11-5-16బుధవారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30గం .లకు అష్టోత్తర పూజ ,ప్రముఖ సంగీతవిద్వా౦ సురాలు శ్రీమతి వి శాంతి శ్రీ గారిచే శంకరాచార్య స్తోత్రగానం

11-5-16బుధవారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30గం .లకు అష్టోత్తర పూజ ,ప్రముఖ సంగీతవిద్వా౦ సురాలు శ్రీమతి వి శాంతి శ్రీ గారిచే శంకరాచార్య స్తోత్రగానం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు

Inline image 1

సాహితీ బంధువులకు రేపు  11-5-16 వైశాఖ శుద్ధ పంచమి బుధవారం జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు

  రేపు ఉదయం 9 గం లకు మేడూరు దగ్గర ఉన్న కూడేరు గ్రామం లోనా మిత్రులు శ్రీ పసుమర్తి ఆంజననేయ శాస్త్రి  గారు  వారి స్వంత దేవాలయ సముదాయం లో శ్రీ శంకరాచార్య స్వామి విగ్రహ సమక్షం లో  శ్రీ శంకర జయంతిని అభిషేకం ,వేదపారాయణ ,,సాహిత్యం లో కృషి చేస్స్తున్న నాకు పండిత సత్కారం గా నిర్వహిస్తున్నారు  .
     రేపు సాయంత్రం 6-30 గం లకు ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారల దేవాలయం లో శ్రీ శంకర జయంతి సందర్భం గా  శ్రీ శంకరాచార్యులవారికి అష్టోత్తర పూజ, ,అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి వి .శాంతి శ్రీ  గారి చే  ”శ్రీ శంకరాచార్య విరచిత స్తోత్ర గానం ”నిర్వహింప బడుతాయి .
      ఆస్తిక జనమహాశయులు ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
                                   మీ దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141

 56  ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-3(చివరిభాగం )

41వ ఏట మరోపుస్తకం తెచ్చింది  స్టెయిన్ .అతుకుల బొంత లా అసహ్యంగా ఉంది .పికాసో బరాక్ లు పెయింటింగ్ లో వస్తువును తగ్గించి నైరూప్యం (ఆబ్ స్ట్రాక్ట్ )లోకి వచ్చేశారు .రచనలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ‘’టెండర్ బటన్స్ ‘’లో స్టెయిన్ చేసింది .దీనికి ఉప శీర్షికగా ‘’ఆబ్జేక్త్స్ ఫుడ్ రూమ్స్ ‘’అని పెట్టింది .నిశ్చల చిత్రాన్ని క్యూబిక్ చిత్రకారులు చిత్రించినట్లు రాసింది .చైర్ ,పియానో ఆరంజ్ ,బాక్స్ ,పుష్పం ,పోస్తేజ్ స్టాంప్ ,ఎగ్గ్స్ గొడుగు మొదలైన వస్తువులనుతీసుకొని చదువరులకు షాకిచ్చింది .ప్రతి వస్తువులో కొత్తదనం ,అననుభూతి కం గాఅంతకు ముందెప్పుడూ చూడని ,తారస పాడనీ రీతిలో  రాసింది .పెయింటర్లు విషయాన్ని మార్చి సంబంధం లేకుండా చేసినట్లు. స్టెయిన్ వాక్యాలను మార్చి మార్చి రాసింది .వాక్య నిర్మాణం (సింటాక్స్ )ను ధ్వంసం చేసింది .సంప్రదాయాలను కిటికీలోంచి గిరాటేసింది ‘’త్రీ లైవ్స్అండ్ ది మేకింగ్ ఆఫ్ అమెరికా ‘’లో నిజమైన ప్రజల గురించి రాసింది కాని ఇప్పుడు మానవ ప్రవ్రుత్తి పై ఆమెకు అభిరుచి లేదు .ఇప్పుడు అంతా  పదాల ,దృశ్యాల సహసంబందాల (కారిలేషన్ ),శబ్దాల ,మాటలలో ఉత్పన్నమయ్యే అర్ధాలపై ఆకర్షణ పెంచుకొన్నది .శబ్దం లోని లయ వ్యంగ్యం అనిశ్చితత్వం ఆమెను పట్టుకోన్నాయి .మిగిలిన వన్నీ వదిలేసింది సంఘటనలు ,చర్యలను నుండి తప్పుకొన్నది .దీనికి కారణంఈ  రోజుల్లో అందరికి ఏం జరుగు తుందో తెలుసు అందుకని దానిమీద మక్కువ లేదు అన్నది .ఎవరైనా శబ్దాన్ని చూశారా ,రంగుకు శబ్దానికి ఉన్న సంబంధం తెలుసా ,దాన్ని వర్ణించటానికి ఒక మాట సరిపోతుందా ?అని ప్రశ్నించింది .లూసి చర్చ్అనే నవలిక ,యూస్ ఫుల్ నాలెడ్జ్ అనే వ్యంగ్యాత్మక రచన  చేసింది .’’వాట్ హాపెనేడ్ ‘’లో నాటకాత్మక శైలి ప్రవేశ పెట్టింది .అదెలా ఉందొ రుచికి చూద్దాం –‘’a cut a cut is not a slice ,what is the occasion for representing a cut and slice .What is the occasion for all that .A cut is a slice ,a cut is the same slice ‘’ఇలా సా—–గుతుంది .

  యాభైవ పడి లో ఈ గందర గోల రచనకు స్వస్తి పలికి ,స్నేహితురాలిపై రాస్తున్న నెపంగా తన జీవిత చరిత్రనే ‘’ది ఆటో బయాగ్రఫిఆఫ్   ఆలిస్ బి.టోక్లాస్’’నవల రాసింది .ఇందులోవన్నీ తన జ్ఞాపకాల మాలలే .నిజానికి దగ్గర లేదన్నారు కొందరు .కాని చాలామంది ప్రాభావితులై ఇస్టపడి చదివి బాగా చర్చి౦చు కొన్నారు .ఈ విజయం టో మళ్ళీ అమెరికా వెళ్ళింది .అక్కడ తన రచన ‘’ఫోర్ సెయింట్స్ ఇన్ త్రీ యాక్ట్స్ ‘’ప్రదర్శన చూసింది .మార్మికత ,చాదస్తాలతో ఉన్నా మ్యూజికల్ హిట్ .’’నువ్వు మాట్లాడే భాషలో ఎందుకు రాయవు ?అని అడిగితె ‘’షేక్స్ పియర్ బ్లాంక్ వెర్స్ లో మాట్లాడాడని అనుకొంటున్నారా ?’’అని ఎదురు ప్రశ్న వేసింది.

  మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఫోర్డ్ కారు లో యుద్ధ భూమిని చేరి గాయపడిన ,హాస్పిటల్ లో కోలుకొంటున్న సైనికులకు ఆహార పదార్ధాలు అందించింది .ఆమెనవ్వు చలాకీతనం సంభాషణ వారినకి  ఏంతో బాదోపశమానం కలిగించింది .నాజీ సైన్యం పారిస్ ను రెండవ ప్రపంచ యుద్ధం లో ఆక్ర మించినప్పుడు రోజు విడిచి రోజు 7మైళ్ళు నడిచి వెళ్లి ఆహార పదార్ధాలను సేకరించేది ‘’.her;s is a powerful personality ‘’అన్నాడు ఫ్రాన్సిస్ హాకేట్ .’’అమెరికన్ సైన్యం ఆమెకు బానిసత్వ సంకెళ్ళను చేదించింది  ‘’అన్నారు .’’వార్స్ ఐ హావ్ సీన్ ‘’రచనలో ఫ్రాన్స్ పతనం ,దాన్ని ఆక్రమి౦చు కోవటం మరలా స్వేచ్చ పొందటం అన్నీ రాసింది ‘’బ్రూసీ అండ్ విల్లీ ‘’లో ఎక్కువ భాగంసైనికులు కాని సైనికుల లాంటి  చిత్రాలే. ఇదే ఆమె చివరి పుస్తకం .ఆమెకిప్పుడు 70ఏళ్ళు .మరో ఏడాదికి ఆమె ఆరోగ్యం క్షీణించి కుంచి౦చుకు పోయింది .మళ్ళీ అమెరికాకు వెడదామని అనుకోనగా  ఆమెకు కేన్సర్ సోకిందని నిర్దారణయింది .న్యుల్లి సర్ సీన్ అనే పారిస్ లోని అమెరికన్ హాస్పిటల్ లో చేర్చారు. ఒకవారం మాత్రమె అక్కడ ఉంది .నిరంతర శ్రమవలన స్టెయిన్ 26-7-1946న  శాశ్వతంగా దూరమై పోయింది .చనిపోవటానికి ముందు ‘’సమాధానం ఏమిటి ?అని అడిగి ‘’అయితే సరి ,అని నవ్వి ,సమాధానం రాక ,’’ప్రశ్న ఏమిటి ?’’అని అడిగి౦ది  అదే ఆమె జీవితపరమార్ధాన్ని గురించిన అన్వేషణ లో చివరిసారిగా అడిగిన ప్రశ్నగా మిగిలింది  .

    ఆమె చనిపోయాక అమె పై విరుద్దాభిప్రాయాలు వెలువడ్డాయి .ఒకాయన ‘’logorrhea  ,a running of the vowels ‘’అంటే ,’’syllabic babbling ‘’అన్నాడు ఇంకొకాయన .ఆమె రాసిన పేరగగ్రాఫులు ఎమోషనల్ గా  ఉన్నాయికాని వాక్యాలు కాదన్నాడు ఇంకొకడు ఇవేవీ నిజం కాదు చిన్నపిల్ల మాటల కూర్పు మొదలు పెట్టి ఎదిగినట్లు ఎదిగింది .ఆమె ‘’she reached to overlaboration  by over simplification –against what she considered an effete literature she pitted a primitive ,even as barbaric ,youthfulness ‘’ఆమె ఎప్పటికప్పుడు కొత్త విషయం కొత్త విధానం లో చెప్పింది .చదువరిని జాగృతం చేయటమే ఆమె లక్ష్యం .ప్రసారవిషయం గా ఆమెది అపజయమే .భాషా ప్రయోగ శీలనం లో అద్భుత విజేత .తరువాత రచయిత లెందరికో స్టెయిన్ గొప్ప ప్రేరణ గా నిలిచింది .

 

స్టెయిన్ ఇంట్లో సమావేశాలు ఆధునికత ,ప్రతిభా ఆలోచనా ఉన్న వారికి గొప్ప స్పూర్తిగా ఉండేవి .ఆమెసహిత్య శైలి మూడు రకాలు .1-hermetic –works illustrated by ‘’The making of Americans ‘’.Popularized writings  such as Autobiography of Toklas and speech writings are Brwisie and wille .అని ఎస్టిమేట్ చేశారు .ఆమె రాసిన ఇతర నవలలు నాటకాలు కధలు కవితలు హాస్యంతో వ్యక్తిగతమైనవే .ఆమెకవిత ‘’a rose is a rose is a rose is arose ‘’దీనికి ఉదాహరణ . These stream-of-consciousness experiments, rhythmical essays or “portraits”, were designed to evoke “the excitingness of pure being” and can be seen as literature’s answer to visual art styles and forms such as Cubism, plasticity, and collage. Many of the experimental works such as Tender Buttons have since been interpreted by critics as a feminist reworking of patriarchal language. These works were well received by avant-garde critics but did not initially achieve mainstream success. Despite Stein’s work on “automatic writing” withWilliam James, she did not see her work as automatic, but as an ‘excess of consciousness’.[citation ne

       పికాసో వేసిన క్యూబిక్ ఆర్ట్ పిక్చార్లను ఎక్కువగా కొన్నాకాని సిజన్నే ఆర్ట్ అంటే అమిత ఇష్టం .సర్వ వ్యాపకమైన దానీలో ప్రత్యేకంగా కనిపించే  సమానత్వాన్ని ఆమె కోరటం సిజన్నే ప్రభావమే ‘’కాన్వాస్ అంతా ప్రాముఖ్యమైనదే ‘’అంటాడు సిజన్నే .  Stein explained: “The important thing is that you must have deep down as the deepest thing in you a sense of equality.”ఆమె చేసిన పునరుక్తులు పాత్ర అట్టడుగు స్వభావ వ్యక్తీకరణకే  .ఆంగ్లో సక్సన్ పదాలను ఎక్కువగా వాడింది .అందరూ వాడిని వాటిని వదిలేసింది . Stein predominantly used the present progressive tense, creating a continuous present in her work, which Grahn argues is a consequence of the previous principles, especially commonality and centeredness. Grahn describes “play” as the granting of autonomy and agency to the readers or audience: “rather than the emotional manipulation that is a characteristic of linear writing, Stein uses play.”[49]

For me the work of Gertrude Stein consists in a rebuilding, an entirely new recasting of life, in the city of words. Here is one artist who has been able to accept ridicule, who has even forgone the privilege of writing the great American novel, uplifting our English speaking stage, and wearing the bays of the great poets to go live among the little housekeeping words, the swaggering bullying street-corner words, the honest working, money saving words and all the other forgotten and neglected citizens of the sacred and half forgotten city.’’అన్నాడు యా౦డర్సన్.హాస్య రచయితా జేమ్స్ తర్బర్  ‘’’యే పదార్ధం లేకుండా ఎనభై వేలకు పైగా పదాలటి ‘’జాగ్రఫీ అండ్ ప్లేస్ ‘’రాయటం స్టెయిన్ గొప్పతనం అన్నాడు .దాదాపు నలభై పుస్తకాలు రాసిన స్టెయిన్ బ్రెయిన్’’ స్టెన్ గన్’’అనిపిస్తుంది .ఎందరో  సంగీతకారులు ఆమె రచనలకు సంగీతం కూర్చారు ‘దేర్ఈజ్ నో దేర్’’యే రోజ్  ఈజ్ యే రోజ్’’వంటివి ఎన్నో ఉన్నాయి.దాదాపు నలభై పుస్తకాలు రాసింది .

 

Inline image 1

 సశేషం

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140

 56  ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-2

  రూ డీ ఫ్లూరస్ లోని ఇల్లు ప్రగతి శీల రచయితలూ కళాకారులకు ముఖ్య కేంద్రమైంది .కళాకారిణిగా  స్టెయిన్ ,పికాసో ,మాటిస్సే,బ్రేక్ లతో వారికి కీర్తి రాకముందే పరిచయమైంది .వాళ్ళ చిత్రాలనుకొని తన ఇంట్లో గర్వంగా వ్రేలాడదీసిమురిసిపోయేది.సొగసైన సెలూన్ నిర్వాహకురాలుగా యువ రచయితలను ఆకర్షించింది .వారిని తన నిర్మొహమాట పద్ధతిలో అప్పటికి ఇంకా రచన ప్రారంభ దశలోనే ఉన్నా స్టెయిన్ వారిపై ప్రభావం చూపించింది .ఆమె నిజాయితీకి వారు అప్రతిభులైనారు .స్కాట్ ఫిట్జెరాల్డ్,షేర్వుడ్ అండర్సన్ .ఎర్నెస్ట్ హెమింగ్ వేమొదలైన వారు ఆమె వలన లబ్ది పొందారు .వారి రచనలను ఇంకా సూక్ష్మీ కరించమని సరళం చేయమని  పదేపదే చెప్పేది.తానూ సూచించిన  సరళత ఆమే మొదటి పుస్తకం ‘’త్రీ లైవ్స్ ‘’లో కని పించదు దీన్ని 35వయసులో రాసింది .ఇద్దరు జర్మన్ సేవకుల ఒక నీగ్రో వేశ్యల విషాద  జీవిత చిత్రణ .దీనిపై వచ్చిన విమర్శలు తక్కువే కాని పాజిటివ్ గా లేవు .కాని కొత్తస్వరం నూతన భావనలు వైవిధ్యం ఉన్నాయని మెచ్చుకొన్నారు .రెండవ పుస్తకం ‘’ది ఆటో బయాగ్రఫి ఆఫ్ ఆలిస్ బి టాక్లాస్’’లో మేనరిజాలు ,సంబంధం లేని విషయాలు ఉన్నాయి .కొత్త ప్రపంచం లో పాత మనుషులు బాపతుగా ఉంది .కొత్తవారు పాతవాళ్ళలోంచి ఎర్పడుతారు .కదా సంవిధానం లేదు .ఒకే కుటుంబానికి చెందిన కద..జీవితం అంటే సాధారణ సంఘటనల మార్పు లేని తీరే  అంటుంది స్టెయిన్ .పునరుక్తి బోరు కొడుతుంది ‘’దిమేకింగ్ ఆఫ్ అమెరికన్స్ ‘’లో ‘’the quality of being a son or an uncle ,does not depend at all on the specific parents  or nephews who objectively create the position .The individual people in the book go on and on as themselves ‘’ప్రాణం ఉన్న జీవులుగా ,క్రియలుగా ,వాళ్ళందరూ ఆకర్ములు .’’this anonymity or common’’ placeness ‘’ or impersonality of mind is of course ,in her case an intellectual thing ,even a scientific discipline –but it is parallel to and very like the mentality of the saints whose biographies are lost in their absorption in the present general miracle and the state of grace ‘’విగ్రహారాధన కు స్వస్తి .

     సశేషం

        మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138

55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త  ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -4(చివరిభాగం )

రసెల్ 80 వ జన్మ దినోత్సవం కీర్తులు భుజకీర్తులతో బ్రహ్మాండంగా జరిగింది .నోబెల్ బహుమతి వచ్చినప్పుడు లైఫ్ మేగజైన్ రాస్తూ ‘’తాను  సాహిత్యానికి చేసిన సేవ ఏదీలేదు కనుక దాన్ని తిరస్కరించాడని ఆతని మహోన్నత బుద్ధి ఇంకా కోపం తెప్పిస్తూనే అల౦కార మైంది ‘’అన్నది .ఆయనపై ఒక సినిమా చిత్రీకరిస్తు ఇంటర్వ్యు చేస్తున్నప్పుడు ఆయన బుర్ర పాదరసంలా పని చేసి పక్షపాతం ,నటన ,మోసాలను అతి వేగం గా గుర్తించ గలిగే సామర్ధ్యాన్ని కలిగే ఉంది .అప్పుడు ఆయన 60ఏళ్ళ వాడికంటే యవ్వనంగా కనిపించాడు .మీసం ఎప్పుడో జారిపోయింది .కవళికలు స్పష్టంగా పెదిమలు ద్రుఢంగా,కళ్ళు జీవం తో తొణికిస లాడాయి  .

80 వ పుట్టిన రోజు జరిగిన నెలకు ఈ పెళ్ళిళ్ళ ప్రయత్న గాడు  వివాహ ఆనందాన్ని చాలా అనుభవించానని విడాకులను దూరం చేశానని అన్నాడు .అన్నాడేకాని కొన్ని నెలల తర్వాత నాలుగో సారి ఎడిత్ ఫించ్ అనే  బ్రిన్ మావార్ కాలేజి మాజీ  టీచర్ ను పెళ్ళాడేసిఆశ్చర్యం  కల్గించాడు .ఆయన సంకల్ప బలం రచన శక్తీ ఎనభై దాటినా ఏమీ తగ్గనే లేదు .వితండ వాదం ప్రమాదల  గురించి నిర్మోహ మాటం గాఇదివరకటికంటే ఘాటుగా  రాశాడు .1950-52కాలంలో ‘’అన్ పాప్యులర్ ఎస్సేస్ ‘’,న్యు హోపెర్ ఫర్ ఏ చేంజింగ్ వరల్డ్ ‘’ది ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ ఆన్ సొసైటీ ‘’ గ్రంధాలు  రాశాడు.1953లో రసెల్ కొత్త రంగ ప్రవేశం చేశాడు .అప్పటివరకు 65పుస్తకాలు అనేక కరపత్రాలు రాసిన వాడు చిన్న కదల మోజులో పడి రాశాడు  .వీటిని ‘’శాటన్ఇన్ దిసబర్బ్స్ ‘’పేరుతొ ప్రచురించాడు .1954లో 82వ జన్మ దినోత్సవం జరుపు కొంటూ ‘’నైట్ మేర్స్ ఆఫ్ ఎమినేంట్ పెర్సన్స్’’రాసి ప్రచురించాడు .ఫ్రీ మైండ్ గురించి ఇంకా చర్చిస్తూనే రాస్తూనే చెబుతూనే ఉన్నాడు .చావేకాక మనిషి జీవితం లోచాలా  స్వేచ్చగా ఉండాలి ,ఆలో చనల్లొ ,విమర్శలో ,ఊహలో ,సృజనలో అన్నాడు

‘’ 1962జూన్ 1న చావు గరించి విని విచారం వెలి బుచ్చే సమయం లో తానొక దేశ దిమ్మరినని ,అరిస్టాక్రసి వ్యతిరేకినని,అతని సిద్దా౦ తాలు చాలా తమాషాగా ఉంటాయని ,అవిఅతని నడవడిని నిర్ణ యించాయని చెప్పుకొంటారు .ఆయన బాగా ముసలితన లో కూడా మాంచి వినోదం పంచేవాడిగా ,మంచి ఆరోగ్యంగా ,రాజకీయ నిర్ణయ నేతగా ,ఆనాటి రెస్టోరేషన్ తరువాతి   మహాకవి మిల్టన్ లాగా ఒంటరి గా   ఉన్నాడని ,చని పోయిన శకానికి మిగిలిన ఆఖరి ప్రాణి ‘’అని కీర్తించాలని కోరుకొన్నాడు .

రసెల్ పూర్తిగా యుద్ధ వ్యతిరేకి .సామ్రాజ్య వాదాన్ని  పూర్తిగాతిరస్కరించినవాడు .పాసిజం ను సమర్ధించి జైలుకు వెళ్ళినవాడు .తర్వాత హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాడు . స్టాలిన్ తరహా నియంతృత్వాన్ని ఎదిరించిన వాడు .వియత్నాం పై అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకించాడు .అణ్వాయుధ విసర్జన కోరుకొన్నవాడు .అతనికి వచ్చిన పురస్కారాలు విశేషమైనవి .పుట్టుక నుండి1908వరకు ‘’ది ఆనరబుల్ బెర్ట్రాండ్ ఆర్ధర్ విలియమ్స్ రసెల్ ‘’ను ,1908నుంచి 1931 వరకు ‘’ఎఫ్ ఆర్ ఎస్ ‘’,1931-49వరకు ‘’రైట్ ఆనరబుల్ ఎరల్ రసెల్ ‘’‘’,1949నుంచి చని పోయేవరకు ‘’రైట్ ఆనరబుల్ ఎరల్ రసెల్ ఓఎం ఎఫ్ ఆర్ ఎస్ బిరుదులతో విరాజిల్లాడు .

ఎనలిటికల్ ఫిలాసఫీ స్థాపకుల్లో  రసెల్ ఒకడు .లీబ్నిజ్ ప్రభావం బాగా ఉన్నవాడు .ఈస్తెటిక్స్ కాకుండా అన్ని వేదాంత విషయాలు రాశాడు .ఫలవంతమైన మెటా ఫిజిసిస్ట్ .లాజిక్ ఫిలాసఫీ గణితాలలో ఉద్దండుడు.ఫిఆసఫీ ఆఫ్ లాంగ్వేజెస్ ,ఎథిక్స్ ,ఎపిస్టమాలజిఅంటే జ్ఞాన మీమాంసా శాస్త్రం లలో  నిష్ణాతుడు  .బ్రాండ్ బ్రాన్ డాల్ట్ రసెల్ ను  ఈస్తెటిక్స్ పైన ఎందుకు రాయేదని అడిగితె తనకు సౌందర్యం గురించి ఏమీ తెలియదని, కాని దాని వలన తాను  రాసినదానిని బేరీజు వేయకూడదని అన్నాడు .తాను ఆజ్ఞేయ వాదినే అన్నాడు .అంతమాత్రం చేత ఒలింపిక్ దేవతలను కాదని అనలేదు .బ్రిటిష్ హ్యూమన్ అసోసియేషన్ సలహా సంఘ సభ్యుడిగా ,,కార్దిస్ హ్యుమానిటీస్ అధ్యక్షుడిగా జీవితాంతం రసెల్ పని చేశాడు .శాస్త్రీయ సంఘం(సైంటిఫిక్ సొసైటీ ) ఏర్పడాలనివాచించాడు .యుద్ధం లేని జనాభా అతిగా పెరగని ,సంపద అందరికి సమానంగా విభజింప బడే సమాజం కోరుకొన్నాడు .మానవాళికిమార్గ దర్శనం చేసేది పరస్పర సహకారమే అన్నాడు .’’హోమో సెక్సువల్ ఆ రిఫార్మ్ సొసైటీ’’ని పూర్తిగా సమర్ధించాడు .”Reflections on My Eightieth Birthday” (“Postscript” in his Autobiography), Russell wrote: “I have lived in the pursuit of a vision, both personal and social. Personal: to care for what is noble, for what is beautiful, for what is gentle; to allow moments of insight to give wisdom at more mundane times. Social: to see in imagination the society that is to be created, where individuals grow freely, and where hate and greed and envy die because there is nothing to nourish them. These things I believe, and the world, for all its horrors, has left me unshaken”[158

అని రాసుకొన్నాడు .రసెల్ ప్రభావం పడని ఆధునిక రచయిత ఎవరూ లేరు అన్నది యదార్ధం .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137

55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త  ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -3

యుద్ధం తర్వాత తాను  నమ్మని , రష్యామీదుగా  ప్రయాణం చేశాడు .అప్పుడు బోల్షేవిక్కులు ఆసియా వాసులపై చూపిస్తున్న బలాన్ని పాశ్చాత్య మానసాలు ఒక జబ్బుగా ఎలా భావిస్తున్నారో నని ఆశ్చర్య పోయాడు .రష్యా చైనాలను మెచ్చుకొన్నాడు .50 వచ్చాయి పెళ్లి అయి 27 ఏళ్ళయింది .విడాకులిచ్చి డోరా విన్ఫ్రేడ్ బ్లాక్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెతోకలిసి ‘’ప్రాస్పెక్త్స్ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలిజేషన్ ‘’పుస్తకం రాశాడు .ఆమె సహకారం తో బీకన్ హిల్ స్కూల్ ను 4నుండి 10 ఏళ్ళ వయసు పిల్లలకోసం స్థాపించాడు.అందులో నిబంధనలు కాని ,మతబోధ కాని క్రికెట్, ఫుట్ బాల్  ఆటలు కాని ,బెత్తం తో కొట్టటం కాని తిట్టటం  కాని లేని ఆధునిక భావాలతో నడిపించ టానికి ప్రయత్నించిన స్కూల్ అది .విద్యార్ధినీ విద్యార్ధులు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చదువుకోవచ్చు .ఏం కావాలంటే అది చేసుకోవచ్చు .ఆడా మగా కలిసి బట్టలు లేకుండా స్నానాలు చేసేవారు .అన్ని ప్రశ్నలకు పూర్తీ నిజాయితీ తో జవాబు చెప్పేవారు .ఈ విధానం సాధారణ ,ఎగువ సాధారణ వర్గాల తలిదండ్రులకు  మింగుడు పడలేదు ..కొందరు ఈ విధానం పనికిరాదన్నారు ..మనిషి శీలానికి నాలుగు ముఖ్య విషయాలు కారణం అన్నాడు రసెల్ .వీటిని ‘’ఎడ్యుకేషన్ అండ్ గుడ్ లైఫ్ ‘’పుస్తకం లో వివరించాడు .అందులో మొదటిది –వైటాలిటి –అంటే బలీయమైన శక్తుత్సాహం –భయం లేని స్వీయ క్రమ శిక్షణ .ఎవరూ ఎలా ప్రవర్తించాలో చెప్పబడ రాదు ఎవరూ అవతలివారి పై అధికారం చూపించ రాదు .మన ప్రయోజనాలు మనవే .అవి బయటివారి ప్రభావం వలన యేర్పడ రాదు .మన ప్రయోజనాలను ఇతరులపై బలవంతంగా రుద్ద రాదు ..రెండవది కరేజ్ –ధైర్యం –ఆత్మ గౌరవం,ఆత్మ జ్ఞానం..వ్యతిరేక అలవాట్లపై పోరాటం చేసి కోపం దుర్మార్గాలను అణచుకొని నేర్చుకోవాలి .మూడవది సెన్సిటివిటి-అంటే సున్నిత మనస్తత్వం .సరైన విద్యవలన ఇది లభిస్తుంది కాని తాత్కాలిక భావోద్రేకాలకు గురైతే రాదు .నాలుగవది ఇంటలిజెన్స్ –అంటే మేధస్సు .తెలుసుకోవాలనే తహ తహ కొత్తది కనిపెట్టటానికి కారణ మవుతుంది .అది విజ్ఞానానికి దారి తీస్తుంది .సృజన వయసు మీద పడిన కొద్దీ తగ్గుతుంది .ఆశయ ఆదర్శాలు ఘనమే కాని ఆచరణలో పూజ్యమై స్కూల్ మూత పది నిరాశనూ అపజయాన్ని పంచింది .

స్కూల్ తో పాటు రెండో పెళ్ళీ ఫెయిలయింది .మొదటి భార్య ఇచ్చిన విడాకులు గుర్తింపు పొందలేదు .రెండో భార్య డోరా  ఇచ్చిన విడాకుల నోటీసు చాలా స్పెక్టాక్యులర్ అంటే వింత ఆకర్షణమైంది  .దీనికి కారణం రసెల్ ప్రచురించిన ‘’మారేజ్ అండ్ మోరల్స్ ‘’.భార్యా భర్తల మధ్య సెక్స్ సంబంధం సంతానం కోసం మాత్రమే కాదు కాని వారిద్దరి మధ్యా అవగాహనకు ఇద్దరికీ విద్య ఉండాలి .అందుకోసం పెళ్లికాకుండానే పరాయి వాడితో పడుకోవటం అలవాటుకావాలి .అంతే కాదు వివాహేతర శృంగారమూ అభిలాష ణీయం అన్నాడు .దీన్ని వివరిస్తూ రసెల్ ‘’where marriage is  fruitful and both partners to it are reasonable and decent the expectations ought to be that it will be lifelong ,but that not it will exclude other sex relations ‘’అని కొత్త’’ దవ్వారాలు ‘’తెరిచాడు  .ఈ విషయం లో రసెల్ ద్వయం హుందాగానే ఉన్నా ,ఇద్దరు పిల్లలను కన్నా వీరికాపురం జీవితాంతం వర్దిల్లాల్సి ఉంది .కాని ఈ వివాహేతర శృంగారాన్ని  ఆ ఇద్దరూ ఆహ్వానించ లేక పోయారు .ఈ బాధ భరించలేక 1932లో చట్ట పరంగా రెండేళ్ళ తర్వాత  విడిపోయారు .అప్పటికి ముసలాయన వయసు 64,ఇక ఆగకుండా తన దగ్గర రిసెర్చ్ అసిస్టెంట్ గా ఉన్న హెలెన్ పాట్రీషియా స్పెన్స్ ను పెళ్లి చేసుకొన్నాడు .మరో ఏడాదికి ఒక కొడుక్కి తండ్రి అయ్యాడు .

అరవైలలో చాలా విలువైన గ్రంధ రచన చేసి ప్రచురించాడు ..అందులో ముఖ్యమైనది ‘’ఫ్రీడం అండ్ ఆర్గ నైజేషన్ ‘’.దీనిలో 1814నుండి 1914వరకు ఒక శతాబ్దపు చరిత్ర ను గూర్చిన సర్వే ఉంది .ఇందులోని శక్తి వంతమైన వర్ణన శైలి విపరీతంగా ఆకర్షిస్తుంది .దీన్ని ఒక  సైంటిఫిక్ ఫిక్షన్ గా రాశాడు .పాతవాటిని పునర్ మూల్యాంకన చేసి కొత్త విషయాలు చెప్పాడు .ఇందులో కొంత దుస్టస్వభావం ఉన్నా ,వందేళ్ళలో నియంత మాటర్నిచ్ ,సింహ సదృశ బిస్మార్క్ ,చాపకింద నీరులా ఉండే మాల్థస్,విప్లవ అవాస్తవ ఫిలాసఫర్ ,ప్రమాదకర ఎకనామిస్ట్ మార్క్స్ల గురించి మనకు తెలియని విషయాల నెన్నిటినో తవ్వి తీశాడు .గణిత శాస్త్ర వేత్తగా రసెల్ మార్క్స్ చెప్పిన వివాదాస్పద సర్ప్లస్ ధీరీ అంటే మిగులు సిద్ధాంతాన్ని సవాలు చేసి ధనికుల చేతిలో అధికారం ఉందనటాన్ని కాదని వర్గ పోరాట సిద్ధాంతం ఉదార వాద సిద్ధాంతాన్ని దెబ్బతీసిందని తేల్చాడు .దీనివలన కన్జర్వేటివ్ లు బలపడ్డారన్నాడు .అంతమాత్రం చేత కేపిటలిజం ఉద్ధరిస్తున్దనుకోలేదు .దీనికి పారిశ్రామిక ప్రజాస్వామ్యం పరిష్కారం అన్న మార్క్స్ ఆలోచనపై అనుమానించాడు .’’the nineteenth century  was brought to a disastrous end by conflict  between industrial technique and political theory .Plutocracy ,the actual form of government in western countries ,was unacknowledged and ,as far as possible concealed from the public eye ‘’అని తన మనోభావాలను స్పష్టంగా చెప్పాడు రసెల్ .

‘’ఇన్ ప్రైజ్ ఆఫ్ ఐడిల్నెస్ ‘’ను దీనితర్వాత ఒక ఏడాదికి ప్రచురించాడు .శైలిలో విషయం లో చాల భిన్నంగా ఉంది .ఆశ్చర్యాలు సూక్తులు ,హాస్యం తో మేళవించి రాశాడు ‘’science while it diminishes our cosmic pretensions ,enormously increases our terrestrial comfort .That is why in spite of the horror of the theologians ,science has on the whole been tolerated ‘’అని సైన్స్ చేస్తున్న మేలు కీడులను విశ్లేషించాడు పని రెండు రకాలు .మొదటిది పదార్దాన్ని భూమి వద్దకానీ భూమిఉపరితలం  దగ్గరలో కాని ఇతర పదార్ధాలకు సాపేక్షంగా మార్చటం   .రెండవది ఇతరులను కూడా ఇలానే చేయమని చెప్పటం ‘’అన్నాడు

65వ ఏట రసెల్ మళ్ళీ అమెరికా వెళ్ళాడు చికాగో యూని వర్సిటి ,కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెల్స్ యూని వర్సిటి ,హార్వర్డ్ యూని వర్సిటీలలో విలియం జేమ్స్ స్మారక ఉపన్యాసాలిచ్చాడు 1940లో కాలేజ్ ఆఫ్ ది సిటి ఆఫ్ న్యు యార్క్ లో ఫిలాసఫీ ప్రొఫెసర్ చైర్ కు ఆహ్వానించారు .చాలా తీవ్రంగా అరుపులు కేకలు నిరసనలు మిన్ను ముట్టాయి. ‘అక్కడి తలిదండ్రులు రసెల్ రాసిన మారేజ్ అండ్ మోరల్స్ చదవకుండానే తమ పిల్లలకు  ఫ్రీ సెక్స్ ,అనైతికత వంటివి  నేర్పి భ్రస్టు పట్టిస్తాడేమోనని  భయ పడ్డారు,.ఈ అభియోగాలైన సేలేషియస్ అంటే కామం ,లెచేరస్ అంటే అతి శృంగారం ,లిబిడినస్అంటే విషయాసక్తి ,ఏస్తేటిక్అంటే సౌందర్యారాధన ,సబ్ వేర్సివ్అంటే  అన్నిటికీ అడ్డుతగలటం వంటివి తనపై మోపటం చూస్తె పూర్వం  సోక్రటీస్ పై,ణ కూడా ఇవే అభియోగాలు మోపారన్న సంగతి గుర్తు చేశాడు .రసెల్ క్లాస్ రూమ్ లో లాజిక్ ,గణితం మాత్రమె బోధిస్తున్నాడని కాలేజి ప్రెసిడెంట్  నిర్దారించినా ,రసెల్ పై ఒక కోర్టు కేసు జరిగి ,అతను హానికర ప్రభావం (పేర్నిషియస్  ఇన్ఫ్లుయేన్స్)కలిగిస్తున్నాడని  నియామకం రద్దు అయింది .న్యు యార్క్ సుప్రీం కోర్ట్ జస్టిస్ జాన్ మెక్ గీహన్ ,రసెల్ నియామకాన్ని రద్దుపరచి ‘’రసెల్ కి ఉద్యోగం అమర్యాదకు పట్టాభిషేకం ‘’అని తీర్పు చెప్పాడు . రసెల్ ఫిల డేల్ఫియా దగ్గర బార్న్స్ ఫౌండేషన్ లో ఉపన్యాసానికి ఆహ్వానం అందుకొన్నాడు .పెన్సిల్వేవేనియాలో మెరియన్ లో ఇల్లు కొనుక్కొని ఉండి,బార్న్స్ తో తగువు పడిరెందేల్లతర్వాట మళ్ళీ బాక్ టుపెవిలియన్ గా ఇంగ్లాండ్ చేరాడు .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో రసెల్ అభ్యంతరాలేవీ చెప్పలేదు .పసిఫిజాన్ని వదులుకోలేదు .కాని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఫాసిజాన్ని వ్యతిరేకించాలని కోరాడు .70 వ పడిలో తననుతాను ఆనంద పసిఫిస్ట్ గా చెప్పుకొన్నాడు .మార్మికటా వ్యతిరేకి అయ్యాడు .నిందా స్తుతి పరుడు ,అవిదేయతా తిరుగు బాటు దారుడు అనిపించాడు .76లో మరో రచన బాంబు పేల్చాడు .అదే ‘’హ్యూమన్ నాలెడ్జ్ –ఇట్స్ స్కోప్ అండ్ లిమిట్స్ ‘’.మేధావితనం ను విశ్లేషించిన రచన ఇది .రసెల్ తొణకని బెణకని ధైర్య సాహసాలకు అద్దంపట్టింది అది ..రేడియో ప్రసంగాలు చేస్తూ రేడియో స్థాయిని విపరీతంగా పెంచాడు .సామాన్యజనానికి సాహిత్యాన్ని

అందించాడు రేడియో మాధ్యమంగా .77వ ఏట నార్వీజియన్ ఫ్లైయింగ్ బోట్లో ప్రయాణం చేశాడు .అది కూలిపోయింది .అందులోని 20 మంది ప్రయాణీకులు నీళ్ళలో మునిగి మరణించారు .ఒళ్ళంతా పూర్తీ డ్రెస్ తో ఉన్న రసెల్ గడ్డకట్టిన సముద్రం లో ఈడుకొంటూ బయట పడే ప్రయత్నం చేస్తుండగా సహాయం అంది రక్షింప బడ్డాడు .కొద్ది రోజుల తర్వాత యధాప్రకారం తానూ చేయాల్సిన ఉపన్యాసం ఇచ్చాడు .78 వ ఏట బెర్ట్రాండ్ రసెల్ కుసాహిత్యం లో నోబెల్ బహుమతిలభించింది .రసెల్ ను మహితాత్మక రచయితగా మానవతా మూర్తి గా ప్రపంచం గుర్తించి ప్రశంసించింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5

 అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5

18-18 పురాణాలూ చెప్పగల సమర్ధులు

    ఒకదాని లోంచి ఇంకోదానిలోకి దూకే మహనీయులు

    ఏది మొదలెట్టి ఏమి చెబుతున్నారో అర్ధంకాని అసహాయులు

   ఈ మధ్యే ‘డ్రాయర్ పురాణం ‘’అరగంట సుమారు చెప్పారట

   అసలు విషయం కంటే ఏదైనా చెప్పగల సమర్ధులు

   భర్త స్నానం చేసి వదిలేసిన డ్రాయర్ని భర్త ఝాడించి ఆరేయ రాదట

   ఆరేస్తే ఆయుక్షీణమట భార్య ఉతికి ఆరేస్తేనే మోక్షమట

   మరి భార్య  బాల్చీ తన్నేస్తే ఏం చేయాలి మహానుభావా !

   డ్రాయర్ ఉతుక్కోసం మళ్ళీ పెళ్ళాడమని ఏ శాస్త్రం లోనైనా ఉందా ?

  విషయపు లోతులు తరచి విశేషాలు చేబుతారనుకొంటే

  మీ లోతు డ్రాయర్ దాకా  వెళ్ళిందన్నమాట

ఆహా ఏమి పురాణం ? ఏ కాలం లో మనమున్నాం ?

ఆధునిక సాంకేతిక కాలం లో ఉన్నమనం ఎలా

సమస్యల సుడిగుండాలనుంచి బయట పడి

జీవితం సార్ధకం చేసుకోవాలో వివరించండి స్వామీ !

అర్ధం పర్ధం లేని ఈ పిడకల వేట ,డ్రాయర్ పురాణం ఎందుకు ?

మనుషుల్ని సంస్కరించటమంటే  డ్రాయర్లూ గోచీలు  లుంగీలు లంగాల

మురికి వదిలించటం కాదు –మానసిక మాలిన్యాన్ని వదిలించాలని నేర్పండి

అప్పుడే మీ ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది,ఎకుంటే అధోగతి

అని ,నేనన్నా నంటే ఏమీ అనుకోకండి .

19-చానెళ్ళు పోషిస్తున్నాయని ఒక్కోరూ ఒక్కో చానెల్ కు

    అతుక్కుపోయి తాము చెప్పిందే వేదం అంటున్నారు

    షిర్డీ ప్రచారకుడూ ,వేద వేదాగ సారీ  ఈమధ్య సినీ ప్రచారకులూ అయిన

    ఒకాయనా ఒకరు నమ్మిన వారిని రెండోవారు ఈ మధ్యే దూషిస్తే

    రెండు గ్రూపుల అనుయాయులు ఒకరినొకరు బండ బూతులతో భూషించుకొన్నారట

    వేరే  ఒకాయన పల్లీలు బటానీలు తింటూ తినిపిస్తూ

   డొల్లు కబుర్ల తో  చానెల్ ను నడిపిస్తున్నారట

   ఇదేం పోయే కాలం గురూ అని బుర్రలు బద్దలు కొట్టుకొంటున్నారట

   బుల్లి పెట్టెను బద్దలు కొట్టుకొనే ధైర్యం లేక  వీక్షకులు .

   చానెళ్ళు మంచిని పెంచి మమతను పంచి మనసుల్ని చల్లబరచాలికాని

   ఈ వింత వికృత విరోధ చేష్టలు చేటుకాలపు ధోరణులకు

  ఫుల్ స్టాప్ పెట్టకుంటే మన ధ్యేయానికి ,మానవత్వానికీ మాయని మచ్చ

  అందరి ధ్యేయం సర్వోన్నత మానవ పరిమాణమే కావాలి కాని

  నికృష్ట నీచ మానవ స్వభావ దిగ జారుడు తనం కాదు

  అందరూ పెద్దలే, పెద్ద మనుషులే మధ్యలో ఉన్న బంగారుపళ్లెం మాయం ట

  తీరు మార్చు కో౦డి చానెళ్ళ గురు బ్రాహ్మలు గార్లూ !

  అతి వికటించి ,పైత్యం ప్రకోపించి మీ భరతమే ప్రేక్షకులు  పడతారేమో జాగ్రత్త

  అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

 సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-16 –ఉయ్యూరు

 

 

Posted in కవితలు, రచనలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136

55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త  ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -2

ప్యూరిటన్ల రూపు రేఖలు మరో రెండేళ్లలో మారిపోతున్నాయి .బీట్రిస్ వెబ్  మాటల్లో ‘’రసెల్ తనలోకాని ఇంకెవరి లోనైనా కానీ  చిన్న తప్పును కూడా సహించేవాడు కాదు .మనుషుల స్థాయిని బట్టి తప్పులు ఉంటాయనేవాడు ‘’.సంపూర్ణతలో ఏ లోపమున్నా సహించేవాడు కాదు .భార్య అయినా లోకమైనా అదే పద్ధతిలో ఉండేవాడు . మానవ అభ్యుదయానికి  ఆధారం సైన్స్ అని నమ్మాడు..’’సెలక్క్టేడ్ పేపర్స్ ‘’కు ముందుమాట రాస్తూ ‘’యవ్వన వాంఛ నన్ను మానవ సమాజ శ్రేయస్సును ఆలోచింప జేసింది ..గణితం నుండి సైన్స్ కు చేరి ఒంటరిగా పగటికలలతో గడిపాను .గలీలియో ,డేస్కార్తెస్ లు కూడా వారి యవ్వనం లో ఇలాగే ఉండేవారేమో .ప్యూర్ మాదమేటిక్స్ లో రాణించాలంటే సైన్స్ లోనూ ప్రతిభ సాధించాలని పించింది .కనుక సైన్స్ నాకు బాగా దగ్గరైంది .ఇదే సమయం లో నాబుద్ధి ఫిలాసఫీ వైపు పరిగెత్తింది .నైతికతకో వేదాన్తానికో కాదు ‘’by the wish to discover whether we possess anything that can be called knowledge ‘’.

కనుక జ్ఞాన సముపార్జన కోసమే రసెల్ గవేషణ సాగించాడు .తరువాత తుఫాను మధ్య ఉన్న భావన కలిగించాడు .దేనితో రాజ్యానికి శత్రువై ,అనైతికుల లో ఒకడు అనిపించుకొన్నాడు చివరికి అధికారిక దార్శనికుడు అయ్యాడుకాని  పిడి వాదిఅని పించుకోలేదు .24వ ఏట మొదటిపుస్తకం ‘’జర్మని సాంఘిక ప్రజాస్వామ్యం ‘’పై  విశ్లేషణాత్మక రచన చేసి ప్రచురించాడు .తరువాత రేఖాగణితం ,లీబ్నిజ్ ఫిలాసఫీలపైనా గణితం ,తర్కం ఒకటే అనే సిద్ధాంత వ్యాసం రచించాడు .38వయసులో ఏ.యెన్ వైట్ హెడ్ తో కలిసి ‘’ప్రిన్సిపియా మాధమేటికా ‘’వ్రాత ప్రతి తయారు చేశాడు .ఇరవై  ఏళ్ళుగా తనను బాధిస్తున్న సమస్యకు ఇది పరిష్కారం అన్నాడు దీన్ని .అయితే అతని అసలు సమస్య కు ఇంకా పరిష్కారం లభించలేదు .అయితేనేం ఫిలాసఫీ లో కొత్త విధానం గణితం లో నూతన శాఖ  లను కని  పెట్టగలిగానని సంతృప్తి చెందాడు .ఇది అంతగా కొత్తదికాకున్నా సత్యాన్ని ఆవిష్కరించటానికి మరోమార్గమేర్పడింది . . పరిశీలన ,పరీక్ష ,విశ్లేషణ ల వలన జ్ఞానం అనుభవ మౌతుంది .కాని లెక్కలు లాజిక్ ఇంకా దూరం వెళ్ళగలవు .వీటిద్వారా ఇప్పటి వరకు ఉన్న జ్ఞాన పరిధి విస్తరింప జేశారు .అనుభవ జ్ఞానం కాదనలేము అన్నాడు .వేదాంతం లో నే కాదు దాని వివరణలో అవసరమైన భాషలోనూ మార్పులు తెచ్చాడు .ఏదైనా రుజువైన తరువాతనే నమ్మగలం .అందులోని ప్రతి పద సముదాయం ,వాస్తవం లకు కూడా ఇదే వర్తిస్తుంది .మనకు తెల్సింది అనుకొన్న ప్రతి విషయాన్నీ అనుమానించాలి ,జాగ్రత్తగా గమనించాల్సిందే అంటాడు రసెల్ .

41 వయసులో ప్రిన్సిపియా చివరి మూడవ భాగం అచ్చు అయింది .అమెరికా వెళ్లి హార్వర్డ్ లో ‘’లోవెల్ లెక్చర్స్ ‘’ఇచ్చి మొదటి ప్రపంచ యుద్ధ చివరికాలం లో ఇంగ్లాండ్ కు తిరిగొచ్చాడు .రసెల్ లోని ఫాసిజం ,మానసిక శక్తి ఒక్కసారిగా షాక్ తిన్నాయి –కారణం లిబరల్స్ ‘’యుద్ధానికి యుద్ధమే ‘’అన్న నినాదం విని .జంకు గొంకు లేకుండా యుద్ధ భీభత్సాన్ని గూర్చి తీవ్రంగా ప్రచారం చేశాడు   .ఒక పాతికళ్ళ తర్వాత ‘’యుద్ధం నాలోని మేధస్సుకు వ్యతిరేకం .యుద్ధ ప్రేమికులు గొర్రెల్లా మందలో కలిసి పోయారు .మేధావులకు సంఘం పై ప్రేమా బాధ్యతా ఉంటె ఈ మానవ మారణ కాండకు ఊపిరులు ఊదరు  ‘’అని రాశాడు .’’most intellectuals have no belief in the intellect ,except in quiet times ‘’అని చురక అంటించాడు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రచారాన్ని ,కరపత్రాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి జరిమానా విధించి చివరికి ట్రినిటి కాలేజీ లెక్చరర్ ఉద్యోగాన్ని పీకేసింది .కొద్దికాలం తర్వాత రాసిన ఆర్టికల్స్ మిత్ర కూటమికి వ్యతిరేకం గా భావించి అరెస్ట్ చేసి ఆరునెలలు జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జైలు జీవితం రసెల్ కు వరమై తాను  టెక్స్ట్ బుక్ అని పిల్చుకొన్న ‘’ఇంట్ర డక్షన్ టు మాధమాటికల్ ఫిలాసఫీ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు   .దీని పై  హెచ్ జి వెల్స్ ‘’ప్రతిపేజీ ని జైలు గవర్నర్ కు పంపి చదివి౦పజేసి ఆమోదం పొందాకే పబ్లిషర్ దగ్గరకు చేరేది .జైలు గవర్నర్ ప్రతి రాత పేజీని చదవలేక అర్ధమూకాక తలకాయ నెప్పి వచ్చి బాధ పడ్డాడు ‘’అని రాశాడు .రిటైర్డ్ అకెడేమీషియన్ అని రసెల్ ను అందరూ మర్చే పోయారు .ఇప్పుడు  పబ్లిక్ పర్సన్ అయ్యాడు .దేశ ద్రోహిగానో .అమరవీరుడిగానో ప్రజల మనస్సులో ఉండిపోయాడు ..ప్రముఖ నవలాకారుడు రచయిత డి హెచ్ లారెన్స్ తో కలిసి అమెరికా వెళ్లి అక్కడ ‘’పసిఫిక్ ఉటోపియన్ కాలనీ ‘’స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడు .కాని యుద్ధం పూర్తి అయ్యేదాకా ఇంగ్లాండ్ లోనే ఉండటం మంచిదని నిర్ణయించుకొన్నాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135

55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త  ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -1

 

మనదగ్గర ఏదైనా విశేషం ఉందా అని కనుక్కోవటమే జ్ఞానం అంటాడు రసెల్ .గణిత శాస్త్ర వేదాంతి లేక వేదాంత గణిత శాస్త్రజ్ఞుడు ,చరిత్రకు కొత్త అర్ధం చెప్పినవాడు ,అనుమానాస్పడుడు ,మహా జ్ఞాపక శక్తి ఉన్నవాడు బెర్ట్రాండ్ రసెల్ .దేనినైనా వెంటనే ఒప్పేసుకోవటం ,మామూలు ఆలోచానా విధానం నచ్చనివాడు .అంతమాత్రం చేత సర్వ శుద్ధుడు కాదు .కాని తనలోనే విరుద్ధ భావాలున్నవాడు .గందర గోళ ప్రపంచం లో వివాదాస్పద వ్యక్తీ ,తనజీవితాన్నే తాను  చక్కదిద్దుకోలేని వాడు .ప్రతిదీ స్థిరమైన పద్ధతిలో ఉండాలనుకోనేవాడు .నలుగురు పిల్లలకు తండ్రి ,బాల్య శిక్షణ లో ప్రతిభా సంపన్నుడు ,ఒక అభివృద్ధికరమైన స్కూల్ ను స్థాపించిచేతులు కాల్చుకొన్న విఫలుడు. శృంగారం తెలియని సిద్ధాంతి .అయినా పరిపూర్ణ వివాహం గురించి శాస్త్రీయంగా రాసిన వాడు ,నిత్య సంచారి.స్థిరంగా ఒక చోట లేనివాడు ,అపజయం పొందిన భర్త ,మూడు సార్లు విడాకులు పొందినవాడు .80ఏళ్ళు దాటాక నాలుగో భార్యను పొందినవాడు రసెల్ .

పుట్టినప్పటి నుండే వివాదాస్పద వ్యక్తీ . మూడవ ఏటనే రస్సెల్ తండ్రి తనకోడుకును అగ్నాస్టిక్ గా అంటే దైవ భక్తీ లేనివాడిగా పెంచమని కోరితే బ్రిటిష్ రాజ్యం రసెల్ను వార్డ్ గా   రక్షణబాధ్యత స్వీకరించింది .18-5-1872న ఇంగ్లాండ్ లోని మన్మత్ షైర్ లోని  అందమైన ప్రదేశమైన టింటెర్న్ కు సమీపంలో ఉన్న ట్రెల్లెక్ లో   జన్మించాడు .బెర్ట్రాండ్ ఆర్ధర్ విలియం రసెల్ అసలుపేరు .59వ ఏట రసెల్ ‘’మూడవ ఎరల్ ‘’అయ్యాడు .1832లో ఈ ముసలాయన విప్లవాత్మక మైన సంస్కరణ బిల్లు ను ప్రవేశ పెట్టాడు .అందులో లిబరిజం ను వారసత్వంగా పొందిన యువత జీవితాంతం కొనసాగాలని కోరాడు .బాల్యం లో ఎపిస్కోపలియన్ ,ప్రెస్ బెటేరేనియన్ చర్చి లలో వారం విడిచి వారం ఆదివారాలలో వెడుతూ చర్చికివెళ్ళని  వాడిగా గుర్తి౦పబడి 11వ ఏట డార్విన్ శిష్యుడని పించాడు .ఈవయసులోనే తన మొదటి తిరుగుబాటు బావుటా ఎగుర వేశాడు .యూక్లిడ్ నిర్వచనాలను అంగీకరించటానికి సిద్ధ పడ్డాడు .కాని అందులోని సిద్ధాంతాలలో స్వీయ స్పష్టత లేదని  విభేదించాడు  .

18ఏళ్ళు వచ్చేదాకా రసెల్ ను ఇంటి వద్దే జర్మన్ గవర్నేస్ లు ,ఇంగ్లాండ్ ట్యూటర్లు చదువు చెప్పారు .గణితం లో అతనికున్న మేధస్సుకు వాళ్ళు ఆశ్చర్య పోయేవారు .కేంబ్రిడ్జి లో చేరి గ్రాడ్యుయేట్ అయి పారిస్ వెళ్లి,  బ్రిటిష్ ఎ0బసీకి అనుబంధంగా ఉన్నాడు  జేర్మనిలోని బెర్లిన్ చేరి ఎకనామిక్స్ చదివాడు .22వయసులో ఫిలడెల్ఫియా లోని క్వేకర్ రచయిత లోగాన్ పియర్సాల్ స్మిత్ సోదరిఅయిన ఆలీస్ విటాల్పియర్సల్ స్మిత్  కు చేరువై పెళ్లి చేసుకొన్నాడు .అరిత్ మాటిక్ ,ఫిలాసఫీ అధ్యయనం లో మునిగి ,ఫెమినిజం ,సోషలిజం లను కూడా నేర్చాడు .భార్యా భర్త లిద్దరూ ఫేబియన్ సొసైటీ సభ్యులై జార్జి బెర్నార్డ్ షా సిడ్నీ,బీట్రిస్ వెబ్ లతో సాన్నిహిత్యంగా మెలిగారు.29ఏళ్ళ రసెల్ నల్ల మీసం తో మేధావిగా కళ్ళలో కాంతితో కనిపించేవాడు .ఏదిరాసినా మాట్లాడినా  ఖచ్చితంగా సూటిగా ఉండేది .నల్లజుట్టు ,నాడులు పైకి కనిపించే చేతులు ,బుల్లిగడ్డంతో అందగాడనిపించేవాడు .నైతికత విషయం లో ప్యూరిటన్ .అలవాట్లలో సన్యాసిగా ఉండేవాడు .ఉన్నవాటిని సద్వినియోగం చేసుకోవాలనే తత్త్వం .మేధాపరంగా చాలా సాహసి .విగ్రహారాధనకు వ్యతిరేకి .మత సాంఘిక సంప్రదాయాలకు,సెంటిమెంట్ లకు  వ్యతిరేకి . ఆలోచన క్రమానినే  (ఆర్డర్ ఆఫ్ ధాట్)నమ్మేవాడు .లాజిక్ ,సైన్స్ లలో వస్తు క్రమాన్నే (ఆర్డర్ ఆఫ్ థింగ్స్ )నమ్మాడు రసెల్

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”రచన ”మే సంచిక లో” ఉత్తర రచన ”లో నా ఉత్తరం

”రచన ”మే సంచిక లో” ఉత్తర రచన ”లో నా ఉత్తరంdr sivarama 001

Posted in రచనలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4

16-ప్రధాని గా ఉన్నాయన  చేస్తున్నది గారడీ మోళీ

 మాట మార్పు క్రియా శూన్యతా విశ్రు౦ఖల కేళీ

చట్టసభల్లో పదే పదేచెప్పిందే చెయ్యలేని కంగాళీ

సభల్లో ఉపన్యాసపు హోరుతో ఆడే హోళీ

క్రియా శూన్యత్వం లో అగ్రగామిగా నిల్చిన రించోళీ

ఇలా అయితే కొద్దినెలల్లోనే పార్టీ అయిపోతుంది  ఖాళీ

పార్టీ కాషాయానికి, తాను కాశీకి వెళ్లి ఆడుకోవాలి ఆట గోళీ

ప్రజలతో ఆడుకొంటే కసితో అనేస్తారు చెంబేళీ

ఒంటి సొమ్ము శొంఠి అయితే దరికి రారు వాహ్యాళి

మంచిపెంచి మంచి పంచితే నే జీవితం రంగేళీ

సహజీవన సౌందర్యమే ఇస్తుంది దీపావళి

అహం బలిస్తే ,ఇహం వదిలేస్తే వచ్చేది తిమిరావళి

జనాలకు చివరికి మిగిలేది బాధా తప్త శోకావళి

ఇహనైనా మించి పోలేదు వెను దిరిగి చూడాలి

ప్రజలు మెచ్చిచ్చిన అదికారం  మదో(తో )న్మాదం కాకూడదు  

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

17-వెయ్యి గొడ్లు తిన్న రాబందు పిడుగుకు చిక్కింది

  తమపాలన సమయం లోదేశమంతా కుంభ కోణమే

 బొగ్గు మసి తెల్లతలపాగా ప్రదానికే పులిమారు

తమ చేతులు మసికాకుండా సోదర మంత్రి పుంగవులు

ఇప్పుడొచ్చి పడిందిమీద  అగస్టా ఎగస్ట్రా గా  

తల్లీ కొడుకులు గిలగిల విలవిలా

సర్వం త్యాగం చేయాల్సిన సైనికాధికారి

సర్వ భోగ వసంత రాయుడై కులికి వెకిలి చేష్టలతో

కంపరం కలిగిస్తుంటే దేవుడా రక్షించాలి

నా దేశాన్ని దేశ రక్షకుల నుండి ,పాలనా యంత్రాంగం నుండి

పరమ పావన సాదు సంతుల నుండి

అని ,నేనంటే ఏమీ అనుకోకండి .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-16-ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134

54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -3(చివరిభాగం )

వచన రచనతో బాటు క్రేన్ చాలా ప్రాముఖ్యమైన కవితలూ రాశాడు .రెడ్ బాడ్జ్ ప్రచురించిన సమయం లోనే వీటినీ ‘’ది బ్లాక్ రైడర్స్ అండ్ ఆదర్ లైన్స్ ‘’పేర అచ్చు వేశాడు .చనిపోవటానికి రెండేళ్ళ ముందు ‘’వార్ ఈజ్ కైండ్’’అనే రెండవ కవితా సంపుటి వెలువరించాడు .రెండిటిలోనూ సెంటిమెంట్ ఉన్నా అతని తప్పులకు అద్దం పట్టాయి.చావును తప్పించుకోలేమని గ్రహించాడు .విధానం తీవ్రంగానే ఉన్నా స్వభావం తెలుస్తుంది –

‘’In the desert –I was a creature ,naked and bestial –who ,squatting upon the ground –held his heart in his hands –I said ,’’is it good ,friend ?-It is bitter bitter ‘’he answered –but I like it –because it is bitter –and because it is my heart ‘’ఈకవిత మొదటి సంపుటి లోనిది .

రెండవ సంపుటి వార్ ఈజ్ కైండ్ లో ఒకటి చూద్దాం –

‘’have you ever made a just man?-‘’oh ! I have made three ‘’answered  God -.’’but two of them are  dead –and the third –listen listen –and you will hear the thud of his defeat ‘’

అన్ని కవితలూ ఇలా ఉండవు కొన్నిటిలో నిరసన మరికొన్నిటిలో నిరాశా కొన్నిట్లో కోపోద్రిక్తత నిస్పృహ కనిపిస్తాయి .అయితే ఇందులో దేన్నీ కాదన లేము .క్రేన్ చనిపోయిన పాతిక ఏళ్ళకు కానీ ఏ పబ్లిషర్ కూడా అతని సమగ్ర సాహిత్యాన్ని ముద్రించటానికి ముందుకు రాలేదు ‘’కలేక్టేడ్ పోయెమ్స్’’రావటానికి మరో అయిదేళ్ళు ఆగాల్సి వచ్చింది  క్రేన్  గురించి ‘’ –all inside –he had no surface ‘’అన్నాడు జోసెఫ్ కాన్రాడ్1952లో ‘’స్టీఫెన్ క్రేన్ –ఆమ్నిబస్ ‘’లో .హెన్రి డేవిడ్ థోరో, హెమింగ్ వేల మధ్య ఉన్న అమెరికన్ వచన రచయితలలో ఇప్పుడు హెమింగ్ వే,ఫాక్నర్ లలాగా తన స్వంత శైలిని నిర్మించుకొని ప్రతి అంగు ళాన్నీప్రభావితం చేశాడు క్రేన్ ‘’అన్నాడు ఆల్ఫ్రెడ్ కజిన్ . అమెరకా దేశం లోని అగ్ని అతని వచనం లో ఉంది .అతని వాక్యాలు ఉరుములు సృస్టిస్తాయి  .మనిషి భూమిని బద్దలు కొట్టినట్లు ఉంటాయి. నేచరిజం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా నే నేచరిస్టిక్ రచయిత  అనిపించాడు .ఒక్కమాటలో ‘’Crane made an image of a new and clear cut world .The actual world in which he lived was not only too much with him but too much for him ‘’అంటాడు లూయీ అంటర్ మేయర్ .

స్టీఫెన్ క్రేన్ రాసిన ఫిక్షన్ అంతా నేచురలిజం అమెరికన్ రియలిజం ,ఇంప్రెషనిజం .లేక ఈ మూడిటి మిశ్రమం .రచనలో నేచురిస్తిక్ ఐడియాలు ఇంప్రెషనిజ విధానాలు ఉంటాయి .తన జీవిత చరిత్ర రాసుకొనే ఆలోచన ఉందా అని క్రేన్ ను అడిగితె ‘’ “dare not say that I am honest. I merely say that I am as nearly honest as a weak mental machinery will allow.”[167]  అని చెప్పాడు .  H. G. Wells remarked upon “the great influence of the studio” on Crane’s work, quoting a passage from The Red Badge of Courage as an example: “At nightfall the column broke into regimental pieces, and the fragments went into the fields to camp. Tents sprang up like strange plants. Camp fires, like red, peculiar blossoms, dotted the night…. From this little distance the many fires, with the black forms of men passing to and fro before the crimson rays, made weird and satanic effects.”[169] Although no direct evidence exists that Crane formulated a precise theory of his craft, he vehemently rejectedsentimentality, asserting that “a story should be logical in its action and faithful to character. Truth to life itself was the only test, the greatest artists were the simplest, and simple because they were true.”[170]

                   

30ఏళ్ళ జీవితం లో క్రేన్ అయిదు నవలలు ,రెండు కవితా సంపుటాలు ,మూడు చిన్నకదల సంపుటాలు రెండు యుద్ధ కదా సంపుటాలు రాసి ప్రచురించాడు .ఇవికాక అనేక వార్తా కధనాలు రాశాడు .వీటిలో ‘’రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’ను అమెరికన్ క్లాసిక్ అంటారు .చనిపోయే ముందు క్రేన్ అతని సమకాలిక రచయితలలో అగ్రగామిగా ఉన్నాడు .1920నాటికి క్రేన్ ను అతని రచనలనూ జనం మర్చే పోయారు .1923లో ధామస్ బీర్ ,క్రేన్ జీవిత చరిత్ర రాశాకే మళ్ళీ వెలుగులోకి వచ్చాడు .ఇప్పుడు క్రేన్ ను 1890నాటిఅత్యంత ప్రతిభఉన్న   సృజనాత్మక రచయితలలో ఒకడుగా గుర్తించారు .’’ఫైనేస్ట్ క్రియేటివ్ స్పిరిట్ ఆఫ్ హిజ్ టైం’’అంటున్నారిప్పుడు .హెమింగ్ వే మొదలైన మోడర్నిస్ట్ లకు  క్రేన్ గొప్ప ప్రేరణ అయ్యాడు .క్రేన్ ఆకస్మిక మరణం సాహిత్యానికి గొప్ప ఆశనిపాతం అన్నారు . In 1936, Hemingway wrote in The Green Hills of Africa that “The good writers are Henry James, Stephen Crane, and Mark Twain. That’s not the order they’re good in. There is no order for good writers.”[243] Crane’s poetry is thought to have been a precursor to the Imagist movement,[244] and his short fiction has also influenced American literature. “The Open Boat”, “The Blue Hotel”, The Monster and “The Bride Comes to Yellow Sky” are generally considered by critics to be examples of Crane’s best work.[245]

  Inline image 1  Inline image 2

A river, amber-tinted in the shadow of its banks, purled at the army’s feet; and at night, when the stream had become of a sorrowful blackness, one could see across it the red, eyelike gleam of hostile camp-fires set in the low brows of distant hills.”
— Stephen Crane, The Red Badge of Courage[6
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133

54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -2

గ్రీస్ నుంచి తిరిగి వచ్చాక దక్షిణం వైపు వెళ్ళమని ఆజ్న జారీ అయింది .క్యూబా తిరుగు బాటులలో  చిక్కుకు పోయింది .స్పానిష్ అమెరికన్ యుద్ధం రావటానికి ఇంకా రెండేళ్ళు ఉంది .ఐలాండ్ ప్రజల క్యూబా విముక్తి నినాదం అమెరిక ప్రజల సానుభూతి పొందింది. పేపర్ దిగ్గజం హార్ట్స్ పత్రికలన్నీ యుద్ధం రావాలనే కోరాయి ,ప్రచారమూ చేశాయి. చట్ట వ్యతిరేక ఆయుధాలు ప్రబలంగా ఉన్నాయి .ఈ స్థితి లో క్రేన్ ను అక్కడి యుద్ధ వార్తల్ని రాయటానికి పంపారు .ఆతను వెళ్ళే షిప్ బ్రద్దలయింది .ప్రయాణీకుల౦దరూ  క్షేమం .క్రేన్ తో బాటు మరో ముగ్గురు ఒక నాటుఓపెన్  బోటు ఎక్కి ప్రయాణించారు .చాలా రోజులు  ప్రయాణం సాగింది .ఒక ఏడాది తర్వాత ఇదంతా ఒక గొప్ప ఎపిసోడ్ గా ‘’దిఫైనెస్ట్ షార్ట్ స్టోరి ఇన్ ఇంగ్లిష్ ‘’గా ప్రచురితమైంది .అదే ‘’ది ఓపెన్ బోట్ అండ్ అదర్ టేల్స్ఆఫ్ అడ్వెంచర్ ‘’.ఈ కధను అతి సహజంగా నిదానంగా ప్రారంభించి రాశాడు .అందులోని ప్రారంభ వాక్యాలే అందర్నీ ఆకర్షించాయి .క్రేన్ మాటల్లోనే ‘’None of them knew the color of the sky .’’నుంచి చివరిదాకా నాన్ స్టాప్ గా చదివించింది .ప్రమాదం షాక్ ,దాదాపు ట్రాజెడీగా మారిన ఉదంతం తో క్రేన్ ఆరోగ్యాన్ని గూర్చి పట్టించుకోలేదు .దీనివలన యెడ తెగని దగ్గు పట్టుకొన్నది .ఎత్లెటిక్ శరీరం కుంగి పోయింది .27వ ఏట ఇంగ్లాండ్ కు కోరా హౌరాత్ స్టెవార్ట్ తో వెళ్ళాడు .

ఇంతకీ ఎవరీ కోరా ?ఫ్లారిడా లో వేశ్య వాటిక ను నడిపేది .ఆమె ను క్రేన్ ను కలిశాడు .న్యు ఇంగ్లాండ్ లో పుట్టి ఇంగ్లీష్ కెప్టెన్ ను పెళ్ళాడి,అనేక మగాళ్ళకు ఆడదై బతికింది .క్రేన్ కన్నా పెద్ద వయసు అందం ఆనందం బె ఫరవా ఉన్న కోరా ఔరా అన్నట్లు క్రేన్ ప్రేమ క్రేన్ కు తగులు కొన్నది .కెప్టెన్ నుంచి విడాకులు తీసుకోక పోయినా లండన్ లో క్రేన్ ను పెళ్లి చేసుకొని అతని సంరక్షణ బాధ్యతా తీసుకొన్నది . వేడి ప్రదేశానికి అతడు వెడితే క్షేమమని డాక్టర్లు సూచి౦చ గానే క్రేన్ ను తీసుకొని గ్రీస్ వెళ్ళి,అతనికి సేవలు చేసి మళ్ళీ ఆరోగ్యవంతుడిని చేసే ప్రయత్నం చేసింది .కొంచెం ఆరోగ్య కుదుట బడగానే ఇంగ్లాండ్ చేరి సర్రే లో స్థిరపడ్డారు .వీళ్ళ పెళ్లి గుట్టు రట్టు అవుతుందనే భయం తోఉండగా  జోసెఫ్ కాన్రాడ్ క్రేన్ కు బాసటగా నిలిచాడు .దీనితో ఇతర సాహితీ పరుల తో సాన్నిహిత్యం పెంచుకొన్నాడు .గాసిప్ ఉచ్చు కోరాకు కాక క్రేన్ కు తగులు కొన్నది .వ్యభిచారం దాన్ని నడిపే వారి పైనా క్రేన్ సానుభూతిగా ఉండటం తో అతనే ఆ వ్యాపారం చేస్తున్నాడని పుకారు రేగింది .పుకార్లు మరీ ప్రమాదకరమైనాయి .

మనిషి నీరసించి ,ఆరోగ్యం క్షీణించి జబ్బు పడ్డ కవిగా కనిపించాడు .క్రేన్ చివరి ఫోటో రిల్కే నుగుర్తు  చేస్తుంది .అప్పుడప్పుడు తూలి పడిపోయేవాడు .బహుశా మత్తు మందుకు బానిసయ్యాడేమో నని అనుమానించారు .అతనిగదిలో మాదక  ద్రవ్యాలు కనిపించాయి .అప్పటికే వాటికి పూర్తిగా బానిసై పోయాడు .స్పానిష్ అమెరికన్ యుద్ధం ప్రారంభమవగానే అమెరికా తిరిగి వచ్చేయాలనుకొన్నాడు .క్యూబా నుండి రాసి పంపే అనుమతి పొందాడు .టి.బి .అనుకొన్నారు కాని తేలలేదు ససెక్స్ లో ఉన్న బ్రేడే లో ఒక ఇల్లు చూసి అక్కడకు క్రేన్ ను తీసుకు వెళ్ళింది కోరా .అక్కడ కాలం తో పోరాటం సాగించాడు ..ప్రపంచ గొప్ప యుద్ధాల గురించి విస్తృత వర్ణనాత్మకంగాలిప్పిన్ కాట్స్ మేగజైన్ కు  రాశాడు  .ఇది అతని మరణానంతరం ప్రచురితమైంది .హార్పర్స్ మంత్లీ కి విలోం విల్ స్టోరీస్ రాశాడు .ఆడపిల్లలకోసం ఇలాంటి సీరియలె రాశాడు .రక్తపోటు రాత పనిని మందగింప జేసింది .ఆరోగ్యం కోసం జర్మనిలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్న శానిటోరియం లో 29వ ఏటయేడునెలలకాలం లో  చేరాడు .5-6-1900లో చనిపోయాడు క్రేన్ .అతని భౌతిక కాయాన్ని అమెరికా చేర్చి న్యు జెర్సీ లోని ఎలిజబెత్ లో ఖననం చేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-16-ఉయ్యూరు

 


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132

54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్

యుద్ధం లో సైన్యం చేసిన సాహసాన్ని ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అనే అమరమైన నవలగా 23వ ఏట  అసలు యుద్ధభూమిని చూడనే చూడకుండా రాసిన అమెరికన్ యువ రచయిత స్టీఫెన్ క్రేన్ .దీన్ని ‘’అట్లాంటిక్ మంత్లి ‘’పత్రిక ‘’సాహిత్యం లో కొత్త ఫాషన్(వైఖరి ) ప్రవేశ పెట్టాడు క్రేన్ ‘’అని గొప్పగా రాసింది  .ప్రముఖ రచయిత హెచ్ జి వెల్స్ ‘’కొత్త శకానికి ఇది నూతన ఆవిష్కారం .పాత విదానాలన్నిటిని  వెనక్కినెట్టేసిన నవల ‘’అన్నాడు  .ఇందులోని తీవ్రత అంతా రచయిత చర్యా రాహిత్యమే .తన సృజన సామర్ధ్యాన్ని అతి వేగా వంతంగా ఖర్చు చేసి అపూర్వ అనన్య సామాన్య రచనలు చేసి 30ఏళ్ళకే పరమపదించాడు క్రేన్ .

తలిదండ్రులైన  జోనాధన్ టౌన్లిక్రేన్ ,స్టీఫెన్ క్రేన్ ల  14మంది సంతానం లో చివరివాడు స్టీఫెన్ క్రేన్ .అమెరికాలోని న్యూయార్క్ లోన్యు జెర్సీ లో 1-11-1871న జన్మించాడు .తొమ్మిదవ ఏట మేధడిస్ట్ మినిస్టర్ అయిన తండ్రి చనిపోయాడు .తల్లి కూడా అంతే పవిత్రంగా జీవిస్తూ పిల్లల బాధ్యతా తీసుకొంది.మతసంబంధమైన వ్యాసాలూ రాసి ప్రచురించేది .తల్లికున్న ఈ సుగుణం కొడుకు క్రేన్ కు అబ్బింది .టీనేజ్ లో కుటుంబం యాస్బరి పార్క్ లో ఉండగా సంఘంలోని గుసగుసలు ,వేసవి యాత్రికుల విషయాలు గ్రహించేవాడు .సిరాక్యూజ్ యూని వర్సిటి లాఫెటీ కాలేజి లో  లో విద్యార్ధి గా చేరి ,కాలేజి  రిపోర్టర్ గా ‘’ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ ‘’కు పనిచేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదింఛి ఖర్చులకు వాడుకొనేవాడు .పెద్దగా చదువు పై శ్రద్ధ ఉండేదికాదు కాని సంతృప్తికరమైన విద్య అబ్బింది .పాఠ్య పుస్తకాలను అలాఅలా తిరగేసేవాడు కాని అందులోని విషయాలన్నీ యిట్టె గ్రహించేసేవాడు . పొడవుగా సన్నగా అసలైన కొంగ అంటే క్రేన్ లాగా ఉండేవాడు .నీలి కాంతివంతమైన కళ్ళు ,క్రీడాకారుడిగా కనిపించేవాడు . వాస్తవంగా మంచి ఎత్లేట్ .బేస్ బాల్ టీం కెప్టెన్ క్రేన్ .

 

18ఏళ్ళకే తల్లీ చానిపోయింది .కుటుంబం చాలాపెద్దది .కనుక ఒంటరిగా జీవి౦చాలనుకొన్నాడు .తనదారి తాను  చూసుకోవటం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు .యువ రచయితలూ కళా కారుల బృందం లో చేరి న్యు యార్క్ లోనిదిగువ  తూర్పు ప్రాంతం లో లాడ్జింగ్ లలో అద్దెకు ఉంటూఅయిదేళ్ళు గడిపాడు .అప్పుడప్పుడు స్కెచ్ లు రాస్తూ ,జర్నలిజం లో ప్రవేశింఛి ఆకలితో చావకుండా బతికాడు .21వ ఏట ఒక నవల రాస్తే ఏ పబ్లిషర్ కూడా ప్రచురించటానికి ముందుకు రాలేదు .అదే ‘’మాగ్గీ –ఎ గర్ల్ ఆఫ్ ది స్ట్రీట్స్   ‘’నవల .దీన్ని ప్రీస్ట్ లైన తలిదండ్రుల కొడుకైన క్రేన్ రాశాడు .అది ఒక వ్యభిచారి అయిన స్త్రీ వృత్తాంతం .బురదలో పుట్టి వికసించిన పుష్పం ఆమె .మురికి వాడలలోని ముడి హింస ను ,ఆ మనుషులు మాట్లాడే బజారు భాషలో రాశాడు .చివరికి ఎవడో ఒక బకరా పబ్లిషర్ అచ్చు వేయటానికి రెండు షరతులపై ఒప్పుకొన్నాడు .పుస్తక ముద్రణ ఖర్చు క్రేన్ పెట్టుకోవాలి .పబ్లిషర్ పేరు పుస్తకం లో ఎక్కడా కని పించ కూడదు .తన సోదరుల దగ్గర అప్పు చేసి డబ్బు సమకూర్చుకొన్నాడు .తీరా పుస్తకం బయటికి వస్తే జర్నలిస్ట్ గా ఉన్న తన పరువు పోతుందేమోనని భయ పడ్డాడు .’’జాన్ స్టన్ స్మిత్ ‘’అనే మారు    పేరుతో పుస్తకం అచ్చు వేయించాడు .చచ్చీ చెడి వందకాపీలు అమ్ముడయాయి .మిగిలిన వాటిని కాల్చి గదిని వెచ్చ చేసుకొనేవాడు .అంతకు ముందే సిస్టర్ కారీ నవలతో డ్రైజర్ నేచురలిస్ట్ నవలకు దారి చూపాడు దాని ప్రభావం క్రేన్ రాసిన ఈ నవల పై ఉందని కొందరు విమర్శకులన్నారు .కాని హామ్లిన్ గార్లాండ్ ఈ నవలను బాగా మెచ్చాడు .విలియం డీన్ హోవెల్స్ ‘’as present in the working out of this poor girl;s squalid romance as any classic fable ‘’అని కీర్తించాడు .కదా కంటే కూడా గొప్పగా మురికి కూపం లో దరిద్రం తో అలమటించిన ఒక పేద పిల్ల ఏ ఇతర క్లాసిక్ కద కంటే గొప్పగా ఉంది అన్నాడు .

పేపర్లు బాగా ప్రోత్సహించాయి .దీనితో రెండవ నవలకు శ్రీకారం చుట్టాడు .అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిననవల ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’ఇంకా ఇరవై నాలుగు ఏళ్ళు రాకుండానే 1895లో దీన్ని క్రేన్ ప్రచురించాడు .ఈ నవలకు నేపధ్యం అమెరికన్ సివిల్ వార్ .అదిఅటామిక్ యుగం ముందు జరిగే  ఏ యుద్ధమైనా కావచ్చు .అన్నీ అలాగే జరుగుతాయి .తికమక పెట్టె ఆ పరిస్థితులలో ఏ సైన్యమైనా అలానే ప్రవర్తిస్తుంది .ఆనాటి ప్రజలు పిరికితనం  ,సమయానికి తగినట్లు మొండి ధైర్యం తో ,భయాలను సిల్లీ జోకులతో కప్పి పుచ్చుకొంటూ ,  ప్రగల్భాలు ,ఆత్మ స్తుతి డాబు లతో ఉండేవారు .కధను ఒకదాని తర్వాత ఒకటి గా వచ్చే  ఫ్లాష్ లతో మనుషులను అజ్ఞాతం లో ఉంచుతూ మహా వేగం గా  నడిపించి రాశాడు .కొద్ది వీరత్వం ,యుద్ధ మహా భీభత్సం కళ్ళకు కట్టించాడు .ఇందులోని సైన్యం సామాన్య రైతులు ,కమ్మరివారు ,గుమాస్తాలు ,కంచర గాడిదలను తోలేవారు .వీరిలో ఎవరికి యుద్ధం ఎలా జరుగుతుందో అపాయం ఎలా తప్పించుకోవాలో ఏమాత్రం తెలియని వాళ్ళు .అయినా యుద్ధం చేస్తున్నారు .క్రేన్ ఈస్తటిక్ అన్వేషణ భయ భ్రాంతుల కు అధీనం లో ఉంది .అందుకే అన్ని యుద్ధ రచనలు వేరు వేరుగానే ఉంటాయి .ఇందులోని సంఘర్షణ ను అనేక స్థాయిలలో వర్ణించాడు క్రేన్.రక్తపాతం అడుగున సౌందర్యం కనిపిస్తుంది చనిపోయే సైనికుడు తన గాయాలను బాధను  లెక్క చేయకుండా ముందుకు సాగి పోతాడు .ఆకాశం లో సూర్యుడు ఎర్రగా పొరలాగా ఉన్నాడని వర్ణించాడు .యుద్ధ భూమిని కవిత్వీకరించి మన తిక్కన మహా కవిలాగా తీర్చి దిద్దాడు .ఆ వర్ణ క్రేన్ మాటల్లో ‘’In the gloom before the break of day their uniforms glowed with a deep purple hue .From across the river the red eyes were still peering .In the eastern  sky there was a yellow patch like a rug laid for the feet of the coming sun ,and against,black and pattern like ,loomed the gigantic figure of the colonel on a gigantic horse ‘’

ఈ నవలను ఎందరు ఎన్ని విధాల మెచ్చుకొన్నా లాభాల వర్షం కురిపించలేక పోయింది .ఒక వంద డాలర్లే చేతిలో పడ్డాయి .కాని ఈ నవలతో స్టీఫెన్ క్రేన్ అమెరికన్ సేలిబ్రిటి అయ్యాడు .ఆయనకు మెక్సికో వెళ్ళే అవకాశమిచ్చారు .1896లో గ్రీసు టర్కీలు యుద్ధానికి దిగినప్పుడు న్యూయార్క్ జర్నల్ ఎడిటర్ ఈ యుద్ధ వార్తలను రాయటానికి సర్వ సమర్ధుడు క్రేన్ ఒక్కడే అని భావించి బాధ్యతలను అప్పగించాడు .ఆనదంగా క్రేన్ వెళ్ళాడు .అక్కడ అనేక మోసాలలో అభియోగాలను ఎదుర్కొన్నాడు .అతనికిస్టమైన ఒక అమ్మాయి బజారు బిచ్చ గత్తెఅని అరెస్ట్ చేశారు .క్రేన్ ఆమె ను రక్షించ బోతే పోలీసులు వీరి గదిలో మత్తు పదార్ధాలు దొరికాయని అభియోగం మోపారు .వేరొకమ్మాయి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆతను తన దగ్గర డబ్బు అప్పు తీసుకోన్నాడని డబ్బు వాపసు ఇప్పించమని  కోర్టు కెక్కింది .26ఏళ్ళ వయసులో ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో .

Inline image 1  Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )

ఇదే విషయాన్ని పుట్టపర్తివారు ‘’తకఝం,తకఝం ,తకదిరి కిట ‘’నాదాలతో లోకేశుడు నాట్యమాడాడన్నారు .సకల భువనాలు ఆంగికంగా ,సకల వాజ్మయం వాచికంగా ,సకల నక్షత్రాలు కలాపాలుగా ,సర్వం తన యెడ సాత్వికంగా చతుర్విధ అభినయ అభిరతి తో ,తనలోనే తాను  వలచి నృత్య నృత్త భేదాలను చూపి ,లాస్య ,తాండవ భేదాలను ఎరుక పరుస్తూ ,సకల దిక్పాలకులకూ పారవశ్యం కలిగిస్తూ నాట్య గరిమతో పరమ శివుడు తాండవ కేళీ విలోలుడయ్యాడు.

ఇప్పుడు భరద్వాజ శివుని తాండవం లో రాగ విన్యాసకేళి ఎలా సాగిందో దర్శిద్దాం –

‘’మూర్చ నాభిర్గిరాం దేవతాయాం సమీ –కృత్య తంత్రీ ర్నభై ర్వల్లకీ౦  చ శ్రుతీః

సాదు సప్తస్వరాన్ వాదయన్త్యాముదా-సం ననంర్త శ్రీ భవానీ పతిః’’

సరస్వతి వీణపై గోళ్ళతో మూర్చనలను సమీకరించి శ్రుతులను ,సప్త స్వరాలనూ ఆహ్లాదంగా వాయిస్తుంటే పరమ శివుడు హెచ్చిన ఉత్సాహం తో అనుగుణం గా నాట్యం చేశాడు .తరువాత వేణు గాన ధ్వనికి అనునర్తనం ఎలా చేశాడో మహర్షి వర్ణిస్తున్నాడు –

‘’శుంభ రారంభ గంభీర సంభావనా –గు౦భన జ్జ్రు౦భణో జంభ దంభాపహే

లంబయత్యుత్కటం వేణు నాదామృతం-సం ననర్త శ్రీ భవానీ పతిః’’

శివుని నాట్య ఆరంభం ప్రకాశమానంగా ఉంది .ఇంద్రుడు వేణుగానామృతాన్నిఅందరిపై  ప్రవహింప చేస్తుంటే తదనుగుణంగా గంభీరాలైన భావ సముదాయాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తూ నాట్యమాడుతున్నాడుభవానీ పతి.తర్వాత శ్లోకం లో గానాలకు అనుగుణ నాట్యం శంకరుడు ఎలా చేశాడో వివరిస్తున్నాడు భారద్వాజర్షి .

‘’సంభ్రుతోత్కంఠితా కుంఠ కంఠ స్వర .-శ్రీ రమా భామినీ స్ఫీత గీతామృతం

విశ్రుత ప్రక్రమం స శ్రుతిభ్యాం పిబన్ –సం ననర్త శ్రీ భవానీ పతిః’’

శ్రావ్య కంఠం తో లక్ష్మీదేవి గొంతెత్తి పాడుతున్న గీతామృతాన్ని తన సుభగ కర్ణాలతో ఆలకిస్తూ శివుడు అనుగుణమైన నృత్యాన్ని చేశాడు .ఇందులోని పద బంధాలు వ్రుత్యనుప్రాసతో కర్ణపేయం చేయటం మహర్షి కవితా చమత్కృతి .స్రగ్విణీ వృత్తాలతో మహర్షి వీనుల విందు చేస్తున్నాడు .అనుభవించిన వాడికి అనుభవించినంత .మన మనస్సులపై చిత్తరువు గీసి దర్శించమంటున్నాడు .

ఇపుడు కాసేపు ఆచార్య తాండవ దృశ్యాన్ని తిలకిద్దాం –నాట్యానికి కావాల్సిన సర్వ లక్షణాలను వివరిస్తూ ,అవి ఒకదానితో ఒకటి  కలిసి రసోత్పత్తి ఎలా చేస్తున్నాయో పుట్టపర్తి వారు వివరించిన తీరు అమోఘం –

‘’కర ముద్రికల తోనే ,గనుల చూపులు దిరుగ-దిరుగు చూపులతోనే బరువెత్త హృదయమ్ము –హృదయమ్ము వెనువెంట ,గదిసికొన  భావమ్ము –కుదిసిభావము తోనె,కుడురుకోగ రసమ్ము –శిరము ,గ్రీవమ్ము,పేరురము ,హస్త యుగమ్ము –సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు –తారకలు జలియింప దారకలు నటియింప-గోరకములై గుబురు గొన్న జూటము నందు  -నురగాలి ,నలిరేగి ,చొక్కి వీచిన యట్లు –పరపులై పడ గల్ప పాదపంబుల బూవు –లాడే నమ్మా శివుడు ,పాడేనమ్మా భవుడు ‘’అన్నారు .ముక్త పద గ్రస్తం తో ఊపిరి సలపనీక.ఆవేగానికి యదార్ధ స్థితి కల్పించటం సామాన్య  కవి వల్ల అయ్యే పనికాదు .తానూ అనుభవిస్తూ మనకు కూడా ఆ పరమానందాన్ని అనుభవం లోకి తెప్పించారు సరస్వతీ పుత్రులు .భరద్వాజుని శివుడు చే సే నాట్యం కంటే పుట్టపర్తి వారి శివ నాట్యం మనోహరమై విరాజిల్లింది .మహర్షి శబ్దాలంకారాలతో సాధిస్తే పుట్టపర్తి వారు అనుభూతిని రంగరించి నిండుదనం చేకూర్చారు .

మళ్ళీ ఒకసారి భరద్వాజ శివ తాండవం లోకి ప్రవేశిద్దాం –వీణ ,వేణువు ల అమృత గాన లహరికి తేలిపోయి శివుడు నాట్యం చేశాడని తెలుసుకొన్నాం .ఇప్పుడాయన మృదంగ భంగిమలకు ఎలా పాదాలు కలిపి నర్తి౦చాడో మహర్షి వర్ణిస్తున్నాడు –

‘దర్శయత్యాదరా ద్వాదనే నైపుణీం-సన్మ్రుదంగస్యగోవింద మార్దంగికే

తాలభేదం సహోదాహర త్యబ్జకే –స్సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

విష్ణుమూర్తి తన మృదంగ వాదనా నైపుణ్యాన్నిప్రదర్శిస్తుంటే ,బ్రహ్మ దేవుడు ‘’తల భేదాలుకాదు’’  తాల భేదాలను ఉదహరిస్తుంటే  పరమశివుడు స్వయంగా నర్తించాడు .ఈ శ్లోకం లో’’ దకారం ‘’అనేకమార్లు ఆవృత్తి చెందటం చేత మృదంగ ధ్వని శ్లోకం లోనే మారు మోగింది .అదీ కవి చమత్కారం .మృదంగానికి లయ ప్రాణం .నాట్యానికి చాలా అవసరమైన వాద్యం మృదంగం. విష్ణువు అమోఘ  మార్దంగికుడు .నాట్యం యొక్క రక్తి మ్రుదంగంపైనే ఎక్కువ ఆధార పడి ఉంటుంది .అందుకే శివుని సరి జోడు విష్ణువే స్వయంగా మృదంగ సహకారం అందించి ,శివ తాండవాన్ని రక్తి కట్టించాడు .ఆయన మృదంగ వాదనకూడా చాలా ఆదరంగా నైపుణ్యంగా చేయటంకూడా  ఇక్కడ విశేషమే .

‘’మూడుకన్నులతో అయిదు తలల వాడి  ‘’నాట్యాన్ని ‘’ఆరుముగాల ‘’సామి తిలకించి పులకించే దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు కవి మహర్షి –

‘’సమస్త ముఖ లాలనం నహి ముఖస్యమే షణ్ముఖ-సమస్త ముఖ లాలనం ఖలు మృగాంక రేఖాననన

ఇతి స్వసుతవాదనమ్ముదిమున్ము ఖైః పంచభిః-సుతస్య మతి లాలనం విరచయ౦చ్ఛివః పాతునః ‘’

ఆనంద పారవశ్యంతో  ఆర్ముగం అయిన కుమారస్వామి అయిదు తలల ముక్కంటి నాట్యాన్ని చూస్తుంటే కొడుకుతో తండ్రి ‘’నాయనా షణ్ముఖా !నీ ఆరు ముఖాలను లాలించటానికి నాకు అన్ని తలలూ లేవు కదా ‘’అనగా కొడుకు ‘’చంద్ర రేఖాననా తండ్రీ శివా !సమస్తముఖలాలనమే కదా ఉన్నది ‘’అనగానే ఆనందం తో కుమారస్వామి మతిని లాలించే శివుడు మనలను కాపాడు గాక ‘’అని స్తుతించాడు మహర్షి భరద్వాజుడు .శివుని అన్ని ముఖాలలో మృగాంక లేఖనం ఉంది అని సమర్ధన .ఈశ్వరుని  లాలనం నోచుకోని కుమారునిఆరవ ముఖం కుమారుని ఆరవ ముఖం పైఉన్న చంద్ర రేఖను చూసి ఆనందిస్తోందని అర్ధం .ఇది పృధ్వీ వృత్తశ్లోకం . దీనితో  మహర్షి శివతాండవ వర్ణనను సమాప్తి చేశాడు ..

ఇప్పుడు పుట్టపర్తి శివుడు ఎలా ముగించాడో తాండవం చూద్దాం –

శివుడు తాండవ మాడుతుంటే ‘’తెలి బూది పూతతెట్టులు కట్టి నట్లు ,చలికొండ మంచు కుప్పలు పేర్చినట్లు ,అమృతం అమతి౦చినట్లు   మనసులోని సంతోషం కళ్ళకు కట్టి నట్లు ఆనందం అంతా తాండ వి౦చి౦ దట .నీల గళుని నాట్యం చేత కల్పించబడిన’’నీలిమ ‘’మబ్బులు ఉబ్బి క్రమ్మినట్లుగా ,అబ్బురాలైన నీలాలు లిబ్బి సేరు విధాన ,కాటుక కొండ పగిలి చెదిరినట్లుగా ఉంది .శివుని కనుల హస్తాల భంగిమలు మహాద్భుతం గా ఉన్నాయి .ఒక సారి చిరు చేపల్లగా ,ఒకసారి ధనుస్సుల్లాగా కనులతో నర్తించాడు.హస్త విన్యాసం చేస్తుంటే అవి స్తంభ యుగమా, వేప శాఖాద్వయమా ,కుంభి కరఖండాలా అని అనిపించాయి .షడ్జమం లో నెమలి పించం విప్పి ,వృషభం లో నంది నర్తించాయి .’’శాస్త్రాలను దాటి ,సర్వ స్వతంత్రుడై ,భావ రాగ సంబంధం తో ,రాగ లీలా విలాసంతో ,తానె తా౦ డవమో తాండవమే తానో అన్నట్లుగా ,ఒక అడుగు జననం మరో అడుగు మరణం ,ఒక వైపు సృష్టి వేరోకవైపు ప్రళయం కనిపించేట్లు నర్తించాడు .ఇది కాస్మిక్ డాన్స్ .ఇందులో అందరూ ఒకటే. హరిహర భేదమే లేదు .

‘’హరియే హరుడై ,లచ్చి యగజాతయై ‘’కనిపించారు ‘’హరునిలో హరిని  హరిలో హరుని చూసి అద్వైత భావన కలిపించారు ‘’సర్వ మేదినియు ,నద్వైతమే బ్రతిధ్వను లీన –ఆడేనమ్మా శివుడు –పాడేనమ్మా భవుడు  ‘’అన్నారు పరాకాష్టగా .శివతాండవం తర్వాత శివా అంటే పార్వతీదేవి ‘’గగన వనం లో విచ్చికొన్న జలదం వలే –వనం లో పారాడే వాత పోత౦  లాగా లాస్యం చేస్తుంది .అర్ధాంగి లాస్యాన్ని’’తరుణ చంద్రా భరణుడు ‘’ఆమోదం తెలిపాడు .శివ శక్తులు ఒకటిగా చేరటం తో అర్ధ నారీశ్వరం సార్ధకమై ,సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌందర్య సౌభాగ్యమై తాండవ లాస్యాలకు భరత వాక్యం పలికినట్లైంది

సమాప్తం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-5-16-ఉయ్యూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130

53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్-2

రెండేళ్ళ తర్వాత కొంత ఆర్ధిక వెసులుబాటు ఉన్నా ,భవిష్యత్తు ఆశాజనకం గా ఉండదని గ్రహించాడు డ్రైజర్.వేరే చోట పనిలో కుదిరి 1928లో ఫ్రీలాన్స్ సామర్ధ్యం తో పెళ్ళికి సిద్ధమయ్యాడు .తరువాత కొన్నేళ్ళు సక్సెస్ ఫుల్  రచయితగా ఎదిగాడు .న్యూయార్క్ మురికి వాడల ,స్వీట్ షాప్ ల ,నిరుద్యోగుల కడగండ్లను నిశితంగా పరిశీలింఛి రాశాడు .కార్పోరేషన్ వారికి హృదయం లేదన్నదాన్ని వ్యతిరేకిస్తూ ‘’No corporation is soulless which helps all others in helping itself ‘’అన్నాడు .పేదలతో మమేకమై తిరిగినవాడు ఇప్పుడు ప్రకటన రొచ్చులో కూరుకుపోయాడు .28వ ఏట ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఉద్యోగం నచ్చక వదిలేసి ‘’సిస్టర్ కారీ ‘’నవల రాశాడు .

డ్రైజర్ మొదటినవల సిస్టర్ కారీ చాలా పాపులర్ అయింది .అందులోని విషయమే ఈవిజయానికి కారణం .సమ్మోహనం ,వ్యభిచారం ,విషాదం ,దొంగతనం లను నైతికతను మసాలాగా దట్టించి రాసిన నవల ఇది .బెస్ట్ సెల్లర్ గా పేరు పొందింది .కాని నిజానికి అది చేజేతులా నాశనం చేసుకొన్నఅతని సోదరి జీవితమే .ఇందులోని వాస్తవికత అతిసామాన్యమై ,ఆనాటి సెక్స్ తో రోచ్చుతో దట్టించిన  మిగిలిన నవలల కంటే భిన్నంగా జనాదరణ పొందింది .పాపాలకు పరిహారంగా హార్ట్స్ వుడ్ ఆత్మ హత్య చేసుకొంటే ,కారీ బతికి తను సాధించాల్సింది ధైర్యంగా సాధించింది .ఈ నవల రాత ప్రతిని హార్పర్ అండ్ బ్రదర్స్ కు ముద్రనకోసం డ్రైజర్ అందజేస్తే వెంటనే తిరస్కరించి తిరిగి పంపించేశారు .నిరాశతో వేరే పబ్లిషర్ కు డబల్ డేకు ఇస్తే ఒప్పుకొని అంతా సిద్ధం చేసిన తర్వాత అతనిభార్య ప్రూఫులు దిద్దుతూ అందులోని  నిష్కపటరచనకు ఆన౦ది౦చినా ,చట్టప్రకారం ముద్రించాల్సి ఉన్నా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయటానికి ఒప్పుకోలేదు .చిన్న పుస్తకంగా ప్రింటర్ దగ్గరే ఉండిపోయింది .ఒకరకంగా రచనను అణగ దోక్కేశారు   .కొన్ని సమీక్షలు అనుకూలంగానే వచ్చాయి.రచయిత పాత్ర చిత్రీకరణపై ప్రశంశలు వెల్లి  విరిశాయి  .కాని చాలామంది విమర్శకులు అంటీ ముట్టకుండా చేతులకు మసికాకుండా రాశారు .ఎవరూ కమిట్ కాలేదు .పాపం కొన్ని వందల పుస్తకాలే అమ్ముడు పోయాయి .తండ్రిలాగే తానూ జీవితం లో ఓడిపోయానని చింతించాడు .

ముప్ఫై వ ఏట అంత ఉత్సాహం గాలేక ఏదో చిలక్కొట్టుడు స్కెచెస్ మాత్రం అడపా దడపా రాశాడు .దీనికి తోడూ నీడలేని వాడయ్యాడు .నిరాశే తోడయ్యింది .భార్యను అత్తవారింటికి మిస్సోరి కి పంపించి ,న్యూయార్క్ నుంచి ,వర్జీనియా అక్కడి నుండి ,పెన్సిల్వేనియా ,బాక్ టున్యూయార్క్ చేరాడు .మనోవ్యధ ఎక్కువై ,చేతి వేళ్ళకు  స్పర్శ తగ్గి పోయిందని భావించాడు .నిద్ర పట్టేదికాడు. తనపై ఎవరో గూఢ చర్యం చేస్తున్నారని అనుమానపడేవాడు .తనలో మరో ‘’అపరిచిత వ్యక్తీ ‘’ఉన్నాడని గ్రహించాడు .తనది ద్వంద్వ ప్రవ్రుత్తి అని తెలుసుకొన్నాడు .’’అపోజిల్ ఆఫ్ నేచర్ ‘’అనేపేరుతో డ్రైజర్ జీవిత చరిత్ర రాసిన రాబర్ట్ ఎలియాస్ ‘’వారానికి ఒకటి౦బావు డాలర్ల అద్దెతో ఒక చీకటి కొట్టులాంటి గదిలో అద్దెకు ఉంటూ ,మొదట రోజుకు రెండు పూటలా తింటూ ,తర్వాత ఒక్క పూటతో సరి పుచ్చుకొని ,చివరికి ఇన్నిపాలు బ్రెడ్ ముక్కా తింటూ గడిపాడు .వీధిలో దొరికిన యాపిల్ పండునో ,కాయ గూరలనో తిని బతికాడు .ఆయిల్ స్టవ్ తో గదిని వెచ్చ బెట్టుకోనేవాడు .’’అని రాశాడు .ఎంతకు కు౦గిపోయాడంటే  స్వచ్చంద సేవా సంస్థలను తనకు సాయం చేయమని అర్ధించినా స్పందన లేక పొతే మరింత దిగజారి పోయాడు .జీవించాలని ఉన్నా బతకటానికి సరిపడా తిండి లేక శారీరకంగా మానసికంగా కుంగి పోయి ఆత్మ హత్యా ప్రయత్నాలు చేశాడు .తాను పోట్లాడి గెంటేసిన పాల్ మళ్ళీ శరణు అయ్యాడు .అతనికి తను ఇవ్వాల్సిన  వాటా దనం ఇచ్చేస్తాను .ఇలా నిర్భాగ్య స్థితిలో అతను బ్రతకటానికి ఒప్పుకోనని ఆడబ్బు తీసుకోమన్నాడు పాల్ .కొత్త బట్టలు కొని తనతో వెస్ట్ చెస్టర్ లో ఉన్న ప్రముఖ మోల్డూన్ హెల్త్ రిసార్ట్ లో చేర్చాడు .

అన్నివసతులు కలిగిన ఆ రెస్టారెంట్ లో అతని ఆరోగ్యం క్రమంగా బాగుపడింది .జీవితేచ్చ పెరిగింది .న్యు యార్క్ సెంట్రల్ కు ఆరునెలలుబయటి నుంచే  పని చేశాడు .పూర్తిగా ఆరోగ్య వంతుడై మళ్ళీ ఎడిటర్ గా పని చేయాలనుకొన్నాడు .స్ట్రీట్ అండ్ స్మిత్ వాళ్ళ కాకమ్మ కబుర్ల పత్రికలో ఎడిటోరియల్ బాధ్యత తీసుకొన్నాడు .అక్కడ అతనిపని వచ్చిన ఆర్టికల్స్ లోని  60వేలపదాలను  ను ముప్ఫై వేల పదాలు ఉండేట్లు రెండుగా కుదించటం మొదటి భాగానికి కొత్త సమాప్తి రాయటం రెండవ సగానికి కొత్త ప్రారంభం రాసి రెండిటికీ కొత్త పేర్లు పెట్టటం తో చీప్ నవలల విజయం ఊపందుకోన్నది .ప్రొడ్యూసర్ కు లాభాల పంట పండింది .దీనితో డ్రైజర్’’బ్రాడ్వే మేగజైన్ ‘’కు ఎడిటర్ అయ్యాడు .మరో ఏడాదికి ‘’డెలి నీటర్’’,ది డిజైనర్ ,’’న్యు ఐడియా వుమెన్స్ మేగజైన్ ‘’అనే బటరిక్ పత్రికా త్రయానికి డైరెక్టర్ అయ్యాడు .మధ్యే మార్గం కాక కుడి పక్షంగా పత్రికలు  నడిపాడు .తన పత్రికలకు ప్రకటనగా ‘’A curtain raised on a general unwritten phase of life ‘’అని రాసేవాడు .సెన్సేషనల్ ఆవిష్కరణలు ,దోషాలు లేని జోలా వాస్తవికత ఉంటాయని చెప్పేవాడు .’’బోహీమియన్ ‘’పై కంట్రోల్ సాధించి చిన్న వ్యంగ్య రచనలు ప్రచురించాలని నిర్ణయించాడు .మొదట్లో నిరాశగా ఉన్నా తర్వాత ఊపు అందుకొన్నది. ఈ ప్రయత్నం ఎందుకూ పనికి రాని చెత్త కధల్ని వండి వడ్డించి అయిదేళ్ళు బండీలాగి ఇక ఈ రకమైన నీచ సాహిత్యాన్ని ప్రోత్సహి౦చకూడదనుకొన్నాడు .ఇంకా నలభై రాలేదుకాని మరో బ్రేక్ డౌన్ భయ పెట్ట సాగింది. దీన్ని తప్పించుకొనే ప్రయత్నం లో రెండవ నవల ‘’జెన్నీ గేర్హార్ద్ట్ ‘’రాయటం మొదలు పెట్టాడు.

మొదటినవల కారీ లోలాగానే ఇందులోనూ దిగజార్చబడిన స్త్రీ కదఉంది. కాని దానికంటే నైపుణ్యంతో  ఈ అమ్మాయిని చిత్రించాడు . .రొంపిలో నుంచి స్వచ్చ వజ్రంగా బయటికొచ్చిన అమ్మాయి ని చిత్రించాడు .తన స్వీయ వినాశకర అనుమానాలకు జవాబులు చెప్పే ప్రయత్నం చేశాడు .వెంటనే ఆరేళ్లలో ఆరు నవలలు రాసేశాడు ‘’’ఎ ట్రి టైజ్ ఎట్ ఫార్టి ‘లో ఇంగ్లాండ్ జర్మని ,ఇటలీ ల  పై తన అభిప్రాయాలను రాశాడు .పధ్ధతి శైలి మారినా డ్రైజరిజం మారలేదు .I don’t know what truth is ,what beauty is ,what love is ,and what hope is .i don’t believe any one absolutely and I don’t doubt anyone absolutely .I think people are both evil and well intentioned ‘’అంటాడు డ్రైజర్.. నిర్ణయాలలోని మూసపద్ధతిని  .నల్లజాతి తెల్లజాతి అభిప్రాయాలు బద్ధక రాయుళ్ళు ,నిలకడలేనితనం , విరుద్ధ ప్రవర్తన ,భిన్నాభిప్రాయాలు ,మనుషులు నైతికత  మొదలైన వాటిని వ్యతిరేకించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-30-4-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1

బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్ పరీక్ష  రాసినవారు   ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొంది , ‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొంది  ‘’శివ తాండవం ‘’కావ్యం తో శాశ్వత యశస్సు నార్జి౦చినవారు  శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారు .ఆ కావ్యాన్ని వారి ముఖతా విని విని పులకించిన ధన్యులెందదరో ఉన్నారు .ఆచార్యులవారికి సాహిత్యం తో పాటు సంగీత నాట్య శాస్త్రాలూ నేర్చారు .ఇంతతిప్రతిభ రవీంద్రునికి మాత్రమే ఉండేది . ‘’ సరస్వతీ పుత్రుని శివతాండవం ‘’అని సుమారు 40ఏళ్ళ క్రితమే ఆంద్ర ప్రభ ‘’సాహితీ గవాక్షం ‘’లో రాశాను .

ఈమధ్యే శ్రీ రావి మోహన రాగారు సరసభారతి ఉగాది వేడుకల సందర్భంగా వచ్చినపుదు సభా ముఖంగా నాకు భరద్వాజ మహర్షి రాసి శ్రీ దోర్బల విశ్వ నాద శర్మ గారు సంపూర్ణ వ్యాఖ్యానం తో ప్రచురింపబడిన ‘’శ్రీ శివ కర్ణామృతం ‘’కానుకగా అంద జేశారు .దాన్ని శ్రద్ధగా చదువుతున్నాను .నాకు శ్రీ శంకరాచార్య విరచితం అని ప్రసిద్ధమైన శ్రీరామకర్ణామృతం  బిల్వ మంగలుడు లీలాశుకులై రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం  తెలుసు,కాని  శ్రీ శివకర్ణామృతంఉందని తెలియనే తెలియదు దీన్ని భరద్వాజ మహర్షి రాశాడనీ తెలియదు .భరద్వాజుడు కాదు అప్పయ దీక్షితులే దీన్ని రాశాడని ఇందులో ఉపోద్ఘాతం రాసిన సంస్కృతాంధ్ర మహా పండితులు  శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు అన్నారు .కాని పుస్తకం భరద్వాజ ప్రణీతంగానే ప్రచురితం .ఇందులో ప్రతి శ్లోకం అమృత గుళికయే.శివ భక్తీ ప్రపూరితమే .మూడు అధ్యాయాలున్న ఈ కావ్యం లో రెండవ అధ్యాయం లో శివతాండవం వర్ణించ బడింది .దాన్ని చదివి పుట్టపర్తి వారి శివతాండవాన్ని నాకు తెలిసినంత వరకు రెండిటినీ పోల్చి కొంత రాయాలని పించి ఈ ప్రయత్నం చేస్తున్నాను .

మొదటగా మహర్షి’’ శివ రాస ‘’నృత్యాన్ని’’వర్ణిస్తాడు .

‘’తాపసా స్తాపనా౦తరా  దేవతా-దేవతాదేవతాశ్చా౦తరా తాపసాః-ఏవ మాద్రుత్య వాగీశ్వరాది స్థితౌ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

మహర్షుల మధ్య దేవతలు ,దేవతల మధ్య తాపసులు ఉండగా బ్రహ్మాది దేవతలతో మహర్షి గణంతో  శివుడు అలనాటి కృష్ణుడు గోపికలతో’’ అంగనా మంగనా అన్నట్లు రాస లీల చేశాడు .శ్రీకృష్ణ కర్ణామృతం లోనూ లీలాశుకుడు ఇలాంటి వర్ణనే చేశాడు .

అప్పుడు గజముఖుడైన  వినాయకుడు శివ పాదస్పర్శ చేయగా శివుడు విజ్రుమ్భించి నటించాడు .

‘’కుంభి కుంభా హతి స్తంభ సంభావిత –శ్రీ మద౦ఘ్రిద్వ్యయా విక్రమీ విక్రమీ

భక్తి సక్తావలీభుక్తి ముక్తి ప్రదః –స౦  ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

గజముఖుడు శివుని పాద స్పర్శ కోసం వంగి శిరస్సుపై ఉన్న కుంభాలను తాకించగా ఆ పాద ద్వయం కాంతి వంతమైంది.అలాంటి పాదద్వయం భుక్తి ముక్తులిస్తూ స్వయంగా నర్తించాడు .ప్రతి శ్లోకం చివర’’ శ్రీ భవానీ పతిః’’అని ఈ ఘట్టం లో భరద్వాజ మహర్షి రాశాడు .

 

Inline image 1  Inline image 2

Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2

దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్తం లో వర్ణించాడు మహర్షి భరద్వాజుడు .

‘’త్వంగ దుత్తు౦గ రంగ ద్వరాంగోద్ధతా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం

చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦  ననర్త స్వయం భవానీ పతిః’’

శివుని శిరసుపై ఉత్తుంగ మందాకినీ నదీ తరంగాలు నాట్యానికి అంగంగా ,తాండవం లో శివుడు తల ఎగురవేసినపుడు ,ఆ గంగా నదీ బిందువులు  ఆకాశం లో వ్యాపించి నక్షత్రాల ఆకారాన్ని పొందేట్లుగా శివుడు నాట్యం చేశాడు .

ఇప్పుడు అవే కల్ప వృక్ష పుష్పాక్రుతి ధరించినట్లు కవి అదేవృత్తం లో వివరించాడు

‘’దేవ ముక్తాగతం కల్ప పుష్పజం –ద్రాక్సవర్ణం సమాలింగితు మ్మంత కాత్

ఉత్పపత్యాదరా ద్గాంగ బిందూత్కరే –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతే ‘’

భవనీపతి శివుడు నర్తిస్తుంటే దేవతలు కల్ప వృక్ష మాలను శివునిపై విసిరారు .అది కిందకు వస్తుంటే  తమతో సమాన రంగు కలిగి ఉన్నదన్న సంతోషాదరాలతో శివ జటాజూటం లో ఉన్న గంగ బిందు సముదాయం పైకి ఎగిరి ఆహ్వానం పలికినట్లు వాటితో కలిసి అదే పుష్పాల ఆకృతి దాల్చినట్లు నట్లు శివుడు నాట్యమాడాడు  .దేవతలే అంతఘనకార్యం చేస్తే ప్రక్కనున్న అమ్మవారు ఊరు కొంటు౦దా?ఆమె నీలోత్పలమాల వంటి తన చూపులమాలను ఆయన వక్షస్థలం లో వేసిందట –ఆ వైనం తిలకిద్దాం –

‘’అచ్ఛ వక్షః స్థలా లంబి నీలోత్పలం –స్రక్షు ద్రుక్షూ త్పలాక్ష్యా మహీ భ్రుద్భువా

అర్పితా స్వేవ మానంద్య వ్రుత్తోత్సవే –సం ననర్త శ్రీ భవానీ పతిః’’

స్వచ్చమైన శివ వక్షస్థలం పై నల్లకలువ మాలలైన కంటి చూపులతో పార్వతి అభినందన పూర్వకంగాఅర్పించేట్లు  చూడగా రెట్టించిన సంతోషం తో శివుడు గొప్పగా నర్తించాడు .ప్రదోష కాలం లో శివుడు చేస్తున్న ఈ తాండవం ఆయన తెల్లటి వక్షస్థలం పై అర్ధాంగి పార్వతీదేవి  అభినందన పూర్వకం గా చూసిన చూపులు నీలోత్పల మాలలుగా అర్పి౦పబడి భాసించాయి అని భావం .

ఈ శివ తాండవాన్ని చూసి ధన్యులు కావాలని సకల దేవాతలూ అక్కడికి వచ్చేశారు .ఎవరికి వచ్చిన విద్య వారు ప్రదర్శిస్తూ శివ నాట్యానికి తోడ్పడుతున్నారు .సరస్వతీ దేవి మొదలైన దేవతలు అన్నిభాషలలో  భవానీపతిని  స్తోత్రాలతో కీర్తిస్తున్నారు .

‘’ఎకతో భారతీ ముఖ్య దేవీ స్తుతీ –రన్యతో భారతీః శబ్ద భేదాక్రుతిః

సర్వతో భారతీః కామ  మాకర్ణయన్ –సంననర్త స్వయం శ్రీ భవానీ పతేః’’

ఒకవైపు సరస్వతీ దేవి మొదలైన దేవతల స్తోత్రాలు ,మరో వైపు శబ్ద భేదాల ఆకృతులతో వివిధ భాషలను ,అన్ని వైపులనుంచి ,అన్నివిధాల వాక్కులు స్వేచ్చగా వింటూ భావానీపతి స్వయం గా ఆనందంగా నృత్యం చేస్తున్నాడు .

ఇప్పుడు సరస్వతీ పుత్రుని శివతాండవ వర్ణన లోకి తొంగి చూద్దాం –

‘’అలలై బంగారు –కలలైపగడపు –బులుగుల వలెమ –బ్బులు విరిసి’’నాయి .శివతాండవ శివ లాస్యాలను చూసి ఏమానందము ఇలాతలమున ‘’అను కొంటున్నారు .పక్షులు వేదగానం ,హైమవతి నూపుర నాదం తోడైనాయి .

‘’పలికెడు నవెప –క్షులు ప్రాబలుకులో –కల హైమవతీ –విలసన్నూపుర-నినాదములకు –న్నను కరణ౦బులో’’అన్నట్లున్నాయి .పార్వతికి గీర్వాణి భారతి అలంకారం చేస్తోంది .శివుడికి బ్రహ్మ సకలాభరణాలతో అలంకరిస్తున్నాడు .భ్రు౦గాలు  గొంతు సవరిస్తున్నాయి .ఇది మహదానందం –‘’ఒహోహోహో –యూహాతీతం –బీయానందం –బిలాతలంబున ‘’అని ఉప్పొంగిపోయి రాశారు సరస్వతీ పుత్రులు .ఆర్యా ప్రాణేశుడు  చేసే నాట్యాన్ని చూడటానికొచ్చిన ఆల మృగాలు పరవశించి ఆనంద బాష్పాలు రాలుస్తుంటే ‘’విశ్వేశ్వరుని అడుగులు కడగటానికా ?’’అన్నట్లు ఉందట .రంగం సిద్ధమై౦ది కనుక కవి శివుని సంసిద్ధం కమ్మని కోరుతున్నాడు –

‘’నీ నృత్తములో నిఖిల వాజ్మయము –తానము మరియు గానము గాగను –తాండవింపగాదరుణం బైనది –ఖండే౦దుధరా గదలుము నెమ్మది ‘’అన్నాడు .

తాండవ నృత్య కేళీ విలాసం

‘’తలపైని చదలేటి యలలు దా౦డవ మాడ –నలల త్రోపుడుల గ్రోన్నెల పూవు గదలాడ –మొనసి ఫాలము పైన ముంగురులు చెరలాడ –గను బొమ్మలో మధుర గమనములు నడయాడ –గనుపాప లో గౌరీ కసి నవ్వు చిందింప –గను చూపులను తరుణ కౌతుకము జు౦బింప-గడగి మూడవ కంట కటి నిప్పులు రాల –గడు నేర్చి పెదవిపై గతిక నవ్వులు వ్రేల –ధిమి దిమిధ్వని సరిదిరి గర్భములు తూగ-నమిత సంరంభ హాహకారములు రేగ –ఆడేనమ్మా శివుడు –పాడెనమ్మా భవుడు ‘’ఇలా ఉద్ధృతంగా శివుడు తాండవం చేస్తున్నాడని మహాద్భుతంగా ,అనుభవైక వేద్యంగా శ్రీ పుట్టపర్తి వారు వర్ణించారు .ఆ తాండవం లో మనలనూ భాగ స్వాములను చేశారు .అదీ వారి రచనా నైపుణ్యం .

ఇప్పుడు భరద్వాజ శివుడు ఏం చేస్తున్నాడో చూడాలి –

‘’చంచలాభాసితా  కా౦చ  నా౦చద్రుచా –చంచలా భాసితా వ్యోమ యాతా జటాః

చంచలా భాసితా వేవ భాసీ దధత్ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

బంగారపు పవిత్ర కాంతి చేత అంటే లక్ష్మీదేవి చేత ,ఆకాశాన్ని చేరిన జడలు మెరుపుల చేత ప్రకాశ మానమైనాయి.ఇలా చంచలా భాసితమైన రెండు కాంతులను ధరించి శివుడు బాగా నర్తించాడు

లక్ష్మీ దేవికి చంచల అనిపేరు ఒక చోట స్థిరంగా ఉండదు .కాని విష్ణు మూర్తి వక్షస్థలం పైన  మాత్రం స్థిరంగా ఉండిపోతుంది .అయినా చంచలమైనది అనే అప్రతిష్ట మాత్రం ఆమెను వదలలేదు .శివుడికి కాంచన ఉత్తరీయం లేదు .ఆయనకున్నది పులి తోలు ఉత్తరీయమే .కాని నాట్య సమయం లో శివుని శరీరకాంతి బంగారు కాంతి అంటే చంచల కా౦తిగానే అనిపించింది  .నాట్యం లో తలపైకి ఎగరేసినపుడు శివుని జటాజూటం ఆకాశాన్ని అంటింది .నీలాకాశపు మెరుపు తీగలచేత యెర్రని జడలు ప్రకాశించాయి .ఇలా రెండుకాంతులు చంచలాలే .అవి  శివునికి గొప్ప ఉత్తేజం కలిగించి బాగా నాట్యం చేయటానికి దోహదమైనాయని కవి భావన .

ఇప్పుడు శివుని నాట్య శబ్దాల విశేషాలను వర్ణిస్తున్నాడు భరద్వాజ మహర్షి –

‘’తక్క తో ధిక్క తోతౌ తధా తైతధై-తోంగ దద్మాంగ దిన్నర్త శబ్దాన్ముహుః

ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

నాట్యం లో వచ్చే ‘’తక్కతాది’’ శబ్దాలను ఉచ్చరిస్తూ నవ్వుతూ ముఖాన్ని వికసింప జేస్తూ శివుడు నాట్యమాడాడు .ఇదంతా లయ విన్యాసానికి చెందిన కసరత్తు .ఇక రాగ విన్యాసాన్ని వివరించ బోతున్నాడు మహర్షి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-16-ఉయ్యూరు  .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘పికాసో కంటే గొప్పవాణ్ణి ”అనుకొన్న తెలుగు చిత్రకారుడు ,గుడివాడ వాసి అమెరికా నివాసి ఎస్ వి రామా రావు

sv4 001 sv1 001 sv2 001 sv3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మే నెల ”తెలుగు వెలుగు ”లో గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”పై చిరు సమీక్ష

avishranta akshara krushi 001tv girvanam 001

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -129

53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్

అమెరికన్ నవలాకారులలో అతి వెర్రిగా  అణగ దొక్కబడిన ,నిషేధింపబడిన వాడు దియోడర్ డ్రైజర్..అయినా అదే పట్టుదలతో తనను తాను కాపాడుకొన్న ధీరుడు .ప్రచురణకు కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న రెండు పెద్ద సంస్థలు అతని రచనలను ప్రచురించ టానికి తిరస్కరింఛి, మిగిలిన చిన్నా చితకా పబ్లిషర్ లను కూడాఅసలు వాటిని చదవ కుండానే  ప్రచురించ నీయ కుండా చేశాయి  .అతనేదో దేశ ద్రోహం లాంటి నేరం చేశాడని ,ఆయన రచనలు అమెరికా జాతికి అవమాన కరమని .అశ్లీల సాహిత్య కారుడని ముద్ర వేశారు .చిన్నతనం నుంచే ఈ విద్వేషాన్ని అనుభవించటం మొదలు పెట్టి జీవితాంతం అనుభవిస్తూనే ఉన్నాడు .ఒక అభద్రతాభావం జీవితాంతం అతన్ని వెంటాడింది .అందుకే రాసిన దానిలో గందర గోళం కనిపిస్తుంది .

అసలు పేరు దియోడర్  హెర్మన్ ఆల్బర్ట్ డ్రైజర్.27-8-1871న అమెరికాలోని ఇండియానా రాష్ట్రం లో ఉన్న టెర్రెహాట్ లో జన్మించాడు .ఇల్లు  పాడుపడిన దెయ్యాలకొంప .జబ్బు పడినట్లు నీరసంగా కనిపించే కొడుకు ఆరోగ్యం కోసం తల్లి ప్రక్కనే ఉన్న ముసలి మంత్ర గత్తేను పిలిపించి దెయ్యం పట్టి అలా చిక్కిపోతున్నాడేమో చూసి వదిలించమని కోరింది .తండ్రిజాన్ పాల్ కేధలిక్ .ఇలాంటి నమ్మకాలు లేనివాడు .ఏ ఇబ్బంది వస్తుందో నని జర్మనీ పారిపోయాడు ఆయన జీవితం లో విఫలుడు .బ్రహ్మాండమైన ఫాక్టరీకి సంపన్న యజమాని .దివాలా తీసి లేబరర్ గా పనిచేస్తున్నాడు .ఇంటిబాధ్యత అతని మేన్నోనైట్ భార్య వహించి ఒక బోర్డింగ్ హౌస్ ను నిర్వహిస్తూ వాషింగ్ పనీ చేబట్టింది .13మంది సంతానం లో దియోడర్ 12వ వాడు .ఆ కుటుంబం అంతా వేయించిన బంగాళాదుంపలు ,పాప్ కారన్ తిని బతికింది ..రైల్ రోడ్ ప్రక్కనే ఉండటం తో వాగన్లలోని బొగ్గు దొంగలించి అమ్మి సొమ్ము చేసుకొనేవారు .ఎవరికీ చెప్పులు కూడా ఉండేవికావు .తల్లి చేసిన ఇస్త్రీ బట్టల్ని బుజాలపై మోసుకొంటూ డోర్ డెలివరి ఇచ్చేవాడు దియోడర్.పేదరికపు కోరల్లో గిలగిల లాడి పోతున్న సంసారాన్ని చూసి ఏమీ చేయలేక తన నిస్సహాయ స్థితికి వ్యధ చెందేవాడు .అన్నలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి బాధ్యత లేని తమ జీవితానందాలను కధలుగా చెబుతూంటే ఆశ్చర్య పోయేవాడు .ఏదీ సాధించకపోయినా తండ్రి ఆడపిల్లలను  తల్లినీ సాధిస్తూ ఇబ్బంది పెట్టటం సహించ లేక పోయేవాడు .తన తల్లి దయ సానుభూతి ప్రేమ ఉన్న మాతృమూర్తి అని తెలుసుకొని ఆరాధించేవాడు .

పెద్దకొడుకులు లాగా వీడు దారి తప్పకూడదని తండ్రి డ్రైజర్ను  చర్చి స్కూల్ కు పంపించాడు .అక్కడి మత బోధ ఒంటికి పడలేదు .తట్టుకో లేక పోయాడు .నల్ల డ్రెస్ వేసుకొన్న ప్రీస్ట్ లంటే భయమేసేది .నవ్వుకు తావేలేదక్కడ .నిత్య కర్మకాండ మరింత భయపెట్టింది .కుటుంబం అక్కడి నుంచి ఇండియానా లోనే మరో ప్రాంతానికి మారింది .మనవాడు ఇక్కడ అయిష్టంగానే ఉండిపోయాడు ,చికాగోకు ఫామిలీ చేరినతర్వాత ఊరట లభించింది .చిన్నతనం లో ఆడుకొనే ఆటలు అతనికి దూరమయ్యాయి .బాల్యం అంతాఆనంద రహితంగానే గడిచిందని బాధ పడేవాడు .17ఏళ్ళు రాకముందే ఒక మురికి  రెస్టా రెంట్ డిష్ వాషర్ గా,స్టవ్ తుడవటం ,కార్ చెకర్ గా   పని చేశాడు .18వ ఏట వారానికి 5డాలర్లు సంపాదించాడు .అతని పూర్వపు  టీచర్ ఇండియానా యూని వర్సిటి లో పని చేసే అవకాశం కల్గించాడు..19వ ఏట తల్లి చనిపోయింది .ఆమె అనారోగ్యం తో చర్చికి హాజరు కాలేక పోయేది .అందుకని ఆమె చనిపోతే ప్రీస్ట్ వచ్చి అంత్యక్రియలు జరపటానికి నిరాకరించాడు .ఇవన్నీ ఈయువకుడి పై ప్రభావం కలిగించి అసలే చర్చి అంటే ఏహ్యభావం ఉన్న దియోడర్ కు ఆ సంప్రదాయం పై పూర్తీ వ్యతిరేకత ఏర్పడిపోయింది ‘.

పొట్ట పోషణకోసం రియల్ ఎస్టేట్ కాన్వాసర్ గా ,వాగన్ డ్రైవర్ గా ,చిన్న చిన్న పనులు చేస్తూ ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో చేరాడు .ఇరవై ఏళ్ళకే రిపోర్టర్ చేస్తూ ప్రపంచం లోని కస్టాలు బాధలు వ్యధలు ,ప్రజల ,పాలకుల ఉదాసీనత అర్ధం చేసుకొన్నాడు .అందులో ఏదీ వార్తకాదని యదార్ధ గాధ అని తెలుసుకొన్నాడు .సెయింట్ లూయీ కి మారి తన పేపరుకు స్కూల్ టీచర్ పరీక్ష నిర్వహించి సారా వైట్ అనే ఆమ్మాయి తో పరిచయమై ప్రేమించి ,అయిదేళ్ళ తర్వాత పెళ్ళాడాడు .పెళ్ళికాక ముందే చార్లెస్ డికెన్స్ ,డూ మారినర్ ,హతారన్ ,బాల్జాక్ రచనలన్నీ క్షుణ్ణంగా చదివి జీర్ణం చేసుకొన్నాడు .సెయింట్ లూయీ నుండి టోలెడో,క్లీవ్ లాండ్ ,పిట్స్ బర్గ్ ,కూ చివరికి న్యూయార్క్ కూ చేరాడు .అప్పటికే అతని సోదరుడు పాల్ ,ఇద్దరు అక్కలు అక్కడేఉంటున్నారు .అక్కడ కెరీ అనే రెస్టారంట్మేనేజర్ గా ఉన్న ఆమెను ఒకడు ముగ్గులోకి దింపి ,ఆమెతో ఉడాయి౦చేశాడు  .15వేల డాలర్లు నొక్కేసి బొక్కేసిన వాడినే పెళ్లి చేసుకొంది.వాడికి అన్నిరకాల సాయం చేసింది .తన సోదరి ధనవంతుడైన వాడినిస్టపడి ,కడుపు తెచ్చుకొంటే ఆమెకు అండగా నిలిచింది .ఈ కెరీ అంటే డ్రైజర్కు వీరాభిమానం .ఈమెనే తన నవలలో ముఖ్య పాత్రగా చిత్రించాడు .అక్కలకు ,పాల్ కు భారం కారాదని భావించి వేరే ఒక అచ్చిరాని చోట రూమ్ అద్దెకు తీసుకొన్నాడు .’’న్యూ యార్క్ వరల్డ్ ‘’పత్రికలో ఉద్యోగం వచ్చింది .కొద్దికాలానికే డిస్మిస్ చేశారు .తిండిలేక ఇబ్బందిపడ్డాడు .రోజూ పస్తులే .పాల్ వచ్చి బాసటగా నిలిచాడు .పాల్ డ్రసర్ గా  పిలువ బడే ఇతను గుర్తింపు పొందిన గొప్ప నటుడు ,ఎంటర్ టైనర్.అనేక పాప్యులర్ సాంగ్స్ పాడి రికార్డ్ చేసినవాడు .అందులో బార్బర్ షాప్ మెలడీలు ,సెంటి మెంటల్ త్రిల్లర్లూ ఉన్నాయి .300పౌండ్ల స్తూలకాయుడు పాల్ .మనవాడికంటే 15ఏళ్ళు పెద్ద .హానికర రక్త హీనత వలన 1906లో పాల్ చనిపోతే ‘’మై బ్రదర్ పాల్ ‘’అంటూ విపరీతంగా ఏడ్చేశాడు .అతనితోకలిసి తయారు చేసిన ఒక పాట ఆల్ టైం రికార్డ్ అయింది .తన పబ్లిషింగ్ ఫార్మ్ లో ఇతనికి అవకాశమిచ్చాడు .ఈ సంస్థ పాటలు ,కధలతో ఒక మేగజైన్ తెచ్చి  ‘’ఎడిటర్ అండ్ అరెంజర్ ‘’అని గౌరవంగా ముద్రించాడు .అవినీతి తో కూరుకు పోయిన మెట్రో రాజకీయాలను ,పురాతత్వ శాస్త్రం ,ఐరోపా పరిస్తితులు ,మహిళా భవితవ్యం ,మద్యపాన వ్యసనం ,కుజ గ్రహం లో జీవరాశి మొదలైన విషయాలపై సంపాదకీయ రచనలు చేసే బాధ్యత డ్రైజర్ కు  అప్పగించాడు ఇతను తన సమర్ధతను చాటి భేష్ అనిపించుకొన్నాడు . ,

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-16-ఉయ్యూరు

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10

భాగవత పరమార్ధం

ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు  ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్ చే జాతీయోపన్యాసకులుగా గౌరవి౦పబడి ,యావద్భారత దేశం పర్య టించి ఢిల్లీ బెనారస్ ,బెంగుళూర్ అన్నామలై మున్నగు విశ్వ విద్యాలయాలలో వివిధ విషయాలపై ఉపన్యాసాలిచ్చి ప్రభావితం చేసిన ఆచార్య బొడ్డు పల్లి పురుషోత్తం గారు విజయవాడ ‘’రసభారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’కోసం రాసిన పోతన భాగవత విశేషాలలో నుంచి కొన్ని విషయాలను గూర్చి తెలుసుకొందాం .

గాంధీ మహాత్ముడు ఆంగ్ల భాష ను వాడటం చేత ఆ భాషకు ఎంతో గౌరవం కలిగింది అని విశ్వనాధ గాంధీ మరణం పై ‘’మానవ నిర్మితంబైన ఆంగ్లేయంబు శ్రీ రుషి ప్రోక్తంబు చేసినారు –కేవలము రుణ పడ్డ దాంగ్లేయ జాతి –నీకు మానవ సామాన్య నియత ధర్మ –మురలి సామ్రాజ్య ధర్మంబు నొక్కదాని –తెచ్చు కొని బాధ పడుచుండు పిచ్చి జాతి ‘’అని మనల్ని గురించి బాధ పడ్డాడు .నన్నయ తిక్కనలు చెప్పింది లౌకిక కవిత్వం .పాల్కురికి సోమన చెప్పింది మత కవిత్వం కాని కవి యోగి భక్త పోతన్న చెప్పింది భక్తీ కవిత్వం అన్నారు .ఇదే విశ్వనాధ దృష్టిలో జీవుని వేదనను తీర్చి శాంతి చేకూర్చేది అన్నారు బొడ్డుపల్లి వారు .భక్తి సంకుచితమైనది కాదు జాతి మతాతీతమైనది భక్తీ .

పోతన కేవలం భక్తీ కవి కాదు .భక్తీ కవిత్వోద్యమ సారధి .యావద్భారత దేశం లోను భక్తీ కవిత్యోద్యమానికి ఆద్యుడు పోతన .సూరదాసు ,తులసీదాసు తుకారాం వంటి భక్తకవులకు ప్రేరణ పోతన్నయే .వల్లభాచార్యులకు భుక్తిపాదం నెలకొల్పటానికి ఆంద్ర భాగవతమే ఆధారం .

’’వర గోవింద కదా సుధారస మహా వర్షోరు ధారా పరం –పరలకు గాక ,బుదేంద్ర చంద్ర !ఇతరోపాయాను రక్తిం ప్రవి

స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు –స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే ‘’అన్నవాడు పోతన .సంకీర్తన భక్తికి  ప్రాణం పోసి జన తరుణోపాయానికి మార్గం చూపిన కవి పోతన .సంకీర్తన భక్తితో జన చైతన్యం కలిగిందని విమర్శకాభిప్రాయం .చైతన్య ప్రభువు ఆంద్ర దేశం లో సంచారం చేశాడు .మంగళ గిరి పానకాల స్వామి దివ్య దర్శనం చేశాడు .అప్పుడు పోతనగారి భాగవత ప్రభావం పడే ఉంటుంది .చతుర్విధ ,పంచవిధ నవ విధ భక్తులను గురించి ఆంద్ర భాగవతం సవిస్తరంగా తెలిపింది .నిజానికి ఆంద్ర భాగవతం వ్యాస భాగవతం కంటే మహత్తరమైనది అన్నారు ఆచార్య శ్రీ పురుషోత్తమం గారు .వ్యాస భారతం లో భక్తీ శాస్త్రం గా చెప్ప బడింది .శాస్త్రం తండ్రి వంటిది .భక్తి కళ.తల్లి వంటిది .’’భక్తి జననీ భక్తార్భకం రక్షతి ‘’అన్నారు ఆది శంకరాచార్యులవారు .పోతనగారు భక్తిని కళగా పోషించారు.భక్తీ చేత శ్రీ కైవల్యం పొందటానికి కవిత్వం చెప్పాడు పోతన .భగవంతుడు ‘’భక్త పాలన కళా సంరక్షకుడు ‘’అన్నాడాయన ‘’మహానందనా డింభకుడి ‘’లాగా భాగవతం ఆనందాన్ని ప్రసాదిస్తుంది .

అన్నీ రాసినా మనసు చికాకుగా ఉంటె నారదమహర్షి వ్యాసుని హరినామ స్తుతి చేసే భాగవతం రాయమన్నాడు .ఆయన యెంత ప్రయత్నించినా శాస్త్ర  వైదుష్యం వృద్ధి కాలేదు . అందుకే వ్యాసభాగవతం మహా మనీషికి కాని అవగాహన కాదు .బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చే బట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .అంటే నారద మహర్షి ప్రబోధాన్ని ఈ ఆంద్ర వ్యాసుడు పోతన్న తూ చా తప్పకుండా పాటించాడన్న మాట .అందుకే తెలుగు భాగవతం అనువాదం కాక అను సృజన అయింది .మూలానికంటే రెండు మూడు రెట్లు శ్రీధర భాష్యకారుని అభిప్రాయాలతో సమ్మిళితమై సరసంగా సమున్మేషించింది అన్నాడు శ్రీ పురుషోత్తం గారు .సంస్కృతం లో 25శ్లోకాలకే పరిమితమైన గజేంద్ర మోక్షం పోతన చేతిలో 125రసగులిక పద్య గద్యాలలో అలరారి మూలానికే వన్నె తెచ్చింది .పోతన గారి భాగవత భక్తీకళా ప్రపూర్ణమై సామాన్యులకూ దీమాన్యులకు కూడా జీవితపాదేయం ,ఉపాదేయం అయింది .

నిఖిల రసామృతమూర్తి అయిన భగవంతునికి అంకితమిచ్చిన పోతన భాగవతం మిగిలిన వారి కవిత్వాలకంటే ఒక మెట్టు పైనే ఉంది .’’బాల రసాల సాల నవ పల్లవ కోమల ‘’మైన ఆయన కవిత్వం ఉల్లాన్ని ఉప్పొంగ జేసే ఉదాత్త దివ్య భవ్య కవిత్వం  .ఆయన దేనికీ ఎవరికీ భయ పడాల్సిన వాడు కాదు .తన పరిమితమైన కవితాత్మను సచ్చిదానందాత్మక పరమాత్మతో ఏకం చేసి తాదాత్మ్యం చెంది ,తాను  నిమిత్త మాత్రుడుగా ఉండి భాగవతాన్ని పలికాడు పోతన .ఇంతటి విషయ తాదాత్మ్యం నన్నయ ,తిక్కనలకు లేదు .అందుకే వారిద్దరికంటే పోతన ఘనుడు అంటారు ఆచార్యులవారు .ఎప్పుడో దార్శనికుడు ప్లాటో ‘’కవులు నీతి మంతులుకారు .వాళ్ళు రాసేది,జీవించేది ఒకటికాదు ‘’అని నిరసించాడు .పోతనలాంటి నైతిక కవి ఉంటాడు అని ప్లేటో ఆనాడు ఊహించలేక పోయాడు .కవిత్వం  జీవితం రెండూ ఒకటిగా జీవించి ఆదర్శ కవి అయ్యాడు పోతన. అందుకే ఆంధ్రుల ఆరాధ్యదేవత ,కవి,వ్యక్తీ  అయ్యాడు పోతన .

పోతన సర్వతంత్రస్వతత్రుడు భగవంతునికి తప్ప ఎవరికీ భయ పడడు.ఇంద్రియాలకు దాసుడుకానేకాడు .లోపలి శత్రువులను జయించినవాడు .హాలికుడిగా పరమ సంతృప్తి తో జీవించాడు .పూర్తిగా అంతర్ముఖుడు పోతన .త్రికరణాలను ఏకం చేసుకొని రస స్వరూపుడైన భగవంతునితో ఎకో న్ముఖుడైన వాడు .ఆయన కవిత్వం కూడా అంతటి మహత్వాన్ని ,మార్దవత్వాన్ని సముపార్జించుకొని ఆంద్ర జాతిని పూర్తిగా ఆవర్నించు కొన్నది అని తేనే సోనల్లాంటి పదాలతో లలిత లలితంగా మధుర మధురంగా బొడ్డుపల్లి వారు పోతనను ఆయన కవిత్వాన్ని విశ్లేషించారు .

ఆంద్ర భాగవతానికి తెలుగులో ఏ కావ్యానికీ లేని  మరొక ప్రాశస్త్యం ఉంది .ఈ ప్రశస్తి సంస్కృత భాగవతానికి లేదంటారు ఆచార్యులు .తెలుగు దేశం లో ఎవరికైనా తీవ్ర మైన ఆపద కలిగితే దానితో తీవ్ర మనోవేదన తో బాధ పడుతుంటే ‘’గజేంద్ర మోక్షం ‘’పారాయణ చేస్తారు .వెంటనే ఆర్తి నశిస్తుందని విపరీతమైన విశ్వాసం .ఈ పారాయణం అర్ధ రాత్రి అందరూ నిదురించే వేళ కంఠ మెత్తి’’లావొక్కింతయు లేదు ,ధైర్యము విలోలంబయ్యె ‘’అని బిగ్గరగా చదువుతూ పారాయణం చేస్తారు ఆంద్ర జనులు .అభీష్ట సిద్ధి పొందుతారు .మరొక విశేషం .కన్నె పిల్ల వివాహం జరగటం ఆలస్యమైతే ఆమె చేత రుక్మిణీ కల్యాణం పారాయణ చేస్తే మూడే మూడు నెలలలో వివాహం జరుగుతుందని అనుభవపూర్వక విషయమే . ఈ మహత్తు పోతన గారి కవిత కు  ఎలా కలిగింది ?ఆయన’’ భక్త కవి యోగి’’ కావటం వలన.ఉదాత్త నైతిక జీవనుడు ,త్రికరణ శుద్ధి కలవాడు .అంతేకాదు .ఆయనది మాంత్రిక కవిత్వం అంటే మంత్రాల వంటి కవిత .వాటిని శ్రద్ధగా పారాయణ చేస్తే శాంతి దాంతులు కలిగి అభీష్ట౦  సిద్ధి స్తుంది .ఒక రకంగా పోతన వశ్య వాక్కు ఉన్నకవి బ్రహ్మ .

వారణాసి రామ మూర్తి ( రేణు )తెలుగు భాగవతాన్ని హిందీ లోకి అనువదింఛి పోతన పూత కవితను ఉత్తరాది వారికి రుచి చూపించారు .శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సంస్కృతీకరించి గీర్వాణ భాషకు పోతన భక్తీ కవిత తో సోగసులందజేశాడు .తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆంగ్లం లోకి అనువది౦ప జేశారు .తమిళ దేశీయ హరిదాసులు  కూడా పోతన గజేంద్ర మోక్ష పద్యాలను వారి విచిత్ర యాసతో చదివే వారట .తమిళులు ఆనందంగా ఆలకి౦ చేవారని శ్రీ ప్రయాగ సంగమేశ్వర భాగవతార్ చెప్పారని పురుషోత్తం గారన్నారు .

నిజానికి తెలుగు భాగవతం కంటే భారతానికి విశేష ప్రాచుర్యం కలగాలి కారణం భారతం జీవిత సమరాన్ని నిరూపించే ఘట్టం .ధర్మ సమన్వయము లో ఎవరికైనా సందేహం వస్తే భారతమే ప్రమాణం .కవిత్రయ శిల్ప హస్తం తో మూల భారత బంగారాన్ని తళుకు బెళుకులోలికే స్వర్ణాభరణం గా చేసి సరస్వతీ కంఠాభరణం చేశారు . భారతం ధర్మాన్ని చెబితే భాగవతం పరమార్ధాన్ని బోధించింది .ప్రజలలో ఎక్కువ మంది పురుషార్ధ పరాయణులేకాని ,పరమార్ధ పరాయణులు కారు .అలాంటి భారతాన్ని అధిగమించి పోతన గారి భాగవతం ఆంద్ర దేశం లో విశేష ప్రాచుర్యం పొందింది .ప్రజలకు శృంగారం పై మోజు ఎక్కువ .పోతనగారు కూడా అసలు శృంగారకవే .ఆయన రాసిన భోగినీ దండకమే సాక్షి .రాను రాను భక్తకవిగా పరిణమించాడు .అయినా శృంగారాన్ని రంగ రించకుండా ఉండలేక పోయాడు .వామనావతార ఘట్టం లో వామన మూర్తి యాచనా హస్తం చూసేసరికి బలి చక్రవర్తి ఉప్పొంగిపోయాడు .ఎటు వంటి హస్తం కింద, తన హస్తం పైన ఉందొ ఆలోచించుకొని ఉప్పొంగి పోయి నోటి తో పోతన గారి పద్యం లో పలికించాడు –

‘’ఆదిన్ శ్రీసతి కొప్పు పై ,తనువుపై ,హంసోత్తరీయంబు పై –పాదాబ్జంబులపై ,కపోల తటిపై ,పాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ చెందు కరంబు క్రిందగుట ,మీదై నా కరంబౌట,మేల్ –కాదే?రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే ?-ఇందులోని శృంగార భావానికి ఆనందించని సహృదయుడు ఉండడు అంటారు శ్రీ బొడ్డుపల్లి .భాగవతం సంకీర్తన ప్రధానం దానికి తాళాలు ,మృదంగాది వాద్యాలు అవసరం .ఆ కొరత తీర్చి శబ్దాలంకారాలతో శోభ తెచ్చాడు .పోతన పద్యాలను సంకీర్తన లాగా పాడే వాళ్ళున్నారు అంటారు ఆచార్య బొడ్డుపల్లి .శబ్దాలంకారాల ప్రయోజనం గుర్తించి  సార్ధకం చేసిన వాడు పోతన కవి ఒక్కడే అంటారు .పోతన గారి అర్దాలంకారాలు కూడా రస వ్యన్జకాలై అలంకార ధ్వనిలో పర్య వసిస్తాయి అన్నారు .శ్రీ వేదాల తిరు వేంగళాచార్యుల వారు భాగవతం లో అనేక  ద్వని భేదాలున్నాయని సోపత్తికంగా నిరూపించారు .

ఛందో వైవిద్యం లో ,ఛందఃశిల్పంలోను పూర్ణ ప్రజ్నఉన్నవాడు పోతన .బ్రౌన్ దొర పోతన్న ,వేమన్నలనే ప్రజా కవులు అన్నాడు .కవులందరూ మేధాశక్తి తో కవిత్వం చెబితే ‘’అతి మానసిక కవిత్వం ‘’(ఓవర్ హెడ్ పోయిట్రీ)శ్రీ అరవిందులు చెప్పారు  .తెలుగులో ఒక్క పోతన్నగారే ఇలాంటి కవిత్వం చెప్పారు. నిఖిల రసానంద మూర్తితో ఏకం కావాలని ప్రతి కవీ కోరుకొని విఫలురై విలపిస్తారు .కాని సఫలత పొందిన వాడు పోతన్నగారొక్కరే .అందుకని ఆయనకు ఆయనేసాటి .ఎంత భావోద్రేకం లో ఉన్నా రచన ప్రారంభించే సరికి కవితా శక్తి కొంత సన్నగిల్లుతుంది .దీనినే పాశ్చాత్యులు ‘’A poet;s mind in creation is a fading furnace ‘’అన్నారు .దీనికి అపవాదం పోతన్న .కారణం ఆయన కవితాత్మను అనంత భగవచ్చక్తికి లంకె వేసి తనదన్నది వేరే ఏదీ లేకుండా చేసుకొన్నకవి యోగి .

ఈ నాలుగు వ్యాసాలకు ఆధారం నేను ముందే మనవి చేసినట్లు విజయవాడ రసభారతి వారి ప్రచురణ పీయూష లహరి అని మరొక్క సారి మనవి చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9

’   భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9

భారత ధర్మ సూక్ష్మాలు

సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి  ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ సార సంగ్రహం ,వాల్మీకి రామాయణోపన్యాసాలు వంటి గ్రంధ రచయిత శ్రీ  నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పిన వాటిలో అతి ముఖ్యమైనవి అందజేస్తున్నాను.

‘’వేదోఖిల ధర్మ మూలం ‘’వేదమే అన్ని ధర్మాలకు ఆధారమైనది .’’వేదాలు అపౌరుషేయాలు ,సృష్టి అనాది .జీవుడు నిత్యుడు .’’అనే మహా విషయాలను భగవాన్ వేద వ్యాస మహర్షి మహా భారతం లో చెప్పాడు .వేదం సామాన్య ధర్మం అని విశేష ధర్మం అని రెండు ధర్మాలు విధించింది  .విశేష ధర్మాన్నే ధర్మ సూక్ష్మం అని లేక సూక్ష్మ ధర్మమని అంటారు .దీనికే ఆపద్ధర్మం అనే ఇంకోపేరు కూడా ఉంది. భారతం లో శాంతి ,ఆనుశాసనిక పర్వాలు కేవలం ధర్మ ప్రబోధకాలు .వీటికి ముందున్న పర్వాలలో చరిత్రా౦తర్గత సూక్ష్మ ధర్మాలను చెప్పాడు వ్యాసర్షి .’’మా హి౦ సాస్సర్వ భూతాని ‘’అని వేదం నిర్ణయించింది .కాని యజ్ఞాలలో పశు హింస ధర్మ విశేషంగా చెప్పింది .కామాన్ని గర్హించినా గార్హస్త్య జీవితం లో కామం పవిత్ర జీవితంగా చెప్పింది .పాండవ జననాలు సూక్ష్మ ధర్మాలపై ఆధార పడి ఉన్నాయి .దీనివలననే కుంతీ పతివ్రతగా ద్రౌపది కి అయిదుగురు భార్తలు౦డటం ధర్మమే అయింది .

ద్రౌపది జననం  అగ్ని కుండం లో జరిగింది .ఆమె స్వర్గ లక్ష్మి .పాండవులు అయిదుగురూ ఇంద్రులు .ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు .అయిదుగురు భర్తలకు ఒక్కటే భార్య అవటం ఆనాడు సామాన్య లోక ధర్మం కూడా కాదు .విశేష ధర్మాన్ని బట్టే ఆమెను అయిదుగురు పాండవులు భార్యను చేసుకొన్నారు .ద్రుపద రాజ కొలువులో అర్జునుడు బ్రాహ్మణ వేషం లో మత్స్య యంత్రాన్ని ఛేదింఛి ద్రౌపదిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .రాజాహ్వానం తో  ద్రోపదితో సహా పాండవులు రాజాస్థానానికి చేరారు .భోజనాదులైపోయే దాకా పాండవులు బ్రాహ్మణులా క్షత్రియులా అనే నిర్ణయం జరగ లేదు .ద్రుపదుడు ధర్మ రాజును –‘’కదం జా నీమ భవతః క్షత్రియాన్ ,బ్రాహ్మణానుత –బ్రవీతునో భవాన్ సత్యం సందేహో హ్యత్రనో మహాన్ ‘’అని అడిగాడు ‘’స్వామీ !మేము మిమ్మల్ని క్షత్రియులు అనుకోవాలా ?బ్రాహ్మణులు అనుకోవాలా ?నిజం చెప్పి సందేహాన్ని తీర్చండి ‘’దీనికి ధర్మ రాజు తాము పాండురాజు కు మారులమని సుక్షత్రియులమైన పాండవులమని తేల్చి చెప్పాడు .సందేహం తీరిన రాజు ద్రౌపదిని అర్జునున కిచ్చి వివాహం చేస్తానని ,దానికి శుభ ముహూర్త నిర్ణయం  చేయిస్తానని  అన్నాడు .ఇప్పటి వరకు కుల ధర్మాన్ని పాటించటం జరిగింది అంటే అర్జునునికే ద్రౌపదినిచ్చి అ నాటి లోకాచారం ప్రాకారం పెళ్లి చేసే ప్రయత్నం చేశాడు రాజు .వెంటనే ధర్మ రాజు ‘’నాకూ పెళ్లి కావాల్సి ఉంది ‘’అన్నాడు .’’దానికేం నీకు ఇష్టమైతే నీకైనా నా కూతుర్నిస్తాను ‘’అన్నాడు .మళ్ళీ ధర్మ రాజు ‘’సర్వేశామ్మహిషీ రాజన్ ద్రౌపది నో భవిష్యతి ‘’అని బాంబు పేల్చాడు .అంటే మా అన్న దమ్ములైదుగురకు ద్రౌపది భార్య కాగలదు అన్నాడు .నిజంగా అది సామాన్య ధర్మమే అయితే ద్రుపదుడు ఏమనాలి ?సరే అలాగే చేద్దాం అనాలి మరి అలా అనలేదాయన –‘’

‘’ఏకస్య బహ్వ్యో విహితా మనుష్యః కురునంద –నై కస్యా బహువ్య పుంసః శ్రూయంతే బహువ్య క్వచిత్

లోక వేద విరుద్ధం త్వం నా ధర్మం ధర్మ విచ్చుచిః-కర్తు మర్హసి కౌన్తేయ కస్మాత్తే బుద్ధి రీద్రుశీ’’అన్నాడు . అంటే ‘’లోకం లో ఒక మగవాడికి అనేక మంది భార్యలు ఉండటం సహజం .ఒక స్త్రీకి బహు భర్తలు ఉండటం ఎక్కడా చూడలేదు ‘’అని అర్ధం .ఇందులో వ్యాసులవారు వాడిన ‘’పుంసః ‘’అనే పదానికి నీల కంఠ వ్యాఖ్యలో ‘’వేద కర్తుః పరమాత్మానః సకాశాత్ న శ్రూయంతే’’అని ఉన్నది అంటే లోకం లో లేదు వేదం లో కూడా ఈ ఆచారం లేదు .ధర్మాత్ముడవైన నువ్వు ఇలాంటి అధర్మానికి ఎందుకు పాల్పడుతున్నావు?అని అడిగాడు .కనుక ఆకాలం లో లోక ధర్మాన్ని వేదోక్త ధర్మాన్నీ రెండిటినీ పాటించారు అని తెలుసుకోవాలి .దీనికి ధర్మ రాజు సమాధానం –

‘’సూక్ష్మో ధర్మో మహా రాజ నాస్య విద్మో వయం గతిం –పూర్వేషామాను పూర్వ్యేణ యాతమ్ వర్త్మాను యామహే

నమే వాగనృతం ప్రాహనా ధర్మే దీయతే మతిః-ఏవం చైవ వదత్యం చామమచైతన్య నోగతం ‘’అని బదులిచ్చాడు దీని భావం –ద్రుపద మారాజా !ఇది స్థూల దృష్టికి గోచరించని ధర్మ సూక్ష్మం .ఈఆచారం వేదం లో ఉంది .ప్రచేతసనులను ఇలాగే చేసుకొన్నారు.నానోట అసత్యం రాదు .ఇది ధర్మమే ‘’అని నొక్కి వక్కాణించాడు .ఇంతలో వ్యాసభగవానుడు ప్రత్యక్షమైనాడు .ఇప్పుడు బంతి ఆయన కోర్టులో ఉంది .ఆయన ద్రుపద  మహా రాజుకు దివ్య ద్రుష్టి నిచ్చి చూడమన్నాడు .పాండవులు అయిదుగురు ఇంద్రులే అని ద్రౌపది స్వర్గ లక్ష్మి అని చూపించి దుష్టసంహారం కోసం అవతరించిన’’ దుర్గా దేవి’’యే ద్రౌపది అని తెలియ జెప్పి ,రాజును ఒప్పించి పాండవులు అయిదుగురకు ద్రౌపదినిచ్చి దగ్గరుండి వివాహం జరిపించాడు .ఇదే భారతం లోని సూక్ష్మాతి సూక్ష్మ ధర్మం .

జూదం లో ఓడిపోయిన పాండవులున్న కురు సభలోకి దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకు వచ్చాడు అక్కడున్న భీష్మ ద్రోణాది పెద్దలన్దర్నీ నిలదీసింది ద్రౌపది అది న్యాయం ధర్మమేనా అని .అప్పుడు భీష్మ పితామహుడు ‘’ధర్మ నిర్నయానికోసంనేనిప్పుడు స్పష్టంగా చెప్ప కూడదు –‘’సూక్ష్మత్వాద్గహనత్వాచ  కార్యస్యాన్యచ గౌరవాత్ ‘’అన్నాడు .తెలుగు భారతం లో భీష్ముడు కురుసభలో మాట్లాడినట్లు కనిపించదు .సంస్కృత భారతం లో రెండు సార్లు పితామహుడు మాట్లాడినట్లు ఉన్నది .మరోసూక్ష్మ ధర్మాన్ని గురించి తెలుసుకొందాం .అర్జునుడి గా౦డీవాన్ని ఇతరులకు ఇవ్వమని అతనితో ఎవరైనా అంటే వాడి గొంతుక కోస్తానని కిరీటి ప్రతిజ్న చేశాడు .యుద్ధం లో ధర్మ రాజే ఈమాట అన్నాడు . అన్నను చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఫల్గుణుడు .అన్నను చంపటం హింస శపథం నేరవేర్చుకోక పోవటం ఆసత్య దోషం .ఈ రెండు ధర్మ సంకటాల మధ్యా పాండవ మధ్యముడు ఇరుక్కుపోయాడు .అపాయాలకు చక్రం అడ్డం వేసే కృష్ణుడు ఉపాయంగా ధర్మ రాజును పార్దునితో తిట్టించి ,అనృత దోషాన్నుంచి ,భ్రాత్రు హింస నుంచి కాపాడాడు .సత్య వ్రత పాలన కంటే అహింసా వ్రత పాలన శ్రేష్టం ఇదే ధర్మ సూక్ష్మం .ఇది శాస్త్ర విషయం. వ్యక్తి హృదయం  కాదు .శాస్త్ర హృదయం తెలిసిన శ్రీ కృష్ణుడు చేసిన మహత్తర కార్యం .భారత యుద్ధం పాండవుల రాజ ధర్మం పైనే ఆధార పడింది కాని  రాజ్య  కాంక్ష మీద కాదు అంటారు శ్రీ నండూరు వారు .

భారతం లో వ్యాసభగవానుడు చెప్పని రాజ నీతి లేదు .నీతి వేరు ధర్మం వేరు . నీతిఅనే పదం ధర్మం అనే అర్ధాన్ని ఇవ్వదు .ధర్మం అంటే శాసనం .భారతం లో దుర్మార్గుల నీతికూడా ఉంది .ధర్మాపన్న నీతిని బోధించింది .భారతం లో ఉన్న కఠోర నీతియే ఈ నాటి దుండగుల నీతి .విదురనీతి ధర్మ విశిష్టమైన నీతి .ధర్మ విశిష్టమైన నీతిని పాండవులు అనుసరించారు .అర్ధ పురుషార్ధ ప్రధానమైన నీతిని దుర్యోధనాదులు అనుసరించారు .ఈ రెండూ అనాదివే .వ్యాసుడు భారతం లో కౌరవ పాండవులను రెండు వృక్షాలతో పోల్చి చెప్పాడు ‘’దుర్యోధనో మన్యుమయో మహా ద్రుమః ‘’అంటే కౌరవ వృక్షానికి బీజం తన బుద్ధి మాత్రమే ప్రధానం గా చేసుకొన్న  ద్రుత రాస్ట్రుడు అన్నాడు మరి ధర్మ రాజు  సంగతి –‘’ధర్మ మయో మహాద్రుమః ‘’అన్నాడు .అనగా ‘’యుధిష్టిరుడు అనే ధర్మ వృక్షానికి వేదాలు ,శ్రీ కృష్ణుడు బీజాలు ‘’అన్నాడు .నన్నయ భట్టు ఈ శ్లోకాన్ని అనువదించాడు .వేద శాస్త్ర విధులు తాత్కాలికాలే కాని సార్వకాలికాలు గా ఆచరణ యోగ్యం కాదని భావించి నన్నయ్య వీటిని తెనిగించలేదు .తిక్కన పూర్వ ,ఉత్తర మీమాంసా శాస్త్రాలను రెండిటినీ భారతం లో చక్కగా వ్యాఖ్యానించాడు .’’మన రాజకీయ నాయకులు –(వీరికే నండూరు వారు’’ దేశోద్ధారకులు ‘’అని ముద్దుపేరు పెట్టారు )మహా భారత శాంతి పర్వాన్ని చదివి ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకొని ప్రజా పాలన చేయాలి ‘’అనిఆర్ష ధర్మ ప్రబోధక శ్రీ నండూరు  సుబ్రహ్మణ్య శర్మ గారు హితవు చెప్పారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

రామాయణ  రామణీయకం

విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల  వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ  రామణీయక  విశేషాలను  తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది  .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన మేర్పడింది .దండీ కాళిదాసాదులవలన బహువచనమేర్పడింది . వాల్మీకి ‘’వేదార్ధ ఉప బృంహితార్ధం ‘’అంటే  జగద్ధిత కాంక్షతోశ్రీమద్రామాయణం రచించాడు .ఆ తర్వాత అనేకమందికవులు రామాయణం రాశారు. ఎవరి కోరిక వారిది .అనర్ఘ రాఘవ కర్త బాల మురారి శ్రీరాముని గుణ గణాలు మరో నాయకుని లో లేనందువలన రాశానన్నాడు –‘’యది  క్షుణ్ణం పూర్వైః ఇతి జహతి రామస్య భరితం –గుణై రేతావద్భిః జగతి పునరన్యోజయతికః ‘’.అలాగే జయ దేవ మహాకవి ప్రసన్న యాదవ నాటకం లో ‘’రాముడిని వదలి వేరే నాయకుడి ని ఎలా ఎంచుకోను ?తెలుగులో కంకంటి పాపరాజ కవి –

‘’మానుగకర్మ భూమి పయి మానవ జన్మము నెత్తి నిర్మల –జ్ఞానము గాంచి మానవుడు చారుకవిత్వము నేర్చి ‘’జానకీ

జాని ‘’కదల్ రచింపక అసత్ కద లెన్నోరచించే నేనియున్ –వాని కవిత్వ మేటికి ,వాని వివేక మహత్వ మేటికిన్ ?’’అని ప్రశ్నించాడు .భోజరాజు ‘’చంపూ రామాయణం ‘’లో గంగను భూమి పైకి భగీరధుడు తెచ్చాడని ,అది భగీరధ గంగ అని పితృ దేవతలకు గంగోదకం తో తర్పణం చేయని వాడు ఉంటాడా ?అన్నాడు .అంటే అది జాతీయ సంపద అయింది అలాగే రామాయణం కూడా .వ్యవహార నేతృత్వం రామాయణం లోనే ఉంది .’’ఒక పిల్లాడిని రామాయణం నేర్పి అడవి లో వదిలిపెడితే ,20ఏళ్ళకు సామాన్య నాగారికుడికంటే ఎంతో గొప్పగా వ్యవహరిస్తాడు ‘’అని ఒక పాశ్చాత్య పండితుడు అన్నాడు ..రామాయణం గొప్ప తనానికి సుందర కాండ ఒక కారణం .’’సుం’’అంటే శోకాన్ని ‘’దర’’అంటే ఖండించేవాడు అంటే హనుమంతుడు .సీత శోకాన్ని శ్రీరాముని శోకాన్ని సుందర కాండలో తీర్చిన వాడు శ్రీ ఆంజనేయ స్వామి .పద్మ పురాణం లో శివుడు పార్వతికి హనుమ వైభవాన్ని బోధిస్తూ ‘’మదంశజో,మహాభాగో ,మహా భుజ పరాక్రమః సుభాగః సున్దరః శ్రీమాన్ భక్త రక్షణ పరాయణః’’అని కీర్తించాడు .హనుమ భుజ వివేక పరాక్రమ వర్ణనలు ఉండటం వలన సుందరమైనది .అందువల్ల ఈకాండ చేత రామాయణ ప్రాశస్త్యం హెచ్చింది  అన్నారు .

తనతో పాటు శ్రీరాముని యాగ రక్షణార్ధం తీసుకు వెళ్లి ఆయనను ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’అనే శ్లోకం తో నిద్ర లేపాడు ఇదే  సాహిత్యలోకం  లో మొదటి సుప్రభాతంగా రికార్డ్ సృష్టించింది .సీతాపహరణం లేకపోతె రామాయణం ద్రౌపదీ వస్త్రాపహరణం లేక పొతే భారతం లేవు .రామాయణం నాయక ,నాయిక ,ప్రతి నాయక అంటే 3 పేర్లతో పిలవబడటం విశేషం . ‘’కావ్యం’’ రామాయణం’’ క్రుత్స్హ్నం’’ సీతాయాశ్చరితం’’ మహాత్ –‘’పౌలస్త్య వధం’’ ‘’ .వాల్మీకి సామాన్య కవికాడు .దర్శన వర్ణనం ఉన్న కవి .తమసానది ని వర్ణిస్తూ వాల్మీకి –‘’ఆకర్దమ మిదం తీర్ధం భరద్వాజ నిశామయి-రమణీయం ప్రసన్నాంబుసన్మనుష్య మనో యధా’’-సత్పురుషుని మనసులాగా తమసానది ఉన్నది .’’

‘’ మానిషాద ప్రతిస్టాంత్వమగమః శాశ్వతీస్సమాః-యత్ క్రౌంచ మిధునాదేక మవధీః కామ మోహితం ‘’అనే భారతీయ సాహిత్యం లో వాల్మీకినోట వెలువడిన  ప్రధమ అనుష్టుప్ శ్లోకం లో’’ సప్త స్వరాలు ‘’నిక్షేపి౦చ బడ్డాయి అని విశ్లేషకులు తేల్చారు .అందుకే ‘’పాఠయే చ మధురం ‘’అన్నారు .గురువు విశ్వామిత్రుని గంగావతరణం కధ చెప్పమని రాముడు కోరితే రుషి కుమారస్వామి జననం చెప్పాడు .ఇదే గడసరి కధాకధనం అంటాడు విశ్వనాధ .తను రాక్షస సంహారం యాగ రక్షణా చేసుకోగాలిగినా విశ్వామిత్రుడు  రాముని  తెచ్చుకొన్నాడు. ఆయనద్వారా లోకానికి గురు శుశ్రూష ఎలా చేయాలో బోధించాడు .శ్రీ కృష్ణ బలరాములు సాందీపని గురువు వద్ద విద్య నేర్చారు .నిజంగా వాళ్లకు ఆ అవసరం లేదు అయినా లోకానికి చాటటానికి చదివారు .అదీ పరమార్ధం .

రాముడిని తనతో పంపమని అడగటానికి దశరధుని దగ్గరకు విశ్వామిత్రుడు వచ్చాడు .ఆయనను వర్ణిస్తూ దశరధుని చేత విశ్వనాధ ‘’మీరు రావటం ఊసర క్షేత్రానికి వర్షం రావటం ,పుట్టు పేదకు కొండలో నిధి అందినట్లు ‘’లుప్త పిండమై లొచ్చున వడ్డ వంగడములో నిసువొక్కటి చొచ్చుటే ప్రభూ ‘’అంటాడు .ఇంతగొప్పగా చెప్పిన వారు తెలుగు కవిత్వం లో లేరు అంటారు అవధానిగారు .దీన్ని కొనసాగిస్తూ

‘’నీవై వచ్చుట మా గృహంబులు త్రివేణీ మంగళ స్నాన పు –ణ్యావిర్భావములయ్యె,మా యెడల గాయత్రీ మహాదేవి ,శ్రీ

సావిత్ర్యాక్రుతి ద్రష్ట వేదముగ సాక్షాత్కర మిప్పించె ,ఏ –లా వేదంబులు నాల్గు నాలుగు మొగాల౦ బాడినట్లయ్యేడిన్’’అని తన జీవితానుభవాన్ని రంగ రించి రాశాడు విశ్వనాధ .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలున్నాయి .ఒక అక్షరానికి వెయ్యి చొప్పున రామాయణం లో 24వేలశ్లోకాలున్నాయి .రామాయణం లో ఏ పాత్ర యెంత వరకో అంతవరకే ఉంటుంది .సీతా స్వయం వరం తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ కనిపించడు.మహర్షి రాముడికి అస్త్ర శస్త్రాలివ్వటం ,తాటక సంహారం ,మారీచ సుబాహు వధ ,అహల్యా శాప విమోచనం సీతాకల్యాణం అనే అయిదు పనులు చేసి నిష్క్రమించాడు .’’గురు దక్షిణనిమ్ము తాటకాభల్లము నాకు ‘’అని శిష్యుడిని కోరితేనే రాముడు స్త్రీ అయిన తాటక సంహారం చేశాడు .అహల్యాశ్రమం ‘’హరి విడిచిన వైకుంఠం’’లాగా అనిపించిందట .అహల్యకు రామ పాదం సోకగానే ప్రాణం ఎలా వచ్చిందో విశ్వనాధ నభూతో గా చెప్పాడు .అదే విశ్వనాధ ఉపజ్న –

‘’ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే ,పాషాణ మొకటికి స్పర్శ వచ్చే –ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచే

ప్రభు మేని నెత్తావి పరిమళించిన చోట ఆశ్మంబు ఘ్రాణే౦ద్రియంబు నొందే-ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కాన వచ్చినంతనే కనులు వచ్చే

అ ప్రభుండు వచ్చి ,ఆతిధ్యమును స్వీక – రించినంత ఉపల హృదయ వాది

ఉపనిషద్విదాన మొలికి శ్రీరామ భ-ద్రాభి రామ మూర్తి యగుచు పొలిచె ‘’

ఇంతటి అద్భుత కల్పన చేసి అహల్యకు పంచేంద్రియత్నాన్ని కల్పించిన వారెవ్వరూ లేరు .

కల్ప వృక్షం లో పరశురామ గర్వ భంగాన్ని ముందే చేయించాడు విశ్వనాధ .శివ ధనుర్భంగ ఘట్టం లో విశ్వనాధ

‘’అతని దృష్టికి జానకి ఆగలేదు –అతని క్రుస్టికి శివధనుస్సాగ లేదు

సీత పూజడ వెన్నుగ శిరసు వంచే –చెరకు గడవోలె నడిమికి విరిగే ధనువు ‘’

ఇంతటి ఉదాత్త వర్ణన చేసిన కవీశ్వరులు కనిపించరు .

శ్రీరాముడిని 4ఘట్టాలలో వాల్మీకి భగ వంతునిగా   చాటి చెప్పాడు అంటారు ఆచార్య దివాకర్ల .శబరికి మోక్షం ,జటాయువు మోక్షం ,గుహునితో సంభాషణం ,సుమిత్ర లక్ష్మణునికి చేసిన ఉపదేశం ఘట్టాలలో రాముడు సాక్షాత్తు పరమేశ్వరుడే నని చెప్పాడు .సుమిత్ర ,కొడుకు లక్ష్మణునితో ‘’రామం దశరధం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం-అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యదా సుఖం ‘’అని దిశా నిర్దేశనం చేస్తుంది అరణ్య వాసానికి పంపుతూ .ఈ శ్లోకం లో అనేకార్ధాలు చెప్పారు పండితులు .దశ అంటే పక్షి –దశరధుడు అంటే పక్షి వాహనంగా ఉన్నవాడు శ్రీ మహా విష్ణువు .ఆనారాయణుడే ఈ శ్రీ రాముడు .రాముడే దశరధ స్థానానికి అర్హుడని –మాం అంటే లక్ష్మీ దేవిగా సీతను భావించు అని భావం .తాను  మాత్రం’’ I shall become the daughter of my father ‘’అని సుమిత్రమనో నిశ్చయం .తనకు ఒక ప్రత్యేకత లేదని అర్ధం .అడవిని స్వర్గం గా చూడు అని ఉపదేశించింది .’’దేవానాం పూరయోధ్యా ‘’అని అరుణం భగవత్తత్వాన్ని చెప్పింది .

శబరి ‘’తుట్ట తుద దాక ఎండిన చెట్టు కొమ్మ –శిఖరంబున యందు పుష్పించినట్లు ‘’గా కనిపించింది రాముడికి .ఆమె రామునితో ‘’ఈ దేశంబున చెట్టు చెట్టు గృహమోయి నాకు ‘’అని చెప్పింది .’’స్నానాదుల్ నిత్య పవిత్ర మూర్తికిని మర్యాదా మహా౦ బోదికిన్’’అని భక్త శబరీ అంటే రాముడు ‘’అవాక్కయ్యాడట ‘’.ఎందుకు ఈ ముసలి వయసులో ఇంతకష్టపడి పూలు ,పళ్ళూ  తెచ్చావమ్మా అని రాముడు అంటే –‘’నేను పూలు పళ్ళు తేలేదు –లీలామనోజ రాలేదు నేను ‘’అందట .’’చేతులున్నాయికనుక పూలు ,చెట్లున్నాయికనుక పళ్ళు ,శరీరం ఉంది కనుక నడిచి వచ్చాను ‘’అంది శబరి .ఫైనల్ టచ్ ఇస్తూ ‘’చిత్తముండుట ఊహ చేసితిని స్వామి ‘’అంది.

శబరితో రాముడు  సరదాగా చలాకీగా మాట్లాడితే ఆమె తగిన సమాధానాలే చెప్పింది విశ్వనాధ శబరీ .’’ఏమిటమ్మా నీ జుట్టు ముగ్గు బుట్టయ్యంది.’’అన్నాడు .దానికి శబరీ ‘’ప్రభు నీ ఆత్మ వాకిట రంగ వల్లి దిద్దుటకు ఇంత పండినది ‘’అన్నది .’’ఎంతో తపించి నీ ఆయువంత ఏర్చి ఇట్లు ఏకైతివి ?’’అని గడుసుగా అడిగితె ‘’ప్రభువ స్నేహంబు (నెయ్యి )చేత,ఆర్ద్రంబు చేసి (తడిపి )ఇంత వత్తిగనన్ను వెల్గి౦చవే ‘’అని బదులిచ్చింది .పరవశించిన ‘’రామ సామి  ‘’శబరికి మోక్షం ప్రసాదించాడు .’’తవ ప్రసాదాత్ గచ్చామి ‘’అంటూ శబరీ పరమపదం చేరింది .అలాగే జటాయువుకూ ‘’గచ్చ లోకానుత్తమన్ ‘’అని భగవంతునిగా దర్శనం ప్రసాదించాడు .వాల్మీకి వర్ణనారీతి నిరుపమానం .’’అహో రాగ వతీ సంధ్యా జాహితి స్వయ మంబరం ‘’శ్లోకం లో నాయకా నాయికల వర్ణనను సంధ్యా వర్ణనలో కలిపేశాడు .ఇలా ఎన్నైనా చెప్పవచ్చు .అందుకే గిరులు తరులు ఉన్నంత వరకు రామాయణ కద ఉంటుంది అంటాడు మహర్షికవి వాల్మీకి .అందుకే విశ్వనాధ ‘’ఎన్ని జన్మలైనా వాల్మీకి ఋణం మనం తీర్చుకోలేము ‘’అన్నాడు .వాల్మీకి ఆది కవి .నాటికీ నేటికీ ఆయన్ను మించినవారు లేనేలేరు అన్నారు ఆచార్య దివాకర్ల వేంకటావాధాని గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ?

అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట లేక పోయాయి .భారతీయుడు తనది ఫలానా రాష్ట్రం అని గర్వ పడడు.ఏ శుభకార్యం చేసినా ఆ ఊరిలోని నీటినే కలశం లో పోసి దేశం లోని పవిత్ర నదులన్నీ ఆ నీటిలోనే ఉన్నాయని ఆవాహన చేసి గర్విస్తాడు .జంబూద్వీపే భారత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ లేక ఉత్తర దిగ్భాగే శ్రీశైలానికి లేక హిమవత్పర్వతానికి ఏ దిక్కున ఉన్నాడో ,ఏ పవిత్ర నదీమ తల్లుల మధ్య ఉన్నాడో చెప్పుకొని పులకించి పోతాడు .తన సాంస్కృతిక జీవనం లో రాజకీయానికి స్థానం కలిపించడు.అదీ అనాదిగా వస్తున్నా మన సంప్రదాయం .

భారతీయులను అందర్నీ సాంస్కృతిక పరంగా ఏకం చేసినవి పూర్వ భారత సాహిత్యం .వ్యాస వాల్మీకి కాళిదాసాదికవులు .వీరు ఈ దేశ ప్రజలకు ఆలోచనా ధోరణిని ,జీవిత విధానాన్నీ ,జీవిత లక్ష్యాలను ప్రసాదించారు .ఆనాడు వారు సంస్కృతం లో రాస్తే వాటిని చదివి స్పూర్తి పొందారు జనం .అనువాదాలూ వారికి చేరువయ్యాయి .అ సాహిత్యం కావ్యాలు నాటకాలు జానపదాలు కధలూ గాధలుగా విస్తరిల్లింది కావ్యాల పేర్లతో నగరాలు ,గ్రామాలు  బిరుదులూ వెలిశాయి.కనుక ఆర్ష సంప్రదాయానికి ఎత్తిన వైజయ౦తిక లు ఈ మహా కావ్యాలు . భారత దేశ భౌగోళిక సౌందర్యం ,భారతీయ జీవిత వృత్తం  ధర్మాభిరతి ,లౌకిక పారలౌకిక జీవితాదర్శాలు ,జీవిత సాఫల్యానికి అవసరమయే శాస్త్ర పరిజ్ఞానం ,రాజనీతి,అర్ధ నీతి మొదలైన వెన్నో మన ఇతిహాస పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి .ఇప్పటికీ యావత్ ప్రపంచానికీ మానవత్వపు విలువలను ఇవే అందజేస్తున్నాయి .అన్ని వర్ణాల, వర్గాల వారూ వీటిని చదివే ప్రేరణ పొందుతున్నారు .అందుకే భారాతీయులందరికి ఏ ప్రాంతీయ భాషాకవి తమ కవి కాలేకపోయాడు .సంస్కృతంలో పరిచయం ఉన్నా లేకున్నా అందరికి వ్యాస వాల్మీక ,కాళిదాస భవ భూతుల వంటి వారే కవులు .ఇదొక అనిర్వచనీయ భారతీయ సంస్కృతీ రహస్యం అంటారు ఇరివెంటి వారు .

భారత స్వాతంత్ర్య సమార యోధుడు మేధావి ,మహా మనీషి ,అపర చాణక్యుడు రాజాజీ భారతీయ ఆత్మను అర్ధం చేసుకోవాలంటే రామాయణ భారతాలను మనం చదివి తీరాల్సిందే అని నిర్మొహమాటం గా స్పష్టంగా చెప్పాడు .దార్శనికుడు రాజకీయ వేత్త పండిత నెహ్రూ రామాయణ భారతాలు భారతీయ సంప్రదాయ విజ్ఞాన సర్వస్వాలని ,భారతీయులను ఏక సూత్రం తో కలిపే సందేశ కావ్యాలని ,భారతీయ తత్వ చింతనకు బహుముఖీన విజ్ఞానానికి  ప్రతీకలు అన్నాడు .మహాత్ములందరూ వీటి ప్రేరణతో ఉద్దీప్తులైనవారే నని మనం మరచిపోరాదు .జాతి పిత మహాత్మా గాంధీజీ ‘’గీత నా తల్లి ‘’అన్నాడు భగవద్గీతపై తనకున్న అపార నమ్మకం తో .

ఈ సాహిత్యం లోని కధలూ ఉపాఖ్యానాలు నేటి మన పత్రికలలో పతాక శీర్షికలకు మార్గ దర్శనం చేస్తున్నాయి .సామెతలుగా ,జాతీయాలుగా ఉపయోగ పడుతున్నాయి .అందులో కొన్ని –పరశురామ ప్రీతి ,కబంధ హస్తాలు ,లక్ష్మణ రేఖ ,రావణ కాష్టం ,పుష్పక విమానం వంటివి ఎన్నో ఎన్నెన్నో .అయితే ఇప్పటి యాంత్రిక రాజకీయ జీవితం లో సంప్రదాయం క్రమంగా కనుమరుగై పోతోంది .ప్రపంచం లో భారత్ కు ఉన్న విశిష్ట స్థానం ఇప్పుడు లేదు ..పశువులోని మానవుడు వృద్ధి చెందాడని పాశ్చాత్య దేశాలు నమ్మితే మనం మాత్రం మానవుడు దైవాంశ సంభూతుడు అని ఎలుగెత్తి చాటాం, చాటుతున్నాం, చాటుతాం .ఈ విశిష్ట ఆలోచనా ఫణితి మనం కాపాడుకొంటే ప్రపంచ దేశాలు మనకే అగ్రాసనాదిపత్యమిస్తాయి .ప్రాచీన సాహిత్యం చదవటం అంటే తిరోగమనం అనుకోటం పెద్ద పొరబాటు .సార్వకాలీన సార్వ జనీనమైన విలువల తో బతకటాన్ని నేర్చుకోవటం అని గ్రహించాలి.అదే అందరి ఆదర్శం అయితే అంతా ఆర్యావర్తమే అవుతుంది .

పురాణ ఇతిహాసాలలో మన గత చరిత్ర  నిన్నటి అనుభవాలు దాగి ఉన్నాయి .నిన్నటి కన్నీరు తో బాటు పన్నీరూ ఉందని గుర్తించాలి .జీవితాన్ని రసాత్మకం గా మార్చుకొనే ప్రక్రియలున్నాయి .పాశవికత నుండి పరమోన్నత స్థాయికి చేరుకొనే విధానాలున్నాయి .ఆ సాహిత్యం దైవ భక్తికీ ,ధర్మానురక్తికీ ,ధర్మానుసరణకూ ప్రమాణంగా నిలిచింది .వీటిని చదవని వాడు ఏదీ చదవని వాడి కిందే లెక్క .ఇవికాక క్రీ శ .ఒకటవ శతాబ్ది లో వచ్చిన ‘’బృహత్కధ ‘’లేక కదా సరిత్సాగరం ,రెండవ శతాబ్దం లో శ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల ‘’కాశీ మజిలీ కధలు ‘’ కూడా మానవ మస్తిష్క వికాసానికి తోడ్పడేవే .అలాగే బసవ పురాణం లో మనవ సంబంధాలున్నాయి. ఇవన్నీ చదివి అర్ధం చేసుకొని అన్వయించుకొని జీవిస్తే వేరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వందలూ వేలూ పోసి కొని చదవక్కరలేదు .పురాణ ఇతహాస వాగ్మయం తో మన పరిచయం భారతీయత లక్షణం .,జాతీయత లక్షణం విశిష్ట వ్యక్తిత్వ లక్షణం అంటారుమహా వక్త ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమీ కార్య దర్శి ,యువ భారతి స్థాపకులు ,ఉస్మానియా విశ్వ విద్యాలయ స్నాతకోత్తర కేంద్ర తెలుగు శాఖ రీడర్  డా .ఇరివెంటి కృష్ణ మూర్తి- విజయవాడ ‘’రసభారతి’’వారు ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6

కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం )

91వ శ్లోకం లో దీక్షితులు –

‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ  గణైః దివిషత్ గుణైశ్చ

అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’

వరదా !నీ ముఖం లో పరస్పర విరుద్ధ గుణాలున్న చంద్రుడు ,కమలం ఒకే చోట కలసి ఉన్నట్లు ఉంటుంది .కమలం లో కేవలం సుగంధం ఉంటుంది .చంద్రునిలో కాంతి మాత్రమే ఉంటుంది .కాని నీ మోములో కాంతి సుగంధం రెండూ కలిసి ఉంటాయి. ఇది పరమాశ్చర్య కర విషయం .కమలం పగలే వికసిస్తే చంద్రుడు రాత్రిమాత్రమే ప్రకాశిస్తాడు .కానీ స్వామీ నువ్వు మాత్రం రాత్రీ ,పగలు అనే తేడా లేకుండా ప్రకాశిస్తావు .కమలాన్ని ద్విజులు అంటే పక్షులే కోరుకొంటాయి .కాని నిన్ను ద్విజులు అంటే బ్రాహ్మణులు దేవతలు కూడా కోరుకొంటారు .

అ౦కాది రూఢసహజశ్రీ అంటే –అధిరోహించిన లక్ష్మి కలది అని అర్ధం .లక్ష్మి సహోదరుడే చంద్రుడు .కాని నీముఖం ఎలాంటి గుర్తులతో గుర్తి౦చాల్సిన  అవసరమే లేదు .దానికి సహజ కాంతి ఉంది .

మరో శ్లోకం లో వరద రాజ స్వామి నిస్శ్వాసం నుండి వేద విద్య వెలువడిందని ఆయన ముఖార వింద౦  లో ఉన్న సరస్వతి దాన్ని గ్రహిస్తోందనీ అంటాడు .విద్యారణ్య స్వామి వేద భాష్య భూమిక   లో ‘’యశ్య నిఃశ్వసితం వేదాః,అస్య మహతో భూతస్యనిఃశ్వసితమే తధ్యద్రుగ్వేదోయజుర్వేదః సామవేదః ‘’అనే మంత్రాన్ని పేర్కొన్నారు .

102వ శ్లోకం లో –

‘’పద్మానురాగ జుషి లోహిత శుక్ల కృష్ణాం—ఆసేదుషి ప్రకృతి మాద్రుతమీనరూపే

శ్రుత్యంత భాసిని మదావల శైల నాద –త్వల్లోచనే త్వయి చ భాతి నమే విశేషః ‘’

‘’హే హస్తి చలవాసా వరదా !ఎర్రని ,తెల్లని ,నల్లని గుణాలతో కూడిన ప్రకృతిని మత్స్యాకారం తో కర్ణాంతం వరకు వ్యాపించిన నీ నేత్రాలలో స్వీకరించావు .అయితే నీ నేత్రాలకూ నీకు భేదమే లేదు. నేత్రాలు త్రివర్ణాత్మకాలు అంటే తెలుపు ,ఎరుపు జీర ,నలుపు రంగులతో ఉంటాయి .సాంఖ్యులు చెప్పిన ప్రకృతి,సత్వ ,రాజస్తమస్సులతో అంటే మూడు రంగులు లేక గుణాలతో ఉంటుంది .సాంఖ్యుల ప్రకృతికి వేదాంతుల మాయ కు భేదమే లేదు ..ఈవిషయాన్ని ‘’అజామేకాం లోహిత శుక్ల క్రిష్ణా౦ ‘’మంత్రమే వివరించింది .అలాంటి ప్రకృతే నిన్ను ఆశ్రయించుకొని ఉందికదా ,నేత్రాలూ నీలోనే ఉన్నాయి ,ప్రకృతి లేక మాయ నిన్నే ఆశ్రయించి ఉంటుంది .ఆప్రరుతి లక్షణాలు నీ కళ్ళల్లో ఉన్నాయి .శ్రుత్యంతం అంటే వేదాంతం .మీన రూపం అంటే మత్స్యావ తారం .

తరువాత శ్లోకం  లో ‘ప్రజాపతి నిన్ను దర్శించి ముక్తుడయ్యాడు.అందుకని మరో సృష్టి కర్త అవసరమయ్యాడు .అతన్ని సృష్టించే శ్రమ లో ఉన్న నీ ఫాల భాగం పై స్వేద జలకణాలా అన్నట్లు కిరీటం దగ్గరున్న ముత్యాలు శోభిస్తున్నాయి ‘’అన్నాడు .

అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ప్రమోషన్ ప్రజాపతి పదవి .ఉన్న ప్రజాపతి మోక్షం పొందాడు వరద రాజ దర్శనం తో .ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంది .ఆపదవిని భర్తీచేసేపనిలో పడ్డాడు .అందుకే చెమటలు కారుస్తున్నాడు .భగవంతుని లలాట స్వేద జలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని ‘’మహోపనిషత్ ‘’తెలియ జేసింది –

‘’అధ పునరేవ నారాయణః సోన్యత్కామో మనసా –ధ్యాయత తస్య ద్యానాంతస్థస్య లలాటాత్ స్వేదోఃపతత్-తా ఇమా ఆపస్తాభ్యః సు తేజో హిరణ్య మండల మభవత్ –తత బ్రహ్మా చతుర్ముఖో జాయత ‘’

ఇంతకీ అసలు చెప్పిందేమిటి ?వరదుని కిరీటం లోని ముత్యాలు స్వేద బి౦దువులులాగా ఉన్నాయి అని చెప్పటమే

చివరిది అయిన 105వశ్లోకం లో అప్పయ్య దీక్షితార్ వరదుని అమృత రూపం నిరంతరం స్పురించాలని  కోరుకున్నాడు

‘’ఆపాద మాచికుర భార మశేష మంగ –మానంద బృంద లసితం సద్రుశామ సీమం

అ౦తర్మమ స్పురంతు సంతత మంతరాత్మన్-అంభోజ లోచన తవ శ్రిత హస్తి శైలం ‘’.

ఓ అంతరాత్మా !అ౦ భోజలోచనా !జ్ఞాన వంతులు కడుపార జుర్రే నఖ శిఖ పర్యంతమైన నీ అమృత స్వరూపం ,నిరంతరం న హృదయం లో స్పురించుగాక .

ఇతి శ్రీమత్ భారద్వాజ కుల జలధి కౌస్తుభ –శ్రీమత్ అద్వైత విద్యాచార్య శ్రీ విశ్వజిత్ యాజి శ్రీ రంగ రాజాధ్వరి వర సూనునా –శ్రీమదప్పయ దీక్షితేన కృతం వరజ రాజ స్తవ వివరణం సంపూర్ణం .’’

అప్పయ దీక్షితుల చిరు పరిచయం –

‘’ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ ప్రాభాకర పరిశ్రమః –తత్రాపి యాజుషీ శాఖా నల్పస్య తపసః ఫలం ‘’

అని తెలుగు భాషను మెచ్చుకొన్న మహా పండితుడు  మహా విద్వాంసుడు అప్పయ దీక్షితులు తమిళనాడు లోని దక్షిణ ఆర్కాటు జిల్లా అంటే తుండీర మండలం లోని ‘’అడియ పాళెం’’లో జన్మించాడు .ఈయన పితామహుడు అచ్చాన్ లేక ఆచార్య దీక్షితులు ఒక సారి శ్రీ కృష్ణ దేవరాయలు భార్యా సమేతంగా శ్రీ కంచి వరద రాజ స్వామి దర్శనానికి  వస్తే రాణిపై ఈయన ఒక శ్లోకాన్ని ఆశువుగా చెప్పాడు .సంతోషించిన రాయలు ఆయనను ‘’వక్షస్థలాలా చార్యుడు’’అనే బిరుదు నిచ్చాడని ‘’చిత్ర మీమాంస ‘’లో మనవడు అప్పయ దీక్షితులు చెప్పాడు .ఇంతకీ తాత గారి శ్లోకం  దాని పరమార్దం ఏమిటి ?

‘కా౦చిత్ కాంచన  గౌరా౦గీం వీక్ష్య సాక్షాదివశ్రియం –వరద స్సంశయా పన్నో వక్షః స్థల మవైక్షత ‘’ అంటే

‘’లక్ష్మీ దేవిలాగా ఉన్న అనంత సౌందర్య రాశిని అయిన ఈమెను చూసి తన వక్షస్థలం పై లక్ష్మీదేవి ఉందొ లేదో అని కంగారు పడి వరదయ్య తన వక్షస్థలాన్ని తడుముకొన్నాడట ‘’.ఈ శ్లోకం తోనే తాత అచ్చాన్ దీక్షితులు ఒక్కసారిగా ‘’వక్షస్థలాచార్యుడు ‘’అయిపోయాడు .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదోకని ఒక శ్లోకం ఈయన పేరునే మార్చేసి రికార్డ్ సృష్టించింది .

అప్పయ తాత గారికి ఇద్దరు భార్యలని ఒకామె వైష్ణవ సాంప్రదాయానికి రెండవ ఆమె శైవ సాంప్రదాయానికి చెందినదని తెలుస్తోంది .వైష్ణవ సాంప్రదాయపు ఆమె పేరు’’ తోతరాంబ’’,అని ఆమెకు నలుగురు కొడుకులని ,పెద్ద కొడుకు రంగ రాజాధ్వరి అని అంటారు .ఈయన తండ్రిలాగానే యాగాలు చేశాడు .అందులో ‘’విశ్వజిద్యాగం ‘’చేసి కీర్తి పొందాడు ‘’అద్వైత విద్యా ముకురం ‘’అనే గ్రంధాన్ని ,’’వివరణ దర్పణం ‘’మొదలైన గ్రంధాలను రాసిన మహా మనీషి  ఈయన జ్యేష్ట కుమారుడే మన అప్పయ దీక్షితులు .భారద్వాజ గోత్రీకుడు ,’’శ్రీ కంఠమత స్థాపనా చార్య ‘’,చతురధిక ప్రబంధశత నిర్వాహకః ‘’ ‘’,మహా వ్రత యాజీ ‘’బిరుదులు  పొందాడు .కాలం 16వ శతాబ్దం లో చాలాభాగం ,17వ శతాబ్దిలో కొంత భాగం లో జీవించాడు .మొత్తం మీద 104గ్రంధాలు రాశాడు .వాటిపేర్లను తానే పట్టికగా ఇచ్చాడు వాటిలో చాలా వాటికి వ్యాఖ్యానాలూ తానే రాశాడు .విద్యా రణ్య స్వామి తర్వాత అంతటి పక్ష పాత రహిత బుద్ధి ఉన్న మహా విద్వాంసుడు దీక్షితులు ..’’సర్వ దర్శన సారం ‘’ఆయన సర్వమత సమదృష్టికి గొప్ప ఉదాహరణ .చిన బొమ్మనాయక రాజు అప్పయ దీక్షితులకు స్వర్ణాభి షేకం చేశాడు .

ఆధారం –అప్పయ దీక్షిత కృత వరద రాజ స్తవం –వ్యాఖ్యానం –శ్రీ దేవర కొండ శేషగిరి రావు .

వరద రాజ స్తోత్రం ముఖ చిత్రం జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ ప్రియులకు,పద్యం వినాలన్న కుతూహలమున్న శ్రోతలకు మంచి అవకాశం. – “భువనవిజయం”

IMG_0532 IMG_0530

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5

కంచి వరద రాజ దర్శనం -4

‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం

తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’

వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ  వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను ఆశ్రయించి వైజయంతిమాల నీ సారూప్యాన్ని పొందు తోంది .అన్నిప్రాణాలలో నువ్వు అంతర్యామివి .అన్ని వర్ణాల వారూ నిన్ను ఆశ్రయిస్తారు .అన్ని పరిమళాలు నీలోనే ఉన్నాయి .

వైజయంతీ మాల పక్షం లో ఆలోచిస్తే అది పంచ భూతాల రూపం లో ఉంది .

‘’పంచ రూపా తు యా మాలా వైజయంతీ గడాభ్రుతః –సా భూత సంఘాత భూతా మాలా చ వై ద్విజ ‘’అని ఒక లోక ప్రమాణం ఉంది .అన్ని రంగులు అందులోనే ఉంటాయి .అది పంచ భూతాత్మికం .అందులో అనేక రకాల పుష్పాలుంటాయి .రత్న పుష్పాలూ ఉంటాయి .అది సుగంధ బంధురం .కనుక నీకూ మాలిక కూ పోలిక ఉంది .ఈ గుణాలతో ఉన్న నిన్ను ఆశ్రయించి ఈ వైజయంతి మాల ఆశ్ర యించడం వలన నీ లక్షణాలు ఆ మాలకు సంక్రమించాయి .అంటే మాల నీ రూపాన్ని ధరిస్తోందని తాత్పర్యం .పరమాత్మ సుగంధ భరితుడు అనటానికి వేదమే ప్రమాణం –‘’సర్వ కర్మా సర్వ కామః సర్వ గంధః సర్వ రసః ‘’

71వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు కౌస్తుభ విశేషాలు వర్ణించాడు –

‘’నాభీ సరోజ కిరణై ర్మణిరాజ భాభిః-ఆత్మ ప్రభా రపి సంవలితం విభాతి

శ్రీ వత్స విగ్రహ జుషః ప్రకృతే స్త్వదీయం –వక్షః పరీత మితి సత్వ రజస్తమోభిః’’

‘’స్వామీ వరద రాజా !నీనాభి కమల కాంతులు ,కౌస్తుభ మణి దీప్తులు ,నీ శరీర కాంతితో కూడిన వక్షః స్థలం అక్కడ ఉన్న శ్రీ వత్సం అనే పుట్టు మచ్చ తో కలిసి అది ప్రక్రుతి యొక్క సత్వ రజో తమోగుణాలతో ఆవరింప బడి నట్లు గా శోభిస్తోంది .

నాభి సరోజాన్ని కొందరు తెలుపు రంగు అన్నారు .ముఖ్యంగా మురారి నాటకం లో ఈ మాట చెప్పాడు .హరి వంశం అరుణ వర్ణం అన్నది .నైషధం లో తెలుపు అని ఉంది. ప్రపంచ సార సంగ్రహం మాత్రం శ్యామల వర్ణం అన్నది .ఇలా కౌస్తుభ నాభి వర్ణాలు రక రకాలుగా వర్ణింప బడ్డాయి .ఇది  విరోదా భాసం అని కంగారు పడక్కర్లేదు .విష్ణు పురాణం స్వామి వారి శ్రీ వత్సం అంటే పుట్టుమచ్చ ప్రక్రుతి స్వరూపం అన్నది .

‘’శ్రీ వత్స సంస్థాన మయ మనంతే చ సమాశ్రితం –ప్రధానం బుద్ధి రూప్యాస్తే గదః రూపేణ మాధవే ‘’

అంటే అది వక్షస్సు కుడి వైపు బిల్వ రూపం లో ఉంటుంది .హరివంశ మహా పురాణం లో –‘’శ్రీ వత్సే నోరసి శ్రీమాన్ రోమ జాలేన రాజతే ‘’అని ఉంది .రోమాల ఆవర్తం అంటే రోమాల సుడి అని అర్ధం చేసుకోవాలి .వామన పురాణం –‘’అదొక భూషణ విశేషమని చెప్పింది .అందులోని ‘’విష్ణు పంజర స్తోత్రం ‘’లో –‘’వైజయంతీం ప్రగ్రుహ్యాథ శ్రీ వత్సం కంఠ భూషణం –వాయవ్యాం రక్షమాం దేవ అశ్వ శీర్ష నమోస్తుతే ‘’అని ఉన్నది .

మరో శ్లోకం లో స్వామి చేతి కంకణం నుండి ప్రభవించే పల్లవ రాగం లాలన తో కలిసి గర్వించి సూర్యుడిని కూడా దిక్కరిస్తోంది అంటాడు దీక్షితకవి

మాణిక్యం పద్మరాగం ,కురువిందం ,సౌగంధికం ,నీల గ౦ధీ అని నాలుగు రకాలు .వీటిలో కూడా నాలుగు వర్ణాలున్నాయి అని రత్న శాస్త్రం చెప్పింది .వీటి రంగులు ఎరుపు మిక్కిలి ఎరుపు ,పసుపు నీలం అని వివరించింది .కురు వి౦దానికే పల్లవ రాగం అనే పేరుంది .’’ప్రచక్రమే పల్లవ రాగ తామ్రా’’అని కాళిదాసమహా కవి చెప్పాడు .దీనికి రాసిన వ్యాఖ్యలో పల్లవ రాగం ఒక రత్న విశేషం అని చెప్పారు .

సవిత్రుడు అంటే సూర్యుడు ,తండ్రి అనీ రెండు అర్ధాలున్నాయి .పల్లవ శబ్దానికి విటుడు అనే అర్ధమూ ఉంది .అంటే ఏది చేయదగినదో ఏదికాదో తెలియని వాడని అర్ధం .విటుడు తండ్రిని దిక్కరించినట్లు పల్లవ రాగమణిసూర్యుడిని తిరస్కరిస్తోంది అని భావం .

‘’ఆబాతి దేవ విధృత స్తవ సవ్య పాణౌ –అంతర్బహిశ్చ శుచి రచ్యుత పంచ జన్యః

అంతే వమన్నివ గలస్య గురో రభీర – ద్వాన క్రియోప నిష దధ్యయ నారద మేషః ‘’

‘’అచ్యుతా !నీ ఎడమ చేతి లో ఉన్న పాంచ జన్య శంఖం లోపలా బయటా ,ఉచ్చ్శ్రై స్రవం తో ఉపనిషత్తులను పఠించ టానికి ,నాదం అనే ఉపనిషత్తును నేర్చుకోవటానికి నీ కంఠ సమీపం లో శిష్యుని మాదిరిగా కనిపిస్తోంది .

బ్రహ్మాండ పురాణం లో ఎవరు భక్తులకు ఇష్టులు అనే వివాదం లక్ష్మీ సరస్వతుల మధ్య  జరిగిందనీ బ్రహ్మను తేల్చి చెప్పమని కోరితే లక్ష్మీ దేవే అని చెప్పాడని ,సరస్వతికి కోపం వచ్చిందని ,ఆ కోపం వరద రాజ స్వామి కౌమోదకి గద లాగా ఉందని చమత్కరించాడు దీక్షితులు .కౌమోదకి పచ్చగా ఉంటుంది అన్నది ‘’ప్రపంచ  సారం ‘’-‘’చక్రం ,శంఖం గదాంబుజ కౌస్తుభ ముసలాః-స ఖడ్గవనమాలాః రక్తాచ్చ పీత కనక శ్యామల కృష్ణ ద్యుశుక్ల భాసః స్యుహుః’’

80వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు

‘’నామైవ తే వరద వాంచిత దాటరు భావం –వ్యాఖ్యాత్యతో నవ హసే వరదాన ముద్రాం

న హ్యాగ మోదిత రసః శ్రుతి సిద్ధ మర్ధం-లింగేన బోధ్యుమురరీ కురుతే విపశ్చిత్’’

స్వామీ !అభయ ముద్ర లాగా వరద ముద్రను నువ్వు ఎందుకు ధరించలేదు అనే ప్రశ్న ఉంది .అసలు నీ పేరే వరదుడు.కనుక వేరుగా వరముద్ర ఎందుకు ?ప్రత్యక్షంగా కనిపిస్తుంటే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు ?వామన పురాణం లో వరద రాజ వ్యుత్పత్తి ఉన్నది –కోరిన కోర్కెలు తీర్చేవాడూ ,బాధలు పోగొట్టేవాడు కనుక వరద రాజు అయ్యాడని ఉంది –

‘అభి గమ్యోవై వరం దత్తే ప్రణతార్తివినాశినః –ఆఖ్యాం వరద రాజేతి యయౌ నిత్యం క్రుతార్ధయన్ ‘’

వరద అనే పదం తోనే స్వామి తత్త్వం బోధ పడుతుంది వేదమే’’రసో వై సహః రాసగ్గం హ్యేవాయంలబ్ధ్వా నందీభవతి ‘’అని ప్రతిపాదించింది .

ఇంకో శ్లోకం లో ‘’ఉపేంద్రా !నీ ముఖార వింద శోభను గ్రహించాలనే లోభ గుణం వలన చంద్రుడు ,కృష్ణ పక్షం శుక్ల పక్షం అనే మిష తో నీ దేవ మందిరం చుట్టూ చాంద్రాయణ వ్రతం ఆచరిస్తూ నీ కాంతిని తాగటానికా అన్నట్లున్నాడు  ‘’అన్నాడు .

వాస్తవానికి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు .అది మేరు పర్వతం కాదని దేవ మందిరం అనీ కవి చమత్కరిస్తున్నాడు.శుక్ల పక్షం లో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతూ పౌర్ణమినాడు 15ముద్దలు తినటం కృష్ణ పక్షం లో తగ్గించుకొంటూ పోవటం గా చేసే వ్రతాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు .చంద్ర కళల వృద్ది క్షయాలను బట్టి చంద్రుడు కూడా ఇలా వ్రతం చేస్తున్నాడు అంటాడు కవి .

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాన్యులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి అభినందన

హైదరాబాద్ ఆకాశవాణి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ,సాహిత్య సంగీత మర్మజ్ఞులు ,సరసభారతికి పరమ ఆప్తులు మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి అభినందనలు –దీనితో జత చేశాను చూడండి -దుర్గా ప్రసాద్ aditya2 001 aditya1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3

కంచి వరద రాజ దర్శనం -2

సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు-

‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ

ఆఖ్యాన సమాప్త వచసా  మవితర్కణీయం-ఆశ్చర్య మేతదతి నిశ్చయ మాపాహంతే’’అన్నాడు మరో శ్లోకం లో

‘’స్వామీ !పశ్చిమాభి ముఖంగా ఉన్న నిన్ను తత్వ వేత్తలు ఎన్ని జన్మలెత్తినా లభించని రూప మాధుర్యాన్ని చవి చూస్తున్నారు .ఆయన పర బ్రహ్మమే నని శబ్ద ,అనుమానాది ప్రమాణాలకు అందనివాడని భావం .ఇక్కడ ఆశ్చర్య శబ్దం సాభిప్రాయ ప్రయోగం .ఆశ్చర్యం అంటే సకల చరాచర సృష్టి కర్త అయిన భగవానుడు అని అర్ధం .హరి వంశం లో ‘’ఆశ్చర్యో పాఖ్యానం ‘’లో శ్రీ కృష్ణుని గురించి నారద మహర్షి చెప్పిన మాటలే దీనికి ప్రమాణం .

‘’ఆశ్చర్య౦ ఖలు దేవానాం ఏకస్త్వం పురుషోత్తమ –ధన్యశ్చాపి మహా బాహో లోకేనాన్యోస్తి కించన ‘’.కఠోపనిషత్ కూడా ‘’పరబ్రహ్మాన్ని గురించి వినటం ,తెలుసుకోవటం చెప్పటం అంతా ఆశ్చర్యావహం ‘’అన్నది –‘’ఆశ్చర్యో వక్తా ,కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞాతా కుశలాను షిస్టః’’.ఇవే మాటల సారాంశం భగవద్గీతలోనూ కనిపిస్తుంది .

ఇక్కడ వరద రాజస్వామి పశ్చిమాభి ముఖంగా ఉన్నాడు .ఆ దిశలో చూడటం కుదరదు .అయినా కనిపిస్తూనే ఉన్నాడు కదా .పడమర ముఖంగా ఉన్నవాడిని తూర్పు ముఖంగా చూస్తేనేగా కనిపించేది .

మరో శ్లోకం లో అల౦కా రాలకే అలంకారమైన స్వామి ని వర్ణించటానికి ఏ అలంకారం సాధ్యమవుతుంది అంటాడు .అంటే అతిశయోక్తి కాని స్వభావోక్తికాని ఆయన్ను వర్ణించ లేవని భావం .ఇంకో శ్లోకం లో లక్ష్మీ కా౦తుడవైన నువ్వు అందగాడైన మన్మధుని తండ్రివి .శృంగార రసాది దేవతవు .సర్వ గుణోన్నతుడవైన నిన్ను ఎవరు సంపూర్ణంగా వర్ణించగలరు ?అన్నాడు .భరతుడు నాట్య శాస్స్త్రం లో శృంగారానికి అధిదేవత విష్ణు మూర్తి అని చెప్ప్పాడు –‘’శృంగారో విష్ణు దేవత్యః ‘’

‘’నీ దగ్గరికి చేరితే తిరిగి రావటం అంటూ ఉండదు .ముక్తుడైపోతాడు నీకు అర్పించిన మనసును మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వవు ‘’అంటాడు దీక్షితులు .

‘’యత్ప్రణ సంయమ జుషాం యమినాం మనాంసి –మూర్తిం విశన్తి తవ మాధవ కు౦భకేన

ప్రత్యంగ మూర్చ దతివేల  మహా ప్రవాహ –లావణ్య సింధు తరణాయ తదిత్య వైమి’’

‘’ప్రాణాయామం మొదలైన వాటి వలన ప్రాణాన్ని నిరోధిస్తూ ,తమ మనసులలో కుంభకం ద్వారా నీ రూప ధ్యానం చేస్తారు .ఆ పాద మస్తకం లో ఉండే ఒక్కొక్క నీ అవయవాన్నీ ధ్యానిస్తూ లావణ్య సింధువు ను తరిస్తున్నారు ‘’

లావణ్యా మృతాన్ని త్రాగుతున్నారని అర్ధం .ప్రాణాయామం చేసేటప్పుడు పూరక స్థితి లో నాభి చక్రం లో ఉన్న బ్రహ్మను ,కుంభక స్థితిలో హృదయం లో ఉన్న జనార్దనుడిని ,రేచక స్థితి లో లలాటం లో ఉన్న శివుడిని ధ్యానించాలి అని స్మృతి చెప్పింది –‘’నాభి చక్ర స్థితం ధ్యాయేత్ పూరకేణ పితామహం –హృదయాబ్జ గతం ధ్యాయేత్ కుంభ కేన జనార్దనం –లలాటస్థం శివం ధ్యాయేత్ రేచకేన మహేశ్వరం ‘’.

వేరొక శ్లోకం లో దీక్షితకవి ‘’నీ వదన పద్మం నుండి సరస్వతీనది ,పాదాల నుండి గంగానది ప్రవహిస్తుంటే ఈర్ష్యతో యమునా నది నీ నఖ శిఖ పర్యంతం నిరంతరం ప్రవహిస్తోందాఅన్నట్లు త్రివేణీ సంగమంగా నీ శరీర కాంతి శోభిస్తోంది ‘’అన్నాడు

‘’సర్వాతీ శయి సహజద్యుతి భూషితస్య –విశ్వైక నాయక విభూషణ ధారణం తే

ఆ బద్ధ సౌహృదయ మాపార సుఖాంబు రాశేః-వీక్షే తదైవ విషయాది కుతూహలేన ‘’

‘’సహజ కాంతి శరీరుదవైన నీకు వేరే అల౦కారా లెందుకు ?అయినా ధరిస్తున్నావు .అపరిమితానంద నిదివి అయిన నువ్వు కుతూహలం తో తుచ్చ విషయాలతో స్నేహం చేసినట్లుగా మామూలు ఆభరణాలు ధరిస్తున్నావు .నిత్య నిరతిశయ ఆనంద మహర్ణవ రూపుడవైన నీవు మామూలు గోపికలతో విహరించి నట్లుగా ఈ సాధారణ ఆభరణాలతో కనిపిస్తున్నావు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉయ్యూరులో ప్రయోక్త, దర్శక,నిర్మాత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు ఉయ్యూరు ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో ఏప్రిల్ 16నుండి 18వరకు నిర్వహించిన నాటకోత్సవాల ముగింపు సభ  నిన్న 18-4-16 సోమవారం శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనటం తో పూర్తీ అయింది .

శ్రీ బుద్ధ ప్రసాద్ ఉవాచ

సమాజం లో అనేక సమస్యలను రచయితలు  తమ ప్రతిభ తో అద్భుతంగా నాటకాలుగా మలచి  ,వినోదం తోపాటు విజ్ఞానాన్ని వివేకాన్ని జాగృతిని కలిగిస్తున్నారని వాటిని సమర్ధులైన నటులు నటించి దర్శకత్వం వహించి ప్రజల ముందు ప్రదర్శించి సమాజాన్ని మేల్కొల్పుతున్నారని ,దీనికి ఎప్పుడో శ్రీవీరేశలింగం గారు దారి చూపారని ,సమాజం లోని చెడును, కుళ్ళును కడిగిపారేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటం రచయితల బాధ్యత అని మన రచయితలూ ఈపనిని చాలా సమర్ధ వంతంగా నిర్వహిస్తూ సమాజ హితైషులుగా మారటం శుభ సూచకమని అన్నారు .కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ పూసల శ్రీ డి విజయ భాస్కర్ రచించిన నాటకాలు వందలాది ప్రదర్శనలతో దిగ్విజయంగా సాగుతున్నాయని ఆ ఇద్దరూ దివి సీమ ముద్దుబిడ్డలే అవటం మనందరికీ గర్వకారణమని చెప్పారు .తమ తండ్రి గారు స్వర్గీయ మండలి వెంకట కృష్ణా రాగారు అవనిగడ్డలో నాటకాలు నిర్వహిస్తే ,ఏ సదుపాయమూ బ్రిడ్జిలు లేని ఆకాలం లో లక్షమందికి పైగా వచ్చి నాటకం చూసి స్పూర్తి పొందేవారని గుర్తు చేసుకొన్నారు .తానూ నాటకాలు నిర్వహిస్తూనే ఉన్నానని కాని ఇప్పటి జనం బుల్లితెర మాయలో పడి అన్నీ వదిలేస్తున్నారని ,ఇప్పుడు తాము నాటకాలు ప్రదర్శిస్తున్నా జనం లో  స్పందన  ఉండటం లేదని ,ఇది ఆరోగ్య కరం కాదని ,ప్రేక్షకులు లేని నాటక ప్రదర్శన శోభించదని కనుక ఎన్ని పనులున్నా కళకోసం జనం సమయం కేటాయించుకొని దాన్ని బ్రతికి౦చు కోవాలన్నారు .ఉయ్యూరు లో దాదాపు నాలుగు వందల మంది నాటక ప్రదర్శనను చూడటానికి రావటం అంటే రికారర్డ్ సృష్టించటమే నని , ఉయ్యూరు ప్రజల కళాభిమానానికి చేతు లెత్తి నమస్కరిస్తున్నానని ,ఈ పొంగు చల్లారనివ్వ వద్దని ,ప్రతి యేటా నాటకోత్సవాలు ఉయ్యూరులో జరపాలని దానికి తన వంతు సహకారం అందిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .

శ్రీ వి. వి. ఆర్ .సద్యో స్పందన

ఉయ్యూరులో నాటకం వేస్తే అయిదారుగురు వస్తే గొప్ప అని తనను చాలామంది నిరుత్సాహ పరచారని ,కాని ఉయ్యూరులో ఉన్న సినిమా దియేటర్ లకు వచ్చే జనం కంటే ఇక్కడికి ఎక్కువ జనం రావటం తనను అమితాశ్చర్య పరచిందని ముఖ్యంగా మహిళామణులు ఏంతోఉత్సాహంగా పాల్గొని ఈ నాటకోత్సవాలను దిగ్విజయం చేశారని వారికి తాను జీవితాంతం రుణ పడి ఉంటానని ప్రేక్షక దేవుళ్ళు లేకపోతె నాటకాలు నిర్వీర్య మౌతాయని ,అలాంటి చక్కని ఉత్సాహ పూరిత వాతావరణాన్ని కల్పించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపు కొంటున్నానని ,భగవంతుని అనుగ్రహం ,స్థానికుల ప్రోత్సాహం ,ప్రేక్షకాదరణ ఇలా నే కొన సాగితే ప్రతి ఏడూ నాటకోత్సవాలు నిర్వహిస్తామని సవినయంగా మనవి చేశారు .తాము ఆహ్వానించిన వెంటనే లబ్ధ ప్రతిష్టులైన ఆర్టిస్ట్ లు తన పై ఎంతోనమ్మకం తో ఇక్కడికి వచ్చి తమ నాటకాలను ప్రదర్శించి విజయం చేకూర్చారని వారికి ఏమిచ్చినా ఋణం తీరదనని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .

ఉయ్యూరులో నాటక ప్రదర్శన శాల అవసరం

ఈ మూడు రోజుల నాటక ప్రదర్శనలు చూశాక నాకు ఉయ్యూరు లో అన్ని హంగులతో ఒక నాటక ప్రదర్శన శాల అవసరం ఉందని అనిపించింది .ఏం. పి.,,ఏం .ఎల్ .ఎ., ,ఏం. ఎల్. సి.మంత్రిగారి నిధులు ,డిప్యూటీ స్పీకర్ గారి నిధులు ,మునిసిపాలిటీ నిధుల తో ,కే .సి. పి.సాయం తో అన్ని వసతులతో ఆధునిక సౌకర్యాలతో ఒక పర్మనెంట్ నాటకశాల నిర్మాణం కూడా ఈ ఉత్సాహపు పొంగు కుంగి పోయే లోపు వచ్చి ఫలప్రదమవ్వాలని ఆశిద్దాం .’’నాలుగవ గోడ ‘’(దియేటర్ )బలీయంగా ఉండాలని అది అందరి అవసరాలు తీర్చాలని కోరుకొందాం .ఉయ్యూరు కళాభిమానులు ఈ అత్యుత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం .శ్రీ .వి. వి. ఆర్ .సాహసోపేతంగానిర్ణయం  తీసుకొని నాటక ప్రదర్శన దిగ్విజయం గా నిర్వహించినందుకు మనసారా అభి నందిస్తున్నాను .

సందట్లో సడేమియా గుంపులో గోవిందం

నేను నిన్న రాత్రి ప్రదర్శన చూడటానికి వెళ్ళినప్పుడు శ్రీ వల్లభనేని వెంకటేశ్వరారావు గారు నా దగ్గరకొచ్చి ,చేతిలో చేయి వేసి ‘’మీ మెయిల్ చదివాను బాగుంది థాంక్స్ ‘’అన్నారు నిన్న నేను రాసిన ‘’ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే’’అన్న ఆర్టికల్ చదివి .నా పక్కనే నా స్నేహితుడు సూరి బాబు ఉన్నాడు ఆయనకు పరిచయం చేసి అతనికీ సన్మానం చేస్తే బాగుంటుంది అన్నాను. చేస్తున్నాం అన్నారు .సూరిబాబు మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోయింది .మూడవ  రోజూ స్థానిక కళా కారులను సత్కరించారు .సూరిబాబుకూ సన్మానం చేయించారు శ్రీ బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా .నా మిత్రుడు చాలా సంతోషించాడు .నన్నూ స్టేజి పైకి రమ్మన్నారు .ఎందుకు ?అన్నా వినకుండా లాగారు పైకి .శ్రీ బుద్ధ ప్రసాద్ ,కే సి పి సి యి వో శ్రీ వెంకటేశ్వర రావు గార్లుఆప్యాయంగా  దగ్గరగా తీసుకొని శాలువా కప్పారు .ఎందుకు కప్పారో వాళ్ళకేమైనా తెలిసిందో లేదోకాని నాకు మాత్రం తెలియ లేదు సందట్లో సడేమియా గుంపులో గోవిందా చందం అనుకొన్నాను .అయినా ధన్యవాదాలు .

మినిస్టర్ నాటకం

ప్రముఖ నాటక రచయిత శ్రీ డి విజయ భాస్కర్ రచించి ,ప్రసిద్ధ నాటక సినీ నటుడు శ్రీ కోట శంకరరావు నటించి దర్శకత్వం వహించిన ‘’మినిస్టర్ ‘’నాటకం అనుకొన్న సమయానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది .మినిస్టర్ గా శ్రీ శంకర రావు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు .ఏంతో సీనియర్ నటుడు శ్రీ మల్లాది భాస్కర్ మినిస్టర్ సేక్రేటరిగా ,2004 ఎన్నికలముందు ఈ టి విలో ధారావాహికంగా వచ్చిన ‘’మాయా బజార్ ‘’రాజకీయ నాటకం లో ముఖ్య పాతదారి శ్రీ చలపతి రావు  ,మినిస్టర్ భార్యగా నటించిన ఆవిడా అందరూ సహజ నటనతో ఆకట్టుకొన్నారు .మొన్నటి ‘’అలేక్జాండర్ ‘’ఎకపాత్రాభినయం ,కొంచెం నిర్జీవంగా సాగితే ఈ నాటకం సజీవ పాత్రల తో రంగస్థలం పండింది .ప్రాణం ఉన్న నాటకం అని పించింది. అందరూ బాగానే చేశారు .మొదట్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికిన మినిస్టర్  మృత్యు దేవత బెదిరింపుతో జీవితాన్ని మార్చుకొని అందరికీ ఉపయోగ పడేట్లు ,స్వార్ధ రహితంగా ప్రవర్తిన్చేట్లు ప్రజాహితమే ధ్యేయంగా బతకటానికి నిర్ణయించుకొంటాడు .కాని అది అసాధ్యమని పిస్తారు పెళ్ళాం కొడుకులూ .డబ్బు లేనివాడు కాణీకి చెల్లుబాటుకాడని ,’’డబ్బు టుదిపవర్ ఆఫ్ డబ్బు’’తోనే అధికారం పలుకుబడి వస్తాయని భావిస్తారు .మినిస్టర్ మనసు మారదు .అతన్ని చంపి కొడుకు ఏం ఎల్ ఏ అవాలనుకొని ప్లాన్ వేస్తె మొగుడు పొతే సానుభూతి  పెళ్లానికేనికే వస్తుందని తల్లి వాడిని వారించి భర్తను చంపే ప్రయత్నం చేస్తుంది చేయిస్తుంది .దేనికీ లొంగని మినిస్టర్ ,తన పని తాను  చేసుకుపోతూ ప్రజలలో దేవుడు అనిపించుకొంటాడు .పూర్వం దగ్గరకు చేరినవాళ్ళుశత్రువులై పోతారు .ధ్యేయం మార్చుకోడు .చివరికి అతని నిజాయితీ తెలిసి ఆదర్శం అంటే అదే అని అందరూ తెలుసు కొంటారు .ముఖ్యంగా ఇందులో నీతి ’’రాజకీయ నాయకుడు నీతి,నిజాయితీలతో  ఉంటె అతని కిందపని చేసే ఆఫీసర్లు అలాగే ఉంటారు .ఆ తర్వాత కింది వాళ్ళూ,ప్రజలూ  అనుసరిస్తారు కనుక మార్పు పై స్థాయిలోనే ముందు రావాలి ‘’

సీజండ్ ఆర్టిస్ట్ శ్రీ శంకరరావు మినిస్టర్ పాత్రలో జీవించాడు .భార్య పాత్రదారిణీ అంతే.సెక్రెటరి చిన్ని కృష్ణ పాత్రధారి శ్రీ భాస్కర్ తన అపార నటనానుభావాన్ని రంగరించి ముద్దుముద్దు మాటలతో హావ భావాలతో నటించి మెప్పించాడు. మాటలు సందర్భోచితంగా ఫోర్సుబుల్ గా ఉన్నాయి .మనిషి  మారుదా మన్నా  వ్యవస్థ మారనివ్వదు .దీనికి బలీయమైన దైవ ప్రేరణ కావాలి .అప్పుడేసాధ్యం .తానూ మారి వ్యవస్థను మార్చే మినిస్టర్ పాత్ర నటించిన శ్రీ శంకరరావు ‘’నట కోట ‘’అనిపించాడు . ‘’మా టి. వి ‘’.సీరియల్ లో ఆయన పాత్ర పలికిన  ‘’ఊత పదం’’ ‘’ఇట్ ఈజ్ వెరి గుడ్ –ఐ లైక్ యు ‘’ అన్నది ఆయన నటనకూ వర్తిస్తుంది .అందరూ అభినందనీయులే .మంచినాటకం చూసిన పూర్తీ సంతృప్తి లభించింది .

శ్రీ గుమ్మడి మరో గుప్పెడు ఉంటే బాగుండేది

తరువాత ప్రదర్శన రాయబార ఘట్టానికి చెందిన శ్రీకృష్ణుని ‘’పడక సీను ‘’అనే శయన దృశ్యం .అర్జున ,దుర్యోధన శ్రీ కృష్ణ పాత్రలు .కృష్ణుడుగా శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అభినయం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎన్నో వందల ప్రదర్శనలిచ్చిన అనుభవం ఆయనది .పద్యం నల్లేరు పై బండీ.హావ భావాలతో విరుపులతో పద్యం కదను తొక్కింది .’’బావా ఎప్పుడు వచ్చితీవు ‘’అని సుయోధనుడిని పలకరించటం తన శిష్యుడైన అర్జునుని సంభావించటం లో గుమ్మడి నటన’’ గుమ్మడి పూవై’’ విరగ బూసింది .అర్జున పాత్రధారీ చాలా ధారాళంగా పద్యాలు పలికాడు .దుర్యోధన దారీ చాలా దర్పంగా రాజసంగా పద్యం పాడి భేష్ అనిపించాడు .గోపాల కృష్ణుడు అయిన ‘’గుమ్మడి ‘’ఇంకో గుప్పెడు పొడవు ఉంటె వాచిక నటనలతో పాటు రూపం లోనూ సాటి లేని వాడని పించేవాడు అని నాకని పించింది .ఉయ్యూరు కు సమీపం లో ఇద్దరు శ్రీ కృష్ణ పాత్రధారులు ఉండటం మనం చేసుకొన్న అదృష్టం .ఒకరు మేడూరు కు చెందిన ఇప్పటి శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అయితే మరొకరు పెనమకూరుకు చెందిన కీ శే శ్రీ అబ్బూరి వర ప్రసాద రావు గారు .ఇద్దరూ ఇద్దరే .

చిన్న ఫ్లాష్ బాక్

ఈ పౌరాణిక సీను చూశాక సుమారు పాతిక ముప్ఫై ఏళ్ళ క్రితం కాటూరు రోడ్డులో డేరాలు వేసి సురభివారు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు గుర్తుకొచ్చాయి .డబ్బు చెల్లించి చూసినా ప్రతి సీను పండింప జేసేవారు .అదొక కుటుంబ నాటక వ్యవస్థ ,ఆంద్ర దేశం వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు .వారికివ్వాల్సిన గౌరవాన్నిచ్చి కళకుప్రోత్సాహమివ్వాలి .ఇప్పుడు ఇక్కడ జరిగింది ఉచిత ప్రదర్శన.ఎన్ని కస్టాలు నష్టాలు భరించి వీటిని ప్రదర్శిస్తారో ఒక సారి మనం ఆలోచించాలి .వారి అభినయ సామర్ధ్యానికి మనం కొట్టే చప్పట్లే వారికి ప్రోత్సాహం ప్రేరణగా నిలుస్తాయి .శ్రీ వేదాంతం సత్యనారాయణగారు ఉయ్యూరు హైస్కూల్ లో భామా కలాపం నిర్వహించారు సుమారు పాతిక ఏళ్ళక్రితం .కే సి పి వారి ప్రాంగణం లోనూ ప్రదర్శించారు .

కళలకు ప్రోత్సాహం తగ్గిపోతోంది అనుకొన్న కాలం లో ఉయ్యూరు లో ఈ నాటకోత్సవాలు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చి జీవం పోశాయి .ఆ ఉత్సాహపు పొంగు చల్లారకుండా అందరం బాధ్యత వహించాలి .అందర్నీ కలుపుకు పోయే సారధ్యం కావాలి .స్థానికంగా ఉన్న సాహిత్య సంస్థలతో సాన్నిహిత్యం అవసరం ..నా వరకు నాకు మైకు ద్వారా విని తెలుసుకోవటమే కాని ఆహ్వాన పత్రం అందలేదు అంటే నమ్మరేమో .శ్రీ వి. వి .ఆర్. సాహసానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకాదరణ వలన లభించి సంతృప్తి మిగిల్చి ఉంటుంది .శుభం భూయాత్ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-16-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం మూడవ రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన శయన దృశ్యం (పడక సీను ) ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్న దృశ్య మాలిక  Translate

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం మూడవ రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన  శయన దృశ్యం (పడక సీను ) ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్న దృశ్య మాలిక

Translate

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

   ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

పరుచూరి బ్రదర్స్ వంటిఉయ్యూరు ,పరిసరప్రాంతాల  మేటినాటక రచయితలున్నా వారెవరూ పూనుకొని  ఈ ప్రదేశం లో మళ్ళీ ఇన్నేళ్ళకు నాటక మహోత్సవం మూడు రోజులు నిర్వహించాలనే సంకల్పం ,దాన్ని నెరవేర్చటం గండి గుంటవాసి నాటక ప్రయోక్త దాదాపు డజను బహుమతుల విజేత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  పూనుకోవటం ఉయ్యూరులోని సాహిత్య నాటక సంస్థలు చక్కెర కర్మాగారం శాసన సభ్యులు ,ఔత్సాహికులు ,విద్యా సంస్థలు ,ప్రభుత్వం అంతాకలిసి సహకరించటం అందరికి అందుబాటు లో ఉండే వి ఆర్ కే.ఏం హైస్కూల్ ఆరుబయట రంగ స్థలాన్ని ఎన్నుకొని ప్రదర్శించటం గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ నాటక మహోత్సవాలను చూడటానికి మూడు వందలకు తక్కువ కాకుండా కళాభిమానులు వచ్చి హాయిగా క్రమశిక్షణతో చూడటం ఒక చరిత్రనే సృష్టించింది ఉయ్యూరు లో .ఎందరు మహా నటులోచ్చి యెంత గొప్ప నాటకాలు ఆడినా ప్రేక్షకులు లేకుంటే నిరుపయోగం. ప్రదర్శకులకు తీవ్ర అసంతృప్తి .దాన్ని అధిగమించి ఉయ్యూరు ప్రజలు హాజరై దిగ్విజయం చేకూరుస్తున్నారు. కనుక మొదటగా అభినందించాల్సింది ప్రేక్షక మహాజనులనే, వారి సంస్కారాన్నే .

  మళ్ళీ ఇన్నేళ్ళకు అని మొదట్లో రాశాను .అంటే ఇదివరకొకసారి జరిగాయన్న అర్ధం అందులో ఉంది .పూర్తిగా నాకు గుర్తు లేదు కాని 1967-70మధ్యకాలం లో ఉయ్యూరు శివాలయం లో సుమారు వారం రోజులు నాటక పోటీలు జరిగాయి .అప్పుడు నేను కొత్తగా ఉయ్యూరు కు బదిలీ అయి హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నాను .యాకమూరు లేక గరిక పర్రు నివాసి శ్రీ చొప్పరపు వెంకటేశ్వర రావు గారు ఈ నాటకపోటీలు నిర్వహించటం లో పూర్తీ బాధ్యతా తీసుకొన్నారు .బట్ట తల ,ముతక ఖద్దరు పంచా చొక్కా ఖండు వాతో ఆయన ఉండేవాడు .సౌజన్యం మూర్తీభవించి ఉండేది .ఆయనకు ఎవరెవరు సహకరించారో జ్ఞాపకం లేదు కాని సాయం వేళలలో శివాలయం అంతా జనం తో కిటకిట లాడిపోయేది .పరిమిత వనరులతో ,అతితక్కువ సౌకర్యాలతో ఉన్నా ,చాలా నాటకాలు పోటీలో పాల్గొన్నాయి .కే సి పిలో పని చేసేవారూ అప్పుడు నాటకం ప్రదర్శించారు .ఏక పాత్రాభినయాలు జరిగాయి .మళ్ళీ ఈ నాటకాల జోలికిఎవరూ  పోయినట్లు లేదు. కే సి ఫై వారు మాత్రం శ్రీరామనవమి నాడు రాత్రి వేళ నాటకాలు ఆడించేవారు బయటి వారిని తీసుకొని వచ్చీ ,తమ స్టాఫ్ తోసాంఘిక నాటకాలు వేయించి  ,కెమిస్ట్ శ్రీ టి వి సత్యనారాయణ తో హాస్య నాటకాలు రాయించి ప్రదర్శింఛి   కొంత కళా పోషణ చేశారు .అప్పటివారే ఇప్పుడు వ్రుద్ధకళాకరులుగా గౌరవం అందుకొంటున్నారు . పాపం కే సి పివారు అక్కడి ఆడిటోరియం లోను వి ఆర్ కేం స్కూల్ లోను సంగీత కచేరీలు నిర్వహించారు రెండు మూడేళ్ళు .శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు ,శ్రీ మల్లాదితండ్రీ తనయులు శ్రీ చంద్ర శేఖర్  శ్రీ బాబు వయోలిన్కూదాఎర్పాటు చేయించారు .కాని వారెంతచేసినా ఊళ్ళో జనానికీ కొంత పట్టాలిగా .ఆ ప్రోత్సాహం కరువై అబ్రప్ట్ గా విరమించుకొన్నారు .అలా జరగా కుండా ఉండాల్సింది కాల ధర్మం అని సరి పుచ్చుకోవాలి అంతే . శ్రీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ఫ్లాష్ బాక్ లోకి వెడితే ఉయ్యూరులో పాలిటెక్నిక్ కాలేజి ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ వేసే నాటకాలు పరమ ప్రామాణికంగా ఉండేవి ..శ్రీ ఉప్రద్రస్ట(యు వి ) సుబ్బరాయ శర్మ వంటి వారు ఇక్కడ విద్యార్ధులుగా గోప్పనాటకాలు వేశారు .అలాగే శ్రీ నారాయణ రావు అనే ఆతనూ గొప్ప నటుడు .శ్రీ ఆచారి మేష్టారు అనేకాలేజి  డ్రాయింగ్ మేష్టారు గొప్ప తర్ఫీదునిచ్చి దర్శకత్వం వహించి ,రంగాలంకరణ తో కనుల పండువు చేసి ఆహ్లాద ఆనందాలను కలిగించారు .ఇవన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి .

   అన్నిటా ఆద్యులైన శ్రీ కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం ఏప్రిల్ 16ను తెలుగు నాటక రంగ దినోత్సవం గా గుర్తించి ఉయ్యూరులో ఆనాడే నాటకోత్సవం ప్రారంభించటం ముదావహం. ఆ మహనీయుని స్మరించే సదవకాశామూ .మొదటి రోజు సభకు శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ ,కేసి పి సి యి వో శ్రీ జి వెంకటేశ్వరరావు ,’’పూల రంగడు ఫేం ‘’,ఉయ్యూరు నగరపాలక సంస్థ చైర్మన్ శ్రీ జ౦పాన పూర్ణ చంద్ర రావు,మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీ నాని వంటి పెద్దలు వేదిక పై ఉండగా ఉత్సవాలు ప్రారంభమైనాయి .

   ధర్మార్జితం అనే నాటకాన్ని ప్రదర్శించారు .మొదట్లో కొంచెం హాస్యంగా ప్రారంభమై మధ్యలో సెంటి మెంట్ దట్టింపు రెట్టింపై నాటకం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగి ప్రేక్షకులను సీట్లకు అతుక్కు పోయేట్లు చేసింది .రచన దర్శకత్వం బాగున్నాయి .అందరూ బాగా నటించారు నండీ అవార్డ్ పొందిన నాటకం .ప్రదర్శనకు ముందు ఉయ్యూరుకు చెందినకొందరు పూర్వపు నటులను  సన్మానించారు .

     రెండవ రోజు విలన్, కేరక్టర్ యాక్టర్ గా యాస భాష తో ప్రసిద్ధులైన శ్రీ త వి జయ ప్రకాష్ రెడ్డి ‘’అలెక్సాండర్’’నాటకం ఆద్యంతం రక్తి కట్టింది .రచన కీ శే పూసల .నటనా ,నిర్వహణ శ్రీ రెడ్డి .దాదాపు ఏక పాత్రాభినయం .అయితే కొత్త ప్రయోగం .దీన్ని గురించి రెండేళ్ళ క్రితం పేపర్లో చదివి రెడ్డిగారు చాలా బాగా చేస్తున్నారని తెలుసుకొన్నాను. ప్రత్యక్షంగా నిన్న చూశాను .నిజంగా చెప్పాలంటే ‘’ప్రీ రికార్డెడ్ ‘’నాటకం .రికార్డర్ లో వచ్చే మాటలను బట్టి పెదిమలు కదిలిస్తూ హావ భావ ప్రకటన చేస్తూ ఒంటి చేత్తో శ్రీ జయ ప్రకాష్ రెడ్డి నిర్వహించాడు .మిగిలిన పాత్రలున్నా అవి వినిపించేవే కాని  స్టేజి పై కనిపించేవికావు .కాని వారందరి గొంతుకలు చాలా నిర్దుష్టంగా పాత్రల స్వభావాలకు తగినట్లు ఉండటం మహా గొప్ప గా ఉంది .వారి సెలెక్షన్ ,రెండరింగ్ లో తీసుకొన్న జాగ్రత్త మెచ్చ దగినది .సంఘం లో ఉన్న అనేక సాంఘిక దురన్యాయాలు ,పిరికితనం ,ఆరళ్ళు వంటి వాటికీ హెల్ప్ లైన్ లో శ్రీ రెడ్డి చెప్పిన పరిష్కారాలు ,అవి క్లిక్ అయిన వైనాలు బాగా ఆకర్షించాయి .ఇతర దేశాలలో బెకెట్, ధారన్ టన్ వంటి నాటక రచయితలూ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతి అందుకొన్నారు .ఎన్.ఆర్ నంది వంటి వారూ ప్రయోగాలు చేశారు .నిలకడ నీరు ఆరోగ్యం కాదు. ప్రవాహ జలం ఆరోగ్యకరం అందుకే ప్రయోగాలు .

  శ్రీ రెడ్డి ఒక్కడే స్టేజి అంతా దున్నేశాడు అన్ని రకాల భావోద్వేగాలకు చిరునామాగా నిలిచి పోషించి సెహబాస్ అనిపించాడు .పూసల డైలాగులు సహజ సిద్ధంగా ఉండి’’మణిపూసలు ‘’అని పించాయి అని నేను స్పందన తెలియ జేయమని అడిగితే వేదికపై చెప్పాను .అలాగే ‘’నాటక రంగ వేజేత అలేక్జాండర్’’గా శ్రీ రెడ్డి బహుముఖీన ప్రజ్నకనిపించారని ఆయన నాటక సినీరంగానుభవాలను రంగ రించి అందించిన కళాత్మక నాటకం’’ అన్నాను.అయితే నాకేమని పించింది అంటే నాటకం నిడివి పది హీను నిమిషాలు తగ్గి ఉన్నట్లయితే ఇంకా చిక్కగా గొప్పగా నిర్దుష్టంగా ఉండేది .అంతేకాదు ముఖ్య నటుని లో వచ్చిన మార్పు తానూ ఏ సాలహాలు చెప్పి ఎదుటి వారిలో మార్పులు తెప్పించాడో అలాగే తాగుడు సిగరెట్ .కొడుక్కు దూరంగా ఉండటం విషయాలలో కూడా క్రమంగా మార్పు వస్తే మరింత ఎఫెక్ట్ ఉండేది .తానుతాగి అనుభవించి అందరికీ దూరమై చివర్లో’’ సినేమా డైలాగులు ‘’వల్లించటం సినిమాటిక్ గా ఉందికాని డ్రమాటిక్ గా లేదని పించింది ..శ్రీనివాస అక్షరాలయ డైరెక్టర్ శ్రీపరుచూరి శ్రీనివాసరావు తమ కాలేజి విశాఖ లో జరిగిన పోటీలో నందీ అవార్డ్ పొందిందని ఇక్కడి ఇంతమంది  జనాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకించి పోతోందని ఈ నాటకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే బాధ్యత తమ కాలేజి తీసుకొంటుందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .కీప్ ఇట్ అప్ శ్రీ రావ్.

   దీని తర్వాత  హాస్య ప్రధానమైన రెండవ నాటక ప్రదర్శన ఉంది నేను చూడలేదు .

    రెండవ రోజూ కొందరు నాటక నటులకు సన్మానాలు చేశారు .నా స్నేహితుడు ,అనేక నాటకాలు అడినవాడు టి వీనటుడు అయిన శ్రీ సిద్దాబత్తుల సూర్య నారాయణ శనివారం సాయంత్రం ఫోన్ చేసి తనను సన్మానించటం  లేదని ,తానూ అర్హుడనని చెప్పారు. నేను ‘’ఆ వ్యవహారాలతో నాకేం సంబంధం లేదు .వాటిని ఏర్పాటు చేసేవారికి చెప్పు లేక నీకు జరిగిన అన్యాయాన్ని శ్రీ వి వి .ఆర్.ను కలిసి చెప్పు ‘’అని సలహా ఇచ్చాను .

  ఏమైనా ఉయ్యూరులో నడి వేసవి  లో సాయం వేళల ఈ నాటకోత్సవం జరపటానికి ముందుకొచ్చిన .చల్లని మల్లె పువ్వు నవ్వులువిరజిమ్ముతూ హాస్య పరిమళాన్ని వెదజల్లుతూ సాంఘిక సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ మనసులను దోస్తూ ,ఆలోచింప జేస్తూ  నాటకాలను ప్రదర్శింప జేస్తున్న  శ్రీ వి వి ఆర్ .ను,ఆయనకు సహకరించిన వారినీ  నాటక ప్రదర్శన సంస్థలను మరొక్కమారు అభినందిస్తున్నాను .ముందే చెప్పినట్లు ఈ నాటకోత్సవ విజయానికి ముఖ్య కారకులైన ఉయ్యూరు కళాభిమానులే నని ఇంకొక సారి  తెలియ జేస్తూ వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను .

మూడవ  రోజు18-4-16 సోమవారం  రాత్రి శ్రీ కోట శంకర రావు ప్రదర్శించే ‘’మినిస్టర్ ‘’నాటకం దాని తర్వాత పౌరాణిక నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు నాటక ప్రదర్శనా ఉన్నాయి .

          మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-4-16-ఉయ్యూరు 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరులో నాటకోత్సవం రెండవ రోజు జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శన ”అలేక్సాండర్ ”పై జ్యోతి కధనం

Inline image 1
Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2

కంచి వరద రాజ దర్శనం

కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ శక్యం కాక ,తన అసమర్ధతను కాపాడుకోవటానికి పరోక్షంగా కవి వాక్కుల ద్వారా చేయిస్తోందన్నాడు దీక్షితులు –‘’

‘’మన్యే నిజ స్కలన దోష మవర్జనీయం –అన్యస్యా మూర్ధ్ని విని వేశ్య బహిర్బభూషుః

ఆవిశ్య దేవ రసనాని మహా కవీనాం –దేవీగిరామపి తవస్తవ మాత నోతి’’.

‘’ మహా కవులు నిన్ను స్తోత్రం చేస్తే చేశారుగాక .తెలివి తక్కువ వాడి నైన నేను నీ ఒక్కొక్క అంగాన్నీ వర్ణించటం లో ఎక్కువ సమయం తీసుకొని నా మనసు నీ యందు లగ్నం చేసి ధన్యుడనౌతా’’ నంటాడు అప్పయ్య దీక్షితులు వరద రాజ స్వామితో .తమిళనాడు లోని తు౦డీర మండలం లో అన్ని  వైపులా క్షీర సాగరం ఉంది .దాని వైభవం బ్రహ్మ లోక వైభావాన్నే తక్కువ చేస్తుంది .నిరంతర వేద పఠన ,పాఠనాలతోతో ప్రతిధ్వనిస్తుంది .ఈ కాంచీ పురాన్ని చూసిన విద్వాంసుడు కూడా త్రిలోకాలను చూడటానికి ఇష్ట పడడట.

క్షీర సాగర మద్యం లో భగవానుని దివ్య ధామం ఉంటుందని కూర్మ పురాణం చెబుతోంది .శాక ద్వీపం చుట్టూ క్షీర సాగరం ,దానిలో శ్వేత ద్వీపం ,దానిమధ్య శ్రీమన్నారాయణ నివాసం ఉంటుందనీ చెప్పింది .’’ఆదిత్యో వా ఏష ఏ తన్మండలం ‘’అనే మంత్రం లో స్వామి వేదం త్రయ స్వరూపుడు అన్నది .తొమ్మిది యోజనాల విస్తీర్ణం లో ఆదిత్య మండలం ఉందనీ ,ఆ సవిత్రు మండల మధ్య వర్తి యై నారాయణుడు ఉంటాడని వాయు పురాణ కధనం .’’ధ్యేయ స్సదా స్సవిత్రు  మండల మధ్య వర్తీ నారాయణః ‘’అని పురాణం చెప్పింది .ఇది బ్రహ్మ సదనం కంటే పరమ మైనది అంది కూర్మ పురాణం .కంచిలో క్షీర నది గురించి బ్రహ్మాండ పురాణం లో ఒక కద ఉంది .కామ దేనువుకు దూడ లేక పోవటం తో వసిష్ట మహర్షి దర్భలతో ( కూర్చి )దూడను తయారు చేశాడు.దీనితో కామధేనువుకు పాలు చేపుకు వచ్చాయి .ఆపాలు వరదలై పారింది .అదే క్షీర నది .తెలుగులో ‘’పాలేరు ‘’అంటారు .ఇది కంచికి దగ్గరలో ఉంది .వేగావతీ నదినే క్షీరనది అంటారని వామన పురాణం లో ఉంది .హరి వంశం లో మరో కధనం ఉంది .విష్ణువు వరాహ రూపం దాల్చి,నాలుగు వైపులా నాలుగు శైలాలు ఉంచాడు .ఒక్కొక్క శైలం నుంచి ఒక్కో నది ప్రవహించింది .అని ,అవే వసుధార ,పయోధార ,ద్రుత ధారా ,,మధుధారలు అని ప్రసిద్ధి పొందాయి .దక్షిణ దిశలో ఉంది పయోధార అనీ పాలవంటి నీళ్ళు ఉండటం వలన ఆ పేరొచ్చిందని చెప్ప బడింది .ఈ నదుల నీరు తాగితే వాసు దేవ పరాయణులు అవుతారు అనీ చెప్పబడింది .

వరద రాజ దివ్య దర్శనం పుణ్యాత్ములకే సిద్ధిస్తు౦దన్నాడు అప్పయ్య దీక్షితులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞాన మయ కోశాలు దాటి ఆనందమయ కోశం లో ప్రవేశించినట్లుగా కంచిలోని నాలుగు ప్రాకారాలు దాటి ఆనందం అనే తీగ కు కాసిన  పండులాగా వరద రాజ దర్శనం చేస్తారు పుణ్యాత్ములు .తైత్తిరీయ ఉపనిషత్ లో ఆనందవల్లిలో మామూలు మానుషానందం కంటే అనంతమైన బ్రహ్మానందాన్ని భక్తుడు పొందుతాడు .మనుష్య ,గాంధర్వ ,దేవ గాంధర్వ ,పితృ ,ఆజాన దేవ ,కర్మ దేవ ,దేవ ,ఇంద్ర ,బృహస్పతి ,ప్రజా పతుల ఆనందం ఒకదానికంటే మరొకటి గొప్పది .దీనికంటే బ్రహ్మానందం అధిక తరమైనది .’’సో శ్నుతే సర్వాన్ కామాన్ ,ఆనందం బ్రాహ్మణో విద్వాన్ న భిభేతి కుతశ్చన’’అంటే కోర్కెలన్నీ తీర్చుకోన్నవాడు అవుతాడని ,నిర్భయంగా ఉంటాడని ఉపనిషత్తులు ఘోషించాయి .

కంచిలో హస్త గిరిపై నెలకొన్న పుణ్య కోటి అనే విమానానికి అంటే విగ్రహం ఉండే ప్రదేశానికి 24మెట్లున్నాయి ఇవి 24తత్వాలకు ప్రతీకలు .ఇవి దాటిన పురుషుడికి పరమ పురుష దర్శనం లభిస్తుంది .భక్తుడు భవసాగరాన్ని దాటి పోతాడు .ఇందులో సాంఖ్య దర్శన ప్రతిపాదన ఉంది .మూల ప్రక్రుతి ,మహాత్ తత్త్వం ,అహంకారం ,పంచ భూత తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు  పంచ మహా భూతాలూ అంటే ఆకాశం నీరు ,వాయువు ,అగ్ని,భూమి,11ఇంద్రియాలు ,అనే ఈ 24తత్వాలపైన పురుషుడు అంటే25వ  తత్వ మైన  పురుషునిగా ఉండటమే సాంఖ్యతత్త్వం .అలాగే ఇక్కడ 24మెట్లున్నాయి .అవి దాటిన వాడు  25వ పురుషుడు అయిన అంటే 26వ వాడైనశ్రీ వరద రాజ స్వామిని ఆరాధించాలి .సాంఖ్యం  24,దానితో పురుషుడు తో ఆగిపోతుంది .24తత్వాలు ప్రకృతికి చెందినవి .వీరి పురుషుడు సాక్షి .పురుషుని సాంగత్యం వలన ప్రక్రుతి జగత్తును నడిపిస్తుందని అంటుంది సాంఖ్యం.ప్రక్రుతి లక్షణాలకు దూరంగా ఉండి,అంటీ ముట్టకుండా ఉండటమే సాక్షి గా ఉండటమే ముక్తి అని సాంఖ్య సిద్ధాంతం వేదాన్తులుమాత్రం పురుషుడిని జీవునిగా భావించి పరమ పురుషుడిని చేరటమే మోక్షం అంటారు .ప్రక్రుతి ,పురుషుల సమాగం ఈశ్వ రేచ్చ లేనిదే జరగదు అంటారు వేదాంతులు .ఈశ్వరుడిని అంగీకరించాలనే వీరి సిద్ధాంతం .ఆ ఈశ్వరుడే వరద రాజ స్వామి .సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం .కేవల సాంఖ్య తత్వ మీశ్వరుడిని అంగీకరించదు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి

Inline image 1Inline image 2

‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే వడ్డాణ౦ అన్నమాట .శరీర మధ్య భాగాన ధరించే నగ .కాంచిని ఓద్యాణపీఠం అంటారు .స్వయంభువు చేత పూజింప బడింది కనుక కాంచి అయిందని శివపురాణసంగ్రహం అన్నది  .దిగ్గజాలు పూర్వం ఇక్కడ విష్ణువును పూజించటం చేత దీనికి ‘’హస్త గిరి ‘’అనే పేరొచ్చింది .కనుక కా౦చీని’’ హస్తగిరి’’ అనీ అంటారు .-‘’దిగ్నాగై రర్చితస్తత్ర పురా విష్ణుః సనాతనః ‘’

కాంచి అంటే ‘’మొలనూలు ‘’అనే అర్ధం కూడా ఉంది .మణి,కా౦చనాదుల ప్రభలతో వెలిగేది అని భావం .భూమిని విశ్వంభర అంటారు .భూమి అనే ఉత్తమ నాయిక మొలనూలుగా కాంచీ పురం భాసిస్తోంది .కాశీ ఖండం లో మూడు భువనాల కంటే మనోహరమైనది కాంచీ అని చెప్పబడింది .-‘’జగామ నగరీం కాంచీం కాంతాం త్రిభువనాదపి’’.భాగవతం దశమ స్కంధం ,71వ అధ్యాయం 4వ శ్లోకం లో  బలరామ తీర్ధ యాత్రా ప్రకరణం లో ‘’కామ కోటి పురీ కాంచీ ‘’అని ప్రశంసింప బడింది .’’మేరు తంత్రం ‘’అనే గ్రంధం కాంచీ –బ్రహ్మాండానికి నాభి స్థానం అని పేర్కొన్నది .అశోకుని శిలా శాసనాలలో చేర ,చోళ ,పాండ్య రాజ్యాలతో బాటు సత్య పుత్రుని రాజ్యం కూడా ఉందని తెలియ జేయ బడింది .కాంచీ ని’’ సత్య వ్రత క్షేత్రం’’ అనీ అంటారు .ఆ రాజును బట్టేఈ  పేరు వచ్చి ఉండ వచ్చు ‘’.బెంగాలీ విశ్వ కోశం’’లో కాంచీ ని ‘’మహా పీఠ స్థానం ‘’అని ఉన్నది  .అష్టాదశ శక్తి పీఠాలలో కాంచీ ఒకటి .

కా౦చీలో 108శివ క్షేత్రాలు ,18వైష్ణవ క్షేత్రాలున్నాయి .విష్ణు కంచిలో శ్రీ వరద రాజ స్వామి ఆలయం ప్రసిద్ధమైనది .అందులో వంద స్తంభాల మండపం ,శిల్ప ప్రతిభ వెదజల్లే రాతి వ్రేలాడే గొలుసులు ,,స్వామి మెడ లో సాలగ్రామ శిల బంగారు వెండి బల్లులున్నాయి.వాటిని తాకితే బల్లిపడిన దోషం పోతుంది. తాకిన వారిని తాకినా అదే ఫలితం కలుగుతుంది అని నమ్మకం .అమ్మవారి పేరు ‘’పెరు౦ దేవి ‘’పుష్పవల్లీ తాయార్ అనీ పిలుస్తారు .బంగారుపూత ఉన్న ధ్వజ స్థంభం ఇక్కడి ప్రత్యేకత .ఆలయ ప్రాంగణం లో అనంత తీర్ధం ,వసంత ,అభిషేక ,పవిత్రోత్సవ మండపాలు వైష్ణవ భక్త మందిరాలు ,ఉద్యానవనంముచ్చట గొలుపుతాయి .మే ,నూన్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లార్డ్ క్లైవ్ స్వామికి నవ రత్నాలు సమర్పించాడని ,ప్లేస్ అనే ఆంగ్ల దొర లక్షలు విలువ చేసే మణులు దానం చేశాడని చరిత్ర చెబుతోంది .

కాంచిలో 4కొట్టాలున్నాయి రుద్ర కొట్టం లో శ్రీ ఏకామ్ర నాధుడు ,కామ కొట్టం లో శ్రీ కామాక్షీ అమ్మవారు ,పుణ్య కొట్టం లో శ్రీ వరద రాజ స్వామి ,కుమార కొట్టం లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి కొలువై ఉంటారు .పూర్వ తమిళ సాహిత్యం లో ,పతంజలి భాష్యం లో కంచి వివరాలున్నాయి .పంచ లింగాలలో ప్రుద్వీలింగం అంటే సైకత  లింగమే ఏకామ్ర నాద స్వామి

అపరాజిత ,అశ్వత్ధ వృక్షాలతో అలంకరింప బడిన కాంచీ క్షేత్రం లో ఉన్న దివ్య సరోవరం దగ్గర బంగారు గృహం ఉందని అక్కడ  లక్ష్మీసమేత శ్రీ వరద రాజస్వామి వేంచేసి ఉన్నాడని అప్పయ్య దీక్షితులు వరద రాజ స్తవం లో వర్ణించాడు .వామన పురాణం ‘’తేజస్వంతులలో సూర్యుడు ,స్త్రీలలో రంభ ,ఆశ్రమాలలో గృహస్తాశ్రమం ,పురాలలో కాంచీపురం శ్రేష్టం అని చెప్పింది .-‘’తేజస్వినా యద్వది హార్క,ఉక్తో నారీషు రంభా ,–ఆశ్రమిణాం గృహస్తః  ,కాంచీ తదా శ్రేష్ట తయా పురీణాం-దేశేషు సర్వేషు చ మధ్య దేశః ‘’.కాశీలో ఉండటం కంటే  కాంచీలో ఉండటం శ్రేష్టం అని సనత్కుమార సంహిత –‘’శ్రీమత్కాశీపురీ వాసా ద్వాసః కాంచీ పురే వరః ‘’అన్నది .కాంచీ లో ఉన్న దివ్య సరస్సు దగ్గర ‘’పంచ నాగాది’’సరస్సులున్నాయని ,అందులో ‘’నాగ హ్రదం ‘’ శ్రేష్ట మని ,దాని దగ్గరే ఆశ్వత్దాది వ్రుక్షాలున్నాయని ,,మధ్యలో హిరణ్య గృహం ఉందని ,పుణ్య కోటి అనే విమానం ప్రసిద్ధమైనదని ,దానిలో దివ్య మూర్తి అయిన వరద రాజ స్వామి నెలకొని ఉన్నాడని సనత్కుమార సంహిత పేర్కొన్నది .ఇది ఛాందోగ్య ఉపనిషత్ లో చెప్పిన ‘అరశ్చహ వై —హిరణ్యం ‘’మొదలైన మంత్రాలతో చెప్పినట్లే ‘’ద్యులోకం లో అరమని ,ణ్య మని రెండు సముద్రాలున్నాయని ,అక్కడే సంతోషాన్నిచ్చే’’ ఐరం మదీయం ‘’అనే సరస్సు ,అమృతాన్ని స్రవించే అశ్వత్ధ వృక్షం ఉన్నాయి అని చెప్పినదానికి సరి పోలినది .బ్రహ్మ చర్యం పాటించని వారికి పొంద శక్యం కానిది ,హిరణ్య గర్భుని కి నివాసంగా ఉన్న బ్రహ్మ పురం ,దాని మధ్యలో స్వామి అధిష్టించే హిరణ్మయ మండపమూ ఉన్నాయి .

అప్పయ్య దీక్షితులు ‘’భక్తి ప్రదమైన ‘’విరజ ‘’అనే పేరుతొ విరాజిల్లే క్షీరనదిని దాటి  కాంచీ లో ప్రవేశించిన భక్తుడికి స్వామి పాద తీర్ధం తులసీ దళాలు పుష్ప సుగంధం లభిస్తాయని చెప్పాడు .విరజ అంటే రజస్సు లేనిది .సూక్ష్మ దేహం లయం అయినపుడు ,విశుద్ధులైన సత్పురుషులకు పరమ పదమే లభిస్తుంది .ఇంతటి విశిష్టమైనది కాంచీ పురం .

ఆధారం –శ్రీ మత్ అప్పయ్య దీక్షిత కృత –వరద రాజ స్తవం –దానికి  శ్రీ దేవరకొండ శేషగిరి రావు గారు రాసిన వ్యాఖ్యానం

మరో విషయం తో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

11-ఎన్టి .ఆర్ .కు భారత రత్న ఇవ్వండి

  ఎ.యెన్ .ఆర్ .కు ఇంకేదో ఇవ్వండి

అని అడిగేవాళ్లే కాని

నాటి మహానటులు  నాగయ్య గారి కి

బళ్ళారి రాఘవ గారికి గౌరవ స్థానం ఇవ్వమని అడిగేవారు లేరు  

కనీసం నందీఅవార్డ్ లను నాగయ్యస్మారక ,రాఘవ స్మారక

 అవార్డ్ లు గా ఇచ్చి గౌరవించ రాదా ,

అని ,నేనన్నా నంటే  ఏమీ అనుకోకండి .

12-ఉయ్యూరులో ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు

  నాటక పోటీలు నేటినుంచి నిర్వహిస్తున్న

గండి గుంట వాసి ,దూరదర్శన్ ప్రొడ్యూసర్

శ్రీ వల్లభనేని వెంకటేశ్వర రావు ను అభినందిస్తూ

ఈపనినే ఈ ప్రాంత రచయితలు  పరుచూరి బ్రదర్స్

ఇప్పటిదాకా ఎందుకు చేయ లేక పోయారో

అని ,నేనంటే ఏమీ అనుకోకండి  .

13-అంబేద్కర్ ఆశయాలను అరవై ఏళ్ళు వల్లె వేసినా

 ఒక్కనాడూ ఏ కాంగ్రెస్ ప్రధానీ ఆయన పుట్టిన ఊరు

చూడలేదంటే ,ఆయనకు భారత రత్న ఇవ్వలేదంటే

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు చందంగా ఉంది

అని ,నేనంటే ఏమీ అనుకోకండి .

14-బాబా సాహెబ్ నూట ఇరవై అయిదవ జయంతి

  చిరస్థాయి గా నిల్చిపోయేట్లుచేస్తూ ఆయన పుట్టిన చోటును

సందర్శించిన భారతతొలి ప్రధాని మోడీ ని

దళిత వ్యతిరేకిగా,మత రాజకీయ పోషకుడుగా

విపక్షాలు కోడై కూస్తున్నాయి

అని ,నేనన్నాంటే ఏమీ అనుకోకండి .

15-‘’ఆపరేషన్ ఆకర్ష్’’తో తెలంగాణలో’’ గులాబి కండువా ‘’ఆయనా

   ‘’ఆపరేషన్ వాక్యూం ‘’తోఆంధ్రాలో  ‘’పచ్చ కండువా’’ ఆయనా

ప్రతి పక్షం కోట గోడలు మొదలు కంటా కూల్చేస్తున్నారు

అని ,నే నన్నానంటే ఏమీ అనుకోకండి .

సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీరామ నవమి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు రేపు 15-4-16 శుక్రవారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

 

 

Inline image 2

Inline image 3


Inline image 1
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

3-ఆఘమేఘాలమీద రాజధాని అమరావతి

  ఉందోలేదో తెలియక పోయినా అనుమతి  

  బొక్కసం బొక్కే అయినా కేంద్రం  విదిలించకున్నా

పరాయి దేశాల పుణ్యమా అని సాగిపోతోంది

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

4-గ్రాఫిక్స్ కే పట్టం కట్టి ఇచ్చారు బహుమతి ‘’బాహు బలికి ‘

  మనిషి విలువ యంత్రానికి దిగదుడుపే నని ఇచ్చారు బలి  

‘’బాజీ రావు ‘’కు దక్కాల్సిన బహుమతి

 మానవత్వ కండల్లేని బాహుబలికివ్వటం

 బహు హృదయ వాదులను  బలి చేయటమే

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి  .

5-కొట్టూ కొట్టూ రనప్ రనప్ అంటూ

  వెంట పడి తరిమి సెమీస్ కు చేరిస్తే క్రికెట్

 ఫైనల్ కి చేరలేక చతికిల పడితే

ఆటగాళ్ళపై అభియోగం మోపితే క్రిటిక్, న్యాయమా

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

6-సీమ ఖాళీ ,ఉత్తరాంధ్ర ఊడ్చేసి

  సాగరాంధ్ర సముద్రం లో కలిపి

 ‘’ఫాన్ ‘’గాలి తీసి శిక్షించినా జనం

అదే వికృత నికృష్ట హావభావాలతో

ఇష్టం వచ్చినట్లు వదరి  బెదిరించి

‘’ రోజా’’లను ‘బూతుల ముళ్ళతో’’ జనాలపైకి వదిలి .

ఇప్పుడా ముళ్ళే గుచ్చుకొంటే బిక్క చచ్చి గుక్క పెట్టాడు

అని ,నేనంటే ఏమీ అనుకోకండి .

7-రాష్ట్రాల ఎన్నికలలు సాగిపోతున్నాయి

 ఎవరు ఎవరిని ది౦చుతారో ,  ముంచుతారో

‘’ఆం ఆద్మీలు ‘’తేలక ,తెలీక దిగులు పడుతున్న

ప్రజా అజెండా లేని జెండా నాయకులు

కొత్త కూటాలు కొత్త దిశా నిర్దేశం చేస్తాయేమో

అని, నేనంటే ఏమీ అనుకోకండి .

8-బాణా సంచా నిర్లక్ష్యం ఖరీదు

వందకు పైగా నిండు ప్రాణాల బలి

ఉత్సవాలూ మితి మీరకుంటేనే

ఉన్న వాళ్ళు చూసి ఆనందించేది

ఇందర్ని బలి ఇచ్చి బావుకునేదేముంది

అని ,నేనన్నంటే ఏమీ అనుకోకండి .

9-క్రాంత దర్శి కే .ఎల్ .రావు కల

 ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు

 నేడు ఆంధ్రాలో సాకారమై నదుల

 అనుసంధానం రూపుదాల్చిందంటే

ఆ’’ ఇంగితజ్న ఇంజనీర్’’ కు  జోహార్

సంకల్ప బలం తో సాధించిన బాబూ ,ఉమాలకు హేట్సాఫ్

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

10-‘’మెట్రో వద్దు గిట్రో వద్దు  

   రాజధానికి అంత భూమా?  

 ఫ్లై ఓవర్లు దేనికి దండగ ‘’

అని సన్నాయి నొక్కులు నొక్కే  

‘’ఉయ్యూరు’వృద్ధ నాయకుడి’’ మాటలెప్పుడూ

 ప్రజా వ్యతిరేకమే ,పదవి లేని ఈసు అసూయలే

అని ,నేన్నానంటే  ఏమీ అనుకోకండి .

సశేషం

     మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి

1-రేపు ‘’పవన్ ‘’కమలం నెత్తి మీదెక్కుతాడు

  ‘’జగన్ ‘’ను దువ్వకపోతే నెత్తిన ‘’చేతులే ‘’

కమలం సైకిల్ దోస్తీ మహా అయితే ఇంకో ఏడాదేమో

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

2-గడ ఎక్కి ముద్ర గడ దూకుతానని బెదిరింపు

 మధ్యలో తోకముడిచి ఎప్పుడూ కుంటి సాకుతో జంపు

లేస్తే మనిషిని కాను అనే ‘’కొంగర మల్లయ్య తీరు ‘’

అని , నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-16-ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

‘ మా అన్నయ్య ”ఆత్మీయ కవితా స్రవంతి-7

33-అందరికన్నా నా అన్న మిన్న –శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కైకలూరు -9441091692

త్రేతాయుగం లో లక్ష్మణుని అన్న శ్రీ రాముని కన్నా

ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అన్న బలరాముని కన్నా

కలియుగం లో శ్రీనివాసుని అన్న గోవిందరాజుల కన్నా

వర్తమాన కాలం లో తెలుగు యువత అన్న ఎన్ .టి.ఆర్ .కన్నా

నా అన్న నాకు మిన్న –వేరెవరూ సాటి రారన్నా .

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉయ్యూరు -విష్ణాలయం లో విశేష పూజలు ఏం .ఎల్.సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఛి సౌ శ్వేత వివాహం 20-4-16బుధవారం సందర్భం గా ఈ రోజు 13-4-16బుధవారం ఉయ్యూరు శ్రీ విష్ణ్వాలయం లో శ్రీ రుక్మిణీ కల్యాణం చేసిన దృశ్యా మాలిక Translate

This gallery contains 129 photos.

More Galleries | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

cr2 001 cr1 001సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ,జీవనాధారం సంపాదకీయ రచనే .ఈ రచనలో క్లుప్తత స్పష్టత నిబద్ధత ,వార్తవిలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తాయి .నిష్టగా ఇష్టం తో రాశారు .సుమారు 5వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా తెలుగు ,పోతన జీవన రీతిలో నీతి ,పత్రికలూ ,పరిణామం ,ప్రయోజనం వంటివి అమూల్యాలని పించాయి .’’పత్రికకు సంపాదకత్వం వహించేది సంపాదకుడో,అడ్వర్ టైజ్ మెంట్ మేనేజరో తెలియటం లేదు ‘’అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు .సంగీత సామ్రాజ్ఞి ఏం ఎస్ అంటే మహా అభిమానం .ఆమె సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గేయాలను పాడి యువతకు మార్గ దర్శనం చేశారని మెచ్చుకొన్నారు .ప్రజా హక్కుల సాధనకోసమే ఆయన కలం పనిచేసింది .ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయనది

సి రా .ఒక విజ్ఞాన సర్వస్వంగా భాసించే వారు .తాపీ ధర్మారావు ,విజయ లక్ష్మి ,చింతామణి ,కాశీనాధుని  ,స్మారక అవార్డులను అందుకొన్నారు .సిద్ధార్ధ కళా పీఠం,రాష్ట్ర ప్రభుత్వం ,రామినేని ఫౌండేషన్ ,మద్రాస్ తెలుగు అకాడెమీ వీరిని ఆహ్వానించి ఘన సన్మానం చేశాయి .జాతీయ సమైక్యతా పురస్కారం అందుకొన్నజర్నలిస్ట్ సరస్వతి ఆచారి గారు .సాటి పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు వీరిని ‘’త్యాగధనుడు ‘’అని కీర్తించారు .తమ విశ్వాసాలతో ఏకీభవించని వారితోనూ కలిసి మెలిసి సంచరించే విశాల హృదయం ఆయనది .ఇదే అరుదైన వ్యక్తిత్వం .అతిసున్నిత మనస్తత్వం ఆయనది .’’అక్షర శాస్త్ర దారి ‘’ అయిన ఆయన కలానికీ గళానికీ విపరీతమైన శక్తి ఉంది .మౌనంగా కళా సాహిత్యార్చన చేసే సంస్కారి .సంస్కరణ వివాహాలు వీరి చేతుల మీదుగా వెయ్యి కి పైనే జరిగాయి .వివాహ పరమార్ధాన్ని అతి తేలిక మాటలతో వివరించి చెబుతూ జరిపించే వీరి పధ్ధతి సర్వ జనామోదమైంది .విశాలాంధ్ర సంస్థాపకులు శ్రీ మద్దూరి చంద్ర శేఖర రావు ఉపన్యాసాల పరంపరకోసం ప్రముఖ పాత్రికేయులైన ఏం. చలపతిరావు గారిని ఆహ్వానించి ప్రారంభం చేయటం ఆయన విశాల దృక్పధానికి గొప్ప నిదర్శన .వీరి సంపాదక ప్రతిభను గుర్తించిన ఈ నాడు సంపాదకులు శ్రీ రామోజీ రావు పొత్తూరి వారితో వీరిని తమ పత్రికలో పని చేయమని ఆహ్వానం పంపగా సున్నితంగా ‘’ఎందుకు లెండి ‘’అని తిరస్కరించిన నిబద్ధత వారిది . నిరాడంబరతకు నిజరూపం ,విలాసాల మీద మోజు లేని వారు .కమిటెడ్ కమ్యూనిస్ట్ .

సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లోకాలు తేలిగ్గా గుర్తుంటాయి అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata  Natya  Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దాలుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం చేస్తూ ,కూచిపూడి వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసిద్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్టపర్తి వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తుంది .నటరాజ తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦  దర్శన మిస్తుంది .ప్రతీకాత్మక మైన సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం ,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తుంది ‘’అని విశ్లేషించిన సంస్కారి .

విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి మనసుకు హత్తుకోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని  ‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రుత్తి ధర్మం ఇది ప్రవ్రుత్తి ధర్మ౦ ‘’అన్నారు.  అప్పుడు వారి సంస్కారానికి జోహార్లర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జనులు ,సహృదయులు నిబద్ధ జీవి  ,విశాల హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం ,స్పురద్రూపం ,ఆకట్టుకొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గళ వాగ్వైభవం ,చాందస భావాలకు దూరం ,అయినా సనాతన సాహిత్యం పై విపరీతమైన అభిమానం ,పూర్తీ కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా ఆయన సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం ,అభిరుచి ఉన్నవారే శ్రీ చక్ర వర్తుల రాఘవాచారి .ఈ పేరు చాలా మందికి తెలియదు .సి రాఘవా చారి అంటే కొంతమందికీ ,సి రా ‘’అంటే ఇంకొంచెం మందికి విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది .33 ఏళ్ళు  విశాలాంధ్ర దిన పత్రికకు సంపాదకులుగా ఉండి,ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చినవారు .విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదు .రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు .చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పున్నవారు .ఆయన విజయవాడ వారే అని అందరూ అనుకొంటారు . కాదు .

బి ఏ చదివి ,సంస్కృతంలో విద్యా భూషణ అయి ,ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ .సాధించి  ,హైదరాబాద్ ఏ ఎస్ .సి లో పండిత శిక్షణ పొంది ,సంస్కృతం  లోనూ ఏం ఏ .అందుకొని ,మూడేళ్ళు సంస్కృత ఉపన్యాసకురాలిగా పని చేసి ,16ఏళ్ళ నుండి తెలుగు పండితురాలిగా ఉద్యోగిస్తూ ,  శ్రీ కోయిల్ కందాడైశ్రీనివాసన్ ను వివాహమాడి ,పుత్రుని పొంది ,సరసభారతికి ఆత్మీయురాలైన శ్రీమతి కొమాండూరి కృష్ణా ,’’రాఘవాచారి గారి సంపాదకీయశైలి  ‘’అనుశీలనం 2008లో  రాసి ప్రచురించి నాలుగు నెలల క్రితం  నాకాపుస్తాకాన్నిస్తే, తీరికగా నిన్నా ఇవాళా చదివి ,అందులో చాలా విషయాలు చాలా మందికి తెలియవు అనే అభిప్రాయం తో ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .

సాహితీ సంపాదకచక్రవర్తి శ్రీ చక్రవర్తుల రాఘవా చారి తెలంగాణాలోని వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘’శాతాపురం ‘’లో 10-9-1939న శ్రీ నల్యాన్ చక్రవర్తుల వరదాచార్యులు ,శ్రీమతి కనకవల్లి దంపతులకు జన్మించారు .తొమ్మిది మంది సంతానం .అయిదుగురు అన్నదమ్ములలో చివరి వాడు .అందరు ‘’రాఘవన్ ‘’అని పిలిచేవారు .తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల గ్రామం .ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు .అమ్మ తమిళం నేర్పింది .ఆంధ్రనామ సంగ్రహం ,రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు .అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో శ్రీ సంపత్కుమారాచార్య ,చల్లా సత్య నారాయణ శాస్త్రి గారల వద్ద పంచకావ్యాలు నేర్చారు .1951లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తీ చేశారు .  నిజాం కాలేజి లో పి యు  సి .మొదటి బాచ్ లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ రాంక్ లో పాసైనారు .ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీర్ణులయ్యారు

1961లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్ కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రిడేన్స్’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అయినా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్ ,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్ ,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధులు .అప్పటికే కమ్యూనిజం ను అవపోసనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపోయి అమరురాలైన శ్రీమతి చాకలి ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు  ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గరగా పాకలు వేయించి ఆసుపత్రులుగా మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు వీరి తల్లిగారు .1953నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రారంభించారు ‘’జన ధర్మ ‘’ను కూడా  చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే ఇష్టపడి చదివేవారు .

కాలేజీ చదువులోనే’’ క్రీడాభిరామం లో ఓరుగల్లు వర్ణన ‘’వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు .శ్రీ శ్రీ వరవర రావు లపై రాసిన వ్యాసాలూ ‘’సృజన ‘’లో ప్రచురితమైనాయి .ఇప్పటికీ రోజుకు రెండు గంటలైనా సాహిత్యాధ్యనం చేయకుండా ఉండరు .భావాలలో కమ్యూనిస్ట్ అయినా వేషధారణ సంప్రదాయ పద్ధతిలోనే ఉండేది .పిలక కూడా ఉండేది అందుకే విద్యార్ధి దశలో ‘’యెర్ర సభ్యతం ‘’తీసుకోలేదు .తండ్రి తద్దినాలు కూడా పెట్టేవారు .చివరి సారిగా 1959-60లో పెట్టి ‘’ఇక పెట్టను ‘’అని ప్రకటించి సభ్యత్వం  తీసుకొన్న నిబద్ధత ఆయనది ..ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపిన వారాయన .శ్రీ కనపర్తి నాగయ్య గారి చివరి కూతురు ,న్యాయవాది అయిన శ్రీమతి జ్యోత్స్నను ‘’కులాంతర  ఆదర్శ ,ప్రేమ వివాహం ‘’చేసుకొన్నారు . ఈ విషయం నా లాటి చాలామందికి తేలియదు.వీరిది చాలా అన్యోన్య దాంపత్యం .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’అయిన భర్తావద్ద ధర్మ సందేహాలు తీర్చుకోనేవారామె .

న్యాయ వాదవ్రుత్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రుష్టి పెట్టారు .భారత రాజ్యాంగం ,ఇతర దేశాల రాజ్యా౦గాలను  తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్ పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’  అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్ ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,  లింక్ పేపర్లకు పని చేశారు .1968లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .

అనేక విశ్వ విద్యాలయ జర్నలిజం కోర్సులకు అధ్యాపకులుగా ,సందర్శనాచార్యులుగా ,,ఎక్సామినర్ గా సేవలందించారు .1971లో విశాలాంధ్ర సంపాదక వర్గం లో చేరి ,1972లో సంపాదక బాధ్యత,2002వరకు  వహించి దాని ఉన్నతికి ముఖ్యకారకులైనారు .2006లో సాంకేతికంగా విశ్రాంతి పొందినా సలహాలు సంప్రదింపులు అందిస్తున్నారు .33ఏళ్ళ కుర్ర వయసులో సంపాదకుడైన ఆచారిగారు’’ ప్రజా సంపాదకులు ‘’ గా పేరు తెచ్చుకొన్నారు .

పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో శ్రీ దుర్ముఖి ఉగాది పంచాంగ శ్రవణం 

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో పంచాంగ శ్రవణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment