వీక్షకులు
- 1,159,245 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.32 వ భాగం.11.6.26.
- డెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.1 వ భాగం.11.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.5 వ భాగం.11.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.214 వ భాగం.11.6.26.
- ఇంగ్లాండ్లో యాభై సంవత్సరాలు(త్రివేణి)
- శ్రీ బేతబోలు రామబ్రహ్మం గారి “దేవీ భాగవతం బేతవోలు వారి సృజనాత్మక చాతుర్యం” పై శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం ఈరోజు(10-6-26) ఉదయం 7:20 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైనది. శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ బాబాయ్ గారికి శుభాకాంక్షలు, వందనాలు . ధన్యవాదములుతో…పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
- అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్ ,ఉడ్రోవిల్సన్ ఫెలోషిప్ ఆవార్డ్ గ్రహీత –శ్రీమతి గీతా గోపీనాథ్-(మహిళామణులు ) -గబ్బిట దుర్గాప్రసాద్
- హెచ్. డబ్ల్యూ. మాస్సింగ్హామ్(త్రివేణి)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.29 వ భాగం.8.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి. కల్పవృక్ష వా గ్వై భవం.2 వ భాగం.8.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,107)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి సందర్భంగా వెలువరించిన బుక్ లెట్
మహా మహోపాధ్యాయ స్వర్గీయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు విజయవాడ శివ రామ క్షేత్రం లో 11-3-17 నుండి 13-3-17 వరకు వారి శిష్యులలో ప్రముఖులు శాస్త్ర విద్వన్మణి,ఆర్ష విద్యాభూషణ ,న్యాయ రత్న ,భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ, వేదా౦తాచార్య ప్రస్తుత బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ఆచార్యులైన డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన శిష్య బృందం ఘనం గా నిర్వ హిస్తున్న సందర్భం గా , శ్రీ మాణిక్య శాస్త్రి గారి జీవితం, సాహిత్యం పైనా ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి జీవిత సాహిత్యాలపైన నేను ”గీర్వాణకవుల కవితా గీర్వాణం -రెండవ భాగం ”లో రాసిన వ్యాసాలను సంగ్రహించి ,కొత్త విషయ విశేషాలు చేర్చి రాయగా ప్రత్యేక బుక్ లెట్ గా సరస భారతి తరఫున స్వంత ఖర్చులతో శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ప్రచురించి మొదటి రోజు 11-3-17 శనివారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి పెద్దకుమారుల చేత ఆవిష్కరింప జేసి సభ లో పాల్గొన్న వారందరికీ ఉచితం గా అందజేసి తమ గురు భక్తిని చాటుకున్నారు . ఇందులో నాది ఉడత సాయం మాత్రమే -మీ దుర్గా ప్రసాద్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు
డా ఇనగంటి ఉమా రామారావు 10-8-1956 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కు దగ్గర లోని త్యాజం పూడి గ్రామం లో శ్రీ ఇనగంటి సీతారామ మార్కండేయ శర్మ ,శ్రీమతి సూర్య ప్రకాశమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ విద్య ను కొవ్వూరు లోని ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం లోను తిమ్మ సముద్రం లోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యా పీఠం లోను అభ్యసించారు .వీరి న్యాయ ,అలంకార శాస్త్ర గురువులు వీరి తండ్రిగారి తోపాటు ,శ్రీ బొక్కా వీరభద్ర శాస్త్రి ,శ్రీ రామ చంద్ర కోటేశ్వర శర్మ ,,శ్రీ దోర్బల ప్రభాకర శర్మ ,శ్రీ దుర్భా శ్రీ రామ చంద్ర మూర్తి గార్లు .శ్రీ రామారావు న్యాయం లో విద్యా ప్రవీణ ,అలంకార శాస్త్రం లో ఎం. ఏ. డిగ్రీలను ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి పొందారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి విద్వాన్ పట్టా అందుకున్నారు . వీరికి న్యాయ శాస్త్ర బోధనలో 36 సంవత్సాల అనుభవం ఉన్నది .ప్రస్తుతం తిమ్మ సముద్రం సంస్కృత విద్యా పీఠం ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు . ‘’విష్ణు ధర్మోత్తర పురాణం ‘’ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ లో భాగం గా ఇప్పుడు అనువాదం చేస్తున్నారు .
శ్రీ ఉమా రామారావు 2015 లో కులపతి ఆచార్య హరే కృష్ణ శత పథి ముఖ్య సంపాదకులుగా ,తాము సంపాదకులుగా శ్రీ అన్నం భట్టు విరచిత ‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦జనం ‘’(మంగల వాదః ) గ్రంధాన్ని ప్రచురించారు .దీనిని తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రచురించింది . ఈ గ్రంధం 17 వ శతాబ్దికి చెందిన అన్నం భట్టు రచించిన ‘’సిద్ధాంజనం’’ ఇప్పటి వరకూ ప్రచు రింప బడని వ్రాత ప్రతి నాధారం గా ప్రచురింప బడింది .ఇది 13 వ శతాబ్దానికి చెందిన గంగేశ ఉపాధ్యాయ రచించిన నవ్య న్యాయ పాఠ్య గ్రంధం పై పక్షాధర మిశ్ర అనబడే జయదేవ ‘’ఆలోక ‘’పేరిట రాసిన ఉప వ్యాఖ్యానం .
తత్వ చింతామణి లోని ‘’మంగల వాదం ‘’ అనేది తత్వ చింతామణి కి ప్రత్యక్షర ఖండం లో ఒక భాగం ఇందులో అనేక విషయాలపై చర్చ ఉన్నది .పూర్వపు విద్యా వేత్తలైన పక్షధార ,నరహరి ,రుచిదత్త ,మహేశ ,మధు సూదన ల సిద్ధాంతాలపై అన్నం భట్టు చేసిన ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వివరణమే ఇది .వీటిని అన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చిన గ్రంధం .ఈ గ్రంధం లో మరో విశేషం –తత్వ చింతామణి ఆలోక వ్యాఖ్యానాల మూల రూపాలను యధా తధం దీనితోపాటు చేర్చి ప్రచురించి చదువరులకు సౌలభ్యం కలిగించటం .సంక్షిప్త ఉపోద్ఘాతం నోట్స్ వగైరా అందజేయటంకూడా లాభించింది .
ఆధారం -11-3-17 న విజయవాడ శివ రామ క్షేత్రం లో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి మూడు రోజుల ఉత్సవాల మొదటిరోజున నన్ను శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ వెంటబెట్టుకొని సభలో పాల్గోనేట్లు చేయగా , నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’నుండి శ్రీ మాణిక్య శాస్త్రి గారు,శాస్త్ర విద్వాన్మణి,ఆర్ష విద్యా భూషణ ,న్యాయ రత్న భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ వేదా౦తాచార్య డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గార్ల పై నేను రాసిన వ్యాసాలను సంగ్రహించి ప్రత్యేక బుక్ లెట్ గా ప్రచురించి ,ఈ రోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా డా శ్రీ ఇనగంటి ఉమా రామా రావు గారు పరిచయమై నాకు అందజేసిన ‘’తత్వ చంతామణ్యాలోక సిద్దా౦జనం ‘’ గ్రంథం .
ఈ సందర్భం గా భోజనాల సమయం లో అక్కడ చేరిన సంస్కృత విద్వా౦సు లందరినీ నేను సంస్కృత కవుల పై తెచ్చిన రెండు గ్రంథాలను వివరించి మూడవదానినీ నెట్ లో రాస్తూ ఇప్పటికి 67 మంది గురించి రాశానని ,కనుక ఇక్కడ ఉన్నవారు తమ బయోడేటా, గ్రంథ రచన విషయాలను మాణిక్య శాస్త్రి గారిపై అందజేసిన బుక్ లెట్ లో ఉన్న నా చిరు నామాకు పంపించి వారిని గురించి రాసే అదృష్టం కలిగించమని ప్రార్ధించాను .చూడాలి ఎందరు స్పందిస్తారో .
.
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-17 –ఉయ్యూరు .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి
కుటుంబ నేపధ్యం
తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .
జనన విద్యాభ్యాసాలు వివాహం
గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ 20 15 లో వేదం లో ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం గా శ్రీ యజ్ఞ సరస్వతి అనే కూతురును పొందాడు .
. శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు , శ్రీ దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారు ,శ్రీ కాశీ కృష్ణ మూర్తి ఘనాపాఠీగారు , శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీగారు , ,శ్రీ కె. వి .యెన్ .అవధాని గారు ,ఎం .స్వామి నాధన్ గారు (వేద భవన్ . గీర్వాణ రచనా సామర్ధ్యం
తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రాతిశాఖ్యానం –పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా రాశాడు .ఇవి గాక ’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమణిక ‘’ రచించాడు .
పురస్కారాలు
2000 సంవత్సరం లో 15 వ ఏటనే లక్నో లోని ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు. వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించగా అందులో పని చేస్తూ ఉన్నాడు ..
ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .
శ్రీ శ్రీనివాస శాస్త్రి ఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-17 –ఉయ్యూరు
మాఇంట్లో యలమర్రు గబ్బిట వారు
8-3-17 బుధవారం ఉదయం మా ఇంటికి యలమర్రు కు చెందిన వారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ0 లో 30సంవత్సరాలనుండి భాషా శాస్త్ర వేత్తగా ,న్యాయ విద్యా ప్రవీణగా ,వేదాంతాచార్యగా సేవలు అందిస్తున్న డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,వారి కుమారులు డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి గారు .రావటం మా సుకృతం .
శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు తమకు తర్క న్యాయ మీమాంసాది శాస్త్రాలు బోధించిన విజయవాడ వాస్తవ్యులు మహా మహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో 11-3-17 నుండి 13-3-17 వరకు మూడు రోజులు విజయవాడ శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో మాణిక్య శాస్త్రిగారి శిష్య బృందం తో కలిసి ఘనం గా నిర్వహిస్తూ ,ఆహ్వానాన్ని నాకు అందజేయటానికి ఉయ్యూరు వచ్చిన సందర్భం ఇది .
స్థానిక ఛానల్ వారు మా ఇంట్లోనే శ్రీ శాస్త్రిగారిని ఇంటర్వ్యూ చేశారు . సంస్కృత భాషా వైభవాన్ని తమ వైదుష్యాన్ని భాష చిరంజీవిగా వర్ధిల్లటానికి చేయవలసినదానిని వారుచక్కగా వివరించి చెప్పారు .
శ్రీ మాణిక్య శాస్త్రి గారిపైన ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారిపైనా నేను గీర్వాణ కవుల కవితా గీర్వాణం -రెండవ భాగం లో రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను . వాటినే ఉపయోగించి మాణిక్య శాస్త్రిగారి శత జయంతికి ఫోటోలతో సహా ఒక చిన్న బుక్ లెట్ ను ప్రచురించి ,సభలకు విచ్చసే వారందరికీ అంద జేయాలన్నది శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి సంకల్పం . ఆ బుక్ లెట్ తయారీ కూడా మా అబ్బాయి రమణ సహాయం తో ఇక్కడే రూపు దాల్చటం సరసభారతి అదృష్టం . గురు భక్తి కి నిలువు దర్పణం డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు . అందరికీ ఆదర్శ ప్రాయులు ఆ గురు శిష్యులు . -దుర్గా ప్రసాద్
మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో
-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )
-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )
డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1956 న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం యలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బాసావిత్రి గారు .కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం .ఏ . పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి ముగ్గురు కుమారులు –శ్రీ సుబ్రహ్మణ్య సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ శ్రీనివాస యజ్ఞ దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది .తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది . .
గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి 1983-88 కాలం లో తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు ..1997 నుంచి తర్క ,వేదాంత శాస్త్రాలలో ప్రొఫెసర్గా ఉన్నారు .
శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లోజగదీశ భట్టా చార్య తర్కామృతం పై ‘’మాణిక్య ప్రభ ‘’రాశారు .1995మాధురీ గాదాధరీ మత భేద విమర్శ రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళువిజయవాడ ఆకాశ వాణి లో తర్క శాస్త్ర వైభవం ,అనిత్యః శబ్దః ,పరమాణు స్వరూపం ,వ్యక్తి వివేక విమర్శనం మున్నగు అంశాలపై ప్రసంగాలు చేశారు .
శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే .కే. డి.లో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు, వక్తలు గాఉండి భాగవత ,రామాయణ ,స్కాంద పురాణా౦ తర్గత కాశీఖండాలపై ప్రవచనం చేశారు .సంప్రదాయ న్యాయ మీమాంస వేదాంత శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .ఈ శాస్త్రాలలో వీరికి గురువులు మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ,పండిత రాజ ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,పండిత రాజ,పద్మభూషణ్ పి .యెన్ .పట్టాభి రామ శాస్త్రి గారు ,న్యాయ వేద వేదాంత విద్వాన్ శ్రీ ధూళి పాళ రామచంద్ర శాస్త్రి గారు ,కవితార్కిక చక్రవర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు .
1670 కాలపు వాడైన నాగేశ భట్టు భట్టోజీ దీక్షితుల భారతీయ పంచాంగం ప్రకారం కాల ,తిధి నిర్ణయం పై ‘’తిధినిర్ణయం ‘’ అనే సంస్కృత శాస్త్ర గ్రంథాన్ని ప్రకాశింప జేశారు .జగదీశ భట్టాచార్యుడి తర్కామృత గ్రంథంపై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’ మాణిక్య ప్రభ సంస్కృత వ్యాఖ్యా విభూషితం’’చేశారు . శాస్త్రిగారి ద్వితీయ పుత్రులు ,పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో తర్క శాస్త్రం లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన శ్రీ జయమాణిక్య శాస్త్రి ‘’మణిప్రభ హిందీ వ్యాఖ్య’’సంవలితం ‘’చేశారు . దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ రచించిన ‘’ఉజ్వలా వ్యాఖ్యానం ‘’ను శాస్త్రి గారు సంపాదకులుగా వెలువరించారు . .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .క్రీ. శ.1600 కాలం వాడైన మధురానాథ తర్క వాగీశుని ‘’మాధురీ ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గాదాధరీ ‘’,13వ శతాబ్దికి చెందిన గంగేశుని ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురీ గాదాధర్యోర్మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ ప్రచురించింది .రామరుద్ర భట్టాచార్యులు రాసిన ‘’ వ్యుత్పత్తి వాద వ్యాఖ్యానాన్ని ’ మద్రాస్ లోని అడయారు లైబ్రరీ నుంచి కంచి కామ కోటి పీఠ ఆస్థాన విద్వాంసులైన మహా మహోపాధ్యాయ శ్రీ ఎస్ .ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రిగారి ద్వారా తెప్పించి ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’ అని ప్రకాశనం చేశారు .. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడ శీతి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని ఉజ్జైన్ లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .
డా.శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు అనేక మంది విద్యార్ధులకు తర్క ,వేదాంత ,మీమాంస శాస్త్రాలను బోధిస్తూ పరిశోధనకు ప్రోత్సహిస్తూ సుమారు 25 మంది చే తర్క వేద వేదాంత శాస్త్రాలలో పి .హెచ్ .డి .సాధించటానికి మార్గ దర్శనం చేశారు .ప్రస్తుతం వీరి మార్గ దర్శనం లో 10 మంది పి .హెచ్. డి.,పి .డి.ఎఫ్ .చేస్తున్నారు . కంచి కామకోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో శాస్త్రిగారు శాస్త్రార్ధం చేసి స్వర్ణపతకం పొందారు .శ్రీ వారి అనుగ్రహం తో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి తర్క శాస్త్రాన్ని వినిపించారు . ఆంధ్ర పీఠమైన పుష్పగిరి శంకరాచార్యులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి ఆదేశం తో వారి ఉత్తరాధికారి ,ప్రస్తుత పీఠాదిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారికి తర్క వేదాంత శాస్త్రాలను కాశీ లో శ్రీ శాస్త్రి గారి ఇంటి వద్దనే శ్రవణం చేయించారు .అనేక మంది పీఠాదిపతుల వద్ద గోలోక౦ ,కాళీ శాంకరి ,బచ్యాఝా ‘’ అద్వైత సిద్ధి ,బ్రహ్మాన౦దీయ క్రోడ పత్ర’’విషయాలపై శాస్త్రార్ధాలు చేసి జగద్గురువుల అనుగ్రహం పొందారు .కంచి ,శృంగేరి, ద్వారక ,పుష్పగిరి ,ఉడిపి పీఠాలలో శాస్త్రార్ధ చర్చ చేసి ‘’శాస్త్ర విద్వన్మణి’’, ‘’న్యాయరత్న ,’’ఆర్షవిద్యా భూషణ’’ బిరుదులను అందుకున్నారు . శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆజ్ఞానుసారం మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ఇంటిలో అంతేవాసిగా ఉండి తర్క వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టారు .
‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .
శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో జత చేశాను చూదాండి
గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-2017 –ఉయ్యూరు
56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)
56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)
జెర్ ట్రూడ్ స్టెయిన్ పై రెండు వర్గాలమధ్య రేగిన విపరీత మైన దుమారం అంతా ఇంతా కాదు .మధ్యే మార్గమే లేదు .ఆమె వ్యతిరేకులు ఆమెనుఒక ఫ్రాడ్ గా ,ఆమె చెప్పిన ఆటోమాటిక్ రైటింగ్ ఒక అవహేళనగా భావించారు .ఆమెది ‘’క్లినికల్ కేస్ ఆఫ్ మేగలోమానియా ‘’అన్నారు .కొద్దిమంది ఆమెను రచయిత్రిగా కంటే ఆమె ఒక ఒకమతం గా ,దేశం లో అత్య౦త విప్లవాత్మక సృజన శీలిగా సాహిత్యం లో శాస్త్రీయ దృక్పధం ఉన్న విద్యార్ధినిగా,ప్రపంచాన్నే మార్చేసిన ఏక వ్యక్తి విప్లవ వనితగా ఆరాధించారు .మిగిలిన చాలా మందికి ఆమె నిరంతర వివాదాస్పద వ్యక్తి .ఎవరేమనుకొన్నా ఆమె తిరుగులేని ఉన్నత స్థాయి మతాధికారి .
3-2-1874 నా అమెరికాలో పెన్సిల్వేనియా లోని అల్లెఘేని లో డేనియల్ ,అమీలియా కేజర్ స్టెయిన్ దంపతులకు జన్మించింది .తండ్రిసంపన్నమైన స్ట్రీట్ రైల్వే వైస్ ప్రెసిడెంట్,నిరంతర సంచారి .పెద్దన్న లియో తో ఆమే వియన్నా ,పారిస్ కాలి ఫోర్నియా లలో బాల్యం గడిపింది . చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు .లైబ్రరీలకు వెళ్లి దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేసింది .తర్వాత స్మోల్లేట్ ,స్కాట్ ,షేక్స్పియర్ ,బన్యన్ ,ఫీల్డింగ్ వర్డ్స్ వర్త్ రచనలతో పాటు ‘’కాంగ్రెషనల్ రికార్డ్స్ ‘’కూడా ఊది పారేసింది .19 వ ఏట రెడ్ క్లిఫ్ లో సైకాలజీ ప్రత్యేకంగా చదివి విలియం జేమ్స్ కు శిష్యురాలైనది .పరీక్ష ముందు రోజు రాత్రి ఒపేరా హౌస్ కు వెళ్లి ,అక్కడి నుంచి అర్ధ రాత్రి లేట్ పార్టీ లో ఉండి ఇంటికి వచ్చింది .పరీక్ష లో సమాధానం పేపర్ పై భాగాన ‘’డియర్ ప్రొఫెసర్ జేమ్స్ నేనుఫిలాసఫీ పేపర్ రాయలేక పోతున్నందుకు మన్నించండి ‘’అని రాసింది .దానికి సమాధానంగా జేమ్స్ ‘’డియర్ మిస్ స్టెయిన్ –నిన్ను పూర్తిగా అర్ధం చేసుకొన్నాను .అప్పుడప్పుడు నేను అలానే చేసేవాడిని .’’అని రాసి ఆమెకు అతి ఎక్కువ మార్కులు వేశాడు .
రెడ్ క్లిఫ్ లో ఉండగానే ఆటోమాటిక్ రీడింగ్ ,రైటింగ్ లో ప్రయోగాలు చేసింది .లియాన్ సాల్మన్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్ధి తోకలిసి సృజన కార్యం అంతశ్చేతన తో కాకుండానే సాధ్యం అని రుజువు చేసి తమ పరిశోధన వివరాలను 1896 లో ‘’నార్మల్ మోటార్ ఆటో మాటిజం’’అనే శీర్షికతో ‘’సైకలాజికల్ రివ్యు ‘’లో ప్రచురించింది . అదే ఆమె మొట్టమొదటి ప్రచురణ వ్యాసం .దీనిపై విస్తృతంగా రాస్తూ ఆ తర్వాత బాగా ప్రసిద్ధి చెందింది .ఆ తర్వాత కాలం లో ‘’ఇందులో మాటలూ వాక్యాలు సరైనవే కాని ఒక దానికొకటి సంబంధం సరిగ్గా లేదు ‘’అని చెప్పు కొన్నది .రెడ్ క్లిఫ్ పరిశోధన జరిగిన 38 ఏళ్ళ తర్వాత ప్రొఫెసర్ బి .ఎఫ్ .స్కిన్నర్ ఆ పత్రాన్ని కనుగొని ‘’హాజ్ గెట్రూడ్ స్టెయిన్ అ సీక్రెట్ ‘’అనే దానిలో ఆమె సైకలాజికల్ రివ్యు లో రాసిన దానిలో అది చాలా పాక్షికంగా ఉన్న పేపర్ మాత్రమే అని రాశాడు .అచేతన స్థితిలో రాసిన రాత అన్నాడు .స్టెయిన్ కూడా ఆ తర్వాత తన స్వీయ చరిత్రలో తన ప్రయోగం విజయవంతం కాలేదని ,ఆటోమాటిక్ రెస్పాన్స్ కు తగిన సరైన సాక్షాలు లేవని రాసింది .’’ఇది ఆటోమేటిక్ అని నేననుకోలేదు ,ఇప్పుడు కూడా అనుకోను .విశ్వ వ్యాప్తంగా ఏ విద్యార్ధి అయినా దీనిపై ఇంకా పరిశోధించి నిగ్గు తేల్చవచ్చు మనిషి మనసులో ఉన్నది ఏదో ,సరైన పదాలతో ఆ భావోద్వేగం రాత వలన బయటికి వస్తుంది ‘’అని చెప్పింది .ఇదంతా భాషా శాస్త్ర వేత్తల దృష్టి ని ఆకర్షించింది . . దీనిని ఆమె గురువు విలియం జేమ్స్ బాగా ప్రోత్సహించాడు .ఆయన రాసిన ‘’సైకాలజీ ‘’గ్రంధం లో ‘’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’అధ్యాయం లో సాహిత్యం లో ఈ కొత్త పదాన్ని సృష్టించి వాడాడు .ఇందులో ప్రతి ఆలోచనా విడి విడిభాగాలుగా బయటికి వస్తుంది .ప్రతివాక్యం ఒక కాల అవధికి సంబంధించింది అవుతుంది .ఇది స్టెయిన్ ను బాగా ఆకర్షించింది .ఇందులో సెన్స్ ఆఫ్ టైం అంటే ఆమెకు బాగా ఇష్టమైంది .
23 వ ఏట ఆమె జాన్స్ హాప్కిన్స్ యూని వర్సిటి లో చేరినాలుగేళ్ళు మెడిసిన్ చదివింది .అన్నిటా బాగా మార్కులు వస్తున్నా ,డిగ్రీ పొందకుండానే మానేసింది .మార్కులకంటే చదువే ముఖ్యంగా భావించింది .లండన్ వెళ్లి జీవిత గమనాన్ని మలుపు తిప్పు కొన్నది .ఎలిజబెతన్ ప్రోజ్ కు అంకితమైంది .20 వశతాబ్ది ప్రారంభం లో పారిస్ మేధావులకు కేంద్ర నిలయ౦ గా ఉండేది . .1903 లో పారిస్ చేరి ,ఆలిస్ బి .టోక్లాస్ అనే సాన్ ఫ్రాన్సిస్కో స్నేహితురాలితో పరిచయం చేసుకొని స్నేహాన్ని జీవితాంతం నిలుపు కొన్నది .ముప్ఫై ఏళ్ళలో ఒక్క సారి మాత్రమే చుట్టపు చూపుగా అమెరికా వెళ్లి వచ్చింది .మిగాతాకాలం అంతా పారిస్ లోనే .సోదరుడు,’’ ది ఎ.బి.సి .ఆఫ్ అద్లేటిక్స్ రచయితా అయిన లియో తో ఉన్నది .వీరి భావాల మధ్య వైరుధ్యం ఉన్నందున తరచూ కీచులాడుకోనేవారు .కొత్త ,అంతగా పేరు లేని పెయి౦టర్స్ నుగుర్తించి చిత్రాలను అతను సేకరించి భద్ర పరిస్తే ,తానే వారిని కనుక్కున్నానని ఆమె పోట్లాడేది .ఆమె రాసే విధానమూ అతనికి నచ్చేదికాదు .ఆమె రాతలో స్పష్టత లేదని ,పునరుక్తులు ఎక్కువని ఈసడించేవాడు .ఆమె పురుష వేషం మాట విధానం అతనికి ఏవగింపు .బిగుతు ,పొట్టి బట్టలను అతడు వద్దనే వాడు .జుట్టు కత్తిరించుకోవటం గిట్టేదికాదు .చురుకైన నళ్ళకళ్ళ చిన్నదిఆమె . పికాసో ఈమె చిత్రాన్ని అర్ధ నిమీలిత ధ్యాన యోగం లో సగం వాదం లో ముందుకు వంగి ప్రత్యర్ధి ని ఉచ్చులో పడేస్తున్నట్లు గొప్పగా చిత్రించాడు .అయితే పికాసో చిత్రించిన దానికి భిన్నంగా ఆమె కవళికలు ఉండేవి .ఆమె ముఖం ఆవేశ పూరితుడైన బుద్ధుని ముఖంలా లేక ఉలెన్ బట్టలలో చుట్టబడిన రోమన్ సెనేటర్ ముఖంలా అనిపించేది .ఆమె డామినేటింగ్ నేచర్ కు కొంపలో ఇద్దరు ఆడ వాళ్ళ మధ్య ఉండటం భరించలేక లియో అక్కడి నుంచి మారి వేరే చోట ఉన్నాడు .స్టెయిన్ అతనికి ‘’prolonged disease ,a kind of mild insanity ‘’తో బాధ పడుతున్నదానిలా అనిపించింది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-3–17 -ఉయ్యూరు
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము .
అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .
సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )
ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )
విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )
మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ పరుచూరి శ్రీ నాథ్ గార్లు సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .
కార్య క్రమ౦
మధ్యాహ్నం -3-30 నుండి 4 వరకు –అల్పాహార విందు
సాయంత్రం -4 గం నుండి -5 గం వరకు –ఉగాది పురస్కార ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం –అతిధుల అభిభాషణం
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
3-నవ భారత సాహితీ రత్న ,సాహితీ విశిష్ట వానమామలై స్మారక పురస్కార ,సోమనాధ కళా పీఠ పురస్కార గ్రహీత -శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్యభరిత గ్రంధ ప్రచురణ కర్త ,విద్వత్ కవి , విమర్శకులు ,బహు(40 కి పైగా ) గ్రంథకర్త విశ్వనాథ వారి క్రష్ణ కావ్యాల పరిశోధకుకులు – డా. శ్రీ రంగ స్వామి (వరంగల్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
సాయంత్రం -5 గం నుండి 6 -30 గం వరకు ‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై ప్రముఖ కవి మిత్రులచే కవి సమ్మేళనం
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె . కనక దుర్గా మహాలక్ష్మి , శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )
. జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 3–3–2017
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఉగాది శుభాకాంక్షలు
నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు
‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు
డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు ) డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట) శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ , శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ ) శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీ సి హెచ్ .భవానీ శంకర రావు ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )
‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ
దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’
( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము .
అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .
సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )
ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )
విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )
మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ పరుచూరి శ్రీ నాథ్ గార్లు సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె . కనక దుర్గా మహాలక్ష్మి , శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )
. పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 1–3–2017
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఉగాది శుభాకాంక్షలు
నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు
‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు
డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )
డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు )
డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట)
శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )
డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా
శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ ,
శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,
శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,కె ఆంజనేయ కుమార్,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ ) శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )
‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ
దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’
( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి
కుటుంబ నేపధ్యం
తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్స్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .
జనన విద్యాభ్యాసాలు వివాహం
గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ 20 15 లో వేదం లో ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం పొందాడు .
శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు ,శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శిష్యులైన డా .ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి గారు వంటి ప్రముఖులున్నారు .వీరితోపాటు శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీ ,శ్రీ కె వి యెన్ అవధాని ,ప్రొఫెసర్ శ్రీ పి కె ముఖోపాధ్యాయ గురు పరంపర వద్ద శాస్త్రి విద్య నేర్చాడు .
గీర్వాణ రచనా సామర్ధ్యం
తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రతిషఖ్యానం –పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా రాశాడు .ఇవిగాక ‘’ప్రాచ్య సాఖ్యాయనం వివరణం’’,,’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమాణిక ‘’ రచించాడు .
పురస్కారాలు
2000 సంవత్సరం లో 15 వ ఏటనే లక్నో లోని ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించింది .ఇందులో రెండేళ్ళు పని చేశాడు .
ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-3-17 -ఉయ్యూరు
ఆంజనేయుడంటే వాళ్లకు కోపం
ఆంజనేయుడంటే వాళ్లకు కోపం
ఇండియాలో ఉత్తరాఖండ్ లోని ద్రోన్ గ్రామం లో భూటియా అనే తెగ వారికి హనుమంతుడు అంటే విపరీతమైన కోపం .దీనికి కారణమూ ఉంది . రామ రావణ యుద్ధం లో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛ పోయాడు .హనుమంతుని సంజీవి మొక్క తెమ్మని పంపితే దాన్ని గుర్తు పట్టలేక ఏకంగా డ్రోన్ గ్రామ లో ఉన్న సంజీవ పర్వతాన్నే పెకలించుకు లంకకు తీసుకొని వెళ్ళాడట .సంజీవ పర్వతం ఆ గ్రామస్తుల ఆరాధ్య దైవమట.అందరి ప్రాణాలను కాపాడే తమ దేవుడైన ఆ కొండను హనుమ ఒంటి చేతితో ఎత్తుకు పోవటం ఈ గ్రామం వారికి ఆయనపై విపరీతమైన ఆగ్రహం కలిగించింది .కొత్త గా ఆ ఊళ్లోకి వచ్చే వారెవరూ ‘’జై బజరంగ భళి ‘’అనటానికి వీల్లేదు .
కొరియన్ల రాణి స్వగ్రామం అయోధ్య
కొరియన్ మహా రాజు కిం సురో కరక్ వంశాన్ని స్థాపించాడు .ఆయన భార్య మహారాణి ‘’హర వాంగ్ ఓక్ ‘’.ఈమెను ‘’సురి రత్న ‘’అంటారు .ఈ రాణి పుట్టిల్లు మన అయోధ్య .ఇక్కడి నుంచే క్రీ శ.48 లో పడవ ద్వారా ఆమె అయోధ్య నుంచి దక్షిణ కొరియా కు వెళ్లి కిం సురో రాజును పెళ్ళాడి ‘’గం వాన్ గయా ‘’రాజ్యాన్ని స్థాపించిందని కొరియన్ల నమ్మకం .పదేళ్ళప్పుడు ఆమెకు వివాహం జరిగింది .పది మంది పిల్లలకు తల్లి అయింది .వీరి ను౦చే కరక్ వంశం ఆవిర్భవించింది .రాణి వాంగ్ ఒక్ 157 ఏళ్ళు జీవి౦చిందట .ఒక రోజు దేవుడు ఆమెకు కలలో కనిపించి ,కొరియాలో భార్య దొరక్క విలపిస్తున్న సురో రాజు ను చేరుకొని పెళ్లి చేసుకోమని చెప్పాడట .దక్షిణ కొరియాలో ఈ తెగవారు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు .కరక్ తెగవారికి అందుకే తమ రాణి పుట్టిన పవిత్రస్థలం అయోధ్య అంటే వాళ్ళకి వల్ల మాలిన అభిమానం .అందుకే ప్రతి ఏటా వందలాది మంది ఆ తెగవారు అయోధ్యకు యాత్రకు వచ్చి వెడుతూ ఉంటారు కొరియాలో రాణి సమాధిని కట్టటానికి రాళ్ళను అయోధ్య నుంచే తీసుకు వెళ్లి నట్లు ఆమె సమాధిపై రాసి ఉంది.దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోది ని వారు అయోధ్యలో తమ రాణి వాంగ్ ఒక్ పేరిట ఆలయాన్ని కట్టమని కోరారు .అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రినీ కోరారు ఇద్దరూ సానుకూలంగా స్పందించారు .త్వరలో రాణి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశిద్దాం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-17 –ఉయ్యూరు
ఆధారం -6-11-16 ఆంద్ర జ్యోతి ఆదివారం స్పెషల్ .
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ఉగాది కవి సమ్మేళనం ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము .
సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాద్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )
ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ )శ్రీమతి కె . లక్ష్మీ కనక దుర్గ (మచిలీపట్నం )
సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 27–2–2017
పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )
పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )
చాలామంది కవులు సందర్భానికి బాగానే స్పందించి తమ శక్తి యుక్తుల్ని కూడా దీసి తమ కిస్టమైనన్ని పద్యాలు రాసి తమదైన బాణీలో కంచు కంఠాలతో దిక్కులు పిక్కటి ల్లేట్లు చదివే ప్రయత్నం చేశారు .కానీ సరైన విధానం అవలంబించక పోవటం వలన ,ఎవరు ఏ రోజు ఏ సమయం లో పద్యాలు చదవాలో ముందే తెలియ జేయక పోవటం వలన మధ్యలో మంత్రులకు స్వాగతాలు వాళ్ళు యదా ప్రకారం ఆలస్యంగా రావటాలు, వాళ్ళకోసం ప్రోగ్రాం కుది౦చటాలతో కవులందరికీ సమానమైన సమయం దక్కలేదు .చాలా నిరుత్సాహ పడ్డారు కూడా .దీనికి తోడు’’మీ కవితలు ఎలాగో పుస్తకం లో ప్రచురిస్తారు కదా ఒక్క పద్యం చదవండి చాలు’’ అని ‘శ్రీ పాలపర్తి వారు పదే పదే అనటం కవులకు బాదే కలిగించింది.’’ అంతకాడికి పద్యాలు మీకే పంపించేవాళ్ళం కదా మళ్ళీ ఈ వేదిక ఎందుకు ?’’అని గొణుగుళ్ళూ వినిపించాయి . మొదటి రోజు సభ ఆలస్యంగా ప్రారంభమవట౦ తో కవులకు సమన్యాయం దక్కలేదు .హడావిడిగా ముక్కు చీదినట్లు చీదేశారుపాపం .ఎక్కడో విశాఖ నుంచి ,కడపనుంచి వచ్చిన వారికి చాలా నిరాశా నిట్టూర్పే మిగిలింది .ఆ రోజు ఉదయం చివరగా చదివిన కవులకు శ్రోతలే లేరు అందరూ’’ ఫుడ్ కోర్ట్ లో బాటింగ్’’లో మునిగి పోయి ఉన్నారు .శ్రోతలు లేనప్పుడు కవులకు స్పూర్తి ఎలా కలుగుతుంది ? ఈ విషయం నిర్వాహకులు ఆలోచించలేక పోయారు .మధ్యాహ్న కవులకూ అదే పరిస్థితి . కవులు కూడా కొత్తదనం కోసం పాకు లాడింది తక్కువే అని పించింది .రొటీన్ రోడ్ద కొట్టుడు కొంత ఇబ్బంది అయింది .చమక్కులు లేవు .ప్రేలుళ్ళు లేవు .హాస్యపు వరద లేదు .చతురతా తక్కువే అనిపించింది . ఎత్తుగడా ,ముగి౦పులలో మెరుపులు లేవు .
రెండవ రోజు డా .శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ప్రసంగం ఆద్యంతం రక్తి కట్టింది .దిశా నిర్దేశామూ చేసింది .ఆయన రాసి చదివిన పద్యాలకూ గొప్ప సార్ధకత కనిపించింది .అవి నాకు బాగా నచ్చి అయన వెంట బడి స్క్రిప్ట్ తీసుకొని కాపీ చేసే దాకా వదలలేదు నేను. ఆయనా నవ్వుతూ నా కోరికను తీర్చారు .మర్నాడు ఆచార్య వర్య ను బెజవాడ మనోరమ హోటల్ వద్ద మేము పోలవరం యాత్ర సందర్భంగా కలువగా వారికినేను రాసిన ‘’కేమటాలజి పిత కొలచల సీతారామయ్య –(పుల్లేరు నుంచి ఓల్గా దాకా )పుస్తకం అందజేస్తే చాలా ఆనందించారు. ఆ చిరునవ్వు మనో ఫలకం పై ముద్ర పడింది . వీరిని మళ్ళీ సాయంత్రం వేదిక నెక్కించి మాట్లాడమనటం ,శ్రీ ఇనాక్ గారినీ ,మళ్ళీ వాయి౦చ మనటం చూసే వాళ్ళకే కాక వారిద్దరికీ కూడా ఇబ్బంది కలిగించినట్లు అనిపించింది .దీన్ని అవాయిడ్ చేసి ఉండాల్సింది .
ఇప్పుడు డా. శ్రీ తిరుమల శ్రీనివాసా చార్య గారి పద్యాలను ఆస్వాదిద్దాం –
1-శ్రీ కృష్ణ దేవరాయల –యాకృతి నామమ్ములందు నద్భుత మేదో
ప్రాకటముగ భాసి౦చును –తాకిన నాముక్త మాల్యదను మన చేతన్ .
2-శబ్ద యోజన చూడ పాషాణ భంగి –కాని పించును రాయల కాయ మట్లు
అర్ధమారసి చూడగా నమృత మట్లు-యెదల నూరించు రాయల హృదయ మట్లు
3- ఆతని కావ్యము చదివిన –చేతస్సున నిండి పోవు చిన్మయ శక్తుల్
ఆతని వీరత గాంచిన –చేతుల చప్పట్లు కొట్టు జేజే లగుచున్ .
4-ఆతడెత్తిన కత్తి కెదురేది బెదురేది –అరి వర్గ మెల్లెడ శిరసు వంచె
ఆతడెక్కిన గుర్ర మడ్డులన్నిటి ద్రొక్కి –పరుగు లెత్తగ గిరుల్ శిరసు వంచె
అతడు పన్నిన వ్యూహ చతురతల్ దిలకించి –పులకించి కోటలు తలలు వంచె
అతడు సల్పిన ధాటి నరి కట్ట లేని తు-ర్కల సైన్య మెల్ల శీర్షమును వంచె
రాత్రి పగలును భయద గర్జనలు సలిపి –యుద్ధ సైన్యాల నెపుడు సముద్ధరించి
గజపతుల నెల్ల నోజంబు ‘’కటక ‘’నూది-దక్షిణావని నేలిన దక్షు డతడు.
5-సంస్కృతాంధ్రములందు సమ కౌశలము దెల్పు –రాయల మీసముల్ రమణ కెక్కె
శైవ వైష్ణవముల సమదృష్టి బ్రకటించు –రాయల మీసముల్ రమణ కెక్కె
శాత్రవ దమనము సత్ఫలనము జాటు –రాయల మీసముల్ రమణ కెక్కె
సతు లిద్దరను భావ సములని సూచించు –రాయల మీసముల్ రమణ కెక్కె
కృతులు రచియించుట –కవి కృతులు గొనుట
భువన విజయమ్ము నందును కవన విజయ మందు సమమని
మెరయించి యంద గించి –కృష్ణ రాయలకు సముల్ కెరలు చుండు.
6-ఒక చేత రాజ్య లక్ష్మికి స్వర్ణ మకుటాన –ముద్దుగా నవ రత్నములను పొదిగి
ఒక చేత రాజ్య లక్ష్మికి స్నిగ్ధ చికురాల –పొలుపుగా అందాల పూలు ముడిచి
ఒక చేత విజయ లక్ష్మికి పాదముల నీడ –పరరాజ శిరముల వంచి నిలిపి
ఒక చేత వర లక్ష్మికి సంతసము గూర్చు – శంఖ భేరీ పృధు స్వనము వినిచి
తుళువ వంశ సంజాత చతుర్భుజుడయి –చతుర మతితోడ సాహితీ సమర రంగ
సార్వ భౌముడై తెలుగుల స్వాంత సీమ –వెలుగు శ్రీ కృష్ణ దేవరాయల నుతింతు .
7-ఖడ్గ మెత్తి నట్టి కఠిన కరమ్మున –కలము నెట్లు పట్టి లలిత రీతి
స్వప్నమందు గన్న జ౦జాక్షు డే నిల్చె-ఖడ్గమందు ,అతని కలము నందు .
8-అంత గొప్ప కావ్య మాముక్త మాల్యద –కృష్ణ దేవ రాయ లెట్లు వ్రాసె
వింత ఏమి ?స్వప్న వేళాగమ౦దైన –ఆంద్ర విష్ణువు మహిమ యని తలంతు.
9-సరిలే రెవ్వరు విష్ణు కావ్య రచనా శైలీ విలాసమ్మునన్ –సరి లేరెవ్వరు ,సౌమ్య రాజ్య జనతా సౌఖ్య ప్రదానమ్మునన్
సరి లేరేవ్వరు ,దివ్య వేంకట గిరీశ స్వర్ణ సంపూజలన్ –సరిలే వెవ్వరు కృష్ణ రాయలకు అస్టైశ్వర్య భోగమ్మునన్ .
ఇలాంటి కలకండ వంటి పద్యాలను ఈ బ్రహ్మోత్సవం లో కవులు రాశారేమో తెలియదు –కారణం అన్నీ వినే అదృష్టం కల్పించక పోవటం ,కొంత మేము అక్కడ లేక పోవటం కూడా .పద్య వరద పారించి కృష్ణా కూలంకష కు వరద తేవాలన్న అందరి సంకల్పం నెరవేర్చే మంచి ప్రయత్నమే ఇది .ఇంకొంచెం వ్యూహ రచన చేసి ఉంటే ఇంకా బాగా రాణించేది . 130 మంది కవులలో తలలు నెరిసిన వారే దాదాపు 120 మంది ఉంటారు .యువతను ప్రోత్సహించాలన్న ధ్యేయం సాధించ లేదు . కాలేజీ స్థాయిలో వారికి వేరే పద్య ప్రయత్నం చేసి ,ప్రోత్సాహకాలు అంద జేస్తే కొంత ప్రయోజనం ఉండేది ..
కవులు కావ్యాలు రాస్తే గొప్ప పారితోషికమిచ్చి వెంటనే ప్రచురిస్తామని ప్రభుత్వం తరఫున భాషా సాంస్కృతిక శాఖ కార్య దర్శి ,మంత్రి గారు ,శ్రీ బుద్ధప్రసాద్ వేదికపై చాలా సార్లు ప్రకటించారు .అది త్వరగా సఫలం అవుతుందని ఆశిద్దాం .కవులు మంచి రచనలు చేసి ,సమర్ధత చాటి ,ముద్రణ భాగ్యం పొందాలని ఆశిద్దాం .ప్రభుత్వాలు ప్రకటించినట్లు పనులు జరగటానికి ఏళ్ళూ పూళ్ళూ పడతాయి .కవులను ప్రభుత్వ౦ తమ కటాక్షం కోసం చాతక పక్షుల్లా వేచి చూడనీయకుండా ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకొని అన్నమాట నిలబెట్టుకోవాలి .పైరవీలు ,పక్షపాతాలకు తావు లేకుండా సంర్ధతకు ,ప్రతిభకు విలువ నిచ్చి ప్రోత్సహించాలి .అప్పుడే పద్య కవితా బ్రహ్మోత్సవ కల సాకారమై అందరికి విస్తృత ప్రయోజనం లభిస్తుంది .యువత పోటీ పడి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి .తెలుగు దేశం లో అందర౦ కలిసికట్టుగా వారసత్వంగా వచ్చిన పద్యానికి పట్టాభి షేకం చేసే ప్రయత్నం చేసి తెలుగు తళ్లి ఋణం తీర్చుకుందాం .
ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-17 –ఉయ్యూరు
22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు
ది 22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు
విజయవాడ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్క్రతిక శాఖ వారు నిర్వహించిన సభలో సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, కార్యదర్శి శివలక్ష్మిలను రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాధ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు సన్మానించారు.
వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )
వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం బైరాగి వరకు 33 మంది పై వరద కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు ప్రవర్తనల తీరుకు పరిశీలించి ఆత్మీయంగా రాసిన విశేషాలివి .వారి తరం వాటి ఊపిరి చప్పుళ్ళు వినిపించాడు వరద .రచయిత రచనా సామర్ధ్యం ,ప్రేరణ వెనుక ఉన్న వైయక్తిక జీవిత నేపధ్య విలువ తెలిపాడు .ఆయన చెపితేనే మనకు మారేపల్లి ,బొడ్డు ,ముద్దు కృష్ణ ,పురిపండా ,మాచిరాజు ,తురగా ,నలినీకుమార్ లగురించి పూర్తిగా తెలిసింది .వారి అనుభవాలు ‘’స్వ ఘోషలు ‘’కావు .వారి స్థాన నిర్ణయాల కు ఆకరాలు(రిఫరెన్స్ లు ) .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఆకాడెమీ ఆవిర్భావానికి పూర్వ రంగం ,అ.ర స .ఆవిర్భావ నేపధ్యం ,విలువైన డాక్యు మెంట్లు అన్నాడు శ్రీకాంత శర్మ .అంతకు మించి వరద ‘’కదన శైలి ‘’మరో ఎత్తు .కబుర్లు చెప్పినట్లు రాయటం చదివే ధోరణి పెంచేందుకు బాగా తోడ్పడింది .పాఠకుడిని మార్చే నైపుణ్యం ఉంది ఇందులో .పది పరిశోధన గ్రంధాలు ఇవ్వలేని సారాన్ని అయిదారు పేజీలలో తేల్చాడు వరద .అయన రుచి భేదం మనకు నచ్చకపోవచ్చు కాని అభిరుచిని కాదనలేం .అన్నాడు శర్మ .
‘’ఉన్మత్త భావ శాలుర జఠరాగ్నిని ని కవన కుతూహలం ఎట్టకేలకు చల్లార్చింది ‘’అన్నాడు అంబటి సురేంద్ర రాజు .కవుల వ్యక్తిగత జీవితం లోని ఔన్నత్య,సత్య సంధత,ఆదర్శం ,నిర్భీతి ,వ్యక్తిత్వం విలువలకోసం తపన మనముందుంచి కళ్ళు తెరిపించాడు వరద అన్నాడు రాజు రాజా లాంటి మాట .ఇది అసంపూర్తి గానే ఉంది .అప్పుడే అయిపోయిందా అనే ఉత్కంఠ మిగిల్చాడు .అన్ని వ్యాసాలూ ‘’జీవన శకలాలే ‘’.రెప్పపాటుకాలం లో గొప్ప కాంతి ప్రజ్వరిల్ల జేశాయి .శైలీ విన్యాసమే దీనికి గొప్పకారణం .పాఠకుడిని ‘’నిర్నిమేషుడిని ‘’చేసింది .బెల్లం కొండ ‘’త్రిపుట ‘’,తాగు బోతూ చెల్లెలా ‘’పాప’’ యెర్ర జీర ‘’రాయప్రోలు రాజశేఖర్ ‘’నివాళి ‘’’’శిష్ట్లా జ్ఞాపకాలు ‘’ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి ధన్యవాదాలు చెప్పాడు రాజు .’’సాహిత్య శిరో వేదన తో బాధ పడుతున్న ‘’సమకాలీన కవితా బాధితులకు ‘’కవన కుతూహలం ‘’ఒక ఉప శాంతి ‘’అన్నాడు అజంతా .అంతే కాదు ‘’సైద్ధాంతిక శిరో ముండనానికి ఇది విరుగుడు కూడా ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సురేంద్ర రాజు .
‘’నారాయణ బాబు వట్టి అమాయకుడు అనుకొనే వాడిని ‘’అన్న వరద మాటల్లో బాబు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అన్న భావం ఉంది ‘’అన్నాడు ఏ బి కె .శ్రీ శ్రీ కవిత్వం మీదే సదభిప్రాయం లేని వరద, బాబు గురించి ఇంతకంటే ఏమంటాడు అన్నాడు ప్రసాద్ .’’ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం –ఒక రమ్యా లోకం ‘’అన్నది ఎందరికో నచ్చినమాట అంటాడు ‘’ఆర్ ‘’.ఆనాటి నవ్య కవులు 1920 లోపు కంటే 19 21-30 మధ్యనే గొప్పకవిత్వం అంతా రాశేశారు .కనుక 1910-1930 కాలం స్వర్ణయుగం అనాలి అని సవరణ చేశాడు ఆర్ .వరద కవన కుతూహలం చూస్తే ,చదివితే ఆనాటి సాహిత్య వాతావరణం మళ్ళీ వస్తే బాగుండును అనే ‘’నాస్టా ల్జియా ‘’కలుగుతుందన్నాడు ఆర్ .ఈ స్కెచెస్ కవుల జీవిత చరిత్రలుకావు తనజ్ఞాపకాల కధనం .విభిన్న వ్యక్తిత్వాల సజీవ సందర్శనం .శేషేంద్ర శర్మ కూడా పద్యాన్ని వరదలానే నెత్తికి ఎత్తు కోన్నవాడే తర్వాత వచనకవితలో పండిపోయాడు .
‘’ముద్దుకృష్ణ రాస్తాను అన్నాడు రాయలేదు.ఇది ముద్దు కృష్ణ రాయాల్సిన పుస్తకం అని వరద అనటం ఆయన మర్యాద ..రావి శాస్త్రి కూడా ప్రేరకుడు .ఈ వ్యాసాలూ హోమియోపతి మందులాగా ‘’విగరు, పొగరు ,పోటేన్సి ‘’కలిగి ఉన్నాయి అన్నాడు పురాణం .వరదను జీనియస్ అని రావి శాస్త్రి ఎప్పుడూ చెప్పేవాడని చందు సుబ్బారావు జ్ఞాపకం చేశాడు .
ఇంతటి కుతూహలం పుట్టించింది వరద ‘’క’వన కుతూహలం ‘’
మహా శివరాత్రి శుభా కా౦క్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
66 –స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి
తూర్పు గోదావరిజిల్లా ఏనుగల మహల్ లో శ్రీ రాణీ సదాశివ మూర్తి జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతం చదివి ఎం ఏ .పొందారు .’’వైదిక ఛందస్సు ‘’పై పరిశోధన చేసి పి హెచ్ డి అందుకొన్నారు . వీరి డిగ్రీలను చూస్తె దిమ్మ తిరిగి పోతుంది .సంస్కృత, ఇంగ్లీష్లలో ఎం ఏ ., వేదాంతవిద్యా ప్రవీణ ,జ్యోతిష ఆచార్య .పొయేటిక్స్ ,వేదిక్ ప్రాసడి,తంత్ర సంస్కృత సైన్స్ లలో పట్టభద్రులు.ఎం బి ఏ కూడా చేశారు . సంస్క్రుతాధ్యాపకులుగా చేరి పని చేశారు .2000 సంవత్సరం లో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం సంస్కృత ఆచార్యులు గా లో చేరి పని చేస్తున్నారు .శ్రీ సదాశివ మూర్తి గారు ఇప్పటిదాకా 40 కి పైగా గ్రంధాలు రాశారు .ప్రాచీన గ్రంధాలలోని అనేకానేకమైన వైజ్ఞానిక విశేషాలను ఎన్నో వ్యాసాల ద్వారా తెలియ జేశారు. దేశ విదేశాలలో జరిగిన 80 కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన పరిశోధనా పత్రాలను సమర్పించారు .15 కు పైగా సదస్సులకు తామే నేతృత్వం వహించారు .ఆయన ప్రచురించిన పరిశోధనా వ్యాసాల సంఖ్య 50 కి పైమాటే .రాష్ట్రీయ విద్యా పీఠం కు శ్రీ సదా శివ మూర్తి చేసిన కృషికి గుర్తి౦పుగా 2007 లో ‘’వ్యాసభారతి ‘’జాతీయ పురస్కారాన్ని,ప్రజ్ఞా భాస్కర బిరుదు అందుకున్నారు
నాట్యం లో మంచి ప్రావీణ్యం ఉన్నవీరిని .నాట్య రవళి వంటి పలుసంస్థలు సత్కరించాయి . సంస్కృత నృత్య నాటికలు రచించారు . నాటకాలు రాశారు ..అనేక అరుదైన గ్రంధాలకు సంపాదకత్వం వహించారు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన సాహిత్య అకాడెమి ఇటీవలే పురస్కారం అందించింది .ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన ద్విశతావదాని , బహు గ్రంధ కర్త స్వర్గీయ డా .రాళ్ళ బండి కవితా ప్రసాద్ రచించిన ‘’ఒంటరి పూల బుట్ట ‘’కవితా సంకలనాన్ని శ్రీ రాణీ సదాశివ మూర్తి సంస్కృతం లోకి అనువదించారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి 50 వేల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది . ఈ పురస్కారాన్ని,తామ్ర పత్రాన్ని త్వరలో ఢిల్లీ లో జరిగే ప్రత్త్యేక కార్యక్రమం లో సదాశివ మూర్తి గారికి అందించి సత్కరిస్తారు .’’ఇంతటి గుర్తింపు ,గౌరవం దక్కటం జీవితం లో మరిచి పోలేను .ఇన్నాళ్ళు గా నేను సాగించిన సాహిత్య కృషి ఫలించింది అని భావిస్తాను ‘’అని శ్రీ రాణీ సదాశివ మూర్తి అత్యంత వినయంగా చెప్పారు .
‘’హిడింబ భీమ సేనం ‘’అనే సంస్కృత ఫీచర్ ఫిలిం కు ప్రొఫెసర్ సదాశివ మూర్తి దర్శకత్వం వహించారు .’’ఎలెక్ట్రానిక్ సెర్చ్ ఆఫ్ మహా భారత ‘’అనే వీరి పరిశోధన చాలా విపులం మూలాలకు అత్యంత సమీపం గా ఉన్నది అందులో 18 విషయాలపై పరిశోధన ఉన్నది .అవి –పర్వ ,ఉపాఖ్యాన ,అధ్యాయ,శ్లోక పరిశోధన ,సారాంశ ,చిత్ర ప్రదర్శన ,అస్త్ర ,యుద్ధ వ్యూహ మొదలైన వాటిపై విపుల పరిశోధన ఇది .అంతేకాదు హరివంశం తో కూడా కలిసిఉన్న 1 లక్షా పది వేల శ్లోకాల మహా భారత౦ పై మహా పరిశోధన ఇది.ఇందులో వారి కుశాగ్రబుద్ది’’ రాణీ ‘’గా రాజ్య మేలింది.దీనికి ప్రొఫెసర్ శ్రీపాద శ్రీ పాద సత్యనారాయణ మూర్తి ప్రిన్సిపల్ ఇన్వెస్టి గేటర్ అయితే ,ఆచార్య సదాశివ మూర్తి కొ ఆర్డినేటర్ .ఒకే ఒక్క ఏడాదిలో ఈ బృహత్ పరిశోధన పూర్తీ చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది .
సంస్కృతం లోనే కాక పాశ్చాత్య భాషా విమర్శన లోనూ నిపుణులు .
జాతీయ స్థాయిలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు వ్యాఖ్యాతగా గొప్ప ప్రసిద్ధి పొందారు .
ఆధారం -23-2-17 ఆంద్ర జ్యోతి
సశేషం
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు
పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు
పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు_
పద్యం అవుట్ డేటెడ్ దానికి మనుగడ లేదు అనే అభిప్రాయాన్ని మార్చాలన్న ఆలోచనతో ,పద్యానికి పునర్ వైభవం కల్పించాలన్న సదుద్దేశ్యం తో ,యువకులలో పద్యం పై మక్కువ కలిగించాలన్న ధ్యేయం తో ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ,దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యం లో ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి పూనిక ,ప్రేరణతో ,ఆంధ్రుల తొలి రాజధాని ,తెలుగు భాషకు మాత్రమే ఉన్నఒకే ఒక దేవుడైన ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం లో తెలుగు భాషా సంస్కృతులకు ఇతోధికంగా తోడ్పడిన ఆముక్త మాల్యద రచనకు స్వీకారం చుట్టిన ఆంద్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వ భౌముడైన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ సమక్షం లో ఫిబ్రవరి 18 19 శని ఆదివారాలలో శ్రీ కృష్ణ దేవరాయ మహోత్సవం లో భాగం గా రెండు రోజుల’’ తెలుగు కవితా బ్రహ్మోత్సవాలు’’ జరిగాయి . పద్యం హోరులో స్తబ్దత దూరానికేక్కడికో కొట్టుకు పోయింది .పిలిస్తే పద్యం, పలకరిస్తే పద్యం గా సాగింది .రెండు రోజుల్లోనూ కనీసం 130 మంది లబ్ధ ప్రతిష్టు లైన కవులు నవ్యాంధ్ర లో ఉన్న 13 జిల్లాల నుండి వచ్చిపాల్గొన్నారు అంటే దీని విజయానికి అంతకంటే నిదర్శనం ఏమి కావాలి ?ఈ మొత్తం కార్యక్రమానికి సమన్వయ కర్తగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాజి వి పూర్ణ చంద్ వ్యవహరించి సర్వ సమర్ధతతో నిర్వహించారు .దీనికి సాంస్కృతిక శాఖ కార్య దర్శి ప్రముఖ రచయిత శ్రీ డి.విజయభాస్కర్ తోడ్పాటు మిక్కిలి శ్లాఘనీయం .
మొదటి రోజు 18 వ తేదీ శనివారం ఉదయం శ్రీ విజయభాస్కర్ ఆహ్వానం ,సమన్వయము తో సభ జరిగింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ప్రారంభోపన్యాసం అందరినీ ఆకర్షించింది శ్రీకాకుళం ప్రాశస్త్యాన్ని ,పద్య వైభవం ఆవశ్యకతను చక్కగా వివరించారు ,ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప్ప సభా ప్రారంభం చేశారు .జ్ఞానపీఠ మూర్తి దేవి పురస్కార గ్రహీత ఆచార్య శ్రీ కొలకలూరి ఇనాక్ గారికి మంత్రి గారి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది .ఆత్మ కూరి మొల్ల రాసిన రామాయణం కు శ్రీ మున్నెల్లి శివ శంకరయ్య ,శ్రీమతి దగ్గుపాటి శ్రీదేవి రచించిన వ్యాఖ్యానం ను శ్రీ ఐలాపురం వెంకయ్య ఆవిష్కరించారు .శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఉత్సవ విశేషాలను వివరించారు .పద్య కవితగా కావ్యమో నాటకమో ,ప్రబంధమో రాసిన కవులకు గోప్పపారితోశికం తోపాటు ప్రభుత్వమే ప్రచురణ బాధ్యతా చేబడు తుంది అని అందరూ ప్రకటించటం కవులకు గొప్ప ఊరట ప్రేరణ ,స్పూర్తి గా ఉంది.
తరువాత అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ ఆధ్వర్యం లో 40 మంది కవులు తాము రచించిన పద్యాలను గానం చేసి మెప్పించారు .భోజన విరామం తరువాత మరో 30 మందికవుల పద్య గానం జరిగి .అందరినీ అలరించింది .కవులందరికీ శాలువాలతో శ్రీ బుద్ధప్ర సాద్,శ్రీ విజయ భాస్కర్ లు సత్కరించి ఆంద్ర మహా విష్ణువు జ్ఞాపికను ‘’కృష్ణా తీరం ‘’బృహత్ గ్రంధాన్ని కానుకగా అంద జేశారు . సాయంత్రం కళారత్న ,నాట్యా చర్య శ్రీ కె వి సత్యనారాయణ బృందం ‘’శ్రీ కృష్ణ దేవరాయ గోసంగి ‘’కూచి పూడి నృత్య రూపకం ప్రదర్శించారు .విద్యార్ధినీ విద్యార్ధులు స్థానికులు ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేశారు .డప్పు కోలాటం రంగ వల్లి ప్రదర్శన ఆకర్షనీయం గా ఉన్నాయి .దేవాలయం లో గోదాదేవి మూర్తి ఉండాలన్నఒక కవి సూచనను అందరూ సమర్ధించారు .నన్ను పద్యం రాయమని శ్రీ పూర్ణ చంద్ ప్రోత్సహించాగా 5 ఆటవెలదులతో సయ్యాట లాడి శ్రీ రామ లక్ష్మణాచార్యులగారిచే పరిష్కరింప జేసి ‘’ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట ‘’శీర్షిక గా చదివి ఒకప్పుడు శ్రీకుళానికి ప్రసిద్ధి తెచ్చిన ఆటవెలదులు అంటే దేవ దాసీలకు పద్య పంచ రత్నాలను అంకితం చేస్తున్నట్లు ప్రకటించాను .బహుశా వారిని ‘’వాడు కున్న వారే ‘’కాని వారికి అంకిత మిచ్చిన వారెవ్వరూ ఉండి ఉండరు .నేనే ‘’ఆ పని ‘’అంటే అంకితం చేశాను .
19- వ తేదీ రెండవ నాటి కార్యక్రమం లో శ్రీ తిరుమల శ్రీని వాసా చార్య ప్రసంగం ఆసాంతం ఆహ్లాదంగా విషయ వివరణ పరంగా రాయల మహత్తర శక్తి కి దర్పణం గా సాగింది. వారి పద్యాలు చాలా రస స్పూర్తిగా ఉన్నాయి .60 మందికవులు పద్య కవితలు వినిపించి సత్కారం అందుకున్నారు .భోజనానతరం మంత్రులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి శ్రీ పైడి కొండల మాణిక్యాల రావు పాల్గొని దిశా నిర్దేశం చేశారు .శ్రీగుమ్మడి గోపాలకృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామిగార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .శ్రీ ఉమా గారి ప్రేరణతో నే మర్నాడు 20 వ తేది సోమవారం కవులందరం పోలవరం టూర్ చేశాం .సాయంత్రం 4 గం లకు శ్రీమతి పుల్లా భొట్ల శాంతి స్వరూప్ ,శ్రీతాతా సంజీవ శర్మ లు యువ జంట అష్టావధానం నిర్వహించారు .ఆశువు స్థానం లో నేను ‘’104 ఉపగ్రహాల ను ప్రయోగించిన రాకెట్టు ,దాన్ని నిర్మించి ప్రయోగించిన శాస్త్ర సాంకేతిక నిపుణులపై ‘’రాకెట్ వేగం తో నడిచే పద్యం చెప్పమని అడిగితే ద్విపదలో చెప్పారు .పంచచామరం లో చెబితే అదిరేది .మరోఆశువుగా ఈ పద్య బ్రహోత్సవాలను తిరుమల వేంకటేశ్వరుడు తన బ్రహోత్సవాలతో పోల్చుకొని ఎలా ఆనంది౦ చాడో చెప్పమని అడిగాను. మంచి పద్యమే చెప్పారు .ఈ అవధానం లో ఘంటా నాదం చాలా ప్రత్యేకంగా ఉంది .ఒక పృచ్చకుడు సుమారు 10 అక్షరాల వాక్యం ఇస్తే ఒక అవధాని దాన్ని పళ్ళెం మీద గరిటె తో కొడితే దాన్ని విని మరో అవధాని ఆ మాటలను తెలియ జేయాలి .బాగా చేశారు ఇద్దరూ. అప్రస్తుతం కొంచెం డోసు మించినా బాగుంది .మంచి అవధానం చూశామన్న సంతృప్తి అందరికి కలిగింది . శ్రీ మీగడ రామస్వామిగారి ప్రత్యేక రాగాలతో చేసిన పద్యగానం గొప్ప ఆకర్షణ .ఈ రెండు అవధానాలతో ‘’పద్యకవితా బ్రహ్మోత్సవం’’ ,’’పద్య కవితా మహా బ్రహ్మోత్సవం’’గా మారి మహాద్భుతమైన విజయాన్ని చేకూర్చింది .పూర్వ కవుల ముఖ్యమైన పద్యాలను సేకరించి మీగడ రామస్వామి వంటి గాయకులతో స్వర రాగ యుక్తంగా గానం చేయించి సి డి.లుగా తెచ్చి భవిషత్ తరాలకు భద్రపరచాలన్న సూచన అందరికి ఆమోద యోగ్యమైంది .అమలు జరగాలని ఆశిద్దాం దివి సీమ ముడుబిడ్డ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి వేటూరి రాసిన దివిసీమ జాతీయ గీతాన్ని గానం చేసి సి డి విడుదల చేయించారు భగవద్గీతా గానమూ చేశారు. చివరగా కుమారి అంబిక నృత్య ప్రదర్శన తో కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి . కొస మెరుపు –మొదటి రోజు కాఫీ టిఫిన్లు బాగానే ఉన్నాయి మధ్యలో మజ్జిగా ఇచ్చారు .సాయంత్రం వేదికపై ఉన్న అతిదులకే కాని కవులకు కనీసం టీ కూడా ఇవ్వలేదు .బిస్కట్లూ లేవు .ఉదయం కాఫీ కూడా కొద్దిమందికే అందాయి .రెండవ రోజు ధద్ధ్యోజనం ,పులిహారే టిఫిన్లు బాగా లేవు .శ్రీకాకుళం అంటే చక్ర పొంగలికి ప్రసిద్ధి .దాని రుచికాదు కదా వాసన కూడా తగల క పోవటం పెద్ద లోపం . కాఫీ అసలు లేదు .కాఫీ గత ప్రాణులు చాలా ఇబ్బంది పడ్డారు .మధ్యాహ్నం భోజనం స్వీటు హాట్ తో బాగానే ఉంది .ఆ తర్వాత కవులను పట్టించుకున్న నాధుడు లేడు.ఎండ వేడిభరించలేనిది .మజ్జిగ ఇస్తే ముసలి ప్రాణాలకు ఊరటగా ఉండేది .సాయంత్రం టీ కాని ,స్నాక్స్ కాని’’ గెస్ట్ ఆఫ్ ఆనర్’’ లకు తప్ప ఎవరికీ లేవు .ఇలా ఏ సాహితీ సభలోనూ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు .కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే జాతీయ ,అంతర్జాతీయ సభలలో ఎవరికీ ఏ లోటూ ఉండేదికాదు .ఇలా ఇక్కడ జరుగ కుండా ఉండాల్సింది .ఇవి చంద్రునిలో చిరుమచ్చలే.చంద్రుని ఆహ్లాద వెన్నెల ముందు ఇవి లెక్కలోకి రావు .
ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-17 –ఉయ్యూరు
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు
అనుకొన్నవన్నీ కావు .అనుకోకుండా నిమిషాలపై నిర్ణయం తీసుకొన్నవి ఒక్కోసారి అద్వితీయ విజయాలను ఇస్తాయి .అలాంటిదే మా పోలవరం టూర్ .ప్రకటించిన పది నిమిషాలకే శ్రీ పూర్ణ చంద్ గారు టూర్ కు వచ్చే వారి పేర్లు సేకరించటం ,మర్నాడు ఉదయమే ఏర్పాటు అవటం ,మేము ఉయ్యూరునుంచి ఆరుగురం పాల్గోవటం అంతా చక చకా జరిగి పోయాయి .ఇంకా ఎవరైనా వస్తారేమో నని పూర్ణ చంద్ గారు తెలిసిన వారందరికీ బస్ బయల్దేరే దాకా ఫోన్ మీద ఫోన్ చేయటం నాకు తెలుసు .ఏదో ఒక కారణం చెప్పి రాలేమన్నవారే ఎక్కువ .అనుకున్నాం కనుక పాతికమందైనా వెళ్ళాలి అనుకోని బయల్దేరాం .రాలేని వాళ్ళు ఫేస్ బుక్ లో మాతో ఆనందం పంచుకొన్నవారే అధికం .ఒకరిద్దరు అసహనం చూపారు .
నాకు తెలిసినంతవరకూ కేరళ ప్రజా కవి అచ్చప్పన్ జయంతిని ప్రతి ఏటా ఫిబ్రవరిలోవారం రోజులు ఘనంగా జరుపుతారు .దేశ విదేశాలనుండి దేశం లోప్రతి మూల నుండీ కవులు రచయితలూ పాల్గొని అనుభూతి పొందుతారు .అలాగే రెండేళ్ళ క్రితం అచ్చప్పన్ జయంతి సభలకు వెళ్లాలని ఒక ఆలోచన వచ్చింది .కాని ఈ నాటి వరకు అమలు కాలేదు .ఇప్పటికైనా ఏదైనా ఉత్సాహం ఉరకలు వేసే సాహితీ సంస్థ ఆ టూర్ ను ఏర్పాటు చేస్తే నేను కూడా రావటానికి సిద్ధమే .పూను స్పర్ధలు విద్యలందే కాదు కృషిలో ,సేవలో కూడా ఉండాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది .నిన్ననే నేను రాసినట్లు మేమెవరమూ గవర్నమెంట్ బాండ్ వాగన్ గాళ్ళం కాదు .మంచిని మెచ్చేవాళ్ళం సమర్ది౦చే వాళ్ళం మాత్రమే.అత్యాధునిక టెక్నాలజీ కొద్దోగొప్పో తెలిసినవాళ్ళం .ఆ రంగం లో అభి వృద్ధిని ప్రోత్సహించేవాళ్ళం .మా టూర్ బాచ్ లో బి టెక్ విద్యార్ధిని కుమారు బిందు తోపాటు ,యువ కవులు పత్రికా రచయితలూ నా బోటి ముసలివారు ,మహిళలూ ఉన్నారు కనుక ఒక చక్కని బాలన్స్ ఉన్న టూర్ .
ఆధునిక టెక్నాలజీ అందుకొని బస్ బయల్దేరాక అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకొంటూ అప్పటి కప్పుడు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయించిన బిందు ,శ్రీ చలపాక అభినందనీయులు .అలాగే తిరిగి వచ్చేటప్పుడూ మా అనుభవాలను చెప్పించి ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రాం గా వాళ్ళిద్దరూ నిర్వహించి ఈ టూర్ కు ఒక అత్యంత ఘనతను చేకూర్చారు ఇది టేక్నాలజి విజయం .వందలాదిమంది చూసి అభినందించారు అందరినీ .పట్టిసీమ ,పోలవరం పనులు అత్యంత ఆధునిక టెక్నాలజీ తో చేస్తున్నారు .దాన్ని తెలుసుకోవటానికే మేము వెళ్లి , మా టెక్నాలజీ తో లోకానికి ఆన్ ది స్పాట్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చాం .ఇదో మైలురాయి .
అయితే మాకు కనిపించిన కొన్ని లోపాలు మంత్రి శ్రీ ఉమా గారికి ప్రయాణం లోనే చెప్పేశాం .అవి పట్టి సీమ ,పోలవరం లలో అక్కడి పనుల విషయమై వివరించే బ్రోచర్లు లేవు .అడిగితె ఇంగ్లీష్ లో ఉన్న ఒక్కటి మాత్రమె పూర్ణ చంద్ గారికి ఇచ్చారు .సందర్శకులకు బ్రోచర్స్ చేతికిస్తే అక్కడి నిర్మాణపు పనుల వైశిష్ట్యం తెలుస్తుంది .అలాగే పోలవరం లోనూ అంతే.వీడియో లద్వారా జరిగిన, జరుగుతున్న, జరుగ బోయే పనులను ,ప్రొజెక్టర్ లద్వారా చూపిస్తే మరీ హృదయానికి తాకి మురిసి పోతారు .ఆ ఏర్పాటు ఇక నుంచైనా అక్కడ జరగాలి .తిరిగి వచ్చాక శ్రీ ఉమా గారు ఏర్పాటు చేసిన సభలో బ్రోచర్లు లేవని మేము చెబితే ,పట్టిసీమ పై తమ ఆఫీసులో ఉన్న చిన్న చిన్న హాండ్ బుక్ లను అంద జేశారు .అది సర్వ సమగ్రంగా ఉంది .కాని పోలవరం పై సమగ్రమైన బుక్లెట్ రావాలి. హా౦డీగా,పూర్తి వివరాలతో ఇలాగే తెలుగులో రూపొందింఛి అందించాలి . . ఇవి చెప్పాల్సిన బాధ్యతా మాది .మొహమాటం లేకుండా మంత్రిగారికే తెలియ జేశాం సభా ముఖంగా .అయన సంతోష పడి, తమ దగ్గర మెకంజీ మాన్యువల్ ఉందని ,దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే వెంటనే ప్రచురిస్తామని చెప్పారు .పూర్ణ చంద్ గారు తప్పక అనువాదం అతి త్వరలో అంద జేస్తామన్నారు .ఇది కూడా చాలా సమగ్రమైన పుస్తకం అవుతుంది .అభి వృద్ధి విషయం లో మెకంజీ ఆలోచనలు అందరికి తెలుస్తాయి . మరొక్క సారి నాతో ఈ పర్యటనలో పాల్గోన్నవారికీ ,ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అధికారులకూమా పూర్ణ చంద్ గారికీ అందరికీ కృతజ్ఞతలు .ఇది వినోద యాత్ర కాదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞాన యాత్ర .ఫలప్రద యాత్ర .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-17 –ఉయ్యూరు
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )
పట్టి సీమ ఎత్తి పోతల పధకం
‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’కాదు ,’’జలధనమేరా అన్నిటికి మూలం –ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ‘’అన్నది సూక్తి కావాలి .’’జలసిరి ఉంటేనే సర్వ సిరుల సమాహారం లభిస్తుంది . జీవాధారం, జీవనాధారం అయిన నీరు అతి పవిత్రం . దాన్ని సేకరించి నిల్వ చేసుకోవాలి .లేకుంటే ప్రగతి అధోగతి పాలౌతుంది .
ఇటీవలకాలం లో కృష్ణ గుంటూరు సీమలలో కృష్ణ నదీ జలాలు అందక ‘’క్రాప్ హాలిడే ‘’ప్రకటించబడి అన్నపూర్ణ అయిన ఈ రెండు జిల్లాల పరిస్థితి దారుణమై రైతుల పాలిటి హృదయ శల్యమై బాధిస్తోంది .దీని నుంచి రైతులకు విముక్తి కలిగించకపోతే ఆంద్ర దేశానికి మనుగడ ఉండదు .ఈ విషయాన్ని కనిపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,పోలవరం వచ్చేదాకా ఆగకుండా ,సాగు తాగు నీరు అందించే పధకం గా లిఫ్ట్ ఇర్రిగేషన్ ద్వారా గోదావరి నీళ్ళను కృష్ణ లో బెజవాడ అవతల ఇబ్రహీం పట్నం దగ్గరున్న ఫెర్రీ లో సంగమించే పధకం ఆలోచించి అత్యంత వేగంగా అమలు జరిపి అందరినీ ఆడుకున్నారు .దీనివలన గోదావరి జిల్లాకు ఏ రకమైన నష్టం ఉండదు కారణం గోదావరి వరద జలాలను మాత్రమే పట్టిస గ్రామం వద్ద నిర్మించిన 24 మోటార్ల నిలువు మోటార్లతో తోడి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరేట్లు చేయటం సాహసం అద్భుతం .పోలవరం నిర్మాణానికి మనపైనున్న రాష్ట్రాల అభ్యంతరాలు నిదుల కొరత ,కేంద్ర సాయం అంత త్వరగా పరిష్కారం అయ్యే వికావు కనుక అంతదాకా అన్నదాతలను పస్తుపడుకో బెట్టటం ఇష్టం లేక పట్టుబట్టి చేబట్టిన దీపట్టిసీమ ఎత్తి పోతలపధకం .
పట్టిసీమకు ఒక ప్రత్యేకత ఉంది ద్రాక్షారామం లోదక్ష ప్రజాపతి అల్లుడైన శివుని ఆహ్వానించకుండా యజ్ఞం చేసి ,పిలువని పేరంటంగా వచ్చిన స్వంత కూతురు సతీ దేవిని అవమానిస్తే ,ఆమె అక్కడే యోగాగ్నిలో దగ్ధమైతే ,శివునికి తెలిసి జటాజూటం నుంచి వీర భద్రుని సృష్టించి దక్షాధ్వర విధ్వంసం చేయించాడు .హాజరైన దేవతలందరికీ తగిన శాస్తి చేసి తన’’ పట్టిస ‘’అనే ఆయుధం తో దక్షాదులను సంహరించి ,ఆ పట్టిస ను గోదావరి నీటిలో కడిగిన ప్రదేశమే పట్టిస .అదే పట్టి సీమ .గోదారి మధ్యలో శ్రీ వీర భద్రేశ్వరాలయం చిన్న గుట్ట మీద ఉంటుంది .బోటులలో వెళ్లి దర్శించాలి .శివరాత్రికి ఇక్కడికి వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకొంటారు .అంతటి పురాణ ప్రసిద్ధ ప్రదేశం పట్టిస .అక్కడే మన ఎత్తి పోతలపధకం ఉన్నది .అదిఅప్పుడు ‘’వీర భద్ర విజయం’’ అయితే ఇప్పుడిది’’ చంద్ర బాబు విజయం ‘’..
పోలవరం పనులు యదా ప్రకారం జరుపుతూనే దీనికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు .పట్టిస గ్రామం పోలవరానికి అతి దగ్గరలో ఉండటం కుడికాల్వ సమీపం లో ఉండటం దీన్ని ఎంచుకోవటానికి ముఖ్య కారణాలయ్యాయి .వరదకాలం లో సుమారు 80 టి ఎం సి లనీటిని ఎత్తిపోస్తారు .24 మోటార్లు అంటే వర్టికల్ టర్బైన్ పంపులుఉపయోగించారు .ఒక్కో మోటారు 354 ఘన అడుగుల -10 ఘన మీటర్ల నీరు ఎత్తి పోస్తుంది .ఒక్కో మోటార్ హార్స్ పవర్ 6300 .పోలవరం కుడికాల్వ లోకి నీరు మళ్ళించ టానికి తా 95అడుగుల ఎత్తుకి నీటిని తోడిపోస్తారు .ఒక్కో మోటారు విద్యుత్ సామర్ధ్యం 4.7 మెగా వాట్లు .మొత్తం 113 మెగా వాట్ లవిద్యుత్తూ అవసరం అవుతుంది .ఈ పధకానికి అక్కడ రైతులనుంచి స్వచ్చందంగా సేకరించిన భూమి 186 .5 ఎకరాలు .గోదావరి ఒడ్డునే పట్టిసం గ్రామం లో పంప్ హౌస్ కట్టారు .14 మోటార్లను బి హెచ్ ఇ ఎల్ సమకూరుస్తే గడువు లోపు పని పూర్తీ అవటానికి మరో 14 చైనా నుంచి తెప్పించి వాడారు .
డయాఫ్రం వాల్ నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత .మోటారు,పంపులు అమర్చటానికి లోతుగా బావిని తవ్వి అంచులు కూలి పోకుండా గోడలు కట్టే బదులు భారీ ప్రత్త్యేక యంత్రాలతో నాలుగు వైపులా మందపాటి గోడను కడతారు ఇదే డయాఫ్రం వాల్ .వీటి మధ్యలో ఉన్న మట్టిని త్రవ్వి తీసి బావులు నిర్మించారు ఇది అత్యంత అధునాతన ప్రయోగం అత్యన్తరక్షణ కరం కూడా. పనీ అతి త్వరగా పూర్తీ అయింది .221మీటర్ల పొడవు 33 మీటర్ల వెడల్పు స్థలం లో గోదారి ఒడ్డునే పంప్ హౌస్ నిర్మించారు .దీనికి కుడి కాలువ కేవలం 4 కిలో మీటర్ల దూరం లోనే ఉంది.ప్రత్యేకమైన 12 వరుస పైప్ లైన్ ల ద్వారా నీరు వస్తుంది .ఒక్కో పైప్ లైన్ 3.2 మీటర్ల అంటే దాదాపు 10 మీటర్ల వ్యాసం కలిగి న పైప్ లైన్లను ఈ నాలుగు కిలో మీటర్ల పొడవునా 12 వరుసలలో అమర్చారు .ఒక్కో వరుస పైప్ లైన్ రెండు పంపులు తోడిన నీటిని మోసుకు వెడుతుంది .అంత లావు గోట్టాలనుంది నీరు కాలవలోకి పోస్తే గట్లు కొట్టుకు పోకుండా ప్రత్త్యేక డెలివరి సిస్టర్న్ లను రెండు ఎకరాల స్థలం లో ఏర్పాటు చేశారు .ఈ పైప్ లైన్ లద్వారా కుడికాలువకు చేరిన నీరు అక్కడి నుండి త్రవ్విన177 కిలోమీటర్ల ప్రత్యేకకాలువ గుండా కృష్ణా నదికి చేరుతాయి .కాలువలోకి నీరుపడే దాకా మనకు ఎక్కడా గొట్టాలు భూమి పైన కానీ పించకుండా లోతుగా అమర్చటం మరో ప్రత్యేకత .ఈ కాలువ ప గొ జిల్లాలో 12 1 కిలో మీటర్లు ,కృష్ణ జిల్లాలో 56కి మీ ప్రయాణం చేస్తుంది .ఈ కుడికాలవ పోలవరం జలాశయం దగ్గర లో ఉన్న ‘’తోట గొంది ‘’గ్రామం లో ప్రారంభమై ,కృష్ణా జిల్లా వెలగలేరు గ్రామం వద్ద అంతం అవుతోంది .ఈ కాలువ ప గొ జి లో 9 మండలాలు –పోలవరం ,కొవ్వూరు ,గోపాలపురం ,దేవరపల్లి ,నల్ల జర్ల ,ద్వారకా తిరుమల ,పెదవేగి ,దెందులూరు పెదపాడు మండలాలలో ,43 గ్రామాలు,-పోలవరం ,వి౦జపురం ,ప్రగడ పల్లి ,గంగోలు ,కొవ్వూరు పాడు ,గుడ్డిగూడెం ,భీమోలు ,వెల్ల చింతల గూడెం ,చిట్యాల ,వెంకట రాయ పాలెం ,చెరుకు మిల్లి ,బందాపురం ,దేవరపల్లి ,దీమంతుని గూడెం ,యర్న గూడెం ,వీరవల్లి ,సంజీవ పురం అనంతపల్లి ,నల్లజర్ల ,మరెళ్ళమూడి ,ఆవపాడు ,ఉంగుటూరు రిజర్వ్ ఫారెస్ట్ ,నల్లమాడు ,గున్నంపల్లి ,నారాయణ పురం ,యం.ఎస్ పల్లి ,పంగిడిగూడెం ,పోలసానిపల్లి ,సి సి పూడి ,రామారావు గూడెం అగ్రహారం,ముండూరు ,చక్రాయ గూడెం ,జి .గుంట,పెదవేగి ,కావవ గుంట ,చోది మేళ్ళ,ఒంగూరు ,జగన్నాధ పురం ,పినకడిమి ,కొప్పాక ,భోగాపురం ,వేంపాడు ,కొక్కిరపాడు గ్రామాల గుండా కృష్ణా లో 5 మండలాలు –నూజివీడు ,బాపులపాడు ,గన్నవరం ,విజయవాడ రూరల్ ,జి కొండూరు ,మండలాల గుండా 25 గ్రామాలు –పల్లెర్ల మూడి ,సీతారాం పురం ,వేలేరు ,రేమల్లె ,రంగన్న గూడెం ,వీరవల్లి ,సూరవరం ,బండారు గూడెం కుందావారి కండ్రిక ,పాతపాడు ,పి నైనవరం ,జక్కంపూడి ,వేమవరం ,కొత్తూరు తాడేపల్లి ,తాడేపల్లి వెలగలేరు ,బల్లిపర్రు ,తెంపల్లి ,వీరపనేని గూడెం చిక్కవరం ,గొల్లనపల్లి ,గోపువారి గూడెం ,కొండపావులూరు , గుండా ప్రవహి౦చి ఇబ్రహీం పట్నం వద్ద ఫెర్రీలో కృష్ణా నదిలో గోదావరికలిసి గోదా కృష్ణ రూపు దాల్చింది .కృష్ణా పుష్కరాలకు ఈ అసాధ్యం సుసాధ్యమైంది .రైతులకు సకాలం లో నీరు అందించటమే దీని ప్రధాన ఉద్దేశ్యం .
కుడికాలువ కృష్ణా జిల్లా పల్లెర్ల మూడి వద్ద మొదట ప్రవేశిస్తుంది .రైతులతో ముఖ్యమంత్రి చర్చించి సానుకూలంగా స్పందింపజేసి ,తగినంత నష్టపరిహారం ఇచ్చి ఈ భూములు తీసుకొన్నారు .కావాల్సిన 12 ,543 ఎకరాలలో 10 ,695 ఎకరాలు సేకరించారు ఇంకా 1848 ఎకరాలు సేకరించాలి .కోర్టు కేసులలో ఉండటం వలన ఈ సేకరణ జరగలేదు కుడికాలువ పనులన్నీ 60 రోజుల్లో పూర్తీ చేయటం విశేషం.అప్పటికే గతప్రభుత్వం కాలువలను కొంతమేరకు త్రవ్వటం వలన యిది సాధ్యమైంది .మొత్తం 13 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని 438 ఎక్స్ వేటర్లు ,10 25 టిప్పర్లు ఉపయోగించి తవ్వారు .వేగం గా పని ముగియటానికి తాత్కాలికంగా85 మంది ఇంజనీర్లను కేటాయించారు .మొత్తం మీద 141 మంది ఇంజనీర్లు ,181 మంది సాంకేతిక నిపుణుల వేలాదికార్మికుల సేవలను వినియోగించారు .కల్వర్టులు అండర్ టన్నేళ్ళు , ఆక్వి డేక్ట్ ,ఇన్ లెట్ ,అవుట్ లెట్ లద్వారా వాగులు వంకల అవరోధాలను అధిగమించారు .రవాణా సౌకర్యానికి ఇబ్బందిలేకుండా కాలువలో పెద్దపెద్ద పైపులు వేసి తాత్కాలిక వంతెనలు వేశారు .తవ్విన మట్టిని కాలువ గట్ల పటిష్టతకు ఉపయోగించారు .
పోలవరం పూర్తీ అయితే పట్టిసీమ యంత్రాలను మరొక చోట కు తరల్చి ఉపయోగిస్తారు .13 00కోట్ల రూపాయల పట్టి సీమ ఎత్తి పోతలపధకం వలన ఏటా రైతులకు 1000కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుంది .దీనివలన కృష్ణా ఆయకట్టులో 13 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది .ముందే చెప్పినట్లు గోదావరి వరద నీరు మాత్రమే అందులోనూ కొద్దిభాగం మాత్రమే దీని ద్వారా ఉపయోగిస్తున్నాం .పట్టిసీమలో 14 మీటర్ల నీటి మట్టానికి మించి వరద వస్తేనే కృష్ణాకు నీరు తరలిస్తారు కనుక గోదావరీ తీర ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .ధవళేశ్వరం బ్యారేజి పూర్తీ స్థాయి నీటి మట్టం 13 .6 7 మీటర్లు పైన .అంతకంటే ఎక్కువ నీరువస్తే కిందకి వదులుతారు .కనుక పట్టి సీమ వద్ద నీరు తోడాలి అంటే 14 మీటర్ల పైన నీరు వస్తేనే అది వరదనీరై కృష్ణాకు నీరు అందుతుంది అని అందరూ గ్రహించాలి . కృష్ణా జిల్లాలో జి కొండూరు మండలం వెలగలేరు వద్ద కుడికాలువ ద్వారా నీరు తెప్పించి అక్కడినుంచి బుడమేరు మళ్లింపు ద్వారా కృష్ణ లోకి నీళ్ళు మళ్ళించి బుడమేరును సద్వినియోగం చేస్తారు .
ప్రకాశం బారేజి కెపాసిటి 3 టి ఎం సీ లు మాత్రమే .మరి గోదావరి నుంచి వచ్చి చేరే 80 టి ఎం సి లనీటిని నిల్వ చేయకుండా కృష్ణా డెల్టా కాలువలకే ఆయకట్టు నీరు అందించటానికి విడుదల చేసి బారేజ్ ను కాపాడుతారు .కృష్ణా గోదారులకు ఒకే సారి వరదలు వస్తే గోదారి జలాన్ని అసలు తరలించనే తరలించారు. సముద్రం పాలుకావాలి లేక పోలవర జలాశయం లో నిలవ చేస్తారు .డెలివరి సిస్టం పని సామర్ధ్యానికి కావాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్ లో భాగంగా 11 కె వి ళ సబ్ స్టేషన్ నిర్మించి .పల్లంట్ల గ్రామం వద్ద 400 కె వి సబ్ స్టేషన్ నుంచి ప్రత్యెక ట్రాన్స్ మిషన్ లైన్లద్వారా విద్యుత్ అందిస్తారు .కాలువ దారిలో ఉన్న వాగులలోని నీటినీ వాడుకొనే ఏర్పాటు చేశారు .పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ,పంపిణీ కాలువల వ్యవస్థ ఏర్పడ్డాక రాయలసీమ పొలాలకు నీరు అందజేస్తారు .కుడికాలువ కు ఇచ్చిన భూమికి గాను రైతులకు 700కోట్ల నష్ట పరిహారం చెల్లించి సంత్రుప్తిపరచారు .కరువుకాటకాలను తట్టుకొని నిలబడటానికిడెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ సూచించిన నదుల అనుసంధాన విధానాన్నే మన ప్రభుత్వం భారత దేశం లో మొట్టమొదటి సారిగా అమలు చేసి అసాధ్యాన్ని అత్యన్తసుసాధ్యం చేసి చూపించింది .దీనికి అందరూ అభినందనీయులే .
కుడికాలువ రహదారులు దాటే చోట మొత్తం 41 వంతెనలు నిర్మించారు .పోలవరం కాలువ గుండేరును కవ్వగుంట వద్దా ,తమ్మిలేరును జానం పేట ,రామిలేరును పల్లెర్ల మూడివద్ద దాటుతుంది .పట్టిసీమ ప్రాజెక్ట్ పనిని ‘’మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ‘’కు అప్పగించారు .పట్టిసీమ పనులు ప్రారంభించిన 139 రోజుల్లోనే గోదావరి కృష్ణ లను 16-9-20 16 న అనుసంధానం చేసి రికార్డ్ సృష్టించారు.
గోదావరి నదీ గర్భం లో కట్టే పోలవరం డాం నిర్మాణానికి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికారాలను ఉప యోగిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీ దీనికి గొప్పగా సహకరిస్తోంది .డయాఫ్రం వాల్ నిర్మాణమే ఒక అత్యద్భుతం .ప్రత్యేకంగా చూశాముకనుక మహదానందం వేసింది ఇక్కడ వాడే భారీ పరికరాలన్నీ మన దేశం లోనే తయారు చేసినవే .యంత్రాల నిర్మాణం ,ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అంతా ఎల్ అండ్ టి వారిదే అవటం తో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి .అయినా చంద్రబాబు ఇంకా అసంత్రుప్తిగానే ఉన్నారు .వారానికి జరగాల్సిన పనులలో నలభై శాతమే అవుతున్నట్లు నిన్న చాలా తీవ్రంగా స్పందించారు .. కాని అక్కడి ఇంజనీర్లు చాలా ఆత్మ విశ్వాసం తో పని చేస్తూ ,గడువుకు ముందే ప్రాజెక్ట్ పూర్తీ చేస్తామని గర్వంగా మాతో అన్నారు .నిజమే అని పించింది .డాం నిర్మాణం తర్వాత అటు 150మీటర్లు ఇటు మరో 150మీటర్ల ఏటవాలు రోడ్డును వంద అడుగుల లోతు నుండి నిర్మించి పై భాగాన రెండు వైపులా 50 మీటర్ల వెడల్పు ఉండేట్లు నిర్మిస్తారు .కొండలు గుట్టలు త్రవ్వి తీసిన రాయి రప్పా మట్టి అంతటిని ప్రాజెక్ట్ బలోపేతానికి వినియోగిస్తారు . ఏర్పరచే కాఫర్ (మట్టి ) డాం నిర్మాణమూ అపురూపమైనదే .మరొక మూడేళ్ళలో ప్రాజెక్ట్ మొత్తం పూర్తీ అయి బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా అబ్బుర పరుస్తుంది . వచ్చే జూన్ నాటికి పోలవరం నీరు కృష్ణానదిలోకి చేర్చే భగీరధ ప్రయత్నం లో అందరూ తలమునకలై పని చేస్తున్నారు .మన సాంకేతిక పరిజ్ఞానానికి జోహార్లు అందించాలి .భారత దేశం లో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూ ఉపయోగించని అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను పోలవరం ప్రాజెక్ట్ కు విని యోగించటం దీని అతి ముఖ్య మైన విషయం విశేషం .ఇంతటి బృహత్తర నిర్మాణాన్ని మన రాష్ట్ర ప్రభుత్వమే ఎవరి కోసమూ ఎదురు చూడకుండా ప్రారంభించింది .తర్వాత భారత ప్రభుత్వం మొత్తం ఆర్ధిక బాధ్యత సమ కూర్చటానికి ముందుకురావటం ,పైన ప్రధాని శ్రీ మోడీ ,జలవనరుల మంత్రి శ్రీమతి ఉమా భారతి ,ఇక్కడ రాష్ట్రం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,జలవనరుల మంత్రి శ్రీ ఉమా మహేశ్వర రావు ల సంయుక్త ఆలోచన మద్దతు పూర్తీ స్థాయిలో లభించి ,ఫలితాలను త్వరలో అందుకో బోతున్నాం .ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఇదే వేగం తో పనులు జరిగి ప్రాజెక్ట్ అతి త్వరలో అన్ని లక్ష్యాలతో సాకారం కావాలని సర్వ దేవతలనూ ప్రార్ధిద్దాం . శుభం భూయాత్ .ఈ బృహత్తర అత్యంతాధునిక దేవాలయ నిర్మాణానికి రాళ్ళెత్తి న కూలీ లందరికి వందనం అభి వందనం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’
అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’
కొందరు తమ స్వీయ సేవాభాగ్యం తో చరితార్దులౌతారు ,చరిత్రనూ సృస్టిస్తారు ,భావి తరాలకు మహా మార్గ దర్శకులై తేజో మూర్తులని పించుకుంటారు .పనిలో కసి ,కృషిలో నైశిత్యం ,ఆలోచనలో నవీనం ,శ్రేయస్సులో యశస్సు ఉన్న వాడే మన నవ్యాంధ్ర ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు .ఆయన మంత్రి వర్గ సహచరులలో అదే దీక్షతో అదే తపనతో ,ఆయన పదంలో పదం కలిపి అంతే అంకిత భావం తో పనిచేస్తు కలల సాకారానికి కృషి చేస్తున్న మన జల వనరుల మంత్రి శ్రీ దేవి నేని ఉమా మహేశ్వర రావు ఆయనకు సరి జోడు .ఇద్దరూ కలిసి’’ టు ఇన్ వన్’’. అందుకే పట్టి సీమ ఎత్తిపోతల పధకం అంత త్వరలో రూపు దిద్దుకొని ,విభజన వలన అన్నపూర్ణ వంటి కృష్ణా గుంటూరుజిల్లాల అన్నదాతలు నీళ్ళో రామచంద్రా అని మొత్తు కోకుండా ,దశాబ్దాల సుప్త స్థితిలో ఉన్న పోలవర జలాశయ నిర్మాణం ప్రారంభించినా, దానికి ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలవలన అసలుకే మోసం వస్తుందేమో అనే ముందు చూపుతో దాని పని దాన్ని సాగిస్తూ ,ఆపద్ధర్మగా పట్టిసీమ ఎత్తి పోతల పధకం బాబు మస్తిష్కం లో తళుక్కున మెరవటం ,సాధన సంపత్తి చేకూర్చుకొని అసహాయ సూరునిలా కార్య రంగం లో దిగి గోదారమ్మను రికార్డ్ టైం లో క్రిష్ణమ్మలో అను సందానించి ‘’గోదా కృష్ణ ‘’లేక క్రిష్ణావరి ‘’ని సాధించి రైతన్న వదనాలలో దరహాసాలు పూయించి ,వరిలో రికార్డ్ ఉత్పత్తి సాధించేట్లు చేయగలిగి స్వర్ణాంధ్ర కు నాంది పలికాడు .లేక పోతే అసలే కర్నాటక డాములవలన బక్క చిక్కిన కృష్ణా నది బెజవాదదాకా కూడా వచ్చే అవకాశం ఉండేదికాదు .ఇదీ దార్శనికుడైన పాలకునికి ఉండాల్సిన లక్షణం .ఆ లక్షణాలు పూర్తిగా మూర్తీభవించిన వాడు చంద్రబాబు . ఈ కలల సాకారానికి మరింతసమర్ధతతో కృషి చేసి తామూ ఏమాత్రం తీసి పోనీ వారమని రుజువు చేశారు ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు ,కార్మికులు ..ఇందరి సమైక్య ,సమష్టి కృషి ఫలితం మనం ఒక్క ఏడాదిలో నే అనుభవించాం .నిరంతర పర్యవేక్షణ ,సముచిత సలహాలు ఎదురయ్యే అడ్డంకుల్ని ముందే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం విజన్ ఉన్న వారికే సాధ్యమౌతుంది .ఆ విజన్ ఉన్న వాడు మన చంద్ర బాబు .అపర భగీరధుడు అనేది రొటీన్ మాట కనుక నేను చంద్ర బాబు ను ఇంజనీర్ కాకపోయినా ‘’ఆంధ్రా కాటన్ ‘’అంటాను .ఈ కాంబి నేషన్ ఇలాగే సమర్ధంగా పని చేస్తే మన కళ్ళ ముందు ‘’స్వర్ణాంధ్ర ‘’మెరిసిపోతూ దర్శన మిస్తుంది .క్షణం లో సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్ధవంతంగా అమలు జరపాలి .అప్పుడే ఫలితాలు అతి త్వరగా అందరికీ అందుతాయి .దీనికి మరో ఉదాహరణ చూద్దాం –
ఆంధ్ర మహా విష్ణువు ఏలుబడిలో ఉన్న ప్రధమాంధ్ర రాజధాని శ్రీకాకుళం లో కృష్ణ దేవరాయల మహోత్సవాలతో ‘’పద్య కవితా బ్రహ్మోత్సవాలు ‘’ను ఈ నెల 18 19 తేదీలలో నిర్వహించి తెలుగు పద్యానికి బ్రహ్మ రధం పట్టించిన సంగతి మనకు తెలుసు .రెండవ రోజు సభకుమంత్రి శ్రీ దేవినేని రావటం ,ఉత్సవాలు జరుగుతున్న తీరుకు పులకి౦చి పోవటం, అక్కడ హాజరైన అన్నదాతల ముఖాలలో వెలిగిన నవ్వులను చూసి స్పందించటం ,కవులందరూ పట్టి సీమ పోలవరం ప్రాజెక్ట్ లను తప్పని సరిగా చూసి స్పందనలు తెలియ జేయాలని కోరటం, అప్పటికప్పుడు ఆర్టీసి ఎం. డి.శ్రీ మాలకొండయ్య తో మాట్లాడటం దాన్ని సవాలుగా తీసుకొన్న’’కత్తి’’లాంటి సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ దీర్ఘాసి (దీర్ఘాసి అంటే పెద్ద కత్తి అని అర్ధం )విజయభాస్కర్ రేపే మనకవులు పట్టిసీమ పోలవరం సందర్శిస్తారని చెప్పటం ,20 వ తేదీ సోమవారం ఉదయం అందరం బెజవాడ చేరటం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ బస్ లో డా జి .వి. పూర్ణ చంద్ గారి నాయకత్వం లో ప్రయాణించి పట్టి సీమ ఎత్తి పోతల పధకాన్ని ,అక్కడికి 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ను అక్కడి ఇంజినీర్లు మాకు ప్రతివిషయాన్ని దగ్గరుండి పూస గుచ్చి నట్లు వివరిస్తే తెలుసుకోవటం ,కమ్మని ఆతిధ్యం అందజేయయం ,డాం నిర్మాణం జరిగే నదీ గర్భానికి తీసుకువెళ్ళి భారత దేశం లోనే ఎక్కడా ఇంతవరకు జరగని ,లేని అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక సాయంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచేట్లు నిర్మిస్తున్న పోలవరం రిజర్వాయర్ ,బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా చూసే గొప్ప అనుభవం పొందటం ,తిరిగి వచ్చేటప్పుడు పోలవరం కాలువా పట్టి సీమ ఎత్తి పోతల కాలువా అనుసంధానం అయ్యే చోటు చూడటం ,రాత్రి బెజవాడ వస్తుండగా మంత్రి శ్రీ ఉమా మమ్మల్ని వారి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించటం ,అక్కడ విందు తర్వాత మమ్మల్ని అందరిని గౌరవంగా వేదిక పై ఆసీనులను చేయటం అక్కడ అప్పటికే హాజరై ఉన్న అన్నదాతలకు మా అందరి అనుభవాలను గంటన్నర సేపు తెలియ జెప్పించటం ,ఆ ప్రాజెక్ట్ లపై మేము రాసిన కవితలు వినిపింప జేయటం , వారంతా అత్యంత శ్రద్ధగా వింటూ చప్పట్లతో మమ్మల్ని అభినందించటం ,మంత్రిగారు మాకు అందరికి స్వయం గా శాలువాలు కప్పి సన్మానించటం ,అంతా రాత్రి 11-30 గంటలు అయినా దాదాపు 5 వందల కిలో మీటర్లు ప్రయాణం చేసిన మాకు కాని ,పొద్దుటినుంచి రైతులతో ,జలసంఘాలవారితో భేటీలో ఉన్నా మంత్రిగారికి కాని, అర్ధ రాత్రి అవుతున్నా అన్నదాతలకు కాని విసుగు అని పించకుండా కార్యక్రమం అంతా ఒక్క రోజులో జరగటం చూస్తే కలయో వైష్ణవ మాయయో అనిపించింది .అంతటి బృహత్తర నిర్మాణ దశలను ప్రత్యక్షంగా చూడటం మా అదృష్టం శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రధాని నెహ్రు శంకుస్థాపన చేసిన వారానికే నేను ,మా అమ్మా శ్రీశైలం సందర్శింఛి అక్కడ దాదాపు పది హీను రోజులున్న విషయం జ్ఞాపక మొచ్చింది .ఇదీ నిన్నటి మాపర్యటన సారాంశం .వివరాలు తరువాత తెలియ జేస్తాను .మా పర్యటనలో మాతోపాటు ప్రపంచ ప్రసిద్ధ నైరూప్య చిత్రకారులు ,ఆధునిక పికాసో,పద్మశ్రీ ఎస్వి .రామారావు గారు ,పత్రికా రంగానికి చెందిన శ్రీ చలపాక ప్రకాష్ , వంటి వారు ఉండటం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది . ఈ సమావేశాన్ని ‘’జలదాతలు,అన్నదాతలు అక్షరాదాతల’’ సంయుక్త సమావేశం కనుక సత్ఫలితాలనిస్తుంది ‘అని నా కవిత వినిపించాను- .కవులమైన మేము రాసింది ,రాస్తున్నదీ ,రాయబోఏదీ ప్రభుత్వానికి భజన కాదు వ్యక్తులకు డప్పు కొట్టటం కాదు ,అక్కడ జరుగుతున్న అభివృద్ధిని,మేం చూసిన కళ్ళతో తెలియ జేయటమే . ప్రాజెక్ట్ పూర్తీ అయితే ఎంతటి మహోత్క్రుస్టం గా రాష్ట్రం ఉండబోతోందో ,ఎంత నిబద్ధతగా ఇరావైనాలుగుగంటలూ, వారానికి ఏడు రోజులు పని చేస్తూ అనుకున్న సమయానికి నిర్మాణ౦ పూర్తీ చేసి ఆంద్ర జాతికి అంకిత మిచ్చే కృషిలో అందరూ భాగ స్వాములవుతున్నారో ,కళ్ళున్నా చూడలేని ,చెవులున్నా వినలేని ,అభి వృద్ధి ఉన్నా లేదని బుకాయించే వారికి తెలియ జెప్పటానికి మాత్రమే.ప్రభుత్వానికి మేం ప్రచార సారదులం కాము కాము కాము అని విన్న విస్తున్నాం .సత్యానికి మాత్రమే మా ప్రచారం .
పట్టిసీమ
పట్టి సీమ
బాబు పట్టు బట్టిన
సృష్టి సీమ
ఎత్తిపోతల జల వృష్టి సీమ
ఆంధ్ర అన్నదాతల సంతుష్టి సీమ
పంటలకు ,సౌభాగ్య పుష్టి సీమ
శాస్త్ర సాంకేతిక సమష్టి కృషి సీమ
సస్య శ్యామలాంధ్ర పునః సృష్టి సీమ .
పోలవరం
ప్రాజెక్ట్ పోలవరం
దశాబ్దాల కాంక్షల కలవరం
సాకార మౌతున్న ‘’జల pool వరం ‘’
భగీరధుని కన్నా మిన్న
విజన్ ఉన్న చంద్ర బాబు
‘’ఆంధ్రా కాటన్ ‘’ అనటం సబబు .
ఇవి నవ్యాంధ్ర జనవనరుల బ్రహ్మోత్సవాలు
ఆనందం తో నర్తించే మన హృదయ పులకా౦కితాలు .
మిగిలిన వివరాలు తరువాత వ్యాసం లో
సశేషం
మాతృభాష దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు
కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు
కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు అద్భుతంగా నిర్వహించారు. పద్య కవితలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉయ్యూరు సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, సంస్థ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు
7-2-17 శనివారం శ్రీకాకుళం లో మొదటి రోజు పద్య కవితా బ్రహ్మోత్సవచిత్రాలు
7-2-17 శనివారం శ్రీకాకుళం లో మొదటి రోజు పద్య కవితా బ్రహ్మోత్సవచిత్రాలు
వరద’’ కవన కుతూహలం ‘’-2
వరద’’ కవన కుతూహలం ‘’-2
‘’వరద కాదు అది సెలయేరు కలకలం .’’సెలయేరుల కలకలముల –చిరుగాలుల మృదుగీతుల –మంజులమగు నీ పలుకులె-మదికి దోచురా!’’అని వరద మాటలలోనే అనుకొంటూ ఉందామన్నాడు ఏ బి కె .’’ఏల్చూరి మురళీధరరావు ‘’మంచి పుస్తకాలలో మరీ మంచి పుస్తకం .తెరమరుగున దాగిన అనేక రసవత్తర సన్ని వేశా(షా )లకు తెర తీశాడు .తనచిన్ననాటి జ్ఞాపకాలను ‘’జీవన ప్రద గాధలు ‘’గా రాశాడు .సమకాలం లోవిలుప్తమైన విదగ్ధ కళా ప్రపంచాన్ని కన్నులకు కట్టినట్లు చూపాడు .అభ్యర్ణ ఆంద్ర సారస్వత భువన కోశం ఆ౦గికకమై ,,రమ్య కవితా బహువ్రీహి పండిన ఆనాటి వాజ్మయమంతా వాచికమై ,ఆ మహా కవి యశః పారిజాతాల మాల ఆహార్యమై రూపొందించిన తరంగ ప్రతి బింబ న్యాయంగా వరద సాహితీ వరద పారించాడు ‘’అంటూ నాటకీయ భాషలో కవితాత్మకంగా ప్రశంసించాడు .సాహిత్య అకాడెమీ ,అరసం ఆవిర్భావం ,కాలదోషం వ్యాసాలూ జ్ఞాన తృష్ణను తీరుస్తాయి .పుస్తకం లో ఆత్మీయత ,తేజోమయ వాతావరణం వెల్లి విరిశాయి .మూర్తి చిత్రణ –కారికేచర్ లో వరద ను మించిన వారు లేరు .విశ్వనాధ ‘’ఆంద్ర ప్రశస్తి ‘’లోని శిల్పం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది .
‘’కవిత్వం మీదమీ అభిప్రాయం ఏమిటి ‘’అని శ్రీ శ్రీ -చెళ్ళపిళ్ళవారిని అడిగితే ‘’నేనూ కవినేనా ?’’అని మొదలు పెట్టి చెప్పిన గాంభీర్య విషయాలు,’’ఉదయిని ‘’కోసం వ్యాసం రాయమంటే అబ్బూరి రామకృష్ణారావు ‘’నేనెందుకు రాయాలో చెప్పు ‘’అన్న అబ్బూరి పూర్ణ పురుషత్వం ఇందులో ప్రత్యక్షం .శ్రీ శ్రీ వైరశుద్ధికి హత్యా ప్రయత్నం చేసిన శిష్ట్లా ఉమామహేశ్వరరావు జీవిత విశ్లేషణ ,తెలుగు జీవితాన్ని ఆమూలాగ్రం తరచి చూసి,కవిత్వం లో అనేక ప్రయోగాలు చేసిన విశ్వనాధ ‘’మనిద్దరం సమకాలికులం రాజేశ్వర రావూ ‘’అన్నప్పటి విదగ్ధత ,జరుక్ శాస్త్రి హాస్య ధోరణి ,జీవితాన్ని కవితా యజ్ఞం లో వ్రేల్చి సన్మాన సభలో సరస్వతీ సమారాధకునిగా మృతి చెందిన బొడ్డు బాపిరాజు విశిష్ట కదా కధనం ,కుందుర్తి వచనకవితా మహోద్యమం ,సాహిత్యానికే అంకితమైన బెల్లంకొండ రామదాసు ,దువ్వూరి ,మారేపల్లి, మాధవ పెద్ది మొదలైనవారి స్వభావ నైర్మల్యం అపురూపంగా మలచాడు వరద .’’సన్నివేశాల అలంకారానికి వరద స్వీకరించిన పద్యాలు అనర్ఘ రత్న ఉపహారాలు .కవిత్వం శబలిత భావ సంసక్తమై రసనాగ్ర నర్తకి గా ఉండాలన్న వరద దృక్పధానికి పద్యగేయాలన్నీ విశేషణమైన భూషణాలే’’అని ఏల్చూరి చెప్పింది ఏమాత్రం సందేహి౦పరానిదే .’’ఆధునిక చరిత్ర ‘’కాధి కులలో వరద కు ఈ గ్రంధం సముచిత స్థానాన్ని కల్పిస్తుంది అని చక్కగా చెప్పాడు ఏల్చూరి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-17 –ఉయ్యూరు
వరద’’ కవన కుతూహలం ‘’
వరద’’ కవన కుతూహలం ‘’
1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే ,అది పుస్తక రూపం గా 198 9 లో వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు వరద .
కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని దశాబ్దాల క్రిందటి విషయాలను గుర్తు చేసుకొని ,మననం చేసుకొని రాసిన అనుభవ జ్ఞాపకాలు .ఆయన ధారణ’’రసనాగ్ర నర్తకి ‘’అన్నాడు ఏ బి కె .శ్రీపాద వారి’’ అనుభవాలు –జ్ఞాపకాలు’’ ,శ్రీ శ్రీ ‘’అనంతం ‘’,ఇంద్రగంటి ‘’గౌతమీ గాధలు ‘’తర్వాత చెప్పుకో దగింది కవన కుతూహలం .’’యుద్ధం లో ‘’కదన’’ ,సాహిత్యం లో ‘’కవన’’కుతూహలాలు ఒకే కోవకు చెందినవి .’’ఇది ఆధునిక ఆంద్ర సాహిత్యం లో ఒకటి ,రెండు శతాబ్దాలకు పూర్వం ‘’స్వర్ణ యుగం ‘’గా భావించిన ‘’ఒక మహోజ్వల ఘట్టం తో సంబంధం ఉన్న సాహితీ స్రస్టలగురించి జ్ఞాపకాలు మాత్రమే కాదు ,పర నింద కాదు,రొడ్ద కొట్టుడు ఆత్మ కద అంతకంటే కాదు రెండు దశాబ్దాలకే పరిమితమూ కాదు లెక్కలేనంత మంది కవులు ,రచయితలూ నాటక కర్తలు బారులు తీరి పాఠకులకు అజ్ఞాన నేత్రదర్శనం చేయటానికి క్యూ కట్టారు .అందుకే ఇది ఐదు దశాబ్దాల సాహిత్యావలోకనం ‘’అన్నాడు ఏ బి కె .అంతేకాదు ‘’వరద సాహిత్య సిద్ధాంత రాద్ధా౦తాలతో బాధించకుండా ,తన సహజ చతురిమ ,హేళన అని పించని పరిమిత అవహేళనతో ,పరదాలు తొలగించి సరదాగ సాధించాడు .సాహిత్య వివేచనా ,విమర్శన ,హాస్య ప్రియత్వం కల బోసిన రచన .తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం పాఠకులపై చెరగని ముద్ర వేయగల అరుదైన సాహిత్య క్రీడ కవన కుతూహలం ‘’అని సరైన తూకపు రాళ్ళతో తూచి నిక్కచ్చిగా నిగ్గు తేల్చాడు . తండ్రి అబ్బూరికి సరైన సాహితీ వారసుడు వరద .
ప్రాచీన ,అర్వాచీన ,పాశ్చాత్య సాహిత్యోద్యమాలతో ,కవితా ధోరణులతో మునిగి తేలే వారంతా ,వరద రచనా విశిస్టతతో మనకు పరిచయం ఉన్న వారుగా కనిపిస్తారు .’’ఇది కొద్ది మందికే పరిమితమైన అనుభవ పేటిక కాదు . ఆంద్ర దేశమంత వెడల్పూ ,తెలుగు సాహిత్యమంత లోతు ఉన్న అపురూప రచన ‘’అన్న ఏ బి కె మాట ప్రత్యక్షర సత్యమే .రచనా పద్ధతీ శైలీ ,ధారా శుద్ధి ప్రశంసనీయం .పరిచయమైతే వదలి పెట్టని రకం వరద .వరద అంటే ‘’అబ్ది ఘోష లో శబ్ద తరంగం ‘’ఓకే తరానికి తండ్రి తోపాటు కౌమార దశ లోనే కవి కుమారుడై తనతరానికి ఒక ఇన్ స్పి రేషన్ అయ్యాడు వరద ‘’.ప్రముఖుల జీవిత రసవత్తర సన్నివేశాలను ,వచో వైభవ స్మ్రుతి విశేషాలను అనితర సాధ్య రీతిలో వరద గ్రంథస్థం చేశాడు ‘’అన్నాడు అజంతా కవి .వరద’’ కుతూహం’’చూస్తుంటే బెర్నార్డ్ లెనిన్ ‘’కండక్టేడ్ టూర్ ‘’అందులో యూరప్ లోని 12 సంగీతోత్సవాలకు హాజరై రాసినదీ ,పారిస్ కి చెందిన సిల్వియా బీచ్ ‘’షేక్స్ పియర్ అండ్ కంపెని ‘’ హెమింగ్ కోహెన్ ‘’లాండ్ మార్క్స్ ఇన్ అమెరికన్ రైటింగ్ ‘’గుర్తుకు వస్తాయి అన్నాడు ప్రసాద్ .అయితే వచనకవితను వరద తక్కువగా చూడటం హేళన చేయటం మంచిదికాదన్నాడు ఏ బి కె .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-17 –ఉయ్యూరు
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ఉగాది కవి సమ్మేళనం ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము ..
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై జిల్లాలోని ప్రముఖ కవి మిత్రులచేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ శ్రీ పరుచూరిరామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు (అమెరికా ) గౌరవ అతిధి గా ,ప్రముఖ సంఘ సేవకులు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు , స్వచ్ఛ భారత్ కార్య కర్త ,పెద్దలు శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ గారు(విజయవాడ ) ఆత్మీయ అతిధిగా పాల్గొంటారు .
సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 18-2-17
పద్య కవితా బ్రహ్మోత్సవాలుపద్య కవితా బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం -17-2-17 ,18-2-17 ముదిమి వయసున ఆటవెలది తో సయ్ రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు
పద్య కవితా బ్రహ్మోత్సవాలు
శ్రీకాకుళం -17-2-17 ,18-2-17
ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట –
రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు
1-అలతి అలతి పదము లల్లిక బిగి చేత
అలర రాజ నియతి నందమొప్ప
ఇలను ‘మెచ్చ ’యాము’’డింపు గా బల్కెను
పలుకు రాయలదని ప్రణతు లిడుదు .
2-రాయలేలినట్టి రాజ్యమ్ము మనదిరా
రాయ వాచకమ్ము రసన కింపు
రాయ కవన సొంపు ర౦జిల్లు మనసున
రాయ !కృష్ణ రాయ !.రమ్య తేజ .
3-తెలుగు భాషకు గుడి ,తెలుగు భాషపు నుడి
తెలుగు పలుకు తీపి తెలియ జెప్పి
తెలుగు రాయలకును దీటెవ్వ రనగను
తెలుగు కీర్తి జగతి నిండ నిలిపె .
4-అమ్మ భాష నీవు అబ్బుర పడు రీతి
కమ్మగాను బల్కి కాచి నిల్పు
చెమ్మ దగులు మదికి చేయెత్తి జైకొట్ట
అమ్మ నెపుడు నీవు ఆదరించు .
5-ఆట వెలది తోడ ఆట లాడ౦గను
తీట బుట్టె ముదిమి తీరి దేమొ
మాట కదలకుండ మారాము చేసినా
పంచ రత్నములను కొంచ కిచ్చె..
గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు –సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –
2-405 –శివాలయం వీధి -ఉయ్యూరు -5 21 16 5 –కృష్ణా
పన్నీరు కన్నీరు మున్నీరు
పన్నీరు కన్నీరు మున్నీరు
1- సెల్వం పన్నీరు
కాల్వల కొద్దీ కన్నీరు
కార్చినా చివరాఖరు
కు మునిగాడు మున్నీరు .
2- ఎవడో వేసిన ఎరకు
గురై తన్నుకున్నాడు గిలగిల
పధకం బెడిసి కొట్టి మళ్ళీ
వలవలా విలవిలా.
3-బలం తనది కాదని
అమ్మదని తెలుసుకోక
ఆశ పడ్డాడు కాని
తోసిరాజై తీసేసిన
కరేపాకై షాకయ్యాడు .
4-‘’అమ్మ’’ ఉన్నా లేకున్నా
రాజ్యం నడిపేది ‘’చిన్నమ్మే’’
జనాన్ని కదిలించి ఒక్క ఓటు
కూడా తేలేని దేబి ముకాలకు
గద్దె ఎక్కే హక్కు లేదని తెలీదు పాపం .
5-పాదుకలు మోసి మోసి
అమ్మ కరుణా కటాక్షం తో
ఆపద్ధర్మ౦గా అనేకమార్లు
గద్దె అనుభవించి ఎదురు తిరిగితే
పాద ప్రక్షాళనమే మిగిలింది .
6-పాతిక మంది వెనకలేని
పన్నీర్ ను వెనకేసుకొచ్చి
మీడియా చాలా తప్పు చేసింది
దిశా నిర్దేశం చేసే పత్రికలే ప్రజల్ని
వక్రమార్గం పట్టిస్తే దేశానికి దిక్కేది ?
7- నమ్మిన బంటు’’ పళని’’కి
‘’ పదవి పళని విభూతి ‘’దక్కితే
కల్ల బొల్లి ఏడ్పుల పన్నీర్ కు
‘’వల్ల కాట్లో విబూది’’మాత్రమే దక్కింది .
8-అరవై అయిదు కోట్ల అక్రమార్జన
అంటూ శిక్షించటం న్యాయమే అయినా ,
ఇన్నేళ్ళు కేసు దేకి అందలం లో
కూర్చున్నవారు ఎన్ని వేలకోట్లు
మళ్ళీ దాచారో ఎవరు లెక్కిస్తారు ?
దీనికి శిక్ష ఎవరనుభవించాలి ?
అనేది జవాబు లేని ప్రశ్న .
9-వందకు పైగా ఉపగ్రహాలు
విసిరి౦ది మన రాకెట్టు
సాటిలేరు మనకేవ్వరూ ఒట్టు మీద ఒట్టు
ఈ విజయం సాధించిన మన శాస్త్రజ్ఞులు
శాస్త్ర సా౦కేతికాలలో కడు విజ్ఞులు .
10-మినీ ఎన్నికలు ముగుస్తున్నాయ్
మునిగే దెవ్వరో తేలేదేవ్వరో
తేలేది మార్చి మొదట్లో నే
అప్పటిదాకా రొంబ టెన్షనే టెన్షను
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-17-2-17 –ఉయ్యూరు .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39 17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39
17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )
ఆధునిక కళాపిత
19 వ శతాబ్దపు కళా కృషికి ,దీనికి విరుద్ధమైన 20 వ శతాబ్దపు భావ తీవ్రవాదుల కళ కు యుగ సంధి కి చెందిన పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రాన్స్ దేశపు చిత్రకారుడు పాల్ సిజేన్ .అన్వేషణాత్మకమైన ,పదే పదే వాడే బ్రష్ స్ట్రోక్స్ తో అత్యంత విశిష్ట లక్షణాలతో ,ప్రత్యేకత తో అతని కళాఖండాలు వెలిగిపోతాయి .వర్ణ తలాలను చిన్న బ్రష్ స్ట్రోక్ లతో సంక్లిష్ట చిత్రాలుగా తీర్చి దిద్దాడు .చిత్రి౦పబడే వాటి అంతరిక ప్రవృత్తిని బహిర్గతం చేయటం అతని చిత్రాల ప్రత్యేకత .19 వ శతాబ్ది ఇంప్రెషనిజం కు 20 వశతాబ్దిఅత్యాధునిక క్యూబిజం కు సిజేన్ వారధి . ప్రఖ్యాత చిత్రకారులు మాటిస్సే పికాసో లు ‘’సిజేన్ మా కళా పిత ‘’అని ఆరాధనా భావం తో కీర్తించారు .
బాల్య విద్యాభ్యాసాలు
పాల్ సిజేన్ 19-1-1838 న ఫ్రాన్స్ లోని ఎక్స్ యెన్ ప్రావిన్స్ లో సెయింట్ సావియర్ పట్టణం లో జన్మించాడు .ఫిబ్రవరి 22 న ఎగ్లైజ్ డిలా మేడేలిన్ లో ,అమ్మమ్మ మేనమామ లు గాడ్ పేరెంట్స్ గా బాప్టైజ్ అయ్యాడు .తర్వాత కేధలిక్ మతానికి పూర్తిగా అంకిత మయ్యాడు .తండ్రి సెయింట్ జేకారి గ్రామస్తుడు .బాంకింగ్ ఫర్మ్ వ్యవస్థాపక భాగస్వామి .ఇదే మన కళాకారుడిని జీవితాంతం ఆదుకున్నది .ఆనాటి సాటి కళాకారు లెవ్వరికి లేని ఆర్ధిక భద్రత,వారసత్వ సంపద దక్కింది సిజేన్ కు .
తల్లి ఆన్నె ఎలిజబెత్ ఆనరిన్ ఆబర్ట్ ఆకర్షణీయ ,చైతన్య స్పూర్తికల ,త్వరగా తప్పు కొనే స్వభావం కలది .తల్లిదగ్గర నుండే సిజేన్ జీవిత దృక్పధాన్ని,దృష్టి ని ఏర్పరచుకున్నాడు .చెల్లెళ్ళు మేరీ ,రోజ్ లతో కలిసి స్కూల్ కు వెళ్ళేవాడు .10 వ ఏట ఐక్స్ లో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ లో చేరాడు .1852లో బార్బాన్ కాలేజి లో చేరాడు .అక్కడే ప్రసిద్ధ రచయితలూ ఎమిలీ జోలా ,బాప్టిస్టిన్ బెయిలీ లతో గాఢ పరిచయమేర్పడింది. ఎక్కడ చూసినా ఈ ముగ్గురూ కలిసె కనిపించేవారు .ఈ ముగ్గురు మిత్రులను’’విడదీయ రాని త్రయం ‘’(ఇంసేపరబుల్ ట్రయో)అనేవారు.ఆరేళ్ళు ఆ కాలేజిలో చదివాడు చివర ఏడాది డే స్కాలర్ గా ఉన్నాడు .
కళ పై మక్కువ
18 5 7 లో ఐక్స్ లో ఉన్న ఫ్రీ మునిసిపల్ డ్రాయింగ్ స్కూల్ లో చేరాడు .స్పానిక్ ముని జోసెఫ్ గిల్బర్ట్ వద్ద డ్రాయింగ్ అభ్యసించాడు .తండ్రి సలహాపై 19 5 8 -61వరకు ఐక్స్ యూని వర్సిటి లా స్కూల్ లో డ్రాయింగ్ క్లాసులకు హాజరౌతూనే లా చదివాడు .
బాంకర్ అయిన తండ్రి మాటకు విరుద్ధంగా వారించినా ఆగకుండా ఐక్స్ వదిలేసి కళ పై విపరీతమైన వ్యామోహంతో1861 లో పారిస్ చేరాడు . అతనినినిర్ణయం తీసుకొనేట్లు బాగా ప్రభావితం చేసింది అప్పటికే పారిస్ లో స్థిరపడిన ఎమిలీ జోలాయే .తండ్రి కూడా కొడుకు కోరికను మన్నించి ఆర్ధిక సాయం చేసి ప్రోత్సహించాడు .తరువాత తండ్రి నుంచి భారీమొత్తం లో 4 లక్షల ఫ్రాంక్ లు వారసత్వ ధనం గా చేతికొచ్చింది .దీనితో చేసిన అప్పులన్నీ తీర్చి రుణ విముక్తుడయ్యాడు .
అర్కి టెక్చరల్ శైలి
పారిస్ లో కామిల్ పిసారియో అనే ఇంప్రెష నిస్ట్ ఆర్టిస్ట్ తో పరిచయాం కలిగింది సిజేన్ కు .1960 లో వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధమేర్పడింది .ఈ యువ ఆర్టిస్ట్ పై పిసారో ప్రభావం బాగా పడింది .ఒక పుష్కర కాలం కలిసి లాండ్ స్కేపులు గీశారు .పెయింటింగ్ ఎక్స్ కర్షన్ లు చేశారు .క్రమ౦గా ఇద్దరు మమేకమయ్యారు .మడతలో సిజేన్ లాండ్ స్కేప్ లో బొమ్మ ఉండేది .తరువాత అనేక మంది కి చోటు కల్పించేవాడు .అతని ఒహ్హత్మకత సృజన అద్భుతమని పించేది .క్రమంగా రంగుల ప్రభావం తగ్గించి తేలిక గా చిత్రాలు గీశాడు .ఆతర్వాత శిల్పాకృత పెయింటింగ్స్ శైలి (ఆర్కి టేక్చరల్ స్టైల్ )కి రూప కల్పన చేశాడు.తాను లోకం లో చూసిన దానిని చిత్రం లోఅత్యద్భుత౦ గా చూపేవాడు .తేలిక రంగులతో ఫలితాలు రాబట్టాడు . “I want to make of impressionism something solid and lasting like the art in the museums”,[17] అని చెప్పేవాడు . his contention that he was recreating Poussin “after nature” underscored his desire to unite observation of nature with the permanence of classical composition..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-15 –ఉయ్యూరు
సరస భారతి శ్రీ హేవిళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో నిర్వహింప బడుతాయి .
ఈ సందర్భంగా1- స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కారాన్ని-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిస్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (పొన్నూరు ) గారికి అందజేస్తున్నాం .
2- .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ0త ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావు (విజయవాడ ) గారికి ”స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ”అంద జేస్తున్నాం
3- జిల్లా లోని ప్రముఖ కవులచే ”వసుధైక కుటుంబం ”అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం
ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ శ్రీ పరుచూరిరామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు (అమెరికా ) గౌరవ అతిధి గా పాల్గొంటారు .
సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 14-2-17
—
వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’
వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’
1985 లో ‘’ఉదయం ‘’డైలీ లో వారం వారం ధారావాహికగా వరద రాసిన సాహిత్య స్మృతులు ‘’వరద కాలం ‘’గా 1990లో పుస్తకంగా వచ్చింది .దీనికి ప్రేరకులు ఎడిటర్ శ్రీ ఏ బి కె ప్రసాద్ .దీనిలో సాహిత్యం లో ఒక యుగం కళ్ళముందు నిలిపాడు వరద .వ్యక్తుల వ్యక్తిత్వ ఆవిష్కారం ,చరిత్రలో వారి సంబంధం కనుమరుగు కాకుండా కాపాడి అందించాడు .ప్రయోక్త ,ప్రచురణకర్త ,కవి ,నాటకకర్త ,రచయితా ,పాత్రికేయుడు అయిన వరద నవ్య సాహిత్య చరిత్రకు ,ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రకు ,కవితా విప్లవాలకు పూర్వ రంగాన్ని ,వాటి ఉత్దాన పతనాలను ప్రత్యక్ష సాక్షిగా నిలిచి రాసిన రచన .ఆయన అర్ధ శతాబ్దపు సాహితీ యానం .సాహితీ మూర్తుల హృదయ వీణా తంత్రుల నిక్వాణ౦ .తెలుగు దేశం లో నాటక రంగస్థల నిర్మాణ ,నిర్వహణ ,నాటికా నాటకాల ప్రయోగ వైశిష్ట్యం ,తన ప్రత్యక్ష అనుభవ ,అనుభూతులు’’నాట్య గోష్టి ‘’గా పొందు పరచాడు .’’రచనలో నైశిత్యం ,వాక్కులో చమత్కారం రధ చక్రాలుగా సాగిన శారదా మూర్తి ఈ గ్రంధం ‘’అన్నాడు ఏ బి కె .గురజాడ గిడుగు ,రాయప్రోలు అబ్బూరి రామకృష్ణారావు ,కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ లకవితా రచనలకు చక్కని వ్యాఖ్యానం .ఈ తరానికి తెలియని ఎన్నో విషయాలు వివరించి చెప్పాడు .వ్రుత్తి పద ప్రయోగ కోశాలకు ,పత్రికా సారస్వతాను బంధాలకు ,రసమంజరీ నాదాలకు తొలి పూజ చేసిన తండ్రి బహు ముఖీన కృషికి అద్దంపట్టాడు .తొలి కదానికకు ఒరవడి పెట్టిన ఇద్దరిలో తండ్రీ ఉన్నాడు .’’మంగళ సూత్రం ‘’డిటెక్టివ్ నవలకు ,’’తెలుగు సంసారానికీ ‘’ఆయనే కర్త .హిందూ ఆంగ్లపత్రికలో పని చేసిన మొదటి తెలుగు వాడు కుందూరి ఈశ్వర దత్తు ,హిందూ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడైన న్యా పతి సుబ్బారావు లగురించి విశేషాల కుంభ వృష్టి కురిపించాడు ‘’కవిత ‘’సంచికలకు ,మోడరన్ తెలుగు పోయెట్రి ‘’సంకనలాకు బాధ్యురాలు వరద భార్య చాయాదేవి ..వర్కింగ్ జర్నలిస్ట్ ల భారతీయ సమాఖ్య,హైదరాబాద్ యూనియన్ల వ్యవస్థాపకులలో ఒకడు వరద .అక్కిరాజు ,దుగ్గిరాల, ,కొండా ,సుందరయ్య ,బసవ రాజు ,బళ్ళారి ,లంక సుందరం, చలం ,తాపీ ,మరో మధురవాణి లాంటి దీప స్తంభాలను, వారి వెలుగులను గుమ్మరించాడు .ఎన్నెన్నో విశ్వ విద్యాలయాల విద్యా కేంద్రాల జ్ఞాపకాల గుబాళింపులతో పరవశం కలిగించాడు .ఆంద్ర దేశ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యుదయ పదానికి వరద సేవ చిరస్మరణీయం .’’వరద కాలం ‘’అందరికి కరదీపిక .రాజులదండ యాత్రలను యాత్రలుగానే చిత్రించి ,ఆత్మ గౌరవాన్ని చంపుకొన్న తెలుగు మేధావులనుఉమాకాంతం శఠించినందుకు వరద మెచ్చుకున్నాడు .రాజకీయాల పతనం ,డేమోక్రసిలో నామినేషన్ డామినేషన్ సంస్కృతీ ఎండ గట్టాడు వరద .’’మాతరం దిగ్గజాల్లాంటి రాజకీయ నాయకుల్ని ,గాయకుల్ని ,గాయకుల్ని ,పండిత ,కవుల్నీ ,నటుల్నీ చూసింది .ఆ నాడు పెద్దమనుషులే నిజాయితీ పరులే రాజకీయాలలోకి వచ్చేవారు .అప్పటికి రాజకీయం వృత్తి కాలేదు .తెలుగు వాడు దుర్యోధనుడు లాంటి వాడు .తనకేదీ కావాలనుకోడు .ఇతరులకు మాత్రం ఏమీ ఉండకూడదు అనుకొంటాడు .ముగ్గురు తెలుగువాళ్ళు కలిస్తే పార్టీ ,ఇద్దరుకలిస్తే ముఠా ,ఒక్కడే అయితే ప్రతి పక్షం పెడతారు .ఈ శతాబ్దపు రెండో దశాబ్దం లో కూడా తెలుగు వాడి మానసిక స్థితి అలానే ఉంది ‘’అని బాధ పడ్డాడు వరద .’’వరద రచన ఇంగ్లాండ్ లోని బ్లూమ్స్ బరీ గ్రూపు ప్రముఖుడు లిటన్ స్త్రాచీ సారస్వత వివేచనా తో ,ట్రూమన్ కపాటే ‘’ది మ్యూజేస్ ఆర్ హెర్డ్ ‘’తోనూ పోల్చదగినవి .’’అన్నాడు ఏ బి కె .వరద ఇల్లు ఒక శారదా నికేతనం .అందులో ఆతను ప్రేక్షకుడేకాడు పాత్ర దారికూడా చతురంగా తగాదా పడటం వరద హాబీ .’’వరద మనకు అయిదు సంపుటాల ఆత్మ కద రాసిన లియోనార్డ్ ఉల్ఫ్ లాంటి వాడు ‘’.
‘’ వరద సత్యాన్వేషి .అతని కారెక్టర్ స్కెచెస్ స్ట్రాచీ చిత్రించిన ‘’ఎమినేంట్ విక్టోరియన్స్ ‘’.ను గుర్తుకు తెస్తాయి ‘’అన్నాడు గోపాల చక్రవర్తి .’’వరద చేసింది సాహితీ క్షీర సాగర మధనం .బిట్వీన్ ది లైన్స్ లో గొప్ప చరిత్ర ఉంది.అక్షర స్పేస్ షిప్ లో ప్రయాణించి గతకాల అనుభూతులను అందించాడు ‘’అన్నాడు పురాణం .వరద ,తండ్రీ ఇద్దరూ రాడికల్ హ్యూమనిస్ట్ లే.ఎం యెన్ రాయ్ అనుచరులే .ఇద్దరికీ పద్యమే ఇష్టం .అందులోనే రాశారు .వచనకవిత్వం పై సదభిప్రాయం లేని వాళ్ళే .అయినా అందరికీ దగ్గరయ్యారు .వరద కాలం ఒక సాహిత్య వరద గోదారి .చదివి తెలుసుకొని ఆనందించా ల్సినవి ఎన్నో ఉన్నాయి .నేను చేసింది అతి సూక్షం పరిచయం మాత్రమే.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-17 –ఉయ్యూరు
ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )
ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )
భారతం లో వేదవ్యాసభగవానుడు ‘’భగవాన్ వాసు దేవో పి కీర్త్యతేత్ర సనాతనః ‘’అనిసనాతన వాసుదేవుడు ఈ కృష్ణుడు అన్నాడు .అలాంటి వాడు ‘’ఏను ‘’అంటే చాలు కాని భూసురులు , వేదాలు ఆయన తర్వాతవే .వాటి గురించి ఆయన చెప్పక్కరలేదు .ప్రవర్తకులైన భూసురులు,వేదాలు ఆయన సనాతనత్వాన్ని చెప్పటానికి సాధనాలు మాత్రమే .సాధ్యమైన పురుషోత్తముడే సిద్ధి౦చాక ,సాధనాల గురించి చెప్పక్కర లేదు .అయినా చెప్పాడు అంటే అందులో ఏదో విశేషం ఉంది అని మనం గ్రహించాలి అంటారు శలాక వారు .వాసుదేవుడు అంటే వాసుదేవుని కుమారుడు అని పురాణ అర్ధం కాదు .’’ఎల్ల యందు దావసించుట ,ఎల్లయును దనయందు వసి యించుటండ్రు వాసుదేవు డని పేరి కర్ధంబు’’అనే తాత్విక అర్ధం మనం గ్రహించాలి అన్నారు ప్రాచార్య శర్మగారు .ఈ తత్వానికి వ్యక్తిగత పక్ష పాతాలు ఉండవని ,ఉంటాయని భావిస్తే మనం తత్వ బాహ్యులం అవుతామని శ్రీ శర్మగారు ఉవాచ .కనుక తేలింది ఏమిటి ?శ్రీ కృష్ణ నిర్ణయం సత్య నిర్ణయం .’’సత్య జ్ఞాన మనంతం బ్రహ్మ ‘’అని కదా శ్రుతి.శ్రీ కృష్ణుని భగవల్లక్షణాలను –పాండవులంత కాకపోయినా –ధృత రాష్ట్రుడు కొంత వరకు తెలిసిన వాడే అనటానికి ఆధారాలున్నాయి .కృష్ణుని అనుగ్రహం తోనే విశ్వ రూప సందర్శన అనుభూతి పొందాడు గుడ్డి రాజు .మళ్ళీ ఆ కళ్ళను మూసేయటం కూడా వాసుదేవుని అనుగ్రహం తోనే .దీన్ని బట్టి కృష్ణుని పక్షపాత రహిత దృష్టి ధృత రాష్ట్రు నికి బాగా తెలిసిందే .కనుక శ్రీ కృష్ణ ఉవాచ సర్వోపాదేయం అనే విషయం లో ఎవ్వరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు శర్మ గారు .
ప్రమాణాలలో తలమానికం వంటిది శబ్ద ప్రమాణం .శబ్ద ప్రమాణం అంటే ఆప్త వాక్యం అని అర్ధం .రాగ ద్వేషం లేని స్వార్ధ దృష్టి లేని ,లోకతత్వం ,పరతత్వం బాగా తెలిసిన మహాత్ములు లోక హిత దృష్టితో ప్రతి పాదించిన సత్యాలే శబ్దాలు అంటారు శలాక శర్మ గారు .అవి తిరుగు లేని ప్రమాణాలు .గుడ్డిరాజు ఎదలోని కాపట్య౦ తెలుసుకోవటానికి ఈ శబ్ద ప్రమాణం బాగా గట్టిగా సహకరిస్తుంది . అదేమిటో వివరంగా తెలుసు కొందాం –
1-పాండురాజు మరణం తర్వాత పరలోక క్రియల అనంతరం వ్యాస భగవానుడు తన తల్లి సత్యవతికి ఏకాంతం లో
‘’మతి దలపగను సంసారం –బతి చంచల ,మెండ మావు లట్టులు ,సంప –త్ప్రతతతు లతి క్షణికంబులు –గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్’’.
2-‘’క్రూరులు ,విలుప్త ధర్మా –చారులు ధృత రాష్ట్ర సుతు లస ద్వ్రుతులు ,ని –ష్కారణ వైరులు ,వీరల –కారణమున నెగులు వుట్టు గౌరవ్యలకున్ ‘’
ఋషి,గ్రంధ ప్రణేత భారత వంశ వివర్ధనుడు ,సాక్షాత్తు నారాయణుడు అనే పేరున్న వ్యాసుని మాటలు ఇవి .రెండవ పద్యం లో గుడ్డిరాజు కొడుకుల లస్వభావం ,దాని ఫలితం విస్పష్టంగా వివరించాడు .’’ధృత రాష్ట్ర సుతులు ‘’అంటే షష్టీ సమాస౦ గా అర్ధంగా తీసుకోరాదని ,’’ధృత రాష్ట్ర శ్చసుతాశ్చ’’అనిఅంటే ధృత రాష్ట్రుడు, సుతులూ అని కవి హృదయంగా చెప్పుకోవాలని అంటారు ప్రాచార్య . దీన్ని ఎలా సమర్ధించాలి ?’’దాని ధృత రాష్ట్రు౦డు తాన యనుభ వి౦చుం ,గానీ మీరీ దారుణంబు చూడక తపో వనంబున కరుగు౦డని చెప్పి చనిన ‘’అని అరణ్య పర్వం లో నన్నయ గారు వ్రాసిన మాటలు విచారిస్తే సత్యం బోధ పడుతుంది అన్నారు శర్మగారు .ధృత రాష్ట్రుడు మూల కారణం కనుక దాని ఫలం ఆయనే అనుభవిస్తాడు అని వ్యాసర్షి హృదయం .ఇంతకంటే పరమ ప్రమాణం ఏం కావాలని ఆచార్య ప్రశ్న .
2-ధృతరాష్ట్రు ని కాపట్యం గురించి అతని సతి గాంధారి ఇంకా స్పష్టంగా చెప్పింది .భారత స్త్రీ సాధారణంగా భర్త తప్పును సమర్ధిస్తుంది .ఏకాంతం లో ఏకి పారేసినా,పది మందిలో వెనకేసుకొస్తుంది .ఈగ వాలనీయదు భర్తమీద . కాని ఈ భారతం లోని స్త్రీ అయిన గాంధారీ దేవి నిండు సభలో ధృతరాష్ట్రు ని స్వభావానికి’’ గొప్ప నీరాజనమే’’పట్టింది .అందులో తన కొడుకులు చెడి పోతున్నారన్న ఆవేదన తప్ప మరో భావనే లేదు .ఎలాగంటారా-చూద్దాం రండి –
రాయబార కృష్ణుడు కరుసభలో చెప్పాల్సింది అంతా చెప్పాక ,దుర్యోధనుడు తన చతుస్టయం తో సభాసదు లందరికి అసహ్యం ఆశ్చర్యం జుగుప్సా పుట్టేట్లు సభనుంచి ‘’వాకౌట్ ‘’చేసేశాడు .కృష్ణుడు చీదరించుకొన్నాడు వాడి వింత ప్రవర్తనకు .ఆవేదనాపడ్డాడు .’’సత్కులము బాలి౦పగ వర్ణింప రాదే దుస్టాత్మకు నీచు నొక్కరిని బోదే భేద మీ జాతికిన్ ‘’అన్నాడు ఉద్యోగ పర్వం లో .’’మా వంశం లో కంసుడు ఇలాగే ప్రవర్తిస్తే ,మా వాళ్ళందరూ నాకు చెబితే ,నేను వాడిని అంతం చేసి వంశం కాపాడాను .మీరు కూడా ఆపని చేసి వంశం రక్షించు కో రాదా ?’’అన్నాడు ఈ మాటలతో ధృత రాష్ట్రు డికి ‘’గుండె జారి గల్లంతైంది ‘’.కృష్ణుడు అన్నంత పనీ చేసి కొంప ముంచు తాడేమోనని బెదిరి పోయాడు గుడ్డిరాజు .వెంటనే విడురుడిని పిలిపించి మనసులోమాట ఉండబట్ట లేక కక్కేశాడు –
‘’బుద్ధి మంతురాలు ,పొందుగ బలుకంగ-నేర్చు ,వచ్చి కొడుకు దేర్చి పోవు –గాన వేగ నీవు గాంధారి దోడితె-మ్మనుడు ,నరిగి యతడు నట్ల చేసె’’
భర్త పిలుపుతో గాంధారి సభలోకి ప్రవేశించింది .రాజు ‘’నీ తనూభవుడు దుర్వినియంబున జనియె నిట్టి వెంగలి గలడే?’’అన్నాడు తానేదో పత్తిత్తు అయినట్లు –
‘’నీవైన జెప్పి శాంతుం –గావింపగ నోపుదేని ,గౌరవ కుల మీ-గోవిందు శాసనము సం –భావి౦ప౦ గాంచి చెడక బ్రతుకుం జుమ్మీ ‘’అని నోరు జారేశాడు .కోపం వచ్చినప్పుడు మన ఇళ్ళలోనూ భార్య భర్తని ,భర్త భార్యని ‘’నీ కొడుకు ‘’అని దెప్పటం ఉందికదా .గుడ్డిరాజు నీకొడుకు అన్నమాట రాజమాత కు ‘’ఎక్కడో ‘’కాలింది .ఇక చెడా మడా కడిగి పారేసింది నిండుసభలో –
‘’అనుడు ‘’నీ పుత్రడవి నీతుడగుట ఎరిగి ,వాని వశంబున నేల పోయె-దీవు ,పాండవులకు నేమి ఇచ్చితేని-నడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప!చెపుమ ‘’అని ఝాడించింది .అంటే ‘’రాజా !తప్పంతా నీదే .నువ్వు తండ్రివి .అధికారం అంతా నీ చేతుల్లోనే ఉంది .వాడు ఆడి౦చి నట్లల్లా ఆడటం నీ లోపం .పాండవులకు నువ్వు ఏది ఎంత ఇస్తే నిన్ను కాదనగలిగే గుండె ఎవరి కుంది ,ఎవరు కాదనగలరు ?’’అంటూ చివరగా ‘’అధిపా ‘’అని అంటించింది కొసరుమాటగా .మామూలు ఆడది అయితే ‘’నీ నిర్వాకం మండినట్లే ఉంది ‘’అన్నదానికి సమానార్ధం .’’అసలు వాడిని అలా తయారు చేసింది నువ్వే నీ పెంపకం లోనే వాడు త్రాస్టుడు భ్రష్టుడు,కులనాశకుడుఅయ్యాడు’’ అని ఈసడింపు .’’అలాంటి వాడికి తండ్రి వైన నువ్వు ‘’నీ కొడుకు ‘’అని నన్ను అనటానికి నీ నోరెలా వచ్చింది ?’’అని రెట్టించింది .’’వాడు అచ్చంగా నీ కొడుకే ఫో ‘’అన్నది .ఎన్నాళ్ళనుంచో అమెమనసులో రగిలి పోతున్న సెగను, నగ్న సత్యాన్ని ఒక్కసారి వెలిగ్రక్కి ఊపిరి పీల్చుకున్నది .ఏ సంకోచం లేకుండా ఆమె మనసులోని మాట అనేసింది .దటీజ్ గా౦ధారిమాత .గుడ్డిరాజు కపట స్వభావం ఎంత బాగా, ఎంత స్పష్టంగా గాంధారి చెప్పిందో మనకు తెలిసింది .భగవద్గీతలో మానవ సంబంధాలలో ఉన్న ఏడు రకాలను 1-సుహ్రుత్తు ,2-మిత్రుడు 3-అరి 4-ఉదాసీనుడు 5-మధ్యస్తుడు6-ద్వేష్యుడు 7-బంధువు అనే వారున్నట్లు చెప్పబడింది .వీళ్ళల్లో ఉదాసీన ,మధ్యస్థ ,బంధువు లఅభిప్రాయాలకు అనేక సందర్భాలలో విలువ ఎక్కువగా ఉంటుంది అంటారు శలాక వారు .గాంధారి దేవి ప్రాణ బంధువు అయిన భర్త స్వరూపం గురించి దాపరికం లేకుండా చెప్పిన మాట శబ్ద ప్రమాణంగా అత్య౦తవిలువైనదని కురువంశ నాశనానికి గుడ్డిరాజే మూలకారణం అని స్పష్టమైంది అన్నారు సమాప్తి చేస్తూ ప్రాచార్య డా శలాక రఘునాధ శర్మ గారు .
వింటే భారతమే వినాలి అనటానికి ఈ ఘట్టం ప్రత్యక్ష నిదర్శనం ‘.
ఆధారం –ముందే చెప్పినట్లు శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’వ్యాస భారత వరి వస్య ‘’గ్రంధం లో ‘’భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు’’వ్యాసం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు
మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన
మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన
‘’బాబు చాలాబిజీ ‘’అన్న రేడియో మిర్చి లాగా అనుక్షణ సాహిత్య గవేషణలో చర్చలలో సాహితీ సభా నిర్వహణలో ,రమ్యభారతి పత్రికా ప్రచురణలో ,స్వంత పుస్తక ప్రచుణలతోపాటు ఇతరు లెందరికోప్రచురణ సాయమందిస్తూ , మా సరసభారతి లాంటి సంస్థలకు పుస్తకాలను డి .టి .పి .దగ్గర్నుంచి ముద్రణ దాకా అన్నీ స్వయంగా చూసి ,పర్యవేక్షించి అందింస్తూ కవితలు ,కధలు రాస్తూ బహుమతుల౦దుకొంటూ ,వాటిల్లో పోటీలు పెట్టి బహుమతుల౦దిస్తూ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి బాధ్యత అత్యంత సమర్ధంగా నిర్వహిస్తూ ,ప్రతి ఆదివారం ఏదో ఒక జిల్లాలో ఆకార్య వర్గ సమావేశానికి హాజరౌతూ ,తన వృత్తికి ఏ మాత్రమూ ఇబ్బంది కలుగకుండా చూసుకొంటూ, కత్తిమీద సాముచేస్తున్న కలం వీరుడు శ్రీ .చలపాక ప్రకాష్ .వామనుడైనా అన్నిటా త్రివిక్రముడు .లబ్ధ ప్రతిష్టులైన కవులు రచయితలెందరితోనో, ఎన్నో సంస్థలతోనో పరిచయం , వర్ధమాన కవులకు ,రచయితలెందరి కో ఆదర్శం ,ఆసరా ప్రకాష్ .
ఇంత బిజీ జీవితం లో కూడా ఆయన దృష్టి అత్యాధునిక ప్రక్రియ నానీ పై పడి, దానిలోతు పాతులను తరచి చూడాలనే సంకల్పం కలిగి ,నిర్విరామ౦గా కృషి చేసి ,తరచూ పత్రికలో నానీలపై వ్యాసాలు రాస్తూ,వాటిపై పరిశోధన పత్రం రచించే సామర్ధ్యం అర్హత ఉందని గుర్తింపు పొంది ,మిత్రుల ప్రోత్సాహం తో ‘’కేంద్ర సాహిత్య మంత్రిత్వ శాఖ వారి ఫెలోషిప్ ‘’కోసం దరఖాస్తు చేసి ,తన సామర్ధ్యానికి గీటురాయిగా ఆ సంస్థ ప్రకాష్ ను ‘’నానీ ప్రాజెక్ట్ ‘’రెండేళ్లలో పూర్తీ చేయటానికి జూనియర్ ఫెలోషిప్ కుఎంపిక చేసి ఒక లక్షా నలభై వేల రూపాయలు నగదు అవార్డ్ అందజేస్తున్నట్లు ప్రకటించటం ,’’నానీ రచన అంతటి వేగంగా’’ జరిగి పోయాయి .’’నానీ ల నాన్న’’ఆచార్య ఎన్.గోపీ గారు( ఎన్ అంటే నానీల అని కూడా అర్ధం తీసుకోవచ్చు) ఫోన్ చేసి ‘’డా .ప్రకాష్ ‘’అని సంబోధించటం తో ప్రకాష్ కృషి ఫలించింది . ప్రతిభ ఉంటే అవకాశాలు ,పురస్కారాలు ఏ రికమండేషన్లూ అక్కర్లేకుండానే వెతుక్కుంటూ వెంట పడతాయి అనటానికి చలపాక ఒక గొప్ప ఉదాహరణ . కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి ‘’ఉత్తమ సాహితీ వేత్త ‘’పురస్కారం అందుకోవటం తో ప్రారంభమైన ఈ సాహితీ దిగ్విజయయాత్ర,అనేక సాహిత్య ,సాంస్కృతిక సంస్థలనుండి పురస్కారాలు ,మూడు పుస్తకాల ముద్రణకు తెలుగు విశ్వ విద్యాలయం నుండి ఆర్ధికసాయం అందుకోవటం ,జాతీయ , అంతర్జాతీయ స్థాయి ,ఆటా ,,నాటా సంస్థల బహుమతుల వరకు కోన సాగుతూనే ఉంది .ఇది ప్రకాష్ ప్రతిభా సర్వస్వం .ఈ అర్హతలతోనే1997 నుండి మూడేళ్ళు నానీల అంతు చూసి ,ఎవరూ స్పృశించని లోతులు తరచి సమగ్రమైన పరిశోధన చేసి ‘’అత్యాధునిక కవితా రూప ప్రక్రియ –నానీ ‘’గ్రంధంగా ప్రచురించారు .దీనినే నిన్న 12-2-17 ఆదివారం సాయంత్రం గుంటూరు బ్రాడీపేట లోని ప్రజాశక్తి గ్రంధాలయ సమావేశ మందిరం లోగుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన సభలో ఆచార్య శ్రీ ఎన్.గోపీ ఆవిష్కరించారు .వేదికపై శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి చిల్లర భవానీ దేవి వంటి ప్రముఖులున్నారు. శ్రీ గోపీ గారు నానీ ప్రాదుర్భవాన్ని ,ఎదుగుదలనువివరించి ప్రకాష్ కృషిని అభినందించారు .శ్రీమతి భవాని గ్రంధం లోని విషయాలను స్థూలంగా తెలియ జేశారు .
22 శీర్షికలో ప్రకాష్ నానీ పూర్వరంగం ,అత్యాధునిక ప్రక్రియ నానీ ,నానీ నిర్మాణం ,కొనసాగింపు ,నానీల వస్తు వైవిధ్యం ,ఏక వస్తు నానీలు ,వినూత్న ప్రయోగాలూ ,నానీలలలో సూక్తులూ ,సుభాషితాలూ ,వాటిలో హాస్య వ్యంగ్య చమత్కారాలు ,నానీ కవయిత్రులు ,ప్రసారమాధ్యమాలలో నానీలు ,నానీలపై జన వాక్యాలు ,వాదోపవాదాలు ,కవుల రచయితల అభిప్రాయాలు ,నానీసంపుటాలు ,అవార్డ్ లు ,కొత్త ప్రక్రియలకు స్పూర్తినిచ్చిన నానీ వగైరాలతో సమగ్ర పరిశోధనాత్మక గ్రంధంగా రచించారు .నాదృష్టిలో ఇది ‘’నానీ సర్వస్వం ‘’.అంతే కాదు శ్రీ చలపాక ప్రతిభా సర్వస్వం (మేగ్నం ఓపస్ )కూడా .352 పేజీల ఈ నానీ పరిశోధనా బృహద్గ్రంధం చక్కని ముఖ చిత్రం తో పాలరాయి లాంటి తెల్లని కాగితాలతో కనుల విందు చేస్తోంది .దీని వెల కేవలం రూ.87 . అందరు కొని తప్పక చదవాల్సిన రిఫరెన్స్ పుస్తకం .
సభ జరుగుతున్నప్పుడు నా ప్రక్కనే కూర్చున్న గుంటూరులో ప్రముఖ వైద్యులు ,కవి, రచయితా, విమర్శకులు డా రమణ యశస్వి తో మాట్లాడటం మహదానందం వేసింది .కాగితం పై నాఅభిప్రాయాలను నానీల్లాంటి రూపం లో రాసి వారికి చూపిస్తుంటే వారి ప్రశంసలు ,హావభావాలు మర్చి పోలేనివైనాయి .వీటినే శ్రీ గోపీ గారికీ ,ప్రకాష్ సుబ్బయ్యగార్లకూ వినిపిస్తే వారూ ఎంతో సంతోషించారు .ఆచిలిపి నానీలు మీకోసం –
1-మైక్రో నానీ పై– మాక్రో పరిశోధన 2-నానీల పరిశోధన –సుఖ ప్రసవానికి –చలపాక –ఒక మంచి నర్సు .
3-‘’గోపీ ‘’నోట –‘’నానీ ‘’నాని –వట వృక్షమై –నేడు నిలబడింది .
నేను ఈ ప్రక్రియ పై అప్పటివరకు ఎప్పుడూ ప్రయత్నించేలేదు .సభ ప్రేరణగా రాసినవి ఇవి .ఇవి నానీలో నూనీలో నేనీలో నాకు తెలియదు .భావావిష్కరణకు నాకు తోడ్పడిన బుజ్జి పదాలు .
కొస మెరుపు -జిల్లా ముఖ్య పట్టణమైన గుంటూరు లో గుంటూరు జిల్లా రచయితల సంఘం నగరం నడి బొడ్డు బ్రాడీ పేటలో సభ నిర్వహిస్తుంటే ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ అధ్యక్ష,కార్యదర్శులు , మాజీ వైస్ చాన్సలర్ ,ప్రముఖ సాహితీవేత్తలు వేదికపై పాల్గొనే ఈ సభలో గుంటూరుపట్టణం వారు పట్టుమని పాతిక మంది లేక పోవటం ,ఇతర సుదూర ప్రాంతాలనుండి వచ్చినవారు 15 మంది ఉండటం బాధ కలిగించింది .సాహిత్య సభలకు ఇలాంటి స్థితి రాకూడదు .పండుగ వాతావరణం లో జరగాల్సిన సభ నీరసంగా జతగటం ఊహించలేకపోయాను .ఈ విషయాన్నే డా రమణ యశస్వి గారితో చెవిలో నెమ్మదిగా చెబితే ‘’ఇక్కడ అంతేనండి .మీకు అక్కడ బాగా వస్తారా ?’’అంటే అవాక్కయ్యాను .
దీనితో పరిశోధనా గ్రంధం ముఖ చిత్రం జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు
11-2-17 శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరణాలలో మేమిద్దరం, మా మనవరాలు రమ్య
This gallery contains 9 photos.
బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు
బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు
గబ్బిట వారు సంగీత ,సాహిత్య రంగాలలో నిష్ణాతులు .శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి నాతో ‘’మీకు గబ్బిట దక్షిణ మూర్తిగారు తెలుసా ?’’అని అడిగితె నేను నోరు వెళ్ళ బెట్టాను .అప్పుడు ఆయనే చెప్పారు దక్షిణామూర్తిగారు మహా గొప్ప సంగీత విద్వాంసులు అని . అలాగే గబ్బిట వెంకటరావు గారు మా జ్ఞాతి అని మా మామ్మా నాన్న చెప్పే వారు కాని వారి గురించీ నాకు తెలియదు .మా మేనమామ గుండు గంగయ్యగారి పెద్దబ్బాయి పద్మనాభానికి గబ్బిట వెంకటరావు గారి భార్య చెల్లెలు శ్రీమతి వెంకట లక్ష్మి నిచ్చి ఆకిరిపల్లి లో వివాహం చేసినప్పుడు వారిని చూశాను. అంతకు ముందు మా చిన్నతనం లో మా ఇంటికి ఆయన వచ్చేవారని అమ్మా నాన్న చెప్పేవారు . తర్వాత ఆయన భార్య చనిపోయినప్పుడు ఆకిరిపల్లిలో కార్యక్రమం చేస్తే వెళ్లాం అప్పుడు చూశాను .2008 లో బాపు గారిని మద్రాస్ లో వారి౦టి వద్ద మా మైనేనిగారి పరిచయం తో వెళ్లి సందర్శించాం .అక్కడే ఉన్న ముళ్ళపూడి రమణ గారి పరిచయమూ కలిగింది .వారిద్దరూ చూపిన ఆప్యాయత మర్చిపోలేనిది .అప్పుడు బాపుగారు నన్ను ‘’మీకు వెంకట రావు గారు తెలుసా ?’’అని అడిగితే మా బంధుత్వం చెప్పాను. ఆయన ఎంతో సంబర పడి ‘’తెలుగు పద్యం రాయాలంటే వెంకట రావు గారే రాయాలి ‘’అంతబాగా రాస్తారు నాకు నచ్చిన ,నేను మెచ్చిన కవి అన్నారు .‘’మహదానందం వేసింది .అలాంటి వెంకటరావు గారి అమ్మాయి వివాహం బెజవాడలో జరిగితే మాకు ఆహ్వానం వస్తే వెళ్ళాము .అదే చివరి సారి ఆయన్ను చూడటం .వాళ్ళబ్బాయి మధు తో మంచి పరిచయం ఉంది.మేము మద్రాస్ వెడితే వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేవాళ్ళం .వాళ్ళు ఉయ్యూరు వస్తే తప్పక మా ఇంటికి వచ్చేవాళ్ళు. మధు కుమారుని వివాహం రెండేళ్ళ క్రితం బెజవాడలో చేస్తే వెళ్లాం .మంచి ఆప్యాయతను ఆతను,అతని సోదరులూ చూపారు .
అలాగే శ్రీ డా.గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్. వారబ్బాయి శ్రీ డా.జయ మాణిక్య శాస్త్రి ఒరిస్సాలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ .చివరి అబ్బాయి శ్రీ డా.నివాస శాస్త్రి వారణాసిలో స్మార్తం లో దిట్ట సంస్కృత గ్రంధ రచయిత ఈ కుటుంబం పామర్రుదగ్గర ఎలమర్రు గ్రామానికి చెందినవారు .వీరిని డిసెంబర్ 4 న ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం ‘’రెండవభాగం ఆవిష్కరణకు ఉయ్యూరు కు ఆహ్వానించగా అందర్నీ చూసే అదృష్టం కలిగింది . వీరందరి గురించి ఎవరో ఒకరు రాయక పొతే ఈ తరానికి తెలియదు .నా తపన అంతా దానికోసమే ‘.
గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే’’ హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారట .సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాసి సుప్రసిద్దులయ్యారు .అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .వెంకట రావు గారు 15-3-1928న శ్రీ గబ్బిట దక్షిణామూర్తి, శ్రీమతిలక్ష్మీ నరసమ్మ దంపతులకు .పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు .కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు .సీనియర్ సముద్రాల ,జగ్గయ్యల ప్రేరణతో సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి దృష్టిలో పడి ఆయన కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కదా మాటలు పాటలు పద్యాలుస్క్రీన్ ప్లే రాసి బాపు ను మెప్పించారు . సీతా కల్యాణం ,సంపూర్ణ రామాయణం లకు కూడా గబ్బిట వారి రచన తోడ్పడింది. ఎన్టి రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .బి ఏ సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భాస్మాసురకూ సంభాషణలు రాశారు .విష్ణుమాయ ,భలే మోసగాడు చిత్రాలు చేశారు .కన్నడం లో శ్రీ చాము౦డేశ్వరి మహిమ ,రాజనర్తకి రహస్యనిర్మించారు ., ఒరియా భాషలో సి ఎస్ రావు డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర నూ నిర్మించారు ,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు
వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు . కుమార్తె గౌరీ విజయ లక్ష్మి .ఇంటి పేరుతో సహా వెండి తెర పై రచయితగా వెలుగొందిన గబ్బిట వెంకటరావు .కళామతల్లి ముద్దు బిడ్డ .శ్రీ వెంకటరావు గారు శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్యం రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి, శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేసి రికార్డ్ నెలకొల్పారు .దీనితో సినిమా తీయాలని ఆయన సంకల్పం .ఇంతటి పూర్ణ ప్రజ్నులైన శ్రీ గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో పరమ పదించారు.
శ్రీ గబ్బిట వెంకటరావు గారి కుటుంబ చిత్రాన్ని జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-12-2-17 –ఉయ్యూరు
ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2
ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2
భారత దేశ తత్వ వేత్తలు ఏదైనా ఒక అంశాన్ని పట్టు కోవటానికి 4 ప్రమాణాలను పాటిస్తారు .అవే ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద ప్రమాణాలు .వీటిలో ఒక దానికంటే మరొకటి క్రమగా బలవత్తరాలు .సాధారణంగా వాదం లో స్వపక్షం ,పర పక్షం ,మధ్యమ పక్షం అనేవి ఉంటాయి .ఒక పక్షానికే చెందిన మాటలు యధా తధంగా ఆమోదించ టానికి వీలు కాదు .రెండు వైపులా ఉన్న ఉత్తమ స్వభావం గలవారి మాటలను ప్రమాణంగా తీసుకోవాలి . వాద ప్రతి వాదులలో అజ్ఞానం చేత ,ఆవేశం చేత తమ తప్పులు ఒప్పుకోవచ్చు .అప్పుడు స్వపక్షం నుంచి వెలువడిన అభిప్రాయాలను ప్రత్యక్ష ప్రమాణాలుగా స్వీకరిస్తారు .ఇలాంటివి మహా భారతం లో చాలా ఉన్నాయి మచ్చుకి కొన్ని చూద్దాం .
1-సంజయ రాయబారం అయిన కౌరవ కొలువులో అర్జునుడి మాటలన్నీ 50 శ్లోకాలో సంజయుడు వృద్ధ రాజుకు చెప్పాడు .భీష్మ ద్రోణాదులు ఆమాటల్ని ధ్రువీకరించారు .’’పాండవులు ఎవరి సాయం తో మామీదకు వస్తారు ?’’అని అడిగాడు గుడ్డిరాజు .ఆమాట సంజయుడికి ఒక విద్యుత్ ఘాతం లా తగిలి మూర్ఛపోయాడు .విదురుడు సంజయుడు మూర్ఛపోయాడని రాజుతో చెప్పాడు .సభలో ఉన్న పెద్ద లందరూ కురు వంశం సర్వ నాశనం అయి పోయింది అనుకున్నారు .అప్పుడు గుడ్డిరాజు ‘’ఆ ఏమీ లేదు .పాండవులు సంజయుడిని బాగా బెదిరించారు అందుకే మూర్ఛపోయాడు’’ అన్నాడు తాపీగా .తేరుకున్న సంజయుడు రాజుతో పాండవుల సహాయ సంపత్తులు బలం ,బలగం ఎంత గొప్పవో అన్నిటినీ పూస గుచ్చినట్లు వివరించాడు .అప్పుడు ధృత రాష్ట్రుడు –భీముని శక్తి సామర్ధ్యాలన్నీ వర్ణిస్తూ 60 శ్లోకాలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు .తన నోటితో తానే పాండవులకు చేసిన అన్యాయాలన్నీ ఏకరువు పెట్టాడు .భీముడి సాహసాన్ని పదే పదే గుర్తు చేసుకొన్నాడు. గుండె చెరువై పోయింది .కొంపలు అంటుకుంటున్నా రాజ్య భాగం గురించి ఒక్క మాట అయినా గుడ్డిరాజు నోటి నుంచి రాలేదు .యుద్ధం చేయటానికే నిశ్చయించాడు .
2- ‘’చావరు ,నొవ్వరు పాండవు –లేవురు నని నీవు చెప్పనిప్పలుకులు దుః-ఖా వేశములై ,చే-తో వ్రుత్తి గరంప జొచ్చె దుర్భర భంగిన్ ‘’అని శల్య పర్వం లో యుద్ధం దాదాపు పూర్తికావచ్చిన సందర్భం లో ధృత రాష్ట్రుడుఅన్నమాటలివి .తనవాళ్ళు అందరూ చచ్చినందుకు పడుతున్న బాధ కంటే ,పాండవులు చావలేదన్న వేదనఅత్యంత ప్రమాణంగా ఆయన వెళ్ళ గక్కాడు .దీన్ని ఆధారంగా ఒక సారి ఫ్లాష్ బాక్ కు వెడితే గుడ్డిరాజు నిజస్వరూపం తెలుస్తుంది .యుద్ధాన్ని ఆయన ఎంతగా ఇష్టంగా కోరుకున్నాడో ,యుద్ధం ద్వారా ఎలాంటి ఫలితాన్ని అంటే పాండవుల సర్వ నాశనాన్ని ఎలా కోరుకున్నాడో అవగత మవుతుంది .ఇంతకంటే ధృతరాష్ట్రు ని లోగిలి అంటే అంతరంగానికి ప్రత్యక్ష ప్రమాణం వేరుగా ఇంకోటి ఏమీ అక్కర్లేదు అన్నారు ప్రాచార్య శర్మగారు .
అనుమాన ప్రమాణం ద్వారాకూడా గుడ్డి రాజు కపట వృత్తిని నిశ్చయింప వచ్చు అన్నారు శర్మగారు .క్రియాశీలురు దుర్యోధనాదులే అయినా వారికి మూల శక్తి ముసలిరాజే .లోకం లో ప్రతి గ్రూపుకూ వీరాభిమానులు చాలా మందే ఉంటారు .ఇక్కడ కౌరవ పక్షాన్నిమనస్పూర్తిగా ఆరాధించిన వాళ్ళు కనబడటం, కాని వారి పేర్లను పెట్టుకోవటం కాని మనకు కని పించదు.అంటే వాళ్ళ అ౦తరాంతరాలలో ఎక్కడో ఎవరు ఎలాంటి వారు అనే అభిప్రాయం గూడు కట్టుకొనే ఉంది అని ఊహించవచ్చు అంటారు శర్మగారు .
సమర్ధ మైన ప్రమాణంగా కవి ఉపమానాన్ని స్వీకరిస్తాడు .మహాభారతం లో రెండు పక్షాలవారినీ శ్రీ కృష్ణుడు ఉపమాన ప్రమాణం ద్వారాఉద్యోగ పర్వం లో విస్పష్టంగా వివరించాడు –
‘’రోషమయ మహాతరువు సుయోధనుడు,రు –స్కంధ మందులో న గర్ణు డలరు-గొమ్మ సౌబలుడు ,గుసుమ ఫలములు ,దు –శ్శాసనుండు ,మూల శక్తి తండ్రి ‘’
‘’ధర్మజుండు ధర్మ తరు ,వర్జునుడు ఘన –స్కంధ ,మనిల సుతుడు శాఖ ,కవలు –పుష్ప ఫలము ,లేను ,భూసురులును ,వేద –ములు దదీయ మైన మూల చయము ‘’.
ఈ రెండు పద్యాలు చాలా బలమైనవి. భారత తత్త్వం అంతా వీటిలో బీజ ప్రాయంగా ఇమిడి ఉండి .దీనిలో ధృత రాష్ట్రు ని తత్త్వం విస్పష్టంగా కనిపిస్తోంది .’’మూల శక్తి తండ్రి ‘’అనటం లో నెపం దుర్యోధనుడి మీదకు నేట్టేయటానికి వీలు లేదు .ఈ చెట్టు ‘’అసారం ‘’అనీ రెండవ చెట్టు ‘’గాఢ సార సహితం ‘’అనీ శ్రీ కృష్ణ నిర్ణయం .ఇక్కడ అందరికీ ఒక అనుమానం రావచ్చు .పాండవ పక్షపాతి కదా నల్లవాడు ఆయన చెప్పిన మాట పక్షపాతం తో ఉండటం సహజం కదా అటువంటప్పుడు దాన్ని పట్టుకొని వేలాడటం భావ్యమేనా .అందుకే కృష్ణుడు చమత్కారంగా ‘’ధర్మ తరువునకు మూల చయం –ఏను ,భూసురులు ,వేదములు ‘’అన్నాడు దీన్ని తాత్వికంగా లోతుగా తరచి చూడాలి .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 12-2-17 –ఉయ్యూరు
ధృతరాస్ట్ర లో(కౌ)గిలి
ధృతరాస్ట్ర లో(కౌ)గిలి
కురుక్షేత్ర యుద్ధానంతరం నిర్వేదనకు గురైన ధృత రాష్ట్రుడు కౌరవ వంశాన్ని నిర్వంశం చేసిన భీముని పై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో భావించి పైకి భీముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ అతని కౌగిలి కోరటం ఈ దుష్టపన్నాగం గమనించిన శ్రీ కృష్ణుడు భీముడికి బదులు లోహ భీముడిని తయారు చేయించి కౌగలించుకోమనటం, ధృత రాష్ట్ర కౌగిలి లో ఆ ఇనుప భీమ విగ్రహం పొడి పొడి అవటం మనం విన్నాం ,సినిమాలలోనూ చూశాం .అంతటి కాపట్య౦ ఉన్నవాడు గుడ్డిరాజు .మహాభారతానికి నాయకుడు ధర్మరాజు , నాయక నాయకుడు శ్రీ కృష్ణుడు .కృష్ణుడు ఆడించినట్లే భారతం నడిచింది అనిలోకం విశ్వ సిస్తుంది .కాని కురువంశ వినాశనానికి ముఖ్య మూల కారణం అ౦బి కాతనయుడైన గుడ్డి రాజే అని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’వ్యాస భారత వరి వస్య ‘’గ్రంధం లో ‘భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు ‘’వ్యాసం లో చాలా లోతుగా పరిశీలించి వ్రాశారు .ధృత రాష్ట్రుని బాహ్య ప్రవృత్తి కౌగిలి లో బయట పడితే ,ఆ౦తరిక ప్రవ్రుత్తి హృదయం అనే గృహం అంటే లోగిలిలో బందీ గా ఉన్నది అని నాకు అని పించి, శలాక వారి అభిప్రాయాలలోని ముఖ్య విషయాలను అందరూ తప్పక తెలుసుకోవాలన్న అభిప్రాయం తో మీకు అందించే ఉద్దేశ్యం తో శీర్షిక గా ‘’ధృత రాష్ట్ర లో(కౌ )గిలి ‘’అని రెండూ కలిసి వచ్చేట్లు పెట్టి రాస్తున్నాను .సాహసానికి మన్నించండి .
‘’ పారమార్ధిక దృష్టి లో చూస్తే భారత యుద్ధానికి మూలకారణం శ్రీ కృష్ణ పరమాత్మ .రాజకీయ దృక్పధం తో చూస్తే రాజ్యం పైఆశ .మానవత్వ కోణం లో చెప్పాలి అంటే సర్వ అనర్ధాలకు మూలకారణం ధృత రాష్ట్రుడే ‘’అన్నారు శ్రీ శలాక శర్మగారు .పరమార్ధం శరీరం ,శరీరి ,తత్త్వం మొదలైన అంశాలకు సంబంధించింది .భారతం తత్వ ప్రధాన గ్రంధం .ధృత రాష్ట్ర పక్షం అసుర భావాలకు ,పాండవ పక్షం దివ్య భావాలకూ ప్రతీకలు .ఈరెండిటికి శరీరం లోను ,విశ్వ శరీరం లోను నిత్య సంఘర్షణ ఉంటుంది .పరమాత్మను ఆశ్రయించిన దైవ సంపత్తి ,ఆసుర సంపత్తిని సర్వ నాశనం చేస్తుంది .దీన్ని ఆడించేవాడు పరమాత్మ .ఆయన కర్తవ్యాలు సాధు పరి రక్షణ ,,అసాధు శిక్షణ ,ధర్మ స్థాపన .మానవుని లో చెలరేగే దుస్ట భావాలు- అంటే సచ్చిదానంద తత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అజ్ఞానం మొదలైనవి అసాదువులు .వీటికి వ్యక్తిత్వం వస్తే ధృత రాస్ట్రుడు మొదలైన వారు ఏర్పడుతారు .ఆత్మ తత్వాన్ని ఆశ్రయించి ,కర్మాది యోగాలద్వారా స్వస్థితిని చేరుకొనే జ్ఞానాశిస్ట భావాలే సాదు శబ్దవాచ్యాలు .వీటికి రూపకల్పన జరిగితే పాండవులు అవుతారు .ధర్మ సంస్థాపన అంటే వేరే ఏదో కాదు –పై రెండు పనులు జరిగితే ఏర్పడే స్థితి .చీకటి తొలగి వెలుగు వచ్చినట్లు అన్నమాట .ఈదృష్టి తో చూస్తే ,సర్వాంతర్యామి ,సర్వజ్ఞుడు ,సర్వ కారణుడు ,వాసుదేవ రూపం లో అవతరించిన పరమాత్మ మహా భారత యుద్ధానికి కర్త ,కారయిత ‘’అన్నారు మహా వ్యాఖ్యాన శిరోమణి శలాక శర్మగారు .సాక్షాత్తు అపర సూత మహర్షి అనిపిస్తారు .
యుద్ధానికి రెండవ కారణం రాజ్యాశ .నిజంగా ఇది రాజులకు దోషం కాదు .ఇక్కడ పాండవ కౌరవులలో రెండు పక్షాలు సర్వ నాశనం కాకుండా మధ్యే మార్గం సూచింపబడింది .అదే రాజ్యం లో సగభాగం .అదీ కుదరక పొతే అయిదు ఊళ్లు అయినా ఇవ్వటం .కాని కౌరవ పక్షం ‘’వాడి సూది మొన ఇంచుక మోపిన యంత మాత్రయున్ భూమి యొనర్చి ‘’ఇవ్వను ఫో అన్నది .ఇంకొంచెం దూకుడుగా ముందుకు వెళ్లి ‘’ఎవ్వరైన సంగ్రామమునన్ జయంబు గొని రాజ్యము చేయుట నిశ్చయించితి ‘’అనేదాకా వెళ్ళింది .అంతేనా ‘’ఆ మహా భోగం ‘’సిద్ధి౦చేదాకా పట్టిన పట్టు విడువకుండా అంగుళం కదలకుండా కూర్చున్నది .రాజ్యం వీరభోజ్యం అన్నంత మాత్రాన ధర్మం ,న్యాయం ఇచ్చి పుచ్చుకొనే పద్ధతీ ,సోదరత్వం మొదలైన మంచి లక్షణాలను మంట గలిసి పోయేలా ప్రవర్తి౦చటం వివేక వంతుల లక్షణం కాదు .వీటికోసం ఒక పక్షం అంటే పాండవ పక్షం చేయవలసిన కృషి అంతా చేసింది .ఇంగ్లీష్ లో ‘’గివ్ హిం ఏ లాంగ్ రోప్ ‘’అన్నట్లు చాలా ఉదారంగా వ్యవహరించింది .ఎంతటి మహోన్నత త్యాగాలకైనా ,ఎన్ని విపత్తుల కైనా తట్టుకోవాలని దృఢ సంకల్పం తో ఉంది. రెండవ పక్షమైన కౌరవ పక్షం వీటిని నామ రూపాలు లేకుండా ,తుడిచి పెట్టటానికి శాయ శక్తులా ప్రయత్నించింది.ఫలం అనుభవించింది . మితిమీరిన అర్ధ లోభం ఎంత భయంకరంగా పరిణమిస్తుందో కురుక్షేత్ర యుద్ధం నిరూపించింది .ఈ దృష్టి లో మహా భారత యుద్ధానికి అసలు కారణం అధికార దాహం .ఇది కౌరవులలో కొండంత గా ఉంటె పాండవులలో గోరంత గా ఉన్నది .
తత్వానికీ ,అర్ధ లోభత్వానికీ మధ్యలో వాటితో విడదీయరాని సంబంధం ఉన్న మానవత్వం అనే ముడి ఒకటి ఉంది.అనేక కోణాలలో మానవుడు పశుతుల్యుడే ,కొన్ని కోణాలలో విశిష్టుడుగా కనిపిస్తాడు .ఈ కొన్ని కోణాలలో నిలదోక్కుకుని నిలబడితేనే అతని మానవత్వం పరిగణన లోకి వస్తుంది .పైన చెప్పిన ధర్మం, న్యాయం మొదలైనవే ఆ కొన్ని కోణాలు .ఈ విషయాలలో ఒక నీతి ,నియమం ,లేకుండా ప్రవర్తించి సర్వ నాశనం తెచ్చుకున్నవారు దుర్యోధనుడు ,కర్ణుడు ,శకుని ,దుశ్శాసనుడు .నైతిక బలం తో, అధికార దృష్టితో ,పెద్దల మద్దతు తో ,వీరిని అదుపులో పెట్టుకొనే సమర్ధత ఉన్నా ,కన్నుకావని పుత్ర వాత్సల్యం తో ,దురాశ,సంకుచిత స్వభావం తో చాటుగా ,సూటిగా కూడా ప్రోత్సహించినవాడు ధృత రాష్ట్రుడు.అతని కపటత్వమే కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణమై౦ది .దీన్ని నిరూపించటానికి ప్రత్యక్ష ,పరోక్ష నిదర్శనాలున్నాయ౦టున్నారు శ్రీ శలాక వారు .వాటిని గురించి తరువాత తెలుసు కొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-17 –ఉయ్యూరు
—
11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్
11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్
విజయవాడ నవ్య నాద నీరాజనం
మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి నమస్తే -విజయవాడ కార్యక్రమాన్ని నెట్ లో పంపటమేగాక విడిగా పోస్ట్ లో ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు . రెండేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం మహదానందంగా ఉన్నది . నిన్నటి మీ నవ్య నాద నీరాజన0 లో తబలా మోత ,కీ బోర్డు హోరు మీ మాధుర్య గాత్రానికి గ్రహణం పట్టించాయేమో నని పించింది
.మీ ప్రయత్నం అద్వితీయం అనితర సాధ్యం .ఘంటసాల సంగీతానికి, స్వర మాధుర్యానికి మీరు మాట .పాట ద్వారా చేస్తున్న విశ్లేషణ ,ప్రచారం అత్యున్నత స్థాయి లో ఉండి మాస్టారిపై గౌరవం నేటికీ రోజు రోజుకూ పెరిగేట్లు ఉండటం మీద్వారా ఆ కృషి జరగటం వారిపై మీకున్న ఆరాధనాభావానికి, ,రసజ్ఞులలోవారిపై ఉన్న ఆదరణ భావానికి నిలువెత్తు నిదర్శనం . బహుశా భారత దేశం లో ఏ సినీ సంగీతగాయకునికి ఘంటసాల మాస్టారు గారికి ఉన్న ఆరాధన ,దాన్నికార్య రూపం లోసప్తాహాలు ,ఏకాహాలు బృందగానాలు గా నిర్వహించటం జరుగుతున్న దాఖలాలు లేవు . అది ఒక్క మాస్టారు గారికే లభించింది . మరీ ప్రత్యేకంగా వారి గాత్ర ,రాగ స్వర మాధుర్యాలను సభాముఖంగా విశ్లేషణ చేస్తూ ,ఆధునికతను జోడిస్తూ ,వాటిలోని శాస్త్రీయ సంగీతపు లోతులను తెలియ జేస్తూ మీరు చేస్తున్న ప్రచార వ్యాప్తి మరే గాయకునికీ దక్కలేదు అని నిర్ద్వంద్వముగా చెప్పవచ్చు దీనిద్వారా మీరు తరిస్తూ రసజ్ఞ లోకాన్నీ మీవెంట తీసుకొని వెడుతూ తరింప జేస్తున్నందుకు తెలుగు జాతి మీకు ఎంతో రుణ పడి ఉంది .. మీ పరిశోధన ఏ విశ్వ విద్యాలయమూ చేయలేనంత బృహత్తర మైనది . ఘ0టసాలగారే పాడుతున్నారా ,వారే తమ స్వర రాగాలను విశ్లేషించి మనకు చెబుతున్నారా అన్నంత మమైక్యత సాధించి” అపర ఘంటసాల” అని పిస్తున్నారు .మీ జీవితం ధన్యం .వింటున్న, చూస్తున్న మా జీవితాలూ ధన్యాతి ధన్యం .ఈ పొడి మాటల పుష్పాలతో మీ సేవకు అర్చన చేస్తూ -మీ దుర్గా ప్రసాద్
—
10-2-17 శుక్రవారం ఘంటసాల సంగీత కళాశాలలోఘంటసాల వర్ధంతి సందర్భం గాశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి నవ్య నాద నీరాజనం
This gallery contains 28 photos.
గీర్వాణ కవుల కవితా గీ ర్వాణం -3 62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )
95 ఏళ్ళు పూర్ణాయుస్సుతో వర్ధిల్లిన కె.పి. నారాయణ పిశరోడి 23-8-1909న కేరళలోని పాలకాడు జిల్లా పట్టా౦బి దగ్గర పుతిస్సేరి పశుపతి నంబూద్రి ,నారాయణి పిశురస్యార్ దంపతులకు జన్మించాడు .మహా విద్వాంసులైన పున్నస్సేరి నంబి నీల కంఠ శర్మ ,అత్తూర్ కృష్ణ పిశరోడి ల వద్ద సంస్కృత కావ్యాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు.19 32 లో పట్టా౦బి లోని సంస్కృత కళాశాల నుండి సాహిత్య శిరోమణి పరీక్ష ఉత్తీర్ణుడై చాలా స్కూళ్ళు ,కాలేజీలలో సంస్కృత ,మళయాళలను బోధించాడు ..కేరళ వర్మ కాలేజి లో రిటైర్ అయ్యాక యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ ఫెలోషిప్ సాయం తో పరిశోధన చేశాడు .మణి దీపం, కళాలోకం , శ్రుతి మండపం ,ధనంజయం ,తోరణాయుధాంకం ,కాళిదాస హృదయం ,అత్తూర్ ,నాట్య శాస్త్రం (అనువాదం ) రచించాడు .సాహిత్య నిపుణ ,పండిత తిలకం ,సాహిత్య రత్నం బిరుదులు పొందాడు కేరళ ప్రభుత్వసాహిత్యం సేవకు అందజేసే అత్యున్నత ‘’ఎదు తచ్చన్ ‘’,పురస్కారం ‘’అందుకున్నాడు .20-3-2004 న 95 వ ఏట నారాయణ పిశరోడి నారాయణ లోకం వైకుంఠం చేరుకున్నాడు ..
63-వ్యాస మధ్వ ప్రతిష్టాన ట్రస్ట్ ఏర్పాటు చేసిన –వ్యాసంకర ప్రభంజనా చార్య
భారత దేశ అత్యున్నత సంస్కృత విద్వాంసులలో ఒకరుగా పేరెన్నిక గన్నవాడు వ్యాసంకర ప్రభంజనా చార్య .మధ్వాచార్యుల ద్వైత మత ప్రచారకుడు .మధ్వవేదాంత శాస్త్రం పై అనేక గ్రంధాలు రాశాడు .దేశ ,విదేశాలలోని ఎన్నో సంస్థలు ఆయనకు విశేష బిరుదులను ప్రదానం చేసి సన్మానించాయి .1994 లో బెంగళూర్ లో జరిగిన అఖిలభారత మధ్వ వేదాంత సభకు చైర్మన్ గా వ్యవహరించాడు .బెంగళూర్ లోని ఫస్ట్ గ్రేడ్ గవర్నమెంట్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశాడు .స్వచ్చందం గా పదవీ విరమణ చేసి వేదాంత భావ వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేశాడు .’’జయతీర్ధ వ్రాత ప్రతి గ్రంధాలయం ‘’స్థాపించి అంతవరకూ ముద్రించని ,అరుదైన భారతీయ తత్వ శాస్త్ర గ్రంధాలను ప్రచురించాడు .ప్రచురించిన వాటిలో భారత ,భాగవత ,భగవద్గీత వంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి .
‘’ వ్యాస మధ్వ సంశోధన ప్రతిష్టాన ట్రస్ట్’’ నెలకొల్పి ,భారతీయ సంస్కృతీ, విలువలు ,సంప్రదాయాలను పరిరక్షింఛి వ్యాప్తి చెందించే కార్య క్రమాన్ని చేబట్టాడు .’’ఐతరేయ ప్రకాశన ‘’అనే ముద్రణాలయం ఏర్పరచి ఎన్నో విలువైన గ్రంధాలను ముద్రించాడు .వైష్ణవ సంప్రదాయానికి చెందిన వందలాది స్తుతులను స్తోత్రాలను సేకరించి’’స్తోత్రమాలిక ‘’గా వెలువరించాడు .శ్రీమతి జయశ్రీని వివాహమాడి ఒక కుమారుడిని పెంచుకున్నారు ..
ప్రభంజనాచార్య సంస్కృత సాహిత్య సేవకు భారత రాష్ట్ర పతి 2005 లో పురస్కారం అందజేశారు .ఆచార్యుల వారి రచనా ప్రభంజనం –శ్రీ జయ తీర్ధ దర్శన ,బ్రహ్మ సూత్ర నామావళి,పూర్ణ ప్రజన దర్శన ,సదాచార వినోద ,శ్రీ వేద వ్యాస దర్శన ,శ్రీ బ్రహ్మణ్య తీర్దారు ,ప్రవచన భారతి ,శ్రీ మధ్వాచార్య కాల నిర్ణయ ,శ్రీ రాఘవేంద్ర దర్శన .
64-సంస్కృత ,సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ –వి.రాఘవన్(1908 -1979 )
1908 లో జన్మించి 71 వ ఏట 1979 లో మరణించిన వి. రాఘవన్ సంగీతం లో సంస్కృతం లో సవ్య సాచి .అనేక గ్రందాల రచయిత, అత్యున్నన్నత పురస్కార గ్రహీత .120గ్రంధాలు ,1200 పరిశోధన వ్యాసాలు రాసిన మహా రచయిత రాఘవన్ .1963 లో భోజుని బృహత్ గ్రంధమైన శృంగార ప్రకాశిక నుఅనువదించాడు .దీని అనువాదానికి ,అత్యున్నత వ్యాఖ్యానానికి 1966 లో సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .దీన్ని హార్వర్డ్ ఓరియెంటల్ సిరీస్ వారు మళ్ళీ ప్రచురించారు .రవీంద్రుని మొదటినాటకం ‘’వాల్మీకి ప్రతిభ ‘’నుఅనువదించాడు .బోయవాడు పరిణామం చెంది వాల్మీకి మహర్షిగా మారిన కధను టాగూర్ అపూర్వంగా సృష్టించాడు .మయూరజుని’’ఉత్తర రాఘవం ‘’నాటకాన్ని శోధించి సాధించి వెలువరించాడు .1958లో ‘’సంస్కృత రంగ ‘’అనే నాటక శాల స్థాపించి చాలా సంస్కృత నాటకాలు ప్రదర్శించాడు . కర్ణాటక సంగీతం లో ప్రావీణ్యం సాధించి మద్రాస్ మ్యూజిక్ అకాడేమికి 1944 నుండి మరణించేదాకా సెక్రెటరి గా ఉన్నాడు .ఆయన కుమార్తె నందినీ రమణి గొప్ప కళా విమర్శకురాలు .ఆయన మరణానతరం ‘’వి .రాఘవన్ రిసెర్చ్ సెంటర్ ‘’ను నెలకొల్పారు .2008 లో రాఘవన్ ప్రధమ శత జయంతిని ఘనంగా నిర్వహించారు .రాఘవన్ పై ‘’స్మ్రుతి కుసుమాంజలి ‘’అనే ప్రత్యెక సావనీర్ నుప్రచురించారు .అందులో ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ,వైస్ ప్రెసిడెంట్ వి.వి .గిరి గార్ల ప్రశంసలున్నాయి .ప్రముఖ రచయితా వ్యాఖ్యాత కపిలా వాత్సాయన్ ‘’ No work on Indian aesthetics is complete without its quoting Dr. Raghavan’’ అన్నమాటలు యదార్ధం .
65-ప్రబంధ సార న్యాయ గ్రంధ కర్త –గంగా సహాయ్(1840- వ శతాబ్దం )
రాజ పుటానాలోని షికార్ జిల్లా పటాన్ లో ఉన్నత బ్రాహ్మనవంశం లో సహాయ జన్మించాడు .అక్కడే చదివి పండితుల ప్రబోధం తో ఉన్నత విద్య కోసం కాశీ వెళ్ళాడు .అక్కడ గొప్ప పండితులవద్ద వేద ,శాస్త్ర ,పురాణ ఉపనిషత్తులను రెండేళ్లలో అధ్యయనం చేసి తిరుగులేని మహా విద్వాంసుడు అని పించుకొన్నాడు .అక్కడి ఆచార్యులు సహాయ్ వైదుష్యానికి ఆశ్చర్య పడి ఆయన తమకు మరింత విజ్ఞాననం ప్రసాదింఛి మార్గ దర్శకం చేయాలని కోరారు .బుండీ మహారాజు గంగా సహాయ ను దర్శించి తన బుండీ రాజ్య పాలన అత్యంత సమర్ధ వంతంగా నిర్వ హించటానికి మార్గ దర్శనం చేయమని అభ్యర్ధించాడు ..దీని తో సంస్కృత పండిత కవి గంగా సహాయ్.1877 నుంచి 1913 వరకు బుండీ రాజ్యానికి దివాన్ గా వ్యవహరించాడు .
.న్యాయ శాస్త్రం లో మహా విద్వాంసుడు .భాగవత మహా పురాణాన్ని లిప్య౦తరీకరణ(ట్రాన్సిలరేట్ ) చేసి ,అనువదింఛి వ్యాఖ్యానించాడు .అంటే పండితులకు మాత్రమె ఆ నాడు అర్ధమయ్యే రీతిలో ఉన్నభాషను ఆధునికంగా అందరికి సులభంగా అర్ధమయ్యే రీతిలో రాశాడన్నమాట. దీనికి ఆయన ‘’అన్వితార్ధ ప్రకాశిక ‘’అనే సార్ధక నామాన్ని పెట్టాడు .1901 లో దీనిని బొంబాయి లోని వెంకటేశ్వర ప్రెస్ ముద్రించింది .
1877 నుంచి 1930 వరకు ఆయన 127 గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇందులో బుండి రాజ్య చరిత్ర అయిన ‘’వ౦స్ ప్రకాష్ ‘’కూడా ఉంది .’’కాందార్ ,‘’పండిత ‘’బిరుదులు పొందాడు .1880లో ‘’ప్రబంధ సార ‘’రచించాడు .రాజస్థాన్ లో ఇదే అతి ప్రాచీన న్యాయ శాస్త్ర గ్రంధం .అంతకు ముందు వరకు రాజస్తాన్ లో స్థానిక న్యాయ చట్టాలు సంప్రదాయం ,ఆచార వ్యవహారాలమీద ఆధార పడి ఉండేవి .బుండీ నగర ద్వారాల్లో ఒక దానికి ‘’పండిట్ గంగా సహాయ్ ‘’పేరు పెట్టి గౌరవించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17-ఉయ్యూరు
.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )
29-9-1875 న కేరళలో వాడక్కేదతునారాయణ నంబూద్రి ,పాపికుట్టి పిశరస్యార్ దంపతులకు త్రిసూర్ జిల్లా అత్తూర్ అనే కుగ్రామం లో కృష్ణ పిశోరడి జన్మించాడు . స్వగ్రామ౦ లోనే ప్రాధమిక విద్య పూర్తీ చేసి మేనమామ భారత పిశోరడి ప్రేరణతో సంస్కృతం నేర్చాడు .తర్వాత వ్యాకరణం ,కావ్యాలలో వెలదాతు రామున్నినంబియార్ వద్ద నేర్చి పండితుడైనాడు .వెంగేరి వాసుదేవ నంబూద్రి అనే బాబాయ్ తన ఇంటికి ఆహ్వానించి అలంకార వ్యాకరణ న్యాయ శాస్త్రాలలో నిష్ణాతుని చేశాడు .చేరువంనూర్ సభామఠంలో వృద్ధ పెదనాన్న నిర్వ హించే వేద పాఠ శాల నిర్వహణలో రెండేళ్ళు సహాకయకుడుగా ఉన్నాడు .ఈ నిర్వహణ బాధ్యత ఇష్టం లేక దాచుకొన్న పాతిక రూపాయలతో కొడు౦గలూర్ కోవిలక్కం కు వెళ్ళిపోయాడు .
అప్పటికే అలంకార న్యాయ శాస్త్రాలావు ఉద్దండుడైన అత్తూర్ కృష్ణ భట్టాశ్రీ గోదావర్మ తమ్పురాన్ వద్ద న్యాయం లో ప్రత్త్యేక శిక్షణ పొందాడు .ఇక్కడ ఆయన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకున్నాడు .22వ ఏట పూర్ణ ప్రజ్ఞతో స్వగ్రామం చేరి సంస్కృత భాషను నేర్పటం ప్రారంభించాడు .తాను అద్దె కు ఉంటున్న ఇంటి యజమాని మూప్పి నాయరు కృష్ణ మొదటి శిష్యుడు .నాయర్ కు సంస్కృతం నేర్పుతూ ఆయనవద్ద వీణ నేర్చుకొన్నాడు .25 వ ఏట నన్ని కుట్టి ని వివాహమాడాడు .మామగారుభారత పిశోరడి గొప్ప వైణిక విద్వాంసుడు .కూతురూ మంచి వైణికురాలు .భార్య ,మామగారు వైణికులు అవటం తో అత్తూర్ వీణా సాధన అద్వితీయంగా సాగింది.వీరిఅన్యోన్య దాంపత్యం 56 ఏళ్ళునిరాఘాటం గా కొనసాగింది .తరువాత భార్య మరణించింది .
అలట్టూర్ హై స్కూల్ లో టీచర్ గా జీవితం ప్రారంభించి ,తర్వాత 5 ఏళ్ళు త్రిసూర్ లోని భారత విలాసం ప్రెస్ లో పని చేశాడు .కేరళ పాణిని బిరుదాంకితుడైన ఎ.రాజరాజ వర్మ ఆహ్వానం పై తిరువనంతపురం మహా రాజా కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా వర్మ స్థానం లో చేరాడు . ఓరియెంటల్ డిపార్ట్ మెంట్ కు 16 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాడు .19 27 లో తిరువాన్కూర్ మహారాజుకు ట్యూటర్ గా నియమింపబడి అయిదేళ్ళున్నాడు . పదవీ విరమణతర్వాత స్వగ్రామం త్రిస్సూర్ వెళ్లి అనుక్షణ వ్యాపకం తో సుఖ జీవనం గడిపాడు . ‘’శ్రీ తిలకం ‘’అనే స్వగృహం నిర్మించుకొని దానిని సంగీత గురుకులంగా నిర్వహించి ఎందరికో సంగీత విద్య నేర్పాడు . కవి, సంగీతకారుడు ,నాటక రచయితా ,వ్యాసరచయిత మహా విద్వాంసుడు,పరిశోధకుడు సంస్కృత ,మళయాళ భాషా పండితుడు అయిన కృష్ణ’’విద్యాధనం సర్వ ధన ప్రధానం ‘’అనే సూక్తిని ‘’విద్యా దదాతి వినయం ‘’అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు .వినయ౦ ,సర్వోత్కృష్ట గుణ సంపన్నుడు .నేర్పటం ఎంత ఇష్టమో ఇతరుల వద్ద నేర్చుకోవటమూ ఆయనకు అంతే ఇష్టం అని గురువు కె.పి నారాయణ పిశోరడి అన్నమాటలు పూర్తీ సత్యాలు .
భారత విలాసం ప్రెస్ లో పని చేసినప్పుడు ‘’మణి దీపిక ‘’పై వ్రాసిన సమీక్ష రాజరాజ వర్మ దృష్టిలో పడి మహా రాజా కాలేజి కి ఆహ్వానించాడు .రాజరాజ వర్మవద్ద పరిశోధనకు సంబంధించిన మెళకువలు గ్రహించాడు .భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన గణపతి శాస్త్రి తో పరిచయం మంచి మార్పు తెచ్చింది .ప్రాధమిక వ్యాకరణ గ్రంధం ‘’బాలరత్నం ‘’రాసి ,చారిత్రిక భాషా సాహిత్య గ్రంధంగా ‘’లీలాతిలకం ‘’రచించాడు .అనేక విషయాలపై బహు గ్రంధాలు రాశాడు .’’రసిక రత్నం’’జర్నల్ స్థాపించి వెలుగు చూడని ఎన్నో కావ్యాలను వెలుగులోకి తెచ్చాడు .మహాకవి కాళిదాసు శాకుంతల నాటకం ను ‘’కేరళ శాకుంతలం ‘’గా 1937 లో రాసి ప్రచురించాడు . దీన్ని మెచ్చిన కొచ్చిన్ మహారాజు ‘’పండిత రాజ ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .
ఆయన ప్రతిభా సర్వస్వం గా సంగీతం పై అనేక సంవత్సరాలు పరిశోధన చేసి రచించిన ‘’సంగీత చంద్రిక ‘’1954 లో ప్రచురించాడు.12అధ్యాయాలతో 700పేజీలున్న బృహత్ గ్రంథమిది .ఇందులో నాద, శ్రుతి స్వర ,వీణ గ్రామ మూర్చన ,మేళ తాళ , వర్ణాలంకార , గమకస్థాయి ,,ప్రబంధ రాగ ,గీత అధ్యాయాలున్నాయి .1728 సూత్రాలకు మూలం, సూత్ర భాష్యం రాశాడు .చివరి అధ్యాయం’’ గీత ‘’లో రామాయణానికి సంబంధించిన కధలకు చెందిన 443 గీతాలు దేనికది ప్రత్యేక రాగ౦ ,,తాళం లో న్నాయి .వీటికి సాహిత్యం స్వరమూ కూడా కూర్చాడు . .గ్రంధం అద్భుత విశ్లేషణాత్మక వివరణ గా ప్రత్యేకంగా రూపొందించాడు .ఇందులో భరతుని నుంచి ఆధునిక కాలం వారి వరకు ఉన్న వారి వ్యాఖ్యానాలన్నీ పొందు పరచాడు .
పిశోరడి రచనలు –సంగీత చంద్రిక ,భాష్యువుం ,సాహిత్యవుం ,కేరళ సాహిత్య చరితం ,కేరళ చరితం ,విద్యా వివేకం ,భాష దర్పణం ,ఉత్తర రామాయణం (అనువాదం ),శాకుంతలం (అనువాదం )లీలాతిలకం -వ్యాఖ్య .జీవిత౦ లో చివరి రోజు వరకు సాహిత్య సంగీత కృషి చేస్తూనే 5-6-1964 న స్వగృహం ‘’శ్రీతిలకం ‘’లో బంధు మిత్రులందరి సమక్షం లో 89 వ ఏట మహా సంస్కృత సంగీత విద్వాంసుడు అత్తూర్ కృష్ణ పిశరోడి శ్రీ కృష్ణ లోకానికి చేరుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17 –ఉయ్యూరు
.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి
సంస్కృతభాషలో కవిత్వం ,నాటకం ,నవల ,వ్యాసం వ్యాఖ్యానం రాసి గీర్వాణ సేవ చేసిన మహాను భావుల నెందరినో గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో పరిచయం చేసుకోన్నాం .ఆ తర్వాత సంస్కృతం లో సినిమాలు తీసిన శ్రీ జి వి అయ్యర్ గురించీ తెలుసుకొన్నాం .అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఇప్పుడు తెలుసుకో బతున్నాం .అసలు సంస్కృతం మృత భాష ,దాన్ని ఎవరు చదువుతారు అందులో ఎవరు రాస్తారు ,చాదస్తంగా మీ లాంటి వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు అని చాలా మంది అనుకొంటారు .కానీ ఈ 21 వ శతాబ్దం లో ఎనిమోదో ,తోమ్మిదోదో అయిన వింత ఒకటి వింటే అవాక్కై పోతాం. అదే కర్నాటక రాష్ట్రం లో మత్తూరు,హోసన హళ్లి అనే రెండు గ్రామాల ప్రజలు నిత్య వ్యవహారాలలో కూడా సంస్కృతంలోనే మాట్లాడు కొంటారని తెలిస్తే నాబోటి వాళ్ళం ఎగరలేక పోయినా గంతులేస్తాం .వారి సంస్కృతీ భాషా పరిరక్షణకు జేజేలు పలకాల్సిందే .
సంస్కృత గ్రామాలు
మత్తూరు ,హోసనహళ్లి.అనే రెండుగ్రామాలు కర్ణాటకలో తుంగా నదీ తీర౦ లో శివ మొగ్గ కు దగ్గరలో ఉన్నాయి .ఆ గ్రామాలను ‘సంస్కృత గ్రామాలు ‘’అంటారు అక్కడ గుడి, బడి ,అంగడి వీధులలో ,ఇళ్ళల్లో చిన్నా పెద్ద ,ఆడా మగా అందరూ సంస్కృతం లోనే మాట్లాడుతారు .అలా మాట్లాడుతున్నందుకు వాళ్ళు చాలా గర్వంగా భావిస్తారు .కొత్తవారు ఈ గ్రామాలలోకి వెళ్ళంగానే వాళ్ళు ‘’భవత్ నాం కిం ?”’అని అడుగుతారు .అంటే ‘’అయ్యా ! తమ పేరేమిటి ?”’అని అర్ధం పేరు చెప్పాక ‘’కతమ్ ఆస్తి ‘’? అనగా ‘’తమరు ఎలా ఉన్నారు ?’’అని అడుగుతారు .ఇలాసంభాషణ కొనసాగిస్తారు .ఈ గ్రామస్తులకు సంస్కృతం తప్ప ఇంకా ఏభాషా తెలియదు అనుకొంటే’’ భాషా పప్పు’’ లో కాలేసినట్లే మనం .వారికి తెలుగు కన్నడం మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఉంది .కుటుంబం లో ఒక్కరైనా ఇంజనీరింగ్ చదివి ఉత్తీర్ణులైన వారున్నారు .అయినప్పటికీ వారందరూ సంస్కృతం లోనే విధిగా మాట్లాడాలని దృఢ నిశ్చయం లో ఉన్నారు ..దీనికి కారణం భారత దేశం లో సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న ‘’సంస్కృత భారతి ‘’అనే స్వచ్చంద సంస్థ .
సంస్కృత భారతి సేవ
1981 లో సంస్కృత భారతి మత్తూరు గ్రామం లో ‘’సంస్కృత భాష గొప్ప దనం –ప్రస్తుతం దేశం లో దాని వైభవపతనానికి కారణాలు ‘’అనే అంశం పై 10 రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించింది .చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చాలా మంది వచ్చారు .ఈ వర్క్ షాప్ లో ఒకాయన ‘’సంస్కృతం లో ఒకడు అనర్గళంగా మాట్లాడితే అతడిని పండితుడు అంటారు .కానీ ఊరి వారంతా సంస్కృతం లో మాట్లాడితే ఏమనాలి ?అనే ప్రశ్న వేసుకొని అలా౦టిగ్రామాన్ని ‘’సంస్కృత గ్రామం ‘’అనాలి అని నిర్ణయించారు .సంస్కృత భారతి చెప్పిన ఈమాటను పై రెండు గ్రామాల వారికీ బాగా నచ్చి ,అందరూ సంస్కృతం నేర్చుకోవటం మొదలు పెట్టి సంస్కృతం లో మాట్లాడటం ప్రారంభించి సంస్థ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చి తమ ప్రత్యేకతను చాటి చెప్పి దేశం లోనే సంస్కృత భాషా పరంగా ఆదర్శ గ్రామాలు అని పించారు .సంస్కృతం తో పాటు మరొక మిశ్రమభాష ‘’సంకేతి ‘’ని కూడా వీరు మాట్లాడుతారు .ఇది సంస్కృత ,కన్నడ తెలుగు ,తమిళ మిశ్రమ భాష .ఇది వ్యావహారిక భాష .దీనికి లిపి లేదు దేవ నాగరి లిపినే వాడుతారు .సుమారు 6 00ఏళ్ళక్రితం కేరళనుంచి సంకేతి బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి .వీరి దినదిన జీవితమంతా సంస్క్రతం చుట్టూనే పరిభ్రమిస్తుంది . సంస్కృతమే అందరూ మాట్లాడుతారుకదా అని అందరూ పిలక పెట్టుకొని పంచె లేక లుంగీ తో ఉంటారు అనుకొంటే పొరబడ్డట్టే .జీన్స్ పాంట్ వాళ్ళూ చెవుల్లో సెల్లు లవాళ్ళూ మోటార్ బైక్ రాయుళ్ళూ అందరూ ఉంటారు .కాని మాట్లాదేదిమాత్రం సంస్కృతమే . ఒకరకం గా ఈ జంట గ్రామాలు పురాతన ఆధునికతలకు తీపి గుర్తులు .
గుడే బడి
ఈ గ్రామాల దేవాలయాలలో సంస్కృతం నేర్పించే పాఠశాలలుఉన్నాయి వీటిని ‘’వేద శాలలు ‘’అంటారు .శిధిలా వస్థలో ఉన్న ప్రాచీన తాళపత్ర గ్రంధాలను ఇక్కడే తిరగ రాసి ,కంప్యూటరైజ్ చేస్తారు .ఈ రెండు గ్రామాల వారే సంస్కృతం లో సంభాషిస్తున్నారు కాని ఇతర గ్రామాలవారెవ్వరూ ముందుకు రావటం లేదు .కాని జర్మని ,రష్యా వంటి విదేశీ యువత సంస్కృతం నేర్చుకోవటానికి అమితాసక్తి చూపిస్తున్నారు .జర్మనీ యూని వర్సిటీలలోని సంస్కృత కోర్సులకు ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా వారిలో పదుల సంఖ్యలలోనే విద్యార్ధులను ఎంపిక చేస్తున్నారు .కారణం సంస్కృతం బోధించే ప్రొఫెసర్లు తగినంత మంది లేక పోవటమే .అందుకే విదేశాలనుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి సంస్కృతం అభ్యసిస్తున్నారు .ఈ జంటగ్రామాల గోడలపై రాతలూ సంస్కృతం లోనే ఉంటాయి ..
మహా పండితులకు జన్మస్థానం
ఇక్కడి ఈ జంట గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయం .ఇక్కడి ప్రధాన పంట వక్కలు (పోచెక్కలు ).మత్తూరు నుంచి 30 కి పైగా సంస్కృత పండితులు బెంగళూరు మంగళూరు ,మైసూరు మొదలైన ప్రాంతాలలో యూని వర్సిటి ప్రొఫెసర్లు గా ఉన్నారు .భారతీయ విద్యా భవన్ పాఠశాల నుఇక్కడ స్థాపించిన మత్తూరు కృష్ణ మూర్తి ,వయోలిన్ విద్వాంసుడు వెంకటరాం ,కన్నడ శాస్త్రీయ సంగీత కారుడు హెచ్ .ఆర్.కేశవ మూర్తి వంటివారు జన్మించిన భూమి మత్తూరు .
గమక సంగీత రూపక సంప్రదాయ పునరుద్ధరణ
సంస్కృతాన్ని మాత్రమె పునరుజ్జీవింప జేయటం కాదు వీరి కన్నడ శాస్త్రీయ’’ గమక ‘’సంగీత రూపక సంప్రదాయ౦ అంతరించి పోతుంటే వీరందరూ జాగరూకులై దాన్ని అంతరించి పోనివ్వకుండా పునరుజ్జీవింప జేసి కాపాడారు .గమక అంటే కన్నడ సంగీత రాగం లో కద ను వివరించటం .దీనినే ‘’కావ్య వచన ‘’అంటారు వీళ్ళు .కన్నడ దీశం లో గమక ప్రదర్శనకు జనం విపరీతంగా హాజరై ఆనందిస్తారు .
ప్రధాని నరేంద్ర మోడీ సి .బి .ఎస్. ఇ .సిలబస్ లో ఉన్న జర్మన్ భాష బదులు సంస్కృతం నుప్రవేశ పెట్ట్టే ప్రణాళికలో ఉన్నారని తెలిసి ఈ గ్గ్రామస్తులు పరమానంద భరితులవుతున్నారు .
ఆధారం –1-ఆంధ్ర జ్యోతి -29-1-17 ఆదివారం స్పెషల్ 2- వీకీ పీడియా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-17 –ఉయ్యూరు























