ఇది విన్నారా ,కన్నారా !-8

ఇది విన్నారా ,కన్నారా !-8

15-వైదుష్యం మూర్తీభవించిన శ్రీమతి అరుంధతీ సర్కార్

136-78ఏళ్ళవయసులో ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం లో లేచి 3-30 నుంచి 5-30దాకా సంగీత సాధన చేసే ఆదర్శ విద్వాంసురాలు శ్రీమతి అరుంధతీ సర్కార్ .

137-సర్కార్ మొదటి గురువు పారుపల్లివారే .పట్టమ్మాళ్ గారిదగ్గరా విద్య నేర్చారు.ఏక సందా గ్రాహి .స్వరం తో రాసుకో కుండా వేల కీర్తనలను అలవోకగా పాడగలగటం అరుంధతి గారి ప్రత్యేకత .

138-పట్టమ్మాళ్ వైదుష్యం అంతా ఇంతాకాదని ఏది అడిగినా అనర్గళంగా గంటల కొలది చెప్పే ఓర్పూ నేర్పూ ఆమెకున్నాయని ,విద్యార్ధుల్ని చంటి పిల్లల్లాగా ధన ద్రుష్టి లేకుండా చూస్తారని తన అనుభవాన్ని చెప్పారు .తొమ్మిదవ ఏటనే డి.కె గారి 78 ఆర్ పి.ఏం రికార్డులు విని ఆమె సంగీత ప్రభావం లో పడ్డారు అరుంధతి .

139-ప్రతి ఏడు త్యాగ రాజ ఉత్సవాలకు తిరువయ్యూర్ వెళ్లి వస్తారు సర్కార్ .దీక్షితులవారు ఏయే క్షేత్రాలపై కీర్తనలు రాశారో ఆయా క్షేత్రాలను యాత్రగాకూడా  వెళ్లి సందర్శిస్తారు .

140-తొమ్మిది శైవ క్షేత్రాలలోని తొమ్మిది మంది లింగ మూర్తులపై ఉన్న కృతులను అరు౦ధతి గారు పాడగా ఆకాశవాణి రికార్డ్ చేసింది .

141-ఉత్తరాంధ్ర శ్రీకాకుళం లో సర్కార్ నాలుగు గంటలు కచేరీ చేసి గ్రామీణ ప్రజలను తాదాత్మ్యం లో ముంచారు .స్వరకల్పన ,రాగాలాపనలో రాగాలాపనకే మొగ్గు చూపుతారు .

142-బంగారు కామాక్షి పేరుతొ శ్యామ శాస్త్రిగారి కృతులు పాడితే కళా వారధి వారు క్యాసెట్లు సి డిలుగా తెచ్చారు .

143-ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా 1971వరకు పనిచేసి గొప్ప ఫీచర్స్ చేసి అందించారు అందులో ‘’ఆరిజిన్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ విజయనగరం ‘’మంచి ఫీచర్ గా పేరు పొందింది ..వీరు రచించి ప్రసారం చేసినవి –మంత్రాలయ మహాన్ ,గురు గుహోదయం ,శ్రీ కమలాంబా జయంతి ,గురు గుహాంత రంగం .

144-‘’ఆనందం కోసం పాడుకొంటాను .పాడు కొంటూ ఉండాగా మనసు శూన్యం తో నిండుతుంది ‘’అంటారు శ్రీమతి అరుంధతీ సర్కార్ .శూన్యం అంటే ద్వంద్వాతీత స్థితి అని అదే పూర్నత్వానికి పర్యాయ పదమని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య గారు వివరణ ఇచ్చారు .

16-వాయులీన విద్యాదరి శ్రీమతి అవసరాల  కన్యాకుమారి

145-మైసూర్ చౌదయ్యగారి వయోలిన్ వాదన ‘’గుర్రాలు పరిగెత్తినట్లు ఉంటుంది ‘’అన్నారు సరస్వతీ పుత్ర పుట్టపర్తి వారు .ద్వారం వారి వాదన ‘’మలయపవనం వీచి నట్లు ఉంటుంది ‘’అన్నారు ఆచార్య .

146-కాకినాడలో పుట్టి మద్రాస్ లో పెరిగిన కన్యాకుమారిగారు శ్రీమతి ఏం ఎల్ వసంతకుమారిగారికి 19ఏళ్ళు వాయులీన సహకారమందించారు .అది తనకు సువర్ణ అధ్యాయం అంటారు కన్యా కుమారిగారు .మరెందరికో వాయి0చారామే .

147-మద్రాస్ లో 100 వాద్య కళాకారులతో రెడుగంటల  సేపు వాద్య బృంద ప్రదర్శన చేశారు .మరో సారి 75వయోలిన్ లతో ముప్పావుగంట ప్రదర్శన ఇచ్చారు .భారతస్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సమయం లో 50 వయోలిన్ లతో తానే సృష్టించిన ‘’భారత్ ‘’(శంకరాభరణ జన్య ఔడవ షాడవం)అనే కొత్తరాగాన్ని పాడించి రక్తి  కట్టించారు.ఒక వైకు౦ఠ   ఏకాదశినాడు 29గంటల సేపు నిర్విరామంగా వాయులీన కచేరీ చేసిన సామర్ధ్యం కన్యాకుమారిగారిది .

17-గాంభీర్య మాధుర్యాల శ్రీ మల్లాది సూరిబాబు

148-మల్లాది సూరిబాబు గారి తండ్రి శ్రీ శ్రీరామ మూర్తి గారు శాస్త్రీయ సంగీతాన్ని ,హరికధా గానాన్నీ మద్రాస్ ఆకాశ వాణిలో 1945నుండి 53వరకు వినిపించారు .

149- సూరిబాబుగారు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారి శిష్యులు .పినాకపాణి గారి వద్దా కొంత నేర్చారు .పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వరాలయం లో ఆరునెలలు విద్యార్ధులకు సంగీతం నేర్పారు .

150-సూరిబాబు గారి భార్య శ్రీమతి సుకన్యా ,కుమారులు శ్రీ రాం ప్రసాద్ ,శ్రీ రవికుమార్ లు సంగీతజ్నులే కాక ప్రతిభా పాటవ సంపన్నులు .అంటే తాత  దగ్గరనుఛి మనవళ్ళ దాకా అందరూ సంగీత విద్వాంసులే .

151-శ్రుతి మీద ద్రుష్టి ఉన్న సూరిబాబు గారు అన్ని శ్రుతులకూ తంబూరా శ్రుతి చేసి సి .డి.లు తెచ్చారు .ఆకాశవాణి గ్రేడ్ వన్ ఆర్టిస్ట్ మల్లాది .

152-మల్లాది సోదరులు నేదునూరి వారికీ  ,పినాక పాణి  గారికీ శిష్యులు .కర్నూలు వెళ్లి శ్రీపాద వారి వద్ద వందలాది కృతులకు పాఠం నేర్చారు .సంగీతం తో దేశ విదేశాలలో పర్యటించారు

153-‘’ఆంధ్రదేశం లో సంగీతానికి ఆదరణ తక్కువే అయినా అభిరుచి తగ్గలేదు ‘’అంటారు సోదరులు .’’వేడుక కోసం కచేరీ చేయరాదు .ధర్మ దృష్టితో చేయాలి .’’అంటారు సంగీతాన్ని కళగా కంటే శాస్త్రం గా ,విద్యగా నమ్ముతాము అని చెప్పారు .

154-‘గాయకుడు భగ వంతునితో చేసే సంభాషణ యే సంగీతం ‘’అన్నారు .

155-‘’బాగుగా వింత రాగములు ఆలాపము చేయగ మేను పులకరింపు గ ‘’మల్లాది సోదరులు వేలకు వేలు కచేరీలు చేస్తూ సంగీత సరస్వతిని ప్రపంచమంతా ఊరేగిస్తున్నారు .

 

Inline image 4 Inline image 5Inline image 1 Inline image 2Inline image 3

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -165

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -165

 63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్-2

ఇరవై ఏళ్ళకు ఇసడోరా అందాల రాశిగా ఉన్నా ,ఆనాటి ప్రసిద్ధ ఇంగ్లాండ్ ఫోటోగ్రాఫర్ ఆర్నాల్డ్ గెంతీ దృష్టిలో ఆమె అంత అందగత్తె గా అనిపించలేదట .బుగ్గలు లావుగా ముక్కు కోటేరు తీసినట్లు ,చిన్న రెండు గడ్డాలతో కనిపించేది .మూతి చాలా అందంగా లలితంగా ఉండేది .కళ్ళు సవాలు చేస్తున్నట్లుగా మొత్తం మీద శరీరం చాలా హుషారైన సాఫల్య వంతమైనదిగా ఉండేది .వేలాది అమెరికా బాలికల కంటే చాలా భిన్నంగా ఉండేది .తాను  నాట్య నక్షత్రం లో జన్మించినట్లు భావించేది .

 లండన్ లో డంకన్ లు బ్రిటిష్ మ్యూజియం లో ఎక్కువ కాలం గడిపేవారు .విన్కేల్మాన్ రాసిన ‘’జర్నీ టు ఎథెన్స్ ‘’ఆంగ్లానువాదం వాళ్ళను బాగా ఆకర్షించి హెలెనిక్  సంస్కృతి పై ఆసక్తి పెరిగింది .అక్కడి గార్డెన్ పార్టీలలో ,డ్రాయింగ్ రూమ్ లలో తన ప్రతిభ చూపేది .సోదరి ఎలిజబెత్ దియోక్రిటిస్ కవితలు చదివేది .రేమాండ్ డాన్స్ గురించి ఉపన్యాసాలిచ్చేవాడు .డాన్స్ -సైకాలజీమీద భవిష్యత్ మానవులపైనా చూపే ప్రభావం పై మాట్లాడే వాడు .అందరూ బ్రహ్మాండంగా అభినందించారు కాని రొక్కం రాలేది కాదు .పెన్నీ కి దొరికే బన్  నీళ్ళు కలిసిన సూపు తిని తాగి ఎలాగో గడిపేవాళ్ళు .ఇసడోరా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ,ఎల్లెన్ టెర్రీవంటి ప్రముఖులనెందరినో కలిసింది .చివరికి ఫ్రాంక్ బెన్సన్ నడిపే షేక్స్పియర్ కంపెనీలో చేరింది .పూర్వం వేసిన మిడ్ సమ్మర్ తప్ప వేరే అవకాశం రానేలేదు .లండన్ లాభం లేదని పారిస్ కు మారారు .

   22వ ఏట పారిస్ లో ఇసడోరా ఒక కొత్త అవతారం దాల్చింది .లావ్రే దెయ్యాలను ,గ్రీక్ కుండీలను ,లోహ ఉపశమనాలను  పరీక్షించి వాటిని సంగీతానికి జోడించి ,పాదాల రిధం కు సరిపోయేట్లు చేసింది . స్టుడియో గోడలపై  రేమాండ్ గ్రీక్ స్తంభాలు పెయింట్ చేశాడు .డంకన్ కుటుంబం బూట్ల బదులు చెప్పులు వాడటం మొదలు పెట్టింది .తనకున్న లేస్ డ్రెస్ ను ,స్లిప్పర్ లనూ వదిలేసి డాన్స్ చేసింది .ఈ నాటి  నగ్నంగా ఉన్నట్లు ఆనాడు దాదాపు అలానే డాన్స్ చేసింది .ఇదంతా గ్రీక్ పెయింటింగ్స్ ,శిల్పాల ప్రభావమే .సంగీతకారుడు రోడిన్ బ్రాంజ్ చప్పుడు ,జపనీస్ సాడాయాక్కో విషాద నృత్యాలను చేసింది .తానిప్పుడు డాన్స్ మూలం ఏమిటో తెలుసుకొంటున్నా నని చెబుతూ’’which  might be the divine expression of  the human spirit through the medium of the body’s movement ‘’అని వివరించింది .డాన్సింగ్ స్కూల్స్ లో శరీరకదలికలను వెన్నెముక ఆధారం కు వెనుక మధ్యలో ఉంటాయని బోధిస్తారని ,ఈ అక్షరేఖ నుంచి కాళ్ళు చేతులు మొండెం కడులుతాయని చెప్పి ఒక తోలుబోమ్మలాగా తయారు చేస్తారు అన్నది ఇసడోరా .ఇసడోరా కనిపెట్టిన దాని ప్రకారం  సెంట్రల్ స్ప్రింగ్ మోటార్ పవర్ బిలం (క్రేటర్ ఆఫ్ మోటార్ పవర్ ) సోలార్ ప్లేక్సేస్ లో ఉంది .అంటే ఉదర నాడీ కూపం లో ఉంది .ఈ విషయాన్ని వివరిస్తూ అర్ధ శతాబ్దం తర్వాత జాన్ మార్టిన్ రాస్తూ ‘’అదే ఆమె చెప్పిన బేసిక్ డాన్స్ .అదొక వ్రుత్తి ,వ్యాపారంకాని ,మొదలు పెట్టె కళ కాని  కాదని ,అదొక జీవ కార్యం (బయలాజికల్ ఫంక్షన్ )అన్నాడు .ఆమె ఏదో కొత్తగా ఏమీ కని పెట్టలేదు కాని ఈ కదలికల ప్రేరణ మూలాన్ని(రూట్స్ ఆఫ్ ది ఇ౦ప ల్స్ ) శోధించే ప్రయత్నం చేసింది .ఇదే ప్రతి అనుభవానికి స్పందన అవుతుంది .దీనినే ఆమె యూనివర్సల్ ఏండోమెంట్   అంటే సార్వత్రికదైవ లక్షణం అనుకొన్నది .ఏమాత్రం సాధారణ సైకాలజీలో ప్రవేశం లేని ఈమె యే ఒక్క డాన్సర్ కూ తట్టని అద్భుత భావం తట్టటం గొప్ప విషయం .,యాదృచ్చికమైనశారీరక  కదలిక (స్పాంటేనియస్ మూవ్ మెంట్స్ )అనేది ప్రతి మనిషి యొక్క ఇంద్రియ లేక భావోద్వేగ ఉద్దీపన లకు  ప్రధమ  ప్రతిస్పందన .(spontaneous movement of the body is the first reaction of all men to sensory or emotional stimuli)

        ఇసడోరా సిద్ధాంతాలపై చాలా అనుమానాలున్నాయి కాని అంతకు మించిన జవాబు ఎవరి వద్దా లేదు .ఆమె ప్రాధమిక భావోద్వేగాలను ,ప్రేమను ,నిరాశా నిస్పృహలను వేలాది ప్రేక్షకులముందు తన ఆనందం దుఖం తో ప్రదర్శించి చూపింది .ఇంకేముంది మ్యూజిక్ క౦పోజర్లు ,నాటక రచయితలు ,ఆమె చుట్టూ మూగారు .కళాకారులు ఆమె చూపే అసాధారణ శారీరక కదలికలను అనుకరించటానికి, నేర్చుకోవటానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు .అంతకు మించి ఆమె చేబట్టి ,పునః సృష్టి చేసిన ప్రాచీన ‘’టేర్ప్సి కోరియన్ ఆర్ట్ ‘’ను అభినందించటానికి చాలామంది వచ్చారు .ఈ విషయం పై రోడిన్ రాస్తూ ‘’ఇసడోరా శిల్పాన్ని ,భావోద్వేగాన్ని అతి సునాయాసంగా సాధించింది

  .జీవితాన్ని,కళ ను ఇసడోరా  మహాద్భుతంగా ఏకీకృతం చేసింది .’’అన్నాడు .

    ఫాన్స్ లోనే కాక తన జీవితం లోను పరిపూర్ణత సాధించటానికి కన్యత్వం నుండి చెప్పులు వదిలేసినంత తేలికగా  విడుదలై౦ది .ఒక రోజురాత్రి  ఒపెరాకు తల్లిని ,రేమాండ్ ను  రమ్మని పిలిచి రహస్యంగా ఒక చా౦పేన్ బాటిల్ తెచ్చి తలలో రోజా పువ్వులు అలంకరించిడయాస్ అందరి  కోసం ఎదురు చూసినట్లు ఉంది .అక్కడికి అప్పుడే వచ్చిన ఒక  యువకుడు ఒక్క సారిగా దిగ్భ్రాంతి చెంది  బాబోయ్ అని పారిపోయాడు .రోజాలు చామ్పేన్ తనను ము౦చేశాయని ఏడుస్తూ కూర్చుంది .మరోసారి ఇంకోకుర్రాడిని హోటల్ రూమ్ కు తీసుకొని వెళ్ళమని అడిగితె ఆమెస్వచ్చతకు ముగ్ధుడై మోకాళ్ళ మీదకూర్చుని వినమ్రుడయ్యాడు   .ఇదీ ఆమె మోహ బంధ జీవితం .ఆమెది ఎప్పుడూ అవతలివారిని ఇబ్బంది పెట్టె విధానమే .మోహపు వలలో వేసి మగాళ్ళను గిలగిల లాడేట్లు చేసేది .లవర్స్ కంటే ఆమె చేత దిగజార్చ బడిన  వాళ్ళే ఎక్కువ .అహంకార పూరిత సాహసం,ఆలోచనా రహిత జీవనం బాధ్యతా రాహిత్యం ఆమె కొంప కొల్లేరు చేశాయి . My life called for the pen of Cervantes or Casanova ‘’అని గర్వంగా చెప్పేది .

      డంకన్లు మరింత తూర్పుకు  బెర్లిన్ వియన్నా బుడాపెస్ట్ వెళ్ళారు .ఇసడోరా తన రంగాన్ని తీవ్ర ,భోగాసక్తి విషయాలతో డిజైన్ చేయించింది .స్టేజి ఏమీ లేని శూన్యం చేసింది .పేల్ బ్లూ ,సాఫ్ట్ గ్రీన్ ,న్యూట్రల్ గ్రే రంగుల పెద్ద పెద్ద కర్టెన్లు ఏర్పాటు చేసింది .అవి పైన నలుపులో కలిసిపోయి అదృశ్య మయ్యేట్లు  వెనకా ప్రక్కలా ముడతలుగా  అమిరేట్లు చేసింది .రోజ్ కలర్ స్పాట్ లైట్  ఊహను ప్రతిబింబింప జేసింది .ఇసడోరా కురులు వంకరలు తిరిగి మెత్తగా ఉన్నాయి .ప్రేమ పిచ్చి పట్టిన కోపోద్రిక్త వాతావరణం కల్పించింది .డాన్సులు మొదలయ్యాయి .ఆమె ఒక పిల్లలాగా బంతి,  పిడికిలి ఎముకలతో చాకీస్ సముద్ర తీరం లో ఆడుతున్నట్లు అభినయించింది .ఆర్ఫియాస్ కు విషాద  సహాయికలలో ఒకరిగా ,ఎల్సియన్ ఫీల్డ్ లలో ఆనందోత్సాహాలతో ఉన్న అమ్మాయిగా నటించింది .సమాప్తి అతి త్వరలోనే వచ్చేసింది .ఈ ప్రదర్శన బాగా విజయ వంతమైంది .అదొక రెవెలేషన్ అంటే దివ్యా దేశం అనిపించింది .

   బుడా పెస్ట్ లోనే ఇసడోరా మరో నూతన నృత్యానికి ప్రాణం పోసి ప్రేక్షకులను ఉర్రూత లూగించింది .ఆమె ప్రోజ్ స్టైల్ లాగా ఆమె టేస్ట్ కూడా నాసిరకం .ఒక స్టాక్ కంపెనీ నటుడిని ప్రేమ వలలో పడేసింది .అతని మూడ్ ప్రతి పాత్రకీ మారి పోతుంది .ఆతను రోమియో జూలియట్ లో నటించగానే మళ్ళీ మార్క్ ఆంటోని గా నటించటం ఆమె జీర్ణించుకోలేక పోయింది .ఇసడోరా ముద్దు ఇమ్మంటే  ఆంటోనీ లాగా లాంగ్ స్పీచ్ ఇచ్చేవాడు .వ్యక్తీ తన వృత్తికి  మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేవాడు .మళ్ళీ ప్రేమలో విఫలమై౦ది కాని ఆర్ట్ ను గుర్తించింది .జెర్మనీ చేరి ‘’డాన్స్ ఆఫ్ ది రివల్యూషన్ ‘’చేసింది .మ్యూనిచ్ చేరగానే విద్యార్ధులు అభిమానులు కోచ్ హార్స్ ను తప్పించి వీధుల్లో తామే బండీ లాగి అభిమానాన్ని ప్రదర్శించారు .ఆమె బెర్లిన్ ఒపేరా హౌస్ లో కనపడగానే ప్రేక్షకులు ఆమె ప్రదర్శనను పదేపదే చేయమని కోరారు .

   26 వ ఏట ఇసడోరా గ్రీస్ వెళ్ళింది .రేమాండ్ తమ యాత్ర యులిసిస్ దారిలో నడవాలన్నాడు .ఎన్నో ఇబ్బందు లెదురైనాయి .గ్రీకు గడ్డ మీద కాలు పెట్టగానే స్వంత గడ్డపై కాలు పెట్టిన అనుభూతి పొందారు .అక్కడి పార్దినాన్ ను చూసి ఒక దేవాలయం కట్టాలని నిర్ణయించుకొన్నారు .శంకుస్తాపనకు ప్రీస్ట్ ను పిలిచారు .ఒక నల్ల కోడిపుంజు ను  బలి ఇచ్చారు .గ్రీసులోనే స్థిరంగా ఉండి పోవాలనుకొన్నారు .సూర్యోదయాన పాటలతో డాన్స్ లతో సముద్ర తీరాన గడిపారు .తర్వాత మేక పాలు మాత్రమే తాగి చాలా సాత్వికంగా గడిపారు .అక్కడి వారికి ఉదయాన డాన్స్ ,పాట నేర్పేవారు .గ్రీకు దేవతలను సందర్శించేటప్పుడు తమ ఆధునిక వస్త్ర ధారణవదిలేసి సామాన్యంగా వెళ్ళేవారు .మధ్యాహ్న సమయాలలో ధ్యానం ,సాయం వేళల పాగాన్ ఉత్సవాలు జరిపి తగిన సంగీతం పాడేవారు.ఇంత చేస్తున్నా అక్కడి వారెవరికీ వీళ్ళగురించి పట్టనే లేదు .మంచినీళ్ళకోసం మైళ్ళ దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అక్కడ తాము ప్రారంభించిన గుడి నిర్మాణం తడపటానికి నీళ్ళు అందలేదు. దానితో పని ఆపేశారు .కాని మొత్తం ట్రిప్ లో ఇసడోరాకు ఒకే ఒక ఆనందం మిగిలింది – గ్రీకు పిల్లలకు ఏషిలస్ రాసిన ‘’ది సప్ప్లిఎంట్స్’’ను పాడటం నేర్పగలిగింది  .తమతో వాళ్ళను వియన్నా కు తీసుకెళ్ళింది .

  Inline image 5Inline image 6Inline image 3  Inline image 4Inline image 1  Inline image 2


    సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-16-ఉయ్యూరు  

 

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-6

ఇది విన్నారా ,కన్నారా !-6

10-గాత్ర వాయులీన విద్వన్మణి-శ్రీ నేతి శ్రీరామ శర్మ

95-అతి సామాన్యంగా కనిపించే శ్రీ నేతి శ్రీరామ మూర్తి గారు సంగీతం లో విద్వన్మణి. వీరికి తల్లీ తండ్రీ ,గురువు ,మనసెరిగిన మిత్రుడు ప్రత్యక్ష దైవాలు .వీరి వాయులీనవిమల గాంధర్వం .గుంటూరు జిల్లా నూతక్కి గ్రామస్తులు .తండ్రి శ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ శ్రీ ఆది భట్ల నారాయణ దాసు గారి ద్వితీయ శిష్యులు .దాసుగారి మొదటి శిష్యులు శ్రీ వాజ పేయాజుల  సుబ్బయ్య గారు .ఏఇద్దరు శిష్యులను లవ కుశులు అనేవారు .

96-నేతివారు 1958నుండి -88దాకా రేడియోలో నిలయ విద్వాంసులు .’’మనకు విద్య ఉందికదా అని  దాన్నంతా ప్రదర్శించ కూడదు .ముఖ్య కళాకారునికి లోబడి వాయించాలి .కచేరీ రక్తి కట్టించాలి ‘’అనే సహృదయులు

97-నేతి వారి విద్వత్తు కు తగ్గట్లు సువర్ణ ఘంటా కంకణం ,కనకాభి షేకం పొందారు .శ్రీపారుపల్లి పంతులు గారు పాడుతుంటే ‘’జీవం తో ఉన్న తంబూరా తంత్రులు మోగిస్తున్నట్లు ఉంటుంది ‘’అని మెచ్చిన రస హృదయులు సరస హృదయులు .

98-ఒక సారి హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ టి ఆర్ .మహా లింగం గారి గాన కచేరీ కి శ్రీ మతి ద్వారం మంగతాయారు గారు పక్క వాద్యం వాయించటం మొదలు పెట్టి అనారోగ్యం తో మూర్చ పోగా నేతివారు అనుకోకుండా అంతటి దిగ్దంతునికి వయోలిన్ వాద్యం వాయించి రక్తి కట్టించారు

99-పుంభావ సరస్వతీ మూర్తులైన శ్రీరామ శర్మగారు సంగీత సభలకోసం ఎన్నో వేల రూపాయలు దానం చేసిన వితరణ శీలి .

100-గాయక సార్వ భౌమ పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు ‘’సంగీత సభ ‘’ఏర్పరచి సంగీత సరస్వతికి సేవ చేసిన మహనీయులు నేతి శ్రీరామ శర్మ గారు.

11-సంగీత సాహిత్య విద్వాంసులు శ్రీ యెన్ సి హెచ్ ,కృష్ణ మాచార్యులు

101-కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో జన్మించిన శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణ మాచారి గారు ఎన్నో ప్రౌఢ మైన హరికధాలను సంస్కృతాంధ్రాలలో రచించారు ..పారుపల్లి వారి శిష్యరికం లో ఎదిగిన వారు .

102-త్యాగరాజ స్వామి వారి ‘’నౌకా చరితం ‘’ను సంస్కృతం లోకి అనువదించిన గీర్వాణ వైదుష్యం వీరిది .

103-ఈ రోజుల్లో భారత దేశం లో సంస్కృతం లో హరికధ కాలక్షేపం ఉత్తమ స్థాయిలో చేస్తున్న శ్రీ ఉమా మహేశ్వర రావు గారికి ఆచార్యులవారు గురువు .తామూ ఎన్నో సంస్కృత హరికధలు దేశమంతటా చెప్పారు .

104-కవిత్వం భావుకత లలో నిష్ణాతులు .’’త్యాగ రాజ గేయార్ధ కుంచిక ‘’అనే ఉద్గ్రంధం రాసి శ్రీ కల్లూరి వీరభాద్రశాస్త్రి గారికి అంకితమిచ్చారు

105-‘’మనం బాణీ ణి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు .ముర శ్రీరంగం అయ్యంగారు అనే మహానుభావుడు ఏర్పాటు చేసిన బాణీయే ‘’ఆంధ్రదేశపు బాణీ ‘’అన్నారు .

106-సంగీతం మోక్షమిస్తుందని ఒక గొప్ప వ్యాసాన్ని సంస్కృత భాషలో రాస్తూ ‘’గీతి గానేన యోగస్స్యాత్-యోగాదేవ శివైక్యతా-‘’ఇత్యుక్త ప్రకారేణ త్యాగ రాజః గానేన యోగం ,యోగేన శివైక్యం ప్రాప్యతే ఇతి నిశ్చనుమః –శివైక్యం నామ జీవన్ముక్తి రేవ ‘’అని ముగించారు  .

12-శ్రీ కొమాండూరి శేషాద్రి

107-పాడుతున్నది వాయిస్తున్నది ఏమిటో ,అందులోని మర్మమేమిటో సోపత్తికంగా వివరించి చెప్పగల విద్వాంసులు శ్రీ కొమాండూరి శేషాద్రి గారు .వీరిది సంగీత వంశం .

108-2008లాయింగ్లాండ్ లో పర్యటిస్తూ సంగీత కచేరీలు సోదాహరణ ప్రసంగాలు చేసి శ్రోతల హృదయాలను ఉర్రూత లూగించారు .

109-లండన్ దగ్గర ఒక చోట సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆదేశం తో 108మంది చేత18కృతులను ఏక కంఠం గా పాడించి సేబాష్ అనిపించారు .

110-అమెరికాలోని పిట్స్ బర్గ్శ్రీ వేంకటేశ్వరాలయం ఆహ్వానంతో  ఒక ఏడాదిలో ఆరు నెలలకోసారి గా రెండు సార్లు విజిటింగ్ అధ్యాపకులుగా ఉంటూ ,నిత్య బోధనా జరిగాక సాయంవేళ రాగ ,కృతి ,భావ ,త్రిపుటి లపై మహా వాగ్గేయ కారుల రచనలపై చర్చాగోస్తులు జరిపారు .దీనితో వారు ప్రామాణికమైన ప్రసంగా కర్త గా ,వ్యాఖ్యాతగా ,విశ్లేషకునిగా ,తులనాత్మక వివరణ కర్త గా రాణించి వినుతి కెక్కారు .

111-శిష్యులు కోరిన రాగం లో అప్పటికప్పుడే కృతి రాసి గోష్టిలో నేర్పటమూ చేశారు.

112-రాగం ‘’ఆఠాణా’’అంటే బందీ నుంచి విముక్తి చేసేది అని అర్ధం చెప్పారు కొమాండూరి వారు .’’ఠాణా’’అంటే పోలీస్ స్టేషన్ .అ అంటే లేనిది అంటే బందీ కానిది అని వివరణ ఇచ్చారు  .

113-వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లుగానే ఆచార్యులవారు ‘’నాదం రసాత్మకం కీర్తనాని ‘’అన్నారు రాగానికి స్వరం ఆధారం .అ కారా ఉకారాదుల చేత అది నూతనత్వాన్ని పొంది ,సంచారులచేత అనుష్టానం అవుతుంది .లక్ష్య సిద్ధికలిగి లక్షణ భావం నేర్చిన నేర్పరికి మాత్రమే ‘’రాగాత్మను స్థాపన చేయటం తెలుస్తుంది ‘’అంటారు .

114-‘’భరత,శార్న్గ్య దేవ,రఘునాధ నాయకుల అఖండ వీణ పరిశోధనలు లోకానికి శ్రుతి రూపం లో బయట పడి తర్వాత నాద మూర్తులైన త్యాగ రాజాదుల కృతుల చేత  మర్యాద పొందాయి .నిశ్చయంగా వీణా వాదన నైపుణ్యం రాగ వికాస క్రమానికి పెద్ద పీట వేసింది ‘’అని ఖండితంగా చెప్పారు శ్రీకోమా౦డూరి.

115-‘’రాగం నాదా౦తర్భాగం .రాగం స్వర వర్ణ రూపంగా బహిర్గతమై దానిలోనే నాదం అంతర్వాహినిగా ప్రసరిస్తుంది .మూలమే నాదం మిగిలినవి అంగాలు ‘’అన్నారు .

116-హిందూస్తానీ ,కర్నాటక విద్వాంసుల లో భేదాన్ని వివరిస్తూ ‘’హిందూ స్థానీ  గాయకులు రాగాన్ని గ్రహన్యాస మూలకంగా నాద పూర్ణంగా కూర్చటం వాళ్ళ రీతి .కర్నాటక గాయకులూ స్వర ప్రాధాన్యం టో వాగ్గేయ కారుల కృతుల రూపంగా నాదాన్ని ప్రకటిస్తారు .వీరిలో స్వర కల్పనమార్గం తో ,లయ బంధం తో కల్పనలు చేయటంద్వారా వీళ్ళ శైలిలో విలక్షణత కనిపిస్తుంది ‘’అని విశ్లేషించారు .

117-‘’హిందూస్తాని నాద సంబంది .కర్నాటకం స్వరసంబంది .నాదాన్ని రసాత్మకం గా వాళ్ళు చూపిస్తే మనం మరింత చాతుర్యం తో అంతర్లీన స్వర సౌందర్యాన్వేషణలో నాదాన్ని ప్రబల పరుస్తూ సాహిత్యాన్ని ప్రదర్శిస్తాం ‘’అంటారు .

118- శీ శేషాద్రిగారి కి పెద్దకుమార్డు శ్రీ రాజన్ ,చిన్నకుమారుడు వెంకట కృష్ణ చెరొక ప్రక్కన కూర్చుని వీరు మధ్యలో కూర్చుని వయోలిన్ వాయిస్తుంటే శ్రోతలకు గాంధర్వ లోకం లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు ఆచార్య వీరభద్రయ్య .

119-‘’అర్ధ వంతం రుచి మంతమైన ‘’సాహిత్యపు పలుకుబడి ‘’నేర్చిన కృతి ఆత్మ దర్శితం అవటం అని వార్యం .’’అని వారి అభిప్రాయం .

120-శేషాద్రి వారి ఆరు నీతి సూత్రాలు –నీకు రాదు అని ఎవరితోనూ అనరాదు ,మనం కష్ట పడినా విద్యార్ధులకు అవగాహన కల్పించాలి ,భావావేశం తో పాఠం చెప్పాలి ,ప్రేమతో బోధించాలి ,పదిసార్లు వాళ్లకు చెబితే మనకు అది క్షుణ్ణంగా తెలుస్తుంది ,నిస్పృహా ,నైరాశ్యాలు అధ్యాపకుడికి పనికి రావు

Inline image 1 Inline image 2

.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -164

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -164

 63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్

యూరప్ లోప్రారంభించి నాట్యం లో విప్లవం సాధించి ప్రపంచ వ్యాప్తి కలిగించిన ఏకైక అమెరికా నాట్య కళాకారిణి ఇసడోరా డంకన్ ఆమె చేసింది ‘’ఏక మహిళా విప్లవం ‘’.27-5-1878 న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో లో సముద్ర తీరాన జన్మించింది .తన జీవిత చరిత్ర ‘’మై లైఫ్ ‘’లో ‘’నా శారీరక కదలికలు సముద్ర అలల లయను బట్టే వచ్చాయి .అందానికి సంతానానికి,ఆనందానికి ప్రేమ కు  చిహ్నమైన ,సముద్రం లో పుట్టిన గ్రీకు దేవత ఆఫ్రొడైట్ నక్షత్రం లో నేను పుట్టాను . ఈ గ్రీకు దేవతకు సమానం  రోమన్ దేవత వీనస్ ’’అని రాసుకొన్నది .తనను తాను ప్రకృతి ప్రసాది౦చిన దానిని గా చిన్నప్పటి నుండి భావి౦చుకొన్నది .

  ఇసడోరా తండ్రి స్కాటిష్ వాడు .నాలుగు సార్లు బాగా సంపాదించి అంతా పోగొట్టుకొన్నవాడు .తల్లి ఐరిష్ కేధలిక్ .ఈమెను వదిలి తండ్రి వేరే అమ్మాయి తో ఉన్నాడు .దీనితో తల్లి నాస్తికానికి మారి రాబర్ట్ ఇంగర్ సాల్ శిష్యురాలైనది .పుట్టిన ఇద్దరు మొగపిల్లలను ,ఇద్దరాడ పిల్లల్ని తిరుగు బాటు దారులుగా పెంచింది .సంగీతం టీచర్ అయిన ఆమె జీవితం లో విసిగి వేసారి పియానో పాఠాలు నేర్పేది .చక్కగా పాడుతూ మంచి సాహిత్యాన్ని పిల్లలకు అలవరచింది .ఈ డంకన్ కుటుంబం పొట్ట గడుపు కోవటం కోసం ఎన్నో చోట్లు  మారుతూ తిరిగింది .ఈ జీవితమే ఆమె భవిష్యత్తు జీవితం పై ప్రభావం చూపింది .

   బోధించటం లో యెంత కోరిక ఉండేదో డాన్స్ చేయటం లోనూ అంతే ఉండేది .ఆరేళ్ళ పిల్లగా ఉన్నప్పుడే చుట్టూ ప్రక్కలున్న నడక కూడా ఇంకా రాని డజను మంది పిల్లల్ని పోగేసి కాళ్ళూ చేతులు ఎలా కదపాలో తుంటి ని ఆధారంగా చేసుకొని శరీరాన్ని ప్రక్కలకు ఎలా త్రిప్పాలో  నేర్పించేది డంకన్ .ఇదే తన ‘’డాన్స్ స్కూల్ ‘’అనేది .జీవితకాలం లో ఎప్పుడైనా ఒక గొప్ప డాన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కలలు కన్నది .దీనికోసం ఖండాలు దాటి ప్రయాణించింది .ఎనిమిదవ ఏట చిన్నపిల్లలకు డాన్సింగ్ స్టెప్స్ నేర్పి కొన్ని పెన్నీలు మొదటి సారిగా సంపాదించింది .పదవ ఏట డబ్బు సంపాదించటం ఎలాగో తనకు తెలిసిపోయిందని ,ఇంక స్కూల్ కు వెళ్లి చదవాల్సిన పని లేదని తల్లికి చెప్పేసింది .కూతురుకున్న అభిరుచి గుర్తించి తల్లి ఇసడోరా ను స్థానిక బాలెట్ టీచర్ దగ్గర పెట్టింది .కాని కాలి బొటన వ్రేళ్ళపై నిలబడి ప్రాక్టీస్ చేయటం  సహజత్వానికి భిన్నం అని ,అసహ్యం  అని చెప్పి౦ది .మూడవ లెసన్ అయ్యాక క్లాస్ వదిలేసి బాలెట్ పై ఉన్న ద్వేషాన్ని జీవితాంతం ఒదులుకోలేకపోయింది .బాలెట్ స్కూళ్ళు అంటే వ్యతిరేకత ఏర్పడింది .అవన్నీ అర్ధం పర్ధం లేని శరీర విన్యాసాలు అన్నది .పూర్తి జిమ్నాస్టిక్ నె డాన్స్ అంటున్నారని  ఈ బాలెట్ డాన్స్ అసహ్యం అన్నది .

  17వ ఏట తల్లి ఇసడోరా ను చికాగో తీసుకొని వెళ్ళింది .అక్కడ ఎవరైనా  కూతురు అభిరుచికి తగిన డాన్స్ నేర్పుతారేమోననే ఆశతో .అప్పటికి ‘’స్ప్రింగ్ సాంగ్స్ ‘’మొదలైన శ్రావ్యమైన సంగీతం ఆదరణలో ఉంది .ఈమెకు నేర్పటానికి యే మేనేజరూ అంగీకరించలేదు .వెంట తెచ్చుకొన్న డబ్బు అంతాఒక వారం లో  అయిపోయి తల్లీ కూతురు టమేటాలు తిని బతికారు .చివరికి ‘’మేసోనిక్ టెంపుల్ రూఫ్ గార్డెన్ ‘’మేనేజర్ ఇసడోరా స్ప్రింగ్ సాంగ్ పాడటానికి ఒప్పుకొన్నాడు .కాని పాటలో ‘’ఫ్రిల్స్ అండ్ కిక్స్ ‘’ఉండాలన్నాడు. అదేఆమే మొదటి ప్రదర్శన .ఒక వారం బాగానే గడిచింది .కాని దాన్ని వద్దని వదిలేసింది .చికాగో లో అప్పటికే పెళ్ళయిన పోలిష్ పెయింటర్ ను ప్రేమించింది .అతనంటే పిచ్చ ప్రేమ కలిగింది .కాని తల్లి ఒప్పు కోక పోవటం తో పెళ్లి జరగలేదు .తన బాల్య జీవితమంతా  తండ్రి చేసిన నికృష్ట పు పని నీడ పడి వెంటాడిందని బాధ పడింది .తల్లితో తండ్రి విడాకుల విషయం తన మనసుపై తీవ్రమైన ముద్ర వేసి౦ది అన్నది .కనుక తాను పెళ్ళికి వ్యతిరేకంగా ,స్త్రీ జన విముక్తికి పోరాడాలని ,ప్రతి స్త్రీ ఒకరో ఇద్దరో పిల్లలను కనటానికి హక్కు ఉండాలని కోరింది .

 చికాగో వదిలాక ఆగస్తిన్ డాలీ అనే నాటక ప్రదర్శకుడు పిలిచిన ఇంటర్వ్యు కు వెళ్లి ఉపన్యాసంగా ‘’నేను డాన్స్ ను కనిపెట్టాను .రెండు వేల సంవత్సరాలుగా మరుగున పడిన ఆర్ట్ ను కనుక్కున్నాను . దానితో మన నాట్యాన్ని  విప్లవాత్మకంగా మార్చేయవచ్చు .నేను ఎక్కడ నేర్చుకొన్నాను అని ప్రశ్నిస్తే ఫసిఫిక్ సముద్ర తీరం వద్దా ,సియార్రా నేవడాలోని పైన్ వృక్షారణ్యం దగ్గరా నేర్చానని చెప్తాను .నేను మహా కవి వాల్ట్ విట్మన్ ‘’ఆధ్యాత్మిక పుత్రిక ‘’ను .అమెరికా పిల్లల కోసం అమెరికాను యదార్ధం గా అభి వ్యక్తీకరించే డాన్స్ ను సృష్టిస్తాను ‘’అన్నది గుక్క తిప్పుకోకుండా .ఇసడోరా వాక్ ప్రవాహం ఆమె లోని సృజన ,తపన ,నమ్మకం చూసి ఇలాంటి అమ్మాయి కోసమే తానూ వెతుకుతున్నట్లుగా భావించి తీసుకొన్నాడు .కొన్ని వారాలతర్వాత ఇసడోరా బ్రాడ్వే లోని 29వ వీధిలో రిహార్సేల్ ప్రారంభించింది .మూకాభినయం విజయవంతం కాలేదు .అప్పుడు డాలీ ‘’ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’లో ఒకసీన్ ప్రాక్టీస్ చేయించాడు .అందులో దేవదూతలు పెట్టుకొనే రెక్కలు ,వాటితో డాన్స్ నచ్చలేదు .ఇంగ్లీష్ మ్యూజికల్ కామెడి ‘’గ్రీషా’’లోకోరస్ పడటమూ ఇబ్బంది అనిపించింది .

      కూతురు సంపాదించిన కొద్ది డబ్బుతోనే ఇసడోరా తల్లి కార్నెజీ హాల్ లో ఒక రూమ్ ఉన్న స్టూడియో ను అద్దెకు తీసుకొని కుటుంబాన్ని ఇక్కడకు వచ్చేయమన్నది .కొద్దిమందికి పియానో నేర్పింది .కొడుకు ఆగస్తిన్ నటుడు కావాలనుకొని టూరింగ్ టాకీస్ లో చేరాడు .రేమాండ్ ఒకపత్రికలో పార్ట్ టైం జాబ్ లో చేరాడు ,ఎలిజబెత్ ఇసడోరాకు సాయం గా ఉంది .అందరూ కొద్దో గొప్పో సంపాదిస్తున్నా  ఇంటి అద్దె కు చాలక  వక్తృత్వం సంగీతం కోసం గంటకు ఇంత అని అద్దేకిస్తూ రాబడి పెంచుకొన్నారు .వీరందరితో స్టూడియో కిక్కిరిసిపోతే డంకన్ కుటుంబం సేదదేరటానికి సెంట్రల్ పార్క్ కు వెళ్ళేవారు .ఇసడోరా కచేరీలను పెంచింది .డాన్సులూ చేస్తోంది .ఎతేల్ బెర్ట్ నేవీననే ఆతను ఆమెకు చిన్న చిన్న కచేరీ హాళ్ళలో కచేరీలకు కుదిర్చాడు .అయినా ఖర్చు ఎక్కువా రాబడి తక్కువ గా ఉంది .సంచార తెగల గుడారం లాంటి ఈ కొ౦ప నుంచి విండ్సర్ హోటల్ లోని రెండు విశాలమైన గదుల్లోకి మారారు .కాని ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది .అప్పుడు ఇసడోరా ‘’మమ్మల్ని ఆదుకొనేది ఒక్కటే హోటల్ తగలబడటమే ‘’అన్నది నవ్వుతూ .ఈపరిస్థితి లో అదృష్టం ఆమె తలుపు తట్టింది .మర్నాడే విండ్సర్ భవనం పూర్తిగా కాలి నేల మతట్టమైంది .జంతువులను చేరవేసే ఒక బోటు ఎక్కి డంకన్ కుటుంబం వారు ఇంగ్లాండ్ వెళ్ళారు .

 

Inline image 1

      సశేషం

            మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-16-ఉయ్యూరు

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-5

ఇది విన్నారా ,కన్నారా !-5

8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి

76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు .

77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ విరమణ చేశారు .

78-స్వామి గారు ఇంటి దగ్గరే సంగీత విద్యార్ధులకు గాత్రం వీణ వయోలిన్ లను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితం గా నేర్పిన ఉదారులు .

79-శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద గురుకుల పద్ధతిలో వారి౦ట్లోనే ఉండి 1941నుండి 48వరకు ఉచితంగా సంగీతం అభ్యసించారు .వీరితండ్రి శ్రీ పెద్దయ్య గారుకూడా ప్రముఖ విద్వాంసులే .8 రకాల తాళ వాద్యవాదనలో నిపుణులు .

80-రెండవ క్లాసు వరకే చదివిన స్వామిగారు 1948నుండి 1986వరకు విజయవాడ ఆకాశ వాణి లో ఉద్యోగించారు .

81-నాద సుధార్ణవ ,గాన కళానిధి రామస్వామిగారు తామ గురువులు రామ కృష్ణయ్య గారు విజయవాడలో సంగీత కళా శాల స్థాపనకోసం కొంత భూమి నిచ్చి ,పునాది వేసి   చనిపోతే ,స్వామిగారు ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి  మోతే వేదకుమారి గారి   తో ఈ విషయం  ప్రస్తావించగా ఆమె వెంటనే ఆనాటి మంత్రి శ్రీ ఎస్ .పి.పట్టాభిరామా రావు గారితో చెప్పి విజయవాడలో సంగీత కళాశాల మంజూరు చేయించగా నిర్మింపజేసి  గురు ఋణం తీర్చుకొన్నారు .పునాది గురువుగారిది భవన నిర్మాణం శిష్యునిది .

82-రామస్వామిగారు విజయవాడ  గాంధి నగర్ లో  గురువులు గాయక సార్వ భౌమ శ్రీ పారుపల్లి రామ క్రిష్నయ్య గారి కాంశ్య విగ్రహ ప్రతిస్టాపనం చేయించారు.అంతటి గురు భక్తి వారిది .

83-‘’సప్త గిరి సంగీత విద్వన్మణి ‘’స్వామిగారు చడువేమీ లేక పోయినా ఛందో భంగం లేకుండా పాంచాలీ రీతిలో రస గుళికలలాంటి రచనలు చేసిన వాగ్గేయ కారులు .

84-వయోలిన్ సోలో వాయించటం లో రామ స్వామి గారు ఎంత నిష్ణాతులో సహకార వాద్యం లోనూ అంతే చతురులు .వారు సహకార వాద్యం వాయిస్తే ‘’పట్టుపరుపు మీద పడుకొన్నట్లు ఉంటుంద’’న్నారు  ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు .

85-ప్రక్క వాయిద్యం వాయిస్తుంటే ‘’కూరలో సరిపడా ఉప్పు ఉన్నట్లుగా ఉండాలి .ముఖ్య కళాకారుడు ,వయోలిన్ కలిసి పాడినట్లు౦డాలి’’అంటారు’’ స్వామీ’’జీ .

86-హంస పురస్కార గ్రహీత ,ఆకాశ వాణి ఆడిషన్ కమిటీ సభ్యులు అయిన స్వామిగారు అనేక దేశాలలో సోలో కచేరీలుచేశారు  సహకార వాద్యమూ  వాయించారు .అయినా రవ్వంత గర్వం కాని ఈర్ష్యా అసూయలు కాని లేని పూర్ణ పురుషులు .

87-‘’నేను దేనికీ భయపడను –ఒక్కశ్రుతి,లయలకు తప్ప ‘’అంటారునిర్భీకులైన  పండిన వాయులీన ఘనులు శ్రీ అన్నవరపు రామ స్వామి .

9-మహా మహోపాధ్యాయ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ

88-‘’ప్రతి వారిలో’’ లయ ‘’ఉంటుంది .దాన్ని వెలికి తీసే బాధ్యత అధ్యాపకునిది ‘’అన్నారు మహా మహోపాధ్యాయ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారు .

89-లయ ప్రాధాన్యతతో ఆకెళ్ళ వారు విద్యార్ధుల కిచ్చే శిక్షణ మహత్తర మైనది .తెలుగు లోను ఇంగ్లీష్ లోను వీరు ‘’తాళ ప్రస్తార రత్నాకరం ‘’రాశారు .Indian genius in Talaprastar ‘ Tala prastara of Nihamka Saranga deva’s Sangita ratnakara ‘’అనే వీరి రెండు ఉత్తమ గ్రంధాలు చరిత్రలో చిరస్థానం పొందాయి .

90-36 రాగాలకు ఒక్కొక్కటి అయిదారు నిమిషాల కు సరిపడా రాగాలాపనలను స్వర లిపి లో రచించి ‘’స్వరరాగ సుధ’’అనే మహోత్కృష్ట గ్రంధం రాశారు .

90-శ్రీ నేదునూరి వారిని ఆకెళ్ళ వారు తమ గురుదేవులుగా భావిస్తారు .

91-సంగీత కళాశాలలలో నేడు బోధిస్తున్న సర్టి ఫికేట్ కోర్సుకు ఆకెళ్ళ వారు సిలబస్ తయారు చేసిచ్చారు .అలాగే డిప్లొమా కోర్సుకు ఆరేళ్ళ శిక్షణ కూ వారిచ్చిన సిలబస్ నే అందరూ అనుసరిస్తున్నారు ఇంతకంటే ఘనత ఇంకేమి ఉంది ? వీటిని సి.డి .లుగా కూడా రూపొందించి మహోపకారం చేశారు ఆకెళ్ళవారు .

92-ఆకెళ్ళ వారి ‘’తాళ ప్రస్తార సాగరం ‘’గ్రంధం 1985లో తెలుగు విశ్వ విద్యాలయం చేత స్సర్వ శ్రేష్ట గ్రంధంగా ఎంపిక కాబడి౦ది .

93-భారత ప్రభుత్వం ఆకెళ్ళ వారికి సీనియర్ ఫెలోషిప్ అందించి  నిశ్శంక శా౦ర్గ్య దేవుని ‘’సంగీత రత్నాకర ‘’గ్రంధానికి వ్యాఖ్య రాయించింది .

94-లయ విన్యాసాలపైనా ,వర్ణాలపైనా ఆకెళ్ళ వారు 481’’ఆడియో ట్రాక్స్ ‘’లను సి డిలుగా వెలువరించారంటే వారి విద్వత్తు యే స్థాయిదో అర్ధమవుతుంది .అందుకే వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ అవార్డ్ ,టి టి.కె .అవార్డ్ లభించాయి

Inline image 1  Inline image 2

Inline image 3  Inline image 4

 

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-16-ఉయ్యూరు  ‘

.

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-4

ఇది విన్నారా ,కన్నారా !-4

6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి

61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య .

62-నేదునూరి వారికి సంగీత విద్యలో తెలియని రహస్యం లేదు .సంగీత విషయం లో వారి అభిప్రాయాలను బహు నాగరికంగా తెలియ జేయటం వారి సంస్కారం .

63-60ఏళ్ళు శాస్స్త్రీయ సంగీతన సాధనం లో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ శాస్త్రి గారు అన్నమయ్య  60 సంకీర్తనలను రెండు సంపుటాలుగా స్వర పరచి ప్రచురించారు .అన్నమయ్య కృతులను పాడి 3 కాసెట్లు వెలువరించారు .64-‘’జిరాక్స్ కాపీ లాగా ఎవరూ పాడలేరు .ఎవరి మనోధర్మం వారిదే .మాడ్యులేషన్ లో తేడా ఉంటుంది .దాని వలన  వ్యక్తిగత అందం పెరుగుతుంది .సంగతులు వేరే అయినా పాడటం లో ఏదో మార్పు ఉంటుంది .అందుకే ఎవరి గాత్రం వారికి ప్రత్యేకంగా ఉంటుంది ‘’అంటారు నేదునూరి వారు .

65-‘’సంగీతం ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగించాలి దానికి సాహిత్యం ఒక వెహికిల్ .సంగీత పరిపూర్ణతకు సాహిత్యం చాలా అవసరం .’’అన్నారు .

66-కీర్తన పాఠానికి నేదునూరివారు ఎంతో విలువ నిస్తారు .ఈ నాటి కళాకారులు ఆర్ట్ నే ప్రదర్శిస్తున్నారు కాని  కీర్తన ,లయ,స్వర,కల్పనమొదలైన శాస్త్ర విషయాలను బలహీనంగా చూపిస్తున్నారని బాధ పడ్డారు .’’ఆర్ట్ ను శాక్రి ఫైస్  చేసేంత క్రిటికల్ పొజిషన్ లోకి పోవద్దు ‘’అని సంగీత కళాకారులకు హితవు చెప్పారు .

67-కర్నాటక సంగీత వృక్షానికి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు ఒక తురాయి పువ్వు .సంప్రదాయజ్నుడు ,విద్వచ్చిఖామణి,సంగీతమే తప్ప మరొక జీవితాంశం లేనివారు ‘’ .

7-సంగీత భీష్మ శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి

68-కర్నాటక సంగీత విద్వాంసులలో భీష్మా చార్యులుగా గుర్తింపుపొందిన శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత నెలకు వెయ్యి రూపాయల గౌరవ పారితోషికం అందుకున్నారు .

69-ఆడిషన్ పరీక్ష లేకుండానే ఆకాశ వాణి లో ప్రసారాలు సాధించారు .సంగీత సరస్వతి ,గాన ధీర ,సంగీత చక్రవర్తి ,గాన రసార్నవ బిరుదులూ పొందారు .

70-తాన్సేన్ విశేష రాగం తో జ్యోతిని వెలిగించాడని ,దీక్షితులవారు అమృత వర్షిని రాగం పాడి వాన కురిపించారని మనకు తెలుసు .ఆ రాగం  కీర్తనలోనే ‘’వర్షయ వర్షయ సలిలం ‘’అన్న మాటలున్నాయి. పురుషోత్తమ శాస్త్రిగారు ఇతర రాగాలతో కూడా వర్షం కురిపించవచ్చని రుజువు చేశారు .’’ఖర హర ప్రియ ‘’రాగాన్ని మండు వేసవికాలం లో 9రోజులు దీక్షగా పాడి వాన కురిపించిన ఘటికులు శాస్స్త్రిగారు .వర్షాలకు పంతువరాళి శంకరాభరణ రాగాలూ పనికి వస్తాయని ,తెలియ జేశారు .సుమారు 30ఏళ్ళ క్రితం సన్నాయి పై చారు కేసి రాగాన్ని వాయించి పంట దిగుబడిని 60శాతం పెంచారు మనవాళ్ళు .మోహన రాగ ప్రస్తారం చేస్తే వంద దిగ్రీలలోపు జ్వరాలు తగ్గిపోతాయని శ్రీ బాల మురళి అన్నారు .నవీనకాలం లో గానం తో వర్షా వృద్ధి ని సాధించిన ఘనత పురుషోత్తమ శాస్త్రి గారిదే.

71-అక్బర్ పాదుషా ముందు గోపాల నాయక్ అనే సంగీతా విద్వాంసుడు యమునా నది నీటిలో గొంతు వరకు మునిగి దీపక్ రాగం ఆలపించాడని దాని వలన నీళ్ళలోనే అగ్ని పుట్టి ఆ సంగీత విద్వాంసుడు కాలిపోయి పిడికెడు బూడిద గా మారాడని ఒక ఐతిహ్యం ప్రచారం లో ఉంది .

72-‘’I am sure that turbulent lunatics could ,to a very large extent ,be made amenable and to some extent quieted by Neelambari or ydukula Kambhoji ‘’అని ‘’ఫాసేట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ‘’పుస్తకం లో శ్రీ శ్రీనివాసన్ రాశారు .

73-పిరికి తనాన్ని పోగొడుతూ ,తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే శక్తి నీ ధైర్యాన్ని ‘’శుభ పంతు వరాళి రాగం ‘’ఇస్తుందని శాస్త్రిగారి నిశ్చితాభిప్రాయం .అకాల మృత్యువు ,బొమికల లోపాలు చర్మ వ్యాధులను శంకరాభరణం నయం చేస్తుందని భరోసా ఇచ్చారు .

74-శాస్త్రి గారిని భారత ప్రభుత్వం ‘’కల్చరల్ స్కాలర్ ‘’గా సంగీతం లో నియమించింది .నాద యోగి పరంపరలోని వారాయన .

75-వరంగల్లు నగరం లో  శ్రీ పురాణం పురుషోత్తమ శాస్స్త్రిగారికి 1980లో స్వర్ణ గండ పెండేరం తొడిగి ఆ సంగీత సరస్వతిని సన్మానించారు .

Inline image 1  Inline image 2Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -163

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -163

 62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే -3(చివరి భాగం )

 వయసు నలభై మధ్యలో సియార్రే దగ్గర స్విస్ చాటోలో నివాసమేర్పరచుకొన్నాడు .అప్పుడప్పుడు పారిస్ ,ఇటలీ ట్రిప్ లు చేస్తున్నాస్విట్జర్లాండ్ లో స్థిర పడాలని కోరుకున్నాడు .యాభై వ ఏట రక్త హీనత బారిన పడ్డాడు .రిల్కే కు ఇష్టమైన రోజ్ చిహ్నం అతని చావును వేగిర పరచింది .రిల్కే కున్న ఈజిప్ట్ అభిమాని నిమేట్  ఎలౌ బే కు గులాబీ పుష్పగుచ్చాన్ని ఇవ్వాలనుకొని గులాబీ పూలు కోస్తూ గులాబి ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ అయి ,విషమై ఇన్ఫెక్షన్ సోకి లుకేమియా తీవ్రమై బలహీనమైనాడు .29-12-1926న 57వ ఏట రిల్కే మరణించాడు .స్విట్జర్లాండ్ లోని వాలోలిస్ లో ఉన్న రెరాన్ లో ఖననం చేశారు .

   రిల్కే అభిమానులు కొద్ది  మందే ఉండేవారు .వారికీ ఆయన ‘’కవులకు కవి ‘’అని పించాడు .కవితలు కధలు జ్ఞాపకాలు ,అనువాదాలు అన్నీ కలిపి రిల్కే 30కి పైగా రాశాడు .చనిపోయాకకూడా గ్రంధ ప్రచురణ జరిగింది ఆయన ప్రతీకలు ఒక దానిలో ఒకటి చోరబడి విశ్లేషకులకు తల బొప్పి కట్టేది .రిల్కే అత్యంత పారవశ్యం తో బాధ పడ్డాడు .వాచామ గోచరంకాని దాన్ని వాచ్యం చేయటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .కాలాతీత ,రూపాతీత ,అనంత పరబ్రహ్మాన్వేషణ చేశాడు రిల్కే .ఇది కొందరికి ఆధ్యాత్మిక అవకాశ వాదం అని పించింది .రిల్కే భావదారను తెలియ జేస్తూ లూయీ అంటర్ మేయర్ ‘’There is a magnificence in Rilke’s double vision which tries to break through the barrier of the senses ,and even for those who comprehend it only in glimpses ,there is nobility in the poetry which continually strives to unite thought and action desire and fulfillment ,in a sustained  flash of revelation ‘’ అని అన్నాడు .

    రిల్కే శైలి గురించి చెప్పాలంటే గ్రీక్ మైదాలజి లోని విషయాలను స్వీయ వ్యాఖ్యానం తో  కవిత్వం రాశాడు .రూపకం అన్యాపదేశాలను ఎక్కువగా వాడాడు .కవిత్వం లో ఖండన  ఎక్కువ .రోజా పువ్వును నిద్రకు చిహ్నంగా ,వాటి రేకులు మూసిన కనురెప్పలకు ప్రతీకలుగా గ్రహించాడు .’’విజన్ ఆఫ్ క్రైస్ట్ ‘’లో మేరీ మాగ్దలీన్ ను క్రీస్తు కుమారుడి తల్లిగా చెప్పాడు .’’యేసు క్రీస్తు దివ్యుడు కాదు మానవుడే .జెరూసలెం కు అవతలున్న కాల్వేరి కొండపై ఆయన్ను శిలువ చేసినప్పుడు వచ్చిన గాధలే ఆ యన చరిత్రకు ఆధారం ,ఈ విషయాలు 1893నాటికి  ప్రచురణ పొంని కవితలలో చెప్పాడు .మేరీ మాగ్దలీన్ తో క్రీస్తు ప్రేమ విషయమూ రాసి, ఆయన దైవాంశ స౦భూతుడు కాదని కేవల మానవ మాత్రడేనని గట్టగా తెలియ జేశాడు’’అని సుసాన్ హస్కిన్ వివరించాడు .

   అమెరికాలో రిల్కే కవిత్వాన్ని బాగా ఆరాధించి పుస్తకాలు బాగా కొన్నారు .13వ శతాబ్దపు సూఫికవి రూమి లాగా ,20వ శతాబ్దపు లెబనీస్ –అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ లాగా  రిల్కే ను ఆరాది౦చా రక్కడ .టివి సినిమా రేడియో లలో రిల్కే కవిత్వాన్ని తరుచుగా ఉదహరిస్తారు .అతనిది ‘’మార్మిక కవిత్వం ‘’అంటారు .ఆరాటం తక్కువ తో ఎక్కువ సఫలతతో ముందుకు నడిపిన మార్గ గామి గా రిల్కే ఆరాధింప బడుతున్నాడు .రిల్కే రాసిన ‘’డ్యూనో ఎలిజీస్ ‘’ప్రభావం పడని కవి లేడు.ముఖ్యంగా ఆడెన్ కు  రిల్కే  ఆరాధ్య కవి .

రిల్కే కవితలలలో కొన్ని –భావాలు మరికొన్ని

“Let everything happen to you
Beauty and terror
Just keep going
No feeling is final”
― Rainer Maria Rilke

 

“I live my life in widening circles that reach out across the world.”
― Rainer Maria RilkeRilke’s Book of Hours: Love Poems to God

 

“Believe in a love that is being stored up for you like an inheritance, and have faith that in this love there is a strength and a blessing so large that you can travel as far as you wish without having to step outside it.”
― Rainer Maria RilkeLetters to a Young Poet

 

“The work of the eyes is done. Go now and do the heart-work on the images imprisoned within you.”
― Rainer Maria Rilke

 

Love consists of this: two solitudes that meet, protect and greet each other. ”
― Rainer Maria Rilk

 

 

“Extinguish my eyes, I’ll go on seeing you.
Seal my ears, I’ll go on hearing you.
And without feet I can make my way to you,
without a mouth I can swear your name.

Break off my arms, I’ll take hold of you
with my heart as with a hand.
Stop my heart, and my brain will start to beat.
And if you consume my brain with fire,
I’ll feel you burn in every drop of my blood.”
― Rainer Maria Rilke

 

“The purpose of life is to be defeated by greater and greater things.”
― Rainer Maria Rilk

 

“Have patience with everything that remains unsolved in your heart.
…live in the question.”
― Rainer Maria RilkeLetters to a Young Poet

 

“The only journey is the one within.”
― Rainer Maria Rilke

 

“Make your ego porous. Will is of little importance, complaining is nothing, fame is nothing. Openness, patience, receptivity, solitude is everything.”
― Rainer Maria Rilke

 

Let life happen to you. Believe me: life is in the right, always.”
― Rainer Maria Rilke

 

Whenever Rilke writes about God, however, he is not referring to the deity in the traditional sense, but rather uses the term to refer to the life force, or nature, or an all-embodying, pantheistic consciousness that is only slowly coming to realize its existence

 

The revolutionary poetic philosophy that Rilke proposed in Duino Elegies is considered significant to many literary scholars. “No poet before him had been brave enough to accept the whole of [the dark side of the] world, as if it were unquestionably valid and potentially universal,” asserted Conrad Aiken in his Collected Criticism.

 

“The Sonnets are the songs of his victory,” affirmed Bowra in The Heritage of Symbolism.“In the Sonnets,” Bowra wrote, “Rilke shows what poetry meant to him, what he got from it and what he hoped for it.

 

రిల్కే జీవిత చరమాంకం లో ఫ్రెంచ్ కవులు పాల్ వాలేరి ,జీన్ కాక్టువాప్రభావం లో పడి ఫ్రెంచ్ భాషలో కవిత్వం రాశాడు .

Inline image 1  Inline image 2  Inline image 3Inline image 4

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-6-6-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -162

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -162

 62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే -2

  కావాలనే ఒంటరిగా ఉన్నాడు రిల్కే .కాలాన్ని ఎక్కువగా మ్యూజియం, గాలరీ ,స్టూడియోలు ,లైబ్రరీలు పబ్లిక్ గార్డెన్ లలో గడుపుతూరాత్రి వేళల్లో రోడ్లమ్మట తిరుగుతూ సీన్ నది గట్ల వెంబడి పచార్లు చేస్తూ గడిపాడు .ఒంటరితనాన్ని ఆతను అర్ధం చేసుకోన్నంత ఎక్కువగా వేరెవరూ అర్ధం చేసుకోలేదు .బ్రహ్మాండంగా ఏకాంతాన్ని అనుభవించాడు .’’నాకు ఏకాంతమే కావాలి లోపలి ఏకాంతం . ఏకాంతమే పని, స్థాయి ,వృత్తీ అంటాడాయన .తాను రాసిన ‘’ది నోట్ బుక్స్ ఆఫ్ మాల్టేలారిడ్స్ బ్రిగ్గీ ‘’లో  ‘’మనిషి అనేక నగరాలు తిరగి మనుషుల్ని చూడాలి .పక్షులు జంతువుల గురించి తెలుసుకోవాలి .పువ్వుల నవ్వులు అనుభవించాలి అప్పుడెప్పుడో ఏదో ఒక సమయం లో రాయాల్సిన దానిలో మొదటి ది స్పురిస్తుంది’’ అంటాడు

   ఈ తిరగటం లో బెల్జియం ,కాప్రిమ్యూనిచ్ బిస్క్రా ,కార్తేజ్ ,నేపుల్స్ ,ట్యూనిస్లు చుట్ట బెట్టాడు .అల్జీర్స్ లో ఈజిప్ట్ లోనూ గడిపాడు .’’ది బుక్ ఆఫ్ అవర్స్ ,’’,ఎర్లి పోయెమ్స్ ‘’,ది లైఫ్ ఆఫ్ వర్జిన్ మేరీ లతోపాటు ఎలిజబెత్ బార్రేట్ బ్రౌనింగ్ పోర్చుగీస్ లో రాసిన సానేట్స్ ను అనువాదం చేశాడు. తనలో ఏదో మార్పు వస్తున్నట్లు గ్రహించాడు  . పని దృష్టిఏర్పడి మనసు తో చూడటం ఆలోచించటం మొదలు పెట్టాడు.  బయటిదాన్ని చూస్తూ అంతరంగం మదనాన్ని గ్రహించాడు . వస్తున్న  మార్పు ఏమిటో  తెలుసుకోలేక పోతున్నాడు .బాధ అనుభవిస్తూ ఎదురు చూస్తున్నాడు .భార్య నుండి విడిపోయి శారీరకంగా మానసికంగా కు౦గి పోయాడు .తనకు సృజన శక్తి తగ్గి పోతోందని బాధ పడ్డాడు .దిగులు నిరాశా ఉన్న సన్యాసి గా మారిపోయాడు .

     అదృష్ట వశాత్తు మేరీ వాన్ తర్న్ అండ్ టాక్సిస్హోహెన్ లోహే అనే ప్రిన్సెస్ తో పరిచయమై ,త్రీస్టీలోని కాజిల్ ఆఫ్ ద్యునోలో ఆమె కు అతిధిగా ఉన్నాడు .ఏడాదిన్నర తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఒంటరిగా ఉన్నాడు .ఒక రోజు అకస్మాత్తుగా ఆధ్యాత్మిక శక్తి ఏదో అనుభవం లోకి వచ్చినట్లు అనిపించింది .ఏదో కొత్త విషయం జరిగింది .తానేదో ప్రకృతికి ఆవలి తీరం లో ఉన్నట్లు అనిపించింది .ద్యుయానో లో ఉన్న ఈకాలం లో అంతరాత్మ ఎదోచెప్పిన అనుభూతి కలిగింది .ఈ అనుభూతిని ‘’ద్యూనో ఎలిజీస్ ‘’గా పదేళ్ళు రాసి పూర్తీ చేశాడు .’’ప్రతి చోటా ఏదో కనిపించి దృష్టి గోచరమైంది .ప్రతి దానిలోనూ ఒక అంతర్ ప్రపంచం కనిపించింది . అంతరిక్షం  తో ఉన్న ఒక దేవదూతదర్శనమైంది ..ఈ అంతరంగాన్ని పట్టుకోవటమే నా కర్తవ్యమ్ అనిపించింది ‘’అని రాశాడు రిల్కే .దైవ దర్శనం తోపులకించాడు .ఒక చెట్టు కొమ్మ లోనుంచి విశ్వాన్ని చూశాడు .రిల్కే చూసింది క్రిస్టియన్ దేవత కాదని దేవుని మారు పేరు అని అంటారు .రిల్కే ఆ దేవతలో కనిపి౦ చేది పూర్తిగా కనిపించనిదిగా  మార్పు చెందుతుందని అన్నాడు .దేవదూతలో ఉన్న ప్రపంచానికే రిల్కే మనసును అర్పణ చేశాడు .అదే ఉండటం అవటం (బీయింగ్ అండ్ బికమింగ్ )అన్నాడు

  ఈఎలిజీలలో ఉన్న శోకానికి జవాబుగా ‘’సానేట్స్ ఆఫ్ ఆర్ఫియస్ ‘’రాశాడు .శోకం తర్వాత ఆనందం అన్నమాట .మళ్ళీ ఒంటరితనం ,అవిశ్రా౦తత అనుభవించాడు .లోకసంచారం తిరిగీ ప్రారంభించాడు .ప్రజలంతా పతనం లో ఉన్నారన్నాడు ప్రేమ విషయం లో అతని అభిప్రాయాలు తమాషాగా ఉంటాయి .ఆదర్శ ప్రేమికులు అంటే స్త్రీత్వం ఉన్నవారే ,ఏదీ కోరనివారే ,అర్ధం చేసుకోగలిగిన వారే అంటాడు .మగ వాడు ప్రేమలో ఆశక్తుడని రిల్కే అభిప్రాయం .

         సశేషం

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -161 62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -161

 62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే

జర్మనీ మహా కవులు గోదే ,హీన్ లతర్వాత అంతటి ప్రసిద్ధి పొందిన కవి రైనెర్ మేరియా రిల్కే .ఆస్ట్రియా కు చెందినవాడైనా జర్మనీలోనే ఉన్నాడు ఆభాషలోనే రచనా వ్యాసంగం చేశాడు .4-12-1875న ప్రేగ్ లో పాత బోహీమియన్ వంశం లో జన్మించాడు .చిన్ననాటే గొప్పవాడని పించాడు .ఒక కూతురు పసిపిల్లగా ఉన్నప్పుడే చనిపోతే తల్లి ఇతనిని అతిగారాబంగా ఆడపిల్లలాగా పెంచి ముద్దూ మురిపం చూపింది .చర్చిలో పేరు రెనీ .ఆరేళ్ళదాకా ఆడ పిల్ల వేషం లోనే పెరిగాడు .ఆడుకోటానికి బొమ్మలు ,టాయ్ కిచెన్ వంటివి ఇచ్చేది తల్లి .తల్లికి సాయం చేస్తూ వస్తువుల దుమ్ము దులిపెవాడు .ధరించిన పెద్ద గౌను ,చిన్న చామాయిస్ గ్లోవ్స్ లను చూసుకొని గర్వ పడేవాడు .

   తనకు యే రకమైన పునాది లేదన్నాడు .రహస్యంగా ఉండటం అలవాటైంది .ఈ ఆడ వేషాలకు చెల్లు చీటీ ఇస్తూ తండ్రి మిలిటరీ స్కూల్ లో చేర్చాడు .పదేళ్ళ వయసులో నిత్య జీవితం లోని ఒత్తిడి  తట్టుకుంటూ ,ఒంటరిజీవితానికి అలవాటు పడి ,చివరికి ఒక అంకుల్ రక్షణలో ఊపిరి పీల్చుకొన్నాడు .ఈ అంకుల్ గారి చిత్రాన్ని గీసి ఆయన్ను ఒక చక్ర వర్తి గా ఆరాధించాడు .క్రమంగా ఈ ఆరాధన భగవంతుని వైపు మరల్చాడు .మిలిటరీ స్కూల్ లో ఇబ్బంది పడ్డాడు .అయిదేళ్ళు మిలిటరీ స్కూల్ చదువు .నీళ్ళలో చాలా సేపు ఇతన్ని నిలబెట్టేవారు .పనికి మాలినవారితో జమ చేసి తిప్పలు పెట్టేవారని చెప్పుకొన్నాడు .ఈ బాధలు భరించ లేక అర్ధ రాత్రులలో మంచం మీద లేచి నిలబడి తనకు చావు ప్రసాదించమని దేవుడిని వేడుకొనేవాడు .మొరేవియాలోని సెయింట్ పోల్టన్ అనే మొదటి స్కూలు లో అనుభవించిన దారుణాలు మానసిక గాయమై జీవితాంతం వేధిస్తూనే ఉన్నాయని చెప్పుకొన్నాడు రిల్కే .

  గోరు చుట్టూ మీద రోకలి పోటులాగా రిల్కే బాధలు తల్లీ తండ్రీ విడి పోవటం తో మరీ పెరిగాయి .పెదనాన్న జరోస్లోవ్ రిల్కే బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యూటర్ లను పెట్టి చదివించాడు ఈ అంకుల్ అకస్మాత్తుగా మరణించగా ఏడేళ్ళ  రిల్కీ తట్టు కోలేక  ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొన్నాడు .బిజినెస్ స్కూల్ లో ఒక ఏడాది లాగినా ఉపయోగ పడలేదు .ప్రేగ్ యూనివర్సిటి పరీక్ష ఇరవై వ ఏట పాసయ్యాడు .సాహిత్యం మెటాఫిజిక్స్ ,తత్వ శాస్త్ర చరిత్ర ,చదివాడు  న్యాయ శాస్త్రం పై ద్రుష్టి పడింది..ఒక సెమిస్టర్ అవగానే ఆర్ట్ చదవటానికి మ్యూనిచ్ పారిపోయాడు .తర్వాత స్కూల్ చదువుకు సున్నా చుట్టి వారసత్వ ఆస్తిపై వచ్చిన కొద్దిపాటి డబ్బుతో యాత్రా సందర్శనం తో  కొత్తకొత్త స్నేహితులతో ,కొద్దికాలపు అసంతృప్తి  ప్రేమ వ్యవహారాలతో కాలక్షేపం చేశాడు .

  1897లో వేలరీ డేవిడ్ రోన్ఫీల్డ్ అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ ఆగి పోయాక మొదటిపుస్తకం ముద్రణకు డబ్బు ఇచ్చి ,నీట్జే ని కలవరపరచిన లూ సలోమీ35ఏళ్ళ ఆవిడతో 23వ ఏట ప్రేమలో పడ్డాడు  .ఆమె ఇతనిని  హృదయానికి హత్తుకోగానే అతని గుండె కుదుపులకు లోనైంది .ఇద్దరూ ప్రేమికుల అవతారం ఎత్తారు .కాని కొద్దికాలానికే విడిపోయారు .మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత పెళ్లి చేసుకొన్నారు .సలోమీ రిల్కీ కి సర్వస్వం అయి ఎంతో సహకరింఛి ఆదర్శ గృహిణి అనిపించింది .నిత్య బోరు జీవితాన్నుంచి దూరం కావటానికిఒంటరి తనానికి  ప్రయత్నించేవాడు .మొదటిపుస్తకం ‘’లైఫ్ అండ్ లిరిక్స్ ‘’ను 19 ఏట ముద్రించాడు .తర్వాత మూడేళ్ళకు  ‘’dream crowned ‘’విడుదల చేశాడు  .సోరీస్ అబౌట్ గాడ్ ,ది బుక్ ఆఫ్ పిక్చర్స్ విడుదల చేశాడు .నమ్మశక్యం కాని ఈ ప్రపంచం దాని వాస్తవికత అతన్ని కుదిపేశాయి .

  22-25ఏళ్ళ మధ్య లో మ్యూనిచ్ బెర్లిన్ ,ఇటలీ ,రష్యాలు తిరిగి ప్రముఖ రష్యా రచయిత టాల్ స్టాయ్ణి కలుసుకొన్నాడు .రష్యన్ భాష నేర్చాడు .రెండో సారి రష్యా వెళ్లి వార్ప్స్ వీద్ అనే ఊళ్ళో ఉన్న ఆర్ట్ కాలనీ లో సారా వెస్ట్ హాప్స్ అనే రోడిన్ శిష్యురాలైన శిల్పిని ని చూశాడు.మరుసటి ఏడాది ఆమెను పెళ్లి చేసుకొని ఒక కూతురును కన్నాడు .పారిస్ వెళ్లి రోడిన్ నుకలిసి ,రోమ్ లో  ఒక నెలగడిపి ,ఇటాలియన్ రేవేరాలోని వయా రేగియో లో కొంతకాలం ఉండి,మళ్ళీ రోమ్ వచ్చి 10నెలలు గడిపి ,స్వీడెన్ డెన్మార్క్ లలో తిరిగి ,తిరిగి పారిస్ చేరాడు .30వ ఏట రోడిన్ కు సెక్రెటరి అయ్యాడు .అననుకూలమైన రోడిన్ తోఇబ్బంది పడ్డా అతని శిల్పకళ రిల్కేను ప్రభావితం చేసింది .Rilke envisioned a poetry ,which would not be about ‘’things ‘’,but would be them a poetry which would make his objects standby themselves ,filling space with their solidity ‘’ఇదే ‘’పోయెమ్స్ ఆఫ్ థింగ్స్ ‘’.ఇందులో మానవుల లక్షణాలు ,విశ్వ లక్షణాలు ఉంటాయి దీనిపై హాన్స్ ఈగన్ హాల్తూసేన్ ‘’ under the emblem of humanity ,of selfless devotion to ‘’die Dinge ‘’the world is conquered by the all in one of feeling .అని విశ్లేషించాడు .మాయాజాలమే అయినా అర్ధమయ్యే భావన కార్యం అదే సమయం లో కర్త్రుత్వకతను వదిలి విషయ పరంగా ను మొత్తం విశ్వం లోని వస్తుపరంగానూ వ్యక్తమౌతుంది .వస్తు శక్తిని ఆడెన్ కవి అంచనా వేస్తూ ఒంటరితనం నుండి రిల్కే తన ప్రపంచాన్ని మన ముందుంచాడు అంటాడు –Rilke whom ‘’die dinge ‘’bless –the Santa Claus of loneliness ‘’.

 Inline image 1 Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-3

ఇది విన్నారా ,కన్నారా !-3

35-సంగీత శాస్త్రీయతా పరిరక్షకులైన విద్వన్మణి శ్రీ శ్రీపాద పినాక పాణి గారి అన్నగారు శ్రీపాద గోపాల కృష్ణ మూర్తి తెలుగు సాహిత్య విమర్శకులుగా బహు ప్రఖ్యాతులు .

36-పాణి గారు ద్వారం వారి శిష్యులు .పినాక గారు మద్రాస్ వెళ్ళేటప్పుడు అక్కడి నాదస్వర వాద్యాలూ ,శ్రీ అరియక్కూడి రామానుజయ్యర్ గారి కచేరీలు వింటూ ఉండమని హితవు చెప్పారు .దీన్ని గౌరవిస్తూ శ్రీ పాణి వర్ణం కృతి రాగం ,నేరవు స్వర కల్పనా లను పరిశుద్ధ స్వరం తోతంజావూరు బాణీలో ప్రతిభా వంతంగా పాడే అరియక్కూడి రామానుజయ్యర్ గారి ఒక్కరి సంగీతమే విని ,ఇతర బాణీలకు వశమై పోవద్దు అని నాయుడుగారి సలహా గా భావించి ఔదల దాల్చారు .

37-‘’కర్నాటక సంగీతమే ఒక బాణీ .దీన్ని కల్తీ చేయకూడదు ‘’అని పాణిగారి నిశ్చితాభిప్రాయం .

38-చిన్నప్పటి నుంచి ఎవరి గానం విన్నా వాటిలోవిశేష సంగతులు సంచారాలను నోటు పుస్తకంలో రాసుకోనేవారు .అందుకే వారి దగ్గర ఉన్న సంగీత పాఠం మరెవ్వరి దగ్గరా లభించదు .దీని సాయం తోనే నాలుగు సంపుటాల ‘’సంగీత సౌరభం ‘’రాశారు .

39-1947లో శ్రీ రామానుజ అయ్యంగార్ ‘’కృతి మణి మాల ‘’గ్రంధాన్ని5సంపుటాలుగా  తమిళం లో వేడ్డామనుకొంటే,శ్రీ పినాక పాణి గారి స్నేహం, సలహాతో తెలుగులోనూ ప్రచురిస్తూ పాణిని గారితో సాహిత్యాన్ని రాయించారు .

40-తన స్వర పాఠంకన్నా ,ఏగాయకుడి పాఠమైనాబాగా ఉంటె దానినే సాధన చేయాలని శిష్యులకు చెప్పే సౌజన్యం పాణిని గారిది .

41-మనో ధర్మ సంగీతాన్ని సాధన చేసి చూపించినవారు పాణి గారు .ఆయనది కల్తీ లేని శుద్ధ సంగీతం .వారు సంగీత కులపతి.

42-పల్లవి గాన సుధ ,మనోధర్మ సంగీతం అనే రెండు విశిష్ట రచనలు చేసి మార్గ దర్శకులయ్యారు పాణి గారు

43-1100కు పైగా కీర్తనలను స్వర పరచి రచించారు .ఇంత భారీగా సంగీత సేవ చేసిన వారు అరుదు .

44-దక్షిణాది సంగీతానికి సంరక్షకులుగా నిలిచిన అభేద్య దుర్గం డా .శ్రీపాద పినాక పాణి .

45-‘’సంగీత మహా మహోపాధ్యాయ ,సంగీత విద్వన్మణి ,నాద నిధి ,రాగ హృదయజ్న ,నాద సుధార్ణవ ,సంగీత సార్వ భౌమ ,సంగీత క్షీర సాగర ,గానకళా గంధర్వ ,లక్ష్య లక్షణ మార్తాండ ,సంగీత సుధాకర ,అన్నమాచార్య విద్వన్మణి’’వంటి అనేక బిరుదులు  అందుకొన్నవారు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు .

46-250 రాగాల లక్షణాలను వివరంగా తెలుపుతూ ఉదాహరణలతో సహా ‘’రాగ లక్షణ సంగ్రహం ‘’గ్రంధాన్ని రచించిన  విద్వాద్వరేణ్యులు నూకల వారు .

47-త్యాగ రాజ స్వామి వారి పంచ రత్న కీర్తనలలో ఉన్న సంగీత సాహిత్య విశేషాలను తెలియ జేస్తూ ఇంగ్లీష్ లో నూకలవారు ‘’Monograph of Tyagaraja;s  Pancha  Ratna krutis ‘’ అనే వ్యాఖ్యాన గ్రంధం రాశారు .

48-శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి ప్రసిద్ధ ‘’నవావరణ కీర్తనలకు ,నవ గ్రహ కీర్తనలకు స్వరం సాహిత్యార్ధం తోవిశేష గ్రంధం రాశారు .

49-‘’సంగీత సుధ’’అనే పాఠ్య గ్రంధం తోపాటు ,త్యాగరాజ క్రుతులన్నిటి పైనా వ్యాఖ్యాన రచన చేశారు .

50-అంతర్జాల విప్లవాన్ని గ్రహించి ,సంగీత విద్యకు దాన్ని అన్వయిస్తూ ‘’Listen and Learn ‘’పేరుతొ 40ఆడియో కేసెట్లు తయారు చేశారు .

51-శ్రీ బాలమురళి తో కలిసి నూకలవారు ఒక ఏడాది జంట గాన కచేరీ చేశారు .ఇద్దరూ కలిసి  కాంభోజి ,కానడ రాగాలలో పాడిన వాటిని 45R.P.M.రికార్డ్ గా విడుదల చేశారు .

52-నూకలవారు గానం తో పాటు వయోలిన్ ,వయోలా వాయిద్యాలలోనూ నిష్ణాతులే .

53-పవిత్ర హృదయాలు సినిమాలో నూకల .బాలమురళి  జంట ‘’నారాయణ రెడ్డి గారి ‘’కరుణామయి శారద ‘’పాట పాడారు.

54-శ్రీ సత్య సాయిబాబా  స్థాపించిన సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ను అధ్యాపకులను  నూకలవారి తోనే సెలెక్ట్ చేయించారు బాబా .

55-నూకల వారిగాననికి మెచ్చి సత్య సాయిబాబా ఒక ఎమరాల్డ్ ఉంగరం సృష్టించి బహూకరించి ఆశీర్వదించారు .

56-శ్రీ కంచి పరమాచార్యులు ‘’నూకలవారిది దివ్య సంగీతం ‘’అని మెచ్చారు .

57-షట్కాలపల్లవి పాడే శ్రీమతి మండా సుధారాణి ని నూకలవారు బహుదా మెచ్చుకొంటారు .

58- గాయత్రి,పంచాక్షరి ,వెంకటేశ్వరోపాసన ,లక్ష్మీ గణపతి ,సరస్వతీ మంత్రాలను నిత్యానుస్టానంగా పాటిస్తారు .

59-‘’ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవత్యైః-వీం వీణాయైః మమ  సంగీత విద్యాం ప్రయచ్చ స్వాహా ‘’అనే’’ వీణా౦బ జపం నిత్యం ‘’చేస్తారు .

60-‘’సంగీత క్షేత్రం లో ఎవరెస్ట్ శిఖరం శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు ‘’అన్న ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకు అతిశయోక్తి కాదు.

సశేషం

 

Inline image 1Inline image 2Inline image 3Inline image 5Inline image 4

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | 2 Comments

జూన్ నెల రచన మాసపత్రికలో దర్శకడు వై వి రావు పై శ్రీ కవన శర్మ రచనకు నా స్పందన లేఖ

జూన్ నెల రచన మాసపత్రికలో దర్శకడు వై వి రావు పై శ్రీ కవన శర్మ రచనకు నా స్పందన లేఖyvrao rachana june 001

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -160

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -160

 61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్ -3(చివరిభాగం )

 జెర్మనీలో ప్రారంభించిన నాలుగు భాగాల పుస్తకాన్ని పాలస్తీనా ,స్విట్జర్లాండ్ లలో కొనసాగింఛి మాన్ అమెరికాలో పూర్తీ చేశాడు .యాభై వ పడి లో  ఒక మ్యూనిచ్ ఆర్టిస్ట్ వచ్చి జీసెస్ కు సంబంధిన ఇతిహాసానికి చిత్రాలు గీయమని ,ముందుమాట రాయమని  కోరాడు .పూర్తిగా ధ్యానం తో,అస్థిర ఊహాగానాలతో తానూ బైబిల్ కధలను మళ్ళీ చదివానని ,గోదే చేసిన  ’’అతి సాధారణమైన కద చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది అతి తక్కువ లో ఉండిమిగిలినది ఎప్పుడు పూరిద్దామా అనే తహ తహ ఏర్పడింది ‘’అన్నవ్యాఖ్య   గుర్తుకొచ్చిందని మాన్ తన ‘’ఎ స్కెచ్ ఆఫ్ మై లైఫ్ ‘’లో రాసుకొన్నాడు .అది తనకు గొప్ప అవకాశమే నని మనిషి మూలాలను వెదికి,అతని సారాంశం ,లక్ష్యాలను తెలియ జేసే మహత్తర కృషి అని అన్నాడు .ఈ జోసెఫ్ పుస్తకానికి బొమ్మలు వేయటానికి 16ఏళ్ళు పట్టింది .మొదటి భాగం ‘’జోసెఫ్ అండ్ హిజ్ బ్రదర్స్ ‘’ఆరేళ్ళతర్వాత 1934లో ప్రింట్ అయింది .ఇదే ఇంగ్లాండ్ లో ‘’ది టేల్స్ ఆఫ్ జాకబ్ ‘’పేరున విడుదలైంది .ఏడాది తర్వాత ‘’ది యాంగ్ జోసెఫ్ ‘’,వచ్చింది తర్వాత ‘’జోసెఫ్ ఇన్ ఈజిప్ట్ ‘’1938లో ముద్రణ పొందింది .’’జోసెఫ్ ది ప్రోవైడేర్’’అనే సంతోషకర భాగం పూర్తిగా అమెరికాలోనే 1944లో రూపు దిద్దుకోన్నది .బైబిల్ కధే అయినా కాలం ,స్థలాలను ఆధునిక దృష్టితో చూపాడు .హాన్స్ కాస్ట్రాప్ లాగా మాన్ కూడా కొత్త అపరి శుద్ధ వాతావరణం లోయువకుడిగా  ప్రవేశించాడు .మామూలుగానే యదార్దాన్నీ ప్రతీకల్నీ జోడించాడు .ఇందులో కూడా ఆర్టిస్ట్ ను సమాజం తో అతని పోరాటాన్ని చిత్రించాడు .కలల బేహారి, అందగాడు అయిన  జోసెఫ్ ను అతని సోదరులు మోసంచేస్తారు .అతని దార్మికతకు ఈర్ష్యతో బందీ చేస్తే చివరికి విడిపించుకొని మహోన్నతంగా ఎదుగుతాడు .అతని విజయానికి తగిన గుర్తింపు లభించేలోపు ,పూర్వపు ఐతిహాసిక నాయకులలాగానే చనిపోతాడు .జోసెఫ్ అమర ఆర్టిస్ట్ గా విమోచకుడుగా ,ప్రదాత గా ,బాధలను అనుభవిస్తూ నమ్మిన ప్రజలను రక్షించే రక్షకుడుగా మిగిలిపోతాడు .

     ఈ నాలుగు భాగాలు విడుదల అవుతున్నప్పుడే మాన్ 1940కి ముందు రాసిన ఫిక్షన్ అంతా అంటే బృహత్ నవలలు కాక మిగిలిన వాటినన్నిటినీ ‘’స్టోరీస్ ఆఫ్ త్రీ  డికేడ్స్ ‘’ గా ముద్రించాడు .ఇది కాక గుర్తింపు పొందిన ఫ్రాయిడ్, గోతే , వాగ్నర్ లపై వ్యాస పరమపర అచ్చు వేశాడు .అనేక రాజకీయ పత్రాలను ,’’ది బిలవేడ్ రిటర్న్స్ ‘’ను ,ముసలి గోదే పై ఒక నవల ను చైతన్య స్రవంతి (స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ )లో రాశాడు .ఇది గోదే ఉదయ ధ్యానానికి ప్రతీక .హిందూ నేపధ్యంగా ‘’ది ట్రాన్స్ పోజేడ్ హెడ్స్ ‘’అనే ఫాంటసి ని ,ఒజేస్ ,డేకలాగ్ ల పై ఒక నవలిక ను అల్లాడు .ఇది జోసెఫ్ సాగాకు అను బంధం .73వ ఏట మళ్ళీ గోదే మహాశయుడికి గౌరవాభినందనలు తెలియ జేస్తూ ‘’డాక్టర్ ఫాస్టస్ ‘’రాశాడు .

    ఎనభై ఏళ్ళు వచ్చాయి మాన్ కు .’’బ్లాక్ స్వాన్ ‘’రాసి ప్రచురించి అభిమానుల్ని ఆశ్చర్య పరచాడు .ఇదిఒక మధ్య వయసు  స్త్రీ జననేంద్రియ (గైనలాజికల్ )కద.ఆమెకు బహిస్టు ఆగిపోయినాక తనకొడుకు కంటే కాస్త పెద్ద వాడైన ఒక యువకుడితో ప్రేమలో పడుతుంది .కలలు కంటుంది .పూర్తీ ప్రేమ పిచ్చిలో పడిన ఆమెకు కేన్సర్ వచ్చిందని తెలుస్తుంది .ఈ అత్యధిక వేదనా భరిత కధను పేరడీ జోడించి రాశాడు .మాన్ తప్పులన్నీ అతని స్టైల్ కు ముడి పెట్టబడి ఉన్నాయి .జర్మనీ సంగీతకారుడు వాగ్నర్ వాద్య ఘోషలాగా మాన్ మాటల ఘోష ఉంటుంది .లేక జార్గాన్ ను మరొక ఆర్ట్ కు జత చేసినట్లు ఉంటుంది అంటారు .రంగు మీద రంగు హద్ది హడ లెత్తి స్తాడు అంటారు .సంక్షిప్తతా ప్రతిభ లేనివాడు మాన్ .చిన్నకధల్లో కూడా లాగుడు స్వభావం జాస్తి .అతని ప్రతీకలూ భారంగా ప్రాముఖ్యంగా ఉంటాయి .నడక మందంగా ఉంటుంది . విడిపోయిన జర్మనీని కలిపే ప్రయత్నం చేస్తూ 1952లో స్విట్జర్ లాండ్ వెళ్ళాడు .అకస్మాత్తుగా జ్యూరిచ్ లో జబ్బు చేసింది .అక్కడే రక్తం గడ్డ కట్టి ఎనభై వ ఏట   12-8-1955న మహా రచయితా మాన్ మహా మానవునిలో కలిసిపోయాడు . .’’ఉత్తమ మానవ సంప్రదాయ దూత ‘’(హెరాల్డ్ ఆఫ్ ది  బెస్ట్ ట్రెడిషన్ ఆఫ్ హ్యుమానిటి)గా  మాన్ ను అందరూ అభినందించారు .

  యాదృచ్చికంగా మాన్ మరణించిన నెల తర్వాత ఆయన ‘’గేయేస్ట్ నవల ముద్రణ జరిగింది  .30ఏళ్ళకు పైగా ఈ కద ఆయన మనసులో ఉంది .మరణానంతరం ‘’కన్ఫెషన్స్ ఆఫ్ ఫెలిక్స్ క్రల్,కాన్ఫిడెన్స్ మాన్ ‘’1955లో వచ్చాయి .ఇది వినోదాత్మక నవలగానే కాకుండా అ యుగపు గొప్పసాహస  రౌడీ నవల గా గుర్తింపు పొందింది .సగం పారడి ,సగం అపహాస్యజ్ఞానంతో రాణించింది.ఆర్టిస్ట్ యాక్టర్ అడ్వెంచర్ మాత్రమేకాదు ఆయన జీవించిన కాలానికి విమర్శనాత్మక చిత్రం అది .

   1929 లో సాహిత్యం లో మాన్ కు నోబెల్ బహుమతినిచ్చారు . డాస్టవస్కి పై రాసిన వ్యాసం లో మాన్   ఫ్రెడరిక్ నీట్స్అనుభవించిన బాధలతో పోల్చాడు .నీట్జే ప్రభావం మాన్ పై చాలా ఉంది .మొదటి ప్రపంచ యుద్ధం లో కైజేర్ విల్హాం కన్జర్వేటిజాన్ని ను బలపరచి లిబరల్స్ పై నిప్పులు చెరిగాడు .కొత్త జర్మన్ వీమర్ రిపబ్లిక్ కు మద్దతు ఇవ్వమని మేధావులను కోరాడు .బీతొవెన్ సంగీతం పై ప్రసంగించాడు .క్రమంగా మాన్ భావాలు లిబరల్ లెఫ్ట్ నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్ళాయి .నాజీయిజాన్ని వ్యతిరేకించమని పనివారలకు ప్రబోధించాడు .నాజీలకు వ్యతిరేకంగా ఎన్నో రేడియో ప్రసంగాలు చేశాడు .దాదాపు 60కి పైగా మాన్ గ్రంధాలు రాశాడు .

Mann’s style is finely wrought and full of resources, enriched by humour, irony, and parody; his composition is subtle and many-layered, brilliantly realistic on one level and yet reaching to deeper levels of symbolism. His works lack simplicity, and his tendency to set his characters at a distance by his own ironical view of them has sometimes laid him open to the charge of lack of heart. He was, however, aware that simplicity and sentiment lend themselves to manipulation by ideological and political powers, and the sometimes elaborate sophistication of his works cannot hide from the discerning reader his underlying impassioned and tender solicitude for mankind.

అన్నది  యెన్ సైక్లో పీడియా బ్రిటాన్నికా . Mann demanded “a compact between the conservative culture-idea and revolutionary social thought: to put it pointedly … an understanding between Greece and Moscow.” At the same time he defended the standpoint that one should establish a dialogue between Karl Marx and Friedrich Hölderlin, because a social democracy must go hand in hand with cultural education and the development of society..

     సశేషం

Inline image 1Inline image 2

 Inline image 3 Inline image 4

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా

ఇది విన్నారా ,కన్నారా !-2

19-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’ మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది .

20-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న  సంగీత కచేరీ లో ప్రేక్షక స్థానం లో కూర్చున్న తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా వలెనే వృద్దుడవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’అని మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..

21-బాలమురళి 12వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గురు శ్రీ  త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం లో కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొందారు .

22-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థానీ  సంగీతం లో శ్రోతలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తారు అన్నది .అయితే  కర్ణాటకలోని ప్రౌఢత్వాన్నిహిందూ స్తానీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

23-‘’ఆచార్య వీరభ్ద్రయ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే శ్రీ పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి వాయిద్యం లో కనిపిస్తుంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు సీతారామయ్య .

24-‘’సాహిత్యం స్పష్టంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తారు .స్వర స్థానం మీద నిలిపి పాడితే హిందూ స్థానీ అని వేళాకోళం చేస్తారు .హిందూ స్తానీని మిక్స్ చేసి  పాడుతున్నాను అంటారు నన్ను .అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థానీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు బాలమురళి .

25-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త్రం లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తారు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ ‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థానీ బాణీలు లేవా ,ఆ బాణీలలోని రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థానీ నుంచే వచ్చిందని ఒక సంగీత మహా మహోపాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని పూర్తిగా హిందూ స్థానీ పద్ధతిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా  తానూ విన్నానని మరి అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదని ఆచార్య వీణ(ర )భద్రయ్య అన్నారు .

26-‘’మనకున్న మంత్రాల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రాలే నట .అంటే జీవన్మంత్రాలు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రాలకు ప్రాణం పోస్తారట .అలాగే రాగాలన్నీ ప్రాణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రాణ దానం చేశారు .అంతేకాక 72మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్తం గా కట్టి వాగ్గేయ కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురలిలోని వైశిస్ట్యాన్ని  ఆవిష్కరించారు ఆచార్య .

27-‘’ఆయనను  మహా గాయకునిగానే చూస్తాం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400 దాకా రచనలు చేశారు. వర్ణాలు ,కృతులు జావళీలు తిల్లానాలు రచించారు .బాలమురళి తిల్లానా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక తిల్లానాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా ఎవరివద్దా సంస్కృతాంద్రాలు  నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి .సంగీత సాహిత్యాలు రెండూ బాలమురలికి దైవ దత్తాలే .

28-త్యాగ బ్రహ్మ నుంచిగురు పరంపరలో  నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .

29-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తారా “”?అని అడిగితే ‘’సాహిత్య ,సంగీత రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తాను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను ‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .

30-‘’ఏ పర్వీన్ సుల్తానా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జమ స్థాయి ‘’ని అలవోకగా అది రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర గాయకులు  తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.

31-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూప్రింట్ రాగానే ఇల్లు దొరికినట్లు కాదు .అందులో ఎవరూ నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టుకొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే .కేవలం సంగీత పుస్తకాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .

32-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి, సర్వశ్రీ  ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రాణం పోశారు .

33-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధులు .

34-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్తం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత0 యదార్ధం .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -159

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -159

 61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్ -2

ముప్ఫై వ ఏట ప్రేటియా ప్రింగ్ షీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు ఆమె తండ్రి ప్రముఖ గణితాచార్యుడేకాక ,కళా పిపాసి విలువైనవాటి సేకరణ చేసేవాడు .తర్వాత 28 ఏళ్ళు ‘’మాన్ తన ఉమన్ ‘’తోహాయిగా  విలాసంగా సృజనాత్మకం గా కాలక్షేపం చేశాడు .మ్యూనిచ్ లో ఉన్న విలాసవంతమైన పెద్ద భవంతి కాక ,మిమిలాన్డ్లోని ఇసార్ లో ఒక కాటేజీ ని ఏర్పాటు చేసుకొన్నాడు వేసవి విడిదికోసం .ముగ్గురబ్బాయిలు ముగ్గురమ్మాయిలు  సంతానం .ఒక కొడుకు’’ క్లాస్’’ రచయిత..ఒక కూతురు’’ ఎరీకా’’ నటి ,ప్రసిద్ధ కవి డబ్ల్యు .హెచ్ ఆడెన్ ను పెళ్ళాడింది .తన వివాహం కాగానే మాన్ ‘’రాయల్ హైనెస్ ‘’అనే అరిస్టాక్రాటిక్ హీరో గురించి ,ఆర్టిస్ట్ అయిన ఆతను రెండు భిన్న సమాజాలమధ్య పొందిన బాధల గాధలుగా రాశాడు .పూర్వపు వాటిలో ఉన్న తీవ్రతను తగ్గించి తగిన మోతాదులో రాయటం తోదీన్ని నవలా రూపం లో ఉన్న కామెడి అన్నారు .మొ.ప్ర.యు.వచ్చి మీద పడే సమయం .ఇంకా 15ఏళ్ళకు కాని మాన్ మహా గ్రంధం అచ్చు అయి వెలుగు చూడదు .

   ‘’డెత్ ఇన్ వెనిస్ ‘’అనే ప్రసిద్ధ నవలిక 30 వ ఏట రాశాడు.అందాన్ని ఆరాధించే ,పాతదాన్ని పెకలించేసే గుస్టావ్ వాన్ ఏశాన్ బాష్  అనే విసిగి వేసారిన అరిస్టా క్రాటిక్ గురించిన కదగా రాశాడు .అతనికి ఒక పోలిష్ కుర్రాడు తోడు .ఇద్దరిమధ్య మాటలు ఉండవు .పట్టణం ప్లేగు మహమ్మారి కోరల్లో ఉంటె హీరో ఆ కుర్రాడికోసం అక్కడే ఉండి చనిపోవాలను కొంటాడు .ఇందులోని కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉంటాయి –‘’beauty ;s very essence ,form as divine thought ,the single and pure perfection which resides in the mind ‘’లాంటివి చాలా ఉన్నాయి .కదా లేదు కాకర కాయా లేదూ .పనీ లేదు పాటాలేదు .కాని అత్యంత ఉత్కంఠ కలిగిస్తూ నరాలు తెగిపోతాయేమో అన్నంత భయాన్ని కల్పిస్తూ రచన చేశాడు మాన్ .సౌందర్య స్తోత్రం చేస్తూ ప్రేరణ తోపాటు అపకారమూ కల్పించాడు .ఇందులోని విషయం మాన్ కు చాలా ఇష్టమైనది .హీరో ఎవరితోనూ పెద్దగా మాట్లాడక పోయినా ,ఒంటరిగా ఉన్నా ,తనకు సేవ చేసేవారితోనే అప్పుడప్పుడు మాట్లాడుతున్నా  నవలాకారుని తీవ్ర తన్మయత్వం ముగ్ధుల్ని చేస్తుంది .దీని భావాన్ని జోసెఫ్  వార్నర్ ఏంజెల్ అనే విశ్లేషకుడు –‘’ది ధామస్ మాన్స్ రీడర్ ‘’లో రాస్తూ ‘’his absorption with the idea ,his yielding to the image of Tadzio;s beauty separates Aschenbach  from his art ,which is communication ,and from his morality ,and he plunges into the abyss of solitude ‘’అన్నాడు .

  మొ.ప్ర.యు .తర్వాత మాన్ ఫిక్షన్ ఏదీ రాయలేదు .’’అన్ పొలిటికల్ మాన్ ‘’అనే పుస్తకం లో తన జ్ఞాపకాలు రాశాడు .తనవన్నీ మెటాఫిజికల్ ,మోరల్  రాజకీయ ,సాంఘికాలను చెందినవని ,తన అభిరుచులు సంప్రదాయం జర్మనీకి చెందినవని ,అవి కయ్యానికి కాలుదువ్వే  దేశ భక్తికి చెందినవనీ చెప్పేవాడు .కొన్నేళ్ళ తర్వాత మాన్ కున్న కన్జర్వేటివ్ భావాలు తగ్గాయి .తక్షణ సమస్యలపై దృష్టి ఏర్పడింది ,తానున్న పరిస్థితులను తన అంతరాత్మనూ బేరీజు వేసుకొన్నాడు .తాను  నడిచిన మార్గం సరైనదికాదని గ్రహించాడు .రాజకీయానికి వ్యతిరేకమైన ,అభి వృద్ధికి నిరోధకం గా ఉన్న సంస్కృతీ తో తాను సహజీవనం చేయలేనని గ్రహించాడు .

  ఇదుగో ఇలాంటి అంతః శుద్ది ఏర్పడిన కాలం లోనే  ‘’ది మాజిక్ మౌంటేన్ ‘’రాశాడు .మాన్ మొదటి నవల బడ్దేన్ బ్రూక్స్ ను మొదటి స్వచ్చమైన జర్మనీ నవలగా భావిస్తే ,దీన్ని స్వచ్చమైన మొదటి యూరప్ నవలగా విమర్శకులు గుర్తించారు .ఇది కూడా మాస్టర్ పీస్-అత్యుత్తమ నవల  అనిపించింది .ఈ నవలా కద 1912లో మాన్మాన్ మనసులో  మూడు వారాలు భార్యకు శ్వాసకోశ సంబంధ వ్యాధి చికిత్స కోసం సాని టోరియం లో ఉండగా రూపు దిద్దుకోన్నది .మొదట్లో ఇదొక కామెడీ గా అనుకొన్నాడు .కాని చావుపై వ్యామోహం ,జీవితం పైనా ,సువ్యవస్తపై అవ్యవస్థ విజయాలు  చూసి విపరీతంగా పెంచి రోగ గ్రస్త నాగరకత పై నీతిధా వ్రుత్తాంతం గా రాశాడు .ఈ నవల నుయదార్ధం గా ప్రతీకాత్మకంగా  రెండు స్థాయిలలో రచించాడు  మామూలు కద అయితే ఒక అమాయక ,ఏదీ దాచుకొని మధ్యతరగతి యువకుడైన హాన్స్ కాస్టర్ప్ స్విస్ శానిటోరియంలో క్షయ వ్యాధికి చికిత్స పొందుతున్న ఒక కజిన్ ను చూడ టానికి వస్తాడు .మూడు నెలలు ఉండాలనుకొని వచ్చినవాడు ఏడేళ్ళు అక్కడే ఉండి పోతాడు .అక్కడే అనేక సాహసాలలో మాంసం ఆత్మ లను పరిశీలించి ‘’సూక్ష్మ లోకం ‘’(వరల్డ్ ఇన్ మైక్రో కాసం )ను కనుక్కొంటాడు .అక్కడే ఒక జర్మన్ డాక్టర్ ఒక రష్యా అమ్మాయి మొదలైన అనేక జాతుల మనుషుల ప్రభావానికి లోనౌతాడు .రష్యా అమ్మాయి పై వలపుల వల విసురుతాడు .జర్మన్ డాక్టర్ ,సాల్విక్ సైకాలజిస్ట్ డచ్ పెయింటర్ కూడా పరిచయ మౌతారు. వాళ్ల సుదీర్ఘ వాగ్వాదాలు ,చావులాంటి ఉదాసీనత చూసి అకస్మాత్తుగా ,యే పనీలేకుండా ఉండే పరిస్థితి లోనుంచి ఒక మాజిక్ పర్వతం వలన బయట పడి జన జీవితం లోకి అడుగు పెట్టాడు .ప్రతీకాత్మకంగా ఆలోచిస్తే –ఇది జాతీయతను ,ఉదార వాదాన్ని తెలియ జేస్తూ ,,విషాదం వినోదం కాని జీవితం పాత్రలన్నీ అన్యార్ధ మైనవిగా ఉంటాయి .దీనిలోని నీతిని మాన్ స్వయం గా ఇలా ‘’A man lives not only his personal life as an individual ,but also  consciously or unconsciously ,the life of his epoch and his contemporaries ‘’ వివరించాడు .

    మాజిక్ మౌంటెన్ లో వాతావరణం శబ్దార్ధ ప్రధానంగా (లిటరల్ ),మెటా ఫిజికల్ గా ఉంటుంది .శిఖరాగ్రంనుండి దూకే పదాల జలపాతంలాగా ఉంటుంది .అవి రక్తం లేని వ్యాసాల్లాగా ఉంటాయి .అతని ఆలోచన నిర్మాణం కదా కధనం ,మేధా కలసిపోయి అత్యద్భుత పాత్ర చిత్రణ తో అత్యంత గొప్ప ఏకైక ఊహాత్మక నవలగా చరిత్ర సృష్టించింది .దీని విస్తృత పరిధి వలన ఇరవయ్యవ శతాబ్దపుప్రపంచాన్ని ,దాని కి అంటుకొన్న క్షయాన్నిచూడవచ్చు .ఈ క్షీణత మొదట్లోను తర్వాత హిట్లర్ ప్రజాస్వామ్యం పై చేసిన దాడి తోనూ మాన్ మనసులో పడలేదు .అతని అన్న హీన్రిచ్ ,అతని ఎదిగిన పిల్లలు అతిగా వ్యాపిస్తున్న నిరంకుశత్వాన్ని ఎదిరించమని పదేపదే కోరేవారు .ఏ రాజకీయం లేని మాన్  నిర్ణయం తీసుకోలేక పోయాడు .తనలో కన్జర్వేటివ్ భావాలు ఇంకా ఉండటం వలన జర్మనీకి వ్యతిరేకంగా మాట్లాడ లేక పోయాడు .నాజీల పూర్తీ దౌష్ట్యం ,నేరం ,నేషనల్ సోషలిజం పేరిట రీచ్ స్టాగ్ కాల్పులలో గుర్తించి మారి పోయాడు .వెంటనే రొమాంటిక్ బార్బెనిజాన్ని ఎదిరించాడు .ఈ కాలం లో మాన్ స్విట్జర్ లాండ్ లో జోసెఫ్ పై రాస్తున్న నాలుగు భాగాల రచనలో మునిగి పోయాడు .మళ్ళీ ఎన్నడూ జర్మనీలో అడుగు పెట్టలేదు .

 1933లో జ్యూరిచ్ లో స్థిరపడ్డాక ,మాన్ ఆస్తి నంతటిని జర్మనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .మాన్ గ్రందాల నన్నిటిని కాల్చి బూడిద చేసింది నాజీ ప్రభుత్వం .మూడేళ్ళ తర్వాత అతని జర్మన్ పౌరసత్వం రద్దు చేశారు .1938లోజన్మ భూమి జర్మనీ లో  నిలువ నీడలేని మాన్ అమెరికాకు వెళ్లి ప్రిన్స్ టన్ యూని వర్సిటీ లో ఉపన్యాసాలిచ్చాడు .కాలి ఫోర్నియా లో స్వగృహాన్ని ఏర్పరచుకొని 1914లో అమెరికా పౌరసత్వం పొందాడు .ఫాసిస్ట్ కార్య క్రమాలకు వ్యతిరేక ప్రచారం లో పాలు పంచుకొన్నాడు .’’ది కమింగ్ ఆఫ్ డెమోక్రసీ ‘’లో ‘’the habit of thought which regards life and intellect ,art and politics as totally separate worlds ‘’అని రాశాడు .భవిష్యత్ నాగరకతపై దార్శనికుడుగా తన మనోభావాలు చెప్పాడు .’’నా నలభై వ ఏట తప్పు చేయకుండా ఉండి ఉంటె ,ఇవాళ నేను సత్య దర్శనాన్ని పొంది ఉండేవాడినే కాదు అంటూ ‘’truth can never be a possession ,only an eternal aspiration .May it be said of each one of us that he spent his life honestly and restlessly striving for the true and the good ‘’అన్నాడు .

  Inline image 1  Inline image 3Inline image 2

   సశేషం

      మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-1

ఇది విన్నారా ,కన్నారా !-1

1.’’గాయక సర్వ భౌమ ‘’బిరుదు పొందిన పారుపల్లి రామ కృష్ణయ్య  పంతులు గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో 1882 డిసెంబర్ 5న శ్రీ శేషాచలం పంతులు శ్రీమతి మంగమ్మ దంపతులకు జన్మించారు

2-పంతులు గారి షష్టి పూర్తీ నాడు వారికి విజయవాడ నగర వీధులలో గాజా రోహణ సన్మానం చేశారు ..ఏ సంగీతకారుడికీ ఇంతటి ఘన సన్మానం జరగ లేదు అదొక రికార్డ్ .

3-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ  పారుపల్లి వారి శిష్యులు .రామునికి సీత కృష్ణునికి గీత ఎలాగో అలాగే శిష్యులకొరకు పారుపల్లి వారు అన్నారు బాలమురళి .

4-పారు పల్లి యనెడి పావన నామంబు –విజయవాడ లోన వెలయ కున్న

ఏ స్థితి ని గనెదమో ?ఏ గతి నుందుమో-మాద్రుశులగు మంద మతులు నేడు ‘’అన్నారు మహా విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచారి గారు.

4-ఫిడేలు నాయుడు గారు అనే శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంటే ఈశ్వరుడు తనదైన సంగీతాన్ని నాయుడు గారి ‘’ద్వారా ‘’వెదజల్లి ఇంటిపెరైన ద్వారం ను సార్ధకం చేశారని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు పద్యం లో కొనియాడారు.

5-రాజాజీ ‘’కళాసరస్వతి నాయుడు గారి వేళ్ళతో ఆడుకొంటుంది ‘’అన్నారు .

6-మృదంగ మహా విద్వాంసుడు  శ్రీ దక్షిణా మూర్తి పిళ్లే,నాయుడుగారి ఫిడేలు కచేరి చూసి వారి వ్రేళ్ళను కళ్ళకు అద్దుకొన్నారు .

7-వయోలిన్ కు గౌరవం తెచ్చిన వారు ద్వారం వారే .

8-నాయుడుగారికి అయిదారేళ్ళ వయసులో చూపు మందగించి క్షీణిస్తే ,స్కూల్ టీచర్ వీరి అంధత్వాన్ని పరిహసిస్తే చదువు మానేసి సంగీతం లో ప్రవేశించారు .ఈ మేస్టారే ఆ తర్వాత నాయుడుగారు కాకినాడ సరస్వతీ గాన సభలో కచేరీ చేయగా విని ‘’నన్ను క్షమించరా –నిన్ను చిన్నప్పుడు అవమానించాను ‘’అని క్షమాపణ చెప్పారు .

9-విజయనగర సంగీత కళా శాలలో చదవాల్సిన నాయుడు గారు అక్కడ చదవకుండానే ప్రొఫెసర్ గా మహా రాజా వారి చే నియమింప బడ్డ్డారు . విద్యార్దికాకుండానే సరాసరి ప్రొఫెసర్ అయిన ఆయన గొప్పతనం ఎన్నదగినది .

10-సంగీత సరస్వతి శ్రీమతి వీణ ధనమ్మాళ్ రోజూ వీణ పై సాధన చేస్తూ చివరగా ‘’కృష్ణా ‘’అని వీణను కింద పెట్టేసేది మళ్ళీ ఎవరు అడిగినా వాయించే ది కాదు .కాని ఒక సారి ద్వారం వారు ఈమె ఇంటికి రాగా వారిపై గౌరవంతో కింద పెట్టిన వీణ తీసి మళ్ళీ వాయించి వారి గౌరవానికి తగినట్లు ప్రవర్తించింది .

11-పాశ్చాత్య వాద్యం అయిన వయోలిన్ ను మొదటగా భారతీయీకరణ చేసి మన సంగీతానికి అనుగుణంగా మార్చినవారు సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తు స్వామి దీక్షితులవారి తమ్ముడైన బాల స్వామి దీక్షితులు .

12-పాశ్చాత్య సంగీత మర్మాలను అవగాహన చేసుకొని ,యే పాశ్చాత్య సంగీత పాఠం ఎదురుగా లేకుండానే ,ఆ సంగీత రచనలను అతి తేలికగా వాయించే వారట ద్వారం వారు ..

13-నాయుడు గారిని మద్రాస్ లో ఉంచాలని శిష్యులు భావించి ఆహ్వానించారు .రెండుషరతులపైన వారు అంగీకరించారు .ఒకటి తన విద్యా గురువు అన్నగారైన శ్రీ వెంకట క్రిష్నయ్య నాయుడు గారికి కొంత పారి తోషికం తో  సన్మానించటం .రెండవది జబ్బు పడిన ఒక సంగీత విద్వా౦సు నికి ఆర్ధిక సాయం చేయటం .అలాగే శిష్యులు స్పందించారు .ఆ జబ్బు పడిన సంగీత విద్వాంసుడు ఎవరో కాదు ఒకప్పుడు నాయుడు గారు కచేరీ చేస్తుంటే నాయుడుగారిని నిందిస్తూ ,అక్కడ తానూ రాసిన కరపత్రాలను ముద్రించి పంచి పెట్టిన వారు ..ఎంతటి దయార్ద్ర హృదయులో నాయుడు గారు దీన్ని బట్టి తెలుస్తుంది .

14-నాయుడుగారి కళ్ళకు ఆపరేషన్ చేయిస్తామని చాలా ముందుకు వచ్చారు .వారికి అది ఇష్టం లేదు దానికి కారణం గా ‘’సంగీతానికి మనో నేత్రం అవసరం .నాకుబాహ్య నేత్రాలు లేవు కనుక నా మనో నేత్రాన్ని వికసింప జేసుకో గలిగాను .అందుకే నా సంగీతం పరి పక్వ దశకు వస్తోంది .మన సంగీతం ఏకత్వాన్ని సూచిస్తుందికనుక  ఇది ఏక స్వర సంగీతం .దీనికి ఏకాగ్రత, తపస్సుకావాలి .కళ్ళు ఉంటె చూపు బుద్ధి చాంచల్యం పొంది ఏకాగ్రత కుదరదు .అందుకే నా సంగీతానికి నా బాహ్య నేత్రాలను సమర్పించుకొన్నాను ‘’అని ఒక యోగిలాగా చెప్పారు .

15-‘’సంగీతం వినబడే ఒక తపస్సు .కర్నాటక సంగీతం శ్రావ్య స్వరాల ద్వారా మోక్షాన్ని పొందే అతి తేలిక మార్గం .ఇది నాద బ్రహ్మోపాసన .ఒక యోగాభ్యాసం ‘’అన్నారు నాయుడుగారు .

16-‘’నాయుడుగారి చేతి వ్రేళ్ళకు కన్నులున్నాయి .అలాగే మృదంగ విద్వాంసులు శ్రీ కోలంక వెంకట రాజు గారి వ్రేళ్ళలో వీణ లున్నాయి’’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

17-‘’ఈ వాయులీన సాహిత్య మాదుర్యముల్ –దేవతా స్త్రీ కంఠ దీప్త రావమ్ములో –పారిజాతామోదభావమ్ములో –సురనదీ జీవమ్ములో!’’అన్నారు విశ్వనాధ

18’’నీ గాన నిర్ఝరి మోక్ష ద్వారమునకుమార్గం బని ‘’ద్వారం ‘’నీ ఇంటి పేరు దనరె’’అన్నారు .

ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు ‘’గ్రంధం

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -158

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -158

 61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్

   మార్సెల్ ప్రౌస్ట్ అనే ఫ్రెంచ్ రచయితా,ఐరిష్ రచయితా జేమ్స్ జాయిస్ ,అమెరికా రచయిత ధామస్ ఉల్ఫ్ ,జర్మన్ రచయితధామస్ మాన్ రాసిన స్వీయ చరిత్ర లాంటి నవల లు ఇరవై వ శతాబ్దం లో కొత్త లోకాలను చూపి౦చాయి .మాన్ పురాణ రచనలు రాయటం మొదలు పెట్టే దాకా మిగిలినవారి లాగానే చాలా కల్లోలం అనుభవించాడు .మిగిలినవారి కంటే వేరుగా ఉండటం ఆయన కోరుకొన్నాడు .దీనికోసం ఒంటరితనం అనుభవించాడు మధ్య తరగతి సంపన్న కుటుంబానికి చెందినా వాడైనా .

  జర్మనీలోని పాత హాన్సీటిక్ టౌన్ లోని లూబెక్ సిటీలో ధామస్ మాన్ 6-6-1875న జన్మించాడు .పాల్ ధామస్  మాన్ గా చర్చి రికార్డ్ లో పేరు నమోదైంది .స్టూడెంట్ మేగజైన్ లో రాసిన వాటిని పాల్ ధామస్ పేరుతొ రాశాడు .మాన్ వంశం తర తరాలుగా ప్రసిద్ధమమైనదే  .తాత చాలా పేరున్నవాడు .నెదర్లాండ్స్ కు ‘’కాన్సల్ ‘’గా ఉండేవాడు .తండ్రి ధనవంతుడైన ధాన్యం వ్యాపారి ,రెండు సార్లు సెనేటర్ గా ఒక సారి లూబెక్ మేయర్ గా ఉన్నవాడు .కన్జర్వేటివే కాని సంప్రదాయ పధ్ధతి పాటి౦చనివాడు .సౌత్ అమెరికా ప్లాంటర్ ,పోర్చుగీస్ క్రియోలీ జర్మన్ కుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు .వీరి మొదటి కుమారుడు తాత లాగా లిబరల్ గా ప్రసిద్ధుడు ,తల్లిలాగా ప్రముఖ నవలా కారుడు .అయిదుగురు సంతానం లో ధామస్ రెండవ వాడు తండ్రి గౌరవాన్ని మెచ్చుకొంటూనే చీదరించుకోనేవాడు .కాని తల్లి అంటే వీరాభిమానం చూపేవాడు .తల్లి పియానో ,మా౦డలీన్ వాయించటం లో నేర్పరి .ఆ పట్నం లోని తతిమ్మా ఆడవారి కంటే చాలా భిన్నంగా అన్నిట్లోనూ కనిపించేది .

  మాన్ బాల్య విద్య అంత హుషారుగా సాగలేదు .ప్రష్యన్ ల పెత్తనం ఎక్కువ .సాహిత్య గంధం వారికి పడేదికాదు  .శిక్షణా గొప్పగా ఉండేదికాదు .మన వాడి కాలక్షేపం అన్నగారి ‘’టాయ్ దియేటర్ ‘’లోనే ,అక్కడున్న పుస్తకాలతోనే .ఆన్స్ క్రిస్టియన్  ఆండర్సన్ కధలు ,హోమర్ రాసిన గ్రీకు పురాణ కధలు బాగా చదివాడు .15వ ఏట తండ్రి చనిపోయాడు .కుటుంబ ఆదాయం క్రామంగా తగ్గిపోయి,దివాలా ఎత్తేయటం జరిగింది .లంకంత కొంప బేరానికి పెట్టారు .ఇంట్లోని పురాతన వస్తువులన్నీ అమ్మేశారు .పిల్లలను తీసుకొని తల్లి కొంచెం వెచ్చని ప్రాంతమైన దక్షిణం వైపు ఉన్న మ్యూనిచ్ చేరింది .ధామస్ మాత్రం లూబెక్ లోనే అన్న హీన్రిచ్ తో ఉండిపోయి స్కూల్ విద్య పూర్తీ చేశాడు గోదే,షిల్లర్ ,హీన్ కవులను అనుకరిస్తూ రొమాంటిక్ కవితలు రాశాడు వీటికి ‘’స్ప్రింగ్ స్టార్మ్’’అనే పేరుపెట్టి ఒక చిన్న పత్రికకు పంపిస్తే ఆవి ప్రచురితమవగా  మహా సంతోషించాడు 19వ ఏట మ్యూనిచ్  లో ఉన్న కుటుంబానికి చేరుకొన్నాడు సీరియస్ గా ,తనకే ప్రాముఖ్యం ఉండాలనుకొనే ఈ నల్లకళ్ళయువకుడి చూపులో భవిష్యత్ రచయిత దర్శనమయ్యేది .ఇన్సూరెన్స్ ఆఫీస్ లో తాత్కాలికం గా పనికి కుదిరాడు .అకౌంట్స్ రాస్తూ ,దొంగతనంగా ఫిక్షన్ రాస్తూ ఒక చిన్న కద రాసి పత్రికకు పంపితే అది అచ్చు అయి చూసుకొని మురిసిపోయాడు .పొగడ్తలూ లభించాయి .ఒక ఏడాదికే దట్టంగా ముక్కు పొడుం పీలుస్తూ ముక్కు లెగరేసే చీదుతూ రోతగా ఉండే  గుమాస్తాల మధ్య ఉండటం అసహ్యమని పించింది.  ఈగుమాస్తా చాకిరీ విసుగనిపించి. తండ్రి ఆస్తిపై వచ్చేరాబడి బాగానే ఉండటం టో మళ్ళీ చదువు లో దిగాడు .యూని వర్సిటి లో చేరి ఫిలాసఫీ సాహిత్యం చదివాడు .తల్లి అతనికి మరో 12నెలల స్వేచ్చ ఇచ్చింది .ఈ కాలం ఇటలీలో గడిపాడు .అప్పటికి హీనస్ రిచ్ అక్కడే ఉన్నాడు,తన పెద్ద గ్రంధం రచనలో మునిగి ఉన్నాడు .ధామస్  చిన్న కధలు రాస్తూ ‘’లిటిల్ మిస్టర్ ఫరీద్ మాన్ ‘’పేరుతొ కదా సంపుటి ని 23వ ఏట ప్రచురించాడు .

Inline image 1

Inline image 2Inline image 3

  అన్న హీన్రిచ్ ప్రోత్సాహం తో భయ పెట్టేంత పెద్ద సైజు లో ఉద్గ్రంద రచన చేస్తూ 1898లో జర్మనేకి తిరిగి వస్తూ తనతో ‘బడ్దేన్ బ్రూక్స్  ‘’అనే ఆ మహా గ్రంధాన్ని తెచ్చాడు .ప్రచురణ కర్త పుస్తకం సైజు సగానికి సగం తగ్గించమని ప్రాధేయ పడ్డాడు  .అదంతా తన పూర్వీకుల కద,ఆనాటి సమాజం కద అవటం తాను  ఇంకా యవ్వనం లోనే ఉండటం వలన తక్కువ పేజీలలో దాన్ని కుదించి న్యాయం చేయలేనని  తగ్గించటానికి ససేమిరా అన్నాడు . పబ్లిషర్ అభ్యంతరాలను తోసి రాజంటూ రెండుభాగాలుగా దీన్ని 1902 లో ప్రచురించాడు .ఊహాతీత విజయం వరించింది .ఒక్క ఏడాదిలోనే రెండు భాగాలను కలిపి ఒకే పుస్తకంగా ప్రచారించాడు .అంతడిమాండ్  వచ్చింది ఆ పుస్తకానికి. మాన్ ను ‘’డాజ్జ్లింగ్ పో ర్టెంట్ ‘’అంటే’’ మిరుమిట్లు గొలిపే ఉత్పాతం ‘’అన్నారు .ప్రపంచం లోని సజీవ భాషలన్నిటి లోకీ ఈ నవల అనువదించ బడింది .అదొక సమకాలీన క్లాసిక్ అయింది .జర్మనీలో ప్రతి ఇంటిలోనూ బైబిల్ టో పాటు ఈ పుస్తకమూ చోటు చేసుకొన్నది .1935లో జర్మన్ భాషలో వెలువడిన ఈ గ్రంధం ఒక మిలియన్ కాపీలకు పైనే అమ్మకాలు సాధించింది .1929లో ధామస్ మాన్ కు నోబెల్ ప్రైజ్ ను సాహిత్యం లో ప్రదానం చేస్తూ కమిటీ ‘’మాన్ రాసిన గొప్ప నవల  బడ్దేన్ బ్రూక్స్ కు మాత్రమే ఈ పురస్కారం ‘’అని మెచ్చి ఇచ్చింది .

   బడ్దేన్ బ్రూక్స్ లోని కధను తెలియ జేస్తూ ఉప శీర్షికగా ‘’ఒక కుటుంబ పతనం ‘’(డిక్లైన్ ఆఫ్ ఎ ఫామిలీ ‘’అని అర్ధవంతంగా పేరు పెట్టాడు .19వశతాబ్దం లోని మూడు తరాల కధాగమనం ఇందులో .ఊహాతో తనవారి ఉద్దాన పతనాలను ఆవిష్కరించాడు .ధనాన్ని కోల్పోవటం ,సంస్కృతిలో ఉన్నతి సాధించటం చూపించాడు .నిర్వహణ చాలా సహజంగా ఉన్నా ,అంతరార్ధం అంతా-ఆది భౌతికంగా (మెటా ఫిజికల్ )గా ఉండటం విశేషం .ప్రసిద్ధ వేదాన్తులైన నీజేషీ స్కాపెంహార్ లను పూర్తిగా అధ్యయనం చేశాడుకనుక ఆ భావ పరమపర లో నడిపాడు .నీజేషీ వేసిన ప్రశ్న ‘’మన ఉనికికి పరమార్ధం ఉందా ?అన్న దానికి వివరణ ఇది .ఇందులో సామాన్య పౌరుడిప్రపంచానికి ,సమాజం లో ఇమడలేని ఆర్టిస్ట్ ప్రపంచానికి ఉన్న తేడాను గొప్పగా వివరించిన నవల .కుటుంబ గాదా సరిత్సాగారమే కాకుండా సామాజిక సమస్యా కదా సాగరం కూడా .ఒక రకం గా మన విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’లాగా అనుకో వచ్చు నేమో ? .దీనినే మాన్ భాషలో ఏం చెప్పాడో చూద్దాం –‘’it is my bourgeois conscience makes me see in the artist life ,in all irregularity and all genius ,something profoundly disreputable ,that fills me with this lovelorn ‘’faiblesse ‘’for the simple and good ,the comfortably normal ,the average unendowed  respectable human being ‘’

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -157

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -157

 60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్  నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer)-3(చివరి భాగం )

     స్క్వీజర్ కు వచ్చిన కష్ట పరంపర నుంచి బయట పడేయ్యటానికి అతని ‘’జీవితం కోసం భక్తీ ;;-(రివరెంస్ ఫర్ లైఫ్ )బాగా తోడ్పడింది .యూరప్ తిరిగి వెళ్ళేటప్పుడు అదే రక్షగా ఉంది .గారిసాన్ ,సెయింట్ రేమి ,లలో మానసిక వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తున్నప్పుడు వాన్ గో వద్ద ఉన్నప్పుడూ అదే వెంట ఉండి నడిపించింది .ఆర్మిస్టైస్ వచ్చినప్పుడు శారీరక మానసిక  శక్తులతో బాగా ఉన్నాడు .ఎక్కడికి  వెళ్ళాలనుకొంటే అక్కడికి వెళ్లి పోగలిగేవాడు .లాంబ రేన్ లో  తన కార్య సాధనకోసం ఆర్గాన్ తోప్రదర్శనలిస్తూ లెక్చర్లు ఇస్తూ విరాళాలు స్వీకరించాడు .కీర్తి బాగా వ్యాపించి స్విట్జర్లాండ్,స్వీడెన్ డెన్మార్క్ ,ఇంగ్లాండ్  కు 1924లో ఆహ్వానిస్తే వెళ్ళాడు.తిరిగి ఆఫ్రికాకు చేరాడు .

 ఆల్బర్ట్ స్క్వీజర్ జీవిత చర్య ఇదే అయిపొయింది .తన హాస్పిటల్ కు  మందులు ,పరికరాలు అవసరం వచ్చినప్పుడల్లా ఇల్లాగే లెక్చర్ టూర్ ,ఆర్గాన్ ప్రదర్శన చేసి ధనాన్ని పొందాడు .1949లోమొదటి సారి  అమెరికా వెళ్లి కొలరాడో లోని ఆస్పెన్ లో జరిగిన గోదే సే0టేన్నియల్ లో పాల్గొన్నాడు .1950లో ‘’నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ సంస్థ 18 దేశాలలోని  చిత్ర కారుల  ,సంగీతకర్తల  ,రచయితల మధ్య పోటీ నిర్వహించింది .అందులో ‘’schweitzer was proclaimed The Man of the Century ‘’అంటే ఆశతాబ్దపు ప్రముఖ వ్యక్తిగా ప్రకటింప బడ్డాడు .చాలా సంతోషించాడు .కాని దీనికంటే తాను కనిపెట్టిన శాశ్వత స్ప్రింగ్ ,ను 75౦ కాంక్రీట్ బ్లాకుల మధ్య బిగించి వాయించటం అతన్ని మరింత గర్వ పడేట్లు చేసింది .ఇంతకంటే అతనికి మహదానందం కలిగించిన విషయం మరొకటి ఉంది .అతని గారాల కూతురు 6 చి౦పాంజీలతో ,5 ఏపు లతో అతి ప్రేమగా హాస్పిటల్ ఆవరణ లో కలిసి తిరుగుతూ జీవరాసులన్నిటిపైనా ఆమె చూపిస్తున్న ప్రేమ కు మరీ మరీ ఆనందం పొందాడు .తన కృషి తన కూతురుకు కూడా సంక్రమించటం ఆయనకు మధురానుభూతినిచ్చింది. జేసేస్ చెప్పిన విశ్వవ్యాప్త ప్ర్రేమ ఆచరణలోకి వచ్చినందుకు సంబర పడ్డాడు .

   65 వ ఏట ‘’ఆల్బర్ట్ స్క్వీజర్ ఫెలోషిప్ ‘’ఏర్పరచారు .అప్పుడు ఏం జరిగిందో ఒక సభ్యుడు ఇలా వివరించాడు ‘’సరిగ్గా ఉదయం ఏడున్నర గంటలకు బ్రేక్ ఫాస్ట్ కు గంట మోగింది .మేమందరం చీకటిగా ఉన్న ఆప్రదేశానికి ఆ ముందు రాత్రికే చేరుకొన్నాం .అబ్బా !యెంత అద్భుత ప్రపంచం !ఇంటి దగ్గరా దాని చుట్టూ కూడా యదార్ధమైన జంతు ప్రదర్శన శాల చూశాం .అందులో కోళ్ళు ,బాతులు ,టర్కీలు ,పిల్లులు ,కుక్కలు ,మేకలు ,,లేళ్ళు ,పక్షులు ,మొదలైనవి ఎన్నో ఉన్నాయి .ఒక పెలికాన్ పక్షి  అక్కడికి నిత్య౦వచ్చి పోయే  అతిధి .  అక్కడ చేరిన పక్షులు జంతువులతో అది కూడా కలిసి పోయి ఆల్బర్ట్ స్క్వీజర్ ప్రేమను పొందుతుంది .ఈ జంతు ప్రపంచం మధ్య స్క్వీజర్ ను చూస్తె ఆనాటి నిజమైన’’ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి ‘’అనిపించాడు .రాత్రిళ్ళు తనను చిన్నప్పుడేప్పుడో రక్షించిన ఒక పసుపు తెలుపు రంగు పిల్లి ఒకటి వచ్చి కృతజ్ఞతా పూర్వకంగా ఆయన దగ్గర ఉండే దీపం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది ‘’అని ఆ యదార్ధ దృశ్యాన్ని ఫోటోగ్రాఫ్ తీసినట్లు రాసి మనకు చూపించాడు .ఇదంతా చూస్తుంటే ఒక మానవ మాత్రునికి సాధ్యమా అని పిస్తుంది. సకల జీవ రాసులపై ప్రేమ ఉన్న వారికి సాధ్యమే అని తెలుస్తుంది .దీనికి మనకు ప్రత్యక్ష సాఖ్యంగా భగవాన్ రమణ మహర్షి కనిపిస్తారు .రమణాశ్రమం లో ఆయన ఇలానే జంతు ప్రేమికులు అని మనకు తెలిసిన విషయమే .అవి చనిపోతే అక్కడే సమాధులు కూడా నిర్మించిన మహోన్నత మూర్తి శ్రీ రమణులు .

    ఎనభై ఏళ్ళు మీద పడ్డాయి .జుట్టు నెరిసింది కాని దట్టంగా ఉంది .నీలి వాడి చూపులకళ్ళలో కరుణా రసం,సహిష్ణత  జాలువారుతూనే ఉన్నాయి .ప్రపంచం లో నిత్యం జరిగే అన్యాయాలు చూస్తున్న న్యాయం జరుగుతుందనే నమ్మకం తో ఉన్నాడు స్క్వీజర్ .ఇదేదో సంతృప్తికర ఆనందమయ ప్రపంచం అని అనుకోలేదు .’’తానొక స్వయ౦ విభజన చెందిన  ఆదర్శ వాది’’(సెల్ఫ్ డివైడెడ్ ఐడియ లిస్ట్)అని చెప్పుకోనేవాడు .తానూ నిత్య ఆశావాదినని ,ఏదో ఒక రోజు మానవాళికి మంచి జరిగి అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారనే నమ్మకం తనకు ఉన్నాదని చెప్పేవాడు .’’To every one ,in what ever state of life he finds himself ,the ethics of reverence for life do this ‘’అంటాడు .మనిషితన చుట్టూ ఉన్న వారి సంక్షేమం కోసం కూడా తపించి పని చేయాలి .విద్యా వేత్తలు ఆర్టిస్ట్ లు తమ దగ్గరున్న విద్య మొదలైన వాటిని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి .ఈ బిజీ ప్రపంచం లో వ్యక్తీ తన పరిధి దాటి బయటకు పోవటం నిజంగా కష్ట మే .అయినా దాటే ముందడుగు వేయాలి. సకల జన సౌభాగ్యమే మానవ జాతి పురోగతికి మార్గం అని ఆలోచించాలి .తమ జీవితాలలో కొద్దిభాగామైనా పరులకోసం వెచ్చిస్తేనే మనం మానవులం అని పించుకో గలుగుతాం’’ .ఇదీ స్క్వీజర్ మహర్షి చెప్పిన ‘’రివరెంస్ ఫర్ లైఫ్ ‘’.ఇది భక్తీ పరిదిదాటి చాలా ముందుకు వెళ్ళింది .’’It asked for  a life  which was actively ,but not passively ,Christian –a life in which getting and spending ,contrary to the spirit of the times ,came second and sharing came first ‘’అని తన సిద్ధాంత పిండి తార్ధం చెప్పాడు .

    1953లో స్క్వీజర్ కు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించి  ఆయన మానవాళికి చేసిన సేవలను  గౌరవించారు .ఆయనను 20వ శతాబ్దపు సాటిలేని మహోన్నత వ్యక్తీ ‘’(ది ట్వెంటి యేత్  సెంచ రీస్ మాచ్  లెస్ హ్యూమన్ బీయింగ్ ) అని శ్లాఘించారు .నిజంగా అ పురస్కారం ఆయనమనసును ఆర్ద్రం చేసింది .కాని స్వీడన్ వెళ్లి బహుమతిని స్వీకరించలేదు .తనను నమ్ముకొని తన సేవ టో సేద దీరుతున్న ఆఫ్రికా వాసుల ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అని తాను వెళ్ళక పోవటానికి   కారణంగా చెప్పాడు .మనవ సేవే మాధవ సేవగా జీవితాన్ని చరితార్ధం చేసుకొని నిండుగా 90 ఏళ్ళు జీవించిన మహర్షి ఆల్బర్ట్ స్క్వీజర్ 4-9-1965 న తాను నమ్మిన యేసు పదం చేరుకొన్నాడు .

“Who can describe the injustice and cruelties that in the course of centuries they [the coloured peoples] have suffered at the hands of Europeans?… If a record could be compiled of all that has happened between the white and the coloured races, it would make a book containing numbers of pages which the reader would have to turn over unread because their contents would be too horrible

The laying down of the commandment to not kill and to not damage is one of the greatest events in the spiritual history of mankind. Starting from its principle, founded on world and life denial, of abstention from action, ancient Indian thought – and this is a period when in other respects ethics have not progressed very far – reaches the tremendous discovery that ethics know no bounds. So far as we know, this is for the first time clearly expressed by Jainism.

అణు ఆయుధాలను అరికట్టాలని  రేడియో ఒసియో లోమాట్లాడుతూ ‘’ “The end of further experiments with atom bombs would be like the early sunrays of hope which suffering humanity is longing for.”అని హెచ్చరించాడు .స్వీజర్ జీవితాంతం ‘’శాకాహారి ‘’గానే ఉండిపోవటం మరొక విశేషం .ఎలిజబెత్ రాణి ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ కేవేలియర్ ఆఫ్ మిలిటరీ ‘’ను ,’’హాస్పిటల్ ఆర్డర్  ఆఫ్   సెయింట్ లాజరస్ ఆఫ్ జెరూసలెం అవార్డులను అందుకొన్నాడు స్క్వీజర్ .అతని కజిన్ అన్నే మేరీ స్క్వీజర్ సాత్రే  ,ప్రముఖ శాస్త్రవేత్త జీన్ పాల్ సాత్రే తల్లి .స్వీజర్ పేర అవార్డ్ నెలకొల్పి ఎందరో ప్రముఖులకు అందజేశారు .ఆల్బర్ట్ స్క్వీజర్ అంతర్జాతీయ బహుమానాన్ని 29-5-2011న మొదటిసారిగా యూజీన్ డ్రూవర్ మాన్ కు ,డాక్టర్ దంపతులు రోల్ఫ్ అండ్ రాఫెల్ మైబాచ్ లకు అందజేశారు

బాష్ సంగీతాన్ని రికార్డ్ చేయటానికి స్క్వీజర్ కొత్త టెక్నిక్ వాడాడు .దీనినే ఆయన పేరుమీద ‘’స్క్వీజర్ టెక్నిక్ ‘’అన్నారు గౌరవంగా .కొలంబియా ,ఫిలిప్స్ రికార్డింగ్ కంపెనీలు దీన్ని బాగా సద్వినియోగం చేసుకొన్నాయి .స్క్వీజర్ పై దాదాపు పది సినిమాలు వచ్చాయి .ఆయన సుమారు ఇరవై దాకా పుస్తకాలు రాశాడు .

Inline image 1

Inline image 2Inline image 3

Inline image 4

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -156

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -156

 60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్  నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer)-2

30వ ఏట స్క్వీజర్ నాటకీయం గా ఒక నిర్ణయం తీసుకొన్నాడు .భూమధ్య రేఖపై ఉన్న ఆఫ్రికాకు డాక్టర్ గా వెళ్ళాలనే కోరికతో మెడిసిన్ లో చేరాడు .అతని స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు .ఎలాగైనా అతని ప్రయత్నం మాన్పించాలని ఒక ముఖ్య స్నేహితుడు ‘’యూరప్ లో నువ్వు పాత ఆర్గాన్స్ ను రక్షించావు .ఇప్పుడు ఆఫ్రికాలో పాత నీగ్రోలను రక్షిస్తావా ?”’అని అడిగాడు .స్క్వీజర్ కు ఈ ఆలోచన చాలా కాలం నుంచే మనసులో మెదులుతోంది .విద్యార్ధిగా ఉండగానే బాధలతో యే బాదర బందీ లేని జీవితం గడపాలన్నది అతని  ఆకాంక్షగా ఉండేది .ఇరవై రెండవ ఏట ఒక సారి అకస్మాత్తుగా ‘’నేను ముప్ఫై వ ఏడు వచ్చేదాకా ఆర్ట్ కోసం శ్రమిస్తా .ఆతర్వాత నాజీవితాన్ని మానవ సేవలో గడుపుతాను ‘’అని ఒక నిర్ణయానికి వచ్చాడు .జీసెస్ చెప్పిన ‘’who se ever would save his life shall lose ,it ,and whosoever shall lose his life for My sake shall save it ‘’ దానిలో అర్ధాన్ని వెతికే వాడు , ఆ ధోరణిలో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలను కొనే వాడు మూత్తం మీద అర్ధాన్ని పట్టుకొన్నాడు .బాహ్యానందం తోపాటు ఇప్పుడు మానసికానందాన్ని పొందుతున్నాను అను కొనేవాడు .

     యూరప్ వెళ్ళటానికి ప్లాన్ ఏమీ తయారు చేసుకోలేదు కాని ,ముందుగా తలిదండ్రులకు దూరమైన బాలల భవ్య భవితవ్యం కోసం తపించి విద్యాబుద్ధులు నేర్పించి శ్రమించాడు .ఆయనకు అనాధ శరణాలయ సంస్థలేవీ సహకరించ లేదు .కనుక తనదారేదో తానే వెతుక్కోవాలని పించి విడుదలైన ఖైదీలలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు అదీ ఫలించలేదు .పారిస్ మిషనరీ సొసైటీ కి చెందిన ఒక మేగజైన్ లో కాంగో కాలనీకి ఉత్తరాన ఉన్న గాబన్ లో డాక్టర్ల అవసరం ఉంది అన్న ప్రకటన చూశాడు .ఇది ఒక వరంగా అనిపించింది .జీసస్ మాటల్ని అందరూ చెబుతారుకాని ఆచరణలో పెట్టేవారు బహు అరుదు అని గ్రహించాడు తన ఆలోచనలకు తగిన అవకాశం అని ,తనను చూసి నవ్విన వారి నాప చేను పండేట్లు చేసే సదవకాశం అను కొన్నాడు .

        ‘’వీడేవడ్రాబాబూ !ఆఫ్రికాకు ఎగరేసుకొంటూ పోతానంటున్నాడు.మిషనరీగా కాదుట డాక్టర్ గా నట.వీడికి  పిచ్చా వెర్రా ‘’అను కొన్నారు స్నేహితులు .వాళ్లకు సమాధానంగా ‘’నేను డాక్టర్ అవాలనుకోన్నాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా .ఇప్పటిదాకా ఏదో ఒకటి జనాలకు చెప్పీ చెప్పీ విసిగి వేసారి పోయాను .ఇప్పుడు ఈ కొత్త అవతారం లో నాకు మాట్లాడే అవకాశం కోసం చూడను .క్రీస్తు చెప్పిన ప్రేమ మతాన్ని అవలంబించి సేవ చేస్తాను ఇదే నా నిర్ణయం దీనికి తిరుగు లేనే లేదు ‘’అన్నాడు .తర్వాత ఏడేళ్ళు మెడిసిన్ పై ద్రుష్టి కేంద్రీకరించి చదివాడు .వైడర్ తోకలిసి బాష్ ఆర్గానిక్ సంగీతం పై మొదటి అయిదు విప్లవాత్మక భావ పరంపరగా గ్రంధాలు ,జీసెస్ క్రీస్తు చారిత్రకత పై పుస్తకం రాశాడు .ఉష్ణమండల ప్రాంత వ్యాధుల గురించి 37వ ఏట పరిశోధన చేశాడు .హాస్పిటల్ లో ఇంటర్ షిప్ పూర్తీ చేసి , హేలీన్ బస్లావు అనే చారిత్రకారుని కుమార్తెను పెళ్లి చేసుకొని ,కొత్త పెళ్ళాం తో ఆఫ్రికా లోని లామ్బార్నే సెటిల్ మెంట్ కు చేరాడు .మెడికల్ ప్రాక్టీస్ కు కావలసిన బిల్డింగ్ నిర్మాణం పూర్తీ కాలేదు అక్కడి పరిస్థితులు పరమ దారుణంగా ఉన్నాయి .అతని కన్సల్టింగ్ రూమ్ పాడు పడ్డ చిన్న గది మురికివాసన .అక్కడి ఉష్ణోగ్రత భరింప రానిదిగా ఉంది .మొదట్లో అతనికి దుబాసీలుగా సహాయకులుగా ఉండే స్థానికులు ఎవరూ దొరకలేదు .మొదటి సారిగా తమ దగ్గరకు ఒక డాక్టర్ వచ్చాడని తెలుసుకొని దాదాపు రెండు వందల మైళ్ళు కాలినడకన నడిచి వచ్చి జబ్బు పడ్డ వారు వచ్చేవారు .స్క్వీజర్ మలేరియా కే కాకుండా స్లీపింగ్ సిక్ నెస్,విరేచనాలు ,అక్కడ బాగా ప్రబలి ఉన్న కుష్టు వ్యాదికీ  చికిత్స చేశాడు .అవసరమైతే హీర్నియాకు అల్సర్,  బోదకాలు కు కూడా శస్త్ర చికిత్స చేశాడు .డాక్టర్ ఆఫ్ డివినిటి అయిన ఆల్బర్ట్ పేషెంట్ లు ఇచ్చిన  బహుమతులను తీసుకోలేదు .మతాధికారులు అతన్ని దుబాసీ సహాయం తోమత బోధ చేయమని కోరేవారు .ఇదొక కొత్త అనుభవం అనిపించింది .యేసు క్రీస్తు పవిత్ర బోధనలను అక్కడఏమీతెలియని కొత్త వారికి  ప్రచారం చేయటం లో విపరీతమైన ఆనందాన్ని పొందాడు .ఖాళీ సమయం లో బాష్ పై మిగిలిన చివరి మూడు బ్భాగాలు రాశాడు  .తనకున్న ఆర్గాన్ సంగీతానికి మెరుగులు దిద్దుకొంటూ స్వయంగాతాను రూపొందించిన పియానో పై పలికించాడు .

     స్క్వీజర్ ,కు అతని భార్య తనకు నర్సుగా  లేఖకురాలిగా సహాయం చేసింది .ఆఫ్రికా  చేరిన ఏడాది లోపే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది .ఫ్రాన్స్ అధీనం లో ఉన్న జర్మనీకి చెందినవాడుకనుక ఆల్బర్ట్ ను విదేశీ శత్రువుగా భావించారు .తెల్లవాళ్ళు తెల్లవాల్లను ఖైదీలుగా చేసి నల్ల సైనికుల  అధీనం లో ఉంచటం స్థానికులకు ఇబ్బంది గా ఉండేది అని ‘’ఔట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ధాట్’’పుస్తకం లో రాశాడు .నాగరిక దేశాలు యుద్ధం పై మొహరించినకాలం లో స్క్వీజర్ డాక్టర్ గా తన పని తానూ చేసుకు పోతున్నాడు .వింత పరిస్థితులలో ఇరుక్కున్న రెండు రోజుల తర్వాత ‘’ఫిలాసఫీ ఆఫ్ సివిలి జేషన్ ‘’రాయటం మొదలు పెట్టాడు .16 నెలల తర్వాత స్క్వీజర్ ను వంద మైళ్ళ దూరం నదికి ఎగువన   జబ్బుతో ఉన్న ఒక మిషనరీ భార్యను చూసి వైద్యం చేయటానికి  అనుమతించారు .డెక్ మీద కూర్చుని తనకు అంత వరకు తెలియని కొత్త ఆలోచనలేవో మది నిండా ముసురు కాగా,యే వేదాంత గ్రంధం లోని లేని వినూత్న ఆలోచనలను పేజీలకు పేజీలు  రాసేశాడు .మూడు రోజుల తర్వాత ఖడ్గ మృగాల మధ్యలో ఉన్న అనుభవం ఏదో కలిగింది .మనసులో మెరుపులా ‘’రివరెంస్ ఫర్ లైఫ్’’అనే పదం తన్నుకొచ్చింది .అప్పటిదాకా ఉన్న ఇనుప తెరలు తొలగి పోయి ,దారి సుగమంగా దర్శన మిచ్చింది .ప్రపంచ స్థితి ,నైతికత ప్రక్క ప్రక్కనే ఉంటాయి .కనుక కనిపించే భౌతిక ప్రపంచం ,జీవితం నాగరకత తో కలిసి పోవటం తన ఆలోచనలకు మూలం అన్నాడు ఆల్బర్ట్ స్క్వీజర్ .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -155

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -155

 60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్  నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer)

    ‘’రోతను పుట్టించే ఆలోచన లతో పూర్తిగా నిండి ఉన్న యుగ వైఖరికి రోసి ఉన్నాను .ఆలోచన తనను తానుచక్కబరచుకోకుండా   ఇప్పటి వరకు తన లక్ష్యాన్ని సాధించలేదు .ఈ విపత్కర కల్లోలాన్నుంచి బయట పడాలంటే వాస్తవ నాగరకత ఆదర్శాల సంరక్షణ కింద ఉండాల్సిందే ‘’అని,అన్నది పరిపక్వత లేని ఫిలాసఫర్ కాదు . ,తన పరిధిని నైరూప్య సరిహద్దులో ఉన్ననిరంతర కార్య కర్త అయిన ఒక ప్రీచర్  ,సంగీత సృజన శీలి ,సంగీత వాద్య నిర్మాత , ,నాగరికతను బహిష్కరించి ,హాయిగా సాగే వృత్తికి తిలోదకాలిచ్చి ,తన జీవిత కాలమంతా సభ్యతా సంస్కారం లేదని మనం అనుకొంటున్నఆటవిక జాతులతో అరణ్యాలలో కలిసి జీవించిన  ఆల్బర్ట్ స్క్వీట్జేర్ .ఇప్పటికే ఆయన అంటే ఏమిటో అర్ధమై పోయి ఉంటుంది .

  యోగ పురుషులలో ఒకరుగా గుర్తి౦పబడి న   ఆల్బర్ట్ స్క్వీజర్ 14-1-1875న జర్మన్ ఆల్సేస్ లోని కేసర్స్ బెర్గ్ లో జన్మించాడు .తలి దండ్రుల వైపుకు చెందినవార౦దరూ మినిస్టర్ లు ,సంగీత కారులే .తాత ఆల్సేషియన్ ఆర్గ నిస్ట్ ,స్కూల్ మాస్టారు .ఆయన సోదరులూ ఇంతే .మాతామహుడు ఒక పాస్టర్,.తండ్రి ఇవాంజెలికల్ కాంగ్రి గేషన్ నాయకుడు .తండ్రి అయిదుగురు సంతానం లో ఆల్బర్ట్ రెండవ వాడు .ఇతనికి ముగ్గురు సోదరిలు ,ఒక తమ్ముడు ఉన్నారు .అయిదవ ఏటనే పియానో తో కమ్మని స్వరాలు ఒకే వేలితో పలికించిన  బాల మేధావి .ఏడవ ఏటనే ‘’పార్లోరోర్గాన్ ‘’పై స్వంత  ఏకస్వరాలను (హార్మనీస్ )వాయించిన దిట్ట .9వ ఏట గ్రూయిన్స్ బాక్ చర్చి లో ప్రార్ధనలో ఆర్గనిస్ట్ రాకపోతే తానే వాయించి అబ్బుర పరచాడు .చదువు ఆల్సేషియన్ స్కూల్స్ లో సాగింది .నేచురల్ సైన్స్ పై అభిమానం ఎక్కువ .చార్లెస్ మేరీ విండర్ అనే ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆర్గనిస్ట్ వద్ద వీలున్నప్పుడల్లా పాఠాలు నేర్చాడు .18వ ఏట స్త్రాస్ బర్గ్ యూని వర్సిటి లో చేరాడు .ఇక్కడే టెక్నాలజీ ని సంగీతాన్ని అభ్యసించాడు .యవ్వనం నుంచే ప్రముఖ సంగీతకారులు బాష్ అన్నా ,జీసస్ అన్నా ఆరాధనా భావం ఉండేది .22ఏళ్ళ వయసులో ఫిలాసఫీ చదవటానికి  పారిస్ లోని  సాన్ బారన్ వెళ్ళాడు .వెండర్ దగ్గర ఆర్గాన్ నేర్చి  బాగా  అభి వృద్ధి  చెందాడు .జర్మనీలో అంతకు ముందు ఎవరూ నేర్వని’’ ప్లాస్టిక్ స్టైల్’’ ను అలవరచుకొన్నాడు.

  ఇరవై నాలుగవ ఏట ఫిలాసఫీలో డిగ్రీ పొంది ,స్త్రాస్ బర్గ్ లోని సెయింట్ నికొలాస్ చర్చ్ లో ప్రీచర్ అయ్యాడు  .యూని వర్సిటీలో మత వేదాంత శాస్త్ర లెక్చరర్ గా ఎంపికయ్యాడు .లాస్ట్ సప్పర్ లోని పూర్వ క్రైస్తవమరియు బాప్టిజం  అభి వృద్ధి పై ఆల్బర్ట్ కున్న అభినివేశాన్ని గమనించి ఈపదవి నిచ్చారు 1906లో ‘’ది క్వెస్ట్ ఆఫ్ దిహిస్టారికల్ జీసస్ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .అదేసమయం లో  సంగీతకర్త బాష్ పై స్క్వీజర్ రాసిన  ఉద్గ్రంధమూ వెలువడింది .18వ శతాబ్దికి సంగీత గ్రాండ్ మాస్టర్ బాష్ ను పూర్వ పరి శోధకులకంటే భిన్నంగాపోలీ ఫోనీ లో ఆయన మాస్టర్ అని ,క్లాసిసిస్ట్ అని ,మహాకవి అని ప్రముఖ చిత్రకారుడని  ఆల్బర్ట్ సశాస్త్రీయంగా రుజువు చేశాడు .బాష్ ను గురించి రాస్తూ ‘’ఆయన సంగీతం కవితాత్మకమే కాక ,చిత్రాత్మకం కూడా .కారణం అందులోని విషయాలు కవిత్వం చిత్ర లేఖనం నుండి పురుడు పోసుకోన్నాయి .గోదిక్ ఆర్కి టేక్చర్ ను శబ్దం గా రూపాంతరం చెందించిన ఘనత బాష్ ది ‘’అని  విశ్లే షించాడు  .దీనికి అనుబంధంగా బాష్ వి తనవి ప్రదర్శనలను చేర్చి ‘’ది ఆర్ట్ ఆఫ్ ఆర్గాన్ బిల్డింగ్  అండ్ ఆర్గాన్ ప్లేయింగ్ ఇన్ జర్మని అండ్ ఫ్రాన్స్ ‘’ను ప్రచురించి బాష్ పై తిరుగు లేని అధారిటీ అని నిరూపించాడు .పాతవాటిని మార్చి కొత్తవి కనిపెట్టటం లో సాదికారత సాధించాడు .నమూనాలను ఆయన అంగీకారం కోసం మార్పుల కోసం పంపేవారు .అనేక సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి పురాతన వాద్యాలను పరి రక్షించే ప్రయత్నాలు చేశాడు. మాంచి ప్రాముఖ్యాన్ని పొంది 29వ ఏట భవిష్యత్ జీవితం పై భరోసా పొందాడు .

  Inline image 1  Inline image 2

   సశేషం

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారల దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

Inline image 1
Inline image 2

సాహితీ బంధువులకు రేపు 31-5-16 మంగళ వారం శ్రీ హనుమజ్జయంతి శుభా కాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -153

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -153

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -6

నాజీల ‘’ఆబాస విజయం ‘’ను గుర్తి౦చనివాడు ,ఇంగ్లాండ్ చేస్తున్న ఒంటరి పోరాటం చూసి రష్యాకు అమెరికాకు తగిన సమయం లోఆయుధాలతో సైన్యం టో  స్పందించే అవకాశామిచ్చినవాడు’’ ,మహా కూటమి ‘’అనే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసి పడమటినుంచి అమెరికాను తూర్పునుంచి రష్యాను యుద్దొన్ముఖులను చేసిన అపర చాణక్యుడు చర్చిల్ .తనకు అత్యంత మిత్రుడైన అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ తో న్యు ఫౌండ్ లాండ్ లో 19 41లో చారిత్రాత్మక శాంతి ఒప్పందమైన అట్లాంటిక్ చార్టర్ ను రూపొందించటం లో అనన్య సాధారణ ప్రతిభ కనపరచాడు .యుద్ధ సమయం లో ఈ నేత లిద్దరూ కనీసం డజను సార్లు అయినా సమావేశమై చర్చి౦చుకొన్నారు .చర్చిల్ అమెరికా ప్రెసిడెంట్ కు ఆయననివాసం వైట్ హౌస్ కు  ఆత్మీయ అతిధి ,కుటుంబ సభ్యుడూఆయ్యాడు.ప్రెసిడెంట్ భార్య ఎలినార్ రూజ్ వెల్ట్ ఈ అగ్రనాయకులిద్దరూ యుద్ధ పూర్వ దేశ పరిస్తితికి యుద్దానంతర దేశ పరిస్థితికి చాలా ఆందోళన పడ్డారని చెప్పింది .యుద్ధం పూర్తీ అయ్యేదాకా తాను  పదవిలోనే ఉంటానని యుద్ధం నుంచి ప్రతి సైనికుడు బయటికి వచ్చి జీవితం లో స్థిరపడేదాకా తనకు విశ్రాంతి లేదని చెప్పేవాడని గుర్తు చేసుకోన్నది .రష్యా నియంత స్టాలిన్ తోస్నేహం వ్యక్తిగాతమైనదేకాని రాజకీయమైనదికాదు .ఈ ఇద్దరూ నిర్లఖ్యం ,దూకుడు స్వభావం గల యుద్ధ వీరులేకాక తిండి పోతులు ,తాగు బోతులు కూడా .కమ్మ్యూనిజం వ్యాప్త్ని చర్చిల్ భయంకరమైనదిగా భావించేవాడు . రష్యా వల్ల కలిగిన దారుణ మారణ కాండ మానవ జాతి చరిత్రలో ఎప్పుడైనా చూశామా అని 1921 జనవరి లో చర్చిల్ అన్నాడు .’’రష్యా తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తోంది జనానికి తిండి లేదు .మనిషికి మనిషి రాష్ట్రానికి రాష్ట్రం బద్ధ శత్రువులై జనాలను తరిమేస్తున్నారు .ఇదంతా చూస్తుంటే నాగరక మానవుడిని సంస్కృతికి దూరంగా తరిమేస్తూ ఆశల హర్మ్యాలు కూలుస్తూ ,రెక్కాడితెకాని డోక్కాడని పరిస్స్థితి  సృష్టించి  మనం రాతి యుగం లో ఉన్నామా అనే అనుమానం కలిగేట్లు చేస్తున్నారు’’అన్నాడు .ఇదే చర్చిల్ 20ఏళ్ళ తర్వాతారష్యాను ‘’మహా యుద్ధ వీరులు ,శక్తి వంతమైన నాయకులు అన్నాడు రష్యా సైన్యం జర్మనీ సైన్యాన్ని ఎక్కడికక్కడ నిలవరించి ఇంగ్లాండ్ వైపుకు దూసుకు రాకుండా అడ్డు పడినప్పుడు.గత రెండు దశాబ్దాలుగా తనకంటే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారెవరూ లేరన్నాడు .జర్మనీ రష్యాపై దాడికి దిగినప్పుడు రేడియో లో మాట్లాడుతూ  ‘’నేను పూర్వం మాట్లాడిన మాటలన్నీ గతం గతః .ఇప్పుడు రష్యా సైనికులు ప్రాణాలు ఒడ్డి తమ దేశాన్నిరక్షి౦చు కొంటున్న తీరు చూస్తె వారి అపూర్వ త్యాగాభరిత పోరాట పటిమ దిగ్భ్రాంతి కలిగిస్తోంది .మా రెండు దేశాల  లక్ష్యం ఇప్పుడు ఒక్కటే హిట్లర్ ను అతని నాజీ సిద్ధాంతాన్ని కూకటి వేళ్ళతో పెకలించి పారేయటమే   .ఇప్పుడు ఆ నరహంత హిట్లర్ తోకాని అతని నాజీ జుంటా తోకాని అసలు సంప్రదింపులు జరపనే జరపం .భూమిపైనా సముద్రం మీదా ఆకాశమార్గానా అతనితో పోరాటం చేస్తాం దైవక్రుపవలన తను స్వాధీనం చేసుకొన్న భూభాగాన్ని విముక్తం చేయగలిగాం ‘’Any man or state who fights on against Nazidom  will have our aid’’అన్నాడు .

   యుద్ధం పూర్తీ అవగానే చర్చిల్ రష్యా విషయం లో కొంత ఊగిసలాడాడు .రష్యాఆసియాను  డామినేట్ చేస్తుందేమోనని అనుమానించాడు .దానికోసం ఇంగ్లీష్ మాట్లాడే  దేశాల  సమాఖ్య కోసం  ప్రయత్నించాడు .అంతమాత్రం తో రష్యా వైపు యుద్ధ ద్రుష్టి టో చూడను కూడా లేదు .ప్రభుత్వం లో ఉన్నా బయట ఉన్నా అతని స్వరం లో తీవ్రత ఏమాత్రమూ తగ్గలేదు  .యుద్ధం ముగిసి మిత్రపక్షాల విజయం తర్వాత ఇంగ్లాండ్ లో ఎన్నికలు జరిగి యే నాయకుడు తమను కాపాదాడో తమ దేశాన్ని రాక్షించాడో ఆమహా నాయకుడైన చర్చిల్ నుపరువు ప్రతిష్టలు హిమాలయోత్తుంగ సదృశంగా ఉన్న సమయం లో దారుణం గా  ఓడించారు .దీనికి చాలాకారణాలున్నాయి .స్వతహాగా టోరీ కావటం ,పేదదప్రజానీక బాగోగులపై ద్రుష్టి లేని వాడు కావటం , నూతన దేశ నిర్మాణానికి,బాధ్యతలను మోయటానికి  చాలినంత శక్తి యుక్తులు లేని ముసలి ఎద్దు అయిపోవటం కొన్ని కారణాలు అతని శత్రువులు మాత్రం యుద్ధ సమయం లో శక్తి యుక్తులు చూపిదేశాన్ని రక్షించినా శాంతి సమయం లో సమర్ధత చూపే చాకచక్యం లేని ఒంటి కొమ్ము సొంటి లాంటి వాడన్నారు .అసలు ప్రజలు మార్పు కోరారు . సూపర్ హ్యూమన్ కాకపోయినా చర్చిల్ తీవ్రంగా బాధ పడ్డాడు .ప్రతిపక్ష నేతగా ఉండి అవమానాల పాలయ్యాడు .దీనిపై స్పందిస్తూ ‘’దేశం లో అత్యున్నత పదవినిలో ఉంటూ  అయిదేళ్ళ మూడునెలల రెండవ ప్రపంచ సంగ్రామం లో నా దేశం తరఫున పోరాడి నా దేశం పరువు ప్రతిస్స్టలనుపెంచి ,యుద్ధ విజయాన్ని చేకూర్చితే నా బ్రిటిష్ ప్రజలు ఇక నువ్వు మా విషయాలలో చేయవలసిందేమీ లేదు అంటూ ఓడించి ఇంటికి పంపారు ‘’అని రాసుకొన్నాడు.

   ఈ నిరాశా నిస్పృహలనుండి తేరుకోవటానికి చర్చిల్ కు కొంత కాలం పట్టింది  .ఇంగ్లాండ్ అమెరికాలలో విస్తృతంగా పర్యటన చేస్తూ పూర్వంలాగానే శక్తి వంతమైన పదజాలం తోప్రజలను ఆకర్షించాడు .కొత్త మాటలూ ప్రయోగాలు చేశాడు .రష్యా గురించి చెబుతూ ‘’an iron curtain has descended across the continent ‘’అన్నాడు ఇనప తెరఅనే మాటను రష్యన్ సీక్రెట్ సర్వీస్ లకు అన్వయిన్చేట్లు అన్నాడు .గణాంక వేత్తలను సైంటిస్ట్ లను ,మిలిటరీ ఎక్స్ పర్ట్ లను ,పరిశోధకులను ,విద్యా వేత్తలను ఒక రికార్డింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసుకొని పగలూరాత్రి షిఫ్ట్ పద్ధతిలో పనిచేసి ఆరు భాగాల సీరియల్ ను నిర్మించాడు .ఇందులో అమెరికన్ సీరియల్  ఒక్కదానికే రెండు మిలియన్ డాలర్ల డబ్బు వచ్చింది .వీటికి వేరువేరుగా పేర్లు పెట్టాడు –‘’ది గాదరింగ్ స్టార్మ్’’,దెయిర్ ఫైనేస్ట్ అవర్ ‘’,ది గ్రాండ్ అలయన్స్ ‘’,ది హింజ్ ఆఫ్ ఫేట్ ,’’క్లోసింగ్ ది రింగ్ ‘’,ది త్రంఫ్ అండ్ ట్రాజేడి’’చివరిదానికి బాధా తప్త హృదయం తో ‘’HOWTHE GREAT DEMOCRACIES TRIUMPHED AND SO WERE ABLE TO RESUME THEFOLLIES WHICH HAD SO NEARLY COST THEM AND THEIR LIFE ‘’అని ఉప శీర్షిక పెట్టాడు .శక్తి వంతమైన రష్యా ,ప్రచ్చన్న యుద్ధం వంటివి ఇంకా పరిష్కారం కాని సమస్యలుగానే ఉన్నాయి .

   ఆరేళ్ళు జ్ఞాపకాల రాతల్లో తలమునకలుగా ఉండి,తన జీవితం లోని అవమాన కర  ఓటమి ట్రాజెడీ ని మరో అంతర్ నాటకం తోవిజయ తీరాలకు చేరుద్దామని ఎదురు చూస్తుండగా 1951లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చి ,అదృష్టం తలుపుతట్టగా గెలిచి మళ్ళీ బ్రిటిష్ ప్రధాని అయి ఊరట చెందాడు .ప్రజా సేవకు గర్వ పడుతూ ‘’నేను పదవికోసమో అధికారం కోసమో రాలేదు .ఈ రెండిటినీ సుస్టుగా అనుభవించాను .మరి ఎందుకు వచ్చాను అంటే సుస్థిర శాంతి  స్థాపనకోసమే ‘’అన్నాడు .

   సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -154

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -154

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -7(చివరి భాగం )

 79వ చర్చిల్ పుట్టిన రోజును ప్రపంచ వ్యాప్తంగా ధూమ్ ధాం గా నిర్వహించారు .ఈ సందర్భంగా ‘’చర్చిల్ బై హిస్ కాంటే౦ప రరీస్ ‘’అనే పుస్తకాన్ని విడుదల చేశారు .అందులో ఎందరో ప్రసిద్ధులు చర్చిల్ యుద్ధ విలేకరిగా ,నవలా రచయితగా ,కళాకారునిగా ,హాస్య రచయితగా ,,వక్తగా ,సైనికుడిగా ,పార్ల మెంటేరియన్ గా   ,రాజకీయ ప్రతిపక్ష నాయకుడిగా ,నిర్వహించి ప్రదర్శించిన బహు ముఖ ప్రజ్ఞా విశేషాలను నిండు మనసుతో రాశారు .అన్నిటికన్నా ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ‘’ప్రతిభగల వ్యక్తి చర్చిల్ ‘’అని రాసి ఆయనకు రెండు టికెట్లు పంపుతూ తన నాటకాన్ని ఆవిష్కరించమని కోరుతూ ‘’మీరు మొదటి ఆటకే రండి .మీకు స్నేహితుడనే వాడెవరైనా ఉంటె వెంట తీసుకొని రండి ‘’అని ‘’ఎటకారం గా ‘’రాసి ఆహ్వానించాడు .ఘటికుడు చర్చిల్ తక్కువ వాడా ! వెంటనే జవాబు రాస్తూ ‘’ప్రారంభ రాత్రి ఆటకు రాలేనంత పని ఒత్తిడిలో ఉన్నాను .కాని రెండో ఆటకు రాగలను –ఒక వేళ రెండో ఆట ఉంటె ‘’అని ఝలక్ ఇచ్చాడు .

  చర్చిల్ మాటలు తూటాల్లాగా పేల్తాయి .వాటిలో హాస్స్యం చమత్కారం వ్యంగ్య వైభవం మినుకు మినుకుమనే తెలివి తేటలు కలిసే ఉంటాయి .వీటినన్నిటినీ కలిపి ‘’ఎ చర్చిల్ రీడర్ ‘’గా లోకం లో నిలిచి పోయాయి .అందులో కొన్ని .1-మొండి వాడు అంటే తన మనసును ఎప్పుడూ మార్చుకోని వాడూ ,తానూ మాట్లాడే విషయాన్ని మార్చని వాడు .2-వ్యక్తిగతంగా నేను నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నాకు ఎవరిదగ్గరా నేర్చుకోవాలని లేకపోయినా .3-తెలివిగాలవాడేవడైనా యుద్ధం లో జయించటానికి ప్రణాలికలు తయారు చేస్తాడు ,వాటి అమలు కోసం బాధ్యత తీసుకో కుండా .4-ప్రపంచం కలిసి ఉంటె విడిపోయి ఉన్నదానికంటే గొప్ప .కాని ప్రపంచం ధ్వంసం కాకుండా విడి పోయి ఉండటం మేలు .

   79వ సంవత్సరం మధ్యలో ఈ బహు రంగుల బహు భంగుల,వివాదాస్పద  మేధావిని ‘’నైట్ ఆఫ్ ది మోస్ట్ నోబుల్ ఆర్డర్ ఆఫ్ ది కార్టర్ బై ఎలిజబెత్ ది సెకండ్ ‘’చేసి గౌరవించారు .కొన్ని నెలల తర్వాత విన్ స్టన్ చర్చిల్ కు ప్రపంచ ప్రసిద్ధ నోబెల్ సాహిత్య బహుమతిని అందజేసి గౌరవాన్ని రెట్టింపు చేశారు .అయన రచనలకు మాత్రమే ఇచ్చిన  బహుమతి కాదు ,ఆయన చేసిన యుద్ధ ఉపన్యాసాలకు కూడా చెందుతుంది .నోబెల్ అవార్డ్ నిస్తూ ‘’for his wartime speeches  against a ‘’monstrous tyranny never surpassed in the dark ,lamentable catalog of human crimes ‘’అని అభి వర్ణించింది  ఆ సంస్థ .స్వీడిష్ అకాడెమి చర్చిల్ ను ఆహ్వానించి సత్కరించి పురస్కార ప్రదానం చేస్తూ ‘’for his mastery of historical and biographical description ,as well as  the brilliant  art of oration with which he has defended human values ‘’అని ప్రశంసించింది మానవీయ విలువల పరి రక్షణకు చర్చిల్ చేసిన సేవకు ఇది ఘనమైన కితాబు బహుమతి ,ఆ ‘’పాదరస బహు-మతి ‘’చర్చిల్ కు .

  ఆయన మహా వక్త్రుత్వానికి , చరిత్రకు  అందుకొన్న గొప్ప అవార్డ్ అది .ఆయన రచనలో ఉన్న నిబద్ధతకు ,ఆయనే చెప్పిన ‘’పనిలో నైతికత ‘’(మొరల్ ఆఫ్  ది వర్క్)కు అది నిదర్శనం .చర్చిల్ మాటలు మంత్రాలు లాపనిచేశాయి .వాటి ప్రభావం  అనిర్వచనీయం .కొన్ని చర్చిల్ మాటల మంత్రాలు –‘’In war ,Resolution .In Defeat ,Defiance .In victory ,Magnanimity .In peace ,Good will .ఈ విషయం లో రచయిత లూయీ అంటర్ మేయర్ అన్నమాటలు ‘’It was a motto worthy of being borne on the proudest shield and the loftiest banner ‘’ఆ యుద్ధ వీరునికి కీర్తి పతాకలు .ఇంతటి కీర్తి ఘనుడు చర్చిల్ 24-1-1965న 91ఏళ్ళు జీవించి కీర్తి కాయాన్ని వదిలేసి అమరుడైనాడు .ఆయన అంత్య క్రియలకు చైనా తప్ప అన్ని దేశాల ప్రతి నిధులు హాజరైనారు .350 మిలియన్ ల ప్రజలు టెలివిజన్ లో వీక్షించారు .సైనిక లాంచనాలతో 19గన్ సాల్యూట్ తో మహా గౌరవ ప్రదంగా ప్రభుత్వం నిర్వహించింది .డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో చర్చిల్ పెయింటింగ్ లను చూడవచ్చు .

  ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ,బి బి సి నిర్వహించిన 2002. ప్రపంచ ప్రసిద్ధ వందమంది నాయకులలో చర్చిల్ సర్వ ప్రధముడుగా ఎన్నికైనాడు .’’ఆనరరి సిటిజెన్ ఆఫ్ అమెరికా ‘’గా ఆ ప్రభుత్వం గౌరవించింది .రోచెస్టర్, మియామి మొదలైన ఎన్నో యూని వర్సిటీలు గౌరవ డాక్త రేట్ ప్రదానం చేశాయి .వివాదాస్పద ప్రధాని అయినా చారిత్రిక పురుషుడు ,మన కృష్ణ దేవరాయలులాగా ‘’సాహితీసమరాంగణ బ్రిటిష్ సార్వ భౌమ ప్రధాని చర్చిల్’’ .మహా రాజకీయ దురంధరుడు .చరిత్రను ఒక మలుపు తిప్పిన లెజెండ్ చర్చిల్ 

.Inline image 3Inline image 4

.

 

   సశేషం

                   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -152

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -152

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -5

 కొత్త ఉద్యోగం  చర్చిల్ ఊగిసలాడే ధోరణిని ,అస్థిర తను సూచిస్తుంది .’’మనవాడు ఎవరి వైపు ఉంటాడు అంటే తనవైపే ‘’అని ‘’జోకారు ‘’..ఫ్రీట్రేడ్ ను నిషేధించినపుడు ‘’అదేమీ తప్పుకాదు .సరైనమార్గం లో తీసుకొన్న నిర్ణయమే .అభి వృద్ధి అంటే మార్పే .లోపం లేకుండా ఉండటం అంటే అనేకసార్లు మార్చుకోవటమే ‘’అని నాన్ స్టాప్ గా వాయి౦ చేశాడు .దీన్ని  చూసి లార్డ్ ఆక్స్ ఫర్డ్ ‘’తీర్పులేని జీనియస్ ‘’అన్నాడు (ఎ జీనియస్ వితౌట్ జడ్జి మెంట్ ).దీన్ని నిజం చేశాడేమో అన్నట్లు చలా సార్లు తీవ్ర అంత్య స్థితి లో(ఎక్స్ ట్రీం) ఉండేవాడు .కొత్త బిచ్చ గాడు పొద్దెరగడు అన్న సామెత ప్రకారం కన్జర్వేటివ్ ల కంటే ఇంకా కన్జర్వేటివ్ గా ఉండేవాడు .టోరీలకే టోపీ పెట్టి ముందుండేవాడు .1929లో లేబర్ పార్టీ లిబరల్స్ ఇచ్చిన తోడ్పాటుతో ఎన్నికలలో టోరీలతో పోటీ చేసి తోఘన విజయం సాధించింది .బాల్డ్విన్ ను మళ్ళీ ప్రధానిగా నియమించి చర్చిల్ కు కేబినేట్ లో స్థానం ఇవ్వకూడదని షరతు పెట్టారు .58వ ఏట ప్రాభవం కోల్పోయి మంత్రి వర్గం లో స్థానం పొందలేదు .మళ్ళీ గద్దేనేక్కటానికి పదేళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది పాపం .

   ఈ నిరీక్షాకాలాన్ని సోమరి కాలం (ఐడిల్ డికేడ్)అన్నాడు .అవే ఆయనకు ‘’లోటస్ యియర్స్ ‘’అయ్యాయి .తనపల్లెటూరు  చార్ట్ వెల్ కు వెళ్లి రచనా వ్యాసంగం లో మునిగిపోయాడు .అతి ప్రసిద్ధి చెందిన

 రాజకీయ చారిత్రిక సాక్షాధార పత్ర (డాక్యుమెంట్ )రచన చేసి ఎన్నో విషయాలు తవ్వి తీశాడు .’’ది వరల్ద్ క్రైసిస్ ‘’పేర వచ్చిన నాలుగు భాగాలు చర్చిల్ ను మహా వక్తలలో ఒకనిగా ,అతనిది ఒక మహాద్భుత అనితర సాధ్యమైన ప్రత్యేకమైన శైలిగా –అదే ‘’ప్యూర్ చర్చిలియనిజం ‘’గా గుర్తింపు పొందింది  .ఈ పుస్తకం అమ్మకాలవలన చర్చిల్ కు లక్ష డాలర్ల పైకం లభించింది .ఈ రాబడి ఆయన రాసిన ‘’మాల్ బరో ‘’జీవిత చరిత్ర ,అనేక పత్రికలకు రాసిన సీరియల్ వ్యాసాలవలన ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది .మరొక వ్యాసంగం గా తాపీ పని (మేసన్రి)  హాబీ గా చేసుకొని అందులోనూ విజయస్తంభాన్ని కట్టాడు .కాని ‘’బ్రిక్ లేయర్స్ యూనియన్ ‘’వ్యతిరేకించింది .వెంటనే అందులో మెంబర్షిప్ తీసుకొని గోడ కట్టటం లో పై కప్పు నేయటం లో తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .దేశ భవిష్యత్తునే నిర్మించిన వాడికి ఇదొక లెక్కా !ప్రజా జీవితం నుంచి చర్చిల్ విరమించుకోవటాని ఎవరూ ఒప్పుకోలేదు .పదేళ్ళు నియోజక వర్గానికి దూరంగా ఉన్నా పిలిచి నిలబెట్టి గెలిపించి పార్ల మెంట్ కు పంపారు .

  హిట్లర్ మొదటి సారిగా జర్మని ఆయుధ సంపత్తి సేకరణ చేయాల్సిందే అన్నప్పుడు  ,చర్చిల్ కు హిట్లర్ పై జాతీయ పక్ష పాత ధోరణి కనిపించలేదు .’’గాదరింగ్ స్టార్మ్’’లో రాస్తూ చర్చిల్ ‘’హిట్లర్ సిద్ధాంతాలు ఆలోచనలు ,రికార్డ్ ,ప్రవర్తనా శీలం గురించి నాకేమీ తెలియదు .ఎవరైనా ఓడిపోయినతన దేశం కోసం నిలబడితే నేను అవతలి పక్షం లో ఉన్నా వారిని మెచ్చుకొంటాను ‘’అన్నాడు హిట్లర్ రాసిన ‘’మీన్ కాంఫ్ ‘’పుస్తకాన్ని చర్చిల్ పూర్తిగా చదివి అర్ధం చేసుకొన్నాడు .రాబోయే కాలం లో ప్రపంచ విజేత కావాలన్న హిట్లర్ ఆశయం ,దానికోసం జరుగ బోయే తీవ్ర యుద్ధాలను ,వాటివలన ప్రపంచానికి జరగా బోయే అనర్ధాన్ని ముందే పసి గట్టాడు.జర్మన్ సైన్యం ఇంకొక 7ఏళ్ళలో చిన్న దేశాలను కబళించే  ఉద్దేశ్యంతో  జర్మన్ వీధుల్లో కవాతు నిర్వహిస్తున్నప్పుడే చర్చిల్ హౌస్ ఆఫ్ కామన్స్ లో తీవ్ర స్వరం తో రాబోయే ప్రళయాన్ని వివరిస్తూ ‘’ ఈ యువ బలీయ మైన సైనికులు కవాతు చేయటం చూస్తె హిట్లర్  కోరిన సమాన హోదా కోసం కాదని ,ఆ విషయం వారి కళ్ళల్లో ఆయుదాలకోసమే అన్న భావం ప్రతిఫలిస్తోంద’’నిచెప్పాడు .జర్మనీ అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జలాంతర్గాములను తయారు చేసుకోన్నాదని ,సైన్యానికి ఆధునిక యుద్ధ టాంకు లు నిర్మించి అజేయంగా తయారైందనీ సభలో నెత్తీ నోరూ పెట్టుకొని అరిచాడు ఆవేశ పడ్డాడు ,వాదించాడు గర్జించాడు .తనమాటలు యదార్ధమేనని విశ్వాసం కలిగించాడు అప్పటికి చర్చిల్ నాజీలకు ఎదురు నిల్చిన’’ఏక వ్యక్తీ బ్రిటిష్ సైనికుడు’’ ,  దీనితో మిగిలిన వారికి విసుగు కోపం వచ్చాయి ఆయన మీద .ప్రతిపక్షం నిద్రలో జోగుతూ ‘’ఎస్ ‘’అని ఈ హెచ్చరిక దారుని తోసేసింది .

  1934లో పార్లమెంట్ లో చర్చిల్ మాట్లాడుతూ నాజీ జర్మనీ హిట్లర్ నాయకత్వం లో ఆకాశాన్ని విమానాలతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ,అలక్ష్యం చేస్తే లండన్ పై జర్మన్ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తాయని  హెచ్చరించాడు .ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ ,ఎడ్వర్డ్ రాజు ఒక సామాన్యఅమెరికన్  స్త్రీని పెళ్లి చేసుకో వద్దు అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం లో ఉన్నాడేకాని హిట్లర్ కొంప ముంచుతాడనే ఆలోచనలో లేడు.నేవెల్లి చామ్బర్లేన్ మాత్రం హిట్లర్ ను తక్కువ అంచనా వేశాడు .లీగ్ ఆఫ్ నేషన్స్  వెన్నులో బాకు  గుచ్చినట్లుగా ఇంగ్లాండ్ ఇటలీ ముందు మోకరిల్లి అబిసీనియా ని నిర్లక్ష్యం చేసింది .చర్చిల్ ఉద్విగ్న దీర్ఘోపన్యాసం కూడా ఫలించలేదు .అప్పటికే చేతులు కాలాయి ఆకులతో పని లేక పోయింది. జర్మని రైన్ లాండ్ ను వశం చేసుకొని ,తూర్పు యూరప్ లో జర్మనీ హవా ను ఆపలేక నిస్తేజమైంది .ప్రధాని బాల్డ్విన్ ‘’ఇంతకంటే గొప్ప ఆయుధాలున్న దేశం ఉందా ,మనకేమీ భయం లేదు ‘’అంటూ చర్చిల్ ను దుయ్య బట్టాడు .చాంబర్లేన్ సిగ్గుమాలిన  షరతులతోహిట్లర్ ముందు మ్యూనిచ్ లో మోకరిల్లాడు.ఏడాది దాటేసరికి జర్మని పోలాండ్ ను స్వాధీనం చేసుకోవటం తో రెండవ ప్రపంచ యుద్ధం ‘’శురూ ‘’అయింది .

   వార్ మేనేజర్ చర్చిల్ ను ఇప్పుడు అందరూ ‘’ప్రాఫెట్ ‘’ప్రవక్త అంటున్నారు .బాల్డ్విన్ స్థానం లో చాంబ ర్లేన్ ప్రధాని అవగానే ,65 ఏళ్ళ చర్చిల్ సమర్ధతకు తగినట్లుగా  నేవీ కి చీఫ్ చేసి’’ ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాల్టి ‘’పునరుద్ధరించాడు ,నావికారంగం లోని ప్రతి శాఖకూ ‘’Winston is back’’అని మెసేజ్ లు పంపించాడు .చర్చిల్ అంటే ఇంగ్లాండ్ గౌరవ చిహ్నమైన ‘’సింహపు ముఖం ‘’అని కీర్తించారు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే బ్రిటన్ రాజు చాంబ ర్లేన్ ను దిగిపొమ్మని చెప్పి చర్చిల్ ను కూటమి ప్రాభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు .10-5-1940న చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా మొదటి ప్రసంగం చేస్తూ బ్రిటిష్ ప్రజలకు ‘’మీకు  రక్తం చెమట ,శ్రమ ,కన్నీళ్లు తప్ప నేనేమీ ఇవ్వటం లేదు ‘’అన్నాడు ఉద్వేగం తో.

  సమర్ధ నైపుణ్యం ఉన్న చర్చిల్ తాను  ప్రజలతో ఏమన్నాడో తెలియని వాడు కాదు అందులోని అంతరార్ధం గ్రహించమని కోరాడు .తన సర్వ శక్తి యుక్తుల్నీ చాతుర్యాన్ని సాహస ధైర్యాలను ప్రదర్శించాడు .జర్మనీ తీర ప్రాంతాలపై దాడి చేయమని  సైన్యానికి ఆదేశాలిచ్చాడు .దీనికోసం సైన్యానికి ‘’ఆంఫీబియన్ టాంక్ ‘’-అంటే నీటిలో నేలమీదా నడిచే వాటిని ,వాటికి కావలసిన ఆయుధ సామగ్రిని ,ప్రయోగాత్మక లాండింగ్ క్రాఫ్ట్ ను అందించాడు .తుది సమరానికి ముందే  మిత్ర కూటమి ఫ్రాన్స్ పై దాడి చేసి దీనికోసం ఒక కృత్రిమ హార్బర్ ను నిర్మించింది ఇలాంటివి అవసరం ఉన్న చోటల్లా నిర్మించాలని వీటికి ఉక్కు కాకుండా కాంక్రీట్ వాడాలని సూచించాడు. అవి నీటిలో తేలుతూ కృత్రిమ దీవిలాగా కనిపిస్తాయి శత్రుభయం ఉన్నప్పుడు అవి నెమ్మదిగా నీటిలో మునిగి పోతాయి దీనివల ‘’టార్పేడో ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ఫ్ ఉన్న కృత్రిమ హార్బర్లు తయారయ్యాయి వీటినుంచి సబ్ మేరీన్లను విమానాలను పంపే వీలు,నాశనం చేసే అవకాశం  కలిగింది , ఇదంతా చర్చిల్ మేధో మధనం లో వచ్చినదే .బెల్జియం రాజు లిపోల్ద్ జర్మన్ లకు పాదాక్రాంతుడయ్యాడు .రష్యా ఫ్రాన్స్ ను పట్టుకోన్నది .ఈ సందర్భంగా చర్చిల్ కేబినేట్ మీటింగ్ లో ‘’మనం ఒంటరి వాళ్ళం అయ్యాం నేనొక్కడినే ఉన్నాను .కాని నాకు ఇది చాలా గగుర్పొడిచే సందర్భంగా ఉంది ‘’అన్నాడు జర్మనీ చిరకాల కోరిక బ్రిటన్ ను కబళించటం అని గుర్తు చేస్తూ ప్రజలకు ‘’మనం మన ఇంగ్లాండ్ దీవిని ప్రాణాలకు తెగించి కాపాడుకొందాం .బీచులమీద నిలబడి యుద్ధం చేద్దాం .యుద్ధ భూమిలో వీధుల్లో,కొండల్లో  పోరాటం సాగిద్దాం.అంతేకాని లొంగి పోవటం అనేది లేదు చావో రేవో తేల్చుకొందాం. సర్వస్వం ఒడ్డి పోరాడుదాం విజయమో వీర స్వర్గమో తేలుద్దాం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుదాం ‘’అని ప్రబోధించాడు ప్రజలను చేతనతో సమాయత్తం చేశాడు వాళ్ళ  గుండెల  నిండా దేశ భక్తీ ప్రవహింప జేశాడు .జన జాగృతి కలిగించి దేనికైనా సిద్ధం చేశాడు .’’Let us brace ourselves to our duties ,and so bear ourselves that ,if the British Empire  and common wealth last for a thousand years ,men will say ‘’this was their finest hour ‘’అని పిలుపునిచ్చి కర్తవ్యోన్ముఖులను చేశాడు చర్చిల్.

 

Inline image 3Inline image 4

           సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-16-ఉయ్యూరు  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వానం

hj2 001 hj 1 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -4

   చక్కని సమాసాలు ,పద గుంభన ,అలవోక గా వచ్చే వాక్ ప్రవాహం తో చర్చిల్ సభికుల్ని ఆకర్షించేవాడు .ఒక ఆలోచనాపరుడిగా వినేవాళ్ళ బుర్రల్ని కంగాళీ పెట్టేవాడు కాదు .ఒకే మూస భావజాలం తోప్రవాహ ఝరిగా మాట్లాడుతుంటే అది పాతదే అని పించేదికాడు .స్వీయంకాని వాటిని స్వీయం గా చేసుకొనే నైపుణ్యం ఆయనలో యెలా ఉండేదో ఆయన జీవిత చరిత్ర ‘’విన్ స్టన్ చర్చిల్ –ది ఎరా అండ్ ది మాన్ ‘’ రాసిన వర్జీనియా కౌలేస్ ‘’అతను  కార్య శూరుడేకాని ఆలోచనా పరుడు కాదు .ఉన్న విధానాలను ,విలువలను తనవే అన్నట్లు గా చెప్పే నేర్పు ఉన్నవాడు .విక్టోరియా కాలపు భావనలు పూర్తీ వికాసం పొందిన కాలం లో ఆయన చరిత్ర గడియారాన్నిశతాబ్దాల  వెనక్కి తిప్పగల మేధావి .గతకాలపు ,కాలదోషం పట్టి ,రంగు కోల్పోయి వెలిసిపోయిన   భావాలకు పట్టిన బూజు .ఆ బూజు దులపకుండా దాన్నే ప్రచారం చేసినవాడు చర్చిల్ .యూరప్ కు దూరం గాచిన్న సైన్యం కోసం ,సామ్రాజ్య వాదం కోసం ,పటిసస్ట ఆర్ధిక స్థిరత్వం కోసం ,స్వేచ్చా వాణిజ్యం కోసం ఆదాయం పన్ను పెంపుదల లేకుండా ఒంటరిగా  ఉన్నవాడు .ఇవన్నీ గతకాలపు భావ జాలం .కొత్త శతాబ్ది వచ్చే సరికి ఇవన్నీ నశించిపోతాయి ‘’అని రాసింది .

‘’ఊహ తెలిసిన నాటినుంచి నేను దేన్నీ నమ్మాలి అనుకొన్నానో దానినే నమ్మి ఆచరించాను ‘’అంటాడు చర్చిల్.తన రాజకీయం పూర్తీ గా కన్జర్వేటివ్ అయిన తండ్రి రాండాల్ఫ్ చర్చిల్ వద్ద నేర్చినదే అని ,ఆయన మెప్పించగల సామర్ధ్యమున్న వక్త ,రాజకీయ వేత్తఅనీ  అన్నాడు .ఆ పురాతన సంప్రదాయ వారసత్వమే తనకూ సంక్రమించిందని ,తన తాత మొదటి డ్యూక్ ఆఫ్ మరల్ బరో అని ,ఆయన గొప్ప మిలిటరీ కమాండర్ మాత్రమేకాక ‘’మాస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ‘’ అని పించుకోన్నాడని ,ఆయన వాడిన హాస్యపు పలుకులు తానూ వాడి తన ప్రసంగాలకు మిర్చీ మసాలా అద్దానని  చెప్పుకొన్నాడు .ఆయన ‘’he loves to see him work ‘’కు చెందినవాడని ,మిస్టర్ మాక్ డోనాలడ్ మాత్రం ‘’greatest living master of falling without hurting himself ‘’టైపు వాడని అన్నాడు .ప్రతి దానినీ వ్యతిరీకించటం చర్చిల్ స్వభావం అది తనకు మేలు చేస్స్తుందనే నమ్మకం ఉండేది ఆయనకు .ఆయన వ్యతిరేకులు మాత్రం చర్చిల్ పార్టీలో ఇమడలేనంత పెద్దవాడు అన్నారు ఆయన అనుకూలురు మాత్రం  అప్పుడెప్పుడో మన’’ బారువా’’అనే ఆయన ‘’ఇండియా ఈజ్ ఇందిరా ‘’అన్నట్లుగా ‘’వ్యక్తీ ముందు ,.పార్టీ తర్వాత ‘’అని కొమ్ము కాశారు .సడన్ గా టోరీ కన్జర్వేటివ్ లపై విరుచుకుపడ్డాడుచర్చిల్   బోయర్ లతో శాంతి ఒప్పందం కోసం  మరింతగా ముందుకు వెళ్లి  సభలో లిబరల్స్ వైపు మొగ్గాడు  .మూడేళ్ళ తర్వాత లిబరల్ పార్టీ తమ పార్టీలోని వ్యతిరేకుల్ని  ,1906 సాధారణ ఎన్నికలలోవదిలించుకొని ,చర్చిల్ కు ‘’అండర్ సెక్రెటరి ఫర్ ది కాలనీస్ ‘’పదవి కట్టబెట్టింది .

  లిబరల్స్ కన్జర్వేటివ్ లతో నిత్యం తలపడుతుంటే ‘’మహిళా వోటు హక్కు ‘’కేకలు చర్చిల్ కు చమట పట్టిస్తున్నాయి .ఇది గొప్ప ఉద్యమంగా మారి ప్రజా బలం పెరిగి చివరికి చర్చిల్ ను ఓడించేదాకా వచ్చింది .మరొక ‘’కౌంటీ ‘’లో లిబరల్స్ బలీయంగా ఉన్న చోటు నుంచి పోటీ చేసి గెలిచి  మళ్ళీ సభలో అడుగుపెట్టాడు .మళ్ళీ మంత్రి వర్గం లో బెర్త్ సంపాదించి ఈసారి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ కు ప్రెసిడెంట్ అయ్యాడు .పుష్కలంగా డబ్బు మూలుగుతోంది కనుక  పెళ్ళాడాలనేలనే ఆలోచనలో పడ్డాడు .1908 సెప్టెంబర్ లో సెయింట్ మార్గ రేట్ చర్చ్ లో  క్లిమే౦టైన్ హోజేర్ అనే అందగత్తె ను పెళ్లి చేసుకొన్నాడు .ఈ పెళ్లి పెద్ద రాజ లాంచనాలతో జరిగింది .36వ ఏట హోం సెక్రెటరి అయ్యాడు .ఏడాది తర్వాత ‘’ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాల్టి’’అయ్యాడు .ఆయన బాధ్యత చాలా క్లిష్టమైనది ముఖ్యమైనది ప్రమాద భరితమైంది  కూడా .అన్ని లోపాలకు ఆయన్నే లక్ష్యంగా చేసి మాట్లాడేవారు .ఇంగ్లాండ్ మూడు సమ్మెలు ఆరు నిరసనలతో అట్టుడికి పోతోంది .బయట ముంచుకొస్తున్న విపత్కర పరిస్తితులు పాలనకు చాలా ఇబ్బండులుగా మారాయి .సముద్రాంతర మార్కెట్ కోసం పోరాటం ఎక్కువైంది .ఆయుధ ప్రదర్శన , యూరప్ ను భయ పెడుతోంది .1914లో ఆంగ్లో –జర్మన్ సంబంధాలు బాగా క్షీణించాయి .ఇదంతా దారిలోకి రావాలంటే ఏదో ఒక రెచ్చ గొట్టే సంఘటన జరగాలి .28-6-1914న ఆస్ట్రియన్ డ్యూక్ సెర్బియన్ ఒక టెర్రరిస్ట్ సభ్యుడి చేతిలో హత్య చేయబడ్డాడు .జర్మని ఆస్ట్రియా ను సమర్ధించింది .రష్యా సెర్బియా వెనక నిలబడింది .ఫ్రాన్స్ కొంత ఊగిసలాడినా చివరికి రంగం లోకి దిగింది .జర్మన్ సైన్యం పారిస్ పై దాడి కోసం  బెల్జియంను  పై దాడి చేసి లోబరచుకోన్నది .జర్మన్ పై ఉన్న ద్వేషం తో ఇంగ్లాండ్ యుద్ధ  సన్నద్ధమవటం టో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది .

   మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభకాలం లో చర్చిల్ బ్రిటిష్ సామ్రాజ్యం లో అత్యంత శక్తి వంతమైన నాయకులలో ఒకడైనాడు .సమయానికి తగిన చురుకుదనం ,అవతలి వారిని ఒప్పించే నైపుణ్యం ,అవసరమైతే మొండిగా ఉండే నైజం ఉన్న చర్చిల్ పాత విధానం లో సాగే భూయుద్ధ వైఖరినే మార్చేశాడు .కొత్త ఆయుధాలు కనుగొనే అవకాశమిచ్చాడు ,మూస విధానం లోఉన్న యుద్ధ వ్యూహాలను  సమూలంగా మార్చేశాడు .తేలిక రకం యుద్ధ విమానాలు చాలా అవసరమని గుర్తించాడు .అప్పటికే జర్మని గాస్ టో నడిచే జెప్ప్లిన్ విమానాలను వాడుతూ ఆకాశాన్ని హస్తగతం చేసుకొన్నది .అప్పటి వరకు వాడుకలో ఉన్న ట్రెంచ్ లలో దాక్కొని చేసే యుద్ధం ఇక ఫలించదని తెలుసుకొని ‘’ఆయుధ కారు ‘’ను ఉపయోగించి ఫలితాలు పొందాలనే నిర్ణయానికొచ్చాడు .ఇదే తర్వాత యుద్ధ టాంక్ గా మార్పు పొందింది .ఇంతచేసినా ఒక్క ఎదాదిమాత్రమే అధికారం లో ఉన్నాడు .అవతలి వారి అభిప్రాయాలను కనీసం వినని ,పట్టించుకోని తత్త్వం తో శత్రువులను ఎక్కువగా  సృస్టించు కొన్నాడు  .యుద్ధం నత్త నడక నడుస్తోంది ఆంట్వెర్ప్, డార్డ్ నేల్లెస్ లలో అపజయాలను చర్చిల్ మెడకే చుట్టారు .యుద్ధం ప్రారంభమైన పది నెలల తర్వాత ఆయన ‘’ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మి రాలిటి’’పదవి ఊడిపోయింది .మరో అయిడుననెలలలో చర్చిల్ మంత్రి పదవికే ఎసరోచ్చింది .

 ‘’నా పని అయిపొయింది .కార్య రంగం నుంచి నన్ను తప్పించేశారు ‘’అని వాపోయాడు ఒక స్నేహితుడిదగ్గర .ఇంకా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడుగానే ఉన్నాడు. దేశ భక్తీ టో కూడిన ప్రతి పక్షం వాడిగా ఉన్నాడు .గాడి తప్పిన విధానాలను వ్యతిరేకించాడు .పని తక్కువ కనుక తనకు ఇష్ట మైన పెయింటింగ్ తో గడిపాడు .1916నాటికి డయానా ,రాండాల్ఫ్ , సారా అనే ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు ..క్రమంగా పదవీ సోపానాలు ఎక్కటం ప్రారంభించాడు .పాత ప్రభుత్వాలు పోయి కొత్తవి వస్తున్నప్పుడు చర్చిల్ మంత్రి అవుతూనే ఉన్నాడు .వ్యతిరేకత తారా స్తాయిలో ఉన్నా లాయడ్ జార్జ్ చర్చిల్ ను ఆయుధ సంపత్తి మంత్రిగా తీసుకొన్నాడు .యుద్ధ విరమణ తర్వాత మిలటరి పై అధికారం తో సహా  ఉన్న యుద్ధ మంత్రియ్యాడు .తర్వాత కలోనియల్ ఆఫీస్ కు బదిలీ అయ్యాడు .అప్పటికే బలహీనమై పోయిన లిబరల్ పార్టీని వదిలేసి ,లాబ రైట్స్ ను ఎదిరించి అతుకుల బొంత కూటమి  పార్టీ ఆలోచన చేసి ,అదీ గిట్టక టోరీల తీర్ధం పుచ్చుకొన్నాడు .1924లో కన్జర్వేటివ్ లు మళ్ళీ అధికారానికోచ్చారు .స్టాన్లీ బాల్ద్ విన్ ,చర్చిల్ ను ‘’చాన్సెలర్ ఆఫ్ ది ఎక్స్ చెకర్ ‘’ను చేశాడు .అంటే ‘’బొక్కసానికి కులపతి ‘ని చేశాడు .రాజకీయ గాలి యే వైపు వీస్తుందో తేలికగా పసి గట్ట గల ‘’వెదర్ కాక్’’చర్చిల్ .దిగే గడపా ,ఎక్కే గడప ఆయనకు బాగా అలవాటే ,అధికారానికి అది రాచ బాటే అయింది .ఈ నాటి పార్టీ ఫిరాయి౦పు లకు  ఆద్యుడు భజన్ లాల్ ,దేవీలాల్ మొదలైనవారికి ,’’ఆయారాం గయారాం ‘’లకు గురు తుల్యుడు చర్చిల్ అనిపిస్తాడు .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -3

   ఒక ఏడాది తర్వాత ఇండియా లోని ఆగ్నేయ ప్రాంతం లో పోరాటం సాగింది .యుద్ధ వార్తాప్రతినిదిగా ఉన్న చర్చిల్ ఇక గోళ్ళు గిల్లు కుంటూ కూర్చోరాదని అనుకోని తన పై అధికారులకు తనకు  యుద్ధం లో పాల్గొనే అవకాశమిచచ్చి పఠాన్ల తిరుగు బాటు ను  అణచి వేసే బాధ్యతనిమ్మని కోరాడు  .దీనిలో విజయం సాధించి తన వ్యాసాల  వలన చర్యలవలన పొగడ్తలు సాధించాడు ..దిస్టోరీ ఆఫ్ ది మాలకండ్ ఫీల్డ్ ఫోర్సెస్ ‘’అనే పుస్తకం లో ఈ యుద్ధ విశేషాలను రాశాడు .ఇరవై మూడేళ్ళ కె ఈ పుస్తకం అచ్చు అయి మంచి పేరు తెచ్చింది ,ఆర్ధికంగా బాగా లాభించింది .రాయల్టీ వర్షమే కురిసింది .సెకండ్ లెఫ్టినెంట్ అయి మాంచి హుషారులో ఉండి’’సవ్రోలా ‘’అనే నవలను ఫిక్షన్ ,కల, కలగా పులగం గా రాశాడు .తిరుగు బాటుకు వ్యతిరేకి చర్చిల్ .’’ఆయన బ్లడ్ లో సైనికుడే ఉన్నాడుకాని రచయితలేడు’’ అని పిస్తాడు .ఆంగ్లో ఈజిప్షియన్ సైన్యం డేర్విషేస్ సుల్తాన్ కు విమోచనం కలిగించే దుందుడుకు చర్యలు చేబట్టాలని ఆలోచిస్తున్నప్పుదు తానూప్రచారం లో భాగంయ్యాడు .పై అధికారుల్ని ఒప్పించటానికి కష్ట పడాల్సి వచ్చింది .కమాండర్ ఇన్ చీఫ్ సర్ హెర్బర్ట్ కిచేనర్ కు చర్చిల్ ను తీసుకొనే ఉద్దేశ్యం లేదు .అతని తల్లి వెనకాల ఉండి కద నడిపించింది .21వ లాన్సేర్ కు సూపర్ న్యూమరరి లెఫ్టినెంట్ అయి ,కరేస్పాన్డెంట్ గా స్థానం పదిల పరచుకొన్నాడు .

   సూడాన్ యుద్ధం చర్చిల్  డబల్  ఢమాకాగా   పోరాట యోధుడిగా ,రచయితగా ప్రసిద్ధి చెందాడు .ఆండర్మాన్ యుద్ధం లో లాంసర్ దళం అద్వితీయ పోరాట పటిమ చూపి అతని ప్రతిభ నాయకత్వం వలన గెలుపు లభించింది .దీనిపై రాసిన ‘’ది రివర్ వార్ ‘’పుస్తకం విమర్శకులకే కాక సాధారణ చదువరులను  కూడా  ఆకర్షించి ,చాలా పెద్ద ఖరీదైన పుస్తకం అయినా కొన్ని నెలలోనే పునర్ముద్రణ పొందటం విశేషం .24 ఏట ఇంగ్లాండ్  కు తిరిగి వెళ్లి ఈ  ‘’సోల్జర్ జర్నలిస్ట్ ‘’మళ్ళీ రాజకీయాలలో తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేశాడు .సరైన దిశా ఆలోచనలు లేని కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా ఉప ఎన్నికలో పోటీ చేశాడు .టోరీల ప్రాధాన్యత ,స్టాటస్కోవిధానం అంగీకరించాడు .’’టిటేస్ బిల్లు ‘’కు మద్దతుపలికాడు .అది జనాభిప్రాయానికి విరుద్ధంగా ఉందని తెలిసి ఉపసంహ రించాడు .హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు ఆర్ధర్ బాల్ఫోర్ ఈ ఫిరాయింపు చూసి ‘’ఈకుర్రాడు పనికోస్తాడను కొంటె వాగ్దానాల మోజులో పడ్డవాడిగా కనిపిస్తున్నాడు ‘’అని హేళన  చేశాడు .ఈ ఎన్నికలో చిత్తూ గా ఓడిపోయాడు చర్చిల్.తప్పు తెలుసుకొని చెంపలేసుకొని మళ్ళీ సోల్జరింగ్ అంటూ యుద్ధ వీరుడయ్యాడు .సుడి ఎక్కడో ఉండి ఆరు నెలల తర్వాత హీరో అయ్యాడు .

  దక్షిణాఫ్రికా చర్చిల్ కు పెద్ద దృశ్యమే అయింది .ఆరంజ్ ఫ్రీస్టేట్ లోని ట్రాన్స్ వాల్లోని బోయర్లు అనబడే  రైతులు ,ఆంగ్ల సంపన్నుల దాడి ని వ్యతిరేకించారు .అక్కడి బంగారు వజ్రాల గనుల ఖనిజ సంపద పై బ్రిటిష్ వాళ్ళ కళ్ళు పడి దోచుకొనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి చిన్న చిన్న స్వతంత్ర రిపబ్లిక్ లను ఏకం చేసి  ‘’శ్వేత చత్రం ‘’కిందకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నారు .ఇంగ్లాండ్ సైనిక దళాలు ట్రాన్స్ వాల్ సరిహద్దులో దిగగానే ప్రెసిడెంట్ పాల్ క్రూజర్ ఒక అల్టిమేటం జారీ చేయటం ,లండన్ యుద్ధం ప్రకటించటం చక చకా జరిగి పోయాయి .దక్షిణాఫ్రికా యుద్ధాన్ని బుజాన మోసిన టోరీ ఇ౦పీరియలిస్ట్ లపై  లిబరల్స్ ,రాడికల్స్ దాడి చేశారు .దీనితో తలబోప్పికట్టి పరువు బజారున పడిన ‘’ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం ‘’మూడేళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది .ఏదో రకంగా విజయం దక్కించుకొనే ఆలోచనలో ఆంగ్లప్రభుత్వం ఒక లక్షా ఇరవై వేలమంది బోయర్ మహిళలను,పిల్లలను ఒక కాన్సేంట్రేషన్  కాంప్ లో పెడితే అందులో 20వేల మంది సైనిక దౌర్జన్యానికి బలై చనిపోయారు .పరువు ప్రతిష్టలు పాతాళం లోకి జారిపోయినా ,చర్చిల్ పేరు మాత్రం బాగా ప్రచారమైంది . ‘’మార్నింగ్ పోస్ట్ ‘’పత్రికకుయుద్ధ ప్రతినిధిగా  దక్షిణాఫ్రికా వెళ్లి ,ఒక పాడైపోయిన యుద్ధ రైల్ లో ప్రయాణం చేసి ,తనే నాయకత్వం వహించి వెడుతుండగా రైలు పట్టాలు తప్పగా చర్చిల్ ను వల వేసి  పట్టి బందీని చేశారు .రెండు వారాల తర్వాత తప్పించుకొన్నాడు .ఆయనపై నిఘావేసి పట్టిస్తే పాతిక పౌండ్లు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ‘’నా విలువ పాతికేనా ‘’?అని గునిశాడు .అతని ఆచూకీ కోసం వేసిన పత్రాలలో ‘’25 ఏళ్ళ ఇంగ్లీష్ వాడు అయిదడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ,అందరికంటే భిన్నమైన శరీరం ,ముందుకు వంగి నడిచే నైజం ,పాలి పోయినట్లుండే ముఖం ,రాగి రంగు జుట్టు ,కనిపించీ కనిపించని మీసం, ముక్కు మాట ,’’ మాటల్లో ఎస్ ‘’అక్షరాన్ని పలకలేని తనం ఉన్నవాడు’’అని రాశారు . బ్రిటిష్ కాలనీకి అద్దేకారు లో కలప దుంగల కింద దూరి  పారి పోయి ఉంటాడని అనుమానించారు .చర్చిల్ రాసిన రిపోర్ట్ లను మిలిటరీ అధికారులు ఛీ కొట్టారు .అందులో చర్చిల్ బోయర్ ల సుపీరియారిటీ,గొప్పతనపు ప్రశంస తప్ప  తప్ప న్యూస్ ఏదీ లేదన్నారు .ఒక గ్రూపు బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్లు చర్చిల్ కు టెలిగ్రాం పంపుతూ ‘’నీ ముఖ్య స్నేహితులు ఇక్కడ నువ్వు మరింత గాడిద లాగా గుర్తి౦ప బడకుండా వెంటనే ఇంగ్లాండ్ తిరిగి రావాలని కోరుకొంటున్నారు ‘’అని వార్త పంపారు .పై అధికార్లు చీదరించినా తడబాటు పడలేదు .అతనిది ‘’పతాక శీర్హిక విజయం ‘’(హెడ్ లైన్ విక్టరి ).అదే అతనికి ఆనందం .నమ్రత గా  ఉండాలనుకొంటాడుకాని స్వీయ మౌనాన్ని భరించలేడు .ఏది ఏమైనా ఇరవై ఏళ్ళ నడి వయసులో చర్చిల్ ఇంగ్లాండ్ దేశ జాతీయ విగ్రహ మూర్తి (ఐడల్ )అనిపించుకొన్నాడు .

          మెప్పులూ మెహర్బానీలతో ఉన్న చర్చిల్ ఒల్ద్ హాం కు తిరిగొచ్చి ప్రజాసేవలో పడ్డాడు .దేశభక్తి విషయం లో మచ్చ లేని వాడని పించుకొన్నాడు కనుక రాజకీయ గెలుపు సమస్య కాలేదు .ఎన్నికల ముందే లెక్చర్ టూర్ టో లండన్ అంతా చుట్టేశాడు .దీనికి అయిదు వేల పౌండ్లు ,అమెరికా టూర్ లో మరొక పది వేల పౌండ్లు రాబడి వచ్చింది .అమెరికాలో చర్చిల్ ను ‘’5 యుద్ధాల వీరుడు ,6గ్రందాల రచయిత,ఇంగ్లాండ్ భావి ప్రధాని ‘’అని పొగిడారు .న్యు యార్క్ లో ప్రముఖ రచయిత మార్క్ ట్వేన్ ఒక సభలో చర్చిల్ ను పరిచయం చేస్తూ ‘’ఖచ్చితంగా పరిపూర్ణ (పెర్ఫెక్ట్ )వ్యక్తీ చర్చిల్ .అతని తండ్రి ఇంగ్లిష్ ,తల్లి అమెరికన్ ‘’అన్నాడు .అమెరికాలో ప్రసంగాలు ,పుస్తక పరిచయాలు పూర్తీ చేసు కొని ఇంగ్లాండ్ చేరే సరికి ‘’ఈ ఆంగ్ల దొర’’ చేతిలో లక్షణం గా ఒక లక్ష డాలర్లు పడ్డాయి .చర్చిల్ అదృష్టం తారాజువ్వ లాగా పైకి ఎగరటమే కాదు చాలా ఉన్నత స్థాయిలో నిలిచి,26వ ఏట నే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో స్థానం పొందాడు .

      సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి షష్ట్యబ్ది పూర్తి మహోత్సవం లో ఆవిష్కార మవుతున్న ”బుద్ధయానం ”లో నా రచన

బుధ జన హృదయ సభాపతి

 

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర  శాసన సభ  ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి కి  మే నెల 26న  60  ఏళ్ళు నిండు తున్నసందర్భం గా  మే నెల 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ”ష ష్ట్యబ్ది పూర్తీ ”మహోత్సవాన్ని కిన్నెర ఆర్ట్ అకాడెమి అధ్యక్ష కార్య దర్శులు  శ్రీ గంధం సుబ్బారావు శ్రీ మద్దాళి  రఘురాం గార్ల ఆధ్వర్యం లో ప్రచురించి ఆవిష్కరింప  జేస్తున్న  ”బుద్ధ యానం ”అభినందన సంచికకు నన్ను వ్యాసం రాసి పంపమని కోరగా రాసిన వ్యాసం -దుర్గా ప్రసాద్

విలక్షణ విశిష్ట వ్యక్తిత్వం

ఆయనదొక విచిత్ర చైతన్యం .తాను  పెద్దల వద్ద గ్రహించిన విషయ సారాన్ని జనసామాన్యానికి అందించాలన్న తపన ,ఆ పెద్దలను విశాల వేదికలపై సత్కరించి ఋణం తీర్చుకోవాలన్న ధ్యేయం .మంచి ఎక్కడున్నా సంగ్రహించి భావితరాలను ఉత్తేజితులను చేయాలన్న ఆలోచన ,పాతది తీసి పారేసేది, కొత్తది అమాంతంగా కౌగలించుకొనేది కాదన్న సమతుల్యత ,తరతరాల భారత జాతి అన్నిరంగాలలో సాధించిన ప్రగతి నవ నాగరకతా వ్యామోహం లో అధోగతి కాకూడదన్న ఆవేదన ,తెలుగు భాషాసాహిత్య  ,చరిత్ర ,సంస్కృతులను మనం కాపాడుకొంటూ ముందు తరాలవారికి అందిస్తూ సాగాలనే సత్సంకల్పం ,వెనుక పడి పోతున్న తెలుగును ,దాని వెలుగులను తెలుసుకోలేని ఆధునికులను గమనించి తెలుగు ను  శాస్త్రీయత సాంకేతికత లతో పరిపుష్టిచేసి ‘’ యూని కోడ్ ‘’లను సాది౦ప జేసి యువకులను ఆకర్షించాలన్న పట్టుదల  ,ఏ వేదికమీదైనా వీటి నే ప్రస్తావించి ,బుద్ధిజీవులను ,యవతను  ,సామాన్యులను ,మహిళలను చైతన్య వంతులను చేస్తున్న ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ నిజంగానే’’ బుధ జన హృదయ సభాపతి’’. .వ్యక్తిగా ,శాసన సభ్యునిగా ,అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ,మంత్రిగా ,ఉపసభా పతిగా ఏ హోదాలో ఉన్నా ఆయన తెలుగు భాష  సంస్కృతులకోసం ,భారతదేశ సమగ్రత కోసం అహరహం శ్రమిస్తున్న  అలసట ఎరుగని ఉత్సాహ శీలి .సాటి శాసన సభ్యులకు ,మంత్రులకూ ,రాజకీయ నాయకులకూ పట్టని ఈ విషయాలపై  జనానికి తన రుజు ప్రవర్తన శాంత స్వభావం ,భేషజం లేని వ్యక్తిత్వం ,కలుపుగోలుతనం ,అవగాహనా చాతుర్యాలతో,విజన్ తో  ప్రేరణ కలిగిస్తున్న ఏకైక విశిష్ట వ్యక్తీ ,మహా మనీషి ..

క్రియా కార్య శీలి

భాషా సాహిత్యాలతో పాటు మనదే అయిన సంగీత నాటక ,చిత్ర,శిల్ప , కళా రంగాలనూ  పరి పుష్టం చేసుకోవాలని ,వీటి అభివృద్ధికోసం మళ్ళీ ఎకాడమీలను పునరుద్ధ రించాలని నినదిస్తూ ,ప్రభుత్వానికి తెలియ బరుస్తూ జాగృతి కలిగిస్తూ  మాటలతో కాక చేతలతో చేసి చూపిస్తున్న చాతుర్యం శ్రీ బుద్ధ ప్రసాద్ ది.కూచి పూడి కళా కేంద్రాభి వృద్ధి ,హంసలదీవి పర్యాటకాభి వృద్ధి ,ఘంటసాల బౌద్ధ స్తూప పరిరక్షణ ,శ్రీకాకుళం లో శ్రీ కృష్ణ దేవరాయల ,కాసుల పురుషోత్తమ కవి ల విగ్రహ స్థాపన ,శ్రీ కృష్ణదేవ రాయ ఉత్సవాలు ,కృష్ణా మహోత్సవాలు, దివి సీమ ఉత్సవాలు ,బందరు కోట ప్రాచీన వైభవం ,కృష్ణా జిల్లా సర్వస్వం వంటివి ఆయన ఆలోచనా విధానికి ,కళా వికసన ప్రాభవ చైతన్యానికి నిదర్శనలు   .

చోదక ప్రేరక మార్గ దర్శి

తెలుగు భాషా సాహిత్యాలను తెలుగు దేశం లో కాపాడుకోవటానికి ,ప్రజా చైతన్యాన్ని కల్గి౦చటానికి భాషా సంఘాలతో కలిసి ఉద్యమించి తెలుగు కు ప్రాచీన హోదా సాధించి ప్రజా బలాన్ని ప్రభుత్వానికి తెలియ బరచినవారు శ్రీ ప్రసాద్ .మన రాష్ట్రం లోనే కాక భారత దేశం లో అనేక రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారు ఎదుర్కొంటున్న కష్టాలను ,అక్కడి ప్రభుత్వాలు తెలుగుకు చేస్తున్న చేటును గుర్తించటానికి ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ,అక్కడి ప్రభుత్వాలను కదిలించి ,తెలుగుకు ,తెలుగు ప్రజలకు మేలు చేయటం లో మార్గ దర్శి గా ఉన్నారు .ముఖ్యంగా తమిళనాడులోని హోసూరు ,తెలుగు వారికి ఒడిస్సాలోను ,మహారాష్ట్ర ,కన్నడ రాష్ట్రాల తెలుగు వారినీ ఇక్కడ జరిగే సభలకు ఆహ్వానించి ,వారి నోట వారెదుర్కొనే ఇబ్బందులను సమస్యలను  చెప్పించి ,మనవంతు సాయమందించే సంకల్పం తో వారికి ఊరట కల్పించటంలో  శ్రీ బుద్ధ ప్రసాద్ చూపించిన చొరవ నిరుపమానం .

సంస్కార మూర్తి

అమెరికా ,కెనడా ,మారిషస్ ,ఇంగ్లాండ్ ,మొదలైన దేశాలలో తెలుగు సభలలో పాల్గొని , వారితో మమేకమై ,వారు మన భాషా సాహిత్య సాంప్రదాయాలను పరిరక్షించుకొంటున్న తీరు చూసి ఉప్పొంగి పోయి అలాంటి చైతన్యం ఇక్కడ కూడా రావాలని ఉద్బోది౦చిన సాహసి శ్రీ బుద్ధ ప్రసాద్ .ఎవరో ఏదో అనుకొంటానే సందేహం, మొహమాటం లేకుండా మనం వెనకబడి పోతున్నామనే ఆవేదనతో ఆయన చేసే ప్రసంగాలు స్పూర్తిమంతాలై కర్తవ్య నిర్వహణకు మార్గ దర్శకాలయ్యాయి. ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .ఆయనకు మాత్రమే సాధ్యమైన విషయం కూడా .మాట్లాడే ప్రతిమాటలో సంస్కారం ఉట్టి పడి మనం ఏమిటో మనకు ఎరుక కలిగిస్తుంది .ఇంగ్లాండ్ లో తెలుగు సాహితీ సేవ చేస్తున్న జ్ఞాన వృద్దు శ్రీ గూటాల కృష్ణ మూర్తి గారి ని ,మలేషియాలో శ్రీ మదిని సోమినాయుడు ,ఫ్రాన్స్ కు చెందినా శ్రీ డేనియల్ నేగెర్స్ మొదలైన  భాషా సాంస్కృతిక సేవాపరాయణులనుకలిసి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జరిగిన జాతీయ ,ప్రపంచ తెలుగు రచయితల మహా సభలలో వారితో స్పూర్తి పూర్వక ప్రసంగాలు చేయించి ,ఆ సభలను  న భూతో గా నిర్వహించి  ప్రపంచ వ్యాప్త ప్రశంసలను అందుకొనేట్లు చేయటం లో ప్రధాన సారధి శ్రీ బుద్ధ ప్రసాద్ . ఊరికే వేదికలపై ఉపన్యాసాలిస్తే అనుకొన్నది సాధించలేమని ,అవన్నీ అక్షర బద్ధమై తరతరాలకు వెలుగుల నివ్వాలని ,’’ఆచూకీ పుస్తకాలు’’గా  ,కరదీపికలుగా నిలిచిపోవాలని భావించి ‘’తెలుగు పసిడి’’,వజ్ర భారతి ‘’కృష్ణా జిల్లా సర్వస్వం ‘’తెలుగు భారతి ,’’మణిదీపాలు’’ వంటి అత్యుత్తమ గ్రంధ ప్రచురణ చేయించిన క్రాంత దర్శి . ,అధికారం లో ఉన్నా లేకున్నా ప్రభుత్వాన్ని ఒప్పించి వారి సహాయ సహకారాలు అందేట్లు చేసి సభలను దిగ్విజయం చేయించిన ఘనత శ్రీ బుద్ధ ప్రసాద్ గారిదే.ఈ విజయాలలో భాగస్వామ్యులు కృష్ణా జిల్లా రచయితల సంఘ అధ్యక్ష కార్య దర్శులైన శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,డా జి వి .పూర్ణ చంద్, శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్  లు  అనటం లో సందేహం లేదు .అంతటి దార్శనికులు  శ్రీ బుద్ధ ప్రసాద్ .ప్రభుత్వ సంస్థలలో ,న్యాయ స్థానాలలో తెలుగును వాడటం పై దీక్షగా కృషి చేసి విజయం సాధించారు .సమస్య మూలాలను తరచి పరిష్కరించే నేర్పున్నవారాయన .

సుజన జన మనో రంజనం

కృష్ణా జిల్లాలోను ,ఇతర జిల్లాలోను ,రాష్ట్ర రాష్ట్రేతర౦గాను ఉన్న సాహిత్య  సాంస్కృతిక సంస్థలతో ,అక్కడి కవులు రచయితలు ,పురాతత్వ వేత్తలు ,చిత్రకారులు ,నటులు ,సంగీతజ్ఞులు, విమర్శక విశ్లేషకులతో, ప్రయోగ శీలుర తో నిత్యం సంబంధాలను కలిగి వారి సభలలో పాల్గొని ,పుస్తకావిష్కరణలు ఇబ్బడి ముబ్బడిగా చేసి యువతను ప్రోత్సహించి , బుద్ధిజీవులను సత్కరిస్తూ ,అన్ని సాహిత్య ప్రక్రియలకూ చేయూత నిస్తూ’’  భువన విజయ రాయలు’’ గా ప్రేరణనిస్తూ నిత్య చైతన్య శీలిగా ,నిర్విరామ భాషా సాహిత్య కళా రాధక సేవకునిగా,తండ్రి  స్వర్గీయ శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి వారసునిగా జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు.

సరసభారతి తో సాన్నిహిత్యం

శ్రీ బుద్ధ ప్రసాద్ గారితో నాకు ౩౦ఏళ్ళుగా పరిచయం ఉంది .ఆయనంటే నాకు గొప్ప అభిమానం .రాజకీయ నాయకులు అందరూ ఆయనలాగా ఉంటే, ఆలోచిస్తే ,నడిస్తే యెంత బాగుంటుంది అనిపిస్తుంది .కృష్ణా జిల్లా ఉయ్యూరులో నా ఆధ్వర్యం లో సరసభారతి అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆరేళ్ళక్రితం ఏర్పడి 20గ్రంధాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 13పుస్తకాలున్నాయి .సరస భారతి నిర్వహించే ఉగాది వేడుకలకు ,భాషా సదస్సులకు ,పుస్తకావిష్కరణలకు ,కదా సదస్సు ,గురజాడ ,రవీంద్రుల 150వ జయంతి ఉత్సవాలకు  శ్రీ ప్రసాద్ విచ్చేసి నిండుదనం తెచ్చి చైతన్య స్పూర్తి కలిగి౦చారు  .కనిపించగానే నమస్కరిస్తూ  ‘’దుర్గా ప్రసాద్ గారూ బాగున్నారా ?’’అంటూ ఆప్యాయంగా పలుకరించే సంస్కారం ఆయనది .ఏ పదవిలో ఉన్నా ఈ తీరులో మార్పు లేదు .సభలలో అధికార దర్జా డాబూ దర్పాలూ ప్రదర్శించని అతి వినయ శీలి .సౌజన్య మూర్తి .

ప్రతిభా  పురస్కారాలు

శ్రీ బుద్ధ ప్రసాద్ .రాష్ట్ర ,రాష్ట్రేతరాలలో తెలుగు భాషా సంస్కృతులకు విశేష సేవ లందిస్తున్నఉత్తమ  సంస్థను నిష్పక్ష పాతంగా ఎంపిక చేసి తమ తండ్రిగారి జయంతి ఆగస్ట్ 4న’’మండలి వెంకట కృష్ణారావు ‘’స్మారక పురస్కారాన్ని    స్వంత ఖర్చులతో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ద్వారా ను ,  తెలుగు భాషా  సేవ చేస్తున్న  విశిష్ట వ్యక్తికి ,కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారానూ  తమ తండ్రిగారి పేర నగదు పురస్కారాన్ని అందజేస్తూ అందరికి ఆదర్శ ప్రాయ౦గా  ఉన్నారు .’’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ ‘’అంటే ‘’ప్రతిభా నవనీతం’’ ఎక్కడున్నా గుర్తించి వారి సేవలను సభాముఖంగా అందరికీ తెలియజేసి ప్రేరణ కలిగించటం ఆయనకే సాధ్యం .ఇక్కడ కుల మత జాతి,ప్రాంత సంకుచిత భావాలకు తావే లేదు .ప్రతిభకే పట్టాభిషేకం .ఇది అందరికి సాధ్యంకాని విషయం . ఆయనకే సాధ్యమై ,చిర యశస్సుకు కారణమైంది .అందుకే ఆయన విశ్వ మానవడు .’’ఉదార చరితానాం వసుధైక కుటుంబకం ‘’అన్నది ఆయన పట్ల సార్ధక మైనది  .

అభినవ కృష్ణ రాయలు

తెలుగు సాహిత్యం లో శ్రీ బుద్ధ ప్రసాద్ చదవని గ్రంధం లేదేమో ?అనుక్షణ పఠనం ఆయన కిష్టం..చదివింది మనసు పొరల్లో ముద్ర పడి ఉండటం ఆయన ప్రత్యేకత .The book is one which will serve to open the eyes  even of  those who are blind to the sufferings of those around them ‘’అని జస్టిస్ శ్రీ అల్లాడి కుప్పుస్వామి రావూరి భరద్వాజ గారి ‘’జీవన సమరం ‘’పై రాసింది ఆచరణీయం చేశారు ..చదవటం, చదివించటం తో పాటు గొప్ప రచనలూ చేశారు. భాషా సంస్కృతులపైనా ,తన విదేశే యాత్రానుభవాలపైనా పుస్తకాలు రాసి  ప్రచురించి  సమకాలీనులకు ,భావితరాలకు ఉత్తేజం కలిగించారు .లెక్కలేనన్ని గ్రంధాలనుఅభిమానంతో  అంకితం పొందిన ‘’అభినవ కృష్ణ రాయలు’’ శ్రీ బుద్ధ ప్రసాద్ .వేలాది విలువైన గ్రంధాలను కొని ,సేకరించి స్వంత  గ్రంధాలయం లో  భద్రపరచిన పుస్తక ప్రియులాయన .

మూర్తిమత్వం

ప్రశాంత వదనం , చెదరని నవ్వు  , ఆయన ఆంతర్యం లాగా నే తెల్లని స్వచ్చమైన ఖాదీ వస్త్ర ధారణ, ,సాంప్రదాయక నడవడి ,ప్రాచీన అర్వాచీన సాహిత్యం పై సరి సమాన ఆదరణ ,ధార్మిక జీవనం ,ఆధ్యాత్మిక ఉన్నతి ,రుజు ప్రవర్తనం ,సాంఘిక సేవ ,బహుజన హితాయచ బహుజన సుఖాయచ అన్న ఆదర్శం,అట్టడుగు వర్గాలతో సహా సమాజం లోని అన్ని వర్గాల అభి వృద్ధి కోసం శ్రమించే నిండైన విశాల హృదయం  , మచ్చలేని నిజాయితీ ,విలువల తో కూడిన ప్రవర్తన,సౌజన్యం, స్నేహశీలత ,నిష్కళంక నిరాడంబర జీవితం వలన అందరకు శ్రీ బుద్ధ ప్రసాద్  దగ్గరయ్యారు .ఆయనతో మాట్లాడటం అంటే ఒక విజ్ఞాన సర్వస్వం లోకి ప్రవేశించటమే .మాట్లాడిన తర్వాత ఆ ప్రభావం గాఢంగా మనసుపై పడి ప్రచోదనం చేస్తుంది . ‘’ముఖం లో తేజస్సు ,హృదయం లో ఉత్సాహం ,నిరంతర కార్య తత్పరత సత్వ గుణ లక్షణం ‘’అన్నారు  స్వామివివేకానంద  .అలాంటి సత్వ గుణ సంపన్నులు శ్రీ బుద్ధ ప్రసాద్ .

మానవీయతకు ఎత్తిన పతాక

’’సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపి వేస్తున్నాను చూడు –అకుంఠిత మైన మానవీయ పతాకను ఎగుర వేస్తున్నాను చూడు ‘’అన్నఅనుభూతి కవి ‘’ తిలక్ ‘’మాటలకు ఆచరణ రూపం కావటం వలననే  శ్రీ బుద్ధప్రసాద్ ను  పదవులు వరించాయి .ఆయనవలననే ఆ పదవులు సార్ధకమై అలంకారం ,గౌరవం పొందాయి. ‘’క్రుణ్వంతు విశ్వం ఆర్యం ‘’-ఈ విశ్వాన్ని ఆర్య మయంగా అంటే సత్పురుషులుగా చేస్తాము ‘’అన్నది ఋగ్వేదం  .అలాంటి  ఆదర్శ పురుషుడు  శ్రీ బుద్ధ ప్రసాద్ .బుద్ధ భగవానుడు కూడా ‘’సమాధిః ఆర్యాణా౦ ధ్వజా –ప్రజ్ఞా ఆర్యాణా౦ ధ్వజా –ముక్తిం ఆర్యాణాం ధ్వజా ‘’అని సర్వమానవ సమత్వాన్ని సమాదరించాడు .అదే ఈ ‘’బుద్ధుని’’ పద్ధతి కూడా .

మూలాల విలువల పరిరక్షణం

పాశ్చాత్య వ్యామోహం పనికి రాదనీ, పక్షి యెంత దూరం సముద్రం పై  ప్రయాణం చేసినా చివరికి తన గూటికే చేరుతుందని కవిసామ్రాట్ విశ్వనాధ చెప్పిన విషయాన్ని పదే పదే గుర్తుచేస్తారు శ్రీ బుద్ధ ప్రసాద్ .మన భాషా చరిత్ర సంస్కృతులను పరి పోషించుకొంటూ యువత ముందుకు సాగాలని ఆయన ఉద్బోధ . మన ఉపనిషత్తులు పారమార్ధిక హిమాలయాలని ,మన సంస్కృతిని పోషించే పావనోదకాలని చెప్పిన పండిట్ నెహ్రూ వాక్కులను మర్చి పోరాదని  మరచిపోతే భారత దేశం భారత దేశం అనిపించుకోదని చేసిన హెచ్చరిక ను అనుసరించి, ఆచరింప జేస్తారు  .’’Western civilization makes for material progress but Indian civilization makes for spiritual understanding‘’అన్న విషయం నరనరాల్లో ఉండాలని కోరుకొంటారు .ప్రాచీన సంప్రదాయం ,పారమార్ధక దృక్పధం ,ఆధునిక శాస్త్ర సాంకేతిక సగుణ ఫలితాలు మానవ భవితకు పునాదులు అని ఆయన నమ్మారు .అలానే ఆచరిస్తున్నారు .పూర్వ సాహిత్యం పైనా ఆకవుల,రచయితల  పైనా ఆరాధనా భావం తో పాటు నవీన సాహిత్య సృజనపైనా అపారమైన ఆపేక్ష ఉన్నవారు .మొదటిదాని భూమికపై రెండవది వృద్ధి చెందాలని కోరుకొంటారు శ్రీ బుద్ధ ప్రసాద్ .

ప్రబుద్ధ చేతుడు

సమకాలీన సమాజం లో శ్రీ బుద్ధ ప్రసాద్’’ ను ప్రబుద్ద చేతుడు’’ అంటే బుద్ధివైభవాన్నితెలుసుకోనేవారికి బుద్ధిని ప్రదానం చేసేవాడు అన వచ్చు . .అందుకే సాహిత్య శిఖరారోహణం చేసినవారు ,సంఘం లో అధికారం లోనూ ,విశిష్ట పదవులలోను ఉత్కృష్ట స్థానాలలో ఉన్నవారు, యువకులు  అందరూ శ్రీ బుద్ధప్రసాద్ కు ఆత్మీయులే . ఆయన వలన  ప్రేరణ పొంది ,తమ సామాజిక బాధ్యతను గుర్తించి నడిచేవారే . వారందరి మధ్య సాహిత్య,సంగీత సామాజిక ,కళా విద్యా ,శాస్త్ర సాంకేతిక విషయాలు చర్చిస్తూ దిశా నిర్దేశం చేస్తూ ,స్పూర్తి , ప్రేరణ నిచ్చే ఉదాత్త పురుషుడు శ్రీ బుద్ధ ప్రసాద్ .ఎవరు చెప్పినా ఓపికగా విని అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టటం ఆయన కిష్టం .గొప్ప ప్రజాస్వామ్య వాది.గాంధేయ విధానం లో,అహింసా మార్గం లో  ప్రగతి సాధించాలన్న ధ్యేయం ఉన్నవారు . . అజాత శత్రువు. అందరివాడు .అందలాలకు అర్హమైన వాడు .

మహత్తర కానుక

‘’ధర్మ రక్షణ ప్రేమ తత్వాల నెరిగించు –పోతనాది సుకవి పు౦గవులను

స్వర యుత గాన మొసగు త్యాగ రాజాది –లలిత సంగీత కళా నిధులను

బండ రాళ్ళకు ఉలిన్ ప్రాణంబు పోసిన –శేముషీ ధనులైన శిల్ప వరుల

అవని పేర్గన్న నాట్యాచార్య వరులైన –కూచి పూడిని నృత్య కోవిదులను

హస్త కళలందు నిష్ణాతు లైన వారి –ఆంధ్రమన్న పూర్ణగ జేయునట్టి వారి

దేశ సేవా దురంధరుల్ ధీనిధులను –కన్న తెల్గు తల్లికి నమస్కార శతము ‘’

అన్న ఆంద్ర కవి వాక్కు అమోఘం .అలాంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డడు ,’’దివిసీమ రాయలు’’ ,సేవా తత్పరులు ,విద్యా వినయ సంపన్నులు ,,అనునిత్య సరస్వతీ సమార్చకులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి   సార్ధక జీవనం తో అరవై ఏళ్ళు నిండిన సందర్భంగా కిన్నెర ఆర్ట్  అకాడెమిఅధ్యక్ష ,కార్య దర్శులు  శ్రీ గంధం సుబ్బారావు ,శ్రీ మద్దాళి రఘురాం  గార్ల ఆధ్వర్యం లో  ‘’షబ్యబ్దిపూర్తి అభినందన గ్రంధం ‘’ప్రచురి౦చి బహూకరించటం అభినందనీయం .ఎక్కడెక్కడ ఉన్నా తెలుగు వారందరికీ  గర్వకారణం , అత్యంత సంతోష దాయకం .తెలుగు సరస్వతికి అమూల్యాభరణం . మహత్తర కానుక .ఆయురారోగ్యాలతో  మరింత ఉన్నత పదవులలో రాణిస్తూ,ప్రజా సేవలో తరిస్తూ ,తెలుగుచరిత్ర , భాషా సాహిత్య,  సంస్కృతులకు ఇతోధిక సేవ చేసేలా   శతాధిక ఆయుస్సును   ఆ భగవంతుడు శ్రీ బుద్ధ ప్రసాద్ గారికి   ప్రసాదించాలని మనసారా కోరుకొంటున్నాను .

గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-16-ఉయ్యూరు

అధ్యక్షులు –సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –

శివాలయం వీధి –ఉయ్యూరు –కృష్ణా జిల్లా -521165

సెల్ –    9989066375

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -2

  క్లాసిక్స్ అంటే యెంత అయిస్టమో చర్చిల్ కు ఆటలన్నా అంతే..ఫుట్బాల్,క్రికెట్ మాచ్ లవైపు కన్నెత్తి అయినా చూసి ఎరగడు .ఖర్మకాలి చూసినా ఆటగాళ్లను నవ్వుతో పలకరించటం అనేది అతని నిఘంటువులోలేదు..అయితే ఫెన్సింగ్ పోటీలంటే అమితాసక్తి .17వ ఏటనే ఇందులో ప్రైజ్ కొట్టేశాడు .మరుసటి ఏడాది మనవాడి చదువు నిర్వాకం స్కూల్ కు ఎగనామం ,పంతుళ్ళ  కు పంగనామం బాగోతం చూసి,ఒక పాడుబడిన ఇంటిని బీర్ బాటిల్ లో గన్ పౌడర్ దట్టించి పేల్చి వేసే సంఘటనలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు కొంచెం లో ప్రాణాపాయం నుండి తప్పించుకోవటం తెలిసి , తండ్రి కొడుక్కి ఈ చదువు అచ్చిరాదని గ్రహించి  ‘’ సాండ్  హర్స్ట్మి మిలిటరీ స్కూల్ లో చేర్పించాడు చర్చిల్ ను .కుర్రాడికి అక్కడికెళ్ళి చదవటం మోజుగా ఉంది .కాని అందులో ప్రవేశానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది .ఎంట్రన్స్ పరీక్షలో రెండు సార్లు డింకీ కొట్టాడు .మూడో సారి ఒక  స్పెషలిస్ట్  చెప్పినట్లు అన్నీ బట్టీ పట్టి ఎట్లాగో అట్లా ముక్కి గట్టేక్కాడు .మనవాడి అత్తిసరు మర్కులకంటే తక్కువ వచ్చిన మార్కులకుతండ్రి తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకొన్న క్రాక్ రెజిమెంట్ లో చేర్చుకోకుండా రోత పుట్టించే ఆశ్విక దళం లో చేర్చుకొన్నారు .కాని ఈ కావల్రి లో సంపన్న కుటుంబ యువకులకు ,విద్యలో పెద్దగా రాణించని ,తెలివితేటలూ తక్కువగా ఉన్న వారి నే చేర్చుకొంటారు .ఇదీ ఒక అదృష్టమే అయింది .గుర్రపు స్వారినే నడకకంటే ఎక్కువగా ఇష్టపడే వాడు .

            సాండ్ హర్స్ట్ స్కూల్ చర్చిల్ జీవితాన్నిగోప్ప మలుపు తిప్పింది .అతని అల్లరి చిలిపితనం దు౦దుడుకు స్వభావాలకు కళ్ళెం వేసి అతన్ని ప్రయోజకుడిని చేసింది .యుద్ధరంగం గురించి నేర్చే విద్యకోసం అప్ప్లై చేశాడు .మాప్ లను తయారు చేయటం పరిశీలించటం ,యుద్ధ వ్యూహ ప్రతి వ్యూహాలు ,పరిపాలన ,సైనిక చట్టాలు అన్నీ నేర్చాడు .ప్రజా వ్యవహారాలనూ క్షుణ్ణంగా అభ్యసించాడు .చర్చిల్ మేనత్త  గారిసన్ కు కుడి భుజమైన లార్డ్ ట్వీడ్ మౌత్ ను పెళ్లి చేసు కోన్నది .హోం రూల్ గురించి డిన్నర్ టేబుల్ దగ్గర లిబరల్స్ మాట్లాడుకొనే మాటలు ,హౌస్ ఆఫ్ కామన్స్ లో కన్జర్వేటివ్ ల సంభాషణలు విని అర్ధం చేసుకొన్నాడు 19వయట స్కూల్ లో చివరి టేరంలో లండన్ లో మిసెస్ ఆర్మిస్టన్ చాంట్ ,ఆమె బృందం చేబట్టిన ప్రొహిబిషన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి  రాచాకీయ ఆరం గేట్రం చేశాడు . చర్చిల్ వాగ్ధాటికి మురిసిపోయి  ,నిరసనకారుల చేతుల్లోని  ‘’ప్లేకార్డ్ ‘’లను అనుచరులు చి౦చిపారేశారు .పాపం నిరసనకారులు నీరుకారి  జావగారి జారిపోయారు  .ఈ సంఘటన చర్చిల్ లో  నిగూధంగా దాగి ఉన్న శక్తిని బహిర్గతమ్ చేసింది. చర్చిల్ కు ఎస్ పలకటం సరిగ్గా వచ్చేదికాదు .కాని అతని ‘’ఐ మస్ట్ సే ‘’,’’ఐ  గ్లాడ్ టు సీ ‘’అనే మాటలు మంత్రాలై అతన్నిఆకాలం లో  ఒక గొప్ప వక్తగా మార్చేశాయి .       

    ఇరవై ఏళ్ళ ఈ రాగి జుట్టు భరోసా ,స్వీయ స్వాధీన   నవ్వు ముఖపు యువకుడు  సాండ్ హర్స్ట్ చదువుకు తగిన ప్రతిఫలంగా ‘’క్వీన్స్ కమిషన్ ‘’పొందాడు .ఈ గుర్తింపు చూసి ఆనందించే అదృష్టం తండ్రికి దక్కలేదు  .ఉన్న ఎస్టేట్ చాలా విశాల మైంది  .అమ్మి అప్పులు తీర్చేసరికి తలప్రాణం తోకకు వచ్చి ఈ కుర్ర కావల్రి ఆఫీసర్ కు రెండు వేళ్ళూ నోటిలోకి వెళ్ళటమే కష్టమై పోయింది . గుర్రం మాట దేవుడెరుగు .అయితే అనుకోకుండా సంవత్సరానికి అయిదువందల పౌండ్ ల భత్యాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది ఇది గుడ్డిలో మెల్ల .తన తోటి ఆఫీసర్ల జీతం కంటే తక్కువే అయినా ఖర్చులు తక్కువే అవటం ఏడాదికి అయిదు నెలలు సెలవు లభించటం ఊరట కల్గించాయి .

   ఖాళీగా కూర్చోటం కత్తికి తుప్పపట్టకుండా చేయటం   అలవర్చుకొన్నాడు   .అన్నీ పరిశీలించేవాడు .యుద్ధం ఎక్కడ ఉందా అని వెతుక్కునేవాడు .అది క్యూబా లో కనిపించింది .అక్కడ గెరిల్లా యుద్ధాలు వీధి పోరాటాలు .అతని కోరిక తీరటానికా అన్నట్లు ‘డైలీ గ్రాఫిక్ ‘’అనే పత్రిక చర్చిల్ ను యుద్ధ విలేకరిగా క్యూబాకు పంపింది ,స్పానిష్ అధికారులు చర్చిల్ను అతనితో వచ్చిన హసార్ ను బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులుగా భావించి బాగా మర్యాద చేశారు .తాగినంత రం,కోరినన్ని చుట్టలు ,స్వారీకి గుర్రాలు ,వెనక ఎస్కార్ట్ ,సంప్రదాయ బాప్టిజం ఫైర్ తో స్వాగత సత్కారాలు చేశారు .కొద్దివారాలు అక్కడ గడపగానే దోమకాటు  వలన మలేరియా చిహ్నాలు కనిపించాయి .వెంటనే స్నేహితుడితో సహా ఇంగ్లాండ్ చేరేసరికి ఇద్దరికీ ఇండియాలో పని చేయటానికి ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి .

  చర్చిల్ బెంగుళూరు లో తన రెజిమెంట్ టో దిగేసరికి అతని వయసు 22.పెద్దగా భారం లేని పనే .పెద్ద బంగాళా లో నివాసం .అతనితో పాటు ముగ్గురు ఆఫీసర్లు .ఉదయం పూట డ్రిల్లు .మధ్యాహ్నం అంతా పడి నిద్రపోవటం సాయంత్రం అయిదింటి దాకా .అప్పుడు పోలో ఆట .ఇలా లేజీ గా గడపటం ఇష్టం లేక ఇంగ్లాండ్ నుండి పుస్తకాలు పంపమని కోరాడు .ఇదివరకు సాహస గాదలంటే ఇష్టం గా ఉండేది .ఇప్పుడు ప్లేటో రాసిన రిపబ్లిక్ ,మెకాలే రాసిన హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ ,గిబ్బన్ రచన డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ లు బాగా అభిరుచికలిగించాయి .ఇవేవో కాలక్షేపానికేకాని అతని శారీరక మానసిక శక్తులకు తగిన పని లేదనిపించి విసుగొచ్చింది .కాని మెకాలే ,గిబ్బన్ ల రచనలు అతను భావి మహా వక్త కావటానికి బాగా సహకరించాయి .

Inline image 1Inline image 2

      సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-16-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేపు 24-5-16 మంగళవారం ”సోదర దినోత్సవం” -బ్రదర్స్ డే”

సాహితీ బంధువులకు శుభకామనలు -రేపు 24-5-16 మంగళవారం ”సోదర దినోత్సవం” -బ్రదర్స్  డే”

సందర్భంగా శ్రీ దుర్ముఖి ఉగాదికి సరసభారతి నిర్వహించిన ”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకల వ్రాత ప్రతిని ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లోస్వామివార్ల సమక్షం లో  రాత్రి 7గంటలకు ,ఈ పుస్తకానికి స్పాన్సర్ అయిన శ్రీమతి సీతం రాజు మల్లిక గారి చేత ఆవిష్కరింప జేస్తున్నాము అసలు  పుస్తకం జూన్ నెలలో ప్రచురణ పొంది ఆవిష్కరణ జరుగుతుంది -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్

  79వ పుట్టిన రోజున తాను  రాసిన ఆరు భాగాల’’రెండవ ప్రపంచ యుద్ధం ‘’ జ్ఞాపకాలలో చివరిభాగాన్ని ప్రచురించి విడుదల చేసినవాడు ఇంగ్లాండ్ ప్రధాని సర్ విన్ స్టన్ లెనార్డ్ స్పెన్సర్ చర్చిల్ .అప్పటికే 30కి పైగా ఇతర పుస్తకాలు రాసిన రాజకీయ దురంధరుడు ,పెయింటర్ ,రచయితచర్చిల్.ఇవి ఏదో ఆషామాషీగా ,సంక్షిప్తంగా రాసినవి కావు .తన పూర్వీకుడు మార్ల్ బరో పై ఆయన జీవితం కాలం అనే పేరుతొ నాలుగు బృహద్గ్రందాలు రాశాడు .తండ్రి లార్డ్ రాండాల్ఫ్ చర్చిల్ పై రెండు ,,తన యుద్ధ ప్రసంగాలను ఏర్చి కూర్చి ఆరుభాగాలుగా రాశాడు .ఫిక్షన్ ను ఏమీ వదిలిపెట్టలేదు .’’సవ్రోలా ,ఎ టేల్ ఆఫ్ రివల్యూషన్ ఇన్ లారేనియా ‘’అనే కాల్పనిక సాహిత్యమూ రాశాడు .సైనికుడు జర్నలిస్ట్ ,చరిత్రకారుడు,రాజకీయ నాయకుడు ,మహా వక్త ,రాజకీయ దురంధరుడు అయిన చర్చిల్ కు గ్రంధ కర్తృత్వం జీవితం లో ఒక భాగమైపోయింది .అయిదుగురు చక్రవర్తుల వద్ద  పని చేసిన అనుభవం ఆయనది .ఆయనను ఎంతగా ఆరాధించారో అంతగా తిట్టారు .హౌస్ ఆఫ్ కామన్స్ లో అతనంటే చిరాకు ఏహ్య భావం ఉండేవి .అయితేనేం జనం చేత  పిచ్చ పిచ్చగా మోజు పడి ఆరాధింప బడిన నాయకుడాయన  .ఆ శతాబ్దపు అత్యంత  ‘’బహురూప మూర్తి  ‘’(ప్రోటియన్ ఫిగర్ )అని పించుకోన్నవాడు .

     30-11-1874 న లండన్ లోని బ్లెన్ హీం పాలస్ లో లార్డ్ రాండాల్ఫ్ చర్చిల్ కు మూడవ కొడుకుగా పుట్టాడు .వీరిది మార్ల్ బరో వంశం .ఈ వంశాని కే రాణి అన్నే వుడ్ స్టాక్ క్రౌన్ ప్రాపర్టి ని,వారిలో బ్లెన్ హీం లో అత్యంత సుందర విలాస భవనం నిర్మించిన ఆర్కిటెక్ట్ జాన్ వాన్ బ్రా కు  అప్పగించింది .తల్లి జెన్నీ జెరోం అమెరికా దేశీయురాలు ,న్యూయార్క్ వాసి ..అత్యంత సంపన్నురాలు ,బహు దొడ్డ అందగత్తె .నెలలు రాకముందే పుట్టటం ,పుట్టిన దగ్గర్నుంచి మన ‘’జగన్ ‘’లాగాపదవి కోసం తొందర పడటం చూసి స్నేహితులు చర్చిల్ ను ‘’య౦గ్ మాన్ ఇన్ హర్రి ‘’అనేవాళ్ళు .అంటే దుందుడుకు కుర్రాడు అని అనచ్చు .తర్వాత ‘’దూకుడు గాడు ‘’అన్నారు .చిన్నప్పటి నుంచి కయ్యానికి కాలు దువ్వేరకం .అధికారాన్ని ధిక్కరించేవాడు .నర్సుల్ని విసిగించేవాడు .ట్యూటర్లను ఆట పట్టించేవాడు .చర్చిల్ జీవిత చారిత్ర రాసిన లేవిస్ టేలర్ ‘’కొంతవరకు కంచర గాడిద తల ,మండే నిప్పు పొగరు ,పొట్టి ,యెర్ర జుట్టు ,ముఖంపై చిన్న చిన్న మచ్చలు ,కొద్దిగా కుక్కపిల్ల ముక్కు ,లాంతరురు స్తంభం లా యే భావం కనిపించని మూతి ,నీలి కాంతి వంతమైన కళ్ళు ,వాటిలో కొట్టోచ్చేట్లు కనిపించే అసహనం ‘’అని చర్చిల్ రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణన చేశాడు ‘’.మొరటడు’’గా  చిన్నప్పుడేకాడు పెద్దప్పుడూ,జీవితాంతం  ప్రవర్తించాడు .80ఏళ్ళవయసులో బట్టతల ఉన్న ,అతని ముఖం  మర్యాద తో గుండ్రంగా పింక్ కలర్ గా ఉండేది  .ఒకావిడ తనకు పుట్టిన కొడుకు ఆయనలాగే ఉన్నాడని చర్చిల్ తోఅంటే ‘’నిజమే పుట్టిన శిశువు లందరూ నాలానే కనిపిస్తారు  ‘’అన్నాడు .

    రెండేళ్ళ వయసు రాకముందే తాత ఐర్లాండ్ కు వైస్ రాయ్ అయ్యాడు .కనుక కొంతకాలం చర్చిల్ బాల్యం ఐర్లాండ్ లో గడిచింది .అక్కడి క్రమ శిక్షణ ఉల్లంఘించి  తను స్వయం గా  ఏర్పాటు చేసు కొన్న   ,బొమ్మల సైన్యంతో ఆదుకొనేవాడు .వాటితో ఆడకుండా ఉండగలిగే వాడు కాదు .దీన్ని గమనించిన అతని తండ్రి ఒక వెయ్యి మంది బొమ్మ సైనిక బృందాన్ని ఏర్పాటు చేశాడు .తనకొడుకు తప్పనిసరిగా మిలిటరీ కమాండర్ అవుతాడని భావించాడు .స్కూల్ చదువు పెద్ద బోర్ గా పెద్ద హింసగా భావించాడు .7వ ఏట దగ్గరలో ఉన్న ఆస్కాట్ కు పంపారు .ఇది ఈటన్ లో చేరటానికి శిక్షణ ఇస్తుంది .ఇక్కడ లాటిన్ ను ద్వేషించటం ఒక్కటే నేర్చుకొన్నాడు .కోపం వచ్చి మేస్టార్లు’’ బడితె పూజ ‘’చేసే   వాళ్ళు . కాని దాన్ని మాన్పించలేక పోయారు .ఒక సారి హెడ్ మాస్టర్ నెత్తిన పెట్టుకొనే స్ట్రా కాప్ ను  కాలితో తన్నుతూ  ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడు .ఇంకేముంది స్కూల్ పిల్లలకు ఆదర్శమూర్తి అయిపోయాడు .కొడుకులో మార్పుఏదైనా  వస్తుందనే ఆశతో ,ఆరోగ్యమూ ఈ రెండేళ్లలో దెబ్బతిన్నదనే  ఆలోచనతో చేర్పించారు ,ఇక్కడ మరింత స్వేచ్చ దొరికింది .ఈతకొట్టటానికి ,గుర్రపు స్వారీకి ,తనకు కావలసిన పుస్తకాలు చదువుకోవటానికి అనుమతి లభించింది .ఇక్కడే ‘’కింగ్ సాల్మన్స్ మైన్స్ ‘’,’’ట్రెజర్ ఐలాండ్ ‘’నవలలు ఇష్టంగా చదివాడు .కాని దీనికంటే ఏదో ఒక చిలిపి పని చేయటం ఇష్టంగా ఉండేది .ఎర్ర తోలు కదా’’ ఎర్ర తేలు’’బుద్ధులు వంట బట్టాయి .వీరామూర్ అనే టీచర్ ‘’ఇకపై నా మోకాళ్లను నువ్వు తొక్కితే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ‘’అంది ఈ కొంటె కుర్రాడితో .’’క్లాసు పిల్లల్లో అత్యంత అల్లరిగాడు .కాని వీడే ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచం లోనే అతి చిన్న అల్లరి పిల్లాడు అనిపించుకొంటాడు అని నాకు అనిపిస్తోంది ‘’అన్నది .అమర్యాదకు ,మూర్ఖత్వానికి చిరునామా అయ్యాడు .అందులోనే ఆనందం పొండాడు .ఒకసారి విద్యార్ధులను టీచర్ మీలో ఎవరికి ఎన్ని లోపాలున్నాయో చెప్పండి ?’’అని అడిగితె మన తుంటరి ‘తొమ్మిది ‘’అని గర్వంగా చెప్పాడు  .’’తొమ్మిదా ?’’అని టీచర్ ఆశ్చర్యంగా అంటే  మన ప్రబుద్ధుడు కాలర్ ఎగరేసి అంతే అన్నాడు .ఆ క్లాస్ వయసు పిల్లగాళ్ళకు అన్ని లోపాలు క్షమించరానివే .గ్రహించిన సూక్ష్మగ్రాహి కొంటేకోనంగి’’నేను చెప్పింది ‘’నీన్ ‘’అది జర్మన్ మాట .అని సర్దుకొన్నాడు .

  మూడేళ్ళు బ్రైటన్  చదువు తర్వాత ఆరోగ్య కేంద్రమైన  హారో లో చేరాడు .ఇక్కడ పరిస్తితి  మరీ  దారుణం చేశాడు .ఎంట్రన్స్ పరీక్షకు లాటిన్ లో ఒక ప్రశ్నా పత్రం ఇస్తే అక్షరం ముక్క రాయకుండా ఖాళీగాఅక్కడక్కడ పిచ్చి గీతాలు గీసి చివర సంతకం ఒకటి ‘’పొడిచి ‘’ మళ్ళీ తిరిగిచ్చేశాడు .స్కూల్లో అతి చిన్నతరగతిలో అతి తక్కువ మార్కులు .దీనితో మరీ రెచ్చి పోయాడు .తెలివి తక్కువ తనం నుంచి అత్యధిక విద్యా వ్యాసంగం కలవాడయ్యాడు .తనకు నచ్చని ఇష్టం లేని తనదికాని దాన్ని దేనినీ పట్టించుకొనే వాడు కాదు .ఈ విషయం పై చర్చిల్ స్వయంగా ‘’where my reason ,imagination or Interest was not engaged ,I could not or would not learn ‘’అని కుండ పగలకొట్టి చెప్పాడు.’’మై ఎర్లి లైఫ్ ‘’అనే తన పుస్తకం లో చర్చిల్ .స్కూల్ మాస్టర్లు తనపై  రుద్దే క్లాసికల్ చదువును అడ్డుకొన్నాడు.సీజర్, ఓవిడ్,వర్జిల్ లను చదివి చదివి చెమటలు కార్చాడు .ఇంగ్లీష్ కాంపోజిషన్ అంటే కొంచెం ఇష్టం .గొప్పగొప్ప ఇంగ్లీష్ స్టైలిస్ట్ ల నాడి పట్టుకొన్నాడు .ఈ సందర్భంగా ‘’I got into my bones the essential structure of the ordinary British sentence which is a noble thing .’’అంటూ ‘’స్కూల్ లో లాటిన్ కవిత్వం  లో ,  గ్రీక్ఎపిగ్రామ్స్ రాయటం లో లో ప్రైజులు కొట్టేసి ఆకాశం లో విహరించిన నా స్నేహితులు,ఇప్పడు బుద్ధి తెచ్చుకొని నేలమీద నడుస్తూ బతుకు తెరువు చూసుకొంటున్నారు .కనుక లాటిన్ గ్రీక్ నేర్చుకోనన్న నాకు పశ్చాత్తాపం లేదు, అవి రాకపోయినందువలన నా జీవితానికి కలిగిన ప్రమాదం ఏదీ జరగ లేదు’’అన్నాడు .

     సశేషం

Inline image 1Inline image 2

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-16-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147

 58  -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –3(చివరి భాగం )

ప్రతిఖండం  మార్కొనికి కొత్తదిగానే ఉంది. పాత  ప్రపంచానికి  కు కొత్త ప్రపంచానికి   వైర్లెస్ ద్వారా అనుసందానం  జరపాలనే ధ్యేయం తో అమెరికా వెళ్ళాడు .చనిపోయే లోపు మార్కొని 89 సార్లు అట్లాంటిక్ దాటాడు .1900 అక్టోబర్ లో అతి పెద్ద ట్రాన్స్ మిటర్ బిల్డింగ్ ను పర్య వేక్షించాడు .అప్పటిదాకా తాను నిర్మించిన దానికంటే ఇది వంద రెట్లు శక్తి వంతమైనది .దీన్ని కార్న్ వాల్ లోని పోలదు లో ఏర్పాటు చేశాడు. ఇది ఇంగ్లాండ్ కు ఆగ్నేయంగా ఉంది .1901లో  బీమ్స్ శక్తిని పరీక్షించాడు .ఆరు నెలల తర్వాత వచ్చిన తుఫాను తానేర్పరచిన వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది .అన్నీ మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది .ఇలాంటి టవర్లె రిసీవింగ్ టవర్ లుగా మాసా చూసేట్స్ లో కేప్ కాడ్ లో  ఏర్పాటు చేసి వీటిని పడగోట్టేశారు .తరువాత అమెరికన్ సైట్ ను న్యు ఫౌండ్ లాండ్ లోని సెయింట్ జాన్ కు మార్చాడు .దీనివలన అనేక ఇబ్బందులేర్పడ్డాయి .అప్పుడు వాతావరణం అసలు బాగా లేదు అంటే అనుకూలంగా లేదు .ట్రయల్ గా పంపిన బెలూన్లు  దూరంగా కొట్టుకు పోయాయి .కావలసిన ఎత్తుకు సరిపడా నిర్మాణం చేయ లేక పోయాడు ..చివరిసారిగా న్యు ఫౌండ్ లాండ్ లోని  ఏరియల్ ఎత్తును 400అడుగులు ఉండేట్లు యా౦టేన్నాను గాలి పటాలు పట్టుకోనేట్లు చేశాడు .

 1901డిసెంబర్ 12 న మార్కొని సెయింట్ జాన్ లోని ఒక టవర్ లో కూర్చుని కార్న్ వాల్ నుండీ వచ్చే సిగ్నల్ కోసం ఎదురు చూశాడు .మొదట్లో చాలా బలహీనంగా పోను పోనూ చాలా బలంగా మోర్స్ కోడ్ లోని ‘’ఎస్ ‘’వినిపించింది .సక్సెస్ .సముద్రమేఒక మిరకిల్ గా  ఒక వారధిగా వైర్లెస్ కు పని చేసిందని చెప్పాడు .ఈ యువ సైంటిస్ట్ ను ‘’హీరో ఆఫ్ ది అవర్ ‘’గా అభివర్ణించారు .’’నవీన శక ఆవిష్కర్త ‘’అన్నారు మార్కొని ని..’’మాస్టర్ ఆఫ్ స్పేస్ ‘’అనీ శ్లాఘించారు .మార్కొని పేరు మొదటి ఆవిష్కర్తల జాబితాలో చేరింది అని పొగిడారు .’’మార్కొని కార్న్ వాల్ నుంచి ఎస్ సిగ్నల్ పంపటం లో విజయం సాధించగానే ఒక కొత్త శకం మానవ చరిత్రలో ఆవిష్కారమైంది .ఒక వ్రేలి స్పర్శ ఒక ప్రత్యుత్తర స్పందనను ప్రకటించింది .కాని ఈ కుర్రాడు సగం సంతోషం తో,సగం ఆశ్చర్యభయం  తో కనిపించాడు తాను  ఇప్పుడు అన్నిటినీ తన నియంత్రణ లోకి తెచ్చుకోగలననే ధైర్యమొచ్చింది ‘’అని రాశాడు సైంటిస్ట్ ఆధర్ సర్ ఆలివర్ లాడ్జ్ .

  ఈ పరిశోధనా సుడి గుండం లో కొట్టుకొంటున్న మార్కొనికి ఇంతవరకు పెళ్లి కోరిక కలగ లేదు .35దాటాయి. మొదటి పెళ్లి ప్రయత్నం విఫలమైంది .మాంచి ముహూర్తం లోనే ఐరిష్ లార్డ్ ఇంచిక్విన్ కూతురు ఆనరబుల్ బీత్రిస్ ఓ బ్రీన్ తో జరిగింది .19ఏళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లలను  కన్నారు .1924లో వివాహ బంధం విచ్చిన్నమైంది .మూడేళ్ళ తర్వాత మార్కొని 53వ ఏట మరో అందగత్తె కౌన్టేస్ మేరియా క్రిస్టిన బెజ్జి స్కాలి ని పెళ్ళాడాడు .అమెది పాపల్ అరిస్టాక్రసి వంశం .ఈ వివాహం గ్రాండ్ గా యువ రాజు చేతులమీదుగా జరిగింది .కార్డినల్ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాడు .విలాసవంతంగా జీవితం గడపాలని మార్కొని నిర్ణ యించుకొన్నాడు .ఒక తెరచాప ఉన్న చిన్న పడవ మీద చిన్న ప్రయోగ శాలను నిర్మించుకొని ఎక్కువ కాలం అక్కడే గడిపేవాడు .ఇప్పుడు మార్కొనిని సైంటిస్ట్ గా కంటే నోబుల్ గా చూస్తున్నారు .మళ్ళీ తండ్రి అయ్యాడు .కూతురికి తన పరిశోధనలకు తగిన ‘’ఎలేట్ట్రా ‘’అని పేరు పెట్టుకొన్నాడు .

 తన ప్రయోగ రంగాన్ని విస్తృత పరచాడు 1902లో తాను సాధించిన మాగ్నెటిక్ డిటెక్టర్ కు  పేటెంట్ పొందాడు .దీనితర్వాత సమా౦తర ఏరియల్ ను నిర్మించి ఆశ్చర్యం కలిగించాడు .అల్ట్రా షార్ట్ వేవ్స్ పై ద్రుష్టి పెట్టాడు .మొదట్లో తాను సాధించిన రెండు వేల మీటర్ల  వేవ్ లెంగ్త్ ఉన్నదానికి బదులుగా ఇప్పుడు 15మీటర్ల వేవ్ లెంగ్త్ ను సాధించాడు .షార్ట్ వేవ్స్ లో ఇదొక అద్భుతం .దీన్ని ప్రక్కన పెట్టి తరంగాన్ని12వేల మీటర్ల  అతి పొడవైన దానిగా మార్చే కృషి చేశాడు .ఇవి పగటిపూట బలాన్ని కొంత కోల్పోతాయి .ముసలితనం పైబడినకొద్దీ మళ్ళీ షార్ట్ వేవ్స్ పైనే పని చేశాడు .కేంద్రీకరించి ,యే దిశలోనైనా పుంజాలుగా పంపే షార్ట్ వేవ్ ను తయారు చేసే పనిలో పడ్డాడు ..ఈ షార్ట్ వేవ్స్ ను ప్రపంచం లో యే ప్రాంతం పైకి అయినా పంపవచ్చని ,వాటితో మెసేజ్ లను యే ఆటంకం లేకుండా ,పగలు రాత్రి భేదం లేకుండా నిరాటంకంగా బయలు దేరిన చోట ఉన్న శక్తి తోనే రిసీవర్ కు చేరేట్లు పంపవచ్చని రుజువు  చేశాడు .

   సమాచార వ్యవస్తలో మరో అద్భుతం ఆవిష్కారమైంది .జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ,లీ డీ ఫారెస్ట్ శాస్త్ర వేత్తలు  మేధావి మార్కొని ఫలితాలను మిగిలిన మాధ్యమాల పై ప్రయోగించి వినోదం తో బాటు సమాచార ఆలోచనలకు దారి ఏర్పరచారు .ఫ్లెమింగ్ తయారు చేసిన ధర్మి యానిక్ వాల్వ్ ,డీ ఫారెస్ట్ వాక్యూం ట్యూబ్ కు దారి చూపింది .దీనితో రేడియో ,బొమ్మలు మాట్లాడే వ్యవస్థ ఏర్పడ్డాయి .1909లో మార్కొని రెండు విధాల గౌరవం పొందాడు .ఇటాలియన్ సెనేట్ లో సభ్యునిగా ,గౌరవాన్ని పొందటమే కాక భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి పొందాడు .1919లో ఆస్ట్రియా ,బల్గేరియా దేశాల మధ్య శాంతి ఒడంబడిక సాధించటం లో కృత క్రుత్యుదయ్యాడు .పారిస్ పీస్ కాన్ఫ రెన్స్ కు డెలిగేట్ గా వెళ్ళాడు 1929లో ‘’మార్చేస్ ‘’ను చేసి అరుదైన గౌరవం కలిగించారు .వైర్లెస్ వ్యాప్తిని మరింత విస్తృత పరచే ఆలోచనలో భాగం గా అంతరిక్షం లోకి చంద్రుడు లక్ష్యంగా లేక కుజుడికి వార్త పంపే విధానం గురించి తీవ్రం గా ఆలోచిస్తూ అధిక శ్రమ తో అలసిపోయి  కూలిపోయాడు .తనకేం జరిగిందో తెలియదు .కాని ఆ సచేతన మేధావి (డైనమిక్ జీనియస్ )’’బాగా బాగా అలసిపోయాను ‘’అని మాత్రం అంటూ ,వెంటనే ఆక్సిజన్ ఎక్కించినా అందుకొనే శక్తి లేక 20-7-1937న 63 వ ఏట మార్కొని మరణించాడు .నిస్సంకోచంగా మార్కొని స్థానం అత్యున్నతమైనదే .రేడియో ను ‘’ the miracle with world girdling wings ‘’అన్నాడు .అది అభి వృద్ధికి గొప్ప చిహ్నం .’’సైన్స్ కు పరిమితులు లేవు .ప్రతి ముందడుగు అన్వేషణా పరిధిని విస్త రిస్తుంది.’’అనేవాడు మార్కొని .ఆ మాట నిజం ఆయన పరిశోధనలో జీవించిన యాభై ఏళ్ళు నిజంగానే సైన్స్ పరిధిని విస్తరింప జేసింది అంటారు రచయిత లూయీ అంటర్  మేయర్ .

  మార్కొని బిజినెస్ మాన్ ,పారిశ్రామిక వేత్త ,’’ది వైర్లెస్ టేలిగ్రాఫ్స్ అండ్ సిగ్నల్ కంపెని ‘’వ్యవస్థాపకుడు .ఇదేతర్వాత’’మార్కొని కంపెని ‘’అయింది .రేడియోకు వాణిజ్య లాభాలను చేకూర్చినవాడు .1912ఏప్రిల్ 15న ‘’టైటానిక్ షిప్ ‘’మునిగినపుడు మార్కొని కంపెనీ బ్రతికి ఉన్నవారి పాలిటి ఆపద్బాందవి గా ఉండి రక్షించింది .’’నేను ప్రపంచానికి మంచి చేశానా ,కీడు చేశానా ?’’అని వితర్కి౦చు కోనేవాడు .మేలే తనవల్ల జరిగిందని సంతృప్తి పడేవాడు .నోబెల్ బహుమతితో పాటు మొత్తం 15అరుదైన అవార్డ్ లు సత్కారాలు అందుకొన్నాడు .మార్కొని పేర అనేక సంస్థలు వెలిసి ఆయనను చిరంజీవిని చేశాయి .మహానుభావుడు మార్కొని మరో లోకం లో సమాచార వ్యవస్త సాగిస్తున్నాడేమో !

 

Inline image 2Inline image 3Inline image 4

    సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146

 58  -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –2

       వైఫల్యాలను దాటి విజయాలు సాధించాడు మార్కొని .భవనం మూడవ అంతస్తులో ఒక ‘’కీ ‘’పెట్టి కింద బేస్మెంట్ లో బెల్లును మోగించాడు .పైంతస్తులో ఒక యంత్రం పెట్టి మోర్స్ కోడ్ లోని మూడు చుక్కలద్వారా ఎస్ అనే అక్షరాన్ని కింద లాన్ లో వినపడేట్లు చేశాడు .ఎక్కువ శక్తిని తరంగాలలో నింపే ప్రయత్నం చేశాడు. వాటిని శక్తి పుంజాలుగా మార్చి ఎక్కువ వేగం కలిపించాడు .స్పార్క్ లకు మరింత శక్తి కలిగించాడు .దీని వలన రిసీవర్ స్పష్టంగా పదునుగా వార్తలను గ్రహించేది .21వ ఏట  ఒక మైలు దూరం లో పల్లెటూరి లో ఉన్నతండ్రి ఫారం హౌస్ కు మెసేజ్ పంపగలిగాడు . మొదట వాడిన పరికరం శక్తిని బాగా పెంచి రెట్టింపు దూరం మెసేజ్ పంపాడు .

 మార్కొని కున్న ప్రభావం కల స్నేహితులు అతని పరిశోధనా ఫలితాలను ఇటలీ  ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళారు .అదేమంత గొప్ప విషయం కాదని ,ఆకాలం లో పక్వానికి వచ్చిన పండులాంటి జ్ఞానం అనీ తేలిగ్గా కొట్టి పారేశారు అధికారులు .దీన్ని లక్ష్య పెట్టకుండా ,తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ,అంతకుముందే సర్ ఆలివర్ లాడ్జ్ చేసిన పరిశోధనా ఫలితాలను అర్ధం చేసుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు .

  22ఏళ్ళ 6నెలల వయసున్న మార్కొని కళ్ళు తిరిగే ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొందాడు .మొదటి సారిగా వైర్లెస్ టేలిగ్రఫీ కు పేటెంట్ పొందాడు .బ్రిస్టల్ చానెల్ గుండా 10మైళ్ళ దూరం మేసేజ్ పంపగలిగాడు .అప్పుడు ఇటలీ ప్రభుత్వం కళ్ళు తెరిచి  మార్కొని ని స్వదేశానికి తిరిగి రమ్మని ఆహ్వానించింది .దాన్ని గౌరవించి వెళ్లి ఇటాలియన్ రేవీరా వద్ద ఉన్న స్పెజియాలో ఒక స్టేషన్ ఏర్పాటు చేసి సముద్రం లో 12మైళ్ళ దూరం లో ఉన్న యుద్ధ నౌకలతో వార్తా సంబంధాన్ని ఏర్పరచాడు .అప్పటికే ఆయన స్వంత వైర్లెస్ టేలిగ్రాఫ్ ,సిగ్నల్ కంపెనీలు ఏర్పరచుకొన్నాడు .మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి ఇంగ్లీష్ చానెల్ ద్వారా సమాచారం  అందుకోవటం చేశాడు .

   ఈప్పటిదాకా కళ్ళు మూసుకొన్న బడా బడా సైంటిస్ట్ లు ఇప్పుడే ఒక యువ సైంటిస్ట్ ఒక గొప్ప అభివృద్ధిని సైన్స్ లో సాధించాడని ప్రకటించారు .అయితే మార్కొని గొప్పతనమేమిటో ప్రజలకు 1898 వరకు అంటే  మొదటి వైర్లెస్ పరికరాన్ని ఒక లైట్ షిప్ లో ఏర్పాటు చేసేదాకా తెలియదు .కొద్ది కాలానికి ఆ షిప్ ఒక స్టీమర్ తాకిడికి దెబ్బతింది .సహాయం కోసం మెసేజ్ లు లైట్ హౌస్ కు అందాయి .వెంటనే లైఫ్ బోట్ లను పంపి సమాచార వ్యవస్థ ను అత్యంత వేగంగా సమర్ధంగా పునరుద్ధ రించారు .ప్రసార దూరం క్రమక్రమ౦గా పెరిగి,74మైళ్ళ దూరం వరకు సమాచార౦పంపటం కుదిరింది .

   ఆధునిక ప్రపంచం లో మార్కొని సాధించింది అత్యద్భుత శాస్త్రీయ విజయమే అయినా ఆయన తాను  ఇంకా ప్రాధమిక దశ లోనే ఉన్నానని చెప్పేవాడు .ప్రసారం చానెల్ దాటిందీ అంటే అట్లాంటిక్ సముద్రాన్నీ దాటించ వచ్చు అనే నమ్మకం కుదిరింది .పాత పుస్తకాల జ్ఞానం వంట బట్టించుకొన్న ప్రొఫెసర్లు ఇది అసాధ్యమని ,విద్యుత్ అయస్కాంత తరంగాలు సరళ రేఖా మార్గం లో ప్రయాణి౦చటమే దీనికి కారణం అన్నారు .ఈ వితండ వాదులకు జవాబు ఇవ్వటానికి ఇష్టపడని మార్కొని హెర్టీజియన్ తరంగాలు నదులు, ప్రవాహాలు లాగానే భూమి వక్రతను అనుసరిస్తాయని రుజువు చేశాడు .

  ఇప్పటికే ప్రసిద్దుడనిపించుకొన్న మార్కొని చాలా సీరియస్ గా ముభావంగానే ఉండేవాడు .ఏమీ చదువుకొని అజ్ఞానులకు వైర్లెస్ టేలిగ్రఫీ   అర్ధం ఎలా వివరిస్తావు అని అడిగితే మార్కొని ‘’గాలిలో శబ్దం తరంగాలుగా వ్యాపిస్తుందని తెలియని వారు లేరు .ఉదాహరణకు ఒక ఫిరంగిని పేలిస్తే దానివలన కలిగే ఒత్తిడి దగ్గరున్న గాలి ని కంపింప జేస్తుంది .ఈ కంపనాలు వెళ్ళినంత దూరం  శబ్దం వినపడుతూనే ఉంటుంది .నేను ఏర్పాటు చేసిన నిలువుగా ఉన్న వైరు విద్యుదాయస్కాంత తరంగాలను గాలిలోకి పంపిస్తుంది .అందువలన ఒక రకమైన కంపనాలను వాతావరణం లో కలుగుతాయి .ఈ కంపనాలు అన్ని దిశలలోనూ రిసీవర్ ను చేరే దాక వ్యాపిస్తాయి .కనుక ఒక మెసేజ్ ను గాలిద్వారా యెంత దూరమైనా పంపవచ్చు అయితే మనం కల్పించిన కంపనాలు నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడే సాధ్యం ‘’అని చక్కగా వివరించాడు .

   1899 ఫాల్ సీజన్ లో మార్కొని అమెరికాకు బయల్దేరి వెళ్ళాడు న్యు యార్క్ హెరాల్డ్ యజమాని జేమ్స్ గార్డన్ బెన్నెట్ అమెరికా కప్ యాచ్ పోటీలను వైర్లెస్ ద్వారా రిపోర్ట్ చేయమని కోరాడు .న్యు యార్క్ సందర్శన సంభ్రమాన్ని కల్గించింది .అక్కడిఆకాశ హర్మ్యాలు వైర్లెస్ సిగ్నల్ లకు  అడ్డు పడతాయేమోనని సరదాగా అన్నాడు .అక్కడున్న ఒక రిపోర్టర్ ‘’no bigger than a French man and no older than a quarter century .He is a mere boy ,with a boy ’s happy enthusiasm and a man’s  view of his life work .His manner is a little nervous and his eyes a bit dreamy .He acts with the modesty of a man who merely shrugs his shoulders when accused of discovering a new continent ‘’.అన్నాడు మార్కొని ని గమనించి .

 

Inline image 1

        సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రాసాద్ -19-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145

 58  -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని

  25-4-1874న గుగ్లీనో మార్కొని ఇటలీదేశం లోని బోలానా లో పుట్టినప్పుడు ,వాళ్ళ పక్కింటి ఆయన ఈ పిల్లాడిని చూసి అతని చెవులు చేటల్లాగా ఉన్నాయని అన్నాడట .వాళ్ళమ్మ వెంటనే ‘’అయితే మనం ఎవరం వినలేని శబ్దాలను  మా వాడు వింటాడన్న మాట ‘’అని బదులిచ్చిందట .ఐరిష్ జాతికి చెందిన తల్లి ఆ చెవులకు సంగీత మాధుర్యాన్ని అందించేది .తండ్రి సంపన్నుడైన బిజినెస్ మాన్ కనుక కొడుకును అందరూ చదివే చదువు కాకుండా గొప్ప చదువు చదివి౦చా లనుకొన్నాడు .ఫ్లారెన్స్ అండ్ లెగ్ హారన్ వంటి ప్రసిద్ధ విద్యా కేంద్రాలలో చేరక ముందు మార్కొని ఇంటికొచ్చి మేస్టార్లు విద్య నేర్పేవారు .తండ్రి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను బాగా చదివే వాడు .ముఖ్యంగా భౌతిక శాస్త్రాన్ని ఆసక్తిగా చదివాడు .అందులో ఎలేక్త్రిసిటి పై విపరీతమైన అభిమానమేర్పడింది .తండ్రి కట్టించిన అటకపై కూర్చుని ప్రయోగ శాలగా కరెంట్ వైర్లు బాటరీలతో ఏదో ప్రయోగాలు చేసేవాడు .12ఏళ్ళ వయసులో .గాలి లోని పదార్ధాల గురించి బాగా అర్ధం చేసుకొన్నాడు .13వ ఏట గాలినుంచీ నైట్రేట్ ను తయారు చేసే ప్రయత్నం చేశాడు .

 మార్కొనికి 14 ఏళ్ళు వచ్చినప్పుడు హీన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్ వాయు తరంగాలపై తానూ చేసిన ప్రయోగ ఫలితాలను ప్రచురించాడు .గాలిలో  తరంగాలున్నాయి అనేది కొత్త విషయం కాదు 1864లో జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ కాంతి లోని విద్యుదయస్కాంత తరంగాలను ,విద్యుత్ తరంగాలను ప్రయోగాత్మకం గా ప్రదర్శించే ప్రయత్నం చేశాడు  ,వాటి పొడవు వేలాసిటి లను చెప్పాడు .కాని ఆయన సిద్ధాంతం ప్రయోగాత్మకంగా రుజువు కాలేదు .అందుకే చాలాకాలం అది సిద్దా౦త౦గానే హెర్ట్జ్ ప్రయోగం చేసి రుజువు చేసేదాకా ఉండి పోయింది .గదిలో ఏలెక్ట్రికల్ వేవ్స్ ను హెర్ట్జ్ పంపగలుగుతున్నాడని ,ఎలెక్ట్రిక్ ఆసిలేటర్ ద్వారా దానికి 20అడుగుల దూరం లో ప్రేరిత విద్యుత్ (ఇన్ డ్యూసింగ్ కరెంట్ )ను సృష్టించాడని చదివి ఆశ్చర్య పోయాడు మార్కొని .వైర్ లెస్ లో అద్భుతమైన శక్తి దాగి ఉందని గ్రహించాడు .గాలిని మాధ్యమంగా తీసుకొని వార్తలు మ్యూజిక్ ,ప్రసంగం మొదలైనవానిని పంప వచ్చని ,భద్ర పరచ వచ్చునని ఊహ చేశాడు .ఒక స్పందనను వైర్లు లేకుండా కొన్ని అడుగుల దూరం పంపగా లేనిది ,మైళ్ళ దూరం పంపలేమా అని ఆలోచించాడు .ఇది సాధ్యమైతే ప్రపంచ వ్యాప్తం గా పంపించవచ్చు అని  ఆయన మస్తిష్కం లో మెరుపులాంటి ఆలోచన వచ్చింది  .దీనినే మార్కొని ఇంట్యూషన్ అంటే అంతర్ ద్రుష్టి అన్నాడు .’’ఈ తరంగాలు కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తమై కొత్త సమాచార వ్యవస్థ ఏర్పడుతుంది ‘’అని చెప్పాడు .

   16వయసులో మార్కొనికి తన జీవిత లక్ష్యమేమిటో తెలిసింది .బొలోనా యూని వర్సిటిలో ఎలెక్ట్రో మాగ్నేటిజం పై పరిశోధనలు చేస్తున్న ఫిజిక్స్ ప్రొఫెసర్ అగస్టోరిఘి వద్ద చేరి చదివాడు. అక్కడి మిగిలిన శాత్ర వేత్తలు హీర్త్జియన్ తరంగాల పని తీరుపై పరిశోధిస్తున్నారు .అంతమాత్రంగా మార్కొని దానికేమీ భంగ పడలేదు .ఒక’’ ప్రేరణ వేస్టనం’’అంటే ఇండక్షన్ కాయిల్ ,కొన్ని పరికరాలు మోర్స్ కీ ,ట్రాన్స్ మీటర్ ,మల్టిపుల్ డిస్చార్జర్ (స్పార్క్ గాప్ )తోప్రయోగాలు సాగించాడు .పారిషియన్ ఫిజిసిస్ట్ అడౌర్డ్ బ్రాన్లీ నుంచి అరువుగా మరొక పరికరం తీసుకొన్నాడు. బ్రాన్లీ లోహముక్కలు నింపిన గ్లాస్ ట్యూబ్ ను ఉపయోగిస్తూ  హేతు బద్ధంగా ప్రయోగం చేస్తుంటే మెకానికల్ షాక్ తో పడిపోయాడు .మార్కొని ఇందులోని సిద్ధాంతాన్ని గ్రహించి నిర్మాణాన్ని వృద్ధి చేశాడు .పలుచటి దేర్మామీటర్ గ్లాస్ ట్యూబ్ లో నికెల్ పొడి వేసి ,దానిలోకి కరెంట్ పంపాడు .అది అతని ఆలోచనలను సరియైనవే నని రుజువు చేస్తూ ఒక కండక్టర్ గ పని చేసింది .దానిపై నెమ్మదిగా తట్టితే లోపలి రేణువులు దూరమై అంచనా తప్పింది .తరువాత ఇనుము ,కాపర్ జింక్ ,బ్రాస్ లతో ప్రయోగాలు చేశాడు .ఇవేవీ ఊహించిన ఫలితాలివ్వ లేదు .చివరికి నికెల్ సిల్వర్ మిశ్రమ౦బాగా సెన్సిటివ్ గా ఉంటు౦ది కనుక దాన్ని  వాడాలని నిర్ణయానికొచ్చాడు .స్పందనలను పెంచుతూ ,పరికరాన్ని మరింత శుద్ధి చేస్తూ ప్రయోగాలు చేశాడు .ఇప్పటివరకు  హీర్తీజియన్ ఆసిలేటర్కు ఉన్న రెండు కడ్డీలను తీసేసి స్పార్క్ డిస్చార్జర్  ఒక టెర్మినల్ ను ఎత్తుగా స్థంభం మీదున్న మెటల్ కండక్టర్ కు కలిపాడు .రెండవ టెర్మినల్ ను భూమిలో పాతిపెట్టిన మెటల్ ప్లేట్ కు కలిపాడు .దీనితో వైర్ లెస్ లాబ్ నుండి గాలిలోకి దూసుకు పోయింది అని మార్కొని జీవిత చరిత్ర రాసిన ఆరిన్  డన్లాప్ అంటాడు .దీనితో  సృస్టిం పబడిన స్పార్క్ చేయలేని పని ,ప్రయాణం చేయలేని దూరం అనేవి లేకుండా పోయాయి. సమాచార వ్యవస్థలో ఇదొక గొప్ప విప్లవం .దీని సాధకుడు మార్కొని .

 

Inline image 1Inline image 2

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

భరద్వాజ మహర్షి రచించిన శ్రీ శివ కర్ణామృతం లో శివుని సంసారాన్ని ఆయన శృంగార చేష్టలను మహర్షి మహా అందంగా వర్ణించాడు .మొదట శివ సంసార వర్ణన చూద్దాం .

1-‘’అర్దా౦గే హిమ శైలజాం దధ దయం  బంధుం గృహం తద్గురోః-కైలాసాచల ముద్వహన్ కరతలే కృత్వా సుమేరుం ధనుం

గంగా మ్మూర్ధ తలే తదా భమపి సన్మౌలౌ విదుం తత్క్రుతే—కాశీ వాస కరః శుభం వితనుతాం శంభు ర్మహాకార్ముకః ‘’

తాత్పర్యం –సగం శరీరం లో హైమవతి ని ధరించి ,హిమవంతుని బంధువైన కైలాసాన్ని  ఇల్లుగా చేసుకొని ,సుమేరువును ధనుస్సుగా స్వీకరించి ,గంగను, చంద్రుని శిరస్సు పై ధరించి ,కాశీ వాసి,మహా కార్ముకుడు అయిన  అయిన శంభుడు శుభం చేకూర్చుగాక .

హైమవతి తండ్రి హిమ వంతుడి బంధువైన కైలాసాన్ని ఇల్లుగా చేసుకొన్నాడు .వేటాడే వృత్తికి సహాయ పడటానికి హిమవంతుని మరొక చుట్టం సుమేరువు వేటాడే ధనుస్సుగా సహకరిస్తున్నాడు .శివుడికి ఆభారణాలపై ప్రేమ చాలానే ఉంది .అందుకే చంద్రుని గంగను తలపై పెట్టుకొన్నాడు. ధనుర్విద్యా నైపుణ్యం తో మహా  కార్ముకుడైన  శివుడు జ్ఞాన రూప బాణాన్ని వ్యర్ధం కాకుండా ,వేటాడుతూ ,సంసారులకు నరక భయం చూపించి బెదిరిస్తూ ,వాళ్ళ అజ్ఞాన ధనాన్ని  దోచుకొంటూ జీవిక సాగిస్తున్నాడు .వేట సాగక పొతే కాశీ లో నివాసం ఉండి భార్య అన్న పూర్ణ పెట్టె భిక్షతో జీవిస్తు,కైలాసం లో భార్య బిడ్డలకు పెడుతూ సంసారం లాగిస్తున్నాడు శివుడు .గంగను నెత్తిమీద పెట్టుకొన్నా గౌరియే అర్ధాంగి అని నమ్మిస్తున్నాడు .ఇలా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా దక్షిణ నాయకత్వశృంగారం  వెలిగిస్తున్నాడు .గంగను రెండో భార్యగా తెచ్చుకొన్నా గౌరీ ఏమీ మాట్లాడలేదు కారణం ఆమె ఒక జడురాలు అంటే కొండకు పుట్టినది .చంద్రుడూ జడుడేఅయినా నెత్తి కెక్కి౦చు కొన్నాడు .నీరు అవసరం కదా అని భార్య గౌరికి నంగనాచి కబుర్లు చెప్పినెత్తిన పెట్టుకొన్నాడు .

తరువాతి శ్లోకం లో శివుని  శృంగార రసోత్కర్షను వర్ణిస్తున్నాడు

2-‘’కోవాహే శైలజాతే! వపుషి ద్రుత తరాలింగితోవర్తతే తే-మాయా మద్వేష దారీ వద విదిత మహో తావకీనం హిశీలం

ఇత్యుర్వీ భ్రుత్తనూజాం క్షణం చకిత తరాం భీష యిత్వాసహాసో –వీక్ష్యాత్మానం తదంగ ప్రతి ఫలిత ముమా ప్రాణ నాదో వతాన్నః .’’

భావం –శివుడు పార్వతిని కౌగలించుకో బోయాడు .అప్పుడు ఆమె శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు .అది చూసి ఆయన ‘’పార్వతీ !నా వేషం వేసుకొని నిన్ను కౌగిలించుకొన్న వాడేవ్వడు ?ఆహా యెంత గొప్ప శీలం నీది !అని ఒక్కక్షణకాలం ఆమె ఆశ్చర్య పోయేట్లు బెదిరించి చిరునవ్వుతో ఉన్న శివుడు మనల్ని కాపాడాలి .

స్పటిక మణి,జపాకుసుమం ఒకే చోట ఉంటె ఒక దాని లక్షణం రెండవ దానిలో కనపడుతుంది .సాంఖ్యం లో ప్రక్రుతి పురుష సంయోగం –జపా స్పటిక మణి సంయోగంగా చెప్ప బడింది.శివుడు స్పటిక మణి .పార్వతి జపాకుసుమం .కనుక శివుని దేహం లో పార్వతి ప్రతి ఫలించాలి .కాని పార్వతి శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు. అంటే శివుని స్పటిక సమానత్వం పార్వతిలో కనపడింది .ఈవిషయం శివుడు గ్రహించాడు .పార్వతిని, దీన్ని సాకుగా తీసుకొని కొంచెం ఆట పట్టించాలని ‘’నన్ను కౌగిలించుకోవటానికి ముందే ఇంకోడిని కౌగలి౦చు కొన్నావ్ .నాకు అసలు విషయం చెప్పు వాడేవడు  ?అని కోపం నటించి ప్రశ్నించాడు .ఆమె చకితురాలైంది .అలాంటి పార్వతిని శివుడు కౌగలించాడు .శృంగారం రసోత్కర్ష మైధ్వనించింది

తరువాత శివా శివుల సమాగమం శ్వేత పీత మహాస్సుల సమాగమం  గా కవి వర్ణించాడు ఆ వైభోగాన్నీ చూద్దాం ..

3-పంచ బాణ విజయస్య కాంచన –స్తంభతా విలసిత ప్రతీతి కృత్-

రాజతాద్రి నిహితో దినోతు మాం –శ్వేత పీత మహాసోస్సమాగమః ‘’

భావం –మన్మధుడి విజయస్తంభం నటబడిందా అన్నట్లు తెల్లని ,పచ్చని కాంతుల కలయిక నన్ను సంతోష పెట్టాలి

ఇప్పటిదాకా వైరాగ్యం లో ఉన్న శివుడు ,పార్వతీ దేవి తపస్సుతో శివుడిలో కాముడు పునర్జన్మ పొందాడు .అలాంటి శివుడిని కామంతో గెలిచాననే ధీమాతో విజయ స్తంభం నాటబడి తెలుపు పసుపు కాంతులు సమాగమమైనాయి .పార్వతి దేహచ్చాయ పసుపు. శివునిది తెలుపు .వీరిద్దరి పేర్లు చెప్పకుండా కవి ఈ రంగుల సమాగమం చెప్పాడు చమత్కారంగా .రజతాద్రి మీద మన్మధుడు నాటిన విజయ స్తంభం బంగారు వర్ణం కలది .బుద్ధి అనే గుహకు ప్రతీక అయిన వెండి కొండపై ఉన్న గుహలో శివ పార్వతుల శ్వేత పీత సమాగమం జరిగింది .ఇది ఆ౦తరంగికమని  నిహిత అనే శబ్దం సూచిస్తోంది .మన్మధుడు అరవింద ,చూతక అశోక ,నవ మల్లిక ,నీలోత్పలం అనే పంచ పుష్ప బాణుడు .మన్మధుని విజయం అంటే పంచ బాణ విజయమే .అంతటి ప్రభావం ఆ పుష్పబాణాలకున్నది అని అర్ధం .ఈ శ్లోకం రదోద్ధత వృత్తం లో రచింప బడింది . తరువాత శ్లోకం లో కవి వారి సమాగమం తన మనసులో జరగాలని కోరాడు .

4-‘’అన్యోన్య నైర్మల్య సమృద్ధి భాజో –రన్యోన్య దేహ ప్రతి బి౦బనేన

తేజోర్ధనారీశ్వర యోర్ధ్వ యోసత్ –ప్రకాశ మానమ్మమ మానసేస్తు’’

భావం – పార్వతీ పరమేశ్వరుల సంయోగం లో ఒకరి శరీరంలో మరొకరి శరీరం ప్రతి ఫలిస్తోంది .అలాంటి అర్ధనారీశ్వర తేజం నా మనసులో శాశ్వతంగా ప్రకాశించాలి .

ఇద్దరి శరీరాలు అత్యంత నిర్మలం కనుక ఈ ప్రతిఫలించటం కుదిరింది .వారి తేజం ‘’సత్త’’అంటే త్రికాలా బాధ్యం అని మంచిదని అర్ధాలు .శివ పారమ్య దృష్టిలో అమ్మవారు ప్రతి బింబ పాత్రగా ఉంటుంది .శక్తి పారామ్య దృష్టిలో శివుని నుంచి అమ్మవారు తొలగిపోతే ఆయన శవమే కాని  శివం కాదు  .నిర్గుణ కైవల్య అద్వైత వాసన కలిగి దానికోసం ప్రయత్నించేవాడు ‘’ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా ‘’అనేదాని ప్రకారం ఈశ్వరోపాసన చేయాల్సిందే

మరో శ్లోకం లో శివుడు శివా ను పరిహసి౦చటం చెప్పాడు –

5-‘’శ్రీ గౌరీం ప్రణయేన జాతు కుపితాంవైముఖ్య సంధాయినీ –మంగీకార మకుర్వతీమను నయైః కందర్ప చేస్టాస్వలం

సంక్రాంతః కిమురోజ యోర్హ్రుది చ తేపాషాణ భారః పరం –తాతస్యేతి నవ దంశ్చిరాదభి ముఖీ కుర్వంచ్చివః పాతునః’’

భావం –పార్వతి ప్రణయం తో కోపం వచ్చి మన్మధ క్రీడకు విముఖురాలైంది .శివుడు ఎన్నో అనునయ వాక్యాలు పలికి ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు .ఆమె అంగీకరించలేదు .అప్పుడు స్థాణువైనశివుడు ఆమెతో ‘’నీ స్తనాలకూ నీ హృదయానికీ కూడా  నీ తండ్రి పాషాణత్వం సంక్రమించిందేమో‘’అని నిష్టూరంగా అన్నాడు .చివరికి ఆమెను ప్రసన్నం చేసుకొని సుఖించిన శివుడు మమ్మల్ని కాపాడాలి .

స్తనాల కాఠిన్యం స్త్రీకి సహజం  అందం శోభా కూడా. కాని హృదయ కాఠిన్యంఆమెకు సహజమైంది కాదు .ఈ రెండు కాఠిన్యాలుఆమెకు తండ్రి హిమగిరి నుండి సంక్రమించాయి అనటం చమత్కారం తండ్రి లక్షణాలు కూతురికి రావటం సహజమే కాక అభి వృద్ధి సూచకం కూడా .

అసలే తాండవ లోలుడు .ఇప్పుడు భార్య మనసు స్వాధీనమైనది .ఇక రెచ్చి పోయి శివుడు నాట్యం చేశాడు ఎలా ?

6-‘’దిం –ధిమి –ధిమి –ధిమి –శబ్డై-ర్బందుర పద మందరం నటంతం తం

ఝం ఝణఝణ ఝణ రావా –రంజిత మణి మండనం శివం వందే ‘’

భావం –దిం ధిమి ధిమి ధిమి అనే మృదంగ ధ్వనులకు అనుగుణంగా ఝం ఝణ ఝణ ఝణ అనే శబ్దాలతో అక్కడ సమావేశమైన వారందరికీ ఆనందం కలిగేట్లు ,రంజింప జేసే భూషణాలు కలిగి ఉన్న నాట్యమాడే శివుని సేవిస్తాను .

శివుని దయాగుణం అపరిమితం అని చెప్పే శ్లోకం

‘’యః శ్రీకరం బాలమంత్ర తంత్రం –క్రీడాదరాత్ స్వంపరి పూజ యంతం

శివః క్రుతార్ధం కృతవాం స్త ధైన-మయం కిమాత్మీయ ముపెక్షతే మాం ‘’

భావం –పూర్వం శ్రీకరుడు అనే పిల్లాడు మంత్రం తంత్రం లేకుండా ఆదరం గా శివుడిని పూజించాడు .ఆబాలుడి భక్తికి మెచ్చి శివుడు అతడిని క్రుతార్దుడిని చేసినట్లు నన్ను క్రుతార్దుడిని చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని కవి ప్రశ్నించాడు శివుడిని .

శివ పంచాక్షరీ మంత్రం మహాత్మ్యాన్ని వర్ణిస్తున్నాడిప్పుడు –

8-యదోప దిస్టా శ్రవణే శివస్య –పంచాక్షరీ గార్గ మునీశ్వ రేణ

నిర్యాయ భూపస్య తధైవ గాత్రాత్ –కాకాత్మనా పాప చయః ప్రదగ్ధః ‘’

భావం –ఒకప్పుడు ఒక రాజు చెవిలో గర్గమునీశ్వరుడు శివ పంచాక్షరీ మంత్రం ఉపదేశిస్తే ,ఆయన శరీరం లో నుంచి పాపం అంతా కాకి రూపం లోబయటికి వచ్చి,ఆయన పాప సమూహం కాలిపోయింది

అనేక పాపాలు చేస్తేనే కాకి జన్మ వస్తుంది .అందుకే ‘’కాకోపి జీవతి చిరాయ బలిం చ భుక్తే –పాపీ చిరాయచిర జీవ కాకః ‘’అనే సామెత లోకం లో వచ్చింది ‘

ప్రశ్న ,సమాధానం రూపం లో  శివమహిమను వర్ణించే శ్లోకం –

9-‘’కందర్ప మనం వక్తి –పురాణా మమరద్విషాం-కామాశాం కృతవాన్ వ్యర్దాం –క్షణాత్ కోపేన శంకరః ‘’

భావం –పురాణాలు పుర అనే రాక్షసుని దర్పాన్ని అణచిన వాడు ఎవడు అని చెప్పాయి ?కందర్ప దమనుడైన శివుడిని అని సమాధానం .కోపం తో క్షణకాలం లోనే ఆశను వ్యర్ధం చేసినది ఎవరు ?కాముడని పిలువ బడే మన్మధుని ఆశను క్షణ కాలం లో నీరు కార్చిన శివుడు అని జవాబు .

కం దర్ప దమనం –లో కం అంటే ఎవరిని అని అర్ధం. కలిపి తే కందర్ప దమనం –అంటే మన్మధ దహనం చేసిన వాడు అనే అర్ధం వస్తుంది .అలాగే పురా అంటే త్రిపురాసురపురాలు .పురాణామామర ద్విషా అనికలిపితే పుర రాక్షస వినాశనకారి అనే అర్ధం

చివరగా శివుని నమ్మిన వాడికి యే భయం లేదని చెప్పే –శివ పంచాక్షరీ బీజాక్షర ప్రారంభంగా చెప్పిన విశేష శ్లోకాలు

10-‘’న జననీ జన గర్భ నివాసజం –న చ నిరంతర సంసృతి జమ్మమ

న యమ దూత కృతం చ భయం యతో –నవరతమ్మమ దైవత మీశ్వరం ‘’

భావం –నా దైవం  ఈశ్వరుడు కనుక నాకు తల్లికడుపులో మళ్ళీ పుడతానన్న భయం కాని ,సంసార భయం కాని ,యమ దూతల వలన భయం కానీ లేదు .

ఈశ్లోకం లో ఒక విశేషం ఉంది .శివ పంచాక్షరీ మంత్రం లోని నకారం తో నాలుగు పాదాలను నడపటం .మిగిలిన శ్లోకాలలో కూడా ఈ విశేషం గమనించండి

11-మహా వీర రుద్రమ్మనో జాతి రౌద్రం –మహీ భ్రుత్కుమారీ మనః పద్మ మిత్రం

మఖ ద్వంసినం సమ్మత శ్రీకరమ్మ –న్మనో మందిరం మహా దేవ మీడే’’

భావం –మన్మధుడికి అతి భయం కలిగించిన శత్రువు మహా వీర రుద్రుడు .కానీ పార్వతీ దేవి మనస్సు అనే పద్మానికి మిత్రుడు అంటే సూర్యుడు .దక్ష యజ్న ధ్వంసకుడు ,ఇస్టులకు ఇష్టసంపదలిచ్చేవాడు ,నా మనో మందిరం లో నివసించే మహాదేవునికి వందనం .

12-‘’శివేపరాప హ౦తారం  -శివ సందాయినం పరం

శివానంద కరం శాంతం –శివం సేవే నిరంతరం ‘’.

భావం –అమంగళాన్నిపోగొట్టి ,మంగళాన్నికలిగించే వాడు శివానందాన్నిచ్చే వాడు ,శాంతుడు ,ఉత్క్రుస్టుడుఅయిన శివుని సేవిస్తాను .

13-వాసుకీశ్వర విభూషిత కంఠం-వామ భాగ పరి పూరిత బాలం

వారణాస్యభిదా  పట్టణ వాసం –వామ దేవ మది దైవత మీడే’’.

భావం –కంఠం లో వాసుకి అనే సర్పేశ్వరుని ధరించి వామ భాగం లో బాల లేక బాలుడు కల కేశ పాశం తో,వారాణసి పట్టణమైన కాశీ లో నివశించే గొప్ప వాడైన వామ దేవ శివుని నుతిస్తాను .

14-‘’యదు నాద పద్మ భవ వాసవాదయో –యదుదార భావ గుణ నాయకాః శివం

యమ శాసనోగ్ర తర మాశ్రయ౦త్యహో –యమ నాద నాద మహా మాశ్రయామి తం ‘’

భావం –ఏకారణం తో యమశాసనాన్నివిని ఉగ్రుడైన శివుని ఉదార గుణాలకు నాయకులైన విష్ణు బ్రహ్మా ఇంద్రాదులు ఆశ్ర ఇస్తారో ,ఆ కారణంగానే నేను ఉమానాద శివుడిని ఆశ్ర యిస్తాను  .

ఈవిధంగా 5శ్లోకాలతో శివ పంచాక్షరి చెప్పి తరువాత దానిఅర్ధాన్ని వివరిస్తున్నాడు భరద్వాజ మహర్షికవి –

15-‘’నమః సృష్టి స్థితి లయాన్ –కుర్వతే జగతాం సదా

శివ యైక్యం గతా యాంతు –పరమానంద రూపిణే’’

భావం –ఎప్పుడూ లోకాలసృష్టి స్తితి లయాలు చేస్తున్న  పార్వతీదేవి  ఐక్యత తో,పరమానంద స్వరూపుడైన శివునికి నా నమస్సులు .

చివరగా అకార ,ఉకార ,మకారాలతో కూడిన ప్రణవాన్ని వర్ణిస్తున్నాడు –

16-‘’ఆది స్వరం తృతీయేన –సహితం బిందు సంయుతం

ధ్యాయామి హృదయే యోగీ –ధ్యేయం కామిత మోక్షదం ‘’

భావం –కోరుకొన్న మోక్షాన్నిచ్చే ,యోగులచేత ద్యానింప బడే మూడవ స్వరమైన ఉకారం తో,బిందువు అంటే మకారం తో కలిసిన ఆది స్వరం అంటే ఆకారం తో ఉన్న ప్రణవమైన ఓంకారాన్ని మనసులో ధ్యానిస్తాను .

ఆధారం –భరద్వాజ మహర్షి రాసిన శ్రీశివ కర్ణామృతం కావ్యానికి శ్రీ దోర్బల విశ్వనాధ శర్మ గారి అర్ధ తాత్పర్య ‘’ఆస్వాదినీ వ్యాఖ్యానం’’.

 

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

భరద్వాజ మహర్షి రచించిన శ్రీ శివ కర్ణామృతం లో శివుని సంసారాన్ని ఆయన శృంగార చేష్టలను మహర్షి మహా అందంగా వర్ణించాడు .మొదట శివ సంసార వర్ణన చూద్దాం .

1-‘’అర్దా౦గే హిమ శైలజాం దధ దయం  బంధుం గృహం తద్గురోః-కైలాసాచల ముద్వహన్ కరతలే కృత్వా సుమేరుం ధనుం

గంగా మ్మూర్ధ తలే తదా భమపి సన్మౌలౌ విదుం తత్క్రుతే—కాశీ వాస కరః శుభం వితనుతాం శంభు ర్మహాకార్ముకః ‘’

తాత్పర్యం –సగం శరీరం లో హైమవతి ని ధరించి ,హిమవంతుని బంధువైన కైలాసాన్ని  ఇల్లుగా చేసుకొని ,సుమేరువును ధనుస్సుగా స్వీకరించి ,గంగను, చంద్రుని శిరస్సు పై ధరించి ,కాశీ వాసి,మహా కార్ముకుడు అయిన  అయిన శంభుడు శుభం చేకూర్చుగాక .

హైమవతి తండ్రి హిమ వంతుడి బంధువైన కైలాసాన్ని ఇల్లుగా చేసుకొన్నాడు .వేటాడే వృత్తికి సహాయ పడటానికి హిమవంతుని మరొక చుట్టం సుమేరువు వేటాడే ధనుస్సుగా సహకరిస్తున్నాడు .శివుడికి ఆభారణాలపై ప్రేమ చాలానే ఉంది .అందుకే చంద్రుని గంగను తలపై పెట్టుకొన్నాడు. ధనుర్విద్యా నైపుణ్యం తో మహా  కార్ముకుడైన  శివుడు జ్ఞాన రూప బాణాన్ని వ్యర్ధం కాకుండా ,వేటాడుతూ ,సంసారులకు నరక భయం చూపించి బెదిరిస్తూ ,వాళ్ళ అజ్ఞాన ధనాన్ని  దోచుకొంటూ జీవిక సాగిస్తున్నాడు .వేట సాగక పొతే కాశీ లో నివాసం ఉండి భార్య అన్న పూర్ణ పెట్టె భిక్షతో జీవిస్తు,కైలాసం లో భార్య బిడ్డలకు పెడుతూ సంసారం లాగిస్తున్నాడు శివుడు .గంగను నెత్తిమీద పెట్టుకొన్నా గౌరియే అర్ధాంగి అని నమ్మిస్తున్నాడు .ఇలా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా దక్షిణ నాయకత్వశృంగారం  వెలిగిస్తున్నాడు .గంగను రెండో భార్యగా తెచ్చుకొన్నా గౌరీ ఏమీ మాట్లాడలేదు కారణం ఆమె ఒక జడురాలు అంటే కొండకు పుట్టినది .చంద్రుడూ జడుడేఅయినా నెత్తి కెక్కి౦చు కొన్నాడు .నీరు అవసరం కదా అని భార్య గౌరికి నంగనాచి కబుర్లు చెప్పినెత్తిన పెట్టుకొన్నాడు .

తరువాతి శ్లోకం లో శివుని  శృంగార రసోత్కర్షను వర్ణిస్తున్నాడు

2-‘’కోవాహే శైలజాతే! వపుషి ద్రుత తరాలింగితోవర్తతే తే-మాయా మద్వేష దారీ వద విదిత మహో తావకీనం హిశీలం

ఇత్యుర్వీ భ్రుత్తనూజాం క్షణం చకిత తరాం భీష యిత్వాసహాసో –వీక్ష్యాత్మానం తదంగ ప్రతి ఫలిత ముమా ప్రాణ నాదో వతాన్నః .’’

భావం –శివుడు పార్వతిని కౌగలించుకో బోయాడు .అప్పుడు ఆమె శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు .అది చూసి ఆయన ‘’పార్వతీ !నా వేషం వేసుకొని నిన్ను కౌగిలించుకొన్న వాడేవ్వడు ?ఆహా యెంత గొప్ప శీలం నీది !అని ఒక్కక్షణకాలం ఆమె ఆశ్చర్య పోయేట్లు బెదిరించి చిరునవ్వుతో ఉన్న శివుడు మనల్ని కాపాడాలి .

స్పటిక మణి,జపాకుసుమం ఒకే చోట ఉంటె ఒక దాని లక్షణం రెండవ దానిలో కనపడుతుంది .సాంఖ్యం లో ప్రక్రుతి పురుష సంయోగం –జపా స్పటిక మణి సంయోగంగా చెప్ప బడింది.శివుడు స్పటిక మణి .పార్వతి జపాకుసుమం .కనుక శివుని దేహం లో పార్వతి ప్రతి ఫలించాలి .కాని పార్వతి శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు. అంటే శివుని స్పటిక సమానత్వం పార్వతిలో కనపడింది .ఈవిషయం శివుడు గ్రహించాడు .పార్వతిని, దీన్ని సాకుగా తీసుకొని కొంచెం ఆట పట్టించాలని ‘’నన్ను కౌగిలించుకోవటానికి ముందే ఇంకోడిని కౌగలి౦చు కొన్నావ్ .నాకు అసలు విషయం చెప్పు వాడేవడు  ?అని కోపం నటించి ప్రశ్నించాడు .ఆమె చకితురాలైంది .అలాంటి పార్వతిని శివుడు కౌగలించాడు .శృంగారం రసోత్కర్ష మైధ్వనించింది

తరువాత శివా శివుల సమాగమం శ్వేత పీత మహాస్సుల సమాగమం  గా కవి వర్ణించాడు ఆ వైభోగాన్నీ చూద్దాం ..

3-పంచ బాణ విజయస్య కాంచన –స్తంభతా విలసిత ప్రతీతి కృత్-

రాజతాద్రి నిహితో దినోతు మాం –శ్వేత పీత మహాసోస్సమాగమః ‘’

భావం –మన్మధుడి విజయస్తంభం నటబడిందా అన్నట్లు తెల్లని ,పచ్చని కాంతుల కలయిక నన్ను సంతోష పెట్టాలి

ఇప్పటిదాకా వైరాగ్యం లో ఉన్న శివుడు ,పార్వతీ దేవి తపస్సుతో శివుడిలో కాముడు పునర్జన్మ పొందాడు .అలాంటి శివుడిని కామంతో గెలిచాననే ధీమాతో విజయ స్తంభం నాటబడి తెలుపు పసుపు కాంతులు సమాగమమైనాయి .పార్వతి దేహచ్చాయ పసుపు. శివునిది తెలుపు .వీరిద్దరి పేర్లు చెప్పకుండా కవి ఈ రంగుల సమాగమం చెప్పాడు చమత్కారంగా .రజతాద్రి మీద మన్మధుడు నాటిన విజయ స్తంభం బంగారు వర్ణం కలది .బుద్ధి అనే గుహకు ప్రతీక అయిన వెండి కొండపై ఉన్న గుహలో శివ పార్వతుల శ్వేత పీత సమాగమం జరిగింది .ఇది ఆ౦తరంగికమని  నిహిత అనే శబ్దం సూచిస్తోంది .మన్మధుడు అరవింద ,చూతక అశోక ,నవ మల్లిక ,నీలోత్పలం అనే పంచ పుష్ప బాణుడు .మన్మధుని విజయం అంటే పంచ బాణ విజయమే .అంతటి ప్రభావం ఆ పుష్పబాణాలకున్నది అని అర్ధం .ఈ శ్లోకం రదోద్ధత వృత్తం లో రచింప బడింది . తరువాత శ్లోకం లో కవి వారి సమాగమం తన మనసులో జరగాలని కోరాడు .

4-‘’అన్యోన్య నైర్మల్య సమృద్ధి భాజో –రన్యోన్య దేహ ప్రతి బి౦బనేన

తేజోర్ధనారీశ్వర యోర్ధ్వ యోసత్ –ప్రకాశ మానమ్మమ మానసేస్తు’’

భావం – పార్వతీ పరమేశ్వరుల సంయోగం లో ఒకరి శరీరంలో మరొకరి శరీరం ప్రతి ఫలిస్తోంది .అలాంటి అర్ధనారీశ్వర తేజం నా మనసులో శాశ్వతంగా ప్రకాశించాలి .

ఇద్దరి శరీరాలు అత్యంత నిర్మలం కనుక ఈ ప్రతిఫలించటం కుదిరింది .వారి తేజం ‘’సత్త’’అంటే త్రికాలా బాధ్యం అని మంచిదని అర్ధాలు .శివ పారమ్య దృష్టిలో అమ్మవారు ప్రతి బింబ పాత్రగా ఉంటుంది .శక్తి పారామ్య దృష్టిలో శివుని నుంచి అమ్మవారు తొలగిపోతే ఆయన శవమే కాని  శివం కాదు  .నిర్గుణ కైవల్య అద్వైత వాసన కలిగి దానికోసం ప్రయత్నించేవాడు ‘’ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా ‘’అనేదాని ప్రకారం ఈశ్వరోపాసన చేయాల్సిందే

మరో శ్లోకం లో శివుడు శివా ను పరిహసి౦చటం చెప్పాడు –

5-‘’శ్రీ గౌరీం ప్రణయేన జాతు కుపితాంవైముఖ్య సంధాయినీ –మంగీకార మకుర్వతీమను నయైః కందర్ప చేస్టాస్వలం

సంక్రాంతః కిమురోజ యోర్హ్రుది చ తేపాషాణ భారః పరం –తాతస్యేతి నవ దంశ్చిరాదభి ముఖీ కుర్వంచ్చివః పాతునః’’

భావం –పార్వతి ప్రణయం తో కోపం వచ్చి మన్మధ క్రీడకు విముఖురాలైంది .శివుడు ఎన్నో అనునయ వాక్యాలు పలికి ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు .ఆమె అంగీకరించలేదు .అప్పుడు స్థాణువైనశివుడు ఆమెతో ‘’నీ స్తనాలకూ నీ హృదయానికీ కూడా  నీ తండ్రి పాషాణత్వం సంక్రమించిందేమో‘’అని నిష్టూరంగా అన్నాడు .చివరికి ఆమెను ప్రసన్నం చేసుకొని సుఖించిన శివుడు మమ్మల్ని కాపాడాలి .

స్తనాల కాఠిన్యం స్త్రీకి సహజం  అందం శోభా కూడా. కాని హృదయ కాఠిన్యంఆమెకు సహజమైంది కాదు .ఈ రెండు కాఠిన్యాలుఆమెకు తండ్రి హిమగిరి నుండి సంక్రమించాయి అనటం చమత్కారం తండ్రి లక్షణాలు కూతురికి రావటం సహజమే కాక అభి వృద్ధి సూచకం కూడా .

అసలే తాండవ లోలుడు .ఇప్పుడు భార్య మనసు స్వాధీనమైనది .ఇక రెచ్చి పోయి శివుడు నాట్యం చేశాడు ఎలా ?

6-‘’దిం –ధిమి –ధిమి –ధిమి –శబ్డై-ర్బందుర పద మందరం నటంతం తం

ఝం ఝణఝణ ఝణ రావా –రంజిత మణి మండనం శివం వందే ‘’

భావం –దిం ధిమి ధిమి ధిమి అనే మృదంగ ధ్వనులకు అనుగుణంగా ఝం ఝణ ఝణ ఝణ అనే శబ్దాలతో అక్కడ సమావేశమైన వారందరికీ ఆనందం కలిగేట్లు ,రంజింప జేసే భూషణాలు కలిగి ఉన్న నాట్యమాడే శివుని సేవిస్తాను .

శివుని దయాగుణం అపరిమితం అని చెప్పే శ్లోకం

‘’యః శ్రీకరం బాలమంత్ర తంత్రం –క్రీడాదరాత్ స్వంపరి పూజ యంతం

శివః క్రుతార్ధం కృతవాం స్త ధైన-మయం కిమాత్మీయ ముపెక్షతే మాం ‘’

భావం –పూర్వం శ్రీకరుడు అనే పిల్లాడు మంత్రం తంత్రం లేకుండా ఆదరం గా శివుడిని పూజించాడు .ఆబాలుడి భక్తికి మెచ్చి శివుడు అతడిని క్రుతార్దుడిని చేసినట్లు నన్ను క్రుతార్దుడిని చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని కవి ప్రశ్నించాడు శివుడిని .

శివ పంచాక్షరీ మంత్రం మహాత్మ్యాన్ని వర్ణిస్తున్నాడిప్పుడు –

8-యదోప దిస్టా శ్రవణే శివస్య –పంచాక్షరీ గార్గ మునీశ్వ రేణ

నిర్యాయ భూపస్య తధైవ గాత్రాత్ –కాకాత్మనా పాప చయః ప్రదగ్ధః ‘’

భావం –ఒకప్పుడు ఒక రాజు చెవిలో గర్గమునీశ్వరుడు శివ పంచాక్షరీ మంత్రం ఉపదేశిస్తే ,ఆయన శరీరం లో నుంచి పాపం అంతా కాకి రూపం లోబయటికి వచ్చి,ఆయన పాప సమూహం కాలిపోయింది

అనేక పాపాలు చేస్తేనే కాకి జన్మ వస్తుంది .అందుకే ‘’కాకోపి జీవతి చిరాయ బలిం చ భుక్తే –పాపీ చిరాయచిర జీవ కాకః ‘’అనే సామెత లోకం లో వచ్చింది ‘

ప్రశ్న ,సమాధానం రూపం లో  శివమహిమను వర్ణించే శ్లోకం –

9-‘’కందర్ప మనం వక్తి –పురాణా మమరద్విషాం-కామాశాం కృతవాన్ వ్యర్దాం –క్షణాత్ కోపేన శంకరః ‘’

భావం –పురాణాలు పుర అనే రాక్షసుని దర్పాన్ని అణచిన వాడు ఎవడు అని చెప్పాయి ?కందర్ప దమనుడైన శివుడిని అని సమాధానం .కోపం తో క్షణకాలం లోనే ఆశను వ్యర్ధం చేసినది ఎవరు ?కాముడని పిలువ బడే మన్మధుని ఆశను క్షణ కాలం లో నీరు కార్చిన శివుడు అని జవాబు .

కం దర్ప దమనం –లో కం అంటే ఎవరిని అని అర్ధం. కలిపి తే కందర్ప దమనం –అంటే మన్మధ దహనం చేసిన వాడు అనే అర్ధం వస్తుంది .అలాగే పురా అంటే త్రిపురాసురపురాలు .పురాణామామర ద్విషా అనికలిపితే పుర రాక్షస వినాశనకారి అనే అర్ధం

చివరగా శివుని నమ్మిన వాడికి యే భయం లేదని చెప్పే –శివ పంచాక్షరీ బీజాక్షర ప్రారంభంగా చెప్పిన విశేష శ్లోకాలు

10-‘’న జననీ జన గర్భ నివాసజం –న చ నిరంతర సంసృతి జమ్మమ

న యమ దూత కృతం చ భయం యతో –నవరతమ్మమ దైవత మీశ్వరం ‘’

భావం –నా దైవం  ఈశ్వరుడు కనుక నాకు తల్లికడుపులో మళ్ళీ పుడతానన్న భయం కాని ,సంసార భయం కాని ,యమ దూతల వలన భయం కానీ లేదు .

ఈశ్లోకం లో ఒక విశేషం ఉంది .శివ పంచాక్షరీ మంత్రం లోని నకారం తో నాలుగు పాదాలను నడపటం .మిగిలిన శ్లోకాలలో కూడా ఈ విశేషం గమనించండి

11-మహా వీర రుద్రమ్మనో జాతి రౌద్రం –మహీ భ్రుత్కుమారీ మనః పద్మ మిత్రం

మఖ ద్వంసినం సమ్మత శ్రీకరమ్మ –న్మనో మందిరం మహా దేవ మీడే’’

భావం –మన్మధుడికి అతి భయం కలిగించిన శత్రువు మహా వీర రుద్రుడు .కానీ పార్వతీ దేవి మనస్సు అనే పద్మానికి మిత్రుడు అంటే సూర్యుడు .దక్ష యజ్న ధ్వంసకుడు ,ఇస్టులకు ఇష్టసంపదలిచ్చేవాడు ,నా మనో మందిరం లో నివసించే మహాదేవునికి వందనం .

12-‘’శివేపరాప హ౦తారం  -శివ సందాయినం పరం

శివానంద కరం శాంతం –శివం సేవే నిరంతరం ‘’.

భావం –అమంగళాన్నిపోగొట్టి ,మంగళాన్నికలిగించే వాడు శివానందాన్నిచ్చే వాడు ,శాంతుడు ,ఉత్క్రుస్టుడుఅయిన శివుని సేవిస్తాను .

13-వాసుకీశ్వర విభూషిత కంఠం-వామ భాగ పరి పూరిత బాలం

వారణాస్యభిదా  పట్టణ వాసం –వామ దేవ మది దైవత మీడే’’.

భావం –కంఠం లో వాసుకి అనే సర్పేశ్వరుని ధరించి వామ భాగం లో బాల లేక బాలుడు కల కేశ పాశం తో,వారాణసి పట్టణమైన కాశీ లో నివశించే గొప్ప వాడైన వామ దేవ శివుని నుతిస్తాను .

14-‘’యదు నాద పద్మ భవ వాసవాదయో –యదుదార భావ గుణ నాయకాః శివం

యమ శాసనోగ్ర తర మాశ్రయ౦త్యహో –యమ నాద నాద మహా మాశ్రయామి తం ‘’

భావం –ఏకారణం తో యమశాసనాన్నివిని ఉగ్రుడైన శివుని ఉదార గుణాలకు నాయకులైన విష్ణు బ్రహ్మా ఇంద్రాదులు ఆశ్ర ఇస్తారో ,ఆ కారణంగానే నేను ఉమానాద శివుడిని ఆశ్ర యిస్తాను  .

ఈవిధంగా 5శ్లోకాలతో శివ పంచాక్షరి చెప్పి తరువాత దానిఅర్ధాన్ని వివరిస్తున్నాడు భరద్వాజ మహర్షికవి –

15-‘’నమః సృష్టి స్థితి లయాన్ –కుర్వతే జగతాం సదా

శివ యైక్యం గతా యాంతు –పరమానంద రూపిణే’’

భావం –ఎప్పుడూ లోకాలసృష్టి స్తితి లయాలు చేస్తున్న  పార్వతీదేవి  ఐక్యత తో,పరమానంద స్వరూపుడైన శివునికి నా నమస్సులు .

చివరగా అకార ,ఉకార ,మకారాలతో కూడిన ప్రణవాన్ని వర్ణిస్తున్నాడు –

16-‘’ఆది స్వరం తృతీయేన –సహితం బిందు సంయుతం

ధ్యాయామి హృదయే యోగీ –ధ్యేయం కామిత మోక్షదం ‘’

భావం –కోరుకొన్న మోక్షాన్నిచ్చే ,యోగులచేత ద్యానింప బడే మూడవ స్వరమైన ఉకారం తో,బిందువు అంటే మకారం తో కలిసిన ఆది స్వరం అంటే ఆకారం తో ఉన్న ప్రణవమైన ఓంకారాన్ని మనసులో ధ్యానిస్తాను .

ఆధారం –భరద్వాజ మహర్షి రాసిన శ్రీశివ కర్ణామృతం కావ్యానికి శ్రీ దోర్బల విశ్వనాధ శర్మ గారి అర్ధ తాత్పర్య ‘’ఆస్వాదినీ వ్యాఖ్యానం’’.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం

శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం

భరద్వాజ మహర్షి శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి లో ఉన్న శివుడిని ఎనిమిది శ్లోకాలలో గొప్పగా వర్ణించాడు .అన్నీ శార్దూల వృత్తాలే .మకుటంగా ‘’నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’గా ఉంచాడు .వీటిలో శ్లేష వైభవం ఉంటుంది ప్రతి పదం రామ పరంగా ,శివపరంగా అర్ధం చెప్పుకోవాలి .అప్పుడే భావం అందుతుంది పండుతుంది.ఈఎనిమిది శ్లోకాలను ‘’రామాకృతీశ్వరాస్టకం’’అంటారు  .ఆ వైభోగాన్ని తిలకిద్దాం –

1-శ్రీ కంఠం స్పుట నీర స౦భవ దృశం వందారు కల్ప ద్రుమం-రత్నోద్భాస్వద హీన కంకణ ధరం బ్రహ్మాదిభిః సంస్తుతం

సత్యం చిత్తజ వైరి సంభ్రమ హరం తం పార్వతీ నాయకం –‘’నిత్యమ్మానసవాస మీశ్వర మహం ‘రామాకృతిం భావయే ‘’’

భావం –విషం కంఠంలో ఉన్న (శివుడు )లక్ష్మీ అంశ గల సీతాంకం పై ఉన్న (రాముడు )కమలాల వంటి కన్నులున్న ,నమస్కరించిన వారి కోర్కెలు తీర్చే దేవ వృక్షము వంటి వాడు ,రత్నాల కంకణం తో ప్రకాశించేవాడు ,బ్రహ్మాదులచే స్తుతింప బడేవాడు అయిన ఈశ్వరుడు ,నిత్యుడు ,మనసులో పుట్టే లోపలి శత్రువులను హరించేవాడు ,అందమైన ఆకారం లేక రాముని ఆకారం గల పార్వతీ పతికి నమస్కారం .

ఇందులో మానస వాస స్పుట వీరసంభవ దృశం వందారు కల్పద్రుమ ,సత్య ,ఈశ్వర శబ్దాలు శ్రీరామ శివులిద్దరికీ చెందుతాయి .

2-‘’లోకేశం బహురాజ రాజ వినుతం పౌలస్త్య సంతోషధం –సీతా రమ్య పయోదరాది కల సచ్చ్రీ కుంకు మాలం కృతం

భవ్యం సధ్వజ జాత నంద పరం కైలాస నాదం ప్రభుం –నిత్యమ్మానసవాసమీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –లోకేశ్వరుడు ,ఎక్కువగా కుబేరుని చేత స్తుతింప బడేవాడు ,పులస్త్య వంశ సంజాతుడైన రావణునికి (శివుడు )విభీషణుడికి (రామ ) సంతోషం కలిగించి ,నాగేటి చాలుకు మనోహరమైన మేఘాల మెరుపు కాంతి అనే కుంకుమ చేత అలంకరింప బడిన ,మంచి వారైన బ్రహ్మ కుమారులకు ఆనందం కలిగించటానికి ఆసక్తడయ్యే ,మనసులో నివసించే ప్రభువైన ,సమర్ధుడైన రాముని ఆకారం లో ఉన్న కైలాస నాధుని భావిస్తాను .

రామాకృతి శబ్దం లో రామ అంటే స్త్రీ ,అంటే పార్వతి అంటే అర్ధనారీశ్వరత్వం .రామ పరంగా నాగేటి చాలులో దొరికిన సీత అని అర్ధం ‘

3-‘’కౌసల్యా వర నందనం గుణ యుతం ,హంసాన్వయోల్లాసకం –కల్యాణం వరరాజ శేఖర మతి ప్రాలేయ శైలాశ్రయం

బాణోత్దాత మహా గజాసుర శిరోభార మ్మునీన్ద్రస్తుతం –నిత్యమ్మానస వాస మీశ్వరమహం రామాకృతిం భావయే ‘’.

భావం –కౌసల్యకు వరమిచ్చి సంతోషింప జేసినలేక కౌసల్య శ్రేష్ట పుత్రుడైన ,గుణాలతో ఉన్న ,జ్ఞానుల కులాన్ని ఉల్లసింప జేసే ,(శివుడు )లేక సూర్య కులాన్ని ఉల్లసింప జేసే (రాముడు ),మంగళ స్వరూపుడైన చంద్రుడు శిరో భూషనంగా ఉన్న (శివుడు )లేక రాజులకు శిరో భూషణం లాంటి వాడైన (రాముడు ),గొప్ప కొండ అయిన కైలాసం లో నివసించే లేక ఉత్తర ధృవం నుంచి దక్షిణానికి వెళ్ళేటప్పుడు మంచుకొండ అయిన హిమాలయాన్ని దాటిన తర్వాత వచ్చే అయోధ్యా పట్టన వాసి అయిన రాముని ,బాణాలతో గజాసుర సంహారం చేసి పార్వతికి (శివుడు )పదితలల రావణుని బలమైన బాణం తో చంపిన (రాముడు )మునీన్ద్రులచే స్తుతింప బడిన ,సుందరమైన మనసు నివాసంగా కల,రామ ఆకారం లో ఉన్న ఈశ్వరుని ఉపాసిస్తాను .

కౌసల్య శివుని ఉపాసిస్తే వరంగా రాముడిని కుమారునిగా అనుగ్రహించాడని పురాణ కద ఉంది .విల్లూ నారి ఉన్నవాడు రాముడు దయా గుణమున్నవాడు శివుడు .హంసాన్వయం అంటే జ్ఞానుల సముదాయమైన మునీశ్వరులు అని శివ పక్షంగా ,సూర్య వంశం లో అని రామ పక్షంగా అర్ధం .ఇద్దరూ కల్యాణం ఇచ్చేవారే .వర రాజ శేఖరం –నెత్తిమీద చంద్రుడున్నవాడు శివుడు రాజ వంశాలలో శిఖరాయమైన వాడు రాముడు .అతి ప్రాలేయ శైలం అంటే ఉత్తరాన మంచుకొండ దాటితే వచ్చేది కైలాసం అని శివుని పక్షాన ,ఉత్తర ధృవం నుండి దక్షిణానికి వెళ్ళేటప్పుడు హిమాలయం దాటితే వచ్చేమొదటి అయోధ్యా పట్టణం అని రామ పరంగా అర్ధం .’’శ్రీరామః శ్యామలాదేవి ‘అనే తాంత్రిక మంత్రం ప్రకారం శ్రీరాముడు శక్తి అవతారం కనుక హరి హర అవతారం లో మోహినిగా శివుని కామించి ‘’హరిం పరం తమను యంతి దేవాః’’అనే వేద వచనం ప్రకారం కూడావిష్ణువు రామ అంటే స్త్రీయే

4-‘’హస్త స్వీకృత బాణ ముజ్జ్వల తనుం భాస్వ ద్విభూతేర్ధధం –నిత్యం సద్వ్రుష వాహ మందక రిపుం రుద్రాక్ష మాలాధారం

నానా శేష శిరః కిరీట విలసన్మాణిక్య శోభోజ్జ్వలం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –బాణాసురుని చేబట్టిన (శివుడు )లేక బాణం చేతిలో ఉన్న (రాముడు )ప్రకాశించే బూడిద ఒంటి నిండా ఉన్న లేక ప్రకాశించే శరీరం కల ,ఎద్దు వాహనంగా ఉన్న లేక మంచి ధర్మాన్ని ధరించిన ,అంధ కాసుర శత్రువైన లేక గుడ్డి ద్రుతరాస్త్రుడికి శత్రువైన (కృష్ణావతారం ),రుద్రాక్ష మాలలు ధరించే లేక దుఖాన్ని పోగొట్టే జపమాల ధరించిన ,అనేక రాజుల శిరోమణులచేత ప్రకాశించే పాదాలుగల నిత్యుడైన మనసు నివాసంగా ఉన్న రామాకృతిగల లేక రామ వంటి ఆకారం కల మహేశ్వరునికి వందనం .

5-‘’అత్య౦తానిల సూను వందిత పదం శ్రీ చందనాలంకృతం-కాంత మ్మోహన వాలి నాశ కరం సద్ధర్మ మార్గా కరం

విశ్వామిత్ర సుయోగ వర్ధన మహోత్క్రుస్ట ప్రభా దర్శకం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే .

భావం –ఎక్కువగా ఆంజనేయ లేక భీముని చేత నమస్కరింప బడే పాదాలు కలవాడు ,శ్రీ చందనం చేత అలంకరింప బడేవాడు ,సుందర మోహ రూపుడైన గజాసురుడు లేక వాలి ని నాశనం చేసినవాడు ,విశ్వామిత్రుని మంచి యాగాన్ని కాపాడిన వాడు లేక విశ్వానికి అమిత్రుడు అయిన దక్షుని యాగాన్ని ధ్వంసం చేసినవాడు మహోత్క్రుస్ట ప్రభావాన్ని దర్శి౦ప జేసే నాశనం లేని మానసవాస రామాకృతి శివునికి వందనం

శివుడికి లయకారుడుకనుక భీముడు అనే పేరుంది  .కుంతీ దేవి భీమనామ శివుని  ఆరాధించి పొందిన కుమారుడికి భీముడు అనే పేరు పెట్టింది .అనిలుడు అంటే వాయువు శివుని అస్టమూర్తులలో వాయువు ఉన్నాడు .గజాసురుడు వాలి ఇతరులను మొహం లో పడేసేవారే .విశ్వామిత్రుడు గాది తనయుడు .శివుడికి భాగం ఇవ్వకుండా యజ్ఞం చేసిన దక్షుడు విశ్వానికి అమిత్రుడు .శివుడికి మంచిగంధం పూత ఇష్టం .రాముడు వనవాసం పూర్తీ అయ్యాకే చందన చర్చితుడు అయ్యాడు .

6-‘’దీవ్య ద్రశ్మి తమోను దర్దవిలసత్సద్భాను పట్టం విభుం –శాంతం పూర్ణ నభో౦శుకం నిజ జనాధారం కృపాసాగరం

దేవేశం గుహ మానసా౦బుజ దినాదీశం ప్రియం శంకరం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –ప్రకాశించే కిరణాలతో చీకటిని పోగొట్టే అర్ధ చంద్ర ఫాలం కల,లేక సూర్యుడు కట్టుకొన్న పట్టం కల పూర్ణాకాశమేవస్త్రంగా ఉన్న లేక పూర్ణాకాశంవంటి నీలకాంతి ఉన్న ,తనవారికి ఆధారమైన ,దయకు సముద్రుడైన ,దేవతలకు గురువైన కుమారస్వామి లేక భిల్ల రాజైన గుహుని మనస్సు అనే కమలానికి సూర్యుడైన  ,ప్రేమకల సుఖాన్ని  ఇచ్చే శాశ్వతుడైన రామాకృతి గల శివుని భావిస్తాను .

రాజ్యాభిషేక సమయం లో ఫాలానికి కట్టే పట్టు వస్త్రాన్ని ‘’పట్టం’’అంటారు .శివుడికి చంద్రుడే అలాంటి పట్టం .అర్ధ చంద్రుడుకనుక అర్ధ విలసత్ అన్నాడు .ప్రకాశించే కిరణాలవాడు కనుక దీవ్యద్రశ్మి .పూర్ణ నభోమ్శుకం శివుడు దిగంబరుడని సూచిస్తుంది .గుహ అనే మాట కుమారస్వామికి గుహుడికి వర్తిస్తుంది .

7-‘’కామం లక్ష్మణ హస్త పంకజ కృత ప్రేమాది పూజాద్రుతం –సానందం భరత ప్రమోద నిలయం ధీరం సుమంత్రాదిపం

హర్తారం ఖర దూషణాహృతి పదం సాకేత వాసాదరం – నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –లక్ష్మణుని హస్తకమలాలచే చేయ బడిన  ప్రేమ మొదలైన పూజలయందు ఆదరంకల ,ఆనందం తో భరతుని సంతోషానికి స్థానమైన ,ధీరుడైన మంచి మంత్రాలకు ప్రభువైన (శివుడు )లేకసుమంతుడనే మంత్రికి ప్రభువైన (రాముడు ),సంహారకుడైన ,అతి కఠిన నిందలను  స్వీకరించే స్థానమైన (శివుడు) లేక ఖర దూషణాది రాక్ష సంహారానికి స్థానమైన (రాముడు ),జ్ఞానం తో కూడిన నివాసం లో ఆదరమున్న రామాకార శివుని పూజిస్తాను .

విష్ణువు పురుషుడు అయినా స్త్రీ భావం తో మోహత్వం పొందిన శివుని సంభోగ సుఖం తో ‘’భైరవు’డి’’ని కన్నాడు.శివుడు త్రిముర్త్యాత్మక రూపమైనట్లే రాముడు కూడా .లక్ష్మణ పూజ రాముడు గ్రహిస్తే రామ శివలింగ ప్రతిష్ట శివునికి ప్రీతి కలిగించింది .శివుడికి కైలాసం యెంత ఇష్టమో రాముడికి సాకేత పురి అంత ఇష్టం .

8-‘’పాదాక్రాంత విభీషణం రణ ముఖే సద్రత్న సింహాసనా –రూఢం భీమ ధనుః ప్రభంజ నవర శ్రీ కీర్తి మాలాధరం

కుందానంద నమంద హాస మతులం శ్రీరామ చంద్రం సదా- నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –యుద్ధం లో చేతు లేటత్తేసి నమస్కరించిన వారికి అభయ మిచ్చేవాడు (శివుడు )లేక యుద్ధం లో శరణాగతుడైన విభీషణుడు కలవాడు(రాముడు ),రత్న కిరీట దారి,యుద్ధం లో అరి వీర భీకరుడు అయిన అర్జునుని ధనుస్సును భేదించి ,వరమాలను అనుగ్రహించినవాడు (శివుడు )శివ ధనువును భంజించి లక్ష్మీస్వరూప సీతను ఆమె వేసిన వరమాలను గైకోన్నవాడు (రాముడు )మల్లెమొగ్గల్లాంటి నవ్వుతో అందాన్ని సాటి లేని కాంతినీ ఇచ్చే రాముడు లేక చంద్ర శేఖరుడైన శివుడు మానసావరణానికి ప్రభువైన రామబ్రహ్మం  లాగా క్రియా రహితుడైన  రామాకృతి కల ఈశ్వరునిభావిస్తాను

అర్జునుని అనుగ్రహించాడు అనే కీర్తిమాల శివుడు ధరించాడు .రాముడు శివ ధనుర్భంగము చేసి వరశ్రీ ని అంటే సీతకు భర్తగా వరింప బడే కీర్తిని పొందాడు .ఇతరులు విరవలేని ధనుస్సును విరిచాడనే కీర్తిమాల రాముడు ధరించాడనిఅర్ధం .

ఆధారం –భరద్వాజ మహర్షి రాసిన శ్రీ శివ కర్ణామృతం కావ్యానికి శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారి అర్ధతాత్పర్య వ్యాఖ్యానం

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శివ కర్ణామృతం లో నవ శివ మూర్తి వైభవం

శ్రీ శివ కర్ణామృతం లో నవ  శివ మూర్తి వైభవం

భరద్వాజ మహర్షి రాసిన శ్రీ శివ కర్ణామృతం కర్ణ పేయం .అందులో తొమ్మిది   మంది శివ స్వరూపాలను మహర్షి అద్భుతంగా వర్ణించాడు ఆ సోయగాలనే మనం దర్శించ బోతున్నాం .మొదటగా ఆయన దాత్రీ రూప శివ మూర్తి వర్ణన చూద్దాం –

1-‘’దాత్రీ మనంతాం-స్థిరాం విశ్వంభరాం ధరాం

గాం గోత్రామవనీ మాద్యా –మ్మూర్తిం శంభోర్భజామ్యహం ‘’

తాత్పర్యం –పోషించే అనంతమైన స్థిరమైన విశ్వాన్ని ధరించే గోవులాగా సాధువైన ,ఆవులకు ఆహార మిచ్చిన వారి భయాలను తొలగించి రక్షించే భూమి అనే శివుడిని ప్రధమ మూర్తిని సేవిస్తాను .ఈ మూర్తికి’’ శర్వుడు’’ అనే పేరు .అంగారకుడు కుజుడు అంటే భూమి పుత్రుడు అంటే ఈశ్వర తనూజుడు .శివుని ఫాల భాగం లోని చెమట బిందువులు భూమిపై పడగా అంగారకుడు పుట్టాడు .

శివుని నవ మూర్తులలో రెండవదైన జల మూర్తిని కవి వర్ణిస్తున్నాడు –

2-‘’అమృతం ,జీవనం ,వారి –కమలం సర్వతోముఖం .’

ద్వితీయ మస్య రూపం చ –భజే హం పరమేశితు’’

భావం –మరణం లేని బ్రతుకునిచ్చే ,బ్రహ్మ యొక్క వసతి రూప మలం అయినటు వంటి ,అన్ని వైపులా ముఖాలున్న పరమేశ్వరుని రెండవ రూపమైన జల మూర్తిని సేవిస్తాను .

జలం లేక పొతే జీవనం లేదు మరణమే .మన శరీరం లో వస్తి అనే మలం ఉంటుంది .బ్రహ్మ శివుడికి వస్తిమలం అవటం వలన నీటికి కమలం అనే పేరు వచ్చింది .నీరు అన్నివైపులా ప్రవహిస్తుంది కనుక సర్వతో ముఖం .ఈ జలమూర్తి శివుడికి ‘’భవుడు ‘’ అని పేరు .

ఇక అగ్ని రూప శివుని గురించి చెబుతున్నాడు మహర్షి .

3-‘’జ్వలనం ,పావకం ,దివ్యం –సువర్ణం ,కాంచనం,శుచిం

తృతీయ మూర్తిం తేజోహం –కలయే పార్వతీ పతేః’’

భావం –మండేది ,పవిత్రం చేసేది ,స్వర్గం లో ఉండేది ,మంచి రంగుతో ప్రకాశించేదీఅయిన పవిత్రమూర్తి శివుని మూడవ  మూర్తి అయిన తేజస్సును ధ్యానిస్తాను .

భూ ,జల శబ్దాలకు పైన చెప్పినట్లే ఇక్కడ అగ్ని కి  ఉన్న వివిధ నామాలను అర్ధ వంతంగా చెప్పాడు ‘జ్వలన ,పావక శుచి శబ్దాలు అగ్నికి పర్యాయ పదాలు సువర్ణ ,కాంచన శబ్దాలు బంగారానికి మారు పేర్లు .ఇవి తేజో భూత అంతర్గతాలు అని తార్కికులు అంటారు .అందుకే తేజో మూర్తి వర్ణనలో స్థానం పొందాయి ఈ పదాలు .స్వర్గం లో ఉండే దేవతలకు అగ్ని రూపం దివ్యం .ఈఅగ్ని రూపం లేక తేజో రూపం ధరించిన శివుడిని ‘’పశు పతి ‘’అంటారు .

ఇప్పుడు నాలుగవదైన వాయు  మూర్తి ని వర్ణిస్తున్నాడు మహర్షి –

4-సదాగతిం ,జగత్ప్రాణం-మరుతం మారుతం సదా

చతుర్దంత మ్మూర్తి భేదం –శంకరస్య  భజామ్యహం ‘’

భావం –ఎప్పుడూ కదులుతూ ,జగాలకు ప్రాణాధారమై ,ఇంద్రుని చేత ‘’ఏడవ వద్దు ‘’(మారుద )అని చెప్పబడిన ,చిన్న చిన్న వాయువులతో కలిసి మహా వాయువైన శివుని నాలుగవ మూర్తి వాయువును సేవిస్తాను .

సదాగతి ,జగత్ప్రాణ,మరుత్ ,మారుత శబ్దాలు వాయువుకు ప్రసిద్ధాలు .కశ్యప ,దితులు భార్యా భర్తలు ఇద్దరూ ఒక సాయం వేళ ఉద్రేకానికి లోనై ‘’చీకటి తప్పు’’ చేశారు .అప్పుడు కశ్యపుడు ఒక ఏడాది పాటు పగటి పూట నిద్ర పోకూడని వ్రతం చేయిస్తుండగా ఇంద్రుడు వ్రత భంగం చేయటానికి మారు వేషం లో వచ్చి ఆమెకు సేవలు చేశాడు .పొరబాటున ఒక రోజు ఆమె పగటి నిద్ర పోగా గర్భం లో ప్రవేశించి పిండాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంటే ,గర్భస్త శిశువు ఏడుస్తుంటే ‘’మారుద మారుద ‘’అని ఇంద్రుడు ఓదార్చాడు .ముక్కలు ముక్కలుగా పుట్టిన దితి పుత్రులకు మరుత్తులు అనే పేరు వచ్చింది .వాయురూపశివ మూర్తిని ‘’ఈశానుడు ‘’అంటారు .

తరువాత ఆకాశ  రూప శివమూర్తి వర్ణన

5-‘’ఆకాశం ,పుష్కరం నాకం –అనంతం శబ్ద కారణం

పంచమం మూర్తి రూపం చ-శంభో సేవే నిరంతరం ‘’

భావం –బాగా ప్రకాశించేది ,దేనినీ అంటనిది  ,దుఃఖ రహితమైనది ,అంతంలేని శబ్దాన్ని పుట్టించేది అయిన అయిదవ ఆకాశ మూర్తి శివునికి వందనం .

ఆకాశం ,పుష్కరం అనంతం అనేవి ఆకాశానికి పర్యాయ పదాలు .నాకం అంటే స్వర్గం అనే అర్ధం ఉన్నా అది ఆకాశానికి కూడా చెందుతుంది .ఆకాశం యొక్క లక్షణం శబ్దం . గుణం అనేది ద్రవ్యం నుండే వస్తుంది గుణానికి ద్రవ్యమే కారణం .శబ్ద గుణం ఆకాశ ద్రవ్య రాశి నుంచి వచ్చింది అనే తర్క వాక్య ప్రమాణం ప్రకారం ఆకాశం శబ్ద కారణం అయింది .ఈ ఆకాశ శివ మూర్తికి ‘’భీమ ‘’అని పేరు .

ఇప్పుడు ఆరవ సూర్య శివ రూపాన్నిగురించి చెబుతున్నాడు భరద్వాజ కవి

6-‘’ప్రభాకర మినం  హంసం –లోక బంధుం తమో పహం

త్రయీ మూర్తిం మూర్తి భేదం –షష్ఠం శంభో ర్భజామ్యహం ‘’.

తాత్పర్యం –కాంతికి గని యై ,దాన్ని వెలువరించే ప్రభువైన హంస మంత్రం స్వరూపుడైన (హం –స అనే రెక్కలు గల )లోక బంధువైన ,చీకటీ అజ్ఞానాలను తొలగించే శివుని ఆరవ మూర్తి అయిన సూర్యుని సేవిస్తాను .

రవం అంటే ధ్వని .ధ్వని0 చేవాడు కనుక సూర్యుడిని రవి అంటారు..అద్వని ఓంకారమే ..ఓంకారం లోని అ కార ,ఉకార మకారాలనుండి రుక్ యజుర్ ,సామ వేదాలు ఉద్భవించాయి .సూర్యుడు ఆ వేద స్వరూపం కనుక త్రయీ మూర్తి అయాడు .ఈ త్రయీ మూర్తి శబ్దము చేత చెప్పబడ్డాడు ‘’యస్య నిస్శ్వసితం వేదాః’’అనే శ్రుతిని బట్టి ప్రణవం విస్తృతి యై వేదమైంది .’’సోహం ‘’అనేది రహస్యం అందుకని సోహం అనకుండా హంస మంత్రం గా చెప్పారు .’ఈ మంత్రం ‘’అహం సః’’అంటే ‘’నేనే ఆ బ్రహ్మాన్ని ‘’అని తెలియ జేస్తుంది .భగవంతుని  నిశ్వాసం సృష్టి అని ఉచ్చ్వాసం ప్రళయం అని అందరికి తెలిసిందే .భగవంతుని ఉపాసనకు ప్రతీక సూర్యుడు హంస శబ్ద వేద్యుడు .మానవులు ఉచ్చ్వాస నిస్శ్వాస రూప హంసం  రోజుకు ఇరవై ఆరు వేల సార్లు అప్రయత్నంగా జపిస్తారు దీన్ని జపం కాని జపం’’ అజపా జపం’’అంటారు లేక అజపా గాయత్రి అంటారు .గాయత్రి మంత్రం లోని మూడు పాదాలు రుక్ యజు సామ రూపాలు .ఇదే ‘’సోహమస్మి ‘’అనే మహా వాక్యానికి విస్తారమైన రూపం .అస్మి లేక పోయినా సోహం అనేది. జీవేశ్వర అభేదాన్ని సూచిస్తుంది .గాయత్రి హంస మంత్రార్ధాలు ఒక్కటే .ఈ రవి రూప శివుడినే  ‘’రుద్రుడు ‘’అంటారు .

దీనితర్వాత ఏడవ చంద్రరూప శివ వర్ణన చేశాడు మహర్షి

7-‘’శుభ్రాంశు సోమమమృత –కరం చంద్ర మసం సదా

కలానిదిం మూర్తి భేదం –సప్తమం శూలినో భజే ‘’.

భావం –తెల్లని కిరణాలతో పాటు ఉమ అనే షోడశ కళ తో కలిసి ,అమృతం అంటే మోక్షాన్ని కలిగిస్తూ ,ఆహ్లాదమిస్తూ ,రమింప జేసే చంద్ర కళానిధి అయిన శివుని  ఏడవ మూర్తిని భజిస్తాను .

ఉదయాన సూర్య ,చంద్రులకాంతి ఎర్రగా ,మధ్యాహ్నాన తెల్లగా ,సాయం వేళ మళ్ళీ ఎర్రగా ఉండటం సహజం .కాని మధ్యాహ్న సూర్యుడు రక్త కిరణుడు గానే భావిస్తారు .ఆహ్లాదమిచ్చే చంద్రుడిని శుభ్రా౦శువు అంటారు .తిధులు 15.కళలు కూడా 15.కాని సమస్టికళ ను ‘’అమ ‘’అంటారు .అంటే ఆతి తక్కువ కాంతి .చంద్ర కాంతి లేని అమావాస్యను ‘’కుహు ‘’అంటారు .చంద్ర స్పర్శ లేని షోడశ కళా సమస్టి అయిన అమావాస్య ను ‘’మహా సప్త దశి దేవి ‘’గా భావిస్తారు దీనికి తంత్ర శాస్త్రం లో ‘’షోడశి ‘’అన్నారు షోడశి చంద్రునికి అది దేవత గా ఉన్న చంద్రునికి ‘’సోమ ‘’అని పేరు .దీనినే అమృత కళ అన్నాడు భవ భూతి .-‘’వందే మహి చ తం వాణి మమృతా మాత్మనః కలాం’’.చంద్ర రూప శివుడిని ‘’మహా దేవుడు ‘’అన్నారు .

శివుని ఎనిమిదవ యజమాన  రూప మూర్తి గురించి చెబుతున్నాడు భరద్వాజుడు

8-‘’ఆహితాగ్నిం యాగా కారం –యజ్వనం సోమ యాజినం

అష్టమం మూర్తి సంభేద –మస్టమూర్తే ర్భజామ్యహం ‘’

భావం –అగ్న్యాధానం ,యాగం దేవ పూజ ,సోమ యాగం చేసే శివుని ఎనిమిదవ రూప మైన యాజమాన మూర్తినిస్మరిస్తాను .ఈ ఎనిమిదవ యాజమాన రూప శివుడిని ‘’ఉగ్రుడు ‘’అంటారు

తరువాత యాజమాన్యాన్ని వదిలేసినముని మూర్తిగా శివుని వర్ణిస్తున్నాడు

9-‘’హస్తద్వయేనా౦ఘ్రి తల ద్వయం స్వ-మూరుద్వయే సంపరి యోజ యంతం

పద్మాసనే రూఢ తరం జపంతం-మునిమ్మహేశమ్ముహు రాశ్రయామి ‘’

భావం –తన చేతులతో తన పాద తలాన్ని ,తొడలలో ఉంచి  ,పద్మాసనం లో కూర్చుని బాగా జపించే ముని అయిన మహేశ్వరుడిని మాటి మాటికీ ఆశ్ర యిస్తాను .

ఆధారం భరద్వాజ విరచిత శ్రీ శివ కర్ణామృతం కు శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారి తెలుగు చేత ,వ్యాఖ్యానం.

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144

 57  -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -3(చివరి భాగం )

     మళ్ళీ అమెరికాకు తిరిగి రాగానే యదా ప్రకారం ఒక ఫారం ను కొణి సాగు మొదలు పెట్టాడు .హాలిక కవి అయ్యాడు .మొదటగా న్యు హాంప్ షైర్లోని ఫ్రాన్కోనియా వద్ద కొండ ఎక్కే మార్గం లోను తర్వాత  వెర్మాంట్ లో షా,ఫ్ట్స్ బరీ ,కాంకార్డ్,,కార్నర్స్ ,రిప్టన్ లలో  కొన్నాడు .డబ్బూ పోయీ శనీ పట్టే నన్నట్లు చేతులు కాల్చుకోవతమేకాని పెన్నీ రాబడి రాలేదు .మళ్ళీ లేక్చరింగ్ చేబట్టి ‘’కల్చర్ అగ్రి కల్చర్ కు ఊతమిస్తు౦దను’’ కొన్నాడు .చాలా ప్రతిభావంతంగా ,యాదృచ్చికంగా ,అతి సహజంగా మాట్లాడే నేర్పున్న వాడు కనుక శ్రోతలను బాగా మెప్పించేవాడు .తన కవితల్ని వినిపించే వాడు వాటితో స్థానిక కధలకు ప్రచారం జరిగింది .అనేక గ్రంధాలు ,చాటువులు వినిపించి అలరించేవాడు .మళ్ళీ కాలేజి లో చేరాడు ఈ సారి విద్యార్దిగానో విద్యా వేత్తగానో కాదు ‘’పోయెట్ రెసిడెన్స్ ‘’గా కాంపస్ ఇంఫ్లుఎన్స్ గా ,ఒక విధంగా ‘’పొయెటిక్ రేడి యేటర్’’గా చేరాడు .40వ ఏటనుండి అనేక విద్యా సంస్థలలో ఇలాగాడిపి ,మిచిగాన్ లోని డార్ట్ మౌత్ లోను ,ముఖ్యంగా మీసా చూసేట్స్లోని ఆమ్ హీరస్ట్లో ఉన్నాడు

  నార్త్ ఆఫ్ బోస్టన్ ప్రచురణ తర్వాత ఇక ఆపు లేకుండా కవిత్వ పఠనం,రచనలలో మునిగిపోయాడు .రాసినది ప్రతిదీ స్వీయానుభవం టో భావ తీవ్రతతో రాశాడు .అవసరమైన చోట్ల విషాద మలుపులు పెట్టేవాడు ..కొన్ని సార్లు ఆయన కవిత్వం కబుర్లు చెప్పేది .మరికొన్ని సార్లు వాటి బాణీలను అవే కట్టుకొని బయట పడేవి .చాలాసార్లు మాట్లాడుతూ పాటలతో పలకరించేవి .1916లో ‘’మౌంటేన్ ఇంటర్వల్ ‘’ప్రచురించాడు .అందులో ‘’యాన్ ఓల్డ్ మానస్ వింటర్ నైట్ ,’’బిర్చేస్ ‘’’’ఫైర్ అండ్ ఐస్ ‘’వంటివి అద్భుతమనిపిస్తాయి .చాటువులలో నిరుత్సాహ భావాన్ని పొదిగే వాడు .ఉదాహరణకు –

‘’Some say the world will end in fire –some say in ice –from what I have tasted of desire –I hold with those who favor fire -.But if it had to perish twice –I think I know enough of  hate –To say that for destruction ice –is also great –And would suffice ‘’

  ఫ్రాస్ట్ ప్రజాకవి అయిపోయాడు బిరుదులూ ,గౌరవాలు వచ్చి పడుతున్నాయి .’’నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’బంగారు పతకమిచ్చి సత్కరించింది .అనేక సంస్థలు విద్యాలయాలు ఆహ్వానించి సన్మానించాయి ..నాలుగు సార్లు పులిట్జర్ బహుమతి పొంది ,రికార్డ్ సృష్టించాడు .ఈ గౌరవాలు ఆదారాలు ఆయన కవిత్వానికి ఆటంకం కాలేదు .వీటి గురించి తన మొదటి పుస్తకం లోనే ‘’They would not find me changed from him they knew –only more sure of all I thought was true ‘’అని రాసిన నిర్లిప్తుడు ఫ్రాస్ట్ .పొగడ్తల హోరు విజ్రుమ్భించినా ,అతని వ్యతిరేకులు మాత్రం  తన పాత అప్రయత్న విధానాన్ని బలి చేశాడు అన్నారు .ఇప్పుడు వాళ్ళ కళ్ళకు ఫ్రాస్ట్ ‘’Play with the role of a self conscious  homespun philosopher ‘’గా కనిపించాడు .ఫ్రాస్ట్ అభిమానులు నిత్య జీవితం లోని సమస్యలను వదిలి సంప్రదాయ వాడిగా ఉన్నాదన్నారు .అన్ని సంక్షేమ కార్య క్రమాలపై ఆయనకు ఉన్న తూష్ణీ భావాన్ని తెలియ జెప్పటానికి ఆయన రాసిన –‘’I have none of the tender than –thou –Collectivistic  regimenting love –with which the modern world is being swept ‘’పంక్తులను ఉదహరిస్తారు .’’నేను యువకుడిగా ఉన్నప్పుడు రాడికల్గా ఉండటానికి సందేహించా .కారణం ముసలి వయసులో కన్జర్వేటివ్ ను అయిపోతానేమోనని భయం ‘’అన్నాడు .ఎప్పుడు ఆయన సేఫ్ జోన్ లో ఉన్దేప్రయత్నమే చేశాడు అంటారు .ఆయనది క్రాకర్ బాక్స్ ఫిలాసఫీ అన్నారు .అయితే జీవించి ఉన్న యే అమెరికా కవీ ఫ్రాస్ట్ లాగా సామాన్య మనుషుల చర్యల గురించి రాయలేదు ‘’అన్నాడు ప్రముఖ విమర్శకుడు జారెల్ .’’వాళ్ళందరూ వాస్తవ వ్యక్తులు .వారిమాటలు,ఆలోచనలూ ,ఎమోషన్లూ యదార్ధాలే .ఇవన్నీ చదివితే ఫ్రాస్ట్ తానూ రాసిన పుస్తకాలలో లేడని ,యదార్ధ ప్రపంచం లోనే ఉన్నాడని తెలుస్తుంది .వస్తువుల  విషయాలలోని ఆహ్లాదం విషాదం ,నిరుత్సాహం ఆయనలోని వేదన అన్నీ అర్ధ వంతాలైన కవిత్వం రాశాడు. ఇంతకంటే ఎక్కువ న్యాయాన్ని సున్నితత్వానికి ,ప్రేమకు ,ఆనందానికి కలిగించిన వారు లేరు అన్నది పూర్తీ యదార్ధం .

   కవులు ముసలి వారైన కొద్దీ పాడాలనే అభిలాష తగ్గిపోతుంది కాని దీనికి విరుద్ధం ఫ్రాస్ట్ ..యాభై ,అరవై ఏళ్ళ మధ్య ఆయన వైవిధ్యం తారా స్థాయికి చేరింది .’’happiness makes up in height for what it lacks in length’’, ’’choose something like a star ‘’,the gift out right ‘’వంటివి ఎన్నో .వీటిలో ‘’కమిన్ ‘’చాలా చిన్నదిగా షార్ప్ గా ఉంది –

‘’As I came the edge of the woods –thrush music hark –now if it was dusk outside –inside it was dark

I was out for stars –I would not come in-I meant not even if asked-And I had not been ‘’

  ఫ్రాస్ట్ 80వ పుట్టిన రోజున ‘’ఎఫోర్ సేడ్’’అనే ఆయన కు ఇష్టమైన ఆయనే ఎంపిక చేసిన అభిమాన కవితా సంపుటి వెలువడింది .రాబిన్సన్ చని పోయాక వచ్చిన ‘’కింగ్ జాస్పర్ ‘’కు ముందుమాట రాస్తూ ఫ్రాస్ట్ ‘’The style was not only the man but that style was the way the man takes himself ‘’అని రాశాడు .కవిత తనను తానూ చెప్పుకు పోవాలి అని ఫ్రాస్ట్ అభిప్రాయం .చాలా అరుదుగానే తానూ వివరణలిస్తాడు .’’కవిత  ఆనందం తో ప్రారంభమై జ్ఞానం తో అంతమవాలి  ‘’అన్నదే ఫ్రాస్ట్ దృక్పధం మానసిక స్థితి –మూడ్ కు అది మొదటి చిత్రం అవుతుంది .రాసేవాడికి చదివే వాడికి ఆశ్చర్యం ఉండదు . ‘’For me the initial delight is in the surprise of remembering something I did not know I knew ‘’అంటాడు ఫ్రాస్ట్ .

 ఫ్రాస్ట్ ప్రాచుర్యానికి కారణాలు వెతకటం కోసం పెద్దగా కస్ట పడక్కర లేదు .ఆయన మార్గ దర్శికత ,కవితా పదజాలం ,అందులోని సొగసు చదువరులను కట్టి పడేసి ఆయనకు కృతజ్నులౌతారు .కవితలు యెంత ఆకర్షణగా ఉంటాయో అంత సవాలుగా ఉండటం ఆయన ప్రత్యేకత .అందుకే రచయిత లూయీ అంటర్ మేయర్ ‘’never has poetry accomplished a more complete act of sharing ‘’అని ఫ్రాస్ట్ కవిత్వ ప్రత్యేకతను తెలియ జేశాడు .

   1922 జూన్ లో వెర్మాంట్ లోని ‘’స్టేట్ లీగ్ ఆఫ్ వుమెన్స్ క్లబ్ ‘’రాబర్ట్ ఫ్రాస్ట్ ను’’ వెర్మాంట్ ఆస్థానకవి  ‘’గా ప్రకటించింది .దీన్ని ‘’న్యు యార్క్ టైమ్స్ ‘’అధిక్షేపిస్తే సారా క్లెఫ్ హార్న్ మొదలైన మహిళలు సమర్ధించారు .1961జులై 22న వెర్మాంట్ రాష్ట్ర శాసన సభ సంయుక్త సమావేశం లో ఫ్రాస్ట్ ను ‘’వెర్మాంట్ రాష్ట్ర ఆస్థాన కవి ‘’గా ప్రకటించి గౌరవించింది .వెర్మాంట్ రాష్ట్రం ఫ్రాస్ట్ పేరు ను అక్కడున్న ఒక పర్వతానికి పెట్టి గౌరవించింది .

  ఫ్రాస్ట్ జీవితకాలం లో సుమారు 40 కవితా సంపుటాలను ,4 నాటకాలను ,7వచన గ్రంధాలను రాశాడు అయన రాసిన లేఖలు ‘’లెటర్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్ ‘’గా వచ్చాయి .మానవ అస్తిత్వాన్ని అన్వేషించటం లో ,తనతో సంబంధం లేని విశ్వం లో ఒంటరితనం పైనే కవిత్వం రాశాడు .ఫ్రాస్ట్ కవిత్వం 19వ శతాబ్ది అమెరికన్ కవిత్వ క్రాస్ రోడ్ పై ఉంది అన్నారు  Frost believed that “the self-imposed restrictions of meter in form” was more helpful than harmful because he could focus on the content of his poems instead of concerning himself with creating “innovative” new verse forms.[26]

 

ఫ్రాస్ట్ పబ్లిక్ లోకి బాగా వచ్చేవాడు అసలు ఆయన ను రుషి అనాలా కవి అనాలా అనే సందిగ్ధం ఉంది .28 యూని వర్సిటీలనుంది గౌరవ డిగ్రీలు పొందాడు అందులో రెండు ఇంగ్లాండ్ యూని వర్సిటీలు ఉండటం విశేషం .ఆయనను వర్డ్స్ వర్త్ తో పోలుస్తారు .’’నీకు అదృష్టం దురదృష్టం ఏదైనా పట్ట వచ్చు .కాని నీకు చివరికి కావాల్సింది కృప మాత్రమే ‘’అంటాడు దీనిపైనే ‘’ఎ మాస్క్ ఆఫ్ రీజన్ ‘’ ఎ మాస్క్ ఆఫ్ మెర్సి’’అనే రెండు దీర్ఘ కవితలు రాశాడు 89ఏళ్ళు ‘’నాన్ కన్ఫర్మార్ ‘’గా జీవించి 29-1-1963న రాబర్ట్ ఫ్రాస్ట్ ‘’మరణ మంచు ‘’-డెత్ ఫ్రాస్ట్ లో కలిసిపోయాడు .’’గ్రేటెస్ట్ ఆఫ్ ది అమెరికన్ పోయేట్స్ ఆఫ్ ది సెంచరి ‘’అని పించుకొన్నాడు. అమెరికాలోని న్యు ఇంగ్లాండ్ జానపద కవిగా ప్రారంభమైన ఆయన కవితా ప్రస్తానం జాతీయ ,అంతర్జాతీయ కీర్తి నార్జించింది .జాన్  ఎఫ్ కేన్నేడి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ ను సగౌరవంగా ఆహ్వానించిసత్కరించి  ‘’ది గిఫ్ట్ అవుట్ రైట్ ‘’కవితను చదివించి  ప్రజలకు స్పూర్తి కలిగించాడు అంతవరకూ యే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఒక కవికి ఇంతటి గౌరవాన్ని పదవీ ప్రమాణం నాడు కలిగించలేదు .కేనేడీ ఫ్రాస్ట్ లు రికార్డ్ సృష్టించారు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143

 57  -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -2

   విమర్శకులు ఫ్రాస్ట్ లిరిక్స్ ను బాగా ఆదరించారు .ఆయన వాడిన  అతి సాధారణ శబ్ద జాలాన్ని ,పరిశీలనా దృష్టినీ అభినందించారు .మరచిపోయిన ఆలోచనలను మరపు రాని విధంగా మలచిన తీరు అసాధారణం అన్నారు .ఒక ఏడాది తర్వాత రెండవ పుస్తకం అచ్చు అయి ఫ్రాస్ట్ కీర్తి బాగా వ్యాపించి ప్రసిద్ధుడయ్యాడు  .అట్లాంటిక్ కు ఇరువైపులా ఉన్న దేశాలు ‘’నార్త్ ఆఫ్ బోస్టన్ ‘’కవిత్వం లో నవీన హృదయాన౦దకర భావాలు సహజ సుందరంగా  మానసిక విశ్లేషణాత్మకంగా ఉన్నాయని మెచ్చుకొన్నారు .సాధారణ భాష ను అత్యంత శక్తి వంతంగా ప్రయోగించిన తీరు అందర్నీ ఆకట్టు కొన్నది .కవితాపర0 గా నేటివిటీ ఉన్న విషయాలను ఎన్నుకొని వాటిని అందల మెక్కించాడు  .అందులో వ్యావహారిక పదాలు అందాలొలుకుతూ సొగసు చేకూర్చాయి .ఇదొక కొత్త వరవడి .మార్క్ వాన్ డోరేన్కు ఫ్రాస్ట్ కవితలో సహజ సంభాషణా చాతుర్యం ఉట్టిపడింది ,.ఆయన ఏది రాసినా  ప్రజలు మాట్లాడుకొన్నట్లుగా ఉండటం గొప్ప విశేషం .ఫ్రాస్ట్ కు గొప్ప గొప్ప విషయాలను యెంత తేలిక పదాలలో చెప్ప వచ్చో బాగా తెలుసు .అందుకే అతని కవిత్వం లో సహజత్వం పరిమళిస్తుంది ‘’అన్నాడు

       నార్త్ ఆఫ్ బోస్టన్ కు ఉపశీర్షిక గా ‘’ఎ బుక్ ఆఫ్ పీపుల్ ‘’అని పెట్టటం సార్ధకమైంది .ప్రజల గురించేకాదు వారి నేపధ్యాన్నీ వివరించే కవితలు ఇవి .కొన్ని గంభీరంగా ఉన్న డ్రామాలూ రాశాడు .వీటిలో  ఏకా0కి కలే ఎక్కువ .వ్యవసాయం ఒట్టిపోయి ఆప్రదేశం లో పారిశ్రామిక విస్తరణ జరుగుతున్ననేపధ్యం పై ఎక్కువ గా రాశాడు .అతని సహచరుడు న్యు ఇంగ్లాండ్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్  రాబిన్సన్ లాగానే స్వీయ ప్రేమ, కోరిక లోని చెడునువ్యతిరేకిస్తూ  ఫ్రాస్ట్  కవితలల్లాడు .కానీ ఆయన లాగా కాకుండా అడవులు మానసిక ప్రశాంతికి నిలయాలని ,సహజ రోగ నివారకాలని ,భూమి అన్నీ ఇచ్చే మాత్రు మూర్తి అని నమ్మాడు .రాబిన్సన్ తో కలిసి ముసలి ,ముతక, పేద బలహీన వర్గాలకు సహాయం చేసి సంతృప్తి చెందాడు .

  నార్త్ ఆఫ్ బోస్టన్ లో ప్రజలే డామినేట్ చేస్తారు .’’హోం బరియల్ ‘’కొత్త అసాధారణత కనిపిస్తుంది .ఇందులోని మాటలు అందరూ మాట్లాడేవే .కాని సందర్భం మాత్రం చాలా విశేషం గా ఉంటుంది .సహజమైన మాటలేకాని అనుభవం లో అసాధారణంగా ఉంటాయి .కాళ్ళ చెప్పులకు అంటిన బురద కూడా కవితా స్థానం పొందింది .’’ది విచ్ ఆఫ్ కూస్ ‘’ దెయ్యం కద .చనిపోయిన వాడి ఎముకలు మెట్లు ఎక్కి భయం భీభత్సం సృస్టిస్తాయి .’’కోడ్’’అనేది మరో వింత కామెడి ,దాదాపు ట్రాజెడీ.’’The House keeper ‘’ is an instance of pure talk not only in poetry  but talks as poetry ‘’.అదొక కుటుంబ నాటకం .

  1915లో ఫ్రాస్ట్ అమెరికాకు ఒక సెలెబ్రిటి గా తిరిగొచ్చాడు .అజ్ఞాత వ్యక్తిగా అమెరికా నుండి బయటికి వెళ్ళినవాడు ఇప్పుడు’’ నవీన అమెరికా కవిత్వ నాయకుడి ‘’గా కాలుపెట్టాడు .విమర్శకులు బ్రహ్మ రధం పట్టారు .ఆయన తమ వాడే నని యెగిరి గంతులేశారు .లండన్ లో ఎజ్రా పౌండ్ స్నేహితుడుగా నేకాక పోషకుడుగా ఉండేవా డు .ఫ్రాస్ట్ ను ‘’ఇమేజిస్ట్ ‘’కవిగా మారుద్దామని ప్రయత్నించి విఫలు డయ్యాడు.కొందరు క్లాసిస్ట్ అని మరికొంతమంది హ్యూమనిస్ట్ అని ,రియలిస్ట్ అని రూరలిస్ట్ అనీ అన్నారు వీటికి సమాధానంగా ఫ్రాస్ట్ ‘’If I must be classified I might be called a  Synecdochist ,for I prefer the synecdoche in poetry –that figure of speech in which we use a part for the whole ‘’అని స్పష్టంగా చెప్పాడు .తాను అఖండత్వాన్నికోరేవాడినని అందులో యే కొద్దిభాగమైనా పూర్ణత్వానికి ప్రతీకగా ఉంటుందని అర్ధం .

  ఇలాంటి సరదా స్టేట్ మెంట్ లు ఆయనకిష్టం .ఎక్కువగా చెప్పకుండా అన్నిటినీ సూచించటం ఫ్రాస్ట్ లక్షణం .ఒక మేధావి సలహా మేరకు రోజూ ఒక అవ్యక్త ఉపన్యాసం రాసి దానికి చక్కని ఆకృతి కలిపించేవాడు .రియలిజం పై చెబుతూ ‘’రియలిస్ట్ లలో రెండు రకాలున్నారు .ఒకాయన అసలైన పోటాటో ను చూపించటానికి దానికి అంటిన మట్టీ మశానం తో సహా చూపిస్తాడు .అది నమ్మినవాడు దాని దుమ్ము దులిపి అసలు బంగాళా దుంపను చూపిస్తాడు .నేను రెండో రకం వాడిని .కళ జీవం తో ఉండాలంటే దాన్ని శుభ్రం చేసి తోలు తీయాల్సిందే నాది అదే పని ‘’అన్నాడు .’’ఒక్కోసారి నెను  రాసే పదాలలో అనుమానం వచ్చి నన్ను నేనే ప్రశ్నించుకొంటాను .నాకు సరైన సమాధానమే లభిస్తుంది .మాటలు వాటికి కావాల్సిన స్థానాల్లో అవే వచ్చి చేరుతాయని నమ్ముతాను .సాహిత్యం పై నా నిర్వచనం ‘’మాటలు చేతలుగా మారటం ‘’అన్నాడు ఫ్రాస్ట్ .

       ఫ్రాస్ట్ భావాలన్నీ ఆయన లాండ్ స్కేప్ కు చెందినవే .ఆ లాండ్ స్కేప్ లో ఆయన ముఖమే ప్రత్యక్ష మౌతుంది .ముడి గ్రానైట్ రాయిని సాన బెడితే వచ్చే బొమ్మలాగా ఆయన కవళికలు ఉంటాయి .పాలిపోయిన నీలి కళ్ళు వేళాకోళం చేస్తున్నట్లున్న నవ్వు ,కందిరీగ కుడితే వాచిపోయినట్లున్న కింది పెదవి తో బలీయమైన శరీరం తో కనిపిస్తాడు ఫ్రాస్ట్ .ముభావం గంభీరం అయిన విద్యా వేత్త ముఖం ఆయనది .తన ‘’  కలేక్టేడ్ పోయెమ్స్  ‘’కు ముందు మాట రాసుకొంటూ ‘’విద్యావేత్తలూ కళాకారులను విసిరేసిన తర్వాత వాళ్ళు బాధ పడుతూ తమలో విభేదాలకు కారణం ఏమిటి అని వితర్కి౦చు కొంటారు .ఇద్దరూ కూడా జ్ఞానం ద్వారానే పని చేస్తారు అయితే తేడా ఎక్కడ ఉంది అంటే వారు పొందిన జ్ఞాన మార్గాలలోతేడాఅని నా అనుమానం . .విద్యా వేత్తలు తమ మనస్సాక్షి పరి పూర్ణత తో,తర్కం తో ,జ్ఞాన సముపార్జన చేస్తారు .కవులు పుస్తకాలతోనూ ,అవిలేకు0డాను  ఉత్సాహ ఉల్లాసాలతో సాదిస్తారు   .వారు దేనికీ కట్టుబడి ఉండరు .కాని తమవద్దకు  వచ్చి  చేరి అంటుకొనే వాటిని తప్పకుండా స్వీకరిస్తారు .


             సశేషం

                మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మండు వేసవి తాపం తీర్చిన చినుకు జల్లు

మండు వేసవి తాపం తీర్చిన చినుకు జల్లు

ఎండలుమెండు గా కాస్తున్న నడి వేసవిలో  భానుప్రతాపం నలభై కి పైగా ఉన్న కాలం లో 11వసంతాలు పూర్తి చేసుకొని 12వ ఏట అడుగు పెట్టిన చినుకు మే నెల ప్రత్యేక సంచిక కురిపించిన చిటపట చినుకులలో రెండు రోజులు చదివి తడిసి ముద్దయ్యాను .ఒక సంక్షిప్త విజ్ఞాన సర్వస్వమని పించింది .శ్రీ నండూరి వారి ప్రత్యేక శ్రద్ధకు జోహార్లు .184పేజీలతో ,25వైవిధ్య కధలు ,6సమీక్షలు ,14విశ్లేషణాత్మక వ్యాసాలు ,25కవితలు ,,చారిత్రిక పరిశోధక బ్రహ్మ శ్రీ పి.విపరబ్రహ్మ శాస్త్రి గారి తో శ్రీ పన్నాల భట్టు గారి ముఖా ముఖీతో ‘’అందమైన ఎటో కొత్తస్వరం కోసంఎదురు  చూస్తున్నచేపకళ్ళ చిన్నదాని ముఖ చిత్రం తో ప్రత్యేక చినుకు ‘’ సంపాదకులు ఆశించినట్లు కొత్త స్వరం వినిపించింది .

శ్రీ జొన్న విత్తులవారి ‘’ఝరి’’కద పత్రికకే తలమానికం .ఆ రచనా ఝరిలో కొట్టుకు పోతాం .అంత పకడ్బందీ గా ఉంది .నేటివిటీ వసంతమై విరిసింది .శ్రీ రామా చంద్ర మౌళి వినిమయ సంస్కృతీ మేక్ అండ్ సేల్స్ పై  రాసిన కదా బాగుంది .మనిషి తనను సామాజిక రుగ్మతల నుండి కాపాడుకోవాలని హితవు చెబుతూ ,ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజ్ రీ ఇమ్బర్స్ మెంట్ నిలయాలయ్యాయని చదువు చెప్పరని ,అక్కడి రాంకులు ,డిస్టింక్షన్లు  బోగస్ అని నిర్మొహమాటంగా చెప్పారు .చదువే ధైర్య స్తైర్యాలిచ్చి జీవితాన్నిస్తు౦దన్నారు .మనం మనకోసం సమాజం కోసం దేశం కోసం బతకాలన్న సత్యాన్ని చెప్పారు .చనిపోదామనుకొన్న ప్రేమికులు చివరికి కలిసే జీవించాలని నిర్ణయి౦చుకొన్నకద శ్రీమతి సత్యవతి గారి ‘’కలిసే ప్రయాణం .దేశం లో ,కాలం లో కొత్త నీరు ప్రవహిస్తుందని విహారి కధలో చెప్పగా ,నారాయణ్ మలయాళీ కధకు శ్రీ స్వామి తెలుగు సేత బాగుంది చక్కని వ్యంగ్యమూ ఉంది .సామాన్య కిరణ్ కద ఒక అభాగ్యు రాలైన విధి వంచిత   వ్యధ .తనకోసం వచ్చే విటుల్ని ‘’కుక్కలు కాదు ఇంకేవో ‘’అనటం ,వేశ్య రేప్ చేయబడితే ఎవరూ పట్టించుకోక పోవటం నేటి సమాజ స్థితికి అద్దంపట్టింది .సొల్లు అదే నండీ సెల్లు అదే బాబూ ‘’ఊసు ‘’కోసం రేపటి జనరేషన్ ఎలా పుట్టటానికి తయారై లోకం లోకి వస్తారో చెప్పే  శ్రీమతి జ్యోతిష్మతి సరదా కత,గిరిజన స్కూల్ కోసం ఉన్న భూమిని  ప్రభుత్వానికి అర్పించి తిండిలేక తన నేలమీదే తాను పరాయివాడైన బూగన్న కద కళ్ళు తెరిపిస్తాయి .వేదగిరి రాంబాబు రాసిన అందం కధలో మానసిక అందం గొప్పదని చాటారు. పలమనేరు ,బాలాజీ ప్రేమకధ చిలిపిగా సాగితే ,మిధ్యాహ్న భోజనమైన మధ్యాహ్న భోజనం కద ఓబుల్ రెడ్డి రాశారు .సాధువును మోసం చేసిన ముగ్గురు కుర్రాళ్ళు పోలీసుల చేతిలో ధర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ పొందటం విష్ణుతో పాటు సాధువూ ఎస్సై చేతిలో చావటం ఒళ్ళు గగుర్పొడిచేట్లు రాశారు అద్దేపల్లి ..దేవ పుత్రది ఛిన్న కధే కాని పెద్దమనసున్న అవ్వ కద.’’ఆయమ్మ కంటిలో ఆకులను నమిలి మింగి రసాన్ని ఊదితే అంటూ ముట్టూ లేదు ఇప్పుడేమిటి తమ్బాకులు మీదికి ఇసిరేసి౦దేమి  ‘’అని మనవడు అడిగితె అవ్వ ‘’దాన్ని ‘’వైద్దికం’’అంటారు దానికి దోషం లేదు ‘’అన్న అవ్వ గొప్ప మనసు ను దర్శింప జేస్తాడు .    . మిగిలిన కధలూ బాగానే నడిచాయి అలరించాయి .

కవితలలో అడిగోపుల అండమాన్ జైలు లో ‘’ఒక గది హింస ఇంకొక గదికి తెలియదు ‘’అన్నారు .శివారెడ్డి ‘’దేవుడు కూడా లేని వాళ్ళం ‘’అని అనాధతో అనిపిస్తాడు .దేశాన్ని ప్రేమించి దానికోసం పాటు పడే వాడుంటే అడ్రస్ చెప్పమన్నారు దాస్ .తొలకరి కన్నీరు హృదయం లోకి ఇంకిందట లక్ష్మీ రాధికకు .వెంకట రెడ్డి ‘’ఆలోచనలు ‘’లో ‘’వ్యక్తిత్వం అంటే జీర్ణించుకొన్న అలవాట్లే ‘’.దేశానికి తలపాగా లాంటి,జాతి కడుపు ఆకలి తీర్చే  రైతన్న కనిపించటం లేదు కారణం భూగోళం ఆకలి పుండుగా మారటమే ‘’అని రవీంద్ర ,అంటే, కాశ్మీర్ ముఫ్తీ కి హైమవతి కుంకుమ పూల హారం వేశారు .’’నువ్వు గుమ్మం లో ఎదురవ్వడం కాదు –బ్రతుకంతా తోడవటం ముఖ్యం ‘’అనగల సత్తా పాటిబండ్ల రజనిది.ఒంగిన  ఆకాశం  వంకకే తన పయనమని ,ప్రతిక్షణం ప్రతీక్షణం స్వప్నాల సుమ వాటికలో కోర్కెల కొమ్మకు పూచిన పుష్పం లా శిధిలమై ,శీర్ణమై రాలి పోతాను నీ ముందు ‘’అన్న సూర్య ప్రకాష్,’’నాన్న పై ఖండువా ,నా దుఖాన్ని అదిమి పెట్టే అధారమయింది ‘’అన్న నాగ రాజ లక్ష్మి అభినందనీయులు .స్వేచ్చ విలువ లింకన్, మహాత్ముడు ,,మండేలాలకే తెలుసు అంటాడు శ్రీ హస్త .’’అతడు ఎదురై నాలో అలజడిని ,అలల జడిగా మారుస్తాడు .నేను అప్రయత్నంగా అక్షరమైతే ,అతడు నా ముందు అద్దమై నిలబడుతాడు ‘’’అన్నమాటలు ’నల్లా ఇరికే ‘’గా ఉన్న రోహిణి కుమార్  భావుకత  .అరసవిల్లి కృష్ణ ప్రోజ్ పోయెం ,’’దూరం గా జలపాతం కనిపిస్తుందేమోనని సూర్యుడు చెట్ల భుజాలెక్కి చూస్తున్నాడు ‘’అన్న ఆంజనేయ కుమార్ ఎండాకాలం కవితలు కొత్త స్వరమే పూరించాయి .’’వెలుతురు సోకని మరణ మార్గాల ద్వారా –కాంతి అడుగుల విత్తనాలు నాటి వద్దాం ‘’అని రాసిన మెర్సీ అభినందనీయురాలు .తతిమ్మా కవితలూ ఎన్నదగినవే .

భట్టుగారి పరబ్రహ్మ శాస్త్రి గారితో ఇంటర్వ్యు ఆయన ప్రతిభను చాటింది ‘’ఆసేతు హిమాచల పర్యంతం ‘’అనే కాన్సెప్ట్ ను తెచ్చి రుజువు చేసినవాడు సముద్ర గుప్తుడు అంటారు శాస్త్రిగారు .చారిత్రిక పరిశోధనా పరమేశ్వరులాయన . అశోక్ కుమార్ రూప విమర్శ సమగ్రమై విశేషంగా ఉంది .జయకాంతన్ కధల్లో మానవీయతను మధురాంతకం దర్శిస్తే ,రాజి రెడ్డి వైబ్రేటింగ్ వాక్యాలు ,ఫ్లెక్సిబుల్ గా సాగి రూపొందించిన శిల్పమే అది అని ,ఆయన వాకింగ్ ,డాన్సింగ్ కలిసిన రచయితగా లక్ష్మీ నరసయ్య చూపాడు .రాచపాలెం రెడ్డిగారి పునర్మూల్యాంకనం యెంత అవసరమో చదివితే తెలుస్తుంది .సాహిత్య చరిత్ర నిర్మాణం లో మణిపూస శ్రీమతి సుసర్ల నరసాంబ గురించి కాత్యాయిని గారు ఎన్నో విషయాలు తవ్వి తీశారు .కడియాల వార్షిక ‘’కవితా వికాసం ‘’వారి ప్రతిభా ,నిష్పక్ష పాతాలకు నిదర్శనం .ఒకప్పుడు ఆంద్ర ప్రభలో శ్రీ వాత్సవ ఇలాగే రాయటం జ్ఞాపక మొస్తుంది .అమ్మల౦దరికి వందనాలు  ఉమా గారు చేస్తే ,,సామ్యుల్ బెకెట్ అసంగత నాటక విశేషాలను ఆడెపు లక్ష్మీ పతి తనదైన శైలిలో సమగ్రంగా వివరించారు .క.వ.న.శర్మ గారి ఐజాక్ అసిమోవ్ జీవిత చిత్రణ మంచి స్థాయిలో ఉంది. మిగిలిన వ్యాసాలూ జాగ్రత్తగా చదవ దగినవీ అధ్యయనం చేయ దగ్గవికూడా .

కొత్త స్వరాన్ని వినిపిస్తానన్న సంపాదకుడి ఆశయాలకు అనుగుణం గా చినుకు ఆస్థాన కవి, రచయిత గాయకులైన గుమ్మా ,వెన్నా ,జాన్సన్ ,లంకె, సశ్రీ ,బృందావనం ,రామ తీర్ధ ,జగద్ధాత్రి మొదలైన వారు పాతవారే అయినా కొత్త స్వరాలూదారు .చినుకుకు కొత్తదనం చల్లదనం ,పరిమళం అద్దారు  కొన్ని వడగళ్ళ చినుకులూ కురిపించారు .ఇందులో శిమ్మన్న గారు లేక పోవటం వెలితిగా ఉంది .వంద రూపాయల ఈ ‘’ప్రత్యేక చినుకు ‘’వేసవి  హృదయ తాపాన్ని తీర్చే చల్లని చినుకుల ఝరి.

గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-16-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142

 57  -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్

న్యు ఇంగ్లాండ్ అనే మాసాచూసేట్స్ ను అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించినవాడైన రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1874న కాలిఫోర్నియా రాష్ట్రం లో సాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు .అందుకని ఆయన రచనల్లో ఆ మట్టి వాసనలు –నార్త్ ఆఫ్ బోస్టన్ ,మౌంటేన్ ఇంటర్వెల్ ,ఎఫాఆర్దర్ రేంజ్ ,న్యు హాంప్ షైర్,స్తీపుల్ బుష్ వంటి వాటిలో   ప్రత్యక్షమౌతాయి .అమెరికా దూర పాశ్చాత్య భాగం లో జన్మించటం యాదృచ్చికం .తలిదండ్రులిద్దరూ తూర్పు ప్రాంత0 లో పుట్టిన  పల్లెటూరి మేస్టార్లు  .ఇక్కడే వారి పూర్వీకులు ఎనిమిది తరాలుగా నివశించారు .తల్లి స్కాట్ లాండ్ కు చెందిన సముద్ర యాన ఆర్క్నీ  కుటుంబానికి చెందినవారు. తండ్రి వైపువారు ఇంగ్లాండ్ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు .తండ్రి విలియం ప్రెస్కాట్ ఫ్రాస్ట్ సహజంగా దేనికీ కట్టుబడని వాడు .ఉపాధ్యాయ వ్రుత్తి వదిలేసి ,న్యు ఇంగ్లాండ్ రిపబ్లికన్ నుండి తిరుగు బాటు చేసి కాలిఫోర్నియా చేరి అక్కడ సాన్ ఫ్రాన్సిస్కో బులెటిన్అనే డెమోక్రాటిక్ పార్టీ పత్రికకు  సంపాదకుడయ్యాడు .ఆయన మనసంతా సౌత్ మీదే ఉండేది .కొడుకు రాబర్ట్ పుట్టటానికి పదేళ్ళ ముందే సివిల్ వార్ పూర్తి అయినా కొడుకు కు రాబర్ట్ లీ ఫ్రాస్ట్ అని పేరు పెట్టుకొన్నాడు .రాజకీయాలలో ప్రవేశించిన ఆయనకు  ఆరోగ్యం సహకరించలేదు .ముప్ఫై ఏళ్ళకే క్షయ వ్యాధితో చనిపోయాడు .భార్య కొడుకుని ,,కూతుర్ని తీసుకొని మాసా చూసేట్స్ లోని  లారెన్స్ చేరి మామగారి దగ్గర ఉంది .అప్పటికి మనకవి వయసు పది మాత్రమే .

           తల్లి మళ్ళీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ ,ఖాళీ సమయాలలో ఇంకా యేవో వ్యాపకాలలో ఉంటూ పిల్లల పోషణ చేసింది .కాలి  ఫోర్నియాలో చదువు ఏమీ సాగలేదు రాబర్ట్ కు .ఎలాగో అలా కాలేజి నుంచి బయట పడ్డాడు . తన చదువు గురించి చెబుతూ ఫ్రాస్ట్ ‘’ఒకటిన్నర ఏడాది యే గ్రేడూ లేని కాలిఫోర్నియా చదువు ,నాలుగేళ్ల లారెన్స్ హై స్కూల్ చదువు మాత్రమీ నేను చదువుకొన్న చదువు .’’అన్నాడు 12వ ఏట కొద్ది పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు ,ఒక’’ షూ షాప్’’పీస్ వర్కర్ గా  పని చేశాడు .16ఏళ్ళ వయసులో బాబిన్ వాగన్ ను లాగేపని లారెన్స్ టెక్స్టైల్ మిల్ లో చేశాడు .18ఏట కార్బన్ పెన్సిల్  లాంపులు స్పిన్నింగ్ యంత్రాలకు అమర్చటం డైనమో బాగు చేయటం వంటి చిన్న చిన్న పనులు చేశాడు .17వయసులో డార్ట్ మౌత్ చేరి మూడు నెలలకే మానేశాడు .చాలా రెస్ట్ లెస్ గా  ఉంటూ  పుస్తకాలు చదవని శిక్షణ  లోటు అనుభవించాడు .తల్లి చేసే చోట ఒక టరం టీచింగ్ చేసి మళ్ళీ వ్యవసాయం లో చెయ్యి కాల్చుకొన్నాడు .షేక్స్ పియర్ కవిని జనాలకు పరిచయం చేసే ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్  అనిపించుకొన్నాడు .19వ ఏట జర్నలిజం లో వేలేట్టాడు .లారెన్స్ సెంటినెల్ పేపర్ కు రిపోర్ట ర్ చేరి ‘’అమెరికన్ ‘’పేపర్ కు బదిలీ అయ్యాడు .కాలమిస్ట్ గా పని చేసస్తూ ఎడిటోరియల్ పేజీ రాశాడు .పద్ధతీ పాడూ లేకుండా పేరాలు రాసేవాడు .కొన్నిసార్లు మత సంబంధ వ్యాసాలూ గిలికేవాడు .చివరికి ఇదే కవిత్వం రాయటానికి దారి చూపింది .

21వ ఏట తన హైస్కూల్ స్వీట్ హార్ట్  సౌందర్య రాశి ఎలినార్ వైట్   ను పెళ్లి చేసుకొన్నాడు .చదువు పూర్తీ చేయాలనుకొని హార్వర్డ్ లో చేరాడు .విలియం జేమ్స్ దగ్గర చదవాలని ఉండేది .కాని ఫిలాసఫీ కి తగిన ప్రాధమిక విషయాలు తెలియవని చేర్చుకోలేదు .రెండేళ్ళు కర్రిక్యులం తో కుస్తీ పట్టాడు .కాని దాన్ని ఓడించటం అసాధ్యమనుకొని’’ పీటీ దెబ్బ తిని’’చదువుమానేశాడు .

           మరో అయిదేళ్ళు పొలం సాగు ,న్యు హాంప్ షైర్ర్ లోని డేర్రిలో ఉన్న  పింకేర్టన్ అకాడెమి లో పార్ట్ టైం టీచింగ్ తో కాలం గడిపాడు . 27వయసులో న్యు హాంప్ షైర్ స్టేట్లోని ప్లిమత్ లో ఉన్న నార్మల్ స్కూల్ లో సైకాలజీ బోధించాడు .జే ఏం సిన్జే ,జార్జ్ బెర్నార్డ్ షాల నాటకాలు ఇతర విషయాలు చదువుతూ జ్ఞాన సముపార్జన చేశాడు .టీచింగ్ మాత్రమే తన కెరీర్ కు తగింది అనుకొన్నాడు .మధ్య మధ్యలో కవిత్వం రాస్తూనే ఉన్నాడు .పదిహేనేళ్ళ వయసులో ప్రెస్కాట్ రాసిన ‘’కాంక్వెస్ట్ ఆఫ్ మెక్సికో ‘’చదివి మురిసి పోయి దాన్ని బాలడ్ గా రాయటం ప్రారంభించాడు ఇది లారెన్స్ హై స్కూల్ మేగజైన్ లో ప్రింట్ అయింది .19వ ఏట మొట్ట మొదటి ప్రొఫెషనల్ కవిత ‘’ఇండిపెండెంట్ మేగజైన్ ‘’లో ప్రచురితమై 15డాలర్ల పారితోషికం లభించింది .పెద్దగా హుషారు ఇవ్వక పోయినా కవిత్వం కూడు పెడుతుంది అని గ్రహించాడు ,నిరాశ నిస్పృహలు తొలగి ఆశా రేఖ కనిపించింది దీనికి బలం ఇస్తూ ,మరో 14ఏళ్ళు ఆ పత్రిక ఫ్రాస్ట్ కవిత్వాలను ప్రచురిస్తూ ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని సమకూర్చింది .మిగతా మేగజైన్లు ఫ్రాస్ట్ కవితలను వేసుకోవటానికి ముందుకు రాకపోయినా ఇండి పెండెంట్ పత్రిక మరో ఆరు కవితలను ప్రచురించింది. .ఫ్రాస్ట్ కవిత్వం పాతమూస కవిత్వానికి భిన్నంగా ,పల్లెటూరి భావాలకు బలమిస్తూ వారికి సన్నిహితంగా రాయటమే దీనికి కారణం .ఫ్రాస్ట్ రాసిన ‘’మై బట్టర్ ఫ్లై’’రాసిన 20ఏళ్ళకు అతని మొదటి కవితా సంపుటి అమెరికాలోని న్యు ఇంగ్లాండ్ లో కాదు అసలైన బ్రిటన్ లోని ఇంగ్లాండ్ నుండి వెలువడింది  .ఇది చాలా అరుదైన గౌరవం అదృష్టం .దీనికి అనేక కారణాలున్నాయి .రైతుగా బైతుఅని పించుకొని ,,కొన్నపోలాలన్నీ అమ్మేసుకొని ,రాళ్ళు రప్పల నేలను సాగు చేయటం తనవలన అయ్యే పనికాదని గ్రహించి పూర్తిగా కమతానికి దూరమయ్యాడు .ఇప్పుడు మధన ప్రారంభమై తాను  ఏదైనా  కవిత్వం కాని కాకర పీచు కాని రాయటానికి ఆలోచన ఉన్నవాడినేనా రాయగలనా అని వితర్కి0 చు కొన్నాడు .తాత్కాలికంగా ఫ్రాస్ట్ దంపతులు బకింగ్ హాం షైర్లో ఉండి,అక్కడ ఇరుగుపొరుగు వారిద్దరూ వ్యవసాయం చేస్తూ కవులైన సంగతి గ్రహించాడు .మిగిలిన రచయితలు రూపర్ట్ బ్రూక్ ,ఎడ్వర్డ్ ధామస్ లతో పరిచాయం పెంచుకొన్నాడు .ధామస్ పై ఫ్రాస్ట్ ప్రభావం అధికమై తన కవితా సంకలనాన్ని ఫ్రాస్ట్ కు అంకితమిచ్చాడు

         ఒక రోజు తాను  రాసిన కవితలను అచ్చుకాని వాటిని తిరగేస్తూ ఉండగా తాను  ఇరవై ఏళ్ళుగా రాసిన కవిత్వం అంతా రాశీ భూతమై కనిపించి జలదరించింది. ఎప్పుడూ డబ్ల్యు ఇ.హెన్లీ కవిత్వాన్ని ఆదరిస్తూ మెచ్చుకొనే ఫ్రాస్ట్ కు తన కవిత్వ’’ కవిలె కట్ట ‘’ను హెన్లీ పబ్లిషర్ కు పంపాలనే ఆలోచన వచ్చింది .ఫ్రాస్ట్ ఎవరో ఆ పబ్లిషర్ కు తెలియక పోయినా ముద్రించటానికి వెంటనే అంగీకరించి ముందుకొచ్చాడు .కవి లాంగ్ ఫెలో కవితలో ఒక ఫ్రేజ్ ‘’మై లాస్ట్ యూత్ ‘’ను స్పూర్తిగా తీసుకొని ‘’ఎ బాయ్స్ విల్ ‘’పేరిట ప్రచురించాడు .అప్పటికి ఫ్రాస్స్ట్ వయసు 38.

Inline image 1Inline image 2

           సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-16-ఉయ్యూరు  ‘’

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరం లోక శంకరం -3(చివరి భాగం )

శ్రీ శంకరం లోక శంకరం -3(చివరి భాగం )

శ్రీ శంకరులు కాశీ లో ‘’మనీషా పంచకం ‘’రాశారు .మనీషా అంటే బుద్ధి .’’ఏక శ్లోకి ‘’లో రెండు మహా వాక్యాల భావం పొదిగారు .విష్ణు మూర్తి ణి పాదాది కేశాంతం 50శ్లోకాలో వర్ణించారు .అంబాష్టకం ,శివపరాద స్తోత్రం కాలభైరవాస్టకం ,మానస పూజా స్తోత్రం ,భజగోవింద శ్లోకాలు ,,లక్ష్మీనృసింహ స్తోత్రం దక్షిణా మూర్తి ,అన్నపూర్ణాష్టకం ,చిన్నప్పుడే ‘’ పేద విధవరాలి దరిద్రాన్ని పోగొట్టి కాపాడమని లక్ష్మీదేవిని ‘’కనకధారా స్తోత్రం ‘’తో ప్రసన్నురాలిని చేసుకొని ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే .శ్రీశైలం లో ‘’శివానంద లహరి ‘’రాశారు .దేశం లోని అన్ని పుణ్య క్షేత్రాలను దర్శించి అవసరమైన చోట్ల అమ్మవార్ల ఉగ్రత్వాన్ని తగ్గించటానికి శ్రీ చక్ర యంత్ర స్థాపన చేశారు .కర్నాటక లోని గోకర్ణం లో హరి శంకర మఠం ఏర్పాటు చేసి , కొల్లూరులో మూకాంబికా దేవిని ప్రతిష్టించారు .శృంగేరిలో శారదాదేవిని ప్రతిష్టించారు .బదరీ కేదార్ నాద లను దర్శించి అక్కడి స్వాములపై స్తోత్ర రచన చేశారు .పాండురంగాష్టకం రాశారు .కేరళలో పర్యటించారు గుజరాత్ లో ద్వారక కృష్ణుని సోమనాధ జ్యోతిర్లిన్గాన్నీ దర్శించారు .గణేశ ,సుబ్రహ్మణ్య ,ఉమామహేశ్వర ,కృష్ణా ,అచ్యుత ,హనుమత్కావచం ,జగన్నాధ విష్ణు భుజంగ స్తోత్రాలు చేశారు .

ఆధ్యాత్మికంగా ప్రాతస్మరణ ,ఉపదేశ ,యతి ,మాయా పంచకం ,నిర్వాణ షట్కం ,అద్వైత,,కాశీ  పంచ రత్నం ,ప్రశ్నోత్తర మాలికా ,బ్రహ్మజ్ఞానావళీ మాలా ,లఘు వాక్య వ్రుత్తి ,అనాత్మ శ్రీ విగర్హణం,బ్రహాను చింతనం ,యోగ తారావాలీ ,దశ శ్లోకి ,షట్పదీ స్తోత్రం ,మోహ ముద్గరం ,తోటకాస్టకంవంటివి రాశారు .దేవీ స్తుతులుగా గౌరీ దశకం ,భవానీ భుజంగ స్తోత్రం ,త్రిపురసుందరీ ,దేవీ భుజంగ ,స్తోత్రాలు ,అన్నపూర్ణాష్టకం భ్రమరాంబా ,శారదా భుజంగ ,స్తోత్రాలు ,మీనాక్షీ ,లలితా పంచరత్న స్తోత్రాలతో పాటు గంగ ,యమునా ,మణికర్ణిక నర్మదాస్టకాలటో మరెన్నో చెప్పారు .ఇవి వింటేనే పుణ్యం చదివి అర్ధం చేసుకొని అనుసరిస్తే కైలాసమే .

ఆ నాటికి సంప్రదాయాలుగా ఉన్న కీట వార ,భోగ వార ,ఆనంద వార ,భూరి వార అనే నాలుగు సంప్రదాయాల ను ప్రమాణంగా తీసుకొని నాలుగు ఆమ్నాయ పీఠాలను నెలకొల్పారు శంకర యతీంద్రులు .పూరీకి హస్తమలక ,శృంగేరికి సురేశ్వర ,ద్వారకకు పద్మ పాద ,బడరికి తోటకాచార్యులను పీఠాది పటులుగా నియమించి అద్వైత సేవ చేయమని ఆదేశించారు .శ్రీ శంకరులు కాశ్మీర్ వెళ్లి అక్కడ సర్నోన్నత శారదా పీఠాన్ని అది రోహించాతానికి ముందు అక్కడున్న అన్ని మతాల అధిపతులను వాదం లో గెలిచి యెక్క బోతుండగా సరస్వతీ దేవి ప్రత్యక్షమై ‘’నువ్వు కామశృంగారాలలో మునిగి తేలావు యతీశ్వరునికి ఇవి నిషిద్ధం ఈ పీఠం ఎక్కే అర్హత లేదు ‘’అన్నది .’’అమ్మా ! నా కామవాసన అమరుక దేహం లో ఉన్నప్పుడే .ఇప్పుడా దేహం లేడునేను మామూలు యతినే ‘’అనగానే సంతోషించి ‘’నిన్ను మించిన వారెవ్వరూ లేరు సర్వ అర్హతలు నీకున్నాయి నువ్వే దీన్ని అధిరోహించాతానికి సర్వ విధాలా సమర్దుడివి ‘’అనగానే అందరూ శంకరుని వెంట బెట్టుకొని వెళ్లి పీఠం పై సగౌరవంగా కూర్చో బెట్టి అభినందించారు దీనితో శంకర యతీంద్రులు ‘’యోగి మహా రాజ్ ‘’అయ్యారు .తల్లికి జబ్బు చేసి మనసులో తలచుకొంటే కాలడి వెళ్లి ,12మంది నంబూద్రీ కుటుంబాలలో రెండు కుటుంబాలవారు మాత్రమె సహకరించగా శ్మశానం లో కాకుండా స్వంత ఇంటిలో దహన క్రియలు నిర్వహించి తల్లికిచ్చిన మాట నిల బెట్టుకొన్నారు .ఆ రెండు కుటుంబాలవారికి అక్కడ తమ పేరా ఉన్న వన్నీ అప్పగించిమల్లీ కాలినడకన దేశపర్యటన ప్రారంభించారు .కేదార్ నాద లో శ్రీ శంకర భగవత్పాదుల వారు మహా నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది అక్కడే ఆయన సమాధి ఉంది .రెండేళ్ళ క్రితం వరదలలో అది కొట్టుకు పోయింది .

వేద ధర్మ పునరుద్ధరణకు ఇంతగా శ్రమించిన ఆ 32ఏళ్ళ యువ యతికి మనం ఏం చేశాం అని ఆలోచిస్తే సిగ్గు పడాల్సి ఉంటుంది .ఆయన మనవాళ్ళ లెక్క ప్రకారం క్రీ శ.820లో మరణించినా 1906వరకు  అంటే సుమారు 1,086సంవత్సరాల వరకు అసలు ఆయన జన్మించిన స్థలం ఏది అని నిర్ధారించలేక పోయాం .అప్పటికి తిరువాన్కూర్ మహా రాజు అధీనం లో ఉన్న కేరళ రాష్ట్రం లోని శృంగేరీ మఠంపీఠాధిపతి 1906లో సుప్రసిద్ధ చారిత్రిక పరిశోధకుడు పురాశాస్త్ర వేత్త అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారినికేరళ లోని  ఎర్నాకులం జిల్లాలో ఉన్న కాలడి ని సందర్శించి ప్రభుత్వ రికార్డులు ,కైఫీయత్తుల సహాయం తోఖచ్చితంగా శంకరుల జన్మ ప్రదేశాన్ని నిర్ధారించమని పంపారు .శాస్త్రి గారు కాలడి వచ్చి అక్కడి రికార్డులన్నీ పరిశీలించగా అది అంతా’’కపిల్లమన ‘’అనే ఆధీనం లో ఉన్నాడని తేల్చి ,శంకరులు జన్మించిన స్థలాన్ని నిశిత పరిశోధనలతో నిగ్గు తేల్చి ఇప్పుడు కాలడిలో శంకరాలయం ఉన్న చోటే ఆది శంకరుల జన్మస్తలి అని రుజువులతో సహా శృంగేరి మతానికి నివేదిక ఇచ్చారు ,పీతాదిపతులు తిరువాన్కూర్ మహా రాజాను సందర్శించి విషయమంతా తెలియ జేసి నివేదిక అందించి ఆస్తలాన్ని కబ్జా దారుడి నుండి తీసుకొని తమ మతానికి అప్పగిస్తే అక్కడ శంకరాలయం కదతామన్నారు .రాజు గారు పరమానందం పడి కపిల్ల మన స్వాధీనం లో ఉన్నదాన్ని అంతటినీ ప్రభుత్వ పరం చేసుకొని శృంగేరి మతానికి రాసిచ్చారు .ఆ తర్వాత నాలుగేళ్ళకు అక్కడ శృంగేరి మఠం శ్రీ శంకరాలయాన్ని 1910లో నిర్మించి ,నిత్య పూజాదికాలు చేయిస్తున్నారు .శంకరాచార్య దివ్య విగ్రహం ప్రతిష్టించారు అఖండ జ్యోతి ఆ రోజు నుండి వెలిగే ఏర్పాటు చేశారు 2010లో ఆలయానికి శాత జయంతి ఉత్సవాన్ని మహా ఘనంగా నిర్వహించారు ఈ ప్రదేశం లోనే తల్లి ఆర్యాంబ కు కుమారుడు శంకరులు శవ సంస్కారం నిర్వహించారు .    కాలడికి దగ్గరలో ‘’మాణిక్య మంగళం ‘’అనే చోట శ్రీ కాత్యాయినీ మాత దేవాలయం ఉంది .నిత్యం ఉదయాన తండ్రి శివ గురువు అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించేవారు ఒక రోజు ఊరికి వెడుతూ ఆ బాధ్యతను బాల శంకరునికి అప్పగించారు .అమ్మవారి దగ్గర  పాల చెంబు పెట్టి  తాగమని గోల చేశారు .ఎంతకీ తాగాక పోయేసరికి ఏడుపు మొదలు పెట్టాడు .అమ్మ అనుగ్రహించి దర్శనమిచ్చి పాలు తాగేసింది అమ్మవారి దివ్య దర్హనం టో పులకించి ఆమె దివ్య సుందరాకారాన్ని ‘’సౌందర్య లహరి ‘’రాసి నిక్షిప్తం చేశారు .పూర్ణానది ఒడ్డునే శంకరాచార్య శ్రీ కృష్ణ విగ్రహాన్ని తల్లి కోరికపై ప్రతిష్టించి అక్కడే కూర్చుని 243పంక్తుల ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రాశారు .తమిళనాడు లోని కంచి మఠంవారు కాలడి సెంటర్ లో కీర్తిస్తంభం ‘’అనే 8 అంతస్తుల భవనం నిర్మించి శ్రీ శంకరులకు సంబంధించిన సర్వవిషయాలను అందులో ఉంచారు .

కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూరు తిరువేలు మాన్ శివాలయం ‘’ఉంది .ఈ లింగాన్నిశంకరుల తండ్రి  శివగురువు ప్రతిష్టించారు రోజూ భార్యా భర్తలు ఇంట దూరం వచ్చి పూజాదికాలు చేయటం కష్టమైంది అడవి ప్రాంతం శివుని ప్రార్ధిస్తే నాట్యం చేసే తెల్ల జింక కనిపిస్తుందని అది ఆలయానికి దారి చూపిస్తుందని చెప్పాడు అలాగే వెళ్లి శివార్చన చేసేవారు అందుకనే ఆ ప్రదేశాన్ని ‘’తిరువేల్లమాన్ మల్లి ‘’అన్తెనాత్య మాదే తెల్ల జింక అని పిలుస్తారు .

కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ‘’నయ తోడు శంకర నారాయణ కోవెల’’ ఉంది .ఈ శివాలయం లో శంకరాచార్య కూర్చుని విష్ణు మూర్తి ణి ప్రార్ధిస్తే శ్రీ హరి ప్రత్యక్షమై శివునిలోకలిసి పోయి హరి హర భేదం లేదని చాటాడు అందుకే ఈ దేవాలయం అద్వైత అర్చనకు గొప్ప స్థానంగా ప్రసిద్ధి చెందింది .మున్డుశివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన చేస్టారు .ఇక్కడి నదిలో మూతల నడవు ‘’అంటే మొసలి ఘాట్ (క్రోకడైల్ ఘాట్ )ఉంది .ఇందులో స్నానం చేస్తుంటేనే బాల శంకరుని మొసలి పట్టుకోగా తల్లి అనుమతితో ఆపద్ధర్మ సన్యాసం తీసుకొన్న రేవు అన్నమాట .

శ్రీశంకరుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .సౌందర్య లహరిలో భగవత్పాదుల శ్లోకం తో సమాప్తి చేస్తాను –

‘’ప్రదీప్త జ్వాలాభిర్దివస కర నీరాజన విధి –స్సుదా సూతే శ్చ౦ద్రో పల జలల వైరర్ఘ్య రచనా –స్వకీయై రంభోభి స్సలిలనిది సౌహిత్య కరణం –త్వదీయాభిర్వా గ్భిస్తవ జనని వాచాం స్తుతి రియం ‘’

Inline image 1

 

శంకరాచార్య కీర్తి స్తంభ మండపం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరం లోక శంకరం -2

శ్రీ శంకరం లోక శంకరం -2

ఎలా ఉన్నాడు శంకరుడు ?’’వేద విద్య లో బ్రహ్మకు సమానం .వేదాంత ఉపనిషద్విద్య లో బృహస్పతి .వేద కర్మ వ్యాఖ్యానానికి జైమినిమహర్షి తో సరి జోడు .వేద తత్వ మూలానికి వ్యాస భాగవానులే .మూర్తీభవించిన వేద వ్యాసుడే శ్రీ శంకర భాగవత్పాదులవారు ‘’అన్నారు విద్యారణ్య స్వామి .8ఏళ్ళ వయసులో కపిల మహర్షి రాసిన సాంఖ్యశాస్త్రాన్నీ ,పతంజలి రచించిన యోగ శాస్త్రాన్నీ  ఔపోసన పట్టిన ప్రజ్ఞా మూర్తి .భట్ట పాదుల వార్తికాన్ని అవగాహన చేసుకొన్నవాడు .అద్వైత సుఖాన్ని పొంది ,వేద సారాన్ని ఒక చేతిలో ,జ్ఞాన సముద్రాన్ని రెండవ చేతిలో ధరించి ,ఎదుటివారి వాదనలోని స్కాలిత్యాన్ని అంటే దోషాలలాంటి  ముళ్ళనుతీసివేసే ప్రజ్న కలిగి ఉన్నాడు అంటారు మాధవ విద్యారణ్యు లు .చంద్రుడూ,శ0కరుడూ అమృతాన్నే ఇస్తారట .చంద్రుడు కాంతి రూపం లో ఇస్తే ఈబాల శంకరుడు వేదాంత భావనా రూపంగా కాంతి నిచ్చాడట  . చంద్రుడు నక్షత్ర కాంతిని హరిస్తాడు .ఈ శంకర ముఖ చంద్రుడు సజ్జనుల తేజస్సును పెంచుతాడట.

శంకర ఫాల భాగం పై ధరించే మూడు విభూతి రేఖలు గంగా ,యమునా సరస్వతీ నదుల పవిత్ర త్రివేణీ సంగమం .అవి మూడు వేదాల శిరస్సులనే ఉపనిషత్తుల వ్యాఖ్యానాలనే మూడు కీర్తులుగా భాసిస్తున్నాయన్నారువిద్యారణ్యు లు .అజ్ఞా నారణ్యం లో భార్యా ,పిల్లలు అనే కార్చిచ్చు మంటల చేత తపిస్తున్న జనానికి ,ఆత్మ విద్య ను ఉపదేశించటానికి శ్రీ మేధా దక్షిణా మూర్తియే ,మౌన ముద్ర వదిలి శ్రీ శంకరాచార్యులుగా అవతరించారట .శంకర యతీశ్వరునికి ,కైలాసవాసి పరమేశ్వరునికి పోలికలతో పాటు ఒక ముఖ్య భేదం కూడా ఉందట .భగవత్పాదులు వైదిక మార్గాన్ని అనుసరించి యజ్న యాగాదులు చేస్తూ చేయించారు .కాని పరమ శివుడు మామగారైన దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళకుండా భార్యకు అవమానం జరిగిందని తన వీరభద్రావతారం తో దక్ష యజ్న వినాశనం చేయించాడు అని చమత్క రించారు మాధవ విద్యారణ్య స్వామి .శంకరుడు అనే హిమవత్పర్వతం నుండి బయలుదేరిన ‘’వాక్కు ‘’అనే గంగా ప్రవాహం ,దుస్టవాదాలను హరించి ‘’వైదిక పంటలు ‘’పండించింది .శ్రీ శంకర వాక్ పరిమళాన్ని పచ్చ కర్పూరం అప్పుగా తెచ్చుకొందట .కస్తూరి పరిమాణం గా గ్రహించిందట .కుంకుమ పువ్వు కొనుక్కోన్నదట .ఇదంతా చూసి మంచిగంధం ఏకంగా తస్కరించిందని విద్యారణ్య చమత్కారం .

శంకరా ద్వైతం లో విశిష్టత ఏమిటి ?పూర్వం అరణ్యాలలో మహర్షులు మాత్రమే ఆత్మ జ్ఞానం టో అద్వైత సుఖాన్ని దర్శించారు .అందుకే అది అంతా ‘’ఆరణ్యకం ‘’అయింది .గౌతమ బుద్ధుడు దాన్ని జనసామాన్యం లోకి తెచ్చాడు .కాలక్రమంలో అది భ్రస్టు పట్టింది .శంకరాచార్య వచ్చి అద్వైతాన్ని మళ్ళీ నిల బెట్టారు .అందుకే వివేకానందస్వామి ‘’నైతిక దృక్పధం లో బుద్ధుడు ,శాస్త్రీయ దృష్టిలో శంకరుడు అద్వైతాన్ని నిలబెట్టారు ‘’అన్నాడు .శంకరాద్వైతం లో మరో విశిష్టత ఉంది .క్షుద్ర దేవతారాధన చేసే కాపాలికుల విశ్వాసాలను భద్ర పరిచింది .అద్వైత దైవం ‘’సమస్వరూపుడు ‘’.సర్వం ఆయనే .సర్వాన్నీ ఆయన గా చూడటమే అద్వైతం .

శంకర భగవత్పాదులు ఒక విజ్ఞాన సర్వస్వం .వాదనా సామర్ధ్యానికి పరాకాష్ట .జ్ఞాన సాగరం ఆయన .వైరాగ్య హిమవన్నగం .సంస్కృత వాజ్మయానికి మహా గొప్ప ప్రచారకులు .ఆయన స్తోత్రాలు అమృత ధార.జ్ఞాన గంగాస్నాన ఫలాన్నిస్తాయి .జీవన్ముక్తి సాధకాలు .అంతటి ప్రతిభా ప్రజ్ఞామూర్తి మళ్ళీ జన్మించనే లేదు .వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణు మూర్తి అయితే శంకరాచార్య అపర శంకరుడే .భగవంతుడిచ్చిన ఆయుర్దాయం 8ఏళ్ళు మాత్రమే.అగస్త్యాది  మహర్షులిచ్చింది మరో 8 ఏళ్ళు .అంటే 16 ఏళ్ళకే జీవితం చాలించాల్సి ఉంటుంది .మరి ఈలోపలే ఎన్నో అద్భుతాలు సాధించారు .తల్లి ఎప్పుడు మనసులో తలుచు కొంటె అప్పుడే ఆమెదగ్గరకు వచ్చి వాలుతానని తల్లికి వాగ్దానం చేసి ,సన్యాసియై సరైన గురుని అన్వేషిస్తూ కాలినడకన కాలడి నుండి బయల్దేరారు .నర్మదా నదీ తీరం లో కొండపై ఒక గుహలో శ్రీ గోవింద భగవత్పాదులు ఉన్నారని తెలుసుకొని దర్శించటానికి శంకరులు చేరారు .చూడగానే ‘’ఎవరు నువ్వు?అని ప్రశ్నించారు గౌడ పాదులనే, గోవింద భగవత్పాదులు .అయన వేద ,ఉపనిషత్తుల ను శిష్యులకు నేర్పుతూ బహుళ కీర్తి నార్జించారు .సాక్షాత్తు శుక మహర్షి అవతారం .అప్పుడు శంకరాచార్య –

‘’మనో బుధ్యహంకార చిత్తానినా-న శోత్రం న జిహ్వా , నచ ఘ్రాణ,నేత్రే –నచ వ్యోమ భూమి ర్న తేజో  ,న వాయు-శ్చిదానంద రూపం శివోహం శివోహం ‘’అని జవాబు చెప్పారు శంకరులు .భళా అనుకోని,ఈయన కోసమే తాను  ఎదురు చూస్తున్నట్లు చెప్పి’’స ప్రాంగ శంకర స శంకర ఏవం సాక్షాత్ ‘’అని   శిష్యునిగా స్వీకరించారు గోవిందులు .ఒక రోజు అర్ధ రాత్రి హోరు గాలి ,వానతో నర్మదా నది విజ్రుమ్భించి పొంగి గుహలోకి నీరు చేరే స్థాయికి చేరింది గురువు గాఢ నిద్రలో ఉన్నారు .శంకరులు  ఓంకార జపం చేస్తూ నర్మదా స్తుతి చేస్తూ  కాలం గడిపారు .అంతే నర్మద శాంతించింది దిశ మార్చుకొని తరలిపోయింది . .తెల్ల వారేసరికి అంతా ప్రశాంతం గా ఉంది .ఈ విషయం శిష్యులు గురుదేవులకు తెలియ జేశారు .మహా ప్రసన్నులై నాలుగు మహావాక్యాలు ,ఉపనిషత్తులు బోధించి వాటికి వ్యాఖ్యానం రాయమని ఆదేశించారు .అలానే చేశారు శిష్య శంకరులు .గౌదపాడులున్న ఈ క్షేత్రం లో ఓంకారేశ్వర శివుడున్నాడు .అందుకే ఇది ఓంకార క్షేత్రమైంది .ఇక్కడి జ్యోతిర్లింగం’’ మామలేశ్వర జ్యోతిర్లింగం’’ గా ప్రసిద్ధం .రెండుకొండల నడుమ ఈ క్షేత్రం ఓంకారాకృతిలో కనిపించటం మరో విశేషం .

గురువు ఆజ్ఞను ఔదల దాల్చి శంకరులు ప్రస్తాన త్రయం అంటే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత లకు మహా భాష్యం రాశారు .బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ శిష్యులకు వివరిస్తుంటే వ్యాసభగవానుడు శిష్య రూపం లో వచ్చి వింటూ వాదిస్తూ 8రోజులు ఉన్నాడు .చివరి రోజు శిష్యుడొకడు ఆయన వ్యాసర్షి అని తెలియ జేస్తే అమాంతం పాదాలపై వాలి పోయారు శంకరులు .ఆప్యాయంగా లేపి కౌగిలి౦చు కొనిఅద్భుతమైన వ్హాఖ్యానం చేశాడని శంకరులను వ్యాసుల వారు అభినందించారు .16వ ఏడు దాటి పోతోందని తెలిసి కాశీలో ప్రాణ త్యాగం చేయాలనుకొన్న శంకరులకు వ్యాసభగవానుడు దర్శన0  అనుగ్రహించి ఆయనతో చాలా పని మిగిలి పోయిందని తాను మరొక 16సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తున్నానని  జన్మించిన దానికి సార్ధకం చేసుకోమని చెప్పాడు .

కాశీలో భట్ట పాదుడు చుట్టూ ఊక పేర్చుకొని దహనం చెందే ప్రయత్నం చేస్తున్నప్పుడు శంకరులు అటుగా వెడుతూ విషయం తెలుసుకొని ఆయన సాక్షాత్తు కుమార స్వామి అవతారమని కనుక ఆత్మ త్యాగం వద్దని చెప్పి శిష్యునిగా స్వీకరించి వార్తికం వ్రాయమని కోరారు. అలానే చేశాడు భట్ట పాదుడు .నర్మదా నదీ తీరం లోని మాహిష్మతీ పట్టణం లో ఉన్న కర్మిస్టి,జ్ఞానమార్గానికి వ్యతిరేకి అయిన మండన మిశ్రుని వాదం లో ఓడించి శిష్యుని చేసుకొని ,ఆయన భార్య ఉభయ భారతి తననూ ఓడించాలని కోరితే ‘’కామ శాస్త్రం ‘’లో తనను ఓడించ మని కోరింది. గడువు కోరి మరణించిన అమరుక మహారాజు శరీరం లో  పరకాయ ప్రవేశం చేసి అంతఃపుర స్త్రీలతో శృంగారం అనుభవించి ఆ విద్యలో అఖండుడు అని పించుకొని అమరుక కావ్యం రాసి ,మళ్ళీ తన శరీరం లో ప్రవేశించి ఉభయ భారతిని కామ శాస్త్రం లో వాదం తో ఓడించి ఆమెను మళ్ళీ బ్రహ్మ లోకానికి వెళ్ళేట్లు చేశారు శంకరులు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరం లోక శంకరం

వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి –ఆది శంకరాచార్య జన్మించిన రోజు .దానిని నిన్న 11వ తేదీ బుధవారం కృష్ణానదీ తీరం సమీపం లో ఉన్న శ్రీ రామ చంద్రుడు ప్రతిష్టించిన ఉభయ రామేశ్వర క్షేత్రంగా ఖ్యాతి చెందిన ఐలూరు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న కూడేరు గ్రామం వాసి , నాకు 30ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు నాతొ పాటు ఉయ్యూరు హైస్కూల్ లో లెక్కల మేష్టారు గా పని చేసినవారు మాంచి బాడ్మింటన్  ,వాలీ బాల్ ప్లేయర్ ,గణిత శాస్త్ర బోధనలో దిట్ట ,క్రమశిక్షణకు మారు పేరు ,సహాయ సహకారాలలో ముందుండే సహృదయులు ,స్నేహానికి చిరునామా సరసభారతికి ఆత్మీయులు ,మాకుటుంబ  మిత్రులు అయిన శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారు వారి స్వంత దేవాలయ సముదాయం లో ఉదయం 9గం లకు నిర్వహిస్తూ నెలరోజుల నాడే నన్ను ఆహ్వానించి నాలుగు ముక్కలు భాగవత్పాదులపై మాట్లాడమని కోరారు .మేమిద్దరం, మా మూడవ కోడలుశ్రీమతి రాణి ,మనవరాలు ఛి రమ్య కారులో ఉదయం 8గంటలకు కూడేరుకు కనకవల్లి దేవరపల్లి మీదుగా వెళ్లి కృష్ణ కరకట్ట ఎక్కి  ,దారిలో ఐలూరు లో శ్రీ రామ లింగేశ్వర స్వామిని దర్శిద్దామని  పావు తక్కువ తోమ్మిదికే అక్కడికి చేరగా గుడి తలుపులు తాళం వేసి ఉన్నాయి కటకటాల తలుపు లోంచి స్వామి లింగాన్ని దర్శించి తరించం .ఈ స్వామిని సుమారు 26ఏళ్ళక్రితం నేను మేడూరు హెడ్ మాస్టారుగా పని చేసినప్పుడు స్కూల్  పిల్లలను ఫీల్డ్ ట్రిప్ గా  ఐలూరు తీసుకు వెళ్లి కృష్ణానది ఒడ్డుకు తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉంటె , మేడూరు మహిళామండలి వారు మా అందరికోసం సుమారు 500మందికి లడ్డూలు ,పులిహోర చేసి రిక్షాలో మా వెనక పంపిన జ్ఞాపకం ఇంకా ఉంది .’’కటకటాల దర్శనం’’ తర్వాత సరాసరి కూడేరు శాస్త్రిగారింటికి చేరాం .ఇంటి దగ్గర మేము బయల్దేరే టప్పుడే టిఫిన్ చేసేశాం .ఇప్పుడు శాస్త్రిగారి భార్య ఇచ్చిన కాఫీ త్రాగాం.ఇంకా ఆయనకాని ఆవిడకాని స్నానాలు చేయలేదు .కూడేరు అల్లుడు శ్రీ ఫణి అభిషేక కార్య క్రమం కోసం కలిదిండి నుండి వచ్చారు. కలిదిండి అంటే శ్రీ పాతాల భోగేశ్వర స్వామి ఆలయం గుర్తు ఉండే ఉంటుంది .అక్కడికి ఒకప్పుడు రాజ రాజ నరేంద్ర మహారాజు ఆస్థానకవి నన్నయ గారు రాజ మండ్రి నుంచి వచ్చి స్వామిని దర్శించి ఇక్కడి నాగ కన్య వృత్తాంతం విని ,అప్పటికే రాజు మహా భారతాన్ని అనువదించమని కోరగా నన్నయ ఉదంకో పాఖ్యానాన్ని గుర్తుచేసుకొని ఉదంకుడు చేసిన నాగ స్తోత్రాలకు శ్రీకారం ఇక్కడే చుట్టాడని ఐతిహ్యం .అంటే తెలుగు భారత రచన  కలిదిండిలో ప్రారంభమైనదన్నమాట .కలి దిండి అంటే ఇది జ్ఞాపక మొచ్చింది .

కూడేరు శ్రీ శంకరుల విగ్రహానికి నమక చమకాలతో అభిషేకం బిల్వార్చన శంకర భగవత్పాదుల అష్టోత్తర పూజాఫనిగారి ఆధ్వర్యం లో  చేశారు .తర్వాత శ్రీ దాసాంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ నిర్వహించారు స్వామికి మేము నూతన వస్త్రాలు సమర్పించాం.తరువాత సభ మొదలైంది .నేను శ్రీ శంకరులపై మాట్లాడాను .నాకు శాలువా కప్పి ‘’చంద్రునికో నూలు పోగు ‘’అన్నారు శ్రీ శాస్త్రి .ఒక జ్ఞాపిక బహూకరించారు .నేను ఆయనకు సరసభారతి జ్ఞాపికను ‘’దైవ చిత్తం ‘’శ్రీ హనుమజ్జయంతి ఆహ్వాన  పత్రాలు  అందించాను .శ్రీ ఫణిగారికి జ్ఞాపిక ,కేమటాలజి పిత, దైవ చిత్తం తో బాటు వేదాశీర్వచనం చేసినందుకు 116 రూపాయలు తాంబూలం లో సమర్పించాను అక్కడికి వచ్చిన శ్రోతలు’’ ఆరుగురికి’’ మన ఈ రండు పుస్తకాలు , కరపత్రాలు అందజేశాను .స్వామి ప్రసాదం రవ్వకేసరి పులిహోర అందరికి అందించారు. బహు రుచిగా ఉన్నాయి రెండూ ..తరువాత శాస్త్రి గారింట్లో మాకు రసం మామిడి పండు తో సహా భోజన ఏర్పాటు చేశారు .పదార్దాలాన్నీ రుచిగా శుచిగా ఉన్నాయి .కమ్మగా భోజనం చేశాం. మా ఇద్దరికీ శ్రీ శాస్త్రి దంపతులు నూతన వస్త్రాలు ప్రదానం చేసి ఆశీర్వదించారు   వెంటనే బయల్దేరి  కట్ట మీదుగా వల్లూరు ద్వారా ఉయ్యూరుకు మధ్యాహ్నం రెండున్నరకు చేరాం .

సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి దేవాలయం లో శ్రీ శంకర జయంతి ణి సరసభారతి 92 సమావేశంగా చేశాం .శ్రీ శంకరాచార్య పటానికి అష్టోత్తర పూజ చేశాం .తరువాత ప్రముఖ గాయని శ్రీమతి వట్టెం శాంతిశ్రీ శ్రీ శంకర కృత దేవీ స్తోత్రగానం వీనుల విందుగా చేశారు .ఆమె సౌందర్య లహరి ని సిడి లుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాని శ్రీ కంచి స్వామి సన్నిధిలో నాలుగు గంటలు పాడి వినిపించానని వారు దివ్య ఆశీస్సులందించి ముందుకు సాగమని చెప్పారని అన్నారు .మంచి ప్రయత్నం చేస్తున్నారని ,విజయ వంతం కావాలని నేను అన్నాను .ఇలా రెండు సార్లు శ్రీ శంకర జయంతి లో పాల్గొనే అదృష్టం కలిగింది .అక్కడా ఇక్కడా మాట్లాడిన మాటలనే ‘’శ్రీ శంకరం లోక శంకరం ‘’గా మీకు అందిస్తున్నాను .

‘’శ్రుతి స్మృతిపురాణామాలయ౦ కరుణాలయం-నమామి భాగవత్పాదశంకరం లోక శంకరం ‘’

‘’దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –

స ఏవ శంకరాచార్యః –సాక్షాత్ కైవల్య నాయకః –

శ్రౌత స్మార్త ప్రతిస్టార్ధం భక్తానాం హితకామ్యయా

కరిషత్సవతారం స్వం శంకరో నీల లోహితః ‘’(శివ రహస్యం )

కంచి మఠం లెక్కల ప్రకారం క్రీ పూ .509లో జన్మించి ,క్రీ పూ 477లో కైవల్యం పొంది ,పాశ్చాత్యుల లెక్కప్రకారం క్రీ శ 788లో జన్మించి క్రీ శ 820 లో మరణించారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు .ఎవరివి యే లెక్కలైనా వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్రా నక్షత్రం లో జన్మించారు అని అందరూ అంగీకరించారు . కేవలం 32సంవత్సరాలు మాత్రమే జీవించి,ప్రస్తాన త్రయానికి భాష్యం రాసి ,రసగుళికలు అనదగిన సంస్కృత స్తోత్రాలు ,సౌందర్య లహరి శివానంద లహరి వంటి అనేక రచనలు చేసి సంస్కృత భాషను సుసంపన్నం చేసి దాన్నిసామాన్య  జనాలకుఅందుబాటులో తెచ్చిన   మహానుభావుడు  .అందుకే స్వామి వివేకానంద ‘’In  Sankara  we see tremendous intellectual power throwing ,the scorching light of reason upon every thing ‘’అన్నారు .’’Sankara was not merely a philosopher ,not really a religious leader ,but he was the greatest nation builder and thought leader ‘’అన్నాడు ఎ.కే బెనర్జీ  .జాతి నిర్మాత శంకరుడు .మాసానాం మార్గశీర్షోహం ‘’అని గీతలో కృష్ణుడు అన్నా వైశాఖ  మాసం విశిష్టమైనదని నాకని పిస్తుంది .ఈనెలలో ఎందరో మహానుభావుల జయంతులు ఉన్నాయి .వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు సింహాచ నరసింహ స్వామి చందనోత్సవం ,పరశురామ జయంతి  వీరశైవ మత స్థాపకుడు బసవనమంత్రి జన్మదినం .శుద్ధ పంచమిశ్రీ  శంకర జయంతి, శుద్ధ షష్టి శ్రీ రామానుజ జయంతి .శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి .పౌర్ణమి భగవాన్ బుద్ధ జయంతి అన్నమాచార్య జయంతి .వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి .మండు వేసవిలో ఇన్ని జయంతులు .అందుకే పానకాలు వడపప్పు ,మామిడిపళ్ళు తాటాకు విసన కర్రలతో ఉపచారాలు తాపోపశమనం  అటు దేవుళ్ళకూ ఇటు మనకూ కూడా .

కలియుగం ప్రవేశించి అప్పటికి 3వేల సంవత్సరాలు అయింది .దేశం లో వేద విరుద్ధ భావనలు వ్యాపించాయి యజ్న యాగాదులు లేవు .వేదఅధ్యయ్యన అధ్యాపనాలు లేవు .రాజులు వైదికాన్ని వదిలేసి జైన బౌద్దాలవైపు చేరి పోషించారు .పాషండ మతాలన్నీ పెరిగిపోయాయి .దేవతలందరూ శివుడిని చేరి  లోకోపకారం చేయమనిప్రార్ధించారు .బోళాశంకరుని హృదయం కరిగి పరిష్కారమార్గంగా తానే భూమిపై శంకరాచార్య స్వామిగా అవతరిస్తానని అభయమిచ్చాడు .కుమార స్వామిని భట్ట పాదునిగా  ,బ్రహ్మను మండన మిశ్రునిగా ,ఇంద్రుడిని సుధన్వ మహా రాజుగా తనకంటే ముందే భూమి పై జన్మించమని ఆదేశించాడు .విష్ణువును పద్మ పాదాచార్యునిగా వాయుదేవుడిని హస్తామలకాచార్యునిగా ,అగ్ని దేవుడిని తోటకాచార్యునిగా ,వరుణ దేవుడిని చిత్సుఖా చార్యునిగా జన్మించమని కోరాడు .శుక మహర్షిని గౌడ పాద లేక గోవింద భగవత్పాద  యతీ౦ద్రు నిగా పుట్టమని  చెప్పాడు .ఒకప్పుడు బ్రహ్మ వేదం చదువుతున్నప్పుడు స్వరలోపం జరిగింది .ప్రక్కనే ఉన్న అర్ధాంగి సరస్వతి నవ్వింది .కోపం వచ్చి ఆమెను భూలోకం లో విష్ణు మిత్రునికి కుమార్తెగా జన్మించమని శాపమిచ్చాడు ఆమె యే ఉభయ భారతిగా జన్మించి మండనమిశ్రుని వివాహమాడింది .భట్ట పాదుడు జైమిని సూత్రాలకు తాత్పర్యం రాసి సుధన్వ మహా రాజుకు వినిపించి ఆయన అనుగ్రహాన్ని పొందాడు .రాజు సహాయం తో జైన బోద్దాచార్యులతో వాదాలు చేసి ఓడించి వైదికం వైపు జనాలను చేరేట్లు చేశాడు .శివుడు ఒక రోజు సుధన్వ మహా రాజు కలలో కన్పించి కేరళలో కాలడి దగ్గర పూర్ణానది తీరాన ఒక శివాలయం నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలతో వర్ధిల్ల జేయమని ఆదేశించాడు. రాజు అలానే చేశాడు .ఇంతటి బృహత్ నేపధ్యం ఏర్పాటు చేసుకొని శివుడు శంకరాచార్యునిగా కాలడిలో నంబూద్రీ బ్రాహ్మణ కుటుంబీకు డైన శివగురు  ధర్మ పత్ని ఆర్యాంబ  లకు జన్మించాడు .ఈ దంపతులకు వృద్ధాప్యం సమీపిస్తున్నా సంతతి కలుగ లేదు .వారి ఇష్టదైవం పరమేశ్వరుని అనుగ్రహం కోసం చాలా చేసి  చివరికి పొందారు .దీర్ఘాయుస్సు కల కొడుకు కావాలా అల్పాయుష్కుడైన తేజస్వి కుమారుడు కావాలా అని అడిగితె తేజస్వి నే కోరారు. ఆ దంపతులు .ఇలా శివానుగ్రహం వలన ఆర్యాంబ శంకరుని భర్త శివ గురువుద్వారా కన్నది . శ్రీ శంకరుని జీవితం పై అనేక గ్రంధాలు ఉన్నప్పటి కి ,విజయనగర స్థాపనకు హరిహర బుక్క రాయల ను ప్రేరేపించి న అద్వైత గురువులు శ్రీ మాధవ విద్యా రణ్య స్వామిరాసిన  ‘’శంకర విజయం ‘’సాదికారికమైనది .నా రచనకు ఎక్కువగా శంకర విజయం ఆధారం .మిగిలినవాటినుండీ గ్రహించి రాసినవే .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 12-5-16-

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కుడేరులో శ్రీ శంకర జ్జయంతి


కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కుడేరు గ్రామస్తులు నాతోటి సహా ఉపాధ్యాయుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి కోరికమేరకు ఈ రోజు నేను నా శ్రీమతి మా మూడో కోడలు, మనవరాలు కుడేరు గ్రామం వెళ్లి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిస్ట్ట చేసిన శ్రీ ఆది శంకరాచార్యులుకి అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహించాను. వారు మాకు సన్మానం చేశారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment