమె ఒక ఒకమతం గా ,దేశం లో అత్య౦త  విప్లవాత్మక సృజన శీలిగా  సాహిత్యం లో శాస్త్రీయ దృక్పధం ఉన్న విద్యార్ధినిగా,ప్రపంచాన్నే మార్చేసిన ఏక వ్యక్తి విప్లవ వనితగా   ఆరాధించారు .మిగిలిన చాలా మందికి ఆమె నిరంతర వివాదాస్పద వ్యక్తి .ఎవరేమనుకొన్నా ఆమె తిరుగులేని ఉన్నత స్థాయి మతాధికారి .

  3-2-1874 నా అమెరికాలో పెన్సిల్వేనియా లోని అల్లెఘేని లో డేనియల్ ,అమీలియా కేజర్ స్టెయిన్ దంపతులకు జన్మించింది .తండ్రిసంపన్నమైన  స్ట్రీట్ రైల్వే  వైస్ ప్రెసిడెంట్,నిరంతర సంచారి .పెద్దన్న లియో తో ఆమే వియన్నా ,పారిస్ కాలి ఫోర్నియా  లలో బాల్యం గడిపింది . చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు .లైబ్రరీలకు వెళ్లి దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేసింది .తర్వాత స్మోల్లేట్ ,స్కాట్ ,షేక్స్పియర్ ,బన్యన్ ,ఫీల్డింగ్ వర్డ్స్ వర్త్ రచనలతో పాటు ‘’కాంగ్రెషనల్ రికార్డ్స్ ‘’కూడా ఊది పారేసింది .19  వ ఏట రెడ్ క్లిఫ్ లో సైకాలజీ ప్రత్యేకంగా చదివి  విలియం జేమ్స్ కు శిష్యురాలైనది .పరీక్ష ముందు రోజు రాత్రి ఒపేరా హౌస్ కు వెళ్లి ,అక్కడి నుంచి అర్ధ రాత్రి లేట్ పార్టీ లో ఉండి ఇంటికి వచ్చింది .పరీక్ష లో సమాధానం పేపర్ పై భాగాన ‘’డియర్ ప్రొఫెసర్  జేమ్స్ నేనుఫిలాసఫీ పేపర్ రాయలేక పోతున్నందుకు మన్నించండి ‘’అని రాసింది .దానికి సమాధానంగా జేమ్స్ ‘’డియర్ మిస్ స్టెయిన్ –నిన్ను పూర్తిగా అర్ధం చేసుకొన్నాను .అప్పుడప్పుడు నేను అలానే చేసేవాడిని .’’అని రాసి ఆమెకు అతి ఎక్కువ మార్కులు వేశాడు .

  రెడ్ క్లిఫ్ లో ఉండగానే ఆటోమాటిక్ రీడింగ్ ,రైటింగ్ లో ప్రయోగాలు చేసింది .లియాన్ సాల్మన్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్ధి తోకలిసి సృజన కార్యం  అంతశ్చేతన తో కాకుండానే సాధ్యం అని రుజువు చేసి తమ పరిశోధన వివరాలను 1896 లో   ‘’నార్మల్ మోటార్ ఆటో మాటిజం’’అనే శీర్షికతో  ‘’సైకలాజికల్ రివ్యు ‘’లో ప్రచురించింది . అదే ఆమె మొట్టమొదటి ప్రచురణ వ్యాసం .దీనిపై విస్తృతంగా రాస్తూ ఆ తర్వాత బాగా ప్రసిద్ధి చెందింది .ఆ తర్వాత కాలం లో ‘’ఇందులో మాటలూ వాక్యాలు సరైనవే కాని ఒక దానికొకటి సంబంధం సరిగ్గా లేదు ‘’అని చెప్పు కొన్నది .రెడ్ క్లిఫ్ పరిశోధన జరిగిన 38 ఏళ్ళ తర్వాత ప్రొఫెసర్ బి .ఎఫ్ .స్కిన్నర్ ఆ పత్రాన్ని కనుగొని ‘’హాజ్ గెట్రూడ్ స్టెయిన్ అ సీక్రెట్ ‘’అనే దానిలో ఆమె సైకలాజికల్ రివ్యు లో రాసిన దానిలో అది చాలా పాక్షికంగా ఉన్న పేపర్ మాత్రమే అని రాశాడు .అచేతన స్థితిలో రాసిన రాత అన్నాడు .స్టెయిన్ కూడా ఆ తర్వాత తన స్వీయ చరిత్రలో తన ప్రయోగం విజయవంతం కాలేదని ,ఆటోమాటిక్ రెస్పాన్స్ కు తగిన సరైన సాక్షాలు లేవని రాసింది .’’ఇది ఆటోమేటిక్ అని నేననుకోలేదు ,ఇప్పుడు కూడా అనుకోను .విశ్వ వ్యాప్తంగా ఏ విద్యార్ధి అయినా దీనిపై ఇంకా పరిశోధించి నిగ్గు తేల్చవచ్చు మనిషి మనసులో ఉన్నది ఏదో ,సరైన పదాలతో ఆ భావోద్వేగం  రాత వలన బయటికి వస్తుంది ‘’అని చెప్పింది .ఇదంతా భాషా శాస్త్ర వేత్తల దృష్టి ని ఆకర్షించింది . .  దీనిని ఆమె గురువు విలియం జేమ్స్ బాగా ప్రోత్సహించాడు .ఆయన రాసిన ‘’సైకాలజీ ‘’గ్రంధం లో ‘’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’అధ్యాయం లో సాహిత్యం లో ఈ కొత్త పదాన్ని సృష్టించి వాడాడు .ఇందులో ప్రతి ఆలోచనా విడి విడిభాగాలుగా బయటికి వస్తుంది .ప్రతివాక్యం ఒక  కాల అవధికి సంబంధించింది అవుతుంది .ఇది స్టెయిన్ ను బాగా ఆకర్షించింది .ఇందులో సెన్స్ ఆఫ్ టైం అంటే ఆమెకు బాగా ఇష్టమైంది .

  23 వ ఏట ఆమె జాన్స్ హాప్కిన్స్ యూని వర్సిటి లో చేరినాలుగేళ్ళు మెడిసిన్ చదివింది .అన్నిటా బాగా మార్కులు వస్తున్నా ,డిగ్రీ పొందకుండానే మానేసింది .మార్కులకంటే చదువే ముఖ్యంగా భావించింది .లండన్ వెళ్లి జీవిత గమనాన్ని మలుపు తిప్పు కొన్నది .ఎలిజబెతన్ ప్రోజ్  కు అంకితమైంది .20 వశతాబ్ది ప్రారంభం లో పారిస్ మేధావులకు కేంద్ర నిలయ౦ గా ఉండేది . .1903  లో పారిస్ చేరి ,ఆలిస్ బి .టోక్లాస్ అనే సాన్ ఫ్రాన్సిస్కో స్నేహితురాలితో పరిచయం చేసుకొని స్నేహాన్ని జీవితాంతం నిలుపు కొన్నది .ముప్ఫై ఏళ్ళలో ఒక్క సారి మాత్రమే చుట్టపు చూపుగా అమెరికా వెళ్లి వచ్చింది .మిగాతాకాలం అంతా పారిస్ లోనే .సోదరుడు,’’ ది ఎ.బి.సి .ఆఫ్ అద్లేటిక్స్ రచయితా అయిన  లియో తో ఉన్నది .వీరి భావాల మధ్య వైరుధ్యం ఉన్నందున తరచూ కీచులాడుకోనేవారు .కొత్త ,అంతగా పేరు లేని పెయి౦టర్స్ నుగుర్తించి  చిత్రాలను అతను సేకరించి భద్ర పరిస్తే ,తానే వారిని కనుక్కున్నానని  ఆమె పోట్లాడేది .ఆమె రాసే విధానమూ అతనికి నచ్చేదికాదు .ఆమె రాతలో స్పష్టత లేదని ,పునరుక్తులు ఎక్కువని ఈసడించేవాడు .ఆమె పురుష వేషం  మాట విధానం అతనికి ఏవగింపు .బిగుతు ,పొట్టి బట్టలను అతడు వద్దనే వాడు .జుట్టు కత్తిరించుకోవటం గిట్టేదికాదు .చురుకైన నళ్ళకళ్ళ చిన్నదిఆమె . పికాసో ఈమె చిత్రాన్ని అర్ధ నిమీలిత ధ్యాన యోగం లో  సగం వాదం లో ముందుకు వంగి  ప్రత్యర్ధి ని ఉచ్చులో పడేస్తున్నట్లు  గొప్పగా చిత్రించాడు .అయితే పికాసో చిత్రించిన దానికి భిన్నంగా ఆమె కవళికలు ఉండేవి .ఆమె ముఖం ఆవేశ పూరితుడైన బుద్ధుని ముఖంలా లేక ఉలెన్ బట్టలలో చుట్టబడిన రోమన్ సెనేటర్ ముఖంలా అనిపించేది .ఆమె డామినేటింగ్ నేచర్ కు కొంపలో ఇద్దరు ఆడ వాళ్ళ మధ్య ఉండటం భరించలేక లియో అక్కడి నుంచి మారి వేరే చోట ఉన్నాడు .స్టెయిన్ అతనికి ‘’prolonged disease ,a kind of mild insanity ‘’తో బాధ పడుతున్నదానిలా అనిపించింది .

Inline image 1

   మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-3–17  -ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో  ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం  గా  నిర్వహిస్తున్నాము .

అతిధులకు  కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు

గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య  ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )

ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )

విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )

మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ  పరుచూరి శ్రీ నాథ్ గార్లు  సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .

కార్య క్రమ౦

మధ్యాహ్నం -3-30 నుండి 4 వరకు –అల్పాహార విందు

సాయంత్రం -4 గం నుండి -5 గం వరకు –ఉగాది పురస్కార ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం –అతిధుల అభిభాషణం

స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త       శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )

2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )

3-నవ భారత సాహితీ రత్న ,సాహితీ విశిష్ట  వానమామలై స్మారక పురస్కార ,సోమనాధ కళా పీఠ పురస్కార గ్రహీత -శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు  సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్యభరిత గ్రంధ ప్రచురణ కర్త  ,విద్వత్ కవి , విమర్శకులు ,బహు(40 కి పైగా ) గ్రంథకర్త  విశ్వనాథ వారి క్రష్ణ కావ్యాల పరిశోధకుకులు –  డా. శ్రీ రంగ స్వామి (వరంగల్ )

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు  మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ౦త  ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు  (విజయవాడ )

కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

సాయంత్రం -5 గం నుండి 6 -30 గం వరకు  ‘’వసుధైక కుటుంబం ‘’   అంశం పై   ప్రముఖ కవి మిత్రులచే కవి సమ్మేళనం

పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .

నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె .  కనక దుర్గా మహాలక్ష్మి ,  శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )

 

. జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి

,                                                                                          3–3–2017

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఉగాది శుభాకాంక్షలు

నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు

‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు

డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ  శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు ) డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట) శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ , శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు  శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ )  శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీ సి హెచ్ .భవానీ శంకర రావు ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )

Inline image 2

‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ

దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’

( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment