గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

కేరళలో తిరువనంత పురం లోని చెంపల0తి లో  1885 లో నారాయణ గురు జన్మించాడు .తండ్రి మదన్ ఆసన్  ,తల్లి కుట్టిఅమ్మ .గురుకుల పద్ధతిలో ప్రాధమిక విద్య  ఉన్నత విద్య 1887 వరకు నేర్చాడు .ఈకాలం లోనే తర్క ,వ్యాకరణ కావ్య నాటక వేదాంతాలు క్షుణ్ణంగా అభ్యసించాడు . సకల సద్గుణ రాశి గా పేరు పొందాడు .మంత్ర వేత్తగా ఉపన్యాసకుడుగా గురువుగా బోధకుడుగా సన్యాసిగా ప్రముఖుడయ్యాడు .కేరళలో హిందూ మత ,పునరుద్ధరణకు ,అందులోని మూఢ ఆ ఛారాలను తొలగించి సంస్కరణ చేసినందుకు నారాయణ గురు ను సదా స0స్మరించుకొంటారు .

 సంఘం లో అట్టడుగున ఉన్న అణగారిన కిందికి తొక్కబడిన జాతులవారిని కులమత భేదాలు లేకుండా చేరదీసి వారినీ సమాజం లో సమాన హోదాగలవారినిగా చేయటానికి చైతన్య వంతులను చేశాడు .తోటివారిని మానవులుగా గుర్తించాలే తప్ప హిందూ ముస్లిం క్రైస్తవాదులుగా గుర్తించరాదని బోధించాడు .వేద ,ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు బాగా ఆకళింపు చేసుకున్నవాడుకా నుక వాటిలోని పరమ రహస్యాలను అర్ధం చేసుకొని ఆచరణ సాధ్యం చేశాడు .మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడు పడ్డాడు . దేశసంచారం చేస్తూ కట్టాంబి స్వామిని కలిసి ఆయన శిష్యుడై ఇద్దరూకలిసి సంఘ దురాచార నిర్మూలనకు నడుం కట్టారు .యోగ విద్యనూ సాధించాడు .వివాహమైందికాని సఫలం కాలేదు .

  నారాయణ గురు అరివిప్పురం లో ఒక శివ లింగ ప్రతిష్ఠచేసి గుడికట్టించి దాన్ని గొప్ప యాత్రాస్థలంగా మార్చాడు . 1895 లో డా.పల్పు ను కలుసుకోవటం తో సాంఘిక సేవకు మంచి ఊపు లభించింది .1903 లో ‘’శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం ‘’స్థాపించి అదో జగత్ సహోదరుల ను ఆదుకున్నాడు .నారాయణ గురు యజ్వ కులంలో పుట్టాడు ఆకులం వారికి అప్పుడు విద్యాలయాలలో  ఉద్యోగాలలో దేవాలయాలలో ప్రవేశం లేదు . ప్రముఖ మలయాళ వి కుమార  ఆసన్ ఈయన శిష్యుడే .ఆ సంస్థకు సెక్రెటరీ గా ఉన్నాడు . సంస్థ ‘’వివేకోదయం ‘’దిన పత్రిక ను ఆసన్ సంపాదకుడుగా ప్రారంభించింది .వీరి కులాలలో కెట్టు కళ్యాణం అనే శాస్త్ర బద్ధమైన ఖర్చుతోకూడిన తంతు  చేసుకొన్నవారికే  వివాహ యోగ్యత ఉండేది .ఈ పద్ధతిని మానిపించి సూటిగా తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహ పద్ధతిని జరిపించి సఫలుడయ్యాడు నారాయణ గురు .శివ గిరిలో శారదా మఠం  అలివిప్పురం మొదలైన చోట్ల ఆశ్రమాలు కట్టించి ,తాలస్సేరిలో జగన్నాధ దేవాలయం నిర్మించి అందరికి దేవాలయ ప్రవేశం కల్పించి గాంధీ ,ఠాగూర్ ల ను ఆహ్వానించి మన్ననలు పొందాడు .

 వేదాంత సంబంధమైన గ్రంథాలెన్నో నారాయణ గురు రాశాడు .కొన్ని సమాజ ఉద్ధరణకు రాశాడు .ఆయన సంస్కృత రచనలలో దర్శన మాల ,ఆత్మోపదేశ శతకం ,దైవ దశకం ,అనుకంప దశకం ,జటిలాక్షణం , చిచ్ఛ దా చింతనం ,శివశతకం,అద్వైత దీపికా ,జనని నవారత్న మంజరి ,నిర్వృతి పంచకం ,వినాయకాష్టకం ,జ్ఞాన దర్శనం ,చిదంబర శతకం ,ఇంద్రియ వైరాగ్యం  శ్రీ కృష్ణ దర్శనం కలినాటకం  మొదలైనవి ఉన్నాయి . 1928 లో ఈ ఆధ్యాత్మిక పుణ్య పురుషుడు నారాయణ గురు 43 ఏళ్లకే నారాయణ సన్నిధానం చేరాడు .

398-కేరళలో వివిధ రూపాలలో వర్ధిల్లిన సంస్కృత నాటకాలు

సంప్రదాయ ,జానపద పద్ధతులలో సంస్కృత నాటకాలు కేరళలో బహుళ వ్యాప్తి పొందాయి .అభినయ శైలి అద్భుతం .ఈ ప్రదర్శనా రూపకాలు -కుట్టియాట్టం ,ఛాక్యార్ కుట్టు ,నంగ్యార్ కుట్టు ,కృష్ణాట్టం అని వేర్వేరురకాలు ..

1-కుట్టి యా ట్టమ్ – కేరళలో సంస్కృత నాటకాలు ఆడటం ప్రారంభమైనది దీనితోనే .ఇది దేశంలో మిగిలిన చోట్లకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది .అతి ప్రాచీన కళ  ఇది .కుట్టి అంటే కూడి అంటే కలిసి అని ,అట్టం అంటే నటించటం .అంటే కలిసి నటించటం అన్నమాట .నృత్యనాటకం లో ఉపరూపక విధానం . భరతముని చెప్పిన అన్ని సిద్ధాంతాలను దీనిలోపాటిస్తారు .ఈ కళ 10 వ శతాబ్దికి బాగా వ్యాప్తి చెందిన అతి ప్రాచీన ప్రదర్శన విధాన0 .కులశేఖర వర్మ కేరళలో దీన్ని మొదటిసారిగా ప్రదర్శించారు . దీనిలో ఆంగిక, వాచిక, సాత్విక ,ఆహార్య అభినయాలుంటాయి .ముద్ర ,చారి పద్ధతులను వాడతారు .తాళానికి మిలవు ,ఇడక్క ,కూడంకుల ,కూళితాళం  ఉపయోగిస్తారు . కుట్టియాట్టోమ్ లో ప్రదర్శించే సంస్కృత నాటకాలు -శక్తి భద్రుని ఆశ్చర్య చూడామణి నాటకం ,సుభద్రా ధనుంజయం ,కులశేఖరుని తపతీ  స్వయంవరం  హర్షుని నాగానందం ,నీలకంఠుని కళ్యాణ సౌగంధికం ,బోధాయనకవి రాసిన భగవదజ్జుక ,భాసుని అభిషేక, స్వప్న వాసవ దత్త , దూత వాక్య నాటకాలు

2-చాక్వార్  కుట్టు -ఇందులో న0జి యార్ ,నంబియార్ లు ఉంటారు .కుట్టియాట్టోమ్ లో ఇది విదూషక భాగం .ముఖ్యకథను హాస్యపద్ధతిలో అప్పటికాలానికి అన్వయిస్తూ విదూషకుడు చెబుతాడు .ఇది సంఘ దురాచారాలను ఖండించే రూపక విధానం .

3-నగరికుట్టు -ఇందులో ఆడవారే స్త్రీపాత్రలను ధరించటం ప్రత్యేకత .నంబియార్ కుటుంబాలకు చెందిన నంగియార్ లు నటిస్తారు .శ్రీ కృష్ణ కథలనే ప్రదర్శిస్తారు .వీటిలో ఏకాంకికలూ ఉంటాయి .చేటి నిర్వహణ బాధ్యత తీసుకొని కదా వృత్తాన్తమ్ తెలియ జేస్తుంది

4-కృష్ణాట్టం -ఇది అతిప్రాచీన సంప్రదాయ నృత్యనాటక ప్రదర్శన విధానం. దీనిని  1654లో గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం లో మొట్టమొదట ప్రదర్శించారు  .ఇందులో శ్రీకృష్ణుని జన్మ వృత్తాన్తమ్ దగ్గరనుంచి స్వర్గారోహణ వరకు 8 కధలను 8 రాత్రులు  ప్రదర్శిస్తారు.ఇందులో నృత్య సంగీతాలకే అధిక ప్రాధాన్యం .సంస్కృత సంగీత నాటకాలకు కేరళ ప్రజలు ఇస్తున్న ఆదరణకు ఇవన్నీ అద్దం పడుతూ వారి సాంస్కృతిక అభిరుచికి జోహార్లు అందుకొంటున్నాయి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Narayana Guru.jpg

— నారాయణ గురు


   కూడియాట్టం


  కృష్ణాట్టం 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

కేరళకు చెందిన 18 వ శతాబ్ది సంస్కృతకవి రామపనివాద గొప్ప సంస్కృత  విద్వా0సుడు .ఆ కాలపు ఎందరో రాజుల సంస్థానాలలో మన్ననల  నందుకున్నవాడు .ప్రాకృతభాషలోనూ అసామాన్య పాండిత్యం ఉన్నవాడు సంస్కృత ,ప్రాకృతాలలో చాలా రచనలు చేశాడు .వెత్తట్టు నాడు ప్రభువు వీర రాయల కోరికపై ‘’చంద్రికా వీధి ‘’ని ,అమలప్పుళ రాజు దేవనారాయణ కోరికపై ‘’లీలావతి వీధి ‘’ని ,తిరువనంతపురం సామ్రాజ్య స్థాపకుడు మార్తా0డ  వర్మ కోరగా ‘’సీతారాఘవ నాటకం ‘’చెన్నమగళం సైన్యాధియతి  కుబేర బిరుదాంకితుడు పలియాత్ అచ్చన్  అడగగా ‘’విష్ణు విలాసకావ్యం ‘’,కున్నమకులం లో మానాకులం కుటుంబం లో  ప్రసిద్ధుడైన ఆర్య శ్రీకంఠ రామవర్మ కోరికపై ‘’ముకుంద శతకం ‘’రాసి ప్రభువుల సైన్యాధికారులు ,ఉన్నత కుటుంబీకుల గౌరవ మన్ననలు పొందాడు . రామ ‘’పని వాద ‘’మంచి పనివాడు’’ అనిపించుకున్నాడు . పనివాద పేరును బట్టి ఆయన నంబియార్ కుటుంబం వాడని భావించారు . ఈ వంశం వారు ఛాక్యార్ లకు సంస్కృత నాటక ప్రదర్శనలో ‘’మిలవు ‘’అనే డ్రమ్ ను వాయిస్తూ సహాయపడేవారు .రామపని వాద నారాయణీయం రాసిన  నారాయణ భట్టు శిష్యుడు .తన రచనలన్నిటిలో గురుపాదుని సంస్మరించాడు .

 ఆయన రాసిన రాఘవీయ మహా కావ్యం లో 20కాండలు ,1572 శ్లోకాలున్నాయి .ఇవికాక మదన కేతు చరిత ప్రహసనం ,ముకుంద ,శివ ,సూర్య శతకాలు ,అంబర నాధీశ  స్తోత్రం  భాగవత చంపు ,వృత్త వార్తిక ,తాళ ప్రస్తార కావ్యం ,రాసక్రీడ తోపాటు కొన్ని సంస్కృత వ్యాఖ్యానాలు శాస్త్రీయ రచనలు చేశాడు .ఆయన రాసిన రాఘవీయానికి విష్ణువిలాసం మేలత్తూర్ దాతుకావ్యం గా భావిస్తారు .సుకుమార రాసిన కృష్ణ విలాసం పై విలాసిని ,వివరణ అనే వ్యాఖ్యలు రాశాడు .వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశకు వ్యాఖ్యానం ,కంస వధ  ,ఉషానిరుద్ధ లఘుకావ్యాలు .లలితా రాఘవ ,పాదుకా పట్టాభిషేక నాటకాలు  లీలాశుకుని ‘’గోవిందాభిషేకం ‘’కు వ్యాఖ్యానం కూడా కూడా ఈయన రచించాడని ఏం కృష్ణమాచారియార్ తెలిపాడు .ఇవికాక పంచపాది అనే సంగీత రూపకం ,ముక్కొల్లు దేవాలయదైవం పై 20 శృంగార శ్లోకాల శృంగార వింశతి  జ్యోతిషం పై కొన్ని గ్రంథాలు కూడా రాశాడని అంటారు .బహుముఖ ప్రజ్ఞాశాలి ,అన్ని ప్రక్రియలలో సమానమైనపాండిత్యం తో కవిత్వం చెప్పి మహాభిరామంగా రామ పనివాద ప్రశస్తి చెందాడు .

396-కట్టాంబి స్వామి  (1853-1924 )

కేరళకు చెందిన కట్ఠంబి స్వామి హిందూ వేదాంతి గొప్ప సంఘ సంస్కర్త .భారతీయ తత్వ శాస్త్రానికి యోగం జ్ఞానం ఉచ్చావ నిస్వాసాలు అని చెప్పాడు .అద్వైత బ్రహ్మ స్వరూప దర్శనానికి ఇవే  మార్గ దర్శకాలు .కేరళలో రాజకీయ ,మత, సాంఘిక ,సాహిత్యాలలో సంస్కరణలు చేయాలని భావించాడు . 1853 ఆగస్టు లో కేరళలో తిరువనంతపురం దగ్గర కొల్లూర్ లో జన్మించాడు .తండ్రి వాసుదేవ శర్మ .తల్లి నాగమ్మ .చిన్నప్పుడు అందరూ కుంజు అని ముద్దుగా పిలిచేవారు అదే తర్వాత కుంజుపిళ్ల గా  మారింది .తలిదండ్రులకు చదువుచెప్పించే స్తొమత లేకపోవటం తో పెట్టియిల్ రామం పిళ్ల  ఆసన్ నడిపే గురుకులం లో చేరాడు .క్లాస్ లీడర్ అయినందున ‘’కట్టాంబి ‘’అనే పేరు వచ్చి అదే స్థిరమైంది .స్వామినాధ దేశికులవద్ద తమిళం ,సుందరం పిళ్ల వద్ద తత్వ శాస్త్రం ,టిక్కట్టు అయ్యావు వద్ద యోగా నేర్చాడు . ఒక సంచారస్వామి ఆఊరి కి వచ్చి బాల సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశాడు .దీన్ని నిత్యం జపం చేసి గొప్ప అనుభూతిపొంది ‘’షణ్ముఖ దాస ‘’బిరుదుపొందాడు .కుటుంబ భారం మీద పడగా చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించి పోషించాడు .త్రివేండ్రం ప్ర భుత్వ సెక్రెటేరియట్ లో గుమాస్తాగా చేయాడు .

 తమిళనాడువెళ్లి శుభా జట పాటిక అనే శాస్త్ర కోవిదుని శిష్యుడై చాలా కాలం ఉండి సంస్కృతం శాస్త్రాలు ,సిద్ధ వైద్యం ,సంగీతం  మార్షల్ ఆర్ట్ వగైరా నేర్చాడు .హిందూ, క్రిస్టియన్ ,ముస్లిం మత పెద్దలవద్ద, అవధూతల వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొన్నాడు .ఒక గొప్ప విద్యావేత్తగా ,మహర్షిగా మారి కేరళకు తిరిగిరాగా  నారాయణ గురు1882 లో ఈయన్ను కలిసి  , ఆయన కొట్టాంబి శిష్యుడైపోయాడు  .ఇద్దరూకలిసి హిందూమతం లోని మూడాఛారాలను సంస్కరించాలని నిర్ణయించారు .ముందుగా మహిళా విమోచన ఉద్యమం చేబట్టి వారికి అన్నిటా సమాన ప్రా తినిధ్యమివ్వాలని ఉద్యమించారు .మత  మార్పిడులను ఎదిరించారు .

 కిట్టాంబి స్వామి రచనలు ఆయన మేధో శక్తిని వివరిస్తాయి .సంస్కృతం లో ఎన్నో ముక్తకాలు  భజన గీతాలు ,వ్యాసాలూ రాశాడు .ఆయన రచనలో ‘’వేదాధికార మిరూపణ ‘’ప్రసిద్ధ గ్రంథం .అద్వైత పధ్ధతి ,ఆదిభాష  ,క్రీస్తు మత నిరూపణం ,దేవీ మానస స్తోత్ర వ్యాఖ్యానం ,నిజానంద విలాసం ,సర్వమత సామరస్యం లు కూడా బహుళ ప్రచారం లో ఉన్నవే .ఆయనను ‘’కవి వస్త్రం లేని సన్యాసి’’ అంటారు . 1924 లో పన్మన వద్ద కిట్టా0బి స్వామి 71 వ ఏటమహా సమాధి చెందాడు .ఆయనను విద్యాధిరాజా అని ,విద్యారాజరాజతీర్ధ పరామభట్టార అని కేరళ ప్రజలు  గౌరవంగా సంబోధిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

వీక్లీ  అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

సరసభారతి 106 వ సమావేశం గా మహర్షి బులుసు సాంబమూర్తి గారి131 జయంతి

 ఈ శ్రావణ శుక్రవారం షార్లెట్ లోని మహిళలందరు సంప్రదాయ పద్ధతిలో పట్టు చీర జాకెట్ తలలో పూలు కళ్ళకు కాటుక ,చేతులకు గాజులతో సాక్షాత్తు అపర లక్ష్మీ దేవి స్వరూపంగా కనిపిస్తుంటే ఎంతో ముచ్చట వేసింది . మన సంప్రదాయ సంస్కృతులను ఇంత గొప్పగా పాటిస్తూ మనందరికి కీర్తి తెస్తూ ,ఆదర్శ ప్రాయమవటం అభినందించదగిన విషయం .భారతీయ మహిళలూ మీకు జోహార్లు .

శ్రీ మతి బులుసు పద్మ తమ ఇంటికి శనివారం రాత్రి టిఫిన్ కు రమ్మనమని చెప్పినప్పటినుంచి  ఆ రోజు ఎలా దాన్ని సరసభారతి కార్యక్రమంగా నిర్వహించాలా అనే ఆలోచన లో మధనపడ్డాను . శ్రీ బులుసు సాంబ మూర్తి గారింట్లో కలుస్తున్నాం కనుక మనమందరం మర్చిపోయిన స్వాతంత్య్ర సమార యోధులు ఆంద్ర రాష్ట్ర అవతారాణానికి శ్రీ పొట్టి శ్రీరాములుగారితో ఉద్యమించిన మహర్షి బులుసు సాంబ మూర్తిగారు జ్ఞాపకం వచ్చి ,బులుసు వారింట బులుసు వారిని జ్ఞాపక0  చేసుకుందామనిపించి ,దానితోపాటు ‘’నవ్వులతో ఆట నవ్వులాట ‘’ను కలిపి అందరూ పాల్గొనేట్లు చేద్దామని అనుకొన్నాను .

5-8-17 శనివారం – .మేము వాళ్ళఇంటికి రాత్రి 7 గంటలకే చేరాం .మిగతావాళ్ళు రావటం ఆలస్యమైంది .వాళ్ళు వచ్చాక ముందు ‘’టిఫిన్ కోర్ట్ ‘’లో ‘’బ్యాటింగ్ ‘’ప్రారంభించాం . పూరీ కూర ,ఇడ్లీ చట్నీ సాంబార్ ,మిర్చిబజ్జీ ,వెజిటబుల్ బిర్యానీ ,జున్ను లపై పడి  వీరంగం చేసాం ..అంతా అయేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు అందరం ఒక చోట చేరి సరసభారతి 106 వ కార్యక్రమంగా మహర్షి బులుసు సాంబమూర్తిగారి 131 వ జయంతి ని నవ్వులతో ఆట నవ్వులాట కార్యక్రమం ప్రారంభించాం .అందరూ ఎంతో ఆశ్చర్య పోయారు . బులుసువారింట బులుసువారిపై కార్యక్రమం అనగానే . .యాక్సి డెంటల్ కో ఇన్సి డేన్స్ అంటే ఇదేనేమో కదా . నేను ముందుగా సరస భారతి  సాహితీ ప్రస్థానాన్ని వివరించి బులుసు వారి జీవిత విశేషాలను తెలియ జేశాను .. నేను ఈమాట చెప్పే దాకా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాను అందరూ ఎంతో ఆశ్చర్యానందాలు పొందారు .అలా ఉండాలనే సస్పెన్న్స్ క్రియేట్ చేశా . నా మాటల సారాంశ0-

‘’శ్రీ బులుసు సాంబ మూర్తిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ దగ్గర దూళ్ల గ్రామంలో 4-3-1886న జన్మించారు . తండ్రిగారు సుబ్బావధానులుగారు ప్రసిద్ధ వేద పండితులు .సాంబమూర్తిగారు ప్రాధమిక విద్య స్వగ్రామం లో నేర్చి  విజయనగరం మహా రాజాకాలేజి లో ఫిజిక్స్ చదివి డిగ్రీ పొందారు . కొద్దికాలం గుమాస్తాగా లెక్చరర్ గా పనిచేశారు . తర్వాత న్యాయ శాస్త్రం చదివి 1911 లో పాసై కాకినాడ బార్ కౌన్సిల్ లో చేరి  న్యాయవాది అయ్యారు .

 1920 లో దేశమంతటా ఉధృతంగా సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య  పంతులుగారి ఉపన్యాసాలకు ప్రభావితులై న్యాయవాద వృత్తి వదిలేసి స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమం లో పాల్గొన్నారు మహాత్మా గాంధీ జీవిత విధానం నచ్చి 1923 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సభ్యత్వం తీసుకున్నారు . భారత దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసిన తొలికొద్దీ మంది నాయకులలో సాంబమూర్తిగారూ ఒకరు . 1930 లో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు .. 18-4-1930  లో అరెస్టయి వెల్లూర్ జైలు లో నిర్బంధం లో ఉన్నారు . 1937 మద్రాస్ అసెంబ్లీ కి  జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు . అసెంబ్లీలో  అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి సాంబమూర్తిగారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను చేసింది .ఈ పదవిలో అయిదేళ్ళున్నారు .

 1942 లో క్విట్ ఇండియాఉద్యమం ఊపందుకొన్నప్పుడు గాంధీ ఆదేశం పై రాజకీయనాయకులందరు పదవులను త్యాగం చేయగా సాంబమూర్తిగారు లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవికి రాజయినామా చేసి ఉత్సాహంగా ఉద్యమం నిర్వహించారు .గాంధీగారిలాగానే సాంబమూర్తిగారుకూడా పంచె పై చొక్కాలేకుండా ఉత్తరీయం మాత్రమే ధరించి ఆదర్శ జీవితం గడిపారు .. భారత దేశం 1947 ఆగస్టు 15 న  స్వతంత్రం పొందింది సాంబమూర్తివంటి త్యాగ ధనుల నిస్వార్ధ సేవకు ప్రతిఫలంగా దాన్ని మనం హాయిగా అనుభవిస్తున్నాం .

 అప్పటికి మనం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో ఉన్నాం .ఇప్పుడు ఆంధ్రులకూ స్వతంత్రం కావాలని మద్రాస్ రాష్ట్రం నుండి వేరు చేసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ బులుసు సాంబమూర్తి శ్రీ ప్రకాశం పంతులు మొదలైన నాయకులు .. ప్రధాని నెహ్రు ఊగిసలాటకు ఆగ్రహించిన పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహార దీక్ష కు సంకల్పించారు .అప్పటిదాకా ఆయనవలన లబ్ది పొందిన కాంగ్రెస్ నాయకులు మొహం చాటేయటం ప్రారంభించారు .శ్రీ రాములు గారి దీక్షకు  స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడు బులుసుసాంబమూర్తిగారు తమ ఇంట్లో సత్యాగ్రహం చేయమని కోరగా ,చేశారు ఆ ఆతర్వాత సంగతులు మనకు తెలిసినవే .. ఆంద్ర రాష్ట్రం మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడింది .కానీ ఆ మహానీయులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు ఉపేక్షకు గురి చేశారు .

  సాంబమూర్తిగారు కాకినాడ చేరి జీవిత చరమాంకం అక్కడే గడిపారు . చేతిలో చిల్లి గవ్వ లేని దీన స్థితి వారిది .కేంద్ర మంత్రి గోవింద వల్లభ పంతుకు  ఈ విషయం తెలిసి ఆర్ధిక సాయం చేశారు .అంతకు మించి ఆదరించిన వారెవ్వరూ లేకపోవటం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం .మహర్షి గా అందరి మన్నన పొందిన బులుసు సాంబ మూర్తిగారూ 2–2-1958 న 72 వ ఏట పరమ పదించారు . ఆతర్వాత ఎప్పుడో ఆయన కుమార్తె ప్రభుత్వానికి ఆర్ధిక సాయం కోసం విన్నపం పంపిస్తే ‘’సాంబ మూర్తి ఎవరు ?”’అని అడిగారట .అదీ మన జాతీయ నాయకులకిచ్చిన గౌరవం . అందుకే సాంబ మూర్తిగారిని ‘’నెగ్లెక్టెడ్ పేట్రియట్  ‘’అన్నారు … ఈ నెల15 న మనం భారత స్వాతంత్య్ర  దినోత్సవంజరుపుకో బోతున్నాం . ఆ సందర్భం గా మహనీయ త్యాగమూర్తి మహర్షి బులుసు సాంబమూర్తి గారిని సంస్మరించి ధన్యులమవుదాం .శ్రీ బులుసు సాంబ మూర్తిగారింట్లో స్వర్గీయ బులుసు సాంబమూర్తిగారి ని స్మరించుకొని అవకాశం మనకు కలిగినందుకు ధన్యులం దీనికి బులుసు దంపతులను అభినందిస్తున్నాను ‘’అని చెప్పాను . బులుసువారి త్యాగనిరతిని అందరు మొదటి సారి తెలుకొని తరించామని భావించారు  .

          నవ్వులతో ఆట నవ్వులాట

 తర్వాత నవ్వులతో ఆట నవ్వులాట ప్రారంభించాం .ఇందులో అందరూ పాల్గొని తమ అనుభవాలను ,తాము విన్న కన్నా హాస్యపు పనస తొనలను ,జోకులకేకులు తినిపించారు . శ్రీమతి సుబ్బలక్ష్మిగారు ఆమె భర్త కామేశ్వరరావుగారు రాకీ దంపతులు పద్మ దంపతులు  మా అమ్మాయి విజ్జి తమ అనుభవాలను తెలిపారు .బాధ్యత నాదే  దీనికీ ఫినిషింగ్ టచ్ ఇస్తూ

‘’మన హాస్య రచయితలైన చిలకమర్తి వారి గణపతి ,ప్రహసనాలు ,పానుగంటి సాక్షివ్యాసాలు ,వీరేశలింగంగారి ప్రహసనాలు , మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి బారిస్టర్ పార్వతీశం  మునిమాణిక్యంగారి కాంత0  కథలు ,భమిడిపాటివారి హాస్య నాటికలు ,శ్రీశ్రీ రిమరిక్కులు ఆరుద్ర కూనలమ్మపాదాలు పఠాభి పంచాంగం జలసూత్రం పేరడీలు  బాపు రమణల హాస్యకథామృతం కార్టూన్లు ,శ్రీరమణ పేరడీలు హాస్యపు చెణుకులు ,రావికొండలరావు హాస్య నాటికలు సినీకవి పింగళి సినీమేటి  హాస్యం  తెలుగు హాస్యం పండించిన శివరావు రేలంగి రమణారెడ్డి ,హాస్యరాజా బాబు ,బ్రహ్మానందం ఏం ఎస్, ధర్మవరపు ,ఏ వి ఎస్  ఆంగ్ల హాస్యం పండించిన చార్లీ చాప్లిన్ లారెల్ ,హార్దీ  .రచయితలు  మార్క్ ట్వైన్  డికెన్స్ అమెరికా కార్టూనిస్ట్ జాన్ ధర్బర్  కోటి కి పడగలెత్తిన కార్టూనిస్ట్ ?తెలుగు హాస్యం అమెరికాలో చిందించిన వంగూరి చిట్టెన్ రాజు లను ఒకసారి గుర్తు చేసుకొందాం . అలాగే ఆవకాయ అత్తగారు తో సంసార ధర్మహాస్యం ఘాటు చూపించిన భానుమతి ,సురేకార హాస్య టపాకాయ్ సూర్యకాంతం  కె ఆర్కే మోహన్ మొదలైనవారు గురించి యెంత చెప్పినా అతక్కువే ..

 శ్రీనాధుడు పల్నాటిపై రాసిన చాటువులు తెనాలి పాండురంగనిపై ప్రచారం లో ఉన్న కధలు అన్నీ హాస్యపు తేనే తుట్టెలే . తాగే ఓపికవుంటే మధురమేకాదు అద్భుతః .

పల్నాడులో నీరు  దొరక్క ‘’తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా !గంగ విడువు పార్వతి చాలున్  ‘’అని ‘’కుళ్ళా  యుంచితి కోకచుట్టితి మహా కూర్పాము న్ గట్టితిన్ ,చల్లా యంబలి  ద్రావితి  విశ్వస్తవడ్డి0పగా -తల్లీ కన్నడ రాజ్య  లక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్ ;;’ ‘’జొన్నకలి జొన్నన్నము జొన్నపిసరు జొన్నలే తప్పన్ సన్నన్నము సున్నసుమీ పదునుగ పల్నాటిసీమ ప్రజలందరికిన్ ‘’

అలాగే తెనాలి రాముడు తాతా ఊతునా అంటే సరే నంటే తాంబూలం ముఖాన ఉమ్మేస్తే  పాంకోడు పెట్టి పన్ను రాలగొడితే  దుప్పికొమ్ము పెట్టుకొని రాయల సభకి వస్తే రాయలు రవి గానని చో  కవిగాఅంచునే కదా అని సమస్య ఇస్తే -’’ఆ రవి వీరభద్రు చరణాహతి కిన్ డుళ్ళిన బోసి నోటికిన్  కొక్కెర పంటికిం దుప్పి కొమ్ము పల్గా రచియించె నౌరా -రవిగానని చో  కవి గాంచునే కదా ‘’చాటువు -విజయనగరమహారాజు పూసపాటి  ఆనంద  గజపతి రాజు తన ఆస్థాన వైణిక  విద్వాన్ నడిమింటి సంగమేశ్వర  శాస్త్ర గారిని ‘’శాస్త్రి గారూ ఇంకా నడిమిల్లేనా ‘’అని హాస్యమాడితే ‘’ప్రభూ మా నడిమిల్లు మీ’’ పూసపాటి ‘’‘’చేయదా  ?అని ఇచ్చిన రిపార్టీ ,కాంతం ,మునిమాణిక్యం ప్రణయ కోపం తో కొంతకాలం మాట్లాడుకోపోతే ఒక రోజు ఆయన మేడ మెట్లు ఎక్కుతూంటే ఆమె దిగుతుండగా ఎదురుపడితే మునిమాణిక్యం ‘’నేను మూర్ఖులకు దారి ఇవ్వను ‘’అంటే ‘’నేను ఇస్తాను ‘’అని చాచి చెంపమీదకొట్టినట్లు రిపార్టీ ఇవ్వటం ,ఫన్ బకెట్ ఫన్ బకెట్ జూనియర్స్ ,ఫన్నీ ఫెల్లోస్ ,ఫ్రాస్త్రేటేడ్ వుమన్ మొదలైనవన్నీ ఒక్క సారి జ్ఞాపకం జేసుకొని హాయిగా 45 నిమిషాలు నవ్వుకున్నాం ,.  తర్వాత ఉషా పద్మ విజ్జి అంతా కలిసి పాడ  వోయి భారతీయుడా ,మా తెలుగు తల్లికి పాటలు పాడి ముగింపుకు వన్నె తెచ్చారు .అనుకోకుండా కార్యక్రమం అద్భుతంగా ఆనందంగా హాయిగా జరిగినందుకు ‘’ఆల్ హాపీస్’’ .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-17-కాంప్ -షార్లెట్-అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

31-7-17 సోమవారం -ఉదయం సంధ్యావందనం ,నిత్యపూజ ,ఆంజనేయ అష్టోత్తర,సహస్ర నామ ,సువర్చలాఅష్టోత్తరపూజ తర్వాత  తొమ్మిదిరోజుల సుందరకాండ  శ్రీ సువర్చ లాన్జనేయ శతక పారాయణలో 5 వ రోజు పారాయణ ఉదయం పూర్తి చేశాను .. మా అమ్మాయి కొత్త ఉద్యోగం లో చేరింది .. మధ్యాహ్నం యు ట్యూబ్ జయ టివి లో మార్గశిర సంగీత ఉత్సవం చూశాను . చాలా అద్భుతంగా ఉంది . తమిళ తెలుగు కన్నడ మళయాళ హిందీ భాషలో గొప్ప సంగీత కచేరీలు కర్ణానందంగా ఉన్నాయి .. అలంకారిక ఆనంద నందనం -8 ,9 ఎపిసోడ్స్ రాశాను . రాత్రి ‘’గొట్టం ‘’లో  విశ్వనాధ్  సినిమా ‘’స్వరాభి షేకం ‘’చూశాము . ఆనందం తో గుండె కరిగి ఆనంద  బాష్పాలు  అడుగడుక్కీ కారి మహదానందమేసింది . ధన్యుడు  విశ్వనాధ్  .మనల్నీ ధన్యులను చేశాడు . అందులో రైల్వే కంపార్ట్ మెంట్ లో శివాజీ రాజా భార్యప్రసవం సీను సెంటిమెంట్ కు ,మానవత్వానికి ,సంగీత ప్రభావానికి ,హోమియో మందు ప్రయోజనానికి అద్దం పట్టింది . గుండెలు కరిగి ఆనంద తాండవమే చేయిస్తుంది . మొత్తం సినిమాలో ఒక పావుగంట సినిమా ఎడిటింగ్ లో తీసేసి ఉంటె శిఖరాగ్రాన నిలిచేది అని పించింది .

 ట్యూబ్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ కవల సోదరుల  ఇంటర్వ్యూ చాలా ఇంటరెస్టింగ్ గా రియలిస్టిక్ గా వాళ్ళ నిజాయితీకి నిదర్శనంగా ఉంది . పల్లె టూరు నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఎన్నో కస్టాలు పడి  ,ఏ దశలోనూ తమ నాయనమ్మ కు సిగరెట్ మద్యం జోలికి వెళ్ళమని చేతిలో చెయ్యేసి పెట్టిన ఒట్టును ,ఇచ్చిన మాట జవదాటకుండా ,అంచెలంచెలుగా ఎదిగి ఫైట్ మాస్టర్లు అయి సిగరెట్ ,మద్యం లేకుండా పైకొచ్చిన సోదరద్వయం వీరు .హీరోలుగానూ చేసి శెభాష్ అనిపించారు .అందులో వాళ్ళు ‘’మేము మంచివాళ్ళం అని అనుకునేవాళ్లం .ఇది కూడా గర్వానికి దారి తీస్తుందని మేమె గ్రహించి ఆ మాట చెప్పుకోవటం మానేసాం .ప్రతి స్టేజ్ లోనూ మా అంతటికీ మేము చెక్ చేసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పురోగమించాం ‘’అని వారిద్దరూ ఏకకంఠం తో చెప్పట0  నాకు బాగా నచ్చింది ..

1-8-17 మంగళవారం -పారాయణ ఆరవ రోజు బాగానే జరిగింది ..ఆలంకారికులు 10 ,11 రాసి పూర్తి చేశా .

బుధవారం -7 వ రోజు పారాయణ . .గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -3 లో 382,383 ఎపిసోడ్ లు రాశాను .

గురువారం -పారాయణ 8 వ రోజు ..గీర్వాణం -3 లో 384 నుండి 387వరకు కవుల గురించి   రాశాను .రాత్రి యు ట్యూబ్ లో హాస్య  చిత్ర దర్శకుడు రాజా వన్నేం రెడ్డి ఇంటర్వ్యూ చూశాను .’’క్షేమంగా వెళ్లి లాభంగా రండి ‘’ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా సూపర్ సక్సెస్  .ఆయనే డైరెక్ట్ చేసిన ఒక కుక్క పై తీసిన ‘’టామీ ‘’సినిమా అవార్డు లను పొందింది .రాజేంద్ర ప్రసాద్ అందులో హీరో .ఎక్కడో దారిలో ఒక కుక్క ఆయన వెంటపడి ఇంటికి వస్తే దాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటూ అదే సర్వస్వ0 గా గడుపుతాడు .రోజూ  అతను  రైల్ లో వేరే చోటుకు వెళ్లి ఉద్యోగం చేసి ,సాయంత్రం ఇంటికి వస్తాడు.  కుక్క ఆయనతో స్టేషన్ కు వెళ్లి మళ్ళీ సాయంత్రం ఆ ట్రెయిన్ వచ్చేసమయానికి అక్కడికి వెళ్లి వెంట తీసుకు వస్తుంది .అంత బాంధవ్యం ఏర్పడుతుంది వాళ్ళిద్దరికీ .ఒక రోజు యధా ప్రకారం ఆయన వెళ్ళాడు కానీ ,తిరిగి రాలేదు .ఆ విశ్వాసపు కుక్క ఏళ్ళ తరబడిరైల్వే స్టేషన్ దగ్గర అలాగే ఎదురు చూస్తూ తిండీ నీరు లేక చనిపోయింది  అతను  కూడా ఎక్కడో చనిపోయాడన్నమాట .విశ్వసానికి ప్రతీక గా టామీ కుక్క నిలిచి పోయింది .ఈకథ జపాన్ లో యదార్ధంగా జరిగింది .ఆ కుక్క విగ్రహం  స్థాపించి దాన్ని చిరస్మరణీయం చేశారట .ఆ కధకు ప్రేరణ పొందిన వన్నేం రెడ్డి మనవాతావరాణానికి తగిన మార్పులు చేసి తీశానని చెప్పాడు .అందులో రాజేంద్ర ప్రసాద్ నటన అద్వితీయమని ,కుక్క నాలుకను తన నాలుకతో తాకటం తన నాలుకను కుక్క తాకి నాలుకపై ఉన్నది తినటం దృశ్యాలలో ఏ మాత్రం సంకోచం ,అసహ్యం పడకుండా రాజేంద్ర చేయటం అతని నిబద్ధతకు నిదర్శనం అన్నాడు .అలా చేసిన నటుడు ఎవరూ ఉన్నట్లు తనకు తెలియదనీ రాజేంద్రను మెచ్చాడు . హాట్స్ ఆఫ్ రాజేంద్ర .

మదర్స్ డే సందర్భంగా ఎప్పటిదో -రాజీవ్ కనకాల ,వాళ్ళ అమ్మగారి తో ఇంటర్వ్యూ అతని చెల్లెలు శ్రీ లక్ష్మితో ముఖాముఖీ బాగున్నాయి అందరికీ ఆదర్శంగా కనకాల కుటుంబం నిలిచింది .సుమారు 20 ఏళ్ళక్రితం వేటూరి సుందర రామ మూర్తిగారి స్వగ్రామం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి లో ఆయన తన ఇంట్లో ఆతిధ్యమిచ్చి జరిపించిన రెండు రోజుల సభలో కనకాల దేవదాస్ ద0పతులను ,విశ్వనాధ్ , బాలు, సప్తపది సినీ హీరోయిన్ సబితా వగైరాలను మేమిద్దరం చూసి మాట్లాడిన విషయాలు గుర్తుకొచ్చాయి .

4-8-17 శుక్రవారం -సుందర కాండ పారాయణం పూర్తి వరలక్ష్మీ వ్రతం

 శ్రావణ మాసం రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం .ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5 గంటలకు నిత్యపూజా ,శ్రీ సువర్చలాన్జనేయ అష్టోత్తర ,శతనామ పూజ చేసేసరికి ఉదయం 6-30 అయింది .రాత్రి తల్లీ కూతుళ్లు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గొప్ప శోభ చేకూర్చారు . అమ్మవారికి కట్టిన చీర చాలా శోభస్కరంగా ఉంది . అప్పటికే మా అమ్మాయి  వాళ్ళమ్మ లేచి వంట సగం పైనే చేసేశారు . 6-30 నుండి 7-45 వరకు వాళ్ళిద్దరికీ వరలక్ష్మీ వ్రతం యధా ప్రకారం చేయించి తోరపూజ తోరాధారణ మంత్రాలు చెప్పి కథ  చెప్పి వాయినాలు ఇప్పించేశాను .మా అమ్మాయి 8 గంటలకు బయల్దేరి ఆఫీస్ కు వెళ్ళింది .నేను తొమ్మది రోజులలో చివరి రోజు సుందరకాండ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ పూర్తి చేసేసరికి .ఉదయం -8-45 అయింది .నైవేద్యంగా పూర్ణం బూరెలు గారెలు పులిహోర ,పాయసం ,పప్పు వంకాయ కూర కొబ్బరి చట్నీ . ఇంతలో శ్రీమతి ప్రక్కి అరుణ దంపతులు వచ్చారు . నైవేద్య హారతి మంత్రపుష్పం పూర్తయ్యేసరికి 9-15 అయింది . అరుణ దంపతులు మా దంపతులకు వస్త్రాలు అందజేసి వాయనం ఇచ్చుకున్నారు . ఆమెకూ మా వాళ్ళు కొత్త చీర జాకెట్ పేటి వాయనం ఇచ్చారు .

తర్వాత టిఫిన్  చేశాను .

 సుమారు 11 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాన్ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి అల్లుడు వచ్చి వాళ్ళ ఇంటికి కారులో తీసుకువెళ్లాడు .ఎల్లా వారమ్మాయి 5 ఏళ్ళ క్రితం ఇక్కడే పరిచయం అప్పుడే వాళ్ళనాన్నగారితో ఫోన్ లో మాట్లాడుతుంటే మేమూ ఆయనకు నమస్కారాలు చెప్పాం . అయిదేళ్ల క్రితం వారు మా అమ్మాయిగారింటికి రావటం ఆయనను నేను ‘’టోరీ రేడియో ‘’కు ఇంటర్వ్యూ చేయటం ఆయన మా ఇంట్లో భోజనం చేయటం జ్ఞాపకం వచ్చాయి .ఆయన మర్చి పోలేదు . ఏడాది క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ఉయ్యూరుకు ఫోన్ లో మాట్లాడారు . విజయ మా ఇద్దరికీ బట్టలు పెట్టి వాయనమిచ్చి  టిఫిన్ పెట్టింది.మేము వాళ్ళఇంటికి వెళ్ళటం ఆమె ఆనందానికి అవధులు లేవని పించింది . .

 ఇంటికి రాగానే శ్రీమతి గోసుకోండ అరుణ  కారులో వాళ్ళింటికి తీసుకు వెళ్లి ఆదంపతులు మాకు బట్టలు పెట్టారు . వాయనం ఇచ్చారు . ఈ రెండు ఇళ్లకు మాతోపాటు మా ప్రక్కనున్న శ్రీ మతి సుగుణ కామాక్షిగారు కూడా వచ్చారు . ఇంటికి వచ్చి భోజనం చేసి సరికి మధ్యాహ్నం 1-30 అయింది .. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ భార్య శ్రీమతి రాధ మా ఆవిడను కారులో ఇంటికి తీసుకు వెళ్లి వాయనం ఇచ్చి ,చీర జాకెట్ పెట్టింది .

    సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మాయి ,వాళ్ళమ్మ కలిసి పిలిచిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్లి వచ్చారు ఇంటికి వచ్చిన వారికి వాయనమిచ్చారు . రాత్రి 9 గంటలకు రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మశ్రీ వచ్చారు . పద్మశ్రీ అమ్మవారిపై శ్రావ్యంగా పాట  పాడింది . తర్వాత రాంకీ భార్య శ్రీమతిఉషా ,వాళ్ళ పెద్దమ్మ దంపతులు శ్రీమతి బులుసు పద్మజ వచ్చి పాటలుపాడి వాయనం తీసుకొన్నారు .పద్మ శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో టిఫిన్ కు రమ్మని ఆహ్వానించింది . ఆతర్వాత డా శ్రీమతి ఉపాధ్యాయుల శ్రావ్య ,వాళ్ళ అమ్మగారు వచ్చారు . ఆమె తలిదండ్రుల షష్ఠిపూర్తికి మమ్మల్ని పిలిస్తే వెళ్లాం . ఆమె అమ్మమ్మ మా గురువుగారు స్వర్గీయ  మహం కాళి  సుబ్బరామయ్యగారి తమ్ముడి భార్య అని అప్పుడు తెలిసింది .మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసుకున్నాం . డా శ్రావ్య ఎంతో సాదా సీదాగా ఉంటారు . మంచి సంస్కారి .మళ్ళీ మనం కలుద్దాం అండీ అన్నారు . వీళ్ళ0దరికి మా అమ్మాయి వాయినాలు ఇచ్చింది అందరికి సరసభారతి పుస్తకాలు ఇచ్చాను చాలా సంతోషించారు  .

శనివారం -విజ్జీ వాళ్ళు తెలిసిన అమ్మాయి సీమంతానికి వెళ్లారు .మధ్యాహ్నం సాయి సెంటర్ నిరాహాహకురాలు శ్రీమతి జయ్ వాళ్ళ అత్తగారు ,లక్ష్మి పిల్లల డాక్టర్ నృత్య కళాకారిణి శ్రీమతి సాయి లక్ష్మి మొదలైనవారు వస్తే అందరికీ వాయినాలు ఇచ్చింది మా అమ్మాయి . డాక్టర్ గారికి మహిళా మాణిక్యాలు ఇచ్చాను ఆమె పొంగి పోయారు

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

      ఆంగ్ల సామ్రాజ్య సంస్కృత మహా కావ్యం రాసిన ఏ .ఆర్. రాజరాజ వర్మ కోయి తంపురన్ కేరళ దేశీయుడు .తల్లి కుంజి కావు తంబురాట్టి ,తండ్రి వాసుదేవన్ నంబూద్రి .  ఆయన రాసిన 30 గ్రంధాలలో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఉంది .ఇది 23 సర్గలలో 1910శ్లోకాల కావ్యం .లండన్ నగర వైభవ వర్ణన తో కావ్యం ప్రారంభమై క్రమంగా ఆంగ్ల సామ్రాజ్య చరిత్ర ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ను  రాశాడు కవి . ప్రతిశ్లోకం కావ్య గౌరవాన్ని పెంచేట్లు గా రాయటం కవి ప్రతిభకు నిదర్శనం .దీనిని 1901 లో టి గణపతి శాస్త్రి సంక్షిప్తంగా ముందుమాట రాసి ప్రచురించాడు .ఈ కవి ఇతర రచనలో విటవిభావరి లేక రాధా మాధవం నాలుగు భాగాలైన ‘’యమ’’లతో అలరారే చిన్నకావ్యం . తిరువనంత పురం లో సంస్కృత బోధపై ‘’గైర్వాణి విజయం ‘’రాశాడు .ఉద్దాలక చరిత వచన రచన ,తులాభారం ప్రబంధం ,ఋగ్వేదకారిక .పాణిని  అష్టాధ్యాయికి దీటుగా సంస్కృత వ్యాకరణం ‘’లఘుపాణినీయం ‘’. ఈ గ్రంథం  ఆయనను ‘’కేరళ పాణిని ‘’చేసింది .

294-కేరళోదయకర్త -డా .కె యెన్ .ఎళుత్తచ్చన్ (1911-1981)

సంస్కృత ,మళయాళ భాషలలో విస్తృత రచనలు చేసిన కేరళ పండితుడు డా .కె యెన్ ఎళుత్తచ్చన్ .పాలకాడు  జిల్లా చెరుపుల సెఱి లో 21-5-1911 న జన్మించాడు .విద్వాన్ పరీక్ష పాసై ,రెండు పాఠశాలలో పని చేసి బొంబాయి వెళ్లి తిరిగొచ్చి సంస్కృత ,మళయాళ ,ఇంగ్లిష్ లలో మాస్టర్స్ డిగ్రీ 1953 లో పొందాడు .మద్రాస్ యూనివర్సిటీలో లెక్చరర్ గాచేరి ‘’భాషా కౌతళీయం ‘’లో పరిశోధన చేసి పిహెచ్ డి పొంది ,కాలికట్ యూనివర్సిటీ లెక్చరర్ అయ్యాడు .కేరళ స్టేట్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అయ్యాడు .ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ ఫెలోషిప్ పొంది ,కాలికట్ యుని వర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ చేశాడు .మళయాళ వ్యాకరణం పై విస్తృత పరిశోధన చేసి మళయాళ వ్యాకరణ చరిత్ర రాశాడు .మూడు చిన్నకథా సంపుటాలు ,మూడు కవితా సంపుటాలు ప్రచురించాడు మళయాళ భాషా సేవకు సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .

  సంస్కృతం లో రాసిన కేరళోదయాచారిత్రిక కావ్యం 21 సర్గలలో 2,500శ్లోకాలతో ఉన్నది .ఇది 1977 లో ప్రచురితమైంది .చరిత్రకావ్యాలలో ఇది అగ్రభాగాన నిలిచింది .కవి సృజన శక్తికి ,కవితాప్రతిభకు, శైలికి ఇది గొప్ప నిదర్శనంగా నిలిచింది .ఈ మహాకావ్యం లో జాతీయ సమైక్యతను చక్కగా చాటి చెప్పాడు .కావ్యాన్ని  స్వప్నమంజరి స్మృతిమంజరి ,ఐతిహ్య మంజరి ,బోధామంజరి చిత్ర మంజరి అనే అయిదు గుచ్చాలుగా విభజించాడు .కేరళ దేశం పరశురామ మహర్షి వలన ఏర్పడిందనే ఐతిహ్యం తో మొదలు పెట్టి  చేర  రాజుల ,జామోరీ రాజుల పాలన పోర్చుగీసుల రాక ,ఆధునిక కేరళ చరిత్ర అంతా సవివరంగా వర్ణనాత్మకముగా రాశాడు .మహాత్మా గాంధీ ,బాలగంగాధర తిలక్ వంటి జాతీయ నాయకుల చరిత్రనూ కలిపాడు .ఆధునిక భావాలను కూడా హాయిగా సుందరంగా సరళమైన సంస్కృతం లో రాయవచ్చునని కవి రుజువు చేసి చూపాడు . 28–10-1981 న 70 వ ఏట మరణించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

A.R. Raja Raja Varma.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిలో ప్రతి రోజు తెల్లవారుఝామున స్వామిని మేల్కొల్పటానికి ఆలపించే  శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం  సుప్రభాతాలలో తలమానిక మైనది .దీన్ని రాసే అదృష్ట0 పొందినవాడు ప్రతి వాది  భయంకర శ్రీ అనంతాచార్య .ఈయననే అన్నాచార్య అంటారు .ఇదిక్రీశ.  1430 లో రాయబడిందిగా భావిస్తారు .అనంతాచార్య శ్రీ మనవాల మాముని  స్వామి శిష్యుడు . మనవాల  స్వామి శ్రీరంగం లో శ్రీరంగ నాధ సుప్రభాతం రాసిన శ్రీ వైష్ణవ మహా భక్త శిఖామణి .

 శ్రీ వేం కటేశ్వర సుప్రభాతం లో నాలుగు భాగాలుంటాయి -1- శ్రీ  వేంకటేశ  సుప్రభాతం -29 శ్లోకాలు 2-శ్రీ  శ్రీ వేంకటేశ స్తోత్రం -10 శ్లోకాలు -3- ప్రపత్తి-16 శ్లోకాలు  4-మంగళాశాసనం .-14 శ్లోకాలు  సుప్రభాతం లో మొదటి శ్లోకం వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం లోని విశ్వామిత్ర మహర్షి శ్రీ రాముని నిద్ర మేల్కొల్పుతూ చెప్పిన ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’శ్లోకం తో ప్రారంభమవుతుంది . అనంతా చార్యులు  నిత్యం అర్చించిన శ్రీ లక్ష్మీ నారాయణ ,శ్రీ భూదేవీ సమే త పద్మనాభ స్వామి విగ్రహాలతోపాటు 12 దివ్య సాలగ్రామ శిలలు ప్రస్తుతం ఆయనకు 15 వ తరం వారైన ప్రతివాది భయంకర రాఘవాచార్యులవారి వద్ద ఉన్నాయి .ఇప్పటికీ అవి ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దివ్య సాలగ్రామ క్షేత్రం లో నిత్యం పూజలందుకొనటం గొప్ప విశేషం .

1-సుప్రభాతం .

1-కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే -ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం .

24-ఇత్ధమ్  వృషాచలపతే రిహసుప్రభాతం –  ఏ మానవాః ప్రతిదినం పఠితుమ్  ప్రవృత్తాహ్

   తేషామ్ ప్రభాత సమయే స్మ్రుతి రంగ భాజాం -ప్రజ్ఞాన్ పరార్ధ సులభ0  పరమాం ప్రసూతే . 2- స్తోత్రం

1-కమలాకుచ చూచుక కుంకుమతో -నియతారణ  తాతుల నీల తనో

  కమలాయత లోచన లోకపతే – విజయీభవ  వేంకట శైలపతే  .

10-అజ్ఞానినా మయాదోషా న శేషాన్నిహితాన్ హరే -క్షమస్వత్వం క్షమస్వత్వం శేష శైల శిఖా మనే  .

3-ప్రపత్తి

1-  ఈశాన్యాం  జగతోస్య  వేంకట  పతే ర్విష్ణో పరాం ప్రేయసీ0-తద్వక్షస్థల నిత్య వాస రసికాం  తత్  క్షాన్తి  సంవర్ధినీం

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనే స్థితం -వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీమ్ వన్డే జగన్మాతరం .

4-మంగళాశాసనం

1-శ్రియహ్ కాంతాయ నిధయే నిధయేర్థినాం -శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం .

14-మంగళా శాసన పరై ర్ మదాచార్య పురోగమైహ్  – సర్వైశ్చ పూర్వై రాచార్యైహ్   సత్కృతాయాస్తు మంగళం .

యాభై అరవై ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకం లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు . నోటికిరాని వారు ఉండేవారుకాదు .శ్రీమతి ఏం ఎస్ సుబ్బలక్ష్మి తన అమరాగాణంతో దానికి మరింత వైభవం తెచ్చింది . ఆమె సుప్రభాతం వినకపోతే శ్రీ వేంకటేశ్వరుడు నిద్ర లేచేవాడుకాదు అన్నంతగా ప్రచారమైంది

392- యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని (1370-1450 )

తమిళనాడు ఆళ్వార్ తిరుమంఝీరిలో 1370 లో మనవాల మాముని జన్మించాడు .అసలుపేరుఅళగియమనవాల పెరుమాళ్ నాయనారు .అంటే శ్రీ రంగనాధస్వామిలాగా ఉన్న అందమైన పెళ్లి కొడుకు అని అర్ధం .. తండ్రి తిరునైదయ అన్నారు .తల్లి శ్రీరంగ నాచ్చియార్.తండ్రీ ,మాతామహులవద్ద వేదం  వేదాంతం దివ్య ప్రబంధాలు అభ్యసించి , 16 వ ఏట సిక్కి కేదారం నుంచి  తిరువై మోళి పిళ్ళై వెళ్ళాడు . ఇక్కడే రామానుజుల విగ్రహం ఉంది .ఇక్కడే ‘’యతిరాజ వింశతి’’రాశాడు .శ్రీ భాష్యం చదివి రామానుజ ఆదేశం పై దివ్య ప్రబంధ ప్రచారం చేస్తూ శ్రీరంగం చేరి తన పూర్వీకులులాగానే రంగనాధ సేవలో పునీతుడయ్యాడు .ఇక్కడే శ్రీ రంగనాధ సుప్రభాతం ,స్తోత్రం రాశాడు . అక్కడినుంచికనుంచి తిరుమల  మొద లైన పుణ్య క్షేత్ర దర్శనం చేసి  మళ్ళీ శ్రీరంగం చేరాడు

 పిళ్ళై లోకాచార్య రహస్య  గ్రంధాలైన ముముక్షుపది  శ్రీ వచన భూషణం ,తత్వరహస్యం లపై  వ్యాఖ్యానాలు రాశాడు . జ్ఞాన సారం ,ప్రమేయం సారాలపై కూడా వ్యాఖ్యలు రాశాడు .మళ్ళీ తిరునగరిచేరి ఆచార్య హృదయం పై వ్యాఖ్య రాశాడు . 1430 లో రంగనాధ స్వామి మనవాల  మామునిని శ్రీరంగం కు వచ్చి నమ్మాళ్వార్ రాసిన తిరుమొళి పై ఉపన్యాసాలు ఇమ్మని ఆదేశిస్తే వచ్చి అందరికి అర్ధమయేట్లు ఆయన హృదయాన్ని ఆవిష్కరించి చెప్పాడు .ఈయన ప్రసంగాలకు మురిసిపోయిన రంగనాధుడు చివరి రోజు బాల పూజారిగా వచ్చి అభినందిస్తూ ‘’తనియన్ ‘’చెప్పి  అదృశ్యమయ్యాడు . ఆ శ్లోకం అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో దివ్య ప్రబంధ గానం కు ముందు పఠిస్తారు ,-ఆ శ్లోకం –

‘’శ్రీ శైలేశ దయాపరం  ధీ భక్యాది గుణార్ణవమ్ యతీంద్ర ప్రవణం రామానుజ మతారం మునిమ్ . దివ్య ప్రబంధ పఠనం -’’శ్రీమతే  రమ్యాజ మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసినే భూయాత్ శ్రీ నిత్య శ్రీనిత్య మంగళం ‘’అని పూర్తి చేస్తారు అంత   గౌరవం ఇస్తారు మాముని స్వామికి .ఆయన 19 గ్రందాలరాస్తే అందులో మూడు సంస్కృతం ,మిగిలినవి తమిళం లో ఉన్నాయి .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-5-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

సంస్కృత కన్నడ వ్యాకరణా ల లోతులు తెరచిన యెన్ రంగనాధ శర్మ 7-1-1916న కర్ణాటకలో నాడహళ్లి లో జన్మించాడు .బెంగుళూరు చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో 1948 నుండి 1976 వరకు నాలుగు దశాబ్దాలు సంస్కృత కన్నడాలు బోధించాడు .ప్రముఖరచయితాజి వి గుండప్పకు సహాధ్యాయి .సంస్కృతం లో బాహుబలి విజయం  ,ఏక చక్రం ,అనే చారిత్రిక ,పౌరాణిక నాటకాలు ,గురు పరే మిత చరితం ,గోమఠేశ్వర సుప్రభాతం ,గుమ్మటేశ పంచకం రాశాడు .కన్నడం లో చాలా విస్తృత రచనలు చేశాడు ఎన్నో అనువాదాలు రచించాడు

కర్ణాటక రాష్ట్ర బహుమతి రాష్ట్రపతి ప్రశంసాపత్రం ,రాజ్యోత్సవ పురస్కారం ఉత్తమ అధ్యాపక అవార్డు ,మొట్టమొదటి డి వి జి మెడల్ ,మహామహోపాధ్యాయ ,గౌరవ డాక్టరేట్ ,సంస్కృత గ్రంథ రచన పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నాడు . 25-1-2014 న 98 ఏళ్ళ నిండువయసులో రంగనాధ శర్మ శ్రీరంగ ధామం చేరాడు .

390-మహాయాన బౌద్ధ ప్రజ్ఞా పారమిత్ర  గ్రంథం  (క్రీపూ 100  )

మహాయాన బౌద్ధ ఉద్గ్రంధం ప్రజ్ఞా పారమిత్ర అంటే సర్వతోముఖ జ్ఞానం పొందే సాధన మార్గం .ఇందులో బోధిసత్వుని మాతృ దేవతగా భావించారు .ఇది మహాయానం లోని మూల సిద్ధాంతం .ఇందులోని  సూత్రాలు అనుత్పాద  మైనవి గా విశ్వసిస్తారు .ఒకరకం గా అపౌరుషేయాలు .ఇందులో 8 వేల  సూత్రాలున్నాయి .వీటిని ‘’అష్ట సాహస్రిక ప్రజ్ఞా పార మిత్ర సూత్రాలు ‘’అంటారు .. ఇవన్నీ క్రీపూ ఒకటవ శతాబ్ది కి చెందినవి అని పరిశోధకుడు ఎడ్వర్డ్ కాంజ్  రాశాడు . ఇందులోని సంస్కృతం నిర్దుష్టమైనది కాదని భావిస్తారు .. వీటి చైనీ అనువాదం క్రీశ 2 వ శతాబ్దిలో లభించాయి  .ఇవే రత్న గుణ సముచ్ఛయగా పిలువబడుతున్నాయి  . మహాయానం లోని భాగమైన ‘’చాటిక ‘’లవారు అభి వృద్ధి చేశారని అనుకొంటారు .ఇవన్నీ ఆంద్ర దేశం లో కృష్ణా నదీ తీరాన అమరావతీ ధాన్యకటకం  మహాయాన సంఘాలలో ఏర్పడినవిగా ఊహిస్తారు  .వీటిలోని శాఖలను పూర్వశైల ,అపర శైల అంటారు .వీటిలో ఒక్కొక్కవ్రాత ప్రతి   ప్రాకృత భాషలో ఉన్నాయి. వీటిలో బుద్ధుని బోధలున్నాయని హుయాన్ సాంగ్ ధృవీకరించాడు . 2012 లో హ్యారీపాక్ ,శేషి కరసీమ లు శిధిలమైన దీని వ్రాతప్రతిని ముద్రించారు .రేడియోకార్బన్ డేటా ప్రకారం ఇది క్రీశ . 75 కు చెందినదిగా గుర్తించారు .బౌద్ధ గ్రంధాలలో అతిప్రాచీనమైనదిగా దీన్ని భావిస్తున్నారు .చైనా భాషలోకి అనువదించిన లోకేశేన- గాంధారీ భాష వ్రాతప్రతిని ఆధారంగా  చేసుకొని చేశాడు .జపాన్ భౌద్ధులుమాత్రం దీనికంటే ‘’వజ్రచ్చేదిక’’ప్రాచీనమైనది అంటారు .చివరికి దీనికి వజ్రచేదికా ప్రజ్ఞా పారమిత్ర అని పిలుస్తున్నారు .దీనికి ఆచార్య నాగార్జునుడు ,మైత్రేయ అసంగ ,వసుభద్ర దిఙ్నాగాదులు వ్యాఖ్యానాలు రాశారు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3 388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3

388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వెంకట నాధుడుగా  తమిళనాడు భువనగిరిలో 1597లో కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో తిమన్నభట్ట  గోపికాంబ దంపతులకు జన్మించారు .మధురై లో బావ లక్ష్మీ నరసింహాచార్యులవద్ద  శాస్త్రాధ్యనం చేసి ,కుంభకోణం శ్రీమఠం లో చేరి ,సరస్వతీబాయిని వివాహమాడి ,లక్ష్మీనారాయణ ఆచార్య అనే కుమారుని కి తండ్రిఅయ్యారు.

 సుధీంద్ర తీర్థులవద్ద శిష్యరికం చేసి ఆయన అనుజ్ఞతో 1614 లో సన్యాసాశ్రమం స్వీకరించి  తమ శ్రీరామ భక్తికి నిదర్శనంగా ‘’రాఘలేంద్ర తీర్ధ ‘’అయ్యారు .సంస్కృతంలో నిష్ణాతులై వేద ,వేదాంత ,శాస్త్రాలను బోధించారు .గొప్ప సంగీతజ్ఞులేకాక వీణా వాదనలో గొప్ప నిపుణులుకూడా . 1621 లో  సుచీన్ద్రుల  తర్వాత శ్రీమఠం పీఠాధిపతి అయి 1671 వరకు ఉన్నారు  . దక్షిణ భారతం అంతా విస్తృతంగా పర్యటించి ద్వైతమత ప్రచారం ఉధృతంగా చేశారు .అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్య పరచారు .1801 లో బళ్లారికలెక్టర్  గా ఉన్న థామస్ మన్రో రాఘవేంద్రస్వామి వారి అద్భుతాలను స్వయంగా చూసి అబ్బురపడి కైఫీయత్ లో  రికార్డ్ చేశాడు .

  రాఘవేంద్ర స్వామి ద్వైత మత గ్రంధం శ్రీమాన్ న్యాయ సుధకు సంస్కృతం లో .‘’సుధాపరిమళ వ్యాఖ్య ‘’రాశారు. మాధవా చార్యుల  పది ప్రకారణ గ్రంధాలలో ఆరింటిపై స్వామి దశప్రాకారణ వ్యాఖ్యానం రాశారు  .బ్రహ్మ సూత్రాలకు ‘’సూత్ర ప్రస్తానం ;; ఋగ్వేద ఉపనిషత్ ప్రస్థానాలు కూడా రాశారు .గీతా ప్రస్తానం శ్రీ రామ చరిత మంజరి ,శ్రీ కృష్ణ చరిత మంజరి ,ప్రతాః సంకల్ప గద్య ,సర్వ సమర్పణ గద్య కూడా రాఘవేంద్ర స్వామి రచించారు  .రాఘవేంద్ర స్వామిపై శ్రీ రాఘవేంద్ర విజయం ను వారి మేనల్లుడు ,నారాయణాచార్య రాశాడు .అప్పనా చార్య స్వామిపై 32 శ్లోకాల స్తోత్ర0 రాశాడు .ఇది  మఠం లో నిత్యా స్తోత్రమైంది . రాఘవేంద్ర స్వామి జీవితం పై ,మహాత్మ్యాలపై తెలుగు తమిళభాషలో చాలా సినిమాలు టివి సీరియల్స్ వచ్చాయి . తమిళనటుడు రజనీకాంత్ స్వామిగా నటించాడు . తెలుగు సీరియల్ లో ప్రసాద్ బాబు చేసినట్లుజ్ఞాపకం .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

–    శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు—

Varalakshmi vratham pooja procedureAadi 18 recipesAadi 18 celebration procedure


 

సాహితీ బంధువులకు ,సోదరీమణులకు రేపు 4-8-17 రెండవ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

ద్వైతమత స్థాపనాచార్యులపై మధ్వ  విజయం రాసిన నారాయణ పండితాచార్య శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు త్రివిక్రమ పండితా చార్య కుమారుడు .మధ్వ విజయం 16 సర్గల మహాకావ్యం . మధ్వాచార్యులు సమకాలీకులవటం వలన ఈ గ్రంధం మన విద్యారణ్యులవారి శంకర విజయంలాగా సాధికారమైనది . దీనికి ఆయనే ‘’సుమధ్వ విజయ ‘’వ్యాఖ్యానం రాశాడు  ప్రకాశిక అనే పేరు కూడా ఉంది .నారాయణ పండితాచార్య శివస్తుతి ,3 వేల  శ్లోకాలతో సంగ్రహ రామాయణం ,ప్రమేయ నవ మాలిక  అనే ‘’అనుమాధవ విజయం’’ కూడా రాశాడు .ఇది 32 శ్లోకాల మధ్వ సంగ్రహ చరిత్ర .దీనికి రాఘవేంద్ర స్వామి తమ పూర్వాశ్రమం లో వ్యాఖ్యానం రాశారు .

 మణి మంజరి ,శుభోదయకావ్యాలు కూడా ఈ కవి రాశాడు .మణి మంజరిలో మధ్వాచార్యులు ముందున్న వైష్ణవాచార్యుల చరిత్ర అంతా  ఎనిమిది సర్గలలో సరళ సుందరంగా రాశాడు . ఈయన రచనన్నిటిపై విపులమైన వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి .మధ్వాచార్యులు దశ ప్రకాశం పై నారాయణ పండితాచార్య ప్రసిద్ధ వ్యాఖ్యానం ‘’విష్ణు తత్వ నిర్ణయ సారం ‘’రాశాడు . ఈ టీక నే ‘’తత్వ మంజరి ‘’అంటారు .అందుకనే ఈయనకు  ‘’ప్రాచీన టీకాకారుడు ‘’అని పేరు .   కేరళలోని కాసార్ గోడ్ లో ఇప్పటికీ ఆయన స్వగృహాన్ని చూడవచ్చు . దీనిని  గౌరవంగా ‘’కవి మఠం ‘’అంటారు  .

387-భ్రమర గీత కర్త -శ్రీ పాద రాజ(1404-1502)

కర్ణాటకలో హరిదాస ఉద్యమ పిత  . విజయనగర సామ్రాజ్య రాజగురువుకూడా .లక్ష్మీ నారాయణ తీర్ధ అనీ అంటారు ..కర్ణాటక చెన్నపట్న తాలూకా అబ్బూరులో జన్మిచాడు . ఆయనను ధ్రువుని అవతారంగా భావిస్తారు .. ద్వైత ,హరిదాసు సాహిత్యానికి ,రాజకీయ సాంస్కృతిక మార్పులకు ఆయన  అసమాన  కృషి చేశాడు . ఒకసారి స్వర్ణ వర్ణ తీర్ధ స్వామి అబ్బూరు వచ్చి బాల లక్ష్మీ నారాయణ ను అబ్బూరు ఎంత దూరం అని అడిగితె ,తెలివిగా ‘’అస్తమయ సూర్యుని చూస్తున్నారుకదా .మేము ఇక్కడ ఆడుతున్నాం కదా .యెంత దూరమో మీరే ఊహించండి ‘’అన్నాడు .అంటే చీకటిపడుతుంటే ఇంటికి వెళ్ళటానికి మాకు ఎక్కువ సమయం పట్టదు కదా అంతతక్కువ దూరం అనే భావం తో చెప్పాడన్నమాట . స్వాములవారు ఈ బాలుడు గడుసు పిండమే నని గ్రహించి ,తన శిష్యుడిని చేసుకొని  సన్యాసమిప్పించి ఉత్తరాధికారిని చేశాడు .

శ్రీపాద రాజ తీర్ధ పీఠాధిపతి అయి విజయ నగర రాజులుచేసిన బ్రాహ్మహత్యా  దోషాలను ఇవారించాడు సంస్కృత ,కన్నడ భాషలలో గొప్ప పండితుడై చాలా  గ్రంథాలు రాశాడు .భ్రమర గీత ,వేణుగీత ,గోపీ గీత ,మాధవ నామ సంస్కృత రచనలు బహుళ వ్యాప్తి పొందాయి .ఆయనతన భక్తి గీతాలను ‘’దేవర నామాలు ‘’అని చెప్పి పాడేవాడు .తన సంతకాన్ని ‘’రంగ విఠల ‘’అని చేసేవాడు . ఆయన రాసిన భక్తిగీతం ;;భూషణకే భూషణ ‘’అందరి నాలుకలపై నర్తిస్తుంది.  కోలార్ జిల్లా ముల్ బగాయ్ తాలూకా నరసింహ తీర్ధలో  ఆయన ‘’బృందావనం ‘’ను లక్షలాది భక్తులు దర్శిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

1-8-1912 న కడూర్ కృష్ణ జాయిస్ కర్ణాటక శృంగేరిలో శేషమ్మ ,సుబ్బా జాయిస్ దంపతులకు జన్మించాడు .అలంకార ,అద్వైతాలలో విద్వాన్ డిగ్రీ పొంది హోల్ నరసాపూర్ ,ఆధ్యాత్మ ప్రకాశం కార్యాలయం లో పని చేశాడు .తర్వాత బెంగుళూర్ శృంగేరి శంకర మఠం  లోఆధ్యాత్మ వేదాంత ప్రొఫెసర్ అయ్యాడు .కన్నడ సంస్కృతాలలో విశేష పాండిత్యం పొంది ఆ రెండుభాషల పత్రికాధిపత్య0వహించాడు . శృంగేరి స్వాములు పండితవర బిరుదు నిచ్చి సత్కరించారు .సంస్కృతం లో కృషికి రాష్ట్ర పతి ప్రశంసాపత్రం ,కన్నడ సేవకు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు .సంస్కృతం లో కుంభాభిషేక చంపు ,శారదన్నవరాత్ర చంపు ,మూల విద్యా భాష్య  వార్తిక సమ్మతం ,శంకర దర్శనామ ప్రకాశం ,రాశాడు .సంస్కృత దశ శ్లోకి కి సంపాదకత్వం వహించాడు .కన్నడం లో సంబంధ వార్తిక ,ధర్మ శాస్త్ర రాశాడు .దశ శ్లోకిని ,వివేకచూడామణిని చంద్ర శేఖర భారతీతీర్థ వ్హయాఖ్యానం తో సహా కన్నడాను వాదం చేశాడు .శారదా నవ రాత్రి చంపు ను 1976 లో ముద్రించాడు అందులో శారదా అభిషేక ఉత్సవం ,నవరాత్రి ఉత్సవాలను వర్ణించాడు .ఆధునిక సంస్కృత కవులలో చంపు కు మళ్ళీ వైభవం తెచ్చినవాడు కృష్ణ జాయిస్

385-గాంధీ పై మోహనాయన కావ్యం రాసిన -బొమ్మలాపుర వెంకట రామ భట్ట (1915

బొమ్మలాపుర వెంకట రామభట్ట కర్ణాటక లోని బొమ్మలాపురం లో 1-1-1915 న జన్మించాడు .సరోబాలో సంస్కృత టీచర్ .సంస్కృత కన్నడ హిందీలలో కవిత్వం చెప్పాడు రాశాడు .సంస్కృతం లో మహాత్మాగాంధీ జీవితంపై ‘’మోహన యాన0 ‘’కావ్య0 ,శంకర చరితం ,భామినీ మాధవ కావ్యం ,సతీ మహా స్వేత ,విశ్వ రూప దర్శనం ,సత్యవిషయం నాటకాలు ,అంగద సంవాదం ,ఏకం నా ద్వితీయం ,నాధయ సంస్కృత భేరి ,భార్గవ శతకం ,యాజ్ఞ వల్క్య  బోధాయన ,భువనేశ్వరీ సుప్రభాతాలు ,శంకరాలోకం భావతరంగిణి సంస్కృత వచన రచనలు ,సత్యనీయ రీతి  అనే స్వీయ చరిత్ర ,మంత్రం వేదాంత శాస్త్రాలనాధారంగా వెయ్యిఆర్యా వృత్త  శ్లోకాల  ‘’ఆర్యా సహస్రి ‘’ రాశాడు .

 సంస్కృత కావ్యాలను కన్నడం లోకి కన్నడ రచనలు సంస్కృతం లోకి అనువదించి ప్రజ్ఞ ఆయనది .కన్నడ సంస్కృత నిఘంటు నిర్మాణము చేశాడు .కన్నడ భాషకే ప్రత్యేకమైన షట్పది ని సంస్కృతం లో ప్రవేశపెట్టిన ఘనత వెంకట రామ భట్టు ది .మోహనయానం లో భామినీ షట్పది ని నేర్పుగా ప్రయోగించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య  (1922-2015)

గలగరి పండరీనాథాచార్య 22-7-1922 న కర్ణాటకలోని గలగరి అనే కుగ్రామం లో జన్మించాడు . తండ్రి కూర్మా చార్యులు . చిన్నతనం లో చదువు ఒకటవ తరగతి తో ఆగిపోయింది .వెంటనే వేదాధ్యనం తండ్రివద్ద ప్రారంభించాడు . 1944  నుంచి 1960 వరకు బాగల్ కోట్ లోని శంకరప్ప సంస్కృత హై స్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయ్డుగా పని చేశాడు . 1961లో గడగ్ వెళ్లి వీరనారాయణ సంస్కృత పాఠశాల ప్రారంభించాడు  . 1971లో వేద  సాహిత్య  మాల సంస్థ స్థాపించి అష్టాదశ మహా పురాణాలను నలభయి  ఏళ్ళు కృషి చేసి కన్నడం లోకి అనువదించాడు .మధురవాణి ,వైజయంతి సంస్కృత పత్రికలకు ,శ్రీ సుధా ,పంచామృత కన్నడ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు . ఆయన సంస్కృత వచన రచన శైలి బాణభట్టును పోలి ఉంటుంది .కవిత్వ శై లి కాళిదాసుకు సమానం గా ఉంటుంది .  సృజన సాహిత్యం లో  ఆయన అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు అన్ని ప్రక్రియలూ స్పృశించాడు .సంస్కృతం లో 22 సృజన రచనలు చేశాడు . అవి వేదాంత తుండ స్తవం ,రామరసాయన మహాకావ్యం ,శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్యం ,పవన పావన చంపు ,శ్రీ పాండురంగ  విఠల  చంపు ,శ్రీ రాఘవేంద్ర అశ్వ ధాటి ,తాత్యా తోపితా హ గాంధీ టోపీ పర్యంతం ,విప్లవ వీరుడు సుభాష చంద్ర బోసు పై ‘’క్రాంతి స్ఫు లింగ మొదలైనవి . కన్నడం లో రాసిన 21 రచనలలో -మహా భారత కోశ ,రాగ విరాగ ,భామతి ,కర్ణాటక కోశకారు ,కల్హణ రాజ తరంగిణి మొదలైనవి ఉన్నాయి .ఇవికాక ముందే చెప్పినట్లు 18 పురాణాలనకు కన్నడా నువాదం చేశాడు .

 పండరీనాధాచార్యులు తన ప్రతిభకు తగిన పురస్కారాలు ఎన్నో అందుకొన్నాడు .అందులో సాహిత్య అకాడెమి పురస్కారం ,రామకృష్ణ దాల్మియా ,రాష్ట్రపతి అవార్డు ,కన్నడ కాళిదాస బిరుదు ,రాజ్య ప్రశస్తి ,మహామహోపాధ్యాయ ,విద్వత్కవి తిలక  ,సచ్చాస్త్ర ప్రవచన విచక్షణ ,సంస్కృతివాహక ,విద్యా రాజా మొదలైనవి ఎన్నో బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్న మహా   సంస్కృత విద్వా0సుడు గలగరి పండరినాధ ఆచార్య .. సాహిత్య వ్యాసంగం తో పండిపోయిన పండరినాథాచార్య 93 వ ఏటపండిన వయసులో 29-8-2015 లో పండరినాధుని చేరుకొన్నాడు ..

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

వాడిరాజాచార్య రాఘవాచార్య పంచముఖి లేక వాచస్పతి పంచముఖి 17-9-1936 న కర్ణాటకలోని ధార్వార్ లో జన్మించాడు . తండ్రి వైద్య రత్న ఆర్ ఎస్ .పంచముఖి .తల్లి కమలాబాయి .తండ్రి ప్రసిద్ధ ఎపిగ్రఫిస్ట్ ,ఆర్కియాలజిస్ట్ ఇండాలజిస్ట్ చారిత్రాత్మక పరిశోధనలో జీవితమంతా గడిపినవాడు .దాస సాహిత్య పరిశోధనలో పండిపోయినవాడు .తండ్రివద్దనే వాడిరాజు సంస్కృతం తత్వ శాస్త్రం అభ్యసించాడు . 1956 లో కర్ణాటక యుని వర్సిటీ నుండి సంస్కృతం గణితం లలో 82. 5 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ రాంక్ సాధించాడు .రెండేళ్ళతర్వాత  బాంబే యుని వర్సిటీనుండి ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రాంక్ తోపాటు గోల్డ్ మెడల్ పొందాడు . 1963లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ‘’అప్లికేషన్ ఆఫ్ గేమ్ ధీరీ ఆఫ్ ఎకనామిక్స్ పాలిసీ పై దిసీస్ రాసి పిహెచ్.డి .అందుకొన్నాడు .

 ఆర్ధిక రంగం  లో పంచముఖి సేవలు నిరుపమానమైనవి .నోబెల్ లారయట్ జాన్ టిన్ బెర్జిన్ తో ను జెనీవాలో టా0జానియా  మాజీ ప్రెసిడెంట్ జూలియస్ నైరేరీ తోను కలిసి పనిచేశాడు .అలీన దేశాల అభివృద్ధి చెందుతున్న దేశాలకు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టం తయారు చేసిన ఘనత సాధించాడు .ఇండియా ప్లాంయింగ్ కమిటీ సెక్రెటరీగా 1977లో పనిచేశాడు .దీనివలన ఆర్ధిక సరళీకరణ విధానం ధ్రువ పడటానికి సహకరించాడు .

ఆర్థికరంగం లో దూసుకు పోతున్నా సంప్రదాయంగా వచ్చిన సంస్కృతం లోనూ అద్వితీయ ప్రతిభ ప్రదర్శించి అనేక పుస్తకాలు కవితలు సంస్కృతం లో రచించాడు పంచముఖి .తిరుపతి సంస్కృత విద్యాపీఠానికి 1998 నుండి 2008 వరకు రెండుసార్లు ఛాన్సలర్ అయ్యాడు .శ్రీ వెంకటేశ్వర వేదం విశ్వ విద్యాలయ  రాజ్యాంగ  నిర్మాణం లో స్థాపనలో విశేష కృషి చేశాడు .సంస్కృత -సైన్స్ ఎక్సిబిషన్ నిర్వహణలో ,సంస్కృత నెట్ ఏర్పాటులో ,ప్రాచీన సంస్కృత గ్రంధాల డిజిటలీకరణలో ఆయన సేవ అపారం .భగవద్గీత పైనా మేనేజ్ మెంట్ పైనా విశేష కృషి చేశాడు .సంస్కృతాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో బోధించే ఆలోచన చేసి అమలులోకి తెచ్చాడు .

  పంచముఖి సంస్కృతం లో  -1-భారతీయ ఆర్ధిక సర్వేక్షణ 2-కావ్య కుసుమాకర 3-బ్రహ్మ సూత్ర దీపికా 4-విచార వైభవం 5-భారతీయ అర్ధ శాస్త్ర మొదలైనవి 12రాశాడు .

ఎకనామిక్స్ లో -ట్రేడ్  పాలిసీస్ ఆఫ్ ఇండియా ,ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ ,టీచింగ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ,ఫిస్కల్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ టు వార్డ్స్ యాన్ ఏషియన్ ఎకనామిక్ ఎరా మొదలైన 15 గ్రంధాలురాశాడు .ఆయన ప్రతిభకు తగిన పదవులు వరించాయి -ఇండియన్ కౌన్సిలాఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ చైర్మన్ గా ,ఇండియన్ ఎకనామిక్స్ జర్నల్ మేనేజర్ గా ,8 వ వరల్డ్ ఎకనామిక్స్ కాంగ్రెస్ కన్వీనర్ గా ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా  అఖిలభారత మధ్వ సమ్మేళనం ప్రెసిడెంట్ గా ఇవికాక మరో 30సంస్థలలో సభ్యుడుగా సలహాదారుగా గౌరవాధ్యక్షుడుగా  ఉన్నాడు .

 2003 లో భారత రాష్ట్ర పతి నుంచి సంస్కృతం లో ప్రతిభా పురస్కారం ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ -ఢిల్లీ నుంచి విశిష్ట సంస్కృత సేవా వ్రతి ,ఢిల్లీ లాల్ బహదూర్ యుని వర్సిటీనుండి వాచస్పతి పురస్కారం ,విశ్వేశ్వ రయ్య ప్రశస్తిపురస్కారం ,కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం ,గురుసార్వ భౌమ రాఘవేంద్ర అనుగ్రహపురస్కారం ,విశాఖ లోని గీతం యుని వర్సిటీ పురస్కారం వంటివి ఎన్నో  బహుముఖ సేవకు పంచముఖిని  వరించాయి .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— V R Panchamukhi.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

భోజ రాజు -నా గ్రంథ ప్రారంభం లోని పది పద్యాలలో నా సిద్ధాంత సారాంశాన్ని వివరించాను . తర్వాత అధ్యాయం లో అర్ధనారీశ్వర వర్ణన చేసి నా శృంగారవాదానికి ఎంత సందర్భోచితమో చెప్పాను . పార్వతీ పరమేశ్వరులకలయిక స్త్రీ పురుషత్వాల సమైక్య స్వరూపం .దాని ఫలితంగా కలిగే హాస్య పూరిత అనుభవాలు సాంకేతికంగా వర్ణించా .అందులోని ప్రతిపదం సంభోగ ,విప్రలంభ శృంగారాల వివిధ రూపాలను ధ్వనింప జేస్తుందన్నాను ..ప్రాచీనులు 10 రసాలు చెప్పినా నేను శృంగారమే రసం అన్నాను .అదే ఆనంద స్వరూపం .భరతముని చెప్పిన 49 భావాలు సమానమైనవే .అందులో ఏదైనా ఉచ్ఛ  స్థితికి చేరి ఆనందంగా మారచ్చు . ఆనందాన్ని  కేవలం రసం అనకుండా శృంగారరసం అన్నాను .దీన్ని ‘’యేన శృంగారం రియతే స శృంగారహః ‘’అని నిర్వచించా .అంటే శిఖరాన్ని చేరటం అన్నమాట ..అంటే ఆన0దా ధిరోహణం చేయటమే .శృంగారం నుంచే 49 రసాలు జన్మించాయి ..దానికి అవి సహాయకాలు .ప్రేమ అంటే అనురాగానికి పర్యాయ పదం కాదు .సౌందర్య తత్వ సాధనమైన ఆనందమే ప్రేమ .అందుకే ఆనంద రసం అన్నాను ..అభిమానం వీటిని కలిపి ఉంచే లక్షణం .అభిమానమే రసాను భూతికి మూలం . రసాను భూతి అనే సోపానానికి ఉన్న మూడు మెట్లలో అది అట్టడుగు మెట్టు ..దీనినే అహంకారం అన్నాను .నా పేర్లలో సాంఖ్య సిద్ధాంత చాయలున్నాయి ..ఈ అభిమాన శబ్దానికే అహంకార ,శృంగార ,రస శబ్దాలు పర్యాయ పదాలు .అహంకారం అంటే స్పందించాగలిగే సహృదయుని భావోద్వేగ స్థితి నుంచి బహిర్గతమయ్యే అహంకారమే అభిమానం .అహంకారం అంటే లౌకికార్ధం లో ఉన్న గర్వం కాదు.  నేను అనే భావం అన్నమాట ..రసాను భూతిగా మారే ప్రతి దశలో అహంకార ఛాయకనిపిస్తుంది ..అలంకార శాస్త్ర ప్రయోజనాలకోసం సాంఖ్యుల భావాల్ని పునర్నిర్మించి ,తత్వ వేత్తల  అహంకారాన్ని ,అలంకార శాస్త్రజ్ఞుల భావయిత్రీ ప్రతిభను సమ్మిళితం చేసి కొత్త రూపాన్నిచ్చాను . మిత్రులారా తర్వాత మీ వంతు .

మహిమా భట్టు -రసము అంటే స్థాయి యొక్క ప్రతిబింబమే .కళాత్మకంగా ఉన్న కారణం నుంచి అనుమాన ప్రమాణం చేత సాధింపబడుతుంది .రసికుడిలో విభావాదుల జ్ఞానం వలన స్థాయీ భావం ఉద్దీన మవుతుంది . దాని నుంచి వచ్చిన అనుమాన స్ఫురణ యే రసాను భూతి . రసికుడు రసాన్ని భావ రూపంగా మాత్రమే అనుభవిస్తాడుకాని యదార్ధంగా కాదు .వ్యంజకా వ్యంజనాలను గ్రహించినప్పుడే కాక ,విభావాదుల నుంచి వచ్చే స్థాయీ భావాన్ని అనుభవించటం లో కూడా కాలక్రమం ఉంటుంది .దీనికి కారణం -వీటిమధ్య కారణం ,కార్య సంబంధం ఉంటుందికనుక . నా గ్రంథం రెండవ అధ్యాయం అంతా అనౌచిత్యాన్నే చర్చించాను .అనౌచిత్యం -అంతరంగ ,బహిరంగ అని రెండురకాలు .మొదటిది రసాన్ని అభివ్యక్తి చేయటంలో రెండవది శబ్దార్ధాల ప్రయోగాలతో కనిపిస్తుంది . ఈ రెండిటినీ మళ్ళీ 5 రకాలుగా విభజించా .ఇవన్నీ రసావిష్కారానికి అవరోధాలు .ధ్వనికారుని ‘’కావ్యమస్యాత్మా ధ్వని రీతి ‘’అని మొదలు పెట్టిన మొదటి కారిక లోనే ఈ దోషాలను చాలా ఉదాహరించి చూపించా ..ఆనంద వర్ధన శ్లోకాలే వాడి దోషాలకు ఉదాహరణలుగా చెప్పాను .ఈ దోషాలు పరిహరించి ఎలా రాస్తే బాగుంటుందో సూచించాను .భారతీయ సాహిత్య విమర్శనా చరిత్రలో నేను చేసి చూపింది అపూర్వం అసదృశం ..దీనికొక ఉదాహరణ ఇచ్చా ‘’వైద్యుడు ఇతరులను అయోగ్యమైన ఆహారం తినకుండా నివారిస్తాడు-తానూ దానికి అలవాటు పడిఉన్నా  సరే ‘’అని చెప్పాను .ఇక చెప్పాల్సింది లేదు .సెలవ్ .

విశ్వనాథుడు -నేను చెప్పాల్సింది అంతా  చెప్పేశాను ..పండితరాయలు ప్రసంగిస్తారు .సెలవ్

జగన్నాథుడు -రస ప్రాధాన్యాన్ని నేను అంగీకరిస్తా.కానీ రసం ప్రముఖంగా లేదనో ,రసధ్వని కనపడలేదనో కావ్యాన్ని కావ్యం కాదు అనకూడదు .అలంకార చమత్కారమున్నా ,చమత్కారాన్ని సూటిగా లేక వాచ్యార్థం గా చెప్పినా కావ్యం ఆనందాన్నిస్తుంది . చమత్కార గుణానికి జేజే లుపలికాను .రస ,అలంకార వస్తువులనుంచి ఇది నిష్పన్నమవుతుంది.  ధ్వని ,లేక వాచ్యం ద్వారా అభి వ్యక్తమవుతోంది .ఈ రకంగా కావ్య భావానికి కొత్త సమగ్ర స్వరూప నిర్ణయం చేశాను ..నా వాదనాపటిమ ఘనిస్టం .సహజ ఉన్నత కవిత్వం అని నా కవిత్వాన్ని కీర్తించారు ..తేడా వస్తే చమడా ఒలుస్తా ..నాది ఆత్మ విశ్వాసం .అద్వైతినైనా నాకు శివ కేశవ భేదం లేదు .లోకాన్ని నిశితంగా పరిశీలించి రాశాను .భోగ లాలసత కు ,శృంగార క్రీడలకు నిలయమైన మొఘల్ సామ్రాజ్య రాజధానిలో ఉండటం వలన శృంగారం నా అంగాంగానా అలముకొన్నట్లు కనిపిస్తుందికదూ ..ఇంతకంటే నాకూ చెప్పటానికేమీ మిగలలేదు సెలవ్ .

భోజరాజు -సాహిత్య రసానుభూతి మూడు మెట్ల సోపానం అని ఇందాకే చెప్పాను .అడుగుమెట్టును పూర్వ కోటి అని ,అభిమానం అనే మధ్యమెట్టు మాధ్యమావస్థ  భావన.ఇది మనో వృత్తులన్నీ అణగిపోయిన తర్వాత సాగే చింతన యొక్క ఉన్నత దశ .ఈ దశలో వివిధ మనోద్వేగాల  బహుళత్వం అను భూతమవుతుంది .ఇవే భరతముని చెప్పిన అష్ట రసాలు .నిజానికి ఇవి 49 .. భావనా పరిధిని అధిగమించి న శుద్ధానందం ఇది .ఈ  చరమ స్థితినే శృంగారం లేక ప్రేమ అన్నాను .ఇదే ఉత్తర కోటి . ఆనంద వర్ధనుని ధ్వనిని అంగీకరిస్తూ మీమాంసకుల ‘’తాత్పర్యం ‘’తో దానికి సామరస్యం కలిపించాను ..అంటే ధ్వనికి తాత్పర్యం అనే కొత్త పేరు పెట్టానన్నమాట .వర్ధనుడి అనువాద ధ్వనికి ప్రతివాదంగా ‘’శబ్ద ధ్వని ‘’అనే కొత్త రూపాన్ని ప్రవేశపెట్టాను ..అలంకార పరామర్శలో కొత్తదనాన్ని తెచ్చాను .గుణాలు ,రసాలు భావాలు అన్నీ అందులోకి వస్తాయని దాని విస్తృతి పెంచాను . సూక్ష్మ అర్ధ పరిమాణాలు గుర్తించా ..అలంకార సమ్మేళనంలో 6 ప్రమాణాల భావన సమర్ధించా ..అలంకారాలలోచమత్కారం పరాకాష్టకు చేరేది వాటిని నేర్పుగా కలిపినప్పుడే . ఇదే నాకున్న అలంకార శాస్త్రం పై శ్రద్ధ అన్నారు  . మీ కృష్ణా జిల్లా పెనమకూరు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’రాసి నన్ను చరితార్థుడిని చేశాడు ..అందులో ఆవు -పులి కథ చిరస్మరణీయంగా రాశాడు .ఆ కథ  నాకు చాలా ఇష్టం . సత్య నిష్ఠకు అది గొప్ప ప్రతీక ఆయనకు అభినందన చందనాలు  .అభిమానంతో నన్ను ఆహ్వానించి నిర్వహణ బాధ్యతనూ అప్పగించినందుకు సరసభారతి కి కృతజ్ఞతలు .నేను నా రాజ్యం లోనే ఉన్నట్లు అనిపించింది .నా సాహిత్య సభనే నడిపిన అనుభూతికలిగింది .శ్రోతృ మహాశయులు ఓపికకు ధన్యవాదాలు .

 సాహితీ బంధువులారా !అలంకారిక ఆనంద నందనం చివరిభాగ0లో మన కోరికమన్నించి విచ్చేసి తమ సిద్ధాంత సారా మృతధారలతో తనియింపజేసిన అలంకారిక పరమేశ్వరులకు కృతజ్ఞతాభి వందనాలు . మీకూ శతకోటి అభినందనలు .ఒక్క సారి పునశ్చరణ చేసుకొందాం .

భోజమహారాజుగారి నిశిత పరిశీలనకు జోహార్లు .. వారిని ధారానగర ప్రభువు అంటారు ..భోపాల్ లో వారు నిర్మించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’సుప్రసిద్ధమైనది .భోజేశ్వర పట్టణం గొప్ప విద్యా కేంద్రం ..అతి పురాతన తాళపత్ర గ్రంధాలను సేకరించి భాప్రాపరచారు భోజరాజు .ఈ నాటి థార్ నగరం లో వారు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉంది .సరస్వతీ పుత్రలేకాక సమరాంగ ణ సార్వభౌములైన వారు .మన కృష్ణ దేవరాయలు గుర్తుకు వస్తారు . పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాశారు .సివిల్ ఇంజనీరింగ్ పై ‘’సమరాంగణ సూత్ర దారి ‘’రాసి దేవాలయ ,కోటల ,విగ్రహ, గృహ నిర్మాణ వివరాలు తెలిపారు .తంత్ర శాస్త్రంగా ‘’తత్వ ప్రకాశం ‘’,లోహ శాస్త్రంగా ‘’రస రాజమృగాంకమ్ ,నౌకా నిర్మాణ శాస్త్రంగా ‘’యుక్తి కల్పతరు ‘’న్యాయ శాస్త్రం పై ‘’ధర్మ శాస్త్ర వృత్తి ‘’రామాయణంపై రామాయణ చంపు రాశారు దీనికే ‘’భోజ చంపు’’ అనే సార్ధకనామమేర్పడింది .మొత్తం 84 గ్రంధాలు రాసిన బహుశాస్త్ర కోవిదులు .కాళిదాసాది కవులకు నిలయం భోజరాజాస్థానం .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్య భోజ రాజ  చంపు తోనే ప్రారంభమయ్యేది ..అంతటి ప్రశస్తి పొందిన చంపు అది .. రాజుకనుక ప్రతి విషయాన్నీ చెప్పాలనే చాపల్యం ఉందనిపిస్తుంది . సర్వజ్ఞుడికి అందర్నీ తనలాగే చేయాలనే కోర్కె ఉంటుంది . అందుకే ఈతపన . కృతజ్ఞతలు భోజరాజేంద్రా .

  మహిమాబట్టు లవారు అనుమాన సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం కంటే మరింత సమ గ్రమైనది .రసాధిక్యతను నొక్కి చెప్పింది .గుణీ భూత వ్యంగ్యాన్ని  వివరించింది .కవితా సృష్టికి రసమే  ఆనంద  కారణం కనుక మరే  ఇతర పదార్ధానికీ కూడా దాన్ని లోబరచకూడదని స్పష్టంగా చెప్పారు ..అనుమాన సిద్ధాంతం లో గుణీ భూత వ్యంగ్యానికి అగ్రాసనమిచ్చారు .దీనిలో వక్రోక్తి తాత్పర్యాలను కూడా భాగం చేశారు.  మౌలిక ఆలోచనకలిగిన ధైర్య శాలి .అలంకార చరిత్రలో పాండిత్య స్ఫోరకమైన వాగ్వాదాలకు ,విస్తృతమైన విద్వత్తుకు ,విస్పష్ట విశదీకరణకు ,లోతైన గ్రహణ శక్తికి మహిమా భట్టు లవారికి సాటి వేరెవరూలేరు అన్న శ్రీ ఆర్ .పి .ద్వివేదీ పలుకులు అక్షర సత్యాలు ..వారు అవతరించిన అసమాన ‘’అనుమాన మహిమాభట్టు ‘’.

 విశ్వనాథకవిరాజుల  వారి సాహిత్య దర్పణం గురించి వారికుమారుడు అనంతదాసు ‘’శ్రవ్యా భి  నే యాలంకార తత్త్వం సత్కవి సమ్మతం -యదిహాస్తి యదన్యత్ర యాన్నే హస్తి తత్క్వచిత్ ‘’అని గొప్పగా చెప్పాడు -అలంకారాల ముఖ్య ధర్మాలన్నీ ఇందులో ఉన్నాయి .ఇందులో ఉన్నది ఇతర గ్రంథాలలో ఉండవచ్చు .కానీ ఇందులో లేనిది మాత్రం ఇంకెక్కడా ఉండదు ‘’అదీ అలంకార విశ్వ నాధీయ0 .  ‘’విశ్వ నాదీయం ‘’కూడా ..విశ్వనాధులవారు సాహిత్య దర్పణాన్ని సంక్షిప్తంగా ,అర్ధ స్పష్టత తో ,సర్వ దోషరహితంగా రచించారు దీనికి  ఆయన కుమారుడుఅనంతదాసు చెప్పిన శ్లోకమే సాక్షి -’’స్వల్పాక్షరాహ్ సుబోధార్దాహ్ ప్రధ్వస్త శేష దూషణాః –సాహిత్య దర్పణో నామ గ్రంథ స్తేన వినిర్మితాహ్ ‘’. ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో పరిపక్వమైన చింతనగల వారిలో విశ్వనాథ కవిరాజ స్థానం అత్యున్నతమైనది –

‘’ధ్వన్యాధ్వని  ప్రౌఢాధియం పురోగాహ్ శ్రీ విశ్వనాధాహ్ కవి చక్రవర్తీ ‘’..ఈ సభ మీ రాకతో ధన్యమైందికవి చక్రవర్తీ ,

మనవాడైన జగన్నాథ పండితరాయల వారి కవిత్వం కోన సీమ కొబ్బరికున్న తీపిదనం లేతతనంతో కోనసీమ అందాలవంటి శబ్దార్ధాల సుందర మేళవింపుతో  ఆ సీమ ప్రత్యేకమైన పక్వమైనపనసపండు తొనలవంటి మాధుర్యవంతమైన  ప్రయాస లేని యమకాల ఇంపు సొంపులతో అలరిస్తుంది .. రామణీయార్ద ప్రతిపాదనమైన శబ్దమే కావ్యం అనగలిగిన చేవ ఉన్న అలంకారిక కవి .సౌందర్యం మూర్తీభవించిన వ్యక్తి .ఐహిక భోగాలకు పర లోక చింతనకు సమ విలువనిచ్చినవారు .అపార విద్వత్తుతో ప్రకాశించే ఆపర సాహత్య  జగన్నాధులే .మీరాక తో మేము పావనమయ్యాము పండితరాయా నమోవాకాలు . అలంకారిక చతుష్టయం అందరికీ మరోమారు వందనం .ఆల0కారకులైన  మీ రాకవలన ఈ ప్రత్యేక కార్యక్రమం నిజంగానే ఆనంద నందనమై కను విందు, వీనుల విందూ చేకూర్చింది .

దీనిని ప్రశ్నోత్తర రూపం లో నిర్వహించి అలంకార పరిణామాన్ని తెలియ జేస్తే బాగుంటుంది అనే సూచన వచ్చింది .అసలు అలంకార  శాస్త్రం  డ్రై  సబ్జెక్ట్ .మళ్ళీ దీనిలో ప్రశ్నలు , సమాధానాలు ,చర్చలూ ఉపచర్చలు పెడితే బుర్ర వేడెక్కి మైండ్ బ్లాకై పోతుందని భయపడి ఈ విధానాన్ని ఎంచుకున్నాను .సరదాగా వినేందుకు ,కావాలంటే ఆరుద్ర రాసిన ‘’సమగ్రాంధ్ర సాహిత్యం ‘’లాగా హాయిగా చదువుకొనేట్లు రీడబిలిటీ ఉండాలని అనుకొని ,ఆలంకారికుల గురించి  తెలియని విషయాలెన్నో తెలియ జేసే వీలు ఇది కలిగిస్తుందని భావించాను .  . ఇది ఒక భూమిక మాత్రమే . కావలసినవారు దీనిపై సౌధాలు నిర్మించుకో వచ్చు . నేను తీసుకున్నది 13 మంది ఆలంకారికులను మాత్రమే . ఇంకా ఎందరో లబ్ధ ప్రతిష్టులైన వారున్నారు . ఎందరో ఆలంకారికులు అందరికీ ఆనంద నందన వందనములు . ఈ కార్యక్రమాన్ని సమాదరించి జయప్రద0 చేసిన అందరికీ మరొక్క మారు కృతజ్ఞతాభి వందనాలు .

ఆధారం -ఈఆలం కారిక ఆనంద నందనం ధారా వాహికకు  ఆధారం 1–నేను రాసిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం 2- పబ్లికేషన్స్ డివిజన్ వారి ‘’భారతీయ సంస్కృతీ వైతాళికులు -ఆలంకారికులు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -10

అలంకారిక ఆనంద నందనం -10

భోజ రాజు -సర్వ జన సంక్షేమం నా ధ్యేయం .సమైక్య భారతావని న దృష్టి .కేదారేశ్వర ,రామేశ్వర ,సోమనాధ ,సుందర ,కాల అనలా ,రుద్రాదులకు దేవాలయాలు నిర్మించాను కాశ్మీర్ లో ఇప్పటి కోధర్ వద్ద పాప సూడాన్  తీర్ధానికి మట్టికట్టలు పోయించటానికి ధనసహాయం చేశాను . ఈ విషయం కల్హణుడు రాజతరంగిణిలో రాశాడు ..భోజపురం అంటే ఈ నాటి భోపాల్ లో బెట్వానది ఉపనదితోకలిసే సన్నని కనుమద్వారా ప్రవహించే చోట మైలున్నర పొడవున్న ఆనకట్ట వేసి విశాల సరోవరాన్ని నిర్మించాను .ఇది అద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి  నా సాహస కృత్యానికి ప్రతీక అని అంటున్నారు ..కవి ,పండిత ,కళాకారులకు భూరి విరాళాలిచ్చి పోషించాను ..వారి కవితా శక్తికి అక్షర లక్షలిచ్చాను ..దేశం లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవి పండితులూ నా ఆస్థానం లో ఉండటం నా అదృష్టం .నా సంస్థానం సరస్వతీ నిలయమై వర్ధిల్లింది .తిలక మంజరికర్త జైనమతాచార్యుడు ధనపాలుడు ,శుక్ల యజుర్వేద భాష్యకర్త కాశ్మీర పండితుడు ఊవటుడు,చిత్తకవి ,ఇంకా ఎందరెందరో నా కొలువు కూటానికి ప్రకాశం తెచ్చారు . నేను వారిని పోషించానని గర్వంగా చెప్పను .వారి వలన నా భోజ సభ భాజమానమైంది అంటాను ..నేను శివ భక్తుడనే కానీ అన్నిమతాలు నాకు ఆదరణీయమైనవే . జైన గ్రంధాలను కాపాడాను .కర్ణాటకలోనిశ్రావణ బెళగొళ లో  ఉన్నజైన గురువు ప్రభ చంద్రునికి భూరి దక్షిణ సమర్పించాను . దీనికి సంబంధించిన శాసనం అక్కడ వేయించాను .నా రాజ్య పాలన 40 ఏళ్ళు సాగింది ..

 నేను 84 రచనలు చేశాను. 84 దేవాలయాలు నిర్మించాను ..సరస్వతీ కంఠా భరణం ,శృంగార ప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంధాలు నాకు మంచి పేరు తెచ్చాయి … మిగతా వివరాలు తర్వాత తెలియ జేస్తాను ఇప్పుడు మిగిలిన వారు మాట్లాడుతారు .

మహిమా భట్టు -భట్ట గోపాలుడు నా అనుమాన సిద్ధాంతాన్ని ఆరాధించాడు -’’రసామృత నదీ మగ్నే ,ధ్వనికారే మహా గురౌ అనుమానాయాహి కావ్యం గోష్టిమ్ న ముంచతి ‘’-మా గురువైన ధ్వనికార్టరసామృతం లో మునిగిపోయినా ,అనుమానం మాత్రం సాహిత్య విమర్శకుల గోష్ఠి ని వదిలి వెళ్ళలేదు ..నాతర్వాత వారైనా రుయ్యక మమ్మట విద్యాధర ,విశ్వనాథ  జగన్నాథా దులు నా సిద్ధాంతాన్ని పరిశీలించారు .నేను కళ వాస్తవాన్ని అనుకరిస్తుంది అని నమ్మాను .విభావానికి స్థాయికి మధ్య సంబంధం ,కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే .రస సాక్షాత్కారం అనుమానాయిక గ్రాహకత్వాన్ని దాటి పోదు .అన్న నాసిద్ధాంతానికి తగిన నిర్మాణం దృఢంగానే చేశాను .భావ ప్రకటనకు భాష సహేతుక సాధనం . భావాలు అర్ధవంతమైతేనే ఇతరుల మనస్సులను ఆకర్షించుకో గలవు ..మీమాంసకులలాగానే నేనుకూడా కర్మను చేయించే ప్రవ్రుత్తి ,కర్మకు విముఖం చేసే నివృత్తి సిద్ధాంతమే భాషా లక్షణాన్ని శాసిస్తుంది అని నమ్మాను . వాక్యం లో సాధ్యం అంటే అనుమానం చేత సిద్ధించేది ,సాధన అంటే తర్కం అనే అంశాలుంటాయి .కనుక దీని స్వభావం అనుమానం చేతనే గ్రాహ్యం .కనుక వాక్యం ద్వారా అందజేసేభావాలు సాధ్య ,సాధనాల సంబంధం తో ముడిపడి ఉండటం వలన అనుమేయ స్వభావం కలిగి ఉంటాయి .. కావ్యార్ధం మూడురకాలు  -వస్తువు ,అలంకారం, రసం .మొదటి రెండిటినీ ప్రత్యక్షంగా చూపించవచ్చు .కానీ మూడవదైన రసం అనుమానం వలననే సిద్ధిస్తుంది .అక్షరాలచేత ప్రభావితమయ్యే పదాల అర్ధం ద్వారానే రతి మొదలైన స్థాయీ భావాలను అనుమానించటం జరుగుతుంది .అక్షరాలూ సూచించే గమకం అంటే గుణం పరోక్షంగా నే గ్రాహ్యమవుతుంది అభిదా శక్తినే గుర్తించాను .లక్షణ ,తాత్పర్య ,అర్దాపత్తి ఉపమానం వక్రోక్తి అన్నీ అనుమానం కిందికే వస్తాయి .

విశ్వనాథుడు -నా సాహిత్య దర్పణం భారత దేశమంతా ప్రచారమైంది .కావ్య ప్రకాశం పధ్ధతి ననుసరించి రాశాను .ఇందులో కారకాలు ,వృత్తులు నేనే రాశాను .ఉదాహరణలు నా గ్రంథా లనుండి ఇతర గ్రంథాలనుంచి ఇచ్చాను .నా ప్రసిద్ధ సిద్ధాంతం ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’..వ్యంజన ను ప్రత్యేక వృత్తిగా చెప్పాను .పురాణకావ్యాలను కథ ,చంపు ,బిరుదు ,కరండ గా విభజించి నిర్వచించాను ..నాకు మార్గ దర్శి ధనుంజయుడు ..నేను అలంకార దోషాన్ని అంగీకరించలేదు ..సాహిత్యాన్ని శ్రవ్యం (కావ్యాలు )అని దృశ్యం (నాటకాలు )అని వర్గీకరించాను . ఆనంద వర్ధన ,మమ్మట ,జగన్నాధా దులు శ్రవ్య కావ్యాలనే చర్చిస్తే భారత ,ధనుంజయులు దృశ్య సాహిత్యాన్ని మాత్రమే చర్చిస్తే నేను మాత్రమే మొట్ట మొదటి సారిగా శ్రవ్య దృశ్య సాహిత్యాన్ని చర్చించాను . నాటకకళ కూయక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాను .  నా వంటి వారి వలననే ధ్వని సిద్ధాంతం సుస్థిరమైంది .నేనే ధ్వనిసిద్ధాంత ప్రతిస్థాపకుడనని -’’ప్రస్థాపనా పరమాచార్య ‘’అని నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పుకొన్నాను .. జగన్నాథుడు -షాజహాన్ చక్రవర్తి మామ నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ ప్రశంసిస్తూ ‘’ఆసఫ  విలాసం ‘’కావ్యం రాశాను జగదాభరణ ,ప్రాణాభరణ కూడా నావే .నా విడి విడి పద్య సంకలనమే ‘’భామినీ విలాసం ‘’..రస గంగాధర విషయాలను సంక్షిప్తం చేసి ‘’చిత్ర మీమాంస ఖండన ‘’రాశాను ..నా గురుదేవులు శేష కృష్ణులను భట్టోజీ దీక్షితుడు విమర్శిస్తే ,దీక్షితుల ‘’ప్రౌఢ మనోరమ ‘’పైనా  అక్కసు అంతా కక్కుతూ ‘’మనోరమా కుచమర్దనం ‘’రాశాను ..నా అలంకార గ్రంధం రస గంగాధరం నన్ను మహా పండితునిగా ,విమర్శకునిగా పేరు ప్రతిష్టలు తెచ్చింది .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశిక ల తో సమాన స్థాయి పొందింది .నా తర్క శాస్త్ర పాండిత్యానికి ,ఆలోచనాపటిమకు ,సుబోధక శైలికి  అలంకార శాస్త్ర ప్రతిభకు ఇది నిలువెత్తు దర్పణం . ఇందులో రెండు అధ్యాయాలున్నాయి అధ్యాయాలను ‘’ఆనానాలు ‘’అని వినూత్నంగా పేరు పెట్టాను .మధుర కవిత్వం లో నాకు సాటి ఎవరూ లేరని సవాలు విసిరాను ..శృంగార0 రాసేటప్పుడూ ఔచిత్యాన్ని దాటకుండా రాశా .ముక్తకాలలో కూడా రస పోషణ చేసి సెబాస్ అనిపించుకొన్నాను .నా రచనలన్నీ ప్రసాద గుణానికి ఉదాహరణలే .’’.రమణీయార్ధక ప్రతిపాదక  శబ్దహః కావ్యం ‘’అన్న కావ్య జగజ్జెట్టీని నేను .

 భోజరాజు -సరస్వతీ కంఠాభరణం నా మొదటి రచన .చిన్నదికూడా . .శృంగార ప్రకాశం రెండవది .రెండిట కొన్ని సమాన విషయాలున్నాయి .నేను చెప్పాల్సిందంతా దీనిలోనే చెప్పాను .శృంగార విషయాల నిగ్గు తేల్చే గ్రంధం .లలితా కళారహస్యాలను ,కావ్యరచనా మర్మాలు ఉన్నాయి .కంఠాభరణం అయిదు పరిచ్చేదాలు .అలంకార శాస్త్ర విషయాలన్నీ ఉన్నాయి .అలంకారాలను శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు  ఉభయాలంకారాలుగా విభజించాను . 6 గుణాలు 16 దోషాలు చెప్పాను .ఒక్కోదానిలో 24 అలంకారాలు చెప్పాను .చివరి అధ్యాయం ముఖ్యమైంది ఇందులో రసం పై చర్చ ఉంది .ఇందులోకారికల సమాఖ్య ఉదాహరణలో ఎక్కువే .

‘’శృంగార ఏవ ఏకో రసః ‘’శృంగారం ఒక్కటే రసం అన్నాను .అంటే శృంగారం సంపూర్ణమైన రసం అని సిద్ధాంతం చేశాను ఇది వినూత్న సిద్ధాంతమే .

శృంగార ప్రకాశం లో 36 ప్రకాశాలున్నాయి .అధ్యాయాలను ప్రకాశానాలు అన్నాను శబ్దార్ధ సంబంధాల అభి వ్యక్తియే సాహిత్యం అని నిర్వచించాను ఈ సంబంధం 12 రకాలు .. 9వ అధ్యాయం లో సాహిత్య విమర్శ చేశాను . 13 వ అధ్యాయం ‘’రతి ‘’ కి కేటాయించాము ..ధర్మార్ధ కామ మోక్షాలకు సంబంధించిన నాలుగు శృంగార రూపాలతో కొత్త సిద్ధాంతాన్ని విస్తృత ప్రాతిపదికపై నిర్మించాను . 15 అధ్యాయాలలో సంప్రదాయ శృంగార రస లక్షణాలు చర్చించాను ..  22 వ అధ్యాయం ‘’అనురాగం ‘’కు కేటాయించాను .దీనిలో 64 రకాలున్నాయని చెప్పాను అందులో ఒక్కొక్కొటి 8 విధాలు .వీటిలో ఒక్కొక్కదానిలో మళ్ళీ 8 రకాలు .ఇవి మళ్ళీ ఒక్కోటి 3 రకాలు .కనుక మొత్తం 64x8x 24=12228రకాలు .ఇన్నిటికి పేర్లు పెట్టటం ఆషామాషీ కాదు కానీ అన్నిటికీ పేర్లు పెట్టాను ..అన్నిటికీ ఉదాహరణలివ్వగలిగాను .

మహిమా భట్టు -భోజమహా రాజుల వారిది ఎంతటి సూక్షం పరిశీలనా అర్ధమయిందికదా ..ఒక వస్తువు ను చూడటం వలన అది అనుభవం లోకి  వచ్చి సంస్కార రూపంగా మనసులో దాగి ఉంటుంది .దీనికి సంబంధించిన మరో వస్తువును విన్నప్పుడో చూసినప్పుడో పూర్వ సంస్కారం వలన క్రొత్తదాన్ని గ్రహించగలం ఈ మూడు రకాల అభి వ్యక్తీకరణలో ఒక్కటికూడా ధ్వనికి వర్తించదు .అందుకే రసధ్వనికి నిర్వచనంగా అభి వ్యక్తిని చూపటం జరిగింది ..వాచ్యార్థ రచనలన్నీ కవిత్వం అవుతాయి .ధ్వనికావ్యం దాని వెలుపలే మిగిలిపోతుంది ధ్వనిని రెండవ రకమైన వ్యంజకంగా భావిస్తే అప్పుడు వ్యంజకానికి అనుమాన సంజ్ఞ లేకుండా పోతుంది .ధ్వని సిద్ధాంతాన్ని వదిలి అనుమాన సిద్ధాంతాన్ని అంగీకరించాల్సి వస్తుంది .

విశ్వనాథుడు -నేను ధ్వనిని అంగీకరించి ,దాని ఉనికిని నిరూపిస్తూ -’’కావ్యస్యాత్మా సాయి వార్ధాహ్  కావ్యస్యాత్మా ధ్వని రీతిహ్ ‘’రస ప్రాధాన్యతపై నేను -’’ఏకో రసో అంగీకర్తన్యాహ్ ‘’అని ధ్వని వస్తు, అలంకార రసధ్వనులన్నాను ..మొదటి రెండు కావ్యాత్మ కానేరవు .రసధ్వనిమాత్రమే కావ్యాత్మ .ఈ ఒక్కమాటతో నా సాహిత్య దర్పణం అలంకార శాస్త్ర వికాసం లో అసదృశ స్థానం పొందింది .ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో నన్ను అగ్రగణ్యుని చేసింది .రస సిద్ధాంతాన్ని సుదృఢం చేసిన వానిగా కీర్తి గడించాను .

 జగన్నాథుడు -నా అన్యోక్తులలో కూడా ధ్వని ఉంది .సాహిత్య సేవలో ప0డిపోయాను .ఎన్నో స్వతంత్ర భావాలు చెప్పాను .ప్రతిభకు సర్వోన్నత స్థానమిచ్చాను .కావ్యాలను నాలుగు రకాలుగా విభజించాము .కొత్త రస సిద్ధాంతం చెప్పటం ,రెండురకాల గుణాలు అంగీకరించటం ,శబ్ద మూల శక్తి ధ్వనిని తర్క సమ్మతంగా రుజువు చేయటం ,అభిద లక్షణ శక్తులపై చర్చ ,అనేక అల0కారాలకు రూపాన్ని ,పరిధిని నిర్ణయించటం లో నా మౌలిక ప్రతిభ వ్యక్తమైనదని అంటారు.  నిజమేనేమో లేక పొతే ఎందుకంటారు ?

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -9-

అలంకారిక ఆనంద నందనం -9-

సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’నాల్గవదైన చివరిభాగానికి సాహితీ పిపాసులకు స్వాగతం . ఈ రోజు నలుగురు సుప్రసిద్ధ ఆలంకారికులు మనకు తమ సిద్ధాంత వివరణ చేస్తారు .శ్రీ భోజ మహారాజులవారిని సభాధ్యక్షం వహించి తమ పాలనా వైభవాన్ని తెలియజేస్తూ సిద్ధాంత వివరణ నిస్తూ సభను నిర్వహించవలసినదిగా కోరుతున్నాను .నవరత్నకవులతో వారు నిర్వహించిన కవితా దర్బారు మనకు సుపరితమే .వారికిది నల్లేరు పై బండి … ఈ నాటి భోజాస్థానం లో స్థానం పొంది తమ తమ సిద్ధాంత ప్రతిపాదనలను వివరించవలసినదిగా రాజానక మహిమా భట్టు ,విశ్వ నాథ కవిరాజు ,మన ఆంద్ర దేశ జగన్నాథపండిత రాయలను వేదిక నలంకరించవలసినదిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..

భోజమహారాజు -నేను క్రీశ. 1010 నుంచి 1050 వరకు మాళవ రాజ్య  పాలన చేశాను . మా తండ్రి సింధురాజు ఐదేళ్లు లోపే రాజ్యపాలన చేశారు ./పెదనాన్న ముంజు పరమార వంశ మొదటి గొప్పరాజు . 20ఏళ్లకు పైగా పాలించారు .ఆయన మహాసేనాని కవి .కళాసాహిత్యాలను పోషించారు పారమారరాజులలో నా పాలన స్వర్ణయుగం గా భావిస్తారు .వారసత్వంగా విస్తారమైన సామ్రాజ్యం నాకు లభించినా రాజ్య విస్తరణకు కృషిచేసి ఒరిస్సా ,శాకాంబరీ ,లాట,కొంకణాదేశాలు జయించి మాళవ రాజ్యం లో కలిపాను .గజనీ మహమ్మద్ దండయాత్రలు యె దుర్కోవటానికి  ఆనంద  పాలుడికి, ఆయన తర్వాత కుమారుడు త్రిలోచన పాలునికి నా సైన్యాన్ని పంపి సహాయం చేశాను ..ఉత్తర భారతం లో ఘజనీకి ఎదురులేక పోయినా ,నా నాయకత్వం లో హిందూరాజులను  సంఘటిత పరచి అతని దురాక్రమణలకు అడ్డుతగలగా 1025 లో గజినీ సోమనాధ దేవాలయాన్ని దోచి ధ్వంసం చేశాక ,మమ్మల్ని తప్పించుకోవటానికి దారిమళ్లి  కచ్ ,సింధు ప్రాంతాలనుండి వెనక్కి పారిపోయాడు  .పశ్చిమ ప్రాంతం లో మా విజయానికిది నిదర్శనం ఒరిస్సా పాలకుడు రాజేంద్ర చోళుడితో మైత్రి కుదుర్చుకొని రాజ్యాన్ని సుస్థిరం చేశాను .. సుదీర్ఘంగా నా చరిత్ర చెప్పానేమో !ఇప్పుడు వరుసగా మహిమా భట్టు ,విశ్వనాథుడు జగన్నాథుడు ప్రసంగిస్తారు .

మహిమా భట్టు -నేను కాశ్మీర బ్రాహ్మణుడను .మాతండ్రి శ్రీ ధైర్యుడు .గురువు మహాకవి శ్యామల .అలంకార శాస్త్రంగా ‘’వ్యక్తి వివేకం ‘’రాశాను .ఇది ఆనంద వర్ధన ధ్వని సిదాంతానికి వ్యతిరేకం .నేను రాసిన మరో గ్రంధం ‘’తత్వోక్తి కోశం ‘’లో భావన యొక్క స్వభావాన్ని నిరూపించా .అయితే ఇది ప్రస్తుతం అలభ్యం అంటున్నారు ..నేను ‘’అనుమాన సిద్ధాంతం ‘’ప్రతిపాదించాను .పాండిత్యం అరుదైన రసాస్వాదం కలిపి దీన్ని రాశాను ..రుయ్యకుడు వ్యక్తివివేకానికి వ్యాఖ్య రాశాడు .ఇందులో రెండవ అధ్యాయమే లభించింది . అందులో నా సిద్ధాంతంపై విమర్శ ఉంది . వివేకం లో మొదటి అధ్యాయం లో ధ్వని నిర్వచనాన్ని విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి ,అది అనుమానమే తప్ప వేరే  కాదని నిరూపించాను .కుంతకుని వక్రోక్తి కూడా అనుమాన పరిధిలోనిదే .రెండవ అధ్యాయం లో నా విమర్శనా ప్రాగల్భ్యం కనిపిస్తుంది ..చివరి అధ్యాయం లో అనుమాన సిద్ధాంతాన్ని వివరించాను .ఆనంద వర్ధనుడు ధ్వనికిచ్చిన ఉదాహరణలనే తీసుకొని అలంకార శాస్త్రం లో కొత్త మార్గం స్థాపించాను . విశ్వనాథుడు -ఒరిస్సా రాష్ట్రం లో పండిత కుటుంబం లో నేను పుట్టాను.  కపింజల గోత్రీకుడిని . తండ్రి చంద్ర శేఖరుడు కవి ,ఛ0దోవేత్త .14 భాషలలో దిట్ట . ఒరిస్సా గజపతి రాజుల ఆస్థానం లో మా తాత జయదేవుని అష్టపదులకు సర్వాంగ సుందరి వ్యాఖ్య రాసిన నారాయణ దాసు,   తండ్రీ  చంద్ర శేఖరుడు ,నేను కూడా ఉన్నవాళ్ళమే .నేను 18 భాషలలో ప్రావీణ్యం ఉన్నవాడిని .’’సాహిత్య దర్పణం ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను .నాకుమారుడు అనంత దాసు నా సాహిత్య దర్పణానికి ‘’లోచన ‘’వ్యాఖ్య రాశాడు ..నేను త్రికళింగ  అమాత్యుడను ..నా రచనలు -చంద్రకళా  నాటిక ,ప్రభావతీ పరిణయ నాటకం ,రాఘవ విలాస కావ్యం ,కువలయాశ్వ చరిత్ర -ప్రాకృత కావ్యం ,ప్రశస్తి రత్నావళి ,నరసింహ విజయం ,కంస వధ  కావ్యం ,కావ్య ప్రకాశ దర్పణం , లక్ష్మీ స్తవం మొదలైనవి సాహిత్య దర్పణం తోపాటు రాశాను .

జగన్నాథుడు -ఆంధ్రదేశం లో కోనసీమలో ముంగండ గ్రామ లో ఉపద్రష్ట వారింట క్రీశ 1600 లో జన్మించాను .ఉపద్రష్ట అంటే యజ్ఞ పరివేక్షకుడు అని అర్ధం .తండ్రి  భట్టు సకల విద్యా ప్రవీణుడైన పండితుడు .  తల్లి లక్ష్మి. నేనుప్రసిద ఖండూర దేవుని వద్ద విద్యలు నేర్చాను .తండ్రిగారివద్దనే వ్యాకరణం తప్ప సకల శాస్త్రాలు అభ్యసించాను .శేష నీరీశ్వరులవద్ద వ్యాకరణం నేర్చాను . నా తండ్రిని నేను ‘’మహా గురువు ‘’ అని సంబోధించాను .నాకు తండ్రీ ,గురువూ ఒక్కటే ..నేను ఉత్తరభారతం చేరి మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానకవినై పండిత రాయలు బిరుదుపొందాను.  ఆయనకుమారులూ నా శిష్యులే .చక్రవర్తి అనుమతిపొంది లవంగిని పెళ్లి చేసుకొన్నాను ..నా శిష్యులలో శ్రీకులపతి మిశ్రా ఆగ్రా మధుర చతుర్వేది వంశస్తుడైన మధురకవి . జయపూర్ రాజు మొదటి శ్రీరామ సింహాజీ ఆస్థానకవి .మరొక శిష్యుడు నారాయణ భట్టు ..నేను ‘’రస గంగాధర0 ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను ఎందుకో కానీ నాకూ అప్పయ్య దీక్షితులుకు పడేదికాదు . ఎడ్డెమంటే తడ్డెం అనుకొనే వాళ్ళం  .గంగా లహరి యమునా లహరి అనే అమృత లహరి ,కరుణా లహరి ,లక్ష్మీ  లహరి ,సుధాలహరి రస గంగాధరం తోపాటు రాశాను .అందుకని నన్ను లహరికవి అన్నారు ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -8

అలంకారిక ఆనంద నందనం -8

అభినవ గుప్తుడు -నాటక కళా సృష్టిని సజీవంగా భావించాను ..భరత ముని మార్గాన్నే అనుసరించి దాన్ని కార్యావస్థలు ,అర్ధ ప్రకృతులు గా విశ్లేషించా .ఈ రెండిటినీ 64 సంధ్యారాగాలుగా విభజించి ,నాటక కర్త అవసరాన్ని బట్టి వీటిలో ఎన్నైనా వాడుకొనే వీలు కల్పించా .నాటకం లో రసమే ఆత్మ అని నేనూ అంగీకరించా ..రంగస్థలం పై ప్రదర్శించే ఒక వస్తువుగా రసాన్ని విశ్లేషించా .విభావ అనుభావ వ్యభిచార స్థాయీ భావాలు దాని అంగాలు అన్నాను ‘’స్థాయీ విలక్షణో రసాహ్ ‘’.సన్నివేశం మొదలైన వాటితోకలిసి పానకం లా స్థాయీ భావానికి భిన్నంగా ఉండేదే రసం ..రసానుభవం వేర్వేరు స్థాయిలలో ఉంటుందని చెప్పా .ఇంద్రియాలు బుద్ధి ,భావోద్వేగం ,ఉద్వేగ అభి వృద్ధి ,అలోకికం అనేవి ప్రతి ఒక్కటీ తర్వాత వచ్చే స్థాయికి తీసుకొని వెడతాయి . రసానుభవం యొక్క వివిధ భావాలను ఒక్కొక్కదాన్ని ఒక ప్రత్యేక స్థాయికి కేటాయిస్తుంది . మొదట ఇంద్రియ స్థాయిలో విశ్లేషణ ప్రారంభమౌతుంది .కళకు సంతోషమే ప్రయోజనం అన్నాను ..నిజమైన రసాత్మక వస్తువు కేవలం ఇంద్రియాలను ఉత్తేజపరచేదికాదు.  భావనశక్తిని ఇంద్రియాలద్వారా పురిగొల్పుతుంది .అంటే ఒక చిత్రానికి స్థూల రేఖలు మాత్రమే గీసినట్లు అన్నమాట .ప్రేక్షకుడు తన భావనా  శక్తితో  అవసరమైన వాటితోనింపి చిత్రాన్ని పూర్తి చేస్తాడు .కనుక నేను రసానుభూతికి రెండవ స్థాయి భావన అన్నాను ..ప్రేక్షకుడు నటుని అభినయం తో తాదాత్మ్యం చెంది ఉద్వేగానికి గురౌతాడు .కళ  ఉద్వేగాన్ని ప్రదర్శిస్తుంది ,ప్రేరేపిస్తుంది .ఉద్వేగానికి గురైతే తనను తాను  మర్చిపోతాడు అప్పుడు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు .నా దృష్టిలో గాఢమైన అంతర్లీనత  వలన ,స్థాయీ భావాన్ని నిరాదరరించటం వలన కర్త ,వస్తువు అనే ద్వైవీ భావం  తొలగిపోవటమే చివరిది అత్యున్నత మైనది అయిన రసానుభవం .ఈ దశలో స్థాయీ భావం అంతశ్చేతన  లో మునిగిపోగా సాధారణీకరణం చెందిన వ్యక్తిలోని ఆనంద పార్శ్వ్0 ప్రకాశిస్తుంది . యోగి అనుభావించే తురీయానందం వంటిది పొందుతాడు .ఆత్మ ఒక్కటే ప్రకాశించగా వస్తువుకు సంబంధించిందంతా అంతశ్చేతనలో లయమై పోతుంది . సోదరులూ ఇక కానీండి . మమ్మటుడు -అన్నగారు సమాధి సిద్ధి మనందరికీ కల్గించారు . .నేను నా గ్రంధం 5 వ అధ్యాయం లో మధ్యమ తరగతి కవిత్వాన్ని చర్చించాను .ఇలాంటికవిత్వం లో వాచ్యార్థమే ప్రధానం . వ్యంగ్యార్థం అప్రధానం . దీనినే ‘’గుణీ భూత వ్యంగ్యం ‘’ అన్నాను  . శాస్త్ర తార్కిక వాదంతో పరిపుష్టి చేశాను . 6 వ అధ్యాయం అధమకవితను గూర్చి చెప్పాను .ముఖ్యమైన 7 వ ధ్యాయం లో కావ్య దోషాలు చర్చించి నా విమర్శనా శక్తికి పదును పెట్టాను ..కాళిదాసు కుమార సంభవం లో వర్ణించిన పార్వతీ పరమేశ్వరుల శృంగార క్రీడను తప్పు పట్టాను .తప్పు ఎవరు చేసినా తప్పే . ఆనాడే వర్ధనులు అంగీకరించినా నేను మాత్రం ఒప్పుకోలేదు . నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పే ధైర్యం ఉంది . నేను ఎవరికీ జంకను .స్వంత  తలిదండ్రుల రతి క్రీడ వర్ణించటం ఎలా తప్పో, ఆది దంపతుల రతికేళి వర్ణించటం కూడా అంతే తప్పు మొహమాటం లేదు ..పద్యం లో రస విరోధం ‘’విషయం లో ఆనంద వర్ధనుని నిలదీశాను అలాగే వామన రుయ్యక ఉద్భటులతో కూడా విభేదించా ,చివరికి నా వాదమే సరైనది అని అందరూ అన్నారు .వేదాంతులలో నిష్ణాతులైన ముకుళభట్టు ,మండన మిశ్రులతోకూడా ఢీ అంటే ఢీ  అన్నా ..

కుంతకుడు -సృజనాత్మక భావన కవిత సామ్రాజ్యపు అయిదు వేర్వేరు క్షేత్రాలలో ప్రవర్తిస్తుంది .ఇవే  అక్షరాలా కూర్పు ,పద పూర్వార్ధ ,పద పరార్ధ ,వాక్య ,ప్రకరణ ప్రబంధం . వక్రత ఈ ఐదింటిలోనే ప్రదర్శనమిస్తుంది..కవిత్వం లో రస ప్రాధాన్యం గుర్తించి అది ప్రకరణ వక్రత ,ప్రబంధ వక్రత పరిధిలోకి వస్తుందని చెప్పా .మొత్తం కావ్యం లో కనిపించే వక్రత లేక ప్రబంధ వక్రతను ఆహ్లాదకరమైన రసాల సాయం తో సాధించాలి .పదాల కు జీవకళ వచ్చేది ఆసాంతం రసాన్ని కొనసాగించి ,ఆహ్లాదం కలిగించినప్పుడే .ఆనంద వర్ధనుల మతమూ ఇదే .ఈ భావమే నన్ను ఉత్కృష్ట అలంకారిక జాబితాలో చేర్చింది ..కావ్యం లో అంగీభూతంగా రసం ఉంటె దాన్ని ధ్వనిగా గుర్తించాలని ఆనంద వర్ధనులన్నారు .కానీ నేను ‘’రసానుతుల్యం వర్తమానం ‘’అని చెప్పి ,నేను చెప్పిన రసవాదాలంకారానికి ,రసానికి సమాన హోదా ఇవ్వాలని వాదించాను  . వర్ధనులు రెండవ తరగతి కావ్యం లో దీన్ని చేర్చగా నేను వక్రతతతో సమాన హోదా నిచ్చాను . రసవదాలంకారం అంటే రసమే ప్రధాన ఆకర్షణగా గల ఒక రకమైన వక్రోక్తి .

అభినవ గుప్తుడు -ఉద్వేగ అభి వ్యక్తి స్థాయిలో అనుభవించే రసానికీ ,అలౌకిక స్థాయిలో అనుభవించే పరమానంద సమానమైన రసానికి భేదం ఉంటుంది .సూక్ష్మఅంశాలను సైతం అధిగమించగలవారు మాత్రమే ఇలాంటి రసానందాన్ని పొందగలరు .విశేషణం విశేష్య భావ ముఖేన యో వ్యవహారాః సా ఆత్మాణి నోప పద్యతే ‘’. రసానుభవం నిశ్చలం కాదు .గతి శీలమైనది . ఇది ఆత్మ తన విశ్వ జనీనత ను భావించి అనుభవించటమే .ఆనందం అంటే స్వాత్మ పరామర్శమాత్రమే వేరే ఏమీ కాదు .దీన్ని అద్వైత వేదాంత దృ ష్టి తో వివరించలేము కారణం ఆత్మకు లేక బ్రహ్మ0 కు స్వప్రకాశమే కానీ స్వాత్మ పరామర్శ ఉండదు …

 అర్ధ నిర్ణయం లో ఉన్న సమస్యలనూ మనో వైజ్ఞానిక దృ ష్టి నుంచి అధ్యయనం చేసి వాటిలో అభిదా ,లక్షణా ,తాత్పర్య ,వ్యంజనా అనే నాలుగు భేదాలున్నాయని చెప్పాను  .నా అల్మాకార సిద్ధాంతం శైవ తత్వ శాస్త్రాలు జ్ఞాన సిద్ధాంతాలపై ఆధార పడిఉంది . నా సిద్ధాంతాన్ని అందుకే రహస్య యోగం అన్నారు .పరమ సత్యం  అఖండమైనది .జ్ఞానం జ్ఞేయం జ్ఞాత అంతా ఆభాసమే .ఈ ఆభాస పూరిత ప్రపంచమంతా సమస్తాన్నీ తనలో ఇముడ్చుకొన్న విశ్వ చేతన.లేక ఆత్మ యొక్క వ్యక్తరూపం .దీన్ని స్వాతంత్య్ర  వాదం అనీ అనచ్చు నిర్ణయం స్వేచ్ఛ పరమ తాత్విక సిద్ధాంతంగా అది విశ్వ శిస్తుంది ..జీవాత్మ ,పరమాత్మ ఒకే పోలికకలవి .జీవాత్మకు మూడుకల్మషాలు -అణవ,కర్మ ,మాయ ఉండటం వలన పరమాత్మకంటే వేరుగా కనిపిస్తాడు .వీటిని తొలగించుకోవటానికి తంత్ర లోకం అనే గ్రంధం లో దేశధ్వ ,తత్వధ్వమొదలైన అధ్యాయాలలో చర్చించాను .అనుభవ స్థాయిలో గ్రహించేవాడి వ్యక్తిత్వం రుచి ,కోరిక ,గ్రహణ శక్తి ని బట్టి ఉంటుంది .సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు విశ్వ జనీనతను సాధిస్తారు .దీనికి నాటక ప్రదర్శన విధానమమే  తోడ్పడుతుంది . .. ఇంతటితో నేను చెప్పాల్సింది ముగిస్తూ ,మిత్రులకు కొనసాగించమని కోరుతున్నాను .

మమ్మటుడు-పదం ,పదాంశం ,మూలం ,ధాతువు ,ప్రత్యయం ,విభక్తి ,పాదాంతం ,క్రియాకాలం ,చివరికి వచన  సంఖ్య లో కూడా  సూక్ష్మా0శాలలో  వ్యంగ్యార్థం తొంగి చూడచ్చు . ధ్వనికి అనంత రూపాలున్నాయి వీణాన్నిటిని నాల్గవ అధ్యాయం లో వివరంగా రాశాను . దోషాలను ఎట్టి చూపే రంధ్రాన్వేషకులు చాలామందే ఉంటారు .నేను దోష నివారణ పద్ధతులు చెప్పి దారి చూపించాను  ..ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను .

కు0త కుడు -నేను రీతి కి మార్గం అని పేరుపెట్టాను .కాళిదాసు సుకుమారమార్గానికి ,బాణ భవభూతులు విచిత్రమార్గానికి ,మయూరుడు మార్గ మార్గానికి ,మిగిలినవారు  మాధ్యమమార్గానికి చెందినవారు .ప్రతికవికి భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది .కవి వ్యక్తిత్వం శైలిలో ప్రతి బింబిస్తుంది . వక్రోక్తి కి అసాధారణ ఆకర్షణ ఉండాలి రసికులు రంజింపజేయాలి ..ధ్వని రస విషయాలలో నాకు అభిప్రాయం భేదం లేదు . కావ్య నిర్వచనం లో నేను రసికులు ప్రాధాన్యమిచ్చాను ‘’శబ్దార్ధౌ  సహితం కావ్యం ‘’-శబ్దం అర్ధం కలిసే కావ్యమౌతుంది .శబ్దార్ధాలుకలిసి ‘’సాహిత్యాన్ని ‘’కలిగి,వక్రోక్తిలో అమరి అభిరుచి ఉన్న రసికులు ఆనందింప జేసినపుడే అది కవిత్వం అవుతుంది .ఈ సాహిత్య భావన కల్పించినవాడిని నేనే ..నేనే స్వయంగా కవితా గుణాలను రెండు సముదాయాలుగా గుర్తించాను .మొదటిది సాధారణ ఇది అన్నిరకాల కవిత్వం లోనూ ఉంటుంది .రెండవది అసాధారణ .ఇందులోని గుణాలు ప్రత్యేక మార్గాలు లేక శైలి కి సంబంధించినవి . మొదటి సముదాయం లో సౌభాగ్య ,లావణ్య ,ఔచిత్యా లు ఉంటాయి రెండవదానిలో మాధుర్య ,ప్రసాద ,లావణ్య ,ఆభిజాత్యాలుంటాయి ఈ నాలుగు గుణాలు సుకుమార మార్గ ,విచిత్ర మార్గాలకు చెందినవి .సౌభాగ్యగుణం శబ్దానికి అర్ధానికీ కూడా చెందుతుంది . గుణం చేరటం వలన సందర్భాన్ని బట్టి రసం నిష్పన్నమై రసికులు ఆనందం కలిగిస్తుంది . శబ్దార్దాల సౌందర్యమే లావణ్యం .కవితా మర్యాద ఔచిత్యం .భావాలలో ,పద ప్రయోగం లో కూడా ఔచిత్యం ఉండాలి . ఔచిత్యం ద్వారానే కవిత భావనలు జీవం పోసుకొంటాయి .. ఔచిత్యానికి నేనే మార్గదర్శినని చెబుతూ సెలవ్ .

   చాలా సంతోషంగా ఈ మూడవ కార్యక్రమం పూర్తి అయింది .ఒక్కసారి వారి భావనలను పునశ్చరణ చేసుకొందాం  . ‘

 ‘’రసానుభవం లో సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు కూడా విశ్వ జనీనత ను సాధిస్తారని అభినవ గుప్తులవారి భావం .కావ్యభాషకు భావకత్వ  భోజకత్వ శక్తులు ఉంటాయి అన్న భట్టనాయక మతాన్ని గుప్తులవారు తిరస్కరించారు . ఈ రెండు శక్తులవలననే రసానుభవం లో సాధారణీకరణ జరుగుతుందని భట్టనాయకుడు భావిస్తే ,అభినవ గుప్తులు రసానుభవాన్ని అలౌకిక స్థాయిలో కూడా వివరించి అది ఆనందానుభవం తప్ప మరొకటి కాదన్నారు ..భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు గుప్తులవారు ‘’వివరణ ‘’రాశారు ..అభినవ గుప్తుల అన్నగారు ధ్వన్యాలోకానికి ‘’చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశారు . దాన్ని ఆ వంశం వారందరూ అధ్యయనం చేశారు .చంద్రిక చాలక తాను  ‘’లోచన ‘’వ్యాఖ్య రాశానని గుప్తులవారే చెప్పుకొన్నారు . వేదికపై ఉన్న మమ్మటు లవారు అభినవ గుప్తులను ‘’ఆచార్య పాదులు ‘’అని సంబోధించటం వలన అయన శిష్యుడే అయి ఉంటారు .క్షేమేంద్రుడూ గుప్తులను తనగురువుగా చెప్పుకొన్నాడు . అలంకార శాస్త్రం లో ‘’గుప్తం’’గా ఉన్న ఎన్నో విషయాలను వెలికి తీసి ‘’అభినవం’’గా చెప్పిన అభినవ గుప్తులవారికి అభినందన చందనం .

 రాజానక మమ్మట  పండితుల సమైక్యబుద్ధి అభినందనీయం .తన వ్యక్తిత్వాన్ని బహుముఖ పాండిత్యాన్ని కావ్య ప్రకాశం లో ప్రకాశమానంచేశారు స్వతంత్ర భావాలు ,నిర్భీకత ,న్యాయ ద్దృ ష్టి ,విశాల దృక్పధం ,సమన్వయ దృష్టి ,సాహిత్య సృష్టిలో అంద  చందాలు  .దోషాలు గ్రహించే ప్రతిభ ,రసికత వారి వ్యక్తిత్వ ముఖ్య లక్షణాలు .ఇన్ని గుణాలు ఒక చోట కలిసిఉండటం అరుదైన విషయం .అందుకే కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసిన ఒకాయన ఆయనను సరస్వతీ దేవి అపర అవతారమని  స్తుతించాడు ‘’వాగ్దేవతావతార’’అని మళ్ళీ స్తుతించేదాకా ఉండలేక పోయాడు . ఆయన మాటకు తిరుగు లేదు .ధ్వని సిద్ధాంత లక్షణాలకు నిర్దిష్ట రూపాన్నీ ,ఆచరణాత్మక నిర్వచనాన్ని ఇచ్చిన ఘనత రాజానక మమ్మట పండితులకే చెందుతుంది .వీరికి ముందు ధ్వన్యాలోకం లో లోచన0 లో సిద్ధాంతాలుగా రూపు దాల్చని భావాలుగా ఉన్న  ధ్వని సిద్ధాంతానికి సంపూర్ణమైన తుది స్వరూపమిచ్చి ఆనంద వర్ధనులకే కాక అలంకార శాస్త్రానికి విలువైన కానుక నిచ్చిన మమ్మట పండితులకు కాశ్మీరమేకాదు యావద్భారతం  రుణ పడి  ఉంది .వారి కావ్యప్రయోజన ,కావ్య హేతు చర్చ అందర్నీ ఆకర్షించింది .శబ్ద శక్తి వివరణ అనితరసాధ్యమనిపిస్తుంది .కావ్యప్రకాశికకు జైన మతాచార్యులు మాణిక్య చంద్రుడు మొదటి వ్యాఖ్యానం రాస్తే ,ఆతర్వాత 50 కి పైగా టీకలు  వచ్చి  భగవద్గీత తర్వాత ఇన్ని టీకలు వచ్చిన గ్రంధంగా రికార్డ్ సాధించింది . టీకాలు వివరణలు వివరణలు మళ్ళీ టీకలూ శర  పరంపరగా సాగుతూనే ఉన్నాయి .ప్రతి ఇంట్లో కావ్య ప్రకాశం ఆవరించి ఉంది అనే శ్లోకం ఒకటి బాగా ప్రచారం లో ఉంది  -’’కావ్య ప్రకాశస్య కృతా గృహే గృహే టీకా తదాప్యేష తథైవ దుర్గమః ‘’.ధన్యులు మీరు మమ్మట పండితా!  మమ్మల్నీ ధన్యులను చేసినందుకు కృతజ్ఞతలు .  మమ్మట మతం సర్వ సమ్మతం అని పించారు .

  రాజానక కు0తకుల వారి   వక్రోక్తిలో ధ్వని సంప్రదాయం కలిసే ఉంది . కానీ కొత్తదారిపట్టి ముసుగేసుకొన్న ధ్వని వక్రోక్తియే అనిపించారు .అందరూ కావ్యాత్మ అంటే కావ్య జీవితం అన్నారు . సోమేశ్వర మాణిక్య చంద్రులు వీరిని సమర్ధించారు . వీరిభావాలు పాశ్చాత్య ఆలంకారికుల భావాలకు దగ్గరగా ఉంటాయి .కావ్య నిర్వచనం ,అలంకార నిర్ణయం రీతి వివరణలో ఆధునిక మార్గమే తొక్కారు .ఔచిత్యం ద్వారానే కవితా భావనలు జీవం పోసుకొంటాయి అన్న వారి భావనలను క్షేమేంద్రుడు ఔచిత్యాన్ని గురించి ఒక బృహద్గ్రంధమే రాశాడు .ఔచిత్యం రసం తోకలిసి స్థిరమై కావ్య శరీరాన్ని జీవం తో నింపుతుందన్నాడు .ఔచిత్య ,రసాల ఆధిక్యతను  అంగీకరించి తమ కొత్త సిద్ధాంతమైన ‘’వక్రోక్తి ‘’కూడా అలంకార శాస్త్రం లో ముఖ్యమైన విలువలను సమర్థిస్తుంది అని నిరూపించారు . వక్రోక్తి కుంతక ధరులైన కుంతకులకు అభినందనం .

 ఈ మూడవ సమావేశం అర్ద వంతంగా సమాప్తి చెందినందుకు ఇందులో పాల్గొన్న అలంకారిక మహాశయులకు శ్రోతృ మహాశయులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను . నాల్గవ చివరి ప్రత్యేక సమావేశం లో మళ్ళీ కలుద్దాం .

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -7

అలంకారిక ఆనంద నందనం -7

సాహితీ బంధువులకు సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మూడవ భాగానికి స్వాగతం . ఈ రోజు శారదా దేశ0 కాశ్మీర్ కే చెందిన ముగ్గురు ఆలంకారికులు మనమధ్య ఉండటం మరొక వినూత్న విషయం .. వారిలో ‘’అభి వ్యక్తి సిద్ధాంతకర్త ‘’శ్రీ అభినవ గుప్తులవారిని అధ్యక్ష స్థానం వహించి సభా సంచా లనం చేస్తూ తమ సిద్ధాంతవిషయాలను తెలియ జేయవలసినదిగా  వేదిక నలంకరించవలసినదిగా అగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..వ్యంజనా వృత్తికారులు రాజానక మమ్మట పండితులను ,వక్రోక్తి విన్యాసి రాజానక కుంతకులవారినీ తమ సిద్ధాంత వివరణ చేయవలసినదిగా ఆత్మీయం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను . ఇద్దరు రాజానకులు వేదికపై ఉండటమూ మన అదృష్టమే .

అభినవ గుప్తుడు -నా మాతృభూమి భారత దేశ శిరోలంకారమైన కాశ్మీరం అవటం నా అదృష్టం ..నేను క్రీశ 960 ప్రాంతం వాడిని . నా రచనలలో నా జీవితాన్ని రేఖా మాత్రంగా తెలియజేశాను .మొదటి గ్రంధం క్రమ స్తోత్రం మార్గ శిర బహుళ నవమి క్రీశ. 990 లో ను ,భైరవాష్టకం పుష్య బహుళ దశమి క్రీశ. 992 లో ,ఈశ్వ ప్రత్యభీఙ్ఞ వివృతి విమర్శ మార్గశిరమాస చివరి దినాన 1014 లో రాశాను .నేను 30 వ ఏటనే సాహిత్య వ్యాసంగం ప్రారంభించాను ..మా పూర్వీకులలో అత్రి గుప్తుడు అతి ప్రాచీనుడు ..కనౌజ్ పాలకుడు లలతా దిత్యుని శైవ వాజ్మయ పాండిత్యానికి ముగ్ధుడై తనతో కాశ్మీరానికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు .రెండు శతాబ్దాల తర్వాత  నేను కాశ్మీరం లో జన్మించానన్నమాట ..మాతండ్రిగారు నరసింహ గుప్తులు ..తల్లిగారు విమలమ్మ .ధార్మిక వాతావరణం లో ధన్యమైన కుటుంబం లో నేను పుట్టానని గర్వం గా చెప్పుకొంటాను .నా వాగ్ధాటి ,మేధో శక్తికి ఉపాధ్యాయులు నివ్వెర పోయేవారు . ఇదంతా శారదా దేవి కటాక్షం .చిన్నప్పుడే తల్లి చనిపోవటం ,మా తండ్రిగారు సర్వం త్యజించి సన్యాసం స్వీకరించటం తో నేను వివాహం చేసుకో కూడదని నిర్ణయించుకున్నాను  . కాశ్మీర్ లోను బయటా మహా పండితుల వద్ద క్రమ ,త్రిక ,కులపద్దతి సిద్ధాంతానే  కాక ,ఆచరణాత్మక యోగ పద్ధతులూ నేర్చాను ..యోగాభ్యాసం తో ఆత్మ శక్తులు సాధించాను . ఇప్పుడు వరుసగా మమ్మట ,కు0తక మహాశయులను తమ ప్రసంగాలను వరుసక్రంగా చేయవలసినదిగా కోరుతున్నాను .

మమ్మటుడు -అన్నగారు గుప్తుల వారివలెనే నేనూ కాశ్మీరమ్మ ఒడిలో పుట్టాను .నా గురించి నేను ఎక్కడా చెప్పుకోలేదు .కానీ పరిశోధకులు ఊరుకొంటారా ? ఎంతో శోధించి నేను 11 వ శతాబ్ది ఉత్తరార్ధం వాడినని సిద్ధాంతం చేశారు ..నేను రాసిన ‘’కావ్యప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం బహు ప్రశస్తి పొందింది .అది భారతీయ ఆత్మపై చెరగని ముద్ర వేసింది అంటారు విజ్ఞులు . దీనిపై  ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చి నన్ను మరవనివ్వలేదు .సంస్కృతం లో కావ్య ప్రకాశానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇంకా దేనికీ రాలేదని నిర్ధారించారు .నాకు రాజానక బిరుదునిచ్చారు  ..సంస్కృత ,ప్రాకృతాలలో అశేష పాండిత్యమూ ,వ్యాకరణం లో విద్వత్తునూ సాధించాను ..మాతండ్రి గారు జయ్యట పండితులు .నా తమ్ముళ్లు కైయట ,ఊవట లు .తమ్ముళ్ళిద్దరూ వేదాలకు వ్యాకరణానికి వ్యాఖ్యానం రాసిన పండితులు . పెద్ద తమ్ముడు కైయట మహాభాష్యానికి ,చిన్నతమ్ముడు ఊవట శుక్ల యజుర్వేద సంహితకు వ్యాఖ్యలు రాశారు .తమ్ములిద్దరూ నా వద్దే చదివారు .నేను కాశీలో విద్య నేర్చాను ..భోజమహారాజు దాతృత్వాన్ని గురించి ఒక శ్లోకాన్ని కావ్యప్రకాశంలో ఉదాహరించాను .మాతమ్ముడు  మాళవ దేశం లో ఉండటం వలన అది అక్కడినుంచి కాశ్మీరానికి చేరింది .

కుంత కుడు-నేనూ తల్లి కాశ్మీరు బిడ్డనే ..నాకాలం నేనూ చెప్పుకోలేదు .కానీ నన్ను క్రీశ 950-1050 ల మధ్య కూర్చోపెట్టారు .సంతోషం . కాశీతర్వాత గొప్ప సంస్కృత సాహిత్య కేంద్రం కాశ్మీర0 అవటం మాకు గౌరవం ..నా రచనలలో కాళిదాస ,భవభూతి ,హాలా ,బాణ మాఘ ,అమరు  ,మయూర ,శ్రీ హర్ష ,భట్టనారాయణ ,రాజశేఖర ,భామహా రుద్రత ఆనంద వర్ధనాదులను పేర్కొన్నాను ఆనాడే వర్ధనులవారిని ‘’ధ్వనికారులు ‘’అన్నాను .ఉదాత్తరాఘవాన్నీ ప్రస్తావించాను .నేను ‘’వక్రోక్తిజీవితం ‘’రాశాను .అధ్యాయాలను ఉన్మేషా లు అన్నాను . ప్రధాన సిద్ధాంతాలను కారికలుగా శ్లోకాలలో రాశాను . వాటికే వచనం లో వృత్తి అనే వ్యాఖ్యానం రాశాను . వృత్తి లో అనేక పద్యాలు ఉదాహారించాను . నా వక్రోక్తి సిద్ధాంతాన్ని వృత్తి సంపూర్ణంగా వివరిస్తుంది .వక్రత అంటే వైచిత్య్రం .ఉక్తి వైచిత్రమే వక్రోక్తి .వక్రోక్తి అల0కా రాలతో శోభించి హృదయాలను రంజి0పజేస్తుంది. ఇదొక అసాధారణ భావ ప్రకటన అన్నమాట .కావ్యలోకం లోనే ఇది కనిపిస్తుంది .దీన్ని వివిధ సిద్ధాంత కర్తలు వేర్వేరుగా నిర్వ చించారు .కొందరు అలంకారం లో భాగం అంటే మరికొందరు అలంకారాలు వక్రోక్తియే ఆధారం అన్నారు కావ్యానికి వక్రోక్తి ప్రాణం అన్నాను .కవిత్వా నికిది జీవం పోస్తుంది .కావ్యానికి జీవితమే వక్రోక్తి . అందుకే నా రచనకు వక్రోక్తి జీవితం అనే ప్రత్యేక మైన పేరు పెట్టాను .

అభినవ గుప్తుడు -మా కాశ్మీరు సోదరులం ఇలా ఒక చోట కలుసుకొనే మహద్భాగ్యం కలిపించిన సరసభారతి కి కృతజ్ఞతలు . 50 పైగా రచనలు చేశానునేను.  శైవాగమాలపై పంచికలు రాశాను శ్రీ పూర్వ శాస్త్రం ,స్తోత్రాలూ రాశాను ..నా రచనలు మూడు రకాలు .తాంత్రికం ఆలంకారికం ,తాత్వికం . నేను ముఖ్యంగా ఆల0కారి కుడను .అలంకారిక సమస్యలను చారిత్రిక ,విశ్లేషణాత్మక ,మనో వైజ్ఞానిక  తార్కిక ,తాత్విక దృక్పధాలనుంచి పరిశీలించాను .కళాప్రయోజనాలు ఆర్ష సిద్ధా0తమూ  చర్చించాను .నాటక ,కావ్య రచనలో వచ్చే అలంకార సమస్యలకే నేను పరిమితమయ్యాను .నాటక ప్రదర్శనలో సాక్షాత్కరించేది ,అనుభవించేది ఐన రసం ను పురస్కరించుకొని వచ్చే అలంకార సమస్యలను చారిత్రిక దృక్పధం నుంచి ప్రత్యేకించి పరిశీలించి నాకు ముందువారైనభట్ట లొల్లట  ,శ్రీశంకువు  ,భట్టనాయక రసం పై చెప్పిన ప్రసిద్ధ అభిప్రాయాలను ఉటంకించాను . లొల్లటు నిది ఆచరణాత్మకమైనా ,ప్రేక్షకుడిలో రసాను భూతి ఎలా కలుగుతుందో  చెప్పలేదు .కానీ తర్వాత వాళ్ళు ఆయనది భ్రమన్త సిద్ధాంతం అన్నారు . శ్రీ శంకుడు సిద్ధాంత దృక్పథ0 నుంచి అలంకార సమస్యను పరిశీలించాడు .ప్రధాన రసం గమ్యం అయితే మిగిలినవి గమకాలు .రసం పరోక్ష అనుకరణ అయితే మిగిలినవి ప్రత్యక్ష అనుకరణ -’’అనుకరణ రూపత్వదేవచ నామాంతరేణ వ్యాపదిష్టో రసాహ్ ‘’. అన్నాడు అభినవ భారతిలో శ్రీశ0కుడు  .

నేను అలంకార సమస్యను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించి నాటక ప్రదర్శనలో రసాను భూతికలిగించే వస్తువులను విశ్లేషించి ,దానిలో అంశీ భూతంగా ఉన్న అంశాలను బయటికి తీశాను ..రసాత్మక వస్తువు లోని భాగాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో నిరూపించాను . రసికుని వ్యక్తిత్వం సామాన్యునిలో ఎలా భేదిస్తుందో కూడా చెప్పను . రసాత్మక వస్తువుకు ,అనుభవం లో ఉన్న వస్తువుకు మధ్య తేడాను అంతరాన్ని విడమర్చి చెప్పాను .రసికుని వ్యక్తిత్వం అతని మానసిక ,భౌతిక పరిస్థితుల కారణంగా రసాను భూతికలుగుతుందని స్పష్టం చేశాను .ఈ విషయం లో భట్టనాయకుని అభిప్రాయాన్ని కాదన్నాను . సోదరులారా మీరు కొన సాగించండి .

మమ్మటుడు -నా కావ్య ప్రకాశం లో మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం .కావ్య నిర్వ చనం చెప్పి కావ్యభేదాలు తెలియజేసి కావ్య ప్రయోజనాలు ,కవి యోగ్యతలు స్పృశించాను సహజ సిద్ధ ప్రతిభ లేకపోతె కవిత్వం వెక్కిరింపుకు గురి అవుతుందని హెచ్చరించాను.  అలంకారాలతో నిండి గుణాలు కలిగి దోష రహితమైన శబ్దార్ధాల కూర్పుతో కవిత్వం రాయాలి అన్నాను .అలంకారాలు తప్పని సరికాదు . శబ్దార్ధాలు చక్కని పొందిక కలిగి ఉండాలి . స్వచ్ఛమైన కవిత్వానికి అలంకార బంధనాలనుంచి విముక్తికల్గించాను.  శబ్దార్ధ విచారణ తాత్విక చర్చగా చేశాను . అలంకార శాస్త్రం లో ఇలాంటి తాత్విక చర్చ కొత్త వ్యంజనానికి దారితీసింది .కవితాత్మ ధ్వని వ్యంజనమ్ పై ఆధారపడి ఉంటుంది .శబ్దానికి అభిదా ,లక్షణా ,వ్యంజనా అని మూడు రకాల శక్తులుంటాయి .

కుంతకుడు -వక్రోక్తి పై నావి మౌలిక భావనలు .శబ్దార్ధాల పోహళింపు ,కవి సృజనాత్మక భావన  కవితాయోగ్యతలు  కవిత్వ మర్యాద అంటే సాహిత్య ,కవి వ్యాపార ,గుణ ,ఔచిత్యాల ను  సుసంపన్నం చేశాను . భామహుడే  నా ప్రేరణ .వక్రోక్తి కావ్యానికి జీవితం అనే సిద్ధా0తం ప్రతిపాదించాను .వక్రోక్తి విచిత్రమైన భావ వ్యక్తీకరణ . ఈ వైచిత్రియే ఉచ్చస్తితికి తీసుకు వెడుతుంది .పదాలకు ,భావాలకు మరొక అభిప్రాయం కలిగించేది వక్రోక్తి . వైదగ్ధ్య  ఫణితి  లాగా అన్నమాట ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

సుందరకాండ లలితాసహస్ర పారాయణ ,గృహప్రవేశ ,కూచిపూడి రంగప్రవేశ వారం

24-7-17 సోమవారం -శ్రావణ మాసం ప్రారంభం .. న్యాయవాది నాటక సినీ నటుడు ,ప్రజాన్యాయ ఉద్యమ నిర్మాత సి వి ఎల్ నరసింహారావు తో యు ట్యూబ్ లో ఇంటర్వ్వ్యూ చూశాను ..ఆయన ఉద్దేశ్యం లో కొత్త చట్టాలు తేవక్కరలేదు . ఇంకో వంద యేళ్ళ వరకుకావలసిన చట్టాలు ఉన్నాయి వాటిని అమలు పరచటం లోనే సమస్య . ఆ చొరవ ప్రభుత్వం తీసుకొంటే చాలు .. అమలు అతి వేగవంతంగా జరగాలి . చట్టం పై భయం తో పాటు భక్తీ ఉండాలి . ప్రజలకు అవగాహన కల్పించాలి .లేబర్ కు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలూ కలిపించింది లాయర్లను వారికి ఏర్పాటు చేస్తోంది .. ఇది తెలియని చాలామంది సామాన్యులున్నారు .మా దగ్గర కొచ్చేవారికి ఈ విషయం చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసే న్యాయ వాదుల దగ్గరకు మేమె పంపుతున్నాము .మా దంపతులం కౌన్సిలింగ్ చేసి ఎన్నో కుటుంబాలను ఎందరో దంపతులను కాపాడాం .అన్నాడాయన .అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ . 20 వ శతాబ్ది అరుదైన మహా సంస్కృత విద్వా0సుడు  కపాలి శాస్త్రి గురించి గీర్వాణం -3 లో 381 వ కవిగా రాశాను .

 మంగళవారం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’సీరియల్ రాయటం మొదలు పెట్టాను .అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్   మెచ్చి చదువుతూ సలహాలతో మార్గ దర్శనం చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది .

బుధవారం -కాకినాడలో ఉన్న మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఏం బి బి ఎస్ కౌన్సెలింగ్  లో శ్రీకాకుళం ప్రయివేట్ మెడికల్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందని ఫోన్ చేసి చెప్పాడు .మా కుటుంబం అంతా చాలా సంతోషించాం .. ఆలంకారికులు 2 ,3 భాగాలు రాశాను .

 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అకస్మాత్తుగా రాజీ నామా చేసి లాలూ ముఠాను వదిలించుకొని ‘’కమలాన్ని’’ చేత ధరించి మళ్ళీ 6 వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు .చాణక్యానికి మించిన ఉదాహరణ .

27-7-17 గురువారం -శ్రీ సుందరకాండ 56 వ 9 రోజుల పారాయణ మొదటి రోజు ఉదయం 7-30 కు మొదలు పెట్టి 9-30 కి పూర్తి చేశాను రోజుకు ఒక శ్రీ సువర్చలాన్జనేయ శతకం కూడా చదవటం  మొదలు పెట్టాను . ఆలంకారికులు 4,5 భాగాలు రాశాను ..

28-7-17 శుక్రవారం -పారాయణ రెండవ రోజు పూర్తి చేశాను . మా అల్లుడి వద్ద వేదం నేర్చుకున్న శ్రీ నూకల రాంబాబు గారింట్లో నూతన గృహప్రవేశానికి వెళ్లాం . పురోహితుడు మా మంటాడ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో సుమారు 30 ఏళ్ళక్రిందట  ఉన్న పూజారి శ్రీ బలరామా  చార్యులే . ఇక్కడికి వచ్చి 27 ఏళ్ళు అయిందట . శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,వాస్తుహోమం కూడా చేశారు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు పెట్టి ఆశీస్సులు పొందారు రాంబాబు ఉషా దంపతులు . తర్వాత భోజనాలు -పూర్ణాలు ,గారెలు పులిహోర వంకాయ కూర పప్పు సాంబారు పెరుగు తో భోజనం . నేనుస్వీ టు పెరుగన్నం తో సరిపుచ్చుకున్నాను .

  సరసభారతి 105 వ సమావేశంగా లలితా సహస్రనామ పారాయణ

 రాంకీ దంపతులు ఈ మొదటి శుక్రవారం  రాత్రి 7 గంటలకు వాళ్ళ ఇంట్లో లలితా సహస్ర నామ పారాయణ చేస్తూ మా శ్రీమతిని మా అమ్మాయినీ పిలుస్తూ ‘’పోతు పేరంటాలు ‘’గా  నన్నూ రమ్మన్నారు .ముగ్గురం వెళ్లాం .భక్తిగా చేశారు .దీన్ని సరసభారతి 105 వ కార్యక్రమంగా అందరి అనుమతితో నిర్వహించాం . అనుకోకుండా ఇక్కడ కొందరు పరిచయమయ్యారు నామిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారి బంధువు లు శ్రీ దూర్వాసుల కామేశ్వరరావు దంపతులు శాస్త్రిగారి స్వ గ్రామం కృష్ణాజిల్లా కూడేరు లో వారి శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం లో నవగ్రహ ప్రతిష్ట చేశారట .కామేశ్వరరావుగారి భార్య రాంకీ భార్య శ్రీమతి ఉష కు అమ్మక్కయ్యే . ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న శాస్త్రి గారి రెండవ అబ్బాయి సుబ్రహ్మణ్యం కు ఆఫీస్ బాస్ . వీరుకాక  గండి గుంటవారైనా మహిళ ఉయ్యూరు శాసన సభ్యులు స్వర్గీయ శ్రీ అన్నే బాబూ రావు గారి మేనకోడలు .మరొకామె కెసిపి లో ఉద్యోగి కుమార్తె .ఇంకోరు చల్లపల్లి వారు .మరొకామె నాదెళ్ల అంజయ్యగారి మనవరాలు .తమాషాగా ఎలా కలిశారో ఆశ్చర్యమేసింది అందరం ఆనందించాం . పారాయణ తర్వాత అందరికి ఉపాహారం.  మహా రుచిగా ఉన్న పనస తొనలు  ప్రత్యేకం

 నేను సరస భారతి గురించి రెండుమాటలు చెప్పి షార్లెట్ లో రెండవ సమావేశమూ రాంకీ వాళ్ళఇంట్లో జరగటం దానికి ఆ దంపతుల తోడ్పాటుకు ధన్యవాదాలు చెప్పి ,,ఇందులో పాల్గొన్నవారంతా సరసభారతి సభ్యులే అని తెలియ జేశాను . తర్వాత లలితా సహస్రనామ విశేషాలు ,శ్రావణమాస ప్రాముఖ్యత క్లుప్తంగా 8 నిమిషాలలో చెప్పాను -దాని సారాంశం తెలియ జేస్తున్నాను -’

‘’లలితా సహస్ర నామాలలో శాస్త్రీయ దృక్పధం ఉంది .మహామేధావి శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధా0తం ఇందులో ఉంది ..పదార్ధం దాని శక్తి యొక్క ప్రతిక్రియవలన ఈ ప్రపంచం నడుస్తుంది . పదార్దానికి ,శక్తికీ భేదం లేదు .పదార్ధం శక్తిగా శక్తి పదార్థంగా మారుతుంది .శక్తి యొక్క స్థూల రూపమే పదార్ధం .పదార్ధం పరమశివుడైతే శక్తి పరమేశ్వరి .శివుడు శక్తి ఒకే  శక్తికి రెండు రూపాలు .ప్రతి పదార్ధం లోను శక్తి నిగూఢంగా ఉంటుంది .ఆ శక్తియే శ్రీ లలితా పరమేశ్వరి -’’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా -సా సా  సర్వేశ్వరీ దేవీ ,శక్తిమంతో మహేశ్వరః ‘’అన్నారు .భండాసురుడు  మొదలైన రాక్షసులు జడత్వానికి అజ్ఞానానికి ,బద్ధకానికి ప్రతీకలు .జడత్వం వదిలే దాకా వాళ్లకి వాళ్లలో ఉన్న శక్తి తెలియదు ఆ శకినీ శ్రీ మాత అంటాం .జడత్వాన్ని సంహరించి చైతన్య జ్ఞాన ప్రకాశం కలిగిస్తుంది ..లోపలి శక్తి మేల్కొనాలి అంటే సాధన చేయాలి .. లలితా సహస్ర పారాయణ చేస్తే అమ్మవారు మనల్ని చెయ్యిపట్టుకొని ముందుకు నడిపిస్తుంది .చైతన్య యాత్ర చేయిస్తుంది .ఈ సహస్ర నామాలలో చివర పరమేశ్వరి శివుని అభిన్న  రూపంగా తాదాత్మ్యం చెందుతుంది .లలితా రూపం లోజగదాంబ దర్శన  మిస్తుంది ..ప్రతినామం ఒక మజిలీ . .లలితా స్తోత్రం అంటే శ్రీదేవి దివ్య విభూతి ,విజ్ఞాన సర్వస్వము .ఈ భావాలు అర్ధం చేసుకొని పారాయణ చేస్తే అలౌకిక ఆనందం కలిగి మోక్షం కలుగుతుంది .

   ‘’ఇప్పుడు శ్రావణ మాసం విశేషాలు తెలుసుకొందాం .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్ననెల  శ్రావణ మాసం విష్ణు మాసం .ఈ నెలలోనే విష్ణువుఉద్భవించాడు .ఈ మాసం లోనే బ్రహ్మ మొదటిసారి విష్ణు సందర్శనం చేశాడు .తిరుమలలోని గోవిందుడూ ఈ నెలలోనే వెలుగు చూశాడు .శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమి లేక గరుడ పంచమి అంటారు . గరుత్మంతుడు తన తల్లి వినతాదేవి బానిసత్వాన్ని పోగొట్టిన రోజు .తానూ విష్ణువుకు వాహనమైన రోజు .గరుడ పురాణం ఆవిర్భవించిన రోజు కూడా పంచమి తిథినాడే .

 శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రాది ఏకాదశి .మొగ  సంతానం కోసం నోములు నో స్తారు . గొడుగులుదానం ఇస్తారు ..ద్వాదశి దామోదర ద్వాదశి .విష్ణువుకు ప్రీతికరం .త్రయోదశి చతుర్దశి శివ పార్వతుల పూజ చేస్తారు .శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పున్నమికూడా .హయగ్రీవుడు వైఖానస ముని జన్మించిన రోజు . .సంతోషిమాత అవతరించిన రోజుకూడా .ఈ రోజుననే అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామం బోధించాడు .

 శ్రావణ బహుళ చవితి సంకష్ట హరణ  చతుర్థి .అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి . .శ్రావణ అమావాస్య పో లాల అమావాస్య .

 కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలూ శ్రావణ గౌరీవ్రతం ప్రతి మంగళవారం చేసి వాయినాలు ఇస్తారు .తమకు దీర్ఘ సుమంగళీత్వం లభించాలని చేసే వ్రతం ఇది . పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం . ఇన్ని విశిష్టతలున్న మాసం శ్రావణమాసం .అందరికి శుభాలు కలిగించాలని ఆ జగదేక మాత ను ప్రార్ధిద్దాం .

29-7-17 శనివారం -కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశం

సాయంత్రం 5 గంటలనుండి 8-45 వరకు కమ్యూనిటీ హా ల్ లో కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశానికి వెళ్లాం .. ఈమె గురువు శ్రీమతి మాడభూషి పల్లవి . 7వ ఏటనుంచే నాట్యం అభ్యసించింది . గణపతి  ప్రార్ధన ,వాణీ పరాకు లతో ప్రారంభించి కొలువైతివా రంగ సాయి అనే స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి విప్రనారాయణ సంగీత నాటకం లో రాసిన దాన్ని అభినయించింది .తర్వాత గోవర్ధన గిరిధార చేసింది .6 గంటలకు విరామం -బిస్కట్లు శ్వీట్లు వగైరాలు టీ .మళ్ళీ 6-15 కు ప్రారంభం .అంబాష్టకం ,తర్వాత కొలువై ఉన్నాడే ,చేసింది అన్నీ రాగమాలికలే  కురవంజి రాగం లో ముద్దుగారే యశోదా అన్నమయ్య కీర్తన చేసింది .చివరికి కుంతలవరాలి రాగం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ  తిల్లానాతో రాత్రి 8-45 కు పూర్తి చేసింది . తర్వాత రెండు స్వీ ట్లు పప్పు కూర చపాతీ  బిర్యానీ వగైరాలతో మంచి విందు హాజరైన దాదాపు 300 పై జనాలకు ఆత్మీయంగా ఏర్పాటు చేశారు నేను రెండు  స్వీట్లు  ‘’కరుడన్నం’’ తో సరిపెట్టుకున్నా .

 బాగానే చేసింది కానీ నృత్యం ఆత్మ కనిపించలేదు .అన్నమయ్య గీతం లో రతికేళీ రుక్మిణి దగ్గర మంచి హావ భావాలు చూపించింది .పెద్ద వెలితి ఏమిటి అంటే కాలికి గజ్జలు కట్టలేదు ఆ సవ్వడి లేకపోవటం తో మొత్తం ప్రోగ్రామ్ తేలిపోయింది అనిపించింది . అమెరికాలో మేము చూసిన రెండవ  రంగ ప్రవేశమిది .2002 లో మొదటి సారి అమెరికాకు హూస్టన్ కు వచ్చినప్పుడు మా బంధువు శ్రీమతి వావిలాల లక్ష్మిగారు మా ఇద్దరినీ  రైస్ యూనివర్సీటీలో  నాసాలో పని చేసే ఆంధ్రా దంపతుల అమ్మాయి  రంగ ప్రవేశానికి తీసుకు వెడితే చూసాం .చాలా బాగా చేసింది . .అక్కడే జానప ద గాయని శ్రీమతి అనసూయ (కృష్ణ శాస్త్రిగారి మేనకోడలు )గారమ్మాయి శ్రీమతి రత్నపాప గారిని అనసూయగారినీ మొదటి సారి చూసి మాట్లాడాం . ఒక రకం గా బంధుత్వం ఉంది . మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అనే జె వేలూరి కూతురు వీణ రెండేళ్లక్రితం కాలిఫోర్నియాలో ఇలాగే కూచిపూడి రంగ ప్రవేశం చేసింది . మా అమ్మాయి షార్లెట్ నుంచి వెళ్లి చూసి వచ్చింది . ఈ వారం వీక్లీ కి సమాప్తం పలుకుతూ సెలవ్

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -6

ఆలంకారిక ఆనంద నందనం -6

ఆనంద వర్ధనుడు -రామాయణ ,భారతాలలో ,కాళిదాస శకుంతల వంటి నాటకాలలో సౌందర్యం ఉన్నా ,అందులోని లక్షణాలను విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేసినవారు లేరు .సిద్ధాంతకర్తలు తమ పద్యాలనే సౌందర్యానికి ఉత్తమ ఉదాహరణలుగా తెలుపు కొన్నారు .నేను దీన్ని తిరస్కరించి నా  గ్రంథం అ0తా  కవితా సౌందర్య లక్షణాలను ,ఎన్నో సంస్కృత మహా కావ్యాల ను విశ్లేషించి నిరూపించే ప్రయత్నం చేశాను .సౌందర్య తత్వ మూల సూత్రాన్ని సహృదయులే గ్రహించ గలరనేది నా ప్రగాఢ విశ్వాసం ..

  నేను ఈ విధంగా గ్రహించిన మూల సూత్రమే ‘’ధ్వని ‘’దీన్ని మహా కావ్యానికైనా  చిన్నదైనా గీతానికైనా సమాన బలం తో వర్తింప చేయవచ్చు అపరిమితమైన వివరాలకు అందులో ఆస్కారం ఉంది . కవిత్వ విలువలకు అంచనా కట్టటానికి ధ్వని బాగా ఉపయోగ పడుతుంది .పోలికలు భేదాలుచూపించటం ద్వారా కవిత్వాన్ని ఇతర ప్రక్రియలనుంచి వేరు చేసి చూపిస్తుంది.  తర్కం ,శబ్దార్ధ సంబంధ శాస్త్రం  భాషా శాస్త్రాలలో నిష్ణాతులనుకూడా సంతృప్తిపరచచే సమగ్రమైన శాస్త్రం అయింది విజ్ఞాన శాస్త్ర తర్క శాస్త్ర మూలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో దానికి సమానమైన స్థానం కళకూ ,కవిత్వానికీ ఉందని నిరూపించటం లో ధ్వని సిద్ధాంతం విజయం సాధించింది . ఇంతకు  పూర్వమే ఉన్నసౌందర్య లక్షణాలుగా వర్గీక రింప బడిన అలంకారాలు ,గుణాలు ,మొదలైన వాటిని తోసి రాజు అనకుండా వాటినీ ఈ సిద్ధాంతం ఆకళింపు చేసుకొన్నది .విమర్శకుడు మాత్రం తన విశ్లేషణలో వాటిని విడదీసి చూడటం అనివార్యం . వామన విష్ణు స్వరూపా వామనా ,,చందోలంకార రాజాశేఖరా  వరుసగా మీ మాటలు వినిపించండి .

వామనుడు -నేను ప్రస్తావించిన రీతి గురించి ‘’తగురీతి’’గా తెలియ జేస్తాను .రీతిరాత్మా కావ్యస్య ‘’అని ఘంటాపధంగా చెప్పాను .కావ్య శరీరానికి ఆత్మరీతి మాత్రమే  .రీతులు మూడు రకాలు వైదర్భి కోమలమైంది .గౌడీ సమాసాలతో పరుషాక్షరాలతో ఉంటుంది .పాంచాలీ రీతి ఈ రెండిటి మిశ్రమ రూపం .ఆ కాలం లో ఆ ప్రదేశాలలో శైలిని బట్టే రీతులకు ఆ పేర్లు  వచ్చాయి . వైదర్భీ రీతిలో కావ్య దోషం కొంచెం కూడా ఉండదు .మాధుర్య ,ప్రసాద మొదలైన 10 గుణాలు ఉంటాయి వైదర్భీ రీతి కాళిదాసుని శైలి ఉత్తమ ఉదాహరణ ..గౌడీ రీతిలో దీర్ఘ సమాసాలు  శబ్దా డంబరం ఎక్కువ .దీనికి కాంతి ,ఓజస్సు అనే రెండు గుణాలుంటాయి  భవభూతిశైలి దీనికి ఉదాహరణ .భవభూతి ఒకే పద్యం లో శ్రీరాముడు శివుని విల్లు విరవడం ,దాని ఫలితంగా చెవులు బ్రద్దలయ్యే ధ్వని రావటం వర్ణించాడు పదాలు విల్లు విరిగే ట ప్పుడు వచ్చే శబ్దాన్ని ప్రతిధ్వనిస్తాయి దీర్ఘ సమాసాలు వాడటం ఆయనకిష్టం .మూడు సమాసాలతో మూడున్నర వాక్యాలు రాశాడు . 19 మాత్రలతో ‘’శార్దూలం ‘’పై ‘’క్రీడిం’’చాడు .పాంచాలీ రీతిలో మాధుర్య ,మృదుత్వ గుణాలతో పై రెండిటికి మధ్యస్తంగా ఉంటుంది .పటం  పై రేఖలు ముందుగీసి తర్వాత చిత్రం తయారు చేసినట్లు ఉంటుంది .కవిత్వం ఈ మూడింటిలో దేనికో ఒక దానికి చెంది ఉంటుంది .. కవికి వ్యాకరణ నిఘంటు ఛందస్సు కళలు ,శృంగార రాజనీతులలో పాండిత్యం తో  కూడిన లోకజ్ఞానం ఉండాలి . వీటినే కవితా సామాగ్రి అన్నాను . ఇతర మహాకవుల రచనలతో పరిచయం ఉండాలి .పద్యరచన నిష్ట తో చేయాలి . జ్ణాసంపన్నులను సేవించాలి పదాలను చేర్చేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచనతో చేయాలి . ఏకాగ్రత అన్నిటికన్నా ముఖ్యం భావనా  శక్తి  పుష్కలంగా ఉండాలి . స్వయం సిద్ధమైన శక్తివంతమైన లోపల దాగి ఉన్న ప్రతిభయే భావనా శక్తి .

రాజశేఖరుడు-వాత్సాయన కామ శాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం ఆదర్శంగా కావ్య మీమాంస రాశాను ఇతర రచయితల అభిప్రాయాలను క్రోడీ కరించి చేర్చాను .కవులకు సమాచార దర్శిని గా కావ్య మీమాంస ఉండాలన్నదే నా అభిప్రాయం ..తమాషాగా నేను కావ్య పురుషుడిని వర్ణించి ఆయనకు సాహిత్య విద్య అనే కన్యనిచ్చి విదర్భలో వత్స గుల్మ లో పాణిగ్రహణం చేశానని చెప్పాను .కవికి కావాల్సిన అర్హతలు ,ప్రతిభా పాండిత్యాలు ,వృత్తుల ,రీతుల స్వభావం,కవిత్వానికి ఆధార సామగ్రి ,ప్రాచీన గ్రంథాలనుండి ఎలా విషయం సేకరణ చేయాలో ,అది అనుకరణగా ఎప్పుడు దిగజారుతుందో ,కవి సంప్రదాయాలు ఎలా ఉంటాయో ,దేశం లోని పర్వత నదీనదాలు వాటి ప్రత్యేకతలు ,ఋతువులను ఎలా వర్ణించాలి ,చెట్లను లతలను పక్షులను ఏయే రుతువులలో ఎలా వర్ణించాలో అన్నీ రాసి కరతలామలంగా చేతిలో పెట్టాను .ఇప్పుడు మీరు గైడ్ అంటారే అలా రాశాను . ఒక రకంగా మార్గదర్శి యైన గైడ్ ను కూడా అయ్యానేమో .

 ఆనంద వర్ధనుడు -సౌందర్యం అనేక కోశాల చేత కప్పబడి ఉంటుంది .బయటికి కనిపించేది తక్కువ ప్రాధాన్యం కలది పైకి స్పష్టంగా కనిపించే బాహ్య సౌందర్యం లోపలి సౌందర్య సారమైనసారం అయిన రసానికి సరైన మాధ్యమం అయితేనే దానికి విలువ ఉంటుంది లయాత్మక ప్రక్రియ వలన రూపానికి ,భావ చిత్రం వలన వస్తువుకు శోభకలగవు .సౌందర్యాన్ని పెంచేది అలంకారం ,గుణం ,రీతి ,వృత్తి . అంతరాంతరాలలోకి దూసుకు వెళ్లి రసాత్మను స్పృశించాలి .బాహ్య అందాలను ఏ పండితుడైనా గ్రహించగలరు .కానీ కవిత్వాన్ని .సాహిత్య రూపాల నుంచి వేరు చేసి ప్రత్యేక లక్షణమైన రసాన్ని అర్ధం చేసుకోవాలన్నా ,వివరించాలన్నా రసికుడికే సాధ్యం ..మిగిలిన విషయాలు తరువాత చెబుతాను .లేకపోతె మోతాదు మించిపోవచ్చు .సోదరులారా ఇక మీ వంతు –

వామనుడు -విజ్ఞులైన విమర్శకులకు ఆహ్లాదం కలిగించే ఉత్తమ కవిత్వానికి లక్షణాలు చెప్పాను ..కవులు దోషాలు,అవి  లేకపోవటం ,గుణాలు అలంకారాలు ఉండటం  .కవులు గుణాలు  స్వీ  కరించి దోషాలు పరిత్యజించాలి .దోషాలు చాలా ఉంటాయికనుక గుణాలతోపాటు దోషాలనూ ఎక్కువగానే చర్చించాను . సూక్ష్మ దోషాలనూ తెలియజేశాను .గుణాలు  అలంకారాలు కావ్యగుణాన్ని పెంచుతాయి .అనటాన్ని నేను ఒప్పుకోను .రెండూ వేర్వేరు .’కావ్య శోభయాహ్  కర్తారో గణాః తదతిశయ హేతవ స్త వాలంకారః పూర్వే నిత్యా ‘’అంటే గుణాలు కవిత్వానికి స్వాభావిక సౌందర్యానికి కారణాలు .అవి అందుకే అనివార్యంగా నిత్యముగా ఉండాలి అల0 కా రాలు కావ్య సౌందర్యాన్ని వృద్ధి చేస్తాయన్నమాట నిజమే .అంతమాత్రం చేత తప్పని సరికాదు .గుణాలతో సహజ సౌందర్యం ఉన్న కన్నెపిల్ల ఆభరణాలతో  మరింత  అందంగా ఉన్నట్లు అన్నమాట ..

రాజశేఖరుడు -నా కావ్య మీమాంస సాధారణ ఛందో శాస్త్ర గ్రంధాలవంటిదికాదు ఛందో శాస్త్రం లో చాలా అరుదుగా కనిపించే అనేక విషయాలు రాశాను .అలంకార శాస్త్రం పై నాకు ఎక్కువ గౌరవం ఉంది .అది వేదాలలో 7 వ అంగం .దాని సహాయం లేకపోతె వేదపాఠాల పూర్తి అర్ధం తెలియదు నా ఉద్దేశ్యం లో సాహిత్య విద్య 5 వ విద్య .మనకు సాంప్రదాయంగా వచ్చే విద్యలు నాలుగు -వేదాలు వ్యవసాయ వాణిజ్యాలు ,రాజనీతి ,తత్వ శాస్త్రం .ఇవి ఎంతముఖ్యమో అలంకార శాస్త్రమూ అంతముఖ్యమే .అందుకే 5 వ విద్య అన్నాను .నేను రాజా దర్బారులో జరిగే సాహిత్య గోష్ఠులు ,కవి దిన చర్య ,అతని పఠన మందిరం ,రాత సామాగ్రీ గురించి ఆసక్తికరంగా చెప్పాను .కవయిత్రుల ప్రతిభను కూడా నిర్ణయించి వారికీ గౌరవం కల్పించాలని చెప్పాను .సాహిత్య పరీక్షలు నిర్వహించి ఉత్తములను ఎంపిక చేసి బ్రహ్మ రధంగా ఊరేగించాలని రాజులకు హితవు చెప్పాను .మహాకవులైన కాళిదాసు ,మెంధ ,అమర ,భారవి మొదలైన వారిని పరీక్షించి సన్మానించారు .అలాగే శాస్త్ర కారులైన ఉపవర్ష ,వర్ష ,పాణిని ,పింగళ ,వ్యాడి ,పతంజలి వంటివారిని పాటలీ పుత్రం లో పరీక్షించి నిగ్గు తేల్చారు ..నా అభిప్రాయాలను ,ఇతర అభిప్రాయాలను బలపరచటానికి విస్తారంగా పద్యాలు ఉదాహరించాను .. ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదు .సెలవు .

ఆనంద వర్ధనుడు -రాజా శేఖరులవారు తమ అమూల్యాభిప్రాయాలను స్పష్టంగా క్లుప్తంగా తెలియ జేసినందుకు ధన్యవాదాలు .. రస స్వభావం దాని అంతరాత్మ తప్ప వేరేదీ కాదు కానేరదు . రసం మనసుకు కలి గించే ఆనందాను భూతి . అది కవి సృజనను ప్రేరేపిస్తూ ,భావనా శక్తి కల విమర్శకుడి మనసును రంజింప .కవితా సౌందర్యానికి కారణం ఫలితం కూడా అదే .రసికుడు భావించి అనుభవించేవరకు రసం అనేది ఉండదు .

  నేను చెప్పిన ముఖ్య విషయం ధ్వని .అది మెరుపులా వచ్చే స్ఫూర్తి .’’అక్షరం ,పదం ,సర్వనామం ,సమాసం ,వాక్యం  కావ్యం లలో దేనిలోనైనా రసం యొక్క సౌందర్యం మెరుపులా తటిల్లున వ్యక్తమైనది ధ్వని అని నేను నిర్వచించాను .ధ్వని ఉవ్వెత్తున పైకి లేచినపుడు రసాన్ని ప్రత్యక్షం చేయటానికి ఉపయోగించే ఆధారభూమి సామాన్య భాష ,సామాన్య అర్ధం .రసధ్వని గుణాలను అలంకారాలను త్రోసిపుచ్చదు .శబ్దార్ధాల సొగసుల్ని తనలో విలీనం చేసుకొంటుంది . రస స్పందన లేకపోతె మిగితావేవీ రాణించవు . ప్రతి భాణా 0శమూ వ్యంజకమే అంటే రసాన్ని అభి వ్యక్తం చేసేదే . వ్యంజకం అంటే వెల్లడించేది అని అర్ధం కనుక ఇది శ్రేష్ఠమైన వ్యంజకం అవుతుంది ..భాషకు అతీతంగా వెల్లడి అయ్యే క్రియ ధ్వని .ఇప్పుడు వామనుల వారి అభిప్రాయం విందాం .

వామనుడు-శబ్ద ,అర్ధ అలమాకారాలను నేను చర్చించాను .యమక ,అనుప్రాస లనే నేను చర్చించాను .వీటిని అతిగా వాడద్దు అని చెప్పాను ఉపమా ప్రపంచం రాశాను రూపక వక్రోక్తిలను వివరించాను .రూప చిత్రణను నిదర్శనాలంకారం అన్నాను .అయిదవ అధికరణ లో కవి ప్రయోగాలు  చెప్పే ప్రాయోగిక రాశా .ఒకే పదాన్ని రెండు సార్లు వాడరాదని సంధినియమాల జాగ్రత్త ,పద్యపాదం మొదట్లో ‘’ఖలు ‘’వంటి పదాలు వాడొద్దని హితవు చెప్పాను ..కవిత్వం లో ముఖ్యాంశం సౌందర్యమేనని మొదట చెప్పింది నేనే . ఇంతకంటే చెప్పాల్సినది లేదని తెలియజేస్తూ సెలవు .

 ఆనంద వర్ధనుడు -సోదరులిద్దరూ కాడి నాపై పడేసి భారం దించుకొన్నారు ..రస ధ్వని ఉంటేనే కావ్యం అన్నాను .కానీ తర్వాత కొంత సడలించి .బహురూపి అయినా రసమే ధ్వనికి ఆత్మఅనే నేను నమ్మాను .ధ్వని ప్రధాన వ్యంగ్యంగా ,గుణీ భూత వ్యంగ్యంగా రెండురకాలుగా ఉంటుంది .అంటే కవితా చిత్రణలో ధ్వని అందానికి సహాయ భూతంగా ఉంటుంది . వాల్మీకి కాళిదాసులు మొదటి దానికి ప్రతినిధులు .బాణుడు మాఘుడు రెండవ దానికి ప్రతినిధులు ..సౌందర్యోన్మీ లన స్వభావం రసం యొక్క సృజనాత్మక స్పందన మాత్రమే అని మరొక్క సారి తెలియ జేస్తూ మా ముగ్గురకు మీతో ముచ్చటించి మా హృదయకవాటాలు విప్పి మా సిద్ధాంతాలు తెలియజేయటానికి అవకాశం కలిగించిన సరసభారతి శ్రద్ధగా విని జయ ప్రదం చేసిన శ్రోతృ మహాశయులకు ధన్యవాదాలు తెలియ జేస్తూ సెలవ్ .

 వేదిక ను సుసంపన్నం చేసిన పెద్దలారా సోదరులారా .గొప్ప అదృష్టవంతులం మనం .ఇంతటి ఉత్కృష్ట సిద్ధాంత కర్తలు మన మాట మన్నించి ఈ ప్రత్యేక కార్యక్రమ0 లో పాల్గిని అమూల్య విషయాలు చెప్పినందుకు విన్న మీకు కృతజ్ఞతలు .ఒక్కసారి ఈ ముగ్గురు చెప్పిన విషయసారాంశం మీ ముందు ఉంచుతాను –

 విమర్శనాత్మక పరిశీలన చేసి విలువ కట్టటానికి కావలసిన ప్రమాణాలు మొట్ట మొదటి సారిగా చెప్పిన వాడు ఆనంద వర్ధనుడు .కవిత్వ విమర్శలో రసానికి సంబంధిన విధానం ఔచిత్యం ఒక్కటే అన్నాడు స్పష్టంగా .సౌందర్య శాస్త్రానికి సంబంధం లేని ప్రమాణాలనుంచి ఆయన అలంకార శాస్త్రానికి విముక్తి కలిగించాడు .అలంకారిక ఔచిత్యం అనే ప్రమాణానికి కట్టుబడి ఉంటె ,నైతిక ప్రమాణాలను ఉల్లంఘించిన రసాభాసం కూడా సుందరంగా ఉంటుంది అంటూ నైతిక నిర్ణయాలను దాటి ఆమోదం తెలియ జేశాడు ..ఆనంద వర్ధనుడు మౌలిక ప్రతిభకల మేధావి సౌందర్య భావనలో అన్ని ముఖ్యాంశాలను లోకం దృష్టికి తెచ్చిన మొదటి ఆలంకారికుడాయన .ఆయన సృజనాత్మక ఆలోచనా విధానం నేటికీ ఆసక్తి కలిగిస్తోంది ..తార్కిక ,వ్యాకరణ ,వాక్య నిర్మాణ రీతులను అధిగమించి కవిత్వం సంతరించుకొని ధ్వనిని ,దాని ఉవ్వెత్తున లేచే శక్తిని ఆనాడే వర్ధనుడు గ్రహించాడు అభినవ గుప్తుడు మరింత స్పష్ట పరచాడు .భామహా దండి ల అలంకారవాదం వామనుని రీతి వాదం లను కూడా సమన్వయ పరచిన సహృదయ ఆలంకారికుడు ఆనంద వర్ధనుడు . ధ్వని ధ్వని అని చెవుల్లో మార్మోగేట్లు చెప్పి అందులోని అలోకిక ఆనందాన్ని  బ్రహ్మానంద  సహోదరత్వాన్ని  చెప్పిన మౌలిక సిద్ధాంతకర్త పేరుకు సార్ధకత తెచ్చినవాడు ఆనంద వర్ధనుడు .

 వామనుడు అలంకార గ్రంథ కర్తలలో సూత్ర శైలిని ఆశ్రయించిన మొట్టమొదటివాడు . భావాలను సూటిగా సుత్తిలేకుండా చెబుతాడు . వృధా చర్చల జోలికి వెళ్ళలేదు సాంకేతిక విషయాలనూ సులభ సుందర శైలిలో చెప్పి హృదయానికి దగ్గరకు చేర్చాడు .కవులు రెండురకాలని మొదటివారు ‘’అరోచ కినాః ‘’అంటే ఎక్కువ శ్రద్ధ లేనివారు అంటే తృప్తి చెందని అభిరుచికలవారు అని రెండవవాడు ‘’సత్ర నాభ్యవహా రినా ‘’అంటే దేనినైనా తినగలిగేవారు అంటే ఏ రకమైన రచనయైనా చేయగలిగే వారు ..మొదటి రకం వారు వివేకులు విచక్షణా జ్ఞానమున్నవారు కానుక వారికి బోధించవచ్చు రెండవవారు అవివేకులు విచక్షణా జ్ఞానం లేనివారు .వీరికి చెప్పటం వ్యర్థం .కవికి ఏ కాగ్గతకావాలని మనసును అంతర్ముఖం చేసినప్పుడే వాస్తవమైన అంతరార్ధాన్ని గ్రహించగలడ ని వామన ఉవాచ .చిత్రకళాభిమానికనుక కవిత్వ లక్షణాలను చిత్ర కళతో పోల్చి అందంగా చెప్పాడు .. సాహిత్య వ్యక్తీకరణలో అనేక అంశాలు లక్షణాలు విశ్లేషించి విమర్శించి తనకున్న ఉత్తమ కళాభి రుచిని వ్యక్తం చేశాడు వామనుడు . కవిత్వ నిర్మాణం అనే సమైక్య సత్యం యొక్క లక్షణాలను అధ్యనానం చేసిన వాడు వామనుడు .కావ్యం యొక్క ఆత్మను గురించి మొదట చెప్పినవాడు వామనుడే . .కావ్యానికి గుణాలవల్ల సౌందర్యం కలుగుతుందన్న సౌందర్య వాది . ‘’కావ్యం గ్రాహ్య మాలంకారాత్ ‘’అంటూ గ్రంధం ప్రారంభించి సౌందర్య విశ్వరూపాన్ని చూపినవాడు వామనుడు

  రాజా శేఖరుడు ఉదహరించిన పద్యాలలో విలువైన సమాచారం ఉంది.  ఒక పద్యం ద్వారా పైశాచి అనే ప్రాకృత భాష అవంతీ అబూ పర్వత  ప్రాంతం ,మాండ్ శోర్ ప్రాంతాలలో మాట్లాడే వారని  తెలుస్తోంది .అలాగే గుప్త చరిత్రలో రామ గుప్తుని వృత్తా0త  విషయాలు తెలియ జెప్పే పద్యం ఒకటి ఉంది ఇంకెక్కడా రామ గుప్తుని ప్రస్తావన లేదు ..ఆయన రాసిన కావ్యమీమాంస లో కొద్దిభాగమే దొరికినా ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన సాధారణ జ్ఞానం ,అలంకార శాస్త్రానికి చెందిన విశేష జ్ఞానం దీనివలన గొప్ప సంపదగా మనకు లభించింది . భార్య అవంతీ సుందరి చెప్పిన’’ రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యంగా పరిగణించాలి ‘’అన్నమాటను సమర్ధించి ‘’రసకవియే ఉత్తమకవి ‘’అని నిర్ధారణ చేసి తానూ రాశావాదినే అని పించుకొన్నవాడు రస ట్రాజ శేఖరుడు .

 మరొక్కమారు ఈ ముగ్గురు మేధావులకు కృతజ్ఞత తెలుపుతూ రెండవ సమావేశాన్ని ముగిస్తున్నాము . మూడవ ప్రత్యేక సమా వేశం లో మరికొందరు ఆలంకారికులతో ముచ్చటింపజేద్దాం అంతవరకూ సెలవ్ .

 సశేషం

 మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లలితా సహస్రనామ పారాయణ

సరసభారతి 105 వ సమావేశం గా 28-7-17 శుక్రవారం రాంకీ గృహం లో లలితా సహస్రనామ పారాయణ

-దుర్గాప్రసాద్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -5

ఆలంకారిక ఆనంద నందనం -5

సరసభారతి సాహితీ బంధువులకు ‘’అలంకారిక ఆనంద నందనం ‘’రెండవ ప్రత్యేక సమావేశానికి స్వాగతం . మొదటి సమావేశం అర్ధవంతంగా మీ అందరి సహకారం తో రస సిద్ధాంతకర్త  భరత ముని ,అలంకార ఆవిష్కర్త భామహా ,గుణా విష్కర్త వచన వాచో విధేయుడు దండి మహాశయులు తమ హృదయాలను విప్పి మనకు ఆనందనందన అనుభూతిని కలిగించారు .ఈ రెండవ సమావేశానికి ధ్వని సిద్ధాంతకర్త ఆనంద వర్ధనాచార్యులవారిని ఆధ్యక్షం వహించి తమ సిద్ధాంత వివరణ చేయవలసినది గా ,వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తూ  రీతి సిదాంతకర్త వామనులను ,ఛందశ్శాస్త్ర వేత్త రాజశేఖరులను తమతమ సిద్ధాంతావిష్కరణ చేయవలసినదిగా వేదిక నలంకరించవలసినదిగా  ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాను .

ఆనంద వర్ధనుడు -చాలా మంచి కార్యక్రమం సరసభారతి నిర్వహిస్తున్నందుకు అభినందనలు . నా ధ్వని .సిద్ధాంతాన్ని ఏమాత్రం సవ్వడి అంటే ధ్వని చేయకుండా సావధాన చిత్తులై ఆలకించమనవి ..నేను కశ్యప మహర్షి ప్రదేశం ,శారద దేశం .అయినకాశ్మీర దేశ వాసిని .క్రీశ. 9వ శతాబ్ది ప్రథమార్ధం వాడిని కవితా సౌందర్య రహస్యాన్ని ఆకళింపు చేసుకోవటానికి ఉపయోగపడే ధ్వన్యాలోకం అనే గ్రంధం రాశాను .రసజ్ఞుడనని సాహిత్య విమర్శకులలో ప్రజ్ఞావంతుడనని అంటారు అది అభిమానం తో అనేమాట ..నేను శ్లోక రూపం లో రాసిన వాటిని కా రిక లు అన్నాను  .వీటికి వచనం లో ఇచ్చిన వ్యాఖ్యానాన్ని వృత్తి అంటారు .ఈ రెండిటినీ నేనే రాశాను సందేహం లేదు .బుద్ధి కుశలతో విమర్శించటం ,కవిత్వాన్ని సరిగా అవగాహన చేసుకోవటం కొద్దీ మందికే సాధ్యమైన విద్య అన్నాను ..వ్యాకరణ పాండిత్యం నిఘంటు పరిచయం ఆ సామర్ద్యాన్నివ్వదు . విమర్శ సృజనాత్మక విద్య .విమర్శించే నేర్పు అసాధారణమైనది .నిజానికి ఈ రెండూ ఒకే శక్తికున్న రెండు రూపాలు . ఆదర్శ విమర్శకుడికి భావనాశక్తి అంటే ప్రతిభ ,రసజ్ఞత సామాన్య లక్షణం అందుకనే ఆదర్శ విమర్శకుడిని సహృదయుడు ,రసికుడు అంటారు .కవి కావ్యాన్ని సృష్టిస్తే ,విమర్శకుడు తన భావనా శక్తితో దాన్ని పునర్నిర్మిస్తాడు .కనుక అభిరుచి ఉన్న సహృదయులు మాత్రమే కావ్యాత్మను అవగాహన చేసుకొని దాని అందాన్ని విశ్లేషించగలుగుతారు ..కవితా సౌందర్య చర్చలో వేదాంతులకు స్థానం ,వాదించే అర్హత ఉండదు… అందుకే నా ధ్వన్యాలోకానికి ‘’సహృదయ లోకం ‘’అనే పేరు . .నా తర్వాత ప్రసంగాలు వరుసగా చేయవలసిందిగా వామన ,రాజశేఖర సోదరులను కోరుతున్నాను .

వామనుడు – ఆనంద వర్ధనులు అదక్షతన జరిగే ఈ అలంకారిక సభలో పాల్గొనటం నా అదృష్టం .నేనుకూడా కాశ్మీర శారదా దేవి అనుగ్రహ పాత్రుడనే .7  వ శతాబ్ది వాడిని .ఆయనకంటే సుమారు రెండు శతాబ్దాలు ముందువాడిని . .కావ్యాలంకారం అనే గ్రంధం సూత్ర శైలిలో రాశాను .నేనే దీనికి ;;కవి ప్రియ’’వ్యాఖ్యానమూ రాశాను ఇతరకవులపద్యాలు నా పద్యాలు ఉదాహరణగా ఇచ్చాను గ్రంధాన్ని సంప్రదాయ పద్ధతిలో అధికారణాలుగా విభజించాను ..దీనిలో అయిదు అధికారణాలున్నాయి అధికారణాలను 12అధ్యాయాలుగా విభజన చేశాను .మొత్తం 317 శ్లోకాలున్నాయి ..నేను ‘’రీతి ;;కి ప్రాధాన్యమిచ్చాను .కావ్య శరీరాన్ని గురించి స్థూలంగా చెప్పి అలంకార శాస్త్రాధ్యయనం అవసరాన్ని  దాన్ని చదివి అర్ధం చేసుకోవటానికి కావాల్సిన అర్హతను,సహాయకాల గురించి  చర్చించాను .మొదటి సూత్రం లోనే కవిత్వాన్ని నిర్వచించాను కావ్యం గద్య ,పద్య రూపక భేదంగా ఉంటుంది .కావ్యం అలంకార శోభితమైనప్పుడే రాణిస్తుంది దోషాలు లేకుండా గుణ అలంకారాలు చేరిస్తే కావ్య శోభ పెరోగి సౌందర్య వికసనమవుతుంది .అలంకార శాస్త్ర పఠనం ద్వారానే ఉత్తమ కవిత్వం రాయగలరు .ఉత్తమ కావ్య రచన వలన ఆనందం కీర్తి లభించి ,ప్రత్యక్ష ,పరోక్ష ఫలితాలు లభిస్తాయి .

రాజశేఖరుడు –నేను  ఆలంకారి కుడనే కాక  కవి , నాటక కర్తనూ కూడా . 9వ శతాబ్ది చివరివాడిని ..మా తండ్రిపేరు దుర్దకుడు .కాలచూరి రాజుల మహా మంత్రి . అమ్మపేరు శీలవతి .మాది యాయవారాబ్రాహ్మణ వంశం .అవంతీ సుందరి అనే  విద్యావతి అనేకళ ల లో ఆరితేరిన క్షత్రియ కన్యను పెళ్లి చేసుకొన్నాను .నేను రాసిన కావ్య మీమాంసలో ఆమె అభిప్రాయాలనూ చేర్చాను .కనౌజ్ ప్రతీహార రాజు మహేంద్ర పాలుని ఆస్థానకవిని .రాజు నా శిష్యుడే.  ఆ రాజు కొడుకు మహీపాలుని కాలం లో కవి రాజు నయ్యాను బాల రామాయణం బాల భారతం కర్పూర మంజరి అనే మూడు నాటకాలు రాశాను .కనౌజ్ లో కర్పూర మంజరి ప్రదర్శించాం .కాలకూట రాజు మూడవ ఇంద్రుడు కనౌజ్ ను ధ్వసం చేస్తే త్రిపురి  పాలించే కాల చూరిరాజు మొదటి యువరాజ దేవుడి ఆస్థానానికి తిరిగొచ్చాను  మా  రాజు  రాష్ట్ర కూటు లను ఓడించినప్పుడు నా నాల్గవ నాటకంప్రాకృత0  లో రాసిన  ‘’విద్ధ శాల భంజిక ‘’(కదలని బొమ్మ )ప్రదర్శించారు .నేను అలంకార శాస్త్ర ,ఛందో శాస్త్ర విషయాలపై కూడా ఒక గ్రంధం  ‘’కావ్య మీమాంస ‘’రాశాను కవిత్వానికి సంబంధించిన సకల విషయాలు ఉన్న విజ్ఞాన సర్వస్వము అది .కానీ దురదృష్ట వశాత్తు ఇందులో ‘’కవి రహస్య ‘’అనే మొదటిభాగమే ప్రచురింపబడింది ఇందులో 18 ఖండాలున్నాయి ..

సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -4

ఆలంకారిక ఆనంద నందనం -4

భరత ముని-రసాలు సౌందర్యం తో ఉన్న వస్తువు ,సన్నివేశాన్ని ఆశ్రయించి ఉంటాయి .స్థాయీ భావాల ,వ్యభిచారీ భావాల సమ్మిళిత స్వరూపమే వస్తువు లేక సన్నివేశం .వ్యభిచారీ భావాలంటే 33 తాత్కాలిక మానసిక ఉద్వేగాలు .-నిర్వేదం ,దైన్యం ,గ్లాని గర్వం మోహం  భ్రమ మొదలైనవి . భావం నుంచి ద్రష్ట లో ఉండాల్సిన ఊహా శక్తియొక్క ప్రాధాన్యత తెలియ జేయటానికే ఈ పదాలను సృష్టించాను చూసేవాడిలో సౌందర్య రసాస్వాదన అనే శక్తి లేకపోతె ఒక అందమైన అమ్మాయిని చూసినా ,రమణీయ సుందర ఉద్యానవనం చూసినా వాడిలో ఏ రకమైన భావోద్వేగం కలగదు .రంగ స్థలం పై వీటిని ప్రదర్శించేటప్పుడు సామరస్యం ,ఔచిత్యం చూపిస్తే అభిరుచి ఉన్న ప్రేక్షకుడికి రసానందం కలుగుతుంది . ఇవి లేకపోతె రస భంగమవుతుంది అనిగ్రహించాలి .నాటకం విజయం కావటానికి ప్రధాన సూత్రం ఏమిటి అంటే వివిధ రసాలమధ్య ఏదో ఒకటి సర్వత్రా ఆవరించి శాసించే విధంగా ఉండాలి .మానసిక స్థితుల వైవిధ్యం మధ్యలో ,అన్నీ ఊహలవలన రూపాంతరం చెందితే ,గాఢమైన భావా వేశం  ఒకటి వాటినన్నిటిని సూత్రం లో బంధించినట్లు గా ఐక్యం చేస్తుంది . దీన్ని ఆ కళాకృతి యొక్క అంగిరసం గా భావించాలి . మిగిలినవన్నీ కేవలం క్షణికాలే .నాటకం లో ఒకే రసం అంటూ ఉండదు …ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదని మనవి చేస్తూ  సోదరులు భామహా ,దండి లు కొనసాగి0చమని కోరుతున్నాను . మా ముగ్గరినీ ఆహ్వానించి మా ముఖ్తతహా  మా సిద్ధాంతాలను తెలియ జెప్పే అవకాశం కలిగించిన సరసభారతివారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను సెలవ్ .

భామహుడు -నేను వక్రోక్తికే పట్టం కట్టాను .సౌందర్య భావోద్దీపకమైన విభావాలుగా పరిణామ చెందాలి అంటే వక్రోక్తి వల్లనే సాధ్యం ..అన్నగారు భరతులవారు చెప్పిన రసాలన్నిటిని అలంకారాలుగా స్వీకరించటానికి నాకేమీ అభ్యంతరం లేదు ..శబ్దార్ధాలను మించి మరేదో జ్ఞానం కావ్యం ఉపదేశిస్తుంది .అందుకే నేను పర్యాయోక్తి విశేషోక్తి వ్యాజస్తుతి అలంకారాలను ఆదరించాను ప్రధాన కథ లో ఔన్నత్యం అద్భుతం దృశ్య రామణీయకత తోపాటు ,నాటకీ య గుణం ,శైలీ వైభవం కూడా ఉండాలి .గుణాలు కూడా అలంకారాలు అన్నాను కవిత్వ విలువలను నాశనం చేసే 12 దోషాలను గుర్తించి వివరించానునేను ..వస్తుజ్ఞానాన్ని పొందేవిధానం ,త్రైపాక్షిక తర్క సాధ్యమైన హేతువు ,నాదం యొక్క అమృతత్వం ,తార్కికమైన భ్రమలు చర్చించటానికి ఒక అధ్యాయం అంతా ఉపయోగించాను .కవిత్వానికి తనదైన తర్కం ఒకటి ఉంటుంది .అలాగే తనదైన అపోహలూ ఉంటాయి ..కావ్యనాయకుని శపథం ధార్మిక లౌకిక ,శృంగార ,ప్రతీకార బద్ధంగా ఉంటుంది మహాకావ్యాలలో ఇవి నెరవేరాలి .దీనికి విరుద్ధంగా వైఫల్యం చెందటం పెద్దపొరబాటే .ఉదాహరణకు-పురువు తండ్రి ముసలితనానికి బదులు తన యవ్వనం ఇవ్వటం ,వత్సరాజు వాసవదత్తను అపహరించటం భీముడు దుస్సాశాసనుడి రక్తాన్ని పానం  చేయటం  భీష్ముని బ్రహ్మచర్య ప్రతిజ్ఞ వంటివి . నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు .

దండి-సాంకేతిక నైపుణ్యం  శైలీ వైభవం  నాకు బాగా ఇష్టం .వీటిలో నన్ను మించినవారు లేరని విశ్లేషకులు భావించారు మంత్ర  గుప్తుని  వృత్తా0తం లో 200 కు పైగా వాక్యాలను ఓస్ట్య ములు లేకుండా రాశాను ఇదొక పెద్ద ఫీట్ ..ఇలా రాయటానికి ఒక విచిత్ర కారణం ఉంది .తన కథ చెబుతున్నప్పుడు మంత్ర గుప్తుడి పెదిమలు అతని ప్రియురాలి ముద్దులతో గాయపడ్డాయి .అందుకని దంత క్షతాలు కనిపించకుండా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని పెదవులు కలిపితే వచ్చే అక్షరాలైన ఓస్ట్య ములు రాకుండా చెప్పించాను ..వర్ణించటం చిత్రించటమే నాపని చర్చించటం నా పనికాదు .నేను చిత్రించిన స్త్రీలలో స్వభావ విరుద్ధ దౌర్జన్య పోకడలు  కామ తృష్ణ ,మోహావేశం రతికేళిలో పురుషుల్ని మించిపోవటం కనిపిస్తుంది .ఇవి నేను చూసి రాసినవే .అందుకే నా వర్ణనలు రాజస్థానీ సంక్షిప్త చిత్ర కళ తో  ,  మాటిస్ చిత్రాలతో పోలుస్తారు . ఇంతటి నిశిత పరిశీలన చేసినవారికి అభినందన చందనం . సెలవు

 సాహితాభిమానులకు వందనం .ఈ ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొని శ్రద్ధగా విని విషయం సంగ్రహణం చేసిన శ్రోతలకు కృతజ్ఞతలు .మీరు లేనిదే దీనికి విజయం చేకూరదు .మనం ఆహ్వానించగానే మన్నించి తమ అమూల్య సందేశాలను సిద్ధాంతాలను సవివరంగా తెలియజెప్పిన భరత ముని  భామహా ,దండి పండితులకు మనఃపూర్వక కృతజ్ఞతాంజలి .సోదరులారా ఒక్కసారి నేను వీరు ముగ్గురు చెప్పినదాన్ని సమీక్ష చేస్తున్నాను ,జాగ్రత్తగా వినండి .

భరత ముని రస సిద్ధాంతం లోని సముచిత భావనలు ఆంగ్లకవి విమర్శకుడు  టి ఎస్ ఇలియట్  వస్తుసామ్య భావనకు సన్నిహిత సంబంధం ఉందని అంటున్నారట . ఉత్తమ భావాలు దేశకాలాతీతాలు కదా  .. రస సిద్ధాంతం పై అనేక వ్యాఖ్యా గ్రంధాలూ రావటం దానిలో ఉన్న విషయం గరిమకు సాక్ష్యం .బట్టలొల్లటుడు -జీవితం లోనూ కళ లోను  వచ్చే భావోద్వేగానికి మధ్య తేడాలేదని ,రసాలు రంగస్థలపాత్రలనుండే ఏర్పడతాయని ,చూసేవారు పాత్రలలో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తాడని చెప్పాడు .శంకుకుడు నటులలో విభావ అనుభవాదులను చూసి ప్రేక్షకుడు తనదైన జ్ఞానం లేక తార్కిక భావనతో కళకున్న ప్రత్యేక ఆకర్షణవలన రసాన్ని అనుభవిస్తాడని అన్నాడు .భట్టనాయకుడు సౌందర్య సాధనలో వచ్చే అన్ని అంశాలను సార్వ జనీనం చేయటం వలన కలిగే అలౌకిక ఆనందమే రసం అని పేర్కొన్నాడు .కాశ్మీర శైవ దార్శనికుడు అభినవ గుప్తుడు రసం కళ లోనుంచే స్వయంగా పుడుతుందని  ,అది అద్వితీయమైనదని తేల్చాడు ..భాష యొక్క సౌందర్యోద్దీపనా శక్తికి సమగ్ర వివరణగా ఆనంద వర్ధనునిధ్వని సిద్ధాంతాన్ని అన్వయించటం ద్వారా రసం మానవునికిఅత్యు కృష్ట మైన ఆత్మాశ్రయ ఆధ్యాత్మ్తికానందం కలిగిస్తుందని మరింత విస్పష్టంగా తెలియజేశాడు .సాహిత్యం లో అర్ధానికి ఉన్న బహుళ వ్యాప్తిని ,కవిత్వ భాషకు గల ప్ర త్యేక విశిష్టత గురించి ఆధునికులు చేసిన భావనలు మన ప్రాచీన ఆలంకారికులు ముందుగానే ఊహించి చెప్పినవే అని ఘంటా పదంగా చెప్పవచ్చు . భరత శాస్త్రాన్ని డ్రమాటిక్ ఆర్ట్ ,పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ అన్నారు ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .అరిస్టాటిల్ రాసిన పొయెటిక్స్  ఇలాగే ఉంటుంది .సంగీతాన్ని గురించి విపులంగా  చర్చించిన  తొలి గ్రంధం నాట్య శాస్త్రమే . 13 వ శతాబ్ది వరకు సంగీతానికి ఇదే ఉపయుక్త గ్రంధం .ఆతర్వాతే దక్షిణాది ఉత్తరాది సంప్రదాయాలేర్పడ్డాయి .శృతుల మధ్య సామరస్యమే సంగీ తమన్నాడు భరతముని .ఈ నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదంగా గుర్తించారు  భరత ముని నాటిన రసం అనే బీజం మొలకెత్తి మహావృక్షమై ,శాఖోపశాఖలై విస్తరించి పుష్పఫల సంభరితమై సార్ధక్యాన్ని పొందింది .

 భామహుడు పురాణ కావ్య ,శృంగార ప్రబంధాలను వెలకట్టి విలువలను నిర్ణయించటం లో ఆయన కవిత్వ విమర్శ పరాకాష్టకు చేరింది .ఆయన సిద్ధాంతం లోసూత్రాలను తర్వాత వచ్చ్చిన వ్యాఖ్యాతలు శ్రద్ధగా పరిశీలించి ఉంటె కావ్య విమర్శ కొత్త పుంతలు తొక్కి ఉండేది తన అపార విద్వత్తు ద్వారా గ్రహించిన సత్యాలను కవిత్వ సేవకు మళ్లించి తన సామర్ధ్యాన్ని అంతటినీ సద్వినియోగం చేసుకొన్నాడు .భరతుని రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించలేదు . అగ్ని పురాణం లో ఉన్న రసమే కావ్యానికి జీవం అన్నదీ ఆయన స్పృశించలేదు .రసాన్ని ‘’రసదలంకారం .’’అన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహా సిద్ధాంతం .

 ఇక దండి లక్ష్య పూరిత నిండైన జీవితం గడిపి ఆచార్యుడనే బిరుదు పొంది ,శిష్య ప్రశిష్యులతో ప్రక్రుతి ఒడిలో జీవించి అద్భుత సాహిత్యనిధిని మనకు అందజేశాడు వకాహనానికి గౌరవం తెచ్చాడు వచనాన్ని సంస్కృతం ప్రాకృత ,అపభ్రంశ మొదలైన స్థానిక భాషలలో కూడా రాయవచ్చు నేనే భరోసా కలిగించాడు  కానీసంస్కృతం విశ్వవ్యాప్త గౌరవమున్న భాష -’’దండినః పదలాలిత్యం ‘’అని పేరు పొందాడు .గుణ ప్రస్థాన భావాన్ని దండి వ్యాపింప జేశాడు .కవిత్వం లో శ్లేష ,ప్రసాద గుణం సమతాగుణం ,మాధుర్యం అర్ధ వ్యక్తీ ఓజస్సు అనే గుణాలు ఉంటేనే మహాకావ్యమౌతుందని దండిభావన .

‘’సంస్కృతం నామ దైవీ వాన న్యర వ్యాతా మహర్షిభిః ‘’అంటే సంస్కృతం నిజంగా దేవా భాష అని మహర్షులు సిద్ధాంతీకరించారు .సామాన్య మాండలీకాలు అనేకం దానినుండి పుట్టాయి స్థానిక ప్రజలు వాటిని పోషించారు .అని గొప్ప భాషా విశ్లేషణ చేసిన దండి మాండలిక మార్గ దర్శిఅనిపించాడు

విశ్వ సాహిత్యం లో భరతుని రస సిద్ధాంత ప్రకటన అత్య0త  సమ గ్రమైనది మానవుడిలో సహజ స్వాభావికంగా స్పంధించే గుణం ,నాటకీయ సమర్పణలో వివిధ ప్రేరకాల కూర్పు ద్వారా క్రియాత్మకం చేయటం ,దానివలన ప్రేక్షకునిలో వచ్చే స్పందన ,చివరికి స్వచ్ఛమైన రసానుభూతికలగటం భరతముని రస సిద్ధాంతం లో ముఖ్యాంశాలు .కవిత్వ భాషలో విడదీయ రాని అఖండత్వం లోకి శబ్దార్ధాలు పరిణామం చెందటం లోని భామహుడు విడమర్చి చెప్పాడు .కావ్యాన్ని సౌందర్యం తో నింపేది అలంకారాలేన్ని వచనము కూడా శిరోభూషణమే నని దండి మహాశయుని భావం భరతుడు కావ్యాత్మ రసం అంటే  ,భామహుడు అలంకారం అంటే దండి కావ్యాత్మ గుణం అని ప్రతిపాదించారని  అర్ధం చేసుకోవాలి .సరసభారతి నిర్వహించిన ఈ ప్రత్యేక ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మొదటి సమావేశం సమాప్తం . మరి కొందరు ఆల0 కారికులతో రెండవ సమావేశం లో కలుద్దాం .అంతవరకూ సెలవు .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -2

అలంకారిక ఆనంద నందనం -2

భరత ముని -ఉత్తమ ఉదాహరణాత్మక నాటకం అంటే ధీరోదాత్తుడు నాయకుడుగాకలది లేక శృంగార ప్రధానమైనది .ప్రకరణం అంటే  హాస్య రూపకం .జీవితం లో కస్టాలు బాధలతో సతమతమయే  సామాన్యులకు వినోదం చేకూర్చటమే నాటక లక్ష్యం . అనుకరణ ,అనుకీర్తనద్వారా నటులు వేషాలు వేసి వినోదాన్నిస్తారు .పాత్రలు పౌరాణికం కావచ్చు ఇతిహాసానికి సంబంధినవి కావచ్చు .లేక నాటక కర్త సృష్టించిన పాత్రలైనా కావచ్చు .మీరందరూ అనుకొంటున్నట్లు అనుకరణ అంటే వెక్కిరింత కాదు .ఉన్నది ఉన్నట్లు చేసి చూపటమూకాదు .ఊహా కల్పనా ద్వారా పాత్రను పునర్నిర్మించి ప్రదర్శించాలి ..దీనినే పునః సమర్పణ అంటారు .కథ లేక ఇతివృత్తం ఉదాత్తం మహిమాన్వితం గా ఉండాలి .నాయికా నాయకులు ఉన్నత కులం లో పుట్టి  ధీరగుణం కలిగి ఉండాలి .అప్పుడే గంభీరమైన నాటకం చూడగలరు .నిత్య జీవిత పాత్రలతో ఇతివృత్తం ఉంటె అది ప్రకరణం అవుతుంది .దీన్నే సామాన్య హాస్య నాటకం అన్నాను .నాటకం మాత్రం ప్రకల్పనలో ,ప్రదర్శనం లో మహోన్నతంగా ఉంటుంది . అసాధారణం ,అద్భుతం ,అలౌకికం కూడా చూపటానికి ఇతి వృత్తం లో స్థానం ఉంటుంది .ఏ రూపం లో ఉన్నా నాటకం చివరికి పరిష్కారం లభించే సంఘర్షణ ముఖ్యఅంగం కావాలి .నాటక ప్రారంభం లో అనుకూల ప్రతికూల శక్తులు సమంగా మోహరించి ఉంటాయి ..మధ్యలో ఒక క్లిష్ట దశ ఏర్పడుతుంది ..అప్పుడు నాటకం ఏ ఉద్దేశ్యంతో ప్రారంభమైందో అది చేరటం అసాధ్యమని పిస్తుంది .కానీ చివరికి ఉపసంహారం లో నాయకుడి శ్రమ ఫలి0చి ,విజయం చేకూరుతుంది . నాటక కథా  వస్తువును సంధులుగా ,సంధ్యాంగాలు గా సూక్ష్మ0 గా విశ్లేషించి చెప్పాను . చాలా దూరం వచ్చానేమో ?ఇప్పుడు భామహా , దండి మహాశయులు తమ విశ్లేషణ వరుస క్రమంలో చేస్తారు ..

భామహుడు-కావ్యానికి కవితా సామగ్రి ఎలా ఉండాలో నేను స్పష్టంగా చెప్పాను .అవి  -వ్యాకరణం ,ఛందస్సు ,నిఘంటువు ,సంప్రదాయంగా వస్తున్న కధలు ,గాథలు ,లౌకిక జ్ఞానం ,తర్కం లలితకళలు . కవి కావ్య నిర్మాణం చేయటానికి ముందే వస్తు నిపుణుల మార్గ దర్శకత్వం లో తన కళకు కావలసిన విషయాలలో ప్రాధమిక జ్ఞానాన్ని అయినా సమ కూర్చుకోవాలి తప్పదు ..కవిత్వం లో ఒక్క దోషం ఉన్నా నేను సహించను .కవిత్వ నియమాలు ఉల్లంఘిస్తే ,తండ్రికి అపఖ్యాతి తెచ్చే కొడుకు లాంటి వాడు అన్నాను నిర్మోహమాటంగా .అధమ కవిత్వ రచన మరణం తో సమానం ..నాది శాస్త్రీయ దృష్టి .మొహమాటం లేనే లేదు .

దండి-వాక్కు అభి వ్యక్తీకరణ అనేక మార్గాలలో జరుగుతుంది . కృతి నిర్మాణ శైలులు సూక్ష్మ భేదాలతో అసంఖ్యాకంగా ఉంటాయి .వైదర్భీ ,గౌడీ రీతులు పూర్తిగా భిన్నమైనవి .-

‘’అస్త్య నేకో  గిరాం మామః సూక్ష్మ భేదః పరస్పరం -తత్ర వైదర్భీ గౌడీయో వద్యతే ప్రస్ఫుటాం తరౌ ‘’ వైదర్భీ శైలి ఉత్కృష్టమైనది .దీనిలో దశ గుణాలు ఉన్నందున సుస్పష్టంగా ,మనోహరంగా ఉంటుంది .గౌడీ దీనికి విరుద్ధమైన గుణాలు కలిగి ఉంటుంది . రెండిటిలో వైదర్భీ శైలి ఉత్కృష్టమైంది .నా  తర్వాతవాడైన వామనుడు కూడా రీతి యే కవిత్వానికి ఆత్మ -రీతి రాత్మ కావ్యస్య ‘’అని సమర్ధించాడు  . ఆ చిన్నారికి నా ఆశీసులు .

భరత ముని -నటుల దృష్టిననుసరించి నాటకాలను అంకాలుగా విభజించాలి . తీవ్ర మార్పులు ,నమ్మశక్యం కానంత సుదూర ప్రాంతాలకు సన్నీ వేశాలు మారటం ఒకే అంకం లో జరగకూడదు . నాటకాన్ని అంతా  ఒకే సారి చూస్తుంటే ఈ నియమం పాటించక్కరలేదు ప్రతాప ,శృంగారాలలో నాయికా నాయకులు ఎలా ఉండాలో చెప్పాను . దీని వెనుక వైవిధ్యం అనే కీలక సత్యం దాగి ఉందని గ్రహించాలి .చివరికి దుర్మార్గం పై మంచితనానికి విజయం కలగాలి తప్పదు .. ప్రేక్షకులలో భారతీయ ధార్మిక వాతావరణం కలిగించాలి  . నీతి  ఐశ్వర్యం మనో వాంఛా పరిపూర్తి ఉత్తమ పాత్రలను నడిపించే శక్తులుగా ఉండాలి . పాత్రలద్వారా చూసేవారు ప్రేరణపొంది ఆదర్శ వంతమై తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి . అందుకే నేను విషాదాంత నాటకాల జోలికి పోలేదు … ఇప్పుడు భామహా దండి లు తమ అనుభవాలను చెబుతారు .

భామహుడు –భరతన్న గారి చూపు యెంత ధార్మికమైనదో యెంత ప్రయోజనకరమైనదో తెలిసిందికదా ..నేనుకూడా కవిత్వ శాఖలలో మహాకావ్యమే ఉత్తమోత్తమ మైనది అని గంట కొట్టి చెప్పాను ..రూపం లో ,వస్తువులో మహాకావ్యం ఉత్కృష్టమైంది . దానిలో పాత్రలు ఉదాత్తమైనవి ఉన్నతమైనవి .శైలి సుందరంగా ఉంటుంది . నాయకుని చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు మహా కావ్యం లో ఉంటాయి .రాజనీతి ,దండ  యాత్రలు ,విజయాలు ధర్మోపదేశాలు అన్నీ సులభ శై లిలో వ్యక్తీకరింపబడతాయి ..కథ సుఖాంతమవటం  భరతన్నయ్య లా నాకూ ఇష్టం .కావ్యం చతుర్విధ పురుషార్ధాలను ఎంతోకొంత ఉద్బోధిస్తుంది .కానీ ద్వితీయ పురుషార్ధమైన అర్ధానికి కావ్యం ప్రాధాన్య మిస్తుంది .మానవ స్వభావాలలో సత్యానికి కావ్యం ప్రతిబింబమవుతుంది .అన్ని రసాలకు కావ్యం లో చోటు ఉంటుంది .

దండి-నా అవంతీ సుందరి కథ ఆఖ్యాయిక వర్గానికి చెందింది .ఇందులోని సంఘటనలు యదార్ధ జీవిత సత్యాలపై ఆధారపడి ఉన్నాయి .వచనం అంటే’’ ఛందో బద్దమై న పాదాలుగా విభజించటానికి వీలు లేని పదాల కూర్పు’’అని నా నిర్వచనం . మనో వృత్తులు ,భావోద్వేగాలు తో నిండిన కవిత్వం  వచనాన్ని పూర్తిగా భిన్నమైంది .మీమాంస శాస్త్ర కర్త శబరుడు అలంకార రహితంగా దర్శన శాస్త్రాలురాసి శంకర భగవతపాదులనే  ఆకర్షించాడు .కనుక కవిత్వమే ఆకర్షిస్తుంది అనటానికి వీలు లేదు .వచనము సమర్ధంగా రాయగలిగితే అదే ఫలితాలను ఇస్తుంది అని మర్చిపోరాదు .

భరత ముని -సంతోషం .కావ్య  ప్రాధాన్యం  సోదరుడు భామహుడు వివరిస్తే ,వచన మనో వికాసాన్ని దండి తమ్ముడు చక్కగా చెప్పాడు .ఎందులో రాశా మనికాదు ఎంతబాగా రాశామనేది ముఖ్యం . ఈ రెండూ రెండు కళ్ళ వంటివే .. ఇప్పుడు నేను నాటకం లో నాందీ ప్రస్తావన గూర్చి చెబుతాను .నాటకానికి నాంది చాలా ముఖ్యం .నాందిలో పాత్రధారులు సుదీర్ఘంగా ఆరాధన చేయాలి అది అయ్యాక నే నిజంగా నాటకం ప్రారంభమవుతుంది .పాత్రలు వాటి హోదాలనుబట్టి . ఎలా సంబోధించాలి ,ప్రాకృత భాషా మాండలికాలను ఎలావాడాలి ,ఏయే భాగాలను ఎలా సముచితమైన సంజ్ఞలు నాట్య ,సంగీత రీతులతో ప్రదర్హించాలి అనే విషయాలను అతి సూక్షంగా పరిశీలించి చెప్పాను .అందుకే ఇప్పటికీ మీరు నన్ను మరచిపోలేక పోతున్నారు .. సోదరులారా ఇక మీరు ఉపక్రమించండి .

భామహుడు -అన్నగారు భరత మునీశ్వరులు ఒక విజ్ఞాన సర్వస్వము వారి నాట్య శాస్త్రం అంతే విలువకలిగింది .మాఅందరికి వారే మార్గ దర్శి ..ఇతర కవిత్వ శాఖలలో దశ విధ రూపకం ,గద్యం లో శృంగార గాథ ,అనిబద్ధ కవితలు ఉన్నాయి శృంగార గాథ లు ఆఖ్యాయిక ,కథ అని రెండురకాలు .ప్రకృతిని ,శృంగారాన్నీ వర్ణించే ఖండకావ్యాలు అని బద్ధ కవిత్వం కిందకు వస్తాయి .ఖండకావ్యం తో ప్రారంభించినా మహాకవి లక్ష్యం ఉత్తమ మహాకావ్య రచనమే .పురాణ ,ఇతిహాస కథలు ,కల్పిత కథలు కావ్య వస్తువులుకావచ్చు .కల్పిత కథలని తేలికగా తీసిపారేయ రాదు . కవి వాటిని తన అనన్య సామాన్యమైన ప్రతిభతో మలిచి మహాకావ్యం చేయవచ్చు .

దండి-కథ  ఎలా ఉండాలి అన్న విషయం లో అన్నగారు భామహుడు ,పెద్దన్న భరతముని గారి అభిప్రాయాలు నాకూ నచ్చాయి .. ఇప్పుడు ప్రపంచమంతా వచన కవిత్వం తో పరవళ్లు తొక్కుతోంది .నేను వేసినదారి సవ్యమైనదే అని నమ్మకం కుదిరింది .కావ్యం లో ఆశ్వాసాలు కాండాలు ఉంటాయి కానీ వచన రచనను నేను ఉచ్చ్వాసాలుగా విభజించాము .ఉపోద్ఘాతం ఛందస్సులోపద్య రూపం లో ఉండచ్చు ..శృంగార ఇతివృత్తం ,రాజులమధ్య యుద్ధం ,ప్రేమికుల విరహం  జైత్ర యాత్రలు  మహత్తర సంఘటనలు చక్కగా వచనం లోనే చిత్రించవచ్చు .కథ ,ఆఖ్యాయిక మధ్య భేదాన్ని పాటించక్కరలేదు . పేర్లు వేరేకానీ రెండూ ఒకటే రకానికి చెందినవని నేను అభిప్రాయపడ్డాను .ఇక్కడమాత్రం అన్న భామహులను కాదంటున్నాను  .నా అవంతీ సుందరి కథ  భట్ట బాణుని కాదంబరి వచనానికి దగ్గరలో ఉంటుంది .ఈ కథ  ద్వారా నా జీవిత కథను తెలుసుకొనే ప్రయత్నం చేశారు పరిశోధకులు .నా యదార్ధ జీవిత కథ చుట్టూ కల్పనా చమత్కృతి తో అల్లిన అనేక  కథ లున్నాయని వారు భావించారు .నాకూ మహా కవి కాళిదాసు కూ మధ్య ఎవరుగొప్ప అనే సమస్య వచ్చి మేమిద్దరం సరస్వతీ దేవి దగ్గరకు వెళ్లి అభిప్రాయం అడిగితె ఆమె ‘’కవిర్ద 0డి కవిర్థం డి కవిర్ద0డి న సంశయహ్ ‘’అని బదులు చెప్పగా ,కాళిదాసుకు కోపం వచ్చి –కోహం ముండే ‘’-నేనెవరినీ దద్దమ్మా అని అడిగినట్లు ఆమె నిస్సంకోచంగా ‘’త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ‘’అని మూడుసార్లు అన్నదని  తీగంతా లాగి  డొంకంతా కదిల్చి వదిలి సంబరం చేసుకొన్నారు జనం . అయినా మా ఇద్దరి మధ్యా స్పర్ధ ఏమిటి ?ఇదంతా కాలక్షేపం బటానీలు . ఎంత గొప్పగా అల్లా రో ఈ కథను .మహాకవులకు  తీసిపోరు ఈ పుకారు మనుష్యులు .ఇంతటితో ఆగారా /లేదే -మరో చమత్కారకవి ‘’వాల్మీకితో  కవి అనే పదం పుట్టింది .వ్యాసునితో కవిద్వయం ఏర్పడింది డండి రాకతో కవిత్రయం అని లోకంలో వ్యవహారం లోకి వచ్చింది అన్నాడట .. భజన పరులు ఆనాడూ ఉన్నారు స్వామీ ..మరీ చెక్క భజన పనికి రా’’దండీ’’ .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -3

అలంకారిక ఆనంద నందనం -3

భరత ముని -నాటకం లోని ప్రతి అంశానికీ అంటే పాత్రీకరణ ,నాటక ప్రణాళిక ,శైలి ,దుస్తులు ,సంగీతం నృత్యం వంటివి ఏదైనా రసం ప్రధానం అని నా అభిప్రాయం . అదే ప్రాణప్రదమైన ఊపిరి .అదిలేకపోతే కళ  నిర్జీవమే .రసం భావంతో విడదీయరాన0తగా పెనవేసుకొని ఉండటం వలన ఒకటి లేకుండా రెండవదానిని అర్ధం చేసుకో లేం .వాడుకలో రసభావాలు ఒకే అర్ధం లో పర్యాయ పదా లయ్యాయి .మనిషికి ఉన్న మానసిక ప్రపంచం ,అనుభూతులు ,ఆవేశాలు ,అభిమానాలతో అతడిని ఏదో పనికి పురికొల్పుతాయి . జీవతానికీ ,కళ కూ ఇదే మూల పదార్ధం .దీన్ని తీర్చి దిద్దటానికే కళలు ప్రయత్నిస్తాయి .జీవితాలలో సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి .కానీ కళాకారుడు వాటిని గ్రహించి నప్పుడు తన ఊహలో వాటిని కల్పించుకొని ఒక క్రమ పద్ధతిలో పెడతాడు .ఇలాంటి పధ్ధతి భూమిపై ఉండదు .ప్రతిభా వంతుడైన కవి కల్పించిన దానికి లోబడి ఉన్నప్పుడు వాటిని భావాలు అంటారు ; భావన అంటే సృజనాత్మకమైన కల్పనా విధానమే .ఇదే సౌందర్య రసజ్ఞత .ఇది నాటక కర్తకు ,రసిక ప్రేక్షకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ..ఇలా రస ,సౌందర్య సిద్ధాంతానికి నేనే ఊపిరి పోశాను . నా తర్వాత భామహా దండి తమ్ములు తమ భావావేశాలు వివరిస్తారు .

భామహుడు -అన్న గారి రస  సౌందర్య సిద్ధాంతానికి జోహార్లు .అన్నిటా వారు మార్గ దర్శి యే .నా దృష్టిలో కవిత్వం అంటే మహా పురుషులకు కవి అర్పించే ఘన  నివాళి .విద్వా0సు డైన కవి ఉన్నత భావ వ్యక్తీకరణ ద్వారా సౌందర్యాన్ని   ఉన్మీలనం  చేస్తూ  తన లక్ష్యాన్ని సాధిస్తాడు .ఉత్తమ కథా నాయకుని చుట్టూ ఉత్తమ శిల్పం తో అల్లిన ఉత్తమకథ మహాకావ్యానికి వస్తువవ్వాలి ..అన్నగారు భరత ముని చెప్పినట్లు పంచ సందుల సిద్ధాంత సారా0శ మైన క్రియకు సంబంధించిన ఏకత,వస్తువులో అంతర్వాహినిగా ఉండాలి .కావ్యం పాఠకుని ఆనంద పరచి నర్మ గర్భంగా ధర్మోపదేశం చేయాలి .ఉద్వేగ భరితమైన కథలను చెబుతూనే లౌకిక జ్ఞానాన్ని ,సాంఘిక ధర్మాలు ఉపదేశించాలి .మొదటినుంచి కావ్య నాయకుని ప్రశంసించటం లో కవి ఔచిత్యం పాటించాలి .ఈ మంచి మాటలు చెప్పానుకనుకనే  నా ప్రవచనాలు ప్రాచీన సంస్కృత సాహిత్య లక్షణ సారం అన్నారు విజ్ఞులు ..నాకాలం లో రసాలు కావ్య వస్తువులో భావోద్వేగం కలిగించే అంశాలు మాత్రమే . శబ్దాలంకారం రసం ఎలా అవుతుందని ఆ తర్వాత ఆనంద వర్ధనుడు ప్రశ్నించాడు .నేను ఈ విషయాలు పట్టించుకోలేదు అంతే …

  కావ్య సౌందర్యా రాధన శీలురకు నా అలంకార సిద్ధాంతం రస గుళికగా భాసించింది . సౌందర్యం అనే విషయాన్ని అన్న భరతుల వారితర్వాత నేనూ ఆ మార్గమే పట్టాను ..సౌందర్యం రెండురకాల .ఒకటి స్వాభావికమైనది రెండవది కళ ద్వారాసృష్టించేది ..ఆభరణాలవలన సుందరి మరింత సౌందర్యంగా ఎలా  భాసిస్తుందో అలాగే రమణీయమైన శబ్దాలవలన సౌందర్యం అభివ్యక్తమౌతుంది .అలంకారాలు కూడా కావ్య సౌందర్యాన్ని ఇనుమడి0ప జేస్తాయి అనటం లో సందేహం లేదు.కావ్య విశిష్టతను శబ్దం అలంకారాలూ  రెండూ ఇనుమడింప జేస్తాయి  ..కానీ కావ్య సౌందర్యానికి వక్రోక్తి అనేది ప్రాణం అని నేను గట్టిగా నమ్ముతాను .వక్రోక్తి లేకపోతె ఉత్తమ కావ్యరచన సాధ్యంకాదు అని నిర్మొహమాటంగా అన్నాను ..

 దండి-దండం చేతిలో ఉన్నవాడు దండి కనుక నా పేరు అదికాదని వేరే ఏదో ఉందని అనుకొన్నారు . దక్షిణాదివాడినని కర్ణాటక వాడినని ,మహారాష్ట్ర భాషను వైదర్భీ రీతిని మెచ్చుకున్నానని సంతోషించారు . దశకుమా ర చరిత్రలో గోమిని వృత్తా0తం  బట్టి  సంసారాన్ని పొదుపుగా నడుపుకునే అలవాట్లను చెప్పాను . మరొక చోట కోడిపందాలు కూడా వర్ణించాను .  వీటన్నిటిబట్టి దాక్షిణాత్యుడను అనే బలమైన భావన కలిగింది . అంతే కాదు నా కావ్యాదర్శం రాసిన వందేళ్లకే కన్నడం లోకి అనువాదం పొందింది .క్రీశ 1250 లో తెలుగు అనువాదము వచ్చింది .కావేరీ తీరపట్టణం ,కళింగాంధ్రాల ప్రస్తావన కూడా దీన్ని బలీయం చేసి ఉంటుంది.  అందుకే నన్ను ప్రామాణిక సృజనాత్మక సంస్కృత రచయితలలో ఒకనిగా విశేష స్థానం కల్పించారు . సమాజం లో ఉన్న ఉన్నత బీద వర్గాలు దొంగలు కుట్రలు కుతంత్రాలు అంతఃపుర కేళీ విలాసాలు వేశ్యా పొందు సౌఖ్యాలు ,జూద గృహాలు  కోడిపందాలు ఒకటేమిటి జనజీవన స్రవంతిలో ఉన్న ప్రతి  విషయాన్ని బొమ్మకట్టి నట్లు కట్టించి చూపాను నా రచనలో .కనుక నేను సామాజిక కవిని అన్నా ఇబ్బందిలేదు.  క్రీశ 500 కాలం నాటి శూద్రకమహాకవి మృచ్ఛకటికం నాటకం వర్ణించిన సాంఘిక పరిస్థితులే నాకాలం నాటికీ ఉన్నాయి . అన్నలిద్దరూ రసం సౌందర్యం అంటూ ఆకాశాన విహరిస్తే నేను నేలమీదనే ఉంటూ నా కళ్ళతో చూసిన దృశ్య ప్రపంచాన్నే వర్ణించి సహజ కవిని అయ్యాను . ఇప్పటికే స్వ –మర్దనం చాలా చేశానేమో ..

భరత ముని -లేదు తమ్ముడూ .నేల విడిచి సాము చేయని నిన్ను చూస్తే మా ఇద్దరికీ అభిమానమే .చెప్పాల్సిన విషయాలే చెప్పావు .నీగురించి తెలియనివారికందరికి ఇవి అమూల్యమైన ఊటలు .మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పు తప్పు లేదు .. ఇందాక రస ప్రస్తావన చేశాను ..భావం వస్తు స్వభావం గా ఉంటె సౌందర్య రసజ్ఞత అధమస్థాయి లో ఉంటుంది .చిత్రకళలో దీనికి స్థానం ఉంది .కానీ రంగస్థలం పై కళాకారుడు మానవ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రీ కరించటం లో తృప్తిపడకుండా వాటిని మరింత జటిలం చేస్తాడు .ఈ విధంగా జయప్రదంగా భావ జటిలతమాత్రమే రసం అనిపించుకునే అర్హత పొందుతుంది .కారణం అది ఇచ్చేరుచి ఆనందానుభూతి అనంతమైనది .నా దృష్టిలో భావం లేని రసం లేదు .అలాగే రసం లేకుండా ఏ భావమూ ఉండదు . వీటి పరస్పర సమన్వయము వలననే రంగ స్థల విజయం  ఆధార పడి  ఉంటుంది . వస్తువు ,లేక భావం సూటిగా ప్రేక్షకుడికి తాకితే అతడిలో వెంటనే ప్రతిస్పందన కలిగితే అది అక్కడికక్కడే రసంగా పరిణామ0 చెందుతుంది ..అప్పుడు అతని శరీరం అంతా ఎండు  టాకుకు నిప్పు పెట్టినట్లుగా ప్రజ్వ లిస్తుంది . రసం అంటే సౌందర్య భావ జనిత ఆనందం అని ఏక వచనం లో అర్ధం .బహువచనం లో రసాలు  ఉఛ్చ స్థితికి చేరిన స్థాయీ భావాలు అని నా నిర్వచనం .భావోద్రేకాలు ఎనిమిది .రతి ఉత్సాహం మొదలైనవి .వీటినే శృంగార వీర రసాదులు అన్నాను ‘’శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకా -భీభత్సాద్భుత సంజ్నౌ చేత్య స్టౌ నాట్యే రసాహ్ స్మృతాః ‘’

‘’రతి ర్హాసశ్చశోకశ్చ క్రోధో త్సాహో భయం తథా -జుగు ప్సావిస్మయ శ్చేతి స్థాయీ భావాః ప్రకీర్తితాః ‘’

 అంటే -శృంగారం హాస్యం ,కరుణ ,రౌద్రం  వీరం భయానకం ,భీభత్సం ,అద్భుతం అనేవి 8 రసాలు  వీటికి ఉన్న 8 స్థాయీ భావాలూ వరుసగా -రతి ,హాసం ,శోకం ,క్రోధం ,ఉత్సాహం ,భయం ,జుగుప్స ,విస్మయం .చూసేవాడిలో బాధను రగుల్గొల్పే కరుణ , భీభత్సం కూడా నా దృష్టిలో రసాలే  .రస సౌందర్య చర్చ అంటే నాకు ఒళ్ళు తెలియదు .చాలా చెప్పి విసిగించానా ? తమ్ముళ్లూ ఇప్పుడు మీ వంతు .

భామహుడు- అన్నగారు భరతులవారు రస వాహినిలో ముంచి తేల్చారు .సౌందర్య దర్శనం తో అప్రతిభులను చేశారు . అన్నగారూ శతకోటి వందనాలు . కావ్య భాషలో సౌందర్యం వెనక ఉన్న రహస్యాలను భేదించటానికి అనుస్యూతం గా  ప్రయత్నాలు జరుగు తూనే ఉన్నాయి .అయితే నా  భావాలు ఆలోచనాత్మకమైనవి  ,అతి నిగూఢమైనవి అంటారు విశ్లేషకులు .కుంతక  ,ఉద్భటులు నా భావాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసి మంచి ప్రచారం తెచ్చారు .నా నిశిత దృష్టికి  ,భావ వైశాల్యానికి వారి రచననలు అద్ధం పట్టాయి . అది నా అదృష్టం . నా భావ వ్యాప్తికి చేయూతనిచ్చినవారికి హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు . నాకు అనిపించేదేమిటంటే శబ్దార్ధాలు ,కథా వస్తువు ,భావోద్వేగాల సమ్మేళనం వలననే సంపూర్ణ సౌందర్యాను భూతి కలుగుతుంది ..కనుక ఇవన్నీ అలంకారం లోని అంశాలే అంటాను నేను ఈ  దృష్టితో చూస్తే కేవలం వాస్తవికత ,కవిత్వం పరస్పరంగా విరుద్ధమైనవి గా కనిపిస్తాయి .కనుక నేను స్వభావోక్తిని ఒక అలంకారంగా గుర్తించలేదు . నేను అలంకారానికి ప్రాధాన్య మిచ్చాను .గుణాలు రీతి అవసరం  .వైదర్భీ  గౌడీ భేదాలు ఉండాలి . వైదర్భీలో ప్రసాద ,ఋజుత్వ ,కోమలత్వ గుణాలు నాకు ఇష్టం లేదు పురుషార్థం వక్రోక్తి లేకపోతె కావ్యమే కాదు పొమ్మన్నాను . గౌడీయ రీతిలో అలంకారానికి ,భావ ఔచిత్యానికి యుక్తి యుక్తం గా చోటు కలిపిస్తే ఉత్తమ కావ్యమవుతుంది.  కేవలం మాటల గారడీ లో అందం లేదు ఉండదు .ద్వివిదాత్మక సౌందర్యం వక్ర శబ్దం అర్ధం వల్లనే ఏర్పడుతుంది అని ఘంటాపధంగా చెప్పాను .సమాస ప్రయోగం ధారాళంగా ఉండచ్చు సమాస బాహుళ్యం వలన ఓజస్సు ఏర్పడుతుంది .కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ప్రాసాద గుణం రాణిస్తుంది .సమాసాలు కర్ణ పేయంగా ఉంటె మాధుర్య గుణం వికసిస్తుంది .

దండి-అన్న లిద్దరూ సౌందర్య పిపాసలో చాలా దూరం కొట్టుకు పోయారు .  .పెద్దన్న భరతుడు ముందే అనుజ్ఞ ఇచ్చాడన్న ధీమాతో  నేను మాత్రం నా స్వంతగోడు వినిపిస్తున్నాను .అవంతీ సుందరికథ  ను నేను  కంచిలో రాశాను .పుస్తకాలంటే నాకు వల్లమాలిన అభిమానం.మా అమ్మా నాన్న పోయాక సరస్వతి ,శ్రుతులే నాకు దిక్కు అయ్యాయి ..దేశాటనం చేస్తూ బ్రాహ్మణ క్షత్రియ విద్వద్గోష్ఠిలో పాల్గొన్నాను . వైద్యం పశువైద్యం ,జ్యోతిషం ఖగోళం వాస్తు శిల్పకళతో నైపుణ్యం సాధించాను .కౌటిల్యం కామసూత్రాలు చదివి నిష్ణాతుడనయ్యాను వాస్తు శిల్పం లో నా పరిజ్ఞానాన్ని మిత్ర శిల్పి లలితాదిత్యుడు ఎంతో మెచ్చాడు ..మహాబలి పురం లో త్రివిక్రమ విష్ణు మూర్తి రాతి విగ్రహం చేయి విరిగిపోతే దానికి మలాం పూసి మరమ్మతు చేసిన లలితాదిత్యుడు  నన్ను దానిపై అభిప్రాయం కోరాడు అంటేశిల్పకాలపై నాకున్న పరిజ్ఞానం అతనికి నచ్చినట్లేకదా . .ఎన్నో పుస్తకాలు చదవాలని పిస్తుంది కానీ వయస్సు మీదపడిపోతోంది అని నాకు బాధగా ఉంది . నాకుతెలిసిన సాహిత్యకారులు వ్యాస సుబాహు గుణాడ్య  మూలదేవ శూద్రక భాస  ,సర్వజన ప్రవర సేన కాళిదాస ,నారాయణ భారవి   ,బాణ మయూరాదులను నేను స్మరించాను .బహుశా వారికాలాలు కూడా అదే వరుసలో ఉంటాయి .విజ్జిక లేక విజ్జి అనే కవయిత్రినీ గుర్తు చేసుకున్నాను .ఆమె నల్లగా ఉంటుందికనుక నేను సరస్వతీ దేవిని శుక్లాంబరధరం స్వేతవర్ణం గా వర్ణిస్తే ఆమె శ్యామలవర్ణం గల విజ్జికయే సరస్వతి అని భావిస్తే దండి అలా వర్ణించి ఉండేవాడు కాదు అని జవాబు ఇచ్చింది .గంగాదేవి అనే కవయిత్రి ఆచార్య దండి వాక్కు అనే తేజస్సు అద్ధం  లో మెరిసిన సరస్వతీ దేవి ఆభరణాల సోయగమే ‘’అని చక్కగా చమత్కరించింది –

‘’ఆచార్య దండి నో వాచ మాచాన్నామృత సంపదాం -వికాసో వేధసః పరన్యా విలాస మణి దర్పణం ‘’.

 భరతముని -దండి సోదరా నీ కథ ను దండిగా చెప్పి మాకు కొత్త విషయాలు తెలియజేశావు .సోదరులారా మన కార్యక్రమాన్ని రేపటితో ముగిద్దాం. .తయారుగా రావల సిందిగా కోరుతున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -1

అలంకారిక ఆనంద నందనం -1

సాహిత్య సాంస్కృతిక ప్రియులు  భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న  ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని పించి  ,ఇప్పుడు నడుం కట్టాం . ఈ కార్యక్రమం నాలుగు భాగాలుగా జరుగుతుంది .ప్రతికార్యక్రమం లో ప్రసిద్ధ భారతీయ ఆల0కా కరికులు పాల్గొని తమ జీవిత విశేషాలను ,తమ సిద్ధాంతాల పూర్వా పరాలను వారి తోనే చెప్పించాలని సంకల్పించాం .వారందారూ తమ హృదయావిష్కరణకు సరసభారతి చక్కని వేదికగా భావించి ఆనందంగా అంగీకరించటం మన తొలి  విజయం . ప్రతి కార్యక్రమం లో పాల్గొనే వారిలో ఒక ఆలంకారికుడు అధ్యక్షస్థానం వహించి నిర్వహిస్తారు .మనమంతా ప్రేక్షకులమై వారి హృదయావిష్కారాన్ని అనుభవిద్దాం . ఈ రోజు మొదటి కార్యక్రమం లో శ్రీ భరత ముని అధ్యక్షత వహి0చి తమ సిద్ధాంతాలను ఆవిష్కరిస్తారు  .శ్రీ భామహుడు శ్రీ దండి తమ సిద్ధాంత వివరణ చేస్తారు .ఆలంకారికులకు ఒకమనవి .తమ జనన మరణ కాలాల విషయాల గందర గోళం తో సభాసదులను ఇబ్బంది పెట్టక క్లుప్తంగా చెప్పి తమ కావ్యరచనలు ,తాము ప్రతిపాదించిన సిదాంతాలు ,అంతకు పూర్వమున్న వాటిపై తాము ఆలోచించి చెప్పిన నూతన విషయాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి అలంకారిక ఆనంద నందనాన్ని సు సంపన్నం చేయమని ప్రార్ధిస్తూ ,త్రిమూర్తులైన ఆ ముగ్గురు ఆలంకారికులను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ సభను నిర్వహించవలసినదిగా శ్రీ భరత ముని ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకొంటున్నాను ..

భరత ముని -సరసభారతి సరసమైన కార్యక్రమం నిర్వహిస్తూ ,మమ్మల్ని పాత్ర దారులను చేయటం విలక్షణంగా ఉంది .నిజమే సాహిత్య సభలలో ఆలంకారికులకు స్థానం బహు అరుదుగా ఉంటోంది .సరసభారతి ని ఇందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ  వేదికపై నా సహచరులైన భామహా ,దండి లను ఆప్యాయంగా స్వాగతిస్తున్నాను . నన్ను భరత ముని గానే అందరూ సంబోధిస్తారు ..నేను ఋగ్వేద0లో ప్రస్తావించబడిన భరత వంశం వాడిని .స్వర్గం నుంచి రూపక కళను భూమికి తెచ్చాను .నేను రచించిన నాట్య శాస్త్రా న్ని నా నూరుగురు కుమారులు కో హల ,దత్తిల,అశ్మకుట్ట ,నఖ కుట్ట మొదలైనవారికి బోధించాను .వీరందరూ ప్రామాణికులే .వీరు కూడా యధా శక్తి గా  నాట్య కళ పై గ్రంధాలు రాశారు  .నేను ఋగ్వేదకాలం వాడినైనా చారిత్రిక పరిశోధకులు మాత్రం నేను క్రీపూ 200 కాలం వాడినంటున్నారు . ఇప్పుడు భామహమహానుభావుని  ఆతర్వాత దండి మహాశయుని తమ పుట్టు పూర్వోత్తరాలు తెలియ జేయవలసినదిగా కోరుతున్నాను ..

భామహుడు నా పుట్టు పూర్వోత్తరాలు  గురించి నేనెక్కడా చెప్పుకోలేదు .నాకు కౌటిల్య భరత  కాళిదాస మహాకవులు తెలుసు రామాయణ ,మహాభారత  బృహత్కథలు తెలుసు .సంస్కృత కావ్య తత్త్వం పై నేనే మొట్టమొదటి గ్రంధం రాశాను .ఉద్భటుడు దీనిపై ‘భామహా వివరణ ‘’అనే వ్యాఖ్యానం రాశాడు . అది కాలగర్భం లో కలిసిందని అంటున్నారు . అందులో కొన్ని భాగాలు ఇటీవలే రోమ్ నగరం లో గ్నోల్ అనే ఆయన ప్రచురించాడు అయితే అవి అర్ధం చేసుకోవటానికి వీలు లేనంతగా శిధిలమయ్యాయని సాహిత్య పిపాసకులు బాధ పడుతున్నారని తెలిసింది .చరిత్రకారులు నన్ను క్రీశ 600 వాడినని అంటున్నారు .

 దండి -సంస్కృత గద్య రచయితగా నన్ను అందరూ అభిమానిస్తారు .భట్ట బాణుడు నా సహచర కవి . నేనూ నా కాలాన్ని గురించి చెప్పలేదు .ఎందుకో మాకప్పుడు మమ్మల్ని గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం ఉండేదికాదు .కానీ పరిశోధకులు ఊరుకుంటారా .వారిలెక్కలప్రకారం నేను క్రీశ 710-720 మధ్యవాడినని తేల్చారు .నేను కావ్యాదర్శం అనే సిద్ధాంత గ్రంధాన్ని వచనం లో రాశాను  వచన రచన 1-కథ 2-ఆఖ్యాయిక అని రెండురకాలు  ఆఖ్యాయికలో కథా  నాయకుడే స్వయంగా కథ  చెబుతాడు  .కథ లో ఎవరైనా చెప్పవచ్చు ..నాకు ముందే ఇలాంటి సాహిత్యం కొంత ఉంది నేను మెరుగులు పెట్టి ఉంటాను

 భరతుడు -సోదరులు సంక్షిప్తంగా తమను పరిచయం చేసుకున్నందుకు ధన్యవాదాలు .ఇప్పుడు నా నాట్య శాస్త్ర విశేషాలు కొన్ని మీతో ముచ్చటిస్తాను ..నా  నాట్య శాస్త్రం 37 అధ్యాయాల బృహద్గ్రంథం ..దీన్ని విజ్ఞాన సర్వస్వము అన్నారు  సహృదయులు .దీనిలో అనేకరకాల నాట్య శాలల నిర్మాణం ,రంగస్థల దేవతలను నటీ నటులు ఆరాధించటం ,తాండవం మొదలైన నృత్య రీతులు ,కంటి చూపులు ,కరముద్రలువగైరా సూక్ష్మ వివరాలనూ తెలియ జేశాను . నటీ నటుల హావ భావాలు ,ప్రదర్శించే పద్ధతులు ,పాత్రోచిత భాష ,తగిన ఛందోరీతులు  వాద్య గానాలకు సంబంధించి శాస్త్ర విషయాలు ,పాత్రోచిత దుస్తులు ,తెరలు వాడే విధానం కూడా చెప్పాను .రూప కాలలో భేదాలు ,నాటకం లో సంధి ,పరిచ్చేదం నాయకీ నాయక భేదాలు ,వివిధరకాల పాత్రలు ,రసాలు భావాలు అలంకారాలు గుణ దోషాలు ఒకటేమిటి సమస్తం వివరించాను.  ఇందులో రస భావాదులు సాహిత్య విమర్శకు అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు .నాట్య లేక రంగస్థల ప్రదర్శన పరిధిలో కి రాణి కళ కానీ ,శాస్త్రం, శిల్పంకాని లేవు అని ఘంటాపధంగా చెప్పాను ..ఇప్పుడు భామహుడు పిమ్మట దండి మహాశయులు తమ రచనలలో విశేషాలను వివరిస్తారు .

 భామహుడు -కావ్యం లో అలంకారానికి సంబంధించిన నియమాలను నేను సూత్రీకరించాను .ఉత్తమ కావ్యం జీవితం లోను  కళ లోను విలువలను పెంచుతుంది .ఆనందాన్ని యశస్సును ఇస్తుంది . కావ్య రచనా  ప్రతిభ లేకుండా ఎన్ని శాస్త్రాలలో పాడిత్యం ఉన్నా వ్యర్ధమే . వెన్నెల లేని రాత్రి ,మంచిప్రవర్తన లేని మనిషి సంపద, లాగా  కావ్య నిర్మాణ సామర్ధ్యం లేని వాక్కులో ఎంతటి దాటి ఉన్నా వెలవెల బోతుంది .సంస్కృత ఆలంకార శాస్త్ర చరిత్రలో నేనే మొదటిసారిగా శాస్త్ర రచనకంటే కవితా ప్రతిభ యొక్క విశిష్టతను చెప్పాను .ఏ గురువువద్దనైనా చదివి శాస్త్ర పండితుడుకావచ్చు .కవిత్వం లో అది సాధ్యపడదు . కవిత్వం అనేది ఏ కొద్దిమంది ప్రతిభా వంతుల ముఖం నుండో  తనంతట తానుగా  అనర్గళంగా పొంగిప్రవహించే గంగా ప్రవాహం . కావ్యం అజరామరమైనది . అమృతత్వం కావ్య లక్షణం . కవి కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవిస్తాడు అని స్పష్టంగా చెప్పాను .

దండి-నేను కావ్యాదర్శం ,దశ కుమార చరిత్ర ,అవంతీ సుందరి కథ అనే మూడు ప్రసిద్ధ రచనలు చేశాను .మహా భారత కధలను చెప్పే ద్విసంధాన కావ్యము నా రచనే .కానీ ఇది అలభ్యమంటున్నారు .జాగ్రత్త లేకపోతె అంతే ..అలంకార శాస్త్రానికి ఒక కొత్త దృక్కోణాన్ని నూతనత్వాన్ని ఇచ్చాను .కావ్యానికి శబ్దము అర్ధము అనే రెండు ముఖాలున్నాయి .కావ్య శరీరం రమణీయార్ద భూషిత పద సంఘాతం అని నిర్వచించాను -’’శరీరం తావాదిష్టార్థ వ్యవ చిన్నా పదా వళీ ‘’అన్నాను ఈ పదావళి అనేక రీతులలో  వ్యక్తమౌతోంది .అలంకారాలతో దానికి శోభ వస్తుంది .కవికి ,పాఠకుడికి ఆనందాన్ని కలిగించి ,కవికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టటమే కావ్య ప్రయోజనం .వచనం కవిత్వానికి మరో రూపమే నని ఖచ్చితంగా చెప్పాను .కావ్యం లో ఉండాల్సిన గుణాలు పరిహరించాల్సిన దోషాలు చెప్పాను .మా అన్నగారు భామహుల కంటే మౌలికతను ప్రదర్శించాను . అన్నగారి వక్రోక్తీ నాకు ఇష్టమే .అసాధారణ విషయాన్నికానీ వస్తువును కానీ వర్ణించాలనే కోరికకలిగినపుడు అలంకారాలు తన్నుకొంటూ వస్తాయి .అతిశయోక్తిలో  వర్ణన పరా  కాష్ట కు చేరుతుంది  భౌతిక పరిమితులనన్నిటినీ అధిగమిస్తుంది .కావ్యానికి శోభాకూర్చేది అలంకారమే అని నా పూర్తి విశ్వాసం .రసం కావ్యానికి మాధుర్యాన్నిస్తుంది .నేను అందరికంటే భిన్నంగా కావ్య శైలికి ప్రాధాన్యమిచ్చాను ..

   సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in రచనలు | Tagged | Leave a comment

  గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)

  గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)

  టి వి కపాలి శాస్త్రి తమిళనాడులోని మద్రాస్ లో మైలాపూర్ లో 1886 లో తంత్ర శాస్త్ర బ్రాహ్మణా కుటుంబం లో జన్మించాడు .తల్లి ఉగ్గుపాల తోనే సకల శాస్త్ర వేద సారం గ్రహించాడు

12 వ ఏటనే సంస్కృత రామాయణాన్ని 12 సార్లు  చదివేశాడు .అప్పటికే శ్రీ విద్యోపాసకుడై లలితా త్రిపుర సుందరి పరమ భక్తుడయ్యాడు . 1907లోఒక దేవాలయం లోమొదటి గురువు  శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని  దర్శనం కలిగి ,శిష్యుడై నాలుగేళ్లు ఆయన వద్ద విద్య నేర్చి ,ఆయనతో రెండవ గురువు రమణ మహర్షిని సందర్శించి  శిష్యుడయ్యాడు ..మహర్షి సందర్శనమే లేకుంటే నేను అరవిందుల దర్శనం చేసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు శాస్త్రి .మూడవ గురువు అరవిందులు . 1914 లో అరవిందాశ్రమ పత్రిక ‘’ఆర్య ‘’ను చదివిన శాస్త్రి అరవిందులను దర్శించాలని కోరికకలిగి పాండి చేరి వెళ్లి 1917 లో మొదటి సారి దర్శించి సంస్కృత శ్లోకాలతో స్తుతించాడు .  .అరవిందులు శాస్త్రిని ‘’సంస్కృతం కాక వేరే భాష వచ్చునా ‘’?అని అడిగాడు . 1923 లో మళ్ళీ ఒకసారి దర్శించి ఆయన బంగారు ఛాయను చూసి అప్రతి భుడయ్యాడు శాస్త్రి . మాతారవిందులకోరికపై చేస్తున్న సంస్కృత ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి ఆశ్రమంలో చేరి 1953 ఆగస్టు 15 అరవిందుని జన్మదినం నాడు చనిపోయే వరకు 15-8-1953 అక్కడే ఉన్నాడు . అంతరాత్మ ప్రబోధించినప్పుడు మాత్రమే ఏదైనా రాసేవాడు  .

టి వి కపాలి శాస్త్రి అంటే 20 వ శతాబ్దపు అరుదైన వేద వేత్త మహా సంస్కృత  విద్వా0సుడు  అని యీ కాలం వారికి పెద్దగా తెలియదు .ఋగ్వేద విషయం లో కపాలి  అపర పరమేశ్వరుడే అని అరవిందులే అన్నారు .అరవిందుల ప్రఖ్యాత ఆంగ్ల కవిత ‘’హు ‘’ను కపాలి శాస్త్రి సంస్కృతం లోకి అనువదించాడు.ఇదీ ఆ కవిత లో మొదటిపాదం – In the blue of the sky, in the green of the forWhose is the Hand that has painted the glow?.

శాస్త్రిని జ్ఞానాంబునిథి  అన్నాడు ఆయన శిష్యుడు చిన్మయి .అరవిందాశ్రమ మదర్ గురించి శాస్త్రి ఆంగ్లం లో ‘’ఫ్లేమ్ ఆ ప్ ది వైట్ లైట్ ‘’అనే అపూర్వ గ్రంధం రాశాడు  దీనిని శాస్త్రి కోరికపై చిన్మయి బెంగాలీ భాషలోకి ‘’సదా జ్యోతి శిఖా ‘’గా అనువదించాడు . 1997లో సాక్షి ట్రస్ట్ వారు ‘’అరవింద కపాలి శాస్త్రి ఇన్ స్టి ట్యూట్ ఆ ప్ వేదిక్  కల్చర్ ‘’స్థాపించి వేద ,,అరవిందుల సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేశారు

. జీవితకాలమంతా రమణ మహర్షి ,అరవింద యోగి ల వేదాంతతత్వాన్ని వ్యాపింప జేయటానికే కృషి చేశాడు శాస్త్రి .ఉపాధ్యాయుడుగా అనువాదకునిగా ,విశ్లేషకునిగా ,వ్యాస రచయితగా కవిగా ,తంత్ర శాస్త్ర వేత్తగా శాస్త్రి లబ్ధ ప్రతిష్టుడు .అరవిందులవద్ద సాధన చేస్తున్నా ,శాస్త్రి రమణమహర్షి పై ఆరాధనా భావం వదలలేదు.ఏ   క్షేత్రం  లో పనిచేసినా శాస్త్రి దాని లోతులు తరిచాడు .ప్రాచీన భావధారకు అధునాతన విధానానికి గొప్ప సేతువు కపాలి శాస్త్రి .వేదాలలోని మహత్తర భావాలను అంతర్ దృష్టి  యోగసాధనలతో వెలికి దీసి లోకానికి అందించిన పూర్ణ పురుషుడు శాస్త్రి.ఋగ్వేద ప్రధమ అస్టకానికి  కపాలి శాస్త్రి సంస్కృతం లో రచించిన వ్యాఖ్యానం’’ఋగ్భాష్య భూమిక ‘’ అనితర సాధ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది .సాయనా చార్యుల కర్మ సిద్ధాంతానికి అతీతంగా రాసిన వ్యాఖ్య ఇది . ఇది ఆంగ్లం లోనూ వెలువడింది అందుకనే 20 వశతాబ్దపు అత్యుత్తమ సంస్కృత వేద వేత్తగా కపాలి శాస్త్రిని గౌరవిస్తారు .వేదం లోని స్వర్ణమయ కాంతులను దర్శించి ,లోకానికి ఆదర్శన భాగ్యాన్ని ప్రసాదించినవాడు శాస్త్రి .వేద ,తంత్ర ,ఉపనిషత్తుల విజ్ఞాన బాండాగారాన్ని తెరచి ఆ దివ్య నిధిని లోకానికి అందించినఅనితర సాధ్య సాధకుడు శాస్త్రి .ఆయన మంత్రాలతో దేవతలను ఆహ్వానిస్తుంటే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ  ప్రత్యక్షమయ్యేవారు దేవతలు .ఉపనిషత్తులు ఆత్మావిద్యా సాధనకు కరదీపికలు అని అరవిందులు భావించినట్లే శాస్త్రీ జీ కూడా భావించాడు

 

24 సంవత్సరాలు పాండిచ్చేరిలో శ్రీ మాతారవిందుల అంతేవాసిగా ఉండి అరవిందుల పూర్ణయోగ సాధనలో పండిపోయి దాన్ని గొప్పగా ప్రచారం చేశాడు శాస్త్రి .శాస్త్రి రాసిన గ్రంధాల వివరాలు-

సంస్కృత గ్రంధాలు-1ఋగ్వేద భాష్య -సిద్ధాంజన -ఋగ్ భాష్య భూమిక 2-ఋగ్వేద సంహిత -మొదటి అష్టకం -సంస్కృతం లో పదం అర్ధం భాష్యం  వివరణ 3-వాసిష్టమునిరాసైనా -ఉమాసహస్ర కావ్యం -ఆయన జీవిత చరిత్ర వాసిష్ఠ వైభవం అనే కాపాలి శాస్త్రి రచన 4-సంస్కృత మంత్రాలు శ్లోకాలు -వ్యాఖ్యానం అనువాదం 5-షట్ దర్శన భాష్యం ,రమణగీతప్రకాశం ,సావిత్రి 6-కొన్ని తెలుగు సంస్కృత రచనలు .

 ఆంగ్లం లో -లైట్స్ ఆన్  ది వేదాస్ ,  ఉపనిషత్స్ ,లైట్స్ ఆన్ టీచింగ్స్  వేదిక్  సిక్రెట్స్ ఇన్ కాంపాక్ట్ ఫార్మ్ ,ఫర్దర్ లైట్స్ ఆన్ ది వేదాస్ ,ది మహర్షి మొదలైనవి

  కపాల శాస్త్రి పేరు 1953లో ఆయన చనిపోయిన తర్వాత లోకానికి బాగా తెలిసింది .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

SASTRY, T.V. KAPALI
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  ఇచ్ఛా మరణం ఇచ్ఛా  గమనం పొందిన యోగి 

ఇచ్ఛా మరణం ఇచ్ఛా  గమనం పొందిన యోగి

   స్వామి రామా 17 ఏళ్ళ ప్రాయం లో గురువు బెంగాలీ బాబా ‘’నువ్వు నిజమైన విద్య  నేర్వాలని ఉంటె గంగోత్రి వద్ద ఉన్న మహాయోగి వద్దకు వెళ్లి నేర్చుకో ‘’అని పంపాడు ..అక్కడికి వెళ్లి చూస్తే ఆయన మహా అందగాడుగా చక్కని దృఢమైన శరీర సౌష్టవం తో మిసమిసలాడుతూ కనిపించాడు ..ఉక్కు కండలు తిరిగిన శరీరం విశాలమైన ఛాతీ తో 85 ఏళ్ళ వృధుడు ఆయన ..రామా వెళ్ళగానే ఆకలిగా ఉందా ఏమి తింటావని అడిగి ఆయన ఉన్న గుహలోకి వెళ్లి అక్కడున్న దుంపలు తీసుకుని తినమన్నాడు .ఆయన చెప్పినట్లే రామా చేశాడు .అది పాలతో వండిన ఆహారపు రుచి గా ఉంది .. తినటం అవగానే తానేమీ మాటలతో బోధించను అని చెప్పాడు .ఆయన ప్రక్కనే స్వామిరామా మూడు రోజులు కూర్చున్నాడు .ఇద్దరిమధ్య మౌనమే ..మూడవ రోజు మనసులో తాను  ఇక్కడికి రావటం శుద్ధ దండగ అని ఈయన నేర్పేది ఏమీలేదని అనుకొన్నాడు వెంటనే ఆ యోగి ‘’నిన్ను ఇక్కడికి మీ గురువు పంపింది జ్ఞానాత్మక విద్య నేర్చుకోవటానికి కాదు అదికావాలంటే బోలెడు గ్రంధాలున్నాయి చదివి గ్రహించవచ్చు నిన్ను పంపింది ఇక్కడ కొంత అనుభవం పొందమని .నేను నా శరీరాన్ని  ఎల్లుండి విసర్జింప బోతున్నాను ,’’అన్నాడు ..ఎందుకు శరీరాన్ని త్యాగం చేసుకోవాలో రామాకు అర్ధంకాక అది ఆత్మహత్యగా భావించాడు .ఇది గ్రహించి ఆయన ‘’నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు .సన్యాసులు ఆత్మహత్యకు పాల్పడరు .పుస్తకం అట్ట  నలిగిపోతే  ,పాడుకాకుండా కొత్తఅట్ట  వేసినట్లు ,దిండుగలేబు మాసిపోతేదాన్ని నాశనం చేయకుండా  కొత్తది తొడిగినట్లు స్వచ్చంద శరీర త్యాగం అలాంటిదే . రామా కుర్రాడుకనుక ‘’ స్వామీ !ఇంత అందమైన ,దృఢమైన శరీరాన్ని ఎందుకు విసర్జించాలని అనుకొంటున్నారో  నాకేమీ అర్ధం కావటం లేదు .వద్దు అది పాపం ‘’అన్నాడు వేడికోలుగా . ఆయన ప్రశాంతంగా వినిఊరుకోగా ,ఒక శిష్యుడు  ‘’నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ?ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడో నేనెక్కడో ‘’అని ప్రక్కకు తీసుకు వెళ్లి’’ఆయన ప్రశాంతతకు భంగం కలిగించవద్దు . పిచ్చిప్రశ్నలు అడుగుతున్నావు ఆయనను .యోగులు అంటే ఏమిటో నీకు తెలియదు .ఆయన ను ప్రశాంతంగా దేహ త్యాగం చేయనివ్వు ‘’అన్నాడు ..రామ ఆ శిష్యుడితో ‘’అందమైన ఆదేహాన్ని వదిలెయ్యటం ఎందుకు ?దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటె రిపోర్ట్ ఇచ్చేవాడిని .ఇది చట్ట వ్యతిరేక చర్య ‘’అన్నాడు ..శిష్యుడు యెంత చెప్పినా రామ సంతృప్తి చెందలేదు .అందమైన శరీరం వదలటమేమిటనే ఆయన ఆలోచన ..చివరికి శిష్యుడు ‘’ప్రశాంతంగా ఉండి అన్నీ గమనించు . అంతా నీకే అర్ధమవుతుంది ‘’అన్నాడు .ఆ స్వామి మరొక 24 గంటలు స్వామిరామాతో మాట్లాడనే  లేదు  .రామా మాత్రం  ‘’ఈయన ఇప్పటిదాకా నాకు చెప్పిందేమీలేదు .నేనిక్కడ ఉండటం దండగ నేను వెళ్ళిపోతాను ‘’అని శిష్యుడితో అన్నాడు .

  ‘’ఆయన ప్రాణ త్యాగం చేసే విధానాన్ని ఎందుకు చూడవు ?’’అన్నాడు శిష్యుడు రామా ‘’ఇది చాలా బుద్ధితక్కువపని నేనైతే హాస్పిటల్ లో చస్తా .ఈ  వెర్రి ఏమిటి ?’’అని తన ఆధునిక భావాలు ఆవిష్కరించాడు . .శిష్యుడు ‘’నీకు అర్ధం కాదు .నిన్ను ఇక్కడికి పంపించింది చూస్తూ తెలుసుకోమని .నీ మనసులో వితర్కించుకోవాలంటే నీ  ఇష్టం .కానీ ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగించవద్దు ‘’అన్నాడు .చివరికి ఆ స్వామి ‘’నిజంగా నేనేమీ చేయటం లేదు .మనకు శరీర త్యాగం చేసే సమయం వచ్చిందని తెలిసిపోతుంది.  ప్రకృతికి అడ్డుపడలేము . అది సహజ ధర్మం . మరణం ప్రకృతికి సాయం చేస్తుంది .చావుకు భయపడరాదు దానివలన ప్రయోజనం ఉండదు .అర్థమైందా ?’’అన్నాడు మౌనాన్ని ఛేదించి .’’నాకు చావాలని లేదు .కనుక అర్ధం చేకుకోవాల్సిన పని లేదు ‘’అన్నాడు మొండిగా .’’.నీ వైఖరి సరైనదికాదు మరణం అంటే ఏమిటో తెలుసుకో .మన0  అనేక భయాలమధ్య బతుకుతున్నాం .చావు అంటే నాశనం చేసేదికాదు అది శరీరాన్నుంచి వేరు చేసేది ‘’అనగా ‘’శరీరం లేకుండా నేనుండలేను ‘’అన్నాడు రామా అప్పుడు ఆయన ప్రశాంతంగా ‘’చావు శరీర ధర్మం .ఎవరూ  అంతకాలం  ఈ శరీఅరం తో బతికి  ఉండలేరు .అది మార్పు చెందాలి శిధిలమవ్వాల్సిందే . ఇది నీకు తెలియాలి.  జీవితానికిపట్టుకొని వ్రేలాడకుండా విముక్తిపొందేవారు   అతి కొద్దిమందే ఉంటారు  . ఆ టెక్నీక్ నే యోగా అంటారు .ఇది ఇప్పుడు అందరూ చేస్తున్న మామూలు యోగా కాదు ఉన్నతమైన యోగా అదిధ్యానం లో సరైన పధ్ధతి . నీకు తెలిస్తే శరీరం  మనసు బుద్ధి మొదలైన  అన్ని విషయాలపై నీకు నియంత్రణ వస్తుంది .అది ప్రాణ ,అనే ఉచ్వాస నిశ్వాసా ల వలన సాధ్యం.దానివలన మనసుకు శరీరానికి మంచి సంబంధం కలుగుతుంది .ఊపిరిపీల్చటం ఆగిపోతే లంకె తెగిపోతుంది . అదే మృత్యువు .అయినా నువ్వు ఇంకా జీవించే ఉంటావు ‘’అని చెప్పాడు

  ‘’శరీరం లేకుండా ఎలా ఉంటాం ?’’అడిగాడు రామా . ‘’చొక్కా లేకపోతే ఎలా ఉంటావో అలా ‘’అంతే .అంతకన్నా ఏమీ లేదు ‘’అన్నాడు స్వామిజీ . అయినా అసంతృప్తిగానే ఉన్నాడు రామా .   శరీర త్యాగం చేయటానికి ముందురోజు స్వామీజీ కొన్ని సూచనలు చేశాడు ఇద్దరికీ .  .తెల్లవారుజామున 5 గంటలకు ప్రాణ త్యాగం చేస్తాను .మీరు నా శరీరాన్ని గంగానదిలో ముంచేయండి .మీ ఇద్దరూ ఆపని చేయగలరా “‘అని అడుగగా ‘’నేనొక్కడినే చేయగలను ‘’అన్నాడు రామా ప్రగల్భ0 గా .ఆ గుహకు గంగ కొన్ని వందల గజాల దూరం లో ఉంది .తెల్లవార్లూ చావు గురించే ఆలోచించాడు మూడుగంటలకే లేద్దామనుకొన్నారు ఇ ద్దరూ. .కానీ నిద్రపట్టక ముందే లేచారు .స్వామీజీ ‘’మీకేమికావాలో కోరుకోండి ఇస్తాను ‘’అన్నాడు .రామా ‘’చచ్చిపోయేవారు మీరేమిస్తారు ?’అన్నాడు వ్యంగ్యంగా సిరివెన్నెల సీమలో లో సర్వదమన బెనర్జీ ‘’ఆది భిక్షువు వాని నేమి కోరేదీ ‘’అన్నటైపులో .అప్పుడు స్వామీజీ ;;యదార్ధ గురువు ను చావు ఏమీ చేయలేదు . మరణం తర్వాత కూడా గురువు శిష్యులకు మార్గ దర్శనం చేస్తాడు ‘’అని చెప్పి శిష్యుడివైపు తిరిగి ‘’ఈ’’ కొత్త పయ్యా ‘’   నీకు తలనెప్పిగా ఉన్నాడా ?’’అని అడిగాడు .అతడు నిర్మొహమాటంగా ‘’నిజమేస్వామీ కానీ నేనేం చేయగలను ‘’అన్నాడు .

  తెల్లవారుజామున అయిదు అయిదున్నర మధ్య ఈ ఇద్దర్నీ  స్వామీజీ దగ్గరకు పిలిచి ‘’ధ్యానం లో ఉండండి .అయిదు నిమిషాలలో దేహత్యాగం చేస్తాను .ఈ కట్టే పని అయిపొయింది ఇక భరించలేదు కనుక విసర్జించాల్సిందే ‘’అన్నాడు .అయిదు నిమిషాలతర్వాత స్వామీజీ ఓం ‘’అన్నాడు .ఆతరువాత అంతా నిశ్శబ్దమే ..రామా ఆయన నాడి  చూసి స్వామీజీ తన నాడిని  హృదయ స్పందనను శ్వాసను తాత్కాలికంగా నిలిపేశాడేమో అనుకొన్నాడు .తర్వాత శరీర ఉష్ణోగ్రత  కళ్ళు ,వగైరాలు పరీక్షించాడు .శిష్యుడు ఇక చాలు అని గురువు సిద్ధి చెందారని ఆలస్యం చేయకుండా సూర్యోదయానికి ముందే దేహాన్ని గంగలో నిమజ్జనం చేయాలని అన్నాడు .భయపడవద్దని తానే  మోసుకొని వెళ్లగలనని అనగా తానూ సహాయపడతానన్నాడుశిష్యుడు .ఇద్దరూ ప్రయత్నించినా ఆ దేహాన్ని కదల్చలేక పోయారు . ఒక పైన్  చెట్టు గట్టి కొమ్మ తెచ్చి తొడలమధ్య పెట్టి కదిల్చే ప్రయత్నం చేశారు ఫలితం కనిపించలేదు .ఒక గంట సేపుఅన్ని ప్రయత్నాలూ చేశారు . కానీ అంగుళం కూడా కదల్చలేక పోయారు .

  సూర్యోదయానికి కొన్ని నిమిషాలముందు ‘’ఇప్పుడు మనం శరీరాన్ని మోసుకు పోదాం ‘’అనే మాట వినిపించింది .అక్కడ వాళ్లిద్దరే  తప్ప మూడోపురుగు లేదు .బహుశా తాను మనసులో అనుకొంటున్నానేమో అని రామా భావించాడు . శిష్యుడిని అడిగితె తనకూ ఆమాట వినిపించింది అన్నాడు .ఇంతలో స్వామీజీ భారీ అందమైన శరీరం ఒక్కసారిగా దానంతటికి లేచి   గాలిలోకి ఎగిరిప్రయాణించి  గంగానదిని చేరి అందులో మునిగి అదృశ్యమైంది .ఈ ఇద్దరూ షాకయ్యారు జరిగిన సంఘటన చూసి .సిద్ధ పురుషులకు అసాధ్యమైనది లేదు అని మనం తెలుసుకోవాలి .

  సమాప్తం

 ఇప్పటిదాకా హిమాలయ యోగుల గురించి చాలా యదార్ధ గాధలు రాసి మీకు తెలియ జేశాను .దీనికి ఆధారం మొదట్లోనే చెప్పినట్లు స్వామిరామా ఆంగ్లం లో రాసిన ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’అని మరొక్కసారి మనవి చేస్తూ ఈ ధారావాహికను సమాప్తి చేస్తున్నాను .ఎందరో ఆత్మజ్ఞానం పొంది విశ్వ శ్రేయస్సును కాంక్షించే మహా యోగులు .అందరికి శిరసువంచి పాదాభివందనాలు.

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చచ్చి బతికి బోధించి దేహత్యాగం చేసిన యోగి

చచ్చి బతికి బోధించి దేహత్యాగం చేసిన  యోగి

మహిమాన్విత యోగులు హిమాలయాలలోనే ఉంటారనే భ్రమలో ఉండేవాడు స్వామిరామా . కానీ ఒకనది  ఒడ్డున పట్టణానికి దగ్గరలో  ఒక యోగిఅనుభవం ఆయన్ను అప్రతిభుడిని చేసింది . ఆయన్ను చూడాలని బయల్దేరాడు . .ఇంకా అయన ఆశ్రయానికి నాలుగు మైళ్ళ దూరం లో ఉండగానే ఆయన రామాకు శిష్యులతో ఆహారం పంపాడు ..ఎవరైనా వస్తుంటే తానూ ఇలాగె చేస్తానుకదా ఇందులో వింతయేమున్నది అని పించింది . ఆశ్రమానికి వెళ్ళగానే ఆయన ‘’నాయనా !నువ్వు ఆలస్యంగా వచ్చావు .రేపు ఉదయం నేను శరీర త్యాగం చేయబోతున్నాను’’ .అన్నాడు రామా ఆదుర్దాగా ‘’స్వామీ తమరు మరొక పూట  ఉండి నాకు జ్ఞాన బోధ చేయలేరా ?’’అన్నాడు వినయంగా .’’లేదు కుదరదు.సమయం లేదు  ‘’అన్నాడు నిర్మొహమాటంగా .

  అక్కడ ఆయనవద్ద అనేక మార్గాలపై విశ్వాసం వున్న శిష్యులున్నారు . హిందువులకు ఆయన స్వామి .ముస్లిం లకు ఇస్లా0  ముల్లా  క్రిస్టియన్లకు యేసు అనుయాయి ..ఆయన చనిపోగానే ఆయన శరీరాన్ని క్రిస్టియన్ సెమిటేరికి  తీసుకు వెళ్లాలని క్రైస్తవులు ,ముస్లిం లు మసీదుకు ,హిందువులు ఆయన్ను అక్కడే సమాధిచేసి ఒక స్మారక చిహ్నం కట్టాలని తీవ్రంగా భావిస్తున్నారు ..

 మర్నాడు ఉదయం ఆయన ముందే చెప్పినట్లు దేహ త్యాగం చేసేశాడు .డాక్టర్ వచ్చి ఆయన చనిపోయాడని నిర్ధారించాడు .తర్వాత కొన్ని గంటలు శిష్యులమధ్య తర్జన భర్జనలు గందర గోళం ..అన్నిమతాలవారు ఆ పార్థివ శరీరం తమకే దక్కాలని పోట్లాడుకొంటున్నారు సమస్య జఠిలమై పోయింది . పరిష్కారం లభించటం లేదు . జిల్లా మాజిస్ట్రేట్ వచ్చాడు .స్వామి రామాతో ‘’మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఈ యోగి ఏ మతానికి చెందిన వాడో చెప్పండి ‘’అని అడిగాడు ..రామా ఆయనతో ‘’నాకేమీ తెలియదు ‘’అన్నాడు .మనసులో ‘’ఇదేమిటి ఈ యోగి చనిపోతూ భలే ఫిట్టింగ్ పెట్టాడే .నాకు ఈయనేం బోధ చేస్తాడు .నిజంగా మహా యోగి అయివుంటే ఇలాంటి సమస్యను సృష్టించేవాడు కాదుకదా ‘’అని మనసులో రామా వితర్కించుకొన్నాడు ..

ఆ యోగి ప్రాణం విడిచి   అప్పటికి నాలుగు గంటలయింది ..అప్పుడు అకస్మాత్తుగా ఆయన లేచి ‘’ఒరే మూర్ఖుల్లారా !మీరు నా దేహం కోసం కొట్టుకు చస్తున్నారు కనుక నేను చావ దలచుకోలేదు ‘’అన్నాడు అక్కడున్న మేజిస్ట్రేట్  ,జనమూ ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయారు ..ఆయోగి అక్కడి మూడుమతాల శిష్యులతో ‘’తెలివితక్కువ సన్నాసుల్లారా! నా కళ్ళ ముందు నుంచి మీరు తక్షణం వెళ్లిపోండి .నాకు కనిపిస్తే సహించను .నేను దేవునికి తప్ప ఎవరికీ చెందిన వాడినికాను .పొండి వెళ్లి పోండి ‘’అని గద్దించాడు . స్వామి రామాను దగ్గరకు పిలిచి ‘’నాయనా !కంగారు పడకు .నేను ఇక్కడే మూడు రోజులు ఉండి నీకు కావలసింది అంతా బోధిస్తాను .నాల్గవ రోజు శరీర త్యాగం చేస్తాను ‘’అని చెప్పాడు ..

  స్వామిరామా ఆయోగివద్ద మూడు రోజులు ఉండి  ఆత్మజ్ఞానం బోధనవలన సంతుష్టుడయ్యాడు .రామా జీవితం లో ఈ మూడు రోజులు చిరస్మరణీయమైనవని భావించాడు .ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం బోధించాడు .ప్రతి రోజు ఆయన నోటి నుంచి ‘’నువ్వు యదార్ధంగా ఎవరివో అది అవ్వాలి నువ్వు .నువ్వు కానిదానికోసం నటించవద్దు ‘’ఈ మహా వాక్యాన్ని రోజూ అనేక సార్లు ఉచ్ఛరించేవాడు ఆ యోగి పుంగవుడు ..మూడు రోజులు అయ్యాక ఆయన రామా తో ‘’నేను జల సమాధి ఆవాలను కొంటున్నాను ‘’అని చెప్పి నదికి నడిచి వెళ్లి అందులో అదృశ్యమయ్యాడు .జనం తర్వాత వచ్చి అడిగితె ఆయన నదిలో మునిగిపోయాడు మళ్ళీ కనిపించలేదు అని చెప్పాడు . వాళ్లంతా ఆ నదిని అంగుళం అంగుళం గాలించి వెతికారు . కానీ ఆయన దేహం వాళ్లకు దొరకలేదు .మహర్షులు మహాయోగులు ఏదో ఒక మతానికి చెందినవారు కాదు .ఈ అడ్డుగోడలకు  అతీతంగా ఉండేవారు .వారు సర్వమానవాళికి చెందినవారు ..  మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )

సౌర శాస్త్రం (సోలార్ సైన్స్ )యోగ శాస్త్రాలలో అత్యాధునికమైనది .మానవ బాధానివారణకు ఉపయోగపడేది ..పరమగురువు చెప్పినప్రకారం అదొక ప్రత్యేక ధ్యాన విధానం.మానవుని లోని సౌరవలయం (సోలార్ ప్లెక్సెస్ ) పై ఆధార పడి  ఉంటుంది . భౌతిక మానసిక వ్యాధుల నివారణకు అత్యుత్తమ విధానం . మానవ శరీరం లో సౌర వలయం అతిపెద్ద జాలం దాని కేంద్రాన్ని మణిపూరకచక్రం  అంటారు . ఈ చక్రం పై ధ్యానం చేయటానికి అనేక పద్ధతులున్నాయి ,కానీ ఆధునిక ప్రాణాయామం సౌర శాస్త్రాన్ని ఉపయోగించి చేస్తే ప్రాణశక్తికంటే ఉన్నతమైన ఒక గొప్ప శక్తి స్థాయికి చేరుస్తుంది .ఈ స్థాయిలో శక్తి లయలను ఉదయ సూర్యుని పైగాని ,ఉదరాగ్ని పై కానీ ధ్యాస ఉంచి అధ్యయనం చేయాలి ..ఈ నివారక విధానం ఉపనిషత్తులలో వివరించబడినది ,. అతికొద్ది మంది పండితులకు వేత్తలకు మాత్రమే ఇది తెలుసు . ఈ శాస్త్రాన్ని తెలుసుకొంటే భౌతిక ,ప్రాణిక ,మానసిక స్థాయిలపై ఆధిపత్యం ,నియంత్రణ లభిస్తుంది .దీనీపై ప్రవీణుడైనవాడు  ఆశక్తిని ప్రసారం చేసి ఎవరి రోగాలనైనా,యెంత దూరం లో ఉన్నా  నివారించి  ఆరోగ్యం చేకూర్చగలడు .

  తనగురువు బెంగాలీ బాబా నుండి స్వామిరామా అన్నిశాస్త్రీయ  విద్యలలో గొప్పదైన ‘’శ్రీ విద్య ‘’ను పొందాడు .  ఇది టిబెట్ లోని అన్నిమండలాల లోను ,భారతీయ సాహిత్యం లోను తల్లి విద్య లాంటిది .ఆధునిక సాధనలో సాధకుడు శ్రీ యంత్రం లోని వివిధ భాగాలపై ద్రుష్టి కేంద్రీకరించే విధానాలు తెలుసుకొని అప్పుడు కేంద్రం పై దృష్టినిలిపే ప్రయత్నం చేస్తాడు .ఇది ఆధ్యాత్మిక శక్తికేంద్రమైన బిందువు ఇక్కడే శివుడు, శక్తి(శివా శివులు ) కలిసి ఐక్యమై ఉంటారు . మలబారు కొండలపై ఈ విద్యను తనకు గురువు నేర్పినా ‘’బిందు భేదనం ‘’సాధన మాత్రం బోధించలేదు .ఈ పర దేవత ఆరాధనా విధానం లో మహర్షులు చెప్పిన విజ్ఞానం అంతా ఉంటుంది . దీనికోసం గ్రంధాలు చదవాల్సిందే .కానీప్రజ్ఞానిధియైన  గురువే మార్గ దర్శకత్వం చేయాలి .అప్పుడే సార్ధకమవుతుంది .ఈ ఉన్నత విద్య తెలిసినవారు వేళ్ళమీద లెక్కింపతగినంత మందిమాత్రమే ఉన్నారు .మన సంప్రదాయం శ్రీ విద్యను బాగానే బోధిస్తుంది .పరమగురుదర్శనం ఆయన బోధించిన ఆధునిక యోగం వలన తాను  టిబెట్ కు వచ్చిన పని సార్ధకమైందని సంతృప్తి చెందాడు స్వామి రామా ..

  పరమగురువు వద్ద టిబెట్ లో నెలన్నర ఉండి అధ్యయనం చేసిన తర్వాత ఒక రోజు గుహ బయట కూర్చుని తన యాత్రానుభవాలను రాస్తున్న డైరీ జ్ఞాపకం వచ్చి అది ఇక్కడ తనదగ్గర ఉంటె ఎంతబాగుండును ఈ విషయాలన్నీ అందులో రాసుకొనే వాడినికాదా అని మనసులో అనుకొన్నాడు ..లోపలున్న పరమగురువు చిరునవ్వుతో లోపలి రమ్మని పిలిచి ‘’నీ డైరీ నీకోసం తెప్పించగలను .దాని అవసరం లేదా ?’’అని అడిగితె ఆశ్చర్యపోయినా  ఇలాంటి అద్భుతాలు మహాత్ములకు చాలా సునాయాసం అని గ్రహించి ,ఇలాంటివి తానూ చాలాచూశాడుకానుక అద్భుతం అనిపించలేదురామాకు …’’అవును స్వామీ కొన్ని పెన్సిళ్లు కూడా కావాలి ‘’అన్నాడు ..స్వామిరామా తాను రాస్తున్న డైరీని ఉత్తరభారతం లోని నైనిటాల్ కొండలలో ఉన్న భవాలీ శానిటోరియం లో వదిలేసి వచ్చాడు . అకస్మాత్తుగా 475 పేజీలతో ఉన్న పెద్ద డైరీ మూడు పెన్సిళ్ళతో అక్కడ ప్రత్యక్షమయ్యాయి .రామా సంతోషించాడుకాని ఆశ్చర్యపడలేదు .తనకు ఆధ్యాత్మికంగా ఏదైనా కొత్త విషయం బోధించమని అడిగాడు .

  నవ్విన పరమగురువు ‘’నీకు అది అంతా బోధించాను .దాన్ని పునశ్చరణ చేస్తూ మనసులో నిలుపుకోవాలి .నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి .నువ్వు ఇప్పుడు లాసాకు వెళ్లి అక్కడనుండి ఇండియా వెళ్ళు .అనగా ‘’నేను ఇండియా వెళ్ళటం కుదరదు వెడితే నన్ను అరెస్ట్ చేస్తారు ‘’అన్నాడు .వెంటనే గుగ్గురువు ‘’త్వరలో ఇండియాకు స్వతంత్రం రాబోతోంది .నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే విపరీతమైన మంచు  హిమానీ నదాలు నిన్ను అడుగుకూడా ముందుకు వేయనియ్యవు ‘’అని హెచ్చరించి పంపాడు . మళ్ళీ ఆయన దర్శనం కాలేదు .కానీ కొద్దికాలం తర్వాత ఆయన శిష్యులకు వీడ్కోలు పలికి అదృశ్యమై పోయాడని విన్నాడు .కొందరు ఆయన తా నక్ పురా వద్ద ప్రవహించే కాళీ గంగానదిపై పుష్పహారాలతో తేలుతూ ఉండటం చూశామని చెప్పారు . తన గురువు బెంగాలీ బాబాను పరమగురువు బ్రతికి ఉన్నారా అని అడిగితె చిరునవ్వు నవ్వి ‘’అది నీ అంతట నువ్వే తెలుసుకోవాలి ‘’అని మాత్రమే అన్నాడు .

   ఏమి జరుగుతుందో అనే భయంతో లాసా చేరి పూర్వపు లామా కు అతిధిగా ఉండి జూన్ 1947 న ఇండియా కు బయల్దేరాడు ..రెండు కంచరగాడిదలు ఇద్దరుగైడ్ ల సాయం తో ఒక నెల ప్రయాణించి దట్టంగా మంచు తో నిండిన కనుమలకు దాటి సిక్కిం రాజధాని గాంగ్ కాక్ చేరాడు అక్కడికి చేరటానికి మూడురోజుల ముందే భారత దేశానికి స్వతంత్రం  వచ్చింది .గాంగ్ కాక్ లో ఈశాన్యాన ఇప్పటికీ ఉన్న ఒక మొనాస్టరీ లో ఉన్నాడు .అక్కడ బౌద్ధ యోగి బుద్ధగయ లో చాలాకాలం ఉండి  సంస్కృతం అభ్యసించిన ఒక ప్రసిద్ధ   లామాను దర్శించి .ఆయనతో ఉన్నాడు .సాధారణంగా బౌద్ధం శంకరాచార్యులవారిని విమర్శిస్తుంది .కానీ ఈ మహా పండితుడుమాత్రం భారతీయ గ్రంథాలనుండి అనేక ఉదాహరణలిస్తూ సంభాషిస్తాడు బౌద్ధం శంకరాద్వైతం లను సమన్వయ పరచి చక్కగా మాట్లాడతాడు .ఈ లామా ‘’పరమోన్నత సత్య0  విషయం లో ఈ రెండు సిద్ధాంతాలలో భేదం ఏమీలేదు  . ఉన్నభేదం శబ్దాలకు మాటలకు సంబంధించిమాత్రమే .. ఈయన ఇండియా టిబెట్ జపాన్ చైనా దక్షిణాసియా లోని బౌద్ధ అనుయాయుల గురించి బాధపడుతూ ‘’వీళ్ళు బౌద్ధ ధ్యాన పధ్ధతి ,ఆత్మజ్ఞాన సమ్పత్తిని పూర్తిగా వదిలేసి కర్మకాండలలో కూరుకు పోయారు .ఇదిగౌతమబుద్ధుడు బోధించిన  అసలైన బౌద్ధ విధానం కాదు. ఈ ఆధునిక పోకడల ను నివారించటానికి కల్తీ లేని అసలైన బౌద్ధం  అదృశ్యమై పోయింది .వేలాది బౌద్ధ దేవాలయాలు  బౌద్ధాలయమాలు పూజారులు  సన్యాసులు  కర్మ కాండలకే పరిమితమై పోవటం బాధ కలిగిస్తోంది .బుద్ధుడు చెప్పిన ‘’మీ దీపం మీరే వెలిగించుకోండి .ఎవరూ మీకు  విముక్తిని ఇవ్వలేరు .మిమ్మల్ని మీరు తెలుసుకోండి .నిర్వాణం పొందండి అప్పుడు మీరే బుద్ధులౌతారు ‘’అని బోధించినదానికి పరమ విరుద్ధంగా ఉంది ‘’అని ఆ లామా ఆవేదన చెందాడు .

   ఈ లామా ఆత్మజ్ఞానం మరచి కర్మకాండలలో కూరుకు పోయిన సరైన అద్వైతాన్ని బోధించని  శంకర అనుచరులైన అద్వైతులనుకూడా విమర్శించాడు .’’ఇలాంటి బోధనలు మనుషులను గందర గోళ  పరుస్తాయి ..శంకరుల వేదాంతం వేద  బౌద్ధ వేదాంత సమన్వయము .’’అసగ్రా ఇదం అగ్ర అసిత్ ‘’అంటే దృశ్య ప్రపంచం శూన్యం లో నుంచి ఉద్భవించింది ‘’మొదలైన సంస్కృత శ్లోకాను మాండూక్య ఉపనిషత్ ,బౌద్ధ  విద్వాన్సుడు   ఈశ్వర కృష్ణుని సాంఖ్య కారిక ల నుండి ఉదహరిస్తూ  తన భావాలను వ్యక్తం చేసి చెప్పాడు స్వామి రామాకు.అనేక రోజులు రామాకు వేదాంత బోధ చేసి స్వామిరామాను హిమాలయాలలో ఉన్న తన బెంగాలీ గురువు ను త్వరగా కలుసుకోమని చెప్పి వీడ్కోలు పలికి పంపించాడు .

           మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

56 వ శ్రీ సుందరకాండ పారాయణం 

56 వ శ్రీ సుందరకాండ పారాయణం

  శ్రావణమాస సందర్భంగా 27-7-2017 గురువారం నుండి 4-8-17 శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం )వరకు 9 రోజులు నాచే 56 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ   ఉదయం 7-30 నుండి 9-30 వరకు షార్లెట్ లోని మా అమ్మాయి వాళ్ళ స్వగృహం లో భగవదనుగ్రహం తో నిర్వహింపబడుతోందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు ) వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )

వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )

వెంకయ్య నాయుడు వారం

17-7-17 సోమవారం -ఉపరాష్ట్రపతి పదవికి యెన్ డి ఏ అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడిని ప్రధాని మోడీ ప్రకటించాడు .మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ ఈ పేరు వినిపిస్తూనే ఉంది .వెంకయ్యమాత్రం ‘’నేను ఉషాపతి ని మాత్రమే ఉప రాష్ట్ర పతి నికాను ‘’అని ప్రకటిస్తూనే ఉన్నాడు .ఇప్పుడు తప్పలేదు . ఒక ఆంధ్రుడికి ఒక క్రియాశీలక కార్యకర్తకు వక్తకు ముఖ్యంగా మన భాష సంస్కృతులపై విశేషమైన అభిమానమున్న వెంకయ్యకు ,అంటే ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవం ఇది ..మెజారిటీ ఎలానూ ఉందికనుక ఎన్నిక లాంఛన ప్రాయమే .

   వెంకయ్య పై నాకున్న అజ్ఞాత పరిచయం .బహుశా 1967-70 మధ్యకాలం అనుకొంటా సరిగ్గా గుర్తు లేదు . బందరు హిందూకాలేజి లో లెక్కలమేస్టారుగా శ్రీ రాజనాల శివరామ కృష్ణ మూర్తి -ఆర్ ఎస్ కె మూర్తి అనే ఆయన తో పరిచయం కలిగింది .ఆయన లెక్కలు బాగా చెప్పేవారు ఇంటిదగ్గర ట్యూషన్ కు వందలాది విద్యార్థులు ఉండేవారు ఇంగ్లిష్ లో దిట్ట .ఆర్ ఎస్ ఎస్ కు సుశిక్షిత కార్యకర్త బి జెపి నాయకుడు .జాగృతి వారపత్రిక ఆయనే చూసేవారు అందులో సినిమా రివ్యూ చాలా గొప్పగా రాసేవారు మీదు మిక్కిలి మంచి కథా  రచయి.  హాస్యం అంతర్వాహినిగా ఉండేది ఆయన రచనలలో . మాకు ఫామిలీ ఫ్రెండ్ .ఇద్దరం కలిసి శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి అభ్యర్ధన మేరకు ఆయన శాసనమండలి ఎన్నికకు ప్రచారం కూడా చేసాం .మేస్టారూ అని ఆప్యాయంగా పిలిచేవాడిని .

 అప్పుడాయన ‘’సాందీపని ‘’అనే మాస పత్రిక నడిపేవారు . దానిలో నన్ను కవితలు రాయమని కోరేవారు .అప్పుడాయన నెల్లూరి కుర్రాడు వెంకయ్య నాయుడు అనే అబ్బాయి చాలా వినయ వివేక శీలి  బుద్ధిమంతుడు ,గొప్ప కార్యకర్త .సాందీపనిలో రాస్తూంటాడు .అని చెప్పేవారు ఇదే అజ్ఞాత పరిచయం .నేను ఇందిరా గాంధీ పై ‘’కొమ్మా బొమ్మా అమ్మ ‘’అనే వ్యంగ్య కవిత రాశాను అది చదివి ఆయన సాందీపనిలో ప్రచురించారు . కనుక వెంకయ్య రాసె పత్రికలో నేనూ రాయటం అజ్ఞాత పరిచయమే . తరచుగా వెంకయ్య మేష్టారి దగ్గరకు వచ్చి సలహాలు తీసుకొనే వాడు . ఆ తర్వాత ఆంధ్రా ఉద్యమం లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిపిన సభలలో వెంకయ్య ,యలమంచిలి శివాజీ ,వడ్డే  శోభనాద్రీశ్వరరావు   సుంకర సత్యనారాయణ కొమరగిరి కృష్ణమోహన్ లవంటి యువ రక్తం ఊరూ రా ఉపన్యాసాలతో హోరెత్తించేవారు .విశాఖ ఉక్కు ఉద్యమం లోనూ ముందే ఉన్నారు  వాటిఫలితం దక్కలేదు కానీ వీరి పాత్ర మరువలేనిది . వీరిలో శివాజీ ధీరిటీషియన్ .స్టాటిస్టిస్ తోమాట్లాడేవాడు .ఉపన్యాసం రాణించేదికాదు .  కొమరగిరి ,వెంకయ్య లు దారాళ పాత వక్తలు .బిజెపి ఆర్ ఎస్ ఎస్ ను నరనరానా జీర్ణించుకున్నవారు .సుంకర కూడా వంకర ప్రాస లతో జనానికి కిక్కెక్కించేవాడు . శివాజీ రాజ్య సభ సభ్యత్వ0 తో  చరణ్ సింగ్ అంతేవాసిత్వం తో ఆగిపోతే ,కొమరగిరి ఇక్కడే ఆగి ఒక ఆధ్యాత్మిక పత్రికా సంపాదకుడుగా బందర్ కె పరిమితమైతే లకు  ఎక్కడో లక్కలాపట్టి సుంకర కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు .వద్దే లోక్ సభ సభ్యుడు రాష్ట్ర మంత్రీ అయ్యాడు . పార్టీని సిద్ధాంతాన్ని పూర్తిగానమ్మి జనసంఘ్ తో తర్వాత భారతీయ జనతాపార్టీ తో నిబద్ధంగా ఉంటూ సుశిక్షిత ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా అందరి అభిమానం పొంది గొప్పవక్తగా ప్రాస యమక చక్ర వర్తి గా అంచెలంచలు మీద ఎదిగి బిజెపి అత్యున్నత వ్యవస్థాగత స్థానం పొంది ,ఆంధ్రా విభజన సమయం లో కీలక పాత్ర పోషించి అన్యాయం జరగకుండా ప్రయత్నించి ,అటల్ బిహారీ వాజ్ పేయికి ,లాల్ కృష్ణ అద్వానీ కి అంతేవాసియై మోడీ ప్రధానికావటానికి అడ్డంకులు తొలగించి ,తానూ కేంద్ర మంత్రిపదవి పొంది ,ప్రతిపక్షాలతో చక్కని సంబంధం కలిగి సమస్యా పరిష్కారానికి తగిన వాడనిపించి ఇప్పుడు ఉపరాష్ట్ర పతి పదవి అందుకో బోతున్నాడు నిబద్ధతకు తగిన ప్రతిఫలం ఇది . ఏనాడూ జంపింగ్ ఫ్రాగ్ కాలేదు .ఇది ఆంధ్రులందరు గర్వించదగిన సమయం .అందుకే ఈవారం వెంకయ్య వారం అన్నాను .

    మంగళవారం     గీ -3 లో కొండవీటి వేంకటకవి పై రాశాను .ఆస్ట్రో ఫిజిక్స్ ఆధారం గా బ్లండరే  బ్లండర్ , మూలకాలు అంతరిక్ష మార్పులు రాశాను .ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 100 ఫారం హీట్ డిగ్రీలు ఉంటోంది .యెన్ కస్తూరి అనే ఆయన రాసిన ‘’లవింగ్ గాడ్ ‘’చదవటం ప్రారంభించి ఆపకుండా దాదాపు ఎనభై పేజీలు చదివాను చాలాబాగా ఉంది .కేరళలో పుట్టి మైసూర్ లో ఉద్యోగించి ,ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి,శ్రీరామకృష్ణ పరమహంస ,వివేకానంద మార్గం లో ప్రయాణించి సత్యసాయికి దగ్గరై ఆయన జీవిత చరిత్రను తన జీవిత చరిత్రతో కలిపి చాలా బా గా రాశాడు .షిరిడీ సాయి జీవిత చరిత్రకు  దంబోల్కర్ అనే హేమాద్రిపంత్ రాసిన షిర్డీ బాబా సచ్చరిత్ర ఎంత సాధికారమైనదో ,శ్రీ కస్తూరి రాసిన ;;లవింగ్ గాడ్ ‘’సత్యసాయి జీవిత చరిత్రకు అంతటి ఆదేంటిక్ రచన అని అందరి అభిప్రాయం .

 గురువారం పెన్సిల్వేనియా నుంచి శ్రీమతి శ్రీదేవి గారు మెయిల్ రాస్తూ తాను  రెండు పుస్తకాలు పంపాననని అందాయా అని అడిగి మనబ్లాగ్ చాలా ఆసక్తికరంగా ఉందని మెచ్చుకొన్నారు .ధన్యవాదాలు తెలియ జేశాను .రాత్రి రాజేంద్ర ప్రసాద్ సినిమా ‘’గుండమ్మగారి మనవళ్ళు ‘’గొట్టం లో చూసాం . సరదా సినిమా ..

 శుక్రవారం శ్రీ మైనేనిగారు శ్రీ వాడ్రేవు చిన  వీరభద్రుడుగారు ‘’ముండకోపనిషత్ ‘’పై ప్రసంగం చూడమంటే చూశాను బాగుంది .దీనితోపాటు స్వామి రామా ఉపనిషత్తులపై ఆంగ్లప్రసంగం  అద్వైత వేదిక లో శ్రీ అరవిందరావు   ప్రసంగాలూ చూశాను . దేనికదే అనర్ఘ రత్నం .

22-7-17 శనివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం శాకాంబరీ పూజ ,సాయంత్రం శాకాంబరీ పూజా విశేషాలపై ప్రసంగం  బాగా జరిగాయి రమణ అన్నీ దగ్గరుండి నిర్వహింపజేశాడు .

  సెప్టెంబర్ 5 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు  నాకూ మైనేనిగానికి గురువులైన కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శ్రీ గోపాల కృష్ణగారు ,మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులతో మా అబ్బాయి రమణ తో  సంప్రదించి నిర్ణయించాము . రాత్రి అన్నమయ్య సినిమా ట్యూబ్ లో చూసాం .

23-7-17 ఆదివారం ఉదయం అంతా తీవ్రమైన ఎండ సాయంత్రం మంచి వర్షం కురిసింది .వీక్లీ న్యూస్ సమాప్తం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రావణ మాస శుభాకాంక్షలు 

        శ్రావణ మాస శుభాకాంక్షలు

అందరకు 24-7-17 సోమవారం తో ప్రారంభమయే  శుభ శ్రావణ మాస శుభాకాంక్షలు . 4-8-17 రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం . 7-8-17 సోమవారం శ్రావణ పూర్ణిమ -జంధ్యాలపూర్ణిమ ,వైఖానస ,హయగ్రీవ జయంతి -రాఖీ పూర్ణిమ -రాత్రికి పాక్షిక చంద్ర గ్రహణం

 15-8-17 మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి -భారత స్వాతంత్య్ర దినోత్సవం
  25-8-17 శుక్రవారం -శ్రీ వినాయక చవితి
                                               దుర్గాప్రసాద్ -23-7-17
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -3

గుగ్గురు దర్శనం -3

  స్వామి రామా విడిది చేసిన ఆశ్రమం లో సంస్కృత వ్రాత ప్రతి లామాలచేత పూజింపబడుతోంది .గట్టి గుడ్డ కవర్ తో ఉన్న ఆ ప్రతి  గంధం తో దుమ్ముకొట్టుకు పోయింది .ఆ ప్రతిని చదివినవాడికి వెంటనే కుష్ఠురోగం  వచ్చి చస్తాడని వాళ్ళ నమ్మకం లామాలు చాలామంది వచ్చి దాన్ని పూజిస్తారుకాని ఎవరూ తెరిచి చదివిన దాఖలా కనిపించలేదు .రామాకు దాన్ని చదవాలనే కోరిక బలీయమైంది .దాన్ని కనీసం చూపించటానికి కూడా ఎంతబ్రతిమిలాడినా అల్లామా ససేమిరా అన్నాడు .అప్పుడు రామాకు ‘’గ్రంధాలు వాటిని చదివే వారికే కానీ అందులో ఏముందో తెలుసుకోకుండా పూజించేవారికి కాదు ‘’అన్న పెద్దలమాట జ్ఞాపకమొచ్చింది  .తెల్లవారుజామున 3 గంటలకు ఆశ్రమాన్నికి వెళ్లి ,ఆసిల్కు గుడ్డ లో చుట్టబడి ఉన్న ఆ  గ్రంధం ఉన్న గదిలో చేరి దాన్ని తెరచి అక్కడిదీపపు  వెలుగు లో దాన్ని చదువుతుంటే అది ‘’లింగ పురాణం ‘’అని అర్ధమై ,అందులో వేలాది శ్లోకాలలో ఆధ్యాత్మిక కథలు  విధానాలు ,పద్ధతులు పురాతన భారతీయ వేద సాహిత్యాధారంగా రచింపబడిందని గ్రహించాడు . కంగారులో లోపలి కి చేరటం దీపాలు చెదరటం మళ్ళీ మూట సరిగ్గా కట్టలేక పోవటం వలన దాన్ని ఎవరో తప్పక తెరచి చదివి ఉంటారని అనుకొంటారు .స్వామి రామా పై అనుమానమొచ్చింది .లామా పిలిపించి గద్దించాడు .అప్పుడు రామా తెలివిగా ‘’హిమాలయ యోగులు నన్ను దీన్ని చదివి రమ్మని పంపారు .మీరు నన్నేమైనా అంటే నాకేమీ కాదు మీరే ఇబ్బందిపడతారు ‘’అన్నాడు హిందీలో ..ఇక ఏమీ మాట్లాడ లేక ఈ లామా ,లామాల పెద్దా విషయాన్ని అక్కడితో వదిలేశారు లేకపోతె స్వామి రామాను పిచ్చ కొట్టుడు కొట్టి ఉండేవాళ్ళు . దీనితో వాళ్లందరికీ బుద్ధ గయ నుండి ఒక గొప్ప పండితుడైన లామా వచ్చాడని మహా తెలివిగలవాడని  మహా మంత్ర తంత్ర వేత్త అని రామా గురించి ప్రచారం చేశారు  రామాతో వెంటవచ్చిన టిబెటన్ గైడ్ లు రామాను ఇక ఇక్కడినుంచి వెళ్ళిపోవటం మంచిదని చెప్పారు . ఇక్కడిలామాల గుడ్డినమ్మకానికి నవ్వుకున్నాడు రామా

               ఫలించిన    గుగ్గురు దర్శనం

ఎట్టకేలకు గుగ్గురు దర్శనం చేశాడు స్వామిరామా .రామాను చూడగానే ఆనందం తో ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నాయనా !చాలా దూరం నుంచి వచ్చావు .ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నావు అలసినట్లున్నావు . విజ్ఞాన రహదారి చాలా కష్టమైనది విజ్ఞానం గ్ర హించటమూ కష్టతర మైనదే ‘’అంటూ రామా ప్రయాణం లో సర్వ విషయాలు తన కళ్ళతో చూసినట్లు రామాకే వర్ణించి చెబుతుంటే స్వామి రామా అవాక్కయ్యా డు ..దూరం కష్టప్రయాణం లో తపం ధ్యానం అన్నీ ఉట్టికెక్కాయనిపించింది .స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తే అలానే చేశాడు .మార్గాయాసం శ్రమ ఇబ్బందులు గురువుగురువు గారి ఆత్మీయ ఆలింగనం తో మాయమైపోయాయి తన గురువు బెంగాలీ బాబా ఎలాతనపై కారుణ్యం చూపించేవాడో ఈయనా అలానే అపార కారుణ్య వర్షం కురిపించాడు .గొప్ప  యోగులు తమ శిష్యులను చూస్తే వారిపై  అనంత  అనుకంప వాత్సల్యం ప్రేమ కలుగుతాయి .

 రామాగురువు ఈ  టిబెట్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .బాల్యం లోనే ఇల్లువదిలి హిమాలయాల్లో పాద చారిగా సంచరించి ,అనేక గురువులవద్ద అన్నీ నేర్చాడు .ఇప్పుడు చాలా ముసలివాడుగా ఉన్నాడు .కానీ ఆరోగ్యంనే ఉన్నాడు .కూర్చున్న చోటు నుంచి ఉదయం  ఒకసారి ,,సాయంత్రం ఒకసారిమాత్రమే లేస్తాడు . ఐదడుగుల పది అంగుళా ల ఎత్తు ,సన్నగా శలాకలాగా మాంచి శక్తి సంపన్నం గా ఉన్నాడు .దట్టమైన కనుబొమలు  ,ముఖం లో చెరగని ప్రశాంతత ,వెలుగు ,కళ్ళల్లో కాంతి చెదరిని చిరునవ్వు తో ఆకర్షణీయంగా ఉన్నాడు …ఆయన ఆహారం ‘’యాక్ పాలు ‘’..ఒక్కోసారి సూప్ .అప్పుడప్పుడు కొందరులామాలు వచ్చి ఈయనవద్ద చదువుకొంటారు ..7 వేల అడుగుల ఎత్తున ఉన్న స్వాభావికమైన చిన్నగుహలో ఉంటాడు .నిప్పు రాజేసి లోపలి చీకటిని పోగొడతాడు .దానితోపాలు  నీళ్లు కాస్తాడు . గుహముందు కర్రలతో పోర్టికో ను శిష్యులు నిర్మించారు .ఈ గుహ నుంచి చూస్తే అద్భుతమైన ఎత్తైన  పర్వత శ్రేణి ,శిఖరాలు  అందమైన దిక్చక్రమ్ కనుల విందు చేస్తాయి .

            సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

—

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

పుపుల్ జయకర్ ఉత్తర ప్రదేశ్ ఇటావాలో 1915 లో జన్మించింది తండ్రి భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్ .ఉదారవాది అయిన మేధావి . తల్లి గుజరాత్ లోని సూరత్ బ్రాహ్మణ కుటుంబస్త్రీ .ఇక్కడే జయకర్ చిన్నతనం కొంతకాలం గడిచింది .తండ్రి ఉద్యోగం వలన కుటుంబం చాలా ప్రదేశాలలో ఉండాల్సి వచ్చి అక్కడి కళా సంస్కృతుల అవగాహన ఆమెకు కలిగింది . 11వ ఏట బెనారస్ వెళ్లి అనిబిసెంట్ స్థాపించిన ధియసాఫికల్ స్కూల్ లో చేరింది .భారత స్వాతంత్రోద్యమం లో బీసెంట్ అనిర్వచనీయ పాత్ర పోషించిందని మనకు తెలుసు .ఆమె నడిపిన ‘’హోమ్ రూల్ లీగ్ ‘’చిరస్మరణీయం . .తండ్రికిఅలాహాబాద్ బదిలీ అయినందున అక్కడ ఆయనకు మోతీలాల్ నెహ్రు తో గాఢ పరిచయమేర్పడి ఆమెకు నెహ్రు కుటుంబం తో సన్నిహితమయి ఇందిరా గాంధీతికి మంచి స్నేహితురాలైంది . 1936 లో లండన్ వెళ్లి బెడ్ ఫోర్డ్ కాలేజీలో చేరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ అయి ఇండియా కు తిరిగి వచ్చి బారిస్టర్ మన్ మోహన్ జయకర్ ను వివాహమాడి బొంబాయిలో స్థిరపడింది .
బొంబాయి లో ‘’ట్రాయ్ కార్ట్ ‘’అనే ఇంగ్లిష్ మేగజైన్ నడిపింది .దీనిలో ప్రఖ్యాత చిత్రఙకారులు జెమిని రాయి ఎఫ్ ఏం హుసేన్ లు చిత్రాలు గీసేవారు .రాజకీయాలలో దిగి 1940 లో ‘’కస్తూరి బాయ్ ట్రస్ట్ ‘’నిర్వాహకురాలు మృదులా సారాభాయ్ కి అసిస్టెంట్ అయింది .తర్వాత ప్రధాని నెహ్రు ఆధ్వర్యం లో ఉన్న ప్లానింగ్ కమిషన్ లోని స్త్రీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా ఉద్యోగం పొందింది .అప్పుడే ప్రఖ్యాత దార్శనికుడు జిడ్డు .కృష్ణ మూర్తితో పరిచయమై ఆమె ఆలోచనా సరణినే మార్చేసింది . భారతీయ చేనేత పరిశ్రమ ను పూర్తిగా అవగాహన చేసుకొన్నది .జౌళి పరిశ్రమ మంత్రి ఆధ్వర్యం లో ఆమె మద్రాస్ బీసెంట్ నగర్ లో ‘’వీవర్స్ వె ల్ఫేర్ సెంటర్ ‘’ఏర్పాటు చేసింది .

ఇందిరా గాంధీ ప్రధాని అయ్యాక 1966 లో జయకర్ ను సంస్కృతికసలహారు గా నియమించింది .తర్వాత హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ ,చైర్ పెర్సన్ కూడా అయింది .ఆ తర్వాత ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు చార్ పర్సన్ గా మూడేళ్లు పని చేసింది .లండన్ ,పారిస్ ,అమెరికా లలో అనేక నెలల పాటు నిర్వచించబడిన ‘’ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ‘’కు ఆమె సూత్రధారి పాత్రధారి అయి భారతీయ కళా సంస్క్రుతులకు విశ్వ వ్యాప్తి కలిగించింది .ప్రధాని రాజీవ్ గాంధీ కాలం లో ‘’అప్నా ఉత్సవ్ ‘’లకు కూడా ఆమె ప్రధానికి సాంస్కృతిక సలహాదారుగా గా కేబినెట్ మంత్రి హోదా లో ఉన్నది . 1982 లో జయకర్ ‘’ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ‘’కు వైస్ ఛాన్సలర్ అయింది .ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ కు కూడా వైస్ చైర్మన్ గా ఉంది .ఈ పదవులు నిర్వహిస్తూనే ప్రధాని కి భారతీయ సంప్రదాయ ,సాంస్కృతిక వనరుల శాఖకు సలహాదారుగా ఉన్నది .ఇవన్నీ ఆమె సమర్ధతకు భారతీయ కళాసాంస్కృతుల పట్ల జయకర్ కున్న మక్కువ ఆరాధనలు ,వాటిని ప్రపంచ వ్యాప్తం చేయటం లో ఆమె చూపిన చొరవ కృషికి నిదర్శనం .తన స్నేహితురాలు ,ప్రధాని ఇందిరా గాంధీ సూచన మేరకు జయకర్ 1984 లో ‘’ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ ‘’స్థాపించింది .

బెంగాల్ లోని ‘’హంగ్రీ జెనరేషన్ ‘’అనే సాహిత్య ఉద్యమానికి పుపుల్ జయకర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ,1961 లో ఆ సాహిత్యకారులు విచారణ విషయం లో గొప్ప సహకారమందించింది .ఇండియా ,అమెరికా ఇంగ్లాండ్ ,లాటిన్ అమెరికా వంటి పలుచోట్ల ఉన్న జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ కు జీవితకాల సేవలు అందించింది .ఆంద్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా మదనపల్లి లోని ‘’రిషీ వాలీ స్కూల్ ‘’స్థాపన నిర్వహణలో ఆమెది గణనీయ పాత్ర .ఆమె విద్య విజ్ఞాన కళా సాంస్కృతులఆరాధనకు అభినందనగా ఆమె పేర దేశం లో ఎన్నో విద్యాలయాలు వెలిశాయి .

1937 లో జయకర్ మన్మోహన్ జయకర్ అనే బారిస్టర్ ను వివాహమాడిందని ముందే చెప్పుకున్నాం ఆయన 1972 లో చనిపోయాడు వీరి ఏకైక కుమార్తె ‘’రాధికా హెర్ బెర్జెర్ ‘’ రిషీ వాలీ స్కూల్ అధ్యక్షురాలై నిర్వహణ బాధ్యతలు చేబట్టింది .విలువలతో కూడిన విద్య నందించుటయే ఈ విద్యాలయ లక్ష్యం .కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో పూనా దగ్గర రాజగురునగర్ లో సహ్యాద్రి స్కూల్ ,వారణాసిలో రాజఘాట్ బీసెంట్ స్కూల్ ,కథక్ డాన్స్ స్కూల్ మొదలైనవి నిర్వహిస్తున్నది

పుపుల్ జయకర్ ‘’జిడ్డు కృష్ణ మూర్తి జీవిత చరిత్ర ‘’ఇంగ్లిష్ లో రాసింది దీనికి మంచి పేరొచ్చింది .మరోపుస్తకం ‘’ఇందిరా గాంధీ -యాన్ ఇంటిమేట్ బయాగ్రఫీ ‘’ కూడా ప్రసిద్ధమైంది .ఇందిరా గాంధీ తనకు ఆపరేషన్ బ్లు స్టార్ వలన ప్రాణగండం ఉందని ముందుగానే ఊహించి చెప్పిందని జయకర్ తెలియ జేసింది .ఆమెరాసిన ఇతర పుస్తకాలు – గాడ్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్ -కథా సంపుటి ,టెక్స్టైల్స్ అండ్ ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా ,యాన్ ఎర్డ్రెన్ డ్రమ్ ,ది ఎర్త్ మదర్ ,ఫైర్ ఇన్ ది మైండ్ -డైలాగ్స్ విత్ జె.కృష్ణ మూర్తి మొదలైనవి .

పుపుల్ జయకర్ 29-3-1997 న 82 వ ఏట మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -2  

గుగ్గురు దర్శనం -2

 లాసా లో ఒక లామాను కలిసి తాను  ఆధ్యాత్మిక మార్గదర్శనానికి టిబెట్ వచ్చానని ,తనకు రాజకీయ ఉద్దేశ్యాలేవీ లేవని , చెప్పి నమ్మక0 కలిగించి  ఆయనవద్ద  15 రోజులు గడిపాడురామా .ప్రభుత్వ ఉద్యోగులకు స్వామిరామాను పరిచయం చేస్తే  , వ చ్చీరానీ  టిబెటన్ భాషలో వారికి నచ్చ చెప్పగలిగాడు .ఈ లామా స్నేహితుడైన మరోలామా ఆశ్రమం  గుగ్గురువు ఆశ్రమానికి  సమీపం లోనే ఉన్నదని  చెప్పిలాసాకు ఈశాన్యం లో  75 మైళ్ళ దూరం  నాగరికతకు చాలా దూరం లో ఉన్నఅక్కడికి కొందరు గైడ్ లను తోడు ఇచ్చి పంపాడు .అక్కడినుంచి గుగ్గురువును తేలికగా చేరుకోవచ్చు .

  ఆ ఆశ్రమంలో 300 కు పైగా లామాలున్నారు . టిబెట్ లో  చాలా మొనాస్టరీస్ ఉన్నాయి .. వీటిలో వేలాది లామాలు వివిధ సంప్రదాయాలకు చెందినవారున్నారు . లామాయిజం అంటే బౌద్ధం లో వ్యక్తిగతమైనమతం  అనిపించిందిరామా కు  . ప్రతిలామా తనదైన ప్రత్యేక తరహాలో ఉత్సవాలు పూజా ధ్యానాదులు మంత్రోచ్చారణ ,ప్రార్ధనా చక్రాన్ని త్రిప్పటం  నిర్వహిస్తాడు .నలందాలోని  ప్రాచీన బౌద్ధ విశ్వ విద్యాలయంలో స్వామి రామా ఈ తంతు అంతా చూశాడు .బౌద్ధాన్ని క్షుణ్ణంగా ఇదివరకే చదివి ఉన్నాడు ..వెయ్యేళ్ళక్రితం టిబెటన్ విద్యావేత్త ఇండియా వచ్చి బౌద్ధాన్ని అధ్యయనం చేసి ఇక్కడి బౌద్ధ మత గ్రంధాలను టిబెట్ కు తీసుకు వెళ్లాడు అప్పటి నుంచి ఇండియానుంచి బౌద్ధపండితులు టిబెట్ వెళ్ళటం ప్రారంభి0చి అక్కడివారికి బౌద్ధ సాహిత్యాన్ని నేర్పారు .టిబెట్ లో బౌద్ధం లో ఉన్న అనేక శాఖలు స్వామి రామాకు తెలుసు ..వారిలో దేవుళ్ళు దేవతలను నమ్మేవారు బుద్ధుడు దేవుడని భావించేవారు ఉన్నారని గ్రహించాడు.

 టిబెట్ బౌద్ధం తంత్రం తో ముడిపెట్టబడి ఉంటుంది .గుగ్గురువును కలవటానికి ముందు ఒక చిన్న లామా ఆశ్రమం చూశాడు.  అక్కడిలామా టిబెట్ లోనే ప్రసిద్ధి చెందినలామా అని పేరు  టిబెట్లోని యోగ విధానం కొంతమారిన తంత్రశాస్త్ర0.దీనినే ‘’వామాచారం ‘’అంటారు ..ఈ మార్గం లోవారు మధిర మాంసం,చేప , మగువ   మంత్రా  లను నమ్ముతారు .రామా వెళ్లిన ఆశ్రమ లామా ఒక చెక్క గదిలో అనేకమందిమంత్రాలు చదివే  స్త్రీల మధ్య  కూర్చుని కనిపించాడు .కొన్ని మంత్రాలు చదివాక వారంతా అక్కడ ఉన్న పచ్చి మాంసపు ముక్కలను  కొన్ని సుగంధద్రవ్యాలు పచ్చిమిర్చి కలిపి తిని మళ్ళీ మంత్రాలు చదివారు . 15 నిమిషాల తర్వాత ఆ లామా రామాను చూసి పలకరించి వచ్చినపని అడిగాడు .ఈ లామాను చూడటానికే వచ్చానన్నాడు. ’’  అది అబద్ధం  నీపేరు స్వామిరామా  నువ్వు నీ గురువుగారి గురువును చూడటానికి మారు వేషం లో వచ్చావు  .సిక్కిం పోలీసులు  నీ  కోసం  వెతుకుతున్నారు ‘’అని చాలాకోపంగా తీవ్రం గా అన్నాడు బహుశా మగువలమధ్య మాంసం తింటుండగా చూశాడని ‘’ఎక్కడో ‘’కాలి  అలా అని ఉంటాడని గ్రహించాడు రామా ..ఈయన ఆలోచనలన్నీ ఆయన పసిగట్టేశాడు .రామా వణికిపోయాడు .తమాయించుకొని టిబెట్లో  కొంత తంత్ర విద్య నేర్వాలని వచ్చానని వినయంగా చెప్పాడు .చల్లబడిన లామా తనవద్ద ఉన్న ఒక తంత్ర పుస్తకాన్నిచ్చాడు దాన్ని తిరగేసినరామా  అది ఇదివరకే తాను  చదివేసిందే నని చెప్పగా మరొక తాంత్రిక లామా వద్దకు పంపాడు .ఈలామాకు బుద్ధగయ లో ఉండిచదవటం వలన హిందీ బాగా వచ్చు   .

 టిబెట్ సారస్వతం అంతా హిందూపురాణ అనువాదాలు కొన్నిటిలో టావోయిజం బౌద్ధం  కన్ఫ్యూషియన్ మతం కలిసికనిపిస్తాయి .వ్యవస్తీకృతంగా  సృజనాత్మకంగా ఏదీ లేదు .రామాకున్న టిబెటన్ భాషా పాండిత్యం  తక్కువేకాని ఈలామా హిందీలో మాట్లాడటం వలన ఇబ్బందికలుగలేదు .జనసామాన్యం తోమాట్లాడే టిబెటన్ మాటలు బాగానే వచ్చినాఅనేక మొనాస్టరీలలో భద్రపరచబడిన వ్రాత ప్రతులలోని  సారస్వతాన్ని చదివేంతగా రాదు .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం

ఒకరోజు స్వామీ రామా ను గురువు బెంగాలీ బాబా టిబెట్ లో ఉన్న తన గురువు వద్ద కొంతకాలం ఉండి రమ్మని పంపాడు . గుగ్గురువు ను చూసి అనుభూతి పొందాలనే ఆత్రత తో రామా 1931లో బయల్దేరాడు .మానస పాస్ దగ్గర ఆపేశారు  మళ్ళీ 1946 లో టిబెట్ రాజధాని లాసా కు డార్జిలింగ్  కాళీపాంగ్ సిక్కిం ల ద్వారా వెళ్ళాడు .ముఖ్యోద్దేశం గుగ్గురు దర్శనమే .అక్కడ కొంత అడ్వాంస్డ్ ప్రాక్టీస్ పొందటమే ..డార్జిలింగ్ లో కొన్నిరోజులుండి  ఉపన్యాసాలిచ్చాడు .బ్రిటిష్ ఆఫీసర్లు రామాను విప్లవావాది గా  ఇండియాలోని బ్రిటిష్ ప్రభుత్వానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడనిభావించారు కాలిఫాన్గ్ కు వెళ్లి పదిరోజులుండి ‘’కుంగ్ ఫు ‘’నేర్చాడు .అక్కడి నుంచి సిక్కిం కు వెళ్ళాడు .అంతాకాలినడకనే అని మర్చిపోకండి .సిక్కిం లో దలైలామా దగ్గర బంధువు ఇంట్లో అతిధిగా ఉన్నాడు .సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ రామా టిబెట్ లో శాంతికి  విఘాతం  కలిగిస్తాడేమోనని భయపడి ముందుకు పోవటానికి అనుమతించలేదు చాలా రోజులు ఆ ఆఫీసర్ తో తన గోడు చెప్పుకొన్నాడు ..కానీ రామా కాంగ్రెస్ పార్టీ గూఢచారి అని అనుకోని  ,అప్పుడాపార్టీ బ్రిటిష్ ప్రభుత్వం తో స్వాతంత్య్రం కోసం తీవ్రం గా పోరాడుతున్నందున అనుమతి నిరాకరించాడు . అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతివాద మితవాదులుండేవారు . గాంధీ  ఆయన అనుచరులు మితవాదులు .మిగిలినవారు అతివాదులు ..రామా ఈ రెండు గ్రూపుల వారితో సంబంధం ఏదీ లేదు .రామదగ్గర నెహ్రు రాసిన ,గాంధీరాసిన ఉత్తరాలను చూశాడు ఆఫీసర్ .అనుమానం మరింతబలీయమై రామానుప్రభుత్వ ఇన్స్పెక్షన్  బంగళా లో   హౌస్ అరెస్ట్ లో ఉంచాడు..అన్ని సౌకర్యాలు కలిగించారు కానీ రెండు నెలలు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది .ఎవరితోమాట్లాడటానికి ఎవరికీ ఉత్తరం రాయటానికి వీ లు లేదు . .ఒకరోజు ఆఫీసర్ ‘’నువ్వేమీ చేయలేదని నాకు తెలుసు ,కానీ నిన్ను రాజకీయ గూఢచారిగా అనుమానిస్తున్నాను .నాకు నీపై మంచి రిపోర్ట్ వచ్చేదాకా ఇక్కడినుంచి కదలటానికి వీల్లేదు ‘’అన్నాడు .ఒకగార్డ్ ఇరవైనాలుగు గంటల కాపలాఉన్నాడు .ఈ కాలం లోనే రామ టిబెటన్ భాష అధ్యయనం చేసి నేర్చుకొని వాళ్ళతో మాట్లాడే వీలు కలిపించుకొన్నాడు . .

 రెండు నెలలు హౌస్ అరెస్ట్ లో ఉన్నా ఎంతమందికి మొరపెట్టుకున్నా లాభం లేకపోయే సరికి రహస్యంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు స్వామిరామా ..ఒక గార్డ్ ను మచ్చిక చేసుకొని పొడవైన తలా  ముఖం పైకూడా కప్పుకొనే  టిబెటన్ కోటు సంపాదించాడు .ఒక చలిరాత్రి గార్డ్ ఫుల్ గా మందుకొట్టి నిద్రపోతున్నసమయం లో రాత్రి 11 గంటలకు జులై 15 ఆకోటు తొడుక్కునితాను  ఢిల్లీ వె డుతున్నట్లు  ఒక ఉత్తరం రాసి టేబుల్ మీద ఉంచి చీకట్లో ఉడాయించాడు ..ఇదేమీ తప్పనిపించలేదు అంటాడురామ కారణం తనను అనవసరంగా ఏ కారణం లేకుండా నిర్బంధించటం న్యాయం కాదుకాబట్టి .మూడు రోజులు నడిచి చివరి చెక్ పోస్ట్ కు చేరాడు .అక్కడ సిక్కిం గూర్ఖా సైనికులు పహారా కాస్తున్నారు .రామాను ప్రశ్నించి ఆయన గురించి అడిగి తెలుసుకొన్నారు .తనకు నేపాలీ భాష వచ్చుకనుక ధారాళంగా ఆభాషలో మాట్లాడి ,వాళ్లకు తాను  నేపాలీ అనే అభిప్రాయం కలిగించటం తో వాళ్ళు సరిహద్దు దాటి టిబెట్ లోకి వెళ్ళటానికి  అనుమతించారు. గండం గడిచి పిండం బయట పడింది .

   టిబెట్ లో మరిన్ని  ఇక్కట్లు పడ్డాడు ..తానూ శాకాహారి .అక్కడ మాంసం తప్ప తినటానికి ఏమీ దొరకదు .టిబెట్ లో ఒక్క శాకాహారికూడా ఆయనకు కనిపించలేదు .టిబెట్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఎప్పుడూ మంచు కురవటం తో అక్కడ జనం మాంసం చేపలు తింటేనే బతకగల పరిస్థితి .ఎక్కడో ఒకటీఆరా కాయగూరలు దొరికితే తినేవాడురామా . గుడ్లు కూడా తినాల్సి వచ్చేది .ఆహార మార్పువలన డయేరియాతో బాధపడ్డాడు .ఆరోగ్యం క్షీణించింది .కానీ ఇక్కడ కొన్ని సన్యాసా  శ్రమాలు  గుహలు దర్శించి తాను  వచ్చినపని నెరవేర్చుకొందామనుకొన్నాడు .

   రాత్రి వేళపడుకునేసమయం లో ప్రజలు రామా  దగ్గరున్న వస్తువులను దొంగిలించటానికి తనిఖీ చేసేవారు  . కానీ ఆయనదగ్గర కొన్ని పౌండ్ల బిస్కట్లు  కొద్దిగా పప్పు ,నీళ్ల సీసా  2 వేల  రూపాయలు మాత్రమే ఉండేవి .డబ్బును లోపలి దుస్తులలో జాగ్రత్తగా దాచేవాడు .కాళ్లబూట్లు ఎప్పుడూ ఎవరి ముందూ విప్పేవాడుకాదు . రోజుకు 15 మైళ్ళు నడిచి  లేకపోతె కంచరగాడిదపై ప్రయాణించేవాడు .తటస్థ పడిన మనుషులతోమనసుకు నచ్చక పోయినా  జ్యోతిషం ,జోస్యం చెబుతూ గడిపేవాడు . టిబెటన్లకు వీటిపై మహా గురి ..కనుక ఈయనపై నమ్మక గౌరవాలేర్పడి ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్ళటానికి మ్యూల్స్ ను ఏర్పాటు చేసేవారు .దారిలో చాలాసార్లు అడవి ఎలుగు బంట్లు తారస పడేవి .టిబెటన్ గ్రామాలను కాపలాకాసే పెద్ద పెద్ద భూతియా కుక్కలు కనిపించేవి .ఈ సమస్యలు బాధిస్తున్నా రామాకు ప్రయాణం ఉత్సాహాన్ని ఇచ్చింది .హిమాలయ యోగుల మహత్యాలు తెలుసుకోవాలనే ఆరాటం పెరిగిందేకాని తగ్గలేదు ..వెనక్కి తిరిగి ఇండియాకు వెడితే బ్రిటిష్ ప్రభుత్వం తనను తప్పక అరెస్ట్ చేసి జైలు లో పెడుతుంది .కనుక పీచే మూడ్ కుదరదు ఆగే మూడ్ మాత్రమే తప్పనిసరి అనుకున్నాడు .

 ఎవరి సాయం గైడ్లు లేకుండా ఏ ప్రణాళికా లేకుండా హిమ పర్వత వాహినులు , హిమానీ నదాలు కనుమలు దాటుకొంటూ ముందుకు వెళ్ళాడు  దైవమే  తనకు రక్షా ఏడుగడ ..దారితప్పేవాడు దైవమె మళ్ళీ మార్గం చూపేవాడు .పగటి వేళా భయం అసలు ఉండేదే కాదు చావుభయం అసలే లేదు  .తన గుగ్గురువు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకున్నాడు .ఆయన వద్ద కొంతకాలం తన గురువు చెప్పినట్లు ఉండాలన్నదే తపన .ఆయన ఇక్కడ ఒంటరి ప్రదేశం కనుక ఉన్నాడు .  యోగా  లో ఆధునిక పురోగమన పద్ధతులు నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారికి నేర్పుతున్నాడు .హిమాలయ కుమయూన్ హిల్ యోగులైన హరికృష్ణ బాబా మొదలైన వారు ఆయనంటే విపరీతమైన ఆరాధన కలిగిఉన్నారని ఈయనను హిమాలయ శాశ్వత (ఎటర్నల్ )యోగి అని అందరూ భావిస్తారని తన గుగ్గురువు దగ్గరే యోగ శిక్షణ పొందాడని  తన గురువు బెంగాలీ బాబా ద్వారా  రామా తెలుసుకొన్నాడు  .ఈ కోరికే  రామాను ఇంతదూరం తెప్పించింది .

 విపరీతంమైన ప్రయాణం రెండునెలలు చేసి రామా లాసా చేరాడు అక్కడ ఒక కేథలిక్ ప్రీస్ట్ కలిశాడు .ఆయన తన చిన్న నివాసం లో రామాను ఉంచాడు .ఈఇద్దరుకాక మరో ఇద్దరు మిషనరీలు అందులో ఉన్నారు .ఈ ముగ్గురే లాసా లో ఉన్న కేథలిక్కులు .వీరికదలికలను టిబెటన్ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుంది .అలసట తీరే దాకా వారితో పది రోజులున్నాడు .ఈలోగా సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ కు రామా టిబెట్ లో ఉన్నట్లు తెలిసింది .రామా కేసును సి ఐ డి కి అప్పగించాడు ..

          సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )

మొదటి హైడ్రోజెన్ బాంబ్ పరీక్షదక్షిణ ఫసిఫిక్ లోఎనీవేటోక్ లో 1-11-1952లో జరిగినప్పుడు  ఆల్బర్ట్ శాస్త్రవేత్త అక్కడి శిధిలాలను పరిశీలిస్తుంటే ఒక కొత్తమూలకం ను కనుక్కొని దానికి ‘’అయిన్ స్టీనియమ్ ‘’అని పేరుపెట్టారు ..ఫాస్ఫరస్ కు కాంతిమంట ఉండటం తో ఆ గ్రీక్ పేరు సార్ధకమైంది .ఇది వీనస్ గ్రహం అంటే శుక్రగ్రహానికి అనాదిగా ఉన్న పేరే .ఆ గ్రహం సూర్యోదయానికి ముందు ఆకాశం లో కనిపిస్తుంది . సెలీనియం మూలకం పేరు సెలెనా అనే గ్రీకు పదం నుండి వచ్చింది . గ్రీకు ల చంద్రునిపేరు సెలెనా ..దీనిఖనిజాలలో ఇది’’ టే ల్ల్యురియం ‘’అనే మరో మూలకం తో కలిసి లభిస్తుంది .లాటిన్ లో టెల్లస్ అంటే భూమి అని అర్ధం .

 1-1-1801 న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ గిసెప్పె పియాజ్జి సూర్యుని చుట్టూ కుజ ,,గురు గ్రహాలమధ్య తిరుగుతున్న కొత్త గ్రహాన్ని కనిపెట్టి రోమన్ల సస్య దేవత ‘’సెరేస్    పేరుపెట్టారు ..సిరియల్ మూలం నుండి వచ్చిందే సేరేస్..ఈ సంఘటన తర్వాత కనిపెట్టబడిన మొదటి మూలకానికి ఈ ఉత్సాహం లో ‘’సెరియం ‘అని గౌరవంగా ఆ దేవత పేరే పెట్టారు ..రెండేళ్ల తర్వాత సూర్యుని చుట్టూ సె రెస్ లాగే తిరిగే మరో గ్రహాన్నికనిపెట్టి  విఙ్నానానికి అధిదేవత అయిన రోమన్ దేవత ‘’పొల్లాస్ ‘’పేరుమీదుగా పిలిచి దీనితర్వాత కనుగొనబడిన మూలకానికి ‘’పల్లాడియం  ‘’అని పిలిచారు ..ఆతర్వాత ఇలాంటివే అనేక బుల్లి బుల్లి గ్రహాలూకనిపెట్టారు .చివరికి తేలిందేమిటంటే సెరె స్    పొల్లాస్ లు గ్రహాలుకావు ఆస్టెరాయిడ్స్ అని ..ఇలాంటివన్నీ వందల వేల  సంఖ్యలో  ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఉన్నాయని గ్రహించారు .

  పాదరసం అంటే మెర్క్యురీ ద్రవ మూలకం పేరు గ్రహాలలో అత్యధిక వేగం గా తిరిగే మెర్క్యురీ అంటే బుధ గ్రాహం పేరుతో పిలిచారు .ఇది కూడా రోమన్ వార్తాహరుడైన దేవత పేరే .

 ధోరియం మూలకాన్ని గురుగ్రహం నుంచి మెరుపులు చిమ్మే స్కాండినేవియన్ మెరుపు దేవతపేరుతొ పిలిచారు.హబుల్ టెలిస్కోప్ జూపిటర్ యొక్క పోలార్ ప్రాంతం లో లెక్కలేనన్ని ఎలెక్ట్రిక్ చార్జెస్ ఉన్నట్లు గమనించింది . పాపం శనిదేవత పేర ఒక్క మూలకమూ లేదు .కానీ యురేనస్ ,నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలపేర 1789 లో కనిపెట్టబడిన యురేనియం కు పెట్టారు యురేనియం ఐసోటోప్ లన్నీ అస్ధిరాలు .అవి యాదృచ్చికంగా (స్పాంటేనియస్ )శిధిలమై తేలిక మూలకాలుగా ఏర్పడతాయి .మొదటి పరమాణు బాంబులో యురేనియం నే ఉపయోగించి జపాన్ పట్టణాలైన హీరోషిమా ,నాగసాకిలపై అమెరికా6-8-1945 న  ప్రయోగించింది  .న్యూక్లియస్ లో 92 ప్రొటాన్లున్న యురేనియం ప్రకృతిలో విరివిగా లభించే రేడియో యాక్టివ్ మూలకం

 నెప్ట్యూన్ పేరిట1940 లోబెర్కెలీ సైక్లో ట్రాన్ లో  కనిపెట్టబడిన  నెప్త్యూనియం మూలకం పిలువబడింది  .జోసెఫ్ లీ వెర్రియర్ అనే ఫ్రెంచ్ గణిత వేత్త యురేనస్ వింత ప్రవృత్తిని అధ్యయనం చేస్తూ నెప్ట్యూన్ ను గుర్తించాడు .సౌర వ్యవస్థ (సోలార్ సిస్టమ్ )లో యురేనస్ తర్వాతే నెప్ట్యూన్ ఉంటుంది .భూమిపై పీరియాడిక్ టేబుల్ లో కూడా యురేనియం తర్వాత స్థానమే నెప్ట్యూనియం  ది .

  బెర్కిలీ సైక్లో ట్రాన్ చాలా మూలకాలను కనుక్కున్నది అందులో ప్లుటోనియం మూలకం నెప్త్యూనియం తర్వాత వస్తుంది . 1930 లో ఆరిజోనాలోని లోవెల్ అబ్సరేటరీ క్లైడ్ టామ్ బాగ్ ప్లూటో గ్రహాన్ని కనుక్కున్నాడు .దీనిపేరు ప్లుటోనియం కు పెట్టారు .ప్లూటో సైజ్ ను నిర్దుష్టంగా కొలవగలిగారు .ప్లూటో క్రమక్రమంగా తగ్గిపోతోంది .చల్లగా మంచుతో ఉండే ప్లూటో నవగ్రహాలలో అతి చిన్నది .ఇలా మూలకాలకూ ,అంతరిక్ష గ్రహాలకు సన్నిహిత సంబంధం ఉందని తెలుస్తోంది .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-17 కాంప్-షార్లెట్-అమెరికా


Posted in సైన్స్ | Tagged | Leave a comment

(పరమ ) హంస ధామం

(పరమ ) హంస ధామం

 హిమాలయాలలో గంగోత్రిని మించిన మనోహరమైన ప్రదేశం కనిపించదు .అక్కడే హంసలు దర్శనమిస్తాయి అందుకే దానికి హంసధామం అనిపేరు . అక్కడే జితేంద్రియులైన మహా యోగులు దర్శనమిస్తారు .కనుక అది పరమహంస ధామం కూడా . మంచుతో కప్పబడిన హిమ శృంగాలు కను విందు చేస్తాయి .సుమారు 50 కి  పైగా యోగులు చిన్న చిన్న గుహలలో అక్కడ ఉంటారు .ప్రక్కనే గంగమ్మ తల్లి . అంతకంటే వారికి కావలసినదేముంది ఈ  యోగులు శీతాకాలం కూడా బట్టలు ధరించరు  కొందరైతే చలికాచుకోవటానికి అగ్ని కూడా రాజేయరు .స్వామిరామ ఇక్కడే మూడు శీతాకాలాలు ఒక చిన్నగుహలో గడిపాడు ..ఈగుహకు సుమారు అయిదువందల గజాల దూరం లో మరొక యోగి పుంగవుడు ఒక గుహలో ఉండేవాడు ..వీరిద్దరూ ఒకరికొకరు కనిపించినప్పుడు చూసుకోవటమే కానీ ఒకరికొకరు ఇబ్బందిపెట్టుకొనే వారు కాదు ఎవరి సాదన  ధ్యాన యోగాలు వారివే .ఇక్కడ ఉన్నకాలం తనజీవితం లో గొప్ప ఫలవంతమైనకాలంగా రామా భావించాడు .యోగాభ్యాసాలు చేస్తూ ఇంత గోధుమ ,పప్పు మాత్రమే ఆహారంగా జీవించాడు .ఈ రెంటినికలిపి  తడిపి ఉంచి రెండురోజులతర్వాత మొలకెత్తగానే కొద్దిగా ఉప్పుకలిపి వాటిని ఆహారంగా తినేవాడు..ఇంతకూ మించి వేరే ఏదీ తినేవాడుకాదు .

  రా మా గుహకు దగ్గరలోనే ‘’కృష్ణాశ్రమం ‘’అనే యోగి ఉండేవాడు .ఆయన పేరు భారత దేశమంతటా బాగా తెలుసు ..ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది .వందలాది బాంబులు పేలితే వచ్చే భయ0కర  శబ్దం అది ..అది ఆకస్మికంగా జారిపడిన  హిమ గండ శిలాపాతం (అవలాంచి).స్వామి రామా తనగుహలోంచి బయటికి వచ్చి ఏం జరిగిందోనని ఆతృతగా చూశాడు ..అది పౌర్ణమి రాత్రికావటం వలన  అవతలి ఒడ్డు న క్రష్ణా శ్రమ యోగి ఉండే గుహదగ్గరున్న గంగానది  మంచుతో కప్పబడి కనిపించింది. ఈ భారీ అవలాంచీ ని చూసి రామా మనసులో కృష్ణాశ్రమయోగి అందులో కప్పబడి ఉంటాడని అనుమానించాడు .పొడవైన టిబెటన్ కోటు ధరించి చేతి లో టార్చి లైట్ వెలుగుతో ఆయన గుహ వైపుకు వేగంగా అడుగులు వేశాడు .అక్కడ గంగ చిన్న ఇరుకు వాగులా ఉంటుంది ..దాన్ని దాటి ఆయన గుహవైపుకు వెడితే అది సురక్షితంగా ఉందని గ్రహించి  లోపల చిరునవ్వుతో కూర్చుని ఉన్న శ్రీ కృష్ణాశ్రమ యోగి కనిపించాడు .హమ్మయ్య అనుకొన్నాడు స్వామిరామా .

 ఆ గుహలోకి వెళ్లి ఆయనను పలకరించాడు .ఆయన మాట్లాడకండా చేతులు పైకెత్తి ‘’హం  హం  హం ‘’అన్నాడు .దగ్గరలో ఉన్న పలకపై ‘’ఏమీ కాలేదు ..నాకు ఏ అపకారము జరగదు .ఇక్కడ చాలా ఏళ్ళనుంచి ఉంటున్నాను .ఈ శబ్దాలు హిమ గండశిలలు  నన్ను భయ పెట్టలేవు ..నా గుహ సురక్షితం ‘’అని రాశాడు .ఆయనకే ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉన్న సంగతి తెలుసుకొని భగవంతుని కృపకు అంజలి ఘటించి మళ్ళీ ఆ రాత్రివేళ తన గుహకు చేరుకొన్నాడురామా ..ఒక అతిపెద్ద దేవదారు వృక్షం పూర్తిగా కూలి మంచులో కప్పబడిపోయిందికాని అది ఆయనగుహనూ ఏమాత్రం తాకలేదని గ్రహించాడు .

  మధ్యాహ్న సమయాలలో తరచుగా కృష్ణాశ్రమ యోగి గుహకు వెళ్లి తనకున్న అనుమానాలను అడిగి ఆయననుండి సంతృప్తికరమైన సమాధానాలు పొందేవాడు రామ .. ఆయన మౌనంగా ఉండేవాడుకనుక సమాధానాలు పలకపై రాసేవాడు .ఆయన నేత్రాలు అగ్నిగోళాలుగా కాంతి నిచ్చేవి .ఆయన చర్మం ఏనుగు  చర్మ మంత దళసరిగా ఉండేది.  80 ఏళ్ళ వయసులోకూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు   .గడ్డ కట్టే చలిలో ఊలు బట్టలు, నిప్పు లేకుండా ఎలా ఆయన జీవిస్తున్నాడో ఆశ్చర్యమేసింది .. గుహలో వస్తు సామగ్రికూడా ఏమీ లేదు  .గోముఖి దగ్గరుండే ఒక స్వామి రోజూ కొంత ఆహారం తెచ్చి ఇచ్చేవాడు .రోజుకు ఒకసారి మాత్రమే బంగాళాదుంపలు వేయించి తినేవాడు .కొద్దిగా రొట్టెముక్క తినేవాడు .ఈ ప్రాంత వాసులు ‘’గంగా తులసి ‘’అనే ఓషధి మొక్క ఆకులతో తయారు చేసే గ్రీన్ టీ నే తాగుతారు .స్వామిరామా కు ఇక్కడి యోగులు స్వాములు ఓషధులగురించి ప్రయోజనకర మొక్కల గురించి  వివరంగా తెలియజేశారు .వనౌషధ శాస్త్రంగురించీ రామా తో చర్చించారు .ఈ జితేంద్రియ యోగులు ఈ హంస ధామం వదిలి మైదానప్రాంతాలకు వెళ్ళటానికి అసలు ఇష్టపడరు .వీరిని దర్శించాలంటే  ఆసక్తి భక్తి ఉన్నవారు  అత్యున్నత ప్రాంతమైన ఈ ప్రదేశానికి రావాళిందే .బుద్ధి పై మనసు సాధించిన యోగులైన పరమహంసల దర్శనానికి ఈ హంస ధామమే శరణ్యం.

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2

 భూమి క్రస్ట్ లో 10 శాతం అల్యూమిన0 ఉంది .కానీ మన పూర్వీకులకు దాని గురించి తెలియదు . 1827 లో దాన్ని కనిపెట్టేదాకామనకు తెలియదు ,1960 దాకా  అది మన ఇళ్లల్లోకి ప్రవేశించలేదు .అప్పటిదాకా టిన్ కాన్స్ ,టిన్ ఫాయిల్స్ వాడేవారు . ఇందులో అల్యూమినం  ఉంటుంది మెరుగు పెట్టబడిన అల్యూమినం  రిఫ్లెక్టర్ గా బాగా ఉపయోగపడుతుంది .ఇప్పుడు అన్ని టెలిస్కోప్ మిర్రర్ లకు దాన్ని కోటింగ్ కు వాడుతున్నారు . అల్యూమినమ్ కంటే 1. 7 రెట్లు సాంద్రత ఉన్న టైటానియం దానికంటే శక్తివంతమైనది భూ గర్భం లో ఎక్కువగా దొరికే తొమ్మిదవ మూలకం ..దీన్ని వాడటం గొప్ప ఫాషనయింది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లలో విరివిగా వాడుతున్నారు ..విశ్వం లో కార్బన్ కంటే ఆక్సిజన్ పరమాణువులు ఎక్కువ .కార్బన్ తోకలిసి కార్బన్ మోనాక్సయిడ్ కార్బన్ డయాక్సయిడ్ లను ఏర్పరచి ,మిగిలిన ఆక్సికన్ టైటానియం తో బంధాలు ఏర్పాటు చేసుకొంటుంది .రెడ్ స్టార్స్ ల స్పెక్ట్రమ్ లో టైటానియం ఆక్సయిడ్ కనిపిస్తుంది  మనం వాడే నీలం, కెంపు లలో టైటానియం ఆక్సయిడ్ ఉంది .టెలిస్కోప్ డోములకు వేసే వైట్ పెయింట్ లో టైటానిక్ ఆక్సయిడ్ ఉంటుంది  స్పెక్ట్రమ్ లోని ఇంఫ్రాఅర్ద్ భాగం లో ఎక్కువ పరావర్తనం చెందేది గా  కనిపిస్తుంది .టెలిస్కోప్ చుట్టూ ఉండే సూర్యకాంతిని తగ్గించటానికి ఉపయోగపడుతుంది .రాత్రి వేళలో టెలిస్కోప్ డోమ్ తెరచి ఉంటె టెలిస్కోప్ దగ్గరున్న గాలి ఉష్ణోగ్రత ,రాత్రి గాలి  ఉష్ణోగ్రతకు సమానమై ,నక్షత్రాలనుండి ,ఇతర గ్రహాంతర పదార్ధాలనుండి వచ్చే కాంతి స్పష్టంగా కనిపిస్తుంది . గ్రీక్ పురాణం లోని టైటాన్ అంటే శని గ్రహ0 చుట్టూ ఉండే పెద్ద చంద్రుడి   పేరే ఆమూలకానికి వచ్చింది ..

 విశ్వం లో ఇనుముకున్న గిరాకీ ఎక్కువే .పెద్ద నక్షత్రాలు తమ కొర్ లో హీలియం కార్బన్ ,ఆక్సిజన్ నైట్రోజెన్ మొదలైన వాటితోపాటు ఇనుము మూలకాన్నీ ఉత్పత్తి చేస్తాయి .న్యూక్లియస్ లో 26 ప్రోటాన్లు అన్నే న్యూట్రాన్లు కేంద్రం లో కలిగిఉన్న ఐరన్ ఎలిమెంట్ మిగిలినవాటికంటే ఒక విభిన్నమైన లక్షణం-ఏ న్యూక్లియర్ అణువు శక్తి మొత్తం కంటే   కనిష్ట శక్తి మొత్తం కలిగి ఉంటుంది .దీని భావం ఏమిటంటే -ఐరన్ పరమాణువును ఫుజన్  ద్వారా కలిపితే అవికూడా శక్తిని పీల్చేస్తాయి (అబ్సార్బ్ )..కానీ నక్షత్రాలు శక్తి నిర్మాణ0 చేస్తాయి .బృహత్తర తారలు ఇనుమును ఉత్పత్తి చేసికోర్ లో  కూడబెడితే వాటి చావు మూడిందన్నమాట . అధిక భారం వలన నక్షత్రం తనబరువుకు తానె కూలిపోతుంది .కానీ వెంటనే పుంజుకొని సూపర్ నోవా విస్ఫోట నానికి గురై ఒక బిలియన్ సూర్యుల కాంతితో ఒకవారం దివ్య జ్యోతిలా వెలుగుతుంది .

  తక్కువ  ద్రవీభవన  ఉష్ణోగ్రత  కల’’ గాలియం ‘’మూలకం ఆస్ట్రో ఫిజిస్ట్ లకు ఎందుకో రుచించలేదు కానీ సూర్యుని నుంచి న్యూట్రియాన్ లు గుర్తించే గాలియం క్లోరైడ్ బాగా ఉపయోగపడింది ..భూగర్భం లో చాలా ఎక్కువ మొత్తం లో లిక్విడ్ గాలియం క్లోరైడ్ ఉంది న్యూట్రియన్లు ,గాలియం న్యూక్లియస్ లు ఢీకొని ‘’జెర్మేనియం ‘’ను ఏర్పరుస్తాయి ..దీనివలన ఎక్స్ రే కాంతి మినుకు మంటుంది .

  టెక్నీషియ0 మూలకం రేడియో యాక్టివ్ ధర్మం కలది .ఇది భూమిమీద ఎక్కడా లభించదు .కావాలంటే పార్టికల్ ఆక్సిలరేటర్ లనుండి పొందవచ్చు .గ్రీకు మాట టెక్నీటోస్ అంటే కృత్రిమమైనది అనే అర్ధం తో దీనికి టెక్నీషియ0  అని పేరుపెట్టారు . ఇది రెడ్ స్టార్స్ ప్రాంతం లో ఎక్కడో కొద్దిగా ఉందని గమనించారు .దీని హాఫ్ లైఫ్ టైం కేవలం 2 మిలియన్ల సంవత్సరాలు .ఇది ఉన్న నక్షత్ర జీవితకాలం కంటే తక్కువ .మరోమాటగా చెప్పాలంటే ఇది లేకుండా ఏ నక్షత్రం పుట్టలేదు ,ఒక వేళా పుట్టివుంటే ఈపాటికి గిట్టి ఉండేది ..నక్షత్ర కొర్ నుంచి దీన్ని సంపాదించే సాధనం కనిపెట్టబడలేదు .

 ఆస్మియం ప్లాటినం ఇరీడియం మూలకాలు అతిభార మూలకాలు .ఇందులో ఇరీడియం చాలా ఎక్కువ ఉపయోగం లో ఉంది ఫాన్ ల తయారీలో  స్మోకింగ్ గన్  తయారీలో ఎక్కువ వాడకం లో ఉంది ..65 మిలియన్ సంవత్సరాలక్రిందటి  జియాలాజికల్ స్ట్రాటలోని క్రెటీషియస్ పాలజియన్ ప్రాంతం లో పలుచనిపొరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది .భూమిపై ఇరీడియం తక్కువగానే ఉన్నా ,ఆరుమైళ్ళ మెటాలిక్ ఆస్టెరాయిడ్స్ లో ఉండి ,భూమిని తాకి ఆవిరై ,దాని పరమాణువులను భూమిపై  అక్కడక్కడా వెదజల్లింది ..ఈ సమయం లోనేభూమిపై ఉన్న  డైనోజార్లు అంతరించిపోయాయి .అందుకే దీన్ని డైనోజార్ కిల్లర్ ఆస్టెరాయిడ్ అంటారు ..దీని ఎత్తు  ఎవరెస్టు శిఖరం అంత.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1
Inline image 2
Posted in సైన్స్ | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !

 ఉంది. ఇదేదో మోకాలికి బట్టతలకు ముడిపెట్టటం కాదు .. సహజ సిద్ధమైన మూడు మూలకాలుమాత్రమే బిగ్ బాంగ్ సమయం లో ఏర్పడ్డాయి .. న్యూక్లియస్ లో ఒకే ప్రోటాన్ ఉన్న హైడ్రోజెన్ అతితేలికైనా సాధారణ మూలకం ..ఇది బిగ్ బాంగ్ కాలం లో ఉత్పత్తి అయింది ..సహజ సిద్ధంగా లభించే 94 మూలకాలలో హైడ్రోజెన్ మానవ శరీరం లో ఉన్న మొత్తం పరమాణువులో  రెండు వంతులుంటుంది . విశ్వం ఉన్న పరమాణువుల(యాటమ్స్ )  సంఖ్యలో 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది . .భారీదైన గురు గ్రహం (జూపిటర్ ) కు చెందిన హైడ్రోజెన్ అనేక ఒత్తిడిలకు లోనై ఒక వాయువుగా కాకుండా ,ఒక వాహక లోహం గా ప్రవర్తించి గ్రహాలమధ్య అతి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచింది . 1796 బ్రిటిష్ శాస్త్ర వేత్త హేన్రి కేవండిష్ నీటిపై పరిశోధన చేస్తూ హైడ్రోజెన్ ను కనుక్కొని దీనికి హైడ్రోజెన్ -అంటే ‘’నీటిని ఏర్పరచేది ‘’అని పేరుపెట్టారు ..ఆస్ట్రో ఫిజిస్ట్ లలో కేవండిష్ మొట్టమొదటిసారిగా న్యూటన్ చెప్పిన సమీకరణం లో బిగ్ జి (G)అంటే గురుత్వాకర్షణ విలువ ఖచ్చితంగా కనిపెట్టి దానితో  భూమి ద్రవ్యరాశి  యెంత ఉందో  లెక్కవేసి స్పష్టంగా చెప్పాడు . ప్రతి రోజులో ప్రతి సెకండ్ కాలం లో 4. 5బిలియన్ టన్నుల అతి వేగంగా చలించే హైడ్రోజెన్ కేంద్రాలు శక్తిగా పరివర్తన చెంది ,ఒకదానికొకటి బలం గా కొట్టుకోవటం వలన సూర్యుని కేంద్రం లో 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతలో’’ హీలియం ‘’గా మారుతుంది .

  హీలియం మూలకం తక్కువ సాంద్రత గల వాయువు .దాన్ని ఎక్కువగా పీలిస్తే గొంతులోని స్వర పేటికపై కంపనాలు కలిగించి మిక్కీ మౌస్ చేసే శబ్దాలను చేస్తుంది ..హైడ్రోజెన్ తర్వాత విశ్వం లోఎక్కువగా  కనిపించే రెండవసాధారణ మూలకం హీలియం .హైడ్రోజెన్ తర్వాత స్థానం లో ఉన్నా హీలియం ,విశ్వం లోని అన్ని మూలకాల మొత్తం లో హైడ్రోజెన్ కంటే నాలుగు రేట్లు ఉన్నమూలకం ..బిగ్ బాంగ్ అనుభవం వలన  విశ్వం లోని అన్నిటికంటే కనీసం 10 శాతమైనా హీలియం మూలకాలు .ఈ ఫైర్ బాల్ ఉత్పత్తి చేసిన దే మనవిశ్వం .నక్షత్రాలలో థర్మో  న్యూక్లియస్ ఫుజన్  వలన హీలియం ఏర్పడి విశ్వం లో కొన్ని భాగాల్లో 10 శాతంకంటే ఎక్కువగానే హీలియం కనిపిస్తుంది .ఏ గెలాక్సి ప్రాంతం లోను 10 శాతం కంటే హీలియం తక్కువగా ఉన్నట్లు గుర్తించలేదు ..భూమిపై దీనిని కనుగొనటానికి 30 ఏళ్ళ ముందు అంతరిక్ష యాత్రికులు సూర్యుని కరోనా  అంటే పై శిఖర భాగాన హీలియం ను 1868 సంపూర్ణ సూర్య గ్రహణం నాడు కనిపెట్టారు..గ్రీకు సూర్య దేవత హీలియోస్ పేరిట దీనికి హీలియం అని పేరుపెట్టారు .గాలిలో హైడ్రోజెన్  లో 92 శాతం తేలి ఉండే  గుణం ఉన్నహీలియం ,హైడ్రోజెన్ కున్న మండే స్వభావం లేకపోవటం విశేషం .అందుకే బెలూన్లు నింపటానికి హీలియం నే ఎక్కువగా వాడుతున్నారు .హీలియం ను ఎక్కువగా వాడేది వయోగించేదీ అమెరికా మిలిటరీ ఒక్కటే ..

విశ్వం లో  మూడవ సాధారణ మూలకం ’’ లిథియం ‘’  ..దీని న్యూక్లియస్ లో మూడు ప్రొటాన్లుంటాయి ..హైడ్రోజెన్ హీలియం వలెనే లిథియం కూడా బిగ్ బాంగ్ సృష్టి యే ..నక్షత్ర కొర్ బాగా రియాక్షన్లలో హీలియం ఉత్పత్తి అయితే దానికి విరుద్ధంగా ప్రతి న్యూక్లియర్ రియాక్షన్ లోనూ లిథియం నాశనమై పోతుంది విశ్వం లోని పరమాణువులో   లిథియం  ఏ ప్రాంతం లోనైనా 1 శాతం కంటే మించి ఉండదు .ఏ గెలాక్సిలో ఇంతకంటే ఎక్కువ శాతం లో లిథియం ఉన్నట్లు గుర్తించలేదు .బిగ్ బాంగ్ మాయా జాలం లో హీలియం పై స్థాయిలో ఉంటె లిథియం కింది స్థాయిలో ఉండటం ..

 నాల్గవ మూలకం కార్బన్ .అన్ని పదార్ధాల అణువుల(మాలిక్యూల్ ) మొత్తం కంటే కార్బన్ కనిపించే అణువుల సమాఖ్య ఎక్కువ .విశ్వం లో కార్బన్ చాలా ఎక్కువే .నక్షత్ర కొర్ భాగం లో అది మధించబడి గెలాక్సిలలోకి పంపబడుతుంది .కార్బన్ లేని ప్రపంచాన్ని ఊహించలేము .

 సిలికాన్ పీరియాడిక్ టేబుల్ లో కార్బన్ కిందే ఉంటుంది .అంటే కార్బన్ ఎలా అణువులను తయారు చేయగలుగుతుందో సిలికాన్ కూడా అలాగే చేయగలుగుతుంది అర్ధం ..అయితే విశ్వం లో సిలికాన్ కంటే కార్బన్ 10 రెట్లు ఎక్కువగా ఉండటమే దానికి కిరీటం పెట్టటానికి కారణం అయింది ..

ఆరవ మూలకం సోడియం .సోడియం లాంప్స్ బజారుకు వెలుగునిస్తాయి ఇప్పుడైతే L.E D హవా వచ్చిందికాని  ఇప్పుడు లో ప్రెజర్ సోడియం లాంప్ లో వచ్చాయి అంతకు ముందు అంతా సోడియం హవా నడిచింది  ఆహార పదార్ధాలలో రుచికోసం వాడే ఉప్పులో ఉన్నది సోడియయమేకదా .

      సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-17-కాంప్-షార్లెట్-అమెరికా  .

Posted in సైన్స్ | Tagged | Leave a comment

 బ్లండరే బ్లండర్-4(చివరిభాగం ) 

బ్లండరే బ్లండర్-4(చివరిభాగం )

విశ్వ విస్తరణ గురించి హబుల్ తెలియజేశాక మరెవ్వరూ ఒమీగా విలువ 1 కి దగ్గరగా ఉండటం చూడలేదు . ఉన్న పరిశోధనా ఫలితాలలో వచ్చిన అత్యంత నిర్దుష్ట ఫలితం ఒమీగా విలువ 0. 3 కు అతి దగ్గరగా ఉంది . కనుక విశ్వం తెరచి అంటే ఓపెన్ గా ఉంది . 1979లో అమెరికా లో మాసా చుసెట్స్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ టెక్నలాజి ఫిజిసిస్ట్ అలాం హెచ్ గూత్ బృందం బిగ్ బాంగ్ ధీరీకి సవరణలు చేస్తూ సమస్యలను  అధిగమిస్తూ విశ్వం లో పదార్ధం ,శక్తి మనకున్నట్లుగానే సజావుగా ఉన్నట్లు గ్రహించారు దీనివలన ఒమీగా విలువ 1 కి దగ్గరాగా చేర్చబడింది కానీ అరకు కానీ 2 కు దగ్గరగాకాని లేక అంతకంటే పెద్ద సంఖ్య కు కానీ చేర్చలేదు  .  1దగ్గరకు మాత్రమే చేర్చింది . ఈ తర్జన భర్జనలు తర్వాత దృశ్యమాన పదార్ధం క్రిటికల్ డెన్సిటీకి 5 శాతం కంటే ఎక్కువ లేదు అని స్పష్టమైంది ..మరి డార్క్ మాటర్ మిస్టరీ ఏమిటి ?.ఎవరికీ అదేమిటో తెలియదు కానీ మొత్తం(టోటల్ ) లో మాత్రం దాని పాత్ర ఉంది దీనితర్వాత తేలిందేమిటంటే మనకు కనిపించే పదార్దానికి అయిదారు రెట్లు డార్క్ మాటర్ ఉంది .మళ్ళీ గందరగోళం అయినా ఓ లుక్కేసి ఉండాలి అన్నారు ధీరిస్ట్ లు .రెండు  శిబిరాలవారుడార్క్ ఎనర్జీ కనిపెట్టబడే దాకా  అవతలివారిదే తప్పు అనుకొంటున్నారు అన్నారుకూడా .ఈ ఒకే ఒక భాగం (కాంపోనెంట్ )ను సాధారణ పదార్దానికి  సాధారణ ఎనర్జీ కి కలిపితే విశ్వం యొక్క మాస్ ఎనర్జీ డెన్సిటీ క్రిటికల్ లెవెల్ దాకా పెరిగి0ది . ఇది పరిశీలకులకు ధీరీస్ట్ లకు సంతృప్తి నిచ్చింది . ఇద్దరూ కరెక్ట్ అనుకోని అభినందించుకున్నారు . ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎన్ని కూడికలు చేసినా దేన్నీ కలిపినా అంతతరిక్షం లో అంతకంటే పదార్ధం ఏదీ అదనంగా లేదని తేల్చారు

  ఈ డార్క్ ఎనర్జీ అనేది క్వాంటం ప్రభావం  కావచ్చు  అంతరిక్ష శూన్యం ఒత్తి శూన్యంకాక కొన్ని కణాలు ,వాటి వ్యతిరేక కణాల సముదాయం .అవి నిరంతరం జతలుగా కలిసి విడిపోతూంటాయి కనుక వాటిని కొలిచే వీలు లేదు సూక్ష్మ విషయాలను చెప్పే క్వాంటం ఫిజిక్స్ దీన్ని తీవ్రంగానే అధ్యయనం చేయాలని భావించింది .వాస్తవిక కణాలు అంటే వర్చువల్ పార్టికల్స్ జంటలు కొంత అతితక్కువ బయటి పీడనాన్ని కలిగించి  మళ్ళీ అంతరిక్షం లోకి దూరిపోతాయి . దురదృష్ట వశాత్తు రిపల్సివ్ వాక్యూమ్ ప్రెజర్ మొత్తం 10 టు ది పవర్ ఆఫ్ 20 రెట్లు ప్రయోగశాలలో గుర్తించిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ కంటే ఎక్కువ .ఇది దిమ్మతిరిగే ఫలితం కనుక మళ్లీ అనుమానం
    దీనిపై కీ లక సమాధానం ఏదీ కనిపించలేదు . అంతమాత్రాన నిరాశ కలగలేదు డార్క్ ఎనర్జీ ఒక చిన్న ముందడుగు . దీన్ని అయిన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంత సమీకరణాలకు అను స0ధించాలి .అంటే ఆయన చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ లాంబ్డా మాత్రమే ఇప్పుడు శరణ్యమైంది . అంతరిక్షం లో గతం లో వర్తమానం లో భవిషత్తులో యెంత డార్క్ ఎనర్జీ వచ్చినా ,దాన్ని కొలవటానికి ,లెక్కించటానికి దాని ప్రభావం తెలుసుకోవటానికి అవకాశం దీనివలననేఅంటే లాంబ్డా వలననే  లభించింది
 కనుక నిస్సంకోచంగా మహా మేధావి చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ అంటే లాంబ్డా యే దిక్కైంది  పాపం ఆయన దీన్ని తన బ్లండర్ అని లెంపలేసుకొన్నాడు .కానీ ఆయన చెప్పిందే నూటికి వెయ్యిశాతం కరెక్ట్ .కనుక అప్పటి బ్లండరే ఇప్పుడు బ్లండర్ అయింది .అందరికి ఊపిరి తీసుకొనే అవకాశాన్నిచ్చింది .దార్శనికుడు అయిన్ స్టీన్ మేధస్సు బహు చురుకైనది అని మళ్ళీ రుజువైంది . ఏతావాతా తేలిందేమిటి అంటే డార్క్ ఎనర్జీ అనేది విశ్వ0 లో మూల లక్షణమైన ఆస్తి అన్నమాట.
  సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 బ్లండరే బ్లండర్ -3

బ్లండరే బ్లండర్ -3

పెల్మట్టర్ ,స్కి మిడిస్ట్ శాస్త్ర వేత్త ల సూపర్ నోవాలు న్యూక్లియై ఫ్యూజన్ లో విలువైనవి .. కొన్ని హద్దులలో ఆ నక్షత్రాల   విస్ఫోటనం ఒకే మాదిరిగా ఉంది .అంతే శక్తి జనకాలను వినియోగించుకొని ,,అంతే టైటానిక్ ఎనర్జీ ని ,అదే సమయం లో విడుదల  చేసి అంతే తీవ్ర ప్రకాశనం పొందాయి .. కనుక ఇవివిస్ఫోటనం చెంది దూరంగా వెళ్ళిపోయిన గెలాక్సిల  కాస్మిక్ దూరాలను కొలవటానికి  కొలబద్దలుగాలేక స్టాండర్డ్ కాండిల్స్ గా  ఉపయోగ పడ్డాయి  .సూపర్ నోవా అన్నిటిలో ఒకేరకమైన వాట్తెజి ఉండి  తక్కువ కాంతికలవి దూరం గా ఎక్కువ కాంతికలవి దగ్గరగా ఉంటాయి .వాటి కాంతిని గణన చేస్తే అవి మనకు యెంత దూరం లో ఉన్నాయో  ఒకదానికొకటి యెంత దూరం లో ఉన్నాయో ఖచ్చితం గా చెప్పచ్చు  సూపర్ నో వాల ప్రకాశం *ల్యూమినాసిటి )వేర్వేరుగా ఉండట మ్ వలన ఇదొక్కటే దూరాలను కొలవటానికి కొలమానంగా తీసుకో కూడదు .

 అంతాబాగానే ఉంది .గెలాక్సిల దూర గణనకు మరో విధానం ఉంది .అదే-మిల్కీ వే నుంచి వాటి తిరోగమనం లేక మాంద్యం (రిసెషన్ ).ఇదే కాస్మిక్ విస్తరణకు ప్రాతిపదిక .హుబుల్ శాస్త్ర వేత్త గమనించినదాన్ని బట్టి విస్తరిస్తున్న విశ్వం దూరపు వస్తువులు మన నుంచి దూరం జరిగే  పందెం (రేస్ )లో దగ్గరున్న వాటికంటే వేగంగా జరిగిపోతాయి . కనుక ఒక గెలాక్షీ మాంద్య వేగాన్ని లెక్కించేటప్పుడు గెలాక్షీ దూరం కూడా కొలిచే వీలుంటుంది ..
  ఈ రెండు ముఖ్య విధానాలలో ఒకే వస్తువు కు విభిన్న దూరాలు వస్తాయి కనుక ఇందులో ఏదో  తప్పు ఉందని గమనించాలి .సూపర్ నోవాలు నిర్దుష్ట కాండిల్స్ కాకపోవచ్చు .లేక కాస్మిక్ విస్తరణ రేటు ను గెలాక్షీ వేగం ఆధారం గా కొలవటం తప్పు కావచ్చు . దీనిని బట్టి విశ్వం మనం ఊహించిన దానికంటే వేగంగా విస్తరించి గెలాక్సిలను వాటి మాంద్య  వేగానికంటే దూరంగా వాటిని ఉంచింది అని తెలుస్తోంది .కనుక అదనపు విస్తరణ ను వ్యాఖ్యానించటానికి అయిన్ స్టీన్ చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ -లాంబ్డా ఉపయోగించకుండా చెప్పటం అసాధ్యం .
  ఇక్కడే ఒక ప్రత్యక్ష సాక్షం దొరికింది మాంద్య  శక్తి గురుత్వాకర్షణ ను ఎదిరించి సర్వ్తత్రా  వ్యాపించి0ది  (పేర్మియేట్ ) .అందుకే లాంబ్డా అవసరమైంది .ఇప్పుడు లాంబ్డా ఒక భౌతిక సత్యమైంది దీనికి ఒక పేరుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది .కనుక విశ్వ నాట్యం లో కృష్ణ శక్తి అంటే డార్క్ ఎనర్జీ ఒక ముఖ్య కేంద్ర పాత్ర పోషించింది .శాస్త్ర వేత్తలు పారల్ మట్టర్ ,స్కిమిడ్స్ ,రీస్ లు ముగ్గురూ 2011 నోబెల్ ప్రయిజ్  ”డార్క్ మాటర్ ”కనుగొన్నందుకు   పొందారు.
  డార్క్ ఎనర్జీ గణనానికి ఖచ్చితమైన లెక్క దొరికింది విశ్వం లో ఉన్న 68 శాతం మాస్ ఎనర్జీ లో డార్క్ మాటర్ (కృష్ణ పదార్ధం )27 శాతం ఉంటె సాధారణ పదార్ధం కేవలం 5 శాతం మాత్రమే ఉంది .మన నాలుగు తరాల (ఫోర్ డైమెన్షనల్ )విశ్వం -విశ్వం లోనిపదార్ధం శక్తి మొత్తానికి , విశ్వం విస్తరిస్తున్న వేగానికి ,సంబంధం కలిగి ఉంది దీని గణనకు ఒక చక్కని గుర్తు” ఒమీ గాఅనే గ్రీకు అక్షరాన్ని  ”  రూపొందించారు. విశ్వ పదార్ధ శక్తి సాంద్రత  ను విశ్వ వ్యాప్తిని నిరోధించటానికి కావలసిన కనీస పదార్ధ శక్తి సాంద్రత(క్రిటికల్ డెన్సిటీ ) తో భాగిస్తే వచ్చే దే ” ఒమీగా ”
  ద్రవ్యరాశి ,శక్తి స్పీడ్ టైంవక్రత (కర్ప్ ) కు కారణమైతే ఒమీగా విశ్వం యొక్క ఆకారాన్ని  తెలియ జేస్తుంది .ఒమేగా విలువ 1 కంటే తక్కువైతే  ద్రవ్యరాశి శక్తి  క్రిటికల్ విలువకంటే తక్కువ గా ఉండి ,విశ్వం అనంతంగా అన్ని వైపులకు ,అన్నికాలాల్లో వ్యాప్తి చెంది ,ఒక గుర్రపు జీను ఆకారం పొంది ,అక్కడ సమాంతరరేఖలు వికేంద్రీకరణ చెందుతాయి ..ఒమీగా విలువ 1 అయితే విశ్వం నిరవధికంగా అరుదుగా వ్యాప్తి చెంది ,విశ్వం సమతలంగా మారి మనం సమాంతర రేఖల విషయం లో నార్చుకున్న  జామెట్రీ సూత్రాలన్నీ రుజువౌతాయి .  . ఒక వేళా ఒమీ గా విలువ 1 కంటే ఎక్కువైతే  సమాంతర రేఖలు కేంద్రీకరింపబడి ,విశ్వం మళ్లీ  తన పూర్వపు వక్రత పొంది ,ఏ అగ్ని గోళం నుండి తాను  ఆవిర్భవిచిందో ,మళ్ళీ దానిలోకి పతనం (కొలాప్స్ )చెందుతుంది .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1
Inline image 2
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త -కొండవీటి వెంకటకవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

–380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త –కొండవీటి వెంకటకవి (1918 – 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. బాబా లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఈనాడు,లో అనేక వ్యాసాలు రాశారు.

1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ శతకం రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు.

నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరిని ‘కళా ప్రపూర్ణ‘ పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు. కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. 1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు.

వీరు ఏప్రిల్ 7, 1991 సంవత్సరం పరమపదించారు.

పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, హైదరాబాదు ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించారు. ఆయన పురోహితుడు. ఇన్నయ్య తోటి పురోహితుడు.

కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.

వెంకటకవి కృతులు

  1. కర్షకా! (1932)
  2. హితబోధ (1942)
  3. భాగవతులవారి వంశావళి (1943)
  4. ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)
  5. చెన్నకేశవా! (1946)
  6. భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953)
  7. దివ్యస్మృతులు (1954)
  8. నెహ్రూ చరిత్ర – ప్రథమ భాగము (1956)
  9. త్రిశతి (1960)
  10. నెహ్రూ చరిత్ర – ద్వితీయ భాగము (1962)
  11. బలి (1963)

సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా
ఓ కవీ, వేదాంతీ, కొండవీటి వేంకటకవిమట్టినీ, మనిషినీ ప్రేమించినవారే గొప్ప సృజనాత్మక శక్తితో రాణించగలుగుతారు. సత్తెనపల్లి వీధుల్లో రెండు లక్షల అశేష జనవాహిని మధ్య కవితా బ్రహ్మోత్సవం జరిగిన సందర్భం ఒక్కటి చాలు ఆయన సాధించిన విజయమేమిటో తెలుసుకోవడానికి. అదే భారతం. అందరూ అవే మాటలు రాశారు. కానీ నిర్మాణపరంగా లోపాలున్నా ఆయన రాసిన ‘దాన వీర శూరకర్ణ’ చిత్ర సంభాషణలకు అశేష ఆంధ్రావని బ్రహ్మరథం పట్టింది. శ్రీమద్విరాట్‌పర్వం, శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, తాండ్ర పాపారాయుడు, ఏకలవ్య, విశ్వనాథనాయకుడు, వీరాంజనేయ తదితర సంభాషణల రచయితగా 1983 నుంచీ కీర్తిశేషులయ్యేంత వరకు ‘ఈనాడు’లో రాసిన ‘పరదేశి పాఠాలు’ రచయితగా, అనేక కావ్యాలందించిన కవిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు. తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎంతో దూరం నడిచారు. ఎంతోమందిని చైతన్యవంతం చేశారు. ఆ వైతాళికుడే కొండవీటి వేంకటకవి. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్‌ మాటల్లో చెప్పాలంటే సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి. ఎద్దులు బండియున్‌ గలిగి యెన్నియొ గేదెలు గాదెలుండినం జద్దికి జాలదయ్యె వ్యవసాయమొనర్చిన నొండు వృత్తి మీ వద్దకు జేరదయ్యె గనుపట్టును దీనికి ముఖ్య కారణం బెద్దియటన్న పాలకుల హీనపుబుద్ధియ సుమ్ముకర్షకా దశాబ్దాలనాడు కవిరాజు చెప్పినది నేటికీ వర్తిస్తుంది… పాలకులే ప్రజల నొసటి రాతలు రాస్తున్నారు. మిరపకు ధర పలుకుతోందని మిరప పైరువేస్తే పంట చేతికి రాగానే దాని ధర తగ్గిపోతుంది. ఒకటా రెండా… ఎన్నో దశాబ్దాలుగా అన్ని పంటల స్థితీ ఇలాగే ఉంది. కొండవీటి వేంకట కవి చెప్పిన మాట పొల్లుపోకుండా నేటికీ వర్తిస్తోంది… ఆయన కవుల బాధ్యతను కూడా స్పష్టం చేశారు. ”కవులై దేశహితమ్ముగోరుచు మహాగ్రంథంబులన్‌ సర్వ మానవ సౌభ్రాతృత బెంపునింపవలె దానంగల్గు మోక్షమ్ము మూర్ఖవిధిన్‌ ద్వేషపు బీజ సంతతుల గూర్పన్‌ లాభమే చెన్నకేశవ మాచెర్ల పురాంతరాలయ నివాసా పాహిమాం పాహిమాం…
కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. ఆచార్య తూమాటి దొణప్ప కొండవీటి వేంకటకవి గురించి ఇలా రాశారు- ”సహృదయాహ్లాదనముగా, సంస్కార ప్రతిపాదనముగా, సమాజ ప్రబోధ సాధనముగా నిర్దిష్టమైన లక్ష్యముతో నిర్దుష్టమయిన సాధన సామాగ్రితో సాహితీ సమారాధనమును సాగించిన సత్కవులు చాల అరుదు. ”ఉత్పాదకా నబహవః కవయః శరభా ఇవ” అన్న బాణోక్తి మేరకు సుకవులు అల్ప సంఖ్యాకులు. ప్రతిభావ్యుత్పత్యభ్యాసములు గల కవులు ద్వాతకులు. ఈ కోటిలో పరాంకోటికెక్కిన మేటి కవి మన కొండవీటి వేంకటకవి…” నిజమే… పద్యం రాసినా గద్యం రాసినా కొండవీటి వేంకటకవి శైలే వేరు. ఆశ్చర్యమేమిటంటే అంతటి ప్రౌఢకవి, కర్షక కవి గురించి తెలుగు సాహిత్యంలో అందుబాటులో ఉన్న జీవితచరిత్రల్లో ఆయనమీద ఒక్క వ్యాసమైనా అందుబాటులో లేకపోవడం. ”ప్రతిభామూర్తులు”, ”తెలుగు పెద్దలు”… ”మహనీయులు”, ”సారస్వతమూర్తులు”… ఇలా అందుబాటులో ఉన్న అనేక వ్యాస సంకలనాల్లో ఆయన గురించి ఒక్క వ్యాసమైనా లేకపోవడం ఈ రంగంలో కృషి చేసిన వారి పక్షపాత వైఖరికి నిదర్శనమనిపిస్తుంది.
నందమూరి తారకరామారావు అనుబంధంతో, ఈనాడు అనుబంధంతో కొండవీటి వేంకటకవి సృష్టించిన ఆలోచనలు, తార్కికత, ప్రాచీన కావ్యాల్ని కొత్తకోణం నుంచి వివేచన చేసే విమర్శనాత్మక దృష్టి ఆయన్ని నిత్య చైతన్య కవిగా మలచిందనడంలో అతిశయోక్తి లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో శేషమ్మ, నారాయణయ్య దంపతులకు 1918 జనవరి 25న జన్మించారు కొండవీటి వేంకటకవి. తండ్రి వద్దే తెలుగు కావ్యాలు చదివారు. మరోవైపు స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొంటున్న మహామహుల్ని చూశారు. వారి జీవన విధానంలో భాగమైన సామాజిక సేవను అవగతం చేసుకొన్నారు. సంస్కరణభావాల్ని ఒంట పట్టించుకొన్నారు. సరికొండ నమ్మాళరాజులు వద్ద సంస్కృతం నేర్చుకుని కావ్యాలు అభ్యసించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రుల వద్ద ఉన్నత విద్య అభ్యసించారు. మహాత్మాగాంధీకి జై అంటూ స్వాతంత్య్రోద్యమంలో ఉరికారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్ని సంఘటితం చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. అందుకే 1936లో జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శి పదవి చేపట్టారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు కావ్యరచన, వృత్తి ధర్మమైన విద్యా బోధన… మూడు రంగాల్లోనూ ఆయన రాణించారు.
1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అక్కడ ఆయన బోధించింది సంస్కృత వ్యాకరణం. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ‘ఈనాడు’ ప్రత్యేక అనుబంధంతో వెలలేని ఆణిముత్యాల వంటి అనేక వ్యాసాలనందించారు. 1953 జనవరిలోనే కవిరాజు బిరుదం పొందిన కొండవీటి వేంకటకవి పలు గ్రంథాల్ని రాశారు. ”పంచీకరణ భాష్యము” వంటి ఆదిశంకరుల రచనలు సైతం అందరికీ అర్థమయ్యేలా అనువదించారు. 1932లో ఆయన ”కర్షకా” అనే నూటొక్క పద్యాల కృతి అందించారు. అప్పుడు ఆయన వయస్సు పధ్నాలుగేళ్లు మాత్రమే. అయినా పండితుల ప్రశంసలందుకొనేలా ఆ కావ్యం రాశారు. ఆ తర్వాత పదేళ్లకి ”హితబోధ” అందించారు. ”భాగవతులవారి వంశావళి గ్రంథాన్ని 1943లో రాశారు. ”ఉదయలక్ష్మి నృసింహ తారావళి” గ్రంథాన్ని 1945లో రాశారు. వీటి తర్వాత కొండవీటి వేంకటకవికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ”చెన్న కేశవ శతకము”. ”చెన్నకేశవ మాచర్లె పురాంతరాలయ నివాసాపాహిమాం పాహిమాం” అన్న మకుటంతో సాగే ఈ కావ్యంలో వేంకట కవి భాషా పటిమ ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది. ఈ కావ్యం తర్వాత ”భావ నారాయణ చరిత్ర” అనే గద్య కావ్యం రాశారు. 1954లో రాసిన ”దివ్య స్మృతులు” ఆయనకు మళ్లీ గొప్ప పేరు తెచ్చింది. యుగకర్తలైన వేమన, వీర గురుడు సిద్ధప్ప, తరిగొండ వేంకమాంబ, అలరాజు కృష్ణదేవరాయలు, గుంటూరు మస్తానయ్య, మూర్తికవి నాగార్జునుడు, చిన్నయసూరి, వీరేశలింగం, గురజాడ అప్పారావు, త్రిపురనేని, కట్టమంచి, ఏటుకూరి వెంకట నరసయ్య, తిరుపతి వేంకటకవులు, పొట్టి శ్రీరాములు… వంటివారి మీద స్మృతి చిహ్నాలైన ఖండ కావ్యాలు రాశారు. తర్వాత ”త్రిశతి” పేరుతో వేమన శతకంలాంటి శతకం రాశారు. నెహ్రూ చరిత్రను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఖండాలుగా మూడు సంపుటాల మనోహర కావ్యం రాశారు. దీన్ని పి.వి.నరసింహారావు హిందీలోకి అనువదించడం విశేషం. రాజర్షి, బలి, మేలుకొలుపు, శ్రీకృష్ణ వ్యాసావళి వంటి కావ్యాల తర్వాత ”పంచీకరణ భాష్యము” రాశారు. ఆయన పలికితే పద్యం, పిలిస్తే పద్యం… అంతగా ఆయనకి పద్యంపై పట్టు ఉండేది. ప్రాచీన సాహిత్యాన్ని మధించి రసాస్వాదన చేసిన కొండవీటి వేంకటకవి కవిరాజుగా, కళాప్రపూర్ణగా పండితుల, సామాన్య పాఠకుల మన్ననలు పొందారు. కొండవీడు అన్న పేరు వింటేనే కదలి ఆశువుగా గలగలా పద్యం చెప్పగల ఆయన…
”ప్రోలయ వేమన ప్రోదిచేసిన నేల
వామనభట్టు దైవాఱుతావు
కాటయ వేమన్న కత్తిపట్టిన చోటు
కొమర గిరీంద్రుండు కుదురు నెలవు
అనవేమసార్వభౌముని విహారస్థలి
శ్రీనాధుసు కవి కాలూను వసతి
శంభుదాసుడు పదాబ్జములు మోపిన యిక్క యోగి వేమన నిల్చు త్యాగభూమి
… ఇటువంటి కొండవీటి సీమ నుంచి ప్రభవించిన వేంకటకవి 1991 ఏప్రిల్‌ ఏడో తేదీ పరమపదించారు. గురుపీఠాన్ని అలంకరించి వేదాంతోపదేశికులయ్యారు. కవిగా, వ్యాఖ్యాతగా, దేశికునిగా భాష్యకారుడిగా, వేదాంతిగా ఆయన అఖండకీర్తిని పొందారు. అనంత భావదీప్తితో ప్రకాశించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడాయన. ఒక సంస్కర్త… సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒక ఎవరెస్టు శిఖరం.

– చీకోలు సుందరయ్య

Kondaveeti Venkatakavi

కొండవీటి వెంకటకవి
(1918-1991)


Inline image 1

కొండవీటి వెంకటకవి
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 బ్లండరే  బ్లండర్ -2

బ్లండరే  బ్లండర్ -2

అయిన్ స్టెయిన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంతకు ముందున్న  గురుత్వాకర్షణ  సిద్ధాంతాన్ని దాటి చాలా ముందుకు దూసుకు వెళ్ళింది .న్యూటన్ ఆలోచనా పరిధిని దాటి సాధారణ సాపేక్ష సిద్ధాంతం, ఇతర ద్రవ్యరాశి లేక శక్తి క్షేత్ర గురుత్వాకర్షణ అంతరిక్ష కాల స్థానిక వక్రత ద్రవ్యరాశి కి సమాధానమై నిలిచింది ..ఇంకొంచెం అర్ధమయ్యేట్లు చెప్పాలంటే -ద్రవ్యరాశి కేంద్రీకరణ వక్రీకరణ కు దారి తీసి అంతరిక్ష- కాల నేత (ఫాబ్రిక్ )లో సొట్టలు -డింపుల్స్ ఏర్పడుతాయి  .ఈ వక్రీకరణలు కదిలే ద్రవ్యరాశులకు మార్గ దర్శనం చేసి సరళ రేఖా మార్గ ”జియో డెసిక్స్ ”కు అంటే వక్రత ఉన్న పథం అంటే కక్ష్యలుగా మారుస్తాయి .ఇక్కడ జియో డేసిక్స్ అంటే విస్తరించిన వక్రతాతలంపై రెండు బిందువులమధ్య ఉన్న అతి తక్కువ దూరం .ఇది నాలుగు తరాల స్పేస్  -టైం నేతలో ఉన్న రెండు బిందువులమధ్య ఉన్న కనిష్ట దూరం గా అర్ధం చేసుకోవాలి . .దీనిపై అమెరికా దేశ దీరిటికల్  ఫిజిసిస్ట్ జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ ”పదార్ధం  స్పేస్ కు ఎలా వంగాలోచెబితే స్పెస్ ద్రవ్యరాశి  ,ఎలా కదలాలో చెబుతుందన్నమాట ”అని వివరించాడు .

  సాధారణ సాపేక్ష సిద్ధాంతం రెండురకాల గురుత్వాకర్షణలను చెప్పింది .ఒకటి మనందరకు  తెలిసిందే  -భూమ్యాకర్షణ శక్తి .రెండవది స్పేస్ -టైం కల్పించే   రహస్యమైన (మిస్టీరియస్ ) యాంటీ గ్రావిటీ ప్రెజర్   .ఐన్స్టీన్ కానీ ఇతర సైన్టిస్ట్ లు కానీ గట్టిగా నమ్మిన లాంబ్డా అనేది పూర్తి యదార్ధమే ..విశ్వం యొక్క మార్పు లేని స్థితి అంటే అస్థిర చలనం లేని విశ్వమే .కానీ ఒక భౌతిక వస్తువు అస్థిర స్థితిలో ఉండటం శాస్త్ర పద్ధతిని (క్రెడో ) ను ఉల్లంఘించటమే అవుతుంది . ఒక్క విశ్వం విషయం లోనే విశ్వమంతా ఎప్పటికప్పుడు సమతుల్యంలో  ఉంటుందని ప్రత్యేకించి చెప్పలేం ..ఇంతకు ముందుశాస్త్ర చరిత్రలో  యెవరూ చూడని కొలవని కనీసం ఊహించని కొత్త విషయం ఇది .ఇదే ఇప్పుడు ఉదాహరణ గా దృష్టాంతంగా మారి పోయి సవాలు విసిరింది ..
  13 ఏళ్ళ తర్వాత 1929 లో అమెరికన్ ఆస్ట్రో ఫిజిస్ట్ ఎడ్విన్ . పి . హబుల్ విశ్వం స్థిరంగా(స్టాటిక్ ) లేదని కనిపెట్టాడు. దీనికి తగిన  సాక్ష్యా ధారాలు చూపించాడు ..గెలాక్షీ దూరమైన కొద్దీ ,అది వేగవంతంగా  మిల్కీ వే(పాలపుంత )  నుంచి వెనక్కి తగ్గుతుంది (రిసీడ్స్ ) .మరోరకంగా చెప్పాలంటే విశ్వం వ్యాకోచిస్తోంది అన్నమాట ..మరిప్పుడు కాస్మ లాజికల్  కాన్ స్టెంట్ కలిగించిన ఇబ్బంది వలన ప్రకృతి శక్తులలో అప్పటివరకు కని పెట్టబడనిదేదీ విశ్వ విస్తరణను ఆపగలిగేది లేదని అర్ధమై మహా మేధావి అయిన్ స్టీన్ తన ”లాంబ్డా ”ను పూర్తిగా తొలగించేసి ”నా జీవితం లో చేసిన అతి గొప్ప బ్లండర్ ఇది ”అని లెంపలు వాయించుకొన్నాడు.   తాను చెప్పిన సమీకరణం లో మార్పు చేసి లాంబ్డా విలువ సున్నా -జీరో గా భావించాడు .ఉదాహరణకు a= b +c అనేది అన్ని విషయాలలోనూ సరిపోతుంది కానీ c కి సున్నా విలువ ఉంటె మాత్రం అందులో  c ఉండాల్సిన అవసరం లేదని ఏమాత్రం లెక్కలొచ్చినవాడికైనా తెలుసు అదే అయిన్ స్టీన్ చేసింది.  అందుకే కాశ్మలాజికల్ కాన్  స్టెంట్ కు జీరో విలువ ఇచ్చాడు . తాను పూర్తిగా పొరబాటు పడ్డానని తాను   చేసింది బ్లండర్ అని పశ్చాస్తాపపడ్డాడు  ఆ మేధావి శాస్త్ర వేత్త . ఇది ఇంతటితో ఆగిపోతే ,కథ కంచికి పొతే  ఆయన గొప్పతనం ఏముంది ?
   ఆతర్వాత దశాబ్దాల కాలాల లో  సైన్టిస్ట్ లు ఐన్స్టీన్ పాతర వేసి గోరీ కట్టిన లాంబ్డా ను బయటికి తీయి కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ ఉంటె తమ భావాలు ఎలా ఉంటాయి అని ఆలోచించటం ప్రారంభించారు . 69 ఏళ్లతర్వాత 1998 లో సైన్స్ లాంబ్డాను చివరి సారిగా త్రవ్వి తీసి బయట పెట్టింది ఆ ఏడాది ప్రారంభం లో మూడు  ఆస్ట్రో ఫిజిస్ట్ ల బృందాలు ఒకటి కాలి  ఫోర్నియాలోని బెర్కిలీ లో ఉండే బెర్కిలీ నేషనల్ లేబొరేటరీ లోని సాల్ పెరల్ మట్టర్ ,మరొకటి ఆస్ట్రేలియాకలో కాన్ బెర్రా కు చెందిన మౌంట్ స్ట్రోమ్లో అండ్ స్దడింగ్ స్ప్రింగ్స్ అబ్జార్వేటరీకి  చెందిన బ్రియాన్ స్కిమిడ్స్  మేరీ లాండ్ లోని బాల్టిమోర్ జాన్ హాప్కిన్స్ యుని వర్సిటీ కి చెందిన ఆడం రైసెస్ బృందాలు డజన్ల కొద్దీ సూ పర్ నోవాలను  భావించినదానికంటే తక్కువ కాంతితో అంటే డిమ్  గా ఉన్నట్లు గుర్తించారు . నక్షత్ర విస్ఫోటనాలు చూశారు .ఈ సూపర్ నోవాలు తమ సమీప సోదర నోవాలకంటే భిన్నంగా ప్రవర్తించి పదిహేను శాతం ఎక్కువ దూరం లో ఉన్నట్లు గమనించారు .ఈ సహజ స్థితికి ముఖ్యకారణం ఐన్ స్టీన్ చెప్పిన లాంబ్డా అంటే కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ మాత్రమే కారణం అని అర్ధం చేసుకొన్నారు .ఇప్పుడు సైన్టిస్ట్ లే లెంపలేసుకొని దుమ్ము కొట్టుకు పోయిన ఆ మేధావి చెప్పిన లాంబ్డా కు జీవ ప్రతిష్ఠ చేసి అయిన్ స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్ష సమీకరణం  లో ఉంచి ఆ సమీకరణం అన్నిటికీ   సమాధాన0  చెప్పింది అని నిరూపించారు  . కథ ఇంతటితోనూ ఆగలేదు .ఇంకా ముందుకు జరిగింది ఆ విషయాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
  Inline image 1


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment