గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩
91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )
శాస్త్ర శర్మ (కుంచు )నంబూద్రి కేరళలో 1877 లో సుబ్రహ్మణ్య నంబూద్రి కిరనా౦జల్ పార్వతి దంపతులకు జన్మించాడు .అన్న వాసుదేవ నంబూద్రి గొప్ప వ్యాకరణ వేత్త .తమ్ముడు సుబ్రహ్మణ్య నంబూద్రి న్యాయ శాస్త్ర వేత్త .7 వ ఏట ఉపనయనం జరిగి అన్నగారి వద్దనే వేదం నేర్చి తర్వాత త్రిస్సూరు బ్రహ్మస్వామి మఠంలో 15 వ తేడు వరకు చదువుకున్నాడు .ఆ సమయం లోనే వ్యాకరణ న్యాయ శాస్త్రాలను కిరంగాట్ మన లో ఉన్న ప్రసిద్ధ పండితుడు రామ స్వామి శాస్త్రి వద్ద క్షుణ్ణంగా అభ్యసించాడు .న్యాయ శాస్త్రం లో అడ్వాన్సేడ్ ట్రెయినింగ్ ను కుడు౦గ ల్లూర్ గురుకులం లో విఖ్యాత భట్ట గోదావర్మ రాజ వద్ద నేర్చాడు .ఆయన మేనకోడలిని వివాహమాడాడు .
కొచ్చిన్ రాజు తర్కాలంకార బిరుదు ప్రదానం చేసి త్రిపుని తుర లోని సంస్కృత పాఠ శాలలో న్యాయ శాస్త్రా చార్యునిగా నియమించాడు .1931 వరకు అక్కడే పని చేసి, రిటైర్ అయినా కూడా తన విద్యావ్యాసంగాన్ని బోధనను మానకుండా చేశాడు .జీవిత కాలమంతా న్యాయ సదస్సులకు న్యాయ నిర్ణేతగా కొనసాగాడు .
న్యాయ శాస్త్రం లో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం .నాచన్ రత్నమాలిక ,దీనిపై ‘’నూతనాలోకనం’’ అనే వ్యాఖ్య ,సుబోధినీ టీకా లను రచించాడు గంగాతరంగిణి అనే 24 తరంగిణులకు ఒక్కొక్కదానికి 14 శ్లోకాల కావ్యం రాశాడు. కాశీ విశ్వేశ్వరునిపై అచంచల భక్తీ ఉన్న కుంచు నంబూద్రి వ్యాఖ్యాన టీకా ‘’ప్రసూనాంజలి’’ రాసి తన శివ భక్తి గరిమను చాటుకున్నాడు .చిన్నదే అయినా అత్యంత ప్రసిద్ధి చెందింది .చాతక సందేశం అనే సందేశ కావ్యాన్నీ రాశాడు .82 ఏళ్ళ వయసులో కుంచు నంబూద్రి 1959 లో శివసాయుజ్యం పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
