ఆపన్న హస్తాలు

హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది ,ఊళ్ళో వాళ్ళు వాళ్ళను చూసి నవ్వుకుంటారు ..తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా .నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది .చీకట్లు అలముకున్నాయి .ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు .చేతిలో బాటరీ లైట్ కూడా లేదు .కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది .. నిలువైన కొండ అంచు నుంచి జారిపోయాడు .ఇంతలో పొడవుగా  తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డం తో ఉన్న ఒక ముసలాయనఆపన్న హస్తాలు   అందించి పైకి లాగి  బయటకు చేర్చికాలిబాట పట్టించి  రామా తో ”ఇది దివ్య ధామం .రక్షిత ప్రదేశం .నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని ”చెప్పి పది నిమిషాలలో  బయట  దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకు వెళ్ళాడు  ఇద్దరూకలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు .స్వామి రామా ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు ..ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు .ఇంతలో గుడిసె లో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి ,తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు .వెచ్చదనం కోసం లోపల  మంట  మండుతోంది  .

  రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు .సాధువు కన్నీరు కారుస్తూ ”నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా ?ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశం లోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను .నీకు కనిపించిన మహానుభావుడే  నన్నూ  ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు .మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు .ఆయనను నేను ”సిద్ధ బాబా ”అని పిలుస్తాను .నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి ”అన్నాడు గద్గద స్వరం తో .
  మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు .తాను  జారిన ప్రదేశం దగ్గర వెతికాడు .తాను  జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు.ముసలాయన పద చిహ్నాలు లేవు .  .ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా . తాను  బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు ..దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు .అక్కడి వారందరికీ తమకుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ  ప్రమాదాలనుంచి కాపాడే వాడు ఆ సిద్ధ బాబాయే  అనే నమ్మకం లో ఉన్నారని తెలుసుకొన్నాడు  .
  ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరం లో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు .అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు .గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా  ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది .ఆయన సిద్ధిపొందాక ఆ ప్రదేశం లో ఆరు అడుగుల చతురం లో గుడికట్టారని ,లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని ,అప్పటినుంచి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించిసిద్ధబాబా ను స్మరించి వెడతారని ,ఆసిద్ధ బాబాయే  తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు .ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ,ధ్యానాలు చేశాడు .   స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోందికనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు ..కూలీలు వచ్చి గుడి ని పడ  గొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు …అడుగు లోతు  నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి .తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ లోపలి తవ్వారు .లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగి0దేకాని తగ్గలేదట.దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయం లో దీపం వెలిగించి,మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట .ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు ,దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది .కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు ..ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతం గా ఉన్నాయని  గ్రహించి త్రవ్వకం ఆపేశారు .
  పోనీ శివలింగాన్ని త్రవ్వి పీకి పారేద్దామని ప్రయత్నం చేశారట .8 అడుగులు తవ్వారు .”అంబ” పలక లేదు యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియ లేదట . కనుక పీకలేక తోక ఝాడించేశారు  .ఒక రోజు రాత్రి ఇంజనీర్ కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి ”ఈ శివ లింగం అత్యంత మహిమాన్వితమైనది .దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు .ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు ”అని చెప్పాడట .అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా  రిపేర్ చేసి  లెంపలు వాయించుకొన్నారట .అందమైన ప్రకృతి  మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిత,మహిమాన్విత శివాలయం అది దానికే తారకేశ్వరాలయమనీ పేరుంది
  ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం .దీన్ని శివ సిద్ధ క్షేత్రమనీ పేరుకూడా ఉంది .తరువాతకాలం లో తాండ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు
.
Inline image 1
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా     

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి

ప్రాచీన సంస్కృత గ్రంధాలు దేశం లో విభిన్న ప్రాంతాలలో ఉన్నవారు రచించారు … అందుకని వాటిలో అనేక రకాలపాఠాలు  ఉన్నట్లు కనిపిస్తుంది . వ్రాయసగాని అశక్తత ,లేక అక్షరాలను అర్ధం చేసుకో లేకపోవటం కారణాలుకావచ్చు ..మరోసారి అనుకున్న భావం ఆపదం తెలియ జేయలేకపోయిందని రాసేవాడు మరో పదాన్ని దాని బదులు చేర్చి ఉండచ్చు ..మన క్లాసికల్ సాహిత్యం ప్రతి దానికీ అనేక పాఠాలు  కనిపిస్తాయి .. వేదానికి ఒక్క దానికి మాత్రమే  ఈ అనేక పాఠాలు కనిపించవు .అది ఎక్కడైనా ఒకే రకమైన పాఠంగా దర్శన మిస్తుంది ..కనుక సాహిత్య గ్రంధాలలో పాఠక  భేదాలు కనిపిస్తాయి .దీనికి కారణాలు -1-ఒకే రకమైన అక్షరాలూ ,అక్షర సముదాయాలు 2-పదాలను తప్పుగా విడగొట్టటం లేక కలపటం 3-అక్షరాల మార్పిడి 4-ఉచ్చా రణలో దోషాలు 5-కొత్తపదా లను అర్ధం తెలీకుండా కూర్చటం 6-పంక్తుల మధ్య ,రాసింది కప్పి వేయబడటం

ఇవి కాక’’ కార్తె’’ మరి కొన్ని కారణాలు చెప్పాడు .మరి కొందరు మరిన్ని కారణాలు కనుగొన్నారు ..వ్యాఖ్యాత తానూ దేనిపై వ్యాఖ్యానం రాయ బోతున్నాడో దాని సరైన పాఠాన్ని ఎన్ను కుంటాడు ..పాఠక భేదాలుంటే పదం అర్ధం భావం కూడా మారిపోతాయి ..దీనివలన వ్యాఖ్యాతల మధ్య అభిప్రాయం భేదాలేర్పడతాయి .తమకు నచ్చినదాన్ని తీసుకొని మిగిలిన వాటిని ప్రక్కకు పెట్టటమే ,లేక లెక్క చేయకపోవటంతో జరుగుతుంది .ఇవన్నీ గమనించిన మల్లినాథుడు పాఠక భేదాలన్నీ తెలుసుకొని ,చర్చించి మంచి  చెడు  తేల్చి వాటిలో గుణగ్రాహకమైన వాటిని స్వీకరించాడు  .సరైన పాఠాన్ని గ్రహించటానికి మల్లినాథుడు మూడు పద్ధతులు పాటించాడు -1-ఒక్కోసారి వాటిని గూర్చి ఊరికే చెప్పటం 2-మరోసారి వాటిని క్షుణ్ణంగా చర్చించి నిగ్గు తేల్చటం 3-తనకు నచ్చిన పాఠాన్ని గ్రహించి మిగిలిన వాటిని ,వాటిపై వ్యాఖ్యానం రాసిన వారినీ తిరస్కరించటం -రఘు వంశం లో 1-19 లో మల్లినాథుడు’’ శాస్త్రేష్వ కుణి ఠతా వృద్ధిహ్ ‘’ను ఇచ్చి వ్యాపృత పాఠ0 అన్నాడు ..రఘు వంశం -5-23 లో ‘’ప్రత్యగ్రహీత్సంగ గర మగ్రజ న్మా ‘’అనే దానికి ‘’తాంగిర0 ఇతి కేచిత్ పఠన్తి ‘’అని వ్యాఖ్యానించాడు

 మరికొన్ని చోట్ల మల్లినాథుడు కారణాలు ముఖ్యంగా వ్యాకరణ విషయం లో తెలియజేసేవాడు -కుమార సంభవం లో 5-13 లో సూరి ‘’ద్వయీ ‘’అనే మాటను తిరస్కరించి ‘’ద్వయే ‘’ను సమర్ధించాడు .పాణిని ప్రకారం ద్వయీ అనేది  ద్వయ మొదలైన వాటి స్త్రీలింగం అని దాని అర్ధం -’’ద్వై అవయవై యస్యాహః సా ‘’అని అంటే రెండు అవయవాలున్నదని భావం అని ఇది సందర్భానికి తగిన మాట కాదని చెప్పాడు .

 కుమార సంభవం లో  ‘’శుభ్రు ‘’పదాన్ని గురించి ‘’విమానానా శుభృకృతః పితుగృహే ‘’లో శుభ్రు పద ప్రయోగం లో అవమానం ఏమీ లేదు ‘’అందమైన కనురెప్పలుగల  పితృగృహం లో ఉన్న ఓ పార్వతీ ‘’అనటం లో తప్పేమీ లేదని సమర్ధించాడు .కొందరు వ్యాఖ్యాతలు శుభ్రు అనేది వ్యాకరణ విరుద్ధ శబ్దం అన్నారు .మరొక పాఠాన్ని తీసుకొని వారివాదాన్ని సమర్ధించుకున్నారు ..మల్లినాథుడు వారి వాదాలను నిర్ద్వంద్వముగా తిరస్కరించి శుభ్రు నే సమర్ధించాడు .మేఘ దూతం లో కాళిదాసు ‘’సగంధ ‘’ పదం వాడితే లక్ష్మీ నివాసుడు ,మహిమాగని మొదలైన వ్యాఖ్యాతలు ‘’సగర్వ ‘’అన్న పాఠక భేదాన్ని సమర్ధించారు ..ఆపదం  పై మల్లినాథుడు విభేదించలేదు కారణం రెండూ ఆ సందర్భం లో సమాన అర్ధాన్నే ప్రతిపాదిస్తున్నాయన్నాడు .దీనికి ‘’విశ్వ కోశం ‘’నుంచి ఉదాహరణ  చూపించాడు -’’గంధో  గంధక ఆమోదే లేశే సంబంధ గర్వయోహ్ ‘’.శాకుంతలం లో కూడా కాళిదాసు ‘’సగంధ ‘’శబ్దమే వాడాడు .

 మరికొన్ని చోట్ల ఇతర వ్యాఖ్యాతలు ఉదహరించిన పాఠక భేదాలను తిరస్కరిస్తూ కారణాలు చక్కగా స్పష్టపరచాడు మల్లినాథుడు ..అలాకామ్ పదాన్ని దక్షిణావర్త నాధుడు ఒప్పుకున్నాడు .ఉత్తర మేఘం లో ‘’ఆలకే  బాల కుందాను విధ్వం ‘’పై మల్లినాథుడు వ్యాఖ్యానిస్తూ -’’’’అలక మితి ప్రధమాంత పాఠే సప్తమీ ప్రక్రమ భాంగః స్యాత్ -నాధ స్తు నియత పుంలింగతా హానిశ్చేతి  దోషాన్తరా మహతా దసత్ -స్వాభావ వక్రణ్య లకాని పారిత మురహ్ -కృత్సనీ ధరహః ఖండితః ఇత్యాదిషు ప్రయోగేషు నపుంసక లింగ గతాదర్శనాత్ ‘’

 మరొక చోట ‘’మహాభాగా ‘’పదాన్ని మల్లినాథుడు సంబోధక ప్రధమా విభక్తిగా భావిస్తే ,భక్తి హేమాద్రి ,చారిత్రిక వర్ధనుల ’’తాయా ‘’ను  తీసుకొని రెండూ నైరూప్య నామవాచకం యొక్క విభాగాలు అన్నాడు .-’’భక్తిహ్ ప్రతీక్షేషు కులోచితా తే పూర్వాన్ మహాభాగ తాయాతి శేషే ‘’-’’పూర్వాన్ మహా భాగవతయా విశేషే ‘’.

మేఘ దూతం లోని ‘’కామార్త హి ప్రక్రుతి కృపణా శ్చేతనా చేతనేషు ‘’వాక్యాన్ని ‘’ప్రణయక ప్రనాహ ;;పాఠం నువ్యాఖ్యాత  వాసుదేవ అంగీకరించాడు ప్రణయ పదం ప్రార్ధన అనే అర్ధాన్ని ఇస్తోందికూడా .దీన్ని విక్రమోర్వశీయం లో కూడా కాళిదాసు వాడాడు .మల్లినాథుడు ప్రక్రుతి ప్రాణాహుని పాఠాన్ని గ్రహించాడు .ప్రేమికులలో ఉండే జ్ఞాన అజ్ఞాన వివరణలను  ఇది సూచిస్తుందని మల్లినాథుని భావన .ఇక్కడ  ప్రార్ధన  అనే అర్ధం సరికాదు అని చెప్పాడు సూరి

 రఘు వంశం లోని ‘’మరుత్సఖస్యేవ బలాహకస్య గతిర్విజ ధ్నే నహి తప్రతస్య  ‘’వాక్యం తప్పనిసరిగా పరిశిలింప దిగింది ..వసిష్ఠుని శరీరం శక్తిని ప్రదర్శిస్తోంది దాన్ని గాలి గాలి అడ్డుకోలేక పోతున్నాయి ఇక్కడ మారుత్సఖ పదాన్ని బహువ్రీహిగా భావిస్తే పదం అందం చల్లారెట్లు పెరుగుతుంది పాణిని ప్రకారం అది తత్పురుష .మల్లినాథుడు పాణిని నే అనుసరించాడు హేమాద్రి ,చరిత్ర వర్ధను లు కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నారు -’’మరుతః సఖేతి తత్పురుషో ,బహువ్రీహో సమాసాంతా భావత్ ‘’

మల్లినాథుడు అనేక చోట్ల అన్య పాఠాలను తిరస్కరించాడు శిశుపాల వధలో బాహ్లికుని అశ్వాలు రేపిన ధూళి  వర్ణన ఉంది .భూమిపై గుర్రం యొక్క కదలిక లు ప్రేయసీ ప్రియుల సంధానంలాగా ఊహించాడు కవి .గుర్రం  నిస్శ్వాసం దుమ్ముకణాల వెదజల్లుడుగా ఊహించాడు  . భూమిపై వెంట్రుకల వ్యాప్తిలా అనిపించింది .ముక్కు పుటాలు ఎగర వేయటం రోమాలు నిక్కబొడుచుకొని మరింత ధూళి లేవటంగా అనిపించింది -’’నాసా విరొక పవనోల్లసితంతమీ యో -రోమాంచనామివ జగన్ రజః పృధివ్యాహ్ ‘’

 సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా అమరవీరుల సంస్మరణ దినం

–Inline image 1– Inline image 2Inline image 3


Inline image 4
Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వీక్లీ అమెరికా ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )

వీక్లీ అమెరికా -8-(2)

ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )

22-5-17 నుంచి 28-5-17 వరకు

       శని ఆది సోమవారాలలో కార్యక్రమ వివరాలు

27 28 తేదీలలో ఉదయం 5-30 కు ధ్యానం ,6-నుంచి 6-30 వరకు సుప్రభాతం 6-30 నుంచి 7 వరకు నగర సంకీర్తనం ,7 నుంచి 8 వరకు ఉపాహారం  8 నుంచి 8-40 వరకు భజన 9 నుంచి 10-15 వరకు శ్రీమతి గీతారామ్ ప్రసంగం ,10-20 నుంచి 10-50 వరకు బ్రేక్ ఫాస్ట్ ,11 నుంచి 12-30 వరకు ‘’పని కొ ట్లు’’ అంటే వర్క్ షాప్స్ ,12-30 నుంచి 1-45 వరకు భోజనం మధ్యాహ్నం 2 నుంచి 3-30 వరకు మళ్ళీ ‘’పని దుకాణాలు ‘’,3-30 నుంచి 4 వరకు టీ బ్రేక్ ,4 నుంచి 5 వరకు శనివారం నాడు కొస్బి పావెల్ ప్రసంగం 5నుంచి -6-15 వరకు రోమెల్ చిత్తూరి  ఉపన్యాసం 6-20 నుంచి 7 వరకు భక్తి గీతాలాపన రాత్రి 7-నుంచి 8 వరకు -డిన్నర్ ,,రాత్రి 8-15 నుంచి  10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ,ఆదివారం ఉదయం మధ్యాహ్నం శ్రీమతి గీతా రామ్ ప్రసంగాలు 4-నుండి 5 వరకు టామ్ లసంటా  ఉపన్యాసం 5 నుంచి 6 వరకు గీతా రామ్ తో ముఖా ముఖి మిగిలినవన్నీ పై విధంగానే

29-5-17 సోమవారం -ఉదయం ధ్యానం ,సుప్రభాతం  నగర సంకెర్తన  బ్రేక్ ఫాస్ట్ తర్వాత రిట్రీట్ పై సమాలోచనం 8-40 నుంచి 9 వరకు హారతి తో మూడురోజుల రిట్రీట్ సమాప్తం .

 మొత్తం 600 మంది ఈ రిట్రీట్ లో స్వంత  ఖర్చులు పెట్టుకొని వచ్చి ,డబ్బు పెట్టి హోటల్ రూమ్స్ లో ఉంటూ ,కార్యక్రమాలలో పాల్గొని తమ అకుంఠిత సాయి ఆరాధనను చాటుకున్నారు .ఇంతమందికి విసుగు విరామం లేకుండా ఇక్కడ సేవలు అందజేశారు .సాయి భావ దీప్తికి నిదర్శనమే నిలిచారు రిట్రీట్ ను జయప్రదం చేశారు . ప్రసంగాలన్నీ ఇంగ్లీష్ లోనే అని మరువరాదు .తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటె మధ్యలో తెలుగు పదాలు ఎక్కడైనా రావచ్చు తప్ప అంతా ఆంగ్లం లోనే అందరికీ అర్ధమయ్యేటట్లే ప్రసంగాలు చేస్తారు . ఇక్కడ ఏ సభలో నైనా అంతే అని గమనించాలి . ఏ ప్రసంగాన్ని అయినా అత్యంత శ్రద్ధతో విన్నారు .’’పిన్ డ్రాప్ సైలెన్స్’’ పాటించి సంస్కారాన్ని చాటారు .దీనికి అందర్నీ తప్పక అభినందించాలి .

 రాలీ సెంటర్ వాళ్ళు మాకు 100 ఆపిల్ పళ్ళు ఉన్న పెద్ద బాక్స్ ‘’ప్రసాదం ‘’  అని చెప్పి ఆదివారం మేము ఇంటికి బయల్దేరే టప్పుడు వాళ్ళే తీసుకొచ్చి కారులో పెట్ట్టారు .ఇంకో బాక్స్ కూడా ఇస్తామంటే మేమే  వద్దన్నాం . ఈ వంద ఆపిల్స్ ను ఎలా సద్విని యోగం చేయాలో మా అమ్మాయి ఆలోచించింది .వచ్చేశనివారం తెలిసినవాళ్లు ఇంట్లో రుద్రాభిషేకం భోజనాలకు ఆహ్వానించారట అక్కడ సద్వినియోగం గా ప్రసాదంగా పంచి బెట్టాలని నిర్ణయించింది .చక్కని గ్రామీణ వాతావరణం లో పరిశుభ్రత ,పారిశుద్ధ్యం  భక్తి ,ప్రేమ సేవ ల మధ్య మనసులకు తాకే ప్రసంగాలతో  భక్తిభావ భజన లతో  ఆప్యాయత వర్షించే ఆతిధ్యం తో రెండు  రోజులు గడిపి మానసిక ఆనందాన్ని పొంది రీకూప్ అయి ఇంటికి తిరిగి వచ్చాము . ఇప్పుడు ప్రసంగ విషయాలు రాస్తాను ..

 జార్జియా కు చెందిన కాస్బి పావెల్ ప్రసంగం లో 1979 లో సత్య సాయిని మొదటి సారి దర్శించినట్లు ,తర్వాత బెంగుళూరులో 20 వేల  మంది ఉన్న సభలో ఉపన్యాసమిచ్చిన సాయి ని చూసి నట్లు ,తానూ ఒకసారి కస్టమ్స్ అధికారులవలన ఇబ్బందులు పడుతుంటే తెల్ల దుస్తులతో వచ్చి పరిష్కరించిన సాయిని చూసినట్లు ,పుట్టపర్తి రాగానే తనకేమీ తెలియ నట్లు ‘’నీకు కస్టమ్స్ వారి వాళ్ళ ఏదైనా ఇబ్బంది కలిగిందా అని అడిగినట్లు ,I+I=WEఅని సాయి చెప్పారని ,సాయి ఉపన్యాసాన్ని ఒకామె ఇటాలియన్ భాషలోకి అనువదించి చెబుతుంటే ఆమెకు సరైన పదం దొరక్క ఇబ్బంది పడుతుంటే బాబా అర్ధవంతమైన ఇటాలియన్ పదాన్ని సూచించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన సర్వాంతర్ వ్యాపి అనటానికి  ‘’లవ్ ఈజ్ గాడ్ ‘’అనటానికి ఇది నిదర్శన మని తన అనుభవాన్ని తెలియ జేశాడు

 గ్రీన్స్ లాండ్ సెంటర్ ప్రెసిడెంట్ గిరీష్ జంధ్యాల బాబాతో తన అనుభవాన్ని 10 నిమిషాలలో చెప్పాడు .ప్రసాదం గా పులిహోర అడిగి అడిగి మరీ పంచమని తనకు బాబా ఇస్తే అందరికీ పంచానని ,కానీ బాబా రెండుమూడు సార్లు రెట్టించి అడిగి అక్కడ ఒక కుర్రాడికి తక్కువే పెట్టావు వాడు దాన్ని వాళ్ళ అమ్మకు కూడా పెట్టాలి .అని చెప్పటం తనకు ఆశ్చర్యం కలిగిందని గొప్ప అనుభూతితో తెలియ జేశాడు .

శ్రీ రోమెల్ చిత్తూరి  ముస్లిం .అమితమైన సాయి భక్తుడు భజనలతో పరవశిస్తాడు . 2012 రిట్రీట్ లో ఆయన్ను చూశా .మాట్లాడా .తానూ రాసిన పుస్తకాలు కూడా ఇచ్చాడు . చక్కని ప్రాసంగికుడు . మాటలప్రవాహం లో కొట్టుకు పోవాల్సిందే . i +i=we కాదని Iమాత్రమే అవుతుందన్న ఉపనిషత్సారం చెప్పాడు రోమెల్ .భక్తులు పార్ట్  టైం గా కాక పూర్తి భక్తులుగా మా రాలని ,తనను బాబా ఐ ఎస్ పరీక్షకు తయారు కమ్మని ఆదేశిస్తే రోజుకు 16 గంటలు స్వామి సేవ చేస్తూ చదువుతూ పాసయ్యానని చెప్పాడు .తనకు గుండె ఆపరేషన్ జరిగితే స్వామి వచ్చి తన చెయ్యి పట్టుకొని ధైర్యం కలిగించారని ,తానూ సి బి ఐ ఆఫీసర్ గా దేశమంతా పనిచేశానని విదేశాలలో కూడా పని చేశానని ఎక్కడ చేసినా సాయి సత్సంగాలు నిర్వహించి సాయి పుస్తకాలు పంచి ప్రజలలో సాయి అవేకెనింగ్ తెచ్చానని ,తనపై అభి యోగాలు మోపితే అవి అన్నీ తప్పుడు వేనని స్వామి కృపవలన రుజువై తనజీవితం  మచ్చలేని జీవితంగా బాబా మలచారని ,రువాండాలో తానూ రిట్రీట్ చేస్తుండగా సత్య సాయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసినట్లు అక్కడి వాళ్ళు తనకు చెప్పారని వాళ్లకు బాబా ఎవరో అసలు తెలియదని దీన్ని బట్టి నమ్మిన వారికి బాబా ఎంత చేరువలో ఉంటారో తెలిసిందని ,ఆయనపట్ల శరణాగతి ఉంటె అన్నీ ఆయనే చూస్తారని ,తానూ డిగ్రీ చదివిన మూడేళ్లు అన్ని వ్యసనాలకు బానిసయ్యానని ,తన పాత్ర ఏమిటో లోకానికి తెలియ జేయటానికి బాబా తనను ఆ  చెడు  అభ్యాసాలనుంచి దూరమయ్యేట్లు చేసి ఐ ఎస్ చదివించారని కృతజ్ఞతతో చెప్పాడు ‘’take active roll the rest He would do ‘’అటూ ప్రచార ఆర్భాటాలు వద్దు ,ఆయనకు ఇష్టం ఉండదు అతి వినయంగా ఉండాలి ప్రతి ఇంట్లో సాయిబాబా కు ఒక కుర్చీ వేసి పవిత్రంగా ఉంచితే ఆయన అన్నీ  చూస్తాడు .తాను  ఒక దొంగతనం కేసులో ప్రభుత్వ దనం కోట్లాది రూపాయలను దొంగలనుంచి స్వాధీన పరచుకొంటే ప్రభుత్వం తనకు 3 లక్షల నగదు పారితోషికమిస్తే దాన్ని బాబా పాదాలవద్ద ఉంచి దాన్ని కనిపెట్టించింది నువ్వే కనుక ఇది నీదే అని సమర్పించానని ,కానీ ఒక ధనికుడు 25 లక్షల చెక్కు పంపిస్తే అన్యాయపు సొమ్ము అది దాన్ని తగలబెట్టమని తగల బెట్టించారని ఆయనకు విలువలతో కూడిన జీవితమే ఇస్ట మని  చెప్పాడు .

20–3-2011 న సత్య సాయి అందరికి రెండు చేతులు ఎత్తి  నమస్కరిస్తూ చివరి దర్శనమిచ్చారని ,మనం కూడా అలాంటి ప్రేమతో అందర్నీ పలకరించాలని ,స్వామి శివానంద ను  పుట్టపర్తిలోని డాక్టర్ నర్సింహన్  ఒకప్పుడు బాబా దర్శనం వలన ఏమిటి ప్రయోజనం అని అడిగితె ‘’సత్య సాయి సందర్శనం లక్ష దేవుళ్ళ దర్శనం తో సమానం ‘’అని చెప్పారని ,తానూ ఒకసారి పాలం బాగ్ లో  లో నగర సంకీర్తనం చేస్తుంటే ఉదయాన ఆకాశం నుంచి వింతకాంతి భూమి మీద ప్రసరించటం అందరూ చూసి పులకించారని ,అందుకే బాబాకు సంకీర్తన చాలా ఇష్టమని చెప్పాడు ..’’భారత దేశం ధర్మ రాజు అయితే అమెరికా అర్జునుడు ‘’అని గొప్ప గా రోమెల్ అభి వర్ణించాడు  .’’మూడు సి ‘’లను దూరం చేసుకోవాలని అవే కంపారిజన్ ,క్రిటిసిజం ,కంప్లెయింట్ అని వివరించాడు .ఈ మూడూ దూరమైతే  ఇలపై  స్వర్గమే నర్తిస్తుంది .చివరగా ;’’;వన్  లవ్ ,వన్ ఫ్యామిలీ వన్ వరల్డ్ ‘’అనేది బాబా ఆదర్శమని అందరం దాన్ని అనుసరించి అందరికి సంతోషం కలిగిద్దామని చెప్పి రోమెల్  హర్షధ్వానాల మధ్య ప్రసంగం పూర్తి చేశాడు . స్ఫూర్తి దాయకమైన గొప్ప ప్రసంగం .

టామ్  లసంటా  ప్రసంగం సంతృప్తిగా లేదని పించింది .

బాలు కరణం 8 నిమిషాలలో తనకు ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చి జీతం 5 వేలు నుంచి 25 వేలకు పెరిగినా ఒక నాస్తికుడైన బాస్ దగ్గర పని చేయటం ఇబ్బంది అనిపించి బాబాకు చెబితే ‘’వాడు ఎవడైతే నీకేమి .నీ పని నువ్వు చెయ్యి ‘’అని ప్రోత్సహించిన  వృత్తా0 తాన్ని  చక్కగా నాటకీయంగా చెప్పి మెప్పించారు

చివరగా శ్రీమతి గీతా రాం మూడు సార్లు చేసిన ప్రసంగ సారాంశాన్ని తెలియ జేస్తున్నాను .ఇందరిలో ఆమె స్టార్ స్పీకర్ అని పించారు హృదయాలకు హత్తుకొనేట్లు ప్రసంగించటం ఆమె కున్న గొప్ప లక్షణం ‘’షి .కాప్టి వేటేడ్ ది  ఆడియెన్స్ ‘’ సరస్వతీ దేవి ఆమె నాలుకపై నిజంగా నే నర్తించింది అనిపిస్తుంది

గీతా రామ్ ‘’బాబా అంటే బి అలెర్ట్ ,బి అవేర్ అరౌండ్ యు అండ్ ఇన్ ‘’అని అర్ధమని సాయి అంటే ‘’సాయి ఆల్వేస్ ఇన్ యు ‘’అని భావమని ,సత్యసాయికి సోనమ్మ అనే 80 ఏళ్ళ ముసలావిడ స్నానానికి నీళ్లు పెడుతూ ,ఆయన తిన్న పాత్రలు కడుగుతూ సేవ చేసేదని ,ఆమెకు ఒక సారి జబ్బు చేస్తే తన తండ్రిగారి కారులో ముందుబాబా వెనక ఆమె ,గీతా పెనుగొండ కు తీసుకు వెడుతుంటే గతుకుల మట్టి రోడ్డుపై కారు దిగిపోయి ఆగిపోతే బాబా ఒక్క వేలితో దాన్ని తోస్తే ముందుకు కదిలేదని ఇదేమిటి స్వామీ అని తన తండ్రి అడిగితె ‘’గోవర్ధనపర్వతాన్ని చిటికెన వేలుపై నిలబెట్టిన నాకు ఇది పెద్దకష్టమా ‘’అన్నారని ,గతుకుల రోడ్డులో సోనమ్మ బాధతో సాయీ సాయీ అని అంటుంటే ‘’సోనియామ్మా నేను నీ దగ్గరే ఉన్నానమ్మా ‘’అంటూ అనునయిస్తూ బెంగుళూరు లో డాక్టర్ కాలప్ప హాస్పిటల్ కు తీసుకు వెడితే వెంటనే ఆపరేషన్ జరగాలని చెబితే ,ఎనస్తీషియా ఇచ్చే డాక్టర్ ఆది వారం అవటం తో రాలేడే మో అని కాలప్ప అంటే ‘’మందుతాగి వాడే ఎనస్తీసియాలో ఉంటె వాడొచ్చి చేసేదేమి ఉంది ‘’అని బాబా చెప్పి సోనమ్మను నిద్రపొమ్మని చెప్పి ఆపరేషన్ చేయాల్సిన చోట తన వ్రేలు పెడితే అది మొద్దుబారగా డాక్టర్ కాలప్ప ఆపరేషన్ పూర్తి చేశాడని ,తన తండ్రి డా  పద్మనాభన్  ఇంటికి బాబా ను తీసుకు వెళ్లారని ఆయనకు వ0ట రాకపోతే బాబా తానె మిరియాల చారు కాచారని అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందని తండ్రి బాబా తో ‘’ఈ పనేదో మీరే ఆమెకు పుట్టపర్తి లో చేయచ్చుకదా ‘’అని అడిగితె ‘’కాలం కర్మ కలిసిరావాలి పద్మనాభం ‘’అన్నారని చెప్పింది .

ఒక సారి ఒకమ్మాయిని పేరేమిటని అడిగితె ఆమె జాయ్ అని చెప్పిందని దానికి బాబా ‘’జీసెస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ,యు లాస్ట్ ‘’అనే అర్ధం చెప్పారన్నారు .నమ్మకం కావాలి నీ నమ్మకం లో నీకు విశ్వాసం ఉండాలి ,క్రమశిక్షణ అంతటా ముఖ్యమన్నారని . తనను అమెరికా వెళ్ళమని చెప్పింది బాబా యే  నని చెప్పింది గీతా రామ్ ..

‘’వాక్ విత్ వాల్యూస్ ‘’అనే   మరో ప్రసంగం లో గీతా రామ్ బాబా ఎప్పుడూ తానూ ఒక అయస్కాంతం అని భక్తులు ఇనుప రజను అని దాన్ని ఆకర్షించటం తన లక్షణమని కానీ రజను తుప్పు పడితే ఆకర్షింప బడదని కనుక కల్మషం అనే తుప్పును ఎప్పటికప్పుడు వదిలించుకోమని చెబుతారన్నది .ఒక సారి ఒక విద్యార్థి తానూ యుద్ధానికి వెళ్లి అక్కడ సేవ చేస్తానని బాబా కు చెబితే ముందు చదువు పూర్తి చేయి తర్వాత నీ ఇష్టం అని హితవు చెప్పారని తానూ అన్నీ గమనిస్తూనే ఉంటానని ‘’foot steps of the ant is a thunder in my ears ‘’‘’అని తన మనోభావాన్ని తెలియ బరచారని   యెంత గొప్ప ఉన్నత విద్యావంతులైన ఉద్యోగస్తులైనా సేవలో ధన్యత చెందుతారని ఇంజనీర్ దశరధ రామి రెడ్డి రోజూ  పుట్టపర్తి లో పాలు కొని తీసుకువచ్చి బాబా భక్తులకు అందజేసేవాడని చెప్పారు .ఆయన భార్య  పుష్పాలతో చక్కని హారాలు అల్లేవాఁ రని   రోజూ 5 సార్లు ఆదండాలు బాబాకు వేసేవారని ఒక దందడ ను పోలి మరొక దండ  ఉండకుండా ఆమె అల్లేవారని చెప్పారు కానీ ఏనాడు ఆమె తన చేతులతో బాబాకు హారం వేసేవారుకాదని ,ఇతరులు వేస్తె చూసి ఆనందించేవారని అయన చనిపోతే భార్య ను  బాబా ఆశ్రమం లోనే ఉంచారని  చెప్పారు కొంతకాలానికి 1980లో బాబా హారాలు వేయవద్దన్నారని ఆమెకు ఆపని లేకుండా పోయిందని ఆతర్వాత 22 ఏళ్ళు అక్కడే ఉన్నా బాబాను ముసలివారు దర్శించే ‘’బుడ్డీ క్యూ ‘’లోనే వెళ్లి చూసేవారని చెప్పారు ఆమెతో బాబా ఎప్పుడూ మాట్లాడని లేదని అన్నారు . కానీ ఒకసారి బాబా బెంగుళూర్ లో ఉండగా ఇద్దరు కుర్రాళ్లను ఆమెను కారులో బెంగుళూరు తీసుకురమ్మని చెప్పి పంపారని వాళ్ళు వచ్చి రమ్మంటే రాంగ్ అడ్రస్ కు వచ్చారేమోనని తిప్పి పంపిందని బాబాకు చెబితే తిట్టి కారులో వెంటనే తీసుకు రమ్మని మళ్ళీ పంపారని ,అప్పుడామె నమ్మి వెళ్లిందని ,ఆయన ఆమెను బట్టల షాపులో 15 చీరెలు జాకెట్లు కొనిపించారని ,కావాల్సినవన్నీ కొనిపించారని విమానం లో ఆమెకు చాలా ప్రదేశాలు చూపించి మళ్ళీ పుట్టపర్తి చేర్చారని ఆమె స్వాయంగా గీతారామ్ కు వివరించినట్లు చెప్పారు .కనుక మనం ఆయన దృ ష్టి పడాలని ఎదురు చూడక్కర లేదు ఆయనకు అందరూ తెలుసు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అలా  ఇస్తారు అన్నారు గీతా

 సాయి సాయి సాయి అనవే -సర్వం బ్రహ్మమనవే -బాబా బాబా బాబా అనవే భక్తితో మహిమతో పాల్గొనవే -రామ రామ రామ అనవే రాక్షస గుణములు పొమ్మనవే -కృష్ణా కృష్ణా కృష్ణా అనవే కష్టములు పోగొట్టుకొనవే -శివా శివా శివా శివా అనవే శివ కేశవులు సమమనవే ‘’-హరి ఓమ్  హరి ఓమ్  ఓమ్ హరి ఓం అనవే ఆత్మా రాముని కనుగొనవే ‘’అనే కీర్తన బాబా రాశారని ఇది దేశ విదేశాలలో బాగా ప్రచారమైంది చెప్పారు .ఒకసారి ఒక కెనడియన్ బృందం విని పులకించి అందులోని భావ ఔన్నత్యానికి పొంగిపోయారని గీత అన్నారు .సేవ అంటే ఆధ్యాత్మికతకు దారి .save లోని అక్షరాలను మారిస్తే seva అవుతుంది ..సాయిని ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి .అని నమ్మిన వారికి బాబా ఎంతటి ఆప్తుడుగా ఉంటారో వివరించారు గీతా రామ్ .

 సాయంత్రం ప్రశ్నోత్తరాలకు ముందు మళ్ళీ గీతారామ్ మాట్లాడుతూ ఒకసారి బాబా తమను హార్స్లీ హిల్స్ కు తనతో తీసుకు వెళ్లారని ,అక్కడ నీటికి ఇబ్బంది అని అందరం 8 గదుల్లో ఉన్నామని ఇంతమందికి నీళ్లను రెండు దున్నపోతుల కు అటూ ఇటూపెద్ద డ్రమ్ములు కట్టి3 మైళ్ళు  కిందనుంచి  రోజుకు మూడు సార్లు తెప్పించేవారని తమతో డాక్టర్ కస్తూరి కూడా ఉన్నారని 10 రోజుల రిట్రీట్ తర్వాత అందరం ఇంటికి బయలుదేరటానికి కార్లు ఎక్కి కూర్చున్నామని కానీ బాబా ఆ బంగాళా వెనక్కి వెళ్లి అక్కడ నీళ్లు మోసిన దున్న పోతుల వీపులు తట్టి పది రోజులుగా తమకు నీళ్లు మోసి తెచ్చినందుకు కృతజ్ఞత చెప్పి ,ఏడవ  వద్దని చెప్పి తానూ మళ్ళీ వస్తానని అభయమిస్తుంటే కస్తూరి గీతా లు స్వామి ఏమి చేస్తున్నారో చూడటానికి వెడితే ‘’దున్నపోతుల్లారా నేనేదో ఇక్కడ చేస్తుంటే మీరెందుకు వచ్చి చూశారు అనిచిరుకోపం ప్రదర్శిస్తే మేము చూడకపోతే ఈ విషయ0 లోకానికి ఎవరు రాసి చెబుతారు అంటే నవ్వేశాడట బాబా .అదీ సత్య సాయి కృతజ్ఞతా భావం .అన్నారు .

 తన వివాహ సంబంధం బాబానే కుదిర్చారని ఆయన అన్ని వస్తువులు కొని కావలసిన పదార్ధాలన్నీ చేయించి దగ్గరుండి వివాహం జరిపించారని చెప్పారు గీతా రామ్ .వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారట .

 అమెరికాలో ఒక సభలో తాను  మాట్లాడుతుంటే ఒక కాంగో జంట కు బాబా వాళ్ళ భాషలో దాన్ని చెప్పారని వాళ్ళు వచ్చి తనకు అభినందనలు తెలిపారని ‘’హి  హస్   ఏ ఫోకస్ ఆన్ ఎవరి థింగ్ .ఆలాగే రష్యన్లకూ బాబా తన ఆంగ్లప్రసంగాన్ని వాళ్ళభాషలో అర్ధమయ్యేట్లు చేశారని చెప్పింది ;’’సాయి కి అందరి హృదయ భాషలు తెలుసు ‘’అన్నది ‘’అన్నారు

.బాబా 70 వ పుట్టిన రోజుకు రమ్మని గీతను ఆహ్వానిస్తే రాలేనని అమెరికాలో నే జరుపుతున్నానని  అంటే ‘’అయితే నేనే వస్తాను ‘’అని చెప్పారని ,ఆ రోజు ఉదయం బాంక్ కు వెళ్లి ఏ టి ఏం లో డబ్బుతీసుకొని కారు ఎక్కగా ఎవరో నల్లని ఆగంతకుడుముసుగేసుకుని  కారులో ఎక్కి కూర్చుని కత్తి  మెడమీద పెట్టి అరవవద్దని చెప్పగా అనుకోకుండా కారులో ఉన్న సత్యసాయి చిన్న ఫోటో కాళ్లకు తన బొటన వ్రేలు తగిలిందని ఇంతలో పోలీసుకారు రావటం ,తానూ కంగారు పడకుండా ఉండటం ,తనను వాడు డ్రైవ్ చేయమంటే చేయలేననటం ,వాడే పోలీసుల హడా విడి చూసి డోర్ తెరుచుకు దిగటం వెంటనే పోలీసులు కారులోకి నెట్టేసి ఎక్కించుకోవటం తనకు భయం లేకపోయినా  పోలీసులు ఎస్కార్ట్ తో ఇంటి దగ్గర దింపటం మూడు నాలుగు నిమిషాల వ్యవధిలో జరిగిపోవటం అంతా బాబా మహిమగా ఆమె చెప్పారు అప్పటికే సాయి జన్మదినం ఇండియాలో జరగటం వాళ్ళమ్మ బాబా దర్శనం చేయటం ‘’గీత బాగుందా ‘’అని తెలియనట్లు అడగటం తానూ అక్కడికి వచ్చేముందే ఫోన్ చేసిందని చెప్పటం గీత ఇంటినుంచి బెంగళూర్ లోని తండ్రికి విషయంమంతా చెప్పటం తో విషయం తెలిసింది సాయంత్రం తండ్రిని బాబా జరిగిన విషయం చెప్పమంటే రెండే రెండు నిమిషాల్లో చెప్పటం అప్పుడు బాబా పూస గుచ్చినట్లు జరిగిన విషయమంతా వివరించటం ఆమె నన్ను ఒక్క సారి తలచుకొంటే నేను ఆమెకు ట్రిప్లికేట్ లో బదులిచ్చానని మొదటగా ఆమెలో స్థిర చిత్తాన్ని , తర్వాత పోలీస్ లను రప్పించటం మూడవది దొంగ కు బుద్ధి వచ్చేట్లు చేసి వాడంతట కు వాడే కారు దిగిపోవటం అనే ట్రిపుల్ బెనిఫిట్  కలిపించానాని సత్యసాయి వివరించార ని ఈ మొత్తం ఉదంతాన్ని చాలా నాటకీయంగా ,ప్రదర్శన పూర్వకంగా సస్పెన్స్ భరితంగా గీతా రామ్ వివరించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు ..తనను పోలీసులు హాట్ లైన్ నంబర్ ఇచ్చి అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయమని చెబితే గీత ‘’నా హార్ట్ లైన నంబర్  బాబా ‘’ఉన్నారని చెప్పిందట ..ఎందుకు భయపడలేదని అడిగితె స్వామి ఉండగా నాకు భయమెందుకు .జీవితం శాశ్వతం కాదు అని బాబా నేర్పారు అన్నది .చివరగా సత్యసాయి బాబా చెప్పిన ‘’నీ పని నువ్వు చేస్తే నా పని నేను చేస్తా ‘’అన్న స్ఫూర్తిదాయకమైన మాట తో ప్రసంగం పూర్తి చేసి హర్షధ్వానాలు అందుకొన్నారుశ్రీమతి  గీతారామ్ .ఇలాంటి వారితో పరిచయమవ్వటం మాతో ఫోటో తీయించుకోవటం మా అదృష్టం .

         మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29–5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Inline image 1

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి రిట్రీట్ వారం -22-5-17 నుంచి 28-5-17 వరకు

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి  రిట్రీట్ వారం  -22-5-17 నుంచి 28-5-17 వరకు

22- సోమవారం -వర్షం బాగా పడింది .సాయంత్రం పుట్టపర్తి లో ఉంటున్న కాకినాడ వాసి శ్రీ అప్పారావు గారు ,అమ్మాయి వచ్చి రిట్రీట్ కు వెళ్లేవిధానం మా అమ్మాయి విజ్జి తో చర్చించి వెళ్లారు ..”మధ్యయుగాల వైద్య విధానం ”పై నెట్ లో రెండు ఎపిసోడ్ లు రాశా .”నోర్సే మైథాలజీ ”చదివా .రాత్రి అమృతం సీరియల్ కాసేపు చూసాం .
మంగళవారం ఉయ్యురు కు ఫోన్ చేసి మా అన్నయ్యగారి అబ్బాయి , రాంబాబు మనవడు   ,కళ్యాణ్ తో మాట్లాడాం .నా ”సుందర కాండ పారాయణ” వీడియో చూశామని చాలా బాగుందని చెప్పారు .” నా దారి తీరు ”లో కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్ లను ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గా రాసిన రెండు ఎపిసోడ్ లు చదువుతుంటే వాళ్ళను ప్రత్యక్షము గా చూస్తున్న అన్హుభూతి కలిగింది అన్నాడు రామ్ బాబు . మా అబ్బాయి రమణ ఫోన్ చేసి హైదరాబాద్ లో ఉన్న మా మేనకోడలు చి సౌ పద్మకు 3 బాక్సులతో శ్రీ హనుమజ్జయంతి నాడు పూజ చేసిన  మామిడిపళ్ళు సుమారు 200 కు పైగా ట్రావెల్స్ బస్ లో  పంపానని అందినట్లు పద్మ ఫోన్ చేసిందని చెప్పాడు పద్మ నాకు వాట్సాప్ లో పళ్ళు అందాయిమామయ్యా అందరికి ప్రసాదం గా పంచాం అని మెసేజ్ రాసింది సంతోషం అన్నాను ..”వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -45”ఎపిసోడ్  తోపాటు  ,”నోర్సే  గాడ్స్ ” రాత్రి రాశా ..రాత్రి ”అన్నోన్ ఫాక్టర్స్” లో మిస్టరీ ఆఫ్ ద్వారక, హిమాలయాల్లో స్వర్గం ,పద్మవ్యూహం చూసాం చాలా వివరణాత్మకంగా ఉన్నాయి మైనేనిగారినీ చూడమని మెయిల్ రాశా ..గోపాల కృష్ణగారుపంపిన -మైరా మాక్డొ నాల్డ్ ”రాసిన ”హైట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ”పుస్తక0 అందింది
  బుధవారం యు ట్యూబ్ లో కాదంబరి కిరణ్ ఇంటర్వ్యూ చూస్తుండగా  మధ్యాహ్నం 2 గంటలకు నెట్ పోయింది .వర్షం పడుతూనే ఉంది .నెట్ లేకపోవటం తో” స్వామి రామా”  అంతా ప్రత్యక్షరం చదివి రాత్రికి పూర్తి చేశా.
 గురువారం రాత్రి 7 గంటలకు మళ్ళీ నెట్ వచ్చింది .మధ్యాహ్నం మన ప్రక్కనున్న రవి గారి నాన్నగారు రాఘవేంద్రరావు  సుగుణ కామాక్షి దంపతులతో  వాళ్ళు ఇక్కడికొచ్చిన 3 వారాలకు మాట్లాడా .అయిదేళ్ల క్రితం వాళ్ళు ఇక్కడే పరిచయమయ్యారు .రమణ ఫోన్ చేసి నిన్న ఆర్ ఐ గారి రెండవ అబ్బాయి ఇవాళ కుమారిగారమ్మాయి వడ దెబ్బకు చనిపోయారని ఇద్దరి కుటుంబాలకు డబ్బు అంద  జేశానని చెప్పాడు .. ”యోగి భోగి రోగి ”,యేసు క్రీస్తు కాశ్మిర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ?”రెండు ఎపిసోడ్ లు రాశా .గోపాల కృష్ణ గారు పంపిన క్లియరెన్స్ డార్రో రచన ”ది  స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”అందింది .
  శ్రీ సత్య  సాయి వార్షిక రిట్రీట్ (సింహావలోకనం )విశేషాలు
 సైన్యం కు శత్రువు భయంకరంగా కనిపించినప్పుడు రిట్రీట్ అవుతుంది అంటే వెనక్కి తగ్గుతుంది .తర్వాత శక్తి యుక్తులు సమకూర్చుకొని మళ్ళీ విజృంభిస్తుంది ఇది రాజనీతి . .సింహం అయిదారు అడుగులకోసారి వెనక్కి తిరిగి చూసుకొంటుంది .ఎందుకంటె తాను మృగరాజు అయినా ఎక్కడినుంచి ఏ ప్రమాదం మీదపడుతుందో ననే సంకోచం .దీన్నే ”సింహావ లోకానాం ”అంటారు . అలాగే ఏ సంస్థ అయినా ఒక ఏడాది పని చేశాక ,తనప్రగతి గురించి సమీక్ష చేసుకొని ,లోటుపాట్లు సరిదిద్దుకొని ,మరింత బలం చేకూర్చుకొని ప్రగతి పదం లో నడిచే ప్రయత్నం చేస్తుంది .ఇదే రిట్రీట్ . .దీనిలో పెద్దలు అనుభవజ్ఞులచేత స్ఫూర్తి పూర్వక ప్రసంగాలు ఉంటాయి . సత్సంగం భజనలు ,పిల్లలకు ఆటాపాటా వారి సృజనకు వేదికగా కార్యక్రమాలు వారి కళా సంస్క్రుతులకు  ఉద్దీపనగా  నాటకాలు ,పాటలు ,ఉంటాయి ఇక్కడ . .అంటే ఒక రకంగా ”రి చార్జి ”చేసుకోవటం మనభాషలో ”పునరంకితం అవటం ”అన్నమాట
 అమెరికా లోని అన్నిప్రాంతాల సత్య సాయి సెంటర్లన్నీప్రతి ఏడాదీ సోమవారం వచ్చే ” మెమోరియల్ డే”ముందు వచ్చే శని ఆదివారాలతోకలిసి మూడు రోజుల సత్యసాయి రిట్రీట్  నిర్వ హిస్తారు  .మెమోరియల్ డే అంటే ”స్మారక దినం ”దేశ స్వాతంత్రానికి ,స్వాతంత్ర రక్షణకు .ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణలో అసువువులు బాసిన వారందర్ని స్మరించే రోజు అన్నమాట .మనం మహాత్మా గాంధీజీ అమరవీరుడైన జనవరి 31ను  ”మృతవీరుల సంస్మరణ దినోత్సవం ” జరుపుకొంటాం .అలాగే ఇక్కడ కూడా .ఆ రోజున వారందరి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధిస్తారు దేశం మొత్తం శలవు దినంగా ప్రకటిస్తుంది . ఇలా మూడు రోజులు సెలవలు కలిసి వస్తే ఇక్కడ వీళ్ళు ”లాంగ్ వీకెండ్ ”అంటారు . శుక్రవారం మధ్యాహ్నం  నుంచే ఆఫీసులు వదిలేసి చక్కగా మూడురోజులు ఎంజాయి చేయటానికి టూర్లు వెడతారు కుటుంబాలతో
  సత్య సాయి సెంటర్ ల రీజియన్ 3 అంటే సౌత్ జోన్ లో ఉన్న 7 రాష్ట్రాలు -అలబామా ,నార్త్ కరోలినా ,సౌత్ కరోలినా ,జార్జియా ,.ఫ్లారీడా  ,టెన్నెస్సీ  వర్జిన్ ఐలాండ్స్ రాష్ట్రాల లోని సాయి సెంటర్ల వారందరికీ నార్త్ కరోలినా రాజధాని రాలీలోని సాయి సెంటర్ వారు దానికి ఒక గంట ప్రయాణ దూరం లో”కంబర్లాండ్ కౌంటీ ”లో  ఉన్న ”ఫయెట్టీ విల్ ”అనే చోట 27-5-17 నుండి 29-5-17 వరకు శని ,ఆది సోమవారాలలో వార్షిక రిట్రీట్ నిర్వహించారు . 2012 లో మేము షార్లెట్ కు వచ్చినప్పుడు గ్రీన్ హిల్స్ లో జరిగిన రిట్రీట్ లో పాల్గొన్నాం . ఫయెటీవిల్ నార్త్ కరోలినా లో  అమెరికా ఆర్మీకి నార్త్ వెస్ట్ భాగ0 లోని ”ఫోర్ట్ బ్రాగ్ ”దళానికి ప్రాముఖ్యమున్న చోటు .నేషనల్ సిటీ లీగ్ నుంచి మూడుసార్లు ఫయెట్టే విల్ ”ఆల్ అమెరికన్ సిటీ అవార్డు ”పొందింది .కేప్ ఫియర్ నది దగ్గర్లో సాండ్ హిల్స్ లో ఉన్నప్రాంతమిది . సౌత్ ఈస్టర్న్ నార్త్ కరోలినా లో ఇది పెద్ద మెట్రోపాలిటన్ పట్టణమే కాక  నార్త్  కరోలినా రాష్ట్రం లో 5 వ పెద్ద పట్టణం కూడా .అంతేకాక సియోవన్  నేటివ్ అమెరికన్ల ఆవాస భూమి  .హైలాండ్ స్కాట్స్ ఇక్కడే మొదట స్థిరపడ్డారు .అమెరికా అంతర్యుద్ధకాలం లో ప్రసిద్ధిపొందింది .ఇక్కడి ఎయిర్ బార్న్ స్పెషల్ ఆపరేషన్ మ్యూజియం ,వార్ మెమోరియల్ మ్యూజియం ,పో హౌస్ మొదలైనవి  దర్షింప తగిన ప్రదేశాలు .అందుకనేనేమో రాలీ సెంటర్ వారు ఈ చారిత్రిక ప్రదేశాన్ని రిట్రీట్ కోసం ఎన్నుకొని ఉంటారని పించింది .  ఇక్కడి RAMADAహోటల్ లో రిట్రీట్ ఏర్పాటు చేశారు .చక్కని విశాలమైన ప్రాంతం 250 గదులు ,కింద 400 మంది కూర్చుని భోజనాలు చేసే ఏర్పాట్లు ,పైన 800 మంది కూర్చునే వీలున్న విశాల మైన సభా మందిరం ఉన్నది . రాలీ వాళ్ళు షార్లెట్ లో జరిగిన సాయి ఆరాధనకు వచ్చి నప్పుడు 3 రోజుల రిట్రీట్ కు అందర్నీ ఆహ్వానించారు .
 ఫయెట్టేవిల్ కు మా ప్రయాణం
 మా అమ్మాయి ముందుగానే ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసింది .. మా మనవళ్లకు26 శుక్ర వారం మధ్యాహ్నం దాకా వార్షిక పరీక్ష ఉన్నందున  పవన్ కారులో మేమిద్దరం వాళ్ళమ్మ మామనవాడు సంకల్ప్ మధ్యాహ్నం  3 గంటలకు బయల్దేరి దారిలో కొత్తగా కట్టబోయే షిర్డీ సాయి మందిరానికి భూమి పూజ జరిగిన చోటు ,మీదుగా హైవే  నుంచి సింగిల్ లైన్ గుండా కొంత దూరం ప్రయాణం చేస్తూ దారిలో రెండు వైపులా పచ్చని జొన్న ,కోతకు సిద్ధమైన గోధుమ పంటలను కోళ్ల ఫారాలను మధ్యలో ఫియర్ నదిని దాటి మళ్ళీ హైవే  పై కొంతదూరం వెళ్లి మళ్ళీ డొంక రోడ్డు మీద ఒక 50 మైళ్ళు ప్రయాణం చేసి 3 గంటల ప్రయాణం తర్వాత సాతంత్రం 6-15 కు” రమడా ”చేరాం .మా అమ్మాయి పవన్ భార్య రాధా వాళ్ళ పిల్లలతో  సాయంత్రం 6 కు బయల్దేరి రాత్రి 9 కి చేరారు .
  మేము చేరే సరికే డిన్నర్ సిద్ధం గా ఉంది .రిజిస్ట్రేషన్ అయ్యాక భోజనం చేశాను .హాలులో టేబుల్స్ వాటి ముందు కుర్చీలతో ఏర్పాటు ఉంది .ర్యాలీ నిర్వాహకులు అందర్నీ చక్కని నవ్వు ముఖాలతో ”సాయిరాం ”  అంటూ పలకరిస్తూ పూరీ కూరా పరవాన్నం పులిహోర ఆవకాయ ,పెరుగన్నం ఆరంజ్ ఆపిల్ ,అరటిపళ్ళతో అడిగి అడిగి మరీ వడ్డించి తినిపించారు .పైన కాసేపు భజన చూసి అందరం మేము బుక్ చేసుకున్న రెడ్ రూఫ్ ఇన్ హోటల్ కు వెళ్లి అక్కడ పడుకున్నాం .
  ఎవరికి వాళ్ళు తమ రూమ్ లను హోటల్ లో స్వంత  ఖర్చులతో బుక్ చేసుకోవాలి .మూడు రోజులకు రెండుపూటలా భోజనం ,టిఫిన్ ,కావాల్సినప్పుడల్లా కాఫీ లకు మనిషికి కేవలం 65 డాలర్లు మాత్రమే కాలేజీ స్టూడెంట్ లకు 25 .పిల్లలకు ఫ్రీ .అంటే దాదాపు ఉచితం గా భోజనం పెట్టినట్లే .సాయి సెంటర్ వాళ్ళు లాభా పేక్ష లేకుండా ”లవ్ ఆల్  సెర్ప్ ఆల్ ”మోటో తో పని చేస్తారు .శుక్రవారం సాయంత్రం ,సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంతా నిర్వాహకులే భరిస్తారు  శని ,ఆదివారాలు దగ్గర లోని హోటల్ లో కేటరింగ్ కు ఆర్డర్ ఇచ్చి తెప్పించి తామే పూటకు ఒక సెంటర్ వాళ్ళు వడ్డన లో ఉండేట్లు ఏర్పాటు చేశారు ..చిన్నపిల్లలా దగ్గర్నుంచి 80 ఏళ్ళు దాటినా స్త్రీ  పురుష సాయి భక్తులందరూ మగవారైతే తెల్లని పాంట్ షర్ట్ లతో ఆడవాళ్లు చీర జాకెట్, నిండుగా కప్పుకున్న కొంగులతో అత్యు0త సాంప్రదాయ బద్ధంగా చెదరని చిరునవ్వుతో సాయిరాం పలకరింపులతో ఆప్యాయం గా ఆదరంగా ఆహ్వానించటం కూర్చోబెట్టటం లేవలేనివారికి వారే తీసుకొచ్చి అందించటం ఇంకో పండు తినండి ,ఇంకాసిన పళ్లముక్కలు తినండి పెరుగన్నం మరి కాస్త వేయమంటారా , ఆపిల్ కోసి ఇవ్వమంటారా అంటూ మహా మర్యాద గా చూశారు .వారందరి సేవ మరువ రానిది .ఈ సేవలో పాల్గొన్నవారికి మిగిలిన కార్యక్రమాలు ఎలా జరిగాయో తెలియటం కష్టమేమో అనిపించింది కానీ వారు డ్యూటీ చేస్తూనే వాటిని చూసి ఉంటారు .కాఫీ కలిపి ఇవ్వమ0టారా షుగర్ సరిపోయిందా ,పాలు కాసిని పోయినా అంటూ ఆప్యాయత చాటారు . మూడు రోజులూ రెండు పూట్లా భోజనాలకు టిఫిన్లకు ఇదే పధ్ధతి .ఎవ్వరి ముఖం లోను అలసట కనిపించలేదు కస్టపడి పోయామన్న భావం లేదు సేవలో తరించామన్న సంతృప్తియే గోచరించింది . ఆదివారం రాలీ నిర్వాహకులతో ఒకరైన శ్రీమతి మాధవి ఆలపాటి తో నేను ఈ విషయం చెబితే ఆమె ఎంతో సంతోషించారు ఆమెతో పాటు పని చేసినవారిని నన్ను పరిచయం చేస్తే వారితోనూ ఈమాట అంటే పులకించిపోయారు వారు . మాధవి గారు తన సెల్ లో నేను చెప్పిన ”it is not only retreat ,t is good well done treat  satisfactory  successful  resourceful retreat”మాటలను రికార్డ్ చేసుకొన్నారు .అభిప్రాయం సేకరణ పుస్తకం లోనూ అదే రాశాను
  శనివారం ఉదయం నేనుస్నానం చేసి  సంధ్య ,పూజా చదివి మా హోటల్ వాళ్ళు ఫ్రీ గా మాకు పెట్టిన టిఫిన్ కాఫీ తీసుకొని హోటల్  మారుద్దామని  మాతోపాటు వచ్చిన అప్పారావు గారి అమ్మాయితో వాళ్ళు ఉంటున్న దగ్గర హోటల్ లో రూమ్ బుక్ చేయించి ఇక్కడ చెక్ అవుట్ చేసి మధ్యాహ్నం అక్కడ చెకిన్ చేసాం .రమడా హోటల్ లో మామూలుగా అయితే లాంగ్ వీకెండ్ లో రూమ్ రెంట్ 90 డాలర్లు ఉంటుందట .కానీ ఇక్కడ రిట్రీట్ జరుగుతున్నందున 60 డాలర్లకు కన్సెషన్ రేట్ లో ఇచ్చారట .పవన్ వాళ్ళు ,చాలా మంది ఇక్కడే బుక్ చేసుకున్నారు . . రెండుపూటలా భజన ఉపన్యాసాలు  వర్క్ షాప్ లు జరిగాయి వర్క్ షాప్ లకు నేను వెళ్ళలేదు సాయి గ్రంధాలు అక్కడ పెట్టారు .కావాల్సినవాళ్లు ఉచితంగా తీసుకోవచ్చు నేను 9 పుస్తకాలు-women saints ,life is a game -play it ,Satya sai speaks loving god ,satyam sivam sundaram ,footprints in shirdi and parthi ,the dharmik challenge premavahini ,పుస్తకాలు తీసుకున్నాను . లక్ష్మీదేవి ఫోటోలు కృష్ణుని ఫోటోలు కూడా కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు .
  ఆదివారం ఉదయమే లేచి సంధ్య ,పూజా కానిచ్చి షార్లెట్ నుంచి తెచ్చుకున్న ఉప్మా  వేడి చేసుకొని తిని స్టార్  బక్స్ లో కాఫీ  తాగి రమడా కు చేరి ,ఉపన్యాసాలు విని పిల్లల వాక్ చూసి కాసేపు విశ్రాంతి . భోజనాలు తర్వాత  మళ్ళీ గీతా రామ్ ఉ పన్యాసం ,తర్వాత పిల్లలు ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి ,సాయంకాలపు స్నాక్స్ కాఫీ తీసుకొన్నాం .శ్రీమతి గీతారా0 ,,జ్ఞానభాస్కర్ భార్య మా టేబుల్ దగ్గరే కూర్చున్నారు .నన్ను వాళ్లకు పవన్ పరిచయం చేశాడు .నేను గీత గారితో ”అమ్మా మీ నాలుకపై సరస్వతీ దేవి నర్తించి నట్లుంది అంత బాగా మాట్లాడారు ”అన్నాను ఆమెసంతోషించి ”ఈ విషయం బాబా గారికి చెబుతాను అయనఎంతో  సంతోషిస్తారు ”అన్నది .భాస్కర్ భార్య తానూ బందరు లో డిగ్రీ చేశానని ఒక సారి ఫ్రెండ్ ను చూడటానికి ఉయ్యురు వచ్చానని అని పవన్ నా బ్లాగు విషయం చెబితే  అడిగి  తెలుసుకున్నది .శనివారం మధ్యాహ్నం  బాలు అనబడే శ్రీ కరణం  బాలకృష్ణ గారిని పవన్ నా దగ్గరకు తీసుకు వచ్చి పరిచయం చేశాడు ఆయన్ను ఆరాధనా దినోత్సవం నాడు షార్లెట్ లో చూశా కలిసి ఫోటో దిగాం అది జ్ఞాపకం చేసుకొని తానూ బాబాపై ఒక శతకం రాశానని దాన్ని చూసి అభిప్రాయం రాయాలని కోరారు .మహద్భాగ్యం అన్నాను ..రాలీ సెంటర్ ముఖ్య పాత్ర దారిని శ్రీమతి ఆలపాటి మాధవి మెయిల్ ఐడి తీసుకొని  వీక్లీ  అమెరికా పంపిస్తాను చూడమంటే దానికోసం ఎదురు చూస్తాను అన్నారు .ఇంతమంది సజ్జనులతో సాహచర్యం ఆనందాన్నిచ్చింది .పెడన దగ్గర ముంజులూరు ఆయన బెజవాడ  ఆయన  కనిపించి పలక రించారు  . ఒక వీల్ చైర్ లో వచ్చిన ఒక అమ్మాయి మధ్యాహ్నం మా దగ్గర కూర్చున్నప్పుడు స్వామిరామా గురించి అప్పారావు గారితో చెబుతుంటే శ్రద్ధగా విని సాయంత్రం నా దగ్గరకొచ్చి తన తండ్రిగారు బెంగుళూరు లో డాక్టర్ గా ఉన్నప్పుడు స్వామి రామా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నారని చెప్పింది భలే సంతోషమేసింది ఈ అమ్మాయి  వాళ్ళు ప్రస్తుతం ఫ్లారిడాలోని మయామి లో ఉంటున్నామని చెప్పింది.
              పోయి దొరికిన ఉంగరం
  శనివారం మధ్యాహ్నం మా శ్రీమతి చేతి ఉంగరం రామడా లో ఎక్కడో జారిపోయింది దాన్ని ఆదివారం మధ్యాహ్నం కానీ పోయిందని తెలుసుకోలేదు .అప్పుడు రాధకు చెబితే తనకే దొరికిందని దాన్ని ఇక్కడి నిర్వాహకుడికి అందజేశామని మైకులో చాలాసార్లు కటించారని చెప్పింది .అప్పుడు విజ్జి ఎవరికి ఇచ్చిందో ఆయన్ను కనుక్కొని  ఆయన జాగ్రత్తగా దాచి ఇస్తే తీసుకు వచ్చింది దానిపై శ్రీ షిర్డీ సాయి బాబా బొమ్మ ఉంది .కనుక మా ఆవిడ నమ్మకం ఆయనే తెప్పించి ఇస్తాడని .అలాగా జరిగింది .
  అసలు కార్యక్రమ వివరాలు ప్రసంగాల సారాంశం తర్వాత భాగం లో తెలియ జేస్తాను
Inline image 1
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-17-
.

–


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ?

అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి భద్రపరచబడిన  వ్రాతప్రతి లో ఈ విషయం ఉందని కాశ్మీర్ లో ప్రచారం లో ఉంది ..తర్వాత దీన్ని ఒక రష్యన్ రచయిత రష్యన్ భాషలోకి అనువదిస్తే తర్వాత ఇంగ్లీష్   లోకి పైన చెప్పిన పేరుతో అనువదించారు . ఇక్కడి హిమాలయ ప్రాంతవాసులందరూ యేసు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేశాడనే నమ్ముతారు .కాదని ఎవరూ అనలేరు . దీనికి కారణాలు 3 ఉన్నాయని అక్కడి గైడ్ లు తెలియజేస్తారు . -జీసెస్ ధరించిన దుస్తులు అచ్చంగా కాశ్మీరీలు ధరించిన దుస్తువులవంటివే .-2-ఆయన జుట్టు శైలి కూడా కాశ్మీరీ శై లే .-3-ఆయన ప్రదర్శించిన మహిమలు అచ్చంగా కాశ్మీర్ లోని తంత్ర విద్యా మహిమలే .
  జీసెస్ తన 13 వ ఏటా ఆసియా మైనర్ ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని ,ఎక్కడికి వెళ్లిందీ ఎవరికీ తెలియదని ,కానీ ఆయన కాశ్మీర్ లోయకు వచ్చి 30 వ ఏడు దాకా అంటే 17 ఏళ్ళు ఉండిపోయాడానన్నది యదార్ధమని భావిస్తారు ..జీసెస్ తపస్సు చేసినట్లు చెప్పబడే ఒక చిన్న ప్రార్ధనామందిరం  ఎత్తైన పర్వతం  మీద కనిపిస్తుంది .దీనినే యేసు ప్రార్ధనామందిరం అంటారు . ఇది కాదనలేని యదార్ధం అని స్వామి రామా కూడా అన్నాడు .కాశ్మీర్ లోఒక చోటు నుంచే  జీసస్ స్వర్గానికి వెళ్లాడని  ,అక్కడ   సమాధి నిర్మించబడి ఉన్న ప్రదేశాన్ని ”రోజా బాల్ ”అంటారని అంటే గౌరవ  సమాధి (అనర్డ్ టుంబు )అని అర్ధమని ,దీన్ని క్రైస్తవు లు  మహమ్మదీయులు కూడా నమ్ముతారని అంటారు .
   కాశ్మీర్ శైవానికి జీవగడ్డ .ఎన్నో శైవాగమ గ్రంధాలు ఇక్కడివే .కానీ ఇంకా చాలా గ్రంధాలు వెలుగు లోకి రాలేదని రామా అంటాడు వీటిని అర్ధం చేసుకోవటానికి అందులో బహు నిష్ణాతులైన పండితుల సహాయం కావాల్సిందే వీటిలోని తాత్వికభావం ఏమిటి ?.ఆత్మ ,మనసు శరీరం ,విశ్వం లోని సత్యం యొక్క అన్ని స్థాయిలు ప్రాధమిక స్పందన లేక యాదృచ్చిక కంపనం యొక్క  అవతారాలే ..ఈ గ్రంధాలలో మూల విషయం ”శక్తిపాతం ”దీనివలన  నిద్రాణమై  ఉన్న శక్తి జాగృతమవుతుంది . అమరనాధ్ ఆలయం కాశ్మీర్ లో ప్రసిద్ధ మైనది .ఇక్కడ విశేషం ఒక గుహలో ఏర్పడే మంచు శివ లింగం .ఆలయం వేసవిలో దర్శిస్తారు అప్పుడు  ఆలయం లో రెండు తెల్లని పావురాల జంట దర్శనమిచ్చి ఆశ్చర్య పరుస్తాయి .అమరనాధ గుహలో శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని అమరత్వాన్ని గురించి బోధించాడని అక్కడే ఉన్న జంట తెల్లపావురాల జంట దాన్నివిని మోక్షం పొందాయని ,అందుకే అవి ఎప్పుడూ ఆ గుహలోనే ఉంటాయని ఐతిహ్యం  .ఈ జంటను దర్శించిన  భక్తులు కూడా మోక్షం పొందుతారని అంటారు .కొందరి కధనం ప్రకారం అమరనాధ గుహ తెరవబడినపుడే ఈ తెల్లపావురాలజంట స్వామి దర్శనం కోసం వచ్చి ఇక్కడే ఉండిపోతాయని .
  అమరనాధ స్వామి దర్శనానికి 25 ఏళ్ళ వయసులో ఉన్న ఒక యువ యోగి ప్రతి సంవత్సరం వస్తాడాని స్వామి రామ తెలిపాడు ఆయనతో మాట్లాడాడు కూడా ఆయన పూర్ణ ప్రజ్ఞుడని రామా అన్నాడు  .శరీరం పై ఒక్క అంగోస్త్రం తప్ప ఆయనవద్ద ఏమీ ఉండవట .ఆయన చెంపలు కెమ్పుల్లా ప్ర కాశించేవన్నాడు ..యోగ శాస్త్రం లో మహా నిష్ణాతుడు . నడిచే ఎంతదూరమైనా కాలికి ఏ ఆచ్చాదనా లేకుండా హిమాలయాలలో తిరుగుతాడు . 12  వేల అడుగుల ఎత్తువరకూ నడిచే వెడతాడు .చలి ఆయన్ను ఏమీ బాధించదు .ఈ యువ సన్యాసిని అక్కడివారు ”బాల భగవాన్ ”అంటారు. ఆయనకు ఇవేమీ పట్టవు నిత్య సంచారి. రామాగురువు బెంగాలీ బాబా ఈయనకు తెలుసు .కొంతకాలం ఆయన వద్ద ఉన్నాడుకూడా .కళ్ళు చికిలించకుండా కనీసం 10 గంటలు కూర్చోగలడు  .యోగ సాధనలో ఆయన సుమారు మూడు అడుగుల ఎత్తుకు గాలిలో లేవగలడు . స్వామిరామా ఆయన్ను దీన్ని గురించి ప్రశ్నిస్తే ”ఇది ఆధ్యాతిక సాధన కాదు .ప్రాణాయామం లో ఉన్నతస్థాయి సాధన బంధనాలు ఛేదన మాత్రమే .బరువుకు ద్రవ్యరాశికి మధ్య భేదం తెలిసిన వారెవరైనా దీన్ని సాధించవచ్చు .కానీ చాలాకాలం సాధన చేయాల్సి ఉంటుంది ”అని చెప్పాడు .
  ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటని స్వామి రామా ప్రశ్నిస్తే బాల భగవాన్ ”ఇంద్రియాలు పూర్తిగా వశం చేసుకొని ,ప్రపంచ దృష్టినుంచి వాటిని దూరం చేసుకొ0టే ఇంద్రియ అవగాహన మనసులో యే  రకమైన  ప్రతిబింబాలను కలిపించలేదు .అంటే అప్పుడు మనసు ఏకాగ్ర చిత్తమవుతుంది .ఎప్పుడైతే ఆలోచన ప్రభావం అణగారిపోతుందో మనసు సమతా స్థితి పొంది ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది .సత్వ గుణం తోనే దీన్ని సాధించగలం ధ్యానం,విషయవాసనా రాహిత్యం రెండు ముఖ్య సాధనాలు .జీవితాన్ని ఒక క్రమ విధానం లో నడపాలి .మధ్యలో బుద్ధి , గుడ్డి  నమ్మకాలు పెడదారులు పట్టిస్తాయి  జాగ్రత్తపడాలి  .ఈ రెండూ కూడా గొప్ప శక్తులే కానీ ముందు వాటి గురించి సంపూర్ణ జ్ఞానం సంపాదించాలి .తర్వాత విశ్లేషించి సరైన మార్గాన సాధన చేయాలి .అన్నిటికీ మార్గ దర్శి అంతశ్చే తన  మాత్రమే అంటారు అంటే అంటారు దృష్టి   మాత్రమే .కనిపించేదంతా యదార్ధం కాదు సత్యం వీటి వెనక దాగి ఉంది దాన్ని తెలుసుకోవాలి .
Inline image 1Inline image 2
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-5-17- కాంప్-షార్లెట్-అమెరికా .

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత వేదాంతం

గణిత వేదాంతం

గణితానికి వేదాంతానికి సంబంధం ఏమిటి ?బోడిగుండుకు  మోకాళ్ళకు ముడి పెట్టటం లాగా ఉందనుకొంటున్నారా .దిగితేకాని లోతు తెలియదు .లెక్కలలో 1 సంఖ్య ఉంది .మిగిలిన అన్ని సంఖ్యలు దీని గుణకాలే .అలాగే ఉన్నది ఒకే ఒక్క శుద్ధ సత్యం .ఆ శుద్ధ సత్యం యొక్క గుణకాలే విశ్వం లో  విభిన్న నామాలు, రూపాలు  ..జీవితం సమ భుజ త్రిభుజం .శరీర కోణం ,శరీరాంతర్గత స్థితి కోణాలు ,బాహ్యప్రపంచ కోణం కలిస్తే సమాన కోణ  సమానభుజాలున్న జీవితం యొక్క సమబాహు త్రిభుజం ..సంఖ్య లన్నీ ఒక స్థిర బిందువునుంచి వచ్చినట్లే ,ఆ బిందువును కొలవలేనట్లే ,ఈ విశ్వమంతా గణింప శక్యం కాని  శూన్యం నంచి ఏర్పడింది .జీవితం ఒక చక్రం .దీన్ని  సున్నా  లేక వృత్తం తో పోల్చవచ్చు. వృత్తం అంటే బిందువు యొక్క పరి వ్యాప్తి అన్నమాట .అయితే జీవితం లో రెండు బిందువులున్నాయి ఇవే  పుట్టుక ,మరణం .ఈ రెండు బిందువులను  కలిపే సరళ రేఖయే జీవితం.జీవితం యొక్క తెలియని భాగమంతా అనంతం రేఖ .
  ముందు ఒక సున్నా పెట్టి దానితరువాత 1 అంకె వేస్తే 01 అవుతుంది .ఒకటి వేసి దానితర్వాత సున్నా పెడితే 10 అవుతుంది .సున్నాలు పెంచిన కొద్దీ విలువ పెరుగుతుంది 100 1000 వగైరా ..ముందు ఒకటి  లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా ఆ సున్నాకు విలువే లేదు .సృష్టిలో అన్ని వస్తువులు సున్నాలే .ఏక పరబ్రహ్మ సత్య భావన లేకపోతే ఈ వస్తువులకు దేనికీ విలువ లేదు .ఆ ఏక సత్య పరబ్రహ్మ ఎరుక కలిగితే జీవితం విలువైనది అవుతుంది .లేకపోతే భారమవుతోంది  .
  కనుక గణితం ధనాత్మక సైన్స్ .అన్ని సైన్స్ లకు మూలాధారం .ఇది సాంఖ్య వేదాంతం పై ఆధార పడిందే ..వేదాంతాలలో అతి ప్రాచీనమైనది సాంఖ్య 0  . ఇది శరీరాన్ని అందలి లోపలి విషయాలను  మనసు చేసే క్రియలను తెలుసుకోవటానికి ఉపయోగ పడుతుంది యోగ అనేది ఆచరణాత్మక విజ్ఞానం (ప్రాక్టికల్ సైన్స్ ).ఇది అతీంద్రియ చేతన(సూపర్ కాన్షస్ ) కలిగిస్తుంది .సందేహ నివృత్తికి  సాంఖ్య  యోగం తప్పని సరి .
   ఈ విషయాలన్నీ స్వామి రామాకు ”చక్ర వర్తి ”అనే  గణిత శాస్త్ర వేత్త అయిన స్వామి బోదించాడు .ఆయన గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ .చక్రవర్తీస్ మాధేమాటిక్స్ ”గ్రంథ రచయిత..తర్వాత జీవితం లో సారం లేదని గ్రహించి సన్యసించి హిమాలయ గుహలలో తపస్సులో గడిపాడు .ఆయనకు మరొక గొప్ప శక్తి ఉంది అదే  ”తదేక దృష్టి ”. దేనిమీద అయినా ఆయన దృష్టిపెడితే దానిప్రభావం గొప్పగా ఉంటుంది .దీనిని ”త్రాటకం ”అంటారు ..ఇంగ్లీష్ లో గేజింగ్ అంటారు .ఈ దృష్టి బయట వాటిపై కేంద్రీకరిస్తే  దాన్ని త్రాటకం అంటారు అదే దృష్టిని అంతర్ముఖ చేస్తే  దాన్ని ఏకాగ్రత అంటారు ..కేంద్రీక రింపబడిన మనసుకు అత్యంత శక్తి లభిస్తుంది .కొందరు దృష్టిని భృమధ్యమం  లో కేంద్రీకరిస్తారు .శివుడు మూడవ కంటి దృష్టిని కేంద్రీకరిస్తేనే మన్మధుడు కాలి  బూడిదయ్యాడు .భూతద్ద0 తో సూర్యకాంతిని కేంద్రీకరిస్తే కాగితం ఫిలిం  దూది మొదలైనవి తగలబడటం మనకు అనుభవమే ..
  స్వామిరామా దీన్ని ప్రత్యక్షం గా చూపించమనికోరాడు  .సరేనని దగ్గరలో ఉన్న కోర్టులో ఏ ఖైదీ అయినా అనవసరంగా అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్నాడేమో చూసి వచ్చి చెప్పమన్నాడు .సరే అని వెళ్లి అక్కడి లాయర్లద్వారా పాపం ఒకతను ఏ నేర మూ చేయకుండా కోర్టులో విచారణకు గురౌతున్నాడని తెలుసుకొని స్వామి చక్రవర్తి కి చెప్పాడు .అప్పుడు చక్రవర్తి ”ఆ ఖైదీ విడుదలవుతాడు .జడ్జి చెప్పే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నీకు ప్రత్యక్షరం తెలియ జేస్తాను కాగితం మీద రాసి టైప్ చేసి ఎవరికీ తెలియ కుండా జాగ్రత్త చేయి .జడ్జిమెంట్ రాగానే నేను చెప్పింది జడ్జి చెప్పింది పోల్చి చూడు ”అని చెప్పటం రామా రాయటం టైప్ చేయటం అందులో మూడు టైప్ తప్పులు దొర్లటం జరిగాయి .రెండుమూడు రోజులతర్వాత జడ్జి తీర్పు చెప్పాడు దాని కాపీ తెప్పించి రామా తానూ టైప్ చేసిన దానితో పోల్చి చూశాడు అక్షరం పొల్లు పోకుండా తానూ చేసిన మూడు తప్పులతో సహా జడ్జి మెంట్ కాపీ ఉంది . ఆశ్చర్యపోయి చక్రవరి త్రాటక విద్య అమోఘమైనది గ్రహించాడు .అంటే ఎక్కడో సుదూరం లో ఉండికూడా మనసును కేంద్రీకరించి అవతలి వారిపై ప్రభావం చూపించవచ్చు అని అర్ధమయింది .అప్పుడు రామా ”స్వామీ !మీరు ఈ ప్రపంచ గతిని మార్చగలరా ?”అని అడిగాడు .దానికాయన ”అది నా పనికాదు అతడు అన్యాయంగా కేసులో ఇరుక్కున్నాడనే జాలితో నా దృష్టిని జడ్జి మనసుపై కేంద్రీకరించి ప్రభావం చూసి జడ్జి మెంట్ అలా వచ్చేట్లు చేయగలిగాను ..మనిషి నిగ్రహం తో ఉంటె ఎక్కడున్నా ,యెంత దూరం లో ఉన్నా అవతలివారి మనసుపై ప్రభావం కలిగించవచ్చు అని నీకు తెలియ జేయటానికే ఇలా చేశాను ”అన్నాడు
 చక్రవర్తి యోగి సంఖ్యామానం లోని సున్నా నుంచి 100 వరకు ప్రతి అంకెను ఉపనిషత్ లోని ఒక్కొక్క శ్లోకం తో జత చేసి వ్యాఖ్యానించి చెప్పేవాడు .వాటిలోని  వేదాంత భావనలను విశదీకరించేవాడు
   మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .. ..
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి భోగి రోగి

హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు .వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు .అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు .ఒకసారి  స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో  హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్హుకోమని పంపాడు .సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు .ఆయన కన్నెత్తి కూడా చూడలేదు .ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు ..ఆయన నిన్ను ఆయన గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ” . అదెలా సాధ్యం ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు .ఆయన ఒక జీవం లేని కర్రముక్కో  రాయిలాగానో  ఉంటాడు చలనం లేదు ”అని ఫిర్యాదు చేశాడు .”కాదులే అక్కడే ఉండు ”అని భరోసా ఇచ్చాడు గురువు .ఒక రోజు హరి ఓం స్వామి  కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్క నా ,రాయినా ?”అన్నాడు .కంగుతిన్నాడు స్వామిరామా .తనగురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని  బోల్డు ఆశ్చర్యపడ్డాడు .మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందం లో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానన్దం కలిగిస్తుంది  ఆ విశ్వ చైతన్యం లో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను ”అన్నాడు  .ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి .హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా  భావించి అనుభవించాడు .

  ఓం హరి స్వామి ఒక సారి కళ్ళు తెరిచినప్పుడు కొన్ని మంత్రాలు చదివి అర్ధం చెప్పాడు .దానిభావ0 , లోకం అంతా రాత్రి వేళ నిద్ర పోతుంటే యోగులు ,ఆత్మజ్ఞాన సంపన్నులు మేలుకొని ఉంటారు .ఇది ఉపనిషత్ వాక్యం ..తర్వాత దానిపై వివరణ ఇస్తూ ”రోజు మొత్తం మీద మంచి కాలం నిశ్శబ్ద రాత్రి వేళ మాత్రమే .అయితే దాని లోని అందాన్ని ఆ నిశ్శబ్ద భావాన్ని కొద్దీ మంది మాత్రమే అనుభవించగలరు .రాత్రి వేళల లో ముగ్గురు మాత్రమే మెలకువ గా ఉంటారు .వారే యోగి భోగి  రోగి .యోగి నిశీది లో  సమాదిగతుడై పరమానందాన్ని పొందుతాడు .భోగి ప్రాపంచిక సుఖాలలో రాత్రిళ్ళు నిద్రపోకుండా  ఆనందం అనుభవిస్తాడు .రోగి జబ్బుతో ముక్కుతూ మూలుగుతూ నిద్ర లేకుండా గడుపుతాడు .యోగిది  శాశ్వతా నందం భోగిది  క్షణికానందం రోగి ది బాదానందం . ”
  మరి యోగికి నిద్ర క్కరలేదా అని అడిగాడు రామా .దానికి ”మనసులో ఏమీ లేకుండా కళ్ళు మూసుకొంటే అది నిద్ర .కావాలని  కళ్ళు మూసుకొని దేనిపైన నైనా  దృష్టి పెడితే  అదిధ్యానం .యోగి కళ్ళుమూసుకొని ఇంద్రియ భావాలను దూరం చేసుకొంటాడు అప్పుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితి కలుగుతుంది కళ్ళు మూసుకోవటం అంటే యోగికి  అంతరేంద్రియమైన కన్ను ను తెరవటమే . అందరు రెండుకళ్ళతో ప్రపంచ వస్తువులు చూస్తే యోగి సర్వ దేహమూ కన్ను గా మారుతుంది సర్వ ప్రపంచం దర్శనీయమౌతుంది” .అని స్వామిరామా సందేహ నివృత్తి చేశాడు .
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

  రఘు వీర చరితం -5(చివరిభాగం )
కావ్యం లో ఉపమాలంకారాలు ఎక్కువగా వాడాడు మల్లినాథుడు ..రామునిపై రాక్షసులు వేసేబాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లు న్నాయి   -”పయోద  బృందాన్ని సగర్జితాని ధారాదిపాతేరివ శైలరాజం ”ఇందులో బాణాలు ఉపమేయం ,వర్ధధార ఉపమానం .సమానధర్మం అభిపాతం .8వ సర్గ లో రూపకాన్ని చక్కగా ప్రయోగించాడు .రామ లక్ష్మణులు సుగ్రీవుని కలిశాక సోదరులను చూసి వానరారాజు మహా ముచ్చట పడ్డాడట అందం ముత్యాలరూపం లో పలువరుసనుండి వెలువడుతోంది అన్నాడు .చంద్ర కాంతి రాత్రి కలువ మనసు అతి తెల్లగా స్వచ్ఛ గంగా జలం  తనను  స్నానం చేయిస్తున్నట్లు ఉందన్నాడు  ఇక్కడ ముఖ వర్చస్సు చంద్రకాంతితో ,దంతాలు ముత్యాలతోను సామ్యం చెప్పాడు .9 వ అధ్యాయం లో సూరి యాకంగా రఘువంశంలో లాగా యమకాన్ని నింపేశాడు .ఈ యమకం దృత విలంబిత శ్లోకానికి  పరమ రామణీయకాన్ని తెచ్చింది -కమలినీ మాలినీ లిత పంకజం -శశమయం  శమయంత మనుక్షపం -స్తపురితం పురితం కవ చ సానుభిః  ”.మరొక చోట దృష్టాంతాలంకారం వాడాడు -భవిష్యత్తులో పెరిగే అవకాశమున్న శత్రువును  ముందే తుద  ముట్టించాలి -లేత మొక్కను గోటితోనే గిల్లేయవచ్చు ,కాలం గడిస్తే మొక్క మానై శాఖోపశాఖలై బలపడి పదునైన గండ్ర గొడ్డలితో ఛేదించాల్సి వస్తుంది -”రిపో రిభిః వ్యాజ్జిత వృద్ధే ఋత్యానమేవ ప్రధమం నిరోధ్యం -నఖ ప్రభేద్యే తు  తరు ప్రరోహే కాలేన కృష్టా హి కుఠార ధారా ”
అర్ధాంతరన్యాసాన్నికూడా  శరదృతు వర్ణనలో సమర్ధవంతంగా ప్రయోగించాడు .లక్ష్మణుడు రామునితో యుద్ధానికి వస్తానన్నాడు -పెద్దలను అనుసరిస్తే ఈ లోకం లోను ,పైలోకం లోను మంచిఫలితాలుంటాయి -”అను వృత్తి ర్గురూణాం హి లోకద్వయ ఫలప్రదా ”.  మరో చోట హనుమ తో -”నహి కృత్యవతామ్ చేతః  ప్రాయహ్ కర్మాంతర క్షమం ”అనిపిస్తాడు ..రాముని మాటలలో ఉత్ప్రేక్ష ను బాగా పలికించాడు ..సీత తనకు దూరమైతే వృక్షాలు కూడా కన్నీరు కారుస్తున్నాయి అని తుమ్మెదల రొద  రోదన ధ్వనిలా ఉందని ఉత్ప్రేక్షించాడు -”ఏ తేవత్ ప్రియతమా విహరాపకల్పం మమీ క్షమీ  క్షమా లిభిర్విహితా తేనాదః -ముజ్వంతి బాష్ప సలిలాని మహీరుహోపి పుష్పేద రస్రు తమరంద మిషేణ నూనం ”
  ఈ మహాకావ్యం లో సంఘటనలు ,పాత్రలు రామాయణం లో ఉన్నట్లే రాశాడు .కొత్తదారి తొక్కలేదు .హనుమ పాత్ర అంటే మల్లినాథునికి చాలా ఇష్టం అని పిస్తుంది .మొదటిసారిగా 8 వ అధ్యాయం లో హనుమ కనిపించి రామునికి అన్నిరకాల సాయం చేస్తానని చెప్పాడు .దీనికి రాముడు పరమాన0దం  పొందాడు  .హనుమను ధీరోదాత్తుడు,స0యమి   అన్నాడు .అతడు అరణ్యం లో ఉండటం రుద్రుని సేవించిన0త సంతోషంగా ఉందన్నాడు  .-”సర్వా తీతస్య వశినస్తవ శక్తిమతః ప్రభో-భైక్ష చర్యణా రుద్రస్య శోభతే వనవాసినా ”
  రామ హనుమల  స్నేహ బంధం అగ్ని సాక్షిగా  జరిగింది .రామకార్యాన్ని నిర్వర్తించమని జాంబవంతుడు హనుమకు హితోపదేశం చేశాడు .రాముడు విష్ణు అవతారమని ఆయన పూర్వ అవతారాలు తనకు తెలుసునని చెప్పాడు .సృష్టికర్త మొదటగా రాముని సృష్టించి ,తర్వాతే స్వాయంభువ ,మొదలైన మనువును సృష్టించాడని చెప్పాడు . 1 1వ అధ్యాయం లో హనుమ జన్మకు ముందున్న పరిస్థితుల వివరణ ఉంది .హనుమలో వాయు ,ఇంద్ర ,బ్రహ్మ వామన లక్షణాలు గుణాలున్నాయన్నాడు -”పితురివ బల వేగయో రముష్య స్థితి రామరాధిపతే రివారు తేజహ్ -కమల భావ ఇవోద్యసః సమాధౌ కపట బటోరివ కామ రూపతా ”.హనుమ యొక్క విశ్వాస ధైర్యాలు ,అనుమానాలను గొప్పగా వర్ణించాడు .హనుమ మహత్కార్యాలన్నీ వైభవోపేతంగా మిగిలిన అధ్యాయాలలో సంపూర్ణంగా వివరించాడు మల్లినాథుడు ..ఏతా  వాతా  తేలిందేమిటి అంటే ఇదిపేరుకి రఘువీర చరితమే కానీ అసలు హనుమ వీర చరితమా అన్నట్లు రాశాడనిపిస్తుంది .హనుమ శక్తి యుక్తులు బలపరాక్రమాలు రామునిపై గల అత్యున్నత భక్తి విశ్వాసాలు చాలా గొప్పగా సూరి వర్ణించాడు .మిగిలిన కావ్యాలలో ఉన్నట్లు వ్యర్ధమైన వర్ణనలేమీ చేయలేదు చక్కని కావ్యమర్యాదను సంయమనాన్ని పాటించి మల్లినాథ సూరి తన కవితాప్రతిభా సర్వస్వ0గా రఘువీర చరితమహాకావ్యాన్ని తీర్చి దిద్ది సెహబాష్ అనిపించుకున్నాడు .
              మల్లినాథుని శైలి ,ఊహా శక్తి
మల్లినాథుని శైలి ఊహా శక్తి ఎప్పుడూ ఆడంబరానికి గురికాలేదు కాళిదాస మహాకవిలాగా భారంకాని  దీర్ఘ0కాని   సంయుక్త పదాలనే వాడాడు కనుక మల్లినాథునిది వైదర్భి శైలి .సరళం గా సూటిగా ఉంటుంది .వాడిన అలంకారాలు తేలికైవై సులభగ్రాహ్యమైనవి కూడా క్లాసికల్ యుగానికి కొద్దీ దూరంగా మల్లినాథుడున్నాడు కనుక ఈ కావ్యం లో కృత్రిమతా ,పదాడంబరాలు లేవు .మల్లినాథుడికి ఆదర్శం కాళిదాసమాహా కవి .రాముని సీతా విరహవేదన రఘువంశం లో ఇందుమతీ విరహ వేదన పొందిన అజుని విరహ వేదన లా ఉంటుంది . సీత పాద భూషణాలు చూసి దుఃఖించటం విక్రమోర్వశీయం లో 5 వ అంకాన్ని గుర్తుకు తెస్తుంది .
  కాళిదాసు మానవ భావాలను సహజ విషయాలుగా భావించి చెప్పాడు .ప్రకృతికి ,మానవ ప్రకృతికి ఉన్నభావోద్రేక  సంబంధాన్ని తరచి  వివరించాడు .మల్లినాథుడు ప్రకృతిని మానవ భాషలో వర్ణించాడు పంపానదినిసుందర కన్యగా అభి వర్ణించాడు .మాల్యవంతుడు స్వర్గానికి తొందరపడి వెళ్లకుండా పంప  అడ్డు పడిందన్నారు .ఈ పట్టణం పంపాతీరాన పదభాగం లో ఉంది .అందుకని పర్వత పదాలను తాకి వేగం తగ్గించుకొన్నద ని భావం ..పాద శ్లేష నుపయోగించి పంపానాయకిపాత్రకు ఔచిత్యం ఘటించాడు .నదిపై మంచు ఆమె కనుబొమలఅల్లికలా ఉందట .నదిలోని తామరపుష్పాలుఆమె హస్తాలు ,కాళ్ళు  ముఖం ,కళ్ళు .సుడులు ఆమె బొద్దుపై వళులు  చక్రవాక ద్వయం ఆమె చనుకట్టు సౌందర్యం .-”ఉద్యతస్య దివం ప్రాప్తం నిరోద్రుమివ సదు  గతిం  -మహీ భూతొ మాల్యవతః పాదాశ్లేషం వితంవా తీ0 –  వీచీ భి ర్భూ లతా0  పా ద్యైహ్  పాణిపాద ముఖ క్షేణ 0 -ఆవర్త  నైనాభి విన్యాసం స్థనాశ్రయం” .
 లతలు చెట్లను పెనవేసుకొన్నప్పుడు రాముడు మరింత వియోగ బాధ పడ్డాడు .ఇక్కడే రామ లక్ష్మణుల సుదృఢ దేహ సౌష్ఠవ సౌందర్యాలను తనివి తీరా వర్ణించాడు .సాధారణంగా కావ్యనిర్మాతలు అనేక రసాలను కావ్యం లో పోషిస్తారు .ఆలంకారికుల సిద్ధాంతం ప్రకారం ఒకటే రసం శృంగార రసం అంగిరసంగా ,మిగిలినవి అంగ రసంగా ఉండాలి .ఈ  కావ్యం లో చాలా దృశ్యాలు యుద్ధ దృశ్యాలే .కనుక వీరరసమే ఇక్కడ ప్రధానం .మిగిలిన రసాలు సందర్భానుసారం పోషించబడ్డాయి .యుద్ధ భూమిలో పీనుగు కుప్పలు భయానకంగా భీభత్స రస ప్రధానంగా వర్ణించబడ్డాయి .రాక్షసులతో యుద్ధాలు భయానక రసాన్ని పోషించాయి ..
  రావణ వద్ద తర్వాత అందరు పుష్పక విమానం లో తిరిగి వస్తున్నప్పుడు దారిలో కనిపించిన వాటినన్నిటిని మల్లినాథుడు ఒకే అధ్యాయం లో వర్ణించి ఔచిత్యం పాటించాడు .రాక్షస గణాలు , ,గరుడ వేగ గమనం ,హనుమ ప్రత్యంగ వర్ణన లలో స్వభావోక్తి అలంకారమే ఉపయోగించాడు .వర్ణనీయ వస్తువుకు తగిన పదాలను ఎన్నుకొని సంపుష్ఠి సంతృప్తి కలిగించాడు .. తరువాతకవులలో ఉన్న అతిశయోక్తి పదాడంబరం మల్లినాథునిలో లేదు .కావ్యమంతా అతి నిదానంగా మెత్తగా ,అవసరమైన చోట్ల విగర్  పొగరు లతో సాగుతుంది .కాళిదాసాదుల లాగ మల్లినాథుడు మంచి శుభాషి తాలను ప్రతి వస్తూపమా లేక అర్ధాంతర న్యాసాలతో అందంగా   కావ్యం లో చెప్పాడు -1-పరిమా చేతు కరణేషు నాతి కాంక్ష్యా 2-అను వృత్త గురూణాం హి  లోక లోక ద్వయ ఫలప్రదా 3-అల్పేనాని నిమిత్తేన సౌభ్రాత్రం క్రియతే నృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే 4-నహి కృత్యవతామ్ చేతః ప్రాయహ్ కారమంటారాక్ష్మమం”
  దీనితో మల్లినాథుని ”రఘవీర చరితం”మహాకావ్యం పై విశేష విషయాలు సమాప్తం  

   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నోర్సేగాడ్స్

నోర్సేగాడ్స్

నోర్సే అంటే  నార్త్ అంటే ఉత్తర ప్రాంతం . అక్కడి ప్రజలను నోర్సే మెన్ అంటారు . వీరి భాష ఓల్డ్ నోర్సే భాష లేక ఐస్లాండిక్  భాష అంటారు  ఇది ఇండో యూరోపియన్ భాషలో ఉత్తర జర్మనీ భాష .ఈనాటి స్కాండినేవియన్ భాషకు ప్రాచీన భాష  వీరు మధ్య ,ఉత్తర స్కాండినేవియా దేశపు ఆటవిక సముద్ర సాహస జాతి .నార్వే ,డెన్మార్క్ ఐస్ ల్యాండ్  స్వీడన్  దేశాలవారిని అందర్నీ ఇదే పేరుతొ పిలుస్తారు వీరు మధ్యయుగాల  బ్రాన్జ్ యుగ ప్రజలు .విచిత్రంగా నోర్సే అంటే పడమటి నోర్సే అని అంటే ఐస్ లాండ్ లో స్థిరపడిన వారని అర్ధం రూఢ మైంది .వీళ్ళుఅమెరికా నార్మాండి  గ్రీన్లాండ్ ,స్కాట్లాండ్ ,ఐర్లాండ్ ,వేల్స్ లలో కాలనీలు ఏర్పరచారు వీళ్ళనే తూర్పు నోర్సే లనీ అంటారు వీళ్ళను డేన్స్ ,స్వీడిష్ లనీ అంటారు  .వీరు ఇంగ్లాండ్ ష్కాట్ ల్యాండ్ ,ఐస్ ల్యాండ్ వేల్స్ ఫారో ఐలాండ్స్ ఫిన్లాండ్ ,ఐర్లాండ్ రష్యా ,గ్రీన్ ల్యాండ్ ,ఫ్రాన్స్ ,జర్మనీ   బెల్జియం యుక్రేన్ ,జర్మనీ ,పోలాండ్ కెనడా ,దక్షిణ ఇటలీలలో ర స్థావరాలు ఏర్పాటు  చేశారు,పాలనా చేశారు  .వీరంతా వైకింగ్ లకు పూర్వం వారు

  వీరి సంస్కృతిని ”నార్డిక్ కల్చర్ ‘అంటారు . ఈ ప్రజలు యుద్ధ వీరులు వ్యవసాయ దారులు ,సముద్ర  దొంగలు ,అన్వేషకులు .మంచి వాణిజ్య నిపుణులు . జంతు రోమాలు అంటే ఫర్ అమ్మకాలతో కుబేరులయ్యారు .వాల్రస్ చేపల దంతాలు ,ద్రువపు ఎలుగుబంటి చర్మాలను రాజులకు అమ్మి పిచ్చగా సంపన్నులయ్యారు .వీరిది స్వతంత్ర ప్రవ్రుత్తి .ఎవరివద్దా బానిసలుగా కానీ పని కానీ చేసేవారుకాదు . గ్రామాలకు గ్రామాలనే  బందీ చేసి ప్రజలను బానిసలను చేసి అమ్మటం వీరి ప్రత్యేకత .బంగారం వెండి రాయి కలప లతో అద్భుత సృజనాత్మక  వస్తువులు చేసేవారు .ఇప్పటికీ ఇవి సజీవంగా ఉన్నాయి అయితే ఆడవారికి రాజకీయా ,న్యాయ విషయాలలో ప్రవేశం లేదు .వాళ్ళు పొలం పనులు చేపల పరిశ్రమ కే  పరిమితం భర్తలు వారాలు నెలలు సంవత్సరాలతరబడి ఇంటికి దూరంగా ఉంటె కుటుంబ బాధ్యత స్త్రీలదే ..కథలు చెప్పటం వీరిలో తరతరాలుగా వర్ధిల్లిన కళ ..నోర్సే  పురాణ గాధలను వీరుల చరిత్రలను కంఠతా వచ్చి తర్వాత తరాలకు ఆకధలను చెప్పి స్ఫూర్తి కలిగించేవారు . 13 శతాబ్దం దాకా వారికీ  లిఖిత సాహిత్యం లేదు .కధలు గాధలు కవితాత్మకం గా  చెప్పే వారంటే వారికి పరమ ఇష్టం .వీరిని ”స్కాల్డ్స్ ”అంటారు .వీళ్ళు పురాణ గాధల్ని ,హీరోల చరిత్రలను రాసి పాడి వినిపించేవారు
  నోర్సే  గాడ్స్ అంటే దేవుళ్ళు అందమైన ” ఆస్కార్డ్ ”అనే బంగారు భవంతులలో ఉంటారు . వీరిలో” ఓడిన్ ”దేవుడు ముఖ్యుడు  దీన్ని వేరేరకంగా చెప్పాలంటే నోర్సే పాంథియన్ లలో(దేవతా గణం  ) ఓడిన్ ముఖ్య అధిపతి ,అతని కొడుకు ”ధార్ ”ఉరుముల దేవుడు ”.ఫ్రే”  సంతానోత్పత్తి దేవత ఫ్రే కవల సోదరి  ఫ్రేయ  .పోడియం కు జంతు మానవ బలి ఇష్టం .ఇతని భార్య ఫ్రిగ్గా ” ముఖ్య దేవతా రాణి .ఈమె కొడుకు బాల్డర్ మంచితనం కాంతులకు దేవుడు కవిత్వానికి దేవత బ్రాగి .యుద్ధ దేవత ”టైర్ ”దేవతల దూత  ”వాలియంట్ హెర్మోడ్ ”..నోర్సే లు పాతాళ లోకం ఉందని దాన్ని  క్రూర రాక్షసులు పాలిస్తారని ,వారిలో ”లోకి ”చాలా ప్రమాదకరమమైన వాడని అతని కూతురు” హెల్ ”  చనిపోయిన  గౌరవం లేని చీకటి రాజ్య0 ” నిఫ్తీమ్” కు రాణి అని నమ్ముతారు . నోర్సే  దేవతలకు,  సాధారణ మానవులకు ”ఈవిల్  ఫ్రాస్ట్ జయింట్స్ ”నిరంతరం భయం బాధ కలిగిస్తారని భావిస్తారు  .ఇదంతా మన పురాణాలకథలే .పేర్లు తేడా అని పిస్తుంది .
  ఈ పురాణ గాధలకు ఆధారం పొయెటిక్ ఎడ్డా లేక ఎల్డర్ యెడ్డా.ఇందులోని కథలు సిగార్డ్  లేక్ సీగ్  ఫ్రెడ్ అనే  డ్రాగన్ కిల్లర్ అయినవీరుని   సాహస గాధలు . ఎల్డర్  ఎడ్డా లో విశ్వం పుట్టుక ,సకల గోల్డెన్ ఆస్కార్డ్ దేవతలు మరణించే డూమ్స్ డే వర్ణనా  ఉన్నాయి . అదే మన ప్రళయం లాంటిది .ఈ గాధాలహరి 1000 -1100 కాలం లో రాయబడింది .ఇదికాక మరో లిఖిత గ్రంధం ”యంగర్  ఎడ్డా ”ను 1200 లో కవి ,చరిత్రకారుడు ,రాజాస్థానం లో ఉన్న స్నోర్రి స్ట్ర ర్లు సన్ రాశాడు . దీన్ని వచన ఎడ్డా అని కూడా అంటారు ..ఇందులో కవులకు కావలసిన చిట్కాలతోపాటు ముఖ్య దేవతల వర్ణన వుంది . ఈ కాలం లో నోర్సే దేవతలైన ఓడిన్ ,ధార్ ,మొదలైన వారి కధలను వైకింగ్ లతో జోడించి చెబుతున్నారు .
  911 లో వైకింగ్ చీఫ్  హ్రాల్ఫ్ కు ఫ్రెంచ్ రాజు కొంత ప్రాంతాన్ని ఇచ్చేశాడు అదే నార్మండి  ..తర్వాత ఇంగ్లాన్డ్ ను ,ఇటలీ లో కొంత భాగాన్ని జయించాడు .. యుద్ధం లో చనిపోయిన నోర్సే  వీరులు దేవతాధిపతి ఓడిన్ కు ”వల్ల హల్లా ”లో అతిధులుగా ఉంటారని నమ్ముతారు ..ఇదే వారి  అమర వీరుల స్వ ర్గం .మనకూ ఇదే కద ఉన్నది కదా . ఇక్కడ అమర వీరులకు సకల సౌకర్యాలు ,”విందు ,మందు పొందు” లభిస్తాయి   .ఐస్ ల్యాండ్ లో 130 అగ్నిపర్వతాలున్నాయి 2010 లో ఒక వాల్కనో బ్రద్దలైతే దాని పొగయూరప్ దాకా  ఆకాశమంతా కమ్మేసి అనేక వారాలు విమాన ప్రయాణాలు రద్దయినాయి .నోర్సి మైథాలజీ ఇలాంటి భయోత్పాతాలవలన ప్రభావితమైనదే ..ఇంగిలీషు నిఘంటువులో వీళ్ళ మాటలు ఎన్నో చేరాయి .Enthral అంటే అతి నిశ్శబ్దంగా ఉండటం.లేక సంభ్రమంలో బందీ అవటం  .ఇది ఓల్డ్ నోర్సే పదం ”త్రాల్” అంటే బానిస నుంచి వచ్చిందే   వైకింగ్ ల డ్రాగన్ షిప్ లంటే శత్రువులకు టెర్రర్ ..వైకింగ్ లు మహా నావికులు . 1984 లో నార్వేజియన్ రెగ్నార్  దోర్ సేత్ తన కుటుంబం తో వెయ్యేళ్ళ నాటి” వైకింగ్ నార్  ”అనే నౌకలో గంటకు 16 కిలోమీటర్ల వేగం తో ప్రపంచాన్ని అంతటిని 2 ఏళ్లలో చుట్టి  వచ్చాడు  .    వారానికి ఆంగ్లం లో ఉన్న ట్యూస్  డే  వెన్స్ డే దర్స డే ఫ్రై  డే రోజులు కూడా నోర్సే  దేవ భాషా జన్యాలే -టైర్(టియు )ఓడిన్ (వోడేన్ ) ధార్ ,ఫ్రిగ్గా లకు సాంకేతికాలు టైర్ యుద్ధ దేవత ,ఓడిన్ దేవాధిరాజు ,ఇతనికొడుకు ధార్  ఫ్రిగ్గా  ఓడిన్ భార్య క్వీన్ ఆఫ్ గాడ్స్ .ధార్ ప్రజా దేవత వైకింగ్ వీరుల ఆరాధ్య దేవత .ఒక గాధ ప్రకారం హాటిల్దా  ది హన్ ఒక నది ఒడ్డున 434 లో టైర్ దేవత యొక్క  భూమిలో పాతబడి ఉన్న ఖడ్గాన్ని  గుర్తించి  బయటికి తీశాడు . రోమన్ ,గాల్  అంటే నేటి ఫ్రాన్స్ సామ్రా జ్యాలకు హాటిల్దా  అతని బార్బేరియన్ గుంపు అంటే సింహస్వప్నం ..
  స్కాండినేవియాలో రాత్రివేళల్లో ఆకాశం ప్రకాశమానంగా ఉన్నప్పుడు ఫ్రిగ్గా దేవత రాట్నాన్ని నక్షత్రాలలో చూడవచ్చు నని చెబుతారు .దీన్నే గ్రీకులు ఓరియన్ బెల్ట్ నక్షత్ర సముదాయం అన్నారు ..ఓరియన్ అంటే గ్రీకు పురాణ వీరుడు .యితడు చంద్ర దేవత  ఆర్టిమెస్ చేత  చంపబడ్డాడు  . 1903 లో ఒక నార్వేజియన్ రైతు పొలం లో ఓక్ తో చేయబడ్డ వైకింగ్ షిప్ ఓస్ బెర్గ్ భూమిలో లోతుగా తవ్వితే బయట పడింది . ఆ షిప్ లో అందంగా వస్త్రాలంకరణ చేసుకొన్న ఇద్దరు యువతుల శవాలు కొన్ని విలువైన వస్తువులు ఒక బకెట్ నిండా ఆపిల్ పళ్ళు కనిపించాయి ఆపిల్ పళ్ళు సంతానానికి చిరాయువుకు చిహ్నాలు  .ఓడిన్ దేవతకు” స్వస్తికా ”చిహ్నానికి సంబంధం ఉంది ఈ చిహ్నం డెన్మార్క్ లో ఆంగ్లో సాక్షం రాజుల ఖడ్గాలపిడి పై కనిపించింది .ఈ చిహ్నం ఉంటె యుద్ధం లో విజయం తధ్యమని నమ్మిక .20  వ శతాబ్దం లో జర్మనీ నాజీలు స్వస్తికా ను తమ జండా చిహ్నంగా స్వంతం   చేసుకొన్నారు
  నార్డిక్ ప్రజలు దేవతలకు గుర్రాలను బలి ఇచ్చేవారు ..రోమ్ లో పూర్వం రథాల పోటీ ఫీల్డ్ ఆఫ్ మార్స్ అనే చోట ప్రతి అక్టోబర్ లో జరిగేది .గెలిచిన టీమ్ రైట్ హాండ్ హార్స్ ను మార్స్ దేవతకు  మంచి పంట కోసం బలి ఇచ్చేవారు .ఇక్కడ ఒక తమాషా విషయం జ్ఞాపకానికి వచ్చింది .ఈ మధ్య  మైనేని గారు పంపిన హారీ .జి ఫ్రాంక్ఫర్ట్ రాసిన ”రీజన్స్ ఆఫ్ లవ్ ”చదువుతుంటే అందులోగ్రీకు తత్వవేత్త గణిత శాస్త్రజ్ఞుడు అరిస్టాటిల్” 2 కు వర్గమూలం రేషనల్ నంబర్ కాదు”అని తాను రుజువు చేసినందుకు అమితానందపడి ఆయన మత క్రియలను బాగా ఆచరించేవాడుకానుక వెంటనె తన అను అనుచరుల్ని 100 ఎద్దులను దేవతకు బలి ఇప్పించాడని ,ఆతర్వాత అప్పటినుంచి ఏ శాస్త్రజ్ఞుడు కొత్త విషయాన్ని కనిపెట్టినా  తమ ప్రాణాలు అన0త  వాయువుల్లో కలిసిపోతాయేమోనని ఎద్దులు వణికి పోయే వని  చమత్కరించాడు రచయిత..ఇందులోనే మరో విషయం ప్రముఖ శాస్త్ర వేత్త నీల్స్ బోర్ చెప్పిన ట్లు ప్రచారం లో ఉన్న  ”  one should never speak more clearly than one can think ” సూక్తి నచ్చింది
 అడవి పంది  అంటే పూర్వ నోర్సేలకు మహా గౌరవం .అది చాలా ప్రమాదకర ,కపట జంతువు . దాని వాడియైన దంతాలు మనుషుల్ని ,కుక్కల్ని గుర్రాల్ని చీల్చిపారేస్తాయి .అడవి పంది  తలకాయను నార్థన్ కింగ్స్ ,వీరులు టోపీ గా పెట్టుకునేవారు .అది వీరత్వానికి ఘనమైన చిహ్నం  . danelawఅనే పదం ఒకప్పుడు బ్రిటిష్ ఐ ల్స్  లో వైకింగ్ లున్న ప్రాంతాలకు గుర్తుగా వాడేవారు .తర్వాత కాలాంతరం లో స్కాండినేవియన్ శబ్దజాలం లో  law, bylaw ,outlaw పదాలు ఏర్పడి  అవే  ఇంగ్లీష్    పదాలుగా వాడబడుతున్నాయి  .కెనడాలో నోర్సే కాలనీ స్థాపించిన ప్రముఖులలో” ఫోర్బ్ జర్నర్న దొట్టిర్”ఒకామె . 11 శతాబ్ది మధ్యలో ఆమె రోమ్ పర్యటన చేసి0ది  పోప్ తో సెటిల్ మెంట్ గురించి మాట్లాడి ఉంటుంది అంటారు .కనుకనే తర్వాత కేథలిక్ బిషప్ నుగ్రీన్ ల్యాండ్ లో ఏర్పాటు చేశారని ఆయన కింద ఐస్ లాండ్  లోఅప్పటికి  పేరు పెట్టని ప్రదేశాలు కూడా ఉన్నాయని భావిస్తారు . ప్రపంచం లో ”లౌడెస్ట్  బాండ్ ”   వైకింగ్ ఫ్లైర్ గా గిన్నెస్ బుక్ లో చోటు చేసుకొన్నది.వారి  ” సన్  ఆఫ్ ఓడియన్  ఆల్బమ్”   ను 2006 లో,గాడ్స్ ఆఫ్ వార్ ఆల్బమ్ 2007 లో విడుదలయ్యాయి
  సాహిత్యం లో హేన్రి రైడర్ హెగ్గర్డ్ ప్రసిద్ధ రచయిత.అతని కింగ్ సా ల్మన్ మైన్స్,షి నవలలు గొప్ప పేరుపొందాయి .జె ఆర్ ఆర్ టోల్ కెన్ అనే బ్రిటిష్ రచయితతన హాబీబిట్ ,లార్డ్ ఆఫ్ రింగ్స్ నవలలో నోర్సే కధలకు అందమైన రూపం ఇచ్చాడు .కాలిఫోర్నియాలో లేక్ టాహో వద్ద ”వైకింగ్స్ హోల్మ్ కాజల్ ఉంది దీన్ని 1929 లో స్వీడెన్   ఆర్కిటెక్ట్   లోరానైట్ నిర్మించాడు  నీల్ గయమన్అనే అమెరికన్ రచయిత రాసిన అవార్డు నిన్నర్  రచన ”అమెరికన్ గాడ్స్ ”లో పాత్రలందరూ పాత నోర్సే  దేవతలకు ఆధునిక పెర్సనానిఫికేషన్స్   నోర్సే  దేవతలైన  ధార్  ,మొదలైన వారి పేర్లు ఇప్పుడు వీడియో గేమ్స్ ,కామిక్స్ ,టివి షో లలో దర్శన మిస్తూ .నోర్సే  దేవతలను చిరంజీవులు చేస్తున్నారు ..లాంగ్ లివ్ నోర్సే  గాడ్స్ ”
. Inline image 1Inline image 2Inline image 3Inline image 4
   మీ –  గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

      రఘు వీర చరితం -4

పదవ అధ్యాయం లో శరదృతు వర్ణన చేశాడు మల్లినాథుడు . సుగ్రీవుని తాత్సారం పై మొదట్లో రాముడు సందేహించినా ఆతర్వాత రావణ సంహారానికి సుగ్రీవుడు అనంత వానర సైన్యాన్ని సిద్ధం చేశాడని తెలిసి సంతోషించాడు .విజయం హనుమవల్లనే సాధ్యమని రాముడు హనుమతో అన్నాడు .తన అంగుళీయకాన్ని హనుమకిచ్చి  సీతాదేవికి ఇవ్వమన్నాడు ..ఆమె తో చెప్పవలసిన విషయాన్ని వివరించి చెప్పాడు .వానర సైన్యం దక్షిణానికి కదిలి సముద్ర తీరం చేరింది .అప్పుడు హనుమ వానర నాయకులతో తాను  విష్ణు మూర్తి అనేక అవతారాలకు  ప్రత్యక్ష సాక్షి నని  అని చెప్పి వానరులకు ఆశీస్సులు పలికాడుహనుమ .
 11 వ అధ్యాయం లో లంకకు ప్రయాణమయ్యే హనుమ వైఖరిలో భిన్నత్వం గోచరిస్తుంది  .ఖగోళ దివ్య మూర్తులందరు హనుమ విజయాన్ని కాంక్షించి శుభం పలికారు .హనుమ సముద్ర  లంఘనంవిష్ణుమూర్తి  ఆదివరాహం ను జ్ఞప్తికి తెస్తుంది ..దారిలో ఆయన చేసిన సాహస కృత్యాలు లంకలో ప్రవర్తించిన తీరు కవితాత్మకంగా సూరి వర్ణించాడు .సీత జాడ ఎక్కడా కనపడనందున కొంత నిరాశ చెందాడు .సేవకునిగా కర్తవ్యమ్ చేయలేకపోయానని బాధ పడ్డాడు -ఫల్ల0తి చే త్స్వామి గుణా హ్ సమస్తాః క్రియా విమూడా యది భృత్య దోషాహ్ -నిరంతర కలేశనిదాన భూతా దిగీ దర్షిం కిడంకర తమానాయాం ‘. ఆత్మా న్యూనతా భావం తో ఆత్మహత్యకూ సిద్ధమయ్యాడు . మళ్ళీ స్థిర చిత్తుడై సీత ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీరుతాను అనుకున్నాడు ..అశోక వనం లో రాక్షస స్త్రీల మధ్య దీన వదనం తో ఉన్న స్త్రీని చూసి సీతా దేవి యే అని నిర్ణయానికి వచ్చాడు .
   13 వ అధ్యాయం సీతాంజనేయ సంభాషణం .సీతాపహరణం దగ్గర నుంచి జరిగిన విషయాలు హనుమ సీతకు వివరించి చెప్పాడు .సీతా విరహం తో రాముడు పొందిన వేదనను వివరించాడు .ఒకసారి నెమలి ఈకలను చూసి సీత తలలో అలంకరించుకున్నరాలిన  పుష్పాలుగా  భ్రమించి వెంటపడ్డాడని చెప్పాడు .సీత లేని రాముడు రాముడు కాదన్నాడు .సీతను చూడటానికి మాత్రమే లంకకు తానూ రాలేదని రామ ముద్రికను ఇచ్చి ఆమెకు సంతృప్తి కలిగించటానికి వచ్చానని అన్నాడు ..తనపై దయ చూపమని .ఆమె గుణ గణాలను సంబోధన ప్రధమా విభక్తిలో వర్ణించాడు -”స్వామిని స్థిర శుచి వ్రతే సతీమార్గ సంచరణా పూర్వ గామిన్ -విప్ర యుక్త రఘునాధ జీవిత మ్లాని హరిణి  దశా పునీహి మామ్ ”.
  సీతా దేవి కాకాసుర వృత్తాన్తమ్ జ్ఞప్తి చేసి తనను అలక్ష్యం చేయట0 తగదని  ప్రార్ధించి చెప్పానని చెప్పమన్నది .తర్వాత లంకాదహనం మళ్ళీ అంగదాదులతో రామ సుగ్రీవ సందర్శనం  సీత ఇచ్చిన చూడామణి రామునికివ్వటం ,అందరు లంకపై దాడికి సిద్ధమై సముద్ర లంఘనం చేయాలనుకోవడం నలుని నాయకత్వం లో వారధి నిర్మించటం వర్ణితం .
 14 వ సర్గ లో లంకలో రాక్షస వానర భీకర యుద్ధం ,విద్యుజ్జి0హుడు ఒక భూతాన్ని సృష్టించి వానరులను భయపెట్టటం ,మాయ రామ  తలకాయ తెచ్చి సీతను బెదిరించటం .నాగ సైన్యాన్ని రామ సైన్యంపై ఉ సిగొల్పటం గరుత్మంతుడు దీన్ని ఛేదించి కాపాడటం గరుత్మంతుడు రావణ కుటుంబ సర్వ నాశనాన్ని ఊహించి చెప్పటం ,తర్వాత ఎన్నో క్షిపణులతో ఘోర సంగ్రామం జరగటం కుంభకర్ణ వద్ద తో సమాప్తం .
  16 వ అధ్యాయం రావణ సేనానులైన అతికాయాదుల  మరణం ,ఇరువైపులా అనేక యోధుల హతహమ్ మేఘనాధుడు యుద్ధానికి రావటం భయంకర యుద్ధం లో వానరులు వీరోచితంగా పోరాడటం హనుమాన్ వానరులకు ఉత్సాహం తెప్పించటం బ్రహ్మాస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే లక్ష్మణుడు దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేయటం ,కుంభకర్ణ ఇంద్రజిత్ వగైరా చనిపోయాక రావణుడు సూటిగా  రాముని తో తలపడటం ,రావణుడు మంత్రం శక్తిని ప్రయోగించి రామునిపై వేయటం ,అగస్త్య ముని వచ్చి సూర్య తేజం తో విఫలం చేయటం ,రాముడు దశ కంఠ  రావణ శిరచ్చేదం చేయటం -”శిరామి తత్స లూనాని తేన సర్రవాని రేజిరే -శిఖర ణీవ నీలాద్రే ధాతు లిప్తాని వాజిణా ” రవాణా సంహారణాన్తరం శివ బ్రహ్మాది దేవతలు వచ్చి రామ పరాక్రమాన్ని ప్రస్తుతించటం ,సీత అగ్ని పునీత యై రావటం ,విభీషణుని లంకా పట్టాభిషేకం ,హనుమంతుడు తెచ్చిన పుషప్పక  విమానం లో అందరు ఎక్కి అయోధ్యకు బయల్దేరటం తో పూర్తి .
  17 వ అద్యాయం లో ఆకాశ విమాన ప్రయాణం ముఖ్యమైన ప్రదేశాలు రాముడు సీతకు చూపించటం ,వింధ్యపర్వతాలు ,పంపానది మతంగ ముని ఆశ్రమం  గోదావరినది ,పంచవటి భరద్వాజ,శరభంగా శ్రమాలు ,పవిత్ర గంగా యమునా సరయు నదులు,చిత్రకూట పర్వతాదులు చూపిస్తూ గాధలను వివరించి చెప్పాడు రాముడు సీతకు . రాముడు అయోధ్యలో కాలుపెట్టగానే ప్రజలు సంతోషం తో బ్రహ్మ రధం పట్టటం  ,కౌసల్యాది మాతలు గురువు వశిష్ఠమహర్షి మంత్రి సుమంత్రుల పరమానందం ,వసిష్ఠ మహర్షి ఆధ్వర్యం లో సర్వ సాగర నదీ జలాలతో అభిషేకించి శ్రీ రామ పట్టాభిషేకం చేయటం తో రఘువీర చరిత కావ్యం సమాప్తమవుతుంది. .
  రఘువీర చరితం మహాకావ్యం లో ముఖ్య విశేషాలు
1-ఇతర మహా కావ్యాలలాగానే వాల్మీకి రామాయణం ఆధారం గా రాయబడింది
  2- కావ్యమర్యాదలన్నీ పాటించి వర్ణనలు చేశాడు సుతీక్ష్ణ ఆశ్రమం దండకారణ్యం అగస్త్యాశ్రమం పంచవటి వర్ణనలు మహా కవి లాగా మల్లినాథుడు చేశాడు ప్రకృతి  వర్ణనలకు ”కులక ”శ్లోకాలను .చక్కగా ఉపయోగించాడు .
3-ప్రతి అధ్యాయం లో ఒక్కొక్క ప్రత్యేక ఛందస్సును ఉపయోగించాడు .అధ్యాయం చివర ఒకటి రెండు శ్లోకాలను వేరేఛందస్సులో రాశాడు
4-సాధారణం గా మహా కావ్య నాయకుడు దివ్య క్షత్రియ వంశ సంజాతుడై ఉంటాడు కానీ ఇందులో శ్రీరామ ,లక్ష్మణ ,,హనుమ లు ముగ్గురూ నాయకులే అవటం విశేషం
5-కావ్యం లో అనేక అలంకారాల శోభ ఉంటుంది..శబ్దాలంకారమైన అనుప్రాస ఒక శ్లోకం లో మహా ,హర్ష ,సమ్ ,ద్ ,నిశ్చిత్ అనే పదాలు పునరా వృత్తమై,కొత్తరకమైన అందమైన ప్రాస కు జీవం పోసింది   -”తయేతి  నిశ్చిత్య స నిశ్చితాయోమ్ మహీయ సస్తత్య మహేంద్ర వీర్యహ్ -ప్రహర్ష వర్షేన్దుర  ధీర్మ  హర్షే రుపాశదంత  పాద సరోజ రేగుణం ”  .
  సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా .
–

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )

1322లో పారిస్ లో  అయిదుగురు మహిళలనులైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారని  అరెస్ట్ చేసి విచారణ జరిపారు . అందులో జాక్వెలిన్ ఫెల్సీ అల్మెనియా ను రోగులను పరీక్షిస్తూ నాడి  చూస్తూ  మూత్రపరీక్ష చేస్తూ ,వాళ్ళ అవయవాలను ముట్టుకొంటున్నందుకు విచారించించగా ఎనిమిదిమంది రోగులు ఆమె వల్లనే తమ జబ్బులు నయమయ్యాయని మగ డాక్టర్లు చేయలేని పని ఈమె చేసిందని సాక్ష్యమిచ్చారు .కానీ జడ్జి మాత్రం ”ఆడవాళ్లకంటే మగ  డాక్టర్ జబ్బుల్ని బాగా నయం చేస్తాడు ”అని చెప్పి ఆ అయిదుగురు  మహిళలను చర్చిలో ప్రార్ధన చేయరాదని వాళ్ళు చచ్చాక నరకానికి పోతారని   బహిష్కరించాడు .
  ఫ్రెంచ్ సర్జన్ గైడి చలియాక్ డాక్టర్లకు కొన్ని నియమాలు సూచించాడు -నిరంతరం నేర్చుకోవాలి  మర్యాద గా మన్ననగా ఉండాలి ,కస్టపడి పని చేయాలి ,పేద ధనిక భేదం లేకుండా వైద్యం చేయాలి .రోగి డబ్బు ఇస్తే తీసుకోవాలి . వద్దు అనరాదు .ఇవ్వకపోతే అడగరాదు . చికిత్స సమయం లో విన్నది అంతా  రహస్యంగా నే ఉంచాలి ”
  ఆ కాలం లో అనాటమీ  ఫిజియాలజి లను పుస్తకం చదివే తెలుసుకునేవారు విద్యార్థులు .కోసి చూస్తే కొత్తగా తెలుసుకొనేది ఉండదని అభిప్రాయం ..ప్రిన్స్ ఆఫ్ మెడిసిన్ అని పిలువబడిన గాలేన్  దృష్టిలో మానవ శరీరం లో ప్రతి భాగాని కి ఒక ప్రత్యేక కర్తవ్యమ్ ఉంది .అని చెప్పాడు .గాలెన్ ను ప్రశ్నిస్తే దేవుడిని ప్రశ్నించినట్లే అని మతాధికారులు హెచ్చరించేవారు  . 4 వ శతాబ్దిలో అభిప్రాయాలు మారి కొత్తవాటికి స్థానం లభించి బొలోనా యూనివర్సిటీ లో మొదటిసారిగా డిసెక్షన్ ను విద్యార్థులు చూసే అవకాశం కలిపించారు .. తర్వాత వారే డీసెక్ట్ చేసే స్థితి వచ్చింది   సర్జన్ గై డి చాసిలియా చాలా వైద్య గ్రంధాలు రాసి ,అనాటమీ జ్ఞానం అనేది పుస్తకాలు చదివి సంపాదించవచ్చు  డీసెక్ట్ చేసి సంపాదించవచ్చు అని తెలియ జేయటం తో దృక్పథమే మారి పోయింది .జాన్ ఆఫ్ సాలిస్ బరి డాక్టర్లను ”రోగి జబ్బుతో ఉన్నప్పుడే మీ ఫీజు నొక్కేయండి వాడు ఛస్తే మీ నోట మట్టే ”వంటి హెచ్చరిక చేశాడు .మెదడు లో రక్తం గడ్డ కట్టితే జలగలను అతికించి చెడు  రక్తం పిండించేవారు .మనవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు .కంటి రెప్ప మీద గడ్డ లేస్తే సమానపాళ్ళలో  ఉల్లి వెల్లుల్లికలిపి నూరి సమపాళ్లలో వైన్ , ఎద్దు పిత్తాశయ సారం కలిపి దానిలో పైన తయారు చేసిన చూర్ణం కలిపి ఇత్తడి పాత్రలో పెట్టి తొమ్మిది రాత్రులు ఉంచి గుడ్డతో వడపోసి రాత్రిపూట పక్షి ఈకతో దీన్ని కంటి రెప్పపై లేచిన కురుపు పై  అద్దాలి .అది చక్కగా పని చేసి కురుపు మటుమాయం అయి ఆశ్చర్యం కలిగించేది .
బ్లాక్ డెత్ అని పిలువబడే ప్లేగు నుండి బతికి బయట పడటం ఉండేదికాదు దైవ చేస్ట గానే  దాన్ని భావించేవారు ,1365 లో దీనిపై జాన్ ఆఫ్  బర్గండి ఒక పుస్తకం రాశాడు .అందులో ప్లేగు బారినుంచి తప్పించుకోవటానికి ఎక్కువగా తినద్దు తాగద్దు స్నానం మానేయాలి ,చలికాలం లో  వేడికోసం  మంటలు వేసుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెర్ ఫ్యూమ్స్ పీల్చి వెళ్ళాలి వేసవిలో ప్లేగు వస్తే చల్లని పదార్ధాలు తినాలి తిన్నదానికంటే ఎక్కువగా నీళ్లు తాగాలి ,మిరియాలు ,ఉల్లి వెల్లుల్లి వంటి వేడిని ఎక్కువ చేసే వస్తువులను వాడరాదు ,పిల్లలు తలిదండ్రులను ఎదిరిస్తున్నందున దేవుడు వాళ్ళని తీసుకు పోవటానికే  అంటురోగాలు కలిగిస్తున్నాడు ”అని హెచ్చరించాడు  .తరువాత  తరువాత ప్లేగు రోగులను విడిగా దూరం గా ఉంచటం ,ఇంట్లో ఎలుకలు చావటానికి మందుగాస్ పెట్టటం వచ్చాయి .పరిశుభ్రత పాటిస్తే కొంతనయ0 .
  కాంటర్ బరి స్టోరీస్ లో చాసర్ శరీరం లోని నాలుగు హుమర్స్ గురించి కవిత్వం చెప్పాడు .గ్రీకులు మానవ శరీరం లో నాలుగు మూల  ద్రవ్యాలు  ఉన్నాయని అవి  సమాన పాళ్ళలో ఉంటె   శరీరం ఆరోగ్యంగా ఉంటుందని బాలెన్స్ తప్పితే రోగాలు వస్తాయని చెప్పారు . అవే  బ్లాక్ బైల్   ,ఎల్లో బైల్ ఫ్లీజిం అనే కఫము ,రక్తం ,మన ఆయుర్వేదం లోనూ వాత  పిత్త  కఫ  రక్తం  ఉన్నాయి . .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -1

మధ్య యుగాల వైద్య విధానం -1

గ్రీకు ,రోమన్ సామ్రాజ్య హవా  ఒక వెయ్యేళ్ళు అంటే క్రీ పూ. 1500 నుంచి క్రీ.  శ . 400 వరకు సాగింది  గ్రీకుల” హిపోక్రటీస్”  ,రోమన్ల” క్లాడియస్ గాలేన్”లు అప్పుడు గొప్ప వైద్యులు  ఈ రెండిటి పతనం తర్వాత 5 వ శతాబ్ది ప్రారంభ0 నుంచి మరొక వెయ్యేళ్ళ కాలాన్ని  మధ్యయుగాల అన్నారు .మధ్యయుగాలలో మొదటి వైద్యుని వైద్య పిత అని రెండవ ఆయనను వైద్య యువరాజు అన్నారు ..ఇద్దరు గొప్ప వైద్య గ్రంధాలు రాశారు ఏవ్ మధ్యయుగాలకు ఆదర్శమైనాయి ఈజిప్టు ఇండియా ,చైనా  వైద్య గ్రంథాలెన్నో అనువాదం పొందాయి .కుటుంబ స్త్రీలే చిన్న చిన్న జబ్బులు నయం చేసేవారు .వీరికి పరంపరాగతంగా వచ్చిన వైద్య విజ్ఞానం తోడ్పడింది ..పక్షవాతం వస్తే సూర్యాస్తమయం తర్వాత మీద వద్ద చిన్న గాయం పెట్టి రక్తాన్ని బయటికి పంపి  మూడుసార్లు నీటితో పుక్కిళింపజేసి మంత్రాలు చదివి నయం చేసేవారని 900 లో రాయబడిన ఆంగ్లో సాక్సన్  రెమిడీస్ అనే పుస్తకం లో ఉంది . అంటే వైద్యం లో మందు ,మతం కలిపి ఉండేవన్నమాట ..డామియన్ ,కాస్మస్ వైద్య దేవతలయ్యారు వాళ్ళు సైలీషియా కు చెందిన సోదరులు మన అశ్వినీ దేవతలులాగా .వాళ్ళు అద్భుతాలు చేస్తారని ఒక నల్లవాడికాలు ను తీసి గాయం తో దెబ్బతిన్న తెల్లవాడి లాలికి అమర్చిన అద్భుత శక్తి వాంతులని నమ్మేవారు ..భారత దేశం లో ఆయుర్వేదం అప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండేది శాస్త్ర చికిత్సలు దిగ్విజయంగా చెయ్య గలిగే వారు . 1793  లో ఇద్దరు  ఆంగ్ల సర్జన్లు ఇలాంటి ఆపరేషన్ ను చూసి బ్రిటిష్ దేశానికి ఆ విధానమంతా రాసి పంపించి అలా చేయమని తెలియ జేశారట ..కౌస్జీ అనే ఆయన ఇంగ్లిష్ ఆర్మీ కి వైద్యుడుగా ఉండేవాడు .ఈయన్ను భారత రాజు బందీ చేసి మోసం నేరం మీద ఒక చెయ్యి ,ముక్కు కోయించాడు  . భారతీయ శస్త్ర వైద్యులు అతని ముఖ చర్మాన్ని తీసి ముక్కుకు అమర్చి సరిచేశారు .ఇంగ్లిష్ సర్జన్లు ఈ అమోఘ గ్రాఫ్టింగ్ విధానాన్ని ముక్కున వేలేసుకొని చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,ఆ విధానాన్ని పూస గుచ్చినట్లుగారాసి బ్రిటన్ రాజుకు పంపి అక్కడ అమలు చేయమని చెప్పారట  .భారతీయ వైద్యం లో వైద్యులు రోగికి సంబంధిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేసేవారు .చరక సంహిత వైద్య గ్రంధం లో మర్యాద ,మంచితనం తెలివి తేటలు ,వ్యక్తిత్వ్వం  వైద్యం లో నేర్పు ఉన్నవాడే గొప్ప వైద్యుడు అని ఉంది .ఏ మొక్కా వృధా కాదు .ప్రతిదానిలో వైద్య గుణాలున్నాయని తెలుసుకొని వనమూలికలు మందులలో వాడేవారు ..
  చైనాలో హాన్ డైనాస్టీక్రీ.పూ. 200 నుంచి  క్రీ శ200 వరకు ఎన్నో వైద్య గ్రంధాలు రచింప బడ్డాయి .చైనా వైద్యులు ”చి ” వాళ్ళభాషలో ”క్వి ”అనేది వైటల్ ఎనర్జీగా నమ్మేవారు .అలాగే శరీరం లోని ”యిన్ ”మరియు ”యాంగ్ ”లు సమ తుల్యం లో ఉండాలని చెప్పేవారు .ఈ రెండు మన చుట్టూ ఉంటాయని ,కానీ అవి కాంతి -చీకటి లాగా  చలి-వేడి లాగా శీతాకాలం -వేసవికాలం లాగ పరస్పర వ్యతిరేకంగా శక్తి వంతంగా ఉంటాయని భావించేవాళ్లు ..కనుక డాక్టర్లు పేషేంట్ లను ఈ రెండిని ఎలా బాలన్స్ గా ఉంచుకొని ఆరోగ్యం కాపాడుకోవాలో చెప్పేవారు ..క్రీ పూ. 400 లోరాయబడిన  ”ఎల్లో ఎంపరర్ మాన్యువల్ ”లో వీటి గురించి ఉంది ..శరీరం వెలుపల యాంగ్ ఉంటుంది .లోపల యిన్ ఉంటుంది ..కాలేయం గుండె ,ప్లీహం (స్ప్లీన్ ),ఊపిరి తిత్తులు ,మూత్ర పిండాలు యిన్ కు చెందినవి .మిగిలిన అయిదు ఖాళీ భాగాలు ,గాల్ బ్లాడర్ ,,ఉదరం ,లోపలి ప్రేవులు వగైరా యాంగ్ వి .స్ప్రింగ్ లో వచ్చే వ్యాధులకు కారణం యిన్ అధీనం లో ఉన్నవాటివల్లా ఆటం లో జబ్బులు యాంగ్ ప్రభావ భాగాల్లో వస్తాయి .ఆకు పంక్చర్ వైద్యం తో ఈ రోగాలు నివారిస్తారు .
   మధ్య యుగాలలో క్రైస్తవ ,మహమ్మదీయ మతాలు విద్య రంగం లో గణనీయ  సేవ చేశాయి ..మొనాస్టరీలు వైద్య గ్రంధాలను భద్రపరచాయి ”రోగి సేవ అన్నిటికంటే ప్రధానం ”అని బెనా డికేటైన్ మాంక్స్ చెప్పేవారు . మాంక్స్ కు చికిత్స మొనాస్టరీలలోనే చేసేవారు .శరీరం లో ప్రతిభాగం లో ఒక సెయింట్ ఉంటాడని అక్కడ జబ్బు రావటానికి కారణం మౌతాడని నమ్మేవారు .వెన్ను నొప్పి వస్తే సెయింట్ లారెన్స్ ను , ప్లేగు జబ్బుకు సెయింట్ సెబాస్టియన్ ను ప్రార్ధించేవారు .పంటినెప్పికి సెయింట్ అప్పొల్లోనియా  .ఈ పే ట్రన్ సెయింట్ ను మతం మార్చుకోనందుకు రాజు అన్ని పళ్ళను పీకించి హింసించాడట .బాల్యం లో బిడ్డల్ని కనేవాళ్ళు సెయింట్ మార్గ రెట్ ఆఫ్ యాంటి  యోక్  ను ,ప్రార్ధించేవారు .ఒకసారి ఒక దెయ్యం మార్గరెట్ ను మింగేస్తే ,ఆమె కడుపులోనే క్రాస్ చిహ్నాన్ని గీసిందని అదే తర్వాత క్రైస్తవ మత చిహ్నం క్రాస్ కు మూలమని    ఆ దెయ్యం కడుపు చీల్చుకుని  సెయింట్ మార్గ రేట్ బయటికి వచ్చిందని నమ్మేవారు
  1000-1300 కాలం లో  యూరప్ వాతావరణం బాగా ఉంది మంచిపంటలు ,పండటానికి కావలసినంత వర్షాలు ప్,అనుకూల ఉష్ణోగ్రత కలిగి ఉండేది .భూస్వాములు అధిక పంటలతో బలిసిపోయారు .సంపన్ను లైన వీరు చర్చి లలో బిషప్పులు  అబ్బట్ లయ్యారు .  తమ దగ్గరున్న ధనాన్ని అద్భుత కెదెడ్రల్ విద్యాలయ వైద్యాలయాల నిర్మాణం చేశారు . 1110 లో పారిస్   1158 లో బొలోనా,1167 లో ఆక్స్ ఫర్డ్ ,1209 లో కేం బ్రిడ్జి ,1222 లో పావుడా లలోయుని వర్సిటీలు నిర్మించి వైద్యానికి ప్రాముఖ్యమిచ్చారు మోదట్లో స్త్రీలకూ ప్రవేశార్హత ఉండేదికాదు .చర్చి వ్యతిరేకించేది . మగవారు వ్యతిరేకించేవారు కానీ క్రమంగా  వారు పోరాటాలల్తో స్థానం సాధించి చదివి డాక్టర్లు సర్జన్లు అయ్యారు . 1250 లో లండన్ లో కేథరిన్ అనే ఆమె మొదటి మహిళా సర్జన్ గా రికార్డ్ కు ఎక్కింది ,  ఆమె తండ్రి సోదరులుకూడా  సర్జన్ లే .. 1380 లో మాస్టర్ సర్జన్ లు సర్జరీతో ఆదా మెగా భేదం చూపాము అని ప్రమాణం చేయటం వచ్చింది .జర్మనీలో బింజెన్ లోని హైడ్ గార్డ్ అనే  1098-1179 కాలపు నన్ వైద్యం చేసి వైద్య గ్రంధాలు రాసింది .సాధారణ మొక్కలు మూలికలను ముందుగా ఎలా వాడవచ్చో వాటిలో రాసింది .. 1420 దాకా  బ్రిటన్ లోనూ ఆడవాళ్లు ముందుకు రాలేకపోయారు . ఇంగ్లాండ్ లోని ప్రముఖ డాక్టర్లు నాలుగవ శతాబ్ది జాన్ ఆఫ్ మారిఫీడ్ అభిప్రాయాన్ని సమర్ధిస్తూ పార్లమెంట్ కు ఒక పిటీషన్ సమర్పించి అందులో ”విద్యకు వైద్యానికి   ఆడవాళ్లు పనికి రారు వారికి సహజ తెలివి తేటలు వృత్తినైపుణ్యం లేవు .వీటితో పేషేంట్ లను బాధ పెట్టి చంపేస్తారు .మూర్ఖత్వం అజ్ఞానం వారిసొమ్ము కనుక వారిని ఉన్నత విద్యలకు అనుమతించవద్దు ”అన్నారు మృగ మహా రాజులైన వైద్యో నారాయణో హరులు -మహిళాహక్కు హరులు .
     సశేషం
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in సైన్స్ | Tagged | Leave a comment

భయాందోళనలు ఎలా పోతాయి ?

భయాందోళనలు ఎలా పోతాయి ?

స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది . 1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ   తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున ధ్యానమగ్నమయ్యాడు దాదాపు మూడుగంటలు సమాధిలో ఉండిపోయాడు ఉదయం ఏడున్నర అయ్యేసరికి కళ్ళు తెరిచి చూడగా పెద్ద నాగుబాము పడగా విప్పి రెండు అడుగుల దూరం లో స్వామిరామాపై తీవ్ర దృష్టి పెట్టి కనిపించింది .భయపడ్డాడు ఏం చేయాలో తోచక మళ్ళీ ధ్యానం లో పడ్డాడు .మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పాము అక్కడే అదే పొజిషన్ లో ఉంది .ఇక లాభం లేదనుకొని భయపడి పరిగెత్తాడు అదీ వెంటబడి పొదల్లో దూరింది ..గుహకు వెళ్లి గురువుకు చెప్పాడు .ఆయన  నవ్వుతూ ”బ్రతికి ఉన్న ఏ జంతువుకైనా ధ్యాన మగ్నమైన వాని ముందు ధ్యానం స్థితిలో ఉండి పోతుంది ”అని సత్యం చెప్పాడు . మరో వింత అనుభవం ఆయనకు ఎదురైంది .గురువు దక్షిణభారత దేశం లో కొంతకాలం గడిపి రమ్మని ఆదేశిస్తే వెళ్లి ఒకరోజు ఒక దేవాలయం కు లో  రాత్రి పడుకోవటానికి ఆశ్రయం ఇవ్వమని కోరాడు .అప్పుడు పూజారి ”నువ్వు స్వామీజీవి అయితే ఆశ్రయం ఎందుకు ”?అని అడిగాడు .ఇంతలో ఒక స్త్రీ తన వెంట వస్తే ఉండటానికి చోటు చూపిస్తానన్నది ..ఆమె రామా ను ఆరడుగుల గుడిసె చూపించి ఉండమన్నది .అప్పడు ఆయనవద్ద ఉన్నవి కూర్చోటానికి జింక చర్మం ,ఒక శాలువా  ఒక అంగోస్త్రం మాత్రమే  ..ఆ గుడిసెలో తలుపులాంటి ఖాళీ నుంచి వెలుగే తప్ప ఏదీ లేదు .కాసేపటికి ఒక నాగుబాము ముందు పాకుతూ కన్పించింది .తర్వాత ప్రక్కన ఒకటి ,మరికాసేపటికి గుడిసె నిండా పాములే పాములు .ఒళ్ళు జలద రించింది స్వామికి .అది సర్ప దేవాలయమేమో నను కున్నాడు ..చాలా భయమేసింది బహుశా ఆ అమ్మాయి తాను  నిజమైన స్వామో కాదో  పరీక్షకోసం ఈ గుడిసెకు పంపించి ఉంటుంది అనుకున్నాడు ..అప్పటికి రామా పూర్తిగా స్వామి కాలేదు .అప్పుడప్పుడే అభ్యాసం  లో ఉన్నాడు . భయపడి పారిపోతే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలి ?పారిపోతే ఇక ఆఊళ్లో ఏ సాధకుడికి ఎవరూ భిక్ష పెట్టరు .కనుక చావో రేవో పాములమధ్య గుడిసెలోనే ఉండి పోవాలను కొన్నాడు ..తనను ఇక్కడకు తీసుకొచ్చిన ఆవిడ జ్ఞాని కాదు కానీ ధైర్యంగా పాముల గుడిసెలోకి రా గలిగింది .కనుక తానూ అక్కడే పాముల మధ్యనే రాత్రి గడపాలని కొని ఉండి పోయాడు ..అలానే ఉన్నాడు .కానీ తన ధ్యానం మర్చి పోయి పాముల ధ్యానం లో ఉన్నాడు పాములు ఆయన జోలికే రాలేదు . ..తెల్లవారాక బయటికి వెళ్ళాడు ఆయనను పాములు ఏమీ చేయలేదు కానీ భయం మాత్రం పోలేదు .తర్వాత మనసులో వితర్కించుకొన్నాడు .తాను  బ్రహ్మ సూత్ర భాష్యం తేలికగా బోధిస్తున్నాడు కానీ మనసులో పిరికి తనం పోలేదు ..ఈ భయం ఎలా ఉందంటే ధ్యానం పూర్తి చేసి కళ్ళు తెరిచి చుట్టూ పాములున్నాయేమో నని వెదికేవాడు .భయాన్ని పోగొట్టుకోవాల్సిందే అనుకున్నాడు ..గురువును చేరి దీనికి మార్గమేమిటో తెలుసుకొందామన్నాడు .ఆయన రామాను చూడగానే ”నీకేమి కావాలో నాకు తెలుసు .నీకు పాములంటే భయం కదా ”అన్నాడు మనసులో మాటకనిపెట్టి .”నీకు భయమని నా కెప్పుడూ చెప్పలేదే అన్నీ నాకు చెప్పేవాడివి దీన్ని ఎందుకు దాచావు ?”అన్నాడు .ఎందుకో కానీ  గురువుకు తనకున్న పాముభయం గురించి చెప్పలేదు .

అడవిలోకి తీసుకు వెళ్లి  ”రేపు ఉదయం నుంచి మనం మౌనం పాటిస్తున్నాం .తెల్లవారు జామున మూడున్నరకే లేచి నువ్వు అడవి ఆకులు పూలు ఏరి తేవాలి .వాటితో మనం ప్రత్యేక పూజ చేద్దాం ”అని చెప్పాడు .అలాగే లేచిచీకటిలోనే  అక్కడ పోగుపడిన ఆకులు చూసి వాటిని చేతిలో పట్టుకున్నాడు ఆకులతోపాటు ఒక నాగు పాము చేతికి చుట్టుకు పోయింది .చెమటలుపట్టాయి భయం తో  తప్పించుకొనే అవకాశం లేదు .ఇంతలో గురువు చూసి దాన్ని తనదగ్గరకు తీసుకురమ్మన్నాడు ..అసలే వణికి పోతున్నాడు భయం తో .గుర్వాజ్ఞ తో మరీ భయం పెరిగింది ”అది నిన్ను కరవదు తీసుకురా ”అన్నాడు .రామాకు చేతిలో మృత్యువే ఉందనిపించింది నమ్మకం కంటే భయం బలీయమైంది .గురువును చేరగా ”నువ్వు పాములను ఎందుకు ప్రేమించలేవు ?”అని అడిగాడు . ”భయం తో చస్తుంటే ప్రేమ ఏమిటి నా బొంద ”అన్నాడు .భయపెట్టే వారిని మనం ప్రేమించలేము ఆదిలోకసహాజం . అప్పడు గురువు ”ఇది అందమైన జంతువు .  అన్ని చోట్ల తిరుగుతుంది .అయినా చూడు అది ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉందొ .ప్రపంచ జీవులలో పాము ఒక్కటే అత్యున్నత స్వచ్ఛమైన జీవి . ”అన్నాడు .అందం సరే  ప్రమాదం సంగతి ?”అన్నాడు స్వామిరామా .మనిషి పాముకంటె అతి మురికి ,విష జంతువూ కూడా .ప్రతిక్షణం కోపం పగలతో రగిలి అవతలివారికి హాని చేస్తూ ఉంటాడు .పాము ఆత్మ రక్షణకు మాత్రమే కాటేస్తుంది ..నువ్వు నిద్రలో ఉంటె నీ వ్రేళ్ళు కళ్ళను పొడుస్తాయా ,నీ నాలుకను పళ్ళు కొరుకుతాయా ?లేదే .శరీర భాగాలన్నిటికి ఒక చక్కని అవగాహన ఉంటుంది .అలాగే సకల చరాచరం ఒకటే అన్న భావన కలిగితే ఏ  జంతువూ వలనా భయమనేది  ఉండదు . ”అన్నాడు గురువు చెప్పిన0తసేపు నాగుపాము స్వామి చేతిలోనే ఉంది క్రమంగా భయం తగ్గింది .మనసు లో ”నేను పామును ఏమీ చేయక పొతే పాము నన్నేం చేస్తుంది ?అనే ఎరుక కలిగింది .అంతే పాము నెమ్మదిగా జారీ ఎటో వెళ్ళిపోయింది .అప్పటి నుంచి పాము అంటే భయం పోయింది .ఏ జంతువైనా తనకు అపకారం జరిగితే తప్ప మీద పడవు .వాల్మీకి ,సెయింట్  ఫ్రాన్సిస్  బుద్ధుడు మొదలైన వారందరూ జీవ ప్రేమికులే ..యోగ సూత్రాలలో మొదటిది అహింస .అహింస అంటే చంపక పోవటం ,హాని చేయకపోవటం ,గాయం చేయకపోవటం.ఆత్మ శక్తికి మించిన బలం లేదు .
   ”నేను హిమాలయాలలో ,అరణ్యాలలో ఎన్నో చోట్ల తిరిగాను..నాకు తెలిసినంతవరకూ నేను వున్నంతవరకు ఏ సాధువు, యోగి, స్వామిలపై ఏ క్రూర జంతువూ దాడి చేసినట్లు చూడలేదు వినలేదు ఈ మహానుభావులు తమను తాము రక్షించుకోవటానికి ఏ సాధనాలు లేనివారు ..వీరిని హిమపాతాలు,ప్రక్రుతి ప్రళయాలు  కూడా ఏమీ చేయలేదు  . వారి బలీయమైన ఆత్మ శక్తికి అన్నీ తలవంచుతాయి . ఈ నిర్భయత్వమే వ్యక్తిగత చేతన ను అధిగమించి విశ్వ చేతనలో చేరటానికి దారి చూపిస్తుంది .ఎవరు ఎవరిని చంపుతారు ?ఆత్మ అనంతమైనది .శరీరం ఎప్పుడోఅప్పడు మట్టిలో కలిసిపోయేదే .హిమాలయ యోగులు ఏ శాఖ వారైనా ఈ గొప్ప భావం తోనే జీవించి తరించారు ”అంటాడు స్వామిరామ .
  స్వామి రామ తారై భవాల్  నుండి నేపాల్ లోని ఖాట్మాండుకు ఒక్కడే నడుచుకుంటూ బయలుదేరాడు ..రోజుకు సుమారు ముప్ఫయి మైళ్ళు నడిచేవాడు .సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చితులు పేర్చి   మంట   వేసుకొని ,ధ్యానం చేసి విశ్రాంతి తీసుకొని, మళ్ళీ తెల్లవారుజామున నాలుగింటికి లేచి నడక సాగించిపది గంటల వరకు నడిచి ఏదో చెట్టుకింద ఆగి మధ్యాహ్నం మళ్ళీ బయల్దేరి సాయ0త్రం ఏడు దాకా నడిచేవాడు .చెప్పులు లేకుండా  ఒక దుప్పటి ,పులిచర్మం ,చిన్న కుండలో నీళ్లు ఇవే  ఆయన సామాగ్రి ..ఒక రోజు సాయంత్రం ఆరింటికి అలసి పోయి చిన్న గుహలో విశ్రాంతి కి వెళ్ళాడు .అది చీకటి గుయ్యారం .లోపల మూడు పులిపిల్లలు కనిపించాయి అవి పుట్టి 15 రోజులు మాత్రమే అయి ఉంటుంది .అవి స్వామి దగ్గరకు వాళ్ళ అమ్మ ఏమో ననుకొని వచ్చి నాకుతున్నాయి .భయపడకుండా వాటిని మచ్చిక చేసుకున్నాడు .కూర్చోగానే గుహ ద్వారం దగ్గర వాటి తల్లి వచ్చి నుంచుని ఉండటం చూశాడు .మొదట్లో అది  లోపలికొచ్చి తనమీద పడి చంపేస్తుందేమో ననుకొన్నాడు .తర్వాత మనసులో ”నేను ఈ పులి కూనలకు  ఏఅపకారం  చేయలేదు .పులి దారిఇస్తే నేను బయటికి వెళ్ళిపోతాను ”అని అనుకోని దుప్పటి నీళ్లకుండా తీసుకొని లేచి నిలబడ్డాడు .ఈయన్ను చూసిన పులి దారి ఇస్తున్నట్లుగా గుహ ద్వారం నుండి పక్కకు తప్పుకున్నది ..స్వామి రామ గుహ లోంచి బయటికి వచ్చి పదడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే పులి నెమ్మదిగా గుహలోకి ప్రవేశించి పిల్లలను చేరినట్లు గమనించాడు .దీన్ని బట్టి జంతువులూ అతి తేలికగా హింసను  భయాన్ని వాసన చూడగలవు .అప్పుడే అవి అతి తీవ్రంగా ఆత్మ రక్షణకు ఎదురు దాడి చేస్తాయి .సాధారణంగా జంతువులు  చాలా రక్షణ నిచ్చి సహాయం చేస్తాయి మనుషులు ప్రమాద సమయాలలో ఒకరిని ఒకరు వదిలేసి పారిపోతారు .కానీ జంతువులూ అలా ప్రవర్తించవు .ఆత్మా రక్షణ సకల జీవులకు ఉంటుంది .కానీ మనుషులకంటే జంతువులు ప్రేమకు అంకితమై ఉంటాయి వాటి మిత్రత్వం నమ్మదగినదే .,షరతులు లేనిదే .మానవుడు అలాకాదు
. Inline image 1Inline image 2
  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in సైన్స్ | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -7 -55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం

వీ క్లీ  అమెరికా -7

55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం
15-5-17 నుండి 21-5-17 వరకు
15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ  కృష్ణ  కాంభోజి రాగాలాపన అందులో తన రచన ”ఏమి పాలింప జాలము ?”విని పరవశించాను . రాత్రి  LOL లో రౌడీ -బ0డ  ,పెళ్లి ఎగగొట్టటానికి ఎత్తులు చూసాం సరదాగా ఉన్నాయి యెంత మంది దగ్గర ఎంతటి టేలెంట్ ఉన్నదో రుజువు చేసేవి ఇవి ..
  మంగళవారం మామూలుగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి శ్రీ రామ లక్ష్మణా చార్యుల ”సువర్చలా వల్లభ శతకం ”పఠించాను . సాయంత్రం ఇన్నయ్యగారి ఫోన్ పలకరింపు . ఆయన భార్య కోమలగారు రాసిన ”మై లైఫ్”చదివాను  .ఆవిడ పామర్రు దగ్గర కొండి పర్రు ఆశ్రమం లో హిందీ చదివారు . ఆమె హైదరాబాద్ లో ఉండగా రేడియో స్టేషన్ ప్రోగ్రామ్ ఎక్సి క్యూటివ్ శ్రీ వేలూరి సహజానంద గారు ఆమెను కొందరు విదేశీ రచయితలను శ్రోతలకు పరిచయం చేయమని కోరగా కాఫ్కా  ఆల్బర్ట్ కాము మొదలైన వారిని చక్కగా పరిచయం చేసినట్లు రాశారు .శ్రీ సహజా నంద మా రెండవ బావ గారు వేలూరి వివేకానంద గారి పెదనాన్న గారి అబ్బాయే . తేలప్రోలు  దగ్గర చిరివాడ అగ్రహారం వాసి .సహజ శ్శ్రీ అరవింద భక్తులు .అరవింద దర్శనం పై పుస్తకాలు రాశాడు వీరి తమ్ముడు సదానంద .ఈ అన్నదమ్ముల్ని మా బావ గారి కుటుంబం సహజ ,సదా అని పిలిచేవారు ఇద్దర్నీ  చూశాను .ఇన్నయ్యగారి పెద్దబ్బాయి శ్రీ రాజు నరిశెట్టి మా పెద్దబ్బాయి శాస్త్రికి గుజరాత్ లోని” ఇర్మ ” లో క్లాస్ మేట్ అని మా మనవడు సంకల్ప్ గుర్తించి చెప్పాడు .
17 బుధవారం నుండి 5 రోజుల న 55 వ సుందరకాండ పారాయణ మొదలు పెట్టాను .నిత్యపూజ ఆంజనేయ అష్టోత్తర ,శతనామ పూజ తర్వాత పారాయణ ప్రారంభించాను .మొదటి రోజు సంక్షిప్త రామాయణం ,తర్వాత శ్రీరామ జననం ,సీతారామ కళ్యాణం ,సీతా రామ సుఖ జీవనం సర్గలు చదివి సుందరకాండ ప్రారంభించి 15 సర్గలు పూర్తి చేశి  మంకు శ్రీనుగారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”చదివి పూర్తి చేశాను అయిదు రోజులూ పానకం వడపప్పు చలిమిడి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం .7 గంటలకు ప్రారంభిస్తే పూర్తి అయేసరికి 10-30 అయింది తర్వాతే టిఫిన్ .ఉదయం 11 -30 కి డా.  యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేశారు .ఏం చేస్తున్నారని అడిగితె పారాయణ సంగతి చెప్పా .ఆయన నిత్యం సంధ్యావందనం పూజ చేస్తారట .నేను చెప్పాక పారాయణ కూడా చేద్దామని అనుకొన్నారటగాని 83 ఏళ్ళ వారు  అంతటి శ్రమ వద్దమని కుటుంబ సభ్యులు వారించారట అందుకని చేయటం లేదని తర్వాత గోపాల కృష్ణ గారు మెయిల్ రాశారు .మైనేనిగారు పంపిన ”Harry G.Frankfurt  రచన ”డి రీజన్స్ ఆఫ్ లవ్ ”అందింది చదివాను పెద్దగా చెప్పిందేమీ లేదని పించింది ..రాత్రి ఫన్ బకెట్ లో ”వుయ్ వాంట్  జస్టిస్ ”అని బాహుబలి -3 తీయాలంటూ నిరాహార దీక్ష చేసిన  సరదా ఎపిసోడ్ చూసి పగలబడి నవ్వుకున్నాం ..
గురువారం -రెండవ రోజు పారాయణ లో 27 వ  సర్గ  వరకు చేసి ముదిగొండ సీతారావమ్మగారి ”శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా .దాదాపు మొత్తం 3 గంటలు పట్టింది   ”నా దారి తీరు ”లో కృష్ణా జిల్లాలోని ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గురించి రెండు ఎపిసోడ్ లు రాశాను ..రాత్రి నర్మదా నదీ తీర”కరి వీర పీఠం”శంకరాచార్య శ్రీ స్వామి రామా గురించి ”పీఠాధిపత్యం బందిఖానా గా భావించి పారిపోయిన పీఠాధిపతి ”అని రాశా .  పారిపోయిన రామా గురువు బెంగాలీ బాబా ను దర్శించి విషయం  చెప్పగా  ”సాధకుడికి ఈ అనుభవమూ కావాలనే నేను నిన్ను నర్మదా తీరానికి 6 నెలల తపస్సుకోస0  పంపాను .దనం వ్యామోహం పదవీ ఎంత బాధకు గురి చేస్తాయో నీకు అనుభవం రావాలనే పంపాను ”అంటాడు
శుక్రవారం -ఉదయం 7-30 కే  పూజ ప్రారంభించి 10-15 కు మూడవరోజు పారాయణ 38 వ సర్గ వరకు చేసి సీతారావమ్మగారి ” ‘శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా..దీనిని మా అమ్మాయి వీడియో తీసి పేస్  బుక్ లో పెట్టిందిట నాకు తెలీదు మామూలు గా చేసే పానకం వడపప్పు చలిబిడి తోపాటు రవ్వకేసరి ప్రసాదం నైవేద్యం 10-15 కు పూర్తిఅయింది . . మధ్యాహ్నం మైనేనిగారి ఫోన్ .తర్వాత నేనూ చేసి మాట్లాడాను
 రాత్రి శ్రీ బులుసు సాంబమూర్తి పద్మ దంపతుల ఇంట్లో డిన్నర్ .వాళ్ళ అమ్మాయి ప్లస్ -2 కు సెలెక్ట్ అయి ర్యాలీ లో సీట్ వచ్చిన సందర్భంగా ఈ ఏర్పాటు .ఇలా సెలెక్ట్ అయినవారి చదువు హాస్టల్ ఖర్చు అంతా  ప్రభుత్వమే భరిస్తుంది స్టేట్ లో 300 మందికే ఆ ఛాన్స్ దాన్ని పొందటానికి అందరూ తీవ్రంగా  కష్ట  పెడతారట  ఒరిస్సా లోని  తెలుగు వారు .ఇక్కడే బరం పురం తెలుగు వారైన రాయప్రోలు వారూ కలిశారు .మేమూ ,పవన్ ,రాంకీ  కుటుంబం గెస్ట్ ల0 అదనంగా . పప్పు ఆలూ కూర ,తమాషా పాయసం ,పునుగులు ,పులిహోర ,సాంబారు ,పెరుగు పండ్ల ముక్కలతో పాటు వాళ్ళ స్పెషల్ ”అప్పడాలపిండి ఉండలు ”వేశారు ఒరిస్సా ప్రాంత తెలుగువారిళ్ళల్లో విందులూ వినోదాలలో అప్పడాల పిండి ఉండలు వడ్డించకపోతే మహా తప్పుట చెప్పారు వాళ్ళు .అలాగే తద్దినాలలో మనం ఆవ పచ్చడి ,నువ్వుల పొడి తప్పక చేస్తాం .కానీ వాళ్ళు ఉసిరి గింజల పచ్చడి పెరుగుతో కలిపి ,ఉసిరి గింజల పొడి చెయ్యటం తప్పదట . మనకు కొత్తగా ఉంది కానీ ఏ ప్రాంతం వారి అలవాటు వారిది .మనకు ఎవరైనా చనిపోతే దినవారాలలో 12 వ రోజు శుద్ధి నాడు ఉసిరి పొడి నెత్తిమీద రాసుకొని స్నానం స్నానం చేసి శుద్ధి అవటం ఉంది ‘
 శనివారం నిత్యపూజ ఆంజనేయ స్తోత్త్ర శతనామ పూజ తర్వాత నాల్గవ రోజు పారాయణ ఉదయం 7-30 కు ప్రారంభించి 54 వ సర్గ వరకు పారాయణ చేసి మామిడిపండ్లు ఆరంజ్ పీచు అరటిపళ్ళ తో పూజ  చేసి  మంకు శ్రీను గారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”పఠించా .అదనపు ప్రసాదం ”చిట్టిగారెలు ”11 గంటల వరకు సాగింది  సంకల్ప్ ను మా అమ్మాయి యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చింది .

మా మనవడు శ్రీకేత్ 9 లో ఉన్నాడు .కనుక ఏం సెట్ లాంటి దాని కోచింగ్ కు షార్లెట్ యూనివర్సిటీ దగ్గర ”రమణ ”అనే లెక్చరర్ దగ్గర లెక్కల కోచింగ్ కు శని ఆదివారాలలో ఉదయం 7 గంటలకు వెళ్లి 12 దాకా ఉండి వస్తాడు మా అల్లుడో  అమ్మాయో  తీసుకుని వెళ్లి మళ్ళీ తీసుకు వస్తారు  .మా వాళ్ళ ఇంటినుంచి 45 మైళ్ళు అంటే సుమారు 70 కిలోమీటర్లు . మైనేని గారుపంపిన ”క్లియరెన్స్ డారో ”రచన ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”బృహద్గ్రంథం అందింది మొదలు పెట్టాను .సాయంత్రం మా అమ్మాయి మనవాళ్లతో లైబ్రరీకి వెళ్లి 7 పుస్తకాలు తెచ్చుకున్నాను చదవాలి .

21-5-17 ఆదివారం వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి -ఉదయం 6-45 కే నిత్యపూజా ,ఆంజనేయ అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి 5 వ రోజు అంటే చివరి రోజు పారాయణ ప్రారంభించి 68 వ సర్గతో సుందరకాండ పూర్తి చేసి తర్వాత నాగ పాశ  విమోచనం  ఆదిత్య హృదయం ,రామ రావణ యుద్ధం రావణ సంహారం ,దేవతలుచేసిన శ్రీరామ స్తుతి ,శ్రీ రామ పట్టాభి షేకం తో మొత్తం సుందరకాండ పారాయణ పూర్తి చేసి రామ లక్ష్మణాచార్యుల ”శ్రీ సువర్చలా వల్లభ సుందర వాయు నందన శతకం ”పఠించే సరికి ఉదయం 10-45  గంటలు అయింది  దీనితో శతక త్రయం ను రెండు సార్లు పఠించినట్లయింది  పావు గంట విశ్రాంతి తీసుకొని శ్రీ సువర్చలాంజ నేయ శాంతి కళ్యాణం    పుణ్యాహ వాచనం ,దిక్పాల  నవగ్రహ పూజ  కన్యావరణం ,ప్రవర మాంగల్యా పూజ ,ప్రవర చూర్ణిక మహా సంకల్ప0 మంగళాష్టకాలతో  సహా చదివి తంత్ర రహిత మంత్రం సహిత కళ్యాణం చేసి స్వామి వారల ఫోటోకు నేను తెచ్చుకున్న శ్రీ ఆంజనేయస్వామికి ప్రక్కనే పెట్టిన పసుపు తో చేసిన సువర్చలాదేవికి అక్షతారోపణ అంటే తలంబ్రాలు పోసి కళ్యాణం పూరి చేసాం అంతా అయ్యేసరికి 12 45 అయింది అంటే  ఉదయం నుంచిసుమారు 6 గంటల కార్యక్రమం నిర్వహించాం .నిత్య ప్రసాదాలతోపాటు పులిహోర ప్రత్యేక ప్రసాదం ఆ అమ్మాయి ,మనవడు పీయూష్ రాత్రి కూర్చుని స్వామికి పూల హారాలు కట్టారు. ఇవాళ పూలతో మామిడిపండ్లతో  చక్కగా అలంకరణ చేసి శోభాయమానం చేసింది  మా అమ్మాయి  . భోజనానికి పవన్ కుటుంబం గోసుకోండ అరుణ కుటుంబాన్ని పిలిచాం వాళ్ళూ వచ్చి స్వామిపాదాలకు తలంబ్రాలు పోసి భోజనం చేసి వెళ్లారు .భోజనం లోకి మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,చిక్కుడుకాయ కూర పెరుగు పచ్చడి టమేటా చట్నీ చారు ,జున్ను .వడ్డించాం .కళ్యాణ విందుకూడా జరిగింది అనుకోకుండా
  శనివారం రాత్రి కాలిఫోర్నియా నుంచి మా మేనల్లుడు శాస్త్రి ,భార్య  ,అత్తగారు ఫోన్ చేసి మా అమ్మాయి పేస్ బుక్   లో పెట్టిన వీడియో చూసి ముచ్చటపడి ఆనందిం చామని అభినందనలు తెలిపారు మొత్తం మీద షార్లెట్ లో నా 55 వ సుందర కాండ పారాయణ  హనుమజ్జయంతి స్వామివార్ల అనుగ్రహం తో దిగ్విజయంగా జరిగింది
    ఉయ్యూరు  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 19 వ తేదీ నుండి మూడు రోజులు 21 వ తేదీ వరకు శ్రీ హనుమజ్జయ0తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు మా అబ్బాయి ఏ పూటకాపూట ఫోన్ చేసి చెబుతూ ఫోటోలు పెడుతూ తెలియ జేశాడు మొదటి రోజు ఉదయం స్వామివార్లకు అభిషేకం . సాయంత్రం శతకత్రయ పోటీకి ”ఒక్క పురుగు ”కూడా రాలేదట .శివాలక్ష్మి శ్రీ రామ లక్ష్మణ్చ్చర్యులు గారు నిర్వహించటానికి వచ్చారు వారికి శాలువాలతో సత్కారం జరిగింది .రెండవ రోజు 1000 రసం మామిడిపండ్లతో పూజ కనుల పండువుగా జరిగిందని  రాత్రికి మా శ్రీమతి కంటి డాక్టర్ శ్రీ మతి జయశ్రీ గారి కుటుంబం పూజలో పాల్గొన్నారని ,వారి అబ్బాయి అమ్మాయి చక్కగా పాటలు పడ్డారని మామానవరాలు హర్షితాఞ్జని కూడా పాడిందని శ్రీమతి శారదా గారు కూడా చక్కగా గానం చేశారని తెలిసింది  మూడవ రోజు ఉదయం 200 తమల పాకు కట్టలతో  అన్ని రకాల పుష్పాలతో అర్చన ఘనంగా జరిగిందని  స్వామివార్ల శాంతికల్యాణాన్ని మా రెండవ అబ్బాయి శర్మ ఇందిరా ద0పతులు  మూడవ కుమారుడు మూర్తి రాణి దంపతులు పీటలమీద కూర్చుని ఘనంగా నిర్వహించారని తెలిసి చాలా సంతోషించాం . రాత్రి  శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు సంకల్పించి స్పాన్సర్ చేసిన 25 కిలోల మినపపప్పు తో స్వామివార్లకు గారెల దండలు అద్భుతః  అనిపించాయి .కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా చాలా భక్తిగా చేశారు అక్కడ మేము లేకపోయినా మా రమణ అన్ని  బాధ్యతలు నిర్వహించి కార్యక్రమాలకు నిండుదనం తెప్పించాడు . ఈ వారానికి స్వస్తి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

21-5-17 ఆదివారం షార్లెట్ లో హనుమజ్జయంతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయునికి నాగవల్లి పూజ

This gallery contains 100 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలురాసిన అన్నమయ్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య  (1409-1503)
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల  సంకీర్తనలు  రచించినా లభ్యమైనవి 12 వేలు  మాత్రమే  అందులో శృంగార భక్తి జ్ఞాన  నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై అందులోని మకరందాన్ని గ్రోలి మనకు అందించిన సంకీర్తనాచార్యుడు . కులమతాలకు అతీతమైన భావ వ్యాప్తి చేసిన సంస్కారి . .”బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే” అని ఎలుగెత్తి చాటిన వేదోపనిషత్ వ్యాఖ్యాత ”.ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి”అని అందరూ ఒక్కరే నాన్న వసుధైక విహావం వ్యాప్తి చేసైనా పూర్ణ ప్రజ్నడు . పదకవితా సాహిత్యానికి పట్టాభిషేకం చేసి  పదకవితా శారదను బంగారు పల్లకి లో  ఊరేగించినవాడు అన్నమయ్య. కలకండ తెలుగుకు మరింత తియ్యదనాన్ని అందించినవాడు.సర్వ దారి సంవత్సర   వైశాఖ శుద్ధ పొర్ణమి 22-5-1409న ఈ నాటి కడప జిల్లా లోని తాళ్ళపాక లో  జన్మించి 95  వ ఏట,దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి   4-5-1503 న శ్రీ వెంకటేశ్వర పద సన్నిధికి చేరిన పుణ్యాత్ముడు .భార్య  తిక్కమ్మ ”సుభద్రా కళ్యాణం ”రాసిన తొలి తెలుగు కవయిత్రి .కొడుకు పేద తిరుమలాచార్యుడు ,మనవడు చిన్నయ్య కూడా కవులే .కర్ణాటక సంగీత కూర్పుకు పాదకవితలతో  ఒక సంచలనం సృష్టించినవాడు అన్నమయ్య.     సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య సంస్కృతం లోనూ కీర్తనలు రాసి తన గీర్వాణ పాండిత్యాన్ని ప్రకటించాడు .సుమారు వంద సంస్కృత కీర్తనలు రాసినట్లు తెలుస్తోంది .అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం
1-పృథుల  హేమ  కౌపీనధర-ప్రథిత  వతృమే బలం పాతు
సూపాసక్తః సుచి శ్శు లభః-కోప విదూరహ-కులా ధికః
పాపభంజకహ పరాత్పరోయం -గోపాలో  మే  గుణం పాతు
తరుణః చత్రీ దందా కమండలు-ధర పవిత్రీ దయా పరః
సురాణాం సంస్తుతి మనోహరః -స్థిర శ్శు ద్ధీర్మే ధృతిం పాతు
త్రివిక్రమః శ్రీ తీరు వెంకట గిరి -నివాసోయం నిరంతరం
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే -దివా నిశాయాం థియమ్ పాతు ”

-వామన మూర్తి పై కీర్తనయుడి దీన్ని లతా మంగేష్కర్ పాడారు

2-భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింత ఏయం సదా –
కటి ఘటిత మేఖలా ఖచిత మని ఘంటికా -పాతాళ నినాదేన   విభ్రాజమానం
కుటిల పద ఘటిత  సంకుల శింజితేన తం -చేతుల నటనా సముజ్వల విలాసం
నిరత కర కలిత నవనీతం  బ్రహ్మాది సుర నికర భావనా శోభిపదం
తిరు వేంకటాచల స్థిత0 అనుపమమ్ హరిం -పరమ పురుషం గోపాలబాలం  –
మరో కీర్తన చూద్దాం
3-దేవ దేవం భజే దివ్య ప్రభావం -రావణాసుర వైరి రవి పుంగవం
   రాజవరం శేఖరం రవి కుల సుధాకరం -ఆజానుబాహు నీలాగ్రకాయం
   రాజారి కోదండ దీక్షా గురు0 -రాజీవ నేత్రం రామచంద్రం ,రామం
   నీల జీమూత సన్నిభ శరీరం -విశాలవక్షం నిబాల జలజ నాభం
   కాలాహి నాగ హరమ్ ధర్మ సంస్థాపనం -గో లలనాధిపమ్  భోగి శయనం రామం
   పంకజాసన వినుత పరమ నారాయణం -శంకరార్జిత జనక చాప దళనం
  లంకా  విశోషణం లలిత విభీషణం వెంకటేశం సాదు వినుత వినుతం రామం –
మరో ఆణిముత్యం –
4- మాధవ కేశవా మాధవ విష్ణో శ్రీధరా- పదనఖ0 చిన్తయామి యూయం
    వామన గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న -రామరామ కృష్ణ నారాయణాచ్యుత
    దామోదరానిరుద్ధదైవ పుండరీకాక్ష -నామాత్రయాధీశ నమోనమో
    పురుషోత్తమ పుండరీకాక్ష -దివ్య హరి సంకర్షణ అధోక్షజ
    నరసింహ హృషీ కేశ నగధర త్రివిక్రమ – శరణాగత రక్ష జయ జయ సేవే
    మహిత జనార్దనా మత్స్య కూర్మ వరాహా -సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
    విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం -అహమిహ తవపద  అనిశం భజామి
     అంటూ  విష్ణు అవతారాలను చక్కగా స్తుతించాడు అన్నమయ్య కీ ర్తనలో 
    సశేషం 
   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో త్రాయహ్నికంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. తొలిరోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివార్లకు మాన్యు సుక్తంతో స్నపన,నూతన వస్త్ర ధారణ, పుష్ప పూజలు ఆలయ అర్చక స్వామి వేదాంతం మురళీకృష్ణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44

 రఘువీర చరితం -3
ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  వేషం లో వచ్చి సోదరుల శరీర దారుడ్యానికి ,శూర పరాక్రమ ఛాయలకు సంతసించాడు -” దంత మౌక్తిక నిష్ఠ యుతా మనః కుముద కౌముదీ -కాంతి ర్గండు గాంబు గౌరీ వ వామేషా స్నాపయతీవ మామ్ ” అనుకోకుండా హనుమ  వారిదేహ చ్చాయలను వర్ణించాడు -సుగ్రీవుని వద్దకు సోదరులను హనుమ చేర్చాడు ..మనసు విప్పి రామ సుగ్రీవులు మాట్లాడుకున్నారు .వాలితో ఉన్న అనుబంధాన్ని సుగ్రీవుడు వివరించాడు సోదరభావం ఒక చిన్న కారణం తో విరిగి పోయిందని అది  యెంత గొప్పవాడికైనా  మళ్ళీ అతికించటం సాధ్యం కానిపని అన్నాడు -అల్పేనాపి నిమిత్తేన సౌభ్రామం భిద్యతే తృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే ”
 తన విషాద జీవితగాధ వివరించాడు వానర రాజు ..రామ సుగ్రీవుల మధ్య స్నేహం గాఢమైన పిమ్మట సుగ్రీవుడు సీతాన్వేషణకు సహాయ పడతానన్నాడు . ప్రవాసితుడైన సుగ్రీవుడు నిబ్బరం గల బలశాలి అని రాముడు గ్రహించాడు ..అప్పుడు హనుమ ”రాముని కోరిక తీగ పుష్పించి ఫలిస్తుంది ”ఆనాడు-”స్ఫీత చాపల సంపర్క మర్కటే స్మిన్  ప్రసారితా -కేవలాతే  కృపా వల్లీ  ఫలం భధ్నాతు మా చిరం ”.రామాహనుమలు తమకు సూర్యుని తో సంబంధాన్ని గుర్తుకు చెచ్చుకున్నారు  వాలిని చంపి వానర రాజు తో స్నేహాన్ని బలీయం చేసుకొంటాను అని సుగ్రీవునికి రాముడు అభయమిచ్చాడు .
   తొమ్మిదవ అధ్యాయం లో రఘు వీర మహాకావ్యంను మల్లినాథుడు  కాళిదాసు రఘువంశ 0లో తొమ్మిదవ సర్గ ను పూర్తిగా అనుకరించి రాశాడు .ముఖ్యంగా యమకాన్నిఅదే కోవలో దట్టించాడు .రఘువంశ వ్యాఖ్యానం రాసిన హేమాద్రి పండితుడు యమకాన్ని మహా గమకంగా నిర్వచించాడు –స్పాత్పాద పద వర్ణనామావృత్తిహ్  సంయుతా యుతా -యమకం భిన్న వాచ్యానామాది మధ్యాంత గోచరం -ఇతి వాగ్భటహ్ . ఇందులో యమకాలున్న శ్లోకాలు పదకొండుమాత్రమే రాముని దుఃఖ పరాకాష్టగా పర్వతాలను ,మేఘాలను  నెమళ్లను మొదలైన వాటిని తన సీతను తనకు తెచ్చి ఇవ్వమని వేడు కోవటం వింత గా ఉంటుంది  .
  సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా       

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ  తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ  గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో ఖేరిఘాట్ కు దక్షిణానఉన్న అరణ్యం కు వెళ్ళాడు .అక్కడి నర్మదా నది మొసళ్లమయంగా ఉండేది .ఉదయాన సాయం వేళల మొసళ్ళు హాయిగా నది ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడుకునేవి ఈ శిష్య స్వామి అక్కడే ఆరు నెలలు ధ్యానం లో గడిపాడు .కానీ ఒక్కనాడూ ఆయన తపస్సుకు ధ్యానానికి అవి భంగం కలిగించలేదు .ఈ యువ సాధకుడివద్ద ఒక చిన్న నీళ్ల కుండ ,ఒక దుప్పటి  ,రెండు అంగోస్త్రాలు మాత్రమే ఉండేవి ..ఆరుమైళ్ళ దూరం లో ఉన్న గ్రామస్తు లు   యువ స్వామికి పాలు  గోధుమ రొట్టె రోజుకొకసారి తెచ్చిపెట్టేవారు .ఇలా ఆరునెలలు అతి   కఠోర  నియమ నిష్ఠలతో ధ్యాన తపస్సులలో గడిపాడు .ఒకరోజు పెద్ద వేటగాళ్ల బృందం అక్కడికి  వచ్చి సుమారు రెండుమూడు గజాల దూరం ఉన్న  మొసళ్ళమధ్య ఏకాంతం గా చలనం లేకుండా  ధ్యాన నిమగ్నమైన స్వామిని చూసిఆశ్చర్యపోయి స్వామికి తెలియకుండా  ఫోటో తీసి పేపర్లకు పంపారు .అవి అన్ని వార్తా పత్రికలలో ప్రచురితమై సంచలనాన్ని కల్గించింది . అదే సమయం లో కరివీర  పీఠ శంకరాచార్యస్వామిడా. శ్రీకూర్కొటి . గీతా రహస్యం రచించిన బాలగంగాధర తిలక్ కు సన్నిహితుడు    తమ వారసునిగా ప్రతిష్టించటానికి పదవికి తగిన వారికోసం   అన్వేషిస్తున్నారు ..ఈ యువ స్వామి విషయం తెలిసి కొందరు పండితులను రహస్యంగా పంపి స్వామి చర్యలను గమనించమన్నారు  .వాళ్ళు దగ్గర గ్రామం లో రహస్యంగా ఉంటూ స్వామి గురించి వింటూ చూస్తూ తెలుసుకొన్నారు .స్వామి కుటుంబ నేపధ్యం చదువు గురువు పవిత్రత  అన్నీ  తెలుసుకొని అసలు విషయం చెప్పి పీఠానికి వారసులుగా ఉండటానికి అంగీకారరించమని ప్రాధేయపడి   యువస్వామిని కూర్కొటి వద్దకు తీసుకు వెళ్లారు ఆయనకు స్వామి నచ్చినట్లు కనిపించింది .వెంటనే యువస్వామి తమ గురువు ను దర్శించి ఆయన అనుమతి, ఆశీర్వాదం పొందాడు
  18 రోజులు అనేక మంత్ర తంత్రాలతో స్నానాదులతో అన్ని రకాల మత సంబంధ విధులు నిర్వ హీంప జేసి కరి వీర పీఠ జగద్గురు  శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అభినందిస్తూ వేలాది టెలిగ్రాములు వచ్చాయి .రోమ్ నుంచి పోప్  సందేశం తోపాటు  ఎందరో మత గురువులనుండి  ఎన్నో సందేశాలు అందాయి.రంగ రంగ వైభవంగా కార్యక్రమం జరిగింది .అప్పటికి ఈ యువ  శంకరా చార్య  వయసు 30 సంవత్సరాలే .ఆరు  నెలల ఒంటరి  కఠిన  నియమ తపస్సు ఇంతటి గొప్ప పదవిని కట్ట బెట్టింది .
  డా కూర్కొటి సాంఘిక మత సంస్కరణలు చాలా చేశారు .మఠం  ఫైల్స్ అన్నీ అప్పగించారు విలువైన సమాచారం చాలా ఉంది ఎందరెందరికో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాల్సి వచ్చేది .ఎన్నెన్నో బృందాలవారు  వచ్చి సందర్శించి ఆశీర్వాదాలు అభిభాషణలు చేయమని కోరేవారు .దేశాటనం చేస్తూ ధార్మిక ప్రసంగాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా గడపాల్సి వచ్చేది . పీఠం లో ఉదయం సాయంత్రం వేలాది భక్తులకు దర్శనం ఇవ్వాల్సి వచ్చేది .ఈ బిజీ షెడ్యూల్ లో తనకు స్వేచ్ఛ అనేది లేదని అర్ధమయింది కొత్త శంకరాచార్య స్వామికి .. తన ఏకాంతం, ధ్యానం తపం ఎగిరిపోయాయి  ఇది నచ్చ లేదని పించింది . ఈ సుఖం సుఖం కాదనుకున్నాడు అంతరాత్మ ”నీకు తగిన పదవికాదు వదిలెయ్యి ”అని ప్రబోధించింది .  రెండేళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా చేతిలో పైసా కూడా లేకండా కట్టుబట్టలతో బయటికి వచ్చి హాయిగా మళ్లీ హిమాలయాలలో ఒంటరిగా తపస్సు చేసుకొందామని తాను  చేరాల్సిన గమ్యానికి చేర్చే రైలు లో మూడవ తరగతి పెట్టె ఎక్కి కూర్చున్నాడు .టికెట్ కొనటానికి చిల్లి గవ్వలేదు బైరాగి టికెట్ అంటారే అలా ఉంది పరిస్థితి .కాసేపయ్యాక కండక్టర్ వచ్చి టికెట్ ఏది అనిఅడిగితే లేదని చెబితే ఖరీదైన శంకరాచార్య దుస్తులు చూసి తర్వాత స్టేషన్ లో దిగిపొమ్మంటే దిగిపోయాడు .కానీ తానెవరో మాత్రం చెప్పలేదు .జీవితం లో ఆయన ఎప్పుడూ టికెట్ కొనకుండా ప్రయాణం చేయలేదు .కండక్టర్ కు వంగి నమస్కరించి ”నా మీద కేసు పెట్ట నందుకు కృతజ్ఞతలు ”అని చెప్పి దిగిపోయాడు .
  ఇంతకీ ఈ స్వామి ఎవరో తెలుసా ?స్వామి రామా .అసలు పేరు బ్రీజ్ కిషోర్ దస్మన    గురువు బెంగాలీ బాబా .స్వామి రామ 1925 లో   ఘర్వాల్ హిమాలయాలలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి   1996 లో చనిపోయాడు .లివింగ్ విత్ ది  హిమాలయన్ మాస్టర్స్ ”అనే గొప్ప గ్రంధం రాశాడు .అమెరికాలో పెన్సిల్వేనియారాష్ట్రం లో హాన్స్ డేల్  అనే చోట సుమారు అయిదువందల ఎకరాలలో ”హిమాలయన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ యోగ సైన్స్ అండ్ ఫిలాసఫీ ”స్థాపించాడు అనేక దేశాల పర్యటన చేశాడు అక్కడా బ్రా0చీలను  ఏర్పాటు చేశాడు .
  Inline image 1Inline image 2Inline image 3
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా     

—



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 –

గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )
 ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే ఉమా మహేశ్వరరావు గారికి మేనమామ .కృష్ణారావుగారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయం నవ్వు ముఖం తో   చూడగానే  రెండు చేతులు జోడించాలనిపిస్తుంది . స్నేహం సౌశీల్యం ఆదర్శం ఆయన సొత్తు అతి నిరాడంబరులు నెమ్మదిగా స్పష్టం గా మాట్లాడేవారు .ఏం ఎల్సీ ఎన్నికలలో కొల్లూరి కోటేశ్వర రావు గారికి నేనూ ఆయన శ్రీ ఆర్ ఎస్ కె మూర్తి శ్రీ గౌతమేశ్వరరావు గారు కలిసి ప్రచారం చేసినప్పుడు పరిచయమయ్యారు తర్వాత కాటూరు హెచ్ ఏం గా మరింత చేరువై వారి అభిమానినయ్యాను .ఆర్ ఎస్ ఎస్ లో సుశిక్షితులైన కార్యకర్త .మంచి బౌద్ధిక్  అంటే సంఘ సమావేశాలలో బుద్ధిని వికసింప జేసే ప్రసంగాలను చేసేవారిని బౌద్ధిక్  అంటారు .ఎన్నో విషయాలు లోతుగా చర్చించేవారు . శ్రీ గౌతమేశ్వరరావుగారు కాటూరులో సోషల్ మాస్టారుగా నాతోపని చేసి ప్రమోషన్ పై రెడ్డిగూడెం హెడ్ మాస్టర్ అయ్యారు .నిబద్ధత ఉన్న ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి . అలాగే కపిల కాశీపతిగారు కైకలూరు ప్రాంతం లో ప్రసిద్ధులు . శ్రీ మారెళ్ల సుబ్బారావు గారు ఆకునూరు హెడ్ మాస్టర్ .పంచ  చొక్కా పై పై కోటు వేసేవారు.పిలక ఉండేది .నాకు బాగా పరిచయం .మంచి ఉపన్యాసకులు .అనలిటికల్ బ్రెయిన్ ఆయనది లోతులను తరచి మాట్లాడేవారు .
  మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తిగారి తండ్రిగారు చతుర్వేదుల సదా శివ మూర్తిగారు అతిపవిత్ర జీవి  .తాడంకి వల్లూరు హెడ్ మాస్టర్ చేసి శ్రీ కాకాని వెంకటరత్నం గారి అభ్యర్థనపై ఆకునూరు హెడ్ మాస్టర్ గా చేశారు డిసిప్లిన్ కు మంచి విద్యా శిక్షణకు జిల్లాలోనే పేరెన్నిక గన్న హెడ్ మాస్టర్ . ఎవ్వరినీ లెక్క చేసేవారుకాదు .అందరికి హడలు .మనిషి భారీ పర్సనాలిటికాదు  సరిసమానంగా తెల్లటి పంచ చొక్కా ఉత్తరీయం మెడలోనుంచి ముందువైపుకు దోపి ,ముఖాన పెద్ద బొట్టు తో  పిలక తో ఉండేవారు . ఇంగ్లీష్ , లెక్కలలో ఆయన వద్ద చదివిన వారు తప్పటం అనేది ఉండేదికాదు .బడితెలవంటి వాళ్ళు కూడా కుక్కిన పేనుల్లాగా తల వొంచి వినయంగా ఉండేవారు .నాకు బాగా పరిచయం .ఆకునూరు నుంచి పడమట వెళ్లి అక్కడే రిటైరయ్యారు .రిటైరయ్యాక ఆయన్ను లెక్కల ట్యూషన్ చెప్పమని బ్రతిమాలితే ఇంటి దగ్గరే ట్యూషన్ లెక్కలు ఇంగ్లీష్ బోధించారు యాభై మందికి తక్కువ ఉండేవారుకాదెప్పుడూ . ఒక ఇన్ స్టి  ట్యూషన్ లాగా నడిపారు  అలాగే కపిలేశ్వర పురం లో హెచ్ ఏం అయినా శ్రీ ఉమా రామ లింగమూర్తి గారికి జిల్లాలో పెద్దపేరు .చామన ఛాయ గోచీ పోసి పంచె కట్టు ,కోటు ,ఉత్తరీయం మెడలో మడిచి స్ఫురద్రూపంగా ఉండేవారు . సంప్రదాయం సౌశీల్యానికి పెట్టిందిపేరు . జిల్లాలో ఆయన పెద్ద దిక్కు . సలహా సంప్రదింపులకు ఆయన వద్దకే వెళ్లేవారు .ఆయన మేనల్లుడూ అల్లుడూఅయిన  శ్రీ  రామ గోపాలం గారు కూడా హెడ్మాస్టర్ . కపిలేశ్వరపురం లో చేసి గన్నవరం లో రిటైర్ అయ్యారు .నేను సైన్స్ మాస్టర్ గా గన్నవరం లో [అని చేసిన పది పది హేను రోజుల్లో నన్ను జాయిన్ చేసుకొని రిలీవ్ చేసింది ఆయనే .మూతి మీద చిన్న మొరిక ఉండేది .పొట్టిగా నే ఉండేవారు పంచెపై చేతుల గ్లాస్కో బనీను వేసేవారు .ఇది తమాషాగా ఉండేది .సైన్స్ టీచర్ గా పెద్ద పేరు
శ్రీ పుచ్చా శివయ్యగారు గ్రాండ్ ఓల్డ్ హెడ్ మాస్టర్ .కపిలేశ్వర పురవాసి . లెక్కలు ఇంగ్లీష్  లలో ధరో  నాలెడ్జ్ ఉన్నవారు . క్రమశిక్షణకు మారుపేరు . రిటైరయ్యాక ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజీ ని శ్రీ అన్నే హనుమంతరావు గారితో కలిసి స్థాపించారు .మానాన్నగారు రిటరయ్యాక ఇక్కడే తెలుగు పండిట్ గా చేశారు ఆదిరాజు పున్నయ్యగారుకూడా ..మాతమ్ముడు కూడా కొద్దీ కాలం చేశాడు . .  శివయ్యగారితో అప్పుడే పరిచయం .
  ఉయ్యూరులో నేను ఎస్ ఎస్ ఎల్ సి చదివినప్పటి హెడ్మాస్టర్ శ్రీ కామినేని రాధాకృష్ణ మూర్తిగారు పెడసనగల్లు వాసి .సూటూ బూటూ టై తో ఉండేవారు .బాల్డ్ హెడ్ .ఆయన్ను ”దసరా బుల్లోడు ”అనేవారు ..ఇంగ్లీష్   ఆల్జీబ్రా  చెప్పారు .అర్ధంకాక నోట్స్ ఇవ్వక పొతే కాటూరు వెళ్లి హెడ్మాస్టార్ గా    ఉన్న శ్రీ సీత0  రాజు కామేశ్వరరావు గారి దగ్గరకు వెళ్లి వారమ్మాయి నోట్స్ అడిగి తీసుకొని రాసుకొని తిరిగి ఇచ్చేవాడిని అందుకే మార్కులు ఆ రెండు సబ్జెక్ట్ లలో తక్కువ వచ్చేవి . .రాధాకృష్ణమూర్తిగారిని నాగిరెడ్డి అనిస్టుడెంట్ స్కూల్ లోనే కొట్టాడు కారణం తెలియదు . కానీ ఆతర్వాత ఆ రెడ్డికి నడుం పట్టేసి  వంకరగా  జీవితాన్తమ్ నడిచేవాడు యాకమూరు వాసి . కామేశ్వరరావు గారు మేము టెన్త్ లో ఉండగా లెక్కలు చెప్పేవారు ఆయన పాఠం  చెబితే అక్కడికక్కడే రావాల్సిందే ఒక్క స్టెప్ కూడా వదలకుండా బోర్డు మీద రాసేవారు . కనుక యావరేజ్ వాడికి గొప్ప అవకాశం .ఆయన ఉయ్యూరులో మా బజార్లోనే కాపురముండేవారు మా నాన్న గారి శిష్యుడనని చెప్పేవారు నేను వారి శిష్యుడను .ఇంటివద్ద వక్కపొడి తయారు చేసి అమ్మేవారు .పంచ చొక్కా తో ఉండేవారు చాలా మర్యాదస్తులు  .వారమ్మాయి నా క్లాస్ మేట్ .” గురువుగారబ్బాయ్ ”అనే నన్ను పిలిచేవారు .పొట్లాలు నిలువుగా ఉండి  అడుగునా పైనా మూత లుగా చిన్న అట్టముక్కలుండేవి . చుట్టూ  గ్లేజ్ కాగితం అతికించి ఉండేది .
   ఉయ్యూరులో పని చేసిన శ్రీ కె ఎస్ ప్రకాశరావు గారికి మంచిపేరు. అలాగే రాళ్లబండి సత్యనారాయణ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు .పంచెపై కోటు .భారీ పర్సనాలిటీ . ఎవరినీ లెక్క చేసేరకంకాదు .శ్రీ ఎస్ కె వెంకటేశ్వర్లుగారు నల్లగా ఆజానుబాహువుగా పంచెకట్టుతో ”సెల్ఫిష్ జయంట్  ”గా ఉండేవారు .ఆయన సంతకం ”జిలేబి చుట్ట”లా  ఉండేది . స్కూల్ లోనే హెడ్ మాస్టర్ రూమ్ లో ఒకప్రక్క ఉండేవారు .వైష్ణవులు .బ్రాహ్మణమాస్టార్ల ఇంటికి ప్రతి రోజు నాకో సూరి రామశేషయ్య గారికో అటెండర్ తో చిన్న చీటీ పంపేవారు ‘అందులో  ”ప్లీజ్ ఆరెంజ్ మీల్స్ టు  డే ”అని ఉండేది .అలానే చేసేవాళ్ళం .మందిని బాదుకోవటం సరదా .ఎక్కడ పని చేసినా స్పెషల్ ఫీ  ఫండ్స్ ”హూష్ కాకి ” నాకేసేవారని జిల్లాలో పెద్దపేరు . ఉయ్యూరులోనూ లేపేశారు .ఎవరికీ తెలిసేదికాదు .ఆయన ఉన్నప్పుడే బ్రహ్మనంద రెడ్డి  డిటెన్షన్ సిస్టం రద్దు చేశాడు .తర్వాత ఈ పాసులను బ్రహ్మానంద రెడ్డి పాస్  అనేవారు
  చెయ్యెత్తి మొక్కాల్సిన మరో హెడ్ మాస్టర్ శ్రీ ఏ బలరామ మూర్తి గారు .ఆయన శారీరక మానసిక ష్వచ్చత కు ఆయన అతి తెల్లని పంచ చొక్కాలు సాక్షి .జిల్లాలోనే తిరుగు లేని వారు ఆయన డ్రాఫ్ట్ రాస్తే తిరుగు లేదు టీచింగ్ లో డిసిప్లిన్ లో ఆయనకు సాటి ఎవరూ లేరు .ఇంటివద్ద మానసిక రోగి అయినా భారయకు అన్నీవండి పెట్టి   బడికి వచ్చేవారట .హేట్సాల్ఫ్ అనిపిస్తుంది .  సమయపాలన ఆయన విధి . స్టాఫ్ మీటింగ్ అంటే అయిదేఅయిదు నిమిషాలు చెప్పాల్సింది పాయిట్స్ గా రాసుకొని వచ్చి చెప్పేసి ఇలా చేయాలి . అంటారు అంతే సుగ్రీవజ్జనే .ఉయ్యుయూరులో కొద్ది కాలమే ఉన్నారు అప్పుడు వారివద్ద పని చేసే అదృష్టం నాకు దక్కింది  .
  ”హాఫ్ కార్ట్ ”  అనే బట్టతలఆయన పేరు బి కామేశ్వరరావు  సోషల్ మేష్టారు తరవాత హెడ్ అయ్యారు  అలాగే శ్రీనివాసరావు గారనే ఆయన రా గ్రాడ్యుయేట్ గా ఉయ్యురు లో సైన్స్ టీచర్ తర్వాత హెడ్ అయ్యారు .వారు  నేనుహెడ్  అయ్యాక మళ్ళీ పరిచయమయ్యారు  ఉయ్యూరు లో హెడ్ అయిన శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు తమాషా గా ఉండే బుల్లి మూతితో మినీ ఎస్వీ రంగారావు గా అనిపించేవారు మంచి సైన్స్ ఇంగ్లీష్  టీచర్ .ఇక్కడే రిటైరయ్యారు ఆయన పాలనను” అక్బర్ పాలన” అనేవాడిని . స్కూల్ లో కొత్త బిల్డింగ్ లు నీటి సరఫరా గ్రౌండ్  మెరక  టిఫిన్ షెడ్ మొదలైనవి కెసిపి సహకారం తో ఏర్పడ్డాయి .అయన ఇద్దరు కూతుళ్లు మానికొండలో నా స్టూడెంట్స్
  చై ర్మన్ పిన్నమనేనిగారి కుడిభుజం  రుద్రపాక హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు గారు మంచి వాలీబాల్, బాడ్మింటన్ ప్లేయర్ .టీచర్స్ బదిలీల్లో పిన్నమనేనిని ముఖ్య సలహాదారు   ఒకసారి నాకు  ముప్పాళ్లనుంచి పామర్రు రావటానికి తోడ్పడ్డారు .సరదాగా మాట్లాడే నేర్పు విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి యుక్తులు హై పర్సెంటేజ్ సాధించే  నేర్పు  ఓర్పు ఉన్నవారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు తర్వాత పునాదిపాడు వచ్చారు . వారబ్బాయిల్లో ఒకరు ఉయ్యురు కాలేజీ తెలుగు లెక్చరర్ ,రెండవనాయన కె సిపి ఉద్యోగి తరుచు ఉయ్యురు వచ్చేవారు .ఈ ఇద్దరు వెంకటేశ్వరరావు గార్లు వామభావ పక్షపాతులు .శ్రీ పి .శ్రీరామ మూర్తిగారి అనుచరులు . అసలు శ్రీరామమూర్తిగారే హెడ్ మాస్టర్ గా గొల్లపల్లి లో పనిచేసి టీచర్స్ తరఫున ఏం ఎల్ సిగా పోటీ చేసి గెలిచారు .మంచి పర్సనాలిటీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు .మేమందరం కొల్లూరి గారి మనుషులం అయినా నాతో  మూర్తిగారు చాలా ఆప్యాయంగా ఉండేవారు .ఒకటి రెండుసార్లు సరసభారతి సమావేశాలకు ఉయ్యురు వచ్చారు . అరుదైన వ్యక్తిత్వం వారిది .కానీ గిల్డ్ తరఫున పని చేసి మేము రెండుసార్లు కొల్లూరి ని గెలిపించి ఆయన్ని ఓడించాం .లెఫ్ట్ భావాలున్న శ్రీ పి .జనార్దనా రావు గారు శ్రీ నెక్కలపూడి కోటేశ్వరరావు గారు మంచి హెడ్మాస్టర్లుగా ప్రసిద్ధులు . అంగలూరు హెడ్ మాస్టారు శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు అందరికీ ఆదర్శ ప్రాయులు .ఆంగ్ల బోధనలో నిష్ణాతులు రూల్స్ లో నిధి .అలాగే మంగళాపురం హెడ్ మాస్టర్ గా చేసి రిటైరైన శ్రీ జోశ్యులుగారు జిల్లా లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా స్కౌట్స్ ట్రెయినింగ్ లో మేటి
      జగ్గయ్యపేట దగ్గర శ్రీ రెబ్బా సత్యనారాయణ గారికి మంచిపేరుంది .గన్నవరం ఆత్కూరు లలో శ్రీ ఆళ్ళ కోటేశ్వరరావు గారు ప్రసిద్ధులు .లేడీస్ లో శ్రీమతి పి .ప్రమీలారాణిగారు అరుదైన వ్యక్తి .గన్నవరం గర్ల్స్ స్కూల్ ను తీర్చి దిద్దారు .ఆమెను మేము హెచ ఏం  అసోసియేషన్  ప్రెసిడెంట్ గా ,కామన్  ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసాం . రెండితోనూ సమర్ధ వంతంగా పని చేసి రాణించారు .ఆమె చెల్లెలు సరోజినీ దేవిగారు నందిగామ లో పేరు పొందారు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి విజయ లక్ష్మిగారు కలుపుగోలు మనిషి
  ఉయ్యురు లో హెడ్ గా పని చేసిన తాడంకి నేటివ్ శ్రీ కోడెబోయిన సూర్యనారాయణ గారు నీట్ గా చొక్కా నలక్కుండా చేతికి మట్టి అంటకుండా పని చేశారు లెక్కలమేస్టారుగా మంచిపేరు  తెల్లని గ్లాస్కోపంచె అంతే  తెల్లని చొక్కా ఉత్తరీయం చేతిలో గొడుగు నెత్తిపై అటునుంచి ఇటు తిరిగిన నాలుగే నాలుగు వెంట్రుక లు ఆయన ప్రత్యేకత  . ఏం జరిగినా సంబంధ లేనట్లుండటం ఆయనకే చెల్లింది .ఆయన సమయం లో స్కూల్ లో హిందూ ముస్లిం స్టూడెంట్స్ కొట్లాట వస్తే బెదిరిపోతే నేనూ ,వల్లభనేని రామకృష్ణారావు గారు అన్నే పిచ్చిబాబు  గారు మొదలైన టీచర్స్ పూనుకొని ఘర్షణ లేకుండాకాపాడాం . ఆయన్ను అందుకే ”ఉపాయం మేష్టారు ”అనేవారు
  మంచి హెడ్మాస్టర్ లలో శ్రీ మంగళగిరి శాస్త్రిగారు ప్రసిద్ధి గొప్ప చెస్ బాడ్ మింటన్ వాలీబాల్ ప్లేయర్ .లెక్కలు  ఇంగ్లీష్ టీచింగ్ లో సూపర్ . గిల్డ్ ప్రెసిడెంట్ ను చేసాం తాడంకి హైస్కూల్ కు వన్నె తెచ్చి అక్కడే రిటైరయ్యారు .ఎన్నో సెమినార్లు నిర్వహించారు ..శ్రీ అన్నే ఉమామహేశ్వరరావు శ్రీ ఘంటా కోటేశ్వరరావు లు ట్యూషన్ మాగ్నెట్స్ .హెడ్స్ గా బాగా రాణించారు ..పెనమకూరు వాసి శ్రీ సూరపనేని వెంకటేశ్వరరావు శ్రీ విల్సన్ గార్లు ,నా ఎస్ ఎస్ సి క్లాస్ మేట్  శ్రీమతి చందా నిర్మల  ఆమె భర్త సామ్యుల్ గారు వత్సవాయి దగ్గర పోలం పల్లి లోను , గుడివాడ దగ్గర మోటూరు లో హెడ్స్ గా చేశారు . నా ” బెడ్ ”ట్రెయినింగ్ మేట్స్  హనుమంతరావు ఆండ్రు పాల్  బండిరామారావు చౌదరి , ,  శ్రీ పి ఆంజనేయశాస్త్రి ,లు హెడ్స్ గా ప్రసిద్ధులు శ్రీ కోకా మా ధవరావు గారు తాడంకి హెడ్మాస్టర్  ఎప్పుడూ ముక్కుపొడీపీలుస్తూ పంచెకు తుడుచుకొంటూ ఉండేవారు . మంచి టీచర్ కుసుమహరనాధ భక్తులు . భార్య  కూడా సౌజన్య  శీలి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు .అలాగే శ్రీ వీరయ్య ,శ్రీ యెన్ అంజయ్య ,వి రఘురాములు ,శ్రీపే టేటి జగన్నాధరావు మొదలైనవారు నాకు సహా ప్రధానోపాధ్యాయలు .ఇప్పటిదాకా చెప్పబడిన వారంతా కృష్ణా జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు .
  ఇప్పుడు ప్రయివేట్ హై స్కూల్ హెడ్మాస్టర్ ల గురించి నాకు తెలిసింది తెలియ జేస్తా .గుడివాడ టౌన్ హై  స్కూల్ వ్యవస్థాపక హెడ్ మాస్టర్ శ్రీ యి ఎస్ యెన్ వి మూర్తి గారనీజ్ఞాపకం కృష్ణా జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర పతి పురస్కార గ్రహీత . మూర్తీభవించిన స్వచ్ఛత . ఆయన ప్రత్యేకత . తర్వాత సోమంచి రామం గారికి  ఈ పురస్కారం వచ్చింది .టౌన్ హై స్కూల్ కె చెందిన మరో హెచ్ ఏం శ్రీ యెన్ వెంకటేశ్వరరావు గారూ పొడుగ్గా పలచగా ఉండేవారు .సౌజన్య మూర్తి . గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నిర్మల గారుకూడా సమర్ధులని పేరుపొందారు .  . మచిలీపట్నం లో శ్రీ చోడవరపు బింధుమాధవరావు గారు జిల్లాలోనే లెక్కలలో ప్రసిద్ధులు .లెక్కలపుస్తకాలు రాశారు . ఆయన తమ్ముడు శ్రీ సి హెచ్  వి రామా రావుగారు ఇంగ్లీష్   లెక్కలలో దిట్ట .మా నాన్న  గారితో  ఉంగుటూరు లోపనిచేసి  తర్వాత  పెనమకూరు హెచ్ ఏంగ కొంతకాలం పని చేసి మళ్ళీ గుడివాడ వైపువెళ్లారు నవ్వుముఖం నాకు బాగా పరిచయం .  బెజవాడ లో హిందూహై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారావుగారు కామ న్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసి టెస్ట్ పరీక్ష పేపర్లు కూడా అమ్మేశారని రుజువైతే మేమ0దరం ఎదురు తిరిగి ఆయన చేతిలోంచి దాన్ని తప్పించి శ్రీ నూకల శ్రీ రామమూర్తిగారు డి యి వోగా ఉన్నప్పుడు ప్రమీలా రాణిగారికి ఇప్పించాం .తేలప్రోలురాజా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రసాదరావుగారు  ఆంగ్ల  బోధనలో ,ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించటం లో  నిష్ణాతులు   వివేకానంద్ స్కూల్ హెడ్ శ్రీ నర్సింహ మూర్తి  గారిది  ఆకర్షణీయ వ్యక్తిత్వం .వానపాముల హెడ్మాస్టర్ సామ్యుల్ గారు భార్య  కూడా   హెడ్స్ .
  పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణ ”చాకు” .హెచ్ ఏం అసోసియేషన్ కు ఆయన్ని నేనే సెక్రెటరీని ప్రమీలారాణిగారిని అధ్యక్షురాలిని చేయటం లో నడుం కట్టాను  ఇద్దరూ దానికి గొప్ప వైభవం తెచ్చారు .శ్రీ మద్దూరి విశ్వం  శ్రీ వై వి రాజు  శ్రీ రమణారావు శ్రీమతి బి సుగుణ కుమారి గార్లు హెడ్ మాష్టార్లుఅయి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్లు గా పదోన్నతి పొందారు .సుగుణగారి భర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్స్ బోధనలో ప్రవీణులు అంగలూర్ హెచ్ ఏం అయ్యారు అందులో రాజు గారు నీతి  నిజాయితీకి ఆభరణం . అలాగే వెలగలేరు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు గారు లెక్కల మేస్టారుగా మంచి పేరు ఉన్నవారు . భార్య కూడా హెడ్ మిస్ట్రెస్ . నా మోపిదేవి శిష్యురాలు బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి భారతీ దేవిని  మేంఅంతాకలిసి ప్రమీలా రాణిగారి తర్వాత  హెచ్ ఏం అసోసియేషను ప్రెసిడెంట్ ను  చేశాము . మస్తాన్ రావుగారు మాతోపాటు మోపిదేవిలో లెక్కల మేస్టారుగా పనిచేసి దివితాలూకా హెడ్మాస్టర్ అయ్యారు .స్వ ర్గీయ శ్రీ టి ఎల్ కాంతారావు గారిమామగారు  పెనమకూరు హెడ్మాస్టర్ గా చేస్తూ చనిపోయారు . అక్కడే పని చేసిన శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తిగారు లెక్కల టీచర్ గా సుప్రసిద్ధులు భారీపర్సనాలిటీ . ఇక్కడే శ్రీ విల్సన్ గారు చేశారు . తోట్లవల్లూరు హెడ్ మాస్టర్ పేరుజ్ఞాపకం లేదుకానీ సిగరెట్టూ గుప్పిటిలోపెట్టి పొగ పీల్చేవారు  .తమాషాగా ఉండేది . శ్రీ చలపతిరావుగారు కపిలేశ్వరపురం ఎంకన్నవీడు ల్లో హెచ్ ఏం . శ్రీ నర్రా బాబూరావుగారు టీచర్ గా హెడ్ మాస్టర్ గా గుడివాడ చుట్టుప్రక్కల ప్రసిద్ధులు వాళ్ళబ్బాయి ఉయ్యూరులో నా శిష్యుడు తర్వాత   అడ్డాడలో లెక్కలమేస్టర్ .ఇలా ఎందరో మహాను భావులైన ప్రధానోపాధ్యాయులు అందరికి వందనములు  .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా           

—


Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105

             గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1
అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి వారి జీవితాలపై  రాయమని కృష్ణా జిల్లా సీనియర్ హెడ్మాస్టర్  రాష్ట్ర ప్రధానోపాధ్యా సంఘానికి అధ్యక్షులు మా లాంటి  వారికి మెంటార్  బాలసాహిత్యాన్ని అద్భుతంగా రాసినవారు రేడియో నాటికల ప్రసిద్ధులు ,హెడ్ మాస్టర్స్ కు కరదీపిక రాసినవారు ”సోమంచి రామం ”అని అందరిచే పిలువబడే  శ్రీ సోంచి శ్రీ రామ చంద్ర మూర్తి గారిని చనువుతో చాలా సార్లు అడిగాను .చూద్దాం అన్నారు కానీ జరగలేదు .వీరి తర్వాత ఇన్ని విషయాలూ తెలిసిన వారు  కృష్ణా జిల్లాటీచర్స్ గిల్డ్ కార్య దర్శి అధ్యక్షపదవులలో రాణించిన గన్నవరం సీనియర్  హిందీపండితులు ,అమెరికా ”తానా ”కు అధ్యక్షులుగా పని చేసిన శ్రీ తోటకూర ప్రసాద్ గారి తండ్రి శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారినీ అడిగాను చాలా సార్లు ఫోన్ కూడా చేశాను .కదలలేదు .నేను సర్వీస్ లోకి రాకముందు ఎందరెందరో గొప్ప హెడ్ మాస్టార్ల పేరు వినేవాడిని ,నేను పని చేస్తున్నప్పుడూ పని చేసినవారు చాలా మందిఉన్నారు .వీరిలో కొద్దీ మంది గురించి మాత్రమే కొన్ని విషయాలు విన్నాను కొందరిని ప్రత్యక్షంగా ఎరుగుదును . నిజంగా వీరందరి పూర్వా పరాలు నాకు పూర్తిగా తెలియనే  తెలియవు .అయినా వారిని గురించి చెప్పాలనే తాపత్రయం ఉండటం వలన సాహసం చేస్తున్నాను .వారి పేర్లనైనా స్మరించటం ధర్మం అని ప్రయత్నిస్తున్నాను .  ఇందులో తప్పులు ఉండచ్చు .సరైన సమాచారం ఇవ్వలేక పోవచ్చు  పెద్దమనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను .మీకు తెలిసినవారెవరైనా ఉన్నా నేను మర్చి పోయిన వారున్నా తెలియ జేయండి . ముఖ్యంగా మునిసిపల్ సర్వీస్ లో ఉన్నవారు ప్రయివేట్ స్కూల  హెడ్ మాస్టర్లలో నాకు తెలిసిన వారు వ్రేళ్లమీద లెక్క పెట్టవచ్చునేమో -ఇది  ఆరంభమే అంతం కాదని తెలియ జేస్తున్నాను  .  ముందుగా శ్రీ వెంపటి పురుషోత్తం గారు ప్రధానోపాధ్యాయులుగా ప్రాతస్మరణీయులు .శాసన మండలికి ఉపాధ్యాయ ప్రటిందీహి గ ఎన్నికై విద్యా సేవ చేశారని విన్నాను . ఆ తర్వాత నేను చదివిన ఉయ్యూరు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ గురించి చెప్పాలి .నేను 1953 లో 8 వక్లాస్ లోకి ఎంట్రన్స్ పరీక్ష రాసి చేరాను .అప్పుడు హెడ్ మాస్టారు శ్రీ బులుసు గౌరీపతి  శాస్త్రి గారనిజ్ఞాపక0 .కుదమట్టంగా ముతక ఖద్దరు పంచ లాల్చీ  తో ఉండేవారు వెడల్పు ముఖం . చామన ఛాయ  .అసెంబ్లీలో ఏదైనా పిల్లలకు చెప్పాలంటే ”ఓ చిన్న అనౌన్స్ మెంటోయ్ ”అనేవారు అది వారి ఊతపదం నవ్వు కొనేవాళ్ళం .ఆయనతర్వాత శ్రీ ఆచంట సత్యనారాయణ గారు వచ్చారు మా తొమ్మిదోక్లాస్ లో ఆయన ఎర్రగా గ్లాస్కో పంచ లాల్ఛీ తో నెహ్రూగారి చారల అరకోటు  తో గుబురు మీసాలతో హుందాగా ఉండేవారు  ఇంగ్లీష్  లెక్కలలో దిట్ట .కానీ ఒకసారి ”గోంగూర పాట ”క్లాస్ లో ఆయనపాడితే విద్యార్థినులు చెంప పగలకొట్టారని విన్నా .కటకటాల మేష్టారి ఇంట్లో ఉండేవారు . అసలు ఉయ్యూరు స్కూల్ 1951 లో ప్రారంభించినవారు శ్రీ వై  గోపాలరావు అనే హెడ్మాస్టర్ .ఈయన కమ్యూనిస్ట్ అభిమాని .తర్వాత గొడవర్రు హై స్కూల్ లో పని చేసి అక్కడ  క్వేశ్చిన్ పేపర్ల లీకు లో ఇరుక్కునికి సస్పెండయి  బయట పడ్డారు నాకు బాగా పరిచయం వెడల్పు ముఖం తెల్లని పంచె లాల్చీ తో ఉండేవారు లెక్కలు ఇంగిలీషు లో నిధి అంటారు .చివరికి ఉయ్యూరులోనే చనిపోయారు . వాళ్ళబ్బాయికి కంపాష నేట్ గ్రౌండ్స్ పై జిల్లా పరిషత్ లో గుమాస్తా ఉద్యోగమిస్తే చక్రం తిప్పి దున్నిపారేశాడు ”అన్నివిధాలా”   తర్వాత శ్రీ కె వి ఎస్ ఎల్ నరసింహారావుగారు ఈయనఉన్నప్పుడే నేను ఎనిమిదిలో చేరాను ,ఈయన పెంటపాడు వాస్తవ్యులు .ఈ జిల్లాలో స్థిరపడిపోయారు కవి,నటుడు గాయకుడు నాటక రచయిత నాట్యం చేసేవారుకూడా .అందుకని ”నాట్యాచార్య ”అనేవారు . నేను  తర్వాత మారి గౌరీనాధ శాస్త్రిగారు వచ్చారని గుర్తు . ఆయన రాసిన ”పాకీ వాణ్ణం డోయ్  బాబూ పాకీ వాణ్ణండి ”పాట బాగా పాప్యులర్ వార్షికోత్సవానికి దాన్ని వేషం వేయించి పాడించేవారు .వీరితో కలిసి ఇదే స్కూల్లో పని చేసిన అదృష్టం నాది .జూనియర్ కాలేజీ ఆకునూరులో లెక్చరర్ అయి ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు నేనంటే పిచ్చ అభిమానం .ఆయన నడక నాట్యం చేస్తున్నట్లుండేది భారీగా పొడవుగా మంచి మీస కట్టుతో తెల్ల ఖద్దరు పంచ చొక్కాతో ఉండేవారు నవ్వు ముఖమే .ఆయనే తనగురించి తాను ”జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ ”అని చెప్పుకునేవారు  మాకు ఫామిలీ ఫ్రెండ్ కూడా .గొప్ప సాయి భక్తులు ఎన్నో పుస్తకాలు రాశారు .సాహితీయామండలికి సరసభారతి ఆప్తులు . ఆయన్ను సన్మానించిన అదృష్ట వంతుడిని ..వీరి తోడల్లుడుగారు శ్రీ టి .తరుణీ రావు గారు మంచి పేరున్న హెడ్మాస్టర్ .తాడంకి లో పని చేశారు .తర్వాత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా  రిటైరయ్యారు .మంచి బాడ్  మింటన్ ,వాలీ బాల్  సెంట్రల్  ప్లేయర్  షాట్ దిగకపోతే కోపంతో బాత్ విరగ్గొట్టేవారు అయితే టీమ్ నడిపించటం లో నేర్పరి
  అవనిగడ్డలో గొప్ప హెడ్మాస్టర్లు పనిచేశారు  వారిలో నా స్నేహితుడు పెద్దిభొట్ల ఆదినారాయణ మామగారి అన్నగాఋ శ్రీ ఏడిద సత్యనారాయణ గారికి  మంచిపేరుండేది  . కూన పులి సుబ్రహ్మణ్యం గారు ఇంగువ కృష్ణ మూర్తిగారు రాయసం సుబ్బారావు గారు కామన్   ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీ శ్రీ టి వి సుబ్బారావు   పెడన హై  స్కూల్ హెడ్ మాస్టర్  చాలాకాలం కామన్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరిగా సమర్ధవంతం గా నిర్వహించిన  శ్రీ విష్ణు వర్ధనరావు  సబ్ జెక్ట్ లోనూ పేరున్నవారు లావుగా వెడల్పు ముఖం తో మల్లుపంచె తెల్ల చొక్కాతో ఉండేవారు సీరియస్ ముఖం ఆయనతో మాట్లాడటం అంటే భయం అనేవారు .
  పామర్రులో చాలా కాలం హెచ్ ఏం గా పని చేసిన శ్రీ రావు సాహెబ్ సుబ్బారావు గారికీ పేరుబాగానే ఉంది .రావు సాహెబ్ అనేది బిరుదేమో !ఆయన గురించి ఒకమాట చెప్పుకొనేవారు .గుమాస్తా ఏదైనా సంతకం కోసం వస్తే ”ఎద్దుచ్చా ?మేక  పెంటికా
“?అని అడిగేవారట .ఎద్దుచ్చ అంటే పొడుగు సంతకమా అని మేక పెంటిక అంటే పొట్టి సంతకమా అని భావం ట .అక్కడే చాలాకాలం పని చేసిన శ్రీ ఆరికపూడి పూర్ణ చంద్ర రావు గారు చెవుల నిండా బొచ్చుతో భారీ పర్సనాలిటీ తో ఖద్దరు వస్త్ర ధారణతో ఆకర్షణీయంగా ఉండేవారు . టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా చాలాకాలమున్నారు .నేను సర్వీస్ లో చేరిన కొత్తలో . ఆయన ఒంటెత్తు పోకడలు నచ్చక మెజారిటీ టీచర్లు ఆయన్ను వ్యతిరేకించగా గిల్డ్ రెండు గా చీలింది .అప్పుడు శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అయ్యారు అప్పటికి ఆయన మోపిదేవి హెడ్మాస్టర్ నా సర్వీస్ సైన్స్ మాస్టర్ గా అక్కడే  ప్రారంభం .  .చక్కని పలువరుసతో ఎత్తుగా తగినంత బలంగా ఖద్దరు పంచె ,లాల్చీ  ఉత్తరీయం చేతిలో తాళం చెవుల గుత్తి తో కనిపించేవారు బోళామనిషి క్షణాలమీద కోపం వచ్చేది .నేనంటే మహా అభిమానం .ఒక ఏడాది అక్కడ పని చేసి ఉయ్యూరుకు ప్రయత్నిస్తుంటే తెలిసి ”మా అమ్మాయి ప్రభావతి ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చింది మీ బోధనా నాకు  అమ్మాయికీ ఇష్టం మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు ప్రయత్నం చేసినా ఆపేస్తా .అనటం తో ఆ అభిమానానికి పులకించి ఉండి పోయా . తర్వాతెప్పుడో కాటూరు హెడ్ మాస్టర్ గా అయన ఉన్నప్పుడు నేను మానికొండలో సైన్స్ టీసీగార్ గా ఉండగా నన్ను కాటూరు వేయించుకోవాలని కమిటీ వారికి చెప్పి ,నర్రా వెంకటరత్నం లాంటి వాళ్ళు అడ్డుపడ్డా   నాకోసం మానికొండ వచ్చి అక్కడ లేనని ఉయ్యూరు వచ్చానని తెలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి విషయం చెప్పి రిక్వెస్ట్ రాయించుకొని నాలుగు రోజుల్లో ఆర్డర్ తెప్పించిన ఉన్నత వ్యక్తిత్వం .తర్వాత గజిటెడ్ హెడ్ మాన్స్టర్ గా ప్రొమోషన్ పొందారు .అప్పుడూ ఎక్కడ కనిపించినా రిక్షా దిగి పలకరించిన  సంస్కారం ఆయనది . వాళ్ళమ్మాయి అబ్బాయి ఇద్దరూ మోపిదేవిలో నా శిష్యులే . బి పి  ఉన్నట్లుగా ప్రవర్తించేవారు క్షణిక కోపం . యిట్టె చల్లారేది . తర్వాత చనిపోయారు   ఈయన బంధువే తూమాటి  వెంకటరామయ్య  నల్లగా తెల్ల పంచ చొక్కాతో ముదునూరు,ఘంటసాలలో హెడ్ గా పని చేసిన  వారుండేవారు . లెక్కలు ఇంగ్లీష్ లలో దిట్ట ఎన్నో సెమినార్లలో కలిసేవార0 .సబ్ జెక్ట్లపై అధారిటీ .పెద్దమనిషిగా మంచిపేరు .
   శ్రీ మోచర్ల పూర్ణ చంద్ర రావు పామర్రులో ,నున్నలో చేశారు భారీ పర్సనాలిటీ .తెల్ల ఖద్దరు పంచ లాల్చీ  స్ఫోటకమాచల ముఖం తో   ఉత్తరీయం తో చాలా హుందా గా ఉండేవారు .వీరిదగ్గర పామర్రులో పని చేశాను .మంచి వాలీబాల్  బాడ్  మింటన్       ప్లేయర్ .పంచె మోకాళ్ల    పైకి ఎగకట్టి ఆడేవారు .సరదాగా మాట్లాడేవారు క్రమశిక్షణ బాగా పాటించేవారు .రోజూ బంద రు నుంచే వచ్చినా ఏనాడు లేటుగా వచ్చేవారుకాదు  పామర్రులో పనిచేసిన మరో ప్రసిద్ధ హెడ్ మాస్టర్ శ్రీ వేమూరి రామ కృష్ణయ్యగారు . ఎర్రగా  అంచుప0చ  తెల్ల చొక్కా ఉత్తరీయం తో నవ్వు ముఖం తో ఉండేవారు మహా సహన శీలి . కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఎలకుర్రు వాస్తవ్యులు గొప్ప స్థితిపరులు .వారబ్బాయి హర్ష నా దగ్గర పామర్రులో టెన్త్ చదివాడు . వీరికి కోపం అంటే ఏమిటో తెలీదు .ఎవ్వరికీ అపకారం తలపెట్టేవారుకాదు . ఇంగ్లీష్     లో నిధి .స్టాఫ్ మీటింగ్  లు గంటలకు గంటలు పెట్టేవారు .విసుగ్గా ఉండేది ఆయనకు తెలియని విషయం లేదు .పి  శ్రీరామ  మూర్తిగారి అభిమాని కానీ మిగతావారిలా బయట పడేవారుకాదు .ఆయన వ్యక్తిత్వానికి అందరూ జోహారు పలికేవారు . తరవాత ఉయ్యూరు హెడ్ మాస్టర్ గా కూడా పని చేశారు అప్పుడు మా పెద్దబ్బాయి శాస్త్రి టెన్త్ చదివాడు . ధర్మ రాజు అనేవారు రామకృష్ణయ్యగారిని . పామర్రులో పని చేసిన మరో హెడ్మాస్టారు శ్రీ హయగ్రీవంగారు .సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ .రూల్స్ బాగా తెలిసినవారు లౌక్యులు .తెల్లపంచె చొక్కాతో నిండు కుండలాఉండేవారు బెజవాడ కాపురం . ఒకటి రెండుసార్లు నాకోసం ఉయ్యూరువస్తే ఆయనకు గారెలు ఇస్తామని చెబితే మా ఆవిడ వండింది ఇష్టంగా తిన్నారు అందుకని ఆవిడ ”గారెలమాస్టారు ”అనేది
  శ్రీ ఇంగువ కృష్ణ మూర్తి గారు ,శ్రీ పి  .సీతారామ శర్మగారు అంటే నా మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి బావగారు మల్లుపఞ్చ కొక్కాతో ఉండేవారు గొప్ప ఇంగ్లీష్    టీచర్ గా పేరు బందరులో ఉండేవారు  శ్రీ పచ్చళ్ళ శర్మ అనే వారు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఉండేవారు ఆరుగొలను ,లో పని చేసిన జ్ఞాపకం .
  మొవ్వ కు చెందిన శ్రీ మొవ్వ వెంకట కృష్ణా రావు గారు ఎప్పుడు ముతక  ఖద్దరు  పంచ లాల్ఛీ ఉత్తరీయంతో ఉండేవారు .దేవుడుమేస్టారు  అనేవారు . నేను మోపిదేవిలో పని చేస్తున్న కొత్తలో ఒక సారి ఆయనమిత్రులైన మా హెడ్మాస్టారు తూమాటి వారిని కలవటానికి వచ్చారు .మా హెచ్ ఏం నా గురించి నా ఎదుటే ఆయనకు చాలామంచిగా పొగుడుతూ చెప్పారు .ఆయన ”కోటేశ్వర రావు ! ఇది పాలపొంగు కొత్త కదా .మొదట్లో బానే పని చేసినట్టే కనిపిస్తారు .తర్వాత ఆపొంగు ఉండదు ”అన్నారు ఏమాత్రం సంకోచం లేకుండా .వెంటనే కోటేశ్వరరావు ”ఇదుగో చెబుతున్నాను చూడు .మా ప్రసాద్ గారు జీవితాంతం ఇదే నిబద్ధతతతో పని చేస్తారని గ్యారంటీ ”అన్నారు నాకు ఆశ్చర్య మేసింది నేను చేరి రెండు నెలలు కూడా దాటి ఉండదు ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్య పోయా .కానీ అదే నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది .కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నానంటే ఇదే కారణం .
  మోపిదేవిలో నేను చేరేసరికి సోషల్ మేష్టారు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు పెదప్రోలు వాసి మంచి ఆస్తిపరులు .తర్వాత కొన్ని నెలలకే ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టారై  వెళ్లిపోయారు   .కానీ కుటుంబం అక్కడే ఉంది ఆతిధ్యానికి పెద్దపేరు నన్ను లెక్కల మేష్టారు శ్రీ జమ్మలమడక రమణారావుగారినీ వారం రోజులు వారింట పెళ్లి భోజనాలవంటి సకల మర్యాదలతో మాకు ఆతిధ్యమిచ్చారు గొప్ప సంస్కారి .నలగని తెల్లని మిల్లు పంచె చొక్కా తో ,పై పంచె తో ఎర్రగా కుది మట్టంగా  ఉండేవారు చతురోక్తులతో అలరించేవారు  .తర్వాత పడమట హెడ్ మాస్టారై  మా అందరి అభ్యర్ధనతో గిల్డ్ ప్రెసిడెంట్ అయి జిల్లాలోనే ఆదర్శ హెడ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు . ఆయన చెల్లెలు తమ్ముడు మోపిదేవిలో నా శిష్యులు . పెదప్రోలు వారే శ్రీ పింగళి ఆంజనేయులు గారు  ఇక్కడినుంచే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ తో వెళ్లారు .అలాగే లెక్కలమేస్టారు బదిలీయై అవనిగడ్డకు వెళ్లిన  శ్రీ నరసింహ మూర్తిగారికి మంచి టీచర్ గా  పేరు తర్వాత హెడ్ మాష్టర్ అయ్యారు చామన చాయగా పంచ చొక్కాతో నవ్వు ముఖం తో ఉండేవారు రెండేళ్ల క్రితం మోపిదేవి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం లో వారిని చూశాను . పెదప్రోలువాసే వేమూరి  మార్కం డేయులు గారు .ముతక ఖద్దరుపంచె చొక్కాలో ఎర్రగా ఉండేవారు .నూజివీడు హై  స్కూల్ హెడ్ గా రిటరయ్యారు .ఈజీ  గోయింగ్ అనేవారు .గుర్రప్పందాల పిచ్చ ఎక్కువని చెప్పుకొనేవారు .ఉయ్యూరు కాపురం వాళ్ళబ్బాయిలు అమరనాధ్ ,అమ్మాయిలూ మాకు బాగా పరిచయం .మరికొందరి గురించి తర్వాత .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

మల్లినాథుని రఘువీర చరితం
  5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస  సంహార గాథ   వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి రాశాడు . వాళ్ళశరీరం లో బాణం దూసుకు పోవటం ,బయటికి రావటం  ఒకే సారి జరిగిపోయాయట .  .రామబాణాలు యమ దూతలు అనిపించాయట . కొందరు రాక్షసుల తలకాయలు కాళ్ళు ,అరచేతులు అడ్రస్ దొరకలేదట .త్రిశురలనూ అదే పరాక్రమంతో రాముడు సంహరించాడు రావణుడు స్వయంగావచ్చి చూసి తనబలగానికి జరిగిన నష్టం తెలుసుకొన్నడ్డు మారీచుడిని ఒకడినే రావణుడు నమ్మాడట . రాముడు అప్పటికే ఈ రాక్ష దళనాయకులను చంపేశాడు . దేవతలు ,మునులు రాముని వీరత్వాన్ని బహుధా పొగిడారు .శూర్పణఖ శత్రువులను చూసి భయపడక వారి సంహారం ఆలోచించమని చెప్పింది .రావణుడినే బంగారు లేడి రూపం లో సీత మనసును  ఆకర్షించమని  ఏదో మిషకల్పించి రామ సోదరులను సీతకు దూరం చేస్తే పని సులువౌతుందని హితవు చెప్పింది  .ఈ పన్నాగాన్ని మారీచుడు  హర్షించలేదు  శీలవతి,రామపత్ని  సీతను అపహరించటం వినాశనమని చెప్పాడు.రావణుడు లోక రావణుడు కనుక వాడి మాట పెడ  చెవిని బెట్టి తాను  చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించాడు ..అప్పుడు మారీచుడు బంగారు మచ్చల మాయలేడి వేషం ధరించి సాయంకాంతిలో ధగధగ మెరిసిపోతూ కనిపించి చూసేవారికెవరికైనా పరవశం కలిగేట్లున్నాడు .మాయలేడి వర్ణన మల్లినాథుడు 10 శ్లోకాలలో రమణీయంగా వర్ణించాడు ..లేడిని చూసిన సీత వ్యామోహం తో దాన్నితీసుకురమ్మన గానే  పట్టటానికి వెంటనే  వెళ్ళాడు .మధ్యలో  ఒక బాణాన్ని దానిపై సంధించాడు . ఆదెబ్బకు గిలగిలా తన్నుకుంటూ అది ”హా సీతా హా లక్ష్మణా ”అని మగగొంతుకతో మాయగా అరిచింది .అది రాక్షసమాయని లక్ష్మణుడికి తెలిసి ఆమె కు చెప్పినా నమ్మక తనభర్త రాముడు ప్రమాదం లో ఉన్నాడనుకొని నమ్మి అతనిని  సహాయంగా వెళ్ళమని బలవంత పెట్టింది .ఎంతకూ కదలకపోతే చాలా నీచంగా మాట్లాడింది .–”నాహం వయస్య మిహిరవ్యపాతోదినాశ్రియహ్ పావక మావి శ0త్యాహ”   ఇక ఆగలేక అతడు వెళ్ళగానే రావణుడు వచ్చి సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు  .దారిలో జటాయువు రావణ బారినుండి సీతను రక్షించే ప్రయత్నం చేశాడుకాని విఫలుడయ్యాడు   .సీత దుఃఖం తో విలపిస్తుంటే ప్రపంచమంతా దుఃఖం తో శోకం తో కన్నీళ్లతో విలపించింది అన్నాడు మల్లినాథుడు ..
  7 వ  సర్గ  లో  రామ లక్ష్మణుల దిగులు విచారం వర్ణితం  .సీతాపహరం తో రాముని వియోగ వేదన వర్ణనాతీతమై ఆమె స్మృతులను నెమరేసుకొంటూ తిరిగాడు తమ్ముడితో . .సీతా వియోగాన్ని భరించలేకఆమె ప్రతి లతా చెట్టు  పక్షి ,నెమలితో స్నేహంగా మెలిగిన దృశ్యాలను జ్ఞాపకం చేసుకొంటూ మరింత కుమిలి పోయాడు  ”అభిసంగ విహ్వలుడనైననన్ను ఎడబాసి ఉండవద్దన్నాడు మరింత గా మానసికంగా కుంగి  స్వీయనిందను  మోపుకొంటూ సీతను క్షమించమని రెండు చేతులూ ఎత్తి  నమస్కరించి ప్రార్ధించాడు రాముడు అని రాశాడు మల్లినాథుడు ..దుఃఖం లో మునిగి వివేకం కోల్పోవద్దని  లక్ష్మణుడు అన్నతో అన్నాడు . సీతాన్వేషణలో సోదరులిద్దరూ దండకారణ్యం లో అడుగడుగు వెతుకుతుకు ముందుకు వెళ్లగా అవసాన దశలో ఉన్న జటాయువు కన్పించి రావణుని సీతాపహరణాన్ని వివరించాడు .
  క్రమంగా రాముని మానసిక స్థితి మారి ఆగ్రహం తో రగిలిపోయాడు .రావణుడు సీతను ఎత్తుకు పోయి ఇంకా వాడు బతికి ఉండటం  చూసి తన విల్లు ఏమీ చేయలేక అవమానం తో వంగిపోయింది అనుకొన్నాడని మల్లినాథుని రాసిన శ్లోకం మెచ్చదగింది .భావ లోలత్వానికి గురికావద్దని తమ్ముడు చెబుతూనే ఉన్నాడు మానవ జీవితం లో సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి నిబ్బరంగా ఉండాలి .వివేకమున్నవాడు బాధపడడు  కర్తవ్యమ్ ఆలోచిస్తాడు .దైవ నిర్ణయాన్ని  శిరసా  వహించమని , విధికి ఎవరైనా తలవంచాల్సిందేనని ధైర్యం చెప్పాడు ..సీత కాలి  ఆభరణమైన కడియాలు కనిపించగానే మళ్ళీ గొల్లుమన్నాడు.  జ్ఞాపకాలలో కూరుకు పోయాడు . మళ్ళీ తమ్ముడు అన్నకు దుఃఖం కానీ సుఖం కానీ శాశ్వతం కాదు అని ”తలంటాల్సి ”వచ్చింది .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104

మేడూరు నుండి అద్దాడకు బదిలీ
 మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని పిలువబడే డా ముసునూరు వెంకటేశ్వరరావు అనే హెడ్మాష్టర్ ఇంగిలీషు లెక్చరర్ ,ప్రిన్సిపాల్ గారి మేనల్లుడు శ్రీ విష్ణుదాసు గారు తాడంకి హై స్కూల్  లో  ఇంగ్లీష్   టీచింగ్ పై ట్రెయినింగ్ క్లాస్ నిర్వహించారు ఆయనతో అదే మొదటి పరిచయం తరువాత ఆయన నూజివీడు స్కూల్ లో సోషల్ మే స్టర్ అవటం మంచి బాడ్ మింటన్ ,వాలీ బాల్  ప్లేయర్ అవటం తో గ్రిగ్ స్పోర్ట్స్ లో కలిసేవాళ్ళం .
  కానీ  గుడివాడ డివిజన్ లో శ్రీమతి ఇందీవరం గారనే ఆమె ఉపవిద్యా శాఖాధికారి గా చాలా మంచి పనులు చేస్తున్నారని ,ఎన్నో విషయాలలో ఆ డివిజన్ ను ముందుకు తీసుకు వెడుతున్నారని    సృజనకు మంచి ప్రోత్సాహమిస్తున్నారని తరచూ ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారని హెడ్మాస్టర్స్ కాన్ఫరెన్స్ లోను ,స్పాట్ వాల్యూ యేషన్    లోను తోటి హెడ్మాస్టర్లు టీచర్స్ చెప్పగా వినేవాడిని అందుకని యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆ డివిజన్ లో ఉయ్యూరుకు దగ్గర స్కూల్ కు  వెడితే బాగుంటుంది అనిపించింది .
  జులైనెలలో నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి గా ఎవరో కొత్త ఆవిడ వచ్చిందని ,ఆవిడ అదేనెలలో మేడూరు స్కూల్ ఇన్స్పెక్షన్ కు రావాలని అనుకొంటున్నారని తెలిసింది .ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ జరిగి రెండేళ్లు దాటింది .కనుక స్టాఫ్ ను సమావేశ పరచి ఇన్స్పెక్షన్ కు సిద్ధమౌదామా అని అడిగాను . ఎకాడమిక్ ఇయర్ ప్రారంభమే కనుక త్వరగా అయిపోతే అందరికీ మంచిదని అనుకున్నాం .అయిన ఖర్చు అంతా టీచర్ల జీతాల ఆధారంగా లెక్కవేసి కట్టుకోవాలని నిర్ణయించాం  లెసన్ ప్లాన చార్టులు మోడళ్ళు  అలంకరణ  వగైరాలతో సిద్ధమవమని చెప్పి గుమాస్తా శ0 కరరావు ను నూజివీడు పంపించి ఆవిడతో మా స్కూల్ స్పెక్షన్ కు సిద్ధమేనని చెప్పించాను .ఆవిడా సంతోషంగా ఒప్పుకుని షెడ్యూల్   పంపారు .డేట్స్ జ్ఞాపకం లేవు కానీ రెండు రోజుల ఇన్స్పెక్షన్ . దీనికి చుట్టు  ప్రక్కల హై స్కూల్స్ నుంచి  సబ్జెక్ట్  ఎక్సపర్ట్ లనూ వ్రాతపూర్వకం గా పిలిపించాం .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ చేయించా .సైన్స్ లో గేమ్స్ లో పనికి రాని  ఆర్టికల్స్ ను తీసెయ్యటానికి రైటాఫ్ లిస్ట్ లు తయారు  చేయించాను   వీటిని డి వై యి ఓ అంగీకరించి సర్టిఫై చేస్తేనే తొలగించాలి ఒక్కోటి మూడు కాయీలు తయారు చేయాలి
   మొదటి రాజు ఇన్స్పెక్షన్  కు ఆమె గుమాస్తా  తో సహా నూజి వీడు నుండివచ్చారు .రాగానే ఫార్మాలిటీ ప్రకారం కాఫీ టిఫిన్ ఆమెకూ గుమాస్తాకు పానెల్ మెంబర్లకు ఏర్పాటు చేయించాం అందరూ సంతృప్తిగా తిని మొదలు పెట్టారు కొబ్బరి చెట్లున్నాయికనుక ఆరగా ఆరగా కొబ్బరి బొండాలు కొట్టించితాగ్గించాం ..మధ్యాహ్న భోజనాలూ శుస్టుగా నే ఏర్పాటు చేయించాం కడుపు నిండా తిన్నారు .ఆ సగం క్లాసుల ఇన్స్పెక్షన్ అయింది . డ్రిల్లు  తో సహా అన్నీ చూశారామె .రికార్డ్ లన్నీ గుమాస్తా చూశాడు .ఆతను సరే నంటే ఆమె ఫైనల్ సంతకం పెడతారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ అకౌంట్ బుక్స్ అన్నీ చూసి రామమోహనరావు గారి విగ్రహ ప్రతిష్టాపనకు మురిసిపోయారామె .సాయంత్రం మళ్ళీ నూజి వీడు వెళ్లినట్లు గుర్తు .
  రెండవ రోజు న మిగిలిన క్లాసులు సబ్ జెక్ట్ లు చూడటం పూర్తి అయింది మర్యాదలన్నీ మామూలే  .ఆమె పేరు గుర్తులేదుకాని కొంచెం నల్లగా పట్టు చీరెలో కుదిమట్టంగా చిరునవ్వుతో ఉన్నారు క్రిస్టియన్ .పేరు మనపేరు లానే ఉన్నగుర్తు .
  రెండవ రోజు పని పూర్తి అవగానే సాయంత్రం  స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాను ఆమె సమక్షం లో .ముందుగా పానెల్ మెంబర్లు తాము టీచర్స్ విషయం లో సబ్ జెక్ట్ బోధనా విషయం లో గమనించిన విషయాలు చెప్పారు సూచనలు ఉంటె సూచించారు .చివరికి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్ అయిన ఆమె మాట్లాడుతూ స్కూల్ అన్ని విధాలా అభి వృద్ధిలో ఉందని ఇన్నిరకాల ఈవెంట్స్ తానూ పని చేసివచ్చిన ఏలూరు లోకూడా చూడలేదని హెడ్ మాస్టారు చాలా విషయాలలో ముందుండి సహచరులను నడిపిస్తున్నారని ,స్టాఫ్ సహకారం అత్యద్భుతమని ,అకౌంట్స్ చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాయని  హెడ్ మాస్టారి కృషికి జిల్లావ్యాప్తంగా గుర్తింపు వచ్చేట్లు చేస్తానని ,ఇంత మంచి స్కూల్ ను విజిట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇక ఎక్కడికి వెళ్లినా మేడూరు హై స్కూల్ ను మోడల్ గ పెట్టుకొని హెడ్ మాస్టర్లకు టీచర్లకు చెబుతానని మహా ఆనందంగా తెలిపారు చప్పట్లు మోగించారు అందరూ  ఆవిడకు శాలువా ఒక జ్ఞాపిక స్కూల్ తరఫున బహూకరించిన జ్ఞాపకం . గుమాస్తా మామూలు మామూలే . రెండురోజుల్లో ఏడాదిభారం ఒక్క సారిగా తీరి పోయినందుకు అందరూ రిలీఫ్ పొందాం .
  పామర్రులో నాతోపాటు సైన్స్ అసిస్టెంట్ గా పని చేసి కాటూరు హెడ్ మాస్టర్ గ ఉన్న పామర్రు నేటివ్ శ్రీ నందిపాటి  .వీరారెడ్డి గారు ఉయ్యూరు దగ్గర కాటూరు హెచ్ ఏం గా ఉన్నారు .అయన రోజూ పామఱ్ఱునుంచి ఉయ్యూరువచ్చి,మళ్ళీ అక్కడినుంచి బస్ లో కాటూరువెళ్ళాలి .కలిసినప్పుడల్లా కష్టంగా ఉందనే వారు .మంచి హాస్యప్రియత్వం తో ఎప్పుడూ నోట్లో క్రేన్ వక్కపొడితో ఉండేవారు .ఆయనతో మాట్లాడటం సరదా గా ఉండేది నాకు సీనియర్ . ఆయన అడ్డాడ ,అడ్డాడలో పనిచేస్తున్న వీర0 కిలాకు నేటివ్ రామారావుగారు  నేనూ ముగ్గురం ట్రయాంగిల్ లింక్ తో రిక్వెస్ట్ పెట్టుకొని  ట్రాన్స్ఫర్ అవుదామని ఒక సారి ఆలోచన వచ్చింది .అప్పటికి రెడ్డిగారికి రెండేళ్లు మాత్రమే ఉంది రిటైర్ అవటానికి .కనుక ఆయన ఈలోగా బదిలీ ఎందుకు  కాటూరులోనే హాయిగా రిటైరవుతాన్న అభి ప్రాయం చెప్పారు .కనుక ఇక కుదరదు అనుకొన్నాను .    ఆగస్టు మొదటివారం లో ఒక ఆదివారం రోజు ఉదయమే రామారావు గారు మాఇంటికి వచ్చి మేమిద్దరం మ్యూచువల్ పెట్టుకొని తాను  మేడూరుకు  నేను అద్దాడకూ బదిలీ అవుదాం ఇష్టమేనా అని అడిగారు .వెదక బోయిన తీగ కాలికే తగిలినట్లయింది .అంతే ఇక ఆలోచించకుండా సరేనని ,బదిలీ అయ్యేదాకా ఎవరికీ తెలియరాదని అత్యంత సీక్రెసీ మెయింటేన్ చేయాలని  ఈ బదిలీ నేనేమీ ప్రయత్నం చేయనని ఎవరినీ కలవనని రూపాయి కూడా చేతి చమురు వదిలించుకోనని  అన్నీ ఆయనే చేయించి ఆర్డర్ తెస్తే ఓకే అనీ చెప్పాను .అన్ని హామీలు అయ్యాక రిక్వెస్ట్ మ్యూచువల్ లెటర్ ఇచ్చాను . మేడూరు వచ్చి ఏడాదిపైన మూడు నెలలే అయింది మళ్ళీ నన్ను మార్చరుఅని లోపల ఉంది .కానీ కొ0డకు వెంట్రకకట్టాం కదా  .అయితే మంచిది అవకపోయినా మంచిదే .
  రామారావు కు జిల్లాపరిషత్ లో పలుకుబడి ఉపయోగించి మా ఇద్దరి మ్యూచువల్ ట్రాన్స్ ఫార్ ఆర్డర్ వారం రోజుల్లో వచ్చేట్లు చేశాడు . ఈ వార్త తెలిసి స్కూల్ స్టాఫ్ గగ్గోలు పెట్టింది . అంతాబాగానే ఉందిగా ఇన్ని మంచి పనులు చేసి అందరిచేతా ప్రశ0సలు పొంది ఇప్పుడు ఎవరికీ కనీసం రామమోహనరావుగారి అబ్బాయికి గారికి కూడా చెప్పకుండా వెళ్లి పోవటం ఏమిటి అన్నారు .సర్పంచ్ గారికి రామారావు గారు రావటం ఇష్టం లేదు .మీరుఊ  అంటే  నిమిషాలమీద ఆర్డర్ కాన్సిల్ చేయిస్తారు అన్నారు . ఆయన వచ్చి ఆ మాటే అన్నారు. నేను శాంతంగా ”రామారావు మేడూరుకు దగ్గర వాడు .మీ అందరికి పరిచర్యమున్నవాడు . అడ్డాడలో  ఐదారేళ్లు  పనిచేసి రోజూ  ప్రయాణం చేయలేక నన్ను అడిగితె నాకు మేడూరైనా అడ్డాడ అయినా ఒక్కటేకదా ఆయనకు కొంత ఉపశమనం కదా అని ఒప్పుకున్నాను” అని తప్పుకున్నాను . ఆర్డర్ వచ్చిన మర్నాడు సాయంత్రమే వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు .అందరూ ఆధారంగా మాట్లాడారు నా గురించి . ఇక గుడ్ బై చెప్పి వచ్చేశాను . ఇది ఆగస్టు 13 వ తేదీ అనిగుర్తు . జాయింగ్ టైం రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కు ఉండదు  .కనుక వెంటనే  అడ్డాడ లో మర్నాడు  ఉదయమే చేరాలి . సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మా ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు .  పామర్రులో సైన్స్  మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలకు అద్దాడకు ఇన్విజిలేటర్ గా వెళ్లాను .శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టారు .మంచి బిల్డింగులు లాబ్ ,ఆటస్థలం చిన్న స్కూలు . అంతకు మించి నాకు దాని గురించి తెలీదు .హెడ్మాస్టారు చాలా క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించటం బాగా గుర్తు .స్టాఫ్ ఎవరెవరున్నారో  కూడా తెలీదు .అలాంటి స్కూల్ లో చేరబోతున్నానన్నమాట . .ఏమైతే నేమి గుడివాడ డివిజన్ స్కూల్ లో పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది    ఇది నా రెండవ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్  .ఒకసారి అనుకోకుండా ఉయ్యూరునుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవల్లో మార్చారు .మాంచి వరదల భీభత్సం .బుడమేరుపొంగి బస్సులు నడవటం లేదు .  బెజవాడ వెళ్లి అక్కడినుంచి గన్నవరం వెళ్లి జాయినయ్యాను .ఒకవారం పని చేశాక నాకు ముందుపనిచేసిన కృష్ణ పామర్రు వెళ్లి ఉండలేక రిక్వెస్ట్ మ్యూచువల్ అడిగితె ఇచ్చా నేను పామర్రుకు ఆత ను గన్నవరానికి వెళ్లాం .అప్పుడూ ప్రయత్నమంతా కృష్ణదే .  దసరా సెలవల తర్వాత గట్టిగా పది రోజులు కూడా గన్నవరం లో పని చేయకుండానే నాకిష్టమైన పామర్రు వచ్చాను .     

             సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

 మల్లినాథుని స్వీయ రచనలు -1

మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం  అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి . కనుక విమర్శనా విశ్లేషణ వ్యాఖ్యానాలతో అగ్రభాగాన ఉన్న మల్లినాథుడు కవిగా కూడా సమున్నత స్థానం లో ఉన్నాడని తెలుస్తుంది ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే లభ్యమౌతున్నాయి .ఈ రెండిటిపై  సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకొందాం

     వైశ్య వంశ సుధాకరం
కాంచీపురం లో వైశ్యులకు  , వ్యాపారులకు మధ్య జరిగిన వివాదం  పరిష్కరించటానికి తన తీర్పుగా మల్లినాథ సూరి ఈ కావ్యం రాశాడు .ఈ వివాదం 1426 లో రెండవ ప్రౌఢ దేవరాయలు రాజ్య పాలన చేస్తున్న సమయం లో వచ్చింది . రాజు మల్లినాథుని ఈ సమస్యను పరిష్కరించమని కోరగా మల్లినాథుడు ఈకావ్యం రాసి తీర్పు ప్రకటించాడు కనుక మల్లినాధునికాలం దీని ఆధారంగా 1430 గా భావించారు .దురదృష్టవశాత్తు ఈ కావ్యం మొత్తంలో అతి కొద్దిభాగమే వ్రాత ప్రతిగా లభ్యమైంది .అది సరళ సంస్కృత వచనం లో తెలుగు వచనం కోవలో  రాయబడిఉంది  .”చాతుర్వర్ణ నిర్ణయా నామ దశమోధ్యాయహ్ ” అందులోని ముఖ్య సారాంశాన్ని తెలుసుకొందాం .
  ఇందులో మల్లినాథుడు వైశ్య శబ్దానికి పర్యాయపదాలు చెప్పాడు అవి నాగర ,ఉరుజ ,త్రీయ ,కోమటి . ఆయన ఉద్దేశ్యం ప్రకారం వాణి ,కోమటి వాళ్ళు వర్ణ సంక్రమణం వలన పుట్టినవారు .కనుక వాళ్ళు అన్ని నగర పట్టణాలలో వస్తువులను అమ్మటానికి అర్హత ,హక్కు కలవాళ్ళు  అమరకోశం నుంచి కొన్ని ప్రకారణాలను ఉదహరిస్తూ నాలుగు వర్ణాలవారి స్వాభావ లక్షణాలను తెలిపాడు .వైశ్య అనే పద శబ్దోత్పత్తిప్రకారం వైజాతి అంటే ద్విజాతి ,అని అర్ధం చెప్పాడు –”అత  ఏవ విజాతిత్వా స్థాపనాత్ అమరసింహా క్తా వివర్ణత్వ స్థాపనం చ ఉపపద్యతా ఏవ -తదాచ శాసనోక్త విజాతీయ శుద్ధ కన్యాయాం జనితోభయ జాతి వంశ్యహ్ వైశ్యోక్తం  విజాతీయహ్ -అమర సింహోక్త వివరణా పృథగ్ జానో వైజాతిరితిసిద్ధం ” (వైశ్య వర్ణస్య సుధాకరహ్ )   కోమటి వారు రెండు వర్ణాల సాంకర్యం వలన పుట్టారుకనుక ద్విజాతి అని పిలువబడ్డారని అందుకే వారిలో  భేదం ఏర్పడిందని చెప్పాడు.  కనుక వైజాతిఅనేది  వైశ్యాతి అయిందని అమరసింహుని అభిప్రాయం అన్నాడు –  ”ద్వై గాతి రితి జాతిద్వయ సాంకర్య  సంభవేన వైజాతి కోమటీనాం  వంశ వైశ్యోక్త  విజాతీయత్వ స్థాపనం శాసనోక్త భేదగలం స్థాపన ”
  వైశ్య ,నాగర ,వణిక,పదాలమధ్య  ఉన్న అర్ధం లో ఏకత్వాన్ని అమరకోశంలోని అనేక ప్రకారణాల నాధారంగా మల్లినాథుడు సాధించి  చెప్పాడు . మరొక విషయమూ తెలియ జేశాడు .సూటిగా చూడబడిన వస్తువు యొక్క జ్ఞాపకం, దాన్ని పరోక్షంగా జ్ఞాపకమని చెప్పినదానికంటే బలవత్తరమైనది అనే సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు  -”అనుమితి స్మృత్యపేక్షయా ప్రత్యక్ష క  స్మ్రుతి కృతే ప్రాబల్యమితి  న్యాయ సిద్ధం ”. మల్లినాథుని ఈ రచనలో సంస్కృతం తోబాటు  కొన్నిఅంటే 11,12,13 లతో బాటు 14 మొదటిభాగం  తెలుగు ప్రకారణాలుగా  కూడా ఉండటం విశేషం .మనుస్మృతి ,పద్మపురాణం  భాగవతం ,ధర్మపాల చరితం మరికొన్ని స్మృతులనుండి తన భావ స్థాపనకు బలంగా అవసరమైనవాటిని ఉటంకించాడు సూరి .
              రఘువీర చరిత మహాకావ్యం
రఘువీర చరితం అనే మహాకావ్యం రాసి మల్లినాథుడు తాను  వ్యాఖ్యాన చక్రవర్తిని మాత్రమేకాదు మహా కవిని అని రుజువు చేసుకొన్నాడు .సంస్కృత మహా కావ్యానికి ఉండవలసిన సర్వ లక్షణాలతో దీన్ని నిర్మించాడు .దీనికి మూలాధారం వాల్మీకి రామాయణమే ..ఈకావ్యం శ్రీరాముడుతండ్రికిచ్చిన మాటపై వనవాసం కోసం  దండకారణ్యం ప్రవేశించటం తో ప్రారంభమౌతుంది ..శ్రీరామ పట్టాభిషేకం తో పరిసమాప్త మౌతుంది .చివరలోపట్టాభిషేకానికి హాజరైన వారందరూ శ్రీరాముని నుండి వీడ్కోలు పొంది వెళ్ళటం ఉంది . ఈ కావ్యం 7 సర్గల కావ్యం ..మొత్తం 1 ,4,62 శ్లోకాలున్నాయి .మొదటి సర్గలో చల్లని మలయమారుతం వర్ణన ఉంది ఆశ్రమ జీవిత పవిత్రత సర్వత్రా గోచరి0చి అన్నింటిపై ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది .అరణ్య ప్రవేశంలోనే విశ్వామిత్రుడు శ్రీరాముని దయ కారుణ్య  సహన శీలాదిఉత్తమ గుణాలను ,పరశురాముని గర్వ భంగాన్ని  ప్రస్తుతిస్తాడు  .రాముని ప్రతిధర్మ  కార్యం లో నీడలా లక్ష్మణుని కృత్యమూ ఉంటుంది -.అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముని వీర విక్రమ శౌర్య పరాక్రమాలు లోకం లో ప్రతిస్థాపితమవ్వాలన్న ఆ కాంక్షను వ్యక్తం చేస్తాడు ..రాముని స్తుతించి అరణ్యవాసులైన తాపసుల పవిత్ర జీవనానికి యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగించటానికి ,వాళ్ళను ఆటంక పరచే రాక్షస ప్రమాదం నుండి రక్షించి  రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్పాడు  ..సీతారాములు మునుముందుకు సాగుతూ ఉంటారు శరభంగ మహర్షి దర్శనం చేసి సుతీక్షణ ముని ఆశ్రమం చేరి ఆశీస్సులు అందుకొంటారు ఇక్కడ ఆశ్రమవర్ణనను మహాద్భుతంగా గొప్ప శ్లోకాలలో మల్లినాధకవి చేశాడు .సుతీక్షణమహర్షి రాముని  గుణగణాలను  కులక శ్లోకాలలో బహుధా ప్రశంసించాడు  రాముడు  సాధించాల్సిన లక్ష్యాలను   మహర్షి వివరంగా ఆదేశించి తెలియజేశాడు అవి బాధితుల యెడ దయ ,కారుణ్యం ,మంచిని కాపాడటం ,,దుష్టత్వాన్ని అంతమొందించటం  అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకాన్ని కాపాడటం ,యుద్ధాలలో విజయం సాధించటం . ఇక్ష్వాకు వంశ రాజుల వ్రతాలు అంటే నియమ నిబంధనలు పాటించమని బోధించాడు-”ఆర్తనుకమ్పా సాధూనాం రక్షణం ఖలనిగ్రహః -రణేషు విజయశ్చేతి  వ్రతాని నియతానివహ్ ”
  తర్వాతి మూడు కులక శ్లోకాలలో అరణ్య స్వాభావిక శోభను ,విశ్వామిత్రుడు క్షణాలలో నిర్మించిన సుందర ఆశ్రమ వర్ణన ఉంటుంది  ..అందరూకలిసి అగస్త్యమహర్షిని సందర్శిస్తారు .మహర్షి వీరి దక్షిణంవైపు ప్రయాణంలో కనిపించే పంచవటి మొదలైన వాటి గురించి వివరిస్తాడు ..దారిలో సంపాతి ని చూసి పంచవటి చేరుతారు . ఇక్కడి ప్రకృతి  అందానికి రాముడు పరవశుడౌతాడు .ఇక్కడ గలగలా పారే గోదావరి నది పులకింతలు పెడుతుంది .గోదావరీ తీరం లో సాయం వేళ గడపటం ఏ సర్గలో ఉంటుంది. కావ్య మర్యాద ననుసరించి అనేక వర్ణనలు చేశాడు కవి మల్లినాథ సూరి .సీతారాముల శృంగార వర్ణనా గొప్పగా చేశాడు .శూర్పణఖ రాకతో ఈ  సర్గ  సమాప్తమౌతుంది  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103

                 మేడూరు ఉద్యోగం -4
రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట
 వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు . నేనూ చూశాను .రావాల్సి నంత కవళికలు రాలేదని పించింది  నాకు అంతగా నచ్చలేదు . కానీ అంతకంటే సమయం లేదు .వారి కుటుంబ సభ్యులు కూడా పెదవి విరిచారని ఉయ్యూరయ్య ఉవాచ .ఇక చేసేదేమీ లేదు . ఆవిష్కరణ జూన్ చివరివారం లో ఆయన మరణించిన నాడు అని నిర్ణయించాం . తేదీ సరిగ్గా గుర్తులేదు .నేనూ స్టాఫ్ సెక్రెటరీ మరో ఇద్దరం కలిసి రుద్రపాక వెళ్లి జిల్లా పరిషత్ చై ర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారిని కలిసి ఆహ్వానించాం తప్పక వస్తామన్నారు .సంతోషంగా తిరిగి వచ్చి ఏర్పాట్ల పై దృష్టిపెట్టాం .విగ్రహానికి సుమారు 6 అడుగుల ఎత్తు  దిమ్మ కట్టించటం ,దానికి నగిషీల పని అంతా  ఉయ్యూరయ్య చూశాడు . పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చిన జ్ఞాపకం . తెలిసిన వారందరికీ ఆహ్వానపత్రాలు పంపాము మండలం లోని అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వెళ్లాయి ఇక్కడ పని చేసి రిటరైన వారికి  వేరొక చోట పని చేస్తున్నవారికి ఎవరినీ వదిలిపెట్టకుండా పూర్వపు టీచర్స్ అటెండెన్స్ ఆధారం గా పంపాము .దాదాపు నాలుగైదు వందల మంది వస్తారని లెక్కవేశాము సర్పంచులకు మండల ప్రెసిడెంట్ లకు కూడా వెళ్లాయి ఆహ్వానాలు . వీరందరికి సాయంత్రం రాగానే టిఫిన్ టీ  ఇవ్వటం రాత్రికి డిన్నర్ కూడా ఏర్పాటు చేసిన గుర్తు . స్కూల్ అలంకరణ అంతా డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్ చూశాడు వచ్చిన వారిని ఆహ్వానించటానికి నేనూ లెక్కల ప్రసాద్ డ్రిల్ మాష్టర్  సుబ్బారావు,లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ ,ఉయ్యూరయ్య శంకరరావు లు చూసాం కమిటీలను ఏర్పరచి బాధ్యతలు అప్పగించాను ఎవరూ ఇందులో నా ప్రమేయం లేదే అనుకోకూడదని నా తలంపు .అందరూ ఇన్వాల్వ్ అయేట్లు ఏర్పాట్లు చేసాం
  ఆవిష్కరణ రోజు రానే వచ్చింది .చైర్మన్ గారు సమయానికే వచ్చారు . ఆహ్వానితులందరూ వచ్చారు రామమోహనరావు గారబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు .వారి బాబాయి కెసిపి రైతు పేరు గుర్తులేదు  ఆయనకూడా అతిధులు వేదిక నెక్కించాం వారి కుటుంబ సభ్యులనూ సగౌరవంగా ఇంటికి వెళ్లి అంతకు ముందే ఆహ్వానించాం .అందరి రాకతో విద్యార్థినీ విద్యార్థులతో ప్రాంగణం కళకళ లాడింది .విగ్రహానికి శాటిన్ కలర్ వస్త్రం తో ఆచ్చాదన (ముసుగు )విషయం డ్రాయింగ్ మాస్టారు తెరపాటు చేశాడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరింప జేయటం నా  సర్వీస్ లో ఇదే మొదటిది .ముసుగు వేయాలని డ్రాయింగ్ మాస్టర్ చెప్పేదాకా నాకు తెలియదు . అనేక మంది రిటైరైన హెడ్ మాస్టర్లు మేస్టార్లు ఆయన పై ఉన్న అభిమానంతో వచ్చారు .అందరినీ ఆహ్వానించి అల్పాహారాలు అందజేశాక సభ ప్రారంభించాం .
   చైర్మన్ గారి తో శ్రీ యలమంచిలి రామమోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించామని కోరగా వచ్చి హర్ష ధ్వానాల మధ్య  ఆవిష్కరించారు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి హారతి పట్టారు కుటుంబ సభ్యులు కూడా వారి వెనుక నిలబడ్డారు . .నా జీవితం లో ఒక గొప్ప ఘనకార్యం చేశానని సంబర పడ్డాను
 చైర్మన్ కోటేశ్వరరావు గారు రామ మోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం తన అ దృష్టం దీనికి పూనుకున్న పాఠ  శాల హెడ్ మాస్టారు అయన నాయకత్వం లో పని చేసిన ఉపాధ్యాయ బృందం అభినందనీయులు  అంటూ  తమకూ, రామ మోహనరావు గారికీ ఉన్న సుదీర్ఘ పరిచయాన్ని ఆయన నిస్వార్ధ జీవిత విశేషాలను ,త్యాగాలను పాఠశాల అభి వృద్ధికి గ్రామాభి వృద్ధికి వారి కృషినీ ప్రశంసిస్తూ వారి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు , తరువాత నేను మాట్లాడుతూ ఆవిష్కరణ పూర్వా పరాలను స్టాఫ్ సహకారాన్ని గ్రామస్తుల అభిమానుల వదాన్యతను తెలియ జేశాను ఇతర ప్రముఖులు రిటైర్ హెడ్ మాస్టర్లు అభిమాన రాజకీయ నాయకులు తక్కువ సమయం లో వారి గొప్పతనాన్ని వివరించారు . సభ తర్వాత అతిధులకు భోజనాలు ఏర్పాటు జరిగింది .చైర్మన్ గారితో సహా అందరూ భోజనం చేసి వెళ్లినట్లు జ్ఞాపకం . ఆవిష్కరణ గ్రాండ్ సక్సెస్ .
   మేడూరు గ్రామకరణం శ్రీ కిండి  శేషగిరిరావు గారు నాకు ఇక్కడ పరిచయమైనా నాటి నుంచి అన్ని విషయాలలో సహాయకారిగా ఉన్నారు ఆయన ఉయ్యూరు షబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దస్తావేజులు  రాసేవారుగా ప్రసిద్ధులు .ఊళ్ళో బ్రాహ్మణ సంఘ నాయకులు . ని చేతిలో డబ్బుతో  మంచిపనులు చాలా ఖర్చు చేసేవారు స్కూల్ ఫంక్షన్ లకు పిలిస్తే ఏదో ఒక రూపం లో విద్యార్థులకు సాయం చేసేవారు .పెద్ద ఆస్తిపరులేమీ కాదు ఎప్పుడూ తెల్ల ఖద్దరుపైజమా లాల్చీ తో   నల్లగా పొడుగ్గా భారీగా నుదుట యెర్ర కుంకుమ బొట్టుతో  నవ్వుతూ కనిపించేవారు .కార్తీకమాసం లో మామిడి తోటలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయమని స్టాఫ్ సెక్రెటరీకి తెలుగు శర్మగారికీ చెప్పగా బాగా ఏర్పాటు చేశారు .ఒక ఆదివారం జరిపాము .తర్వాత శేషగిరిరావు గారు ఏర్పాటు చేసిదానికి  బ్రాహ్మణ మేష్టర్లను ఊరిలోని బ్రాహ్మణులను పిలిచి వనసమారాధన చేస్తే ఉయ్యూరునుంచి వచ్చి పాల్గొన్నా .కానీ వీళ్లంతా పేకాటతో కాలక్షేపం చేయటం నాకు అస్సలు నచ్చలేదు . ఉయ్యూరులో మేము  విష్ణ్వాలయం లో జరిపే బ్రాహ్మణ సంఘ వన భోజనానికి శేషగిరిరావు గారు కూడా వచ్చేవారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో పని చేసేవాడు . రావుగారి భార్య మండలం లో టీచర్ .ఇల్లు పురాతన  మట్టి గోడల మండువా పెంకుటిల్లు .మా ఇంట్లోలాగానే ఎప్పుడు కూలి పోతుందో అనిపించేది .ఒకటి రెండుసార్లు  వీరింట భోజనం చేశా మంచి ఆతిధ్యమిచ్చేవారు .. నేను బదిలీ అయి ఇక్కడినుంచి వెళ్ళిపోయినా ప్రతికార్తీక వనభోజనానికి పిలిచేవారు రెండువందల రూపాయలు ఇచ్చేవాడిని . మహా పెద్దమనిషి .మర్యాదస్తులు .అంతకంటే మేడూరులో నాకెవరూ పరిచయం కాలేదు .రిటరైన ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ ప్రతి నవంబర్ లో ట్రెజరీలో ఇవ్వాలి వాళ్ళు బతికి ఉన్నట్లు గెజిటెడ్ ఆఫిసర్ సర్టిఫై చేయాలి అందుకని చాలామంది వచ్చి సంతకం పెట్టించుకునేవారు  శేషగిరిరావుగారి అమ్మాయి తమ్ముదురామారావు గారి కూతురు ఉయ్యూరు కాలేజీలో చదివేవారు .ఆతర్వాత పదేళ్లకు రామారావుగారు చనిపోయారు
      విగ్రహావిష్కరణ అవగానే బాధ్యతలు అప్పగించిన వారిని లెక్కలు పూర్తి చేసి రెడీగా ఉంచమని  స్టాఫ్ మీటింగ్ లో లెక్కలు చెప్పి అందరి సంతకాలు తీసుకోవాలని చెప్పాను .ఇదిగో అంటూ ఆలస్యం చేశారు .డబ్బు విషయం లో నేను అలసత్వాన్ని సహించను .కనుక ఒక రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆలోపల లెక్క అప్పగించాలని ఒత్తిడి తెచ్చాను .వాళ్లకు మింగుడు పడలేదు .లెక్కలెందుకండి అందరికీ తెలిసిందేకదా అన్నారు అదేమీ కుదరదు అణా  పైసలతో సహా యెంత వసూలైంది దేనికి ఎంత ఖర్చయింది పూర్తి వివరాలు చెప్పాల్సిందే అన్నాను .కొందరు గొణిగారు .ఎవరేమనుకున్నా నా పద్ధతి నాదే  దీనికి తిరుగు లేదన్నాను .అనుకొన్న రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో లెక్కలు రాయించి అందరికి చెప్పించాను . ఒకటి రెండు వేలు మిగిలినాజ్ఞాపకం .దీన్నేమి చేయాలని అడిగాను అందరూ కామన్  గుడ్ ఫండ్ కు జమ చేయమని సలహా చెప్పారు .అలాగే చేసాం అందరితో  జమాఖర్చుల పై సంతకాలు పెట్టించాను .ఇది అగ్రనాయకులు నచ్చలేదని భోగట్టా .నేను దేనికీ భయపడను .ఈ ఊరుకాకపోతే మరో ఊరు .నా కాళ్ళు ఎప్పుడూ చెప్పుల్లోనే ఉంటాయి .
  అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి ఇదివరకు రాసిందే  ఇది . నేను దీనికి ముందు మైలవరం దగ్గర చిలుకూరివారి గూడెం (పుల్లూరు )హై స్కూల్ లో పని చేస్తుండగా అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ వి హనుమంతరావు గారి బామ్మర్ది హైదరాబాద్ లో భారత్ డైనమిక్ లిమిటెడ్ లో  కెమిస్ట్ గా పని చేస్తున్న మా తమ్ముడు మోహన్ కు అటెండర్ గా ఉండేవాడు .అతడు ఎప్పుడూ మా వాడిని సార్ మీ కేదైనా సహాయం కా వాలంటే మా బావ తో చేయిస్తాననేవాడట .ఒకసారి మావాడు నీకు ట్రాన్స్ ఫర్ కావాలంటే చెప్పు హనుమంతరావు తో చేయిస్తానన్నాడు .పుల్లూరు నాకు బాగా నచ్చింది ఎన్నో మంచిపనులు అక్కడ చేశాను .కనుక అక్కడినుంచికదలా లని లేదుకమిటీ వాళ్లకూ నేనంటే  గౌరవం  ఆదరణ  ఉన్నాయి  కానీ మా వాడు అయిదారు సార్లు చెప్పాక సరే అన్నా .అనటం మావాడు వాడి అటెండర్ కు చెప్పటం వాడు హనుమంతరావు చెవిలో ఊదటం జరిగిపోయి నాకు తెలియ కుండానే హనుమంతరావు ఇచ్చిన బదిలీ రికమండేషన్ లెటర్ ఉయ్యూరు మా ఇంటికి రావటం జరిగి నేను దాన్నుచ్చుకుని చర్మన్ గారిని కలవటం .ఉయ్యూరుకాని చుట్టుపక్కలకాని వేయమని అడగటం ఉయ్యూరు తప్ప ఎక్కడా పని చేయరా మీరు అనినవ్వటం మేడూరుకు వారం లోపలే ట్రాన్స్ఫర్ అవటం జరిగిపోయాయి .కనుక ఒకరకంగా ఇష్టం తో వచ్చిన వాడినే .కానీ ముందే చెప్పినట్లు సంకుచితత్వం ఉన్న చోట ఉండలేను . అందుకని విగ్రహావిష్కరణ ఉదంతం మనసును కలత చెందించింది .సమయం కోసం ఎదురు చూస్తున్నాను
ఇక్కడ మరో విషయమూ చెప్పాలి .నా ముందు మేడూరులో పని చేసిన హెడ్ మాస్టర్ జి ఎస్ యెన్ చౌదరి నాకు బీఎడ్ ట్రెయింగ్ మేట్ హాస్టల్ మేట్ కూడా రాజమండ్రిలో .అంతకు ముందు అతని స్థానం లో నేను మానికొండకు సైన్స్ మాస్టర్ గా వెళ్ళా .ఘన చరిత్ర ఉన్నవాడు .  స్కూల్ ఫండ్స్ లో ఎక్యుములేటెడ్ ఫండ్ అని ఉంటుంది .దాని జోలికి ఎవరూ వెళ్లరాదని ఫండమెంటల్ రూల్ ఉంది .ఒక వేళ అందులో అత్యవసర సమయాల్లో తీసి ఖర్చు పెట్టాలంటే రిజల్యూ షన్  రాసి దాని కమిటీతో సంతకం చేయించి హెడ్ మాస్టర్ జిల్లాపరిషత్ కు పంపి అక్కడ ఆమోదం పొంది ఆర్డర్ వస్తేనే తీసి ఖర్చుపెట్టి మళ్ళీ దాన్ని నింపాలి .కానీ మా చౌదరి ఇవేమీ లెక్క చేయకుండా మొత్తం నాకిపారేశాడు  అదేదో సినిమాలో జూ ఏంటి ఆర్ బ్రహ్మానందం తో రమాప్రభ నయన తారలతో ”మా గురువుగారిని  కంప్లీట్ గా నాకి పారేశారన్నమాట ”అన్నట్లు నాకి పారేశాడు ..నేను వచ్చాక చూస్తే ఖాళీ .ఏమయ్యా ఉయ్యూరయ్యా ఇదేంటి అంటే ఆయన మీలాగా లెక్కలు మాతో రాయించేవాడుకాదు ఏమి జరిగిందో జరుగుతోందో మాకే  కాదు బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు అని నెమ్మదిగా చెప్పాడు .కమిటీ వాళ్ళనూ లెక్క చేసేవాడుకాడట . కమ్మవారుగా ”మూసుకు ”కూర్చున్నారు రహస్యం బయట పడకూడదని .నా దగ్గర అప్పుడుడప్పుడు సర్పంచ్ వెళ్లగక్కేవాడు అతి రహస్యం బట్టబయలు అని సామెత .తర్వాత ఇక్కడినుంచి పునాదిపాడువెళ్లి అక్కడా అంతా  నాకేసి చివరికి సస్పెండయ్యి ,ఏదో కిరికిరి చేసి బయటపడ్డాడు . ఇక్కడ నన్ను అందరూ ఆదరిస్తున్నా ఏదో  కూపం లో ఉన్నట్లు అనిపించేది కనుక నేను ఇక్కడ నుంచి అంతా మంచిగా ఉన్నప్పుడే చల్లగా జారుకొంటే మంచిది అని నిర్ణయించుకున్నాను . వెయిటింగ్ ఫర్  ఆపార్ట్యూ నిటి .
     కానీ ఇక్కడ పిల్లలకు సైకిళ్ళు పార్కింగ్ చేయటానికి చోటు లేదు .ఎక్కువమంది చుట్టూ ప్రక్కల నుంచి సైకిళ్ళ మీద వస్తారు . దీనికి పరిష్కారం ఆలోచించాలనిపించింది స్టాఫ్ మీటింగ్ లో చెప్పాను .మంచి ఆలోచన అన్నారు మరి ఫండ్స్ ఎలా ?ఉయ్యూరు కె సిపి ,రోటరీ క్లబ్ లు ఇలాంటి కార్య క్రమాలు చేయటం లో ముందు ఉంది . నేను పెనమకూరు లో సైన్స్ మేస్టారుగా ఉన్నప్పుడు హెడ్మాస్టర్ తో చెప్పి అక్కడ బోరింగ్ వేసి రక్షిత నీటి సరఫరా అవసరం చెప్పి ,కె సిపి వాళ్ళ మా ,గ్రామస్తుల సహకారం తో చేయగలిగాము అది జ్ఞాపకమొచ్చి కెసిపి తొబాగా టచ్ ఉన్న రామమోహనరావు గారి తమ్ముడిని సంప్రదించి ,అందరం కలిసి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారినీ మిగిలిన అధికారులను కలిసి మా ప్రపోజల్ ముందుపెట్టాం . వెంటనే అంగీకరించి వాళ్ళే ఖర్చు పెట్టి హెడ్మాస్టర్ గది  వెనకాల పడమటిభాగం లో గోడ వెంబడి రేకుల షెడ్ వేసి మా కోరిక తీర్చి వచ్చి ఆవిష్కరణ చేశారు . ఇదొక మైలురాయి నాకు ..అయినా వెళ్లాలనే కోరిక తగ్గలేదు
   సశేషం
      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

 వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2
  మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని  లక్షణం  ప్రజ్ఞానం కలిగివుండటమే .దీని అర్ధం ప్రజ్ఞాని ప్రజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణ సరైన ప్రజ్ఞానం కలిగిఉండటమేకాని దానికి గుర్తుకాని సంస్థకాని ఏజెన్సీ కానీ కాదు .కనుక దైవం ప్రజ్ఞాని .కొందరు దైవం ప్రజ్ఞానం కాదని దీనికి కారణం తెలుసుకొన్నవాడు దాని పరికరం ఒకటి కాదు కనుక  వైరుధ్యం ఏర్పడుతుందికనుక అంటారు  .దీన్ని ముందే ఊహించిన మల్లినాథుడు ”మన దృక్పధం నిర్దుష్టమైన  సాక్ష్యం  రుజువు సరైన జ్ఞానం తో పరి వెస్టించి ఉంటుంది కానీ దాని ప్రతినిధిపై కాదు .కనుక చెప్పబడిన ప్రకారణలో వైవిధ్యమే లేదు ”అన్నాడు .-”తద యోగ్యవ్యవ చ్చేదః -ప్రామాణ్యం గౌతమేమతే ”  మల్లినాథుడు ప్రజ్ఞాని అయినవాడు తన  స్వ  విజ్ఞానం పైనే ఆధారపడతారు కనుక సరైన విజ్ఞాన ప్రజ్ఞానాలు అన్నీ ఆయనవే .
   ఈ రెండూ వైరుధ్యాలుకావు .ప్రపంచ జ్ఞాన విషయాలలో సరైన రుజువు ఏదో ఒక ప్రతినిధిని ఆశ్రయించే ఉంటుంది .ఆధారం లేదు .కనుక వైరుధ్యమే లేదు పై వాదాన్ని ఆమోదిస్తే దైవం యొక్క అనిశ్చిత్వం సరైన జ్ఞానానికి అయిదవ మార్గం లేక సాధనమవుతుంది .దైవం మన నాలుగు రకాల అవగాహనకు లలో చేర్చటానికి కుదరదు .కారణం దైవం ప్రత్యక్ష అవగాహనవలననే తెలియ దగినవాడు .దైవం సూటి సరైన విజ్ఞానం  తోనే వ్యాపించి ఉంటాడు అన్నాడు లాల్యే పండితుడు -God is included in the category of direct perception . He is permeated by the direct valid knowledge ;”.
  వరద రాజుని  మరొక వృత్తి ప్రకరణం లో ,చర్య లేక క్రియ అది కర్మ యొక్క చర్య వలన అందులో కోరిన ఫలితం లేకపోయినా రుజువు చేయబడుతుంది అన్నాడు .-”ఇచ్చాది  జన్య ఫలాంతరస్యా భావేపి కరణవ్యాపార విషయత్వ మాత్రేణ కర్మత్వోపపత్తే”
తెలుసుకొనే స్థితిలో చర్య ఉంటుంది .దీన్ని  సూచించే గుర్తు(ఇండికేటరి  మార్క్ ) ఏది ? క్రియ అనేదాని అర్ధం పూర్తిగా దాని ధాతువు మీదనే ఆధారపడితే అప్పుడు అనిశ్చితం ఏర్పడి అది సముచ్చయం వగైరాల పై తప్పనిసరిగా ఆధార పడాల్సి వస్తుంది .చర్య స్పందన పై ఆధారపడితే ,అలా చెప్పటానికి సాక్ష్యం ఉండదు ..ఈ ప్రకారణాలలో మల్లినాథుని గతితార్కిక తర్క ప్రతిభా  సర్వస్వము, నైపుణ్యం విశ్వ రూప సందర్శనమై భాసించింది .ఈ వ్యాఖ్యానం లో మల్లినాథుడు ఇతరుల తప్పుడు  

గుర్తింపు ,పోలికలపై చాలా అసహనం ప్రదర్శించాడు .-”అయమప్యేకః కిరణావళీ గ్రంథ ఆత్మా ప్రకరణాస్య ఇతి కైశిచ్చ దుత్తుంగ తుండే రాఖ్యాతం చ తదవ్యాకరణా పరిజ్ఞాన వంచనా సాహస విలాస ఏవే త్యాస్తం  -ఇంద్రియాలింగాది జ్ఞాన కరణా వ్యాపార విషయత్వమేవ  తత్ఫల జ్ఞాన కర్మత్వా మిత్యర్ధహ్ ”    మల్లినాథుడు ప్రజ్ఞాన0  యొక్క
 కారణం ,దానిఫలితం  భావం దాని చిహ్నం ఒకటే అయినట్లుగా  ఒకటేఅవుతుంది అని భావించాడు .సరాసరి భావం లేక జ్ఞానం ను విస్మరి0చైనా దానితాలూకు చిహ్నం మిగిలే ఉంటుంది అని ఎవరైనా వాదించవచ్చు .
  మల్లినాథుడు వెళ్ళటం అనే పని ఒక గ్రామానికి చేరటానికి  ఫలితం అంటాడు సూరి . ఇచ్చిన ఉదాహరణలో ఫలితలోపం లేదు .అది జ్ఞానం, చర్యయొక్క స్థితి  దాని అర్ధం ధాతుజన్యమా?మొదటి ప్రత్యామ్నాయం లో రూపం ,ఆసాధన.విజ్ఞానం ఎన్నటికీ చర్య కానేకాదు  అడి రూపానికున్న ఒక గుణం లేక లక్షణం  -జ్ఞానం న క్రియా  గుణత్వాత్ రూప విదిత్యర్ధః  ”
 అది గుణం అనటానికి సూరి కారణం చెప్పాడు .దాని ఉనికి అశక్తత లేక నిరసన .మిగతాది అంతా దాని చర్యపై అసక్తత వగైరా .విజ్ఞానం గుణం లేక లక్షణం .ఎందుకంటె అదే ఫలితంకనుక అది అంతర్గతం గా అనంత విషయం తో సంతోషం ఆనందం లాగా  సంబంధం కలిగి ఉంటుంది . రెండవ ప్రత్యామ్నాయంగా స్పందన విషయం లో అతిక్ట్రమణ (ట్రాన్స్ గ్రేస్షన్  )లేక దుర్వినియోగం ఉన్నది .ఈ సందర్భం లో వరద రాజు ఉదయన రచన నుంచి ఒకదాన్ని ఉదహరించారు -”అనేకాన్యా దసిదేవీ —– ”(తార్కిక రక్షా )
  ఈ చిన్న వ్యాఖ్యాన గ్రంధం లో మల్లినాథుడు న్యాయ శాస్త్ర కోవిదులైన అనేక కవుల రచనలను ఉదహరించారు .అంటే ఎంతటి విస్తృత పరిశీలనం చేసి తార్కిక రక్షా కు నిష్క0టక  వ్యాఖ్య రాశాడో తెలుస్తుంది .కొన్నిటిని మాత్రం తెలుసుకొందాం –
1 అక్ష చరణాః 2-అక్షపాదః 3-అమర 4-ఆచార్య 5-ఉదయనుడు 6-కణాదుడు 7-కిరణావళికారుడు 8-ఉదయణాచార్యుడు 9-కోచిత్ 100-గురు 11-గురుమత0 12-చార్వాక 13 నైయాయిక 14-న్యాయ చార్య 15-పక్షిలా 16-పీలుపాక వాది17-ప్రభాకర 18-బుద్ధ 19-బౌద్ధ 20-భట్టపాద 21- భాట్ట 22-భాష్యకార 23-భూషణ 24-భూషా పీయ 25-మీమాంసకులు 26-మను 27-కాచస్పతి 28-వాచస్పత్య పర్య 29-వృత్తిక కారులు 30-వైశేషికాదేశీ 31-శబరుడు 32-వృద్ధ 33-శాక్య 34-శాబ్దిక 35-సాండా ఖ్య 36-గౌతమ 37-సూత్రకార మొదలైన 40 తర్క  న్యాయ శాస్త్ర గ్రంధాలను మల్లినాథుడు అవలోడనం చేసి ,సార   సంగ్రహం చేసి చిన్నపామైనా పెద్దకర్రతో కొట్టినట్లు విపుల వ్యాఖ్యానం రాశాడు ఆ మనీషకు జేజేలు  .
  ఇంతటితో మల్లినాథుని వ్యాఖ్యానాలకు సమాప్తిపలికి తర్వాత ఆయన స్వ0త     రచనల ను  వాటి వైశిష్ట్యాలను తెలుసుకొందాం .
   సశేషం
    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

Inline image 1  Inline image 2

49 NERS                                       BONNIE E CONE

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం

వీక్లీ  అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్  వారం

                  8-5-17నుండి 14-5-17 వరకు
 ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ బుక్ లో పద్మశ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంతకు ముందు రోజు డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు పలకరించారు .మైనేని గారుపంపిన వెనిగళ్ల కోమలగారి అనువాద రచన ”కాళరాత్రి ”చేరింది ..రెండుపూటలా నడక .సాయంత్రం మా అమ్మాయి ఆఫీసు నుంచి వచ్చేసరికి భోజనాలు చేసి సిద్ధంగా ఉంటె” బలి” కి తీసుకు వెళ్ళింది హాలు అరగంట ప్రయాణ దూరం .టికెట్ పెద్దవాళ్లకు 17, పిల్లలకు 11 డాలర్లు .మొత్తం 75 బొక్క .నాకు ఒక్క అంగుళం కూడా నచ్చలేదు .రొయ్యలమీసాల నాజర్ ను చూస్తే డోకు వచ్చింది .ప్రభాస్ డైలాగ్ పల్లెటూరి బైతు మాటలాగా చాలా రఫ్ గా ఉంది . బాగ్రౌండ్ సంగీతం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది .  సంగీతం పాటలూ అసలు నచ్చలేదు . రాణా  శెభాష్ అనిపించాడు . ఈ కధకు అన్నికోట్లు కుమ్మరించటం పరమ దండగ . దీనికంటే శాతకర్ణి వెయ్యి రె ట్లు ,పూర్వపు శోభన్ బాబు ”వీరాభిమన్యు ”పదివేల రేట్లు నయం సినిమా నుంచిరాగానే ఒక కవిత గీకాను  –”డబ్బు -టైము  -బుర్ర-మనసు -విశ్రాంతి -వినోదం -వివేకం -విచక్షణ -విజ్ఞానం -సెల్యులాయిడ్ ఇలా” బహు ”బలి-బాహు బలి . ఇది నా  అభిప్రాయం .చూసేవాళ్ళనీ కనకవర్షం కురిపించేవారినీ ఏమీ అనలేను .ఒక్కటి మాత్రం నిజం అసలు ఏమీ లేని కథను అంత భారీ ఖర్చుతో తీసి రెట్టింపు పైగా డబ్బు 15 00 కోట్లు పిండటం రాజమౌళి వ్యాపార దక్షతకు నిదర్శనం
  మనవళ్లు స్కూల్ ట్రిప్ లో మంగళవారం కొలంబియా వెళ్లి సాయంత్రానికి వచ్చారు . మధ్యాహ్నం ఏమీ తోచక ”మీ గొట్టం”-యూ ట్యూబ్ తిరగేస్తుంటే ఆకెళ్ళ రాసి డైరెక్ట్ చేసిన పద్యనాటకం ”అల్లసాని పెద్దన ”కనిపిస్తే పెట్టాను అద్భుతం అని పించింది .”బలికి బలైన” మనసు ఆనంద తాండవమే చేసింది మనసంతా ఆర్ద్రత తో నిండిపోయింది  పర్గెషన్ అంటారే అది జరిగి తేలికపడింది బుర్ర  హాయిగా ఊపిరి పీల్చుకున్నాను . తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశాను .చాలాహుందాగా ,నిజాయితీగా వినయం గా ఆత్మ విశ్వాసం గా చెప్పారాయన .బెజవాడ బుక్ ఎక్సిబిషన్ లో ఈ జనవరి 10 తేదీ సాయంత్రం రచయితలతో సమావేశం ఉందని తప్పక రమ్మని నాకు శ్రీ పూర్ణ చాంద్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను .అక్కడే మొదటి సారిగా ఆకెళ్ళ ను చూశాను తనను గురించిన పరిచయం లో ఆయన బాగా తనను ఆవిష్కరించుకొన్నారు .తన కదా నవల నాటక సినీ సాహిత్య కృషిని 15 నిమిషాలలో చెప్పేశారు .నేనూ తర్వాత నా గురించి చెప్పాను . మా ఇద్దరితోపాటు మరో పాతిక మందికి మాట్లాడే అవకాశానిచ్చి ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ డి విజయభాస్కర్ బుక్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ బాబ్జీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గుత్తికొండ  సుబ్బారావు డా జి వి పూర్ణ చ0ద్ మొదలైన పెద్దల సమక్షం లో సన్మానం చేశారు . ఇవన్నీ గుర్తుకు వచ్చాయి .
  కోమలగారు ఇంగిలీషు లో రాసుకున్న ”మై లైఫ్ ”పుస్తకాన్ని పంపిస్తున్నట్లు గోపాలకృష్ణ గారి నుంచి మెయిల్ వచ్చింది మర్నాడే అందింది . బుధవారం సాయంత్రం గుంటూరు కు చెందిన రిటైర్డ్ పశువుల డాక్టర్ శ్రీ తాళ్ళూరి వెంకట ,పుట్టపర్తి  నివాసి ,బిల్డర్ శ్రీ సూరపనేని నారాయణప్ప గార్లు ఇంటికి వచ్చారు శతకత్రయం ఇద్దరికీ ఇచ్చాను .తరచూ కలుసుకొందామనుకొన్నాం .
  గురువారం కిరణ్ ప్రభ  ఆకేళ్లతో  తో చేసిన ఇంటర్వ్యూ ఆమని ఇంటర్వ్యూ చూసాం .రమణ ,చరణ్ ,భవానిగారు మంకు శ్రీను గార్లతో ఫోన్ లో మాట్లాడాము
12-వ తేదీ శుక్రవారం మా పెద్దమనవడు చి సంకల్ప్ అంటే  మా పెద్దబ్బాయిశాస్త్రి కొడుకు ఎంఎస్ .కోర్స్ పూర్తయిన సందర్భంగా షార్లెట్ యూని వర్సిటీ  లో జరిగిన గ్రాడ్యుయేషన్ కు మేమిద్దరం మా అమ్మాయి వెళ్లాం . సుమారు 45 నిమిషాల ప్రయాణం .మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు ప్రారంభమైంది .ముందు  బాండ్  వాయిద్యం తర్వాత ఛాన్సలర్ ఫిలిప్ ఎల్ డూబోస్  ప్రసంగం ,తర్వాత బోర్డు ఆఫ్ ట్రస్టీ మాటలు ,దానివెనుక కొంతమంది ప్రముఖుల ఉపన్యాసాలు జరిగాయి ..హామిల్టన్  సెంటర్ హాల్ లో లో జరిగిన ఈ జరిమానికి వేలాది తలిదండ్రులు గాలరీలనిండా కూర్చుని నుంచొని వీక్షించారు వారందరి ఆనందం  వర్ణనాతీతము .ముందుగా డాక్టరేట్ లకు మెడలో పతకంవేసి  సర్టిఫికెట్ ఇచ్చారు . ఆతర్వాత ఏం ఎస్ వాళ్లకు వరుసగా షేక్ హాండ్ లతో సరిపుచ్చారు .ఆతర్వాత బాచెలర్స్ కు .ఇదంతా రెండుంబావు గంటలలో అత్యంత క్రమశిక్షణతో వేడుకగా జరిగింది ..మా మనవడు సంకల్ప్ ”డేటా సైన్స్ అండ్ బిజినెస్ ఎనలిటిక్స్ ”లో ఏం ఎస్ చేశాడిక్కడ  మా అమ్మాయి వాళ్ళున్న షార్లెట్ లోని యూ ని వర్సిటీ ఆఫ్ షార్లెట్ లో సీట్ వస్తే డిసెంబరు26 న  2015   హైదరాబాద్ నుంచి  బయల్దేరి వచ్చి ఇందులో చేరాడు .సుమారు ఒకటిన్నర ఏడాది చదువుతో పూర్తయింది కోర్స్ చివరి పరీక్ష ఈ నెల 10 న జరిగింది .అదికూడా పాసయ్యాక సర్టిఫికెట్ ఇస్తారు .మనకు డిగ్రీ పాసయ్యాక  కాంవో కేషన్ జరిపి సర్టిఫికెట్ ఇవ్వటం అలవాటు    మనకు భిన్నం ఇది . ఏం ఎస్ ఇక్కడ చేసిన వారిలో ఆంద్ర ప్ప్రదేశ్ కు చెందినవాళ్లు మా వాడితో సహా దాదాపు 25 మంది ఉన్నారు
   మా అల్లుడు ఫ్లారిడాలోని నోవా యూని వర్సిటీ నుండి ఆన్ లైన్ ఏం ఎస్ చేశాడు   మేము మొదటిసారి2002 లో  అమెరికాకు టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా పెద్ద మనవడుఅంటే అమ్మాయి పెద్దకొడుకు శ్రీకేత్ పుట్టిన మూడు నెలలకు వచ్చాము అప్పుడు  మా అల్లుడి ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ కోసం మేమిద్దరం మా అమ్మాయి అల్లుడు మనవడు హూస్టన్ నుంచి ఫ్లయిట్ లో లాడర్ డేల్  కు వెళ్లి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకొని మర్నాడు జరిగిన గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్నాం .మియామీలో డాల్ఫీన్ సర్కస్ చూసాం . ఇలా అల్లుడి ,మనవాడి గ్రాడ్యుయేషన్ లలో పాల్గొనే అవకాశం వచ్చి ఆనందంగా ఉంది మాకు .
  .ఇప్పుడు ఈ యూని వర్సిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం . 1000 ఎకరాల విస్తీర్ణం లో ఇది వ్యాపించి ఉంది .అన్ని కోర్సులూ ఉన్నాయి రైల్వే స్టేషన్ కూడా కాంపస్ లోకి వచ్చింది .జూన్ లో ప్రారంభమవుతుంది .ఈ  వర్సిటీ   కి
’49 ERS”అనే నిక్ నేమ్  అనే మారు పేరుంది .దీనికి కారణం 1949 సంవత్సరం యొక్క ప్రాధాన్యమే .ఒకప్పుడు ఆఫ్ -కాంపస్ గా ప్రారంభమైన యూని  వర్సిటీ 1949  లో మూత పడి మరణం చెంది ఉండాల్సింది అప్పుడు” బొన్నే  కోన్ ”అనే వితరణ శీలి  ఆమె బృందమూకలిసి నార్త్ కరోలీనా లెజిస్లేచర్ ను షార్లెట్ లో ఉన్నత విద్యలకోసం శాశ్వత  వ్యవస్థ ఉండాలని చెప్పి ఒప్పించి దాని ఆమోదంతో షార్లెట్ కాలేజీని 1949 లో స్థాపించారు ..అంతేకాకుండా ఈ యూని  వర్సిటీ 49 నంబరు హైవే మీద ఉండటం మరో ప్రాముఖ్యమైన విషయం ..అంతే కాదు అమెరికాలోని నార్త్ కరోలీనాలోని షార్లెట్ లో బంగారు గనులు బాగా ఉన్నాయి .కాలిఫోర్నియాలో ”గోల్డ్ రష్”కంటే ముందే ఇక్కడ బంగారు గనుల త్రవ్వకం జరిగింది .ఇవన్నీ కలిసి వచ్చేట్లుగా యూని వర్సిటీ కాంపస్ లో” కాటో  కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్” , అండ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్లాజ”ప్రాంగణం లో కూర్చుని పళ్లెం లో బంగారు రజను ను నీటితో శుద్ధి చేస్తున్నట్లున్న ఒక బంగారు గని కార్మికుని బ్రాన్జ్ విగ్రహాన్నిఏర్పాటు చేశారు .ఇది ఈ ప్రాంతం  గోల్డ్ మైనింగ్  సెంటర్ అనే చారిత్రిక సత్యాన్ని ,అదీకాక  ,1949 సంవత్సరం  ఈ యూనివర్సిటీ   అభివృద్ధిని నాటకీయంగా  మలుపు తిప్పిన సంవత్సరమని గుర్తు చేస్తుంది .ఆ స్టాథ్యూ లో జీవకళ ఉట్టిపడుతుంది . దీని ఫోటో కింద జమ చేశాను చూడండి  .యూని వర్సిటీ చరిత్రను ఇంతగా మలుపుతిప్పిన బొన్నీ  కోన్ అనే మహిళా మాణిక్యం గురించి తెలుసుకోకపోతే చరిత్ర క్షమించదు .
  బొన్నీ ఇ .కోన్ 1907 లో లో జన్మించింది  1946 నుంచి ఈ యూనివర్సిటీ సంస్థాపకురాలు.ఇక్కడే టీచర్ గా పని చేసి ,1947 లో షార్లెట్ సెంటర్ ఆఫ్ ది  యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా కు డైరెక్టర్ అయి0ది . ఈ సంస్థ మూతపడి చనిపోయే స్థితిలో ఉంటె కోన్ లెజిస్లేచర్ ను ఒప్పించి 1949 లో షార్లెట్ కాలేజీ స్థాపనతో  జీవింపజేసి  దానికి ప్రెసిడెంట్ గా ఉన్నది . 1963 లో రాష్ట్ర ప్రభుత్వ ఆసరాతో  1963లో 4 ఏళ్ళు వికసించింది . 1965   లో కాలేజీని యూని వర్సిటీ స్థాయికి తీసుకురావటానికి తీవ్రం గా కృషి చేసి సఫలమనోరధురాలైంది కోన్ ..అప్పుడామె స్తూడెంట్ ఎఫైర్స్ కు వైస్ ఛాన్సలర్ గా సేవ ప్రారంభించి రిటైర్ అయ్యేదాకా ఉంది 8-3-2003 న బొన్నీ కోన్ శాశ్వతయోగా ఈ లోకానికి దూరమైంది .తనజీవితాన్ని త్యాగం చేసి ప్రాణం పోసి ప్రాణాధికంగా ఆరాధించిన  యూనివర్సిటీ కాంపస్ లో 2004 స్ప్రింగ్ లో కోన్  భౌతిక శరీరాన్ని ఖననం చేశారు . కానీ ఆమె ఆత్మ ఈ  యూని వర్సిటీ లో నే పరిభ్రమిస్తూ వివిధ సంక్షేమకార్యక్రమాలను అభి వృద్ధినీ చూస్తూ సంతృప్తి చెందుతూ ఉంటుందని భావిస్తారు
  ఈ యూనివర్సిటీ మొదటి చాన్సలర్ డీన్ డబ్ల్యు కొల్వర్డ్ . 1966 లో ఈ పదవిలో చేరి 12  ఏళ్ళు పనిచేసి ఇందులో అనేక కాలేజీలు హాస్టళ్లు ,కట్టించి గ్రాడ్యుయేట్ వర్క్ ప్రారంభించి దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేశాడు ఆయన కృషితోనే యూనివర్సిటీ రీసెర్చ్ పార్క్ ,యూనివర్సిటీ అర్బన్ ఇన్ ష్టి ట్యూట్ లు ఏర్పడి అర్బన్ వాతావరణమున్న షార్లెట్ విద్యార్థులకు బహుముఖాలుగా తోడ్పడ్డాయి ..ఈయన 1913 లో జన్మించి 2007 లో మరణించాడు.
  ప్రాస్తుతం ఛాన్సలర్ ఫిలిప్ ఎల్. డుబోయిస్
  శనివారం సాయంత్రం కాకినాడ వాసి  రిటైర్డ్ ఎస్ బి ఐ .ఉద్యోగి పుట్టపర్తి ప్రస్తుత నివాసి శ్రీ అప్పారావుగారు మా ఇంటికి వచ్చారు .ఆయన పూర్తిగా సత్యసాయి భక్తులు . అక్కడే సేవలో గడుపుతారు మన శతకాలిచ్చాను మా అమ్మాయికి బాగా పరిచయం  ఆయన్ను కారులో వారి అబ్బాయి ఇంట్లో దింపివచ్చాము . .మా మనవడు చి హర్షకు 20015 ఆగస్టు లో యాక్సిడెంట్ అయిందని తెలిసి మా అమ్మాయి ఉండ లేక ఆగలేక  ఆగమేఘాలమీద మర్నాడే  బాయల్దేరి ఇండియావచ్చి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఆయన కాకినాడ నుంచి ఫోన్ చేశారట మా అమ్మాయికి .ఆయన మనసు మంచిది గొప్ప సాయి భక్తులు కనుక  సెంటిమెంట్ గా ఫీలయి మా హర్షకు ఏమీ కాదు గండ0  నుంచి బయట పడతాడు అని గట్టిగా నమ్మానని  చెప్పింది చెపుతుందిఎప్పుడూ .
  మా అమ్మాయి గొల్లపూడికాలం చూడమని చెబితే కొన్ని చూశా చాలా బాగా ఉన్నాయి .ఆయనలాగా విషయాన్ని  కరెంట్ టాపిక్  ను అంత అర్ధవంతంగా సుత్తిలేకుండా సూటిగా నిష్పక్షపాతంగా చెప్పే వాడు లేదని నా నమ్మకం ఆయన హావ భావాలు  ఊగటాలు స్ట్రెస్సులు ,ఊనికలు ఒత్తి చెప్పటాలు నాకు భలే ఇష్టం .ఆకెళ్ళ గొల్లపూడి గురించి నేను చూసినవి మైనేనిగారిని చూడమని రాస్తే చూసి చాలా ఎంజాయ్ చేశానని రాశారు . . రాత్రి చంద్ర మోహన్ ఇంటర్వ్యూ చూసాం నిష్పక్షపాతంగా చెప్పాడు .
  14 ఆదివారం ఉదయం మల్లినాథ 40 రాశా .మధ్యాహ్నం  సంగీత గురువు శ్రీ రామాచారి గారి ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లో చూశా.అద్భుతం .ఆయన ఎంత ఉదారంగా స్వచ్చంద సేవ చేస్తున్నారో తెలిస్తే చలించి పోతాం అందరూ కూడాల్సిందే  మధ్యాహ్నం” కాళ రాత్రి ”చదివేశాను బాగుంది . ఇదొక్కటే ఈవారం చదివిన పుస్తకం ..మరిన్ని విషయాలు వచ్చే వీక్లీ  లో .
ఫోటోలు జత చేశాను చూడండి
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

  తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2
సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ ”ప్రమా” లో  వ్యాప్తి చెంది ఉన్నవే అన్నాడు మల్లినాథుడు ..ప్రమేయం నిర్వచనం విషయం లో అతి అనువర్తనం (అప్లికేషన్ )ను పరిహరించటానికి నిర్వచనం లో సాధన అనేపదం తప్పక ఉండాలి అన్నాడు  .ఇది సత్య సమర్ధనంగా ఆమోదయోగ్యం గా ఉన్నది .ఇదికాక మల్లినాథుడు మరింత ముందుకు వెళ్లి  మరొక తాజా చర్చను తెచ్చాడు ..ఇదీ చాలా ఆమోదయోగ్యంగానే ఉంది .-”ప్రమాణామావి సంవాదిజ్ఞానమర్ధం క్రియాస్తితిహ్ (తార్కిక రక్ష)   .వరద రాజు బౌద్ధుల అభిప్రాయాలను ముందుంచుతూ ,”అవిసంవాది ”  ని  అది అనుమాన ప్రమాణం తో సాధింపబడదు అని వ్యతిరేకించాడు ..బౌద్ధుల ఆలోచన ప్రకారం ప్రతిదీ అనిశ్చితంగా వికల్పమే ,అనుమితి కారణాలైన వాటితో సహా.వికల్పం అనేదితప్పనిసరిగా విషంవాది  అవుతుంది కనుక అనుమానం అనుకొనే ప్రశ్నే లేదు .ఈ  సందర్భం లో ల మల్లినాథుడు ”ఉదయనుడు”రాసిన దాన్ని   ఆధారంగా చూపించాడు -”కిమ్ చేత్యం ప్రలపతో బౌద్ధస్య మూర్ధని భగవతాపి -వృద్ధేన దుర్ధర్షే మహానయం వజ్రపాతః కృత ఇత్యాహ ”(తార్కిక రక్ష)ప్రభాకరుడు   చెప్పిన ప్రమాణం అనేది అనుభూతి అన్నదాన్ని వరద రాజు ఆక్షేపించారు .ఇందులో అసంగత్వం లేక అస్థిరత ఉందన్నాడు .వాళ్ళు వేద విజ్ఞానాన్నిచెల్లుబాటయ్యేది అని  అంగీకరించారుకాని  ప్రమాణ విషయం లో స్మృతిని దూరంగా పెట్టారు .ఇక్కడే మల్లినాథుని వ్యాఖ్య మహా ఆసక్తికరంగా ఉంటుంది -తదే  తత్తర గాది రూఠస్య తురగావిస్మరణం యద్ వేదప్రమాణాన్య సాధనే ప్రవృత్తస్య మీమాంస గురో స్తస్మాద్ ఇతి ”.ఒక్కోసారి వరద రాజు కొన్నిటిని ఆమోదించాడు . ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద, క్రమం ఏర్పరచటం లో సరైన తార్కిక సమర్ధన చేయలేక పోయాడు .కానీ మల్లినాథుడు వీటి వరుసక్రమాన్ని చాలా చక్కగా సమర్ధించి చూపాడు -”తత్ర సర్వ ప్రమాణోప జీవ్యత్వాత్ ప్రత్యక్షస్య ప్రాధామ్యం తదితర ప్రమాణో ప జీ వ్యత్వాత్ ప్రత్యక్ష నా0తర్దమనుమానస్య పృథక్ప్రమావ్యదాఠర్య సూచనార్ధ ముపమానస్య శబ్దాత్ ప్రాధామ్యే  పరిశేషా చ్ఛబ్ద స్యాంతే  నివేశ ఇతి ”(తార్కిక రక్ష )
  మల్లినాథుని మరికొన్ని వాదాలు తెలుసుకొందాం -మల్లినాథుడు”నను ఈశ్వరస్య కృతః ప్రమాణాని ”మొదలైన వాటిపై  మరొక ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు .దైవ0  సరైన జ్ఞాన పరివ్యాప్తుడు అని ఎలా చెప్పగలం ? అయన గురించిన జ్ఞానం ఉత్పత్తి కాదు ,కారణం అది ఫలితం  ప్రయోజనం కాదు ..కనుక జ్ఞాన పరివ్యాప్తుడుకాదు .ఈ విషయంపై వాదం లేవదీస్తూ రచయిత ప్రమాణం కు నిర్వచనం చెప్పాడు ”మితిహ్ సమ్యక్ పరీచ్ఛా త్తిరితి ” .అర్ధవంతమైన జ్ఞానం సరైన నిశ్చయం ..అది ఫలితం కాకపోయినా  దైవజ్ఞానము అనేది సరైన ఖచ్చితమైన  జ్ఞానమే కారణం అది ఖచ్చితమైన అనుభవం కనుక
   సశేషం
    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొల్లపూడి

గొల్లపూడి

అమెరికా వచ్చి నెలదాటినా యూ ట్యూబ్ లో కామెడీ సీన్లు ,ఫన్   బకెట్ లు తప్ప పెద్దగా రాత్రిపూట చూసినవేవీ లేవు . ”బలి ”కి బలైన మర్నాడు ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ చూస్తుండగా  ఒక్కసారిగా  దృష్టి  వేరేవాటిపై పడితే ఆకెళ్ళ రాసి దర్శకత్వం చేసిన ”అల్లసానిపెద్దన”పద్యనాటకం కంటబడి వెంటనే చూశా .చాలా అద్భుతమనిపించి ”బలి ” పాల బడిన నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది  మనసు  ఆనంద  తాండవమే చేసింది .తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశా .ఆయనలో ఎంత నిజాయితీ నిక్కచ్చితనం ఉందో  అర్ధమయింది . ఆయన శ్రీనాధ నాటకం కోసం వెతికా దొరకలేదు . మొన్నరాత్రి మా అమ్మాయి గొల్లపూడి ఇంటర్వ్యూ చూశావా అని అడిగింది .చూడలేదన్నాను చూడమంది . ఉయ్యూరులో ఉండగా ఎప్పుడూ ఇలాంటి వాటి జోలికి పోలేదు .రాత  ,చదువు తో సరిపోయేది . మా అబ్బాయి రమణ గొల్లపూడి కాలం పెట్టి వినేవాడు ఏదో ఒకటి రెండు సార్లు అటూ ఇటూ  వెడుతూ విన్నానేమోకాని పెద్దగా దృష్టిపెట్టలేదు .
అయితే మారుతీరావు తో సుమారు ఏడెనిమిదేళ్లు గా పరిచయం ఉంది .ఆయన రచనలు నటన  నాకూ మా శ్రీమతికి బాగా ఇష్టం . ఆయన ”రోమన్ హాలిడే” కథా  సంపుటి నాకు పిచ్చపిచ్చగా నచ్చి సుమారు 15 ఏళ్ళక్రితం 45 పేజీల వ్యాసం రాశాను నాకోసమే . తర్వాత మద్రాస్ లో ఉండే మా బంధువు శ్రీ నోరి రామకృష్ణయ్య గారితో పరిచయం వలన ఫోన్ సంభాషణలవల్లా ఆయన మారుతీ రావు తనకు మార్కింగ్ వాక్ మేట్ అని రోజూ కలుస్తామని చెప్పేవారు .నేను  రాసిన ఈ వ్యాసాన్ని ఫోటోస్టాట్ తీసి రామకృష్ణయ్యగారికి పోస్ట్ లో పంపించి ఆయనకు నచ్చితే మారుతీ రావు కు ఇమ్మని రాశా .ఆయన  చదివి బాగా నచ్చిందని గొల్లపూడి ఇచ్చానని ఆయన చదివి చాలా సంతోషించాడని ఫోన్ లో చెప్పి , మారుతీరావ్ ఫోన్ చేసి నాతో మాట్లాడు తాడు అని చెప్పారు .అన్నట్లే ఒక రోజు ఉదయమే గొల్లపూడి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా నాతో మా శ్రీమతితో మాట్లాడాడు . అందరికీ గర్వంగా చెప్పుకున్నాం .తర్వాత నేను ఆ స్క్రిప్ట్ ను  సరసభారతి బ్లాగ్ లో రాశా . ఆయన దాన్ని సి డి చేయించి పంపమంటే పంపాను .నా మెయిల్స్ కూడా పంపేవాడిని అప్పుడప్పుడు సమాధానం రాసేవాడు సరస భారతి పుస్తకాలు ప్రచురించటం ప్రారంభించాక రామ కృష్ణయ్యగారితో మరోకాపీ ని గొల్లపూడి ఇమ్మని నా సంతకం తో పంపేవాడిని ఆయన జాగ్రత్తగా అన్నీ అంద  జేసినట్లు ఫోన్ చేసేవారు .  తర్వాత రావు విశాఖ కు మకాం మార్చినట్లు కృష్ణయ్యగారు చెప్పారు అక్కడికే పుస్తకం ఆవిష్కరణ అవగానే పంపేవాడిని .
  బహుశా 2015 మార్చి లో ననుకొంటా మారుతీరావు ఒక సాయంత్రం ఫోన్ చేసి ”నిన్ననే మద్రాస్ లో   రామకృష్ణయ్య గారితో  మాట్లాడి ఇవాళ హైదరాబాద్ వచ్చాను ఎందుకో మీతో మాట్లాడాలని పించింది అందుకని చేశాను .అని పదినిమిషాలు ఆత్మీయంగా మాట్లాడారు . ఆ వారం లో జరిగిన సరసభారతి ఉగాది వేడుకలలో ఈ విషయం సభా ముఖంగా అందరికీ తెలియ జేసి గర్వపడ్డాను . కానీ నామనసులో ”మారుతీరావు కు  మనం ఇన్నిపుస్తకాలు ఆయన చదవాలని ఆత్మీయంగా పంపామే .ఆయన మర్యాదకైనా కనీసం ఒక్కటి కూడా తన  పుస్తకం నాకు పంపలేదే ”అని బాధ గా ఉండేది . ఇది పొసెసివ్ నెసో ,స్వార్థమో సంకచితభావమో ఆకాంక్షో  కోరికో ఆశో  అత్యాశో  చెప్పలేను . ఒక ఉగాదికి ఆయన్ను పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా ,ఉగాదిపురస్కార ప్రదానం తీసుకోవలసిందిగా ఫోన్ చేశా మెయిల్స్ కూడా రాశా .వస్తానని చెప్పారు .కానీ చివరికి కొత్త సినిమా ఒప్పుకున్నందువలన రాలేనని రాశారు . బెజవాడలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సమావేశం లోనూ అంతకు ముందు ఒకటి రెండు సభల్లోనూ కలిశాను ఫోటోలు పంపమంటే పంపాను కూడా .
   కానీ సుమారు రెండేళ్లక్రితం వరకు ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారెవరో నాకు తెలియదు .ఒక రోజు కొరియర్ లో ఆరేడు పుస్తకాలు వారి నుంచి నాకు వచ్చాయి .వాటిలోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారితో ”నా అడ్రస్ మీకు ఎలా దొరికింది నాకు ఇన్ని పుస్తకాలు ఎందుకు పంపారు ?”అని అడిగా సాహితీ ప్రియులెవరో  తెలుసుకోవటం నా కు ఇష్టం .మీ అడ్రస్ సంపాదించి పుస్తకాలు పంపాను చదివి అభిప్రాయం రాయండి ”అన్నారు .ఆ సౌజన్యానికి కరిగిపోయాయి వెంటనే చదివి ఫోన్ లో వారికి నా అభిప్రాయం తెలియజేసి సరసభారతి అప్పటిదాకా ప్రచురించిన పుస్తకాలన్నీ కొరియర్ లో పంపాను అందినట్లు ఫోన్ చేసి అభినందించారు .ఇలా మా ఇద్దరిమధ్యా ఫోన్ భాషణం కొనసాగింది అప్పటినుంచి నేనూ గీర్వాణకవుల కవితా గీర్వాణం రెండు భాగాలు కొలచల సీతారామయ్య గారిపై పుస్తకం వగైరాలు పంపాను .  సంస్కృత కవులపై నేను చేస్తున్న కృషిని మెచ్చుకొంటూ మాట్లాడారు . దానిపై ప్రముఖ విశాఖ సాహితీ పత్రిక”ప్రసన్నభారతి ” లో వ్యాసం కూడా రాశారు .న్యాయంగా ఆయన ముందు నావి హనుమంతుని ముందు  కుప్పి గంతులు ..అమెరికా వచ్చేముందు మార్చి 15 న నేనూ మా శ్రీమతి మనవడు చరణ్ విశాఖవెళ్లి డా శ్రీ రాచకొండ నరసింహ శర్మగారిని శ్రీమతిగారిని చూసి  సాయంత్రం వేదుల వారిని చూద్దామని అనుకొంటుండగా వారే ఫోన్ చేసి తప్పక రమ్మని చెప్పగా వెళ్లి సందర్శించాం . ఆయన మా ఇద్దర్నీ చూసి పులకించిపోయారు .మేము ఆదంపతులకు సన్మానం చేద్దామని నూతనవస్త్రాలు శాలువాలు తీసుకు వెడితే వారు ”మీరు మాఅతిధులు .ముందు మీకు మేము సన్మానం చేస్తాం .తర్వాతే మీరు ”అని నన్ను ఆపి తామిద్దరూ మా ఇద్దరికీ నూతనవస్త్రాలు శాలువా కప్పి సత్కారం చేసిన సంస్కారం వారిది .తర్వాత మేమూ చేసాం శాస్త్రిగారి టేబుల్ పై నా గీర్వాణం రెండుభాగాలు ముచ్చటైన అట్టలతో దర్శనమిచ్చాయి .వారు నాతో ”మీ పుస్తకాలలో విష్యం మీరు రాసిన తీరు బ్రహ్మానందంగా నచ్చాయి వాటిలో రోజుకు ఒకటైనా చదవకుండా ఉండలేక పోతున్నాను .అంత రీడబిలిటీ ఉంది మిగతావాళ్లూరాస్తే దీన్నే కీకారణ్యం చేసేవారు మీరు మహా గొప్పగా మనసుకు హత్తుకునేలా సరదాగా చదువుకోనివిషయం   తెలుసుకునేలా రీసెర్చ్ చేసేవారికిరిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి మీ కృషి బహు  గొప్పది మీ రెండో పుస్తకం కోసం వేయికళ్లతో ఎదురు చూశా .అన్నారు .   అక్కడే విశాఖ సాహితీ సంస్థ నిర్వాహకులు శ్రీ ఏం ఎస్ ఆర్ ప్రసాద్ గారు ఇంకొకరు కలిశారు .  వీరుకూడా తమ ప్రచురణలు 6 పుస్తకాలు నాకు ఇచ్చారు .అందులో  శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రీ గారిపై శ్రీమతి చర్ల సుశీలమ్మగారిపై  పుస్తకం  ఆమె కుమార్తె నిడదవోలు మహిళాశ్రమం నడిపే చర్ల సరళ గారి  రచనలు ఉన్నాయి .శ్రీపాద ,సుశీలగార్లపై వెంటనే వ్యాసాలూ నెట్ లో రాశాను  నిడదవోలు ఆవిడతోఫాన్ చేసిమాట్లాడాను ఆమె  యెంతో  సంతోషించారు ఉయ్యూరు రావాలనికొరగా వస్తానన్నారు ఆమెకూ సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను  ఇవన్నీ చూస్తుంటే మారుతీరావు నాకు పుస్తక0 ఒక్కటి కూడా పంపనందుకు మనసు  తొలిచేస్తున్నట్లుంది .. గతం గతః
  నిన్న మధ్యాహ్నం ” యూ ట్యూబ్ లో మారుతీ రావు కాలం పెట్టి విన్నా .ఈ పూటా విన్నా .అద్భుతం అనిపించాయి .బాలమురళి కృష్ణ సంగీత కచేరీ చేస్తూ ఎంత ఆనందిస్తూ మనల్ని ఆనందింప జేస్తారో మారుతీరావు కూడా అంతే ఫీలింగ్ తో ,హావభావాలతో చక్కని రిపిటీషన్ లతో ,నొక్కి చెప్పటం తో గత వర్తమాన భవిష్యత్తులు తరచటం లో  ఇంగ్లీష్  ను  కూడా అవసరమైన చోట వాడటం లో తెలుగులోకంటే ఇంగిలీషు లో ఇంకా బలంగా చెప్పటం లో తెలుగు భాషకు ప్రాణం పోయటం లో భారతీయ సంసంస్కృతికి పట్టం కట్టటం లో  పాశ్చాత్త్య  నాటకాల పోకడలను ఆదరణను వ్యక్తీకరించి మననాటకాలు వృద్ధి లోకి రావటానికి చేయాల్సిన ప్రణాళిక వివరణలో  పెద్దల యెడ విధేయతను వ్యక్తం చేయటం లో ,సమకాలీన రాజకీయ డొల్లతనాన్ని  ఏకి  పారేయటం లో నచ్చినదాన్ని నిష్పక్షపాతంగా  మెచ్చటం  లో తెలుగు కధకులను కధలను ఛానల్ ద్వారా వివరించి ప్రాణ ప్రతిష్ట చేయటం లో మారుతీ రావు కు సరిపోలిన వారు లేరు .కథ , నాటకం వ్యాసం విమర్శ నవల సినీ సంభాషణలు స్క్రీన్ ప్లే  నాటక రచన నటనా సినీనటన లలో ఆయన స్థాయి అందుకొనగలవారు లేరు . విషయవివరణలో ఆయన ముందుకూ వెనక్కూ వెడుతూ అతి సూటిగా శ్రోతల ప్రేక్షకుల గుండెలను తాకేట్లు చేసే స్వీయ  వ్యక్తిత్వం ప్రతిభా గొల్లపూడిది . ఆయన కాలం బ్రహ్మం గారి నేటి  కాల జ్ఞానం అని పిస్తుందినాకు .
   మా గోపాలకృష్ణగారికి ఈ కాలం ,ఆకెళ్ళ నాటకం ఇంట్రవ్యూ చూడమని  రాస్తే  చూసి పరమానంద భరితులయ్యానని రాశారు..
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39
   వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1
కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు తెలుసు .ఇప్పడు ఆయన న్యాయ లేక తర్క శాస్త్ర పాండితీ గరిమను తరచి చూద్దాం .దీనిలో ఆయనప్రతిభ తార్కిక రక్ష పై రాసిన వ్యాఖ్యానం వలన స్పష్టమవుతుంది .దీన్ని రాసిన వాడు వరద రాజకవి .ఈ కవి 12  లేక 14 వశతాబ్ది మధ్యకాలం వాడు ..యితడు ఆంద్ర కవి అని ”హిస్టరీ ఆఫ్  సాంస్క్రిట్ లిటరేచర్ ”రాసిన విద్యాభూషణుడు పేర్కొన్నాడు .కొందరుమాత్రం కాశ్మీర దేశస్తుడు అన్నారు . ఏ  వాడైతేనేమి అతడు  తార్కిక రక్ష రాశాడనేది నిర్వివాదం . దీనికి ఆయనే ”సార సంగ్రహ ”అనే వ్యాఖ్యానమూ రాశాడు .ఈ రెండిటిపై మల్లినాథుడు ”నిష్క0టక ”అనే వ్యాఖ్యానం రచించాడు .   వరద రాజకవి భట్టోజి శిష్యుడు .భట్టోజి రాసిన ”సిద్ధాంత కౌముది ;;ని మధ్య  సిద్ధాంత కౌముది ,లఘు సిదాంత కౌముది అనే రెండు సంక్షిప్త గ్రంధాలుగా చేశాడు .”వ్యవహార నిర్ణయం” అనేదికూడా రాశాడని అంటారు . 18 వ శతాబ్దికి చెందిన మరో వరద రాజకవి ”వ్యవహార మాల ”రాశాడని కానే పండితుడు చెప్పాడు .
   మల్లినాథుని నిష్కంటక లో 1- వర్గాలు 2-చెల్లుబాటయ్యే తార్కికం 3-8 నిర్వచనాలతో సూటి అవగాహన లేక జ్ఞానం అని మూడు భాగాలున్నాయి ..మల్లినాధుడు అనుమాన ప్రమాణం లేక అనుమితి ,ఉపాధి లను పూర్తిగా చర్చించాడు భట్ట వాదాలకు చెందిన వాటిని మల్లినాథుడు త్రోసిపుచ్చాడు ..ప్రభాకరుని ”అభావాన్ని కూడా తిరస్కరించాడు .న్యాయ సూత్రాలు రాసిన గౌతముని మార్గం లో సూరి ప్రయాణించాడు దానిపైనే ఆధారపడ్డాడు .”హేత్వాభాస ”వంటి కొన్ని అవాస్తవాలు లేక భ్రమలను ఉన్నవాటికి అదనంగా సూరి కలిపాడుకూడా.అయితే దురదృష్ట వశాత్తు మల్లినాథుని పూర్తి వ్యాఖ్యానం లభ్యం కాలేదు .మొదటి అధ్యాయాన్ని మాత్రమే విపి  ద్వివేది ప్రచురించాడు ..తార్కిక రక్ష పై వ్యాఖ్యానిస్తూనే మల్లినాథుడు తర్కం పై భూషణ ,న్యాయ కుసుమాంజలి టీక ప్రభాకర ,శా లికనాధ ,శ్లోక వార్తికాకర ,తథాగత ,ఉదయన మొదలైన ఇతరులు రాసిన లేక ఇతర  గ్రంథాలనుండి    అవసరమైనవాటిని  కూడా పేర్కొన్నాడు ..అదనపు వివరణలు ఇచ్చినా సూరి, మూల గ్రంధానికి పరిమితమై మాత్రమే రాశాడు   .ఈ విషయం పై ప్రసిద్ధ పరిశోధకుడు ప్రొఫెసర్ ఇ .ఆర్ .శ్రీకంఠ శర్మ విలువైన వ్యాసం రాశాడు అందులోని కొన్ని విషయాలను లాల్యే  తెలియ జేశాడు .
   వ్యాకరణ వివరణలను మల్లినాథుడు ”షోడశ పదార్ధ ‘ 16  విషయాలపై ఇచ్చాడు వీటిని వరద రాజుకూడా చెప్పాడు .వీటికి ఒక ప్రత్యేక వరుస క్రమాన్ని మల్లినాథుడు తెలియ జేయటం విశేషం -అదే ”ప్రమాణం వినా ప్రమేయాది సిద్ధే -విషయ  వినా ప్రమాణ ప్రవృత్తే -అసందిగ్ధస్య ప్రతి ఇత్సవాత్ -సందిగ్ధస్యాపి నిష్ప్రయోజనం అప్రతి పితిస్త్స త్వాత్ ప్రతిపత్తేశ్చదృష్టాంత ముఖత్వాత్ -అవయవాది నియమస్య సిద్ధదాం తాను సరిత్వాత్ -ప్రమాణ కరణా శరీర నిర్వర్తకాంగేత్వాత్  ప్రమాణానుగ్రాహకత్వాత్ –

తత్ఫల త్వాత్ -తస్యాపి కదా సాధ్యత్వే వాదస్య -తత్వ నిర్ణేయ ఫాలేత్వాత్ ”(తార్కిక రక్ష కారిక పై సూరి వ్యాఖ్య )

 ప్రమాణ0  పై వరద రాజునిర్వచన వివరణలో మల్లినాథుని విధానం సంక్షిప్తంగా అతి స్పష్టంగా అర్ధవంతంగా ఉంది -”సాధనాశ్రయాయో రణ్యతరత్వే  సతి ప్రామాణ్యత్వాత్ ”.ఆశ్రయ పదం ఆవ్యాప్తిని నిర్వచనంలో తొలగించి0ది .దైవం సాధనకాకాపోయినా ప్రమాణమే ”ప్రమా ”  అంటే విఙ్నానానికి అది పునాది (సబ్  స్ట్రాంటం). వరద రాజు

సాధన అవసరం లేదని దీనికి కారణం ప్రమాణాన్ని ప్రభావితం చేయటానికి ఉన్న వ్యాప్యత్వం వలన ప్రమేయం తొలగింపబడ లేనిదని అన్నాడు ..సాధనను సమర్ధిస్తూ ప్రమేయం ఉంటేనే సుఖ దుఃఖాలుంటాయన్నాడు వీటి నిర్వచనాలను ప్రయోగించటానికి సాధన శబ్దం నిర్వచనం లో ఒక భాగమై వివరిస్తుంది అంటాడు.
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా    .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

 

 

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

  Inline image 1
వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం  నుండి 9-30 గం  వరకు 5 రోజులు నా 55 వ శ్రీ సుదరకాండ పారాయణ ,నిత్యం శ్రీ సువర్చలా0జనేయస్వామి వారలకు అష్టోత్తర సహస్రనామ పూజ  శ్రీ సువర్చలాన్జనేయ శతక పఠన0  నిర్వహింప బడుతుంది .
 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి  నాడు  ఉదయం 9-30 నుండి 11గం  వరకు మంత్ర సహిత  ,తంత్ర రహితంగా సంకల్ప  భూశుద్ధి ,విష్వక్సేనారాధన ,పుణ్యాహ ,బ్రహ్మాద్యస్ట దిక్పాలక  ,నవగ్రహ పూజ ,రక్షాబంధన  ,కన్యావరణ మధుపర్క ,మంగళాష్టక ,చూర్ణికా ,మహా సంకల్ప ,ప్రవర అక్షతారోపణ లతో శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి వారల శాంతికళ్యాణం మా దంపతులచే నిర్వహింపబడుతుంది ,
                       గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -షార్లెట్ -అమెరికా 

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెద్దమనవడుచి సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ ఫోటోలు -షార్లెట్ యూని వర్సిటి -12-5-17

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

అమెరికా పూల ఆనందం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

మల్లినాథ సూరి మనీష -38

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38

 పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )
 వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర  సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా  జుహోతి ”లో పెరుగులు  అనే అర్ధం మరొక చోటు నుండి పొందాల్సి ఉంటుంది .అది పునరుక్తి అవుతుంది అది పెరుగు కు త్యాగానికి అసాధ్యమైన సంబంధమవుతుంది ఇదే తాత్పర్యం తనభావానికి మద్దతుగా మల్లినాథుడు రుయ్యకుని భావాన్ని తెలియబరచాడు -”పదార్ధ వాగమసమనంతర భావినీ సమన్వయ శిక్త స్తాత్పర్యం ”ఇక్కడ సమన్వయ అనే మాట చాలా ముఖ్యమైనది .అంటే వేరే  భావం వచ్చే అవకాశముంది కనుక ..తాత్పర్యం సాధారణంగా అర్ధవంతమై సూచనగా ఉండాలి .
 కనుక అలంకారాలలో తాత్పర్యం ప్రధాన భూమిక వహిస్తుంది .ఈ కీలక భావాన్నే మల్లినాథుడు చాలా విస్పష్టంగా తెలియ బరచాడు .అలాగే ”ఉపచార”అనే పదం అలంకారశాస్త్రం లో తరచుగా వాడబడే పదం పి .వి .Kane  పండితుడు ఉపచారా పదానికి చాలా అర్ధాలు చెప్పాడు ..ఉపచారను రూపకం గా భావించాడు .కారణం ఇది రెండు వస్తువులు విభిన్నంగా ఉండి సాధారణం గా అనుమానాన్ని మరుగు పరచి అసామాన్య పోలికను బలపరుస్తుందికనుక .kaneపండితుడు ఈ భావాన్నే మిగిలిన అలంకారికులు కూడా ఉపయోగించారని చెప్పాడు ..కానీ ”తరళ ”వ్యాఖ్యానం లో మల్లినాథుడు మరింత చిన్న నిర్వచనాన్ని ”ఉపచార ”కు ఇచ్చాడు -”అత త్వస్య తత్వేనవ్యపదేశహ ”-”భిన్నత్వేన  ప్రతీయ మానయోరేవే యారోపణమూపచారః ”న్యాయ వార్తికలో ఇవ్వబడినదానికి ఈ నిర్వచనం అతి దగ్గరలో ఉంది .”.వీటన్నిటిని బట్టి చూస్తే విద్యాధరుని ”ఏకావలి ”అనే కంఠాభరణం  మల్లినాథుని తరళ వ్యాఖ్య అనే మెరుగు చేత మరింత ప్రకాశించింది అని స్పష్టం గా  చెప్పవచ్చు ”అన్నాడుడా  పి జి..లాల్యే   పండితుడు .
  ఇంతటితో  విద్యాధరుని  ఏకావలి కి మల్లినాథ సూరి వ్రాసిన తరళ  వ్యాఖ్యానం పై వివరణ పూర్తయింది .
  తరువాత వరద రాజపండితుడు రాసిన ”తర్క రక్ష”కు మల్లినాథ సూరి రాసిన ”నిష్క0టక ”వ్యాఖ్యాన విషయాలను తెలుసు కొందాం .
 సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102

             మేడూరులో ఉద్యోగం -3
సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి పరిచయాలుండటం తో పంపిన బిల్లులు కావాల్సిన ఆర్దర్లు త్వరగా సాంక్షనై  వచ్చేవి ..ఇద్దరు ముగ్గురు లెక్కలమేస్టార్లు బదిలీ అయి కొత్తవారు చేరుతుండటం తో ఇబ్బందిగా ఉండేది పదవతరగతి పిల్లల్ని పరీక్షకు తయారు చేయటం లో లెక్కల ప్రసాద్ బాధ్యత ఎక్కువయ్యింది అయినా చాలా సమర్ధంగా చేశాడు . లైబ్రరీ పై అంతస్తులో ఉండేది .చాలాపుస్తకాలు ఇక్కడే చదివాను . దానికి అనుబంధంగా హాలు ఉండేది .ఎవరైనా మేష్టారు సెలవు పెడితే ఎక్స్ట్రా వర్క్ గా పిల్లల్ని లై బ్రరీకి పంపి పుస్తకాలు మేగజైన్లు చదివించేవాళ్ళం .ఇది నేను రాకముందు నుంచే ఉంది . డ్రాయింగ్ మాస్టర్ కాటూరి ప్రసాద్ కాటూరు వాడు మాతో పాటే ఉయ్యూరు నుంచి వచ్చేవాడు మంచి ఆర్ట్ ఉన్నది. మరో మొహంజదారో నాటకం ,అక్కినేని ఆదుర్తి తీసిన ఆర్ట్ సినిమాలు సుడిగుండాలు ,మరోప్రపంచం  లకు సంభాషణా రచయిత మోదుకూరి జాన్సన్ దగ్గర పని చేసినవాడు పాటలు రాసేవాడు బాగా పాడేవాడు .జాన్సన్ తో తన అనుభవాలు చెప్పేవాడు ..ఈయనను ఎలా బాగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను  .లైబ్రరీహాల్ లో గోడలమీద మంచి సూక్తులు ,పద్యాలు రాయించటం తో మొదలుపెట్టి భారత దేశం మాప్ వేయించి ,సైన్స్  రూమ్ లో మానవ శరీర బాగాలు  పీరియాడిక్ టేబుల్ వేయించి అతని కళను సద్వినియోగం చేయించాను ..
  ప్రతి సెక్షన్ వాళ్ళూ ఒక జాతీయ నాయకుని ఫోటో తమక్లాసు రూమ్ లో స్వంత   ఖర్చులతో క్లాస్ టీచర్ల సహకారం తో పెట్టించాను .సైన్స్ రూమ్ లో సైన్టిస్ట్ ల ఫోటోలు ,ట్యూబ్ లైట్ల అమరిక చేయించాను ..పెద్ద బావికి మోటారు ఉండేది ఆ నీరు కొబ్బరి చెట్లకు పారించటం ,గార్డెన్ లో కూరగాయలు పండించటం అవి వేలం వేసి డబ్బు జమ చేయటం ఉయ్యూరయ్యే చేసేవాడు . కొబ్బరి చెట్ల  పోషణ బాధ్యతా అతనిదే .స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లను ఘనంగా నిర్వ హించేవాళ్ళం .ఆడపిల్లలు ఎక్కువమందిఉన్నా పాటలు పాడేవాళ్లు ఉండేవారుకాదు . పమిడిముక్కలలోడా కృష్ణారావు గారు మేడూరు వారే .ఆయన అక్కడ ఒక కాన్వెంట్ నడిపేవారు భార్య ప్రిన్సిపాల్. ఆయన్ను ఫంక్షన్ లకు పిలిస్తే వచ్చేవారు ..సంస్కారమున్న మనిషి .తెలుగు దేశం పార్టీలో పెద్ద లీడర్ కూడా . పమిడిముక్కల నుండి వచ్చే డ్రిల్ మాస్టారు రిటైరయ్యారు  ఆ సందర్భం గా స్టాఫ్ ఆయనకు సన్మానం చేసి వీడ్కోలు సభ నిర్వహించాము ఆయన ఆటలలో బాగా ఆడినవారికి బహుమతులు ఇవ్వటానికి కొంత డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ కు ఇచ్చారు .ఈ వ్యవహారం తెలుగు మేష్టారు చూసేవాడు . డ్రిల్ మాస్టారు చాలా సంతోషంగా మా అందరికీ పెద్ద పార్టీ కూడా ఇచ్చారు ..మేడూరులో ఎల్ ఐసీ ఏజెంట్ ఒకాయన ఉండేవాడు మంచివాడు చిన్నతరగతులకు ట్యూషన్ చెప్పేవాడు .మేడూరు పోస్ట్ మాస్టారు బాగా సహకరించేవాడు . అప్పుడు పబ్లిక్ పరీక్ష  ఆన్సర్ పేపర్లు పోస్టాఫీస్ ద్వారా ఎవరికి అంటే ఏ సెంటర్ కి పంపమంటే ఆ సెంటర్ కు పంపేవాళ్ళం ఇక్కడ పోస్ట్ మధ్యాహ్నం 2 కు క్లోజ్ .ఈ లోపల బండిల్ తయారుకాకపోతే మర్నాడు పోస్టులో పంపేవాడు ..నాకు అనుమానం వచ్చేది . నేను అక్కడినుంచి వచ్చాక డబ్బు బాగా తినేశాడని ఆరోపణవచ్చి ,రుజువై సస్పెండ య్యాడు .అతనికొడుకు అప్పుడు బడిలో చదివే వాడు తర్వాత అనేక ఉద్యోగాలు చేసి ప్రస్తుతం బెజవాడ  వన్ టౌన్ పోస్టాఫీజు లో పని చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు
      వార్షికోత్సవం జరపటానికి అన్నితరగతులవారికి వక్తృత్వ వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించాం .ప్రతి క్లాసులో ఎక్కువ శాతం హాజరున్న వారికీ ,సంచాయికలో ఎక్కువ డబ్బు పొదుపు చేసినవారికి  పైతరగతులలో  క్రింది తరగతులలో   మంచి క్రమశిక్షణతో మెలగినవారికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇచ్చాము ఆటలు క్రీడలలో పోటీలు పెట్టి జూనియర్స్ ,సీనియర్స్ కు వేరుగా ,అలానే ఉపాధ్యాయుల మధ్య బాడ్ మింటన్ వాలీ బాల్ పోటీలు పెట్టి వారికీ బహుమతులు ఇచ్చాము .క్రీడా విషయాలన్నీ డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారే చూసేవాడు .వార్షి కోత్సవానికి మేడూరు వాసి రేడియోలో పాడీ  పంట నిర్వాహకులు యలమంచిలి హనుమంతరావు గారిని ఆహ్వానించాం ..వారు స్ఫూర్తి  దాయక ప్రసంగం చేశారు .ఎందరో దాతలు ఫిక్సెడ్ డిపాజిట్లు చేశారు ..ఆ  వడ్డీ  డబ్బులు బాంక్ నుంచి తీసి ఎవరికోసం నిర్దేశింప బడిందో వార్షికోత్సవం రోజున అంద  జేయటం అలవాటు అలానే చేసాం .ప్రతి తరగతిలో  ఫస్ట్  సెకండ్ థర్డ్  వచ్చినవారికి మంచి విలువైన పుస్తకాలు కొని బహూకరించాం
   పద వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర కోస్తున్నాయి .హయగ్రీవం గారు హెడ్ మాస్టర్ గా ఉండగా ఉయ్యూరునుంచి మేము వాచర్లుగా వచ్చాము .అంతా యమా డి ప్లిన్ గా కనిపించేది .కానీ కాపీలు తెగ కొట్టేవాళ్ళు .ఎప్పుడూ వీళ్ళ పాస్  శాతం 80పైన ఉండేది నేను డేగ చూపుతో అన్నీ కనిపెట్టి లాగేసి అక్రమం జరక్కుండా చూశాను నా రూమ్ లో కానీ అందరూ అలా ఉండరు . ఆ ఏడు కఠినంగా మేస్టార్లు అందరం  ఒకే మాటమీద ఉండటం తో శాతం 50 కి పడిపోయింది .వాపు తప్ప బలుపుకాదు ఇప్పుడు  నేనే పరీక్ష నిర్వహించాలి .కనుక అతి జాగ్రత్తగా ఉన్నాను .శంకర రావు ను కూడా లైన్ లో పెట్టాల్సి వచ్చింది . ఇక్కడికి ఆగినపర్రు విద్యార్థులు కూడా వచ్చి పరీక్ష రాశారు .ఆ మేస్టార్లు వాచర్లుగా వచ్చారు వారిని మేడూరు పిల్లలున్న రూమ్ లకు వేయాలి అందులో ఒక సైన్స్ మేష్టారు బాగా ట్యూషన్లు చెప్పేవాడు .ఆయన చాలా లూజుగా ఉన్నట్లు మొదటి రోజే గమనించి అత్య0త  జాగ్రత్తగా ఉండి”  రేకాడ ”కుండా చేశాను పరీక్ష హాలులోకి ప్రవేశించేముందే అందర్నీ పూర్తిగా చెక్ చేసి పంపేవాళ్ళం నేనూ డిపార్ట్ మెంట్ ఆఫీసరూ అయినా ”ఎక్కడో ”దాచి దొరికి పోయేవారు .ఆ ఏడాది ఏం ఆర్ ఓ కూడా విజిటింగ్ కు వచ్చేవాడు డిపార్ట్ మెంట్ వాళ్ళుకాక .చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు . రెండుమూడుసార్లు విజిట్ కు వచ్చాడు నాకు సంతోషంగా ఉండేది .పరీక్షలన్నీ బాగానే జరిగాయి అనుకొన్నసమయం లో చివరి పరీక్ష సోషల్ -2 లో యెంత జాగ్రత్తపడ్డా ఒక మేడూరు కుర్రాడే కాపీ తీసి పట్టుబడి సస్పెన్డ్ అయ్యాడు .నెత్తీ నోరూ కొట్టుకుంటూనే ఉన్నా0 అందరం .ఇదొక లోపం తప్ప అంతా  సవ్యంగా జరిగింది   ,
  అలాగే ఏడవతరగతి పరీక్షలూ నిష్పక్షపాతంగా జరిపాను . ఇలా కఠినంగా ఉండటం సర్పంచ్ కి ఇష్టం లేదన్నట్లు వార్తలు విన్నాను ఎవరికోసమో పనిచేయం కదా మన ఆత్మా తృప్తికే డ్యూటీ . మేడూరు లో పని చేస్తుండగానే మా పెద్దబ్బాయి శాస్త్రికి చి సౌ ములగలేటి   సమతకు వివాహం జరిగింది .ఆ అమ్మాయి మా ఇంటికి పెద్దకోడలు .చలాకీ గా ఉండేది అలాంటి అమ్మాయి కోడలుగా రావాలని అనుకొన్నాం .అలాగే ఆ అమ్మాయి చాలా బాధ్యతగా ఉంటుంది అన్నివిషయాలలో . మేడూరు స్టాఫ్ అందరూ బెజవాడ వచ్చారు పెళ్ళికి . ఇక్కడ ఉండగానే మ్యూజిక్ వాల్ క్లాక్ కొన్నాం బెజవాడ వెళ్లి . హెడ్ మాస్టార్ల లిస్ట్ ఉన్న బోర్డు లు ,ఏడు ,పది  పాస్    శాతం  ఫాస్ట్ వచ్చిన వారిపేర్లు రాయించాను .స్కూల్ యెట్ ఏ గ్లాన్స్ కూడా
    మేడూరి రామమోహనరావు గారు అనే యలమంచిలి రామమోహన రావు  గారు బాడీనిర్మాత వితరణ శీలి  జూన్ నాటికి మరణించి సంవత్సరం అవుతోందని ,ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలని స్టాఫ్ లో ఆలోచన వచ్చింది .బాగుంది అని ముందు స్టాఫ్ మెంబర్లు చందాలు వేసుకొని మిగిలినవారి వద్ద వసూలు చేయాలని నిర్ణయించాను నేను వెయ్యి నూట పదహార్లు వేశాను ,అలాగే జీతం బట్టి లేక వారిష్టం ప్రకారం చందాలు వేశారు . దీనికి రసీదు పుస్తకాలు వేయించాం .సర్పంచ్ వగైరాలూ బాగా సహకరించాం .అయితే విగ్రహం తయారు చేసేదెవరు అనేది ప్రశ్న అయింది ఎవరికీ ఏమీ తెలియదన్నారు .అప్పుడు తెనాలిలో అక్కలమంగయ్య అనే ఆయన కొడుకు బాగా చేస్తాడని ఒక సారి వెళ్లి కనుక్కోమని చెప్పాను దీనికి సుబ్బారావు లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ స్టాఫ్ సెక్రెటరీలకు బాధ్యత అప్పగించాం వాళ్ళు వెళ్ళిమాట్లాడి చేస్తానని అనగానే అడ్వాంస్ ఇచ్చారు . కొంత షేప్ వచ్చాక మళ్ళీ చూసి రమ్మని పంపాము బాగా నే వచ్చింది అన్నారు ఫోటోలు తీయించి వారి కుటుంబ సభ్యులకు చూపించి వారి ఆమోదమూ పొందాం .మేడూరులో పని చేసి వెళ్లినవారందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు పంపాము అందులో ఆయనపై అభిమానం ఉన్నవారందరూ డబ్బులు పంపారు కంచు విగ్రహం చాలా ఖరీదు అని భావించి బస్ట్ సైజు తో తేలిక విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము .విగ్రహం జూన్ 10 నాటికి అందజేయాలని చెప్పాం సరేనన్నాడు శిల్పి .
         సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా 

—

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు

ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక  ఆయనలోని సునిశిత  , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ  వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ  ,పారదర్శకత వ్యాఖ్యానం లో  ప్రస్ఫు ట మై అబ్బురపడతాం .వ్యాకరణ సిద్ధాంతాలపై ఆయనకున్న ప్రస్ఫు ట అవగాహనకు ఆశ్చర్య పడతాం
  తరళ  వ్యాఖ్యానం లో అతి సూక్ష్మ కీలక భావనలను ఆయన అతి సునాయాసం గా అత్యంత స్పష్టంగా వివరించాడు .క్రియ యొక్క ప్రాముఖ్యత ఒక పదం లోలేక సమ్మేళనం లో ముఖ్యంగా కానీ గౌణంగాకాని కానీ సహాయకారిగా ఉంటె  క్రియను సంభావించని లోపం వలన అది ప్రాముఖ్యత చెందుతుంది దీన్నే అవిధేయతా విదేయాంశ అన్నాడు .తద్ధితాలలో లోకూడా ఇలాంటి లోపమే ఉంటుంది .దీనికి ఆపవాదు  ఉదాహరణ ఇస్తూ ,క్రియ యొక్క ప్రధాన స్వభావం కొన్ని విభక్తులలో లోపం కాదు నరసింహ భారతి లో భారతి యొక్క ప్రాధాన్యత తద్ధితమైన నరసింహ వలన తగ్గలేదు అని చెప్పాడు .-”నరసింహీ భారతీత్యుక్తే నరసింహ సంబంధ భారతీ పరత్వం ప్రతీయతే న తు నరసింహ పరత్వం ప్రకృత్యార్ధ ప్రాధాన్యక్కారేణ ప్రత్యయేన్ స్వార్ధ ప్రాధాన్య ప్రకాశనా దిత్యర్ధహ్ ”
  మల్లినాథుడు మరో ఉదాహరణ  ఇచ్చాడు .వైశ్వ దేవిక్  ఆమీక్షా ” అంటే పెరుగు మజ్జిగ మిశ్రమం   వైశ్వ దేవికి  నైవేద్యం అని అర్ధం .ఇక్కడ ఆమీక్ష అనేది ఒక ప్రత్యేక పదార్ధం దేవునికి నైవేద్యగా తయారు చేయటం .ఇది తద్ధితమైన అన్  ను వైశ్వ దేవి ని బలీయం చేసింది -నరసింహ భారతి లో భారతి నరసింహ శబ్దానికి సమందించి నట్లుగా . దీన్ని మల్లినాథుడు ఇలా వివరించాడు -”విభక్తిరహి ప్రతిపాడుకాదుత్పన్నా తదర్థస్య విశేషతః సామాన్యతో వా సంబంధం బోధయ0 తీ న తస్య విధేయస్య ప్రాధాన్యం తాత్పర్య విషయతారూప0 తిరోధతే -తద్ధితస్తు తస్యేదామితి  తత్సంబంధ న్య ర్ధాంతరే విహితస్యే వ  ప్రాధాన్యం గమయనన్  ప్రకృత్యార్ధ ప్రాధాన్యం వ్యాహన్తీ త్వన్యాయ వ్యతిరేకా భ్యామ వగమ్యత ఇత్యర్ధహ్ ”
  మూలానికి   విభక్తి తగిలిస్తే అది దానికి సామాన్యంగా కానీ ప్రత్యేకంగా కానీ సంబందాన్నిస్తుంది   తాత్పర్యం లో భేదం రాదు తద్ధితమ్ కనుక తస్య ఇదం తో కలిస్తే ప్రాధానమైనదాని  ప్రత్యేకత తెలుపుతుంది .ఇవి దన్తమ్కు రుణాత్మక చర్చలద్వారా సాధించాలి నరసింహ భారతిలో భారతి ప్రధానమై నరసింహకు విశేశార్ధాన్నిచ్చింది దీన్ని మల్లినాథుని వృత్తి లో స్పష్టంగా వివరించాడు -”అక్లాండం ముఖం చంద్ర ఇతి ప్రయోగే శబ్దాదన్య దాత్వేపి విశేష్య ముఖ చంద్ర గతోక్త ర్ష హేతు త్వె న తద్ది శేషణ యో  సకలంకత్వా కళంకాన్వయో ర్వి ధేయత్వాత్  ప్రాధాన్యం తాత్పర్య విషయత్వ రూపం వివేప్యయో రముఖ చంద్రయో నృ దామన్యో రప్రదాన్యం చార్యా సిధ్య నృవాద  సమ ర్య రూపాదవగమ్యతా   ఇత్యర్ధహ్ -వృత్తో   తు  నైవం ”
ముఖం కళంకరహితం .చంద్రుడు కళంక  సహితుడు .కనుక ముఖం చంద్రునికంటే ప్రకాశయానం .ఇది విద్యానువాదం వలన బలీయమైంది .నరసింహస్య బదులు నరసింహి  అని ఉంటె విశేషణం క్రియగా భాసించదు .ఈ విధంగా మల్లినాథుని తరళ  వ్యాఖ్యానం లో కీలక భావనలపై అతి సంక్షిప్త స్పష్ట నిర్వచనాలున్నాయి .ఈ నిర్వచనాలు ఏకావలికి రాసిన వృత్తి లోనూ కనిపిస్తాయి .కొద్దీ తేడా ఉంటుంది వివరణలో .వృత్తిని వక్రీకరించకుండా నిర్వచనాలను మరింత సరళం చేసి పునర్మించాడు .
   తరువాత ఒకసారి” పాకం ”లో మునుగుదాం
    సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2

డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా రామమోహనరావు గారి జమానాలోవాళ్ళు . వాళ్ళదగ్గర అతివినయంగా ఉండటమే తప్ప బోధనలో మెళకువలు లేవు .మరో తమాషా నేను గమనించింది సాయంకాలానికి రామ మోహన రావు గారబ్బాయి దగ్గరకు స్కూల్   లోని అన్నివిషయాలూ చేరేసే వాళ్ళు .వీళ్ళనే గడప పూజారులు అనేవాళ్ళం  గుమాస్తా  ఉయ్యూరయ్య నిఖార్సైన మనిషి .లెక్క అంతా పకడ్బందీ స్కూల్ అకౌంట్ డబ్బులు కూడా అతని చేతికే ఇచ్చాను .ఎక్కడా తేడా రాదు .అంత నమ్మకం .గొల్లలు అతనే  రిటైరయ్యాక మేడూరు సర్పంచ్ గా ఎన్నికై మంచి పనులు చేశాడు . అంతా  బాగానే ఉంది కానీ ఎక్కడో ఇరుకు గదిలో నేనున్నట్లు ఫీలయ్యాను . నాకు స్వతంత్రం గా ఉండి  అన్నిపనులు సమర్ధంగా చేయటం ఇప్పటిదాకా అలవాటు .ఇక్కడ సాంస్కృతిక విషయాలేమిటో టీచర్లకూ పిల్లలకూ తెలియదు .ఇంతవరకు అల్లాంటివి ఇక్కడ జరగ లేదని చెప్పేవారు . అయినా నా పద్ధతిలో  వీటిని అధిగమించి నడపాలని నిర్ణయానికొచ్చాను .ముందుగా ప్రతిరెండవ  బుధవారం మిగతా చోట్ల చేసినట్లే సాయంత్రం చివరి పిరియడ్ లో వాటిని క్లాస్ టీచర్ల చేత నిర్వహించే పధ్ధతి మొదలుపెట్టాను వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు గా వీటిని చేయించాను  సైన్స్ క్లబ్ అంటే కూడా వీళ్లకు తెలీదు సైన్స్ మేష్టర్లతో దాన్ని ఏర్పాటు చేయించి సైన్స్ రూమ్ లో నెలకొక ప్రోగ్రామ్ చేయించాను .ప్రసిద్ధులైన సైన్టిస్ట్ ల జీవితాలను వారి పరిశోధనలను ఒకరిద్దరు విద్యార్థుల చేత సైన్స్ టీచర్ పర్య వేక్షణలో తయారు చేయించి మాట్లాడించాను .ఇవి విద్యార్థులలో బాగా క్లిక్ అయి నాపై విశ్వాసం కలిగించాయి ..అంతా బాగానే ఉంది అనిపించిన సమయం లో ఒక తమాషా జరిగింది .

   ఒక రోజు ఉయ్యూరు నుంచి బస్ లో వచ్చి నడిచి స్కూల్ కు వస్తుండగా రోడ్డుమీద చాక్ పీసు తో నాకూ హిందీ పంతులమ్మకు అక్రమ సంబంధం అంటగట్టే రాతలు కనిపించాయి  రోడ్డుకు అడ్డంగా రెండుమూడు చోట్ల ఉన్నాయి చదివి కామ్ గా స్కూల్ లోకి వెళ్లి నా పని నేను చేసుకుంటున్నాను . అసెంబ్లీ అయింది క్లాసులు మొదలయ్యాయి .ఒక గంట తర్వాత డ్రిల్ మేస్టర్ సుబ్బారావు గారు నా దగ్గర కొచ్చి ”హెడ్ మాస్టారూ !రోడ్డు మీద ఎలా ఛండాలంగా రాశారో చూశారా ?”అని అడిగాడు .నేను ”ఏమో నండీ తలవంచుకుని నేను రోజూ లాగానే వచ్చాను .ఏమీ చూడలేదు .అని చిన్న అబద్ధం ఆడాను.  అసలు విషయం చెప్పాడు . అప్పుడు నేను ”నేను మగాడిని .సర్దుకు పోవచ్చు ఆమె లేడీ టీచర్ ఆమె చదివివుంటే యెంత బాధ పడుతుందో ఆలోచించండి . మా ఇద్దరి ప్రవర్తన పై స్టాఫ్ లోకాని పిల్లలలో కానీ ఊరిజనం లో ఏమాత్రం అనుమానం ఉందని భావి0చినా  నేను ఈక్షణమే సెలవు పెట్టి వెళ్ళిపోతాను .ప్రెసిడెంట్ గారికి చెప్పి ఆయనకు ఇష్టమైన వారిని వేయించుకోమని చెప్పండి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా బాధ లేదు ”అన్నాను ..వెంటనే ”కాదు సార్ !ఇలాంటివి ఉపేక్షిస్తే చాలాప్రమాదం .మీకయ్యింది .రేపు వేరెవరికైనా అవచ్చు ఆడపిల్లలపై రాయచ్చు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ”అన్నాడు .”బడి డిసిప్లిన్ చూసేది మీరు కనుక మీరూ లెక్కలమేస్టారు  స్టాఫ్ సెక్రెటరీ ,శర్మగారు కలిసి కూర్చుని చర్చించి అసలు రాసిన వాళ్ళు ఎవరో ఏ ఉద్దేశ్యం తో రాశారో కనుక్కుని  తేల్చండి  వాళ్ళ పేర్లు నాకు ఇస్తే క్రమ శిక్షణ చర్య తీసుకుంటాను .ముందుగా హిందీ పంతులమ్మగారికి మనందరి తరఫున సారీ చెప్పి తర్వాత పనిలో దిగండి ”అన్నాను . మంచి ఆలోచన అని అని ఆపనిలో దిగి దోషుల్ని తేల్చి నాదగ్గరకు పంపించి వాళ్ళూ వచ్చారు . ఇద్దరో ముగ్గురో ఉన్నారు పిల్లలు .వాళ్ళు ఎవరో తమతో చేయించారని నిజం చెప్పారు .కూపీ లాగితే అక్కడ రిటైర్ అయిన హిందీ పంతులు ట్యూషన్ కింగ్ పని అని తేలింది .అందరిదగ్గర క్షమాపణ ఉత్తరాలు రాయించి ,తలిదండ్రులను పిలిపించి ఇది మొదటి తప్పుకానుక వదిలేస్తున్నాను కానీ మా స్టాఫ్ కి ఇది చాలదు ఇంకా మీకుకఠిన మైన పనిష్ మెంట్ ఇవ్వాలంటున్నారు అని బెదిరించి తలో నాలుగు డ్రిల్ మిస్టర్ చేత పీకించి వదిలేశా .ఉడత ఊపులు ఊపుదామని ప్రయత్నం .స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిన విషయం వివరించి హిందీపంతులమ్మగారికి అందరం క్షమాపణ చెప్పాం .ఆమె కన్నీరు మున్నీరు గా ఏడ్చింది .మేమిద్దరం బ్రాహ్మణులం అవటం రోజూ బస్ లో ఉయ్యూరు నుంచి రావటం ,ఆమె మా ఇంటిదగ్గరే రాజా గారి కోటలోని ఇంట్లో అద్దెకుండటం ఇంతటి సీన్ ను క్రియేట్ చేయించింది .మళ్ళీ ఇలాంటి దేదీ నేనుండగా జరగలేదు .అందరం మర్చిపోయి మాపనులు మేము చేసుకు పోతున్నాం .సర్పంచ్ కూడా వచ్చి జరిగిన దానికి బాధపడి పునరావృత్తం కాకుండా జాగ్రత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు . మళ్లీ  గాడిలో పడింది స్కూల్ .
  సోషల్ మేష్టారు మస్తాన్ గార్ని పిలిచి ”మాక్ పార్లమెంట్ ”జరిపించమన్నాను .ఆయన అలాంటి మాట తానింతవరకు  వినలేదని చెప్పాడు .అప్పుడు దానికి కావలసిన అన్ని విషయాలూ నేనే సేకరించి ఆయనకు ఇచ్చి ఎలా నడపాలో నేర్పించి పిల్లలకు శిక్షణ నిప్పించి నెల రోజుల్లో పిల్లల్ని తయారు చేయించి నిర్వ హింప జేశాను అద్భుతంగా చేశారు పిల్లలు ప్రశ్నోత్తరాలు ,బిల్లు ప్రవేశపెట్టడం చర్చ బిల్ పాస్ చేయించటం అన్నీ పార్లమెంట్ లో జరిగినట్లు జరిపించాను .బ్రహ్మానంద పడ్డారు విద్యార్థులు తలిదండ్రులు మేస్టార్లు .అక్కడ ఒక చరిత్ర సృష్టించాను ..వీటితో నేనేది చెప్పినా చేయటానికి అందరూ సిద్ధమయ్యారు .
  మేడూరుకు దగ్గరలోనే ఐలూరు పుణ్య క్షేత్రం ఉంది  -.దీన్ని ఉభయ రామ లింగేశ్వర  క్షేత్రం అంటారు .ఇక్కడా కృష్ణకు అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా చిలుమూరు లో శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు ఏకకాలం లో కృష్ణానది దానిప్రక్కనే ప్రవహిస్తుంది  ఐలూరు కు ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగా స్టాఫ్ ని .అలాంటి వాసనే మాకు తెలీదుఅన్నారు .ఆశ్చర్యం వేసింది .సరే దీన్నీ సాధించాలి అనుకోని ఒక రోజు మధ్యాహ్నం ఉదయం పూట  బడి అవగానే పిల్లలని తీసుకు వెళ్లే ఏర్పాటు చేసాం .నది ఒడ్డున కూర్చుని ఏదైనా ఫలహారం  తింటే  బాగుంటుంది అనిపించి సెక్రెటరీకి ఆ బాధ్యత అప్పగించాను .ఈ వార్త ఊర్లో సంచలం కలిగించి మహిళలు ఒక బృందంగా ఏర్పడి అందరికి కావలసిన పులిహోర తయారు చేయించి  పెట్టుకు తినటానికి గిన్నెలు గరిటెలు కాగితాలు మంచి పండిన అరటిపళ్ళు వాళ్ళే సిద్ధం చేసి మాకు ముందే తెలియబరచి రిక్షాలో మాతో పంపించే  ఏర్పాటు  చేశారు . ఇందులో ఉయ్యూరయ్య పాత్ర బాగా ఉంది మంచి చెయ్యాలనుకొంటే  కలిసి వచ్చేవారెప్పుడూ ఉంటారు . అందరం బృందాలుగా క్లాస్ వారీగా వెనక ముందు టీచర్లతో నడక సాగించి ఒక అరగంటా ముప్పావు గంటలో ఐలూరు కృష్ణా నది ఒడ్డుకు చేరి సేద తీరి వెంట తెచ్చినవి పిల్లకు మేష్టర్లకు అందరికీ పంచి సంతృప్తి కలిగించాం .ఇక్కడి దేవాలయ చరిత్రను నేను తెలుగు మేష్టారు  అందరికి వివరించాం తర్వాత దేవాలయాన్ని  సందర్శించి మళ్ళీ బడికి నడిచి వెళ్లాం . ఈ ఫీల్డ్ ట్రిప్ గొప్ప స్పందన కలిగించింది ఊర్లో . ఏపనికైనా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చారు ..
   పిల్లల తో  బాడ్ మింటన్  వాలీబాల్ కబాడీ  బేస్ బాల్ ఖో ఆటలలో డ్రిల్లు మేష్టర్లు మంచి శిక్షణ ఇచ్చి తయారు చేశారు .ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడించాం గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు పంపించాం .బాడ్మింటన్ లో ప్రయిజు వచ్చిందని జ్ఞాపకం . టీచర్స్ కూడా గేమ్స్ ఆడి పాల్గొన్నాం .బాడ్ మింటన్ లో నేను లెఫ్ట్ ఫ్ర0ట్ .శర్మగారు సెంటర్ .బాక్ .సుబ్బారావు  ప్రసాదరావు .వాలీ బాల్  కూడా బాగా ఆడేవాళ్ళం నేను ఈ రెండిటిలో ఎప్పుడు సర్వీస్ చేసిన కనీసం మూడు పాయింట్లయినా వచ్చేవి .జనం ఈలలు చప్పట్లతో ఆభినందించేవారు
  స్కూల్ పరీక్షలు మొహమాటం లేకుండా కాపీ కొట్టకుండా చాలా పకడ్బందీ గా నిర్వహించాం దీనికి లెక్కలమేస్టారు   ప్రసాద్ సహాయం అద్వితీయం అతనికే కొన్ని నిర్దిష్ట భావాలున్నాయి అందుకే మా ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరింది . ఇన్ని విషయాలు బాగానే ఉన్నా క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశరావు విపరీతమైన తాగు బోతు ,బడిపక్కనే ఇల్లు  .గంటకో అరగంటకు ఎవరికీ తెలీకుండా మందుకొట్టి వచ్చేవాడు మాటలు తడ  బడేవి  కళ్ళు చింత నిప్పులు బక్కపలచగా ఉండేవాడు తోస్తే పడిపోయే రకం .అతన్ని కంట్రోల్ పెట్టటం శక్యం కావటం లేదు .అంతకు పూర్వం హెడ్ మాస్టర్లు కూడా ఏమీ పీక లేక వదిలేశారు .అతని కులమూ ఇబ్బంది కలిగించేది ఏ చర్య తీసుకోవలన్నా .మనమే సర్దుకు పోవటం . మనిషి మంచివాడు పిల్లాడు తొమ్మిది చదువుతున్నాడు చురుకైన వాడు . బెదిరించేవాడిని స్టాఫ్ఆర్దర్ వేస్తానని అది రికార్డ్ అయితే జీవితం  జీతం ఖాళీ అని పైవాళ్లకు రాస్తానని హెచ్చరించేవాడిని .చెప్పిన పని చేస్తాడు ఇదొక్కటే లోపం బలహీనత . పామర్రులో సైన్స్ మాస్టర్ గా పని చేస్తుండగా ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు తెగ తాగి వచ్చేవారు .ఒకడు రోడ్డుకడ్డంగా నిలబడి బస్సులు ఆపేవాడు .మరోడుఫుల్ గా మందుకొట్టి తెగవాగేవాడు ఇతను నేనంటే బాగా అభిమాన0గా ఉండేవాడు   .సముద్రం ఒడ్డు  చినగొల్లపాలెం వాడు .అక్కడ రాజకీయ నాయకుడు ఏటూరి బలరామ మూర్తి ఇతనికి కాపు ఏడు గడ .కనుక చైర్మన్లు కానీ ఇంకెవరూ ఇతని జోలికి వచ్చేవాళ్ళు కాదు మనిషి బంగారం   .ఖాళీగా  ఉన్నప్పుడల్లా అతని రూమ్ లో కూచునేవాడిని .కాఫీలు ఆరగాఆ రగా తెప్పించేవాడు .భార్యబంగారు  తల్లి .మంచి టీచర్ . ఈ ఇద్దరు ”డ్రిల్లులు” మను షులు మంచివాళ్ళే గుణం ”గుడి సేటిది ”టైప్  మేడూరునుంచి పామర్రుకు జంపయ్యాను సారీ .  ఉపేక్షతప్ప నాకు క్రాఫ్ట్ మేస్టార్ విషయం లో ఏ ఉపాయము కనిపించలేదు . ఇలాంటి వారిమధ్య పని చేయటం ఎంబరాస్మెంట్ గా  ఉంది .తరుణోపాయంకోసం మనసులో అన్వేషిస్తున్నాను .
                సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

  ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )  

పర్క్యాయోక్తి  అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే  అనుసరించాడు  -”గమ్యత్సా పి భంగ  గ్య0త రేణాభి  దానం పర్యోక్తం ”
  ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ జేస్తే పర్యాయోక్తి .అంటే ఫలం ,ప్రభావం ,ప్రయోజనం  మొదలైనవి తెలియాల్సిన లేక గమ్యం కు కారణాలు అవుతాయి. దీనిపై మల్లినాథుని  వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఉంది .-”యత్ర ప్రస్తుత కార్య కధనాత్ ప్రస్తుతమేవ కారణం గమ్యతే -తత్ర కార్యద్వారా కారణ  స్యేవ పర్యాయేణ భంగ యంత రేణోక్త త్వాత్ పర్యాయోక్త  మిత్యర్ధహ్ ”అన్నాడు
  ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది -ఒకే వస్తువు వివరణగా సూచనగా ఎలా ఉంటుంది?కారణాన్ని సూచిస్తే ఫలిత0 ద్వారా తెలియ జేయవచ్చు కారణం కూడా సంబద్ధమైనదే అప్పుడు అది అప్రస్తుత ప్రశంస తో భేదిస్తుంది ..ఇక్కడ విద్యాధరుడు సూచింపబడిన అర్ధం లేక భావం బలవత్తరమైతే అప్పుడు అది ఒకరకమైన ధ్వని అని పిస్తుంది ”యత్ పునరిహకార్యస్యేవ వర్ణనం తత్కారణా పేక్ష యస్య చమత్కారాతిశయ కారిత్వాత్ ”(ధ్వన్యాలోక0 )    ఇక్కడ అతని వ్యాఖ్య ధ్వన్యాలోకం లోని వ్యాఖ్యను పోలి ఉంది కనుక మల్లినాథుడు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు .సంబద్ధమైన కారణం సంబద్ధమైన ఫలితాన్ని సూచిస్తే అది పర్యాయోక్తి అవుతుందన్నారు .అంటే ఫలితం కారణాన్ని మరొక విధంగా తెలియ జేస్తుంది .ఫలితం ద్వారా చెప్పబడే కారణం యొక్క వర్ణన  ,సూటిగా వర్ణించినదానికంటే మరింత రమ్యంగా ఉంటుంది .
  మల్లి నాధుడు కొన్ని అలంకారాలతో పోలికలు భేదాలు చర్చించి ఇదే విధంగా స్పష్టం చేశాడు .కొన్ని ఉదాహరణలు చూద్దాం –
విరోధ ,విశేషోక్తి అలంకారాల మధ్య తేడాలను వివరిస్తూ రెండు వస్తువులు ఒకే సమాన బలం తో  ఒకదానికొకటి వ్యతిరేకంగా చెప్పబడితే అది విరోధా భాస  అన్నాడు .విశేషోక్తి లో ఫలితం దాగి ఉండి కారణం లేకుండా అంగీకరింపబడకుండా ఉంటె విశేషోక్తి అవుతుంది .కానీ కారణం లేకుండా ఫలితం అంగీకరింపబడదు -”అతః ప్రతినియత్ బాధ్య బాధ్యక భావాపన్నో విరోధో విశేషోక్త్యో -విరోధాలంకారే తు విశేష భావాదుభయొహ్  పరస్పర బాధ క భావాపన్న ఇత్యనయోరపి భిన్న విషయత్వ మేవేత్యర్ధహ్ ”
 ఇలాగే రూపకాన్ని ఉత్రేక్ష ,అతిశయోక్తి ల మధ్య భేదాన్ని కూడా ఇంత స్పష్టంగానూ వివరించాడు .ఈ రెండు బృందాలలో ఉన్న భేదం ఆరోప ,అధ్యారోపాల  ఆధారంగా ఏర్పడినవే అన్నాడు .భేదం లేనిది వస్తువును మింగేసి అనుభవానికి వస్తే అధ్యవాస్యా అవుతుంది అలాంటి మింగుడు లేకపోతె ఆరోపణ అవుతుంది -”ఆరోపాన్యత్రాన్యస్యా వాపః -యధా ముఖం ఇత్యాన్న ముఖే చంద్రత్వస్య  ఏతే నాద్యావశ్య మూలో త్ప్రేక్షా తిశయోక్తి భ్యాం భేదః -విషయని గరణేనా భేద-ప్రతిపత్తి రధ్యావసాయః -విషయాని ఘరానా మంత రేణా  భేద ప్రతి పత్తి  రారోప  ఇత్యన్యో  భేదాదితి”
   ”ఏకాదశ వివర్త రూపకాల”కు సమాసోక్తికి మధ్య ఉన్న ముఖ్య విలక్షణతనుమల్లినాథ సూరి వివరించిన విధానాన్ని డా త్రివేది ఎలా తెలియజేశాడా లాల్యే పండితుడు చెప్పాడు -”మొదటి దానిలో పోలిక చెప్పే విషయి  విషయ0  పై ఆరోపింపబడి ఒక చోట చెప్పి వేరొక చోట సూచనగా ఉంటుంది అప్రస్తుతమైన విషయి  ప్రస్తుతమైన విషయాన్ని తన ధై న రూపం లో రంగుల్లో తెలియ జేస్తుంది .రెండవదానిలో అప్రస్తుతం సామాన్య గుణం తో సూచింపబడి ప్రస్తుతాన్ని బలీయం చేయదు కానీ దాని వేరే మాటలతో ఆవిష్కరిస్తుంది .మరో రకంగా రూపకం లో విషయి  ప్రస్తుతం పై ఆరోపించబడుతుంది .సమాసోక్తి లో అప్రస్తుతం యొక్క  ప్రవర్తన ప్రస్తుతం పై ఆరోపింపబడి  ”వ్యంజనమ్ ”కు కారణమవుతుంది .
  మల్లినాథుడు ఆపహ్నుతి ,వ్యాజోక్తి లమధ్య విలక్షణాలనూ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాడు ..పోలిక దాగి ఉంటె ఆపహ్నుతి . దాగి ఉన్నదాన్ని పోలికతో చెబితే వ్యాజోక్తి .-”యత్రాహ్నవ  ముఖేన సాదృశ్యం ప్రతిపాద్యతే తత్రాపహ్నవః -యాత్ర సాదృస్యోప జీవనే నాపహ్నవః క్రియతే తత్ర వ్యా జోక్తిః ”(ఏకావాలి ).తుల్య యోగితా విషయం లో మల్లినాథుని వివరణ సూటిగా సుత్తి లేకుండా ఉంది .దీన్ని పట్టికలో ఇలా చూఅచ్చు
  ఔ పమ్య  గర్భాలంకారః
|
పదార్ధ గతః                 వాక్యార్ధ గతః ,

–     |

సమాసపూర్వకం            వ్యాస పూర్వకం
దీపకః                                    తుల్య యోగితా

పోలిక దాగ్గిఉన్నా  ధ్వనికి అవకాశం లేదు సూచింపబడిన భావం  సూటిగా అర్ధాన్ని బలీయం చేసి అది ప్రాధాన్యం కోల్పోయి అపరాఅంగికమై గూనీ భూత వ్యంగ్యం లో ఒక అరకం అవుతుంది మరో చోట దీపకం తుల్య యోగితాల ప్రధాన లక్షణ భేదం వివరణ ఉంది సమాన లక్షణం ప్రాకృతానికి కానీ అప్రకృతానికి కానీ సమీపం లో ఉంటుంది  . 
  సూరి దృష్టాంత ,నిదర్శనాలంకారాలమధ్య భేద లక్షణాలన్నీ అదే స్ఫూర్తి తో చెప్పాడు  .రెండు వాక్యాలు రెండు విభిన్న భావాలను సంబంధం లేనివాటిని చెబితే దృష్టాంతం .రెండువాక్యాలు ఒకే  భావాన్ని విధి మొదలైన ఆదేశాలతో చెబితే అర్థవాదం తో ఉంటె నిదర్శనాలంకారం -”యత్ర పరస్పర నిరపేక్షా ర్ధ త్వేన  వాక్యార్ధ భేదస్తత్ర దృష్టాంత -యాత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాదయోరివ వాక్యయో  రేఖ వాక్యతా తత్ర నిదర్శనేతి  భేదః
    అలంకారాలతో సూక్షం భేదాలను మల్లినాథుడు గమనించాడు -”ప్రత్యాయ్యప్రత్యాయక భావోనుమానం -సమర్ధ సమర్ధకా భావే నిరపేక్ష యో తతస్టే  న హేతుర్వేర్యార్దంతరన్యాసః -కేవలం సామాన్యయోహ్ కేవలావ శేష యోర్వా నిరపేక్షయోరేవ హేతు త్వే దృష్టాంత -కార్యకారణా రూపవాక్యార్ధ యోస్తు సాపేక్షార్హే తుత్వే  వాక్యార్ధ హేతుకం కావ్యలింగమితి ”అని స్పష్టపరచాడు
 నిరూపించింది ,నిరూపించబడినదానిమధ్య సంబంధం ఉంటె అనుమానాలంకారం .కారణం ఒక సామాన్యం తో విశేషం విశేషం తో సామాన్యం సమర్ధిస్తే అర్ధాంతరన్యాసం .సామాన్య విశేష వాక్యాలు భావాలు వేరుగా స్వతంత్రంగా ఉంటె దృష్టాంతాలంకారం .రెండువాక్యాలలోని భావం కార్య కారణాలు గా ఉంటె కావ్యలింగాలంకారం అవుతుంది అని సందేహ రహితంగా ఏకావాలి లోని అలంకార చర్చలో వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వివరించాడని  త్రివేదీ తెలియజేసినట్లుడా  పి .జి .లాల్యే పండితుడు మనకు చెప్పాడు . ఇంతటితో అలంకార చందన చర్చ కు సమాప్తి పలికి  ఏకావాలి పై మల్లినాథుని వ్యాఖ్యానం లోని ముఖ్య విషయాలను తరువాత తెలుసుకొందాం .
     అన్నమయ్య   జయంతి శుభాకంక్షలతో
Inline image 1
   సశేషం
 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

  ఏకావాలి లో అలంకార చర్చ
సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది  తెలియ జేయబడి  అసంబద్ధమైనది  సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం  ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ మాత్రం నతు తాదాత్మ్యే నావ చ్చేదకత్వమేవేతి సర్వాలంఘ రో త్తీ ర్ణేయం సమాసోక్తి రిత్యర్ధహ్ ”   

అసంబద్ధమైన దాని ప్రవర్తన ”అప్రకృత0 ”కప్పి వేయబడి లేక సంబద్ధమైనది ప్రకృతం పనిలో పోలికవలన కానీ ,లేక విశేషణాలవలనకాని కప్పబడుతుంది .రూపక ,ఉపమా సమాసోక్తి ల మధ్య విచక్షణత ఒక్కోసారి తెలియ బడుతుంది మల్లినాథుడి భావనలో మొదటి రెండు కలయికలో రూపకం బలీయంగాను ,చివరి రెండిటికలయికలో సమాసోక్తి బలీయం గాను ఉంటుంది -”ఏవం సమాసోక్త్యే క దేశా వివర్తి రూపకాయోహ్ సమావేశే రూపకం బలీయ ఇత్యుక్తమ్ .-ఉపమా సమాసోక్తి సమవాయే తు సమాసోక్తి రేవ బలీద సీతి ”
”ఏకా దేశ  వివర్తి రూపకం ”అనేది ఒక విషయం చూపబడి ,చూపే బడిన దానితో సాక్ష్యాధార పోలిక కనిపించకపోతే ఏర్పడుతుంది సూచింప బడిన రూపకాన్ని మరో చోట ఉన్న వర్ణనతో అక్కడ శబ్దాలతో చెప్పబడక పోయినా మనం గుర్తించాలీ .ఉపమాలంకారం లో ఒకదానికొకటి పోలిక  బంధింపడి గ్రహించే వీలుంటుంది .కానీ సమాసోక్తిలో ఒక దాని ప్రవర్తన మరొకదానిలో  ఆపాదింపబడుతుంది .అసంబద్ధమైన దానిలో సంబద్ధమైన దాని ప్రవర్తన ఆపాదింపబడుతుందని భావం కానీ సంబద్ధమైన దానిపై అసంబద్ధమైన దాని ప్రవర్తన  ఆచ్చాదింపబడదు
విరోధాలంకారం -రెండు విషయాలలో వ్యతిరేకత స్పష్టంగా ఉంటే  అది విరోధాలంకారం .రెండు విషయాలలో సామాన్యత ,గుణం ,క్రియ ,పదార్ధం లలో వ్యతిరేకత కనిపిస్తున్నా ఒకటిగానే ఉండాలి ‘–యత్ర ధర్మయోహ్ సమానాధికరణ్య నిబ0ధో విరోధః స్ఫు రతి తత్ర విరోధాలంకారః -యత్ర తు వైయాది కరుణ్యనిబంధనో విరోధస్తత్రా సన్మత్యాది రిత్యర్ధహ”
అర్ధాంతరన్యాసాలంకారం -ఏకావాలి లో ఒక ప్రత్యేక అసంబద్ధ  ప్రతిపాదన మరొక సామాన్య ప్రతిపాదన తో సమర్ధింపబడినప్పుడుకానీ సాధారణాన్ని విశేషణం తోకాని సమర్ధించి చెప్పటాన్ని  అర్ధాంతర న్యాసం అవుతుందని చెప్పాడు .మామూలు భాషలో సామాన్యాన్ని విశేషం తోకాని విశేషణాన్నిసామాన్యం తో కానీ సమర్ధించి చెప్పటం అన్నమాట .”యత్ర ప్రస్తుతస్య సామాన్య విశేషస్య ,వా పూర్వ పంచాద్వా నిర్దిష్టస్య తదితరేణ సమర్ధన మర్దాన్తరన్యాస ఇత్యర్ధహ్ ”
  మల్లినాథుడు సామాన్యానికి ,అనుమితి (ఇన్ఫరెన్స్ )కు ఉన్న విలక్షణత ను (డిస్టింక్షన్ )గుర్తించాడు ఆయన పద్ధతిలో ఈ అలంకారం అనుమితి తో భేదిస్తుంది .ఒక నిర్దిష్ట విషయం సూచింపబడిన వ్యాప్తి ద్వారా తెలియబడుతుంది -”ఆప్రతీత ప్రత్యాయన మనుమానే ,ప్రతీతస్య సమర్ధన మత్రేతి  భేద ఇత్యర్ధహ్ ”అన్నాడు మల్లినాథ సూరి .
   సశేషం
  నృసింహ జయంతి శుభాకాంక్షలతో
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-9-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

 అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ .లీ లాయర్ అయి తెల్లవాడిని చంపారని అభియోగం మోపబడిన ఇద్దరు నల్లవారి తరఫున వాదించింది .అయినా కేసు ఓడిపోయి తండ్రీ కొడుకు అయినా ఆ దోషులు ఉరి తీయ బడ్డారు తనకుటుంబం ,చుట్టూ ప్రక్కలవారినీ బాగా గమనిస్తూ రచనలు చేసేది అలీస్ ఫించ్ లీ ,లూయీ లీ కాన్నర్ ఎడ్విన్ లీ అనే మూడు పుస్తకాలను 1911 నుంచి 1951 లోపు రాసింది
  మన్రో కౌంటీ హై స్కూల్ లో చేరి ఆంగ్ల సాహిత్యం పై అభిమాని అయింది గ్రాడ్యుయేట్ అయి మాంట్ గోమరి లోని హాంటింగ్డన్  మహిళా కాలేజీ చేరి తర్వాత తస్కలూసా లోని అలబామా యూనివర్సిటీ కి బదిలీ అయి లా చాలాకాలం చదివి  యూనివర్సిటీ న్యూస్ పేపర్ లో రచనలు చేస్తూ డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు 1948 లోలండన్  ఆక్స్ ఫర్డ్ ,యూనివర్సిటీలో యూరోపియన్ నాగరికత పై జరిగిన  సమ్మర్ క్లాస్ లకు హాజరైంది .కానీ దీనివలన ఫలితాంకనపడక మళ్ళీ లా కోర్సులో చేరింది
  1949 లో న్యూయార్క్ చేరి ఎయిర్ లైన్ రిజర్వేషన్ ఏజెంట్ అయి ఖాళీ సమయం లో ఫిక్షన్ రాసింది .అనేక పెద్ద కథలు రాసి పేరు తెచ్చుకున్నది .అప్పుడే ఆమెకు స్నేహితుడు ఒకాయన ఒక సంవత్సర జీతాన్ని పంపి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆ కాలం లో కావలసినంత రచన చేసుకోమని రాశాడు 31 ఏళ్ళవయసులో 1957 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల రాసి ఏజెంట్ ద్వారా పబ్లిషర్ కు పంపింది .జె బి లిప్పిన్ కాట్ ఆ రచన చదివి అందులో ప్రతివాక్యం లో జీవం ఉందని పొగిడికొన్నాడు కానీ మెస్ హోహఫ్ కు నచ్చక ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేస్తూనే ఉండి చివరకు ”టు కిల్ ఏ మాకింగ్ బర్ద్ ”నవలగా రెండేళ్ల తర్వాత బయట పడింది ఈ నవలపై ఆమె I never expected any sort of success with Mockingbird. I was hoping for a quick and merciful death at the hands of the reviewers but, at the same time, I sort of hoped someone would like it enough to give me encouragement. Public encouragement. I hoped for a little, as I said, but I got rather a whole lot, and in some ways this was just about as frightening as the quick, merciful death I’d expected.

— Harper Lee, quoted in Newquist, 1964[14]
అని తన నిర్వేదాన్ని తెలియ బరచింది .రచయితా పబ్లిషర్ లమధ్య అనేక సార్లు చర్చలు జరిగేవి మార్పులకు ఆమె సుముఖంగా లేకపోతె వాళ్ళు చాలాబాగా నచ్చ చెప్పేవారు అలా ఆ నవల తుది రూపానికి చేరి1960 లో ప్రచురణ పొందింది .అమ్మకాలు జోరుగా సాగి బెస్ట్ సెల్లర్ అయిపులిటీజర్ బహుమతి పొందింది . 1999

లో లైబ్రరీజర్నేల్ ఆ నవలను ”ఈ శతాబ్దపు ఉత్తమ నవల ”అని ఎన్నికద్వారా తేల్చింది ఇదిఒక రకం గా ఆమె జీవిత చరిత్రే .పూర్తి యదార్ధ సంఘటనల తోనే రాసింది అందుకే జీవత్వం తో తొణికిసలాడింది

  తర్వాత కాన్సాస్ లోని హొల్కొంబ్ కు వెళ్లి అక్కడ ఒకకుటుంబ హత్య విషయాన్ని శోధించి ”ఇన్ కోల్డ్ బ్లడ్ ”నవలారాసి  1966 లో అచ్చేసింది — మాకింగ్ బర్ద్ ప్రచురణతర్వాత 2016 లో చనిపోయే దాకా బహిరంగ సమావేశాలలో పాల్గొనటం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ లీ చేయనే లేదు .ది లాన్గ్ గుడ్ బై నవల రాస్తూ కాలక్షేపం చేసింది దీన్ని ముద్రించలేదు .అలాగే అలబామా మర్డరర్ పై రాసినా అదీ నచ్చక అచ్చు వేయలేదు  మాకింగ్ బర్ద్ సినిమా తీశారు దానికి అకాడెమి అవార్డు వచ్చింది ..నవలను ఇంట గొప్పగా ఇంతకూ ముందెవ్వరూ సినిమా కధగా మలచలేదు ”అని రాసింది .నటుడు గ్రెగరీ పెక్ తోను ఆతనికుటుంబం తోను లీ కుటుంబం చివరిదాకా  స్నేహ  సంబంధాలు కొనసాగించారు మన బాలీవుడ్ నటుడు దేవానంద్ ను గ్రెగరీ పెక్ అనేవారు పెక్ కు ఆస్కార్ అవార్డు ఆటి కస్ ఫించ్ పాత్రకు ఇచ్చారు 1966 లో ప్రెసిడెంట్ జాన్సన్ లీ ను ”నేషనల్ కౌన్సిల్ ఆన్ ది ఆర్ట్స్ ”కు ఎంపిక చేశాడు 1910 లో ప్రెసిడెంట్ ఒబామా ”నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ”అంద  జేశాడు 2013 లో హార్పర్ లీ తన నవల మాకింగ్ బర్ద్ కాపీ హక్కులను స్వాధీనం చేయమని తన ఏజెంట్ అల్లుడిపై కోర్ట్ లో దావా వేసింది ఇరుపక్షాల వాదనలు విని జడ్జి రాజీ కుదిర్చి పరిష్కరించాడు 2014 లో మన్రో హైకోర్టు లో మ్యూజియం తనకు తెలియకుండా అనుమతి లేకుండా తననవలా ప్రదర్శన చేస్తోందనివ్యాజ్యం వేసింది
   2015 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల ప్రచురణకు కోర్ట్ అనుమతించింది 89 ఏళ్ళవయసులో 19-2-2016 న హార్పర్ లీ మరణించింది .రెండే రెండునావాలాలు అయిదే అయిదు వ్యాసాలూ మాత్రమే రాసినా హార్పర్ లీ అమెరికా సాహిత్యం లో గొప్ప నవలాకారిణిగా గుర్తింపు పొందింది
Inline image 1Inline image 2Inline image 3
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment