గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3
92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )
కృష్ణన్ భట్టాద్రి పాద 1879 లో కేరళలోని త్రిస్సూర్ జిల్లా పెరువనం దేశ మన లో కున్నట్టూర్ పడి నంజరే దాతుఅనే తంత్ర సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .తండ్రి పేరుకూడా కొడుకు పేరే .తల్లి చిత్తూరు మన నుండి వచ్చింది ,తొమ్మిది మంది సంతానం లో ఆరవ వాడు .నలుగురు సోదరులు ,నలుగురు సోదరీమణులు .
ఉపనయనానంతరం ఋగ్వేదాన్ని కంఠోపాఠం చేశాడు .జీవితమంతా వేదం అధ్యన అధ్యాపనం లో గడిపాడు .అద్వాన్సేడ్ సంస్కృతాన్ని సాహిత్యాన్ని చన్నమంగళం అయ్య శాస్త్రి వద్ద నేర్చాడు .కోడంగూర్ గురుకులం లో తర్కాన్ని అభ్యసించాడు . వంశ పారంపర్యంగా వస్తున్న తంత్ర శాస్త్రం లో నిష్ణాతుడై ,తచు శాస్త్రం లో మహా పాండిత్యాన్ని సాధించాడు .భట్టాద్రి పాద ముఖ్య శిష్యుడు 2000 వ సంవత్సరం లో చనిపోయిన తంత్ర మహా నిష్ణాత కలక్కూజ దివాకరాన్ నంబూద్రి .భట్టాద్రి ఆధ్వర్యం లో అరుదైన మహా గొప్ప తిలపర్వత యజ్ఞాన్ని నభూతో గా కొచ్చిన్ మహా రాజు కోరికపై నిర్వహించారు .ఈ మహా క్రతు విధానాన్ని సంపూర్ణం గా నంబూద్రి పుస్తకం గా రచించి ‘’తిలపర్వత దానం ‘’శీర్షికతో ముద్రించాడు .ఆయన రాసిన మరో గ్రంథం ‘’సాహిత్య చింతామణి .’’.ఇందులో ‘’త్రిసంధ ‘’,సంన్యాసక్రియ ‘’మొదలైన కర్మకాండ నంతటిని చక్కగా వివరించి రాశాడు .85 వ ఏట మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -౩-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—
